Thursday, September 26, 2013

||ఉద్యాపన కథా కథనం నామ చత్వారింశత్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౦ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

ధన్య ధన్య శ్రీసాఈసమర్థ | గ్రంథరూపే స్వార్థ పరమార్థ | 
బోధూని భక్తా కరీ కృతార్థ | జో కృతకార్యార్థ సంపాదీ | ||౧|| 
1. ధన్యులు, ధన్యులు, శ్రీసాయి సమర్థులు. ఈ గ్రంథ రూపంలో స్వార్థాన్ని, పరమార్థాన్ని భక్తులకు బోధించి, వారిని కృతార్థులను చేసి, తమ కార్యాన్ని సాధించుకున్నారు.
మాథా పడతా జయాచా హాత | కరీ జో తాత్కాళ శక్తిపాత | 
అప్రాప్యవస్తూ కరీ ప్రాప్త | భేదాచా నిఃపాత కరూనీ | ||౨|| 
2. తలపై చేయిపెట్టి, తక్షణమే భక్తులకు వారి శక్తిని అందించి, భక్తులకు దొరకని ఆత్మవస్తువును ప్రాప్తింప చేసి, వారిలోని భేదభావాన్ని తొలగిస్తారు.
విరవూని మీ తూ భావ భిన్న | జయా కరితా సాష్టాంగ నమన | 
హృదయీ ధరీ ఆలింగూన | అనన్య శరణ రిఘతాంచీ | ||౩|| 
3. ‘నీ, నా’ అనే భావం లేకుండా, అనన్య శరణుజొచ్చి, వారికి సాష్టాంగ నమస్కారం చేస్తే, తమ హృదయానికి హత్తుకుని ఆలింగనం చేసుకుంటారు.
నామే భిన్న సాగరసరితా | పరి రూపే ఎకరూపతా | 
వర్షాకాళీ మిళణీ మిళతా | ఉరే న భిన్నతా తాదృశ | ||౪|| 
4. నది, సాగరం పేరుకు వేరు వేరైనా, వర్షాకాలంలో రెండూ కలిసిపోయినప్పుడు, వాని భిన్నత్వం నశించి, రెండూ ఒక్కటే రూపాన్ని కలిగి ఉంటాయి.
తేవీంచ భావే సద్గురునాథా | భక్తీ అనన్య శరణ జాతా | 
తోహీ భక్తాంస దేఈ నిజగురుతా | పాహోని సద్భక్తతా భక్తాంచీ | ||౫|| 
5. అదే భక్తిభావంతో, సద్గురునాథునికి అనన్య శరణు జొచ్చితే, భక్తుల సద్భక్తిని గమనించి, వారు తమ శక్తిని భక్తులకు ప్రసాదిస్తారు.
జయజయాజీ దీనదయాళా | భక్తీద్ధారా పరమప్రేమళా | 
వ్యాపూని అఖిల బ్రహ్మాండమాళా | వససీ నిరాళా శిరడీంత | ||౬|| 
6. జయ జయ దీన దయాళూ! భక్తులను ఉద్ధరించే పరమ ప్రేమమయీ! అఖిల బ్రహ్మాండాన్ని వ్యాపించి ఉన్నా, భక్తుల ఉద్ధారం కోసం శిరిడీలో ఉంటున్నారు.
జాతే మాండూని పాయ పసరితా | సంత అసతా దళణ దళితా | 
ఖుంటా ఠేకూని వైరా రిచవితా | విస్మయ చిత్తా మాఝియా | ||౭|| 
7. సంతులైన మీరు, తిరుగలిని నేలపై ఉంచి, కాళ్లు చాపుకుని, తిరుగలి పిడిని గట్టిగా బిగించి, ధాన్యం గింజలను విసురుతున్నప్పుడు, నా మనసు అత్యంత ఆశ్చర్యానికి లోనైంది.
తేంచ కీ యా గ్రంథామూళ | మనీ ఇచ్ఛా ఉద్భవలీ ప్రబళ | 
కీ హీ ఏసీ కర్మే సకళ | వర్ణితా కష్మల హరేల | ||౮|| 
8. అదే ఈ గ్రంథానికి మూల కారణం. ఇలాంటి మీ లీలలను వర్ణించడం వలన, పరమ పాతకాలు హరించి పోతాయని, నా మనసులో ఒక ప్రబలమైన కోరిక పుట్టింది.
హరీ స్వయే హోఈల ప్రసన్న | తయా ఆవడే తయాహూన | 
కోణీ కేలియా నిజభక్త కీర్తన | అథవా గుణవర్ణన భక్తాంచే | ||౯|| 
9. ఎవరైనా తన భక్తుని కీర్తించినా, అతని గుణాలను వర్ణించినా, హరి కూడా ప్రసన్నమౌతాడు. ఎందుకంటే, తన మీది కంటే, భక్తునిపైనే ప్రేమ.
ఆశంకతీల శ్రోతే సజ్జన | జయా నిరాధార వాటేల హే విధాన | 
తింహీ పహావే భవిష్యోత్తర పురాణ | త్రిపురారీ కథన కరీ హే | ||౧౦||
10. ఈ మాట నిరాధారమని, సజ్జనులైన శ్రోతలకు సందేహం కలుగవచ్చు. అలాంటివారు భవిష్యోత్తర పురాణంలో, త్రిపురారియే చెప్పినదానిని గమనించవచ్చు.

హీ హీ సకళ సాఈచీ ప్రేరణా | పరి లౌకికరీతీ నిదర్శనా | 
తేణేంచ అనుమోదిలీ హీ రచనా | భక్త కల్యాణాకారణే | ||౧౧|| 
11. ఇదంతా సాయియొక్క ప్రేరణే. కాని, లౌకిక రీతిని పాటించటానికి, భక్తుల శ్రేయస్సు కొరకు ఈ రచనను ఆమోదించారు. 
తైం పాసావ మాసోమాసీ | సాఈ సమర్థ కథానకాసీ | 
యా శ్రీసాఈలీలావలీసీ | శ్రోతే బహు ప్రేమేసీ పరిసతీ | ||౧౨|| 
12. అప్పటినుండి, సాయిసమర్థుని కథలను శ్రీసాయిలీలా మాస పత్రికలో, నెల నెలా శ్రోతలు చాలా ప్రేమతో గమనిస్తున్నారు.
తోచి కీ సాఈ అనుమోదితా | తోచ తో మాఝా బుద్ధిదాతా | 
తోచ మూళ చేతనా చేతవితా | తయాచీ కథా తోచ కరీ | ||౧౩|| 
13. వాటిని ఆమోదించినది సాయియే. వారే నా బుద్ధిదాత. మూల చైతన్యాన్ని ప్రేరేపించినది వారే. వారి కథను వారే రచిస్తున్నారు.
కీ హా హెమాడ నిజమతీ | రచితో హా వికల్ప న ధరా చిత్తీ | 
మ్హణోని శ్రోతయా కరితో వినంతీ | గుణదోష మాథీ మారూ నకా | ||౧౪|| 
14. ఈ హేమాడు, తన స్వంత బుద్ధితో రచిస్తున్నాడనే ఆలోచన మనసులో రానీయకండి. శ్రోతలకు విన్నవించుకుంటున్నది ఏమిటంటే, గుణదోషాలను నాకు అంటగట్టకండి.
గుణ తరీ తే సాఈచే | దోష దిసలియా తరీ తే త్యాచే | 
మీ తో బాహులే సాఈఖడ్యాచే | ఆధారే నాచే సూత్రాచ్యా | ||౧౫|| 
15. అందులోని గుణాలు సాయివే. దోషాలు కనిపించినా, అవి కూడా వారివే. సాయి చేతిలోని బొమ్మను మాత్రమే నేను. వారు సూత్రాన్ని ఎలా ఆడిస్తే అలా ఆడేవాణ్ణి.
సూత్రధారా హాతీ సూత్ర | త్యాలా వాటేల తే తే చిత్ర | 
రంగీబేరంగీ అథవా విచిత్ర | నాచవీల చరిత్ర సమన్విత | ||౧౬|| 
16. సూత్రాలు సూత్రధారుని చేతిలో ఉంటాయి. కథకు అనుగుణంగా, పాత్రలను విచిత్రమైన రీతిలో రంగు రంగుల దృశ్యాలతో ఆడిస్తాడు.
అసో ఆతా హా ప్రస్తావ | కాయ నూతన కథా నవలావ | 
ఉత్కంఠా ప్రచుర శ్రోతృస్వభావ | గురుభక్త గౌరవ త్యా గాఊ | ||౧౭|| 
17. ఈ ప్రస్తావన ఇంతటితో చాలు. చాలా ఉత్సుకతతో ఉన్న శ్రోతలు, క్రొత్త కథా విశేషమేమిటని అడుగగా, గురువు మరి వారి భక్తుల గానం చేస్తాను.
గతాధ్యాయ పూర్ణ కరితా | పుఢీల అధ్యాయ సూతోవాచతా | 
ఠేవిలీ హోతీ స్మరణాచే మాథా | స్ఫురే తీ ఆతా పరిసావీ | ||౧౮|| 
18. గత అధ్యాయాన్ని ముగించేటప్పుడు, తరువాతి అధ్యాయంలో నాకు గుర్తుకు వచ్చిన దానిని చెప్తానని అన్నాను. అలాగే ఇప్పుడు, నా మనసుకు స్పురించిన కథను వినండి.
ఆతా హే గోడ ఆఖ్యాన | శ్రోతా పరిసిజే సావధాన | 
భక్తప్రేమే ఘాలితా భోజన | పరమ సమాధాన సాఈస | ||౧౯|| 
19. మధురమైన ఈ కథను, ఇప్పుడు శ్రోతలు శ్రద్ధతో గమనించండి. భక్తులు ప్రేమతో భోజనం పెడితే, సాయికి పరమ సమాధానం.
నిజ తాన్హియా కనవాళూ మాఈ | తైసా నిజభక్తా ప్రత్యక్ష సాఈ | 
వసో కుఠేంహీ ధాంవత యేఈ | కవణ త్యా హోఈల ఉతరాఈ | ||౨౦||
20. తల్లికి తన బిడ్డలపై ప్రేమ. అలాగే భక్తులకు సాయి ప్రత్యక్ష కన్నతల్లి. వారు ఎక్కడున్నా సరే, భక్తుల పిలుపుకి పరుగున వస్తారు. వారి ఋణాన్ని ఎవరైనా తీర్చుకోగలరా?

దేహే వావరత శిరడీంత | పరి సంచార త్రైలోక్యాంత | 
యే అర్థీంచా గోడ వృత్తాంత | పరిసా నిజ శాంత మానసే | ||౨౧|| 
21. శారీరికంగా శిరిడీలో వ్యవహరిస్తున్నా, వారు త్రిలోకాలంతా సంచరిస్తుంటారు. దీనికి సంబంధించిన ఒక మధురమైన సంగతిని, శాంత మనస్కులై వినండి.
ఎకదా సాఈ పదసంనిష్ఠ | బాళాసాహేబ1 భక్త శ్రేష్ఠ | 
మాతా జయాంచీ వ్రతవైకల్యనిష్ఠ | సర్వాంచే అభీష్ట సంపాదీ | ||౨౨|| 
22. సాయి పాదాలయందు నిష్ఠగల భక్తశ్రేష్ఠుడు, బాలా సాహేబు దేవు. అతని తల్లి, అందరికీ శుభం కలగాలని, నిష్ఠగా వ్రతాలను ఆచరించేది. 
పరోపరీచీ అనేక వ్రతే | హోతీ ఘడలీ తియేచే హాతే | 
తయాంచే ఉద్యాపన రాహిలే హోతే | సాంగ తీ సమస్తే వ్హావయా | ||౨౩|| 
23. ఒక మారు, ఆమె అనేక వ్రతాలను ఆచరించింది. కాని, సంతృప్తికరంగా వ్రత సమాప్తం కావడానికి, ఉద్యాపనం (వ్రతాలు ముగిసిన తరువాత చేసే అన్న సంతర్పణం) మిగిలిపోయింది. 
వ్రతసంఖ్యా హోతా పూర్ణ | కరూ లాగే ఉద్యాపన | 
నా తో పదరీ న పడే పుణ్య | వ్రత తే అపూర్ణ త్యావీణ | ||౨౪|| 
24. అనుకున్న వ్రతాలన్నీ ముగిశాక, ఉద్యాపన చేయాలి. ఉద్యాపన కాని వ్రతాలు అసంపూర్తి గనుక, వాటికి పుణ్యఫలం కలగదు. 
వ్రతే పంచవీస అథవా తీస | ఇతుక్యాంచియా ఉద్యాపనాస | 
దేవ శే దోనశే బ్రాహ్మణాంస | జేవావయాస ఆమంత్రిత | ||౨౫|| 
25. పాతికో, ముప్పైయో ఇన్ని వ్రతాల ఉద్యాపనం కొరకు, దేవు వంద లేక రెండు వందల బ్రాహ్మణులను భోజనానికి ఆహ్వానించాడు. 
మ్హణూన ఎక నేమిలీ తిథీ | హే ఉద్యాపన కరావయా ప్రతీ | 
దేవ జోగాంస2 పత్ర లిహితీ | కరాయా వినంతీ బాబాంస | ||౨౬|| 
26. ఉద్యాపనకు ఒక దినాన్ని నిర్ణయించుకుని, దానికొరకు బాబాను ఆహ్వానించడానికి, దేవు తన పరంగా ప్రార్థించమని జోగుకు ఉత్తరం వ్రాశాడు. 
పహా ఆపణ ఆలియావినా | నాహీ సాంగతా యా ఉద్యాపనా | 
తరీ మాన్య కరూని హీ ప్రార్థనా | కరావే యా దీనా ఆభారీ | ||౨౭|| 
27. ‘మీరు రాకుంటే ఈ ఉద్యాపన పూర్తి కాదు. అందువల్ల, ఈ ప్రార్థనను మన్నించి, ఈ దీనుణ్ణి కృతజ్ఞుణ్ణి చేయండి. 
మీ తో సరకారాచా సేవేకరీ | పోటాలాగీ కరితో చాకరీ | 
త్యాంతచి సాధల్యా పరమార్థహీ కరీ | జాణతసా అంతరీ ఆపణహీ | ||౨౮|| 
28. ‘నేనేమో ప్రభుత్వోద్యోగిని. పొట్టకోసం చాకరి చేసుకుంటూ, వీలైనంత పరమార్థాన్ని కూడా సాధించుకోవాలని నా తపన. ఇవన్నీ మీకు బాగా తెలుసు. 
డహాణూహూన ఇతుకా దూర | స్వయే యావయా మీ లాచార | 
తరీ యా ఆమంత్రణాచా స్వీకార | కరాల హీ ఫార మజ ఆశా | ||౨౯|| 
29. ‘డహాణూనుండి అంత దూరం స్వయంగా రాలేని నిస్సహాయుణ్ణి. కనుక మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని చాలా ఆశతొ ఉన్నాను’. 
ఏసే బాపూసాహేబ జోగ | పత్ర బాబాంస ఏకవితీ సాంగ | 
మ్హణతీ సంపాదా హా కార్యభాగ | యథాసాంగ దేవాంచా | ||౩౦||
30. ఇలా బాపూసాహేబ జోగు ఉత్తరం మొత్తంగా బాబాకు చదివి వినిపించాడు. ఆ కార్యాన్ని దేవు చక్కగా పూర్తి చేసేలా చూడమని, బాబాను జోగు ప్రార్థించాడు. 

శుద్ధభావాచే ఆమంత్రణ | బాబాంనీ ఏకూని ఘేతలే సంపూర్ణ | 
మ్హణతీ “జయా మాఝే స్మరణ | నిరంతర ఆఠవణ మజ త్యాచీ | ||౩౧|| 
31. నిర్మలమైన మనసుతో పంపిన ఆ ఆహ్వానాన్ని బాబా పూర్తిగా విని, “నా స్మరణ చేసేవారిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. 
మజ న లాగే గాడీఘోడీ | విమాన అథవా ఆగ్నిగాడీ | 
హాంక మారీ జో మజ ఆవడీ | ప్రకటే మీ తే ఘడీ అవిలంబే | ||౩౨|| 
32. “నాకు గుర్రం బండిగాని, విమానంగాని, రైలు బండిగాని, అవసరం లేదు. ఏ మాత్రం ఆలస్యం లేకుండా, నన్ను ప్రేమతో పిలిచినవారికి తక్షణం కనిపిస్తాను. 
తూ మీ ఆణి తిసరా ఎక | తిఘే మిళూన జాఊ దేఖ | 
పాఠవూని దే ఏసా లేఖ | పావేల హారిఖ లిహిణారా” | ||౩౩|| 
33. “నీవు, నేను, మరి ఇంకొకరు, ముగ్గురం కలిసి పోదాం. అలా అని, అతనికి ఉత్తరం వ్రాయి. ఆ ఉత్తరం వ్రాసినవాడు సంతోషిస్తాడు”. 
అసో బాబా జే జే బోలలే | తే తే జోగాంనీ దేవా కళవిలే | 
దేవ మనీ ఆనందిత జాహలే | అమోఘ బోలే బాబాంచ్యా | ||౩౪|| 
34. అలా బాబా చెప్పినవన్నీ జోగు, దేవుకు తెలియ చేశాడు. బాబా మాటలు అమోఘమని, దేవు మనసులోనే ఆనందించాడు. 
దేవాంచాహీ పూర్ణ విశ్వాస | బాబా ఆతా యేతీల ఖాస | 
పరి హే జేవ్హా అనుభవాస | యేఈల తో దివస సోనియాచా | ||౩౫|| 
35. బాబా తప్పక వస్తారని, దేవుకు పూర్తి విశ్వాసం. ‘అది అనుభవానికి వచ్చిన రోజే సువర్ణ దినం’. 
పరి దేవాంస హేంహీ ఠావే | శిరడీఖేరీజ తీనచ గాంవే | 
తేథేంహీ క్వచితచి బాబాంనీ జార్వే | శిరడీంత అసావే నిరంతర | ||౩౬|| 
36. కాని దేవుకు ఇది కూడా తెలుసు – ‘శిరిడీ కాక మూడు గ్రామాలకు మాత్రమే, ఎప్పుడో అరుదుగా బాబా వెళ్లుతుంటారని. బాబా ఎప్పుడూ శిరిడీలోనే ఉంటారు. 
మనా ఆలియా సటీసామాసీ | కధీ బాబా జాత రాహత్యాసీ3
కధీ రూఈ3 వా నిమగాంవాసీ3 | వస్తీసీ శిరడీసీ అఖండ | ||౩౭|| 
37. ‘బుద్ధి పుట్టినప్పుడు, ఏ ఆరు మాసాలకో గాని, రహతా, రుయీ లేక నీంగాంకు మాత్రమే వెళ్తారు. లేకుంటే, బాబా ఎప్పుడూ శిరిడీలోనే ఉంటారు. 
యా తీన గాంవా పలీకడే | జాత న కేవ్హాంహీ కోణీకడే | 
తే మగ ఇతకే లాంబ ఇకడే | డహాణూస మజకడే యావే కసే | ||౩౮|| 
38. ‘ఈ మూడు గ్రామాలు దాటి, ఎప్పుడూ ఎవరి వద్దకూ వెళ్లరు. అలాంటప్పుడు, ఇంత దూరంలో ఉన్న, డహాణూలో ఉన్న నా వద్దకు ఎలా వస్తారు? 
పరీ తే పూర్ణ లీలావతారీ | ఇచ్ఛామాత్రే స్వచ్ఛందచారీ | 
యేణే జాణే హే లోకాచారీ | సబాహ్యాభ్యంతరీ పరిపూర్ణ | ||౩౯|| 
39. ‘కాని, వారు పూర్ణ లీలావతారి. అనుకున్నంత మాత్రాన, వారు అనుకున్న చోటుకు, వెళ్లగలరు. వారి రాకపోకలు, లోకాచారం కొరకు అంతే. లోపల, బయట అంతటా, వారు పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. 
తేథూని యేథే హోఈల యేణే | అథవా యేథూన తేథే జాణే | 
హీ దోనీహీ ఆకాశ నేణే | పరిపూర్ణ పూర్ణపణే సబాహ్య | ||౪౦||
40. ‘అక్కడనుండి వారు ఇక్కడికి రావటం, లేక ఇక్కడనుండి వారు అక్కడికి వెళ్లటం, ఈ రెండూ ఆకాశానికి కూడా తెలియదు. ఎందుకంటే, వారు లోపల, బయట, అంతటా సంపూర్ణంగా వ్యాపించి ఉన్నారు’. 

తైసీచ బాబాంచీ దుర్గమగతీ | స్థిరచరీ తే భరలే అసతీ | 
తయా కైచీ ఆగతీ4 నిర్గతీ5 | ప్రకట హోతీ స్వచ్ఛందే | ||౪౧|| 
41. బాబాయొక్క కదలికలు తెలుసుకోవడం కష్టం. సజీవం, నిర్జీవం అన్నింటిలోనూ నిండి ఉన్నవారికి, రాకపోకలు ఎక్కడివి? ఇష్ట ప్రకారం వారు ఎక్కడైనా కనిపిస్తారు.
అసో యా ఆధీ ఎక సంన్యాసీ | ఎకా మాసాచియా అజమాసీ | 
ఆలా స్టేశన మాస్తరాపాశీ | డహాణూ స్టేశనాసీ నిజకార్యా | ||౪౨|| 
42. అదెలా ఉన్నా, దేవు ఆహ్వానానికి సుమారు ఒక నెల ముందు, ఒక సన్యాసి డహాణూ స్టేషనులో, స్టేషను మాస్టరు వద్దకు తన పని మీద వచ్చాడు.
తో గోశాళా ప్రచారక | గోసంస్థేచా స్వయంసేవక | 
ఆలా వర్గణీ మాగావయా దేఖ | స్థితి సాంపత్తిక సుధరావయా | ||౪౩|| 
43. అతడు గోశాల ప్రచారకుడు. గోరక్షణ సంస్థలో స్వయం సేవకుడు. ఆ సంస్థయొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచటానికి, చందాల కోసం, డహాణూ వచ్చాడు.
వేష పాహతా దిసే బంగాలీ | మాస్తరానే యుక్తి కథిలీ | 
గాంవాంత జా తేథేంహీ అపులీ | వ్యవస్థా చాంగలీ లాగేల | ||౪౪|| 
44. వేషం బట్టి, బంగాలీ వ్యక్తిలాగ ఉన్నాడు. స్టేషను మాస్టరు ఆయనికో ఉపాయం చెప్పాడు. ‘ఊరిలోకి వెళ్లండి, అక్కడే మీకు మంచి ఏర్పాట్లు ఉన్నాయి.
తేథే ఆహేత మామలేదార | తయాంపుఢే మాండా హా విచార | 
మిళతీల శేటసావకార | లావితీల హాతభార తుమ్హాంస | ||౪౫|| 
45. ‘మామలేదారు అక్కడే ఉన్నారు. మీ విచారాన్ని ఆయనకు చెప్పండి. అక్కడ సేట్లు, షావుకార్లు కలుస్తారు. వారు మీకు ఏదైనా సహాయం చెస్తారు.
ఎక మామలేదార వళతా | పట్టీ హోఈల హా హా మ్హణతా | 
యా ధర్మాచియా కార్యాకరితా | స్వస్థ చిత్తా జా తేథే | ||౪౬|| 
46. ‘మామలేదారు ఒక్కరిని పట్టుకుంటే చాలు. ఈ ధర్మకార్యానికి చందాలు తొందరగా వచ్చేస్తాయి. మీరు నిశ్చింతగా అక్కడికి వెళ్ళండి’.
హే జో ఆంత మాస్తర బోలే | బాహేర ఘోడ్యాచే టాప వాజలే | 
స్వయే మామలేదారచి తేథే ఆలే | ఉతరలే గేలే స్టేశనాంత | ||౪౭|| 
47. లోపల స్టేషను మాస్టరు అలా చెబుతున్నప్పుడే, బయట గుర్రం కాలి డెక్కల చప్పుడైంది. మామలేదారే స్వయంగా అక్కడికి వచ్చి, స్టేషను లోపలికి వెళ్లాడు.
మాస్తరాతే భేటావయాతే | ఖోలీంత జేవ్హా ప్రవేశలే తే | 
మాస్తర సంన్యాసియా ఝాలే వదతే | ఆలే కీ యేథేంచ మామలేదార | ||౪౮|| 
48. స్టేషను మాస్టరును కలుసుకోవటానికి గదిలోకి ప్రవేశించగానే, మాస్టారు సన్యాసితో ‘ఇదిగో మామలేదారే ఇక్కడికి వచ్చారు’ అని అన్నాడు.
ఘ్యా ఆతా బోలా కాయ తే | దైవే హే భేటలే తుమ్హా ఆయతే | 
సంన్యాసీ నిజ మనోగతాతే | జాహలే నివేదితే త్యాంపాశీ | ||౪౯|| 
49. ‘వారితో మీరు ఏం చెప్పదలచుకున్నారో, ఇప్పుడు చెప్పండి. దైవవశాత్తు, మీరు ఆయనను ఇక్కడే కలిశారు’. తరువాత సన్యాసి తాను వచ్చిన పనిని మామలేదారుతో మనవి చేశాడు.
మగ తే దోఘే బాహేర ఆలే | తేథేంచ ఎకా పేటీవర బైసలే | 
దేవాంస సంన్యాసీ వినవితే ఝాలే | కార్య హే సంపాదిలే పాహిజే | ||౫౦||
50. వారిద్దరూ బయటకు వచ్చి, అక్కడే ఉన్న ఒక పెట్టె పైన కూర్చున్నారు. సన్యాసి అతనితో ‘ఈ కార్యాన్ని ఎలా అయినా సాధించాలి.

గోరక్షణాచే ధర్మకార్య | ఆపణ హాతీ ధరిల్యాశివాయ | 
మజ పరకియా హాతూన హే కార్య | హోఈల కా తిళప్రాయ తరీ | ||౫౧|| 
51. ‘గోరక్షణలాంటి ధర్మ కార్యం, మీరు స్వయంగా స్వీకరించితే తప్ప, బయటవాడైన నాతో ఈ పని అసలు ఏ మాత్రమైనా సాధ్యమా? 
ఆపణ తాలుక్యాచే అధికారీ | మీ తో హా ఏసా భికారీ | 
ఫిరే లోకాంచియా దారోదారీ | టాళాయా ఉపాసమారీ గాఈంచీ | ||౫౨|| 
52. ‘మీరు తాలూకాధికారి, గోవుల ఆకలిని నివారించటానికి, ఇంటింటా తిరిగే ఒక బికారిని నేను.
టాకాల జరీ ఎక శబ్ద | హోఈల మాఝే కార్య జలద | 
మిళవాల గోమాతాంచే ఆశీర్వాద | యశ నిర్వివాద లాధాల | ||౫౩|| 
53. ‘మీరు ఒక్క మాట చెప్పితే, నా కార్యం త్వరగా అయిపోతుంది. ఇందులో మీకు యశస్సు తప్పక వస్తుంది గనుక, గోమాత ఆశీర్వాదం కూడా లభిస్తుంది.
పరిసూన సంన్యాసియాచీ వినంతీ | దేవ కాయ ప్రత్యుత్తర కరితీ | 
గాంవాంత దుజియా కార్యా సంప్రతీ | వర్గణీ హాతీ ఘేతలీసే | ||౫౪|| 
54. సన్యాసియొక్క ప్రార్థనలని విని దేవు అతనితో, ‘వేరే పనికోసం, ప్రస్తుతం, ఊరిలో చందాల సేకరణ జరుపుతున్నాము.
రావసాహేబ నరోత్తమ శేటీ | జయా దీనాంచీ దయా పోటీ | 
నగరశేట జే మోఠే ఖటపటీ | తే ఎక పట్టీ ఉగరావతీ | ||౫౫|| 
55. ‘రావుసాహేబు నరోత్తమ సేటు దీనులయందు దయగలవాడు, మరియు, చాలా కార్యదీక్షాపరుడు. ఇప్పుడే ఎంతో కష్ట పడి, వేరొక పనికోసం చందాల జాబితాను తయారు చేస్తున్నాడు.
త్యాంతచి తుమచియా పట్టీస జాగా | హోఈల కైసీ తరీ సాంగా | 
సమయ హా నాహీ తుమచియా ఉపేగా | అసో మగ మాగాహూన పాహూ | ||౫౬|| 
56. ‘ఇలాంటప్పుడు, మీ చందాల కోసం అవకాశం ఎక్కడిది? ఈ సమయం మీకు సానుకూలంగా లేదు. తరువాతెప్పుడైనా చూద్దం.
తరీ ఆపణ దో చార మాసీ | థాంబూన యా కీ యా గాంవాసీ | 
పుఢే మగ పాహూ త్యా సమయాసీ | ఆజ న యాసీ అనుకూలతా | ||౫౭|| 
57. ‘అందువలన, మూడు నాలుగు నెలలాగి, మీరు ఈ ఊరికి రండి. అప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ కార్యం అసలు సాధ్యం కాదు’.
అసో మగ తో తేథూని గేలా | ఝాలా అసేల మహినా యాలా | 
తో తొ తాంగ్యాంత బైసూన ఆలా | పునశ్చ డహాణూలా మాఘారా | ||౫౮|| 
58. సన్యాసి అక్కడినుండి వెళ్లిపోయాడు. సుమారు నెల రోజుల తరువాత, టాంగాలో డహాణుకు మరల వచ్చాడు.
దేవాంచియా దారాంసమోర | వకీల పరాంజపే యాంచే ఘర | 
తేథేంచ టాంగా థాంబల్యానంతర | సంన్యాసీ ఉతరతా దేఖిలా | ||౫౯|| 
59. దేవు ఇంటి ఎదురుగా, వకీలు పరాంజపే ఇల్లు. అక్కడే టాంగా ఆగిన తరువాత, అందులోనుంచి సన్యాసి దిగటం దేవు చూశాడు.
తోచి కీ హా పూర్వీల నిశ్చిత | ఆలా కీ ఆధీంచ వర్గణీనిమిత్త | 
ఏసే దేవ ములాతే వదత | అంతరీ శంకీత హోఊనీ | ||౬౦||
60. దేవు మనసులో అనుమానం వచ్చి, కొడుకుతో ‘ఇంతకు మునుపు, చందాల కోసం వచ్చిన సన్యాసే ఇతడు. చెప్పిన సమయానికి మునుపే వచ్చాడు’ అని అన్నాడు.

నాహీ పురా మహినా ఝాలా | తోంచ హా యేథే కిమర్థ ఆలా | 
విసరలా కా పూర్వీల బోలా | సాశంకతేలా హే మూళ | ||౬౧|| 
61. ‘నెల పూర్తీ కాలేదు, అప్పుడే ఇక్కడికి రావటంలో అర్థం ఏమిటి? మునుపు చెప్పినదానిని మరిచిపోయాడామో అని నా మనసులో అనుమానం’.
తేణే తేథేంచ టాంగా సోడిలా | తేథేంచ కాంహీ కాళ క్రమిలా | 
ఆలా మగ దేవాంచియా ఘరాలా | కాయ మగ లాగలా వదావయా | ||౬౨|| 
62. సన్యాసి దిగిన చోటునే, టాంగాని వదిలివేశాడు. అక్కడే కొంత సేపు ఆగి, దేవు ఇంటికి వచ్చాడు. ఏమన్నాడో వినండి. 
దహా వాజావయాచా వేళ | బ్రాహ్మణభోజనారంభ కాళ | 
పాహూని దేవాంచీ ఘాలమేల | వదే న మజ ఉతావేళ పైశాచీ | ||౬౩|| 
63. అప్పుడింకా పది గంటల వేళ. బ్రాహ్మణుల భోజనాలకు వంట ఆరంభించే వేళ. దేవు మనసులోని అనుమానాన్ని గ్రహించి, ‘నాకు డబ్బు తొందర లేదు. 
“ఆయా హూ న పైసేకే లియే | ఆజ తో హమకూ భోజన చాహియే” | 
దేవ మ్హణాలే ‘ఆవో ఆనంద హై | ఘర ఎ సమఝియే ఆపకా’ | ||౬౪|| 
64. ‘నేను డబ్బుకోసం రాలేదు. ఈ రోజు మాకు భోజనం కావాలి’ అని అన్నాడు. అందుకు దేవు ‘తప్పక రండి, చాలా సంతోషం. ఈ ఇంటిని మీదిగా భావించండి’ అని చెప్పాడు. 
తవ సంన్యాసీ వదే ఇతుక్యాంత | “హమారే దోన బచ్చే హై సాథ” | 
‘బహోత అచ్ఛీ హై ఎ బాత ’ | దేవ మగ మ్హణతాత తయాతే | ||౬౫|| 
65. అంతలో సన్యాసి ‘మాకు ఇద్దరు అబ్బాయిలు తోడున్నారు’ అని అన్నాడు. ‘మరీ మంచిది’ అని చెప్పి దేవు అతనితో, 
హోతా జేవావయా అవకాశ | మ్హణోని దేవ పుసతీ తయాంస | 
‘కహా ఆపకా ఉతారా హై ఖాస | జహా మై తపాసకూ భేజూ’ | ||౬౬|| 
66. ‘భోజనానికి ఇంకా సమయము ఉంది అందుకు, మీరు ఎక్కడ బస చేశారో చెప్పండి, మిమ్మల్ని పిలవడానికి, ఎవరినైనా అక్కడికి పంపిస్తాను’ అని దేవు అన్నాడు. 
“క్యా జరూర కబ మై ఆవూ | కిస ఘంటే మై హాజర రహూ | 
జబ బోలోగే తబ ఆతా హూ” | సంన్యాసీ బోలూ లాగలా | ||౬౭|| 
67. ‘దాని అగత్యమేమిటి? నేను ఎప్పుడు రావాలి? ఎన్ని గంటలకు హాజరవమంటే అప్పుడు వస్తాను’ అని సన్యాసి అన్నాడు. 
‘అచ్ఛా బచ్చే లేకే సాథ | బారా ఘంటే హోనేకే వఖత | 
ఆవో భోజన పావో సంత’ | ఏసే త్వ వదత దేవ తయా | ||౬౮|| 
68. ‘మంచిది, పన్నెండు గంటలకు, అబ్బాయిలను వెంటబెట్టుకుని వచ్చి, భోజనాని స్వీకరించండి’ అని దేవు అతనితో చెప్పాడు. 
అసో మగ తే సంన్యాసీ గేలే | బరోబర బారా హోతా పరతలే | 
జేవావయా తిఘేహీ బైసలే | భోజనీ ధాలే యేథేష్ట | ||౬౯|| 
69. తరువాత, సన్యాసి వెళ్లిపోయాడు. పన్నెండు గంటలకు తిరిగి వచ్చాడు. ముగ్గురూ భోజనానికి కూర్చుని తృప్తిగా కావలిసినంత తిన్నారు. 
హోఊనియా పాకనిష్పత్తీ | బ్రాహ్మణాంచ్యా బైసల్యా పంక్తీ | 
సపరివార సంన్యాసియా ప్రతీ | తృప్త కరితీ యజమాన | ||౭౦||
70. వంటంతా తయారయ్యాక, బ్రాహ్మణులు పంక్తిలో భోజనానికి కూర్చున్నారు. యజమాని వారిని, సన్యాసి మరియు ఇద్దరు అబ్బయిలను, తృప్తి పరచాడు. 

తరీ తయాచే పూర్వ ప్రయోజన | పసరీ ఆవరణ మాయేచే | ||౭౧|| 
71. మరో ఇద్దరినీ వెంటబెట్టుకుని, సన్యాసి తనంతట తానే వచ్చాడు. అయినా, అతడు పూర్వం చందాల కొరకు వచ్చిన మనిషేననే మాయ, దేవు బుద్ధిని ఆవరించింది. 
తేణే హా కోణీతరీ అతీథీ | సావావయా భోజన ప్రాప్తీ | 
ఆలా ఇతుకేంచ దేవాంచే చిత్తీ | దృఢావలీ వృత్తీ మోహాచీ | ||౭౨|| 
72. దాంతో, దేవు మనసుకు, ఎవరో అతిథి భోజనానికి వచ్చాడని అనిపించింది. మాయ దృఢంగా అతని మనసును ఆవరించింది, 
ఎణేపరీ ఝాలీ భోజనే | ఉత్తరాపోశనే శుద్ధాచమనే | 
సుగంధశీతల ఉదకప్రాశనే | ముఖశుద్ధిదానే సంపాదిలీ | ||౭౩|| 
73. ఇలా, భోజనాలు ముగిశాయి. ఉత్తరాపోశనం, శుద్ధాచమనం చేసి, సుగంధ భరితమైన శీతల ఉదకప్రాశన చేసి ముఖశుద్ధి చేసుకున్నారు. 
శిష్టాచార గంధసుమనే | తాంబూల అత్తర గులాబదానే | 
దిధలీ సర్వత్రాంప్రతి బహుమానే | ఆనందానే దేవాంనీ | ||౭౪|| 
74. శిష్టాచారం ప్రకారం గంధం, పూలు, తాంబూలం, అత్తరూ, పన్నీరు బహుమానాలను దేవు అందరికీ సంతోషంగా ఇచ్చాడు. 
అసో మగ ఏసియా ఉపరీ | మండళీ గేలీ ఘరోఘరీ | 
సంన్యాసీహీ నిజపరివారీ | గేలే మాఘారీ నిజస్థళీ | ||౭౫|| 
75. తరువాత, వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్లిపోయారు. సన్యాసి కూడా తనవారితో తన స్థలానికి వెళ్ళిపోయాడు. 
జరీ ఆగంతుక అనిమంత్రిత | తరీ తే వేళీ యేఊని జేవత | 
పరి దేవా న బాబాసే వాటత | సంశయ రాహత మనాంత | ||౭౬|| 
76. సరియైన సమయానికి, ఆహ్వానించకుండానే వచ్చి, భోజనం చేసిన ఆ ఆగంతకుడు, బాబాయే అని దేవుకు తోచలేదు. అతని మనసులో సంశయం అలాగే ఉంది. 
ఏసే జరీ ఘడలే ప్రత్యక్ష | తిఘే అయాచిత వాఢిలే సమక్ష | 
తరీహీ దేవ మనీ సాకాంక్ష | జోగాంచి సాక్ష ఘేతాతచి | ||౭౭|| 
77. తన ఎదుటే ఇన్నీ జరిగినా, పిలవకుండా వచ్చిన ఆ ముగ్గురికీ వడ్డించినా, దేవు మనసులో ఇంకా సంశయం మిగిలి పోయింది. బాబా వచ్చినట్లుగా నిదర్శనం కోసం జోగును కూడా అడిగాడు. 
అసో హోతా ఉద్యాపన పూర్తీ | దేవ తంవ జోగా పత్ర లిహితీ | 
ఏసే కైసే హో బాబా ఫసవితీ | కాయ తే వచనోక్తి వదావీ | ||౭౮|| 
78. దాంతో, ఉద్యాపనం పూర్తి కాగానే, దేవు జోగుకు ఉత్తరం వ్రాశాడు. ‘ఎందుకిలా బాబా నన్ను మభ్య పెట్టారు? ఇక్కడికి తప్పక వస్తానని ఎందుకు చెప్పారు? 
ఆపణహీ సవే యాల | అన్యథాన హోఈల బోల | 
కాంహీ తరీ సాక్ష పటేల | కైసే న వాటేల హే మజలా | ||౭౯|| 
79. ‘మీరు కూడా వెంట వస్తారన్న బాబా మాట అసత్యం కాదు, కాని వారు వచ్చినట్లు నిదర్శనలేమీ నాకు కనిపించలేదు. 
తరీ హీ ఏసీ గత కా ఝాలీ | మాఝీచ కా హీ నిరాశా కేలీ | 
బహుసాక్షేపే వాట పాహిలీ | కాంహీ న ఆలీ ప్రచీతీ | ||౮౦||
80. ‘అయినా, ఎందుకిలా జరిగింది? నన్నే ఎందుకు ఇలా నిరాశ పరిచారు? వారు వస్తారని, ఎంతో ఆశగా ఎదురు చూచాను. కాని, వారు వచ్చినట్లుగా ఏ అనుభవమూ నాకు కలుగలేదు. 

ప్రేమే బాబాంస నిమంత్రితా | యేతో వదలే మజ చరణాగతా | 
పరి తే సర్వ ఝాలే అన్యథా | కైసే హే సర్వథా న కళే మజ | ||౮౧|| 
81. ‘ఎంతో ప్రేమతో వారిని ఆహ్వానించాను, శరణుజొచ్చిన నా వద్దకు, వారు కూడా వస్తానని చెప్పారు. కాని, అవన్నీ వృథా అయింది. ఎందుకు అని నాకేమీ అర్థం కావటం లేదు.
మాఝీ యేణ్యాచీ పరతంత్రతా | అతి కాకుళతీ పత్రీ లిహితా | 
తరీహీ ఆపణ యేణార హే పరిసతా | మజ బహు ధన్యతా వాటలీ | ||౮౨|| 
82. ‘పరతంత్రుణ్ణి గనుక, ఆహ్వానించడానికి స్వయంగా నేను రావటానికి వీలు కాదని, ఎంతో దీనంగా ఉత్తరం వ్రాశాను. అయినా, మీరు వస్తారని తెలిసి, నేను ధన్యుణ్ణని తలచాను. 
ఆతా ఆపణ కవణ్యాహీ మిషే | యేణార వాటలే కవణ్యాహీ వేషే | 
పరి తే కాంహీ న ఘడలే కైసే | ఆశ్చర్య విశేషే వాటతే | ||౮౩|| 
83. ‘ఏ మిషతోనో, ఏ వేషంలోనో మీరు వస్తారని తలచాను. కాని, అలా ఎందుకు జరగలేదా, అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’. 
జోగాంనీ తే సకల వృత్త | సాఈచరణీ కేలే నివేదిత | 
బాబా హోఊని ఆశ్చర్య చకిత | కాయ తయాంప్రత బోలత | ||౮౪|| 
84. ఉత్తరంలోని విషయాలన్నిటినీ, జోగు సాయి పాదాలలో విన్నవించాడు. బాబా ఆశ్చర్య చకితులై, అతనితో ఏమన్నారంటే, 
“పత్ర ఉకలతా మజ పుఢతీ | పత్రాంతర్గత మనోవృత్తీ | 
వాచావయాచే ఆధీంచ నిశ్చితీ | ఉభ్యాచ ఠాకతీ మూర్తిమంత | ||౮౫|| 
85. “ఆ ఉత్తరాన్ని విప్పగానే, చదవక మునుపే, దానిని వ్రాసిన వారి మనసులోని ఆలోచనలు, నాకు కనిపించింది. 
తో వదే మీ మాఝియా బోలే | విశ్వాస దేఊని తయా ఫసవిలే | 
సాంగ తయా త్వా మజ నోళఖిలే | కా మగ బోలవిలే హోతేంస | ||౮౬|| 
86. “నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి, నమ్మించి, తనని మభ్య పెట్టానని అంటున్నాడు కదూ! నన్ను గుర్తు పట్టలేనప్పుడు, మరి నన్నెందుకు పిలిచినట్లు, అని అడుగు. 
లౌకికీ నా యేథూన హాలలో | పరీ మీ ఉద్యాపనీ జేవూని ఆలో | 
దోఘాం సమవేత యేఈన బోలలో | తైసాచ గేలో దొఘాంసవే | ||౮౭|| 
87. “శారీరికంగా నేను ఇక్కడనుండి కదలలేదు. కాని, ఉద్యాపనకు వెళ్ళి, నేను భోజనం చేసి వచ్చాను. ఇద్దరితో సహ వస్తానని అన్నాను. అలాగే ఇద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళాను. 
హోతా జేవావయా అవకాశ | తేవ్హాంచ ఆధీ ఎకటా సావకాశ | 
తుజ నాఠవే కా సంన్యాస వేష | ప్రథమ ప్రవేశ యేరీతీ | ||౮౮|| 
88. “భోజనానికి ఇంకా సమయం ఉంది. అందుకు మెల్లగా నడుస్తూ, నేనొక్కణ్ణే వెళ్ళాను. సన్యాసి వేషం నీకు గుర్తు లేదా? నేను మొదట అలా వెళ్ళాను. 
పాహూని ఆలో అకల్పిత వృత్తీ | పైసే మాగేన తుజ హీ భీతీ | 
వాటలీ నవ్హతీ కా తవ చిత్తీ | సంశయ నివృత్తీ మ్యా కేలీ | ||౮౯|| 
89. “నేను అకస్మాత్తుగా రావటం చూచి, డబ్బు అడుగుతానేమోనని, నీ మనసులో భయం కలుగలేదూ? అప్పుడు నేను నీ సంశయాన్ని తీర్చాను. 
యేఈన కేవళ జేవావయాస | సవే ఘేఊనియా దోఘాంస | 
ఏసే సాంగూనియా వేళేస | నాహీ కా దోఘాంసహ జేవలో | ||౯౦||
90. “కేవలం భోజనానికి వస్తాను, మరో ఇద్దరితో వస్తాను అని చెప్పి, సరియైన సమయానికి, ఇద్దరితో వచ్చి భోజనం చేయలేదూ? 

పహా మీ మాఝియా వచనాకారణే | మరోని జాఈన జీవే ప్రాణే | 
పరి మాఝియా ముఖీంచీ వచనే | అన్యథా హోణే నాహీ కదా” | ||౯౧|| 
91. “చూడూ! నా మాట నిలబెట్టుకోవటానికి, నా ప్రాణం సైతం విడిచి చచ్చిపోతాను. కాని, నా నోటి మాటలెన్నడూ అసత్యం కావు!” 
ఏసే వదతా సాఈనాథా | ఆనంద నావరే జోగాంచ్యా చిత్తా | 
దిధలే వచన వ్హావే న అన్యథా | అనుభవ హా సర్వథా సర్వాంచా | ||౯౨|| 
92. సాయినాథులు అలా అన్నప్పుడు, విని జోగు ఆనందానికి అవధులు లేవు. బాబా ఇచ్చిన వచనం ఎప్పటికీ అసత్యం కాదు. ఇది ఎల్లప్పుడూ అందరికీ అనుభవమే. 
పుఢే మగ హే సర్వ వృత్త | జోగ కళవితీ దేవాంప్రత | 
పత్ర ఎక సవిస్తర ధాడిత | అతి ముదిత మానసే | ||౯౩|| 
93. తరువాత, జోగు సంతోషంతో ఈ సంగతి అంతా, సవిస్తారంగా ఒక పెద్ద ఉత్తరంలో వ్రాసి, దేవుకు తెలియచేశాడు. 
దేవాంనీ జై పత్ర వాచిలే | ప్రేమోద్రేకే నేత్ర ఓథంబలే | 
ధిక్‍ ధిక్‍ వ్యర్థ సాఈస దూషిలే | బహు హిరముసలే మనాంత | ||౯౪|| 
94. ఆ ఉత్తరాన్ని దేవు చదవగానే, ప్రేమోద్రేకంతో అతని కళ్లు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ‘ఛీ! ఛీ! అనవసరంగా సాయిను దూషించాను’, అని తనలో తానే లజ్జితుడయ్యాడు. 
ధన్య బాబాంచే మహిమాన | ధిక్‍ మాఝ్యా జాణివేచా అభిమాన | 
పరి బాబాచ సంన్యాసీ హే అనుమాన | వ్హావే తే కైసే న మజ కళే | ||౯౫|| 
95. ‘బాబా మహిమ ధన్యం. ఛీ! అన్నీ నాకే తెలుసు, అని దురభిమాన పడ్డాను. ఎంత సిగ్గుచేటు! కాని, బాబాయే ఆ సన్యాసి, అనే ఆలోచన నాకు ఎందుకు కలగలేదో అర్థం కావటం లేదు. 
కారణ బాబాంస కేలే నిమంత్రణ | త్యా ఆధీంచ త్యా ప్రథమాభిగమన | 
తేంహీ తయాచ్యా కార్యా లాగూన | భేటీస ప్రయోజన పట్టీచే | ||౯౬|| 
96. ‘బాబాను ఆహ్వానించక మునుపే, సన్యాసి మొదట వచ్చాడు. అది కూడా, చందాలు వసూలు చేసే తన పని మీద వచ్చాడు. 
తయా దిధలీ హోతీ ముదత | దో చార మాసా యావే పరత | 
తోచ తో జరీ భోజన మాగత | హోఈల కా అనుమిత బాబాచ తే | ||౯౭|| 
97. ‘అప్పుడే, మూడు నాలుగు మాసాల గడువు ఇచ్చను. మరల తరువాత రమ్మని అతనికి చెప్పాను. అయినా, అకస్మాత్తుగా వచ్చి, భోజనానికి వచ్చానని అతడే అంటే, అతడు బాబాయే అని నేనెలా అనుకోను? 
మాత్ర ఎకచి బాబాంచే వచన | యేఈన జేవ్హా కరాయా భోజన | 
మాఝియాసంగే యేతీల దోన | విసరలో మీ భాన తయాచే | ||౯౮|| 
98. ‘కాని, భోజనానికి వచ్చినప్పుడు, “నాతో మరో ఇద్దరు కూడా వస్తారు”, అన్న బాబా మాట ఒక్కటి మాత్రం, నేను మరచిపోయాను. 
బాబాంచియా ఆమంత్రణాపాఠీ | పడతీ జరీ యాసీ ప్రథమ గాఠీ | 
తీహీ కేవళ జేవణాసాఠీ | తరీ న హే దిఠీ6 చాకాటతీ7 | ||౯౯|| 
99. ‘బాబాను ఆహ్వానించిన తరువాత, మొదటి సారిగా సన్యాసిని కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనానికి వచ్చి ఉంటే, నా కళ్ళు నన్ను మోసపుచ్చేవి కావు. 
పరి తో ఆలా గోరక్షణ నిమిత్త | మిళవావయా గోగ్రాసవిత్త | 
తయానంతర తే సాఈప్రత | ఆమంత్రణ జాత ఉద్యాపనా | ||౧౦౦||
100. ‘కాని, అతడు గోరక్షణ కోసం, గోగ్రాసానికి డబ్బు సేకరించాలని వచ్చాడు. ఆ తరువాతే, ఉద్యాపనకు రమ్మని సాయికు ఆహ్వానం పంపటం. 

మ్హణోని ఏసా మోహ పడలా | తేణే హా ఏసా ప్రకార ఘడలా | 
జరీ దోఘాంసహ యేఊన జేవలా | తరీ తో భాసలా అన్నార్థీ | ||౧౦౧|| 
101. ‘అందుకే, మోహం నా మనసును ఆవరించడం వలన, ఇలా జరిగింది. భోజనానికోసమే ఇద్దరితో వచ్చినా, సన్యాసిని, ఉద్యాపన కోసం వచ్చిన ఒక అతిథి, అని అనుకున్నాను.
నసతా కోణీ పూర్వపరిచిత | భోజనసమయీ యేతా అకల్పిత | 
ఘేఊని కోణీహీ దోఘే సమవేత | సాఈచ తే నిశ్చిత వాటతే | ||౧౦౨|| 
102. ‘పూర్వ పరిచయం లేని వారెవరైనా, ఇద్దరితో భోజన సమయానికి అకస్మాత్తుగా వచ్చి ఉంటే, వచ్చినది సాయియే అని నిశ్చయంగా అనిపించేది’.
పరి యా సంతాంచీ ఏసీచ రీతీ | అఘటిత లీలా అద్భుతకృతీ | 
భక్తాంఘరీంచీ కార్యస్థితీ | స్వయేంచి యోజితీ త్యాఆధీ | ||౧౦౩|| 
103. కాని, ఈ సంతుల పద్ధతి ఇంతే. అంత వరకూ జరగని, అద్భుత లీలను చేస్తారు. భక్తుల ఇళ్ళల్లోని పనులను, వారు చాలా మునుపే, ప్రణాళికగా సిద్ధం చేసి ఉంచుతారు.
భక్త వినటతా నిజచరణీ | తయాచియా శుభకార్యాచీ సంపాదణీ | 
ఏసీచ హోతే అకల్పితపణీ | అతర్క్య కరణీ సంతాంచీ | ||౧౦౪|| 
104. వారి పాదాలలో శరణుజొచ్చిన భక్తుల యొక్క శుభకార్యాలను, ఇలా చక్కగా ఊహించని విధంగా జరిపిస్తారు. ఈ సంతుల చర్యలు తర్కానికి దొరకనివి.
చింతిలేంచి దే చింతామణీ | కల్పవృక్ష దే కల్పిలే మనీ | 
కామధేనూ తే కామప్రసవిణీ | అచింత్యదానీ గురుమాయ | ||౧౦౫|| 
105. తలచిన దానిని, చింతామణి ఇస్తుంది. మనసు కల్పించిన దానిని, కల్పవృక్షం ఇస్తుంది. కామధేనువు, కోరుకున్న వానిని ప్రసాదిస్తుంది. ఆలోచనకు అందని దానిని, గురుదేవులు ప్రసాదిస్తారు.
అసో యే ఠాయీ బాబా నిమంత్రిత | సంన్యాసియాచ్యా రూపే ప్రగటత | 
పరి తయాంచీ లీలా అఘటిత | అయాచితహీ యేత కధీ | ||౧౦౬|| 
106. ఇక్కడ, ఆహ్వానింప బడిన తరువాత, బాబా సన్యాసి రూపంలో కనిపించారు. వారి లీలలు ఎంత విచిత్రం అంటే, ఒక్కోసారి, పిలవకుండానే వస్తారు.
కధీ ఛాయాచిత్రరూపే | కధీ పార్థీవ మూర్తిస్వరూపే | 
పార నాహీ తయాంచ్యా కృపే | ప్రగటతీ ఆపేఆప కధీ | ||౧౦౭|| 
107. ఒకప్పుడు చిత్రపటం రూపంలోనో, ఒకప్పుడు మూర్తిగానో, వచ్చే వారి కృపకు అంతు లేదు. కొన్ని మార్లు, తమంతట తామే కనిపిస్తారు.
యే అర్థీంచా మాఝా అనుభవ | పరిసతా శ్రోతయా వాటేల నవలావ | 
కళేల సాఈలీలా ప్రభావ | కథాహీ అభినవ అపూర్వ | ||౧౦౮|| 
108. ఈ సందర్భంలో, నా అనుభవాన్ని వింటే, శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. సాయి లీలల ప్రభావం, అపూర్వమూ, అభినవమూ అయిన ఈ కథను వింటే అర్థమౌతుంది.
హీ కా కథా కీ హీ కాహాణీ | ఏసేహీ ఈస వదేల కోణీ | 
మ్హణావే తే ఖుశాల త్యాంణీ | పరియే శ్రవణీ సాదర వ్హా | ||౧౦౯|| 
109. కొందరు దీనిని ‘ఇది నిజమైన కథా లేక కల్పితమైనదా’ అని అనుకోవచ్చు. వారు ఏమనుకున్నా, మీరు మాత్రం సాదరంగా వినండి.
ఆళస నిద్రా తంద్రా టాకూన | హోఊనియా సావధాన | 
కథా హీ పరిసా ద్యా హే దాన | హోఈల సమాధాన మన మాఝే | ||౧౧౦||
110. సోమరితనాన్ని, నిద్రను పక్కన పెట్టి, సావధానులై, శ్రద్ధగా కథా శ్రవణ దానాన్ని నాకు ప్రదానం చేస్తేనే, నాకు సంతృప్తి.

వ్యగ్రతా క్షణ ఝుగారూన | స్వస్థచిత్త అవ్యగ్రమన | 
ఝాలియా కామా యేఈల శ్రవణ | పుఢే మగ మనన నిజధ్యాస | ||౧౧౧|| 
111. క్షణ కాలం పాటు, మీ చింతలను విడచి, ప్రశాంతమైన మనసులతో, శ్రవణం చేస్తే, అది లాభిస్తుంది. శ్రవణం తరువాత మననం, నిధి ధ్యాసనం. 
తేథూన పుఢే సాక్షాత్కార | పరి యా సర్వా శ్రవణ ఆధార | 
తేంచ కీ యా సర్వాంచే సార | నిశ్చయే భవపార త్యాచేని | ||౧౧౨|| 
112. ఆ పైన, సాక్షాత్కారం. వీటన్నింటికీ వినటమే ఆధారం. అదే అన్నింటికీ సారం. వినటం ద్వారా నిశ్చయంగా, సంసార సాగరాన్ని దాట వచ్చును.
సన ఎకోణీసశే సతరా ఇసవీసీ | ఫాల్గూన శుద్ధ పౌర్ణిమేసీ | 
శేజే నిద్రిస్త అసతా పహాటేసీ | స్వప్న ఎక మజసీ జాహలే | ||౧౧౩|| 
113. క్రి. శ. ౧౯౧౭ వ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ నాడు, శయ్యపై నిద్రిస్తుండగా, తెల్లవారు ఝామున నాకు ఒక కల వచ్చింది.
పహా సాఈచే విచేష్టిత | సుందరవేష సంన్యాసీ హోత | 
దేఊని దర్శన మజ జాగవీత | “భోజనా మీ యేత ఆజ” వదే | ||౧౧౪|| 
114. సాయియొక్క ఈ చర్యను గమనించండి. చక్కని సన్యాసి రూపంలో నాకు దర్శనమిచ్చి, “నేను ఇవాళ భోజనానికి వస్తాను” అని చెప్పారు.
స్వప్నామాజీల జాగృతపణ | తేంహీ కేవళ స్వప్నచి పూర్ణ | 
కారణ జాగృత హోతా మీ ఆపణ | కరాయా ఆఠవణ లాగలో | ||౧౧౫|| 
115. కలలో మేలుకోవటం కూడా, కలలోని భాగమే. ఎందుకంటే, నిద్రలోంచి మేల్కొన్న తరువాత, కలను గుర్తుకు తెచ్చుకున్నాను.
డోళే ఉఘడూని పాహూ లాగే | నాహీ సాఈ న కోణీ తే జాగే | 
స్వప్నచితే జే క్షణా మాగే | యత్కించిత జాగేంపణ నవ్హతే | ||౧౧౬|| 
116. కళ్లు తెరచి చూస్తే, సాయి కాని, వేరెవరైనా కాని, అక్కడ లేరు. క్షణం మునుపు, అది కలే, ఖచ్చితంగా మేల్కొన్న స్థితి కాదు.
ఏసీ హోతా మనాచీ నిశ్చితీ | ఆఠవూ లాగలో స్వప్నస్థితి | 
అక్షరే అక్షర ఆఠవలే చిత్తీ | లవమాత్ర విస్మృతీ విరహీత | ||౧౧౭|| 
117. అలా నిర్ధరించుకున్న తరువాత, కలలోని విషయాలన్నిటినీ, కొంచెం కూడా మరచి పోకుండా, అక్షరం, అక్షరం గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించాను.
“యేతో మీ ఆజ భోజనాస” | యా సాఈచ్యా స్పష్టోక్తీస | 
ఏకూని ఆనందలో జీవాస | కళవిలే కలత్రాస హే వృత్త | ||౧౧౮|| 
118. “నేను ఇవాళ భోజనానికి వస్తాను” అని సాయి స్పష్టంగా చెప్పిన మాటలను విని, చాలా ఆనందం కలిగింది. ఈ సంగతి నా భార్యకు తెలియజేశాను.
ధ్యానీ మనీ సాఈచా ధ్యాస | హా తో నిరంతరచా అభ్యాస | 
సాత వర్షాంచా జరీ సహవాస | ఆస న భాస భోజనాచా | ||౧౧౯|| 
119. మనసులో నిరంతరం సాయినే స్మరిస్తూ, ధ్యానిస్తూ ఉండటం అలవాటే. ఏడు ఏళ్ళు వారి సహవాసంలో ఉన్నా, వారు భోజనానికి వస్తారని ఎప్పుడూ అనుకోలేదు.
అసో తిజలా ఠేవిలే సాంగూన | ఆహే ఆజ హోళీచా సణ | 
ఎక టిపరీ8 అధిక ఆధణ | ఘాలాయా ఆఠవణ ఠేవావీ | ||౧౨౦||
120. అయినా, ఆమెతో, ‘ఇవాళ హోలీ పండుగ. పావు శేరు బియ్యం ఎక్కువగా వండటం గుర్తుంచుకో’ అని చెప్పాను.

హే ఇతుకేంచి కళవితా తీస | లాగలీ కారణ పుసావయాస | 
మీ మ్హణే ఆజ జేవావయాస | పాహుణా యా సణాస యేణార | ||౧౨౧|| 
121. ఇంత చెప్పగానే, ఆమె కారణాన్ని అడిగింది. ‘ఈ రోజు పండుగ రోజు. భోజనానికి ఒక అతిథి వస్తున్నారు’ అని చెప్పాను.
తవ తీ మ్హణే సాంగా కోణ | జిజ్ఞాసా తీస జాహలీ దారుణ | 
పరీ మీ సాంగతా ఖరే కారణ | ఉపహాసా భాజన హోణార | ||౧౨౨|| 
122. దాంతో, ఆమె కుతూహలం ఇంకా బాగా పెరిగి, ‘ఎవరు వస్తున్నారని’ అడిగింది. అసలు విషయం చెప్తే, నేను అపహాస్యం పాలవుతాను. 
హేంహీ మజ ఠావే పూర్ణ | తరీహీ న వ్హావే సత్య ప్రతారణ | 
మ్హణోని శ్రద్ధాపూర్వక జాణ | కేలే మీ నివేదన సత్యత్వే | ||౧౨౩|| 
123. అని నాకు బాగా తెలుసు. అయినా, అసత్యాన్ని పలుకరాదని, ఎంతో శ్రద్ధగా, ఆమెకు నిజాన్ని చెప్పాను. 
తరీ హే ఆహే శ్రద్ధేవరీ | జైసీ జయా జాణీవ అంతరీ | 
వార్తా ఖోటీ అథవా ఖరీ | హే తో మనావరీ సర్వథైవ | ||౧౨౪|| 
124. ఇవన్నీ శ్రద్ధా విశ్వాసలపై ఆధారపడి ఉంటాయి. సత్యం, అసత్యం అనేవి ఎల్లప్పుడూ, వారి వారి మనోభావాలను అనుసరించి ఉంటాయి. 
కితీహీ తిచీ కరితా ఖాతరీ | వార్తా పటేనా తియేచే అంతరీ | 
తీ మ్హణే బాబా శిరడీహూని దురీ | కశాసహీ తరీ యేతీల | ||౧౨౫|| 
125. ఆమెను నమ్మించాలని ఎంత ప్రయత్నించినా, ఆమెకు విశ్వాసం కలగలేదు. ‘బాబా శిరిడీనుండి ఇంత దూరం ఎందుకు వస్తారు?’ అని అడిగింది. 
ఆపులే యేథీల కాయ భోజన | కశాచా ఆపులా హోళీచా సణ | 
టాకూనియా శిరడీంచే మిష్టాన్న | సేవితీల కదన్న కా యేథే | ||౧౨౬|| 
126. ‘మన దగ్గరకు రావడానికి, మన హోలీ పండుగలో విశేషమేముంది? శిరిడీలోని మృష్టాన్న భోజనాలను వదిలి, మన సాధారణ భోజనాన్ని సేవిస్తారా?’ అని అన్నది. 
యేణే పరీ తిచే భాషణ | మీ మ్హణే ఎక టిపరీచే ఆధణ | 
ఠేవితా ఆపణా సాయాస కోణ | టిపరీచీ వాణ నాహీ తుజే | ||౧౨౭|| 
127. ఆమె అలా అనగా ‘ఒక పావు ఎక్కువగా వండటానికి నీకేం శ్రమ? పావు బియ్యం నీకు లోటయ్యిందా? 
ప్రత్యక్ష యేతీల సాఈచ పాహుణే | ఏసే తుజలా మీహీ న మ్హణే | 
పరి ఘడేల కోణాచే తరీ యేణే | హే నిఃశంకపణే మజ వాటే | ||౧౨౮|| 
128. ‘నేను కూడా ప్రత్యక్షంగా, సాయి అతిథిగా వస్తారని చెప్పలేదు. ఎవరో ఖచ్చితంగా వస్తారని మాత్రం నా నమ్మకం. 
మగ తూ మనీ కైసేంహీ మాన | మీ త్యా మానీన సాఈసమాన | 
కింబహునా ప్రత్యక్ష సాఈ న ఆన | అన్వర్థ స్వప్న హోఈల మజ | ||౧౨౯|| 
129. ‘వచ్చినవారిని నీవెలా అనుకున్నా సరే, నేను మాత్రం వారిని, సాయి సమానులుగా భావిస్తాను. అంతే కాదు, వారు ప్రత్యక్షంగా సాయియే, అని భావిస్తాను. నా కల నిజమై తీరుతుంది’ అని అన్నాను. 
అసో ఏసే జాహలే భాషణ | పుఢే పాతలా సమయ మాధ్యాన్హ | 
హోతా యథావిధి హోలికా పూజన | మాండిలీ భోజనపత్రావలీ | ||౧౩౦||
130. మా సంభాషణ అలా జరిగింది. తరువాత, మధ్యాహ్న సమయానికి, యథావిధిగా హోలికా పూజ ముగిసింది. భోజనానికి విస్తర్లు వేశారు. 

ఆదీకరూన పుత్రపౌత్ర | దుహితా జామాత ఇష్టమిత్ర | 
పంక్తీ మాండిల్యా సపీఠపాత్ర | ఘాతల్యా విచిత్ర రాంగోళ్యా | ||౧౩౧|| 
131. పుత్రులు, పౌత్రులు, కూతురు, అల్లుడూ, బంధుమిత్రులూ, మొదలైన వారందరి కోసం పంక్తులలో పీటలు, విస్తర్లూ వేశారు. విస్తర్ల చుట్టూ అందమైన, రంగు రంగుల ముగ్గులతో అలంకరించారు. 
త్యాంతచి ఎకా ముఖ్యపంక్తీ | పాట మాండిలా మధ్యవర్తీ | 
పాత్ర ఎక సాఈప్రతీ | ఇతరాం సమవేతీ వాఢలే | ||౧౩౨|| 
132. వీటన్నీటిలో ఒక ముఖ్య పంక్తిలో, మధ్యన, సాయికోసం ఒక పీటవేసి, పళ్లెంలో అందరితో పాటు వడ్డించారు. 
పాత్రాభోంవతీ రాంగోళీ | ఘాతలీ రంగీబేరంగీ నిళీ | 
ప్రత్యేకా తాంబ్యా పంచపాత్రీపళీ | సర్వాసమేళీ సమసగట | ||౧౩౩|| 
133. పళ్లెం చుట్టూ, రంగు రంగుల ముగ్గులు వేశారు. అందరి దగ్గరా చెంబు, పంచపాత్ర,, ఉద్ధరిణి జత పరచారు. 
పాపడ సాండగే కోశింబిరీ | వాఢిలీ లోణచీ రాయతీ సాజిరీ | 
పరోపరీచ్యా భాజ్యా ఖిరీ | జాహలీ తయారీ బహుతేక | ||౧౩౪|| 
134. అప్పడాలు, వడియాలు, వడపప్పు, ఊరగాయ, పెరుగు పచ్చడి, రకరకాల కూరలు, పాయసం, వగైరా చాలా రకాల భక్ష్యాలు తయారయ్యాయి. 
పాహూనియా బారా ఝాలే | జేవణారే సోంవళీ నేసలే | 
యేఊని ఎకేక పాటీ బైసలే | తోంహీ న ఆలే కోణీ దుజే | ||౧౩౫|| 
135. సమయం పన్నెండు గంటలవడం చూసి, భోజనకర్తలందరూ మడి కట్టుకుని వచ్చి, ఒక్కొక్కరూ పీటలపై కూర్చున్నారు. అయినా, వేరేవారెవరూ రాలేదు. 
సర్వ పాత్రే గేలీ భరోన | వాఢిలే భాత పోళీ వరాన్న | 
రిత్యా మధ్యవర్తీ పాత్రావాంచూన | కాంహీ న న్యూన తే జాగీ | ||౧౩౬|| 
136. అన్ని విస్తర్లలోనూ నిండుగా రొట్టెలు, అన్నం, పప్పు, అన్నీ వడ్డించారు. మధ్యన ఉన్న ఖాళీ స్థలానికి, రావలసిన అతిథి తప్ప, అక్కడ ఏ లోటూ లేదు. 
కోణీ పాహుణా అథవా అతిథీ | యేఈల మ్హణూన మార్గ లక్షితీ | 
జాహలో మీ సాశంక చిత్తీ | వాట తీ కితీ పహావీ | ||౧౩౭|| 
137. అందరూ, ఎవరైనా అతిథి రావచ్చు, అని ఎదురు చూశాము. నా మనసులో అనుమానం మొలకెత్తింది. అలా ఎంత సేపని ఎదురు చూస్తాం? 
మ్హణోని దిధలీ దారాస కడీ | అన్నశుద్ధీ వాఢిలీ తాంతడీ | 
వైశ్వదేవ నైవేద్య పరవడీ | అన్నార్పణ ఘడీ పాతలీ | ||౧౩౮|| 
138. అని నేను వెళ్ళి తలుపు గడియ పెట్టాను. వెంటనే అన్నశుద్ధికి (వడ్డించిన అన్నం మీద నెయ్యి వేయడం) మీద నేతిని వడ్డించారు. వైశ్వదేవునకు నైవేద్యం అర్పించే సమయాన. 
ఆతా ఘేణార ప్రాణాహుతీ | ఇతుక్యాంత జిన్యావర పాఊలే వాజతీ | 
‘రావసాహేబ కోఠే’ కీ వదతీ | బైసలే బైసతీ నివాంత | ||౧౩౯|| 
139. భోక్తలందరూ ప్రాణాహుతిని (పంచ వాయువులకు ఆహారమివ్వడం) ఇవ్వపోతుండగా, మెట్లపైన పాదాల చప్పుడు వినిపించి, ‘రావు సాహేబు ఎక్కడ’ అన్న మాట వినిపించే సరికి, కూర్చున్నవారు కూర్చున్నట్టే నిశ్శబ్దంగా ఉండిపోయారు. 
తంవ మీ తైసాచ గేలో దారీ | వాటలే కోణీ ఆలే అంతరీ | 
హళూచ దారాచీ కడీ జో సారీ | దిసలే జిన్యావరీ దోఘేజణ | ||౧౪౦||
140. అలా ఎవరో వచ్చారని నేను వెళ్ళి మెల్లగా తలుపు గడియ తీసేసరికి, మెట్లపైన ఇద్దరు వ్యక్తులు కనిపించారు. 

త్యాంతీల ఎక అల్లీ మహమద | దుజే సంత మౌలానా శాగ్రిద9
ఇస్మూ ముజావర నామాభిధ | ఆనందప్రద దోఘేహీ | ||౧౪౧|| 
141. వారిలో ఒకరు అల్లీమొహమ్మదు. రెండవ వారు మౌలానా శిష్యుడు. ఇస్మూ ముజావర అని వారి పేరు. ఇద్దరూ చాలా ఆనందంగా ఉన్నారు.
పానే వాఢూని మండళీ బైసలీ | భోజనాచీ తయారీ దేఖిలీ | 
పాహోని అల్లీనే వినంతీ కేలీ | తసదీ మీ దిధలీ క్షమా కరా | ||౧౪౨|| 
142. విస్తర్లలో అన్నీ వడ్డించి ఉండటం, భోజనానికి అందరు సిద్ధంగా కూర్చోవటం చూచి, ‘క్షమించాలి. మీకు శ్రమ కలిగించాను’ అని అల్లీ అన్నాడు. 
వాటతే ఆపణ జేవణావరూన | ఆలా మజకరితా ధాంవూన | 
ఆపణాలాగీ హాత ధరూన | పంక్తీ హీ ఖోళంబూన రాహిలీ | ||౧౪౩|| 
143. ‘నాకోసం, మీరు భోజనం ముందునుండి లేచి వచ్చినట్లుంది. మీకోసం పంక్తిలో అందరూ వేచి ఉన్నారు. 
తరీ ఘ్యాహీ ఆపులీ వస్త | మగ మీ భేటేన హోతా ఫురసత | 
సాంగేన నవలావ ఇత్థంభూత | అత్యద్భుత యే విషయీచా | ||౧౪౪|| 
144. ‘అందువలన, ఇదిగో మీ వస్తువును తీసుకొండి. వీలైనప్పుడు నేను మళ్ళీ కలుస్తాను. అప్పుడు, మీకు ఈ విషయం గురించి, జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను వివరంగా చెప్తాను’. 
ఏసే వదూన ఖాకేంతూన | అల్లీ ఎక పుడకే కాఢూన | 
టేబలావర సన్ముఖ ఠేవూన | సోడవూ గాంఠవణ లాగలా | ||౧౪౫|| 
145. అలా అని, తన చేతిలో ఉన్న ఒక ప్యాకెట్టును టేబలుపైన ఉంచి, దానికి కట్టిన ముడిని అల్లీ విప్పసాగాడు. 
కాఢితా వృత్తపత్రాచే వేష్టణ | దిసలీ సాఈచీ మూర్తీ తత్‍క్షణ | 
మ్హణే హీ ఠేవా వస్తు ఆపణ | కరా హీ వినవణ మాన్య మాఝీ | ||౧౪౬|| 
146. పైన కప్పిన వార్తాపత్రికను విప్పిన వెంటనే, సాయియొక్క మూర్తి కనిపించింది. ‘నా మనవిని మన్నించి ఈ వస్తువును మీ వద్ద ఉంచండి’ అని అతడు అన్నాడు. 
పాహతా సాఈచీ తసబీర | రోమాంచ ఉఠలే శరీరావర | 
చరణావరీ ఠేవిలే శిర | జాహలే అంతర సద్గదిత | ||౧౪౭|| 
147. సాయి మూర్తిని చూడగానే, నా శరీరం రోమాంచితమైంది. గద్గదమైన హృదయంతో, వారి పాదాలయందు నా శిరసునుంచాను. 
వాటలా మోఠా చమత్కార | హీ సాఈచీ లీలా విచిత్ర | 
వాటలే మజ కేలే పవిత్ర | దావూని చరిత్ర హే ఏసే | ||౧౪౮|| 
148. సాయియొక్క విచిత్రమైన ఈ లీలను చూచి, గొప్ప చమత్కారం జరిగినట్లు అనిపించింది. వారి అద్భుతమైన శక్తిని ప్రదర్శించి, నన్ను పవిత్రునిగా చేశారని అనిపించింది. 
ఉఠలీ ప్రబళ ఉత్కంఠా మనీ | ఆణిలీ హీ తసబీర కోఠుని | 
తో మ్హణే మీ ఎకా దుకానీ | వికత ఘేఊని ఆణిలీసే | ||౧౪౯|| 
149. మనసులో వచ్చిన ప్రబలమైన ఉత్సుకతతో, ‘ఈ చిత్రాన్ని ఎక్కడినుండి తెచ్చావని’ అడగగా, ‘అంగడిలో కొన్నాను’ అని అన్నాడు. 
పుఢే మగ తే దోఘేజణ | ఉభే న రాహతీ ఎకహీ క్షణ | 
మ్హణాలే ఆతా జాతో ఆపణ | కరావే భోజన స్వస్థపణే | ||౧౫౦||
150. తరువాత, క్షణమైనా నిలబడకుండా, ఆ ఇద్దరూ ‘మేమిక వెళ్తాం. మీరు ప్రశాంతంగా భోజనం చేయండి. 

ఆతాంచ యా గోష్టీచే కారణ | కథూ జాతా కేవళ నిష్కారణ | 
ఖోళంబేల మండళీచే జేవణ | తే మీ మగ కథీన సావకాశ | ||౧౫౧|| 
151. ‘ఈ మూర్తి గురించి ఇప్పుడు వివరించానంటే, అనవసరంగా అందరి భోజనాలకు ఆలస్యమైపోతుంది. అందుకు, మరొకప్పుడు, నేను మీకు సావకాశంగా చెబుతాను’ అని అన్నాడు. 
మలాహీ తే వాటలే సమర్పక | తసబీర వేళీ ఆలీ హా హరిఖ | 
తయాంతచి మీ జాహలో గర్క | ఆభారప్రదర్శక ఉద్గారలో | ||౧౫౨|| 
152. అదే సరియైనదని నాకూ అనిపించింది. అంతే కాకుండా, సమయానికి సరిగ్గా, బాబా మూర్తి రావటంలో కలిగిన సంతోషంనుంచి, నేనింకా తేరుకోలేదు. అందుకు, ఆ ఇద్దరికీ కృతజ్ఞత చెప్పాను. 
బరే ఆతా యావే ఆపణ | ఆమ్హీహీ పుఢే కరూ నివేదన | 
తసబీర యేథే యేణ్యాచే కారణ | ఆజచి ప్రయోజన కాయ తిచే | ||౧౫౩|| 
153. ‘సరే, మీరిక వెళ్ళండి. నేను కూడా ఈ మూర్తి ఇక్కడికి రావటానికి గల కారణం, తరువాత మనవి చేస్తాను. ఈ రోజే చెప్పి ప్రయోజనమేమిటి?’ అని అన్నాను. 
అసో పుఢే తే గేలియాపాఠీ | యథానిశ్చిత సాఈసాఠీ | 
మధ్యవర్తీ స్థాపిల్యా పీఠీ | నేఊని తీ పాటీ ప్రస్థాపిలీ | ||౧౫౪|| 
154. అలా వారు వెళ్ళిపోయిన తరువాత, మధ్య పంక్తిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీటపైన, సాయిమూర్తిని ఉంచాను. 
సుఖావలే అవఘ్యాంచే మన | అతర్క్య సాఈచే విందాన | 
ఎణేమిషే కరూని ఆగమన | స్వప్నీచే వచన సత్య కేలే | ||౧౫౫|| 
155. అందరి మనసులూ ఆనందంతో నిండిపోయాయి. నిజంగా, సాయి లీల అనుకోనిది, అమోఘం. ఈ రీతిగా వచ్చి, కలలోని వారి మాటలను నిజమని నిరూపించారు. 
ఆలాచ తర కోణీ అతిథీ | యేఊని తేథే బైసేల పంక్తీ | 
హీచ అపేక్షా జ్యాంచియే చిత్తీ | ఆశ్చర్య కితీ హే తయా | ||౧౫౬|| 
156. ఎవరో అతిథి వస్తే, వచ్చిన ఆ మనిషి పంక్తిలో కూర్చుంటాడు, అని అనుకున్న వారందరికీ ఎంతటి ఆశ్చర్యం కలిగిందో. 
పాహోని చిత్రీంచీ సుందర మూర్తీ | పరమ ఆల్హాద సకళాంప్రతీ | 
కైసే హే ఘడలే అకల్పిత రీతీ | ఆశ్చర్య కరితీ సమస్త | ||౧౫౭|| 
157. అందమైన మూర్తిని చూచి, అందరికీ పరమానందం కలిగింది. ఈ అనుకోని సంగతి, ఈ రీతిలో ఎలా సంభవించిందా, అని అందరికి ఆశ్చర్యం. 
ఏసే హోతా ప్రతిష్ఠాపన | కేలే అర్ఘ్య పాద్యాది పూజన | 
భక్తిప్రేమే నైవేద్య సమర్పణ | అవఘీ మగ భోజన ఆరంభిలే | ||౧౫౮|| 
158. ఇలా సాయిమూర్తిని పీటమీద ప్రతిష్ఠాపన చేసి, అర్ఘ్యపాద్యాది పూజలు చేసి, భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పించిన తరువాత, అందరం భోజనాలను ఆరంభించాం. 
తై పాసావ హా కాళవర | ప్రత్యేక హోళీస హీ తసబీర | 
కరవూని ఘేఈ హే శిష్టాచార | అష్టోపచార పూజేసహ | ||౧౫౯|| 
159. అప్పటినుండి ఇప్పటివరకూ, ప్రతి హోలీ పండుగనాడు, శిష్టాచారం ప్రకారం, మూర్తిగా వచ్చిన బాబా, అష్టోపచార పూజను స్వీకరిస్తారు. 
ఇతర పూజేంతీల దేవాంసహిత | హీహీ దేవ్హారీ పూజిలీ జాత | 
ఏసే హే సాఈ అపూర్వ చరిత | భక్తాంసి దావీత పదోపదీ | ||౧౬౦||
160. పూజాగదిలోని ఇతర దేవతలతో పాటు, ఈ మూర్తి కూడా పూజింప బడుతుంది. అడుగడుగున, తమ భక్తులకు, ఈ రీతిగా తమ అపూర్వ లీలలను సాయి చూపిస్తుంటారు. 

అసో పుఢే హే దోఘేజణ | ఆజ ఉద్యా భేటూ మ్హణూన | 
వర్షే నఊ గేలీ నిఘూన | తరీహీ న దర్శన తయాంచే | ||౧౬౧|| 
161. ఆ తరువాత, ఇవాళో రేపో కలుస్తామని చెప్పిన ఆ ఇద్దరూ, చూస్తూ చూస్తూ తొమ్మిది సంవత్సారలు గడిచిపోయినా, కనిపించలేదు.
కర్మధర్మసంయోగే శేవట | అల్లీ మహమద యాచీ గాంఠ | 
పడలీ యందా జాహలీ భేట | సహజ మీ వాట చాలతా | ||౧౬౨|| 
162. చివరకు, కర్మ ధర్మ కలయిక వలన, దారిన నేను వెడుతుండగా, అల్లీ మహమదును కలవడం జరిగింది. 
భేట హోతాంచ జాహలో ఉత్సుక | తసబిరీచే పుసావయా కౌతుక | 
కా హో ఇతుకీ వర్ష మూక | వృత్తీచే సేవక బనలా తుమ్హీ | ||౧౬౩|| 
163. కలిసిన వెంటనే, మూర్తి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో ‘ఇన్నేళ్ళూ ఎందుకు మౌనంగా ఉండిపోయావు?’ అని అడిగాను. 
జైసీ పూర్వీ తైసీచ ఆజ | పడలీ అవచిత గాంఠీ మజ | 
యోగ ఆలా ఆహే సహజ | సాంగా తీ మౌజ సమగ్ర | ||౧౬౪|| 
164. ‘ఈ రోజు కూడా, మునపటి వలనే కలుసుకున్నాం. అనుకోకుండగా అవకాశం వచ్చింది గనుక, ఆసక్తికరమైన ఆ సంఘటన గురించి, సమగ్రంగా చెప్పు. 
తుమ్హీహీ శ్రీసాఈచే భక్త | ఆహే ఠావే హే మజ సమస్త | 
పరి తే దివసీంచ కైసే అవచిత | యావే హే ఉచిత వాటలే ? | ||౧౬౫|| 
165. ‘నీవు కూడా శ్రీసాయి భక్తుడవని నాకు తెలుసు. అయినా, ఆ రోజే రావాలని నీకెందుకనిపించింది?’ అని అడిగాను. 
మగ తో అల్లీ వదే వృత్తాంత | పరిసా మ్హణే కథితో సాద్యంత | 
పహా సాఈచీ లీలా అత్యద్భుత | ఆశ్చర్యభరిత తీ సర్వ | ||౧౬౬|| 
166. అప్పుడు, అల్లీ చెప్పిన సంగతంతా చెప్తాను. ‘సాయియొక్క ఆశ్చర్యకరమైన, అత్యద్భుత లీలను వివరంగా చెప్తాను, విను’. 
యా లీలేచా కాయ అర్థ | కాయ యాంతీల నిజకార్యార్థ | 
యాంత భక్తాంచే కాయ ఇంగిత | సాఈచ సుసంగత జాణతా | ||౧౬౭|| 
167. ‘ఈ లీలయొక్క ప్రాముఖ్యత ఏమిటి? వారి ఉద్దేశమేమిటి? భక్తుల కొరకు, దీని ద్వారా వారు ఉపదేశించినదేమిటి? - ఇవన్నీ సాయికే తెలియాలి’. 
ఆపణ కేవళ ఎకమేకాంనీ | పరిసావ్యా యా లీలా కానీ | 
కింవా త్యా గావ్యా నిజముఖాంనీ | నిఃశ్రేయస దానీ మ్హణవోని | ||౧౬౮|| 
168. ‘ఈ లీలలు శ్రేయస్సును కలిగించేవి కనుక, ఒకరికొకరు నోటితో గానం చేసుకోవడం, లేక చెవులతో విని ఆనందించడమే మన పని’. 
అసో ఆతా హా పుఢీల భాగ | పుఢీల అధ్యాయీ కథూ సాంగ | 
ఆనంద పావేల శ్రోతృసంఘ | చరిత్ర అమోఘ సాఈచే | ||౧౬౯|| 
169. తరువాతి అధ్యాయంలో మిగతా కథ చెప్పబడుతుంది. శ్రోతలు ఆనందాన్ని పొందుతారు. సాయియొక్క చరిత్ర అమోఘమైనది. 
సాఈ నిర్ద్వేష ఆనందఘన | సదా భజావా అనవచ్ఛిన్న | 
పావాల నిజసుఖ సమాధాన | మన నిర్వాసన హోఈల | ||౧౭౦|| 
170. ద్వేష భావం లేని, ఆనందఘనుడైన సాయిని, శాశ్వతంగా, అహర్నిశలూ ఆరాధిస్తే, సుఖమూ సమాధానమూ లభిస్తుంది. మనసు వాసనా రహితమౌతుంది. 

చాతక నిజస్వార్థా వినవీ | మేఘ సకళ సృష్టీతే నివవీ | 
బాళాసాహేబ బాబాంస బోలవీ | బాబా తవ పాలవీత భక్తాంసవే | ||౧౭౧|| 
171. తన స్వార్థంకోసం, చాతక పక్షి వర్షాన్ని కోరుకుంటుంది. కాని, సకల సృష్టి కోసం, మేఘం వర్షిస్తుంది. బాళాసాహేబు బాబాను ఆహ్వానించాడు, బాబా తమ భక్తులందరినీ పిలిచారు. 
భక్తపంక్తీ శ్రోతేహీ బైసతీ | ప్రేమే ఉద్యాపనకథా పరిసతీ | 
సాఈసమాగమ ఆనంద భోగతీ | ఢేంకరహీ దేతీ తృప్తీచే | ||౧౭౨|| 
172. శ్రోతలు కూడా, భక్తులతో పాటు పంక్తిలో కూర్చుని, శ్రద్ధగా ఉద్యాపన కథను విని, సాయి సమాగమ సుఖాన్ని ఆనందంగా అనుభవించి, తృప్తిగా త్రేన్చారు కూడా. 
అనాహూతహీ కైసే యేతీ | కైసే పార్థీవ స్వరూపే ప్రగటతీ | 
కైసే నిజ దాసా ఆభారీ కరితీ | కైసే తే జాగవితీ పదోపదీ | ||౧౭౩|| 
173. పిలవకుండానే ఎలా వస్తారు? మనిషి రూపంలో ఎలా కనిపిస్తారు? తమ భక్తుల మనసులో, ఎలా కృతజ్ఞతా భావాన్ని నింపుతారు? అడుగడుగునా భక్తులను జాగృతం ఎలా చేస్తారు? 
అసో హేమాడ సాఈసీ శరణ | పుఢీల కథేచీ హీచి మాండణ | 
మాండీల ఘేఈల కరూని నిరూపణ | ఆపులీ ఆపణ యథేష్ట | ||౧౭౪||
174. అలా, హేమాడు సాయికి శరణుజొచ్చుతున్నాడు. తరువాతి కథను కూడా మునపటి కథవలెనే, తను కోరుకున్న విధంగా నిరూపించుకుంటారు. 
శరణాగతా ఘాలితో పాఠీ | యాచ త్యాచియా బ్రీదాసాఠీ || 
హేమాడ ఘాలీ పాయీ మిఠీ | పరతా న లోటీ తో తయా ||౧౭౫|| 
175. శరణాగతులైన వారిని రక్షిస్తారు. ఇది వారి ప్రతిజ్ఞ కనుక, వారు తనను తరిమి వేయరని, హేమాడు వారి చరణాలను ఆలింగనం చేసుకుంటున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
 | శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | ఉద్యాపన కథా కథనం నామ | 
| చత్వారింశత్తమోధ్యాయః సంపూర్ణః | 

 ||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||


టిపణీ: 
1. డహాణూచే మామలేదార బాళాసాహేబ దేవ. 2. సఖారామ హరీ జోగ. 
3. హీ తీనహీ గావే(రాహాతా, రూఈ వ నీమగావ) శిరడీపాసూన ౨/౩ మైలాంచ్యా ఆత ఆహేత. 
4. యేణే. 5. జాణే. 6. దృష్టీ. 7. చకలీ నసతీ. 
8. పావశేర (తాందూళ). 9. శిష్య. 

Tuesday, September 17, 2013

||గీతా విశిష్ట శ్లోకార్థ నివేదనం నామ ఎకోనచత్వారింశత్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౩౯ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

ధన్య ధన్య శిరడీ స్థాన | ధన్య ద్వారకామాఈభువన | 
జేథే శ్రీసాఈ పుణ్యపావన | అనిర్వాణ వావరలే | ||౧|| 
1. ధన్యం ధన్యం శిరిడీ క్షేత్రం. పుణ్య పావనులైన శ్రీసాయి తమ నిర్వాణ కాలం వరకు నివసించిన ద్వారకామాయి భువనం ధన్యం.
ధన్య ధన్య శిరడీచే జన | జయాలాగీ ఇతక్యా లాంబూన | 
జేణే కవణ్యాహీ నిమిత్తే యేఊన | ఋణీ కరూన ఠేవిలే | ||౨|| 
2. ధన్యం ధన్యం శిరిడీ జనులు. వారి కోసం బాబా ఎంతో దూరంనుండి, ఏదో నెపంతో శిరిడీకి వచ్చి, వారిని ఋణగ్రస్తులను చేశారు. 
గాంవ శిరడీ ఆధీ లహాన | సాఈ సహవాసే ఝాలా మహాన | 
త్యాచేని ఝాలా అతి పావన | త్యాచేని తీర్థపణ తయాలా | ||౩|| 
3. ఆదిలో శిరిడీ గ్రామం చాలా చిన్నది. కాని సాయి సహవాసంతో గొప్పదైనది. వారి వలననే అతి పావనమైనది. వారి వలననే తీర్థక్షేత్రమైనది. 
త్యా శిరడీచ్యా బాయాహీ ధన్య | ధన్య త్యాంచీ శ్రద్ధా అనన్య | 
న్హాతా దళతా కాండితా ధాన్య | గాతీ అసామాన్య సాఈతే | ||౪|| 
4. శిరిడీలోని స్త్రీలు కూడా ధన్యులు. వారి అనన్యమైన శ్రద్ధ ధన్యం. స్నానం చేస్తూ, ధాన్యం దంపుతూ, విసురుతూ అసమానమైన సాయి గురించి గానం చేశారు. 
ధన్య ధన్య తయాంచే ప్రేమ | గీతే గాతీ అత్యుత్తమ | 
ఏకతా తయాంతీల కాంహీ అనుత్తమ | హోతసే ఉపరమ మనాస | ||౫|| 
5. ధన్యం ధన్యం వారి ప్రేమ. అత్యుత్తమ గీతాలను గానం చేశారు. వానిలో ఉత్తమమైనవి వింటే, మనసుకు శాంతి కలుగుతుంది. 
మ్హణోనియా శ్రోతయాంప్రతీ | యథాకాళే కథానుసంగతీ | 
వ్హావయా తయాంచీ జిజ్ఞాసాతృప్తీ | దేఈన విశ్రాంతీదాయక తీ | ||౬|| 
6. అందువలన శ్రోతల కుతూహలాన్ని తృప్తి పరచటానికి, మనసుకు విశ్రాంతినిచ్చే కొన్ని గీతాలను సందర్భానుసారంగా కథలో చెప్తాను. 
సాఈ నిజామశాహీంత ప్రకట | ఆమ్రతళీ మార్గానికట | 
ధూపఖేడ్యాచే వర్హాడాసకట | శిరడీస అవచట పాతలే | ||౭|| 
7. సాయి నిజాం రాజ్యంలో, దారి ప్రక్కన ఉన్న ఒక మామిడి చెట్టు క్రింద, కనిపించారు. ధూప్ఖేడా గ్రామంలోని పెళ్లివారితో, అకస్మాత్తుగా శిరిడీకి వచ్చారు. 
యా ఖేడ్యాంతీల పుణ్యవాన | చాంద పాటీల నామాభిధాన | 
తయా ఆరంభీ జడలే హే నిధాన | ఇతరా దర్శన త్యాచేనీ | ||౮|| 
8. ఆ ఖేడాలోని చాంద పాటీల అనే పేరుగల పుణ్యవంతునికి, ఈ నిధి ముందుగా లభించింది. అతని ద్వారా ఇతరులకు వారి దర్శనం కలిగింది. 
కైసీ తయాచీ ఘోడీ హరవలీ | కైసీ సాఈచీ గాంఠీ పడలీ | 
కైసీ తయాంనీ చిలిమ పాజిలీ | ఘోడీ త్యా దిధలీ మిళవూన | ||౯|| 
9. ఎలా అతని గుర్రం పోయింది, ఎలా సాయిని కలుసుకున్నాడు, ఎలా సాయి అతనిచే చిలుం త్రాగించారు, ఎలా అతని గుర్రాన్ని ఇప్పించారు; 
చాందభాఈచే కుటుంబాచా | భాచా ఎక హోతా లగ్నాచా | 
వధూచా యోగ జుళలా శిరడీచా | వర్హాడ వధూచ్యా గాంవీ యే | ||౧౦||
10. ఎలా చాందభాయి భార్యయొక్క మేనల్లుడు పెళ్లీడుకొచ్చి, ఎలా శిరిడీలో తన వధువును ఎన్నుక్కున్నాడో, ఎలా పెళ్లి పార్టీ వధువు గ్రామానికి వచ్చిందో -  

యే విషయీంచీ సాద్యంత కథా | పూర్వీంచ1 కథిలీసే శ్రోతయాంకరితా | 
తథాపి స్మరలీ ప్రసంగోపాత్తతా | నకో పునరుక్తతా తయాచీ | ||౧౧|| 
11. ఈ విషయంలోని మొత్తం కథను శ్రోతలకు ముందుగానే చెప్పేశాను. అయినా, సందర్భానుసారం స్మరించుకోవటమే గాని మరల చెప్పటం అనవసరం. 
చాంద పాటీల కేవళ నిమిత్త | భక్తోద్ధారాచీ చింతా అత్యంత | 
మ్హణోని సాఈ హా అవతార ధరిత | స్వయేంచ కీ యేత శిరడీంత | ||౧౨|| 
12. చాంద పాటీల కేవలం నిమిత్త మాత్రుడు. అత్యంత చింతతో, భక్తులను ఉద్ధరించాలని, సాయియే ఈ అవతారాన్ని ధరించి, స్వయంగా శిరిడీకి వచ్చారు. 
జడ మూఢ హీనదీన | వ్రతతపసంస్కార విహీన | 
సాళేభోళే భావార్థీ జన | కోణ సాఈవీణ ఉద్ధరితా | ||౧౩|| 
13. జడులు, మూఢులు, హీనులు, దీనులు; వ్రతాలు, తపస్సును, సంస్కారాన్ని ఎరగని వారు, అమాయక జనులు - వీరిని సాయి తప్ప ఎవరు ఉద్ధరిస్తారు? 
అష్టాదశ వర్షాంచే వయ | తేథూన ఎకాంతాచీ సంవయ | 
రాత్రీ కుఠేహీ పడావే నిర్భయ | సర్వత్ర ఈశ్వరమయ జ్యాసీ | ||౧౪|| 
14. పదునెనిమిది సంవత్సరాల వయసునుండే సాయి ఏకాంతాన్ని అలవరచుకున్నారు. రాత్రిళ్లు నిర్భయంగా ఎక్కడైనా పడుకునేవారు. వారికి సర్వం ఈశ్వరమయం. 
హోతా జేథే పూర్వీ ఖడ్డా | అవఘ్యా గాంవాచా జో ఉకిరడా | 
దివసా ఫిరావే చహూంకడా | రాత్రీ పహుడావే తే స్థానీ | ||౧౫|| 
15. పగలు నలువైపులా తిరిగి, రాత్రిళ్లు, మునుపు ఊరంతటికీ పెంట కుప్ప అయిన ఒక గొయ్యి వద్ద పడుకునేవారు. 
ఏసీ గేలీ వర్షే బహుసాల | ఆలా ఖడ్డ్యాచా ఉదయకాళ | 
ఉఠలా సభోంతీ వాడా విశాళ | యా దీనదయాళ సాఈచా | ||౧౬|| 
16. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు, ఆ గోతికి మంచి రోజులు వచ్చాయి. దాని చుట్టూ, దీన దయాళువైన సాయికి, విశాలమైన భవనం నిర్మింప బడింది. 
అంతీ త్యాచ ఖడ్డ్యాచా గాభారా | ఝాలా విసావా సాఈ శరీరా | 
తేథేంచ త్యాంనా అక్షయ థారా | ఝాలా ఉభారా సమాధీచా | ||౧౭|| 
17. చివరికి ఆ గొయ్యే, సాయి శరీరానికి, విశ్రామ స్థానమైన గర్భగుడి అయింది. అక్కడే వారు శాశ్వతమైన విశ్రాంతిని పొందారు. ప్రస్తుత సమాధి దాని చుట్టూ వెలిసింది. 
తోచ ప్రణతవత్సల సాఈసమర్థ | దుస్తర భవార్ణవ సంతరణార్థ | 
హీ నిజ చరిత్ర నౌకా యథార్థ | భక్తజన హితార్థ నిర్మితసే | ||౧౮|| 
18. శరణుజొచ్చిన వారిని కనికరించే ఆ సాయి సమర్థులు, అతి కష్టమైన సంసార సాగరాన్ని దాటటానికి, యదార్థమైన తమ చరిత్ర అనే నౌకను, భక్తుల హితం కోసం, నిర్మించారు. 
కీ హీ భవనదీ మహా దుస్తర | అంధపంగూ హా భక్తపరివార | 
తయాలాగీ కళవళా ఫార | పావేల పైల పార కైసేనీ | ||౧౯|| 
19. మహా కష్టమైన ఈ సంసార సాగరాన్ని, గుడ్డివారు, కుంటివారూ అయిన భక్త పరివారం ఎలా దాటగలరని, వారు చాలా బాధపడ్డారు. 
సర్వా ఆవశ్యక భవతరణ | తదర్థ వ్హావే శుద్ధాంతఃకరణ | 
చిత్తశుద్ధీ ముఖ్య సాధన | భగవద్భజన త్యా మూళ | ||౨౦||
20. ఈ సంసార సాగరాన్ని దాటటం అందరికీ ఆవశ్యకం. దానికి పరిశుద్ధమైన మనసు అవసరం. చిత్తశుద్ధి ముఖ్య సాధనం. భగవద్భజన దానికి మూలం. 

శ్రవణాసారిఖీ నాహీ భక్తి | శ్రవణే సహజ గురుపదాసక్తి | 
ఉపజే నిర్మళ శుద్ధ మతీ | జేథూన ఉత్పత్తీ పరమార్థా | ||౨౧|| 
21. శ్రవణానికి సమానమైన భక్తి లేదు. శ్రవణంతో సహజంగా గురు పాదాలయందు ఆసక్తి కలిగి, మనసు నిర్మలమౌతుంది. అప్పుడు పరమార్థం పుట్టుకొస్తుంది.
యా సాఈచ్యా అగణిత కథా | గాతా గాతా హోఈల గాథా | 
తరీ హీ సంకలిత వానూ జాతా | నావరే విస్తృతతా అనావర | ||౨౨|| 
22. సాయియొక్క కథలు అసంఖ్యాకం. వాటిని పాడుతూ పాడుతూ ఉంటే, పెద్ద గ్రంథమౌతుంది. సంక్షిప్తంగా వర్ణించాలనుకున్నా, విస్తారం అనివార్యమౌతుంది. 
జో జో శ్రోతయా శ్రవణీ చాడ | తో తో వాఢే నివేదనీ ఆవడ | 
పురవూని ఘేఊ పరస్పర కోడ | సాధూ కీ జోడ నిజహితాచీ | ||౨౩|| 
23. వినటంతో ఎలా ఎలా శ్రోతల ఉత్సుకత పెరిగే కొద్ది, చెప్పేవారికి చెప్పాలనే కోరిక కూడా పెరుగుతుంది. ఇలా పరస్పరం మన కోరికలను తీర్చుకుని, మన హితాన్ని సాధించుకుందాము. 
సాఈచ యేథీల కర్ణధార | దృఢ అవధాన హాచి ఉతార | 
కథాశ్రవణీ శ్రద్ధా ఆదర | త్యా పైలపార అవిలంబే | ||౨౪|| 
24. సాయియే ఇక్కడ నావను నడిపేవారు. ఏకాగ్రంతో వినటమే, వారికి చెల్లించే మూల్యం. కథ వినటంలో శ్రద్ధా గౌరవాలు ఉంటే, ఆలస్యం లేకుండా అవి తీరానికి చేరుస్తాయి. 
గతాధ్యాయీ నిరూపణ | జాహలే సంక్షేపే హండీచే వర్ణన | 
దత్తభక్తి దృఢీకరణ | భక్తసంతర్పణ నైవేద్యే | ||౨౫|| 
25. గతాధ్యాయంలో, సంక్షిప్తంగా హండీ వర్ణన చెప్పబడింది. అలాగే, ఒకరికి దత్తదేవునిపై భక్తిని దృఢ పరచటం, భక్తులకు నైవేద్య సంతర్పణను కూడా చెప్ప బడింది. 
ప్రత్యేక అధ్యాయ సంపవితాంనా | పుఢీల అధ్యాయ విషయసూచనా | 
హోత గేలీ ఏసీ రచనా | సమస్తాంనా అవగత హే | ||౨౬|| 
26. ప్రతి అధ్యాయం ముగింపులో, తరువాతి అధ్యాయంలోని విషయాలను సూచించే విధంగా, ఈ రచన సాగిందని అందరికీ తెలుసు. 
పరీ సంపతా గతాధ్యాయ | నవ్హతీ పుఢీల కథేచీ సయ2
సాఈ ఆఠవూని దేతీల జో విషయ | తోచి కీ ఆఖ్యేయ హోఈల | ||౨౭|| 
27. కాని, గతాధ్యాయం ముగింపులో, తరువాతి కథ గురించి చెప్పలేదు. సాయి గుర్తుచేసిన విషయమే చెప్పబడుతుంది, 
ఏసే జే హోతే స్పష్ట కథిలే | తైసేంచ సాఈకృపే జే ఆఠవిలే | 
తేంచి కీ శ్రోతయాంలాగీ వహిలే | సాదర కేలే యే ఠాయీ | ||౨౮|| 
28. అని స్పష్టంగా చెప్పాను. అలాగే, కృపతో సాయి గుర్తు చేసినదాన్ని ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తున్నాను. 
తరీ ఆతా శ్రోతయా ప్రార్థనా | దూర సారూనియా వ్యవధానా | 
శాంత చిత్తే ద్యా అవధానా | హోఈల మనా ఆనంద | ||౨౯|| 
29. అందువలన, శ్రోతలను ప్రార్థించేదేమిటంటే, అడ్డంకులను దూరం చేసి, శాంత చిత్తంతో వింటే, వారి మనసుకు ఆనందం కలుగుతుంది. 
ఎకదా చాందోరకర సద్భక్త | బైసూనియా మశీదీంత | 
అసతా చరణసంవాహన కరీత | గీతాహీ గుణగుణత ముఖానే | ||౩౦||
30. ఒక సారి, సద్భక్తుడైన చాందోర్కరు మసీదులో కూర్చుని, బాబా పాదాలను ఒత్తుతూ, నోటితో గీతను చెప్పుకుంటున్నాడు. 

భగవద్గీతా చతుర్థాధ్యాయ | జివ్హేస లావూన దిధలా వ్యవసాయ | 
హస్తే చేపీత సాఈచే పాయ | పహా నవల కాయ వర్తలే | ||౩౧|| 
31. చేతులతో సాయి పాదాలను ఒత్తుతూ, నాలుకకు భగవద్గీతలోని నాలుగవ అధ్యాయాన్ని వల్లించే పని పెట్టగా, అప్పుడు ఏం విచిత్రం జరిగిందో చూడండి. 
భూత భవిష్య వర్తమాన | సాఈసమర్థా సర్వ జ్ఞాన | 
నానాంస గీతార్థ సమజావూన | ద్యావా హే మన జాహలే | ||౩౨|| 
32. భూత భవిష్య వర్తమానాలు సర్వం, సాయి సమర్థులకు తెలుసు. నానాకు గీతార్థాన్ని వివరించాలని వారి మనసుకు తోచింది. 
జ్ఞానకర్మ3 సంన్యాసన | బ్రహ్మార్పణ యోగాధ్యాయాచే పఠణ | 
నానాచీ తీ అస్పష్ట గుణగుణ | కేలీ కీ కారణ ప్రశ్నాస | ||౩౩|| 
33. జ్ఞాన, కర్మ సంన్యాసనం, బ్రహ్మార్పణ యోగాధ్యాయాలను, నానా యొక్క అస్పష్టంగా గొణుక్కోవటం బాబా ప్రశ్నకు కారణమైంది. 
“సర్వ కర్మాఖిలం పార్థ”4 | హోయ జ్ఞానీ పరిసమాప్త | 
సంపతా హా త్రయస్త్రింశత్‍5 | “తద్విద్ధి ప్రణిపాత”6 చాలలా | ||౩౪|| 
34. ‘సర్వం కర్మ అఖిలం పార్థ, జ్ఞానే పరిసమాప్తి’ తో ముప్పది మూడవ శ్లోకం ముగిసి, ‘తద్విద్ధి ప్రణిపాత’ మనే శ్లోకం ప్రారంభమైంది. 
హా జో శ్లోక చవతిసావా | యేథేంచ పాఠాస ఆలా విసావా | 
బాబాంచ్యా చిత్తీ ప్రశ్న పుసావా | నిజబోధ ఠసావా నానాంస | ||౩౫|| 
35. ఆ ముప్పది నాలుగవ శ్లోకం వద్ద, అతని పఠనం ఆగింది. బాబా మనసులో, ప్రశ్న అడిగి నానాకు తమ బోధ తెలియచేయాలని, అనిపించింది. 
మ్హణతీ “నానా కాయ గుణగుణసీ | మ్హణ రే స్పష్ట హళూ జే మ్హణసీ | 
యేఊ దే కీ ఏకూ మజసీ | పుటపుటసీ జే గాలాంత” | ||౩౬|| 
36. "నానా! ఏమిటి గొణుక్కుంటున్నావు? మెల్లగా చెబుతున్నదాన్ని స్పష్టంగా చెప్పు. గొంతులో గొణుక్కుంటున్నదాన్ని నన్నూ విననీ" అని అన్నారు. 
మ్హణ మ్హణతా ఆజ్ఞాప్రమాణ | శ్లోక మ్హటలా చారీ చరణ | 
బాబా పుసతీ అర్థనివేదన | స్పష్టీకరణపూర్వక | ||౩౭|| 
37. "చెప్పు" అన్న ఆజ్ఞానుసారం, వెంటనే శ్లోకంయొక్క నాలుగు చరణాలనూ వల్లించాడు. బాబా ఆ శ్లోకానికి అర్థ వివరణను, స్పష్టీకరణను అడిగారు. 
తంవ తే నానా అతివినీత | బద్ధాంజులీ హోఊని ముదిత | 
మధుర వచనే ప్రత్యుత్తర దేత | వదత భగవంత మనోగత | ||౩౮|| 
38. అప్పుడు నానా, అతివినయుడూ, చేతులు జోడించుకుని, సంతోషంగా, మధుర వచనాలతో భగవంతుని మనోగతాన్ని విన్నవించాడు. 
ఆతా హా సాఈనానా7 సంవాద | వ్హావయా సర్వత్రాంనా విశద8
మూళ శ్లోక పదప్రపద | కరూ కీ ఉద్ధృత9 గీతేతునీ | ||౩౯|| 
39. సాయి-నానా సంవాదం అందరికీ తెలియడానికి, గీతలోని మూల శ్లోకం ప్రతి పదాన్ని ఇప్పుడు చెబుతున్నాను. 
కళావయా ప్రశ్నాచే వర్మ | తైసేచ సంతాచే మనోధర్మ | 
కరావా వాటే ఏసా ఉపక్రమ | జేణే యే నిర్భ్రోమ అర్థ హాతా | ||౪౦||
40. ప్రశ్నలోని మర్మం, మరియు సంతుల మనోధర్మం తెలియ చేయటానికి, ఏ సంశయం లేకుండా అర్థమవటానికి, ఇలా మొదలు పెట్టాలి, అని అనిపించింది. 

ఆధీ గీర్వాణ భాషా దుర్గమ | సాఈస కైసీ ఝాలీ సుగమ | 
ఆశ్చర్య కరతీ ప్రశ్న సవర్మ | జ్ఞాన హే అగమ్య సంతాంచే | ||౪౧|| 
41. అసలే గీర్వాణ (సంస్కృత) భాష కష్టమైనది. సాయికి ఎలా సులభమైంది? నిగూఢమైన వారి ప్రశ్న, ఆశ్చర్యకరం. సంతుల జ్ఞానం అర్థం కానిది.
కధీ అధ్యయన కేలే సంస్కృతా | కధీ నకళే వాచిలీ గీతా | 
కీ తో గీతార్థహృద్గతజ్ఞాతా | తైసా హో కరితా ప్రశ్నాతే | ||౪౨|| 
42. సంస్కృతాన్ని ఎప్పుడు అధ్యయనం చేశారు? ఎప్పుడు గీతను చదివారో తెలియదు. అయినా, గీతార్థాన్ని జీర్ణించుకున్న జ్ఞానిలా ప్రశ్నిస్తున్నారు. 
శ్రోతయాంచియా సమాధానా | వ్హావీ మూళ శ్లోకాచీ కల్పనా | 
మ్హణోని అక్షరశః భగవంతవచనా | వదతో జే వివేచనా సాహ్యభూత | ||౪౩|| 
43. శ్రోతలను సమాధాన పరచాలని, వారు మూల శ్లోకాన్ని తెలుసుకోవాలని, భగవంతుని వచనాన్ని అక్షరశః తెలుపుతున్నాను. ఇవి వివరణలో సహకరిస్తాయి. 

“తద్విద్ధి ప్రణిపాతేన | పరిప్రశ్నేన సేవయా | 
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం | జ్ఞానినస్తత్వదర్శినః”10 | ||౪౪|| 
భ. గీ, అ.౪, శ్లో ౩౪ వా 

హా తో గీతేచా మూళ శ్లోక | భాష్యానుసార అర్థ దేఖ | 
టీకాకారహీ ఝాలే అనేక | తే ఎకవాక్యాత్మక సమస్త | ||౪౫|| 
45. ఇది గీతలోని మూల శ్లోకం. భాష ప్రకారంగా అర్థాన్ని వివరించిన టీకాకారులు అనేకులు. వారందరిదీ ఒకటే అభిప్రాయం. 
నానాహీ మోఠే బహుశ్రుత | గీతాభాష్యపారంగత | 
కథూ లాగతీ పదపదార్థ | యథా విదిత శ్లోకార్థ | ||౪౬|| 
46. నానా కూడా గొప్ప శ్రవణం చేసిన వాడు. గీతా భాష్య పారంగతుడు. తనకు తెలిసినట్లుగా, శ్లోకం అర్థాన్ని, ప్రతి పద అర్థంతో చెప్పసాగాడు. 
రసపూరిత మధురవాణీ | నానా సవినయ నమ్రపణీ | 
అన్వయఅతర్థ ఆణూని ధ్యానీ | అర్థ నివేదనీ సాదర | ||౪౭|| 
47. రసపూరితమైన మధురవాణితో, సవినయంగా నమ్రుడై, సరైన అర్థాన్ని ధ్యానించుకుని, నానా శ్లోకార్థాన్ని మనవి చేయసాగాడు. 
మ్హణతీ ‘గురుపదీ ప్రణిపాత | గురుసేవేసీ వికీ జో జీవిత | 
ప్రశ్నాదికీ ఆదరవంత | జ్ఞానీ త్యా జ్ఞానార్థ ఉపదేశితీ | ||౪౮|| 
48. ‘గురు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, గురు సేవకు జీవితాన్ని అంకితం చేసి, ఆదరంగా గురువును ప్రశ్నలనడిగేవారికి, జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు. 
సారాంశ కృష్ణ కృపామూర్తి | అర్జునా జే ప్రేమే వదతీ | 
గురుసేవా గురుప్రణతీ | జ్ఞాన సంవిత్తీ దాయక హీ | ||౪౯|| 
49. ‘సారాంశమేమిటంటే, కరుణామూర్తి అయిన కృష్ణుడు, గురు సేవా, గురువుకు నమస్కారం, ఇవే జ్ఞానాన్ని పొందటానికి సాధనాలు, అని ప్రేమతో అర్జునునితో అన్నాడు. 
అర్జునా ఎణే మార్గే జాతా | తత్వదర్శీ జ్ఞానీ తుజ కరితా | 
దావితీల జ్ఞానాచా రస్తా | బాబా యా అర్థా మీ జాణే’ | ||౫౦||
50. ‘అర్జునా! ఈ మార్గంలో ప్రయణిస్తె, తత్వం తెలిసిన జ్ఞానులు, నీకు జ్ఞాన ప్రాప్తికి దారి చూపుతారని చెప్పారు. బాబా, ఈ అర్థమే నాకు తెలుసు’. 

శాంకరభాష్య ఆనందగిరీ | శంకరానందీ వ్యాఖ్యా శ్రీధరీ | 
మధుసూదన నీలకంఠాధారీ | ఉపదేశ పరీహీ దేవాచీ | ||౫౧|| 
51. శంకర భాష్యం, ఆనందగిరి, శంకరానంద, శ్రీధర, మధుసూదన మరియు నీలకంఠ, వీరందరూ దేవుని ఉపదేశాన్ని ఇలాగే వ్యాఖ్యానించారు. 
ప్రథమ దోన చరణాంచా అర్థ | మాన్య కరితీ సాఈ సమర్థ | 
పరీ ఉత్తర శ్లోకార్ధమథిత | సాఈ జే కథిత తే పరిసా | ||౫౨|| 
52. మొదటి రెండు చరణాల అర్థాన్ని, సాయి సమర్థులు సమ్మతించారు. కాని, మిగతా సగం శ్లోకం గురించి, సాయి ఏం చెప్పారో వినండి. 
ఇతరహీ భక్త చకోరగణ | సాఈ ముఖచంద్ర అనులక్షూన | 
కరావయా అమృతకణ సేవన | ఆ పసరూని ఆస్థిత | ||౫౩|| 
53. ఇతర భక్తులు కూడా, చకోర పక్షులవలె, సాయి ముఖ చంద్రంనుండి రాలే, అమృత బిందువులను సేవించాలని, ఆసక్తితో కూర్చున్నారు. 
మ్హణతీ “నానా తృతీయ చరణ | పునశ్చ లక్ష్యాంత ఘేఈ పూర్ణ | 
జ్ఞాన శబ్దా మాగీల జాణ | అవగ్రహ ఆణ అర్థాస | ||౫౪|| 
54. బాబా అన్నారు, "నానా! మూడవ చరణాన్ని పూర్తి లక్ష్యంతో, మరల గమనించు. జ్ఞానం అనే పదానికి మునుపు అవగ్రహముంది(‘s’). దానిని కలిపి, అర్థం చూడు. 
హే మీ కాయ వదే విపరీత | అర్థాచా కాయ కరితో అనర్థ | 
అసత్య కాయ పూర్వీల భాష్యార్థ | ఏసేహీ నిరర్థ నా మానీ | ||౫౫|| 
55. “ఇదేమిటి, నేనేదో విపరీత అర్థాన్ని చెప్పి, అర్థాన్ని అనర్థంగా చేస్తున్నానని, మునుపు చెప్పిన భాష్యార్థము అసత్యమా అని అనుకోకు. నా మాటలు అర్థం లేనివని తలవకు. 
‘జ్ఞానీ ఆణి తత్వదర్శీ | జ్ఞాన ఉపదేశీతీ’ ఏసే జే మ్హణసీ | 
తేథే అజ్ఞాన పద జై ఘేసీ | యథార్థ ఘేసీల ప్రబోధ | ||౫౬|| 
56. “‘జ్ఞానులు మరియు తత్వం తెలిసిన వారు, జ్ఞానాన్ని ఉపదేశిస్తారు’ అని అన్నావు కదా, అక్కడ అజ్ఞానం అన్న పదం వేస్తే, నిజమైన అర్థం బోధ పడుతుంది. 
జ్ఞాన నవ్హే బోలాచా విషయ | కైసే హోఈల తే ఉపదేశ్య | 
మ్హణోని జ్ఞాన శబ్దాచా విపర్యయ | కరీ మగ ప్రత్యయ అనుభవీ | ||౫౭|| 
57. “జ్ఞానమనేది చెప్పబడే విషయం కాదు. దానిని ఎలా ఉపదేశించగలరు? అందువలన, జ్ఞానం అనే శబ్దానికి విరుద్ధమైన దానిని ఉపయోగించి, అనుభవాన్ని పొందు. 
పరిసిలా తుఝా జ్ఞాన పదార్థ | అజ్ఞాన ఘేతా కాయరే వేంచత | 
’అజ్ఞాన’ వాణీచా విషయ హోత | జ్ఞాన హే శబ్దాతీత స్వయే | ||౫౮|| 
58. “జ్ఞానమనే పదానికి, నీవు చెప్పిన అర్థం విన్నాను. దానికి బదులు, అజ్ఞానమనే పదం వేస్తే ఏం పోతుంది? అజ్ఞానం మాటకు సంబంధించిన విషయం. జ్ఞానం మాటకు అందనిది. 
వార వేష్టీ గర్భాసీ | అథవా మల ఆదర్శాసీ | 
విభూతి ఆచ్ఛాదీ వన్హీసీ | తైసేంచ జ్ఞానాసీ అజ్ఞాన | ||౫౯|| 
59. “గర్భాన్ని చుట్టుకున్నది మావి. ధూళి, అద్దాన్ని కప్పేస్తుంది. అగ్నిని, బూడిద కప్పేస్తుంది. అలాగే జ్ఞానాన్ని, అజ్ఞానం కప్పేస్తుంది. 
అజ్ఞానానే ఆవృత్త జ్ఞాన | కేలే యా గీతీ11 భగవంతే కథన | 
ఎతదర్థ హోతా అజ్ఞాన నిరసన | స్వభావే జ్ఞాన ప్రకాశే | ||౬౦||
60. “అజ్ఞానం జ్ఞానాన్ని కప్పబడినది, అని గీతలో భగవంతుడే చెప్పాడు. దాని అర్థమేమిటంటే, అజ్ఞానాన్ని తొలగిస్తె, స్వభావ సిద్ధంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. 

జ్ఞాన హే తో స్వతఃసిద్ధ | శైవాలావృత తోయసే శుద్ధ | 
హే శైవాల12 జో సారీల ప్రబుద్ధ | తో జల విశుద్ధ లాధేల | ||౬౧|| 
61. “జ్ఞానం స్వతః సిద్ధమైనది. కాని, నాచుతో కప్పబడ్డ, శుద్ధమైన నీరువలె ఉంది. నాచును తొలగించిన బుద్ధిమంతునికి, శుద్ధమైన నీరు లభిస్తుంది.
జైసే చంద్ర సూర్యాంచే గ్రహణ | తే తో సర్వదా ప్రకాశమాన | 
రాహూ కేతూ ఆడ యేఊన | ఆముచే నయన అవరోధితి | ||౬౨|| 
62. “ఇది సూర్యచంద్రుల గ్రహణం వంటిది. వారు ఎప్పుడూ ప్రకాశమానంగా ఉంటారు. రాహు, కేతులు అడ్డు రావటంవలన, మన దృష్టికి అడ్డు కలుగుతుంది. 
చంద్ర సూర్యానా హీ బాధ | హా తో ఆముచే దృష్టీస అవరోధ | 
తైసే జ్ఞాన అసే నిర్బాధ | స్వయంసిద్ధ స్వస్థానీ | ||౬౩|| 
63. “సూర్య చంద్రులకు, ఏ అడ్డూ లేదు. అది మన దృష్టికి కలిగే అడ్డు. అలాగే జ్ఞానం, ఏ అడ్డూ లేకుండా తన చోటులో, ఉన్నది ఉన్నట్లుగా ఉంటుంది. 
డోళా కరీ అవలోకన | తయాచీ దేఖణీ శక్తి తే జ్ఞాన | 
వరీ పడళ వాఢే తే అజ్ఞాన | తయాచే నిరసన ఆవశ్యక | ||౬౪|| 
64. “కళ్లతో చూచి, తెలుసుకునే శక్తి, జ్ఞానం. కళ్లకు వచ్చే పొరలాంటిది అజ్ఞానం. దానిని తొలగించటం అవసరం. 
తే పడళ అథవా సారా | హస్తకౌశల్యే దూర సారా | 
దేఖణీ శక్తి ప్రకట కరా | అజ్ఞాన తిమిరా ఝాడోనీ | ||౬౫|| 
65. “ఆ పొరలను, హస్త కౌశలంతో తొలగించు. చూడగల శక్తిని, కనిపించేలా చేయి. అజ్ఞానమనే చీకటిని తొలగించు. 
పహా హే సకల దృశ్య జాత | అనిర్వచనీయ మాయా విజృంభిత | 
హీచ అనాది అవిద్యా అవ్యక్త | అజ్ఞాన విలసిత తే హేంచ | ||౬౬|| 
66. “ఈ కనిపించే ప్రపంచం చూడు. ఇది మాయయొక్క, చెప్పలేని విజృంభితం. ఇదే అనాది, అవిద్య, కనిపించనిది. అజ్ఞాన విలసితం కూడా ఇదే. 
జ్ఞాన హీ వస్తూ జాణావయాచీ | నవ్హే తీ విషయ ఉపదేశాచీ | 
ప్రణిపాత పరిప్రశ్న సేవా హీంచీ | గురుకృపేచీ సాధనే | ||౬౭|| 
67. “జ్ఞానం, అనుభవ పూర్వకంగా తెలుసుకోవాల్సిన వస్తువు. అది ఉపదేశించగల విషయం కాదు. ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ, ఇవే గురు కృపకు సాధనాలు. 
విశ్వాచే సత్యత్వ మహా భ్రమ | హేంచి జ్ఞానావరణ తమ | 
నిరసూని జావే లాగే ప్రథమ | ప్రజ్ఞాన బ్రహ్మ ప్రకటే తై | ||౬౮|| 
68. “ ‘విశ్వమే సత్యం’, అని అనుకోవటమే మహా భ్రమ. ఇదే జ్ఞానాన్ని ఆవరించే అంధకారం. దీనిని ముందు తొలగించుకోవాలి. అప్పుడే, బ్రహ్మ సులభమైన రూపంలో కనిపిస్తాడు. 
సంసార బీజ జే అజ్ఞాన | డోళా పడతా గురుకృపాంజన | 
ఉడే మాయేచే ఆవరణ | ఉరే తే జ్ఞాన స్వాభావిక | ||౬౯|| 
69. సంసారంలోని దుఃఖాలకు బీజం, అజ్ఞానం. గురు కృప అనే అంజనం, కళ్లలో పడగానే, మాయయొక్క ఆవరణం ఎగిరిపోతుంది. మిగిలినదే స్వాభావికమైన జ్ఞానం. 
జ్ఞాన హే తో నవ్హే సాధ్య | తే తో ఆధీంచ స్వయంసిద్ధ | 
హే తో ఆగమనిగమ ప్రసిద్ధ | అజ్ఞాన హా విరోధ జ్ఞానాలా | ||౭౦||
70. జ్ఞానం, సాధించవలసినది కాదు. మునుపటినుండీ అది, స్వయం సిధ్ధంగా ఉన్నదే. ఇది ఆగమనిగమాలలో ప్రసిద్ధమైనది. అజ్ఞానం జ్ఞానానికి విరోధం. 

దేవా భక్తా జే భిన్నపణ | హేంచ మూళ అజ్ఞాన విలక్షణ | 
తయా అజ్ఞానాచే నిరసన | హోతాంచ పూర్ణ జ్ఞాన ఉరే | ||౭౧|| 
71. “భగవంతుడు, భక్తుడు, అన్న భేద భావమే, విలక్షణమైన అజ్ఞానానికి మూలం. ఆ అజ్ఞానం తొలగి పోతే, పూర్ణ జ్ఞానం మిగులుతుంది. 
దోరా పోటీ సర్పాజనన | హే తో శుద్ధస్వరూపాజ్ఞాన13
స్వరూపోపదేశే నిరసే అజ్ఞాన | ఉరే తే జ్ఞాన దోరాచే | ||౭౨|| 
72. “త్రాటిలో పాముని చూడటం, ఇది అజ్ఞానంయొక్క శుద్ధ స్వరూపం. దానిని తెలుసుకుంటే, అజ్ఞానం తొలగిపోతుంది. అప్పుడు త్రాడు త్రాడే, అన్న జ్ఞానం మిగులుతుంది. 
పోటీ సువర్ణ వరీ కాట14 | కాటాపోటీ లఖలఖాట | 
పరీ తో వ్హావయాలాగీ ప్రకట | హవ్యవాటచి15 ఆవశ్యక | ||౭౩|| 
73. “లోపల బంగారం, పైన మురికి. మురికి క్రింద, ధగ ధగ మెరుస్తున్న బంగారం ఉంది. అయితే అది కనిపించటానికి, అగ్ని అవసరం. 
మాయామూళ దేహ జనన | అదృష్టాధీన దేహాచే చలన | 
ద్వంద్వే సర్వ అదృష్టాధీన | దేహాభిమాన అజ్ఞాన | ||౭౪|| 
74. మాయ మూలంగా, దేహ పుట్టుక. ఆ దేహంయొక్క కదలిక, అదృష్టం చేతిలో. విరుద్ధ భావాలన్నీ, అదృష్టం అధీనం. అందువలన దేహాభిమానం అజ్ఞానం. 
మ్హణోని జే స్వయే నిరభిమాన | తయా న సుఖదుఃఖాచే భాన | 
విరే జై అహంకారాచే స్ఫురణ | తైంచ అజ్ఞాన నిరాస | ||౭౫|| 
75. “అందువలన, ఎవరు స్వయంగా నిరభిమానులో, వారికి సుఖదుఃఖాల ఎరుక ఉండదు. అహంకారంయొక్క ఎరుక తొలగటమే, అజ్ఞాన నాశనం. 
స్వస్వరూపాచే అజ్ఞాన | తేంచ మాయేచే జన్మస్థాన | 
 హోతా గురుకృపా మాయా నిరసన | స్వరూపజ్ఞాన స్వభావే | ||౭౬|| 
76. “ఆత్మయొక్క రూపం గురించిన అజ్ఞానమే, మాయకు జన్మస్థానం. గురు కృప కలిగిన వెంటనే, మాయ తొలగి, ఆత్మ స్వరూప జ్ఞానం సహజంగా బయట పడుతుంది. 
ఎకా భగవద్భక్తీవీణ | కిమర్థ ఇతర సాధనీ శీణ | 
బ్రహ్మదేవహీ మాయే అధీన | భక్తీచ సోడవణ తయాహీ | ||౭౭|| 
77. “ఒక్క భగవద్భక్తి తప్ప, ఇతర సాధనలు ఎందుకు? బ్రహ్మదేవుడే, మాయయొక్క అధీనం. అతనిని కూడా, భక్తియే మాయనుండి విడిపిస్తుంది. 
హో కా బ్రహ్మసదనప్రాప్తి | భక్తీ వాంచూన నాహీ ముక్తి | 
తేథేంహి చుకల్యా భగవద్భక్తి | పడే తో పునరావృత్తీంత | ||౭౮|| 
78. “బ్రహ్మలోకం ప్రాప్తించినా, భక్తి లేకుండా ముక్తి లేదు. అక్కడ కూడా భక్తిలేకపోతే మరల చావు పుట్టుకల చక్రంలో పడవలసినదే. 
తరీ వ్హావయా మాయా నిరసన | ఉపాయ ఎక భగవద్భజన | 
భగవద్భక్తా నాహీ పతన | భవబంధనహీ నాహీ తయా | ||౭౯|| 
79. “అందువలన, మాయను తొలగించుకోవటానికి, భగవద్భజన ఒక్కటే ఉపాయం. భగవద్భక్తునికి పతనమంటూ ఉండదు. అతనికి సంసార బంధనాలూ ఉండవు. 
జన మ్హణతీ మాయా లటకీ | పరి తీ ఆహే మహా చేటకీ | 
జ్ఞానియా ఫసవీ ఘటకోఘటకీ | భక్త నాచవితీ చుటకీవరీ | ||౮౦||
80. “ ‘మాయ భ్రమ’ అని జనులంటారు. కాని అది చాలా గొప్ప మాంత్రికురాలు. జ్ఞానులమని అనుకునే వారిని కూడా, ప్రతి క్షణం మోసగిస్తూనే ఉంటుంది. భక్తులు, దానిని చిటికెల మీద నాట్యం చేయిస్తారు. 

జేథే ఠకతీ జ్ఞానసంపన్న | తేథే టికతీ భావికజన | 
కీ తే నిత్య హరిచరణీ ప్రపన్న | జ్ఞానాభిమానధన జ్ఞానీ | ||౮౧|| 
81. “ఎక్కడ జ్ఞానులు మోసపోతారో, అక్కడ భక్తులు నిలదొక్కుకుంటారు. ఎందుకంటే, వారు నిత్యమూ హరి పాదాలకు శరణాగతులై ఉంటారు. జ్ఞానులు, తాము జ్ఞానులమన్న అభిమానంతో ఉంటారు.
మ్హణోని వ్హావయా మాయాతరణ | ధరావే ఎక సద్గురూచరణ | 
రిఘావే తయా అనన్య శరణ | భవభయహరణ తాత్కాళ | ||౮౨|| 
82. “అందువలన, మాయా సాగరాన్ని దాటటానికి, ఒక్క సద్గురు పాదాలను స్థిరంగా పట్టుకుని, వారికి అనన్య శరణుజొచ్చితే, వెంటనే సంసార భయం తొలగిపోతుంది. 
అవశ్య యేణార యేవో మరణ | పరి న హరీచే పడో విస్మరణ | 
ఇంద్రియీ ఆశ్రమవర్ణాచరణ | చిత్తే హరిచరణ చింతావే | ||౮౩|| 
83. “అవశ్యంగా మరణం వస్తుంది, రానీ. కాని, హరిని మరవద్దు. ఇంద్రియాలు ఆశ్రమాల, వర్ణాలను అనుసరించి పని చేస్తున్నా, మనసుతో హరి పాదాలను ధ్యానించు. 
రథ జైసా జుంపల్యా హయీ16 | తైసేంచ హే శరీర ఇంద్రియీ | 
మనాచ్యా దృఢ ప్రగ్రహీ17 | బుద్ధీ నిగ్రహీ18 నిజహస్తే | ||౮౪|| 
84. “రథం గుర్రాలతో కట్టబడినట్లే, ఈ శరీరం ఇంద్రియాలతో కట్టబడి ఉంది. మనసు అనే దృఢమైన పగ్గంతో, బుద్ధి ఇంద్రియాలను నిగ్రహిస్తుంది. 
మనసంకల్ప వికల్ప భరీ | ధాంవే యథేష్ట స్వేచ్ఛావిహారీ | 
బుద్ధీ త్యా నిజ నిశ్చయే నివారీ | లగామ ఆవరీ నిజసత్తా | ||౮౫|| 
85. “మనసు కోరికలతో, అనుమానాలతో నిండి, యథేచ్ఛగా పరుగు తీస్తూ, స్వేచ్ఛగా విహరిస్తుంది. బుద్ధి తన నిశ్చయించే శక్తితో, పగ్గాన్ని(మనసుని) నిగ్రహిస్తుంది. 
బుద్ధీసారిఖా కుశల నేతా | ఏసా సారథీ రథీ అసతా | 
రథస్వామీసీ కాయ చింతా | స్వస్థ చిత్తా వ్యవహరే | ||౮౬|| 
86. “బుద్ధిలాంటి కుశలుడైన సారథి, రథాన్ని నడుపుతుండగా, రథంలోని యజమానికి చింత ఎందుకు? అతడు నిశ్చింతగా వ్యవహరించ వచ్చు. 
దేహగత సకల కార్య | హే బుద్ధీచే నిజకర్తవ్య | 
ఏసీ మనాసీ లాగతా సంవయ | సర్వ వ్యవసాయ హితమయ | ||౮౭|| 
87. “దేహానికి సంబంధించిన కార్యాలన్నిటినీ చేయించటం బుద్ధియొక్క కర్తవ్యం. ఇది మనసుకు అలవాటు పడితే, అన్ని పనులూ హితంగా జరిగిపోతాయి. 
శబ్దస్పర్శ రూపాది విషయ | యేణే మార్గే లాగల్యా ఇంద్రియ | 
హోఈల వ్యర్థ శక్తి క్షయ | పతన భయ పదోపదీ | ||౮౮|| 
88. “శబ్ద స్పర్శ రూపాది విషయాల వెంట ఇంద్రియాలు పోతే, అనవసరంగా శక్తి తగ్గుతుంది. అడుగు అడుగునా పతన భయమే. 
శబ్దస్పర్శ రూపాదిక | పంచ విషయీ జే జే సుఖ | 
తే తే అంతీ సకళ అసుఖ | పరమ దుఃఖ అజ్ఞాన | ||౮౯|| 
89. “శబ్ద స్పర్శ రూపాది పంచ విషయాలలో, ఏ ఏ సుఖాలున్నాయో, అవన్నీ చివరకు దుఃఖాలే. అజ్ఞానం అన్నింటికంటే దుఃఖం. 
శబ్దవిషయా భులే హరీణ | అంతీ వేంచీ అపులా ప్రాణ | 
స్పర్శవిషయా సేవీ వారణ19 | సాహే ఆకర్షణ అంకుశే | ||౯౦||
90. శబ్దం అనే విషయానికి లోనై, జింక చివరకు తన ప్రాణాన్నే కోల్పోతుంది. స్పర్శ విషయాన్ని ఇష్ట పడి, ఏనుగు ఆ ఆకర్షణ కోసం, అంకుశపు పోట్లను సహిస్తుంది. 

రూపవిషయా భులే పతంగ | జాళూని నిమే అపులే అంగ | 
మీన20 భోగీ రసవిషయభోగ | ముకే సవేగ ప్రాణాస | ||౯౧|| 
91. “రూపం విషయానికి భ్రమిసి, పురుగు తన శరీరాన్ని కాల్చుకుంటుంది. రస విషయానికి భ్రమ పడి, చేప వెంటనే ప్రాణం కోల్పోతుంది. 
గంధాలాగీ హోఊని గుంగ | కమలకోశీ పడే భృంగ21
ఎకేకా పాయీ ఇతుకా ప్రసంగ | పాంచాచా సంఘ భయంకర | ||౯౨|| 
92. “సువాసన మత్తులో పడి, తుమ్మెద కమలంలో ఇరుక్కు పోతుంది. ఒక్కొక్క విషయ సుఖంలో ఇంత ప్రసంగం ఉంటే, ఇంక అయిదూ కూడినప్పుడు ఎంత భయంకరం. 
హీ తో స్థావర జలచర పంఖీ22 | యయాంచీ దుస్థితీ దేఖోదేఖీ | 
జ్ఞాతే మానవహీ విషయోన్ముఖీ | అజ్ఞాన ఆణఖీ తే కాయ | ||౯౩|| 
93. “ఇవేమో జంతువులు, జలచరాలూ, పక్షులు. వీని దుస్థితి చూచినా, జ్ఞానమున్న మానవులు కూడా, విషయాల వెంటనే పరుగెత్తుతారు. ఇంతకంటే అజ్ఞానం ఏముంటుంది? 
అజ్ఞాననాశే విషయవిముఖ | హోతా హోఈల ఉన్మనీ హరిఖ | 
జీవ జ్ఞానస్వరూపోన్ముఖ | ఆత్యంతిక సుఖ లాధేల | ||౯౪|| 
94. “అజ్ఞానం నశించి, విషయాల పట్ల విముఖత కలిగినప్పుడు, మనసుకు, శాంతి, సంతోషం, కలుగుతుంది. జీవుడు, జ్ఞాన స్వరూపం వైపు తిరిగినప్పుడు, అత్యంత ఆనందం కలుగుతుంది. 
చిత్తే కరా హరిగురూ చింతన | శ్రవణే కరా చరిత్ర శ్రవణ | 
మనే కరా ధ్యానానుసంధాన | నామస్మరణ జివ్హేనే | ||౯౫|| 
95. “మనసుతో, హరి, గురు చింతన చేయండి. శ్రవణాలతో చరిత్ర శ్రవణం చేయండి. మనసుతో, ధ్యానానుసంధానాలు చేయండి. నాలుకతో నామస్మరణ చేయండి. 
చరణీ హరిగురుగ్రామాగమన | ఘ్రాణీ తన్నిర్మాల్యాఘ్రాణన | 
హస్తీ వందా తయాచే చరణ | డోళా ఘ్యా దర్శన తయాచే | ||౯౬|| 
96. “పాదాలతో హరి, గురు, గ్రామాలకు వెళ్లండి. ముక్కుతో, వారి నిర్మాల్యాలను వాసన చూడండి. చేతులతో, వారి పాదాలకు నమస్కరించండి. కళ్లతో, వారిని దర్శించుకోండి. 
ఏశా యా సకల ఇంద్రియవృత్తి | తయాం కారణే లావితా ప్రీతి | 
ధన్య తయా భక్తాంచీ స్థితి | భగవద్భక్తి కాయ దుజీ | ||౯౭|| 
97. “ఇలా అన్ని ఇంద్రియాల పనులను ప్రేమగా, వారికొరకు వినియోగించే భక్తుల స్థితి, ధన్యం. ఇంత కంటే భగవద్భక్తి వేరే ఏముంటుంది? 
సారాంశ సమూళ అజ్ఞాన ఖాణా | ఉరే తే జ్ఞాన సిద్ధ జాణా | 
ఏసా యా శ్లోకాచే హృద్గత అర్జునా | శ్రీకృష్ణరాణా సూచవీ” | ||౯౮|| 
98. “సారాంశం – ‘అజ్ఞానాన్ని సమూలంగా నిర్మూలిస్తే, మిగిలేది సిద్ధమైన జ్ఞానమే, అని తెలుసుకో’ అని అర్జునునికి, ఈ శ్లోకం అంతరార్థాన్ని శ్రీకృష్ణ సూచించారు. 
ఆధీంచ నానా వినయసంపన్న | పరిసూని గోడ హే నిరూపణ | 
పాయీ ఘాలూని లోటాంగణ | వందిలే చరణ దో హాతీ | ||౯౯|| 
99. అప్పటికే, నానా వినయ సంపన్నుడు. మధురమైన ఈ వ్యాఖ్యను విని, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, రెండు చేతులతో వందనం చేశాడు. 
మగ తే శ్రద్ధానిష్ఠ ప్రార్థనా | కరితీ దవడా మమ అజ్ఞానా | 
దండా మాఝియా దురభిమానా | యథార్థ శాసనా కరోనీ | ||౧౦౦||
100. తరువాత శ్రద్ధ నిష్ఠలతో, ‘బాబా! నా అజ్ఞానాన్ని పారదోలండి. సరియైన శిక్షణనిచ్చి, నా దురభిమానాన్ని శిక్షించండి’ అని ప్రార్థించాడు. 

సాత్వికతేచీ హౌస వరవరి | వికల్ప అఖండ దాటే అంతరీ | 
అపమాన సాహేనా క్షణభరీ | అజ్ఞాన తే తరీ కాయ దుజే | ||౧౦౧|| 
101. ‘సాత్విక గుణాలు పైపైకి కనిపిస్తున్నా, అనుమానాలు ఎన్నో మనసులో ఉండి, ఒక క్షణమైనా అవమానాన్ని సహించలేనిది - అజ్ఞానం అంటే వేరే ఏముంది?
పోటీ ప్రతిష్ఠేచీ ఉజరీ | ధ్యానావిర్భావ దావీ వరీ | 
కామక్రోధ ధుమసే భీతరీ | అజ్ఞాన తే తరీ కాయ దుజే | ||౧౦౨|| 
102. ‘లోలోపల ప్రతిష్ఠలయందు కోరిక, పైకి ధ్యానం చేస్తున్నట్లు నాటకం, కామక్రోధాలు లోపల రగులుతుంటే - అజ్ఞానం అంటే వేరే ఏముంటుంది?
ఆంతూని సకళ కర్మే నష్ట | బాహేర మిరవూ బ్రహ్మనిష్ఠ | 
ఆచారహీన విచారభ్రష్ట | అజ్ఞాన స్పష్ట కాయ దుజే | ||౧౦౩|| 
103. ‘మనసులో, అన్నీ చెడు కర్మల ఆలోచనలు, పైకి, బ్రహ్మ నిష్ఠునివలె ఊరేగటం, ఆచార హీనం, భ్రష్టు ఆలోచనలు - స్పష్టంగా ఇంతకంటే, అజ్ఞానం వేరే ఏముంటుంది?
బాబా ఆపణ కృపాఘన | కరోనియా కృపాజల సించన | 
కరా హా అజ్ఞానదావానల శమన | హోఈన మీ ధన్య ఇతుకేనీ | ||౧౦౪|| 
104. ‘బాబా! మీరు కృపా ఘనులు. కృపా జలం ప్రోక్షించి, ఈ అజ్ఞానమనే కార్చిచ్చుని ఆర్చివేయండి. అప్పుడే నేను ధన్యుణ్ణి అవుతాను.
నలగే మజ జ్ఞానాచీ గోఠీ | నిరసా మాఝియా అజ్ఞాన కోటీ | 
ఠేవా మజవరీ కృపాదృష్టీ | సుఖ సంతుష్టీ తేచి మజ | ||౧౦౫|| 
105. ‘జ్ఞానం గురించి చర్చ నాకు అనవసరం. నా అజ్ఞాన కోటిని తొలగించి, నాపై కృపా దృష్టిని ఉంచండి. నాకు అదే సుఖం సంతృప్తి.
సాఈ సప్రేమ కరుణాఘన | నానాస నిమిత్తా పుఢే కరూన | 
తుమ్హా ఆమ్హా సకలాం లాగూన | గీతార్థప్రవచన హే కేలే | ||౧౦౬|| 
106. కరుణాఘనులు, ప్రేమమయులైన సాయి, నానాను నిమిత్త మాత్రునిగా ముందుంచి, మీకు, మాకు, అందరికీ గీతార్థ ప్రవచనాన్ని చేశారు.
గీతా భగవంతాచే వచన | మ్హణోని హే ప్రత్యక్ష శాస్త్ర జాణ | 
కాలత్రయీంహీ యాచే ప్రమాణ | కధీంహీ అవగణన హోతా నయే | ||౧౦౭|| 
107. గీత, భగవంతుని వచనం. కనుక, అది ప్రత్యక్ష శాస్త్రమని తెలుసుకో. త్రికాలాల్లో కూడా, ఇది ప్రమాణం. ఎప్పుడూ దీనిని అవమానించ కూడదు.
పరి అత్యంత విషయాసక్త | అథవా జో ఖరా జీవన్ముక్త | 
యా దోఘాంసీహీ నలగే శాస్త్రార్థ | ముముక్షూ ప్రీత్యర్థ యా జన్మ | ||౧౦౮|| 
108. కాని, అత్యంత విషయాసక్తులకు, అథవా నిజమైన జీవన్ముక్తులకు, ఈ ఇరువురికీ శాస్త్రార్థాల అవసరం లేదు. ముముక్షువుల ప్రీతి కోసమే ఇవి సృష్టించ బడ్డవి.
విషయాపాశీ దృఢ ఆకళిలా | కధీ పావేన మీ ముక్తతేలా | 
ఏసే వదతియా ముముక్షూలా | తారావయాలా హీ శాస్త్రే | ||౧౦౯|| 
109. ‘విషయా పాశంలో దృఢంగా చిక్కుకున్నాను. ఎప్పుడు దానినుంచి ముక్తిని పొందుతాను?’ అని తలచే ముముక్షువులను తరింప చేయటానికే ఈ శాస్త్రాలు.
పాహూని ఏశా నిజ భక్తాంలా | సంతాంస జేవ్హా యేతో కళవళా | 
కాఢూని కాంహీ నిమిత్తాలా | ఉపదేశ అవలీలా ప్రకటితీ | ||౧౧౦||
110. ఇటువంటి నిజ భక్తుని చూసి, సంతులకు కరుణ కలిగి, ఏదో నిమిత్తం కనుగొని, అవలీలగా భక్తులకు ఉపదేశం చేస్తారు.

దేవ అథవా గురు పాహే | భక్తా ఆధీన సర్వస్వీ రాహే | 
భక్త కల్యాణ చింతా వాహే | సాంకడీ సాహే తయాంచీ | ||౧౧౧|| 
111. దేవుడు, లేదా గురువు, ఎప్పుడూ భక్తుల అధీనంలో ఉంటారు. భక్తుల మేలునే సదా చింతిస్తూ, భక్తుల కష్టాలను వారే స్వీకరిస్తారు. 
ఆతా ఎక దుజే లహాన | కరితో సాఈచే వృత్త కథన | 
కైసీ ఎకాద్యా కార్యాచీ ఉఠావణ | కరితా నకళతపణ దావీ | ||౧౧౨|| 
112. ఇప్పుడు, సాయి పాటించే మరొక చిన్న పద్ధతి - ఎవరికీ తెలియకుండా, కొన్ని కార్యాలని వారు ఎలా ప్రారంభించేవారు - అని చెప్తాను.
అసో సాన వా తే మోఠే | ఖరే కారణ కధీంహీ న ఫుటే | 
కార్య మాత్ర హళూ హళూ ఉఠే | వాచ్యతా న కోఠే కేవ్హాంహీ | ||౧౧౩|| 
113. అది చిన్న పనైనా, పెద్దదైనా, నిజమైన కారణం ఎప్పుడూ తెలిసేది కాదు. ఎవరికీ, ఎప్పుడూ, ఏమీ చెప్పకుండానే, ఆ కార్యం మాత్రం క్రమక్రమంగా జరిగేది.
సహజగత్యా ఎకాదే కామ | నిఘావే కరావా ఉపక్రమ | 
న మూళ కారణ నిర్దేశ నా నామ | వరివరీ సంభ్రమ ఆణిక | ||౧౧౪|| 
114. ఆ పనులు, సహజంగా మొదలు పెట్టబడేవి. దాని మూల కారణం కాని, పేరుగాని, చెప్పబడేవి కావు. పైగా అవి సంభ్రమాన్ని కలగచేసేవి.
‘బోలేల తో కరీల కాయ | గరజేల తో వరసేల కాయ’ | 
యా రూఢ మ్హణీచా ప్రత్యయ | వినా వ్యత్యయ సాఈ దే | ||౧౧౫|| 
115. ‘చెప్పేవారు చేస్తారా? ఉరిమే మేఘాలు వర్షిస్తాయా?’ అని రూఢిలో ఉన్న ఈ నానుడిని, సాయి ప్రత్యక్షంగా అనుభవంలో చూపించారు.
బాబా సారిఖ్యా అవతార మూర్తీ | పరోపకారార్థ జగీ అవతరతీ | 
హోతా ఇచ్ఛితకార్యా సమాప్తీ | అంతీ అవ్యక్తీ సమరసతీ | ||౧౧౬|| 
116. బాబా లాంటి అవతార మూర్తులు, పరోపకారార్థమే జగత్తులో అవతరిస్తారు. అనుకున్న పని పూర్తి కాగానే, చివరకు కనిపించకుండా పోతారు.
ఆమ్హా న ఠావే మూళ కారణ | కో్ఠూన ఆలో కోఠే ప్రయాణ | 
కిమర్థ ఆమ్హీ ఝాలో నిర్మాణ | కాయ కీ ప్రయోజన జన్మాచే | ||౧౧౭|| 
117. మనకు మూల కారణం తెలియవు. ఎక్కడినుంచి వచ్చాం? ఎక్కడికి ప్రయాణం? ఏ అర్థంతో మనం సృష్టింపబడ్డాం? ఈ జన్మయొక్క ప్రయోజనమేమిటి?
బరే స్వచ్ఛందే జన్మ కంఠలా | పుఢే మృత్యూచా సమయ ఆలా | 
సకళ ఇంద్రియగణ వికళ ఝాలా | తరీహీ న సుచలా సువిచార | ||౧౧౮|| 
118. ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడిపేస్తాము. తరువాత, మరణ కాలం రాగా, అన్ని ఇంద్రియాలూ బలహీనమైనా, మంచి ఆలోచనలు రావు.
కలత్ర పుత్ర బంధూ జననీ | ఇష్టమిత్రాది సకల స్వజనీ | 
దేహ త్యాగితా పాహూ నయనీ | తరీహీ న మనీ సువిచార | ||౧౧౯|| 
119. భార్య, కొడుకులు, బంధువులు, తల్లి, ఇష్ట మిత్రులు, సకల స్వజనులూ, దేహాన్ని త్యజించటం కళ్లతో చూసినా, మనసులో, మంచి ఆలోచనలు రావు.
తైసే నవ్హతీ సంతజన | తే తో అత్యంత సావధాన | 
అంతకాలాచే పూర్ణజ్ఞాన | ఠావే నిజ నిర్వాణ తయాంతే | ||౧౨౦||
120. సత్పురుషులు అలా కాదు. వారేమో అత్యంత జాగరూకతతో ఉంటారు. అంత్య కాలంయొక్క పూర్ణ జ్ఞానముండి, తమ నిర్వాణాని, వారే నిర్ధారిస్తారు.

దేహ అసేతో అతి ప్రీతి | భక్తాంలాగీ దేహే ఝిజతీ | 
దేహావసానీ హీ దేహావస్థితీ | నిజభక్తహితీ లావితీ | ||౧౨౧|| 
121. శరీరంతో ఉన్నప్పుడు, ఎంతో ప్రేమతో, భక్తుల కొరకు తమ శరీరాన్ని అరగదీస్తారు. దేహాన్ని వదిలిన తరువాత కూడా, తాము మరణించిన స్థలాన్ని, భక్తుల శ్రేయస్సు కొరకు వినియోగిస్తారు.
దేహ ఠేవావయాచే ఆధీ | కోణీ అపులీ బాంధితీ సమాధీ | 
కీ పుఢే నిజ దేహా విశ్రాంతి | మిళావీ నిశ్చితీ తే స్థానీ | ||౧౨౨|| 
122. దేహాన్ని వదలక మునుపే, కొందరు, తమ దేహం తరువాత అక్కడే విశ్రమించాలని, నిశ్చిత ప్రదేశంలో సమాధిని నిర్మింప చేసుకుంటారు.
తైసేంచ పహా బాబాంనీ కేలే | పరి తే ఆధీ కోణా నకళలే | 
సమాధీ మందిర బాంధవూన ఘేతలే | అఘటిత కేలే తయాంనీ | ||౧౨౩|| 
123. బాబా కూడా, చూడండి, అలానే చేశారు. కాని, మొదట అది ఎవరికీ తెలియలేదు. సమాధీ మందిరాన్ని నిర్మించుకున్నారు. వారు అద్భుతం చేశారు.
నాగపూరస్థ మోఠే ధనిక | బాపూసాహేబ బుట్టీ నామక | 
తయా హస్తే హే బాబాంచే స్మారక | ఉభవిలే దేఖ బాబాంనీ | ||౧౨౪|| 
124. నాగపూర్ లోని గొప్ప ధనికుడు, బాపూసాహేబు బుట్టీ అని ఆయన పేరు, ఆయన చేతులతో బాబా ఈ స్మారకాన్ని నిర్మించారు.
బాపూసాహేబ పరమ భక్త | సాఈచరణీ నిత్యానురక్త | 
ఆలే నిజ పరివారాసహిత | రాహిలే శిరడీంత సేవేస | ||౧౨౫|| 
125. బాపూసాహేబ పరమ భక్తుడు. సాయి పాదాలలో ఎప్పుడూ, ప్రేమ కలవాడు. తన పరివార సమేతంగా వచ్చి, సేవకోసం, శిరిడీలోనే ఉన్నాడు.
ధరూని సాఈ చరణీ హేత | నిత్యానువర్తీ తేథేంచ వసత | 
పుఢేంహీ తైసేంచ నిత్యాంకిత | రహావే శిరడీంత వాటలే | ||౧౨౬|| 
126. సాయి పాదాల పైన ప్రేమతో అక్కడే వాసం చేశాడు. తరువాత కూడా సాయికి అంకితమై, శిరిడీలోనే శాశ్వతంగా ఉండాలనుకున్నాడు.
ఘ్యావీ ఎకాదీ జాగా వికత | ఉఠవావీ ఎక ఛోటీ ఇమారత | 
స్వతంత్రపణే వసావే తేథ | ఆలే కీ మనాంత తయాంచ్యా | ||౧౨౭|| 
127. ఏదో కొంత స్థలం కొని, ఒక చిన్న బంగళాను నిర్మించి, స్వతంత్రంగా అక్కడే నివసించాలని అతనికో ఆలోచన కలిగింది.
యేథే హే పేరిలే మూళ బీజ | త్యాచాచ వృక్ష హే మందీర ఆజ | 
దృశ్య స్మారక భక్తకాజ | సాఈ మహారాజ ప్రేమాచే | ||౧౨౮|| 
128. ఇక్కడ నాటిన మూల బీజంయొక్క చెట్టు, ఈ నాటి మందిరం. సాయి మహారాజుకు, భక్తుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం, ఈ దృశ్య స్మారకం.
కైసా కైసా యాచా ఉభారా | ఝాలా ఉపక్రమ కవణ్యా ప్రకారా | 
కైసా హా ఆలా యా ఆకారా | వృత్తాంత సారా అవధారా | ||౧౨౯|| 
129. ఎలా ఎలా ఇది పైకి లేచింది, ఏ విధంగా మొదలైంది, ఎలా ఈ ఆకారాన్ని దాల్చింది అన్న సంగతులన్నీ ఇప్పుడు వినండి.
విచార హే ఏసే చిత్తీ | దీక్షితాంచియా మాడీవరతీ | 
బాపూసాహేబ నిద్రిస్త స్థితీ | దృష్టాంత దేఖతీ మౌజేచా | ||౧౩౦||
130. మనసులో, ఈ విషయాల గురించి ఆలోచిస్తూ, దీక్షిత వాడా మేడపై బాపూసాహేబ నిద్రిస్తుండగా, నిద్రలో ఒక చక్కటి కల చూశాడు.

తేథేంచ ఎకా బిఛాన్యాంత | మాధవరావహీ23 అసతా నిద్రిస్త | 
తయాంసహీ తోచ దృష్టాంత | పరమవిస్మిత దోఘేహీ | ||౧౩౧|| 
131. అక్కడే, ఒక పరుపుపైన, మాధవరావు కూడా నిద్రిస్తున్నాడు. నిద్రలో ఆయనకు కూడా అదే కల కలగటంతో, ఇద్దరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. 
బాపూసాహేబ స్వప్న దేఖతీ | బాబా తయాంతే ఆజ్ఞాపితీ | 
ఆపణహీ ఆపులా వాడా నిశ్చితీ | దేఉళా సమవేతీ బాంధావా | ||౧౩౨|| 
132. బాపూసాహేబు చూసిన కలలో, బాబా "నువ్వు నీ వాడను, నిశ్చయంగా మందిరంతో సహ కట్టించు" అని ఆజ్ఞాపించారు.
హోతాం క్షణీంచ హా దృష్టాంత | బాపూసాహేబ జాహలే జాగృత | 
ఆమూల స్వప్న ఆఠవీత | ఆసనస్థిత నిజ శేజే | ||౧౩౩|| 
133. ఆ కల కలిగిన క్షణంలోనే, బాపూసాహేబు మేల్కొని, మొత్తం కలను ప్రక్కపైనే కూర్చుని గుర్తు తెచ్చుకోసాగాడు.
ఇకడే ఏసే చాలలే అసతా | మాధవరావ ఏకిలే రడతా | 
బుట్టీ తయాంస జాగే వ్హా ఓరడతా | నిద్రితావస్థా మావళలీ | ||౧౩౪|| 
134. ఇక్కడ ఇలా జరుగుతుండగా, మాధవరావు ఒకటే ఏడవటం వినిపించింది. బుట్టీ గట్టిగా కేక వేసి లేపడంతో, అతని నిద్ర మాయమైంది.
కాంహో ఆపణ కా రడతా హోతా | ఏసే మాధవరావాస పుసతా | 
మ్హణతీ శ్రీచే ప్రేమోద్గార పరిసతా | ప్రేమోద్రేకతా పావలో | ||౧౩౫|| 
135. ‘ఏమిటోయి! ఎందుకు నీవు ఏడుస్తున్నావు?’ అని మాధవరావుని అడగగా, ‘శ్రీవారి ప్రేమమయమైన మాటలు విని, నాలో ప్రేమోద్రేకం పొంగిపోయింది’ అని చెప్పాడు.
బాష్ప గద్గద జాహలా కంఠ | నయనీ ఆసుంవే వాహిలీ ఉద్భట | 
ప్రేమ నావరే ఆవరితా ఉత్కట | జాహలే పరిస్ఫుట రుదనాంత | ||౧౩౬|| 
136. ’బాష్పాలు రాలాయి, కంఠం గద్గదమైంది. ఆపుకుందామన్నా, ఆగకుండా కన్నీళ్లు బయటికి ఉబికింది. విపరీతమైన ప్రేమ నన్నావరించి, ఏడుపుతో బయట పడింది.’
యేఊని బాబా మాఝియా నికట | ఆజ్ఞా దిధలీ మజలా స్పష్ట | 
వాడా దేఊళ హోఊంద్యా ప్రకట | పురవీన అభిష్ట సర్వాంచే | ||౧౩౭|| 
137. ‘బాబా నా దగ్గరకు వచ్చి, “వాడా మరియు దేవాలయం, ఆకారం దాల్చని. నేను అందరి కోరికలనూ తీరుస్తాను” అని నన్ను స్పష్టంగా ఆజ్ఞాపించారు’.
బాపూసాహేబ అంతరీ విస్మిత | దోఘాంలాగీ ఎకచి దృష్టాంత | 
మన జాహలే సంశయరహిత | కార్యార్థోద్యత నిశ్చిత | ||౧౩౮|| 
138. బాపూసాహేబు లోపలే చాలా ఆశ్చర్య పోయాడు. ఇద్దరికీ ఒకే కల. మనసులోని సంశయాలు తీరాయి. ఇక కార్యాన్ని, మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు.
బుట్టీ స్వయే గర్భశ్రీమంత | వాడా దేఊళ బాంధూ సమర్థ | 
మాధవరావ కేవళ సుఖవస్త | ఎకచి దృష్టాంత ఉభయాంతే | ||౧౩౯|| 
139. బుట్టి స్వయంగా ఆగర్భ శ్రీమంతుడు. వాడా, దేవాలయం కట్టించగల సమర్థుడు. మాధవరావు సుఖంగా బ్రతకగలవాడు. అయినా, ఇద్దరికీ ఒకే కల.
పరస్పరాంచీ స్వప్నే జుళలీ | పరమానందా భరతీ ఆలీ | 
రూపరేఖా నిశ్చిత కేలీ | యోజనా అనుమోదిలీ కాకాంనీ24 | ||౧౪౦||
140. వారిరువురి కలలు పొందాయి. ఇద్దరికీ, పరమానందం కలిగింది. వారు రూపురేఖలను నిశ్చయించగా, దానిని కాకా (దీక్షితు) ఆమోదించాడు.

అసో ఉదయీక ప్రాతఃకాళీ | తిఘేహీ అసతా బాబా జవళీ | 
బాబా నిత్య ప్రేమసమేళీ | ముఖ న్యాహాళీత శామాచే25 | ||౧౪౧|| 
141. మరునాడు ఉదయమే, ముగ్గురూ బాబా దగ్గర ఉండగా, ఎప్పటిలాగే, బాబా ప్రేమతో శామా ముఖాన్ని పరీక్షించ సాగారు.
శామా వదే ‘దేవా హా ఖేళ | కాయ ఆహే తుఝా అకళ | 
ఝోంపహీ న ఘేఊ దేసీ నిశ్చళ | తేథేంహీ ఆమ్హాంతే బరళవిసీ’ | ||౧౪౨|| 
142. శామా అన్నాడు, ‘దేవా! ఏమిటి నీ ఈ అర్థంకాని లీల? ప్రశాంతంగా నిద్ర కూడా పోనీయవు. నిద్రలో కూడా మమ్మల్ని రెచ్చగొడతావు’ 
తేవ్హా బాబా తే పరిసునీ | హస్త ఠేవీత ఆపులే కానీ | 
వదత “ఆమ్హీ ఆపులే ఠికాణీ | మ్హణోత కోణీ కాంహీంహీ” | ||౧౪౩|| 
143. అది విని బాబా, తమ చెవులపై చేతలుంచి, "మేము మా స్థానంలోనే ఉన్నా, ఎవరో ఏదేదో అంటారు" అని అన్నారు. 
అసో మగ తీ పూర్వోక్త యోజనా | మాండిలీ బాబాంచియా అనుమోదనా | 
జాహలీ తాత్కాళ బాబాంచీ అనుజ్ఞా | సమందిర సదనా బాంధావయా | ||౧౪౪|| 
144. మునుపు అనుకున్న నమూనాలను, బాబా ఆమోదానికి చూపించారు. తక్షణమే, మందిరంతో సహ ఇల్లు కట్టడానికి, బాబా అనుమతి దొరికింది. 
మాధవరావాంనీ బాంధిలీ కంబర | ఝాలా తళమజలా తళఘర | 
త్యాంచేచ హాతూన ఝాలీ విహీర | కామ హే యేథేవర పోహోంచలే | ||౧౪౫|| 
145. మాధవరావు నడుం బిగించాడు. నేల క్రింద భూ గృహం తయారైంది. అతని చేతులతోనే, బావి కూడా తయారైంది. ఇంతవరకూ పని జరిగింది. 
లేండీవరీ జాత అసతా | అథవా తేథూని మాగే పరతతా | 
ఖిడక్యా బార్యా దారే బసవితా | బాబా ఉత్సుకతా అవలోకిత | ||౧౪౬|| 
146. లెండీకి వెళ్లేటప్పుడు, లేదా, అక్కడనుండి తిరిగి వచ్చేటప్పుడు కాని, కిటకీలు, తలుపులు బిగించేటప్పుడు, బాబా ఉత్సుకతతో తిలకించేవారు. 
వదత కరూని తర్జనీ వరీ | యేథే దార యేథే బారీ26
యేథే పూర్వేస కాఢా గ్యాలరీ | శోభా బరీ దిసేల | ||౧౪౭|| 
147. చూపుడు వ్రేలితో చూపిస్తూ, “ఇక్కడ ద్వారం, ఇక్కడ కిటికీ, ఇక్కడ, తూర్పు దిక్కున, గ్యాలరీ చేయండి. అందంగా చక్కగా కనిపిస్తుంది”. 
పుఢే కార్యకారణ నిమిత్తే | బాపూసాహేబ జోగాంచే హస్తే | 
పుఢీల కామ హోణారే హోతే | తే మగ త్యాంతే సోపవిలే | ||౧౪౮|| 
148. తరువాత ‘కార్యం – కారణం’ న్యాయం ప్రకారం, ముందర పని బాపూసాహేబు జోగు చేతుల మీదుగా జరగవలసి ఉండగా, దానిని అతనికి అప్పగించారు. 
ఏసే కామ హోతా హోతా | స్ఫురణ ఝాలే బుట్టీచ్యా చిత్తా | 
యాంతచి ఎక గాభారా ధరితా | మురలీధర స్థాపితా యేఈల | ||౧౪౯|| 
149. అలా పని జరుగుతుండగా, బుట్టీ మనసులో, ‘ఇక్కడ ఒక గర్భగుడిని నిర్మిస్తే, అందులో మురళీధరుణ్ణి స్థాపించవచ్చు’ అనే ఆలోచన స్ఫురించింది. 
కల్పనేచా ఝాలా ఉదయ | పరీ న పుసతా బాబాంచా మనోదయ | 
బుట్టీ న ఆరంభిత కాంహీంహీ కార్య | వినా గురువర్య ఆజ్ఞాపన | ||౧౫౦||
150. ఆలోచనేమో ఉదయించింది, కాని బాబా అభిప్రాయం అడగకుండా, గురువర్యుని ఆజ్ఞ లేకుండా, బుట్టీ ఏ కార్యాన్నీ ఆరంభించడు. 

హా తో త్యాంచా నిత్యనేమ | అనుజ్ఞా బాబాంచీ హేంచ వర్మ | 
నాహీ ఏసే ఎకహీ కర్మ | త్యావీణ ఉపక్రమ జయాతే | ||౧౫౧|| 
151. ఇది అతని నిత్య నియమం. బాబా అనుమతి చాలా ముఖ్యం. అది లేకుండా, ఏ ఒక్క పని కూడా ఆరంభించబడదు. 
కిమర్థ వ్హావే మధ్యే దాలన | కాయ ఆహే త్యాచే ప్రయోజన | 
దోన్హీ కడీల భింతీ పాడూన | కరావే స్థాపన మురలీధరా | ||౧౫౨|| 
152. ‘హాలు మధ్యలో గోడ ఎందుకు? దాని ప్రయోజనమేముంది? రెండు వైపులా ఉన్న గోడలను తీసేసి, మురళీధరుని స్థాపన చేయవచ్చు’. 
దాలనాచే వ్హావే దేవాలయ | బాపూసాహేబ యాంచా మనోదయ | 
పరి పుసావా బాబాంచా ఆశయ | అసల్యాస నిఃసంశయ కరావే | ||౧౫౩|| 
153. ‘హాలును రెండు గదులుగా మార్చడానికంటే, అక్కడే దేవాలయం చేయొచ్చుగా’ అనేది బాపూసాహేబు ఆలోచన. కాని, బాబా అభిప్రాయం తెలుసుకొని, నిస్సంశయంగా అలాగే చేయవచ్చు. 
మ్హణోని వదలే మాధవరావా | ఆపణ బాబాంచా విచార ఘ్యావా | 
మగ పుఢీల ఆక్రమ యోజావా | రుచేల దేవా27 తైశాపరీ | ||౧౫౪|| 
154. అందుకు మాధవరావుతో అన్నాడు, ‘మనము బాబా ఆలోచన తెలుసుకొని, తరువాత ముందర నమూనాలను, దేవాకు నచ్చిన విధంగానే చేద్దాం’. 
బాబా ఫేరీవర అసతా | వాడియాచ్యా సన్నిధ యేతా | 
ద్వారానికట స్వారీ పావతా | కాయ పుసతాత శామరావ | ||౧౫౫|| 
155. బాబా వాహ్యాళికి వెడుతూ, వాడకు సమీపంగా వచ్చి, ద్వారం దగ్గర రాగా, శ్యామరావు ఏమి అడిగాడు అంటే -  
దేవా బాపూసాహేబ వదతీ | దాలనాచ్యా దోన్హీ భింతీ | 
పాడూని తేథే స్థాపూ ప్రీతీ | కృష్ణ మూర్తీ మురలీధరా | ||౧౫౬|| 
156. ‘దేవా! హాలుని విభజించే, రెండు గోడలనూ తీసేసి, అక్కడ ప్రీతితో, మురళీధరుడైన కృష్ణమూర్తిని స్థాపిద్దామని, బాపూసాహేబు అంటున్నాడు, 
మధ్య భాగీ చౌక సాధూన | కరూ తేథే సింహాసన | 
వరీ మురలీధర విరాజమాన | శోభాయమాన దిసేల | ||౧౫౭|| 
157. ‘మధ్య భాగంలో చదరంగా చేసి, అక్కడ సింహాసనాన్ని అమర్చి, దానిపైన మురళీధరుడు విరాజమానుడైతే, శోభాయమానంగా కనిపిస్తుంది’. 
ఏసే బాపూసాహేబ యోజితీ | పరి పాహిజే ఆపులీ అనుమతీ | 
దేఊళ వాడా దోనీ యే రీతీ | హాతోహాతీ హోతీల | ||౧౫౮|| 
158. ‘అని బాపూసాహేబు ఆలోచన. మరి మీ అనుమతి కావాలి. ఈ రీతి దేవాలయం, వాడా, రెండూ తొందరగా తయారౌతాయి’. 
ఏకూని హీ శామాచీ ఉక్తీ | బాబా ఆనందే బరే మ్హణతీ | 
“దేఊళ పూర్ణ ఝాలియావరతీ | యేఊ కీ వస్తీస ఆపణహీ” | ||౧౫౯|| 
159. శామా మాటలు విని, బాబా ఆనందంతో, “సరే” అని అన్నారు. “దేవాలయం పూర్తి అయ్యాక, మనమే ఇక్కడ ఉండటానికి వస్తాము”. 
లావూని వాడియాకడే దృష్టీ | బాబా కరీత మధుర గోష్టీ | 
“వాడా పురా ఝాలియా పాఠీ | ఆపులే సాఠీంచా తో లావూ | ||౧౬౦||
160. వాడవైపు దృష్టి సారించి, “వాడా పూర్తి అయ్యాక, మనకోసమే ఉంచుకుందాము” అని బాబా మధురంగా చెప్పారు. 

తేథేంచ ఆపణ బోలూ చాలూ | తేథేంచ ఆపణ అవఘే ఖేళూ | 
ప్రేమే ఆపాపణా కవటాళూ | భోగూ సుకాళూ ఆనందాచా” | ||౧౬౧|| 
161. “మనము అక్కడే తిరుగాడుదాము. అక్కడే మనము ఆడుకుందాము. ప్రేమతో మనము కౌగలించుకుని, ఎల్లప్పుడూ సుఖాన్ని ఆనందాన్ని అనుభవిద్దాము”.
అసో తేవ్హా శ్రీసాఈప్రత | మాధవరావజీ ఏసేంహీ పుసత | 
హేచీ జరీ అనుజ్ఞా నిశ్చిత | పాయాసీ ముహూర్త కరూ కీ | ||౧౬౨|| 
162. అప్పుడు మాధవరావు శ్రీసాయిని, ‘ఇదే అనుమతి నిశ్చయమైతే, పునాదికి ముహూర్తం పెట్టనా?’ అని అడిగాడు. 
బరీ ఆహే నా దేవా వేళ | ఫోడావయా ఆణూ నా నారళ | 
“ఫోడ ఫోడ” మ్హణతా తాత్కాళ | ఆణూని శ్రీఫళ ఫోడిలే | ||౧౬౩|| 
163. ‘ఇప్పుడు సమయం మంచిదేనా, దేవా! కొట్టడానికి కొబ్బరికాయను తీసుకురానా?’ అని అడిగాడు. “కొట్టు, కొట్టు” అని బాబా అనగానే, కొబ్బరికాయను తెచ్చి కొట్టాడు. 
అసో పుఢే ఝాలా గాభారా | మురలీధర దేవాచా చౌథరా | 
మూర్తీహీ ఎకా కారాగిరా | సోపవిలీ కీ కరావయా | ||౧౬౪|| 
164. అలా, గర్భగుడి, తరువాత మురళీధరునికి చదరం అరుగు, తయారయ్యాయి. విగ్రహాన్ని చేయటానికి ఒక శిల్పికి పని కూడా అప్ప చెప్పారు. 
పుఢే ఆలీ ఏసీ వేళ | బాబాంస ఆలే దుఖణే ప్రబళ | 
నికట పాతలా అంతకాళ | అంతరీ తళమళ భక్తాంచ్యా | ||౧౬౫|| 
165. తరువాత వచ్చిన కాలంలో, బాబాకు అనారోగ్యం ఎక్కువైంది. అంత్య కాలం సమీపించింది. భక్తులందరూ లోలోపల చాలా కుమిలిపోయారు. 
బాపూసాహేబ అస్వస్థచిత్తీ | ఆతా పుఢే యా వాడ్యాచీ స్థితి | 
కాయ హోఈల నకళే నిశ్చితీ | మ్హణోని ఖంతీ ఉద్భవలీ | ||౧౬౬|| 
166. బాపూసాహేబు మనసులో దుఃఖించ సాగాడు. ఇక ముందు ఈ వాడా స్థితి ఏమౌతుందో, ఏదీ నిశ్చితంగా చెప్పలేక పోవటం గురించి చింత పట్టుకుంది. 
ఇత‍ఉత్తర బాబాంచే పాయ | మందిరాస యా లాగతీ కాయ | 
లాఖో రుపయే జాహలే వ్యయ | అంతీ హా వ్యత్యయ పాతలా | ||౧౬౭|| 
167. ‘ఎప్పటికైనా, బాబా పాదాలు మందిరంలో పడుతుందా? లక్షాంతర రూపాయలు ఖర్చయ్యాయి. చివరకు, ఈ ఆపద చూడాల్సిన స్థితి వచ్చింది. 
బాబాంనీ దేహ ఠేవిల్యావర | కశాస మురలీధర వా ఘర | 
కశాస వాడా అథవా మందిర | దుశ్చిత్త అంతర బుట్టీచే | ||౧౬౮|| 
168. బాబా దేహాన్ని త్యజిస్తే, ఇక మురళీధరుడు ఎందుకు? ఇల్లెందుకు? వాడా ఎందుకు? మందిరమెందుకు? బుట్టి మనసు నిరాశతో, దుఃఖించ సాగింది. 
పుఢే కర్మధర్మసంయోగే | అంతసమయ సాఈ నియోగే28
జాహలే వాడ్యాచియా మహత్భాగ్యే | మనా జోగే సకళాంచ్యా | ||౧౬౯|| 
169. తరువాత, కర్మ ధర్మ సంయోగం వలన, వాడాయొక్క గొప్ప భాగ్యం వలన, చివరికి అందరి కోరికలూ, బాబా ఆదేశం ప్రకారం, నెరవేరాయి. 
“మజలా వాడ్యాంత ద్యా ఠేవూన” | హే అంతకాళీంచే బాబాంచే వచన | 
నిఘతా బాబాంచియా ముఖాంతూన | జాహలే నిశ్చింత మన సర్వాంచే | ||౧౭౦||
170. “నన్ను వాడాలో ఉంచండి” అనే బాబా మాటలు, అంతిమ సమయంలో, బాబా నోటినుండి వెలువడిన తరవాత, అందరి మనసులు తేలిక పడ్డాయి. 

మగ తే పవిత్ర సాఈ శరీర | జాహలే గాభారియా మాజీ స్థిర | 
వాడా జాహలా సమాధి మందిర | అగాధ చరిత్ర సాఈచే | ||౧౭౧|| 
171. తరువాత, పవిత్రమైన సాయి శరీరం, గర్భగుడిలో స్థిరంగా స్థాపించ బడింది. వాడా, సమాధి మందిరమైంది. సాయియొక్క చరిత్ర అగాధం. 
ధన్య భాగ్య త్యా బుట్టీచే | జయాచియా గృహీ స్వసత్తేచే | 
విసావే శరీర శ్రీసాఈంచే | నామ జయాచే అతి పావన | ||౧౭౨|| 
172. ఆ బుట్టీయొక్క భాగ్యం ధన్యం. స్వశక్తితో నిర్మించిన అతని స్వగృహంలో, పావన నామాంకితుడైన శ్రీ సాయి శరీరం విశ్రమిస్తుంది. 
అసో ఏసీ హీ కథా పావన | పరిసోని శ్రోతే సుఖసంపన్న | 
హేమాడ సాఈనాథాసీ శరణ | సోడీ న చరణ క్షణభరీ | ||౧౭౩|| 
173. పావనమైన ఇటువంటి కథను విని, శ్రోతలు సుఖాలను పొందుతారు. హేమాడు, సాయినాథుని శరణుజొచ్చి, ఒక్క క్షణమైనా వారి పాదాలను విడువడు. 
ఘడోత భోగ ఇష్టానిష్ట | సాఈ ఎక రాఖితా సంతుష్ట | 
వర్తతా మార్గే యథోపదిష్ట | లాధేల అభిష్ట అచూక | ||౧౭౪|| 
174. ఇష్టాయిష్టామైన అనుభవాలు జరుగుతుంటాయి. వారు చెప్పిన మార్గంలో నడుస్తూ, సాయి ఒక్కరిని సంతుష్ట పరిచితే, మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. 
కథా వక్తా ఆణి వదన | జేథే సాఈ సమర్థ ఆపణ | 
తేథే హేమాడ కోఠీల కవణ | ఉగాచ టోపణ నాంవాచా | ||౧౭౫|| 
175. కథ, చెప్పే వారు, మరియు చెప్పే నోరు, అన్నీ సాయి సమర్థులే అయినప్పుడు, హేమాడు ఎవరు? ఉట్టి పేరు మాత్రమే! 
మ్హణోని పుఢే హోఈల ప్రేరణా | తైసీచ కథా యేఈల శ్రవణా | 
వేళీ హోఈల జీ జీ రచనా | తియేచీ వివంచనా కా ఆజ | ||౧౭౬||
176. తరువాత ప్రేరణ ఎలా కలిగితే, అలా కథ వినిపించ బడుతుంది. ఆయా సమయానికి ఎలా, ఎలా రచింపబడుతుందో, దాని గురించిన ఆలోచన ఈ రోజు ఎందుకు? 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
 | శ్రీ సాఈ సమర్థ సచ్చరితే || గీతా విశిష్ట శ్లోకార్థ నివేదనం నామ | 
| ఎకోనచత్వారింశత్తమోధ్యాయః సంపూర్ణః |

 ||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||


టిపణీ: 
1. అధ్యాయ ౫ వా పహావా. 2. ఆఠవణ. 3. భగవద్గీతా, అ. ౪థా. 
4. సర్వ కర్మాంచీ పరిసమాప్తీ జ్ఞానాత హోతే. 
5. భగవద్గీతా, అ. ౪, శ్లోక ౩౩. 
6. జ్యాచ్యా ఆరంభీ ‘తద్విద్ధి ప్రణిపాతేన’ అసే ఆహే త్యా శ్లోకాచే పఠణ సురూ ఝాలే. 
7. శ్రీసాఈబాబా వ కై. నానాసాహేబ చాందోరకర యాంచా. 
8. స్పష్ట. 9. ఉతారా ఘేఊ. 
10. భగవద్గీతా, అ. ౪, శ్లోక ౩౪. 
11. భగవద్గీతా, అ. ౫, శ్లోక ౧౫. 12. శేవాళీ. 
13. శుద్ధ స్వరూపాచే అజ్ఞాన. 14. గంజ, మళ. 15. అగ్నీ. 
16. ఘోడ్యాంనీ. 17. లగామీ. 18. నిగ్రహ కరతే. 19. హత్తీ. 
20. మాసా. 21. భ్రమర. 22. పాఖరూ. 23. మాధవరావ దేశపాండే. 
24. హరీ సీతారామ దీక్షిత. 25. మాధవరావ. 26. ఖిడకీ. 
27. సాఈబాబాంస. 28. ఆజ్ఞేనే.