శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౫ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
ఫళలీ జయాంచీ పుణ్యే అగాధే | తయాంసీంచ సాఈ దర్శన లాధే |
త్రివిధ తాప తయా న బాధే | సాధన సాధే పరమార్థా | ||౧||
1. అంతులేని పుణ్యం పొందిన వారికే సాయి దర్శనం దొరుకుతుంది. అధిభౌతిక, అధిదైవిక మరియు ఆధ్యాత్మిక అను మూడు తాపాలు వారిని బాధించవు, పైగా సాధనతో పరమార్థాన్ని పొందుతారు.
కృపా కరా జీ శ్రోతేజన | క్షణైక కరోని నిజగురుచింతన |
కథేసీ కరా సాదర మన | ఘ్యా అవధాన మజకడే | ||౨||
2. ఓ శ్రోతలారా! దయచేసి, ఒక క్షణం గురువును ధ్యానించి, ఈ కథలమీద శ్రద్ధ కలిగి, మీ దృష్టిని నా వైపు మళ్ళించండి.
ఆహాంత తుమ్హీ ఠావే ఆమ్హా | వ్యర్థ పరిశ్రమ కాంహే తుమ్హా |
ఏసే న మ్హణా కరా క్షమా | ఉపమా తుమ్హా సాగరాచీ | ||౩||
3. మిమ్మల్ని సముద్రంతో పోల్చుతున్నందుకు, ‘మాకు అన్నీ తెలుసు. వృథా శ్రమ మీకెందుకు?’ అని అలక్ష్యంతో అనకండి. నన్ను క్షమించండి.
భరలా జరీ అపరంపార | తరీ న సరితే పరతవీ సాగర |
ఘన వర్షతా సహస్రధార | తయాస హీ థార దేఈ తో | ||౪||
4. అంతులేకుండా నిండి ఉన్నా, సాగరం ఎప్పుడూ నదులను వెనుకకు పంపదు. మబ్బులు కుండపోత వర్షాన్ని కురిపించినా, నదుల నీటికి చోటిస్తుంది.
తైసే తుమ్హీ శ్రోతే సజ్జన | తుమ్హాంమాజీ కరావే మజ్జన |
ఇచ్ఛా ధరిలీ న కరా తర్జన1 | దీన వర్జన బరవేనా | ||౫||
5. అలాగే మీరు కూడా, సజ్జనులైన శ్రోతలారా! మీతో సహవాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. దీనులను త్యజించటం మంచిది కాదు.
యేవో గంగేచే జల నిర్మళ | అథవా గాంవీచా లేండ ఓహోళ |
సాగరాపోటీ దోహీంసీ స్థళ | సంగమీ ఖళమళ విరహిత | ||౬||
6. నిర్మలమైన గంగా జలం కాని, ఊరిలోని మురికి నీటి ప్రవాహంగాని, ఈ రెంటికీ సాగరంలో చోటు ఉంటుంది. ఆ సాగర సంగమం వలన ఎటువంటి అలజడి ఉండదు.
మ్హణోన తుమ్హా శ్రోతియా చిత్తా | సంత కథాశ్రవణీ జే ఆస్థా |
తేచ స్వయే పావేల సాఫల్యతా | కృపేనే పాహతా మజకడే | ||౭||
7. అందువలన, నాయందు దయ ఉంచితే, సత్పురుషుల కథలను వినాలనే మీ ఆసక్తికి, మంచి ఫలితాన్ని పొందగలరు.
సబూరీ2 ఆణి శ్రద్ధాయుక్త | సాదర సేవితా హే కథామృత |
ఆతుడేల భక్తి ప్రేమ యుత | శ్రోతే కృతకృత్య హోతీల | ||౮||
8. అమృతం లాంటి ఈ కథను, ఆదరంతో, శ్రద్ధ, సహనంతో వింటే, విన్నవారు ప్రేమతో కూడిన భక్తిని పొంది ధన్యులవుతారు.
భక్తా సహజ పరమ ప్రాప్తి | శ్రోతయా భక్తి ఆణి ముక్తి |
భావార్థియా సౌఖ్య శాంతి | నిజ విశ్రాంతీ సకళికా | ||౯||
9. దీనిని వినటం వలన, విన్నవారు భక్తిని, ముక్తిని పొందుతారు. భక్తులు సహజంగా పరమార్థాన్ని పొందుతారు. భక్తులు కానివారు సుఖశాంతులను, మనసుకు విశ్రాంతిని పొందుతారు.
గురుముఖీంచ్యా గోడ కథా | ఏకతా నిరసేల భవభయ వ్యథా |
హోఈల ఆనంద శ్రోతియాంచ్యా చిత్తా | స్వయే నిజాత్మతా ప్రకటేల | ||౧౦||
10. గురువు నోటినుండి వచ్చిన మధురమైన కథను వింటే, సంసార బంధాల భయం, బాధ తొలగిపోతుంది. ఆత్మ రూపం తానే శ్రోతలకు కనిపించి, మనసుకు ఆనందం కలిగిస్తుంది.
యే అధ్యాయీ నిరూపణ | ప్రేమళ భక్తాంచే సాఈంస ప్రార్థన |
దర్శన దేఊని సాఈ ప్రసన్న | హోతీ కైసేని త్యా పరిసా | ||౧౧||
11. ప్రేమతో నిండిన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా, వారు అతనికి దర్శనమిచ్చి, ప్రసన్నులయిన సంగతిని ఈ అధ్యాయంలో జాగ్రత్తగా వినండి.
నుకతీచ పాజూని గేలీ బాహేరీ | మాగుతేని ఆలీ జరీ మార్జారీ |
తరీ ఫిరఫిరోని పోరే తిజవరీ | ధాంవతీ ప్రేమభరీ లుంచావయా | ||౧౨||
12. పిల్లి పిల్లలు అప్పుడే పాలు త్రాగినా, ఆ పిల్లి బయటకు వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే, ఆ పిల్లలు తల్లిపై పడి, మరల మరల పాలు త్రాగటానికి పరుగెత్తుతాయి.
మగ తే కంటాళుని గురగురే | క్షణైక జరీ దబతీ పోరే |
ఆఈ నివాంత బైసలీ పురే | ఘాలోని భంవరే లుంచతీ | ||౧౩||
13. విసుగుతో ఆ పిల్లి అప్పుడు, గురగురమన్నా, ఒక క్షణం అణిగి ఉండి, తల్లి కూచుంటే చాలు, పిల్లలు దాని చుట్టూ చేరి ప్రేమగా తిరుగుతాయి.
లుంచతా ఠోసతా ప్రేమభరే | ఆఈ లాగీ పాన్హా పాఝరే |
మగ తీచ పూర్వీల గురగురణే విసరే | ప్రీతీనే పసరే క్షితీవరీ | ||౧౪||
14. అలా పిల్లలు పాలు త్రాగటానికి వచ్చి, ప్రేమతో పాలు చేపగా, ఆ పిల్లి గురగురమని అనకుండా, ప్రీతిగా నేలపై కాళ్ళు చాపుకుని ఒరుగుతుంది.
ప్రేమోదయీ హరపే కంటాళా | చౌపాయీ కవటాళీ దృఢ నిజబాళా |
వరచేవరీ చాటీ అవలీళా | కాయ తో సోహళా అలోలిక | ||౧౫||
15. ప్రేమ పుట్టగానే, విసుగు మాయమౌతుంది. పిల్లలను గట్టిగా పెనవేసుకుని, మాటిమాటికీ నాకుతుంది. ఎంత విచిత్రమైన దృశ్యం!
పోరాంచ్యా తీక్షణ నఖప్రహారే | జో జో మాతేచీ ఓంటీ విదారే |
తో తో అధిక ప్రేమాచే ఝరే | దుగ్ధ ఓఝరే బహుధారా | ||౧౬||
16. వాడియైన గోళ్ళతో పిల్లలు తల్లి పొదుగును గోకుతుంటే, ప్రేమ పొంగి, పాలు ఎక్కువై, ఎన్నో ధారలుగా, బాగా వచ్చేలా చేస్తాయి.
జైసీ త్యా బాళాంచీ అనన్య భక్తీ | మాతేసీ కరీ దుగ్ధోత్పత్తి |
తైసీచ తుమచీ సాఈ పదాసక్తి | ద్రవవీల చిత్తీ సాఈంతే | ||౧౭||
17. ఆ పిల్లల అంతు లేని ప్రేమ కారణంగా, తల్లికి పాలధార ఎలా వస్తుందో, అలా సాయి పాదాలమీద మీకున్న, ఆసక్తి, భక్తి, సాయి మనసును కరిగేలా చేస్తుంది.
ఎకదా హరిభక్తి పరాయణ | గణుదాసాంచే సుశ్రావ్య కీర్తన |
కౌపినేశ్వర సన్నిధాన | ఠాణియాచే జన కరవితీ | ||౧౮||
18. ఒక సారి, హరిభక్తి పరాయణుడైన దాసగణుగారి మధురమైన కీర్తనను, కౌపీనేశ్వర ఆలయంలో ఠాణా ప్రజలు ఏర్పాటు చేశారు.
పడలియా శిష్టాంచా ఆగ్రహ | గణుదాస కరితీ కథానుగ్రహ |
ఎకా కవడీచా హీ పరిగ్రహ | కింవా దురాగ్రహ తేథే నా | ||౧౯||
19. సజ్జనుల ప్రార్థనతో దాసగణు హరికథను వినిపించేవాడు. కాని, ఒక గవ్వైనా తీసుకునే వాడు కాదు. అలా అని దురభిమానంగా ఉండేవాడు కాదు.
కీర్తనా నలగే దేణే కవడీ | తను ఉఘడీ డోఈ న పగడీ |
కాంసేసీ సాధీచ పంచే జోడీ | అనివార ఉడీ శ్రోత్యాంచీ | ||౨౦||
20. తన కీర్తనకు అతను గవ్వైనా ఆశించేవాడు కాదు. అతని దేహం పైన చొక్కాగాని, తలపైన పాగా కాని ఉండేవి కావు. సాధారణంగా నడుముకు పంచె ఉండేది, అంతే. అయినా వినేవారు విపరీతంగా వచ్చేవారు.
యా పోషాఖాచీ హీ కథా | మౌజ వాటేల శ్రవణ కరితా |
అవధారా తీ స్వస్థ చిత్తా | పహా ఆశ్చర్యతా బాబాంచీ | ||౨౧||
21. కథలో ఓ చిన్న కథగా, దాసగణు దుస్తుల కథను వింటే, ఎంతో వినోదంగా ఉంటుంది. బాబాయొక్క అద్భుతమైన లీలలను శాంతంగా వినండి.
అంగరఖా ఉపరణే ఫేటా మాథా | పోషాఖ సమన్వితా నిఘాలే | ||౨౨||
22. శిరిడీ గ్రామంలో ఒక సారి దాసగణు కీర్తన చేయాల్సి ఉండేది. అప్పటి ఆచారంలాగా, శరీరంపై అంగరఖా (కోటులాంటిది), కండువా, తలకు పేటా (తలపాగా) కట్టుకుని, బయలుదేరాడు.
శిష్టాచారానుసారతా | ఆనందే బాబాంస వందూ జాతా | “వాహవా నవర దేవ కీ సజలాసి ఆతా” | బాబా వదతా దేఖిలే | ||౨౩||
23. ఎప్పటిలాగే, వెళ్ళి బాబా పాదాలకు ఆనందంగా నమస్కారం చేయగా, బాబా “వాహవా! పెళ్ళికొడుకులాగా అలంకరించుకున్నావు.
“జాతోస కోఠే ఏసా సజూని” | బాబా పుసతీ తయాంలాగూని | ‘కీర్తన కరాయా జాతో’ మ్హణూని | దాసగణూనీ కథియేలే | ||౨౪||
24. “ఎక్కడకు వెళ్తున్నావేమిటి ఇలా సింగారించుకుని?” అని అతనిని అడిగారు. ‘కీర్తన చేయటానికి వెళ్తున్నాను’ అని దాసగణు జవాబిచ్చాడు.
పుఢే బాబా వదతీ తయాంస | “అంగరఖా ఉపరణే ఫేటా కశాస | కిమర్థ కేలాస ఇతుకా ప్రయాస | నలగతీ ఆపుల్యాస తీ కాంహీ | ||౨౫||
25. మరలా బాబా అతనితో, “అంగరఖా, ఉత్తరీయం పేటా ఎందుకు? ఎందుకింత కష్టపడ్డావు? ఇలాంటివన్నీ మనకు పనిలేదు.
కాఢ కీ తీ మజసమోర | కశాస అంగావర యాంచా భార” | తంవ తీ తయాంచ్యా అనుజ్ఞేనుసార | తేథేంచ చరణావర ఠేవిలీ | ||౨౬||
26. “వీటన్నిటినీ నా ముందు నుంచి తీసేయి. ఒంటి మీద ఎందుకింత భారం?” అని చెప్పారు. వారు చెప్పినట్లే, అప్పుడు దాసగణు వానిని తీసి, వారి పాదాల మీద పెట్టాడు.
తైంపాసూని ఉఘడే సోజ్జ్వళ | హాతీ చిపళీ గళా మాళ | కీర్తన సమయీ సర్వకాళ | గణుదాస హా వేళపర్యంత | ||౨౭||
27. అప్పటినుండి, ఇప్పటి దాకా, అతడు కీర్తన సమయంలో ఎప్పుడూ, చొక్కా లేకుండా, చేతిలో చిరుతలు, మెడలో మాలను ధరించేవాడు.
తర్హా హీ జరీ జనవిరుద్ధ | తరీ తీ అత్యంత పాయాశుద్ధ | కీ జో ప్రబుద్ధాంచా ప్రబుద్ధ | నారద ప్రసిద్ధ హా మార్గ | ||౨౮||
28. అప్పటి ఆచారానికి ఇది విరుద్ధమైనా, ఇది చాలా శుద్ధమైన పద్ధతి. జ్ఞానులలో జ్ఞాని అయిన నారదుని పద్ధతి ఇదే.
హీ నారదీయ మూళ గాదీ | యేథూనచి హరిదాసాంచీ మాందీ | బాహ్య రంగాచీ న జ్యా ఉపాధీ | అంతఃశుద్ధి ధ్యేయ జ్యా | ||౨౯||
29. ఇదే నారదీయ మూల సంప్రదాయం. ఇక్కడినుండే హరిదాసుల పరంపర మొదలైంది. వీరి లక్ష్యం అంతరంగ శుద్ధి. బయటి అలంకారాలతో వీరికి పని లేదు.
అధోభాగాచి వస్త్రాచ్ఛాదిత | చిపళ్యా వీణా వాజవీత | ముఖా హరినామ గర్జత | ధ్యాన విశ్రుత నారదాచే | ||౩౦||
30. నడుముకంటే క్రింది భాగాన్ని మాత్రం వస్త్రంతో కప్పుకుని, ఎడమ చేతిలో చిరుతలు, కుడి చేతిలో తంబూరా వాయించుకుంటూ, నోటితో హరినామాన్ని పాడుతూ ఉండే నారదుని రూపం, అందరికీ తెలిసినదే.
సాఈ సమర్థాంచే కృపేనే | స్వయే రచూని సంతాంచీ ఆఖ్యానే |
మోలావీణ కరితీ కీర్తనే | ఖ్యాతీ తేణే పావలే | ||౩౧||
31. సాయి సమర్థుల కృపతో, సాధు సంతుల కథలను తానే స్వయంగా రచించి, ఏ కానుకలూ తీసుకోకుండా, దాసగణు కీర్తనలు చేసి, ప్రసిద్ధి చెందాడు.
ఉల్హాస సాఈభక్తీచా | దాసగణూనే విస్తారిలా సాచా | వాఢవిలా సాఈప్రేమరసాచా | స్వానందాచా సాగర | ||౩౨||
32. సాయి భక్తి గురించి ఉత్సాహాన్ని పెంచి, ఇంకా ఎందరో ఆ ఉత్సాహాన్ని పంచుకునేలా చేశాడు. ఆత్మ రూపాన్ని కనుక్కుంటే కలిగే ఆనందంలాంటి, సాయి ప్రేమ రసాన్ని పెరిగేలా చేశాడు.
భక్తశిరోమణీ చాందోరకర | తయాంచేహీ అత్యంత ఉపకార | సాఈ చరణ భక్తి విస్తార | కారణ సాచార హే మూళ | ||౩౩||
33. భక్తులలో తలమానికంలాంటి చాందోర్కరు కూడా చాలా ఉపకారం చేశాడు. సాయి పాదాలయందు భక్తి బాగా పెరగటానికి అతడే మూల కారణం.
దాసగణూంచే ఇకడే యేణే | ఎకా చాందోరకరాంచ్యా కారణే | జాగోజాగ తయాంచీ కీర్తనే | సాఈంచీ భజనే చాలలీ | ||౩౪||
34. దాసగణు శిరిడీకి రావడం కూడా నానా చాందోర్కరుని వలనే. దాసగణు ఎన్నో చోట్లలో హరి కీర్తనలు, సాయి భజనలు చేసేవాడు.
పుణే నగర సోలాపూరప్రాంతీ | పూర్వీంచ మహారాజాంచీ ఖ్యాతీ | పరి యా కోంకణచ్యా లోకాంప్రతీ | లావిలీ భక్తి యా దోఘీ | ||౩౫||
35. పుణే, శోలాపుర, అహమ్మదునగర జిల్లా, మొదలైన ప్రాంతాలలో సాయి మహారాజు ఖ్యాతి అదివరకే వ్యాపించి ఉంది. కాని, కొంకణ ప్రాంతంలోని ప్రజలలో సాయి భక్తిని వ్యాపింప చేసింది వీరిద్దరే.
ముంబఈ ప్రాంతీ జీ సాఈభక్తి | తియేచే మూళ యా దోన వ్యక్తి | సాఈమహారాజ కృపామూర్తి | తయాంచే హాతీ ప్రకటలే | ||౩౬||
36. వీరిద్దరి మూలంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి పెరిగింది. వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది.
శ్రీకౌపీనేశ్వరమందిరీ | సాఈ కృపేచ్యా కీర్తనగజరీ | హరి నామాచ్యా జయజయకారీ | ఉఠలీ లహరీ చోళకరాం | ||౩౭||
37. శ్రీ కౌపీనేశ్వర మందిరంలో, హరి నామంతో పాటు సాయి నామ జయజయకారాల నడుమ కీర్తన సాగిపోతుండగా, చోళకరుకు ఒక కోరిక కలిగింది.
హరికీర్తనా బహుత యేతీ | శ్రవణా శ్రవణాచ్యా అనేక రీతీ | కోణా ఆవడే బువాంచీ వ్యుత్పత్తి | హావభావ స్థితి కవణా | ||౩౮||
38. కీర్తన వినడానికి చాలా మంది వస్తారు. ఎన్నో రకాల వినేవారుంటారు. కొందరికి హరిదాసుగారు చెప్పే పద్ధతి ఇష్టమైతే, ఇంకొందరికి వారి హావభావాలు ఇష్టం.
కోణా ఆవడ గాణ్యాపురతీ | వాహవా బువా కాయ హో గాతీ | కాయ తే విఠ్ఠలనామీ రంగతీ | కథేంత నాచతీ ప్రేమానే | ||౩౯||
39. మరి కొందరికి, వారు పాడే పాట నచ్చుతుంది. ‘వహవ్వా! దాసుగారు ఎంత బాగా గానం చేస్తారు. విఠల నామ సంకీర్తనలో ఎలా లీనమై పోతారు, కథ చెబుతూ ఎంత బాగా నాట్యం చేస్తారు’ అని ఆనందిస్తారు.
కోణాస పూర్వరంగీ భక్తి | కోణాచీ కథాభాగీ ఆసక్తి | కోణాస హరిదాసీ నకలా రుచతీ | ఆఖ్యానీ ప్రీతి కోణాస | ||౪౦||
40. అసలు కథకు మునుపు చెప్పే పిట్టకథలు కొందరికి ఇష్టం. మరి కొందరికి కథాభాగం నచ్చుతుంది. ఇంకొందరికి, హరిదాసుగారు ఎవరెవరినో అనుకరిస్తూ చేసే హాస్యం ఇష్టం. మిగతా కొందరికి అసలు కథ తరువాత చెప్పే పిట్టకథలంటే చాలా ఇష్టం.
బువా ప్రాకృత కీ వ్యుత్పన్న | కీ పదపదార్థ బహ్వర్థ సంపన్న |
కీ కేవళ ఉత్తరరంగప్రవీణ | కథా శ్రవణ యే పరీ | ||౪౧||
41. బువా (హరిదాసు) విద్వాంసుడా, విద్యలేని వాడా; టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా, లేక కథలు చెప్పడంలోనే ప్రవీణుడా మొదలైన ఆలోచనలు కీర్తన వినేవారికి వస్తూ ఉంటుంది.
జోడే ఈశ్వర వా సంతచరణీ ప్రీతి | హీ శ్రోతృస్థితీ దుర్మిళ | ||౪౨||
42. ఇలా వినేవారు చాలా రకాలుగా ఉంటారు. కాని, వినటంలో శ్రద్ధా, భక్తిని పెంచుకుని, దేవుడియందు, సాధు సంతులయందు, ప్రీతి కలిగి ఉండే శ్రోతలు చాలా అరుదు.
శ్రవణ కేలే భారాభర | పరి అవిద్యేచే థరావరథర | తే కాయ శ్రవణాచే ప్రత్యంతర | వ్యర్థ భారాభర శ్రవణ తే | ||౪౩||
43. ఎన్ని కీర్తనలు విన్నా అజ్ఞానం పొరలు అలాగే ఉంటే, ఆ వినడం దండుగే కాని, దానివల్ల ఏం ప్రయోజనం?
న ఘడే జేణేనీ మళ క్షాళణ | త్యాతే కాయ మ్హణావే సాబణ | న కరీ జే అవిద్యానిరసన | తే కాయ శ్రవణ మ్హణావే | ||౪౪||
44. చేతికి అంటుకున్న మురికిని కడగలేని దానిని సబ్బు అని అనగలమా? అజ్ఞానాన్ని తొలగించలేని దానిని శ్రవణం అని అంటామా?
ఆధీంచ చోళకర3 శ్రద్ధాళూ | ఆలా సాఈ ప్రేమాచా ఉమాళూ | మనాంత మ్హణతీ బాబా కృపాళూ | కరా సాంభాళూ దీనాచా | ||౪౫||
45. అసలే చోళకరు మంచి భక్తి కలవాడు. కీర్తన వింటూ ఉండగా, సాయిపై అతనికి ప్రేమ పొంగింది. ‘సాయి దయామయా! ఈ దీనుని అనుగ్రహించు’ అని మనసులో వేడుకున్నాడు.
బిచారా గరీబ ఉమేదవార | పోసూ అసమర్థ కుటుంబభార | సరకార పదరీ మిళావా శేర | బాబాంసీ భార ఘాతలా | ||౪౬||
46. పరిశీలనలో ఉన్న పేదవాడు, డబ్బు లేనివాడు. కుటుంబ భారాన్ని మోయలేని దీనుడు. ప్రభుత్వ పనిలో ఉండగా, కుటుంబానికి సరిపడా సంపాదన ఇప్పించాలని బాబాపై భారం మోపాడు.
నవస కరితీ కాముక జన | హోఈల జరీ అభీష్ట సంపాదన | తరీ ఘాలూ ఇచ్చాభోజన | కరూ బ్రాహ్మణసంతర్పణ | ||౪౭||
47. తమ కోరికలు తీరినప్పుడు, చక్కని భోజనాన్ని పెడతామని, లేక బ్రాహ్మణ సంతర్పణ చేస్తామని, కోరికలున్న ప్రజలు మ్రొక్కుకుంటారు.
శ్రీమంతాంచే నవస వచన | మ్హణతీ ఘాలూ సహస్రభోజన | అథవా కరూ శతగోదాన | మన కామనా తృప్త హోతా | ||౪౮||
48. శ్రీమంతులైతే, తమ కోరిక తీరగానే, వేయి మందికి భోజనం పెట్టుతామని, లేక వంద ఆవులను దానం చేస్తామని మ్రొక్కుకుంటారు.
చోళకర ఆధీంచ నిర్ధన | నవస కరావయా ఝాలే మన | ఆఠవూని శ్రీసాఈంచే చరణ | దీన వదన తో బోలే | ||౪౯||
49. చోళకరు అసలే పేదవాడు. మ్రొక్కుకోవాలని అనిపించింది. సాయి పాదాలను ధ్యానించి, దీనంగా వేడుకున్నాడు.
బాబా గరీబీచా సంసార | నోకరీవరీ సారీ మదార | కాయమచా వ్హావయా పగార | పరీక్షా పసార హో లాగే | ||౫౦||
50. ‘బాబా! నాది పేద కుటుంబం. ఉద్యోగం పైనే ఆధార పడ్డాం. పరిశీలనలో ఉన్న ఉద్యోగం ఖాయం కావాలంటే, వచ్చే పరీక్షలో నెగ్గాలి.
పరిశ్రమాంతీ కేలీ తయారీ | పాస హోణ్యావర భిస్త సారీ |
నాతరీ గాంఠీచీ భాకరీ | ఉమేదవారీ జాఈల | ||౫౧||
51. ‘నా జీవితం ఉద్యోగంపైనే ఆధార పడి ఉంది. శ్రమ పడి పరీక్షకు తయారయ్యాను. పరిశీలనలో ఉన్న ఉద్యోగం ఖాయం కావాలంటే, పరీక్షలో నెగ్గాలి. లేకపోతే, ఈ తాత్కాలిక ఉద్యోగం ఊడిపోతుంది.
ఝాలో కృపేనే పాస జర | హోఈన ఆపులే పాయీ సాదర | వాటీన నాంవానే ఖడీసాఖర | హాచ నిర్ధార పై మాఝా | ||౫౨||
52. ‘మీ కృపతో పరీక్షలో నెగ్గానంటే, మీ పాదాల దగ్గరకు వచ్చి, మీ పేర పటిక బెల్లాన్ని పంచి పెడతాను. ఇది నా దృఢ నిశ్చయం’.
ఎణేం పరీ నవస కేలా | మనాజోగా ఆనంద ఝాలా | నవస ఫేడాయా విలంబ లాగలా | త్యాగ కేలా సాఖరేచా | ||౫౩||
53. అని మ్రొక్కుకున్నాడు. అతని కోరిక తీరింది. ఎంతో ఆనందించాడు. మ్రొక్కు తీర్చడానికి ఆలస్యమై పోతుందని, పంచదార తీసుకోవడం మానివేశాడు.
వాటేంత గాంఠీస కాంహీ వ్హావే | రిక్త హస్తే కైసే జావే | ఆజచే ఉద్యాంవర లోటావే | దివస కంఠావే లాగలే | ||౫౪||
54. దారి ఖర్చులకు డబ్బు కావాలి. ఉత్తి చేతులతో బాబా దగ్గరకు ఎలా వెళ్ళాలి? ఇవాళ, రేపు అని రోజులు గడిచిపోతున్నాయి.
ఓలాండవేల నాణేఘాంట4 | సహ్యాద్రీచా కడాహీ అఫాట | పరి ప్రపంచికా హా ఉంబరేఘాంట5| బహు దుర్ఘట ఓలాండూ | ||౫౫||
నవస న ఫేడితా శిరడీచా | అసేవ్య పదార్థ సాఖరేచా |
చహాహీ బిన సాఖరేచా | చోళకరాంచా చాలలా | ||౫౬||
56. శిరిడీకి వెళ్ళి మ్రొక్కు తీర్చుకునే వరకు, పంచదార వేసిన పదార్థాలను మానివేసి, త్రాగే టీ కూడా చక్కెర లేకుండానే తీసుకో సాగాడు.
జాతా ఏసే కాంహీ దివస | ఆలీ వేళ గేలే శిరడీస | ఫేడిలా తై కేలేలా నవస | ఆనంద మనాస జాహలా | ||౫౭||
57. అలా కొన్ని రోజులు గడిచాయి. కాలం కలిసి వచ్చింది. శిరిడీకి వెళ్ళి మ్రొక్కు తీర్చుకుని చాలా ఆనందించాడు.
హోతాంచ సాఈంచే దర్శన | చోళకర ఘాలితీ లోటాంగణ | వందోనియా బాబాంచే చరణ | ఆల్హాద పరిపూర్ణ తే ఝాలే | ||౫౮||
58. సాయిని దర్శించుకుని, వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. మనసుకు తృప్తి, ఆనందం రెండూ కలిగాయి.
మన కరూనియా నిర్మళ | వాటితీ సాఖర అర్పితీ శ్రీఫళ | మ్హణతీ ఆజి మనోరథ సకళ | ఝాలే సఫళ కీ మాఝే | ||౫౯||
59. నిర్మలమైన మనసుతో, సాయికి శ్రీఫలాన్ని (కొబ్బరికాయ) అర్పించి, పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ‘ఈ రోజు నా అన్ని కోరికలూ తీరి, నా జీవితం సార్థకమైంది’ అని అనుకున్నాడు.
ఆనందలే సాఈదర్శనే | సుఖ జాహలే సంభాషణే | హోతే చోళకర జోగాంచే పాహుణే | ఆలే జాణే జోగాంకడే | ||౬౦||
60. సాయి దర్శనంతో ఆనందించి, వారితో మాట్లాడటంతో తృప్తి చెందాడు. చోళకరు జోగు వద్ద అతిథిగా ఉండటం వలన, జోగు వద్దకు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు.
జోగ ఉఠలే పాహుణే నిఘాలే | బాబా జోగాంస వదతే ఝాలే |
“పాజీ యాంస చహాచే ప్యాలే | భలే భరలే సాఖరేచే” | ||౬౧||
61. బయలుదేరటానికి జోగు లేవగానే, చోళకరు కూడా లేచాడు. అప్పుడు బాబా జోగుతో “ఇతనికి బాగా చక్కెర వేసి, కప్పుల నిండా చహా ఇవ్వు” అని చెప్పారు.
ఆనందాశ్రూ ఆలే నయనీ | మాథా చరణీ ఠేవిలా | ||౬౨||
62. తన రహస్యం గురించిన మాటలు చెవిన పడగానే, చోళకరు ఆశ్చర్య పడ్డాడు. వెంటనే, కళ్ళనుండి ఆనందంతో నీరు ప్రవహించ సాగింది. సాయి పాదాల మీద తన తలను ఉంచాడు.
కౌతుక వాటలే జోగాంనా | త్యాహూన ద్విగుణ చోళకరాంనా | కారణ ఠావే తయాంచే త్యాంనా | పటల్యా ఖుణా మనాచ్యా | ||౬౩||
63. బాబా మాటలు జోగుకు చాలా వింతగా అనిపించింది. కాని, చోళకరుకు అంతకంటే రెండింతలు ఆశ్చర్యం వేసింది. అతనొక్కడికే, బాబా మాటలలోని ఉద్దేశం అర్థమైంది.
చహా నాహీ బాబాంస ఠావా | యేక్షణీంచ కా ఆఠవావా | చోళకరాంచా విశ్వాస పటావా | ఠసా ఉమటవా భక్తీచా | ||౬౪||
64. బాబా ఎప్పుడూ చహా త్రాగలేదు. అకస్మాత్తుగా అది ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చింది? చోళకరుకు నమ్మకం కలిగించటానికి. అతని భక్తిని దృఢ పరచటానికి.
ఇతక్యాంచ పురా దిలా ఇశారా | కీ “పావలీ వాచాదత్త శర్కరా | తుఝ్యా త్యాగాచా నేమహీ పురా | చోళకరా ఝాలాసే | ||౬౫||
65. ఇంతలో, అనుకోకుండా, చోళకరుకు బాగా అర్థమయ్యేలా “చోళకరు! నువ్వు అనుకున్న పటిక బెల్లం అందింది. అలాగే నీ త్యాగం గురించిన నియమం కూడా పూర్తయింది.
నవస వేళేచే తుఝే చిత్త | దీర్ఘసూత్రతేచే ప్రాయశ్చిత్త | హే జరి తుఝే ఠేవణే గుప్త | తే మజ సమస్త కళలేగా | ||౬౬||
66. “మ్రొక్కు తొందరగా తీర్చలేక, చక్కెరను మానుకుని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. నువ్వు దీనిని రహస్యంగా దాచినా, నాకు అన్నీ తెలిసింది.
తుమ్హీ కోణీ కుఠేంహీ అసా | భావే మజపుఢే పసరితా పసా | మీ తుమచియా భావా సరిసా | రాత్రందిసా ఉభాచ | ||౬౭||
67. “మీరెవరైనా సరే, ఎక్కడనుంచి అయినా సరే, భక్తి భావంతో నా ముందు చేతులు చాపితే, మీ భక్తి శ్రద్ధలను బట్టి, రాత్రింబవళ్ళూ మీ దగ్గరే ఉంటాను.
మాఝా దేహ జరీ ఇకడే | తుమ్హీ సాతాం సముద్రాంపలీకడే | తుమ్హీ కాంహీంహీ కరా తికడే | జాణీవ మజకడే తాత్కాళ | ||౬౮||
68. “నా దేహం ఇక్కడున్నా, మీరు ఏడు సముద్రాల అవతల ఏం చేస్తున్నా, నాకు వెంటనే తెలిసిపోతుంది.
కుఠేంహీ జా దునియేవర | మీ తో తుమ్హా బరోబర | తుమ్హా హృదయీంచ మాఝే ఘర | అంతర్యామీ తుమచే మీ | ||౬౯||
69. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. మీ లోపల ఉండేవాడు నేనే.
ఏసా తుమ్హా హృదయస్థ జో మీ | తయాసీ నమా నిత్య తుమ్హీ | భూత మాత్రాచ్యాహీ అంతర్యామీ | తోచ తో మీ వర్తతో | ||౭౦||
70. “ఇలా ఎప్పుడూ మీ హృదయంలో ఉండే నన్ను మీరు రోజూ పూజించండి. అన్ని జీవులలో లోపల ఉన్నదీ నేనే.
యాస్తవ తుమ్హాంస జో జో భేటే | ఘరీ దారీ అథవా వాటే |
తే తే ఠాయీ మీచ రహాటే | మీచ తిష్ఠే త్యామాజీ | ||౭౧||
71. “ఇంట్లోగాని, బయటగాని, లేదా దారిలోగాని, ఎక్కడ ఎవరు మీకు కనిపించినా, వారంతా నా ప్రతిరూపమే. వారి లోపల కూర్చున్నది నేనే.
కీడ ముంగీ జలచర ఖేచర | ప్రాణి మాత్ర శ్వాన శూకర | అవఘ్యా ఠాయీ మీచ నిరంతర | భరలో సాచార సర్వత్ర | ||౭౨||
72. “చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన ఎగిరే పక్షులు, కుక్కలు, పందులు, మొదలైన ప్రాణులన్నింటిలోనూ, అన్ని చోట్లా అంతు లేకుండా నిండి ఉన్నాను.
మజశీ ధరూ నకా అంతర | తుమ్హీ ఆమ్హీ నిరంతర | ఏసే మజ జో జాణీల నర | భాగ్య థోర తయాచే” | ||౭౩||
73. “నన్ను వేరుగా అనుకోకండి. మీకూ నాకూ ఏ మాత్రం తేడా లేదు. నన్ను ఇలా తెలుసుకున్నవారు గొప్ప అదృష్టవంతులు”.
దిసాయా హే వార్తా తోకడీ | పరి గుణానే బహు చోఖడీ | కితీ త్యా చోళకరా గోడీ | దిధలీ జోడీ భక్తీచీ | ||౭౪||
74. ఈ మాటలు చాలా మామూలుగా అనిపించినా, అవి ఎంతో ఉత్తమమైన జ్ఞానాన్ని కలుగ చేస్తాయి. ఎంతో ప్రేమతో బాబా చోళకరు భక్తిని స్థిరపరచారు.
హోతే జే జే తయా అంతరీ | తే తే బాబాంనీ ఎణే పరీ | దావిలే తయాంస ప్రత్యంతరీ | కాయ హే కుసరీ సంతాంచీ | ||౭౫||
75. అతని మనసులో ఉన్నదంతా బాబా అతనికి అలా తెలియ చేసి, అతనికి నేరుగా గొప్ప అనుభవాన్ని కలుగ చేశారు. ఈ సాధు సంతులు ఎంత చతురులు?
బోలచి బాబాంచే అణమోల | భక్త హృదయీ శిరతీ సఖోల | ప్రేమాచే మళ్యాస ఆణీతీ ఓల | భక్తీస డోల దావితీ | ||౭౬||
76. బాబా మాటలు వెలలేనివి. అవి భక్తుల హృదయాలలోకి సూటిగా దూసుకుని వెళ్ళి, అక్కడ ప్రేమ, భక్తికి జీవం పోస్తాయి. ఓడలలో దిక్కును చూపే స్తంభంలా, బాబా మాటలు భక్తి మార్గానికి దారి చూపుతాయి.
చాతక తృష్ణేచ్యా పరిహారా | మేఘ సదయతా వర్షే ధారా | పరిణామీ నివే అఖిలధరా | తేచ తర్హా హే ఝాలీ | ||౭౭||
77. చాతక పక్షి దప్పికను తీర్చటానికి, దయతో మబ్బులు ధారగా వర్షాన్ని కురిపిస్తాయి. దానితో, భూమి అంతా తడుస్తుంది. ఇక్కడ కూడా అలాగే జరిగింది.
చోళకర బిచారా కోఠీల కోణ | నిమిత్తాస దాస గణూంచే కీర్తన | నవస కరావయా ఝాలే మన | బాబాహీ ప్రసన్న జాహలే | ||౭౮||
78. పాపం చోళకరు! ఎక్కడి వాడో ఏమో! నిమిత్త మాత్రుడైన దాసగణు కీర్తన వలన, బాబాకు మ్రొక్కుకోవాలన్న ఆలోచన అతనిలో కలిగింది. ఆ ఆలోచన ప్రభావంగానే అతను బాబా అనుగ్రహాన్ని పొందగలిగాడు.
తేణేంచ హా చమత్కార | కళలే సంతాంచే అంతర | ఉపదేశార్థ బాబా తత్పర | ఏసే అవసర ఆణీత | ||౭౯||
79. ఇలాంటి చమత్కారమైన లీలలతోనే సత్పురుషుల మనసులోని ఆలోచనలు బయట పడతాయి. జ్ఞానోపదేశం చేయాలని బాబా ఆసక్తిగా ఉండటం వలన, ఇలాంటి అవకాశాలను సృష్టిస్తారు.
చోళకరాంచే కేవళ నిమిత్త | సకళ భక్తాంచే సాధావయా హిత | అకల బాబాంచీ కళా నిత | విలోకీతచి రహావే | ||౮౦||
80. చోళకరు కూడా నిమిత్త మాత్రుడే. భక్తులందరికీ మేలు చేయాలని, బాబా చేసే ఊహకందని లీలలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తునే ఉంటాయి.
ఏసీచ ఆణిక కథా వర్ణూన | మగ హా అధ్యాయ కరూ పూర్ణ |
కైసా ఎకే కేలా ప్రశ్న | కైసే తన్నిరసన బాబాంనీ | ||౮౧||
81. ఇలాంటిదే ఇంకొక లీలను వర్ణించి, ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. ఎవరో ఒకరు, బాబాను ఏమని అడిగారు, దానికి బాబా ఏమని చెప్పారు?
భక్త ఎక సన్ముఖ బైసత | ఏకే చుకచుకతా పాల ఎక | ||౮౨||
82. మసీదులో, తమ ఆసనంలో బాబా కూర్చుని ఉండగా, ఒక సారి, ఒక భక్తుడు వారి ఎదుట కూర్చున్నప్పుడు, అతని ఎదురు గోడ మీద, ఒక బల్లి కిచకిచమని పలికింది.
పల్లీపతన పల్లీవచన | పుఢీల భవిష్యార్థాచే సూచన | సహజ బాబాంస కరీ ప్రశ్న | జిజ్ఞాసాసంపన్న హోఊని | ||౮౩||
83. బల్లి పైన పడటం కాని, బల్లి పలకటం కాని, భవిష్యతును సూచిస్తుందన్న సహజమైన కుతూహలంతో అతడు, బాబాను అడిగాడు.
“బాబా హీ పాఠీసీ భింతీవరీ | కిమర్థ హో పాల చుకచుక కరీ | కాయ అసావే తియేచే అంతరీ | అశుభకారీ నాహీ నా” | ||౮౪||
84. ‘బాబా! వెనుక గోడమీద బల్లి ఎందుకు కిచకిచమని పలుకుతుంది? దాని మనసులో ఏమి ఉంటుంది? అది చెడు సూచన కాదు కదా?’ అని అడిగాడు.
తయాస బాబా ఝాలే వదతే | “పాలీస ఆలే ఆనంద భరతే | కీ ఔరంగాబాదేహూన యేతే | బహీణ యేథే భేటావయా” | ||౮౫||
85. అతనితో బాబా “ఔరంగాబాదునుండి, తనను కలుసుకోవటానికి, దాని సోదరి ఇక్కడికి వస్తుందని, సంతోషంతో పలుకుతుంది” అని చెప్పారు.
ఆధీ పాల తో జీవ కాయ | తిలా కైచా బాప మాయ | కైచీ బహీణ కైచా భాయ | సంసార వ్యవసాయ కాయ తియే | ||౮౬||
86. అది అసలే బల్లి. అదెంత ప్రాణి! దానికి అమ్మ, నాన్నా, అన్నా, అక్కా, ఉంటారా? దానికి మనుషుల్లాగా చుట్టరికాలు, వ్యవహారాలు ఏముంటాయి?
మ్హణోని బాబా హే కాంహీంతరీ | బోలిలే వినోదే ప్రత్యుత్తరీ | ఏసే మానూనియా అంతరీ | స్వస్థ క్షణభరీ బైసలా | ||౮౭||
87. వినోదానికి, బాబా ఏదో అలా చెప్పి ఉంటారని, అతడు తనలోనే అనుకొని, ఊరికే కూర్చున్నాడు.
ఇతక్యాంత ఔరంగాబాదేహూన | గృహస్థ ఎక ఘోడ్యావరూన | ఆలా ఘ్యావయా బాబాంచే దర్శన | బాబా తే స్నాన కరీత | ||౮౮||
88. ఇంతలో అకస్మాత్తుగా, ఔరంగాబాదునుండి ఒక మనిషి గుర్రం మీద, బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు.
తయాస జాణే హోతే పుఢే | చందీ వాంచూన చాలేనా ఘోడే | హరభరే వికత ఘ్యావయా థోడే | బాజారాకడే నిఘాలా | ||౮౯||
89. అతను ఇంకా ముందుకు ప్రయాణం చేయాల్సి ఉంది. కాని దాణా లేకుండా గుర్రాలు నడవవు. అందుకు శెనగలు కొనటానికి బజారుకు వెళ్ళాలని, అతను అనుకున్నాడు.
పాలీచా ప్రశ్న విచారణారా | సాశ్చర్య పాహే నవ సౌదాగరా | ఇతుక్యాంత త్యానే ఖాకేచా తోబరా | ఝటకలా కచరా ఝాడావయా | ||౯౦||
90. గుర్రానికి తగిలించే సంచిని తన భుజంనుంచి తీసి, అందులోని చెత్తను దులిపాడు. బల్లిని గురించి ప్రశ్న అడిగిన మనిషి, ఆశ్చర్యంగా అతన్ని చూడసాగాడు.
ఉపడీ ఆపటతాంచ క్షితీవర | పాల ఎక పడలీ బాహేర |
ఘాబర్యా ఘాబర్యా ధాంవలీ సరసర | నజరేసమోర సకళాంచ్యా | ||౯౧||
91. సంచిని తిరగవేసి, నేలమీద కొట్టినప్పుడు, అందులోనుండి ఒక బల్లి నేలపై పడింది. అందరూ చూస్తుండగా, అది భయంతో, సరసరా గాబరాగా పరుగెత్తింది.
ప్రశ్నపుసత్యా బాబా వదతీ | “ఆతా లక్ష ఠేవీ తిజవరతీ | పాలీచీ త్యా బహీణ హీచ తీ | పహా చమత్కృతీ తియేచీ” | ||౯౨||
92. ఆ ప్రశ్నించిన మనిషితో బాబా “ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడు! అదే ఆ బల్లి సోదరి. దీని చమత్కారం చూడు” అని అన్నారు.
తీ జీ తేథూని నిఘాలీ తడక | తాఈ కరీత హోతీచ చుకచుక | ధరూనియా త్యా ఆవాజావర రోఖ | చమకత ఠుమకత చాలలీ | ||౯౩||
93. వెంటనే, ఆ బల్లి అక్కడినుండి కిచకిచమనే సోదరి శబ్దాన్ని విని, వయ్యారంగా కులుకుతూ వెళ్ళింది.
బహిణీ బహిణీచీ తీ గాంఠ | బహుతా దిసీ ఝాలీ భేట | చుంబీతీ ముఖ ఆలింగితీ దాట | ప్రేమాచా థాట అనుపమ | ||౯౪||
94. చాలా రోజుల తరువాత ఆ అక్కచెల్లెళ్ళు ఇద్దరూ కలుసుకోవటం వలన, ఒకరినొకరు కౌగలించుకున్నాయి, నోటి మీద ముద్దులు పెట్టుకున్నాయి. ఆ ప్రేమ సాటిలేనిది.
ఎకమేకీస ఘాలీత గిరక్యా | ఆనందానే మారీత భిరక్యా | గేల్యా ఉభ్యా ఆడవ్యా తిరక్యా | స్వచ్చంద ఫిరక్యా మారీత | ||౯౫||
95. ఒక దాని చుట్టూ ఇంకొకటి తిరుగుతూ, ఆనందంగా, అన్ని చోట్లా తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు నాట్యం చేశాయి.
కోఠే తే ఔరంగాబాద శహర | కోఠే శిరడీ కాయ హా ప్రకార | కైసా యావా అవచిత హా స్వార | పాలహీ బరోబర తయాచ్యా | ||౯౬||
96. ఎక్కడ ఔరంగాబాదు పట్టణం, ఎక్కడ శిరిడీ! ఇదేం విశేషం! అకస్మాత్తుగా, ఎక్కణ్ణుంచో ఆ గుర్రపు మనిషి రావటం, అతనితో పాటు ఆ బల్లి కూడా రావటం చాలా వింత కాదూ!
అసేల పాల ఔరంగాబాదీ | అసేల శిరలేలీ తోబర్యామధీ | పరి త్యా ప్రశ్నోత్తరా సంబంధీ | కైసీ హీ సంధీ పాతలీ | ||౯౭||
97. అది ఔరంగాబాదులోని బల్లే కావచ్చు. దాణా సంచిలో దూరి ఉండవచ్చు కూడా, కాని, బల్లి గురించి అడిగిన సమయానికి సరిగ్గా అది ఎలా వచ్చింది?
పాల కాయ చుకచుకావీ | ప్రశ్న స్ఫూర్తి తీ కాయ వ్హావీ | అర్థోపపత్తీ కాయ కథావీ | ప్రచీతి యావీ తాత్కాళ | ||౯౮||
98. అనుకోకుండా ఒక బల్లి కిచకిచమని పలకటం, దానిని గురించి ఒక భక్తుడు ప్రశ్నించటం, దానికి బాబా అర్థం చెప్పి, ఈ అద్భుతమైన అనుభవాన్ని కలుగ చేయటం,
ఏసా హా యోగ అప్రతిమ | వినోదావరీ సార్వత్రిక ప్రేమ | సంత సాధన యోజూని అనుపమ | భక్త క్షేమ వాఢవితీ | ||౯౯||
99. ఇవన్నీ ఊహించని విధంగా కలసిరావటం, అద్భుతమే కాదూ! వినోదం అంటే అందరికీ ఎప్పుడూ ఇష్టమే. భక్తుల మంచిని పెంచటానికి, సత్పురుషులు ఇలాంటి సాటిలేని అనుభవాలను కలిగిస్తూ ఉంటారు.
పహా హా యేథే జిజ్ఞాసూ నసతా | అథవా కోణీహీ న ప్రశ్న పుసతా | కైసా సాఈంచా మహిమా సమజతా | కోణాస కళతా హా అర్థ | ||౧౦౦||
100. కొంచెం ఆలోచించండి. కుతూహలంతో ఎవరూ ప్రశ్నను అడిగి ఉండక పోతే, సాయి మహిమను మనం ఎలా తెలుసుకుంటాం? వారి గొప్పతనం ఎలా బయట పడేది?
అనేక వేళీ శబ్ద కరితా | అనేక పాలీ ఠావ్యా సమస్తా |
కోణ పుసే త్యా శబ్దాచ్యా అర్థా | అథవా వార్తా తయాచీ | ||౧౦౧||
101. ఎన్నో సమయాలలో, ఎన్నెన్నో బల్లులు పలుకుతుంటాయి. ఇది అందరికీ తెలిసినదే. ఆ పలుకుల వెనుక ఉన్న అర్థాన్ని కాని, ఆ బల్లులు ఎందుకు పలుకుతాయి అని కాని, ఎవరైనా తెలుసుకోవాలని ప్రయత్నించారా?
కోణాస వ్హావీ తరీహీ అటకళ | ఆశ్వర్య సకళ కరితాత | ||౧౦౨||
102. ఈ కథవలన మనకు తెలిసేది ఏమిటంటే, ఈ జగత్తును నడిపించే సూత్రం చాలా రహస్యంగా, ఎవరికీ అర్థం కాకుండా ఉంది. అనుకోకుండా, ఎప్పటికప్పుడు, అది అందరినీ ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది.
ఉలట యా పాలీ శబ్ద కరితా | దర్శవితీ కీ అనర్థ సూచకతా | “కృష్ణ కృష్ణ” వాచే మ్హణతా | టళతే అనర్థతా జన వదతీ | ||౧౦౩||
103. బల్లి పలికితే, చెడు సూచన అని, ‘కృష్ణ, కృష్ణ’ అని అంటే ఆ చెడు తొలగి పోతుందని, జనుల నమ్మకం.
ఆసేనాకా కైసీహీ వ్యుత్పత్తి | పరంతు హీ కాయ చమత్కృతి | భక్త జడవావయా నిజపదా ప్రతి | ఉత్తమ హీ యుక్తి బాబాంచీ | ||౧౦౪||
104. ఎవరేమనుకున్నా, తాము అన్ని చోట్లా, ఎల్లప్పుడూ నిండి ఉన్నారన్నది, భక్తులు తెలుసుకొని, భక్తి మార్గంలో స్థిరపడాలని బాబా చేసిన ఉత్తమమైన ఉపాయం ఇది, చమత్కారం మాత్రమే కాదు.
వాచీల జో హా అధ్యాయ ఆదరీ | అథవా నేమానే ఆవర్తన కరీ | తయాచే సంకట గురురాయ నివారీ | ఖూణ అంతరీ దృఢ బాంధా | ||౧౦౫||
105. ఈ అధ్యాయాన్ని, భక్తి శ్రద్ధలతో పఠించి, మరల మరల చదివే వారి కష్టాలను గురుదేవులు తొలగిస్తారని, మనసులో దృఢమైన నమ్మకాన్ని పెంచుకోండి.
అనన్య భావే చరణీ మాథా | జో జో వాహీ తయాసీ తత్త్వతా | త్రాతా పాతా అభయదాతా | కర్తా హర్తా తో ఎక | ||౧౦౬||
106. స్థిరంగా ఒకే మనసుతో, గురు పాదాలమీద తలనుంచే వారిని, రక్షించేది ఒక్క సాయియే. భయాన్ని తొలగించి, కష్టాలను నివారించే ఆ దైవం సాయి ఒక్కరే.
అంతర మానూ నకా యేథ | ఏసాచ ఆహే హా సాఈనాథ | నిజానుభవాచా గుహ్య భావార్థ | భక్త కల్యాణార్థ మీ కథితో | ||౧౦౭||
107. ఇందులో ఏ సందేహాన్ని పెట్టుకోకండి. సాయి గురించి, స్వయంగా నేను పొందిన, రహస్యమైన అనుభవాన్ని, భక్తుల శ్రేయస్సు కొరకు చెప్పుతున్నాను.
జగీ సంపూర్ణ మీచి ఎక | దుజే న మజవీణ కాంహీ ఆణీక | నాహీ కేవళ హాచి లోక | అఖిల త్రైలోక్య మీచి మీ | ||౧౦౮||
108. ఈ ప్రపంచమంతా నేనే. నేను తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఈ లోకంలోనే కాదు, మూడు లోకాలలోనూ నేను, నేనే.
ఏసే అద్వితీయత్వ జేథే స్ఫురే | తేథే భయాచీ వార్తాచ నురే | నిరభిమానే నిరహంకారే | చిన్మాత్ర సారే భరలే జ్యా | ||౧౦౯||
109. ఇలాంటి ఒకటే అన్న భావమున్నప్పుడు, భయమనేది కొంచెం కూడా మిగలదు. అభిమానం లేని, అహంకారం లేని, పూర్తిగా జ్ఞానమే ఉన్న చోట, చైతన్యం ఎప్పుడూ నిండి ఉంటుంది.
హేమాడపంత సాఈంశీ శరణ | సోడూ నేణే క్షణ ఎక చరణ | కీ త్యాంత ఆహే సంసార తరణ | గోడ నిరూపణ అవధారా | ||౧౧౦||
110. హేమాడు పంతు సాయికి శరణుజొచ్చి, ఒక్క క్షణమైనా వారి పాదాలను వదిలి ఉండలేడు. ఎందుకంటే, ఈ సంసార సాగరాన్ని క్షేమంగా దాటించేది ఆ పాదాలే. తరువాత వచ్చే మధురమైన వర్ణనను వినండి.
పుఢీల అధ్యాయీ ప్రసంగ సుందర | నిర్మాణ కరితీల సాఈ గురువర |
బ్రహ్మజ్ఞాన కైసే వాటేవర | చిటకీవారీ జన మాగే | ||౧౧౧||
111. తరువాతి అధ్యాయంలో, గురువులలో గొప్పవారైన సాయి సృష్టించిన, జ్ఞానంతో నిండిన, ఒక ప్రసంగాన్ని వినండి. చిటికలో బ్రహ్మ జ్ఞానం పొందాలనే వారి కోసం ఇదొక కనువిప్పు.
కోణీ ఎక లోభీ జన | పుసేల సాఈంసీ బ్రహ్మజ్ఞాన | తే తయాంచేచ ఖిశాంతూన | దేతీల కాఢూన మహారాజ | ||౧౧౨||
112. ఎవరో ఒక పిసినారి మసీదుకు వచ్చి, సాయిని బ్రహ్మ జ్ఞానం ఇమ్మని అడగగా, మహారాజు దానిని అతని జేబులోనుండి తీసి ఇచ్చారు.
శ్రోతీ పరిసతా హే కథానక | దిసూన యేఈల బాబాంచే కౌతుక | లోభ సుటల్యావాంచూని నిష్టంక | బ్రహ్మ నిఃశంక అప్రాప్య | ||౧౧౩||
113. శ్రోతలు ఈ కథను వింటే, బాబాయొక్క సామర్థ్యం తెలుస్తుంది. పిసినారితనం పోనంత వరకూ, బ్రహ్మను తెలుసుకోవడం సాధ్యం కాని పని. ఇందులో ఏ విధమైన సందేహమూ లేదు.
కోణ తయాచా అధికారీ | త్యాచా కోణీహీ విచార న కరీ | కోణా తే ప్రాప్త కైశియాపరీ | తేంహీ వివరతీల మహారాజ | ||౧౧౪||
114. బ్రహ్మ జ్ఞానం ఎవరికి దొరుకుతుంది? అని ఎవరూ ఆలోచించరు. బ్రహ్మజ్ఞానం ఎవరికి ఏ విధంగా దొరకుతుందో, దానిని కూడా సాయి మహారాజు వివరిస్తారు.
మీ తో తయాంచా దాసానుదాస | పదర పసరితో కరితో ఆస | కీ హా సాఈ ప్రేమ విలాస | అతి ఉల్హాసే పరిసా జీ | ||౧౧౫||
115. నేను వారి సేవకులకు సేవకుణ్ణి. ఈ సాయి ప్రేమ పూరితమైన లీలలను, మీరు ఎంతో ఉత్సాహంగా వింటారన్న ఆశతో వేడుకుంటున్నాను.
చిత్త హీ హోఈల ప్రసన్న | లాధేల చైతన్య సమాధాన | మ్హణూన శ్రోతా ద్యావే అవధాన | సంత మహిమాన కళేల | ||౧౧౬||
116. శ్రోతలారా! ఎంతో సావధానంగా వినండి. వింటే, అప్పుడు సాధు సంతుల మహిమ మీకు అర్థమౌతుంది. చైతన్యం లభించటంతో, మీ మనసు ఆనందంతో తృప్తి చెందుతుంది.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | చోళకరశర్కరాఖ్యానం నామ |
| పంచదశోధ్యాయః సంపూర్ణః |
||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ:
1. ధిక్కార, నిర్భత్సనా. 2. ఉతావీళ న హోణే.
3. యా నావాచా ఎక శ్రద్ధాళూ గరీబ ఠాణ్యాచ్యా సివ్హిల కోర్టాత ఉమేదవార హోతా.
4. ఠాణే జిల్హయాత మురబాడ తాలుక్యాత యా నావాచా ఎక ఉంచ ఘాట అసూన యా వాటేనే కోకణాతీల లోక దేశావర జాతాత ఆణి దేశావరీల కోకణాత ఉతరతాత. యా ఘాటానే పుణే జిల్హ్యాతీల జున్నరలా కోకణచే లోక జాత-యేత అసతాత.
5. ఘరాచా ఉంబరా.
No comments:
Post a Comment