Sunday, July 28, 2013

||చికిత్సాఖండణవిభూతిమండనం నామ పంచత్రింశత్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౩౫ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

మాగా గతాధ్యాయా అంతీ | దిగ్దర్శన కథానుసంగతీ | 
కథిలీ తీచ కథితో సంప్రతీ | తీ స్వస్థ చిత్తీ పరిసిజే | ||౧|| 
1. పోయిన అధ్యాయం చివరలో సూచించిన కథలనే, ఇప్పుడు చెప్తాను. వీనిని శ్రద్ధతో వినండి.
కరూ జాతా పరమార్థ విచార | పంథాభిమాన అడవీ భయంకర | 
విఘ్న నాహీ అతి దుర్ధర | యా అభిమానాసమ దుజే | ||౨|| 
2. పరమార్థం గురించి ఆలోచించటం మొదలు పెట్టితే, అతి భయంకరమైన ధార్మిక శాఖల అభిమానం, అడ్డు పడుతుంది. దీనికంటే ఘోరమైన ఆటంకం ఇంకొకటి లేదు. 
ఆమ్హీ నిరాకారాచే భజక | సాకార దేవ హా భ్రమమూలక | 
సాధుసంత హే మానవచి దేఖ | నమవావే కా మస్తక తయాంపుఢే | ||౩|| 
3. ‘ఆకారంలేని దేవుణ్ణే మేము ఆరాధిస్తాము. ఆకారమున్న దేవుళ్ళే అన్ని భ్రమలకూ మూలం. ఎంతైనా, సాధు సత్పురుషులు కూడా మనుషులే కదా! వారికి, తల వంచి నమస్కారం ఎందుకు చేయాలి? 
తయా నా ఘాలావే లోటాంగణ | తయా న ద్యావే దక్షిణాదాన | 
ఖాలవావీ న యత్కించిత మాన | విడంబన హే భక్తీచే | ||౪|| 
4. ‘వారికి అసలు, సాష్టాంగ నమస్కారం చేయకూడదు. దక్షిణను కూడా ఇవ్వరాదు. వారి ముందు, అసలు తల వంచరాదు. ఇవన్నీ చేస్తే, భక్తిని ఎగతాళి చేసినట్లే’. 
శిరడీసంబంధే అనేకాంహీ | కోణీ కాహీ కోణీ కాహీ | 
అనేక వార్తా కథిల్యా పాహీ | విశ్వసనీయ నాహీ పా సకళ | ||౫|| 
5. అని శిరిడీ గురించి ఒకరు ఒక రకంగా, మరొకరు మరో రకంగా, ఇంకా ఎందరో ఎన్నో రకాలుగా చెప్తారు. అవన్నీ నమ్మదగినవి కావు. 
మ్హణతీ తేథే జాతా దర్శనా | సాఈబాబా మాగతీ దక్షిణా | 
సాధూ జై లాగతీ ద్రవ్య సంపాదనా | సాధుత్వా హీనపణా తయాంచ్యా | ||౬|| 
6. ‘అక్కడికి దర్శనానికి వెళ్ళిన వారిని, సాయిబాబా దక్షిణ అడుగుతారు. డబ్బును ఆశించటం, వారి సాధుత్వం మీద మచ్చ కదా! 
అంధశ్రద్ధా నవ్హే బరీ | ప్రత్యక్ష అనుభవ ఘేతల్యాఉపరీ | 
ఠరవూ నిర్ణయ ఆపుల్యా అంతరీ | కైసియే పరీ వర్తావే | ||౭|| 
7. ‘గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. నేనే అనుభవాన్ని పొందిన తరువాతే, ఎలా నడుచుకోవాలో, మనసులో నిర్ణయించుకుంటాను. 
ఆపణ నాహీ దేణార దక్షిణా | జయా మనీ విత్తాచీ కామనా | 
తయాచే సాధుత్వ యేఈనా మనా | అపాత్ర నమనా తో ఆమ్హా | ||౮|| 
8. ‘నేను దక్షిణను ఇవ్వను. డబ్బును కోరేవారు సాధువులా? అలాంటివారు నాకు నచ్చరు. అర్హత లేనివారికి నేను నమస్కరించను. 
అసో ఆమ్హీ శిరడీస జాఊన | యేఊ తయాచీ భేట ఘేఊన | 
కరణార నాహీ చరణవందన | అథవా ప్రదాన దక్షిణేచే | ||౯|| 
9. ‘శిరిడీకి వచ్చి, నేను వారిని కలుసుకుంటాను. కాని, వారి పాదాలకు నమస్కారం చేయను. దక్షిణ కూడా ఇవ్వను’. 
జో జో ఏసియా కుతర్కే నిఘే | జరీ ఆపుల్యా కృతనిశ్చయా జాగే | 
అఖేర తోహీ దర్శనయోగే | శరణ రిఘే సాఈస | ||౧౦||
10. ఎవరెవరు ఇలాంటి చెడు ఆలోచనలతో శిరిడీకి వెళ్ళారో, వారందరూ సాయిని దర్శించుకోగానే, వారికి శరణుజొచ్చేవారే. 

జో జో సాఈస పాహూ సరలా | తో తో జాగచే జాగీంచ ఠేలా | 
పునశ్చ నాహీ మాగే పరతలా | పాయీంచ రతలా సాఈచ్యా | ||౧౧|| 
11. అలా, సాయిని దర్శించుకోగానే, అక్కడికక్కడే అతుక్కుని పోయేవారు. మరల వెనుకకు తిరిగి చూడలేదు. సాయి పాదాలలో లీనమై పోయేవారు. 
ధరూనియా దాంతీ తృణ | జైసే కోణీ యావే శరణ | 
తైసియే పరీ వందీ చరణ | పావోని విస్మరణ నిశ్చయా | ||౧౨|| 
12. సాయికి వినయంగా శరణుజొచ్చి, వారి పాదాలకు నమస్కరిస్తే చాలు, వారందరూ తమ దృఢమైన నిర్ణయాలను మరచిపోయేవారు. 
పంథాభిమానా జేథే విసావా | సౌఖ్య వాటేల అత్యంత జీవా | 
తో హా అధ్యాయ పస్తిసావా | శ్రోతీ పరిసావా సాదర | ||౧౩|| 
13. తమ శాఖమీద ఉన్న అభిమానాన్ని వదిలితే, మనసుకు ఎంతో సుఖం కలుగుతుంది. ఈ అధ్యాయాన్ని శ్రోతలు ఎంతో ఆదరణతో వినండి. 
తైసీచ సూచిత ఉదీచీ ఖ్యాతీ | బాళా నేవాసకరాచీ ప్రచీతీ | 
కైసా సర్ప సంభావిలా ప్రీతీ | సాఈచ తయాప్రతి భావూన | ||౧౪|| 
14. అలాగే, ఉదీయొక్క మహిమను, బాలా నేవాస్కరు పామును, సాయి అనుకుని, ప్రేమగా ఆదరించిన అతని అనుభవాన్ని వినండి. 
కృపా కరా శ్రోతే మజవర | మీ తో కేవళ ఆజ్ఞేచా కింకర | 
ఆజ్ఞా పాళూ జాణే సాదర | ఉద్భవలే అక్షర చరిత్ర హే | ||౧౫|| 
15. శ్రోతలారా, నా మీద దయవుంచండి. నేను కేవలం బాబా ఆజ్ఞకు సేవకుణ్ణి. వారి ఆజ్ఞను తలవంచి పాటించడమే నాకు తెలిసింది. దాని వలనే ఈ అక్షరాలు, పదాలతో కూడుకున్న చరిత పుట్టినది. 
దృష్టీ ఠేవితా చరణావరీ | తేథూని ఉమటతీ పదలహరీ | 
పవిత్ర చరిత్ర కుంభాంతరీ | వరిచేవరీ మీ భరితో | ||౧౬|| 
16. సాయి పాదాలమీదే నా చూపు ఉంచి, అక్కడినుండి అలలుగా పొంగి వస్తున్న పదాలను, పవిత్ర చరిత్ర అనే ఈ కలశంలో పదే పదే నింపుతున్నాను. 
కాసవీచీ ఆమ్హీ పిలీ | కేవళ దృష్టిక్షేపే పోసిలీ | 
నాహీ తాన్హేలీ భుకేలీ భాగలీ | సదైవ ఠేలీ సంతృప్త | ||౧౭|| 
17. తాబేలు పిల్లలవంటి వారం మనము. కేవలం తల్లి చూపులతోనే పోషింపబడతాము. ఆకలి దప్పుల బాధ మనకు లేదు. ఎప్పుడూ సంతృప్తిగా ఉంటాము. 
అసతా ఎక దృష్టీచే సుఖ | నలగే ఆమ్హా అన్నఉదక | 
దృష్టీచ హరీ తహాన భూక | కితీ తే కౌతుక వానావే | ||౧౮|| 
18. ఆ చూపుల సుఖం మనకు దొరకగా, ఇక అన్న పానీయాలు మనకెందుకు, అవసరం లేదు. ఆ చూపే ఆకలి దప్పులను తొలగిస్తుంది. ఆ చమత్కారాన్ని ఎంతని వర్ణించను? 
ఆమ్హాహీ సకల దృష్టీచా విషయ | కృపాసింధూ సాఈరాయ | 
దృశ్య దృష్టా దర్శన జాయ | పుసోని ఠాయ త్రిపుటీచా | ||౧౯|| 
19. కంటికి కనిపించే అన్నీ, మనకు దయాసాగరులైన సాయి మహారాజే. కనుక దృశ్యం, దానిని చూసేవాడు, మరియు చూసే పని, ఈ త్రిపుటి మనకు ఉండదు. 
తైసేచ ఆమ్హా త్వచా స్పర్శ | దోహీ ఠాయీ సాఈ ప్రకాశ | 
అథవా ఘ్రాణ ఆణి వాస | తేథేహీ నివాస సాఈచా | ||౨౦||
20. అలాగే, చర్మము, మరియు దాని వలన అనుభవించే స్పర్శ, ఈ రెండింటిలోనూ మనకు సాయి అనే భావనమే. ముక్కు, మరియు దానివలన కలిగే వాసనలలోనూ సాయియే. 

అథవా శ్రవణీ శబ్ద పడే | పడతాంచ ప్రకటే సాఈచే రూపడే | 
శ్రావ్య శ్రావక శ్రవణ ఉడే | త్రిపుటీ ఝడే ఎకసరా | ||౨౧|| 
21. లేక, చెవుల మీద పదాలు పడగానే, సాయి రూపం కనిపిస్తుంది. దాంతో, వినేది, వినేవారు మరియు వినటం అనే ఈ త్రిపుటి ఒక్క సారిగా మాయమైపోతుంది.
అథవా జేథే రసనా రసే | ఘోళలీ తేథే సాఈ సమరసే | 
రసనా రస రసాస్వాద బాపుడే | కాయసే కోడే త్రిపుఠీంచే | ||౨౨|| 
22. లేక, నాలుక రుచి చూసేటప్పుడు, సాయియే రసంలో ఒకటిగా ఉంటారు. దాంతో, రుచి చూసే నాలుక, రుచిగల పదార్థం మరియు రుచిని చూడటం అనే త్రిపుటి ఎక్కడైనా ఉంటుందా? 
హేచ గతీ కర్మేంద్రియా | తిహీ ఎక సాఈ సేవిలియా | 
సకల కర్మే జాతీ విలయా | పడేల ఠాయా నైష్కర్మ్య | ||౨౩|| 
23. కర్మేంద్రియాల గురించి అయినా ఇంతే. కేవలం ఒక్క సాయిని సేవిస్తే, అన్ని కర్మలూ నశించిపోయి, కర్మఫలంనుంచి ముక్తులమౌతాము. 
అసో ఆతా హా గ్రంథ లాంబలా | సాఈప్రేమే కోఠేంచ వాహవలా | 
పూర్వానుసంధాన లక్షూ చలా | చాలవూ ఆపులా కథాభాగ | ||౨౪|| 
24. ఇక ఈ గ్రంథం పెద్దదై పోతూ ఉంది. సాయి మీద ప్రేమ, ఎక్కడికో లాక్కెళ్ళుతుంది. ఇప్పుడు, మరల వెనుకటి కథను గుర్తుకు తెచ్చుకుని, ముందుకు పోదాము. 
ఎక మూర్తీపూజా పరాఙ్ముఖ | నిరాకారాచే పరమ భజక | 
జాహలే శిరడీ గమనోత్సుక | కేవళ చికిత్సైక బుద్ధీనే | ||౨౫|| 
25. ఆకారం ఉన్న దేవుణ్ణి ఇష్ట పడక, ఆకారం లేని దేవుణ్ణే ఆరాధించే ఒకతను, కేవలం కుతూహలంతో, శిరిడీకి వెళ్ళాలని అనుకున్నాడు. 
మ్హణతీ ఆమ్హీ శిరడీస యేఊన | ఘేఊ కేవళ సాధూచే దర్శన | 
ఆమ్హీ న కేవ్హాంహీ వాంకవూ మాన | కరూ న ప్రదాన దక్షిణేచే | ||౨౬|| 
26. ‘నేను వచ్చి, ఆ సాధువును కేవలం దర్శించుకుంటాను. అంతే కాని, వారికి తలవంచను, దక్షిణనూ ఇవ్వను’ అని అన్నాడు. 
మాన్య కరాల యా దోన శర్తీ | తరీ యేఊ కీ శిరడీప్రతీ | 
బరే మ్హణతా నిజ మిత్రాసంగతీ | జావయా నిఘతీ స్వస్థ మనే | ||౨౭|| 
27. ‘ఈ రెండు షరతులకు ఒప్పుకుంటే, నేను శిరిడీకి వస్తాను’ అని చెప్పాడు. స్నేహితుడు సరే అని అనగా, అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు. 
కాకా మహాజనీ త్యాంచే మిత్ర | సంతార్థ జయాంచీ భావనా పవిత్ర | 
పరీ తే శంకా కుశంకా పాత్ర | స్నేహీ హోతే తయాంచే | ||౨౮|| 
28. సత్పురుషులంటే ఎంతో భక్తిభావం ఉన్న కాకా మహాజనీయే ఆ స్నేహితుడు. కాని, అతనితో వచ్చినతను ఒట్టి అనుమానాల పుట్ట. 
దోఘే నిఘాలే శనివారీ | ముంబఈహూన రాత్రీంచే ప్రహరీ | 
యేఊని పాతలే శిరడీ భీతరీ | ఆదిత్యవారీ సకాళా | ||౨౯|| 
29. శనివారం రాత్రి వారిరువురూ ముంబైనుండి బయలుదేరి, ఆదివారం తెల్లవారి, శిరిడీ చేరుకున్నారు. 
దోఘే ఘేలే మశీదీస | సాఈ దర్శన ఘ్యావయాస | 
కాయ వర్తలే తే సమయాస | స్వస్థ మానస పరిసిజే | ||౩౦||
30. సాయి దర్శనానికని ఇద్దరూ మసీదుకు వెళ్ళారు. అప్పుడు, అక్కడ ఏం జరిగిందో జాగ్రత్తగా వినండి. 

పాఊల ఠేవితా పాయరీవరీ | తయా మిత్రా పాహూని దూరీ | 
“కా యావే జీ” ఏసియే పరీ | బాబా మధురోత్తరీ బాహితీ | ||౩౧| 
31. వారు మసీదు మెట్లపై అడుగు పెట్టగానే, కాకా స్నేహితుణ్ణి చూచి, దూరంనుండే బాబా, “కా యావే జీ!” అని ఎంతో తియ్యగా అన్నారు. 
ఏకూని హే ప్రేమవచన | తయా మిత్రాస పటలీ ఖూణ | 
శబ్దోచ్చారాచీ తీ ఠేవణ | దేఈ త్యా స్మరణ వడిలాంచే | ||౩౨|| 
32. ప్రేమతో నిండిన ఆ మాటలను విన్న ఆ స్నేహితునికి, ఆ పదాలు పలికిన తీరు, వాక్య రచన, ధ్వని అన్నీ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి. 
“కా యావే జీ” హా ఉచ్చార | కాఢితా బాబా కరితీ జో స్వర | 
తో ఏకతా కాకాంచే మిత్ర | విస్మితాంతర జాహలే | ||౩౩|| 
33. “కా యావె జీ!” అన్న బాబా మాట, వారి ఉచ్చరణ, ధ్వని, విని కాకా స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. 
పరిసోని మోహక స్వరాచీ ఠేవణ | గత పిత్యాచే ఝాలే స్మరణ | 
త్యాంచేచ స్వరాచీ తర్హా హీ పూర్ణ | వాటలే అనుకరణ యథార్థ | ||౩౪|| 
34. ఎంతో మోహకమైన ఆ గొంతుక, చనిపోయిన తన తండ్రిని గుర్తుకు తెచ్చింది. బాబా గొంతు పూర్తిగా తన తండ్రి గొంతుకలాగే ఉంది అని అనిపించింది. 
కాయ వాణీచీ మోహన శక్తీ | కాకాంచే మిత్ర విస్మిత చిత్తీ | 
మ్హణాలే హీ మమ పిత్యాచీచ ఉక్తీ | స్వర హా నిశ్చితీ ఓళఖీచా | ||౩౫|| 
35. ‘ఆ మాటలలో ఎంతటి ఆకర్షణ శక్తి ఉంది!’ కాకా స్నేహితుడు ఆశ్చర్యపోయాడు. ‘ఈ గొంతు నిజంగా మా తండ్రిదే, నాకు బాగా గుర్తున్నదే!’ 
వడిలా ముఖీంచీ తైసీ తీ వైఖరీ | ఏకతా తే మిత్ర ద్రవలే అంతరీ | 
వందిలే బాబాంచే చరణ శిరీ | విసరూని పూర్వీల నిశ్చయ | ||౩౬|| 
36. తండ్రి నోటినుండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపును విని, అతను కరిగిపోయాడు. మునుపటి తన షరతులను మరచి పోయాడు. వెంటనే, బాబా పాదాల మీద తన తలవుంచి నమస్కరించాడు. 
పుఢే బాబా దక్షిణా మాగతీ | తీహీ కేవళ కాకాచ ప్రతీ | 
కాకా దేతీ, దోఘేహీ పరతతీ | పునశ్చ జాతీ దుపారా | ||౩౭|| 
37. తరువాత, కాకాను మాత్రమే బాబా దక్షిణను అడిగారు. కాకా ఇచ్చాడు. ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. మరల మధ్యాహ్నం మసీదుకు వచ్చారు. 
తేవ్హాంహీ హే సవేంచి జాతీ | దోఘాంహీ జాణే ముంబఈప్రతీ | 
కాకా తేవ్హా ఆజ్ఞా ప్రార్థితీ | దక్షిణా మాగతీ బాబా త్యా | ||౩౮|| 
38. అప్పుడు కూడా, కాకాతో అతని స్నేహితుడూ ఉన్నాడు. ఇద్దరూ ముంబైకి బయల్దేరటానికి, బాబా అనుమతిని కాకా కోరాడు. బాబా మరల కాకాను దక్షిణను అడిగారు. 
తీహీ కేవళ కాకాచ పాశీ | మ్హణతీ సత్రా రుపయే దే మజసీ | 
కాంహీ న మాగత తన్మిత్రాసీ | మగ తే మనాశీంచ చుటపుటలే | ||౩౯|| 
39. అది కూడా కాకాను మాత్రమే. “పదునేడు రూపాయలను ఇవ్వు” అని అడిగారు. కాని, అతని స్నేహితుణ్ణి ఏమీ అడగలేదు. దాంతో అతని మనసులో అలజడి మొదలైంది. 
తంవ తే కాకాంస హళూచ పుసతీ | తుమ్హాసచి కా దక్షిణా మాగతీ | 
సకాళీంహీ తుమ్హాంచ ప్రతీ | ఆతాంహీ మాగతీ తుమ్హాంసచీ | ||౪౦||
40. ఎంతో మెల్లగా అతను ‘నిన్ను మాత్రమే ఎందుకు దక్షిణను అడిగారు? తెల్లవారి కూడా నిన్నే అడిగారు. ఇప్పుడు కూడా నిన్నే అడిగారు’ అని కాకాతో అన్నాడు. 

మీ అసూని తుమ్హా సంగతీ | దక్షిణేలాగీ మజ కా వగళతీ | 
కాకా హళూచ ఉత్తర దేతీ | బాబా ప్రతీచ పుసా హే | ||౪౧|| 
41. ‘నీ వెంట నేనుండగా, నన్ను దక్షిణ అడగకుండా వదిలివేశారేం?’ అని కాకాను అడిగాడు. దానికి కాకా, ‘ఆ సంగతి బాబానే అడగరాదూ?’ అని మెల్లగా చెప్పాడు.
ఇతుక్యాంత బాబా కాకాస వదతీ | “తో కాయ సాంగేరే తుజప్రతీ” | 
తో స్వయేంచ తే మిత్ర బాబాంస పుసతీ | ‘దక్షీణా మ్హణతీ దేఊ కా’ | ||౪౨|| 
42. ఇంతలో బాబా “ఏమిటీ, అతను నీతో ఏమంటున్నాడురా?” అని కాకాను అడిగారు. అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో ‘దక్షిణ నేనూ ఇవ్వనా?’ అని అడిగాడు. 
తవ బాబా ఉత్తర దేతీ | “తుఝే మనీ దేణ్యాచీ నవ్హతీ | 
మ్హణూని నాహీ మాగితలీ తుజ ప్రతీ | దేణే చిత్తీ తర దేఈ” | ||౪౩|| 
43. దానికి బాబా, “నీకు మనసులో ఇవ్వాలని లేదు అని, నిన్ను అడగలేదు. అయినా, మనసులో ఇవ్వాలని ఉంటే ఇవ్వు” అని బదులిచ్చారు. 
బాబా మాగతా భక్త దేత | తయా తే మిత్ర హిణావీత | 
తేచ న మాగతా జై దేఊ కా మ్హణత | ఆశ్చర్యభరిత తవ కాకా | ||౪౪|| 
44. బాబా దక్షిణ అడిగినప్పుడు భక్తుడు ఇస్తే, దాని గురించి ఆ స్నేహితుడు తప్పుగా మాట్లాడేవాడు. అలాంటి వాడు, బాబా అడగకుండానే, ‘దక్షిణను ఇవ్వనా?’ అని అడిగినప్పుడు, కాకాకు చాలా ఆశ్చర్యమైంది. 
మ్హణతా చిత్తీ అసల్యాస దేఈ | తయా మిత్రాస జాహలీ ఘాఈ | 
సత్రా రుపయాంచీ భరపాఈ | కేలీ పాయీ న మాగతా | ||౪౫|| 
45. “ఇవ్వాలని ఉంటే ఇవ్వు” అన్న బాబా మాటలకు, వెంటనే ఆ స్నేహితుడు పదునేడు రూపాయలను, సాయి అడగకుండానే, వారి పాదాలకు అర్పించాడు. 
బాబా మగ వదతీ తయాస | “జాసీల రే క్షణ ఎక బైస” | 
కరితే ఝాలే గోడ ఉపదేశ | నిరసావయ సభేదాత్మతా | ||౪౬|| 
46. తరువాత బాబా అతనితో “పోదువుగాని లేరా, ఒక క్షణం కూర్చో” అని, అతనికున్న తాను వేరే అన్న ఆలోచనలను తొలగించటానికి, ఎంతో తియ్యగా ఉపదేశించారు. 
“తుమ్హా ఆమ్హాంతీల తేల్యాచీ భింత | పాడూనియా తీ టాక సమస్త | 
హోఈల మగ మార్గ ప్రశస్త | అరస పరస భేటావయా” | ||౪౭|| 
47. “నీకూ, నాకూ మధ్యన ఉన్న ఆ నూనెవాడి గోడను, మొత్తం పడగొట్టేసేయి. అప్పుడు, మనం ఒకరినొకరు కలుసుకోవటానికి సరియైన దారి ఏర్పడుతుంది”. 
పుఢే ఆజ్ఞా ఝాలే దేతే | మాధవరావ జాహలే ప్రార్థితే | 
పాహూని అభ్రాచ్ఛాదిత నభాతే | పాఊస యాంతే భిజవీల | ||౪౮|| 
48. తరువాత, వారికి వెళ్ళటానికి బాబా అనుమతినిచ్చారు. ఆ సమయంలో మేఘాలు ఆకాశాన్ని బాగా క్రమ్ముకున్నది చూసి, మాధవరావు ‘వీరు వానలో తడిసి పోతారేమో?’ అని అన్నాడు. 
బాబా ప్రత్యుత్తర త్యా దేతీ | “జాఊ దే త్యా స్వస్థచిత్తీ | 
పాఉసాచీ కాంహీంహీ భీతీ | నాహీ తయా ప్రతీ మార్గాంత” | ||౪౯|| 
49. “వారిని హాయిగా వెళ్ళనివ్వు. దారిలో వర్షం వస్తుందేమోనని వారు భయ పడాల్సింది లేదు” అని బాబా అన్నారు. 
అభివందూని సాఈచే పాయ | తైసేచ గాడీంత బైసలే ఉభయ | 
విజా చమకత దాటత ధూయ | గంగేస పయ-పూర లోటలా | ||౫౦||
50. బాబా పాదాలకు నమస్కారం చేసి, ఇద్దరూ బండిలో కూర్చున్నారు. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. పెనుగాలి వీస్తోంది. గోదావరిలో నీరు బాగా, నిండుగా ఉంది. 

గడగడాటే గర్జే ఆకాశ | నౌకాగమన ఆలే వాంట్యాస | 
కాకా మనీ పూర్ణ విశ్వాస | హోతే ఆశ్వాసన బాబాంచే | ||౫౧|| 
51. గడగడమని ఉరుములు గర్జిస్తున్నాయి. వారు నదిని, నావలో దాటవలసి వచ్చింది. ఇంతైనా, కాకా మనసులో బాబా మాటలమీద పూర్తి నమ్మకం ఉంది. 
పడలా విచార త్యా మిత్రాస | కైసా సుఖాచా హోఈల ప్రవాస | 
ఉగీచ నిఘాలో యావయాస | హోతీల సాయాస మార్గాంత | ||౫౨|| 
52. అతని స్నేహితునికి విపరీతమైన అనుమానం. ‘ప్రయాణం సాఫీగా సాగుతుందా? అనవసరంగా బయలుదేరామెమో? దారిలో ఎన్ని కష్టాలు పడతామో?’ అని చింత. 
అసో పుఢే తే సుఖే గేలే | అగ్నిరథాంత ఆరూఢ ఝాలే | 
మేఘ మగ తేథూన వరసూ లాగలే | నిర్భయ పావలే ముంబఈస | ||౫౩|| 
53. కాని, వారు సుఖంగా వెళ్ళి, రైలు బండిలోకి ఎక్కిన తరువాతనే, మేఘాలు బాగా వర్షించాయి. వారు ఏ భయమూ లేక ముంబై చేరుకున్నారు. 
పుఢే జేవ్హా ఆలే సదనీ | పాహతీ ఖిడక్యా ద్వారే ఖోలూని | 
గేలీ అడకలీ చిమణీ ఉడూని | గతప్రాణ దోనీ ఆఢళల్యా | ||౫౪|| 
54. ఆ స్నేహితుడు ఇంటికి వెళ్ళి, కిటకీ తలుపులు తెరచి చూడగా, గదిలో చిక్కుకున్న పిచ్చుకల్లో, ఒకటి ఎగిరి పోయింది. ఇంకా రెండు చచ్చిపడి ఉన్నాయి. 
పాహూని ఏసా తో దేఖావా | వాఈట బహుత వాటలే జీవా | 
అన్నాపాణ్యావాంచూని దేవా | బిచార్యా జీవా ముకల్యా యా | ||౫౫|| 
55. కనిపిస్తున్నదానిని చూసి, అతనికి చాలా బాధ కలిగింది. ‘అన్నం నీరూ లేక, పాపం వాని ప్రాణాలు పోయాయి. 
నిఘాలో జేవ్హా జావయా శిరడీ | వాతాయనే జరీ ఠేవితో ఉఘడీ | 
పడతీ నాహీ కాళాచీ ఉడీ | మేలీ బాపుడీ మజహాతే | ||౫౬|| 
56. ‘శిరిడీకి వెళ్ళినప్పుడు, కిటికీలు తెరచి ఉంచి ఉంటే, అవి చచ్చిపోయేవి కావు. నా వల్లనే అవి చచ్చిపోయాయి. 
మ్హణే ఆతా ఉడాలీ జీ | తీచీచ జణూ బాబాంస కాళజీ | 
మ్హణోన దిధలీ హోఊని రాజీ | అనుజ్ఞా ఆజీ పరతావయా | ||౫౭|| 
57. ‘ఇప్పుడు ఎగిరి పోయిన దాని గురించి ఆతురతతోనే, బాబా ఇవాళ తిరిగి రావటానికి మాకు అనుమతిచ్చారు. 
నాహీ తరీ తీహీ మరతీ | అన్నావీణ కైసీ జగతీ | 
ఆయుష్య సరలే తేణే హే గతీ | పావలీ నిశ్చితీ తీ ఎక | ||౫౮|| 
58. ‘లేకుంటే, ఇది కూడా చచ్చిపోయేదే. అన్నం లేకుండా ఎలా బ్రతుకుతుంది? ఆయువు తీరి పోయినవి చచ్చిపోయాయి, ఈ ఒక్కటి బ్రతికే ఉంది’ అని అనుకున్నాడు. 
ఆణిక యాంచా అనుభవ ఎక | తోహీ శ్రవణార్హ ఆహే సురేఖ | 
ఎకా పాయాంచ్యా టాంచేచే దుఃఖ | భోగీత హే కిత్యేక మాసవరీ | ||౫౯|| 
59. ఇతనికి ఇంకొక అనుభవం కూడా కలిగింది. వినడానికి ఇదీ ఇంపుగా ఉంటుంది. ఎన్నో నెలలనుంచి ఇతను కాలి మడమల నొప్పితో బాధ పడుతున్నాడు. 
శిరడీస జాణే ఘడల్యా ఆధీ | బహుత మహినే భోగిలీ హీ వ్యాధీ | 
తేథూన పరతల్యాపాఠీ న బాధీ | నాసలీ అల్పావధీంతచి | ||౬౦||
60. శిరిడీకి వెళ్ళక మునుపు ఎన్నో నెలలు బాధ అనుభవించాడు. శిరిడీనుండి తిరిగి వచ్చాక, ఏ నొప్పీ లేదు. త్వరలోనే ఆ జబ్బు కూడా పోయింది. 

ఏసీచ ఆణిక దుసరీ కథా | సంతాచా అంత లావూ జాతా | 
పాయీ నమవావా లాగలా మాథా | మనీ నసతా తీ పరిసా | ||౬౧|| 
61. ఇలాంటిదే ఇంకొక కథ. సత్పురుషులను పరీక్షించాలనే ఉద్దేశంతో వెళ్ళి, మనసులో లేకున్నా, వారి పాదాల మీద తలను వంచవలసి వచ్చిన సంగతిని వినండి.
తైసీచ దక్షీణా దేణ్యాచీ నసతా | మోహపాశీ అడకలే జాతా | 
భంగూని అపులీ దృఢనిశ్చయతా | దక్షీణా దేతాత కైసీ తీ | ||౬౨|| 
62. అలాగే, పిసినారితనం అడ్డు తగిలినా, దక్షిణను ఇవ్వాలని లేకున్నా, తమ దృఢమైన నిశ్చయాన్ని వదిలి, ఎలా దక్షిణను ఇచ్చారో వినండి. 
ఠక్కర ధరమసీ జేఠాభాఈ | సాలిసీటర రహివాస ముంబఈ | 
బళావలీ పూర్వ పుణ్యాఈ | భేటూ సాఈస మన ఝాలే | ||౬౩|| 
63. ముంబైలో ఉండే వకీలు, ధరంసీ జేఠాభాయి ఠక్కరుకు, పూర్వ జన్మల పుణ్య బలం వలన, సాయిని దర్శించుకోవాలనే కోరిక కలిగింది. 
మహాజనీంచే హేచ శేట | ఉభయతాంచా పరిచయ దాట | 
వాటలే శిరడీస జాఊన థేట | ఘ్యావీ కీ భేట ప్రత్యక్ష | ||౬౪|| 
64. కాకా మహాజనీ యజమాని ఇతడే. ఇద్దరూ బాగా కలిసి పని చేసేవారు. అందుకే శిరిడీకి వెళ్ళి, బాబాను ఎదురుగా చూడాలని అనుకున్నాడు. 
ఠక్కరజీంచ్యా పేఢీవరీ | కాకా ముఖ్య కారభారీ | 
సుటీ సాధోని హారోహారీ | కరీత తయారీ శిరడీచీ | ||౬౫|| 
65. ఠక్కరు కంపెనీలో కాకా మేనేజరు. ఉన్న సెలవు రోజులన్నింటినీ వాడుకుని, కాకా తరచూ శిరిడీకి బయలుదేరే వాడు. 
కాకా తరీ కాయ వేళీ పరతతీ | ఆఠాఠ దిన శిరడీస కాఢితీ | 
ఆజ్ఞా నాహీ సాఈచీ మ్హణతీ | హీ కాయ రీతీ కామాచీ | ||౬౬|| 
66. ‘వెళ్ళిన తరువాత, పోనీ సమయానికి సరిగ్గా వచ్చేవాడా?ఎనిమిదేసి రోజులు శిరిడీలో ఉండిపోవటం – అదేమిటని అడిగితే, ‘తిరిగి రావటానికి సాయి అనుమతి ఇవ్వలేదు’ అని అనటం. ఇదేమైనా పని చేసే పద్ధతేనా?’ అని యజమాని ఆలోచించాడు. 
ఏసే కైసే తరీ హే సంత | బండ నవ్హే హే ఆమ్హా పసంత | 
నిఘాలే శేట శిమగ్యాచే సుటీంత | లావాయా అంత సాఈచా | ||౬౭|| 
67. ‘పోనీ, ఆ సత్పురుషుని ప్రత్యేకత ఏమిటి? ఈ ఆడంబరాలన్నీ నాకు నచ్చవు’ అని అనుకుని, సాయి గురించి అటో ఇటో తేల్చుకోవాలని, హోళీ పండుగ సెలవు రోజులలో సేటు బయల్దేరాడు. 
అంగీ దుర్ధర దేహాభిమాన | నిజైశ్చర్యాచేంచ మహిమాన | 
సంత తరీ మానవా సమాన | కిమర్థ మాన వాంకవావీ | ||౬౮|| 
68. తన గురించి, తన సంపదను గురించి, విపరీతమైన అహంకారం ఉన్న సేటుకు, ‘ఈ సత్పురుషులంతా మనుషులే కదా, ఎందుకు వారికి తలవంచాలి?’ అని అనిపించింది. 
పాహూని సాఈచీ అధికార స్థితీ | శాస్త్రీ పండిత టేకీస యేతీ | 
తేథే బాపుడే ధరమసీ తే కితీ | తే కాయ తగతీ నిశ్చయా | ||౬౯|| 
69. సాయియొక్క సామర్థ్యాన్ని తెలుసుకుని, పండితులూ, విద్వాంసులూ, వారి ముందు మోకాళ్ళ మీద నిలబడతారు. అలాంటప్పుడు, ఈ ధరంసీ ఎంతటి వాడు? అతని నిశ్చయం ఏ పాటిది? 
పరి న అంధశ్రద్ధా బరీ | కరూన ఘేఊ ఆపులీ ఖాతరీ | 
కరూని ఏసా నిశ్చయ అంతరీ | కేలీ తయారీ శిరడీచీ | ||౭౦||
70. ‘అయినా, గుడ్డి నమ్మకం మంచిది కాదు. మనమే స్వతహాగా పరీక్షించి చూద్దాం’ అని తనలో నిశ్చయించుకుని శిరిడీ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. 

వర్ణిల్యా ఎకా స్నేహ్యాచ్యా వరతీ | ధరమసీహీ తేచ రీతీ | 
సవే కాకాంస ఘేఊని నిఘతీ | ఆణీక వదతీ తయాంస | ||౭౧|| 
71. ఇదివరకే వర్ణించిన కాకా స్నేహితుని వలె, ధరంసీ కూడా కాకాను వెంటబెట్టుకుని, బయల్దేరుతూ, కాకాతో ఇలా అన్నాడు, 
శిరడీస జాతా తేథేంచ రహాతా | చాలేనా యా ఖేపే హీ వార్తా | 
పరతలే పాహిజే మజ సమవేతా | హే నిశ్చితతా జాణావే | ||౭౨|| 
72. ‘శిరిడీకి వెళ్ళితే, నీవు అక్కడే ఉండిపోతావు. ఈ సారి అలా కుదరదు. నా వెంట తిరిగి వచ్చేయాలి, బాగా గుర్తుంచుకో!’ అని అన్నాడు. 
తంవ కాకా తయా వదతీ | హే తో నాహీ ఆమ్హా హాతీ | 
తదా ధరమసీ సవే ఘేతీ | ఆణీక సాంగాతీ మార్గార్థ | ||౭౩|| 
73. అందుకు కాకా, ‘అది నా చేతులలో లేదు’ అని అన్నాడు. అప్పుడు ధరంసీ, దారిలో తోడుగా ఉంటాడని మరొకరిని వెంటబెట్టుకున్నాడు. 
న జాణో కాకా నాహీంచ పరతలే | సాంగాత్యావీణ మార్గాంత న చలే | 
మ్హణూని ఆణిక తిజయా ఘేతలే | తిఘే నిఘాలే శిరడీస | ||౭౪|| 
74. ఒక వేళ కాకా తనతో తిరిగి రాకపోతే, దారిలో ఎవరైనా తోడు లేనిదే కుదరదు కనుక, మూడో మనిషిని తీసుకుని శిరిడీకి బయలుదేరారు. 
జగాంత ఏశా కిత్యేక జాతీ | పరోపకారీ భక్తాంచ్యా అసతీ | 
తయాంచీ కరాయా సంశయ నివృత్తీ | బాబా ఆణితీ ధరధరూ | ||౭౫|| 
75. ఈ ప్రపంచంలో మంచి మనసుగల భక్తులు, ఎన్నో రకాల వారు ఉంటారు. అలాంటి భక్తుల అనుమానాలను తొలగించటానికి, బాబా వారిని ఏరిఏరి పట్టుకుని వస్తారు. 
మగ తే జేవ్హా మాఘారా జాతీ | ఆపులే అనుభవ ఇతరా కథితీ | 
లిహవూని ఘేతీ కోణాహీ హాతీ | జనా సత్పథీ లావాయా | ||౭౬|| 
76. అనుభవం పొందిన ఆ భక్తులు, తిరిగి వెళ్ళిపోయి, తమ అనుభవాలను ఇతరులకు చెప్తారు. లేదా, జనులను మంచి దారిలో పెట్టటానికి, ఎవరితోనైనా వ్రాయిస్తారు. 
తాత్పర్య హే జే కోణీ జాతీ | దర్శనసుఖే తృప్త హోతీ | 
ఆరంభీ కైసీ హీ తయాంచీ వృత్తీ | పరమానంద ప్రాప్తీ అఖేర | ||౭౭|| 
77. ఇంతకూ చెప్పేదేమిటంటే, బాబా దగ్గరకు ఎవరు వెళ్ళినా, వారిని దర్శించిన తరువాత, సుఖంతో తృప్తిని పొందుతారు. మునుపు వారి ఆలోచనలు ఎలా ఉన్నా, చివరకు పరమానందాన్ని పొందుతారు. 
మ్హణోత అపులే పాయీ జాతీ | అసే నా కా చికిత్సా ప్రీతీ | 
పరీ నిరాళీ వస్తుస్థితీ | కార్య సాధితీ బాబాంచే | ||౭౮|| 
78. పరీక్షించాలనే కోరికతో, తమంతట తాము వెళ్ళుతామని, ఎవరైనా అనుకోవచ్చు. కాని నిజమేమిటంటే, వారు వెళ్ళి, బాబా అనుకున్న దానిని, సాధిస్తారు. 
బాబాంచి తయా దేతీ స్ఫూర్తీ | తేవ్హాంచి బాహేర పాయ కాఢితీ | 
చేవవూనీ స్వాభావిక వృత్తీ | లావితీ పరమార్థీ తయాంస | ||౭౯|| 
79. బాబా స్ఫూర్తినిస్తేనే ఎవరైనా కాలు బయట పెట్టగలరు. వారి స్వాభావికమైన మనసును జాగృతం చేసి, వారిని బాబా పరమార్థంలో ప్రవేశ పెడతారు. 
కోణ జాణే తయాంచ్యా కళా | జాణూ జాతా హోతీల అవకళా1
హోఊని నిరభిమాన పాయీ లోళా | భోగాల సోహళా సుఖాచా | ||౮౦||
80. బాబా ఆలోచనలను ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవాలని ప్రయత్నిస్తే, దుర్దశ పాలవుతారు. కాని, అహంకారాన్ని వదిలి, వారి పాదాల దగ్గర పొర్లితే, అన్ని సుఖాలనూ పొందుతారు. 

బరవే న జాణే రిక్త కరీ | దేవ-ద్విజ-గురు ద్వారీ | 
మ్హణవూని ద్రాక్షాచీ దో శేరీ | కాకా ఖరీదీత మార్గాంత | ||౮౧|| 
81. దేవతలను దర్శించాలనుకున్నప్పుడు, అలాగే, గురువు, బ్రాహ్మణుల దగ్గరకు వెళ్ళాలనుకున్నప్పుడు, ఒట్టి చేతులతో వెళ్ళకూడదని, దారిలో రెండు సేర్ల ద్రాక్ష పళ్ళను కాకా కొన్నాడు.
పోటీ నాహీ బీజ జ్యాంత | అసే ఏసీ హీ ద్రాక్షాంచీ జాత | 
పరి సబీజ జీ వేళీ ప్రాప్త | ఘేతలీ విక్రీంత కాకాంనీ | ||౮౨|| 
82. గింజలు లేని ద్రాక్ష పళ్ళుంటాయి, కాని అప్పుడు అవి దొరకక, దొరికిన గింజలున్న ద్రాక్ష పళ్ళనే కొన్నాడు. 
అసో గోష్టీ వార్తా కరీత | పాతలీ హీ త్రయీ శిరడీంత | 
సవే తిఘేహీ దర్శనార్థ | గేలే మశీదీంత బాబాంచ్యా | ||౮౩|| 
83. మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, ఆ ముగ్గురూ శిరిడీ చేరి, బాబా దర్శనానికని మసీదుకు వెళ్ళారు. 
బాబాసాహేబ తర్ఖడ భక్త | హేహీ హోతే తేథే స్థిత | 
శేట ధరమసీ జిజ్ఞాసా ప్రేరిత | పుసతీ తయాంప్రత తే పరిసా | ||౮౪|| 
84. బాబా భక్తుడైన బాబాసాహేబు తర్ఖడ కూడా అక్కడ ఉన్నాడు. కుతూహలం కొద్దీ సేటు ధరంసీ అతనిని ఏమి అడిగాడో అది వినండి. 
యేథే కాయ ఆహే కా యేతా | తర్ఖడ వదతీ దర్శనాకరితా | 
శేట మ్హణతీ ఏకిలీ వార్తా | యేథే తో ఘడతాత చమత్కార | ||౮౫|| 
85. ‘ఇక్కడేముందని మీరు తరచుగా ఇక్కడికి వస్తుంటారు?’ అని అన్నాడు. ‘బాబా దర్శనానికి’ అని తర్ఖడ చెప్పాడు. ‘కాని, ఇక్కడ చమత్కారాలు జరుగుతాయని నేను విన్నానే?’ అని సేటు అడిగాడు. 
తవ తర్ఖడ వదతీ త్యాంనా | హీ తో నాహీ మాఝీ భావనా | 
జైసీ ఉత్కంఠా జయాచే మనా | పావే తీ కామనా సీద్ధీతే | ||౮౬|| 
86. దానికి తర్ఖడ ‘నాకు చమత్కారాలు చూడాలనే కోరిక లేదు. ఎవరి మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవి ఇక్కడ నెరవేరతాయి’ అని అతనితో అన్నాడు. 
కాకాంనీ పాయీ డోఈ ఠేవిలీ | ద్రాక్షే బాబాంచ్యా కరీ అర్పిలీ | 
వాటావయాచీ సురువాత ఝాలీ | మండళీ జమలీ హోతీచ | ||౮౭|| 
87. బాబా పాదాల మీద తలవుంచి, నమస్కరించి, వారి చేతికి, కాకా ద్రాక్ష పళ్ళను అందించాడు. అప్పటికే భక్తులంతా అక్కడ గుమిగూడారు. వారికి బాబా ద్రాక్ష పళ్ళను పంచడం మొదలు పెట్టారు. 
బాబా తంవ ఇతరా సమవేత | ధరమసీసహీ కాంహీ దేత | 
పరి తయా తీ నావడతీ జాత | నిర్బీజీ ప్రీత తయాంస | ||౮౮|| 
88. అందరితో పాటు, బాబా ధరంసీకి కూడా కొన్ని పళ్ళను ఇచ్చారు. అతనికి గింజలు లేని పళ్ళంటే ఇష్టం. గింజలున్నవి ఇష్టం లేదు. 
యా ద్రాక్షాంచీ తయాస చీడ | ఆరంభీచ ఉపజలీ నడ | 
కైసీ సేవావీ వాటలే అవఘడ | అవ్హేరహీ జడ వాటే మనా | ||౮౯|| 
89. గింజలున్న ద్రాక్ష పళ్ళంటే అతనికి అసలు విసుగు. ఆదిలోనే హంసపాదులా, ఆరంభంలోనే ఇదో సమస్య. ఆ పళ్ళను ఎలా తినాలి అన్న కష్టం ఎదురైంది. అలా అని, వానిని తిరిగిచ్చేయనూ లేడు. 
శివాయ డాక్టరే కేలే మనా | ద్రాక్షే న ఖావీ ధుతల్యావినా | 
ఆపణచి ధుణే యోగ్య వాటేనా | ఉఠల్యా కల్పనా నానావిధ | ||౯౦||
90. పైగా, ‘ద్రాక్ష పళ్ళను కడగకుండా తినకూడదని డాక్టరు చెప్పాడు. అంత మందిలో తానొక్కడే కడుక్కోవటం బాగుంటుందా’ అన్న అనుమానాలెన్నో వచ్చాయి. 

పుఢే తైశీంచ టాకిలీ తోండాంత | బియా చఘళూని ఠేవిల్యా ఖిశాంత | 
సాధూంచే తే స్థాన పునీత | కరవేనా అపునీత ఉచ్ఛిష్టే | ||౯౧|| 
91. ‘ఏదైతే అది కాని’ అని పళ్ళను అలాగే నోట్లో వేసుకున్నాడు. ‘పవిత్రమైన సత్పురుషుని చోటులో, ఎంగిలి వేసి అపవిత్రం చేయరాదని’, గింజలను జేబులో వేసుకున్నాడు. 
తవ తే శేట మనీ మ్హణతీ | సాధు అసతా కైసే హే నేణతీ | 
కీ హీ ద్రాక్షే మజ నావడతీ | బళేంచ కా దేతీ మజప్రతీ | ||౯౨|| 
92. ‘సత్పురుషుడైయుండీ నాకిష్టం లేదని తెలియదా? బలవంతంగా నాకెందుకు ఇస్తున్నారు?’ అని సేటు మనసులోనే అనుకున్నాడు. 
ఉఠతా ఏసీ తయాంచీ వృత్తీ | బాబా తీచ ఆణీక త్యా దేతీ | 
తీ సబీజ జాణూని హాతీంచ ఠేవితీ | ముఖీ న ఘాలితీ ధరమసీ | ||౯౩|| 
93. అతని మనసులో ఈ ఆలోచన వస్తుండగానే, బాబా అతనికి ఇంకొన్ని పళ్ళను ఇచ్చారు. ‘గింజలున్న పళ్ళు’ అని ధరంసీ నోట్లో వేసుకోకుండా, అలాగే చేతిలో పట్టుకున్నాడు. 
సబీజ నావడతీ ద్రాక్షే ఖరీ | పరి తీ బాబాంనీ దిధలీ కరీ | 
ధరమసీ శేట అవఘడలే అంతరీ | కైసియే పరీ వర్తావే | ||౯౪|| 
94. అతనికి గింజలున్న పళ్ళంటే ఇష్టం లేదు, నిజమే. కాని, బాబా తమ చేతులతో ఇచ్చారు. ఏం చేయాలో తెలియక ధరంసీ సేటు ఇబ్బందిలో పడ్డాడు. 
తోండీ ఘాలావయా హోఈనా మన | కరూని ఠేవిలీ ముఠీంత జతన | 
తంవ బాబా వదతీ “టాకరే ఖాఊన” | మానిలే ఆజ్ఞాపన శేటీనే | ||౯౫|| 
95. నోట్లో వేసుకోవటానికి ఇష్టం లేక, పిడికిట్లోనే పట్టుకుని ఉండగా, “తినేసేయిరా” అని బాబా అన్నారు. వెంటనే సేటు వారి ఆజ్ఞను పాటించాడు. 
“ఖాఊని టాక” బాబా వదతా | ధరమసీనీ తోండాంత టాకితా | 
బీజరహిత తీ సర్వహీ లాగతా | అతి ఆశ్చర్యతా పావలే | ||౯౬|| 
96. “తినేసేయి” అని బాబా అనగానే, ధరంసీ వానిని నోట్లో వేసుకున్నాడు. అవన్నీ గింజలు లేని ద్రాక్ష పళ్ళు. అతనికి చాలా ఆశ్చర్యమైంది. 
ఏసీ నిర్బీజ ద్రాక్షే లాగతా | ధరమసీ హోఊని విస్మిత చిత్తా | 
మనీ మ్హణే అజబ సత్తా | కాయ యా సంతా అశక్య | ||౯౭|| 
97. ద్రాక్షపళ్ళలో గింజలు లేవని తెలియగానే, ధరంసీకి ఆశ్చర్యమై, ‘సత్పురుషులకు కానిదేమి ఉంది? వీరికి ఎంతటి సామర్థ్యం? 
జాణోని మాఝే మనీచా హేత | అసతా సబీజ ఆణి నిర్ధూత | 
సాఈ మజ జీ జీ దేత | తీ తీ బీజరహిత హితకారీ | ||౯౮|| 
98. ‘నా మనసులోని ఆలోచనను తెలుసుకున్నారు. అన్నీ గింజలున్న పళ్ళే అయినా, సాయి నా చేతికి గింజలు లేనివి, మంచివి అయిన పళ్ళనే ఇచ్చారు’ అని అనుకున్నాడు. 
థక్క ఝాలీ చిత్తవృత్తీ | చికిత్సేచీ పడలీ విస్మృతీ | 
గళాలీ సర్వ అహంకృతీ | సంతీ ప్రీతీ ఉపజలీ | ||౯౯|| 
99. అతని మనసు ఆలోచించటం మానివేసింది. బాబాను పరీక్షించాలన్న మాట మరచిపోయాడు. అతని అహంకారమంతా కరిగిపోయి, సత్పురుషులంటే భక్తి ఏర్పడింది. 
పూర్వ సంకల్ప గేలే విలయా | సాఈ ప్రేమ ఉపజలే హృదయా | 
ఉత్కంఠా జీ శిరడీస యావయా | పురలీ కృతనిశ్చయా సారఖీ | ||౧౦౦||
100. శిరిడీకి రాక మునుపటి ఆలోచనలన్నీ మాయమయ్యాయి. అతని మనసులో సాయి పట్ల ప్రేమ పుట్టింది. శిరిడీకి రాక మునుపు ఉన్న అతని కుతూహలం ఫలితాన్నిచ్చింది. 

బాబా తర్ఖడ హేహీ తేథే | బాబాపాశీంచ బసలే హోతే | 
బాబా సాఈ జాహలే వాటతే | త్యాంతీల త్యాంతేహీ కాంహీ | ||౧౦౧|| 
101. బాబాసాహేబ తర్ఖడ అక్కడే బాబా దగ్గరే కూర్చుని ఉన్నాడు. సాయి అతనికి కూడా కొన్ని పళ్ళను ఇచ్చారు.
తేవ్హా ధరమసీ తయాంహీ పుసతీ | ఆపులీ ద్రాక్షే కైసీ హోతీ | 
బాబా జేవ్హా సబీజ మ్హణతీ | విస్మిత చిత్తీ అతిశయ | ||౧౦౨|| 
102. ధరంసీ అతనిని ‘మీ ద్రాక్ష పళ్ళు ఎలా ఉన్నాయి’ అని అడిగాడు. ‘గింజలున్న పళ్ళు’ అని అతడు చెప్పగా, ధరంసీకి ఇంకింత ఆశ్చర్యం కలిగింది. 
తేణే తే సాధు హీ శ్రద్ధా బసలీ | దృఢీకరణార్థ కల్పనా స్ఫురలీ | 
సాధూ అసాల తరీ హీ పుఢలీ | జాతీల దిధలీ కాకాంనా | ||౧౦౩|| 
103. దాంతో, బాబా సత్పురుషులే అని నమ్మకం కలిగింది. అయినా, దాన్ని దృఢ పరచుకోవటానికి, ఒక ఆలోచన వచ్చింది. ‘మీరు నిజంగా సత్పురుషులైతే, ఈ మారు కాకాతో పంచడం మొదలు కావాలి’ అని అనుకున్నాడు. 
బాబా వాటీత హోతే బహుతా | పరి హే స్ఫురతా శేటీచే చిత్తా | 
కాకాపాసూనచ శేజ2 ధరితా | అతి నవలతా శేటీస | ||౧౦౪|| 
104. అప్పుడు బాబా అందరికీ పళ్ళను పంచుతున్నారు. అయినా, సేటు మనసులో ఈ ఆలోచన రాగానే, బాబా మరల కాకానుండి పంపిణి మొదలుపెట్టారు. సేటుకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. 
ఏశా సాధుత్వాచ్యా ఖుణా | ఏసా హా మనకవడేపణా | 
పురా ఝాలా ధరమసీచ్యా మనా | సాధు సాఈనా మానావయా | ||౧౦౫|| 
105. సత్పురుషుల లక్షణమైన, ఇతరుల మనసులోని ఆలోచనలను తెలుసుకునే శక్తి చూసి, ధరంసీ మనసు సాయి సత్పురుషులే అని ఒప్పుకుంది. 
మాధవరావ హోతే తేథే | తే మగ ఝాలే బాబాంస నివేదితే | 
కాకాంచే మాలక శేట హే తే | ఝాలే సమజావితే బాబాంస | ||౧౦౬|| 
106. మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. ‘కాకాయొక్క ఆ శేటు, తెలుసు కదా ...ఇతనే అతను’ అని సేటును బాబాకు పరిచయం చేయడానికి ప్రయత్నించాడు. 
“హా కుఠలా కాకాచా మాలక | త్యాచా మాలక ఆహే ఆణిక” | 
బాబా ప్రత్యుత్తర దేతీ చోఖ | కాకాంస తోఖదాయకసే | ||౧౦౭|| 
107. దానికి వెంటనే బాబా, “ఇతను కాకాకు ఎక్కడి యజమాని? అతని యజమాని వేరే ఉన్నారు” అని చెప్పారు. ఆ మాటలు విని, కాకాకు చాలా ఆనందం కలిగింది. 
ఆణీక కైసీ నవలపరీ | ఆపా నామే ఎక ఆచారీ | 
ఉభా తేథేంచ ధునీశేజారీ | బాబా తయావరీ ఘాలితీ | ||౧౦౮|| 
108. ఇంతకన్నా వింతేమిటంటే, ధుని ప్రక్కనే నిలుచుని ఉన్న ‘అప్పా’ అనే వంటవానిని చూపిస్తూ, బాబా, 
మ్హణతీ హే శేటజీ ఇథవర ఆలే | తే మజకరితా నాహీ శ్రమలే | 
ఆపాలాగీ ప్రేమ దాటలే | మ్హణూన పాతలే శిరడీస | ||౧౦౯|| 
109. “ఈ శేటజీ ఇంత దూరం వచ్చింది, నా కోసం కష్ట పడి కాదు. ఇదిగో! ఈ అప్పా పైని ప్రేమతో శిరిడీకి వచ్చాడు” అని అన్నారు. 
అసో ఏసే హే భాషణ ఝాలే | ధరమసీ అపులే నిశ్చయ విసరలే | 
ఆపణ హోఊన పాయా పడలే | మగ తే పరతలే వాడ్యాంత | ||౧౧౦||
110. బాబా మాటలు విన్నాక, బాబాను పరీక్షించాలన్న తన నిశ్చయాన్ని మరచిపోయి, తనంతట తానే, బాబా పాదాలపై పడ్డాడు. తరువాత వారు వాడాకు తిరిగి వెళ్ళారు. 

అసో మాధ్యాన్హీ ఆరతీ ఝాలీ | ఘరీ జాణ్యాచీ తయారీ చాలలీ | 
ఆజ్ఞా ఘేణ్యాచీ వేళ ఆలీ | మండళీ నిఘాలీ మశీదీ | ||౧౧౧|| 
111. మధ్యాహ్నం ఆరతి ముగిసింది. భక్తులు ఇళ్ళకు వెళ్ళిపోవటానికి తయారవుతున్నారు. బాబా అనుమతిని తీసుకునే సమయం వచ్చింది. దానికోసం, భక్తులు మసీదుకు బయలుదేరారు. 
ధరమసీ తేవ్హా కాకాంస వదత | మీ తో నాహీ ఆజ్ఞా మాగత | 
తుమ్హీచ మాగా తుమ్హా తీ లాగత | తంవ కాయ మ్హణత మాధవరావ | ||౧౧౨|| 
112. అప్పుడు, కాకాతో ధరంసీ ‘నేనేమో అనుమతిని అడగను. నీకు కావాలి గనుక, నువ్వు అడుగు’ అని అన్నాడు. దానికి మాధవరావు, 
కాకాంచే తో నాహీ ప్రమాణ | ఆఠవడా ఎక భరల్యావీణ | 
హోణార నాహీ ఆజ్ఞాపన | ఆపణచి విచారూని ఘ్యానా కా | ||౧౧౩|| 
113. ‘కాకా తిరిగి రావటం గురించి చెప్పలేం. వారం గడిచే దాక అతన్ని పోనివ్వరు. అందుకు, మీరే బాబాను అడిగి సెలవు తీసుకోండి’ అని చెప్పాడు. 
పుఢే హే తిఘే జాఊన బైసతా | మాధవరావ ఆజ్ఞా మాగతా | 
బాబాంనీ సాంగూ ఆరంభిలీ వార్తా | తీ స్వస్థ చిత్తా పరిసావీ | ||౧౧౪|| 
114. తరువాత, ముగ్గురూ మసీదుకు వెళ్ళి కూర్చున్నారు. వారి తరఫున మాధవరావు అనుమతిని కోరాడు. అప్పుడు బాబా ఒక కథను చెప్పటం మొదలుపెట్టారు. దానిని శ్రద్ధగా వినండి. 
“హోతా ఎక చంచలబుద్ధి | ఘరీ ధన ధాన్యాచీ సమృద్ధి | 
శరీరీ నాహీ ఆధి వ్యాధీ | నసతీ ఉపాధీ ఆవడే | ||౧౧౫|| 
115. “బుద్ధి నిలకడ లేని ఒక మనిషి ఉండేవాడు. అతని ఇంట్లో, ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి ఏ జబ్బూ, బాధా లేవు. లేని కష్టాలని తన మీద వేసుకోవటం అతనికి ఇష్టం. 
ఉగాచ బోజా వాహీ మాథా | హిండే ఇతఃస్తతః నాహీ స్వస్థతా | 
ఖాలీ ఠేవీ ఉచలీ మాగుతా | నాహీ నిశ్చలతా మనాస | ||౧౧౬|| 
116. “అనవసరంగా తన తలపై భారాన్ని మోస్తాడు. ఎక్కడెక్కడో తిరుగుతాడు. మనసుకు నిలకడ లేదు. బరువును క్రిందికి దించుకుని, మళ్ళీ పైకి ఎత్తుకుంటాడు. మనసును స్థిరంగా ఉంచుకోలేడు. 
పాహూని ఏసీ తయాచీ అవస్థా | కీంవ ఆలీ మాఝియా చిత్తా | 
‘వాటేల త్యా ఎకా ఠాయీ ఆతా | ఠేవ రే నిశ్చితతా’ మ్హణాలో | ||౧౧౭|| 
117. “ఇలాంటి అతని స్థితిని చూసి, నాకు అతని మీద దయ కలిగింది. ‘నీకు నచ్చిన చోట, నీ బరువును దించు. నిశ్చింతగా ఉండరా’ అని చెప్పాను. 
ఉగాచ ఏసా భ్రమతోస | ఎకా ఠాయీంచ స్వస్థ బైస” | 
వార్తా ఖోంచలీ ధరమసీస | మానీత ఆపణాస ఇశారా తో | ||౧౧౮|| 
118. “ ‘అనవసరంగా అక్కడా ఇక్కడా తిరగకుండా, ఒకే చోట స్థిరంగా కూర్చో’ అని చెప్పాను” అని అన్నారు. ఆ మాట ధరంసీ మనసులోకి చొచ్చుకుని పోయింది. ఆ మాటలు తనను గురించే అని తెలుసుకున్నాడు. 
అసోని వైభవ యథాస్థిత | కారణ నసతా యత్కించిత | 
ధరమసీ సదా చింతాక్రాంత | డోకే పికవీత ఉగాచ | ||౧౧౯|| 
119. ఎంతో సంపద, ఎంతో వైభవం ఉన్నా, ధరంసీ ఏ కారణమూ లేకుండానే, ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. అనవసరంగా బాధ పడేవాడు. 
అసతా విపుల సంపత్తీ మాన | మనాస నాహీ సమాధాన | 
పాఠీసి కాల్పనిక దుఃఖే గహన | త్యాంతచి నిమగ్న సర్వదా | ||౧౨౦||
120. అంతటి ఐశ్వర్యం, గౌరవం ఉన్నా, అతని మనసుకు శాంతి లేదు. లేనిపోని దుఃఖాలను ఊహించుకుని, ఎప్పుడూ వానిలోనే మునిగి పోయేవాడు. 

ఏకతా సాఈముఖీంచీ కథా | శేటజీ పరమ విస్మిత చిత్తా | 
హీ తో ఆపులే మనాచీ అవస్థా | అతి సాదరతా పరిసిలీ | ||౧౨౧|| 
121. బాబా నోటినుండి తన కథను విని, సేటుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ‘అరే! ఇది నా మనసులోని స్థితి’, అని చాలా శ్రద్ధగా విన్నాడు.
కాకాస ఇతుకీ లవకర ఆజ్ఞా | అశక్య కోటీచీ హీ ఘటనా | 
పరి తీహీ మిళతా ప్రయాసావినా | ధరమసీ మనాంత సంతుష్ట | ||౧౨౨|| 
122. ఇక, కాకా తిరిగి వెళ్ళటానికి బాబా అంత త్వరగా అనుమతిని ఇవ్వటం అనేది, సాధ్యం కాని పని. కాని, అది కూడా సులభంగానే దొరకటంతో, ధరంసీ ఎంతో తృప్తి పడ్డాడు. 
కాకానే నిఘావే బరోబర | ధరమసీచీ ఇచ్ఛా ఫార | 
తీహీ బాబాంనీ పడిలీ పార | దేఊని హోకర జావయా | ||౧౨౩|| 
123. కాకా కూడా తన వెంటే బయలుదేరాలని, ధరంసీ అనుకున్నాడు. కనుక, కాకాకు వెళ్ళటానికి అనుమతినిచ్చి, బాబా ధరంసీయొక్క ఆ కోరిక కూడా తీర్చారు. 
హాహీ ఎక శేటజీచా పణ | కైసీ బాబాంనీ జాణిలీ ఖూణ | 
హేంహీ ఎక సాధుత్వ లక్షణ | పటలే విలక్షణ ధరమసీంనా | ||౧౨౪|| 
124. ఇది కూడా అతనికి అనుమానంగానే ఉండింది. తన మనసులోని సంగతిని బాబా ఎలా తెలుసుకోగలిగారు? వారి సాధుత్వానికి ఇదొక వింతైన లక్షణమని, ధరంసీ ఒప్పుకున్నాడు. 
జాహలీ సంశయ నివృత్తీ | సాఈ సాధు హీ అభివ్యక్తి | 
జయా మనీ జైసీ వృత్తీ | తైసీచ అనుభూతీ దావిలీ | ||౧౨౫|| 
125. సేటుకున్న అన్ని అనుమానాలూ తీరాయి. సాయి గొప్ప సత్పురుషులని తెలుసుకున్నాడు. ఎవరెవరి మనసులో ఏయే ఆలోచనలుంటాయో, వారికి అలాంటి అనుభవాలనే బాబా కలిగిస్తారు. 
జ్యా జ్యా మార్గే జాఉ ఇచ్ఛితీ | తో తోచ మార్గ తయా లావితీ | 
సాఈ జాణతీ అధికార సంపత్తీ | పరమార్థ ప్రాప్తీహీ త్యామానే | ||౧౨౬|| 
126. భక్తులు తాము కోరుకున్న దారిలోనే, వారిని బాబా ప్రవేశ పెడతారు. వారి అర్హత తెలిసిన సాయి, దానికి తగినట్లు వారికి పరమార్థాన్ని కలగ చేస్తారు. 
భక్త భావార్థీ అథవా టవాళూ | సాఈ సమత్వే దోఘాంసీ కృపాళూ | 
ఎకాస టాళూ దుజియా కవటాళూ | నేణే హీ కనవాళూ మాఉలీ | ||౧౨౭|| 
127. భక్తులు తమను నమ్మినా, నిందించినా, దయామయులైన సాయి, అందరినీ సమానంగా చూస్తారు. ప్రేమమయి అయిన సాయి మాత, ఒకరిని చేరదీసి, మరొకరిని తిరస్కరించదు. 
తంవ తే దోఘే జేవ్హా నిఘతీ | పంధరా రుపయే కాకాంప్రతీ | 
బాబా దక్షిణా మాగూని ఘేతీ | సవేంచ వదతీ కాకాంస | ||౧౨౮|| 
128. వారిద్దరూ బయలుదేరేటప్పుడు, కాకా దగ్గరనుండి, బాబా పదిహేను రూపాయలను దక్షిణగా అడిగి తీసుకున్నారు. తరువాత అతనితో, 
“దక్షిణేలాగీ జ్యానే మజలా | అసేల ఎక రుపయ్యా దిధలా | 
దశగుణే మజ తయా మోబదలా | ద్యావా లాగలా మోజూన | ||౧౨౯|| 
129. “నాకు ఎవరైనా ఒక రూపాయి దక్షిణగా ఇస్తే, దానికి బదులుగా, వారికి నేను లెక్క పెట్టి, పదింతలు ఇవ్వవలసి ఉంటుంది. 
మీ కాయ కోణాచే ఘేఈనా ఫుకట | మాగే న మీ సర్వా సరసకట | 
ఫకీర జయాసీ దావీ బోట | తయాసీంచ గోష్ట దక్షిణేచీ | ||౧౩౦||
130. “నేను ఎవరి దగ్గరనుండీ, ఏదీ ఉచితంగా తీసుకోను. అలాగే, నేను అందరినీ కూడా అడగను. ఫకీరు వేలెట్టి ఎవరిని చూపిస్తే, వారిని మాత్రమే దక్షిణను అడుగుతాను. 

తోహీ ఫకీర జయాచా ఋణీ | తయాసీచ హీ కరీ మాగణీ | 
దాతా ఘేఊని కరీ పేరణీ | పుఢే సంవగణీ కరావయా | ||౧౩౧|| 
131. “పైగా, ఫకీరు కూడా, ఋణపడి ఉన్నవారినే అడగటం. అలా దక్షిణను ఇచ్చే దాతలు, తరువాత వచ్చే పంటను అనుభవించటానికి, విత్తనాలను నాటుకుంటారు. 
విత్త హే కేవళ ధర్మద్వారా | విత్తవంతా పడేల ఆహే ఉపకారా | 
ధర్మైక ఫళ హే ఎణేంచ ఖరా | జ్ఞానాసీ థారా లాధతో | ||౧౩౨|| 
132. “ధర్మ కార్యాలకు ఖర్చు పెడితేనే, శ్రీమంతుల డబ్బుకు విలువ పెరిగి, దానం చేసిన వారికి మంచి జరుగుతుంది. ఉదారంగా దానం చేస్తే, ఖచ్చితంగా ఫలం లభిస్తుంది. అలాంటి వారికే జ్ఞాన మార్గం దొరుకుతుంది. 
దుఃఖ సంపాద్య హే విత్త | కేవళ ఆహే ఇష్టోపభోగార్థ | 
 వ్యర్థ నిష్కారణ వేంచితాత | ధర్మ సంచిత అవగణునీ | ||౧౩౩|| 
133. “కాని, ఎంతో కష్టపడి సంపాదించిన ఈ డబ్బును, కేవలం తమ కోరికలను తీర్చుకోవటానికే అని అనుకుని, ధర్మాన్ని లెక్క చేయక, ఎందరో వృథాగా డబ్బు ఖర్చు పెడతారు. 
కరూనియా కవడీ కవడీ | అర్బుదాంత ధన జే జోడీ | 
తే విషయ స్వార్థాచియా ఆవడీ | కదా న దవడీ తో సుఖీ” | ||౧౩౪|| 
134. “పైసా పైసా కూడబెట్టి, పది కోట్ల వరకు కూడబెట్టిన డబ్బును, తన కోసం, తన ఇంద్రియ సుఖాలను అనుభవించటానికి కాక, ఖర్చుపెట్టే వారే సుఖంగా ఉంటారు”. 
‘నాదత్తముపతిష్ఠతి’3 | సకళాంస ఠావీ కీ హీ శ్రుతీ | 
పూర్వదత్త ఠాకే పుఢతీ | తదర్థ మాగతీ దక్షిణా | ||౧౩౫|| 
135. ‘నా దత్తం ఉపతిష్ఠతి’ అంటే, ‘ఇవ్వక పోతే, దొరకదు’ అనే ఈ వేద వాక్యం అందరికీ తెలుసు. మునుపు ఇచ్చినది బాబాకు స్పష్టంగా కనిపిస్తుంది కనుకనే, వారు దక్షిణను అడుగుతారు. 
రామావతారీ రఘునందనే | ఆపార స్వర్ణ స్త్రియాంచీ దానే | 
కరితా షోడశ సహస్త్ర ప్రమాణే | ఘేతలే కృష్ణే తత్ఫల | ||౧౩౬|| 
136. రామావతారంలో రఘురాముడు, బంగారంతో చేసిన ఎన్నో స్త్రీ మూర్తులను దానం చేశాడు. దాని ఫలితాన్ని కృష్ణావతారంలో, పదహారు వేల స్త్రీల రూపంలో తిరిగి పొందాడు. 
భక్తి జ్ఞాన వైరాగ్య హీన | ఏసా జో భక్త తో అతి దీన | 
తయాస ప్రథమ వైరాగ్యీ స్థాపూన | భక్తిజ్ఞాన మగ దేతీ | ||౧౩౭|| 
137. భక్తి, జ్ఞానం, వైరాగ్యాలు తెలియని అతి దీనులైన భక్తులకు, ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి, తరువాత భక్తి జ్ఞానాలను బాబా నేర్పుతారు. 
కరవితీ జే దక్షిణా ప్రదాన | తీచ వైరాగ్యాచీ ఖూణ | 
పుఢే భక్తిపంథాస లావూన | జ్ఞాన ప్రవీణ కరవీత | ||౧౩౮|| 
138. భక్తులతో దక్షిణను దానం చేయించటం, వైరాగ్యానికి గురుతు. తరువాత, వారిని భక్తి మార్గంలో ప్రవేశ పెట్టి, బాబా జ్ఞానులుగా చేస్తారు. 
“ఆమ్హీ తరీ కాయ కరితా | ఎకపట ఘేతో దసపట దేతో | 
క్రమే క్రమే జ్ఞానపథా లావితో” | లోభ ఉఠతో ధరమసీతే | ||౧౩౯|| 
139. “మేం మాత్రం ఇంకేం చేస్తాం? ఒకటి తీసుకుంటాం, దానికి పదింతలు ఇస్తాం. క్రమక్రమంగా వారిని జ్ఞాన మార్గంలోకి తీసుకుని వస్తాము” అని బాబా చెప్పగా, ధరంసీకి ఆశ కలిగింది. 
ఆపణ హోఊని రుపయే పంధరా | ఠేవితే ఝాలే బాబాంచే కరా | 
విసరలే పూర్వ కృత నిర్ధారా | ప్రకార సారాచ అపూర్వ | ||౧౪౦||
140. మునుపు అనుకున్న నిశ్చయాన్ని మరచి పోయి, తనంతట తానే, పదిహేను రూపాయలను బాబా చేతిలో ఉంచాడు. ఎంత వింతగా లేదూ! 

వాటలే ఆధీ వృథా జల్పలో | బరే కేలే సమక్ష ఆలో | 
సాధూ కైసే అసతాత బోధలో | తయాంచే లోధలో అనుభవీ4 | ||౧౪౧|| 
141. ‘అనవసరంగా గొప్పలు చెప్పుకున్నాను. ఇక్కడికి వచ్చి, ఎదురుగా కలుసుకోవటం మంచిదైంది. సాధువులు ఎలా ఉంటారో తెలిసింది. నా స్వంత అనుభవంతోనే, వారి మీద భక్తి కలిగింది.
అసో దృఢ న విచారితా మనీ | ఆమ్హీ యేణార నవ్హతో నమనీ | 
తేహీ ఆలో ఆపణ హోఊనీ | సాధూంచి కరణీ అగమ్య | ||౧౪౨|| 
142. ‘సరిగ్గా తెలుసుకోకుండానే, వారికి నేను నమస్కరించను, అని అనుకున్నాను. కాని, చివరకు, నా అంతట నేనే, అది కూడా చేశాను. సత్పురుషుల లీలలు నిజంగా అర్థం కానివి. 
“అల్లా మాలిక” ముఖీ నిరంతర | తయాస కాయ ఆహే దుష్కర | 
ఆమ్హీ పహావయా హోతో ఆతుర | కేవళ చమత్కార సాధూంచే | ||౧౪౩|| 
143. ‘ఎల్లప్పుడూ “అల్లా మాలిక” అని పలికే వారికి, కష్టమైనది ఏముంటుంది? కాని, నేను మటుకు, వారు చేసే చమత్కారాలను మాత్రమే చూడాలని ఆతుర పడ్డాను. 
వృథా ఝాలా ఆముచా పణ | ఘాతలే మానవా లోటాంగణ | 
న మాగతాంహీ దక్షిణా ప్రదాన | కేలే ఆపణ హోఊన | ||౧౪౪|| 
144. ‘నా హఠం ఎంత వ్యర్థమైనది. ఒక మనిషికి సాష్టాంగ నమస్కారం చేశాను. వారు అడగకుండానే, నా అంతట నేనే, దక్షిణను కూడా ఇచ్చాను. 
వృథా ఆముచీ సారీ బఢాఈ | ఆపణ హోఊన ఆపులీ డోఈ | 
పూజ్య భావే సాఈపాయీ | వాహిలీ నవాఈ కాయ దుజీ | ||౧౪౫|| 
145. ‘నేను చెప్పుకున్న బడాయి అంతా దండుగే! నా అంతట నేనే, ఎంతో భక్తితో, సాయి పాదాల మీద నా తలనుంచాను. ఇంతకంటే గొప్ప చమత్కారం ఏముంటుంది?’ 
కాయ వానూ హీ సాఈచీ కూసరీ | హే సర్వ జరీ తో స్వయేంచ కరీ | 
బాహ్యాత్కారీ అలిప్తతా ధరీ | నవలపరీ తీ కాయ దుజీ | ||౧౪౬| 
146. ఈ సాయియొక్క సామర్థ్యాన్ని ఎలా వర్ణించను? ఇదంతా వారే చేసినా, పైకి మటుకు, తమకేమీ సంబంధం లేనట్లు, ఏమీ ఎరుగనట్లు ఉంటారు. ఇంతకంటే, ఆశ్చర్యకరమైంది ఏముంటుంది? 
కోణీ కరా వా న కరా వందన | ద్యా అథవా న ద్యా దక్షిణా దాన | 
ఆనందకంద సాఈ దయాఘన | కరీ న అవగణన కోణాచే | ||౧౪౭|| 
147. ఎవరైనా వారికి నమస్కారం చేసినా, చేయకున్నా, దక్షిణను ఇచ్చినా, ఇవ్వకున్నా, ఆనందానికి ఇల్లైన సాయి దయామయులు ఎవరినీ కించపరచరు. 
పూజిల్యాచా నాహీ ఆనంద | అవమానిల్యాచా నాహీ ఖేద | 
హర్ష న తేథే కైచా విషాద | పూర్ణ నిర్ద్వంద్వ తే హే స్థితి | ||౧౪౮|| 
148. పూజిస్తే, వారు సంతోషించరు. అవమానిస్తే, వ్యథ పడరు. సంతోషం లేని చోట, దుఃఖం ఎక్కడుంటుంది? పూర్తిగా, విరుద్ధ భావాలు లేని స్థితి వారిది. 
అసో కోణాచా కాంహీహీ హేత | ఎకదా జయాంసీ దర్శన దేత | 
తయాచీ భక్తీ పాయీ జడవీత | శక్తీ హీ అద్భుత సాఈచీ | ||౧౪౯|| 
149. ఎవరి మనసులో ఎలాంటి ఆలోచనలున్నా, ఒక సారి వారి దర్శనం చేసుకున్న వారికి, తమ పాదాల మీద భక్తి నాటుకునేలా చేస్తారు. సాయియొక్క అద్భుతమైన శక్తి ఇలా ఉంటుంది. 
అసో పుఢే ఉదీ ప్రసాద | పావూని ఘేఊని ఆశీర్వాద | 
పరతలే తే నిర్వివాద | ఖ్యాతీ హీ అగాధ సాఈచీ | ||౧౫౦||
150. బాబా ఆశీర్వాదాన్ని, ఉదీ ప్రసాదాన్ని తీసుకుని, ధరంసీ మరియు కాకా, ఏ అనుమానాలూ లేక తిరిగి వెళ్ళిపోయారు. అర్థం కానటువంటి అద్భుతమైన శక్తి సాయిది. 

కరావయా తేథూన నిర్గమన | లాగే బాబాంచే ఆజ్ఞాపన | 
కరితా ఆజ్ఞేచే ఉల్లంఘన | నిమంత్రణ తే విఘ్నాంసీ | ||౧౫౧|| 
151. శిరిడీనుండి బయలుదేరటానికి, బాబా అనుమతి అవసరం. వారి ఆజ్ఞను మీరితే, అన్ని రకాల కష్టాలనూ పేరు పేరున పిలిచినట్లే! 
ఆపమతీ కరితా నిష్క్రమణ | అనుతాప ఆణి విటంబన | 
మార్గాంత వ్యత్యయ యేతీ దారుణ | తయాంచే నివారణ దుష్కర | ||౧౫౨|| 
152. ఎవరికి తోచినట్లు వారు వెళ్ళిపోతే, దారిలో దారుణమైన కష్టాలు, బాధలు, అవమానాలు కలిగి, వానినుంచి తప్పించుకోవటం అసాధ్యమౌతుంది. 
ఏసీ వర్ణిలీ తేథీల నిర్గతీ | ఆముతీచీహీ తేచ స్థితీ | 
“మీ న ఆణితా కోణీ న యేతీ” | ఏసీ వదంతీ బాబాంచీ | ||౧౫౩|| 
153. శిరిడీనుండి బయలుదేరటానికి అలా ఉంటుంది. మన పరిస్థితి కూడా అంతే. “నేను తీసుకుని రాకపోతే, ఎవరూ రాలేరు” అని బాబా తరచుగా అనేవారు. 
“మాఝీ ఇచ్ఛా ఝాలియావీణ | దారవంఠా త్యాగీల కవణ | 
కోణా స్వేచ్ఛే హోఈల దర్శన | ఘడేల ఆగమన శిరడీచే” | ||౧౫౪|| 
154. “నా ఇష్టం లేకుండా, వారి ఇంట గడపను ఎవరు దాటగలరు? ఎవరు శిరిడీకి రాగలరు, వచ్చి నా దర్శనం చేసుకోగలరు?” అని బాబా అనేవారు. 
సాఈ సమర్థ కృపా మూర్తీ | తయా ఆధీన ఆముచీ గతీ | 
కృపా ఉద్భవేల తయాంచే చిత్తీ | తేవ్హాంచ యేతీల దర్శనా | ||౧౫౫|| 
155. అంటే, మన రాకపోకలన్నీ సాయి సమర్థుని చేతిలో ఉన్నాయి. వారికి మనపై దయ కలిగినప్పుడే, వారి దర్శనం సాధ్యమౌతుంది. 
ఏసే తేథీల గమనాగమన | నసతా సాఈచే చిత్త ప్రసన్న | 
హోఈ న కోణాసహీ ఆజ్ఞాపన | ఉదీప్రదాన సమవేత | ||౧౫౬|| 
156. శిరిడీకి పోవటం, అక్కణ్ణుంచి రావటం ఇలా ఉంటాయి. సాయి అనుకోనిదే, వారు ఎవరికైనా సరే, అనుమతిని ఇవ్వటం, ఉదీ ప్రసాదాన్ని ఇవ్వటం అనేది జరగదు. 
కరూనియా అభివందన | మాగూ జాతా ఆజ్ఞాపన | 
ఉదీ సమవేత ఆశిర్వచన | తేంచ ఆజ్ఞాపన నిఘావయా | ||౧౫౭|| 
157. వారి పాదాలకు నమస్కారం చేసి, బయలుదేరటానికి అనుమతిని అడిగినప్పుడు, వారు ఉదీ ప్రసాదాన్ని ఇస్తారు. అదే వారి అనుమతి అని అర్థం. 
ఆతా ఎక విభూతీచా అనుభవ | శ్రోతయాలాగీ కథితో అభినవ | 
మగ నేవాసకర భక్తిప్రభావ | మహానుభావ సాఈ కృపా | ||౧౫౮|| 
158. ఉదీయొక్క శక్తి గురించిన వింతైన ఒక అనుభవాన్ని, ఇప్పుడు శ్రోతలకు చెప్తాను. దాని తరువాత, నేవాస్కరు భక్తి ప్రభావం, మరియు అతను సాయి మహానుభావుని అనుగ్రహాన్ని పొందటం చెప్తాను. 
వాంద్రే శహరచా ఎక గృహస్థ | తోహీ జాతీచా ప్రభూ కాయస్థ | 
రాత్రీ నిద్రా యేఊ నయే స్వస్థ | జాహలీ శికస్త యత్నాంచీ | ||౧౫౯|| 
159. బాంద్రా పట్టణంలో ఉన్న కాయస్థ ప్రభు జాతికి చెందిన ఒక గృహస్థునికి, ఎన్ని ప్రయత్నాలు చేసినా, రాత్రి పూట సుఖమైన నిద్ర ఉండేది కాదు. 
డోళ్యాస డోళా లాగూని నిద్రిత | అసతా క్షణైక అకస్మాత | 
స్వప్నీ తయాచా మృత తాత | కరీ జాగృత ప్రతిదినీ | ||౧౬౦||
160. కళ్ళు మూసుకుని అతను పడుకుంటే, చనిపోయిన అతని తండ్రి కనిపించి, ప్రతి రాత్రీ మేలుకొలిపే వాడు. 

పూర్వీల యుక్తాయుక్త ప్రకార | గుప్త గర్హ్య క్లిష్ట విచార | 
శివ్యా శాప పూర్వక ఉచ్చార | వాక్‍ప్రహార ప్రేరీ తో | ||౧౬౧|| 
161. వెనుక జరిగిన వాటి గురించి, రహస్యంగా తన మనసులో దాచుకున్న మాటలని, అర్థం కాని తిట్లను, శాపనార్థాలను చెబుతూ, బాధపెట్టేవాడు.
ప్రతిదినీ ఏసా ప్రసంగ | ప్రతిదినీ హోయ నిద్రా భంగ | 
పడేనా కాంహీ ఉమంగ | చుకేనా భోగ పాఠీచా | ||౧౬౨|| 
162. ప్రతి రోజూ ఇలాగే జరిగేది. ప్రతి రాత్రీ నిద్రాభంగమయ్యేది. ఆ బాధను వదిలించు కోవటానికి ఏం చేయాలో తోచలేదు. 
తేణే తో గృహస్థ కంటాళలా | ఉపాయ కాంహీ న సుచే తయాలా | 
పుసే ఎకా సాఈ భక్తాలా | కరావా ఇలాజ కాయ తరీ | ||౧౬౩|| 
163. ఏం చేయాలో తోచక, బాధ భరించలేక, విసుగు చెందాడు. ‘దీనికి ఏదైనా ఉపాయం చూపించు’ అని ఒక సాయి భక్తుని అడిగాడు. 
ఆమ్హీ న జాణూ అన్య ఉపాయ | సాఈ మహారాజ మహానుభావ | 
ఠేవాల జరీ తుమ్హీ హీ భావ | ఉదీ నిజ ప్రభావ ప్రకటీల | ||౧౬౪|| 
164. ‘నాకు సాయి మహారాజు తప్ప, వేరే ఏ ఉపాయాలూ తెలియవు. వారు మహానుభావులు. వారి మీద గనుక నీకు భక్తి శ్రద్ధలుంటే, ఉదీ ప్రభావం నీకే తెలుస్తుంది’ అని చెప్పాడు. 
జైసే జైసే తయా కథిలే | తైసే తైసే తయానే కేలే | 
అనుభవాహీ తైసేంచ ఆలే | దుఃస్వప్న పడలే నాహీ పునః | ||౧౬౫|| 
165. అతను చెప్పినట్లే, ఇతను చేశాడు. అద్భుతమైన అనుభవం కూడా కలిగింది. మళ్ళీ అతనికి చెడు కలలు రాలేదు. 
కర్మ-ధర్మ-వశే తే మిత్ర | హోతే సాఈ సమర్థ ఛాత్ర | 
వానూని ఉదీచా మహిమా విచిత్ర | అర్పీత లవమాత్ర తయాంస | ||౧౬౬|| 
166. అదృష్టం కొద్దీ, ఆ స్నేహితుడు సాయి సమర్థుల భక్తుడు. విచిత్రమైన ఉదీ మహిమను వర్ణించి, అతనికి కొంచెం ఇచ్చాడు. 
మ్హణతీ జాతా నిజావయాస | లావా థోడీ మస్తకాస | 
పుడీ బాంధూని ఠేవా ఉశాస | మనీ శ్రీ సాఈస ఆఠవా | ||౧౬౭|| 
167. ‘పడుకునే మునుపు, నొసటన రాసుకుని, ఉదీ పొట్లాన్ని తలక్రింద ఉంచుకుని, భక్తిగా బాబాను తలచుకో’ అని చెప్పాడు. 
పోటీ ఠేవా భక్తిభావ | పహా మగ యా ఉదీచా ప్రభావ | 
తాత్కాళ కరీల పీడేచా అభావ | సహజ స్వభావ హా తీచా | ||౧౬౮|| 
168. ‘మనసులో భక్తి, నమ్మకం ఉంచుకుని, ఆ ఉదీ ప్రభావాన్ని చూడు. అది వెంటనే నీ బాధను తొలగిస్తుంది. దాని స్వభావమే అది’ అని చెప్పాడు. 
ఏసే హోతాంచ లాగలీ త్యాలా | గాఢ నిద్రా త్యా రాత్రీలా | 
దుష్ట స్వప్నాచా ఠావచి పుసిలా | అతి ఆనందలా గృహస్థ | ||౧౬౯|| 
169. అలా చేయగా, అతనికి ఆ రాత్రి గాఢ నిద్ర పట్టింది. చెడు కలలు రాలేదు. అతడు చాలా ఆనందపడ్డాడు. 
మగ త్యా త్యాచ్యా ఆనందాస | కాయ పాహిజే పుసావయాస | 
పుడీ తీ నిత్య రక్షీ ఉశాస | స్మరే సాఈస నిత్యశః | ||౧౭౦||
170. ఇక అతని సంతోషాన్ని అడగాలా? ప్రతి రోజూ సాయిని తలచుకుని, ఉదీ పొట్లాన్ని తలగడ క్రింద పెట్టుకునే వాడు. 

పుఢే బాబాంచీ ఛబీ ఆణిలీ | గురువార సాధూన మాళ వాహిలీ | 
ఉశాగతీ భింతీస లావిలీ | ఆదరే పూజిలీ తయానే | ||౧౭౧|| 
171. తరువాత, బాబా ఫోటోను తెచ్చుకుని, తలవైపు గోడకు తగిలించి, ప్రతి గురువారం దానికి మాలను వేసి, భక్తిగా పూజ చేసేవాడు. 
ఘేఊ లాగలా ఛబీచే దర్శన | గురువారీ మాళా సమర్పణ | 
కరీ నిత్య మానసిక పూజన | పీడా నివారణ జాహలీ | ||౧౭౨|| 
172. ప్రతి రోజూ అలా సాయిని దర్శించుకుని, ప్రతి రోజూ మానసిక పూజ చేసి, గురువారం మాలను వేయటంతో, అతని బాధలన్నీ తొలగిపోయాయి. 
ఏసీ చాలవిలీ నేమ నిష్ఠా | పావలా తో స్థాఈ అభీష్టా | 
నిద్రాభంగాది దుఃస్వప్నానిష్టా | విసరలా కష్టా పూర్వీల | ||౧౭౩|| 
173. ఎంతో నియమ నిష్ఠలతో, వీటిని పాటించేవాడు. మునుపటి నిద్రాభంగం కాని, చెడు కలలు కాని, అన్నిటినీ ఇప్పుడు మరచి పోయాడు. 
హా తో ఉదీచా ఎక ఉపయోగ | కథితో ఆణీక అద్భూత యోగ | 
కైశాహీ సంకటీ కరితా ప్రయోగ | అభీష్ట భోగ దేఈ తీ | ||౧౭౪|| 
174. అది ఉదీయొక్క ఒక ప్రయోజనమంతే. ఇప్పుడు, అంతకంటే ఆశ్చర్యకరమైన, ప్రయోజనాన్ని చెప్పుతాను. ఎంతటి కష్టకరమైన సమయంలో కాని, ఈ ఉదీని ఉపయోగిస్తే, అది మన కోరికలను తీరుస్తుంది. 
హోతా ఎక భక్త థోర | బాళాజీ పాటీల నేవాసకర | 
బాబాలాగీ ఝిజవిలే శరీర | సేవా లోకోత్తర కరూని | ||౧౭౫|| 
175. బాలాజీ పాటీలు నేవాస్కరు అనే ఒక గొప్ప భక్తుడుండేవాడు. అతడు బాబా కోసం, ఇతరుల ఉపకారానికై సేవ చేస్తూ, తన దేహాన్ని అరగ తీశాడు. 
గావాంత నిత్య జాణ్యాయేణ్యాచే | తైసేచ లేండీచీ ఫేరీ ఫిరణ్యాచే | 
హే బాబాంచే రస్తే ఝాడణ్యాచే | నేవాసకరాంచే నిత్య కామ | ||౧౭౬|| 
176. రోజూ గ్రామంలో, బాబా తిరిగే దారులు, వారు లెండీకి వెళ్ళే దారిని, నేవాస్కరు చిమ్మేవాడు. క్రమం తప్పకుండా ఈ పని చేసేవాడు. 
యాచ సేవేచీ పరిపాటీ | చాలూ రాహిలీ తయాంచే పాఠీ | 
రాధాకృష్ణాబాఈచీ5 హాతోటీ | అలౌకిక మోఠీ యే కామీ | ||౧౭౭|| 
177. అతని తరువాత, ఈ సేవను రాధాకృష్ణబాయి చేసేది. ఏ ప్రతి ఉపకారమూ ఆశించక, ఈ పనిని ఆమె అలౌకికంగా చేసేది. 
వర్ణ బ్రాహ్మణ అఖిల వంద్య | ఆణీ హీ సేవా ఏశీ నింద్య | 
శివలే న కేవ్హాంహీ హే విచారమాంద్య | తియేచ్యా అనవద్య6 అంతరా | ||౧౭౮|| 
178. ‘అందరూ ఆదరించే బ్రాహ్మణ జాతిలో పుట్టి, ఇలాంటి నీచమైన పని ఎలా చేయాలా?’, అనే ఆలోచన, ఆమె నిర్మలమైన మనసులో, ఎప్పుడూ రాలేదు. 
ఉఠోనియా సకాళచే ప్రహరీ | ఝాడూ ఘేఊనియా నిజకరీ | 
స్వయే హీ బాబాంచే రస్తే వారీ7 | ధన్య చాకరీ తియేచీ | ||౧౭౯|| 
179. తెల్లవారే లేచి, చేత్తో చీపురు పట్టుకుని, బాబా నడిచే అన్ని దారులనూ, స్వయంగా శుభ్రం చేసేది. ఆమె సేవ నిజంగా చాలా ధన్యం. 
కామ నిర్మళ ఆణి సత్వర | కోణ అన్య పావేల తీ సర | 
పుఢే మగ జాతా కాంహీ అవసర | అబదుల8 సరకలా పుఢారా | ||౧౮౦||
180. ఎంత శుభ్రంగా, ఎంత త్వరగా ఆ పనిని ఆమె చేసేది! ఆమెకు సాటిగా ఎవరు చేయగలరు? కొంత కాలం గడిచాక, అబ్దుల్ ఆ పని చేయటానికి ముందుకొచ్చాడు. 

అసో తో పాటీల మహాభాగ | సంసారీ వర్తూన సంసార విరాగ | 
కేవఢా తయాచా స్వార్థత్యాగ | పరిసా తో భాగ కథేచా | ||౧౮౧|| 
181. అలా, ఆ భాగ్యవంతుడైన పాటీల్, సంసారంలో ఉంటూనే, సాంసారిక విషయాలలో ఏ ఆసక్తీ లేకుండా, ఉండేవాడు. స్వార్థం అనేది కోంచేం కూడా లేని, అతని త్యాగాన్ని తెలియచేసే కథను వినండి.
హోతా శేతాచీ సవంగణీ | ధాన్య సమస్త మశీదీ ఆణీ | 
రిచవూని ఢిగార తేథేంచ అంగణీ | సమర్పీ చరణీ బాబాంచ్యా | ||౧౮౨|| 
182. తన పొలంలోని పంట కోయగానే, మొత్తం ధాన్యాన్ని తెచ్చి, అతను మసీదు ఆవరణలో రాసిపోసి, దానిని బాబా పాదాలకు సమర్పించేవాడు. 
మానూని బాబా సర్వస్వ ధనీ | తే జే దేతీల త్యాంతునీ ఉచలూనీ | 
తితుకేంచ ధాన్య ఘరీ నేఊనీ | గుజారా కరూనీ రాహీ తో | ||౧౮౩|| 
183. ‘ఆ పంటకు బాబాయే యజమాని’ అని అనుకొని, వారు ఇచ్చినంత ధాన్యాన్ని మాత్రమే ఇంటికి తీసుకుని వెళ్ళి, జీవితం గడుపుకునేవాడు. 
మహారాజాంనీ స్నాన కరునీ | హాత పాయ వ తోండ ధువుని | 
ఆలేలే మోరీచే సాండపాణీ | బాళా పిఊని రాహతసే | ||౧౮౪|| 
184. సాయి మహారాజు, కాళ్ళూ చేతులూ, ముఖం కడుక్కున్న నీరు, వారు స్నానం చేసిన నీరు మురికి కాలువలో ప్రవహిస్తుంటే, ఆ నీరునే అతను త్రాగేవాడు. 
హే నేవాసకర అసేపర్యంత | చాలలా హా నేమ అవ్యాహత | 
అజూని తయాంచా ప్రేమళ సుత | చాలవీ హే వ్రత అంశతః | ||౧౮౫|| 
185. ఈ నేవాస్కరు ఉన్నంత వరకూ, నియమం తప్పకుండా, అలాగే చేసేవాడు. అతని తరువాత, అతని కొడుకు కూడా, తండ్రిలా కొంచెం చేసేవాడు. 
తోహీ ధాన్య పాఠవీ సతత | త్యాంతీల జోంధళ్యాచీ భాకర నిత | 
మహారాజ నిజ నిర్వాణాంత | ఖాత అసత చార వేళా | ||౧౮౬|| 
186. అతను కూడా, ఎప్పుడూ బాబాకు ధాన్యాన్ని పంపేవాడు. ఆ జొన్న రొట్టెలను సాయి మహారాజు తమ సమాధి వరకూ, రోజుకు నాలుగు సారి తినేవారు. 
అసో ఎకదా కాయ ఘడలే | వర్ష శ్రాద్ధ బాళాచే ఆలే | 
అన్న శిజవూన తయార ఝాలే | వాఢూ లాగలే వాఢపీ | ||౧౮౭|| 
187. బాళా పాటీలు చనిపోయిన తరువాత, ఒక సారి, అతని శ్రాధ్ధం వచ్చింది. అన్నంతో పాటు మిగతా వంటలూ, వండి సిద్ధంగా ఉన్నాయి. ఇక వడ్డించడమే తరువాయి. 
యేణార్యాంచా అందాజ ధరునీ | పాకసిద్ధీ హోతీ సదనీ | 
వాఢతే వేళీ అందాజాహునీ | సంఖ్యా త్రిగుణీత జాహలీ | ||౧౮౮|| 
188. ఎంత మంది రావచ్చో అని అంచనా వేసి, వంటలు తయారు చేశారు. కాని, చూడగా చూడగా, అనుకున్నదానికంటే మూడింతలు జనం వచ్చారు. 
నేవాసకరీణ మనీ ఘాబరలీ | సాసూబాఈశీ కుజబుజూ లాగలీ | 
ఫజితీచీ పాళీ ఆలీ | కైసీ నివారిలీ జాఈల | ||౧౮౯|| 
189. నేవాస్కరు భార్యకు గాబరా వేసింది. ‘అవమానం కాకుండా, ఇప్పుడు ఈ సమస్యనుంచి ఎలా బయట పడతాము?’ అని అత్తగారితో మెల్లగా అన్నది. 
సాసూబాఈచీ నిష్ఠా థోర | ఆపులే సాఈ సమర్థ ఖంబీర | 
అసతా కిమర్థ కరావా ఘోర | రాహీ తూ నిర్ఘోర మ్హణే తీ | ||౧౯౦||
190. అత్తగారికి సాయి మీద విపరీతమైన నమ్మకం. ‘మనకు సాయి సమర్థుల గొప్ప అండ ఉండగా, దిగులు ఎందుకు? నీవు అసలే భయపడకు’ అని చెప్పింది. 

ఏసే సాసూనే ఆశ్వాసూనీ | ఉదీ ఎక మూఠభర ఘేఊనీ | 
ఘాతలీ అన్నాచ్యా ప్రత్యేక బాసనీ | బాసనే వస్త్రాంనీ ఆచ్ఛాదిలీ | ||౧౯౧|| 
191. అలా కోడలితో చెప్పి, పిడికెడు ఉదీని తీసుకుని ఆమె, వంటకాలున్న ప్రతి గిన్నెలో వేసి, గిన్నెలను బట్టలతో కప్పి పెట్టింది. 
మ్హణే తూ జా ఖుశాల వాఢ | వాఢ్యా పురాచ కపడా కాఢ | 
పునశ్చ పూర్వవత్ కపడా ఓఢ | ఖూణ హీ దృఢ సాంభాళీ | ||౧౯౨|| 
192. ‘ఇక ఏ భయమూ లేకుండా వడ్డించు. గిన్నెలోనుండి ఎంత కావాలో తీసుకుని, మరల మునుపటిలాగే బట్టను కప్పిపెట్టు. ఇది బాగా గుర్తుంచుకో’ అని చెప్పింది. 
హే సాఈచ్యా ఘరచే అన్న | ఆపులా నాహీ ఎకహీ కణ | 
తోచ కరీల లజ్జా రక్షణ | త్యాచే ఉణేంపణ తయాలా | ||౧౯౩|| 
193. ‘ఇది సాయియొక్క అన్నం. ఇందులో ఒక మెతుకు కూడా మనది కాదు. కనుక, అవమానం పాలు కాకుండా, మనలను వారే రక్షిస్తారు. ఏ లోటు కలిగినా, అది వారిదే కాని, మనది కాదు’ అని చెప్పింది. 
అసో జైసా త్యా సాసూచా నిశ్వయ | తైసాచ తిజలా ఆలా ప్రత్యయ | 
కాహీ ఎక న యేతా వ్యత్యయ | జేవలే పాహుణే పయ సుద్ధా | ||౧౯౪|| 
194. అత్తగారికున్న దృఢమైన నమ్మకానికి సాక్షిగా, కోడలికీ అలాంటి చక్కటి అనుభవమైంది. ఏ ఇబ్బందీ లేకుండా, బంధువులూ, అతిథులూ భోజనం చేశారు. 
ఆలే గేలే సర్వ జేవలే | యథాసాంగ సర్వ ఝాలే | 
తరీ హీ అన్న శిల్లక రాహిలే | పాత్రీ భరలేలే పూర్వవత | ||౧౯౫|| 
195. వచ్చిన వారందరూ భోజనం చేశారు. అనుకున్న ప్రకారం అన్నీ జరిగిపోయాయి. అయినా, గిన్నెలలో, అన్నం మాత్రం ఇంకా అలాగే మిగిలి ఉంది. 
ఉదీచా హా ఏసా ప్రభావ | సంతాంచా హా సహజ స్వభావ | 
జయా మనీ జైసా భావ | తయా అనుభవ హీ తైసాచ | ||౧౯౬|| 
196. ఉదీ ప్రభావం ఇలా ఉంటుంది. సత్పురుషులకు ఇది సులభంగా, స్వాభావికంగా ఉంటుంది. ఎవరి మనసులో ఏ భావం ఉంటుందో, వారికి అలాంటి అనుభవమే కలుగుతుంది. 
అసో ఉదీచా మహిమా గాతా | నేవాసకరాచీ ఆణిక కథా | 
పాహోని త్యాచీ భక్తిమత్తా | ఆఠవలీ చిత్తా తీ ఏకా | ||౧౯౭|| 
197. ఉదీ మహిమను గురించి చెబుతున్నప్పుడు, నేవాస్కరుయొక్క భక్తికి సంబంధించిన మరొక కథ గుర్తుకు వచ్చింది. దానిని వినండి. 
హోఈల కాయ విషయాంతర | ఎకదా శంకూ లాగలే అంతర | 
హోఈల తే హోవో పరీ తీ సాదర | ప్రసంగానుసార కరావీ | ||౧౯౮|| 
198. ఇది ఇప్పటి సందర్భానికి సరి కాదేమో అని అనుమానం వచ్చింది. అయితే కానీ, సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను. 
ఏసా నిశ్చయ కరూని మనీ | కథా కథితో ఇయే స్థానీ | 
జరీ వాటలీ తీ అస్థానీ | క్షమా శ్రోత్యానీ కరావీ | ||౧౯౯|| 
199. అలా అనుకున్న తరువాత, ఆ కథను ఇక్కడే చెప్పుతాను. శ్రోతలు గనుక ‘ఇది సందర్భం కాదు’ అని అంటే, నన్ను క్షమించాలి. 
ఎకదా శిరడీచా రహివాసీ | రఘు పాటీల నామ జయాసీ | 
పాహుణా గేలా నేవాశాసీ | యాచేచ గృహాసీ ఉతరలా | ||౨౦౦||
200. శిరిడీలో ఉండే రఘు పాటీల అనే ఒకాయన, నేవాసాకు వెళ్ళి, అక్కడ నేవాస్కరు ఇంట్లో బస చేశాడు. 

గురే ఢోరే దావణీసీ | బాంధిలీ అసతా ఎకే నిశీ | 
భుజంగ ఎక ఫూంఫూ శబ్దేశీ | గోఠ్యాంత ప్రవేశీ అవచిత | ||౨౦౧|| 
201. ఒక రాత్రి వేళలో, పశువులను తాళ్ళతో గుంజలకు కట్టి ఉండగా, అకస్మాత్తుగా, ఒక పాము కొట్టంలో వచ్చి, బుసకొట్టింది.
పాహోనియా ఏసా ప్రసంగ | జాహలీ సర్వాంచీ మతి గుంగ | 
కరోనియా తో ఫణా భుజంగ | యథాసాంగ బైసలా | ||౨౦౨|| 
202. ఇలాంటి అనుకోని పరిస్థితి వచ్చే సరికి, అందరికీ మతి పోయింది. కాని, ఆ పాము పడగ విప్పి, చక్కగా అక్కడ కూర్చుంది. 
గురే కరూ లాగలీ గడబడ | సుటావయాలాగీ ధడపడ | 
నేవాసకరాచా గృహ సుదృఢ | సాఈచ ప్రకట జాహలే | ||౨౦౩|| 
203. పశువులు భయంతో, కట్లను విప్పుకుని పారిపోవటానికి గొడవ చేస్తున్నాయి. కాని, సాయియే ఆ రూపంలో వచ్చారని, నేవాస్కరుకు బలమైన నమ్మకం. 
ఆతా గురే సోడిల్యా శివాయ | యేథే నాహీ అన్య ఉపాయ | 
నాహీ తరీ పడూన పాయ | హోఈల అపాయ ఎకాదా | ||౨౦౪|| 
204. ఎవరి పాదమైనా ఆ పాము పడగపై పడితే, అపాయం కాదూ! అందుకే, పశువులను విప్పకుండా, వేరే ఏ ఉపాయమూ కనిపించలేదు. 
దురోని దేఖిలా భుజంగ | హర్షిత నేవాసకరాంతరంగ | 
జాహలా పులకిత సర్వాంగ | కేలా సాష్టాంగ ప్రణిపాత | ||౨౦౫|| 
205. ఆ పామును దూరంనుండి చూసే, నేవాస్కరుకు ఆనందం కలిగింది. దేహమంతా పులకించి పోయింది. వెంటనే, సాష్టాంగ నమస్కారం చేశాడు. 
మ్హణే సాఈచీ కృపా దృష్టీ | భుజంగ రూపే ఆలే భేటీ | 
ఆణిలీ దుగ్ధ భరోని వాటీ | భుజంగా సాఠీ తయానే | ||౨౦౬|| 
206. పాము రూపంలో వచ్చింది, తమ మీద సాయి కృపా దృష్టియే అని తలచి, పాము కోసం ఒక గిన్నె నిండా పాలు తెచ్చి పెట్టాడు. 
కాయ త్యా బాళాజీచీ వృత్తీ | చిత్తా న జ్యాచ్యా అణుమాత్ర భీతీ | 
పహా కాయ వదే భుజంగా ప్రతీ | సావధ శ్రోతీ పరిసీజే | ||౨౦౭|| 
207. ఏ మాత్రం భయం లేకుండా ఉండాలంటే, ఆ బాళాజీయొక్క మనసు ఎంత బలమైందో! ఇంకా, ఆ పాముతో ఏమన్నాడో శ్రోతలు వినండి. 
కా హో బాబా ఫోంఫో కరితా | కాయ ఆమ్హా భివవూ పహాతా | 
ఘ్యా హీ దుధాచీ వాటీ ఆతా | స్వస్థ చిత్తా సేవా హీ | ||౨౦౮|| 
208. ‘బాబా! ఎందుకు బుసబుసమంటున్నావు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా, ఏం? ఇదిగో, ఈ పాల గిన్నె. దీనిని తీసుకుని, నిశ్చింతగా త్రాగు’. 
వాటీనే త్యాస కాయ హోయ | తపేలే భరూన ఆణిలే పయ | 
పుఢే ఠేవిలే అంతరీ నిర్భయ | భావనేచే భయ సారే | ||౨౦౯|| 
209. చిన్న గిన్నెలోని పాలు ఏం సరిపోతాయని, పెద్ద గిన్నె నిండా పాలు తెచ్చి, ఏ మాత్రం భయం లేకుండా, ఆ పాము ముందు ఉంచాడు. నిజంగా, భయమనేది మన మనసు పుట్టించేదే కదా! 
దూధ ఠేవూని తయాచే జవళీ | జాఊని బైసలా పూర్వస్థళీ | 
నాహీ దూర నాహీ జవళీ | ముఖీ నవాళీ9 భుజంగాచీ | ||౨౧౦||
210. పాల గిన్నెను పాము ముందుంచి, తాను వెళ్ళి, మరీ దగ్గరగా కాక, దూరంగానూ కాక, మునుపు కూర్చున్న చోటులోనే, కూర్చున్నాడు. ఆ పామును చూస్తున్న కొద్దీ, అతని ముఖంలో ఎంతో ఉత్సాహం కనిపించ సాగింది. 

భీతిప్రద భుజంగాగమన | సర్వాంచే కాయ సారఖే మన | 
గేలే సర్వ గాంగరూన | కైసే హె విఘ్న నిరసేల | ||౨౧౧|| 
211. పాము ఇంట్లోకి వచ్చిందంటే, ఎంతో భయపడాల్సిన సంగతి. అదీ, అందరి మనసులూ ఒకేలా ఉంటాయా? ఈ ఆపద ఎలా తొలగుతుందా అని అందరూ గాబరాగా ఉన్నారు. 
బాహేర జావే తరీ భీతీ | భుజంగ గేలియా అంతర్‍గ్రహా ప్రతీ | 
కఠీణ తేథూన బహిర్నిసృతీ | బైసలే పాళతీ ఠేవూని | ||౨౧౨|| 
212. ‘పాముగాని ఇంట్లోకి దూరిందా, ఇక బయటికి రావటం కష్టం’, అని బయటికి పోవటానికి భయపడి, అందరూ దాని మీదే కన్ను వేసి కూర్చున్నారు. 
ఇకడే భుజంగ తృప్త ఝాలా | చుకవూనియా సర్వాంచా డోళా | 
నకళే గేలా కవణ్యా స్థళా | ఆశ్చర్య సకళా వాటలే | ||౨౧౩|| 
213. అక్కడ వారు అలా ఉండగా, ఇక్కడ పాము చాలా తృప్తి చెంది, అందరి చూపులను తప్పించుకుని, ఎటో వెళ్ళి పోయింది. ఎటుపోయిందని ఎవరికీ తెలియలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. 
మగ తో సర్వ గోఠా శోధిలా | పరి న యత్కించిత థాంగ లాగలా | 
బహుతేకాంచా జీవ స్థిరావలా | మనీ చుకచుకలా నేవాసకర | ||౨౧౪|| 
214. కొట్టమంతా వెదికినా, దాని ఆచూకీ దొరకలేదు. అందరి మనసులూ కుదుటపడ్డాయి. కాని, నేవాస్కరు మనసులోనే బాధపడ్డాడు. 
ఆరంభీ గోఠ్యాంత జేవ్హా ప్రవేశలా | తేవ్హా జైసా దృష్టీస పడలా | 
తైసాచ జాతానా అసతా దిసలా | హీచ తయాలా చుకచుక | ||౨౧౫|| 
215. ‘కొట్టంలోకి వచ్చినప్పుడు కనిపించినట్లుగా, వెళ్ళేటప్పుడు కూడా కనిపించి ఉంటే బాగుండేది’ అని అతని బాధ. 
బాళాస హోత్యా స్త్రియా దోన | పుత్ర సంతతీ హోతీ లహాన | 
కధీ కధీ నేవాశాహూన | యేతీ దర్శన ఘ్యావయా | ||౨౧౬|| 
216. బాళాకు ఇద్దరు భార్యలు. కొడుకులు చిన్నవారు. వీరందరూ అప్పుడప్పుడు, బాబా దర్శనానికి, నేవాసానుండి వచ్చేవారు. 
బాబా తయా దోఘీప్రత | చోళ్యా లుగడీ వికత ఘేత | 
సాశీర్వాద తయా అర్పీత | ఏసా తో భక్త బాళాజీ | ||౨౧౭|| 
217. ఇద్దరు భార్యలకూ చీరలు, రవికలను కొని, బాబా తమ ఆశీస్సులతో ఇచ్చేవారు. అంతటి గొప్ప భక్తుడు బాళాజీ! 
హా సచ్చరిత మార్గ ధోపట | జేథే జేథే యాచా పాఠ | 
తేథేంచ ద్వారకా మాఈచా మఠ | సాఈహీ ప్రకట నిశ్చయే | ||౨౧౮|| 
218. ఈ సచ్చరితలో చూపే దారి చాలా సులభమైంది. సాయి సచ్చరిత పారాయణం ఎక్కడ ఎక్కడ జరుగుతుందో, ద్వారకామాయి అక్కడే ఉంటుంది. అక్కడే తప్పకుండా, సాయి కూడా కనిపిస్తారు. 
తేథేంచ గోదావరీచే తట | తేథేంచ శిరడీ క్షేత్ర నికట | 
తేథేంచ సాఈ ధునీ సకట | స్మరతా సంకట నివారీ | ||౨౧౯|| 
219. అక్కడే గోదావరీ తీరం, దగ్గరలోనే శిరిడీ క్షేత్రం. అక్కడే ధునితో సహా సాయి ఉండి, తలచుకున్నంత మాత్రాన అన్ని కష్టాలను తొలగిస్తారు. 
జేథే సాఈచరిత్ర పఠణ | తేథే సదైవ సాఈనివసన | 
శ్రద్ధాపూర్వక చరిత్రావర్తన | కరితా తో ప్రసన్న సర్వ భావే | ||౨౨౦||
220. సాయి చరిత్ర పారాయణం చేసే చోట, సాయి ఎల్లప్పుడూ ఉంటారు. భక్తితో, నమ్మకంగా చరిత్రను మరల మరల చదివితే, సాయి ఎంతో ఆనందిస్తారు. 

స్మరతా సాఈ స్వానందఘన | జపతా తన్నామ అనుదిన | 
నలగే ఇతర జపతప సాధన | ధారణా ధ్యాన ఖటపట | ||౨౨౧|| 
221. ఆనందానికి వాస స్థానమైన సాయిని తలచుకుంటే చాలు. ప్రతి రోజూ వారి పేరును జపిస్తే చాలు. చాలా కష్టమైన జప, తప, ధ్యాన ధారణ మొదలైన మిగతా సాధనలేవీ అవసరం లేదు.
సాఈ చరణీ ఠేవూని ప్రీతీ | జే జే యా సాఈచీ విభూతీ | 
నిత్యనేమే సేవితీ లావితీ | తే తే పావతీ మనేప్సిత | ||౨౨౨|| 
222. సాయి పాదాలను భక్తితో నమ్మి, వారి విభూతిని, ప్రతి రోజూ నియమంగా, నుదుట రాసుకుంటే, మనసులోని కోరికలన్నీ తీరుతాయి. 
ధర్మాది చారీ పురుషార్థ | పావోని హోతీ తే కృతార్థ | 
ప్రకట హోతీల సకల గుహ్యార్థ | స్వార్థపరమార్థ సమవేత | ||౨౨౩|| 
223. ధర్మ అర్థ కామ మోక్ష అనే నాలుగు పురుషార్థాలను పొంది, తృప్తులౌతారు. స్వార్థం మరియు పరమార్థంలోని రహస్యమైన అర్థాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. 
మహాపాపాది పాపే ప్రబళ | తైసీంచ ఉపపాతకేంహీ సకళ | 
ఉదీ సంపర్కే హోతీ నిర్మూళ | లాధే నిర్మళతా సబాహ్య | ||౨౨౪|| 
224. మహాపాపాలు, ఘోరమైన పాతకాలు, చిన్నచిన్న తప్పులు, అన్నీ ఉదీ స్పర్శ కాగానే, నిర్మూలనమై, లోపల బయట పరిశుద్ధత దొరుకుతుంది. 
ఏసే హే విభూతి ధారణ | భక్తాంసీ ఠావే హే మహిమాన | 
శ్రోత్యాంచేహీ వ్హావే కల్యాణ | మ్హణూన హే వర్ణన వాఢవిలే | ||౨౨౫|| 
225. భక్తులందరికీ ఈ విభూతి మహిమ, దాని అద్భుతమైన శక్తి, బాగా తెలుసు. శ్రోతలకు కూడా తెలియాలని, వారి మేలు కోసమే ఇంత వివరంగా వర్ణించాను. 
వాఢవిలే హీ భాషా అసార్థ | నేణే మీహీ మహిమా యథార్థ | 
తరీహీ శ్రోత్యాంచియా హితార్థ | సంకలితార్థచి నిరూపిలా | ||౨౨౬|| 
226. ‘వివరంగా వర్ణించాను’ అని చెప్పటం సరి కాదు. ఎందుకంటే, నాకు కూడా విభూతి మహిమ పూర్తిగా తెలియదు. అయినా, శ్రోతల మేలు కొరకు సంక్షిప్తంగా వర్ణించాను. 
మ్హణూని శ్రోతయాంస హీచ ప్రార్థనా | కరూని సాఈప్రతి వందనా | 
ఆపణచి ఆపులా అనుభవ ఘ్యానా | ఇతుకేంచి మానా మద్వచ | ||౨౨౭|| 
227. అందుకే శ్రోతలకు నాదొక ప్రార్థన. సాయికి నమస్కారం చేసి, ఈ విభూతి మహిమను వారే స్వయంగా అనుభవించాలి. ఈ ఒక మారు, నా మాటను వినండి. 
యేథే నాహీ తర్కాచే కామ | పూజ్యభావ వ్హావా ప్రకామ | 
నలగే బుద్ధిచాపల్యోక్రమ | పాహిజే పరమ శ్రద్ధాళూ | ||౨౨౮|| 
228. ఇక్కడ వాద వివాదాలతో పని లేదు. బలమైన పూజ్య భావం కావాలి. బుద్ధికి నిలకడ ఉండాలి. భక్తి శ్రద్ధలు చాలా అవసరం. 
శ్రద్ధా విహీన కేవళ తార్కిక | వాదోన్ముఖ ఆణి చికిత్సక | 
తయా న సంతజ్ఞాన సమ్యక | శుద్ధ భావిక తే పావే | ||౨౨౯|| 
229. శ్రద్ధ లేనివారికి, నమ్మకం లేక కేవలం వాదన చేసే వారికి, అతి తెలివిగలవారికి, సత్పురుషుల జ్ఞానం లభించదు. పరిశుద్ధమైన భక్తితో, నమ్మకమున్న భక్తునికే అది దొరుకుతుంది. 
కథాంతర్గత న్యూనాతిరిక్త | సర్వ మానూని సాఈప్రేరిత | 
హోఊని దోష దృష్టీవిరహిత | సాఈసచ్చరిత వాచావే | ||౨౩౦||
230. ఈ కథలో కనిపించే తప్పులు, గొప్పలు అన్నీ సాయి ప్రేరణతోనే జరిగాయి అని అనుకుని, వానిని వదిలేసి, సాయి సచ్చరితను చదవండి. 

సాఈ పరమ కనవాళూ ప్రీతీ | రసిక వాచకవృంద చిత్తీ | 
యేణే మిషే స్థాపో నిజమూర్తీ | నిత్య స్మృతీ వ్హావయా | ||౨౩౧|| 
231. ఎప్పుడూ మంచినే స్వీకరించే పాఠకులారా! ఇలా పరమ దయాళువు, ప్రేమమయులు అయిన సాయిని మనసులో పెట్టుకుని, నిత్యమూ తలచుకోండి. 
కోఠే గోమాంతక కోఠే శిరడీ | తేథీల చోరీచీ కథా ఉఘడీ | 
సాఈ సాద్యంత కథీ సుఖ పరవడీ | కథా చోఖడీ పుఢారా | ||౨౩౨|| 
232. ఎక్కడ గోవా! ఎక్కడ శిరిడీ! గోవాలో జరిగిన దొంగతనాన్ని పూర్తిగా, వివరంగా సాయి చెప్పిన కథ తరువాతి అధ్యాయంలో చెప్పబడుతుంది. 
మ్హణూని హేమాడ సాఈచరణీ | ఠేవీ మస్తక అంతఃకరణీ | 
వినవీ శ్రోతయా అతి నమ్రపణీ | సాదర శ్రవణీ వ్హావయా | ||౨౩౩||
233. సాయి పాదాలమీద తలనుంచి, మనస్పూర్తిగా, ఎంతో వినయంగా, హేమాడు ‘శ్రద్ధగా వినండి’ అని మనవి చేసుకుంటున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | చికిత్సాఖండణవిభూతిమండనం నామ | 
| పంచత్రింశత్తమోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. అవదసా. 2. సురువాత. 3. దిల్యావాచూన మిళత నాహీ. 
4. లుబ్ధ ఝాలే. 
5. యా బాఈ జాతీనే దేశస్థ బ్రాహ్మణ హోత్యా. యాంచే మూళచే నావ సుందరాబాఈ క్షీరసాగర. పణ, త్యా కోణత్యాహీ మాణసాస హాక మారతానా ‘రాధాకృష్ణా’ మ్హణూన హాక మారీత, మ్హణూన ‘రాధాకృష్ణాబాఈ’ హే త్యాంనా నావ పడలే. త్యా నేహమీ బాళకృష్ణాచి ఎక పితళీ మూర్తీ జవళ బాళగీత. తీ త్యాంచ్యా స్నాన, జేవణఖాణ, నిజణే వగైరేంచ్యా వేళీ బరోబర అసే. సాఈబాబా త్యాంనా ‘రామకృష్ణీ’ మ్హణత వ రోజ స్వతః జేవాయలా బసాయచ్యా ఆధీ, త్యాంనా దోన భాకర్యా ఆణి వర తోండీ లావణ్యాస కాహీ భాజీ వగైరే, దుపారచ్యా జేవణాచ్యా వేళీ పాఠవీత. త్యా మశీదీత కధీహీ యేత నసత. త్యా బాలవిధవా స్థితీతహీ శిరడీత రాహూన పడేల తీ సంతసేవా మనోభావే వ నేహమీ భజన కరీత అసత. 
6. నిర్దోష. 7. ఝాడూన స్వచ్ఛ కరీ. 
8. హా బాబాంచా ఎక నిస్సీమ భక్త. బాయకో, ములే-బాళే వ ఘరదార సోడూన శ్రీంచ్యా సేవేసాఠీ సంస్థానచ్యా జాగేత రాహిలా హోతా. 
9. నవల.