Tuesday, March 12, 2013

||మదనుగ్రహ నామ అష్టాదశోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౮ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
 
జయ సద్గురో పరమ నిత్యా1 | జయ సద్గురో బ్రహ్మసత్యా | 
అనుభవే దావిసీ జగ్న్మిథ్యా | మాయా నియంత్యా జయ జయ | ||౧|| 
1. ఎప్పటికీ ఉండే, పరమ సత్యమూ అయిన సద్గురు దేవా! నీకు జయము జయము! ఈ జగత్తు సత్యం కాదని, మీ భక్తులకు అనుభవాన్నిచ్చి మీరు తెలుపుతారు. మాయను ఎప్పుడూ మీ అధీనంలో ఉంచుకునే దేవా! మీకు జయము జయము!
జయజయాజీ అనాద్యనంతా | జయజయాజీ ద్వంద్వాతీతా2 | 
జయజయాజీ వికారరహితా3 | నిజరూప4 బోధితా తూ ఎక | ||౨|| 
2. చివర, మొదలు లేని మీకు జయము జయము! విరుద్ధ భావాలను మీరిన మీకు జయము జయము! ఏ రకమైన మార్పులు లేని మీకు జయము జయము! వేరే ఎవ్వరికీ బోధించడం సాధ్యం కాని, ఆత్మ రూపాన్ని, మీరొక్కరే స్పష్టంగా బోధించగలరు. 
సాగరీ రిఘాలీ కరూ ఆంఘోళీ | పరతేల కాయ సైంధవాచీ5 పుతళీ5 | 
హేతో న ఘడే కదాకాళీ | తుజజవళీహీ తైసేంచ | ||౩|| 
3. ఉప్పుతో చేయబడ్డ బొమ్మ, స్నానానికని సాగరంలో దిగితే, బయటకు రాగలదా? అది ఎప్పటికీ సాధ్యం కాని పని. మీ గురించి తెలుసుకోవటం కూడా అట్లే. 
వేదశ్రుతి హీ జయావిశీ | వివాద కరితీ అహర్నిశీ | 
తే అలక్ష్య తూ బోటానే దావిశీ | అప్రయాసే భక్తాంసీ | ||౪|| 
4. ఊహకందని పరబ్రహ్మ గురించి, వేదాలు శ్రుతులూ రాత్రింబవళ్ళూ చర్చించుకుంటాయో, అలాంటి ఆ బ్రహ్మను, భక్తులకు చాలా సులభంగా, మీ వ్రేలితో మీరు చూపిస్తారు. 
ఆలాచ దైవాచా యోగ జర కా | పడలా పురేకా తుఝా గర్కా6 | 
మగ హా ఆపులా వాహా పరకా | నాహీ యా కుతర్కా స్థాన తై | ||౫|| 
5. దేవుడి దయవల్ల, ఎవరైనా మీ ఆశ్రయంలోకి వస్తే, వారికి ‘తమది, ఇతరులది’ అనే తక్కువ భావాలు ఉండవు. 
గతాధ్యాయీ కథా పావన | బ్రహ్మ గుండాళ్యాచే ఆవిష్కరణ | 
బ్రహ్మార్థియాచే లోభావరణ | ప్రతిబంధ కారణ వర్ణిలే | ||౬|| 
6. నోట్ల కట్టలో చుట్టి ఉన్న బ్రహ్మను బయటికి తీసి, బ్రహ్మను కోరుకునే వారికి, పిసినారితనం పెద్ద అడ్డంకని తెలిపిన పావన కథను, మునుపటి అధ్యాయంలో వర్ణించడమైనది. 
ఆతా మదనుగ్రహ7 కథా | శ్రవణ కీజే ఆదరే శ్రోతా | 
అనుభవా యేఈల తుమచియా చిత్తా | మార్గ దర్శకతా బాబాంచీ | ||౭|| 
7. ఇప్పుడు చెప్పబోయే, బాబా నన్ను అనుగ్రహించిన, ఈ కథను, శ్రోతలు శ్రద్ధగా వింటే, భక్తులకు బాబా ఎలా దారిని చూపేవారో మీకు అనుభవమవుతుంది. 
హీ హీ ఆహే గోడ వార్తా | తీ మీ కథితో యథార్థతా8 | 
శ్రోతా ఆపులాలియా స్వార్థా | స్వస్థ చిత్తా పరిసావీ | ||౮|| 
8. మధురమైన ఈ కథను, అది ఎలా జరిగిందో అలానే మీకు చెబుతాను. తమ శ్రేయస్సు కొరకు, శ్రోతలు శాంతంగా, నెమ్మదిగా వినండి. 
అసతా శ్రవణార్థీ సాదర | వక్త్యాస ఉల్హాస ఆణి ఆదర | 
హృదయా ఫుటే ప్రేమ పాఝర | ఆనంద నిర్భర ఉభయతా | ||౯|| 
9. వినేవారు శ్రద్ధగా వింటే, చెప్పేవారికీ ఉత్సాహం కలిగి, అలా ఇద్దరి హృదయాలలో ప్రేమ పొంగి, ఆనందం కలుగుతుంది. 
న కరితా బుద్ధిభేద తిళభర | జైసా జయాచా అధికార | 
తైసాచ తయాస మార్గ సాచార | ఉపదేశ పురఃసర దావితీ | ||౧౦||
10. భక్తుల మనసులో ఏ మాత్రం కలత, అలజడి కలగించకుండా, వారు తెలుసుకోగలిగిన రీతిలోనే, వారికి సరియైన దారిని, బాబా బోధించేవారు. 

ఏసే కితీఎకాంచే మతే | గురూనే జే కథిలే జ్యాతే | 
కథితా9 నయే తే ఇతరాంతే | విఫల హోతే గురువాణీ | ||౧౧|| 
11. గురువు చెప్పిన ఉపదేశాన్ని, ఇతరులకు తెలియ చేస్తే, గురువు చెప్పినది ఫలించదని అనేకులు అనుకుంటారు. 
హెతో కేవళ కాల్పనిక | నసతే స్తోమ నిరర్థక | 
ప్రత్యక్ష కాయ స్వప్నోక్త10 హీ దేఖ | కథితీ సద్బోధక సకళాంతే | ||౧౨|| 
12. కాని, ఇది ఒట్టి అనుకోవటమే. అర్థం లేని ఆలోచనలు. అంతే కాదు. ఎదురుగా గురువులు చెప్పే ఉపదేశాన్నే కాకుండా, కలలో చెప్పిన సంగతులను కూడా ఇతరులకు తెలియ చేస్తే, అది అందరికీ మంచిని చేస్తుంది. 
మానాల జరీ హే అప్రమాణ | బుధకౌశిక ఋషి ప్రమాణ | 
రామరక్షా దీక్షేచే స్వప్న | కేలే కథన సర్వత్రా | ||౧౩|| 
13. దీనికి సాక్ష్యం లేదని అనుకుంటారేమో! బుధకౌశిక ఋషియే దీనికి ప్రమాణం. తనకు కలలో బోధించిన రామరక్షా దీక్షా మంత్రాన్ని ఆయన అందరికీ చెప్పేశాడు. 
గురు వర్షాకాళీంచే ఘన | ఆవడీ వర్షతీ స్వానందజీవన | 
తే కాయ ఠేవావే కోంబూన11 | యథేచ్చ సేవూన సేవవావే | ||౧౪|| 
14. వానాకాలంలోని మబ్బులాంటివారు గురువు. ఆనందమనే నీరును వారు ఉత్సాహంగా కురిపిస్తారు. అలాంటి నీరు సేకరించుకుని, దాచుకోవటానికా? తామూ తీసుకుని, ఇతరులకూ కావలిసినంత పంచి పెట్టాలి. 
లేంకరాచీ ధరూన హనువటీ | మాయ తయాచ్యా ఆరోగ్యాసాఠీ | 
మాయాళూపణే పాజీ గుటీ | తీచ హాతవటీ బాబాంచీ | ||౧౫|| 
15. బిడ్డల ఆరోగ్యం కోసం, తల్లి వారి గడ్డాన్ని పట్టుకుని, మాయ మాటలను చెప్పి, వారికి మందు త్రాగిస్తుంది. భక్తులకు ఉపదేశాన్ని బోధించడంలో, బాబా కౌశలం కూడా అలాంటిదే. 
మార్గ తయాంచా నవ్హతా గుప్త | కోణ్యా రీతీ కైసా అవచిత | 
నిజభక్తాంచా హేతు పురవిత | సావచిత్త తే ఏకా | ||౧౬|| 
16. వారు చెప్పే దారి, దాచుకోవటానికి కాని, రహస్యంగా కాని, ఉండేది కాదు. ఏ విధంగా, అకస్మాత్తుగా భక్తుల కోరికలను వారు తీర్చేవారో ఇప్పుడు శ్రద్ధగా వినండి. 
ధన్య ధన్య సద్గురూ సంగతీ | కోణా వర్ణవే తియేచీ మహతీ | 
ఆఠవితా ఎకేక తయాంచ్యా ఉక్తీ | నిజస్ఫూర్తి ఉచంబళే | ||౧౭|| 
17. సద్గురువుయొక్క సహవాసం ధన్యం. దాని మహిమను ఎవరు మటుకు వర్ణించగలరు? సద్గురువుయొక్క ఒక్కొక్క మాటను తలుచుకుంటే, స్ఫూర్తి పొంగుతుంది. 
ప్రేమే కరితా ఈశ్వరార్చన | గురుసేవా గురూ పూజన | 
హోఈల గురుగమ్య సంపాదన | ఇతర సాధన తే ఫోల | ||౧౮|| 
18. దేవుణ్ణి భక్తితో, ప్రేమతో పూజ చేస్తే, గురు సేవను దృఢమైన నమ్మకంతో చేస్తే, అప్పుడు గురువు బోధించగల జ్ఞానం దొరకుతుంది. ఆ జ్ఞానాన్ని పొందాలని చేసే ఇతర సాధనలన్నీ దండుగ. 
విక్షేప ఆణి ఆవరణ | తేణే హా భవమార్గ సంకీర్ణ | 
గురువాక్య దీపకిరణ | నిర్విఘ్న మార్గదర్శక | ||౧౯|| 
19. లేనిది ఆరోపించడం వలన (విక్షేపం), ఉన్నదానిని కప్పి వేయడం వలన (ఆవరణం), సాంసారిక జీవనం అయోమయంగా, మసక మసకగా ఉంటుంది. ఇలాంటి దారిని దాటటానికి, గురువుయొక్క మాటలే దీపపు వెలుగులాంటివి. 
గురు ప్రత్యక్ష ఈశ్వర | బ్రహ్మ విష్ణూ మహేశ్వర | 
గురూచి వస్తుతః పరమేశ్వర | బ్రహ్మ పరాత్పర గురురాయ | ||౨౦||
20. గురువే ఈశ్వరుడు. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. నిజానికి గురువే పరమేశ్వరుడు, గురువే అతి ఉత్తమమైన పరబ్రహ్మ. 

గురు జననీ గురు పితా | గురు త్రాతా దేవ కోపతా | 
గురు కోపతా కోణీ న త్రాతా | సదా సర్వదా జాణావే | ||౨౧|| 
21. గురువే తల్లి. గురువే తండ్రి. దేవుడు కోపిస్తే, గురువు రక్షిస్తాడు. కాని, గురువు కోపిస్తే, ఎవరూ రక్షించలేరు. దీనిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
గురు దర్శక ప్రవృత్తీచా | తీర్థవ్రత నివృత్తీచా | 
ధర్మాధర్మ విరక్తీచా | వేదశ్రుతీచా ప్రవక్తా | ||౨౨|| 
22. సాంసారిక జీవితంలోనూ, తీర్థయాత్రాది, వ్రతాలలోనూ, ధర్మాధర్మ మరియు విరక్తి మార్గాలలో గురువే మనకు దారి చూపేది. వేదాలలోని, శ్రుతులలోని జ్ఞానాన్ని బోధించేది గురువే. 
ఉఘడూని బుద్ధీచే డోళే | సంత దావితీ నిజరూప సోహళే | 
పురవితీ భక్తీచే డోహళే | అతి కోవళే కారుణిక | ||౨౩|| 
23. బుద్ధి వికాసం చెందేలా చేసి, ఆత్మ రూపంయొక్క వైభవాన్ని చూపించేది గురువే. అతి కోమల హృదయులు, కరుణామయులు అయిన సత్పురుషులు, భక్తితో కలిగిన మనుషుల కోరికలను తీరుస్తారు. 
తేణే విషయ వాసనా మావళే | నిద్రేంతహీ జ్ఞానచి చావళే | 
వివేక వైరాగ్య ఫళ జావళే12 | కృపాబళే హాతీ యే | ||౨౪|| 
24. దానితో, ఇంద్రియ సుఖాల మీదున్న కోరికలు తొలగిపోయి, నిద్రలో కూడా జ్ఞాన దృష్టి ఉంటుంది. వారి దయతో, వివేకం మరియు వైరాగ్యాలనే ఫలాలు చేజిక్కుతాయి. 
జాహలియా సత్సమాగమ | సంతసేవా సంతప్రేమ | 
స్వయే భక్తకామ కల్పద్రుమ | సర్వ శ్రమ నివారీ | ||౨౫|| 
25. సత్పురుషులతో ఉంటూ, ప్రేమతో వారి సేవ చేస్తే, భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షమైన దేవుడు స్వయంగా కష్టాలన్నిటినీ తొలగిస్తాడు. 
సదా అసావే సత్పరాయణ | కరావ్యా సంతకథా శ్రవణ | 
వందావే సంతాంచే చరణ | పాపక్షాలన హోఈల | ||౨౬|| 
26. అందువలన, ఎల్లప్పుడూ సాధు సంతులతో ఉంటూ, వారి కథలను వింటూ, వారి పాదాలకు పూజ చేస్తే, పాపాలన్నీ తొలగిపోతాయి. 
లార్డ రే జై ఇలాఖాధిపతీ | క్రాఫర్డశాహీ ఘాతలీ పాలథీ | 
తత్కాలీన ఎక ప్రసిద్ధ కీర్తి | లాగలే భక్తీస బాబాంచ్యా | ||౨౭|| 
27. బ్రిటిషు ప్రభుత్వంలో, ముంబై సంస్థానానికి, లార్డు రే గవర్నరుగా ఉన్నప్పుడు, క్రాఫర్డు (మునిసిపల్‍ కమీషనరు) పాలన పడిపోయింది. ఆ కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి, బాబాకు భక్తుడయ్యాడు. 
హా సంసార తాపత్రయ ఖోటా | వ్యాపార ధంద్యాంత ఆలా తోటా | 
మనాస కంటాళా వీట మోఠా | ఘేతలా లోటా నిఘాలే | ||౨౮|| 
28. ఆ వ్యక్తి వ్యాపారంలో బాగా నష్టపోయి, మనసుకు చాలా విరక్తి కలిగింది. కష్టాలతో నిండి ఉన్న ఈ ప్రపంచం పనికి రానిదిగా అనిపించింది. దానితో, అన్నిటినీ వదులుకొని, చేతిలో ‘లోటా’ పట్టుకుని, బయట పడ్డాడు. 
చిత్త ఝాలే అతి అస్థిర | వాటే ప్రవాసా జావే దూర | 
సేవావా ఎకాంత సుఖకర | ఏసా విచార దృఢ కేలా | ||౨౯|| 
29. మనసు చాలా కలత చెంది, దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా, సుఖంగా ఉండాలన్న ఆలోచన వచ్చింది. దానినే ఆచరించాలని నిశ్చయించుకున్నాడు. 
జీవ జై పడే అతిసంకటీ | దేవ ఆఠవే తదా కష్టీ | 
మగ తో భక్త కరీ హాకాటీ13 | లాగే పాఠీ దేవాచ్యా | ||౩౦||
30. మనుషులు చాలా కష్టాలలో ఉన్నప్పుడే, దేవుడు గుర్తుకు వస్తాడు. నిరాశ, నిస్పృహలతో దేవుణ్ణి తలుచుకుంటూ, దేవుడి వెంట పడతారు. 

పరి న లాగతా దుష్కర్మా ఓహటీ | దేవాచే నాంవ యేఈనా ఓఠీ14 |
మగ సప్రేమతా పాహూని జగజేఠీ | సంత భేటీ కరవితో | ||౩౧||
31. పాపపు పనులను చేయడం తగ్గే వరకూ, దేవుని పేరు నోటికి ఆనదు. అయినా, దేవుడు మనుషుల భక్తిని చూచి, వారిని సాధు సంతుల దగ్గరకు చేరుస్తాడు. 
తైసేంచ త్యా భక్తాచే జాహలే | పాహూని సంసారా అతి కావలే15 |
స్నేహీ తయాచే వదతే ఝాలే | హితవచన వహిలే తే ఏకా | ||౩౨||
32. ఆ భక్తునికి కూడా అలాగే జరిగింది. ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ మనిషిని చూచి, అతని స్నేహితుడు అతనికి చెప్పిన మంచి మాటలను వినండి. 
కాంహో ఆపణ శిరడీస జానా | సమర్థ సాఈనాథాంచే దర్శనా |
కరా కీ తయాంస ప్రార్థనా | దయాఘనా త్యా సంతా | ||౩౩||
33. ‘శిరిడీకి వెళ్ళి, సాయి సమర్థుల దర్శనం ఎందుకు చేసుకోకూడదు? అక్కడికి వెళ్ళి, దయామయులైన ఆ సత్పురుషుని ప్రార్థించండి. 
క్షణైక సంత సంగతీ లాధతే | చంచల మన నిశ్చల హోతే |
తాత్కాళ హరిచరణీ జడతే | మగ అవఘడ తే పరతాయా | ||౩౪||
34. ‘సత్పురుషుల సహవాసం ఒక్క క్షణం లభించినా, కలత చెందిన మనసు, శాంతించి, వెంటనే శ్రీహరి పాదాలలో లీనమై పోతుంది. అక్కడనుండి వెనుకకు మరలించడం కష్టం. 
దేశోదేశీచే లోక జాతీ | సాఈపదరజీ లోళతీ |
మహారాజాంచ్యా ఆజ్ఞేత వర్తతీ | అభిష్ట16 పావతీ సేవేనే | ||౩౫||
35. ‘ఎందరో దేశ దేశాలనుండి అక్కడికి వచ్చి, సాయి పాద ధూళిలో పొర్లుతారు. ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటిస్తూ, వారి సేవ చేస్తూ తమ మనసులోని కోరికలను తీర్చుకుంటారు. 
ఏసీ తయాంచీ ప్రసిద్ధ కీర్తీ | ఆబాలవృద్ధ సర్వ జాణతీ |
తయాంసీ యేతా కాకుళతీ | దుఃఖనివృత్తి లాధాల | ||౩౬||
36. ‘అలాంటిది వారి కీర్తి! చిన్న పిల్లలనుండి, వయసు మీరిన వారందరికీ ఇది తెలుసు; వారికి దయ కలిగితే, అన్ని వ్యథలు, నొప్పులనుండి ముక్తి కలుగుతుంది. 
శిరడీ సాంప్రత పవిత్ర స్థాన | యాత్రా వాహే రాత్రందిన |
తుమ్హీహీ పహా అనుభవ ఘేఊన | సంతదర్శన హితకారీ | ||౩౭||
37. ‘రాత్రింబవళ్ళూ భక్తులు రావటంతో, ఇప్పుడు శిరిడీ ఒక పుణ్య క్షేత్రం అయింది. మీరు కూడా వెళ్ళి, వారి దర్శన భాగ్యంతో జరిగే మంచిని, మీరు కూడా అనుభవంచ వచ్చు’, అని ఆ స్నేహితుడు చెప్పాడు. 
అవర్షణే ఉద్విగ్న అకించన17 | అవచిత వర్షే విపుల ఘన |
హోతా భుకేనే వ్యాకుళ ప్రాణ | పంచపక్వాన్న వాఢిలే | ||౩౮||
38. వానలు లేక, ఎంతగానో బాధ పడుతున్న దరిద్రునికి, అకస్మాత్తుగా బాగా వాన కురిసినట్లు, ఆకలితో అల్లాడిపోతున్న వాడికి, పంచ భక్ష్యాలు వడ్డించినట్లు -  
తైసీ స్నేహ్యానే కథిలీ వార్తా | మానవలీ తీ తయా భక్తా |
అనుభవ ఘ్యావా ఆలే చిత్తా | ధరిలా రస్తా శిరడీచా | ||౩౯||
39. స్నేహితుడి మాటలు అతనికి అనిపించింది. అతని సలహాను తీసుకుని, దానితో తన అనుభవాన్ని తెలుసుకోవాలని, శిరిడీకి బయలుదేరాడు. 
ఆలే గాంవీ ఘేతలే దర్శన | పాయీ ఘాతలే లోటాంగణ | 
తత్కాళ నివాలే నయన | సమాధాన జాహలే | ||౪౦||
40. శిరిడీ చేరుకుని, సాయిని దర్శించుకుని, సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే, అతని కళ్ళు తృప్తితో నిండిపోయాయి, మనసు శాంతించింది. 

జే పూర్ణబ్రహ్మ సనాతన | స్వయంజ్యోతి నిరంజన | 
పాహూన ఏసే సాఈంచే ధ్యాన | సుప్రసన్న మన జాహలే | ||౪౧|| 
41. పూర్ణమైన పరబ్రహ్మ, ఆది అంతం లేనివాడు, తనే స్వయంగా వెలుగు రూపమైన సాయిని చూచి, అతని మనసు ఆనందంతో నిండిపోయింది.
వాటలే పూర్వార్జిత18 సభాగ్యతా | తేణేంచ హే పాయ ఆలే హాతా | 
చిత్తాస లాధలీ శాంతతా | నిశ్చింతతా దర్శనే | ||౪౨|| 
42. వెనుకటి ఎన్నో జన్మల పుణ్య ఫలంగా, అదృష్టం కొద్దీ, బాబా పాదాలు దొరికాయి అని అనిపించింది. సాయి దర్శనంతో, ఉన్న చింతలు దూరమయ్యి, మనసుకు శాంతి చేకూరింది. 
ఉపనామ జయాంచే సాఠే | అంతరీ నిశ్చయాచే మోఠే | 
గురుచరిత్ర పారాయణ నేటే | నేమనిష్ఠే ఆరంభిలే | ||౪౩|| 
43. అతని ఉపనామం సాఠే అని. దృఢ నిశ్చయంతో, గురు చరిత్ర పారాయణను నియమ నిష్ఠలతో మొదలు పెట్టాడు. 
సప్తాహ పూర్ణ హోతా నిశీ | బాబా దేతీ దృష్టాంత త్యాంశీ | 
నిజకరీ ఘేఊని త్యా పోథీశీ | అర్థ సాఠ్యాంసీ సమజావీత | ||౪౪|| 
44. వారం రోజులు పారాయణం చేసిన తరువాత, ఒక రాత్రి, గురు చరిత్ర గ్రంథాన్ని తమ చేతిలో పట్టుకుని, సాఠేకు బాబా అర్థాన్ని తెలియ చేస్తున్నట్లుగా, సాఠేకు కల వచ్చింది. 
స్వయే స్థిత నిజాసనీ | సమోర సాఠ్యాంస బైసవూని | 
గురుచరిత్రాచీ పోథీ ఘేఊనీ | నిరూపణీ తత్పర | ||౪౫|| 
45. తమ ఆసనంలోనే కూర్చుని, తమ ఎదుట సాఠేను కూర్చోబెట్టుకుని, గురు చరిత్ర గ్రంథాన్ని పట్టుకుని, బాబా దాని అర్థాన్ని చెప్పసాగారు. 
బాబా గ్రంథావర్తన కరితీ | పురాణికసే19 కథా నిరూపితీ | 
సాఠే శ్రోతేపణే స్వస్థచిత్తీ | సాదర ఏకతీ గురుకథా | ||౪౬|| 
46. పురాణికుని వలె బాబా గ్రంథ పారాయణ చేస్తూ, వర్ణించడం, శ్రోతవలె స్థిరమైన మనసుతో సాఠే శ్రద్ధగా గురు కథను వినటం, 
హే కాయ ఏసే ఉఫరాటే | విచారాంత పడలే సాఠే | 
వాటలే తయాంస ఆశ్చర్య మోఠే | కంఠ దాటే ప్రేమానే | ||౪౭|| 
47. తాను చేయాల్సిన దానిని బాబా చేస్తూ, బాబా బదులు తాను శ్రోత కావడంలాంటి కలకు అర్థమేమిటని సాఠే ఆలోచించ సాగాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రేమతో అతని కంఠం గద్గదమైంది. 
ఆజ్ఞాన తమఉశీసీ | ఠేవూనియా మానేపాశీ | 
ఘోరత పడలే జే వాసనా కుశీసీ | త్యా జాగవిసీ దయాళా | ||౪౮|| 
48. ‘అజ్ఞానమనే తలగడను తల క్రింద పెట్టుకుని, ఇంద్రియ సుఖాల కోరికలనే పడకపై, గుర్రు పెట్టి నిద్రిస్తున్న వారిని, దయామయులైన సాయి మేల్కొలుపుతారు. 
పహా ఏసియాహీ సమయాసీ | థాపటోనియా ఆపణాసీ | 
గురుచరిత్ర పీయూషాసీ20 | పాజిలేంసీ కృపాళా | ||౪౯|| 
49. ‘అలాంటి సమయంలో, నా వెన్ను తట్టి, గురు చరిత్ర అనే అమృతాన్ని నాచే త్రాగించారు కదూ! కృపాళూ!’ 
అసో ఏసా దృష్టాంత పడతా | సాఠే జాగృత ఝాలే తత్వతా | 
కళవితీ కాకాసాహేబ దీక్షితా | సాద్యంత వార్తా ఘడలీ తీ | ||౫౦||
50. అలా తనకు వచ్చిన కలనుండి, సాఠే వెంటనే మేల్కొన్నాడు. జరిగిన దానిని వివరంగా, కాకాసాహేబు దీక్షితుకు తెలియ చేశాడు. 

మ్హణతీ న కళే యాచా అర్థ | జాణతీ ఎక బాబా సమర్థ | 
కాయ కీ న కళే త్యాంచే మనాంత | కాకా సాధ్యంత పుసా కీ | ||౫౧|| 
51. ‘దీని అర్థమేమిటో నాకు తెలియలేదు. సాయి సమర్థులు ఒక్కరికే అది తెలుస్తుంది. వారి మనసులో అసలు ఏమున్నదో నాకు తెలియడం లేదు. కాకా! సాధ్యమైతే, వారిని అడగండి. 
పునశ్చ పాఠ21 సురూ కరావా | కీ ఝాలా తితకాచ పురా సమజావా | 
మనోదయ బాబాంచా పుసావా | తేణేంచ విసావా యే మనా | ||౫౨|| 
52. ‘నేను మరల ఇంకొక సారి పారాయణ చేయాలా, లేక ఇంత వరకు చేసింది చాలా? అని మీరు అడిగి, వారి ఉద్దేశాన్ని కనుక్కోండి. అప్పుడే నా మనస్సుకు శాంతి’. 
మగ కాకా బాబాంప్రతీ | సమయ పాహూని స్వప్న నివేదితీ | 
దేవా ఆపణ య దృష్టాంతీ | కాయ సాఠ్యాంప్రతీ జాణవిలే | ||౫౩|| 
53. తగిన సమయం చూసుకుని, సాఠే కలను బాబాకు తెలిపి, కాకా, ‘బాబా! ఈ కలతో సాఠేకు ఏమని తెలియ చేశారు? 
సప్తాహ ఏసాచ సురూ ఠేవావా | కివా యేథూన పురా కరావా | 
దృష్టాంతార్థ స్వయే వివరావా22 | మార్గ దావావా తయాంతే | ||౫౪|| 
54. ‘ఇంకొక వారందాకా పారాయణం మొదలు పెట్టాలా లేక ఇంతటితో నిలిపి వేయాలా? కలలోని అర్థాన్ని మీరే స్వయంగా వివరించండి. అతనికి దారిని చూపించండి. 
ఇతుకీచ పాయీ మాఝీ వినంతీ | సాఠే మోఠే భక్త భావార్థీ | 
కృపా వ్హావీ తయాంవరతీ | పురవావీ ఆర్తీ తయాంచీ | ||౫౫|| 
55. ‘సాఠే మంచి భక్తుడు. యోగ్యుడు, మోసం తెలియని వాడు. అతని మీద దయ తలచి, అతని కోరికను తీర్చండి. మీ పాదాలకు ఇదే నా విన్నపం’ అని చెప్పాడు. 
మగ బాబా ఆజ్ఞాపితీ | “హోఊ ద్యా ఆణిక ఎక ఆవృత్తీ | 
వాచితాంహీ గురూచీ పోథీ | భక్త హోతీ నిర్మళ | ||౫౬|| 
56. “ఇంకా ఒక మారు పారాయణ జరగని” అని బాబా ఆజ్ఞాపించి, “గురువుయొక్క ఈ పవిత్ర గ్రంథాన్ని పారాయణం చేస్తే, భక్తులు నిర్మలమౌతారు. 
యా పోథీచే పారాయణ | కరితా హోఈల కల్యాణ | 
పరమేశ్వర హోఈల ప్రసన్న | భవబంధన సటేల” | ||౫౭|| 
57. “ఈ గ్రంథాన్ని పారాయణం చేస్తే, శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు తృప్తి చెందుతాడు. సాంసారిక బంధనాలు విడిపోతాయి” అని చెప్పారు. 
హే జవ బాబాంనీ కేలే కథన | కరీత హోతో మీ పాదసంవాహన23 | 
ఝాలో అంతరీ విస్మయాపన్న | వృత్తీ స్ఫురణ పావలీ | ||౫౮|| 
58. బాబా ఇలా అంటున్నప్పుడు, నేను వారి పాదాలు పట్టుతున్నాను. బాబా చెప్పిన మాటలు విని, నా మనసులో ఆశ్చర్యం కలిగి, చాలా ఆలోచనలు వచ్చాయి. 
బాబా తరీ హే ఏసే కైసే | సాఠ్యాంస ఫళతీ అల్పాయాసే | 
మాఝీ గేలీ వర్షానువర్షే | సాతచి దివసే ఫల త్యాంసీ | ||౫౯|| 
59. ‘బాబా! మరి ఇలా అయితే ఎలా? ఏడు రోజుల, కొద్ది శ్రమతోనే సాఠేకు ఫలితమూ, ఏళ్ళ తరబడి చేసిన నా శ్రమకు ఏమీ లేదా? 
ఎకచి పాఠ గురుచరిత్రాచా | కేలా సాఠ్యాంనీ సాతా దిసాంచా | 
చాళీస వర్షాచా పాఠ జయాచా | విచార తయాచా నాహీంచ కా | ||౬౦||
60. ‘ఏడు రోజులలో, ఒక్క మారే సాఠే గురు చరిత్ర పారాయణం చేశాడు. నలభై ఏళ్ళుగా చేస్తున్న పారాయణ గురించి ఏ ఆలోచనా లేదా? 

ఎకాస ఫళతీ సాత దివసే | ఎకాచీ నిష్ఫళ సాత24 వర్షే | 
వాట పాహే మీ చాతక ప్రకర్షే | దయాఘన హా వర్షేల కై | ||౬౧|| 
61. ‘ఒకరికేమో ఏడు రోజులలో ఫలితం, ఇంకొకరి ఏడేళ్ళ పారాయణ దండుగా? ఈ దయామయులు ఎప్పుడు నాపై దయ కురిపిస్తారా అని చాతక పక్షిలా ఎదురు చూస్తున్నాను.
యేఈల కై ఏసా దివస | ప్రసన్న హోఈల హా సంతావతంస25 | 
ఫేడీల మాఝియా మనీచీ హౌస | దేఈల ఉపదేశ మజ కాయ | ||౬౨|| 
62. ‘ఈ సత్పురుషులు సంతోషించి, నాకు ఉపదేశాన్నిచ్చి, నా మనసులోని కోరికను తీర్చే రోజు ఎప్పుడైనా వస్తుందా’ అని చూస్తున్నాను. 
భక్తవత్సల శ్రీగురూ సాఈ | పహా తయాంచీ కాయ నవలాఈ | 
మనీ వృత్తి ఉఠలీ తే సమయీ | తాత్కాళ త్యాంహీ జాణిలీ | ||౬౩|| 
63. సద్గురు సాయి చేసిన చమత్కారాన్ని చూడండి. నా మనసులో ఉబికి వస్తున్న ఆలోచనలను, వెంటనే తెలుసుకున్నారు. 
ఏశాచ అవిద్యేచ్యాహీ పోటీ | బర్యా వాఈట కోట్యనుకోటీ | 
వాసనా ఉఠతీ ఉఠాఉఠీ | తితుక్యాంచీ దృష్టీ తయాంనా | ||౬౪|| 
64. అజ్ఞానం వలన (నాకు కలిగినట్లు) కోటానుకోటి మంచి, చెడు కోరికలు మనసులో వెంట వెంటనే లేస్తుంటాయి. అవి లేస్తున్నట్లే బాబాకు తెలిసిపోతుంటాయి. 
“మన చింతీ తే వైరీ న చింతీ” | హేతో సర్వాంస ఠావే నిశ్చితీ | 
ఇతర కోణీ జరీ తే నేణతీ | మహారాజ ఓళఖతీ తాత్కాళ | ||౬౫|| 
65. తన శత్రువు తానే కనుక, మనసు ఆలోచించే చెడు ఆలోచనలను శత్రువు కూడా ఆలోచించడు. ఇది అందరికీ తెలిసినదే. మిగతావారికి ఇది తెలియక పైనా, సాయి మహారాజుకు వెంటనే తెలిసిపోతుంటాయి. 
పరి తీ మాయ అతికృపాళ | పోటాంత ఘాలీ నింద్య సకళ | 
అనింద్య పాహూన ప్రాప్తకాళ | తితుక్యాస చాలన దేఈ తీ | ||౬౬|| 
66. కాని, కరుణామయి అయిన సాయిమాతా, అందరి చెడు ఆలోచనలనూ తన కడుపులో దాచుకుంటుంది. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ తల్లి వాటిని ప్రోత్సాహ పరుస్తుంది. 
తంవ తే మనోగత జాణూనీ | బాబా వదతీ మజలాగూనీ | 
ఊఠ త్యా శామ్యాకడే26 జాఊనీ | రుపయే ఘేఊనీ పంధరా యే | ||౬౭|| 
67. నా మనసులోని ఆలోచనలను తెలుసుకుని, బాబా ఇలా అన్నారు, “లే! లేచి ఆ శామ్యా దగ్గరకు వెళ్ళి, పదిహేను రుపాయలను తీసుకుని రా. 
బైసే తయాపాసీ క్షణభర | గోష్టీ బోలా పరస్పర | 
దక్షిణా దేఈల తీ ఘేఊన సత్వర | యేఈ మాఘారా పరతోన | ||౬౮|| 
68. “అతని దగ్గరే కాసేపు కూర్చుని, ఇద్దరూ కబుర్లు చెప్పుకోండి. తరువాత అతనిచ్చె దక్షిణను తీసుకుని, తొందరగా తిరిగి రా”. 
కృపా ఉపజలీ సాఈనాథా | దక్షిణేచ్యా కరూని నిమిత్తా | 
మ్హణతీ మాగ జా ఆతాంచే ఆతా | రుపయే మజకరితా శామాకడే | ||౬౯|| 
69. సాయినాథునికి నాపై దయ కలిగి, దక్షిణ నెపంతో “మరి, తొందరగా ఇప్పుడే వెళ్ళు. నా పరంగా శామాను రూపాయలు అడుగు”. 
ఝాలియావరీ ఏసీ ఆజ్ఞా | బైసావయా పుఢే కోణాచీ ప్రాజ్ఞా | 
బైసతా తీ హోఈల అవజ్ఞా | ఘేఊని అనుజ్ఞా ఊఠలో | ||౭౦||
70. అలా వారి ఆజ్ఞ అయ్యిన తరువాత, అక్కడ కూర్చునే ధైర్యం ఎవరికుంటుంది? అలా కూర్చుంటే, వారి ఆజ్ఞను మీరినట్లే కదా? అందుకే, వారి అనుమతిని పొంది, లేచాను. 

మగ మీ తాత్కాళ గమన కేలే | శామరావహీ బాహెర ఆలే |
హోతే నుకతేంచ స్నాన కేలే | నేసత ఠేలే ధోతర | ||౭౧||
71. వెంటనే బయలుదేరాను. శామరావు బయటికి వచ్చాడు. అప్పుడే స్నానం చేసి, పంచను కట్టుకుంటున్నాడు. 
నుకతేంచ ఝాలె హోతే స్నాన | ధూత వస్త్ర పరిధాన కరూన |
హోతే ఘాలీత ధోతరాచీ చూణ | ముఖే గుణగుణ నామాచీ | ||౭౨||
72. అప్పుడే స్నానం చేయడం వలన, ఉతికిన పంచను చుట్టుకుని, కుచ్చిళ్ళను సవరించుకుంటూ, నోటితో నామాలను గునుగుతున్నాడు. 
మ్హణతీ “కాయ మధ్యేచ కోఠే | మశీదీంతూన ఆలాంత వాటే |
చర్యేవరీ కా చంచలతా ఉమటే | అసే ఎకటే కా ఆజ | ||౭౩||
73. ‘ఏమిటి ఈ వేళప్పుడు ఇక్కడ ఉన్నారు? మసీదునుండి వచ్చినట్లున్నారు. ముఖం మీద ఈ అలజడి ఎందుకు? ఇవాళ ఒక్కరే వచ్చారేమిటి?’ అని అన్నాడు. 
యా బసా మీ ఆతాంచ న్హాలో | హా పహా ధోతర చుణీత ఆలో |
జాతో దేవావర పాణీ ఘాలో | సమజా పరతలో ఏసాచ | ||౭౪||
74. ‘రండి, కూర్చొండి. నేనిప్పుడే స్నానం చేశాను. చూడండి, పంచె కట్టుకుని కుచ్చిళ్ళను సవరించుకుంటూ వస్తున్నాను. వెళ్ళి, దేవుడికి అభిషేకం చేసి, వెంటనే వచ్చేస్తాను. 
ఆపణ కరితా తాంబూల భక్షణ | తో మీ సారితో పూజావిధాన |
కరూ మగ వార్తా సావధాన | సమాధానపూర్వక” | ||౭౫||
75. ‘మీరు తాంబూలం వేసుకునే లోగా, నేను పూజా విధానాన్ని పూర్తి చేసి, వచ్చేస్తాను. తరువాత, మనిద్దరం తాపీగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు’. 
మాధవరావ ఘరాంత జాతీ | మగ తేథేంచ ఖిడకీవరతీ |
హోతీ నాథభాగవతాచీ27 పోథీ | సహజ హాతీ ఘేతలీ | ||౭౬||
76. అని చెప్పి, మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే కిటికీ పైన ఉన్న ఏకనాథ భాగవత గ్రంథాన్ని, చేతికి అందుకున్నాను. 
యదృచ్చేనే గ్రంథ ఉఘడలా | అకల్పిత జేథే ఆరంభ కేలా |
ప్రాతఃకాళీ జో అపూర్ణ టాకిలా | వాచావయా ఆలా తోచ భాగ | ||౭౭||
77. ఊరికే పుస్తకాన్ని తెరిచే సరికి, అనుకోకుండా, తెల్లవారి నేను చదువుతూ, మధ్యలోనే ఆపేసిన భాగం, కనిపించింది. 
అతి ఆశ్చర్య మనా వాటలే | ప్రాతఃకాళీ వాచన జే హేళసిలే28 |
బాబాంనీ తే సంపూర్ణ కరవిలే | వరీ లావిలే నియమన | ||౭౮||
78. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. తెల్లవారి నేను చదవని భాగాన్ని, ఇప్పుడు పూర్తి చేయించి, నియమాన్ని పాటించేలా బాబా చేశారు. 
నియమన మ్హణజే నియమే వాచన | న హోతా సంపూర్ణ నిశ్చింత పరిశీలన |
అపురే టాకూన నియమితోపాసన29 | స్థానాపాసూన చళూ నయే | ||౭౯||
79. ఇక్కడ నియమం అంటే, ప్రతి రోజూ, ఎంచుకున్న గ్రంథాన్నుంచి, అనుకున్న భాగాన్ని చదవడం. అనుకున్న భాగాన్ని పూర్తిగా చదవకుండా, మధ్యలో మానేసి, కూర్చున్న చోటునుండి లేవకూడదు. 
ఆతా థోడీసీ ఉపకథా | ఓఘాస ఆలీ న యే టాకితా |
శ్రోతా పరిసావీ సాదరతా | యా నాథభాగవతా సంబంధే | ||౮౦||
80. నాథ భాగవతానికి చెందిన ఒక చిన్న ఉపకథ, ఇప్పుడు గుర్తుకు వచ్చింది. వదిలి పెట్టలేనిది ఆ కథ. దీనిని శ్రోతలు శ్రద్ధగా వినాల్సిందే. 

తే హే నాథభాగవత | గురుభక్తిరసే పరిప్లుత30 | 
సాఈకృపా పాత్రభూత | నిత్య దీక్షిత31 వాచితీ | ||౮౧|| 
81. సాయి కృపను పొందిన సీతారాం దీక్షితు, గురు భక్తి రసంతో నిండిన ఈ ఏకనాథ భాగవతాన్ని ప్రతి రోజూ పఠించేవాడు.
జగదుద్ధారాచియా కారణే | బ్రహ్మ్యా ఠాయీ జే నారాయణే | 
పేరిలే తే మగ నారద క్షేత్రీ త్యాణే | బీజ ఆణిలే కణసాసీ | ||౮౨|| 
82. జగత్తును ఉద్ధరించాలని, బ్రహ్మ అనే భూమిలో, నారాయణుడు భక్తి బీజాన్ని నాటాగా, అది నారదుడనే పొలంలో పంటకు వచ్చింది. 
జయా క్షేత్రాచీ దశలక్షణీ | కేలీ సంవంగణీ బాదరాయణీ | 
శుకే పరీక్షితీచ్యా ఖళ్యాంత మళణీ | కేలీ నివడణీ కణసాంచీ | ||౮౩|| 
83. ఆ పొలంలో పండిన పది లక్షణాలుగల పంటను, వ్యాస మహర్షి సంగ్రహ పరచాడు. పరీక్షిత్తు అనే కళ్ళంలో, శుక మహర్షి ఆ గింజలను వేరు పరచగా, 
స్వామీ శ్రీధరే మారిలే హడప32 | స్వామీ జనార్దనే కేలే మాప | 
రసభరిత పక్వాన్నే ఉమాప33 | నాథప్రతాప భోజన | ||౮౪|| 
84. శ్రీధర స్వామి తూర్పార పట్టాడు. వచ్చిన పంటను, జనార్దన స్వామి కొలవగా, రసవత్తరమైన భోజనాన్ని ఏకనాథ మహారాజు తయారు చేశాడు. 
స్కంధ ఎకాదశ త్యాంతీల జాణ | భక్తిప్రేమసుఖాచీ ఖాణ | 
తే హే బత్తీసఖణీ34* వృందావన | నిత్య వాచన దీక్షితా | ||౮౫|| 
85. భాగవతంలోని పదకొండవ అధ్యాయం, భక్తి ప్రేమ ఆనందాలకు గని. ముప్పైరెండు అధ్యాయాలతో ఉన్న బృందావనం లాంటి ఈ గ్రంథాన్ని దీక్షితు ప్రతి రోజూ చదివేవాడు. 
దివసా తయాచే కరితీ నిరూపణ | రాత్రౌ వాచితీ భావార్థ రామాయణ | 
హాహీ గ్రంథ గుర్వాజ్ఞా మ్హణూన | జాహలా ప్రమాణ దీక్షితా | ||౮౬|| 
86. పగటి పూట దానికి అర్థం చెప్పేవాడు. రాత్రి పూట భావార్థ రామాయణాన్ని చదివే వాడు. గురువు ఆజ్ఞతో, ఈ గ్రంథం కూడా, దీక్షితుకు ప్రమాణికమైంది. 
భక్తిసుఖామృతాచే సార | జ్ఞానేశ్వరీచా ద్వితీయావతార | 
తో హా నాథాంచా మూర్త ఉపకార | మహారాష్ట్రావర ఉదండ | ||౮౭|| 
87. నాథ భాగవతం భక్తి రసామృతానికి సారం. జ్ఞానేశ్వరికి రెండవ అవతారం. మహారాష్ట్రకు ఏకనాథ మహారాజు చేసిన మహోపకారం ఈ భాగవత గ్రంథం. 
కరోనియా ప్రతఃస్నాన | నిత్యనేమ సాఈపూజన | 
అన్య దేవ దేవతార్చన | నైవేద్య నీరాజన ఉరకతా | ||౮౮|| 
88. తెల్లవారి స్నానం చేసి, నిత్య నియమంగా సాయిబాబా పూజ, ఇతర దేవీదేవతల అర్చనలయ్యాక, దీక్షితు నైవేద్యం నీరాజనాలు ఇచ్చి, 
మగ శ్రోత్యాంసమవేత సవిస్తర | పయఃప్రసాద35 అల్పాహార36 | 
సారోని నిత్యక్రమానుసార | పోథీ సాదర వాచితీ | ||౮౯|| 
89. నివేదించిన పాలు, ఫలహారాన్ని శ్రోతలతో పాటు తానూ తీసుకుని, ప్రతి రోజూ గ్రంథాన్ని శ్రద్ధగా చదివే వాడు. 
జయా గోడియే సహస్త్ర పారాయణే | భగవత్పరాయణ తుకారామానే | 
కేలీ భండార్యావర37 ఎకాంతపణే | తే గోడీ కవణే వర్ణావీ | ||౯౦||
90. భండారా అనే కొండపై, భక్తుడైన తుకారాం ఒక్కడే కూర్చుని, ఈ నాథ భాగవతాన్ని వేయి సార్లు పారాయణం చేశాడు. అందులోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు? 

హా మహా ప్రాసాదిక దివ్య గ్రంథ | దీక్షిత శిష్య నిష్ఠావంత | 
మ్హణోని జీవాంచ్యా ఉద్ధారార్థ | సాఈసమర్థ ఆజ్ఞాపితీ | ||౯౧|| 
91. జీవుల ఉద్ధారం కోసం, దైవ ప్రేరణతో రచించబడిన ఈ దివ్య గ్రంథాన్ని, నిష్ఠాపరుడైన దీక్షితు, రోజూ పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు. 
జాణే నలగే వనాప్రతీ | భగవంత ప్రగటే ఉద్ధవగీతీ38 | 
శ్రద్ధాయుక్త జే పారాయణ కరితీ | భగవత్ప్రాప్తి రోకడీ | ||౯౨|| 
92. దేవుణ్ణి చూడటానికి అడవులకు వెళ్ళవలసిన పనిలేదు. భాగవతంలోని పదకొండవ అధ్యాయంలో ఉండే ఉద్ధవ గీతలో దేవుడు కనిపిస్తాడు. శ్రద్ధా భక్తితో పఠిస్తే, దేవుడు ఖచ్చితంగా దొరకుతాడు. 
భారతీ సంవాద కృష్ణార్జునాచా | త్యాహూన సరస హా కృష్ణోద్ధవాచా | 
తో యా భాగవతీ ఉపదేశ సాచా | ప్రేమళ వాచా నాథాంచీ | ||౯౩|| 
93. భారతంలోని శ్రీకృష్ణార్జునుల సంవాదం కంటే, ఇందులోని కృష్ణ ఉద్ధవుల సంభాషణ చాలా రసభరితంగా ఉంది. శ్రీకృష్ణుని ఉపదేశాన్ని ఏకనాథ మహారాజు ఎంతో ప్రేమగా వర్ణించారు. 
అసో ఏసా హా ప్రాసాదిక గ్రంథ | జ్ఞానదేవ భావార్థదీపికా39 సమవేత | 
సమర్థ కృపాళూ సాఈనాథ | వాచవీత నిత్య శిరడీంత | ||౯౪|| 
94. ఇలాంటి దైవికమైన గ్రంథాన్ని, మరియు జ్ఞానదేవుని భావార్థ దీపికను, శిరిడీలో ప్రతిరోజూ, దయామయులైన సాయి సమర్థులు, చదివించే వారు. 
సఖారామ హరీ జోగ | తయాంస హా బాబాంచా నియోగ40 | 
సాఠ్యాంచే వాడియాంత హా యోగ | భక్తా ఉపయోగ హా మోఠా | ||౯౫|| 
95. ఈ భాగవత గ్రంథాన్ని, సఖారామ హరి జోగు సాఠేవాడాలో చదవాలని, బాబా ఆజ్ఞ. ఇది భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. 
ప్రత్యహీ యా గ్రంథాచే శ్రవణ | బాబా కిత్యేక భక్తాంలాగూన | 
శ్రవణ కరవితీ కళవళూన | భక్త కల్యాణ వాంఛేనే | ||౯౬|| 
96. భక్తుల శ్రేయస్సు కోరి, వారి మీద కరుణతో, ప్రతిరోజూ ఈ గ్రంథాన్ని, బాబా భక్తుల చేత వినిపించేవారు. 
అగాధ బాబాంచీ అనుగ్రహకుసరీ41 | భక్తా ఉపదేశితీ పరోపరీ | 
భక్త జవళీ వా దేశాంతరీ | బాబా అంతరీ సన్నీధచి | ||౯౭|| 
97. భక్తులను అనుగ్రహించే బాబా పద్ధతి సులభంగా అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపదేశం చేసేవారు. భక్తులు దగ్గరలో ఉన్నా, దేశాంతరాలలో ఉన్నా, బాబా ఎప్పుడూ వారి హృదయాలలో ఉండేవారు. 
ఆపణ జరీ మశీదీ బసతీ | కోణాహీ కాంహీ కార్య నేమితీ | 
తయాసీ దేఊనియా నిజశక్తీ | కరవూని ఘేతీ తే కార్య | ||౯౮|| 
98. ఎవరికైనా ఏదైనా పని అప్ప చెప్పితే, తాము మసీదులోనే కూర్చుని, చెప్పిన వారికి తమ శక్తిని ఇచ్చి, బాబా ఆ పనిని చేయించుకునే వారు. 
బాపూసాహేబ జోగాప్రత | వాడ్యాంత పోథీ వాచాయా సాంగత | 
తే తీ వాచీత నిత్య నేమస్త | శ్రోతేహీ యేత ఏకాయా | ||౯౯|| 
99. వాడాలో గ్రంథాన్ని పఠించమని బాపూసాహేబు జోగుకు వారు చెప్పారు. దానిని అతడు ప్రతి రోజూ నియమంగా చదివేవాడు. వినడానికి శ్రోతలు కూడా వచ్చేవారు. 
జోగ హీ దుపారా భోజనాంతీ | నిత్య జాఊని బాబాంప్రతీ | 
చరణ వందూని ఘేఊని విభూతి42 | ఆజ్ఞాపన43 ఘేతీ పోథీచే | ||౧౦౦||
100. రోజూ, మధ్యాహ్న భోజనం తరువాత జోగు, బాబా దగ్గరకు వచ్చి, వారి పాదాలకు నమస్కరించి విభూతిని తీసుకుని, గ్రంథ పఠనకై వారి ఆజ్ఞను తీసుకునే వాడు. 

కధీ వాచీత జ్ఞానేశ్వరీ | కధీ తే నాథభాగవతావరీ | 
పారాయణ మాండీత ఆనందనిర్భరీ | వ్యాఖ్యాన కరీత అర్థాచే | ||౧౦౧|| 
101. ఒక్కొక్కప్పుడు జ్ఞానేశ్వరిని, ఇంకొకప్పుడు ఏకనాథ భాగవతాన్ని, దాని అర్థాన్ని చెబుతూ ఎంతో ఆనందంతో బాగా పఠించేవాడు.
ఏసీ అనుజ్ఞా ఝాలియా పాఠీ | భక్త జే యేతీ బాబాంచే భేటీ | 
కితి ఎకా పోథీ ఏకావయాసాఠీ | ఉఠాఉఠీ పాఠవీత | ||౧౦౨|| 
102. అలా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తరువాత, తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులను, పారాయణాన్ని వినమని, బాబా వెంటనే వాడాకు పంపించేవారు. 
కధీ సాంగత సంక్షిప్త గోష్టీ | శ్రోతా జో సాంఠవీ నిజకర్ణసంపుటీ | 
తోంచ బాబా మ్హణతీ “జా ఉఠీ | త్యా పోథీసాఠీ వాడ్యాంత” | ||౧౦౩|| 
103. కొన్ని మార్లు, చిన్న కథలుగా చెప్పి, వానిని శ్రోతలు తమ చెవులలో నింపుకునే లోగా, “లేవండి! వెంటనే వాడాకు వెళ్ళి, గ్రంథం వినండి” అని బాబా చెప్పేవారు. 
శ్రోతా భావార్థీ పోథీస జాతా | నిఘావీ పోథీంతహీ ఏసీచ కథా | 
 కీ జో పూర్వీల కథేచీ దృఢతా | అర్థావబోధకతా పూర్ణ కరీ | ||౧౦౪|| 
104. భక్తి భావంతో, శ్రోతలు వెంటనే వాడాకు వెళ్ళగా, వారికి బాబా చెప్పిన కథే అక్కడ నడుస్తుండేది. అది విన్న తరువాత, వారికి ఆ కథ గురించిన ప్రాముఖ్యత బాగా స్పష్టంగా అర్థమయేది. 
జ్ఞానేశ్వరాంచీ జ్ఞానేశ్వరీ | అథవా ఎకనాథాంచీ వైఖరీ | 
బాబాంచ్యా కథేచాచ అనువాద కరీ | శ్రోతయా నవల పరీ హీ మోఠీ | ||౧౦౫|| 
105. జ్ఞానేశ్వరుని జ్ఞానేశ్వరి, లేదా ఏకనాథుని భాగవతం చదువుతున్నా, అది బాబా చెప్పిన కథలనే వివరిస్తుంటే, శ్రోతలకు చాలా ఆశ్చర్యం కలిగేది. 
ఎకాద్యా పోథీచా వివక్షిత భాగ | వాచావా ఏసా నసతాంహీ నియోగ | 
పూర్వ నివేదిత గోష్టీచా సుయోగ | పోథీంత జోగ వాచీత | ||౧౦౬|| 
106. గ్రంథంలోని ఏదో ఒకటి రెండు భాగాలను చదవమని బాబా చెప్పక పోయినా, అంతకు ముందు బాబా చెప్పిన ప్రసంగానికి సరిపోయే కథలనే జోగు చదివే వాడు. 
భగవద్గీతా భాగవత | ముఖ్యతః హేచ దోన గ్రంథ | 
భాగవత ధర్మాచే సారభూత | జోగ హే నిత్య వాచీత | ||౧౦౭|| 
107. జోగు రోజూ పఠించే భగవద్గీత, భాగవతం ఈ రెండూ ముఖ్య గ్రంథాలే. భాగవత ధర్మానికి ఇవి ఆధారం. 
గీతా జ్ఞానేశ్వరీ టీకా | జయ నాంవ “భావార్థదీపికా” | 
భాగవత ఎకాదశమస్కంధనికా | పరమార్థ భూమికా నాథాంచీ | ||౧౦౮|| 
108. ‘భావార్థ దీపిక’ అనబడే జ్ఞానేశ్వరి, భగవద్గీతకు అర్థ సహితంగా చెప్పబడిన టీకా. భాగవతంలోని పదకొండవ అధ్యాయం ఆధారంతోనే, ఏకనాథుడు పరమార్థాన్ని వివరించాడు. 
అసో యా నిత్య క్రమానుసార | భాగవత వాచనాచా ప్రచార | 
మీహీ తే వాచీ నిరంతర | పడలే అంతర తే దినీ | ||౧౦౯|| 
109. అలా, రోజూ నియమంగా భాగవత పఠన జరుగుతుండగా, నేను కూడా రోజూ దానిని పఠించేవాణ్ణి. కాని, ఆ రోజు అనుకున్న భాగాన్ని పూర్తిగా చదవలేక పోయాను. 
కథా ఎక ఆధీ వాచిలీ | మండళీ మశీదీ జావయా నిఘాలీ | 
వాచతా వాచతా పోథీ ఠేవిలీ | ధాంవ మారిలీ మీ తేథే | ||౧౧౦||
110. ఒక కథను సగం చదువుతుండగా, భక్తులు అందరూ మసీదుకు బయలుదేరారు. అప్పుడు, చదువుతున్న గ్రంథాన్ని అక్కడే పెట్టి, నేను కూడా వారితో మసీదుకు పరుగెత్తాను. 

ఇచ్ఛా ఏకావ్యా బాబాంచ్యా గోష్టీ | బాబాంచ్యా పరీ ఆణిక పోటీ | 
భాగవత సోడూని ఇతర కష్టీ | నాహీంచ తుష్టీ తయాంనా | ||౧౧౧|| 
111. నాకేమో బాబా మాటలను వినాలన్న కోరిక. కాని, బాబా అనుకునేదే వేరు. భాగవత పఠనాన్ని వదిలి, మిగతా పనులు చేయటం వారికి ఇష్టం కాదు. 
యేచ అర్థీ నేటే పాటే | రాహిలే44 భాగవత వాచవిలే వాటే | 
ఏసే హే బాబాంచే కౌతుక మోఠే | ప్రేమ లోటే ఆఠవితా | ||౧౧౨|| 
112. అందుకే, నేను ఆ రోజు చదవ వలసిన భాగాన్ని, బాబా నాచే చదివించారేమో అని అనిపిస్తుంది. వారి లీలలను తలచుకుంటే, ప్రేమ ఉప్పొంగుతుంది. 
అసో భాగవతీ కథా సంపలీ | ఉపకథాహీ యేథే సరలీ | 
మాధవరావాంచీ పూజా ఆటపలీ | స్వారీ ఆలీ బాహేర | ||౧౧౩|| 
113. దీంతో, భాగవత కథ, దానికి సంబంధించిన ఉపకథ కూడా అయిపోయినవి. పూజ ముగించుకుని, మాధవరావు బయటకు వచ్చాడు. 
అహో బాబాంచా నిరోప ఆహే | తోచ మీ ఘేఊని ఆలో పాహే | 
“శామా పాసూన పంధరా రుపయే | దక్షిణా యే ఘేఊని” | ||౧౧౪|| 
114. ‘“శామా దగ్గరనుండి పదిహేను రూపాయల దక్షిణను తీసుకునిరా” అన్న బాబా సందేశము తీసుకుని వచ్చాను’. 
బైసలో హోతా సేవా కరీత | అకస్మాత తుమచే స్మరణ హోత | 
“ఊఠ శామాకడే జా మ్హణత | దక్షిణేసీ45 పరత యే” | ||౧౧౫|| 
115. ‘నేను బాబా పాద సేవ చేస్తూ కూర్చుండగా, అకస్మాత్తుగా నీవు గుర్తుకు వచ్చావు. అంతే, “లే, శామా దగ్గరకు పో” అని చెప్పి, “దక్షిణతో తిరిగి రా” అని అన్నారు’. 
“బైస మ్హణాలే తయాంచే ఘరీ | విళభర46 తయాసవే వార్తా కరీ | 
బోలూన చాలూన పరస్పరీ | మగ మాఘారీ తూ యేఈ” | ||౧౧౬|| 
116. ‘“అతని ఇంట్లో కాసేపు కూర్చుని, మీరు ఇద్దరూ కబుర్లు చెప్పుకోండి. తర్వాత, తిరిగి రా” అని బాబా చెప్పారు’. 
మాధవరావ జంవ హే పరిసత | ఝాలే అత్యంత ఆశ్చర్యచకిత | 
రుపయాంఏవజీ నమస్కార సాంగత | దక్షిణా మ్హణత హీ ఆముచీ | ||౧౧౭|| 
117. అది విని మాధవరావుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ‘రూపాయలకు బదులుగా నా నమస్కారాలే నా దక్షిణ’ అని అన్నాడు. 
బరే అసో ఎక ఝాలే | పంధరా నమస్కార పదరీ బాంధలే | 
పరి వార్తా కరావయాస యా కీ వహిలే | మ్హణూని మ్హటలే తయాంస | ||౧౧౮|| 
118. ‘సరే, అలాగే’ అని అతని పదిహేను నమస్కారాలను కొంగున మూట కట్టుకున్నాను. ఒక పనైంది. ఇక అతనితో ముచ్చటించాలి కదా. 
కాయ గోష్టీ సాంగతా సాంగా | ఫేడా కీ మాఝ్యా శ్రవణ పాంగా | 
బాబాంచీ నిర్మళ యశగంగా | దురితభంగా కరూ కా | ||౧౧౯|| 
119. అతనితో ‘ఏం కబుర్లు చెబుతావో చెప్పి, నా కుతూహలాన్ని తీర్చు. పావనమైన బాబాయొక్క అద్భుతమైన కథలలో మునిగి, మన పాపాలను తొలగించుకుందాం’ అని అన్నాను. 
మగ మాధవరావ మ్హణతీ బైసా | యా దేవాచా ఖేళచి ఏసా | 
తుమ్హీహీ సర్వ జాణతసా | క్షణైక విసావా ఘ్యా బసా | ||౧౨౦||
120. అప్పుడు మాధవరావు, ‘సరే, కూర్చోండి. ఈ దేవుని లీలలు ఎంత సాటిలేనివో, మీకంతా తెలుసు. కాసేపు విశ్రామంగా కూర్చోండి. 

హే ఘ్యా పాన హా ఘ్యా కాథ | చునా సుపారీ ఆహే డబ్యాంత | 
హా మీ ఆలో ఎకా క్షణాంత | టోపీ డోక్యాంత ఘాలూని | ||౧౨౧|| 
121. ‘ఇదిగో, ఈ ఆకులు, కాచు తీసుకోండి. వక్కలు, సున్నం డబ్బాలో ఉన్నాయి. తల మీద టోపీ పెట్టుకుని, ఇదిగో, ఒక క్షణంలో వచ్చేస్తాను.
అగాధ సాఈబాబాంచ్యా లీలా | కితీ మ్హణూని మీ సాంగూ తుమ్హాలా | 
ఆపణ కాయ థోడ్యా దేఖిల్యా | శిరడీస ఆల్యాపాసోని | ||౧౨౨|| 
122. ‘సాయిబాబా లీలలు ఊహకందనివి. ఎన్నని నేను మీకు చెప్పను? బాబా శిరిడీకి వచ్చినప్పటినుండి, మనం చూసింది కొంచెమా? 
మీ తో కేవళ ఖేడవళ47 | ఆపణ శహరవాసీ సకళ | 
కాయ వానావ్యా ఆపణాజవళ | లీలా అకళ తయాంచ్యా | ||౧౨౩|| 
123. ‘నేనొట్టి పల్లె వాణ్ణి. మీరంతా ఊళ్ళలో ఉండేవాళ్ళు. అంతు లేని వారి లీలలను, మీకు నేనెలా వర్ణించను?’ 
యేతో మ్హణూని ఘరాంత గేలే | దేవాస ఫూల పాన వాహిలే | 
తాత్కాళ టోపీ ఘాలూన ఆలే | బోలత బైసలే మజసవే | ||౧౨౪|| 
124. అని అంటూ, మాధవరావు ఇంట్లోకి వెళ్ళి, దేవునికి పత్రి, పుష్పాలను సమర్పించి, టోపీ పెట్టుకుని, వెంటనే వచ్చి, నా దగ్గర కబుర్లు చెప్పాలని కూర్చున్నాడు. 
కాయ దేవాచీ అతర్క్య లీలా | కోణ జాణేల యాచీ కళా | 
అంత నాహీ యాచ్యా ఖేళా | ఖేళూన ఖేళానిరాళా | ||౧౨౫|| 
125. ‘ఈ దేవా లీలలు తర్కానికి అందనివి. వారి నేర్పును ఎవరు అర్థం చేసుకోగలరు? వారి లీలలకు అంతు అనేదే లేదు. అవి చాలా ప్రత్యేకమైనవి. 
కాయ తుమ్హీ విద్యేచే భోక్తే | ఎకాహూని ఎక జ్ఞాతే | 
ఆమ్హా గాంవఢళా కాయ కళతే | చరిత్ర అకళతే బాబాంచే | ||౧౨౬|| 
126. ‘మీరంతా చాలా గొప్ప విద్యావంతులు. ఒకరిని మించిన జ్ఞానులు ఇంకొకరు. తెలివి లేని పల్లెవాసులైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమౌతుంది? 
తే కాయ గోష్టీ వార్తా న సాంగతీ | ఆమ్హాపాశీ కిమర్థ పాఠవితీ | 
త్యాంచీ కరణీ తేచ జాణతీ | మానవీ వృత్తీ నాహీ తీ | ||౧౨౭|| 
127. ‘వారు అసలు ఏ సంగతీ చెప్పరు. అలాంటిది మా దగ్గరికెందుకు పంపించటం? వారేం చేస్తారో అది వారికే తెలియాలి. వారి పనులు మటుకు, మనుషులు చేసేవి కావు, దేవుడు చేసేవి. 
ఆలేచ ఆతా ఓఘావరీ | గోష్టహీ మజ ఆఠవలీ బరీ | 
కరూ వార్తా కాంహీతరీ | వేళ సాజరీ కరూ కీ | ||౧౨౮|| 
128. ‘ఓ మంచి సంగతి ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఆ కథను చెప్పి, కాలాన్ని సరిగ్గా ఉపయోగిద్దాం. 
ప్రత్యక్ష ఆముచే దృష్టీసమోర | కథితో యేథే ఘడలేలా ప్రకార | 
జయా మనీ జైసా నిర్ధార | తైసా తే పార పాడితీ | ||౧౨౯|| 
129. ‘నా కళ్ళెదుటే ఇక్కడ ప్రత్యక్షంగా జరిగిన, ఒక సంగతి చెబుతాను. ఎవరి మనసులో ఏ కోరికుంటే, అలాగే జరిగేలా బాబా చేసేవారు. 
కధీ కధీ బాబాహీ కితీ | మనుష్యాచా అంత పాహతీ | 
భక్తి ప్రేమ కసాస లావితీ | తేవ్హాంచ దేతీ ఉపదేశ | ||౧౩౦||
130. ‘కొన్ని మార్లు, మనుషులను బాబా చివరిదాకా పరీక్షించేవారు. భక్తి, ప్రేమలను బాగా పరీక్షించిన తరువాతే, ఉపదేశాలను ఇచ్చేవారు’. 

‘ఉపదేశ’ హా శబ్ద కానీ పడతా | స్మరలీ సాఠ్యాంచీ గురుచరిత్ర కథా | 
సకృద్దర్శనీ జణూ విద్యుల్లతా | చమకలీ చిత్తా మాఝియా | ||౧౩౧|| 
131. అని అంటుండగా, ‘ఉపదేశం’ అన్న మాట నా చెవులలో పడగానే, మెరుపు మెరిసినట్లు, వెంటనే సాఠేయొక్క గురు చరిత్ర కథ నా మనసులో మెరిసింది. 
నసేల కాహీ శామాచీ యోజనా | మశీదీంతీల మమ చంచల మనా | 
స్థైర్య ఆణావయాలాగీ కల్పనా | అఘటిత ఘటనా బాబాంచీ | ||౧౩౨|| 
132. మసీదులో కలత చెందిన నా మనసును, స్థిర పరచటానికే, శామా దగ్గరకు బాబా నన్ను పంపించారేమో అని అనిపించింది. బాబా పనులన్నీ ప్రత్యేకం! 
అసో హీ జీ ఉఠలీ వృత్తి | తైసీచ దాబూన ఠేవిలీ చిత్తీ | 
కథా శ్రవణీ దుణావలీ ఆర్తీ | తియేచీ పూర్తీ సంపాదూ | ||౧౩౩|| 
133. ఇలా మనసులో లేచిన ఆలోచనలను అణచి వేశాను. కథ వినాలనే కోరిక బలమై, దానిని ముందు తీర్చుకోవాలని అనుకున్నాను. 
మగ బాబాంచ్యా గోష్టీ వార్తా | థోడ్యా థోడ్యా సురూ హోతా | 
ఆనంద వాటూ లాగలా చిత్తా | భక్త వత్సలతా పాహూని | ||౧౩౪|| 
134. కొంచెం కొంచెంగా బాబా మాటలు, లీలలు వింటున్న కొద్ది, భక్తుల మీద వారికున్న ప్రీతిని తెలుసుకుని, మనసుకు చాలా ఆనందం కలిగింది. 
పుఢే ఆణిక కథా సాంగతీ | మ్హణతీ ఎక దేశముఖీణ హోతీ | 
తియేచ్యా పహా ఆలే చిత్తీ | సంత సంగతీ కరావీ | ||౧౩౫|| 
135. అటు తరువాత, శామా మరో కథను చెప్ప సాగాడు. దేశముఖ అనే ఇంటి పేరు గల ఒక స్త్రీ ఉండేది. సత్పురుషుల సహవాసం చేసుకోవాలని అకస్మాత్తుగా ఆమెకు అనిపించింది. 
ఏకూన సాఈబాబాంచీ కీర్తీ | సంగమనేరచే లోకాం సంగతీ | 
ఆలీ బాఈ శిరడీ ప్రతీ | దర్శన ప్రీతీ బాబాంచ్యా | ||౧౩౬|| 
136. సాయిబాబా కీర్తి విని, వారి దర్శనం చేసుకోవాలన్న ఆశతో, సంగమనేరు జనులతో, ఆమె శిరిడీకి వచ్చింది. 
ఖాశాబా దేశముఖాచీ హీ ఆఈ | నామ ఇయేచే రాధాబాఈ | 
నిష్ఠా ధరూన సాఈంచే పాయీ | దర్శన ఘేఈ సాఈంచే | ||౧౩౭|| 
137. ఆమె ఖాశాబా దేశముఖకు తల్లి. ఆమె పేరు రాధాబాయి. సాయి పాదాల మీద విపరీతమైన నమ్మకం కలిగి, వారి దర్శనం చేసుకుంది. 
దర్శన ఘడలే యథాసాంగ | గేలా మార్గీచా శీణ భాగ | 
జడలా శ్రీచరణీ అనురాగ | కార్యభాగ ఆఠవలా | ||౧౩౮|| 
138. దర్శనంతో కలిగిన తృప్తి వలన దారిలో కలిగిన అలసట తీరింది. సాయి పాదాలయందు భక్తి పెరిగింది. తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. 
హోతీ తియేచ్యా మనీ ఆర్త | గురు కరావే సాఈసమర్థ | 
కరితీల ఉపదేశ యథార్థ | జేణే పరమార్థ సాధేల | ||౧౩౯|| 
139. సాయి సమర్థులను తన గురువుగా చేసుకుంటే, వారు తనకు సరియైన ఉపదేశాన్ని ఇస్తారు, అన్న ఒక ఆశ ఆమెలో చిగురించింది. ఆ ఉపదేశంతో తాను పరమార్థాన్ని పొందవచ్చు. 
బాఈ వయానే మ్హాతారీ | నిష్ఠా అత్యంత బాబాంవరీ | 
మిళావా ఉపదేశ కాంహీతరీ | నిర్ధార అంతరీ హా కేలా | ||౧౪౦||
140. వయసు మీరిన ముసలావిడ ఆమె. కాని, బాబాపై విపరీతమైన భక్తి కలగటం వలన, వారి వద్ద ఎలాగైనా ఉపదేశాన్ని పొందాలని మనసులో నిశ్చయించుకుంది. 

బాబా జోంవరీ మజలా స్వతంత్ర | దేతీ న ఎకాదా కానమంత్ర | 
కరితీ న మజ కృపాపాత్ర | తోంవరీ అన్యత్ర జాణేనా | ||౧౪౧|| 
141. ‘బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి, నన్ను అనుగ్రహించేటంత వరకు, ఎక్కడికీ వెళ్ళను’ అని అనుకున్నది.
వ్హావా సాఈముఖీంచాచ మంత్ర | ఘేతా ఇతరత్ర తో అపవిత్ర | 
శ్రీసాఈ సంతాగ్రణీ పవిత్ర | అనుగ్రహ పాత్ర మజ కరో | ||౧౪౨|| 
142. ‘ఆ మంత్రం సాయి నోటినుండే రావాలి. ఇతరులతో వస్తే, అది అపవిత్రం. శ్రీ సాయి సత్పురుషులలో శ్రేష్ఠులు, పవిత్రులు కనుక, నన్ను అనుగ్రహం పొందేలా చేయాలి’. 
కరూని ఏసా అంతఃకరణే | దృఢనిశ్చయ త్యా వృద్ధ బాఈనే | 
వర్జ్య కరూని ఖాణే పిణే | ఘేఊని ధరణే బైసలీ | ||౧౪౩|| 
143. అని ఆమె మనసులో దృఢంగా నిశ్చయించుకుని, అన్న పానాదులను మాని, మొండిపట్టు పట్టి కూర్చుంది. 
ఆధీంచ వయానే మ్హాతారీ | పోటాంత అన్న నాహీ తిళభరీ | 
పాణీహీ పిఈనా ఘోటభరీ | శ్రద్ధా భారీ ఉపదేశీ | ||౧౪౪|| 
144. అసలే వయసు మీరిన ముసలామె. కడుపులో కాసింతైనా అన్నం లేదు. ఓ గుక్క నీరు కూడా త్రాగలేదు. బాబా చెప్పే ఉపదేశం మీద శ్రద్ధతో, నమ్మకంతో, ఎదురు చూస్తూంది. 
తీన దివస అహర్నిశీ | మ్హాతారీ రాహిలీ ఉపవాశీ | 
బాబా ఉపదేశ దేతీల జే దిశీ | ప్రయోపవేశీ48 తోంవరీ | ||౧౪౫|| 
145. అలా మూడు రోజులు, రాత్రింబవళ్ళూ ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశం చేసే వరకూ, తాను అలాగే ఉపవాసంలో ఉంటానని, గట్టిగా దీక్షతో ఉంది. 
మంత్రోపదేశ ఘేతల్యావిణే | కిమర్థ శిరడీంచే జాణే యేణే | 
 ఉతరల్యా స్థళీ ఘేతలే ధరణే | నిర్వాణ తీణే మాండిలే | ||౧౪౬|| 
146. ఉపదేశం లేకుండా, శిరిడీకి రావటం కాని, శిరిడీనుండి పోవటం కాని దండుగ అని, తాను బస చేసిన చోట, చావుకు కూడా సిద్ధపడింది. 
అన్న పాన కేలే వర్జన | ఏసే తప తే తీన దిన | 
కరితా కష్టలీ దేశముఖీణ | ఉదాసీన బహు ఝాలీ | ||౧౪౭|| 
147. అలా అన్న పానాదులు మాని, మూడు రోజులు తపస్సు చేసి, ఆమె అలసి నీరసించి పోయింది. చాలా నిరాశతో ఉంది. 
మాధవరావాంస విచార పడలా | ప్రకార హా తవ నాహీ భలా | 
కాయ కరావే యా భవితవ్యాలా | మ్హాతారీ మరణాలా భిఈనా | ||౧౪౮|| 
148. మాధవరావు కలత చెందాడు. ‘ఈ ముసలామేమో చావుకు కూడా భయపడటం లేదు. జరుగుతున్నది అసలేం బాగా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?’ అని ఆలోచించ సాగాడు. 
మగ తే జాఊని మశీదీసీ | బైసతే ఝాలే బాబాంపాశీ | 
నిత్యాచియా కుశలవృత్తాసీ | ఆదరేంశీ తే పుసత | ||౧౪౯|| 
149. మసీదుకు వెళ్ళి బాబా దగ్గర కూర్చున్నాడు. ఎప్పటి లాగే, బాబా ఎంతో ప్రేమతో, అందరి కుశలాన్ని అడిగారు. 
“శామా ఆజ కాయ విచార | ఠీక ఆహే నా సమాచార | 
తో నారాయణ49 తేలీ చళలా ఫార | గాంజీ అనివార మజలాగీ” | ||౧౫౦||
150. “శామా! ఏమిటి ఇవాళ సంగతి? అంతా బాగానే ఉంది కదా? ఆ నూనెల నారాయణుని బుర్ర తిరిగి, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు” అని అన్నారు. 

పాహోని మ్హాతారీచా విచార | శామా ఆధీంచ కష్టీ ఫార | 
కైసే కరావే తరీ సాచార | పుసే నిర్ధార బాబాంసీ | ||౧౫౧|| 
151. ముసలామె దీక్ష చూసి, మాధవరావు అసలే బాధతో ఉన్నాడు. అప్పుడు వెంటనే, ‘నిజంగా, ఇప్పుడేం చేయాలి?’ అని బాబాను అడిగాడు. 
హే కాయ గౌడబంగాల దేవా | ఖేళ ఆపులా ఇతరా న ఠావా | 
త్వా మాణసే ఎకేక ఆణావీ గాంవా | ఆమ్హా పుసావా విచార | ||౧౫౨|| 
152. ‘ఈ రహస్యమేమిటి? మీ లీలలు ఎవరికీ అర్థం కాదు. ఒక్కో మనిషిని గ్రామానికి రప్పించి, వారి గురించి మమ్మల్ని అడుగుతారు! ఏం గారడి ఇది? 
తీ దేశముఖీణ వయాతీత | అన్నాపాణ్యావిరహిత | 
రాహిలీ తీన దివస ఉపోషిత | తుజవరీ హేత ధరూని | ||౧౫౩|| 
153. ‘ఆ దేశముఖి ముసలామె, అన్న పానాదులు మాని, మూడు రోజులునుండి, మీ కోసం ఉపవాసంగా ఉంది. 
మ్హాతారీ తీ పరమ హట్టీ | తుఝియా పాయీ నిష్ఠా కట్టీ | 
తూ తో తీస న పాహసీ దృష్టీ | కరితోస కష్టీ కా తిస | ||౧౫౪|| 
154. ‘ఆమె పరమ మొండి. కాని, మీ పాదాల మీద ఆమెకు చాలా నిష్ఠ. ఇక మీరేమో - ఆమె వైపు కూడా అసలు చూడటం లేదు. ఆమెను ఎందుకిలా బాధపెడుతున్నారు? 
ఆధీంచ తే శుష్క కాష్ఠ | దురాగ్రహీ మహా ఖాష్ట | 
అన్నావీణ వాటతే స్పష్ట | ప్రాణాచి నష్ట హోతీల | ||౧౫౫|| 
155. ‘అసలే ఆమె ఎండిపోయిన కర్రలా ఉంది. పైగా మొండి పట్టుదలతో ఉంది. అన్నం కూడా తినకుండా ప్రాణం పోగొట్టుకునేలా ఉంది. 
మ్హణతీల మ్హాతారీ గేలీ దర్శనా | ఉపదేశాచీ ధరూన వాసనా | 
సాఈబాబాంసీ నాహీ కరుణా | కేలే మరణాధీన తిలా | ||౧౫౬|| 
156. ‘‘ముసలామె దర్శనం చేసుకుని, ఉపదేశం పొందాలని ఎంతో ఆశతో వెళ్ళింది. కాని సాయిబాబాయే కరుణించగా, ఆమెను చావుకు వదిలేశారు’ అని లోకులు అంటారు. 
బాబా ఘడో న దే ఏసా ప్రవాద50 | సాంగోని తిచా తిలా హితవాద | 
కరానా కా తిజవరీ ప్రసాద | హా అప్రమాద51 నిరసా కీ | ||౧౫౭|| 
157. ‘బాబా! లోకలు ఇలా అనుకోకూడదు. ఆమెకు హితోపదేశం చేసి, ఆమెనెందుకు అనుగ్రహించటం లేదు? అపవాదాలను ఆపండి. 
అంగాంత నాహీ ఉరలే త్రాణ | కాసావీస హోతీల ప్రాణ | 
మ్హాతారీ తీ పావేల మరణ | తుమ్హాంస అపశరణ52 యేఈల | ||౧౫౮|| 
158. ‘దేహంలో శక్తి లేదు. ప్రాణం విలవిలాడుతూ, ఎంతో బాధపడి, ఆ ముసలామె చస్తుంది. మీకు అపకీర్తి వస్తుంది. 
మ్హాతారీచే దుర్ధర వ్రత | ఆమ్హాస పడలీ చింతా బహుత | 
దుర్దైవే మ్హాతారీ జాలియా మృత | గోష్ట అనుచిత ఘడేల | ||౧౫౯|| 
159. ‘ఆమె దీక్ష ఎంతో కష్టంగా ఉంది. మేమందరమూ చాలా చింతతో ఉన్నాము. దురదృష్టంతో ఆమె చస్తే, జరగకూడనిది జరిగినట్లు అవుతుంది. 
మ్హాతారీనే మాండిలా త్రాగా53 | న కరితా తిజవరీ కృపానురాగా | 
దిసే న ధడగత తిచీ మలా గా | స్వముఖే సాంగా తిస కాంహీ | ||౧౬౦||
160. ‘ఆమెను మీరు కరుణించక పోతే, ఆ ముసలామె చావటానికి సిద్ధమైంది. ఆమె బ్రతికే ఆశ లేదు. మీరే ఆమెకేదైనా చెప్పండి’ అని అన్నాడు. 

ఝాలీ సీమా అధ్యాయాచీ | పుఢీల శ్రవణేచ్ఛా శ్రోతయాంచీ | 
పుఢీల అధ్యాయీ పురేల సాచీ | ప్రేమరసాచీ తీ జోడ | ||౧౬౧|| 
161. ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది. ముందు ఏమి జరిగింది అని తెలుసుకోవాలనే కోరిక, తరువాతి అధ్యాయంలో, ప్రేమ రసంతో నిండిన కథతో, తీరుతుంది. 
పుఢే బాబాంనీ ప్రేమళపణే | ఉపదేశ జో కేలా త్యా మ్హాతారీ కారణే | 
తయాచియా సాదర శ్రవణే | ఉఠేల ధరణే అవిద్యేచే | ||౧౬౨|| 
162. ఎంతో ప్రేమతో బాబా ఆ ముసలామెకు చేసిన హితోపదేశాన్ని వింటే, మొండిపట్టు తొలగిపోయి, అజ్ఞానం నశిస్తుంది. 
హేమాడ సాఈపాయీ శరణ | శ్రోతయా ఘాలీ లోటాంగణ | 
అల్పాయాసే భవతరణ | కరాయా శ్రవణ తత్పర వ్హా | ||౧౬౩||
163. హేమాడు సాయి పాదాలకు శరణుజొచ్చి, సులభంగా సంసార సాగరాన్ని దాటటానికి, శ్రద్ధగా వినండి అని శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |

| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | మదనుగ్రహ నామ | 

| అష్టాదశోధ్యాయః సంపూర్ణః |


||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ: 
1. నాశరహితా. (నిత్యా) 2. నిర్ద్వంద్వా. (ద్వంద్వాతీతా) 3 .నిర్వికారా. (వికారరహితా) 
4. స్వరూప. (నిజరూప) 5. మిఠాచీ బాహులీ. (సైంధవాచీ) 6. వేఢా. (గర్కా) 
7. మజవర ఝాలేల్యా అనుగ్రహాచీ గోష్ట. (మదనుగ్రహ) 8. జశీ ఝాలీ తశీ. (యథార్థతా) 
9. కథూ నయే. (కథితా) 10. స్వప్నాత సాంగితలేలే. (స్వప్నోక్తహీ) 
11. గచ్చ భరూన. (కోంబూన) 12. జువళే. (జావళే) 
13. నావానే ఎకసారఖ్యా హాకా మారణే, నామస్మరణ కరణే. (హాకాటీ) 
14. తోండీ. (ఓంఠీ) 15. కాతావలేలే (కావలే) 16. ఉచ్ఛిత మనోరథ. (అభీష్ట) 
17. దరిద్రీ. (అకించన) 18. పూర్వపుణ్యాఉర్చ్యా బళానే (పూర్వార్జిత) 
19. పురాణికాప్రమాణే. (పురాణికసే) 20. అమృతాలా. (పీయూశాసీ) 
21. (గురుచరిత్రాచే అమృతరూపీ) ఆవర్తన. (పాఠ) 22. స్పష్ట సాంగావా. (వివరావా) 
23. పాయ దాబణే. (పాదసంవాహన) 24. బాబాంచే దర్శన ఝాల్యాపాసూనచీ సాత వర్షే. (సాత) 
25. సంతచూడామణీ. (సంతవతంస) 26. మాధవరావ దేశపాండే. (శామ్యాకడే) 
27. భాగవతాచ్యా ఎకాదశ స్కంధావరీల ఎకనాథ మహారాజాంచీ టీకా. (నాథభాగవతాచీ) 
28. ఆళసానే వాచావయాచే టాకలే (హేళసిలే) 29. నేమాచీ ఉపాసనా. (నియమితోపాసన) 
30. పూర్ణ భరలేలే. (పరిలుప్త) 31. శ్రీ హరీ సీతారామ దీక్షిత. (దీక్షిత) 
32. సూప ఘేఊన ఝడపణే తే. (హడప) 33. పుష్కళ. (ఉమాప)
34. బత్తీస అధ్యాయ జ్యాలా ఆహేత అసే (*యా ఠికాణీ ఎకనాథీ భాగవతాత ౩౨ అధ్యాయ ఆహేత అసే మ్హటలే ఆహే, తే చుకీనే హేమాడపంతాంనీ మ్హటలే ఆహే. మహారాష్ట్ర శాసనానే మార్చ ౧౯౭౧ సాలీ ప్రకాశిత కేలేల్యా శ్రీ ఎకనాథీ భాగవతాచ్యా ప్రతీత ౩౧ అధ్యాయచ ఆహేత. తసేచ, శ్రీ రామచంద్ర కృష్ణ కామత సంపాదిత వ కేశవ భికాజీ ఢవళే ప్రకాశిత, ౧౯౮౫ సాలచ్యా ఆవృత్తీతసుద్ధా ౩౧చ అధ్యాయ ఆహేత. అసే సమజతే కీ, హేమాడపంత యాంచ్యా నేహమీచ్యా వాచనాత శ్రీ లక్ష్మణ రామచంద్ర సంపాదిత వ తుకారామ జావళీ, నిర్ణసాగర ప్రింటీంగ ప్రేస యాంనీ ౧౯౧౦సాలీ ప్రకాశిత కేలేలీ ఆవృత్తీ అసే. తిచ్యాతసుద్ధా ౩౧చ అధ్యాయ ఆహేత. స్వతః హేమాడపంతాంనీ ’శ్రీ సాఈలీలా’చ్యా వర్ష ౫వే, అంక ౬-౭-౮ మధ్యే పృష్ఠ ౭౨౯వర ఎకనాథీ భాగవత ఆణి భావార్థ రామాయణ వ సాఈమహారాజ యా సంబంధిత ఆపల్యా లేఖాత ఎకనాథీ భాగవతాత ౩౧ అధ్యాయ ఆహేత, అసే నమూద కేలే ఆహే.) (బత్తీసఖణీ*). 
35. దుధాచా నైవేద్య. (౮౯ పయఃప్రసాద) 36. అల్ప ఫలాహార (౮౯ అల్పాహార) 
37. యా నావాచ్యా డోంగరావర (౯౦ భండార్యావర) 
38. యా ఎకాదశస్కంధాస ’ఉద్ధవగీత’ అసే మ్హణతాత. (౯౨ ఉద్ధవదీతీ) 
39. జ్ఞానేశ్వరీ. (౯౪ భావార్థదీపికా) 40. ఆజ్ఞా. (౯౫ నియోగ) 
41. శైలీ (౯౭ అనుగ్రహకుసరీ) 42. ఉదీ, అంగారా. (౧౦౦ విభూతి) 
43. పోథీ వాచావయాస ఆజ్ఞా. (౧౦౦ ఆజ్ఞాపన) 
44. నిత్యపాఠాపైకీ వాచావయాచా బాకీ రాహిలేలా భాగ. (౧౧౨ రాహిలే) 
45. దక్షిణేసహ. (౧౧౫ దక్షిణేసీ) 46. పళభర. (౧౧౬ విళభర) 47. గావఢేకరీ (ఖేడ్యాతీల) - (౧౨౩ ఖేడవళ) 
48. అన్న వ పాణీ యాంవాచూన వ్రతస్థ బసణే. (౧౪౫ ప్రాయోపవేశీ)

49. ‘నారాయణ తేలీ’ హే అంతఃస్థ ఎఖాద్యా దృష్టవృత్తీలా అనులక్షూన శ్రీ సాఈబాబా వరచేవర మ్హణత అసత (౧౫౦ నారాయణ) 
50. లోకాంత పరస్పరాంత బోలణే. (౧౫౭ ప్రవాద) 51. దోషారోప (౧౫౭ అప్రమాద) 
52. అపయశ. (౧౫౮ అపశరణ) 53. నిర్వాణ. (౧౬౦ త్రాగా)

Saturday, March 2, 2013

||బ్రహ్మజ్ఞాన కథనం నామ సప్తదశోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత
 || అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౭ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

గతాధ్యాయీ అభివచన | కీ యే అధ్యాయీ హోఈల నిరూపణ | 
శ్రేయ ఆణి ప్రేయ లక్షణ | సాదరే శ్రవణ తే కీజే | ||౧|| 
1. ఈ అధ్యాయంలో శ్రేయం (మనకు శ్రేయస్సును, అంటే మేలు, చేకూర్చేది) మరియు ప్రేయ (మనకు ప్రియమైనది, అంటే నచ్చినది) లక్షణాలను వర్ణిస్తానని వెనుకటి అధ్యాయంలో చెప్పాను కదూ! వానిని శ్రద్ధగా ఇప్పుడు వినండి.
ప్రకాశ ఆణి అంధకార | జైసే అన్యోన్య వృత్త్యాకార | 
భిన్నరూప తే పరస్పర | శ్రేయ ప్రేయ తయా పరీ | ||౨|| 
2. వెలుగు, చీకటి ఒకటికొకటి సంబంధ పడి ఒకేలా ఉన్నా, అవి ఒకటికొకటి వేరుగా విరుద్ధంగా ఉంటాయి. అలాగే శ్రేయ, ప్రేయాలు అంతే. 
ప్రేయార్థ జయాచే మన ధాంవే | స్వార్థాపాసావ తో భ్రంశ పావే | 
శ్రేయ తే వివేకరూప ఆహే | అవివేక రూప ప్రేయ కీ | ||౩|| 
3. ప్రేయ వెనుక పరుగెత్తే మనసుగల వారు, స్వార్థంతో నాశమౌతారు. శ్రేయ వివేకానికి రూపమైతే, ప్రేయ అవివేకానికి రూపం. 
శ్రేయాచా విషయ కేవళ విద్యా | ప్రేయాచా తో నిఖళ అవిద్యా | 
ప్రేయ కధీ నా భులవీ సూజ్ఞా | శ్రేయ అజ్ఞా నావడే | ||౪|| 
4. శ్రేయాలకు సంబంధించిన సంగతులు కేవలం జ్ఞానంతో ముడి పడినవి. ప్రేయాల సంగతులు అజ్ఞానానికి సంబంధించినవి. వివేకవంతులు ఎప్పుడూ ప్రేయాల గురించి మోసపోరు. అజ్ఞానులకు శ్రేయాలు నచ్చవు. 
జోంవరీ కనక కామినీ హోడ | ఇంద్రియాంసీ విషయాంచీ ఆవడ | 
వివేక వైరాగ్యా నాహీ జోడ | ప్రేయచి గోడ తోంవరీ | ||౫|| 
5. డబ్బు, స్త్రీలు వీటి కోసం విపరీతమైన మోహం ఉన్నంత వరకు, ఇంద్రియాలకు సుఖాలపై కోరిక ఉన్నంత వరకు, వివేకం వైరాగ్యం పొందనంత వరకు, ప్రేయాలే చాలా మధురంగా ఉంటాయి. 
నీర క్షీరాచీ మిసళ | తేవీ ప్రేయశ్రేయాంచీ భేసళ | 
జేవీ దుగ్ధ తేవఢే నివళ | సేవితీ మరాళ మానసీ | ||౬|| 
6. నీరు, పాలు ఎలా కలిసి పోతాయో, అలా ప్రేయాలు శ్రేయాలు కలిసే ఉంటాయి. మానస సరోవరంలోని హంస ఒక్కటే ఈ మిశ్రమంలో నుంచి, నీరును వేరు చేసి, పాలను మాత్రమే త్రాగుతుంది. 
తేవీంచ జే ధీర బుద్ధిమంత | వివేకీ ఆణి భాగ్యవంత | 
శ్రేయస కేవళ లోలంగత | ప్రేయాసీ విన్ముఖ సర్వదా | ||౭|| 
7. ధీరులు, బుద్ధిమంతులు, అదృష్టవంతులు, కేవలం శ్రేయాలనే కోరుకుంటారు. ప్రేయాలనుంచి ఎప్పుడూ దూరంగా ఉంటారు. 
తేచ పహా మందబుద్ధీ | శరీర పశు పుత్ర ధన మానాది | 
యోగక్షేమాచ్యా లాగోని నాదీ | ప్రేయ సాధితీ ఎకలే | ||౮|| 
8. కాని తెలివి లేనివాళ్ళు, దేహం గురించిన సుఖాలు, పశువులు, కొడుకులు, డబ్బు, కీర్తి, గౌరవాలు, వీటి వెంట పరుగెత్తుతూ, ప్రేయాలనే పొందుతారు. 
శ్రేయ కాయ ప్రేయ కాయ | జ్ఞాత ఝాలే జరీ ఉభయ | 
తైసాచి గ్రహణ వ్యవసాయ | జరీ స్వాయత్త1 పురుషాసీ | ||౯|| 
9. శ్రేయాలు కాని, ప్రేయాలు కాని, ఈ రెంటినీ బాగా తెలుసుకున్న తరువాత కూడా, మనుషులకు స్వతంత్ర బుద్ధి ఉండటంతో, ఈ రెంటిలో దేనిని కోరుకోవాలి అన్నది వారి చేతిలోనే ఉంటుంది. 
తరీహీ ప్రాప్త హోతా ఉభయ | నివడ కరణే అవఘడ విషయ | 
కరూని మందబుద్ధీవరీ జయ | ఆలింగీ ప్రేయ తయాసీ | ||౧౦||
10. అవి రెండూ దొరకినప్పుడు, వాటిలో దేనిని కోరుకోవాలో నిర్ణయించడం చాలా కష్టం. ప్రేయాలు తెలివి లేని వాళ్ళను జయించి, గట్టిగా కౌగలించుకుంటుంది. 

సారూ2 ప్రేయ ఆదరూ శ్రేయ | పురుషార్థ తో హాచి హోయ | 
అసతా పయమిశ్రిత తోయ | పయచి ఘేఈ హంస జైసా | ||౧౧|| 
11. నీరు కలిసిన పాలలో నుండి, పాలను మాత్రమే తీసుకునే హంసలా, ప్రేయాన్ని వదిలి, శ్రేయాన్నే తీసుకోవాలి. ఇదే మనుషులు సాధించాల్సిన ఉత్తమ స్థితి. 
శ్రేయ ఆణి ప్రేయ హీ దోన | జరీ హీ పురుషాచే స్వాధీన | 
అసమర్థ కరాయా హే వివేచన | వివేకహీన మందమతీ | ||౧౨|| 
12. శ్రేయ మరియు ప్రేయ, ఇవి రెండూ మన చేతిలో ఉన్నా, వివేకం లేనివారికి, తెలివి లేనివారికి, ఈ రెంటిలోని తేడాను తెలుసుకో గలిగే శక్తి ఉండదు. 
శ్రేయ తే ఆహే కశాంత | ఆరంభీ జాణిలే పాహిజే నిశ్చిత | 
మగ యేతా ప్రతిబంధ మార్గాంత | ప్రతికార3 సాద్యంత కరూంయే | ||౧౩|| 
13. ముందుగా, శ్రేయ దేనిలో ఉంది అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తరువాత, దానిని పొందటానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవచ్చు. 
యేథేంచ పురుషార్థ దృష్టీపుఢా | యేవోని ఠాకే దత్త నిఘడా| 
మ్హణోని శ్రేయార్థచి కరా ఝగడా | కరోని ధడా బుద్ధీచా | ||౧౪|| 
14. శ్రేయను పొందటానికి, దృఢమైన, శక్తివంతమైన మానవ ప్రయత్నం కావాలి. అందుకే, మునుపే బుద్ధితో బాగా నిశ్చయించుకుని, శ్రేయం కొరకు పోరాడాలి. 
అతర్క్య సంసారచక్రాచే ఫేర | అఖండ భ్రమతీ అష్టౌప్రహర | 
ఆధ్యాత్మికాది త్రితాప ప్రఖర | దుర్నివార నర సాహే | ||౧౫|| 
15. ఈ సంసార చక్రం తిరగటం అంతుపట్టనిది. రాత్రి పగలూ ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతూ ఉండటం వలన, భయంకరము, తొలగించటానికి వీలు కాని, అధ్యాత్మికాది మూడు తాపాలను మనుషులు అనుభవిస్తుంటారు. 
తేణే ఆత్యంతిక దుఃఖహర | సహన కరితా హోఈ జర్జర | 
శోధీ మగ తన్నివర్తనపర | సోపీ సుఖకర సాధనే | ||౧౬|| 
16. దానివలన, విపరీతమైన దుఃఖాలను సహిస్తూ, విసిగిపోయి, వానిని తొలగించు కోవటానికి సుఖకరమైన సాధనలను వెతుకుతారు. 
దుఃసహ హే భవచక్ర పరివర్తన | హోఈల కైసే యాచే స్తంభన | 
తదర్థ అసేల కాయ సాధన | హే అన్వేషణ4 ఆదరీ | ||౧౭|| 
17. భరించలేని, ఈ సంసార చక్రం తిరగడాన్ని ఆపడానికి, ఏవైనా సాధనాలున్నాయా అని శ్రద్ధగా వెతుకుతారు. 
థోర భాగ్యే హే బుద్ధి ఉపజతా | తేథూన నిపజే పురుషార్థతా | 
మగ తో సదుపాయ సాధకతా | నిజస్వార్థా వరీల | ||౧౮|| 
18. గొప్ప అదృష్టం వలన ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు, ఉత్తమమైన జీవితాన్ని (శ్రేయాలను) పొందటానికి చేసే మానవ ప్రయత్నం, మొదలవుతుంది. ఆ తరువాత, తన మేలు కోసం, తన లక్ష్యాన్ని పొందటానికి, సరియైన మార్గాన్ని కనుక్కుంటాడు. 
అనాది అవిద్యా అథవా మాయా | శుక్తిరజత మృగజలవత వాయా | 
అధ్యాసరూప మహదంతరాయా | విలయా నేలే పాహిజే | ||౧౯|| 
19. ముత్యపు చిప్పులోని వెండిలాగ, ఎండమావుల్లోని నీరు లాగ, ఎప్పటినుంచో వస్తున్న ఈ మాయ, లేక విద్య లేకపోవటం, ఎంతో మోసం చేసేది, మరియు వ్యర్థమైనది. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించే ఈ మాయ, అడ్డంకులలో చాలా ముఖ్యమైనది. దీనిని నశింప చేయాలి. 
స్వప్నాంత సోన్యాచ్యా గారా వర్షతీ | ప్రయత్నే సాంఠవణ కేల్యా అమితీ5 | 
వాటే వేళీ కామాస యేతీ | హారవూన జాతీ జాగృతీ | ||౨౦||
20. కలలో బంగారపు వడగళ్ళ వాన పడుతుంది. ఎప్పటికైనా పనికి వస్తుందని చాలా కష్టపడి, వానిని మూట కట్టుకునే ప్రయత్నం చేస్తే, మెలుకువ రాగానే అవి మాయమైపోతాయి. 

దృష్టాదృష్ట భోగ వాసనా | ఆశా తృష్ణా వా కామనా | 
సదైవ ప్రతిబంధక జాణా | సమూళ ఖాణా6 యా ఆధీ | ||౨౧|| 
21. కనిపించేవి, కనిపించనివి మొదలైన ఇంద్రియ సుఖాలను అనుభవించాలనే విపరీతమైన కోరిక, వాటిని కావలని అనుకోవటం కాని, వాటి గురించి ఆలోచించటం కూడా పెద్ద అడ్డంకులు, అని తెలుసుకోవాలి. ముందు వీటిని తొలగించుకోవాలి.
అశక్య దిసాయా సూర్యకరే7 | బుద్ధి జేథూన మాఘారీ ఫిరే | 
జేథ వేదశ్రుతీచే పాఊల న శిరే | తే నిజకరే గురు దావీ | ||౨౨|| 
22. సూర్యుని వెలుగులో చూడలేని దానిని, బుద్ధికి అందని దానిని, వేద శ్రుతులకు అంతు పట్టని దానిని, గురువు తమ చేత్తో చూపిస్తారు. 
కామ క్రోధ ఉభయవృత్తీ | కరూ న దేతీ జ్ఞాన ప్రాప్తీ | 
శ్రవణ మనన సమాధి విచ్చితి8 | హాతో హాతీ త్యా కరితీ | ||౨౩|| 
23. కామ క్రోధాలు రెండూ మనసుకు వచ్చే మార్పులు. ఇవి జ్ఞానాన్ని పొందనీయవు. పైగా కథా, కీర్తనలను వినటానికి, తలచుకోవటానికి, సమాధి చెందటానికి, వెంటనే చెడుగొట్టుతాయి. 
దీపాంకర్పూరా హోతా లగటీ9 | సంభవే కాయ లోటాలోటీ10 | 
ఉభయత్ర భేటీ హోణ్యాచీ ఖోటీ | దీపత్వే ఉఠే కర్పూర | ||౨౪|| 
24. దీపం, కర్పూరం రెండూ కలసినప్పుడు, ఒకటి ఇంకొక దానిని తోసి వేయటం సాధ్యమా? ఆ రెండూ కలసిన వెంటనే, కర్పూరం దీపమై వెలుగుతుంది. 
శ్రుతిస్మృతీలా అవిహిత | దుష్కర్మీ లోళే జో అవిరత | 
జ్ఞానీ అసని కాయ హిత | విహితావిహిత జో నేణే | ||౨౫|| 
25. శ్రుతి స్మృతులలో, చేయకూడదని చెప్పిన చెడు పనులనే ఎప్పుడూ చేస్తూ, అందులోనే మునిగి ఉండి, ఏది సరియైనది, ఏది కాదు అని తెలుసుకోలేని మనిషి, శాస్త్రాల జ్ఞాని అయితే మాత్రం ఏం ప్రయోజనం? 
తైసాచ జో నిత్య అశాంత | అంతఃకరణ అసమాహిత | 
ఇంద్రియలౌల్యే విక్షిప్తచిత్త | జ్ఞానే నిర్వృత్త11 హోఈనా | ||౨౬|| 
26. అలాగే, మనసులో అలజడి కారణంగా, ఎప్పుడూ శాంతి లేకుండా ఉండేవారు, ఇంద్రియ సుఖాల గురించి మనసులో కలవర పడేవారు, జ్ఞానంలో ఎన్నటికీ పరిపూర్ణులు కాలేరు. 
జ్యాచే చిత్తాస సమాధాన | జో గురుపుత్ర ఆచారవాన | 
జ్యాచే నిశ్చల ఆత్మానుసంధాన | జ్ఞానసంపన్న తో ఎక | ||౨౭|| 
27. మనసులో తృప్తిగా ఉండేవాడు, ఆచారాలను తెలిసిన వాడు, నిజమైన న్యాయపరమైన గురు పుత్రుడు, నిలకడగా ఉండే మనసుతో, ఆత్మతో లీనమౌతాడో అలాంటి వాడొక్కడే జ్ఞానాన్ని పొందినవాడు. 
హో సంసార వా మోక్షగామీ | జాణే జరీ నిజధామీ | 
హోఈ శరీరరథస్వామీ12 | కేవళ వాగ్మీ13 కాయ కరీ | ||౨౮|| 
28. సంసారి అయినా, మోక్షాన్ని ఇష్టపడేవాడైనా, తను చేరుకోవాలిసిన చోటుకు చేరాలంటే, దేహమనే ఈ రథాన్ని తన అధీనంలో ఉంచుకోవాలి. ఊరికే ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు ఏమి సాధించగలడు? 
యేథే వాచేసీ నాహీ థార | అభ్యాస ఎక సర్వసార | 
రథస్థానీ14 యోజీ శరీర | స్వయే స్థిర బైసేగా | ||౨౯|| 
29. తెలివిగా మాట్లాడగలిగే ధాటికి ఇక్కడ చోటు లేదు. అసలైన అభ్యాసం అవసరం. దేహాన్ని రథంగా అనుకుని, నిలకడగా కూర్చోవాలి. 
యా నిజ శరీరాచ్యా రథీ | నిజబుద్ధీస కరీ సారథీ | 
స్వయే స్వామీ బైసే రథీ | స్వస్థచిత్తీ ఏస తూ | ||౩౦||
30. దేహమనే ఈ రథంలో, తన బుద్ధిని సారథిగా చేసి, యజమాని అయిన తాను, స్థిరమైన మనసుతో కూర్చోవాలి. 

దుర్గమరూప రసమార్గరాజీ15 | కంఠావయా మగ సారథీ యోజీ | 
ఆవరీ మనఃప్రగ్రహాంమాజీ16 | దశేంద్రియవాజీ17 ఉచ్చృంఖళ | ||౩౧|| 
31. బుద్ధిని సారథిగా నియమించి, ఇంద్రియాలనే పది గుర్రాలను, మనసు అనే పగ్గంతో తన అధీనంలోకి తెచ్చుకోవాలి. విచ్చలవిడిగా పరుగెత్తే ఈ గుర్రాలను, ఇంద్రియ సుఖాలనే మార్గాల మీద, తెలివితో నడిపించాలి. 
ఘోడే జరీ సైరా18 ధాంవతీ | లగామ రాఖీల స్థానావరతీ | 
తో నిరవూన సారథియా హాతీ | స్వస్థ చిత్తీ బైసే తూ | ||౩౨|| 
32. గుర్రాలు తమ ఇష్టం వచ్చినట్లు పరుగెత్తాలని అనుకున్నా, మనసనే పగ్గం అదుపులో ఉంచుతుంది. కనుక, దీనిని సారధి చేతికిచ్చి, నీవు ఏ చింతా లేకుండా కూర్చో. 
సారథీ కుశల ఆణి నిపుణ | తరీచ ఘోడే చాలతీ కసూన | 
తోచ మనఃప్రగ్రహపరాధీన19 | హోతా బలహీన హోతసే | ||౩౩|| 
33. నేర్పు గల, ఉపయోగకరమైన సారథి అయితేనే, గుర్రాలు బాగా పరుగెత్తుతాయి. కాని, మనసు అనే పగ్గం బలహీనమైతే, గుర్రాలు అదుపులో ఉండవు. 
వివేక బుద్ధీచే సారథ్య జేథ | జో సమనస్క20 సమాహితచిత్త21 | 
తయాసీచ పరమపద ప్రాప్త | ఇతర మార్గాంత థకతాత | ||౩౪|| 
34. వివేకంతో ఉన్న బుద్ధియొక్క సారథ్యం ఉండి, మనసును బలంగా నిగ్రహించుకుని, ఏకాగ్రతతో ఉన్నవారు, పరమ పదాన్ని చేరుకోగలరు. మిగతావారు, మార్గంలో అలసిపోతారు. 
జయాచే సదా ఆయుక్త మన | తయా న కదా సమాధాన | 
తయా న తత్పదాభిగమన | సంసారపరివర్తన చుకేనా | ||౩౫|| 
35. మనసు అధీనంలో ఉండకపోతే, వారికి శాంతి ఉండదు. పరమాత్మ కూడా వారికి లభించడు. చావు పుట్టుకల చక్రం తప్పదు. 
ఏసే తే పద పరమ మోఠే | వాస్తవ్య తరీ తయాచే కోఠే | 
మనీంచీ హే ఆశంకా ఫిటే | ప్రకట జై తే ఓపైసే | ||౩౬|| 
36. ఇలాంటి గొప్ప పరమపదం, తనంతట తానే కనిపించినప్పుడు, ‘ఇది నిజంగా ఎక్కడుంది?’ అనే మనసులోని సంశయం దూరం అవుతుంది. 
యేథే న చలే తర్కవాద | అనువాద ప్రవాద వా సంవాద | 
ఈశకృపేనేంచ లాగేల దాద | ఇతర వాద తే వ్యర్థ | ||౩౭|| 
37. తర్కాలు, వాదాలు ఇక్కడ పనికి రావు. దేవుడి అనుగ్రహంతోనే, అడ్డంకులు తొలగిపోయి, ఆత్మయొక్క చోటు తెలుస్తుంది. ఇతర వాదాలు దండుగ. 
న చలే యేథ తర్కాచీ చతురాఈ | తర్కజ్ఞమతి కుంఠిత హోఈ | 
భోళా భావచి సిద్ధీస జాఈ | హేచ నవలాఈ యేథీల | ||౩౮|| 
38. తర్కాలలో, వాదాలలో ఉండే చాతుర్యం ఇక్కడ పనికి రాదు. ఎంతో జ్ఞానం ఉన్న తర్క శాస్త్రజ్ఞుల తెలివి, భ్రమతో కూడుకున్నవి. వినేవారిని కలవర పెట్టేవిగా ఉంటాయి. నమ్మకం ఉన్న అమాయకులే సిద్ధిని పొందగలరు. ఇదే ఇక్కడి విశేషం. 
సమ్యగ్జ్ఞానాసీ జే కారణ | తే గతి ఆన తే బుద్ధీహీ ఆన | 
తో ఆగమజ్ఞహీ వేగళాచ జాణ | ఉత్తమ జ్ఞానదానీ జో | ||౩౯|| 
39. అతి ఉత్తమమైన మంచి జ్ఞానాన్ని చేరుకునే మార్గం వేరు. దానికి కావలసిన బుద్ధి కూడా వేరు. ఆ జ్ఞానాన్ని బోధించ గలిగిన, శాస్త్రాలను తెలిసిన నిపుణులు కూడా వేరు. 
కాయా అమోలిక చాలిలీ వాయా | ధన కామ హీ దుపారచీ ఛాయా | 
జాణోని హరీచీ దుర్ఘట మాయా | లాగే పాయా సంతాంచ్యా | ||౪౦||
40. వెల కట్టలేని ఈ దేహం వృథాగా పాడై పోతూ ఉంది. డబ్బు మీది వ్యామోహం, మధ్యాహ్నపు నీడలాగా క్షణికమైనదని తెలుసుకోవాలి. అలాగే, శ్రీహరియొక్క మాయను జయించటం కూడా చాలా కష్టమని కూడా తెలుసుకోవాలి. అందుకే సత్పురుషుల పాదాలను ఆశ్రయించాలి. 

సంత భవసాగరీంచే తారూ | తూ హో తేథీల ఎక ఉతారూ | 
తయాంవీణ పైలపారూ | కోణ ఉతరూ సమర్థ | ||౪౧|| 
41. సత్పురుషులు ఈ సంసార సాగరాన్ని దాటించే నౌకలు. ఆ నౌకలలో నీవు ఒక ప్రయాణికుడు కావాలి. వారి తప్ప, ఈ నౌకలను తీరానికి చేర్చగల సమర్థులెవరు?
వివేక వైరాగ్య యాంచీ జోడ | బాంధీల తయాంచీ జో సాంగడ | 
తో హో కా జడమూఢ దగడ | అవఘడ నా త్యా భవసింధు | ||౪౨|| 
42. వివేకం, వైరాగ్యం, ఈ రెంటినీ మూట కట్టుకున్నవారు, జడులైనా, మూఢులైనా, రాయి లాంటి కఠినులైనా, సంసార సాగరాన్ని దాటటం వారికి ఏ మాత్రం కష్టం కాదు. 
షడ్గుణైశ్వర్య భగవంతాచే | వైరాగ్య హే ప్రథమైశ్వర్య సాచే | 
అసతీల జే మహద్భాగ్యాచే | వినా ఇతరాంచే వాంట్యా న యే | ||౪౩|| 
43. దేవుడి షడ్గుణ ఐశ్వర్యాలలో, వైరాగ్యం మొదటి ఐశ్వర్యం. ఎంతో అదృష్టవంతులకు తప్ప, మిగతా వారికి ఇది దొరకదు. 
విహితకర్మ22 కేలియావీణ | హోఈనా చిత్తశుద్ధీ నిర్మాణ | 
చిత్తశుద్ధీ న హోతా జాణ | జ్ఞాన సంపాదన ఘడేనా | ||౪౪|| 
44. శాస్త్రాలు నియమించిన పనులను చేయకపోతే, మనసు శుద్ధి కాదు. మనసు శుద్ధంగా లేకపోతే, జ్ఞానం దొరకటం సాధ్యం కాదు. 
తస్మాత్ కర్మచి ఎక జాణ | జ్ఞాన ప్రాప్తీచే మూల కారణ | 
నిత్యనైమిత్తిక కర్మానుష్ఠాన | తేణేంచ క్షాళణ మళాచే | ||౪౫|| 
45. కనుక, మనము చేసే పనులే (కర్మ) జ్ఞానం లభించటానికి మూల కారణమని తెలుసుకోవాలి. నియమించిన పనులను రోజూ చేయటం వలనే, మనసులోని మురికిని కడిగి వేయటం జరుగుతుంది. 
ఎవం శుద్ధ ఝాలేల్యా చిత్తీ | వివేక వైరాగ్యా ఉత్పత్తీ | 
శమదమాది సాధన సంపత్తీ | విదేహ ముక్తీ యే హాతీ | ||౪౬|| 
46. ఇలా పరిశుద్ధమైన మనసులో, వివేక వైరాగ్యాలు పుట్టి, శమ దమాది సాధన సంపత్తి (శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష మరియు సమాధాన) లభించి, ఈ దేహం ఉండగానే మోక్షం కలుగుతుంది. 
ఫల కామ సంకల్పత్యాగే | చిత్తైకాగ్రతేచ్యా యోగే | 
అనన్యత్వే జో గురూసీ శరణ రిఘే | పదరీ ఘే త్యా సద్గురూ | ||౪౭|| 
47. చేసే పనులకు వచ్చే ఫలం గురించి ఆలోచించకుండా, స్థిరమైన మనసుతో గురువును సాటిలేని శరణుజొచ్చితే, సద్గురువులు అక్కన చేర్చుకుంటారు. 
జో బహిఃప్రవృత్తిశూన్య | భావీక భక్త అనన్య | 
జ్ఞానలాభే హోఈ ప్రజ్ఞ | ఉపాయ అన్య చాలేనా | ||౪౮|| 
48. బయటి ప్రపంచపు పనులలో అసలు ఆసక్తి లేకుండా, మనసును నిలకడగా చేసుకున్న భక్తులకు జ్ఞానం లభించి, ప్రజ్ఞావంతులు అవుతారు. మిగతా ఏ ఉపాయాలూ పనికి రావు. 
తేంహీ జ్ఞాన లాభల్యావరీ | అధర్మమార్గే ఆచరణ కరీ | 
అత్ర నా అముత్ర ఖాలీ నా వరీ | త్రిశంకూపరీ లోళకంబే | ||౪౯|| 
49. జ్ఞానం దొరికిన తరువాత, అధర్మమైన దారులను అనుసరించే వారు, ఇహ పరాలకు దూరమై, క్రింద కాకా, పైనా కాక, త్రిశంకులా, మధ్యన వ్రేలాడుతారు. 
జీవాచీ జే అజ్ఞాన వృత్తీ | తీచ ఖరీ సంసార ప్రవృత్తీ | 
ఝాలియా ఆత్మజ్ఞాన ప్రాప్తీ | తేచ నివృత్తీ సంసారా | ||౫౦||
50. జీవులలోని అజ్ఞానమే ఈ సంసారం వైపు జీవులను ఆకర్షిస్తుంది. ఆత్మ జ్ఞానం దొరకగానే, లౌకిక జీవితంనుంచి ముక్తి లభిస్తుంది. సంసారంలో ఉన్నా, జ్ఞాని సంసారానికి చేరిన వాడు కాదు. 

ఆత్మజ్ఞ సదా అహంభావ రహిత | ధర్మాధర్మ శుభాశుభ విరహిత | 
తయాంస తే సంసారాంతర్గత | హితాహిత కాయ పా | ||౫౧|| 
51. ఆత్మను తెలుసుకున్నవారు, ఎప్పుడూ అహంకారం లేకుండా ఉంటారు. వారికి సంసారంలోని ధర్మ అధర్మాలు, శుభ అశుభాలు, హిత అహితాలు, వీటితో ఏం పని? 
విరాలీ దేహాహంకార వృత్తీ | తాత్కాళ తేథేంచ సంచలీ నివృత్తీ | 
తీచ జీవాచీ పరమాత్మ స్థితీ | ఖూణ నిశ్చితీ బాంధావీ | ||౫౨|| 
52. తానే ఈ దేహం అనే అహంకారం తొలగిపోయిన వెంటనే, ఈ సంసార వ్యవహారాలనుంచి విరక్తి కలుగుతుంది. జీవుడు దేవుడితో ఒకటైన స్థితి అదే అని, ఖచ్చితంగా తెలుసుకోవాలి. 
ప్రవృత్తీ ఠాయీ శత్రూ మిత్ర | నివృత్తీచే తో హే విచిత్ర | 
మీచ మీ పాహతా సర్వత్ర | శత్రుత్వ మిత్రత్వ తై కైంచే | ||౫౩|| 
53. ప్రాపంచిక వ్యవహారాలలో ఆసక్తి ఉన్నప్పుడు, శత్రువులు, మిత్రులు ఉంటారు. కాని, విరక్తి కలిగిన తరువాత అలా కాదు. అంతటా నేను నేనుగా కనిపించగా, ఇంక శత్రువులు ఎక్కడ, మిత్రులు ఎక్కడా? 
ఏసియా మహాసుఖాపుఢే | దేహ మహద్దుఃఖ తే బాపుడే | 
తై కోణ ఏహిక సుఖా రడే | మహత్సుఖ ఆతుడే జై | ||౫౪|| 
54. ఇలాంటి మహా సుఖం ముందు, దేహానికి కలిగే దుఃఖాలు ఏపాటివి? అంత అద్భుతమైన సుఖం దొరికిన తరువాత, లౌకిక సుఖాలకు ఎవరు ఏడుస్తారు? 
ఏహిక దుఃఖాచే డోంగర | కోసళోత మగ తయావర | 
పరి తో న హాలే లవభర | గిరివర కేవళ ధీరాచా | ||౫౫|| 
55. ఈ లౌకిక దుఃఖాలు కొండల వలె వారి మీద పడ్డా, వారు ఏ మాత్రమూ చలించరు. కొండంత ధైర్యంతో ఎదుర్కొంటారు. 
భగవంత జ్యావరీ ప్రసన్న హోతో | త్యాలాచ మగ తో వైరాగ్య దేతో | 
త్యాశీ వివేకాచీ సాంగడ బాంధితో | పార ఉతరవితో భవసాగర | ||౫౬|| 
56. దేవుడు ఎవరిని ఇష్టపడితే, వారికి వైరాగ్యాన్ని ఇస్తాడు. దానితో పాటు వివేకాన్ని కూడా జత చేసి, వారిని ఈ సంసార సాగరంనుంచి దాటిస్తాడు. 
ఆదర్శీ ఉమటల్యా ముఖాపరీ | స్పష్టాత్మదర్శనీ హేతు జో ధరీ | 
తయా యేథే భూ23 కీ బ్రహ్మలోక23 వరీ | జాగా తిసరీ నాహీంచ | ||౫౭|| 
57. అద్దంలో కనిపించే మొహంయొక్క ప్రతిబింబం లాగా, స్పష్టంగా ఆత్మను చూడాలనే కోరికగలవారికి కోరిక తీరేది, ఇక్కడ భూలోకంలో, లేక పైన బ్రహ్మ లోకంలో. అంతే కాని, మూడో చోటు వేరే లేదు. 
యాగీ హోతా దేవతా తృప్తీ | పితృలోకాచీ హోఈల ప్రాప్తీ | 
లాధేల కర్మ ఫలోపభుక్తీ | ఆత్మసంవిత్తీ లాధేనా | ||౫౮|| 
58. యజ్ఞ యాగాలు చేయడంతో, దేవతలు తృప్తి చెందితే, పితృలోకం చేరి, కర్మ ఫలాలను అనుభవించ వచ్చు, కాని ఆత్మ జ్ఞానం దొరకదు. 
గంధర్వ మహర్జనస్తపః సత్య | తేథీల ఆత్మదర్శన అతి అవివిక్త24 | 
యాలాగీ జే ఆత్మదర్శనాసక్త | భూలోక యథోక్త వాంచ్చితీ | ||౫౯|| 
59. గంధర్వ, మహా, జన, సత్య, తపో మొదలైన లోకాలలో దొరికే ఆత్మ జ్ఞానం చాలా మసక మసకగా, అస్పష్టంగా ఉంటుంది. అందుకే, ఆత్మను తెలుసుకోవాలని అనుకునే వారు భూలోకాన్నే కోరుకుంటారు. 
యేథే హోతే చిత్తశుద్ధీ | ఆదర్శాపరీ నిర్మల బుద్ధీ | 
శుద్ధ ఆత్మస్వరూప త్రిశుద్ధీ | ప్రతిబింబీత హోతసే | ||౬౦||
60. ఇక్కడ, మనసు శుద్ధి కలిగి, అద్దం వలె నిర్మలమై, శుద్ధమైన ఆత్మ రూపాన్ని ప్రతిబింబిస్తుంది. 

దుజే స్థాన జే బ్రహ్మలోక | తేథేంహీ హోతో ఆత్మావలోక25 | 
పరి సాయాస లాగతీ అనేక | కష్టకారక అతితర తో | ||౬౧|| 
61. రెండవ చోటైన బ్రహ్మ లోకంలో కూడా, ఆత్మ రూపాన్ని తెలుసుకోవచ్చు. కాని, అక్కడ అనేక రకాల కష్టాలు ఉండగా చాలా శ్రమ కలుగుతుంది.
సర్పావాణీ26 మాయా వేటాళీ | అక్షీ27 ఆంతూన ఆంతడీ పిళీ | 
బాహేరహీ సర్వాంగ కవటాళీ | సమర్థ టాళీ కోణ తియే | ||౬౨|| 
62. పాము వలె, మాయ లోపలి ప్రేగులను, బయట అన్ని అంగాలను పెనవేసి పిండేస్తూంటే, దానిని ఆపగల సమర్థులెవరు? 
“తుమ్హీ బసల్యా బసల్యా పహాతా | ఖిశీంత పన్నాసపట రూపయే అసతా | 
కాఢా పాహూ బాహేర ఆతా | బ్రహ్మా తో ఖిశాంత తుమచేచ” | ||౬౩|| 
63. “ఊరికే కూర్చుని, ఏమీ పట్టనట్టుగా నువ్వు చూస్తున్నావు. జేబులో యాభై రెట్లు రూపాయలు ఉన్నాయి. వానిని ఇప్పుడు బయటికి తీయ్యి. చూద్దాం! అక్కడ, నీ జేబులోనే బ్రహ్మ ఉన్నాడు!” 
కాఢా మ్హణతా హాత ఘాలితీ | గృహస్థ పుడకే ఖిశాంతూన కాఢితీ | 
దహాదహాంచ్యా పంచవింశతీ | నోటా మోజితీ పుడక్యాంత | ||౬౪|| 
64. అని బాబా తీయమని చెప్పగా, ఆ గృహస్థుడు జేబులో చేయి వేసి నోట్ల కట్టను తీశాడు. అందులో పది రూపాయల నోట్లను, ఇరవై ఐదు లెక్క పెట్టాడు. 
గృహస్థ విరఘళే మనీంచే మనీ | కేవఢే మహారాజ అంతర్జ్ఞానీ | 
మస్తక ఠేవితీ తయాంచే చరణీ | ఆశీర్వచనీ ఉత్కంఠా | ||౬౫|| 
65. అతడు లోలోపల సిగ్గు పడ్డాడు. అవలీలగా అన్నీ తెలుసుకో గలిగిన బాబా శక్తిని చూచి, భయపడి, వెంటనే తన తలను వారి పాదాలపై ఉంచాడు. 
మగ బాబా మ్హణతీ తే వేళే | “గుండాళ ఆపులే బ్రహ్మగుండాళే | 
లోభాచే జాహల్యావీణ వాటోళే | బ్రహ్మ న మిళే తుజ లాగీ | ||౬౬|| 
66. అప్పుడు బాబా అతనితో “నీ బ్రహ్మను చుట్టి దాచేసుకో! నిన్ను చుట్టుకున్న పిసినారితనం తొలగి పోనంత వరకు, నీవు బ్రహ్మను కనుక్కో లేవు. 
పుత్రపశ్వాది విత్తార్జన | ఆసక్త యాంతచి జయాచే మన | 
తయాస కైంచే బ్రహ్మజ్ఞాన | ద్రవ్యవ్యవధాన న సుటతా | ||౬౭|| 
67. “కొడుకులు, పశువులు, డబ్బును కూడబెట్టుకోవటం లాంటి ఆలోచనలలో ఆసక్తి ఉన్నవారికి, డబ్బు మీద ఉన్న వ్యామోహం పోయేంత వరకు, బ్రహ్మజ్ఞానం ఎలా దొరుకుతుంది? 
మహా కఠిణ విత్తమోహ | తృష్ణావర్త దుఃఖగాహ28 | 
మద మత్సర మకర దుఃసహ | ఎక నిఃస్పృహ తరేల | ||౬౮|| 
68. “డబ్బు మీద ఉండే వ్యామోహాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. డబ్బు వ్యామోహం అనే సుడిగుండాలు గల దుఃఖాల చెరువులో, అహంకారం, ఈర్ష్య అనే మొసళ్ళు భరించ లేనంతగా ఉంటాయి. కనుక ఒక్క విరాగియే (వైరాగ్యం కలవాడు) తరించగలడు. 
లోభాశీ బ్రహ్మాచే అఖండ వైర | తేథే ధ్యానా నాహీ అవసర | 
కైంచీ ముక్తీ విరక్తీ సాచార | ఆచారభ్రష్ట లోభిష్ట | ||౬౯|| 
69. “బ్రహ్మకు లోభానికి (పిసినారితనం) అంతు లేని వైరం. లోభం ఉన్న చోట మనసు నిలకడగా ఉండదు. ఆచారాలనుండి దూరంగా ఉండే పిసినారికి, విరక్తి, ముక్తి ఎలా సాధ్యం? 
లోభా ఠాయీ నసే శాంతీ | నా సమాధాన నా నిశ్చింతీ | 
ఎక లోభ వసతా చిత్తీ | జాతీ మాతీంత సాధనే | ||౭౦||
70. “పిసినారికి శాంతి, తృప్తి, సమాధానం, అనేవి ఏవీ ఉండవు. లోభమనే ఈ ఒక్క గుణం మనసులో ఉంటే, మిగతా సాధనలన్నీ మట్టి కొట్టుకు పోతాయి. 

శ్రుతి స్మృతీస అవిహిత | ఏసే నిషిద్ధ జే దుశ్చరిత | 
త్యాంతచి సదైవ జో ఆసక్త | అసమాహిత చిత్త తో | ||౭౧|| 
71. “శ్రుతులు, స్మృతులు చేయకూడదని చెప్పిన పనులనే చేయడంలో, ఎప్పుడూ ఆసక్తి కలిగిన దుష్టులకు, మనశ్శాంతి అనేది ఉండదు. 
తయా నాంవ ‘విక్షిప్తచిత్త’ | సదైవ దుష్కర్మీ వ్యావృత్త29 | 
అఖండ విషయకర్దమీ లోళత | హితాహిత దేఖేనా | ||౭౨|| 
72. “అలాంటి వారిని ‘విక్షిప్త చిత్త’ (కలత చెందిన మనసు) అని అంటారు. వారు ఎప్పుడూ చెడు పనులలోనే మునిగి ఉంటారు. మంచి, చెడు అనేది చూడకుండా, ఎప్పుడూ ఇంద్రియ సుఖాలనే బురదలో పడి పొర్లుతుంటారు. 
హో కా బ్రహ్మవిజ్ఞాన సంపన్న | నాహీ జో ఫళేచ్చేసీ నిర్విణ్ణ30 | 
తోంవరీ వావ31 తే బ్రహ్మ విజ్ఞాన | ఆత్మ సంపన్న నాహీ తో | ||౭౩|| 
73. “బ్రహ్మ జ్ఞానాన్ని పొందినా, చేసిన పనులకు వచ్చే ఫలం మీద విరక్తి కలుగనంత వరకు, పొందిన జ్ఞానం దండుగ. అలాంటి వారు అసలైన ఆత్మ జ్ఞానాన్ని అనుభవించలేరు. 
కోణ కాంహీ మాగూ యేతా | అధికార పాహతీ సంత ప్రథమతా | 
జైసీ జయాచీ యోగ్యాయోగ్యతా | తైసేంచ త్యాతే దేతీ తే | ||౭౪|| 
74. “ఎవరైనా, ఏదైనా, కోరటానికి వచ్చినప్పుడు, సత్పురుషులు, ముందు వారి యోగ్యతను చూస్తారు. తరువాత, వారి వారి యోగ్యతలను బట్టి అడిగినది ఇస్తారు. 
జయా మనీ రాత్రందిన | దేహాభిమాన విషయచింతన | 
తయా గురూపదేశాచా శీణ | వ్యర్థ నాగవణ ఉభయార్థా | ||౭౫|| 
75. “రాత్రింబవళ్ళూ దేహం మీద ప్రేమతో, మనసులో ఇంద్రియ సుఖాల గురించే ఆలోచించే వారికి, గురువు ఉపదేశం వృథా. వారికి ఇహం లోనూ, పరం లోనూ ఏదీ దొరకదు. 
చిత్తశుద్ధీ జాహల్యావీణ | పరమార్థీ రిఘూ పాహే జో ఆపణ | 
జ్ఞాన గర్వాచీ తీ మిరవణ | కేవళ శీణ తో ఖరా | ||౭౬|| 
76. “శుద్ధమైన మనసు లేకుండా, పరమార్థ మార్గంలో చేరాలని అనుకోవడం, తమ జ్ఞాన గర్వాన్ని చాటుకోవడమే గాని, అది నిజంగా వ్యర్థం. 
యాస్తవ రూచేల తేంచ బోలావే | పచేల తితుకేంచ అన్న ఖావే | 
నా తరీ వ్యర్థ అజీర్ణ వ్హావే | హే తో ఠావే సకళీకా | ||౭౭|| 
77. “తమకు నచ్చిన సంగతులే చెప్పాలి. జీర్ణమయేంత అన్నమే తినాలి. లేకుంటే అన్నం ఎక్కువై అజీర్ణం అవుతుందని అందరికీ తెలిసిందే కదా! 
మాఝా భాండార భరపూర ఆహే | దేఈన జో జో జే జే చాహే | 
పరి గ్రాహకాచీ శక్తి పాహే | దేతో మీ సాహే తేంచ కీ | ||౭౮|| 
78. “నా భాండారం పూర్తిగా నిండి ఉంది. ఎవరు ఏమి అడిగినా ఇవ్వగలను. కాని, పుచ్చుకునే వారి తాహత్తును చూచి, వారు భరించగలిగినంతే ఇస్తాను. 
ఏకాల జరీ హే లక్ష దేఊన | పావాల తుమ్హీ కృతకల్యాణ | 
యా పవిత్ర మశీదీంత బైసూన | అసత్య భాషణ న కరీ మీ” | ||౭౯|| 
79. “దీనిని శ్రద్ధగా వింటే నీవు ధన్యుడవుతావు. ఈ పవిత్రమైన మసీదులో కూర్చుని, నేనే అబద్ధమైన మాటలను పలకను”. 
హీ సంతవాక్యసుధాసరితా | భావార్థే యేథే బుడీ దేతా | 
అంతర్బాహ్య లాధే శుద్ధతా | క్షాళణ హోతా మళాచే | ||౮౦||
80. ఇది సత్పురుషుని నోటినుండి ప్రవహించిన అమృత ఝరి. దీనిలో మునకలు వేస్తే, మురికి కడగ బడి, లోపల బయటా పరిశుద్ధి కలుగుతుంది. 

ఏసా సాఈనాథాచా మహిమా | వర్ణూ జాతా న పురే సీమా | 
ఉపమూ కైసే త్యా నిరుపమా | శుద్ధప్రేమా ఆధీన తో | ||౮౧|| 
81. ఇలాంటి సాయినాథుని మహిమను వర్ణించటం మొదలు పెట్టితే, దానికి ముగింపే ఉండదు. పోల్చడానికి సాధ్యం కాని వారిని దేనితో పోల్చగలం? నిర్మలమైన ప్రేమతోనే వారిని పొందగలము.
మాఉలీ తీ సకళాంచీ | విశ్రాంతీ ఆర్తశ్రాంతాంచీ | 
కల్పవల్లీ ఆశ్రితాంచీ | దీనా దుబళ్యాంచీ జీ ఛాయా | ||౮౨|| 
82. వారు అందరికీ తల్లి. ఆర్తులకు, కష్టాలతో అలసి పోయినవారికి వారే ఆశ్రయం. ఆశ్రితులకు వారు కల్పవృక్షం. దీనులకు, శక్తి లేని వారికి వారు నీడ. 
సంసారావరీ పాణీ దేఊన | గిరీకపాటీ మౌన ధరూన | 
ఎకాంతవాస స్వీకారూన | నిజకల్యాణైక దక్ష జో | ||౮౩|| 
83. సంసారానికి నీళ్ళు వదిలేసి, మౌనంగా కొండలలో, గుహలలో, ఒక్కరే ఉండి తమ మేలును సాధించుకునే వారూ ఉంటారు. 
ఏసే సంత అసతీ బహుత | కేవళ జే సాధితీ నిజస్వార్థ | 
అథవా కేవళ నిజపరమార్థ | కాయకీ అర్థ ఇతరాతే | ||౮౪|| 
84. అలాంటి సాధువులు చాలా మంది ఉంటారు. వారు కేవలం తమ స్వార్థాన్ని లేదా పరమార్థాన్ని సాధించుకుంటారు. వారినుంచి మిగతా వారికి ఏం ప్రయోజనం? 
తేవీ న సాఈబాబా మహంత | నసతా ఆప్తేష్ట గణగోత | 
ఘరదార వా జాయాసుత | ప్రపంచాంత రాహతీ | ||౮౫|| 
85. కాని సాయిబాబా అలాంటి మహాత్ములు కారు. ఆప్తులు, ప్రియులు, బంధువులు, ఇల్లూ వాకిలి, భార్యా పిల్లలు, ఎవరూ లేకున్నా, ఈ ప్రపంచంలోనే ఉన్నారు. 
కరతల భిక్షా పాంచ ఘరా | తరూతలవాస అష్టౌ ప్రహరా | 
మాండూని థితా ప్రపంచ పసారా | వ్యవహార సారా శికవితీ | ||౮౬|| 
86. ఐదు ఇళ్ళలో చేతికిచ్చిన భిక్షను తీసుకుని, ఇరవై నాలుగు గంటలూ చెట్టు క్రింద ఉంటూ, తమదంటూ ఏమీ లేకున్నా, ప్రపంచంలో ఎలా మెలగాలని బోధించేవారు. 
సాధూని నిజ బ్రహ్మస్థితీ | జనతేచ్యా కల్యాణా ఝిజతీ | 
ఏసే సంత మహామతి | విరళా జగతీ అసతీల | ||౮౭|| 
87. తాము బ్రహ్మ స్థితిలో ఉంటూ, ప్రజల శ్రేయస్సు కొరకు కష్టపడేవారు. మహాజ్ఞానులైన ఇలాంటి సత్పురుషులు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. 
ధన్య తో దేశ ధన్య తే కుళ | ధన్య తీ ఆఈబాపే నిర్మళ | 
ధన్య త్యాంచా కుసవా సోజ్వళ | ప్రసవలా నిర్మళ హే రత్న | ||౮౮|| 
88. ఈ పవిత్ర రత్నం జన్మించిన దేశం ధన్యం. ఆ కులం ధన్యం. పవిత్రులైన ఆ తల్లి తండ్రులూ ధన్యులు. 
అనాయాసే పరిస లాధలా | పాషాణ సమజూని బహుతీ ఝుగారిలా | 
శిరడీంత యా పరమ భాగవతాలా | కోణీ న ఓళఖిలా బహుకాళ | ||౮౯|| 
89. ఏ కష్టము లేకుండా, పరుశవేది దొరికితే, అది ఓ రాయి అని అనుకుని పారవేసుకున్నట్లు, శిరిడీలోని ఈ పరమ దైవాన్ని, చాలా కాలం వరకూ ఎవరూ తెలుసుకోలేదు. 
జైసే ఉకిరడా రత్న పడావే | పోరాంబాళా సాంపడావే | 
త్యాంనీ వాటేల తేథే ఉడవావే | ఖుశాల తుడవావే దగడసే | ||౯౦||
90. చెత్త కుప్పలో పడి ఉన్న రత్నం పిల్లలకు దొరికితే, దాన్ని రాయి అనుకుని వారు ఇష్టమొచ్చినట్లు సంతోషంతో ఎగర వేసి, కాలుతో తొక్కుతారు. 

అసో యాపరీ తో బ్రహ్మాచా భోక్తా | ఆశీర్వచనీ పావే తృప్తతా | 
తీచ గత తుమ్హా ఆమ్హా సమస్తా | బికట రస్తా సోడావా | ||౯౧|| 
91. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని కోరి వచ్చిన మనిషి, బాబా ఆశీస్సులతొ తృప్తి చెందాడు. దారి కష్టమైనప్పుడు, దానిని వదలాలి. నాకైనా, మీకైనా అదే ఉపాయం. 
జోవరీ బాహ్య విషయాంచే సేవన | శబ్దశ్రవణ స్పర్శసంవేదన | 
ఆమోదాఘ్రాణన32 బాహ్యాంగదర్శన | తో న విరోధన33 విషయార్థా | ||౯౨|| 
92. శబ్దాలను వింటూ, స్పర్శ సుఖాన్ని పొందుతూ, మంచి వాసనలను అనుభవిస్తూ, బయట కనిపించే రూపాలను చూస్తూ, ఇలా బయట ప్రపంచాన్ని సేవిస్తున్నంత వరకూ, ఇంద్రియాలను అదుపులో పెట్టటం కాని పని. 
ఝాలియావీణ ఇంద్రియనిరోధన | స్వభావప్రవృత్తిపరావర్తన34 | 
ప్రత్యగ్రూపాచే35 అవలోకన | వా తద్బోధన36 అశక్య | ||౯౩|| 
93. ఇంద్రియాలను అదుపులో పెట్టకుండా, వాటి సుఖాలనుండి దూరం కాకుండా, ఆత్మ జ్ఞానం కావలంటే, అది అసాధ్యం. 
ఆధీ వ్హావే సర్వేషణావిహీన | మగ సద్గురూసీ అనన్య శరణ | 
ఏసా జో దృఢ శ్రద్ధాసంపన్న | ఆత్మవిజ్ఞానా పాత్ర తో | ||౯౪|| 
94. మునుపు, కోరికలను వదలాలి. తరువాత, దృఢమైన శ్రద్ధా భక్తులతో, సద్గురువుకు శరణుజొచ్చితే, అప్పుడు ఆత్మ జ్ఞానానికి యోగ్యులవుతారు. 
శ్రోత్రాది పంచజ్ఞానేంద్రియే | త్యాగిజేతీల జై స్వ స్వ విషయే | 
మన సంకల్ప వికల్ప స్వయే | త్యాగీల నిశ్చయే జే కాళీ | ||౯౫|| 
95. చెవులు మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలు తమ తమ కోరికలను వదిలి వేసినప్పుడు, మనసు తనంతట తానే, అనుమానాలను, చర్చలను వదిలివేస్తే, 
ఎవం ప్రతినివృత్త జై అంతర | బుద్ధిహీ సాండీల నిశ్చయవ్యాపార37 | 
తేచ తే పరమగతీ సాచార | నిర్వికార బ్రహ్మ తే | ||౯౬|| 
96. అలా అన్నింటినుండి బయట పడ్డ మనసులో, బుద్ధి కూడా నిర్ణయం తీసుకునే పనిని మానినప్పుడు, అదే మోక్షం. అదే నిర్వికార బ్రహ్మతో ఒక్కటైన స్థితి. 
బుద్ధీ హోఈల నిశ్చయశూన్య | చిత్తహీ జై పావేల చైతన్య | 
తైంచ తోచ ఎక న తదన్య | ఆత్మ్యాతే ధన్య జాణీల | ||౯౭|| 
97. బుద్ధి శూన్యమై, మనసు చైతన్య మయమై, ఆ పరమాత్మ ఒక్కడే తప్ప వేరే ఎవరూ లేరని ఆత్మను తెలుసుకున్న మనిషి ధన్యుడు. 
హోతా విషయాంపాసూన విన్ముఖ | హోతీల ఇంద్రియే ఆత్మోన్ముఖ | 
తేవ్హాంచ ప్రకటేల నిజసుఖ | ఇతర సర్వ అసుఖ తే | ||౯౮|| 
98. ఇంద్రియ సుఖాలనుండి దూరమైనప్పుడు, ఇంద్రియాలు వాటంతట అవే ఆత్మవైపు చూడటం మొదలౌతుంది. అప్పుడే నిజమైన ఆత్మ సుఖం కనిపిస్తుంది. మిగతావన్నీ సుఖాలు కావు. 
జే విషయ వికార ప్రచ్ఛన్న38 | అతిసూక్ష్మ దుర్దర్శ39 ఆత్మజ్ఞాన | 
పరమానందప్రాప్తీచే సాధన | అతిగహన ఆకళాయా | ||౯౯|| 
99. ఇంద్రియాల కోరికలతో, వాటి ఆసక్తితో కప్పబడి ఉన్నంత వరకూ, సూక్ష్మమైన ఆత్మాన్ని తెలుసుకోవటం కష్టం. ఆత్మను తెలుసుకుంటేనే, పరమాత్మతో ఒక్కటవటానికి అవకాశం ఉంది. 
హిరణ్యగర్భపదాపర్యంత | ఇహాముత్ర40 విషయీ విరక్త | 
తోచ ఎక బ్రహ్మపదాభిషిక్త41 | తో ఎక ముక్త జాణావా | ||౧౦౦||
100. బ్రహ్మ పదవి వరకు ఉండే ఇహ పర సుఖాలన్నిటి లోనూ విరక్తి కలిగినవారే, బ్రహ్మ పదమునకు యోగ్యులు. అలాంటి వారే ముక్తులని తెలుసుకోవాలి. 

చిత్తాస విషయాపాసూన | హళూహళూ మాఘౌతే42 ఫిరవూన | 
ఆత్మరూపీ స్థిర కరూన | ఆత్మజ్ఞాన జోడావే | ||౧౦౧|| 
101. ఇంద్రియాలను తృప్తి పరిచే వస్తువులనుంచి, మనసును మెల్ల మెల్లగా వెనుకకు మరలించి, ఆత్మ రూపంలో స్థిరపరచి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి.
ఇహాముత్రఫళభోగవిరాగ | హర్ష శోకాది ద్వంద్వత్యాగ | 
బుద్ధిమంతాసీంచ హా భోగ | అధ్యాత్మయోగ తో హాచి | ||౧౦౨|| 
102. ఇహ లోకంలో, పర లోకంలో దొరికే కర్మ ఫలాలను, ఆనందం - దుఃఖం లాంటి విరుద్ధ భావాలను, వైరాగ్యంతో త్యజించిన బుద్ధిమంతులకే వైరాగ్య సుఖం దొరుకుతుంది. దానినే అధ్యాత్మ యోగమని అంటారు. 
అధిదైవాధ్యాత్మాధిభౌతికీ43 | నిఖిల వడవానల జ్వాలాదికీ | 
సంతప్త సంసారార్ణవోదకీ44 | కోణ కీ సుఖీ అసేల | ||౧౦౩|| 
103. అధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికాలనే మూడు తాపాల బడబానల మంటలలో మరిగి పోతున్న సంసార సాగరంలోని నీటిలో, ఎవరు సుఖంగా ఉండగలరు? 
తేణే వ్హావయా నిజసముద్ధరణ | వ్హావే సాఈప్రసాదసంపన్న | 
కరావే తచ్చరిత్రావలోకన | శ్రవణ మనన సాదరే | ||౧౦౪|| 
104. అలాంటి తాపాలనుండి తమను తాము ఉద్ధరించుకోవటానికి, సాయి అనుగ్రహాన్ని పొందాలి. వారి చరిత్రను శ్రద్ధగా విని, తలచుకుంటూ ఉండాలి. 
హె శ్రీసాఈనాథ చరిత్ర | శ్రోతీ సపుత్ర మిత్ర కలత్ర45 | 
పరిసతా సాధేల ఇహ పరత్ర | లీలా విచిత్ర బాబాంచీ | ||౧౦౫|| 
105. శ్రోతలు తమ భార్య, కొడుకులు, మిత్రులు, మరియు బంధువులతో సహా, సాయినాథుని చరిత్రను వింటే, ఇహ పర సుఖాలు లభిస్తాయి. 
సభాగ్య శ్రద్ధాళూ శ్రోతే | తేచి యా కథాంచే పరిసతే | 
పరిసతా అతి హళువార చిత్తే | శాంతతే యేతే శాంతతా | ||౧౦౬|| 
106. శ్రద్ధా, భక్తి, నమ్మకమున్న అదృష్టవంతులైన శ్రోతలు ఈ కథలను, నిలకడగా ఉన్న మనసుతో వింటే, శాంతి లభిస్తుంది. 
యా కథాంనిఃస్యందనిర్ఝరే46 | కర్మాకర్మలవణ47 విరే | 
శ్రవణద్వారే నయనీ శిరే | రూప సాజిరే సాఈచే | ||౧౦౭|| 
107. సెలయేరు లాంటి ఈ కథా ప్రవాహంలో, కర్మ, అకర్మలనే ఉప్పు కరిగిపోతుంది. చెవుల ద్వారా సాయి సుందర రూపం కళ్ళ ముందుకు వస్తుంది. 
చరిత్ర శ్రవణే పాతకాం ర్హాస48 | చరిత్ర శ్రవణే కాళావరీ కాస49 | 
చరిత్ర శ్రవణే పరమోల్హాస | శ్రోతే నిరాయాస పావతీ | ||౧౦౮|| 
108. సాయి కథలను వినటంతో అన్ని పాపాలు నశిస్తాయి. ఈ కథలను విని, శ్రోతలు చావుతో పోరాడి గెలువగలుగుతారు. ఈ కథలు వినటంతో శ్రోతలు ఉత్సాహాన్ని, సంతోషాన్ని సులభంగా పొందగలరు. 
శ్రవణే శుద్ధ అంతఃకరణ | శ్రవణే చుకేల జన్మమరణ | 
శ్రవణే శ్రోతయా బ్రహ్మపణ | కేవళ50 బ్రహ్మార్పణకర్మానే51 | ||౧౦౯|| 
109. ఈ కథలను వింటే, మనసు శుద్ధమౌతుంది. ఈ కథలను వినటంతో చావు పుట్టుకలు వదిలి పోతాయి. వీటిని విని శ్రోతలు బ్రహ్మత్వాన్ని పొందుతారు. బ్రహ్మార్పణ బుద్ధితో ఈ కథలను వినాలి. 
ఏసా హా సాఈసేవాకామ52 | సేవకా సదా కరీ నిష్కామ53 | 
నిజ భక్తా శ్రీసాఈరామ | దేఈల ఆరామ సర్వదా | ||౧౧౦||
110. ఇలా సాయి సేవను కోరుకునే సేవకులను, భక్తులను, శ్రీసాయిరాముడు కోరికలు లేనివారిగా చేసి, వారి మనసుకు ఎల్లప్పుడూ సుఖాన్ని కలిగిస్తారు. 

భాగశః యా గ్రంథాచే వాచన | అథవా శ్రవణ ఆణీ పరిశీలన | 
మనన ఆణి నిదిధ్యాసన | కరా అనుదిన శ్రోతే హో | ||౧౧౧|| 
111. ఓ శ్రోతలారా! ప్రతి రోజూ ఈ గ్రంథంలోని ఒక్క అధ్యాయాన్ని అయినా చదివి, లేక విని, మననం, నిధిధ్యాసనం చేసి, ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండండి. 
“ఆనందో బ్రహ్మేతి వ్యజానాత” | హె తరీ తైత్తిరీయ శ్రుతి విఖ్యాత | 
తేంచ తే బాబా అనువాదత | శ్రుతినిర్ణీత భక్తాంతే | ||౧౧౨|| 
112. ‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత’ అన్న తైత్తరీయ ఉపనిషత్తులోని మాట బాగా ప్రసిద్ధి చెందినది. ఈ మాటలను బాబా తమ భక్తులకు పదే పదే చెప్పేవారు. 
“ఫికీర న కరావీ యత్కించిత | సదా అసావే ఆనందభరిత | 
చింతా న కరావీ ఆమరణాంత” | ఉపదేశ నిత్య బాబాంచా | ||౧౧౩|| 
113. “మీరు కించిత్తైనా దిగులు పడకండి. ఎప్పుడూ ఆనందంగా ఉండండి. జీవితాంతం చింత పెట్టుకోకండి” అని బాబా ఎప్పుడూ బోధించేవారు. 
అసో బ్రహ్మతత్వ నిర్ధారణ | హే యా అధ్యాయాచే ధోరణ | 
కీ హీ నౌకా భవతారణ | జాఈల శరణ సాఈంస త్యా | ||౧౧౪|| 
114. ఈ అధ్యాయంయొక్క ఉద్దేశం, బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడం. సాయికి శరణుజొచ్చిన వారిని, సంసార సాగరాన్నుండి తరింపచేసేది, బ్రహ్మ తత్వమనే ఈ నౌకయే. 
హితవచన వారంవార | సాంగావే కరావా పరోపకార | 
బాబా తయాచా కరూన అనుకార | తదనుసార ప్రవర్తతీ | ||౧౧౫|| 
115. శాస్త్రాలు చెప్పిన ‘ఇతరులకు మంచి బోధ చేయండి, ఇతరుల మీద దయతో ఉండి, పరోపకారం చేయండి’ అన్న మాటలను తాము స్వయంగా పాటిస్తూ, భక్తులకు పదే పదే చెప్పే వారు. 
హే సయుక్తిక కీ అయుక్తిక | హే మతభేద కేవళ వైయ్యక్తిక54 | 
జేణే సామాన్య జనతేసీ తోఖ55 | తోచ కీ రోఖ యే గ్రంథీ | ||౧౧౬|| 
116. ఇది తగునా లేక తగదా అనే అభిప్రాయాలు కేవలం వ్యక్తిగతం. సామాన్య జనులకు సంతోషం కలిగించి, మేలు చేయడమే ఈ గ్రంథంయొక్క ప్రయోజనం. 
హేంచి ఆహే యేథే ప్రయోజన | బాబా జాణీత కార్యకారణ | 
జైసే తయాచే మనేప్సిత జాణ | హోష్యమాణ56 హీ తైసేంచ | ||౧౧౭|| 
117. ఇక్కడ అసలు ఉద్దేశం అదే. చేసే పనులకు కలిగే ప్రయోజనాలు, ఆ పనుల వెనుక ఉన్న కారణాలు, అన్నీ బాబాకు బాగా తెలుసు. వారు అనుకున్నదానిని బట్టే భవిష్యత్తు జరుగుతుంది. 
గురూముఖీంచ్యా కథా ఏకావ్యా | అతర్క్యే లీలా అనుభవావ్యా | 
స్మరతీల త్యా సంగ్రహీ ఠేవావ్యా | పరిసవావ్యా ఇతరాంతే | ||౧౧౮|| 
118. గురువు నోటినుండి వచ్చిన కథలను విని, వారి ఊహకందని లీలలను అనుభవించి, ఆ లాలలన్నిటినీ గుర్తుగా సంగ్రహించి ఇతరులకు వినిపించాలి. 
సాఈంచే హే చరిత్ర బరే | శ్రవణ కరితా అత్యాదరే | 
శ్రోతియావక్త్యాంచే దైన్య హరే57 | దుర్దిన ఓసరే అవఘ్యాంచే | ||౧౧౯|| 
119. అద్భుతమైన ఈ సాయి చరిత్రను అతి ఆదరంగా వింటే, చెప్పే వారి మరియు వినేవారి దైన్యం నశిస్తుంది. అంతే కాదు, అందరి చెడు రోజులూ తొలగిపోతాయి. 
పాహోని బాబాంచీ అలౌకిక లీలా | కోణ అభాగీ చకిత న ఝాలా | 
కేవళ దర్శనమాత్రేంచి నివాలా | లీన ఝాలా పదకమలీ | ||౧౨౦||
120. బాబాయొక్క అలౌకికమైన లీలలను చూసి, చకితుడు కాని దురదృష్టవంతుడు ఎవడన్నా ఉన్నాడా? కేవలం వారి దర్శన మాత్రంతోనే తృప్తి చెంది వారి పాదాలలో లీనమై పోతాడు. 

విశద చరితే యా సాఈచీ | ప్రశస్త చిత్తే ఏకావయాచీ | 
సంధీ యేతా ఏసీ సుఖాచీ | కోణ ఫుకాచీ దవడీల | ||౧౨౧|| 
121. విస్తారమైన ఈ సాయి చరితను, పరిశుద్ధమైన మనసుతో వినటానికి మంచి అవకాశం దొరికితే, ఎవరు కాదని అనుకుంటారు?
పుత్ర మిత్ర కలత్రావర్త | కామక్రోధాదిగ్రాహయుక్త58 | 
నానా59 రోగ తిమింగిలోజ్జృంభిత60 | ఉద్దేలిత61 ఆశాకల్లోళీ | ||౧౨౨|| 
122. కొడుకు, భార్య, మిత్రులనే సుడిగుండాలలో, కామం క్రోధం అనే మొసళ్ళు, అనేక రోగాలనే తిమింగలాలు విజృంభిస్తుంటాయి. ఆశలనే అలలు కలవర పెడతుంటాయి. 
వేళీ ఉద్వేగాచా ఝటకా | యేవోని జాతో ఘటకోఘటకా | 
ద్వంద్వ మాజూని ఉడతో ఖటకా | పరి న తటకా తోడవే | ||౧౨౩|| 
123. దుఃఖం, వ్యథ అనే దెబ్బలు మళ్ళీమళ్ళీ తగులుతుంటాయి. సుఖదుఃఖాలనే విరుద్ధ భావాలు మనసులో సంశయాలను పుట్టిస్తాయి. అయినా ప్రపంచాన్ని వదిలి పెట్టలేరు. 
స్వయేంచ జీవాస కరావా బోధ | కీ తూంచ ఆహేస బ్రహ్మ శుద్ధ | 
ఝాలాసీ దేహసంగే బద్ధ | నలికాపినద్ధ62 శుక జైసా | ||౧౨౪|| 
124. ‘శుద్ధమైన బ్రహ్మవు నీవే. కాని, శరీరమనే పంజరములో బంధింపబడి ఉన్నావు. పంజరంలోని తీగను గట్టిగా పట్టుకుని తలక్రిందులుగా వ్రేలాడే చిలుకలా ఉన్నావు’, అని మనం స్వయంగా జీవాత్మకు బోధించాలి. 
భులలాసీ కేవళ మోహమాయే | తేణే విసరలాసీ నిజ సోయే | 
తూఝా తూంచ సావధ హోయే | స్వరూపా యే ఝడకరీ | ||౧౨౫|| 
125. ‘కేవలం మాయా, మోహం వలన మతి చదిరింది. ఆ కారణంగా నీ మంచిని మరచిపోయావు’ అని నిన్ను నీవే హెచ్చరించుకుని త్వరగా నీ స్వరూపాన్ని తెలుసుకో. 
భ్రమాముళే వాఢలా భ్రమ | దేహాభిమానాది సంభ్రమ | 
మృగజలసమ హే ‘మీ మమ’ | జాణూని నిర్మమ హోఈకా | ||౧౨౬|| 
126. ‘ఒక పొరబాటు కారణంగా ఇంకా ఎన్నో పొరబాటులు ఎక్కువై, దేహం మీద అభిమానం, కోరికలు కలుగుతుంటాయి. ‘నేను నాది’ అన్నది ఎండమావులలాంటిదే అని తెలుసుకుని, ఏ మమకారాలు లేకుండా ఉండాలి’. 
యా మీ తూ పణాచే ప్రపంచీ | గుంతావే కా నీట వివంచీ63 | 
సోడ ఆవళలే పాయ పంచీ64 | ఉడ్డాణే ఉంచీ విహరకీ | ||౧౨౭|| 
127. ‘నీవు, నేను అన్న ఈ ప్రపంచంలో ఎందుకు చిక్కుకోవాలి? చిలుకా! నీ కాలికి ఉన్న బంధనాన్ని విదిలించుకుని పైకి ఎగిరి విహరించు. 
ముక్త తేథే బద్ధతా అసే | బద్ధతేపాశీ ముక్తతా వసే | 
పరత హోఊనియా ఉభయదశే | శుద్ధ స్వవశే రాహీ బా | ||౧౨౮|| 
128. ‘ముక్తి ఉన్న చోట బంధనమూ ఉంటుంది. అలాగే బంధనమున్న చోట ముక్తి కూడా ఉంటుంది. ఈ రెండు దశలను దాటి శుద్ధమైన ఆత్మ రూపంలో స్థిరపడాలి’. 
హే తో సాక్షేపతేచే జ్ఞాన | సుఖ వా దుఃఖ సర్వాజ్ఞాన | 
దవడోని సంపాదీ విజ్ఞాన | బ్రహ్మజ్ఞాన పాశీంచ65 | ||౧౨౯|| 
129. ఇవి ఒకటికొకటి సంబంధించినవి. సుఖం మరియు దుఃఖం అనేవి అజ్ఞానం వలనే కలిగేవి. అజ్ఞానాన్ని తొలగించుకుని, జ్ఞానాన్ని పొందితే, బ్రహ్మజ్ఞానం దగ్గరలోనే ఉన్నట్లు. 
దేహీ జోవర మీ తూ పణా | తో న తూ నిజ హితాచా దేఖణా66 | 
తో టాక పాహీ ఆపఆపణా | కృపణపణా భిరకావీ | ||౧౩౦||
130. ‘దేహంలో ‘నీవు నేను’ అనే భేద భావం ఉన్నంత వరకు నీవు నీ మేలును తెలుసుకోలేవు. అందుకే ‘నీ, నా’ అన్న దాన్ని వదిలేసేయి. పిసినారిలా దేహాన్ని అంటిపెట్టుకోవటం మాని, నిన్ను నీవు తెలుసుకో. 

కుబేరాసమ ధనవంత | భిక్షావృత్తి జరీ విచరత | 
తరీ తే కేవళ నష్ట చరిత | విపరీత పణ అజ్ఞానానే | ||౧౩౧|| 
131. కుబేరుడిలాంటి ధనవంతుడు, భిక్షాటనం చేస్తుంటే, అది కేవలం అజ్ఞానం వలన కలిగిన దౌర్భాగ్యమే. 
కరావే నిత్య సచ్చాస్త్ర శ్రవణ | విశ్వాసే పాళావే సద్గురువచన | 
రాహూని సదా సావధాన | అనుసంధాన రాఖావే | ||౧౩౨|| 
132. ఎప్పుడూ ఉత్తమమైన శాస్త్రాలను వినాలి. సద్గురువు మాటలను నమ్మకంతో పాటించాలి. వానిని శ్రద్ధగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. 
పాహోని జన తే ఆచార పద్ధతి | నిజోద్ధార మార్గ చోఖాళతీ | 
అసంఖ్య జీ ఉద్ధరతీ | సహజ గతీ త్యాంచేనీ | ||౧౩౩|| 
133. గురువుల ఆచార పద్ధతులను చూసి, జనులు తమను తాము ఉద్ధరించుకోవటానికి దారులను ఎన్నుకుంటారు. అలా లెక్కలేనన్ని జీవులు ఉద్ధరింపబడి, మోక్షాన్ని సహజంగా పొందుతారు. 
కదా యేఈల ఏసీ ఘటకా | ఘడేల భవపాశాంతుని సుటకా | 
జయా అహర్నిశ హా మనాస చటకా | అవచట తటకా తో సోడీ | ||౧౩౪|| 
134. ఈ సంసార బంధనాలు ఎప్పుడు విడిపోతాయో అని రాత్రింబవళ్ళూ ఆలోచించేవారు, త్వరగా విముక్తిని పొందుతారు. 
సాధవేల తో ఎకాంత సాధూన | సంసార నిఃసార హీ గాంఠ బాంధూన | 
అధ్యయన ఆణి ఆత్మచింతన | యాంత చిరంతన67 అసావే | ||౧౩౫|| 
135. ఈ సంసారం నిస్సారం అని బాగా తెలుసుకుని, వీలైనంత వరకు ఏకాంతాన్ని సదుపయోగం చేసుకుని, ఏకాంతంలో ఎప్పుడూ అధ్యయనంలోను ఆత్మ చింతనలో ఉండాలి. 
భక్తి శ్రద్ధాన్విత మనే | శిష్యే పూర్ణ వినయసంపన్నే | 
శరణ సాష్టాంగ గేలియావిణే | జ్ఞానకేణే68 గురూ న దే | ||౧౩౬|| 
136. పూర్తి వినయం విధేయతలతో, శ్రద్ధ భక్తిగల మనసుతో, శిష్యులు సాష్టాంగ పడి శరణు వేడితే తప్ప, గురువు జ్ఞాన సంపదను ప్రసాదించరు. 
సర్వస్వీ గురూశుశ్రూషా కరావీ | బంధమోక్షవృత్తీ69 వివరావీ | 
విద్యావిద్యాది ప్రశ్నీ ధరావీ | గురూరావీ సఫలతా | ||౧౩౭|| 
137. ఉన్నదంతా గురువుకు అర్పించి, వారి సేవ చేయాలి. బంధం ముక్తి గురించి బాగా తెలుసుకోవాలి. విద్య, అవిద్యల గురించిన ప్రశ్నలను గురువుని అడిగి తెలుసుకుని, సఫలతను సాధించాలి. 
ఆత్మా కోణ పరాత్మా కోణ | కోణా న సాంగావే గురూవీణ | 
గురూహీ న యేతా శరణ పూర్ణ | దేతీ న కణహీ జ్ఞానాచా | ||౧౩౮|| 
138. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న సంగతులను గురువు తప్ప వేరే ఎవరూ చెప్పరు. పూర్తిగా గురువుకు శరణాగతులైతే తప్ప, వారు ఆవగింజంత జ్ఞానాన్ని కూడా ప్రసాదించరు. 
గురూవినా ఇతరే దేతా జ్ఞానా | సంసార నివర్తకతే హోఈనా | 
మోక్షఫలప్రద లవహి అసేనా | మనా ఠసేనా కదాపి | ||౧౩౯|| 
139. గురువు కాకుండా, ఇంకెవరైనా జ్ఞాన బోధ చేసినా, దానితో సంసార బంధనాలు విడిపోవు. దానివల్ల కొంచెం కూడ ముక్తి కలుగదు. అది మనసులో అసలు నాటుకోదు. 
తస్మాత గురూవినా జ్ఞాన నోహే | విదిత సకల విద్దానా హే | 
బ్రహ్మాత్మైక్య విషయీ సోయే | సమర్థ పాయ గురూచే | ||౧౪౦||
140. గురువు లేక జ్ఞాన పొందడం సాధ్యం కాదని పండితులందరికీ తెలిసినదే. బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్న నిజాన్ని అనుభవింప చేసే సామర్థ్యం గురు పాదాలకే ఉంది. 

తేథే న కరితా అనమాన | సాండోని తాఠా అభిమాన | 
హోవోని అఖండ దండాయమాన | ఖాలవా మన గురుపదీ | ||౧౪౧|| 
141. అక్కడ, ఏ అనుమానాలూ లేకుండా, దర్పాలను, అభిమానాలను వదిలివేసి, ఎంతో వినయంగా, గురువుకు సాష్టాంగ దండ నమస్కారం చేసి, వారి పాదాలపై తలునుంచాలి.
దాసానుదాస మీ తుమచా | భరవసా ఎక తవ పదాచా | 
ధరోని పావలో మ్హణా వాచా70 | ధడా జీవాచా దృఢ కరా | ||౧౪౨|| 
142. నిలకడగా ఉండే మనసుతో, గురువు పాదాలను గట్టిగా పట్టుకుని, ‘నేను మీ దాసానుదాసుణ్ణి, మీ పాదాలొకటే నాకు నమ్మకం’ అని నోటితో అంటే చాలు. 
మగ పహా చమత్కార తయాచా | తో గురుదయార్ణవ హేలావే సాచా | 
నిజశేజీ తరంగాచ్యా71| ఝేలీ వరచ్యావరీ తో | ||౧౪౩|| 
143. ఆ తరువాత, వారి చమత్కారాన్ని చూడండి. దయాసాగరులైన ఆ గురువు తమ అనుగ్రహమనే అలల పడకపై తేలి ఆడించగలరు. 
శిరీ ఠేవీ అభయహస్త | ఇడా పిడా కరోని ఉద్వస్త | 
జాళోని పాతకాచ్యా రాశీ సమస్త | ఉదీ మస్తకీ ఫాసీ తో | ||౧౪౪|| 
144. రక్షణనిచ్చే తమ చేతిని, తలపై ఉంచి, ఇడ-పింగళ అనే నాడులను సరి చేసి, మహా పాపాల రాశిని కాల్చి వేసి, నుదుట ఉదీని పెడతారు. 
ఎవం బ్రహ్మార్థియా బ్రహ్మనిరూపణ | హే తో కేవళ నిమిత్త జాణ | 
జీవశీవైక్యతేచీ ఖూణ | భక్తా సంపూర్ణ కథియేలీ | ||౧౪౫|| 
145. ఆ విధంగా, బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన మనిషిని, కేవలం నిమిత్త మాత్రునిగా చేసి, జీవుడు శివుడు ఒక్కటే అనే జ్ఞానాన్ని, బాబా పూర్తిగా భక్తులందరికీ బోధించారు. 
ఆతా మహారాజాంచీ ఎవఢీ | అతుల ప్రజ్ఞా విద్యా గాఢీ | 
అసతా థట్టేచీ కాయ హీ ప్రౌఢీ | కాయ ఆవడీ వినోదీ | ||౧౪౬|| 
146. ఇంతటి గొప్ప విద్య, సాటిలేని ప్రజ్ఞ ఉన్న మహారాజుకు, హాస్యం అంటే ఎందుకంత ఇష్టం? వినోదానికి ఎందుకంత ప్రాముఖ్యతను ఇచ్చారు? 
సహజ శంకా ఘేఈల మన | పరి పాహతా విచారూన | 
ఎకచి ఆహే సమాధాన | సావధాన పరిసిజే | ||౧౪౭|| 
147. అనే అనుమానం సహజంగా కలుగుతుంది కదూ! బాగా ఆలోచిస్తే, దొరికేది ఒక్కటే సమాధానం. అదేమిటని శ్రద్ధగా వినండి. 
ములాంబాళాంసవే బోలతా | తయాంచ్యా బోబడ్యా బోలాంత రమతా | 
ప్రౌఢత్వాచ్యా కథా వార్తా | కధీంహీ హోతాత కాయకీ | ||౧౪౮|| 
148. పసిపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, వారి వచ్చీ రాని ముద్దు మాటలను విని ఆనందిస్తున్నప్పుడు, మనమెవరైనా పెద్దవారిలా మాట్లాడతామా? 
నసతే ప్రేమ కా తయావరీ | తే కాయ వర్ణూ సకేల వైఖరీ | 
పరి బోధప్రదాన కుసరీ | వినోద మస్కరీ హీ ఎక | ||౧౪౯|| 
149. వారి మీద మనకు ప్రేమ లేకనా? మాట్లాడటంలో అది ఒక రకం. అలాగే వినోదం, హాస్యంతో జ్ఞానాన్ని బోధించటం కూడా ఒక కళ. 
కాయ ఆహే రోగ పోటీ | హే కాయ ఆహే బాళాస దృష్టీ | 
మాతేస పాజావీ లాగే గుట్టీ | జరీ తే హట్టీ పిఈనా | ||౧౫౦||
150. పొట్టలో ఏ రోగం ఉందో పిల్లలకు తెలుస్తుందా? వారికి తల్లే కదా మాత్రలూ మందూ ఇవ్వాలి! ఒకవేళ, మందు త్రాగనని వారు మొండికేస్తే, 

కధీ ఆంజారూన గోంజారూన | కధీ నేత్ర పింజారూన | 
కధీ చతుర్దశరత్న ప్రయోజన72 | కధీ ఆలింగన సప్రేమ | ||౧౫౧|| 
151. వారిని బ్రతిమలాడో, బామాడో లేక కొన్ని సార్లు కళ్ళు ఎర్రగా చేశో, ఇంకొన్ని సార్లు బెత్తంతో రెండు వాయించో, చాలా మార్లు ప్రేమగా వారిని గుండెలకు హత్తుకునేది తల్లే కదా! 
తీంచ హోఊ లాగతా ప్రౌఢ | కరావే వాటే తయాంచే కోడ | 
పరి బుద్ధీ తీవ్ర వా బోజడ | తైసాచ నివాడ జ్ఞానాచా | ||౧౫౨|| 
152. పిల్లలు పెరిగిన కొద్దీ, వారి బుద్ధి పెరగటాన్ని కూడా గమనించి, వారిని లాలించాలి. అలాగే జ్ఞానం బోధించేటప్పుడు కూడా. 
తీవ్ర బుద్ధీచే తీవ్ర గ్రహణ | ఉపదేశ ఠరతా నలగే క్షణ | 
తేంచ జడబుద్ధీచే విలక్షణ | బహూత రక్షణ సాయాస | ||౧౫౩|| 
153. చాకులాంటి బుద్ధిగలవారు, క్షణం కూడా ఆలస్యం చేయకుండా, జ్ఞానాన్ని తొందరగా అర్థం చేసుకుంటారు. అదే బుద్ధి తక్కువ ఉన్నవారికి, చెప్పినది తలకెక్కటం కొంచెం కష్టం. వారికి తెలియచేయటానికి కొంచెం ఎక్కువ కష్ట పడాల్సి ఉంటుంది. 
సమర్థ సాఈ జ్ఞాననిధీ | జయా భక్తాంచీ జైసీ బుద్ధీ | 
ఆధీ నిర్ధారూని పాత్రశుద్ధీ | జ్ఞాన సమృద్ధి వితరత | ||౧౫౪|| 
154. సాయి సమర్థులు జ్ఞానానికి నిధి. ముందు భక్తులయొక్క బుద్ధిని, వారి యోగ్యతను తెలుసుకుని, తరువాత సాయి జ్ఞానాన్ని సమృద్ధిగా వారికి ఇచ్చేవారు. 
తయాంస పూర్ణ అంతర్జ్ఞాన | తయాంస ఆధీంచ సర్వాంచీ జాణ73 | 
జయాస జైసే యోగ్య సాధన | తయాచే నియమన తైసేంచ | ||౧౫౫|| 
155. వారికి అవలీలగా అన్నీ తెలిసేవి. అందరి గురించీ వారికి ముందే తెలుసు. వారివారి యోగ్యతలను బట్టి, వారికి ఆయా సాధనలను నియమించే వారు. 
జైసా జయాచా అధికార | తయాచా ఆధీంచ కరూని విచార | 
యోగ్యాయోగ్యతేనుసార | భక్తాంచా భార బాబాంనా | ||౧౫౬|| 
156. అలాగే వారివారి అర్హతలను బట్టి, దాని ప్రకారంగా భక్తుల బాధ్యతలను వారు తీసుకునేవారు. 
తైసేచ ఆమ్హీ దిసాయా థోర | పరి త్యా సిద్ధ సాఈసమోర | 
ఖరేచ ఆమ్హీ పోరాంహుని పోర | వినోదీ ఆతుర సర్వదా | ||౧౫౭|| 
157. వయస్సు మళ్ళిన వారిలా మనము పైకి కనిపించినా, సాయి సిద్ధుల ఎదుట, నిజంగా మనము పిల్లల కంటే పిల్లలం. అందుకే ఎప్పుడూ హాస్యం, వినోదం కోసమే ఆత్రంగా ఉంటాము. 
వినోదాంచే బాబా ఆగర | జే జే ఠాయీ జయాసీ ఆదర | 
తే తే యథేష్ట పురవూని సమగ్ర | రాఖీత అవ్యగ్ర భక్తాంస | ||౧౫౮|| 
158. బాబా వినోదాలకు నిలయం. ఎవరికి ఏది రుచిస్తుందో, తెలుసుకుని, ఆ భక్తులకు ఇష్టమైన వానినే చక్కగా వారికిచ్చి, వారిని తృప్తి పరిచే వారు. 
సుబుద్ధ వా బుద్ధిమంద | వాచితా ప్రకటేల పరమానంద | 
పరిసతా వాఢేల శ్రవణ ఛంద | మననే స్వానంద సంతుష్టీ | ||౧౫౯|| 
159. బుద్ధి ఉన్న వారైనా సరే, లేని వారైనా సరే, ఈ చరిత్రను పఠిస్తే, పరమానందం కలుగుతుంది. విన్న కొద్దీ, ఇంకా వినాలనే కుతూహలం పెరుగుతుంది. దానినే తలచుకున్న కొద్దీ, తృప్తి, ఆనందం కలుగుతాయి. 
ఆవర్తనీ74 పరమార్థబోధ | నిదిధ్యాసనీ మహదాల్హాద | 
సౌఖ్య ఉపజేల అఖండ నిర్బాధ | ఏసీ అగాధ హీ లీలా | ||౧౬౦||
160. మరల మరల పఠిస్తే, పరమార్థ జ్ఞానం కలుగుతుంది. నిధి ధ్యాసలు చేస్తే, అంతు లేని, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. అలాంటిది బాబాయొక్క ఈ అమోఘమైన లీల. 

భాగ్యే జేణే అనుభవ యేథీలా | యత్కించితహీ అసేల భోగిలా | 
కాయావాచామనే తో ఖిళిలా | అతర్క్య లీలా సాఈచీ | ||౧౬౧|| 
161. ఈ అనుభవాన్ని పొందిన భాగ్యవంతులు, ఎంత కొంచెమైనా సరే, దేహంతో మాటలలో మనసుతో సాయికి అంకితమై పోయారు. ఊహకు అందనివి సాయి లీలలు. 
హేమాడ సాఈపాయీ శరణ | వినోదమార్గే జ్ఞానప్రదాన | 
భక్తకల్యాణ ఎక ప్రయోజన | నిమిత్త జాణ బ్రహ్మార్థియా | ||౧౬౨|| 
162. హేమాడు సాయి పాదాలకు శరణుజొచ్చి, హాస్యంతో వినోదంతో భక్తుల శ్రేయస్సు కోసం బాబా జ్ఞానాన్ని పంచడం గురించి చెప్పాడు. బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన మనిషి కేవలం నిమిత్త మాత్రుడే. 
పుఢీల అధ్యాయ యాహూన గోడ | శ్రవణార్థియాంచే పురేల కోడ | 
మాఝియా జీవీంచీ గుప్త హోడ | ఫోడ ఫోడోని పురవిలీ | ||౧౬౩|| 
163. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురం. వినేవారి కోరికలను తీరుస్తుంది. నా మనసులో రహస్యంగా ఉన్న కోరిక, స్పష్టంగా బయటికి చెప్పబడి, తీర్చటం కూడా జరుగుతుంది. 
మీ జాఈన మాధవాపాశీ75 | బాబాంచా నిరోప దేఈన త్యాంశీ | 
పావేన కైసా అనుగ్రహాశీ | సాద్యంతేశీ పరిసా జీ | ||౧౬౪||
164. మాధవరావు దగ్గరకు నేను వెళ్ళి, అతనికి బాబాయొక్క సందేశాన్ని అందించి, సాయి అనుగ్రహాన్ని పొందిన సంగతిని, పూర్తిగా వినండి. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 

| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | బ్రహ్మజ్ఞాన కథనం నామ | 

| సప్తదశోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||


  టిపణీ: 
1. స్వావలంబీ. 2. దూర కరూ. 
3. ప్రతిబంధ, నివారణ్యాచా ఉపాయ. 4. శోధ. 
5. పుష్కళ. 6. ఖణూన కాఢా. 
7. సూర్యప్రకాశానే. 8. భంగ. 9. సమాగమ. 
10. ఎకమేకాంచీ ఢకలాఢకలీ. 11. పరిపూర్ణ. 
12. శరీరూపీ జో రథ త్యాచా ధనీ. 13. వాచాళ, నుసతా శబ్దచ్ఛల కరణారా. 
14. రథాచ్యా ఠికాణీ. 15. విషయాంచ్యా అనేక మార్గాంచీ పరంపరా. 
16. మనరూపీ లగామానే. 17. దశేంద్రియరూప దహా ఘోడే. 
18. వాటేల తికడే. 19. మనరూపీ లగామ తాబ్యాబాహేర గేల్యావర. 
20. మనావర జ్యాచా తాబా ఆహే తో. 21. జ్యాచే చింత ఎకాగ్రతా పావలే ఆహే. 
22. శాస్త్రానే యోగ్య మ్హణూన ఠరవిలేలే కర్మ. 23. ఖాలీ భూలోక ఆణి వర బ్రహ్మలోక. 
24. అస్పష్ట. 25. ఆత్మప్రాప్తి. 
26. సర్పాప్రమాణే. 27. సమూళ, పూర్ణపణే.
28. దుఃఖాచా డోహ. 29. గఢలేలా. 30. విరక్త. 
31. ఫుకట, వ్యర్థ. 32. సుగంధ ఘేణే. 33. సంయమన. 
34. స్వభావతఃచ ఆలేలే విన్ముఖపణ. 35. ప్రత్యగాత్మ్యాచే. 
36. త్యాచా ప్రబోధ. 37. నిశ్చయ కరణ్యాచా జో బుద్ధీచా వ్యాపార తో. 
38. విషయ-వికార యాంనీ ఝాకలేలే. 39. దిసణ్యాస అవఘడ. 
40. యా లోకీచ్యా వ పరలోకీచ్యా విషయాంమధ్యే. 
41. బ్రహ్మపదావర జ్యాలా అభిషేక ఝాలా ఆహే అసా. 42. మాఘారే. 
43. అధిదైవిక, ఆధ్యాత్మిక యా తీన తాపాంత. 44. సంసారరూపీ సాగరాత. 
45. ఆపలే కుటుంబ, పుత్ర ఆణి ఆప్త యాంసహ. 46. యా కథారూప ఝర్యాచ్యా ప్రవాహాత. 
47. కర్మరూప వ అకర్మరూప క్షార. 48. నాశ. 
49. ఝగడూన విజయీ హోణ్యాచీ తయారీ. 50. ఫక్త. 
51. హాతూన జే జే కర్మ ఘడేల త్యాచ్యా ఫలప్రాప్తీచీ ఇచ్ఛా న ఠేవతా తే బ్రహ్మార్పణ కేల్యానే. 
52. సాఈచ్యా సేవేచీ ఇచ్ఛా. 53. ఇచ్ఛారహిత. 54. వ్యక్తివ్యక్తీచే. 
55. సంతోష. 56. హోణారే. 57. నష్ట హోఈ. 58. భోవరా. 59. సుసరీ, నక్ర. 
60. తిమింగిల నావాచా ఎక మోఠా మాసా. 61. ఖవళలేలా. 
62. పకడణ్యాసాఠీ బాంధలేల్యా నళీలా పాయాంనీ ఘట్ట ధరూన జో ఆపల్యాస ఉలటా టాంగూన ఘేతో అసా పోపట. 63. విచార కర. 64. హే పోపటా. 
65. జవళచ. 66. పాహణారా. 
67. నిరంతర. 68. జ్ఞానాచా ఠేవా. 69. బంధమోక్షాచ్యా గోష్టీ. 70. వాచేనే. 
71. లాటాంచ్యా శయ్యేవర. 72. చౌదావ్యా రత్నాచీ (ఛడీచీ) యోజనా. 
73. జాణీవ. 74. ఎకావర ఎక పాఠ. 
75. మాధవరావ దేశపాండే, జ్యాంనా బాబా ‘శామా’ యా నావానే సంబోధిత.