Monday, January 21, 2013

||శ్రీసంతఘోలపరామ దర్శనం నామ ద్వాదశోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత 
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౨ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

జయ జయ సద్గురూ సాఈనాథా | నమితో చరణీ ఠేఊని మాథా | 
నిర్వికారాఖండైక స్వరూపా | కరీ కృపా శరణాగతా | ||౧|| 
1. జయ జయ సద్గురు సాయినాథా! మీ పాదాలలో తలనుంచి నమస్కరిస్తున్నాను. ఎల్లప్పుడూ ఆకారంలేని ఆత్మ రూపంలో మీరు లీనమై ఉండి, మీకు శరణుజొచ్చిన వారిని కరుణిస్తారు.
సచ్చిదానందా ఆనంద కందా | భవదవార్త సౌఖ్యనిష్పందా | 
అద్వైత బోధే ద్వైత ఛందా | మందాచ్యాహీ వారిసీ | ||౨|| 
2. సచ్చిదానందా! ఆనంద కందా! సంసార సాగరంలో చిక్కుకుని కష్ట పడుతున్నవారికి, సుఖాలను కలిగిస్తారు. 
అవఘ్యా ఠాయీ పూర్ణ భరలే | గగన జైసే హే విస్తారలే | 
తేంచ కీ తవ స్వరూప రేఖాటలే | అనుభవీ భలే దైవశాలీ | ||౩|| 
3. ఆకాశం వలె ఈ జగతినంతా పూర్తిగా వ్యాపించి ఉన్న మీ రూపాన్ని, తలచుకుని అనుభవించిన వారు నిజంగా భాగ్యవంతులు. 
సాధూంచే వ్హావే సంరక్షణ | అసాధూచే సమూళ నిర్దళణ | 
ఎతదర్థచి ఈశ్వరావతరణ | సంత హే విలక్షణ యా పరతే | ||౪|| 
4. సాధువులను రక్షించటానికి, చెడ్డవారిని మొత్తంగా నశింప చేయటానికి, దేవుడు అవతరిస్తాడు. కాని, ఈ సత్పురుషుల లక్షణాలే వేరు. 
సాధు అసాధు సంతా సమాన | ఎక మోఠా ఎక ఊన | 
హే జాణేనా జయాంచే మన | సమసమాన ఉభయా జే | ||౫|| 
5. వారికి సాధువులు, సాధువులు కానివారు, అంతా సమానమే. ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అనే భేద భావం వారికి తెలియదు. వారికి ఇద్దరూ ఒకటే. 
ఈశ్వరాహూన సంత మోఠే | అసాధూంస ఆధీ లావితీ వాటే | 
మన జయాంచే తిళతిళ తుటే | ప్రేమ దాటే దీనార్థ | ||౬|| 
6. సత్పురుషులు దేవుడికంటే గొప్పవారు. ఎందుకంటే, వారు మొదట చెడ్డవారిని మంచి దారిలో పెట్టాలని ప్రయత్నిస్తారు. దీనుల కోసం, వారి మనసు ప్రేమతో తపించి పోతుంటుంది. 
భవసాగరాచే హే అగస్తి | అజ్ఞాన తమాచే హె గభస్తి | 
పరమాత్మ్యాచీ ఎథేంచ వస్తీ | వస్తుతః హే తదభిన్న | ||౭|| 
7. సంసార సాగరాన్ని, అగస్త్య ఋషివలె, సాయి ఔపోశనం పడతారు. అజ్ఞానమనే చికటిని తొలగించి జ్ఞానమనే వెలుగునిచ్చే సూర్యులు వీరు. దేవుడు వీరిలోనే ఉంటాడు. అసలుకు, వీరు దేవుడికంటే వేరే కాదు. 
ఏశాంతీల హా సాఈ మాఝా | అవతరలా భక్తకాజా | 
మూర్తీమంత జ్ఞానరాజా | కైవల్యతేజాధిష్టిత | ||౮|| 
8. ఇలాంటి సత్పురుషులలో మన సాయి ఒకరు. భక్తుల కోసం అవతరించిన జ్ఞాన రాజు. దేవుడితో ఒకటైనప్పుడు కలిగే వెలుగుతో, వారు వెలిగిపోతారు. 
జీవ మాత్రీ అత్యంత మమతా | ఇతరత్ర అత్యంత అనాసక్తతా | 
ఠాయీ సత్తా ఠాయీ విరక్తతా | నిర్వైర సమతా సర్వత్ర | ||౯|| 
9. అన్ని ప్రాణుల మీద వారికి విపరీతమైన ప్రేమ. మిగతా సంగతుల గురించి అసలు పట్టించుకోరు. ఒక చోట ఆసక్తి, ఇంకొక చోట అసలు ఆసక్తి లేనట్లు కనిపించినా, అన్ని చోట్లా వారికి సమ భావమే. 
జయా న శత్రు మిత్రభావ | సరిసే జయా రంకరావ | 
ఏసా జో సాఈ మహానుభావ | ఏకా ప్రభావ తయాచా | ||౧౦||
10. వారికి మిత్రులు శత్రువులు అనే భావం అసలు ఉండదు. రాజైనా, పేదైనా వారికి ఒకటే. ఇలాంటి సాయి మహానుభావుని గొప్పతనాన్ని వినండి. 

సంత ఆపుల్యా పుణ్య కోడీ | వేంచితీ భక్త ప్రేమాచ్యా ఓఢీ | 
న పాహతీ ఆడ పర్వత దరడీ | ఘాలితీ ఉడీ భక్తార్థ | ||౧౧|| 
11. వారు సంపాదించిన పుణ్య సంపదను, భక్తులపై ప్రేమతో, వారి కోసం ఖర్చు పెడతారు. కొండలు, గుట్టలు ఏ అడ్డంకులు వచ్చినా, లెక్క చేయక, భక్తుల కోసం వాటిని దాటి వస్తారు. 
ఎక అజ్ఞానీ మ్హణూన నేణతీ | పరమార్థ కాయ కశాశీ ఖాతీ | 
స్త్రీ పుత్ర ధన కామీ లోలంగితీ | బిచారీ నేణతీ తీ సోడా | ||౧౨|| 
12. పరమార్థం అంటే ఏమిటో తెలియక, భార్యాబిడ్డల మీద మోహంతో, డబ్బు సంపాదనలో మునిగి పోయిన వారిని, అజ్ఞానులని తలచి వదిలి వేయాలి. 
ఏసీ నేణతీ బాళీ భోళీ | దేవ తయాంతే కృపా కురవాళీ | 
దేవాస విముఖ దేవా నిరాళీ | అభిమాన పోళీ తయాంతే | ||౧౩|| 
13. ఇలాంటి అమాయకులను దేవుడు కరుణిస్తాడు. కాని, దేవుడికి దూరంగా, అహంకారంతో ఉన్నవారి అభిమానాన్ని అణచి వేస్తాడు. 
అజ్ఞానియాంచీ యేఈల కీంవ | సంత ఎకాదా లావీల జీవ | 
విశ్వాస ప్రకటేల లాఠీవ | జ్ఞానాచీ తాఠీవ నిష్ఫల | ||౧౪|| 
14. సాధువులు అజ్ఞానులను కరుణిస్తారు. దానితో వారికి సాధువులపై నమ్మకం కలుగుతుంది. తమకే జ్ఞానముందని అహంకారం పడటం దండుగ. 
పండితంమన్య మూఢ మతీ | శుష్కాభిమానే ఉగీచ ఫుగతీ | 
భక్తిపంథ అవహేళితీ | నకో సంగతీ తయాంచీ | ||౧౫|| 
15. తామే పండితులమని మూర్ఖులు ఉత్తుత్తి అభిమానంతో పొంగిపోతారు. భక్తి మార్గాన్ని వారు అవహేళన చేస్తారు. అలాంటి వారి సహవాసం మనకు పనికి రాదు. 
నకో వర్ణసంకర బండ | నకో వర్ణాభిమాన థోతాండ | 
న వ్హా వర్ణాశ్రమ ధర్మలండ | పాఖండ పండిత న వ్హావే | ||౧౬|| 
16. వర్ణాశ్రమానికి విరుద్ధంగా కాని, దాని పరంగా కాని, మనకు వాద వివాదాలు అనవసరం. వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్నాం అనే అహంకారము వద్దు. వీటితో పాషండ (వేదాలను వ్యతిరేకించిన) పండితులు కాకండి. 
వేద వేదాంగ పారంగత | జ్ఞానగర్వే మదోన్మత్త | 
భక్తి మార్గాచే ఆడ యేత | తయాంచీ ధడగత దిసేనా | ||౧౭|| 
17. వేద వేదాంగాలను తెలుసుకున్న వారు, జ్ఞాన గర్వంతో, అహంకారంతో భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి తరించే మార్గం లేదు. 
అజ్ఞానీ విశ్వాస పడిపాడే | తరేల తో భవభయ సాంకడే | 
పరీ యా శాస్త్ర పండితాంచే కోడే | కదా నులగడే కవణాతే | ||౧౮|| 
18. అమాయకులు నమ్మకం ఆధారంతో సంసార సాగరంలోని కష్టాలనుంచి బయట పడతారు. కాని, శాస్త్ర పండితుల చిక్కులను ఎవరూ విడదీయలేరు. 
సంతాపాయీ ఠేవితా విశ్వాస | అజ్ఞానియా అజ్ఞాన నిరాస | 
జ్ఞానాభిమానియా న వికల్ప సాయాస | ఉపజేల తయాంస సద్భావ | ||౧౯|| 
19. సత్పురుషుల మీద నమ్మకం ఉంచితే, అజ్ఞానుల అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం అభిమానులకు అనుమానాలు తొలగిపోయి, మంచి భావన, ఆలోచనలు మొదలౌతాయి. 
అసో ఎకదా సుదైవ పరిపాటీ | కైసీ ఘడలీ విచిత్ర గోష్టీ | 
హోతీ ఎకా కర్మఠాచే లలాటీ | అలభ్య భేటీ సాఈచీ | ||౨౦||
20. ఒక సారి ఒక విచిత్రమైన ఘటన జరిగింది. దైవ నిర్ణయం ప్రకారం, సంప్రదాయాన్ని కఠోరంగా పాటించే ఒక భక్తునికి సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం కలిగింది. 

తయాచా సంకల్ప హోతా వేగళా | యోగాయోగ హోతా నిరాళా | 
తేణేంచ శిరడీచా లాభ ఘడలా | దృష్టీస పడలా నిజగురూ | ||౨౧|| 
21. అతను అనుకున్నది వేరు. కాని, దైవం అనుకున్నది వేరు. దైవ నిర్ణయం ప్రకారం, శిరిడీ ప్రయాణ యోగం కలిగి, అక్కడ తన గురువు దర్శనం చేసుకున్నాడు.
తే అతి సురస కథానక | జే గురూమహాత్మ్య ప్రకాశక | 
శ్రవణ కరాజీ ఆవశ్యక | ప్రేమ నిదర్శక గురూభక్తా | ||౨౨|| 
22. గురువు మహిమను తెలియ చేసే రసభరితమైన ఆ కథను తప్పక వినండి. అది గురుభక్తుల ప్రేమకు ఉదాహరణ. 
నాశిక క్షేత్రస్థ కర్మఠ సోంవళే | అగ్నిహోత్రీ ఉపనామ ముళే | 
పూర్వ పుణ్యాఈచ్యా బళే | శిరడీస ఆలే ఎకదా | ||౨౩|| 
23. నాసిక అనే ఊరిలో నివాసి. సంప్రదాయాలను అతిగా పాటించేవాడు. ఆచారాలను నిష్ఠగా పాటించే, ఒక అగ్నిహోత్రి. ఇంటి పేరు ముళే. వెనుకటి పుణ్య బలంతో ఒక సారి శిరిడీకి వచ్చాడు. 
గాంఠీ నసతా హే బళ | శిరడీస కోణీహీ ఠరేనా పళ | 
కోణాచా కితీహీ నిశ్చయ ప్రబళ | న చలే చళవళ బాబాంపుఢే | ||౨౪|| 
24. ఎంతో పుణ్యం సంపాదించి ఉండకపోతే, శిరిడీలో ఎవరూ కూడా, ఒక క్షణమైనా ఉండ లేరు. ఎవరిదైనా, ఎంతటి దృఢ నిశ్చయమైనా, బాబా ఎదుట అవేవీ సాగవు. 
కోణీ మ్హణేల మీ జాఈన | మనమానే తో తేథే రాహీన | 
నాహీ తయాచ్యా హే ఆధీన | పరాధీన తో సర్వస్వీ | ||౨౫|| 
25. శిరిడీ వెళ్ళి, నాకు తోచినంత కాలం నేను అక్కడుంటానని ఎవరైనా అనుకోవచ్చు. కాని, అది వారి చేతిలో లేదు. అనుకున్నట్లు జరగదు. అక్కడ అందరూ ఇంకొకరి అధీనంలో ఉండాల్సిందే. 
ఏసే మీ మీ మ్హణతా | థకలే కిత్యేక నిశ్చయ కరితా | 
సాఈ ఎక స్వాతంత్ర్య దేవతా | గళే అహంతా ఇతరాంచీ | ||౨౬|| 
26. ఇలా నేను నేననే అహంకారంతో అనుకున్నది చేయలేక అలసిపోయారు. తామనుకున్న ప్రకారమే చేసే ఒక స్వతంత్ర దైవం బాబా. వారి ఎదుట ఇతరుల అహంకారం కరిగిపోతుంది. 
అపులీ పాళీ ఆలియావీణ | బాబాంస హోఈనా అపులే స్మరణ | 
కానీ న యేఈ తద్గుణవర్ణన | దర్శన స్ఫురణ కోఠూన | ||౨౭|| 
27. మన వంతు వస్తేనే గాని, బాబాకు మనం గుర్తుకు రాము. వారి గుణగణాల వర్ణన మన చెవులకు వినిపించదు. ఇక వారిని తలచు కోవటం, వారిని దర్శించుకోవటం ఎక్కడిది? 
జావే సాఈ సమర్థ దర్శనా | అసతా కిత్యేకాంచీ కామనా | 
యోగచి ఆలా నాహీ త్యాంనా | సాఈ నిర్వాణాపర్యంత | ||౨౮|| 
28. చాలా మంది సాయి సమర్థుల దర్శనానికి వెళ్ళాలని అనుకున్నా, సాయి నిర్వాణం వరకు వారికి ఆ అదృష్టం కలగలేదు. 
పుఢే జాఊ జాఊ మ్హణతా | ఆడ యేఊన దీర్ఘసూత్రతా | 
రాహిలే కిత్యేక యేతా యేతా | బాబాహీ నిఘనతా పావలే | ||౨౯|| 
29. ఇంకా కొందరు తరువాత పోదాం, ఆ పై పోదాం అని అనుకుంటూ సమయాన్ని వృథా చేసిన వారికి, ఏవో అడ్డంకుల వలన ప్రయాణం కుదరలేదు. ఇంతలో బాబా సమాధి చెందారు. 
ఆజ ఉద్యా కరిత రాహిలే | అఖేర ప్రత్యక్ష భేటీస అంతరలే | 
ఏసే పశ్చాత్తాప పావలే | అంతీ నాగవలే దర్శనా | ||౩౦||
30. ఇవాళ పోదాం, రేపు పోదాం అని అనుకుంటూ, చివరకు బాబా ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకుని, చాలా పశ్చాత్తాప పడ్డారు. 

ఏసియాంచీ జీ రాహిలీ భూక | పరిసతా కథా యా ఆదర పూర్వక | 
పురవీల దుధాచీ తహాన తాక | విశ్వాస ఎక ఠేవితా | ||౩౧|| 
31. సాయి దర్శనం చేసుకోవాలనే కోరిక తీరని వారు, ఈ కథల మీద నమ్మకం ఉంచి, భక్తి శ్రద్ధలతో వింటే, పాలకు బదులు మజ్జిగ దొరికినట్లు, బాబాయొక్క దర్శన దాహం కొంత వరకు తీరుతుంది. కాని, నమ్మకమొకటే ఉండాలి. 
బరే జే భాగ్యే కోణీ గేలే | దర్శన స్పర్శనే చిత్తీ ధాలే | 
తే కాయ తెథే యథేచ్ఛ రాహిలే | బాబాంనీ ఠేవిలే పాహిజే | ||౩౨|| 
32. మన అదృష్టం కొద్దీ శిరిడీ వెళ్ళి, సాయి దర్శన, వారి స్పర్శ సుఖాలను పొందిన వారు, బాబా ఉంచితే తప్ప, అక్కడ తమ ఇష్టం కొద్దీ ఉండగలిగేవారా, బాబా ఉంచాలి గాని! 
అపుల్యాపాయీ కోణా న జావవే | రాహూ మ్హణతా కోణా న రాహవే | 
ఆజ్ఞా హోఈ తోంచ వసావే | మాఘారా జావే జా మ్హణతా | ||౩౩|| 
33. ఎవరైనా కాని, వారు అనుకున్నట్లు అక్కడికి వెళ్ళలేరు. వెళ్ళినా, ఎంత బలమైన కోరిక ఉన్నా, ఉండలేరు. బాబా అనుమతిని ఇచ్చినంత వరకే ఉండగలము. “వెళ్ళి పో” అంటే తిరిగి వెళ్ళి పోవలసిందే. 
ఎకదా కాకా మహాజనీ | శిరడీస గేలే ముంబఈహూనీ | 
ఎక ఆఠవడా శిరడీస రాహునీ | పరతావే మనీ తయాంచే | ||౩౪|| 
34. ఒక సారి, కాకా మహాజని ముంబైనుండి శిరిడీ వెళ్ళాడు. ఒక వారం రోజులు అక్కడ ఉండాలన్నది అతని కోరిక. 
చావడీ సుందర శృంగారీత | బాబాంసమోర పాళణా టాంగీత | 
కృష్ణజన్మాచా ఉత్సవ కరీత | ఆనందే నాచత భక్తజన | ||౩౫|| 
35. శ్రీకృష్ణ జన్మాష్టమి కోసమని, చావడి అందంగా అలంకరించ బడింది. బాబా ఎదుట ఊయల వ్రేలాడ కట్టబడి ఉంది. భక్తులు శ్రీకృష్ణ జన్మోత్సవంలో ఆనందంగా నాట్యం చేస్తున్నారు. 
గోకుళ అష్టమీచాహీ సోహళా | ఆనందానే పహావా డోళా | 
సాధూని ఏసీ మౌజేచీ వేళా | కాకా శిరడీలా పాతలే | ||౩౬|| 
36. ఆ గోకులాష్టమి వైభవాన్ని ఆనందంగా, కళ్ళారా చూడాలనే కోరికతో, కొంత ముందుగానే, కాకా శిరిడీ చేరుకున్నాడు. 
ఆరంభీచ బాబాంచ్యా దర్శనా | జాతా బాబా పుసతీ తయాంనా | 
“పరతణార కేవ్హా నిజ సదనా” | విస్మిత మనా తై కాకా | ||౩౭|| 
37. కాని, బాబా దర్శనానికే మొదట వెళ్ళగా, బాబా అతనిని, “మీ ఇంటికి ఎప్పుడు వెళ్ళుతున్నావు?” అని అడిగారు. కాకా ఆశ్చర్యపోయాడు. 
భేటతా క్షణీంచ హా కా ప్రశ్న | కాకా జాహలే విస్మయాపన్న | 
రాహూ శిరడీంత ఆఠ దిన | హోతే కీ మన తయాంచే | ||౩౮|| 
38. ‘కలిసిన వెంటనే ఇదేం ప్రశ్న’ అని కాకా తనలో తాను ఆశ్చర్య పడ్డాడు. వారం రోజులు ఉండాలనే కోరికతోనే అతను శిరిడీ వచ్చాడు. 
బాబాచ జేవ్హా స్వయే పుసతీ | ఉత్తర దేణే కాకాప్రతీ | 
తేంహీ వాటే బాబాచ సుచవితీ | మ్హణూన దేతీ యోగ్యతే | ||౩౯|| 
39. కాని బాబాయే స్వయంగా ఈ ప్రశ్న అడిగి, చెప్పాల్సిన జవాబునూ సూచించారు. కాకా చెప్పిన సమాధానం చాలా సరియైనదే. 
“బాబా జేవ్హా దేతీల ఆజ్ఞా | పరతేన తెవ్హా అపులే సదనా” | 
ప్రత్యుత్తర యేతాంచ కాకాంచ్యా వదనా | ‘ఉదయీక జా నా’ మ్హణాలే | ||౪౦||
40. ‘బాబా ఎప్పుడు ఆజ్ఞ చేస్తే అప్పుడు వెళ్తాను’ అని జవాబిచ్చాడు. కాకా చెప్పిన జవాబు విని బాబా “ఉదయం వెళ్దువు గాని లే” అని అన్నారు. 

ఆజ్ఞా కేలీ శిరసా ప్రమాణ | కరూన బాబాంసీ అభివందన | 
అసతా అష్టమీసారఖా సణ | కేలే ప్రయాణ తేచ దినీ | ||౪౧|| 
41. భక్తితో బాబా ఆజ్ఞను కాకా తలమీద పెట్టుకుని, వారి పాదాలకు నమస్కారం చేసి, కృష్ణాష్టమి పండుగ రోజే శిరిడీనుంచి బయలుదేరాడు.
పుఢే జంవ తే గాంవీ యేతీ | పేఢీ వరతీ జాఊన పాహతీ | 
మాలక మార్గ ప్రతీక్షాచ కరితీ | కాకా పరతతీ కేవ్హా హీ | ||౪౨|| 
42. ఊరు చేరిన తరువాత, తన కార్యాలయానికి వెళ్ళి చూడగా, కాకా ఎప్పుడు తిరిగి వస్తాడా అని, అక్కడ అతని యజమాని అతని రాకకు ఎదురు చూస్తున్నాడు. 
మునీమ ఎకాఎకీ అజారీ | మాలకాస కాకాంచీ జరూరీ | 
కాకాంనీ త్వరిత యావే మాఘారీ | పత్ర శిరడీవరీ మోకలీలే | ||౪౩|| 
43. గుమాస్తాకు అకస్మాత్తుగా జబ్బు చేయటంతో, యజమానికి కాకా అవసరం తప్పని సరియై, అతనిని వెంటనే రమ్మని అప్పటికే శిరిడీకి ఉత్తరం వ్రాశాడు. 
కాకా తేథూన నిఘాల్యావరీ | టపాలవాలా తపాస కరీ | 
మగ తే పత్ర పాఠవీ మాఘారీ | మిళాలే ఘరీ కాకాంస | ||౪౪|| 
44. శిరిడీనుండి కాకా బయలుదేరాక, టపాలా వాడు వాకబు చేసి, ఉత్తరాన్ని త్రిప్పి పంపగా, అది కాకాకు ఇంట్లో దొరికింది. 
తేచ పహా కీ యాచే ఉలట | శ్రవణ కరా హీ అల్ప గోష్ట | 
భక్తాంస న కళే నిజాభిష్ట | సాఈ తే స్పష్ట జాణతసే | ||౪౫|| 
45. దీనికి విరుద్ధంగా, ఇంకో చిన్న కథను వినండి. తమ మంచి ఏమిటో భక్తులకే తెలియదు. కాని, బాబాకు అది స్పష్టంగా తెలుసు. 
ఎకదా నాశికచే ప్రఖ్యాత వకీల | నామే భాఊసాహేబ ధుమాళ | 
బాబాంచే ఎక భక్త ప్రేమళ | ఆలే కేవళ దర్శనా | ||౪౬|| 
46. నాసికులో భావుసాహేబు ధుమాళ అను ప్రసిద్ధి చెందిన వకీలు ఉండేవాడు. బాబా అంటే అతనికి విపరీతమైన భక్తి, ప్రేమ. ఒక సారి అతను సాయి దర్శనానికై శిరిడీకి వచ్చాడు. 
ఉభ్యా ఉభ్యా ఘ్యావే దర్శన | కరూనియా పాయీ నమన | 
ఘేఊని ఉదీ ఆశిర్వచన | జావే పరతోన హే పోటీ | ||౪౭|| 
47. దర్శనం చేసుకుని, బాబా పాదాలకు నమస్కరించి, విభూతిని, వారి ఆశిస్సులను తీసుకుని తొందరగా వెంటనే వెళ్ళి పోవాలని అతని ఉద్దేశం. 
పరతతా వాటేవర నిఫాడాస | ఉతరణే హోతే ధుమాళాంస | 
తేథే ఎకా ముకదమ్యాస | జాణే తయాంస ఆవశ్యక | ||౪౮|| 
48. తిరుగు ప్రయాణంలో, నిఫాడ అను ఊరికి ఒక కేసు కోసం ధుమాళు వెళ్ళవలసిన అవసరం ఉంది. 
హా జరీ తయాంచా బేత | బాబా జాణత ఉచితానుచిత | 
పరత జావయా ఆజ్ఞా మాగత | బాబా న దేత తీ త్యాంనా | ||౪౯|| 
49. అతని ఆలోచన అలా ఉంది కాని, బాబాకు అతని మంచి గురించి బాగా తెలుసు. అందుకే, తిరిగి వెళ్ళిపోవటానికి బాబా అనుమతి కోసం ధుమాళు వెళ్ళితే, వారు అతనికి అనుమతిని ఇవ్వలేదు. 
ఆఠవడా ఎక ఠేవూన ఘేతలే | ఆజ్ఞా దేణ్యాచే స్పష్ట నాకారిలే | 
సునావణీచే కార్య లాంబలే | తైసేచ గేలే తీన1 వార | ||౫౦||
50. అనుమతిని ఇవ్వటానికి స్పష్టంగా నిరాకరించి, ఒక వారం రోజులు అక్కడే ఉంచేశారు. కేసు వాయిదా పడింది. అలా మూడు సార్లు జరిగింది. 

ఆఠవడ్యావరహీ కాంహీ దివస | ఠేవూన ఘేతలే ధుమాళాంస | 
ఇకడే ముకదమ్యాచే తారఖేస | న్యాయాధీశాస అస్వస్థతా | ||౫౧|| 
51. ధుమాళును వారం పైగా అక్కడ ఉంచేశారు. వాయిదా పడిన రోజులంతా న్యాయాధీశునికి ఆరోగ్యం బాగలేక పోయింది. 
జన్మాంత కధీంహి నాహీ ఠావా | ఏసా పోటశూళ దుర్ధర ఉఠావా | 
ముకదమా ఆపాప పుఢే ఢకలావా | కాళ లాగావా సార్థకీ | ||౫౨|| 
52. జన్మలో ఎన్నడూ ఎరుగని, విపరీతమైన కడుపు నొప్పి వచ్చి, కేసు దానంతట అదే వాయిదా పడింది. ఆ సమయాన్ని ధుమాళు మంచి పనికి ఉపయోగించాడు. 
అసో ధుమాళాంస సాఈసహవాస | పక్షకారాచా చింతా నిరాస | 
ఘడూన ఆలే అప్రయాస | ఠేవితా విశ్చాస సాఈవర | ||౫౩|| 
53. సాయిని నమ్మినందుకు, అతనికి సాయి సహవాసం, మరియు అతని ముద్దాయికి చింతా నివారణ, ఏ కష్టమూ లేకుండానే రెండూ కలిగాయి. 
పుఢే మగ యోగ్య కాలీ | ధుమాళాతే ఆజ్ఞా దిధలీ | 
కార్య సర్వ యథాస్థిత ఝాలీ | అఘటిత కేలీ2 సాంఈచీ | ||౫౪|| 
54. తరువాత ఒక మంచి సమయాన, ధుమాళుకు వెళ్ళటానికి అనుమతి దొరికింది. సాయియొక్క విచిత్ర లీలా ప్రభావంతో అన్ని పనులూ చక్కగా జరిగాయి. 
ముకదమా చాలలా చార3 మాస | జాహలే చార న్యాయాధీశ | 
పరీ అఖేరీస ఆలే యశ | ఆరోపీ నిర్దోష సూటలా | ||౫౫|| 
55. ఆ కేసు నాలుగు నెలలు నడిచింది. నలుగురు న్యాయాధీశులు మారారు. చివరకు విజయం లభించింది. నిందితుడు నిర్దోషి అని విడుదల చేయబడ్డాడు. 
ఎకదా ఎక భక్తప్రవర | నానాసాహేబ నిమోణకర | 
కైసా తయాంచ్యా పత్నీచా కైవార | ఘేతలా తో ప్రకార పరిసావా | ||౫౬|| 
56. బాబా ఒక సారి, నానాసాహేబు నిమోణ్కరు అన్న భక్తుని భార్య పక్షం వహించిన చిన్న కథను, ఇప్పుడు వినండి. 
నిమోణ గాంవీచే వతనదార | న్యాయాధీశాచా కారభార | 
సోంపవీ జయా సరకార | వజనదార హే మోఠే | ||౫౭|| 
57. నిమోణ అన్న ఊరికి నానాసాహేబు వతన్దారు. ప్రభుత్వం అతనికి గౌరవ మేజిస్ట్రేటు పదవిని ఇచ్చింది. ఇతనికి అక్కడ చాలా పలుకబడి ఉండేది. 
మాధవరావాంచే పితృవ్య జ్యేష్ట | వయోవృద్ధ పూజ్య శ్రేష్ట | 
జాయాహీ4 మోఠీ ఎకనిష్ట | సాఈచ ఇష్ట దైవత జ్యా | ||౫౮|| 
58. మాధవరావుకు అతను పెదనాన్న. వయసులో పెద్దవాడు, అందరి గౌరవాలను పొందినవాడు. అతని భార్య కూడా చాలా గొప్ప నిష్ఠాపరురాలు. వారిద్దరికీ సాయియే ఇష్ట దైవం. 
సోడూనియా వతనీ గాంవ | శిరడీంత దోఘాంహీ దిధలా ఠావ | 
సాఈచరణీ ఠేవూని భావ | సుఖ స్వభావ వర్తతీ | ||౫౯|| 
59. తమ స్వంత ఊరుని వదిలి, శిరిడీలో ఆ ఇద్దరూ సాయి పాదాలను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ, సుఖంగా ఉన్నారు. 
ఉఠూనియా బ్రహ్మ ముహూర్తీ | ప్రాతఃస్నాన పూజన సారితీ | 
కరాయా నిత్య కాకడ ఆరతీ | చావడీప్రతీ తీ యేత | ||౬౦||
60. ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తన (సూర్యోదయానికి గంటన్నర మునుపు) లేచి, స్నానం చేసి, పూజకు సిద్ధం చేసుకుని, కాకడ హారతిని చేయటానికై చావడికి వెళ్ళేవారు. 

పుఢే అపులీ స్తోత్రే మ్హణత | నానా బాబాంపాశీంచ రాహత | 
హోఈ సూర్యాస్త తో పర్యంత | సేవేత నిరత బాబాంచ్యా | ||౬౧|| 
61. ఆ తరువాత, స్తోత్రాలను చెప్పేవారు. రోజూ సూర్యుడు అస్తమించే వరకు, బాబా సేవలో, బాబా దగ్గరే నానా ఉండేవాడు.
లెండీవరీ బాబాంస నేత | మశీదీంత ఆణూన ఘాలిత | 
పడేల తీ తీ సేవా కరీత | ప్రేమ భరీత మానసే | ||౬౨|| 
62. లెండీ వరకు బాబాతో వెళ్ళడం, అక్కడినుంచి మసీదు దాకా వారితో రావటం, మొదలైన ప్రేమ పూర్వకమైన, అవసరమైన, సేవలు చేసేవాడు. 
బాఈనేహీ అపుల్యా పరీ | కరవేల తీ బాబాంచీ చాకరీ | 
కరావీ అతి ప్రేమభరీ | దివసభరీ తెథేంచ | ||౬౩|| 
63. అతని భార్య కూడా ఆమెకు చేతనైనంత, చాలా ప్రేమతో దినమంతా, బాబా దగ్గరే ఉండి, బాబా సేవ చేసేది. 
మాత్ర కరాయా స్నాన పాన | స్వయంపాక జేవణ ఖాణ | 
అథవా రాత్రీ కరాయా శయన | నిజస్థాన సేవావే | ||౬౪|| 
64. స్నానానికి, వండుకోవటానికి, రాత్రి పడుకోవటానికి మాత్రమే ఆమె తన బసకు వెళ్ళేది. 
బాకీ అవశేష సర్వకాళ | దుపారతిపార సాంజ సకాళ | 
ఘాలవీ హే దంపత్య ప్రేమళ | రాహూని జవళ బాబాంచ్యా | ||౬౫|| 
65. మిగతా సమయమంతా, తెల్లవారి, మధ్యాహ్నం, సాయంత్రం, ఆ ప్రేమమయ దంపతులు బాబా దగ్గరే ఉండేవారు. 
అసో యా దోఘాంచీ సేవా వర్ణితా | హోఈల బహు గ్రంథ విస్తారతా | 
మ్హణూన ప్రస్తుత విషయాపురతా | భాగ మీ ఆతా ఏకవితో | ||౬౬|| 
66. ఇలా ఆ ఇద్దరి సేవలను వర్ణిస్తుంటే, ఈ గ్రంథం చాలా పెద్దదై పోతుంది. అందుకు, ఇప్పటికి సంబంధించిన కథా భాగాన్ని వినిపిస్తాను. 
బాఈస జాణే బేలాపురీ | ములగా తెథే థోడా అజారీ | 
కేలీ పతీచ్యా విచారీ | తెథే తయారీ జాణ్యాచీ | ||౬౭|| 
67. వారి అబ్బాయికి ఆరోగ్యం బాగా లేకపోవటంతో, ఆమె బేలాపూరులో ఉన్న ఆ కోడుకును చూడాలని అనుకున్నది. అక్కడికి వెళ్ళటం గురించి భర్తతో మాట్లాడింది. 
పుఢే నిత్యక్రమానుసార | బాబాంచాహీ ఘేతలా విచార | 
పడతాంచ బాబాంచా హోకార | ఘాతలా కానావర పతీచ్యా | ||౬౮|| 
68. తరువాత ఎప్పటిలాగే, బాబా అనుమతిని పొంది, ఆ సంగతి భర్తకు తెలిపింది. 
అసో ఏసే నిశ్చితపణే | ఠరలే బేలాపురచే జాణే | 
పుఢే పడలే నానాచే మ్హణణే | ఉద్యాంచ పరతణే మాఘారా | ||౬౯|| 
69. ఈ రకంగా ఆమె బేలాపూరు వెళ్ళటం నిశ్చయమైంది. కాని, మరుసటి రోజే తిరిగి రావాలని నానా అన్నాడు. 
నానాస హోతే కాంహీ కారణ | మ్హణూన మ్హణతీ తిజలాగూన | 
జా పరీ యే పరతోన | దుశ్చితమన కుటుంబ | ||౭౦||
70. ఏవో కారణాల వలన, ఆమెతో నానా ‘రేపే తిరిగి వచ్చేసేయి’ అని అన్నాడు. ఇది విని, ఆమె మనసుకు బాధ కలిగింది. 

దుసరే దివశీ పోళ్యాచీ అవస | తోహీ తెథేంచ కాఢావా దివస | 
హోతీ బాఈచ్యా మనాచీ హౌస | యేఈనా మనాస నానాంచ్యా | ||౭౧|| 
71. మరుసటి రోజు ‘పోళా’ అమావాస్య కావటంతో, ఆ రోజు అక్కడే గడపాలని ఆమె ఉబలాట పడింది. కాని, నానాకు అది ఇష్టం లేదు. 
శివాయ అమావాస్యేచా దిన | అనుక్త కరాయా గమనాగమన | 
బాఈస పడలే కోడే గహన | కైసీ సోడవణ హోఈల | ||౭౨|| 
72. అమావాస్య రోజు ప్రయాణం మంచిది కాదు. ఈ పరిస్థితినుండి ఎలా తప్పించుకోవాలి, అని ఆమె చాలా ఆరాట పడింది. 
బేలాపురాస గేల్యావీణ | వాటే న తిజలా సమాధాన | 
దుఖవితా నయే పతీచే మన | ఆజ్ఞోల్లంఘన మగ కైచే | ||౭౩|| 
73. బేలాపూరుకు వెళ్ళకపోతే, ఆమె మనసుకు శాంతి ఉండదు. అయినా, భర్త మనసును బాధ పెట్టటం ఆమెకు ఇష్టం లేదు. మరి, భర్త మాటను ఎలా కాదంటుంది? 
అసో మగ కేలీ తయారీ | నిఘాలీ జావయా బేలాపురీ | 
లెండీస నిఘాలీ బాబాంచీ స్వారీ | నమస్కారీ తయాంతే | ||౭౪|| 
74. అయినా, అన్ని ఏర్పాట్లనూ చేసుకుని, బేలాపూరు వెళ్ళటానికి సిద్ధమై బయలుదేరింది. బాబా లెండీ తోటకు వెళ్ళడం చూసి, వారి పాదాలకు నమస్కరించింది. 
కోణీహీ బాహేర గావీ జాతా | పావావయా నిర్విఘ్నతా | 
దేవాపుఢే ఖాలవీ మాథా | తీచ కీ ప్రథా శిరడీంత | ||౭౫|| 
75. ఎవరైనా బయటి ఊరికి వెళ్ళేటప్పుడు, ఏ అడ్డంకులూ రాకుండా ప్రయాణం జరగాలని, దేవుడికి నమస్కరించటం అలవాటు. ఈ పద్ధతిని శిరిడీలో కూడా పాటించేవారు. 
పరీ తెథీంచా దేవ సాఈ | జావయాచీ కితీహీ ఘాఈ | 
నిఘావయాచే సమయీ డోఈ | తయాంచే పాయీ ఠేవీత | ||౭౬|| 
76. శిరిడీలో కనిపించే దైవం సాయి. అందుకు, ఎంత తొందరగా ఉన్నా, ముందు బాబా పాదాలకు నమస్కరించి, ఆ తరువాతే బయలుదేరే వారు. 
యా తెథీల క్రమానుసార | సాఠ్యాంచియా వాడ్యాసమోర | 
బాబా ఉభే అసతా క్షణభర | బాఈనే చరణ వందిలే | ||౭౭|| 
77. అదే ప్రకారం, సాఠేవాడా ఎదుట బాబా ఒక క్షణం పాటు నిలవగా, ఆమె బాబా పాదాలకు నమస్కరించింది. 
నానాసాహేబ నిమోణకర | ఆదీకరూన సాన థోర | 
యేఊన తెథే దర్శన తత్పర | నమస్కారీత బాబాంనా | ||౭౮|| 
78. ఆమెతో, నానాసాహేబు నిమోణ్కరు మొదలగు పెద్దలు, పిన్నలూ, బాబా దర్శనం చేసుకోవాలని వచ్చి, వారికి నమస్కరించారు. 
ఏసియా సమస్త మండళీ దేఖతా | విశేషతః నానాంచియా సమక్షతా | 
బాబా జే వదలే బాఈస తత్వతా | పహావీ సమయోచితతా తయాచీ | ||౭౯|| 
79. అలా అక్కడ అందరూ చూస్తుండగా, బాబా పాదాలపై తల ఉంచి నమస్కరించి, బయలుదేరటానికి అనుమతిని కోరుతున్న నానా భార్యతో, నానా ఎదుటే, బాబా చెప్పిన దానిని, గమనించండి. 
పాయీ ఠేవూనియా మాథా | నిఘావయాచీ ఆజ్ఞా మాగతా | 
“జా బరే లవకర జా ఆతా | స్వస్థ చిత్తా అసావే | ||౮౦||
80. బాబా పాదాలపై తల ఉంచి, బయలుదేరటానికి ఆమె అనుమతిని కోరగా, “సరే వెళ్ళు. త్వరగా వెళ్ళు. నిశ్చింతగా ఉండు. 

గేల్యాసారఖే చార దివస | సుఖీ రాహీ బేలాపురాస | 
విచారూనియా సర్వత్రాంస | మాఘారీ శిరడీస యేఈ తూ” | ||౮౧|| 
81. “బేలాపూరుకు వెళ్ళి, నాలుగు రోజులు నిశ్చింతగా, సుఖంగా ఉండి, అందరినీ కలసుకొన్న తరువాతే నువ్వు శిరిడీకి రా”.
అసో బాబాంచే వచన | బాఈస అకల్పిత శాంతవన | 
నిమోణకరాంస పటలీ ఖూణ | సమాధాన ఉభయతా | ||౮౨|| 
82. బాబా మాటలు ఆమెకు ఎంతో ఊరటను కలిగించాయి. నిమోణ్కరుకు సంగతి అర్థమైంది. ఇద్దరికీ ఎంతో తృప్తి కలిగింది. 
సారాంశ ఆపణ కరావే బేత | ఆమ్హా న జాణవే ఆదీ అంత | 
హితాహిత జాణతీ సంత | కాంహీ న అవిదిత తయాంతే | ||౮౩|| 
83. చెప్పదలచుకున్నది ఏమిటంటే, మనం ఏదైనా ఆలోచించినప్పుడు, దాని వెనుక జరిగినది, దాని తరువాత జరుగబోయేది, ఏవీ మనకు తెలియవు. కాని మన మంచి చెడులు సత్పురుషులకు బాగా తెలుస్తాయి. ఎందుకంటే, వారికి తెలియనిదేదీ లేదు. 
భూత భవిష్య వర్తమాన | కరతలామలకవత్ తయా జ్ఞాన | 
కరితా తయాంచ్యా ఆజ్ఞేత వర్తన | సుఖసంపన్న భక్త హోతీ | ||౮౪|| 
84. అరచేతిలోని ఉసిరికాయ ఎలా స్పష్టంగా కనిపిస్తుందో, అలా వారికి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలంలో జరిగేది స్పష్టంగా తెలుస్తుంది. అందువలన, వారి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే, మనము సుఖ సంపన్నులౌతాము. 
అసో ఆతా పూర్వానుసంధాన | చాలవూ ముఖ్యకథా నిరూపణ | 
కైసీ ముళ్యాంవరీ కృపా కరూన | దిధలే దర్శన గురూచే | ||౮౫|| 
85. ఇంతకు మునుపు మొదలు పెట్టిన కథను ఇప్పుడు కొన సాగిద్దాము. బాబా ముళేను కరుణించి, అతనికి గురు దర్శనాన్ని కలిగించిన ముఖ్య కథను చెప్పుతాను. 
శ్రీమంత బాపూసాహేబ బుట్టీ | హేతూ ఘ్యావీ తయాంచీ భేటీ | 
పరతోనీ జావే ఉఠాఉఠీ | ముళ్యాంచ్యా పోటీ హే హోతే | ||౮౬|| 
86. శిరిడీలో శ్రీమంతుడైన బాపూసాహేబు బుట్టీని కలుసుకుని, వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని, ముళే అనుకున్నాడు. 
అసో హా జరీ త్యాంచా హేత | బాబాంచా త్యాంత అన్య సంకేత | 
తో చమత్కార తే ఇంగిత | సావచిత్త పరిసావే | ||౮౭|| 
87. అతను అలా అనుకున్నా, బాబా అనుకున్నది వేరు. ఆ చమత్కారంలోని అర్థాన్ని సావధానంగా వినండి. 
శ్రీమంతాంచీ భేట ఝాలీ | మండళీ మశీదీలాగీ నిఘాలీ | 
ముళ్యాంనాహీ ఇచ్ఛా ఉదేలీ | నిఘాలే మండళీ సమవేత | ||౮౮|| 
88. అనుకున్న ప్రకారమే ముళే బుట్టీని కలుసుకున్నాడు. తరువాత, అందరూ మసీదుకు బయలుదేరుతుంటే, ముళే మనసులో కూడా కోరిక కలిగి, వారితో తాను కూడా వెళ్ళాడు. 
ముళే షట్శాీస్త్రీ అధ్యయన | జ్యోతిర్విద్యేత అతి ప్రవీణ | 
సాముద్రికాంతహీ తైసేచ పూర్ణ | రమలే దర్శన హోతాంచ | ||౮౯|| 
89. ఆరు శాస్త్రాలనూ ముళే చాలా లోతుగా తెలుసుకున్నాడు. జ్యోతిష్యంలో, హస్త సాముద్రికంలో కూడా అతను ప్రవీణుడు. బాబాను చూసి చాలా ఆనందించాడు. 
పేఢే బత్తాసే బర్ఫీ నారళ | నారింగాది ఫళఫళావళ | 
అమూప అర్పితీ జన ప్రంజళ | భక్త ప్రేమళ బాబాంస | ||౯౦||
90. ముళే మసీదుకు వెళ్ళినప్పుడు, పాలకోవా, బత్తాసులను, బర్ఫీని, కొబ్బరికాయలను, నారింజ మొదలైన పళ్ళను, ఫలాహారాలను, భక్తులు ప్రేమతో బాబాకు అర్పిస్తున్నారు. 

శివాయ తెథే యేతీ మాళిణీ | జాంబ కేళీ ఊంస ఘేఊనీ | 
బాబా ఖరీదితీ ఆలియా మనీ | పైసే దేఉనీ పదరచే | ||౯౧|| 
91. ఇవి కాక, అమ్మకానికి స్త్రీలు తెచ్చిన జామపళ్ళు, అరటిపళ్ళు, చెరుకు, వీటిని తమకు తోచినప్పుడు, స్వంత డబ్బిచ్చి బాబా కొనేవారు. 
పల్లవచా పైకా ఖర్చ కరీత | అంబ్యాచ్యా పాట్యా ఖరేదీత | 
కేళీంహీ ఉమాప ఆణవీత | వాంటీత మనసోక్త భక్తాంనా | ||౯౨|| 
92. తమ స్వంత డబ్బుతో మామిడి పళ్ళ బుట్టలను కొనేవారు. అరటి పళ్ళను కూడా చాలా తెప్పించి, తమకు ఇష్టం వచ్చినట్లుగా, భక్తులకు పంచేవారు. 
ఎకేక ఆంబా ఘేఊన కరీ | ధరూన దోన్హీ తళ హస్తాభ్యంతరీ | 
చోళూన మఊ ఝాలియావరీ | భక్తాంకరీ మగ దేత | ||౯౩|| 
93. ఒక్కొక్కటే మామిడిపండును, రెండు చేతులతోనూ పట్టుకుని నలిపి, మెత్తబడిన తరువాత, భక్తులకు ఇచ్చేవారు. 
ఆంబా లావితా ఓఠీ | రస ఎకదాంచ ఉతరావా పోటీ | 
జైసీ భరలీ రసాచీ వాటీ | సాల బాఠీ ఫేంకావీ | ||౯౪|| 
94. అలా మెత్తబడిన మామిడిపండు పెదవులకు తగలగానే, గిన్నెలోనుండి వచ్చినట్లు, రసమంతా ఒక్క సారిగా కడుపులోకి వెళ్ళిపోయేది. తరువాత తొక్క, టెంకను పారవేయటమే. 
కేళ్యాంచీ తో అపూర్వ శైలీ | భక్తాంనీ ఘ్యావీ గర్భనవ్హాళీ | 
బాబాంనీ సేవావ్యాంత తయాంచ్యా సాలీ | కాయ త్యా కేలీ అద్భుత | ||౯౫|| 
95. అరటిపళ్ళతో కూడా బాబాది ప్రత్యేకమైన పద్ధతి. లోపలి పండును భక్తులకు ఇచ్చి, దాని తొక్కలను బాబా తీసుకునేవారు. ఎంతటి అద్భుతమైన లీల! 
హీ సర్వ ఫళే ఆపులే హాతీ | బాబా తెథే అవఘ్యాంస వాంటితీ | 
కోకాలీ ఆలియా చిత్తీ | స్వయే చాఖితీ ఎకాదే | ||౯౬|| 
96. ఈ పళ్ళను అంతటినీ తమ చేతులతో బాబా అక్కడున్న వారందరికీ పంచేవారు. ఎప్పుడైనా తమ మనసుకు అనిపిస్తే, ఒకటీ, అరా స్వయంగా తినేవారు. 
యా క్రమాచియా పరిపాటీ | కేవళ భక్తజనాంచియా సాఠీ | 
ఖరీదూనీ కేళియాంచీ పాటీ | బాబా వాంటీత హోతే తై | ||౯౭|| 
97. అలవాటు ప్రకారం, ఆ రోజు భక్తుల కోసమే అరటిపళ్ళ బుట్టను కొని, బాబా అందరికీ పంచిపెడుతున్నారు. 
శాస్త్రీబువాంస ఆశ్చర్య గహన | జాహలే దేఖూనీ బాబాంచే చరణ | 
ధ్వజ వజ్రాంకుశ రేఖా నిరీక్షణ | కరావే మన జాహలే | ||౯౮|| 
98. బాబా పాదాలను చూసి, శాస్త్రీ బువాకు (ముళే) చాలా ఆశ్చర్యం కలిగింది. వారి చేతిలోని, ధ్వజ, వజ్రాంకుశ రేఖలను చూడాలని అతనికి కోరిక కలిగింది. 
భక్త కాకాసాహేబ దీక్షిత | హోతే తెవ్హా నికట స్థిత | 
ఉచలూని చార రంభా ఫళే దేత | బాబాంచే హాతాంత తేధవా | ||౯౯|| 
99. కాకాసాహేబు దీక్షితు కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. అతను నాలుగు అరటిపళ్ళను బాబా చేతులలో పెట్టాడు. 
కోణీ బాబాంస బహు వినవిలే | బాబా హే క్షేత్రస్థ శాస్త్రీ ముళే | 
పాతలే చరణీ పుణ్యబళే | ప్రసాద ఫళే ద్యా కీ యా | ||౧౦౦||
100. అక్కడున్న వారిలో ఎవరో ఒకరు బాబాతో ‘ఇతడు ముళే శాస్త్రి. నాసిక నివాసి. అతని పుణ్యం కొద్దీ మీ పాదాల దగ్గరకు వచ్చాడు. అతనికి పళ్ళ ప్రసాదం ఇవ్వండి’ అని అన్నారు. 

వినవా కోణీ వా న వినవా | బాబాంచే ఆలియావీణ జీవా | 
కోణాంతే కాంహీ న దేతీ తే కెవ్హా | కరితీ తెవ్హా కాయ తే | ||౧౦౧|| 
101. ఎవరు చెప్పినా, చెప్పకున్నా, బాబా తమ మనసుకు నచ్చితే తప్ప, ఎవరికీ ఏమీ ఇచ్చేవారు కాదు. అలాంటప్పుడు, చెప్పినవారు ఏం చేస్తారు?
కేళీ న, ముళే హాత మాగతీ | తదర్థ పుఢే హాత పసరితీ | 
బాబా న తికడే చిత్త దేతీ | ప్రసాద వాటీతీ సకళికా | ||౧౦౨|| 
102. అరటిపళ్ళ కోసం కాక, బాబా చేతిని చూడాలనే కోరికతో, ముళే తన చేతిని ముందుకు చాచాడు. బాబా అటువైపు అసలు చూడకుండా, అందరికీ ప్రసాదాన్ని పంచుతున్నారు. 
ముళే బాబాంస కరితీ వినంతీ | ఫళే నకో హాత ద్యా మాగతీ | 
పాహూ యేతే సాముద్రిక వదతీ | బాబా న దేతీ త్యా హాత | ||౧౦౩|| 
103. బాబాతో ముళే ‘నాకు పళ్ళు వద్దు. మీ చేతిని ఇటివ్వండి. సాముద్రికాన్ని చూస్తాను’ అని వేడుకున్నాడు. కాని అతనికి బాబా తమ చేతిని ఇవ్వలేదు. 
తరీహీ ముళే పుఢే సరకత | సాముద్రికార్థ హాత లాంబవిత | 
బాబా న తికడే ఢూంకూన పహాత | జణూ నాహీంత గాంవీంచే త్యా | ||౧౦౪|| 
104. అయినా, ముందుకు జరిగి ముళే చేయి చాచాడు. తమకు ఏమీ తెలీనట్లు బాబా ఉన్నారు. అటువైపు తిరిగి కూడా చూడలేదు. 
పసరిల్యా ముళ్యాంచే హాతీ | బాబా తీ చార కేళీ ఠేవితీ | 
బసా మ్హణతీ పరీ న దేతీ | ముళ్యాంచే హాతీ నిజహస్త | ||౧౦౫|| 
105. చూడలేదు సరికదా, ముళే చేతిలో నాలుగు అరటిపళ్ళను ఉంచి కూర్చోమని చెప్పారు. అంతే కాని, తమ చేతిని ముళే చేతికివ్వలేదు. 
ఆజన్మ ఈశ్వరార్థ ఝిజవిలా కాయ | తయాస సాముద్రికీ కర్తవ్య కాయ | 
అవాప్త సకళ కామ సాఈరాయ | సద్భక్తా మాయబాప జో | ||౧౦౬|| 
106. జీవిత కాలమంతా దేవుడి కొరకు దేహాన్ని అరగ తీసిన వారికి, అన్ని కోరికలూ తీరి, సద్భక్తులకు తల్లి తండ్రి అయిన, సాయి మహారాజుకు సాముద్రికంతో ఏం పని? 
పాహూని బాబాంచీ నిఃస్పృహ స్థితీ | సాముద్రికార్థ ఉదాసీనవృత్తీ | 
శాస్త్రీబువా హస్త ఆంవరితీ | నాద టాకితీ బాబాంచా | ||౧౦౭|| 
107. బాబాయొక్క వైరాగ్యాన్ని, సాముద్రికం పట్ల అసలు ఆసక్తి లేకపోవడం చూచి, ముళే శాస్త్రి తన చేతిని వెనుకకు తీసుకుని, వారిని ఇబ్బంది పెట్టడం మానుకున్నాడు. 
కాంహీ వేళ స్వస్థ బైసలే | మండళీ సమవేత వాడ్యాంత గేలే | 
స్నాన కేలే సోవళే ల్యాలే | ఆరంభూ సరలే అగ్నిహోత్ర | ||౧౦౮|| 
108. కొంత సేపు నిశ్చింతగా కూర్చుని, తరువాత భక్తులతో పాటు బసకు వెళ్ళాడు. స్నానం చేసి, మడి బట్టలు కట్టుకుని, అగ్నిహోత్రాన్ని మొదలు పెట్టాడు. 
ఇకడే నిత్యక్రమానుసార | బాబా నిఘాలే లేండీవర | 
మ్హణతీ గేరూ ఘ్యారే బరోబర | భగవే అంబర పరిధానూ | ||౧౦౯|| 
109. ఇక్కడ, మసీదులో, ఎప్పటిలాగే బాబా లెండీకి బయలుదేరుతూ “కాషాయ రంగు తీసుకుని రండి, కాషాయ వస్త్రాలు ధరిస్తాను” అని అన్నారు. 
సర్వాంస వాటలా చమత్కార | గేరూచే బాబా కాయ కరణార | 
జో తో కరూ లాగే విచార | గేరూ స్మరలా ఆజ కా | ||౧౧౦||
110. అక్కడ ఉన్న వారందరికీ చాలా ఆశ్చర్యమైంది. ‘అసలు కాషాయ రంగు ఎందుకు బాబాకు? ఈ రోజే ఇదెందుకు గుర్తుకు వచ్చింది?’ అని వారు ఆలోచించ సాగారు. 

బాబాంచీ అశీచ సందిగ్ధ వాణీ | కాయ అర్థ జాణావా కోణీ | 
పరీ ఆదరే సాంఠవిల్యా శ్రవణీ | అర్థ శ్రేణీ వోగరితీ | ||౧౧౧|| 
111. బాబా మాటలు, మిగతా వారికి సులభంగా అర్థం కాకుండా, ఇలాగే ఉంటాయి. ఎవరైనా ఆ మాటలను ఎలా తెలుసుకోగలరు? కాని, శ్రద్ధగా వింటే, సరియైన అర్థం తెలుస్తుంది. 
కీ తే సంతాచే బోల | కధీంహీ జే నసణార ఫోల | 
అర్థభరిత సదా సఖోల | కరవేల మోల కవణాతే | ||౧౧౨|| 
112. ఎందుకంటే సాధు సంతుల మాటలు ఎప్పుడూ అర్థం లేకుండా ఉండవు. అవి ఎప్పుడూ అర్థంతో నిండి ఉంటాయి. ఆ మాటలకు ఎవరు విలువ కట్టగలరు? 
ఆధీ విచార మగ ఉచ్చార | హా తో నిత్యాచా వ్యవహార | 
ఉచ్చారామాగే ఆచార | సంత సాచార ఆదరితీ | ||౧౧౩|| 
113. మునుపు ఆలోచించుకుని, తరువాత మాట్లాడటమనేది సాధు సంతులు ఎప్పడూ చేసే పద్ధతి. చెప్పిన మాటలనే, తరువాత వారు ఆచరిస్తారు. 
యా సర్వమాన్య సిద్ధాంతానుసార | సంతవచన కధీ న నిఃసార | 
ధ్యానీ ధరూని పడతాళితా ఫార | పడే వేళేవర ఉకల త్యా | ||౧౧౪|| 
114. అందరూ ఒప్పుకున్న ఈ నిజాన్ని బట్టి, సత్పురుషుల మాటలెప్పుడూ అర్థం లేకుండా ఉండవు. బాగా ఆలోచిస్తే, సమయం వచ్చినప్పుడు, చిక్కు విడిపోతుంది. 
అసో ఇకడే బాబా పరతలే | నిశాణీ శింగ వాజూ లాగలే | 
బాపూసాహేబ జోగీ వహిలే | వేళీ సుచవిలే ముళ్యాంతే | ||౧౧౫|| 
115. లెండీనుండి బాబా తిరిగి వచ్చారు. సన్నాయి, బూరలు మ్రోగాయి. వెంటనే, బాపూసాహేబు జోగు ముళేతో ఇలా అన్నారు. 
ఆరతీచా సమయ ఆలా | యేతా కాయ కీ మశీదీలా | 
శాస్త్రీబువాంచే సోవళేపణాలా | ప్రసంగ వాటలా అవఘడ తో | ||౧౧౬|| 
116. ‘హారతి సమయమైంది, మసీదుకు వస్తారా?’ అని అడిగాడు. శాస్త్రీ బువా మడిలో ఉన్నాడు. మసీదుకు ఎలా వెళతాడు? అతనికి చిక్కు పరిస్థితి ఎదురైంది. 
వదతీ మగ తే ప్రత్యుత్తరీ | ఘేఊ దర్శన తిసరే ప్రహరీ | 
లాగలే జోగ మగ తే అవసరీ | కరూ తయారీ ఆరతీచీ | ||౧౧౭|| 
117. ‘మూడో ఝామున, సాయంత్రం, వెళ్ళి దర్శనం చేసుకుంటానని’ సమాధానం చెప్పాడు. జోగు హారతికి సిద్ధం చేసుకున్నాడు. 
ఇకడే బాబా పరత యేవోనీ | బసలే బోలత జో నిజాసనీ | 
తో సర్వాంచ్యా పూజా హోఊని | ఆరతీ స్థానీ థాటలీ | ||౧౧౮|| 
118. ఇక్కడ మసీదులో, లెండీనుండి తిరిగి వచ్చి, బాబా తమ ఆసనంలో కూర్చుని, వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. అందరి పూజలూ అయింది. హారతి మొదలు పెట్టాలి. 
ఇతుక్యాంత బాబా మ్హణతీ "ఆణా | త్యా నవ్యా బామణాకడూన దక్షిణా ’| 
బాపూసాహేబ బుట్టీచ తత్క్ష ణా | గేలే దక్షిణా మాగావయా | ||౧౧౯|| 
119. ఇంతలో బాబా “వెళ్ళి ఆ క్రొత్తగా వచ్చిన బ్రాహ్మణుని దగ్గరనుండి దక్షిణను తీసుకుని రండి” అని అన్నారు. వెంటనే బాపూసాహేబు బుట్టీ దక్షిణను అడగటానికి తానే వెళ్ళాడు. 
నుకతేచ ముళే కరూని స్నాన | సోవళే వస్త్ర కరూని పరిధాన | 
బసలే హోతే ఘాలూని ఆసన | స్వస్థ మన కరూనియా | ||౧౨౦||
120. ముళే అప్పుడే స్నానం చేసి, మడి బట్టలు కట్టుకుని, యోగాసనంలో, శాంతంగా, స్థిరమైన మనసుతో కూర్చున్నాడు. 

నిరోప పరిసతా తే అవసరీ | విక్షేప దాటలా ముళ్యాంచే అంతరీ | 
దక్షిణా కిమర్థ మ్యా ద్యావీ తరీ | మీ అగ్నిహోత్రీ నిర్మళ | ||౧౨౧|| 
121. బాబా పెట్టిన కబురు విని, ముళే కలవర పడ్డాడు. ‘నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? శుద్ధమైన అగ్నిహోత్రుణ్ణి నేను.
అసతీల బాబా మోఠే సంత | పరి మీ కాయ తయాంచా అంకిత | 
మజపాశీ కా దక్షిణా మాగత | జాహలే దుఃశ్చిత్త మన తేణే | ||౧౨౨|| 
122. ‘బాబా గొప్ప సత్పురుషులే కావచ్చు. నేనేవిధంగానూ వారికి కట్టుబడలేదు. అలాంటప్పుడు నన్ను దక్షిణ అడగటం ఎందుకు?’ అని అతని మనసు కలవర పడింది. 
సాఈసారిఖే దక్షిణా యాచితీ | కోట్యాధీశ నిరోప ఆణితీ | 
ముళే జరీ మనీ శంకతీ | దక్షిణా ఘేతీ సమవేత | ||౧౨౩|| 
123. కాని, సాయి వంటి వారు దక్షిణను అడగటం, కోటీశ్వరుడు ఆ కబురు తేవటం, వీటన్నిటినీ ఆలోచించి, అనుమానించి, తన దగ్గర ఉన్న కొంచెం దక్షిణను తీసుకొని, ముళే మసీదుకు బయలుదేరాడు. 
ఆణీక సంశయ తయాంచే మనీ | ఆరబ్ధకర్మ అపూర్ణ టాకూని | 
జావే కేవీ మశీదీలాగునీ | నాహీ మ్హణూనహీ మ్హణవేనా | ||౧౨౪|| 
124. అంతలోనే, ఇంకొక సందేహం కలిగింది. మొదలు పెట్టిన అగ్నిహోత్రాన్ని పూర్తి కాకుండానే వదిలేసి, మసీదుకు ఎలా వెళ్ళటం, రానని అనలేడు. 
సంశయాత్మ్యాస నాహీ నిశ్చితీ | సదా దోలాయమాన చిత్తీ | 
తయా న హీ నా తీ గతీ | త్రిశంకూ స్థితీ తయాంచీ | ||౧౨౫|| 
125. సంశయాలు వచ్చిన వారికి నెమ్మది అంటూ ఉండదు. నిశ్చింతగా ఉండలేరు. వారి మనసెప్పుడూ ఇటూ అటూ ఊగుతూ ఉంటుంది. అటూ ఇటూ గాని త్రిశంకు స్థితి వారిది. 
తథాపి మగ కేలా విచార | జావయాచా కేలా నిర్ధార | 
గేలే సభామండపాభీతర | రాహిలే దూర తే ఉభే | ||౧౨౬|| 
126. బాగా ఆలోచించుకొని, వెళ్ళాలని ముళే నిర్ణయించుకున్నాడు. దక్షిణను తీసుకుని, మసీదులోని సభామండపంలోకి వెళ్ళి, దూరంగా నిలుచున్నాడు. 
ఆపణ సోవళే మశీద ఓవళీ | జావే కైసే బాబా జవళీ | 
లాంబ రాహూనీ బద్ధాంజళీ | పుష్పాంజళీ ఫేకితీ | ||౧౨౭|| 
127. తనేమో మడిలో ఉన్నాడు. మసీదు అపవిత్రమైనది. బాబా దగ్గరకు ఎలా వెళ్ళాలి అని అనుకుని, చేతులు జోడించుకుని, దూరంగా నిలుచుని, బాబా మీద పూవులను విసిరాడు. 
ఇతుక్యాంత ఏసా చమత్కార | ఝాలా తయాంచే దృష్టీసమోర | 
బాబా అదృశ్య గాదీవర | ఘోలప గురూవర దిసలే తై | ||౧౨౮|| 
128. ఇంతలో, ఒక అద్భుతమైన చమత్కారం జరిగింది. తను చూస్తుండగానే, ఆసనంలో కూర్చున్న బాబా కనిపించలేదు. మళ్ళీ చూడగా, అక్కడ తన గురువర్యులైన ఘోలపగారు కనిపించారు. 
ఇతరాంస నిత్యాచే సాఈసమర్థ | ముళ్యాంచే డోళా ఘోలపనాథ | 
తే జరీ పూర్వీచ బ్రహ్మీభూత | ఆశ్చర్యచకిత బహు ముళే | ||౧౨౯|| 
129. మిగతా అందరికీ సాయి సమర్థులు కనిపించినా, ముళే కళ్ళకు, ఎప్పుడో సమాధి చెందిన ఘోలపనాథులు కనిపించారు. ముళేకు చెప్పలేనంతగా ఆశ్చర్యం కలిగింది. 
గురూ జరీ వస్తుతః సమాధిస్త | తేహీ జై దృష్టీగోచర భాసత | 
తేణే ముళే అతి విస్మిత | తైసేచ సాశంకిత మానసీ | ||౧౩౦||
130. ఎప్పుడో సమాధి చెందిన గురువు కళ్ళకు కనిపించే సరికి, ఆశ్చర్యంతో పాటు ముళేకు అనుమానం కూడా కలిగింది. 

స్వప్న మ్హణావే నాహీ నిజేలా | జాగృతి తంవ గురూ కైసా ఠేలా | 
సంభ్రమ కేఉతా జీవీ ఉఠలా | బోల ఖుంటలా క్షణభరీ | ||౧౩౧|| 
131. ఇదంతా ఒక కల ఏమో అని అనుకోవటానికి, తను నిద్రపోవడం లేదు. మరి, మేలుకొని ఉండగా, తన గురువు తన ఎదుట ఎలా ఉన్నారు? తన మనసు ఎందుకింత గజిబిజిగా అయ్యింది? క్షణం పాటు ఆశ్చర్యంతో, అతనికి నోట మాట రాలేదు. 
ఆపులా ఆపణ ఘేఈ చిమటా | మ్హణే నవ్హే హా ప్రకార ఖోటా | 
కిమర్థ మనా హా సంశయ ఫుకటా | సర్వాంసకటా మీ యేథే | ||౧౩౨|| 
132. తనను తాను గిల్లుకుని చూశాడు. ఇది అబద్ధం కాదు అని నమ్మకమైంది. అందరితో పాటు నేనూ ఇక్కడ ఉండగా, నా మనసులోనే ఎందుకిన్ని సందేహాలు? 
ముళే ముళచే ఘోలపభక్త | బాబావిషయీ జరీ శంకిత | 
పరీ ఝాలే పుఢే అంకిత | అకలంకిత మానసే | ||౧౩౩|| 
133. అసలుకు ముళే ఘోలప భక్తుడు. మొదట బాబా గురించి ఎన్నో సందేహాలు ఉండేవి. కాని, ఇప్పుడు అవన్నీ చెదిరిపోయి, నిర్మలమైన మనసుతో, అతను బాబాకు అంకితమయ్యాడు. 
స్వయే వర్ణాగ్రజ బ్రాహ్మణ | వేద వేదాంగ శాస్త్ర సంపన్న | 
మశీదీంత ఘోలప దర్శన | విస్మయాపన్న జాహలే | ||౧౩౪|| 
134. తనేమో గొప్ప బ్రాహ్మణ జాతికి చెందినవాడు. వేద వేదాంగ శాస్త్రాలను తెలుసుకున్నవాడు. కాని, ఒక మసీదులో, తన గురు ఘోలపగారి దర్శనంతో, అతనికి విపరీతమైన ఆశ్చర్యమేసింది. 
మగ వరతీ గేలే చఢోన | నిజగురూచే చరణ వందూన | 
ఉభే రాహిలే కర జోడూన | వాచేసీ మౌన పడియేలే | ||౧౩౫|| 
135. తరువాత మెట్లెక్కి వెళ్ళి, తన గురువు పాదాలకు నమస్కారం చేసి, చేతులు జోడించుకుని, మాటలు రాక, ఊరికే నిలుచున్నాడు. 
భగవీ వస్త్రే భగవీ ఛాటీ | ఘోలపస్వామీ దేఖోని దృష్టీ | 
ధాంవోనీ పాయీ ఘతలీ మిఠీ | ఉఠాఉఠీ ముళ్యాంనీ | ||౧౩౬|| 
136. సన్యాసివలె, కాషాయ వస్త్రాలు ధరించిన ఘోలపస్వామిని చూడగానే, ఆగలేక, ఎంతో ప్రేమతో, వారి పాదాలను ముళే కౌగలించుకున్నాడు. 
తుటలా ఉచ్చ వర్ణాభిమాన | పడలే డోళియాంమాజీ అంజన | 
భేటతా నిజగురూ నిరంజన | నిధాన సంపన్న తే ఝాలే | ||౧౩౭|| 
137. గొప్ప జాతి తనది, అనే అభిమానం తొలగిపోయింది. కళ్ళలో కాటుక వ్రాసినట్టు, కళ్ళకు కనిపించని తన గురువు కనిపించగానే, చాలా గొప్ప నిధి దొరికినట్లు ముళే భావించాడు. 
హరపలీ వికల్పవృత్తీ | జడలీ బాబాంవరీ ప్రీతీ | 
అర్ధోన్మీలిత నేత్రపాతీ | టక లావితీ సాఈ పదీ | ||౧౩౮|| 
138. మనసులోని సందేహాలన్నీ తొలగిపోయి, బాబాపై ప్రీతి కలిగింది. సగం మూసుకున్న కళ్ళతో, సాయి పాదాలను తదేకంగా చూడసాగాడు. 
అనంత జన్మీచే సుకృత ఫళలే | దృష్టీ పడలీ సాఈంచీ పాఉలే | 
చరణ తీర్థీ స్నాన ఘడలే | దైవ ఉఘడలే వాటలే | ||౧౩౯|| 
139. ఎన్నో జన్మల పుణ్యం ఫలించి, సాయి పాద దర్శనం కలిగి, వారి పాదాల తీర్థ స్నానంతో, అతనికి దేవుడి దగ్గర ఉన్నట్లు అనిపించింది. 
ఆశ్చర్య కేలే సకళికీ | హే కాయ ఘడలే ఎకాఎకీ | 
జాఊనీ ఫులాంచీ ఫేకాఫేకీ | పాయీ డోకీ ఠేవితీ కా | ||౧౪౦||
140. దూరంనుంచే పూలు విసిరిన మనిషి, బాబా పాదాల మీద తల ఉంచటంతో, అకస్మాత్తుగా ఏమిటీ వింత అని అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్య పడ్డారు. 

ఇతర మ్హణతీ బాబాంచీ ఆరతీ | ముళే ఘోలప నామే గర్జతీ | 
ఉంచస్వరే త్యాంచీచ ఆరతీ గాతీ | రంగీ రంగతీ సప్రేమ | ||౧౪౧|| 
141. అందరూ బాబా హారతిని పాడుతుంటే, ఘోలపగారి పేరును ముళే బిగ్గరగా చెప్పసాగాడు. పై స్వరంలో వారి హారతినే గానం చేస్తూ, వారి ప్రేమలో లీనమై పోయాడు.
సోవళ్యాచీ సాండిలీ స్ఫీతీ | స్పర్శాస్పర్శాచీ విరాలీ స్ఫూర్తీ | 
సాష్టాంగ దండాయమాన హోతీ | డోళే మిటితీ ఆనందే | ||౧౪౨|| 
142. మడి పట్ల అతనికున్న అభిమానం, గొప్పతనం అన్నీ తొలగిపోయాయి. పవిత్రం, అపవిత్రం గురించిన ఆలోచనలూ మాయమై, సాయికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆనందంతో, అతను కళ్ళు మూసుకున్నాడు. 
ఉటల్యావరీ డోళే ఉఘడితా | ఘోలప స్వామీశీ అదృశ్యతా | 
త్యాంచే స్థానే సాఈ సమర్థా | దక్షిణా మాగతా దేఖిలే | ||౧౪౩|| 
143. కాని, లేచి కళ్ళు తెరచి చూస్తే, ఘోలపస్వామి మాయమై, వారికి బదలు సాయి సమర్థులు నవ్వుతూ, దక్షిణను అడుగుతూ కనిపించారు. 
పాహోనీ బాబాంచీ ఆనందమూర్తి | ఆణి తయాంచీ తీ అతర్క్యశక్తీ | 
తటస్థ ఝాలీ చిత్తవృత్తీ | ముళే నిజ స్థితీ విసరలే | ||౧౪౪|| 
144. బాబాయొక్క అపార శక్తిని, వారి ఆనంద రూపాన్ని చూచి, అతని మనసు పని చేయటం మానివేసింది. ముళే తనను తాను మరచి పోయాడు. 
ఏసే హే మహారాజాంచే కౌతుక | దేఖతా హరలీ తహాన భూక | 
జహాలే నిజగురూ దర్శనసుఖ | పరమహరిఖ ముళ్యాంనా | ||౧౪౫|| 
145. సాయి మహారాజుగారి ఈ అద్భుత లీలను చూసిన తరువాత, అతనికి ఆకలి దప్పులు మాయమై పోయాయి. తన గురువును చూసిన సుఖం ముళేకు పరమానందం కలిగించింది. 
జాహలే మానసీ సమాధాన | ఘాతలే బాబాంస లోటాంగణ | 
ఆనందాశ్రూంస భరతే యేఊన | మస్తకీ చరణ వందిలే | ||౧౪౬|| 
146. అతని మనసు తృప్తి చెందింది. ఆనందంతో కళ్ళనుండి నీరు కారగా, బాబా పాదాలకు నమస్కరించాడు. 
దక్షిణా కాయ హోతీ తీ దిధలీ | పునశ్చ డోఈ చరణీ ఠేవిలీ | 
నయనీ ప్రేమాచి ఆసువే ఆలీ | తను ఝాలీ రోమాంచిత | ||౧౪౭|| 
147. తన వద్ద ఉన్న దానిని దక్షిణగా ఇచ్చి, మరల బాబా పాదాలపై తలనుంచాడు. అతని కళ్ళ వెంట ప్రేమతో నీరు దొర్లాయి. శరీరం రోమాంచితమైంది. 
సద్గదీత కంఠ ఝాలా | అష్టభావ మనీ దాటలా | 
మ్హణతీ మనీచా సంశయ ఫిటలా | వరి భేటలా నిజగురూ | ||౧౪౮|| 
148. గొంతు గద్గదమైంది. మనసులో ఎనిమిది భావాలు ఉప్పొంగాయి. ‘నా సందేహాలన్నీ దూరమయ్యాయి. పైగా నా గురువు దొరికారు’ అని అనుకున్నాడు. 
పాహోని బాబాంచీ అలౌకిక లీలా | ముళ్యాంసహ సర్వ జన గహీంవరలా | 
గేరూచా అర్థ నిశద ఝాలా | అనుభవ ఆలా తేధవా | ||౧౪౯|| 
149. ముళేతో సహ అక్కడున్న వారందరూ బాబాయొక్క ఈ విచిత్రమైన లీలను చూసి, ఆశ్చర్య పడ్డారు. అప్పుడు వారికి కాషాయ రంగు గురించి అర్థమై, బాబా మహిమను అనుభవంతో తెలుసుకున్నారు. 
హేచ మహారాజ హేచ ముళే | ఆశ్చర్య కైసే యేచ వేళే | 
కోణ జాణే మహారాజాంచే కళే | అగాధ లీలే తయాంచే | ||౧౫౦||
150. అదే సాయి మహారాజు, అదే ముళే, కాని ఆ సమయంలోనే ఆ మార్పు ఎలా వచ్చింది? బాబా లీలలను ఎవరు తెలుసుకోగలరు? వారి లీలలను అర్థం చేసుకోవడం సాధ్యం కాని పని. 

ఏసేచ ఎక మామలతదార | ధరూని సాఈ దర్శనీ ఆదర | 
సవే ఘేఊన మిత్ర డాక్టర | నిఘాలే శిరడీస యావయా | ||౧౫౧|| 
151. ఇలాగే, సాయి దర్శనంలో శ్రద్ధగల ఒక మామలతుదారు, తన స్నేహితుడైన ఒక డాక్టరుని వెంటబెట్టుకుని, శిరిడీకి బయలుదేరాడు. 
డాక్టర జ్ఞాతీనే బ్రహ్మణ | రామోపాసక ఆచారవాన | 
స్నాన సంధ్యా విహితాచరణ | నేమ నిర్భంధన ఆవడ | ||౧౫౨|| 
152. ఆ డాక్టరు ఒక బ్రాహ్మణుడు. రాముణ్ణి ఉపాసించేవాడు. ఆచారవంతుడు, స్నాన సంధ్యలూ, శాస్త్రాలయందు, నియమ నిష్ఠల మీద ప్రీతి కలవాడు. 
సాఈబాబా ముసలమాన | ఆపులే ఆరాధ్య జానకీజీవన | 
ఆధీంచ స్నేహ్యాస ఠేవిలే సాంగూన | నాహీ మీ నమన కరణార | ||౧౫౩|| 
153. ఆ డాక్టరు ‘జానకీనాథుడు నేను పూజించే దేవుడు. సాయిబాబా ముస్లిము కనుక నేను వారికి నమస్కరించను’ అని మామలతుదారుకు ముందుగానే చెప్పాడు. 
ముసలమానాచ్యా పాయీ నమన | కరావయా హే ఘేఈనా మన | 
మ్హణూన శిరడీస కరావయా గమన | ప్రథమపాసూన శంకిత మీ | ||౧౫౪|| 
154. ‘ఒక ముసల్మాను పాదాలకు నమస్కరించడం నా మనసు ఒప్పుకోవటం లేదు. అందు చేతనే, శిరిడీకి వెళ్ళటానికి నేను మొదటినుండి వెనుకాడుతున్నాను’ అని అన్నాడు. 
“పాయ పడా” హా కోణీహీ ఆగ్రహ | ధరణార నాహీ ఏసా దురాగ్రహ | 
కరూన ఘేఊ నకా హా గ్రహ | కరా హా నిగ్రహ మనాచా | ||౧౫౫|| 
155. ‘బాబా పాదాలపై పడు అని నిన్నెవరూ బలవంత పెట్టరు. ఇలాంటి ఆలోచనలను, పట్టుదలను వదిలేయి. మనసును బాగా దృఢ పరచుకో. 
’కరావా మాతే నమస్కార’ | బాబాహీ న కధీ వదణార | 
ఆశ్వాసితా హే మామలతదార | ప్రకటలా ఆదర గమనార్థీ | ||౧౫౬|| 
156. ‘నాకు నమస్కారం చేయి అని బాబా ఎప్పుడూ అనరు’. అని మామలతుదారు బాగా నచ్చచెప్పగా, అతడు సరేనని వెళ్ళటానికి ఒప్పుకున్నాడు. 
ఏసా దృఢనిశ్చయ కరూన | మానూని ఆపులే మిత్రాచే వచన | 
వికల్ప అవఘా దూర సారూన | నిఘాలే దర్శన ఘ్యావయా | ||౧౫౭|| 
157. తన స్నేహితుని మాటలని విని, కలిగిన అనుమానాలను వదిలేసి, నిశ్చయమైన మనసుతో, ఆ డాక్టరు సాయి దర్శనానికి బయలుదేరాడు. 
పరీ ఆశ్చర్య జై శిరడీస ఆలే | దర్శనార్థ మశీదీస గేలే | 
ఆరంభీ త్యాంనీంచ లోటాంగణ ఘాతలే | విస్మీత ఝాలే బహు స్నేహీ | ||౧౫౮|| 
158. అయితే, శిరిడీ వెళ్ళి, బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళగానే, ఆశ్చర్యకరంగా, అతనే ముందుగా సాయికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చూసి, అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు. 
తంవ తే పుసతీ తయాంతే | కైసే విసరలా కృత నిశ్చయాతే | 
ఆమ్హా ఆధీంచ లోటాంగణాతే | ముసలమానాతే ఘాతలే కైసే | ||౧౫౯|| 
159. ‘నాకంటే ముందుగానే, నువ్వు ముసల్మానుకు ఎలా సాష్టాంగ పడ్డావు? వారికి నమస్కరించను అన్న నీ నిర్ణయాన్ని మరచిపోయావా?’ అని అడిగాడు. 
మగ తే డాక్టర కథితీ నవల | రామరూప మ్యా దేఖిలే శామల | 
తే మీ తాత్కాళ వందిలే నిర్మల | సుందర కోమల సాజిరే | ||౧౬౦||
160. అందుకు ఆ డాక్టరు ‘నేను మేఘశ్యాముడైన ఆ రాముని రూపాన్ని చూసాను. పావనుడు, కోమలడు, అందంగా శోభిస్తున్న ఆ రామునికి నమస్కారం చేశాను. 

తేంచ పహా హే ఆసనస్థిత | తేంచ హే సర్వాంసవే బోలత | 
మ్హణతా మ్హణతా క్షణార్ధాంత | దిసూ లాగత సాఈరూప | ||౧౬౧|| 
161. ‘చూడు! అక్కడ కూర్చుని అందరితో మాట్లాడుతున్నది ఆ రాముడే’ అని అంటూ ఉండగానే, క్షణంలో అతనికి సాయి రూపం కనిపించింది.
తేణే డాక్టర విస్మయాపన్న | మ్హణావే తరీ హే కాయ స్వప్న | 
మ్హణే హే కైచే ముసలమాన | యోగసంపన్న అవతారీ | ||౧౬౨|| 
162. అప్పుడు ఆ డాక్టరు ఆశ్చర్యంతో ‘ఇది కల కాదు కదా! వీరు ముస్లిము కాదు. యోగ సంపన్నులైన అవతార పురుషులు. 
చోఖామేళా జాతీచా మహార | రోహిదాసహా తో చాంమార | 
సజన కసాఈ హింసా కరణార | జాతీచా విచార కాయ యాంచ్యా | ||౧౬౩|| 
163. ‘చోఖామేళా మాల జాతివాడు. రోహిదాసు మాదిగవాడు. సజ్జన, కసాయి - హింస చేసేవాడు. ఈ సాధు సంతుల జాతిని గురించి ఎందుకు ఆలోచించాలి? 
కేవళ జగాచీయా ఉపకారా | చుకవావయా జన్మమరణాచా ఫేరా | 
త్యాగూని నిర్గుణా నిరాకారా | ఆలే హె ఆకారా సంత జగీ | ||౧౬౪|| 
164. ‘వీరందరూ కేవలం జగత్తును ఉద్ధరించటానికి, జీవులను చావు పుట్టుకల చక్రంనుండి తప్పించటానికి, నిరాకారంనుండి, అందరికీ కనిపించేలా సాకార రూపంతో ఈ ప్రపంచానికి వచ్చారు. 
హా తో ప్రత్యక్ష కల్పద్రుమ | క్షణాంత సాఈ క్షణాంత రామ | 
మాఝా దండిలా అహంభ్రమ | దండప్రణామ కరవూనీ | ||౧౬౫|| 
165. ‘క్షణంలో సాయిలా, మరు క్షణంలో రామునిలా కనిపించే వీరు, మన కళ్ళ ఎదుట ఉన్న కల్పవృక్షం. నాతో సాష్టాంగ నమస్కారం చేయించి, నా అహంకారాన్ని అణచి వేశారు’, అని అనుకున్నాడు. 
దుసరే దివశీ ఘేతలే వ్రత | కృపా న కరితా సాఈనాథ | 
పాఊల న ఠేవణే మశీదీంత | బైసలే ఉపోషిత శిరడీంత | ||౧౬౬|| 
166. ఇది జరిగిన మరునాడే ‘సాయినాథులు నన్ను కరుణిస్తే తప్ప, నేను మసీదులో అడుగు పెట్టను’ అని దీక్షబూని శిరిడీలో ఉపవాసంతో ఉన్నాడు. 
ఏసే క్రమిలే దివస తీన | పుఢే ఉగవతా చౌథా దిన | 
కాయ ఘడలే వర్తమాన | దత్తావధాన పరిసా తే | ||౧౬౭|| 
167. అలా మూడు రోజులు గడిచాయి. నాలుగవ రోజున ఏం జరిగిందో శ్రద్ధగా వినండి. 
వాస్తవ్య జ్యాచే ఖానదేశాంత | ఏసా ఎక అకస్మాత | 
స్నేహీ తయాంచా పాతలా తేథ | దర్శనార్థ సాఈంచ్యా | ||౧౬౮|| 
168. ఆ డాక్టరుకు ఖాందేశంలో ఒక స్నేహితుడు ఉండేవాడు. అకస్మాత్తుగా వాడు సాయి దర్శనానికని శిరిడీకి వచ్చాడు. 
నఊ వర్షాంనీ జాహలీ భేటీ | పరమానంద మాఈనా పోటీ | 
డాక్టరహీ గేలే ఉఠాఉఠీ | తయాచే పాఠీ మశీదీస | ||౧౬౯|| 
169. తొమ్మిది నెలల తరువాత అతనిని కలుస్తున్నందుకు డాక్టరుకు పరమానందం కలిగింది. అతనితో తనూ మసీదుకు వెళ్ళాడు. 
జాతాంచ ఘాతలా నమస్కార | బాబా పుసతీ “కా డాక్టర, | 
కోణీ ఆలా కా బోలావిణార ? | ఆలాస కా ఉత్తర దేఈ మజ” | ||౧౭౦||
170. వెళ్ళిన వెంటనే బాబా పాదాలకు నమస్కరించాడు. అప్పుడు బాబా అతనితో “ఏం డాక్టరు! నిన్ను ఎవరైనా పిలవటానికి వచ్చారా? ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు” అని అడిగారు. 

ఏకూన ఏసా వర్మీ ప్రశ్న | డాక్టర గేలే విరఘళూన | 
జాహలే కృతనిశ్చయాచే స్మరణ | అనుతాప ఖిన్న అంతరీ | ||౧౭౧|| 
171. మర్మంతో కూడుకున్న ఆ ప్రశ్న విని డాక్టరు కరిగిపోయాడు. తను తీసుకున్న నిర్ణయం గుర్తుకు వచ్చి, మనసులో చాలా బాధ పడ్డాడు. 
పరీ తే దివశీ మధ్యరాత్రీ | కృపా జాహలీ తయావరీ | 
పరమానంద స్థితీచీ మాధురీ | నిద్రే మాఝారీ చాఖిలీ | ||౧౭౨|| 
172. అయినా అదే రోజు అర్ధరాత్రప్పుడు, అతనిపై బాబా కృప కలిగి, నిద్రలోనే పరమానందం అంటే ఏమిటో దాని మాధుర్యాన్ని చవిచూశాడు. 
పుఢే డాక్టర స్వగ్రామా పరతతీ | తరీ తీ సంపూర్ణస్వానంద స్థితీ | 
సంపూర్ణ పంధరా దిన అనుభవితీ | వాఢలీ భక్తి సాఈపదీ | ||౧౭౩|| 
173. తన ఊరికి వెళ్ళి పోయిన తరువాత కూడా, పదిహేను రోజుల దాకా, సంపూర్ణ ఆనందాన్ని అనుభవించాడు. అలా అతనికి సాయి పాదాల మీద ఉన్న భక్తి విపరీతంగా పెరిగింది. 
ఏసేచ సాఈంచే అనేక అనుభవ | సాంగూ యేతీల ఎకేక అభినవ | 
వాఢేల బహుత గ్రంథ గౌరవ | విస్తారభయాస్తవ ఆంవరితో | ||౧౭౪|| 
174. ఇలాగే, సాయి లీలల అనుభవాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక దానిని మించినది మరొకటి. చెప్పుకుంటూ పోతే, ఈ గ్రంథానికి గౌరవం పెరుగుతుంది. కాని, గ్రంథం చాలా పెద్దదై పోతుందన్న భయంతో తగ్గిస్తున్నాను. 
ఆరంభీచీ ముళ్యాంచీ కథా | పరిసతా విస్మయ శ్రోతియా చిత్తా | 
పరీ యేథీల తాత్పర్యార్థితా | తైసీచ బోధకతా ఆకళిజే | ||౧౭౫|| 
175. మొదట చెప్పిన ముళే కథను వింటే, శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. కాని అందులోని సారాన్ని, బోధించిన నీతిని అర్థం చేసుకోవాలి. 
జో జో జయాచా గురూ అసావా | త్యాచేచ ఠాయీ దృఢ విశ్వాస బసావా | 
అన్యత్ర కోఠేహీ తో నసావా | మనీ ఠసావా గుహ్యార్థ హా | ||౧౭౬|| 
176. మన గురువు ఎవరైనా, వారి మీద దృఢమైన నమ్మకం ఉంచాలి కానీ, ఇంకెక్కడా ఇంకెవరి మీదా ఉంచకూడదు. ఈ కథయొక్క అసలైన రహస్యం ఇదే. దీనిని మనసులో బాగా నిలుపు కోవాలి. 
యాంహూన అన్య కాంహీ హెతూ | దిసేనా యా బాబాంచే లీలే ఆంతూ | 
కోణీ కసాహీ విచారవంతూ | అసో పరంతు అర్థ హాచీ | ||౧౭౭|| 
177. బాబాయొక్క ఈ లీలలో ఇంతకంటే వేరే ఏ కారణమూ కనిపించదు. ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచించినా, దీని అసలైన అర్థం ఇదే. 
కోణాచీ కీర్తీ కితీహీ అసో | ఆపులే గురూచీ ముళీంహీ నసో | 
పరీ ఆపులేచ ఠాయీ విశ్వాస వసో | హాచి ఉపదేశో యేథిలా | ||౧౭౮|| 
178. మిగతా గురువులకు ఎంత గొప్ప కీర్తి ప్రతిష్ఠలు ఉన్నా, మన గురువుకు అవేవీ లేకున్నా, మన గురువు మీదే నమ్మకం ఉంచాలి అన్నదే ఈ కథలోని నీతి, సారాంశం. 
పోథీ పురాణ ధుండూ జాతా | హాచ ఉపదేశ భరలా తత్వతా | 
పరీ ఏసీ ఖూణ గాంఠ న పఢతా | నిష్టా వఠతా వఠేనా | ||౧౭౯|| 
179. పురాణాలను, మతపరమైన గ్రంథాలను, ఎంత వెదికినా, అంతటా ఈ బోధయే నిండి ఉంది. కాని, ఇది అనుభవంలోకి వస్తే తప్ప, నమ్మకం కుదరదు. 
నసోని ఆత్మనిశ్చయ వరిష్ఠ | మిరవితీ ఆపణ ఆత్మనిష్ఠ | 
త్యాంచ్యా జన్మాచే అవఘే కష్ట | దిసతీ స్పష్ట ఠాయీ ఠాయీ | ||౧౮౦||
180. తమ పైనే తమకు నమ్మకం లేని కొందరు, తామే ఆత్మను తెలుసుకున్న వారని ఊరేగుతారు. కాని, ఈ జన్మలో వారు పడే బాధలు అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తుంటాయి. 

ఇదంచ నాస్తీ పరంచనా | ఆజన్మ సదైవ వివంచనా | 
స్థైర్య లభేనా క్షణైక మనా | ముక్తాచ్యా వల్గనా కరితాతీ | ||౧౮౧|| 
181. అలాంటి వారికి ఇహ లోకం కాని, పరలోకం కాని ఏవీ లేవు. బ్రతికున్నన్ని రోజులూ ఎదో ఒక చింత. ఒక్క క్షణమైనా మనసుకు శాంతి లేక, ముక్తి పొందిన వారము అని గొప్పలు చెప్పుకుంటారు. 
అసో పుఢీల అధ్యాయాచీ గోడీ | యాహూన ఆఢళేల చోఖడీ | 
కేవళ సాఈదర్శన పరవడీ | ఆనంద నిఖడీ భోగవీ | ||౧౮౨|| 
182. వచ్చే అధ్యాయం ఇంతకంటే మధురంగా, మనసును హత్తుకునేలా ఉంటుంది. కేవలం సాయి దర్శనంలో కలిగే ఆనందాన్ని అనుభవించండి. 
భక్త భీమాజీ పాటీల ఏసా | క్షయరోగ తయాచా ఘాలవిలా కైసా | 
భక్త చాందోరకరాంచా భరవసా | దృష్టాంతా సరిసా పటవిలా | ||౧౮౩|| 
183. భీమాజీ పాటీలు అనే భక్తుని క్షయ రోగాన్ని బాబా ఎలా తొలగించారు, మరియు కలలో కనిపించి, భక్త చాందోర్కరు నమ్మకాన్ని బాబా ఎలా దృఢం చేశారు అన్న దాని గురించి చెబుతాను. 
ఏసా కేవళ దర్శన ప్రతాప | ఏహికాంచే లావీ మాప | 
ఆముష్మికాహీ దేఈ ఉగ్రాప | దర్శనే నిష్పాప కరీ జో | ||౧౮౪|| 
184. కేవలం తమ దర్శనంతోనే భక్తుల పాపాలను తొలగించి, ఈ లోకంలో వారికి కలిగే కోరికలనే కాకుండా, వారి ఆధ్యాత్మిక అవసరాలను కూడా బాబా తీర్చేవారు. 
కరీ జై యోగియాచా దృష్టిపాత | నాస్తికాంసహీ పాప నిర్ముక్త | 
ఆస్తికాంచీ తై కాయ మాత | పాప పరిచ్యుత సహజేంచ | ||౧౮౫|| 
185. యోగుల చూపు మాత్రం ప్రభావంతోనే, నాస్తికుల పాపాలు తొలగినప్పుడు, ఇక ఆస్తికుల పాపాలు కనిపించకుండా మాయమౌతాయి. 
తత్వీ జయాచీ బుద్ధీ స్థిర | ఝాలా జయా అపరోక్ష సాక్షాత్కార | 
జో హోయ తయాచే దృష్టీగోచర | పాప దుస్తర తరలా తో | ||౧౮౬|| 
186. బ్రహ్మలోనే తమ మనసును స్థిరంగా నిలిపి, ఆత్మయొక్క అనుభవాన్ని పొందిన మహాత్ముల చూపు పడగానే, భక్తులు తరింప చేయలేని పాపాలనుండి కూడా తరింప బడుతారు. 
ఏసీ బాబాంచీ కళా అకళ | బాబా తుమ్హాలాగీ ప్రేమళ | 
మ్హణోని జాణతే నేణతే సకళ | హోఊని నిర్మళ శ్రవణ కరా | ||౧౮౭|| 
187. ఇలా ఉంటాయి, బాబాయొక్క అర్థం కాని లీలలు. మీపట్ల బాబా ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకుని, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ నిర్మలమైన మనసుతో ఈ కథలను వినండి. 
జేథే భక్తిప్రేమాచా జివ్హాళా | జేథే జీవాస బాబాంచా లళా | 
తేథేంచ ప్రకటే ఖరా కళవళా | శ్రవణాచా సోహళా తేథేంచ | ||౧౮౮|| 
188. ఎక్కడ భక్తి ప్రేమలందు శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ బాబా మీద మనసులో ప్రీతి ఉంటుందో, అక్కడే నిజమైన ప్రేమను పొందాలనే తపన ఉంటుంది. అక్కడే వారి కథలను వినడం వలన ఆనందం కలుగుతుంది. 
హేమాడ నమితో సాఈచరణా | వజ్రపంజర జే అనన్య శరణా | 
పార నాహీ తయాంచా కవణా | భవభయ హరణాశక్త జే | ||౧౮౯||
189. ఒకే మనసుతో శరణుజొచ్చిన వారికి, విపరీతమైన శక్తినిచ్చి, సంసార భయాన్ని తొలగించే సాయి పాదాలకు, హేమాడు నమస్కరిస్తున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | శ్రీసంతఘోలపరామ దర్శనం నామ | 
| ద్వాదశోధ్యాయః సంపూర్ణః |

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు || 


టిపణీ: 
1. నేమలేల్యా తీన తారఖా (ఎక వార మ్హణజే ఎక ఆఠవడా, తీన వార మ్హణజే తీన ఆఠవడే). 
2. క్రీడా, లీలా. 
3. హా ముకదమా ఎకాకడూన దుసర్యాకడే అసా చాలతా చార మాజిస్ట్రేటాంకడే వర్గ హోత గేలా. 
4. పత్నీ. 

Tuesday, January 1, 2013

||శ్రీసాఈమహిమావర్ణనం నామ ఎకాదశోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత 
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౧ వా ||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

గతకథేచే అనుసంధాన | బాబాంచే అరూంద ఫళీవర శయన | 
అలక్ష్య ఆరోహణ అవతరణ | అకళ విందాన తయాంచే | ||౧|| 
1. మునపటి కథను కొనసాగిద్దాము. వెడల్పులేని చెక్క పలకపై బాబా పడుకోవటం, వారు ఆ పలక పైకి ఎలా వెళ్ళేవారో, దిగేవారో, ఎవరికీ అర్థం కాని వారి కుశలతను గూర్చి చెప్పడమైంది.
అసో హిందూ వా యవన | ఉభయతాంస సమసమాన | 
జాహలే ఆయుర్దాయ పర్యాలోచన | తే హే దేవార్చన శిరడీచే | ||౨|| 
2. హిందువు కాని, ముస్లిము కాని ఇద్దరినీ సమానంగా చూడటం, వారి జీవిత కాలం గురించి, శిరిడీలోని జనులకు వారే పూజ్య దైవమని తెలియజేయటం జరిగింది. 
ఆతా హా అధ్యాయ అకరావా | గోడ గురూకథేచా సుహావా | 
వాటలే సాఈచరణీ వహావా | దృఢ భావా ధరూని | ||౩|| 
3. గురు కథలతో ఈ పదకొండవ అధ్యాయాన్ని అలంకరించి, దృఢమైన భక్తితో, సాయి పాదాలకు అర్పించాలని అనిపించింది. 
ఘడేల యేణే సగుణధ్యాన | హే ఎకాదశరూద్రావర్తన | 
పంచభూతాంవర సత్తా ప్రమాణ | బాబాంచే మహిమాన కళేల | ||౪|| 
4. అలా చేయడం వలన, సాయి సగుణ, సాకార రూపం గురించి ధ్యానం సాధ్యమౌతుంది. ఈ అధ్యాయం ఏకాదశ రుద్రావర్తన వంటిది. పంచ భూతాలపై బాబాకున్న శక్తి, అధికారం, ఇంకా వారి మహిమ ఇవన్నీ ప్రమాణ పూర్వకంగా అర్థమౌతుంది. 
కై సే ఇంద్ర అగ్ని వరూణ | బాబాంచ్యా వచనాస దేతీ మాన | 
ఆతా కరూ తయాంచే దిగ్దర్శన | శ్రోతా అవధాన దేఇంజే | ||౫|| 
5. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు బాబా మాటలను ఎలా గౌరవించేవారో, ఇప్పుడు తెలియజేస్తాను. శ్రోతలారా! శ్రద్ధగా వినండి. 
పూర్ణ విరక్తీచీ విరక్తీ | ఏసీ సాఈచీ సగుణ మూర్తి | 
అనన్య భక్తా నిజవిశ్రాంతి | ఆఠవూ చిత్తీ సప్రేమ | ||౬|| 
6. పూర్తి విరక్తికి ఆకారం వచ్చి, విపరీతమైన భక్తితో శరణుజొచ్చే భక్తులకు విశ్రాంతి నిలయమే సాయి. ఆ సాయి సగుణ మూర్తిని ప్రేమతో మనసున ధ్యానిస్తాను. 
గురూవాక్యైక విశ్వాసన | హేంచి బసాయా దేఊ ఆసన | 
సర్వ సంకల్ప సంన్యాసన | కరూ పూజన యా సంకల్పే | ||౭|| 
7. గురువు మాటల మీద మనకున్న నమ్మకాన్నే, వారికి కూర్చోవటానికి ఆసనంగా సమర్పిద్దాము. అన్ని కోరికలను వదిలి వేయాలనే సంకల్పంతో పూజ చేద్దాము. 
ప్రతిమా స్థండిల అగ్ని తేజ | సూర్యమండల ఉదక ద్విజ | 
యా సాతాంహీ వరీ గురూరాజ | అనన్య పూజన కరూ కీ | ||౮|| 
8. విగ్రహం, స్థండిలం (దర్భలతో శుభ్రపరచిన భూమి), నిప్పు, సూర్య మండలం, నీరు, బ్రాహ్మణులు ఈ ఏడింటి కంటే గురువే గొప్ప. వారిని దృఢమైన భక్తితో పూజిద్దాము. 
చరణ ధరితా అనన్యభావే | గురూచి కాయ పరబ్రహ్మ హేలావే | 
ఏసే గురూపూజేచే నవలావే | అనుభవావే గురూభక్తే | ||౯|| 
9. దృఢమైన నమ్మకంతో, భక్తితో వారి పాదాలను ఆశ్రయిస్తే, గురువే కాదు, దేవుడు కూడా కదలి వస్తాడు. గురు పూజలో ఇంతటి మహిమ ఉంది. దీనిని గురువుయొక్క భక్తులు స్వతః అనుభవించాలి. 
పూజక జేథవర సాకారూ | దేహధారీచ ఆవశ్యక గురూ | 
నిరాకారాస నిరాకారూ | హా నిర్ధారూ శాస్త్రాచా | ||౧౦|| 
10. పూజించే వారు తమ దేహమే తాము అని అనుకున్నప్పుడు, గురువు కూడా శరీరంతో ఉండాలి. తమ దేహాన్ని మించి పూజించే వారికి, ఆకారం లేని గురువునే ధ్యానం చేయాలి అని శాస్త్రాలు చెప్పాయి. 

న కరితా సగుణాచే ధ్యానా | భక్తి భావ కదా ప్రకటేనా | 
ఆణి సప్రేమ జంవ భక్తి ఘడేనా | కళీ ఉఘడేనా మనాచీ | ||౧౧|| 
11. కంటికి కనిపించే ఆకారం లేనంత వరకు, మనసులో భక్తి కలుగదు. ప్రేమతో నిండిన భక్తి కలుగనంత వరకు, మనసనే మొగ్గ వికసించదు. 
తే ఉమలల్యావిణ కాంహీ | కేవళ కర్ణికేస గంధ నాహీ | 
నా మకరంద నా భ్రమర పాహీ | తేథ రాహీల క్షణభర | ||౧౨|| 
12. మొగ్గ వికసించక పోతే, సువాసన ఉండదు. సువాసన లేకుంటే, తేనెటీగలు క్షణమైనా అక్కడ నిలువవు. అవి నిలవక పోతే, అక్కడ తేనె ఉండదు. 
సగుణ తేంచి సాకార | నిర్గుణ తే నిరాకార | 
భిన్న నాహీ పరస్పర | సాకార నిరాకార ఎకచి | ||౧౩|| 
13. త్రిగుణాలతో కూడిన ఆకారంతో కనిపించటమే సగుణము. అదే సాకారం. గుణాలు లేనిదే నిర్గుణం. అదే నిరాకారం. ఇవి రెండూ ఒక్కటే, ఏ భేదమూ లేదు. సాకారం నిరాకారం రెండూ ఒక్కటే. 
థిజలే తరీ తే ఘృతచి సంచలే | విఘురలే తేహీ ఘృతచి మ్హణితలే | 
సగుణ నిర్గుణ ఎకచి భరలే | సమరసలే విశ్వరూపే | ||౧౪|| 
14. నెయ్యి పేరుకొని గట్టిగా ఉన్నా, కరిగి ద్రవరూపంలో ఉన్నా, నెయ్యి అనే అంటాము. సగుణ, నిర్గుణాలు రెండూ సమపాళ్ళలో కలిసి, ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. 
డోళే భరూని జే పాహూ యేఈ | పదీ జ్యాచ్యా యే ఠేవితా డోఈ | 
జేథ జ్ఞానాచీ లాగే సోఈ | ఆవడీ హోఈ తే ఠాయీ | ||౧౫|| 
15. కంటి నిండా చూసేందుకు, మనసారా భక్తితో పాదాల మీద తల ఉంచటానికి వీలుగా, సాకార రూపం ఉంటే, అక్కడ జ్ఞానం ఏ ఆటంకమూ లేక ప్రవహిస్తుంది. అక్కడే ప్రేమ కలుగుతుంది. 
జయాచియే సంగతీ | ప్రేమవార్తా కరూ యేతీ | 
జయాస పూజూ యే గంధాక్షతీ | మ్హణూని ఆకృతి పాహిజే | ||౧౬|| 
16. ప్రేమతో మాట్లాడుకోవటానికి, పూలు గంధం అక్షతలతో పూజించటానికి, ఒక ఆకారం కావాలి. 
నిర్గుణాహూన సగుణాచే | ఆకలన బహు సుకర సాచే | 
దృఢావల్యా ప్రేమ సగుణాచే | నిర్గుణాచే బోధన తే | ||౧౭|| 
17. నిర్గుణం కంటే, ఆకారం ఉన్నవారిని తెలుసుకోవటం చాలా సులభం. ఆకారం ఉన్న మూర్తిపై ప్రేమ, భక్తి దృఢమైతే, నిర్గుణ ధ్యానం తనంతట తానే కలుగుతుంది. 
భక్తా నిర్గుణ ఠాయీ పడావే | బాబాంనీ అనంత ఉపాయ యోజావే | 
అధికారానురూప దూర బసవావే | దర్శన వర్జావే బహుకాళ | ||౧౮|| 
18. భక్తులు నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని, బాబా చాలా ఉపాయాలను చేసేవారు. తమ భక్తులు భక్తి మార్గంలో వారు ఎదిగిన స్థితిని బట్టి, వారిని దూరంగా ఎక్కడికో పంపిచడం, లేక చాలా కాలం వారికి తమ దర్శనం లేకుండా చేయడం, వంటివి చేసేవారు. 
ఎకాస దేశాంతరా పాఠవావే | ఎకాస శిరడీంత ఎకాంతీ కోండావే | 
ఎకాస వాడయాంత అడకవావే | నేమ ద్యావే పోథీచే | ||౧౯|| 
19. ఒకరిని శిరిడీనుంచి దూరం పంపితే, మరొకరిని శిరిడీలోనే ఒంటరి చోటులో ఉంచేవారు. ఇంకొకరిని వాడాలోనే బంధించి, గ్రంథ పారాయణం చేయించేవారు. 
వర్షానువర్ష హా అభ్యాస | హోతా వాఢేల నిర్గుణధ్యాస | 
అసనీ శయనీ భోజనీ మనాస | జడేల సహవాస బాబాంచా | ||౨౦||
20. ఇలా చాలా సంవత్సరాలు అభ్యాసం చేస్తే, నిర్గుణ ధ్యానం పెరుగుతుంది. కూర్చున్నా, పడుకున్నా, భోజనం చేస్తునా, మనసు బాబా మీదే లగ్నమై ఉంటుంది. 

దేహ తరీ హా నాశివంత | కధీ తరీ హోణార అంత | 
మ్హణూని భక్తి న కరావీ ఖంత | అనాద్యనంత లక్షావే | ||౨౧|| 
21. ఈ దేహం శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అంతం కావలిసిందే. అందువలన, నశించే ఈ దేహం గురించి భక్తులు దుఃఖించకుండా, ఆది అంతము లేని ఆ దేవుడి మీద మనసు పెట్టాలి.
హా బహువిధ దృశ్య పసారా | సకల అవ్యక్తాచా సారా | 
అవ్యక్తాంతూన ఆలా ఆకారా | జాణార మాఘారా అవ్యక్తీ | ||౨౨|| 
22. రకరకాలుగా కనిపించే ఈ జగత్తంతా ఒక మాయ. కనిపించని ఆ దేవుడినుండి ఆకారం పొంది, కనిపించ సాగింది. మరల అది కనిపించకుండా మాయమౌతుంది. 
హీ ‘ఆబ్రహ్మస్తంబ’ సృష్టీ | వ్యష్టీ జైసీ తైసీ సమష్టీ | 
ఉపజలీ జ్యా అవ్యక్తాపోటీ | తెథేంచ శేవటీ సమరసే | ||౨౩|| 
23. ఈ సృష్టిలో, బ్రహ్మనుండి మొదలుకొని అతి చిన్న అణువు దాకా, విడి విడిగా తీసుకున్నా, లేక మొత్తాన్ని తీసుకున్నా, కనిపించని ఆ దేవుడినుండి పుట్టి, మరల ఆ దేవుడిలోనే లీనమై పోతుంది. 
మ్హణవూన కోణాసహీ నా మరణ | మగ తే బాబాంస తరీ కోఠూన | 
నిత్య శుద్ధబుద్ధనిరంజన | నిర్మరణ శ్రీసాఈ | ||౨౪|| 
24. అందువలన చావు అన్నది ఎవరికీ రాదు. ఇక మరి బాబాకు చావెక్కడిది? వారికి చావే లేదు. వారు శాశ్వతమైన, శుద్ధమైన బుద్ధ జీవి. 
కోణీ మ్హణోత భగవద్భక్త | కోణీ మ్హణోత మహాభాగవత | 
పరీ ఆమ్హాంస తే సాక్షాత భగవంత | మూర్తిమంత వాటలే | ||౨౫|| 
25. కొందరు వారిని భగవద్భక్తులని, మరి కొందరు భాగవతుడని (శ్రీ విష్ణు భక్తుడు) అంటారు. కాని మనకు వారు మూర్తీభవించిన దేవుడే! 
గంగా సముద్రా భేటూ జాతే | వాటేనే తాపార్తా శీతల కరితే | 
తీరీంచే తరూంస జీవన దేతే | తృషా హరితే సకళాంచీ | ||౨౬|| 
26. సాగర సంగమానికోసం గంగా నది వెళ్ళుతూ, దారిలో తపించేవారిని చల్లబరచి, తీరంలోని చెట్లకు నీరందిస్తూ, అందరి దాహాన్ని తీరుస్తుంది. 
తైసీచ సంతాంచీ అవతార స్థితి | ప్రకట హోతీ ఆణి జాతీ | 
పరీ తయాంచీ ఆచరితీ రీతీ | పావన కరితీ జగాతే | ||౨౭|| 
27. అలాగే, సాధు సంతుల అవతారం. వారు కనిపించి, మరల కనిపించకుండా వెళ్ళిపోతారు. కాని కనిపించినంత కాలం వారు ఆచరించిన రీతి ఈ జగత్తును పావనం చేస్తుంది. 
కమాలీచీ క్షమాశీలతా | నైసర్గిక విలక్షణ అక్షోభ్యతా | 
ౠజుతా మృదుతా సోశీకతా | తైసీచ సంతుష్టతా నిరూపమ | ||౨౮|| 
28. దేనినైనా క్షమించే వారి ప్రత్యేకమైన గుణం, ఎంతో సహజంగా ఉండే వారి శాంత స్వభావము, అపురూపమైన వారి నిష్కపట గుణం, వారి మృదుత్వం, ఎప్పుడూ తృప్తిగా ఉండే వారి స్వభావం, ఇవన్నీ సాటి లేనివి, అసామాన్యమైనవి. 
దిసాయా జరీ దేహధారీ | తరీ తో నిర్గుణ నిర్వికారీ | 
నిఃసంగ నిర్ముక్త నిజ అంతరీ | ప్రపంచీ జరీ విచరలా | ||౨౯|| 
29. శరీరంతో కనిపిస్తున్నా, మనతో ఈ ప్రపంచంలో తిరుగుతున్నా, వారు లోలోపల నిర్గుణులు, ఏ కోరికలూ లేనివారు, ఏ సహవాసమూ లేనివారు, మరియు ముక్తులు. 
కృష్ణ స్వయే జో పరమాత్మా | తోహీ మ్హణే సంత మదాత్మా | 
సంత మాఝీ సజీవ ప్రతిమా | సంత సప్రేమా తో మీచ | ||౩౦||
30. దేవుడై ఉండీ శ్రీకృష్ణుడు, “సంతులు నా ఆత్మ. వారు జీవంతో ఉన్న నా ప్రతిమా రూపాలు. ప్రేమతో నిండిన సత్పురుషులలో నేనే ఉన్నాను. 

ప్రతిమారూపహీ1 సంతా న సాజే | సంత నిశ్చళ స్వరూప మాఝే | 
మ్హణవూని మద్భక్తాంచే ఓఝే | తయాంచే లాజే మీ వాహే | ||౩౧|| 
31. “అయినా, వారిని నా ప్రతిమా రూపలు అని అనటం సరి కాదు. వారు మారని నా రూపాలే. అందుకే, వారి కోసం, నా భక్తుల బరువు బాధ్యతలను నేనే మోస్తాను. వారికి కలిగే అవమానాలను కూడా నేనే భరిస్తాను. 
సంతాంసీ జో అనన్యశరణ | మీ హీ వందీ తయాచే చరణ | 
ఏసే వదలా ఉద్ధవా ఆపణ | సంత మహిమాన శ్రీకృష్ణ | ||౩౨|| 
32. “సాధు సంతులకు శరణుజొచ్చిన వారి పాదాలకు కూడా నేను నమస్కరిస్తాను”. అని సత్పురుషుల మహిమను శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పారు. 
సగుణాంతలా జో సగుణ | నిర్గుణాంతలా జో నిర్గుణ | 
గుణవంతాతీల జో అనుత్తమ గుణ | గుణియాంచా గుణియా గుణి రాజా | ||౩౩|| 
33. సగుణాలలో సంపూర్ణమైన వారు, నిర్గుణులలో నిర్గుణులు, గుణవంతులలో ఉత్తమమైన గుణవంతులు, మరియు గొప్ప గుణాలున్న వారందరికీ రాజు వంటి వారు సాయి. 
పర్యాప్త కామ జో కృతకృత్య | సదా యదృచ్ఛా లాభ తృప్త | 
జో అనవరత ఆత్మనిరత | సుఖదుఃఖాతీత జో | ||౩౪|| 
34. కోరికలన్నీ తీరినవారు, దొరికిన వాటితో తృప్తి పడే సంతుష్టులు, ఎప్పుడూ ఆత్మ ధ్యానంలో లీనమైన వారు, సుఖ దుఃఖాలను మించిన వారు సాయి. 
ఆత్మానందాచే జో వైభవ | కోణా వర్ణవేల తే గౌరవ | 
అనిర్వాచ్య సర్వథైవ | బ్రహ్మ దైవత మూర్త జో | ||౩౫|| 
35. ఆత్మ ధ్యానంలో లీనమై పొందే ఆనందానికి ఐశ్వర్యమైనట్టి వారిని ఎవరు వర్ణించగలరు? మూర్తీభవించిన ఈ బ్రహ్మ దేవుణ్ణి ఎవరూ ఏ విధంగానూ వర్ణించలేరు. 
కీ హీ అనిర్వచనీయ శక్తి | దృశ్య రూపే అవతరలీ క్షితీ | 
సచ్చిత్సుఖానందాచీ మూర్తి | జ్ఞాన సంవిత్తి తీచ తీ | ||౩౬|| 
36. వర్ణించ సాధ్యం కాని ఈ శక్తియే, మనిషి రూపంలో భూమిపై అవతరించింది. సచ్చిదానంద మూర్తి అయిన జ్ఞాన సంపత్తే సాయి. 
బ్రహ్మాకారాంతఃకరణమూర్తి | ఝాలీ జయాచీ ప్రపంచీ నివృత్తి | 
నిత్య నిష్ప్రపంచ బ్రహ్మాత్మ్యైక్యస్థితి | ఆనంద మూర్తి కేవళ తీ | ||౩౭|| 
37. సాంసారిక బంధాలనుంచి ముక్తి పొంది, బ్రహ్మతో ఒకటైన కరుణామూర్తి, వీరే. ఎల్లప్పుడూ ప్రపంచానికి దూరంగా, బ్రహ్మతో ఏకమై, శుద్ధమైన ఆనందానికి రూపం సాయి. 
“ఆనందోబ్రహ్మోతి” శ్రుతి | శ్రోతే నిత్య శ్రవణ కరితీ | 
పుస్తకజ్ఞానీ పోథీంత వాచితీ | భావికా ప్రతీతీ శిరడీంత | ||౩౮|| 
38. ‘ఆనందో బ్రహ్మేతి (శుద్ధమైన ఆనందమే దేవుడు)’ అని శ్రుతులు చెబుతాయి. శ్రోతలు దీనిని రోజూ వింటారు. పుస్తకాలు చదివే వారు పారాయణం చేస్తారు. మరియు భక్తులు ఈ అనుభవాన్ని శిరిడీలో పొందుతారు. 
ధర్మాధర్మాది జ్యాచే లక్షణ | తోహా సంసార అతి విలక్షణ | 
అనాత్మజ్ఞాంసీ క్షణోక్షణ | కరణే రక్షణ ప్రాప్త కీ | ||౩౯|| 
39. ధర్మం అధర్మంతో కూడుకున్న అతి విచిత్రమైనది ఈ ప్రపంచం. ఆత్మ గురించి జ్ఞానం లేనివారు ప్రతి క్షణం దీనినుండి తమను తాము రక్షించుకుంటూ ఉండాలి. 
పరీ హా న ఆత్మాజ్ఞాంచా విషయ | తయాంసీ ఆత్మస్వరూపీంచ ఆశ్రయ | 
తే నిత్య ముక్త ఆనందమయ | సదా చిన్మయరూప జే | ||౪౦||
40. కాని, ఆత్మను తెలుసుకున్న వారికి ఈ రక్షణ అవసరం లేదు. ఎప్పుడూ వారు ఆత్మలో లీనమై ఉంటారు. శాశ్వతంగా ముక్తిని పొందినవారు. ఎప్పుడూ ఆనందంతో ఉన్న శుద్ధ జ్ఞానానికి రూపాలు. 

బాబాంచ సర్వాంచె అధిష్ఠాన | తయాంస కేఉతే ఆసన | 
త్యాహీ వరీ రౌప్య సింహాసన | భక్త భావనపరీ బాబా | ||౪౧|| 
41. స్వతఃగా బాబాయే అందరికీ ఆధారం. వారికి ఆసనం ఎందుకు? అందునా వెండి సింహాసనం! కాని, బాబా ఒప్పుకున్నది, భక్తుల ముచ్చట తీర్చటానికే.
బహుతా దిసాంచీ జునీ బైఠక | గో్ణత్యాచా తుకడా ఎక | 
త్యావరి ఘాలితీ భక్త భావిక | గాదీ సురేఖ బైసాయా | ||౪౨|| 
42. వారి మామూలు ఆసనం అంటే, ఏ నాటిదో ఒక పాత గోనె ముక్క. దానిపై, భక్తులు ప్రేమతో చక్కటి గద్దెను వేసేవారు. 
మాగీల టేకాయాచి భింత | తెథే తక్యా ఠేవితీ భక్త | 
జైసే భక్తాంచే మనోగత | బాబాహీ వాగత తైసేచ | ||౪౩|| 
43. వెనుక ఆనుకోవటానికి ఒక తలగడను గోడకు ఉంచేవారు. భక్తుల మనసులోని కోరికలను బట్టి బాబా నడుచుకునేవారు. 
వాస్తవ్య దిసే శిరడీంత | తరీ తే హోతే సర్వగత | 
హా అనుభవ నిజభక్తాంప్రత | సాఈ నిత దాఖవీత | ||౪౪|| 
44. అసలు వారు శిరిడీలో కనిపించినా, అంతటా ఉన్నట్లు, తమ భక్తులకు రోజూ అనుభవాలను కలిగించేవారు. 
స్వయే జరీ నిర్వికార | అంగికారీత పూజా ఉపచార | 
భక్తభావార్థానుసార | ప్రకార సర్వ స్వీకారిత | ||౪౫|| 
45. ఏ కోరికలూ లేకుండా, అన్నిటినీ త్యాగం చేసినా, భక్తుల భావాలకు తగ్గట్టు అన్ని రకాల పూజ ఉపచారాలను చేయించుకునేవారు. 
కోణీ కరీత చామరాందోలన2 | కోణీ తాలవృన్త3 పరివీజన | 
సనయా చౌఘడే మంగల వాదన | కోణీ సమర్పణ పూజేచే | ||౪౬|| 
46. ఒకరు వింజామర, మరొకరు వీవన వారికి వీచేవారు. కొందరు సన్నాయి, డోలు మొదలయిన వాద్యాలు వాయించేవారు. కొందరు పూజను చేసేవారు. 
కోణీ హస్త పాదప్రక్షాలన | కోణీ అత్తర గంధార్చన | 
కోణీ త్రయోదశగుణీ తాంబూల దాన | నివేదన మహానైవేద్యా | ||౪౭|| 
47. వారి చేతులను, పాదాలను ఒకరు కడిగితే, మరొకరు అత్తరు గంధం పూసేవారు. ఇంకొకరు మహానైవేద్యాన్ని సమర్పించి, జాజి, జాపత్రి మొదలగు పదమూడు పరిమళ వస్తువులతో కూడిన తాంబూలాన్ని అర్పించేవారు. 
కోణీ దుబోటీ ఆడవే గంధ | శివలింగా తైసే చర్చితీ సలంగ | 
కోణీ కస్తూరీమిశ్రిత సుగంధ | తైసేంచి చందన చర్చీత | ||౪౮|| 
48. ఇంకా కోందరు, బొటన వ్రేలితో, శివలింగానికి పెట్టేలా అడ్డబొట్టు పెట్టేవారు. మరొకరు కస్తూరి కలిపిన సుగంధ చందనాన్ని రాసేవారు. 
ఎకదా తాత్యాసాహేబ నూలకరాంచే | స్నేహీ డాక్టర పండిత నాంవాచే | 
ఘ్యావయా దర్శన సాఈ బాబాంచే | ఆలే ఎకదాంచే శిరడీంత | ||౪౯|| 
49. ఒక మారు, తాత్యాసాహేబు నూల్కరు స్నేహితుడు, డాక్టరు పండిత్ అనే పేరుగలతను సాయి దర్శనానికి శిరిడీ వచ్చాడు. 
పాఊల ఠేవితా శిరడీంత | ఆరంభీ గేలే మశీదీంత | 
కరూని బాబాంసీ ప్రణిపాత | బైసలే నివాంత క్షణ భరీ | ||౫౦||
50. శిరిడీలో అడుగు పెట్టగానే, వెంటనే మసీదుకు వెళ్ళి, బాబాకు నమస్కరించి, కొంత సేపు విశ్రమించటానికి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. 

బాబా మగ వదతీ తయాంతే | “జాఈ దాదా భటాచ్యా యేథే | 
జా అసే జా” మ్హణూని బోటే హాతే | లావితీ మార్గాతే తయాస | ||౫౧|| 
51. అప్పుడు బాబా అతనితో “దాదా భట్టు దగ్గరకు ఇలా వెళ్ళు” అని తమ చేత్తో దారిని చూపించారు. 
పండిత దాదాంకడే గేలే | దాదాంనీ యోగ్య స్వాగత కేలే | 
మగ దాదా బాబాంచే పూజేస నిఘాలే | యేతా కా విచారిలే తయాంసి | ||౫౨|| 
52. పండితు దాదా దగ్గరకు వెళ్ళాడు. దాదా అతనిని బాగా సత్కరించాడు. ఆ తరువాత, బాబా పూజకని దాదా బయలుదేరి, ‘మీరూ వస్తారా?’ అని అడిగాడు. 
దాదా సమవేత పండిత గేలే | దాదానీ బాబాంచే పూజన కేలే | 
కోణీహీ న తోంవర లావాయా ధజలే | గంధాచే టికలే బాబాంస | ||౫౩|| 
53. దాదా వెంట పండితు వెళ్ళాడు. బాబా పూజను దాదా చేశాడు. అప్పటి వరకూ బాబా నుదుటి మీద గంధం పెట్టటానికి ఎవరూ సాహసించలేదు. 
కోణీ కసాహీ యేవో భక్త | కపాళీ గంధ లావూ న దేత | 
మాత్ర మ్హాళసాపతీ గళ్యాసీ ఫాంసీత | ఇతర తే లావీత పాయాంతే | ||౫౪|| 
54. ఏ భక్తుడైనా సరె, ఏ కారణం చేత వచ్చినా, తమ నుదుట మీద బాబా గంధం రాయనిచ్చేవారు కాదు. మహల్సాపతి ఒక్కడే వారి గొంతుకు చందనం పూసేవాడు. ఇతరులు వారి పాదాలకు మాత్రమే పూసేవారు. 
పరీ హే పండిత భోళే భావిక | దాదాంచీ తబకడీ కేలీ హస్తక | 
ధరూనియా శ్రీసాఈచే మస్తక | రేఖిలా సురేఖ త్రిపుండ్ర | ||౫౫|| 
55. కాని, ఇది తెలియని అమాయకుడైన పండితు, చందనం గిన్నెను తన చేతిలోకి లాక్కొని, సాయి నుదుట మీద మూడు అడ్డ రేఖలను (త్రిపుండ్రం) దిద్దాడు. 
పాహూని హే తయాంచే సాహస | దాదాంచే మనీ ధాసధూస | 
చఢతీల బాబా పరమ కోపాస | కాయ హే ధాడస మ్హణావే | ||౫౬|| 
56. అతని ధైర్యాన్ని చూచి, దాదా మనసులో కలవర పడ్డాడు. ‘ఎంత ధైర్యం! బాబా కోపంతో మండి పడుతారేమో!’ అని అనుకున్నాడు. 
ఏసే అఘడతే జరీ ఘడలే | బాబా ఎకహీ న అక్షర వదలే | 
కింబహునా వృత్తీనే ప్రసన్న దిసలే | ముళీ న కోపలే తయాంవర | ||౫౭|| 
57. అలా జరగకూడనిది జరిగినా, బాబా ఒక ముక్కైనా అనలేదు. ఇంకా, చాలా ప్రసన్నంగా కనిపించారు. పండితు మీద అసలు కోపగించ లేదు. 
అసో తీ వేళ జాఊ దిలీ | దాదాంచే మనీ రూఖరూఖ రాహిలీ | 
మగ తేచ దినీ సాయంకాళీ | బాబాంస విచారిలీ తీ గోష్ట | ||౫౮|| 
58. దాదా మనసులో అలజడి మొదలైంది. అయినా ఆ పూట గడవనిచ్చాడు. అదే రోజు సాయంత్రం, దాని గురించి బాబాను అడిగాడు. 
ఆమ్హీ గంధాచా ఉలాసా టిళా | లావూ జాతా ఆపులియా నిఢళా | 
స్పర్శ కరూ ఘ్యానా కపాళా | ఆణి హే సకాళా కాయ ఘడలే | ||౫౯|| 
59. ‘మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని మేము ఎంత ఉత్సాహ పడినా, మమ్మల్ని అసలు తాకనివ్వరు కదా, మరి ఈ ఉదయం ఏం జరిగింది? 
ఆముచ్యా టిళ్యాచా కంటాళా | పండితాంచ్యా త్రిపుండ్రాచా జివ్హాళా | 
హా కాయ నవలాచా సోహళా | బసేనా తాళా సుసంగత | ||౬౦||
60. ‘మా తిలకం మీకు నచ్చదు గాని, ఆ పండితు త్రిపుండ్ర రేఖలంటే అంత ప్రేమమా? ఏమిటీ వింత? తాళానికి సరిగ్గా లేదు!’ 

తంవ సస్మితవదన ప్రీతీ | సాఈ దాదాంలాగీ వదతీ | 
పరిసావీ తీ మధుర ఉక్తీ | సాదర చిత్తీ సకళికీ | ||౬౧|| 
61. అప్పుడు, ముఖం మీద చిరునవ్వుతో, ఎంతో ప్రేమగా దాదాతో పలికిన మధురమైన మాటలను అందరూ శ్రద్ధగా వినండి.
“దాదా తయాచా గురూ బామణ | మీ జాతీచా ముసలమాన | 
తరీ మీ తోచి ఏసే మానూన | కేలే గురూపూజన తయానే | ||౬౨|| 
62. “దాదా! అతని గురు బ్రాహ్మణుడు. నేను జాతిలో ముస్లిమును. అయినా అతడు నన్ను తన గురువు అని అనుకుని పూజ చేశాడు. 
ఆపణ మోఠే పవిత్ర బ్రాహ్మణ | హా జాతీచా అపవిత్ర యవన | 
కైసే కరూ త్యాంచే పూజన | ఏసే న తన్మన శంకలే | ||౬౩|| 
63. “‘నేను శుద్ధమైన, పవిత్రుడైన బ్రాహ్మణుణ్ణి. ఇతడు అపవిత్రమైన ముసల్మాను జాతివాడు కదా, ఇతనిని ఎలా పూజించడం’ అని అతడు అసలు సందేహించ లేదు. 
ఏసే మజ త్యానే ఫసవిలే | తెథే మాఝే ఉపాయ హరలే | 
నకో మ్హణణే జాగీంచా రాహిలే | ఆధీన కేలే మజ తేణే ” | ||౬౪|| 
64. “అలా తను నన్ను యేమార్చాడు. అప్పుడు నా ఉపాయమేమీ సాగక, నేను అతనిని కాదనలేక పోయాను. అలా నన్ను తన వశం చేసుకున్నాడు”. 
ఏసే జే హే ఉత్తర పరిసిలే | వాటలే కేవళ వినోదే భరలే | 
పరీ తయాంతీల ఇంగిత కళలే | మాఘారా పరతలే జై దాదా | ||౬౫|| 
65. ఇలాంటి జవాబు విని, దాదాకు అది కేవలం వినోదంగా అనిపించింది. ఇంటికెళ్ళిన తరువాతే, ఆ మాటలలోని ఇంగితం అతనికి అర్థం అయింది. 
హీ బాబాంచీ విసంగతతా | దాదాంచ్యా ఫారచ లాగలీ చిత్తా | 
పరీ పండితాసవే వార్తా కరితా | కళలీ సుసంగతతా తాత్కాళ | ||౬౬|| 
66. పొసగు లేని బాబా నడత, దాదాను చాలా బాధపెట్టింది. తరువాత, పండితుతో మాట్లాడినప్పుడు బాబా నడత ఎంత నిలకడగా ఉందో తెలిసింది. 
ధోపేశ్వరీంచే రఘునాథ సిద్ధ | ‘కాకా పురాణిక’ నామే ప్రసిద్ధ | 
పండిత తయాంచే పదీ సన్నద్ధ | ఋణానుబంధ శిష్యత్వే | ||౬౭|| 
67. ధోపేశ్వరులో రఘునాథ అన్న సిద్ధుడు కాకా పురాణిక (౧౮౨౧ - ౧౯౧౦) అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఎన్నో జన్మల ఋణానుబంధం వలన, వారి పాదాలయందు పండితు భక్తితో శిష్యుడిగా ఉన్నాడు. 
త్యానీ కాకాంచా ఘాతలా ఠావ | తయాంస తైసాచ ఆలా అనుభవ | 
జయా మనీ జైసా భావ | భక్తి ప్రభావహీ తైసాచ | ||౬౮|| 
68. బాబాను చూసినప్పుడు, బాబాయే తన గురువైన కాకా అని అనుకున్నాడు. అతనికి అలాగే అనుభవమైంది. మనసులో ఉండే భావాన్ని బట్టి భక్తి ప్రభావం కూడా ఉంటుంది. 
అసో హే సర్వోపచార కరవూన ఘేతీ | కేవళ తయాంచ్యా ఆలియా చిత్తీ | 
నాతో పూజేచీ తాటే భిరకావితీ | రూప ప్రకటితీ నరసింహ | ||౬౯|| 
69. కాని, ఇలాంటి పూజలను తనకు నచ్చినప్పుడే బాబా చేయించుకునే వారు. లేకుంటే, పూజా పళ్ళాన్ని కోపంతో విసిరి వేసి, నరసింహావతారాన్ని చూపేవారు. 
హే రూప కా జై ప్రకటిజేల | కోణ ధీరాచా పాశీ ఠాకేల | 
జో తో జీవాభేణే పళేల | వృత్తి ఖవళేల తీ జేవ్హా | ||౭౦||
70. ఇలాంటి ఉగ్ర రూపాన్ని చూపినప్పుడు, వారి దగ్గర నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుంది? అంత కోపాన్ని చూసి, ప్రాణ భయంతో అందరూ పరిగెత్తేవారు. 

కధీ అవచిత క్రోధవృత్తి | భక్తాంవరీ ఆగ పాఖడితీ | 
కధీ మేణాహూని మఊ భాసతీ | పుతళా శాంతి క్షమేచా | ||౭౧|| 
71. ఒకొక్కప్పుడు అకస్మాత్తుగా బాబా కోపంతో భక్తులపై నిప్పులు చెరిగేవారు. ఇంకొకప్పుడు మైనంకంటే మెత్తగా, శాంతి, క్షమలు ఆకారం దాల్చినట్లు ఉండే వారు. 
కధీ కాళాగ్నిరూప భాసతీ | భక్తాంస ఖడ్గాచే ధారేవర ధరితీ | 
కధీ లోణ్యాహూని మవాళ హోతీ | ఆనంద వృత్తి విలసతీ | ||౭౨|| 
72. ఒకొక్కప్పుడు కోపంతో ఉగ్రంగా కాలాగ్ని రూపంతో కనిపించి, భక్తులను ఖడ్గ ధారపై నడిపించేవారు. ఇంకొకప్పుడు, వెన్నకంటే మెత్తగా, ఎంతో ఆనందంగా కనిపించేవారు. 
జరీ క్రోధే కాంపలే థరథరా | డోళే జరీ ఫిరవిలే గరగరా | 
తరీ పోటీ కారూణ్యాచా ఝరా | మాతా లేంకురా తైసా హా | ||౭౩|| 
73. బయటకు కోపంతో అటు ఇటు ఊగిపోతున్నా, కళ్ళు గిరగిరా త్రిప్పినా, లోపల మటుకు బిడ్డలపై కన్నతల్లికి ఉండే కరుణ ఝరి ఉండేది. 
క్షణాంత వృత్తీవరీ యేతా | హాంకా మారూని బాహతీ భక్తా | 
మ్హణతీ “మీ కోణావరీహీ రాగావతా | ఠావే న చిత్తా మాఝియా | ||౭౪|| 
74. కోపం తగ్గగానే, భక్తులను పిలిచి, “ఎవరి మీదైనా నేను కోపించినట్లు కనిపించినా, మనసులో నాకు కోపం లేదు. 
మాయ హాణీ లేంకరా లాతా | సముద్ర కరీ నదియా పరతా | 
తరీచ మీ హోయ తుమ్హా అవ్హేరితా | కరీన అహితా తుమచియా | ||౭౫|| 
75. “తల్లి తన బిడ్డలను తన్ని తరిమి వేసినప్పుడు, సముద్రం నదులను వెనుకకు పంపినప్పుడు, నేను మిమ్మల్ని తరిమి వేస్తాను. అప్పుడు మీకు చెడు చేస్తాను. 
మీ మాఝియా భక్తాంచా అంకిలా | ఆహే పాసీంచ ఉభా ఠాకలా | 
ప్రేమాచా మీ సదా భుకేలా | హాక హాకేలా దేతసే” | ||౭౬|| 
76. “నేను నా భక్తుల అధీనంలో ఉన్నవాణ్ణి. భక్తుల దగ్గరే ఉంటాను. నేనెప్పుడూ వారి ప్రేమ కోసం తపిస్తుంటాను. భక్తులు ఎప్పుడు పిలిచినా పలుకుతాను”. 
హా కథాభాగ లిహితా లిహితా | ఓఘానే ఆఠవలీ సమర్పక కథా | 
ఉదాహరణార్థ కథితో శ్రోతా | సాదరాచిత్తా పరిసిజే | ||౭౭|| 
77. కథలోని ఈ భాగాన్ని వ్రాస్తున్నప్పుడు, పైన చెప్పిన దానికి సంబంధించిన ఇంకొక కథ సహజంగా గుర్తుకు వచ్చింది. ఉదాహరణగా చెబుతాను. శ్రోతలారా! శ్రద్ధగా వినండి. 
ఆలా కల్యాణవాసీ ఎక యవన | సిదీక ఫాళకే నామాభిధాన | 
మక్కా మదీనా యాత్రా కరూన | శిరడీ లాగూన పాతలా | ||౭౮|| 
78. కళ్యాణలో ఉండే సిద్ధిక ఫాళకే అను పేరుగల ముస్లిము, మక్కా మదినా యాత్రలు చేసి, శిరిడీకి వచ్చాడు. 
ఉతరలా తో వృద్ధ హాజీ | ఉత్తరాభిముఖ4 చావడీమాజీ | 
ప్రథమ నఊ మాస ఇతరాజీ | బాబా న రాజీ తయాతే | ||౭౯|| 
79. ముసలివాడైన ఆ హాజీ ఉత్తర దిశలో ఉన్న చావడిలో బస చేసాడు. మొదటి తొమ్మిది నెలలూ, అతనిపై బాబా ప్రసన్నులు కాకపోగా, అతనంటే బాబాకు ఇష్టం ఉండలేదు. 
ఆలా నాహీ తయాచా హోరా | వ్యర్థ జాహల్యా యేరఝారా | 
కేల్యా తయానే నానా తర్హా | నజరానజర హోఈనా | ||౮౦||
80. కాలం కలసిరాలేదు. అతను ఎన్ని మార్లు మసీదుకు వెళ్ళినా అన్నీ వృథా అయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, బాబా దర్శనం కాలేదు. 

మశీద ముక్త ద్వారా అవఘ్యాంసీ | కోణాసహీ నా పడదపోశీ | 
పరీ న ఆజ్ఞా త్యా ఫాళక్యాసీ | చఢావయాసీ మశీదీ | ||౮౧|| 
81. మసీదు తలుపులు అందరికీ తెరచి ఉండేవి. ఎవరికీ ఏ అడ్డు, తెరగానీ లేవు. కాని, ఆ ఫాళకేకు మాత్రం మసీదు మెట్లు ఎక్కటానికి అనుమతి దొరకలేదు.
ఫాళక అంతరీ ఖిన్న ఝాలే | కాయ తరీ హే కర్మ వాహిలే | 
మశీదీస న లాగతీ పాఊలే | కాయ మ్యా కేలే పాప కీ | ||౮౨|| 
82. ‘ఏమిటి నాకు ఈ కర్మ! మసీదులో అడుగు పెట్టలేకున్నానే? నేనేం పాపం చేశాను?’ అని ఫాళకే మనసులో దుఃఖించాడు. 
కవణ్యా యోగే ప్రసన్న హోంతీ | ఆతా బాబా మజవర పుఢతీ | 
హాచ విచార దివసరాతీ | హృద్రోగ చిత్తీ ఫాళక్యాంచే | ||౮౩|| 
83. ‘ఏం చేసి, బాబా అనుగ్రహాన్ని పొందగలను?’ అని రాత్రి పగలూ అతనికి ఒకటే ఆలోచన. దాంతో, రోగంలా ఈ ఆలోచన, అతని హృదయాన్ని పీడించ సాగింది. 
తితక్యాంత కోణీ కళవిలే తయాంస | హోఊ నకా ఏసే ఉదాస | 
ధరా మాధవరావాంచీ కాస | పురేల ఆస మనీంచీ | ||౮౪|| 
84. ఇంతలో ‘విచారించకు! మాధవరావు సహాయం పొందితే, నీ కోరిక తీరుతుంది’ అని ఎవరో తెలియజేసారు. 
ఆధీ న ఘేతా నందీచే దర్శన | శంకర హోఈల కాయ ప్రసన్న | 
తయాసీ యాచ మార్గాచే అవలంబన | గమలే సాధన తే బరవే | ||౮౫|| 
85. ముందుగా నంది దర్శనం చేసుకోకపోతే, శంకరుడు ప్రసన్నమౌతాడా! అతనికి ఈ మార్గమే మంచిదనిపించి, ఆ ఉపాయం నచ్చింది. 
సకృద్దర్శనీ హీ అతిశయోక్తి | ఏసే వాటేల శ్రోతయా చిత్తీ | 
పరీ హా అనుభవ దర్శనవక్తీ5 | భక్తాంప్రతీ శిరడీంత | ||౮౬|| 
86. ఇది విని శ్రోతలకు అతిశయోక్తిగా అనిపించ వచ్చు. కాని, శిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకు, ఎన్నో మార్లు ఈ అనుభవమైంది. 
జయా మనీ బాబాంచే సవే | సంథపణే సంభాషణ వ్హావే | 
తయాచియా సమవేత జావే | మాధవరావే ఆరంభీ | ||౮౭|| 
87. బాబాతో ఏకాంతంగా మాట్లాడాలని ఇష్టపడే వారు, మొదలు మాధవరావును వెంటబెట్టుకుని వెళ్ళేవారు. 
ఆలే హే కోణ కోఠూన కిమర్థ | గోడ శబ్దే కళవావా కార్యార్థ | 
సూతోవాచ హోతాంచ సమర్థ | హోత మగ ఉద్యుక్త బోలాయా | ||౮౮|| 
88. అతను ముందుగా, ఎవరు ఎక్కడనుండి ఏ పని మీద వచ్చారన్నది అతి సున్నితంగా బాబాకు చెప్పేవాడు. దాని తరువాత, బాబా మాట్లాడటానికి మొదలుపెట్టేవారు. 
ఏకోనియా తే హాజీనే సకళ | మాధవరావాంస ఘాతలీ గళ | 
మ్హణాలే “ఎకదాంహీ మాఝీ తళమళ | ఘాలవా దుర్మిళ మిళవూని ఘ్యా | ||౮౯|| 
89. ఇదంతా విని మాధవరావుతో ఆ హాజీ, ‘నా మనసులో ఉన్న ఈ బాధను ఒక్క సారి తొలగించు. ఇంత వరకు నాకు సాధ్యం కాని బాబా దర్శనాన్ని కలిగించు’ అని వేడుకున్నాడు. 
పడతా మాధవరావాంస భీడ | కేలా మనాచా నిశ్చయ దృఢ | 
అసో వా నసో కార్య అవఘడ | పాహూ కీ దగడ టాకునీ | ||౯౦||
90. అంత దీనంగా అతను మాధవరావును వేడుకోగా, సాధ్యం కాని, కాకపోనీ, ఎంత కష్టమైనా సరె, ప్రయత్నించి చూడాలని అతను నిశ్చయించుకున్నాడు. 

గేలే మశీదీస కేలా ధీర | గోష్ట కాఢిలీ అతిహళువార | 
“బాబా తో మ్హాతారా కష్టీ ఫార | కరానా ఉపకార తయావర | ||౯౧|| 
91. ధైర్యాన్ని కూడబెట్టుకుని, మసీదుకు వెళ్ళాడు. జాగ్రతగా, మెల్లగా బాబాతో ‘బాబా! ఆ ముసలివాడు చాలా బాధ పడుతున్నాడు. అతన్ని కరుణించ రాదా?’ 
హాజీ తో కరూని మక్కా మదీనా | శిరడీస ఆలా ఆపులే దర్శనా | 
తయాచీ కైసే యేఈనా కరూణా | యేఊంచ ఘ్యానా మశీదీ | ||౯౨|| 
92. ‘ఆ హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి, తమ దర్శనానికి శిరిడీ వచ్చాడు. అతనిపై ఎందుకు దయ చూపటం లేదు? దయచేసి అతన్ని మసీదులోకి రానివ్వ రాదా? 
జన యేతీ అసంఖ్యాత | జాఊన మశీదీంత దర్శన ఘేత | 
హాతోహాత చాలలే జాత | హాచ ఖిచపత పడలా కా | ||౯౩|| 
93. ‘లెక్కలేనన్ని జనులు వచ్చి, మసీదులో మీ దర్శనం చేసుకుని వెళుతున్నారు కదా? మరి ఇతని మీదే ఎందుకింత నిరాదరణ? 
కరాకీ ఎకదా కృపాదృష్టీ | హోవో తయాసీ మశీదీంత భేటీ | 
జాఈల మగ తోహీ ఉఠాఉఠీ | పుసూని గోష్టీ మనీంచీ” | ||౯౪|| 
94. ‘ఒక్క సారి అతని మీద మీ దయ చూపండి. అతనిని మసీదులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి. మనసులోని మాట చెప్పుకుని వెంటనే వెళ్ళిపోతాడు’ అని అన్నాడు. 
“శామ్యా తుఝ్యా ఓఠాచా జార | అజూన నాహీ వాళలా తిళభర | 
నసతా అల్లాచీ ఖుదరత తయావర | మీ కాయ కరణార తయాసీ | ||౯౫|| 
95. “శ్యామా! నువ్వింకా ముక్కు పచ్చలారని పసివాడవు. అల్లా అనుగ్రహం అతనిపై లేక పోతే, నేనేం చేయ్యను? 
నసతా అల్లామియాచా ఋణీ | చఢలే కాయ యా మశీదీ కుణీ | 
అఘటిత యేథీల ఫకీరాచీ కరణీ | నాహీ మీ ధణీ తయాచా | ||౯౬|| 
96. “అల్లా మియాకు ఋణపడి ఉండకపోతే, ఎవరైనా మసీదు మెట్లు ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు లీలలు ఎవరికీ అర్థం కానివి. నేను అతని యజమానిని కాను (అతని మీద నాకే అధికారము లేదు). 
అసో బారవీ6 పలీకడే థేట | ఆహేజీ ఎక పాఊలవాట | 
చాలూన యేసీల కాయ తూ నీట | విచారజా స్పష్ట తయాతే” | ||౯౭|| 
97. “అయినా సరే, అక్కడ బారవీ (అనే పేరుగల బావి) దగ్గరగా, వెనకాల ఇరుకు బాట ఉంది. ఆ దోవలో అతడు రాగలడా, అని వెళ్ళి స్పష్టంగా అడుగు.” అని అన్నారు. 
హాజీ వదే “కితీహీ బికట | అసేనా తీ మీ చాలేన నీట | 
పరీ మజ ఘ్యావీ ప్రత్యక్ష భేట | చరణానికట బైసూ ఘ్యా | ||౯౮|| 
98. దానినే మాధవరావు అడగగా ఆ హాజీ ‘ఎంత కష్టమైనా సరే వస్తాను. వారిని స్వయంగా కలుసుకోవాలి. వారి పాదాల దగ్గర నేను కూర్చోవాలి అని అన్నాడు. 
పరిసూని శామాకరవీ హే ఉత్తర | బాబా వదతీ ఆణీక విచార | 
“చారవేళాంతీ చాళీస హజార | రూపయే తూ దేణార కాయ మజ” | ||౯౯|| 
99. దీనినే మాధవరావు బాబాకు చెప్పగా “నాలుగు వాయిదాలలో, నలభై వేల రూపాయలను నాకు ఇస్తాడా అని అడుగు” అని అన్నారు. 
మాధవరావ హా నిరోప సాంగతా | హాజీ మ్హణాలే “హే కాయ పుసతా | 
దేఈన చాళీస లాఖహీ మాగతా | హజారాంచీ కథా కాయ” | ||౧౦౦||
100. మాధవరావు చెప్పిన మాటలు విని ఆ హాజీ ‘దీన్ని అడగాలా? అడగాలే కాని, వేలు ఏమిటి, నలభై లక్షలన్నా ఇస్తాను’ అని అన్నాడు. 

పరిసోని బాబా వదతీ త్యా పూస | “ఆజ బోకడ కాపావయాచా మానస | 
ఆహే ఆముచా మశీదీస | తుజ కాయ ఘోస7 పాహిజే | ||౧౦౧|| 
101. అది విని బాబా “ఈ రోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది. ఆ మాంసంలో నీకు ఏ భాగం కావాలి?
కివా పాహిజే తువర8 అస్థీ | కివా వృషణవాసనా చిత్తీ | 
జా విచార త్యా మ్హాతార్యాప్రతీ | కాయ నిశ్చితీ వాంఛీతో” | ||౧౦౨|| 
102. “ఎముక మాంసం కావాలా? లేక వృషణాలంటే ఇష్టమా? ఆ ముసలివాణ్ణి నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు”. 
మాధవరావే సమగ్ర కథిలే | హాజీప్రతీ బాబా జే వదలే | 
హాజీ నిక్షూన వదతే ఝాలే | “నలగే త్యాంతలే ఎకహీ మజ | ||౧౦౩|| 
103. బాబా చెప్పిన మాటలన్నీ మాధవరావు హాజీతో చెప్పాడు. అందుకు హాజీ ‘నాకవేవీ వద్దు. 
ఘ్యావే మజ కాహీ అసేల చిత్తా | తరీ మజ ఆహే ఎకచి ఆస్థా | 
కోళంబ్యాంతీల9 తుకడా లాభతా | కృతకల్యాణతా పావేన” | ||౧౦౪|| 
104. ‘నాకేమైనా ఇవ్వాలని వారికి ఉంటే, నా కోరిక ఒకటే. కొళంబాలోని ఒక ముక్క దొరికితే చాలు. ధన్యుణ్ణి’. 
హాజీచా హా నిరోప ఘేఊన | మాధవరావ ఆలే పరతోన | 
కరితాంచ బాబాంస తో నివేదన | బాబా జే తత్క్షణ ఖవళలే | ||౧౦౫|| 
105. హాజీ చెప్పిన మాటలను మాధవరావు బాబాకు మనవి చేశాడు. వెంటనే బాబా కోపంతో ఉగ్రులయ్యారు. 
కోళంబా ఆణి పాణ్యాచ్యా ఘాగరీ | స్వయే ఉచలూని భిరకావిల్యా ద్వారీ | 
హాత చావోనియా కరకరీ | ఆలే శేజారీ హాజీచ్యా | ||౧౦౬|| 
106. కోపంతో మట్టి పాత్రను, నీళ్ళ కుండను స్వయంగా పైకెత్తి, తలుపుల వైపు విసిరి వేశారు. తమ చేతిని కరకరా కొరుకుతూ, హాజీ వద్దకు వచ్చి పక్కన నిలుచున్నారు. 
ధరూని ఆపులీ కఫనీ దోంకరీ | హాజీ సన్ముఖ ఉచలూని వరీ | 
మ్హణతీ “తూ కాయ సమజలాస అంతరీ | కరిసీ ఫుశారీ మజపుఢే | ||౧౦౭|| 
107. హాజీ ఎదుట రెండు చేతులా తమ కఫినీని పట్టుకుని, పైకి లేవనెత్తి, “నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ముందా నీ బడాయి అంతా? 
బుఢ్ఢేపణాచా తోరా దావిసీ | ఏసేచ కాయ తూ కురాణ పఢసీ | 
మక్కా కేల్యాచా తాఠా వాహసీ | పరీ న జాణాసీ తూ మాతే” | ||౧౦౮|| 
108. “ముసలివాడని బడాయి చూపిస్తున్నావు. ఖురాను పఠించటం ఇలాగేనా? మక్కా యాత్ర చేశానని గర్వ పడుతున్నావు గాని, నన్నింకా తెలుసుకోలేక ఉన్నావు!” 
ఏసే తయాసీ నిర్భత్సిలే | అవాచ్య శబ్దప్రహార కేలే | 
హాజీ బహు గాంగరూన గేలే | బాబా పరతలే మాధారా | ||౧౦౯|| 
109. అని అతనిని అవమానించారు. చెప్పరాని మాటలను అన్నారు. హాజీ చాలా గాబరా పడ్డాడు. బాబా వెనుకకు తిరిగి వచ్చేశారు. 
మశీదీచే ఆంగణీ శిరతా | మాళీణీ దేఖిల్యా ఆంబే వికితా | 
ఖరేదిల్యా త్యా పాట్యా సమస్తా | పాఠవిల్యా తత్వతా హాజీస | ||౧౧౦|| 
110. మసీదు లోనికి వస్తూ, తోటమాలి మామిడి పళ్ళను అమ్మటం చూశారు. వెంటనే మొత్తం బుట్టను కొని, హాజీకు పంపించారు. 

తైసేచి తాత్కాళ మాగే పరతలే | పున్హా త్యా ఫాళక్యాపాశీ గేలే | 
రూపయే పంచావన్న ఖిశాంతూని కాఢిలే | హాతావర మోజిలే తయాచే | ||౧౧౧|| 
111. వెంటనే, ఆ హాజీ దగ్గరకు మళ్ళీ వెళ్ళారు. తమ జేబులోనుండి ౫౫ రూపాయలను లెక్క పెట్టి, అతని చేతిలో ఒక్కొకటిగా ఇచ్చారు. 
తెథూన పుఢే మగ ప్రేమ జడలే | హాజీస జేవావయా నిమంత్రిలే | 
దోఘేహీ జణు అవఘే విసరలే | హాజీ సమరసలే నిజరంగీ | ||౧౧౨|| 
112. అప్పటినుండి అతనిపై ప్రేమ కలిగి, అతనిని భోజనానికి పిలిచారు. ఇద్దరూ అంతా మరచి పోయారు. ఆత్మానందంలో హాజీ లీనమై పోయాడు. 
పుఢే మగ తే గేలే ఆలే | యథేచ్ఛ బాబాంచే ప్రేమీ రంగలే | 
నంతరహీ బాబాంనీ వేళోవేళే | రూపయే దిధలే తయాస | ||౧౧౩|| 
113. కొంత కాలం తరువాత, హాజీ శిరిడీనుండి వెళ్ళిపోయాడు. కాని, మరల వచ్చాడు. అలా వస్తూ పోతూ బాబా ప్రేమలో మునిగి పోయాడు. అప్పుడప్పుడు బాబా అతనికి రూపాయలనిచ్చేవారు. 
అసో ఎకదా సాఈసమర్థా | మేఘావరీహీ జయాచీ సత్తా | 
తయా ఇంద్రాసీ పాహిలే ప్రార్థితా | ఆశ్చర్య చిత్తా దాటలే | ||౧౧౪|| 
114. మేఘాలను కూడా శాసించగల సమర్థులు సాయి. ఒక సారి ఇంద్రుని ప్రార్థించడం చూసి, నాకు ఆశ్చర్యం కలిగింది. 
అతి భయంకర హోతా సమయ | నభ సమగ్ర భరలే తమోమయ | 
పశు పక్షియా ఉద్భవలే భయ | ఝంజావాయూ సూటలా | ||౧౧౫|| 
115. అది చాలా భయంకరమైన సమయం. ఆకాశమంతా మేఘాలు క్రమ్ముకుని, చీకటియై పోయింది. ఝంఝా మారుతం వీస్తుంటే, పశువులు పక్షులు భయంతో విలవిలలాడాయి. 
ఝాలా సూర్యాస్త సాయంకాళ | ఉఠలీ ఎకాఎకీ వాహుటళ | 
సుటలా వార్యాచా సోసాటా ప్రబళ | ఉడాలీ ఖళబళ దుర్ధర | ||౧౧౬|| 
116. సూర్యుడు అస్తమించాడు. సాయంత్రం అకస్మాత్తుగా సుడిగాలి వీచి, పెరిగి పెద్దదై, అన్ని చోట్లా భయంకరమైన అల్లకల్లోలం మొదలైంది. 
త్యాంతచి మేఘాంచా గడగడాట | విద్యుల్లతాంచా కడకడాట | 
వార్యాచా భయంకర సోసాట | వర్షావ ఘనదాట జోరాచా | ||౧౧౭|| 
117. దీనికి తోడుగా మేఘాలు ఉరమ సాగాయి. మెరుపులు శబ్దం చేస్తున్నాయి. గాలియొక్క భయంకర శబ్దంతో పెద్ద వర్షం మొదలైంది. 
మేఘ వర్షలా ముసళ ధారా | వాజూ లాగల్యా ఫటఫట గారా | 
గ్రామస్థాంస సుటలా భేదరా | గురాంఢోరా ఆకాంత | ||౧౧౮|| 
118. ధారలు ధారలుగా వర్షం, టపటపమని వడగళ్ళ చప్పుడు, వీటన్నిటికీ గ్రామస్థులు భయపడి పోయారు. దూడలు, పశువులు భయంతో అరవ సాగాయి. 
మశీదీచ్యా వళచణీఖాలీ | భణంగభికారీ నివార్యా ఆలీ | 
గురేంఢోరే వాంసరే ఎకత్ర మిళాలీ | భీడ ఝాలీ మశీదీ | ||౧౧౯|| 
119. బికారులు, భిక్షగాళ్ళు ఎక్కడ దాచుకోవాలో తెలియక, మసీదు చూరు క్రిందకు వచ్చారు. పశువులు, దూడలు కూడా మసీదులో చేరుకున్నాయి. మసీదు క్రిక్కిరిసింది. 
పాణీచ పాణీ చౌఫేర ఝాలే | గవత సారే వాహూన గేలే | 
పీక హీ ఖళ్యాంతీల సర్వ భిజలే | లోక గజబజలే మానసీ | ||౧౨౦||
120. నలువైపులా ఎక్కడ చూసినా అక్కడంతా నీరే. గడ్డి కొట్టుకుని పోయింది. కళ్ళాలలోని పంటంతా నీళ్ళపాలైంది. జనం ఏమి చేయాలో తెలియక ఆందోళనతో దిగ్‍భ్రమ చెందారు. 

అవఘే గ్రామస్థ ఘాబరలే | సభామండపీ యేఊని భరలే | 
కోణీ మశీదీచే వళచణీస రాహిలే | గార్హాణే ఘాతలే బాబాంనా | ||౧౨౧|| 
121. గ్రామస్థులంతా భయంతో గాబరా పడి, మసీదులోని సభా మంటపంలోకి చేరుకున్నారు. సభా మంటపం నిండి పోయింది. కొందరు మసీదు చూరు క్రింద వచ్చి, బాబాతో మొర పెట్టుకున్నారు.
జోగాఈ జాఖాఈ మరీఆఈ | శని శంకర అంబాబాఈ | 
మారూతి ఖండోబా మ్హాళసాఈ | ఠాయీ ఠాయీ శిరడీంత | ||౧౨౨|| 
122. జోగులాంబ, జాఖాలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సమ్మ మొదలైన దేవీదేవతలు శిరిడీలో ఎక్కడో ఒక చోటులో నెలకొని ఉన్నారు. 
పరీ అవఘడ ప్రసంగ యేతా | కామీ పడేనా ఎకహీ గ్రామస్థా | 
తయాంచా తో చాలతా బోలతా ధాంవతా | సంకటీ పావతా ఎక సాఈ | ||౧౨౩|| 
123. కాని, ఇలాంటి ఘోరమైన కష్ట కాలంలో, ఏ ఒక్కరూ గ్రామస్థుల సహాయానికి రాలేదు. అందరితో మాట్లాడుతూ, నడుస్తూ, పరిగెత్తుతూ, వారి కష్టాలలో ఆదుకునేది, ఆ సాయి ఒక్కరే. 
నలగే తయాస బోకడ కోంబడా | నలగే తయాస టకా దోకడా | 
ఎకా భావాచా భుకేలా రోకడా | కరీ ఝాడా సంకటాంచా | ||౧౨౪|| 
124. ఇలా ఆదుకోవటానికి, వారికి ఏ కోడినో లేక మేకనో బలి చేయక్కరలేదు. ఒకటో, రెండో రూపాయలూ అవసరం లేదు. కేవలం భక్తినే ఆశిస్తూ, అందరి కష్టాలనూ వారు తుడిచి వేస్తారు. 
పాహూని ఏసే లోక భ్యాలే | మహారాజ ఫారచి హేలావలే | 
గాదీ సోడునీ పుఢే ఆలే | ఉభే రహిలే ధారేవర10 | ||౧౨౫|| 
125. ప్రకృతి క్రూరత్వానికి భయంతో వణికిపోతున్న ప్రజలను చూసి, సాయి మహారాజు విపరీతంగా కరిగిపోయారు. కూర్చున్న చోటునుండి లేచి, ముందుకు వచ్చి, మసీదు అంచున నిలుచున్నారు. 
మేఘనినాదే భరల్యా నభా | కడాడతీ విజా చమకతీ ప్రభా | 
త్యాంతచి సాఈమహారాజ ఉభా | ఆకంఠ బోభాయ ఉచ్చస్వరే | ||౧౨౬|| 
126. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లి పోయింది. ఉరుములు ఉరిమి, మెరుపులు మెరుస్తున్నాయి. వీటి మధ్యలో, అక్కడ సాయి మహారాజు నిలుచుని, గట్టిగా ఎత్తైన స్వరంలో, గర్జించారు. 
నిజ జీవాహూని నిజభక్త | దేవాస ఆవడతీ సాధూసంత | 
దేవ తయాంచే బోలాంత వర్తత | అవతార ఘేత త్యా లాగీ | ||౧౨౭|| 
127. దేవుడికి తనపై కంటే, తన భక్తుల పైన, సాధు సంతుల పైన ప్రేమ. అందుకే దేవుడు వారు చెప్పినట్లు చేస్తాడు. దేవుడు అవతరించేది కూడా భక్తుల కోసమే. 
పరిసోని భక్తాంచా ధాంవా | దేవాస లాగే కైవార ఘ్యావా | 
వరచేవర శబ్ద ఝేలావా | భక్త భావా స్మరోని | ||౧౨౮|| 
128. కష్టాల్లో ఉన్న భక్తుల మొర వినిన తరువాత, వారిని రక్షించాల్సిందే. భక్తుల భావాన్ని, భక్తిని గుర్తుంచుకొని, తను ఇచ్చిన మాటను తప్పక నిలబెట్టుకుంటాడు. 
చాలలీ ఆరోళీవర ఆరోళీ | నాద దుమదుమలా నిరాళీ | 
వాటే మశీద డళమళీ | కాంటాళీ బసలీ సకళాంచీ | ||౧౨౯|| 
129. బాబాయొక్క గర్జనలపై గర్జనల శబ్దం ఆకాశమంతా ప్రతిధ్వనించగా, మసీదు ఎక్కడ కదలి పోతుందో అన్నట్లుగా అనిపించింది. వారి నాదానికి అందరి చెవులూ మూత పడ్డాయి. 
త్యా గిరాగజర తారస్వరే | దుమదుమలీ మశీద మందిరే | 
తంవ మేఘ నిజగర్జనా ఆవరే | వర్షావథారే ధారాంచా | ||౧౩౦||
130. వారి గర్జనల ఆ పెద్ద శబ్దం పర్వతాలలో, మసీదులో, మందిరాలలో మారు మ్రోగింది. వారి గర్జనకు భయపడ్డట్లు, మేఘాల గర్జనలు, ధారలుగా కురుస్తున్న వర్షాలు టక్కున ఆగిపోయాయి. 

ఉదండ బాబాంచీ ఆరోళీ | అవఘా సభామండప డండళీ11 | 
గజబజలీ భక్త మండళీ | తటస్థ ఠేలీ ఠాయీంచ | ||౧౩౧|| 
131. బాబాయొక్క కేకలతో, సభామంటమంతా అదిరిపోయింది. భక్త మండలి భయంతో గాబరా పడ్డారు. ఏమి చేయాలో తెలియక, తామున్న చోట్లలోనే ఊరికే ఉండిపోయారు. 
అతర్క్య బాబాంచే విందాన | జాహలే వర్షావా ఆకర్షణ | 
వాయూహీ ఆవరలా తత్క్షణ | ధుఈ విచ్ఛిన్న జాహలీ | ||౧౩౨|| 
132. నిజంగా, బాబా ఈ లీల వర్ణించ సాధ్యం కాదు. వర్షం ఆగిపోయింది. వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి. 
హళూహళూ పాఊస ఉగవలా12 | సోసాటాహీ మందావలా | 
నక్షత్రగణ దిసూ లాగలా | తమ నిరసలా తే కాళీ | ||౧౩౩|| 
133. మెల్ల మెల్లగా తుఫాను తగ్గింది. వాన తగ్గింది. నక్షత్రాలు కనిపించ సాగాయి. చీకటి మొత్తం తొలిగిపోయి, వెలుగు వచ్చింది. 
పాఊస పుఢే పూర్ణ ఉగవలా | సోసాట్యాచా పవనహీ విరమలా | 
చంద్ర గగనీ దిసూ లాగలా | ఆనంద ఝాలా సకళాంతే | ||౧౩౪|| 
134. తరువాత, వర్షం మొత్తంగా ఆగిపోయింది. గాలి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ సంతోషమైంది. 
వాటే ఇంద్రాస దయా ఆలీ | పాహిజే సంతాంచీ వాణీ రాఖిలీ | 
ఢగే బారా వాంటా ఫాంకలీ | శాంత ఝాలీ వావటళ | ||౧౩౫|| 
135. ఇంద్రునికి దయ కలిగిందేమో అని అనిపించింది. సత్పురుషుల మాటను నిలపెట్టాలి కదా. వాతావరణం శాంతించగానే మేఘాలు పన్నెండు దిక్కులలో వెళ్ళిపోయాయి. 
పాఊస సర్వస్వీ నరమలా | వారాహీ మంద వాహూ లాగలా | 
గడగడాట జాగీంచ జిరాలా | ధీర ఆలా పశుపక్ష్యా | ||౧౩౬|| 
136. వాన పూర్తిగా ఆగిపోయింది. గాలి మెల్ల మెల్లగా వీచింది. ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులకు, పక్షులకు ధైర్యం వచ్చింది. 
సోడూనియా ఘరాంచ్యా వళచణీ | గురే వాసరే బాహేర పడునీ | 
వావరూ లాగలీ నిర్భయ మనీ | పక్షీహీ గగనీ ఉడాలే | ||౧౩౭|| 
137. ఇళ్ళ చూరుల క్రింద చేరుకున్న దూడలు, పశువులు బయటకు వచ్చి, ఏ భయం లేకుండా తిరగ సాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి. 
పాహూన పూర్వీల భయంకర ప్రకార | మానూనియా బాబాంచే ఉపకార | 
జన సర్వ గేలే ఘరోఘర | గురేంహీ సుస్థిర ఫరకలీ13 | ||౧౩౮|| 
138. ఇంతకు మునుపు ఉన్న ఘోర పరిస్థితిని చూసిన తరువాత, అందులోనుంచి తమను రక్షించిన బాబాకు జనులంతా తమ కృతజ్ఞతలు తెలిపి, వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా మసీదునుండి వెళ్ళిపోయాయి.  
ఏసా హా సాఈ దయేచా పుతళా | తయాస భక్తాంచా అతి జివ్హాళా | 
లేంకురా జైసా ఆఈచా కళవళా | కితీ మీ ప్రేమళా గాఊ త్యా | ||౧౩౯|| 
139. ఇంతటి కరుణామూర్తి మన సాయి. బిడ్డల గురించి కన్నతల్లివలె, వారు భక్తుల గురించి కలవర పడతారు. భక్తుల మీద వారికి ఉన్న విపరీతమైన ప్రేమను నేనెంతని వర్ణించగలను? 
అగ్నీవరీహీ ఏసీచ సత్తా | యే అర్థీచీ సంక్షిప్త కథా | 
శ్రోతా పరిసజే సాదర చిత్తా | కళేల అపూర్వతా శక్తీచీ | ||౧౪౦||
140. అగ్ని మీద కూడా బాబాకు ఇలాంటి శక్తి ఉంది. దీని గురించి ఒక చిన్న కథను చెబుతాను. శ్రోతలు ఈ కథను శ్రద్ధగా వింటే, బాబాయొక్క అద్భుతమైన శక్తి గురించి తెలుస్తుంది. 

ఎకదా మధ్యాన్హీచీ వేళ | ధునీనే పేట ఘేతలా సబళ | 
కోణ రాహీల తెథ జవళ | జ్వాళాకల్లోళ ఉఠలా | ||౧౪౧|| 
141. ఒక సారి, మధ్యాహ్నం వేళ, ధునిలోని మంట బాగా రగులుకుంది. మంటలు పైపైకి లేస్తూవుంటే, దగ్గర ఎవరు ఉండగలరు? ఎవరికి అంత ధైర్యం ఉంటుంది?
ప్రచండ వాఢలా జ్వాళామాళీ14 | తక్తపోశీలా శిఖా భిడలీ | 
వాటే హోతే మశీదీచీ హోళీ | రాఖ రాంగోళీ క్షణాంత | ||౧౪౨|| 
142. విపరీతంగా పైకి వస్తున్న ఆ మంట శిఖలు, మసీదు పైకప్పును తాకుతున్నాయి. మసీదు మండి బూడిదైపోతుందేమో అని ఆ క్షణంలో అనిపించింది. 
తరీ బాబా మనీ స్వస్థ | సకళ లోకచింతాగ్రస్త | 
తోండాత బోటే ఘాలీత సమస్త | కాయ హీ శికస్త బాబాంచీ | ||౧౪౩|| 
143. ఏమౌతుందో అని జనులంతా గాబరాగా ఉంటే, బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. అక్కడున్న వారు ముక్కు మీద వేలు వేసుకుని, ‘ఏమిటి బాబా ఇంత ప్రశాంతంగా ఉన్నారు’ అని అనుకున్నారు. 
ఎక మ్హణే ఆణా కీ పాణీ | దుజా మ్హణే ఘాలావే కోణీ | 
ఘాలితా మాథా సటకా హాణీ | కోణ త్యా ఠికాణీ జాఈల | ||౧౪౪|| 
144. వారిలో ఒకరు నీళ్ళు పట్టుకొని రండి అని అంటే, ఇంకొకరు పోసేవారెవరు అని అన్నారు. అలా పోస్తే, సటకాతో బాబా కొడతారేమో? అమ్మో! ఎవరు ముందుకు రాగలరు? 
మనీ జరీ సర్వ అధీర | విచారావయా నాహీ ధీర | 
బాబాచ తంవ హోఊని అస్థిర | సటక్యావర కర టాకియలా | ||౧౪౫|| 
145. అందరికీ భయమే. బాబాను అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు బాబా చిరాకుగా సటకా పైన చెయ్యి వేశారు. 
పాహోని జ్వాళాంచా భడకా | హాతీ ఘేఊనియా సటకా | 
హాణితీ ఫళాక్యావరీ ఫటకా | మ్హణతీ ‘హటకా మాఘారా’ | ||౧౪౬|| 
146. రగులుతున్న మంటలను చూసి, సటకాను చేతిలోకి తీసుకొని దెబ్బపై దెబ్బ కొట్టుతూ “వెనక్కు తగ్గు! తగ్గు పో!” అని అన్నారు. 
ధునీ పాసావ ఎక హాత | స్తంభావరీ కరితీ ఆఘాత | 
జ్వాళాంకడే పహాత పహాత | ‘సబూర సబూర15’ వదత తే | ||౧౪౭|| 
147. ధునికి ఒక మూర దూరంలో ఉన్న స్తంభంపైన సటకాతో కొడుతూ, మంటలను చూస్తూ “శాంతించు, శాంతించు” అని అన్నారు. 
ఫటక్యా ఫటక్యాస ఖాలీ ఖాలీ | జ్వాలా నరమ పడూ లాగలీ | 
భీతి సమూళ ఉడూని గేలీ | శాంత ఝాలీ తై ధునీ | ||౧౪౮|| 
148. ఒక్కొక్క దెబ్బకు మంటలు తగ్గి, ధుని శాంతించింది. భయపడ్డ జనులు కూడా భయాన్ని వదిలి శాంతించారు. 
తో హా సాఈ సంతవర | ఈశ్వరాచా దుజా అవతార | 
డోఈ తయాచ్యా పాయాంవర | ఠేవితా కృపాకర ఠేవీల | ||౧౪౯|| 
149. సాధు సంతులలో చాలా గొప్పవారైన మన సాయి, దేవుడి మరో అవతారం. వారి పాదాలపై తలను ఉంచితే, వారు తమ కృపా హస్తాన్ని మనపై ఉంచుతారు. 
హోఊనీ శ్రద్ధా భక్తియుక్త | కరీల జో యా అధ్యాయాచే నిత | 
పారాయణ హోఊని స్వస్థచిత్త | ఆపదా నిర్ముక్త హోఈల | ||౧౫౦|| 
150. నమ్మకంతో, భక్తిశ్రద్ధలతో, ప్రతి రోజు ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తే, ఆపదలన్నీ తొలగి పోతాయి. 

ఫార కాయ కరూ మీ కథన | శుద్ధ కరోనియా అంతఃకరణ | 
నేమనిష్ఠ వ్హా సాఈపరాయణ | బ్రహ్మ సనాతన పావాల | ||౧౫౧|| 
151. ఇంత కంటే ఇంకేమి చెప్పను? మీ మనసును శుద్ధం చేసుకోండి. నిర్మలమైన మనసుతో, నియమ నిష్ఠలతో, భక్తితో సాయిని పూజిస్తే, శాశ్వతమైన పరబ్రహ్మను పొందగలరు. 
పురేల అపూర్వ ఇచ్ఛిత కామ | వ్హాల అంతీ పూర్ణ నిష్కామ | 
పావాల దుర్లభ సాయుజ్య ధామ | అఖండ రామ లాధాల | ||౧౫౨|| 
152. కష్టమైన మీ కోరికలన్నీ కూడా ఫలిస్తాయి. అన్ని కోరికలూ తీరి, చివరకు పూర్తిగా ఏ కోరికలూ లేనివారౌతారు. చాలా కష్టమైన ‘సాయుజ్య ముక్తి’ని చేరుకుంటారు. ఎప్పటికీ తరగని శాంతి సుఖాలు తృప్తి కలుగుతాయి. 
అసో జయా భక్తాంచ్యా చిత్తీ | భోగావీ పరమార్థ సుఖ సంవిత్తీ | 
తేణే యే అధ్యాయానువృత్తీ | ఆదరవృత్తి ఠేవావీ | ||౧౫౩|| 
153. పరమార్థ జ్ఞానాన్ని, పరమార్థ సుఖాన్ని, పొందాలని మనసులో కోరుకునే భక్తులు ఈ అధ్యాయాన్ని మరల మరల శ్రద్ధగా చదవండి. 
శుద్ధ హోఈల చిత్తవృత్తి | కథా సేవనీ పరమార్థ ప్రవృత్తి | 
ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి | పహావీ ప్రచీతి బాబాంచీ | ||౧౫౪|| 
154. అలా చేయడం వలన, మనసు పరిశుద్ధమౌతుంది. పరమార్థ మార్గంలో ముందుకు పోవాలనే కోరిక మనసుకు కలుగుతుంది. అరిష్టాలు తొలగిపోతాయి. ఇష్ట దేవత దర్శనం కలుగుతుంది. బాబా లీలలను స్వయంగా అనుభవించి, తెలుసుకోండి. 
హేమాడపంత సాఈస శరణ | పుఢీల అధ్యాయ అతిపావన | 
గురూశిష్యాంచే తే మహిమాన | ఘోలప దర్శన గురూ పుత్రా | ||౧౫౫|| 
155. హేమాడు పంతు సాయికి శరణుజొచ్చి, అతి పావనమైన తరువాతి అధ్యాయంలో, గురుశిష్యుల మహిమ, గురు పుత్రునికి గురు ఘోలప దర్శనం గురించి చెప్పబడుతుంది. 
శిష్యాస కైసాహీ ప్రసంగ యేవో | తేణే న త్యజావా నిజ గురూదేవో | 
సాఈ తయాచా ప్రత్యక్ష అనుభవో | దావీ దృఢ భావో వాఢవీ | ||౧౫౬|| 
156. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంతటి పరిస్థితిలోనైనా, శిష్యుడు తన గురువును వదిలి పెట్టరాదని, సాయి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలుగ చేసి, భక్తి భావాన్ని దృఢ పరచారు. 
జే జే భక్త ఆలే పాయీ | ప్రత్యేకా దర్శనాచీ నవాఈ | 
కోణాస కాంహీ కోణాస కాంహీ | దేఊని ఠాయీంచ దృఢ కేలే | ||౧౫౭||
157. బాబా పాదాలకు శరణుజొచ్చిన ప్రతి ఒక్క భక్తునికీ, అద్భుతమైన అనుభవం కలిగించి, ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా దర్శనమిచ్చి, బాబా ఆ భక్తులకు తమ గురువు మీద ఉన్న నమ్మకాన్ని, భక్తిని బాబా దృఢ పరచారు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | శ్రీసాఈమహిమావర్ణనం నామ | 
| ఎకాదశోధ్యాయః సంపూర్ణః |

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||


టిపణీ: 
1. “ప్రతిమా మాఝ్యా అచేతన వ్యక్తీ | 
     సంత సచేతన మాఝ్యా మూర్తీ ||” (ఎకనాథీ భాగవత) 
2. చవరీ వారణే. 3. పంఖా. 
4. శిరడీంత దోన చావడ్యా ఆహేత - ఎక ఉత్తరాభిముఖ వ దుసరీ దక్షిణాభిముఖ. దోన్హీ సమోరసమోర ఆహేత. 
5. దర్శనసమయీ. 6. కాహీ అంతరావరీల ఎక విహీర. 7. మాంస. 
8. ఎకా భాగాచ్యా మాంసాసకట అస్థీ. 
9. భాకరతుకడా ఠేవణ్యాచే మాతీచే భాండే. 
10. మశీదీచ్యా జోత్యాచ్యా కడేవర. 11. డళమళలా. 12. కమీ ఝాలా. 
13. ఫాకలీ. 14. అగ్నీ. 15. శాంత హో; శాంత హో!