Thursday, February 21, 2013

||బ్రహ్మజ్ఞాన కథనం నామ శోడశోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత 
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౬ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

రాజాధిరాజ చక్రవర్తీ | శాంతి సింహాసనస్థ మూర్తి | 
నమూ స్వానందసామ్రాజ్యపతి | అనన్యగతీ గురురాజ | ||౧|| 
1. రాజాధిరాజ చక్రవర్తీ! శాంతి అనే సింహాసనంపై వెలుగుతున్న మూర్తి! ఆత్మజ్ఞానంతో కలిగే ఆనందమనే సామ్రాజ్యానికి అధిపతి! గురు మహారాజా! మీకు స్థిరమైన మనసుతో నమస్కరిస్తున్నాను.
అభేదభక్తి సహజస్థితి | ఉభయభాగీ చవర్యా వారితీ | 
స్వానుభూతి సద్యఃప్రతీతి | జయా వీజితీ అత్యాదరే | ||౨|| 
2. అంతు లేని భక్తి, మరియు సహజ సమాధి స్థితి, వీరిరువురూ మీకు రెండు ప్రక్కలా వింజామరాలు వీచుతున్నాయి. ఆత్మను స్వయంగా తెలుసుకో గలిగే జ్ఞానం, మరియు తక్షణ అనుభవం, మీకు గౌరవంగా గాలిని వీచుతున్నాయి. 
ఛత్రధారీ స్వాత్మస్థితి | వేత్రధారీ శాంతిసంవిత్తి | 
షడరి మాయా మోహవృత్తి | జేథే నతగతీ క్షణభరీ | ||౩|| 
3. ఆత్మలో లీనమై ఉండే స్థితి, ఛత్రాన్ని, శాంతి మరియు వివేకం, దండాన్ని పట్టుకుని ఉన్నాయి. లోభ,మోహ,మద, ఈర్ష్య, కోపం మరియు ద్వేషమనే ఆరుగురు శత్రువులు, మరియు మాయ, మీ దగ్గర ఒక్క క్షణమైనా ఉండలేవు. 
కాయ యా సభేచా థాట | చార సహా అఠరా భాట | 
చిన్మయచాందవా లఖలఖాట | పసరలా ఘనదాట స్వానంద | ||౪|| 
4. ఓహో! ఎంత వైభవం మీ దర్బారుది! నాలుగు వేదాలు, ఆరు దర్శనాలు, పద్దెనిమిది పురాణాలు, భట్రాజులై మీ కీర్తిని పొగుడుతున్నాయి. శుద్ధమైన జ్ఞానమనే వెలుగు, మీ వెనుక సూర్యుడివలే వెలుగుతూంది. మీ చుట్టూ ఎటు చూసినా, ఆనందం దట్టంగా నిండి ఉంది. 
విరక్తి భక్తి శుద్ధ జ్ఞాన | శ్రవణ మనన నిదిధ్యాసన | 
నిజానుసంధాన సాక్షాత్కరణ | అష్టప్రధాన సేవారత | ||౫|| 
5. విరక్తి, భక్తి, శుద్ధమైన జ్ఞానం, వినటం, మననం, నిధిధ్యాసనలు, ఆత్మను పరమాత్మలో లీనం చేయటం, ఈ ఎనిమిది ప్రధానులు మీ సేవలో ఎల్లప్పుడూ ఉంటారు. 
శాంతి దాంతి దివ్యమణి | చమకతీ జయాచ్యా కంఠభూషణీ | 
వేదాంతసాగరసుధాతరంగిణీ | మధుర వాణీ జయాచీ | ||౬|| 
6. శాంతి, ఇంద్రియాలను అదుపులో పెట్టటం, అనే రెండు దివ్య మణులు మీ గొంతులో ఆభరణాలుగా మెరుస్తుంటాయి. వేదాంతమనే సాగరంలోని అలలవలె మధురంగా, మీ మాటలు అమృతాన్ని కురిపిస్తున్నాయి. 
ఝళకే జయాచీ సతేజ ధార | కరాయా త్యా జ్ఞానఖడ్గాచా ప్రహార | 
పాహోని జ్యాచా ఉద్యత కర | కాంపే థరథర భవవృక్ష | ||౭|| 
7. జ్ఞానమనే పదునైన కత్తితో, నరకటానికి లేచిన మీ చేతిని చూసి, సంసారమనే మాను గడగడా వణుకుతుంది. 
జయ నిరంజనా అవ్యయా | గుణాతీతా యోగిరాయా | 
పరోపకరార్థ ధరిలీస కాయా | ఉద్ధరాయా దీన జనా | ||౮|| 
8. జయ నిరంజనా! అంతు లేని వాడా! మూడు గుణాలను మించిన వాడా! యోగిరాజా! దీనులను, భక్తులను ఉద్ధరించటానికే మీరు ఈ దేహాన్ని ధరించారు. 
గతాధ్యాయీ నిరూపణ | భక్తభావార్థ కరోని పూర్ణ | 
పురవోని తయానే కేలేలా పణ | పటవిలీ ఖూణ మనాచీ | ||౯|| 
9. వెనుకటి అధ్యాయంలో, ఒక భక్తుని కోరిక తీరి, తన మ్రొక్కును అతను తీర్చినప్పుడు, అతను రహస్యంగా ఉంచిన అతని నిర్ణయాన్ని, అతనికి తెలియ పరచి, అతని నమ్మకాన్ని స్థిరపరచారు. 
సద్గురు సదా అవాప్తకామ | శిష్య కాయ పురవీ తత్కామ | 
శిష్యాంచాచ సేవాకామ | పురవూని నిష్కామ తో కరీ | ||౧౦||
10. సద్గురువు ఎప్పుడూ ఏ కోరికా లేనివారు. అలాంటప్పుడు, వారి కోరికలను శిష్యులు ఎలా తీర్చగలరు? వారే శిష్యుల సేవలు చేసి, శిష్యుల కోరికలను తీర్చి, వారిని కోరికలు లేనివారిగా చేస్తారు. 

భావే అర్పితా ఫూల పాన | అతి ప్రేమే కరీల సేవన | 
తేంచ అర్పితా సాభిమాన | ఫిరవీల మాన జాగీంచ | ||౧౧|| 
11. భక్తితో సద్గురువుకు పత్రిని, పువ్వులను అర్పిస్తే, చాలా ప్రేమగా తీసుకుంటారు. అదే అహంకారంతో అర్పిస్తే, వెంటనే తిరస్కరిస్తారు. 
సచ్చిత్సుఖాచే జే సాగర | తయా బాహ్యోపచారీ కాయ ఆదర | 
పరి తే కరితా భావార్థే సాదర | సౌఖ్య నిర్భర సేవితీ | ||౧౨|| 
12. సత్యం, జ్ఞానం మరియు ఆనందానికి నిలయమైన వారికి పైపై ఉపచారాల అవసరం ఏముంటుంది? అయినా, గౌరవ భావంతో ఉపచారాలను చేస్తే, వారు సంతోషంగా స్వీకరిస్తారు. 
నేణతపణాచే పాంఘరూణ | ఘేఊని అజ్ఞాన దేతీ జ్ఞాన | 
న కరితా మర్యాదా అతిక్రమణ | గోడ శికవణ తే దేతీ | ||౧౩|| 
13. ఏమీ తెలియనట్లు, అజ్ఞానమనే ముసుగును కప్పుకుని, ఇతరులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. శాస్త్రాల్లో చెప్పబడిన నియమాలను మీరకుండా, చాలా మధురంగా, భక్తులకు శిక్షణను ఇస్తారు. 
తయాంచీ సేవా కరితా భావే | సేవక బ్రహ్మసాయుజ్య పావే | 
ఇతర సర్వ సాధనీ ఠకావే | లీన వ్హావే గురూ సేవే | ||౧౪|| 
14. భక్తితో వారిని సేవించినవారు బ్రహ్మతో ఒక్కటౌతారు. అందుకే, మిగతా ఇతర సాధనాలన్నీ వదిలి, గురు సేవలోనే లీనమై పోవాలి. 
త్యా సేవేచీ లఘు కుచరాఈ | కివా తేథ లవచతురాఈ1
కరితా సాధక పడేల అపాయీ | విశ్వాస పాయీ పాహిజే | ||౧౫|| 
15. ఆ సేవలో ఏమాత్రం బద్ధకం, అలసత్వం ఉన్నా, గొప్పగా విర్రవీగినా, సాధకులు చిక్కులలో పడిపోతారు. ఇక్కడ కావలిసింది, గురు పాదాల మీద దృఢమైన నమ్మకం. 
శిష్యే కాయ కీజే స్వయే | సద్గురూసీచ లావణే సోయే | 
శిష్యాస న ఠావే నిజ అపాయ | న కళత ఉపాయ గురుకరీ | ||౧౬|| 
16. శిష్యులు తమంతట తామే ఏమీ చేయలేరు. సద్గురువే వారిని దారిలో పెట్టాలి. ఎందుకంటే, తమకు ఎదురొచ్చే అపాయాల గురించి శిష్యులకు ఏమీ తెలియదు. వారికి ఆ అపాయాలను తెలియనీయకుండా, గురువే ఉపాయాలను నేర్పిస్తారు. 
గురుపరీస ఆణిక వదాన్య2 | త్రిభువనీ పాహతా నాహీ అన్య | 
శరణ్యాచా పరమశరణ్య | శరణ అనన్య హోఊ త్యా | ||౧౭|| 
17. ఈ మూడు లోకాలలోనూ ఎంత వెదకినా, గురువుకంటే మరో గొప్ప దాత ఎవరూ ఉండరు. శరణాగతులకు ఎప్పటికీ ఆశ్రయమైన వారికి, ఒకే మనసుతో శరణు పోదాము. 
ఉపమూ జాతా చింతామణీసీ | చింతామణీ దే చింతితార్థాసీ | 
గురూ దేఈల అచింత్య వస్తూసీ | పరమాశ్చర్యేసీ నిజభక్తా | ||౧౮|| 
18. సద్గురువును చింతామణితో పోల్చుదామనుకుంటే, చింతామణి కేవలం కోరుకున్న దానినే ఇస్తుంది. గురువు భక్తులకు పరమ ఆశ్చర్యం కలిగేలా, వారు కోరని దానిని ఇస్తారు. 
తుళూ జాతా కల్పతరూసీ | తో తో పురవీ కల్పితార్థాసీ | 
దేఈల నిర్వికల్పస్థితీసీ | అకల్పితేసీ గురురాయ | ||౧౯|| 
19. గురువును కల్పవృక్షంతో పోల్చుదాము అనుకుంటే, అది కల్పిత వస్తువులనే ఇస్తుంది. కాని, మనసు ఊహించలేని నిర్వికల్ప స్థితిని గురుదేవులు కలుగ చేస్తారు. 
కామధేను కామిలే పురవీ | గురుధేనూచీ తీహూన థోరవీ | 
అచింత్యదానీ ఏసీహీ పదవీ | కోణ మిరవీ తిజవీణ | ||౨౦||
20. గురువు కామధేనువు కంటే ఎక్కువ. కామధేనువు కోరుకున్న కోరికలనే తీరుస్తుంది. ఆశించని ఆత్మ స్థితిని గురువు తప్ప ఎవరు ప్రసాదించగలరు? 

ఆతా శ్రోతయా హేంచ విజ్ఞప్తీ | సాంగేన మ్హణితలే గతాధ్యాయాంతీ | 
బ్రహ్మార్థియా బ్రహ్మజ్ఞానప్రాప్తీ | కథా సంగతి అవధారా | ||౨౧|| 
21. వెనుకటి అధ్యాయం చివరగా, బాబానుంచి బ్రహ్మ జ్ఞానాన్ని కోరిన మనిషి కథను చెప్పుతానని అన్నాను. శ్రోతలకు నాదొకటే కోరిక. ఆ కథను ఇప్పుడు చెప్పుతున్నాను, సావధానంగా వినండి.
బ్రహ్మజ్ఞానాచా ఆలియా భోక్తా | బాబా కైసీ కరితీ తృప్తతా | 
కైసే ఉపదేశితీ నిజభక్తా | త్యా పరమార్థా పరిసాజీ | ||౨౨|| 
22. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే ఆశతో వచ్చిన మనిషిని బాబా ఎలా తృప్తి పరచారు? అతనితో పాటు మిగతా భక్తులందరికీ పరమార్థాన్ని బాబా ఎలా ఉపదేశించారో, వినండి. 
సంత నిత్యాచే నిష్కామ | సకళ పరిపూర్ణ అవాప్తకామ | 
పరి భక్త అత్యంత సకామ | అతృప్త కామ సర్వదా | ||౨౩|| 
23. సాధు సంతులు ఎప్పుడూ కోరికలు లేనివారే. వారి కోరికలన్ని పూర్తిగా తీరిపోయి ఉంటాయి. కాని భక్తులకు విపరీతమైన కోరికలుండి, తీరని కోరికలతో ఎప్పుడూ మనసులో నెమ్మది లేక, తృప్తి లేక, బాధ పడుతూ ఉంటారు. 
కోణీ మాగే పుత్ర సంతతి | కోణీ అఖండ రాజ్య సంపత్తి | 
కోణీ మాగే భావ భక్తి | భవనిర్ముక్తీ ఎకాదా | ||౨౪|| 
24. కొందరికి మగ సంతు కావాలని కోరిక, ఇంకొందరికి అంతు లేని రాజ్య సంపత్తి కావాలనే కోరిక, మరి కొందరు భక్తి విశ్వాసాలను కోరితే, ఒకరిద్దరు మాత్రమే ఈ సంసార బంధాలనుంచి ముక్తిని కోరుకుంటారు. 
ఏసాచ ఎక భక్త భావార్థీ | పరి నిమగ్న ధనసంచయార్థీ | 
ఏకూన బాబాంచీ ఉదండ కీర్తి | దర్శనార్తి ఉదేలీ | ||౨౫|| 
25. ఇలాంటి ఒక భక్తుడు, డబ్బు సంపాదనలోనే మునిగి ఉన్నతను, బాబాయొక్క గొప్ప కీర్తిని విని, వారిని దర్శించుకోవాలని అనుకున్నాడు. 
ఘరీ ఉదండ సంతతి సంపత్తి | దాస దాసీ అపరిమితీ | 
దర్శన ఘ్యావే ఆలే చిత్తీ | ఉదార మూర్తి బాబాంచీ | ||౨౬|| 
26. ఇంట్లో అతనికి అన్నీ విపరీతంగా ఉండేది. సంపద ఉంది, సంతానం ఉన్నారు. దాస దాసీ జనం ఉన్నారు. అయినా, కోరిన వారికి అడిగినది ఇచ్చే బాబాను కలవాలని అనిపించింది. 
బాబా మోఠే బ్రహ్మజ్ఞానీ | సాధుసంత ముకుటమణి | 
మస్తక ఠేవూ త్యాంచే చరణీ | అగాధ కరణీ జయాంచీ | ||౨౭|| 
27. ‘బాబా చాలా గొప్ప బ్రహ్మజ్ఞాని. సాధు సంతులకు తలమానికం. అద్భుతమైన లీలలను చేస్తారు. అలాంటి వారి పాదాలపై నా తలనుంచుతాను. 
నాహీ ఆపుల్యాస దుజీ వాణ | ఆపణ మాగూ బ్రహ్మజ్ఞాన | 
సహజీ జాహల్యా హే సాధన | మగ మీ ధన్య హోఈన | ||౨౮|| 
28. ‘నాకు వేరే ఏ కోరికా లేదు. ఒక బ్రహ్మజ్ఞానాన్ని మాత్రమే అడుగుతాను. అది గాని సులభంగా దొరికితే, నేను ధన్యుణ్ణౌతాను’ అని అనుకున్నాడు. 
మగ తయా తన్మిత్ర మ్హణే | సోపే నాహీ బ్రహ్మ జాణణే | 
తే తుజసమ లోభియాభేణే | ప్రకట హోణే దుర్ఘట | ||౨౯|| 
29. అప్పుడు అతని స్నేహితులు, ‘బ్రహ్మను తెలుసుకోవటం అంత సులభం కాదు. నీలాంటి పిసినారికి బ్రహ్మ కనిపించటం సాధ్యం కాదు. 
ద్రవ్యదారాసుతాంపరతీ | ఠావీ న జయా సుఖోత్పత్తి | 
తయాస బ్రహ్మహీ కేవళ భ్రాంతీ | కైచీ విశ్రాంతీ దేఈల | ||౩౦||
30. ‘డబ్బు, భార్యాబిడ్డల కంటే వేరే ఏ ఆనందము తెలియని వానికి, బ్రహ్మ అనేది కేవలం ఒక మాయ. నీలాంటి వారికి, ఆ మాయ ఏ సుఖ శాంతులను ఇస్తుంది? 

క్షీణ హోతా ఇంద్రియ శక్తి | జగాంత కోణీ మాన న దేతీ | 
తై రికామటేకడే ఉగాచ బైసతీ | సూత కాంతితీ బ్రహ్మాచే | ||౩౧|| 
31. ‘వయసు పెరిగి, ఇంద్రియాల సత్తువ తగ్గినప్పుడు, ఈ ప్రపంచం ఎవరినీ గౌరవించదు. అప్పుడు ఖాళీగా, ఊరికే కూర్చుని బ్రహ్మ గురించిన ఆలోచనలను అల్లుకోవచ్చు. 
తైసీ హీ తుఝీ బ్రహ్మజిజ్ఞాసా | చికట హాతీంచా న సుటతా పైసా | 
కోణీ న హా తుఝా ధింవసా3 | పురవీల ఏసా మిళేల | ||౩౨|| 
32. ‘బ్రహ్మ గురించి తెలుసుకోవాలనే నీ కోరిక కూడా, అలాంటిదే. పైసా డబ్బు ఖర్చు చేయటానికి వెనుకాడే నీలాంటి పిసినారి కోరికను తీర్చేవారు, ఎవరూ దొరకరు’ అని చెప్పారు. 
అసో ఏసీ ఆస్థా మనీ | బ్రహ్మార్థీ నిఘాలా శిరడీ లాగోని | 
పరత భాడ్యాచా టాంగా కరోని | సాఈచరణీ పాతలా | ||౩౩|| 
33. అయినా, మనసులో బలమైన కోరికతో, అతడు శిరిడీకి బయలుదేరాడు. పోవటానికి, తిరిగి రావటానికి కూడా టాంగాను మాట్లాడుకుని, సాయి పాదాల దగ్గరకు చేరాడు. 
ఘేతలే సాఈంచే దర్శన | కేలే తయా పాయీ నమన | 
సాఈ మగ వదతీ మధుర వచన | శ్రోతా శ్రవణ తే కీజే | ||౩౪|| 
34. సాయి దర్శనం చేసుకుని, వారి పాదాలకు నమస్కరించాడు. అప్పుడు సాయి పలికిన మధురమైన మాటలను శ్రోతలారా! జాగ్రత్తగా వినండి. 
హా సాఈ కథాకల్పతరూ | అవధానపయః పానే సధరూ | 
జంవ జంవ వాఢే శ్రోతయా ఆదరూ | ప్రసవేల ఫలభారూ తంవ తంవ | ||౩౫|| 
35. ఈ సాయి కథా కల్పవృక్షాన్ని, స్థిరమైన మనసు అనే నీటితో తడిపితే, ఆ చెట్టు చక్కగా పెరుగుతుంది. శ్రోతలకు, శ్రద్ధ, గౌరవం పెరిగిన కొద్దీ, మంచి ఫలాలను ప్రసాదిస్తుంది. 
రసభావే సర్వాంగీ భరేల | సుగంధ పుష్పీ తో ఫులేల | 
మధుర ఫలభారీ తో లవేల | ఇచ్ఛా పురేల భోక్త్యాంచీ | ||౩౬|| 
36. ఆ చెట్టుయొక్క ప్రతి శాఖ, భక్తి రసంతో నిండి, సువాసనలను ఇచ్చే పువ్వులను వికసింప చేసి, తియ్యగా ఉండే ఫలాలతో నిండి, భక్తుల కోరికలను తీరుస్తుంది. 
మ్హణే తో “బాబా4 బ్రహ్మ దాఖవా | హేంచ ఆలో ధరూన జీవా | 
జన మ్హణతీ శిరడీకర బాబా | బ్రహ్మ దావితీ అవిలంబే | ||౩౭|| 
37. బ్రహ్మ జ్ఞానాన్ని కోరి వచ్చిన మనిషి బాబాతో, ‘బాబా! నాకు బ్రహ్మను చూపించండి. నేను దానికోసమే వచ్చాను. శిరిడీ బాబా బ్రహ్మను వెంటనే చూపిస్తారని జనులు అంటున్నారు. 
మ్హణోని ఇతకా దూర ఆలో | మార్గ కంఠితా ఫార శ్రమలో | 
తరీ తే బ్రహ్మ జరీ లాధలో | కృతకృత్య ఝాలో” మ్హణేన | ||౩౮|| 
38. ‘ఆ ఆశతోనే నేను ఇంత దూరం వచ్చాను. వచ్చేటప్పుడు చాలా కష్టపడ్డాను. అయినా, బ్రహ్మ జ్ఞానం దొరికితే, నేను ధన్యుణ్ణౌతాను’ అని అన్నాడు. 
బాబా వదతీ “న కరీ చింతా | బ్రహ్మ దావీన రోకడే ఆతా | 
యేథే న ఉధారీచీ వార్తా | తుజసమ పుసతాచి దుర్లభ | ||౩౯|| 
39. అప్పుడు బాబా అతనితో “నువ్వేం చింతించకు. బ్రహ్మను చూపడానికి డబ్బులవుతుంది. ఇక్కడ అంతా నగదే కాని, అప్పు మాటే లేదు. కాని, నీలాగా అడిగేవారు చాలా తక్కువ. 
మాగతీ బహుత ధనసంపదా | నివారా మ్హణతీ రోగ ఆపదా | 
మాగతీ లౌకిక మాన రాజ్యపదా | సౌఖ్య సదా మాగతీ | ||౪౦||
40. “అంతా డబ్బును, సంపదను కోరుతారు. కష్టాలను, రోగాలను తొలగించమని అడుగుతుంటారు. లౌకికమైన కీర్తి, మర్యాదలను, రాజ పదవులను కోరుతారు. ఎవరైనా కాని, ఎప్పుడూ సుఖాలనే అడుగుతారు. 

కేవళ ఏహిక సుఖాలాగూని | జన శిరడీస యేతీ ధాంవూని | 
లాగతీ మజ ఫకిరాచే భజనీ | బ్రహ్మ కోణీహీ న మాగతీ | ||౪౧|| 
41. “ఈ లోకానికి సంబంధించిన సుఖాల కోసమే, శిరిడీకి పరుగెత్తుకుని వచ్చి, ఫకీరుడైన నన్ను పూజిస్తారు, కాని, బ్రహ్మ కావాలని నన్నెవరూ అడగరు.
తైశియాంచా మజ సుకాళ | తుజ సారిఖ్యాంచాచ దుకాళ | 
బ్రహ్మజిజ్ఞాసూంచా మీ భుకాళ | పర్వకాళచ హా మజలా | ||౪౨|| 
42. “అలాంటి (సుఖాలను కోరుకునేవారు) భక్తులే నాకు చాలా మంది ఉన్నారు. నీ లాంటి వారే చాలా కరువు. బ్రహ్మను తెలుసుకోవాలనే వారి కొరకు చాలా ఆతురతతో ఉన్నాను. ఈ రోజే నాకు పర్వ దినం. 
జయా బ్రహ్మ వస్తు భేణే | రవిశశీంచే నియత చాలణే | 
నియమే ఉగవణే నియమే మావళణే | ప్రకాశ చాందిణే నేమస్త | ||౪౩|| 
43. “ఈ బ్రహ్మ వస్తు భయంతో, సూర్య చంద్రులు నియమంగా ఉదయించటం, నియమంగా అస్తమించటం, సూర్యుని వెలుగు, చంద్రుని వెన్నెల మొదలైనవి రావటం, నియమంగా జరుగుతున్నాయి. 
గ్రీష్మ వసంతాది ఋతుకాళ | ఇంద్రాది దేవ లోకపాళ | 
నేమే కరితీ జో ప్రజా ప్రతిపాళ | త్యా సర్వా మూళ హే బ్రహ్మ | ||౪౪|| 
44. “గ్రీష్మ, వసంత ఋతువులు, ఇంద్రాది దేవతలు, లోకాలని పాలించే దిక్పాలకులు, నియమంగా ఉండటానికి మూలకారణం ఈ బ్రహ్మయే. 
మ్హణూన శరీరవిస్త్రంసనా ఆధీ | సుధీ బ్రహ్మపురుషార్థ సాధీ | 
త్యావీణ పునరావర్తన నిరవధీ | లాగేల అబాధిత పాఠీసీ | ||౪౫|| 
45. “అందుకే, దేహాన్ని విడవక మునుపే, తెలివైన వారు బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నిస్తారు. అది లేకపోతే, చావు పుట్టుకలు ఆగకుండా, వెంటే ఉంటాయి. 
తే హే బ్రహ్మ జాణల్యావీణ | హోఈల జరీ శరీరపతన | 
పిచ్ఛా పురవీల సంసారబంధన | పునర్జనన చుకేనా | ||౪౬|| 
46. “బ్రహ్మను తెలుసుకోక మునుపే ఈ దేహం నాశమైతే, సంసార బంధాలు తొలగిపోవు. అవి ఉన్నంత వరకు మళ్ళి పుట్టటం తప్పదు. 
బ్రహ్మాచి కాయ మీ తుజ సగళే | దావితో పహా బ్రహ్మగుండాళే5
జే తుజ నఖశిఖాంత వేటాళే | తే మీ ఆగళే ఉకలితో” | ||౪౭|| 
47. “బ్రహ్మ అంటే ఏమిటో, నేను నీకు మొత్తం చూపిస్తాను, చూడు! పాదాల చివరనుంచి తలదాకా నిన్ను చుట్టుకున్న ఈ బ్రహ్మ జ్ఞాన సారాన్ని, విడదీసి, బయటకు లాగి, నీకు చూపిస్తాను!” 
కాయతీ సుధామధుర వాణీ | కేవలాద్వైతసుఖాచీ ఖాణీ | 
సంశయదోలారూఢ జే ప్రాణీ | తదుద్ధరణీ సమర్థ | ||౪౮|| 
48. ఎంత మధురమైన మాట! అంతా ఒక్కటే అనే అద్వైత సుఖాల ఖని! అనుమానాలు, సంశయాలు ఉన్నవారిని ఉద్ధరించే సామర్థ్యం ఉన్న మాట! 
ఆపాతరమణీయ సుఖప్రలోభనీ | గుంతలే జే దివస రజనీ | 
తయాంసహీ బాబాంచీ వచనసరణీ | విహితా చరణీ ప్రస్థాపీ | ||౪౯|| 
49. క్షణికమైన సంతోషాన్నిచ్చే సుఖాల ఆశలో, రాత్రింబవళ్ళూ చిక్కుకున్న వారిని కూడా, బాబా మాటలు, శాస్త్రాలు చెప్పిన మంచి మార్గంలో నడిపిస్తాయి. 
చింతామణి ప్రసన్న హోతా | లౌకికసౌఖ్య చఢేల హాతా | 
లాధేల స్వర్గసంపత్తిమత్తా | మహేంద్ర హోతా ప్రసన్న | ||౫౦||
50. చింతామణి ప్రసన్నమైతే, లౌకిక సుఖాలు లభిస్తాయి. మహేంద్రుడు ప్రసన్నమైతే, స్వర్గ సంపదలన్నీ దొరుకుతాయి. 

యాహూన గురూచీ అలౌకికతా | గురూసమాన నాహీ దాతా | 
దుర్లభ బ్రహ్మ దావితీల భక్తా | సుప్రసన్నతా పావలియా | ||౫౧|| 
51. గురువు ఇంతకంటే గొప్పదైన, లౌకికం కాని, వాటిని ప్రసాదిస్తారు. గురువుకు సమానమైన దాత ఇంకొకరు లేదు. వారు ప్రసన్నులైతే, పొందటానికి సాధ్యం కాని, బ్రహ్మను కూడా భక్తులకు చూపిస్తారు. 
తయా గోడ కథేచ్యా శ్రవణే | హోఈల సంసార దుఃఖా విసరణే | 
బ్రహ్మార్థియాంసీ కైసే శికవిణే | తేహీ జాణణే బాబాంహీ | ||౫౨|| 
52. వారి తియ్యని కథలను వింటే, సంసారంలోని బాధలను మరచిపోవచ్చు. బ్రహ్మను కోరి వచ్చిన వారికి ఎలా శిక్షణ ఇవ్వాలో, బాబాకు బాగా తెలుసు. 
అసో మగ త్యాతే బసవిలే | క్షణైక అన్య వ్యవసాయీ త్యా గుంతవిలే | 
జణూ త్యా ప్రశ్నాచే భానచ హరపలే | ఏసే దావిలే తయాలా | ||౫౩|| 
53. అలా అతనిని కూర్చోబెట్టి, దేని కోసం వచ్చాడో దానిని మరచిపోయేలా, మిగతా సంగతులలో లీనమైయేలా, చేశారు. 
మగ బాబాంనీ కాయ కేలే | ములాస ఎకా నికట బోలావిలే | 
“జా” మ్హణతీ “సత్వర వాహిలే | దే నందూలా6 నిరోపకీ | ||౫౪|| 
54. తరువాత బాబా ఏం చేశారంటే, ఒక అబ్బాయిని దగ్గరకు పిలిచి, “వెళ్ళు, తొందరగా వెళ్ళి, నందుకు, 
పాంచ రుపయే ఉసనవారీ | బాబాంస ఆహే నికడ భారీ | 
హాతఉసనే క్షణభరీ | దే ఝడకరీ మ్హణ త్యాలా” | ||౫౫|| 
55. “బాబాకు వెంటనే అయిదు రూపాయలు కావాలి. కనుక కాసేపటి కోసం అప్పు ఇవ్వమని అతనితో చెప్పు” అని అన్నారు. 
ములగా గేలా నందూచే ఘరా | కులుప హోతే తయాచే ద్వారా | 
యేఊన తాత్కాళ మాఘారా | సమాచారా నివేదిలే | ||౫౬|| 
56. ఆ అబ్బాయి నందు ఇంటికి వెళ్ళితే, అక్కడ తలుపుకు తాళం వేసి ఉంది. వెంటనే తిరిగి వచ్చి, ఆ సంగతి బాబాకు చెప్పాడు. 
బాబా మ్హణతీ “జా పరతోని | అసేల ఘరీ బాళా7 వాణీ | 
తోచ నిరోప త్యాతే దేఊని | రుపయే ఘేఊని యేఈ జా” | ||౫౭|| 
57. బాబా మళ్ళీ ఆ అబ్బాయితో, “మళ్ళీ వెళ్ళు. బాళా వ్యాపారి ఇంటిదగ్గరే ఉంటాడు. అదే మాటను అతనితో చెప్పి, రూపాయలను తీసుకుని రా” అని చెప్పారు. 
వ్యర్థ గేలీ హీహీ ఫేరీ | బాళాహీ తేవ్హా నవ్హతా ఘరీ | 
ములగా ఘడలీ జే జే పరి | సాదర కరీ బాబాంసీ | ||౫౮|| 
58. అక్కడికి వెళ్ళటం కూడా దండుగ అయింది. బాళా కూడా అప్పుడు ఇంట్లో లేడు. ఆ మాటే, ఆ అబ్బాయి ఆదరంతో, బాబాకు చెప్పాడు. 
ఆణఖీ ఎకా దోఘా ఠాయీ | బాబా ధాడితీ తయా లవలాహీ | 
థకలా హేలపాటియా పాయీ | కపర్దీక కాంహీ లాధేనా | ||౫౯|| 
59. అతనిని వెంటనే మరో ఒకరిద్దరి దగ్గరకు బాబా పంపారు. ఆ అబ్బాయి తిరిగి తిరిగి అలసి పోయాడు కాని, ఎక్కడా చిల్లిగవ్వైనా దొరకలేదు. 
నందూ అథవా బాళా వాణీ | ఎకహీ తే వేళీ ఘరీ న కోణీ | 
బాబాంస హీ జాణ పూర్ణపణీ | అంతర్జ్ఞానీ మహారాజ | ||౬౦||
60. మహారాజుకు అవలీలగా అన్నీ తెలుసు కనుక, నందు కాని, బాళా కాని, ఆ సమయాన ఇంట్లో ఉండరని మునుపే తెలుసు. 

చాలతే బోలతే బ్రహ్మసాఈ | పాంచ రూపయాంస అడేల కాఈ | 
పరి త్యా బ్రహ్మార్థియాపాయీ | హే నవలాఈ మాండిలి | ||౬౧|| 
61. కదలాడుతూ, మాట్లాడుతూ, కనిపించే, సజీవ బ్రహ్మయే సాయి. వారికి అయిదు రూపాయలు కరువా? బ్రహ్మజ్ఞానం మీద ఆశతో వచ్చిన ఆ మనిషి కోసం, ఈ అద్భుతాన్ని చేశారు.
పాహుణా యేతా ఘరా | తయాచియా పాహుణచారా | 
కేలే జే మిష్టాన్న వా శిరా | భోగహీ ఇతరా లాధే తో | ||౬౨|| 
62. బంధువులు ఇంటికి వస్తే, వారికోసం తయారు చేసిన హల్వా మొదలైన పిండివంటలను మిగతా వారు కూడా తిని ఆనందిస్తారు. 
తైసా హా బ్రహ్మభోక్తా | కరూనియా పుఢారా నిమిత్తా | 
మహరాజ ఉపదేశితీ భక్తా | కల్యాణార్థా సకళాంచ్యా | ||౬౩|| 
63. అలాగే, బ్రహ్మను కోరి వచ్చిన మనిషిని, నిమిత్త మాత్రునిగా చేసి, మిగతా అందరి శ్రేయస్సు కోసం, మహారాజు భక్తులకు బోధించారు. 
పన్నాసాధిక దోనశతే8 | రుపయే నోటాంచే పుడకే హోతే | 
త్యా బ్రహ్మార్థియాచే ఖిశాంత తేథే | తే సాఈనాథే జాణితలే | ||౬౪|| 
64. బ్రహ్మ కోసం వచ్చిన మనిషి జేబులో, రెండు వందల యాభై రూపాయల నోట్ల కట్ట ఉంది. మిగతా అన్ని సంగతులూ తెలిసినట్లే, ఇది కూడా సాయినాథులకు తెలుసు. 
హే కాయ త్యా బ్రహ్మార్థియా నకళే | నవ్హతే కాయ తయాస డోళే | 
ఖిశాంత అసతా నోటాంచే భేండోళే | వికల్పఘోళే9 నాడలా | ||౬౫|| 
65. మరి, తన జేబులోని నోట్ల సంగతి ఆ మనిషికి తెలియదా? ముఖంలో కళ్ళు లేవా? జేబులో నోట్ల కట్ట ఉన్నా, దానిని బాబాకు ఇవ్వాలా వద్దా అన్న సందేహం అతనిని అడ్డుకున్నది. 
సాఈస పాంచ రుపడ్యా ఉధార | ఆణి త్యాహీ ఎక ఘటకాభర | 
త్యాహీ ద్యావయా నాహీ ధీర | బ్రహ్మసాక్షాత్కార మాంగూయే | ||౬౬|| 
66. అయిదు రూపాయలు, అదైనా ఒక ఘడియ కోసం, సాయికి అప్పుగా ఇవ్వటానికి, అతనికి మనసు రాలేదు. అలాంటిది, బ్రహ్మ కావాలని వచ్చాడు! 
సాఈమహారాజ సత్యవచనీ | రకమహీ10 లహాన హాతఉసనీ | 
దేఊన పహావే యేతాంచ మనీ | వికల్ప యేఊని ఆదళే | ||౬౭|| 
67. సాయి మహారాజు తమ మాట మీద ఉంటారు, అలాంటి వారు అప్పుగా అడిగినదైనా కొంచమే కదా! పోనీ, ఇద్దామని అనిపించినా, సందేహంతో మనసు మారిపోయి, ఇవ్వకుండా ఊరికే ఉండిపోయాడు. 
పాంచ రూపయాంచీ కథా తీ కాయ | పరి తే ద్యావయా జీవ న హోయ | 
ఎవఢీ జయా లావవే న సోయ | లోభ స్వయమేవ11 తో జన్మే | ||౬౮|| 
68. అతనికి అయిదు రూపాయలు ఒక లెక్కా? అయినా కాని, ఇవ్వటానికి మనసు ఒప్పుకోలేదు. సాయి కోసం, ఇంత చిన్న మొత్తం ఇవ్వలేని వాడు, పిసినారి కాకుండా ఏమిటి? 
ఇతర కోణీ భాళా భోళా | జయాలా బాబాంచా ఖారా జివ్హాళా | 
ఉసనవారీచా తో సోహళా | ఉఘడ్యా12 డోళా బఘతా నా | ||౬౯|| 
69. బాబా మీద అసలైన భక్తిగల ఇంకే భక్తుడైనా సరే, తన కళ్ళ ముందు, అయిదు రూపాయల అప్పు గురించి ఆ కుర్రాడు పడుతున్న పాట్లను, కళ్ళప్పగించి చూస్తూ, ఊరికే కూర్చోడు. 
బ్రహ్మార్థా జో ఇతుకా తాన్హేలా | త్యాలా హా ప్రశ్న నసేల కా ఉకలలా | 
ఏసే న యత్కించిత వాటే మజలా | పరి తో గ్రాసిలా ధనమోహే | ||౭౦||
70. బ్రహ్మ కోసం నిజంగా అంత తపించే వాడైతే, అతనికి సమస్య అర్థం కాకుండా ఉండేదా? ఏమో, నాకలా అనిపించదు. డబ్బుపై అతనికి ఉన్న వ్యామోహమే అతనిని కమ్ముకుంది. 

స్వస్థ బసావే తేంహీ నాహీ | సుటలీ పరత జాణ్యాచీ ఘాఈ | 
తో మ్హణే “అహో బాబాసాఈ | బ్రహ్మ ఠాయీ పాడా క” | ||౭౧|| 
71. అలా అని, ఊరికే అయినా కూర్చున్నాడా! అదీ లేదు. వెంటనే వెళ్ళి పోవాలని త్వర పడ సాగాడు. ‘ఓ బాబా సాయీ! బ్రహ్మను తొందరగా చూపించు’ అని అడిగాడు. 
బాబా మ్హణతీ “బసల్యా ఠాయీ | బ్రహ్మ దావావే యేచ ఉపాయీ | 
కేలే యేథేవర ఉపాయ పాహీ | కళలే నాహీంచ కా తుమ్హా?” | ||౭౨|| 
72. “నువ్వు కూర్చున్న చోటే, బ్రహ్మను చూపించాలనేగా ఇంతవరకూ నా ప్రయత్నం! అసలు, నీకేం అర్థం కాలేదా?” అని బాబా అతనిని అడిగారు. 
బ్రహ్మాలాగీ పంచ ప్రాణ | పంచ పంచేంద్రియ జ్ఞాన | 
 అహంకార బుద్ధి మన | లాగతీ సమర్పణ కరావయా | ||౭౩|| 
73. బ్రహ్మ కావాలంటే అయిదు ప్రాణాలు, అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం అనేవి సమర్పించ వలసి ఉంటుంది. 
బ్రహ్మజ్ఞానాచా మార్గ బికట | సులభ న సర్వా సరసకట | 
ఉదయకాల హోతా తే ప్రకటే | లాభేఅవచట సభాగ్యా | ||౭౪|| 
74. బ్రహ్మజ్ఞానం దొరికే దారి చాలా కఠినం. అది అందరికీ సులభంగా సాధ్యం కాదు. సమయం వచ్చినప్పుడు, అదృష్టం ఉన్నవారికి, అకస్మాత్తుగా అది దానంతట అదే కనిపిస్తుంది. 
హిరణ్యగర్భపదాపర్యంత | సర్వ ఉత్కర్షీ జో విరక్త | 
తోచి బ్రహ్మవిద్యేసీ అధికృత | అనాసక్త ఇతరత్ర | ||౭౫|| 
75. ఈ లోకంలోని సంగతులు అన్నింటి మీద, ఏ మాత్రం ఆసక్తి లేకుండా, హిరణ్యగర్భ (బ్రహ్మ పదవి) పదవి వచ్చిన తరువాత వచ్చే కీర్తితో చలించకుండా, విరక్తితో ఉన్నవారే, బ్రహ్మ విద్యను పొందటానికి యోగ్యులు. 
అంగీ విరక్తి న లవలేశ | ఏశియాసీ బ్రహ్మతత్త్వోపదేశ | 
కోణీహీ జరీ కేలా అశేష | కాయ త్యా యశ యేఈల | ||౭౬|| 
76. ఏ మాత్రం విరక్తిలేని వానికి, ఎవరైనా బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించినా, దానివల్ల అతనికి వచ్చే ఉపయోగం మాత్రం, ఏముంటుంది? 
అబాధిత బ్రహ్మబోధన | ఉత్తమాధికారియా గృహణ | 
పరి మధ్యమాధికారీ జన | పరంపరే ఆధీన సర్వదా | ||౭౭|| 
77. ఆధ్యాత్మికంగా పూర్తి యోగ్యత ఉన్నవారు, బ్రహ్మ జ్ఞానాన్ని సులభంగానే అర్థం చేసుకుంటారు. కాని, అంత లేకుండా, మధ్యమంగా యోగ్యత ఉన్నవారికి, క్రమ క్రమంగా, శాస్త్రాలు చెప్పినట్లు, బోధించాలి. 
ఎకా విహంగమమార్గసేవన | దుజియా పరంపరా13 సోపాన14
పరి యా అనధికారియా లాగూన | వావగా శీణ బ్రహ్మాచా | ||౭౮|| 
78. మొదటిది, పక్షులు ఎగిరే ఆకాశ మార్గం. రెండవది, కొంచెం నిధానమైన, శాస్త్రాలు నియమించిన, మెట్లను క్రమ క్రమంగా ఎక్కటం. కాని, ఆధ్యాత్మికంగా ఏ యోగ్యతా లేని వారికి, బ్రహ్మ జ్ఞానాన్ని బోధించుట దండుగ. 
ఎకా ఆత్మ వివేకావాంచూన | నాహీ నిరతిశయ ప్రాప్తిసాధన | 
హే జరీ సత్య వేదాంత వచన | తే కాయ ఆధీన సర్వాంచ్యా | ||౭౯|| 
79. ఆత్మ గురించి, నిజమైన దానిని, నిజం కానిదానిని, తెలుసుకోగలిగిన వివేకం, బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి అన్నిటికంటే గొప్ప సాధనం, అని వేదాంతం చెప్పింది. ఇది నిజమైనప్పటికీ, ఎంత మందికి ఈ వివేకం ఉంటుంది? 
అభ్యాస ఆణి శ్రమ రోకడే | కరూ లాగతీ హాడాంచీ కాడే | 
తయీ తే గురుకృపా ఉజియేడే15 | హాతీ చఢే హళూ హళూ | ||౮౦||
80. చాలా కష్టమైన అభ్యాసంతో, దేహమంతా చిక్కి, ఎముకలమయం అయినప్పుడు, గురు కృప అనే వెలుగుతో, మెల్ల మెల్లగా బ్రహ్మజ్ఞానం చేతికి అందుతుంది. 

మీ ఎక ఈశ్వర మీ నియంతా | హిరణ్యగర్భా16 జై చఢే అహంతా | 
స్వరూపీ పడే విస్మరణతా | ప్రాదుర్భూతతా విశ్వాచీ | ||౮౧|| 
81. “నేనే ఈశ్వరుణ్ణి, నేనే అన్నిటినీ ఆజ్ఞాపించువాడిని” అని హిరణ్యగర్భుడికి అహంకారం కలిగినప్పుడు, తన అసలైన రూపాన్ని మరచి పోవటంతోనే, ఈ సృష్టి పుట్టింది.
“బ్రహ్మాహమస్మీతి” హోతా జ్ఞాన | జ్ఞాతా హోయ స్వరూపీ లీన | 
తైంచ విశ్వాభాసవిసర్జన | శ్రుతి గర్జన కరితే కీ | ||౮౨|| 
82. “నేనే బ్రహ్మను” అన్నది తెలుసుకున్నప్పుడు, తెలుసుకునే వాడు ఆత్మలో లీనమైపోతాడు. అప్పుడే, ఈ జగత్తు గురించిన మాయ తొలగిపోతుంది. ఇలా అని శ్రుతి చెబుతుంది. 
హోతా స్వప్నబోధోత్పత్తి | బ్రహ్మాకారాంతఃకరణ వృత్తి | 
బ్రహ్మాగ్నీంత విశ్వాచీ ఆహుతీ | హోతే విభూతి17 సృష్టీచీ | ||౮౩|| 
83. ఒక మారు ఆత్మ మేలుకుంటే, తాను, బ్రహ్మ వేరు కాదని తెలుసుకుంటుంది. అప్పుడు ఈ జగత్తును బ్రహ్మ అనే అగ్నికి ఆహుతి చేస్తుంది. దాంతో, ఈ సృష్టి అంతా బూడిదై పోతుంది. 
జీవాంచీహీ హేచ స్థితి | హోతే జేవ్హా భ్రమనివృత్తి | 
రజ్జూ కిరణ ఆణి శుక్తి | ఆభాసా ముకతీ తాత్కాళ | ||౮౪|| 
84. జీవుల స్థితి కూడా ఇదే. మాయ తొలగిపోగానే, త్రాడు త్రాడుగానే, ముత్యపు చిప్ప చిప్పలాగానే కనిపిస్తాయి. వాటి గురించిన అపోహ తొలగిపోతుంది. 
శుక్త్యజ్ఞాన తేంచ రజత భాన | రజతాజ్ఞాన తేంచి శుక్తిజ్ఞాన | 
భ్రమ నివృత్తికాలీ రౌప్యావసాన18 | శుక్తికా విజ్ఞాన నిర్భేళ | ||౮౫|| 
85. సరియైన జ్ఞానం లేకపోవటం వలన, ముత్యపు చిప్పను వెండి అని అనుకోవటం, ఆ జ్ఞానం రావటంతో, అది వెండి కాదు, ముత్యపు చిప్ప అని తెలుస్తుంది. మాయ తొలగిపోవటంతో, అది వెండి అనే అపోహ తొలగిపోయి, ముత్యపు చిప్ప అన్న సంగతి స్పష్టంగా తెలుస్తుంది. 
అన్యోన్య మోహాచే హే లక్షణ | జ్ఞానదీపాచే కరా ఉజళణ | 
అజ్ఞానమలా కరా క్షాలన | నిర్దాళణ తై ప్రతిభాసా | ||౮౬|| 
86. ఈ మోహంయొక్క లక్షణాన్ని, జ్ఞానమనే దీపంతో కనిపించేలా చేయండి. అజ్ఞానమనే మురికిని కడిగి వేయండి. అప్పుడు, అన్ని రకాలైన అపోహలూ నశిస్తాయి. 
జన్మ మృత్యూచా నసతా బంధ | అసతా కిమర్థ మోక్షనిర్బంధ | 
వేదాంతా ఆమ్హా కాయ సంబంధ | మగ హా ప్రబంధ కాయసా | ||౮౭|| 
87. చావు పుట్టుకల బంధనమే లేకపోతే, మోక్షానికోసం ఇంత ఆరాటమెందుకు? వేదాంతానికి, మనకు ఏమి సంబంధం? బ్రహ్మ జ్ఞానం గురించిన ఈ సంభాషణ ఎందుకు? 
ఆహే మీ బద్ధ వ్హావే నిర్ముక్త | ఏసా జో దృఢ నిశ్చయాసక్త | 
తోచ యేథీల అధికారీ ఫక్త | న యుక్త అత్యజ్ఞ19 వా20 తజ్జ్ఞ21 | ||౮౮|| 
88. ‘నేను బంధించ బడి ఉన్నాను, దీనినుండి ముక్తి కావాలి’ అని దృఢ నిశ్చయంతో ఉన్నవారే బ్రహ్మ జ్ఞానాన్ని పొందటానికి యోగ్యులు. ఏమీ తెలియని అజ్ఞానులు కాని, అన్నీ తెలిసిన జ్ఞానులు కాని, యోగ్యులు కాదు. 
బద్ధచి నాహీ కైంచీ ముక్తి | హే తో ఆహే వస్తుస్థితి | 
బద్ధముక్తతా గుణసంగాతీ22 | ఆహే ప్రతీతి అవధియా | ||౮౯|| 
89. అసలు బంధమే లేనప్పుడు, ఇంక ముక్తి దేనినుండి? ఇది నిజమైన స్థితి. సత్వ, రజస్సు, తమ అనే మూడు గుణాల కలయికతో, ‘బంధనము’, ‘ముక్తి’ అనే తెలివి వస్తుంది. ఇది అందరి అనుభవం. 
ద్వితీయాచా23 అభావ జేథే | బాంధీ సోడీ కవణ కవణాతే | 
కోణీహీన బద్ధ వా ముక్త తేథే | ద్వైత అద్వైతే గేలియా | ||౯౦||
90. జీవాత్మ, పరమాత్మ రెండూ ఒకటే, వేరు కాదు అన్న భావం ఉన్న చోట, ఎవరు ఎవరిని బంధించటం? విడిపించటం? అంతా వేరు వేరు అన్న భావన పోయి, అంతా ఒక్కటే అన్న భావం వస్తే, ఎవరూ బంధితులు కారు, ఎవరూ ముక్తులూ కారు. 

దిన రజనీ హే ప్రకార | ఉత్పాదీ కాయ దినకర | 
హాతో దృగ్దోషవ్యవహార | దివాకర అలిప్త | ||౯౧|| 
91. పగలు, రాత్రి అన్న వానిని సూర్యుడు పుట్టించాడా? ఇవి మన చూపు దోషమే కాని, సూర్యుడు ఎప్పుడూ ఒకేలా, ఉన్న చోటే, ఉంటాడు. 
మీ ఎక కర్తా మీ భోక్తా | హా అభిమాన ధరూని చిత్తా | 
స్వర్గ నరక సుఖాసుఖ24 అనుభవితా | వాసనాసక్తతా వాఢతే | ||౯౨|| 
92. ‘చేసేది నేనే, ఆనందించేదీ నేనే’ అనే అహంకారంతో సుఖ దుఃఖాలను, స్వర్గ నరకాలను అనుభవిస్తున్న కొద్దీ, ఇంద్రియాల కోరికల మీద ఆసక్తి ఎక్కువ అవుతుంది. 
ఆత్మా నిత్య పురాణ శాశ్వత | జన్మనాశాది వికారవర్జిత | 
ఓంకారాక్షరప్రతీకవంత25 | అనాద్యనంత సంతత జో | ||౯౩|| 
93. కాలంతో నిమిత్తం లేనిది ఆత్మ. ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది. చావు పుట్టుకలతో వచ్చే మార్పులు లేనిది. ఓంకారమే దాని రూపం. దానికి ఆరంభమూ లేదు, అంతమూ లేదు. 
జయాచీ శరీరమాత్రాత్మదృష్టీ26 | స్వయే నిరాళా నిరాళీ సృష్టీ | 
తయాస ఆత్మజ్ఞానాచీ కష్టీ | పరామృష్టి27 లాధేనా | ||౯౪|| 
94. ఈ దేహాన్నే ఆత్మ అని అనుకునేవారు, తాము వేరు - ఈ సృష్టి వేరు అని అనుకునేవారు, ఆత్మ జ్ఞానం కావాలని కోరుకుని, కష్ట పడినా, అది దొరకదు. 
వాణ్యాది సర్వేంద్రియాంచా లయ | కరా మనీ వ్హా కృతనిశ్చయ | 
త్యా మనాచా కరా క్షయ | ఘ్యావా ఠాయ బుద్ధీచా | ||౯౫|| 
95. నోటి మాటను, మిగతా ఇంద్రియాలనూ అదుపులో పెట్టుకుని, దృఢంగా నిశ్చయించుకుని, మనసు చేసే మిగతా పనులను నిలిపి వేసి, బుద్ధిని పూర్తిగా ఆశ్రయించాలి. 
ప్రకాశ స్వరూప జే జ్ఞానబుద్ధి | మనాసీ తేథే లావా సమాధి | 
మనాసహ సర్వేంద్రియసమృద్ధి | ఎకా స్వాధీన బుద్ధీచ్యా | ||౯౬|| 
96. జ్ఞానాన్నిచ్చే, వెలుగు రూపంలో ఉన్న, బుద్ధియందు మనసును నిలపాలి. అటూ ఇటూ పోక మనసును బుద్ధియందు స్థిరంగా ఉంచాలి. ఎందుకంటే, మనసుతో సహ అన్ని ఇంద్రియాలూ, బుద్ధి అధీనంలో ఉంటాయి. 
ఘటాసీ ఆద్యకారణ మాతీ | ఇంద్రియా బుద్ధి తైశాచ రీతీ | 
తే తయాంచీ నిత్య స్థితి | ఏసీ హే వ్యాప్తి బుద్ధీచీ | ||౯౭|| 
97. కుండకు మూల కారణం మట్టి. అలాగే, ఇంద్రియాలకు మూల కారణం బుద్ధి. ఎప్పుడూ ఉండే దాని స్థితి ఇది. ఈ విధంగా బుద్ధి వ్యాపించింది. 
బుద్ధీ నిజవ్యాపకపణే | వ్యాపీ మనాది సకల కరణే28
బుద్ధీస మహత్తత్త్వీ29 నిరవిణే | మహత్ సమర్పణే ఆత్మత్వీ | ||౯౮|| 
98. తన చాచుకునే గుణంతో, బుద్ధి మనసును, మిగతా ఇంద్రియాలను వ్యాపిస్తుంది. కనుక, బుద్ధిని, అంతటా వ్యాపించి ఉన్న మహత్తత్వంలో (ఈశ్వర తత్త్వం) లయం చేసి, ఆ మహత్తత్వాన్ని, ఆత్మ తత్వంలో లీనం చేయాలి. 
ఏసాచ కరితా సమాహార | హోయ ఆత్మస్వరూపనిర్ధార | 
మగ రజత మృగజల సర్పాకార | దృగ్వికార కేవళ తే | ||౯౯|| 
99. ఈ రకమైన ఒద్దికను సాధిస్తే, ఆత్మ రూపం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక అప్పుడు, ముత్యపు చిప్పులోని వెండి, ఇసుకలోని ఎండమావి, త్రాడులోని పాము ఆకారం, కేవలం మన చూపులోని దోషమే అని అర్థమవుతుంది. 
తో హా అశేష విశేష రహిత | జన్మాపక్షయవివర్జిత30
యద్యర్శనేవీణ నాహీ స్వహిత | సాధూ సతత బోలతీ | ||౧౦౦||
100. అంతు లేని, ఏ రకమైన ప్రత్యేకతా లేని, చావు పుట్టుకలు లేని, ఈ ఆత్మను తెలుసుకోలేక పోతే, శ్రేయస్సు అనేది లేదు, అని సాధు సంతులు ఎప్పుడూ చెప్పుతుంటారు. 

కార్య మాత్రాస ఆహే కారణ | ఆత్మా స్వయంభూ నిష్కారణ | 
‘పురాSపి నవ31’ హా పురాణ | బుద్ధిహీన స్వభావే | ||౧౦౧|| 
101. ప్రతి ఒక్క పనికీ ఒక కారణము ఉంటుంది. కారణం లేని పని ఉండదు. కాని, ఆత్మ తానై ఉంది. ఏ కారణమూ లేకుండానే ఉంది. ఆత్మ చాలా పాతది, అయినా ఎప్పుడూ క్రొత్తగానే ఉంటుంది. ఆత్మ ఎప్పటికీ బుద్ధికి అందనిది - అదే దాని స్వభావం.
ఆకాశవత్ అవిచ్ఛిన్న | జన్మవినాశ విలక్షణ32
‘ఓం ప్రణవ’ జయాచే ఆలంబన33 | నిరాలంబన నిష్కలజో | ||౧౦౨|| 
102. ఆకాశం లాగా ఆత్మ కూడా వేరు చేయలేనిది. చావు పుట్టుకలకు మీరినది. ఓం ప్రణవం మీదనే ఆత్మ ఆధార పడి ఉంది. మిగతా ఏ ఆధారమూ లేకుండా, శుద్ధంగా ఉండేదే ఆత్మ. 
పరబ్రహ్మ తే జ్ఞాతవ్య | అపర బ్రహ్మ తే ప్రాప్తవ్య | 
ఓం తత్ప్రతీక ధ్యాతవ్య | ఉపాసితవ్య సర్వదా | ||౧౦౩|| 
103. అంతు లేని పరబ్రహ్మను తెలుసుకోవాలి. చేతికి అందే బ్రహ్మను పొందాలి. బ్రహ్మకు రూపమైన ఓంకారాన్ని ధ్యానించాలి. ఎల్లప్పుడూ పూజించాలి. 
సర్వ వేదాంచే జే సార | ప్రణవస్వరూప తోచ ఓంకార | 
తయాచా సార్థ జో నిర్ధార | తోచ విచార మహావాక్యాచా | ||౧౦౪|| 
104. అన్ని వేదాల సారమైన బ్రహ్మయొక్క రూపమే ఓంకారం. ఆ బ్రహ్మ (ప్రణవం)ను అర్థం చేసుకుని, ఖచ్చితంగా తెలుసుకోవటమే వేదాలలోని మహావాక్యాల అసలైన చింతన. 
వేద స్వయే జే ప్రతిపాదితీ | జే అతిప్రయత్నే జన సంపాదితీ | 
యదర్థ బ్రహ్మచర్య ఆచరితీ | మ్హణతీ ఓం పద తయాసీ | ||౧౦౫|| 
105. సాధకులు బ్రహ్మచర్య నియమాలను పాటించి, చాలా కష్టంతో పొందగలిగేదే ఓంకారం అని స్వయంగా వేదాలే తెలియచేశాయి అని అంటారు. 
అసో తయా పదాచా ఆక్రమ | కరూ జాతా జరీ దుర్గమ | 
తరీ తే అభ్యాసియా సుగమ | హోతా పరమ గురూకృపా | ||౧౦౬|| 
106. ఆ స్థితిని చేరుకోవటానికి ఎంత కష్టమైనా, అభ్యాసంతో, సద్గురు కృపతో, సాధకులకు అది చాలా సులభమౌతుంది. 
ఇంద్రియా మాజీల జీ స్థూల పరమ | తేథూన ధరితా అనుక్రమ | 
ఆదరితా సూక్ష్మ తారతమ్యక్రమ | సాధే అవిశ్రమ సాధకా | ||౧౦౭|| 
107. ఇంద్రియాలలో, అన్నిటికంటే పెద్దదానినుండి, క్రమంగా అన్నిటికంటే చిన్నదానివరకూ, పెద్దాచిన్నా అనేదానిని వివేకంతో వేరు చేస్తూ, విరామం లేకుండా ప్రయత్నం చేస్తే సాధకులు సాధించగలరు. 
తే హే ఓం శబ్దవాచ్య అక్షర | సకళ తపాచే జే సార | 
ఉచ్చారమాత్రే స్ఫురే అర్థసార | సాక్షాత్కార ఆవర్తనే | ||౧౦౮|| 
108. ఓం అనే అక్షరాన్ని శబ్దం చేస్తూ ఉచ్చరిస్తే, అదే అన్ని తపస్సుల సారం. ఆ శబ్దాన్ని చెప్పినంత మాత్రాన దాని అర్థం తెలుస్తుంది. దానిని ఎప్పుడూ ధ్యానిస్తే, దేవుడు కనిపిస్తాడు. 
అవిపరిలుప్త34 చైతన్య | వృద్ధిక్షయ వికారశూన్య | 
ఏసా ఆత్మా జాణీల తో ధన్య | భక్త అనన్య సద్గురూచా | ||౧౦౯|| 
109. ఏ మార్పులూ, హెచ్చు తగ్గులు లేని, అంతటా ఉండే చైతన్యవంతమైన ఆత్మను, తెలుసుకున్న, సద్గురువుయొక్క స్థిరమైన భక్తుడు ధన్యుడు. 
అధ్యాత్మ అధిభూత అధిదైవ | త్రివిధ తాపీ తాపలే జే సదైవ35
తే కైంచే భోగితీ హే సుదైవ | వైభవ హే ఎక సంతాంచే | ||౧౧౦||
110. అధ్యాత్మిక, అధిభౌతిక, మరియు అధిదైవికం అనే మూడు రకాలైన తాపాలతో ఎల్లప్పుడూ తపించి పోయేవారు, ఈ భాగ్యాన్ని ఎలా అనుభవించగలరు? ఇది ఒక్క సత్పురుషులకే సాధ్యం. 

అవిద్యేపోటీ ఉపర్జే సంసృతి | త్యా పాసోన వ్హావయా నివృత్తి | 
సాధన జే బ్రహ్మాత్మైకత్వ వృత్తి | తయాచీ ప్రాప్తి యే ఠాయీ | ||౧౧౧|| 
111. అజ్ఞానం వలన చావు పుట్టుకల చక్రం మొదలౌతుంది. దానినుండి బయట పడటానికి, బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అనే భావనను సాధించటమే. అది ఇక్కడే సాధ్యం. 
విషయ కల్పనా శూన్య స్థితి | ‘అహం బ్రహ్మాస్మీతి’ వృత్తి | 
యా మహావాక్యాచియా ఆవృత్తి | బుద్ధి ప్రవృత్తి హోఈల జై | ||౧౧౨|| 
112. ఇంద్రియ సుఖాల గురించి మనసు చేసే ఆలోచనలను తుడిచేసి, ఎప్పుడూ “నేనే బ్రహ్మ” అనే వేదాలలోని మహావాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, బుద్ధి తనంతట అదే ఆ స్థితిని చేరుకుంటుంది. 
గురువచన శాస్త్ర ప్రతీతి | అంతర్బాహ్య కరణవృత్తి | 
మనాసహ ఉపరమా పావతీ | ఆత్మసంవిత్తి లాభే తై | ||౧౧౩|| 
113. గురువు చెప్పే మాటలు, శాస్త్రంలోని వాక్యాలు, అనుభవంలోకి తెచ్చుకుని, దైహికమైన, మానసికమైన పనులను నిలిపి వేసినప్పుడు, మనసు శాంతించి, ఆత్మ జ్ఞానం పూర్తిగా దొరకుతుంది. 
తైంచ సమ్యగ్దర్శన ప్రాప్తి | విషయార్థాది జడ నివృత్తి | 
తుటే అవిద్యాది హృదయ గ్రంథి | హోయ అవ్యక్తీ ప్రవిష్ట | ||౧౧౪|| 
114. అప్పుడే, పూర్తిగా, స్పష్టంగా జ్ఞానం లభించేది. ఇంద్రియ సుఖాలపై విరక్తి కలిగి, అజ్ఞానం పన్నిన వలనుంచి హృదయం బయట పడి, కనిపించని దానిలో చేరి, దాంతో ఒకటౌతాడు. 
కవడశాంతీల అతిసూక్ష్మ కణ | తయాహూనహీ సూక్ష్మ ప్రమాణ | 
తయా అణూహూనహీ ఆణీయాన36 | ఆత్మానుమాన నిర్ధార | ||౧౧౫|| 
115. సూర్యకిరణాలలో ఉండే అతి చిన్నదైన అణువుకంటే చిన్నది ఆత్మ అని నిర్ధారణ చేయడమైనది. 
మోఠ్యాంత మోఠే బ్రహ్మాండ జాణ | త్యాహూనహీ ఆత్మా మహిమాన37
పరి హే సర్వ సాపేక్ష ప్రమాణ | ఆత్మా ప్రమాణాతీత38 తో | ||౧౧౬|| 
116. అలాగే, పెద్ద వస్తువుల కంటే పెద్దది బ్రహ్మాండం. బ్రహ్మాండం కంటే పెద్దది ఆత్మ. అయినా ఇవన్నీ పోల్చుకోవటానికి మాత్రమే. ఆత్మ కొలతలకు మీరినది. 
సూక్ష్మత్వే ‘అణోరణీయాన’39 | మహత్త్వే మహత్పరిమాణవాన | 
ఎవం నామరూపాది కేవళ ఉపాధీ జాణ | ఆత్మా పరిపూర్ణ నిరుపాధిక | ||౧౧౭|| 
117. చిన్నదానికంటే అతి చిన్నది, పెద్దదానికంటే అతి పెద్దది ఆత్మ. పేరులు, రూపాలు, ఇవి మనం ఆత్మను తెలుసుకోవటానికి ఉపయోగించే పదాలే కాని, ఆత్మ పరిపూర్ణం మరియు వర్ణించ కానిది. 
ఆత్మ్యాస నా జన్మ నా మరణ | నాహీ తయాసీ మూలకారణ | 
అజనిత్య శాశ్వత పురాణ | సహజ నిర్ధారణ దుర్గమ | ||౧౧౮|| 
118. ఆత్మకు చావులేదు, పుట్టుక లేదు. దానికి మూల కారణం కూడా లేదు. ఆత్మ పుట్టుక లేనిది. ఎప్పుడూ ఉండేది. నాశనం కానిది. ఇది ఆత్మ అని స్పష్టంగా చెప్పటం చాలా కష్టం. 
‘ఓంకార’ ప్రతీక జే బ్రహ్మ | తేంచ త్యాచే స్వరూప పరమ | 
ఆగమనిగమాంసహీ దుర్గమ | తే కాయ సుగమ సర్వత్రా | ||౧౧౯|| 
119. బ్రహ్మకు మూలమైన ఓంకారమే దాని మూల స్వరూపం. వేదాలు, శాస్త్రాలు కూడా ఇలా అని వర్ణించ లేని ఆత్మ, అందరికీ సులభ సాధ్యమా? 
జయా నిర్ధారితా వేద థకలే | తపస్వీ వనవాసీ ఝాలే | 
ఉపనిషదీ హాత టేంకిలే | కోణా న ఝాలే నిదాన | ||౧౨౦||
120. ఇది ఆత్మ అని చెప్పటానికి వేదాలు అలసిపోయినవి. ఋషులు అడవుల పాలయ్యారు. ఉపనిషత్తులు చేతులు ఎత్తివేశాయి. ఎవరికీ దాని అంతు చిక్కలేదు. 

పావావయా ఆత్మస్వరూపాచియా ఠావా | ఉభేదదర్శీ ఆచార్యచి వ్హావా | 
తదితరాంచా కోణ కేవా | రిఘావా న తేథే తార్కికా | ||౧౨౧|| 
121. ఆత్మ పరమాత్మ ఒక్కటే, వేరు కాదు అన్నదానని స్వయంగా అనుభవించిన గురువులు ఉంటేనే, ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి సాధ్యమౌతుంది. మిగతా గురువులతో అది సాధ్యం కాదు. తర్క శాస్త్రం తెలిసినంత మాత్రాన ప్రయోజనం లేదు.
కేవళ తార్కికా న తేథే థారా | భ్రమావర్తీ ఫిరేల గరగరా | 
ఆగమ ఆచార్యావీణ ఇతరా | స్థిరావేనా తత్త్వబుద్ధీ | ||౧౨౨|| 
122. కేవలం తర్కం (వాదం) చేసేవారికి అక్కడ చోటు లేదు. వారి మనసు కల్పించుకున్న సుడిగుండాల్లోనే వారు గిరగిరా తిరుగుతుంటారు. వేద శాస్త్రాలు తెలిసిన గురువులకు తప్ప, ఇతరులకు ఆత్మజ్ఞానానికి కావలిసిన స్థిరమైన బుద్ధి ఉండదు. 
స్వబుద్ధికల్పనేచే అనంత తారే | న చుకవితీ లఖచౌర్యాంశీ ఫేరే | 
ఆగమ ఆచార్యేందు ఎకచి పురే | మగ తమ నురే లవలేశ | ||౧౨౩|| 
123. తన బుద్ధి కల్పించుకున్న సిద్ధాంతాలు అనే అనేక తారలు, ఎనభై నాలుగు లక్షల చావు పుట్టుకలను తప్పించలేవు. అదే, శాస్త్రాలు తెలిసిన గురువులాంటి ఒక్క చంద్రుడు ఉంటే చాలు, అజ్ఞానమనే చీకటి కొంచెం కూడా మిగలదు. 
ఇతరాంన సాధే జే బహు సాయాసే | తేంచ సాధీల తో అల్పాయాసే | 
జో దృఢ ధరీ త్యా సద్గురుచే కాసే | తయా ప్రకాశే సద్విద్యా | ||౧౨౪|| 
124. మిగతా వారు ఎంత కష్ట పడినా సాధించలేని దానిని, సద్గురువును గట్టిగా పట్టుకున్నవారు, ఏ కష్టమూ లేకుండా, సులభంగా సాధించగలరు. వారికి బ్రహ్మ జ్ఞానంయొక్క వెలుగు కనిపిస్తుంది. 
సకార్య అవిద్యా జేథ సరే | సచ్చిదానందస్వరూప స్థిరే | 
స్వస్వరూప స్థితి అవతరే | మోక్ష దుసరే నామ త్యా | ||౧౨౫|| 
125. దానితో అజ్ఞానం తొలగిపోతుంది. సచ్చిదానంద స్వరూపం స్థిరపడుతుంది. ఆత్మ స్వరూపం అనుభవంలోనికి వస్తుంది. ఇలాంటి స్థితికి మరో పేరే మోక్షం అని. 
హేంచ జీవాచే అత్యంత అభీష్ట | యదర్థ కరితీ బహుత కష్ట | 
జే నిరంతర బ్రహ్మయోగనిష్ట | అంతర్నిష్ఠ సర్వదా | ||౧౨౬|| 
126. మనిషి జీవితంలో ఎక్కువగా ఆశించ తగినది ఇదే. దీనికోసమే జీవులు ఎప్పుడూ చాలా కష్ట పడతారు. దీనికోసమే, నిష్ఠలో ఉండే బ్రహ్మయోగులు ఎప్పుడూ ఆత్మలో లీనమై ఉంటారు. 
స్వరూపీ హోతా చంచళ | ఉఠే విషయాంచీ ఖళబళ | 
ఝాలియా స్వరూపీ నిశ్చళ | యేఈ వికళతా విషయాంతే | ||౧౨౭|| 
127. మనసుకు నిలుకడ లేనప్పుడు, ఇంద్రియాల కోరికలు అల్లకల్లోల పరుస్తుంటాయి. ఆత్మ స్వరూపంలో లీనమైన వారికి, మనసు స్థిరపడి, ఇంద్రియాల కోరికలు తగ్గిపోతాయి. 
స్వరూపీ జో విముఖ | విషయ తయా సదా సన్ముఖ | 
తోచ హోతా స్వరూపోన్ముఖ | విషయ ముఖ ఫిరవితీ | ||౧౨౮|| 
128. ఆత్మ స్వరూపాన్నుంచి ముఖం తిప్పుకున్నప్పుడు, ఇంద్రియాల కోరికలు కలవర పెడతాయి. అదే ఆత్మవైపు ముఖం తిప్పితే, ఇంద్రియాల కోరికలు మొహం చాటేస్తాయి. 
మోక్షమాత్రాచీచ ఇచ్చా కరీ | అన్యార్థీ నిరీచ్చ అభ్యంతరీ | 
ఇహ పరత్రార్థ తృష్ణాలేశ నధరీ | తోచ అధికారీ మోక్షాచా | ||౧౨౯|| 
129. మిగతా ఇహపర సుఖాలను అణు మాత్రం కూడా ఆశించకుండా, కేవలం మోక్షాన్నే కోరుకునే వారే, మోక్షానికి అర్హులు. 
యాంతీల జో ఎకా లక్షణే ఉణా | ముముక్షూ నవ్హే తో స్పష్ట జాణా | 
తో కేవళ ముముక్షూచా బహాణా | జైసా కాణా దేఖణా | ||౧౩౦||
130. వీనిలోని ఏ ఒక్క లక్షణం లేకున్నా, వారు ముముక్షువులు (మోక్షాన్ని ఆశించేవారు - ముక్తి కావాలని అనుకునే వారు) కారని బాగా తెలుసుకోవాలి. అలాంటివారు, ఒకే కన్నుతో, రెండు కన్నులతో చూస్తున్నట్లు నటించే వారిలా, ముముక్షువుల వలె, కేవలం, నాటకం ఆడేవారు. 

అహంకార గళాల్యా వీణ | న హోతా లోభాచే నిర్మూలన | 
న హోతా మన నిర్వాసన | బ్రహ్మజ్ఞాన ఠసేనా | ||౧౩౧|| 
131. అహంకారం తొలగి పోనంతవరకు, పిసినారితనం పోయేంత వరకూ, ఇంద్రియాల కోరికల వెంట మనసు పడనంత వరకు, బ్రహ్మజ్ఞానం కలుగదు. 
దేహాత్మ బుద్ధి హేచ భ్రాంతి | బంధాసీ కారణ ఆసక్తి | 
సోడా విషయ కల్పనా స్ఫూర్తి | బ్రహ్మప్రాప్తి హాతీ యే | ||౧౩౨|| 
132. మన దేహమే ఆత్మ, అని అనుకోవటమే ఒక పెద్ద మాయ. బంధనానికి కారణం ఆసక్తి. ఇంద్రియ సుఖాల గురించిన ఆలోచనలను విడిచి పెడితే, బ్రహ్మజ్ఞానం చేతికి అందుతుంది. 
నిర్విశేష పరబ్రహ్మ | సాక్షాత్కారా యే కఠీణ కర్మ | 
సవిశేష నిరూపణ హేంచి వర్మ | హాచి ధర్మ ధీమందా | ||౧౩౩|| 
133. మూడు గుణాలను మించిన బ్రహ్మను తెలుసుకోవటం, చాల కష్టమైన పని. అందుకే, ఈ మూడు గుణాలున్న బ్రహ్మయొక్క పూజలోని రహస్యాన్ని తెలుసుకోవడమే, బుద్ధిమంతుల ధర్మం. 
ఆత్మా గూఢ సర్వాంభూతీ | హే తత్వ జాణతీ వేదాంతీ | 
పరీ యావీ సర్వత్ర అనుభూతీ | ఏసీ ప్రతీతి కైసేనీ | ||౧౩౪|| 
134. అన్ని జీవులలోనూ రహస్యంగా, సులభంగా కనుక్కోలేకుండా ఆత్మ దాగి ఉందని, వేదాంతులకు తెలుసు. కాని, అనుభవంతో దీనిని అందరూ తెలుసుకోవడం ఎలా? 
ఆధీ లాగే చిత్త శుద్ధి | వరీ సూక్ష్మ కుశాగ్ర బుద్ధి | 
తేవ్హాంచ ప్రకటే హా త్రిశుద్ధి | కృపా సమృద్ధి స్వయమేవ | ||౧౩౫|| 
135. మునుపు, మనసు శుద్ధం కావాలి. తరువాత, కత్తిలా పదునైన బుద్ధి ఉండాలి. అప్పుడే, ఆత్మ, దయతో, స్వయంగా కనిపిస్తుంది. 
ఆత్మా నిత్య అవికృత | ఆత్మవిద తో శోకరహిత | 
తోచ ధైర్యవంత ధీమంత | భవనిర్ముక్త తో సదా | ||౧౩౬|| 
136. ఎప్పుడూ ఉండేది, ఏ మార్పూ లేనిది ఆత్మ. ఆత్మను తెలుసుకున్న వారికి దుఃఖమనేది ఉండదు. వారే ధైర్యవంతులు. వారే తెలివైన వారు. వారే ఈ సంసారంనుండి ముక్తిని పొందినవారు. 
యేథ న చలే ప్రవచన యుక్తి | కింవా గ్రంథార్థధారణా శక్తి | 
అథవా వేద శ్రుతి వ్యుత్పత్తీ | కాంహీ ఉపపత్తి లాగేనా | ||౧౩౭|| 
137. ప్రవచనాలు చెప్పగలిగే నిపుణతగాని, గ్రంథాలను గ్రహించే శక్తిగాని, లేక వేదాల శ్రుతుల అర్థాలను విడమర్చి చెప్పటం గాని, అవసరం లేదు. 
ఆత్మా నిత్య అవికృత | శరీర అనిత్య అనవస్థిత40
హే జాణోని సాధే జో స్వహిత | విహితావిహిత41 దక్ష తో | ||౧౩౮|| 
138. ఏ మార్పూ చెందక, ఎప్పుడూ ఉండేది ఆత్మ. దేహం క్షణికమైనది, ఎప్పుడూ మార్పు చెందుతూ ఉండేది. ఇది తెలుసుకుని, తమ శ్రేయస్సును సాధించుకునే వారు యోగ్యమైన దానిని, యోగ్యం కానిదానిని తెలుసుకున్న నిపుణులు. 
ఆత్మజ్ఞానీ సదా నిర్భయ | ఎకీంఎక అద్వితీయ | 
దుజేపణాచా పుసిలా ఠాయ | శోకాత్యయ42 దృష్ట ఫళ | ||౧౩౯|| 
139. ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారు, ఎప్పుడూ భయపడరు. అంతా ఒక్కటే తప్ప వేరు కాదు, అన్న భావనతో, దుఃఖాన్ని తొలగించుకున్న వారు. 
ఆత్మా జరీ దుర్విజ్ఞేయ | నాతుడే ప్రవచన శ్రవణే ఠాయ | 
కేవళ మేధా కరీల కాయ | తరీహీ సువిజ్ఞేయ ఉపాయే | ||౧౪౦||
140. ఆత్మ జ్ఞానం పొందటం అంత కష్టమైనప్పుడు, ప్రవచనాలు వినినా అంతు పట్టనిది, కేవలం తెలివి మాత్రం ఏమి చేయగలదు? అయినప్పటికీ, ఉపాయాలతో ఆత్మను తెలుసుకోవచ్చు. 

జో స్వయే సర్వత్ర నిష్కామ | ఆత్మజ్ఞానైకమాత్రకామ | 
ఏసా జో ఆత్మయా ప్రార్థీ ప్రకామ43 | తయాసచి పరమ లాభ హా | ||౧౪౧|| 
141. ఎవరికి ఎల్లప్పుడూ ఆత్మ జ్ఞానం తప్ప మిగతా ఏ కోరికా ఉండదో, ఎవరు ఆత్మను ఎప్పుడూ వెదుకుతూ ఉంటారో, అలాంటి వారే ఈ పరమ ప్రయోజనాన్ని పొందుతారు.
శ్రవణాదికాళీ “తోచ మీ ఆహే” | ఏసియా అభేద దృష్టీ జో పాహే | 
హేచ అనుసంధాన జయాచే రాహే | ఆత్మా అనుగ్రహే వరీ త్యా | ||౧౪౨|| 
142. కథలు, కీర్తనలు వింటున్నప్పుడు “అది నేనే” అని అనుకుంటూ, దానినే తలచుకుంటూ, జీవాత్మ పరమాత్మ ఒక్కటే, వేరు కాదు అని భావించేవారినే, ఆత్మ అనుగ్రహిస్తుంది. 
సదా దుశ్చరితాసక్త | అశాంత ఆణి అసమాహిత44
నాహీ జయాచే ఎకాగ్ర చిత్త | తయా హా అప్రాప్త జ్ఞానియా | ||౧౪౩|| 
143. ఎప్పుడూ చెడు ఆలోచనలలో ఆసక్తి చూపుతూ, నిలకడ లేకుండా, శాంతి లేకుండా, అలమటించే వారికి మనసు ఏకాగ్రతగా ఉండదు. అలాంటి వారు జ్ఞానులైనా సరే, ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. 
శ్రుతిస్మృతి ప్రతిపాదిత | కరీ జో విహిత త్యాగీ అవిహిత | 
జయాచే నిత్య సమాహిత చిత్త | ఆత్మా అంకిత తయాచా | ||౧౪౪|| 
144. శృతి, స్మృతి (వేదాలు) లు యోగ్యమని చెప్పిన పనులను చేస్తూ, చెడు పనులను వదిలేసి, ఎల్లప్పుడూ స్థిరమైన మనసుతో ఉండేవారు, ఆత్మను అధీనంలో ఉంచుకోగలరు. 
దుశ్చరితాపాసావ జో విరత | ఆచార్యగురు పదీ జో వినత | 
ఫలాచీ ఇచ్చా జయాచీ నివృత్త | తయాసీచ ప్రాప్త హా ఆత్మా | ||౧౪౫|| 
145. పాపపు పనులనుండి దూరంగా ఉంటూ, గురువు పాదాలలో నమ్రతతో శరణుజొచ్చి, చేస్తున్న పనులకు వచ్చే ఫలం మీద ఏ మాత్రం ఆశ లేని వారికే, ఆత్మ లభిస్తుంది. 
న హోతా విషయీ నిష్కామ | న హోతా కేవళ ఆత్మకామ | 
న హోతా సకళవృత్తివిరామ | ఆత్మారామ దుర్గమ | ||౧౪౬|| 
146. ఇంద్రియ సుఖాల మీద కోరిక తీరనంత వరకు, కేవలం ఆత్మనే ఆశ పడనంత వరకు, మనసు నిలకడగా లేనంత వరకు, ఆత్మారాముడు దొరకడం సాధ్యం కాదు. 
పాహూని జిజ్ఞాసూచ్యా తపా | స్వయే ఆత్మ్యాస ఉపజేల కృపా | 
తైంచ ప్రకటీ నిజస్వరూపా | గురువీణ సోపా నవ్హేచ | ||౧౪౭|| 
147. సాధకుల ఆరాటం, వారి తపస్సును చూసి, ఆత్మకు దయ కలిగి, స్వయంగా తానే తన స్వరూపాన్ని కనిపించేలా చేస్తుంది. కాని, గురువు లేకుండా ఇది సులభంగా సాధ్యం కాదు. 
తరీ స్వరూపప్రాప్త్యర్థ సాధకే | కరావీ శ్రవణమననాదికే | 
అభేదభావానుసంధాన నికే | తరీచ సుఖే ఆత్మలాభ | ||౧౪౮|| 
148. అందుకు, ఆత్మను తెలుసుకోవటానికి, సాధకులు కథలు, కీర్తనలు వింటూ, వానినే చక్కగా గుర్తు చేసుకుంటూ, ఎల్లప్పుడూ జీవాత్మ పరమాత్మ ఒకటే వేరు కాదు అనే భావనను అనుభవంలో ఆచరిస్తుంటే, ఆత్మ జ్ఞానం సుఖంగా లభిస్తుంది. 
ప్రపంచ హా అజ్ఞానమయ సారా | అజ్ఞానమూలక తయాచా పసారా | 
జ్ఞానావీణ మోక్షాస థారా | నాహీ జరా హే సమజా | ||౧౪౯|| 
149. ఈ ప్రపంచం అంతా అజ్ఞానంతో నిండి ఉంది. ఈ ప్రపంచం ఇంతగా పెరగటానికి మూల కారణం కూడా అజ్ఞానమే. మోక్షం పొందటానికి జ్ఞానం తప్ప వేరే ఏ దారి లేదని తెలుసుకోవాలి. 
అనుమాన ఆణి యుక్తిప్రభవ | హా తో శాస్త్రాచా అనుభవ | 
ప్రపంచ నాశీంచ జ్ఞానోద్భవ | అసంభవ అన్యథా | ||౧౫౦||
150. ఆలోచనా శక్తి, మరియు బుద్ధియొక్క యుక్తితో, శాస్త్రాలలోని జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. కాని, మనసులోని మాయా ప్రపంచం నశించిపోతేనే, ఈ జ్ఞానం దొరకుతుంది. లేకుంటే అది సాధ్యం కాదు. 

మహాత్మా హో కా పాపాత్మా | జీవాత్మా తోచ పరమాత్మా | 
హే జాణూన వర్తేల తో మహాత్మా | అభేదాత్మా తో ఎక | ||౧౫౧|| 
151. మహాత్ముడైనా, పాపి అయినా, జీవాత్మయే పరమాత్మ అని తెలుసుకుని, అలా నడుచుకునే వాడే మహాత్ముడు. అతడే దేవుడు. 
బ్రహ్మాత్మైకత్వ విజ్ఞాన | హేచ జ్ఞానాచే పర్యవసాన | 
ఝాలియా ఎకదా ఆత్మజ్ఞాన | సమస్త అజ్ఞాన మావళే | ||౧౫౨|| 
152. బ్రహ్మతో ఒకటై పోవడమే జ్ఞానంయొక్క చివరి మెట్టు. ఆత్మ జ్ఞానం ఒక్క సారి కలగగానే, అజ్ఞానం మొత్తం నశించి పోతుంది. 
ఆత్మజ్ఞాన హోతా పురే | అవగంతవ్య45 మగ కాంహీ నురే | 
కరతలగత వస్తుజాత సారే | సాక్షాత్కారే తయాసీ | ||౧౫౩|| 
153. ఆత్మ జ్ఞానం కలిగితే చాలు. ఇక తెలుసుకోవటానికి ఏదీ మిగలదు. అరచేతిలోని ఉసిరికాయలా, ఈ ప్రపంచమంతా వారికి కనిపిస్తుంది. 
ఆత్మవిజ్ఞానాచే ఫళ | సంసార నివృత్తి అవికళ | 
పరమానంద ప్రాప్తి తాత్కాళ | తయా సుకాళ మోక్షాచా | ||౧౫౪|| 
154. ఆత్మ జ్ఞానం దొరకటం వలన, సాధకులు పరమానందాన్ని, మంచిదైన మోక్షాన్ని పొంది, ఈ ప్రపంచం నుండి ముక్తిని పొందుతారు. 
ఆత్మా సూక్ష్మాహూన సూక్ష్మతర | మహతాహూన మహత్తర | 
హా తో సర్వ వ్యాపకతా ప్రకార | బుద్ధిగోచర కరావయా | ||౧౫౫|| 
155. ఆత్మ చిన్నదానికంటే చిన్నది, పెద్దదానికంటే పెద్దది, అని చెప్పటంలోని భావం, ఆత్మ గురించి బుద్ధికి తెలియ చేయటానికి మాత్రమే. 
తో స్వయే సూక్ష్మ నా మహత | తరతమభావ46 తేథే కల్పిత | 
తో తో ఆబ్రహ్మస్తంబ పర్యంత | పరిపూరిత చరాచరీ | ||౧౫౬|| 
156. నిజానికి, ఆత్మ చిన్నదీ కాదు, పెద్దదీ కాదు. ఈ పోల్చటం కేవలం ఊహా చిత్రం అంతే. బ్రహ్మతో మొదలై ఈ సృష్టిలోని అతి చిన్న వస్తువులో కూడా, ఆత్మ పూర్తిగా ఉంది. 
తే హే అనిర్వచనీయ సత47 | బుద్ధీంత వ్హావయా సంకలిత | 
వాచేనే కరితీ మర్యాదిత | అమర్యాదిత జే స్వయే | ||౧౫౭|| 
157. ఏ హద్దూ లేని, వర్ణించటానికి వీలు కాని, ఈ ఆత్మయొక్క ఉనికిని బుద్ధికి తెలియ చేయటానికి, మాటలలో చెప్పేటప్పుడు ఆత్మను తగ్గించటం జరుగుతుంది. 
కేవళ బుద్ధి వైభవాచే యోగే | ఖరే వర్మ హాతీ న లాగే | 
సాధూ సద్గురూ సంత సంగే | సేవానురాగే48 తత్ప్రాప్తీ | ||౧౫౮|| 
158. అసలైన ఆత్మ రహస్యాన్ని, బుద్ధి ఎంత శక్తివంతమైనా, తెలుసుకోవటం సాధ్యం కాదు. సద్గురువుల, సాధు సంతుల సహవాసంలో ఉండి, వారిని సేవించి, వారి కృపను పొందిన వారికే ఆత్మ లభిస్తుంది. 
బ్రహ్మ నిరూపణ కాయ థోడే | పోథ్యా పుస్తకీ భరలే రోకడే | 
పరి సద్గురూ కృపా జో న ఘడే | హాతీ న చఢే కల్పాంతీ | ||౧౫౯|| 
159. పవిత్ర గ్రంథాలలో, పురాణాలలో బ్రహ్మ జ్ఞానం గురించిన వివరణ లేక పోలేదు. దానికి ఏ మాత్రం కరువు లేదు. కాని, సద్గురు కృప లేకుంటే, ఈ కల్పం ముగిసినా కూడా అది చేతికి చిక్కదు. 
నిత్య నైమిత్తిక కర్మాభావీ | శుద్ధసంస్కారయుక్త జో మన నాహీ | 
తోంవరీ బ్రహ్మానుభవ పాహీ | ముళీంచ కాంహీ నాగవే49 | ||౧౬౦||
160. రోజూ నియమించ బడ్డ పనులను చేయకున్నా, మనసులో పరిశుద్ధమైన సంస్కారాలు లేకపోయినా, బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవటం కాని, అనుభవించటం కాని, అసలు జరగని పని. 

బ్రహ్మ కేవళ నిత్య | తద్వ్య్తతిరిక్త సర్వ అనిత్య | 
దృశ్య జాతా నాహీ సాతత్య50 | సత్యసత్య త్రివాచా | ||౧౬౧|| 
161. ఒక్క బ్రహ్మ మాత్రమే ఎప్పుడూ ఉండేది. మిగతావన్నీ క్షణికం. కనిపించేదంతా శాశ్వతం కాదు. ఇది సత్యం, ఇదే సత్యం, ముమ్మాటికీ ఇది సత్యం అని మూడు మారులు చెప్పబడిన నిజమిది.
బ్రహ్మాచా వక్తాహీ దుర్మిళ | తైసాచ దుర్లభ శ్రోతాహీ నిర్మళ | 
వరీ ప్రేమళ ఆణి అనుభవశీల | సద్గురూ విరళ లాధాయా | ||౧౬౨|| 
162. బ్రహ్మ గురించి చెప్పేవారూ లేరు, అలాగే బ్రహ్మ జ్ఞానాన్ని వినే పవిత్రుడైన శ్రోత కూడా దొరకడు. ప్రేమమయులు, అనుభవాన్ని పొందిన సద్గురువులు అంత కంటే ఇంకా అరుదు. 
బ్రహ్మ కాయ వాటేవర పడలే | గిరీకందరీ జే జే దడలే | 
యమ నియమీ జే అడకలే | గఢలే ధ్యాన ధారణీ | ||౧౬౩|| 
163. అడగగానే ఇవ్వటానికి, బ్రహ్మ అందుబాటులో ఉందా? కొండలలో, గుహలలో దాక్కుని, యమ నియమాలతో కట్టుబడి, ధ్యానంలో మునిగిన వారికి కూడా అది దొరకదు. 
త్యాంనాహీ న హోతా గురూకృపా | యేఈనా జే బ్రహ్మ రూపా | 
తే తుజసమ యా లోభస్వరూపా | ఆతళే బాపా కైసేని | ||౧౬౪|| 
164. గురువు అనుగ్రహం లేకపోతే, బ్రహ్మ రూపం కనిపించదు. అలాంటిది, నీవంటి మూర్తీభవించిన లోభ స్వరూపానికి ఎలా లభిస్తుంది బాబూ? 
జయాస ఉదండ ద్రవ్యాసక్తి | తయాస బ్రహ్మజ్ఞాన ప్రాప్తీ | 
న ఘడే కధీంహీ కల్పాంతీ | గాంఠ నిశ్చితీ బాంధావీ | ||౧౬౫|| 
165. డబ్బు మీద అంతు లేని ఆశ ఉన్నవారికి, ఈ కల్పం ముగిసినా కూడా, బ్రహ్మజ్ఞానం దొరకదు. దీనిని బాగా గుర్తుంచుకో. 
కరితా పరమార్థ శ్రవణ | కరీ విషయాంచే చింతన | 
ఆణి ప్రపంచాచే నిదిధ్యాసన | మగ సాక్షాత్కరణహీ తైసేంచ | ||౧౬౬|| 
166. పరమార్థాన్ని వింటున్నప్పుడు, ఇంద్రియ సుఖాల గురించే ఆలోచిస్తూ, సాంసారిక వ్యవహారాల నిధిధ్యాసన చేసేవారికి, ఆత్మ కనిపించటం ఎలా సాధ్యం? 
మల విక్షేప ఆణి ఆవరణ | ఏసే త్రిదోషీ అంతఃకరణ | 
నిష్కామ కర్మే మల నిర్మూలన | విక్షేప క్షాలన ఉపాసనా | ||౧౬౭|| 
167. మలం (కోపం, ఈర్ష్య మొదలైనవి), లేనిదానిని ఆపాదించటం (విక్షేపం), మరియు నిజాన్ని కప్పి ఉంచటం (ఆవరణ) అనే మూడు దోషాలు కలిగిన మనసును, నిష్కామ కర్మ (ఫలితాన్ని ఆశించకుండా పనులు చేయటం) తో మలాన్ని కడిగి వేసి, విక్షేపాన్ని భక్తి పూజలతో (ఉపాసన) తొలగించాలి. 
స్వకర్మ ఆణీ ఉపాసనా కరితా | పరిపక్వతా యేతే కర్త్యాచే చిత్తా | 
మల విక్షేప నిర్మూళ హోతా | ఆవరణ శేషతా రాహతే | ||౧౬౮|| 
168. ఇలా నిష్కామ కర్మ మరియు ఉపాసన చేయగా మనసు పరిపక్వమవుతుంది. మలం మరియు విక్షేపాలు పోగా, ఆవరణ మిగులుతుంది. 
తే హే సర్వానర్థబీజ ఆవరణ | నాసూన జాతే ప్రకటతా జ్ఞాన | 
హోతా రవి ప్రకాశమాన | జేవీ నిరసన తిమిరాచే | ||౧౬౯|| 
169. నిజాన్ని కప్పి పుచ్చడమనే ఈ ఆవరణ, అన్ని అనర్థాలకు మూలం. సూర్యుని వెలుగుతో చీకటి తొలగిపోయేలా, జ్ఞానం కలగగానే, అజ్ఞానమైన ఆవరణ కూడా నశిస్తుంది. 
సత్యజ్ఞానానంతాది లక్షణీ | వర్ణిలే జే వేదాంతవిచక్షణీ51
తే బ్రహ్మ జ్యాచా తోచ జనీ | హోతా జ్ఞానీ విలసతే | ||౧౭౦||
170. వేదాంతంలో నిపుణులైనవారు వర్ణించిన సత్యం, జ్ఞానం, మరియు ఆనందం అన్న లక్షణాలు గల బ్రహ్మను, జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. 

థోడా అంధార థోడే చాందణే | ఎకలా పాంథస్థ రానీ చాలణే | 
బిచకలా స్థాణూ52 తస్కర భేణే | లపలా తేణే తేథేంచ | ||౧౭౧|| 
171. మసక చీకటిలో, ఒక బాటసారి, అడవిలో నడుస్తూ, ఒక చెట్టు మొండేమును చూసి, దొంగ అనుకుని, భయ పడిపోయి, అక్కడే దాక్కుంటాడు. 
ఎకలా మీ జవళీ పైసా | తో53 తర టపలా54 వాటపాడ్యా జైసా | 
ఆతా కరావా విచార కైసా | నయే భరవసా జీవాచా | ||౧౭౨|| 
172. ‘నేనొక్కణ్ణే ఉన్నాను. నా దగ్గర డబ్బుంది. వాడు దారి దోపిడి చేసే దొంగలా ఉన్నాడు. ఇప్పుడేం చేయాలి? ప్రాణంపై ఇక భరోసా ఎలాగూ లేదు’ అని అనుకుంటాడు. 
తోంచ దురూని దీప యేతా | ప్రకటతా స్థాణూచీ యథాత్మతా55
విరలీ తయాచీ భీతీగ్రస్తతా | కళలీ తీ ఆభాసతా చోరాచీ” | ||౧౭౩|| 
173. దూరంనుండి దీపం రాగానే, చెట్టు మొండెము కనిపించి, అతని భయం తొలగిపోతుంది. చెట్టును చూసి దొంగ అన్నది, లేనిది ఉన్నట్లుగా అనుకునే భ్రాంతి. 
అసో ఆతా యా ప్రాప్తాసీ | నివేదిలే వ్యత్యయ శ్రోతయాంసీ | 
పుఢీల అధ్యాయీ శ్రేయార్థియాసీ | శ్రేయ ప్రకాశీల నిజరూప | ||౧౭౪|| 
174. ఇంత వరకు శ్రోతలకు బ్రహ్మజ్ఞానం పొందటానికి ఉండే అడ్డంకులను మనవి చేశాను. తరువాతి అధ్యాయంలో, శ్రేయాన్ని కోరుకునే వారికి, శ్రేయస్సు తన రూపాన్ని ఎలా బయట పెడుతుంది అనే దాని గురించి వినండి. 
హేమాడ సాఈ పదీ లోళే | వాచేస యేఈల తైసే బరళే | 
సాఈకృపా జే జే చావళే | పరిసోత భోళే భావికతే | ||౧౭౫|| 
175. సాయి పాదాలలో హేమాడు దొర్లి, తనకు తెలిసినది చెప్పాడు. సాయి, దయతో చెప్పించిన దానిని, అమాయక భక్తులు వింటారు. 


| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | బ్రహ్మజ్ఞాన కథనం నామ | 
| శోడశోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
 
టిపణీ: 
1. ‘చతురాఈ’ హా శ్రీసాఈబాబాంచా శబ్ద, యాచా అర్థ శహాణపణ. ‘ఫార చతురాఈ కామాచీ నాహీ, శ్రేష్ఠ వ వయోవృద్ధ సాంగతీల తే ఎకత జావే,’ అసే తే ఆపల్యా భక్తంస పుష్కళదా మ్హణత. 
2. దాతా. 
3. ఇచ్ఛా. 
4. బ్రహ్మార్థీ, బ్రహ్మజిజ్ఞాసూ. 
5. జ్యాచ్యాత బ్రహ్మాచా గడ్డా అథవా భేండోళే ఆహే అశీ చీజ. 
6. యా నావాచా శిరడీతీల ఎక మారవాడీ దుకానదార. 
7. యా నావాచా ఎక వాణీ దుకానదార. 
8. దోనశే పన్నాస. 
9. ద్యావే కీ న ద్యావే, పరత యేతీల కీ నాహీ, వగైరే ప్రకారచ్యా వికల్పాంచా ఘోళ మ్హణజే ఘోటాళా పడూన. 
10. మాగితలేలా పైసా. 
11. లోభాచీచ మూర్తీ. 
12. ఆపల్యా దృష్టీసమోర చాలలేలా ఖేళ పాహత అసతా. 
13. శాస్త్రసంమత క్రమాక్రమానే చాలణే. 
14. శిరడీ, జినా. 
15. ప్రకాశానే. 
16. సూత్రాత్మా (విశ్వాత్మ్యాచ్యా లింగదేహాచా అభిమానీ). 
17. లాఖ, లయ. 
18. రూప్యాచా శేవట, మ్హణజే రూపే దిసేనాసే హోతే. 
19. అత్యంత అజ్ఞానీ. 
20. అథవా. 
21. పూర్ణజ్ఞానీ. 
22. సత్వ-రజ-తమ యా త్రిగుణాంశీ సమాగమ ఝాలా మ్హణజే. 
23. భయం ద్వితీయాభినిదేశతఃస్వాత్‍. 
24. సుఖదుఃఖ. 
25. అవయవ, నిశాణీ, ప్రతిమా. 
26. శరీర హాచ ఆత్మా అశీ జ్యాచీ దృష్టీ ఆహే తో. 
27. పరామర్ష. 
28. ఇంద్రియే. 
29. సమష్టీ, సర్వవ్యాపీ ఈశ్వరత్వ. 
30. నాశ. 
31. పూర్వీహీ నవా, త్రికాలబాధిత. 
32. పలీకడీల. 
33. ఆధార, ఆశ్రయ. 
34. సర్వవ్యాపీ. 
35. సదా. 
36. అణూహూన బారీక, అతిశయ సూక్ష్మ. 
37. మోఠా. 
38. ప్రమాణాపలీకడే. 
39. సూక్ష్మాహూన సూక్ష్మ. 
40. అవస్థితిరహిత. 
41. యోగ్యాయోగ్య. 
42. శోకనాశ. 
43. సతత, పుష్కళ. 
44. అస్థిర. 
45. జాణణే. 
46. మోఠా, త్యాహూన మోఠా అశీ జీ జాణీవ. 
47. అస్తిత్వ. 
48. సేవేపాసూన హోణార్యా కృపేనే. 
49. హాతీ లాగత నాహీ. 
50. సతతపణా, శాశ్వతీ. 
51. వేదాంతనిష్ణాత జనాంనీ. 
52. తుటలేల్యా ఝాడాచే బాకీ రాహిలేలే ఖోడ. 
53. ఖోడ, జ్యాచ్యావర చోర హీ భావనా ఝాలీ ఆహే తే. 
54. టపూన బసలా ఆహే. 
55. ఖరే స్వరూప.

Friday, February 15, 2013

||చోళకరశర్కరాఖ్యానం నామ పంచదశోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౫ వా|| 

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

ఫళలీ జయాంచీ పుణ్యే అగాధే | తయాంసీంచ సాఈ దర్శన లాధే | 
త్రివిధ తాప తయా న బాధే | సాధన సాధే పరమార్థా | ||౧|| 
1. అంతులేని పుణ్యం పొందిన వారికే సాయి దర్శనం దొరుకుతుంది. అధిభౌతిక, అధిదైవిక మరియు ఆధ్యాత్మిక అను మూడు తాపాలు వారిని బాధించవు, పైగా సాధనతో పరమార్థాన్ని పొందుతారు.
కృపా కరా జీ శ్రోతేజన | క్షణైక కరోని నిజగురుచింతన | 
కథేసీ కరా సాదర మన | ఘ్యా అవధాన మజకడే | ||౨|| 
2. ఓ శ్రోతలారా! దయచేసి, ఒక క్షణం గురువును ధ్యానించి, ఈ కథలమీద శ్రద్ధ కలిగి, మీ దృష్టిని నా వైపు మళ్ళించండి. 
ఆహాంత తుమ్హీ ఠావే ఆమ్హా | వ్యర్థ పరిశ్రమ కాంహే తుమ్హా | 
ఏసే న మ్హణా కరా క్షమా | ఉపమా తుమ్హా సాగరాచీ | ||౩|| 
3. మిమ్మల్ని సముద్రంతో పోల్చుతున్నందుకు, ‘మాకు అన్నీ తెలుసు. వృథా శ్రమ మీకెందుకు?’ అని అలక్ష్యంతో అనకండి. నన్ను క్షమించండి. 
భరలా జరీ అపరంపార | తరీ న సరితే పరతవీ సాగర | 
ఘన వర్షతా సహస్రధార | తయాస హీ థార దేఈ తో | ||౪|| 
4. అంతులేకుండా నిండి ఉన్నా, సాగరం ఎప్పుడూ నదులను వెనుకకు పంపదు. మబ్బులు కుండపోత వర్షాన్ని కురిపించినా, నదుల నీటికి చోటిస్తుంది. 
తైసే తుమ్హీ శ్రోతే సజ్జన | తుమ్హాంమాజీ కరావే మజ్జన | 
ఇచ్ఛా ధరిలీ న కరా తర్జన1 | దీన వర్జన బరవేనా | ||౫|| 
5. అలాగే మీరు కూడా, సజ్జనులైన శ్రోతలారా! మీతో సహవాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. దీనులను త్యజించటం మంచిది కాదు. 
యేవో గంగేచే జల నిర్మళ | అథవా గాంవీచా లేండ ఓహోళ | 
సాగరాపోటీ దోహీంసీ స్థళ | సంగమీ ఖళమళ విరహిత | ||౬|| 
6. నిర్మలమైన గంగా జలం కాని, ఊరిలోని మురికి నీటి ప్రవాహంగాని, ఈ రెంటికీ సాగరంలో చోటు ఉంటుంది. ఆ సాగర సంగమం వలన ఎటువంటి అలజడి ఉండదు. 
మ్హణోన తుమ్హా శ్రోతియా చిత్తా | సంత కథాశ్రవణీ జే ఆస్థా | 
తేచ స్వయే పావేల సాఫల్యతా | కృపేనే పాహతా మజకడే | ||౭|| 
7. అందువలన, నాయందు దయ ఉంచితే, సత్పురుషుల కథలను వినాలనే మీ ఆసక్తికి, మంచి ఫలితాన్ని పొందగలరు. 
సబూరీ2 ఆణి శ్రద్ధాయుక్త | సాదర సేవితా హే కథామృత | 
ఆతుడేల భక్తి ప్రేమ యుత | శ్రోతే కృతకృత్య హోతీల | ||౮|| 
8. అమృతం లాంటి ఈ కథను, ఆదరంతో, శ్రద్ధ, సహనంతో వింటే, విన్నవారు ప్రేమతో కూడిన భక్తిని పొంది ధన్యులవుతారు. 
భక్తా సహజ పరమ ప్రాప్తి | శ్రోతయా భక్తి ఆణి ముక్తి | 
భావార్థియా సౌఖ్య శాంతి | నిజ విశ్రాంతీ సకళికా | ||౯|| 
9. దీనిని వినటం వలన, విన్నవారు భక్తిని, ముక్తిని పొందుతారు. భక్తులు సహజంగా పరమార్థాన్ని పొందుతారు. భక్తులు కానివారు సుఖశాంతులను, మనసుకు విశ్రాంతిని పొందుతారు. 
గురుముఖీంచ్యా గోడ కథా | ఏకతా నిరసేల భవభయ వ్యథా | 
హోఈల ఆనంద శ్రోతియాంచ్యా చిత్తా | స్వయే నిజాత్మతా ప్రకటేల | ||౧౦||
10. గురువు నోటినుండి వచ్చిన మధురమైన కథను వింటే, సంసార బంధాల భయం, బాధ తొలగిపోతుంది. ఆత్మ రూపం తానే శ్రోతలకు కనిపించి, మనసుకు ఆనందం కలిగిస్తుంది. 

యే అధ్యాయీ నిరూపణ | ప్రేమళ భక్తాంచే సాఈంస ప్రార్థన | 
దర్శన దేఊని సాఈ ప్రసన్న | హోతీ కైసేని త్యా పరిసా | ||౧౧|| 
11. ప్రేమతో నిండిన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా, వారు అతనికి దర్శనమిచ్చి, ప్రసన్నులయిన సంగతిని ఈ అధ్యాయంలో జాగ్రత్తగా వినండి. 
నుకతీచ పాజూని గేలీ బాహేరీ | మాగుతేని ఆలీ జరీ మార్జారీ | 
తరీ ఫిరఫిరోని పోరే తిజవరీ | ధాంవతీ ప్రేమభరీ లుంచావయా | ||౧౨|| 
12. పిల్లి పిల్లలు అప్పుడే పాలు త్రాగినా, ఆ పిల్లి బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే, ఆ పిల్లలు తల్లిపై పడి, మరల మరల పాలు త్రాగటానికి పరుగెత్తుతాయి. 
మగ తే కంటాళుని గురగురే | క్షణైక జరీ దబతీ పోరే | 
ఆఈ నివాంత బైసలీ పురే | ఘాలోని భంవరే లుంచతీ | ||౧౩|| 
13. విసుగుతో ఆ పిల్లి అప్పుడు, గురగురమన్నా, ఒక క్షణం అణిగి ఉండి, తల్లి కూచుంటే చాలు, పిల్లలు దాని చుట్టూ చేరి ప్రేమగా తిరుగుతాయి. 
లుంచతా ఠోసతా ప్రేమభరే | ఆఈ లాగీ పాన్హా పాఝరే | 
మగ తీచ పూర్వీల గురగురణే విసరే | ప్రీతీనే పసరే క్షితీవరీ | ||౧౪|| 
14. అలా పిల్లలు పాలు త్రాగటానికి వచ్చి, ప్రేమతో పాలు చేపగా, ఆ పిల్లి గురగురమని అనకుండా, ప్రీతిగా నేలపై కాళ్ళు చాపుకుని ఒరుగుతుంది. 
ప్రేమోదయీ హరపే కంటాళా | చౌపాయీ కవటాళీ దృఢ నిజబాళా | 
వరచేవరీ చాటీ అవలీళా | కాయ తో సోహళా అలోలిక | ||౧౫|| 
15. ప్రేమ పుట్టగానే, విసుగు మాయమౌతుంది. పిల్లలను గట్టిగా పెనవేసుకుని, మాటిమాటికీ నాకుతుంది. ఎంత విచిత్రమైన దృశ్యం! 
పోరాంచ్యా తీక్షణ నఖప్రహారే | జో జో మాతేచీ ఓంటీ విదారే | 
తో తో అధిక ప్రేమాచే ఝరే | దుగ్ధ ఓఝరే బహుధారా | ||౧౬|| 
16. వాడియైన గోళ్ళతో పిల్లలు తల్లి పొదుగును గోకుతుంటే, ప్రేమ పొంగి, పాలు ఎక్కువై, ఎన్నో ధారలుగా, బాగా వచ్చేలా చేస్తాయి. 
జైసీ త్యా బాళాంచీ అనన్య భక్తీ | మాతేసీ కరీ దుగ్ధోత్పత్తి | 
తైసీచ తుమచీ సాఈ పదాసక్తి | ద్రవవీల చిత్తీ సాఈంతే | ||౧౭|| 
17. ఆ పిల్లల అంతు లేని ప్రేమ కారణంగా, తల్లికి పాలధార ఎలా వస్తుందో, అలా సాయి పాదాలమీద మీకున్న, ఆసక్తి, భక్తి, సాయి మనసును కరిగేలా చేస్తుంది. 
ఎకదా హరిభక్తి పరాయణ | గణుదాసాంచే సుశ్రావ్య కీర్తన | 
కౌపినేశ్వర సన్నిధాన | ఠాణియాచే జన కరవితీ | ||౧౮|| 
18. ఒక సారి, హరిభక్తి పరాయణుడైన దాసగణుగారి మధురమైన కీర్తనను, కౌపీనేశ్వర ఆలయంలో ఠాణా ప్రజలు ఏర్పాటు చేశారు. 
పడలియా శిష్టాంచా ఆగ్రహ | గణుదాస కరితీ కథానుగ్రహ | 
ఎకా కవడీచా హీ పరిగ్రహ | కింవా దురాగ్రహ తేథే నా | ||౧౯|| 
19. సజ్జనుల ప్రార్థనతో దాసగణు హరికథను వినిపించేవాడు. కాని, ఒక గవ్వైనా తీసుకునే వాడు కాదు. అలా అని దురభిమానంగా ఉండేవాడు కాదు. 
కీర్తనా నలగే దేణే కవడీ | తను ఉఘడీ డోఈ న పగడీ | 
కాంసేసీ సాధీచ పంచే జోడీ | అనివార ఉడీ శ్రోత్యాంచీ | ||౨౦||
20. తన కీర్తనకు అతను గవ్వైనా ఆశించేవాడు కాదు. అతని దేహం పైన చొక్కాగాని, తలపైన పాగా కాని ఉండేవి కావు. సాధారణంగా నడుముకు పంచె ఉండేది, అంతే. అయినా వినేవారు విపరీతంగా వచ్చేవారు. 

యా పోషాఖాచీ హీ కథా | మౌజ వాటేల శ్రవణ కరితా | 
అవధారా తీ స్వస్థ చిత్తా | పహా ఆశ్చర్యతా బాబాంచీ | ||౨౧|| 
21. కథలో ఓ చిన్న కథగా, దాసగణు దుస్తుల కథను వింటే, ఎంతో వినోదంగా ఉంటుంది. బాబాయొక్క అద్భుతమైన లీలలను శాంతంగా వినండి.
ఎకదా గణుదాసాంచీ కథా | శిరడీ గ్రామీ హోణే అసతా | 
అంగరఖా ఉపరణే ఫేటా మాథా | పోషాఖ సమన్వితా నిఘాలే | ||౨౨|| 
22. శిరిడీ గ్రామంలో ఒక సారి దాసగణు కీర్తన చేయాల్సి ఉండేది. అప్పటి ఆచారంలాగా, శరీరంపై అంగరఖా (కోటులాంటిది), కండువా, తలకు పేటా (తలపాగా) కట్టుకుని, బయలుదేరాడు. 
శిష్టాచారానుసారతా | ఆనందే బాబాంస వందూ జాతా | 
“వాహవా నవర దేవ కీ సజలాసి ఆతా” | బాబా వదతా దేఖిలే | ||౨౩|| 
23. ఎప్పటిలాగే, వెళ్ళి బాబా పాదాలకు ఆనందంగా నమస్కారం చేయగా, బాబా “వాహవా! పెళ్ళికొడుకులాగా అలంకరించుకున్నావు. 
“జాతోస కోఠే ఏసా సజూని” | బాబా పుసతీ తయాంలాగూని | 
‘కీర్తన కరాయా జాతో’ మ్హణూని | దాసగణూనీ కథియేలే | ||౨౪|| 
24. “ఎక్కడకు వెళ్తున్నావేమిటి ఇలా సింగారించుకుని?” అని అతనిని అడిగారు. ‘కీర్తన చేయటానికి వెళ్తున్నాను’ అని దాసగణు జవాబిచ్చాడు. 
పుఢే బాబా వదతీ తయాంస | “అంగరఖా ఉపరణే ఫేటా కశాస | 
కిమర్థ కేలాస ఇతుకా ప్రయాస | నలగతీ ఆపుల్యాస తీ కాంహీ | ||౨౫|| 
25. మరలా బాబా అతనితో, “అంగరఖా, ఉత్తరీయం పేటా ఎందుకు? ఎందుకింత కష్టపడ్డావు? ఇలాంటివన్నీ మనకు పనిలేదు. 
కాఢ కీ తీ మజసమోర | కశాస అంగావర యాంచా భార” | 
తంవ తీ తయాంచ్యా అనుజ్ఞేనుసార | తేథేంచ చరణావర ఠేవిలీ | ||౨౬|| 
26. “వీటన్నిటినీ నా ముందు నుంచి తీసేయి. ఒంటి మీద ఎందుకింత భారం?” అని చెప్పారు. వారు చెప్పినట్లే, అప్పుడు దాసగణు వానిని తీసి, వారి పాదాల మీద పెట్టాడు. 
తైంపాసూని ఉఘడే సోజ్జ్వళ | హాతీ చిపళీ గళా మాళ | 
కీర్తన సమయీ సర్వకాళ | గణుదాస హా వేళపర్యంత | ||౨౭|| 
27. అప్పటినుండి, ఇప్పటి దాకా, అతడు కీర్తన సమయంలో ఎప్పుడూ, చొక్కా లేకుండా, చేతిలో చిరుతలు, మెడలో మాలను ధరించేవాడు. 
తర్హా హీ జరీ జనవిరుద్ధ | తరీ తీ అత్యంత పాయాశుద్ధ | 
కీ జో ప్రబుద్ధాంచా ప్రబుద్ధ | నారద ప్రసిద్ధ హా మార్గ | ||౨౮|| 
28. అప్పటి ఆచారానికి ఇది విరుద్ధమైనా, ఇది చాలా శుద్ధమైన పద్ధతి. జ్ఞానులలో జ్ఞాని అయిన నారదుని పద్ధతి ఇదే. 
హీ నారదీయ మూళ గాదీ | యేథూనచి హరిదాసాంచీ మాందీ | 
బాహ్య రంగాచీ న జ్యా ఉపాధీ | అంతఃశుద్ధి ధ్యేయ జ్యా | ||౨౯|| 
29. ఇదే నారదీయ మూల సంప్రదాయం. ఇక్కడినుండే హరిదాసుల పరంపర మొదలైంది. వీరి లక్ష్యం అంతరంగ శుద్ధి. బయటి అలంకారాలతో వీరికి పని లేదు. 
అధోభాగాచి వస్త్రాచ్ఛాదిత | చిపళ్యా వీణా వాజవీత | 
ముఖా హరినామ గర్జత | ధ్యాన విశ్రుత నారదాచే | ||౩౦||
30. నడుముకంటే క్రింది భాగాన్ని మాత్రం వస్త్రంతో కప్పుకుని, ఎడమ చేతిలో చిరుతలు, కుడి చేతిలో తంబూరా వాయించుకుంటూ, నోటితో హరినామాన్ని పాడుతూ ఉండే నారదుని రూపం, అందరికీ తెలిసినదే. 

సాఈ సమర్థాంచే కృపేనే | స్వయే రచూని సంతాంచీ ఆఖ్యానే | 
మోలావీణ కరితీ కీర్తనే | ఖ్యాతీ తేణే పావలే | ||౩౧|| 
31. సాయి సమర్థుల కృపతో, సాధు సంతుల కథలను తానే స్వయంగా రచించి, ఏ కానుకలూ తీసుకోకుండా, దాసగణు కీర్తనలు చేసి, ప్రసిద్ధి చెందాడు. 
ఉల్హాస సాఈభక్తీచా | దాసగణూనే విస్తారిలా సాచా | 
వాఢవిలా సాఈప్రేమరసాచా | స్వానందాచా సాగర | ||౩౨|| 
32. సాయి భక్తి గురించి ఉత్సాహాన్ని పెంచి, ఇంకా ఎందరో ఆ ఉత్సాహాన్ని పంచుకునేలా చేశాడు. ఆత్మ రూపాన్ని కనుక్కుంటే కలిగే ఆనందంలాంటి, సాయి ప్రేమ రసాన్ని పెరిగేలా చేశాడు. 
భక్తశిరోమణీ చాందోరకర | తయాంచేహీ అత్యంత ఉపకార | 
సాఈ చరణ భక్తి విస్తార | కారణ సాచార హే మూళ | ||౩౩|| 
33. భక్తులలో తలమానికంలాంటి చాందోర్కరు కూడా చాలా ఉపకారం చేశాడు. సాయి పాదాలయందు భక్తి బాగా పెరగటానికి అతడే మూల కారణం. 
దాసగణూంచే ఇకడే యేణే | ఎకా చాందోరకరాంచ్యా కారణే | 
జాగోజాగ తయాంచీ కీర్తనే | సాఈంచీ భజనే చాలలీ | ||౩౪|| 
34. దాసగణు శిరిడీకి రావడం కూడా నానా చాందోర్కరుని వలనే. దాసగణు ఎన్నో చోట్లలో హరి కీర్తనలు, సాయి భజనలు చేసేవాడు. 
పుణే నగర సోలాపూరప్రాంతీ | పూర్వీంచ మహారాజాంచీ ఖ్యాతీ | 
పరి యా కోంకణచ్యా లోకాంప్రతీ | లావిలీ భక్తి యా దోఘీ | ||౩౫|| 
35. పుణే, శోలాపుర, అహమ్మదునగర జిల్లా, మొదలైన ప్రాంతాలలో సాయి మహారాజు ఖ్యాతి అదివరకే వ్యాపించి ఉంది. కాని, కొంకణ ప్రాంతంలోని ప్రజలలో సాయి భక్తిని వ్యాపింప చేసింది వీరిద్దరే. 
ముంబఈ ప్రాంతీ జీ సాఈభక్తి | తియేచే మూళ యా దోన వ్యక్తి | 
సాఈమహారాజ కృపామూర్తి | తయాంచే హాతీ ప్రకటలే | ||౩౬|| 
36. వీరిద్దరి మూలంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి పెరిగింది. వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది. 
శ్రీకౌపీనేశ్వరమందిరీ | సాఈ కృపేచ్యా కీర్తనగజరీ | 
హరి నామాచ్యా జయజయకారీ | ఉఠలీ లహరీ చోళకరాం | ||౩౭|| 
37. శ్రీ కౌపీనేశ్వర మందిరంలో, హరి నామంతో పాటు సాయి నామ జయజయకారాల నడుమ కీర్తన సాగిపోతుండగా, చోళకరుకు ఒక కోరిక కలిగింది. 
హరికీర్తనా బహుత యేతీ | శ్రవణా శ్రవణాచ్యా అనేక రీతీ | 
కోణా ఆవడే బువాంచీ వ్యుత్పత్తి | హావభావ స్థితి కవణా | ||౩౮|| 
38. కీర్తన వినడానికి చాలా మంది వస్తారు. ఎన్నో రకాల వినేవారుంటారు. కొందరికి హరిదాసుగారు చెప్పే పద్ధతి ఇష్టమైతే, ఇంకొందరికి వారి హావభావాలు ఇష్టం. 
కోణా ఆవడ గాణ్యాపురతీ | వాహవా బువా కాయ హో గాతీ | 
కాయ తే విఠ్ఠలనామీ రంగతీ | కథేంత నాచతీ ప్రేమానే | ||౩౯|| 
39. మరి కొందరికి, వారు పాడే పాట నచ్చుతుంది. ‘వహవ్వా! దాసుగారు ఎంత బాగా గానం చేస్తారు. విఠల నామ సంకీర్తనలో ఎలా లీనమై పోతారు, కథ చెబుతూ ఎంత బాగా నాట్యం చేస్తారు’ అని ఆనందిస్తారు. 
కోణాస పూర్వరంగీ భక్తి | కోణాచీ కథాభాగీ ఆసక్తి | 
కోణాస హరిదాసీ నకలా రుచతీ | ఆఖ్యానీ ప్రీతి కోణాస | ||౪౦||
40. అసలు కథకు మునుపు చెప్పే పిట్టకథలు కొందరికి ఇష్టం. మరి కొందరికి కథాభాగం నచ్చుతుంది. ఇంకొందరికి, హరిదాసుగారు ఎవరెవరినో అనుకరిస్తూ చేసే హాస్యం ఇష్టం. మిగతా కొందరికి అసలు కథ తరువాత చెప్పే పిట్టకథలంటే చాలా ఇష్టం. 

బువా ప్రాకృత కీ వ్యుత్పన్న | కీ పదపదార్థ బహ్వర్థ సంపన్న | 
కీ కేవళ ఉత్తరరంగప్రవీణ | కథా శ్రవణ యే పరీ | ||౪౧|| 
41. బువా (హరిదాసు) విద్వాంసుడా, విద్యలేని వాడా; టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా, లేక కథలు చెప్పడంలోనే ప్రవీణుడా మొదలైన ఆలోచనలు కీర్తన వినేవారికి వస్తూ ఉంటుంది.
ఏసే శ్రోతే బహుత అసతీ | పరి శ్రవణే శ్రద్ధా భక్తి | 
జోడే ఈశ్వర వా సంతచరణీ ప్రీతి | హీ శ్రోతృస్థితీ దుర్మిళ | ||౪౨|| 
42. ఇలా వినేవారు చాలా రకాలుగా ఉంటారు. కాని, వినటంలో శ్రద్ధా, భక్తిని పెంచుకుని, దేవుడియందు, సాధు సంతులయందు, ప్రీతి కలిగి ఉండే శ్రోతలు చాలా అరుదు. 
శ్రవణ కేలే భారాభర | పరి అవిద్యేచే థరావరథర | 
తే కాయ శ్రవణాచే ప్రత్యంతర | వ్యర్థ భారాభర శ్రవణ తే | ||౪౩|| 
43. ఎన్ని కీర్తనలు విన్నా అజ్ఞానం పొరలు అలాగే ఉంటే, ఆ వినడం దండుగే కాని, దానివల్ల ఏం ప్రయోజనం? 
న ఘడే జేణేనీ మళ క్షాళణ | త్యాతే కాయ మ్హణావే సాబణ | 
న కరీ జే అవిద్యానిరసన | తే కాయ శ్రవణ మ్హణావే | ||౪౪|| 
44. చేతికి అంటుకున్న మురికిని కడగలేని దానిని సబ్బు అని అనగలమా? అజ్ఞానాన్ని తొలగించలేని దానిని శ్రవణం అని అంటామా? 
ఆధీంచ చోళకర3 శ్రద్ధాళూ | ఆలా సాఈ ప్రేమాచా ఉమాళూ | 
మనాంత మ్హణతీ బాబా కృపాళూ | కరా సాంభాళూ దీనాచా | ||౪౫|| 
45. అసలే చోళకరు మంచి భక్తి కలవాడు. కీర్తన వింటూ ఉండగా, సాయిపై అతనికి ప్రేమ పొంగింది. ‘సాయి దయామయా! ఈ దీనుని అనుగ్రహించు’ అని మనసులో వేడుకున్నాడు. 
బిచారా గరీబ ఉమేదవార | పోసూ అసమర్థ కుటుంబభార | 
సరకార పదరీ మిళావా శేర | బాబాంసీ భార ఘాతలా | ||౪౬|| 
46. పరిశీలనలో ఉన్న పేదవాడు, డబ్బు లేనివాడు. కుటుంబ భారాన్ని మోయలేని దీనుడు. ప్రభుత్వ పనిలో ఉండగా, కుటుంబానికి సరిపడా సంపాదన ఇప్పించాలని బాబాపై భారం మోపాడు. 
నవస కరితీ కాముక జన | హోఈల జరీ అభీష్ట సంపాదన | 
తరీ ఘాలూ ఇచ్చాభోజన | కరూ బ్రాహ్మణసంతర్పణ | ||౪౭|| 
47. తమ కోరికలు తీరినప్పుడు, చక్కని భోజనాన్ని పెడతామని, లేక బ్రాహ్మణ సంతర్పణ చేస్తామని, కోరికలున్న ప్రజలు మ్రొక్కుకుంటారు. 
శ్రీమంతాంచే నవస వచన | మ్హణతీ ఘాలూ సహస్రభోజన | 
అథవా కరూ శతగోదాన | మన కామనా తృప్త హోతా | ||౪౮|| 
48. శ్రీమంతులైతే, తమ కోరిక తీరగానే, వేయి మందికి భోజనం పెట్టుతామని, లేక వంద ఆవులను దానం చేస్తామని మ్రొక్కుకుంటారు. 
చోళకర ఆధీంచ నిర్ధన | నవస కరావయా ఝాలే మన | 
ఆఠవూని శ్రీసాఈంచే చరణ | దీన వదన తో బోలే | ||౪౯|| 
49. చోళకరు అసలే పేదవాడు. మ్రొక్కుకోవాలని అనిపించింది. సాయి పాదాలను ధ్యానించి, దీనంగా వేడుకున్నాడు. 
బాబా గరీబీచా సంసార | నోకరీవరీ సారీ మదార | 
కాయమచా వ్హావయా పగార | పరీక్షా పసార హో లాగే | ||౫౦||
50. ‘బాబా! నాది పేద కుటుంబం. ఉద్యోగం పైనే ఆధార పడ్డాం. పరిశీలనలో ఉన్న ఉద్యోగం ఖాయం కావాలంటే, వచ్చే పరీక్షలో నెగ్గాలి. 

పరిశ్రమాంతీ కేలీ తయారీ | పాస హోణ్యావర భిస్త సారీ | 
నాతరీ గాంఠీచీ భాకరీ | ఉమేదవారీ జాఈల | ||౫౧|| 
51. ‘నా జీవితం ఉద్యోగంపైనే ఆధార పడి ఉంది. శ్రమ పడి పరీక్షకు తయారయ్యాను. పరిశీలనలో ఉన్న ఉద్యోగం ఖాయం కావాలంటే, పరీక్షలో నెగ్గాలి. లేకపోతే, ఈ తాత్కాలిక ఉద్యోగం ఊడిపోతుంది. 
ఝాలో కృపేనే పాస జర | హోఈన ఆపులే పాయీ సాదర | 
వాటీన నాంవానే ఖడీసాఖర | హాచ నిర్ధార పై మాఝా | ||౫౨|| 
52. ‘మీ కృపతో పరీక్షలో నెగ్గానంటే, మీ పాదాల దగ్గరకు వచ్చి, మీ పేర పటిక బెల్లాన్ని పంచి పెడతాను. ఇది నా దృఢ నిశ్చయం’. 
ఎణేం పరీ నవస కేలా | మనాజోగా ఆనంద ఝాలా | 
నవస ఫేడాయా విలంబ లాగలా | త్యాగ కేలా సాఖరేచా | ||౫౩|| 
53. అని మ్రొక్కుకున్నాడు. అతని కోరిక తీరింది. ఎంతో ఆనందించాడు. మ్రొక్కు తీర్చడానికి ఆలస్యమై పోతుందని, పంచదార తీసుకోవడం మానివేశాడు. 
వాటేంత గాంఠీస కాంహీ వ్హావే | రిక్త హస్తే కైసే జావే | 
ఆజచే ఉద్యాంవర లోటావే | దివస కంఠావే లాగలే | ||౫౪|| 
54. దారి ఖర్చులకు డబ్బు కావాలి. ఉత్తి చేతులతో బాబా దగ్గరకు ఎలా వెళ్ళాలి? ఇవాళ, రేపు అని రోజులు గడిచిపోతున్నాయి. 
ఓలాండవేల నాణేఘాంట4 | సహ్యాద్రీచా కడాహీ అఫాట | 
పరి ప్రపంచికా హా ఉంబరేఘాంట5| బహు దుర్ఘట ఓలాండూ | ||౫౫|| 
55. సహ్యాద్రి కొండలలోని భయంకరమైన నాణే ఘాటును దాటేయ వచ్చు, కాని సంసారులకు ఇంటి గడప దాటడం కూడా చాలా కష్టం. 
నవస న ఫేడితా శిరడీచా | అసేవ్య పదార్థ సాఖరేచా | 
చహాహీ బిన సాఖరేచా | చోళకరాంచా చాలలా | ||౫౬|| 
56. శిరిడీకి వెళ్ళి మ్రొక్కు తీర్చుకునే వరకు, పంచదార వేసిన పదార్థాలను మానివేసి, త్రాగే టీ కూడా చక్కెర లేకుండానే తీసుకో సాగాడు. 
జాతా ఏసే కాంహీ దివస | ఆలీ వేళ గేలే శిరడీస | 
ఫేడిలా తై కేలేలా నవస | ఆనంద మనాస జాహలా | ||౫౭|| 
57. అలా కొన్ని రోజులు గడిచాయి. కాలం కలిసి వచ్చింది. శిరిడీకి వెళ్ళి మ్రొక్కు తీర్చుకుని చాలా ఆనందించాడు. 
హోతాంచ సాఈంచే దర్శన | చోళకర ఘాలితీ లోటాంగణ | 
వందోనియా బాబాంచే చరణ | ఆల్హాద పరిపూర్ణ తే ఝాలే | ||౫౮|| 
58. సాయిని దర్శించుకుని, వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. మనసుకు తృప్తి, ఆనందం రెండూ కలిగాయి. 
మన కరూనియా నిర్మళ | వాటితీ సాఖర అర్పితీ శ్రీఫళ | 
మ్హణతీ ఆజి మనోరథ సకళ | ఝాలే సఫళ కీ మాఝే | ||౫౯|| 
59. నిర్మలమైన మనసుతో, సాయికి శ్రీఫలాన్ని (కొబ్బరికాయ) అర్పించి, పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ‘ఈ రోజు నా అన్ని కోరికలూ తీరి, నా జీవితం సార్థకమైంది’ అని అనుకున్నాడు. 
ఆనందలే సాఈదర్శనే | సుఖ జాహలే సంభాషణే | 
హోతే చోళకర జోగాంచే పాహుణే | ఆలే జాణే జోగాంకడే | ||౬౦||
60. సాయి దర్శనంతో ఆనందించి, వారితో మాట్లాడటంతో తృప్తి చెందాడు. చోళకరు జోగు వద్ద అతిథిగా ఉండటం వలన, జోగు వద్దకు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. 

జోగ ఉఠలే పాహుణే నిఘాలే | బాబా జోగాంస వదతే ఝాలే | 
“పాజీ యాంస చహాచే ప్యాలే | భలే భరలే సాఖరేచే” | ||౬౧|| 
61. బయలుదేరటానికి జోగు లేవగానే, చోళకరు కూడా లేచాడు. అప్పుడు బాబా జోగుతో “ఇతనికి బాగా చక్కెర వేసి, కప్పుల నిండా చహా ఇవ్వు” అని చెప్పారు.
ఖుణేచీ అక్షరే పడతా కానీ | చోళకర చమత్కారలే మనీ | 
ఆనందాశ్రూ ఆలే నయనీ | మాథా చరణీ ఠేవిలా | ||౬౨|| 
62. తన రహస్యం గురించిన మాటలు చెవిన పడగానే, చోళకరు ఆశ్చర్య పడ్డాడు. వెంటనే, కళ్ళనుండి ఆనందంతో నీరు ప్రవహించ సాగింది. సాయి పాదాల మీద తన తలను ఉంచాడు. 
కౌతుక వాటలే జోగాంనా | త్యాహూన ద్విగుణ చోళకరాంనా | 
కారణ ఠావే తయాంచే త్యాంనా | పటల్యా ఖుణా మనాచ్యా | ||౬౩|| 
63. బాబా మాటలు జోగుకు చాలా వింతగా అనిపించింది. కాని, చోళకరుకు అంతకంటే రెండింతలు ఆశ్చర్యం వేసింది. అతనొక్కడికే, బాబా మాటలలోని ఉద్దేశం అర్థమైంది. 
చహా నాహీ బాబాంస ఠావా | యేక్షణీంచ కా ఆఠవావా | 
చోళకరాంచా విశ్వాస పటావా | ఠసా ఉమటవా భక్తీచా | ||౬౪|| 
64. బాబా ఎప్పుడూ చహా త్రాగలేదు. అకస్మాత్తుగా అది ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చింది? చోళకరుకు నమ్మకం కలిగించటానికి. అతని భక్తిని దృఢ పరచటానికి. 
ఇతక్యాంచ పురా దిలా ఇశారా | కీ “పావలీ వాచాదత్త శర్కరా | 
తుఝ్యా త్యాగాచా నేమహీ పురా | చోళకరా ఝాలాసే | ||౬౫|| 
65. ఇంతలో, అనుకోకుండా, చోళకరుకు బాగా అర్థమయ్యేలా “చోళకరు! నువ్వు అనుకున్న పటిక బెల్లం అందింది. అలాగే నీ త్యాగం గురించిన నియమం కూడా పూర్తయింది. 
నవస వేళేచే తుఝే చిత్త | దీర్ఘసూత్రతేచే ప్రాయశ్చిత్త | 
హే జరి తుఝే ఠేవణే గుప్త | తే మజ సమస్త కళలేగా | ||౬౬|| 
66. “మ్రొక్కు తొందరగా తీర్చలేక, చక్కెరను మానుకుని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. నువ్వు దీనిని రహస్యంగా దాచినా, నాకు అన్నీ తెలిసింది. 
తుమ్హీ కోణీ కుఠేంహీ అసా | భావే మజపుఢే పసరితా పసా | 
మీ తుమచియా భావా సరిసా | రాత్రందిసా ఉభాచ | ||౬౭|| 
67. “మీరెవరైనా సరే, ఎక్కడనుంచి అయినా సరే, భక్తి భావంతో నా ముందు చేతులు చాపితే, మీ భక్తి శ్రద్ధలను బట్టి, రాత్రింబవళ్ళూ మీ దగ్గరే ఉంటాను. 
మాఝా దేహ జరీ ఇకడే | తుమ్హీ సాతాం సముద్రాంపలీకడే | 
తుమ్హీ కాంహీంహీ కరా తికడే | జాణీవ మజకడే తాత్కాళ | ||౬౮|| 
68. “నా దేహం ఇక్కడున్నా, మీరు ఏడు సముద్రాల అవతల ఏం చేస్తున్నా, నాకు వెంటనే తెలిసిపోతుంది. 
కుఠేంహీ జా దునియేవర | మీ తో తుమ్హా బరోబర | 
తుమ్హా హృదయీంచ మాఝే ఘర | అంతర్యామీ తుమచే మీ | ||౬౯|| 
69. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. మీ లోపల ఉండేవాడు నేనే. 
ఏసా తుమ్హా హృదయస్థ జో మీ | తయాసీ నమా నిత్య తుమ్హీ | 
భూత మాత్రాచ్యాహీ అంతర్యామీ | తోచ తో మీ వర్తతో | ||౭౦||
70. “ఇలా ఎప్పుడూ మీ హృదయంలో ఉండే నన్ను మీరు రోజూ పూజించండి. అన్ని జీవులలో లోపల ఉన్నదీ నేనే. 

యాస్తవ తుమ్హాంస జో జో భేటే | ఘరీ దారీ అథవా వాటే | 
తే తే ఠాయీ మీచ రహాటే | మీచ తిష్ఠే త్యామాజీ | ||౭౧|| 
71. “ఇంట్లోగాని, బయటగాని, లేదా దారిలోగాని, ఎక్కడ ఎవరు మీకు కనిపించినా, వారంతా నా ప్రతిరూపమే. వారి లోపల కూర్చున్నది నేనే. 
కీడ ముంగీ జలచర ఖేచర | ప్రాణి మాత్ర శ్వాన శూకర | 
అవఘ్యా ఠాయీ మీచ నిరంతర | భరలో సాచార సర్వత్ర | ||౭౨|| 
72. “చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన ఎగిరే పక్షులు, కుక్కలు, పందులు, మొదలైన ప్రాణులన్నింటిలోనూ, అన్ని చోట్లా అంతు లేకుండా నిండి ఉన్నాను. 
మజశీ ధరూ నకా అంతర | తుమ్హీ ఆమ్హీ నిరంతర | 
ఏసే మజ జో జాణీల నర | భాగ్య థోర తయాచే” | ||౭౩|| 
73. “నన్ను వేరుగా అనుకోకండి. మీకూ నాకూ ఏ మాత్రం తేడా లేదు. నన్ను ఇలా తెలుసుకున్నవారు గొప్ప అదృష్టవంతులు”. 
దిసాయా హే వార్తా తోకడీ | పరి గుణానే బహు చోఖడీ | 
కితీ త్యా చోళకరా గోడీ | దిధలీ జోడీ భక్తీచీ | ||౭౪|| 
74. ఈ మాటలు చాలా మామూలుగా అనిపించినా, అవి ఎంతో ఉత్తమమైన జ్ఞానాన్ని కలుగ చేస్తాయి. ఎంతో ప్రేమతో బాబా చోళకరు భక్తిని స్థిరపరచారు. 
హోతే జే జే తయా అంతరీ | తే తే బాబాంనీ ఎణే పరీ | 
దావిలే తయాంస ప్రత్యంతరీ | కాయ హే కుసరీ సంతాంచీ | ||౭౫|| 
75. అతని మనసులో ఉన్నదంతా బాబా అతనికి అలా తెలియ చేసి, అతనికి నేరుగా గొప్ప అనుభవాన్ని కలుగ చేశారు. ఈ సాధు సంతులు ఎంత చతురులు? 
బోలచి బాబాంచే అణమోల | భక్త హృదయీ శిరతీ సఖోల | 
ప్రేమాచే మళ్యాస ఆణీతీ ఓల | భక్తీస డోల దావితీ | ||౭౬|| 
76. బాబా మాటలు వెలలేనివి. అవి భక్తుల హృదయాలలోకి సూటిగా దూసుకుని వెళ్ళి, అక్కడ ప్రేమ, భక్తికి జీవం పోస్తాయి. ఓడలలో దిక్కును చూపే స్తంభంలా, బాబా మాటలు భక్తి మార్గానికి దారి చూపుతాయి. 
చాతక తృష్ణేచ్యా పరిహారా | మేఘ సదయతా వర్షే ధారా | 
పరిణామీ నివే అఖిలధరా | తేచ తర్హా హే ఝాలీ | ||౭౭|| 
77. చాతక పక్షి దప్పికను తీర్చటానికి, దయతో మబ్బులు ధారగా వర్షాన్ని కురిపిస్తాయి. దానితో, భూమి అంతా తడుస్తుంది. ఇక్కడ కూడా అలాగే జరిగింది. 
చోళకర బిచారా కోఠీల కోణ | నిమిత్తాస దాస గణూంచే కీర్తన | 
నవస కరావయా ఝాలే మన | బాబాహీ ప్రసన్న జాహలే | ||౭౮|| 
78. పాపం చోళకరు! ఎక్కడి వాడో ఏమో! నిమిత్త మాత్రుడైన దాసగణు కీర్తన వలన, బాబాకు మ్రొక్కుకోవాలన్న ఆలోచన అతనిలో కలిగింది. ఆ ఆలోచన ప్రభావంగానే అతను బాబా అనుగ్రహాన్ని పొందగలిగాడు. 
తేణేంచ హా చమత్కార | కళలే సంతాంచే అంతర | 
ఉపదేశార్థ బాబా తత్పర | ఏసే అవసర ఆణీత | ||౭౯|| 
79. ఇలాంటి చమత్కారమైన లీలలతోనే సత్పురుషుల మనసులోని ఆలోచనలు బయట పడతాయి. జ్ఞానోపదేశం చేయాలని బాబా ఆసక్తిగా ఉండటం వలన, ఇలాంటి అవకాశాలను సృష్టిస్తారు. 
చోళకరాంచే కేవళ నిమిత్త | సకళ భక్తాంచే సాధావయా హిత | 
అకల బాబాంచీ కళా నిత | విలోకీతచి రహావే | ||౮౦||
80. చోళకరు కూడా నిమిత్త మాత్రుడే. భక్తులందరికీ మేలు చేయాలని, బాబా చేసే ఊహకందని లీలలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తునే ఉంటాయి. 

ఏసీచ ఆణిక కథా వర్ణూన | మగ హా అధ్యాయ కరూ పూర్ణ | 
కైసా ఎకే కేలా ప్రశ్న | కైసే తన్నిరసన బాబాంనీ | ||౮౧|| 
81. ఇలాంటిదే ఇంకొక లీలను వర్ణించి, ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. ఎవరో ఒకరు, బాబాను ఏమని అడిగారు, దానికి బాబా ఏమని చెప్పారు?
ఎకదా బాబా మశీదీంత | అసతా ఆపులే ఆసనీ స్థిత | 
భక్త ఎక సన్ముఖ బైసత | ఏకే చుకచుకతా పాల ఎక | ||౮౨|| 
82. మసీదులో, తమ ఆసనంలో బాబా కూర్చుని ఉండగా, ఒక సారి, ఒక భక్తుడు వారి ఎదుట కూర్చున్నప్పుడు, అతని ఎదురు గోడ మీద, ఒక బల్లి కిచకిచమని పలికింది. 
పల్లీపతన పల్లీవచన | పుఢీల భవిష్యార్థాచే సూచన | 
సహజ బాబాంస కరీ ప్రశ్న | జిజ్ఞాసాసంపన్న హోఊని | ||౮౩|| 
83. బల్లి పైన పడటం కాని, బల్లి పలకటం కాని, భవిష్యతును సూచిస్తుందన్న సహజమైన కుతూహలంతో అతడు, బాబాను అడిగాడు. 
“బాబా హీ పాఠీసీ భింతీవరీ | కిమర్థ హో పాల చుకచుక కరీ | 
కాయ అసావే తియేచే అంతరీ | అశుభకారీ నాహీ నా” | ||౮౪|| 
84. ‘బాబా! వెనుక గోడమీద బల్లి ఎందుకు కిచకిచమని పలుకుతుంది? దాని మనసులో ఏమి ఉంటుంది? అది చెడు సూచన కాదు కదా?’ అని అడిగాడు. 
తయాస బాబా ఝాలే వదతే | “పాలీస ఆలే ఆనంద భరతే | 
కీ ఔరంగాబాదేహూన యేతే | బహీణ యేథే భేటావయా” | ||౮౫|| 
85. అతనితో బాబా “ఔరంగాబాదునుండి, తనను కలుసుకోవటానికి, దాని సోదరి ఇక్కడికి వస్తుందని, సంతోషంతో పలుకుతుంది” అని చెప్పారు. 
ఆధీ పాల తో జీవ కాయ | తిలా కైచా బాప మాయ | 
కైచీ బహీణ కైచా భాయ | సంసార వ్యవసాయ కాయ తియే | ||౮౬|| 
86. అది అసలే బల్లి. అదెంత ప్రాణి! దానికి అమ్మ, నాన్నా, అన్నా, అక్కా, ఉంటారా? దానికి మనుషుల్లాగా చుట్టరికాలు, వ్యవహారాలు ఏముంటాయి? 
మ్హణోని బాబా హే కాంహీంతరీ | బోలిలే వినోదే ప్రత్యుత్తరీ | 
ఏసే మానూనియా అంతరీ | స్వస్థ క్షణభరీ బైసలా | ||౮౭|| 
87. వినోదానికి, బాబా ఏదో అలా చెప్పి ఉంటారని, అతడు తనలోనే అనుకొని, ఊరికే కూర్చున్నాడు. 
ఇతక్యాంత ఔరంగాబాదేహూన | గృహస్థ ఎక ఘోడ్యావరూన | 
ఆలా ఘ్యావయా బాబాంచే దర్శన | బాబా తే స్నాన కరీత | ||౮౮|| 
88. ఇంతలో అకస్మాత్తుగా, ఔరంగాబాదునుండి ఒక మనిషి గుర్రం మీద, బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. 
తయాస జాణే హోతే పుఢే | చందీ వాంచూన చాలేనా ఘోడే | 
హరభరే వికత ఘ్యావయా థోడే | బాజారాకడే నిఘాలా | ||౮౯|| 
89. అతను ఇంకా ముందుకు ప్రయాణం చేయాల్సి ఉంది. కాని దాణా లేకుండా గుర్రాలు నడవవు. అందుకు శెనగలు కొనటానికి బజారుకు వెళ్ళాలని, అతను అనుకున్నాడు. 
పాలీచా ప్రశ్న విచారణారా | సాశ్చర్య పాహే నవ సౌదాగరా | 
ఇతుక్యాంత త్యానే ఖాకేచా తోబరా | ఝటకలా కచరా ఝాడావయా | ||౯౦||
90. గుర్రానికి తగిలించే సంచిని తన భుజంనుంచి తీసి, అందులోని చెత్తను దులిపాడు. బల్లిని గురించి ప్రశ్న అడిగిన మనిషి, ఆశ్చర్యంగా అతన్ని చూడసాగాడు. 

ఉపడీ ఆపటతాంచ క్షితీవర | పాల ఎక పడలీ బాహేర | 
ఘాబర్యా ఘాబర్యా ధాంవలీ సరసర | నజరేసమోర సకళాంచ్యా | ||౯౧|| 
91. సంచిని తిరగవేసి, నేలమీద కొట్టినప్పుడు, అందులోనుండి ఒక బల్లి నేలపై పడింది. అందరూ చూస్తుండగా, అది భయంతో, సరసరా గాబరాగా పరుగెత్తింది. 
ప్రశ్నపుసత్యా బాబా వదతీ | “ఆతా లక్ష ఠేవీ తిజవరతీ | 
పాలీచీ త్యా బహీణ హీచ తీ | పహా చమత్కృతీ తియేచీ” | ||౯౨|| 
92. ఆ ప్రశ్నించిన మనిషితో బాబా “ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడు! అదే ఆ బల్లి సోదరి. దీని చమత్కారం చూడు” అని అన్నారు. 
తీ జీ తేథూని నిఘాలీ తడక | తాఈ కరీత హోతీచ చుకచుక | 
ధరూనియా త్యా ఆవాజావర రోఖ | చమకత ఠుమకత చాలలీ | ||౯౩|| 
93. వెంటనే, ఆ బల్లి అక్కడినుండి కిచకిచమనే సోదరి శబ్దాన్ని విని, వయ్యారంగా కులుకుతూ వెళ్ళింది. 
బహిణీ బహిణీచీ తీ గాంఠ | బహుతా దిసీ ఝాలీ భేట | 
చుంబీతీ ముఖ ఆలింగితీ దాట | ప్రేమాచా థాట అనుపమ | ||౯౪|| 
94. చాలా రోజుల తరువాత ఆ అక్కచెల్లెళ్ళు ఇద్దరూ కలుసుకోవటం వలన, ఒకరినొకరు కౌగలించుకున్నాయి, నోటి మీద ముద్దులు పెట్టుకున్నాయి. ఆ ప్రేమ సాటిలేనిది. 
ఎకమేకీస ఘాలీత గిరక్యా | ఆనందానే మారీత భిరక్యా | 
గేల్యా ఉభ్యా ఆడవ్యా తిరక్యా | స్వచ్చంద ఫిరక్యా మారీత | ||౯౫|| 
95. ఒక దాని చుట్టూ ఇంకొకటి తిరుగుతూ, ఆనందంగా, అన్ని చోట్లా తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు నాట్యం చేశాయి. 
కోఠే తే ఔరంగాబాద శహర | కోఠే శిరడీ కాయ హా ప్రకార | 
కైసా యావా అవచిత హా స్వార | పాలహీ బరోబర తయాచ్యా | ||౯౬|| 
96. ఎక్కడ ఔరంగాబాదు పట్టణం, ఎక్కడ శిరిడీ! ఇదేం విశేషం! అకస్మాత్తుగా, ఎక్కణ్ణుంచో ఆ గుర్రపు మనిషి రావటం, అతనితో పాటు ఆ బల్లి కూడా రావటం చాలా వింత కాదూ! 
అసేల పాల ఔరంగాబాదీ | అసేల శిరలేలీ తోబర్యామధీ | 
పరి త్యా ప్రశ్నోత్తరా సంబంధీ | కైసీ హీ సంధీ పాతలీ | ||౯౭|| 
97. అది ఔరంగాబాదులోని బల్లే కావచ్చు. దాణా సంచిలో దూరి ఉండవచ్చు కూడా, కాని, బల్లి గురించి అడిగిన సమయానికి సరిగ్గా అది ఎలా వచ్చింది? 
పాల కాయ చుకచుకావీ | ప్రశ్న స్ఫూర్తి తీ కాయ వ్హావీ | 
అర్థోపపత్తీ కాయ కథావీ | ప్రచీతి యావీ తాత్కాళ | ||౯౮|| 
98. అనుకోకుండా ఒక బల్లి కిచకిచమని పలకటం, దానిని గురించి ఒక భక్తుడు ప్రశ్నించటం, దానికి బాబా అర్థం చెప్పి, ఈ అద్భుతమైన అనుభవాన్ని కలుగ చేయటం, 
ఏసా హా యోగ అప్రతిమ | వినోదావరీ సార్వత్రిక ప్రేమ | 
సంత సాధన యోజూని అనుపమ | భక్త క్షేమ వాఢవితీ | ||౯౯|| 
99. ఇవన్నీ ఊహించని విధంగా కలసిరావటం, అద్భుతమే కాదూ! వినోదం అంటే అందరికీ ఎప్పుడూ ఇష్టమే. భక్తుల మంచిని పెంచటానికి, సత్పురుషులు ఇలాంటి సాటిలేని అనుభవాలను కలిగిస్తూ ఉంటారు. 
పహా హా యేథే జిజ్ఞాసూ నసతా | అథవా కోణీహీ న ప్రశ్న పుసతా | 
కైసా సాఈంచా మహిమా సమజతా | కోణాస కళతా హా అర్థ | ||౧౦౦||
100. కొంచెం ఆలోచించండి. కుతూహలంతో ఎవరూ ప్రశ్నను అడిగి ఉండక పోతే, సాయి మహిమను మనం ఎలా తెలుసుకుంటాం? వారి గొప్పతనం ఎలా బయట పడేది? 

అనేక వేళీ శబ్ద కరితా | అనేక పాలీ ఠావ్యా సమస్తా | 
కోణ పుసే త్యా శబ్దాచ్యా అర్థా | అథవా వార్తా తయాచీ | ||౧౦౧|| 
101. ఎన్నో సమయాలలో, ఎన్నెన్నో బల్లులు పలుకుతుంటాయి. ఇది అందరికీ తెలిసినదే. ఆ పలుకుల వెనుక ఉన్న అర్థాన్ని కాని, ఆ బల్లులు ఎందుకు పలుకుతాయి అని కాని, ఎవరైనా తెలుసుకోవాలని ప్రయత్నించారా?
సారాంశ హా జగాచా ఖేళ | సూత్రే గుప్త ఆణి అకళ | 
కోణాస వ్హావీ తరీహీ అటకళ | ఆశ్వర్య సకళ కరితాత | ||౧౦౨|| 
102. ఈ కథవలన మనకు తెలిసేది ఏమిటంటే, ఈ జగత్తును నడిపించే సూత్రం చాలా రహస్యంగా, ఎవరికీ అర్థం కాకుండా ఉంది. అనుకోకుండా, ఎప్పటికప్పుడు, అది అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. 
ఉలట యా పాలీ శబ్ద కరితా | దర్శవితీ కీ అనర్థ సూచకతా | 
 “కృష్ణ కృష్ణ” వాచే మ్హణతా | టళతే అనర్థతా జన వదతీ | ||౧౦౩|| 
103. బల్లి పలికితే, చెడు సూచన అని, ‘కృష్ణ, కృష్ణ’ అని అంటే ఆ చెడు తొలగి పోతుందని, జనుల నమ్మకం. 
ఆసేనాకా కైసీహీ వ్యుత్పత్తి | పరంతు హీ కాయ చమత్కృతి | 
భక్త జడవావయా నిజపదా ప్రతి | ఉత్తమ హీ యుక్తి బాబాంచీ | ||౧౦౪|| 
104. ఎవరేమనుకున్నా, తాము అన్ని చోట్లా, ఎల్లప్పుడూ నిండి ఉన్నారన్నది, భక్తులు తెలుసుకొని, భక్తి మార్గంలో స్థిరపడాలని బాబా చేసిన ఉత్తమమైన ఉపాయం ఇది, చమత్కారం మాత్రమే కాదు. 
వాచీల జో హా అధ్యాయ ఆదరీ | అథవా నేమానే ఆవర్తన కరీ | 
తయాచే సంకట గురురాయ నివారీ | ఖూణ అంతరీ దృఢ బాంధా | ||౧౦౫|| 
105. ఈ అధ్యాయాన్ని, భక్తి శ్రద్ధలతో పఠించి, మరల మరల చదివే వారి కష్టాలను గురుదేవులు తొలగిస్తారని, మనసులో దృఢమైన నమ్మకాన్ని పెంచుకోండి. 
అనన్య భావే చరణీ మాథా | జో జో వాహీ తయాసీ తత్త్వతా | 
త్రాతా పాతా అభయదాతా | కర్తా హర్తా తో ఎక | ||౧౦౬|| 
106. స్థిరంగా ఒకే మనసుతో, గురు పాదాలమీద తలనుంచే వారిని, రక్షించేది ఒక్క సాయియే. భయాన్ని తొలగించి, కష్టాలను నివారించే ఆ దైవం సాయి ఒక్కరే. 
అంతర మానూ నకా యేథ | ఏసాచ ఆహే హా సాఈనాథ | 
నిజానుభవాచా గుహ్య భావార్థ | భక్త కల్యాణార్థ మీ కథితో | ||౧౦౭|| 
107. ఇందులో ఏ సందేహాన్ని పెట్టుకోకండి. సాయి గురించి, స్వయంగా నేను పొందిన, రహస్యమైన అనుభవాన్ని, భక్తుల శ్రేయస్సు కొరకు చెప్పుతున్నాను. 
జగీ సంపూర్ణ మీచి ఎక | దుజే న మజవీణ కాంహీ ఆణీక | 
నాహీ కేవళ హాచి లోక | అఖిల త్రైలోక్య మీచి మీ | ||౧౦౮|| 
108. ఈ ప్రపంచమంతా నేనే. నేను తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఈ లోకంలోనే కాదు, మూడు లోకాలలోనూ నేను, నేనే. 
ఏసే అద్వితీయత్వ జేథే స్ఫురే | తేథే భయాచీ వార్తాచ నురే | 
నిరభిమానే నిరహంకారే | చిన్మాత్ర సారే భరలే జ్యా | ||౧౦౯|| 
109. ఇలాంటి ఒకటే అన్న భావమున్నప్పుడు, భయమనేది కొంచెం కూడా మిగలదు. అభిమానం లేని, అహంకారం లేని, పూర్తిగా జ్ఞానమే ఉన్న చోట, చైతన్యం ఎప్పుడూ నిండి ఉంటుంది. 
హేమాడపంత సాఈంశీ శరణ | సోడూ నేణే క్షణ ఎక చరణ | 
కీ త్యాంత ఆహే సంసార తరణ | గోడ నిరూపణ అవధారా | ||౧౧౦||
110. హేమాడు పంతు సాయికి శరణుజొచ్చి, ఒక్క క్షణమైనా వారి పాదాలను వదిలి ఉండలేడు. ఎందుకంటే, ఈ సంసార సాగరాన్ని క్షేమంగా దాటించేది ఆ పాదాలే. తరువాత వచ్చే మధురమైన వర్ణనను వినండి. 

పుఢీల అధ్యాయీ ప్రసంగ సుందర | నిర్మాణ కరితీల సాఈ గురువర | 
బ్రహ్మజ్ఞాన కైసే వాటేవర | చిటకీవారీ జన మాగే | ||౧౧౧|| 
111. తరువాతి అధ్యాయంలో, గురువులలో గొప్పవారైన సాయి సృష్టించిన, జ్ఞానంతో నిండిన, ఒక ప్రసంగాన్ని వినండి. చిటికలో బ్రహ్మ జ్ఞానం పొందాలనే వారి కోసం ఇదొక కనువిప్పు. 
కోణీ ఎక లోభీ జన | పుసేల సాఈంసీ బ్రహ్మజ్ఞాన | 
తే తయాంచేచ ఖిశాంతూన | దేతీల కాఢూన మహారాజ | ||౧౧౨|| 
112. ఎవరో ఒక పిసినారి మసీదుకు వచ్చి, సాయిని బ్రహ్మ జ్ఞానం ఇమ్మని అడగగా, మహారాజు దానిని అతని జేబులోనుండి తీసి ఇచ్చారు. 
శ్రోతీ పరిసతా హే కథానక | దిసూన యేఈల బాబాంచే కౌతుక | 
లోభ సుటల్యావాంచూని నిష్టంక | బ్రహ్మ నిఃశంక అప్రాప్య | ||౧౧౩|| 
113. శ్రోతలు ఈ కథను వింటే, బాబాయొక్క సామర్థ్యం తెలుస్తుంది. పిసినారితనం పోనంత వరకూ, బ్రహ్మను తెలుసుకోవడం సాధ్యం కాని పని. ఇందులో ఏ విధమైన సందేహమూ లేదు. 
కోణ తయాచా అధికారీ | త్యాచా కోణీహీ విచార న కరీ | 
కోణా తే ప్రాప్త కైశియాపరీ | తేంహీ వివరతీల మహారాజ | ||౧౧౪|| 
114. బ్రహ్మ జ్ఞానం ఎవరికి దొరుకుతుంది? అని ఎవరూ ఆలోచించరు. బ్రహ్మజ్ఞానం ఎవరికి ఏ విధంగా దొరకుతుందో, దానిని కూడా సాయి మహారాజు వివరిస్తారు. 
మీ తో తయాంచా దాసానుదాస | పదర పసరితో కరితో ఆస | 
కీ హా సాఈ ప్రేమ విలాస | అతి ఉల్హాసే పరిసా జీ | ||౧౧౫|| 
115. నేను వారి సేవకులకు సేవకుణ్ణి. ఈ సాయి ప్రేమ పూరితమైన లీలలను, మీరు ఎంతో ఉత్సాహంగా వింటారన్న ఆశతో వేడుకుంటున్నాను. 
చిత్త హీ హోఈల ప్రసన్న | లాధేల చైతన్య సమాధాన | 
మ్హణూన శ్రోతా ద్యావే అవధాన | సంత మహిమాన కళేల | ||౧౧౬|| 
116. శ్రోతలారా! ఎంతో సావధానంగా వినండి. వింటే, అప్పుడు సాధు సంతుల మహిమ మీకు అర్థమౌతుంది. చైతన్యం లభించటంతో, మీ మనసు ఆనందంతో తృప్తి చెందుతుంది. 

  | ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | చోళకరశర్కరాఖ్యానం నామ | 
| పంచదశోధ్యాయః సంపూర్ణః |

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

  టిపణీ: 
1. ధిక్కార, నిర్భత్సనా. 2. ఉతావీళ న హోణే. 
3. యా నావాచా ఎక శ్రద్ధాళూ గరీబ ఠాణ్యాచ్యా సివ్హిల కోర్టాత ఉమేదవార హోతా.
4. ఠాణే జిల్హయాత మురబాడ తాలుక్యాత యా నావాచా ఎక ఉంచ ఘాట అసూన యా వాటేనే కోకణాతీల లోక దేశావర జాతాత ఆణి దేశావరీల కోకణాత ఉతరతాత. యా ఘాటానే పుణే జిల్హ్యాతీల జున్నరలా కోకణచే లోక జాత-యేత అసతాత. 
5. ఘరాచా ఉంబరా.