Monday, July 15, 2013

||ఉదీమహిమా నామ చతుస్త్రింశత్తమోధ్యాయ:||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౩౪ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

పూర్వీల అధ్యాయీ ఉదీ మహిమాన | కేలే యథాతథ్య కథన | 
ప్రకృతాధ్యాయీంహీ తేంచ నిరూపణ | వివరూ గుణలక్షణ పుఢారా | ||౧|| 
1. పోయిన అధ్యాయంలో, ఉదీ మహిమను గురించి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పబడింది. ఈ అధ్యాయంలో కూడా, ఉదీయొక్క గుణాలను, దాని లక్షణాలను వర్ణిస్తాను.
తీచ మాగీల కథేచీ సంగతీ | తేంచ ఉదీచే వైభవ సంప్రతీ | 
శ్రోతీ పరిసిజే స్వస్థ చిత్తీ | సుఖ సంవిత్తీ ప్రీత్యర్థ | ||౨|| 
2. వెనుకటి అధ్యాయంలో చివరిగా చెప్పిన, ఉదీ వైభవాన్ని గురించిన కథలను, ఇప్పుడు శ్రోతలు తమ సుఖ సంతోషాల కొరకు, ప్రీతిగా వినండి. 
రోగ దుర్ధర హాడ్యావ్రణ | కోణ్యాహీ ఉపాయీ హోఈనా శమన | 
సాఈ హస్తీంచ్యా ఉదీచే చర్చన | కరీ నిర్మూలన వ్యథేచే | ||౩|| 
3. ఎంతో బాధతో కూడుకుని, నివారణకు చాలా కష్టమైన, ఎముకలలోని వ్రణం, ఏ ఉపాయాలతోనూ తొలగనప్పుడు, సాయి తమ చేతితో ఉదీని అద్దగా, పూర్తిగా నివారణమైంది. 
ఏశా యా ఉదీచ్యా కథా అనేక | దిగ్దర్శనార్థ కథితో ఎక | 
శ్రవణ కరితా వాటేల కౌతుక | అనుభవపూర్వక మ్హణోన | ||౪|| 
4. ఉదీ గురించి ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయి. మచ్చుకకు, శ్రోతలకు ఒకటి చెప్తాను. నిజంగా జరిగినది గనుక, శ్రోతలకు ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. 
జిల్హా నాశీక మాలేగాంవీ | డాక్టర ఎక పదవీధర పాహీ | 
హోతీ తయాంచే పుతణ్యాస కాంహీ | వ్యథా జీ రాహీ న ఔషధే | ||౫|| 
5. నాసిక జిల్లాలోని మాలేగాం అనే ఊరిలో, వైద్య డిగ్రీ ఉన్న ఒక డాక్టరు ఉండేవాడు. అతని సోదరుని కొడుకుకు వచ్చిన జబ్బు, బాధ, ఏ ఔషధాలతోనూ తగ్గలేదు. 
స్వయే వైద్య స్నేహీ వైద్య | కేలే ఉపచార నానావిధ | 
కుశల శస్త్రక్రియాప్రబుద్ధ | థకలే నిర్బుద్ధ జాహలే | ||౬|| 
6. స్వయంగా అతను వైద్యుడు. అతని స్నేహితుడూ వైద్యుడు. ఎన్నో రకాల చికిత్స చేశారు. వారు శస్త్ర చికిత్స కూడా చేయగల సమర్థులు. ఎంత అనుభవం ఉన్నవారైనా, వారికి ఏమి చేయాలో తోచలేదు. 
రోగ తో హోతా హాడ్యావ్రణ | రూఢ అపభ్రంశ హాడ్యావర్ణ | 
వ్యాధీ మహాదుర్ధర విలక్షణ | యేఈనా గూణ ఔషధే | ||౭|| 
7. ‘ఎముకల వ్రణం’ అన్న ఆ జబ్బు, అపభ్రంశమై ‘ఎముకల వర్ణం’ అని రూపుదిద్దుకుంది. ఇది చాలా ఘోరమైన జబ్బు. అసలు మందులతో నయమయ్యేది కాదు. 
సర్వోపచార దేశీ విదేశీ | ఝాలే ఫిటలీ సర్వ అసోశీ | 
కరోని పాహిలే శస్త్రక్రియేశీ | కాహీంహీ యశస్వీ హోఈనా | ||౮|| 
8. అయినా, దేశ విదేశాలలోని చికిత్సలన్నింటినీ, ఏదీ వదలకుండా, ఎంతో ప్రయత్నంతో చేశారు. శస్త్ర చికిత్స కూడా చేశారు. కాని, దేనివల్లనూ గుణం కనిపించలేదు. 
పుతణ్యా తో వయానే లహాన | వేదనా త్యా న హోతీ సహన | 
కష్టే కాసావీస ప్రాణ | ఉద్విగ్నమన ఆప్తేష్ట | ||౯|| 
9. చిన్న వయసులో ఉన్న అబ్బాయి, బాధను సహించలేక విలవిలలాడుతుంటే, దగ్గరున్న బంధువులు, మిత్రులు ఎంతో బాధ పడ్డారు. 
జాహలీ ఉపాయ పరమావధీ | యత్కించితహీ శమేనా వ్యాధీ | 
తయా ఆప్తేష్ట సంబంధీ | మ్హణతీ ఆరాధా దైవతే | ||౧౦||
10. చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశారు. అయినా, ఆ జబ్బు కొంచెం కూడా తగ్గలేదు. బంధువులు, మిత్రులు, దేవుళ్ళను పూజ చేయమని సలహా ఇచ్చారు. 

దేవదైవతే కులస్వామీ | యాంతూన కోణీహీ యేఈనా కామీ | 
కానీ ఆలే శిరడీ గ్రామీ | అవలియా నామీ వసే హే | ||౧౧|| 
11. దేవీ దేవతలుగాని, కులదేవత కాని, ఎవరూ కూడా ఏ సహాయమూ చేయలేదు. అప్పుడు, శిరిడీ గ్రామంలో ఒక అవలియా ఉన్నారన్న వార్త, వారి చెవిలో పడింది. 
తే శిరడీచే సంతప్రవర | సాఈ మహారాజ యోగీశ్వర | 
కేవళ దర్శనే వ్యాధి పరిహార | కరితీ సాచార పరిసిలే | ||౧౨|| 
12. వారు సత్పురుషులలో చాలా గొప్పవారు, యోగీశ్వరులు అయిన శిరిడీలోని సాయి మహారాజు, కేవలం దర్శనంతో జబ్బును తొలగిస్తారని విన్నారు. 
హేత ఉపజలా సాఈదర్శనీ | నిశ్చిత కేలే మాతాపితయాంనీ | 
పాహూ హా తరీ ఉపాయ కరూని | నాంవ ఘేఊని దేవాచే | ||౧౩|| 
13. అది విన్న తరువాత, అబ్బాయి తల్లిదండ్రులకు, సాయిని దర్శించుకోవాలనే కోరిక కలిగింది. దేవుణ్ణి తలచుకుని, ఈ ప్రయత్నం కూడా చేయాలని అనుకున్నారు. 
మ్హణతీ తో మహాన అవలియా | తేణే నిజహస్తే ఉదీ లావిలియా | 
దుర్ధర రోగ జాతీ విలయా | అనుభవ ఘ్యావయా కాయ వేచే | ||౧౪|| 
14. ‘ ‘వారు చాలా గొప్ప మహాత్ములు. వారి చేత్తో ఉదీని రాస్తే, ఎలాంటి భయంకరమైన జబ్బైనా, తొలగి పోవలసిందే’, అని ప్రజలు అనుకుంటున్నారు. వెళ్ళి ఈ అనుభవాన్ని కూడా ప్రయత్నిస్తే నష్టమేముంది? 
చలా వందూ తయాచే పాయ | కరూన పాహూ శేవటచా ఉపాయ | 
తేణే తరీ టళో హా అపాయ | తరణోపాయ హా ఎక | ||౧౫|| 
15. ‘వెళ్ళి వారి పాదాలకు నమస్కరించి, ఈ చివరి ప్రయత్నాన్నీ చేద్దాం. దానివలనైనా, ఈ అపాయం తొలగవచ్చు. మనకు మిగిలిన చివరి ఆశ, ఇదే’. 
అసో పుఢే తే మాతాపితర | కరూనియా ఆవరాఆవర | 
హోఊని సాఈదర్శనా ఆతుర | శిరడీస సత్వర పాతలే | ||౧౬|| 
16. అని అనుకుని, ఆ తల్లి తండ్రులు గబగబా అన్నీ సర్దుకుని, సాయి దర్శనానికని ఆతురతతో బయలుదేరి, శిరిడీ చేరుకున్నారు. 
యేతాంచ బాబాంచే దర్శన ఘేతలే | చరణ వందూని లోటాంగణీ ఆలే | 
దుఃఖ బాళాచే నివేదన కేలే | ఉభే ఠేలే సన్ముఖ | ||౧౭|| 
17. వెంటనే బాబా దర్శనం చేసుకుని, వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. తరువాత, అబ్బాయియొక్క బాధను గురించి చెప్పి, సాయి ఎదుట నిలబడ్డారు. 
వికళవాణీ జోడూని పాణీ | వినటోని శ్రీసాఈ చరణీ | 
ముఖ కరోని కేవిలవాణీ | కరితీ వినవణీ సాఈశీ | ||౧౮| 
18. చేతలు జోడించుకుని, దీనంగా, ఎంతో దుఃఖంతో బాబాకు విన్నవించారు. 
వ్యథా పీడిత హే బాళ మ్హణతీ | దుఃఖ న దేఖవే ఆమ్హాప్రతీ | 
సుచే న కాయ కరావే పుఢతీ | దిసేనా ధడగతీ ఆమ్హాతే | ||౧౯|| 
19. ‘జబ్బుతో బాధపడుతున్న ఈ బిడ్డ బాధను, మేము చూడలేకుండా ఉన్నాం. ఏం చేయాలో తెలియటం లేదు. జబ్బు నయమవుతుందన్న ఆశా కనిపించటం లేదు. 
పుత్ర దుఃఖాచ్యా అవకళా పాహతా | థోర శీణలో సాఈ సమర్థా | 
తరీ అభయకర యాచియే మాథా | ఠేవూని వ్యథా నివారావీ | ||౨౦||
20. ‘బిడ్డ పడుతున్న బాధను చూసి, మేము చాలా అలసిపోయాము. సాయి సమర్థా! రక్షించే మీ చేతిని ఇతని తలపై ఉంచి, బాధను తొలగించండి. 

పరిసోన ఆపులే మహిమాన | కేలే ఆమ్హీ యేథేవర ఆగమన | 
అనన్యభావే ఆలో శరణ | ఎవఢే జీవదాన ద్యా ఆమ్హా | ||౨౧|| 
21. ‘మీ మహిమను విని, మేము ఇక్కడికి వచ్చాము. మీ మీద భక్తితో, మీకు శరణుజొచ్చాం. ఇతనికి ప్రాణదానం చేయండి’ అని వేడుకున్నారు.
తంవ తో సాఈ కరుణామూర్తీ | ఆశ్వాసితా హోయ తయాంప్రతీ | 
“మశీదీచ్యా ఆశ్రయా జే యేతీ | తయా న దుర్గతీ కల్పాంతీ | ||౨౨|| 
22. అది విని, కరుణామయులైన సాయి, వారికి ధైర్యాన్ని కలుగ చేశారు. “ఈ మసీదును రక్ష కోరిన వారికి, ప్రపంచం ఉన్నంత వరకూ, ఏ చెడూ కలగదు. 
ఆతా తుమ్హీ నిశ్చింత అసా | ఉదీ ఘ్యా త్యా వ్రణావర ఫాంసా | 
యేఈల గుణ ఆఠాచౌందివసా | ఠేవా భరంవసా దేవావరీ | ||౨౩| 
23. “ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి. ఈ ఉదీని తీసుకుని వ్రణంపై రాయండి. ఎనిమిది రోజులలో బాధ తగ్గిపోతుంది. దేవుని మీద నమ్మకం ఉంచండి. 
మశీద నవ్హే హీ ద్వారావతీ | యేథే జయాంచే పాయ లాగతీ | 
తాత్కాళ క్షేమ ఆరోగ్య పావతీ | యేఈల ప్రతీతీ తుమ్హాంహీ | ||౨౪|| 
24. “ఇది ఒట్టి మసీదు కాదు. ఇది (శ్రీకృష్ణుని) ద్వారావతి. ఇక్కడ కాలు పెట్టినవారు, వెంటనే ఆరోగ్యాన్ని, క్షేమాన్ని పొందుతారు. ఇది మీకు కూడా అనుభవమౌతుంది. 
యేథే యేతా ఆరామ న పడే | హే తో కాలత్రయీంహీ న ఘడే | 
జో యా మశీదీచీ పాయరీ చఢే | తయాచే బేడే పార జాణా” | ||౨౫|| 
25. “ఇక్కడకు వచ్చి, బాగు కాకపోవటం అనేది, మూడు కాలాల్లో (భూత, భవిష్యత్, వర్తమానం) జరగనిది. ఈ మసీదు మెట్లెక్కిన వారు, అనుకున్నది జరిగినట్లే అని తెలుసుకోండి”. 
పుఢే బాబాంచే ఆజ్ఞే కరూన | వ్యథితాస సన్మఖ బైసవూన | 
పాయావర బాబాంనీ హాత ఫిరవూన | కృపావలోకన తై కేలే | ||౨౬|| 
26. తరువాత, బాబా ఆజ్ఞ ప్రకారం, బాధ పడుతున్న బాలుణ్ణి, బాబా ఎదుట కూర్చోబెట్టారు. అతని పాదంపై బాబా చేత్తో నిమిరి, తమ దయగల చూపును అతని మీద పెట్టారు. 
వ్యథా హీ తో కేవళ దైహిక | అసేనా కా తీ దైవీక | 
అథవా దుర్ధర మానసీక | సమూలహారక దర్శన | ||౨౭|| 
27. అది కేవలం దేహానికి సంబంధించిన బాధ. మనస్సుకు కలిగిన బాధైనా, దైవ యోగం వలన వచ్చిన బాధైనా సరే, బాబా దర్శనంతోనే తొలగిపోతుంది. 
పాహోని శ్రీసాఈచే ముఖ | ఠాయీంచ విరాలే సకళ దుఃఖ | 
సేవన కరితాంచ వచన పీయుఖ | పరమ సుఖ రోగియా | ||౨౮|| 
28. శ్రీసాయి ముఖాన్ని చూస్తే చాలు, ఎంతటి దుఃఖమైనా వెంటనే తొలగిపోతుంది. అమృతంలాంటి వారి మాటలను వింటే, రోగికి పరమ సుఖం కలుగుతుంది. 
అసో పుఢే తే తైసేచ తేథ | రాహిలే చార దివసపర్యంత | 
గేలా వ్యాధీస ఆరామ పడత | విశ్వాసహీ జడత సాఈపదీ | ||౨౯|| 
29. అలా వారు నాలుగు రోజుల వరకు శిరిడీలో ఉన్నారు. జబ్బు నయమవటంతో, వారికి సాయి పాదాల మీద నమ్మకం కుదిరింది. 
తదనంతర తీ తిఘేంజణే | బాబాంచియా పూర్ణ అనుమోదనే | 
పరతలీ ఆనంద నిర్భరమనే | సంతుష్టపణే గాంవాసీ | ||౩౦||
30. అదైన తరువాత, ఆ ముగ్గురూ బాబాయొక్క పూర్తి అనుమతితో, మనసు నిండా ఆనందంతో, ఎంతో తృప్తిగా తమ ఊరికి తిరిగి వెళ్ళిపోయారు. 

హా కాయ లహాన చమత్కార | హాడ్యావ్రణాస పడలా ఉతార | 
ఉదీ ఆణి కృపేచీ నజర | హాచ కీ ఉపచార అపూర్వ | ||౩౧|| 
31. ఇదేమైనా చిన్న చమత్కారమా! ఉదీ మరియు బాబా దయగల చూపు అనే సాటిలేని ఈ ఉపచారాలతో, ఎముకల లోతులో ఉన్న వ్రణం కూడా మానిపోయింది. 
ఏసే హే మహాపురుష దర్శన | భాగ్యే లాధతా ఆశ్వాసన | 
కల్యాణకారక ఆశీర్వచన | తేణేంచ నిర్మూలన వ్యాధీంచే | ||౩౨|| 
32. అదృష్టం కొద్దీ, ఇలాంటి మహాపురుషుని దర్శనం, వారి ధైర్యాన్నిచ్చే మాటలు, మంచిని చేసే వారి ఆశీర్వాదం దొరికితే, ఎలాంటి జబ్బైనా నయమైపోతుంది. 
అసో కాంహీ దివసా జాతా | ఉదీ వ్రణావర లావితా సేవితా | 
ఘాయ భరలా సుకతా సుకతా | లాధలా ఆరోగ్యతా1 తో ములగా | ||౩౩|| 
33. అబ్బాయి వ్రణంపై ఉదీని రాసి, నీటితో తీసుకోగా, కొంత కాలానికి వ్రణం ఎండిపోయి, అబ్బాయి ఆరోగ్యవంతుడయ్యాడు. 
ఏకూన మాలేగాంవీ హే చులతా | సాఈదర్శనీ ఉపజలీ ఉత్సుకతా | 
మనీ మ్హణే ముంబఈలా పరతతా | పురవూ ఆతురతా ఎవఢీ | ||౩౪|| 
34. ఈ సంగతిని విని, మాలేగాంలోని బాబాయికి, సాయి దర్శనం చేసుకోవాలని అనిపించింది. ముంబైకి తిరిగి వెళ్ళేటప్పుడు, శిరిడీ వెళ్ళి, తన కోరిక తీర్చుకోవలెనని, తనలో అనుకున్నాడు. 
పుఢే ముంబఈలాగీ జై నిఘతీ | మాలేగాంవీ మనమాడావరతీ2
ఘాతలా కోణీ వికల్ప చిత్తీ | నిశ్చయ త్యాగితీ శిరడీచా | ||౩౫|| 
35. కాని, తరువాత, ముంబైకి బయలుదేరగా, మాలేగాంలోనూ మరియు మన్మాడులోనూ, ఎవరో అతని మనసులో అనుమానం పుట్టించారు. దానితో అతడు శిరిడీకి వెళ్ళే తన ఆలోచనను మానుకున్నాడు. 
సత్కార్యాచీ ఏసీచ రీతీ | ఆరంభీ కుత్సిత జన మోడా ఘాలితీ | 
లోకప్రవాదా బళీ న పడతీ | అంతీ సద్గతీ తయాంసచీ | ||౩౬|| 
36. మంచి పనులు చేయాలనుకుంటే ఇలాగే అవుతుంది. చెడ్డ బుద్ధిగలవారు మొదట అడ్డు తగులుతారు. లోకుల మాటలను లెక్క చేయనివారే, చివరకు మంచి దారిలో వెళ్ళుతారు. 
మగ తే సంత దర్శన డావలునీ3 | గేలే థేట ముంబఈ లాగునీ | 
ఉరలీ రజా ఆలీబాగేస రాహునీ | భోగావీ మనీ హా సంకేత | ||౩౭|| 
37. సత్పురుషుని దర్శించాలనే కోరికను అణచి వేసుకుని, ఆ మనిషి, నేరుగా ముంబైకి వెళ్ళిపోయాడు. అలీబాగులో సుఖంగా సెలువును గడపాలని అనుకున్నాడు. 
ఏసా నిశ్చయ జాహల్యావరీ | తీన రాత్రీ హారోహారీ4
ఏకిలా ధ్వనీ నిద్రే మాఝారీ | ‘అజూన మజవరీ అవిశ్వాసనా?’ | ||౩౮|| 
38. అలా అనుకున్నాక, వరుసగా మూడు రాత్రులు నిద్రలో “ఇంకా నాపై అపనమ్మకమా!” అన్న మాటలు వినిపించాయి. 
లాగోపాఠ హీ అశరీరవాణీ5 | ఏకూని డాక్టర విస్మిత మనీ | 
నిశ్చయ కేలా శిరడీ ప్రయాణీ | అన్వర్థ ధ్వనీ వాటలా | ||౩౯|| 
39. మూడు రాత్రులు వరసగా విన్న ఆ మాటలకు, డాక్టరు ఆశ్చర్యపోయాడు. అందుకు, ఆ మాటలని నమ్మి, శిరిడీకి వెళ్ళాలని అనుకున్నాడు. 
పరీ ఎకాసీ దూషిత జ్వర | డాక్టరాంచేచ తయా ఉపచార | 
తయాస ఆరామ పడలీయావర | నిఘణే సత్వర ఠరవిలే | ||౪౦||
40. కాని, అప్పుడు ఆ డాక్టరు, టైఫాయిడు జ్వరంతో ఉన్న ఒక రోగికి చికిత్స చేస్తున్నందు వలన, ఆ రోగికి నయమైన వెంటనే, శిరిడీ వెళ్ళాలని అనుకున్నాడు. 

పరి తో జ్వర మోఠా ప్రఖర | గుణా న యేతీ కాంహీ ఉపచార | 
పడే న లవమాత్రహీ ఉతార | ఘడే న సత్వర నిర్గమన | ||౪౧|| 
41. కాని, ఆ జ్వరం చాలా తీవ్రంగా ఉండి, ఎలాంటి చికిత్సలకూ గుణం కాలేదు. కొంచెం కూడా తగ్గలేదు. దాని వలన, శిరిడీ ప్రయాణం జరిగేలా కనిపించలేదు.
మగ తే మనీ కరితీ నిర్వాణ | జరీ ఆజ యాస యేఈల గుణ | 
తరీ మీ ఉద్యాంచ న దడవితా క్షణ | శిరడీస ప్రయాణ కరీన | ||౪౨|| 
42. అప్పుడు, అతడు మనసులో, ‘ఈ రోజు రోగికి జ్వరం తగ్గితే, క్షణం ఆలస్యం చేయకుండా నేను రేపు శిరిడీకి బయలుదేరుతాను’ అని అనుకున్నాడు. 
ఏసా కరితా దృఢ సంకేత | ప్రహరా దో ప్రహరా జ్వరహీ ఉతరత | 
జాహలా సఫల తయాచా హేత | నిఘాలే శిరడీప్రత డాక్టర | ||౪౩|| 
43. అలా దృఢంగా నిశ్చయించుకోగా, రెండు మూడు గంటలకే జ్వరం తగ్గింది. డాక్టరు అనుకున్నది జరిగి, శిరిడీకి బయలుదేరాడు. 
యథా సంకల్ప శిరడీస గేలే | మనోభావే చరణ వందిలే | 
బాబాంహీ అంతరీచే అనుభవ పటవిలే | లక్ష జడవిలే నిజసేవే | ||౪౪|| 
44. తను అనుకున్నట్లు, శిరిడీకి వెళ్ళి, భక్తిగా బాబా పాదాలకు నమస్కారం చేశాడు. బాబా కూడా అతని మనసులోని నమ్మకాన్ని దృఢపరచి, తమ సేవలో అతనిని మగ్నుని చేశారు. 
మస్తకీ హస్త సాశీర్వాద | ఠేవిలా దిధలా ఉదీప్రసాద | 
పాహూని సాఈచా మహిమా అగాధ | విస్మయావిద్ధ జాహలే | ||౪౫|| 
45. రక్షించే తమ చేతిని అతని తలపై ఉంచి, ఆశీర్వదించి, ఉదీ ప్రసాదాన్ని ఇచ్చారు. డాక్టరు సాయియొక్క అద్భుతమైన మహిమను చూసి, ఆశ్చర్య చకితుడైనాడు. 
రాహిలే తేథే చార దివస | పరతలే డాక్టర ఆనంద మానస | 
పురే న హోతా పంధరా దివస | గేలే విజాపురాస బఢతీవర | ||౪౬|| 
46. అక్కడ నాలుగు రోజులుండి, ఎంతో ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు. పదిహేను రోజులు గడవక మునుపే, అతనికి ప్రమోషను వచ్చి, వైజాపూరుకు (మన్మాడు దగ్గర ఉన్న ఒక ఊరు) వెళ్ళాడు. 
హాడ్యా వ్రణాచియా ఓఢీ | ఆలీ సాఈ దర్శన పరవడీ | 
జడలీ సంతచరణీ గోడీ | జోడిలీ జోడీ అక్షయీ | ||౪౭|| 
47. అబ్బాయికి ఎముకలలో వ్రణం రాగా, డాక్టరుకు సాయియొక్క దర్శన భాగ్యం కలిగి, వారి పాదాల మీద ప్రేమ కుదిరింది. అలా అతడు శాశ్వతమైన సుఖాన్ని కూడబెట్టుకున్నాడు. 
అసేచ ఎకదా డాక్టర పిల్లే | నారూ వ్యథేనే వ్యాకూళ ఝాలే | 
ఎకావర ఎక సాత ఝాలే | బహుత కష్టలే జీవాలా | ||౪౮|| 
48. ఇలాగే, ఒక సారి, డాక్టరు పిళ్ళే నారు కురుపుతో చాలా బాధపడ్డాడు. ఒకటిపై ఒకటిగా, ఏడు కురుపులు లేవగా, అతను సహించలేని బాధతో దుఃఖించాడు. 
సాఈబాబాంచే భారీ ప్రేమ | ‘భాఊ’ ఆవడతే టోపణనామ | 
భాఉచే నిత్య కుశల క్షేమ | పూసావే పరమ ఆవడీనే | ||౪౯|| 
49. బాబా అంటే అతనికి చాలా ప్రేమ. బాబా అతనిని ముద్దుగా “భావూ” అని పిలిచేవారు. ప్రతి రోజూ ఎంతో ప్రేమతో భావూయొక్క యోగక్షేమాలను కనుక్కునే వారు. 
మశీదీమాజీ సాంజసకాళ | కఠడయా సన్నిధ భాఊచే స్థళ | 
భాఊపాశీ బహుత కాళ | గోష్టీంచా సుకాళ పరస్పరా | ||౫౦||
50. తెల్లవారి, సాయంత్రం, మసీదు కటకటాల దగ్గర భావూ కూర్చునేవాడు. బాబా అతనితో చాలా సమయం గడిపేవారు. వారిద్దరూ ఎంతో హాయిగా ముచ్చటించుకునే వారు. 

భాఊ పాహిజే చిలీమ ఓఢితా | భాఊ పాహిజే విడీ ఫుంకితా | 
భాఊ పాహిజే న్యాయ వివడితా | జవళ నసతా కరమేనా | ||౫౧|| 
51. బాబా చిలుం పీల్చేటప్పుడు, భావూ ఉండాలి. బీడీ కాల్చేటప్పుడు, భావూ ఉండాలి. ఏ సంగతైనా నిర్ణయించేటప్పుడు, భావూ ఉండాలి. భావూ దగ్గర లేకపోతే, బాబాకు అసలు తోచేది కాదు. 
అసో ఏసీ తయాంచీ కథా | దుఃసహ హోఊని నారూచీ వ్యథా | 
భాఊంనీ అంథరూణ ధరిలే వికలతా | దుఃఖోద్వేగతా దుర్ధర | ||౫౨|| 
52. పరిస్థితులు అలా ఉండేవి! కాని, నారు కురుపుల బాధ భరించలేక, ఎంతో దుఃఖంతో భావూ మంచం పట్టాడు. అతనికి చాలా నిరుత్సాహం కలిగింది. 
ఏసా తో ప్రసంగ దారుణ | ముఖీ ‘సాఈ’ నామ స్మరణ | 
పురే యాతనా బరే తే మరణ | పాతలే శరణ సాఈతే | ||౫౩|| 
53. ఇంత దారుణమైన స్థితిలో కూడా, అతను నోటితో సాయి పేరునే తలచుకునేవాడు. ‘ఈ బాధ ఇక చాలు బాబూ! ఈ యాతనకంటే చావు మేలు’ అని సాయికి శరణు వేడుకునేవాడు. 
పాఠవితీ బాబాంస సాంగూన | కంటాళలో హే దుఃఖ భోగూన | 
కాయ హే కితీ ఆంగాలా వ్రణ | నాహీ మజ త్రాణ సోసావయా | ||౫౪|| 
54. ‘ఇంకా ఎన్ని రోజులు ఈ కురుపులు నా ఒంటి మీదుంటాయి? ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ విసుగెత్తి పోయాను. ఈ బాధను సహించే శక్తి నాకింక లేదు’, అని బాబాకు సందేశం పంపించాడు. 
శుద్ధాచరణే వర్తతా | కా మజలా హే దుఃఖావస్థా | 
దుష్కర్మాచ్యా వాటే న జాతా | కా మమ మాథా పాప హే | ||౫౫|| 
55. ‘ఇన్ని రోజులనుంచీ పరిశుద్ధంగానే నడుచుకుంటున్న నాకు, ఈ దుస్థితి ఎందుకు? నేనెప్పుడూ చెడు పనులను చేయలేదే! నా తల మీద ఈ పాపపు బరువెందుకు? 
మరణప్రాయ నారూచ్యా వేదనా | బాబా న ఆతా సోసవతీ ఆపణా | 
యాహూన ఆతా యేఊ ద్యా మరణా | భోగీన యాతనా పుఢారా | ||౫౬|| 
56. ‘బాబా! ఈ నారు కురుపు బాధ, చావుకంటే ఘోరంగా ఉంది. నేనింక ఈ బాధను భరించలేను. ఇంతకంటే, చావు వచ్చినా ఫరవాలేదు. మిగిలిన బాధను వచ్చే జన్మలలో అనుభవిస్తాను. 
భోగిల్యావీణ నాహీ గతీ | ఆణిక జన్మ ఘేఊ లాగతీ | 
పరి ప్రారబ్ధభోగ కధీంహీ న చుకతీ | మీహీ మందమతీ హే జాణే | ||౫౭|| 
57. ‘ప్రారబ్ధ కర్మను ఎన్నటికీ తప్పించుకోలేం. దీనిని అనుభవించకుండా, మరో దారి లేదు. దీని కోసం ఎన్నో జన్మలనెత్తాలి. మూర్ఖుడైనా నాకూ, ఇది తెలుసు. 
సుఖే ఘేఈన దహాజన్మ | తేథే హే భోగీన మాఝే కర్మ | 
కరాయా ప్రకృత జన్మాచా ఉపరమ| ఎవఢా హా ధర్మ మజ వాఢా | ||౫౮|| 
58. ‘పది జన్మలను ఎత్తైనా సరే, ఈ కర్మను సంతోషంగా అనుభవిస్తాను. కాని, ఈ జన్మను ఇంతటితో చాలించేలా నన్ను అనుగ్రహించండి. 
పురే ఆతా యా జన్మాచే జిణే | సోడవా మజ జీవేప్రాణే | 
నకో ఆతా హే కష్ట సోసణే | హేంచ మాగణే మాగతో | ||౫౯|| 
59. ‘ఈ జన్మలో అనుభవించాల్సింది ఇంక చాలు. ఈ జీవితంనుండి నన్ను ముక్తుణ్ణి చేయండి. నాకీ కష్టాలు ఇంక వద్దు’, అని సాయికి కబురు పంపాడు. 
పరిసూన ప్రార్థనా సిద్ధరాణా | దయా ఉపజలీ అంతఃకరణా | 
డాక్టర పిల్ల్యాచియా సమాధానా | వర్షలే కరుణామృత తే సేవా | ||౬౦||
60. సిద్ధులలో రాజైన సాయి మహారాజుకు పిళ్ళే బాధను విని, మనసు కరిగిపోయి ఉప్పొంగింది. డాక్టరు పిళ్ళేను శాంతింప చేయటానికి, సాయి కురిపించిన అమృతంలాంటి దయగల మాటలను వినండి. 

మగ భక్త కామ కల్పద్రుమ | పాహూని దుఃఖావస్థా తీ పరమ | 
కరావయా లాగీ తీచా ఉపశమ | కాయ ఉపక్రమ మాండిలా | ||౬౧|| 
61. తన భక్తుని విపరీతమైన బాధను, దుఃఖాన్నీ చూసి, భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షం అయిన సాయి, అతని బాధను నివారించటానికి, ఉపాయం పన్నారు.
నిరోప ఆణిలా దీక్షితాంనీ | బాబాంనీ తే వృత్త పరిసునీ | 
మ్హణాలే “సాంగ తయాస జాఊని | నిర్భయ మనీ రాహీ తూ” | ||౬౨|| 
62. పిళ్ళేయొక్క కబురును తెచ్చిన దీక్షితు చెప్పింది విని, బాబా “ ‘నువ్వు ఏ భయమూ లేక ఉండు’ అని అతనితో చెప్పు” అని దీక్షితుతో అన్నారు. 
ఆణిక తయాస పాఠవితీ సాంగూ | “కిమర్థ దహా జన్మాంచా పాంగూ | 
అవఘ్యా దహా దివసాచా భోగూ | భోగూ విభాగూన పరస్పర | ||౬౩|| 
63. “ ‘పది జన్మల వరకూ ఎందుకు? ఒకరికొకరు కలిసి పంచుకుని, మొత్తం పది రోజులు అనుభవిస్తే చాలు’ అని అతనితో చెప్పు” అని అన్నారు. 
మోక్ష స్వార్థ వా పరమార్థ | ద్యావయా మీ అసతా సమర్థ | 
హాచ కా తుఝా పురుషార్థ | మరణానర్థ మాగసీ | ||౬౪|| 
64. “ ‘మోక్షంగాని, స్వార్థంగాని లేక పరమార్థంగాని ఇవ్వటానికి సమర్థుడైన నేను ఇక్కడ ఉండగా, చావుని కోరుకుంటున్నావు. ఇదేనా నీ ధైర్యం, పురుషార్థం?’ 
ఆణవా తయాస ఉచలూనీ | భోగ హా సాహూ కీ తో భోగూనీ | 
జావే న ఏసే గాంగరూని | ఆణావా మారూని పాఠీవర” | ||౬౫|| 
65. “అతనిని లేపి, ఇక్కడకు తీసుకుని రండి. కర్మ ఫలాన్ని ఓర్పుతో అనుభవించాలి గాని, భయంతో బెంబేలు పడి కాదు. వీపు మీద మోసుకుని తీసుకుని రండి” అని చెప్పారు. 
అసో డాక్టర ఏసియే స్థితీ | ఆణిలే తాత్కాల మశీదీప్రతీ | 
పాఠీచా తక్యా కాఢునీ హాతీ | దిధలా తయాంప్రతీ బాబాంనీ | ||౬౬|| 
66. డాక్టరు ఏ స్థితిలో ఉన్నాడో, అలాగే వెంటనే మసీదుకు తీసుకుని వచ్చారు. తమ వెనుక ఉన్న తలగడను తీసి, తమ చేత్తో బాబా అతనికి ఇచ్చారు. 
ఠేవిలా ఆపులే సవ్యభాగీ | ఫకీర బాబా బైసత తే జాగీ | 
మ్హణాలే “టేకూన పడ యే ఉగీ | చింతా వాఉగీ కరూ నకో” | ||౬౭|| 
67. తమ కుడివైపు, ఫకీరు బాబా కూర్చునే చోట, తలగడను ఉంచి, “దీనికి ఆనుకుని ఊరికే పడుకో. పనికి రాని చింతలేవీ పెట్టుకోకు. 
“కరీ స్వస్థ లాంబ పాయ | జేణే తుజలా ఆరామ హోయ | 
సంచిత సంపేనా భోగిల్యా శివాయ | ఖరా ఉపాయ తో హాచి | ||౬౮| 
68. “కాళ్ళు బాగా చాపుకో. దానివల్ల నీకు హాయిగా ఉంటుంది. చేసుకున్న కర్మఫలం అనుభవించకుండా ముగిసిపోదు. దీనికి అసలైన ఉపాయం ఇదే. 
ఇష్టానిష్ట సుఖదుఃఖ | సంచితానుసార అమృత వా విఖ | 
హే ప్రవాహపతిత ద్వంద్వ దేఖ | ధరీన హరిఖ వా శోక | ||౬౯|| 
69. “ఇష్టాయిష్టాలు, సుఖదుఃఖాలు, అమృతం లేదా విషం, అనే విరుద్ధ భావాల అనుభవాలు, కూడబెట్టుకున్న కర్మఫలం వలన, ప్రవాహంలాగా వచ్చిపడతాయి. 
జే జే యేఈల తే తే సాహే | అల్లా మాలిక వాలీ ఆహే | 
సదా తయాచ్యా చింతనీ రాహే | కాళజీ వాహే తో సారీ | ||౭౦||
70. “అలా వచ్చినవానిని, సహనంతో అనుభవించాలి. అల్లా మాలిక మన రక్షకుడు. ఎల్లప్పుడూ అతనిని తలచుకుంటూ ఉండాలి. మనందరి బరువు బాధ్యతలను వారే చూసుకుంటారు. 

చిత్త విత్త కాయా వాణీ | సహిత రిఘావే తయాచే చరణీ | 
అసతా నిరంతర తయాచే స్మరణీ | దిసేల కరణీ తయాచీ | ||౭౧|| 
71. “ఈ దేహం, మనసు, డబ్బు, మాటలతో సహా, వారి పాదాలను ఆశ్రయించాలి. ఎప్పుడూ వారిని తలచుకుంటూ ఉంటే, వారి లీల తెలుస్తుంది”. 
తంవ తే వదతీ పిల్లే డాక్టర | పట్టీ బాంధితీ నారూవర | 
నానాసాహేబ చాందోరకర | పరి న ఉతార కాంహీంచ | ||౭౨|| 
72. అప్పుడు డాక్టరు పిళ్ళే ‘నానాసాహేబు చాందోర్కరు నారు కురుపుపైన పట్టీ కట్టాడు. అయినా ఏం తగ్గలేదు’ అని బాబాతో అన్నాడు. 
బాబా మ్హణతీ “నానా పాగల6 | పట్టీ సోడ తూ మరశీల | 
ఆతా కాఊ7 యేఊన టోంచీల | మగ తూ హోశీల చాంగలా” | ||౭౩|| 
73. “నానా పిచ్చివాడు! ఆ పట్టీని విప్పేయి, లేదా చస్తావు. ఇప్పుడు ఒక కాకి వచ్చి, పొడుస్తుంది. దానితో నీవు బాగా అయిపోతావు” అని బాబా అన్నారు. 
అసో ఏశా వార్తా చాలతా | అబ్దుల8 ఆలా తాత్కాళ వరతా | 
పణత్యాంత తేల ఘాలావయాకరితా | కాయ అవచితా తై ఘడలే | ||౭౪|| 
74. వారిద్దరూ అలా మాట్లాడుతున్నప్పుడు, ప్రమిదలలో నూనె పోయటానికి అబ్దుల్ పైకి వచ్చాడు. అప్పుడు, అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, 
మశీద ఆధీ తీ సాంకడ9 | భక్తాంచీ హోత బహుత భీడ10
త్యాంతచీ పిల్లే యాంచీ గడబడ | వావరూ11 అవఘడలా అబ్దుల | ||౭౫|| 
75. అసలే మసీదు ఇరుకు. దానికి తోడు భక్తులు బాగా గుంపులుగా ఉన్నారు. ఇంకా, పిళ్ళే గొడవ వేరే. అబ్దుల్‍కు అడుగు వేయటానికి చోటు లేక, ఇబ్బందిగా ఉంది. 
అబ్దుల్లా నిజకార్యీ దక్ష | పణత్యాంకడే తయాచే లక్ష | 
తేణే పిల్యాంకడే జాహలే దుర్లక్ష | ప్రకార విలక్షణ ఘడలా తై | ||౭౬|| 
76. అబ్దుల్ తన పనిలో మునిగి ఉన్నాడు. అతని మనసు, చూపు అంతా ప్రమిదల పైనే ఉంది. దాంతో అతను పిళ్ళేను చూడలేదు. అప్పుడు, ఒక విచిత్రమైన ఘటన జరిగింది. 
అబ్దుల్లా12 తరీ కరీల కాయ | హోణారాపుఢే నాహీ ఉపాయ | 
పిల్ల్యాంనీ లాంబవిలా హోతా జో పాయ | చుకూన పాయ పడలా వరీ | ||౭౭|| 
77. అబ్దుల్లా మాత్రం ఏం చేయగలడు? జరగాల్సిన దానిని ఎవరూ ఆపలేరు కదా! పిళ్ళే కాలు చాపుకుని ఉన్నాడు. ఆ కాలిపై అబ్దుల్ కాలు పొరపాటుగా పడింది. 
ఆధీంచ పాయ హోతా సుజలా | తేథేంచ అబ్దులచా పాయ పడలా | 
మగ పిల్ల్యాంనీ జో ఠణాణా కేలా | అతి కళవళలా జీవ తై | ||౭౮|| 
78. మునుపే కాలు బాగా వాచి ఉంది. ఆ కాలు మీదనే అబ్దుల్ కాలు బలంగా పడగానే, ఒక్క సారి బాధతో, పిళ్ళే గట్టిగా చావు కేక పెట్టాడు. నొప్పితో అతని ప్రాణం విలవిలలాడింది. 
మారిలీ ఎకదాంచి కింకాళీ | మస్తకీ జాఊని భినలీ కళీ | 
వినవీత బాబాంస బద్ధాంజుళీ | కరుణా సమేళీ తే పరిసా | ||౭౯|| 
79. ఒకే ఒక మారు కేక పెట్టాడు. కాని, అది తలలోకి చొచ్చుకుని పోయినట్లుంది. చేతులు జోడించుకుని, చాలా దీనంగా బాబాతో మొర పెట్టుకో సాగాడు. దానిని వినండి! 
నారూ ఫుటూన వాహూ లాగతీ | పిల్లే అత్యంత అస్వస్థ చిత్తీ | 
ఎకీకడే ఆక్రోశ కరితీ | గాఊ అనుసరతీ దుసరీకడే | ||౮౦||
80. నారు కురుపు పగిలి, చీమ కారసాగింది. విపరీతమైన బాధతో పిళ్ళే, ఒక వైపు ఏడుస్తూ, మరొక వైపు పాడ సాగాడు. 

కరమ కర మేరే హాల పర తూ కరీమ | తేరా నామ రహిమాన హై ఔర రహీమ | 
తూ హీ దోనో ఆలమ కా సులతాన హై | జహామే13 నుమాయా తేరీ శాన హై | 
ఫనా హోనే వాలా హై సబ కారోబార | రడే నూర తేరా సదా ఆశకార | 
తూ ఆశికకా సదా మదదగార హై| 

ఓ కరీం (అల్లా)! నా మీద దయ చూపించు! నీ పేరు రహీమాన్ మరియు రహీమ్ గనుక|  
ఈ రెండు లోకాలకూ నీవొక్కడివే సుల్తాను| లోకంలో అంతా నీ వైభవం కనిపిస్తూ ఉంది|   
లోకంలోని కార్యాలన్నీ నాశమైనా, నీ వెలుగు ఎప్పటికీ మెరుస్తూ ఉంటుంది|   
నీ భక్తులకు నీవే ఎప్పుడూ ఆశ్రయం| 

రాహూన రాహూన ఉఠతసే కళ | జీవ కళవళలా పడలే వికళ | 
సాఈబాబాంచా హా ఖేళ | ఝాలీ అటకళ సర్వాంచీ | ||౮౧|| 
81. పిళ్ళేకు కాలిపోటు ఆగి ఆగి వస్తూంది. అతని ప్రాణం విలవిలలాడింది. చాలా నీరస పడిపోయాడు. ఇంత వరకూ జరిగినది, సాయిబాబా లీల అని అందరికీ అర్థమైంది.
బాబా వదతీ “పహా భాఊ | లాగలా బరే ఆతా గాఊ” | 
పిల్లే తయాంస పుసతీ తో కాఊ | అజూన ఖాఊ యేణార కా | ||౮౨|| 
82. “చూశారా! భావూ బాగైపోయి పాడుతున్నాడు” అని బాబా అన్నారు. పిళ్ళే బాబాతో ‘ఇంకా ఆ కాకి వచ్చి పొడుస్తుందా?’ అని అడిగాడు. 
తేవ్హా బాబా వదతీ “తూ జాఈ | స్వస్థ వాడ్యాంత పడూన రాహీ | 
ఆతా కాఊ ఫిరూన నాహీ | యేణార పాహీ టోంచావయా | ||౮౩|| 
83. అందుకు బాబా “నువ్వు వెళ్ళి, వాడాలో హాయిగా పడుకో. ఇప్పుడు, ఆ కాకి పొడవడానికి ఇంక రాదు. 
తోచ నాహీ కా యేఊన గేలా | తోచ తో జ్యాణే పాయ దిధలా | 
తోచ తో కాఊ టోంచూన పళాలా | నారూ తళాలా ఘాతలా” | ||౮౪|| 
84. “ఇప్పుడేగా అది వచ్చి వెళ్ళింది, నీ కాలు తొక్కింది అదేగా. అదే పొడిచి పారిపోయింది. నీ నారు కురుపును మట్టు పెట్టింది”. 
కైచా కాఊ ఆణి కాఉళా | హోణార వృత్తాంత సమక్ష ఘడవిలా | 
కాక అబ్దుల్లారూపే ప్రకటలా | కేలె బోలా అన్వర్థ | ||౮౫|| 
85. ఎక్కడ కాకి! ఎక్కడి పొడవటం! అందరి ఎదుటే, జరగవలసిన దానిని జరిపించారు. ఆ కాకిని అబ్దుల్లా రూపంలో తెప్పించి, తమ మాటను బాబా నిజం చేసి చూపించారు. 
బోల నవ్హే తో బ్రహ్మలేఖ | కర్మావరీహీ మారీల మేఖ | 
అల్పావకాశేంచ భాఊస దేఖ | లాగలే సుఖ వాటావయా | ||౮౬|| 
86. అవి మాటలు కావు, బ్రహ్మ రాసిన రాత. కలిగిన కర్మఫలాన్ని కూడా అవి ఆపగలవు. త్వరలోనే, బాధ తగ్గి, భావూకు హాయిగా అనిపించ సాగింది. 
ఉదీలేపన ఉదీసేవన | హేంచ ఔషధ హేంచ అనుపాన | 
జాహలే సమూళ రోగ నిరసన | ఉగవలా జో దిన దహావా | ||౮౭|| 

87. ఉదీని రాయటం, ఉదీని తీసుకోవటం, ఇదే మందు. దీనినే తాగడం. ఇలా చేసిన తరువాత, పదవ రోజు జబ్బు నయమైంది. 
నిఘాలే సజీవ సప్తజంతూ | జఖమా మాజీల బారీక తంతూ | 
వేదనా దుర్ధర జాహల్యా శాంతూ | దుఃఖాసీ అంతూ జాహలా | ||౮౮|| 

88. కురుపులలోనుండి సన్నని, తీగల్లాంటి బ్రతికి ఉన్న పురుగులు బయటికి వచ్చాయి. అప్పుడున్న విపరీతమైన బాధ తగ్గి, అతని దుఃఖం తీరింది. 
జాణోని ఏశియా చమత్కారా | పిల్లే సాశ్చర్య జాహలే అంతరా | 
నేత్ర స్త్రవలే ప్రేమధారా | పాహోని ఉదారాచరితతే14 | ||౮౯|| 

89. ఈ చమత్కారాన్ని చూసి, పిళ్ళే ఆశ్చర్యపోయాడు. బాబాయొక్క ఉదారమైన ఈ లీలను చూసి, అతని కళ్ళనుండి ప్రేమతో నీరు కారాయి. 
బాబాంచియా చరణ సంపుటీ | పిల్లే తేథేంచ ఘాలితీ మిఠీ | 
బాష్పావరోధ జాహలా కంఠీ | ఫుటే న ఓష్టీ కీ వాచా | ||౯౦||

90. వెంటనే పిళ్ళే బాబా పాదాలను కౌగలించుకున్నాడు. అతని గొంతు గద్గదమై, అతనికి నోటవెంట మాట రాలేదు. 

సాంగూన ఆణీక ఎక అనుభవ | కరూ హా సంపూర్ణ ఉదీప్రభావ | 
జయా మనీ జైసా భావ | హాచ గౌరవ గ్రంథాచా | ||౯౧|| 
91. మరొక అనుభవాన్ని చెప్పి, ఉదీయొక్క అద్భుతమైన ప్రభావం గురించిన కథలను ముగిస్తాను. మనసెలా ఉంటే, అనుభవాలు అలా ఉంటాయి అనేదే దీని సారం. 
ఎకదా మాధవరావ జ్యేష్ఠ | బాపాజీ తయాంచా బంధూ కనిష్ఠ | 
కైసే తయావరీ యేతా అభీష్ట | ఉదీనే అభీష్ట15 పావలే | ||౯౨|| 
92. మాధవరావుయొక్క తమ్ముడైన బాపాజీకు కష్టం వచ్చినప్పుడు, ఉదీ అతని ఆపదను తొలగించింది. 
ఏసా యా ఉదీచా ప్రభావ | కితీ వానావా మ్యా నవలావ | 
గ్రంథి జ్వరాది రోగ సర్వ | ఔషధ అపూర్వ నాహీ దుజే | ||౯౩|| 
93. ఇలాంటి ఉదీయొక్క అద్భుతమైన ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను? ప్లేగు రోగంనుండి, అన్ని రోగాలకు, అలాంటి ఉత్తమమైన ఔషధం ఇంకొకటి లేదు. 
అసతా సాఊళ16 విహిరీవర | కుటుంబాసీ ఆలా జ్వర | 
గ్రంథీ ఉద్భవల్యా జాంఘేవర | మనీ ఘాబరలా బాపాజీ | ||౯౪|| 
94. శిరిడీ దగ్గర ఉన్న సావూళ విహిరులో ఉన్నప్పుడు, బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది. ఆమె తొడపై గడ్డ రాగా, బాపాజీ చాలా గాబరా పడ్డాడు. 
పాహూన కుటుంబ అతి హైరాణ | తైసాచ రాత్రీచా సమయ భయాణ | 
జాహలా బాపాజీ భ్రాంతమన | గళాలే అవసాన తయాచే | ||౯౫|| 
95. ఆ రాత్రి సమయంలో, తన భార్య పడే బాధను చూసి, బాపాజీ భయపడిపోయాడు. అతని ధైర్యం సడలి పోయింది. 
ధాంవ ఠోకిలీ రాతోరాత | సకంప భయభీత శిరడీస యేత | 
జాహలా కథితా సమస్త వృత్త | నిజబంధూప్రత తేధవా | ||౯౬|| 
96. భయంతో వణుకుతూ, రాత్రికి రాత్రే పరుగున శిరిడీకి వచ్చి, జరిగినదంతా తన అన్నతో చెప్పాడు. 
మ్హణతీ ఆల్యా దోన గాంఠీ | జ్వర సంతప్త ఝాలీసే కష్టీ | 
చలా పహా కీ అపుల్యా దిఠీ | దిసే న గోఠీ మజ బరవీ | ||౯౭|| 
97. ‘రెండు గడ్డలు లేచాయి. జ్వరంతో ఒళ్ళు కాలిపోతూంది. చాలా బాధ పడుతూ ఉంది. మంచి లక్షణాలేవీ నాకు కనిపించటం లేదు. నువ్వు వచ్చి, నీ కళ్ళతోనే చూడు’ అని చెప్పాడు. 
బాపాజీ బోలతా కేవిలవాణీ | మాధవరావజీ దచకలే మనీ | 
గేలే పళోని తోండచే పాణీ | మన ఠికాణీ పడేనా | ||౯౮|| 
98. అలా చెప్పుతున్నప్పుడు, బాపాజీ దీనమైన ముఖాన్ని చూసి, మాధవరావుకు కూడా భయం కలిగింది. నోరు ఎండిపోయింది. మనసు నిలకడగా ఉండలేదు. 
మాధవరావ మోఠే వివేకీ | గ్రంథీ మ్హణతా భరలీ ధడకీ | 
గ్రంథిజ్వరాచీ తడకాఫడకీ | ఆహేచ ఠావుక కీ అవఘియా | ||౯౯|| 
99. మాధవరావు తెలివిగలవాడే, కాని, గడ్డలు అనగానే, అతనికీ అదురు పుట్టింది. గ్రంథి జ్వరంతో ప్రాణం పోగలదని అందరికీ తెలిసిందే. 
ప్రసంగ బరవా వా బికట | కార్య అసో ఇష్టానిష్ట | 
ఆధీ సాఈస పుసావీ వాట | పరిపాఠ హా ధోపట శిరడీంత | ||౧౦౦||
100. మంచిదైనా, చెడు అయినా, శుభమైనా, అశుభమైనా, దేనికైనా, ముందు సాయిని అడగటం శిరిడీలోని పరిపాటి. 

మగ తే జైసే జైసే కథితీ | ఆచారావే తైసే స్థితీ | 
తేచ భక్తసంకట నివారితీ | వర్ణావే కితీ అనుభవ | ||౧౦౧|| 

101. వారు ఎలా చెప్పితే అలా చెప్పినట్టు చేయడమే అలవాటు. ఎందుకంటే, భక్తుల కష్టాలను తొలగించేది వారే కదా! అలాంటి ఎన్ని అనుభవాలను వర్ణించగలం?
అసో యా నిత్య పాఠానుసార | మాధవరావహీ కరితీ విచార | 
ఆధీ బాబాంస కేలే హే సాదర | సాష్టాంగ నమస్కారపూర్వక | ||౧౦౨|| 
102. ఆ పద్ధతి ప్రకారమే మాధవరావు, ముందుగా బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇలా అన్నాడు. 
మ్హణతీ జయజయ సాఈనాథా | దయా కరావీ ఆమ్హా అనాథా | 
హే సంకట కాయ ఓఢవలే ఆతా | నసతీ చింతా ఉద్భవలీ | ||౧౦౩|| 
103. ‘జయ జయ సాయినాథా! అనాథులమైన మమ్మల్ని అనుగ్రహించండి. ఈ కష్టం ఏమిటి, ఇప్పుడు? లేని చింత పుట్టుకొచ్చింది! 
తుజవాంచూన కవణా ఆనా | ఆమ్హీ జాఊ కరాయా యాచనా | 
దూర కరీ త్యా పోరీచ్యా యాతనా | ఆశీర్వచనా దేఈ గా | ||౧౦౪|| 
104. ‘మిమ్మల్ని కాక, వేరే ఇంకెవరిని వెళ్ళి వేడుకోవాలి? బాబా! ఆ పిల్ల బాధను నివారించి, ఆమెను ఆశీర్వదించండి. 
కరీ ఎవఢే సంకట హరణ | ఆమ్హా కైవారీ కోణ తుజవీణ | 
కరీ యా దుర్ధర జ్వరాచే శమన | బ్రీద సంరక్షణ కరీ గా | ||౧౦౫|| 
105. ‘ఈ కష్టాన్నించి మమ్మల్ని రక్షించండి. మీరు తప్ప, మాకు సాయం చేసేవారు ఎవరు? విపరీతమైన ఈ జ్వరాన్ని తొలగించి, మీ మాటను నిలబెట్టుకోండి’. 
పుసతీ అనుజ్ఞా జావయాస | బాబా వదతీ తంవ తయాస | 
“నకో జాఊ అపరాత్రీస | ఉదీ దే తియేస పాఠవునీ | ||౧౦౬|| 
106. అని వేడుకుని, వెళ్ళటానికి వారి అనుమతిని అడిగాడు. అతనితో బాబా ఈ “అపరాత్రి వేళ, నీవు వెళ్ళకు. ఉదీని ఇచ్చి పంపించు” అని అన్నారు. 
కశాచ్యా గ్రంథీ కశాచా తాప | ఆపులా అల్లా మాలిక బాప | 
బరే హోఈల ఆపోఆప | హోఈల సుఖరూప నిర్ఘోర | ||౧౦౭|| 
107. “ఏమి గ్రంథి! ఏమి జ్వరం! మన తండ్రి అల్లా మాలిక. దానంతట అదే తగ్గిపోయి, తప్పక హాయి కలుగుతుంది. 
మాత్ర తూ సకాళీ సూర్యోదయీ | సాఊళ విహిరీస జాఊన యేఈ | 
ఆతాంచ నకో జాణ్యాచీ ఘాఈ | స్వస్థ రాహీ తూ యేథే | ||౧౦౮|| 
108. “రేపు తెల్లవారగానే, సావూళ విహిరుకు వెళ్ళి రా. ఇప్పుడే వెళ్ళాలని తొందర పడకు. శాంతంగా ఇక్కడే ఉండు. 
ఉదయీకహీ జాఊన యావే | నలగే నిరర్థక కుచంబావే | 
ఉదీ లావితా సేవితా భావే | కిమర్థ భ్యావే ఆపణ” | ||౧౦౯|| 

109. “తెల్లవారే వెళ్ళాలని అనిపించినా, వెళ్ళి తొందరగా వచ్చేయి. ఉదీని రాసి, నీటితో త్రాగితే చాలు. ఎందుకు భయపడటం?” అని చెప్పారు. 
పరిసతా హే బాపాజీ భ్యాలా | తయాచా మోఠా హిరమోడ ఝాలా | 
మాధవరావ జాణతీ ఔషధీపాలా | పరి న సమయాలా ఉపయోగ | ||౧౧౦||

110. అది విని బాపాజీకి భయం వేసింది. అతనికి నిరాశ కలిగింది. ఎందుకంటే, మాధవరావుకు మూలికల మందులు తెలుసు. కాని ఇప్పుడు, అవేవీ పనికి రావు. 

ఎక సాఈకృపేవీణ | ఔషధీంస నాహీ గుణ | 
హే ఎక వర్మ హీ ఎక ఖూణ | మాధవరావ పూర్ణ జాణతీ | ||౧౧౧|| 

111. ఒక సాయి అనుగ్రహం తప్ప, వేరే ఏ ఔషధాలూ బాధను తగ్గించ లేవన్న రహస్యం, మాధవరావుకు బాగా తెలుసు. 
ఆజ్ఞా బాబాంచీ వందూన | ఉదీ దిధలీ పాఠవూన | 
రాహిలే మాధవరావ స్వస్థ మన | పరతలా ఉద్విగ్న బాపాజీ | ||౧౧౨|| 
112. కనుక, బాబా ఆజ్ఞకు తలవంచి, ఉదీని పంపించి, తాను శిరిడీలోనే నిశ్చింతగా ఉన్నాడు. కాని, బాపాజీ మాత్రం నిరాశతో వెళ్ళిపోయాడు. 
పాణ్యాంత ఉదీ కాలవూన | పోటాంత పాజిలీ అంగా లావూన | 
ఘామ సుటలా డవడవూన | నిద్రా లాగూన రాహిలీ | ||౧౧౩|| 

113. ఉదీతో నీటిని కలిపి, భార్యకు త్ర్రాగించి, కొంత ఆమె దేహానికి రాసాడు. త్రాగిన వెంటనే, బాగా చెమటలు పట్టి, ఆమె గాఢంగా నిద్రపోయింది. 
సూర్యోదయ జాహల్యావరీ | కుటుంబాస వాటలీ హుషారీ | 
నాహీ జ్వర నా గాంఠీ విషారీ | బాపాజీ కరీ ఆశ్చర్య | ||౧౧౪|| 

114. సూర్యోదయమయ్యే సరికి, ఆమెకు హుషారు కలిగి, ప్రాణం కుదుట పడింది. జ్వరం లేదు, విషపు గడ్డలూ లేవు. బాపాజీకి చాలా ఆశ్చర్యం కలిగింది. 
ఇకడే మాధవరావ జే ఉఠలే | శౌచ ముఖమార్జన ఆటపలే | 
సాఊళ విహిరీస జావయా నిఘాలే | దర్శనా ఆలే మశీదీ | ||౧౧౫|| 

115. ఇక్కడ శిరిడీలో, మాధవరావు నిద్రలేచి, శుభ్రంగా ముఖం కడుక్కుని, సావూళ విహిరుకు వెళ్ళటానికి సిద్ధమై, బాబా దర్శనానికి మసీదుకు వచ్చాడు. 
ఘేతలే బాబాంచే దర్శన | ఘాతలే పాయీ లోటాంగణ | 
ఉదీ సమవేత ఆశీర్వచన | మిళతాంచ తేథూన నిఘాలే | ||౧౧౬|| 

116. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, ఉదీతో ఆశీర్వాదాన్ని తీసుకుని, అక్కడినుండి బయలుదేరాడు. 
మశీదీచీ పాయరీ ఉతరతా | బాబా తయాంస ఏకిలే ఆజ్ఞాపితా | 
“శామా ఉఠాఉఠీ యే మాగుతా | విలంబ లాగతా కామా నయే” | ||౧౧౭|| 

117. మసీదు మెట్లు దిగుతుండగా బాబా “శామా! వెంటనే తిరిగి వచ్చేయి. ఆలస్యం చేసే అవసరం లేదు” అని ఆజ్ఞాపించడం వినిపించింది. 
అసేల కీ భావజయీ వివ్హళ | కైసీ సాహీల దో గ్రంథీచీ జళజళ | 
పడలీ అసేల కరీత తళమళ | వాటేనే హళహళ దీరాస | ||౧౧౮|| 

118. రెండు గడ్డలతో మరదలు ఎలా బాధను భరిస్తోందో ఏమో అని బావగారు, దారి పొడుగునా ఆలోచనలతో మథన పడసాగాడు. 
కరితీ బాబా కాంహీ ఇషారా | కా యే సత్వర మ్హణతీ మాఘారా | 
తేణే శామా హోయ ఘాబరా | చాలే ఝరఝరా మార్గానే | ||౧౧౯|| 

119. ‘అయినా, వెంటనే వచ్చేయి అని బాబా ఎందుకు అన్నారు?వారు దేనినైనా సూచిస్తున్నారా?’ అని మనసులో చాలా ఆరాట పడుతూ, గబగబా వెళ్ళాడు. 
ఘాఈ ఘాఈ సాఊళ విహిర | గాంఠేపర్యంత నవ్హతా ధీర | 
పాఊల ఠేవితా ఉంబరఠ్యావర | చమత్కారలే అంతరీ | ||౧౨౦||

120. సావూళ విహిరు చేరుకునే వరకూ, మనసుకు నిలకడ లేదు. కాని, గడపలో అడుగు పెట్టగానే, లోపల చమత్కారం కనిపించింది. 

జియేస గతరాత్రీ గ్రంథీజ్వర | చహా ఠేవితా పాహీ చులీవర | 
మాధవరావ విస్మితాంతర | జాహలే స్థిత్యంతర పాహునీ | ||౧౨౧|| 

121. పోయిన రాత్రి గ్రంథి జ్వరంతో బాధ పడుతున్న మరదలు, ఈ రోజు పొయ్యి మీద చహా తయారు చేస్తూ ఉండటం చూచి, ఈ విపరీత పరిస్థితికి మాధవరావు ఆశ్చర్యపోయాడు.
తంవ తే బాపాజీస పుసత | హీ తో నిత్య వ్యవసాయరత | 
బాపాజీ మ్హణే హీ సర్వ కరామత | ఉదీచీ నిశ్చిత బాబాంచ్యా | ||౧౨౨|| 

122. దాంతో, ‘ఈమె రోజులాగే మామూలుగా పనులు చేస్తూ ఉందే?’ అని బాపాజీని అడిగాడు. దానికి బాపాజీ ‘ఇదంతా నిజంగా బాబా ఉదీయొక్క అద్భుతమైన పని’ అని చెప్పాడు. 
మ్హణే మీ యేతాంచ ఉదీ పాజిలీ | చోళూన చోళూన సర్వాంగా చర్చిలీ | 
తాత్కాళ ఘర్మాంచిత తనూ ఝాలీ | నిద్రా లాగలీ స్వస్థపణే | ||౧౨౩|| 

123. ‘రాగానే, నేను ఉదీ నీరును త్రాగించాను. దేహమంతా బాగా రాశాను. వెంటనే చెమటలు పట్టి, సుఖంగా నిద్రపోయింది. 
పుఢే జంవ సూర్యోదయ హోత | ఉఠూని బైసలీ ఖడఖడీత | 
గ్రంథీ విరాల్యా జ్వరాసహిత | హే సర్వ చరిత సాఈచే | ||౧౨౪|| 

124. ‘తెల్లవారగానే హాయిగా లేచి కూర్చుంది. గడ్డలు, జ్వరం అన్నీ మాయమయ్యాయి. ఇదంతా సాయి మహిమ వలనే జరిగినది’ అని చెప్పాడు. 
శామా పాహూని ఏసీ స్థితీ | తాత్కాళ ఆఠవలీ సాఈచీ ఉక్తీ | 
“ఉఠాఉఠీ యేఈ తూ మాగుతీ” | సాశ్చర్య చిత్తీ జాహలా | ||౧౨౫|| 

125. ఆమె పరిస్థితిని చూచి, శామాకు ‘వెంటనే తిరిగి వచ్చేయి’ అన్న సాయి మాట గుర్తుకు వచ్చి, ఆశ్చర్యపోయాడు. 
జాణ్యా ఆధీంచ కార్య సంపలే | చహా ఘేఊన మాధవరావ పరతలే | 
మశీదీంత జాఊన పాహిలే | చరణ వందిలే బాబాంచే | ||౧౨౬|| 
126. అక్కడికి వెళ్ళక మునుపే, జరగాల్సింది జరిగిపోయింది. అక్కడ చహాని తీసుకుని, మాధవరావు తిరిగి వచ్చేశాడు. వెంటనే మసీదుకు వెళ్ళి, బాబా పాదాలకు నమస్కరించాడు. 
మ్హణతీ ‘దేవా కాయ హా ఖేళ | తూంచి ఉడవిసీ మనాచీ ఖళబళ | 
బసల్యా జాగీ ఉఠవిశీ వాహుటళ | మాగుతీ నిశ్చళ తూంచి కరిసీ’ | ||౧౨౭|| 
127. ‘దేవా! ఏమిటీ ఈ లీల? నువ్వే మనసులో అలజడి కలగచేస్తావు. కూర్చున్న చోటే, సుడిగుండాలను లేపుతావు. తరువాత నువ్వే శాంతింప చేస్తావు’ అని అన్నాడు. 
బాబా తయాస ప్రత్యుత్తర దేతీ | “పహా కర్మాచీ గహన గతీ | 
మీ కరీ నా కరవీ కాంహీంహీ నిశ్చితీ | కతృత్వ మారితీ మజమాథా | ||౧౨౮|| 
128. దానికి బాబా “చూడూ, ఇదంతా మీ మీ కర్మయొక్క గమనం, ప్రభావం. నిజంగా, నేనేమీ చేయను. అనవసరంగా, చేసినది నేనేనని నా తలమీద వేస్తారు. 
కర్మే జీ జీ అదృష్టే ఘడత | మీ తో తేథీల సాక్షీభూత | 
కర్తా కరవితా తో ఎక అనంత | కృపావంతహీ తో ఎక | ||౧౨౯|| 
129. “విధివలన జరిగే కర్మలకు, నేను సాక్షిని మాత్రమే. చేసేవాడూ, చేయించేవాడూ అనంతుడైన, కరుణామయుడైన, ఆ పరమేశ్వరుడు ఒక్కడే. 
మీ నా దేవ నా ఈశ్వర | మీ నా ‘అనల హక్క’ నా పరమేశ్వర | 
‘యాదే హక్క’ మీ యాదగార | బందా మీ లాచార అల్లాచా | ||౧౩౦||
130. “నేను దేవుణ్ణీ కాను, ఈశ్వరుణ్ణీ కాను. నేను ‘అనల హక్క’ను గాను. నేను ‘యాదే హక్క’ను మాత్రమే. ఎప్పుడూ పరమేశ్వరుణ్ణి తలచుకునే వాణ్ణి. అల్లాకు ఎంతో విధేయుడైన దాసుణ్ణి. 

సాండూనియా అహంకార | మానూని తయాచే ఆభార | 
తయావరీ జో ఘాలీల భార | బేడా తో పార హోఈల” | ||౧౩౧|| 
131. “అహంకారాన్ని అణచి వేసి, దేవుడి ఉపకారాన్ని తలచుకుంటూ, బరువంతా దేవునిపై వేసిన వారిని, ఆ దేవుడే తీరానికి చేరుస్తాడు”, అని జవాబిచ్చారు. 
అసాచ ఎకా ఇరాణీయాచా | అనుభవ ఏకా మహత్వాచా | 
తయాచ్యా తాన్హ్యా ములీచీ వాచా | బసతసే తాసా తాసాస | ||౧౩౨|| 
132. ఇలాంటిదే ఒక ఇరానీ మనిషియొక్క గొప్ప అనుభవాన్ని వినండి. పసిబిడ్డ అయిన అతని కూతురుకు, గంటగంటకూ మాట ఆగిపోతుండేది. 
తాసా గణిత ఆకడీ యేఈ | పడే ధనుకడీ హోఊన ఠాయీ | 
అత్యావస్థా బేశుద్ధ హోఈ | ఉపాయ కాంహీ చాలేనా | ||౧౩౩|| 
133. ప్రతి గంటకూ, నోటినుండి నురగ కక్కుతూ, మూర్ఛ వచ్చి, అక్కడికక్కడే వంగిపోయి, విలవిలలాడుతూ, తెలివి తప్పి పడిపోయేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏదీ ఫలించలేదు. 
పుఢే తయాంచా ఎక మిత్ర | వర్ణీ తయాస ఉదీచే చరిత్ర | 
మ్హణే ఏసే రామబాణ విచిత్ర | ఔషధ అన్యత్ర అసేనా | ||౧౩౪|| 
134. తరువాత ఒక రోజు, అతని స్నేహితుడు, అతనికి ఉదీయొక్క మహిమను గూర్చి వర్ణించి, ‘రామబాణంవంటి ఇలాంటి విచిత్రమైన మందు ఎక్కడా ఉండదు. 
జావే అవిలంబే పారల్యాస | ఉదీ మాగావీ దీక్షితాంస | 
అసే తయాంచే సంగ్రహాస | అతి ఉల్హాసతా దేతీల | ||౧౩౫|| 
135. ‘ఆలస్యం చేయకుండా, వెంటనే పార్లేకు వెళ్ళి, దీక్షితుని ఉదీని ఇమ్మని అడుగు. అతని దగ్గర ఉంటుంది. సంతోషంగా ఇస్తాడు. 
తీ ఉదీ మగ రోజ థోడీ | సాఈస్మరణ శ్రద్ధా ఆవడీ | 
పాజితా హీ జాఈల ఆంకడీ | సౌఖ్య పరవడీ లాధాల | ||౧౩౬|| 
136. ‘సాయిని తలచుకొని, భక్తితో రోజూ, ఆ ఉదీని కొంచెం కొంచెం త్రాగించితే, మూర్ఛపోయి, జబ్బు నయమయి, సుఖంగా ఉంటుంది’ అని చెప్పాడు. 
ఏసే ఏకూన మగ తో పారశీ | ఉదీ మాగూన దీక్షితాంపాశీ | 
ములీస పాజితా నిత్యనేమేసీ | ఆరోగ్య తిజసీ లాధలే | ||౧౩౭|| 
137. అది విని, ఆ పార్శీ ఆయన, దీక్షితు దగ్గరనుండి ఉదీని అడిగి తెచ్చి, రోజూ నియమంగా, ఆ అమ్మాయికి త్రాగించగా, ఆమె ఆరోగ్యం కుదుట పడింది. 
తాసాంతాసా జీ హోతసే ఘాబరీ | తాత్కాళ ఉదీనే జాహలీ బరీ | 
జాఊ లాగలే మధ్యంతరీ | లహరీ లహరీంత సాత తాస | || ౧౩౮|| 
138. గంటగంటకూ వస్తున్న మూర్ఛ బాధ, ఉదీతో వెంటనే తగ్గి, ఏడేసి గంటలకు రావటం మొదలైంది. 
తాసాతాసానే యేణారీ లహర | పడతా సాతా తాసాంచే అంతర | 
కాంహీ కాళ క్రమిలియానంతర | పరిహార17 సమగ్ర జాహలా | ||౧౩౯| 
139. గంటగంటకూ వస్తున్న మూర్ఛ, ఏడేసి గంటలకొక మారు వచ్చి, కొంత కాలానికి జబ్బు పూర్తిగా నయమై పోయింది. 
హర్డ్యానజీక ఎకా గావాంత | రహాతసే ఎక వృద్ధ గృహస్థ | 
మూతఖడ్యాచ్యా వ్యాధీనే గ్రస్త | జాహలా త్రస్త అతిశయ | ||౧౪౦||
140. హర్డ్యా దగ్గర, ఒక పల్లెలో ఒక ముసలాయన ఉండేవాడు. అతడు మూత్రపిండంలోని రాళ్ళ (kidney stones) వ్యాధితో చాలా బాధ పడుతుండే వాడు. 

హా రోగ శస్త్రక్రియేవీణ | అన్యథా నాహీ యాచే నివారణ |
మ్హణూని శస్త్రక్రియాప్రవీణ | పహా తరీ కోణ జనవదతీ | ||౧౪౧||
141. ‘ఈ జబ్బుకు, శస్త్ర చికిత్సతో తప్ప, వేరే ఏ మందులూ లేవు గనుక, ఎవరైనా శస్త్ర చికిత్స చేసే నిపుణుణ్ణి చూసుకో’ అని కొందరు సలహా ఇచ్చారు.
రోగీ పరమ చింతాతూర | కర్తవ్యార్థీ న సుచే విచార |
మరణోన్ముఖ కృశ శరీర | దుఃఖ అనివార సోసేనా | ||౧౪౨||
142. రోగికి ఏం చేయాలో తోచక, చాలా దుఃఖిస్తూ, బాధతో ఉండిపోయాడు. ఆ బాధను భరించలేక, అతని దేహం చిక్కిపోయి, చావుకు దగ్గరయ్యాడు. 
శస్త్రప్రయోగా లాగే ధైర్య | రోగియా అంతరీ నాహీ స్థైర్య |
సుదైవే తయాచే నష్టచర్య | సంపలే ఆశ్చర్య తే పరిసా | ||౧౪౩||
143. శస్త్ర చికిత్స చేయించుకోవాలంటే, రోగికి ధైర్యం ఉండాలి. కాని, ఈ రోగికి ధైర్యం లేదు. అదృష్టం కొద్దీ అతని చెడు రోజులు ముగింపుకు వచ్చాయి. ఆ వింతను వినండి. 
ఎరీకడే హా ఏసా ప్రకార | తోంచ త్యా గ్రామీచే ఇనామదార |
సాఈబాబాంచే భక్త థోర | ఆలే గాంవావర సమజలే | ||౧౪౪||
144. రోగి పరిస్థితి ఇలా ఉండగా, సాయి భక్తుడైన ఆ ఊరి ఇనాందారు, అక్కడికి వచ్చాడు. 
తయాంపాశీ బాబాంచీ విభూతీ | నిత్య రాహీ హే సర్వ జాణతీ |
రోగార్తాచే ఆప్తేష్ట యేతీ | ఉదీ ప్రార్థితీ తయాంతే | ||౧౪౫||
145. అతని దగ్గర బాబా ఉదీ ఎప్పుడూ ఉంటుందని అందరికీ తెలుసు. రోగి బంధువులు వచ్చి, అతనిని ఉదీ కోరారు. 
ఇనామదారాంనీ ఉదీ దిధలీ | ములానే బాపాస పాణ్యాంత పాజిలీ |
పాంచహీ మినిటే నసతీల లోటలీ | తోంచ కీ వర్తలీ నవలపరీ | ||౧౪౬||
146. ఇనాందారు ఆనందంగా ఉదీని ఇచ్చాడు. రోగి కొడుకు ఆ ఉదీని నీటిలో కలిపి, తండ్రికి త్రాగించాడు. అంతే! అయిదు నిమిషాలు గడిచాయో లేదో, విచిత్రం జరిగింది. 
ఉదీ ప్రసాద అంగీ జో భినలా | మూతఖడా ఠాయీంచా ఢళలా |
మూత్రద్వారే బాహేర నిసటలా | ఆరామ పడలా తాత్కాళ | ||౧౪౭||
147. ఉదీ ప్రసాదం ఒంటిలోపల పడగానే, మూత్రపిండంలోని రాయి కదిలి, వెంటనే మూత్ర ద్వారంనుండి బయటికి జారిపోయింది. రోగికి ఎంతో హాయిగా అనిపించింది. 
ముంబాపురీచే ఎక గృహస్థ | హోతే జాతీచే ప్రభు కాయస్థ |
హోతా ప్రసూతి సమయ ప్రాప్త | స్త్రీ అత్యవస్థ సర్వదా | ||౧౪౮||
148. ముంబై పట్టణంలో, కాయస్థ ప్రభు జాతికి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతని భార్య, ప్రతి సారి కాన్పు జరిగే సమయంలో, చాలా బాధ పడుతుండేది. 
మగ కితీహీ ఉపాయ కరా | గూణ న ఎకాహీ ఉపచారా |
బాఈచా జీవ హోతసే ఘాబరా | ఏసా బిచారా త్రాసలా | ||౧౪౯||
149. ఎంత ప్రయత్నించినా, ఎన్ని ఉపాయాలు చేసినా, ఏ ఒక్కటీ పనికి రాలేదు. ప్రాణం పోతున్నట్లుగా ఆమె తపించి పోతుండేది. 
‘శ్రీరామమారుతీ’ నామే విఖ్యాత | హోతే ఎక సాఈచే భక్త |
తయాంచ్యా విచారే హే గృహస్థ | జావయా శిరడీప్రత నిఘాలే | ||౧౫౦||
150. దగ్గరలోనే, ‘శ్రీరామ మారుతి’ అన్న పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన సాయి భక్తుడుండేవాడు. అతని సలహా విని, ఈ గృహస్థుడు, భార్యతో, శిరిడీకి బయలుదేరాడు. 

ప్రసూతీచా యేతా సమయ | మహత్‍ సంకటీ పడత ఉభయ | 
జాహలా ఎకదా మనాచా నిశ్చయ | పావూ నిర్భయ శిరడీంత | ||౧౫౧|| 
151. కాన్పు సమయం వచ్చినప్పుడు, దంపతులిద్దరూ చాలా దిగులు పడేవారు. శిరిడీలో అయితే ఏ భయమూ లేక ఉండవచ్చని, ఒకే మనసుతో, వారు నిర్ణయించుకున్నారు. 
హోణార హోఈనా కా నిదానీ | హోవో తే బాబాంచే సంనిధానీ | 
ఏసా సంకల్ప దృఢ కరోని | శిరడీస యేఊన రాహిలే | ||౧౫౨|| 
152. ‘జరగాల్సినదేదో జరగనీ, కాని అది బాబా సన్నిధిలోనే జరగనీ’ అని అనుకుని, దృఢ నిశ్చయంతో, శిరిడీకి వచ్చి ఉండ సాగారు. 
ఏసేహీ ఉభయతా కిత్యేక మాస | కరితీ జాహలీ శిరడీంత వాస | 
పూజా అర్చా సాఈసహవాస | ఆనంద ఉభయాంస జాహలా | ||౧౫౩|| 
153. అలా ఆ దంపతులు శిరిడీలో ఎన్నో నెలలు ఉన్నారు. సాయి సహవాసం, పూజలూ, అర్చనలూ చూస్తూ ఆ దంపతులు ఎంతో ఆనందంగా కాలం గడిపారు. 
ఏసా క్రమితా కాంహీ కాళ | ప్రసూతి సమయ ఆలా జవళ | 
కాళజీ ఉద్భవలీ ప్రబళ | సంకట టళణార కైసే హే | ||౧౫౪|| 
154. కొంత కాలం గడిచాక, కాన్పు జరిగే సమయం దగ్గరకు వచ్చింది. గండం ఎలా గడుస్తుందా అని వారికి దిగులు పట్టుకుంది. 
ఏసే మ్హణతా మ్హణతా ఆలా | ప్రసూతీచా దివస పాతలా | 
గర్భద్వారాచా మార్గ అడలా | సర్వాంస పడలా విచార | ||౧౫౫|| 
155. అలా అనుకుంటూనే, కాన్పు జరిగే రోజు వచ్చింది. ఆమె గర్భాశయ ద్వారం మూసుకుని పోవటంతో, అందరికీ చింత పట్టుకుంది. 
బాఈస హోఊ లాగల్యా యాతనా | కాయ కరావే కాంహీ సుచేనా | 
ముఖే చాలలీ బాబాంచీ ప్రార్థనా | త్యావీణ కవణా కరుణా యే | ||౧౫౬|| 
156. ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. అందరూ నోరారా, బాబాను ప్రార్థించ సాగారు. వారు తప్ప వేరెవరు కరుణిస్తారు? 
ధాంవూనీ ఆల్యా శేజారణీ | ఘాలూని బాబాంనా గార్హాణీ | 
ఎకీనే ప్యాల్యాంత ఓతూనీ పాణీ | ఉదీ కాలవూనీ పాజిలీ | ||౧౫౭|| 
157. ఇరుగు పొరుగు స్త్రీలు పరుగెత్తుకుని వచ్చారు. అందులో ఒకామె, బాబాను తలచుకుంటూ, గ్లాసులోని నీటిలో ఉదీ కలిపి, ఆమెకు త్రాగించింది. 
పాంచ మినిటే గేలీ న గేలీ | తోంచ బాఈచీ సుటకా ఝాలీ | 
గర్భస్థితీ నిర్జీవ దిసలీ | గర్భీంచ ముకలీ చైతన్యా | ||౧౫౮|| 
158. అయిదు నిమిషాలు గడిచాయో లేదో, ఆమెకు కాన్పు జరిగింది. బయటకు వచ్చిన బిడ్డ, గర్భంలోనే చనిపోయి ఉంది. 
అసో గర్భాచీ కర్మగతీ | హోఈల పుఢారా గర్భప్రాప్తీ | 
బాఈ పావలీ భయనిర్ముక్తీ | లాధలీ సంస్థితీ సౌఖ్యాచీ | ||౧౫౯|| 
159. కాని, అది ఆ బిడ్డయొక్క తలరాత. ముందుముందు ఇంకొక బిడ్డకు గర్భం దాల్చవచ్చు. కాని, ఆమెకు కాన్పు అంటే భయం పోయి, సుఖంగా ఉంది. 
వేదనా విరహిత గర్భ స్త్రవలీ | హాతీ పాయీ సుఖే సుటలీ | 
మహచ్చింతేచీ వేళ టళలీ | ఋణీ ఝాలీ జన్మాచీ | ||౧౬౦||
160. ఇప్పటికి మటుకు, ఏ బాధా లేకుండా ఆమె ప్రసవించింది. పెద్ద గండం గడిచి పోయింది. చింత తీరింది. మళ్ళీ కొత్త జన్మనిచ్చిన బాబాకు, జీవితాంతం ఋణపడి ఉంది. 

పుఢీల అధ్యాయ యాహూన గోడ | పరిసతా పురేల శ్రోత్యాంచే కోడ | 
నిరసూని చికిత్సకపణాచీ ఖోడ | భక్తీచీ జోడ లాధేల | ||౧౬౧|| 
161. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురంగా ఉంటుంది. దీనిని విన్న శ్రోతల కోరిక తీరుతుంది. ఎక్కువగా కుతూహలం చూపే చెడు అలవాటు తొలగిపోయి, భక్తి పెరుగుతుంది. 
ఆమ్హా నిరాకారాచీ ఉపాసనా | ఆమ్హీ దేణార నాహీ దక్షీణా | 
ఆమ్హీ వాకవిణార నాహీ మానా | తరీచ దర్శనా యేఊ కీ | ||౧౬౨|| 
162. ‘ఆకారం లేని దేవుణ్ణే మేము ఆరాధిస్తాము. మేము ఎవరికీ తల వంచము. దక్షిణ మొదలైనవి ఇవ్వము. అలా అయితేనే, సాయి దర్శనానికి వస్తాను’. 
ఏసా జయాంచా కృతనిశ్చయ | తేహీ పాహతాంచ సాఈచే పాయ | 
దక్షీణేసహిత సాష్టాంగ కాయ18 | వాహతీ హా కాయ చమత్కార | ||౧౬౩|| 
163. అని దృఢంగా నిశ్చయించుకుని, బాబాను చూడగానే, దేహాన్ని వారి పాదాల మీద పడవేసి, దక్షిణను కూడా ఇవ్వటం, చమత్కారం కాదా! 
ఉదీచాహీ అపూర్వ మహిమా | నేవాసకరాంచా భక్తిప్రేమ | 
కైసే దుగ్ధ పాజూనీ భుజంగమా | గృహస్థధర్మా సంరక్షిలే | ||౧౬౪|| 
164. అలాగే, ఉదీయొక్క అద్భుతమైన మహిమ, నేవాస్కరు భక్తి ప్రేమలు, అతడు పాముకు పాలు త్రాగించటం, గృహస్థుని ధర్మాన్ని పాటించటం, 
ఏసఏసియా కథా ఉత్తమ | పరిసతా ఉపజేల భక్తిప్రేమ | 
సంసారదుఃఖా హోఈల ఉపశమ | యాహూని పరమసుఖ కాయ | ||౧౬౫|| 
165. ఇలాంటి ఉత్తమమైన కథలను వింటే, భక్తి ప్రేమలు కలిగి, సాంసారిక దుఃఖాలు తొలగిపోతాయి. ఇంత కంటే, పరమ సుఖం వేరే ఏముంటుంది? 
మ్హణోని హేమాడ కరీ వినతీ | సాఈ చరణీ కరోని ప్రణతీ | 
ప్రేమ ద్యాజీ శ్రోతయాంప్రతీ | నిజ సచ్చరితీ రమావయా | ||౧౬౬||
166. హేమాడు సాయి పాదాలకు నమస్కరించి, శ్రోతలకు ఈ సచ్చరితను వినటానికి ప్రేమను కలిగించమని వేడుకుంటున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
 | శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | ఉదీమహిమా నామ | 
| చతుస్త్రింశత్తమోధ్యాయ: సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు || 

టిపణీ: 
1. ఠాణే జిల్హ్యాత బేలాపూర జవళ తురంభే గావీ రాహణార్యా శాంతాబాఈ యా నావాచా బాఈచ్యా డావ్యా హాతాచ్యా అంగఠ్యాస హాడ్యావ్రణ ఝాలా హోతా. తో సాత వర్షే హోతా. ఎకే రాత్రీ మహారాజాంనీ తిలా స్వప్నాత జాఊన సాంగితలే, “తూ డికేమాలీ లావ!” బాఈ జాగీ ఝాలీ, తో తిలా మోఠా ఆనంద వాటూ లాగలా. తినే వ్రణాలా డికేమాలీ లావలీ వ తిచా వ్రణ బరా ఝాలా. తినే మగ యా సర్వ మజకురాచే కార్డ మహారాజాంస లిహూన పాఠవిలే. త్యా కార్డావర తారీఖ ౧ సప్టేంబర, ౧౯౧౮ హీ ఆహే. 
2. మాలేగావ ఆణి మనమాడ యా దోన్హీ ఠికాణీ. 
3. ఘ్యావయాచే సోడూన. 4. లాగోపాఠ. 5. ఆకాశవాణీ. 6. వేడా. 
7. కావళా. 8. మశీదీత దివాబత్తీ కరణారా శ్రీంచా ఎక భక్త. 
9. థోడ్యా జాగేచీ. 10. దాటీ. 11. పాఊల టాకావయాస. 
12. అబ్దులభాఈ హా మూళచా నాందేడచా రాహణారా; పరంతు మహారాజాంచ్యా సమాధీచ్యా ఆధీ ౨౫ - ౩౦ వర్షాపాసూన శిరడీసచ సేవేసాఠీ యేఊన రాహిలా హోతా. సమాధీ నంతరహీ కాహీ ముశాహిరా న ఘేతా ఫక్త అన్నవస్త్ర ఘేఊన సేవా కరీత అసే. మహారాజ దేహధారీ అసతానా త్యాచ్యావర అత్యంత కామ పడత అసే వ తే సర్వ తో మోఠ్యా ప్రేమానే కరీత అసే. పూర్వీ నేహమీ చావడీత రాహత అసే వ త్యానంతర మృత్యూ హోఈపర్యంత ద్వారకామాఈజవళ రాహత హోతా. రాత్రీసుద్ధా విశ్రాంతీ న ఘేతా కురాణ పఢణ్యాత బరాచ వేళ ఘాలవీత అసే. ఘరీ త్యాచీ ఆఈ, బాయకో వ ములగా ఇతకీ మండళీ ఆహేత; పణ త్యాంనా సర్వాంనా సోడూన తో శిరడీస రాహిలా హోతా. త్యాచీ ఆఈ వ ములగా కధీ కధీ శిరడీస యేతాత. బాయకోహీ ఎకదా ఆలీ హోతీ; పణ తో త్యాంపైకీ కోణాచ్యాహీ మోహాత పడలా నాహీ. త్యాచ్యా ములాచ్యా లగ్నాచీ కాళజీ త్యాచా ఆఈలా ఫార వాటత అసే వ తినే ఎకే ఠికాణీ జుళవిణ్యాచీ శికస్త కేలీ. పణ, అబ్దులభాఈ ఫకీర ఝాలా ఆహే, త్యాచ్యా యేథే ఆమచీ ములగీ ద్యావయాచీ నాహీ, అసా రోకడా జబాబ మిళాలా. త్యానంతర తీ బాఈ తేథే ఆలీ వ మహారాజా జవళ గార్హణే కేలే. మహారాజ మ్హణాలే, ‘సబురీ ధర! ఘాబరూ నకో. ములాలా చాంగలీ ములగీ మిళేల వ తే ఆపోఆప జమూన యేఈల.’ అర్థాత, మహారాజాంచ్యా మ్హణణ్యాప్రమాణే ఘడూన ఆలే. ఎకదా అబ్దులభాఈచీ ఆఈ వ ములగా ఎకా గావాలా గేలీ అసతా, తేథే ఎకా గృహస్థాచీ గాఠ పడలీ వ త్యానే ఆపణ మాఝీ ములగీ కరా, అసా ఆగ్రహ ధరలా. త్యాలా కాహీ మండళీంనీ సాంగితలే కీ, ములాచా బాప ఫకీర ఝాలా ఆహే. త్యావర తో మ్హణాలా, "మీహీ ఫకీర ఝాలో తరీ హరకత నాహీ. మాఝీ ములగీ మీ యా ములాలాచ దేణార". త్యాప్రమాణే తే లగ్నహీ తాబడతోబ ఉరకూన ఘేతలే. త్యా గృహస్థాచీ ఎక మోఠీ ములగీ లగ్నాచీ హోతీ, తిచే లగ్న జుళలే హోతే; పణ తే లగ్న వ్హావయాలా అవకాశ హోతా. తరీహీ త్యానే న థాంబతా ధాకట్యా ములీచే లగ్న అబ్దులభాఈచ్యా ములాశీ తాబడతోబ కరూన టాకలే. 
13. జగతాత. 14. ఉత్కృష్ట కృత్య. 15. చింతలేలా హేతూ. 
16. శిరడీ నజీక ఎక ఠికాణ. 
17. యా ఉదీచే అసే అనేక అనుభవ ఆహేత. నారాయణ గోపినాథ దిఘే యా నావాచే గృహస్థ ముంబఈస రాహత అసత. త్యాంచా పోటాత ఎక గాఠ ఉత్పన్న ఝాలీ. తీ ఫార కఠీణ హోతీ వ తిచ్యాపాసూన త్యాంనా ఫార త్రాస హోఊ లాగలా. ముంబఈస ఎక-దోన ప్రసిద్ధ డాక్టరాంనా తీ దాఖవిలీ; పణ కాహీ ఉపయోగ ఝాలా నాహీ. పుఢే త్యాంనా మహారాజాంకడే జాణ్యావిషయీ ఎకా గృహస్థానే సుచవిలే, అర్థాత, తశా స్థితీత జాణే శక్య నవ్హతే. తే మ్హణాలే, ‘మహారాజాంచ్యా ఆశీర్వాదానే హీ గాఠ ఫుటూన ఆతలా రోగ మళాచ్యా ద్వారానే జాఈల తర మలా బరే వాటేల వ మీ మహారాజాంకడే జాఊ శకేన’. త్యావర త్యా గృహస్థానే త్యాంనా మహారాజాంచీ ఉదీ దిలీ. తిచే త్యాంనీ సేవన కేలే వ దుసర్యాచ దివశీ సకాళీ గాఠ ఫుటూన ఆతలా పూ శౌచాచ్యా ద్వారానే జాఊ లాగలా వ దోన చార దివసాంత త్యాంనా బరే వాటూ లాగలే. మగ లవకరచ తే మహారాజాంచ్యా దర్శనాస గేలే. (౧౩౯ పరిహార) 
18. శరీర.

No comments:

Post a Comment