Tuesday, February 18, 2014

||అవతరణికా నామ త్రిపంచాశత్తమోధ్యాయః||


||శ్రీ సాఈసచ్చరిత||శ్రీహేమాడపంతకృత||
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౫౩ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

శ్రీసాఈ సాక్షాత్ బ్రహ్మమూర్తీ | సంతసమ్రాట్ చక్రవర్తీ | 
సమర్థసద్గురుదిగంతకీర్తి | బుద్ధి స్ఫూర్తిప్రదాయక | ||౧|| 
1. శ్రీసాయి భూమి మీదకు దిగివచ్చిన బ్రహ్మ; సంతులలో చక్రవర్తి. సమర్థ సద్గురువు అని ప్రపంచమంతటా వారి కీర్తి వ్యాపించింది. వారు బుద్ధికి స్ఫూర్తిని ప్రసాదిస్తారు.
అనన్యభావే త్యాసీ శరణ | వందూ త్యాచే పుణ్య చరణ | 
సంసృతిభయాచే కరీ హరణ | జన్మమరణ చుకవీ జో | ||౨|| 
2. వారికి స్థిర బుద్ధితో శరణుజొచ్చి, ప్రార్థిస్తే, జనన మరణాలను, ప్రపంచ భయాలను తొలగిస్తారు. వారి పుణ్య పాదాలకు నమస్కరిద్దాము.
గతాధ్యాయీ దిధలే వచన | “ప్రథమ కరూని సింహావలోకన | 
నంతర అవతరణికా దేఊన | గ్రంథ కరీన సంపూర్ణ” | ||౩|| 
3. గడచిన అధ్యాయంలో, మొదట వెనుకటి అధ్యాయాలను సింహావలోకనం చేసి, తరువాత అవతరణికను పొందు పరచి, ఈ గ్రంథాన్ని సమాప్తి చేస్తానని,
పంతహేమాడ ఏసే వదలే | పరీ తైసే నాహీ ఘడలే | 
అవతరణికారూప సార కాఢిలే | కీ రాహిలే విస్మృతీనే | ||౪|| 
4. హేమాడుపంతు చెప్పారు. కాని, అలా జరగలేదు. గ్రంథంయొక్క సారాంశమైన అవతరణికను వారు వ్రాశారో, లేక మరపు వలన వదిలి వేశారో తెలియదు.
జ్యానే ఆరంభావే గ్రంథలేఖన | త్యానేంచ కరావే తే పూర్ణ | 
శేఖీ అవతరణికా దేఊన | ఏసే నియమన1 సర్వత్ర | ||౫|| 
5. గ్రంథ రచనను మొదలు పెట్టిన వారే అవతరణికను చివర వ్రాసి, ఆ గ్రంథాన్ని పూర్తి చేయటం అనేది అంతటా ఉన్న నియమం.
పరీ నియమా అపవాద అసే | త్యాచేంచ ప్రత్యంతర యేథే దిసే | 
కాంహీ న హోయ స్వేచ్ఛావశే | బలీయస మనోగత బాబాంచే | ||౬|| 
6. కాని, ఏ నియమానికైనా మినహాయింపులు ఉంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా మినహాయింపు కావలసి వచ్చింది. మన కోరిక ప్రకారం ఏదీ జరగదు. బాబా మనసులో ఉన్నదే చాలా బలీయమైనది.
హేమాడ అవచిత దివంగత | దుఃఖిత అవఘియాంచే చిత్త | 
అవతరణికేచీ న కళే మాత | న సుచత కాంహీ కోణాలా | ||౭|| 
7. అందరినీ దుఃఖంలో ముంచి, హేమాడుపంతు అకస్మాత్తుగా సాయి పాదాలు చేరుకున్నారు. ఎవరికీ ఏమీ తోచలేదు. అవతరణిక ఎక్కడా దొరకలేదు.
అణ్ణాసాహేబాంచే2 దప్తర గహన | సాయాసే కరూన తత్సంశోధన | 
త్యాంచే చిరంజీవ శ్రీగజానన | జరూర తితుకే మజ దేతీ | ||౮|| 
8. అణ్ణాసాహేబు (దాభోల్కరు) రచనలను వెదకటం చాలా కష్టమయింది. అతి ప్రయత్నం మీద, వారి కుమారుడు గజానన్ కొన్ని అవసరమైన కాగితాలను వెదకి ఇచ్చాడు.
అణ్ణాసాహేబ కాటకసరీ | వ్యర్థ న జాఊ దేతీ చిఠోరీ | 
కామ కరితీ కలాంకుసరీ | స్వభావ యాపరీ తయాంచా | ||౯|| 
9. అణ్ణాసాహేబు చాలా పొదుపరి. చిన్న చిన్న చిత్తు కాగితాలను కూడా వ్యర్థం చేయకుండా, వాటి మీదనే చక్కగా చాతుర్యంతో పని చేసే స్వభావం వారిది.
లిహితీ అధ్యాయ చిఠోర్యావరీ | తీంచ దేతీ ముద్రకాకరీ | 
వాఊగా ఖర్చ ఖుపే అంతరీ | తయాంచీ సరీ న యే కవణా | ||౧౦||
10. చిన్న చిన్న కాగితం ముక్కల పైన వ్రాసిన అధ్యాయాలను అలాగే ముద్రణకు ఇచ్చేవారు. అనవసరమైన ఖర్చు వారికి నచ్చేది కాదు. నిజంగా, వారికి సాటి ఎవరూ రారు. 

నిర్జీవ బాపుడీ తీ చిఠోరీ | కరుణా ఉపజే తయాంచ్యా అంతరీ | 
హీ ఉద్ధరతీల కవణేపరీ | సంతకేసరి సేవేవిణ3 | ||౧౧|| 
11. జీవం లేని చిన్న కాగితం ముక్కలపై వారికి దయ కలిగి, ‘వీనిని సత్పురుషులైన శ్రీ సాయి సేవలో ఉపయోగించక పోతే ఇవి ఎలా ఉద్ధరింప బడతాయి?’
వాటే ఆలేసే హేమాడ జీవా | కరితీ చిఠోర్యాంచా మేళావా | 
తత్కరవీ కరవితీ సేవా | అసావా ఉదాత్త హేతు హా | ||౧౨|| 
12. అని, హేమాడుకు అనిపించి, కాగితపు ముక్కలను పోగు చేసుకుని, వాని ద్వారా ఈ సేవను చేయించి ఉండవచ్చు. ఇదే వారి ఉదాత్తమైన ఉద్దేశం కావచ్చు.
అంతిమాధ్యాయాచీ తీచ పరీ | లిహిలా అసే చిఠోర్యావరీ | 
మనన కేలే బహుతీ పరీ | అవతరణికా తదంతరీ మిళేనా | ||౧౩|| 
13. చివరి అధ్యాయం కూడా అట్లే కాగితం ముక్కలపై వ్రాసి ఉండవచ్చు. కాని, ఎంత ఆలోచించినా, ఎక్కడా అవతరణిక దొరకలేదు.
గజాననరావదికా మాత కథిలీ | బాబాసాహేబాంసహీ4 తీచ నివేదిలీ | 
త్యా సర్వాంచీ సల్లా పడిలీ | పాహిజే ఘడలీ అవతరణికా | ||౧౪|| 
14. ఈ సంగతి గురించి గజాననరావు మొదలైన వారితోను, మరియు బాబాసాహేబు తర్ఖడతో (ఆయన అప్పుడు శిరిడీ సంస్థానానికి కోశాధికారి మరియు శ్రీ సాయి లీలా మాసపత్రికకు సంపాదకుడు) చెప్పడం జరిగింది. వారందరూ అవతరణిక ఉండవలసినదేనని తమ అభిప్రాయాన్ని తెలిపారు.
బాబాసాహేబ ముదత ఘాలితీ | శ్రీసాఈలీలేంత ప్రసిద్ధ కరితీ | 
ముదతీచే దివస సంపూని జాతీ | తరీ అవతరణికా అవతరేనా | ||౧౫|| 
15. దీనిని వ్రాయటానికి ఒక సమయాన్ని నిర్ణయించి, బాబాసాహేబు ‘శ్రీసాయిలీల’ లో ప్రచురించారు. కాని, ఆ గడువు ముగిసిపోయినా అవతరణిక అవతరించలేదు.
హేమాడ గోవింద సద్గుణఖాణీ | తన్ముఖి వేదాంత భరీ పాణీ | 
గ్రంథీ ప్రకటే ప్రసాద వాణీ | అద్భుత కరణీ గురుకృపేచీ | ||౧౬|| 
16. హేమాడు, అంటే గోవిందరావు, మంచి గుణాలకు గని. వారి నోటికి వేదాంతం కంఠోపాఠం. ఈ గ్రంథంలోని వారి భాష, పదప్రయోగం అన్నీ సాయి ప్రసాదమే. గురువుయొక్క అనుగ్రహం వలన అద్భుతాలే జరుగుతాయి.
సద్గురు సాఈభక్త అనంత | త్యాంత కవిరత్న హేమాడపంత | 
తత్సమ అసేల జో ప్రజ్ఞావంత | తోచి మహంత కరణార తీ | ||౧౭|| 
17. సాయి సద్గురువు భక్తులు లెక్కలేనంత ఉన్నారు. వారిలో హేమాడుపంతు కవిరత్నం. వారికి సరి సమమైన తెలివి గలవాడు, మహాపురుషుడే ఈ అవతరణికను వ్రాయగలడు.
కుఠూనచి అవతరణికా అవతరేనా | ఖిన్నత్వ ఆలే మాఝియా మనా | 
కేలీ దత్తగురూంచీ5 ప్రార్థనా | భాకిలీ కరూణా తయాంచీ | ||౧౮|| 
18. అయినా, ఈ అవతరణిక ఎక్కడనుండీ అవతరించ లేదు. నా మనసుకు చింత పట్టుకుంది. దత్త గురువు స్వరూపులైన సాయినాథుని ప్రార్థించి, వారి అనుగ్రహాన్ని వేడుకున్నాను.
మీ పామర బుద్ధిమంద | నసే విచార విద్యాగంధ | 
కైసా యేఈల మగ ఓవీప్రబంధ | కవిత్వ అంధ మీ ముళచా | ||౧౯|| 
19. ‘నేను పామరుణ్ణి, మంద బుద్ధిని. చదువు రాత తెలియని వాణ్ణి. కవిత్వం అంటే అసలే తెలియదు. అలాంటి వాడు ఛందోబద్ధమైన ఈ కావ్యాన్ని ఎలా వ్రాయగలను?
పరీ యాస అసే ఎక ఆధారూ | సానుకూల జై శ్రీదత్తగురూ | 
మశకాకరవీ ఉచలవితీ మేరూ | అధికార థోరూ తయాంచా | ||౨౦||
20. ‘అయినా, నాకు ఉన్నది ఒకే ఒక ఆధారం. శ్రీ దత్త గురువు అనుగ్రహముంటే చాలు. వారు దోమచే మేరు పర్వతాన్ని కూడా లేవనెత్తించగలరు. వారి శక్తి అపారం’.

పునశ్చ ప్రార్థీ ఉమారమణా | కృపా ఉపజే సాఈ నారాయణా | 
కరీ మమ మతీసీ ప్రేరణా | అవతరణికాలేఖనా సత్వరీ | ||౨౧|| 
21. నా పై దయ చూపించి, అవతరణికా రచనకు త్వరగా నా బుద్ధిని ప్రేరేపించమని, శివ స్వరూపులైన సాయి నారాయణుని నేను మరల ప్రార్థించాను.
శక్తి నసే కవిత్వ కరాయా | మాఝే మతిమాంద్య జాణే శ్రీగురురాయా | 
ఘాలూని నతీ త్యాచియా పాయా | ప్రవర్తే ఘడాయా అవతరణికా | ||౨౨|| 
22. కవిత్వం రచించే శక్తి నాకు లేదు, మందబుద్ధినని గురువర్యులకు తెలుసు. వారి పాదాలకు వందనం చేసి అవతరణికను ప్రారంభిస్తాను. 
అవతరీణకా గ్రంథఖండ6 | కరణార సాఈ వక్రతుండ | 
తయాచే వైభవ అద్భుత ప్రచండ | మాఝే తోండ నిమిత్తమాత్ర | ||౨౩|| 
23. శ్రీ సాయి సచ్చరితలోని గ్రంథ భాగమైన ఈ అవతరణికను గణపతి రూపమైన సాయియే పూర్తి చేస్తారు. వారి వైభవం అద్భుతం, అసమానం. నేను నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే. 
‘ప్రథమాధ్యాయీ’ మంగలాచరణ | విఘ్నహర్తా విశ్వాదికారణ | 
గౌరీశంకర కంఠమండన | శ్రీగజవదన నమియేలా | ||౨౪|| 
24. మొదటి అధ్యాయంలో, మంగలాచరణం, మరియు విఘ్నాలను తొలగించేవాడు, పార్వతీ పరమేశ్వరులకు కంఠ భూషణమైన శ్రీ గజవదనునికి నమస్కారం చేశారు. 
జీ అభినవ వాగ్విలాసినీ | చాతుర్యకలా కామినీ | 
తీ శ్రీ శారదా విశ్వమోహినీ | ఇష్టార్థదాయినీ నమియేలీ | ||౨౫|| 
25. అభినవ వాగ్విలాసిని, చాతుర్యకళా కామిని, విశ్వమోహిని, ఇష్టార్థదాయిని అయిన సరస్వతికు వందనం చేశారు. 
కులగురు, ఆప్తేష్ట, గురూజన | సగుణావతార సంతసజ్జన | 
శరణ్య సద్గురు కైవల్యనిధాన | సాఈభగవాన నమియేలే | ||౨౬|| 
26. కులగురువులకు, ఆప్తులకు, కావలసిన వారికి, పరమేశ్వరుని సగుణావతారమైన సాధు సజ్జనులకు మరియు శరణాగతులకు మోక్షదాత అయిన సద్గురు సాయి భగవానునికి నమస్కారం చేశారు. 
గోధూమపేషణ7 కథా సాంగోన | మహామారీ పూర్ణోపశమన | 
కైసే కేలే తే విశద కరూన | సాఈసామర్థ్య వర్ణిలే | ||౨౭|| 
27. గోధుమలను విసిరిన కథను చెప్పి, కలరా రోగాన్ని పూర్తిగా నశింప చేసిన విషయాన్ని వివరంగా చెప్పి, సాయి సామర్థ్యాన్ని వర్ణించారు. 
ప్రస్తుత గ్రంథ ప్రయోజన | హేమాడపంత నామకరణ | 
గుర్వనవశ్యకతా వివాదఖండన | దర్శన హేమాడా ‘ద్వితీయాధ్యాయీ’ | ||౨౮|| 
28. ఈ గ్రంథ ప్రయోజనాన్ని, దాభోల్కరునికి బాబాయొక్క మొదటి దర్శనం మరియు అతనికి హేమాడ్ పంత్ అన్న నామకరణం, గురువుయొక్క అవశ్యకత లేదు అన్న వాదవివాద ఖండనం గురించి రెండవ అధ్యాయంలో చెప్పబడి ఉన్నాయి. 
గ్రంథలేఖన అనుజ్ఞాపన | కైసే ఆలే సాఈముఖాంతూన | 
రోహిల్యాచే వృత్త కథన | కేలే సంపూర్ణ ‘తృతీయాధ్యాయీ’ | ||౨౯|| 
29. సాయి నోటినుండి ఈ గ్రంథ రచనకు అనుమతి వచ్చిన విధానం, రోహిల్లాయొక్క పూర్తి కథ మూడవ అధ్యాయంలో ఉన్నవి. 
జగచ్చాలక కంఠాభరణ | సాధుసంతాంచే అవతరణ | 
భూమండళీ కిం కారణ | కేలే వివరణ విస్తారే | ||౩౦||
30. జగత్తును నడిపించే పరబ్రహ్మకు ఆభరణాలైన సాధు సంతులు ఎందుకు ఈ భూమిపై అవతరిస్తారు అన్న విషయం గురించి విస్తారమైన వివరణ, 

దత్తావతార అత్రినందన | సాఈ సాక్షాద్ధరిచందన8
శిరడీ క్షేత్రీ ప్రథమాగమన | వర్ణన సమగ్ర ‘చతుర్థీ’ | ||౩౧|| 
31. అత్రి అనుసూయల కొడుకైన దత్త భగవానుని అవతారం, కళ్ళకు కనిపించే కల్పతరువువంటి సాయిబాబా మొదటి సారి శిరిడీ క్షేత్రానికి వచ్చిన సంగతి, నాలుగవ అధ్యాయంలో చెప్పబడింది. 
శిరడీ క్షేత్రీ గుప్త హోఊన | పునశ్చ తేథే ప్రకటూన | 
సకలా కేలే విస్మయాపన్న | సధన9 పాటలా సమవేత10 | ||౩౨|| 
32. శిరిడీ క్షేత్రంనుండి మాయమై, సాహుకారైన చాందు పాటీలు వెంట మరల కనిపించి, అందరినీ ఆశ్చర్య పరచిన విశేషం, 
గంగాగిరాది సంతసంమేలన | స్వశిరీ వాహూన దూరచే జీవన | 
కైసే నిర్మాణ కేలే ఉద్యాన | నిరూపణ సమస్త ‘పంచమీ’ | ||౩౩|| 
33. గంగాగిరు మొదలైన సాధువులతో కలిసి మెలగడం, దూరంనుండి స్వయంగా తమ తలపై నీటిని మోసుకుని వచ్చి, తోటను పెంచటం గురించిన వర్ణన, అయిదవ అధ్యాయంలో ఉంది. 
రామనవమీ ఉత్సవ థోర | బాళా బోవా కీర్తనకార | 
మశీదమాఈజీర్ణోద్ధార | కథన సవిస్తర ‘షష్ఠాధ్యాయీ’ | ||౩౪|| 
34. శ్రీరామనవమి మహోత్సవంలో కీర్తన చేసిన బాలబువా సంగతి, మరియు మసీదు పునరుద్ధరణ గురించిన విస్తార వర్ణన ఆరవ అధ్యాయంలో ఉంది. 
బాబాంచా సమాధిఖండయోగ | ధోతీ పోతీ ఇత్యాది ప్రయోగ | 
బాబా హిందూ కీ యవన ఢోంగ | సంతా తరంగ అగాధ | ||౩౫|| 
35. బాబాయొక్క సమాధి, ఖండయోగం, ధోతి – పోతి మొదలైన వారి యోగప్రక్తియలు, మరియు బాబా హిందువా లేక మహమ్మదీయుని వేషమా అన్న వర్ణన, అంతు పట్టని సాధు సంతుల మనసు గురించి, 
బాబాంచా పేహరావ, వర్తన, దవా, | చిలీమ, జాతీ, ధునీ, దివా | 
త్యాంచా ఆజార త్యాంచీ సేవా | అగమ్య దేఖావా అవఘాచి | ||౩౬|| 
36. బాబాయొక్క దుస్తులు, వారి చిలుము, వారి ధుని, వారి జాతి, వారి ప్రవర్తన, వారు రోగులకు చికిత్స చేయటం, మసీదులో దీపాలను వెలిగించటం, వారి చేయి కాలటం, దానికి సేవ మొదలైన ఆశ్చర్యకరమైన సంగతులు, 
భాగోజీ శింద్యాచీ మహావ్యాధీ | ఖాపర్డేసుత గ్రంథిజ్వరౌషధీ | 
నానా11 పంఢరీ దర్శన బుద్ధి | కథితీ సుధీ12 ‘సప్తమీ’ | ||౩౭|| 
37. భాగోజీ శిండేయొక్క కుష్ఠు రోగం, ఖాపర్డే కొడుకుకు వచ్చిన గ్రంథి జ్వరానికి మందులు ఇవ్వటం, నానాసాహేబు చాందోర్కరు పండరీపురానికి బయలుదేరటం మొదలైన సంగతులను బుద్ధిమంతుడైన కవి ఏడవ అధ్యాయంలో చెప్పారు. 
నరజన్మాచే అపూర్వ మహిమాన | సాఈభైక్ష్యవృత్తి వర్ణన | 
బాయజాబాఈచే13 సంతసేవన | భోజనవిందాన బాబాంచే | ||౩౮|| 
38. అపూర్వమైన మనిషి జన్మయొక్క మహిమ, సాయియొక్క భిక్షావృత్తి, బాయజాబాయి సాయికి చేసిన సేవ, మరియు బాబాయొక్క భోజన పద్ధతి –  
బాబా14, తాత్యా15, మ్హాళసాపతీ | రాత్రీ తిఘే మశీదీంత నిజతీ | 
బాబాంచీ ఆగళీ ప్రీతీ | దోఘాంవరతీ సమసమాన | ||౩౯|| 
39. బాబా, తాత్యా, మహల్సాపతి ముగ్గురూ రాత్రి మసీదులో పడుకునే విధానం, తాత్యా మహల్సాపతులపై బాబాకు ఉన్న సమానమైన ప్రీతి, 
రాహతే గ్రామీచే ఖుశాలచంద | బాబా శాంతి జ్ఞాన కంద | 
పరస్పరాంచా ప్రేమసంబంధ | నిరూపణానంద ‘అష్టమాధ్యాయీ’ | ||౪౦||
40. రాహతా గ్రామంలోని ఖుశాల్చందుకు, శాంతికి జ్ఞానానికి గని అయిన సాయికు గల పరస్పర ప్రేమ సంబంధం గురించిన వివరణ ఎనిమిదవ అధ్యాయంలో ఉంది. 

తాత్యాసాహేబ నూలకర | తాత్యా పాటీల భక్తవర | 
ఎకాంగ్లభౌమ గృహస్థ థోర | ప్రాయశ్చిత్త ఘోర ఆజ్ఞాభంగాచే | ||౪౧|| 
41. తాత్యాసాహేబు నూల్కరు, భక్త శ్రేష్ఠుడైన తాత్యా పాటీలు, మరియు ఒక గొప్ప ఆంగ్లేయ గృహస్థుడు, వీరందరూ బాబా ఆజ్ఞను ఉల్లంఘించి, దాని పరిణామాన్ని అనుభవించటం,
పంచ మహాయజ్ఞ కరవూన | బాబా కరీత భిక్షాన్నసేవన | 
భిక్షాధికార సంపన్న లక్షణ | కరితీ వర్ణన చాతుర్యే | ||౪౨|| 
42. అలాగే, అందులో అతి తెలివిగా, భక్తులతో పంచ మహాయజ్ఞాలను చెయించిన తరువాతే భిక్షాన్నాన్ని సేవించటం మరియు భిక్ష చేయటానికి ఉండవలసిన లక్షణాల వివరణ, 
బాబాసాహేబ తర్ఖడ శ్రేష్ఠ | కట్టే ప్రార్థనాసమాజిష్ట | 
బనలే సాఈభక్తైకనిష్ఠ | కథా ఉత్కృష్ట ‘నవమాధ్యాయీ’ | ||౪౩|| 
43. ప్రార్థనా సమాజంలోని బాబాసాహేబు తర్ఖడ్ సాయి భక్తుడవటం, అతని నిష్ఠా గురించి చాలా ఆసక్తికరంగా తొమ్మిదవ అధ్యాయంలో వర్ణించబడింది. 
లాంబ అవఘీ హాత చార | రూంద తశీచ వీతభర | 
ఆఢ్యాస టాంగిలేల్యా ఫళీవర | శయన యోగేశ్వర బాబాంచే | ||౪౪|| 
44. నాలుగు మూరల పొడువు, బెత్తెడు వెడల్పుగల చెక్క పలకను చూరుకు అడ్డంగా వ్రేలాడగట్టి, దానిపై యోగీశ్వరులైన సాయి పడుకోవటం, 
కేవ్హా శిరడీంత పద పడలే | కితీ వర్షే వాస్తవ్య ఝాలే | 
దేహావసాన కధీ ఘడలే | కేలే నిరూపణ హృదయంగమ | ||౪౫|| 
45. శిరిడీలో వారు ఎప్పుడు అడుగు పెట్టారు? అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? తమ శరీరాన్ని ఎప్పుడు త్యజించారు? 
అంతరీ శాంత నిరీచ్ఛస్థితీ | బాహేర దావీత పిశాచవృత్తీ | 
లోకసంగ్రహ నిత్య చిత్తీ | అఢళ ప్రవృత్తీ గురురాయాంచీ | ||౪౬|| 
46. మరియు, ఏ కోరికలూ లేక మనసు ప్రశాంతంగా ఉన్నా పైకి మాత్రం పైశాచికంగా నటిస్తూ, ప్రజల శ్రేయస్సునే ఆలోచించే గురుదేవుని సుస్థిరమైన మనసు నడతను గురించి, 
వేదశాస్త్ర ధర్మలక్షణ | పరమార్థ ఆణి వ్యవహార శిక్షణ | 
భక్తాభక్త చిత్తపరీక్షణ | హతవటీ విలక్షణ సద్గురూంచీ | ||౪౭|| 
47. వేద శాస్త్రాలలో తెలియచేసిన ధర్మ లక్షణాలను, లోక వ్యవహారాన్ని, పరమార్థాన్ని బోధించటంలో మరియు భక్తుల మనసులను, భక్తులు కానివారి మనసులను, పరీక్షించటంలో సాయి సద్గురువుయొక్క విశేషమైన చాతుర్యం, 
బాబాంచే ఆసన బాబాంచే జ్ఞాన | బాబాంచే ధ్యాన బాబాంచే స్థాన | 
త్యాంచే సామర్థ్య ఆణి మహిమాన | కథన సంపూర్ణ ‘దశమాధ్యాయీ’ | ||౪౮|| 
48. అలాగే, బాబాయొక్క ఆసనం, బాబా జ్ఞానం, బాబా ధ్యానం, బాబా స్థానం, వారి మహిమ వారి సామర్థ్యం గురించిన వర్ణన కూడా ఈ పదవ అధ్యాయంలో చెప్పబడింది. 
సచ్చిదానంద స్వరూపస్థితీ | దిగంత బాబాంచీ ప్రఖ్యాతీ | 
డాక్టర పండితాంచీ ప్రేమభక్తి | సిదికవృత్తీ16 వర్ణియేలీ | ||౪౯|| 
49. బాబాయొక్క సచ్చిదానంద స్వరూప స్థితి, అంతటా వ్యాపించిన వారి కీర్తి, డాక్టరు పండిత్యొక్క ప్రేమ, భక్తి, సిద్ధిక్ ఫాల్కేయొక్క పూజ్య భావం, 
కైసే కేలే అభ్రాకర్షణ | కైసీ అనిలీ సత్తా విలక్షణ | 
అనలాపాసూన సంరక్షణ | సురస వివరణ ‘ఎకాదశీ’ | ||౫౦||
50. అలాగే, మేఘాలను, సుడిగాలిని బాబా అదుపులో ఉంచటం, భక్తులను అగ్నిజ్వాలలనుండి సంరక్షించటం గురించిన రసభరిత వర్ణన పదుకొండవ అధ్యాయంలో ఉంది. 

కాకా17, ధుమాళ18, నిమోణకర19 | ఎక మామలేదార ఎక డాక్టర | 
ప్రసంగ భిన్న భిన్న ప్రకార | వర్ణిలే మధుర వాణీనే | ||౫౧|| 
51. కాకా మహాజని, ధుమాల్‍, నిమోంకరు, ఒక మామలేదారు, ఒక డాక్టరు, వీరి గురించిన వేరు వేరు విషయాల మధుర వర్ణన, 
నాశిక అగ్నిహోత్రీ ముళే సంశయీ | సంత ఘోలప రామనుయాయీ | 
త్యాంచీ సాఈదర్శన నవలాఈ | ‘ద్వాదశాధ్యాయీ’ నిరూపిలీ | ||౫౨|| 
52. నాసిక్‍లోని అగ్నిహోత్రి, ఘోలప స్వామి శిష్యుడు అయిన ముళె శాస్త్రియొక్క సంశయం, అతనికి సాయి దర్శనంలో కలిగిన విశేషమైన అనుభవంయొక్క వర్ణన, ఇవన్నీ పన్నెండవ అధ్యాయంలో చెప్పబడింది. 
బాళాశింపీ హిమజ్వరనాశన | కేలే కృష్ణశ్వానా దధ్యోదన దేఊన | 
బాపూసాహేబ20 మహామారీ శమన | కేలే చారూన అక్రోడ పిస్తే | ||౫౩|| 
53. నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టటంతో బాలా శింపియొక్క చలిజ్వరం పోవటం, బాపూసాహేబు బుట్టియొక్క కలరా వ్యాధి పిస్తా, అక్రోటులు తినడంతో నశించటం, 
ఆళందీ స్వామీ కర్ణరోగీ | ఆశీర్వచనేంచి కేలే నిరోగీ | 
జులాబ పీడా కాకా21 భోగీ | నాశిలీ భుఇముగీ దాణ్యాంనీ | ||౫౪|| 
54. ఆళంది స్వామియొక్క చెవినొప్పిని తమ ఆశీస్సులతో బాబా పోగొట్టటం, కాకా మహాజని విరోచనాల బాధను వేరు శనగ పప్పుతో తొలగించటం, 
హర్ద్యాచే భక్త దత్తోపంత | పోటశూళ వ్యాధిగ్రస్త | 
ఆశీర్వాదేంచి కేలే ముక్త | సమస్త జనాందేఖత | ||౫౫|| 
55. హార్ద్యాలోని దత్తోపంతు కడుపునొప్పి వ్యాధితో బాధపడుతుంటే, అందరూ చూస్తుండగా అతని జబ్బును తమ ఆశీర్వచనాలతో బాబా నయం చేయటం, 
ఎకా భీమాజీ పాటలాలా | కఫక్షయాచా వ్యాధీ జడలా | 
ఉదీ లావూనీ రోగ దవడీలా | వృత్తాంత వర్ణిలా ‘త్రయోదశీ’ | ||౫౬|| 
56. భీమాజి పటేలును క్షయరోగం పట్టుకుంటే, దానిని బాబా విభూతితో తరిమి వేయటం, ఈ సంగతులన్నీ పదమూడవ అధ్యాయంలో వర్ణించ బడింది. 
నాందేడచే శేట పారశీ రతనసీ | విఖ్యాత వ్యాపారీ ఖిన్న మానసీ | 
పుత్రసంతాన దేఊని త్యాసీ | హర్షాకాశీ బసవిలే | ||౫౭|| 
57. నాందేడులోని బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపారి, పారశి సేటు, రతన్‍జీ మగ సంతతి లేదని దుఃఖిస్తుంటే, బాబా అతనికి మగ సంతానాన్ని ప్రసాదించి, అంతులేని ఆనందాన్ని ఇవ్వటం, 
మౌలీసాహేబ గుప్త సంత | నాందేడ శహరీ హమాలీ కరీత | 
సాఈసంకేతవచే జ్ఞాత హోత | కథా అద్భుత ‘చతుర్దశీ’ | ||౫౮|| 
58. అలాగే, నాందేడు పట్టణంలో హమాలి పని చేస్తూ గుట్టుగా జీవిస్తున్న మౌల్వి సాహేబు అనువారు సాధు అని సాయి సూచన వలన అందరూ తెలుసుకున్న అద్భుతమైన కథా వర్ణన, పదునాలుగవ అధ్యాయంలో వర్ణించ బడింది. 
నారదీయ కీర్తనపద్ధతీ | కథితీ బాబా దాసగణూప్రతీ | 
చోళకరాంచే ఫేడూని ఘేతీ | వ్రత చహా సితా22 త్యా పాజునీ | ||౫౯|| 
59. దాసగణుకు నారదీయ కీర్తన పద్ధతిని సాయి వివరించటం; చోళ్కరుకు చక్కెర వేసిన టీని త్రాగించి, అతని వ్రతాన్ని ముగించటం, 
ఔరంగాబాదేహూని పల్లీ ఆలీ | మశీదీంతీల పల్లీస భేటలీ | 
చుకచుకణ్యావరూన వార్తా కథిలీ | కథా నిరూపిలీ ‘పంచదశీ’ | ||౬౦||
60. మసీదులో బల్లి ఒకటి కిచ కిచమని చప్పుడు చేయగా, బాబా దాని కథను చెప్పటం, ఔరంగాబాదునుండి ఇంకొక బల్లి వచ్చి మసీదులోని బల్లిని కలుసుకున్న కథా వర్ణన పదిహేనవ అధ్యాయంలో ఉంది. 

సంతతీసంపత్తీ సంపన్న | సాఈ యశోదుందుభి పరిసోన | 
ఎక గృహస్థ శిరడీ లాగూన | ఆలే బ్రహ్మ జ్ఞానప్రాప్త్యర్థ | ||౬౧|| 
61. సంపద, సంతానం, అన్నీ ఉన్న ఒక గృహస్థుడు సాయియొక్క కీర్తిని విని, బ్రహ్మ జ్ఞానం పొందటానికి శిరిడీకి రావటం,
జో ఇచ్ఛీ బ్రహ్మప్రాప్తి | త్యాసీ హోఆవీ సంసారవిరక్తీ | 
సుటలీ పాహిజే ధనాసక్తీ | ప్రథమ చిత్తీ తయాచ్యా | ||౬౨|| 
62. అప్పుడు బాబా “బ్రహ్మజ్ఞానాన్ని కావాలని అనుకునేవారు, ముందు ప్రపంచంపై మోహం, డబ్బు మీద ఆశలను వదులుకోవాలి” అని చెప్పటం, 
పాంచ రుపయాంచీ ఉసనవారీ | జ్యా న దేవవే బాబా క్షణభరీ | 
నోట అసూని వస్త్రాంతరీ | కవణేపరీ త్యా బ్రహ్మ మిళే | ||౬౩|| 
63. రూపాయల నోట్ల కట్ట జేబులో ఉన్నా, బాబా కొరకు – అదీ కాసేపటి కోసం, అయిదు రుపాయలను అప్పుగా ఇవ్వని వాడికి, బ్రహ్మ ఏ విధంగా దొరుకుతాడు? 
సాఈబోధ శైలీ సుందరా | హేమాడాంచీ ప్రసాద గిరా | 
సంయోగ జైసా పయశర్కరా | కథా మనోహరా ‘షోడశీ’ | ||౬౪|| 
64. మనసును ఆకట్టుకునే సాయి బోధనా పద్ధతి, హేమాడు పంతుకు సాయి ప్రసాదించిన మాట, రెండూ పాలూ పంచదార కలిసినట్లుగా మనోహరమైన కథా వివరణ పదహారవ అధ్యాయంలో చెప్ప బడింది. 
పూర్వకథేచేంచ అనుసంధాన | బ్రహ్మజ్ఞాన విస్తారకథన | 
ధనలోభ యాచే నిఃసంతాన | వర్ణన మధుర ‘సప్తదశీ’ | ||౬౫|| 
65. మునుపటి అధ్యాయంలో చెప్పబడిన బ్రహ్మ జ్ఞానాన్ని గురించిన కథ, విస్తారంగా పదహేడవ అధ్యాయంలో కొనసాగింది. ఇందులో డబ్బు మీద ఆశను వదలించుకోవడం గురించిన మధుర వర్ణన ఉంది. 
సాఠ్యాంచీ గురుచరిత్రకథా | రాధాబాఈచీ ఉపదేశవార్తా | 
హేమాడాంచీ అనుగ్రహతా | కథనకుశలతా ‘అష్టాదశీ’ | ||౬౬|| 
66. పద్దెనిమిదవ అధ్యాయంలో, సాఠేయొక్క గురుచరిత్ర కథ, రాధాబాయికి ఉపదేశం గురించి చెప్పిన సంగతి, హేమాడు పంతును సాయి అనుగ్రహించిన కథా వర్ణన ఉంది. 
అనుగ్రహ కథేచా విస్తార | సాఈ శ్రీబోధానుసార | 
కేలా అసే ఫార ఫార | విచార ‘ఎకోనవింశతీ’ | ||౬౭|| 
67. హేమాడు పంతుయొక్క అనుగ్రహ కథ ఇంకా వివరంగాను, మరియు సాయియొక్క జ్ఞాన బోధను గురించి హేమాడు పంతు ఆలోచించటం – ఇవన్నీ పంతొమ్మిదవ అధ్యాయంలో వివరించ బడింది. 
ఈశావాస్య భావార్థబోధినీ | ప్రారంభిలీ దాసగణూనీ | 
త్యాంత శంకా ఉపజలీ మనీ | పుసిలీ త్యాంనీ బాబాంనా | ||౬౮|| 
68. ‘ఈశావాస్య భావార్థ బోధిని’ అన్న గ్రంథ రచనను దాసగణు మొదలు పెట్టటం, అందులో అతనికి సంశయాలు కలగగా, అతడు బాబాను ప్రశ్నించడం, 
బాబా మ్హణతీ మోలకరీణ | కరీల కాకాంచీ23 తన్నివారణ | 
సద్గురు మహిమా అసాధారణ | గోడ నిరూపణ ‘వింశతీ’ | ||౬౯|| 
69. కాకాయొక్క పని పిల్ల సందేహాన్ని తీరుస్తుందని బాబా చెప్పటం, అలాంటి అసాధారణమైన సద్గురు మహిమయొక్క మధుర వర్ణన ఇరవైయవ అధ్యాయంలో వర్ణించబడింది. 
ఎక ప్రాంతాధికారీ సులక్షణ | దుసరే పాటణకర విచక్షణ | 
తిసరే ఎక వకీల విలక్షణ | అనుగ్రహణ తిఘాంచే ‘ఎకవింశతీ’ | ||౭౦||
70. ఇరవది ఒకటవ అధ్యాయంలో, సుగుణవంతుడైన ఒక ఉపజిల్లా అధికారిని, విచక్షణా జ్ఞానమున్న పాటణకరుని, మరొక వకీలును, ఈ ముగ్గురిని సాయి అనుగ్రహించిన వివరణ ఉంది. 

మశీదమాఈ భవతారకా | తీచ ద్వారావతీ ద్వారకా | 
బాబా కథితీ సకల లోకా | భావార్థ ఎకాహీ నకళే | ||౭౧|| 
71. ద్వారావతి అన్నా, ద్వారక అన్నా అది మసీదుమాతేనని, ఆ మసీదు మాతయే మనల్ని సాంసారిక కష్టాలనుండి తరింప చేస్తుందని బాబా ప్రజలందరకూ చెప్పారు. కాని, వారి మాటలలోని నిజమైన అర్థాన్ని ఎవరూ తెలుసుకోలేక పోయారు, 
మశీద మాఈచే గుణవానితీ | మిరీకర24, బుట్టీంచే అహిదంశ25 టాళితీ | 
అమీర సక్కరాచా వాత హరితీ | వారితీ అహిభయ తయాచే | ||౭౨|| 
72. బాబా మసీదుమాతయొక్క గుణాలను వర్ణించారు. మిరీకరును, బుట్టిని పాము కాటునుండి రక్షించారు. అమీరు శక్కరుయొక్క వాత రోగాన్ని పోగొట్టారు. అతనికున్న పాముకాటు అపాయాన్ని కూడా సాయి తొలగించారు. 
హేమాడ వృశ్చికదంశ సంకట | ఇతరాంవరచే ఉరగారిష్ట25
నివారీత అపమృత్యు దుర్ఘట | ప్రసంగ ప్రకట ‘ద్వావింశతీ’ | ||౭౩|| 
73. అలాగే హేమాడుపంతును తేలు కుట్టటంనుండి, ఇతరులను భయంకరమైన పాము కాటు అపమృత్యువునుండి సాయి రక్షించిన సంగతులను, ఇరవై రెండవ అధ్యాయంలో వర్ణించ బడింది. 
యోగాభ్యాసియాచే శంకానిరసన | మాధవరావాచే26 అహిదంశ నివారణ | 
ధునీ, ఇంధన, అజాహనన | వర్ణన కేలే అతిరమ్య | ||౭౪|| 
74. యోగాభ్యాసియొక్క సందేహాన్ని బాబా తీర్చటం, మాధవరావును పాము కాటు బాధనుండి రక్షించటం, ధుని కొరకు కట్టెలను సేకరించటం, మేకను చంపే సంగతులను గూర్చిన రమ్యమైన వర్ణన, 
బడే బాబాచీ బడేజావ | గుర్వాజ్ఞా నిష్ఠా అభావ | 
కితీ దిలే తరీ బహు హావ | అతృప్త స్వభావ మూళచా | ||౭౫|| 
75. అలాగే, బడేబాబాను సాయి గౌరవంగా చూడటం, సాయి ఆజ్ఞ పాటించే నిష్ఠ అతనికి లేకపోవటం, మరియు అతని అతి ఆశ గురించి, 
కాకాసాహేబ27 భక్తశ్రేష్ఠ | గుర్వాజ్ఞీ పరమైకనిష్ఠ | 
సద్గురులీలా కథన విశిష్ట | కేలే ఉత్కృష్ట ‘త్రయోవింశతీ’ | ||౭౬|| 
76. గురువు ఆజ్ఞను పాటించడంలో కాకాసాహేబుయొక్క దృఢమైన నిష్ఠను పరీక్షించిన సద్గురువు సాయియొక్క విశేషమైన లీలను ఇరవై మూడవ అధ్యాయంలో వర్ణించారు. 
ఫుటాణ్యాచే నిమిత్త కరూన | హేమాడపంతా దేతీ శికవణ | 
సద్గురుస్మరణ కేలియావీణ | విషయసేవన న కరావా | ||౭౭|| 
77. శనగల నెపంతో, హేమాడు పంతుకు, సద్గురువును తలచుకోకుండా ఇంద్రియ సుఖాలను అనుభవించరాదు అన్న సాయి ఉపదేశం, 
అణ్ణా బాబరే వ మావశీబాఈ | కలహ దోఘాంత లావితీ సాఈ | 
త్యా వినోదమస్కరీచీ నవాఈ | గాఈ కవివర్య ‘చతుర్వింశతీ’ | ||౭౮|| 
78. అణ్ణా బాబరే మరియు మావశీబాయి, ఈ ఇద్దరిలో సాయి కలహాన్ని రేపటం, ఆ పరిహాసంలోని వినోదాన్ని కవివర్యులు ప్రత్యేక రీతిలో ఇరవై నాలుగవ అధ్యాయంలో గానం చేశారు. 
భక్త దామూఅణ్ణా కాసార | అహమదనగరచే రాహణార | 
కరూ ఇచ్ఛితీ ఫార థోర | వ్యాపార కాపూస తాందుళాంచా | ||౭౯|| 
79. అహమ్మదునగరు నివాసి దాము అణ్ణా కాసార దూది, మరియు బియ్యంతో గొప్ప వ్యాపారం చేయాలని ఇష్టపడటం, 
ఉద్యమీ హోఈల హానీ సత్య | ఆమ్రఫలసేవనీ ప్రాప్త అపత్య | 
వదతీ సాఈ జ్ఞానాదిత్య | నిరూపణ కృత్య ‘పంచవింశతీ’ | ||౮౦||
80. ఆ వ్యాపారం నష్టకారకమని సాయి తెలుపటం, మరియు తామిచ్చిన మామడి పళ్ళను అతని భార్య తింటే సంతాన ప్రాప్తి అని జ్ఞాన భాస్కరులైన సాయి అతనికి చెప్పటం, ఇవన్నీ ఇరవై అయిదవ అధ్యాయంలో ఉంది. 

భక్త ఎక నామే ‘పంత’ | అన్య సంతానుగ్రహీత | 
పాఠవూన దిలీ త్యా ఖూణ త్వరిత | పంత ప్రమోదిత జాహలే | ||౮౧|| 
81. వేరొక గురువు అనుగ్రహాన్ని పొందిన పంతు అన్న ఒక భక్తునికి, బాబా ఆ సంగతి గుర్తు చేయడం వలన ఆ భక్తుడు పొందిన ఆనందంయొక్క వర్ణన,
హరిశ్చంద్ర పితళే భక్త | తదీయ తనయ అపస్మారగ్రస్త | 
కృపావలోకనేచి సమస్త | రోగ అస్త పావలా | ||౮౨|| 
82. హరిశ్చంద్ర పితళే అనే భక్తుడి కొడుకుయొక్క అపస్మార జబ్బును, బాబా తమ కంటి చూపుతోనే తొలగించటం, 
దిలే పితళ్యాస రుపయే తీన | మ్హణతీ పూర్వీ దిలే దోన | 
బాబా వదతీ కరీ పూజన | రూచిర కథన ‘షడ్వింశతీ’ | ||౮౩|| 
83. పితళేకు బాబా మూడు రూపాయలను ఇచ్చి, “నీకు ఇంతకు మునుపే రెండు ఇచ్చాను. వీనిని పూజించు” అని చెప్పిన కథ ఇరవై ఆరవ అధ్యాయంలో ఉంది. 
భాగవత పోథీ హాతీ దేఊన | ఆపణ ఘ్యావీ ప్రసాద మ్హణూన | 
దేతీ కాకా28 ఇచ్ఛా ధరూన | భగవాన29 దేత తో మాధవా30 | ||౮౪|| 
84. బాబా చేతికి కాకా మహాజని ఏకనాథ భాగవత గ్రంథాన్ని ఇచ్చి, వారి ప్రసాదంగా మరల దానిని తీసుకోవాలని అనుకున్నా, బాబా ఆ గ్రంథాన్ని మాధవరావుకు ఇవ్వటం, 
విష్ణు సహస్త్రనామాచీ పోథీ | ఎకా రామదాశ్యాచే పోథ్యాంత హోతీ | 
త్యా న కళత బాబా ఘేతీ | తీహీ దేతీ మాధవరావా31 | ||౮౫|| 
85. ఒక రామదాసి పుస్తకాలలో విష్ణు సహస్రనామం పుస్తకాన్ని చూసి, దానిని రామదాసికి తెలియకుండా సాయి మాధవరావుకు ఇచ్చిన సంగతి, 
విష్ణుసహస్త్రనామాచీ పోథీ దేఊన | శామరావావర32 అనుగ్రహణ | 
కైసే కరితీ సాఈ దయాఘన | కథా నిరూపణ ‘సప్తవింశతీ’ | ||౮౬|| 
86. శామరావుకు విష్ణు సహస్రనామం పుస్తకాన్ని ఇచ్చి, దయామయుడైన సాయి అతనిని అనుగ్రహించిన కథా వర్ణన, ఇవన్నీ ఇరవై ఏడవ అధ్యాయంలోనే ఉంది. 
భక్త లఖమీచంద మునశీ | చిడీబాఈ బర్హాణపురవాసీ | 
మేఘా బ్రాహ్మణ పుణ్యరాశీ | పాతలే చరణాసీ బాబాంచ్యా | ||౮౭|| 
87. శాంతాక్రూజ్లోని భక్తుడు లక్ష్మీచందు మున్షి, బర్హమపురంలోని చిడిబాయి, బ్రాహ్మణుడు పుణ్యాత్ముడు అయిన మేఘా సాయి పాదాలను ఆశ్రయించటం, 
స్వప్నీ దేఊని సర్వా దృష్టాంత | దేత త్యాచీ ప్రచీతీ జాగరాంత | 
సద్గురు మాఊలీచీ అగమ్య మాత | ప్రేమే కథిత ‘అష్టావింశతీ’ | ||౮౮|| 
88. వారందరికీ స్వప్న దృష్టాంతాలను ఇచ్చి, వారు మేలుకొన్న తరువాత, వారికి అనుభవాలను కలగ చేసిన సద్గురుమాతయొక్క అంతు పట్టని పద్ధతిని ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో తెలియ చేశారు. 
మద్రదేశీచా భజనీ మేళా | శిరడీ క్షేత్రీ ఝాలా గోళా | 
బఘాయా దానౌదార్య సోహళా | భోళా శంకర బాబాంచా | ||౮౯|| 
89. భోలా శంకరుడైన సాయియొక్క దానాన్ని, ఔదార్యాన్ని, వైభవాన్ని చూడలన్న కుతూహలంతో మద్రాసు భజన మండలి శిరిడీ క్షేత్రానికి రావటం, 
రఘునాధరావ తేండులకర | తత్తనయ పరీక్షా ప్రకార | 
త్యాంచీ పేన్శన చింతా దూర | మనోహర లీలా బాబాంచీ | ||౯౦||
90. రఘునాథరావు టెండుల్కరుయొక్క కొడుకు పరీక్షలో పాసయిన విధానం, మరియు టెండుల్కరుయొక్క పెన్షను చింతను దూరం చేసిన సాయియొక్క లీలలు, 

భక్త డాక్టర కప్టన హటే | సాఈ చరణీ ప్రేమ మోఠే | 
దిలే స్వప్నదర్శన పహాంటే | కథానక గోమటే ‘ఎకోనత్రింశతీ’ | ||౯౧|| 
91. సాయి పాదాలయందు విపరీతమైన ప్రేమగల డాక్టరు క్యాప్టెను హాటేకు, తెల్లవారు ఝామున కలలో సాయి దర్శనమిచ్చిన కథా వర్ణన కూడా ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉంది. 
సప్తశృంగ దేవీ ఉపాసక33 | కోణీ కాకాజీ వైద్యనామక | 
దేవీ దేత త్యా దృష్టాంత ఎక | సంతనాయక సాఈ పహావే | ||౯౨|| 
92. సప్తశృంగీ దేవీ భక్తుడైన కాకాజీ వైద్యకు, దేవి కలలో కనిపించి, సంతులలో శ్రేష్ఠులైన సాయిని చూడమని చెప్పటం, 
శామాంబానే త్యాచ దేవీస | కేలా హోతా ఎక నవస | 
శామా నవస ఫేడాయా వణీస | జాఈ తీస వర్షాంనీ | ||౯౩|| 
93. అదే సప్తశృంగీ దేవికి మ్రొక్కును తీర్చుకోవటానికి ముప్పై ఏళ్ల తరువాత శామరావు అక్కడికి వెళ్లటం; 
రాహత్యాచే శేఠ చందఖుశాల | పంజాబీ బ్రాహ్మణ రామలాల | 
స్వప్నీ దోఘా “శిరడీస చల” | హే సాఈబోల కథన ‘త్రింశతీ’ | ||౯౪|| 
94. రాహతా సేటు ఖుశాలచందుకు, పంజాబి బ్రాహ్మణుడు రాంలాలుకు, వీరిద్దరికీ “శిరిడీ రండి” అని సాయి కలలో చెప్పిన వర్ణన, ముప్పైయవ అధ్యాయంలో ఉన్నది. 
విజయానంద యతి మద్రాసీ | నిఘే జావయా సరసమానసీ34
ఠేవూన ఘేతలా నిజపదాశీ | శ్రీహృషీకేశీ బాబాంనీ | ||౯౫|| 
95. మద్రాసు వాసి అయిన విజయానందు అనే సన్యాసి మానస సరోవరానికి బయలు దేరాలని అనుకుంటే, హృషీకేశులైన బాబా అతనిని తమ పాదాల చెంతనే ఉంచుకున్న వర్ణన, 
భక్త శార్దూల మానకర | సాఈపదాంబుజ మధుకర | 
 హింస్త్రక్రూర వ్యాఘ్రోద్ధార | కథన సుందర ‘ఎకత్రింశతీ’ | ||౯౬|| 
96. సాయి పాదాలనే కమలంలో తేనెటీగలా ఉన్న గొప్ప భక్తుడు మాన్కరును, మరియు ఉగ్రమైన, క్రూరమైన పులిని కూడా ఉద్ధరించిన అందమైన కథలు ముప్పై ఒకటవ అధ్యాయంలోనే ఉన్నవి. 
ఆమ్హీ చౌఘే సజ్జన సంత | దేవ శోధార్థ రానీ హిండత | 
మీ హోతాంచ అభిమానగలిత | దర్శన దేత మజ గురురాయ | ||౯౭|| 
97. “దేవుడు ఎక్కడ ఉన్నాడని వెదుకుతూ మేము నలుగురం అడవిలో తిరుగుతున్నాము. నేను నా అహంభావాన్ని అభిమానాన్ని వదిలి పెట్టగానే, గురువుగారు నాకు దర్శనమిచ్చారు” అని సాయి చెప్పిన కథ, 
ఉపోషణ కరణార గోఖలేబాఈ | అశీచ దుజీ కథా సాఈ | 
సాంగత స్వముఖే త్యాచీ నవాఈ | హేమాడ గాఈ ‘ద్వత్రింశతీ’ | ||౯౮|| 
98. మరియు గోఖలేబాయి ఉపవాస వ్రతాన్ని పూనుకున్న కథను, సాయి తమ నోటితో చెప్పగా ముప్పై రెండవ అధ్యాయంలో హేమాడు గానం చేశారు. 
నారాయణ జానీచే మిత్రాస | జాహలా ఎకాఎకీ వృశ్చికదంశ | 
ఎకా భక్తాచే కన్యకేస | దిధలా త్రాస జ్వరానే | ||౯౯|| 
99. నారాయణ జాని మిత్రునికి అకస్మాత్తుగా తేలు కుట్టటం, ఒక భక్తుని కూతురు జ్వరంతో బాధ పడటం, 
చాందోరకరసుతేస భారీ | ప్రసూతివేదనా కరీ ఘాబరీ | 
జానీ స్వతః సుఃఖిత అంతరీ | తిళభరీ సుచేనా కోణాలా | ||౧౦౦||
100. నానా చాందోర్కరు కూతురు ప్రసవ వేదనతో ఆందోళన పడటం, అప్పుడు ఎవరికీ ఏ ఉపాయమూ తోచక బాధ పడటం, 

కులకర్ణీసాహేబ భక్తవర | బాళా బువా భజనకార | 
ఉదీ ప్రభావ బలవత్తర | కళలా ఖరోఖర సర్వాంనా | ||౧౦౧|| 
101. భక్తుడు కులకర్ణీసాహేబ, భజన చేసే బాలబువా, వీరందరికీ విభూతి ప్రభావం తెలవటం,
భక్త హరీభాఊ కర్ణీక | శ్రద్ధావంత ఆణి భావిక | 
త్యాంచ్యా దక్షిణేచీ కథా మోహక | బోధప్రదాయక ‘త్రయస్త్రింశతీ’ | ||౧౦౨|| 
102. చివరిలో, చాలా శ్రద్ధ, భక్తిగల హరిభావు కర్ణీక ఇచ్చిన దక్షిణను గురించిన బోధప్రదమైన కథ, ఇవన్నీ ముప్పై మూడవ అధ్యాయంలో చెప్పబడింది. 
మాలేగాంవచే ఎక డాక్టర | పుతణ్యా హాడ్యావ్రణే అతి జర్జర | 
పిల్లే డాక్టర భక్త భయంకర | పీడిత దుర్ధర నారూనే | ||౧౦౩|| 
103. మాలేగాంలోని ఒక డాక్టరుయొక్క సోదరుని కొడుకు ఎముకలలో వ్రణంతోను, భక్తశ్రేష్ఠుడైన డాక్టరు పిళ్ళే నారు కురుపుతోను బాధపడటం, 
బాపాజీ శ్రీ శిరడీకర | గ్రంథిజ్వరే కుటుంబ జర్జర | 
ఎక ఇరాణీ లహాన పోర | వ్యథిత ఘోర ఆంకడీనే | ||౧౦౪|| 
104. శిరిడీవాసి అయిన బాపాజి భార్య గ్రంథి జ్వరంతోను, ఒక ఇరాని చిన్న పిల్లవాడు మూర్చ జబ్బుతో బాధపడటం, 
హర్ద్యాచే ఎక గృహస్థ | మూతఖడ్యానే అత్యవస్థ | 
ముంబఈచే ఎక ప్రభు కాయస్థ | కుటుంబగ్రస్త ప్రసూతి రోగే | ||౧౦౫|| 
105. హర్ద్యాలోని గృహస్థుడు మూత్రపిండాలలోని రాళ్లవలన, ముంబైలోని ఒక కాయస్థ ప్రభుయొక్క భార్య ప్రసూతి రోగంతో బాధ పడటం, 
ఉపరినిర్దిష్ట వ్యాధుచ్చాటన | కేవళ ఉదీస్పర్శే కరూన | 
ఝాలే న లాగతా క్షణ | నిరూపణ రసాళ ‘చతుస్త్రింశతీ’ | ||౧౦౬|| 
106. వీరందరి జబ్బులను కేవలం విభూతి స్పర్శతో వెంటనే నివారించిన కథలు ముప్పై నాలుగవ అధ్యాయంలో రసవత్తరంగా వర్ణించబడింది. 
మహాజనీంచే మిత్ర ఎక | నిర్గుణాచే పూర్ణ భజక | 
తే బనలే మూర్తిపూజక | దర్శనైక మాత్రే కరూనీ | ||౧౦౭|| 
107. కాకా మహాజని మిత్రుడు, నిర్గుణ ఉపాసకుడు, బాబా దర్శన మాత్రంతో విగ్రహ ఆరాధకుడవటం, 
ధరమసీ జేఠాభాఈ ఠక్కర | ముంబఈచే ఎక సాలిసీటర | 
సబీజ ద్రాక్షే నిర్బీజ సత్వర | కరూన గురువర త్యా దేతీ | | ||౧౦౮|| 
108. ముంబైలోని ఒక సాలిసిటరు ధరంసి జేఠాభాయి ఠక్కరుకు, గింజలున్న ద్రాక్షపళ్ళను వెంటనే గింజలు లేనివానిగా చేసి సాయి గురువర్యులు ఇవ్వటం, 
వాంద్ర్యాచే ఎక కాయస్థ | త్యా నీంద న యే స్వస్థ | 
బాళా పాటీల నేవాసస్థ | ఉదీ ప్రచీత ‘పంచత్రింశతీ’ | ||౧౦౯|| 
109. బాంద్రాలోని ఒక కాయస్థ వ్యక్తికి సుఖంగా నిద్ర పట్టకపోతే, ఇతనికి మరియు నెవాసలోని బాళా పాటీలుకు విభూతియొక్క అనుభవాలను కలగ చేయటం ముప్పై అయిదవ అధ్యాయంలో చెప్పబడింది. 
గోమాంతకస్థ గృహస్థ దోన | నవస కరితీ భిన్న భిన్న | 
ఎక సేవావృత్తీ లాగూన | దుజా స్తేనశోధార్థ35 | ||౧౧౦||
110. గోవా నివాసులైన గృహస్థులలో ఒకరు ఉద్యోగం కొరకు, మరొకరు పోగొట్టుకున్న డబ్బు దొరకాలని, వేరు వేరుగా మ్రొక్కుకోవటం, 

దోఘాంనాహీ నవస విస్మృతీ | సాఈ సమర్థ దేతీ స్మృతీ | 
త్రికాల జ్ఞాన బ్రహ్మాండవ్యాప్తీ | కీర్తీ కోణ వర్ణీల | ||౧౧౧|| 
111. మ్రొక్కులను తీర్చటాన్ని ఆ ఇద్దరూ మరచిపోతే, భూత, భవిష్యత్తు వర్తమానాలను తెలిసిన సాయి సమర్థులు ఆ ఇద్దరికీ మ్రొక్కులను గుర్తు చేశారు. బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్న వారి కీర్తిని ఎవరు వర్ణించగలరు? 
ఔరంగాబాద సఖారామ జాయా | పుత్రార్థ ధావే సాఈచే పాయా | 
ఇచ్ఛాపూర్తి శ్రీఫళ దేఊనియా | కథన కథాశయా ‘షట్త్రిం శతీ’ | ||౧౧౨|| 
112. అలాగే, ఔరంగాబాదు నివాసి సఖారామ భార్య కొడుకు కావాలని సాయి వద్దకు పరుగెత్తగా, ఆమెకు శ్రీఫలాన్నిచ్చి ఆమె కోరికను తీర్చిన కథా వర్ణన ముప్పై ఆరవ అధ్యాయంలో ఉంది. 
చావడీ సమారంభ సోహళా | ఇతరత్ర పాహణ్యా మిళే విరళా | 
హేమాడ వర్ణితీ పాహూని డోళా | కథా రసాళా ‘సప్తత్రింశతీ’ | ||౧౧౩|| 
113. చూడాలన్నా మిగతా ఎక్కడ దొరకని విశేషమైన చావడి ఉత్సవ వైభవాన్ని, హేమాడు పంతు తన కళ్లతో చూచి, రసవత్తరంగా ముప్పై ఏడవ అధ్యాయంలో వర్ణించారు. 
హండీమాజీ పదార్థ భిన్న | శిజవూన కరితీ నానా పక్వాన్న | 
దేతీ సర్వా ప్రసాద భోజన | వర్ణన మనోహర ‘అష్టత్రింశతీ’ | ||౧౧౪|| 
114. వంట పాత్ర హండీలో రకరకాల పదార్థాలతో సాయి అనేక పక్వాన్నాలను వండి, అందరికీ ప్రసాద భోజనాన్ని పెట్టే మనోహర దృశ్యం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో వర్ణించబడింది. 
‘తద్విద్ధి ప్రణిపాతేన’ | యా గీతా శ్లోకాచే వివరణ | 
సాంగతీ చాందోరకరా లాగూన | సంస్కృతాభిమాన హరావయా | ||౧౧౫|| 
115. ‘తద్విద్ధి ప్రణిపాతేన’ అనే గీతా శ్లోకానికి అర్థం, నానా చాందోర్కరుకు వివరంగా చెప్పి, బాబా అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించటం, 
దృష్టాంత దేఊని సంత నృపతీ | బాపూసాహేబ బుట్టీ ప్రతీ | 
మందీర బాంధణ్యా ఆజ్ఞాపితీ | ‘ఎకోనచత్వారింశతీ’ వృత్తాంత | ||౧౧౬|| 
116. బాపూసాహేబు బుట్టీకి మందిరం కట్టమని, సంతులలో రాజైన సాయి కలలో ఆజ్ఞాపించిన సంగతి, ఇవన్నీ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడింది. 
మాతృఃశ్రీచే వ్రతోద్యాపన | దేవ36 ఘాలితీ బ్రాహ్మణ భోజన | 
బాబాంస దేతీ నిమంత్రణ | పత్రలేఖన కరూనియా | ||౧౧౭|| 
117. తన తల్లి చేసిన వ్రతాల ఉద్యాపన కోసం, బ్రాహ్మణులకు భోజనాలను దేవు ఏర్పాటు చేసి, ఉత్తరం ద్వారా బాబాను ఆహ్వానించటం, 
యతివేష ధారణ కరూన | తద్దిని యేతీ విభూతీ తీన | 
బ్రాహ్మణా సమవేత జాతీ జేవూన | న కళే విందాన గురురాయాచే | ||౧౧౮|| 
118. మరో ఇద్దరితో సన్యాసి రూపంలో వెళ్ళి, బ్రాహ్మణులతో పాటు భోజనం చేసిన గురువర్యుల లీలను దేవు తెలుసుకోలేక పోవటం, 
దృష్టాంత దేఊని హేమాడాస | బాబా యేతీ భోజనాస | 
ఛబీరూపీ ధరూని వేష | వర్ణన సురస ‘చత్వారింశతీ’ | ||౧౧౯|| 
119. అలాగే, కలలో హేమాడు పంతుకు భోజనానికి వస్తానని చెప్పి, ఫోటో రూపంలో సాయి భోజనానికి వెళ్లిన కథ చక్కగా నలబైయవ అధ్యాయంలో వర్ణించబడింది. 
ఛబీచీచ కథా విస్తారూన | సాంగతీ కవీ భక్తాలాగూన | 
సద్గురూచే అతర్క్య మహిమాన | నిరూపణ రమణీయ రసాళ | ||౧౨౦||
120. బాబా పటం తన ఇంటికి ఎలా వచ్చిందనే సంగతి గురించి, సద్గురువుయొక్క అంతు పట్టని మహిమను భక్తులకు విస్తారంగా, రమణీయంగా కవి తెలియ చేయడం, 

ధారణ కరూనీ రుద్రావతార | హోతీ లాల ఖదిరాంగార | 
కరితీ గాలీంచా భడిమార | క్రోధే దేవావర37 శ్రీ సాఈ | ||౧౨౧|| 
121. ఎర్రని అగ్నివలె మండి పడుతూ, కోపంతో రుద్రావతారం దాల్చి శ్రీసాయి దేవుకు తిట్ల వర్షం కురిపించటం,
“నిత్య నేమే శ్రీజ్ఞానేశ్వరీ | వాచ” మ్హణతీ సాఈ శ్రీహరీ | 
స్వప్నీ కథితీ వాచనాచీ పరీ | హేమాడ వివరీ ‘ఎకచత్వారింశతీ’ | ||౧౨౨|| 
122. “జ్ఞానేశ్వరిని నిత్యమూ నియమంగా పఠించు” అని శ్రీసాయినారాయణులు దేవుతో చెప్పటమే కాక, పఠించే విధానాన్ని కలలో తెలియ చేసిన సంగతిని నలబై ఒకటవ అధ్యాయంలొ హేమాడు వివరించారు. 
భక్త పండితాంచీ త్రిపుండ్ర లేపనా (వస్త్రావదాన అగ్నినారాయణా) | సాఈనిధన పూర్వసూచనా | 
చుకవిలే రామచంద్రనిధనా38 | తైసేచ మరణా తాత్యాంచ్యా39 | ||౧౨౩|| 
123. భక్త పండితు త్రిపుండ్రాన్ని లేపనం చేయటం, తాము ధరించిన వస్త్రాలను అగ్నినారాయణనకు అర్పించి, సాయి తమ శరీరాన్ని త్యజించటం గూర్చిన సూచన, మరియు రామచంద్ర, తాత్యాపాటీలు మరణాలను తప్పించటం, 
సాఈసద్గురు నిర్యాణ వార్తా | ఉపజవీ శ్రోతయా ఉద్విగ్నతా | 
వ్యాకూల కరీ హేమాడ చిత్తా | కథా పునీతా ‘ద్విచత్వారింశతీ’ | ||౧౨౪|| 
124. సాయి సద్గురువుల నిర్యాణ వార్త శ్రోతలను కలవర పెట్టటం, హేమాడుపంతుకు ఆందోళన కలిగించిన పవిత్ర కథ నలబై రెండవ అధ్యాయంలో ఉన్నది. 
బాబాంచా నిధనవృత్తాంత | పూర్వాధ్యాయీ అపూర్ణ నిభ్రాంత | 
తోచి సంపూర్ణ హేమాడపంత | కరీత ‘త్రిచతుశ్చత్వారింశతీ’ | ||౧౨౫|| 
125. సాయి శరీరాన్ని వదిలిపెట్టిన సంగతి పోయిన అధ్యాయంలో పూర్తి కాక, దానిని హేమాడుపంతు నలబై మూడు, నలబై నాలుగవ అధ్యాయాలలో పూర్తి చేశారు. 
ఎకదా కాకాసాహేబ దీక్షిత | కాకా40 వ మాధవా సమవేత | 
వాచీత అసతా నాథ భాగవత | శంకిత మానసీ జాహలే | ||౧౨౬|| 
126. ఒక సారి, కాకా మహాజని, మాధవరావుతో పాటు కాకాసాహేబు దీక్షితు ఏకనాథ భాగవతాన్ని పఠిస్తుండగా, దీక్షితుకు అనుమానం కలగటం, 
మాధవరావ41 శంకా నిరసిత | సమాధాన న పావే దీక్షిత చిత్త | 
ఆనందరావ పాఖాడే స్వప్న కథీత | కరీత నిరసన శంకేచే | ||౧౨౭|| 
127. ఆ అనుమానాన్ని తీర్చటానికి మాధవరావు చెప్పిన సమాధానం, దీక్షితుకు నచ్చక పోవటం, ఆనందరావు పాఖాడే తనకు వచ్చిన కల సంగతి తెలియచేసి, దీక్షితు అనుమానాన్ని తొలగించటం, 
ఆఢ్యాస టాంగిల్యా ఫళీవరీ | మ్హాళసాపతీ కాం న నిద్రా కరీ | 
సాఈ సమర్థ శంకా నివారీ | కథా కుసరీ ‘పంచచత్వారింశతీ’ | ||౧౨౮|| 
128. చూరుకు వ్రేలాడ కట్టిన చెక్క పలకపై మహల్సాపతి ఎందుకు పడుకోలేడు అన్న సంశయాన్ని సాయి సమర్థులు తీర్చిన కథా విశేషం నలబై అయిదవ అధ్యాయంలో చెప్పబడింది. 
జాగీంచ బసూన అటన42 సర్వత్ర | దావీత జనా చమత్కృతిసత్ర | 
కాశీ గయా గమన విచిత్ర | అద్భుత చరిత్ర బాబాంచే | ||౧౨౯|| 
129. తమ స్థలంలోనే ఉన్నా, అంతటా తిరిగేవారిలా జనులకు చమత్కారాన్ని చూపిన సాయియొక్క సర్వ వ్యాపకత్వం గురించి, వారు కాశి గయలకు విచిత్రంగా వెళ్లినట్లు నిదర్శనాన్ని చూపిన అద్భుత చరిత్ర,; 
చాందోరకర సూను లగ్న పర్వణీ | శామాస జాణ్యా కథీ సంతమణీ | 
శామా దేఖే బాబా ఈక్షణీ | గయాపట్టణీ ఛబీరూపే | ||౧౩౦||
130. చాందోర్కరు కొడుకు పెళ్లికి శామా వెళ్లటానికి అనుమతిని ఇవ్వటం, అనుకోకుండా శామా సాయిని పటం రూపంలో గయలో చూడటం, 

అజద్వయ పూర్వ జన్మకథన | కరితీ స్వముఖే సాఈత్రినయన | 
రమ్య, మధుర, పవిత్ర గహన | కథావర్ణన ‘షట్చ’త్వారింశతీ’ | ||౧౩౧|| 
131. రెండు మేకల పూర్వజన్మ సంగతిని సాయి శంకరులు తమ నోటితో రమ్యంగా చెప్పిన పవిత్ర కథ, ఇవన్నీ నలబై ఆరవ అధ్యాయంలొ వర్ణించ బడింది. 
ఏసీచ ఎక అహిమండుకాంచీ | కింవా లోభీ ధనకో రిణకోచీ | 
పూర్వపీఠికా కథితీ సాచీ | సాఈ విరించీ హరీహర | ||౧౩౨|| 
132. ఒక పాము, ఒక కప్పల పూర్వ జన్మల గురించి, మరియు ఒక లోభి పూర్వ జన్మ సంగతిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపమైన సాయి వర్ణించడం, 
వైర, హత్యా ఆణి ఋణ | ఫేడ్యాకారణే పునర్జనన | 
కరవితీ బాబా కథామృతపాన | హృద్య కథన ‘సప్తచత్వారింశతీ’ | ||౧౩౩|| 
133. శత్రుత్వం, హత్య మరియు ఋణం, వీనిని తీర్చుకోవటానికి పునర్జన్మ కలుగుతుందని బాబా చెప్పిన అమృతంలాంటి కథ నలబై ఏడవ అధ్యాయంలో ఉంది. 
ఎక శేవడే భక్తప్రవర | ఎక అభావిక సపటణేకర | 
 ఎకాచా వకిలీ పరీక్షా ప్రకార | కృపా దుజావర ‘అష్టచత్వారింశతీ’ | ||౧౩౪|| 
134. శేవడే అను భక్తుడి వకీలు పరీక్ష గురించి, మరియు నమ్మకంలేని సపటణేకరును సాయి అనుగ్రహించిన కథ నలబై ఎనిమిదవ అధ్యాయంలో చెప్పబడింది. 
హరీ కాన్హోబా ముంబఈనివాసీ | స్వామీ సోమదేవ కుటిల మానసీ | 
సంత పరీక్షణార్థ శ్రీ శైలధీసీ43 | ఆలే అభిమానాసీ ధరూనియా | ||౧౩౫|| 
135. ముంబై నివాసి అయిన హరీ కాన్హోబా, కుటిల మనసుతో సోమదేవ స్వామి, వీరిద్దరూ బాబాను పరీక్షించాలని శిరిడీ రావటం, 
దర్శనఖేవో44 మనోగత కథిలే | దోఘే తత్కాళ లజ్జిత ఝాలే | 
సాఈ చరణీ చిత్త వేఘలే | పాప నిమాలే జన్మాంతరీచే | ||౧౩౬|| 
136. వారు బాబా దర్శనం చేసుకున్నప్పుడు, సాయి వారి మనసులోని ఆలోచనలను తెలియ పరచగా, వారు లజ్జితులై సాయి పాదాలకు శరణుజొచ్చి, జన్మ జన్మల పాపాలను పోగొట్టుకోవటం, 
బాబాసన్నిధ బసలే అసతా | స్త్రీరూప దేఖూని వికారవశతా | 
ఉపజే చాందోరకరాంచే చిత్తా | వర్ణిలీ వార్తా ‘ఎకోనపంచాశతీ’ | ||౧౩౭|| 
137. అలాగే, ఒక సారి బాబా వద్ద కూర్చుని ఉన్న చాందోర్కరు ఒక స్త్రీని చూచి, మనోవికారానికి లోనైన సంగతి గురించిన కథ, ఇవన్నీ నలబై తొమ్మిదవ అధ్యాయంలొ వర్ణించ బడింది. 
‘తద్విద్ధి ప్రణిపాతేన’ | యాచాచ అర్థ విస్తారూన | 
కరితీ త్యాంచేచ సమర్థన | రఘునాథనందన ‘పంచాశతీ’ | ||౧౩౮|| 
138. ‘తద్విద్ధి ప్రణిపాతేన’ అను గీతా శ్లోకానికి సాయి చెప్పిన అర్థాన్ని విస్తారంగా రఘునాథనందనుడు (హేమాడుపంతు) యాబైయవ అధ్యాయంలో వివరించారు. 
దీక్షిత హరీ సీతారామ | భక్త ధురంధర బాళారామ | 
నాందేడ వకీల పుండలీక నామ | శిరడీ ప్రథమ పాతలే కైసే | ||౧౩౯|| 
139. హరి సీతారామ దీక్షితు, భక్తుడైన బాళారామ ధురంధర, నాందేడులోని వకీలు పుండలీకరావు, వీరు మొదట శిరిడీకి ఎలా వచ్చారు అన్న సంగతి, 
ఎకేకాచీ కథా అద్భుత | శ్రవణీ శ్రోతే హోత విస్మిత | 
భక్తమనోదధి ఉచంబళత | వృత్త వర్ణితీ ‘ఎకపంచాశతీ’ | ||౧౪౦||
140. ఆ ఒక్కొక్కరి అద్భుత కథలను శ్రవణం చేసిన శ్రొతలు ఆశ్చర్యపోవటం, వారి మనసులలో ప్రేమ సముద్రం ఉప్పొంగే సంగతి గురించి యాబై ఒకటవ అధ్యాయంలో వర్ణించబడింది. 

కరూన గ్రంథసింహావలోకన | మాగూన ఘేత పసాయదాన | 
ఖలాంచే ఖలత్వ ఘాలవూన | సజ్జన సంరక్షణ కరావే | ||౧౪౧|| 
141. గ్రంథాన్ని సింహావలోకనం చేస్తూ, దుష్టుల దుర్మార్గాన్ని నశింపచేసి, మంచివారిని రక్షించవలెనని సాయిని ‘పసాయదానాన్ని’ హేమాడుపంతు కోరడం,
సద్గురుచరణీ లీన హోఊన | మస్తక లేఖణీ అర్పణ కరూన | 
సర్వ గ్రంథ సంపవూన | కృతార్థ లేఖన ‘ద్విపంచాశతీ’ | ||౧౪౨|| 
142. సద్గురు పాదాలలో మనసును లీనం చేసి, శిరసును, కలాన్ని వారికి అర్పించి, హేమాడు పంతు యాబై రెండవ అధ్యాయంతో, తృప్తితో గ్రంథాన్ని పూర్తిచేశాడు. 
ఎవం45 శ్రీసాఈసచ్చరితాధ్యాయ | పూర్ణ కరితీ గోవిందరాయ | 
ప్రేమే వందూని త్యాంచే పాయ | నమితో గురుమాయ విశ్వాచీ | ||౧౪౩|| 
143. ఈ విధంగా గోవిందరావు శ్రీసాయి సచ్చరితలోని అధ్యాయాలని పూర్తి చేశారు. భక్తిగా వారి పాదాలకు నమస్కరించి, ఈ ప్రపంచానికే మాత అయిన సద్గురువుకు ప్రణామం చేస్తాను. 
అధ్యాయాధ్యాయసార కథికా | తిలాచ వదతీ అవతరణికా | 
కైవల్యపురీచీ సప్తపథికా | ముముక్షు రసికా జీ హోయ | ||౧౪౪|| 
144. గ్రంథంలోని అధ్యాయాల సారాంశాన్ని తెలియ పరచేదాన్ని అవతరణిక అని అంటారు. మోక్షాన్ని కోరుకునే ముముక్షువులకు ఇది అసలైన రహదారి. 
శేల్యాస రక్టయాచా పదర | మ్హణూని కరితిల అవ్హేర | 
పరీ దాస వినతీ ఎకవార | చతుర శ్రోతీ పరిసావీ | ||౧౪౫|| 
145. సుందరమైన గొప్ప శాలువకు జతపరచిన పాత అంచులా ఉందని దీనిని గౌరవంతో చూడక పోయినా, ఈ దాసుని మనవిని చతురులైన శ్రోతలు ఒక సారి వినండి. 
శేలా నా శిశు, గోండస నీట | బాధావీనా వాఈట దీఠ | 
అవతరణికా హీ కాళీతీట | బాళ46, ధీట త్యా లావీ | ||౧౪౬|| 
146. ఈ గ్రంథం ఒక శాలువా కాదు, అతి సుందరమైన ఒక బిడ్డ. ఈ బిడ్డకు దృష్టి తగలకుండా, ఈ అవతరణికను నల్లటి దిష్టి చుక్కలాగా ఈ బాబా బాలుడు పొందుపరచాడు. 
గ్రంథ సుందర షడ్రస అన్న | అధ్యాయార్థ పదార్థ భిన్న | 
అశేష పచనా తక్రపాన | తద్వత్ లేఖన అవతరణికా | ||౧౪౭|| 
147. ఆరు రసాలతో తయారైన గ్రంథమనే ఈ ఆహారంలో అధ్యాయాలు రకరకాల పదార్థాలు. ఇవి చక్కగా జీర్ణం కావటానికి మజ్జిగ వంటిది ఈ అవతరణిక. 
గ్రంథ సురభి47 సదాఫలా | అధ్యాయావయవ శుచి విమలా | 
దృష్ట న వ్హావీ, ఘాలీ గళా | దిరుమణి48 మాళా అవతరణికా | ||౧౪౮|| 
148. ఎప్పుడూ కోరికలను తీర్చే కామధేనువంటిది ఈ గ్రంథం. పవిత్రమైన అధ్యాయాలే దీని అవయవాలు. దీనికి దృష్టి దోషం తగలకుండా మెడలో వేసే నల్లటి పూసలమాల వంటిది ఈ అవతరణిక. 
అసో ఆతా అధ్యాయపద్ధతీ | పంత హేమాడ జీ ఆచరితీ | 
తీ కథితో యథామతీ | సాదర శ్రోతీ పరిసావీ | ||౧౪౯|| 
149. అందువలన ఇప్పుడు, హేమాడు పంతు అనుసరించిన అధ్యాయాలలోని పద్ధతిని నా బుద్ధికి తోచిన విధంగా చెప్తాను. శ్రోతలు ఆదరంతో వినండి. 
ప్రథమారంభీ సద్గురూస్తవన | నంతర కరితీ వేదాంత నిరూపణ | 
సాఈ బ్రహ్మస్వరూప వర్ణన | అనుభవకథన తదనంతర | ||౧౫౦||
150. సద్గురు స్తుతితో మొదలుపెట్టి, తరువాత వేదాంత వర్ణన, సాయియొక్క బ్రహ్మ స్వరూప వర్ణన, తరువాత భక్తుల అనుభవాలను చెప్పారు. 

మూళచేచ హేమాడ వ్యుత్పన్న | త్యాంత సద్గురుసాఈ ప్రసన్న | 
తత్క్షణి కేలే ప్రతిభాసంపన్న | గ్రంథ పక్వాన్న నిర్మావయా | ||౧౫౧|| 
151. వాస్తవానికి హేమాడుపంతు సాహిత్యంలోను, శాస్త్రజ్ఞానంలోను బాగా ప్రావిణ్యం ఉన్నవారు. పైగా సద్గురు సాయి ప్రసన్నులైయ్యారు. దాంతో, ఈ గ్రంథమనే పక్వాన్నాని తయారు చేయటానికి, హేమాడు పంతును ప్రతిభా సంపన్నులుగా సాయి చేశారు. 
జై అనుభవితీల యాచీ గోడీ | బంద తైంచ జన్మమరణనాడీ | 
నిర్వాణ పదాచీ వతనవాడీ | అక్షయ్య జోడీ మిళేల | ||౧౫౨|| 
152. ఈ గ్రంథంలోని జ్ఞాన మాధుర్యాన్ని అనుభవించిన వారికి జనన మరణాలు ఉండవు. ఎన్నటికీ తరగని మోక్ష సంపద కూడా వారికి లభిస్తుంది. 
హేమాడాంచీ రసాళ వాచా | సాఈప్రసాదలాభ సాచా | 
యోగ పయ ఇక్షు రసాచా | గ్రంథాచా థాట కాయ వానావా | ||౧౫౩|| 
153. హేమాడుపంతుయొక్క రసవత్తరమైన భాష, దానికి తోడు సాయి అనుగ్రహం కలిసి, పాలు చెరుకురసం కలిసిన మధుర రసంవలె తయారైన ఈ గ్రంథంయొక్క శోభను ఎంతని వర్ణించగలం? 
అసతీల బహుత గ్రంథకార | న యే ప్రసాద వాణీచా అధికార | 
జై లాధే సద్గురు సాచార | విశ్వాధార రమాపతి | ||౧౫౪|| 
154. గ్రంథ రచయితలు ఎందరో ఉన్నారు. కాని, విశ్వానికి ఆధారమైన శ్రీవిష్ణువుయొక్క అవతారమైన సద్గురువు దొరకకపోతే, వారికి ప్రసాదంగా అందిన వాణి ఉండదు. 
జరీ కేలే విద్యాధ్యయన | న నిపజే ఏసే గ్రంథలేఖన | 
సద్గురు కృపేవాంచూన | సత్య వచన త్రివార | ||౧౫౫|| 
155. శాస్త్రాలను ఎంత బాగా తెలుసుకున్నా, సద్గురు కృప లేకుండా ఇటువంటి గ్రంథ రచన సాధ్యం కాదు. ఇది ముమ్మాటికీ నిజం. 
కోణ వానీల శ్రీసాఈసచ్చరితా | కితీ అనుపమ గ్రంథ యోగ్యతా | 
లాధలా హేమాడపంతసమ కర్తా | పరమ సౌభాగ్యతా ముముక్షూంచీ | ||౧౫౬|| 
156. సాటిలేని శ్రీసాయి సచ్చరిత యోగ్యతను ఎవరు వర్ణించగలరు? ముముక్షువుల పరమ భాగ్యం కారణంగా హేమాడుపంతు వంటి రచయిత లభించారు. 
యావత్ గ్రంథ మహీతళీ | తావత్ కీర్తీ భూమండళీ | 
గోవిందరాయే కేలీ దివాళీ | వేళీంచ ముముక్షూ కారణే | ||౧౫౭|| 
157. ఈ గ్రంథం భూమిపై ఉన్నంత వరకు, హేమాడుపంతు కీర్తి ప్రపంచమంతటా ఉంటుంది. గోవిందరాయడు ముముక్షువుల కోసం గొప్ప విందును తయారు చేశాడు. 
గ్రంథ బాప ధన్య ధన్య | సాఈ సద్గురు ప్రసాదజన్య | 
ముముక్షు జీవా హోఈల మాన్య | విచార దైన్య ఫేడీల | ||౧౫౮|| 
158. సాయి సద్గురువు అనుగ్రహంతో పుట్టిన ఈ గ్రంథం ధన్యం. ముముక్షువులైన జీవులకు ఇది శిరోధార్యమై వారి దైన్యమైన ఆలోచనలను తొలగిస్తుంది. 
అనంతజన్మీంచా సుకృత ఠేవా | మ్హణూన ఘడలీ సాఈ సేవా | 
మిళాలా మధుర గోవిందరావా | మేవా గ్రంథలేఖనాచా | ||౧౫౯|| 
159. ఎన్నో జన్మల పుణ్య సంగ్రహం వలన గోవిందరావుకు, సాయియొక్క మధురమైన సేవాఫలం ఈ గ్రంథ రూపంలో దొరికింది. 
పంత హేమాడ కట్టే భక్త | కవి, వేదాంత విద్యాసక్త | 
సాఈ సద్గురు పదానురక్త | దివానక్త అసతీ కీ | ||౧౬౦||
160. ఈ హేమాడుపంతు చాలా నిష్ఠాపరుడైన గొప్ప భక్తులు, కవి. వేదంతం అంటే ఆసక్తి కలవారు. రాత్రిపగలూ సద్గురు సాయి పాదాలయందు లీనమై ఉన్నవారు. 

వేదాంత విషయ అతి గహన | విరక్తి భక్తి జ్ఞాన జోడ దేఊన | 
 ఏసా గ్రంథ కరణే నిర్మాణ | గురుకృపేవీణ దుర్ఘట | ||౧౬౧|| 
161. వేదాంతం చాలా కఠినమైన విషయం. దానికి విరక్తి, భక్తి, జ్ఞానం జోడించి ఇటువంటి గ్రంథాన్ని గురు కృప లేకుండా రచించటం కష్టం.
అధ్యాయ నవ్హత హీ హేమకోందణే | జడిలీ త్యాంత కథా మోలరత్నే | 
త్యాంతీల అర్థ ప్రభా కిరణే | మహా ప్రయత్నే గోవిందరాయే | ||౧౬౨|| 
162. ఇందులో ఉన్నవి అధ్యాయాలు కావు. అవి బంగారంతో తయారు చేసిన పేటికలు. అర్థభరితమైన, జ్ఞానవంతమైన కథలనే రత్నాలను వీనిలో గోవిందరాయుడు మహాప్రయత్నంతో ఇమిడ్చారు. 
నానా అధ్యాయ సుగంధ సుమనమాళా | అర్పీతసే శ్రీ సాఈ సద్గురు గళా | 
గోవింద మతీ ప్రేమళ బాళా | నిర్మళ భావే కరూనీ | ||౧౬౩|| 
163. అనేక రకాల సువాసనలను వెదజల్లే ఈ అధ్యాయాలనే పూలదండలను ముద్దుబిడ్డడైన గోవిందరావు, నిర్మలమైన భక్తి భావంతో సద్గురు కంఠానికి అర్పించారు. 
నానా అధ్యాయ శుద్ధ హేమకుంభ | త్యాంత శ్రీ సాఈసచ్చరిత గగాంభ49
భరూని ఠేవితీ రఘునాథడింభ50 | ముముక్షుదంభ దవడావయా | ||౧౬౪|| 
164. ముముక్షువుల దర్పాన్ని తొలగించటానికి, ఈ అధ్యాయాలనే శుద్ధమైన బంగారు కలశాలలో శ్రీసాయి సచ్చరిత అనే గంగాజలాన్ని రఘునాథుని కొడుకు (హేమాడుపంతు) నింపి ఉంచారు. 
నానా గ్రంథ రణాంగణ నభ | ఉభవితీ అధ్యాయ యశస్తంభ | 
మర్దుని అసుర దర్పాభిమానదంభ | రఘునాథడింభ మతి ఖడ్గే | ||౧౬౫|| 
165. ఈ గ్రంథమనే యుద్ధభూమిలాంటి ఆకాశంలో, సూక్ష్మమైన బుద్ధి అనే కత్తితో, దంభం, దర్పం, అభిమానమనే రాక్షసులును చంపి, రఘునాథుని కొడుకు అధ్యాయాలనే కీర్తిస్తంభాలను నిలబెట్టారు. 
గ్రంథ రత్నజడిత పంచారతీ | అధ్యాయ కథార్థ స్నేహసూత్ర జ్యోతీ | 
విరక్తి శాంతి ఘేఊన యేతీ | సంతనృపతీ ఓవాళణ్యా | ||౧౬౬|| 
166. ఈ గ్రంథం రత్నాలతో అమర్చబడిన పంచారతి. ఇందులోని అధ్యాయాలలో ఉన్న కథలు తెలిపే అర్థాలు – నూనెలోని వత్తులయొక్క జ్యోతులు. సంతులలో మహారాజైన సాయికి, శాంతి మరియు విరక్తి, హారతిని ఇవ్వటానికి వస్తాయి. 
గ్రంథమాయా విశ్వమోహినీ | అధ్యాయ బాహూ ఉంచ ఉభవునీ | 
కథార్థ కేయూర కాయ శృంగారునీ | సజ్జ ఆలింగని సాఈ బ్రహ్మా | ||౧౬౭|| 
167. ప్రపంచాన్నే సమ్మోహింపచేసే విశ్వమోహినిలాంటిది ఈ గ్రంథం. కథల అర్థాలు అనే కేయూరాలను, అధ్యాయాలనే తన బాహువులకు అలంకరించుకుని, సాయి బ్రహ్మను కౌగలించుకోవటానికి, ఆ బాహువులను పైకి లేపి ఉంచింది. 
సాఈ సచ్చరిత గ్రంథ సమ్రాట | అధ్యాయ రమ్య చతుర భాట | 
శ్రద్ధా, జ్ఞాన, వేదాంత, థాట | వైభవ అఫాట వానితాతీ | ||౧౬౮|| 
168. సాయి సచ్చరిత, గ్రంథాలకే సామ్రాట్టు. అందులోని అందమైన అధ్యాయాలు, తెలివైన వందిమాగధులు. శ్రద్ధ, జ్ఞానం, వేదాంతం వీటి అంతులేని వైభవాన్ని అవి వర్ణిస్తాయి. 
సాఈ సచ్చరిత పరమార్థ హాట | ఎకేక అధ్యాయ త్యాంతీల పేఠ | 
అనుభవ కథా వస్తు దాట | రచిల్యా నీట కవివర్యే | ||౧౬౯|| 
169. పరమార్థాన్ని అమ్మే సంత ఈ సాయి సచ్చరిత గ్రంథం. దీనిలోని ఒక్కొక్క అధ్యాయం, ఒక్కొక్క అంగడి. వీనిలో భక్తుల అనుభవాల కథలు అనే సరకులను రచయిత అందంగా అమర్చారు. 
గ్రంథ గంగాపాత్ర విరాట | అధ్యాయ రచనా సుబక ఘాట | 
కథా రసామృత ప్రవాహ అచాట | సామర్థ్య అఫాట గురుకృపేచే | ||౧౭౦||
170. ఈ గ్రంథం పెద్దదైన గంగానది. దీనిలోని అధ్యాయాలు, చక్కగా సిద్ధపరచిన తీరఘట్టాలు. గురుకృపా సామర్థ్యం వలన ఇక్కడ కథల రసామృత ప్రవాహం ఉంది. 

గ్రంథ నవ్హే హా కల్పవృక్ష | సంసారజనా వాటే రూక్ష | 
ముముక్షు భావికా కేవళ మోక్ష | అనుభవ ప్రత్యక్ష పహావా | ||౧౭౧|| 
171. ఇది గ్రంథం కాదు, కల్పవృక్షం. సాంసారికులకు ఇది రుచించదు. కాని భావికులకు, ముముక్షువులకు ఇది సాక్షాత్తు మోక్షానికి ద్వారం. మీరే అనుభవంతో తెలుసుకొండి. 
యాసచి మ్హణావే ఖరే స్మారక | జే సంసృతితమ తాపహారక | 
 మోహమాయా నిరయ తారక | శాంతిదాయక అక్షయ్య | ||౧౭౨|| 
172. ప్రపంచంలోని అజ్ఞానాన్ని, మరియు దుఃఖాన్ని తొలగించి, మోహ-మాయలనే నరకంనుండి తప్పించే నిజమైన స్మారకం ఇది. ఎన్నటికీ ముగిసిపోని శాంతిని ఇస్తుంది. 
గ్రంథకార రావ గోవింద | సాఈసద్గురు పదారవింద | 
నిత్య నవా మధు మకరంద | చాఖిత మిలింద హోఊనీ | ||౧౭౩|| 
173. ఈ గ్రంథ రచయిత గోవిందరావు ఒక భ్రమరమై, ఎప్పుడూ సాయి సద్గురు పాద కమలాలో, క్రొత్త క్రొత్త మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. 
ఉపనామ జయాంచే ‘దాభోళకర’ | ఆంగ్లప్రభూ సేవాతత్పర | 
విద్యా, వినయ, ఆచార విచార | అధికారసంపన్న జే అసతీ | ||౧౭౪|| 
174. వీరి ఇంటి పేరు దాభోల్కరు. వీరు ఆంగ్ల ప్రభుత్వంలో మంచి అధికార పదవిలో ఉండేవారు. విద్య, వినయం కలిగి ఆచారాలను బాగా తెలిసినవారు. 
రఖుమాబాఈ తయాంచీ గృహిణీ | సుశీల భావిక సద్గుణఖాణీ | 
పతిపరాయణ వినతవాణీ | సాఈచరణీ దృఢభావ | ||౧౭౫|| 
175. వీరి భార్య అయిన రఖుమాబాయి సౌశీల్యవతి, భక్తురాలు, పతివ్రత, సద్గుణాలకు గని. వినమ్రతతో మాట్లాడే ఈమె, సాయి పాదాలలో దృఢమైన నమ్మకం గలది. 
వేంగుర్ల్యా సన్నిధి ‘దాభోలీ’ | మూలవస్తీ తేథ జాహలీ | 
‘కేళవే’ గ్రామీ నంతర కేలీ | వస్తీ వాడవడిలీ కవీంచ్యా | ||౧౭౬|| 
176. ఈ కవియొక్క పూర్వీకులు, మొదట వెంగుర్ల దగ్గరలోని దాభోలీ అనే చోట నివసించేవారు. తరువాత కేళవే గ్రామానికి వచ్చారు. 
శకే సతరాశే ఎక్యాయశీ | శుక్ల పంచమీ మృగశిర మాసీ | 
రఘునాథ భార్యా లక్ష్మీచ్యా కుశీ | జన్మతీ పుణ్యారాశీ గోవింద | ||౧౭౭|| 
177. శక సంవత్సరం ౧౭౫౧ (క్రి. శ. ౧౮౫౯వ సంవత్సరం) మార్గశిరమాసంలో శుక్ల పంచమి రోజున రఘునాథుని భార్య లక్ష్మీ గర్భాన పుణ్యరాశియైన గోవిందరావు పుట్టారు. 
గౌడ సారస్వత బ్రాహ్మణ జాతీ | గోత్ర భారద్వాజ వయ సప్తతీ51
ఆఢాఢ శుక్ల నవమీ తిథీ | దివంగతి52 అఠరాశే ఎకావనీ | ||౧౭౮|| 
178. గౌడ సారస్వత బ్రాహ్మణ జాతిలో, భరద్వాజ గోత్రంతో పుట్టి, క్రి. శ. ౧౯౨౯వ సంవత్సరం, డెబ్బైయవ వయసులో, ఆషాడ శుక్ల నవమినాడు మరణించారు. 
శకే అఠరాశే చవేచాళిసీ | గ్రంథ ఆరంభిలా చైత్రమాసీ | 
బావన్నాధ్యాయ జ్యేష్ఠమాసీ53 | శకే ఎకావనీ పూర్ణ కేలే | ||౧౭౯|| 
179. శక సంవత్సరం ౧౮౪౪ (క్రి. శ. ౧౯౨౨వ సంవత్సరం) చైత్ర మాసంలో ఈ గ్రంథాన్ని ఆరంభించారు. శక సంవత్సరం ౧౮౫౧ (క్రి. శ. ౧౯౨౯వ సంవత్సరం)లో యాబై రెండవ అధ్యాయాన్ని పూర్తి చేశారు. 
గోవిందరావా ఎకచి సుత | పాంచ దుహితా, చార వివాహిత | 
సుత వివాహిత వైద్యక శికత | సుతా అవివాహిత శికే తేంచి | ||౧౮౦||
180. గోవిందరావుకు ఒక అబ్బాయి, అయిదుగురు అమ్మాయిలు సంతానం. నలుగురికి పెళ్లైయింది. కొడుకుకు కూడా పెళ్లై వైద్యశాస్త్రం చదువుతున్నాడు. పెళ్లికాని అమ్మాయి కూడా డాక్టరు కావాలని చదువుతున్నది. 

ఆతా కథితో పారాయణ పద్ధతీ | తైసీచ సప్తాహాచీ సుగమ రీతీ | 
దిధలీ గురుచరిత్రీ వా అన్య గ్రంథీ | కృపావధాన శ్రోతీ ద్యావే | ||౧౮౧|| 
181. ఇప్పుడు పారాయణం చేసే పద్ధతిని, మరియు సప్తాహం చేసే సులభమైన పద్ధతిని వివరిస్తాను. ఇది ‘గురుచరిత్ర’ మరియు ఇతర గ్రంథాలలో సూచించబడింది. శ్రోతలు దయచేసి శ్రద్ధగా వినండి.
చోఖట కరూనీ అంతఃకరణ | భక్తిభావే కరావే పారాయణ | 
ఎక, ద్వి, వా త్ర్యహని54 కరావే పూర్ణ | సాఈ నారాయణ తోషేల | ||౧౮౨|| 
182. మనసును ముందుగా పరిశుద్ధం చేసుకుని, భక్తి భావంతో పారాయణ చేయాలి. ఒకటి లేక రెండు, లేదా మూడు రోజులలో పారాయణ పూర్తి చేస్తే, సాయి నారాయణులు తృప్తి పడతారు. 
అథవా కరావా సప్తాహ గోడ | మిళేల పుణ్య సంపత్తీచీ జోడ | 
సాఈ పురవీల మనీచే కోడ | భవభయ మోడ హోఈల | ||౧౮౩|| 
183. లేదా, చక్కగా సప్తాహాన్ని చేయండి. మీ పుణ్య సంపత్తి పెరుగుతుంది. మీ మనసులోని కోరికలను సాయి తీరుస్తారు. ప్రాపంచిక భయాలు తొలగిపోతాయి. 
ప్రారంభ కరావా గురువాసరీ | ఊషఃకాలీ స్నానానంతరీ | 
బసావే ఆపుల్యా ఆసనావరీ | ఉరకునీ సత్వరీ నిత్యకర్మ | ||౧౮౪|| 
184. గురువారం రోజు ఉదయాన, నిత్యకర్మలను తొందరగా ముగించుకుని, స్నానం చేసి, ఆసనంపై కూర్చుని, పారాయణను ప్రారంభించండి. 
మండప ఘాలవా రమ్య విస్తీర్ణ | రంభా, కర్దళీ, వసనాది కరూన | 
ఉపరీ సుందర ఆచ్ఛాదన | ఘాలూన విభూషిత కరావా | ||౧౮౫|| 
185. అరటి ఆకులతోను, మరియు వస్త్రాలతో అలంకరించిన ఒక పెద్ద మండపాన్ని తయారు చేసుకొండి. 
త్యాంత కరావే ఉచ్చాసన | భోంవతీ కాఢావ్యా భిన్న భిన్న | 
రంగవల్ల్యా రంగపూర్ణ | నయన సుభగ అసావ్యా | ||౧౮౬|| 
186. అందులో ఎత్తుగా ఒక పీట గాని, బల్లగాని వేసి, చుట్టూ కళ్లకు ఆకర్షణీయంగా రంగు రంగుల ముగ్గులు వేయండి. 
సాఈసద్గురు ప్రతిమా కరూన | అథవా సుందర ఛబీ ఘేఊన | 
ఉచ్చాసనీ ఠేవావీ జపూన | కరూని వందన ప్రేమభావే | ||౧౮౭|| 
187. సాయి సద్గురువుయొక్క ప్రతిమను కాని, లేక అందమైన వారి చిత్రపటాన్నిగాని ఎత్తైన ఆసనంపై ఉంచి, భక్తిభావంతో నమస్కరించండి. 
చీనాంశుకీ55 గ్రంథ బాంధోనీ | సద్గురు సన్నిధ త్యా ఠేవూనీ | 
పంచోపచారే ఉభయా పూజునీ | ఆరంభ వాచనీ కరావా | ||౧౮౮|| 
188. శ్రీసాయి సచ్చరిత గ్రంథాన్ని పట్టు వస్త్రంలో చుట్టి సద్గురు దగ్గర ఉంచి, గ్రంథానికి మరియు సద్గురువుకు పంచోపచార పూజ చేసి, పారాయణను మొదలుపెట్టండి. 
వ్రతస్థ రాహావే అష్ట వాసర | కరావా గోరస వా ఫలాహార | 
అథవా భర్జిత ధాన్య ప్రకార | నక్త రుచిర వా ఎకభుక్త | ||౧౮౯|| 
189. పాలు లేక ఫలహారాలను గాని, లేదా వేపిన ధాన్యాన్ని, ఒక్క పూటే తింటూ, ఎనిమిది రోజులు ఉపవాస వ్రతం చేయండి. 
ప్రాచీ దిశీ ముఖ కరూన | సద్గురూమూర్తీ మనీ ఆఠవూన | 
కరావే స్వస్థ మనే కరూన | గ్రంథవాచన మోదభరే | ||౧౯౦||
190. తూర్పు వైపుకు ముఖం పెట్టి, సద్గురువును మనసులో ధ్యానించి, నిశ్చలమైన మనసుతో, ఆనందంగా గ్రంథ పారాయణ చేయండి. 

అష్ట, అష్ట, ఆణి సప్త | అష్ట, షట్‍, అష్ట, సప్త, | 
ఎవం పాఠ కరావా దిన సప్త | అవతరణికా ఫక్త అష్టమాహనీ | ||౧౯౧|| 
191. మొదటి రోజు ఎనిమిది అధ్యాయాలు, రెండవ రోజు ఎనిమిది, మూడవ రోజు ఏడు, తరువాత ఎనిమిది, ఆరు, ఎనిమిది, ఏడు అధ్యాయాలను వరుసగా ఏడు రోజులూ చదివి, ఎనిమిదవ రోజున అవతరణికను చదవండి. 
అష్టమదినీ వ్రతపారణా | కరూని నైవేద్య సాఈనారాయణా | 
సుగ్రాస భోజన ఆప్తేష్ట, బ్రాహ్మణా | దక్షిణా యథాశక్తి త్యా ద్యావీ | ||౧౯౨|| 
192. ఎనిమిదవ రోజున వ్రతాన్ని ముగించండి. సాయి నారాయణునకు నైవేద్యాన్ని సమర్పించి, బ్రాహ్మణులకు, ఆప్తులకు, మిత్రులకు మంచి భోజనాన్ని, తరువాత శక్తి ఉన్నంత దక్షిణను ఇవ్వండి. 
అవంతూని వైదిక బ్రాహ్మణా | కరావీ నిశీ వేదఘోషణా | 
పయ శర్కరాపాన, సంభావనా | దేఊన తన్మనా నివవావే | ||౧౯౩|| 
193. ఆ రాత్రి, వైదిక బ్రాహ్మణులను పిలిచి, వారిచే వేద పఠనాన్ని చేయించండి. తరువాత వారికి పంచదార వేసిన మధురమైన పాలను, మరియు దక్షిణను ఇచ్చి వారిని తృప్తిపరచండి. 
అంతీ వందూని సద్గురుచరణా | అర్పావీ త్యా ఉచిత దక్షిణా | 
ధాడావీ తీ భాండారభువనా56 | సంస్థాన నిధి వర్ధనా కారణే | ||౧౯౪|| 
194. చివర, సద్గురు పాదాలకు నమస్కరించి, వారికి సరియైన దక్షిణను అర్పించి, దానిని శిరిడీ సంస్థాన నిధి అభివృద్ధి కొరకు పంపాలి. 
యేణే తోషేల సాఈ భగవాన | దేఈల భక్తా పసాయదాన | 
ఛేదీల భవభయ లేలిహాన57 | దావీల నిధాన మోక్షాచే | ||౧౯౫|| 
195. సాయి భగవానులు ఆనందించి, భక్తులకు వరాలను ప్రసాదిసారు. సాంసారిక దుఃఖమనే పాముని నాశంచేసి, మోక్షమనే నిధిని చూపిస్తారు. 
శ్రోతే సంత మాహేరఘర | పడో, పడేల అవతరణికా విసర | 
ద్యావీ గ్రంథార్థావర నజర | వినవీ కింకర పాయాంతే | ||౧౯౬|| 
196. శ్రోతలారా! మీరు సాధువులు. శాంతి, ఆనందానికి నిలయం. మీ పాదాల వద్ద ఈ దాసుని విన్నపం వినండి. అవతరణికను మరచిపోతే మరచిపోండి, కాని, మూల గ్రంథంయొక్క భావంపై మీ ధ్యానాన్ని ఉంచండి. 
శ్రోతే సజ్జన కృతాంత కాళ | అసో దాసావర దయా అఢళ | 
ఠేవుని తుమచ్యా చరణీ భాళ | ప్రార్థీ బాళ బాబాంచా | ||౧౯౭|| 
197. శ్రోతలారా! మీరు మృత్యువునే అంతం చేయగల సజ్జనులు. మీ పాదాలయందు శిరసునుంచి, ఈ బాబా బాళుడు, ఈ దాసునియందు ఎప్పుడూ దయ ఉంచమని ప్రార్థిస్తున్నాను. 
ఉణే అధిక అసేల జే జే | తే తే ద్యావే మజలా మాఝే | 
సార ఘేఊని చిత్త విరాజే | ఏసే కీజే శ్రోతీ తుమ్హీ | ||౧౯౮|| 
198. ఈ అవతరణికలో లోపాలు ఏవైనా ఉంటే, వానిని నావిగా భావించి వానిని నాకు వదిలి, సారాన్ని గ్రహించి, మనసుకు సంతోషం కలిగేలా, శ్రోతలూ, శ్రవణం చేయండి. 

నమో సాఈ శివనందనా | నమో సాఈ కమలాసనా58
నమో సాఈ మధుసూదనా | పంచవదనా59 సాఈ నమో | ||౧౯౯|| 
199. నమో సాయి శివనందనా! నమో సాయి కమలాసనా! నమో సాయి మధుసూదనా! పంచవదన సాయి నమో! 
నమో సాఈ అత్రినందనా60 | నమో సాఈ పాకశాసనా61
నమో సాఈ నిశారమణా62 | వన్హినారాయణా సాఈ నమో | ||౨౦౦|| 
200. నమో అత్రినందనా! నమో సాయి పాకశాసనా! నమో సాయి నిశారమణా! అగ్నినారాయణ సాయి నమో! 
నమో సాఈ రుక్మిణీవరా | నమో సాఈ చిద్భామస్కరా | 
నమో సాఈ జ్ఞానసాగరా | జ్ఞానేశ్వరా శ్రీ సాఈ నమో | ||౨౦౧|| 
201. నమో సాయి రుక్మిణీవరా! నమో సాయి చిద్భాస్కరా! నమో సాయి జ్ఞానసాగరా! జ్ఞానేశ్వరా శ్రీ సాయి నమో! 
అవతరణికా వాక్పుగష్పాంజలీ | తైసీచ నమన నామావలీ | 
ప్రార్థీ అర్పుని గురుపదకమలీ | సాఈ మాఉలీ సంతోషో | ||౨౦౨||
202. ఈ అవతరణిక అనే మాటల పుష్పాంజలిని మరియు నమస్కారాల నామావళిని గురువు పాదాలకు అర్పించి, సాయిమాత ప్రసన్నులు కావాలని ప్రార్థిస్తున్నాను. 


| ఇతి శ్రీసాఈ సద్గురు ప్రేరితే | దాస బాబా బాళ విరచితే | 
 | శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | అవతరణికా నామ | 
| త్రిపంచాశత్తమోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సాఈనాథార్పణమస్తు|| 
||శుభం భవతు || 

టిపణీ: 
1. నియమ. 2. గ్రంథకార అణ్ణాసాహేబ దాభోలకర. 3. శ్రీ సాఈబాబా. 
4. శిరడీ సంస్థానచే ఖజినదార బాబాసాహేబ తర్ఖడ. 5. శ్రీ సాఈబాబా. 
6. శ్రీ సాఈసచ్చరిత గ్రంథాచా భాగ. 7. గహూ దళణే. 
8. హరిచందన=కల్పవృక్ష. 9. శ్రీమంత. 10. చాంద పాటీల. 
11. నానాసాహేబ చాందోరకర. 
12. ఉత్తమ ఆహే బుద్ధీ జ్యాంచీ అసే కవీ హేమాడపంత. 
13. తాత్యా పాటీల కోతే శిరడీకర యాంచ్యా మాతుఃశ్రీ. 
14. సాఈబాబా. 15. తాత్యా పాటీల కోతే. 16. సిద్దిక ఫాళకే. 
17. కాకా మహాజనీ. 18. నాశికచే ధుమాళ వకీల. 
19. నానాసాహేబ నిమోణకర. 20. శ్రీమంత బాబాసాహేబ బుటీ. 
21. కాకా మహాజనీ. 22. సాఖర. 23. కాకాసాహేబ దీక్షితాంచీ. 
24. కోపరగావచే మామలతదార బాళాసాహేబ మిరీకర. 
25. సర్పదంశ సంకట. 26. శిరడీచే మాధవరావ దేశపాండే. 
27. కాకాసాహేబ దీక్షిత. 28. కాకా మహాజనీ. 29. శ్రీ సాఈబాబా. 
30. మాధవరావ దేశపాండే శిరడీకర. 
31. మాధవరావ దేశపాండే శిరడీకర. 
32. మాధవరావాంస బాబా ‘శామా’, ‘శామరావ’ అసే మ్హణత. 
33. సప్తశృంగీ దేవీచే స్థాన వణీ గావీ ఆహే. 34. మానససరోవరాలా. 
35. చోరాచ్యా శోధాసాఠీ. 36. బాళకృష్ణ విశ్వనాథ దేవ. 
37. బాళకృష్ణ విశ్వనాథ దేవ. 38. రామచంద్ర పాటీల శిరడీకర. 
39. తాత్యా పాటీల కోతే శిరడీకర. 40. కాకా మహాజనీ. 
41. మాధవరావ దేశపాండే. 42. హిండణే - ఫిరణే. 43. శ్రీ శిరడీస. 
44. దర్శన హోతాచ. 45. యాప్రమాణే. 46. బాబాంచా బాళూ. 
47. కామధేను. 48. దృష్టమణ్యాంచీ మాళ. 49. గంగోదక. 
50. రఘునాథపుత్ర. 51. సత్తర (వయ ౭౦ వర్షాంచే). 
52. నిధన, మృత్యూ. 53. శకే అఠరాశే ఎకావన్న, జ్యేష్ఠమాసాత. 
54. తీన దివసాంత. 55. రేశమీ వస్త్రాత. 
56. శిరడీ సంస్థానచ్యా ఖజినదారాంచ్యా ఘరీ. 57. సాప. 
58. బ్రహ్మదేవ. 59. శంకర. 60. దత్త. 
61.ఇంద్ర. 62. చంద్ర. 

Friday, February 14, 2014

||సింహావలోకనం నామ ద్విపంచాశత్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౫౨ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

ఆతా కరూ సింహావలోకన | తదనంతర గ్రంథ సంపూర్ణ | 
కరూ అవతరణికా1 దేఊన | సారాంశ నివేదన గ్రంథాచా || 
ఇప్పుడు ఈ గ్రంథాన్ని మునుపటినుంచి పరిశీలించి, తరువాత, ఆ అధ్యాయాల సారాంశమైన అవతరణికతో ఈ గ్రంథాన్ని పూర్తి చేస్తాను.

దేహీ అసతా నిజభక్తాంలా | వేళోవేళీ జో అనుభవ దిధలా | 
త్యాచా గ్రంథ హీ ‘సాఈలీలా’ | గ్రంథ లిహవిలా స్మరణార్థ | ||౧|| 
1. శ్రీసాయి దేహంతో ఉండగా, ఆయా సమయాలలో భక్తులకు కలిగించిన అనుభవాలను గుర్తుంచుకోవటానికి వ్రాయించి, శ్రీసాయి లీలా మాస పత్రికలో ప్రచురింప చేశారు.
‘సాఈలీలా’ పరమ పవిత్ర | త్యాంతీల సచ్చరిత కథాసత్ర | 
 వాచా హే నిజగురు చరిత్ర | ఇహ పరత్ర ప్రబోధక | ||౨|| 
2. శ్రీసాయి లీలా చాలా పవిత్రమైన పత్రిక. అందులో, ఇహ పరాలను గురించి బోధించే మన గురువు చరిత్రను కథల రూపంలో అందరూ పఠించే విధంగా ప్రచురింప బడింది. 
సంగ్రహీ జ్యా తే అసంఖ్యాత | పరీ వ్యుత్పత్తీ విద్యారహిత | 
కరీ ధరూని హేమాడపంత | హే నిజ సచ్చరిత లిహవిలే | ||౩|| 
3. సాయి లీలలు లెక్క లేనంతగా సేకరించబడి ఉన్నాయి. శాస్త్ర జ్ఞానంగాని, విద్యగాని లేని హేమాడు పంతు చేతిని పట్టుకుని సాయి తమ సచ్చరితను వ్రాయించారు. 
కాంహీ ఆపణ ఆపులీ ఖ్యాతీ | స్వముఖే శిష్యా శ్రవణ కరవితీ | 
తేహీ గేలియా నిజధామాప్రతీ | తైంపాసూన యా గ్రంథా స్ఫూర్తీ | ||౪|| 
4. కొందరు గురువులు తమ నోటితో తమ చరిత్రను శిష్యులకు వినిపిస్తారు. అది, వారి తదనంతరం గ్రంథ రచనకు స్ఫూర్తి కలిగిస్తుంది. 
పరోపరీచ్యా వార్తా గహన | సాఈ జేవ్హా కరీత కథన | 
శ్రోతే హోత అత్యంత తల్లీన | భూక తహాన విసరత | ||౫|| 
5. అనేక రకాల గొప్ప గొప్ప సంగతులను సాయి చెప్పుతున్నప్పుడు, శ్రోతలు ఆకలి దప్పులను మరచి, చాలా తల్లీనులై వినేవారు. 
జిహీ పాహిలే సాఈ స్వరూప | హరలే తయాంచే త్రివిధ తాప | 
ఏసా జ్యాంచా తేజ ప్రతాప | సాద్యంత కేవీ వర్ణావా | ||౬|| 
6. సాయియొక్క దివ్య రూపాన్ని చూచిన వారికి మూడు రకాలైన తాపాలు నశించిపోయాయి. అటువంటి వారి శక్తియొక్క ప్రభావాన్ని మొత్తం, పూర్తిగా వర్ణించటం సాధ్యమా? 
ఏసా సాఈ ఉదార కీర్తి | జే జే లాగలే త్యాచ్యా భక్తీ | 
తయాచియా ఉద్ధారాప్రతి | ఠేవిలీ నిజఖ్యాతీ లిహూన | ||౭|| 
7. ఉదార స్వభావానికి కీర్తి పొందిన సాయి, తమను ఆరాధించే భక్తులను ఉద్ధరించటానికి, తమ వైభవాన్ని తెలిపే తమ చరిత్రను తామే వ్రాయించి ఉంచారు. 
గోదావరీచే పవిత్ర స్నాన | పుఢే ఘేవోనియా సమాధీ దర్శన | 
కరావే హే సచ్చరిత శ్రవణ | త్రితాప శమన హోతీల | ||౮|| 
8. పవిత్రమైన గోదావరీ నదిలో స్నానం చేసి, తరువాత సాయి సమాధిని దర్శించి, ఈ సాయి సచ్చరితను పఠించండి. మీ మూడు రకాల తాపాలు నశిస్తాయి. 
సహజ బోలతా జయాచ్యా గోష్టీ | నకళత పడే పరమార్థ మిఠీ | 
ప్రేమే ఘాలాయా గ్రంథీ దిఠీ | పాపాంచ్యా కోటీ నిరసతీల | ||౯|| 
9. సాయి లీలలను మామూలుగా ముచ్చటించుకున్నా సరే, మనకు తెలియకుండానే పరమార్థం అబ్బుతుంది. భక్తిగా ఈ గ్రంథాన్ని పఠిస్తే కోటి కోటి పాపాలు నశిస్తాయి. 
జన్మ మరణ యాతాయాతీ | చుకవావ్యా జే మనే ఇచ్ఛితీ | 
తిహీ అఖండ స్మరణ భక్తి | గురుపదాసక్తి జోడావీ | ||౧౦||
10. జనన మరణాల రాకపోకలను వదిలించుకోవాలని కోరుకునే వారికి గురువుయొక్క పాదాలయందు, మరియు అఖండ గురునామం ధ్యానించడంలో భక్తి ఉండాలి. 

ప్రమాద మిథ్యా జ్ఞానాచే కారణ | ఆత్మరూపీ అనవధారణ(?)2
జేథూని ఉద్భవే జనన మరణ | సర్వానర్థ నిదాన జే | ||౧౧|| 
11. శాశ్వతమైనదేది, కానిదేది అని తెలుసుకోలేక పోవటం వలనే అజ్ఞానం కలగతుంది. ఇదే ఆత్మ స్వరూపాన్ని గ్రహించలేక పోవటం, మరియు జనన మరణాలకు కారణం అయి, అన్ని అనర్థాలకు మూల కారణమౌతుంది.
మోహ మ్హణతే మిథ్యా జ్ఞాన | అనాత్మ ఠాయీ ఆత్మాభిమాన | 
తోచ మృత్యు విద్వజ్జన | లక్షణ కరితాత | ||౧౨|| 
12. మోహం అంటేనే అజ్ఞానం. దేహాన్నే నిజమైన ఆత్మ అనుకుని, ఆ దేహంమీదనే అభిమానాన్ని పెంచుకోవటాన్నే తెలిసినవారు మరణం అని అంటారు. 
సాఈ కథాసాగర మంథన | కరితా సాఈ కథా కథన | 
గోడీ జిచీ నిత్య నూతన | శ్రోత్యాంచే అధఃపతన చుకేల | ||౧౩|| 
13. సాయి కథాసాగరాన్ని చిలికితే, మధురమూ నిత్యము కొత్తదనాన్ని పొంది, ఇంతవరకు చెప్పబడిన సాయి కథలు, విన్నవారి నాశం తప్పిస్తుంది. 
సాఈచే గుణమయ స్థూళ స్వరూప3 | త్యాచే కరితా ధ్యాన అమూప | 
ప్రకటేల సూక్ష్మతమ ఆత్మస్వరూప | హోఉని లోప సగుణాచా | ||౧౪|| 
14. సాయియొక్క సగుణ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే, వారి సాకార రూపం మాయమై, సూక్ష్మమయిన ఆత్మ స్వరూపం కనిపిస్తుంది. 
న హోతా సగుణరూపీ ప్రవేశ | కళేనా ఆత్మ జ్యోతీశ | 
పరబ్రహ్మ జే నిర్విశేష | దుర్బోధ నిఃశేష జాణావయా | ||౧౫|| 
15. ఈ సగుణ రూపాన్ని ముందుగా ఆరాధించకపోతే, ఆత్మయొక్క రూపం తెలియదు. నిర్గుణమయిన పరబ్రహ్మ తత్త్వం పూర్తిగా అర్థం కాదు. 
జేణే దావూని ఆపులీ పాఉలే | ప్రేమే నిజభక్త భావిక బళే | 
దేహీంచ అసతా విదేహీ కేలే | పరమార్థా లావిలే అకళపణే | ||౧౬|| 
16. భావికులైన భక్తులను మీ పాదాల వద్దకు రప్పించి, వారికి తెలియకుండానే, శరీరమున్నా లేని భావన కలిగించి, పరమాత్మ మార్గంలో ప్రవేశ పెట్టారు. 
సాగరాశి జేవ్హా దేతా ఆలింగన | సరితా విసరతే సరితాపణ | 
తైసా భక్త యేతా శరణ | నురవిసీ దుజేపణ భక్తాంచే | ||౧౭|| 
17. సాగరంలో చేరుకున్న నది, తన ఉనికిని మరచిపోయినట్లు, మీ భక్తులు మీ పాదాలకు శరణుజొచ్చిన వెంటనే వారి ద్వైత భావాన్ని తొలగించారు. 
దోనీ దీప ఎక హోతీ | ఎకామేకా ఆలింగన దేతీ | 
తాత్కాళ హారపే ద్వైతస్థితీ | ఎకచి దీప్తి ఎకత్వే | ||౧౮|| 
18. రెండు దీపాలు ఒకదానినొకటి కలసిన క్షణాన అవి రెండు అన్న స్థితి పోయి, ఒక్కటైపోయి ఒకే దీపంగా వెలుగుతాయి. 
కర్పూర సోడూని త్యాచీ దృతి4 | సూర్యా సోడూని త్యాచీ దీప్తి | 
కనకా సోడూని త్యాచీ కాంతీ | రాహీల కా నిశ్చితీ వేగళీ | ||౧౯|| 
19. తన సువాసన లేకుండా కర్పూరం, వెలుగును విడిచి సూర్యుడు, కాంతిని విడిచి బంగారం, వేరుగా ఉండగలవా? 
జైసీ సాగరీ రిఘే సరితా | సాగరచి హోఉని ఠాకే తత్వతా | 
అథవా లవణ సాగరీ రిఘతా | సాగరీ సమరసతా తాత్కాళ | ||౨౦||
20. నది సాగరంలో కలిసిన వెంటనే అది సాగరం అయిపోతుంది. అలాగే, ఉప్పు సాగరంలో పడిన వెంటనే, సాగరంతో ఒకటైనట్లు –  

తేణేపరీ యేతా సాఈపదీ శరణ | భక్తామాజీ నురే దుజేపణ | 
భక్త హోతీ సమసమాన | త్యాగుని మీ పణ ఆపులే | ||౨౧|| 
21. అదే విధంగా, సాయి పాదాలను ఆశ్రయించిన భక్తుల ద్వైత భావం తొలగిపోతుంది. తమ దేహం పైన ఉన్న అభిమానాన్ని వదిలిన వారు సద్గురువులో, ఐక్యమైపోతారు.
జాగృతి స్వప్న అథవా సుషుప్తి | తిహీ మాజీల కవణ్యాహీ స్థితీ | 
జాహలియా సాఈమయ వృత్తి | సంసారనివృత్తి కాయ దుజీ | ||౨౨|| 
22. మేలుకొని ఉన్నప్పుడు గాని, నిద్రలో గాని, లేక కలలుగనేటప్పుడు గాని, ఏ స్థితిలోనైనా మనసు సాయిమయం అయితే చాలు. అదే సంసారంనుంచి విరమించినట్లే. 
అసో ఆతా యేఊన లోటాంగణాసీ | హేచి మాగతో పాయాంపాశీ | 
తుజవీణ అన్యత్రయా వాంఛేసీ | జాఊన దేసీ ఎకేసరీ | ||౨౩|| 
23. కాని ఇప్పుడు, ‘మీ పాదాలకు నమస్కరించి నా మనసు మిమ్మల్ని తప్ప దేనినీ కోరుకుండుగాక!’ అని వేడుకుంటున్నాను. 
బ్రహ్మాదిస్తంబపర్యంత | ఘట మఠీ సబాహ్య ఆకాశవంత | 
పరిపూర్ణ జో సర్వ భూతాంత | విషమతా యత్కించిత జో నేణే | ||౨౪|| 
24. ఎవరు ఆకాశంలాగా, లోపలినుండి, బయటనుండి, బ్రహ్మనుండి మొదలై ఒక చిన్న పొదదాకా, ఇంటిలోనూ, ఇంట్లోని పాత్రలలోనూ, ఈ సృష్టి అంతా నిండి ఉన్నారో, మరియు ఎవరు ఏ కాస్త భేదభావాన్నీ పాటించరో –  
సకళ భక్త జ్యా సమసమాన | జో నేణే మానావమామ | 
ప్రియాప్రియ నేణే జయాచే మన | జయా న విషమపణ తిళభర | ||౨౫|| 
25. అందరి భక్తులనూ సమానంగా చూస్తూ, ప్రియాప్రియాలను, మానాపమానాలను ఎరుగనటువంటి వారు, విషమతా భావం అసలు లేనటువంటి వారు –  
శరణ రిఘూ త్యా సాఈ సమర్థా | జో నిజస్మరణే దే సర్వార్థా | 
త్యాచా చరణీ అఖండ మాథా | ఠేవూనీ కృతార్థా హోఊ కీ | ||౨౬|| 
26. అయిన సాయి సమర్థులను శరణు వేడుకుందాము. తలచుకున్న మాత్రాన అన్ని కోరికలను తీర్చే సాయి పాదాలపై శిరసును ఉంచి, తృప్తిని పొందుదాము. 
ఆతా శ్రోతే సజ్జన భక్తప్రవర | సర్వా మాఝా నమస్కార | 
తుమ్హీ థోర మిత్రాచార | వినవితో సాచార తే పరిసా | ||౨౭|| 
27. ఇక సజ్జనులు, భక్తశ్రేష్ఠులు అయిన శ్రోతలందరికి నా నమస్కారాలు. గొప్ప స్నేహితులైన మీరు దయచేసి నా ఒక్క మనవిని వినండి. 
మాసోమాసీ కాఢుని అవసర | కథా పరిసల్యా జ్యా హా కాళవర | 
త్యా జయాచ్యా తయాచా విసర | నేదా క్షణభర పడావయా | ||౨౮|| 
28. ఇంతవరకు, నెల నెలా కొంత సమయాన్ని వినియోగించి, ఎవరి కథలను విన్నారో, వారిని ఒక్క క్షణమైనా మరచి పోకండి. 
ఆపణ జో జో సప్రేమ చిత్తా | పరిసతా యా సాఈచ్యా కథా | 
తో తో మీ జో యేథీల వక్తా | తయా ఉల్హాసతా దే సాఈ | ||౨౯|| 
29. మీరు ఎంతెంత ప్రేమతో కథలను వింటుంటే, చెప్పే నాకు, సాయి అంత అంత సంతోషాన్ని కలిగిస్తారు. 
తైసే జై శ్రోతే న దత్తావధాన | వక్తా న కేవ్హాంహీ సుప్రసన్న | 
పరస్పరాంచ్యా ప్రసన్నతేవీణ | వాఉగాశీణ శ్రవణాచా | ||౩౦||
30. వినేవారికి శ్రద్ధ లేకపోతే, చెప్పేవారికి సంతోషం కలగదు. ఇద్దరికీ ఆనందాన్ని ఇవ్వని ఈ చెప్పటం వినటం, రెండూ వ్యర్థమైన శ్రమ. 

పరమ దుస్తర భవసాగర | ఉసళతీ మోహాంచ్యా లాటా అనివార | 
ఆదళతీ అవిచార తటావర | పీడితీ తరూవర ధైర్యాంచే | ||౩౧|| 
31. ఈ సంసార సాగరాన్ని దాటటం చాల కష్టమైన పని. ఈ సాగరంలో మోహపు అలలు ఎప్పుడూ ఉప్పొంగుతూ, చెడు విచారలనే తీరాన్ని ఢీకొంటాయి. ధైర్యమనే పెద్ద పెద్ద మానులు పడిపోతాయి. 
వాజతో అహంకారాచా వారా | తేణే హా డహులే సాగర సారా | 
క్రోధేద్వేషాది మహామగరా | మిళే జై థారా నిర్భయపణే | ||౩౨|| 
32. అహంకారమనే గాలి వీచడం వలన సాగరమంతా అల్లకల్లోలమౌతుంది. అలాంటి సాగరంలో, కోపం ద్వేషాలనే పెద్దపెద్ద మొసళ్ళు భయం లేకుండా చోటు చేసుకున్నాయి. 
‘మీ మాఝే’ హా గజర | వాసనా వికల్ప భంవరే అపార | 
నిందా అసూయాది జేథే తిరస్కార | అసంఖ్య జలచర తళపతీ | ||౩౩|| 
33. ‘నేను, నాది’ అన్న ఈ మొసళ్ళు, కోరికలు అనుమానాలు అనే అనేక సుడిగుండాలు, నింద, అసూయ, తిరస్కారం మొదలైన లెక్కలేనన్ని జలచరాలు ఈ సాగరంలో తిరుగుతుంటాయి. 
ఏసా జరీ హా సాగర భయంకర | అగస్తీరూపే ప్రాశీ గురూవర | 
తయాచే జే చరణరజకింకర | తయా న లవమాత్ర భయ త్యాంచే | ||౩౪|| 
34. ఈ సాగరం ఇంత భయంకరమైనప్పటికీ, అగస్త్యుని రూపంలో మన గురువు ఈ సాగరాన్ని ఔపోశనం పట్టుతారు. వారి పాద ధూళికి దాసులైన వారికి కొంచెం కూడా భయం ఉండదు. 
మ్హణోని సాఈ సమర్థ సద్గురూ | హోఊనియా భవాబ్ధీచే తారూ | 
ఆమ్హీ జే కేవళ కాస ధరూ | త్యా సర్వాంస ఉతరూ పైలపార | ||౩౫|| 
35. అందువలన, సద్గురు సాయి సమర్థులు సంసార సాగరాన్ని దాటించే నౌక అయి, వారిని ఆశ్రయించిన వారినందరినీ వారు అవతలి తీరానికి చేర్చుతారు. 
మహాదుస్తర హా భవార్ణవ | కరా సాఈ చరణాంచీ నాంవ | 
దావీల నిర్భయ పైల ఠావ | పహా నవలావ నిష్ఠేచా | ||౩౬|| 
36. సంసార సాగరాన్ని దాటటం చాలా కష్టం. సాయి పాదాలను నావగా చేసుకుంటే, ఏ భయమూ లేకుండా అవతలి తీరానికి చేర్చుతారు. చెదరని నమ్మకంయొక్క గొప్పదనం ఇటువంటిదే. 
పాళితా యా ఏశా వ్రతా | భాసే న సంసార దుఃఖ తీవ్రతా | 
లాభ న అన్య యేణే పరతా | సేవ్య సమర్థతా తీ హీచ | ||౩౭|| 
37. ఇలాంటి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ప్రపంచ దుఃఖాలలోని తీవ్రత తెలియదు. దీనికంటే లాభకరమైనది వేరే ఏదీ లేదు. ఇదే శక్తి మనకు చక్కగా ఉపయోగ పడుతుంది. 
సాఈచరణీ అత్యంత భక్తీ | నయనీ కోందో సాఈమూర్తీ | 
సాఈచ దిసో సర్వాంభూతీ | ఏసీ హీ స్థితీ భక్తా యేవో | ||౩౮|| 
38. సాయి పాదాలలో విపరీతమైన భక్తి, కళ్ళల్లో సాయి రూపాన్ని నింపుకుని, అన్ని ప్రాణులలోనూ సాయినే చూడగలిగే స్థితి భక్తులకు కలుగుగాక. 
హోఊనియా స్వచ్ఛందవర్తీ | పూర్వ జన్మీ పావలో చ్యుతీ | 
ఆతా తరీ లాభో సద్గతీ | సంగ నిర్ముక్తి యే అర్థీ | ||౩౯|| 
39. మునుపటి జన్మలలో ఇష్టం వచ్చినట్లు నడచుకుని, పతనాన్ని పొందాము. కనీసం, ఇప్పుడైనా సద్గతిని పొందటానికి, ఇంద్రియ సుఖాలను వదిలే శక్తి లభించుగాక. 
పాఠీసీ అసతా శ్రీ సమర్థ | కోణీహీ లావూ న శకే హాత | 
ఏసియా నిర్ధారే జే నిర్ధాస్త | ధన్య తే భక్త సాఈచే | ||౪౦||
40. ‘సాయి సమర్థులు ఎప్పుడూ వెన్నంటి ఉంటే, నన్నెవరూ ఏమీ చేయలేరు’ అన్న దృఢ నమ్మకంతో ఏ భయము లేకుండా ఉండే భక్తులు ధన్యులు. 

అసో ఆతా యేతే మనా | ధరూనియా బాబాంచ్యా చరణా | 
కరావీ తయాంస ఎక ప్రార్థనా | సకల భక్త జనాం కారణే | ||౪౧|| 
41. అందువలన ఇప్పుడు, బాబా పాదాలను పట్టుకుని భక్త జనులందరి కొరకు, వారిని ఒక కోరిక ప్రార్థించాలని అనిపిస్తూ ఉంది.
కీ హా గ్రంథ సర్వా ఘరీ | అసావా నిత్య పాఠాంతరీ | 
నియమే ప్రేమే పారాయణ కరీ | సంకటే వారీ తయాంచీ | ||౪౨|| 
42. అదేమిటంటే, ఈ గ్రంథం అందరి ఇళ్లలో ఉండాలి. ఎందుకంటే, దీనిని నియమంగా భక్తితో, ప్రేమతో పారాయణ చేసే వారి కష్టాలు నివారించబడతాయి. 
హోవోనియా శుచిర్భూత | ప్రేమ ఆణి శ్రద్ధాయుక్త | 
వాచీల జో హా సాత దిసాంత | అనిష్టే శాంత తయాచీ | ||౪౩|| 
43. స్నానం చేసి, శుచిగా భక్తి శ్రద్ధలతో ఈ గ్రంథాన్ని ఏడు రోజులలో పఠించినవారి అరిష్టాలు తొలగిపోతాయి. 
తో హా అధ్యాత్మ తంతూనీ విణిలా | కృష్ణబ్రహ్మ కథాంహీ భరలా | 
బ్రహ్మాత్మైక్య రసీ తరతరలా | అపూర్వ ఉథళలా అద్వైతీ | ||౪౪|| 
44. ఈ గ్రంథం ఆధ్యాత్మక దారంతో అల్లబడినది. శ్రీకృష్ణుడి మరియు బ్రహ్మయొక్క కథలతో నిండి ఉంది. బ్రహ్మ, ఆత్మ ఒక్కటే అనే రసపూరితమైన సంగతి ఇందులో ఉంది. అలాగే దీనిలో అద్వైతం గురించి అపూర్వంగా వివరింప బడింది. 
యా నాథ కావ్య నందనవనీ | బత్తీస ఖణాంచియా వృందావనీ | 
యా గోడ మనోహర సదుగ్ధానీ5 | జ్ఞానీ అజ్ఞానీ రమతాతీ | ||౪౫|| 
45. ఏకనాథ మహారాజుయొక్క కావ్యమనే నందనవనంలో, ముప్పై రెండు అధ్యాయాలతో ఉన్న బృందావనంలో, మనోహరము, మధురమూ అయిన పాయసంలో జ్ఞానులు, అజ్ఞానులు ఇరువురూ లీనమైపోతారు. 
కరితో హే సచ్చరిత శ్రవణ | అథవా నేమే పారాయణ | 
కరితీల సాఈ సమర్థ చరణ | సంకట నివారణ అవిలంబే | ||౪౬|| 
46. నియమంగా ఈ సచ్చరితను పారాయణం చేసినా, లేదా శ్రద్ధగా వినినా, సాయి సమర్థులు వెంటనే వారి కష్టాలను తొలగిస్తారు. 
ధనేచ్ఛూస లాభేల ధన | శుద్ధ వ్యవహారీ యశ పూర్ణ | 
ఫళ యేఈల నిష్ఠేసమాన | యేఈనా భావావీణ అనుభవ | ||౪౭|| 
47. ధనం కోరుకునే వారికి ధనం దొరుకుతుంది. మంచి వ్యవహారాలలో సంపూర్ణ యశస్సు కలుగుతుంది. పారాయణం చేసే వారి శ్రద్ధ, నిష్ఠనుబట్టి, ఫలితం లభిస్తుంది. భక్తిభావం లేకపోతే, ఏ అనుభవమూ కలగదు. 
ఆదరే కరితా గ్రంథవాచన | సాఈ సమర్థ సుప్రసన్న | 
కరీ అజ్ఞాన దారిద్ర విచ్ఛిన్న | జ్ఞానధన సంపన్నతా దేఈ | ||౪౮|| 
48. గౌరవంగా ఈ గ్రంథాన్ని పఠిస్తే, సాయి సమర్థులు ప్రసన్నమై, అజ్ఞానమనే దారిద్ర్యాన్ని నశింపచేసి, జ్ఞానమనే సంపదను ప్రసాదిస్తారు. 
గ్రంథరచనీ సాఈ సంకేత | తైసేంచ తయాచే గుప్త మనోగత | 
హోఈల జో తచ్చరణానురక్త | ధన్య త్యా జీవిత భక్తాచే | ||౪౯|| 
49. సాయి సూచనతోనే ఈ గ్రంథ రచన జరిగింది. అదే వారి మనసులో దాగియున్న కోరిక. సాయి పాదాలయందు ప్రేమ నిండిన భక్తుల జీవితం ధన్యం. 
చిత్త కరూనియా సుసమాహిత | నేమ నిష్ఠే హే సచ్చరిత | 
వాచావా ఎక తరీ అధ్యాయ నిత | హోఈల అమిత సుఖదాయీ | ||౫౦||
50. ప్రశాంతమైన మనసుతో, నియమ నిష్ఠలతో, ప్రతి నిత్యమూ ఈ సచ్చరితలోని ఒక అధ్యాయమైన పఠిస్తే చాలు. అది చాలా ఆనందాన్నిస్తుంది. 

జయా మనీ స్వహిత విచార | తేణే హా గ్రంథ వాచావా సాచార | 
జన్మోజన్మీ సాఈచే ఉపకార | ఆనంద నిర్భర ఆఠవీల | ||౫౧|| 
51. తమ మంచి కోరుకునే వారు ఈ గ్రంథాన్ని శ్రద్ధతో పఠించాలి. జన్మ జన్మలకు వారు సాయియొక్క ఉపకారాన్ని ఆనందంగా గుర్తుంచుకుంటారు. 
గురు పౌర్ణిమా గోకుళ అష్టమీ | పుణ్యతిథీ రామనవమీ | 
యా సాఈచ్యా ఉత్సవీ నియమీ | గ్రంథ నిజధామీ వాచావా | ||౫౨|| 
52. గురు పౌర్ణిమ, గోకులాష్టమి, సాయియొక్క మహాసమాధి రోజు, రామనవమి, ఇవన్నీ సాయియొక్క ఉత్సవ దినాలు. ఈ రోజులలో తప్పకుండా తమతమ ఇళ్లలో ఈ గ్రంథాన్ని పఠించాలి. 
జైసా జైసా సంగ చిత్తీ | తైసీ తైసీ జన్మ ప్రాప్తీ | 
అంతే గతీ జైసీ మతీ | శాస్త్ర సంమతీ యా లాగీ | ||౫౩|| 
53. మనసులోని ఆలోచనల బట్టి మరు జన్మ వస్తుంది. ‘చివరి సమయంలో మనసులో ఆలోచనలు ఎలా ఉంటే వారి గతి కూడా అట్లే ఉంటుంది’ అని శాస్త్రం అంటుంది. 
భక్తాంచా ఆధార శ్రీ సాఈ | త్యావిణ విఘ్నే న పడతీ ఠాయీ6
లేంకురాలాగీ కనవళూ మాఈ | యేథ నవలాఈ కాయ తీ | ||౫౪|| 
54. భక్తులకు శ్రీసాయి ఆధారం. వారు లేకుండా, అడ్డంకులు తొలగవు. తల్లి ఎంతైనా తన బిడ్డల కోసం తహతహలాడుతుంది, ఇందులో విశేషమేముంది? 
కాయ వానూ కథా యా పరతీ | శబ్దాచీ జేథే పావతీ ఉపరతీ | 
వాటే రహావే మౌనవృత్తీ | యోగ్య స్తుతీ తీ హీచ | ||౫౫|| 
55. ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పను? మాటలు రాక ఆగిపోయినప్పుడు, మౌనంగా ఉండటమే మంచిదని అనిపిస్తుంది. అదే సరియైన స్తోత్రము. 
తరీ తీవ్ర మోక్షేచ్ఛా మనీ ధరూన | శుభ కర్మేచ నిత్య కరూన | 
శ్రవణాది నవవిధ భక్తీంచే సేవన | కేలియా శుద్ధాంతఃకరణ హోఈల | ||౫౬|| 
56. అందువలన, మోక్షం గురించి బలమైన కోరికతో, నిత్యం మంచి పనులను చేస్తూ, శ్రవణాది తొమ్మిది రకాలైన భక్తితో భగవంతుని సేవిస్తే, మనసు పరిశుద్ధం అవుతుంది. 
హే న సద్గురూ ప్రసాదావీణ | తయావిణ నా పర తత్వజ్ఞాన | 
‘బ్రహ్మైవాహం’ నిత్య స్మరణ | గురునిష్ఠా ప్రవణ తో హోయ | ||౫౭|| 
57. కాని, సద్గురువు అనుగ్రహం లేకపోతే ఇది జరగదు. సద్గురువు లేకుండా పరబ్రహ్మ గురించి జ్ఞానం దొరకదు. సద్గురువు లేకుండా ‘బ్రహ్మైవాహం’ – ‘నేను స్వయం బ్రహ్మను’ అన్నది జ్ఞాపకం ఉండదు. మరియు గురువుయందు నిష్ఠ ఉండదు. 
సంబంధ జైసా పితాపుత్ర | గురూ హే ఉపమా నామమాత్ర | 
పితా కరీ ఇహసుఖా పాత్ర | గురూ ఇహాముత్ర సుఖదాతా | ||౫౮|| 
58. గురు శిష్యుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం వంటిది. గురువును తండ్రితో పోల్చటం నామ మాత్రానికే. ఎందుకంటే, తండ్రి ప్రపంచంలోని సుఖాలను అనుభవించే యోగ్యతను ఇస్తాడు. కాని, గురువేమో పరలోక సుఖాలను కూడా ప్రసాదిస్తారు. 
పితా అర్పీల క్షణిక విత్త | గురూ అర్పీల క్షయాతీత | 
అవినాశ వస్తు కరిల ప్రతీత | అపరోక్ష హాతాంత దేఈల | ||౫౯|| 
59. శాశ్వతం కాని క్షణికమైన ఐశ్వర్యాన్ని తండ్రి ఇస్తాడు. గురువు ఇచ్చే ఐశ్వర్యం ఎన్నటికీ తరగిపోనిది. శాశ్వతమైన సుఖాన్ని నేరుగా మనము అనుభవించేలా చేస్తారు. 
మాతా నఊ మాస పోటీ ధరీ | జన్మ దేతా ఘాలీ బాహేరీ | 
గురు మాతేచీ ఉలటీ పరీ | బాహేరిల భీతరీ ఘాలీల | ||౬౦||
60. తొమ్మిది నెలలు మోసి జన్మను ఇచ్చేటప్పుడు, తల్లి బిడ్డను బయట పడేస్తుంది. దీనికి విరుద్ధంగా, గురుమాత, శిష్యున్ని బయట ప్రపంచంనుండి లోపలికి తీసుకుంటుంది. 

అంతీ గురూ గురూ స్మరణ కరితా | శిష్య నిఃశంక లాధేల సాయుజ్యతా | 
మగ తో స్వయే గురూనే హాణితా | పూర్ణ బ్రహ్మతా లాధేల | ||౬౧|| 
61. చివరి ఘడియలలో ‘గురు, గురు’ అని స్మరిస్తే, అనుమానమే లేకుండా, శిష్యుడు మోక్షాన్ని పొందుతాడు. గురువు తామే శిష్యుణ్ణి కర్రతో కొట్టితే, అప్పుడు శిష్యుడు పూర్తిగా బ్రహ్మలో లీనమౌతాడు.
గురూకరీచా ఆఘాత | కరీల జన్మమరణ నిఃపాత | 
గురూకరితా దేహాచా అంత | కోణ మగ భాగ్యవంత యా పరతా | ||౬౨|| 
62. గురువుయొక్క చేతి దెబ్బతో జనన మరణ చక్రం నశిస్తుంది. ఎవరి శరీరాన్ని గురువు అంతం చేస్తారో, అట్టి వారికంటే భాగ్యవంతులు ఎవరు ఉంటారు? 
ఖడ్గ తోమర ఫరశ శూల | ఇత్యాది హాతీ ఘ్యావే లాగేల | 
ఆఘాత పడతా శుద్ధి అసేల | మూర్తీ మగ దిసేల సద్గురూచి | ||౬౩|| 
63. గద, ఖడ్గము, గొడ్డలి, శూలము మొదలగు శస్త్రాలను గురువు తన చేతిలో తీసుకోవాలి. దాంతో దెబ్బ పడటంతో, శిష్యునికి నిజమైన శుద్ధి జరిగి, సద్గురువుయొక్క అసలు రూపం కనిపిస్తుంది. 
కితీహీ కరా దేహాచే జతన | కేవ్హా తరీ హోణార పతన | 
మగ తయాచే గురూ హస్తే హనన | పునర్జనన హారక | ||౬౪|| 
64. ఎంతగా కాపాడుకున్నా ఈ శరీరం ఎప్పుడైనా నాశం కావలిసిందే కదా, మరి అలాంటప్పుడు, అది గురువు చేతితో నాశమైతే, ఇక పునర్జన్మ ఉండదు. 
మారా మరేమరేతో మార | ఛేదా మాఝా సమూళ అహంకార | 
జేణే న పునర్జన్మ యేణార | ఏసా మజ దుర్ధర ద్యా మార | ||౬౫|| 
65. సద్గురూ! నన్ను బాగా కొట్టు. నేను చచ్చేవరకు కొట్టు. నా అహంకారాన్ని మొత్తం తొలగించు. మళ్లి జన్మ లేకుండా మంచి గట్టి దెబ్బనే ప్రసాదించు. 
జాళా మాఝే కర్మాకర్మ | నివారా మాఝే ధర్మోధర్మ | 
జేణే మజ హోఈల సుఖ పరమ | ఏసా మోహభ్రమ ఛేదావా | ||౬౬|| 
66. నా కర్మలను అకర్మలను కాల్చి వేయి. నా ధర్మ అధర్మాలను తొలగించు. దాని వల్ల నాకు పరమ సుఖం కలుగుతుంది. మోహం కారణంగా కలిగే ఇంద్రియాల కోరికలను నాశం చేయి. 
ఘాలవా మాఝే సంకల్ప వికల్ప | కరావే మజ నిర్వికల్ప | 
పుణ్యహీ నకో నకో మజ పాప | నకో హా ఊద్వ్యాిప జన్మాచా | ||౬౭|| 
67. నా కోరికలను అనుమానాలను తొలగించి, నాకు ఏ సందేహమూ లేని స్థిరమైన స్థితిని ప్రసాదించు. నాకు పుణ్యమూ వద్దు, పాపమూ వద్దు. మరల పుట్టటం కోసం పడే వ్యర్థమైన శ్రమా వద్దు. 
జాతా శరణ రిఘావయాస | తవ తూ ఉభా చౌ బాజూంస | 
పూర్వ పశ్చిమ అవఘ్యా దిశాంస | అధోర్ధ్వ ఆకాశ పాతాళీ | ||౬౮|| 
68. మీ పాదాలలో శరణు కోరి నేను వస్తే, క్రింద, పైనా, ఆకాశంలొ, పాతాళంలో, తూర్పు పడమర అన్ని దిక్కులలోనూ మీరే ఉన్నారు. 
అవఘ్యా ఠాయీ తుఝా వాస | తరీ మజ మాజీంహీ తుఝా వాస | 
కింబహునా ‘మీ తూ’ హా భేదాభాస | మానితా సాయాస మజ వాటే | ||౬౯|| 
69. అన్ని చోట్లలోనూ మీరే ఉన్నారు. నాలో కూడా మీరే ఉన్నారు. ‘నువ్వు, నేను’ అన్న వేరుచేసే భావనను ఊహించుకోవటానికి కూడా నాకు కష్టంగా ఉంది. 
మ్హణూన హేమాడ అనన్య శరణ | దృఢ ధరీ సద్గురుచరణ | 
చుకవీ పునర్జన్మమరణ | ఏసే నిజోధరణ సంపాదీ | ||౭౦||
70. అందుకే హేమాడు సద్గురు పాదాలను దృఢంగా పట్టుకుని, వారికి పూర్తిగా శరణుజొచ్చి, ఇంకొ పుట్టుకను పోగొట్టుకుని, తనను ఉద్ధరించుకుంటాడు. 

హీ కాయ థోడీ కృతి అఘటిత | భక్త ఉద్ధారాయా అసంఖ్యాత | 
నిర్మాణ కేలే హే నిజచరిత | హేమాడ నిమిత్త కరూనియా | ||౭౧|| 
71. లెక్కలేనన్ని భక్తులను ఉద్ధరించటానికి, హేమాడు పంతును నిమిత్త మాత్రునిగా చేసి, సాయి తమ ఈ చరితాన్ని సృష్టించారు. ఇది అద్భుతమైన సంగతి కాదా! 
హే శ్రీ సాఈ సమర్థ చరిత | వ్హావే మజ హాతే హే అఘటిత | 
నా తో సాఈ కృపే విరహిత | పామరా మజ అఘటిత హే | ||౭౨|| 
72. నాచే ఈ శ్రీసాయి సమర్థ చరితం వ్రాయబడటమే చాలా పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి. సాయి కృప లేకుండా నీచుడు, బుద్ధిలేనివాడు అయిన నాకు ఇది సాధ్యం కానిది. 
నాహీ ఫారా దిసాంచా సహవాస | నాహీ సంత ఓళఖణ్యాచా అభ్యాస | 
అంగీ న శోధక దృష్టీచే సాహస | దేఖణే అవిశ్వాసపూర్వక | ||౭౩|| 
73. సాయితో నాకు చాలా సంవత్సరాల సహవాసం లేదు. సాధు సంతులను అర్థం చేసుకునే శక్తి లేదు. వారిని అనుమానంతో, నమ్మకుండా, చూడటమేగాని వారి గురించి చక్కగా ఆలోచించి, తెలుసుకునే దృష్టి లేదు. 
కధీ న కేలీ అనన్యభావే ఉపాసనా | కధీ న క్షణభర బైసలో భజనా | 
ఏసియా హస్తే చరిత లేఖనా | కరవూనియా జనా దావియలే | ||౭౪|| 
74. స్థిరమైన మనసుతో సాధు సంతులను ఎప్పుడూ ఆరాధించ లేదు. కొంత సేపైనా భజనలో పాల్గొనలేదు. ఇలాంటి నాతో తమ చరితాన్ని వ్రాయించి, ప్రపంచానికి చూపించారు. 
సాధావయా నిజవచనార్థ | సాఈచ ఆఠవూని దేతీ హా గ్రంథ | 
పురవూని ఘేతీ హా నిజకార్యార్థ | హేమాడ హా వ్యర్థ నాంవాలా | ||౭౫|| 
75. తమ మాటను నిలబెట్టుకోవటానికి, నాకు ఈ గ్రంథ రచనను స్ఫురింప చేసి, ఈ పనిని సాయి తామే పూర్తి చేసుకున్నారు. ఈ హేమాడు ఊరికే పేరుకు మాత్రమే. 
మశకే కాయ ఉచలావా మేరూ | టిటవీ జై ఉపసావా సాగరూ | 
పరీ పాఠీ అసతా సద్గురూ | అద్భుత కరణీ ఘడవితో | ||౭౬|| 
76. ఒక చిన్న దోమ, మేరు పర్వతాన్ని ఎత్తగలదా? లేక, ఒక పిచ్చుక సాగరంలోని నీళ్లను ఖాళీ చేయటం సాధ్యమా? కాని, సద్గురువు వెన్నంటి ఉంటే, అద్భుతమైన పనులను చేయిస్తారు. 
అసో ఆతా శ్రోతే జన | కరితో తుమ్హాంస అభివందన | 
జాహలా హా గ్రంథ సంపూర్ణ | సాఈ సమర్పణ సాఈచా | ||౭౭|| 
77. శ్రోతలారా! ఇప్పుడు మీకు నమస్కారం చేస్తాను. ఈ గ్రంథం పూర్తి అయింది. సాయియొక్క ఈ గ్రంథం సాయి పాదాలకి అర్పిస్తున్నాను. 
శ్రోతృవృందా సాన థోరా | మాఝే లోటాంగణ ఎకసరా | 
తుమచేని ధర్మే యా కథాసత్రా | సాఈచరిత్రా సంపవిలే | ||౭౮|| 
78. చిన్నా, పెద్దా శ్రోతలందరికీ చాలా గౌరవంగా నా సాష్టాంగ నమస్కారం. మీరు తోడుగా ఉండటం వలననే, వరుసగా కథలతో ఉన్న ఈ సాయి సచ్చరితను పూర్తి చేశాను. 
మీ కోణ యేథే సంపవిణార | హా తరీ వ్యర్థ అహంకార | 
జేథే సాఈ సూత్రధార | తేథే హే మ్హణణార మీ కోణ | ||౭౯|| 
79. పూర్తి చేయడానికి, ఇక్కడ నేనెవరిని? అలా అనుకోవటం వ్యర్థమైన అహంకారం. సాయియే సూత్రధారులు అయినప్పుడు ఇలా అనుకోవటానికి, నేనెవరిని? 
తరీ త్యాగూని అభిమాన మూల బ్యాద | గావే నిజగురు గుణానువాద | 
మనోజ్ఞా త్యా యా బోధప్రద | ఏశియా వాగ్యజ్ఞా సంపవితో | ||౮౦||
80. దుఃఖానికి మూల కారణమైన ఈ అభిమానాన్ని వదిలి, గురువుయొక్క గుణాలను పదే పదే గానం చేస్తాను. అంతఃకరణానికి బోధప్రదమైన ఈ మాటల యజ్ఞాన్ని ముగిస్తాను. 

యేథే పూర్ణ ఝాలా హా గ్రంథ7 | పూర్ణ ఝాలా మాఝా మనోరథ | 
పూర్ణ ఝాలా సాఈ కార్యార్థ | మీహి కృతార్థ జాహలో | ||౮౧|| 
81. ఇక్కడితో ఈ గ్రంథం పూర్తి అయి, సాయి కార్యం పూర్తి అయింది. నా మనసులోని కోరిక కూడా పూర్తి అయి, నేను తృప్తుణ్ణి అయ్యాను. 
ఏసా గ్రంథ అధ్యాయితా సంపూర్ణ | మనః కామనా హోతీల పూర్ణ | 
హృదయీ ధరిల్యా సద్గురూ చరణ | హోఈల ఉత్తీర్ణ భవసాగర | ||౮౨|| 
82. ఇలాంటి గ్రంథాన్ని పూర్తిగా చదివితే, మనసులోని కోరికలు తీరుతాయి. సద్గురు పాదాలను మనసులో నిలుపుకుని, సంసార సాగరంనుండి తరింపబడతారు. 
రోగియా హోయ ఆరోగ్య | దరిద్రీ హోయ ధనాఢ్య | 
సంకల్ప వికల్పా యేఈ స్థైర్య | దీనా ఔదార్య లాభేల | ||౮౩|| 
83. రోగులు ఆరోగ్యవంతులౌతారు. దరిద్రులు ధనవంతులౌతారు. కోరికలు, అనుమానాలు పోయి, మనసు స్థిరపడుతుంది. దీనులకు ఔదార్యం దొరుకుతుంది. 
పిశాచ బాధా అపస్మార | గ్రంథావర్తనే హోతీల దూర | 
మూక అపంగ పంగూ బధిర | తయాంహీ సుఖకర హే శ్రవణ | ||౮౪|| 
84. ఈ గ్రంథాన్ని మరల మరల చదివితే, పిశాచాల బాధ, అపస్మారం తొలగిపోతాయి. కుంటి, మూగ, చెవిటివారికి కూడా దీనిని వినటం వలన సుఖం కలుగుతుంది. 
జో శక్తిమాన్‍ పరమేశ్వర | తయాచా జయాంస పడలా విసర | 
ఏసే జే అవిద్యా మోహిత నర | హోఈ ఉద్ధార తయాంచా | ||౮౫|| 
85. అజ్ఞానంతో, ఇంద్రియాల కోరికల వలలో చిక్కుకుని, అపార శక్తివంతుడైన పరమేశ్వరుని మరచిపోయిన మనుషులు కూడా ఉద్ధరింపబడతారు. 
నర అసూన అసురాచార | కరూన మిథ్యా దవడితీ శరీర | 
సంసారా మానితీ సుఖాచే ఆగర | హోఈల ఉద్ధార తయాంచా | ||౮౬|| 
86. మనుషులుగా పుట్టినా, రాక్షసుల వలె, ఈ ప్రపంచాన్ని, తమ సుఖాలకు ఇల్లు అనుకుని శరీరాలను వ్యర్థ పరుచుకునే వారు కూడా ఉద్ధరింపబడతారు. 
అగాధ సాఈనాథాంచీ కరణీ | హేమాడ నిత్యయీ స్థాపిలా చరణీ | 
తయాలా నిజసేవేసి లావునీ | సేవాహీ కరవుని ఘేతలీ | ||౮౭|| 
87. సాయినాథుల లీలలు అగాధం. ఈ హేమాడు పంతుకు వారు తమ పాదాలలో శాశ్వతమైన చోటిచ్చి, అతనిని తమ సేవకు ఉపయోగించుకుని, ఈ సేవను చేయించుకున్నారు. 
శేవటీ జో జగచ్చాలక | సద్గురు ప్రబుద్ధి ప్రేరక | 
తయాచ్యా చరణీ అమితపూర్వక (?) | లేఖణీ మస్తక అర్పితో | ||౮౮||
87. సాయినాథుల లీలలు అగాధం. ఈ హేమాడు పంతుకు వారు తమ పాదాలలో శాశ్వతమైన చోటిచ్చి, అతనిని తమ సేవకు ఉపయోగించుకుని, ఈ సేవను చేయించుకున్నారు. 


||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||



టిపణీ: 
1. యాత అవాతరణికా దిలేలీ నాహీ. పహిల్యాచ ఓవీత అవతరణికా దేఊ అసే లిహిలే ఆహే; పరంతు తిచే హస్తలిఖిత సాపడలే నాహీ. 
2. అనిశ్చయ, అననుసంధాన. 3. స్థాళ మ్హణజే హాండా (స్థూళ భాండే). 
4. సువాస. 5. ‘సుదుగ్ధాన్నీ’ అసావేసే వాటతే. 
* అధ్యాయ ౧౮ మధ్యే దిలేలీ టీప బఘావీ. 
6. విఘ్నే నాశ పావత నాహీత. 
7. యా అధ్యాయాచ్యా హస్తలిఖితామధ్యే ఇతర అధ్యాయాంప్రమాణే సమాప్తిదర్శక ఓవీ ఆఢళలీ నాహీ.