శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౨ రా ||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
పూర్వాధ్యాయీ మంగలాచరణ | జాహలే దేవతాకులగురూవందన |
సాఈచరిత్రబీజ పేరూన | ఆతా ప్రయోజన ఆరంభూ | ||౧||
1. మంగళాచరణం, దేవతలకు, కులదేవతలకు, గురువులకు వందన సమర్పణతో శ్రీసాయి సచ్చరితకు ప్రారంభం గత అధ్యాయంలో జరిగింది. ఈ గ్రంథ ప్రయోజనాన్ని ఇప్పుడు చెప్పటం ఆరంభిస్తాను.
అధికారీ అనుబంధ దిగ్దర్శన | అతి సంకలిత కరూ వివేచన |
జేణే శ్రోతయా గ్రంథప్రవేశన | ఆయాసేవీణ ఘడేల | ||౨||
2. ఈ గ్రంథాన్ని ఎవరు చదవాలో మరియు ఈ గ్రంథానికి, అందులోని విషయానికిగల సంబంధాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను. దీనివలన, శ్రోతలు సులభంగా ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోగలరు.
ప్రథమాధ్యాయీ యథానుక్రమ | కరూని గోధూమ-పేషణోపక్రమ |
కేలా మహామారీచా ఉపశమ | ఆశ్చర్య పరమ గ్రామస్థా | ||౩||
3. బాబా ఎలా గోధుమలను విసరి, మహమ్మారియైన కలరాను గ్రామంనుండి తరిమివేశారు, అనే సంగతి మొదటి అధ్యాయంలో విన్నారు. ఈ లీల గ్రామస్థులకు పరమాశ్చర్యాన్ని కలిగించింది.
ఏశా సాఊచ్యా అగాధ లీలా | శ్రవణ కరితా ఆనంద ఝాలా |
తేచి యా కావ్యరూపే ప్రకటలా | బాహేర ఉతటలా ప్రేమపూర | ||౪||
4. ఇలాంటి సాయియొక్క ఇలాంటి అగాధమైన లీల విని, నాకు ఆనందం కలిగింది. నాలో ప్రేమ ఉప్పొంగి, ఈ కావ్య రూపంలో ప్రకటితమైంది.
మ్హణూని సాఈచే ధన్యవాద | వాటలే యథామతీ కరావే విశద |
హోతీల తే భక్తాంసీ బోధప్రద | పాపాపనోద హోఈల | ||౫||
5. అందుకు సాయికి నా ధన్యవాదాలు. భక్తులకు మంచి ఉపదేశంగా ఉంటూ, వారి పాపాలను నశింప చేస్తుందనే నమ్మకంతో, సాయియొక్క లీలలను నా బుద్ధికి తోచినట్లు, చెప్పాలని నాకు అనిపించింది.
తదర్థ హే సాఈచే చరిత్ర | లిహూ ఆదరిలే అతి పవిత్ర |
ఆరంభిలే హే కథాసత్ర | ఇహ పరత్ర సౌఖ్యద | ||౬||
6. అందుకే, ఇహ పర సుఖాలను ప్రసాదించే, అతి పవిత్రమైన సాయి చరిత్రయను ఈ కథలను వ్రాయటంతో ప్రారంభించాను.
సన్మార్గదర్శక సంతచరిత్ర | నవ్హే తే న్యాయ వా తర్కశాస్త్ర |
తరీ హోఈల జో సంతకృపాపాత్ర | తయా న విచిత్ర కాహీచ | ||౭||
7. సత్పురుషుల చరిత్ర మంచి మార్గదర్శకమైనది. అది న్యాయశాస్త్రంగాని, తర్కశాస్త్రంగాని కాదు. అయినా సంతుల అనుగ్రహానికి పాత్రులైన వారికి,
తరీ హీ ప్రార్థనా శ్రోతయాలాగీ | వ్హావే జీ యా ఆనందా విభాగీ |
ధన్య భాగ్యాచా తో సత్సంగీ | కథావ్యాసంగీ నిరత జో | ||౮||
8. ఈ ఆనందాన్ని పంచుకోవడంలో, శ్రోతలు కూడా భాగస్వాములు కావలెనని నా ప్రార్థన. ఈ కథలను సత్సంగంతో ఎల్లప్పుడూ వినేవారు ధన్య భాగ్యులు.
చిరపరిచిత జీవాచా మిత్ర | సహవాస జ్యాచా దివస రాత |
త్యాంచే న మజ రేఖాటావే చిత్ర | సంతచరిత్ర కాయ లిహూ | ||౯||
9. పగలూ రాత్రి కలిసి ఉండే మిత్రుల గురించే, కొంచం అయినా వ్రాయలేని నేను, ఒక సంతుని జీవిత చరిత్ర ఎలా వ్రాయగలను?
జేథ మాఝే మజ అంతరంగ | ఓళఖూ యేఈనా యథాసంగ |
త్యా మ్యా సంతమనీచే తరంగ | వర్ణావే నిర్వ్యంగ కైసేనీ | ||౧౦||
10. అంతెందుకు, నా ఆలోచన గురించి కాని, అసలు నా గురించి కాని, పూర్తిగా తెలుసుకోలేని నేను, ఒక సత్పురుషుని మనసులోని ఆలోచనల గురించి తప్పులు లేకుండా ఎలా వర్ణించగలను?
కరూ జాతా స్వరూపనిర్ధార | మూకావలే జేథ వేదహీ చార |
త్యా తుఝ్యా రూపాచా విచార | కళేల సాచార మజ కైసా | ||౧౧||
11. ఆత్మయొక్క స్వరూపాన్ని తెలుసుకోలేక, నాలుగు వేదాలు మౌనం వహించాయి. అలాంటప్పుడు, మీ నిజ స్వరూపాన్ని నేను నిశ్చయంగా ఎలా తెలుసుకోగలను?
స్వయే ఆధీ సంత వ్హావే | మగ సంతా యథార్థ జాణావే | తేథ మీ సంతాంసీ కాయ వానావే | హే మజ ఠావే ఆధీంచ | ||౧౨||
12. ముందుగా నేను సంతుడైతే, తరువాత ఇతర సంతులను తెలుసుకోగలుగుతాను. నా అసమర్థత నాకు ముందుగానే బాగా తెలుసు. అలాంటప్పుడు నేను సత్పురుషులను ఎలా వర్ణించగలను?
సప్త సాగరీంచే పాణీ | తయాచీహీ కరవేల మాపణీ | ఆకాశాసీ ఘాలవేల గవసణీ | పరీ న ఆయణీ సంత యేతీ | ||౧౩||
13. ఏడు సాగరాలలో ఉన్న నీటిని కొలువ వచ్చు. విశాలమైన ఆకాశాన్ని కప్పిపుచ్చవచ్చు. కాని, సత్పురుషులు సామాన్యుల బుద్ధికి అంతు పట్టరు.
జాణే మనీ మీ ఏక పామర | పరీ బాబాంచా ప్రతాప అనివార | పాహూని ఉఠే గావయాచీ లహర | తీహీ అనావర హో పాహే | ||౧౪||
14. నేనొక అల్పుడని నాకు తెలుసు. అయినా, బాబాయొక్క అంతులేని శక్తిని, మహాత్మ్యాన్ని చూచి, వారి గురించి పాడాలని అణచుకోలేనంత ఉత్సాహం నాలో కలిగింది.
జయ జయాజీ సాఈరాయా | దీనదుబళ్యాచియా విసాంవియా | అగాధ న వర్ణవే తుఝీ మాయా | కరీ కృపా యా దాసావరీ | ||౧౫||
15. జయ జయ సాయినాథా! దీనుల దళితుల ఆశ్రయమా! అగాధమైన మీ ప్రేమను వర్ణించ సాధ్యం కాదు. కనుక, ఈ దాసుని కరుణించండి.
లహాన తోండీ మోఠా ఘాంస | తైసే హే హోఈల మాఝే సాహస | హోఊ న దేఈ మాఝా ఉపహాస | వాటే హా ఇతిహాస లిహావా | ||౧౬||
16. ఈ చరిత్రను వ్రాయలన్న నా సాహసం, చిన్న నోటికి పెద్ద ముద్దవలె ఉంది. నన్ను అపహాస్యాల పాలు కానివ్వకండి అని ప్రార్థిస్తున్నాను.
సంతచరిత్రే జే జే లిహితీ | తయావరూ భగవంతాచీ ప్రీతీ | ఏసే మహారాజ జ్ఞానేశ్వర వదతీ | ధరావీ భీతి మగ మీ కా | ||౧౭||
17. అయినా నేనెందుకు భయపడాలి? సంతుల చరిత్ర వ్రాసేవాళ్లపై భగవంతునికి ప్రీతి, అని జ్ఞానేశ్వర మహారాజే అన్నారు.
మఝియాహీ మనీ హ స్ఫూర్తీ | చేతవితీ తీచ భగవంతమూర్తీ | స్వయే జరీ మీ జడ మూఢమతీ | నిజకార్యపూర్తీ తీ జాణే | ||౧౮||
18. ఆ భగవంతుడే నాలో వ్రాయాలనే స్ఫూర్తినిచ్చి, మేలుకొలిపింది. కనుక, తన పనిని ఎలా పూర్తిచేయాలో ఆయనకే తెలుసు. స్వయంగా నేను మందమతిని, జడుణ్ణి.
భక్త జీ జీ సేవా కల్పితీ | సంత స్వయేచి కరవూని ఘేతీ | భక్త కేవళ కారణ నిమిత్తీ | సకళ స్ఫూర్తి సంతాంచీ | ||౧౯||
19. భక్తులు తమకు ఏ సేవ చేయాలని అనుకున్నా, ఆ సేవలన్నిటినీ సత్పురుషులు తామే పూర్తి చేయించుకుంటారు. స్వయంగా ఆ సత్పురుషులే భక్తులకు స్ఫూర్తినిస్తారు. భక్తులు కేవలం నిమిత్త మాత్రులే.
సారాంశ హా సాఈ స్వయే కరవీ | నిజచరిత్ర మజ మూర్ఖా కరవీ |
ఓణేంచ యా కథేచీ థోరవీ | గౌరవీ జే ఆదరే | ||౨౦||
20. సారాంశంలో చెప్పాలంటె, తమ చరిత్రను తామే స్వయంగా ఈ మూర్ఖుని ద్వారా వ్రాయిస్తారు. భక్తి గౌరవాలను కలిగించే ఈ చరిత్రకు అందుకే ఇంతటి ఘనత.
సాధుసంత అథవా శ్రీహరి | కోణాతేహీ ధరూని నిజకరీ |
ఆపులీ కథా ఆపణ కరీ | నిజకర శిరీ ఠేవునీ | ||౨౧||
21. సాధుసంతులు కాని, శ్రీహరియే కాని, నిమిత్త మాత్రునిగా నిర్ణయించిన వారి శిరసుపై తమ వరద హస్తాన్ని ఉంచి, వారి చేయి పట్టుకుని తమ చరిత్రను తామే వ్రాయించుకుంటారు.
జైసీ శకే సతరాంశే సాలీ | మహీపతీసీ బుద్ధి స్ఫురలీ | సాధు సంతాంహీ సేవా ఘేతలీ | చరిత్రే లిహివిలీ త్యా కరవీ | ||౨౨||
22. శ. క. సం|| ౧౭౦౦లో సాధు శ్రేష్ఠులు మహీపతికి ప్రేరణ కలిగించి, అతని ద్వారా తమ చరిత్రలను తామే వ్రాయించి, అతని సేవను స్వీకరించారు.
తీచ సేవా అఠరాశే సాలీ | దాస గణూచ్యా హస్తే ఘేతలీ | పుఢీల సంతచరిత్రే లిహివిలీ | పావన ఝాలీ సకళీకా | ||౨౩||
23. అలాగే, శ. క. సం|| ౧౮౦౦లో దాసగణుని ద్వారా సేవను స్వీకరించి, సాధువులు తమ చరిత్రలను వ్రాయించి, అందరినీ పావనం చేశారు.
భక్త ఆణి సంతవిజయ గ్రంథ | భక్త ఆణీ సంతలీలామృత | హే చార జైసే మహిపతీరచిత | దాసగణూకృత దోన తైసే | ||౨౪||
24. భక్త విజయం, సంత విజయం, భక్త లీలామృతం మరియు సంత లీలామృతం అను నాలుగు గ్రంథాలను రచించిన మహీపతి వలెనే, దాసగణు రెండు గ్రంథాలను రచించారు.
ఏకాంచే నావ భక్తలీలామృత | దుజయాంచే తే సంతకథామృత | ఉపలబ్ధ అర్వాచీన భక్త సంత | ఉభయ గ్రంథాంత వర్ణిలే | ||౨౫||
25. ఒకటి భక్త లీలామృతం, రెండవది సంత కథామృతం. ఈ రెండు గ్రంథాలలో ఈ మధ్యనే వెలుగులోకి వచ్చిన భక్తుల మరియు సత్పురుషుల లీలలు వర్ణింపబడి ఉన్నాయి.
త్యాంతీల భక్తలీలామృతాంత | శ్రీసాఈచే మధుర చరిత | ఆహే వర్ణిలే అధ్యాయత్రయీత | శ్రోతీ తే తేథ వాచావే | ||౨౬||
26. భక్త లీలామృతంలో శ్రీ సాయియొక్క మధుర చరిత్రను మూడు అధ్యాయాలలో వర్ణింపబడినది. శ్రోతలూ దీనిని పఠించండి.
తైశీచి గోడ జ్ఞానకథా | కథితీ సాఈ ఏకా భక్తా | తీ వాచావీ సంతకథామృతా | అధ్యాయ సత్తావన పహా | ||౨౭||
27. అలాగే, సంత కథామృతంలో, ౫౭వ అధ్యాయంలో ఒక భక్తునికి సాయి తెలిపిన మధురమైన, జ్ఞానాన్ని బోధించే కథను చదవండి.
శివాయ సాఈచే అలౌకిక లీలా | రఘునాథ-సావిత్రీ భజనమాలా | అనుభవపూర్వక నివవీ జనాలా | అభంగ-పదాలా గాఊన | ||౨౮||
28. ఇవి కాక, రఘునాథ మరియు సావిత్రి రచించిన రఘునాథ-సావిత్రి భజనమాల అను గ్రంథంలో, తాము అనుభవించిన సాయియొక్క అలౌకిక లీలలను, అభంగమనే పదాలలో, ప్రజల కోసం గానం చేశారు.
యాంతచి ఏక బాబాంచే లేకరూ | జే తృషిత చకోరా అమృతకరూ | వర్షలే కథామృతప్రేమపడిభరూ | శ్రోతా తే సాదరూ సేవావే | ||౨౯||
29. చకోరంలా దాహంగా ఉండే భక్తుల కోసం, బాబా మీద విపరీతమైన ప్రేమతో, బాబా బిడ్డడు (హరి సీతారామ దీక్షిత) భజనమాలకు వ్రాసిన ముందుమాటలో ప్రేమామృతాన్ని కురిపించారు. శ్రోతలు శ్రద్ధగా దానిని పఠించండి.
దాసగణూచీ స్ఫూట కవితా | తీహీ అత్యంత రసభరితా |
ఆనంద దేఈల శ్రోతయాచిత్తా | లీలా పరిసతా బాబాంచీ | ||౩౦||దాసగణూచీ స్ఫూట కవితా | తీహీ అత్యంత రసభరితా |
30. అత్యంత రసభరితమైన దాసగణుని మిగతా కవిత్వంలో కూడా, సాయి లీలలు శ్రోతల మనసులకు ఆనందాన్ని కలిగిస్తాయి.
తైసేంచి గుర్జర జనాంకరితా | భక్త అమీదాస భవానీ మేథా |
యానీహీ కాహీ చమత్కారకథా | అతి ప్రేమళతా లిహిల్యాతీ | ||౩౧||
31. అలాగే, గుజరాతి ప్రజల కొరకు, అమీదాసు భవాని మెహతా అను భక్తుడు అత్యంత ప్రేమతో బాబాయొక్క చమత్కారాల కథలను గుజరాతి భాషలో వ్రాశాడు.
శివాయ కాహీ సద్భ్క్తశిరోమణీ | సాఈప్రభా హే నావ ఠేవునీ | ప్రసిద్ధ కరీత పుణ్యపట్టణీ | కథాశ్రేణీ బాబాంచ్యా | ||౩౨||
32. ఇవి కాక, కొందరు భక్త శిరోమణులు 'సాయిప్రభ' అను పేరుతో బాబాయొక్క కథా పరంపరలను, పూనానుండి ప్రసిద్ధికి తెచ్చారు.
ఏసఏసియా కథా అసతా | యా గ్రంథాచీ కాయ ఆవశ్యకతా | శంకా యేఈల శ్రోతయాంచిత్తా | నిరాకరణతా ఆకర్ణిజే | ||౩౩||
33. ఇలాంటివి ఎన్నెన్నో కథలుండగా ఈ గ్రంథంయొక్క అవశ్యకత ఏముందని శ్రోతలకు సంశయం కలుగ వచ్చును. మీ సందేహాన్ని తీర్చుతాను, వినండి.
సాఈచరిత్ర మహాసాగర | అనంత అపార రత్నాకర | మీ టిటవీ తో రితా కరణార | ఘడణార హే కైసేనీ | ||౩౪||
34. మహా సాగరంవలె సాయి చరిత్ర అనంతం, అపారం. అనేక రత్నాలకు గని. పిచ్చుక లాంటి నేను, దీనిని ఖాళీ చేయటం ఎలా సాధ్యం?
తైసే సాఈచే చరిత్ర గహన |అశక్య కధీహి సాడ్గన వర్ణన | మ్హణూని కరవేల తే కథన | తేణేంచి సమాధాన మానావే | ||౩౫||
35. అత్యంత గహనమైన సాయి చరిత్రను సంపూర్ణంగా వర్ణించటం అసాధ్యం. ఎంత వీలైతే అంత, నా శక్తికొలది చెప్పి, అంతటితో తృప్తి పడాలి.
అపార సాఈచ్యా అపూర్వ కథా | శాంతిదాయక భవదవార్తా | శ్రోతయా దేతీల శ్రవణోల్హాసతా | చిత్తస్థిరతా నిజభక్తా | ||౩౬||
36. అపారమైన సాయియొక్క అపూర్వ కథలు, ప్రాపంచిక దుఃఖాలతో బాధ పడేవారికి శాంతిని చేకూరుస్తాయి. వినటంలో శ్రోతలకు ఉత్సాహాన్నీ మరియు భక్తుల మనసుకు స్థిరత్వాన్ని కలిగిస్తాయి.
కథా వదలే పరోపరీచ్యా | వ్యావహారిక ఉపదేశాచ్యా | తైశాచి సర్వాంచ్యా అనుభవాచ్యా | వర్మాచ్యా నిజకర్మాచ్యా | ||౩౭||
37. అనేక రకాల ఉపదేశాలతో బాబా కథలను చెప్పారు. అందులో కొన్ని ప్రాపంచిక సంగతుల గురించి, కొన్ని భక్తుల అనుభవాల గురించి, మరింకెన్నో తమ లీలలోని మర్మాలను తెలియజేస్తూ చెప్పినవి.
అపౌరూషేయ శ్రుతి విఖ్యాత | జైశా అసంఖ్య ఆఖ్యాయికా విశ్రుత | తైశాచీ బాబా మధుర అర్థభరిత | అపరిమిత సాంగత | ||౩౮||
38. దైవీకమైన శ్రుతలలోని (వేదాలు) అసంఖ్యాకమైన కథలవలె, అర్థంతో నిండిన, రసభరితమైన ఎన్నో కథలను బాబా చెప్పేవారు.
ఏకతా త్యా సావధాన | ఇతర సుఖే తృణాసమాన | విరోని జాయ భూకతహాన | సమాధాన అంతరీ | ||౩౯||
39. ఆ కథలను వింటుంటే, ఆకలి దప్పులను మరచిపోయి, ఇతర సుఖాలు గడ్డితో సమానమని అనిపిస్తాయి. మనసుకు శాంతి ఏర్పడుతుంది.
కోణాసీ వ్హావీ బ్రహ్మసాయుజ్యతా | అష్టాంగయోగప్రావీణ్యతా | సమాధిసుఖనిర్భరతా | హోఈల కథా పరిసతా యా | ||౪౦||
40. అష్టాంగ యోగ ప్రావిణ్యాన్ని, సమాధి సుఖంలోని ఆనందాన్ని, బ్రహ్మతో ఐక్యాన్ని కోరుకునే వారు ఈ సాయి కథలను వింటే, వారి కోరిక తీరుతుంది.
శ్రవణార్థియాంచే కర్మపాశ | తోడూని టాకితీ యా కథా అశేష |
బుద్ధీసీ దేతీ సుప్రకాశ | నిర్విశేష సుఖ సకలా | ||౪౧||
41. వినేవారి కర్మ పాశాన్ని త్రుంచివేసి, బుద్ధిని ప్రకాశవంతం చేసి, ఈ కథలు వారికి ఏ భేదభావాలూ లేని సుఖాన్ని కలిగిస్తాయి.
తేణే మజ స్ఫురలో వాసనా | ఏశా సుసంగ్రాహ్య కథా నానా | ఓవూని కరావే మాలాగ్రథనా | హీచి ఉపాసనా చాగలీ | ||౪౨||
42. అందువల్ల, ఇలాంటి అనేక కథలను సేకరించి, మాలగా గ్రుచ్చాలనే కోరిక నాలో కలిగింది. ఇలాంటి మాలను బాబాకు సమర్పించడమే మంచి పూజ అని కూడా అనిపించింది.
కానీ పడతా చార అక్షరే | తాత్కాళ జీవాచా దుర్దిన ఓసరే | సంపూర్ణ కథా ఏకతా సాదరే | భావార్థీ ఉతరేల భవపార | ||౪౩||
43. ఈ కథలలోని నాలుగు అక్షరాలు చెవులలో పడిన వెంటనే జీవుల చెడు రోజులు తొలగిపోతాయి. ఇక సంపూర్ణ కథను, భక్తిభావంతో వినే భక్తులు సంసార సాగర తీరాన్ని చేరుకోగలరు.
మాఝీ కరోనియా లేఖణీ | బాబాచి గిరవితీల మాఝా పాణీ | మీ తో కేవళ నిమిత్తాలా ధణీ | అక్షరే వళణీ వళవితో | ||౪౪||
44. నన్ను తన లేఖనిగా చేసుకొని, నా చేతిని పట్టుకొని త్రిప్పుతూ, బాబాయే అక్షరాలను వ్రాయిస్తున్నారు. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి.
వర్షానువర్ష బాబాంచీ లీలా | పాహోని లాగలా మనాసీ చాళా | బాబాంచ్యా గోష్టీ కరావ్యా గోళా | భోళ్యా ప్రేమళాంకారణే | ||౪౫||
45. ఎన్నో సంవత్సరాలు బాబా లీలలను చూసిన తరువాత, వారి ప్రవచానాలను, ప్రేమ పూరితమైన భావికులైన భక్తుల కొరకు సేకరించాలనే సంకల్పం నాలో కలిగింది.
హోఊనియా ప్రత్యక్ష దర్శన | నివాలే నాహీత జ్యాంచే నయన | తయాంసీ బాబాంచే మాహాత్మ్యశ్రవణ | పుణ్య పావన ఘడావే | ||౪౬||
46. బాబాను ప్రత్యక్షంగా దర్శించి తమ కళ్ళను పావనం చేసుకోలేని వారు, బాబాయొక్క మహిమలను, చెవులతో వినిన పుణ్యంతోనైనా పరిశుద్ధులు కాగలరు.
కోణా సభాగ్యాచియా మనా | వాచావయాచీ హోఈల కామనా | పరమానంద హోఈల మనా | సమాధాన లాహేల తో | ||౪౭||
47. ఎవరైనా అదృష్టవంతులకు ఈ కథలను పఠించాలన్న కోరిక కలిగితే, వారికి పరమానందం, మనసుకి పరమ శాంతి కలుగుతాయి.
ఏశీ మనాంత ఉదేలీ వృత్తీ | మాధవరావాంచే కానావరతీ | ఘాతలీ పరీ సాశంక చిత్తీ | కైసే మజప్రతి సాధే హే | ||౪౮||
48. ఇలాంటి భావన నా మనసులో కలగగానే, దానిని మాధవరావు చెవిన వేశాను. మనసులో మటుకు, ఈ రచన నా చేత సాధ్యమేనా, అనే అనుమానం మిగిలింది.
వయాసీ ఉలటలీ వర్ష సాఠ | బుద్ధీహీ నాఠ వాహే సునాట | అశక్తపణే రాహీల ఖటపట | ఉరలీ వటవట తోండాచీ | ||౪౯||
49. ఎందుకంటే, అప్పటికే నా వయసు అరవై దాటాయి. అరవై తరువాత బుద్ధి, వ్యర్థమైన వాటి వైపు మళ్ళుతుంది. శరీరంలోని శక్తి సన్నగిల్లింది. ఇక మిగిలేది నోటి వాగుడే.
తీ తరీ వ్హావీ సాఈప్రీత్యర్థ | సాధేల కాంహీతరీ పరమార్థ | ఇతరత్ర హోఈల తీ నిరర్థ | ఎతదర్థ హా యత్న | ||౫౦||
50. అర్థహీనంగా ఇతర విషయాలలో వ్యర్థమయ్యే శక్తిని, సాయి ప్రీతికోసం, పరమార్థం సాధించుకోవటానికి ఉపయోగించాలనే నా ఈ ప్రయత్నం.
అనుభవ ఘేతా దివస రాతీ | వృత్తాంత లిహావా ఆలే చిత్తీ |
జయాచ్యా పరిశీలనే శాంతీ | మనాసీ విశ్రాంతి లాభేల | ||౫౧||
51. రాత్రింపగలూ భక్తులు అనుభవించిన సంగతులను రచించాలని, కోరిక కలిగింది. వానిని మననం చేసుకోవటం వలన, మనసుకు విశ్రాంతి, ఆత్మకు శాంతి లభిస్తాయి.
ఆత్మతృప్తీచే నిసర్గోద్గార | స్వానుభూతీచే అధిష్ఠానావర | బాబా ఉద్గాచరలే వారంవార | శ్రోతయా సాదర కరావే | ||౫౨||
52. స్వంత అనుభవాల మీద ఆధారపడి, ఆత్మకు తృప్తిని కలిగించే మాటలను అనేక సార్లు, బాబా ఎంతో సహజంగా చెప్పారు. వానిని సాదరంగా శ్రోతలకు తెలియ చేస్తాను.
బహుత వదలే జ్ఞానకథా | అనేకా లావిలే భజనపంథా | తయాంచా సంగ్రహ కరావా పురతా | హోఈల గాథా సాఈచా | ||౫౩||
53. జ్ఞానాన్ని తెలిపే ఎన్నో కథలను బాబా చెప్పారు. ఎందరినో భక్తి మార్గంలో ప్రవేశ పెట్టారు. వీటన్నిటినీ సంపూర్ణంగా సేకరిస్తే, అదే గాథ (పవిత్రమైన కావ్యం) అవుతుంది.
త్యా త్యా కథా జే సాంగతీ | సాదర మనే జే జే ఏకితీ | ఉభయాంచ్యా మనాంసీ విశ్రాంతీ | పూర్ణ శాంతి లాభేల | ||౫౪||
54. ఆ కథలను చెప్పేవారికి, శ్రద్ధగా వినేవారికి, ఇద్దరి మనసులకు విశ్రాంతి, సంపూర్ణమైన శాంతి లభిస్తాయి.
ఏకతా శ్రీముఖీంచ్యా కథా | భక్త విసరతీల దేహవ్యథా |
తయాంచే ధ్యాన మనన కరితా | భవనిర్ముక్తతా ఆపైసీ | ||౫౫|| ఏకతా శ్రీముఖీంచ్యా కథా | భక్త విసరతీల దేహవ్యథా |
55. శ్రీవారి నోటినుండి వెలువడిన ఈ కథలను వింటే, భక్తులు శరీర వ్యథలను మరచిపోతారు. అంతే కాదు, వారిని ధ్యానం, మననం చేస్తే, సంసార బంధాలనుండి విముక్తి సహజంగా లభిస్తుంది.
శ్రీసాఈముఖీంచ్యా వార్తా | అమృతాపరిస రసభరితా | పరమానంద దాటేల పరిసతా | కాయ మధురతా వానూ మీ | ||౫౬||
56. శ్రీ సాయి ముఖంనుండి వచ్చిన మాటలు అమృతంతో సమానం, రసభరితం. వానిని వింటే పరమానందం కలుగుతుంది. వాని మాధుర్యాన్ని నేనెలా వర్ణించగలను?
ఏశియా కథా జో అదాంభికతా | ఆఢళేల మజ గాతా వర్ణితా | వాటే తయా పాదరజధుళీ లోళతా | మోక్ష హాతా యేఈల | ||౫౭||
57. అహంకారం లేనివారెవరైనా ఈ కథలను గానం చేస్తుంటే నేను వినినా, వారి పాదాల ధూలిలో నేను పొర్లినా, నాకు ముక్తి సులభంగా లభిస్తుందని అనిపిస్తుంది.
తయాంచ్యా గోష్టీంచీ అలౌకిక మాండణ | తైశీచి శబ్దశబ్దాంచీ ఠేవణ | పరిసతా తల్లీన శ్రోతృగణ | సుఖ సంపూర్ణ సకళికా | ||౫౮||
58. ఈ కథలను చెప్పటంలోని బాబాయొక్క అలౌకికమైన నేర్పు, పదాల కూర్పును విని, శ్రోతలు తల్లీనులై సంపూర్ణ సుఖాన్ని పొందుతారు.
జైసే గోష్టీ ఏకావయా కాన | కివా దర్శన ఘ్యావయా నయన | తైసేంచీ మన హోఊనియా ఉన్మన | సహజ ధ్యాన లాగావే | ||౫౯||
59. వారి మాటలు వినటానికి చెవులు, వారి దర్శనానికి కళ్లు కాతురతో ఎదురు చూస్తుంటే, మనసు జ్ఞానాన్ని దాటి, సహజంగా ధ్యానంలో ఉండిపోతుంది.
గురూమాఊలీ మాఝీ జననీ | కథితీ తియేచ్యా కథా జ్యా జనీ | ఏకిజేతి వదనో వదనీ | సాదర శ్రవణీ సాఠవూ | ||౬౦||
60. నా గురుమాత, నా జనని, ప్రజలకు తెలియ చేసిన కథలను, ఆ నోట ఆ నోట ప్రచారమైన ఇతర కథలను, విని వానిని శ్రద్ధగా చెవులలో నింపుకుందాం.
త్యా త్యాచి వారంవార ఆఠవూ | సాంఠవతీల తితుక్యా సాంఠవూ |
ప్రేమబంధనీ త్యా గాంఠవూ | మగ లుటవూ పరస్పర | ||౬౧||
61. ఆ కథలను మరల మరల గుర్తు చేసుకుని, అన్నిటినీ పదిల పరచుకొని, ప్రేమబంధనంతో ముడివేసి, అందరితోనూ పరస్పరం పంచుకుందాం.
యాంత మాఝే కాంహీంచి నాహీ | సాఈనాథాంచీ ప్రేరణా హీ | తే జైసే వదవితీల కాంహీ | తైసే తే పాహీ మీ వదే | ||౬౨||
62. వీటన్నింటిలోనూ నా ప్రమేయం ఏమీ లేదు. అంతా సాయినాథుల ప్రేరణే. వారు ఏది చెప్పమంటే నేనదే చెబుతాను.
మీ వదే హాహీ అహంకార | సాఈచి స్వయే సూత్రధార | తేచి వాచేచా ప్రవర్తవిణార | తరీ తే వదణార మీ కోణ | ||౬౩||
63. కాని, నేను చెబుతాను అని అనటం కూడా అహంకారమే. సుత్రధారి స్వయం సాయియే. నా వాక్కును నడిపించేది వారే అయినప్పుడు, చెప్పేవాణ్ణి నేనెవరిని?
మీపణా సమర్పితా పాయావర | సౌఖ్య లాధేల అపరంపార | సకళ సుఖాచా సంసార | అహంకార గేలియా | ||౬౪||
64. ఒక మారు అహంకారాన్ని వారి పాదాలయందు సమర్పించితే, అపారమైన సుఖం కలుగుతుంది. అహంభావం తొలగిపోతే, సకల ప్రపంచం సుఖమయమౌతుంది.
హీ వృత్తి ఉఠాయా అవసర | బాబాంసీ విచారూ నాహీ ధీర | ఆలే మాధవరావ పాయరీవర1 | తయాంచే కానావర ఘాతలీ | ||౬౫||
65. ఈ రచనా సంకల్పం నాకు కలిగినా, అనుమతిని ఇమ్మని బాబాను అడిగే ధైర్యం నాకు లేదు. అందువల్ల, ఈ సంగతిని మసీదు మెట్ల వద్దకు వచ్చిన మాధవరావు చెవిన వేశాను.
తేచీ వేళీ మాధవరావానీ | నాహీ తేథే దుసరే కోణీ | ఏసాచి ప్రసంగ సాధునీ | బాబాంలాగూని పుసియలే | ||౬౬||
66. ఆ సమయంలో వేరెవరూ లేనందువలన మాధవరావు అదను చూసుకొని బాబాను అడిగాడు -
బాబా హే అణ్ణా2 సాహేబ మ్హణతీ | ఆపలే చరిత్ర యథామతీ | లిహావే ఏసే యేతే చిత్తీ | ఆపులి అనుమతి అసలియా | ||౬౭||
67. ‘బాబా! మీ అనుమతి ఉంటే, మీ చరిత్రను, తన శక్తికొలది వ్రాయాలన్న కోరిక కలిగినది, అని ఈ అణ్ణాసాహేబు అంటున్నాడు.
“మీ తో కేవళ భికారీ | ఫిరతో భిక్షేసీ దారోదారీ | ఓలీకోరడీ భాజీ భాకరీ | ఖాఊని గుజరీ కాళ మీ | ||౬౮||
68. ‘నేను కేవలం ఒక భికారిని. భిక్ష కోసం ఇంటింటికీ తిరుగుతూ రొట్టెలను, కూర ఉన్నా లేకున్నా, తిని కాలం గడుపుతాను.
త్యా మాఝీ కథా కశాలా | కారణ హోఈల ఉపహాసాలా” | ఏసే న మ్హణా యా హిరియాలా | కోందణీ జడవిలా పాహిజే | ||౬౯||
69. ‘అలాంటి నా కథను వ్రాయటం ఎందుకు? అది అపహాస్యం పాలవుతుంది అని అనవద్దు. ఎందుకంటే, బంగారంలో పొదగాలిసిన జాతిరత్నం మీరు.
అసో ఆపులీ అనుజ్ఞా కాయ | లిహితీల ఆపణ అసల్యా సహాయ | కివా లిహవితీల ఆపులేచి పాయ | దూర అపాయ దవడూనీ | ||౭౦||
70. ‘మీరు అనుమతిను ఇచ్చి, సహాయం చేస్తే ఇతడు వ్రాస్తాడు. లేక, అన్ని అడ్డంకులనూ దూరం చేసి మీరే వ్రాయిస్తారు.
అసతా సంతాంచీ ఆశీర్వచనే | తైంచి ఉపక్రమ గ్రంథరచనే |
వినా ఆపుల్యా కృపావలోకనే | నిర్విఘ్న లేఖన చాలేనా | ||౭౧||
71. ‘సత్పురుషుల ఆశీర్వచనాలే గ్రంథ రచనకు మంచి ప్రారంభం. మీ కృప, కరుణ లేకుంటే ఈ రచన నిర్విఘ్నంగా సాగదు’ అని అన్నాడు.
జాణోని మాఝియా మనోగతా | కృపా ఉపజలీ సాఈసమర్థా | మ్హణతీ లహాసీల మనోరథా | పాయీ మ్యా మాథా ఠేవిలా | ||౭౨||
72. నా మనసులోని కోరికను తెలుసుకున్న సాయి సమర్థులు, కరుణతో “నీ సంకల్పం సిద్ధిస్తుంది” అని చెప్పారు. నేను వెంటనే వారి పాదాలపైన నా శిరసునుంచాను.
దిధలా మజ ఉదీచా ప్రసాద | మస్తకీ ఠేవిలా హస్త వరద | సాఈ సకలధర్మవిశారద | భవాపనోద భక్తాంచా | ||౭౩||
73. నా తలపై వారి వరద హస్తాన్ని ఉంచి, నాకు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. అన్ని ధర్మాలను తెలిసిన విశారదుడు, భక్తుల భవబంధాలను త్రెంచి వేసే సాయి, నన్ను ఆశీర్వదించారు.
ఏకోని మాధవరావాంచీ ప్రార్థనా | సాఈసీ ఆలీ మాఝీ కరూణా | అధీర మనాచ్యా శాంతవనా | ధైర్యప్రదానా ఆదరిలే | ||౭౪||
74. మాధవరావు ప్రార్థనను విన్న సాయికి నాపై దయ కలిగింది. భయంతో ఉన్న నాకు ధైర్యాన్నిచ్చి, నా మనసుకు ఊరట కలిగించారు.
భావార్థ జాణోని మాఝే మనీంచా | అనుజ్ఞాపనీ ప్రవర్తలీ వాచా | “కథావార్తాది అనుభవాంచా | సంగ్రహ సాచా కరావా | ||౭౫||
75. నా మనసులోని భావాన్ని తెలుసుకున్న సాయి, నాకు అనుమతిని ఇస్తూ ఇలా అన్నారు. “వాస్తవమైన కథలు, సంఘటనలు, అనుభవాలు మొదలగు వానిని సేకరించు.
దఫ్తర ఠేవా బరే ఆహే | త్యాలా మాఝే పూర్ణ సహాయే | తో తర కేవళ నిమిత్త పాహే | లిహావే మాఝే మీంచి కీ | ||౭౬||
76. “కథలను సేకరించటం మంచిది. నా సంపూర్ణ సహాయం అతనికి ఉంటుంది. అతడు కేవలం నిమిత్త మాత్రుడు. నా కథను నేనే వ్రాసుకుంటాను.
మాఝీ కథా మీంచ కరావీ | భక్తేచ్ఛా మీంచ పురవావీ |
తయానే అహంవృత్తి జిరవావీ | నిరవావీ తీ మమపదీ | || ౭౭|| మాఝీ కథా మీంచ కరావీ | భక్తేచ్ఛా మీంచ పురవావీ |
77. “నా కథలను నేనే చెప్పి, భక్తుల కోరికలను నేనే తీరుస్తాను. అతడు తన అహంభావాన్ని వదులుకొని, దానిని నా పాదాలకు సమర్పించాలి.
ఏసే వర్తే జో వ్యవహారీ | తయా మీ పూర్ణ సాహ్య కరీ | హే కథాచ కాయ సర్వతోపరీ | తయా ఘరీ రాబే మీ | ||౭౮||
78. “ఈ విధంగా ఉంటూ నడుచుకునే వారికి నేను సంపూర్ణ సహాయం చేస్తాను. ఈ కథా రచనలోనేనా ఏమిటి, వారి కోసం నేను అన్ని విధాలా శ్రమిస్తాను.
అహంవృత్తి జేవ్హా మురే | తేవ్హా తయాచా ఠావహీ నురే | మీచ మగ మీపణే సంచరే | మాఝ్యాచి కరే లిహీన మీ | ||౭౯||
79. “అహంకారం సమూలంగా తొలిగిపోయి, లేశ మాత్రం కూడా దాని శేషం లేనప్పుడు, అతనిలో నేనే తిరుగుతూ, నా చేత్తో నేనే గ్రంథాన్ని వ్రాస్తాను.
యే బుద్ధీ జే కర్మ ఆరంభిలే | శ్రవణ మనన వా లేఖన వహిలే | జ్యాంచే త్యానేంచి తే సంపాదిలే | త్యాస తో కేలే నిమిత్త | ||౮౦||
80. “శ్రవణం, మననం, గ్రంథ రచన మొదలైన పనులను ఇలాంటి బుద్ధితో ప్రారంభిస్తే, ఆ పనిని నేనే సాధిస్తాను. అతడు (దాభోల్కరు) నిమిత్త మాత్రుడు.
అవశ్యమేవ దఫ్తర ఠేవా | ఘరీ దారీ అసా కుఠే వా |
వారంవార ఆఠవా ఠేవా | హోఈల విసావా జీవాసీ | ||౮౧||
81. “ఈ కథలను తప్పక సంగ్రహించాలి. ఇంట్లో కాని బయట కాని ఎక్కడున్నా, ఎల్లప్పుడూ నన్ను గుర్తుంచుకుంటే మనసుకు శాంతి లభిస్తుంది.
కరితా మాఝియా కథాంచే శ్రవణ | తయాంచే కీర్తన ఆణి చీంతన | హోఈల మద్భిక్తీచే జనన | అవిద్యానిరసన రోకడే | ||౮౨||
82. “నా కథలను విని, గానం చేస్తే, మననం చేస్తే, నామీద భక్తి జనిస్తుంది. అజ్ఞానం వెంటనే నశిస్తుంది.
జేథే భక్తి శ్రద్ధాన్విత | తయాచా మీ నిత్యాంకిత | యే అర్థీ న వ్హావే శంకిత | ఇతరత్ర అప్రాప్త మీ సదా | ||౮౩||
83. “ఎక్కడ శ్రద్ధ, భక్తి రెండూ కలుస్తాయో నేను సదా అక్కడ బందీని. మిగతా చోట నేను లభించను. ఇందులో ఏ మాత్రం సందేహమూ లేదు.
సద్భా్వే యా కథా పరిసతా | నిష్ఠా ఉపజేల శ్రోతయా చిత్తా | సహజ స్వానుభవ స్వానందతా | సుఖావస్తా లాధేల | ||౮౪||
84. “మంచి భావంతో ఈ కథలను వింటే, శ్రోతల మనసులలో శ్రద్ధ, నిష్ఠ మేలుకొంటాయి. తరువాత, సహజంగా స్వంత అనుభవం కలిగి, శాశ్వతమైన ఆనందాన్ని, సుఖాన్నీ కలుగు చేస్తుంది.
భక్తాసీ నిజరూపజ్ఞాన | జీవ-శివా సమాధాన | లక్షేల అలక్ష్య నిర్గుణ | చైతన్యఘన ప్రకటేల | ||౮౫||
85. “భక్తుడికి అప్పుడు ఆత్మయొక్క నిజ స్వరూపం తెలుస్తుంది. జీవుడు, శివుడు ఒకటే అనే భావన కలిగి, కళ్లకు కనిపించని, ఏ గుణాలూ లేని చైతన్యం కనిపిస్తుంది.
ఏసే యా మత్కథాంచే విందాన | యాహూని కాయ పాహిజే ఆన | హేంచ శ్రుతీచే ధ్యేయ సంపూర్ణ | భక్త సంపన్న యే అర్థీ | ||౮౬||
86. “నా కథలలోని ప్రత్యేకత ఇదే. ఇంతకంటే ఇంకా ఏం కావాలి? శ్రుతల (వేదాలు) లక్ష్యం కూడా ఇదే. భక్తులకు ఇది సంపూర్ణంగా లభించి సంపన్నులౌతారు.
జేథే వాదావాదీచీ బుద్ధీ | తేథే అవిద్యా మాయాసమృద్ధీ | నాహీ తేథే స్వహితశుద్ధీ | సదా దుర్బుద్ధీ కుతర్కీ | ||౮౭||
87. “ఎక్కడ వాదవివాదాలు జరుగుతాయో అక్కడ అవిద్య, మాయ (అజ్ఞానం) సమృద్ధిగా ఉంటుంది. తమ మంచిని సంపాదించాలనే నిర్మలమైన స్వభావం ఉండదు. ఎల్లప్పుడూ చెడు ఆలోచనలు, చెడు తర్కాలు ఉంటాయి.
తో న ఆత్మజ్ఞానాసీ పాత్ర | తయాసీ గ్రాసీ అజ్ఞాన మాత్ర |
నాహీ తయాసీ ఇహపరత్ర | అసుఖ సర్వత్ర సర్వదా | ||౮౮||
88. “ఇలాంటి వారు ఆత్మ జ్ఞానానికి యోగ్యులు కారు. వారిని అజ్ఞానం పెనవేసుకొని ఉంటుంది. వారికి ఇహం లేదు, పరం లేదు. ఎప్పుడూ దుఃఖమే.
నకో స్వపక్షస్థాపన | నకో పరపక్షనిరాకరణ |
నకో పక్షద్వయాత్మక వివరణ | కాయ తే నిష్కారణ సాయాస” | ||౮౯|| నకో స్వపక్షస్థాపన | నకో పరపక్షనిరాకరణ |
89. “మన ఆలోచనే సరి, మిగతావారి ఆలోచనలు తప్పు అనే భావన మనకు వద్దు. విరోధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు వద్దు. అనవసరమైన ఈ శ్రమంతా ఎందుకు?”
“నకో పక్షద్వయాత్మక వివరణ” | హోతా యా శబ్దాచే స్మరణ | పూర్వీ శ్రోతయా దిధలే అభివచన | జాహలీ ఆఠవణ తయాచీ | ||౯౦||
90. “విరోధమైన అభిప్రాయాల వివరణ వద్దు” అన్న మాట వినగానే, మునుపు శ్రోతలకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది.
మాగా ప్రథమాధ్యాయ సంపతా | వచన దిధలేసే కీ శ్రోతా |
‘హేమాడ’ నామకరణకథా | ఆధీ సమస్తా సాంగేన | ||౯౧||
91. మొదటి అధ్యాయం ముగించే ముందు, ‘హేమాడ్’ అనే నామకరణ గురించి మొత్తం కథ తెలియ చేస్తానని శ్రోతలకు చెప్పాను.
కథేమధ్యే హీ ఆడకథా | పరిసతా ఠరేల ఉపయుక్తతా | హోఈల జిజ్ఞాసేచీ పూర్తతా | హీహీ ప్రేరకతా సాఈంచీ | ||౯౨||
92. అసలు కథ మధ్యలో ఈ ఉపకథను వింటే, దీని యుక్తాయుక్తత తెలుస్తుంది. శ్రోతల కుతూహలం తీరుతుంది. ఇది కూడా సాయియొక్క ప్రేరణే.
పుఢే మగ పూర్వానుసంధాన | హోఈల సాఈ చరిత్ర నివేదన | మ్హణూన శ్రోతా కరావే శ్రవణ | దత్తావధాన తే కథా | ||౯౩||
93. దీని తరువాత, సాయి చరిత్ర కథ మరల కొనసాగుతుంది. కనుక శ్రోతలు ఈ కథను శ్రద్ధగా వినండి.
ఆతా హా ‘సాఈలీలా’ గ్రంథ | ‘భక్తహేమాడపంతవిరచిత’ | ఏసే జే ప్రతిఅధ్యాయాన్తీ శ్రుత | తే హే పంత కోణ కీ | || ౯౪||
94. ఇప్పుడు ఈ సాయి లీలల గ్రంథం ప్రతి అధ్యాయం ముగింపులో ‘భక్త హేమాడ్ పంతు విరచితము’ అని ఉంది కదా, మరి ఈ ‘పంతు’ ఎవరు?
సహజ ఆశంకా శ్రోతయా మనా| కరావయా తజ్జిజ్ఞాసా-శమనా | కైసా ఆరంభ యా నామకరణా | వ్హావే త్యా శ్రవణా సాదర | ||౯౫||
95. అని శ్రోతల మనసులలో ఈ ప్రశ్న రావడం సహజం. ఆ కుతూహలం తీరటానికి, ఈ నామకరణం ఎలా మొదలైంది అన్న సంగతిని శ్రద్ధగా వినండి.
జన్మాదారభ మరణావధీ | షోడశ సంస్కార దేహసంబంధీ | త్యాంతీల ఏక ‘నామకరణ’ విధి | సంస్కారసిద్దీ ప్రసిద్ధ | ||౯౬||
96. పుట్టినది మొదలు చనిపోయేవరకు, శరీరానికి సంబంధించి జరిగే పదహారు సంస్కారాలలో, నామకరణం విధి ఒకటి.
తత్సంబంధీ అల్ప కథా | శ్రోతా పరిసిజే సాదర చిత్తా | హేమాడపంత-నామకరణతా | ప్రసంగోపాత్తతా ప్రకటేల | ||౯౭||
97. దానికి సంబంధించిన చిన్న కథే ఈ ‘హేమాడ్ పంత్’ నామకరణ కథ. సందర్భానుసారంగా ఉన్న ఈ కథను శ్రోతలు శ్రద్ధగా వినండి.
ఆధీ హా లేఖక ఖట్యాళ | జైసా ఖట్యాళ తైసా వాచాళ | తైసాచి టవాళ ఆణి కుటాళ | నాహీ విటాళ జ్ఞానాచా | ||౯౮||
98. అసలే ఈ రచయిత ఆకతాయి. అలాగే వాచాలుడు కూడా. ఇతరులను నిందించి హాస్యం చేసేవాడు - బుద్ధి, జ్ఞానం అసలు లేనివాడు.
నాహీ ఠావా సద్గు రూమహిమా | కుబుద్ధి ఆణి కుతర్కప్రతిమా | సదా నిజ శహాణీవేచా గరిమా | వాదకర్మా ప్రవృత్త | ||౯౯||
99. సద్గురువుయొక్క మహిమ తెలియనివాడు. చెడు బుద్ధి మరియు చెడు తర్కాలు మూర్తీభవించిన మనిషి. ఎప్పుడూ తన తెలివి, తన గొప్పదనాన్ని చాటుకుంటూ ఉండి, వాదవివాదాలలో ఉత్సుకతతో ఉండేవాడు.
పరీ ప్రాక్తనరేషా సబళ | తేణోంచి సాఈచే చరణకమళ | దృష్టీసీ పడలే అదృష్టే కేవళ | హా తో నిశ్చళ వాదనిష్ఠ | ||౧౦౦||
100. అయినా, బలమైన అదృష్ట రేఖ ఉండటం వలన, పూర్వ పుణ్యాల ఫలంగా, సాయియొక్క చరణ కమలాల దర్శనం, ఎంత వ్యతిరేకించినా, జరిగింది.
కాకాసాహేబ3 భక్తప్రవర | నానాసాహెబ4 చాందోరకర |
యాంసీ ఋణానుబంధ నసతా జర | కోఠూని జాణార శిరడీస హా | ||౧౦౧||
101. భక్త శ్రేష్ఠులైన కాకాసాహేబు దీక్షితు, నానాసాహేబు చాందోర్కర్లతో ఋణానుబంధం లేకపోతే, నేను శిరిడీ వెళ్లగలిగే వాణ్ణా?
కాకాసాహేబ ఆగ్రహా పడలే | శిరడీచే జాణే నిశ్చిత ఠరలే | జావయాచే దివశీంచ బదలలే | మన తే ఫిరలే అవచిత | ||౧౦౨||
102. కాకాసాహేబు బలవంతంపై నా శిరిడీ ప్రయాణం నిర్ణయమైంది. కాని, వెళ్ళవలసిన రోజున అకస్మాత్తుగా నా మనసు మారిపోయింది.
యాచా ఏక పరమ మిత్ర | తో లబ్ధానుగ్రహ గురూపుత్ర | అసతా లోణావళ్యాసీ సహకలత్ర | ప్రసంగ తే ఫిరలే అవచిత | ||౧౦౩||
103. ఈ రచయిత పరమ మిత్రుడొక్కడు, గురుపుత్రుడి అనుగ్రహం పొందినవాడు. భార్యతో లోనావలాలో ఊండగా ఒక విచిత్రమైన సంఘటనలో చిక్కుకున్నాడు.
యాచా ఏకులతా ఏక సుత | శరీరే సుదృఢ గుణవంత | అసతా త్యా శుద్ధ హవేచ్యా స్థానాంత | జ్వరాక్రాంత జాహలా | ||౧౦౪||
104. అలాంటి పరిశుద్ధ వాతావరణంలో ఉండి కూడా, బలమైన శరీరంతో ఉన్న గుణవంతుడు అయిన అతని ఏకైక పుత్రుడు జ్వరపీడితుడయ్యాడు.
తయాచా సకళ ఉపాయ మానవీ | జాహలే దోరే ఉతారే దైవీ | గురూసీ ఆణూని సంనిధ బైసవీ | అఖేర ఫసవీ5 సుత త్యాతే | ||౧౦౫||
105. మానవ మాత్రమైన చికిత్సలన్నీ జరిగాయి. దృష్టిదోషాలు, మొక్కబడులు మొదలైన ప్రయత్నాలు కూడా అయ్యాయి. గురువును తీసుకుని వచ్చి ఆ బాలుని ప్రక్కన కూర్చోబెట్టారు. అయినా, చివరకు ఆ బాలుడు చనిపోయాడు.
ప్రసంగ పాహూని ఏసా బికట | నివారావయా దుర్ధర సంకట | గురూసీ బసవిలే పుత్రనికట | తే సర్వ ఫుకట జాహలే | ||౧౦౬||
106. అలాంటి కష్టమైన పరిస్థితిలో, ఘోరమైన సంకటంనుండి తప్పించుకోవటానికి గురువును బాలుని ప్రక్కన కోర్చోబెట్టినా, అంతా వ్యర్థమైంది.
ఏసా హా సంసార మహావిచిత్ర | కోణాచా పుత్ర కోణాచే కలత్ర | ప్రాణిమాత్రాచే కర్మతంత్ర | అదృష్ట సర్వత్ర అనివార | ||౧౦౭||
107. ఈ ప్రపంచం మహా విచిత్రమైనది. ఎవరి కొడుకు? ఎవరి భార్య? ప్రాణంతో ఉన్నవారందరూ కర్మ తంత్రానికి బద్ధులు. విధిని ఎవరూ తప్పించలేరు.
కానీ పడతా హీ దుర్వార్తా | అతి ఉద్విగ్నతా ఆలీ చిత్తా | హీచ కాయ గురూచీ ఉపయుక్తతా | పుత్ర ఎకులతా రాఖవేనా | ||౧౦౮||
108. ఈ చెడు వార్త నా చెవిన పడగానే, మనసుకు అత్యంత దుఃఖం కలిగింది. ఏకైక పుత్రుని రక్షించలేని గురువుయొక్క ప్రయోజనం ఇదేనా?
ప్రారబ్ధకర్మప్రాబల్యతా | తీచ సాఈదర్శనీ శిథిలతా | ప్రాప్త ఝాలీ యా మఝియా చిత్తా | పడలౌ మోడతా గమనాంత | ||౧౦౯||
109. ప్రారబ్ధ కర్మయొక్క ప్రాబల్యాన్ని చూచి, సాయి దర్శనానికి వెళ్లాలన్న నా నిశ్చయం మారిపోయింది.
కిమర్థ జావే శిరడీప్రతీ | కాయ త్యా మాఝ్యా స్నేహ్యాచీ స్థితీ | హాచ నా లాభ గురూచే సంగతీ | గురూ కాయ కరితీ కర్మాసీ | ||౧౧౦||
110. అసలు శిరిడీకి ఎందుకు వెళ్లాలి? నా మిత్రుని పరిస్థితి ఏమయింది? గురువు సాంగత్యం వల్ల ఏం లాభం? మన కర్మకు గురువు ఏం చేయగలడు?
అసేల జే జే లలాటీ లిహిలే | తే తేంచ జరీ హోణార వాహిలే |
మగ తే గురూవినా కాయ అడలే | జేణే ఠేలే శిరడీచే | ||౧౧౧||
111. నొసట వ్రాసినట్లే జరుగనున్నప్పుడు గురువు లేకపోతే మాత్రం ఆగిపోయేది ఏముంది? అన్న ఆలోచనలతో నా శిరిడీ ప్రయాణం ఆగిపోయింది.
కిమర్థ ఆపలే స్థాన సోడా | కశాసీ గురూచే మాగే దౌడా | సుఖాచా జీవ దుఃఖాంత పాడా | కవణ్యా చాడా కళేనా | ||౧౧౨||
112. మనమున్న చోటు వదిలి గురువు వెంట పరిగెత్తడం ఎందుకు? సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెట్టడం ఎందుకు? ఏమీ అర్థం కాలేదు.
జైసే జైసే యదృచ్ఛే ఘడే | తే తే మోగూ సుఖ వా సాంకడే | కాయ జాఊనియా గురూచ్యాకడే | జరీ హోణారాపుఢే చాలేనా | ||౧౧౩||
113. కష్టమైనా సుఖమైన విధివశాత్తు జరిగేదానిని అనుభవించాల్సిందే. జరుగనున్న దానిని ఎవరూ తప్పించ లేనప్పుడు గురువు దగ్గరకు వెళ్లితే ఏమవుతుంది?
జైసే జయాచే అర్జిత | నకో మ్హణతా చాలూని యేత | హోణారాపుఢే కాహీహీ న చాలత | నేలే మజ ఖేంచీత శిరడీసీ | ||౧౧౪||
114. ఇష్టమున్నా లేకున్నా, మన కర్మల ఫలం మన వెంటే ఉంటుంది. విధిని ఎవరూ ఆపలేరు. ఆ విధియే నన్ను శిరిడీకి లాక్కొని వెళ్లింది.
నానాసాహేబ ప్రాంతాధికారీ | కరూ నిఘాలే వసఈచీ ఫేరీ | ఠాణ్యాహూనీ దాదరావరీ | యేఊని విళభరీ6 బైసలై తియేంత | ||౧౧౫||
115. నానాసాహేబు చాందోర్కరు ఠాణాకు ప్రాంతాధికారి. పని మీద వసైకి వెళ్లుతూ ఠాణానుండి దాదరు వచ్చి అక్కడ కొంతసేపు ఆగారు.
మధ్యంతరీ ఏక తాస | గాడీ వసఈచీ యావయాస | వాటలే హా అవకాశ | లావూ కీ కామాస ఏకాదియా | ||౧౧౬||
116. వసైకు వెళ్లే రైలు రావటానికి గంట వ్యవధి ఉండగా, ఆ సమయంలో ఒకటో రెండో పనలు చేసుకోవచ్చనే ఆలోచన అతనికి కలిగింది.
జాహలీ మాత్ర ఏసీ స్ఫూర్తీ | తేంచి ఆలీ దారావరతీ | గాడీ ఏక కేవళ వాందర్యాపురతీ | తే మగ బైసతీ తియేత | ||౧౧౭||
117. ఈ ఆలోచన రాగానే, సమయానికి సరిగ్గా బాంద్రా వరకే వెళ్ళే రైలు, స్టేషనుకు వచ్చింది. అతను ఆ బండి ఎక్కి కూర్చున్నాడు.
యేతా గాడీ నిజస్థానీ | నొరోప ఆలా మజలాగూనీ | మగ మీ భేట ఘేతా తత్క్షణీ | చాలతీ కహాణీ శిరడీచీ | ||౧౧౮||
118. బండి బాంద్రా చేరగానే, నాకు కబురు పెట్టారు. నేను వారిని కలుసుకున్న తక్షణమే శిరిడీ కథ మొదలయింది.
కేవ్హా నిఘణార సాఈదర్శనా | కిమర్థఆహళస శిరడీగమనా |
దీర్ఘ సుత్రతా కా ప్రస్థానా | నిశ్చితీ మనా కా నాహీ | ||౧౧౯||
119. ‘సాయి దర్శనానికి ఎప్పుడు బయలుదేరుతున్నారు? శిరిడీ పోవడానికి ఎందుకు బద్ధకిస్తున్నారు? ప్రయాణానికి ఎందుకింకా ఆలస్యం? మనసులో ఇంకా నిశ్చియించుకోలేదేం?’
పాహూని నానాంచీ ఆతురతా | మీహీ శరమలో ఆపలో చిత్తా | పరీ మనాచీ ఝాలేలీ చంచలతా | పూర్ణ ప్రాంజళతా నివేదిలీ | ||౧౨౦||
120. నానాయొక్క కాతురతను గమనించి, నేను మనసులో లజ్జితుణ్ణయ్యాను. అయినా, వినయంగా అతనితో నా మనోచాంచల్యాన్ని స్పష్టంగా, సంపూర్ణంగా మనవి చేశాను.
త్యావరీ మగ నానాంచా బోధ | కళకళీచా ప్రేమళ శుద్ధ |
పరిసతా శిరడీగమనేచ్ఛోద్బోథధ | అతి మోదప్రద జాహలా | ||౧౨౧||
121. తరువాత, శుద్ధమైన ప్రేమతో నానా చెప్పిన మాటలు విన్న నాలో, శిరిడీ వెళ్లాలన్న కోరిక మళ్ళీ మొదలైంది. వెళ్ళాలంటే ఆనందంగానూ ఉంది. ‘తాత్కాళ నిఘతో’ ఘేతలే వచన | తెవ్హాంచ నానాంనీ కేలే ప్రయాణ |
మగ మీహీ మాగే పరతోన | ఠేవిలే ప్రస్థాన ముహూర్తీ | ||౧౨౨||
122. ‘వెంటనే బయలుదేరుతానని’ నా వద్ద మాట తీసుకుని నానా ప్రయాణమయ్యాడు. ఇంటికి వచ్చి, నా శిరిడీ ప్రయాణానికి ముహూర్తం నిశ్చయించుకున్నాను.
మగ సర్వ సామాన ఆవరూనీ | సర్వ నిరవానిరవ కరూనీ | తేచి దివశీ అస్తమానీ | శిరడీలాగూని నిఘాలో | ||౧౨౩||
123. తరువాత, సామానులన్నీ సర్దుకొని అదే రోజు సాయంత్రం శిరిడీ బయలుదేరాను.
సాయంకాళాపాఠీల మెల | దాదరావర ఉభీ రాహీల | జాణూని దాదరచేంచ భరలే హంశీల | తికీట తేథీల ఘేతలే | ||౧౨౪||
124. సాయంత్రం మెయిలు బండి దాదరులో ఆగుతుందని అనుకొని, దాదరు వరకు డబ్బు కట్టి టికెట్టు తీసుకున్నాను.
పరీ మీ గాడీంత జాఊని బసతా | బాంద్రే స్టేశనీ గాడీ అసతా | యవన ఏక గాడీ సుటతా | అతి చపళతా ఆంత యే | ||౧౨౫||
125. బాంద్రా స్టేషనులో బండి ఉండగా, నేను బండిలో కూర్చున్నాను. మెల్లగా బండి బయలుదేరుతుండగా, ఒక మహమ్మదీయుడు గబగబా లోపలికి వచ్చాడు.
తికీట ఘేతలే దాదరపర్యంత | తోంచ ఆరంభీ కార్యవిఘాత | ‘ప్రథమగ్రాసీ మక్షికాపాత’ | తైసా డోకావత హోతా కీ | ||౧౨౬||
126. ‘ప్రథమ గ్రాసే మక్షికా పాత’ - అంటే మొదటి ముద్దలోనే దోమ పడ్డట్లు, దాదరు వరకు నేను టికట్టు తీసుకోవటమే కార్యంలోని మొదటి అడ్డంకి అయింది.
సర్వే పాహూని సర్వ సామాన | యవన పుసె మజ ‘కోఠే గమన?’ | తవ మ్హణే మీ దాదరాసీ జాఊన | మెల సాధీన మనమాడచీ | ||౧౨౭||
127. నా సామాను చూచి, ఆ మహమ్మదీయుడు ‘ఎక్కడి వరకు ప్రయాణమని’ అడిగాడు. ‘దాదరు వెళ్లి అక్కడ మన్మాడు మెయిలుని అందుకోవాలని ఉంది’ అని నేను జవాబిచ్చాను.
తవ తో సుచవీ వేళేవర | ఉతరూ నకా హో దాదరావర | మెల న తేథే థాంబవణార | బోరీబందర గాంఠావే | ||౧౨౮||
128. తక్షణమే, ‘దాదరులో దిగకండి. అక్కడ మెయిలు ఆగదు. నేరుగా బోరీ బందరు వెళ్ళండి’ అని నాకు సలహ ఇచ్చాడు.
హోతీ న వేళీ హీ సూచనా | మెల దాదరవర మిళతీ నా | నకళే మగ యా చంచల మనా | కాయ కల్పనా ఉఠత్యా తే | ||౧౨౯||
129. సమయానికి సరిగ్గా ఆ సూచన రాకుండా ఉంటే, దాదరులో మెయిలు దొరకక, నా చంచల మనసులో ఏ ఆలోచనలు వచ్చేవో.
పరీ తే దివశీ ప్రయాణయోగ | సాధావా ఏసాచి హోతా సుయోగ | మ్హణోని మధ్యంతరీ హా కథాభాగ | ఘడలా మనాజోగ అవచితా | ||౧౩౦||
130. కాని, ఆ రోజు నాకు ప్రయాణ యోగం ఉండటం వలన, అనుకోని విధంగా ఇలాంటి సంఘటనలు నాకు అనుకూలంగా జరిగాయి.
తికడే భాఊసాహేబ దీక్షిత | హోతేచి మార్గప్రతీక్షా కరీత |
ఉదఈక నఊ దహాచే ఆంత | జాహలో శిరడీంత సాదర | ||౧౩౧||
131. మరునాడు ఉదయం ౯ - ౧౦ గం|| మధ్యన నేను శిరిడీ చేరాను. భావూసాహేబ దీక్షితు అప్పటికే అక్కడ ఎదురు చూస్తున్నారు.
ఇసవీ సన ఎకూణీసశే దహా | వర్తమాన హే ఘడలే పహా | ఎక సాఠ్యాంచాచ వాడా తేవ్హా | హోతా రహావయాసీ ఉతారూంస | ||౧౩౨||
132. క్రి. శ. ౧౯౧౦వ సం|| జరిగిన సంగతి ఇది. అప్పుడు యాత్రికులు బస చేయడానికి సాఠేవాడా మాత్రమే ఉండేది.
తాంగ్యాంతూని ఉతరల్యావరీ | దర్శనౌత్సుక్య దాటలే అంతరీ |
కధీ చరణ వందన శిరీ | ఆనందలహరీ ఉసళల్యా | ||౧౩౩||
133. టాంగానుంచి దిగగానే, సాయి దర్శనానికి ఉత్సుకత కలిగింది. సాయి పాదాలపై ఎప్పుడేప్పుడు శిరసును వంచి వందనం చేద్దునా అన్న ఆనంద తరంగాలు నా మనసులో పొంగాయి.
ఇతుక్యాంత సాఈచే పరమభక్త | తాత్యాసాహేబ నూలకర విఖ్యాత | మశిదీంతూని ఆలే పరత | మ్హణతీ “త్వరిత దర్శన ఘ్యా” | ||౧౩౪||
134. ఇంతలో, ప్రసిద్ధుడూ, సాయియొక్క పరమ భక్తుడు అయిన తాత్యాసాహేబు నూల్కరు మసీదునుండి వచ్చి, ‘త్వరగా దర్శనం చేసుకోండి’ అని అన్నారు.
ఆలేచి బాబా మండళీనిశీ | వాడియాచే కోపర్యాపాశీ | చలా ఆధీ ధూళభేటీసీ | మగ తే లెండీసీ నిఘతీల | ||౧౩౫||
135. ‘భక్త మండలితో సహ బాబా వాడా చివర ఉన్నారు. త్వరగా వెళ్లి ధూళి దర్శనం చేసుకోండి. తరువాత బాబా లెండీకి బయలుదేరుతారు.
పుఢే మగ కరా స్నాన | బాబా జో యెతాతి మాగే పరతోన | తేవ్హా మగ మశీదీస జాఊన | స్వస్థ దర్శన ఘ్యా పున్హా” | ||౧౩౬||
136. ‘తరువాత, స్నానం చేసుకుని, లెండీనుండి తిరిగి బాబా మసీదుకు వచ్చాక, మరల వారిని తీరికగా దర్శనం చేసుకోవచ్చు’ అని అన్నారు.
ఏసే ఏకూని ఘాఈఘాఈ | ధాంవలో బాబా హోతే త్యా ఠాఈ | ధూళీంత ఘాతలే లోటాంగణ పాఈ | ఆనంద న మాఈ మనాంత | ||౧౩౭||
137. ఆ మాట విని, త్వర త్వరగా నేను బాబా ఉన్న చోటుకి పరుగుతీసి, ధూళితో వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాకు పట్టలేనంత ఆనందం కలిగింది.
నానాసాహేబ సాంగూని గేలే | త్యాహూని అధిక ప్రత్యక్ష పాహిలే | దర్శనే మ్యా ధన్య మానిలే | సాఫల్య ఝాలే నయనాంచే | ||౧౩౮||
138. నానాసాహేబు సాయిగురించి చెప్పిన దానికంటే, సాయిని ప్రత్యక్షంగా చూచి, వారి దర్శనంతో ఎంతో అధికంగా నేను ధన్యుణ్ణయ్యాను. నా కళ్ళు సఫలమయ్యాయి.
కధీ ఏకిలీ నాహీ దేఖిలీ | మూర్తీ పాహూని దృష్టి నివాలీ | తహాన భూక సారీ హరపలీ | తటస్థ ఠేలీ ఇంద్రియే | ||౧౩౯||
139. అంతకు మునుపు బాబా అద్భుతమైన రూపాన్ని గురించి వినలేదు, ఎప్పుడూ చూడలేదు. ఆ రూపం చూసి, కళ్లు తరించాయి. ఆకలి, దప్పులు కూడా ఉంటాయన్న సంగతే మరిచిపోయింది. ఇంద్రియాలన్నీ స్థబ్దమయ్యాయి.
లాధలో సాఈంచా చరణస్పర్శ | పావలో జో పరామర్ష |
తేచి యా జీవాచా పరమోత్కర్ష | నూతన ఆయుష్య తేథూని | ||౧౪౦||
140. సాయి పాదాల స్పర్శతో కలిగిన అనుభూతి, ప్రేమతో వారు నా గురించి అడిగిన మాటలు, ఇవే నా ఈ జీవితానికి పరిపూర్ణతను ఇచ్చాయి. అప్పటినుండి వేరొక జీవితం ఆరంభమయ్యింది.
జ్యాంచేని లాధలో హా సత్సంగ | సుఖావలో మీ అంగ - ప్రత్యంగ |
తయాంచే తే ఉపకార అవ్యంగ | రాహోత అభంగ మజవరీ | ||౧౪౧||
141. ఎవరి వలన ఇటువంటి సత్సంగం ప్రాప్తించి, నాలోని ప్రతియొక్క అంగానికి సుఖం లభించిందో, వారి ఉపకారానికి నేను ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను.
జ్యాంచేని పావలో పరమార్థాతే | తేచి కీ ఖరే ఆప్త భ్రాతే | సోయరే నాహీంత తయాంపరతే | ఏసే నిజచిత్తే మానీ మీ | ||౧౪౨||
142. ఎవరి వలన పరమార్థం లభిస్తుందో, వారే నిజమైన ఆప్తులు, బంధువులు. వారికంటే దగ్గరి బంధువులు లేరని నా నమ్మకం.
కెవఢా తయాంచా ఉపకార | కరూ నేణే మీ ప్రత్యుపకార | మ్హణోని కేవళ జోడూని కర | చరణీ హే శిర ఠేవితో | ||౧౪౩||
143. అంతటి మహత్తరమైన వారి ఉపకారానికి నేను ప్రత్యుపకారం చేయలేను. అందువలన కేవలం చేతులు జోడించి, వారి పాదాలపైన నా శిరసును ఉంచుతున్నాను.
సాఈదర్శనలాభ ఘడలా | మాఝియా మనీచ వికల్ప ఝడలా | వరీ సాఈసమాగమ ఘడలా | పరమ ప్రకటలా ఆనంద | ||౧౪౪||
144. సాయి దర్శనం లభించింది. నా మనసులోని సంశయాలన్నీ తొలగిపోయాయి. దానికి తోడుగా, సాయియొక్క పవిత్రమైన సాంగత్యంతో, పరమానందం వెల్లివిరిసింది.
సాఈదర్శనీ హీచ నవాఈ | దర్శనే వృత్తీస పాలట హోఈ | పూర్వ కర్మాచీ మావళే సఈ | వీట విషయీ హళుహళు | ||౧౪౫||
145. సాయి దర్శనమే అద్భుతం. వారి దర్శన మాత్రంతొనే మన దృష్టి, ప్రవర్తన మారిపోతుంది. వెనుకటి కర్మలన్నీ నశింపబడతాయి. క్రమ క్రమంగా విషయ సుఖాలపై విరక్తి కలుగుతుంది. ఇదే వారి దర్శనంలోని విశిష్టత.
పూర్వ జన్మీంచా పాపసంచయ | కృపావలోకనే ఝాలా క్షయ | ఆశా ఉపజలీ ఆనంద అక్షయ | కరితీల పాయ సాఈచే | ||౧౪౬||
146. వారి కృపా దృష్టితోనే పూర్వ జన్మల పాప సంగ్రహం నశించిపోతుంది. వారి పాదాలు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తాయనే ఆశ నాలో పుట్టింది.
భాగ్యే లాధలో చరణమానస7 | వాయసాచా8 హోఈ-న హంస | సాఈ మహంత సంతావతంస9 | పరమహంససద్యోగీ | ||౧౪౭||
147. ఎనలేని అదృష్టం వలన దొరికిన సాయి పాదాలనే మానస సరోవరంలో పడి కాకిలాంటి నేను, హంసనై పోయాను. సాయి మహాత్ములు. సాధువులలో శేష్ఠులు, పరమహంస, పరమయోగి.
పాప తాప దైన్య వినాశీ | ఏసియా సాఈచ్యా దర్శనేసీ | పునిత ఆజ జహాలో మీ బహువసీ | పుణ్యరాశీ సమాగమే | ||౧౪౮||
148. పాపలను, తాపాలను, దైన్యాన్ని నశింపజేసే ఈ సాయి దర్శనంతో మరియు సాంగత్యంతో, నేను నేడు అత్యంత పవిత్రుణ్ణయ్యాను.
పూర్వీల కిత్యేక జన్మాంచ్యా గాంఠీ | తీ హీ సాఈమహారాజ భేటీ | హా సాఈ ఎక మీనలియా దృష్టీ | సకల సృష్టీ సాఈరూప | ||౧౪౯||
149. నా అనేక పూర్వజన్మల పుణ్య సంగ్రహం వలన ఈ సాయి మహారాజు కలిశారు. ఒక్కమారు ఈ సాయి మనసులోకి ప్రవేశిస్తే సకల సృష్టి సాయిమయం అనిపిస్తుంది.
యేతాంచి శిరడీసీ ప్రథమ దివశీ | బాళాసాహేబ భాట్యాంపాశీ | ఆరంభ ఝాలా వాదావాదీసీ | గురూ కశాసీ వ్హావా కీ | ||౧౫౦||
150. నేను శిరిడీలోకి వచ్చిన మొదటి రోజే బాలాసాహేబు భాటేతో వాదవివాదాలు ప్రారంభమయ్యాయి. అసలు గురువు అవసరమేమిటి?
బుడవూని ఆపలీ స్వతంత్రతా | ఓఢూని ఘ్యావీ కా పరతంత్రతా |
జేథే నిజకర్తవ్యదక్షతా | కాయ ఆవశ్యకతా గురూచీ | ||౧౫౧||
151. మన స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకొని, ఇంకొకరి ఆధిక్యతను తలపై వేసుకోవటం ఎందుకు? కార్య నిర్వహణలొ దక్షత ఉన్నవారికి గురువు అవసరమేమిటి?
జ్యాంచే త్యానేంచి కేలె పాహిజే | న కరీ త్యాసీ గురూనే కాయ కీజే | న హాలవితా హాత పాయ జో నిజే | తయాసీ దీజే కాయ కవణే | ||౧౫౨||
152. ఎవరికోసం వారే కష్ట పడాలి. అలా చేయకపోతే, గురువు ఏమి చేస్తాడు? తన చేతులు కాళ్ళు కదల్చని వారికి ఎవరైనా ఏమి ఇవ్వగలరు?
హాచి మాఝా పక్ష ఉజూ10 | ప్రతిపక్షాచీ విరుద్ధ బాజూ | దురాగ్రహాచాచ తో తరాజూ | వాద మాజూన రాహిలా | ||౧౫౩||
153. అనేది నా సరళమైన ప్రతిపాదన. దీనికి విరుద్ధంగా ఉంది ప్రతిపక్షాల వారి అభిప్రాయం. మూర్ఖమైన పట్టుదల, తక్కెడలో ఇరువైపులూ సమానంగా ఉండటంతో వాదవివాదాలు చెలరేగుతున్నాయి.
అంగీ దుర్ధర దేహాభిమాన | తేణేంచి వాదావాదీచే జనన | అహంభావాచీ హీ ఖూణ | నాహీ త్యావీణ వాద జగీ | ||౧౫౪||
154. వాదవివాదాలు పుట్టటానికి భరించలేని దేహాభిమానమే కారణం. అహంకారానికి ఇదే గుర్తు. ఇది లేకుంటే, ప్రపంచంలో వాదవివాదాలే ఉండవు.
ప్రతిపక్షాంచే నిశ్చిత మత | హో కా పండిత వేదపారంగత | గుర్వనుగ్రహావ్యతిరిక్త | పుస్తకీ ముక్త కేవళ తో | ||౧౫౫||
155. ఎంతటి పండితుడైనా, వేద పారంగతుడైనా, గురువు అనుగ్రహం లేకుంటే అతని మోక్షం పుస్తక జ్ఞానంతోనే సరిపోతుందని ప్రతిపక్షం వారి దృఢమైన అభిప్రాయం.
దైవ థోర కీ కర్తృత్వ థోర | వాద చాలలా హా ఘనఘోర | కేవళ దైవావర టాకూని భార | కాయ హోణార మీ మ్హణే | ||౧౫౬||
156. విధి బలమైనదా లేక స్వయంకృషి గొప్పదా అన్న వాదన అతిఘోరంగా జరిగింది. కేవలం దైవంపై భారం వేస్తే ఏం కాగలదు అని నేనన్నాను.
తంవ బోలే విరుద్ధ పక్షకార | హోణారాసీ నాహీ ప్రతికార | హోష్యమాణ11 నాహీ టళణార | మీ మీ మ్హణణార భాగలే | ||౧౫౭||
157. జరిగేదానిని అడ్డుకోలేము. జరగబోయే దానిని ఆపలేము. నేను నేనన్న వారంతా అలసిపోయారు అనేది ప్రతిపక్షాల వారి జవాబు.
దైవాపుఢే కోణ జాఈ | ఏక కరితా ఏక హోఈ | ఠేవా తుమచీ హీ చతురాఈ | అభిమాన ఠాయీ పడేనా | ||౧౫౮||
158. విధిని ఎవరు ఎదుర్కోగలరు? ఒకటి చేయబోతే వేరొకటి అవుతుంది. మీ చాతుర్యం ఇక్కడ పనికిరాదు అని వారు అన్నారు. నా అభిమానం ఊరికే ఉండలేక పోయింది.
మీ మ్హణే హో మ్హణతా కసే హే | కరీల త్యాచేంచ సర్వ ఆహే | ఆళశాపరీ బైసూని రాహే | దైవ సాహే కైసే తే | ||౧౫౯||
159. అలా ఎలా అనగలరు? చేసుకున్న వారికే ఫలితం. ఏమీ చేయకుండా సోమరిలా కూర్చుంటే దైవం ఎలా సహాయం చేస్తుంది?
“ఉద్ధరేదాత్మనాత్మానం”12 | గర్జే స్వయే స్మృతివచన | త్యాచా అనాదర కరూన | తరూన జాణే అశక్య | ||౧౬౦||
160. ‘ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం’ - తనను తానే ఉద్ధరించకోవాలి అని స్మృతి వచనం గర్జిస్తుంటే, దాని అలక్ష్యం చేసి, తరించడం సాధ్యం కాదు.
హే జ్యాచే త్యానేంచ కరావే లాగే | లాగావే కిమర్థ గురూచే మాగే |
ఆపణ అసల్యావీణ జాగే | గురూనే భాగే కైసేనీ | ||౧౬౧||
161. ఇక్కడ ఎవరి ముక్తికోసం వారే ప్రయత్నించాలి. మరి గురువు వెంట పడటమెందుకు? మనం మేల్కొనకపోతే, గురువు ఊండి ప్రయోజనమేమిటి?
ఆపులో సదసద్విచారబుద్ధి | ఆపలే సాధన చిత్తశుద్ధీ | తే ఝుగారూని జో కుబుద్ధి | గురూ కాయ సిద్ధి దేఈ త్యా | ||౧౬౨||
162. తన మేలు, తన మానసిక శుద్ధిని తెలుసుకోలేని వాడు, మంచి చెడుల తేడా తెలుసుకోగల వివేకాన్ని వదిలి వేసిన దుర్బుద్ధికి, గురువు సిద్ధిని ఎలా ప్రసాదించగలడు?
యా వాదాచా అంత నాహీ | నిష్పన్న కాంహీ జాహలే నాహీ | చిత్తస్వాస్థ్యాస అంతరలో పాహీ | హేచ కమాఈ మ్యా కేలో | ||౧౬౩||
163. ఈ వాదనకు అంతు లేదు. దీనివలన ఏ ఫలితమూ లభించలేదు. సరికదా, మనశ్శాంతిని కూడా పోగొట్టుకున్నాను. అదే నేను పొందినది.
ఏసా వాద ఘాలితా ఘాలితా | కోణీహీ నా తిళభర థకతా | ఏశా దోన ఘటకా లోటతా | వాద ఆటపతా ఘేతలా | ||౧౬౪||
164. ఇరు పక్షాలలో ఏ పక్షానికీ అలసట లేకుండా ఈ వాదవివాదాలు రెండు ఘడియలు గడిచాయి. చివరకు వాదాలను ముగించారు.
పుఢే మండళీసమవేత | ఆమ్హీ జాతో జో మశిదీంత | బాబా కాకాసాహేబాంప్రత | పరిసా పుసత కాయ తే | ||౧౬౫||
165. తరువాత, భక్త మండలితో కలిసి, మేము మసీదుకు వెళ్లాము. అక్కడ బాబా కాకాసాహేబును ఏం అడిగారో వినండి.
‘కాయ చాలలే హోతే వాడ్యాంత | వాద కశాచా హోతా భాండత | కాయ మ్హణాలి హె హేమాడపంత’ | మజకడే పాహత బోలలే | ||౧౬౬||
166. “వాడలో ఏం జరిగింది? దేనిగురించి వాదం, పొట్లాట?” అని ప్రశ్నించారు. నా వైపు చూస్తూ “ఈ హేమాడ్ పంతు ఏమంటాడు?” అని అడిగారు.
వాడ్యాపాసూన మశీదీపర్యంత | మధ్యంతరీ అంతర బహుత | బాబాంస కళలే కైసే హే వృత్త | ఆశ్చర్య చకిత మీ మనీ | ||౧౬౭||
167. వాడానుంచి, మసీదు వరకు మధ్యలో దూరం చాలా ఉంది. మరి వాడాలోని సంగతి బాబాకు ఎలా తెలిసింది అని నేను మనసులో ఆశ్చర్యపడ్డాను.
అసో ఏసా మీ వాగ్బాణహత | జాహలో నిఃశబ్ద లజ్జావనత | పాహిల్యాచ భేటీసీ కీ హే అనుచిత | ఘడలే అవిహిత మజకరవీ | ||౧౬౮||
168. ఏమైనా, వాగ్బాణంతో హతుణ్ణయి నిశ్శబ్దంగా సిగ్గుతో కృంగిపోయాను. మొదటి కలయిక లోనే నా ప్రవర్తన అనుచితమూ, అయోగ్యమూ అయింది.
హే ‘హేమాడపంత’ నామకరణ | ప్రాతఃకాలీచా వాద యా కారణ | తేణేంచి బాబాంసీ హేమాడస్మరణ | మనీ మీ ఖూణ బాంధిలీ | ||౧౬౯||
169. ఈ ‘హేమాడపంత్’ అనే నామకరణం ప్రొద్దున్నే జరిగిన వాదవివాదాల వలనే; అందుకే బాబాకు ‘హేమాడ్’ గుర్తుకు రావడం అని నాకు బాగా అర్థమైంది.
దేవగిరీచే రాజే యాదవ | హేచి తే దౌలతాబాదీంచే జాధవ | తేరావే శతకీ రాజ్య వైభవ | వాఢావిలే గౌరవ మహారాష్ట్రాంచే | ||౧౭౦||
170. దేవగిరి రాజులైన యాదవులు, దౌలతాబాదులోని జాధవులు ఒకరే. వారు మహారాష్ట్ర గౌరవాన్ని, రాజ్య వైభవాన్ని పదమూడవ శతాబ్దంలో బాగా పెంపొందించారు.
‘ప్రౌఢప్రతాపచక్రవర్తీ’13 | మహాదేవ నామా భూపతీ |
పుతణ్యా తయాచా పుణ్యకీర్తీ | విక్రమే ప్రఖ్యాతీ పావలా | ||౧౭౧||
171. వీరిలో మహాదేవ అను పేరుగల ప్రతాపవంతుడూ, ప్రౌఢుడు అయిన చక్రవర్తి ఉండేవాడు. అతని సోదరుని కొడుకు కూడా పరాక్రమంలో ప్రఖ్యాతి చెంది, పుణ్య కీర్తిని సంపాదించాడు.
తోహీ యదువంశ చూడామణీ | రామరాజా రాజాగ్రణీ | మంత్రీ యా ఉభయతాంచా బహుగుణీ | సర్వ లక్షణీ హేమాద్రీ | ||౧౭౨||
172. తరువాత వచ్చిన రామరాజ అనే రాజు యదువంశానికి చూడామణిలాంటివాడు. వీరిరువురికీ, బహు గుణవంతుడు, అన్ని లక్షణాలతొ శోభితుడూ అయిన హేమాద్రి పంతు మంత్రి.
తో ధర్మశాస్త్ర గ్రంథకార | బ్రహ్మవృన్దార్థ పరమ ఉదార14 | ఆచార వ్యవస్థా సంగతవార | ఆరంభీ రచణార హేమాద్రీ | ||౧౭౩||
173. అతను ‘ధర్మశాస్త్ర’మనే గ్రంథానికి రచయిత. బ్రాహ్మణులను ఉదారంగా సన్మానించేవాడు. శృతి, స్మృతుల ఆధారంతో ఆచార, వ్యవహారాల గురించి సమగ్రంగా ఒక పద్ధతిని రచించిన మొదటి రచయితలలో ఇతను ఒకడు.
వ్రతదానతీర్థమోక్షఖాణీ | నామే ‘చతుర్వర్గచింతామణీ’15 |
గ్రంథ రచిలా హేమాద్రీనీ | విఖ్యాత కరణీ తయాంచీ | ||౧౭౪||
174. వ్రతాలు, దానాలు, తీర్థాలు, మోక్షం గురించిన విషయాలను విస్తారంగా తెలియజేసే ‘చతుర్వర్గ చింతామణి’ అనే గ్రంథాన్ని రచించి, చాలా ప్రసిద్ధి చెందినవాడు.
గీర్వాణ భాషేంత హేమాద్రీపంత | తోచ ప్రాకృతీ హేమాడపంత | ముత్సద్దీ రాజకారణ నిష్ణాత | హోతా విఖ్యాత తే కాళీ | ||౧౭౫||
175. సంస్కృత భాషలోని ‘హేమాద్రి పంతు’ వికృతం చెంది, ప్రాకృత భాషలో (మరాఠి) ‘హేమాడ్ పంతు’ అయింది. ఆ కాలంలో, అతడు రాజనీతి విశారదుడని ప్రసిద్ధి చెంది ఉన్నాడు.
పరీ తో వత్స మీ భారద్వాజ గోత్రీ | తో పంచ మీ తీన ప్రవరీ | తో యజుర్ మీ ఋగ్వేదాధికారీ | తో ధర్మశాస్త్రీ మీ మూఢ | ||౧౭౬||
176. కాని, అతను వత్స గోత్రానికి చెందిన వాడు, నాదేమో భారద్వాజ గోత్రం. అతని గోత్రంలో ఐదుగురు మహాఋషులున్న పంచ ప్రవరం. నా గోత్రంలో ముగ్గురు మహాఋషులున్న త్రిపవరం. అతడు యజుర్వేది, నేను ఋగ్వేదిని. అతడు ధర్మశాస్త్రాలలో పండితుడు, నేను ఏమీ తెలియని మూఢుణ్ణి.
తో మాధ్యందిన మీ శాకల | తో ధర్మజ్ఞ మీ బాష్కల | తో పండిత మీ మూర్ఖ అకుశల | కా మజ పోకళ హీ పదవీ | ||౧౭౭||
177. అతనిది యజుర్వేదంలో మాధ్యందినమనే శాఖ. నేను ఋగ్వేదంలోని శాకల శాఖకు చెందినవాణ్ణి. అతడు ధర్మశాస్త్రాల గురించి కూలంకుషంగా తెలిసిన జ్ఞాని, నేను వాచాలుణ్ణి. అతను పండితుడు, నేను బుద్ధిహీనుణ్ణి. మూర్ఖుణ్ణి. ఎందుకు నాకీ వ్యర్థమైన బిరుదు?
తో రాజకారణ ధురంధర ముత్సద్దీ | మీ అల్పమతీ మందబుద్ధీ | త్యాచీ రాజ్యప్రశస్తీ16 ప్రసిద్ధి | ఓవీన సాధీ మజ ఘడవే | ||౧౭౮||
178. అతడు రాజకార్య ధురంధరుడు, చతురుడు. నేను అల్పమతిని, మందబుద్ధిని. అతను వ్రాసిన ‘రాజ్య ప్రశస్తి’ ప్రసిద్ధి చెందిన సంస్కృత కావ్యం. ఒక పద్యమైనా వ్రాయలేని వాణ్ణి నేను.
తో గ్రంథకార కలాభిజ్ఞ | మీ తో ఏసా ఠోంబా అజ్ఞ | తో ధర్మశాస్త్రవిశారద సూజ్ఞ | మీ అల్పప్రజ్ఞ హా ఏసా | ||౧౭౯||
179. అతను గ్రంథ రచనలో దిట్ట. నేను ఏ తెలివీ లేనివాణ్ణి. అతడు ధర్మశాస్త్రాలలో ప్రవీణుడు. నేను అల్పజ్ఞుణ్ణి.
తయాచా ‘లేఖనకల్పతరూ’17 | నానా చిత్రకావ్యాంచా ఆకరూ |
మీ హె ఏసే బాబాంచే లేకరూ | యేఈనా కరూ ఓవీ హీ | ||౧౮౦||
180. అతని గ్రంథం ‘లేఖన కల్పతరువు’ అనేక చిత్రకావ్యాల సంగ్రహం. కాని నేను, తెలివి కొంచమైనా లేని బాబా బిడ్డను, చిన్న పద్యాన్ని కూడా వ్రాయలేనివాణ్ణి.
గోరా చోఖా సాంవతా మాళీ | నివృత్తి జ్ఞానోబా నామాది సగళీ |
భాగవతధర్మప్రవర్తక మండళీ | ఉదయాసి ఆలీ యే కాళీ | ||౧౮౧||
181. గోరా, చోఖా, సావతామాళీ, నివృత్తినాథ, జ్ఞానేశ్వర, నామదేవ, మొదలగు భాగవత ధర్మ ప్రవర్తకలు ఉదయించిన ఆ కాలంలో,
పండిత బోపదేవ విద్వన్మణీ | చమకే జయాచే సభాంగణీ | తేథేంచి హేమాడపంత రాజకారణీ | ఖ్యాతీ గుణిగణీ జయాచీ | ||౧౮౨||
182. పండిత బోపదేవ అను విద్వాంసుడు మణిలా ప్రకాశిస్తున్న రాజదర్బారులోనే రాజకారణి అయిన హేమాద్రిపంతు కూడా సుగుణాలతో సుప్రసిద్ధి చెందాడు.
తేథూని పుఢే ఉత్తరేహూనీ | ఉతరల్యా యా దేశీ ఫౌజా యావనీ18 | జికడే తికడే ముసలమానీ | అమ్మల దక్షిణీ మావళలా | ||౧౮౩||
183. తరువాత, ఉత్తర దిశనుండి యవనుల సైన్యం ఈ దేశంలో ప్రవేశించారు. దానివలన, దక్షిణ దేశపు రాజ్యసత్తా అస్తమించి పోయింది.
ఉగాచ నా యా పదవీచే దాన | చతురాఈచా హా సన్మాన | వాదావాదీవరీ హా వాగ్బాణ19 | అభిమాన ఖండణ వ్హావయా | ||౧౮౪||
184. ఏ కారణమూ లేకుండా, ఈ పదవిని నా చాతుర్యానికి సన్మానంలా ఇచ్చినది కాదు. వాదవివాదాలలో పాల్గొనే నా స్వభావాన్ని తొలగించడానికి, అందులో ఉన్న నా అహంభావాన్ని అణచివేయడానికి బాబా నాపై విసిరిన వాగ్బాణం ఇది.
హోఊని అధ్య్రా హళకుండే పివళే | ఉగీచ యోగ్యతేవీణ జో బరళే | తయా మాఝియే ఉఘడిలే డోళే | ఘాలూన వేళేవర అంజన | ||౧౮౫||
185. అల్పజ్ఞానంతో, ఏ యోగ్యతా లేకుండా వ్యర్థంగా వాదించేది నా స్వభావం. కాని, సమయానికి సరిగ్గా కళ్ళలో అంజనం వేసినట్లు, బాబా ఈ వాగ్బాణంతో నా కళ్ళను తెరిపించారు.
అసో ఏసే హే పూర్వోక్త లక్షణ | సాఈముఖోదిత విలక్షణ | ప్రసంగోచిత్త సార్థ నామకరణ | తే మ్యా భూషణ మానిలే | ||౧౮౬||
186. అలా ఇంతకు ముందు చెప్పిన అవలక్షణాలున్నా, విలక్షణమయినా సందర్భానికి సరిపోయి, సాయి నోటినుండి వెలువడిన ఈ సార్థక నామకరణాన్ని నేను భూషణంగా స్వీకరించాను.
కీ యాంతూన మజ లాధో శిక్షణ | వాదావాదీ హే కులక్షణ | స్పర్శోని మజ ఏకహీ క్షణ | పరమ అకల్యాణకారీ తే | ||౧౮౭||
187. అయినా, అశుభము, హానికారకము, చెడు లక్షణాలూ ఉన్న వాదవివాదాలు, ఒక్క క్షణమైనా నన్ను తాకకుండా ఉండేందుకు ఇది మంచి గుణపాఠం అని నాకు అనిపించింది.
గళూని జావా వాదాభిమాన | ఏతదర్థ హే అభిధాన | జేణే ఆమరణ రహావే భాన | నిత్య నిరభిమాన అసావే | ||౧౮౮||
188. వాదవివాదాలలోని నా అభిమానం కరిగిపోయి, మరణం వచ్చేవరకూ అభిమానం, అహంభావం లేకుండా నమ్రతతో ఉండాలని గుర్తుండడానికే ఈ నామకరణం.
రామ దాశరథీ దేవ అవతారీ | పూర్ణ జ్ఞానీ విశ్వాసీ తారీ | అఖిల ఋషిగణమానసవిహారీ | చరణ ధరీ వసిష్ఠాచే | ||౧౮౯||
189. దశరథ పుత్రుడైన శ్రీరాముడు భగవంతుని అవతారం. పూర్ణ జ్ఞాని, నమ్ముకున్న భక్తులను తరింపచేసే దేవుడు. ఋషుల మనసులలో విహరించేవాడు. అలాంటి రాముడు కూడా వసిష్ఠుల పాదాలను ఆశ్రయించాడు.
కృష్ణ పరబ్రహ్మాచే రూపడే | తయాసహీ గురూ కరణే పడే |
సాందీపనీచ్యా గృహీ లాంకడే | సోసూని సాంకడె వాహిలీ | ||౧౯౦||
190. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు కూడా గురువును ఆశ్రయించాడు. గురు సాందీపుని ఇంటిలో కట్టెలు మోసి, కష్టాలు పడ్డాడు.
తేథే మాఝీ కాయ మాత | వాదావాదీ కరావీ కిమర్థ |
గురూవిణ జ్ఞాన వా పరమార్థ | నాహీ హా శాస్త్రార్థ దృఢ కేలా | ||౧౯౧||
191. అలాంటప్పుడు నేనెంతటివాణ్ణి? గురువు లేక జ్ఞానంగాని, పరమార్థంగాని లభించవు అన్న శాస్త్ర వచనాలు నా మనసులో దృఢమయ్యాయి.
వాదావాదీ నాహీ బరీ | నకో కుణాచీ బరోబరీ | నసతా శ్రద్ధా ఆణి సబూరీ | పరమార్థ తిళభరీ సాధేనా | ||౧౯౨||
192. వాదవివాదాలు మంచివి కావు, వ్యర్థమైనవి. ఎవరితోనూ పోల్చుకోకూడదు. శ్రద్ధ, సహనం లేకపోతే పరమార్థం నువ్వుగింజంత అయినా సాధించలేము.
హేహీ పుఢే ఆలే అనుభవా | యే రీతీ యా నామగౌరవా | ప్రేమపురఃస్సర నిజసద్భా వా | శుద్ధ స్వభావా ఆదరిలే | ||౧౯౩||
193. తరువాతి రోజులలో నాకు ఇది అనుభవమైంది. ఈ రీతిగా గౌరవంగా వచ్చిన నామాన్ని, ప్రేమ పూర్వకంగా, సద్భావంతో, నేను స్వీకరించాను.
ఆతా అసో హే కథానక | స్వపక్ష-పరపక్షవిచ్ఛేదక | వాద ప్రవాద నివర్తక | సర్వాంసహీ బోధక సమసామ్యే | ||౧౯౪||
194. నా పక్షం, ఇతరుల పక్షం అన్న భావాన్ని తొలగించి, వాద ప్రతివాదాలను అడ్డగించి, అందరికీ బోధకారకమైన ఈ కథను ఇంతటితో ఆపి,
అసో ఏసే హే గ్రంథప్రయోజన | అధికారీ-అనుబంధనదర్శన |
గ్రంథకారాచే నామకరణ | కథన శ్వవణ కరవిలే | ||౧౯౫||
195. ఈ గ్రంథ ప్రయోజనాన్ని, ఎవరి కోసం రచింప బడింది అన్నదానినీ, గ్రంథానికీ దానిలో ఉండే విషయానికి గల సంబంధాన్ని తెలియ చేశాను. అలాగే, గ్రంథకారునికి జరిగిన నామకరణం వర్ణన కూడా విన్నారు.
పురే ఆతా హా అధ్యాయవిస్తార | హేమాడ సాఈచరణీ సాదర | పుఢే యథానుక్రమ కథా సవిస్తార | శ్రవణతత్పర వ్హావే జీ | ||౧౯౬||
196. కాని, ఇప్పుడు ఈ అధ్యాయ విస్తారం ఇంతవరకు చాలు. తరువాత, క్రమానుసారంగా సవిస్తారమైన కథలను సాదరంగా, సాయి పాదాలయందు హేమాడ్ మనవి చేస్తాడు.
సాఈచ ఆపులీ సుఖసంపత్తీ | సాఈచ ఆపులీ సుఖసంవిత్తీ | సాఈచ ఆపులీ పరమ నివృత్తీ | అంతిమ గతి శ్రీసాఈ | ||౧౯౭||
197. సాయియే మన సుఖ సంపత్తి. సాయియే మనకు సంపూర్ణమైన ఆనందం. మనని ప్రాపంచిక వ్యథలనుంచి దూరం చేసేది సాయియే. మన చివరి లక్ష్యం కూడా సాయియే.
సాఈ కృపేచియా కారణే | సాఈ చరిత్ర శ్రవణ కరణే | తేణేంచ దుస్తర భవభయ తరణే | కలిమల హరణే నిర్మూల | ||౧౯౮||
198. సాయి కృపా కారణంగా, అతి కష్టమైన భవభయాన్ని తరించి, కలియుగంలోని మలినాన్ని నిర్మూలన చేయటం, శ్రీసాయి చరిత్ర వినటం వలననే సాధ్యం.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | కథా ప్రయోజన నామకరణ నామ |
| ద్వితీయోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ:
1. మశీదీచీ పాయరీ
2. యా సాఈచరిత్రాచ్యా లేఖకాస త్యాంచే స్నేహీ బహుధా యా నావానే సంబోధతాత.
3. రా. హరీ సీతారామ ఊర్ఫ భాఊసాహేబ దీక్షిత యాంనా సాఈబాబా ‘కాకా’ మ్హణూన సంబొధీత.
4. కై. నారాయణ గోవింద చాందోరకర యాంనా సాఈబాబా ‘నానా’ మ్హణూన సంబోధీత.
5. మృత్యుముఖీ పడే
6. క్షణభర
7. చరణరూపీ మానససరోవర
8. కావళ్యాచా
9. సంతశ్రేష్ఠ
10. సరళ
11. పుఢే హోణార, భవితవ్య
12. స్వతఃచా ఉద్ధార స్వతఃచ కరావా
13. పంఢరపూర యేథే శకే ౧౧౯౨ ప్రమోదనామ సంవత్సర యా మితీచా ఎక కోరీవ లేఖ ఆహే; త్యా లేఖాత యా మహాదేవ భూపతీస హే విశేషణ యోజలేలే ఆహే.
14. హేమాడపంతానీ రోజ శేకడే బ్రాహ్మణ జేవూ ఘాలావేత అశీ త్యాచీ ఆఖ్యా ఆహే.
15. జ్యాత్యాత వ్రత, దాన, తీర్థ ఆణి మోక్ష యా చార ప్రకరణాంచే సవిస్తర వివేచన కేలే ఆహే. అసా హా ‘చతుర్వర్గ చింతామణీ’ నామక గ్రంథ ఆహే.
16. యా నావాచే హేమాడపంతాంచే ఎక సంస్కృత కావ్య ఆహే.
17. హేమాడపంతాంచ్యా యా ‘లేఖనకల్పతరూ’ నామక గ్రంథాత త్యాంచ్యా మరాఠీ కావ్యరచనేచ్యా వివిధత్వాబద్దల ఉల్లేఖ ’ఆనంద’ మాసిక పుస్తకాచ్యా ఎప్రిల 1923 చ్యా అంక 201, పృ 414 వర పాహా.
18. యవనాంచ్యా.
19. శబ్దరూపీ బాణ
No comments:
Post a Comment