Monday, December 9, 2013

||కాశీగయాగమన అజాజన్మ కథనం నామ షట్చత్వారింశత్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౬ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

ధన్య శ్రీసాఈ తుఝే చరణ | ధన్య శ్రీసాఈ తుఝే స్మరణ | 
ధన్య శ్రీసాఈ తుఝే దర్శన | జే కర్మబంధన మోచక | ||౧|| 
1. ధన్యం శ్రీసాయి మీ చరణాలు! ధన్యం శ్రీసాయి మీ స్మరణ! కర్మబంధనాలనుండి విముక్తి ప్రసాదించే మీ దర్శనం, శ్రీసాయి, ధన్యం!
జరీ సాంప్రత అదృశ్యమూర్తీ | తరీ ధరితా భావభక్తి | 
సమాధిస్థ జాగతీ జ్యోతీ | సద్యఃప్రతీతీ భక్తార్థ | ||౨|| 
2. ఇప్పుడు మీరు అదృశ్యంగా ఉన్నా, మీలో భక్తిభావాన్ని ధరిస్తే, సమాధిలో ఉన్న మీ జ్యోతి జాగృతమౌతుంది. భక్తులు నేటికీ దీనిని అనుభవ రూపంగా చూస్తున్నారు. 
దోరీ సూక్ష్మ ధరిసీ ఏసీ | పాహూ జాతా దిసో నా దేశీ | 
పరీ నిజభక్తా ఖేంచూన ఆణిశీ | దేశీ విదేశీ అసో కీ | ||౩|| 
3. మేమంతా ఎంత ప్రయత్నించినా కనిపించని సూక్ష్మమైన దారంతో, మీ భక్తులు ఈ దేశంలో ఉన్నా, విదేశాలలో ఉన్నా, మీ వద్దకు లాక్కుని వస్తారు. 
ఆణూని సోడిసీ పాయాపాశీ | ప్రేమే ధరిసీ త్యా పోటాశీ | 
మాతా జైసీ నిజబాళకాసీ | తైసా తూ పోశిసీ అవలీలా | ||౪|| 
4. వారిని మీ పాదాల వద్దకు తెచ్చిన వెంటనే, వారిని ప్రేమతో కౌగలించుకుని, తల్లి తన బిడ్డలను చూచేలా మీరు వారిని ప్రేమగా, సునాయాసంగా పోషిస్తారు. 
ఏసే కాంహీ సూత్ర చాళవిసీ | నకళే కోణా కోఠే అససీ | 
పరీ పరిణామీ వాటే మనాసీ | ఆహేస కీ పాఠీసీ భక్తాంచ్యా | ||౫|| 
5. సూత్రాలను ఎలా నడిపిస్తారంటే, మీరు ఎక్కడున్నది ఎవరికీ తెలియదు. కాని, పరిణామాలు ఎలా ఉంటాయంటే, మీరు భక్తుల వెనుకే ఎప్పుడూ ఉన్నట్లు వారికి అనుభవమౌతుంది. 
జ్ఞానీ, పండిత శహాణే సుర్తే | అభిమానే రుతతీ సంసారగర్తే | 
భోళే భాబడే అజ్ఞానీ నేణతే | త్యా నిజసత్తే ఖేళవిసీ | ||౬|| 
6. జ్ఞానులు, పండితులు, చతురులు వారి అహంభావం వలనే ప్రపంచమనే సుడిగుండంలో చిక్కుకుంటారు. కాని, అమాయకులను, అజ్ఞానులను, ఏమీ తెలియని వారిని మీ స్వశక్తితో ఆడిస్తారు. 
ఆంతూన సకల ఖేళ ఖేళసీ | అలిప్తతేచా ఝేండా మిరవిసీ | 
కరోని అకర్తా స్వయే మ్హణవిసీ | నకళే కవణాసీ చరిత్ర తుఝే | ||౭|| 
7. లోలోపల ఎన్నో లీలలను చేస్తూ, పైకి మాత్రం ఏమీ అంటనట్లు కనిపిస్తారు. అన్నీ చేస్తూ, నేనేమీ చేయను, నేను కర్తను కాను అని చెప్పుకుంటారు. మీ చరిత్ర నిజంగా ఎవరికీ అర్థం కానిది. 
మ్హణోని కాయావాచా మన | కరూ తుఝియా పాయీ అర్పణ | 
ముఖీ నిరంతర నామస్మరణ | హోఈల క్షాలన పాపాచే | ||౮|| 
8. అందుకే, శరీరాన్ని, వాక్కుని, మనసును మీ పాదాలకు సమర్పించి, నిరంతరం నోటితో మీ నామ స్మరణ చేస్తే, పాపాలన్నీ తొలగిపోతాయి. 
సకామాచా పురవీసీ కామ | నిష్కామా దేసీ నిజసుఖధామ | 
ఏసే గోడ తుఝే నామ | ఉపాయ సుగమ సద్భక్తా | ||౯|| 
9. కోరికలున్నవారి కోరికలు తీర్చి, ఏ కోరికలూ లేనివారికి శాశ్వత ఆత్మానందాన్ని ప్రసాదిస్తారు. ఇటువంటి మధురమైన మీ నామమొక్కటే సద్భక్తులకు సులభమైన ఉపాయం. 
తేణే పాపాంచా హోఈల క్షయ | రజతమ జాతీల నిఃసంశయ | 
సత్వ గుణాచా క్రమే ఉపచయ | ధర్మసంచయ త్యాపాఠీ | ||౧౦||
10. దానివలన, పాపాలు నశించి పోయి, రజస్తమో గుణాలు నిశ్శేషంగా తొలగిపోయి, క్రమేణ సత్వ గుణం అభివృద్ధి చెంది, ధర్మం మనలో నెలకొంటుంది. 

ధర్మవృత్తీ హోతా జాగృత | వైరాగ్య యేఈ మాగే ధాంవత | 
నామశేష విషయ హోత | తాత్కాళ ప్రకటత నిజజ్ఞాన | ||౧౧|| 
11. ఈ రకంగా ధర్మవృత్తి మనలో జాగృతం కాగానే, వైరాగ్యం వెంటనే తొందరగా వస్తుంది. విషయ సుఖాల కోరికలన్నీ నశించి, ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమౌతుంది. 
వివేకేంసీ లాభతా జ్ఞాన | స్వస్వరూపీ అనుసంధాన | 
తేంచ గురుపదీ అవస్థాన | పూర్ణ ‘గుర్వర్పణ’ యా నాంవ | ||౧౨|| 
12. నిత్యానిత్య వివేకంతో జ్ఞానం కలగగానే, ఆత్మస్వరూపంతో ఐక్యత కుదురుతుంది. అదే గురుచరణాలలో స్థిరపడటం. దీనినే గురువుకు సంపూర్ణ అర్పణ అని అంటారు. 
మన సాఈపదీ అర్పణ | జాహలే యాచీ ఎకచ ఖూణ | 
సాధక హోయ శాంతి ప్రవణ | ఉల్హాసే సంపూర్ణ నిజభక్తి | ||౧౩|| 
13. మనసు సాయి పాదాలకు అంకితమైంది అని అనటానికి ఒకటే గుర్తు. సాధకుని మనసు శాంతినే ఆశిస్తుంది. అతని భక్తి పరాకాష్ఠ చెందుతుంది. 
సప్రేమ గురుభక్తి యా నాంవ ‘ధర్మ’ | అవఘా తో మీచ హే ‘జ్ఞానవర్మ’ | 
విషయీ అరతి ‘వైరాగ్య’ పరమ | సంసారా ‘ఉపరమ’ తే ఠాయీ | ||౧౪|| 
14. ప్రేమపూర్వకమైన గురుభక్తికి ధర్మం అని పేరు. అంతటా నేనే అన్నది జ్ఞానసారం. విషయసుఖాలలో నిరాసక్తి కలగటం పరమ వైరాగ్యం. దానితో మనసు ప్రపంచంనుండి విరమిస్తుంది. 
ఏసియా భక్తీచా మహిమా ధన్య | కేలియా జీవేభావే అనన్య | 
శాంతి విరక్తి కీర్తి యా తీన | జియేచ్యా ఆధీన సర్వదా | ||౧౫|| 
15. ఇలాంటి భక్తియొక్క మహిమ ధన్యం. దీనినే ఏకాగ్ర మనసుతో సాధించినవారికి శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడూ ఎప్పుడూ అధీనంలో ఉంటాయి. 
గురుభక్తి ఏసీ జయాసీ | ఉణే కైచే తరీ తయాసీ | 
ఇచ్ఛీల జే జే అపులే మానసీ | తే తే అప్రయాసీ లాధేల | ||౧౬|| 
16. ఇలాంటి గురుభక్తి ఉన్నవారికి ఏమి లోటు ఉంటుంది? మనసులో దేనిని కోరినా అది అప్రయాసంగా లభిస్తాయి. 
ఏసియా త్యా భక్తీపాసీ | బ్రహ్మస్థితి తో ఆందణీ దాసీ | 
తేథే కోణీ న మోక్షా పుసీ | తీర్థే పాయాంసీ లాగతీ | ||౧౭|| 
17. ఇలాంటి భక్తి ఉన్న చోట బ్రహ్మస్థితి దాసివలే ఉంటుంది. అక్కడ మోక్షాన్ని ఎవరూ ఖాతరు చేయరు. అట్టివారి పాదాల వద్దకు పుణ్యతీర్థాలు చేరుతాయి. 
పూర్వీల అధ్యాయీ జాహలే కథన | దీక్షితాంచే భాగవత వాచన | 
నవయోగియాంచే భక్తివర్ణన | చరణదర్శన సాఈచే | ||౧౮|| 
18. గత అధ్యాయంలో దీక్షితు భాగవతాన్ని పఠించటం, నవయోగులయొక్క భక్తి వర్ణన, సాయియొక్క పాద దర్శనం గురించి చెప్పబడింది. 
సాఈ భక్త ఆనందరావ | పాఖాడే జయాలాగీ ఉపనావ | 
కథిలే తయాంచే స్వప్నలాఘవ | భక్తీచే వైభవ సాఈచ్యా | ||౧౯|| 
19. అలాగే, పాఖాడే అనే ఉపనామమున్న ఆనందరావుయొక్క అద్భుతమైన స్వప్న వృత్తాంతాన్ని గురించి, సాయియొక్క భక్తి వైభవాన్ని గురించీ చెప్పాను. 
సాఈ జయాస ఘేతీ పదరీ | తో ఘరీ అసో వా ద్వీపాంతరీ | 
తయా సన్నిధ అష్టౌ ప్రహరీ | వసే నిర్ధారీ శ్రీసాఈ | ||౨౦|| 
20. సాయి ఎవరిని తమ దరికి చేర్చుకున్నారో వారు ఇంటిలో ఉన్నా, ఎక్కడో ద్వీపాంతరంలో ఉన్నా, శ్రీసాయి ఎల్లప్పుడూ వారి వద్దే తప్పకుండా ఉంటారు. 

భక్త జేథే జేథే జాఈ | తేథే తేథే కవణ్యాహీ ఠాయీ | 
ఆధీంచ జాఊన ఉభా రాహీ | దర్శన దేఈ అకల్పిత | ||౨౧|| 
21. భక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడక్కడకి, ఏ ప్రదేశమైనా, సాయి ముందుగానే వెళ్లి అకస్మాత్తుగా వారికి దర్శనమిస్తారు.
యే అర్థీంచీ అభినవ కథా | కథితో తుమ్హా శ్రోతయాం కరితా | 
విస్మయ వాటేల శ్రవణ కరితా | ఆనంద చిత్తా హోఈల | ||౨౨|| 
22. దీని గురించే ఒక అభినవ కథను శ్రోతలైన మీకు చెప్పుతాను. ఈ కథను వింటే మనసుకు ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి. 
యేథీల సాఈ ముఖీచీ అక్షరే | భావే సేవితా శ్రవణద్వారే | 
సమాధి సౌఖ్య ఫిరే మాఘారే | స్వానందే తరతరే సద్భక్త | ||౨౩|| 
23. ఇక్కడ సాయి నోటినుండి వచ్చిన మాటలను చెవుల ద్వారా భక్తిగా వింటే, సమాధి సుఖం కూడా దానికి సమం కాదు. సద్భక్తులు ఆత్మానందంతో తరిస్తారు. 
జేథ ప్రతిపదీ చమత్కారతా | ఏసీ హీ గోడ కథా పరిసతా | 
ఆప ఆపణా విసరేల శ్రోతా | అలోట గహివరతా దాటేల | ||౨౪|| 
24. అడుగడుగున చమత్కారంతో నిండిన ఇటువంటి మధురమైన కథను వింటే శ్రోతలు తమను తాము మరచిపోతారు. అత్యంత భావోద్రేకంతో వారు పులకించి పోతారు. 
కాకాసాహేబ దీక్షితాంచా | జ్యేష్ఠ పుత్ర బాబూ యాచా | 
నాగపురీ వ్రతబంధ సాచా | కరావయాచా నిశ్చయ | ||౨౫|| 
25. కాకాసాహేబు దీక్షితుని పెద్ద కుమారుడైన బాబుకు నాగపూరులో ఒడుగు చేయాలని నిశ్చయమైంది. 
నానాసాహేబ చాందోరకర | తయాంచాహీ జ్యేష్ఠ పుత్ర | 
తయాచ్యాహీ లగ్నాచా విచార | జాణే గ్వాల్హేర శహరాసీ | ||౨౬|| 
26. నానాసాహేబు చాందోర్కరుని పెద్ద కుమారునికి కూడా వివాహం చేయాలని అనుకోగా, దాని కోసం గ్వాలియరు పట్టణానికి వెళ్లవలసి ఉంది. 
మౌంజీబంధన ఝాలియా పాఠీ | గ్వాల్హేరీస లగ్నాసాఠీ | 
కాకాముళే వ్హావీ న ఖోటీ | హోతే హే పోటీ నానాంచ్యా | ||౨౭|| 
27. ఒడుగు కార్యం పూర్తయాక గ్వాలియరుకు రావటానికి కాకాకు కొంత సమయం కావలసి ఉంటుంది అనేది నానా ఆలోచన. 
నాగపురాహూని గ్వాల్హేరీస | కాకానే యావే స్వస్థ మానస | 
ఏసియా ధరిలే సుముహూర్తాస | జో కీ ఉభయతాంస సోయీచా | ||౨౮|| 
28. నాగపూరునుండి గ్వాలియరుకు కాకా సానుకూలంగా రావటానికోసం, ఇద్దరికీ వీలుగా ఉండే ముహూర్తాలను నిర్ణయించాడు. 
నంతర సాఈచే దర్శనాస | లగ్నాచ్యాహీ ఆమంత్రణాస | 
నానాసాహేబ భక్తావతంస1 | పాతలే శిరడీస ఉత్సాహే | ||౨౯|| 
29. తరువాత, సాయిని దర్శనం చేసుకుని, అలాగే వివాహానికి కూడా పిలవటానికి, భక్త శ్రేష్ఠుడైన నానాసాహేబు ఎంతో ఉత్సాహంగా శిరిడీకి వచ్చాడు. 
కాకాసాహేబ తేథేంచ హోతే | నానా జాఊన మశీదీతే | 
బాబాంస నిమంత్రితీ లగ్నాతే | కర సంపుటాతే జోడూన | ||౩౦|| 
30. కాకాసాహేబు అక్కడే ఉన్నాడు. నానా మసీదుకు వెళ్లి చేతులు జోడించుకుని బాబాను వివాహానికి రావలసిందిగా ఆహ్వానించాడు. 

తంవ బాబా “బరే” మ్హణతీ | “సవే శామ్యాస2 నేఈ” వదతీ | 
పుఢే దో దివసీ కాకాహీ పుసతీ | బాబాంస ఆమంత్రితీ ముంజీతే | ||౩౧|| 
31. బాబా అప్పుడు “సరే” అని తరువాత “శ్యామ్యాను వెంటబెట్టుకుని వెళ్లు” అని చెప్పారు. కాకాసాహేబు కూడా బాబాను ఒడుగుకు రావలసిందిగా ఆహ్వానించాడు. 
త్యాంసహీ బాబా తైసేంచ వదతీ | “శామ్యాస నేఈ” మ్హణతీ సంగతీ | 
కాకాసాహేబ ఆగ్రహ కరితీ | స్వయే యేణ్యాప్రతీ బాబాంస | ||౩౨|| 
32. అతనికి కూడా “శ్యామ్యాను వెంటబెట్టుకుని వెళ్లు” అని బాబా చెప్పారు. కాని, కాకాసాహేబు బాబా స్వయంగా రావాలని వారిని బలవంత పెట్టాడు. 
తయావరీహీ తాత్కాళ ఉత్తర | “కాశీప్రయాగ కరూని సత్వర | 
శామ్యాచేహీ యేతో అగోదర | మజ కాయ ఉశీర యావయా” | ||౩౩|| 
33. అందుకు బాబా వెంటనే “కాశీ ప్రయాగ యాత్రలు త్వరగా చేసి, శ్యామ్యాకంటే ముందుగానే వస్తాను. రావటానికి నాకేం ఆలస్యం” అని జవాబిచ్చారు. 
ఆతా శ్రోతీ యా శబ్దాంవర | దేఊన చిత్త వ్హావే అర్థపర | 
పహావయా తయాంచే ప్రత్యంతర | బాబాంచీ సర్వవ్యాపకతా | ||౩౪|| 
34. ఈ మాటలను శ్రోతలు గుర్తుంచుకోండి. వాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే, సాయియొక్క సర్వ వ్యాపకత్వాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవచ్చు. 
అసో భోజన ఝాలియావర | మాధవరావ కరితీ విచార | 
‘ఎకదా పదరీ పడతా గ్వాల్హేర | కాశీ మగ కాయ దూర అసే’ | ||౩౫|| 
35. అలా, భోజనం చేసి, మాధవరావు ‘ఒకసారి గ్వాలియరు వరకూ బయలుదేరితే ఇక కాశి ఎంత దూరంలో ఉంటుంది’ అని ఆలోచించాడు. 
రుపయే ఖర్చీస ఘేతలే శంభర | నందరామాచే3 ఉసనవార | 
గేలే బాబాంచా ఘ్యావయా రుకార | పుసతీ అతి ఆదరపూర్వక | ||౩౬|| 
36. దారి ఖర్చుకోసం నందరాము దగ్గర వంద రూపాయలను అప్పు తీసుకుని, బాబా అనుమతిని తీసుకోవడానికి వెళ్లాడు. ఎంతో ఆదర ఫూర్వకంగా, 
‘ఆతా లగ్న ముంజీ నిమిత్త | ఘడతసే జాణే గ్వాల్హేరీ పర్యంత | 
కాశీ గయా ప్రసంగోపాత్త | సాధావీ ఉచిత వాటే మనా | ||౩౭|| 
37. ‘ఒడుగు, వివాహం కారణంగా ఇప్పుడు గ్వాలియరు వరకు వెళ్లుతున్నాను కదా, కాశీగయా యాత్రలు కూడా చేస్తే మంచిదని అనుకుంటున్నాను. 
తరీ దేవా పడతసే పాయా | కరూని యేఊ కా కాశీ గయా’ | 
బాబాంనీ ఆజ్ఞా దిధలీ జావయా | మాధవరావాస ఆనందే | ||౩౮|| 
38. ‘అందుకు దేవా, మీ చరణాలకు నమస్కరించి ప్రార్థిస్తునాను, మరి కాశీగయా వెళ్లిరానా?’ అని అడిగాడు. బాబా ఆనందంతో మాధవరావుకు వెళ్లటానికి అనుమతిని ఇచ్చారు. 
ఆణీక వరతీ వదలే తయాంసీ | “వావగే తరీ తూ కాయ పుససీ | 
సహజ ఘడే జే అప్రయాసీ | అచూక తే నిశ్చయేసీ సాధావే” | ||౩౯|| 
39. ఇంకా అతనితో బాబా “నీవు ఆడుగుతున్న దానిలో అనుచితం ఏముంది? ఎందుకు అడుగుతున్నావు? ఏ కష్టం లేకుండా సహజంగా జరిగేదానిని తప్పకుండా సాధించుకోవాలి” అని చెప్పారు. 
అసో ఏసీ ఆజ్ఞా ఝాలీ | మాధవరావానీ గాడీ కేలీ | 
వాట కోపరగాంవాచీ ధరలీ | గాంఠ తంవ పడలీ ఆపాచీ4 | ||౪౦|| 
40. అలా అతనికి బాబా అనుమతిని ఇచ్చారు. మాధవరావు బండి చేసుకుని కోపర్‍గాం మార్గాన పడ్డాడు. అప్పుడు అప్పా కోటేను కలిశాడు. 

ఆణావయాస అపులీ నాత | ఆపా జాత చాందవడా ప్రత | 
ఏకూనియా తీ కాశీచీ మాత | ఉడీ తే టాకీత తాంగ్యాంతునీ | ||౪౧|| 
41. అప్పా తన మనవరాలిని తీసుకుని రావటానికి చాంద్‍వాడాకు వెళ్లుతున్నాడు. కాశీ యాత్రను గురించి విని టాంగాలోనుండి దూకాడు.
కరావయా కాశీ ప్రవాస | పైసా జరీ నవ్హతా గాఠీస | 
మాధవరావాసారఖా సహవాస | ఆపా కోత్యాంస త్యాగవేనా | ||౪౨|| 
42. కాశీ ప్రయాణానికి అతని వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ మాధవరావు వంటి తోడును వదులుకోలేక పోయాడు.
మాధవరావాంనీ దిధలా ధీర | ఆపా కోత్యాంస మగ కాయ ఉశిర | 
ఆనందే గాడీంత బైసలే సత్వర | ప్రసంగతత్పర హోఊని | ||౪౩|| 
43. మాధవరావు ధైర్యం చెప్పిన తరువాత, ఇక అప్పాకోతేకు ఆలోచించవలసినది ఏముంది? ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆనందంగా బండిలో కూర్చున్నాడు.
ఆపా కోతే పాటీల సధన | పరీ న మార్గీ పైశాచే సాధన | 
తదర్థ త్యాంచే కాశీ ప్రయాణ | చుకేల హీ దారుణ చింతా తయా | ||౪౪|| 
44. అప్పా కోతే పాటీలు ధనవంతుడే. కాని చాంద్‍వాడాకని వెళ్లినందువలన అప్పుడు చేతిలో డబ్బు లేకపోవడంతో, కాశీ ప్రయాణం ఆగిపోతుందేమోనని అతనికి పెద్ద చింత.
వాహత్యా గంగేచియా ఆంత | హాత ధువావే ఆలే మనాంత | 
మాధవరావాసారఖీ సోబత | సాధావీ హే మనోగత ఆపాచే | |||౪౫|| 
45. చేజిక్కిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా పుణ్యం సంపాదించుకోవాలి. పైగా మాధవరావు వంటి తోడు ఉన్నప్పుడు తన కోరికను తీర్చుకోవాలి అని అప్పా ఆలోచన.
అసో హీ త్యాంచీ వేళ జాణూన | వేళీ తయాసీ ధీర దేఊన | 
మాధవరావానీ సవే నేఊన | కాశీ త్యా ఘడవూన దీధలీ | ||౪౬|| 
46. అతని బాధను గ్రహించి, అతనికి ధైర్యం చెప్పి, మాధవరావు అతనిని వెంట పెట్టుకుని వెళ్లి, కాశీయాత్ర పుణ్యం ఆయనకు కూడా వచ్చేలా చేశాడు.
పుఢే తే గేలే నాగపురాస | ముంజీచియా సమారంభాస | 
కాకాసాహేబ మాధవరావాంస | దేతీ ఖర్చావయాస దోనశే5 | ||౪౭|| 
47. తరువాత, వారిద్దరూ ఉపనయన శుభకార్యానికి నాగపూరుకి వెళ్లారు. దారి ఖర్చుకోసం కాకాసాహేబు మాధవరావుకు రెండు వందల రూపాయలను ఇచ్చాడు.
తేథూన కేలే గ్వాల్హేరీస | తేథీల లగ్నసమారంభాస | 
నానాసాహేబ మాధవరావాంస | దేతీ తే సమయాస శంభర6 | ||౪౮|| 
48. అక్కడనుండి, వివాహ సమారంభానికి గ్వాలియరు వెళ్లారు. నానాసాహేబు మాధవరావుకు వంద రూపయలను ఇచ్చాడు.
నానాంచే వ్యాహీ శ్రీమంత జఠార | తయాంనీహీ దిధలే శంభర | 
ఏశియా రీతీ ప్రేమసంభార | ఝాలా గురుబంధూవర నానాంచ్యా | ||౪౯|| 
49. నానా వియ్యంకుడు, శ్రీమంత జఠారు కూడా వంద రూపాయలను ఇచ్చాడు. ఈ విధంగా తన గురుబంధువును నానా సత్కార పూర్వకంగా గౌరవించాడు.
కాశీస మంగళ ఘాటావర | జడావాచే కోరీంవ సుందర | 
లక్ష్మీ నారాయణాచే మందిర | జయాచే హే జఠార మాలక | ||౫౦||
50. కాశీలోని మంగళఘాటు వద్ద బంగారు రేకులతో పొదగిన సుందరమైన లక్ష్మీనారాయణ మందిరం ఉంది. దానికి ఈ జఠారే యజమాని.

అయోధ్యేంతహీ శ్రీరామమందిర | జఠారాంచే ఆహే సుందర | 
దోన్హీహీ క్షేత్రీ ఆదరసత్కార | తయాంచే మునీమాంవర సోంపవిలా | ||౫౧|| 
51. అయోధ్యలో కూడా జఠారుకు సుందరమైన శ్రీరామ మందిరమున్నది. ఈ రెండు క్షేత్రాలలోనూ అప్పాకు, మాధవరావుకు గౌరవాదరాలు చేయవలసిన పనిని తన గుమాస్తాకు అప్పగించాడు. 
గ్వాల్హేరీహూన మథురే గేలే | సవే ఓఝే7 బినీవాలే8 | 
పేంఢారకరహీ9 హోతే ఆలే | తిఘేహీ పరతలే తేథూన | ||౫౨|| 
52. గ్వాలియరు నుండి వారిద్దరూ మథురకు వెళ్లారు. వారితో వఝే, బినివాలే, పెండార్కర్‍ కూడా వెళ్లి, తరువాత తిరిగి వచ్చేశారు.
మాధవరావ ఆణి కోతే | తేథూన ప్రయాగా ఝాలే జాతే | 
రామనవమీచ్యా ఉత్సవాతే | అయోధ్యే ఆంతౌతే ప్రవేశలే | ||౫౩|| 
53. మాధవరావు, అప్పా కోతే మటుకు అక్కడనుండి ప్రయాగకు వెళ్లి, శ్రీరామ నవమి ఉత్సవం సమయానికి అయోధ్యకు వచ్చారు.
దిన ఎకవీస తేథే రాహిలే | మహినే దోన కాశీంత కాఢలే | 
చంద్రసూర్య గ్రహణ ఝాలే | దోఘే మగ నిఘాలే గయేస | ||౫౪|| 
54. అక్కడ ఇరవై ఒక్క రోజులు ఉన్నారు. తరువాత కాశీలో రెండు నెలలు గడిపారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గడిచాక, ఇద్దరూ గయకు బయల్దేరారు.
గయేంత గ్రంథీ జ్వరాచీ సాథ | గల్లోగల్లీ జన సచింత | 
ఏసీ తేథే పరిసిలీ మాత | అసతా అగ్నిరథాంత దోఘాంనీ | ||౫౫|| 
55. గయలో ప్లేగు వ్యాపించి ఉందని, సందులలో గొందులలో ఉన్న జనం అదే చింతలో ఉన్నారని, అక్కడ పరిస్థితి రైలు బండిలో ఉండగానే వారిద్దరికీ తెలిసింది.
అగ్నిరథ స్టేశనాంత | యేఊన థాంబతా పడలీ రాత | 
తేథేంచ మగ ధర్మశాళేంత | దోఘేహీ స్వస్థ విసావలే | ||౫౬|| 
56. గయ స్టేషనులో రైలుబండి ఆగే సరికి రాత్రయింది. అందువలన వారిద్దరూ అక్కడే ఉన్న ధర్మశాలలో విశ్రమించారు.
అసో హోతా ప్రాతఃకాళ | భేటీస ఆలా గయావళ | 
తో వదే కరా ఉతావళ | యాత్రాహీ సకళ చాలలీ | ||౫౭|| 
57. తెల్లవారగానే గయలోని పిండారి (పిండ ప్రదానం చేయించే బ్రాహ్మణుడు) వచ్చి, ‘యాత్రికులంతా వెళ్లిపోతూ ఉన్నారు. త్వరగా పదండి’ అని చెప్పాడు.
మాధవరావ ఉద్విగ్నచిత్త | తయాంలాగీ హళూచ పుసత | 
యేతో పరీ జ్వరాచీ సాథ | తుమచియా వస్తీంత ఆహే కా | ||౫౮|| 
58. మాధవరావు భయంతో మెల్లగా, ‘సరే వస్తాం. కాని మీ బస్తీలో కూడా ప్లేగు ఉందా’ అని అడిగాడు.
మగ తో తయా దేఈ ఉత్తర | యేఊని పహా కీ హో తేథవర | 
తేథే నాహీ తసలా ప్రకార | చలా మజబరోబర నిఃశంక | ||౫౯|| 
59. అందుకు ఆయన, ‘అక్కడ అలాంటిదేమీ లేదు. మీరే అక్కడికి వచ్చి చూడండి. నిశ్చింతగా మీరు నా వెంట రండి’ అని చెప్పాడు.
అసో పుఢే హే దోఘేజణ | గయావళాచే యేథే జాఊన | 
పాహూని త్యాచే సదన విస్తీర్ణ | ప్రసన్నాంతఃకరణ జాహలే | ||౬౦|| 
60. వారిరువురూ అతనితో వెళ్లి, విశాలమైన అతని ఇంటిని చూచి సంతోషించారు.

ప్రసన్నతేచే ఆణీక కారణ | తే జో తేథే బైసతీ జాఊన | 
సమోర బాబాంచీ ఛబీ పాహూన | మాధవరావ గహింవరూన దాటలే | ||౬౧|| 
61. వారి సంతోషానికి మరో కారణం, వారు కూర్చోగానే ఎదుట బాబా పటాన్ని చూచారు. మాధవరావు హృదయం ద్రవించి, గద్గదుడైయ్యాడు.
నవ్హతే కధీంహీ ధ్యానీ మనీ | గయేసారిఖ్యా దూర ఠికాణీ | 
పడేల సాఈచీ ఛబీ నయనీ | ఆశ్చర్య మనీ దోఘాంచ్యా | ||౬౨|| 
62. గయవంటి దూర ప్రదేశంలో, సాయియొక్క పటం కళ్లకు కనిపిస్తుందని అతడు అసలు అనుకోలేదు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు. 
మాధవరావ అతి గహింవరలే | ఆనందాశ్రు నయనీ లోటలే | 
కా హో ఆపణ రడూ లాగలే | ఏసే త్యా పుసిలే గయావళే | ||౬౩|| 
63. మాధవరావు కళ్లనుండి ఆనందాశ్రువులు దొర్లి, మనసంతా ప్రేమతో నిండిపోయింది. ‘మీరు ఎందుకు ఏడుస్తున్నారు?’ అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు. 
కాంహీ ఎక నసతా కారణ | మాధవరావ కరితా రూదన | 
గయావళ హోయ సందేహాపన్న | జాహలా ఉద్విగ్న మానస | ||౬౪|| 
64. ఏ కారణమూ లేకుండా మాధవరావు ఏడుస్తుంటే, బ్రాహ్మణునికి సందేహం కలిగింది. అతని మనసు వికలమైంది. 
గయేమాజీ గ్రంథిజ్వర | కైసీ యాత్రా ఘడేల నిర్ధార | 
మాధవరావా మనీ హా విచార | గయావళ ఫార చింతాపలా | ||౬౫|| 
65. ‘గయలో ప్లేగు ఉంది, యాత్ర అనుకున్నట్లుగా చక్కగా జరుగుతుందా లేదా అని మాధవరావు చింతిస్తూ ఉన్నాడని’ అతడు బాధపడ్డాడు. 
ఆధీంచ ఆపణ కళవిలే హోతే | కీ గ్రంథిజ్వర నాహీ యేథే | 
తరీహీ ఆపణ కరితా చింతేతే | ఆశ్చర్య ఆమ్హాతే వాటతే | ||౬౬|| 
66. ‘ఇక్కడ ప్లేగు లేదని ముందుగానే మీకు చెప్పాను కదా. అయినా మీరు దుఃఖపడటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 
నసేల ఆమ్హాంవరీ విశ్వాస | పుసూన ఘ్యానా యా అవఘియాంస | 
యేథే న భీతి తుమచియా కేసాస | పాణీ కా డోళ్యాంస ఆణితా | ||౬౭|| 
67. ‘మామీద నమ్మకం లేకపోతే, వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుకవాసి అంత కూడా భయం లేదు. మరి ఎందుకు కళ్లవెంట నీరు కారుస్తున్నారు?’ అని ప్రశ్నించాడు. 
ఘేతలా గ్రంథీచే సాథీచా ధసకా | మోడలీ జయాచే ధైర్యాచీ బైసకా | 
మ్హణూన రడే హా యాత్రేకరూ దేఖా | ఏసా హా ఎక సారఖా నిష్కారణ | ||౬౮|| 
68. ‘ప్లేగు భయంతో యాత్రికుని ధైర్యం సడలిపోయి, నిష్కారణంగా ఊరికే ఏడుస్తున్నాడు’. 
మ్హణోని గయావళ కరీ సమజీ | మాధవరావాచే మనామాజీ | 
మాఝ్యా ఆధీంచ మాఉలీ మాఝీ | కైసీ హీ ఆజి మజపుఢే | ||౬౯|| 
69. అలా అనుకుని బ్రాహ్మణుడు వారికి నచ్చచెప్పి శాంత పరుచబోయాడు. కాని, మాధవరావు మనసులో, మా సాయి తల్లి నా కంటే ముందుగా వచ్చి నా ఎదుట ఎలా ఉంది? 
“కాశీ ప్రయాగ కరీని సత్వర | శామ్యాచ్యాహీ యేతో అగోదర” | 
హే జే బాబాంచే పూర్వీల ఉద్గార | తే హే ప్రత్యంతర మూర్తిమంత | ||౭౦||
70. “కాశీ ప్రయాగ యాత్ర ముగించుకుని శామ్యా కంటే ముందుగా వస్తానని” బాబా మునుపు చెప్పిన వచనం ప్రత్యక్షంగా అనుభవమైంది. 

ఛబీ బాబాంచీ డోళ్యాసమోర | దిసతా గృహప్రవేశాబరోబర | 
పాహూని హా అకల్పిత ప్రకార | వాటలా చమత్కార అత్యంత | ||౭౧|| 
71. ఇంట్లోకి అడుగుపెట్టగానే బాబా పటం కళ్ల ఎదుట కనిపించగా, అనుకోకుండా సంభవించిన ఈ అనుభవం అత్యంత చమత్కారంగా అతనికి అనిపించింది. 
కంఠీ ప్రేమాచా గహింవర | డోళా ఆనందాశ్రూంచా పూర | 
ఉఠలే రౌమాంచ సర్వాంగావర | ఫుటలా పాఝర ఘర్మాచా | ||౭౨|| 
72. ప్రేమతో కంఠం గద్గదమైంది. కళ్లు ఆనందాశ్రువులతో నిండాయి. శరీరమంతా రోమాంచితమై చెమట పట్ట సాగింది. 
ఏసీ మాధవరావాంచీ స్థితీ | గయావళాచే విపరీత చిత్తీ | 
గ్రంథి జ్వరాచీ పడలీ భీతి | మ్హణోని హే రడతీ సత్య వాటే | ||౭౩|| 
73. ఈ స్థితిలో మాధవరావుని చూచి, ‘అతడు ప్లేగు ఉందని భయపడ్డాడు, అందువలనే ఏడుస్తున్నాడు’ అని బ్రాహ్మణుడు మరో విధంగా తలచాడు. 
శామాచ పుఢే జిజ్ఞాసా ప్రేరిత | గయావళాసీ పృచ్ఛా కరీత | 
కైసేని హీ తుమ్హాంసీ ప్రాప్త | కథా హే సాద్యంత ఆమ్హాతే | ||౭౪|| 
74. తరువాత, చాలా విస్మయంతో శ్యామాయే బ్రాహ్మణుని, ‘ఈ పటం నీకు ఎలా లభించిందో మొత్తం చెప్పు’ అని అడిగాడు. 
పుఢే గయావళ సాంగూ లాగలా | సమగ్ర వృత్తాంత మాధవరావాలా | 
బారా వర్షామాగే జో ఘడలా | నవలావ ఝాలా పరిసా తో | ||౭౫|| 
75. అప్పుడు ఆ బ్రాహ్మణుడు పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన విశేషాన్నంతా మాధవరావుకు చెప్పసాగాడు. దానిని వినండి. 
ఎక నా దోన తీనశే నోకర | గయావళాచే పగారదార | 
మనమాడ ఆణి పుణతాంబ్యావర | యాత్రా సవిస్తర నోందీత | ||౭౬|| 
76. ఆ బ్రాహ్మణుని వద్ద, వంద కాదు, రెండు మూడు వందల మంది జీతం పుచ్చుకునే నౌకర్లు ఉన్నారు. వారు మన్మాడు, పుణతాంబేలలో కూడా ఉన్నారు. యాత్రికులకు సదుపాయాన్ని కలిగించటం అతని నిత్య వృత్తి. 
యాత్రేకరూంచీ లావావీ సోయ | గయావళాంచా నిత్య వ్యవసాయ | 
చాలలే అసతా ఏసే కార్య | గయావళ హా జాయ శిరడీతే | ||౭౭|| 
77. యాత్రికులకు సదుపాయం కలిగించే అతని నిత్య వ్యవహారం అలా జరుగుతుండగా అతను శిరిడీకు వెళ్లాడు. 
సాఈ సమర్థ మోఠే సంత | ఏసీ త్యాంనే పరిసిలీ మాత | 
వ్హావే తయాంచ్యా దర్శనే పునిత | ధరిలా హా హేత తయానే | ||౭౮|| 
78. సాయి సమర్థులు గొప్ప సంతులని అతను విన్నాడు. అందుకు వారి దర్శనంతో పునీతుడవ్వాలని అతని కోరిక. 
ఘేతలే సాఈబాబాంచే దర్శన | కరూనియా పాయాంచే వందన | 
ఛబీ తయాంచీ వ్హావీ సంపాదన | ఇచ్ఛా హీ నిర్మాణ జాహలీ | ||౭౯|| 
79. సాయిబాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాడు. వారి పటాన్ని పొందాలని అతనికి కోరిక కలిగింది. 
హోతీ మాధవరావాపాశీ | ఛబీ ఎక టాంగిలీ భింతీశీ | 
గయావళ మాంగూ లాగలా తియేసీ | పుసూని బాబాశీ తీ దిధలీ | ||౮౦|| 
80. మాధవరావు వద్ద గోడకి తగిలించిన బాబా పటం ఒకటి ఉంటే, దానిని చూచి, ఆ బ్రాహ్మణుడు దానిని కోరాడు. బాబా అనుమతితో మాధవరావు అతనికి దానిని ఇచ్చాడు. 

తీచ కీ తీ ఆపులీ ఛబీ | తోచ గయావళ హే మగ ఆఠవీ | 
తేథేంచ బాబా కైసే మజ పాఠవీ | కైసే మజ భేటవీ దీర్ఘకాలే | ||౮౧|| 
81. ఇదే ఆ పటము అని, ఇతడే ఆ బ్రాహ్మణుడు అని మాధవరావుకు గుర్తుకు వచ్చింది. ‘బాబా నన్ను ఇక్కడికే ఎలా పంపించారు? ఇంత కాలానికి ఈ కలయికను ఎలా సంభవింప చేశారు?’
వస్తుస్థితీ పాహూ జాతా | బారా వర్షాంమాగీల వార్తా | 
కోణ కిమర్థ కీ హీ స్మరతా | కధీ న చిత్తా ఆఠవలీ | ||౮౨|| 
82. ‘వాస్తవానికి పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన దానిని ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? ఇది మనసుకు ఎప్పుడూ గుర్తుకు రాలేదు’.
పరీ బాబాంచీ అగాధ లీలా | తేథేంచ పాఠవిలే శామాలా | 
తేథేంచ దిధలే నిజదర్శనాలా | గయావళహీ ధాలా అత్యంత | ||౮౩|| 
83. కాని, బాబా లీలలు అగాధం. శ్యామాను అక్కడికి పంపించి, అక్కడే తమ దర్శనాన్ని కలిగించారు. బ్రాహ్మణుడు కూడా అత్యంత సంతుష్టుడయ్యాడు.
హీచ కీ దిధలీ అపులే యేథూన | సాఈబాబాంచీ ఆజ్ఞా ఘేఊన | 
యాచ గయావళా లాగూన | జాహలే స్మరణ శామాస | ||౮౪|| 
84. ‘సాయిబాబా అనుమతిని తీసుకుని, ఇదే పటాన్ని ఈ బ్రాహ్మణుడికే నేను ఇచ్చాను’ అని శ్యామాకు గుర్తు వచ్చింది.
యాంచేచ యేథే పూర్వీ ఆపణ | ఉతరలో హోతో శిరడీస యేఊన | 
యానీంచ బాబాంచే కరవిలే దర్శన | జాహలే స్మరణ గయావళా | ||౮౫|| 
85. ‘మునుపు శిరిడీకి వెళ్లినప్పుడు ఇతని వద్దే బస చేసాను. ఇతడే బాబా దర్శనాన్ని చేయించాడు’ అని బ్రాహ్మణుడికీ కూడా గుర్తుకు వచ్చింది.
మగ పరస్పర కృతోపకార | నాహీ ఆనందా పారావార | 
ఠేవిలీ ఉత్తమ వ్యవస్థా ఫార | త్యాంనీ గయేవర శామాచీ | ||౮౬|| 
86. ఒకరికి ఒకరు చేసుకున్న ఉపకారాలను తలచుకుని ఇద్దరూ చాలా సంతోషించారు. బ్రాహ్మణుడు శ్యామాకు గయలో చాలా మంచి సదుపాయాలను చేశాడు.
తయా ఘరచీ కాయ శ్రీమంతీ | దారీ జయాచే ఝులతీ హత్తీ | 
ఆపణ పాలఖీమాజీ బైసతీ | శామాస బైసవితీ హత్తీవర | ||౮౭|| 
87. అతడికి ఎంత ఐశ్వర్యముందంటే, ఏనుగులు అతని ఇంటి ముందు ఉండేవి. తాను పల్లకీలో కూర్చుని, శ్యామాను ఏనుగుపై అంబారీలో కూర్చుండ బెట్టాడు.
ఆనందే విష్ణుపదావర జాఊన | పూజాసంభార సవే ఘేఊనీ | 
ఘాతలే దేవాస అభిషేక స్నాన | కేలే పిండప్రదాన యథావిధీ | ||౮౮|| 
88. చాలా ఆనందంతో పూజా సామగ్రిని వెంట తీసుకిని విష్ణుపాదం దగ్గరకు వెళ్లి దేవునికి అభిషేకం చేయించి, యథావిధిగా పిండప్రదానం కూడా చేయించాడు.
జాహలే మగ బ్రాహ్మణ సంతర్పణ | నైవేద్య సమర్పణపూర్వక భోజన | 
ఆనందే ఝాలీ యాత్రా సంపూర్ణ | ఘేతలీ కరవూన బాబాంనీ | ||౮౯|| 
89. దాని తరువాత, బ్రాహ్మణులకు సంతర్పణ, నైవేద్యం సమర్పణ పూర్వకంగా జరిగిన భోజనంతో యాత్ర తృప్తికరంగా సంపూర్ణమైంది. ఇదంతా వారి చేత బాబా చేయించినదే.
అసో యా సర్వ కథేచే సార | సార్థ బాబాచే ముఖోద్గార | 
అనుభవా యేతీ అక్షరే అక్షర | ప్రేమహీ భక్తాంవర అనివార | ||౯౦||
90. ఈ కథ సారంశం ఏమిటంటే, బాబా నోటినుండి వెలువడిన మాటలు అర్థభరితం మరియు అవి అక్షరం అక్షరం అనుభవంలోకి వస్తాయి అనేదే. బాబాకు భక్తుల పైన ప్రేమ కూడా అపారమైనది.

హే తర కాయ భక్తప్రేమ | ఇతర జీవాంసహీ దేఖత సమ | 
తయాంసీ హీ తాదాత్మ్య పరమ | ఆవడ హీ నిఃసీమ తయాంచీ | ||౯౧|| 
91. అయితే, భక్తులపైనేనా బాబా ప్రేమ? వాస్తవానికి, ఇతర ప్రాణులను కూడా వారు సమానంగా చూస్తారు. ఇతర ప్రాణుల పైన ప్రేమే కాకుండా, అన్ని ప్రాణులతోనూ తాదాత్మ్యం చెందేవారు. 
కధీ లేండీహూన మశీదీ యేతా | సహజ మార్గే చాలతా చాలతా | 
కళప ఎకదా శేళ్యాంచా భేటతా | పరమానందతా బాబాంస | ||౯౨|| 
92. లెండీనుండి మసీదుకు తిరిగి వచ్చేటప్పుడు, మామూలుగా దారిన నడుస్తుండగా, ఎప్పుడైనా మేకల మంద కలిస్తే, బాబాకు పరమానందం.
తంవ త్యా సమస్త కళపాంవరూన | నిజ అమృత దృష్టీ ఫిరవూన | 
త్యాంతూన కధీ ఎక వ దోన | శేళ్యా తే నివడూన కాఢీత | ||౯౩|| 
93. అప్పుడు, ఆ మంద మొత్తంవైపు తమ అమృత దృష్టిని ప్రసరింప చేసి, ఆ మందలోనుండి ఒకటో రెండో మేకలను ఏరుకుని తీసుకునేవారు.
ధణీ మాగేల జీ తీ కీంమత | బాబా తత్కాళ దేఊని టాకిత | 
కోండాజీచే పాశీ ఠేవిత | ఏసీ హీ పద్ధత బాబాంచీ | ||౯౪|| 
94. వాటి యజమాని అడిగినంత డబ్బును వెంటనే ఇచ్చి, మేకలను కొని, కొండాజీ వద్ద ఉంచేవారు. అది వారి పద్ధతి.
ఎకే దివశీ శేళ్యా దోన | కింమత బత్తీస దేఊన | 
బాబా ఆలే ఖరీదూన | సకళాం లాగూన ఆశ్చర్య | ||౯౫|| 
95. ఒక రోజు, ముప్పైరెండు రూపాయల వెల చెల్లించి రెండు మేకలను కొనుక్కుని వచ్చారు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
పడతా యా దోనీ దృష్టీ | అవచిత ఆవడీ ఉపజలీ పోటీ | 
జాఊనియా తయాంచే నికటీ | పాఠీ థోపటీ తయాంచీ | ||౯౬|| 
96. ఆ రెండు మేకలను చూసిన వెంటనే వారి మనసులో ప్రీతి ఉత్పన్నమైంది. వాని వద్దకు వెళ్లి, వాని వెన్ను తట్టారు.
పశు జన్మీ దేఖూని ఉభయతా | కృపా ఉపజలీ సాఈ సమర్థా | 
స్థితి పాహోని కళవళలే చిత్తా | ప్రేమోద్రేకతా దాటలీ | ||౯౭|| 
97. వాని పశు జన్మను చూచి, సాయి సమర్థులకు జాలి కలిగింది. వాని పరిస్థితిని చూచి, వారి మనసు కరిగి, ప్రేమ ఉప్పొంగింది.
ఘేవోనియా తయాంసీ జవళీ | సాఈ ప్రేమే తయా కురవాళీ | 
సాశ్చర్య ఝాలీ భక్తమండళీ | పాహోని నవ్హాళీ బాబాంచీ | ||౯౮|| 
98. వానిని దగ్గరకు తీసుకుని, సాయి ప్రేమతో నిమిరారు. బాబాయొక్క ఈ వింత చర్యను గని భక్తులు ఆశ్చర్యపోయారు.
పూర్వజన్మీంచా లోభ పరమ | స్మరలా సాఈస ఆలే ప్రేమ | 
పాహూని తయాంచా పశుజన్మ | కళవళా అప్రతిమ ఉపజలా | ||౯౯|| 
99. వాని పూర్వ జన్మలోని పరమ లోభం సాయికు గుర్తుకు వచ్చి, వానిపై ప్రేమ పెరిగింది. వాని జన్మను గని వారు కరుణతో కరిగిపోయారు.
దోన రుపయే జీచీ కింమత | తీన అథవా చార తిజప్రత | 
దేతీ బాబా సోళా హే విపరీత | పాహోని హో చకిత తాత్యాబా10 | ||౧౦౦|| 
100. వాని ఖరీదు రెండు రూపాయలు. లేదా మూడో లేక నాలుగో. కాని, బాబా పదహారు రూపాయలను ఇవ్వగా చూచి, తాత్యా చకితుడయ్యాడు.

‘దేఈ వాణీ ఘేఈ ప్రాణీ’ | ఏసే ప్రత్యక్ష దేఖూని నయనీ | 
తాత్యాసహ మాధవరావాంనీ | ధిక్కారిలీ కరణీ బాబాంచీ | ||౧౦౧|| 
101. వ్యాపారి అడిగినంత డబ్బు ఇచ్చి మేకలను కొనటం ప్రత్యక్షంగా చూచి, తాత్యాతో పాటు మాధవరావు కూడా బాబా చర్యను దుయ్య బట్టాడు.
దోహోంచే మోలా సోళా కా దేతీ | బాబాంస పైశాచీ కిమత కా నవ్హతీ | 
కీ తే యథేచ్ఛ కాంహీ తరీ కరితీ | ఏసీహీ ఉపపత్తి బైసేనా | ||౧౦౨|| 
102. రెండు రూపాయల వస్తువుకు పదహారు ఎందుకు ఇచ్చినట్లు? బాబాకు డబ్బు విలువ తెలియదా? అందుకే యథేచ్ఛగా ఏదో చేస్తుంటారా అంటే ఇది కూడా సరియైన మాట కాదు. 
దోఘే అంతరీ బహు చడఫడతీ | ఏసా కా బాబా హా సౌదా కరితీ | 
దోఘేహీ బాబాంస దూషణ దేతీ | హీ కాయ రీతీ సౌద్యాచీ | ||౧౦౩|| 
103. ‘బాబా ఎందుకిలాంటి బేరం చేశారు’ అని ఇద్దరూ చిరచిరలాడారు. ‘బేరమాడే పద్ధతి ఇలాగేనా?’ అని ఇద్దరూ బాబాను దూషించారు. 
ఏసే కైసే బాబా ఫసలే | పాహూ అవఘే లోక తై జమలే | 
బాబా అంతరీ స్వస్థ ఠేలే | జాణో న హరవలే యత్కించిత | ||౧౦౪|| 
104. అసలు బాబా ఎలా మోసగించ బడ్డారు? ఆ వింత చూడటానికి అందరూ అక్కడ పోగయ్యారు. ఏ మాత్రం నష్టం కలగనట్లు, బాబా తమలో తాము నిశ్చింతగా ఉన్నారు. 
జరీ హే దోఘే ఏసే కోపలే | బాబాంస దూషణ దేఊ సరలే | 
తరీ న బాబా యత్కించిత ఢళలే | అచల ఠేలే శాంతి సుఖే | ||౧౦౫|| 
105. వారిరువురూ కోపంతో బాబాను దూషిస్తున్నా, బాబా కించిత్తైనా చలించలేదు. అచలంగా, ప్రశాంతంగా, సంతోషంతో ఉన్నారు. 
మగ ఆదరోనీ వినయవృత్తీ | దోఘేహీ తే బాబాంస పుసతీ | 
హీ కాయ ఉదారపణాచీ రీతీ | రుపయే బత్తీస గేలేనా | ||౧౦౬|| 
106. తరువాత, వారిరువురూ వినయంగా, ఆదరపూర్వకంగా, ‘ముప్పైరెండు రూపాయలు వృథాగా పోయాయి కదా, ఇదేం ఉదారబుద్ధి’ అని బాబాను అడిగారు. 
కేవళ పైశాచా తో ప్రశ్న | పరిసోని సాఈ హాస్యవదన | 
మనీ మ్హణే హే వేడే జన | కైసే మ్యా సమాధాన కరావే | ||౧౦౭|| 
107. కేవలం డబ్బును గురించిన ప్రశ్నను విని సాయి, నవ్వు ముఖంతో, “పిచ్చి జనులారా! మిమ్మల్ని నేను ఎలా సమాధాన పరచను” అని తమలో అనుకున్నారు. 
పరీ బాబాంచీ శాంతీ విలక్షణ | స్థైర్య న ఢళే అణు ప్రమాణ | 
హేంచ పరమ శాంతీచే లక్షణ | ఆశ్చర్య అవఘేజణ కరితీ | ||౧౦౮|| 
108. వారి శాంతి విలక్షణమైనది. వారి స్థైర్యం అణుమాత్రమైనా చలించలేదు. ఇదే పరమ శాంతికి లక్షణం, అని అందరూ ఆశ్చర్య పడ్డారు. 
క్రోధ నాహీ జయాచ్యా గాంవీ | పరమశాంతీచ జో అనుభవీ | 
భూతమాత్రీ జో భగవంత భావీ | కైశీ త్యా శివావీ అవివేకతా | ||౧౦౯|| 
109. క్రోధమనేదే లేకుండా, పరమ శాంతిని అనుభవించే వారిని, సృష్టిలోని ప్రతి వస్తువులోనూ భగవంతుని చూచేవారిని అవివేకం ఎలా తాకగలదు? 
వివేకదృష్టీచే జే నిధడే | క్రోధ యేఊ న దేతీ పుఢే | 
విపాయే11 జై హా ప్రసంగ జడే | భాండార ఉఘడే శాంతీచే | ||౧౧౦||
110. వివేక దృష్టిగల సమర్థులు కోపాన్ని తమ ఎదుటకు రానీయరు. అనుకోకుండా అలాంటి సందర్భం వస్తే, వారి శాంతి భోషాణం తెరుచుకుంటుంది. 

“అల్లా మాలిక” నిరంతర ధ్యాన | తయాచే కాయ వానూ మహిమాన | 
చరిత్ర అగాధ ఆణీక గహన | అతిపావన హితకర | ||౧౧౧|| 
111. ఎల్లప్పుడూ “అల్లా మాలీక్‍” అని ధ్యానం చేసేవారి మహిమను ఎంతని వర్ణించను? వారి చరిత్ర అగాధం, అర్థం కానిది, అతి పావనము మరియు శుభప్రదము. 
జ్ఞాన గర్భ వైరాగ్యనిధీ | నిజశాంతీచా జో ఉదధీ | 
కరుణా పరిపూర్ణ జయాచీ బుద్ధి | వదలా త్రిశుద్ధీ తే పరియేసా | ||౧౧౨|| 
112. జ్ఞాన స్వరూపుడు, వైరాగ్యనిధి, శాంతి సాగరం, మరియు పరిపూర్ణ కరుణా బుద్ధిగల సాయి ఏమన్నారో వినండి. 
పాహూనియా దోఘాంచా ఆగ్రహ | బాబాంనీహీ కేలా నిగ్రహ | 
“జ్యా మజ బసావా ఠావ నా గృహ | త్యా మజ సంగ్రహ కిమర్థ | ||౧౧౩|| 
113. ఆ ఇద్దరి ఆగ్రహాన్నిగని, “కూర్చోవటానికి, ఉండటానికి ఇల్లు వాకిలి లేని వాణ్ణి. అలాంటి నేను డబ్బు పోగుచేసుకోవడంలో ఏమర్థం ఉంది?” అని చాలా నిగ్రహంతో బాబా వారిని అడిగారు. 
మ్హణాలే జాఊని దుకానాంత | ఆధీ ఆణా డాళ వికత | 
చారా శేరభర త్యా మనముక్త | మగ ద్యా త్యా పరత ధనగరా” | ||౧౧౪|| 
114. “ముందు అంగడికి వెళ్లి ఒక సేరు పప్పు కొనుక్కొని రండి. వానికి తృప్తిగా మేత పెట్టి, తరువాత వానిని గొల్లవానికి ఇచ్చివేయండి” అని చెప్పారు. 
ఆజ్ఞేనుసార మగ తాత్కాళ | శేళ్యాంస ఖాఊ ఘాతలీ డాళ | 
మగ కాంహీహీ న దవడితా వేళ | పాఠవిల్యా పరత కళపాంత | ||౧౧౫|| 
115. వారి ఆజ్ఞానుసారం, వెంటనే పప్పును తెచ్చి, ఆ మేకలకు మేత పెట్టారు. తరువాత ఆలస్యం చేయకుండా వానిని మరల మందలోకి పంపించి వేశారు. 
మూర్తిమంత పరోపకార | తో హా ప్రత్యక్ష సాఈ అవతార | 
తయాస తాత్యా, శామా, వా ఇతర | కాయ సువిచార సుచవితీల | ||౧౧౬|| 
116. మూర్తీభవించిన పరోపకారానికి ప్రత్యక్ష అవతారం సాయి. అలాంటివారికి, తాత్యా కాని, శ్యామా కాని, లేక ఇంకెవరైనా కాని, మంచి ఆలోచనలను సూచించగలరా? 
డాళ చారవూని పరమ ప్రీతీ | పాహూని శేళ్యా పావల్యా తృప్తీ | 
మగ మ్హణతీ “ద్యా ధనియా ప్రతీ | ఘేవోత విశ్రాంతీ కళపాంత” | ||౧౧౭|| 
117. మేకలకు ఎంతో సంతోషంగా పప్పు తినిపించి, అవి తృప్తి చెందినట్లు గమనించి, “వానిని వాని యజమానికి ఇచ్చివేయండి. మందలో విశ్రమిస్తాయి” అని బాబా చెప్పారు. 
రుపయే గేలే రుపయా పరీ | శేళ్యా గేల్యా ఫుకటవారీ | 
పుఢే గత జన్మీచీ నవలపరీ | కథిలీ సారీ బాబాంనీ | ||౧౧౮|| 
118. అలా డబ్బుకు డబ్బూ పోయింది, మేకలు కూడా ఉచితంగా పోయాయి. తరువాత, ఆశ్చర్యకరమైన మేకల గతజన్మని గురించి బాబా చెప్పారు. 
జైసా తాత్యా తైసాచ శామా | దోఘాంవరీహీ బాబాంచా ప్రేమా | 
తయాంచియా కోపోపరమా | కథితీ మనోరమా ఆఖ్యాయికా | ||౧౧౯|| 
119. తాత్యా ఎంతో శ్యామా కూడా అంతే. ఆ ఇద్దరిపైనా బాబాకు అమితమైన ప్రేమ. వారి కోపాన్ని శాంత పరచటానికి, బాబా మనోహరమైన ఈ కథను చెప్పారు. 
సాఈ స్వయే హోఊని ఆపణ | దోఘాంలాగీ కరితీ నివేదన | 
శేళ్యాంచే పూర్వ జన్మాచే కథన | శ్రోతాంహీ శ్రవణ కీజే తే | ||౧౨౦|| 
120. తమంతట తాము, సాయి స్వయంగా మేకల పూర్వ జన్మ కథను ఆ ఇద్దరికీ చెప్పారు. శ్రోతలు కూడా దానిని వినండి. 

పూర్వజన్మీ యాంచే సుదైవ | తేవ్హా హే జీవ హోతే మానవ | 
మజపాశీంచ బసావయా ఠావ | కర్మ ప్రభావ యాంనా హీ | ||౧౨౧|| 
121. “గత జన్మలో ఆ మేకల భాగ్యం కొద్దీ అవి మానవులుగా పుట్టాయి. నా దగ్గరే ఉండేవారు. వారికి కూడా కర్మ ప్రభావ ఫలితం తప్పలేదు.
యా జ్యా శేళ్యా దిసతీ తుమ్హా | హోతే హే బంధూ పూర్వజన్మా | 
భాండతా పరస్పర ఝాలీ సీమా | తే యా పరిణామ పావలే | ||౧౨౨|| 
122. “ఇప్పుడు మీకు మేకలుగా కనిపిస్తున్నాయి కదా! ఇవి, పూర్వ జన్మలో సోదరులు. పరస్పరం విపరీతంగా కొట్టుకున్న పరిణామంగా ఈ రూపాన్ని పొందాయి. 
బంధూ బంధూంత ఆరంభీ ప్రేమ | ఎకత్ర అశన12 శయన నేమ | 
నిత్య చింతితీ కుశల క్షేమ | ఎకాత్మతా పరమ ఉభయాంసీ | ||౧౨౩|| 
123. “మొదట్లో అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండేది. ఒక కంచంలో తిని, ఒకే మంచంపైన పడుకునేవారు. రోజూ ఒకరి యోగక్షేమాల గురించి ఒకరు ఆలోచించేవారు. ఇద్దరిలోనూ ఐక్యత బాగా ఉండేది. 
ఏసే దోఘే జరీ సహోదర | కర్మధర్మసంయోగ దుర్ధర | 
ద్రవ్యలోభ అతి భయంకర | పాడిలే వైర పరస్పరీ | ||౧౨౪|| 
124. “ఆ ఇద్దరూ అన్నదమ్ములే అయినా, దుర్భరమైన కర్మ ధర్మల కలయిక వలన, భయంకరమైన డబ్బు వ్యామోహం కారణంగా వారిలో శత్రుత్వం ప్రబలింది. 
జ్యేష్ఠ బంధూ మహా ఆళశీ | కనిష్ఠ వ్యవసాయీ అహర్నిశీ | 
తేణే జోడిల్యా ద్రవ్య రాశీ | మత్సర జ్యేష్ఠాంసీ సంచరలా | ||౧౨౫|| 
125. “పెద్దవాడు చాలా సోమారి. చిన్నవాడు రాత్రి పగలూ శ్రమించి ధనాన్ని కూడబెట్టాడు. దానివలన పెద్దవానికి అసూయ కలిగింది. 
కాఢూనియా టాకావా కాంటా | మగ ద్రవ్యాచా నాహీ తోటా | 
ఏసియా విచారే ఆడవాటా | ఆవడల్యా జ్యేష్ఠా ధనలోభే | ||౧౨౬|| 
126. “‘ముల్లులా గ్రుచ్చుకుంటున్న తమ్ముని తొలగించితే తనకు డబ్బుకు లోటుండదు’, అని పెద్దవాడు ధనలోభంతో చెడుగా ఆలోచించ సాగాడు. 
ధనమోహే దృష్టి ప్రతిబంధ | డోళే అసతా జాహలా అంధ | 
విసరలా బంధుప్రేమసంబంధ | జాహలా సన్నద్ధ తద్ఘాతా | ||౧౨౭|| 
127. “ధనం మీది మోహం దృష్టికి అడ్డు పడింది. కళ్లు ఉండీ అతడు అంధుడయ్యాడు. బంధుత్వాన్ని, సోదర ప్రేమనూ మరచిపోయి, తమ్ముని హతమార్చటానికి సిద్ధమయ్యాడు. 
పరమ కఠిణ ప్రారబ్ధభోగ | ఉపజలా నిష్కారణ వైరయోగ | 
ఫుటలే గుప్త కపటప్రయోగ | లోభావేగ13 అనావర | ||౧౨౮|| 
128. “ప్రారబ్ధ కర్మాన్ని అనుభవించడం పరమ కఠినమైనది. నిష్కారణంగా శత్రుత్వం పుట్టింది. రహస్యంగా ఉన్న మోసం బయట పడింది. లోభం నిగ్రహించుకోలేనంతగా పెరిగింది. 
హోతే త్యాంచే ఆయుష్య సరలే | బంధుత్వప్రేమ సమూళ విసరలే | 
దురభిమానే అత్యంత ఖవళలే | వైరీసే ఝగటలే పరస్పర | ||౧౨౯|| 
129. “వారి ఆయువు తీరిపోయింది. సోదర ప్రేమను పూర్తిగా మరచిపోయారు. దురభిమానం ఎంతగానో పెరిగి పోయింది. శత్రువులవలె ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. 
సోటా హాణోనియా మాథా | ఎకానే దుజియా పాడిలే ఖాలతా | 
తేణే కుర్హాడీచియా ఆఘాతా | సరసా నిజ భ్రాతా మారిలా | ||౧౩౦||
130. “తలపైన బలంగా కొట్టి ఒకడు ఇంకొక్కణ్ణి క్రింద పడవేశాడు. రెండవవాడు గొడ్డలితో కొట్టి తన సోదరుణ్ణి చంపేశాడు. 

మగ తే ధోఘే పడలే మూర్ఛిత | ఛిన్న భిన్న రుధిరోక్షిత | 
అల్పావకాశే అసువిరహిత | పావలే పంచత్వ దోఘేహీ | ||౧౩౧|| 
131. “ఇద్దరూ రక్తం కారుస్తూ, ఛిన్నా భిన్నమై మూర్చ పడిపోయారు. కొంత సేపటికే ప్రాణాలను కోల్పోయి, ఇద్దరూ చనిపోయారు. 
ఏసా త్యాంచా హోతా అంత | ప్రవేశలే తే యా యోనీంత | 
ఏసా యాంచా హా వృత్తాంత | స్మరలా మజ సాద్యంత తయా పహాతా | ||౧౩౨|| 
132. “జీవితాలు అలా అంతం కాగా, వారు ఈ యోనిలో ప్రవేశించారు. వారిని చూడగానే, వారి ఈ వృత్తాంతమంతా నాకు గుర్తుకు వచ్చింది. 
తే కృతకర్మ భోగావయాసీ | ఆలే శేళీచియా జన్మాసీ | 
అవచిత కళపాంత దేఖతా త్యాంసీ | ప్రేమావేశీ ఆలో మీ | ||౧౩౩|| 
133. “చేసిన కర్మను అనుభవించటానికి మేకలుగా పుట్టారు. అకస్మాత్తుగా మందలో వారిని చూచి, నాకు వారిపై ప్రేమ కలిగింది. 
మ్హణోని ఖర్చోని పల్లవచే దామ | వాటలే తయాంసీ ద్యావా విశ్రామ | 
తుమచియా మిషే తయాంచే కర్మ | ఆడవే కీ ఠామ తయాంపుఢే | ||౧౩౪|| 
134. “అందుకే, స్వంత డబ్బు ఖర్చుపెట్టి, వానికి విశ్రామాన్ని కలిగించాలని అనిపించింది. కాని, మీ కారణంగా వాని కర్మ వానికి అడ్డు తగిలింది. 
శేళియాంలాగీ దయా పోటీ | పరీ తుమచియా ఆగ్రహాసాఠీ | 
మీహీ జాహలే కబూల శేవటీ | ద్యావయా త్యాపాఠీ ధనగరా” | ||౧౩౫|| 
135. “మేకల మీద దయ ఉన్నా, మీ బలవంతం వలన, చివరకు నేనే వానిని గొల్లవానికి తిరిగి ఇచ్చి వేయటానికి ఒప్పుకున్నాను” అని చెప్పరు. 
అసో యేథే సంపలీ కథా | క్షమా కరావీ మజలా శ్రోతా | 
పుఢీల అధ్యాయ పుఢా పరిసతా | ఆనంద చిత్తా హోఈల | ||౧౩౬|| 
136. అలా ఈ కథ ఇక్కడితో ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. తరువాత అధ్యాయాన్ని వింటే మనసుకు సంతోషం కలుగుతుంది. 
తోహీ పరమ ప్రేమభరిత | తేంహీ సాఈముఖీంచే అమృత | 
హేమాడ సాఈ చరణీ వినత | హోఊని వినవీత శ్రోతయా | ||౧౩౭||
137. అది కూడా సాయి నోటినుండి స్రవించిన అమృతమే, పరమ ప్రేమ భరితం, అని హేమాడు పంతు సాయి చరణాలయందు వినమ్రుడై శ్రోతలకు మనవి చేస్తున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
 | శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | కాశీగయాగమన అజాజన్మ కథనం నామ | 
| షట్చత్వారింశత్తమోధ్యాయః సంపూర్ణః |

 ||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. భక్తాంత శ్రేష్ఠ - భక్తమణీ. 2. మాధవరావ దేశపాండ్యాంస. 
3. శిరడీచా నందరామ మారవాడీ. 4. ఆపా కోతే. 
5. దోనశే రుపయే. 6. శంభర రుపయే. 
7. పళస్ప్యాచే ఓఝే ఆడనావాచే ఇనామదార. 
8. హే నానాసాహేబాంచే సాడూ. 9. హే నానాసాహేబాంచే జామాత. 
10. తాత్యా గణపత పాటీల కోతే. 11. అకల్పిత. 
12. జేవణఖాణ. 13. లోభాచా ఝటకా.

Tuesday, November 26, 2013

||శ్రీగురుచరణ మహిమా నామ పంచచత్వారింశోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౫ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

సహజ జాతే మాండూని దళతా | జేణే ప్రవర్తవిలే నిజ సచ్చరితా | 
కాయ అలౌకిక తయాచీ కుశలతా | భక్త సత్పంథా లావిలే | ||౧||
1. తిరగలిలో సహజంగా విసురుతూ, భక్తులను సన్మార్గంలో పెట్టాలని, తమ సచ్చరితను స్ఫురింప చేసిన వారి కౌశలం ఎంత అలౌకికమైనది!
మోక్ష జో కా పరమపురుషార్థ | త్యాహూనిహీ గురుచరణ సమర్థ | 
సేవితా ఏసియా గురుచరణీంచే తీర్థ | మోక్ష నకళత ఘర రిఘే | ||౨|| 
2. గురువు పాదాలు పరమ పురుషార్థమైన మోక్షం కంటే శక్తివంతమైనవి. ఇలాంటి గురువుయొక్క పాద తీర్థాన్ని సేవిస్తే, మోక్షం తనంతట తానే, ఎవరికీ తెలియకుండా లభిస్తుంది. 
హోఈల గురు కరుణాకర | తరీచ సుఖాచా హా సంసార | 
ఘడోని యేఈ న ఘడణార | లావీల పరపార క్షణార్థే | ||౩|| 
3. గురువు కరుణ లభిస్తే, ఈ సంసారం సుఖమయమౌతుంది. జరగనివన్నీ జరుగుతాయి. అరక్షణంలో గురువు ఆవలి ఒడ్డుకు చేరుస్తారు. 
జరీ జాహలీ ఇతుకీ పోథీ | కథా కథిలీసే అతి సంకలితీ | 
సాఈచీ తీ అగాధ కీర్తి | తీ మ్యా కితీ వర్ణావీ | ||౪|| 
4. ఇంత గ్రంథం వ్రాసినా, కథ మాత్రం సంక్షిప్తంగానే చెప్పబడింది. సాయియొక్క అగాధమైన, అంతులేని కీర్తిని నేనెంతని వర్ణించను? 
జిచేని దర్శనే నిత్యతృప్తీ | జిచేని సహవాసే ఆనంద భుక్తీ | 
జిచేని భవభయ వినిర్ముక్తి | తీ సాఈమూర్తి హారపలీ | ||౫|| 
5. ఎవరిని చూసినంత మాత్రాన నిత్య తృప్తి దొరికేదో, ఎవరి సహవాసం అంతులేని ఆనందాన్ని ఇచ్చేదో, ఎవరు మనకు సంసార భయాన్ని తొలగిస్తారో, ఆ దివ్యమైన సాయి మూర్తిని పోగొట్టుకున్నాం. 
జిచేని పరమార్థ మార్గ ప్రవృత్తీ | జిచేని మాయామోహ నివృత్తీ | 
జిచేని ఆత్యంతిక క్షేమ ప్రాప్తి | తీ సాఈమూర్తీ హారపలీ | ||౬|| 
6. ఎవరివలన మనలో పరమార్థ ప్రవృత్తి కలిగేదో, ఎవరివలన మాయా మోహ నివృత్తి కలిగి, ఎవరివలన అత్యంత క్షేమం కలుగుతుందో ఆ దివ్యమైన సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. 
జిచేని నవ్హతీ భవభయ భీతి | జిచేని జాగృత న్యాయనీతీ | 
జిచేని సంకటీ మనాస ధృతి | తీ సాఈమూర్తీ హారపలీ | ||౭|| 
7. ఎవరివలన సంసార భయం ఉండదో, ఎవరివలన న్యాయం, నీతి జాగృతమై, కష్టాలను ఎదురించగలిగే ధైర్యం కలిగేదో, అలాంటి సాయిమూర్తిని శాశ్వతంగా పోగొట్టుకున్నాం. 
ధ్యానీ స్థాపూనియా నిజమూర్తీ | సాఈ జాఈ నిజధామా ప్రతి | 
నిజావతారా కరీ సమాప్తి | హే యోగస్థితి అతర్క్య | ||౮|| 
8. ధ్యానించుకోవటానికి అనువుగా తమ రూపాన్ని మన మనసులో స్థాపించి, తమ అవతారాన్ని చాలించి, సాయి తమ నివాస స్థానానికి వెళ్లిపోయారు. తర్కానికి అందని అమోఘమైనది వారి యోగ స్థితి. 
పూర్ణ హోతా అవతార కృతి | హారపలీ తీ పార్థివాకృతి | 
తరీ హా గ్రంథ హీ వాంగ్మయ మూర్తి | దేఈల స్మృతి పదోపదీ | ||౯|| 
9. అవతార కార్యం పూర్తి కాగానే, వారి దేహం మనకు కనిపించకుండా పోయింది. అయినా, వారి వాక్కు రూపమైన ఈ గ్రంథం, వారి జ్ఞాపకాన్ని ప్రతి క్షణమూ మనకు గుర్తుకు తెస్తుంది. 
శివాయ హ్యాచియా కథా పరిసతా | మనా లాభే జీ ఎకాగ్రతా | 
తజ్జన్య శాంతీచీ అపూర్వతా | కేవీ అవర్ణీయతా వర్ణావీ | ||౧౦||
10. అంతేకాక, వారి చరిత్రను చదివినా, వినినా, దానివలన మన మనసుకు కలిగే ఏకాగ్రత, అంతకు మునుపు ఎప్పుడూ కలగని, వర్ణించటానికి వీలుకాని శాంతిని, పదాలలో వర్ణించడం అసాధ్యం. 

ఆపణ శ్రోతే సర్వే సూజ్ఞ | మీ తో తుమ్హాంపుఢే అల్పజ్ఞ | 
తథాపి హా సాఈచా వాగ్యజ్ఞ | ఆదరా కృతజ్ఞ బుద్ధీనే | ||౧౧|| 
11. శ్రోతలూ! మీరందరూ జ్ఞానులు. మీ ముందు నేను ఏమీ తెలియని అజ్ఞాని. అయినా సాయి కోసం చేస్తున్న ఈ శబ్ద యజ్ఞాన్ని మీరందరూ కృతజ్ఞతా భావంతో ఆదరించండి. 
కల్యాణప్రద హా వాగ్యజ్ఞ | పుఢే కరూని మజసమ అజ్ఞ | 
పూర్ణ కరీ నిజకార్యజ్ఞ | శ్రోతే సర్వజ్ఞ జాణతీ | ||౧౨|| 
12. అందరికీ మేలు చేసే ఈ వాగ్యజ్ఞాన్ని నాలాంటి అజ్ఞాని ద్వారా సాయి చేయిస్తున్నారని అన్నీ తెలిసిన శ్రోతలకు తెలుసు. 
కరూనియా ఎకాగ్ర మన | అభివందూన సాఈ చరణ | 
మహామంగల పరమ పావన | కరీ జో శ్రవణ యా కథా | ||౧౩|| 
13. ఏకాగ్ర మనసుతో సాయి పాదాలకు నమస్కరించి, మహా మంగళకరమూ, పరమ పావనమూ అయిన ఈ చరిత్రను వినే భక్తుల మరియు; 
జో భక్త భక్తి సమన్విత | నిజస్వార్థ సాధావయా ఉద్యత | 
హోఊనియా ఎకాగ్రచిత్త | కథామృత హే సేవీల | ||౧౪|| 
14. తమ శ్రేయస్సును సాధించుకోవటానికి ఎంతో ఉత్సుకతతో, అనన్య మనసుతో, భక్తిపూర్వకంగా ఈ కథామృతాన్ని వినే భక్తులకు; 
సాఈ పురవీల తయాచే అర్థ | పురవీల స్వార్థ ఆణి పరమార్థ | 
సేవా కధీంహీ జాఈ న వ్యర్థ | అంతీ తో కృతార్థ కరీల | ||౧౫|| 
15. వారి స్వార్థ పరమైన కోరికలనే కాక, పరమార్థ అవసరాలను కూడా సాయి తీరుస్తారు. వారి సేవ ఎప్పుడూ వ్యర్థం కాదు. ఆ సేవయే వారిని చివరకు కృతార్థులను చేస్తుంది. 
చవ్వేచాళీస అధ్యాయ పోథీ | సాఈ నిర్యాణ పరిసలే అంతీ | 
తరీహీ యా పోథీచీ ప్రగతీ | హీ కాయ చమత్కృతి కళేనా | ||౧౬|| 
16. ఈ గ్రంథంలోని నలుబది నాలుగవ అధ్యాయం ముగింపులో సాయి నిర్వాణాన్ని గురించి విన్నారు. అయినా ఈ గ్రంథం కొనసాగుతూనే ఉంది. మరి ఇదేమి చమత్కారమో అర్థం కావటం లేదు. 
గతాధ్యాయీ సాఈనిర్యాణ | యథానుక్రమ జాహలే పూర్ణ | 
తరీ యా సాఈలీలేచీ కాతిణ | విసంబేనా క్షణభరీ | ||౧౭|| 
17. పోయిన అధ్యాయంలో యథాక్రమంగా సాయి నిర్వాణాన్ని పూర్తిగా వర్ణించడమైనది. అయినా, సాలె పురుగువలె, సాయి లీలలకు క్షణమైనా విశ్రాంతి లేదు. 
పాహూ జాతా నవల నాహీ | నిర్యాణ కేవళ దేహాస పాహీ | 
జన్మమరణాతీత హా సాఈ | అవ్యక్తీ రాహీ పూర్వవత | ||౧౮|| 
18. వాస్తవానికి, ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నిర్యాణం దేహానికి మాత్రమే. సాయి చావు పుట్టుకలకు అతీతులు. అందుకే, వారు మునుపటి వలె కనిపించకుండా ఉన్నారు. 
దేహ గేలా ఆకార గేలా | అవ్యక్తీ జైసా తైసాచ ఠేలా | 
దేహ నిర్యాణా మాగూన లీలా | ఆహేత సకళాంలా అవగత | ||౧౯|| 
19. దేహం పోయింది. దాంతో ఆకారం కూడా పోయింది. కాని, ఎప్పటి వలె వారు కనిపించకుండా ఉన్నారు. శరీరాన్ని వదిలిన తరువాత కూడా జరుగుతున్న వారి లీలలు అందరికీ తెలిసినదే. 
వర్ణూ జాతా త్యాహీ అపార | పరీ న వ్హావా గ్రంథ విస్తార | 
మ్హణూన త్యాంతీల ఘేఊ సార | కరూ కీ సాదర శ్రోతయా | ||౨౦||
20. అలాంటి లెక్కలేని వారి లీలలను వర్ణించాలంటే, ఈ గ్రంథం చాలా పెద్దదై పోతుంది. అందుకు, వాటిలోని సారాన్ని మాత్రమే శ్రోతలకు మనవి చేస్తాను. 

ధన్య ఆముచీ భాగ్యస్థితీ | కీ జే కాలీ సాఈ అవతరతీ | 
తేచ కాలీ ఆమ్హా హే సత్సంగతీ | సహజావృత్తీ లాధలీ | ||౨౧|| 
21. మన భాగ్యం ధన్యం. సాయి అవతరించిన కాలంలోనే వారి పావనమైన సాన్నిధ్యం మనకు కూడా సహజంగా లభించింది.
ఏసే అసతాంహీ చిత్తవృత్తి | జరీ నపవే సంసార నివృత్తి | 
జరీ న జడే భగవంతీ ప్రీతీ | యాహోని దుర్గతీ తీ కాయ | ||౨౨|| 
22. అయినా, మన మనసును సంసారంనుండి నివృత్తి చేయకపోతే, భగవంతునిపై ప్రీతిని పెంచుకోకపోతే, ఇంతకంటే దుర్గతి ఏముంటుంది? 
సర్వేంద్రియీ సాఈచీ భక్తి | తీచ కీ ఖరీ భజన స్థితి | 
నా తరీ డోళా పాహతా మూర్తి | ఖిళీ దాతీ వాచేచ్యా | ||౨౩|| 
23. అన్ని ఇంద్రియాలను సాయి భక్తితో నింపడమే నిజమైన ఆరాధన. అలా కాకపోతే, కళ్లు సాయిను చూస్తున్నా, నోరు పెగలక పోవడంతో, మాట బయటికి రాదు. 
కాన ఏకతా సాఈ కీర్తన | రసనా మధుర ఆమ్రరసీ నిమగ్న | 
కరితా సాఈపాదస్పర్శన | మృదూలీవర్జన ఖపేనా | ||౨౪|| 
24. చెవులు సాయి కీర్తనలను వింటున్నా, నాలుక మటుకు మధురమైన మామిడి పళ్ళ రసం తాగడంలో మగ్నమైతే ఎలా? చేతులు సాయి పాదాలను తాకుతున్నా, మనసు మృదువైన పరుపు సుఖం గుర్తుకు తెచ్చుకుంటే ఎలా? 
సాఈపాసూన క్షణహీ విభక్త | తో కాయ హోఈల సాఈభక్త | 
తో కాయ మ్హణావా చరణాసక్త | సంసారీ విరక్త హో నేణే | ||౨౫|| 
25. క్షణ కాలమైనా సాయినుండి దూరం ఉండగలవాడు అసలు సాయి భక్తుడేనా? సంసారమందు విరక్తి కలగని వారికి సాయి పాదాలయందు ఆసక్తి ఎలా ఉంటుంది? 
ఎకా పతీ వంచూని కోణీ | యేతా తిచియా మార్గావరునీ | 
శ్వశుర దీర భాఊ జాణూనీ | హోఈ వందనీ సాదర | ||౨౬|| 
26. భర్త కాక వేరే మగవారు ఎవరైనా మార్గంలో కనిపిస్తే, వారిని మామగారని, మరిది అని, లేక సహోదరుడని తలచి, గౌరవంగా వందనం చేస్తుంది. 
పతివ్రతేచే నిశ్చళ అంతర | కదా న సాండీ ఆపులే ఘర | 
నిజపతీచాచ ప్రేమా అపార | ఆజన్మ ఆధార తో ఎక | ||౨౭|| 
27. పతివ్రతా స్త్రీ మనసు అలా ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. ఆమె తన ఇల్లు ఎప్పుడూ విడిచి పెట్టదు. తన భర్తపైనే ఆమెకు అంతులేని ప్రేమ. జీవితాంతం ఆమెకు అతడొక్కడే ఆధారం. 
పతివ్రతా సాధ్వీ సతీ | అన్యా భావోనియా నిజపతి | 
తయాచే దర్శన ఘ్యావయా ప్రతీ | కధీంహీ చిత్తీ ఆణీనా | ||౨౮|| 
28. అలాంటి పతివ్రతా సతి, మిగతావారిని తన భర్తగా ఎన్నడూ ఊహించుకోదు. వారిని చూడాలని మనసులోనైనా ఎప్పుడూ తలవదు. 
తీస ఆపులా పతీ తో పతీ | ఇతర కేవ్హాంహీ తయా న తులతీ | 
తయా ఠాయీంచ అనన్య ప్రీతి | శిష్యహీ తే రీతీ గురుపాయీ | ||౨౯|| 
29. ఆమెకు తన భర్తయే సర్వస్వం. మిగతావారెవరూ అతని సమానులు కారు. ఆమె అనన్యమైన ప్రేమ అంతా అతని కొరకే. గురు పాదాలంటే శిష్యుడి ప్రేమ కూడా అలాంటిదే. 
పతివ్రతేచ్యా పతిప్రేమా | గురుప్రేమాస దేతీ ఉపమా | 
పరీ త్యా ప్రేమాస నాహీ సీమా | జాణే తో మహిమా సచ్ఛిష్య | ||౩౦||
30. శిష్యుడి గురు ప్రేమను, పతివ్రతయొక్క పతి ప్రేమతో, పోలుస్తారు. కాని, శిష్యుడి గురు ప్రేమకు పరిమితి అంటూ లేదు. ఉత్తమ శిష్యుడొక్కడికే గురు ప్రేమలోని మహిమ తెలుసు. 

మగ నా జయాచేని సంసారా సాహ్యతా | తీ కాయ సాహ్యా యేతీల పరమార్థా | 
అసో వ్యాహీ జాంవయీ వా వనితా | భరంవసా కోణాచా ధరితా నయే | ||౩౧|| 
31. లౌకికంగా కూడా ఏ సహాయం చేయలేనివారు, పరమార్థంలో మాత్రం ఏ సహాయం చేయగలరు? వియ్యంకుడు గాని, అల్లుడు కాని, లేదా భార్య గాని, ఎవరూ నమ్మకస్థులు కారు. 
మాతా పితా కరితీల మమతా | సత్తేచా పుత్ర లక్షీల విత్తా | 
కుంకువాలాగీ రడేల కాంతా | కోణీ న పరమార్థా సాహకారీ | ||౩౨|| 
32. తల్లితండ్రులు మమకారాన్ని చూపుతారు. కొడుకు దృష్టి, తనకి వచ్చే ఆస్తిపైనే ఉంటుంది. తన పసుపు కుంకుమల గురించి భార్య ఏడుస్తుంది. అంతే కాని, పరమార్థం కోసం సహాయం చేసే వారు ఎవ్వరూ లేరు. 
తరీ ఆతా రాహిలే కోణ | జయాచేని పరమార్థాపాదన | 
కరూ జాతా విచారే నిదాన | ఆపులా ఆపణ అంతీ ఉరే | ||౩౩|| 
33. పరమార్థం కోసం సహాయ పడటానికి మిగిలింది ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే, చివరకు మిగిలేది మనమే. 
కరోని నిత్యానిత్య వివేక | త్యాగోని ఫళ భోగ ఏహికాముష్మిక | 
సాధోనియా శమదమాదిషట్క | మోక్షైక సాధక తో ధన్య | ||౩౪|| 
34. శాశ్వతమైనది ఏది, శాశ్వతం కానిదేది, అనే వివేకంతో, ఇహంలోగాని, పరంలోగాని ఫలాపేక్షను వదిలి, శమ, దమ మొదలైన ఆరు సంపత్తుల సాధన చేసి, మోక్షాన్ని పొందినవారే ధన్యులు. 
తేణే సోడూని దుజియాచీ ఆస | ఠేవావా బళకట ఆత్మవిశ్వాస | 
మారావీ ఆపణ ఆపులీ కాంస | సాధేల తయాసచి పరమార్థ | ||౩౫|| 
35. ఇంకొకరి ఆధార లేకుండా, తనపైనే దృఢమైన నమ్మకంతో, తన ప్రయత్నాన్ని తానే చేసుకునే వారికి పరమార్థం సిద్ధిస్తుంది. 
బ్రహ్మ నిత్య జగ అనిత్య | గురురేక బ్రహ్మ సత్య | 
అనిత్యత్యాగే గురు ఎక చింత్య | భావనాసాతత్య సాధన హే | ||౩౬|| 
36. బ్రహ్మ ఒక్కటే శాశ్వతం. ప్రపంచం మిథ్య. గురు ఒక్కడే నిజమైన బ్రహ్మ. శాశ్వతం కానిదానిని విడచి, గురు ఒక్కడినే ధ్యానించాలి. ఇలాంటి సతతమైన భావన ఒక్కటే పరమార్థ ప్రగతికి సాధనం. 
అనిత్యత్యాగే వైరాగ్య జనన | సద్గురు బ్రహ్మచైతన్య ఘన | 
ఉపజే భూతీ భగవంతపణ | అభేద భజన యా నాంవ | ||౩౭|| 
37. శాశ్వతం కానిదానిని విడిచి పెట్టితే, వైరాగ్యం పుట్టుకొస్తుంది. సద్గురువే బ్రహ్మ, అన్ని ప్రాణులలో భగవంతుడే ఉన్నాడన్న భావన కలగటం, దీనినే అభేద ఉపాసన అని అంటారు. 
భయే అథవా ప్రేమే జాణ | జయా జయాచే నిత్య ధ్యాన | 
ధ్యాతా హోఈ ధ్యేయచి ఆపణ | కంస రావణ కీటకీ | ||౩౮|| 
38. భయంతో గాని, ప్రేమతో గాని, దేనినైనా సతతంగా ధ్యానం చేస్తే, ధ్యానం చేసేవారు ధ్యానించిన వస్తువై పోతారు - కంసుడు, రావణుడు, కీటకం మొదలైనవి కృష్ణుడిగాను, రాముడిగాను మరియు తుమ్మెదలా మారినట్లు. 
చింతనీ వ్హావే అనన్యపణ | ధ్యానా సారిఖే నాహీ సాధన | 
కరీ జో అభ్యాస ఆపులా ఆపణ | తయా నిజోద్ధరణ రోకడే | ||౩౯|| 
39. ఏకాగ్రతతో, అనన్యంగా ధ్యానించాలి. అలాంటి ధ్యానానికి సమానమైన సాధన మరొకటి లేదు. ధ్యానాన్ని సాధన చేసేవారు తప్పకుండా తమను తాము తరింప చేసుకుంటారు. 
తేథే కైంచే జన్మ మరణ | జీవభావాసీ పూర్ణ విస్మరణ | 
ప్రపంచాచే మావళే భాన | ఆత్మానుసంధానసుఖ లాహే | ||౪౦||
40. అప్పుడు, చావు పుట్టుకలు ఎక్కడిది? దేహమే జీవుడు అనే భావన పోయి, ప్రపంచ ధ్యాస లేకుండా, ఆత్మను పొందిన సుఖమైన అనుభవం కలుగుతుంది. 

మ్హణోని నిజగురునామావర్తన | తేణోని పరమానందా జనన | 
భూతీ భగవంతాచే దర్శనే | నామాచే మహిమాన కాయ దుజే | ||౪౧|| 
41. అందు వలన, గురు నామాన్ని జపిస్తూ ఉంటే, పరమానందం జనిస్తుంది. అన్ని ప్రాణులలోనూ భగవంతుని దర్శనం కలుగుతుంది. ఇంతకంటే, నామంయొక్క మహిమ వేరే ఏమి ఉంటుంది?
ఏసీ జయాచ్యా నామాచీ మహతీ | తయా మాఝీ సద్భావే ప్రణతీ | 
కాయావాచామనే మీ త్యా ప్రతీ | అనన్యగతీ యే శరణ | ||౪౨|| 
42. ఇంతటి మహిమగల నామం ఉన్నవారికి, నేను భక్తితో నమస్కరిస్తాను. కాయా, వాచా, మనసా నేను వారికి అనన్య శరణుజొచ్చుతున్నాను. 
యే అర్థీంచీ ద్యోతక కథా | కథితో శ్రోతయాకరితా ఆతా | 
తరీ తీ ఏకిజే నిజహితార్థా | ఎకాగ్రచిత్తా కరూనియా | ||౪౩|| 
43. ఇప్పుడు ఈ విషయాన్నే స్పష్టం చేసే ఒక కథను శ్రోతలకు నేను చెబుతాను. దీనిని మీరు, మీ శ్రేయస్సు కోసమే ఏకాగ్ర చిత్తంతో వినండి. 
కైలాసవాసీ కాకా దీక్షిత | సాఈసమర్థా అజ్ఞాంకిత | 
నిత్యనేమ వాచీత భాగవత | ఆహే కీ అవగత సమస్తా | ||౪౪|| 
44. సాయి సమర్థుల ఆజ్ఞ మేరకు కీ. శే. కాకా దీక్షితు నిత్యం నియమంగా (ఏకనాథ) భాగవతాన్ని పఠించేవాడు అనేది అందరికీ తెలిసినదే. 
ఎకే దివశీ దీక్షితాంనీ | కాకా మహాజనీ యాంచే సదనీ | 
చౌపాటీవర భోజన సారునీ | పోథీ నేమానీ వాచిలీ | ||౪౫|| 
45. ముంబయిలోని చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో, ఒక రోజు, భోజనం తరువాత, దీక్షితు గ్రంథాన్ని పఠించ సాగాడు. 
ఎకాదశాచా అద్వితీయ | ఏసా తో సరస ఆణి ద్వితీయ | 
పరిసతా అనుక్రమే అధ్యాయ | శ్రోత్యాచే ధాయ అంతరంగ | ||౪౬|| 
46. సాటిలేని పదుకొండవ స్కంధంలో, రసభరితమైన రెండవ అధ్యాయాన్ని దీక్షితు పఠిస్తుండగా, వింటున్న శ్రోతల మనసులు, సుఖ శాంతులతో నిండిపోయాయి. 
మాధవరావ బాబాంచే భక్త | కాకా మహాజనీ తయాం సమవేత | 
బైసలే ఏకావయా భాగవత | ఎకాగ్ర చిత్త కరూనియా | ||౪౭|| 
47. బాబా భక్తుడైన మాధవరావుతో సహ, కాకా మహాజని కూడా ఏకాగ్ర చిత్తంతో భాగవతాన్ని వినటానికి కూర్చున్నారు. 
కథాహీ భాగ్యే ఫారచి గోడ | జేణే పురేల శ్రోత్యాంచే కోడ | 
జడేల భగవద్భక్తీచీ ఆవడ | ఏసీచ తీ చోఖడ నిఘాలీ | ||౪౮|| 
48. అదృష్టం కొద్దీ, కథ కూడా చాలా మధురమైనది. శ్రోతల కోరికలను తీర్చి, భగవద్భక్తి యందు ప్రీతిని కలిగించే మంచి కథ అది. 
ఋషభ కుళీంచే నఊ1 దీపక | కవి హరి అంతరిక్షాదిక | 
నిఘాలే యాంచేంచ గోడ కథానక | ఆనందజనక బోధప్రద | ||౪౯|| 
49. ఋషభ కులంలోని, కవి, హరి, అంతరిక్ష మొదలైన తొమ్మిది మంది కులదీపకులు చెప్పిన జ్ఞాన బోధ ప్రధానమూ, ఆనందదాయకమూ అయిన మధురమైన కథ అది. 
నఊహీ తే భగవత్స్వ రూప | పోటీ క్షమా శాంతీ అమూప | 
వర్ణితా భాగవత ధర్మప్రతాప | జనక2 నిష్కంప తటస్థ | ||౫౦||
50. ఆ తొమ్మిది మంది కూడా భగవత్స్వరూపులు. అంతులేని క్షమా, శాంతి కలవారు. వారు శక్తివంతమైన భాగవత ధర్మ మహిమను వర్ణించగా, విని జనక మహారాజు ఆశ్చర్యంతో, మౌనంగా ఉండిపోయాడు. 

కాయ తే ఆత్యంతిక క్షేమ | కాయ హరీచీ భక్తి పరమ | 
కైసేన హీ హరి మాయా సుగమ | నిఃశ్రేయస ఉత్తమ గురుచరణ | ||౫౧|| 
51. అన్నింటికంటే క్షేమమైనది ఏది? హరియొక్క పరమ భక్తి ఎటువంటిది? హరియొక్క మాయను సులభంగా దాటే ఉపాయం ఏది? గురువు పాదాలే అన్నిటికంటే ఉత్తమమైనవి. 
కర్మ అకర్మ ఆణి వికర్మ | యా సర్వాంచే ఎకచి వర్మ | 
గురు హేంచ రూప పరమాత్మ | భాగవత ధర్మ గురుభక్తి | ||౫౨|| 
52. గురువే పరమాత్మ రూపం, గురువుయందే భక్తి ఉండటమే భాగవత ధర్మం. కర్మ, అకర్మ, మరియు వికర్మలన్నింటిలో ఉన్న మర్మం ఈ భావనే. 
హరిచరిత్ర అవతార గుణ | ద్రుమిల నాథే కేలే నిరూపణ | 
పురుషావతారాచీ దావూని ఖూణ | రూపే నారాయణ వర్ణిలా | ||౫౩|| 
53. శ్రీ విష్ణువు చరిత్ర, మరియు అవతారాలలోని విశిష్టతను ద్రుమిలనాథుడు వర్ణించాడు. నారాయణ స్వరూపమైన పురుషావతారాన్ని గుర్తించే లక్షణాలను కూడా అతను వివరించాడు. 
పుఢే అభక్త గతి విన్యాస | విదేహా కథీ నాథ చమస | 
వేదవిహిత కర్మాచీ కాంస | సోడిల్యా హో నాశ సర్వస్వీ | ||౫౪|| 
54. భక్తి లేనివారికి పట్టే దుర్గతిని, వేదాలు చెప్పిన కర్మలను చేయని వారందరూ నాశమౌతారనియూ చమస్నాథుడు జనక మహారాజుకు వివరించాడు. 
సర్వాంతరీ హరీచా వాస | మ్హణోని న కరావా కోణాచా ద్వేష | 
పిండీ పిండీ పహావా పరేశ | రితా న రేస త్యావీణ | ||౫౫|| 
55. దేవుడైన హరి అన్ని ప్రాణులలోనూ ఉన్నాడు కనుక, ఎవరినీ ద్వేషించరాదు. ప్రతి ప్రాణిలోనూ పరమేశ్వరుని చూడాలి. దేవుడు లేని చోటంటూ ఏదీ లేదు. 
అంతీ నవవే కరభాజన | కృతత్రేతాది యుగీంచే పూజన | 
కైశా కైశా మూర్తీంచే ధ్యాన | కరితే నిర్వచన జాహలే | ||౫౬|| 
56. చివరలో, తొమ్మిదవ వాడైన కరభాజనుడు, కృత, త్రేతాది యుగాలలో ఏ ఏ దేవతల మూర్తులను ఎలా పూజించాలి, ఎలా ధ్యానించాలి అని వివరించాడు. 
కలియుగీ ఎకచి సాధన | హరి గురు చరణ స్మరణ | 
తేణేంచ హోయ భవభయహరణ | హే ఎక నిజ శరణ శరణాగతా | ||౫౭|| 
57. హరియొక్క, గురువుయొక్క పాదాలను తలచుకోవటం ఒక్కటే కలియుగంలో మనకున్న సాధనం. దానితోనే భవభయం తొలగిపోతాయి. శరణాగతులకు ఉన్న ఏకైక శరణం ఇదే. 
ఏసీ పోథీ జాహల్యాఅంతీ | కాకాసాహేబ పృచ్ఛా కరితీ | 
కాయ హో హీ నవనాథకృతి | అతర్క్య వృత్తి తయాంచీ | ||౫౮|| 
58. గ్రంథ పఠనం ఇంతవరకూ వచ్చిన తరువాత, కాకా సాహేబు, ‘ఈ నవ నాథుల చర్యలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి! వారి మనోవృత్తి కూడా తర్క రహితంగా ఉంది’ అని ఆశ్చర్యపోయాడు. 
ఆవడీ మాధవరావాంస వదతీ | కితీ హో హీ అవఘడ భక్తి | 
ఆమ్హా మూఢా కైచీ హీ శక్తి | జన్మజన్మాంతీ న ఘడే హే | ||౫౯|| 
59. తరువాత, ప్రేమగా మాధవరావుతో, ‘ఈ భక్తి ఎంత కఠినమైనది! మనవంటి మూఢులకు అంతటి శక్తి ఎక్కడిది? జన్మ జన్మలకూ ఇది సాధ్యం కానిది. 
కోఠే హే నాథ మహాప్రతాపీ | కోఠే ఆపణ ఠాయీంచే పాపీ | 
ఆహే కాయ భక్తి హీ సోపీ | సచ్ఛిద్రూపీ తే ధన్య | ||౬౦||
60. ‘ఇంత శక్తివంతులైన ఆ నాథులు ఎక్కడ? పుట్టుకతోనే పాపులైన మనం ఎక్కడ? ఇంతటి భక్తి సులభ సాధ్యమా? సత్యం, జ్ఞానంయొక్క స్వరూపులైన వారు నిజంగా ధన్యులు. 

ఆమ్హా హీ భక్తి ఘడేల కాయ | కైసేన హోఈల తరణోపాయ | 
జాహలో హతాశ గళాలే పాయ | ఝాలా కీ వాయఫళ జన్మహా | ||౬౧|| 
61. ‘ఇలాంటి భక్తి మనకు లభిస్తుందా? మనకింక వేరే దారి ఏది? నేను హతాశుణ్ణయి పోయాను. ఈ జన్మ వ్యర్థమైపోయింది’ అని అన్నాడు.
కాకాసాహేబ భక్త ప్రేమళ | అసావీ జీవాస కాంహీ హళహళ | 
సుస్థిరవృత్తి వ్హావీ కా చంచళ | ఉడాలీ ఖళబళ శామాచీ | ||౬౨|| 
62. కాకాసాహేబు ప్రేమమయుడైన భక్తుడు. అతని మనసు స్థిరంగా ఉండక, ఇలా ఎందుకు చంచలమై తపన పడుతున్నాడు అని శ్యామా మనసులో బాధ పడ్డాడు. 
శామానామే మాధవరావ | జయాంచా కాకాంలాగీ సద్భావ | 
తయాంస కాకాంచా హా స్వభావ | దైన్యాచా ప్రభావ నావడలా | ||౬౩|| 
63. శ్యామా అనబడే మాధవరావుకు కాకాసాహేబు అంటే చాలా అభిమానం. అతనికి కాకాయొక్క నిరాశ, నిస్పృహ, దైన్యం నచ్చలేదు. 
మ్హణతీ బాబాంసారిఖే లేణే | భాగ్య లాధలే జయాసీ తేణే | 
ముఖ కరావే కేవిలవాణే | వ్యర్థ కీ జీణే తయాచే | ||౬౪|| 
64. ‘బాబాలాంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండి కూడా, ఇంతటి దైన్యం ఎందుకు? అతడు జీవించడం వ్యర్థం’ అని అనుకున్నాడు. 
సాఈచరణీ శ్రద్ధా అఢళ | తరీ హీ కా మనాచీ తళమళ | 
నాథాంచీ భక్తి అసేనా ప్రబళ | ఆపులీహీ ప్రేమళ నవ్హే కా? | ||౬౫|| 
65. ‘సాయి పాదాలలో ఇంతటి దృఢమైన విశ్వాసం ఉండీ కూడా, మనసులో ఇంతటి అలజడి ఎందుకు? నవనాథుల భక్తి ప్రబలమైనదే కావచ్చు. కాని, మన భక్తిలో ప్రేమ లేదా?’ 
ఎకనాథీ టీకేసహిత | ఎకాదశస్కంధ భాగవత | 
వాచావే భావార్థ రామాయణ నిత | ఆపణా నిశ్చిత హీ ఆజ్ఞా | ||౬౬|| 
66. ‘టీకా సహితంగా ఏకనాథ భాగవతంలోని పదుకొండవ స్కంధం మరియు భావార్థ రామాయణాన్ని మీరు రోజూ పఠించాలని బాబా ఆజ్ఞయే కదా! 
తైసేంచ హరిగురు నామస్మరణ | హీ బాబాంచీ ఆజ్ఞా ప్రమాణ | 
యాంతచి అపులే భవభయ తారణ | చింతేచే కారణ కాయ తుమ్హా? | ||౬౭|| 
67. ‘అలాగే, హరినామ స్మరణ, గురునామ స్మరణ, సంసార సాగరం దాటడానికి సాధన, అనేది కూడా బాబా ఆజ్ఞయే కదా? అలాంటప్పుడు, ఎందుకు మీకు ఇంత చింత?’ అని అన్నాడు. 
పరీ త్యా నవయోగ్యాచే చరిత | తయాచే తే అసిధారావ్రత | 
సాధేల కాయ ఆపణా యత్కించిత | చింతన హే సతత కాకాంచే | ||౬౮|| 
68. అయినా, ఆ నవయోగుల చరిత్ర, వారి నియమ నిష్ఠలు, వారు పాలించిన కత్తి మీద సామువంటి వ్రతాలు, వీటిలో ఏ కొంచమైనా మనకు సాధ్యమా? అని కాకా సతతంగా ఆలోచిస్తుండేవాడు. 
లాగలీ జీవాస మోఠీ చుటపుట | నవయోగ్యాంచీ భక్తిచ ఉద్భట | 
కవణ్యా ఉపాయే హోఈల ప్రకట | తరీచ మగ నికట దేవ ఖరా | ||౬౯|| 
69. ఆ నవయోగుల భక్తియే అన్నిటికంటే ఉత్తమమైనది, శ్రేష్ఠమయినది అనియూ, అది ఎలా లభిస్తుంది? ఆ భక్తిద్వారానే భగవంతుని సామీప్యం సాధ్యం, అనియూ కాకా మనసులో తీవ్రమైన కోరిక ఏర్పడింది. 
అసో ఏసీ లాగలీ హురహుర | ఆసనీ శయనీ హాచ విచార | 
ఉదయీక ఘడలా చమత్కార | శ్రోతీ తో సవిస్తర పరిసావా | ||౭౦||
70. అలా, ఈ ఆవేదన ఎంతగా పెరిగిందంటే, కూర్చున్నా, పడుకున్నా, అదే ఆలోచన కాకాను బాధపెట్ట సాగింది. అప్పుడు జరిగిన అద్భుతమైన చమత్కారాన్ని శ్రోతలూ, సవిస్తారంగా వినండి. 

అనుభవాచా పహా నవలావ | ప్రాతఃకాళీంచ ఆనందరావ | 
పాఖాడే హే జయా ఉపనాంవ | ఆలే మాధవరావా శోధావయా | ||౭౧|| 
71. ఆశ్చర్యకరమైన ఆ అనుభవాన్ని గమనించండి. రెండవ రోజు ఉదయమే ఆనందరావు పాఖాడే అనే వ్యక్తి మాధవరావును వెదుకుతూ వచ్చాడు. 
తేహీ ఆలే ప్రాతఃకాళీ | భాగవత వాచావయాచే వేళీ | 
బైసలే మాధవరావాజవళీ | స్వప్నాచీ నవాళీ సాంగత | ||౭౨|| 
72. అది కూడా, తెల్లవారే, సరిగ్గా భాగవత పఠన సమయానికి వచ్చి, మాధవరావు ప్రక్కన కూర్చుని, గత రాత్రి తనకొచ్చిన కల విశేషాన్ని చెప్పసాగాడు. 
ఇకడే చాలలీ ఆహే పోథీ | తికడే పరస్పర దోఘే ఫుసఫుసతీ | 
తేణే శ్రోత్యా వక్త్యాంచే చిత్తీ | అస్థైర్య స్థితి పాతలీ | ||౭౩|| 
73. ఇక్కడ ఒక వైపు గ్రంథ పఠనం సాగుతుంటే, మరోవైపు అక్కడ, వారిద్దరూ గుసగుసలాడుకొంటున్నారు. దీనివలన, చెప్పేవారికి, వినేవారికీ గ్రంథ పఠనంపై ఏకాగ్రత తప్పిపోయింది. 
ఆనందరావ చంచల వృత్తీ | మాధవరావాంస స్వప్న కథితీ | 
వదతా పరిసతా దోఘే కుజబుజతీ | రాహిలీ పోథీ క్షణభర | ||౭౪|| 
74. ఆనందరావు చంచల మనస్కుడు. తన కల గురించి మాధవరావుకు వివరిస్తుండగా, వారిరువురూ ఒకరికొకరు అడగటం, చెప్పటం వలన గ్రంథ పఠనానికి ఆటంకం కలిగింది. 
కాకాసాహేబ తంవ త్యా పుసతీ | కాయ తీ ఏసీ నవల స్థితి | 
దోఘేచ తుమ్హీ ఆనంద వృత్తి | సాంగా న ఆమ్హా ప్రతీ కాయ కీ | ||౭౫|| 
75. అప్పుడు కాకాసాహేబు వారితో, ‘మీరిద్దరూ ఇంత ఆనందంగా ఉన్నారు, ఏమిటి విశేషం? అదేమిటో మాకు కూడా కాస్త చెప్పండి’ అని అన్నాడు. 
తవ తే మాధవరావ వదతీ | కాలచ కీ ఆపణా శంకా హోతీ | 
సమాధాన ఘ్యా హాతోహాతీ | తారక భక్తి లక్షణ | ||౭౬|| 
76. అందుకు మాధవరావు, ‘నిన్ననే కదా మీకు సంశయం కలిగింది, దానికి వెంటనే సమాధానం వచ్చింది. సంసార సాగరాన్ని దాటించే భక్తియొక్క లక్షణాలను వినండి. 
పరిసా పాఖాడ్యాంచే స్వప్న | దిధలే బాబాంనీ కైసే దర్శన | 
హోఈల అపుల్యా శంకేచే నిరసన | గురుపదవందన భక్తి పురే | ||౭౭|| 
77. ‘పాఖాడేయొక్క కల గమనించండి. అందులో బాబా ఎలా దర్శనమిచ్చారో వింటే, మీ సందేహాలు తొలగి పోయి, గురువు పాదాలకు నమస్కరించే భక్తి ఉంటే చాలు, అని అర్థమౌతుంది’ అని అన్నాడు. 
మగ తే స్వప్న ఏకావయాచీ | ప్రబళ జిజ్ఞాసా త్యా సర్వాంచీ | 
విశేషే కాకాసాహేబ యాంచీ | శంకాహీ తయాంచీచ ఆరంభీ | ||౭౮|| 
78. ఆ కల గురించి వినటానికి అందరికీ కుతూహలం కలిగింది. ముఖ్యంగా కాకాసాహేబుకు, తెలుసుకోవాలనే ఆతురత, ఎందుకంటే అతనికేగా మొదట సంశయం కలిగింది! 
పాహోనియా సర్వాంచా భావ | స్వప్న సాంగే ఆనందరావ | 
చిత్తీ ఠేవూనియా సద్భావ | శ్రోత్యాంసహీ నవలావ వాటలా | ||౭౯|| 
79. అందరి ఆతురతను గమనించి, ఆనందరావు తన కలను శ్రద్ధగా చెప్పసాగాడు. అక్కడ ఉన్నవారందరికీ నమ్మకం ఉంది కాబట్టి, చాలా వింతగా వినసాగారు. 
ఎకా మహా సముద్రాంత | ఉభా మీ కంబరభర ఉదకాంత | 
తేథే మాఝియా దృష్టిపథాంత | ఆలే శ్రీసమర్థ అకల్పిత | ||౮౦||
80. ‘నేను ఒక సముద్రంలో, నడుము లోతు నీటిలో నిలబడి ఉన్నాను. అప్పుడు, అక్కడ శ్రీ సాయి సమర్థులు నా దృష్టికి కనిపించారు. 

రత్నఖచిత సింహాసన | వరీ సాఈ విరాజమాన | 
ఉదకాంతర్గత జయాంచే చరణ | ఏసే తే ధ్యాన దేఖిలే | ||౮౧|| 
81. ‘రత్న ఖచితమైన సింహాసనంపై వారు కూర్చుని ఉన్నారు. వారి పాదాలు నీటి లోపలే ఉన్నాయి. అలాంటి దృశ్యాన్ని చూశాను.
పాహూని ఏసే మనోహర ధ్యాన | జాహలే అత్యంత సమాధాన | 
తే స్వప్న హే కోణాస భాన | మన సుఖసంపన్న దర్శనే | ||౮౨|| 
82. ‘వారి మనోహరమైన రూపాన్ని చూసి, నాకు అత్యంత ఆనందం కలిగింది. అలాంటి దృశ్యం కల అనే భావన ఎవరికి కలుగుతుంది? వారి దర్శనంతో మనసుకు ఎంతో సంతోషం కలిగింది. 
కాయ త్యా యోగాచా నవలావ | తేథేంచ ఉభే మాధవరావ | 
పాయా పడా హో ఆనందరావ | వదలే మజ భావపురఃసర | ||౮౩|| 
83. ‘ఇంకా ఆశ్చర్యకరమైన ఘటన అంటే, మాధవరావు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. మాధవరావు భావావేశంతో నాతో, ‘వారి పాదాలపై పడు, ఆనందరావు!’ అని అన్నాడు. 
తంవ మీ తయా ప్రత్యుత్తర దేత | ఇచ్ఛా మాఝీహీ ఆహే బహుత | 
పరీ తే పాయ ఉదకాంతర్గత | కైసే మజ హాతాంత యేతీల | ||౮౪|| 
84. ‘ ‘అలా చేయాలనే నాకూ కోరికగా ఉంది కాని, వారి పాదాలు నీటిలో ఉన్నాయి. నా చేతికి అవి ఎలా అందుతాయి?’ అని నేను బదులు చెప్పాను. 
ఉదకామాజీ పాయ అసతా | కైసా పాయీ ఠేవూ మాథా | 
తరీ మీ కాయ కరావే ఆతా | నకళే మజ తత్వతా కాంహీంహీ | ||౮౫|| 
85. ‘ ‘నీటిలో ఉండే ఆ పాదాలపై నా శిరసును ఎలా పెట్టగలను? నేనిప్పుడు ఏం చేయాలి? నాకు నిజంగా ఏమీ అర్థం కావటం లేదు’ అని అన్నాను. 
ఏసే పరిసూని మాధవరావ | పరిసా బాబాంస వదలే కాయ | 
దేవా3 కాఢ రే వరతీ పాయ | ఆహేత తే తోయ ప్రచ్ఛన్న | ||౮౬|| 
86. ‘ఇది విన్న మాధవరావు అప్పుడు బాబాతో ఏమన్నాడో వినండి. ‘దేవా! నీటిలో ఉన్న మీ పాదాలను పైకి తీయండి’ అని 
ఏసే వదతాంచ తత్క్షేణ | కాఢిలే బాబాంనీ బాహేర చరణ | 
ఆనందరావాంనీ మగ తే ధరూన | కేలే అభివందన అవిలంబే | ||౮౭|| 
87. అలా అన్న వెంటనే, బాబా తమ పాదాలను బయటికి తీశారు. ఆలస్యం చేయకుండా, ఆనందరావు బాబా పాదాలను పట్టుకుని వందనం చేశాడు. 
ఏసే ధరితా దృఢ చరణ | బాబాంనీ దిధలే ఆశీర్వచన | 
“హోఈల జారే తుఝే కల్యాణ | కాంహీ న కారణ భీతీచే” | ||౮౮|| 
88. ‘నేను అలా వారి పాదాలను దృఢంగా పట్టుకుని ఉన్నప్పుడు, బాబా, “నీకు అన్నీ శుభం కలుగుతుంది. నీవు భయ పడవలసినది ఏదీ లేదు, 
ఆణిక బాబా వదలే దేఖ | “రేశీమ కాంఠీ ధోతర ఎక | 
శామ్యాస మాఝ్యా దేఊన టాక | తుజ సుఖదాయక హోఈల” | ||౮౯|| 
89. “జరీ అంచు ధోవతిని నా శ్యామాకు ఇవ్వు. అందు వలన నీకు శుభం కలుగుతుంది” అని కూడా అన్నారు. 
తరీ తీ వందూని ఆజ్ఞా శిరీ | ధోతర మ్యా ఆణిలే రేశీమధారీ | 
కాకాసాహేబ ఆపణ తే స్వకరీ | మాధవరావ స్వీకారీ ఏసే కరా | ||౯౦||
90. ‘వారి ఆజ్ఞను శిరసావహించి, జరీ అంచు ధోవతిని తెచ్చాను. కాకాసాహేబ్! దానిని మాధవరావు మీ చేతుల ద్వారా తీసుకునేలా చేయండి. 

మాన్య కరా జీ హీ మమ వినంతీ | మాధవరావ హే పరిధాన కరితీ | 
కరా ఏసే సుఖవా మజప్రతీ | హోఈన మీ అతీ ఉపకారీ | ||౯౧|| 
91. ‘నా ఈ విన్నపాన్ని మన్నించండి. మాధవరావు దీనిని కట్టుకునేలా చేయండి. దానివలన నాకు సంతోషం కలుగుతుంది. నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అవుతాను’. 
ఆనందరావాచీ హీ మాత | మాధవరావ స్వయే పరిసత | 
కాకాసాహేబ జంవ తే దేత | తే న స్వీకారిత తే వస్త్ర | ||౯౨|| 
92. ఆనందరావు మాటలను తను స్వయంగా విన్నా, కాకాసాహేబు ఇచ్చిన ధోవతిని మాధవరావు తీసుకోలేదు. 
తయాంచే మనీ హే తో స్వప్న | ఆమ్హాస పటలీ పాహిజే ఖూణ | 
దృష్టాంత కాంహీ జాహల్యావిణ | ఘ్యావే న ఆపణ హే వస్త్ర | ||౯౩|| 
92. ఆనందరావు మాటలను తను స్వయంగా విన్నా, కాకాసాహేబు ఇచ్చిన ధోవతిని మాధవరావు తీసుకోలేదు. 
కాకాసాహేబ తేవ్హా వదత | ఆతా బాబాంచీ పాహూ ప్రచీత | 
ఘేణే హే ఉచిత అథవా అనుచిత | హోఈల తే సూచిత చిఠ్ఠ్యాంనీ | ||౯౪|| 
94. అప్పుడు కాకాసాహేబు, ‘బాబా అభిప్రాయాన్ని తెలుసుకుందాం. తీసుకోవటం సరియైనదా, కాదా అనేది చీటీల ద్వారా తెలుస్తుంది’ అని అన్నాడు. 
దేతీల బాబా చిఠ్ఠీ జైసీ | మానూ తయాంచీ ఆజ్ఞా తైసీ | 
చిఠ్ఠ్యా బాబాంచియా పాయాపాసీ | కృతసంకల్పేసీ టాకిల్యా | ||౯౫|| 
95. ‘బాబా ఇచ్చిన చీటీయే వారి ఆజ్ఞగా తీసుకుందాం’ అని నిశ్చయించుకుని, చీటీలలో వ్రాసి, బాబా పాదాల వద్ద ఉంచాడు. 
కాకాసాహేబ యాంచా భార | హోతా సర్వస్వీ సాఈచియావర | 
ఆధీ ఘ్యావా త్యాంచా విచార | కరావా తో వ్యవహార పుఢారా | ||౯౬|| 
96. కాకాసాహేబు తన భారాన్నంతా సాయిపైనే ఉంచేవాడు. బాబా అభిప్రాయాన్ని ముందుగా తెలుసుకున్న తరువాతే ఏ పనైనా చేసేవాడు. 
హే తో బాబాంచే హయాతీంత | తోచ కీ క్రమ తయాంచే పశ్చాత | 
చిఠ్ఠ్యా టాకూన ఆజ్ఞా ఘేత | తైసేచ తే వర్తత నిశ్చయే | ||౯౭|| 
97. అలా ఏమో, బాబా శరీరంతో ఉన్నప్పుడు చేసేవాడు. వారు శరీరాన్ని వదిలిన తరువాత, చీటీలు వేసి బాబా ఆజ్ఞను తీసుకునేవాడు. ఆ ఆజ్ఞను తప్పక పాలించేవాడు. 
కార్య మోఠే అథవా సాన | చిఠ్ఠీనే ఆజ్ఞా ఘేతల్యావీణ | 
కాంహీ న కరణే గేలియా ప్రాణ | అనుజ్ఞా ప్రమాణ సర్వథా | ||౯౮|| 
98. పని చిన్నదైనా పెద్దదైనా, చీటీల ద్వార బాబా ఆజ్ఞను తీసుకోకుండా, ప్రాణం పోయినా, ఏ పనీ చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞయే సర్వదా ప్రమాణం. 
దేహచి జేథే నాహీ అపులా | ఎకదా బాబాంచ్యా పాయీ వాహిలా | 
మగ తయాచ్యా చలనవలనాలా | కాయ అపుల్యా అధికార | ||౯౯|| 
99. ‘బాబా పాదాలకు అంకితం చేసిన తరువాత, దేహమే మనది కానప్పుడు, దాని వ్యవహారాల పైన మనకు అధికారం ఎక్కడుంటుంది?’ 
పహా యా ఎకా భావనేవర | లాఖో రుపయాంచే కమాఈవర | 
లాథ మారిలీ పరీ హా నిర్ధార | దృఢ ఆమరణాంత రాఖిలా | ||౧౦౦||
100. అనే ఈ ఒక్క భావంతో, లక్షలాది రుపాయల సంపాదనను కాలద్రోసుకున్నాడు కాని, తన దృఢ నిర్ణయాన్ని జీవితాంతం వరకు పాటించాడు. 

“ఫళా యేఈల తుఝే ఇమాన | ధాడీన మీ తుజలాగీ విమాన | 
నేయన త్యాంత బైసవూన | నిశ్చింత మన రాహీ తూ” | ||౧౦౧|| 
101. “నీ నమ్మకం ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపి, అందులో నిన్ను కూర్చోబెట్టి, తీసుకొని పోతాను. నిశ్చింత మనస్కుడవై ఉండు”.
హీ బాబాంచీ ప్రసాదోక్తి | అక్షరే అక్షర ఆలీ ప్రతీతి | 
సాఈలీలా వాచకాంప్రతి | ఠావీ నిర్గమ స్థితీ కాకాంచీ | ||౧౦౨|| 
102. బాబాయొక్క ఈ అనుగ్రహ వచనంలోని ప్రతి అక్షరం నిజంగా జరిగింది. కాకాసాహేబుయొక్క విశిష్టమైన నిర్యాణం గురించి, సాయిలీలా మాసికం పాఠకులకు ఇప్పటికే తెలుసు. 
హోతా తయా స్థితీచే స్మరణ | ఆణీక తే కాయ విమాన ప్రయాణ | 
కాయ తే ఆనందాచే మరణ | గురునామావర్తన సమవేత | ||౧౦౩|| 
103. అప్పటి స్థితి తలచుకుంటే, విమాన ప్రయాణమంటే ఇంతకంటే వేరే ఏముంటుంది, అని అనిపిస్తుంది. అనంతమైన గురు నామ స్మరణ జరుగుతుండగా, ఆనందమయమైన ఎంతటి సునాయాస మరణం! 
ఏసే దీక్షిత కరారీ ఆపణ | చిత్తీ నిరంతర సాఈ చరణ | 
ఇష్ట మిత్రాంహీ దేఊని శికవణ | జాహలే విలీన గురుపాయీ | ||౧౦౪|| 
104. అలా, దీక్షితు తన నిశ్చయంలో దృఢంగా ఉండేవాడు. సాయి పాదాలలో ఎప్పుడూ అతని మనసు లీనమై ఉండేది. ఇష్టులకు, మిత్రులకు దీనినే నేర్పించి, గురు చరణాలలో విలీనమై పోయాడు. 
ఆతా పూర్వానుసంధాన స్థితి | దోఘాంహీ మానలీ చిఠ్ఠ్యాంచీ యుక్తి | 
కారణ దోఘాంచీ కాకాంవర ప్రీతి | చిఠ్ఠ్యా మగ లిహవితీ అవిలంబే | ||౧౦౫|| 
105. ఇప్పుడు మునపటి కథకు వస్తే, ఆనందరావు, మాధవరావు ఇద్దరూ కాకాపైని ప్రీతితో చీటీల ఉపాయాన్ని ఒప్పుకున్నారు. ఆలస్యం చేయకుండా, చీటీలను వ్రాయించారు. 
ఎకా చిఠ్ఠీంత ‘ఘ్యావే ధోతర’ | దుసరీంత ‘త్యాచా కరావా అవ్హేర’ | 
ఏసే లిహూన సాఈచ్యా పాయావర | టాకిల్యా ఛాయా చిత్రాతళీ | ||౧౦౬|| 
106. ఒక చీటీలో ‘ధోవతిని తీసుకో’ అని, రెండవ దానిలో ‘తీసుకోవద్దు’ అని వ్రాసి, సాయియొక్క చిత్రపటం క్రింద, వారి పాదాల వద్ద ఉంచారు. 
తత్రస్థ ఎకా అర్భకాస | త్యాంతీల చిఠ్ఠీ ఉచలావయాస | 
లావితా ధోతర ఘ్యావయాస | మాధవరావాంస యే ఆజ్ఞా | ||౧౦౭|| 
107. అక్కడున్న బాలునితో, ఒక చీటీని తీయించగా, అందులో ‘ధోవతిని స్వీకరించు’ అని మాధవరావుకు ఆజ్ఞ అయింది. 
జైసే స్వప్న తైసీచ చిఠ్ఠీ | ఆనంద ఝాలా సకళా పోటీ | 
మగ తే ధోతర రేశీమ కాంఠీ | ఘాతలే కరసంపుటీ శామాచియా | ||౧౦౮|| 
108. కలలో ఉన్నట్టే, చీటీలోనూ ఉండటం వలన, అందరికీ ఆనందం కలిగింది. అప్పుడు, జరీ అంచు ధోవతిని మాధవరావు చేతిలో పెట్టటం జరిగింది. 
త్యాంచే స్వప్న యాంచీ చిఠ్ఠీ | పరస్పరాంశీ పడతా మిఠీ | 
పరమానంద న మాయ పోటీ | సుఖసంతుష్టీ ఉభయాంతే | ||౧౦౯|| 
109. ఆనందరావు కల, మాధవరావు చిట్టి, రెండూ ఒకటే అవటం వలన, వారిద్దరికీ భరించలేనంత పరమానందం కలిగింది. ఆ ఇద్దరికీ సంతోషం, తృప్తి కలిగాయి. 
మాధవరావ అంతరీ ఖూష | ఆనందరావాసహీ సంతోష | 
ఝాలా సాఈభక్తి పరిపోష | ఆశంకా నిరాస కాకాంచా | ||౧౧౦||
110. మాధవరావు లోలోపల ఆనందించాడు. ఆనందరావు కూడా చాలా సంతోష పడ్డాడు. సాయి భక్తి పరిపుష్టి కావడంతో, కాకా సంశయం కూడా తొలగింది. 

అసో యా సర్వ కథేంచే సార | జ్యాచా త్యాణే కరావా విచార | 
ఠేవిల్యా గురుపాయావర శీర | గురువదనోద్గార లక్షావే | ||౧౧౧|| 
111. ఏమైనా, ఈ కథ సారాంశమేమిటంటే, గురువు పాదాలయందు శిరసును ఉంచినప్పుడు, గురువు నోటినుండి వచ్చిన మాటలను, చాలా శ్రద్ధతో పాటించాలి అనే దానిని గురించి, ఎవరికి వారు, ప్రతియొక్కరూ ఆలోచించాలి. 
ఆపణాహూన ఆపులీ స్థితి | ఆపులీ భూమికా వా చిత్తవృత్తి | 
గురు జాణే నఖశిఖాంతీ | ఉద్ధారగతీహీ తోచ | ||౧౧౨|| 
112. మన స్థితిగతులు, మన చిత్తవృత్తి, మన భూమిక, వీటి గురించి మనకంటే, మన గురువుకే బాగా తెలుసు. అలాగే, మనల్ని ఎలా ఉద్ధరించాలన్నది కూడా గురువుకే తెలుసు. 
జైసా రోగ తైసే నిదాన | తైసేంచ ఔషధ వా అనుపాన | 
సద్గురునేమీ శిష్యాలాగూన | భవరోగ నివారణ కార్యార్థ | ||౧౧౩|| 
113. రోగానికి తగిన విధంగా ఔషధం అన్నట్టు, భవ రోగ నివారణ కోసం, సద్గురువు శిష్యునికి ఔషధ రూపంగా నియమాలను విధిస్తారు. 
స్వయే తో జీ కరితో కరణీ | ఆణూ నయే ఆపులే అనుకరణీ | 
తుమ్హా కారణే గురుముఖాంతునీ | నిఘేల తీ వాణీ ఆదరావీ | ||౧౧౪|| 
114. గురువు ఆచరించే విధానాన్ని మనము అనుకరించ కూడదు. కాని, గురువు నోటినుండి మన కోసం వచ్చే మాటలను శ్రద్ధగా ఆచరించాలి. 
త్యాచ శబ్దాంవర ఠేవావే మన | తయాంచేచ నిత్య కరావే చింతన | 
తేంచ తుమచ్యా ఉద్ధారా కారణ | ఠేవా హే స్మరణ నిరంతర | ||౧౧౫|| 
115. ఆ మాటలనే ఏకాగ్రతతో విని, వాటినే మననం చేయాలి. అవే మీ ఉద్ధరణకు ఉపయోగ పడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోండి. 
గురు సాంగే తే పోథీపురాణ | తే తో తద్వచన స్పష్టీకరణ | 
ముఖ్య ఉపదేశీ ఠేవా ధ్యాన | తే నిగమజ్ఞాన ఆపులే | ||౧౧౬|| 
116. గురువు చెప్పినదే, మనకు పురాణ గ్రంథాలలో చెప్పిన మాటలు. వారి మాటలు వాటినే స్పష్టం చేస్తాయి. కాని, మన ధ్యానం ఎప్పుడూ వారి ముఖ్యోపదేశాల పైనే ఉండాలి. అవే మనకు వేద వాక్యాలు. 
కోణాహీ సంతాచే వచన | త్యాచా కరూ నయే అవమాన | 
ఆపులీ మాయ ఆపులీ జతన | కరీల తీ అన్య కోణ కరీ | ||౧౧౭|| 
117. ఏ సత్పురుషుని మాటలనైనా అవమానించ కూడదు. మన కన్న తల్లి మనల్ని చూసినట్లు మిగతా వారెవరు చూస్తారు? 
ఖరా మాయేచా జివ్హాళా | లేంకురాలాగీ తిచా కనవాళా | 
బాళ నేణే తో సుఖసోహళా | ఘేఈల తో లళా తీ పురవీ | ||౧౧౮|| 
118. కన్న తల్లికి తన బిడ్డల పైన, నిజమైన వాత్సల్యం ఉంటుంది. తన గురించి చేసే పనులలో, ఆమె పొందే సుఖం బిడ్డకు తెలియదు. బిడ్డల ప్రతి కోరికనూ తల్లి తీరుస్తుంది. 
సంత సృష్టీమాజీ ఉమాప | “ఆపులా బాప తో ఆపులా బాప” | 
సాఈముఖీంచే హే కరుణాలాప | కోరా స్వహృదయపటావరీ | ||౧౧౯|| 
119. సృష్టిలో లెక్కలేనంత సంతులు ఉన్నారు. కాని, "మన తండ్రి మన తండ్రే" అని సాయి నోటినుండి వెలువడిన కరుణా వచనాన్ని మీ హృదయ ఫలకంపై వ్రాసుకోండి. 
మ్హణోని సాఈముఖీంచే వచన | తేథేంచ ఠేవా అనుసంధాన | 
అంతీ తోచ కృపానిధాన | తాపత్రయ శమన కరీల | ||౧౨౦||
120. అందు వలన, సాయి నోటినుండి వెలువడిన మాటలయందే ధ్యానం ఉంచండి. దయామయులైన వారే చివరకు మన తాపత్రయాలను నివారించేది. 

తోచ జాణే త్యాచీ కళా | ఆపణ పహావే కౌతుక డోళా | 
కాయ అద్భుత తయాచ్యా లీలా | సహజ అవలీలా ఘడతీ జ్యా | ||౧౨౧|| 
121. వారి కళ వారికే తెలుసు. వారి ఆ కళా కౌశలాన్ని మనం కళ్లతో చూడాలి అంతే. ఎంతో సహజంగా, అవలీలగా సంభవించే వారి లీలలు, అంతే అద్భుతం.
దుసరా ఎక మ్హణతో మ్హణూన | త్యాంచే సర్వ ఘ్యావే ఏకూన | 
మోడూ న ద్యావే నిజానుసంధాన | నిజగురువచన విసరూ నయే | ||౧౨౨|| 
122. ఇంకొకరు ఏది చెప్పినా, ఆ మాటలన్నింటినీ వినండి. మీ గురువుయొక్క మాటలను మాత్రం మరచిపోకండి. మీ ధ్యేయాన్నీ, మీ ధ్యానాన్నీ వదలకండి. 
యాంతచి ఆహే పరమకల్యాణ | యాంతచి ఆహే భవభయతరణ | 
యాంతచి అవఘే పోథీపురాణ | జపతపానుష్ఠానచి హే | ||౧౨౩|| 
123. ఇందులోనే భవభయ నివారణమూ, ఇందులోనే పురాణాలు, గ్రంథాలు, ఇందులోనే జప, తప మరియు అనుష్ఠానాలూ ఉన్నాయి. ఇదే మనకు పరమ శుభప్రదము. 
సారాంశ ప్రేమ కరా గురూవర | అనన్యభావే నమస్కార | 
దినకరాపుఢే కైచా అంధార | తయాంసీ భవసాగర నాహీంచ | ||౧౨౪|| 
124. సారాంశంలో చెప్పాలంటే, గురువును ప్రేమించండి, వారికి అనన్య భావంతో నమస్కరించండి. సూర్యుడి ముందు చీకటి ఎలా ఉంటుంది? అలాగే, గురువు వద్ద సంసార సాగరము ఉండదు. 
అసా కుఠేహీ సృష్టీవర | నికట అథవా కితీహీ దూర | 
సాతా సముద్రాచ్యాహీ పార | భక్తార్థ అనివార ప్రేమళ | ||౧౨౫|| 
125. సృష్టిలో ఎక్కడున్నా - దగ్గరలో గాని, దూరంలో గాని, ఏడు సముద్రాల అవతల ఉన్నా సరే - శిష్యులయందు గురువు అత్యంత ప్రేమ కలిగి ఉంటారు. 
అసో ఏసే హే లిహితా లిహితా | కథా ఎక ఆఠవలీ చిత్తా | 
ఎకాచే పాహూని దుజ్యానే కరితా | కైసియా ఆపదా హోత జీవా | ||౧౨౬|| 
126. ఇలా వ్రాస్తూ, వ్రాస్తూ ఉండగా, ఒకరిని చూచి మరొకరు అనుకరిస్తే ఎంతటి ఆపదలు కలుగుతాయనే ఇంకొక కథ నాకు గుర్తుకు వచ్చింది. 
ఎకదా బాబా మశీదీంత | అసతా మ్హాళసాపతీ సమవేత | 
పూర్వీల ఫళీచీ శేజ అవచిత | స్మరే అకల్పిత తయాంతే | ||౧౨౭|| 
127. ఒక సారి, మహల్సాపతితో బాబా మసీదులో ఉండగా, అకస్మాత్తుగా మునుపు తాము పలకపై పడుకున్న సంగతి వారికి గుర్తుకు వచ్చింది. 
రుందీ అవఘీ సవావీత | దోనీ టోకాంస చింధ్యా బాంధిత | 
మశీదీచియా ఆఢ్యాస టాంగిత | ఝోంపాళా కరీత తియేచా | ||౧౨౮|| 
128. ఆ చెక్క వెడల్పు సుమారు ఒక అడుగు మాత్రమే. దానిపై పడుకోవటానికి, రెండు వైపులా దానికి పాత గుడ్డ పీలికలను కట్టి, మసీదు దూలానికి అడ్డంగా వ్రేలాడ గట్టేవారు. 
నిజూ నయే అంధారాంత | తదర్థ ఉశాపాయథ్యా లగత | 
ఠేవూని రాత్రౌ పణత్యా జళత | బాబా నిజత ఫళీవర | ||౧౨౯|| 
129. చీకటిలో పడుకోకూడదని, తల వద్దా, కాళ్ళ వద్దా దీపాలను ఉంచి, అవి రాత్రంతా వెలుగుతుండగా, బాబా ఆ చెక్కపైన పడుకునే వారు. 
యా ఫళీచే సమూళ వృత్త | పూర్వీల ఎకా అధ్యాయాంత4 | 
ఆధీంచ వర్ణిలే ఆహే యేథ | పరిసా కీ మహత్వ తియేచే | ||౧౩౦||
130. ఈ చెక్క పలక వృత్తాంతాన్ని అంతా, ఇదివరకే ఒక అధ్యాయంలో (అధ్యాయం పది) వర్ణించాను. దాని మహత్వాన్ని ఇప్పుడు వినండి. 

ఎకదా యా ఫళీచీ మహతీ | మనోభావే బాబా వర్ణితీ | 
కాకాసాహేబ దీక్షితా చిత్తీ | ఉదేలీ వృత్తీ తీ పరిసా | ||౧౩౧|| 
131. ఒక సారి, ఈ చెక్క పలక గొప్పదనాన్ని బాబా వర్ణిస్తుండగా, కాకాసాహేబు దీక్షితు మనసులో కలిగిన ఆలోచనను వినండి. 
మ్హణతీ మగ తే బాబాంప్రతీ | ఫళీవరీ శయనప్రీతి | 
అసేల తరీ తీ టాంగతో ప్రీతీ | మగ స్వస్థ చిత్తీ పహుడావే | ||౧౩౨|| 
132. బాబాతో అతడు, 'మీకు ఆ చెక్క పలకపై శయనించాలని అంత కోరికగా ఉంటే, ఒక చెక్క పలకను ప్రేమతో వ్రేలాడ కట్టిస్తాను. అప్పుడు మీరు దానిపై సుఖంగా పడుకోవచ్చు' అని అన్నాడు. 
బాబా తయాంస ప్రత్యుత్తర దేతీ | “ఖాలీ టాకూన మ్హాళసాపతీ | 
ఆపణచి వర నిజావే కేఉతీ | బరా మీ ఖాలతీ ఆహే తో” | ||౧౩౩|| 
133. "మహల్సాపతిని క్రింద వదలి, నేను ఒక్కణ్ణే పైన ఎలా పడుకోగలను? నేను క్రింద బాగానే ఉన్నాను" అని బాబా జవాబిచ్చారు. 
త్యావర కాకా అతిప్రీతీ | ఆణీక ఫళీ టాంగూ మ్హణతీ | 
ఆపణ నిజావే ఎకీవరతీ | మ్హాళసాపతీ దుసరీవర | ||౧౩౪|| 
134. అప్పుడు కాకా చాలా ప్రేమతో, 'ఇంకొక చెక్క పలక కట్టిస్తాను. ఒక దానిపై మీరు, రెండవదానిపై మహల్సాపతి పడుకోవచ్చు' అని చెప్పాడు. 
త్యావరీ పహా బాబాంచే ఉత్తర | “తో కాయ నిజతో ఫళీవర | 
జయా అంగీ గుణప్రకర5 | తోచ ఫళీవర నిజేల | ||౧౩౫|| 
135. దానికి బాబా ఏమన్నారో వినండి. "అతడు అసలు చెక్కపై పడుకోగలడా? శరీరంలో సుగుణ సంపదలు ఉన్నవాడే చెక్కపైన పడుకోగలడు. 
“నాహీ ఫళీవర శయన సోపే | కోణ తియేవర మజవీణ ఝోంపే | 
నయన ఉఘడే నిద్రా లోపే | తయాసచి ఝేపే హే శయన | ||౧౩౬|| 
136. "చెక్క పలకపై పడుకోవటం అంత సులభం కాదు. నేను తప్ప, దానిపైన ఎవరు పడుకోగలరు? నిద్రను మానుకుని, కళ్లు తెరుచుకుని ఉండగలవారే దానిపై పడుకోగలరు. 
“మీ జై కరూ లాగే శయన | తై మీ కరీ యాసీ6 ఆజ్ఞాపన | 
‘కర మద్హృూదయావరీ ఠేవూన | రాహీ బైసూన సన్నిధ’ | ||౧౩౭|| 
137. "'నేను నిద్రిస్తుంటే, నా గుండెపైన చేయి వేసి, నా దగ్గరే కూర్చోమని' అతనికి చెప్పాను. 
“తేంహీ కామ యాస న హోఈ | బసల్యా జాగీ డులక్యా ఘేఈ | 
తయా న ఫళీ హీ కామాచీ కాంహీ | ఫళీ హీ బిఛాఇత మాఝీచ | ||౧౩౮|| 
138. "కాని ఆ పని కూడా అతని చేత కాలేదు. కూర్చున్న చోటే కునుకు తీస్తాడు. అతనికి ఈ చెక్క పనికి రాదు. ఈ చెక్క పలక నాకు మాత్రమే పక్క. 
‘నామస్మరణ చాలే హృదయాంత | పాహే తేథే ఠేవూని హాత | 
నిజతా మీ మజ కరీ జాగృత’ | ఏసా అనుజ్ఞాపిత తో అసతా | ||౧౩౯|| 
139. "'నా హృదయంలో నిరంతరం నామ స్మరణ జరుగుతుంటుంది. అక్కడ చేతిని ఉంచి చూడు. నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు' అని అతనిని ఆజ్ఞాపించగా, 
“త్యాసచి నిద్రా లాగతా జడ | కర హో త్యాచా జైసా దగడ | 
‘భగత’ మ్హణతా నేత్రాచీ ఝాపడ | ఉడూని ఖడబడ జో కరీ | ||౧౪౦|| 
140. "అతనికే నిద్ర వచ్చి, అతని చేయి బరువెక్కి రాయిలా అవుతుంది. భగత్ అని నేను పిలవగానే అతని నిద్ర మాయమై, ఆందోళన పడతాడు. 

“బసవే న జయా ధరేవర | ఆసన జయాచే నాహీ స్థిర | 
జో నర నిద్రాతమకింకర | నిజేల ఉంచావర కేవీ” | ||౧౪౧|| 
141. "నేలపైనే సరిగ్గా కూర్చోలేనివాడు, ఆసనంపై స్థిరంగా ఉండలేనివాడు, తమోగుణమైన నిద్రకు కింకరుడైన వాడు, ఎత్తుపైన ఎలా పడుకోగలడు?" 
మ్హణోని “ఆపులే ఆపుల్యాసంగే | దుజియాచే తే దుజియాసంగే” | 
హే తో బాబా వేళ ప్రసంగే | భక్తానురాగే అనువదత | ||౧౪౨|| 
142. అలా బాబా భక్తుల పైని ప్రేమతో, "మీ స్వభావం ప్రకారం మీరు చేయండి, ఇంకొకరిని వారి స్వభావానికి అనుగుణంగా చేయనివ్వండి" అని సందర్భానుసారంగా చెప్పేవారు. 
అగాధ సాఈనాథాంచీ కరణీ | మ్హణూని హేమాడ లాగలా చరణీ | 
తయాంనీ హీ కృపాశీర్వచనీ | ఠేవిలా నిజస్మరణీ అఖండ | ||౧౪౩||
143. సాయినాథుని లీలలు అగాధం. కనుక, హేమాడు వారి చరణాలను ఆశ్రయించగా, బాబా కూడా అతనిని ప్రేమతో, కృపతో, ఆశీస్సులతో ఎప్పుడూ తమ స్మరణలో ఉంచారు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | శ్రీగురుచరణ మహిమా నామ | 
| పంచచత్వారింశోధ్యాయః సంపూర్ణః |

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. కవీ, హరీ, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిల, చమస, కరభాజన. 
2. జనకరాజా. 
3. శ్రీ సాఈబాబాంస మాధవరావ దేశపాండే ‘దేవా’ మ్హణూన నేహమీ సంబోధీత. 
4. అధ్యాయ ౧౦ వా. 
5. సముదాయ. 
6. మ్హాళసాపతీస.