Monday, December 3, 2012

||సాఈసమర్థావతరణం నామ అష్టమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత 
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౮ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

మాగీల అధ్యాయీ జాహలే కథన | కైసే సాఈ హిందూ వా యవన | 
కాయ త్యా శిరడీచే భాగ్య గహన | జే నిజ స్థాన బాబాంచే | ||౧|| 
1. ఇంతకు మునుపటి అధ్యాయంలో, సాయి హిందువా లేక ముస్లిమా అన్నదానని గురించి, బాబా ఉన్న శిరిడీ గ్రామంయొక్క మహాభాగ్యం గురించి చెప్పబడింది.
కైసే బాబా ఆరంభీ పోర | పుఢే జాహలే వేడే ఫకీర | 
కైసీ బనవిలీ బాగ సుందర | మూళచ్యా ఉఖర స్థళాచీ | ||౨|| 
2. ఎలా బాబా మొదట పసివానిగా రావటం, తరువాత పిచ్చి ఫకీరుగా మారటం, బంజరు భూమిలో అందమైన తోటను నిర్మించడం, 
కైసా కాలే కరూన పుఢా | త్యాచి జాగేవర జాహలా వాడా | 
ధోతీ పోతీ ఖండయోగ గాఢా | వర్ణిలా నిఘడా బాబాంచా | ||౩|| 
3. కొంత కాలం గడిచిన తరువాత, అదే చోటులో పెద్ద భవనం తయారవటం, బాబాయొక్క ధౌతి-పోతి, ఖండయోగ ప్రక్రియల గురించి, వర్ణించడమైనది. 
ఝిజవూనియా నిజకాయ | బాబాంనీ సాహిలే కైసే అపాయ | 
భక్త కైవారీ సాఈరాయ | వర్ణూ మీ కాయ తయాతే | ||౪|| 
4. భక్తులను కాపాడే సాయినాథుడుగా, వారి బాధలన్నీ తనపై తీసుకుని, తామే బాధ భరించటం, ఇలాంటి బాబాను నేను ఏమని వర్ణించను? 
ఆతా ఏకా నరజన్మాచే మహిమాన | సాఈంచ్యా భైక్ష్యవృత్తీచే వర్ణన | 
బాయజాబాఈంచే సంతసేవన | బాబాంచే భోజన కౌతుక | ||౫|| 
5. మానవ జన్మ గొప్పతనము, బాబా భిక్షాటనం, బాయజాబాయి సాధు సేవ, ఆశ్చర్య పరిచే బాబా భోజన పద్ధతి గురించి, ఇప్పుడు వినండి. 
తాత్యా బాబా మ్హాళసాపతీ | తిఘే కైసే మశిదీ నిజతీ | 
కైసే ఖుశాలచందాచే గృహా జాతీ | రాహాత్యాప్రతీ సమర్థ | ||౬||
6. అలాగే, తాత్యా, మహల్సాపతితో బాబా మసీదులో ఎలా పడుకునేవారు, రాహాతాలో ఉన్న ఖుశాలచందు ఇంటికి సాయి సమర్థులు ఎలా వెళ్ళేవారు మొదలైన సంగతుల గురించి వినండి. 
ప్రత్యహీ ఉదయ ప్రత్యహీ అస్త | వర్షానువర్ష జాహలీ ఫస్త | 
అర్ధా జన్మ నిద్రితావస్థ | ఉరలా హీ స్వస్థ భోగవేనా | ||౭|| 
7. ప్రతి రోజూ తెల్లవారుతుంది, తరువాత రాత్రి అవుతుంది. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచి పోతాయి. బ్రతికి ఉన్న కాలంలో సగం నిద్రలో గడుస్తుంది. మిగిలిన సగం జీవితం కూడా ఏ సుఖం, శాంతి లేకుండా గడిచిపోతుంది. 
బాళపణీ క్రీడాసక్త | తరూణపణీ తరూణీరక్త | 
వృద్ధాపకాళీ జరాగ్రస్త | సదైవ శ్రస్త ఆధీనీ | ||౮|| 
8. చిన్నప్పుడు ఆటల్లో ఆసక్తి, యవ్వనం రాగానే యువతుల మీద, ముసలితనం వచ్చిందంటే ఇక ఎప్పుడూ రోగాలు, బాధలతో పీడించబడుతూ ఉంటాము. 
జన్మాస యేఉనీ పుష్ట హోణే | శ్వాసోచ్ఛ్వాస కరీత రాహణే | 
దీర్ఘాయుష్య వరీ వాచణే | హే కాయ కేణే యా జన్మీ | ||౯|| 
9. పుట్టటం, బాగా తిని పుష్టిగా పెరగటం, గాలిని పీలుస్తూ, వదులుతూ ఎన్నో ఏళ్ళు బ్రతకటం, జీవితానికి ఇదేనా అర్థం? 
పరమాత్మప్రాప్తి హేచి సాచీ | ఇతికర్తవ్యతా నరజన్మాచీ | 
నా తరీ శ్వాన సూకరాదికాంచీ | జీవికాచి కాయ ఉణీ | ||౧౦||
10. పరమార్థాన్ని పొందడమే మనిషి జన్మయొక్క లక్ష్యం. ఇదే నిజం. లేకుంటే, కుక్కలు, పందులు మొదలైన వాటి జన్మలలో ఏమి తక్కువైంది? 

శ్వానేహీ ఆపులీ పోటే భరతీ | ప్రజోత్పాదన యథేష్ట కరితీ | 
తెథే నరదేహాచీచ కాయ మహతీ | సామ్య స్థితీ ఉభయతా జై | ||౧౧|| 
11. కుక్కలు కూడా తమ పొట్టలు నింపుకుంటాయి. ఇష్టం వచ్చినట్లు పిల్లలను కూడా పుట్టిస్తాయి. మనిషి కూడా ఇవే పనులు చేస్తే, ఇంక మనిషికి ఉన్న గొప్పతనమేమిటి? 
పిండపోషణ ఆణి మైథున | హేంచ జరీ నరదేహాచే సాధన | 
హేంచ జరీ యా జన్మాంచే పర్యవసాన | తరీ తో నరజన్మ నిరర్థ | ||౧౨|| 
12. దేహం పెంచడం, సంభోగించటం ఇవే మనిషి దేహంతో చేసే పనులైతే, ఇవే మానవ జీవితానికి లక్ష్యం అయితే, ఈ మనిషి బ్రతుకు నిజంగా దండుగ! 
ఆహార నిద్రాది చతుష్టయ | యాంతచి హోతా ఆయుష్య క్షయ | 
మగ శ్వానాం మానవా భేద కాయ | కరా నిర్ణయ వివేకే | ||౧౩|| 
13. ఆహారం, నిద్ర, భయం, సంభోగించడం, ఈ నాలుగింటితోనే బ్రతుకు ముగిసిపోతే, ఇక కుక్కలకు మనిషికీ తేడా ఏముంది? మీరే ఆలోచించి, నిర్ణయించుకోండి. 
హీచ జరీ నరదేహసఫలతా | తరూ జన్మీ కాయ న్యూనతా | 
భస్త్రాహీ1 కరీ శ్వాసోఛ్వాసతా | శరీర పుష్టతా శ్వానాంహీ | ||౧౪|| 
14. మనిషి దేహానికి ఇదే అర్థమైతే, మానుగా పుట్టితే మాత్రం లోటేమిటి? కొలిమి తిత్తి కూడా గాలిని పీల్చి, వదులుతూ ఉంటుంది. కుక్కలు కూడా తిని పుష్టిగా పెరుగుతాయి. 
మనుష్య ప్రాణీ ముక్త ఆహే | తో నిర్భయ తో స్వతంత్ర పాహే | 
తో శాశ్వత హీ జాణీవ రాహే | సఫలతా హే జన్మాచీ | ||౧౫|| 
15. కాని, మనిషి ముక్తుడు. భయం లేనివాడు. స్వతంత్రుడు మరియు ఎప్పటికీ ఉండేవాడు అని తెలుసుకోవటమే ఈ మనిషి జన్మకు అర్థం. 
ఆలా కోఠూని ఆహే కోణ | నరజన్మాచే కాయ కారణ | 
ఎథీల బీజ జాణే తో ప్రవీణ | త్యావీణ శీణ మగ సారా | ||౧౬|| 
16. నేనెవరు? ఎక్కణ్ణుంచి వచ్చాను? నాకు ఈ మనిషి జన్మ ఎందుకు వచ్చింది? అనే ఈ రహస్యాలను తెలుసుకున్న వారే వివేకవంతులు. తెలుసుకోకపోతే, ఈ జన్మ దండుగ. 
జైసీ నందాదీపాచీ జ్యోతీ | ఎకచి దిసే ఆదిఅంతీ | 
పరీ వేగళీ క్షణాక్షణాప్రతీ | తైశీచ స్థితి దేహాచీ | ||౧౭|| 
17. నందాదీపంయొక్క జ్యోతి మొదటినుంచి చివరిదాకా ఒకేలా ఉంటున్నట్లు అనిపిస్తుంది. కాని, అది ప్రతి క్షణానికీ వేరు వేరుగా మారుతుంటుంది. మన దేహం కూడా అంతే. 
బాల్య తారూణ్య వార్ధక్యావస్థా | యా తో ప్రకట జనా సమస్తా | 
పరీ జాతీ యేతీ జాతీ స్వభావతః2 | కోణా న కళతా కదాంహీ | ||౧౮|| 
18. బాల్యం, యవ్వనం, ముసలితనం ఇవి అందరికీ వస్తాయి. కాని, అవి ఎలా వచ్చి ఎలా పోతాయి అనేది ఎవరికీ తెలియకుండానే జరిగిపోతాయి. 
దిసే తీచ తత్క్షణీ నాసే | అపరిమిత తరీ ఎకచి భాసే | 
తైసాచి దేహ జో యా క్షణీ అసే | క్షణాంతీ నసే పూర్వీల | ||౧౯|| 
19. చూస్తూ ఉండగానే, కళ్ళకు కనిపించేది వెంటనే నశించి పోతుంది. ప్రతి క్షణం మారుతున్నా, ఒకటిగానే అనిపిస్తుంది. మన శరీరం కూడా ఈ క్షణంలో ఉన్నట్లు వచ్చే క్షణంలో ఉండదు. 
దేహ మళమూత్రాచీ న్హాణీ | శ్లేష్మ పూయలాళీచీ ఘాణీ | 
మరణ ఠేవిలే క్షణోక్షణీ | కులక్షణీ మోఠా హా | ||౨౦||
20. మలమూత్రాలు, శ్లేష్మం, చీము రక్తాల మురికి కాలువ ఈ దేహం. చావు దీనిని ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటుంది. చాలా చెడు లక్షణాలు గలది ఈ దేహం. 

జే హె క్రిమీకీటకాంచే ఘర | నానా రోగాంచే ఆగర | 
అశ్వత్థ3 ఆణి క్షణభంగుర | తే హే శరీర మానవీ | ||౨౧|| 
21. మనిషి దేహం క్రిమి కీటకాలకు వాస స్థానం. అనేక రోగాలకు ఇల్లు. నిలకడ లేనిది మరియు ఎప్పుడైనా నాశనం అయేది.
మాంస శోణిత స్నాయూచా గాడా | తో హా అస్థి చర్మాచా సాంగాడా | 
మూత్ర పురీష దుర్గంధీచా రాడా | జీవాచా ఖోడా ప్రత్యక్ష | ||౨౨|| 
22. రక్త మాంసాలు, నరాలతో ఉన్న ఓ వాహనం ఇది. ఎముకలు, చర్మాలతో కూడిన ఒక ఆకారం. మలమూత్రాల చెడు వాసనల గొయ్యి. ఎప్పటికీ ఇది జీవుణ్ణి అడ్డగించేది. 
త్వాచా మాంస రూధిర స్నాయూ | మేద మజ్జా అస్థివాయూ | 
అమంగల అంగే ఉపస్థ పాయూ | తే అల్పాయూ హే కాయా | ||౨౩|| 
23. రక్త మాంసాలు, చర్మం, నరాలు, కొవ్వు, మజ్జ, ఎముకలు, గాలి మరియు మలమూత్రాలు విసర్జించే అంగాంగాలు కల ఈ దేహం ఆయువు కూడా చాలా తక్కువది. 
ఏసా అమంగల ఆణి నశ్వర | నరదేహ జరీ క్షణభంగూర | 
తరీ మంగలధామ శ్రీపరమేశ్వర | హాతీ యేణార ఎణేంచ | ||౨౪|| 
24. ఇలాంటి మంగళకరం కానిది, ఎప్పటికైనా నశించేది, నిలకడ లేనిది అయినా, మంగళకరుడైన పరమేశ్వరుణ్ణి పొందాలంటే, ఈ దేహం వలనే జరుగుతుంది. 
సదైవ లాగలే జన్మ మరణ | కల్పనేచేంచ భయ దారూణ | 
నాహీ లాగతా కానాలా కాన | ప్రాణ హా నిఘూన జాఈల | ||౨౫|| 
25. చావు పుట్టుకలు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. తలుచుకున్నంత మాత్రమే విపరీతమైన భయాన్ని కలుగ చేస్తాయి. ప్రాణం పోయేటప్పుడు, అకస్మాత్తుగానే పోతుంది. 
కోణ లక్షీ దివసరాతీ | కితీ యేతీ ఆణిక జాతీ | 
మార్కండేయాచ్యా ఆయుష్యే జన్మతీ | తయాంహీ కాలగతి చుకేనా | ||౨౬|| 
26. పగలు రాత్రి ఎంత మంది వస్తున్నారో, మరి ఎంత మంది పోతున్నారో, ఎవరు గమనిస్తారు? మార్కండేయుని వలె కొంత మంది పూర్తి ఆయువుతో పుట్టినా, వారికి కూడా కాలగతి తప్పదు. 
ఏశియా క్షణభంగుర నరదేహీ | పుణ్యశ్లోక కథావార్తాహీ | 
గేలేలా కాళచి పడేల సంగ్రహీ | తద్విరహిత తో వ్యర్థ | ||౨౭|| 
27. నిలకడలేని ఇటువంటి మనిషి దేహంతో, పుణ్యం తెచ్చి పెట్టే శ్లోకాలు, కథా వార్తలూ విన్న సమయమే అర్థవంతమవుతుంది. మిగతా సమయమంతా దండుగ. 
హీచ జాణీవ ఝాలియా నిశ్చిత | హేంచి జన్మా ఆల్యాచే హిత | 
పరి హా విశ్వాస నాహీ పటత | అనుభవావ్యతిరిక్త కోణాహీ | ||౨౮|| 
28. ఇది బాగా నమ్మకంగా తెలుసుకోవటమే ఈ మనిషి జన్మకు ప్రయోజనం. కాని, ఇలా నమ్మకం కలగాలంటే, స్వంతంగా అనుభవం కావాలి. లేకుంటే నమ్మకం కుదరదు. 
పరీ యావయా హా అనుభవ | కరూ లాగే అభ్యాస విభవ | 
తరీ శాశ్వత సుఖార్థీ హా జీవ | తేణే హె వైభవ సాధావే | ||౨౯|| 
29. ఈ అనుభవం కావాలంటే, బాగా అభ్యాసం చేయాలి. శాశ్వతమైన ఆనందాన్ని ఆశించే జీవుడు, ఈ వైభవాన్ని అప్పుడే పొందగలడు. 
దారా సుత వైభవ విత్త | పృథ్వీ సముద్రవలయాంకిత | 
ఈశ్వరకృపే ఇతుకేంహీ ప్రాప్త | తరీ తో అతృప్త మానసీ | ||౩౦||
30. దేవుడి దయవలన, మంచి భార్యాబిడ్డలు, సంపద, వైభవం, సముద్రంచే చుట్టబడి ఉన్న భూమి అంతా దొరికినా, మనసులో మటుకు తృప్తి అనేది ఉండదు. 

శాశ్వత సుఖ ఆణి శాంతి | హేంచ ధ్యేయ ఠేవూని చిత్తీ | 
భూతీ భగవంత హే ఎక ఉపాస్తి | పరమ ప్రాప్తిదాయక | ||౩౧|| 
31. ఎప్పటికీ ఉండే సుఖ శాంతులను పొందాలనే లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని, ప్రతి జీవిలోనూ ఉండే ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తే, అప్పుడు ముక్తి, మోక్షం దొరుకుతుంది. 
త్వచా మాంస రూధిర హాడా | జోడూని కేలా హా దేహసాంగాడా | 
పరమార్థాచా ప్రత్యక్ష ఖోడా | మమత్వ సోడా తయాచే | ||౩౨|| 
32. మనిషి దేహం చర్మం, ఎముకలు, రక్తమాంసాలతో తయారయింది. పరమార్థం పొందటానికి ఇది కనిపించే అడ్డు. దీనిపై మమకారాన్ని వదలాలి. 
మానావా తొ కేవళ చాకర | నకా బసవూ త్యా డోక్యావర | 
లాడ న పురవా నిరంతర | నరకద్వార కరూ నకా | ||౩౩|| 
33. ఈ మనిషి దేహాన్ని ఒక సేవకుడని అనుకోండి. దీనిని నెత్తిన కూర్చో పెట్టుకోకండి. అతిగా గారాబం చేసి, అది నరకానికి దారి తీసేలా చేసుకోకండి. 
నిర్వాహా పురే అన్న ఆచ్ఛాదన | తైసేంచ తాత్పురతే లాలన పాలన | 
లావా అధ్యాత్మిక ఉన్నతీ లాగూన | జన్మమరణ చుకవావయా | ||౩౪|| 
34. బ్రతికి ఉండటానికి సరిపడా అన్న వస్త్రాలు, కొద్దిగా ఆలనా పాలనా చేసి, చావు పుట్టుకలనుంచి తప్పించుకోవటానికి, ఆధ్యాత్మిక ప్రగతి కొరకు, ఈ దేహాన్ని వాడుకోండి. 
జన్మమరణాది అనర్థాత్మక | ప్రతిక్షణ వినాశోత్ముఖ | 
కైసే క్షణిక యాచే సుఖ | నిరంతర అసుఖ జో | ||౩౫|| 
35. చావు పుట్టుకలతో కూడి, ప్రతి క్షణం నాశనం వైపు పరుగెడుతూ, ఎప్పటికీ దుఃఖాలను కలిగించేది ఈ దేహం. అది ఇచ్చే సుఖాలు కూడా క్షణికమే. 
జైశీ విద్యులతా పాహీ | ఆతా ఆహే ఆతా నాహీ | 
క్షణిక సాగర తరంగతాహీ | విచార కాంహీ కరావా | ||౩౬|| 
36. ఈ సుఖాలు మెరుపు తీగలవలె ఒక క్షణం ఉండి వెంటనే మాయమై పోతాయి. ఇవి సముద్రంపైని అలల వలె క్షణికమని తెలుసుకోండి. 
దేహగేహాపత్య స్త్రీ జన | హి సర్వ నాశివంత జాణూన | 
మాతా పిత్యాంసీ ఖాందాం వాహూన | స్వయే జో ఉమజేన ఆపణ | ||౩౭|| 
37. ఈ దేహం, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, అంతా నశించేవని మనము తెలుసుకోము. తల్లిదండ్రులను స్వయంగా భుజాల మీద మోసుకొని పోయినా, వారిలాగా, మనమూ వెళ్ళాలనే నిజాన్ని తెలుసుకోము. 
మేల్యా మాగే ఖుశాల మరే | ఫిరే జన్మమరణాచే ఫేరే | 
పరీ తే కోణ్యా గుణే ఆవరే | విచార న కరీ క్షణభరీ | ||౩౮|| 
38. చనిపోయిన వారి తరువాత చావటం, మరల పుట్టటం, అలా చావు పుట్టుకల చక్రంలో చిక్కుకుని తిరగడమే కాని, వీటిని ఏ రకంగా తొలగించు కోవాలి అని ఒక్క క్షణమైనా ఆలోచించము. 
కరితా నిత్య కుటుంబాచీ భర | ఆయుష్య జాతసే భరాభర | 
కాళ ఆయుష్య గణనా తత్పర | కర్తవ్య విసర త్యా నాహీ | ||౩౯|| 
39. ప్రతి నిత్యం, సంసార భారాన్ని మోయటంతో, ఆయువు కూడా వేగంగా గడిచిపోతుంది. కాలం ఎప్పుడూ మన ఆయువును లెక్కపెట్టటంలో నిమగ్నమై ఉంటుంది. అది తన కర్తవ్యాన్ని ఎన్నటికీ మరిచిపోదు. 
భరతా అఖేరచీ ఘడీ | మగతో థాంబేనా ఎకచిపడీ4 | 
ధీవర జైసా జాళే ఓఢీ | మరణీ తడఫడీ జీవ తైసా | ||౪౦||
40. చివరి ఘడియ రాగానే, కాలం ఒక్క క్షణమైనా ఆగదు. జాలరి తన వలను బలంగా లాగినప్పుడు, అందులో చిక్కుకున్న చేపలవలె, చచ్చేటప్పుడు జీవులు గిలగిలా కొట్టుకుంటారు. 

మహద్భాఠగ్యాచియా పరవడీ | వేంచూనియా పుణ్యకోడీ | 
లాధలీ నరదేహాచీ జోడీ | ఘడీనే ఘడీ సాధావీ | ||౪౧|| 
41. మహాభాగ్యం వలన, ఎన్నో జన్మలలో చేసిన మంచి పనుల వలన వచ్చిన పుణ్య ఫలంగా, ఈ మనిషి దేహం దొరికింది. ప్రతి ఘడియా దీనిని మంచి పనులకు వాడుకోండి.
కరూ జాతా భగీరథ యుక్తి | యా నరదేహాచీ నాహీ ప్రాప్తి | 
కేవళ అదృష్టే యే అవచట హాతీ | వ్యర్థచి మాతీంత మిళవా నా | ||౪౨|| 
42. ఎంత భగీరథ ప్రయత్నం చేసినా, ఈ మనిషి దేహం దొరకదు. కేవలం మన అదృష్టం కొద్దీ, అనుకోకుండా దొరికిన ఈ అవకాశాన్ని, మట్టిలో కలిపి దండుగ చేసుకోకండి. 
పుఢీల జన్మీ కరూ మ్హణతా | ఎకదా హా హాతీంచా జాతా | 
పుఢే హాచ యేఈల హీ నిశ్చితతా | ఏసె మానితో తో మూర్ఖ | ||౪౩|| 
43. వచ్చే జన్మలో చేద్దాము అని అనుకోకండి. అలా అనుకున్నవారు మూర్ఖులు. ఎందుకంటే, ఒక సారి చేయి జారిపోయిందా, ఇక అంతే, ఈ అవకాశం మరల తప్పక దొరకుతుందనే నిశ్చయం లేదు. 
కితి ఎక పాపీ దేహవంత | హోఊని శుక్రబీజ సమన్విత | 
యోనిద్వారాస హోతీ ప్రాప్త | శరీర గ్రహణార్థ నిజకర్మే | ||౪౪|| 
44. వారు చేసిన పనుల ప్రభావం వలన, కొందరు పాపులు, శుక్ర బీజాలలో కలిసి, యోని ద్వారా జన్మించే శరీరాలను పొందుతారు. 
కితీఎక తే త్యాహూన అధమ | అసతా జంగమవర్గీ జన్మ | 
మాగుతీ స్థావర భావపరమ | యథాకర్మ ప్రాప్త త్యా | ||౪౫|| 
45. అంతకంటే నీచులు, వారి కర్మ ఫలం ప్రకారం, క్రింది జాతిలో భాగమైన కదిలే వర్గాలలో, కదలిక లేకుండా పుడతారు. 
జేణే జైసే ఉపార్జిలే జ్ఞాన | జయాచే జైసే కర్మానుష్ఠాన | 
తదనుసార తయా శరీర గ్రహణ | శ్రుతిప్రమాణ హా యోగ | ||౪౬||
46. వారి వారి కర్మ ఫలాన్ని బట్టి, వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టి, వారికి శరీరం లభిస్తుందని శ్రుతి కూడా చెబుతుంది. 
'యథాప్రజ్ఞం హి సంభవా'5 | వదే శ్రుతి మాయ అతికణవా | 
జైసా జయాచా విజ్ఞాన ఠేవా | జననహీ జీవా తైసేంచ | ||౪౭|| 
47. ‘యథా ప్రజ్ఞం హీ సంభవాః’ అని శ్రుతి మాత చాలా కరుణతో చెప్పింది. వారి వారి జ్ఞాన సంపదను బట్టి కూడా పుట్టుక ఉంటుంది. 
అతర్క్య ఈశ్వరీ విందాన6 | అశక్య తయాచే సంపూర్ణ జ్ఞాన | 
అంశమాత్రే లాధే జరీ కవణ | ఎక తో ధన్య నరదేహ | ||౪౮|| 
48. ఈశ్వరుడి లీల అర్థం కానిది. దానిని పూర్తిగా తెలుసుకోవటం సాధ్యం కాని పని. ఎవరికైనా కించిత్తైనా అర్థమయితే, వారి జన్మ ధన్యం. 
పరమభాగ్యే హా నరజన్మ | మహత్పుణ్యే బ్రాహ్మణవర్ణ | 
ఈశకృపే సాఈచే చరణ | లాభ హా సంపూర్ణ అలభ్య | ||౪౯|| 
49. పరమ భాగ్యం వలన ఈ మనిషి దేహం లభిస్తుంది. అందులోను, మహాపుణ్యం వలన బ్రాహ్మణ జాతిలో పుట్టటం, పరమేశ్వరుని అనుగ్రహం వలన సాయి పాదాలు దొరకడం, ఇవన్నీ చాలా అరుదుగా దొరికే లాభాలు. 
ఆహేత జరీ నానా యోనీ | మానవచి శ్రేష్ఠ సర్వాహునీ | 
ఆలో కోఠునీ నిర్మిలే కోణీ | వివేక శ్రేణీ మానవీచ | ||౫౦||
50. ఎన్నో రకాల పుట్టుకలున్నా, మనిషి జన్మ అన్నిటికంటే గొప్పది. ‘మనము ఎక్కడనుంచి వచ్చాం?’ ‘మనలను ఎవరు సృష్టించారు?’ అని తెలివిగల మనుషులు మాత్రమే ఆలోచించగలరు. 

ఇతర యోనీ హే న జాణతీ | ఉపజతీ తైశా నాశ పావతీ | 
భూతభావీవర్తమాన గతి | ఈశ్వరస్థితీ నేణతీ | ||౫౧|| 
51. ఇతర యోనులలో జన్మించే ప్రాణులు వీటిని తెలుసుకోలేవు. అవి ఎలా పుడతాయో అలాగే చచ్చిపోతాయి. భూత భవిష్యత్తు వర్తమానాల సంగతి గురించి గాని, ఈశ్వరుని గురించి గాని వాటికి తెలియవు. 
మ్హణోని హా నరదేహ నిర్మూన | ఈశ్వర ఝాలా ఆనంద సంపన్న | 
కీ వివేక వైరాగ్యాతే వరూన | నర మద్భజన కరీల | ||౫౨|| 
52. అందుకే, ఈ మనిషి దేహాన్ని సృష్టించి, వివేక వైరాగ్యాలతో మానవుడు తనను ఆరాధిస్తాడు, అని ఆ పరమేశ్వరుడు ఆనందించాడు. 
వినాశీ నర కరితా సాధన | హోఈల అవినాశీ నారాయణ | 
నరదేహసమ సాధనసంపన్న | దుజా న ఆనయే సుష్టీ | ||౫౩|| 
53. నశించి పోయే ఈ దేహాన్ని కలిగిన మనిషి, సాధనతో నాశం కాని నారాయణుడు కాగలడు. ఈ సృష్టిలో, మనిషి దేహానికి సమానమైన సాధనా సంపద ఇంకొకటి లేదు. 
గారూడీ స్వయే మోఠా చతుర | ఖేళ న కరీ అజ్ఞానియా సమోర | 
జాణే కుశలతేచే వర్మసార | తో ప్రేక్షక సంభార అపేక్షీ | ||౫౪|| 
54. మాయాలవాడు చాలా తెలివివంతుడు. తెలివి లేని వాళ్ళ ముందు తన ఆటలను చూపడు. తన కళా కౌశలంలోని మర్మాలను తెలుసుకోగల ప్రేక్షకుల కోసమే ఎదురు చూస్తుంటాడు. 
తైసాచ పశుపక్షీ వృక్షసంభార | జీవ జంతు నిర్మూన అపార | 
సఖేదాశ్చర్య పరమేశ్వర | లీలా నిఃసార గమలీ త్యా | ||౫౫|| 
55. అలాగే, పశు పక్షులు మొదలగు జీవ జంతువులను, చెట్లు చేమలను, విపరీతంగా సృష్టించిన దేవుడికి, తన లీలకు అర్థం లేదనిపించి, నిరాశతో దుఃఖం కలిగింది. 
అఫాట హా బ్రహ్మాండ విస్తార | చంద్రసూర్య తారా భార | 
నిర్మిత్యాచ్యా కౌతుకాచా విచార | లవ భార కోణీహీ కరీనా | ||౫౬|| 
56. సూర్య చంద్రులు, లెక్కలేనన్ని తారలు, ఎన్నో జీవ జంతువులు నిండిన ఇంతటి విస్తారమైన బ్రహ్మాండాన్ని నిర్మించిన తన అద్భుతమైన కౌశలాన్ని ఎవరూ కొంచెమైనా తెలుసుకోలేదు. 
హా సర్వ ఖేళ కరణ్యా ఆంతు | మాఝా జగదీశాచా కాయ హేతు | 
యే అర్థీంచా నిశ్చయమాతు | ఎకహీ జంతూ జాణేనా | ||౫౭|| 
57. “ఈ సకల లీలలను చేయటంలో జగత్తుకే ఈశ్వరుడైన నా ఉద్దేశం ఏమిటి అని ఖచ్చితంగా ఏ ఒక్క జీవి అయినా తెలుసుకోవటం లేదు. 
మాఝీ అతుల వైభవ సమృద్ధి | జాణీల ఏసా కుశాగ్రబుద్ధి | 
ప్రాణీ నిర్మిలా నాహీంతదవధి | విఫల త్రిశుద్ధి మమ కార్య | ||౫౮|| 
58. “నా ఈ అసమానమైన అపార వైభవాన్ని తెలుసుకో గలిగే సూక్ష్మ బుద్ధి కల ప్రాణిని సృష్టించనంత వరకు నా పని ముమ్మాటికీ నిష్ఫలం”. 
ఏసే జాణూన జగదీశే | నిర్మిలా ప్రాణీ మానవవేషే | 
కీ జో సారాసార బుద్ధివశే | మజ సామర్థ్యే జాణీల | ||౫౯|| 
59. అని అనుకొని జగదీశ్వరుడు – తన శక్తిని, సృష్టిలోని సారాన్నంతా – తన విచక్షణా బుద్ధితో తెలుసుకోగల ప్రాణిని, మనిషి ఆకారంలో సృష్టించాడు. 
అగాధ మాఝే వైభవ | తైశీచ మాఝీ శక్తి అపూర్వ| 
మాఝ్యా మాయేచా హా ఖేళ సర్వ | ఆశ్చర్యపూర్వక తో జాణే | ||౬౦||
60. “అంతులేని నా వైభవాన్ని, అసమానమైన నా శక్తిని, నా మాయా లీల అంతటినీ అతడు ఆశ్చర్య పడుతూ తెలుసుకుంటాడు”. 

తోచ కరీల జ్ఞాన సంపాదన | మచ్చింతన ఆణి మదవలోకన | 
తోచ హోఈల ఆశ్చర్య సంపన్న | హోఈల తై పూర్ణ ఖేళ మాఝా | ||౬౧|| 
61. “అతడే నా గురించి ఆలోచిస్తూ, విచారణ చేస్తూ, ధ్యానం చేసి, ఆశ్చర్యంతో నిండిపోతాడు. అప్పుడు నా లీల సంపూర్ణం అవుతుంది.
ప్రేక్షకాచీ జీ ఆనంద సంపన్నతా | తీచ మజ మాఝే ఖేళాచీ సాంగతా | 
పాహూని మాఝీ జగన్నియంతృతా | నర కృతార్థతా మానీల | ||౬౨|| 
62. “చూసిన వారు ఆనందిస్తేనే, నాయొక్క లీలకు పరిపూర్ణత్వం వస్తుంది. ఈ జగత్తును నేను శాసించే పద్ధతిని చూచి, మనిషి తృప్తి పొందాలి”. 
కామ్యకర్మే ద్రవ్యోపార్జన | ఎతదర్థ న శరీర పోషణ | 
యావజ్జీవ తత్వజ్ఞాన సంపాదన | హేంచ జీవన సాఫల్య | ||౬౩|| 
63. ఈ దేహాన్ని పోషించటం, ఇంద్రియాల కోరికలను తీర్చటానికి కాని, డబ్బును గడించటానికి కాని, కాదు. బ్రతికి ఉన్నంత కాలము, తత్త్వ జ్ఞానాన్ని సంపాదించటమే, దానికి సాఫల్యతనిస్తుంది. 
తత్వ తేంచ జే అభేదజ్ఞాన | తేంచి ఉపనిషద్బ్ర హ్మజ్ఞాన | 
తేంచ పరమాత్మోపాసన | తేంచ తో భగవాన భక్తాంచా | ||౬౪|| 
64. జీవాత్మ, పరమాత్మ, వేరు కాదు అన్న జ్ఞానమే తత్త్వం. దీనినే ఉపనిషత్తులలో బ్రహ్మజ్ఞానమనీ చెప్పబడింది. పరమాత్మను పూజించటం, సేవ చేయటం అనినా ఇదే. భక్తులు భగవంతుడు అనేదీ దీనినే. 
గురూ బ్రహ్మ నవ్హేత దోన | ఝాలే జయా హే అభేద జ్ఞాన | 
హీచ భక్తీ ఘడతా జాణ | మాయా తరణ సుగమ జే | ||౬౫|| 
65. గురువు, బ్రహ్మ వేరు కాదు అని తెలుసుకోవడమే భక్తి. ఈ భక్తితో మాయనుంచి ముక్తి పొందటం చాలా సులభమని తెలుసుకోండి. 
జే శ్రద్ధావంత పురూషయోగ్య | సంపాదితీ జ్ఞాన వైరాగ్య | 
హే ఆత్మతత్వచి నిజభోగ్య | భక్త సభాగ్య తే జాణా | ||౬౬|| 
66. యోగ్యులు, శ్రద్ధ కలిగిన పురుషులు, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని సంపాదించుకుంటారు. ఈ ఆత్మ తత్త్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు. 
స్వస్వరూపాచే జే అభాన | తే అజ్ఞాన నిరసల్యావీణ | 
స్వయే కృతార్థ మానీ జో ఆపణ | ప్రతిబంధ విలక్షణ హా ఎక | ||౬౭|| 
67. ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా కలిగే అజ్ఞానం వలన, ‘నేను సంపూర్ణం’ అనుకుని తృప్తి చెందడం, చెడు లక్షణంగల ఒక ఇబ్బంది. 
జ్ఞాన ఆణి అజ్ఞాన | దోనీ హే వికార అవిద్యాజన్య | 
కాంటియానే కాంటా ఫేడూన | తైసీ ఉడవూన ఘ్యా దోనీ | ||౬౮|| 
68. జ్ఞానం మరియు అజ్ఞానం, ఈ రెండూ సరియైన విద్య లేనందున కలిగిన మానసిక స్థితి. దీనివలన ఎన్నో తప్పులు, వంచనలు పుట్టుకొస్తాయి. ముల్లును ముల్లుతో తీసినట్లు, ఒకటినుంచి ఇంకొకటిని ఏరి పారేయాలి. 
జ్ఞానానే దూర కరా అజ్ఞాన | జ్ఞానాజ్ఞానాతీత హోఊన | 
నిర్మళ స్వస్వరూపావస్థాన | హే ఎక పర్యావసాన నరజన్మా | ||౬౯|| 
69. జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించండి. తరువాత జ్ఞానం, అజ్ఞానం ఈ రెండింటినీ దాటి, శుద్ధమైన ఆత్మ స్వరూపంలో లీనమవడమే ఈ మనిషి జన్మకు లక్ష్యం. 
న కరితా స్నేహాచీ7 రాంగోళీ8 | అజ్ఞాన తమాచీ కోజళీ9 | 
మీ మమ యా వాతీచీ హోళీ | జ్ఞాన న పాజళీ నిజప్రభా | ||౭౦||
70. ఇంద్రియాల కోరికలనే చమురంతా అయిపోయి, అజ్ఞానమనే చీకటి కాలి బూడిద అయ్యేవరకు, ‘నేను, నాది’ అనే వత్తి కాలిపోనంత వరకు, జ్ఞానమనే జ్యోతి తన ప్రభను ప్రకాశింప చేయదు. 

నరదేహగత జే జే కార్య | అసో నివార్య వా అనివార్య | 
హే తో సర్వ బుద్ధికర్తవ్య | నిశ్చయప్రాయ జాణావే | ||౭౧|| 
71. మనిషి దేహానికి సంబంధించిన అన్ని పనులూ, అవి తప్పనిసరి అయినా కాకపోయినా, అవన్నీ బుద్ధి నిర్ణయించినవని తెలుసుకోవాలి. 
నాహీ ఆపణా దుజే కామ | స్వస్థ భోగావే ఏశ్వర్య ఆరామ | 
అథవా చింతావే రామనామ | హోఊ నిష్కామ నిశ్చింత | ||౭౨|| 
72. సుఖంగా ఐశ్వర్యాన్ని, విశ్రాంతినీ అనుభవించటం, లేక రామ నామాన్ని జపించటం - ఈ రెండు తప్ప మనకు మరో పని లేదు. కనుక, ఏ కోరికలూ లేకుండా నిశ్చింతగా ఉండండి. 
శరీరేంద్రియ మన బుద్ధి | యా తో సర్వ ఆత్మ్యాచ్యా ఉపాధీ | 
హ్రహీంచ ఆత్మా భోక్తృత్వ ఆపాదీ | స్వయే అనాది అభోక్తా | ||౭౩|| 
73. దేహం అంగాంగాలు, మనసు, బుద్ధి ఇవన్నీ ఆత్మకు అడ్డంకులు. అందుకే, ఆది అనేది లేనిది, స్వతహాగా ఏమీ అనుభవించనిది అయిన ఆత్మ, కర్మ ఫలాన్ని తనే అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. 
ఆత్మ్యాచే భోక్తృత్వ ఔపాధిక | స్వయే అభోక్తా స్వాభావిక | 
శాస్త్ర న్యాయ అన్వయ వ్యతిరేక | ప్రమాణ దేఖా యే అర్థీ | ||౭౪|| 
74. అలా తన అడ్డంకుల వల్ల ఆత్మ తానే అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆత్మ స్వయంగా ఏదీ అనుభవించక పోవడం అనేది దాని స్వభావం. దీన్ని న్యాయ శాస్త్రము అన్వయ-వ్యతిరేకులతో ప్రమాణాన్ని ఇస్తుంది. 
హే ఎక జాణోని నిజవర్మ | బుద్ధీస సోంపావే ప్రాప్తకర్మ | 
తిచే హాతీ మనాచే ధర్మ | స్వయే నిష్కర్మ వర్తావే | ||౭౫|| 
75. ఈ నిజమైన రహస్యాన్ని తెలుసుకొని, కలిగిన పనులను బుద్ధికి అప్ప చెప్పి, దాని ద్వారా మనసులోని ధర్మాలను చేయిస్తూ, తాను స్వయంగా ఏ పనీ చేయనట్లు నడచుకోవాలి. 
స్వధర్మాచే అనుష్ఠాన | సదైవ ఆత్మానాత్మచింతన | 
హేంచ నరజన్మాచే పర్యవసాన | సమాధాన స్వరూపీ | ||౭౬|| 
76. నీ ధర్మం ప్రకారం, నీవు నడుచుకో. ఎల్లప్పుడూ ఏది ఆత్మ, ఏది ఆత్మ కానిది అన్నది ఆలోచిస్తూ, ఒకటిని ఇంకొకటినుంచి వేరు చేయాలి. ఇలా ఎప్పుడూ ఆత్మ చింతనలో లీనమై పోతే, వచ్చే తృప్తియే జన్మయొక్క అంతిమ లక్ష్యం. 
నాహీ నరదేహాపరీ ఆన | చారీ పురూషార్థ సాధాయా సాధన | 
జో నర అభ్యాస పరాయణ | తో నారాయణ పద పావే | ||౭౭|| 
77. మనిషి జన్మ సాధించాల్సిన నాలుగు పురుషార్థాలను - ధర్మ, అర్థ, కామ మరియు మోక్షం - సాధించటానికి, మనిషి దేహంకంటే వేరే దారి లేదు. ఎవడు సదా దీని గురించే ఆలోచిస్తూ, అభ్యాసం చేస్తాడో ఆ నరుడు నారాయణ పదవిని పొందగలడు. 
మ్హణూన ఝాలే న జో శరీరపతన | ఆత్మజ్ఞానార్థ కరా యత్న | 
నర జన్మాచా ఎకహీ క్షణ | ఉపేక్షూన టాకూ నకా | ||౭౮|| 
78. అందుకే, ఈ శరీరం నాశమైయేంత వరకు, ఆత్మ గురించి జ్ఞానం పొందటానికి ప్రయత్నించండి. ఈ మనిషి జన్మను అలక్ష్యం చేసి, ఒక్క క్షణమైనా దండుగ చేసుకోకండి. 
సముద్రీచే క్షారోదక | మేఘాహాతీ పడతా దేఖ | 
హోతే జైసే గోడ పీయూష | తే సుఖ జడతా గురూపాయీ | ||౭౯|| 
79. సముద్రంలోని ఉప్పు నీరు, మబ్బులలో పడగానే అవి అమృతంలా మధురమైనట్లు, గురువు పాదాలను ఆశ్రయించిన వారి దుఃఖాలన్నీ, సుఖాలుగా మారిపోతాయి. 
ఏశియా నరదేహాచీ సద్గతీ | గురూవినా నకళే కవణ్యాప్రతీ | 
గురూచ జేవ్హా ధరతీల హాతీ | తైంచ ఉద్ధరతీల జడ జీవ | ||౮౦||
80. మనిషి దేహానికి సద్గతి ఎలా కలుగుతుంది అనేది గురువు తప్ప ఇంకెవరికీ తెలియదు. గురువు స్వయంగా తమ దగ్గర చేర్చుకున్నప్పుడు, అప్పటిదాకా జడ పదార్థాల వలె ఉన్న జీవులు ఉద్ధరింప బడతారు. 

మంత్ర తీర్థ దేవ ద్విజ | జ్యోతిర్వేద ఆణి భేషజ | 
తైసేచ సాతవే గురూరాజ | భావ నా కాజ యా అవఘియా | ||౮౧|| 
81. మంత్రం, తీర్థ క్షేత్రాలు, బ్రాహ్మణుడు, జ్యోతిష్కుడు, మరియు వైద్యుడు - వీరి లాగే ఏడవ వారైన గురు మహారాజు, వీరందరి మీద భక్తి, నమ్మకం ఉంటేనే, వారినుండి మనకు ప్రయోజనం కలదు.
యయాంచ్యా ఠాయీ జైశీ భావనా | సిద్ధీహీ తైశీచ త్యాప్రమాణా | 
వేగ జైసా అధిక ఉణా | సిద్ధీహీ జాణా తైశీచ | ||౮౨|| 
82. వీరియందు ఏ ప్రమాణంలో ఎంతటి భక్తిభావం, నమ్మకం ఉంటే అంతే ప్రమాణంలోనే మనకు ప్రయోజనం కలదు. భక్తి తీవ్రత ఎంత ఎక్కువగానో, తక్కువగానో ఉంటే, ప్రయోజనం కూడా అట్లే అని తెలుసుకోండి. 
బద్ధాస కరితీ ముముక్షూసంత | ముముక్షూచా కరితీ ముక్త | 
అవ్యక్తాచే హోఊన వ్యక్త | పరోపకారార్థ హే కరితీ | ||౮౩|| 
83. సత్పురుషులు సంసారంలో బంది అయిన వాళ్ళను, పరమాత్మ గురించి ఆలోచించే ముముక్షువులుగాను, అలాంటి ముముక్షువులను ముక్తులుగాను మార్చుతారు. దీనికోసం వారు కనిపించని అవ్యక్తంలోంచి బయటకు వచ్చి, కనిపించే రూపం దాల్చుతారు. ఇదంతా పరోపకారం కోసమే. 
కార్య నవ్హే జే వ్యాఖ్యానే పురాణే | సుకర హోఈ తే సత్పురూషా చరణే | 
తయాచే హాలణే బోలణే చాలణే | ఉపదేశణే నిఃశబ్ద | ||౮౪|| 
84. వేదాలపై చేసిన వ్యాఖ్యలు, ప్రవచనాలు, పురాణాలు ఇవేవీ చేయలేని పనులు, సత్పురుషుల నడవడి, వారు మౌనంగానే చేసే ఉపదేశాల ద్వారా సులభమవుతాయి. 
క్షమా శాంతి నిఃసంగతా | భూతదయా పరోపకారతా | 
ఇందియనిగ్రహ నిరహంకారతా | యాంచా ఆచరతా దుర్లభ | ||౮౫|| 
85. క్షమ, శాంతి, ఏకాంతం, జీవుల మీద దయ, పరోపకారం, ఇంద్రియాలపై పట్టు ఉన్నవారు, అహంకారం అసలు లేనివారు, ఇలాంటి గుణాలున్న వారు దొరకడం సాధ్యం కానిది. 
జే న లాభే పఢతా గ్రంథ | సులభతే పహాతా ఎక క్రియావంత | 
కరీ జే న తారాంగణ అనంత | సంపాదీ భాస్వత ఎకలా | |౮౬|| 
86. పుస్తకాలను పఠించడం వలన రాని మంచి గుణాలు, ఆ గుణాలను ఆచరించేవారిని చూస్తే సులభంగా లభిస్తాయి. లెక్కలేనన్ని తారలు ఇవ్వలేని వెలుగును ఒక్క సూర్యుడే ఇవ్వగలుగుతాడు. 
తైసేచ హే ఉదార సంత | సహజ క్రియా త్యాంచ్యా అనంత | 
కరితీ జీవాంస బంధముక్త | సౌఖ్య అత్యంత దేతాత | ||౮౭|| 
87. సత్పురుషుల మంచితనం కూడా అలాంటిదే! స్వాభావికమైన తమ ఆచరణ ద్వారా అనేక జీవులను సంసార బంధాలనుంచి ముక్తులను చేసి, గొప్ప ఆనందాన్ని ప్రసాదిస్తారు. 
యాంతీలచి ఎక సాఈమహంత | ఏశ్వర్యవంత శ్రీమంత | 
పరీ ఫకీరాసమ ఆచరిత | ఆత్మనిరత సర్వదా | ||౮౮|| 
88. సాయి మహాత్ములు ఈ కోవకు చెందినవారే. వారు పరమార్థంతో నిండిన ఐశ్వర్యవంతులు, గొప్ప శ్రీమంతులు; అయినా, ఫకీరుని వలె నడుచుకునేవారు. ఎల్లప్పుడూ ఆత్మ చింతనలో మునిగి ఉన్నవారు. 
అనవచ్ఛిన్న జయాచీ సమతా | మీ మాఝే హీ నాహీ వార్తా | 
జీవమాత్రీ సదా సదయతా | భూతీ భగవంతతా మూర్తిమంత | ||౮౯|| 
89. అన్ని ప్రాణులనూ వారు ఒకే సమంగా చూచేవారు. ‘నేను, నాది’ అన్న మాట వారికి రాదు. అన్ని ప్రాణులను దయతో చూచేవారు, అన్ని జీవులలోనూ దేవుణ్ణి చూసేవారు. 
సౌఖ్యే జయాసీ నాహీ హరిఖ | దుఃఖే జయాసీ నాహీ శోక | 
సరిసే జయా రావరంక | హే కాయ కౌతుక సామాన్య | ||౯౦||
90. సుఖాలతో వారికి ఆనందం లేదు, దుఃఖాలలో శోకమూ లేదు. రాజును, పేదను సమానంగా చూడటం సామాన్యమైన సంగతా? 

జయాచీ భ్రూవిక్షేపలహరీ | క్షణాంత రంకాచా రావ కరీ | 
తో హా ఘేఊని చౌపాలవీ కరీ | దారోదారీ హిండతసే | ||౯౧|| 
91. తలుచుకున్న వెంటనే నిరుపేదను మహారాజుగా మార్చగల సాయి, భుజం మీద జోలి వేసుకుని, గడప గడపకు భిక్షాటన చేస్తూ తిరిగేవారు. 
ధన్య తే జన జయాంచే ద్వారీ | బాబా హోఊని భిక్షేకరీ | 
పోరీ ఆణగే చతకుర భాకరీ | మ్హణూని పసరీ నిజకర | ||౯౨|| 
92. బిచ్చగానివలె “అమ్మాయి! రొట్టెముక్క తెచ్చిపెట్టు” అని ఎవరింటికి బాబా వెళ్ళి చేయి చాపేవారో, వారు ధన్యులు. 
ఘేఈ టమరేల ఎకే కరీ | దుజియా హాతీ చౌపదరీ | 
స్వయే ఫిరే దారోదారీ | నియమిత ఘరీ ప్రతిదినీ | ||౯౩|| 
93. భుజం మీద జోలి తగిలించుకొని, చేతిలో ఒక రేకు డబ్బాతో, ప్రతి రోజూ నియమ ప్రకారం కొన్ని ఇళ్ళకు భిక్ష కోసం, సాయి వెళ్ళేవారు. 
భాజీ సాంబారే దూధ తాక | పదార్థ తితుకే సకళిక | 
టమరేలాంత ఓతితీ లోక | పహా హె కవతీక ఖాణ్యాచే | ||౯౪|| 
94. కూర, సాంబారు, పాలు, మజ్జిగ వంటి పలచని పదార్థాలను జనులు రేకు డబ్బాలో పోసేవారు. సాయియొక్క అసాధారణ భోజన పద్ధతిని గమనించండి. 
శిజలా భాత అథవా భాకరీ | ఘ్యావయా పసరలీ చౌపదరీ | 
పాతళ పదార్థ మగ కైసీహీపరీ | టమరేలా భీతరీ రిచవితీ | ||౯౫|| 
95. గట్టి పదార్థాలైన అన్నమును, రొట్టెను, జోలిలో వేయించుకునేవారు. పలచని పదార్థాలను రేకు డబ్బాలో వేయించుకునేవారు. 
పదార్థా పదార్థీచీ చవీ ఘ్యావయా | లాలసా కోఠూన వ్హావీ | 
రసాసక్తి జివ్హే న ఠావీ | జీవీ ఉఠావీ కైసేనీ | ||౯౬|| 
96. నాలుకకు రుచులను అనుభవించాలన్న ఆశ ఎలాగూ లేదు. అలాంటప్పుడు, మనసులో వేరు వేరు పదార్థాల రుచులను తెలుసుకోవాలన్న కోరిక ఎందుకుంటుంది? 
ఝోళీంత పడలే జే యదృచ్ఛేనే | తృప్త అసావే తయాచ్యాచ సేవనే | 
రూచకర కీ బేచవ హే నేణే | చవీచ రసనే నాహీ కీ | ||౯౭|| 
97. తమ జోలిలో పడిన వానిని తిని తృప్తి పడేవారు. ఏది రుచిగా ఉంది, ఏది రుచిగా లేదు అని వారి నాలుకకు తెలియదు. 
ప్రహర దివసా వస్తీ లాగునీ | భిక్షా మాగత ప్రతిదినీ | 
తేణే ఉదర పూర్తి కరూనీ | సమాధానీ వర్తత | ||౯౮|| 
98. ప్రతి రోజూ వారు భిక్ష కోసం, ఊళ్ళోకి వెళ్ళేవారు. దానితో కడుపు నింపుకుని తృప్తి పొందేవారు. 
భిక్షాతరీ కాయ నియమిత | ఇచ్ఛేస యేఈల తెవ్హా మాగత | 
కధీ బారా వేళ ఎకా దివసాంత | భిక్షేస జాత గాంవాంత | ||౯౯|| 
99. అదీ ఒక పద్ధతి ప్రకారమా? కానే కాదు. వెళ్ళాలని అనిపించినప్పుడు వెళ్ళేవారు. ఒక్కొకప్పుడు ఒకే రోజు పన్నెండు మారులు భిక్షకు ఊళ్ళోకి వెళ్ళేవారు. 
ఎణేపరీ జే అన్న ఆణీత | మశీదీంతీల కుండీత ఠేవీత | 
కావళే కుత్రే త్యాంతచి ఖాత | కధీ న హాంకీత తయాంనా | ||౧౦౦||
100. ఇలా తెచ్చిన అన్నాన్ని, మసీదులోని ఒక మట్టి పాత్రలో ఉంచేవారు. కాకులు, కుక్కలు అందులోనే తింటున్నా, ఎప్పుడూ వానిని తరిమే వారు కాదు. 

మశీద ఆంగణ ఝాడణారీ | త్యాంతూన దహాబారా భాకరీ | 
ఘేఊన జాఈ ఆపులే ఘరీ | కోణీ న వారీ తిజలాగీ | ||౧౦౧|| 
101. మసీదును, దాని ముంగిలిని చిమ్మే స్త్రీ కూడా పది, పన్నెండు రొట్టెలను తనింటికి తీసుకు వెళ్ళేది. ఆమెను ఎప్పుడూ ఎవరూ వారించలేదు.
కుత్ర్యా మాంజరా హడహడ కరణే | స్వప్నాంతహీ జో కదా నేణే | 
తో కాయ గరీబ దుబళ్యా నకో మ్హణే | ధన్య జిణే తయాంచే | ||౧౦౨|| 
102. కుక్కలను పిల్లులను తరమటం అన్నదే వారు కలలో కూడా ఎరుగరు. అలాంటిది, పేదలను అడ్డగిస్తారా? వారి జీవితం ధన్యం. 
ఆరంభీ హా వేడా ఫకీర | యేచ నామే జనా మహశూర | 
తుకడే మాగూని భరీ జో ఉదర | కైచా బడివార తయాచా | ||౧౦౩|| 
103. మొదట్లో వారు పిచ్చి ఫకీరు అనే జనులలో ప్రసిద్ధి అయ్యారు. రొట్టె ముక్కలను అడుక్కొని పొట్ట నింపుకొనే వారిలో, వారి గొప్పతనం మిగతా వారికి ఎలా కనిపిస్తుంది? 
ఫకీర పరీ హాతాచా సఢళ | నిరపేక్ష ఆణి స్నేహాళ | 
బాహ్య చంచల అంతరీ అచళ | కళా అకళ తయాచీ | ||౧౦౪|| 
104. ఫకీరుగా ఉన్నా, వారు చాలా ఉదార స్వభావులు. స్నేహ మూర్తులు, ఏ కోరికలూ లేనివారు; పైకి వారి స్వభావం క్షణ క్షణం మారినా, లోపల నిశ్చలంగా, శాంతంగా ఉండేవారు. వారి నడక అంతుపట్టనిది. 
ఏసియాహీ త్యా కుగ్రామాంత | జాత్యా అతీవ దయావంత | 
హోతే కాంహీ భాగ్యవంత | తే త్యా మహంత మానీత | ||౧౦౫|| 
105. శిరిడీలాంటి చిన్న గ్రామంలో కూడా ఉదార స్వభావంగల భాగ్యవంతులు ఉండేవారు. వారు బాబాను మహాత్మునిగా భావించేవారు. 
తాత్యా కోతే యాంచీ ఆఈ | నాంవ జియేచే బాయజాబాఈ | 
పాటీంత భాకర్యా ఘేఊని డోయీ | రానాంత జాఈ దుపారా | ||౧౦౬|| 
106. బాయజాబాయి అనే తాత్యాకోతే తల్లి, రొట్టెల బుట్టను తలపై పెట్టుకుని మధ్యాహ్నం ఎండలో అడవిలోకి వెళ్ళేది. 
కోస కోస రాన ధుండావే | దాట ఝాడ ఝుడూప తుడవావే | 
వేడ్యా ఫకీరాస యా హుడకావే | పాయా పడావే తయాచ్యా | ||౧౦౭|| 
107. మైళ్ళు మైళ్ళు నడిచి, చెట్లు పొదలు దాటుకుంటూ వెళ్ళి, పిచ్చి ఫకీరును వెదికి పట్టుకుని, వారి పాదాలపై పడేది. 
కాయ తిచ్యా త్యా సత్వాచీ థోరీ | ఓలీ కోరడీ భాజీ భాకరీ | 
రానీవనీ దుపారీ తిపారీ | భరవీ న్యాహారీ బాబాంతే | ||౧౦౮|| 
108. ఎంతటి గొప్ప స్వభావం ఆమెది! మధ్యాహ్నం, సాయంత్రం, అడవికి వెళ్ళి, బాబాకు రొట్టె, కూర పెట్టేది. 
ఏసే తిచే తపాచరణ | బాబాహీ న విసరలే ఆమరణ | 
కేలే తిచ్యా పుత్రాచే కల్యాణ | పూర్ణ స్మరణపూర్వక | ||౧౦౯|| 
109. ఆమెయొక్క ఈ భక్తి పూరితమైన సేవను, జీవితాంతం బాబా మరిచి పోలేదు. దానిని గుర్తుపెట్టుకుని, ఆమె కొడుకుకు మేలు చేశారు. 
ఉభయతా త్యా స్త్రీ పురూషాంచా | ఫకీరాపాయీ దృఢభావ సాచా | 
ఫకీరచి దేవ త్యా ఉభయతాంచా | భావార్థియాచాచ దేవ కీ | ||౧౧౦||
110. ఆమెకు, ఆమె భర్తకు, ఇద్దరికీ ఫకీరు పాదాలయందు దృఢమైన నమ్మకం ఉండేది. వాళ్ళిద్దరికీ ఫకీరే దేవుడు. ఎంతైనా, భక్తితో నమ్మకమున్న వారికే, దేవుడు చెందుతాడు. 

ఫకీరానే ధ్యానస్థ అసావే | బాయజాబాఈనే పాన మాండావే | 
పాటీంతీల అన్న వాఢావే | ఖావవావే ప్రయత్నే| ||౧౧౧|| 
111. ఫకీరు ఎప్పుడూ ధ్యానంలో ఉండగా, బాయజాబాయి ఆకు వేసి, బుట్టలోని అన్నం వడ్డించి, పట్టుదలగా బాబాకు తినిపించేది.
ఫకీరీ అవ్వల బాదశాహీ | ఫకీరీహీ చిరంతన రాహీ | 
అమీరీ క్షణభంగుర పాహీ | సదా బాబాంహీ మ్హణావే | ||౧౧౨|| 
112. అందుకే బాబా ఎప్పుడూ “రాజ వైభవం కంటే పేదరికమే శ్రేష్ఠం. ఎప్పుడూ నిలకడగా ఉండేది పేదరికమే. భాగ్యం ఈ క్షణం ఉంటుంది, మరు క్షణం ఉండదు” అని అనేవారు. 
పుఢే బాబాంనీ రాన త్యాగిలే | గాంవాంత యేఊన రాహూ లాగలే | 
మశీదీంత అన్న ఖాఊ ఆదరిలే | కష్ట చుకవిలే ఆఈచే | ||౧౧౩|| 
113. తరువాత, బాబా అడవులను వదిలి, గ్రామంలోకి వచ్చి ఉంటూ, మసీదులోనే అన్నం తినటం మొదలు పెట్టారు. ఆ తల్లికి కలిగే కష్టాన్ని తొలగించారు. 
ఏసా హా నేమ తెవ్హాంపాసునీ | జైసా చాలవిలా త్యా ఉభయతాంనీ | 
తైసాచ తో తయాంచే మాగునీ | తాత్యాంనీంహీ చాలవిలా | ||౧౧౪|| 
114. అప్పటినుంచి, నియమం ప్రకారంగా ఆ దంపతులు బాబాకు అన్నం తీసుకెళ్ళేవారు. వారి తరువాత, తాత్యా కూడా ఆ నియమాన్ని పాటించాడు. 
ధన్య ధన్య తే సంత సదైవ | జయాచే హృదయీ వాసుదేవ | 
ధన్య తయా భక్తాంచే సుదైవ | సమాగమ వైభవ జ్యా త్యాంచే | ||౧౧౫|| 
115. వాసుదేవుడు ఎప్పుడూ హృదయంలో ఉండే ఆ సత్పురుషులు నిజంగా ధన్యులు. అదృష్టం కొద్ది అలాంటి సత్పురుషుల సహవాస సుఖం పొందిన ఆ భక్తులు ఇంకా ధన్యులు. 
తాత్యా మహా భాగ్యవాన | మ్హాళసాపతీచేహీ పుణ్య గహన | 
బాబాంచే సమాగమాచా మాన | సమసమాన భోగీత | ||౧౧౬|| 
116. తాత్యా మహా భాగ్యవంతుడు. మహల్సాపతి కూడా గొప్ప పుణ్యాత్ముడు. ఎందుకంటే, వీరిద్దరూ బాబాయొక్క సహవాస సుఖాన్ని సమానంగా అనుభవించారు. 
తాత్యా ఆణి మ్హాళసాపతి | మశీదీంతచ శయన కరితీ | 
బాబాంచీహీ అనుపమ ప్రీతీ | దోఘాంవరతీ సారఖీ | ||౧౧౭|| 
117. తాత్యా మరియు మహల్సాపతి ఇద్దరూ మసీదులోనే పడుకునేవారు. వీరిద్దరి పైనా బాబాకు సమానంగా అసమానమైన ప్రేమ. 
పూర్వపశ్చిమే ఉత్తరేస | డోయా తిఘాంచ్యా తీన దిశేస | 
పాయ పరస్పరాంచే పాయాంస | మధ్య బిందూస భిడవితీ | ||౧౧౮|| 
118. తూర్పు, పడమర, ఉత్తరం ఈ మూడు దిక్కులలో ముగ్గురూ తలలనుంచి, మధ్యన ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా పడుకునే వారు. 
తాణూని ఏశియా పథార్యా | గోష్టీ వార్తా చాలతీ సార్యా | 
ఎకాస యేతా నిద్రేచ్యా లకేర్యా | తయాస దుసర్యానే జాగవావే | ||౧౧౯|| 
119. ప్రక్కల పరచుకుని, కథలు, కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురూ పడుకునేవారు. ఒకరికి కునుకు వస్తే రెండోవారు లేపేవారు. 
తాత్యా ఘోరూ లాగతా | ఉఠావే బాబాంనీ అవచితా | 
కరోని తయాంసీ ఉలథాపాలథా | దాబావా మాథా తయాంచా | ||౧౨౦||
120. తాత్యా గుర్రు పెట్టేవాడు. అప్పుడు బాబా అతనిని ఇటూ అటూ దొర్లించి, అతని తలను పట్టుకుని వత్తుతూ, వెంటనే లేపేవారు. 

ఘేఊని సమవేత మ్హాళసాపతీ | బిలగతీ దోఘే తాత్యాప్రతీ | 
ఆవళూన ధరితీ పాయ దాబితీ | పాఠహీ రగడితీ తయాచీ | ||౧౨౧|| 
121. మహల్సాపతితో కలిసి, తాత్యాను గట్టిగా పట్టుకుని, బాబా అతని కాళ్ళు పట్టేవారు. అతని వీపును కూడా మర్దించేవారు. 
ఏశీ సబంధ చవదా సాలే | బాబాంసవే తాత్యా మశీదీంత నిజలే | 
కాయ భాగ్యాచే తే దివస గేలే | స్మరణీ రాహిలే అఖండ | ||౧౨౨| 
122. ఇలాంటి ఎడతెగని సంబంధంతో, ౧౪ సంవత్సరాలు తాత్యా బాబాతో కలిసి మసీదులో నిద్రించాడు. ఎంత అద్భుతమైన రోజులవి! అవి గడిచిపోయి, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మిగిలిపోయాయి. 
ఘరీ ఠేవూనియా మాయబాపే | బాబాంచ్యా ఆవడీ మశీదీ ఝోంపే | 
ప్రేమ తే మాపావే కవణ్యా మాపే | మోల యా కృపేచే కోణ కరీ | ||౧౨౩|| 
123. తల్లి తండ్రులను ఇంట్లో వదిలేసి, బాబాపై ప్రీతితో తాత్యా మసీదులో పడుకునేవాడు. తాత్యాకు గల ప్రేమను ఎలా తూచగలం? అతని పైనున్న బాబా కృపను ఎవరు విలువ కట్టగలరు? 
పుఢే వడీల పంచత్వ పావలే | తాత్యా ఘర సంసారాంత పడలే | 
ఝాలే ఘరధనీ స్వయే దాదులే | నిజూ లాగలే నిజగృహీ | ||౧౨౪|| 
124. తండ్రి చనిపోయిన తరువాత సంసారం బాధ్యత తాత్యాపై పడింది. ఇంటికి యజమాని అయ్యాడు. తరువాత గృహస్థుడైయాడు. తరువాత ఇంట్లోనే పడుకునేవాడు. 
అసో ఏసా నిష్ఠావంత భావ | తయాసీంచ సాఈచా అనుభవ | 
అనాహూత ఉభా స్వయమేవ | భక్త నవలావ పాహూ యే | ||౧౨౫|| 
125. ఇలాంటి భక్తులకు, శ్రద్ధా నిష్ఠలున్న వారికే సాయియొక్క అనుభవాలు కోరకుండానే కలుగుతాయి. భక్తులు దీనినే చమత్కారమని అనుకుంటారు. 
తైసేచ రాహాత్యాంత ఎక గృహస్థ | ఖుశాలచంద నామే విఖ్యాత | 
హోతే బాబాంచే భక్త ధనవంత | నగరశేట గాంవీంచే | ||౧౨౬|| 
126. అలాగే, రాహాతాలో ఖుశాలుచందు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు బాబా భక్తుడు, ధనవంతుడు, ఆ ఊరికి షావుకారు. 
ప్రసిద్ధ పాటీల గణపత కోతే | జైసే బాబాంచే ఫార ఆవడతే | 
చులతే ఖుశాలచందాచే హోతే | తైసేచ బాబాంతే ప్రియ బహు | ||౧౨౭|| 
127. ప్రసిద్ధి పొందిన గణపతి కోతే పాటీలు పైన బాబాకు ఉన్నంత ప్రేమ, ఖుశాలుచందు పినతండ్రి పైన కూడా ఉండేది. 
జరీ జాతీచే మారవాడీ | బాబాలాగీ మోఠీ ఆవడీ | 
పరస్పరాంచ్యా ఘడోఘడీ | భేటీ సుఖపరవడీ తే ఘేత | ||౧౨౮|| 
128. జాతిలో మార్వాడి అయినా, అతనికి బాబాపై చాలా ప్రేమ. ఇద్దరూ తరచుగా ప్రీతితో కలుసుకునేవారు. 
హరిచ్ఛేనే కాంహీ కాలే | వడీల శేటజీ పంచత్వ పావలే | 
తరీహీ న బాబా విసరలే | ప్రేమ పాహిలే దుణావలే | ||౧౨౯|| 
129. కొంత కాలానికి, దైవేచ్ఛతో పెద్ద సేఠు చనిపోయాడు. అయినా బాబా అతనిని మరచి పోలేదు. ఇంకా, ఆ కుటుంబం మీద ప్రేమ రెండింతలయింది. 
పుఢేహీ ఖుశాలచందావరతీ | వాఢత గేలీ బాబాంచీ ప్రీతి | 
ఆదేహాంత దివసరాతీ | కల్యాణా జాగతీ తయాచే | ||౧౩౦||
130. తరువాత కూడా, ఖుశాలుచందు పైన బాబా ప్రేమ పెరుగుతూనే ఉండేది. తమ జీవితాంతం వరకు, బాబా అతని బాగోగులను రాత్రి పగలు కనిపెట్టుతూ ఉండేవారు. 

కధీ గోరథీ కింవా హయరథీ | సవే ఘేఊని ప్రేమాచే సాంగాతీ | 
తెథూన దీడ మైలావరతీ | రహాత్యాప్రతీ జాత బాబా | ||౧౩౧|| 
131. ప్రేమతో భక్తులతో సహా, బాబా ఒక సారి ఎద్దుల బండిలోను, ఇంకో మారు గుర్రపు బండిలోను, మైలున్నర దూరంలో ఉన్న రహాతాకు బాబా వెళ్ళేవారు.
గ్రామస్థ లోక సామోరే యేత | తాశే వాజంత్రీ సవే ఘేత | 
బాబాంస గాంవాంచే వేశీవర భేటత | లోటాంగణీ యేత ప్రేమానే | ||౧౩౨|| 
132. అక్కడి గ్రామస్థులు డోలు, సన్నాయి మొదలగు వాద్యాలతో, ఊరి పొలిమేర వద్దకు వచ్చి, బాబాకు స్వాగతం పలికి, ప్రేమతో వారికి సాష్టాంగ నమస్కారం చేసేవారు.   
మగ తెథూన గాంవా ఆంత | బాబాంస సమారంభే నేత | 
అతి ప్రేమే వాజత గాజత | ఆనంద భరిత మానసే | ||౧౩౩|| 
133. తరువాత, ప్రేమ ఆనందం ఉప్పొంగుతుండగా, అక్కడినుండి మేళ తాళాలతో, బాబాను అతి వైభవంగా ఊళ్ళోకి తీసుకుని వెళ్ళేవారు. 
ఖుశాలచంద ఆపులే సదనీ | బాబాంస మగ జాత ఘేఉని | 
తెథే అల్పాహార కరవునీ | సుఖాసనీ బైసవీత | ||౧౩౪|| 
134. అక్కడ, ఖుశాలుచందు బాబాను తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. ఇంట్లో ఫలాహారాలను సేవింప చేసి, వారిని సుఖంగా కూర్చుండ పెట్టేవాడు. 
మగ త్యా జున్యా పురాణ్యా వార్తా | ఆఠవూని కథితీ ఉభయతా | 
పరస్పరాంచ్యా ఆనందచిత్తా | కోణాస వర్ణితా యేఈల తో | ||౧౩౫|| 
135. ఆ తరువాత ఇద్దరూ పాత కథలను, గడచిన జ్ఞాపకాలను గురించి ముచ్చటించుకునే వారు. ఒకరికొకరు వారు పొందుతున్న ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? 
ఎణే ప్రమాణే ఆనంద విహార | పూర్ణ హోతా ఫళాహార | 
బాబా మగ స్వానందనిర్భర10 | సహ పరివార పరతతీ | ||౧౩౬|| 
136. ఇలా ఆనందంగా కాలం గడిపి, ఫలాహారాన్ని సేవించిన తరువాత, తమతో వచ్చినవారితో బాబా సంతోషంగా శిరిడీకి తిరిగి వచ్చేవారు. 
ఎకీకడే హే రహాతే గాంవ | దుసరీకడే తే నిమగాంవ | 
యా దోహోంచ్యా మధ్యే ఠావ | శిరడీ గాంవ వస్తీచా ||౧౩౭|| 
137. ఒక వైపు రహాతా గ్రామం, ఇంకో వైపు నీంగాం గ్రామం. ఈ రెంటి మధ్యన శిరిడీ గ్రామం ఉండేది. 
జరీ యా మధ్యబిందూ పాసూన | యా దోన గాంవాబాహేర ప్రయాణ | 
స్థూల దేహే కేలే న అనిర్వాణ | తరీ తయా జాణ సర్వత్ర | ||౧౩౮|| 
138. ఇలా రెండు గ్రామాల మధ్యన ఉన్న శిరిడీ గ్రామంలో ఉంటూ, జీవితాంతం వరకు, తమ దేహంతో బాబా ఎప్పుడూ ఈ రెండు గ్రామాల అవతల ప్రయాణం చేయలేదు. అయినా, ఎక్కడ ఏమి జరుగుతున్నదీ అనేది అంతా వారికి తెలుసు. 
నాహీ ఇతర కోఠే ప్రయాణ | నాహీ అగ్నిరథాచే దర్శన | 
తరీ త్యా రథాచే గమనాగమన | వేళ ప్రమాణ త్యా ఠావే | ||౧౩౯|| 
139. వేరే ఏ చోటికీ వారు వెళ్ళలేదు. రైలు బండిని అసలు చూడనే లేదు. అయినా, రైలు బళ్ళ రాక పోకల వేళల గురించి అంతా వారికి తెలుసు. 
సాధావయా గాడీచీ వేళ | భక్తాంనీ కరావీ తయారీ ప్రబళ | 
ఆజ్ఞా మాగూ జాతా జవళ | మ్హణావే ఉతావీళ కా ఝాలా | ||౧౪౦||
140. సమయానికి సరిగ్గా రైలు బండిలో వెళ్ళాలని భక్తులు, ప్రయాణానికై బాబా అనుమతి కోసం వారి వద్దకు వెళ్ళితే, “అంత తొందర పడుతున్నారెందుకు?” అని అడిగేవారు. 

బాబా న కరితా ఆతా తాతడీ | చుకేల మాఝీ ముంబఈచీ గాడీ | 
నోకరీవర యేఈల ధాడీ | సాహేబ కాఢీల మజలా కీ | ||౧౪౧|| 
141. ‘బాబా! తొందరగా వెళ్ళక పోతే, ముంబై వెళ్ళే రైలు తప్పిపోతుంది. ఉద్యోగానికి ముప్పు వస్తుంది. మా యజమాని, ఉద్యోగంనుండి నన్ను తీసేస్తాడు’. 
సాహేబ యేథే నాహీ దుసరా | కశాస వ్హావీ ఇతుకీ త్వరా | 
జా ఖా భాకర తుకడా జరా | జాఈ దుపారా జేవునీ | ||౧౪౨|| 
142. అని అంటే, “ఇక్కడ ఇంకొక యజమాని ఎవరూ లేరు. ఎందుకింత తొందర? వెళ్ళి కొంచెం రొట్టె తిను. మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళవచ్చు” అని చెప్పేవారు. 
ఏసీ కోణాచీ ఆహే ప్రజ్ఞా | కీ త్యా వాణీచీ కరీల అవజ్ఞా | 
లహానా థోరా శహాణ్యా సుజ్ఞా | అనుభవ విజ్ఞాన సకళా హే | ||౧౪౩|| 
143. వారి మాటను జవదాటే ధైర్యం ఎవరికి ఉంటుంది? పిన్నలు, పెద్దలు, తెలివైనవారు, అందరికీ ఇది అనుభవమే! 
జ్యానే జ్యానే ఆజ్ఞా మానిలీ | గాడీ తయాచీ కధీ న చుకలీ | 
పరీ జయానే తీ అవమానిలీ | ప్రచీతీ ఘేతలీ రోకడీ | ||౧౪౪|| 
144. వారి ఆజ్ఞను పాటించిన వారికి, బండి ఎప్పుడూ తప్పి పోలేదు. కాని, వారి మాటను వినని వారు తప్పక కష్టాలను అనుభవించేవారు. 
ఎకామాగూన ఎక అభినవ | సంఖ్యా విరహిత ఏసే అనుభవ | 
అనేకాంచే అనేక అపూర్వ | సంక్షేప పూర్వక సాంగేన | ||౧౪౫|| 
145. లెక్కలేనన్ని ఇలాంటి అనుభవాలు ప్రతి మారు, మునుపెన్నడూ జరగనివి, క్రొత్తవి జరిగేవి. ఎంతో మందికి కలిగిన ఇలాంటి అనుభవాలను ఒకటి తరువాత ఇంకొకటి సంగ్రహంగా చెప్పుతాను. 
హేమాడ సాఈపదీ శరణ | పుఢీల అధ్యాయీ హేంచి నిరూపణ | 
భక్త పరతతా గాంవాలాగూన | బాబాంచే ఆజ్ఞాపన హో లాగే | ||౧౪౬|| 
146. హేమాడు సాయి పాదాలకు శరణుజొచ్చి, తరువాతి అధ్యాయంలో, భక్తులు తమ ఊళ్ళకు వెళ్ళేటప్పుడు, బాబా అనుమతిని ఎలా తీసుకోవాల్సి వచ్చేదో చెబుతాడు. 
ఆజ్ఞా హోఈ తో తో జాఈ | ఆజ్ఞా నాహీ తో తో రాహీ | 
అవమానితా పడే అపాయీ | పుఢీల అధ్యాయీ దిగ్దర్శన | ||౧౪౭|| 
147. అనుమతి దొరికిన వారే వెళ్ళటం, దొరకని వారు ఉండి పోవటం, లేక పోతే, బాబా మాటను జవదాటటం వలన అపాయాలకు గురి కావడం గురించి తెలియ చేస్తాడు. 
తైసేంచ మధుకరీ వృత్తీచే ధారణ | సాఈంస కిమర్థ భిక్షాన్న సేవన | 
పంచసూనాది పాతక క్షాలన | కథా నిరూపణ పుఢారా | ||౧౪౮|| 
148. అలాగే, బాబా భిక్షాటన చేసి, భిక్షాన్నాన్ని ఎందుకు తినేవారు, పంచసూనాది పాతకాలను నిర్మూలించటం మొదలగు కథల వర్ణన తరువాత చేయబడుతుంది. 
మ్హణవూన శ్రోతయా చరణీ ప్రార్థనా | కరితో ఆగ్రహే క్షణక్షణా | 
కరాయా సాఈచరిత్ర శ్రవణ | నిజకల్యాణా కారణే | ||౧౪౯||
149. అందువలన, మీ శ్రేయస్సు కోసం సాయి చరిత్రను వినండి అని హేమాడు శ్రోతల పాదాలకు నమస్కరించి మాటి మాటికీ వేడుకుంటున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | సాఈసమర్థావతరణం* నామ | 
| అష్టమోధ్యాయః సంపూర్ణః |

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిప్పణీ: 
1. భాతా. 2. స్వాభావికపణే. 3. క్షణభంగుర, ఉద్యా నాహీ తో. 
4. క్షణ. 5. స్వతఃచ్యా జ్ఞానాలా అనుసరూన జన్మ మిళతో. 6. లీలా. 
7. విషయప్రీతిరూప తేలాచీ. 8. సమూళ నాశ. 
9. వాత జళల్యానంతర రాఖస్వరూప రాహతే తీ. 
10. యా సంబంధీ రా. హరీ సీతారామ దీక్షిత యాంనా ఆలేలా ఎక అనుభవ - ఎకే దివశీ దోనప్రహరీ మలా మహారాజ మ్హణాలే, “ఖుశాలభాఊ పుష్కళ దివసాంత ఆలే నాహీత. తూ టాంగా ఘేఊన రాహాత్యాస జా వ త్యాంనా ఘేఊన యే. త్యాంనా మ్హణావే, తుమ్హాలా బాబాంనీ బోలవిలే ఆహే.” త్యాప్రమాణే మీ టాంగా ఘేఊన రాహాత్యాస గేలో. ఖుశాలభాఊంచీ భేట ఝాలీ. తే మ్హణాలే, ‘మీ దుపారీ జేవూన నిజలో హోతో. మాఝా డోళా లాగలా తోచ మహారాజ స్వప్నాత ఆలే వ మలా మ్హణాలే, “శిరడీస చల”. త్యాప్రమాణే మలా యేణ్యాచీ ఉత్కట ఇచ్ఛా ఝాలీ. పణ ఆజ మాఝే ఘోడే యేథే నాహీత మ్హణూన మలా యేత నాహీ. మ్హణూనచ మీ మాఝ్యా ములాలా ఆత్తాచ శిరడీస పాఠవిలే ఆహే’. త్యావర మీ మ్హటలే, ‘మ్హణూనచ మహారాజాంనీ మలా టాంగా ఘేఊన పాఠవిలే ఆహే. ఆపణ యేత అసాల తర మాఝా టాంగా తయార ఆహే.’ త్యావర తే మోఠ్యా ఆనందానే మాఝ్యాబరోబర ఆలే. *. శ్రీ సాఈనాథాంచ్యా ఎకా సద్భక్తానే సుచవిలే ఆహే కీ, ‘శ్రీసాఈసమర్థావతరణం’ హా చౌథ్యా అధ్యాయాత యేఊన గేలా ఆహే వ యా అధ్యాయాత ‘నర-జన్మాచీ మహతీ, భిక్షాన్న-సేవన, బాయజాబాఈచీ భక్తీ వ తాత్యా-మ్హాళసాపతీ శయనం’ యాంచీ వర్ణనే ఆహేత. త్యాప్రమాణే వాచకాంనీ లక్షాత ఘ్యావే. 

Saturday, November 17, 2012

||వివిధకథా నిరూపణం నామ సప్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత 
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౭ వా|| 


||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

ఆతా పూర్వకథేచీ సంగతీ | స్మరణపూర్వక ఆణూ చిత్తీ | 
దేఉళాంచ్యా జీర్ణోద్ధారార్థీ | కైసీ ప్రీతి బాబాంస | ||౧|| 
1. మనం ఇప్పుడు మునుపటి కథను గుర్తుకు తెచ్చుకుందాం. అందులో, దేవాలయాల జీర్ణోద్ధరణ గురించి బాబాకు ఎంత ఇష్టమో దాని గురించి,
పరోపకారార్థ కైసే శ్రమత | కైసే నిజభక్తా సాంభాళీత | 
కైసా నిజాంగే దేహ ఝిజవీత | దుఃఖేహీ సోశీత భక్తాంచీ | ||౨|| 
2. అందరి మంచికొరకు బాబా ఎంత కష్ట పడేవారో, తమ భక్తులను ఎలా చూచుకునేవారో, భక్తుల కష్టాలను సహించడానికి తమ శరీరాన్ని ఎలా శ్రమ పెట్టేవారో, 
సమాధీ సమవేత ఖండయోగ | ధోతీ పోతీ ఇత్యాది ప్రయోగ | 
కదా కరపదశిరవియోగ | కదా సంయోగ పూర్వవత్ | ||౩|| 
3. వారు సమాధి, ధౌతి-పోతి, ఖండయోగం మొదలైన ప్రయోగాలను చేసేవారో, ఇందులో భాగంగా చేతులు, కాళ్ళు, శిరస్సును వేరుగా చేసి, మరలా వానిని మునుపటిలా కలిపేవారో, ఇవన్నీ ఈ అధ్యాయంలో చెప్పబడతాయి. 
హిందూ మ్హణతా దిసత యవన | యవన మ్హణతా హిందూ సులక్షణ | 
ఏసా హా అవతార విలక్షణ | కోణ విచక్షణ వర్ణీల | ||౪|| 
4. బాబా హిందువు అని అనుకుంటే, ముస్లిమువలె కనిపించేవారు. మరి, ముస్లిము అని అనుకుందామంటే, హిందువుల లక్షణాలన్నీ కనిపించేవి. ఇంతటి విలక్షణమైన అవతారాన్ని ఎవరు మాత్రం వర్ణించగలరు? 
జాత హిందూ కీ ముసలమాన | థాంగ న లాగలా అణుప్రమాణ | 
ఉభయ వర్గా సమసమాన | జయాంచే వర్తన సర్వదా | ||౫|| 
5. వారు హిందువా, ముస్లిమా అన్నది కొంచెం కూడా ఎవరికీ తెలియదు. హిందువైనా, ముస్లిమైనా, ఇద్దరినీ వారు సమానంగా చూచేవారు. 
రామనవమీ హిందూచా సణ | కరవీతసె స్వయే ఆపణ | 
సభామండపీ పాళణా బాంధవూన | కథా కీర్తన కరవీత | ||౬|| 
6. రామనవమి హిందువుల పండగ. దానిని వారు స్వయంగా జరిపించేవారు. సభా మండపం మధ్యన ఊయలను కట్టించి, కథా సంకీర్తనను చేయించేవారు. 
చౌకాంత సన్ముఖ లాగే పాళణా | కరవూని ఘేతీ రామకీర్తనా | 
తేచీ రాత్రీ సందల మిరవణా | అనుజ్ఞా యవనాంహీ దేత | ||౭|| 
7. తమ ఎదుట ఊయల ఉండగా, రామ కీర్తనను చేయించేవారు. అదే రాత్రి, ముస్లిముల సందల్‍ (చందనోత్సవం) ఊరేగింపుకు కూడా అనుమతిని ఇచ్చేవారు. 
జమవూన జమతీల తితుకే యవన | సమారంభె సందల మిరవణ | 
ఉభయ ఉత్సవ సమసమాన | ఘేత కరవూన ఆనందే ||౮|| 
8. చాలా మంది ముస్లిములు కలిసి, చందన ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా జరుపుకునేవారు. ఈ రెండు ఉత్సవాలను బాబా సమానంగా, సంతోషంగా జరిపించేవారు. 
యేతా రామనవమీచా దివస | కుస్త్యా లావణ్యాచీ హౌస | 
ఘోడే తోడే పగడ్యా బక్షీస | అతి ఉల్హాస ద్యావయా | ||౯|| 
9. రామనవమి రోజు రాగానే, ఎంతో ఉత్సాహంతో, బాబా కుస్తీల పోటీలను పెట్టించి, గుర్రాలను, తలపాగాలను, కంకణాలను బహుమతిగా ఇచ్చేవారు. 
సణ గోకుళ అష్టమీ ఆలా | కరవూని ఘేతీ గోపాళ కాలా | 
తైసీచ ఈద యేతా యవనాంలా | నిమాజాలా అటకనా | ||౧౦||
10. గోకులాష్టమి పండుగ వచ్చినప్పుడు, గోపాలకాలా జరిపించేవారు. అలాగే, ముస్లిముల పండుగ వస్తే, నమాజు చదవటానికి, అడ్డు చెప్పేవారు కాదు. 

ఎకదా ఆలా మోహరమాచా సణ | ఆలే మశీదీస కాంహీ యవన | 
మ్హణతీ ఎక తాజా1 బనవూన | కరూ మిరవణ గ్రామాంత | ||౧౧|| 
11. ఒక సారి, మొహరం పండుగ వచ్చినప్పుడు, కొందరు ముస్లిములు మసీదుకు వచ్చి, ఒక తాజా (తాబూతు) ను చేయించి, గ్రామంలో ఊరేగించాలన్నారు. 
ఆజ్ఞేసరసా తాజా ఝాలా | చార దివస ఠేవూంహీ దిధలా | 
పాంచవే దివశీ ఖాలీ కాఢిలా | నాహీ మనాలా సుఖ దుఃఖ | ||౧౨|| 
12. బాబా అనుమతిని ఇచ్చిన తరువాత, తాజా తయారు చేసి నాలుగు రోజులు ఉంచి, ఐదవ రోజున దానిని క్రిందకు దించేశారు. అందు వలన బాబాకు సంతోషమూ కలగ లేదు, దుఃఖమూ కలగ లేదు. 
అవింధ మ్హణతా వింధితకాన | హిందూ మ్హణతా సుంతా ప్రమాణ | 
ఏసా నా హిందూ నా యవన | అవతార పావన్ సాఈంచా | ||౧౩|| 
13. బాబా ముస్లిము అని అనుకుందాము అంటే, చెవులు కుట్టి ఉన్నాయి. హిందువు అని అనుకుంటే, వారికి సుంతీ జరిగింది. హిందువు కన్నా, ముస్లిము కన్నా అతీతమైన పావన అవతారం సాయిది. 
హిందూ మ్హణావె జరీ తయాంస | మశీదీంత సదా నివాస | 
యవన మ్హణావే తరీ హుతాశ2 | అహర్నిశ మశీదీంత | ||౧౪|| 
14. వారిని హిందువు అంటే, వారి నివాసం ఎప్పుడూ మసీదులోనే. ముస్లిము అని అంటే, రాత్రింబవళ్ళూ అగ్నిహోత్రం చేసేవారు. 
మశీదీంత జాత్యాచే దళణ | మశీదింత ఘంటాశంఖవాదన | 
మశీదీంత అగ్నిసంతర్పణ | ముసలమాన కైస్ హే | ||౧౫|| 
15. మసీదులో విసరటం, మసీదులో ఘంటా నాదం, అక్కడే శంఖు ఊదటం, అక్కడే అగ్నికి ఆహుతులు ఇవ్వడం, ఇక వారు ముస్లిము ఎలా అవుతారు? 
మశీదీంత సదైవ భజన | మశీదీంత అన్నసంతర్పణ | 
మశీదీంత అర్ఘ్య-పాద్య-పూజన | ముసలమాన కైసే హే | ||౧౬|| 
16. మసీదులోనే ఎల్లప్పుడూ భజనలు, అర్ఘ్య పాద పూజలు, అక్కడే అన్న సంతర్పణలు, ఇవన్నీ ఉన్న తరువాత వారు ముసల్మాను ఎలా అవుతారు? 
మ్హణావీ జరీ మ్లేంచ్ఛ జాతీ | బ్రాహ్మణోత్తమ పూజన కరితీ | 
అగ్నిహోత్రీ లోటాంగణీ యేతీ | త్యాగూని స్ఫీతీ3 సోంవళ్యాచీ | ||౧౭|| 
17. ముస్లిము అని అనుకుందాము అంటే, వారిని శ్రేష్ఠమైన బ్రాహ్మణులు పూజిస్తారు. అభిమానాన్ని, మడిని, విడిచి పెట్టి, అగ్నిహోత్రులు వారి పాదాలకు సాష్టాంగ పడతారు. 
ఏసే జన విస్మిత చిత్తీ | పాహూ యేతీ జే జే ప్రచీతీ | 
తేహీ తైసేంచ ఆపణ వర్తతీ | మూగ గిళితీ దర్శనే | ||౧౮|| 
18. అలా జనులు ఆశ్చర్యపోయారు. తామే స్వతహాగా కనుక్కుందామని వచ్చినవారు కూడా అలాగే నడుచుకుంటారు. బాబా దర్శనంతో వారికి నోటి మాట రాక, ఊరికే ఉండిపోతారు. 
తరీ జో సర్వదా హరీసీ శరణ | త్యా కాయ మ్హణావే హిందూ వ యవన | 
అసో శూద్ర అతిశూద్ర యాతివిహీన | జాతీ న ప్రమాణ అణుమాత్ర | ||౧౯|| 
19. ఎల్లప్పుడూ హరి శరణులో ఉండేవారిని, హిందువని లేక ముస్లిమని ఎలా అనగలం? వారు శూద్రుడైనా, అంత కన్నా తక్కువైనా, లేక జాతి లేకున్న వారైనా, వారి యోగ్యతను తెలుసుకోవటానికి వారి జాతి ఏ మాత్రం ఆధారం కాదు. 
నాహీ జయాస దేహాభిమాన | అసో హిందూ వా ముసలమాన | 
సకల వర్ణా సమసమాన | తయా న భిన్నపణ జాతీచే | ||౨౦|| 
20. దేహం మీద ఏ మాత్రం అభిమానము లేని, వారు, హిందువునైనా, ముస్లిమునైనా, ఏ జాతి వారినైనా సమానంగా చూస్తారు. 

ఫకీర పంక్తీసీ మాంస భోజన | అథవా యదృచ్ఛ మత్స్యసేవన | 
తెథేంచ తోండ ఘాలితా శ్వాన | విటే న మన జయాచే | ||౨౧|| 
21. ఫకీరులతో కూర్చుని, మాంసాన్ని, లేదా చేపలను, ఏది దొరికితే దానిని తినేవారు. అందులో కుక్కలు మూతి పెట్టినా అసహ్యించుకునే వారు కాదు.
చాలూవర్షాచా ధాన్యాచా సాంఠా | కృషీవల కరితో బాంధోని మోటా | 
కీ పుఢీల సాలీ ఆలియా తోటా | వేళీ పురవఠా హోఈల | ||౨౨|| 
22. రైతులు ఆ సంవత్సరంలో పండిన ధాన్యాన్ని, తరువాత ఎప్పుడైనా ధాన్యం కొరత ఏర్పడితే ఆ అవసరానికి వాడుకోవటానికి, ముందుగానే పోగు చేసి, సంచుల్లో కట్టి ఉంచుతారు. 
తైసే సంగ్రహీ గవ్హాంచే పోతే | దళాయా మశీదీంత అసే జాతే | 
పాఖడావయా సూపహీ హోతే | న్యూన నవ్హతే సంసారాస | ||౨౩|| 
23. అలాగే, బాబా గోధుమలను ఒక బస్తాలో నింపి, మసీదులో ఉంచేవారు. విసురుకోవటానికి అక్కడ తిరగలి కూడా ఉండేది. చెరగటానికి చేటలూ ఉండేవి. సంసారానికి కావలసిన వాటికి ఏ కొరతా లేదు. 
సభామండపీ శోభాయమాన | సుందర ఖాసే తులసీ వృందావన | 
తెథేంచ ఎక లాంకడీ స్యందన4 | అతి సులక్షణ కాంతీవ | ||౨౪|| 
24. సభామండపంలో అందమైన తులసీ బృందావనం, లక్షణమైన ఒక చెక్క రథం కూడా అక్కడ ఉండేవి. 
హోతే కాహీ పుణ్య గాంఠీ | తేణే యా సద్వస్తూచీ ఝాలీ భేటీ | 
ఏసీ దృఢ సాంఠవా హృదయ సంపుటీ | పడేనా తుటీ ఆమరణాంత | ||౨౫|| 
25. మునపటి జన్మలలో ఏదో పుణ్యం చేసుకోగా, ఈ మంచి వస్తువులకు ఇక్కడ పరమేశ్వరుని అవతారమైన సాయితో కలయిక ఏర్పడింది. ఇటువంటి వస్తువులను మన హృదయంలో గట్టిగా పెట్టుకుంటే, చనిపో్యేవరకు ఏ లోటూ ఉండదు. 
కాహీ పూర్వార్జిత సభాగ్యతా | తేణే హే పాయ ఆలే హాతా | 
మనాస లాభలీ శాంతతా | నిశ్చింతతా హీ ప్రపంచీ | ||౨౬|| 
26. వెనుకటి జన్మలలో సంపాదించుకున్న పుణ్యం వలనే మనకు సాయి పాదాల దగ్గర చోటు దొరికి, సాంసారిక సమస్యలనుంచి ముక్తి మరియు మనసుకు శాంతి లభించింది. 
పుఢే కితీహీ సుఖసంపన్న | ఝాలో తరీ తే సుఖ న యే పరతోన | 
జే శ్రీసాఈ సమర్థ సమాగమజన్య | భోగితా ధన్య ఝాలో మీ | ||౨౭|| 
27. తరువాత ఎంత సంపద, సుఖం దొరికినా, శ్రీ సాయితో గడిపి ధన్యుణ్ణైన ఈ సుఖం, ఆనందం మరల ఎప్పటికీ రాదు. 
స్వానందైక చిద్ఘన సాఈ | కాయ వానూ త్యాచీ నవలాఈ | 
జో తో రాతలా తయాచ్యా పాయీ | జో జో ఠాయీంచ బైసవిలా | ||౨౮|| 
28. ఎప్పుడూ ఆత్మలో లీనమై, పూర్తి ఆనందానికి నిలయం సాయి. వారి గొప్పతనాన్ని, వారి లీలలను నేను ఎలా వర్ణించగలను? వారి పాదాలను నమ్ముకున్న భక్తుల నమ్మకాన్ని వారు ఎప్పుడూ దృఢ పరుస్తారు. 
అజిన దండధారీ తాపసీ | హరిద్వారాది తీర్థవాసీ | 
తడీ తాపడీ ఆణి సంన్యాసీ | త్యాగీ ఉదాసీ బహు యేతీ | ||౨౯|| 
29. జింక చర్మాన్ని కట్టుకుని, చేతిలో కర్రను పట్టుకున్న తాపసులు, హరిద్వారం మొదలైన పుణ్య క్షేత్రాలలో ఉండేవారు, సన్యాసులు, త్యాగులు, బైరాగులు, బిచ్చగాళ్ళు, మొదలగు అనేక రకాల జనులు బాబా వద్దకు వచ్చేవారు. 
బోలే చాలే హసే ఉదండ | జివ్హేస అల్లా మాలీక అఖండ | 
నావడే వాద కింవా వితండ | నికట దండ5 సర్వదా | ||౩౦||
30. బాబా మాట్లాడుతూ, తిరుగుతూ, నవ్వుతూ ఉండేవారు. వారి పెదవుల మీద ఎప్పుడూ ‘అల్లా మాలిక’ అన్న పేరు ఉండేది. వారికి వాదాలన్నా, పనికి రాని మాటలన్నా, అసలు ఇష్టం ఉండేది కాదు. సటకాను ఎప్పుడూ తమ దగ్గరే ఉంచేవారు. 

తాపస వృత్తి శమీ దాంత | వాచా స్త్రవే పూర్ణ వేదాంత | 
కోణాహీ న లాగలా అంత | అఖేరపర్యంత బాబాంచా | ||౩౧|| 
31. వారు గొప్ప తపస్వి. మనసును స్థిరంగా ఉంచి, ఇంద్రియాలను జయించినవారు. సంపూర్ణమైన వేదాంతం వారి మాటలలో ఎప్పుడూ ప్రవహిస్తుండేది. చివరి వరకు, వారి స్వభావాన్ని ఎవరూ సరిగ్గా కనుక్కో లేక పోయారు. 
రావ అసో వా రంక | సమసామ్య సకళా నిష్టంక | 
లక్ష్మీపుత్ర వా భికారీ రంక | ఉభయాంస ఎకచి మాప తెథే | ||౩౨|| 
32. సాహుకారైనా, బిచ్చగాడైనా, ఇద్దరినీ వారు సమంగా చూసేవారు. శ్రీమంతుడైనా, బికారి అయినా ఇద్దరినీ ఒకే త్రాసులో తూచేవారు. 
కోణాచే బరే వాఈట కర్మ | జాణతసే జివా ఆంతులే మర్మ | 
సాంగూన దేత ఖూణ వర్మ | ఆశ్చర్య పరమ భక్తాంనా | ||౩౩|| 
33. అందరి మంచి పనులు, చెడు పనులు, వారి మనసులోని రహస్యాలు, ఇవి సాయికి తెలిసేవి. భక్తుల రహస్యాలను వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పి, వారిని ఆశ్చర్య పరచేవారు. 
జాణపణాచే తే సాఠవణ | నేణతపణాచే పాంఘరూణ | 
మాన సంపాదన జయాస శీణ | ఎవం లక్షణ శ్రీసాఈ | ||౩౪|| 
34. వారు జ్ఞానం కోశాగారం. కాని ఏమీ ఎరుగనట్లుగా అజ్ఞానివలె నటించేవారు. గౌరవాలు, సన్మానాలు అంటే వారికి నచ్చేవి కావు. ఇవి శ్రీ సాయిలోని కొన్ని లక్షణాలు. 
కాయా జరీ మానవాచీ | కరణీ అపూర్వ దేవాచీ | 
శిరడీంత ప్రత్యక్ష దేవ తో హాచి | భావితీ హేంచి జన సారే | ||౩౫|| 
35. మనిషి దేహంలో ఉన్నా, వారు చేసే పనులు, దేవుళ్ళు చేసే పనులలా ఉండేవి. శిరిడీలో ఉన్న ప్రత్యక్ష దేవుడు వీరే అని జనులంతా నమ్మేవారు. 
కాయ బాబాంచే చమత్కార | కితీ మ్హణూన మీ వర్ణూ పామర | 
దేవా దేఉళాంచేహీ జీర్ణోద్ధార | బాబాంనీ అపార కరవిలే | ||౩౬|| 
36. బాబా చమత్కారాల గురించి అజ్ఞాని అయిన నేను ఎంతని వర్ణించను? లెక్కలేనన్ని ఆలయాలను చక్కగా పునరుద్ధరణ చేయించారు. 
శిరడీస తాత్యా పాటీలా హాతీ | శనీ గణపతీ శంకరపార్వతీ | 
గ్రామదేవీ ఆణి మారూతీ | యాంచీహీ సుస్థితీ లావిలీ | ||౩౭|| 
37. శిరిడీలోని గ్రామ దేవతల, గణపతి, ఉమామహేశ్వరుల మరియు మారుతి మందిరాలను తాత్యా పాటీలు ద్వార పునరుద్ధరణ చేయించారు. 
లోకాంపాసూని దక్షిణామిషే | ఘేత అసత బాబా జే పైసే | 
కాహీ ధర్మార్థ వాటీత జైసే | కాంహీ తైసేచ తే దేత | ||౩౮|| 
38. దక్షిణ నెపంతో భక్తుల దగ్గరనుండి తీసుకున్న డబ్బును కొంత ధర్మ కార్యాలకు ఖర్చు పెట్టి, మిగతా డబ్బును జనులకు ఇచ్చేవారు. 
కోణాస రోజ రూపయే తీస | కోణాస దహా పంధరా, పన్నాస | 
ఏసే మన మానేల తయాంస | వాంటీత ఉల్హాస వృత్తీనే | ||౩౯|| 
39. ఒకరికి ముప్పై, ఇంకొకరికి పది, పదిహేను లేక యాభై ఇలా తమకు తోచినట్లుగా ప్రతిరోజూ సంతోషంగా పంచేవారు. 
హా తో సర్వ ధర్మాచా పైసా | ఘేణారాసహీ పూర్ణ భరవసా | 
వినియోగహీ వ్హావా తైసా | హీచ మనీషా బాబాంచీ | ||౪౦||
40. ఈ డబ్బంతా ధర్మంగా వచ్చింది. దానిని పొందినవారు, ఆ డబ్బును మంచి పనులకే ఉపయోగించాలని అనుకునేవారు. బాబా మనసులో కూడా వారు దానిని మంచి పనులకు ఉపయోగించాలనే అభిప్రాయం ఉండేది. 

అసో కిత్యేక దర్శనే పుష్ట | కిత్యేక ఝాలే దృష్టాంచే సుష్ట | 
కిత్యేకాంచే గేలే కుష్ట | పావలే అభీష్ట కితీ ఎక | ||౪౧|| 
41. సాయి దర్శనంతోనే ఎంతో మంది ఆరోగ్యవంతులు అయ్యారు. చెడు పనులు చేసే ఎందరో మంచివారయ్యారు. కుష్టు రోగంతో బాధపడుతున్న ఎందరికో వారి వ్యాధి నయమయింది. చాలా మంది కోరికలు ఫలించాయి.
న ఘాలితా అంజన పాలా రస | కితీక అంధ ఝాలే డోళస | 
ఆలే పాయ కితీక పంగూంస | కెవళ పాయాంస లాగతా | ||౪౨|| 
42. ఏ అంజనం గాని, ఆకు రసం కాని వేయకుండానే, వారి పాదాలను తాకినందుకు ఎందరో గ్రుడ్డివాళ్ళకు కళ్ళ చూపు వచ్చింది. కుంటివాళ్ళెందరికో కాళ్ళు బాగయ్యాయి. 
మహిమా తయాంచా అనివార | కోణా న లాగే తయాంచా పార | 
యాత్రా యేఊ లాగలీ అపార | అపరంపార చౌబాజూ | ||౪౩|| 
43. అంతు లేని వారి మహిమయొక్క మూలం ఎవరికీ అర్థం కాలేదు. నలువైపులనుండి జనులు తండోపతండాలుగా సాయి దగ్గరకు రాసాగారు. 
ధునీ నికట తేచ స్థానీ | మలమూత్రాతే విసర్జూనీ | 
కధీ పారోసే కధీ స్నానీ | నిత్య ధ్యానీ నిరత జే | ||౪౪|| 
44. ధుని దగ్గరలోనే, మలమూత్రాలను చేసేవారు. ఒకప్పుడు స్నానం చేసేవారు. మరొకప్పుడు చేసేవారు కాదు. ఎప్పుడూ ధ్యానంలో మగ్నులై ఉండేవారు. 
డోఈస సఫేత పాగోటే ఖాసే | స్వచ్ఛ ధోతర లావీత కాసే | 
అంగాంత సదరా కీ పైరణ అసే | పెహరావ ఏసా ఆరంభీ | ||౪౫|| 
45. తలకు తెల్లటి పాగా కట్టుకుని, నడుముకు శుభ్రమైన లుంగీని కట్టుకుని, ఒంటిమీద జుబ్బా కాని, చొక్కా కాని తొడిగేవారు. మొదట్లో దుస్తులు ఇలా ధరించేవారు. 
ఆరంభీ గాంవీ వైద్యకీ కరీత | పాహూన పాహూన దవా దేత | 
హాతాలాహీ యశ బహుత | హకీమ విఖ్యాత జాహలే | ||౪౬|| 
46. మొదట్లో ఊరి జనులకు బాబా వైద్యం చేసేవారు. బాగా పరీక్షించి మందులను ఇచ్చేవారు. వారి హస్తవాసి మంచిదన్న కీర్తితో, వైద్యుడిగా పేరు పొందారు. 
ఎకదా ఎకా భక్తాచే డోళే | సుజూని ఝాలే లాల గోళే | 
రక్త బంబాళ దోనీ బుబుళే | వైద్య న మిళే శిరడీంత | ||౪౭|| 
47. ఒక మారు, ఒక భక్తునికి కళ్ళు బాగా వాచి, రెండు కనుగుడ్లు ఎర్రని గోళాల మాదిరి అయ్యాయి. అతనికి శిరిడీలో వైద్యులెవరూ దొరకలేదు. 
భక్త బిచారే భావిక భోళే | బాబాంస దాఖవితే ఝాలే డోళే | 
బిబే ఠేచూని కరవిలే గోళే | సత్వర తే వేళే బాబాంనీ | ||౪౮|| 
48. పాపం, ఏమీ తెలియని ఆ భక్తుడు తన కళ్ళను బాబాకు చూపించాడు. వెంటనే బాబా జీడి గింజలను చితక కొట్టి, ముద్దలా చేసారు. 
కోణీ ఘాలీల సురమ్యాచ్యా కాడ్యా | కోణి గాఈచ్యా దుధాచ్యా ఘడ్యా | 
కోణీ శీతళ కాపురాచ్యా వడ్యా | దేఈల పుడ్యా అంజనాచ్యా | ||౪౯|| 
49. సామాన్యంగా, ఇలాంటి కళ్ళ జబ్బుకు కాటుకను పెడుతారు, లేక ఆవు పాలతో కట్టు కడతారు. కొందరు కర్పూరపు బిళ్ళగాని, లేక అంజనం గాని వేస్తారు. 
బాబాంచా తో ఉపాయచి వేగళా | స్వహస్తే ఉచలిలా ఎకేక గోళా | 
చిణూని భరలా ఎకేక డోళా | ఫడకా వాటోళా వేష్టిలా | ||౫౦||
50. కాని, బాబా పద్ధతే వేరు. జీడి ముద్దలను ఒక్కొక్కటిగా తమ చేతుల్లోకి తీసుకుని, ఒక్కో కంట్లో బాగా నింపి, బట్టతో కట్టు కట్టారు. 

ఉదయీక డోళ్యాచీ పట్టీ సోడిలీ | వరీ పాణ్యాచీ ధార ధరిలీ | 
సూజ హోతీ తీ సర్వ నివళలీ | బుబుళే జాహలీ నిర్మళ | ||౫౧|| 
51. మరునాడు తెల్లవారే, కళ్ళకు కట్టిన పట్టీని విప్పి, కళ్ళపై ధారగా నీరు పోశారు. ఆ భక్తుని కళ్ళ వాపంతా తగ్గిపోయి, కళ్ళు శుభ్రమయ్యాయి. 
డోళ్యా సారిఖా నాజూక భాగ | నాహీ బిబ్యాచీ ఝాలీ ఆగ | 
బిబ్యానే దవడిలా నేత్ర రోగ | ఏసే అనేక అనుభవ | ||౫౨|| 
52. చాలా నాజూకు అయిన కళ్ళలో జీడి గింజలను వేస్తే, కళ్ళు మండలేదు సరికదా, కళ్ళ జబ్బు పారిపోయింది. ఇలాంటి అనుభవాలు ఎన్నో! 
ధోతీ పోతీ తయా అవగత | నకళత ఎకాంత స్థళీ జాత | 
స్నాన కరితా ఆంతడీ ఓకీత | ధుఊన టాకీత వాళావయా | ||౫౩|| 
53. హఠయోగంలో భాగాలైన ధౌతి-పోతి వంటి యోగ ప్రక్రియలు బాబాకు తెలుసు. ఎవరికీ తెలియకుండా ఒక ఏకాంత చోటుకు వెళ్ళి, స్నానం చేసేటప్పుడు, పొట్టలోని ప్రేగులను బయటకు తీసి, కడిగి, శుభ్రం చేసి, ఎండ బెట్టేవారు. 
మశీదీహూన జితకా ఆడ6 | తితకేంచ పుఢే వడాచే ఝాడ | 
తయాహీపలీకడే ఎక ఆడ | దో దివసా ఆడ జాత తే | ||౫౪|| 
54. మసీదునుండి బావి ఎంత దూరాన ఉందో, అంత దూరం ముందుకు వెళితే, అక్కడ ఒక మర్రి చెట్టు ఉండేది. దానికి అవతల ఇంకొక బావి ఉండేది. ఈ రెండవ బావి దగ్గరకు బాబా రెండు రోజులకొక సారి వెళ్ళేవారు. 
భర దుపారీ ప్రఖర ఊన | కోణీ న తెథే ఏసే పాహూన | 
స్వయే ఆడాంతూన పాణీ కాఢూన | ముఖ మార్జన కరీత | ||౫౫|| 
55. మిట్ట మధ్యాహ్నం మండుతున్న ఎండలో, అక్కడికి ఎవరూ వచ్చేవారు కాదు. అది చూచి, బాబా తామే నీరు చేదుకొని, మొహం కడుక్కునే వారు. 
అసో ఏసియా ఎకా ప్రసంగీ | బైసలే అసతా స్నానాలాగీ | 
ఆంతడీ కాఢూని లాగవేగీ | ధుఊ తె జాగీ లాగలే | ||౫౬|| 
56. ఇలాంటి ఒకప్పుడు బాబా స్నానానికి కూర్చుని, ప్రేగులను తీసి, వానిని త్వర త్వరగా కడగ సాగారు. 
అజా మారితా తిచీ ఆంతడీ | బాహ్యాభ్యంతర కరూని ఉఘడీ | 
ధుఊని ఘాలితీ ఘడీవర ఘడీ | నిర్మళ చోఖడీ కరితాత | ||౫౭|| 
57. మేకను చంపినప్పుడు, దాని ప్రేగులను బయటకు తీసి, కడిగి, శుభ్రం చేసి, చుట్ట పెడతారు. 
తైసీచ ఆపులీ ఆంతడీ కాఢూన | ఆంతూన బాహేర స్వచ్ఛ ధుఊనీ | 
పసరలీ జాంబాచే ఝాడావరూని | ఆశ్చర్య జనీ బహు కేలే | ||౫౮|| 
58. అలాగే, బాబా తమ ప్రేగులను బయటకు తీసి, లోపలా బయటా శుభ్రంగా కడిగి, జామ చెట్టుపై పరచి, ఎండబెట్టేవారు. చూచిన జనులకు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. 
జ్యాంహీ హీ స్థితీ డోళా దేఖిలీ | త్యాంతీల కాంహీ హయాత మండళీ | 
ఆహేత అజూన శిరడీంత ఉరలీ | మ్హణతీ వల్లీ తో అపూర్వ | ||౫౯|| 
59. తమ కళ్ళతో బాబాయొక్క ఈ అద్భుత లీలను చూచిన వారిలో కొందరు, ఇప్పటికీ శిరిడీలో ఉన్నారు. వారంతా బాబాకు సాటిగా ఇంకెవ్వరూ లేరని అనేవారు. 
కధీ లావీత ఖండయోగ | కరీత హస్తపాదాది విలగ | 
ఏసే మశీదీంత జాగోజాగ | అవయవ అలగ తే పడత | ||౬౦||
60. ఇంతే కాకుండా, ఖండయోగంతో తమ కాళ్ళూ, చేతులూ వేరు చేయడం కూడా బాబాకు తెలుసు. అలా చేసినప్పుడు, బాబా అవయవాలు మసీదులో అక్కడక్కడా పడి ఉండేవి. 

దేహ ఏసా ఖండ విఖండ | దేఖావా తో భయంకర ప్రచండ | 
పాహూ ధాంవత లోక ఉదండ | బాబా అఖండ త్యా దిసతీ | ||౬౧|| 
61. దేహం ఇలా ఖండ ఖండాలుగా పడి ఉందని తెలిసి, ఆ భయంకర దృశ్యాన్ని చూద్దామని ప్రజలు పరుగెట్టుకుంటూ వెళితే, వారికి యథాప్రకారం పూర్తిగా బాబా కనిపించేవారు.
పాహూని ఎకదా ఏసా ప్రకార | పాహణారా ఘాబరలా ఫార | 
కోణా దృష్టే బాబాంస ఠార | కెలే అత్యాచార హా | ||౬౨|| 
62. ఇలా ఒక సారి బాబా అవయవాలను ముక్కలు ముక్కలుగా చూసిన ఒక గ్రామస్థుడు, బాబాను ఏ దుర్మార్గుడో అత్యాచారం చేసి, హతమార్చాడు, అని చాలా గాబరా పడ్డాడు. 
మశీదీంత ఠికఠికాణీ | అవయవ దిసతీ చార హీ కోనీ | 
రాత్ర మధ్యాన్హ జవళీ న కోణీ | చింతా మనీ ఉద్భ వలీ | ||౬౩|| 
63. బాబా అవయవాలు, మసీదులో వేరు వేరుగా, విడి విడిగా నలుదిక్కులూ పడి ఉన్నాయి. అర్ధరాత్రి సమయాన వారి దగ్గర ఎవరూ లేరే అని అతను చాలా బాధపడ్డాడు. 
జావే కోణాస సాంగావయాలా | హోఈల ఉలట టాంగావయాలా | 
ఏసా విచార పడలా తయాలా | జాఊని బైసలా బాహేర | ||౬౪|| 
64. ఈ సంగతి ఎవరికైనా చెబుదాము అని అనుకుంటే, మొదట తననే అనుమానిస్తారు అని తలచి, వెళ్ళి బయట కూర్చున్నాడు. 
అసేల సాఈచా హా యోగ కాంహీ | హే తో తయాచ్యా స్వప్నీంహీ నాహీ | 
పాహోని ఛిన్నభిన్నతాహీ | భీతి హృదయీ ధడకలీ | ||౬౫|| 
65. సాయియొక్క యోగ క్రియ ఇది అని అతనికి అసలు తెలియదు. భిన్నాభిన్నంగా పడి ఉన్న బాబా దేహాన్ని చూచి, అతని హృదయం దడదడలాడింది. 
కోణాస తరీ కళవావా ప్రకార | మనాంత త్యాచే యేఈ ఫార | 
పరీ మీచ ఠరేన గున్హేగార | ప్రథమ ఖబర దేణారా | ||౬౬|| 
66. ఎవరికైనా ఈ సంగతి తెలియ చేద్దామని అతనికి చాలా అనిపించింది. కాని, ఎవరికి చెప్పినా, మొదట తనే అపరాధి అని అనుకుంటారు. 
మ్హణూన కోణాస సాంగవేనా | యేత మనాంత అసంఖ్య కల్పనా | 
మ్హణూన పహాటే జాఊన పున్హా | పహాతా మనా విస్మిత | ||౬౭|| 
67. అని, చాలా రకాలుగా ఆలోచించి, ఎవరికీ చెప్పలేదు. తెల్లవారు ఝాము కాగానే ఇంకొక సారి వెళ్ళి చూచి, ఆశ్చర్యపోయాడు. 
అదృశ్య పూర్వీల సర్వ ప్రకార | బాబా కుశలస్థానీ స్థిర | 
హే స్వప్న నాహీంనా ఏసా విచార | యేఊని పహాణార సాశ్చర్య | ||౬౮|| 
68. తను ముందు చూచినదేమీ కనిపించలేదు. ఎప్పటిలాగే, బాబా క్షేమంగా తమ చోటులో కూర్చుని ఉన్నారు. ఇది కల కాదు కదా అని అతను విస్తుపోయాడు. 
హే యోగ హే ధోతీపోతీ | బాళపణాపాసూని ఆచరతీ | 
కోణా న కళేతీ అగమ్యగతి | యోగస్థితీ తయాంచీ | ||౬౯|| 
69. ధౌతి-పోతి అను ఈ యోగ ప్రక్రియలు బాబాకు చిన్నప్పటినుంచే అలవాటు. కాని, వారికి యోగంలో ఉన్న పట్టు, దాని వలన కలిగే శక్తి గురించి ఎవరికీ అర్థం కాలేదు. 
దిడకీస నాహీ కోణాచ్యా శివలే | గుణానే ప్రఖ్యాతీతే పావలే | 
గరీబ దుబళ్యాంస ఆరోగ్య దిధలే | హకీమ గాజలే తే ప్రాంతీ | ||౭౦||
70. ఎవరి దగ్గరా బాబా దమ్మిడి అయినా తీసుకునే వారు కాదు. వారి కీర్తి, రోగాలను నయం చేయడంతో వచ్చినది. పేదలకు, బలహీనులకు, ఆరోగ్యాన్నిచ్చి, ఆ ప్రాంతంలో హకీముగా పేరు పొందారు. 

హకీమ హా తో కేవళ పరార్థా | అతి ఉదాస తో నిజస్వార్థా | 
సాధావయా పరకీయార్థా | అసహ్యానర్థా సాహతసే | ||౭౧|| 
71. కాని ఈ హకీము కేవలం ఇతరులకు వైద్యం చేయడం వరకే. తమ విషయంలో చాలా వైరాగ్యంగా ఉండేవారు. ఇతరుల కోసం ఎంత సహింపరాని బాధనైనా సహించేవారు. 
యే అర్థీంచీ అభినవ కథా | నివేదితో మీ శ్రోతియాం కరితా | 
విదిత హోఈల బాబాంచీ వ్యాపకతా | తైశీచ దయార్ద్రతా తయాంచీ | ||౭౨|| 
72. ఈ సందర్భంలో, శ్రోతలకు, ఎవరూ ఊహించని ఒక కథను, నేను మనవి చేస్తాను. దాంతో బాబాయొక్క దయగల మనస్సు, మరియు వారు అన్ని చోట్లా వ్యాపించి ఉండటం గురించి తెలుస్తాయి. 
సన ఎకోణీసశే దహా సాలీ | సమయ ధనతేరస7 దివాళీ | 
బాబా సహజ ధునీజవళీ | బైసలే జాళీత లాంకడే | ||౭౩|| 
73. క్రి. శ. ౧౯౧౦ వ సంవత్సరంలో దీపావళి ముందు వచ్చే త్రయోదశి రోజు (ధన్‍తెరాస్‍), బాబా మామూలుగా ధుని దగ్గర కూర్చుని, ధునిలో కట్టేలను కాల్చుతున్నారు. 
ప్రఖర తెవలీ హోతీ ధునీ | నిజహస్త త్యాంతచి ఖుపసునీ | 
బాబా బైసలే నిశ్చింత మనీ | హాత భాజూని నిఘాలా | ||౭౪|| 
74. ధుని బాగా మండుతుండగా, చుట్టు ప్రక్కల ధ్యాస లేకుండా, బాబా తమ చేతిని నిప్పులో దూర్చి, అలానే కూర్చున్నారు. వారి చేయి చాలా దారుణంగా కాలింది. 
మాధవ నామే తయాంచా సేవక | లక్ష గేలే తయాచే సాహజిక | 
దేశపాండేహీ8 హోతే నజీక | తేహీ తాత్కాలిక ధాంవలే | ||౭౫|| 
75. మాధవ అనే వారి సేవకుడు దాన్ని చూచాడు. మాధవరావు దేశపాండే కూడా వారి దగ్గరే ఉన్నాడు. ఇది చూసి, వెంటనే బాబా వెనుకకు పరుగెత్తాడు. 
జాఊనీ మాగే మారూని బైసకా | కంబరేస ఘట్ట ఘాతలా విళఖా | 
బాబాంస మాగే ఓఢోని దేఖా | పుసతీ విలోకా మగ కాయ | ||౭౬|| 
76. వారి వెనుక కూర్చుని, వారి నడుము చుట్టూ చేయి వేసి, గట్టిగా పట్టుకుని, వెనుకకు లాగాడు. లాగి, ‘దేవా! ఎందుకిలా చేశారు?’ అని అడిగాడు. 
హాహా దేవా హే కాయ కేలే | మ్హణతా బాబా ధ్యానావర ఆలే | 
ఎక పోరరే ఖాకేచే మ్హణతీ నిసటలే | భట్టీంత పడలే ఎకాకీ | ||౭౭| 
77. బాబా వెంటనే తేరుకుని, “ఒక పసిపాప తన తల్లి చంకలోనుండి హఠాత్తుగా జారి, కమ్మరి వాని కొలిమిలో పడింది. 
ఏకూని నిజపతీచ్యా హాకే | లోహారాచీ రాండరే ధాకే | 
మారూని ఆపుల్యా పోరాస ఖాంకే | భాతా ఫుంకే భట్టీచా | ||౭౮|| 
78. “తన బిడ్డను ఒడిలో వేసుకున్న ఒక కమ్మరి వాని భార్య, భర్త పిలుపు విని, భయంతో కొలిమి తిత్తిని వేగంతో ఊదసాగింది. 
ఫుంకతా ఫుంకతా లక్ష చుకలీ | ఖాంకేస పోర హే తీ విసరలీ | 
పోర తీ అచపళ తెథూన నిసటలీ | పడతాంచ ఉచలలీ మీ శామా | ||౭౯|| 
79. “అలా కొలిమిని ఊదుతూ ఊదుతూ, తన ఒడిలో ఉన్న బిడ్డ సంగతి మరిచిపోయింది. ఆ పాప దుడుకుగా అక్కడినుండి జారిపోయింది. కాని శ్యామా, జారిన వెంటనే నేను పైకి లేవనెత్తాను. 
కాఢావయాస త్యా పోరీలా | గేలో తో హా ప్రకార ఘడలా | 
భాజూ దేరే హా హాత మేలా | ప్రాణరే వాచలా పోరీచా | ||౮౦||
80. “ఆ పాపను బయటికి తీయబోతే, ఇలా జరిగింది. ఈ చేయి కాలితే కాలనీ, బిడ్డ ప్రాణం దక్కింది కదా” అని అన్నారు. 

ఆతా యా హాతాచే దుఖణే | కైసా ఉపాయ కరావా కవణే | 
చాందోరకరాస పత్ర ఘాలణే | మాధవరావానే ఠరవిలే | ||౮౧|| 
81. ‘ఇప్పుడు ఈ చేతి బాధను ఎలా నయం చేయాలి?’ అని మాధవరావు ఆలోచించాడు. నానా చాందోర్కరుకు ఉత్తరం వ్రాయాలని నిశ్చయించుకున్నాడు.
పత్ర లిహిలే సవిస్తర | పరమానంద ప్రసిద్ధ డాక్టర | 
సమవేత ఘేఊనియా సత్వర | ఆలే చాందోరకర శిరడీస | ||౮౨|| 
82. ఏదీ వదలకుండా జరిగినదంతా ఉత్తరంలో వ్రాశాడు. పరమానంద అనే ప్రసిద్ధమైన డాక్టరును తీసుకుని నానా వెంటనే శిరిడీకి వచ్చాడు. 
ఉపయోగా పడతీ దాహోపశమనా | ఏశీ ఘేతలీ ఔషధే నానా | 
పరమానంద సమవేత నానా | సాఈ చరణా పాతలే | ||౮౩|| 
83. కాలిన గాయాన్ని తగ్గించటానికి అవసరమైన ఎన్నో రకాల మందులతో, మంచి డాక్టరుతో, నానా సాయి పాదాల వద్దకు వచ్చాడు. 
కరూని బాబాంసి అభివందన | పుసతీ కుశల వర్తమాన | 
నివేదిలే ఆగమన ప్రయోజన | హస్తావలోకన ప్రార్థిలే | ||౮౪|| 
84. బాబా పాదాలకు నమస్కరించి, కుశల ప్రశ్నల తరువాత, తాను వచ్చిన పనిని తెలిపి, బాబాయొక్క చేతిని చూపించమని నానా ప్రార్థించాడు. 
ఆధీంచ హాత పోళల్యాపాసూన | భాగోజీ శిందా తూప చోళూన | 
పట్టయా బాంధీతసే కరకరూన | పాన బాంధూన ప్రత్యహీ | ||౮౫|| 
85. చేయి కాలినప్పటినుండే, భాగోజీ శిండే బాబా చేతికి నేయి వ్రాసి, ప్రతిరోజూ ఆకులు వేసి గట్టిగా కట్టు కట్టేవాడు. 
తో హాత సోడోనియా పహావా | పరమానందాస దాఖవావా | 
దవా ఉపచార సురూ కరావా | గుణ పడావా బాబాంనా | ||౮౬|| 
86. ఆ కట్లను విప్పి, పరమానందకు చూపించి, సరియైన మందులతో ఉపచారం చేస్తే, బాబాకు తొందరగా నయమవుతుంది. 
హీ సదిచ్ఛా ధరూని మనీ | బహుత నానాంనీ కేలీ మనధరణీ | 
ప్రయత్నహీ కేలా పరమానందానీ | పట్టయా సోడూని పహావే | ||౮౭|| 
87. అన్న మంచి ఉద్దేశంతో నానా బాబాను ఎంతో ప్రార్థించాడు. కట్లు విప్పి, చేతి గాయాన్ని తను చూడాలని పరమానందు కూడా విశ్వ ప్రయత్నం చేశాడు. 
ఆజ ఉద్యా ఆజ ఉద్యా కరూనీ | వైద్య ఆపులా అల్లా మ్హణూనీ | 
హస్త న దిధలా పహావయా లాగూనీ | ఖేదహీ న మనీ తయాచా | ||౮౮|| 
88. ఇవాళ రేపు, ఇవాళ రేపు, అంటూ, “నా వైద్యుడు అల్లా” అని చెప్పుతూ, తమ చేతిని బాబా అసలు చూడనివ్వలేదు. అలా చూపక పోవడం వలన వారి మనసులో ఏ వ్యథా లేదు. 
పరమానందాచా ఆణిలేలా దవా | తయా న లాగలీ శిరడీచీ హవా | 
పరీ సాఈదర్శన సుహావా | తయా ఘడావా యోగ హా | ||౮౯|| 
89. పరమానందు తెచ్చిన మందులకు శిరిడీ గాలి కూడా సోకలేదు. కాని, సాయి దర్శనం, దానితో పొందే ఆనందం, అతనికి అదృష్టవశాత్తు కలిగింది. 
భాగోజీచీచ నిత్య సేవా | భాగోజీనేంచ హాత చోళావా | 
తేణే కాళే హాతహీ బరవా | హోఊని సర్వా సుఖ ఝాలే | ||౯౦||
90. భాగోజీయే ప్రతి రోజూ సేవ చేసేవాడు. బాబా చేతిని బాగా మర్దించేవాడు. అతని సేవ, భక్తి వలన బాబాయొక్క కాలిన చేయి, కొద్ది రోజులకు నయమై, అందరికీ ఆనందం కలిగింది. 

ఏసా జరీ హాత బరా ఝాలా | న కళే బాబాంస యేఈ కాయ దుకళా | 
తీ ప్రాతఃకాళచీ యేతా వేళా | పట్టయాంచా సోహళా ప్రతిదినీ | ||౯౧|| 
91. ఇలా బాబా చేతి గాయం నయమైన తరువాత కూడా, ఏ కారణం చేతనో, ప్రతి రోజు తెల్లవారగానే కట్టు విప్పే కార్యక్రమం జరుగుతుండేది. బాబాకు అసలు చేతి వలన ఏ బాధా ఉండలేదు, కాని, ఆ సమయం రాగానే, ఈ కార్యక్రమం మొదలైయ్యేది. 
నసతా హాతాస కాంహీంహీ వేదనా | నిత్య నిష్కారణ తయాచీ జోపాసనా | 
ఘృతమర్దన నిష్పీడన జోపాసనా | ఆమరణాంత చాలవిలీ | ||౯౨|| 
92. వారికి చేతి నొప్పి ఏ మాత్రం లేకపోయినా, ఏ కారణమో తెలియక, ప్రతి రోజూ వారి చేతికి నేతి మర్దన సేవ మటుకు, బాబా సమాధి వరకు జరిగింది. 
హీ ఉపాసనా భాగోజీచీ | సాఈ సిద్ధా న ఆవశ్యకతా జీచీ | 
భాగోజీస ఘడవితీ నిత్యనేమాచీ | భక్తకాజాచీ ఆవడీ | ||౯౩|| 
93. స్వతహాగా తామే సిద్ధులవటంతో, భాగోజీయొక్క ఈ సేవ, ఉపచారం బాబాకు అవసరం ఉండలేదు. కాని, భక్తుల శ్రేయస్సుపై ప్రీతి కల బాబా, భాగోజీకి ఈ నిత్య సేవా భాగ్యాన్ని ప్రసాదించారు. 
పూర్వ జన్మీంచే మహాదోష | భాగోజీ పావల కుష్ట క్లేశ | 
పరీ తయాచే భాగ్య విశేష | సాఈ సహవాస లాధలా | ||౯౪|| 
94. వెనుకటి జన్మలో చేసిన ఏ మహాపాపం వలనో, కాబోలు, భాగోజీకి కుష్టు రోగం వచ్చింది. అయినా, అతని అసాధారణమైన భాగ్యం వలన, సాయి సహవాసం కలిగింది. 
లెండీవరీ నిఘతా ఫేరీ | భాగోజీ బాబాంచా ఛత్రధారీ | 
రక్తపితీ భరలీ శరీరీ | పరీ సేవేకరీ ప్రథమ తో | ||౯౫|| 
95. బాబా లెండీకి వెళ్ళేటప్పుడు, భాగోజీ వారికి గొడుగు పట్టేవాడు. ఒంటిలో పుళ్ళూ, చీము, రక్తంతో నిండి ఉన్నా, బాబా పరిచారకులలో అతడు మొదటి వాడు. 
ధునీపాసలే స్తంభాపాశీ | బాబా జెవ్హా ప్రాతఃసమయాశీ | 
ప్రత్యహీ బైసత నిజారామాశీ | హజర సేవేసీ తై భాగ్యా | ||౯౬|| 
96. ప్రతి రోజూ తెల్లవారి, ధునికి చేరువలో ఉన్న కంభం దగ్గర, విశ్రామంగా బాబా కూర్చున్నప్పుడు, భాగోజీ వారి సేవకు హాజరయ్యేవాడు. 
హాతాపాయాంచ్యా పట్టయా సోడణే | త్యా త్యా ఠాయీంచే స్నాయూ మసళణే | 
మసళల్యా ఠాయీ తూప చోళణే | సేవా కరణే భాగ్యానే | ||౯౭|| 
97. బాబా కాళ్ళకు, చేతులకు ఉన్న కట్లను విప్పి, అక్కడి కండరాలను నేతితో బాగా మర్దన సేవ చేసేవాడు. 
పూర్వజన్మీంచా మహాపాపిష్ట | సర్వాంగీ భరలే రక్త కుష్ట | 
భాగోజీ శిందా మహావ్యాధిష్ట | పరీ భక్త వరిష్ఠ బాబాంచా | ||౯౮|| 
98. వెనుకటి జన్మలలో మాహాపాపి అయినా, దేహమంతా కుష్టు రోగం నిండి ఉన్నా, బాబా భక్తులలో భాగోజీ శ్రేష్ఠుడు. 
రక్తపితీనే ఝడలీ బోటే | దుర్గంధీనే సర్వాంగ ఓఖటే | 
ఏసే జయాచే దుర్భాగ్య మోఠే | భాగ్య చోఖటే సేవా సుఖే9 | ||౯౯|| 
99. కుష్టు రోగం వలన అతని వ్రేళ్ళు పోయాయి; అన్ని అవయవాలలోనుండి భరింపరాని చెడు వాసన వస్తూ ఉండేది. ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నా, అన్నింటికన్నా గొప్పదైన బాబాయొక్క సేవా భాగ్యాన్ని పొందాడు. 
కితీ మ్హణూని శ్రోతయాంలా | వర్ణూ బాబాంచ్యా అగాధ లీలా | 
ఎకదా గాంవీ గ్రంథీజ్వర10 ఆలా | చమత్కార ఝాలా తో పరిసా | ||౧౦౦||
100. ఇలాంటి బాబాయొక్క అద్భుత లీలలను ఎన్నని వర్ణించను? ఒక సారి గ్రామంలో ప్లేగు రోగం వచ్చింది. అప్పుడు జరిగిన చమత్కారాన్ని వినండి. 

దాదాసాహేబ ఖాపర్డ్యాంచా11 | ములగా ఎక లహాన వయాచా | 
ఆనంద సాఈసహవాసాచా | నిజ మాతేచ్యా సహభోగీ | ||౧౦౧|| 
101. దాదాసాహేబు ఖాపర్డే కొడుకు, ఇంకా చిన్నవాడు, తన తల్లితో పాటు సాయితో సహవాసంతో వచ్చే ఆనందాన్ని పొందుతున్నాడు.
ఆధీంచ తో ములగా లహాన | తాప ఆలా ఫణఫణూన | 
మాతేచే హృదయ ఆలే ఉలూన | అస్వస్థమన జాహలీ | ||౧౦౨|| 
102. అసలే పసివాడు. అతనికి శరీరం కాలిపోయేలా జ్వరం రాగా, కన్నతల్లి హృదయం ద్రవించి, అశాంతితో మనసు తల్లడిల్లింది. 
ఉమరావతీ వసతీస్థాన | ఆలే మనీ కరావే ప్రస్థాన | 
సాయంకాళచీ వేళ సాధూన | ఆలీ ఆజ్ఞాపన ఘ్యావయా | ||౧౦౩|| 
103. తన ఊరైన అమరావతికి వెళ్ళిపోవాలని ఆమె ఆలోచించింది. సాయంత్రం మంచి అదను చూసుకుని, సాయి అనుమతి పొందటానికి వచ్చింది. 
అస్తమానచీ కరితా ఫేరీ | బాబా యేతా వాడియాశేజారీ | 
బాఈ జాఊని పాయ ధరీ | నివేదన కరీ ఘడలే జే | ||౧౦౪|| 
104. సాయంకాలం బయటికి వెళ్తూ, బాబా వాడా దగ్గరకు రాగానే, ఆమె వెళ్ళి బాబా పాదాలను పట్టుకుని, జరిగినదంతా బాబాతో చెప్పింది. 
ఆధీంచ స్త్రియాంచీ జాత ఘాబరీ | తశాంత ములాచీ థాంబేనా శిరశిరీ | 
గ్రంథి జ్వరాచీ భీతీహీ భారీ | నివేదన కరీ ఘడలే తే | ||౧౦౫|| 
105. అసలే ఆడవారిది కలవర పడే స్వభావం. పైగా కొడుకు జ్వరం తగ్గక, ప్లేగు భయంతో మరీ భయపడిపోయి, ఆమె బాబాకు మనవి చేసింది. 
బాబా వదతీ మృదు వచన | ఆభాళ ఆలే ఆహే జాణ | 
పడేల పాఉస పీకపికోన | ఆభాళ వితూళూన జాఈల | ||౧౦౬|| 
106. ఆమెతో బాబా చాలా మెల్లగా మాట్లాడుతూ, “ఆకాశంలో మబ్బులు క్రమ్ముకున్నాయి. వర్షం పడి పంట పండుతుంది. మబ్బులు తొలగిపోతాయి. 
భితా కిమర్థ ఏసే వదూన | కఫనీ కంబరేపర్యంత ఉచలూన | 
దావితే ఝాలే సకళాం లాగూన | గ్రంథీ టవటవూన ఉఠలేల్యా | ||౧౦౭|| 
107. “ఎందుకు భయపడుతున్నావు?” అని అంటూ తమ కఫనీని నడుం వరకు లేవనెత్తి, ఎర్రగా పొంగిన బొబ్బలను అందరికీ చూపించారు. 
కుక్కుటీచ్యా అండ్యాంఎవఢే | చార గ్రంథీ చోహీకడే | 
మ్హణతీ పహా హే భోగణే పడే | తుమచే సాంకడే మజలాగీ | ||౧౦౮|| 
108. కోడి గ్రుడ్లంత పెద్దగా, నలువైపులా నాలుగు గడ్డలున్నాయి. “చూడు, మీ బాధలను నేనిలా భరిస్తున్నాను” అని చెప్పారు. 
హే దివ్య ఆణి అలౌకిక | కర్మ పాహోని విస్మిత లోక | 
భక్తాంలాగీ దుఃఖేహీ కైక | భోగితీ అనేక సంత కశీ | ||౧౦౯|| 
109. అసామాన్యమూ, దైవికమూ అయిన ఈ లీలను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. భక్తుల లెక్కలేనన్ని కష్టాలను, సత్పురుషులు ఎలా అనుభవిస్తారో, కదా! 
మేణాహూని మఊచిత్త | సబాహ్య జైసే నవనీత | 
లాభేవీణ భక్తాంసీ ప్రీత | భక్తచి గణగోత జయాచే | ||౧౧౦||
110. మైనం కంటే మెత్తని, వెన్నలాంటి మనసుగల బాబా, స్వంత లాభాలేవీ లేకుండానే, భక్తులను ప్రేమిస్తారు. భక్తులే వారి బంధువులు. 

ఎకదా ఏసా వర్తలా ప్రకార | నానాసాహేబ చాందోరకర | 
నిఘాలే సోడూని నందురబార | పంఢరపురాస జావయా | ||౧౧౧|| 
111. ఒక మారు, నానాసాహేబు చాందోర్కరు నందర్బారు వదిలి పండరీపురం వెళ్ళటానికి బయలుదేరాడు. 
నానా పరమ భాగ్యశాలీ | సాఈంచీ అనన్య సేవా ఫళలీ | 
భూవైకుంఠ ప్రాప్తి ఘడలీ | మామలత మిళాలీ తెథీల | ||౧౧౨|| 
112. నానా చాలా భాగ్యవంతుడు. బాబాకు అతను చేసిన సేవ ఫలించింది. భూలోకంలో వైకుంఠమనే పండరీపురం ప్రాప్తి కలిగి, అతడు అక్కడ మామలతుదారునిగా నియమింపబడ్డాడు. 
యేతాంచ హుకూమ నందురబారీ | జాణే హోతే అతి సత్వరీ | 
తాతడీనె కేలీ తయారీ | హేత అంతరీ దర్శనాచా | ||౧౧౩|| 
113. నందర్బారులో ఉత్తరవు అందుకున్న వెంటనే, పండరీపురం వెళ్ళిపోవలసి ఉండింది. బాబాను చూడాలనే కోరికతో, గబగబా ప్రయాణానికి సిద్ధమయ్యాడు. 
సహకుటుంబ సహపరివార | శిరడీస జాణ్యాచా ఝాలా విచార | 
శిరడీచ ప్రథమ పంఢరపుర | కరూ నమస్కార బాబాంసీ | ||౧౧౪|| 
114. అతనికి శిరిడీయే మొదటి పండరీపురం కనుక, సకుటుంబ సపరివారంగా శిరిడీ వెళ్ళి, బాబాకు నమస్కారం చేయాలన్న ఆలోచన వచ్చింది. 
నాహీ కోణాస పత్ర పాఠవిలే | నాహీ నిరోప వృత్త కళవిలే | 
సరసమాన సర్వ ఆవరిలే | గాడీంత బైసలే లగబగా | ||౧౧౫|| 
115. తాను శిరిడీ వస్తున్నట్లు ఎవరికీ ఉత్తరం వ్రాయలేదు. కనీసం కబురు కూడా పంపలేదు. ఉన్న సామానంతా సర్దుకొని, త్వరగా బండిలో కూర్చున్నాడు. 
ఏసే జే హే నానా నిఘాలే | నసేల శిరడీంత కోణాస కళలే | 
పరీ సాఈంస సర్వ సమజలే | సర్వత్ర డోళే తయాంచే | ||౧౧౬|| 
116. ఇలా తొందరగా నానా బయలుదేరిన సంగతి, శిరిడీలో ఎవరికీ తెలియదు. కాని, సాయికి అన్నీ తెలుసు. వారి దృష్టి అందరి మీద, అన్ని చోట్లా ఉన్నాయి. 
నానా నిఘాలే సత్వర | అసతీల నిమగావాచే శివేవర | 
తో శిరడీంత చమత్కార | ఘడలా సాచార తో పరిసా | ||౧౧౭|| 
117. నానా అంత త్వరగా నందర్బారు వదిలి, నీంగాం ఊరి శివారుకు వచ్చే సరికి, శిరిడీలో ఒక అద్భుతమైన చమత్కారం జరిగింది. దాని గురించి వినండి. 
బాబా హోతే మశీదీంత | మ్హాళసాపతీ సమవేత | 
ఆపాశిందే కాశీరామ భక్త | వార్తా కరీత బసలేలే | ||౧౧౮|| 
118. మ్హాలసాపతితో మాట్లాడుతూ బాబా మసీదులో ఉన్నారు. అప్పా శిండే, కాశీరాం మొదలగు భక్తులు ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. 
ఇతుక్యాంత బాబా మ్హణతీ అవఘే | మిళున కరూంయా భజన చౌఘే | 
ఉఘడిలె పంఢరీచే దరవాజే | భజన మౌజెనే చాలవూ | ||౧౧౯|| 
119. ఇంతలో అకస్మాత్తుగా “పండరీపురం తలుపులు తెరచుకున్నాయి. మనం నలుగురం కలిసి, ఆనందంగా భజన చేద్దాం” అని బాబా అన్నారు. 
సాఈ పూర్ణ త్రికాలజ్ఞాతా | కళూన చుకలీ తయా హీ వార్తా | 
నానా శివేచ్యా ఓఢ్యాసీ అసతా | భజనోల్లాసతా బాబాంస | ||౧౨౦||
120. భూత, భవిష్యత్తు, వర్తమానం, ఈ మూడు కాలాలు పూర్తిగా తెలిసిన జ్ఞాని సాయి. నానా వచ్చేది వారికి తెలుసు. గ్రామ శివారు దగ్గరకు నానా రాగానే, ఎంతో ఉత్సాహంతో భజన పాడటం ఆరంభించారు. 

||భజన|| 
"పంఢరపురలా జాయాచే జాయాచే | తిథేంచ మజలా రాహ్యాచే || 
తిథేంచ మజలా రాహ్యాచే రాహ్యాచే | ఘర తే మాఝ్యా రాయాచే ||" 

||భజన|| 
"పంఢరపురానికి వెళ్ళుతాను, వెళ్ళుతాను| అక్కడ నేను ఉండాలి|| 
అక్కడే నేను ఉండాలి, ఉండాలి| నా స్వామి ఇల్లు అదే"||

స్వయే బాబా భజన మ్హణతీ | భక్త బసలెలె అనువాద కరితీ | 
పంఢరీచే ప్రేమాంత రంగతీ | ఇతక్యాంత యేతీ నానాహీ | ||౧౨౧|| 
121. స్వయంగా బాబాయే భజన పాడుతుంటే, అక్కడ కూర్చున్న భక్తులందరూ వారితో పాటు పాడ సాగారు. అందరూ పంఢరీనాథుని భక్తిలో, ప్రేమలో లీనమై పోయారు. అనుకోకుండా, అప్పుడే నానా కూడా వచ్చాడు.
సహకుటుంబ పాయీ లాగత | మ్హణతీ ఆతా ఆమ్హాం సమవేత | 
మహారాజాంనీ పంఢరపురాంత | నివాంస నిశ్చింత బైసావే | ||౧౨౨|| 
122. సకుటుంబంగా సాయి పాదాలకు నమస్కరించాడు. ‘మహారాజ్‍, మాతో పండరీపురానికి వచ్చి, నిశ్చింతగా, ప్రశాంతంగా మాతోనే ఉండండి’ అని నానా సాయిని వేడుకున్నాడు. 
తో హీ వినంతీ నకోచ హోతీ | ఆధీంచ బాబాంచి ఉల్హాస వృత్తి | 
పంఢరీ గమన భజన స్థితి | జన నివేదితీ తయాంస | ||౧౨౩|| 
123. అలా నానా ప్రార్థించే అవసరం లేకుండానే, బాబా అప్పటికే పండరీపుర ప్రయాణానికై, ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు చెప్పారు. 
నానా మనీ అతి విస్మిత | లీలా పాహూని ఆశ్చర్య చకిత | 
తయా పాయీ డోఈ ఠేవీత | సద్గ దీత జాహలే | ||౧౨౪|| 
124. మనసులోనే, నానా చాలా ఆశ్చర్య చకితుడైయాడు. బాబా లీల అతనిని నోట మాట రాకుండా చేసింది. గద్గదమైన గొంతుతో, భావావేశుడై సాయి పాదాలపై తన తలను ఉంచాడు. 
ఘేఊనియా ఆశీర్వచన | ఉదీ ప్రసాద మస్తకీ వందూన | 
చాందోరకర పంఢరపురా లాగూన | నిరోప ఘేఊన నిఘాలే | ||౧౨౫|| 
125. ఊది ప్రసాదము మరియు సాయి ఆశీర్వాదం పొంది, వారి అనుమతితో, చాందోర్కరు పండరీపురానికి బయలుదేరాడు. 
ఏశా గోష్టీ సాంగూ జాతా | హోఈల గ్రంథవిస్తారతా | 
మ్హణఊని ఆతా పరదుఃఖ నివృత్తితా | విషయ ఆటోపతా ఘేఊ హా | ||౧౨౬|| 
126. ఇలా కథలను చెప్పుకుంటూ పోతే, ఈ గ్రంథం చాలా పెద్దదై పోతుంది. అందుకే, భక్తుల దుఃఖాలను బాబా తొలగించే సంగతుల గురించిన సాయి లీలలను ఇప్పుడు త్వరగా ముగిస్తాను. 
సంపవూ హా అధ్యాయ ఆతా | అంత నాహీ బాబాంచే చరితా | 
పుఢీల అధ్యాయీ అవాంతర కథా | వదేన స్వహితాలాగీ మీ | ||౧౨౭|| 
127. బాబా చరిత్రకు అంతమంటూ ఉందా? అందువలన ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. తరువాతి అధ్యాయంలో, నా శ్రేయస్సు కొరకు, మిగతా కొన్ని కథలను చెప్పుతాను. 
హీ మీపణాచీ అహంవృత్తీ | జిరవూ జాతా జిరేనా చిత్తీ | 
హా మీ కోణ న కళే నిశ్చితీ | సాఈచ వదతీల నిజ కథా | ||౧౨౮|| 
128. ఈ ‘నా’ అన్న అహంభావాన్ని ఎంత అణచి వేయాలనుకున్నా కావటం లేదు. అయినా, ఈ ‘నా’ అనేది ఎవరు అని నిశ్చయంగా తెలియదు. కనుక సాయియే తమ కథను చెప్పుతారు. 
వదతీల నర జన్మాచీ మహతీ | కథితీల నిజభైక్ష్య వృత్తి | 
బాయజాబాఈచీ తీ భక్తీ | భోజన స్థితీ హీ అపులి | ||౧౨౯|| 
129. మానవ జన్మయొక్క మహిమను వారే తెలియ చేస్తారు. తమ భిక్షాటన గురించి, బాయజాబాయి భక్తిని గూర్చి, తమ భోజన పద్ధతిని కూడా వారే చెప్పుతారు. 
సవే ఘేఊని మ్హాళసాపతీ | తైసేచ కోతే తాత్యా గణపతీ | 
బాబా నిజత మశీదీప్రతీ | కైసియే రీతీ తే పరిసా | ||౧౩౦||
130. మహల్సాపతిని, తాత్యా కోతే గణపతిని తమ వెంట పెట్టుకుని, మసీదులో బాబా ఎలా పడుకునే వారో, వినండి. 

పంత హేమాడ సాఈంస శరణ | మ్హణవీ భక్త-పాయీంచీ వహాణ | 
తయాసీ సాఈచీ ఆజ్ఞా ప్రమాణ | ఝాలే నిరూపణ యేథవర | ||౧౩౧||
131. హేమాడపంతు సాయికి శరణుజొచ్చి, తాను భక్తుల కాలి చెప్పు అని తెలియ చేస్తున్నాడు. తనకు సాయి మాటే ప్రమాణం. సాయి ఆజ్ఞను బట్టే ఇంతవరకు ఈ కథ చెప్పటం జరిగింది. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | వివిధకథా నిరూపణం నామ | 
|సప్తమోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||


టిపణీ: 
1. తాబూత. 
2. అగ్నీ. 
3. అభిమాన. 
4. హా ఎక సుందర, కాతీవ కాంకడీ రథ శిరడీస మశీదీచ్యా మండపాత అసతో. హా ఇందూరచే బాబాంచే ప్రేమళ భక్త రా. బాళాసాహేబ రేగే, దాజీసాహేబ అవస్థీ వగైరేంనీ ఉత్సవాచ్యా దివశీ గావాత మిరవణుకీసాఠీ సంస్థానాస అర్పణ కేలా ఆహే. 
5. హా దండ మ్హణజే హాత - దీడ హాత లాంబ ఆణి చాంగలా పాయాచ్యా అంగఠ్యా ఎవఢా జాడ అసా మజబూత కాళ్యా లాకడాచా సటకా, జో బాబాంచ్యాపాశీ నిత్య అసే. మశీదీతూన చావడీత జాతానా ఆణి తేథూన మశీదీత పరత యేతానా బాబా ఎకా హాతాత త్యాంచీ చిలీమ వ తంబాఖూచీ పురచుండీ ఆణి దుసర్యా హాతాత హా త్యాంచా సటకా, అసే బరోబర ఘేఊన నిత్య జాత వ యేత. 
6. విహీర. 
7. ధనత్రయోదశీ (దివాళీచ్యా పూర్వదివశీ). 
8. మాధవరావ దేశపాండే. 
9. సేవా కరావయాసాఠీ కోణీహీ యేవో, సాఈబాబాంనీ కోణాచా కధీహీ అవ్హేర కేలా నాహీ. ఉలట త్యాస ప్రేమానేచ వాగవిలే ఆహే. ఎకదా ఎక మహారోగీ బాఈ మహారాజాంకడే ఆలీ. మహారాజాంనీ భీమాబాఈ నావాచ్యా ఎకా మరాఠా జాతీచ్యా బాఈలా తిలా ఆపల్యా ఘరీ రాహణ్యాస జగా దేణ్యావిషయీ సాంగితలే. భీమాబాఈ మ్హణాలీ, ‘బాబా, తిలా మహారోగ ఝాలా ఆహే నా? తిలా మాఝ్యా ఘరాత జాగా కశీ దేఊ?’ మహారాజ మ్హణాలే, “అగే, తీ మహారోగీ అసలీ మ్హణూన కాయ ఝాలే? తీ మాఝీ బహీణ ఆహే. సఖ్ఖీ బహీణ ఆహే. తిలా ఆపల్యా ఘరీ ఘేఊన జా.” అసే మహారాజాంచే శబ్ద నిఘాల్యావర భీమాబాఈ తిలా ఆపల్యా ఘరీ ఘేఊన గేలీ వ తినే తిలా ఉతరావయాలా జాగా దిలీ. తీ మహారోగీ బాఈ ఎక మహీనా రాహూన తినే తేథేచ ఆపలా దేహ ఠేవలా. బాళాజీ పాటీల నేవాసకర హే ఎకదా ఆపల్యా గావీ జాణ్యాసాఠీ పరవానగీ మాగూ లాగలే. మహారాజ మ్హణాలే, “దగడూభాఊ ఆజరీ ఆహే, త్యాచ్యాకడే ఆపణ లక్ష ద్యావే.” దగడూభాఊ హా జాతీచా ముసలమాన రక్తపితీనే అత్యంత పిడలా హోతా. పాటలాంనీ రోజ త్యాచ్యా అంగాతలే కిడే కాఢావే, సగళీ లస స్వతః ధువావీ ఆణి త్యాలా స్నాన ఘాలావే, అసా క్రమ ఎక మహినా చాలలా. పుడే తో దగడూభాఊ మేలా ఆణి పాటలాలా మహారాజాంనీ ఘరీ జాణ్యాచీ పరవానగీ దిలీ. 
10. ప్లేగ. 
11. ది. ఆనరేబల గణేశ శ్రీకృష్ణ ఖాపర్డే, జే ఇండియా సరకారచ్యా లేజిస్లేటివ్హ అసేంబ్లీచే మెంబర హోతే.