Monday, November 5, 2012

||శ్రీసాఈ పునఃప్రకటీభవనం నామ పంచమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత 
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౫ వా ||
 
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

ఆతా పూర్వీల కథానుసంధాన | బాబా శిరడీంత గుప్త హోఊన | 
చాందపాటలా సవే ఆగమన | జాహలే తే కథన పరిసావే | ||౧|| 
1. ఇప్పుడు మునుపటి కథను కొనసాగిస్తూ, శిరిడీలో మాయమైన బాబా, చాందుపాటీలుతో మరల శిరిడీకి వచ్చిన కథను వినండి. 
స్వయే బాబాంనీ వాహూన జీవన | కేలీ కైసీ బాగ నిర్మాణ | 
గంగాగీరాది సంత సంమేలన | కథా విందాన పావనతే | ||౨|| 
2. స్వయంగా బాబా నీరు మోసి తోటను పెంచడం, గంగాగీరు మొదలైన సాధువులతో కలయిక, మొదలగు పావనమైన కథలలోని విశేషాలను వినండి. 
పుఢే కాహీ కాలపర్యంత | బాబా హోతె జే జాహలే గుప్త | 
ముసలమానాచే వర్హాడాంత | ఆఢళలే శిరడీంత హే రత్న | ||౩|| 
3. కొంత కాలం వరకు ఎవరికీ కనిపించకుండా ఉండిన బాబా, మహమ్మదీయుల పెళ్ళివారితో మరల శిరిడీకి వచ్చి, రత్నంవలె ప్రకాశించ సాగారు. 
తయా ఆధీంచ దేవీదాస | కరూన హోతె శిరడీంత వాస | 
పుఢే ఆలే జానకీదాస | గోసావీ శిరడీస రాహావయా | ||౪|| 
4. వారు రాక మునుపే దేవీదాసు శిరిడీలో ఉండేవాడు. కొంత కాలం తరువాత, జానకీదాసు గోసావి కూడా శిరిడీలో ఉండటానికి వచ్చాడు. 
తో కైసా ఘడలా ప్రకార | కథితో ఆతా సవిస్తార | 
హోఊనియా అవధాన పర | శ్రోతా సాదర పరిసిజే | ||౫|| 
5. ఇదంతా ఎలా జరిగింది అని వివరంగా చెబుతాను. శ్రోతలు సావధానులై శ్రద్ధగా వినండి. 
ఔరంగాబాద జిల్హ్యాంతీల | ధూప ఖేడెగాంవామధీల | 
ముసలమాన భాగ్యశీల | చాందపాటీల నాంవ జయా | ||౬|| 
6. ఔరంగాబాదు జిల్లాలోని ధూపఖేడెగాం అనే చిన్న గ్రామంలో చాందుపాటీలు అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు. 
సఫర కరితా ఔరంగాబాదేచీ | ఘోడీ ఎక హరవలీ త్యాచీ | 
దోన మహినే దాద న తీచీ | ఆతా కశాచీ ఆఢళతే | ||౭|| 
7. ఔరంగాబాదులో తిరుగుతుండగా అతని గుర్రమొకటి తప్పిపోయింది. రెండు నెలలు గడిచినా దాని జాడ తెలియలేదు. ‘ఇంక ఏం దొరుకుతుంది?’ 
పాటీల పూర్ణ నిరాశ ఝాలె | ఘోడీలాగీ బహు హళహళలే | 
ఖోగీర పాఠీవరీ మారిలే | మాఘారా ఫిరలె మార్గానే | ||౮|| 
8. అని పాటీలు పూర్తిగా నిరాశ చెంది, గుర్రం గురించి దుఃఖిస్తూ, గుర్రపు జీనుని భుజం మీద వేసుకొని, తిరుగు దారి పట్టాడు. 
ఔరంగాబాద మాగే టాకిలె | సాడె చార కోస ఆలే | 
మార్గాత ఆంబ్యాచే ఝాడ లాగలే | తళీ దిసలే హె రత్న | ||౯|| 
9. ఔరంగాబాదునుండి నాలుగున్నర కోసుల (తొమ్మిది మైళ్ళు) దూరం ప్రయాణించాడు. దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని క్రింద ఈ మానవులలో రత్నాన్ని చూశాడు.
డోఈస టోపీ అంగాత కఫనీ | ఖాకేస సటకా తమాఖూ చురూనీ | 
తయారీ కేలీ చిలీమ భరూనీ | నవలే తే స్థానీ వర్తలే | ||౧౦|| 
10. తలపై టోపి, దేహం మీద కఫినీ, చంకలో సటకా ఉన్నాయి. పొగాకును నలిపి గొట్టంలో నింపి, చిలుము తయారు చేస్తుండగా, ఆశ్చర్యకరమైన విచిత్రం జరిగింది. 

చాందపాటీల రస్త్యానే జాతా | ఫకీర ఏకీలా హాకా మారితా | 
యేరే చిలీమ పిఊన జా పుఢతా | ఛాయే ఖాలతా బైస జరా | ||౧౧|| 
11. తన దారిన పోతుండగా, చాందుపాటీలుకు ఆ ఫకీరు పిలిచినట్లు అనిపించింది. “ఒరే బాబూ! నీడలో కూర్చుని చిలుం పీల్చి, ముందుకు పో” అని అన్నారు. 
ఫకీర పుసే హే ఖోగీర కసలే | పాటీల మ్హణే జీ ఘోడే హరవలే | 
మగ తో మ్హణే జా శోధ తే నాలే | ఘోడే సాంపడలే తాత్కాళ | ||౧౨|| 
12. “ఈ జీను దేనికి?” అని ఆ ఫకీరు ప్రశ్నించాడు. ‘నా గుర్రం తప్పిపోయింది బాబా!’ అని పాటీలు చెప్పాడు. “వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు” అని ఫకీరు చెప్పారు. ఆశ్చర్యకరంగా, అక్కడికి వెళ్ళిన వెంటనే గుర్రం కనిపించింది. 
చాందపాటీల విస్మిత ఝాలా | మనీ మ్హణే అవలియా భేటలా | 
పార నాహీ హ్యా కృత్యాలా | మానవ హ్యాలా మ్హణూ నయే | ||౧౩|| 
13. చాందుపాటీలు విపరీతంగా ఆశ్చర్యపోయాడు. ‘అవలియా దొరికారు. వీరి లీలలకు అంతు లేదు. వీరిని సాధారణ మానవులని అనలేము’ అని పాటీలు మనసులో అనుకున్నాడు. 
పుఢే తో ఘోడీ ఘేఊన పరతలా | పాటీల పూర్వస్థళీ పాతలా | 
ఫకీర పాసీ బైసవీ త్యాలా | చిమటా ఉచలిలా స్వహస్తే | ||౧౪|| 
14. తరువాత అతను గుర్రాన్ని వెంటబెట్టుకుని మరల ఫకీరు ఉన్న చోటికి వచ్చాడు. అతనిని తన వద్ద కూర్చోబెట్టుకుని, ఫకీరు చిమ్టాను చేతిలోకి తీసుకున్నాడు. 
మగ తో తెథేంచ మాతీంత ఖుపసిలా | ఆంతూన ప్రదీప్త నిఖారా కాఢిలా | 
హాతాంతీల చిలమీవర ఠేవిలా | సటకా ఘేతలా ఉచలునీ | ||౧౫|| 
15. దానిని అక్కడే మట్టిలో గుచ్చాడు. లోపలినుండి మండుతున్న నిప్పును తీసికొని చిలిం గొట్టంపై ఉంచి, సటకా తీసుకున్నాడు. 
పుఢే ఛాపీ భిజవావయాస | పాణీ నాహీ జవళ పాస | 
సటకా ఆపటీ జమినీస | పాణీ నిఘాయాస లాగలే | ||౧౬|| 
16. గుడ్డముక్క తడపటానికి దగ్గరలో ఎక్కడా నీరు లేదు. సటకాతో నేలపై కొట్టగా, వెంటనే నీరు పైకి వచ్చింది. 
ఛాపీ భిజవూనియా పిళిలీ | మగ తీ చిలమీ సభోంవతీ వేష్టిలీ | 
స్వయే ప్యాలా తయాహీ పాజిలీ | మతీ గుంగలీ పాటలాచీ | ||౧౭|| 
17. దానితో గుడ్డను తడిపి, నీటిని పిండేసి, చిలుం గొట్టానికి చుట్టాడు. తను పీల్చి, పాటీలుకు కూడా ఇచ్చాడు. పాటీలుకు మతి పోయింది. 
పడలా ఫకీరాస ఆగ్రహ | పవిత్ర కరా హో మాఝే గృహ | 
పాటిలావరీ కేలా అనుగ్రహ | లీలావిగ్రహధారకే యా | ||౧౮|| 
18. ‘నాతో వచ్చి మా ఇంటిని పావనం చేయండి’ అని ప్రార్థించాడు. ఇలాంటి లీలలను చేయటానికే అవతరించిన ఫకీరు అతనిని అనుగ్రహించాడు. 
దుసరే దివశీ గావాంత గేలే | పాటిలాచ్యా యేథే ఉతరలే | 
కాంహీ కాళ తెథేంచ రాహిలే | పుఢే తే పరతలే శిరడీస | ||౧౯|| 
19. ఆ మరునాడే పాటీలు గ్రామానికి వెళ్ళి, అతని ఇంట కొన్ని రోజులు ఉండి, తరువాత మరల శిరిడీకి వచ్చారు. 
హా చాందపాటీల కారభారీ | ధూప ఖేడ్యాచా గ్రామాధికారీ | 
స్వస్త్రీచ్యా భాచ్యాలాగీ నోవరీ | జుళలీ సోఇరీక శిరడీంత | ||౨౦|| 
20. ఈ చాందుపాటీలు ధూపఖేడె గ్రామానికి అధికారి. అతని భార్యయొక్క మేనల్లుడికి శిరిడీలో సంబంధం కుదిరింది. 

చాందభాఈచ్యా కుటుంబాచా | లగ్నయోగ్య జాహలా భాచా | 
సుయోగ శరీరసంబంధాచా | ఘడలా శిరడీచ్యా వధూచా | ||౨౧|| 
21. చాందభాయి భార్య మేనల్లుడికి పెళ్ళీడు రావడం వలన, శిరిడీలోని ఒక వధువుతో పెళ్ళి నిశ్చయమైంది.
ఘేఊని సవే గాడ్యా ఘోడీ | వర్హాడ నిఘాలే యావయా శిరడీ | 
మగ త్యా చాందభాఈచే ఓఢీ | బాబాహీ వర్హాడీ ప్రవిష్ట | ||౨౨|| 
22. గుర్రపు బండ్ల వెంట పెళ్ళివారు శిరిడీకి బయలుదేరారు. చాందభాయి పైన ప్రేమతో బాబా కూడా పెళ్ళివారితో కలిశారు. 
లగ్న ఝాలే వర్హాడ పరతలే | బాబా ఎకటేచ మాగే రాహిలే | 
రాహిలే తె రాహూన గేలే | భాగ్య ఉదేలే శిరడీచే | ||౨౩|| 
23. పెళ్ళి అయిన తరువాత పెళ్ళివారు వెనక్కు వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉండిపోయారు. ఆ ఉండటం ఉండటం అక్కడే ఉండిపోయారు. అప్పటినుండి శిరిడీ భాగ్యం ఉదయించింది. 
సాఈ అవినాశ పురాతన | నాహీ హిందూ నా యవన | 
జాత పాత కుళ గోతహీన | స్వరూప జాణ నిజబోధ | ||౨౪|| 
24. సాయి సనాతనలు. వారు నశించరు. వారు హిందువు కాదు, ముసల్మాను కాదు. వారికి జాతి, మతాలు, కుల గోత్రాలు లేవు. ఆత్మజ్ఞానమే వారి ఉనికి. 
సాఈ సాఈ మ్హణతీ జే జన | తే తరీ కాయ నామాభిధాన | 
‘యా సాఈ’ మ్హణవూన బహుమాన | పురఃసర సంబోధన జే తె హే | ||౨౫|| 
25. ప్రజలందరూ ‘సాయి, సాయి’ అని అంటారు, అది వారి పేరా? ‘రండి సాయి!’ అని వారిని మర్యాదతో పిలిచిన పిలుపు అది. 
ఖండోబాచే దేఉళాపాశీ | మ్హాళసాపతీచియా ఖళియాసీ | 
ఆరంభీ బాబా వర్హాడానిశీ | ఉతరల్యా దివశీ హే పడలే | ||౨౬|| 
26. ఖండోబా ఆలయం దగ్గర, మహల్సాపతి పొలంలో, పెళ్ళివారితో మొదట బాబా దిగిన రోజే ఈ పేరు వచ్చింది. 
ఆరంభీ తే భగతాచే ఖళే | పుఢే తే అమీనభాఈచే ఝాలే | 
వర్హాడ లగ్నాచే జే ఆలే | యేథేంచ ఉతరలే వడాతళీ | ||౨౭|| 
27. మొదట ఆ పొలం మహల్సాపతికి చెందినది. తరువాత అది అమీనభాయిది అయింది. పెళ్ళివారు ఇక్కడే మర్రి చెట్టు క్రింద దిగారు. 
గాడ్యా సర్వ సుటల్యా ఖళ్యాంత | ఖండోబాచే పటాంగణాంత | 
బాబాహీ తేథే వర్హాడాసమేత | సర్వా సమవేత ఉతరలే | ||౨౮|| 
28. ఖండోబా ఆలయానికి ఆనుకుని ఉన్న ఆ పొలంలో బళ్ళనన్నిటినీ విప్పారు. అక్కడ పెళ్ళివారితో పాటు, బాబా కూడా దిగారు. 
హే బాల ఫకీర గాడీంతూన ఉతరలే | ప్రథమ భగతాచే దృష్టీస జై పడలే | 
'యా సాఈ’ మ్హణూన సామోరే గేలే | నామ తే పడలె తేథూని | ||౨౯|| 
29. ఈ బాల ఫకీరు బండినుండి దిగగానే, మహల్సాపతి వారిని మొదట చూశాడు. వెంటనే ‘రండి సాయి!’ అని వారి ఎదుటకు వెళ్ళాడు. అప్పటినుండి వారికి ఆ పేరే ఉండిపోయింది. 
పుఢే మగ తేవ్హాంపాసూన | సాఈ సాఈ ఏసే మ్హణూన | 
మారూ లాగలే హాకహీ జన | నామాభిధాన తే ఝాలే | ||౩౦||
30. అప్పటినుండి జనులు వారిని ‘సాయి, సాయి’ అని పిలవటం మొదలు పెట్టారు. అలా ఆ పేరే వారికి శాశ్వతంగా నిలిచిపోయింది. 

మగ తే తెథే చిలీమ ప్యాలే | మశీదీంత వాస్తవ్య కేలె | 
దేవీదాస సహవాసీ రమలే | ఆనందలే శిరడీంత | ||౩౧|| 
31. అక్కడ, మహల్సాపతి పొలంలో, వారు చిలుం త్రాగారు. తరువాత మసీదుకు వెళ్ళి, అక్కడ ఉండ సాగారు. దేవీదాసు స్నేహం వారికి ఆనందాన్నిచ్చింది. శిరిడీలో వారు చాలా సంతోషంగా ఉన్నారు.
కధీ బైఠక చావడీంత | కధీ దేవీదాసాచే సంగతీంత | 
కధీ మారూతీచే దేవాలయాంత | స్వచ్ఛంద రత రహావే | ||౩౨|| 
32. అప్పుడప్పుడు చావడిలో కూర్చునేవారు. మరొకప్పుడు దేవీదాసుతో స్నేహంగా, ఇంకొకప్పుడు మారుతీ ఆలయంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉండేవారు. 
హే దేవీదాస శిరడీ గాంవీ | హోతే ఆధీంచ బాబాంచే పూర్వీ | 
పుఢే ఆలే జానకీదాస గోసావీ | మహానుభావీ శిరడీంత | ||౩౩|| 
33. ఈ దేవీదాసు బాబా కంటే ముందునుంచే శిరిడీ గ్రామంలో ఉన్నారు. ఆ తరువాత మహానుభావుడైన జానకీదాసు గోసావి శిరిడీకి వచ్చాడు. 
తయా జానకీదాసాసవే | మహారాజాంనీ బోలత బసావే | 
కింవా మహారాజ జేథే అసావే | తేథే బసావే జానకీదాసే | ||౩౪|| 
34. సాయి మహారాజు ఈ జానకీదాసు వద్దకు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చునేవారు. లేకుంటే, జానకీదాసే సాయి మహారాజు ఉన్న చోటికి వచ్చి కూర్చునేవాడు. 
ఉభయతాంసీ మోఠే ప్రేమ | బైఠకీ హోతీ నిత్యనేమ | 
ఏసా తయాంచా సమాగమ | సుఖ పరమ సకళీకా | ||౩౫|| 
35. వారిరువురకీ ఒకరి మీద ఇంకొకరికి చాలా ప్రేమ ఉండేది. ప్రతి రోజూ నియమంగా వారిరువురూ కలిశేవారు. వారిరువురి స్నేహం అందరికీ చాలా ఆనందంగా ఉండేది. 
తైసేచ ఎక గంగాగీర | మహా ప్రసిద్ధ వైష్ణవ వీర | 
గృహస్థాశ్రమీ పుణతాంబేకర | శిరడీస వరచెవర ఆగమన | ||౩౬|| 
36. అలాగే, మరో ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు, పుణతాంబే నివాసి, గృహస్తుడు, గంగాగీరు శిరిడీకి తరచూ వచ్చేవాడు. 
ఆరంభీ సాఈ విహిరీవరీ | ఉభయ హస్తీ మాతీచ్యా ఘాగరీ | 
సాఈ పాణీ వాహీ హే దేఖోని అంతరీ | ఆశ్చర్య కరీత గంగాగీర | ||౩౭|| 
37. రెండు చేతులతో, మట్టి కుండలను పట్టుకొని, బావినుంచి సాయి నీరు మోసుకొని రావటాన్ని చూసి, మొదట గంగాగీరు ఆశ్చర్యపోయాడు. 
ఏసీ హీ సాఈచీ దృష్టాదృష్ట | హోతాంచ బువా వదలే తై స్పష్ట | 
ధన్య శిరడీచే భాగ్య వరిష్ఠ | జోడలే శ్రేష్ఠ హే రత్న | ||౩౮|| 
38. తరువాత సాయిని ముఖాముఖి కలసినప్పుడు, ‘ఈ అమూల్య రత్నాన్ని పొందిన శిరిడీ భాగ్యం ధన్యం’ అని స్పష్టంగా చెప్పాడు. 
హా ఆజ ఖాందా పాణీ వాహీ | పరీ హీ మూర్తి సామాన్య నాహీ | 
హోతే యా భూమీచే పుణ్య కాంహీ | తరీచ యే ఠాయీ పాతలీ | ||౩౯|| 
39. ‘ఈ రోజు ఇతను భుజాన నీరు మోస్తున్నాడు కాని ఇతను సామాన్యుడు కాదు. ఈ భూమియొక్క పుణ్యం చాలా ఉండబట్టే, ఇక్కడికి వచ్చాడు’, అని చెప్పాడు. 
తైసేచి ఎక ఆణిక సంత | ఆనందనాథ నామే విఖ్యాత | 
తయాంచేహీ హేంచ భాకీత | కర్తృత్వ అద్భుిత కరితీల హే | ||౪౦||
40. అలాగే, ఆనందనాథ అనే పేరు ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా ‘సాయి అద్భుతమైన పనులు చేస్తాడు’ అని భవిష్యాన్ని తెలియజేశాడు. 

మహాప్రసిద్ధ ఆనందనాథ | యేవలే గ్రామీ మఠ స్థాపీత | 
కాంహీ1 శిరడీకరాంసమవేత | ఆలె తె శిరడీంత ఎకదా | ||౪౧|| 
41. బాగా ప్రసిద్ధి పొందిన ఈ ఆనందనాథు యవలా గ్రామంలో మఠాన్ని నెలకొల్పాడు. కొంత మంది శిరిడీ గ్రామస్థుల వెంట ఒక సారి ఇతను శిరిడీ వచ్చాడు. 
అక్కలకోటకర మహాపురూష | ఆనందనాథ తయాంచే శిష్య | 
మ్హణాలే పాహూని సాఈస సమక్ష | ‘హిరా హో ప్రత్యక్ష హా హిరా’ | ||౪౨|| 
42. ఆనందనాథు అక్కలకోట మహారాజు శిష్యుడు. సాయిని ఎదురుగా చూసినప్పుడు, ‘ఈతను వజ్రం. అసలైన వజ్రం!’ 
ఆజ జరీ హా ఉకిరడ్యావర | తరీ హా హిరా నాహీ గార | 
ఆనందనాథాంచె హే ఉద్గా ర | బాబాంచే పోరవయ హోతే తో | ||౪౩|| 
43. ‘ఈ రోజు ఇక్కడ పెంటకుప్ప మీద ఉన్నా, ఇతడు వజ్రమే కాని, రాయి కాదు’ అని పలికాడు. బాబా ఇంకా కౌమార అవస్థలో ఉన్నప్పుడు పలికిన మాటలవి. 
ధ్యానాంత ఠేవా హే మాఝే బోల | పుఢే తుమ్హాంస ఆఠవ యేఈల | 
భవిష్య కథూన హె పుఢీల | మగ తే యేవల్యాస పరతలే | ||౪౪|| 
44. ‘ఈ నా మాటలను గుర్తుంచుకోండి. తరువాత ఇవి మీకు గుర్తుకు వస్తాయి’ అని భవిష్యాన్ని చెప్పి, అతడు యవలాకు వెళ్ళిపోయాడు. 
కేశ మాథ్యాచే సబంధ రాఖీత | డోకే న కధీ ముండవీత | 
పహిలవానాసమ పేహేరావ కరీత | తరూణ వయాంత హే సాఈ | ||౪౫|| 
45. ఆ వయసులో, సాయి తల వెంట్రుకలను పెంచుకునేవారు. ఎప్పుడూ కత్తరించేవారు కాదు. పహిల్వాను వలె దుస్తులను ధరించేవారు. 
రహాత్యాస బాబా జేవ్హా జాత | ఝేండూ జాఈ జుఈ ఆణీత | 
నిజహస్తే ఉఖరీ2 ఖుపసీత | పాణీ హీ ఘాలీత నేమానే | ||౪౬|| 
46. రహాతాకు వెళ్ళినప్పుడు, బంతి మరియు జువ్వి మొక్కలను తెచ్చేవారు. బంజరు భూమిలో ఆ మొక్కలను తమ చేతులతోనే నాటి, వానికి నియమంగా నీరు కూడా పోసేవారు. 
వామన2A తాత్యా తయాంచే భక్త | మృత్తికేచే ఘడే తత్ప్రీ త్యర్థ | 
కచ్చే దోన ప్రత్యహీ పురవీత | బాబా శింపీత నిజహస్తే | ||౪౭|| 
47. వామన తాత్యా వారి భక్తుడు. ప్రతి రోజూ వారికి రెండు పచ్చి కుండలను ఇచ్చేవాడు. వానితోనే బాబా తమ చేతులతో నీరు పోసేవారు. 
ఆడావరీల కుండీమధూన | పాణీ ఆణీత ఖాందా వాహూన | 
ఘడే మగ హోతా అస్తమాన | ఠేవీత నేఊన నింబాతళీ | ||౪౮|| 
48. ఆ కుండలతో బావినుండి నీరు తమ భుజాలపై మోసుకొని వచ్చి, మొక్కలకు పోసేవారు. సూర్యుడు అస్తమించిన తరువాత, ఆ కుండలను తీసుకుని వెళ్ళి, వేపచెట్టు క్రింద ఉంచేవారు. 
ఠేవణ్యాచాచ అవకాశ తేథ | జాగచే జాగీంచ భంగూని జాత | 
ఉదయీక3 తాత్యా ఆణూని దేత | ఘడే తయాంప్రత నూతన | ||౪౯|| 
49. అవి పచ్చివి గనుక, చెట్టు క్రింద పెట్టిన వెంటనే అక్కడిక్కడే పగిలి పోయేవి. మరునాడు తాత్యా మరో రెండు క్రొత్త కుండలనిచ్చేవాడు. 
ఘడా భాజలా టికాఊ బరా | పరీ త్యా4 లాగే కచ్చా కోరా | 
ఆవ్యాచే శ్రమావీణ కుంభారా | ఆధీంచ వికరా ఘడ్యాచా | ||౫౦||
50. కుండలు బాగా కాలితే, కొన్నాళ్ళ పాటు నిలువ ఉంటాయి. కాని, బాబాకు పచ్చివే కావాలి. కుమ్మరివాడు, కుండలను కాల్చే శ్రమా లేకుండానే, అదే ధరకు వానిని అమ్మేవాడు. 

తీన వర్ష హాచీ ఉద్యోగ | ఉఘడయా జాగీ ఉఠవిలా బాగ | 
తేచి స్థానీ ఆజ హా సుయోగ | వాడ్యాచా ఉపభోగ జన ఘేతీ | ||౫౧|| 
51. ఈ విధంగా మూడు సంవత్సరాలు బాబా కష్ట పడగా, ఎందుకు పనికిరాని ఆ స్థలంలో మంచి తోట తయారయింది. ఆ స్థలానికి మంచి యోగం పట్టింది. ఆ స్థలంలోనే, అదృష్టం కొద్ది, ప్రజలు ఇప్పుడు వాడయొక్క సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. 
యేథేంచ నింబాతళీ సాధకా | భాఈ నామే భక్తే ఎకా | 
అక్కలకోటచ్యా స్వామీంచ్యా పాదుకా | పూజాకాముకా5 స్థాపిల్యా | ||౫౨|| 
52. ఇక్కడే, వేపచెట్టు క్రింద ‘భాయి’ అనే ఒక భక్తుడు, అక్కలకోట స్వామియొక్క పాదుకలను భక్తులు పూజించాలనే ఉద్దేశంతో స్థాపించాడు. 
అక్కలకోటచే స్వామీసమర్థ | హోతే భాఈంచే ఉపాస్యదైవత | 
ఛబీ పూజన నిత్యనియమిత | భాఈ కరీత నిష్ఠేనే | ||౫౩|| 
53. తను ఆరాధించే దైవమైన అక్కలకోట స్వామి సమర్థుల పటాన్ని అతను నియమ నిష్ఠలతో పూజించేవాడు. 
వాటలే అక్కలకోటీ జావే | పాదుకాంచే దర్శన ఘ్యావే | 
పూజాఉపచార సమర్పావే | మనోభావే పాదుకాంసీ | ||౫౪|| 
54. ఒక సారి, అక్కలకోటకు వెళ్ళి, అక్కడ స్వామివారి పాదుకలను దర్శించి, భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అతనికి కోరిక కలిగింది. 
ముంబఈహూన నిఘావయాచీ | కేలీ సర్వ తయారీ సాచీ | 
ఉద్యా నిఘణార తో నిశ్చయ తైసాచి | రాహూన శిరడీచీ వాట ధరిలీ | ||౫౫|| 
55. ముంబయినుండి బయలుదేరాలని ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు. కాని, మరునాడు అక్కడికి వెళ్ళాలన్న నిశ్వయం మారి, శిరిడీ దారి పట్టాడు. 
ఉద్యా జాణార తో ఆజ స్వప్న | స్వామీసమర్థ ఆజ్ఞాపన | 
శిరడీస సాంప్రత మమ స్థాన | తేథే తూ ప్రస్థాన కరీగా | ||౫౬|| 
56. ఉదయం బయలుదేరాలని అనుకున్న మునపటి రాత్రి అతనికి కల వచ్చింది. ‘ఇప్పుడు నా స్థానం శిరిడీలో, నీవు అక్కడికే వెళ్ళు’ అని కలలో స్వామి సమర్థ ఆజ్ఞాపించారు.
అశీ తీ ఆజ్ఞా శిరీ వందూన | భాఈ నిఘాలె ముంబఈహూన | 
శిరడీస ఎక షణ్మాస రాహూన | ఆనంద సంపన్న జాహలే | ||౫౭|| 
57. ఇలా ఆజ్ఞ అయినప్పుడు, దానిని అతను శిరసావహించి, ముంబయినుండి ప్రయాణమై, శిరిడీ వెళ్ళి, అక్కడ ఆరు నెలలు ఆనందంగా గడిపే భాగ్యాన్ని పొందాడు. 
భాఈ పూర్ణ నిష్ఠావంత | స్మరణీ రహావా తో దృష్టాంత | 
మ్హణోని నింబాతళీ తేథ | పాదుకా స్థాపీత స్వామీంచ్యా | ||౫౮|| 
58. పూర్తిగా నిష్ఠావంతుడైన భాయి తనకు కలిగిన ఈ దృష్టాంతం ఎప్పటికీ గుర్తుండాలని, వేపచెట్టు క్రింద పాదుకలను స్థాపించాడు. 
శకే అఠరాసే చౌతీస సాలీ | శ్రావణ శుద్ధ పర్వకాళీ | 
పాదుకా స్థాపిల్యా నింబాతళీ | భజనమేళీ సప్రేమే | ||౫౯|| 
59. శక సంవత్సరం ౧౮౩౪లో (క్రి. శ. ౧౯౧౨) శ్రావణమాసం, శుక్లపక్షం పర్వ కాలంలో, స్వామి పాదుకలను చాలా భక్తిప్రేమలతో వేపచెట్టు క్రింద స్థాపించాడు. 
దాదా కేళకరాంచ్యా హస్తే | పాదుకా ప్రస్థాపన కరవిలే ముహూర్తే | 
సశాస్త్ర విధివిధానాంతే | కెలె నిజహస్తే ఉపాసనీంనీ | ||౬౦||
60. ఒక శుభముహూర్తాన, దాదా కేల్కరు చేతల మీదుగా, విధివిధానాలతో శాస్త్రోక్తంగా ఉపాసనీ మహారాజు స్వయంగా పాదుకలను స్థాపించారు. 

పుఢీల వ్యవస్థేచీ నిరవణ | పూజాకరీ దీక్షిత బ్రాహ్మణ | 
వ్యవస్థా పాహీ భక్త సగుణ | ఏసే హే ఆఖ్యాన పాదుకాంచే6 | ||౬౧|| 
61. తరువాత పాదుకలకు జరగవలసిన పూజా వ్యవస్థలను బ్రాహ్మణుడైన దీక్షితు (గోవింద కమలాకర దీక్షితు) చేసేవాడు. మిగతా ఏర్పాట్లను సగుణ మేరు చూసేవాడు. ఇది పాదుకల కథ.
ఏసెచ హె సంత నిర్వికార | ప్రత్యక్ష ఈశ్వరీ అవతార | 
కరావయా జగదుద్ధార | ఉపకారార్థ అవతరతీ | ||౬౨|| 
62. ఏ బంధాలు, కోరికలు లేని సంతులు మనకు, కనిపించే ఈశ్వరుని అవతారాలు. జగత్తును ఉద్ధరించటానికే వీరు ఈ విధంగా అవతరిస్తారు. 
పుఢే కాంహీ దివస జాతా | ఘడలీ ఆశ్చర్యకారక వార్తా | 
శ్రోతీ సాదర శ్రవణ కరితా | నవల చిత్తా వాటేల | ||౬౩|| 
63. కొన్ని రోజుల తరువాత, చాలా ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి జరిగింది. శ్రోతలు శ్రద్ధగా వింటే, విచిత్రంగా అనిపిస్తుంది. 
తాంబోళీ ఎక మోహిద్దీన భాఈ | తయాసవే తేఢ పడూని కాంహీ | 
గేలీ ఝోంబీ జుంపోన పాహీ | లాగలీ లఢాఈ పరస్పర | ||౬౪|| 
64. మొహిద్దీన భాయి అనే తమలపాకులను అమ్ముకునే వానికి, బాబాకు మధ్యన మాటామాట పెరిగి అది కుస్తీకి దారి తీసి, ఇద్దరం పొట్లాడారు. 
పహిలవాన దోఘే కుశల | హోణారాపుఢే న చలే బళ | 
మోహిద్దీన హోఊని ప్రబళ | బాబా హతబళ జిత ఝాలే | ||౬౫|| 
65. ఇద్దరూ చాలా నేర్పు ఉన్న పహిల్వానులే. అయినా, విధి ముందు ఎవరి బలమూ సాగదు. బలవంతుడైన మోహిద్దీను చేతిలో బాబా ఓడిపోయారు. 
తేథూని మగ నిశ్చయ కేలా | పోశాఖ అవఘా బాబాంనీ బదలలా | 
కఫనీ ఓఢిలీ లంగోట లావిలా | ఫడకా గుండాళిలా మాథ్యాస | ||౬౬|| 
66. అప్పటినుండి, బాబా ఒక నిశ్చయానికొచ్చి, తమ దుస్తులన్నీ మార్చివేశారు. లంగోటీని కట్టుకుని కఫనీను తొడుక్కున్నారు. తలకు రుమాలు చుట్టుకున్నారు. 
కెలె గోణాచే వరాసన | గోణాచేంచ అంథరూణ | 
ఫాటకే తుటకె కరోన పరిధాన | త్యాంతచి సమాధాన మానావే | ||౬౭|| 
67. కూర్చోవటానికి వారికి ఆసనం గోనెపట్టా. పడుకోవడం కూడా గోనెపట్టా పైనే. పాత చింకి గుడ్డలను ధరించి, వానితోనే తృప్తి చెందేవారు. 
గరీబీ అవ్వల బాదశాహీ | అమీరిసే లాఖ సవాఈ | 
గరీబోంకా అల్లా భాఈ | అక్షయీ సాఈ వదత కీ | ||౬౮|| 
68. “మహారాజు పదవికంటే పేదరికమే గొప్ప రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికమే లక్ష రేట్లు శ్రేష్ఠం. పేదలకు అల్లాయే బంధువు”. అని సాయి ఎప్పుడూ అంటుండేవారు. 
గంగాగీరహీ యేచ స్థితి | తాలిమబాజీచీ అతి ప్రీతి | 
ఎకదా ఖేళత అసతా కుస్తీ | జాహలీ ఉపరతీ తయాంతే | ||౬౯|| 
69. గంగాగీరు పరిస్థితి కూడా ఇలాంటిదే. కుస్తీలపై అతనికి ఎంతో మోజు. ఒక సారి కుస్తీ పడుతుండగా అతనికి వైరాగ్యం కలిగింది. 
ప్రాప్త కాళ ఘటకా ఆలీ | ఎకా సిద్ధాచీ వాణీ వదలీ | 
దేవా సవేంచ కరీత కేలీ7 | తనూహీ ఝిజవిలీ పాహిజే | ||౭౦||
70. సరియైన సమయం వచ్చేసరికి, ఒక సిద్ధుని మాట పలికింది. ‘దేవునితో ఆడాలి. అలా ఆడుతూ శరీరం అరిగిపోవాలి’. 

కుస్తీ ఖేళతా ఖేళాతా కానీ | పడలీ అనుగ్రహరూపహీ వాణీ | 
సంసారావర ఓతూని పాణీ | పరమార్థ భజనీ లాగలే | ||౭౧|| 
71. అనుగ్రహ రూపమైన ఈ మాటలు అతడు కుస్తీ పడుతుండగా అతని చెవులలో పడింది. అంతే, దాంతో ప్రపంచాన్ని వదిలి, అతడు పరమార్థ సాధనలో పడ్డాడు. 
పుణతాంబ్యాచి యా నికటీ | నదీచ్యా ఉభయ ప్రవాహా పోటీ | 
ఆహే బువాంచా మఠ త్యా బేటీ | సేవేసాఠీ శిష్యహీI ||౭౨|| 
72. పుణతాంబేకు దగ్గరగా, గోదావరీ నదియొక్క రెండు ప్రవాహాల మధ్య, ఒక చిన్న ద్వీపంలో ఇతని మఠం ఉంది. ఇతని సేవ కోసం శిష్యులు కూడా ఉన్నారు. 
అసో పుఢే సాఈనాథ | విచారల్యాచేంచ ఉత్తర దేత | 
స్వయే ఆపణ కోణాసమవేత | కధీంహీ బోలత నసత తే | ||౭౩|| 
73. కాలం గడిచిన కొద్దీ, ఎవరైనా ఏదైనా అడిగితేనే సాయి జవాబిచ్చేవారు. స్వతఃగా వారెప్పుడూ ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. 
దివసా బైఠక నింబాఖాలీ | కధీ శివేచ్యా ఓఢ్యాజవళీ | 
బాభళీచీ ఆడవీ డహాళీ | బైసావే సాఉలియే తియేచ్యా | ||౭౪|| 
74. పగటిపూట వేపచెట్టు క్రింద కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు, గ్రామ శివారులలో ఉన్న కాలువ దగ్గర, తుమ్మ చెట్టు క్రింద నీడలో కూర్చునేవారు. 
కధీ తేథూన ఎక మైలావరీ | నిమగాంవ గాంవాచియా శేజారీ | 
బాబా దివసా దుపారీ తిపారీ | స్వేచ్ఛాచారీ హిండత | ||౭౫|| 
75. మరొకప్పుడు, అక్కడినుండి మైలు దూరంలో ఉన్న నీంగాం దగ్గరకు, మధ్యాహ్నంగాని సాయంత్రం గాని వెళ్ళేవారు. అలా పగలంతా స్వేచ్ఛగా తిరిగేవారు. 
ప్రసిద్ధ త్రింబకజీ డేంగళ్యాఘరీ | నిమగాంవ గాంవాచీ జహాగిరదారీ | 
తేథీల బాబాసాహేబ డేంగళ్యావరీ | ప్రీతి భారీ బాబాంచీ | ||౭౬|| 
76. ప్రసిద్ధుడైన త్రింబకజీ డేంగ్లే నీమగాంయొక్క జాగీర్దారు. వారి ఇంట్లో ఉన్న బాబాసాహేబు డేంగ్లే అంటే బాబాకు చాలా ప్రేమ. 
నిమగాంవావరీ జాతా ఫేరీ | బాబానీ జావే తయాంచే ఘరీ | 
అతి ప్రేమే తయా బరోబరీ | దివసభరీ బోలావే | ||౭౭|| 
77. నీమగాం గ్రామానికి వెళ్ళినప్పుడు, బాబా అతని ఇంటికి వెళ్ళి, రోజంతా అతనితో ప్రేమగా మాట్లాడేవారు. 
బంధు తయాంసీ హోతే లహాన | నానాసాహెబ నామాభిధాన | 
తయాంస నవ్హతే పుత్ర సంతాన | తేణే తే ఖిన్న మానసీ | ||౭౮|| 
78. అతని తమ్ముడు నానాసాహేబు డేంగ్లేకు పుత్ర సంతానం లేదు. అందుకు మనసులో చాలా బాధపడేవాడు. 
ప్రథమ కుటుంబాస యోగ మంద | మ్హణూని కేలా ద్వితీయ సంబంధ | 
తరీహీ చుకేనా ఋణానుబంధ | దైవ నిర్బంధ అగాధ | ||౭౯|| 
79. మొదటి భార్యకు పిల్లలు పుట్టక పోవడంతో, రెండవ పెళ్ళి చేసుకున్నాడు. అయినా తలరాతను ఎవరూ తప్పించుకోలేరు. దైవ నిర్ణయం అర్థం కానిది. 
పుఢే బాబాసాహెబ త్యాంస | పాఠవీత సాఈ దర్శనాస | 
పావతే జాహలే ఆశీర్వాదాస | పుత్ర ప్రసాదాసహీ నానా | ||౮౦||
80. బాబాసాహేబు అతనిని సాయి దర్శనానికి పంపాడు. సాయియొక్క ఆశీర్వాదంతో నానాకు మగ సంతానం కలిగింది. 

పుఢే సాఈంచే దర్శనాలా | జనసముదాయ లోటూ లాగలా | 
మహిమా సాఈంచా వాఢత గేలా | వార్తా నగరాలా పోహోచలీ | ||౮౧|| 
81. ఆ తరువాత, సాయియొక్క దర్శనానికి ప్రజలు గుంపులు గుంపులుగా రాసాగారు. సాయియొక్క కీర్తి అలా పెరుగుతూ పెరుగుతూ, వారి సంగతి అహమ్మదునగరం వరకు చేరింది.
తెథే సరకారదరబారీ చలన | నానాచే హోతె మోఠే వళణ | 
తైసేచ చిదంబర కేశవ మ్హణూన | తెహీ చిటణీస జాణ జిల్హ్యాలా | ||౮౨|| 
82. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి, నానాసాహేబు తరచూ వస్తుండేవాడు. అక్కడే, చిదంబర కేశవ ఆ జిల్లా కలెక్టరు వద్ద కార్యదర్శిగా పనిచేశేవాడు. 
సాఈసమర్థ దర్శనపాత్ర | ఘేఊని ఆపులె ఇష్ట మిత్ర | 
దర్శనార్థ యావే పుత్ర కలత్ర | ధాడిలే పత్ర తయాంస | ||౮౩|| 
83. సాయి సమర్థుల దర్శనానికి భార్యాబిడ్డలను, బంధుమిత్రులను వెంటబెట్టుకొని రమ్మని అతనికి నానా ఉత్తరం వ్రాశాడు. 
ఏసే ఎకామాగూన ఎక | శిరడీస యేఊ లాగలె అనెక | 
వాఢలా జైసా బాబాంచా లౌకిక | పరివారహీ దేఖ తైసాచి | ||౮౪|| 
84. ఈ విధంగా ఒకరి వెనుక ఒకరు అనేకులు శిరిడీకి రాసాగారు. దాంతో బాబా కీర్తి పెరగటమే కాక, వారి లౌకిక పరివారం కూడా పెరిగింది. 
నలగే జరీ కోణాచా సాంగాత | తరీ దివసా భక్తపరివారాక్రాంత8 | 
అస్తమానానంతర శీరడింత | పడక్యా మశిదీంత నిజావె | ||౮౫|| 
85. వారికి ఎవరి సాంగత్యమూ అవసరం లేక పోయినా, రోజంతా భక్తులు వారి చుట్టూ మూగి ఉండేవారు. సూర్యుడు అస్తమించిన తరువాత, శిరిడీలోని పాడు పడిన మసీదులో సాయి నిద్రించేవారు. 
చిలీమ తమాఖూ టమరేల | అంగాంత కఫనీ పాయఘోళ | 
మాథ్యాస ఫడకా ధవల | సటకా జవళ సర్వదా | ||౮౬|| 
86. చిలుం, పొగాకు, మరి రేకు డబ్బా వారి దగ్గర ఎప్పుడూ ఉండేవి. పాదాలవరకు ఉండే కఫనీని ధరించి, తలకు తెల్లని గుడ్డ చుట్టుకునేవారు. చేతిలో సటకా కర్ర ఎప్పడూ ఉండేది. 
తె ధూత వస్త్ర ఎక ధవల | వామకర్ణా మాగే సుఢాళ | 
జటా జూట సమ దేఊని పీళ | గుండాళీ తో శిరాసీ | ||౮౭|| 
87. ఉతికిన తెల్ల గుడ్డను తలకు చుట్టి, ఎడమ చెవి వెనుక జుట్టులో ముడి వేసుకునేవారు. 
యా వసనాచే ఆచ్ఛాదన | ఆఠాఠ దిన స్నాన విహీన | 
పాయీ జోడా నా వహాణ | ఎక ఆసన గోణాచే | ||౮౮|| 
88. ఇలా దుస్తులు ధరించి, కొన్ని మార్లు ఎనిమిదేసి రోజులు కూడా స్నానం లేకుండా ఉండేవారు. పాదాలకు జోళ్ళుగాని, చెప్పులుగాని లేకుండా వారు నడిచేవారు. గోనెపట్టా పైనే కూర్చునేవారు. 
పోత్యాచా తుకడా ఎక | తయావరీ నిత్య బైఠక | 
తక్యా కసా తో నాహీ ఠాఊక | ఆరాణుక కైసెనీ | ||౮౯|| 
89. ఆ గోనెముక్క పైనే ఎల్లప్పుడూ కూర్చునేవారు. తలగడ సుఖం ఎలా ఉంటుందో వారికి తెలియదు. ఉన్నదానిలోనే తృప్తిగా ఉండేవారు.
తోంవరీ తె జీర్ణతరట | తీచ త్యాంచీ ఆవడతీ బైఠక | 
సదా సర్వదా తైశీచ నిష్టంక | అష్టౌ ప్రహర తె జాగీ | ||౯౦||
90. ఆ పాత, చిరిగిపోయిన గోనెముక్కే వారికి ప్రియమైన ఆసనం. రాత్రి పగలూ అది ఎప్పుడూ ఒకే చోటులో ఉండేది. 

తేంచి ఆసన వా ఆస్తరణ | కాంసే ఎక కౌపీన పరిధాన | 
నాహీ దుజె వస్త్ర ప్రవరణ | శీత నివారణ ఎక ధుని | ||౯౧|| 
91. అదే వారి ఆసనం, అవే వారి దుస్తులు. కౌపీనం తప్ప మిగతా వేరే గుడ్డలు ఏవీ ఉండేవి కావు. చలిబాధను తొలగించటానికి, ఒక ధుని మాత్రమే ఉండేది. 
దక్షిణాభిముఖ ఆసనస్థ9 | కఠడ్యావరీ వామ హస్త | 
సమోర ధునికడే అవలోకీత | బాబా మశిదీంత బైసత | ||౯౨|| 
92. మసీదులో దక్షిణ ముఖంగా కూర్చుని, ఎదుటనున్న ధునినే రెప్పలు ఆడించకుండా చూస్తూ, బాబా తమ ఎడమ చేతిని కట్టడాపైన వేసి, కూర్చునేవారు. 
అహంకార వాసనా సమవేతీ | నానావిధ వృత్తీంచ్యా ఆహుతీ | 
ప్రపంచ ప్రవృత్తి సమగ్ర హవితీ | యుక్తి ప్రయుక్తీ ధునీస | ||౯౩|| 
93. వారు అలా కూర్చుంటే, అహంకారాన్ని, అనేకమైన ఇంద్రియల కోరికలను, ఇతర ఎన్నో మానసిక ఆలోచనలను, యుక్తి ప్రయుక్తులను, అన్నిటినీ వారు ధునిలో ఆహుతి చేస్తున్నట్టు అనిపించేది. 
ఏసియా త్యా ప్రఖర కుండా | లావిలా జ్ఞానాభిమానాచా ఓండా | 
అల్లా మాలీక సదైవ తోండా | తయాచా ఝెండా అఖండ | ||౯౪|| 
94. ధునిలో మండుతున్న అగ్నిగుండంలో, అభిమానం నిండిన జ్ఞానాన్ని సమిధలుగా వేశారు. వారి నోట ఎల్లప్పుడూ “అల్లా మాలిక” అన్న ఉచ్చరణ ఉండేది. అలా వారి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉండేది. 
మశీద తరీ తీ కెఉతీ | అవధీ జాగా దోన ఖణ తీ | 
త్యాంతచి బసతీ ఉఠతీ నిజతీ | భేట దెతీ సమస్తా | ||౯౫|| 
95. ఆ మసీదైనా ఎంత ఉండేది? మొత్తం స్థలమంతా రెండు కంభాల మధ్య ఉన్నంత. అందులోనే బాబా కూర్చోవటం, లేవటం, పడుకోవటం, అందరినీ కలుసుకోవటం అన్నీ జరిగేవి. 
గాదీ తక్యా హే తో ఆతా | భక్త సముదాయ మిళలా భంవతా | 
ఆరంభీ తయాంచ్యా నికట జాతా | సకళాంస నిర్భయతా నవ్హతీచ | ||౯౬|| 
96. కూర్చోవటానికి ఒక గద్దె, ఆనుకోవటానికి ఒక తలగడ అన్నీ ఇప్పుడు వచ్చాయి. మొదట్లో వారి దగ్గరికి వెళ్ళాలి అంటేనే అందరికీ భయం. 
సన ఎకోణీసశే బారా | తెథూన నవా ప్రకార సారా | 
మశీదీచియా స్థిత్యంతరా | ఆరంభ ఖరా తెథూన | ||౯౭|| 
97. క్రి. శ. ౧౯౧౨వ సంవత్సరంనుండి మసీదులో క్రొత్త రకమైన మార్పు మొదలైంది. 
ఢోపర ఢోపర జమీనీసీ | ఖడ్డే హోతె మశీదీసీ | 
ఎకే నిశీంత ఝాలీ ఫరసీ | భావాసరసీ భక్తాంచ్యా | ||౯౮|| 
98. మసీదు నేలలో, మోకాలి లోతు గుంతలు ఉండేవి. ప్రేమికులైన భక్తుల ద్వారా ఒక్క రాత్రిలో నేలను చదును చేసి, బండలు పరచబడ్డాయి. 
మశీదీచియా వసతీ ఆధీ | బాబా రహాత తకియా మధీ | 
తెథేంచ కిత్యేక కాలావధీ | అబాధీత రమలే తే | ||౯౯|| 
99. మసీదుకు రాక మునుపు, చాలా కాలం బాబా తకియా (ఫకీరులుండే చోటు)లో హాయిగా ఆనందంగా ఉండేవారు. 
తెథేంచ చరణీ బాంధోని ఘుంగుర | ఖంజిరీచియా తాలావర | 
నాచావే బాబాంనీ అతిసుందర | గాంవేహీ మధూర ప్రేమానె | ||౧౦౦||
100. అక్కడే (తకియాలో) వారు తమ కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, ఖంజరీ తాళానికి సరిగ్గా, అతి సుందరంగా నాట్యం చేసేవారు. భక్తిగా, మధురంగా పాడేవారు కూడా. 

ఆరంభీ సాఈ సమర్థాంస | దీపోత్సవాచి మోఠీ హౌస | 
తదర్థ స్వయే దుకానదారాంస | తేల మాగావయాస తే జాత | ||౧౦౧|| 
101. మొదట్లో సాయి సమర్థులకు దీపాలను వెలిగించటమంటే చాలా ఇష్టంగా ఉండేది. అందుకు వారు స్వయంగా దుకాణుదారుల వద్ద వెళ్ళి నూనెను అడిగేవారు.
ఘేఊనియా టమరెల హాతీ | వాణ్యాతేల్యాంచ్యా దుకానాంప్రతీ | 
స్వయే తేలాచీ భిక్షా మాగతీ | ఆణూని భరతీ పణత్యాంత | ||౧౦౨|| 
102. రేకు డబ్బా చేతిలో పుచ్చుకొని, నూనె వర్తకుల అంగళ్ళకు స్వయంగా వెళ్ళి, నూనెను అడిగి తెచ్చి, ప్రమిదలలో నింపేవారు. 
పణత్యా లావీత ఝగఝగీత | దెఊళీ ఆణి మశీదీంత | 
ఏసే కాంహీ దివస పర్యంత | సదోదీత చాలలే | ||౧౦౩|| 
103. ఆలయాలలో, మసీదులో, ప్రకాశవంతంగా దీపాలను వెలిగించేవారు. అలా కొన్ని రోజుల వరకు ఆగకుండా జరిగింది. 
దీపారాధనీ బహు ప్రీత | దివాళీచాహీ దీపోత్సవ కరీత | 
చింధ్యా కాఢూనీ వాతీ వళీత | దీప ఉజళీత మశీదీ | ||౧౦౪|| 
104. దీపాలతో ఆరాధన వారికి చాలా ప్రీతి. దీపావళిలాగే దీపోత్సవాలను చేసేవారు. చింకి గుడ్డలతో వత్తులను చేసి, మసీదులో దీపాలను వెలిగించారు. 
తేల తో రోజ ఆణీత ఫుకట | వాణియా మనీ ఆలే కపట | 
సర్వా మిళూని కేలా కట | పురే కటకట హీ ఆతా | ||౧౦౫|| 
105. రోజూ ఉచితంగా నూనెను తెచ్చేవారు. దాంతో వర్తకుల మనసులో దురాలోచన కలిగింది. ఇక ఈ గొడవను ముగించాలని అందరూ కలిసి నిశ్చయించుకున్నారు. 
పుఢే నిత్యనియమానుసారతా | బాబా తేల మాంగూ యేతా | 
సర్వాంనీహీ నాహీ మ్హణతా | కాయ ఆశ్చర్యతా వర్తలీ | ||౧౦౬|| 
106. తరువాత, ఎప్పటిలాగే బాబా నూనెను అడగటానికి వెళ్ళగా, వర్తకులందరూ నూనె లేదని చెప్పారు. అప్పుడు చాలా ఆశ్చర్యగొలిపే, 
బాబా నిముట గేలే పరత | కాంకడే సుకేచ ఠేవిలే పణత్యాంత | 
తేల నసతా హే కాయ కరీత | వాణీ పహాత మౌజ తీ | ||౧౦౭|| 
107. ఒక అద్భుతం జరిగింది. ఏమీ మాట్లాడకుండా బాబా తిరిగి వచ్చారు. ప్రమిదలలో వట్టి పోడివత్తులను వేసారు. నూనె లేకుండా బాబా ఏం చేస్తారో అని వర్తకులు సరదాగా చూడసాగారు. 
మశీదీచ్యా జోత్యావరీల | బాబా ఉచలూన ఘేతీ టమరెల | 
త్యాంత హోతే ఇవలేసే తేల | కష్టే లాగేల సాంజవాత | ||౧౦౮|| 
108. మసీదులోని పిట్టగోడ పైని రేకు డబ్బాను బాబా తీసుకున్నారు. అందులో కొంచమే నూనె ఉంది. దాంతో సాయంత్రం ఒక్క దీపాన్ని వెలిగించడం కూడా కష్టం. 
త్యా తేలాంత ఘాతలే పాణీ | స్వయే బాబా గేలే పిఉనీ | 
ఏసే తే బ్రహ్మార్పణ కరూనీ | నివ్వళ పాణీ ఘేతలే | ||౧౦౯|| 
109. ఆ నూనెలో నీరు పోసి, దానినంతా బాబా స్వయంగా త్రాగేశారు. ఆ విధంగా బ్రహ్మకు అర్పించిన తరువాత, ఒట్టి నీటిని తీసుకున్నారు. 
మగ తే పాణీ పణత్యాంత ఓతునీ | సుకే కాంకడే పూర్ణ భిజవూనీ | 
తయాంస కాండే ఓఢూని లావూనీ | దీప పేటవూని దావిలే | ||౧౧౦||
110. ఆ నీటిని తరువాత ప్రమిదలలో పోసి, వానిలో పొడి వత్తులను తడిపి, అగ్గిపుల్లను గీచి దీపాలను వెలిగించారు.

పాహూనియా తే పాణీ పెటె | వాణీ ఘాలితీ తోండాంత బోటే | 
బాబాంస ఆపణ వదలో ఖోటే | కేలే ఓఖటే మనీ మ్హణతీ | ||౧౧౧|| 
111. నీటితో దీపాలు వెలగటం చూసిన వర్తకులు ఆశ్చర్యపోయి, ముక్కు మీద వేలేసుకున్నారు. బాబాతో అబద్ధం చెప్పి మనము మంచి పని చేయలేదు అని వారు మనసులో అనుకున్నారు. 
తేల నసతా అణూమాత్ర | పణత్యా జళాల్యా సర్వరాత్ర | 
వాణీ సాఈచ్యా కృపేస అపాత్ర | వదూ సర్వత్ర లాగలే | ||౧౧౨|| 
112. కొంచెము కూడా నూనె లేకుండా రాత్రంతా దీపాలు వెలిగాయి. సాయియొక్క అనుగ్రహానికి ఈ వర్తకులు యోగ్యులు కారని అందరూ అనుకున్నారు. 
బాబాంచా హా కాయ ప్రతాప | అసత్య భాషణే ఝాలే పాప | 
దిధలా బాబాంస వ్యర్థ సంతాప | హా పశ్చాతాప వాణియా | ||౧౧౩|| 
113. ఏమిటి బాబాయొక్క ఈ అద్భుత శక్తులు అని వర్తకులు అనుకున్నారు. బాబాకు అబద్ధం చెప్పి పాపం తెచ్చుకోవడమే కాక అనవసరంగా వారికి కష్టం కలిగించామని వర్తకులు మరల పశ్చాత్తాప పడ్డారు. 
బాబాంచ్యా తే నాహీ మనీ | రాగ ద్వేషాంనాతళే జనీ | 
శత్రు మిత్ర తయా నా కోణీ | సర్వహీ ప్రాణీ సారిఖే | ||౧౧౪|| 
114. కాని, బాబా మనసులో ఏమి అనుకోలేదు. ఇతరులపై కోపం, ద్వేషం మొదలైనవి వారికి లేవు. వారికి శత్రువులు, మిత్రులు అంటూ ఎవరూ లేరు. వారికి అన్ని ప్రాణులు సమానమే. 
అసో ఆతా పూర్వానుసంధాన | కుస్తీంత యశస్వీ మోహిద్దీన | 
యాహూన పుఢీల చరిత్ర మహిమాన | దత్తావధాన పరిసిజే | ||౧౧౫|| 
115. ఇప్పుడు మునుపటి కథను కొనసాగిద్దాము. మొహిద్దీను కుస్తీలో గెలిచిన తరువాతి కథను జాగ్రతగా గమనించండి. 
కుస్తీ నంతర పాంచవే వర్షీ | ఫకీర అహమదనగర నివాసీ | 
జవ్హార అలీ నామ జయాసీ | ఆలా రహాత్యాసీ సశిష్య | ||౧౧౬|| 
116. కుస్తీ జరిగిన ఐదేళ్ళ తరువాత, అహమ్మదునగరం నివాసియైన జవ్హార అలీ అనే ఒక ఫకీరు, శిష్యులతో సహ రహాతాకు వచ్చాడు. 
పాహూన ఎక ఉఘడీ బఖళ | వీరభద్రాచే దేఊళాజవళ | 
ఫకిరానే దిధలా తళ | ఫకీర తో సబళ దైవాచా | ||౧౧౭|| 
117. వీరభద్రుని ఆలయం దగ్గర ఒక ఖాళీ స్థలాన్ని చూసి అక్కడ తిష్ఠ వేశాడు. కాని, ఫకీరు మాత్రం చాలా అదృష్టవంతుడు. 
జరీ నసతా తో దైవాచా | తరీ తయాతే లాధతా కైంచా | 
సాఈసారఖా శిష్య మౌజేచా | డంకా జయాచా సర్వత్ర | ||౧౧౮|| 
118. అదృష్టవంతుడు కాకపోతే, సాయి వంటి ప్రసిద్ధి చెందిన గొప్ప శిష్యుడు ఎలా దొరకుతాడు? 
లోక గాంవాంత హోతే అనేక | త్యాంతహీ హోతే మరాఠే కైక | 
త్యాంతీల భగూ సదాఫళ ఎక | జాహలా సేవక తయాంచా | ||౧౧౯|| 
119. ఆ ఊళ్ళో అనేక మంది ఉన్నారు. వారిలో కొందరు మరాఠీలూ ఉన్నారు. వారిలో ఒకరైన భగూ సదాపళ ఆ ఫకీరుకు సేవకుడైనాడు. 
ఫకీర హోతా మోఠా పఢీక | కురాణ శరీఫ కరతలామలక | 
స్వార్థీ పరమార్థీ ఆణి భావిక | లాగలే అనేక తచ్చరణీ | ||౧౨౦||
120. ఫకీరు గొప్ప పండితుడు. ఖురానే శరీఫ గురించి అతనికి తెలియనిది ఏదీ లేదు. అతని ఈ జ్ఞానానికోసం, కొందరు స్వార్థపరులు, కొందరు దైవ భక్తులు, నమ్మకం కలవారు కొందరు, ఇలా అనేక రకాలవారు అతని పాదాలను ఆశ్రయించారు. 

ఇదగా బాంధావయా ఆరంభ కేలా | ఏసా కాంహీ కాళ గేలా | 
వీరభద్రదేవ బాటవిలా | ఆరోప ఆలా త్యాజవర | ||౧౨౧|| 
121. జవ్హార అలీ అక్కడ ఈద్గా నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. అలా కొంత కాలం గడిచింది. ఈద్గా కట్టి, వీరభద్రదేవుని అపవిత్రం చేస్తున్నాడన్న నింద అతనిపై పడింది.
పుఢే తో ఇదగా బంద పడలా | ఫకీర గాంవాబాహేర ఘాలవిలా | 
తెథూన మగ తో శిరడీస ఆలా | మశీదీంత రాహిలా బాబాంపాశీ | ||౧౨౨|| 
122. దాంతో ఈద్గా పని ఆగిపోయింది. ఫకీరుని ఊరినుండి బైటికి గెంటివేశారు. అక్కడినుండి అతడు శిరిడీకి వచ్చి, బాబాతో పాటే మసీదులో ఉండ సాగాడు. 
ఫకీర మోఠా మృదుభాషణీ | గాంవ లాగలా తయాచే భజనీ | 
బాబాంసహీ కాంహీ కేలీ కరణీ | ఘాతలీ మోహినీ జన మ్హణతీ | ||౧౨౩|| 
123. జవ్హార అలీ గొప్ప మృదు భాషి. దానితో ఊరివారంతా అతనిని ఇష్ట పడ సాగారు. బాబాను కూడా అతడు ఏదో మాయ చేసి తన వశం చేసుకున్నాడని జనులు అనుకున్నారు. 
హో మ్హణే తూ మాఝా చేలా | స్వభావ బాబాంచా బహు రంగేలా | 
హూ మ్హణతా ఫకీర సంతొషలా |ఘేఊన నిఘాలా బాబాంస | ||౧౨౪|| 
124. అతడు బాబాతో ‘నువ్వు నా శిష్యుడిగా ఉండు’ అని అన్నాడు. వినోద స్వభావంగల బాబా సరే అని అనగానే అతడు చాలా ఆనందించి, బాబాను వెంట తీసుకుని వెళ్ళాడు. 
బాబాంసారిఖా శిష్య సధరూ | జవ్హార అలీ జాహలే గురూ | 
మగ దోఘాంచా జాహలా విచారూ | రహివాస కరూ రహాత్యాంత | ||౧౨౫|| 
125. బాబావంటి సాధు స్వభావంగల శిష్యునికి జవ్హార అలీ గురువయ్యాడు. ఆ తరువాత ఇద్దరూ రహాతాలో ఉండాలని నిశ్చయించుకున్నారు. 
గురూ నేణె శిష్యాచీ కళా | శిష్య జాణే గురూచ్యా అవకళా | 
పరీ న కెవ్హాంహీ అనాదర కేలా | స్వధర్మ రాఖిలా శిష్యాచా | ||౧౨౬|| 
126. గురువుకు శిష్యుని గొప్పదనం తెలియదు. కాని, శిష్యునికి గురువులో ఉన్న లోపాలు తెలుసు. అయినా, గురువును ఎప్పుడూ అనాదరణ చేయకుండా, మంచి శిష్యుని ధర్మాన్ని బాబా పాటించారు. 
గురూముఖాంతూన బాహేర ఆలే | "యోగ్యాయోగ్య" నాహీ పాహిలే | 
వచన వరిచేవరీ ఝేలిలే | పాణీహీ వాహిలే గురూగృహీ | ||౧౨౭|| 
127. గురువు నోటినుండి వచ్చిన మాటలు యోగ్యమా అయోగ్యమా అని చూడకుండా, తూచా తప్పకుండా పాటించారు. గురువు ఇంటికి నీరు కూడా మోశారు. 
ఏసీ చాలలీ గురూసేవా | శిరడీస యావే కెవ్హా కెవ్హా | 
ఏసే హోఊ లాగలే జెవ్హా | కాయ మగ తెవ్హా జాహలే | ||౧౨౮|| 
128. ఇలా గురుసేవ చేస్తూ, అప్పుడప్పుడు శిరిడీకి వచ్చేవారు. అలా ఉండగా, ఏమి జరిగిందో వినండి. 
ఏసే వరచేవర హోఊ లాగలే | రాహాత్యాసచి రాహూ లాగలే | 
ఫారచి ఫకీరా నాదీ భరలే | వాటలే అంతరలే శిరడీలా | ||౧౨౯|| 
129. అలా తరచూ వస్తూపోతూ ఉన్నా, బాబా రహాతాలోనే ఉండసాగారు. బాబా ఫకీరు వశమైపోయారు, ఇక శిరిడీ విడిచి పెట్టినట్లే అని శిరిడీ ప్రజలు అనుకోసాగారు. 
జనాంస వాటె జవ్హార అలీ | సాఈస నిజయోగబళే ఆకళీ | 
సాఈచీ తో కళా వేగళీ | అభిమాన జాళీ దేహాచా | ||౧౩౦||
130. జవ్హార అలీ తన యోగ బలంతో సాయిని కట్టేసుకున్నాడని అందరికీ అనిపించింది. కాని, దేహం మీద ఉన్న అభిమానాన్ని దహింపచేయటానికి సాయి ఈ పద్ధతిని ఉపయోగించారు. 

సాఈసి కోఠూన ఆలా అభిమాన | శ్రోతే సహజ కరితీల అనుమాన | 
పరీ హే లోక సంగ్రహార్థ ఆచరణ | అవతరణ కార్య తే హేంచ | ||౧౩౧|| 
131. సాయికి అభిమానం ఎక్కడిదని శ్రోతలకు సందేహం కలగడం సహజం. కాని, వారి పద్ధతులంతా లోక కల్యాణానికే. వారి అవతారం కూడా దీనికోసమే. 
శిరడీస్థ బాబాంచే ప్రేమీ భక్త | బాబాంచె ఠాయీ అతి ఆసక్త | 
తయాంతే బాబాంపాసూన వియుక్త | రాహణే అయుక్త వాటలే | ||౧౩౨|| 
132. శిరిడీ గ్రామ ప్రజలకు బాబాయందు విపరీతమైన ప్రేమ. బాబా తమ వద్ద లేకపోవటం వారికి చాలా తప్పుగా అనిపించింది. 
సాఈ సర్వస్వీ తయా ఆధీన | పాహూని గ్రామస్థ ఉద్విగ్న మన | 
కైసే కరావే తయా స్వాధీన | విచారీ నిమగ్న జాహలే | ||౧౩౩|| 
133. తమ సర్వస్వం అయిన సాయిని జవ్హార అలీ తన వశం చేసుకోవటం చూసి, శిరిడీ ప్రజలు మనసులో చాలా బాధ పడ్డారు. ఏ విధంగా సాయిని మరల తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అని ఆలోచించ సాగారు. 
జైసే కనక ఆణి కాంతి | జైసా దీప ఆణి దీప్తి | 
తైసీచ హే గురూ శిష్య స్థితి | ఏక్య ప్రతీతి ఉభయాంసీ | ||౧౩౪|| 
134. బంగారం, దాని మెరుగు మరి దీపం, దాని వెలుగు వలె ఆ గురుశిష్యులు ఇద్దరి మధ్య ఐక్యత ఉండేది. 
మగ తె శిరడీచె భక్త మండళ | గేలే రహాత్యాస త్యా ఇదగ్యాజవళ | 
పాహూ ప్రయత్న వేంచూని ప్రబళ | బాబాంసహ సకళ మగ పరతూ | ||౧౩౫|| 
135. శిరిడీలోని భక్తులంతా రహాతాలోని ఈద్గా వద్దకు వెళ్ళారు. గట్టి ప్రయత్నం చేసి, ఎలాగైనను బాబాను వెంటబెట్టుకొనే శిరిడీ తిరిగి వెళ్ళాలి అని వారు అనుకున్నారు. 
బాబా తై దేతీ ఉలట బుద్ధి | "ఫకీర ఆహే మహాక్రోధీ | 
లాగూ నకా తయాచే నాదీ | తో మజ కధీంచ న విసంబే | ||౧౩౬|| 
136. కాని, బాబా వారికి విరుద్ధంగా “ఫకీరు మహా కోపిష్ఠి. అతని జోలికి వెళ్ళకండి. అతడు నన్ను అసలు విడిచి పెట్టడు. 
తుమ్హీ యెథూన కరా పలాయన | ఆతాంచ యేఈల గాంవాంతూన | 
కరీల తుమచే నిసంతాన | పరమ కఠీణ క్రోధ తయాచా | ||౧౩౭|| 
137. “మీరిక్కడనుండి త్వరగా వెళ్ళిపోండి. లేకుంటే ఇప్పుడే ఊళ్ళోనుండి వచ్చి, మీ పని పడతాడు. అతని కోపం పరమ కఠినం. 
రాగ తయాచా మోఠా కడక | యేతాంచ హోఈల లాలభడక | 
జా జా నిఘూన జా కీ తడక | ధరా కీ సడక శిరడీచీ" | ||౧౩౮|| 
138. “అతని కోపం చాలా తీవ్రం. దాంతో ముఖమంతా ఎర్రగా అయిపోతుంది. తొందరగా ఇక్కడనుండి వెళ్ళి, శిరిడీ దారి పట్టండి” అని చెప్పారు. 
ఆతా పుఢే కాయ కర్తవ్యతా | బాబ తో కథితీ ఉలటీ కథా | 
ఇతుక్యాంత ఫకీర ఆలా అవచితా | జాహలా పుసతా తయాంతే | ||౧౩౯|| 
139. ‘ఇప్పుడు ఏమి చేయటం? బాబా ఇలా విరుద్ధంగా చెప్పారేమిటి?’ అని అనుకోసాగారు. ఇంతలో, అనుకోకుండా ఫకీరు అక్కడికి వచ్చాడు. 
"ఆలాంత కాయ పోరాసాఠీ | కాయ కరితసా యేథే గోష్టీ | 
శిరడీస మాఘారా న్యావే హే పోటీ | పరీ యా కష్టీ పడూ నకా" | ||౧౪౦||
140. ‘అయితే, మీరు కుర్రవాడి కోసం వచ్చారా? ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? మరల శిరిడీకి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చారు కదూ! అంత కష్ట పడకండి’. 

ఏసే జరీ తో ప్రథమ వదలా | గ్రామస్థాంపుఢే తోహీ కచరలా | 
మ్హణే మలాహీ ఘేఊని చలా | సవే ములాలా నేఊ కీ | ||౧౪౧|| 
141. అని మొదట అంత దృఢంగా అన్నా, తరువాత, గ్రామస్థుల ఒత్తిడికి, ‘మీతో నన్ను కూడా తీసుకుని వెళ్ళండి. అందరూ కలిసి ఈ కుర్రవానిని మన వెంట శిరిడీకి తీసుకుని వెళ్ళుదాము’ అని అన్నాడు.
అసో ఫకీరహీ ఆలా సవే | తయాసహీ న బాబాంస సోడవె | 
బాబాంసహీ న తయా విసంబవే | న కళే సంభవే కైసే | ||౧౪౨|| 
142. అలా ఫకీరు కూడా బాబా వెంట వచ్చాడు. అతను బాబాను విడిచి ఉండలేడు, బాబా కూడా అతనిని విడిచి ఉండలేరు. ఇది ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. 
సాఈ పరబ్రహ్మ పుతళా | జవ్హార అలీ భ్రమాచా భోపళా | 
దేవీదాసే కసాస లావిలా | భోపళా ఫుటలా శిరడీంత | ||౧౪౩|| 
143. సాయి అవతరించిన పరబ్రహ్మ. జవ్హార అలీయేమో భ్రమలతో కూడుకున్న గుమ్మడి పండు. శిరిడీలో దేవీదాసు పరీక్షించినప్పుడు, గుమ్మడి పండు బ్రద్దలైంది. 
దేవీదాసాచా బాంధా సుందర | డోళే సతేజ రూప మనోహర | 
దహా అకరా వర్షాంచీ ఉమర | ప్రథమ శిరడీవర ఆలా తై | ||౧౪౪| 
144. సుందరమైన ఆకారం, మెరుస్తున్న కళ్ళు, మనోహరమైన రూపంగల దేవీదాసు, పది పదకొండు సంవత్సరాల వయసులో మొదటి సారిగా శిరిడీకి వచ్చాడు. 
ఏసా తో అల్ప వయాసీ | ఎక లంగోట మాత్ర కాసేసీ | 
మారూతీచే దేఉళాసీ | తీర్థవాసీ తో ఉతరలా | ||౧౪౫|| 
145. ఆ లేత వయసులో అతని నడుముకు ఒక లంగోటి మాత్రమే ఉండేది. తీర్థయాత్రలకని వచ్చి, మారుతీ ఆలయంలో ఉండిపోయాడు. 
ఆప్పాభిల్ల మ్హాళసాపతీ | తయాకడే జాతీ యేతీ | 
కాశీరామాదీక శిధా దేతీ | వాఢలీ మహతీ తయాచీ | ||౧౪౬|| 
146. అప్పా భిల్లు, మ్హాళసాపతీ అతని వద్దకు తరచూ వస్తూండేవారు. కాశీరాం మొదలైన వారు అతనికి స్వయంపాకానికి సరుకులిచ్చేవారు. రోజులు గడిచే కొద్దీ, అతని మహిమ పెరగసాగింది. 
వర్హాడాసమేత జై బాబా ఆలే | తయా ఆధీంచ బారా సాలే | 
దేవీదాస యేఊన పహిలే | బసతే జాహలే శిరడీంత | ||౧౪౭|| 
147. పెళ్ళివారితో పాటు బాబా రావటానికి పన్నెండేళ్ళ ముందే, దేవీదాసు శిరిడీకి వచ్చి, అక్కడే ఉండసాగాడు. 
ఆపా భిల్ల పాటీవర శికవీ | వ్యంకటేశ స్త్రోత్ర పఢవీ | 
సర్వాంకరవీ ముఖాద్గిత మ్హణవీ | పాఠ చాలవీ నేమానే | ||౧౪౮|| 
148. అప్పా భిల్లుకు ఇతను పలకపైన వ్రాయడం నేర్పించాడు. వెంకటేశ స్త్రోత్రం చదివించేవాడు. అందరితో కంఠస్థం చేయించాడు. అలా పాఠాలు నియమంగా చెప్పేవాడు. 
దేవీదాస మహాజ్ఞానీ | గురూత్వ ఘేతలే తాత్యాబాంనీ10 | 
కాశీనాథాదిక శిష్యాగ్రణీ | తయా చరణీ లాగలే | ||౧౪౯|| 
149. దేవీదాసు మహాజ్ఞాని. తాత్యా అతనిని గురువుగా అనుకున్నాడు. కాశీనాథు మొదలైన వారు అతనికి ముఖ్య శిష్యులై అతని పాదాలను నమ్ముకున్నారు. 
తయాపుఢే తో ఫకీర ఆణిలా | శాస్త్రీయ వాదవివాద మాండిలా | 
వైరాగ్యానే ఫకీర జింకిలా | హాంకూని లావిలా తెథూని | ||౧౫౦||
150. అతని వద్దకు ఫకీరును తీసుకుని వచ్చారు. శాస్త్రాలపై వాద వివాదాలు జరిగాయి. విరాగియైన దేవీదాసు చేతిలో ఫకీరు ఓడిపోయాడు. తరువాత, జవ్హార అలీను అక్కడనుండి తరిమి వేశారు. 

మగ తో జో తెథూన నిసటలా | వైజాపురీ జాఊని రాహిలా | 
పుఢే కిత్యేక వర్షాంనీ ఆలా | నమస్కారిలా సాఈనాథ | ||౧౫౧|| 
151. అక్కడనుండి పోయి, జవ్హార అలీ వైజాపురులో ఉన్నాడు. చాలా సంవత్సరాల తరువాత, తిరిగి శిరిడీకి వచ్చి, సాయినాథునికి నమస్కరించాడు. 
ఆపణ గురూ సాఈ చేలా | హా సర్వ త్యాచా భ్రమ నిరసలా | 
బాబాంనీహీ పూర్వవత సత్కారిలా | శుద్ధ జాహలా పశ్చాతాపే | ||౧౫౨|| 
152. తను గురువు, సాయి శిష్యుడు అన్న భ్రమ తొలగిపోయింది. బాబా అతనిని మునుపటి వలెనే సత్కరించాడు. పశ్చాత్తాపంతో అతను శుద్ధుడయ్యాడు. 
ఏసీ బాబాంచీ అగాధ లీలా | నివాడ హోణ్యాచా తెవ్హా ఝాలా | 
పరీ తో గురూ ఆపణ చేలా | భావ హా ఆదరిలా తేథవర | ||౧౫౩|| 
153. బాబా లీలలు ఇలా ఎవరికీ అర్థం కాని విధంగా ఉండేవి. జవ్హార అలీ భ్రమలు తొలగిపోయేంత వరకూ, అతనే గురువు, తాను శిష్యుడు అనే భావాన్ని బాబా ఆదరించారు. 
తయాంచే గురూపణ తయాలా | ఆపులే చేలేపణ ఆపణాలా | 
హా తరీ ఎక ఉపదేశ ఎథిలా | స్వయే ఆచరిలా సాఈనాథ | ||౧౫౪|| 
154. అతను గురువని అనుకుంటే అది అతని బాధ్యత. తాము శిష్యుడిగా అన్ని బాధ్యతలూ నెరవేర్చారు. ఈ కథ ఉపదేశం ఇదే. దీనిని సాయినాథులు స్వయంగా ఆచరించి చూపారు. 
ఆపణ కోణాచే హోఊన రహావే | కింవా కోణాస ఆపులే కరావే | 
యాహూన అన్య అసణే న బరవే | తెణే న ఉతరవే పరపార | ||౧౫౫|| 
155. గురువుకు ఒకే మనసుతో శరణు పోవడానికంటే మంచి స్థితి ఇంకొకటి లేదు. లేక, ఎవరైనా మన శిష్యులయితే, వారి పూర్తి బాధ్యతను మనము తీసుకోవాలి. ఈ రెండింటికంటే వేరుగా ఇంకొక రకంగా ఉంటే, అది మంచిది కాదు. దానివల్ల మనము ఈ సంసార సాగరాన్ని దాటలేము. 
హాచ ఎక యే వర్తనీ ధడా | పరీ దుర్లభ ఏసా నిధడా | 
హోఈల జయాచే మనాచా ధడా | నిరభిమాన గడా చఢేల | ||౧౫౬|| 
156. ఈ కథయొక్క పాఠం ఇదే. కాని, అహంకారాన్ని వదిలించుకోవాలని నిశ్చయించికునే వారు చాలా అరుదు. అలాంటి అభిమానం లేనివారు మాత్రమే శరీరం మీదున్న మమకారాన్ని జయించగలరు. 
యేథే స్వబుద్ధి పరికల్పిత | చతురాఈ న కామా యేత | 
జయా మనీ సాధావే స్వహిత | అభిమాన రహిత వర్తావే | ||౧౫౭|| 
157. ఇక్కడ మన బుద్ధి చెప్పే కల్పనలు, అతి తెలివి, పనికి రావు. అతి ఉన్నతమైన మంచిని కోరుకునేవారు, అహంకారం లేకుండా నడచుకోవాలి. 
జేణే దేహాచా అభిమాన జాళిలా | తెణేంచ హా దేహ సార్థకీ లావిలా | 
తో మగ కోణాచాహీ హోఈల చేలా | సాధావయాలా పరమార్థ | ||౧౫౮|| 
158. శరీరం మీదున్న ఆశను దహింప చేసుకున్నవారే ఈ జన్మలో శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు. అలాంటివారే పరమార్థాన్ని పొందడానికి, ఎవరికైనా శిష్యులుగా ఉంటారు. 
పాహోనియా తీ నిర్విషయ స్థితీ | లహాన థోర విస్మిత చిత్తీ | 
వయ లహాన గోజిరీ మూర్తి | చోజ కరితీ జన సారే | ||౧౫౯|| 
159. ఇంద్రియాల కోరికలు అసలే లేని మానసిక స్థితిని, అతి లేత వయస్సు, మనోహరమైన రూపంగల బాబాలో గమనించిన వారంతా ఆశ్చర్యపోయారు. 
జ్ఞానియాచా దేహవ్యాపార | హోతసే పూర్వ కర్మానుసార | 
తయా న ప్రారబ్ధ కర్మభార | కర్మ కర్తార హో నేణే | ||౧౬౦||
160. జ్ఞానులు తమ శరీరంతో చేసే పనులు, వారి మునుపటి పనుల ప్రకారం జరుగుతాయి. వారికి ప్రారబ్ధ కర్మల భారం, బాధలు ఉండవు. జరిగే పనులకు తాము కారణమని వారు అనుకోరు. 

జరీ సూర్యాస అంధారీ రిఘావ | తరీచ జ్ఞానియా ద్వైతభావ | 
స్వస్వరూపచి జయా అవఘే విశ్వ | వసతా ఠావ అద్వైత | ||౧౬౧|| 
161. సూర్యుడు చీకటిలో ఉండనట్లే, జ్ఞానుల బుద్ధి కూడా విరుద్ధ భావాలలో ఉండదు. వారికి ఈ జగత్తంతా ఆత్మ స్వరూపమే. వారు ఎప్పుడూ విరుద్ధ భావాలుకు వేరుగా ఉండే స్థితిలో ఉంటారు. 
హే గురూశిష్యాచే ఆచరిత | సాఈనాథాంచే పరమభక్త | 
మ్హాళసాపతీనీ కరవిలే శ్రుత | తైసేంచి సాద్యంత కథియేలె | ||౧౬౨|| 
162. గురు శిష్యుల ఈ కథను సాయియొక్క పరమ భక్తుడైన మ్హాళసాపతి చెప్పగా, ఆయన చెప్పినట్లే వినిపించాను. 
అసో ఆతా హే ఆఖ్యాన | పుఢీల చరిత్ర యాహూన గహన | 
హోఈల తే కథాక్రమ కథన | సావధాన శ్రవణీ వ్హా | ||౧౬౩|| 
163. ఈ కథను ఇంతటితో చాలించి, ఇంతకంటే లోతైన అర్థంగల తరువాత చరిత్రను యథా క్రమంగా చెబుతాను. శ్రద్ధగా వినండి. 
మశీద పూర్వీ హోతీ కైసీ | కైసియా కష్టీ జాహలీ ఫరసీ | 
సాఈ హిందు వా యవన వంశీ | నెణవే భరంవశీ హే కవణా | ||౧౬౪|| 
164. మసీదు మునుపు ఎలా ఉండేది? ఎలా శ్రమ పడి నేలను చదును చేశారు? సాయి హిందువా, లేక ముసల్మానా అన్నది ఎవరికీ ఖచ్చితంగా తెలియని సంగతి; 
ధోతీ పోతీ ఖండయోగ | కరీత, భోగీత భక్తాంచే భోగ | 
హే సర్వ నివేదన యథాసాంగ | హోఈల చాంగ పుఢారా | ||౧౬౫|| 
165. ధోతి పోతి, ఖండయోగం మొదలైన ప్రక్రియల గురించి; మరియు ఎలా బాబా భక్తుల బాధలను తాము అనుభవించారు అన్న సంగతులతో పాటు మిగిలిన సంగతులను తరువాత మనవి చేస్తాను. 
హేమాడ సాఈస శరణ | చరణ ప్రసాద హే కథానిరూపణ | 
శ్రవణే హోఈల దురిత నివారణ | పుణ్య పావన హీ కథా | ||౧౬౬||
166. హేమాడు సాయికి శరణుజొచ్చి, వారి పాద ప్రసాదమైన ఈ కథను చెప్పగా, శ్రద్ధగా వింటే, పాపాల నాశనమే కాక, పుణ్య పావనం కూడా అని చెబుతున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | శ్రీసాఈ పునఃప్రకటీభవనం నామ | 
| పంచమోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు || 

టిపణీ: 
1. జ్యాంచ్యాబరోబర ఆలే త్యాంచీ నావే - మాధవరావ బళవంత దేశపాండే, దగడూ భాఊ గాయకే, నందరామ శివరామ మారవాడీ వ భాగచంద మారవాడీ, సర్వ రాహణార శిరడీ. హే యేవల్యాస ఆనందనాథాంచే దర్శన ఘేఊన బైలగాడీతూన శిరడీస పరత యేతా అసతా గావకరీ ‘నకో నకో’ మ్హణత అసతా ఆనందనాథ మహారాజ గాడీ చాలత అసతా ఎకాఎకీ ధావత యేఊన త్యా గాడీత బళేచ బసలే ఆణి ‘మలా శిరడీస యావయాచే ఆహే’ అసే మ్హణూన త్యా మండళీంబరోబర శిరడీస గేలే. హే ఆనందనాథ మూళచే దక్షిణ కోకణాతీల మ్హణజే రత్నగిరీ జిల్హ్యాతీల కుడాళదేశకర గౌడబ్రాహ్మణ జ్ఞాతీచే అసూన పూర్వాశ్రమీ అసతా యాంచే వాస్తవ్య బరాచ కాళపర్యంత ముంబఈ శహరాత హోతే. 
2. ఉజాడ జాగేత. 
2A. వామనరావ గోందకర వ తాత్యాబా కోతే పాటీల. 
3. దుసర్యా దివశీ ప్రాతఃకాళీ. 
4. బాబాంస. 
5. పూజా కరణ్యాచీ ఇచ్ఛా అసణార్యాంకరితా. 
6. శ్రీ సాఈలీలా, మాసిక, వర్ష 11, అంక 1, పృ. 25 యాత యా పాదుకాంవిషయీచీ సవిస్తర హకీకత దిలేలీ ఆహే. 
7. క్రీడా.
8. భక్తమండళీంనీ వేష్టిత.
9. గోణాచ్యా ఆసనావర బసలేలే.
10. తాత్యా గణపత పాటీల కోతే.

Sunday, November 4, 2012

||సాఈ సమర్థావతరణం నామ చతుర్థోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత 
|| అథ శ్రీసాఈసచ్చరిత |||| అధ్యాయ ౪ థా || 

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

పూర్విల దో అధ్యాయీ మంగలాచరణ | కథిలే గ్రంథప్రయోజన |
అధికారీ అనుబంధ నిరూపణ | సాంగ వివరణ జాహలే | ||౧||
1. మంగళాచరణం తరువాత, రెండు అధ్యాయాలలో ఈ గ్రంథ ప్రయోజనాన్ని గురించి చెప్పబడింది. గ్రంథకర్త అర్హత, గ్రంథానికి మరియు దానిలోని విషయానికి గల సంబంధాన్ని గూర్చి వివరంగా చెప్పబడింది. 
ఆతా యా సంతాంచా అవతార | కింనిమిత్త యే ధరిత్రీవర |
ఏసే హే కాయ కర్మ ఖడతర | జేణే తే అవతరత భూలోకీ | ||౨||
2. ఈ సంతులు భూమిపై ఎందుకు అవతరిస్తారు? ఏ కష్టమైన పనిని చేయటానికి ఇక్కడికి వస్తారు? అన్నదాని గురించి ఇప్పుడు వినండి. 
ఆతా శ్రోతే మహారాజ | మీ ఎక తుమచా చరణరజ |
మజ తో అవధాన కృపేచే కాజ | మాగతా లాజ మజ నాహీ | ||౩||
3. శ్రోతమహారాజులారా! మీ పాద ధూళిలో నేను ఓ చిన్న నలుసుని. నన్ను కరుణించి సావధానంగా వినండి అని మిమ్మల్ని వేడుకోవడంలో నాకు బిడియం లేదు. 
ఆధీంచ గోడ సంతచరిత్ర | తశాంత హే తో సాఈ కథామృత |
సేవూని సాఈచే అనన్య భక్త | ఆనందయుక్త హోవోత | ||౪||
4. సంతుల చరిత్రలే ఎంతో మధురం. అందులోనూ ఇది అమృతానికి సమమైన సాయి కథ. దీనిని సాయియొక్క అనన్య భక్తులు సేవించి, ఆనంద భరితలవుగాక. 
బ్రాహ్మణ హేళసితీ ఆశ్రమ వర్ణ | శూద్ర హోఊ పాహతీ బ్రాహ్మణ |
ధర్మాచార్యాంచే మాన ఖండణ | కరూ దండణ పాహాతీ | ||౫||
5. బ్రాహ్మణులు తమ జాతికి సంబంధించిన నియమాలను అలక్ష్యం చేసినప్పుడు; శూద్రులు బ్రాహ్మణులై పోవాలనుకున్నాప్పుడు; ధర్మ ఆచార్యులను అవహేళన చేయడమే కాకుండా వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు; 
కోణీ న మానీ ధర్మవచన | ఘరోఘరీ సర్వచి విద్వాన |
ఎకావరతీ ఎకాచీ తాణ | మానీనా కోణ కోణాచే | ||౬||
6. ధర్మసూత్రాలను ఎవరూ పాటించనప్పుడు; ఇంటింటా అందరూ తామే పండితులమని అనుకుంటున్నప్పుడు; ఒకరిపై ఒకరు పెద్దరికాన్ని చెలాయిస్తున్నప్పుడు; ఒకరి మాటను ఇంకొకరు లక్ష్య పెట్టనప్పుడు; 
సేవ్యాసేవ్య భక్ష్యాభక్ష్య | ఆచారవిచారీ పూర్ణ దుర్లక్ష |
మద్యమాంస అవఘ్యాంసమక్ష | బ్రాహ్మణ ప్రత్యక్ష సేవితీ | ||౭||
7. తినకూడనివి తింటూ, సేవించ కూడనివి సేవిస్తూ, ఆచార విచారాలను పూర్తిగా వదిలివేసినప్పుడు; అందరి ఎదుట బ్రాహ్మణులు మద్య మాంసాదులను సేవిస్తున్నప్పుడు; 
ఘేఊన ధర్మాచే పాంఘరూణ | అత్యాచార చాలవితీ ఆంతూన |
పంథద్వేష జాతీ మాజూన | జన జాజాఊన జాతీ జై | ||౮||
8. ధర్మం పేరిట లోలోపల అత్యాచారాలను చేస్తున్నప్పుడు; వీని కారణంగా ధార్మిక సాంప్రదాయాలలో ద్వేషం పెరిగిపోయి, ప్రజలు కష్టాలతో బాధ పడుతున్నప్పుడు; 
బ్రాహ్మణ కంటాళతీ సంధ్యాస్నానా | కర్మఠ కంటాళతీ అనుష్ఠానా |
యోగీ కంటాళతీ జప తప ధ్యానా | సంతావతరణా సమయ తో | ||౯||
9. స్నాన సంధ్యలయందు బ్రాహ్మణులకు శ్రద్ధ లేనప్పుడు; దైవకార్యాలను, పితృకార్యాలను శ్రద్ధగా పాటించేవారు వానిని చేయడానికి విసుక్కుంటున్నప్పుడు; జప తప ధ్యానలయందు యోగులకు ఇష్టం లేనప్పుడు; సంతులు అవతరిస్తారు. 
జన ధన మాన పుత్ర దారా | హాచి సుఖ సర్వస్వా థారా |
మానూని విన్ముఖ పరమార్థ విచారా | సంత అవతారా తై యేతీ | ||౧౦||
10. భార్య, బిడ్డలు, డబ్బు, గౌరవం, వీనినే జనులు అన్ని సుఖాలకు అవసరమని తలచి, దైవంగురించి ఆలోచనలను వదిలివేసినప్పుడు, సంతులు అవతరిస్తారు. 

ఆత్యంతిక శ్రేయప్రాప్తి | ధర్మగ్లాని పాయీ జై ముకతీ | 
కరావయా ధర్మజాగృతీ | సంత యేతీ ఆకారా | ||౧౧|| 
11. ధర్మం నశించి, ప్రజలు శాశ్వతమైన శ్రేయస్సును పోగొట్టుకున్నప్పుడు, ధర్మాన్ని మేలుకొలపటానికి సంతులు మానవ రూపంలో అవతరిస్తారు. 
ఆయురారోగ్య ఏశ్వర్యా ముకతీ | జన శిశ్నోదర పరాయణ బహకతీ | 
నిజోద్ధరణా సర్వస్వీ హుకతీ | అవతారా యేతీతై సంత | ||౧౨||
12. ఆయురారోగ్య ఐశ్వర్యాలను పోగొట్టుకుని, కామంతో పాటు నోటి రుచిని తృప్తి పరచటంలో మునిగి, నీతి భ్రష్టులై తమ ఉద్ధారాన్ని లక్ష్య పెట్టనప్పుడు; సంతులు అవతరిస్తారు. 
వ్హావయా వర్ణాశ్రమధర్మరక్షణ | కరావయా అధర్మాంచే నిర్దళణ | 
దీన గరీబ దుబళ్యాంచే సంరక్షణ | క్షితీ అవతరణ సంతాంచే | ||౧౩|| 
13. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించి, అధర్మాన్ని నాశనం చేసి, దీనులను, దుర్బలులను, పేదలను సంరక్షించటానికి సంతులు భూమిపై అవతరిస్తారు. 
సంత స్వయే ఠాయీచే ముక్త | దీనోద్ధరణీ సదైవ ఉద్యుక్త | 
అవతార తయాచా కేవళ పరార్థ | నిజస్వార్థ త్యా నాహీ | ||౧౪|| 
14. సంతులు, సత్పురుషులు ఎప్పుడూ ముక్తులే. దీనులను ఉద్ధరించటానికే ఎల్లప్పుడూ కృషి చేస్తుంటారు. వారి అవతారం ఇతరుల కోసమే కాని, తమ స్వార్థం కోసం కాదు. 
నివృత్తీచా పాయా భరతీ | ప్రవృత్తీచ్యా డోల్హార్యాభవతీ | 
పరమార్థాచే మందిర ఉభారతీ | భక్తా ఉద్ధరతీ సహజ గతీ | ||౧౫|| 
15. ప్రవృత్తి అనే ప్రవాహంలో కొట్టుకునే ప్రాపంచికులను, నివృత్తి అనే పునాదిపై పరమార్థ మందిరాన్ని నిర్మించి, తమ సహజ గతిలో భక్తులను ఉద్ధరిస్తారు. 
ధర్మకార్య ధర్మ జాగృతి | కరూన అవతారకార్య సంపాదితీ | 
హోతా నిజకార్య పరిపూర్తి | అవతార సమాప్తి కరితాత | ||౧౬|| 
16. ధర్మ పనులను చేసి, ధర్మాన్ని మేలుకొలిపి, తమ అవతార కార్యాన్ని సాధిస్తారు. అది పూర్తి కాగానే తమ అవతారాన్ని చాలిస్తారు. 
సకల జగదానందకరూ | ప్రత్యగాత్మాచ పరమేశ్వరూ | 
జో పరమేశ్వరూ తోచ గురూ | తోచ శంకర సుఖకరూ | ||౧౭|| 
17. ప్రతియొక్క జీవిలో ఉండే జీవాత్మయే పరమాత్మ. అతడే గురువు. అతడే జగత్తు అంతటా సుఖాన్నిచ్చి ఆనందాన్ని ప్రసాదించేవాడు. 
తేచ తో నిరతిశయ ప్రేమాస్పద | నిత్య నిరంతర అభేద | 
నేణే జో దేశ కాలవస్తుభేద | పరిచ్ఛేదాతీత జో | ||౧౮|| 
18. అతడే ప్రేమానికి నిలయం. ఎల్లప్పుడూ భేదం లేని స్వరూపుడు. దేశం, కాలం, వస్తు భేదాలను ఎరుగనివాడు, ఛేదించలేనివాడు. 
పరాపశ్యంతీ మధ్యమా వైఖరీ | వాణీ వర్ణితా థకల్యా చారీ | 
'నేతి నేతి' తి ఘేతలీ హారీ | వేదీ చాతురీ చాలేనా | ||౧౯|| 
19. పర, పశ్యంతి, మధ్యమ మరియు వైఖరి అను నాలుగు రకాల వాణి అతనిని వర్ణించలేక పోయాయి. జ్ఞానంతో నిండి ఉన్న వేదాలూ ఇక్కడ పనికి రాలేదు. ‘నేతి, నేతి’ అంటూ అవి ఓడిపోయాయి. 
లాజలీ షట్శాతస్త్రే షడ్దతర్శనే | థకలీ పురాణే ఆణి కీర్తనే | 
అఖేర కాయా వాచా మనే | ఠరలీ నమనేంచ సాధనే | ||౨౦||  
20. ఆరు శాస్త్రాలు, ఆరు దర్శనాలు సిగ్గుతో మౌనం వహించాయి. పురాణాలు, హరికథలు అలసిపోయాయి. చివరకు మిగిలింది, అతనికి కాయా వాచా మనసా నమస్కారం చేయటం ఒక్కటే. 

ఏసియా సంత సాఈచే చరిత్ర | లీలా జయాచ్యా అత్యంత విచిత్ర | 
పరిసోన జయాచ్యా కథా పవిత్ర | పావనశ్రోత్ర హోఊతకా | ||౨౧|| 
21. అత్యంత అద్భుతమైన లీలలతో కూడుకున్న ఇలాంటి సాయి సంతుని చరిత్రను విని, శ్రోతల చెవులు పవిత్రమౌగాక. 
తోచ చాలక సకలేంద్రియా | బుద్ధి దేఈ గ్రంథరచాయా | 
యథాక్రమ చరిత్ర సుచాయా | అనాయాసే కారణ తో | ||౨౨|| 
22. అన్ని ఇంద్రియాలను నడిపించేది వారే. ఈ గ్రంథ రచనకు స్ఫూర్తినిచ్చినది వారే. వారి సూచనల వలనే ఈ చరిత్ర క్రమబద్ధంగా వ్రాయబడ్డది. 
తో సర్వాంచ్యా అంతర్యామీ | బాహ్యాభ్యంతర సర్వగామీ | 
మగ హే కాళజీ కరావీ కా మీ | వ్యర్థ రికామీ కిమర్థ | ||౨౩|| 
23. అందరి మనసులలో ఉంటూ, ఈ విశ్వమంతటా లోపల బయట స్వేచ్ఛగా తిరిగే వారు ఉండగా నేనెందుకు అనవసరంగా చింతించాలి? 
గుణ ఎకేక తయాచే ఆఠవితా | పడె వృత్తీస తాటస్థతా | 
యేఈల వాచేస కైసా తొ వర్ణితా | దృఢ మౌనతా తత్కథన | ||౨౪|| 
24. వారి ఒక్కొక్క సుగుణాన్నీ తలచుకుంటూ ఉంటే, మనసు పని చేయడం ఆగిపోతుంది. అలాంటప్పుడు మాటలు వారిని ఎలా వర్ణించగలవు? దృఢమైన మౌనమే వారిని వర్ణించటానికి ఉత్తమం. 
ఘ్రాణే సుమన హుంగావే | త్వచా శీతోష్ణ స్పర్శావే | 
నయనే సౌందర్య సుఖఘ్యావే | సుఖవావే ఆపాపణా | ||౨౫|| 
25. పువ్వుల సువాసనను ముక్కుతో తెలుసుకుంటాము. చలువ, వేడి వీటిని చర్మంతో అనుభవిస్తాము. సౌందర్యాన్ని కళ్లతో చూస్తాము. ఇంద్రియాలు వాని సుఖాలను అవే అనుభవిస్తాయి. 
జివ్హా శర్కరేచా స్వాద | జాణే పరీనేణే అనువాద | 
తైసాచ సాఈ గుణానువాద | కరూ విశద నేణే మీ | ||౨౬|| 
26. పంచదారయొక్క తీపిని నాలుక రుచి చూడగలదు, కాని ఆ అనుభవాన్ని అది వర్ణించలేదు. అలాగే, సాయియొక్క గుణాలను వివరంగా చెప్పటం నా చేత కాని పని. 
సద్గురూచేచ జంవ యేఈ మనా | తోచ స్వయే దేఈ ప్రేరణా | 
అనిర్వచనీయాచే నిర్వచనా | స్వజనా కరవీ కరవీతో | ||౨౭|| 
27. కాని, సద్గురువు తాను తలచుకున్నప్పుడే, తన భక్తులకు ప్రేరణ కలిగించి, మాటలకు అందని భావాలని వివరంగా వర్ణించేలా చేస్తారు. 
హా న కేవళ శిష్టాచార | బోల హే న కేవళ ఉపచార | 
మనోభావాచే హే ఉద్గారర | అవధానాదర ప్రార్థితో | ||౨౮|| 
28. ఇది కేవలం పొగడటానికి చెప్పిన పై పై మాట కాదు. మనసులోనుండి వచ్చిన మాట. అందుకే శ్రద్ధగా వినండి అని ప్రార్థిస్తున్నాను.
జైసే గాణగాపుర నృసింహవాడీ | జైసే ఔదుంబర వా భిల్లవడీ | 
తైసేంచ పవిత్ర గోదేచే థడీ | క్షేత్ర ’శిరడీ’ ప్రసిద్ధ | ||౨౯|| 
29. గాణగాపురం, నరసింహవాడి, ఔదుంబర, భిల్లవడీ వలెనే పవిత్రమైన గోదావరి తీరాన ప్రసిద్ధమైన శిరిడీ క్షేత్రం ఉంది. 
గోదావరీచే పవిత్ర తీర | గోదావరీచే పవిత్ర నీర | 
గోదావరీచా శీతసమీర | హీ భవతిమిర నాశక | ||౩౦|| 
30. గోదావరియొక్క పవిత్ర తీరం, గోదావరియొక్క పవిత్రమైన నీరు, గోదావరియొక్క పవిత్రమైన చల్లని గాలులు, ఇవి ప్రాపంచిక కష్టాల చీకటిని, అజ్ఞానాన్ని తొలగిస్తాయి. 

గోదావరీచే మాహాత్మ్య రూచిర | ప్రఖ్యాత జే అఖిల జగతీవర | 
ఎకాహూన ఎక ధురంధర | సంత ప్రవర తై ఝాలే | ||౩౧|| 
31. మొత్తం ప్రపంచంలో గోదావరి మహాత్మ్యం ప్రసిద్ధి చెందినది. ఒకరికంటే ఒకరు గొప్ప సాధు శ్రేష్ఠులు ఇక్కడనుంచే వచ్చారు. 
అనేక తీర్థ యా గోమతీ తీరీ | అఘవినాశక జేథీల వారీ | 
భవరోగ స్నానే పానే నివారీ | పురాణాంతరీ వర్ణిలే | ||౩౨|| 
32. ఈ గోమతీ తీరంలో చాలా తీర్థస్థలాలున్నాయి. ఈ నది నీరు పాపాలను తొలగిస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసినా, ఆ నీరు త్రాగినా, పాపాలను తొలగి పోవటమే కాక, సాంసారిక కష్టాలన్ని మాయమౌతాయి. 
తె హె గోదా అహమదనగరీ | కోపరగావ తాలుక్యాభీతరీ | 
కోపరగావాచియా శేజారీ | మార్గ దేఈ శిరడీచా | ||౩౩|| 
33. అహమ్మదనగరు జిల్లాలో ఉన్న కోపర్గాం తాలూకాలోని కోపర్గాం దగ్గరనుండి ప్రవహిస్తూ, శిరిడీకి త్రోవను సూచిస్తుంది. 
గోదా వళంఘూన పైలతీరీ | సుమారే తీన కోసాంవరీ | 
తాంగా ప్రవేశతా నిమ గాంవాభీతరీ | సమోర శిరడీ దిసతసే | ||౩౪|| 
34. గోదావరిని దాటి, అవతల తీరానికి సుమారు మూడు కోసుల (ఆరు మైళ్ళు) దూరంలోని నీమ్గాం అనే ఊరిలోనికి టాంగా రాగానే, మనకు శిరిడీ కనిపిస్తుంది. 
నివృత్తి జ్ఞానదేవ ముక్తాబాఈ | నామా జనీ గోరా గోణాఈ | 
తుకా నరహరీ నరసీ భాఈ | సజన కసాఈ సాంవతా | ||౩౫|| 
35. నివృత్తి, జ్ఞానదేవ, ముక్తాబాయి, నామదేవ, జనాబాయి, గోరాగోణాయి, తుకారాం, నరహరి, నరసీభాయి, సజన కసాయి, సావత మాలి; 
పూర్వీ సంత హోఊని గేలే | సాంప్రతహీ తే బరేచ ఝాలే | 
హే వసుధైవ కుటుంబీ భలే | ఆధార రంజలే గాంజల్యాచే | ||౩౬|| 
36. మొదలగు సత్పురుషులు ఎందరో మునుపు ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. వీరందరూ వసుదైవ కుటుంబం, జగత్తంతా మనదే అని అనుకునేవారు. సాంసారిక బాధలతో దుఃఖ పడేవారికి వీరే ఆధారం. 
రామదాస సంత ప్రవర | సోడూనియా గోదాతీర | 
ప్రకట ఝాలే కృష్ణా తటాకావర | జగదుద్ధారాకారణే | ||౩౭|| 
37. సాధువులలో శ్రేష్ఠుడైన రామదాసు, గోదావరీ తీరాన్ని వదిలి, జగత్తును ఉద్ధరించటానికి కృష్ణా నదీ తీరాన అవతరించారు. 
తైసెచ హె యోగేశ్వర సాఈ | మహాన శిరడీచీ పుణ్యాయీ | 
జగదుద్ధారాచియే పాయీ | గోదె ఠాయీ అవతరలే | ||౩౮|| 
38. అలాగే, శిరిడీయొక్క మహా పుణ్యం కొద్దీ, యోగీశ్వరులైన శ్రీసాయి, జగత్తును ఉద్ధరించటానికి గోదావరీ నది సమీపాన అవతరించారు. 
పరీస లోహా దె కనక స్థితీ | తయా పరిసా సంతా ఉపమితీ | 
సంతాంచీ పరీ అలౌకిక కృతి | నిజరూప దేతీ భక్తాంతే | ||౩౯| 
39. పరశువేది రాయి ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులను పరశువేదితో పోలుస్తారు. కాని, సాధువులు అద్భుతంగా భక్తులను, తాము ఉండే స్థితికి ఉద్ధరిస్తారు. సత్పురుషులు అలా అలౌకికమైన పనులను చేస్తారు. 
సాండూనియా భేదభావ | స్థిరచర అవఘే బ్రమ్హస్వ భావ | 
ఆపణాంసహ హె విశ్వవిభవ | అఖండ వైభవ బ్రమ్హాచే | ||౪౦||
40. భేదభావాలని మించి, జగత్తులో ఉన్న జీవరాశులన్నింటిలోనూ, బ్రహ్మ రూపాన్ని చూసి, ఈ సృష్టిలోని అద్భుతమంతా బ్రహ్మదే అనుకోవటం; 

ఏసే అఖిల విశ్వ జేవ్హా | మీ చ మీ హే ప్రబొధేల తేవ్హా | 
మగ త్యా సుఖాచా కాయ సుహావా | పరమ సద్భావా పావేల | ||౪౧|| 
41. ఇలా విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న అసలైన జ్ఞానం కలిగితే, అందువల్ల వచ్చే సుఖాన్ని, ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఆ అనుభవాన్ని పొందిన మనిషి, అత్యంత శుద్ధమయిన మంచితనానికి చేరుకుంటాడు. 
ఏసే మీపణ జేవ్హా పావావే | వైర తే కరావే కోణాసవే | 
కిమర్థ వా కవణాస భ్యావే | అన్యచి ఠావే జంవ నాహీ | ||౪౨|| 
42. ఇలా అంతటా నేనే అన్న జ్ఞానం కలిగిన తరువాత, ఎవరితో వైరం ఉంటుంది? నన్ను మించి వేరేవారు అసలు ఎవరూ లేరు అని తెలిశాక, ఎవరి గురించి అయినా ఎందుకు భయపడతాను? 
దామాజీ జైసే మంగళవేఢీ | సమర్థ రామదాస సజ్జనగడీ | 
నృసింహసరస్వతీ జైసే వాడీ | తైసేచ శిరడీ సాఈనాథ | ||౪౩|| 
43. మంగళ వేఢిలో దామాజి, సజ్జనగడలో సమర్థ రామదాసు, నరసింహవాడిలో నృసింహ సరస్వతి వెలిసినట్లు, శిరిడీలో సాయినాథులు వెలిశారు. 
పరమ దుర్ఘట ఆణి దుస్తర |జీంకిలా జయానే హా సంసార | 
శాంతి జయాచా అలంకార | మూర్త భండార జ్ఞానాచే | ||౪౪|| 
44. దాటటానికి సాధ్యం కానిది, అతి కష్టకరమూ అయిన మాయా ప్రపంచాన్ని వీరు జయించారు. మూర్తీభవించిన జ్ఞానభండారం. శాంతి వారి అలంకరణ. 
వైష్ణవాంచే హె మాహేర ఘర | ఉదారాంచా హా ఉదార | 
పరమార్థ కర్ణాచా అవతార | సారాచే సార హా సాఈ | ||౪౫|| 
45. వైష్ణవులకు వారు పుట్టినిల్లు. ఉదారులలో ఉదారులు. పరమార్థాన్ని అనుగ్రహించటంలో దాన కర్ణుని అవతారం. జ్ఞానికి సారం ఈ సాయి. 
ప్రీతి నాహీ నాశివంతీ | ఆత్మస్వరూపీ రంగలీ వృత్తి | 
లక్షఎక పరమప్రాప్తీ | కాయతే స్థితి వర్ణావీ | ||౪౬|| 
46. ఏది నశిస్తుందో దాని గురించి వారికి ప్రీతిలేదు. వారి మనసు ఎప్పుడూ ఆత్మ స్వరూపంలో లీనమై ఉంటుంది. జీవితంలో పొందగల అతి ఉన్నతమైన లక్ష్యాన్ని పొందటమే వారి గురి. అలాంటి వారి స్థితిని ఎలా వర్ణించగలము?
ఏహికాచా న ఉత్కర్షాపకర్ష | ఆముత్రికాచా న హర్షామర్ష | 
అంతరంగ నిర్మల జైసా ఆదర్శ | వాచా వర్షత అమృత సదా | ||౪౭|| 
47. ప్రాపంచిక విషయాలలో ఏ రకమైన ఆసక్తి లేనివారు, పరలోక విషయాలలో కూడ ఆనందంకాని, దుఃఖంకాని లేక వారి మనసు అద్దంవలె నిర్మలంగా ఉంటుంది. వారి మాటలు ఎప్పుడూ అమృతాన్ని కురిపిస్తుంది. 
రాజా రంక దరిద్రీదీన | జయాచే దృష్టీ సమసమాన | 
స్వయే ఠావా న మానాపమాన | భూతీ భగవాన భరలేలా | ||౪౮|| 
48. డబ్బుగలవారు, లేనివారు, దీనులు, బలహీనులు, అందరి పట్లా వారి దృష్టి సమానం. మానాపమానాలకు వారు లోనుకారు. అన్ని జీవులలోను నిండి ఉన్న పరమాత్ముని రూపమే వారు. 
జనాసవే బోలేచాలే | పాహీ మురల్యాంచే నాచ చాళే | 
గజ్జల గాణే ఏకతా డోలే | రేస న హాలే సమాధి | ||౪౯|| 
49. అందరితో తిరుగాడినా, మాట్లాడినా, నాట్యాన్ని చూసినా, గజల్‍ గానాన్ని విని ఆనందించినా, వారి సమాధి స్థితి కొంచెమైనా భంగం కాదు. 
అల్లా నామాచీ జయా ముద్రా | జగ జాగతా జయాయే నిద్రా | 
జాగే జగాస లాగతా తంద్రా | శాంత సముద్రా సమఉదర | ||౫౦||
50. అల్లా నామమే వారి గుర్తింపు. అందరూ మేలుకొన్నప్పుడు వారు నిద్రిస్తారు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారు మేలుకొని ఉంటారు. వారి మనసు సముద్రంవలె ప్రశాంతంగా ఉంటుంది. 

ఆశ్రమ నిశ్చయ కాహీ నకళే | కాహీ నిశ్చిత కర్మా నాతళే | 
బహుధా బసల్యా ఠాయీంచా న ఢళే | వ్యవహార సగళే జో జాణే | ||౫౧|| 
51. వర్ణాశ్రమాలలో వారు ఏ ఆశ్రమానికి చెందినవారో ఖచ్చితంగా తెలియదు. ఏ ఆచారాలని, నియమాలని పాటించరు. కూర్చున్న చోటునుండి సాధారణంగా కదలరు. అయినా, జరుగుతున్న సంగతులన్నీ వారికి తెలుసు. 
దరబారాచా బాహ్య థాట | గోష్టీ సాంగే తీనశే సాఠ | 
ఏసా జరీ నిత్యాచా ఠాట | మౌనాచీ గాంఠ సోడీనా | ||౫౨|| 
52. బయటకు దర్బారు నడిపించి, అందులో చాలా ఆర్భాటంగా కనిపిస్తూ, ఎన్నెన్నో కథలను రోజూ చెప్పినా, మనసులో మటకు వారు మౌనాన్ని వదిలేవారు కాదు. 
భింతీసటేకూన ఉభే అసతీ | సకాళా దుపారా ఫేరీ ఫిరతీ | 
లేడీవరీ వా చావడీస జాతీ | ఆత్మస్థితి అఖండ | ||౫౩|| 
53. మసీదులో గోడకు ఆనుకుని నిలబడినా; ప్రొద్దున, మధ్యాహ్నం లెండీ తోటకో, లేదా చావడికో వెళ్లినా; వారు ఎప్పుడూ ఆత్మ రూపంలోనే లీనమై ఉంటారు. 
న జాణూ కవణ్యా జన్మాంతరీ | కవణ్యా ప్రసంగీ కవణ్యా అవసరీ | 
కేలే మ్యా తప కైశియాపరీ | ఘేతలే పదరీ సాఈనే | ||౫౪|| 
54. ఏ జన్మలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ తపస్సు చేశానో తెలియదు. సాయి నన్ను తమ ఒడిలోకి తీసుకున్నారు. 
హే కాయ మ్హణావే తపాచే ఫళ | తరీ మీ తో జన్మాచా ఖళ | 
సాఈచ స్వయే దీనవత్సల | కృపా హీ నిశ్చళ తయాచీ | ||౫౫|| 
55. తపస్సు ఫలమని అనుకుందామా అంటే, నేను పుట్టుకతోనే చెడ్డవాణ్ణి. అయినా సాయికి దీనులంటే ప్రీతి. వారి తరగని కృపయే ఇది. 
సిద్ధ కోటీంత జరీ జనన | సాధకా ఏసే తయాచే వర్తన | 
వృత్తి నిరభిమాన అతిలీన | రాఖీ మన సకాళాంచే | ||౫౬|| 
56. అన్ని సిద్ధులను పొందిన వారైనా, ఎప్పుడూ సాధకునివలె నడచుకునే వారు. అభిమానం ఏ మాత్రము లేక అందరితోనూ వినయంతో అందరినీ ఆనందపరిచేవారు. 
నాథాంహీ జైసే పైఠణ | జ్ఞాన దేవాంహీ ఆళందీ జాణ | 
తైసేంచ సాఈనీ శిరడీ స్థాన | మహిమా సంపన్న కేలే కీ | ||౫౭|| 
57. పైఠణుని ఏకనాథులు, ఆళందిని జ్ఞానదేవులు పావనం చేసినట్టుగా, శిరిడీ క్షేత్రాన్ని మహిమా సంపన్నం చేశారు. 
ధన్య శిరడీచే తృణ పాషాణ | అనాయాసే జయా అనుదిన | 
ఘడలే బాబాంచే చరణచుంబన | పదరజధారణ మస్తకీ | ||౫౮|| 
58. ప్రతి రోజూ, బాబా పాదలను ముద్దు పెట్టుకొని, వారి పాదల ధూళిని తలపై ధరించిన శిరిడీలోని తృణ పాషాణాలు ధన్యం. 
శిరడీచ ఆమ్హా పంఢరపూర | శిరడీచ జగన్నాథ ద్వారకానగర | 
శిరడీచ గయా కాశీ విశ్వేశ్వర | రామేశ్వరహీ శిరడీచ | ||౫౯|| 
59. శిరిడీయే మన పంఢరీపురం, శిరిడీయే మన పూరీ జగన్నాథం, మరియు మన ద్వారకానగరం. శిరిడీయే గయ, కాశీ విశ్వేశ్వరుని వారణాసి, శిరిడీయే మన రామేశ్వరం.
శిరడీచ ఆమ్హా బద్రికేశ్వర | శిరడీచ నాశీక త్ర్యంబకేశ్వర | 
శిరడీచ ఉజ్జయినీ మహాంకాళేశ్వర | శిరడీచ మహాబళేశ్వర గోకర్ణ | ||౬౦||
60. శిరిడీయే మన బదరీ కేదారం, నాసికులోని త్రయంబకం, శిరిడీయే ఉజ్జయినీ మహాకాళేశ్వరం, మరియు మహాబళేశ్వర-గోకర్ణం. 

శిరడీంత సాఈచా సమాగమ | తేచ ఆమ్హా ఆగమ నిగమ | 
తోచ సకళ సంసారోపశమ | అత్యంత సుగమ పరమార్థ | ||౬౧|| 
61. సాయితో శిరిడీలో ఉండటమే మనకు ఆగమ నిగమాలు. ప్రపంచంలోని బాధలన్నింటినీ తొలగించేది శిరిడీయే. పరమార్థానికి సులభమైనది శిరిడీయే. 
సమర్థ సాఈంచే జే దర్శన | తేచి ఆమ్హా యోగసాధన | 
కరితా తయాంసీ సంభాషణ | హోయ క్షాలన పాపాచే | ||౬౨|| 
62. సమర్థ సాయియొక్క దర్శనమే మనకు యోగసాధనం. వారితో మాట్లాడటమే మన పాపలను కడిగేసుకోవటం. 
తయాంచే జే చరణ సంవాహన | తేంచి ఆమ్హా త్రివేణీ స్నాన | 
తయాంచే చరణతీర్థ సేవన | తేంచి నిర్మూలన వాసనాంచే | ||౬౩|| 
63. వారి పాదాల సేవయే మనకు త్రివేణి సంగమ స్నానం. వారి పాద తీర్థన్ని త్రాగడమే అన్ని ఇంద్రియాల కోరికలను తొలగించుకోవటం. 
తయాంచే జే ఆజ్ఞాపన | తేంచి ఆమ్హా వేద వచన | 
తయాంచ్యా ఉదీ ప్రసాదాచే సేవన | పుణ్యపావన సర్వార్థీ | ||౬౪|| 
64. వారి ఆజ్ఞ మనకు వేద వాక్కు. వారి విభూతి ప్రసాదాలను సేవించడమే అన్ని విధాలా పుణ్య పావనం.
సాఈచ ఆమ్హా పరబ్రహ్మ | సాఈచ ఆముచా పరమార్థ పరమ | 
సాఈచ శ్రీకృష్ణ శ్రీరామ | నిజారామ శ్రీసాఈ | ||౬౫|| 
65. సాయియే మనకు పరబ్రహ్మ. సాయియే మనకు జీవితాన అతి శ్రేష్ఠమైన లక్ష్యం. సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు. మనకు శాశ్వతమైన ఆశ్రయం కూడా శ్రీసాయియే. 
సాఈ స్వయే ద్వంద్వాతీత | కధీ న ఉద్విగ్న వా ఉల్లసిత | 
సదైవ నిజస్వరూపీ స్థిత | సదోదిత సన్మాత్ర | ||౬౬|| 
66. విరుద్ధ భావాలకు (సుఖం - దుఃఖం, ఆనందం - వ్యథ, కోపం - శాంతం, ఇలాంటివి) సాయి అతీతులు. సుఖంలో పొంగిపోక, దుఃఖంలో కృంగిపోక ఎప్పుడూ ఆత్మ స్వరూపంలో లీనమై ఉండే బ్రహ్మ వారు. 
శిరడీ కెవళ కేంద్రస్థాన | క్షేత్ర బాబాంచే అతి విస్తీర్ణ | 
పంజాబ కలకత్తా హిందుస్థాన | గుజరాథ దఖ్ఖన కానడా | ||౬౭|| 
67. శిరిడీ కేవలం కేంద్ర స్థానం. పంజాబు, కలకత్తా, గుజరాతు, దఖ్ఖను, కర్ణాటకలలోనే కాక, దేశమంతటా బాబాయొక్క ప్రభావం వ్యాపించి ఉంది. 
శిరడీచీ సాఈచీ సమాధి | తిచ అఖిల సంతాంచీ మాందీ | 
జెథీల మార్గ క్రమితా ప్రతిపదీ | తుటతే గ్రంథీ జీవాచీ | ||౬౮|| 
68. శిరిడీలోని సాయి సమాధియే సాధువులందరూ కలుసుకునే స్థలం. అక్కడికి చేరుకునే మార్గంలో అడుగు అడుగున జీవాత్మల సాంసారిక కట్లు ఒక్కొక్కటే వీడిపోతాయి. 
సార్థక జన్మా ఆలియాంచే | కేవళ సమాధిదర్శన సాచే | 
మగ సేవేసీ జయాంచే ఆయుష్య వేచే | భాగ్య తయాంచే కాయ వానూ | ||౬౯|| 
69. సమాధి దర్శనం చేసుకున్నంత మాత్రమే జన్మ తరిస్తుంది. ఇక, సాయి సేవలో జీవితాన్ని గడిపిన వారి భాగ్యాన్ని ఎంతని వర్ణించను? 
మశీద ఆణి వాడియాంవరీ | సుందర నిశాణాంచ్యా హారీ | 
ఫడకతీ ఉంచ గగనోదరీ | పాలవతీ కరీ భక్తాంసీ | ||౭౦||
70. మసీదుపైన, వాడపైన (సమాధి మందిరం) అందమైన పతాకాలు కనిపిస్తాయి. భక్తులను చేతులతో పిలుస్తున్నట్లుగా అవి ఆకాశంలో ఎగురుతుంటాయి.

బాబా మహంత ప్రసిద్ధ కీర్తి | గాంవో గావీ పసరలీ మహతీ | 
కోణీ తయా సత్‍శ్రద్ధా1 నవసితీ2 | దర్శనే నివతీ జన కోణీ | ||౭౧|| 
71. బాబా మహాత్ములని ప్రసిద్ధి చెందారు. వారి కీర్తి ప్రతిష్ఠలు ఊరూరా వ్యాపించాయి. కొందరు నిజమైన నమ్మకంతో వారికి మ్రొక్కుకుంటారు. కొందరు దర్శనంతోనే తృప్తి చెందుతారు. 
కోణాచే కైసేహి మనోగత | అసో బుద్ధీ శుద్ధ వా కుత్సిత | 
దర్శనమాత్రేంచ నివే చిత్త | జన విస్మిత అంతరీ | ||౭౨|| 
72. ఎవరి మనసు ఎలా ఉన్నా సరే, నిర్మలంగా కాని, చెడు బుద్ధితో గాని, వారి దర్శనం చేసుకుంటే మనసు శాంతిస్తుంది. ఇది గమనించి జనులు చాలా ఆశ్చర్య పోయారు. 
పంఢరీత విఠ్ఠల రఖుమాఈ | యాంచ్యా దర్శనీ జీ నవలాఈ | 
తేంచ విఠ్ఠల దర్శన దేఈ | బాబా సాఈ శిరడీంత | ||౭౩|| 
73. పంఢరిలో విఠల రఖుమాబాయి దర్శనంతో ఎంత ఆనందం అనుభవమౌతుందో, ఆ విఠల దర్శనాన్నే భక్తులకు సాయి శిరిడీలో ప్రసాదిస్తారు. 
కోణాస వాటల్యాహీ అతిశయోక్తి | ఏకావీ గౌళీబువాంచీ ఉక్తి | 
జయాసీ దృఢ విఠ్ఠలాచీ భక్తి | సంశయ నివృత్తి హోఈల | ||౭౪|| 
74. ఇది అతిశయోక్తి అని కొందరికి అనిపించ వచ్చు. విఠలునియందు దృఢమైన భక్తి కలిగిన గౌలిబువా మాటను వింటే, మీ సందేహం తీరుతుంది.
పంఢరీచే హే వారకారీ | జైశీ వర్షాస పంఢరీచీ ఫేరీ | 
తైశీచ కరితీ హే శిరడీచీ వారీ | ప్రేమ భారీ బాబాంచే | ||౭౫|| 
75. బువా నియమంగా ప్రతి సంవత్సరమూ పంఢరిపురానికి వెళ్ళే యాత్రికుడు. అలా పంఢరిపురానికి వెళ్ళేటప్పుడు శిరిడీకి కూడా వచ్చేవాడు. బాబా అంటే అతనికి విపరీతమైన ప్రేమ.
గర్దభ ఎక బరోబర | శిష్య ఎక సాథీదార | 
జివ్హా ‘రామకృష్ణ హరి’ గజర | కరీ నిరంతర బువాంచే | ||౭౬|| 
76. అతని వెంట తోడుగా ఒక శిష్యుడు ఉండేవాడు. ఒక గాడిద కూడా ఉండేది. నాలుకపై ఎప్పుడూ ‘రామ కృష్ణ హరి’ అని నామాన్ని పలుకుతూ బువా యాత్ర చేసేవాడు. 
పంచాణ్ణవతీ వర్షే వయాస | చాతుర్మాసీ గంగాతట నివాస | 
పంఢపురీ అష్టమాస | భేటీ వర్షాస బాబాంచీ | ||౭౭|| 
77. అతని వయస్సు ౯౫ సంవత్సరాలు. చాతుర్మాసాలు గంగా తీరంలో ఉండి, మిగతా ఎనిమిది నెలలు పంఢరిపురంలో ఉండేవారు. ప్రతి ఏడూ బాబాను దర్శించేవారు. 
బాబాంకడే పహాత పహాత | మ్హణావే యానీ హోఊని వినత | 
హాచి తో ముర్త3 పంఢరీనాథ | అనాథనాథ దయాళ | ||౭౮|| 
78. బాబానే చూస్తూ చూస్తూ, ‘ఇతనే సాక్షాత్తు పంఢరినాథుని అవతారం. అనాథలుకు దీనులకు ఆశ్రయం, కరుణామయుడు ఇతడే’ అని వినయంగా అనేవాడు. 
ధోత్రే నేసూన రేశీమ కానీ | హోతీల కాయ సంత కొణీ | 
కరూలాగతీ హాడాంచే మణీ | రక్తాంచే పాణీ నిజకష్టే | ||౭౯|| 
79. ‘జరీ అంచు ధోవతి కట్టుకోగానే ఎవరైనా సాధువులై పోగలరా? ఇక్కడ, ఎముకలు పూసలుగా, రక్తాన్ని నీరులా మారెలా కష్ట పడాలి. 
ఫుకాచా కాయ హోఈల దేవ | హాచి హో ప్రత్యక్ష పంఢరీరావ | 
జగ వేడే రే వేడే హా దృఢ భావ | ఠేవూని దేవ లక్షావా | ||౮౦||
80. ‘ఏ కష్టమూ లేకుండా దేవుడై పోగలరా? వీరే కనిపించే పంఢరినాథుడు. ఈ ప్రపంచం భ్రమ అని దృఢమైన నమ్మకంతో దైవాన్ని గ్రహించండి. 

జయా పంఢరీనాథాచీ భక్తి | ఏసియా భగవద్భనక్తాచీ హే ఉక్తి | 
తేథ మజపామరాచా అనుభవ కితీ | శ్రోతా ప్రతీతీ పహావీ | ||౮౧|| 
81. పంఢరీనాథుడంటే భక్తి ఉన్న భగవత్భక్తుడు ఇలా చెప్పాడంటే, ఇక పామరుణ్ణయిన నా అనుభవమెంతటిది? శ్రోతలు తమ అనుభవాలతోనే గ్రహించాలి.
  నామ స్మరణీ మోఠీ ప్రీతీ | ‘అల్లా మాలీక’ అఖండ వదతీ | 
నామ సప్తే కరవూన ఘేతీ | దివస రాతీ సన్ముఖ | ||౮౨|| 
82. బాబాకు నామస్మరణ అంటే చాలా ప్రీతి. ఎప్పుడూ ‘అల్లా మాలిక్‍’ అని అంటుండేవారు. రాత్రీపగలూ తమ ఎదుట నామ సప్తాహాలను చేయించేవారు. 
ఆజ్ఞా ఎకదా దాస గణూలా | నామ సప్తాహ మాండావయాలా | 
హోతా గణుదాస వదతీ తయాంలా | విఠ్ఠల ప్రగటలా పాహిజే | ||౮౩|| 
83. నామ సప్తాహం చేయమని ఒక సారి సాయి దాసగణును ఆజ్ఞాపించారు. దాసగణు అందుకు వారితో, ‘చేస్తాను గాని, విఠలుడు ప్రత్యక్షమవాలి మరి’ అని అన్నాడు. 
బాబా తంవ ఛాతీస హాత లావితీ | దాసగణూస నిక్షూన వదతీ | 
“హో హో ప్రగటేల విఠ్థల మూర్తి | భక్త భావార్థీ పాహిజే | ||౮౪|| 
84. బాబా తమ చేతిని గుండెపై వేసుకుని, “భక్తి భావం ఉంటే విఠలుడు తప్పక కనిపిస్తాడు” అని దాసగణుతో అన్నారు. 
డాకురనాథాచీ డంకపురీ | అథవా విఠ్ఠలరాయాచీ పంఢరీ | 
తీ హీచ రణఛోడ ద్వారకానగరీ | జాణే న దూరీ పహావయా | ||౮౫|| 
85. “డాకురనాథుని డంకపురి, విఠలుని పంఢరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా నగరం ఇదే. చూడటానికి ఎంతో దూరం వెళ్లే అవసరం లేదు. 
విఠ్ఠల కాయ ఎకాంతీచా ఉఠూన | యేణార ఆహే దుసరా కుఠూన | 
భక్తప్రేమే ఉత్కటూన | ఎథేంహీ ప్రగటూన రాహీల | ||౮౬|| 
86. “విఠలుడేమైనా ఎక్కడో ఏకాంత స్థలంనుండి ఇక్కడికి రావాలా? భక్తి, ప్రేమలు, చూడాలనే ఆతురత ఉంటే ఇక్కడే కనిపిస్తాడు. 
పుండలికే వడిలాంచీ సేవా | కరూన భులవిలే దేవాధిదేవా | 
పుండలికాచ్యా త్యా భక్తి భావా | విటే విసాంవా ఘేతలా” | ||౮౭|| 
87. “తల్లి తండ్రుల సేవ చేసి, పుండలీకుడు దేవాది దేవుణ్ణి మోహితుణ్ణి చేసి, వశపరచుకున్నాడు. అతని భక్తి భావానికి భగవంతుడు ఇటుకపైన నిలుచుండి పోయాడు” అని అన్నారు. 
అసో హోతా సప్త్యాచీ సమాప్తి | ఝాలీ మ్హణతీ దాసగణూ ప్రతీ | 
శిరడీస విఠ్ఠల దర్శన ప్రాప్తీ | హీ ఘ్యా ప్రతీతి బాబాంచీ | ||౮౮|| 
88. అలా నామ సప్తాహం సమాప్తి కాగానే దాసగణునకు శిరిడీలో విఠలుని దర్శనమైందని అంటారు. బాబా మాటలు అనుభవంలోకి వచ్చాయి. 
ఎకదా కాకా సాహేబ దీక్షిత | నియమానుసార ప్రాతఃస్నాన | 
అసతా ఆసన స్థిత ధ్యానస్థ | దర్శన పావత విఠ్ఠలాంచే | ||౮౯|| 
89. ఒక సారి, ఎప్పటిలాగే నియమంతో ఉదయానే స్నానం చేసి, ఆసనంలో ధ్యానంలో ఉండగా, కాకాసాహేబు దీక్షితుకు విఠలుని దర్శనమైంది. 
పుఢే జాతా బాబాంచే దర్శనా | నవల బాబా పుసతీ తయాంనా | 
“విఠ్ఠలపాటీల ఆలా హోతాంనా? | భేట ఝాలీనా? తయాచీ | ||౯౦||
90. తరువాత బాబా దర్శనానికి వెళ్లినప్పుడు, “విఠల పటేలు వచ్చాడు కదా, అతనిని కలిశావా?” అని విచిత్రంగా బాబా ప్రశ్నించారు. 

మోఠా పళపుట్యా బరే తో విఠ్ఠల | మేఖ మారూని కరీ త్యా అఢళ | 
దృష్టి చుకవూని కాఢీల పళ | హేతా పళ ఎక దుర్లక్ష” | ||౯౧|| 
91. “ఆ విఠలుడు పారుబోతు! అలక్ష్యం చేసి, ఒక్క క్షణమైనా దృష్టిని మరలిస్తే, పారిపోతాడు. గట్టిగా మేకు కొట్టి అతనిని కదలకుండా ఉంచు” అని అన్నారు.
హాతో ప్రాతఃకాళీ ప్రకార | పుఢే జెవ్హా భరలీ దుపార | 
పహా ఆణిక ప్రత్యంతర | విఠ్ఠలదర్శనసోహళా | ||౯౨|| 
92. ఇది ఉదయం జరిగింది. విఠలుని దర్శన వైభవం మధ్యాహ్నం మరో సారి అనుభవానికి వచ్చింది. 
పంఢరపురచ్యా విఠొబాచ్యా | ఛబ్యా పాంచపంచవీస సాచ్యా | 
ఘేఊని కోణీ బాహేరగాంవీచా | వికావయాచ్యా ఇచ్ఛే యే | ||౯౩|| 
93. పంఢరీపుర విఠలుని పాతిక చిత్రపటాలను అమ్ముకోవాలని ఇంకొక ఊరినుంచి ఒకడు శిరిడీ వచ్చాడు. 
సకాళాధ్యానీ ఆలీ తీ మూర్తీ | తియేచీచ సంపూర్ణ హోతీ ప్రతికృతీ | 
పాహూని దీక్షిత విస్మిత చిత్తీ | బోల ఆఠవతీ బాబాంచే | ||౯౪|| 
94. ఉదయం ధ్యానంలో కనిపించిన రూపంలాంటి ఫోటోలు, పూర్తిగా అదే రూపం, చూసి దీక్షితు ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతనికి బాబా మాటలు గుర్తుకు వచ్చాయి. 
దీక్షిత తంవ అతి ప్రీతీ | వికణారాసీ మోల దేతీ | 
ఛబీ ఎక వికతఘేతీ | భావే లావితీ పూజేస | ||౯౫|| 
95. అమ్ముకునే వానికి డబ్బిచ్చి, ఎంతో ప్రేమతో ఒక పటాన్ని కొని, భక్తిగా పూజకోసం పెట్టుకున్నాడు. 
విఠ్ఠల పూజూనీ సాఈచా ఆదర | ఆణీక ఎక కథానక సుందర | 
పరిసా బహు శ్రవణ మనోహర | ఆనంద నిర్భర మానసే | ||౯౬|| 
96. విఠలుని పూజ అంటే సాయికి గల ఆదరణను తెలియ పరచే మనోహరమైన మరొక అందమైన కథను ఆనందంగా వినండి. 
భగవంతరావ క్షీరసాగర | వడీల విఠ్ఠల భక్త ప్రవర | 
పంఢరపురాస వారంవార | ఫేరీ వరచేవర కరీత | ||౯౭|| 
97. భగవంతరావ క్షీరసాగరుని తండ్రి విఠలుని భక్త శ్రేష్ఠుడు. తరచూ పంఢరీపుర యాత్ర కూడా చేసేవాడు.
ఘరాంత హోతీ విఠ్ఠల మూర్తి | వడీల పంచత్వ పావల్యావరతీ | 
జాహలీ పూజానైవేద్య సమాప్తి | శ్రాద్ధతిథీహీ రాహిలీ | ||౯౮|| 
98. పూజ కోసం విఠలుని విగ్రహం వారింట్లో ఒకటుందేది. తండ్రి చనిపోగానే, పూజ, అర్చనలు, నైవేద్య, సమర్పణలు ఆగిపోయాయి. శ్రాద్ధం కూడా ఆగిపోయింది. 
నాహీ వారీచీ కథావార్తా | భగవంతరావ శిర్డీస యేతా | 
బాబా ఆఠవూని తయాచా పితా | మ్హణతీ ‘తో హోతా దోస్త మాఝా | ||౯౯|| 
99. పంఢరీ యాత్ర గురించి అసలు మాటే లేదు. ఈ భగవంతరావు శిరిడీకి వచ్చినప్పుడు, అతని తండ్రిని గుర్తుచేసుకుంటూ బాబా “ఇతని తండ్రి నా స్నేహితుడు.
హా త్యా మాఝ్యా స్నేహ్యాచా సుత | మ్హణూన యాస మీ ఆణిలా ఖేంచిత | 
నాహీ కధీ హా నైవేద్య కరీత | ఉపాసీ ఠేవీత మజలాహీ | ||౧౦౦||
100. “ఆ నా స్నేహితుని కుమారుడే ఇతడు. అందుకే నేను ఇతనిని ఇక్కడకు లాక్కుని వచ్చాను. ఎప్పుడూ నైవేద్యం పెట్టకుండా ఇతను నన్ను కూడా పస్తులు ఉంచుతున్నాడు. 

విఠలాసహీ ఠేవీ ఉపాశీ | మ్హణూన శిరడీసీ ఆణిలే యాసీ | 
ఆతా దేఈన ఆఠవణీసీ | లావీన పూజేసీ యాజలా” | ||౧౦౧|| 
101. “విఠలుని కూడా పస్తులుంచాడు. అందుకే ఇతనిని శిరిడీకి తీసుకుని వచ్చాను. ఇప్పుడు, అతనికి అన్నీ గుర్తుకు తెచ్చి, మరల ఇతడు పూజ ప్రారంభించేలా చేస్తాను” అని చెప్పారు.
ఎకదా పర్వవిశేష జాణూన | కరావే ప్రయాగతీర్థీ స్నాన | 
దాస గణూచే జాహలే మన | ఆలే ఆజ్ఞాపన ఘ్యావయా | ||౧౦౨|| 
102. ఒక సారి, ఒక పర్వదినాన దాసగణుకు ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలన్న కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారి వద్దకు వచ్చాడు. 
బాబా దేతీ ప్రత్యుత్తర | నలగే తదర్థ జాణే దూర | 
హేంచ ఆపులే ప్రయాగతీర | విశ్వాస ధర దృఢ మనీ | ||౧౦౩|| 
103. అప్పుడు బాబా ఆతనితో “దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదే మన ప్రయాగ తీర్థం. మనసులో దృఢమైన నమ్మకముంచు” అని చెప్పారు. 
ఖరేంచ సాంగావే కాయ కౌతుక | బాబాంచే చరణీ ఠేవితా మస్తక | 
ఉభయాంగుష్ఠీ నిథళలే ఉదక | గంగాయమునౌదక పాఝరలే | ||౧౦౪|| 
104. నిజం చెప్పాలంటే, ఎంత అద్భుతమైన ఘటన! బాబా పాదాలపై దాసగణు తన తలను పెట్టగానే, వారి రెండు బొటన వేళ్ళనుండి గంగా యమునల నీరు ప్రవహించింది. 
పాహూనియా తో చమత్కార | దాస గణూస ఆలా గాహింవర | 
కాయ బాబాంచా మహదుపకార | ఫుటలా పాఝర నయనాస | ||౧౦౫|| 
105. ఆ చమత్కారాన్ని చూసి, దాసగణు గగుర్పాటు చెందాడు. బాబా ఎంతటి ఉపకారాన్ని చేశాడు! కృతజ్ఞతతో కళ్ళనుండి నీరు ధారలుగా కారాయి. 
వైఖరీస చఢలే స్ఫురణ | ప్రేమ ఆలే ఉచంబళూన | 
అగాధశక్తి అఘటిత లీలా వర్ణన | కరూన సమాధాన పావలే | ||౧౦౬|| 
106. వెంటనే స్ఫురణ వచ్చింది. ప్రేమ ఉప్పొంగి, బాబాయొక్క అద్భుతమైన లీలను, అంతులేని శక్తి మహిమను వర్ణించి, అతడు తృప్తి చెందాడు. 
దాస గణూచే పద హే గోడ | వేళీంచ పురావే శ్రోతియాంచే కోడ | 
మ్హణోని త్యా ప్రాసాదిక పదాచీ జోడ | దేవోని హీ హోడ పురవితో | ||౧౦౭||
107. దాసగణుయొక్క ఈ మధురమైన రచనలోని ప్రసాదించ బడిన పదాల కూర్పును శ్రోతలకు తెలియజేసి, వారి కుతూహలాన్ని తీరుస్తాను. 

(పద) 
అగాధ శక్తి అఘటిత లీలా తవ సద్గురూరాయా | 
జడజీవాతే భవి తారాయా తూ నౌకా సదయా | ||ధ్రు.|| 
వేణీమాధవ ఆపణ హోఊని ప్రయాగ పద కేలే | 
గంగా యమునా ద్వయ అంగుష్ఠీ ప్రవాహ దాఖవిలే | ||౧|| 
కమలోద్భువ కమలావర శివహర త్రిగుణాత్మక మూర్తీ | 
తూంచి హోఊనీ సాఈసమర్థా విచరసీ భూవరతీ | ||౨|| 
ప్రహర దిసాలా బ్రహ్మాసమ తే జ్ఞాన ముఖే వదసీ | 
తమోగుణాలా ధరూని రూద్ర రూప కధి కధి దాఖవిసీ | ||౩|| 
కధీ కధీ శ్రీకృష్ణాసమ త్యా బాలలీలా కరిసీ | 
భక్త మనానిత సరస కరూనీ మరాళ తూ బనసీ | ||౪|| 
యవన మ్హణావే తరీ ఠేవిసీ గంధావర ప్రేమా | 
హిందు మ్హణూ తరి సదైవ వససీ మశిదింత సుఖధామా | ||౫|| 
ధనిక మ్హణావే జరీ తులా తరి భిక్షాటణ కరిసీ | 
ఫకిర మ్హణావే తరీ కుబేరా దానే లాజవిసీ | ||౬|| 
తవౌకసాతే4 మశిద మ్హణూ తరి వన్హీ తే ఠాయా | 
ధునింత సదా ప్రజ్వళీత రాహే ఉది లోకా ఘ్యాయా | ||౭|| 
సకాళపాసుని భక్తసాబడే పూజన తవ కరితీ | 
మాధ్యాన్హీలా దినకర యేతా హోత అసే ఆరతీ | ||౮|| 
చహూంబాజూలా పార్శ్వదగణసమ భక్త ఉభే రాహతీ | 
చౌరి చామరే కరీ ధరూని తుజవర ఢాళీతీ | ||౯|| 
శింగ ఘడయాళే సూర సనయ్యా దణదణతే ఘంటా | 
చోపదార లలకారితి ద్వారీ ఘాలునియా పట్టా | ||౧౦|| 
ఆరతి సమయీ దివ్యాసని తూ కమలావరదిససీ | 
ప్రదోషకాళీ బసుని ధునిపుఢే మదనదహన హోసీ | ||౧౧|| 
అశ్యా లీలా త్యా త్రయదేవాంచ్యా ప్రత్యహి తవ ఠాయీ | 
ప్రచీతీస యెతాతీ అముచ్యా హే బాబా సాఈ | ||౧౨|| 
ఏసె అసతా ఉగీచ మన్మన భటకత హే ఫిరతే | 
ఆతా వినంతీ హీచ తులా బా స్థిర కరీ త్యాతే | ||౧౩|| 
అధమాధమ మీ మహాపాతకీ శరణ తుఝ్యా పాయా | 
ఆలో, నివారా దాసగణూంచే త్రితాప గురూరాయా | ||౧౪||
(పదం)  
సద్గురుదేవా! మీయొక్క శక్తి అంతులేనిది. 
మీ లీల అద్భుతం. దయామయా! 
అజ్ఞానులైన, అమాయకులైన జీవులను
ఈ సంసార సాగరంనుండీ తరింపజేసే నౌక సదా మీరే||ధ్రు.|| 
వేణు మాధవుడై మీ పాదాలు రెండింటినీ ప్రయాగ చేసి, 
రెండు బొటన వేళ్ళనుండి గంగా యమునల ప్రవాహాన్ని చూపారు (౧) 
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తి అయి 
సాయి సమర్థులై భూమిపై మీరు విహరిస్తున్నారు (౨) 
ఒకప్పుడు బ్రహ్మ అయి జ్ఞానాన్ని బోధిస్తారు. 
ఒక్కొక్కప్పుడు తమోగుణం చూపటానికి రుద్ర రూపం ధరిస్తారు (౩) 
మరొక్కప్పుడు శ్రీకృష్ణునివలె బాల లీలలను చూపిస్తారు. 
అప్పుడప్పుడు, భక్తుల మనసు అనే సరోవరంలో హంసవలె విహరిస్తారు (౪) 
మిమ్ము ముస్లిములని అందునా, మీకు చందనమంటే ప్రీతి. 
హిందువులని అందునా, మీరెప్పుడూ మసీదులో సుఖంగా ఉంటారు (౫) 
శ్రీమంతులని అందునా, భిక్షాటన చేస్తారు. 
పోని ఫకీరు అని అందునా, దానంలో కుబేరుడే సిగ్గుపడతాడు.||౬|| 
మీ నివాసం మసీదులో. కాని, అక్కడ 
భక్తులకు విభూతి ప్రసాదించటానికై ధునిలో రాత్రి పగలూ అగ్ని ప్రజ్వలిస్తుంది. (౭) 
ఉదయంనుండి భక్తులు మీ పూజ చేస్తారు. 
మధ్యాహ్నం, సూర్యుడు తలపై వచ్చినప్పుడు, మీకు హారతి ఇస్తారు (౮) 
భక్తులు దేవదూతలవలె నలువైపుల నిలబడి, 
మీకు వీవనలు వింజామరలు వీస్తారు. (౯) 
సన్నాయి, ఢోలు, ఘంట బాగా మ్రోగుతున్నాయి. 
దండధరులు పట్టీని ధరించి, ద్వారం దగ్గర జయజయ ధ్వనులు పలుకుతారు. (౧౦) 
హారతి సమయంలో, దివ్యాసనంలో మీరు శ్రీవిష్ణువులా కనిపిస్తారు. 
సాయంత్రం ధుని ఎదుట కూర్చుని, కాముణ్ణి దహించిన పరమ శివునిలా కనిపిస్తారు (౧౧) 
ఈ విధంగా రోజు రోజుకూ త్రిమూర్తుల లీలలను మీరు మాకు అనుభవింప చేస్తునారు. 
అయినా, ఈ మనసు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతుంది. దీనిని స్థిరంగా ఉంచమనే కోరికనొక్కటే ఇప్పుడు వేడుకుంటున్నాను. (౧౩) 
అందరికంటే నీచుణ్ణి. మహా పాపిని. మీ పాదాల వద్ద శరణుజొచ్చి వచ్చాను. 
గురుదేవా! ఈ దాసగణుని మూడు తాపాలను తొలగించండి. (౧౪)

అసో అఘోర పాపే ధువాయా | జన జాతీ గంగేచ్యా ఠాయా | 
గంగా లాగే సంతాంచే పాయా | నివారావయా నిజతాపే | ||౧౦౮|| 
108. భయంకరమైన తమ పాపాలను కడిగేసుకోవటానికి గంగకు వెళ్ళుతారు. అయితే, తనకు అంటిన పాపాలను తొలగించుకోవటానికి, గంగ సంతుల పాదాలను ఆశ్రయించ వలసి ఉంటుంది. 
సోడూనియా చరణా పవిత్రా | న లగే గంగా గొదా యాత్రా | 
భావే పరిసా యా సంత స్తోత్రా | గోడచరిత్రా సాఈచ్యా | ||౧౦౯|| 
109. అందు వలన ఈ సాయి సత్పురుషుని పవిత్ర చరణాలను వదిలి గంగ గోదావరి తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం లేదు. సాయియొక్క మధుర చరిత్రను వారి స్తోత్రాన్ని భక్తిగా వినండి. 
జైసే గోణాఈస భీమరథీంత | తమాలాస భాగీరథీంత | 
నామా కబీర శింపాల్యా ఆంత | సుదైవే ప్రాప్త జాహలే | ||౧౧౦||
110. భాగ్యవశాత్తు భీమరథి నదిలో గోణాయికి నామదేవు, భాగీరథీ నదిలో ముత్యపు చిప్పులో తమాలుకు కబీరు లభించారు. 

తైసేచ హె శ్రీసాఈనాథ | తరూణ సోళా వర్షాంచే వయాంత | 
నింబాతళీ శిరడీ గాంవాంత | ప్రథమ భక్తార్థ ప్రకటలే | ||౧౧౧|| 
111. అలాగే, శ్రీసాయిబాబా పదహారు ఏళ్ళ యువ వయసులో, శిరిడీ గ్రామంలోని వేపచెట్టు క్రింద భక్తుల కొరకు మొదట కనిపించారు. 
ప్రకటతాంచ బ్రహ్మజ్ఞానీ | నాహీ విషయవాసనా స్వప్నీ | 
మాయా త్యాగిలీ లాథేహాణునీ | ముక్తీ చరణీ వినటలీ | ||౧౧౨|| 
112. మొదట కనిపించినప్పటికే వారు బ్రహ్మజ్ఞాని. కలలో కూడా వారికి ఇంద్రియాల కోరికలు లేవు. మాయను తన్ని తరిమేశారు. ముక్తి వారి పాదాలయందు దొర్లుతుండేది.
జన్మ బాబాంచా కోణ్యా దేశీ | అథవా కోణ్యా పవిత్ర వంశీ | 
కోణ్యా మాతాపితరాంచ్యా కుశీ | హే కోణాసీ ఠావేనా | ||౧౧౩|| 
113. ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లి తండ్రుల గర్భాన వారు జన్మించారో ఎవ్వరికీ తెలియదు.
ఠావీ న కోణా పూర్వావస్థా | కోణ తో తాత వా కోణ మాతా | 
థకలే సమస్త పుసతా పుసతా | కోణా న పత్తా లాగలా | ||౧౧౪|| 
114. వారి వెనుకటి వివరాలు కూడా ఎవరూ ఎరుగరు. వారి తల్లి తండ్రులు ఎవ్వరు అని అడిగి అడిగి అందరూ అలసిపోయారే కాని వారి వివరాలు ఎవరికీ తెలియలేదు.
సోడూని మాతా పితర ఆప్త | గణగోత ఆణి జాత పాత | 
త్యాగూని సకల సంసార జాత | ప్రకటలా జనహితార్థ శిరడీంత | ||౧౧౫|| 
115. తల్లి తండ్రులను, ఆప్తులను, జాతి మతాలను, ప్రపంచ వ్యవహారాలను, సంసారం అంతటినీ త్యజించి, ప్రజల మేలుకోసం వారు శిరిడీలో కనిపించారు.
శిరడీచీ ఎక వృద్ధ బాఈ | నానా చోపదారాచీ ఆఈ | 
కథితీ ఝాలీ పరమ నవలాఈ | బాబా సాఈ చరితాచీ | ||౧౧౬|| 
116. శిరిడీలోని ఒక ముసలి స్త్రీ, నానా చోప్దారుయొక్క తల్లి, సాయి చరిత్రలోని కొన్ని విశేషాలని చెప్పింది.
మ్హణే ఆరంభీ హే పోర | గోరే గోమటే అతి సుందర | 
నింబాతళీ ఆసనీ స్థిర | ప్రథమ దృగ్గోచర జాహలే | ||౧౧౭|| 
117. చాలా అందమైన బాలునిలా, వేప చెట్టు క్రింద ధ్యానం చేస్తూ, వారు మొదట కనిపించారు అని ఆమె చెప్పింది.
పాహూని సుందర బాళరూప | లోకాంమనీ విస్మయ అమూప | 
కోవళ్యా వయాంత ఖడతర తప | శీత ఆతప సమసామ్య | ||౧౧౮|| 
118. అంత సుందర రూపుడైన ఆ బాలుడు, కోమలమైన చిన్న వయసులోనే అతి కష్టమైన తపస్సును చేయటం చూసి ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఎండైనా, చలియైనా సమానంగా సహిస్తూ ఆ బాలుడు కఠిన తపస్సులో ఉన్నాడు.
వయ కోవళే నవల స్థితీ | గ్రామస్థ సకళ విస్మయ పావతీ | 
గాంవోగాంవీచే లోక యేతీ | దర్శన నిమిత్తీ ములాచ్యా | ||౧౧౯|| 
119. ఎంత చిన్న వయసు! ఎంత కఠిన తపస్సు! గ్రామస్థులంతా ఆశ్చర్య పోయారు. ఆ బాలుని చూడటానికి ఎక్కడేక్కడినుండో జనం వచ్చేవారు.
దివసా నవ్హే కోణాచీ సంగతీ | రాత్రీస నాహీ కోణాచీ భీతీ | 
ఆలీ కోఠూన హీ బాల మూర్తి | ఆశ్చర్య చిత్తీ సకళీకా | ||౧౨౦||
120. పగలు అతనికి ఎవరూ తోడు లేరు. రాత్రి ఎవరి భయమూ లేదు. ఈ బాలుడు ఎక్కడినుండి వచ్చాడా అని అందరికీ ఆశ్చర్యం. 

రూపరేఖా అతిగోజిరీ | పాహతా ప్రేమ దాటే అంతరీ | 
నాహీ కుణాచే ఘరీ నా దారీ | లింబాశేజారీ అహర్నిశ | ||౧౨౧|| 
121. ఎంత అందమైన ముఖం! ఎంత ఆకట్టుకునే రూపం! ఆ బాలుని చూస్తుంటే హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. రాత్రి పగలు వేప చెట్టు క్రిందేగాని, ఎవరి ఇంటికీ పోలేదు. 

జో తో కరీ ఆశ్చర్య థోర | ఏసే కైసే తరీ హే పోర | 
వయ కోవళే రూప మనోహర | రాహీ ఉఘడ్యావర రాత్రందిన | ||౧౨౨|| 
122. వయస్సేమో చాలా చిన్నది. రూపమేమో చాలా మనోహరమైనది. అంత పసి బాలుడు, రాత్రి పగలు ఆరు బయట ఎలా ఉండగలుగుతున్నాడా అని అందరికీ ఆశ్చర్యం. 
బాహ్యాత్కారీ దిసే ఫోర | పరీ కృతీనే థోరాంహునీ థోర | 
వైరాగ్యాచా పూర్ణావతార | ఆశ్చర్య ఫార సకళికా | ||౧౨౩|| 
123. పైకి బాలుని వలె కనిపించినా, అతను చేసే పనులు గొప్పవారికంటే గొప్పగా, అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఉండేవి. మానవ రూపంలో ఉన్న వైరాగ్యంయొక్క అవతారం అతడు. 
ఎకే దివశీ నవల ఝాలే | ఖండోబాచే వారే ఆలే | 
దోఘే చౌఘే ధుజూ లాగలే | పుసూ లాగలే జన ప్రశ్న | ||౧౨౪|| 
124. ఒక రోజు ఒక విచిత్రం జరిగింది. కొందరిపై ఖండోబా దేవుడు ఆవేశమై వారు ఊగుతుంటే, జనం వారిని కొన్ని ప్రశ్నలను అడిగారు. 
కోణా సభాగ్యాచే హే పోర | కోఠూన కైసే హె ఆలే ఇథవర | 
దేవా ఖండోబా తూ తరీ శోధ కర | ప్రశ్న విచారీత తై ఎక | ||౧౨౫|| 
125. ‘దేవా! ఖండోబా! ఇతడు ఏ భాగ్యవంతుల బిడ్డ? ఎక్కడినుండి ఇక్కడికి వచ్చాడు? నువ్వైనా కనుక్కుని తెలియజెయ్యి’ అని ఒకరు అడిగారు. 
దేవ మ్హణే జా కుదళీ ఆణా | దావితో తే జాగీ ఖణా | 
లాగేల యా పోరాచా ఠికాణా | కుదళీ హాణా యే జాగీ | ||౧౨౬|| 
126. దానికి ఖండోబా దేవుడు, ‘వెళ్లి గునపం తెచ్చి, నేను చూపించిన చోటులో త్రవ్వండి. ఈ బాలుని వివరాలు తెలుస్తాయి’ అని జవాబిచ్చాడు. 
మగ తేథేంచ త్యా గాంవకుసాజవళీ | త్యాచ నింబవృక్షాచే తళీ | 
మారితా కుదళీవరీ కుదళీ | విటా తే స్థళీ ఆఢళల్యా | ||౧౨౭|| 
127. అప్పుడు, ఆ గ్రామ శివారులలో, వేపచెట్టు క్రింద గునపంతో త్రవ్వగా, అక్కడ ఇటుకలు కనిపించాయి. 
పురా హోతాంచ విటాంచా థర | జాత్యాచీ తళీ సారితా దూర | 
దృష్టీస పడలే ఎక భుయార | సమయా చార జళతీ జై | ||౧౨౮|| 
128. ఆ ఇటుకల వరసను తొలగించాక, తిరగలి క్రింది రాయి కనిపించింది. దానిని ప్రక్కకు జరపగా, ఒక సొరంగం, అందులో వెలుగుతున్న నాలుగు ప్రమిదలు కనిపించాయి. 
చునెగచ్ఛీ తే తళఘర | గోముఖీ, పాట మాళ సుందర | 
దేవ మ్హణే బారా వర్షే హా పోర | తప ఆచరలా యే స్థళీ | ||౧౨౯|| 
129. సున్నం గచ్చుతో కట్టిన ఆ భూగృహంలో, గోముఖం, పీట, అందమైన మాలలు ఉన్నాయి. ఇక్కడే ఈ బాలుడు పన్నెండు ఏళ్లు తపస్సు చేశాడని ఖండోబా దేవుడు చెప్పాడు.
మగ జన సర్వ ఆశ్చర్య కరితీ | ఖోద ఖోదూన పోరాస పుసతీ | 
పోర తో బారా ములఖాచా గమతీ | కథా భలతీచ సాంగితలీ | ||౧౩౦||
130. ఇది చూసి, జనమంతా ఆశ్చర్యపోయారు. ఆ బాలుని గ్రుచ్చి గ్రుచ్చి ప్రశలను అడిగారు. కాని, ఆ బాలుడు, తుంటరితనంతో, ఇంకేదో వేరే కథ చెప్పాడు. 

మ్హణే హే మాఝ్యా గురూచే స్థాన | అతి పవిత్ర హే మాఝే వతన | 
ఆహే తైసేంచ కరా హే జతన | మానా మద్వచన ఎవఢే | ||౧౩౧|| 
131. “ఇది మా గురువుయొక్క స్థానం. నాకు అతి పవిత్రమైన భూమి. నా మాట విని, దీనిని ఇలాగే భద్రపరచండి” అని చెప్పాడు. 
బాబా ఝాలే ఏసే బోలతే | కథితే ఝాలే శ్రవణ కరితే | 
బాబా వదలే తె వదలే భలతే | ఏసీ హీ వళతే జివ్హా కా | ||౧౩౨|| 
132. అలా బాబా చెప్పారు, అని దానిని విన్నవారు చెప్పారు. మరి, సంబంధం లేని కథను బాబా చెప్పారు అని నా నాలుక అనిందేమిటి? 
ఆశ్చర్య వాటే మాఝేచి మజ | బాబా విషయీ హా కా సమజ | 
పరీ తో ఆతా పడలా ఉమజ | అసేల సహజ వినోద హా | ||౧౩౩|| 
133. నాకే ఆశ్చర్యం కలిగింది. బాబా గురించి ఇలా అనుకున్నానేమిటి? ఇప్పుడు, నాకు అర్థమైంది, అది కేవలం వినోదం కోసం అయి ఉంటుంది అని. 
బాబా మూళచేచ వినోదప్రియ | అసేలహీ భుయార త్యాంచేచ ఆలయ | 
పరీ గురూచే మ్హణతా కాయ జాయ | మహత్వ కాయ వేచేంకీ | ||౧౩౪|| 
134. అసలు బాబా చాలా వినోద ప్రియులు. ఈ భూమి లోపలి ఇల్లు వారి ఆలయమే అయి ఉండవచ్చు. అయినా, గురువుదని చెబితే పోయేదేముంది? దాని మహాత్మ్యం నష్టపోతుందా? అని అలా చెప్పి ఉంటారు. 
అసో బాబాంచ్యా ఆజ్ఞేవరూన | పూర్వీప్రమాణే విటా లావూన | 
భుయార టాకిలే బంద కరూన | నిజగురూస్థాన మ్హణూన తే | ||౧౩౫|| 
135. అలా బాబా ఆజ్ఞ అయిన తరువాత, అది ‘గురుస్థానం’ అని మునుపటివలనే ఇటుకలను పేర్చి, ఆ భూగృహాన్ని, సొరంగాన్ని మూసి వేశారు. 
జైసా అశ్వత్థ వా ఔదుంబర | తైసాచ బాబాంస తో నింబతరూవర | 
ప్రీతి ఫార త్యా నింబావర | అతి ఆదర తయాంచా | ||౧౩౬|| 
136. అశ్వత్థ వృక్షం, ఔదుంబర వృక్షాల వలె ఆ వేపచెట్టుపై కూడా బాబాకు అతి ప్రీతి, విపరీతమైన గౌరవం కూడాను. 
మ్హాళసాపతి ఆదికరూన | జునే శిరడీచే గ్రామస్థ జన | 
బాబాంచ్యా గురూచే హె సమాధిస్థాన | మ్హణూన వందన త్యా కరితీ | ||౧౩౭|| 
137. మహల్సాపతి, శిరిడీలోని వృద్ధులు బాబాయొక్క గురువుగారి సమాధి స్థానమని, అక్కడ నమస్కారం చేసేవారు. 
తయా సమాధి సన్నిధానీ | ద్వాదశ వర్షే మౌన ధరూనీ | 
తపశ్చర్యా కేలీ బాబాంనీ | ప్రసిద్ధ జనీ హీ వార్తా | ||౧౩౮|| 
138. ఆ సమాధి దగ్గర కూర్చుని, పన్నెండు సంవత్సరాలు మౌనంగా బాబా తపస్సు చేశారన్న సంగతి, అక్కడి గ్రామస్థులందరిలో బాగా ప్రసిద్ధి చెందింది. 
సమాధి ఆణి నింబ సమేత | చౌఫేర జాగా ఘేఊని వికత | 
సాఠే సాహేబ బాబాంచే భక్త | చౌసోపీ ఇమారత ఉఠవితీ | ||౧౩౯|| 
139. వేప చెట్టుతో సహ సమాధికి నలువైపులా ఉన్న స్థలాన్ని బాబా భక్తుడు సాఠే కొని, అక్కడ నాలుగు వరండాలు మధ్యన చేరే భవనాన్ని నిర్మించాడు. 
హీచ ఇమారత హాచ వాడా | యాత్రేకరూంచా మూళ ఆఖాడా | 
ఆలియా గోలియాంచా రాడా | ఎకచి గాఢా తే స్థానీ | ||౧౪౦||
140. ఈ భవనమే, ఈ వాడాయే వచ్చిపోయే యాత్రికులకు మునుపు అక్కడ ఉన్న ఒకే ఒక వసతి గృహం. 

బాంధిలా సాఠ్యాంనీ నింబాస పార | మాడ్యా కాఢిల్యా దక్షిణోత్తర | 
ఉత్తరేచా జినా తయార | కరితా హే భుయార దాఖవిలే | ||౧౪౧|| 
141. వేప చెట్టు చుట్టూ సాఠే అరుగు కట్టించాడు. దక్షిణ ఉత్తర దిశలో ఈ భవనాన్ని నిర్మించాడు. ఉత్తర దిశలో మెట్లు కట్టుతుండగా, ఈ భూగృహాన్ని గమనించారు.
జిన్యా ఖాలీ దక్షిణాభిముఖ | కోనాడా ఎక ఆహే సురేఖ | 
తేథేంచ పారావర తయాసన్ముఖ | భక్త ఉదడ్ముహఖ బైసతీ | ||౧౪౨|| 
142. మెట్ల క్రింద, దక్షిణ దిశలో ఒక చక్కటి గూడు ఉంది. దాని ఎదుట, ఉత్తరంవైపు ముఖం పెట్టి, భక్తులు కూర్చుంటారు. 
"గురూవార ఆణి శుక్రవారీ | సూర్యాస్తీ సారవూనియా వరీ | 
ఊద జాళీల జో క్షణభరీ | దేఈల శ్రీహరి సుఖ తయా" | ||౧౪౩|| 
143. “గురువారం, శుక్రవారాలు, సూర్యుడు అస్తమించే సమయంలో, అక్కడ అలికి, శుభ్రం చేసి, సాంబ్రాణి ధూపం వేసేవారికి శ్రీహరి తప్పకుండా సుఖాలను ప్రసాదిస్తాడు”. 
హీ అతిశయోక్తి కివా ఖరే | సాశంక హోతీల శ్రోత్యాంచీ అంతరే | 
పరీ హీ సాఈముఖీంచీ అక్షరే | శ్రవణ ద్వారే పరిసిలీ | ||౧౪౪|| 
144. ఇది నిజమేనా, లేక అతిశయోక్తియా అని శ్రోతల మనసులో అనుమానం కలుగవచ్చు. కాని, ఇవి సాయి నోటినుంచి వచ్చిన మాటలు, నేను నా చెవులతో విన్నవి. 
నాహీ మాఝియా పదరచే విధాన | శంకా న ధరా అణు ప్రమాణ | 
ప్రత్యక్ష జ్యాంనీ కేలే హే శ్రవణ | తే ఆజ విద్యమాన అసతీ కీ | ||౧౪౫|| 
145. ఇవి నేను కల్పించిన మాటలు కావు. అందుచేత కొంచం కూడా సందేహించకండి. ఈ మాటలను ప్రత్యక్షంగా విన్నవారు ఈ నాటికీ ఉన్నారు. 
పుఢే ఝాలా దీక్షితాంచా వాడా | సోయ ఝాలీ ప్రశస్త బిర్హాడా | 
అల్పకాలాంత తేథేంచ పుఢా | దగడీవాడా హీ ఊఠలా | ||౧౪౬|| 
146. ఆ తరువాత, దీక్షితు వాడా కట్టబడింది. దానివలన, భక్తులు బస చేయటానికి మంచి సదుపాయం కలిగింది. తరువాత, చాలా తక్కువ సమయంలోనే అక్కడ ఒక రాతి వాడా నిర్మించబడింది. 
దీక్షిత ఆధీంచ పుణ్యకీర్తి | భావార్థాచీ ఓతీవ మూర్తి | 
ఆంగ్లభూమీచే యాత్రేస జాతీ | తేథ రోవితీ నిజ బీజ | ||౧౪౭|| 
147. అప్పటికే, తన మంచి పనులతో, భక్తి శ్రద్ధ మూర్తీభవించినట్లు ఉండే దీక్షితు కీర్తి గడించాడు. ఇంగ్లాండుకు ప్రయాణమై వెళ్ళినప్పుడు, అక్కడ పారమార్థిక బీజం అతనిలో నాటబడింది. 
యేథే శ్రోతే ఘేతీల శంకా | సోడూని మథురా కాశీ ద్వారకా | 
ధర్మబాహ్య జీ ఆంగ్ల భూమికా | పరమార్థదాయకా కైసీపా | ||౧౪౮|| 
148. ఇది విన్న శ్రోతలకు అనుమానం కలగటం సహజం. మథుర, కాశి, ద్వారక వంటి పుణ్య క్షేత్రాలను వదిలి వేసి, హిందూ ధర్మానికి విరుద్ధమైన ఆంగ్లేయుల భూమిలో పరమార్థం ఎలా నాటబడింది? అని. 
శ్రోత్యాంస శంకా హీ సాహజిక | నిరసతా తీ వాటేల కౌతుక | 
విషయాంతర ఘడేల అల్పక | క్షమా సకళిక కరితీల | ||౧౪౯|| 
149. శ్రోతలకు ఇలాంటి అనుమానం రావటం సహజం. వారి కౌతుకాన్ని తొలగించటానికి మునుపు, ఇక్కడ కొంచెం విషయం మారుతుంది. అందరూ క్షమించాలి. 
కాశీ ప్రయాగ బదరికేదార | మథురా వృందావన ద్వారకాపూర | 
 ఇత్యాది యాత్రా పుణ్య నికర | పదరీ పూర్వీచ తయాంచే | ||౧౫౦||
150. కాశి, ప్రయాగ, బదరీ కేదారాలు, మథురా బృందావనం, ద్వారక మొదలైన పుణ్యక్షేత్రాల యాత్ర చేసిన పుణ్యం దీక్షితుకు అంతకు ముందే ఉంది. 

శివాయ వడిలాంచీ పుణ్యాఈ | ధన్య భాగ్యాచీ అపూర్వాఈ | 
సర్వ పూర్వార్జితాచీ భరపాఈ | జాహలే సాఈ దర్శన | ||౧౫౧|| 
151. అంతే కాకుండా, తల్లిదండ్రుల పుణ్యం వలన, అంతులేని భాగ్యం కొద్దీ, పూర్వార్జిత పుణ్య ఫలం కారణంగా, దీక్షితుకు సాయి దర్శనం కలిగింది.
యా దర్శనా ఆది కారణ | ప్రాక్తనీంచే పాంగుళ పణ | 
ఆంగ్లభూమీంత అసతా జాణ | పాయ నిసరూన జే ఆలే | ||౧౫౨|| 
152. ఈ దర్శనానికి తక్షణ కారణం, అదృష్టం కొద్ది అతనికి కలిగిన కుంటితనం. ఇంగ్లాండులో ఉండగా, దీక్షితు కాలు జారి పడ్డాడు. 
దిసాయా దిసలా జరీ కుయోగ | తరీ పరిపాకే గురూపుష్యయోగ | 
తేణే ఫళలా సదుద్యోగ | అలభ్య సంయోగ సాఈంచా | ||౧౫౩|| 
153. పైకి దురదృష్టంగా కనిపించినా, నిజానికి అది చాలా అరుదుగా జరిగే శుభమైన ఘటన. అతని పుణ్య పనుల ఫలితంగా, ఈ కుంటితనం వలనే, చాలా కష్టమైన సాయియొక్క సహవాసం అతనికి దొరికింది. 
చాందోరకరాంచీ గాంఠ పడలీ | సాఈచీ కీర్తి కర్ణీ ఆలీ | 
మ్హణతీ పహా దర్శన నవ్హాళీ | జాఈల పాంగుళీక తత్కాళ | ||౧౫౪|| 
154. అనుకోకుండా నానా చాందోర్కరును కలవటంతో, సాయి కీర్తి చెవులలో పడింది. చాందోర్కరు అతనితో, ‘సాయి దర్శనంలోని అద్భుతాన్ని చూడు! నీ కుంటితనం వెంటనే పోతుంది’ అని చెప్పాడు. 
పరీ హా పాయాంచా లంగడేపణా | దీక్షిత న మానీత ఉణేపణా | 
ఖరా లంగడేపణా తో మనా| ఘాలవా మ్హణాలే సాఈస | ||౧౫౫|| 
155. కాని, తన కుంటితనాన్ని దీక్షితు ఒక లోపంగా అనుకోలేదు. మనసు స్థిరంగా ఉండకపోవటమే నిజమైన లోపమని, దానిని పోగొట్టమని సాయిని కోరాడు. 
త్వాచా రూధిర మాంస హాడా | సముదాయ నరదేహాచా సాంగాడా | 
హా క్షణభంగూర సంసార గాడా | పాయ లంగడా రాహో కీ | ||౧౫౬|| 
156. చర్మం, ఎముకలు రక్త మాంసాల కలయికే ఈ మానవ శరీరం. అది ఈ ప్రపంచంలో ఉండేది కొన్ని క్షణాలు మాత్రమే. అలాంటప్పుడు, కాలి కుంటితనం ఉంటే ఏం నష్టం? 
ఎకోణీససె నఊ సన | మహినా నోవ్హేంబర తారీఖ దోన | 
దీక్షితాంసీ తై పుణ్యపావన | సాఈదర్శన ఆరంభీ | ||౧౫౭|| 
157. క్రి. శ. ౧౯౦౯వ సంవత్సరంలో నవంబరు రెండవ తారీఖున, మొదటి సారి దీక్షితుకు పుణ్య పావనమైన సాయి దర్శనం కలిగింది. 
మగ తే పుఢే త్యాచవర్షీ | పునశ్చ గేలె డిసెంబర మాసీ | 
శిరడీస శ్రీచ్యా పునర్దర్శనాసీ | వ్హావే రహివాసీ మన ఝాలే | ||౧౫౮|| 
158. అదే సంవత్సరం డిసెంబరు నెలలో శ్రీవారిని మరల దర్శించటానికి శిరిడీ వెళ్ళాడు. అప్పుడు, శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనే కోరిక అతని మనసులో కలిగింది. 
కాఢావే పంచవీస శేఅర | బాంధావే ఎక పత్ర్యాచే ఛప్పర | 
యాత్రేకరూంస హీ సోఈస్కర | ప్రథమ విచార హా స్ఫురలా | ||౧౫౯|| 
159. ఇరవై ఐదు షేర్లను అమ్మి, అక్కడ రేకుల షేడ్డును కట్టించాలని అతనికి మునుపు అనిపించింది. దానివలన వచ్చిపోయే యాత్రికులకు కూడా సదుపాయంగా ఉంటుందని అనుకున్నాడు. 
పుఢే బాంధావా ఎక వాడా | ఏసా జాహలా మనాచా ధడా | 
పుఢీల వర్షీచ ముహూర్త మెఢా | నిక్షేప దగడాసీ పాయాచ్యా | ||౧౬౦||
160. కాని తరువాత, ఒక వాడాను కట్టించటానికి నిశ్చయించుకున్నాడు. తరువాతి సంవత్సరంలోనే ఒక మంచి ముహూర్తాన రాళ్ళ పునాదితో పని మొదలైంది. 

నఊ డిసెంబర తో దిన | బాబాంచే ఘేతలే అనుమోదన | 
తోచ సుముహూర్త మానూన | పాయాబంధన సారిలే | ||౧౬౧|| 
161. డిసెంబరు తొమ్మిదవ తారీఖున, బాబా అనుమతిని పొంది, అదే మంచి ముహూర్తమని, పునాది పని మొదలు పెట్టారు.
బోలావూన హీ యేణార నవ్హే | తె దీక్షితాంచే బంధూహీ తెథే | 
తే దివశీ త్యాచ ముహూర్తే | ఆలేహీ హోతె ఆధీంచ | ||౧౬౨|| 
162. పిలిచినా రాని, దీక్షితుని సోదరుడు కూడా ముందుగానే వచ్చి, ఆ ముహూర్తానికి అక్కడే ఉన్నాడు. 
శ్రీయుత దాదాసాహేబ ఖాపర్డే | పూర్వీచ ఆలే హోతే సడే | 
పరవానగీ5 మాగతా బాబాంకడే | కోణ సాంకడే తయాంలా | ||౧౬౩|| 
163. శ్రీ దాదాసాహేబు ఖాపర్డే అంతకు ముందునుంచే అక్కడ ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళటానికి బాబా అనుమతి దొరకటం కొంచెం కష్టమైంది. 
పరీ ఖాపర్డ్యాతే ఘరీ జావయా | దీక్షితాంతే పాయా ఘాలావయా | 
జాహల్యా యా ఆజ్ఞా ఉభయా | దహా డిసెంబర యా దినీ | ||౧౬౪|| 
164. డిసెంబరు పదవ తారీఖున, ఖాపర్డేకు ఇంటికి వెళ్ళటానికీ, దీక్షితు వాడాకు పునాది వేయటానికీ, బాబా ఆజ్ఞ అయింది.
ఆణఖీ యా దివసాచీ మహతీ | చావడీచీ జీ శేజారతీ | 
తీహీ యాచ దివసాపాసూన కరతీ | పరమ భక్తి ప్రీతీయుత | ||౧౬౫|| 
165. ఈ రోజు ఇంకొక కారణంగానూ చాలా గొప్ప దినము. ఈ రోజునుంచే పరమ భక్తి శ్రద్ధలతో, చావడిలో శేజారతి మొదలైంది. 
పుఢే సన ఎకూణీసశే అకరా | రామనవమీచా ముహూర్త బరా | 
సాధూని గృహ ప్రవేశ సంస్కారా | విధిపురఃసర సారిలే | ||౧౬౬|| 
166. తరువాత, క్రి. శ. ౧౯౧౧వ సంవత్సరం శ్రీరామనవమి సుముహూర్తాన గృహప్రవేశ శుభకార్యం, విధి పూర్వకంగా జరిగింది. 
పుఢే శ్రీమంత బుట్టీంచా ఇమలా | అలోట పైకా ఖర్చీ ఘతలా | 
దేహహీ బాబాంచా తేథ విసవలా | పైకా లాగలా సార్థకీ | ||౧౬౭|| 
167. ఇంకా కొంత కాలం తరువాత, శ్రీమంతుడైన బుట్టీ చాలా డబ్బు ఖర్చుపెట్టి, ఒక వాడను కట్టించాడు. మహాసమాధి తరువాత, బాబా దేహం అక్కడ విశ్రమించడం వలన, అతను ఖర్చుపెట్టిన డబ్బు సార్థకమైంది. 
వాడే ఝాలే తీన ఆతా | జేథే పూర్వీ ఎకహీ నవ్హతా | 
ఆరంభీ సాఠ్యాంచే వాడ్యాచీ ఉపయుక్తతా | ఫారచి సమస్తా జాహలీ | ||౧౬౮|| 
168. మునుపు ఒక్కటైనా లేని శిరిడీలో, ఈ రకంగా మూడు వాడాలు తయారయ్యాయి. మునుపటి రోజులలో సాఠే వాడాయే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండేది. 
ఆణిక ఎక యా వాడ్యాచీ మహతీ | ఆరంభీ యాచ స్థానావరతీ | 
ఫులఝాడాంచీ బాగ హోతీ | నిర్మిలీ నిజ హస్తీ బాబాంనీ | ||౧౬౯|| 
169. ఈ సాఠే వాడాకు మరొక ఘనత ఉంది. ఈ స్థలంలోనే మొదట బాబా స్వయంగా తమ చేతులతో పెంచిన పూలతోట ఉండేది. 
బాగేచీ యా అల్ప కథా | పుఢీల అధ్యాయీ యేఈల వర్ణితా | 
హేమాడ సాఈచరణీ మాథా | ఠేవి శ్రోతా సమవేత | ||౧౭౦||
170. ఈ తోటను గూర్చిన చిన్న కథను వచ్చే అధ్యాయంలో వర్ణిస్తాను. శ్రోతల సమేతంగా హేమాడు సాయి పాదాలయందు తలను ఉంచుతున్నాడు. 

వామన తాత్యా ఘడే పురవీత | సాఈ సమర్థ పాణీ శింపత | 
ఉఖర జాగీ బాగ ఉఠవీత | పుఢే తే గుప్త జాహలే | ||౧౭౧|| 
171. బంజరు భూమిలో సాయి సమర్థులు మొక్కలు నాటి, వామన తాత్యా (కుమ్మరి) ఇచ్చిన కుండలతో నీరు పెట్టి, తోటను పెంచారు. తరువాత ఒక రోజు, బాబా ఎవరికీ కనిపించకుండా మాయమైనారు.
పుఢే ఔరంగబాదేపాశీ | చాంద పాటీల భేటలే త్యాంసీ | 
లగ్నాచియా వర్హాడాసీ | ఆలే శిరడీసీ మాగుతె | ||౧౭౨|| 
172. ఆ తరువాత, ఔరంగాబాదు దగ్గర వారికి చాందుపాటీలు కలిశాడు. అతని ఇంటి పెళ్ళివారితో, బాబా మరల శిరిడీకి వచ్చారు. 
పుఢే దేవీదాసాచీ భేట | పడలీ జానకీదాసాచీ గాంఠ | 
గంగాగీరాంచీ దృష్టాదృష్ట | మిళాలే త్రికూట శిరడీంత | ||౧౭౩|| 
173. అక్కడ దేవీదాసును కలుసుకోవటం, జానకీదాసుతో స్నేహం, గంగాగీరును చూడటం జరిగింది. ఈ ముగ్గురూ శిరిడీలో కలిశారు. 
మోహిద్దీనా సవే కుస్తీ | తెథూన మగ మశిదీ వస్తీ | 
జడలీ డేంగళ్యా లాగీ ప్రీతీ | భక్త భోవతీ మిళాలే | ||౧౭౪|| 
174. మోహిద్దీనుతో కుస్తీ పట్టటం జరిగింది. దాని తరువాత బాబా మసీదులో ఉండసాగారు. వారికి డేంగలేపై ప్రీతి కలగటం, బాబా వద్ద భక్తులు గుమిగూడటం; 
యా సర్వ కథా వార్తాంచే కథన | హోఈల పుఢీల అధ్యాయీ శ్రవణ | 
ఆతా హేమాడ సాఈసీ శరణ | ఘాలీత లోటాంగణ అనన్య | ||౧౭౫||
175. మొదలైన కథలను తరువాత అధ్యాయంలో వినండి. ఇప్పుడు హేమాడు సాయికి మనసు పూర్వకంగా శరణుజొచ్చి, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 

| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | సాఈ సమర్థావతరణం నామ | 

| చతుర్థోధ్యాయః సంపూర్ణః | 



||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||  

 

టిపణీ: 
1. ఖర్యా శ్రద్ధేనే. 
2. నవస కరతాత. 
3. మూర్తిమంత. 
4. తవ+ఓక్స్ (ఘరా) = తుఝ్యా ఘరాలా. 
 5. ఘరీ జావయాస బాబాంచీ ఆజ్ఞా. 
*. అధ్యాయ ౪, ఓవీ క్ర. ౩౩ మధ్యే శిరడీ 'కోపరగాంవ' తాలుక్యాభీతరీ అసా ఉల్లేఖ ఆహే. శిరడీచ్యా సధ్యాచ్యా తాలుక్యాచే నావ 'రాహాతా' అసే ఆహే.