శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౩రా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
ఆతా పూర్వ కథేచీ సంగతీ | సాఈ పూర్ణ ఆశ్వాసన దేతీ |
మ్హణతీ “ఆపలీ సంపూర్ణ అనుమతీ | చరిత్రస్థితీ వర్ణావయా | ||౧||
1. ఇంతకు మునుపు చెప్పిన కథను కొనసాగిస్తూ, సాయి నాకు పూర్తి ధైర్యాన్నిచ్చి, “నా జీవిత చరిత్రను వర్ణించటానికి, నా సంపూర్ణ అనుమతి నీకు ఉంది.
తుమ్హీ ఆపులే కార్య కరా | మనీ యత్కించితహీ న కచరా |
విశ్వాస పూర్ణ మద్వచనీ ధరా | నిర్ధార కరా మనాచా | ||౨||
2. “నీ పనిని నీవు చేయి. మనసులో ఏ మాత్రం భయపడకు. నా మాటలను పూర్తిగా నమ్ము. నీ మనసును దృఢపరచుకో.
కేలియా మల్లీలేచే లేఖన | హోఈల అవిద్యాదోషనిరసన |
కేలియా మల్లీలేచే లేఖన | హోఈల అవిద్యాదోషనిరసన |
భక్తిభావే కరితా శ్రవణ | ప్రపంచభాన మావళేల | ||౩||
3. “నా లీలలను రచిస్తే, అజ్ఞానం వలన వచ్చే దోషాలు తొలగిపోతాయి. ఆ లీలలను భక్తిగా వింటే, సంసారంపైని ధ్యాస మాయమౌతుంది.
ఉఠతీల శ్రవణసాగరావరీ | భక్తిప్రేమామృతాచ్యా లహరీ |
ఉఠతీల శ్రవణసాగరావరీ | భక్తిప్రేమామృతాచ్యా లహరీ |
బుడియా దేతా ఉపరా ఉపరీ | యేతీల కరీ బోధరత్నే” | ||౪||
4. “వినటమనే సాగరాన భక్తి, ప్రేమామృతమనే అలలు లేస్తాయి. ఆ అలలో మరల మరల మునకలు వేస్తే, జ్ఞాన రత్నాలు దొరకుతాయి”.
ఏకోని నిఃశంక ఝాలే మన | సాఈపదీ కేలే నమన |
ఏకోని నిఃశంక ఝాలే మన | సాఈపదీ కేలే నమన |
మగ హే చరిత్రలేఖన | యథా స్మరణ ఆరంభీ | ||౫||
5. ఈ మాటలు వినగానే, నా మనసులోని సంశయాలు దూరమయ్యాయి. సాయి పాదాలకు నమస్కరించి, నాకు గుర్తోచ్చిన విధంగా చరిత్రను వ్రాయటం మొదలు పెట్టాను.
వరీ ఏక సాంగతో శామా3 | ప్రేమే ఘేఈల జో మన్నామా |
తయాచ్యా మీ సకల కామా | పురవీ ప్రేమా వాఢవీ | ||౧౧||
తయాచియా మీ మాగే పుఢే | చోహీకడే ఉభాచ | ||౧౨||
తయాంసీ యా కథాశ్రవణే | ఆనంద హోణే సహజీచ | ||౧౩||
నిత్య సౌఖ్య సమాధాన | సత్య వచన మానావే | ||౧౪||
జో మజలాగీ అనన్య శరణ | విశ్వాసయుక్త కరీ మద్భ జన |
హే శబ్ద యేతాంచ బాబాంచే ఓఠీ | తీచ బాంధిలీ శకున గాంఠీ |
ఘడూన యేణార ఆతా హే గోష్టీ | మీ తో వేఠీచా బిగారీ | ||౬||
6. బాబా నోటినుంచి వచ్చిన మాటలను శుభ శకునమని భావించి, నా కార్యం తప్పక జరిగి తీరుతుందని అనిపించింది. ఇందులో నేను ఉట్టి కూలివాడేనని నా మనసుకు దృఢమయింది.
పహా అగమ్య హరీచీ లీలా | త్యావీణ న కళే తీ అన్యాలా |
పహా అగమ్య హరీచీ లీలా | త్యావీణ న కళే తీ అన్యాలా |
శృతి శాస్త్ర దేవ ముకాబలా | థాంగ లాగలా నా కోణా | ||౭||
7. శ్రీహరి లీలలు ఎంత అంతు పట్టలేనివో గమనించండి. అవి ఆ శ్రీహరికి తప్ప మిగతా వారికి అర్థం కావు. శ్రుతులు, శాస్త్రాలు ఇవేవి ఆ శ్రీహరి లీలలను వర్ణించలేక మూగపోయాయి.
శాస్త్ర విశారద వేద వాదీ | ప్రజ్ఞావంత పండితాది |
శాస్త్ర విశారద వేద వాదీ | ప్రజ్ఞావంత పండితాది |
ఘటపటాదివాదప్రవాదీ1 | యాంచ్యా నాదీ భరూ నకా | ||౮||
8. శాస్త్రాలను బాగా తెలుసుకున్నవారు, వేదాలలో ఉన్న భావంతో సంబంధం లేకుండా వ్రాశిన శబ్దాలనే చర్చించేవారు, అతి తెలివిగల పండితులు, ఘట (మట్టి పాత్ర), పట (వస్త్రం) మొదలైన పదాలకు ఉదాహరణలిస్తూ పనికి రాని చర్చలు చేసేవారు, వీరి జోలికి పోకండి.
హరీ నిజభక్తాంచా కేలా | భాళ్యా-భోళియాంచా భుకేలా |
హరీ నిజభక్తాంచా కేలా | భాళ్యా-భోళియాంచా భుకేలా |
ప్రేమాలాగీ సమూళ వికలా | సదా హఠేలా దాంభికా | ||౯||
9. శ్రీహరి తన భక్తుల చేతిలో కీలుబొమ్మ. అమాయక భక్తుల కోసం తహతహలాడుతాడు. ప్రేమించే భక్తుల అధీనంలో ఎప్పుడూ ఉంటాడు, కాని, ఢాంభికులకు ఎప్పుడూ దూరంగా ఉంటాడు.
“యాంతచి తుమచే కల్యాణ ఆహే | మాఝేహీ అవతారసార్థక్య2 హే |
“యాంతచి తుమచే కల్యాణ ఆహే | మాఝేహీ అవతారసార్థక్య2 హే |
మాఝీ తో ఘోకణీ నిత్య పాహే | కాళజీ వాహే హేచ మీ | ||౧౦||
10. “ఇదే నీకు మంచిని చేకూర్చేది. ఇది నా ఈ అవతార కార్యానికి సార్థకత. దీనినే నేను పదే పదే చెప్పేది. దీని గురించే నాకెప్పుడూ చింత.
వరీ ఏక సాంగతో శామా3 | ప్రేమే ఘేఈల జో మన్నామా |
తయాచ్యా మీ సకల కామా | పురవీ ప్రేమా వాఢవీ | ||౧౧||
11. “శామా! నీకు మరో మాట చెబుతాను. ప్రేమతో, నమ్మకంతో నా పేరును స్మరించే వారి కోరికలన్ని తీరుస్తాను. దీనితో వారికి నామీద ప్రేమ ఇంకా పెరుగుతుంది.
మగ జో గాఈ వాడే కోడే | మాఝే చరిత్ర మాఝే పవాడే | తయాచియా మీ మాగే పుఢే | చోహీకడే ఉభాచ | ||౧౨||
12. “నా చరిత్రను, నా మహిమలను ప్రేమతో పాడేవారి ముందు, వెనుక, నాలుగు దిక్కులలో నిలచి ఉండటాన్ని వారు గమనిస్తారు.
జే జే భక్త మజకారణే | అసతీల వినటలే జీవే ప్రాణే | తయాంసీ యా కథాశ్రవణే | ఆనంద హోణే సహజీచ | ||౧౩||
13. “మనసు, ప్రాణంతో నన్ను ఆరాధించే భక్తులకు సహజంగానే ఈ కథలు విని సంతోషం కలుగుతుంది.
కోణీహీ కేల్యా మాఝే కీర్తన | తయాసీ దేఈన ఆనందఘన4 | నిత్య సౌఖ్య సమాధాన | సత్య వచన మానావే | ||౧౪||
14. “నా కథలను కీర్తనలుగా పాడే వారెవరైనా సరే, వారికి ఎప్పుడూ ఆనందాన్ని, సుఖ శాంతులను ప్రసాదిస్తాను. ఇది నా సత్య వచనమని నమ్ము.
మాఝే చింతన మాఝే స్మరణ | తయాచే ఉద్ధరణ బ్రీద మాఝే | ||౧౫||
15. “నాకు శరణుజొచ్చి, ఒకే మనసుతో, నమ్మకంతో నా భజన, ధ్యానం, నామ స్మరణ చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ.
మాఝే నామ మాఝీ భక్తీ | మాఝే దఫ్తర మాఝీ పోథీ |
మాఝే ధ్యాన అక్షయ చిత్తీ | విషయస్ఫూర్తీ కైంచీ త్యా | ||౧౬|| మాఝే నామ మాఝీ భక్తీ | మాఝే దఫ్తర మాఝీ పోథీ |
16. “నా నామాన్ని భక్తితో జపిస్తూ, నా లీలలను పాడుతూ, మనసులో ఎప్పుడూ నన్ను ధ్యానించే వారికి, ఇంద్రియ సుఖాలు ఎలా గుర్తుకు వస్తాయి?
కృతాంతాచ్యా దాఢేంతూన | కాఢీన మీ నిజభక్తా ఓఢూన | కరితా కేవళ మత్కథా శ్రవణ | రోగనిరసన హోఈల | ||౧౭||
17. “నా కథలను వినటంతోనే వారి రోగాలు తొలగిపోతాయి. నా భక్తులను మృత్యు ముఖంనుండి కూడా లాగేస్తాను.
కథా కరా సాదర శ్రవణ | త్యావరీ కరా పుర్ణ మనన | మననావరీ నిదిధ్యాసన | సమాధాన పావాల | ||౧౮||
18. “ఈ కథలను శ్రద్ధగా వినండి. విన్న తరువాత, మరల గుర్తుకు తెచ్చుకొండి. వాని గురించి ఆలోచించండి. దీనివలన మీకు శాంతి లభిస్తుంది.
‘అహం సోహం’ జాఈల విరోన | ఉన్మన హోఈల శ్రోతియాంచే మన | చిత్త హోఈల చైతన్యఘన | అనన్య పరిపూర్ణ శ్రద్ధేనే | ||౧౯||
19. “అంతే కాదు, ‘నేను, నాది’ అనే భావన మాయమై పోతాయి. పూర్తి శ్రద్ధగల శ్రోతలకు ఉన్మని స్థితి ఏర్పడి, వారి మనసు చైతన్యంతో నిండిపోతుంది.
‘సాఈ సాఈతి’ నామ స్మరణ | కరీల సకల కలిమల5 దహన |
వాణీశ్రవణగతపాపభంజన | ఏక లోటాంగణ ఘాలితా” | ||౨౦||
కార్య జరీ నవ్హే సామాన్య | ఆజ్ఞా కేలీ శిరసామాన్య |
బాబాంసారిఖా అసతా వదాన్య | కా పా దైన్య ఆదరావే | ||౨౧||
21. కావ్యాన్ని వ్రాయడం అంత సులభమైన పని కాదు. అయినా, వారి ఆజ్ఞను తలవంచి పాలించాను. బాబావంటి ఉదారులైన దాత ఉండగా, నేను ఎందుకు దీనుడవ్వాలి?
కోణా హాతీ బాంధావిలీ రాఉళే | కోణాసీ కీర్తనరంగీ లావిలే |
కోణాసీ తీర్థయాత్రే ధాడిలే | మజ బైసవిలే లిహావయా | ||౨౨||
22. ఒకరి ద్వారా మందిరాన్ని కట్టించారు. మరొకరిని హరికథ, కీర్తన మొదలైన వాటిలో నిమగ్నులను చేశారు. ఇంకొకరిని తీర్థయాత్రలకు పంపారు. అలాగే నన్ను వ్రాయటానికి కూర్చోబెట్టారు.
అవఘ్యాపరీస మీ పామర | కవణ్యా గుణే హా కరూణాసాగర |
దయాఘన ఓళలా మజవర | మీ తర కాంహీ జాణేనా | ||౨౩||
23. నేను అందరికంటే పామరుణ్ణి. ఆ కరుణాసాగరులు నాలో ఏ గుణాలను చూసి, నాపై తమ దయా దృష్టిని కురిపించారో నాకు ఏ మాత్రం తెలియదు.
హాచి గురూకృపేచా నవలావా | కీ జేథ కాంహీ న లవ ఓలావా |
తేథేహీ నిబర తరూ ఫులావా | దాట ఉఫలావా అప్రయాసే | ||౨౪||
24. గురు కృపలోని గొప్పతనం ఇదే. ఏ మాత్రం తడి లేకుండా ఎండి మోడుబారిన చెట్టును కూడా, అది ఏ కష్టమూ లేకుండా పుష్పించి, బాగా పళ్లు దొరికేలా చేస్తుంది.
కోణీ పుఢే బాంధితీల మఠ | కోణీ దేవాలయే కోణీ ఘాట |
ఆపణ ఘేఊ ధోపట వాట | చరిత్రపాఠ సాఈంచా | ||౨౫||
25. వచ్చే రోజులలో, కొందరు ఆశ్రమాలని మఠాలని నిర్మిస్తారు. మరి కొందరు నదీ తీరంలో స్నాన ఘట్టాలను నిర్మిస్తారు. కాని, నేను మాత్రం సులభమైన సాయి చరిత్ర పారాయణ మార్గాన్ని పాటిస్తాను.
కోణీ సత్కారపూర్వక అర్చన | కోణీ కరితీ పదాసంవాహన |
ఉత్కంఠిత ఝాలే మాఝే మన | గుణసంకీర్తన కరావే | ||౨౬||
26. కొందరు భక్తితో అర్చన చేస్తారు, మరికొందరు సాయి పాదాలను మృదువుగా నొక్కి సేవ చేస్తారు, నా మనసు మాత్రం సాయి గుణాలను కీర్తించాలని ఉబలాట పడుతుంది.
కృతయుగీ జే ప్రాప్త ‘ధ్యానే’ | యేతీ ‘యజనే’ ద్వాపరీ ‘అర్చనే’ |
తే ప్రాప్త సర్వ ‘నామసంకీర్తనే’ | గురూభజనే కలియుగీ | ||౨౭||
27. కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులతో, ద్వాపరయుగంలో అర్చనల ద్వారా లభించేవన్నీ కలియుగంలో గురుభజనలతో, నామ సంకీర్తనలతో ప్రాప్తిస్తాయి.
అనధికారీ ఉఘడ ఉఘడ | చింధ్యా భారాభర ఏక నా ధడ |
తేథే ఏసే హే అవజడ | కార్య అవఘడ ఘ్యావే కా | ||౨౮||
28. ఏ యోగ్యతా లేనివాణ్ణి నేను. అనర్హుణ్ణి. చినిగిన గుడ్డ పీలికలు బోలెడున్నా సరియైన వస్త్రం ఒక్కటైనా లేనివాణ్ణి. దేనిలోనూ పరిపూర్ణ జ్ఞానం లేనివాణ్ణి. అలాంటప్పుడు, ఇలాంటి కష్టమైన కార్యాన్ని ఎందుకు స్వీకరించాను?
యత్న న కరితా ఉగే బసావే | ఆజ్ఞాభంగపాతకీ వ్హావే |
ఆజ్ఞాపాలన కరూ జావే | తరీ వ్హావే హే కైసే | ||౨౯||
29. ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చుందామంటే, ఆజ్ఞను భంగం చేసిన పాతకుణ్ణవుతాను. పోనీ ఆజ్ఞను పాలిద్దామంటే, నాలాంటివాడికి ఎలా సాధ్యం?
సమర్థ సాఈంచీ నిజస్థితీ | యథార్థ వర్ణాయా కోణా గతి |
స్వయేంచ భక్తార్థ కృపా కరితీ | తరీ తే వదవితీ స్వయేంచ | ||౩౦||
30. సాయి సమర్థుల నిజ స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా వర్ణించే శక్తి ఎవరికి ఉంది? వారే స్వయంగా భక్తులను కరుణించ తలచినప్పుడు, వారికి వారే తెలియజేస్తేనే ఇది సాధ్యం.
వాణీచీ జేథ న చలే ధాంవ | తేథే మీ కా బాంధిలీ హాంవ |
ఏసే బోలావయాసీ వావ | ఠేవిలా న ఠావ కవణాతే | ||౩౧||
31. కాని, మాటలకు అందని భావాలను చెప్పాలని నేనెందుకు ఆశపడ్డాను అని ఎవరైనా అనటానికి నేను తావివ్వలేదు.
ఉచలిలీ జేవ్హా హాతీ లేఖణ | బాబాంనీ హరిలే మాఝే మీపణ |
లిహితీ ఆపులీ కథా ఆపణ | జ్యాచే భూషణ త్యాజలా | ||౩౨||
32. ఎందుకంటే, చేతిలో కలం తీసుకోగానే, బాబా నా అహంకారాన్ని తొలగించి, తమ కథలను తామే వ్రాసుకున్నారు. అందువల్ల, ఇందులోని గొప్పతనమంతా వారిదే.
హే తో సంతచరిత్రలేఖన | సంతాంవీణ కరీల కోణ |
బాబాంచ్యా అతర్క్య గుణాంచే ఆకలన | గగనా ఆలింగన-దానాసమ | ||౩౩||
33. ఎంతయినా, ఇది సత్పురుషుని చరిత్ర రచన. ఇలాంటి రచనలను సత్పురుషులు తప్ప వేరే ఎవరు వ్రాయగలరు? బుద్ధికి అంతుపట్టని బాబా గుణాలను, మహిమలను అర్థం చేసుకోవటమనేది, ఆకాశాన్ని కౌగలించుకోవటం లాంటిది.
అతిగహన తయాంచే మహిమాన | వర్ణావయాసీ మీ మతిహీన |
త్యాంనీచ ఉకలూన ఆపులే ఆపణ | నిర్ముక్తవచన వ్హావే కీ | ||౩౪||
34. ఊహకు అందని వారి మహిమలను, బుద్ధిహీనుడైన నేనెలా వర్ణించను? అందుకు, ఈ కార్యాన్ని వారే వహించి, ఇచ్చిన మాటనుంచి ముక్తులవ్వాలి.
బాబా జరీ మీ జన్మతః బ్రాహ్మణ | తరీ శృతిస్మృతినేత్రవిహీన |
జరీ హే యా జన్మా దూషణ | పరీ మజ భూషణ ఆపులే | ||౩౫||
35. బాబా! పుట్టుకతో నేను బ్రాహ్మణుడనే, కాని, వేదాలు, పురాణాలనే రెండు కళ్లూ లేనివాణ్ణి. ఇది నా పుట్టుకకు లోపమే అయినా, మీ వలననే నాకు శోభ.
శృతిస్మృతి హే బ్రాహ్మణనయన | కాణా తో జో ఏకే హీన |
అంధచి తో జో ఉభయహీన | హీన దీన తైసా మీ | ||౩౬||
36. వేదాలు, పురాణాలు అనేవి బ్రాహ్మణులకు రెండు కళ్లు. ఒకటి లేకపోతే అప్పుడు మెల్లకన్ను. రెండూ లేకపోతే, గుడ్డివాడే. అలాంటి హీనుణ్ణి, దీనుణ్ణి నేను.
ఆపణ మజ అంధాచీ కాఠీ | అసతా మజ కాయ ఆటాటీ |
టేకీత టేకీత పాఠీ పాఠీ | ధోపట వాటే చాలేన | ||౩౭||
37. కాని ఈ గుడ్డివానికి ఊతకర్రలా మీరు తోడు ఉండగా, ఇక నాకేం కష్టం? మీ వెంట వెంటనే సులభమైన మార్గాన నడుస్తాను.
ఆతా పుఢారా కాయ కరావే | మజ పామరా నాహీ ఠావే |
ఆపణచి బుద్ధిదాయక వ్హావే | సంపాదావే నిజ కార్య | ||౩౮||
38. ఇక ముందు ఏమి చేయాలన్నది హీనుణ్ణైన నాకు తెలియదు. నాకు బుద్ధిని ఇచ్చి, మీ కార్యాన్ని మీరే సాధించుకోండి.
ముకే బృహస్పతీసమ బోలతీ | పంగూ మేరూపర్వత లంఘితీ |
హీ జయాంచీ అతర్క్య శక్తి | తయాంచీ యుక్తీ త్యా ఠావీ | ||౩౯||
39. బుద్ధికి మించిన ఎవరి అపూర్వ శక్తితో, కుంటివాడు మేరు పర్వతాన్ని దాటగలడో, మూగవాడు బృహస్పతివలె మాట్లాడగలడో, అలాంటి శక్తిగలవారి యుక్తి వారికే తెలుస్తుంది.
మీ తో కేవళ పాయాంచా దాస | నకా కరూ మజలా ఉదాస |
జోవరీ యా దేహీ సాస | నిజకార్యాస సాధూన ఘ్యా | ||౪౦||
40. నేను మీ పాదదాసుణ్ణి మాత్రమే. నన్ను నిరుత్సాహ పరచకండి. ఈ దేహంలో శ్వాస ఉన్నంత వరకూ మీ కార్యాన్ని సాధింప చేసుకోండి.
ఆతా ఆపణ శ్రోతే జన | జాణితలే జీ గ్రంథప్రయోజన |
సాఈచ లిహితా లిహవితా ఆపణ | భక్తకల్యాణాకారణే | ||౪౧||
41. శ్రోతలూ, ఇప్పుడు మీరు ఈ గ్రంథ ప్రయోజనాన్ని తెలుసుకున్నారు కదూ! సాయియే దీనిని వ్రాయించారు. కాదు, కాదు, వారే భక్తుల శ్రేయస్సు కొరకు దీనిని స్వయంగా వ్రాశారు.
కైసా వాజేల పావా కీ పేటీ | చింతా నాహీ ఉభయా పోటీ |
హీ తో వాజవిత్యా అటాటీ6 | ఆపణ కష్టీ కా వ్హావే | ||౪౨||
42. మురళికి, హార్మోనియానికి కాని ఎలా మ్రోగాలి అన్న చింత ఉండదు. వానినుంచి వచ్చే సంగీతం వాయించే వారి ప్రతిభ కదా! అలాంటప్పుడు, నేనెందుకు కష్ట పడాలి?
కీ జే చంద్రకాంత స్త్రవత | తే కాయ తయా పోటీంచే అమృత |
తీ తో చంద్రాచీ కరామత | చంద్రనిర్మిత చంద్రోదయీ | ||౪౩||
43. చంద్రకాంతి మణి ద్రవింప చేసే అమృతం దాని పొట్టనించి వచ్చిందా? కానే కాదు. అది చంద్రోదయంతో జరిగే చంద్రుని అద్భుతమైన పని.
కివా సాగరా యే భరతీ | తీ కాయ త్యాచీ నిజకృతీ |
తీహీ చంద్రోదయాచే హాతీ | సాగరకృతి నవ్హే తీ | ||౪౪||
44. సాగరంలో అలలు ఉప్పొంగటం దాని గొప్పతనం కాదు. చంద్రుడు ఉదయించిన తరువాత, చంద్రుని కిరణాల ప్రభావం వలన జరిగే అద్భుతం.
అసో టాళోని భంవరే ఖడక | సాగరీ నావా చాలావ్యా తడక |
మ్హణోని జైసే లాలభడక | దీప నిదర్శక లావితీ | ||౪౫||
45. సముద్రంలో ఉండే సుడిగుండాలకు చిక్కుకుండా, పెద్ద రాతి బండలకు కొట్టుకోకుండా ఓడలు నిరాటంకంగా సాగిపోవటానికి, అపాయాలను సూచించే ఎర్రటి దీప స్తంభాలను నిర్మిస్తారు.
తైశాచి సాఈనాథాంచ్యా కథా | జ్యా గోడీనే హిణవితీల అమృతా |
భవసాగరీంచే దుస్తర పంథా | అతి సుతరతా ఆణితీల | ||౪౬||
46. అలాగే, అతి కష్టమైన సంసార సాగరంనుంచి, అమృతం కూడా సిగ్గుపడేలా ఉండే సాయినాథుని మధురమైన కథలు, అతి సులభంగా దాటింప జేస్తాయి.
ధన్య ధన్య యా సంతకథా | శ్రవణద్వారే అంతరీ రిఘతా |
బాహేర నిఘే దేహాభిమానతా | ద్వంద్వవార్తా నురేచ | ||౪౭||
47. వారి కథలు ధన్యం. ఇవి వినటం ద్వారా హృదయంలోకి ప్రవేశించి, ఈ దేహం మీద ఉన్న అభిమానాన్ని బయటికి నెట్టేస్తాయి. సుఖ దుఃఖాలనే విరుద్ధమైన అనుభవాలు ఉండవు.
జంవ జంవ యాంచా హృదయీ సాఠా | తంవ తంవ వికల్ప పళే బారా వాటా |
జ్ఞాన సంచయ హోయ లాఠా | ఉతరే తాఠా దేహాచా | ||౪౮||
48. వీనిని హృదయంలో దాచుకుంటే, మనసుకు కలిగే అనుమానాలు నలుదిక్కులా పారిపోతాయి. అంతే కాదు, జ్ఞానం పెరిగి, అహంకారం తొలగిపోతుంది.
బాబాంచ్యా శుద్ధ యశాచే వర్ణన | ప్రేమే తయాచే శ్రవణ |
హోఈల భక్తకశ్మల7 దహన | సోపే సాధన పరమార్థా | ||౪౯||
49. బాబాయొక్క శుద్ధమైన గుణాలను వర్ణిస్తే, ప్రేమతో వాటిని వింటే, భక్తుల పాపాలు దహించుకుపోతాయి. పరమార్థానికి ఇదే సులభమైన సాధనం.
మాయాతీత బ్రహ్మా కాయ | కాయ తత్తరణార్థ ఉపాయ |
కర్మ ధర్మాచరణే హరి హా ప్రియ | కైసేని హోయ నిజభక్తా | ||౫౦||
50. మాయను మించిన బ్రహ్మ అంటే ఏమిటి? ఈ మాయనుంచి తప్పించుకునే ఉపాయం ఏది? ధర్మం ప్రకారం నడుచుకోవటంలో ఏయే పనులను చేస్తే శ్రీహరి సంతోషిస్తాడు?
ఆత్యంతిక క్షేమ తే కాయ | భక్తి ముక్తి విరక్తి కాయ |
వర్ణాశ్రమధర్మ వస్తు అద్వయ | ఇత్యాది విషయ అతి గూఢ | ||౫౧||
51. అన్నిటికంటే క్షేమమయినది ఏది? భక్తి, ముక్తి, విరక్తి అంటే ఏవి? వర్ణాశ్రమ ధర్మానికి ఉన్న నియమాలు ఏవి? అద్వైతానికి అర్థమేమిటి? ఇలాంటివి, మరింకెన్నో సంగతులు తెలుసుకోవటానికి చాలా కష్టమైనవి.
ఏతదర్థ జయాంతే గోడీ | తయాంనీ పురవాయా నిజ ఆవడీ |
జ్ఞానోబా-ఏకనాథాది కృత గ్రంథ పరవడీ | సుఖనిరవడీ సేవావీ | ||౫౨||
52. వీనిని తెలుసుకోవాలన్న కోరిక కలవారు, జ్ఞానేశర, ఏకనాథులు రచించిన వివిధ గ్రంథాలను పఠించి ఆనందించగలరు.
కృత యుగీ ‘శమ-దమ’ | త్రేతీ ‘యజన’ ద్వాపరీ ‘పూజన’ |
కలియుగీ ‘నామకథాకీర్తన’ | స్వల్ప సాధన పరమార్థా | ||౫౩||
53. ‘శమ దమాదులు’ కృతయుగంలో, ‘యజ్ఞయాగాదులు’ త్రేతాయుగంలో, ‘పూజ అర్చనాదులు’ ద్వాపరంలో ఉంటే, కలియుగంలో పరమార్థానికి ‘నామస్మరణ కథాకీర్తనలు’ సులభమైన సాధనాలు.
బ్రాహ్మణాది చారీవర్ణ | సర్వాంసీ సాధన గురూకథాశ్రవణ |
అసో స్త్రీ శూద్ర వా జాతిహీన | హే ఏక సాధన సకళాంతే | ||౫౪||
54. బ్రాహ్మణాది నాలుగు వర్ణాలకూ గురుకథ శ్రవణం సాధనం. అలాగే స్త్రీలకు, శూద్రులకు, జాతిహీనులకు, అందరికీ ఇది ఒక్కటే మోక్షానికి మార్గం.
అసెల జయాచే పుణ్య పదరీ | తోచ యా కథా శ్రవణ కరీ |
కోణాస యేతీల నిద్రాలహరీ | తయాంహీ శ్రీహరీ జాగవీల | ||౫౫||
55. ఎంతో పుణ్యాన్ని పోగుచేసుకున్న వారే ఈ కథలను వింటారు. అలా వింటున్నప్పుడు ఎవరికైనా నిద్ర ముంచుకొని వస్తే, శ్రీహరి వారిని మేలుకొలుపుతాడు.
వ్హావే విషయభోగ అనవరత | తే న లాభతా తే దీనచిత్త |
తయాంసీహీ హే సంతకథామృత | విషయనిర్ముక్త కరీల | ||౫౬||
56. ఎప్పడూ అంతులేకుండా ఇంద్రియ సుఖాలను అనుభవించాలని కోరుకునేవారిని, ఈ ఇంద్రియ సుఖాలు దొరకక దీనంగా దుఃఖించేవారిని కూడా, ఈ సంతుని కథామృతం కోరికలనుండి ముక్తులను చేస్తుంది.
యోగ యాగ ధ్యాన ధారణా | కరూ జాతా ప్రయాస నానా |
ఆయాస నలగే యా కథాశ్రవణా | ఏకా అవధానావాంచూన | ||౫౭||
57. యోగాసనాలు, యాగాలు, ధ్యాన ధారణలు మొదలైన సాధనలను చేయటానికి చాలా కష్ట పడాలి. కాని, ఈ కథలను వినటానికి, మనసును ఒక చోట స్థిరంగా నిలపటం తప్ప వేరే ఏ శ్రమా లేదు.
ఏసీ హీ సాఈచీ కథా నిర్మళ | పరిసోత సజ్జన శ్రోతే ప్రేమళ |
జళతీల పంచ మహాపాపే ప్రబళ | జాతీల సమూళ విలయాలా | ||౫౮||
58. శుద్ధమైన, పావనమైన సాయియొక్క కథ అంత మహిమగలది. శ్రోతలు భక్తితో ప్రేమతో వినండి. అలా చేస్తే, ఎంతో బలమైన పంచ మహాపాతకాలు కూడా కాల్చబడి, నాశమైపోతాయి.
ఆమ్హా భవపాశీ జఖడిలే | తేణే నిజరూప వేఢిలే |
శ్రవణే తే వేఢే హోతీల ఢీలే | స్వరూప పహిలె లాధేల | ||౫౯||
59. సంసార బంధనాలు మనల్ని బాగా పెనవేసుకుపోయాయి. అందు వలన మన నిజ స్వరూపం మరుగున పడింది. ఈ కథలను వినడంతో ఆ బంధనాలు వదులై, వీడిపోతాయి. అప్పుడే మన నిజ స్వరూపం బయట పడుతుంది.
వ్హావే కథాంచే ఆమరణ స్మరణ | ఘడావే తయాంచే నిత్య పరిశీలన |
హోవో భవదవార్తా శాంతవన | సమాధాన జీవాంచే | ||౬౦||
60. బ్రతుకున్నంత వరకూ మనము ఈ కథలను గుర్తు చేసుకుంటూ ఉందాము. వానిని నిత్యమూ పారాయణం చేద్దాము. అప్పుడే, సంసార కష్టాలనే నిప్పులో మండిపోతున్న జీవులకు శాంతి, ముక్తి దొరుకుతుంది.
వాచతా పరిసతా భక్తిభావే | సహజ సాఈచే ధ్యాన వ్హావే |
సగుణరూప డోళా దిసావే | చిత్తీ ఠసావే దృఢతర | ||౬౧||
61. ఈ కథలను చదువుతున్నా, వింటున్నా, సాయిపై ధ్యానం సహజంగా కుదురుతుంది. దానితో వారి సాకార సగుణ రూపం కళ్లకు కనిపించి, మనసు వారిమీద దృఢంగా నిలిచిపోతుంది.
యేణే ఘడావీ సద్గుారూభక్తి | పావావీ సంసారీ విరక్తి |
జడో గురూస్మరణీ ప్రీతి | హోవో మతి నిర్మల | ||౬౨||
62. సద్గురువు మీద భక్తి, ఆరాధన అలా కలగని. దానితో సంసారం మీద, ప్రపంచం మీద విరక్తి కలుగుతుంది. తరువాత గురువును తలచుకోవాలనే ప్రీతిభావం కలిగి, మనసు నిర్మలమౌతుంది.
ఏసీచ బుద్ధి ధరోని మనీ | కృపా కేలీ సాఈనాథాంనీ |
మజ నిమిత్తా పుఢే కరోనీ | స్వయే కరణీ హే కేలీ | ||౬౩||
63. ఇదే ఉద్దేశంతోనే సాయినాథులు నన్ను కరుణించి ఉండవచ్చు. నన్ను నిమిత్త మాత్రునిగా చేసి, తామే ఈ రచనా కార్యాన్ని చేశారు.
ఓటీ తుడుంబ లాగలీ ఓఢీ | వాసరావీణ పాన్హా న సోడీ |
హే తో ధేనూతే ఉపజత ఖోడీ | తైశీచ ఆవడీ సాఈచీ | ||౬౪||
64. పొదుగు నిండా బాగా పాలు ఉన్నా దూడ లేకుండా ఆవు పాలు చేపదు. ఇది ఆవుయొక్క స్వభావం. సాయియొక్క ప్రేమ కూడా ఇలాంటిదే.
మజ చాతకాచే ని ఆశే | ఆనందఘన హీ మాఉలీ వర్షే |
పురవూని మాఝియా అల్ప తృషే | భక్త ప్రకర్షే నివవీల | ||౬౫||
65. చాతక పక్షివంటి నా కోరికను మన్నించి, నా పై ఆనంద వర్షాన్ని కురిపించి, నా చిన్న కోరికను తీర్చి, సాయిమాత భక్తులకు కూడా ఆనందాన్ని కలిగించారు.
కాయ భక్తిప్రేమాచే కౌతుక | మాతేస లాగే బాళాచీ భూక |
తయానే న పసరితాంహీ ముఖ | థాన కూచుక తే కోందీ | ||౬౬||
66. భక్తి ప్రేమల అద్భుతం ఎంత విచిత్రం! బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. అందుకే బిడ్డ నోరు తెరవక ముందే తన స్తన్యాన్ని బిడ్డ నోటికి అందిస్తుంది.
కోణ జాణే తిచే శీణ | లేకురా న త్యాచీ జాణ |
న పుసతా నిజ మాఉలీవీణ | అన్య కోణ దే థాన | ||౬౭||
67. ఆమె కష్టాలు, బాధలు ఎవరికి అర్థమౌతుంది? బిడ్డకది అసలే తెలియదు. కాని, అడగకుండానే బిడ్డకు, తల్లి తప్ప వేరే ఎవరు స్తన్యమివ్వగలరు?
బాళకాసీ ఘాలితా లేణే | బాలక త్యాంతీల స్వారస్య నేణే |
తే కౌతుక ఏక మాతాచ జాణే | తైసేంచ కరణే సద్గుారూచే | ||౬౮||
68. నగలతో బిడ్డను అలంకరించినప్పుడు, ఆ నగల మీద ఆశగాని, ఆసక్తిగాని ఆ బిడ్డకు ఉండదు. అందులోని తృప్తి, ఆనందం ఒక్క తల్లికే తెలుసు. సద్గురువు పద్ధతి కూడా ఇదే.
హా మాఝా బాళాచా లళా | పురవీల కోణ సుఖ సోహళా |
మాఉలీవీణ కోణాస కళవళా | తో జివ్హాళా దుర్మిళ | ||౬౯||
69. నా బిడ్డయొక్క అవసరాలను ఎవరు తీరుస్తారు అన్న తపన తల్లికి తప్ప వేరే ఎవరికి ఉంటుంది? అలాంటి వాత్సల్యం చాలా అరుదు.
సన్మాతేచ్యా పోటీ యేణే | మహద్భాాగ్యే దేవాచే దేణే |
దుఃఖ సోసూన జన్మ దేణే | బాళక నేణే హే కాంహీ | ||౭౦||
70. మంచి తల్లి కడుపున పుట్టడం దేవుడు అనుగ్రహించిన మహా భాగ్యం. ఎంతో బాధను సహించి, బిడ్డకు జన్మనిచ్చే తల్లి కష్టాలు, బిడ్డలకు తెలియదు.
అసో యే అర్థీ ఆణీక వచన | బోలిలే బాబా కరవితో శ్రవణ |
అహో జీ ఆపణ శ్రోతే సజ్జన | ఆదరే అవధాన దేఈజే | ||౭౧||
71. ఇలాంటి అర్థమొచ్చే బాబా చెప్పిన ఒక మాటను మీకు వినిపిస్తాను. సజ్జనులైన శ్రోతలూ శ్రద్ధగా వినండి.
సన ఏకోణీసశే సోళా సాలీ | చాకరీ సరకారీ పురీ ఝాలీ |
యథాయోగ్య పెన్శన బసలీ | వారీ ఆలీ శిరడీచీ | ||౭౨||
72. క్రి. శ. ౧౯౧౬వ సంవత్సరంలో నా ప్రభుత్వ ఉద్యోగం ముగిసింది. నా అర్హతను బట్టి నా పింఛను నిర్ణయమైంది. శిరిడీ ప్రయాణానికీ అప్పుడే సమయం వచ్చింది.
గురూపౌర్ణిమేచా తో దివస | భక్త మిళాలే గురూపూజేస |
అణ్ణా స్వయంస్ఫూర్తి వినవితీ బాబాంస | కరితీ శిఫారస తీ పరిసా | ||౭౩||
73. అది గురు పౌర్ణమి రోజు. గురు పూజకు భక్తులు పోగయ్యారు. తనంతట తానే అణ్ణా చించణీకరు నా గురించి బాబాతో సిఫారసు చేయడం గమనించండి.
అణ్ణాంస9 మాఝీ మోఠీ కాళజీ | బాబాంచ్యా సమోర కరితీ అజీజీ |
యాంచ్యా10 వాఢత్యా సంసారామాజీ | కృపా కరా జీ యాంజవర | ||౭౪||
74. అణ్ణాకు నాపై చాలా చింత. బాబాతో ‘ఇతనిది పెరుగుతున్న సంసారం. అందువల్ల ఇతనిపై కృప చూపండి.
లావా కీ యాంస దుజీ నోకరీ | హీ పెన్శన కా పడేల పురీ |
అణ్ణాసాహేబాంచీ11 చింతా నివారీ | ఏసే కరీ కాహీ గా | ||౭౫||
75. ‘ఇతనికి వచ్చే పింఛను ఏం సరిపోతుంది? అన్నాసాహేబును వేరే ఉద్యోగంలో ఉంచి, ఇతని చింతను దూరం చేయండి’ అని ప్రార్థించాడు.
బాబా తవ వదతీ ప్రత్యుత్తరీ | “మిళేల మేలీ తయాసీ నోకరీ |
కరావీ ఆతా మాఝీ చాకరీ | సుఖ సంసారీ లాధేల | ||౭౬||
76. దానికి బాబా ఇలా జవాబిచ్చారు, “ఏదో ఒక ఉద్యోగం ఇతనికి దొరుకుతుంది. కాని, ఇప్పుడు నా సేవ చేయనీ. దానితో అతనికి జీవితమంతా సుఖమయమౌతుంది.
తాటే యాంచీ భరలీ సదా | యావజ్జీవ న రితీ కదా |
భావే మత్పర హోతా సర్వదా | హరతీల ఆపదా తయాచ్యా | ||౭౭||
77. “ఇతని పళ్ళాలు ఎప్పుడూ నిండి ఉంటాయి. అతను జీవించి ఉన్నంత వరకూ అవి ఖాళీ కావు. భక్తితో నా వాడై ఉంటే, ఇతని కష్టాలన్నిటినీ నేను తొలగిస్తాను.
కాహీ కేలే కాయ ఝాలే | మ్హణతీ జన తే సమజా చళలే |
ధర్మాచరణ జయాంనీ వర్జిలే | తయాంస పహిలే వర్జావే | ||౭౮||
78. “ ‘మనము ఎలా ఉంటే మాత్రం చెడిపోయేదేముంది’ అని అనేవారు మూర్ఖులు. ధర్మాన్ని ఆచరించని వారి సహవాసాన్ని మనము విడిచి పెట్టాలి.
సమోర యేతా బాజూస జావే | మహా భయంకర తే సమజావే |
త్యాంచ్యా ఛాయేసహీ న రహావే | పడల్యా సహావే కష్టహీ | ||౭౯||
79. “అలాంటి వారిని భయంకరులుగా తలచి, వారు ఎదురు పడితే, పక్కకు తొలగిపోవాలి. వారి నీడ కూడా మనమీద పడకుండా చూసుకోవాలి. దానివల్ల ఎన్ని కష్టాలు వచ్చినా సరే, సహించాలి.
ఆచారహీన శీల భ్రష్ట | విచారహీన కర్మనష్ట |
దేఖేనా జో ఇష్టానిష్ట | కేవీ తో అభిష్ట పావేల | ||౮౦||
80. “ఆచారాన్ని వదిలి పెట్టినవారు, శీలాన్ని పోగొట్టుకున్నవారు, బుద్ధిలేని వారు, మంచి చెడుకు తేడా తెలియని వారు, తమ మనసులోని కోరికలను ఎలా పొందుతారు?
లాగ్యాబాంధ్యావీణ విశేషీ | కోణీ న యేఈ ఆపులే పాశీ |
శ్వాన సూకర కా మాశీ | హడహడ కుణాసీ కరూ నయే | ||౮౧||
81. “ఋణానుబంధం లేకుండా ఎవరూ మన వద్దకు రారు. కుక్క, పంది లేక దోమలైనా సరే. కనుక, ఎవరినీ ఛీ, ఛీ, పో అని తరిమి వేయ్యకండి.
యేథూన పుఢే భక్తి భావా | కరావీ యానే మాఝీ సేవా |
కరూణా యేఈల దెవాధిదేవా | అక్షయ ఠేవా లాధేల | ||౮౨||
82. “ఇకపై ప్రేమతో, భక్తితో అతను నా సేవ చేస్తే, దేవాధిదేవునికి కరుణ కలిగి, ఎన్నడూ తరిగిపోని ఆస్తిని ప్రసాదిస్తాడు.
మగ హీ పూజా కరావీ కైసీ | మీ కోణ కైసా జాణావా భరంవసీ |
సాఈచా తో దేహ వినాశీ | బ్రహ్మ అవినాశీ సుపూజ్య | ||౮౩||
83. “మరి ఈ పూజ ఎలా చేయాలి? నేనెవరినో ఖచ్చితంగా ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే సాయియొక్క ఈ శరీరం నశించిపోతుంది. నాశంలేని బ్రహ్మ ఒక్కడే పూజింప తగినవారు.
మీ తో అష్టధా ప్రకృతి రూపానే | భరలో ఆహే చౌ బాజూనే |
హేంచ అర్జునాస భగవంతానే | గీతావ్యాఖ్యానే నివేదిలే | ||౮౪||
84. “ఎనిమిది రకాలైన ప్రకృతి రూపాలతో, నాలుగు దిశలూ వ్యాపించి ఉన్నానని శ్రీకృష్ణుడు అర్జునునికి గీతలో చెప్పాడు.
యావన్నామరూపాకృతి | స్థావర జంగమాత్మకహీ జగతీ |
మీచి నటలో అష్టధా ప్రకృతి | హీ ఏక చమత్కృతి మాఝీచ | ||౮౫||
85. “జగత్తులో భావనకు అందేవి, అందనివి అయిన నానా రూపాలన్నిటిలోనూ నేనే ఎనిమిది రూపాల ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది కూడా నా సృష్టిలోని చమత్కారమే.
ఓమ్ ప్రణవ హా మాఝా వాచక | వాచ్య తయాచా మీచ ఏక |
విశ్వాకార వస్తు అనేక | త్యాంతహీ మీ ఏక భరలేలా | ||౮౬||
86. “ఓం అనే ప్రణవం నా మాటే. ఆ మాటకు భావం నేనే. ఈ విశ్వంలో అనేక వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులలో కూడా నేనే నిండి ఉన్నాను.
ఆత్మభిన్న వస్తు నాహీ | తేథే కామనా కశాచీ పాహీ |
మీంచి అవఘా ఠాయీ ఠాయీ | భరలో దాహీ దిశాంతీ | ||౮౭||
87. “ఆత్మ వేరే వస్తువు కాదు. పది దిక్కులలోనూ, అన్ని చోట్లలోనూ నేనే నిండి ఉన్నప్పుడు, ఇక దేనిని కోరటం?
పరిపూర్ణ సర్వత్ర ఎణే భావే | మీ మాఝే హే జేథ విసావే |
తయా కామనీయ కాయ అసావే | సర్వీ వసావే సర్వస్వీ | ||౮౮||
88. “ఇలా అంతటా నేనే ఉన్నానన్న భావాన్ని తెలుసుకున్న తరువాత, నేను నాది అన్న వేరు చేసే భావన తొలగిపోయిన తరువాత, ఇంక కోరడానికి ఏముంటుంది?
కామనా యా బుద్ధీత ఉగవతీ | ఆత్మయాసీ సంబంధ న ధరితీ |
సాఈమహారాజ నిజాత్మ మూర్తి | కామనా స్ఫూర్తి తేథే కైంచీ | ||౮౯||
89. “కోరికలు బుద్ధిలో పుట్టుతాయి. దీనికి ఆత్మతో సంబంధం లేదు. సాయి మహారాజు అని పిలవబడే నేను కూడా మూర్తీభవించిన ఆత్మయే. ఇంక అక్కడ కోరికలు ఎలా వస్తాయి?
కామనాంచే నానా ప్రకార | మీ కోణ హే కళతాంచి సార |
విరోని జాతీ జైసీ గార | రవికరనికరసంతప్త | ||౯౦||
90. “కోరికలు అనేక రకాలు. నేను ఎవరు అని ఖచ్చితంగా తెలుసుకున్న తరువాత, సూర్యుని కిరణాలకు కరిగిపోయే మంచులా ఆ కోరికలు కరిగిపోతాయి.
మనబుద్ధ్యా ది ఇంద్రియాంసకట | నవ్హే మీ స్థూల నవ్హే విరాట |
నవ్హే మీ హిరణ్యగర్భ అప్రకట | సాక్షీ మీ జునాట అనాది | ||౯౧||
91. “నేను మనసు, బుద్ధి, ఇంద్రియాలతో కూడుకుని కనిపిస్తున్న ఈ దేహాన్ని కాను. కనిపించని బ్రహ్మాండాన్నీ కాను. ఆది అనేది లేకుండా వస్తున్న సనాతనమైన సాక్షిని నేను.
ఏవం గుణ ఇంద్రియాం పరతా | నాహీ మజ విషయతత్పరతా |
నాహీ మజవీణ ఠావ రితా | కర్తా కరవితా మీ నవ్హే | ||౯౨||
92. “ఇలా గుణాలకు, ఇంద్రియాలకు అందని నాకు, ఇంద్రియ సుఖాలమీద ఆసక్తి లేదు. నేను లేని చోటు ఎక్కడా లేదు. నేను చేసే వాణ్ణీ కాను, చేయించేవాణ్ణీ కాను.
మనబుద్ధ్యా ది ఇంద్రియగణ | అవఘా జడ హీ జేథే ఓళఖణ |
తేథేంచ ‘విరక్తీ’ ప్రకటేల జాణ | సారీల ఆవరణ జ్ఞానాచే | ||౯౩||
93. “మనసు, బుద్ధి ఇవన్నీ ఇంద్రియాలు. ఎప్పటికైనా ఇవి నశించేవి అని తెలిసిన వెంటనే, ఇంద్రియ సుఖాల మీద ఆశ తొలగి, జ్ఞానాన్ని కప్పుకున్న తెర తొలగిపోతుంది.
స్వరూపాచే జే విస్మరణ | తేంచ మాయేచే అవతరణ |
శుద్ధ పూర్ణానంద స్మరణ | తోచ మీ చైతన్య ఘనరూప | ||౯౪||
94. “తన నిజ రూపమైన ఆత్మను మరచిపోవటంతోనే మాయ పుట్టుక ఆరంభమవుతుంది. చైతన్య స్వరూపమే నేను అని గుర్తుకు తెచ్చుకోవటంతో శుద్ధమైన పూర్ణానందం కలుగుతుంది.
త్యా మజకడే ఫిరవిణే వృత్తి | తీచ సేవా తీచ ‘మద్భలక్తి’ |
చిదానంద మీ హోతా ప్రతీతీ | శుద్ధ స్థితీ తే ‘జ్ఞాన’ | ||౯౫||
95. “అలాంటి నా స్వరూపం వైపు మనసును మళ్ళించటమే నా సేవ. అదే నా నిజమైన భక్తి. నేను ఎప్పుడూ ఆనందంగా ఉండే చైతన్యం అని అనుభవంతో తెలుసుకున్నప్పుడు, కలిగే శుద్ధ స్థితియే జ్ఞానం.
అయమాత్మా బ్రహ్మ | ప్రజ్ఞానమానంద బ్రహ్మ |
జగన్మిథ్యత్వే జగద్భ్ర మ | సత్యత్వే బ్రహ్మ తో హా మీ | ||౯౬||
96. “ ‘అయం ఆత్మా బ్రహ్మ’, ‘ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ’ అని అంటారు. కాని, ఈ జగత్తు నిజం కాదు. అందువల్ల దాని గురించే అదే భ్రమలను పుట్టిస్తుంది. నిజానికి బ్రహ్మను నేనే.
నిత్య శుద్ధ బుద్ధ ముక్త | వాసుదేవోహమోమన్విత |
సత్య శ్రద్ధా భక్తి సహిత | పూజన స్వహిత హే మాఝే | ||౯౭||
97. “నేను వాసుదేవుణ్ణి. నేనే ఓంకారాన్ని. నిత్యం, శుద్ధం, బుద్ధుణ్ణి, ముక్తుణ్ణి, సత్యమైనవాణ్ణి నేనే. ఇలాంటి నన్ను శ్రద్ధా భక్తులతో పూజ చేస్తే, స్వహితం కలుగుతుంది.
ఏసే మీ కోణ తే సమజూన | కరావే మాఝే యథార్థ పూజన |
వరీ వ్హావే అనన్య శరణ | జావే సమరసూన మజమాజీ | ||౯౮||
98. “ఇలా నేను ఎవరు అని తెలుసుకొని, నాకు నిజమైన పూజను చేసి, అన్ని విధాలా నాకు శరణుజొచ్చి, నాలో ఐక్యమైపోవాలి.
నదీ జాతా సముద్రా శరణ | యేఈల కా తీ పున్హా పరతోన |
ఉరేల కా వేగళే నదీపణ | దేతా ఆలింగన అర్ణవా | ||౯౯||
99. “సముద్రుని శరణుజొచ్చి, నది మరల తిరిగి వెనుకకు రాగలదా? సముద్రుని కౌగలించుకున్న తరువాత, నది నదిలా వేరే ఉండగలదా?
స్నేహయుక్త కార్పాస వాతీ | భేటూ జాతా దీపక జ్యోతీ |
స్వయే పావే దివ్య దీప్తీ | తైసీచ గతీ సంతపదీ | ||౧౦౦||
100. “నూనెలో తడిసిన దూది వత్తి, దీపపు జ్యోతిని కలిసి, తానూ దీపమై వెలుగుతుంది. సత్పురుషుల పాదాలను శరణుజొచ్చిన వారి స్థితి కూడా అలాగే ఉంటుంది.
అల్లా-మాలీక చైతన్య ఘన | యావీణ చిత్తా నాహీ చింతన |
శాంతనిరపేక్ష సమ దర్శన | తయాచే మీ పణ తే కైంచే | ||౧౦౧||
101. ఎవరు చైతన్య రూపమైన అల్లా మాలిక్ తప్ప వేరే ఏ ధ్యానం లేనివారో, శాంతచిత్తులు, ఏమీ కోరనివారో, అందరినీ సమంగా చూసేవారో అలాంటివారికి అహంకారం ఎలా ఉంటుంది?
నిర్మమత్వ నిరహంకృతి | నిర్ద్వంద్వత్వ నిష్పరిగ్రహస్థితీ |
యాహీ చార గుణాంచీ జై వస్తీ | మీ పణ స్థితీ తై కైసే | ||౧౦౨||
102. అహంకారం, మమకారం, ద్వంద్వాలు, పరిగ్రహం అనే నాలుగు గుణాలకు అతీతులైన వారికి నేననే అహంకారం ఎందుకుంటుంది?
తాత్పర్య హే ఆఠహీ గుణ | సాఈ ఆంగీ అసతా సంపూర్ణ |
మీ పణాస తై కైచే స్థాన | సేవూ మీ పణ తే కైసే | ||౧౦౩||
103. దీని సారాంశం ఏమిటంటే, ఈ ఎనిమిది గుణాలు సాయియందు సంపూర్ణంగా ఉన్నప్పుడు, ఇక అక్కడ అహంభావానికి చోటేక్కడిది? వారినుంచి నేను వేరు కానప్పుడు, వారిని నేనెలా సేవించను?
విశ్వీ భరలే జయాచే మీపణ | తయాచాచ అంశ మాఝేహీ మీపణ |
కరావే సాఈపదీ సమర్పణ | హీచ సంపూర్ణ మమ సేవా | ||౧౦౪||
104. విశ్వమంతటా నిండియున్న వారిలోని ఒక్క చిన్న అంశమే నాలోనూ ఉంది. దీనిని సాయి పాదాలయందు సమర్పించటమే నా సంపూర్ణ సేవ.
మాఝీ సేవా మాఝే భజన | అనన్యపణే మజసీ శరణ |
తో హోయ మద్రూప జాణ | భగవంత వచన భాగవతీ | ||౧౦౫||
105. ‘అనన్యంగా నాకు శరణుజొచ్చి, నా సేవ, నా భజన చేసేవారు నా రూపాన్ని పొందుతారు’ అని శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో చెప్పాడు.
కీటకీసహీ భ్రమర ధ్యాన | తేణే తీ లాధే భ్రమరపణ |
శిష్యహీ కరితా నిజగురూ భజన | నిజగురూసమాన తో హోయ | ||౧౦౬||
106. ఎప్పుడూ భ్రమరాన్ని ధ్యానించే కీటకం ఎలా భ్రమరమై పోతుందో, అలా గురువును ఆరాధించే శిష్యులు గురుసమానులై పోతారు.
సమాన శబ్దే జే వేగళేపణ | తేహీ న సాహే గురూ ఏక క్షణ |
గురూత్వ నవ్హే శిష్యావీణ | శిష్యత్వా అభిన్న గురూపణ” | ||౧౦౭||
107. సమానం అన్న పదంలో ధ్వనించే భేదభావాన్ని గురువు ఒక్క క్షణమైనా సహించలేరు. శిష్యుడు లేక గురువుకు గురుత్వం లేదు. అలాగే శిష్యత్వం గురుత్వం కంటే వేరే కాదు.
అసో పూజా జయాంచీ ఆజ్ఞాపిలి | తో మీ కోణ హీ వ్యాఖ్యా కేలీ |
పుష్టీ కరణార్థ గోష్ట ఆఠవలీ | ఓఘాస ఆలీ తీ కథితో | ||౧౦౮||
108. ఎవరు “నా పూజను చేయి” అని అజ్ఞాపించారో, ఆ ‘నేను’ ఎవరన్న సంగతిని వివరించాను. దీనిని దృఢపరచటానికి ఒక విషయం గుర్తుకు వచ్చింది. దానినే చెబుతాను.
శిరడీసీ ఆలా ఏక రోహిలా | తోహీ బాబాంచే గుణాంస మోహిలా |
తేథేంచ బహుత దిన రాహిలా | ప్రేమే వాహిలా బాబాంసీ | ||౧౦౯||
109. ఒక రోహిల్లా (పఠాను) శిరిడీకి వచ్చి, చాలా రోజులున్నాడు. బాబా గుణాలకు ఆకర్షింపబడి, బాబాను భక్తితో ప్రేమించ సాగాడు.
శరీరే పుష్ట జైసా హాలా12 | స్వైరవర్తీ న జుమానీ కోణాలా |
ఫక్త కఫనీ పాయఘోళ ఆంగాలా | యేఊని రాహిలా మశిదీంత | ||౧౧౦||
110. ఎనుబోతువంటి దేహంతో బాగా పుష్టిగా ఉండేవాడు. స్వేచ్ఛగా తిరుగుతూ, ఎవరినీ ఖాతరు చేసేవాడు కాదు. పాదాలదాక ఉండే కఫనీని ధరించి మసీదుకు వచ్చేవాడు.
దివస అసో వా నిశీ | మశిదీసీ వా చావడీసీ |
కలమే పఢే ఉంచ స్వరేసీ | అతి ఆవేశీ స్వచ్ఛంద | ||౧౧౧||
111. పగలైనా, రాత్రి అయినా, మసీదులో ఉన్నా, చావడిలో ఉన్నా, చాలా ఆవేశంతో గట్టిగా, స్వేచ్ఛగా కురానునుంచి కల్మాలను చెప్పేవాడు.
మహారాజ శాంతీచా పుతళా | గ్రామలోక ఫార కంటాళలా |
మధ్యరాత్రీసహీ త్యాచా టకళా | అడథళా సకళా ఝోంపేలా | ||౧౧౨||
112. సాయి మహారాజు శాంతమూర్తి. కాని గ్రామస్థులు చాలా విసిగిపోయారు. అర్ధరాత్రి కూడా అతను కేకలు వేయటంతో వారికి నిద్రాభంగం కలిగేది.
దివసా ఖపావే ఉన్హాతాన్హాంత | శేతాంత అథవా రానావనాంత |
రాత్రీహీ ఝోంప నాహీ నివాంత | లోక నితాంత కదరలే13 | ||౧౧౩||
113. పగలంతా ఎండలో పొలాల్లోను, అడవులలోను శ్రమించి, రాత్రి ప్రశాంతంగా నిద్రపోదామనుకుంటే, అదీ కానందుకు వారు చాలా బాధ పడ్డారు.
నసేల హోత బాబాంనా తాప | లోకాంచే తో మోఠే పాప |
నాహీ రాత్రీ సుఖాంచీ ఝోంప | ఆలా సంతాప రోహిల్యాచా | ||౧౧౪||
114. బాబాకు ఏ బాధ లేదు. కాని ప్రజలకు చాలా బాధ కలిగింది. రాత్రి సుఖంగా నిద్ర లేకపోవడంతో వారికి రోహిల్లాపై కోపం వచ్చింది.
ఇకడే ఆడ తికడే విహీర | ధరావా కోఠవరీ తో ధీర |
రాత్రందిన హీ కిరకీర | మోఠీ ఫికీర త్యా పడలీ | ||౧౧౫||
115. అటు నుయ్యి, ఇటు గొయ్యిలా తయారైంది వారి పరిస్థితి. ఎన్ని రోజులని శాంతంగా ఉండగలరు? పగలు రాత్రి అరుపుల గొడవ. ఏం చేయాలి అని వారికి పెద్ద చింత పట్టుకుంది.
రోహిలా ఆధీంచి మాథేఫిరూ | వరీ బాబాంచా బళకట ధీరూ |
హోతా త్యాహూనహీ అనావరూ | మగ తో థోరూ జాహలా | ||౧౧౬||
116. అసలే రోహిల్లా తలతిక్క మనిషి. దానికి తోడు, బాబా మద్దతు. దాంతో అతడు అదుపు లేకుండా మునుపటికంటే మరింత రెచ్చిపోయాడు.
చఢేల ఆణి తాఠర ఝాలా | లోకాంవరీ తోడ టాకూ లాగలా |
నిస్సీమ బేఫామ ఉరఫాటలా | గాంవహీ ఫిరలా తయావర | ||౧౧౭||
117. గర్వంగా ఇష్టం వచ్చినట్లు అందరినీ తిడుతూ, నోరు పారేసుకోసాగాడు. హద్దు మీరి ప్రవర్తించడంతో, ఊరు కూడా అతనిపై తిరగ బడింది.
అత్యంత మాయాళూ సాఈమాఉలీ | శరణాగతాసీ పాఠీసీ ఘాలీ |
మ్హణూని గాంవీచీ సర్వ మండళీ | కాకుళతీ ఆలీ బాబాంసీ | ||౧౧౮||
118. సాయిమాత చాలా కరుణామయి, శరణాగతులను దగ్గరకు చేర్చుకుంటుంది అని ఎంతో ఆశతో ఊరివారంతా బాబా వద్ద మొరపెట్టుకోవాలని వెళ్లారు.
పరీ బాబా న లక్ష దేతీ | గ్రామస్థాంసీచ ఉలట వదతీ |
నకా సతావూ రోహిల్యాప్రతీ | తో మజ అతి ప్రియ వాటే | ||౧౧౯||
119. కాని, బాబా వారి మాటలను లక్ష్య పెట్టలేదు. పైగా, వారికి వ్యతిరేకంగా “రోహిల్లాను బాధ పెట్టకండి, నాకతడు చాలా ప్రియుడు.
యా రోహిల్యాచీ బాఈల ఘరఘుశీ | నాందూ న ఘటే తయాపాశీ |
యావయా టోకే14 తీ మజపాశీ | చుకవూన త్యాశీ తే వివశీ | ||౧౨౦||
120. “రోహిల్లా భార్య పరమ గయ్యాళి. అతనితో పొత్తు కుదరక, అతనిని తప్పించుకుని, నా వద్దకు రావాలని ఉబలాట పడుతుంది.
నాహీ రాండేలా పడద పోశీ | లాజలజ్జా లావిలీ వేశీ |
హాంకూన బాహేర ఘాలతా తిజశో |బలాత్కారేంసీ ఘర ఘుసే | ||౧౨౧||
121. “ఆ నీచురాలికి పరదా పద్ధతిలాంటివి ఏమీ లేవు. సిగ్గు బిడియాలను వదిలివేసింది. బయటకు తరిమి వేసినా, బలవంతంగా అది లోపలికి జొరబడుతుంది.
ఓరడూ థాంబే తేచ సంధీ | శిరూ పాహే రాండ దుర్బుద్ధీ |
తో ఓరడతా తీ పళే త్రిశుద్ధీ | సుఖ సమృద్ధీ మజ తేణే | ||౧౨౨||
122. “అతడు కేకలు ఆపివేసిన వెంటనే సందు చూసుకుని, ఆ దుర్బుద్ధి జొరబడాలని చూస్తుంది. అతడు గట్టిగా అరుస్తుంటే అది తప్పక పారిపోయి, అతడి మాట, మనసును శుద్ధంగా ఉంచుతుంది. అందువలన నాకు చాలా సుఖం.
జావే న కోణీ త్యాచ్యా వాటే | ఓరడూ ఘ్యా ముక్తకంఠే15 |
తయావీణ మజ రాత్ర న కంఠే | సౌఖ్య మోఠే తేణేనీ | ||౧౨౩||
123. “అందుకే అతనిని ఇష్టమొచ్చినట్లు కేకలు వేయనీయండి. అతని జోలికి పోకండి. అతడు లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని కేకలు నాకెంతో ఆనందాన్నిస్తాయి.
యాచీ హీ ఓరడ ఎణేంపరీ | ఆహె మజ బహు హితకారీ |
ఏసా హా రోహిలా పరోపకారీ | బహు సుఖకరీ మజలాగీ | ||౧౨౪||
124. “అతడు అలా అరవటం నాకు చాలా మంచిది. పరోపకారం చేసే ఆ రోహిల్లా నాకు చాలా సుఖాన్ని కలిగిస్తాడు.
ఓరడూ ఘ్యా త్యాస యథేష్ట | త్యాంతచి ఆహే మాఝే ఈష్ట |
నాతరీ తీ రోహిలీ దుష్ట | దేఈల కష్ట మజలాగీ | ||౧౨౫||
125. “ఇష్టమొచ్చినట్లు అతన్ని కేకలు వేయనీయండి. అందులోనే నా మంచి ఉంది. లేకుంటే అతని భార్య నాకు చాలా కష్టాన్ని కలగజేస్తుంది.
స్వయేంచ మగ జై థకేల | ఆపోఆప స్వస్థ రాహీల |
కార్యభాగ తుమచా సాధేల | మజహీ న బాజేల16 తీ రాండ | ||౧౨౬||
126. “అలసిపోతే తనంత తానే అతను ఊరుకుండి పోతాడు. మీరు అనుకున్నదీ జరుగుతుంది, ఆమె నన్ను బాధా పెట్టదు”.
అసే మ్హణతా మహారాజ | ఖుంటలా మగ తేథే ఇలాజ |
బాబాంచ్యా మనీ నాహీ గజబజ | కాయ మగ కాజ ఆమ్హాంతే | ||౧౨౭||
127. ‘మహారాజే ఇలా అన్నప్పుడు, వేరే దారి లేదు. బాబా మనసులోనే ఏ బాధ లేనప్పుడు, ఇక మనకేం పని?’ అని గ్రామస్థులు అనుకున్నారు.
ఆధీంచ రోహిల్యాస ఉల్లాస | వరీ హా ఆలా ఫాల్గునమాస |
కలమే పఢతా కంఠశోష | అసమసాహస మాండిలా | ||౧౨౮||
128. అసలే రోహిల్లా ఎంతో హుషారుగా ఉన్నాడు. పైగా కరువులో అధిక మాసంలా బాబా అతనిని వెనకేసుకుని రావటంతో, ఇంకా ఉత్సాహంతో, గొంతు తడి ఎండిపోయేలా అరిచేవాడు.
జన సమస్త ఆశ్చర్యాపన్న | కేవఢే బాబా క్షమాసంపన్న |
జేణే17 వ్హావే మస్తక భిన్న | తేణేంచ తల్లీన తే హోతీ | ||౧౨౯||
129. అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ‘బాబా ఎంతటి క్షమా సంపన్నులు! తల పొగిలిపోయే కేకలలో కూడా ఎంత తల్లీనులవుతారు’, అని అందరూ అనుకున్నారు.
కాయ భయంకర తీ ఓరడ18 | ఘశాస కైసీ నవ్హే కోరడ |
బాబాంచీ పరీ ఎకచి హోరడ | నకా దరడావూ తయాలా19 | ||౧౩౦||
130. ఎంత భయంకరమైన కేకలు! అంత అరిచినా అతని గొంతు ఎండేది కాదు. అయినా బాబాది ఒకటే మాట, “అతనిని భయపెట్టకండి” అని.
దిసాయా రోహిలా వేడా పీర | పరీ బాబాంవరీ అత్యంత ఆదర |
కలమే నిజ ధర్మానుసార | హర్షనిర్భర పఢే తో | ||౧౩౧||
131. చూడటానికి రోహిల్లా పిచ్చి ఫకీరులా కనిపించినా, అతనికి బాబాపై చాలా గౌరవ ఆదరాలు. ఎంత ఆనందంగా మతక్రమం తప్పకుండా కల్మాను చదివేవాడు!
వాణీ హళువార20 కివా మోఠీ21 | కోణాస యాచా విచార పోటీ |
స్ఫురణాసవే ఉఠాఉఠీ | గర్జత ఉఠీ హరీనామ | ||౧౩౨||
132. స్వరం మంజులంగా ఉందా, లేక కర్కశంగా ఉందా అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? తోచిన వెంటనే గట్టిగా హరినామాన్ని స్మరించడమే పని!
నిసర్గదత్త ఘర్ఘర స్వర | ‘అల్లాహో అకబర’ నామ గజర |
కలమే పఢే ఆనందనిర్భర | నిత్య నిరంతర రోహిలా | ||౧౩౩||
133. తనకు దైవదత్తంగా ఉన్న కర్కశమైన కంఠంతోనే, ‘అల్లా హో అక్బర్’ అని గట్టిగా అరిచేవాడు. రోజూ ఎంతో ఆనందంగా కల్మాలను పలికేవాడు.
జయాసీ హరినామాచా కంటాళా | బాబా భీతీ తయాచ్యా విటాళా |
మ్హణతీ ఉగా కా రోహిల్యాస పిటాళా | భజనీ చాళా జయాతే | ||౧౩౪||
134. హరినామం అంటే ఇష్టపడని వారు వచ్చి తమను మలినం చేస్తారని, బాబా అటువంటి వారిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. అందుకే ఎప్పుడూ భజన చేసే రోహిల్లాను ఊరికే ఎందుకు తరిమివేస్తారు?
‘మద్భగక్త యత్ర గాయంతి’ | తిష్ఠే తేథే మీ ఉన్నిద్ర స్థితీ |
సత్య కరావయా హే భగవదుక్తీ | దేసీ ప్రతీతీ దావిలీ | ||౧౩౫||
135. ‘ఎక్కడ నా భక్తులు నా నామ స్మరణ చేస్తారో అక్కడ నేను ఎప్పుడూ మేలుకొని ఉంటాను’. భగవంతుని ఆ మాటను నిరూపించటానికి బాబా ఈ రకంగా అనుభవాన్ని చూపించారు.
ఓలే కోరడే మాగూన ఖాఈల | నాతరీ ఉపాశీ హీ రాహీల |
తయా రోహిల్యాస కైంచీ బాఈల | కోఠూన జాఈల బాబాంశీ | ||౧౩౬||
136. చద్దన్నమో, లేక ఎండిపోయిన రొట్టెనో అడుక్కు తినటం, లేకుంటే పస్తులుండే రోహిల్లాకు, భార్య ఎక్కడిది? అది బాబా దగ్గరకు వెళ్ళటం ఏమిటి!
రోహిలా కఫల్లక దిడకీస భారీ | కైంచే లగ్న కైంచీ నారీ |
బాబా బాళ బ్రహ్మచారీ | కథా హీ సారీ మాయీక | ||౧౩౭||
137. అడుక్కు తినే రోహిల్లా, పైసాకు కొరగాని వాడు. అలాంటి వానికి ఎక్కడి పెళ్లి? ఎక్కడి పెళ్ళాం? ఇక బాబా బాలబ్రహ్మచారి. మొత్తం కథంతా మాయ.
కరీనాకా కంఠశోష | బాబాంస కలమ్యాంచా సంతోష |
ఏకత రాహతీల అహర్నిశ | నిద్రా తే వీష తయాం పుఢే | ||౧౩౮||
138. గొంతు చించుకునేలా అరచినా సరే, బాబా కల్మాలను ఆనందంగా రాత్రి పగలూ వినేవారు. వారికి నిద్ర అంటే విషంతో సమానం.
కోఠే కలమ్యాంచీ ప్రబోధ వాణీ | కోఠే గ్రామస్థాంచీ పోకళ గార్హాణీ |
తయాంస ఆణావయా ఠికాణీ | బతావణీ హీ బాబాంచీ | ||౧౩౯||
139. కల్మాయొక్క జ్ఞాన పూరితమైన మాటలెక్కడ? గ్రామస్థుల పనికి రాని ఫిర్యాదు ఎక్కడ? వారిని సరైన దారిలో పెట్టటానికే బాబా ఈ నాటకం చూపించారు.
హాచి అభిప్రాయ ఎణే రీతీ | బాబాంనీ సకళా దావిలీ ప్రతీతీ |
రోహిల్యాచీ ఆవడే మజ సంగతీ | నామీ ప్రీతి తయాతే | ||౧౪౦||
140. ఈ రకంగా, “నామ స్మరణ అంటే ప్రీతిగల రోహిల్లా నాకు ఇష్టం. నాకు నామ స్మరణ అంటే ప్రీతి” అన్న తమ అభిప్రాయాన్ని బాబా తెలియ చేసారు.
దృశ్య ద్రష్టా ఆణి దర్శన | అవఘేంచ జయా చైతన్యఘన |
తో అసో బ్రాహ్మణ వా పఠాణ | సమసమాన దోఘేహా | ||౧౪౧||
141. చూసేవాడు, చూసే వస్తువు మరియు చూడటం ఇవి మూడూ చైతన్య స్వరూపమే అని అనుకునేవారికి, బ్రాహ్మణుడైనా పఠాను అయినా ఇద్దరూ సమానమే.
ఎకదా మాధ్యాన్హీ ఆరతీ ఝాలీ | మండళీ స్వస్థానీ జావయా పరతలీ |
బాబాంచ్యా ముఖావాటే జీ నిఘాలీ | మధుర వచనావలీ తీ ఏకా | ||౧౪౨||
142. ఒక మారు, హారతియైన తరువాత భక్తులు తమ ఇళ్ళకు బయలుదేరుతుండగా, బాబా నోటినుండి వచ్చిన మధురమైన మాటలను వినండి.
“కుఠేహీ అసా కాహీ హీ కరా | ఎవఢే పూర్ణ సదైవ స్మరా |
కీ తుమచ్యా ఇత్థంభూత కృతీచ్యా ఖబరా | మజ నిరంతరా లాగతీ | ||౧౪౩||
143. “నువ్వెక్కడున్నా, ఏమి చేస్తున్నా, నీ పనులన్నీ నాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకొ.
యేణే నిదర్శిత ఏసా జో మీ | తోచ మీ సర్వాంచ్యా అంతర్యామీ |
తోచ మీ హృదయస్థ సర్వగామీ | అసే మీ స్వామీ సకళాంచా | ||౧౪౪||
144. “ఇలా తెలియజేసిన నేను అంతటా, అందరి హృదయాల్లో ఉంటాను. అన్ని చోట్ల తిరుగుతాను. నేను అందరికి స్వామిని.
భుతీ సబాహ్యాభ్యాంతరీ | భరూని ఉరలో మీ చరాచరీ |
హే సకళసూత్ర ఈశ్వరీ | సూత్రధారీ మీ త్యాచా | ||౧౪౫||
145. “లోపల, బయట, చరాచర సృష్టిలో అన్ని ప్రాణులలో వ్యాపించి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునచే నియమింప బడినది. దీనిని నడిపించే సూత్రధారిని నేను.
మీ సకళ భూతాంచీ మాతా | మీ త్రిగుణాంచీ సామ్యావస్థా |
మీచి సకలేంద్రియప్రవర్తా | కర్తా ధర్తా సంహర్తా | ||౧౪౬||
146. “అన్ని ప్రాణులకు తల్లిని నేను. సత్వ, రజస్ మరియు తమో గుణాలను సమంగా నడిపే వాణ్ణి నేనే. అన్ని ఇంద్రియాలను నడిపించేవాణ్ణి నేనే. సృష్టి, స్థితి, లయలకు కారకుణ్ణి నేనే.
లక్ష లావీ జో మజకడే | నాహీ తయాస కైంచేహీ సాంకడే |
తోచ మాఝా జై విసరపడే | మాయా కోరడే ఉడవీ తై | ||౧౪౭||
147. “నామీద శ్రద్ధ ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు. కాని, నన్ను మరచిపోయిన వారిని మాయ తన కొరడాతో కొడుతుంది.
దృశ్య జాత హే మత్స్వరూప | కీడ ముంగీ రంక భూప |
హే స్థిర జంగమ విశ్వ అమూప | హేంచి నిజరూప బాబాంచే” | ||౧౪౮||
148. “కనిపించే ఈ జగత్తు అంతా నా రూపమే. అంటే చీమ, దోమ, క్రిమికీటకాలు, రాజుపేద, స్థిరంగా ఉండేవి, స్థిరంగా లేనివి మొదలైన ఈ జగత్తంతా బాబాయొక్క నిజరూపమే”.
కాయ మౌజేచా హా ఇశారా | భేద నాహీ సంతా ఈశ్వరా |
అభేద రూపే చరాచరా | విశ్వోద్ధారా అవతార | ||౧౪౯||
149. ఎంత గొప్ప సూచన! సాధువులకీ, పరమేశ్వరునికి ఏ తేడా లేదు. భేదం లేని రూపంలో, స్థిరంగా ఉండే, స్థిరంగా లేని జీవులను ఉద్ధరించటానికి వారు అవతరిస్తారు.
హోణే జరీ గురూపదీలీన | తేణే కరావే గురూగుణగాయన |
అథవా కరావే గురూకథాకీర్తన | అథవా శ్రవణ భక్తీనే | ||౧౫౦||
150. గురువుయొక్క పాదాలలో లీనమవ్వాలంటే, గురువుయొక్క గుణాలను గానం చేయాలి. లేదా గురుకథా కీర్తనలను చేయాలి. లేకుంటే భక్తితో శ్రవణం చేయాలి.
సాధకే ఏసే కరావే శ్రవణ | శ్రోతా శ్రావ్య జాఈ విరోన |
ప్రకట హోఈల చైతన్యఘన | మన ఉన్మన పావేల | ||౧౫౧||
151. వింటున్న విషయంలో సాధకులు లీనమై వింటే, మనసనేది మాయమై, ఉన్మన స్థితికి చేరుకుని, చైతన్య రూపాన్ని అనుభవిస్తారు.
అసతా జరీ గర్క సంసారీ | పడలీ సంతకథా కానావరీ |
యత్న న కరితా తిళభరీ | కల్యాణకారీ తీ స్వభావే | ||౧౫౨||
152. సంసారంలో ఉంటూ, రోజువారి పనులలో మునిగిపోయి ఉన్నా, సాధువుల కథ చెవిన పడితే, కొంచెమైనా ప్రయత్నం చేయకుండానే సహజంగా మంచి కలుగుతుంది.
మగ తీ భక్తి భావే పరిసతా | కేవఢే శ్రేయ చఢేల హాతా |
శ్రోతా విచార కరావా చిత్తా | ఆపుల్యా నిజహితా కారణే | ||౧౫౩||
153. అలాంటప్పుడు, భక్తి భావంతో వింటే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలే ఆలోచించుకోవాలి, వారి మేలు కోసమే.
జడేల తేణే గురూపదీ ప్రేమ | వాఢేల క్రమే ఆత్యంతిక క్షేమ |
నలగే దుజీ నిష్ఠా నేమ | హోఈల పరమ కల్యాణ | ||౧౫౪||
154. వినటం వలన గురువు పాదాలలో ప్రేమ కలిగి, క్రమంగా చాలా శ్రేష్ఠమైన సుఖం కలుగుతుంది. వేరే ఏ నియమాలు సాధనలు లేకుండానే పరమ శ్రేయస్సు దొరుకుతుంది.
మనా లావితా ఏసా నిర్బంధ | వాఢేల కథశ్రవణఛంద |
సహజ తుటతీల విషయబంధ | పరమానంద ప్రకటేల | ||౧౫౫||
155. మనసును ఇలా వినటంలో బంధించి ఉంచితే, కథ వినటంలో శ్రద్ధ ఎక్కువవుతుంది. ఇంద్రియాలకు సంబంధించిన బంధాలు వాటంతట అవే విడిపోయి విపరీతమైన సంతోషం కలుగుతుంది.
ఏకూని బాబాంచీ మధుర వాణీ | నిర్ధార కేలా మీ నిజమనీ |
ఎథూని పుఢే నరసేవా త్యాగుని | గురూసేవనీంచ అసావే | ||౧౫౬||
156. బాబాయొక్క మధురమైన మాటలను విని, ఇక ఇప్పటినుండి మనుషుల సేవను మాని, గురు సేవలోనే ఉండాలని మనసులో నిర్ధారణ చేసుకున్నాను.
పరీ మనాస లాగలీ హురహురీ | ‘మిళేల మేలీ తయా నోకరీ’ |
హే జే బాబా వదలే ఉత్తరీ | ప్రత్యంతరీ యేణార కీ | ||౧౫౭||
157. అయినా మనసులో ఏదో తపన – “అతనికి ఏదో ఉద్యోగం వస్తుంది” అన్న బాబా మాట అనుభవానికి వస్తుందా అని.
శబ్ద బాబాంచా ఖాలీ పడేల | హే తో సహసా కధీహీ న ఘడేల |
నరసేవేచా సంబంధ జడేల | పరీ న జోడేల హిత మోఠే | ||౧౫౮||
158. బాబా మాట జరగక పోవటమనేది ఎప్పుడూ ఉండదు. మనుషులకు సంబంధించిన సేవ దొరికినా, దానివల్ల నాకు మంచి జరగదు.
స్వయంస్ఫూర్తి అణ్ణాంచీ పృచ్ఛా | ఖరీ తథాపి మాఝీ హీ ఇచ్ఛా |
నవ్హతీ ఏసే నాహీ అనిచ్ఛా | ప్రారబ్ధ భోగేచ్ఛా హీ నవ్హే | ||౧౫౯||
159. తనంతట తానే అణ్ణా నా గురించి బాబాను అడిగాడు. నిజమే. కాని, అది నా మనసులోని మాట కాదు అని అనటానికి లేదు. అది ప్రారబ్ధం వలన కలిగిన కోరిక కూడా కాదు.
మాఝ్యాహీ పోటీ నోకరీ వ్హావీ | సంసార నిర్వాహ సోఈ లాగావీ |
సాఈహీ బోటానే గూళ దాఖవీ | పరీ పాజవీ ఔషధ | ||౧౬౦||
160. సంసారం గడవటానికి అనుకూలంగా ఒక ఉద్యోగం కావాలని నా మనసులో కూడా ఉంది. సాయి వ్రేలితో బెల్లాన్ని చూపించి, ఔషధాన్ని త్రాగించారు.
తే ఔషధ యా గుళాచే ఆశే | పిఊని ధాలో భాగ్యవశే |
నోకరీహీ22 అకల్పిత లాగలీ కాసే | ద్రవ్యాభిలాషే స్వీకారిలీ | ||౧౬౧||
161. నా అదృష్టం కొద్దీ, బెల్లం ఆశతో ఔషధాన్ని త్రాగేశాను. అనుకోకుండానే ఉద్యోగం వచ్చింది. నేను డబ్బు మీద ఆశతో దానిని స్వీకరించాను.
గూళ ఝాలా తరీ శేవట | ఖాతాంఖాతా యేణార వీట |
బాబాంచ్యా ఉపదేశమధాచే బోట | చాఖితా చోఖట వాటలే | ||౧౬౨||
162. అయినా, తీపిని ఎంత వరకూ తినగలము? తినగా తినగా చివరకు మొహం మొత్తుతుంది. అప్పుడు, బాబాయొక్క అమృతంలాంటి ఉపదేశాలు చాలా రుచిగా అనిపించాయి.
నోకరీ నవ్హతీ చిరస్థాయీ | చాలూన గేలీ ఆలియా పాయీ |
బాబాంనీ బసవిలే ఠాయీంచేఠాయీ | సౌఖ్య అనపాయీ భోగావయా | ||౧౬౩||
163. ఎప్పుడూ ఉండే ఉద్యోగం కాదది. వచ్చినట్టే వెళ్లి పోయింది. దాంతో శాశ్వత ఆనందాన్ని అనుభవించటానికి, బాబా నన్ను అక్కడే కూర్చోబెట్టారు.
హే విశ్వ సంపూర్ణ చరాచర | భగవత్స్వరూపాచి సాచార |
పరీ భగవంత విశ్వాహూనహీ పర | పరాత్పర పరమాత్మా | ||౧౬౪||
164. కదలికలు ఉండే, కదలికలు లేని జీవులతో నిండి ఉన్న ఈ విశ్వం దేవుని రూపమే. కాని, దేవుడు ఈ విశ్వాన్ని మించి ఉండే పరాత్పర పరమాత్మ.
ఈశ్వర ప్రపంచేసీ అభిన్న | ప్రపంచేసీ ఈశ్వరభిన్న |
ప్రపంచ తేథూని చేతనాచేతన | తయా అధిష్ఠాన ఈశ్వర | ||౧౬౫||
165. పరమేశ్వరుడు ఈ విశ్వం కంటే వేరు కాదు. కాని, విశ్వమే పరమేశ్వరునికంటే ప్రత్యేకమైనది. జగత్తు పుట్టినప్పటినుంచి అందులో కదలికలు ఉండే, కదలికలు లేని ఎన్నో వస్తువులున్నాయి. వాటన్నింటికి పరమేశ్వరుడే ఆధారం.
భగవంతాచీ పూజాస్థానే |అష్టప్రకార అసతీ జాణే |
ప్రతిమా స్థండిలాది ఆనానే | సర్వా తుళణే గురూశ్రేష్ఠ | ||౧౬౬||
166. దేవుణ్ణి ఆరాధించే స్థానాలు ఎనిమిది. విగ్రహం, స్థండిలం మొదలైనవి. వీటన్నిటికంటే గురువు శ్రేష్ఠం.
కృష్ణ స్వయే బ్రహ్మ పూర్ణ | తోహీ ధరీ సాందీపనీ చరణ |
మ్హణే కరితా సద్గుమరూస్మరణ | మీ నారాయణ సంతుష్టే | ||౧౬౭||
167. శ్రీకృష్ణుడు స్వయంగా పూర్ణబ్రహ్మ. అయినా, గురువు సాందీపుల పాదాలను పట్టుకుని, ‘సద్గురువును తల్చుకుంటే నారాయణుడనైన నేను ఆనందిస్తాను’ అని అన్నాడు.
మజహూన మజ సద్గు్రూస్తవన | ఆవడే కీ సహస్త్రగుణ |
ఏసే సద్గుసరూంచే వరిష్ఠపణ | మహిమాన గహన తయాంచే | ||౧౬౮||
168. ‘నా కంటే సద్గురువును పొగిడితే నాకు వేయిరేట్లు ఇష్టం’ అనీ అన్నాడు. సద్గురువుయొక్క ప్రత్యేకత, మహిమ అంత గొప్పది.
గురూభజనా జో పాఠిమోరా | తో ఎక అభాగీ పాపీ ఖరా |
భోగీ జన్మమరణయేర ఝారా | కరీ మాతేరా స్వార్థాచా | ||౧౬౯||
169. గురు భజన అంటే ఇష్టం లేనివాడు నిజంగా అభాగ్యుడు, పాపి. చావుపుట్టుకల రాకపోకల కష్టాలను అనుభవిస్తూ తన శ్రేయస్సును నాశనం చేసుకుంటాడు.
మాగుతీ జన్మమాగుతీ మరణ | హే తో లాగలే నిరంతర భ్రమణ |
మ్హణూని కరూంయా కథాశ్రవణ | నిజోద్ధరణ సంపాదూ | ||౧౭౦||
170. మళ్లి పుట్టుక, మళ్లి చావు! ఈ రెండింటి మధ్యన ఎప్పుడూ తిరుగుతుండటమే మన పని అయిపోయింది. అందుకే, ఈ కథలను విని మనలను ఉద్ధరించుకుందాము.
సంత ముఖీచ్యా సహజ గోష్టీ | అవిధ్యేచ్యా తోడితీ గాంఠీ |
తారక హోతీ అతి సంకటీ | మ్హణోని పోటీ సాఠవూ | ||౧౭౧||
171. సత్పురుషుల నోటినుండి సహజంగా వచ్చిన కథలు అజ్ఞానాన్ని తొలగిస్తాయి. ఎన్నో కష్టాలనుండి అవి దాటిస్తాయి. అందువల్ల, వానిని భద్రంగా హృదయంలో పోగుచేసుకుందాము.
నకళే కైసా యేఈలవేళ | ఘాలూని దేతీల కైసా మేళా |
హా అల్లామియాచా సర్వ ఖేళ | భక్త ప్రేమళ ప్రేక్షక | ||౧౭౨||
172. ముందు ముందు ఎప్పుడు ఎలాంటి సమయం వస్తుందో, ఏమి జరుగుతుందో, ఇదంతా అల్లామియా లీల. అయనకు ప్రేమికులైన భక్తులు కేవలం ప్రేక్షకులు.
గాంఠీస నసతా ప్రజ్ఞాబళ | కాయ మ్హణావే హే దైవ సబళ |
జే మీ లాధలో సాఈ గురూ ప్రబళ | హాహీ ఎక ఖేళ తయాచా | ||౧౭౩||
173. ఏ తెలివి బలమూ లేకుండానే సమర్థులైన సాయి సద్గురుని పొందాను. దీనిని నా బలమైన అదృష్టం అనుకోవాలా? కాదు, ఇది కూడా వారి లీలే!
నివేదిలే గ్రంథ ప్రయోజన | కథిలే మజ దిధలే జే ఆశ్వాసన |
జేణే మత్పరత్వ ఆణి మత్పూజన | కాయ తే దిగ్దర్శన జాహలే | ||౧౭౪||
174. ఈ గ్రంథంయొక్క ప్రయోజనాన్ని మనవి చేశాను. బాబా నాకు ధైర్యాని ఇవ్వటం గురించి మనవి చేశాను. అదే సందర్భంలో, బాబాను ఎలా పూజ చేయలి అన్న దానిని, బాబా తెలియ జేసిన అహం బ్రహ్మ గురించి కూడా సూచించటమయింది.
ఆతా ఆపణ శ్రోతేజన | కరాల పుఢీల అధ్యాయీ శ్రవణ |
సమర్థ సాఈనాథాంచే అవతరణ | శిరడీంత కైసేన జాహలే | ||౧౭౫||
175. ఇప్పుడు, తరువాత అధ్యాయంలో సమర్థ సాయినాథులు శిరిడీలో ఎలా అవతరించారు అన్న సంగతిని శ్రోతలు వినండి.
లహాన థోర తుమ్హీ సగళే | హే సాఈచే చరిత్ర ఆగళే |
హోఊని క్షణైక సంసారావేగళే | పరిసా భోళే భావిక హో | ||౧౭౬||
176. అమాయకులు, భావికులు, చిన్న, పెద్ద అయిన మీరంతా ఒక్క క్షణం ఈ సాంసారిక అలోచనలనుంచి బయటపడి, అసాధారణమైన సాయి చరిత్ర వినండి.
స్వయే జరీ నిర్వికారీ | సాఈ నట నాటకీ అవతారీ |
వర్తే మాయా కార్యానుసారీ | జైసా వ్యవహారీ ప్రాపంచిక | ||౧౭౭||
177. సాయి స్వయంగా ఏ వికారాలూ లేని నిర్వికారి. అయినా, చాలా పాత్రలు నటించిన అవతారి. మాయ వలన, అందరిలాగే ఈ ప్రపంచంలో సామాన్యునిగా నడచుకున్నారు.
‘సమర్థ సాఈ’ యా అల్ప మంత్రే | ధ్యాతీ జయాచీ పదే పవిత్రే |
హాలవీ జో భక్త భవమోక్ష సూత్రే | పావన చరిత్రే తయాచీ | ||౧౭౮||
178. సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో వారి పాదాలను ధ్యానం చేస్తే, భక్తులను సంసార కష్టాలనుండి దాటిస్తారు. అలాంటి సూత్ర్రధారి చరిత్ర పావనమైంది.
ఎవంచ పావన సాఈచరిత్ర | వాచీ తయాచే పావన వక్త |
శ్రోతియాంచే పావన శ్రోత్ర | హోఈల పవిత్ర అంతరంగ | ||౧౭౯||
179. ఇలాంటి పావనమైన సాయి చరిత్రను చెప్పేవారి నోరు, వినేవారి చెవులు, వారిరువురి మనసులు పవిత్రమౌతాయి.
ప్రేమే కరితా కథాశ్రవణ | హోఈల భవ దుఃఖాంచే హరణ |
ఓళేల సాఈ కృపాఘన | ప్రగటేల సంపూర్ణ శుద్ధబోధ | ||౧౮౦||
180. ఈ కథలను ప్రేమగా, శ్రద్ధగా వింటే సాంసారిక దుఃఖం తొలగిపోతుంది. సాయి దయామయులు. సంపూర్ణమైన, శుద్ధమైన జ్ఞానాన్ని బోధిస్తారు.
లయ విక్షేప ఆణి కషాయ | రసాస్వాద హే శ్రవణా అపాయ |
దూరసారాహె అంతరాయ | శ్రవణ సుఖదాయక హోఈల | ||౧౮౧||
181. బద్ధకం, స్థిరంగా ఉండలేని మనసు, ఇంద్రియాలను తృప్తి పరచాలనుకోవటం, ఇవన్నీ వినటంలో కలిగే రస ఆస్వాదనానికి కష్టం కలిగిస్తాయి. ఈ అంతరాయాలను తొలగించుకుంటే వినటం సుఖంగా ఉంటుంది.
నలగే వ్రత ఉధ్యాపన | నలగే ఉపవాస శరీరశోషణ |
నలగే తీర్థ యాత్రాపర్యటన | చరిత్ర శ్రవణ ఎక పురే | ||౧౮౨||
182. వ్రతాలు, ఉద్యాపనలు అవసరం లేదు. దేహాన్ని కష్టపెట్టే ఉపవాసాలు అవసరం లేదు. తీర్థయాత్రలు మొదలైనవి అవసరం లేదు. చరిత్రను వినటం ఒకటే చాలు.
ప్రేమ అసావే అకృత్రిమ | జాణిలే పాహిజే భక్తివర్మ |
సహజ లాధేల పరమార్థ పరమ | నాసేల అవిషమ అవిద్యా | ||౧౮౩||
183. మన ప్రేమ నిర్మలంగా మోసం లేనిదిగా ఉండాలి. భక్తిలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలి. అప్పుడే అజ్ఞానం నశించి, పరమార్థం సహజంగా లభిస్తుంది.
నలగే ఇతర సాధనీ శీణ | కరూ హే సాఈచరిత్ర శ్రవణ |
సంచిత ఆణి క్రియమాణ | అల్పప్రమాణ హీ నురవూ | ||౧౮౪||
184. ఇతర సాధనలతో కష్టపడనవసరం లేదు. ఈ సాయి చరిత్ర విని, మనం గతంలో చేసిన, ఇప్పుడు చేస్తున్న చెడు పనుల ప్రభావం ఏ మాత్రం మిగలకుండా చేసుకుందాం.
కృపణ వావరో కవణ్యాహీ గావా | చిత్తాసమోర పురలేలా ఠేవా |
జైసా తయాసీ అహర్నిశీ దిసావా | తైసాచి వసావా సాఈ మనీ | ||౧౮౫||
185. ఏ ఊళ్ళో తిరుగుతున్నా, రాత్రీపగలూ తాను దాచుకున్న డబ్బునే తన మనసులో పిసనారి చూసేటట్లు, మనమూ మన మనసులో ఎప్పుడూ సాయిని చూద్దాము.
|ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | గ్రంథప్రయోజనానుజ్ఞాపన నామ |
| తృతీయోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
1. ఎకాద్యా విషయాచీ సిద్ధతా కరణ్యాసాఠీ ఘట పట ఇత్యాదీ ఉదాహరణాంనీ వితండవాద మాజవిణే.
2. అవతారకార్యాచీ సఫలతా.
3. రా. మాధవరావ దేశపాండే యాంస బాబా నేహమీ యా నావానే హాక మారీత.
4. పరిపూర్ణ ఆనంద.
5. కలియుగానుసార ఉత్పన్న హోణార్యా దుష్ట వాసనా.
6. ఖటపట, శ్రమ.
7. భక్తాచ్యా పాతకాంచా నాశ.
8. మాయా తరూన జాణ్యాకరితా.
9. అణ్ణా చించణీకర.
10. యా లేఖకాచ్యా.
11. యా లేఖకాస యా నావానే బహుతేక హాక మారీత.
12. రేడా.
13. త్రాసలే.
14. ఉత్సుక ఝాలీ ఆహే.
15. మనసోక్త.
16. ఝోంబేల, ఝగటేల.
17. జ్యా ఓరడీనే.
18. ఆగ్రహ.
19. త్యా రోహిల్యాలా.
20. మంజుళ.
21. కర్కశ.
22. ముంబఈ సరకారచే చీఫ సేక్రేటరీ కై. మి. మీడ హే అ. కలెక్టర అసతానా హా లేఖక త్యాంచా శిరస్తేదార వ మరాఠీచా శిక్షక హోతా. పుఢే ఇ. స్. ౧౯౨౧ సాలీ పేన్శన ఘ్యావయాస హా మే. అకాఊంటేంట జనరలచ్యా ఆఫిసాత జాత అసతా వాటేత మి. మీడ యాంచీ అకల్పిత గాఠ పడూన త్యాంచ్యా ఆగ్రహావరూన, పేన్శన ఘేతల్యానంతర ౫ వర్షాంనీ ఎకా స్పేశల కామావర సహా మహినే పర్యంత సేక్రేటరిఎటమధ్యే యానే నోకరీ పత్కరలీ హోతీ.