Friday, February 14, 2014

||సింహావలోకనం నామ ద్విపంచాశత్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౫౨ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

ఆతా కరూ సింహావలోకన | తదనంతర గ్రంథ సంపూర్ణ | 
కరూ అవతరణికా1 దేఊన | సారాంశ నివేదన గ్రంథాచా || 
ఇప్పుడు ఈ గ్రంథాన్ని మునుపటినుంచి పరిశీలించి, తరువాత, ఆ అధ్యాయాల సారాంశమైన అవతరణికతో ఈ గ్రంథాన్ని పూర్తి చేస్తాను.

దేహీ అసతా నిజభక్తాంలా | వేళోవేళీ జో అనుభవ దిధలా | 
త్యాచా గ్రంథ హీ ‘సాఈలీలా’ | గ్రంథ లిహవిలా స్మరణార్థ | ||౧|| 
1. శ్రీసాయి దేహంతో ఉండగా, ఆయా సమయాలలో భక్తులకు కలిగించిన అనుభవాలను గుర్తుంచుకోవటానికి వ్రాయించి, శ్రీసాయి లీలా మాస పత్రికలో ప్రచురింప చేశారు.
‘సాఈలీలా’ పరమ పవిత్ర | త్యాంతీల సచ్చరిత కథాసత్ర | 
 వాచా హే నిజగురు చరిత్ర | ఇహ పరత్ర ప్రబోధక | ||౨|| 
2. శ్రీసాయి లీలా చాలా పవిత్రమైన పత్రిక. అందులో, ఇహ పరాలను గురించి బోధించే మన గురువు చరిత్రను కథల రూపంలో అందరూ పఠించే విధంగా ప్రచురింప బడింది. 
సంగ్రహీ జ్యా తే అసంఖ్యాత | పరీ వ్యుత్పత్తీ విద్యారహిత | 
కరీ ధరూని హేమాడపంత | హే నిజ సచ్చరిత లిహవిలే | ||౩|| 
3. సాయి లీలలు లెక్క లేనంతగా సేకరించబడి ఉన్నాయి. శాస్త్ర జ్ఞానంగాని, విద్యగాని లేని హేమాడు పంతు చేతిని పట్టుకుని సాయి తమ సచ్చరితను వ్రాయించారు. 
కాంహీ ఆపణ ఆపులీ ఖ్యాతీ | స్వముఖే శిష్యా శ్రవణ కరవితీ | 
తేహీ గేలియా నిజధామాప్రతీ | తైంపాసూన యా గ్రంథా స్ఫూర్తీ | ||౪|| 
4. కొందరు గురువులు తమ నోటితో తమ చరిత్రను శిష్యులకు వినిపిస్తారు. అది, వారి తదనంతరం గ్రంథ రచనకు స్ఫూర్తి కలిగిస్తుంది. 
పరోపరీచ్యా వార్తా గహన | సాఈ జేవ్హా కరీత కథన | 
శ్రోతే హోత అత్యంత తల్లీన | భూక తహాన విసరత | ||౫|| 
5. అనేక రకాల గొప్ప గొప్ప సంగతులను సాయి చెప్పుతున్నప్పుడు, శ్రోతలు ఆకలి దప్పులను మరచి, చాలా తల్లీనులై వినేవారు. 
జిహీ పాహిలే సాఈ స్వరూప | హరలే తయాంచే త్రివిధ తాప | 
ఏసా జ్యాంచా తేజ ప్రతాప | సాద్యంత కేవీ వర్ణావా | ||౬|| 
6. సాయియొక్క దివ్య రూపాన్ని చూచిన వారికి మూడు రకాలైన తాపాలు నశించిపోయాయి. అటువంటి వారి శక్తియొక్క ప్రభావాన్ని మొత్తం, పూర్తిగా వర్ణించటం సాధ్యమా? 
ఏసా సాఈ ఉదార కీర్తి | జే జే లాగలే త్యాచ్యా భక్తీ | 
తయాచియా ఉద్ధారాప్రతి | ఠేవిలీ నిజఖ్యాతీ లిహూన | ||౭|| 
7. ఉదార స్వభావానికి కీర్తి పొందిన సాయి, తమను ఆరాధించే భక్తులను ఉద్ధరించటానికి, తమ వైభవాన్ని తెలిపే తమ చరిత్రను తామే వ్రాయించి ఉంచారు. 
గోదావరీచే పవిత్ర స్నాన | పుఢే ఘేవోనియా సమాధీ దర్శన | 
కరావే హే సచ్చరిత శ్రవణ | త్రితాప శమన హోతీల | ||౮|| 
8. పవిత్రమైన గోదావరీ నదిలో స్నానం చేసి, తరువాత సాయి సమాధిని దర్శించి, ఈ సాయి సచ్చరితను పఠించండి. మీ మూడు రకాల తాపాలు నశిస్తాయి. 
సహజ బోలతా జయాచ్యా గోష్టీ | నకళత పడే పరమార్థ మిఠీ | 
ప్రేమే ఘాలాయా గ్రంథీ దిఠీ | పాపాంచ్యా కోటీ నిరసతీల | ||౯|| 
9. సాయి లీలలను మామూలుగా ముచ్చటించుకున్నా సరే, మనకు తెలియకుండానే పరమార్థం అబ్బుతుంది. భక్తిగా ఈ గ్రంథాన్ని పఠిస్తే కోటి కోటి పాపాలు నశిస్తాయి. 
జన్మ మరణ యాతాయాతీ | చుకవావ్యా జే మనే ఇచ్ఛితీ | 
తిహీ అఖండ స్మరణ భక్తి | గురుపదాసక్తి జోడావీ | ||౧౦||
10. జనన మరణాల రాకపోకలను వదిలించుకోవాలని కోరుకునే వారికి గురువుయొక్క పాదాలయందు, మరియు అఖండ గురునామం ధ్యానించడంలో భక్తి ఉండాలి. 

ప్రమాద మిథ్యా జ్ఞానాచే కారణ | ఆత్మరూపీ అనవధారణ(?)2
జేథూని ఉద్భవే జనన మరణ | సర్వానర్థ నిదాన జే | ||౧౧|| 
11. శాశ్వతమైనదేది, కానిదేది అని తెలుసుకోలేక పోవటం వలనే అజ్ఞానం కలగతుంది. ఇదే ఆత్మ స్వరూపాన్ని గ్రహించలేక పోవటం, మరియు జనన మరణాలకు కారణం అయి, అన్ని అనర్థాలకు మూల కారణమౌతుంది.
మోహ మ్హణతే మిథ్యా జ్ఞాన | అనాత్మ ఠాయీ ఆత్మాభిమాన | 
తోచ మృత్యు విద్వజ్జన | లక్షణ కరితాత | ||౧౨|| 
12. మోహం అంటేనే అజ్ఞానం. దేహాన్నే నిజమైన ఆత్మ అనుకుని, ఆ దేహంమీదనే అభిమానాన్ని పెంచుకోవటాన్నే తెలిసినవారు మరణం అని అంటారు. 
సాఈ కథాసాగర మంథన | కరితా సాఈ కథా కథన | 
గోడీ జిచీ నిత్య నూతన | శ్రోత్యాంచే అధఃపతన చుకేల | ||౧౩|| 
13. సాయి కథాసాగరాన్ని చిలికితే, మధురమూ నిత్యము కొత్తదనాన్ని పొంది, ఇంతవరకు చెప్పబడిన సాయి కథలు, విన్నవారి నాశం తప్పిస్తుంది. 
సాఈచే గుణమయ స్థూళ స్వరూప3 | త్యాచే కరితా ధ్యాన అమూప | 
ప్రకటేల సూక్ష్మతమ ఆత్మస్వరూప | హోఉని లోప సగుణాచా | ||౧౪|| 
14. సాయియొక్క సగుణ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానం చేస్తే, వారి సాకార రూపం మాయమై, సూక్ష్మమయిన ఆత్మ స్వరూపం కనిపిస్తుంది. 
న హోతా సగుణరూపీ ప్రవేశ | కళేనా ఆత్మ జ్యోతీశ | 
పరబ్రహ్మ జే నిర్విశేష | దుర్బోధ నిఃశేష జాణావయా | ||౧౫|| 
15. ఈ సగుణ రూపాన్ని ముందుగా ఆరాధించకపోతే, ఆత్మయొక్క రూపం తెలియదు. నిర్గుణమయిన పరబ్రహ్మ తత్త్వం పూర్తిగా అర్థం కాదు. 
జేణే దావూని ఆపులీ పాఉలే | ప్రేమే నిజభక్త భావిక బళే | 
దేహీంచ అసతా విదేహీ కేలే | పరమార్థా లావిలే అకళపణే | ||౧౬|| 
16. భావికులైన భక్తులను మీ పాదాల వద్దకు రప్పించి, వారికి తెలియకుండానే, శరీరమున్నా లేని భావన కలిగించి, పరమాత్మ మార్గంలో ప్రవేశ పెట్టారు. 
సాగరాశి జేవ్హా దేతా ఆలింగన | సరితా విసరతే సరితాపణ | 
తైసా భక్త యేతా శరణ | నురవిసీ దుజేపణ భక్తాంచే | ||౧౭|| 
17. సాగరంలో చేరుకున్న నది, తన ఉనికిని మరచిపోయినట్లు, మీ భక్తులు మీ పాదాలకు శరణుజొచ్చిన వెంటనే వారి ద్వైత భావాన్ని తొలగించారు. 
దోనీ దీప ఎక హోతీ | ఎకామేకా ఆలింగన దేతీ | 
తాత్కాళ హారపే ద్వైతస్థితీ | ఎకచి దీప్తి ఎకత్వే | ||౧౮|| 
18. రెండు దీపాలు ఒకదానినొకటి కలసిన క్షణాన అవి రెండు అన్న స్థితి పోయి, ఒక్కటైపోయి ఒకే దీపంగా వెలుగుతాయి. 
కర్పూర సోడూని త్యాచీ దృతి4 | సూర్యా సోడూని త్యాచీ దీప్తి | 
కనకా సోడూని త్యాచీ కాంతీ | రాహీల కా నిశ్చితీ వేగళీ | ||౧౯|| 
19. తన సువాసన లేకుండా కర్పూరం, వెలుగును విడిచి సూర్యుడు, కాంతిని విడిచి బంగారం, వేరుగా ఉండగలవా? 
జైసీ సాగరీ రిఘే సరితా | సాగరచి హోఉని ఠాకే తత్వతా | 
అథవా లవణ సాగరీ రిఘతా | సాగరీ సమరసతా తాత్కాళ | ||౨౦||
20. నది సాగరంలో కలిసిన వెంటనే అది సాగరం అయిపోతుంది. అలాగే, ఉప్పు సాగరంలో పడిన వెంటనే, సాగరంతో ఒకటైనట్లు –  

తేణేపరీ యేతా సాఈపదీ శరణ | భక్తామాజీ నురే దుజేపణ | 
భక్త హోతీ సమసమాన | త్యాగుని మీ పణ ఆపులే | ||౨౧|| 
21. అదే విధంగా, సాయి పాదాలను ఆశ్రయించిన భక్తుల ద్వైత భావం తొలగిపోతుంది. తమ దేహం పైన ఉన్న అభిమానాన్ని వదిలిన వారు సద్గురువులో, ఐక్యమైపోతారు.
జాగృతి స్వప్న అథవా సుషుప్తి | తిహీ మాజీల కవణ్యాహీ స్థితీ | 
జాహలియా సాఈమయ వృత్తి | సంసారనివృత్తి కాయ దుజీ | ||౨౨|| 
22. మేలుకొని ఉన్నప్పుడు గాని, నిద్రలో గాని, లేక కలలుగనేటప్పుడు గాని, ఏ స్థితిలోనైనా మనసు సాయిమయం అయితే చాలు. అదే సంసారంనుంచి విరమించినట్లే. 
అసో ఆతా యేఊన లోటాంగణాసీ | హేచి మాగతో పాయాంపాశీ | 
తుజవీణ అన్యత్రయా వాంఛేసీ | జాఊన దేసీ ఎకేసరీ | ||౨౩|| 
23. కాని ఇప్పుడు, ‘మీ పాదాలకు నమస్కరించి నా మనసు మిమ్మల్ని తప్ప దేనినీ కోరుకుండుగాక!’ అని వేడుకుంటున్నాను. 
బ్రహ్మాదిస్తంబపర్యంత | ఘట మఠీ సబాహ్య ఆకాశవంత | 
పరిపూర్ణ జో సర్వ భూతాంత | విషమతా యత్కించిత జో నేణే | ||౨౪|| 
24. ఎవరు ఆకాశంలాగా, లోపలినుండి, బయటనుండి, బ్రహ్మనుండి మొదలై ఒక చిన్న పొదదాకా, ఇంటిలోనూ, ఇంట్లోని పాత్రలలోనూ, ఈ సృష్టి అంతా నిండి ఉన్నారో, మరియు ఎవరు ఏ కాస్త భేదభావాన్నీ పాటించరో –  
సకళ భక్త జ్యా సమసమాన | జో నేణే మానావమామ | 
ప్రియాప్రియ నేణే జయాచే మన | జయా న విషమపణ తిళభర | ||౨౫|| 
25. అందరి భక్తులనూ సమానంగా చూస్తూ, ప్రియాప్రియాలను, మానాపమానాలను ఎరుగనటువంటి వారు, విషమతా భావం అసలు లేనటువంటి వారు –  
శరణ రిఘూ త్యా సాఈ సమర్థా | జో నిజస్మరణే దే సర్వార్థా | 
త్యాచా చరణీ అఖండ మాథా | ఠేవూనీ కృతార్థా హోఊ కీ | ||౨౬|| 
26. అయిన సాయి సమర్థులను శరణు వేడుకుందాము. తలచుకున్న మాత్రాన అన్ని కోరికలను తీర్చే సాయి పాదాలపై శిరసును ఉంచి, తృప్తిని పొందుదాము. 
ఆతా శ్రోతే సజ్జన భక్తప్రవర | సర్వా మాఝా నమస్కార | 
తుమ్హీ థోర మిత్రాచార | వినవితో సాచార తే పరిసా | ||౨౭|| 
27. ఇక సజ్జనులు, భక్తశ్రేష్ఠులు అయిన శ్రోతలందరికి నా నమస్కారాలు. గొప్ప స్నేహితులైన మీరు దయచేసి నా ఒక్క మనవిని వినండి. 
మాసోమాసీ కాఢుని అవసర | కథా పరిసల్యా జ్యా హా కాళవర | 
త్యా జయాచ్యా తయాచా విసర | నేదా క్షణభర పడావయా | ||౨౮|| 
28. ఇంతవరకు, నెల నెలా కొంత సమయాన్ని వినియోగించి, ఎవరి కథలను విన్నారో, వారిని ఒక్క క్షణమైనా మరచి పోకండి. 
ఆపణ జో జో సప్రేమ చిత్తా | పరిసతా యా సాఈచ్యా కథా | 
తో తో మీ జో యేథీల వక్తా | తయా ఉల్హాసతా దే సాఈ | ||౨౯|| 
29. మీరు ఎంతెంత ప్రేమతో కథలను వింటుంటే, చెప్పే నాకు, సాయి అంత అంత సంతోషాన్ని కలిగిస్తారు. 
తైసే జై శ్రోతే న దత్తావధాన | వక్తా న కేవ్హాంహీ సుప్రసన్న | 
పరస్పరాంచ్యా ప్రసన్నతేవీణ | వాఉగాశీణ శ్రవణాచా | ||౩౦||
30. వినేవారికి శ్రద్ధ లేకపోతే, చెప్పేవారికి సంతోషం కలగదు. ఇద్దరికీ ఆనందాన్ని ఇవ్వని ఈ చెప్పటం వినటం, రెండూ వ్యర్థమైన శ్రమ. 

పరమ దుస్తర భవసాగర | ఉసళతీ మోహాంచ్యా లాటా అనివార | 
ఆదళతీ అవిచార తటావర | పీడితీ తరూవర ధైర్యాంచే | ||౩౧|| 
31. ఈ సంసార సాగరాన్ని దాటటం చాల కష్టమైన పని. ఈ సాగరంలో మోహపు అలలు ఎప్పుడూ ఉప్పొంగుతూ, చెడు విచారలనే తీరాన్ని ఢీకొంటాయి. ధైర్యమనే పెద్ద పెద్ద మానులు పడిపోతాయి. 
వాజతో అహంకారాచా వారా | తేణే హా డహులే సాగర సారా | 
క్రోధేద్వేషాది మహామగరా | మిళే జై థారా నిర్భయపణే | ||౩౨|| 
32. అహంకారమనే గాలి వీచడం వలన సాగరమంతా అల్లకల్లోలమౌతుంది. అలాంటి సాగరంలో, కోపం ద్వేషాలనే పెద్దపెద్ద మొసళ్ళు భయం లేకుండా చోటు చేసుకున్నాయి. 
‘మీ మాఝే’ హా గజర | వాసనా వికల్ప భంవరే అపార | 
నిందా అసూయాది జేథే తిరస్కార | అసంఖ్య జలచర తళపతీ | ||౩౩|| 
33. ‘నేను, నాది’ అన్న ఈ మొసళ్ళు, కోరికలు అనుమానాలు అనే అనేక సుడిగుండాలు, నింద, అసూయ, తిరస్కారం మొదలైన లెక్కలేనన్ని జలచరాలు ఈ సాగరంలో తిరుగుతుంటాయి. 
ఏసా జరీ హా సాగర భయంకర | అగస్తీరూపే ప్రాశీ గురూవర | 
తయాచే జే చరణరజకింకర | తయా న లవమాత్ర భయ త్యాంచే | ||౩౪|| 
34. ఈ సాగరం ఇంత భయంకరమైనప్పటికీ, అగస్త్యుని రూపంలో మన గురువు ఈ సాగరాన్ని ఔపోశనం పట్టుతారు. వారి పాద ధూళికి దాసులైన వారికి కొంచెం కూడా భయం ఉండదు. 
మ్హణోని సాఈ సమర్థ సద్గురూ | హోఊనియా భవాబ్ధీచే తారూ | 
ఆమ్హీ జే కేవళ కాస ధరూ | త్యా సర్వాంస ఉతరూ పైలపార | ||౩౫|| 
35. అందువలన, సద్గురు సాయి సమర్థులు సంసార సాగరాన్ని దాటించే నౌక అయి, వారిని ఆశ్రయించిన వారినందరినీ వారు అవతలి తీరానికి చేర్చుతారు. 
మహాదుస్తర హా భవార్ణవ | కరా సాఈ చరణాంచీ నాంవ | 
దావీల నిర్భయ పైల ఠావ | పహా నవలావ నిష్ఠేచా | ||౩౬|| 
36. సంసార సాగరాన్ని దాటటం చాలా కష్టం. సాయి పాదాలను నావగా చేసుకుంటే, ఏ భయమూ లేకుండా అవతలి తీరానికి చేర్చుతారు. చెదరని నమ్మకంయొక్క గొప్పదనం ఇటువంటిదే. 
పాళితా యా ఏశా వ్రతా | భాసే న సంసార దుఃఖ తీవ్రతా | 
లాభ న అన్య యేణే పరతా | సేవ్య సమర్థతా తీ హీచ | ||౩౭|| 
37. ఇలాంటి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ప్రపంచ దుఃఖాలలోని తీవ్రత తెలియదు. దీనికంటే లాభకరమైనది వేరే ఏదీ లేదు. ఇదే శక్తి మనకు చక్కగా ఉపయోగ పడుతుంది. 
సాఈచరణీ అత్యంత భక్తీ | నయనీ కోందో సాఈమూర్తీ | 
సాఈచ దిసో సర్వాంభూతీ | ఏసీ హీ స్థితీ భక్తా యేవో | ||౩౮|| 
38. సాయి పాదాలలో విపరీతమైన భక్తి, కళ్ళల్లో సాయి రూపాన్ని నింపుకుని, అన్ని ప్రాణులలోనూ సాయినే చూడగలిగే స్థితి భక్తులకు కలుగుగాక. 
హోఊనియా స్వచ్ఛందవర్తీ | పూర్వ జన్మీ పావలో చ్యుతీ | 
ఆతా తరీ లాభో సద్గతీ | సంగ నిర్ముక్తి యే అర్థీ | ||౩౯|| 
39. మునుపటి జన్మలలో ఇష్టం వచ్చినట్లు నడచుకుని, పతనాన్ని పొందాము. కనీసం, ఇప్పుడైనా సద్గతిని పొందటానికి, ఇంద్రియ సుఖాలను వదిలే శక్తి లభించుగాక. 
పాఠీసీ అసతా శ్రీ సమర్థ | కోణీహీ లావూ న శకే హాత | 
ఏసియా నిర్ధారే జే నిర్ధాస్త | ధన్య తే భక్త సాఈచే | ||౪౦||
40. ‘సాయి సమర్థులు ఎప్పుడూ వెన్నంటి ఉంటే, నన్నెవరూ ఏమీ చేయలేరు’ అన్న దృఢ నమ్మకంతో ఏ భయము లేకుండా ఉండే భక్తులు ధన్యులు. 

అసో ఆతా యేతే మనా | ధరూనియా బాబాంచ్యా చరణా | 
కరావీ తయాంస ఎక ప్రార్థనా | సకల భక్త జనాం కారణే | ||౪౧|| 
41. అందువలన ఇప్పుడు, బాబా పాదాలను పట్టుకుని భక్త జనులందరి కొరకు, వారిని ఒక కోరిక ప్రార్థించాలని అనిపిస్తూ ఉంది.
కీ హా గ్రంథ సర్వా ఘరీ | అసావా నిత్య పాఠాంతరీ | 
నియమే ప్రేమే పారాయణ కరీ | సంకటే వారీ తయాంచీ | ||౪౨|| 
42. అదేమిటంటే, ఈ గ్రంథం అందరి ఇళ్లలో ఉండాలి. ఎందుకంటే, దీనిని నియమంగా భక్తితో, ప్రేమతో పారాయణ చేసే వారి కష్టాలు నివారించబడతాయి. 
హోవోనియా శుచిర్భూత | ప్రేమ ఆణి శ్రద్ధాయుక్త | 
వాచీల జో హా సాత దిసాంత | అనిష్టే శాంత తయాచీ | ||౪౩|| 
43. స్నానం చేసి, శుచిగా భక్తి శ్రద్ధలతో ఈ గ్రంథాన్ని ఏడు రోజులలో పఠించినవారి అరిష్టాలు తొలగిపోతాయి. 
తో హా అధ్యాత్మ తంతూనీ విణిలా | కృష్ణబ్రహ్మ కథాంహీ భరలా | 
బ్రహ్మాత్మైక్య రసీ తరతరలా | అపూర్వ ఉథళలా అద్వైతీ | ||౪౪|| 
44. ఈ గ్రంథం ఆధ్యాత్మక దారంతో అల్లబడినది. శ్రీకృష్ణుడి మరియు బ్రహ్మయొక్క కథలతో నిండి ఉంది. బ్రహ్మ, ఆత్మ ఒక్కటే అనే రసపూరితమైన సంగతి ఇందులో ఉంది. అలాగే దీనిలో అద్వైతం గురించి అపూర్వంగా వివరింప బడింది. 
యా నాథ కావ్య నందనవనీ | బత్తీస ఖణాంచియా వృందావనీ | 
యా గోడ మనోహర సదుగ్ధానీ5 | జ్ఞానీ అజ్ఞానీ రమతాతీ | ||౪౫|| 
45. ఏకనాథ మహారాజుయొక్క కావ్యమనే నందనవనంలో, ముప్పై రెండు అధ్యాయాలతో ఉన్న బృందావనంలో, మనోహరము, మధురమూ అయిన పాయసంలో జ్ఞానులు, అజ్ఞానులు ఇరువురూ లీనమైపోతారు. 
కరితో హే సచ్చరిత శ్రవణ | అథవా నేమే పారాయణ | 
కరితీల సాఈ సమర్థ చరణ | సంకట నివారణ అవిలంబే | ||౪౬|| 
46. నియమంగా ఈ సచ్చరితను పారాయణం చేసినా, లేదా శ్రద్ధగా వినినా, సాయి సమర్థులు వెంటనే వారి కష్టాలను తొలగిస్తారు. 
ధనేచ్ఛూస లాభేల ధన | శుద్ధ వ్యవహారీ యశ పూర్ణ | 
ఫళ యేఈల నిష్ఠేసమాన | యేఈనా భావావీణ అనుభవ | ||౪౭|| 
47. ధనం కోరుకునే వారికి ధనం దొరుకుతుంది. మంచి వ్యవహారాలలో సంపూర్ణ యశస్సు కలుగుతుంది. పారాయణం చేసే వారి శ్రద్ధ, నిష్ఠనుబట్టి, ఫలితం లభిస్తుంది. భక్తిభావం లేకపోతే, ఏ అనుభవమూ కలగదు. 
ఆదరే కరితా గ్రంథవాచన | సాఈ సమర్థ సుప్రసన్న | 
కరీ అజ్ఞాన దారిద్ర విచ్ఛిన్న | జ్ఞానధన సంపన్నతా దేఈ | ||౪౮|| 
48. గౌరవంగా ఈ గ్రంథాన్ని పఠిస్తే, సాయి సమర్థులు ప్రసన్నమై, అజ్ఞానమనే దారిద్ర్యాన్ని నశింపచేసి, జ్ఞానమనే సంపదను ప్రసాదిస్తారు. 
గ్రంథరచనీ సాఈ సంకేత | తైసేంచ తయాచే గుప్త మనోగత | 
హోఈల జో తచ్చరణానురక్త | ధన్య త్యా జీవిత భక్తాచే | ||౪౯|| 
49. సాయి సూచనతోనే ఈ గ్రంథ రచన జరిగింది. అదే వారి మనసులో దాగియున్న కోరిక. సాయి పాదాలయందు ప్రేమ నిండిన భక్తుల జీవితం ధన్యం. 
చిత్త కరూనియా సుసమాహిత | నేమ నిష్ఠే హే సచ్చరిత | 
వాచావా ఎక తరీ అధ్యాయ నిత | హోఈల అమిత సుఖదాయీ | ||౫౦||
50. ప్రశాంతమైన మనసుతో, నియమ నిష్ఠలతో, ప్రతి నిత్యమూ ఈ సచ్చరితలోని ఒక అధ్యాయమైన పఠిస్తే చాలు. అది చాలా ఆనందాన్నిస్తుంది. 

జయా మనీ స్వహిత విచార | తేణే హా గ్రంథ వాచావా సాచార | 
జన్మోజన్మీ సాఈచే ఉపకార | ఆనంద నిర్భర ఆఠవీల | ||౫౧|| 
51. తమ మంచి కోరుకునే వారు ఈ గ్రంథాన్ని శ్రద్ధతో పఠించాలి. జన్మ జన్మలకు వారు సాయియొక్క ఉపకారాన్ని ఆనందంగా గుర్తుంచుకుంటారు. 
గురు పౌర్ణిమా గోకుళ అష్టమీ | పుణ్యతిథీ రామనవమీ | 
యా సాఈచ్యా ఉత్సవీ నియమీ | గ్రంథ నిజధామీ వాచావా | ||౫౨|| 
52. గురు పౌర్ణిమ, గోకులాష్టమి, సాయియొక్క మహాసమాధి రోజు, రామనవమి, ఇవన్నీ సాయియొక్క ఉత్సవ దినాలు. ఈ రోజులలో తప్పకుండా తమతమ ఇళ్లలో ఈ గ్రంథాన్ని పఠించాలి. 
జైసా జైసా సంగ చిత్తీ | తైసీ తైసీ జన్మ ప్రాప్తీ | 
అంతే గతీ జైసీ మతీ | శాస్త్ర సంమతీ యా లాగీ | ||౫౩|| 
53. మనసులోని ఆలోచనల బట్టి మరు జన్మ వస్తుంది. ‘చివరి సమయంలో మనసులో ఆలోచనలు ఎలా ఉంటే వారి గతి కూడా అట్లే ఉంటుంది’ అని శాస్త్రం అంటుంది. 
భక్తాంచా ఆధార శ్రీ సాఈ | త్యావిణ విఘ్నే న పడతీ ఠాయీ6
లేంకురాలాగీ కనవళూ మాఈ | యేథ నవలాఈ కాయ తీ | ||౫౪|| 
54. భక్తులకు శ్రీసాయి ఆధారం. వారు లేకుండా, అడ్డంకులు తొలగవు. తల్లి ఎంతైనా తన బిడ్డల కోసం తహతహలాడుతుంది, ఇందులో విశేషమేముంది? 
కాయ వానూ కథా యా పరతీ | శబ్దాచీ జేథే పావతీ ఉపరతీ | 
వాటే రహావే మౌనవృత్తీ | యోగ్య స్తుతీ తీ హీచ | ||౫౫|| 
55. ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పను? మాటలు రాక ఆగిపోయినప్పుడు, మౌనంగా ఉండటమే మంచిదని అనిపిస్తుంది. అదే సరియైన స్తోత్రము. 
తరీ తీవ్ర మోక్షేచ్ఛా మనీ ధరూన | శుభ కర్మేచ నిత్య కరూన | 
శ్రవణాది నవవిధ భక్తీంచే సేవన | కేలియా శుద్ధాంతఃకరణ హోఈల | ||౫౬|| 
56. అందువలన, మోక్షం గురించి బలమైన కోరికతో, నిత్యం మంచి పనులను చేస్తూ, శ్రవణాది తొమ్మిది రకాలైన భక్తితో భగవంతుని సేవిస్తే, మనసు పరిశుద్ధం అవుతుంది. 
హే న సద్గురూ ప్రసాదావీణ | తయావిణ నా పర తత్వజ్ఞాన | 
‘బ్రహ్మైవాహం’ నిత్య స్మరణ | గురునిష్ఠా ప్రవణ తో హోయ | ||౫౭|| 
57. కాని, సద్గురువు అనుగ్రహం లేకపోతే ఇది జరగదు. సద్గురువు లేకుండా పరబ్రహ్మ గురించి జ్ఞానం దొరకదు. సద్గురువు లేకుండా ‘బ్రహ్మైవాహం’ – ‘నేను స్వయం బ్రహ్మను’ అన్నది జ్ఞాపకం ఉండదు. మరియు గురువుయందు నిష్ఠ ఉండదు. 
సంబంధ జైసా పితాపుత్ర | గురూ హే ఉపమా నామమాత్ర | 
పితా కరీ ఇహసుఖా పాత్ర | గురూ ఇహాముత్ర సుఖదాతా | ||౫౮|| 
58. గురు శిష్యుల సంబంధం తండ్రి కొడుకుల సంబంధం వంటిది. గురువును తండ్రితో పోల్చటం నామ మాత్రానికే. ఎందుకంటే, తండ్రి ప్రపంచంలోని సుఖాలను అనుభవించే యోగ్యతను ఇస్తాడు. కాని, గురువేమో పరలోక సుఖాలను కూడా ప్రసాదిస్తారు. 
పితా అర్పీల క్షణిక విత్త | గురూ అర్పీల క్షయాతీత | 
అవినాశ వస్తు కరిల ప్రతీత | అపరోక్ష హాతాంత దేఈల | ||౫౯|| 
59. శాశ్వతం కాని క్షణికమైన ఐశ్వర్యాన్ని తండ్రి ఇస్తాడు. గురువు ఇచ్చే ఐశ్వర్యం ఎన్నటికీ తరగిపోనిది. శాశ్వతమైన సుఖాన్ని నేరుగా మనము అనుభవించేలా చేస్తారు. 
మాతా నఊ మాస పోటీ ధరీ | జన్మ దేతా ఘాలీ బాహేరీ | 
గురు మాతేచీ ఉలటీ పరీ | బాహేరిల భీతరీ ఘాలీల | ||౬౦||
60. తొమ్మిది నెలలు మోసి జన్మను ఇచ్చేటప్పుడు, తల్లి బిడ్డను బయట పడేస్తుంది. దీనికి విరుద్ధంగా, గురుమాత, శిష్యున్ని బయట ప్రపంచంనుండి లోపలికి తీసుకుంటుంది. 

అంతీ గురూ గురూ స్మరణ కరితా | శిష్య నిఃశంక లాధేల సాయుజ్యతా | 
మగ తో స్వయే గురూనే హాణితా | పూర్ణ బ్రహ్మతా లాధేల | ||౬౧|| 
61. చివరి ఘడియలలో ‘గురు, గురు’ అని స్మరిస్తే, అనుమానమే లేకుండా, శిష్యుడు మోక్షాన్ని పొందుతాడు. గురువు తామే శిష్యుణ్ణి కర్రతో కొట్టితే, అప్పుడు శిష్యుడు పూర్తిగా బ్రహ్మలో లీనమౌతాడు.
గురూకరీచా ఆఘాత | కరీల జన్మమరణ నిఃపాత | 
గురూకరితా దేహాచా అంత | కోణ మగ భాగ్యవంత యా పరతా | ||౬౨|| 
62. గురువుయొక్క చేతి దెబ్బతో జనన మరణ చక్రం నశిస్తుంది. ఎవరి శరీరాన్ని గురువు అంతం చేస్తారో, అట్టి వారికంటే భాగ్యవంతులు ఎవరు ఉంటారు? 
ఖడ్గ తోమర ఫరశ శూల | ఇత్యాది హాతీ ఘ్యావే లాగేల | 
ఆఘాత పడతా శుద్ధి అసేల | మూర్తీ మగ దిసేల సద్గురూచి | ||౬౩|| 
63. గద, ఖడ్గము, గొడ్డలి, శూలము మొదలగు శస్త్రాలను గురువు తన చేతిలో తీసుకోవాలి. దాంతో దెబ్బ పడటంతో, శిష్యునికి నిజమైన శుద్ధి జరిగి, సద్గురువుయొక్క అసలు రూపం కనిపిస్తుంది. 
కితీహీ కరా దేహాచే జతన | కేవ్హా తరీ హోణార పతన | 
మగ తయాచే గురూ హస్తే హనన | పునర్జనన హారక | ||౬౪|| 
64. ఎంతగా కాపాడుకున్నా ఈ శరీరం ఎప్పుడైనా నాశం కావలిసిందే కదా, మరి అలాంటప్పుడు, అది గురువు చేతితో నాశమైతే, ఇక పునర్జన్మ ఉండదు. 
మారా మరేమరేతో మార | ఛేదా మాఝా సమూళ అహంకార | 
జేణే న పునర్జన్మ యేణార | ఏసా మజ దుర్ధర ద్యా మార | ||౬౫|| 
65. సద్గురూ! నన్ను బాగా కొట్టు. నేను చచ్చేవరకు కొట్టు. నా అహంకారాన్ని మొత్తం తొలగించు. మళ్లి జన్మ లేకుండా మంచి గట్టి దెబ్బనే ప్రసాదించు. 
జాళా మాఝే కర్మాకర్మ | నివారా మాఝే ధర్మోధర్మ | 
జేణే మజ హోఈల సుఖ పరమ | ఏసా మోహభ్రమ ఛేదావా | ||౬౬|| 
66. నా కర్మలను అకర్మలను కాల్చి వేయి. నా ధర్మ అధర్మాలను తొలగించు. దాని వల్ల నాకు పరమ సుఖం కలుగుతుంది. మోహం కారణంగా కలిగే ఇంద్రియాల కోరికలను నాశం చేయి. 
ఘాలవా మాఝే సంకల్ప వికల్ప | కరావే మజ నిర్వికల్ప | 
పుణ్యహీ నకో నకో మజ పాప | నకో హా ఊద్వ్యాిప జన్మాచా | ||౬౭|| 
67. నా కోరికలను అనుమానాలను తొలగించి, నాకు ఏ సందేహమూ లేని స్థిరమైన స్థితిని ప్రసాదించు. నాకు పుణ్యమూ వద్దు, పాపమూ వద్దు. మరల పుట్టటం కోసం పడే వ్యర్థమైన శ్రమా వద్దు. 
జాతా శరణ రిఘావయాస | తవ తూ ఉభా చౌ బాజూంస | 
పూర్వ పశ్చిమ అవఘ్యా దిశాంస | అధోర్ధ్వ ఆకాశ పాతాళీ | ||౬౮|| 
68. మీ పాదాలలో శరణు కోరి నేను వస్తే, క్రింద, పైనా, ఆకాశంలొ, పాతాళంలో, తూర్పు పడమర అన్ని దిక్కులలోనూ మీరే ఉన్నారు. 
అవఘ్యా ఠాయీ తుఝా వాస | తరీ మజ మాజీంహీ తుఝా వాస | 
కింబహునా ‘మీ తూ’ హా భేదాభాస | మానితా సాయాస మజ వాటే | ||౬౯|| 
69. అన్ని చోట్లలోనూ మీరే ఉన్నారు. నాలో కూడా మీరే ఉన్నారు. ‘నువ్వు, నేను’ అన్న వేరుచేసే భావనను ఊహించుకోవటానికి కూడా నాకు కష్టంగా ఉంది. 
మ్హణూన హేమాడ అనన్య శరణ | దృఢ ధరీ సద్గురుచరణ | 
చుకవీ పునర్జన్మమరణ | ఏసే నిజోధరణ సంపాదీ | ||౭౦||
70. అందుకే హేమాడు సద్గురు పాదాలను దృఢంగా పట్టుకుని, వారికి పూర్తిగా శరణుజొచ్చి, ఇంకొ పుట్టుకను పోగొట్టుకుని, తనను ఉద్ధరించుకుంటాడు. 

హీ కాయ థోడీ కృతి అఘటిత | భక్త ఉద్ధారాయా అసంఖ్యాత | 
నిర్మాణ కేలే హే నిజచరిత | హేమాడ నిమిత్త కరూనియా | ||౭౧|| 
71. లెక్కలేనన్ని భక్తులను ఉద్ధరించటానికి, హేమాడు పంతును నిమిత్త మాత్రునిగా చేసి, సాయి తమ ఈ చరితాన్ని సృష్టించారు. ఇది అద్భుతమైన సంగతి కాదా! 
హే శ్రీ సాఈ సమర్థ చరిత | వ్హావే మజ హాతే హే అఘటిత | 
నా తో సాఈ కృపే విరహిత | పామరా మజ అఘటిత హే | ||౭౨|| 
72. నాచే ఈ శ్రీసాయి సమర్థ చరితం వ్రాయబడటమే చాలా పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి. సాయి కృప లేకుండా నీచుడు, బుద్ధిలేనివాడు అయిన నాకు ఇది సాధ్యం కానిది. 
నాహీ ఫారా దిసాంచా సహవాస | నాహీ సంత ఓళఖణ్యాచా అభ్యాస | 
అంగీ న శోధక దృష్టీచే సాహస | దేఖణే అవిశ్వాసపూర్వక | ||౭౩|| 
73. సాయితో నాకు చాలా సంవత్సరాల సహవాసం లేదు. సాధు సంతులను అర్థం చేసుకునే శక్తి లేదు. వారిని అనుమానంతో, నమ్మకుండా, చూడటమేగాని వారి గురించి చక్కగా ఆలోచించి, తెలుసుకునే దృష్టి లేదు. 
కధీ న కేలీ అనన్యభావే ఉపాసనా | కధీ న క్షణభర బైసలో భజనా | 
ఏసియా హస్తే చరిత లేఖనా | కరవూనియా జనా దావియలే | ||౭౪|| 
74. స్థిరమైన మనసుతో సాధు సంతులను ఎప్పుడూ ఆరాధించ లేదు. కొంత సేపైనా భజనలో పాల్గొనలేదు. ఇలాంటి నాతో తమ చరితాన్ని వ్రాయించి, ప్రపంచానికి చూపించారు. 
సాధావయా నిజవచనార్థ | సాఈచ ఆఠవూని దేతీ హా గ్రంథ | 
పురవూని ఘేతీ హా నిజకార్యార్థ | హేమాడ హా వ్యర్థ నాంవాలా | ||౭౫|| 
75. తమ మాటను నిలబెట్టుకోవటానికి, నాకు ఈ గ్రంథ రచనను స్ఫురింప చేసి, ఈ పనిని సాయి తామే పూర్తి చేసుకున్నారు. ఈ హేమాడు ఊరికే పేరుకు మాత్రమే. 
మశకే కాయ ఉచలావా మేరూ | టిటవీ జై ఉపసావా సాగరూ | 
పరీ పాఠీ అసతా సద్గురూ | అద్భుత కరణీ ఘడవితో | ||౭౬|| 
76. ఒక చిన్న దోమ, మేరు పర్వతాన్ని ఎత్తగలదా? లేక, ఒక పిచ్చుక సాగరంలోని నీళ్లను ఖాళీ చేయటం సాధ్యమా? కాని, సద్గురువు వెన్నంటి ఉంటే, అద్భుతమైన పనులను చేయిస్తారు. 
అసో ఆతా శ్రోతే జన | కరితో తుమ్హాంస అభివందన | 
జాహలా హా గ్రంథ సంపూర్ణ | సాఈ సమర్పణ సాఈచా | ||౭౭|| 
77. శ్రోతలారా! ఇప్పుడు మీకు నమస్కారం చేస్తాను. ఈ గ్రంథం పూర్తి అయింది. సాయియొక్క ఈ గ్రంథం సాయి పాదాలకి అర్పిస్తున్నాను. 
శ్రోతృవృందా సాన థోరా | మాఝే లోటాంగణ ఎకసరా | 
తుమచేని ధర్మే యా కథాసత్రా | సాఈచరిత్రా సంపవిలే | ||౭౮|| 
78. చిన్నా, పెద్దా శ్రోతలందరికీ చాలా గౌరవంగా నా సాష్టాంగ నమస్కారం. మీరు తోడుగా ఉండటం వలననే, వరుసగా కథలతో ఉన్న ఈ సాయి సచ్చరితను పూర్తి చేశాను. 
మీ కోణ యేథే సంపవిణార | హా తరీ వ్యర్థ అహంకార | 
జేథే సాఈ సూత్రధార | తేథే హే మ్హణణార మీ కోణ | ||౭౯|| 
79. పూర్తి చేయడానికి, ఇక్కడ నేనెవరిని? అలా అనుకోవటం వ్యర్థమైన అహంకారం. సాయియే సూత్రధారులు అయినప్పుడు ఇలా అనుకోవటానికి, నేనెవరిని? 
తరీ త్యాగూని అభిమాన మూల బ్యాద | గావే నిజగురు గుణానువాద | 
మనోజ్ఞా త్యా యా బోధప్రద | ఏశియా వాగ్యజ్ఞా సంపవితో | ||౮౦||
80. దుఃఖానికి మూల కారణమైన ఈ అభిమానాన్ని వదిలి, గురువుయొక్క గుణాలను పదే పదే గానం చేస్తాను. అంతఃకరణానికి బోధప్రదమైన ఈ మాటల యజ్ఞాన్ని ముగిస్తాను. 

యేథే పూర్ణ ఝాలా హా గ్రంథ7 | పూర్ణ ఝాలా మాఝా మనోరథ | 
పూర్ణ ఝాలా సాఈ కార్యార్థ | మీహి కృతార్థ జాహలో | ||౮౧|| 
81. ఇక్కడితో ఈ గ్రంథం పూర్తి అయి, సాయి కార్యం పూర్తి అయింది. నా మనసులోని కోరిక కూడా పూర్తి అయి, నేను తృప్తుణ్ణి అయ్యాను. 
ఏసా గ్రంథ అధ్యాయితా సంపూర్ణ | మనః కామనా హోతీల పూర్ణ | 
హృదయీ ధరిల్యా సద్గురూ చరణ | హోఈల ఉత్తీర్ణ భవసాగర | ||౮౨|| 
82. ఇలాంటి గ్రంథాన్ని పూర్తిగా చదివితే, మనసులోని కోరికలు తీరుతాయి. సద్గురు పాదాలను మనసులో నిలుపుకుని, సంసార సాగరంనుండి తరింపబడతారు. 
రోగియా హోయ ఆరోగ్య | దరిద్రీ హోయ ధనాఢ్య | 
సంకల్ప వికల్పా యేఈ స్థైర్య | దీనా ఔదార్య లాభేల | ||౮౩|| 
83. రోగులు ఆరోగ్యవంతులౌతారు. దరిద్రులు ధనవంతులౌతారు. కోరికలు, అనుమానాలు పోయి, మనసు స్థిరపడుతుంది. దీనులకు ఔదార్యం దొరుకుతుంది. 
పిశాచ బాధా అపస్మార | గ్రంథావర్తనే హోతీల దూర | 
మూక అపంగ పంగూ బధిర | తయాంహీ సుఖకర హే శ్రవణ | ||౮౪|| 
84. ఈ గ్రంథాన్ని మరల మరల చదివితే, పిశాచాల బాధ, అపస్మారం తొలగిపోతాయి. కుంటి, మూగ, చెవిటివారికి కూడా దీనిని వినటం వలన సుఖం కలుగుతుంది. 
జో శక్తిమాన్‍ పరమేశ్వర | తయాచా జయాంస పడలా విసర | 
ఏసే జే అవిద్యా మోహిత నర | హోఈ ఉద్ధార తయాంచా | ||౮౫|| 
85. అజ్ఞానంతో, ఇంద్రియాల కోరికల వలలో చిక్కుకుని, అపార శక్తివంతుడైన పరమేశ్వరుని మరచిపోయిన మనుషులు కూడా ఉద్ధరింపబడతారు. 
నర అసూన అసురాచార | కరూన మిథ్యా దవడితీ శరీర | 
సంసారా మానితీ సుఖాచే ఆగర | హోఈల ఉద్ధార తయాంచా | ||౮౬|| 
86. మనుషులుగా పుట్టినా, రాక్షసుల వలె, ఈ ప్రపంచాన్ని, తమ సుఖాలకు ఇల్లు అనుకుని శరీరాలను వ్యర్థ పరుచుకునే వారు కూడా ఉద్ధరింపబడతారు. 
అగాధ సాఈనాథాంచీ కరణీ | హేమాడ నిత్యయీ స్థాపిలా చరణీ | 
తయాలా నిజసేవేసి లావునీ | సేవాహీ కరవుని ఘేతలీ | ||౮౭|| 
87. సాయినాథుల లీలలు అగాధం. ఈ హేమాడు పంతుకు వారు తమ పాదాలలో శాశ్వతమైన చోటిచ్చి, అతనిని తమ సేవకు ఉపయోగించుకుని, ఈ సేవను చేయించుకున్నారు. 
శేవటీ జో జగచ్చాలక | సద్గురు ప్రబుద్ధి ప్రేరక | 
తయాచ్యా చరణీ అమితపూర్వక (?) | లేఖణీ మస్తక అర్పితో | ||౮౮||
87. సాయినాథుల లీలలు అగాధం. ఈ హేమాడు పంతుకు వారు తమ పాదాలలో శాశ్వతమైన చోటిచ్చి, అతనిని తమ సేవకు ఉపయోగించుకుని, ఈ సేవను చేయించుకున్నారు. 


||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||



టిపణీ: 
1. యాత అవాతరణికా దిలేలీ నాహీ. పహిల్యాచ ఓవీత అవతరణికా దేఊ అసే లిహిలే ఆహే; పరంతు తిచే హస్తలిఖిత సాపడలే నాహీ. 
2. అనిశ్చయ, అననుసంధాన. 3. స్థాళ మ్హణజే హాండా (స్థూళ భాండే). 
4. సువాస. 5. ‘సుదుగ్ధాన్నీ’ అసావేసే వాటతే. 
* అధ్యాయ ౧౮ మధ్యే దిలేలీ టీప బఘావీ. 
6. విఘ్నే నాశ పావత నాహీత. 
7. యా అధ్యాయాచ్యా హస్తలిఖితామధ్యే ఇతర అధ్యాయాంప్రమాణే సమాప్తిదర్శక ఓవీ ఆఢళలీ నాహీ. 

No comments:

Post a Comment