శ్రీ సాఈసచ్చరిత
||అథ శ్రీ సాఈసచ్చరితప్రారంభః||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
ప్రథమ కార్యారంభస్థితి | వ్హావీ నిర్విఘ్న పరిసమాప్తీ |
ఇష్టదేవతానుగ్రహప్రాప్తీ |శిష్ట కరితీ మంగలే | ||౧||
1. మొదలు పెట్టిన పని ఏ అడ్డంకులూ రాకుండా ముగించాలని, తెలిసినవారు తమ ఇష్ట దేవతల అనుగ్రహానికోసం, ముందుగా మంగళాచరణాన్ని ఆచరిస్తారు.
ఇష్టార్థసిద్ధి ప్రయోజన | అభివందన సకలాంచే | ||౨||
2. అలా ఇష్ట దేవతల మెప్పు పొందడం వలన, అన్ని అడ్డంకులూ తొలగిపోగా, అనుకున్నది లభించి, అందరికీ నమస్కరించటం జరుగుతుంది.
ప్రథమ వందూ గణపతీ | వక్రతుండ హేరంబ మూర్తీ |
చతుర్దశ విద్యాంచా అధిపతీ | మంగలాకృతి గజముఖ | ||౩||
3. వక్రతుండుడు, హేరంబమూర్తి, పదినాలుగు విద్యలకూ అధిపతి, మంగళ రూపుడు, గజాననుడు అయిన గణపతికి మొదటి నమస్కారం.
పోటీ చతుర్దశ భువనే మావతీ | మ్హణోని గా తుజ లంబోదర మ్హణతీ |
పరశు సతేజ ధరిసీ హస్తీ | విఘ్నోచ్ఛితత్యర్థ భక్తాంచ్యా | ||౪||
4. పదునాలుగు లోకాలకూ నీ ఉదరం ఆలవాలం. అందుకే నిన్ను లంబోదరుడని అంటారు. భక్తుల అడ్డంకులను తొలగించడానికి నీ చేతిలో పదునైన పరశువును ధరించావు.
హే విఘ్నవిఘాతోపశమనా | గణనాథా గజాననా |
తూ భక్తాంచా సాహ్యకారీ | విఘ్నే రూళతీ తుఝ్యా తోడరీ |
తూ సన్ముఖ పాహసీ జరీ | దరిద్ర దూరీ పళేల | ||౬||
ప్రసాద పూర్ణ కరీ మద్వచనా | సాష్టాంగ వందనా కరితో మీ | ||౫||
5. విఘ్నాలనే అడ్డంకులను తొలగించే గణనాథా! గజానన! నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నా ఈ పలుకులలో నీ అనుగ్రహం కురిపించు.
తూ సన్ముఖ పాహసీ జరీ | దరిద్ర దూరీ పళేల | ||౬||
6. నీవు భక్తులకు సహాయం చేసేవాడివి. నీ కాలి కడియం క్రింద అడ్డంకులన్నీ నశిస్తాయి. నీ కృపా దృష్టితో పేదరికం దూరంగా పారిపోతుంది.
తూ భవార్ణాచీ పోత | అజ్ఞానతమా జ్ఞానజ్యోత |
తూ తుఝ్యా ఋద్ధిసిద్ధీసహిత | పాహే ఉల్లసిత మజకడే | ||౭||
7. సంసార సాగరాన్ని దాటించే నౌకవు నీవు. అజ్ఞానమనే చీకటిని తొలగించే జ్ఞాన జ్యోతివి. సిద్ధి, బుద్ధులతో నన్ను ప్రసన్నంగా చూడు.
జయజయాజీ మూషకవహనా | విఘ్నకానన-నికృంతనా |
గిరిజానందనా మంగలవదనా | అభివందనా కరితో మీ | ||౮||
8. జయ జయ మూషిక వాహనా! అడ్డంకులనే అడవిని నరికి వేసే గిరిజానందనా! మంగళ వదనా! నీకు నా నమస్కారం.
లాధో అవిఘ్న పరిసమాప్తీ | మ్హణోని హేచి శిష్టాచారయుక్తీ |
లాధో అవిఘ్న పరిసమాప్తీ | మ్హణోని హేచి శిష్టాచారయుక్తీ |
ఇష్టదేవతా - నమస్కృతీ | మంగలప్రాప్త్యర్థ ఆదరిలీ | ||౯||
9. కార్యం విఘ్నాలు లేకుండా ముగింపు కావటానికి, శుభం జరగడానికి, ఇష్టదేవతలకు నమస్కరించే ఆచారాన్ని నేను పాటిస్తున్నాను.
హా సాఈచ గజానన గణపతీ | హా సాఈచ ఘేఊని పరశూ హాతీ |
కరోని విఘ్నవిచ్ఛిత్తీ | నిజ వ్యుత్పత్తి కరూ కా | ||౧౦||
10. అయినా, ఈ సాయియే గజాననుడైన గణపతి, ఈ సాయియే చేతిలో పరశువును పట్టుకుని విఘ్నాలను తొలగించేవారు. వీరే స్వయంగా తమ లీలలను వర్ణిస్తారు.
హాచి భాలచంద్ర గజానన | హాచి ఏకదంత గజకర్ణ |
హాచి వికట భగ్నరదన | హా విఘ్నకానన-విచ్ఛేదక | ||౧౧||
11. సాయియే బాలచంద్ర గజాననుడు. ఏకదంతడూ, ఏనుగు చెవులవాడూ వీరే. విరిగిపోయిన దంతంతో విఘ్నాలనే అడవులను నరికేవారు వీరే.
హే సర్వమంగలమాంగల్యా | లంబోదరా గణరాయా | అభేదరూపా సాఈ సదయా | నిజసుఖనిలయా నేఈ గా | ||౧౨||
12. ఓ సర్వమంగళ మాంగల్యా! లంబోదరా! గణాధీశా! అభేదరూపా! దయామయుడైన సాయి! మమ్ము ఆత్మానంద నిలయానికి తీసుకుని వెళ్ళండి.
ఆతా నమూ బ్రహ్మకుమారీ | సరస్వతీ జే చాతుర్యలహరీ | యా మమ జివ్హేసీ హంస కరీ | హోఈ తిజవరీ ఆరూఢ | ||౧౩||
13. ఇప్పుడు బ్రహ్మకుమారి, జ్ఞాన దేవత అయిన సరస్వతికి నమస్కారం. నా నాలుకను హంసగా చేసుకుని, దానిపై ఈమె కూర్చుండుగాక.
బ్రహ్మవీణా జిచే కరీ | నిఢళీ ఆరక్త కుంకుమచిరీ | హంసవాహినీ శుభ్రవస్త్రీ | కృపా కరీ మజవరీ | ||౧౪||
14. చేతిలో బ్రహ్మవీణను పట్టుకుని, నొసట ఎర్రటి కుంకుమ రేఖతో తెల్ల వస్త్రాలను ధరించిన హంసవాహిని, నన్ను కరుణించు.
హీ వాగ్దేవతా జగన్మాతా | నసతా ఇయేచీ ప్రసన్నతా | చఢేల కాయ సారస్వత హాతా | లిహవేల గాథా కాయ మజ | ||౧౫||
15. అన్ని లోకాలకూ తల్లి అయిన ఈ వాగ్దేవత అనుగ్రహం లేకపోతే, ఏ గ్రంథ రచనైనా సాధ్యమా? ఆమె అనుగ్రహం లేకుండా, ఈ సాయి జీవిత చరిత్ర వ్రాయగలనా?
జగజ్జననీ హీ వేదమాతా | విద్యావిభవ గుణసరితా | సాఈసమర్థచరితామృతా | పాజో సమస్తా మజకరవీ | ||౧౬||
16. హే జగజ్జననీ! వేదమాతా! అన్ని విద్యల విభవ గుణసరితా! నా ద్వారా సాయి సమర్థుని చరితామృతాన్ని పానం చేయించుగాక.
సాఈచ భగవతీ సరస్వతీ | ఓంకారవీణా ఘేఊని హాతీ | నిజచరిత్ర స్వయేంచి గాతీ | ఉద్ధారస్థితీ భక్తాంచ్యా | ||౧౭||
17. సాయియే సరస్వతి, సాయియే భగవతి. భక్తులను ఉద్ధరించటానికి, ఓంకారమనే వీణను చేత పట్టుకుని, తమ జీవిత కథను తామే గానం చేస్తున్నారు.
ఉత్పత్తిస్థితిసంహారకర | రజసత్త్వతమగుణాకర | బ్రహ్మా విష్ణు ఆణి శంకర | నమస్కార తయాంసీ | ||౧౮||
18. ఇప్పుడు సృష్టి, స్థితి, లయ కారకులూ, సత్వ, రజస్సు, తమస్సు గుణాకారులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు నా నమస్కారం.
హే సాఈనాథ స్వప్రకాశ | ఆమ్హా తుమ్హీచ గణాధీశ | సావిత్రీశ కివా రమేశ | అథవా ఉమేశ తుమ్హీచ | ||౧౯||
19. హే సాయినాథా! స్వప్రకాశా! మీరే మాకు గణాధీశులు, సావిత్రి పతి అయిన బ్రహ్మ, రమాపతి అయిన విష్ణు మరియు ఉమాపతి అయిన మహేశ్వరులు కూడా.
తుమ్హీచ ఆమ్హాంతే సద్గురూ | తుమ్హీచ భవనదీంచే తారూ | ఆమ్హీ భక్త త్యాంతీల ఉతారూ | పైల పారూ దావిజే | ||౨౦||
20. మీరే మా సద్గురువు. సంసారమనే నదిని దాటించి, భక్తులను తీరానికి తీసుకువెళ్ళే నౌక మీరే.
కాహీంతరీ అసల్యాశివాయ | పూర్వజన్మీంచే సుకృతో్పాయ |
కేవీ జోడతీల హే పాయ | ఏసా ఠాయ ఆమ్హాంతే | ||౨౧||
21. వెనుకటి జన్మలో చేసిన ఏదో మంచి పనుల పుణ్యం లేనిదే, మీ పాదాల వద్ద మాకు ఆశ్రయం లభిస్తుందా?
నమన మాఝే కులదైవతా | నారాయణా ఆదినాథా |
జో క్షీరసాగరీ నివాసకర్తా | దుఃఖహర్తా సకాళాంచా | ||౨౨||
22. అందరి దుఃఖాలను తొలగించే, పాల సముద్రంలో ఉండే, మా కులదైవమైన నారాయణ ఆదినాథులకు నా నమస్కారం.
పరుశురామే సముద్ర హటవిలా | తేణే జో నూతన భూభాగ నిర్మలా | ప్రాంత ‘కోంకణ’ అభిధాన జాయాలా | తేథ ప్రగటలా నారాయణ | ||౨౩||
23. పరశురాముడు సాగరాన్ని వెనక్కి నెట్టినప్పుడు, నిర్మాణమైన కొత్త భూమికి కొంకణమని పేరు. అక్కడ నారాయణుడు కనిపించాడు.
జేణే జీవాంసీ నియామకపణే | అంతర్యామిత్వే నారాయణే | కృపాకటాక్షే సంరక్షణే | తయాంచ్యా ప్రేరణేఆధీన మీ | ||౨౪||
24. అన్ని జీవులలో కనిపించకుండా ఉంటూ, తన కృపా దృష్టితో, నియమంగా వారి రక్షణ చేస్తున్న నారాయణుని ప్రేరణకు అధీనుణ్ణి.
తైసేంచి భార్గవే యజ్ఞసాండ్గ తేసీ | గౌడదేశీయ జ్యా మహామునీసీ | ఆణిలే త్యా మూళపురూషాసీ | అత్యాదరేసీ నమన హే | ||౨౫||
25. అలాగే, భార్గవుడు (పరశురాముడు) యజ్ఞ సమాప్తికొరకు తీసుకు వచ్చిన గౌడదేశీయ మహాముని, మూలపురుషునికి అత్యాదరంగా నమస్కరిస్తున్నాను.
ఆతా నమూ ఋషిరాజ | గోత్రస్వామీ భారద్వాజ | ఋగ్వేదశాఖా ‘శాకల’ పూర్వజ | ఆద్యగౌడ ద్విజజాతీ | ||౨౬||
26. ఇప్పుడు, ఋషులలో రాజైన, మా గోత్రానికి పూర్వజుడు, ఋగ్వేద శాకల శాఖకు చెందిన, ఆద్య గౌడ బ్రాహ్మణుల వంశ స్థాపకుడు అయిన భారద్వాజ మునికి నమస్కారం చేస్తున్నాను.
పుఢతీ వందూ ధరామర | బ్రాహ్మణ పరబ్రహ్మావతార | మగ యాజ్ఞవల్క్యాది యోగీశ్వర | భృగు పరాశర నారద | ||౨౭||
27. తరువాత, భూమి మీద పరబ్రహ్మ అవతారులైన బ్రాహ్మణులు, మరియు యాజ్ఞవల్క్య, భృగు, పరాశర, నారదాది మునీంద్రులకు నా నమస్కారం.
వేదవ్యాస పారాశర | సనక సనందన సనత్కుమార | శుక శౌనక సూత్రకార | విశ్వామిత్ర వసిష్ఠ | ||౨౮||
28. వేదవ్యాస (పరాశరుని కొడుకు), సనక, సనందన, సనత్కుమారులకు, శుకునకు, సూత్రకారకుడైన శౌనకునకు, విశ్వామిత్ర, వసిష్ఠులకు,
వాల్మీక వామదేవ జైమినీ | వైశంపాయన ఆదికరూనీ | నవయోగీంద్రాదిక మునీ | తయా చరణీ లోటాంగణ | ||౨౯||
29. వాల్మీకి, వామదేవ, జైమిని, వైశంపాయనాది తొమ్మిది యోగీంద్రుల చరణాలకు సాష్టాంగ నమస్కారాలు.
ఆతా వందూ సంతసజ్జనా | నివృత్తి-జ్ఞానేశ్వర-ముక్తా-సోపానా |
ఏకనాథా స్వామీ జనార్దనా | తుకయా కాన్హా నరహరి | ||౩౦||
30. ఇక సాధు సంతులైన నివృత్తి, జ్ఞానేశ్వర, ముక్తాబాయి, సోపాన, ఏకనాథ, స్వామి జనార్దన, తుకారాం, కాన్హోబా, నరహరి మొదలగు వారికి నా నమస్కారం.
సకళాంచా నామనిర్దేశ | కరూ న పురె గ్రంథావకాశ |
మ్హణోని ప్రణామ కరితో సర్వాంస | ఆశీర్వచనాస ప్రార్థితో మీ | ||౩౧||
31. అందరు సంతులు సజ్జనులను పేరు పేరున పేర్కొనుటకు, ఈ గ్రంథంలో చోటు సరిపోదు కనుక, వారందరికీ నమస్కారం చేసి, వారి ఆశీస్సులను వేడుకుంటున్నాను.
ఆతా వందూ సదాశివ | పితామహ జో పుణ్యప్రభావ | బదరీకేదారీ దిలా ఠావ | సంసార వావ మానుతీ | ||౩౨||
32. ఇప్పుడు, ప్రపంచమే నిరర్థకమని తెలుసుకుని, బదరీ కేదారులో స్థిర పడిన పుణ్యాత్ముడూ, నా పితామహుడూ అయిన సదాశివునకు నమస్కారం.
పుఢే వందూ నిజపితా | సదా సదాశివ ఆరాధితా | కంఠీ రుద్రాక్ష ధారణ కరితా | ఆరాధ్యదేవతా శివ జయా | ||౩౩||
33. తరువాత, గొంతులో రుద్రాక్ష మాల ధరించి, ఆరాధ్యదైవమైన సదాశివుని సదా ఆరాధించిన నా తండ్రికి, నా నమస్కారం.
పుఢతీ వందూ జన్మదాతీ | పోసిలే జినే మజప్రతీ | స్వయే కష్టోని అహోరాతీ | ఉపకార కితీ ఆఠవూ | ||౩౪||
34. నాకు జన్మనిచ్చి, రాత్రి పగలూ కషపడి నన్ను పోషించిన, నా కన్నతల్లి ఉపకారాన్ని ఎంతగా స్మరించను? ఆమె పాదాలకు నా నమస్కారం.
బాళపణీ గేలో త్యాగునీ | కష్టే సాంభాళీ పితృవ్యపత్నీ | ఠేవితో భాళ తిచే చరణీ | హరిస్మరణీ నిరత జీ | ||౩౫||
35. చిన్నతనంలోనే కన్నతల్లి నన్ను వదిలి పోగా, నన్ను మా పిన్ని కష్టపడి పెంచింది. ఎల్లప్పుడూ హరిస్మరణలో ఉన్న ఆమె పాదాలకు నా నమస్కారం.
అవఘ్యాహూని జ్యేష్ఠ భ్రాతా | అనిపమ జయాచీ సహోదరతా | మదర్థ జీవప్రాణ వేంచితా | చరణీ మాథా తయాచే | ||౩౬||
36. అందరిలో పెద్దవాడు, అనుపమానమైన సోదర ప్రేమతో, నా కొరకు ప్రాణాలను కూడా ఇవ్వగలిగిన, మా పెద్దన్నయ్య పాదాలపై నా శిరస్సు వంచుతున్నాను.
ఆతా నమూ శ్రోతేజన | ప్రార్థితో ఆపులే ఏకాగ్ర మన | ఆపణ అసతా అనవధాన | సమాధాన మజ కైంచే | ||౩౭||
37. ఇక శ్రోతలైన మీకు నా నమస్కారాలు. ఏకాగ్ర మనసులో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు పరధ్యానంగా ఉంటే నాకు శాంతి ఎక్కడిది?
శ్రోతా జవ జవ గుణజ్ఞ చతుర | కథాశ్రవణార్థీ అతి ఆతుర | తవ తవ వక్తా ఉత్తరోత్తర | ప్రసన్నాంతర ఉల్హాసే | ||౩౮||
38. శ్రోతలు గుణవంతులు, చతురులై ఉండి కథా శ్రవణమందు ఎంత ఆతురతతో ఉంటే, వక్తకు అంతే ఉత్సాహం, సంతోషం కలుగుతుంది.
ఆపణ జరీ అనవధాన | కాయ మగ కథేచే ప్రయోజన | మ్హణోని కరితో సాష్టాంగ వందన | ప్రసన్నమన పరిసావే | ||౩౯||
39. శ్రోతలు సావధానంగా లేకపోతే, మరి ఈ కథకు ఏం ప్రయోజనం? అందుచేత, ప్రసన్న చిత్తంతో, శ్రవణం చేయండని మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను.
నాహీ మజ వ్యుత్పత్తిజ్ఞాన | నాహీ కేలే గ్రంథపారాయణ | నాహీ ఘడలే సత్కథాశ్రవణ | హే పూర్ణ ఆపణ జాణతా | ||౪౦||
40. నాకు పాండిత్యం లేదని, ఏ గ్రంథ పారాయణంగాని, సత్కథా శ్రవణంగానీ నేను చేయలేదని మీకు బాగా తెలుసు.
మీహీ జాణే మాఝే అవగుణ | జాణే మాఝే మీ హీనపణ |
పరీ కరావయా గురువచన | గ్రంథప్రయత్న హా మాఝా | ||౪౧||
41. నా అవగుణాలు, నాలోని లోపాలు, నాకు పూర్తిగా తెలుసు. అయినా గురువుయొక్క వచనాన్ని పాటించటానికి, నేను చేస్తున్న ఈ గ్రంథరచనా ప్రయత్నం.
మాఝోంచి మన మజ సాంగత | కీ మీ తుమ్హాపుఢే తృణవత | పరీ మజ ఘ్యావే పదరాంత | కృపావంత హోఊని | ||౪౨||
42. మీ ముందు నేను గడ్డిపోచును, అని నా మనసు నాకు చెబుతుంది. అయినా నన్ను కరుణించి, మీ అక్కున చేర్చుకోమని నా మనవి.
ఆతా కరూ సద్గు రూస్మరణ | ప్రేమే వందూ తయాచే చరణ | జాఊ కాయావాచామనే శరణ | బుద్ధిస్ఫురణదాతా జో | ||౪౩||
43. ఇక, బుద్ధిని స్ఫురింప చేసే సద్గురువును స్మరించి, కాయా వాచా మనసుతో, త్రికరణ శుద్ధిగా, వారి శరణుజొచ్చి, భక్తి ప్రేమలతో వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం.
జేవణార బైసతా జేవావయాస | అంతీ ఠేవితో గోడ ఘాంస | తైసాచి గురూవందన - సుగ్రాస | ఘేఊని నమనాస సంపవూ | ||౪౪||
44. భోజన సమయంలో, తీపి వస్తువును చివర వడ్డించే విధంగా, గురువుకు నమస్కారంతో వందన సమార్పణ ముగిస్తున్నాను.
ఓంనమో సద్గువరూరాయా | చరాచరాచ్యా విసావియా | అధిష్ఠాన విశ్వా అవఘియా | అససీ సదయా తూ ఏక | ||౪౫||
45. ఓం నమో సద్గురు దేవా! అన్ని చరాచరాలకు మీరే విశ్రామధామం. దయామయా! ఈ సృష్టికి శాశ్వతమైన ఆధారం మీరే!
పృథ్వీ సప్తదీప నవఖండ | సప్తస్వర్గ పాతాళ అఖండ | యాంతే ప్రసవీ జే హిరణ్యగర్భాండ | తేచి బ్రహ్మాండ ప్రసిద్ధ | ||౪౬||
46. ఏడు ద్వీపాలతో, తొమ్మిది ఖండాలుగా ఉన్న ఈ భూమి, మరియు ఏడు స్వర్గాలను, ఏడు పాతాళ లోకాలను పుట్టించిన హిరణ్యగర్భమే బ్రహ్మాండమని ప్రసిద్ధి.
ప్రసవే జీ బ్రహ్మాండా యయా | జీ నామే ‘అవ్యక్త’ వా ‘మాయా’ | తయా మాయేచియాహీ పైల ఠాయా | సద్గుమరూరాయా నిజవసతీ | ||౪౭||
47. ఈ బ్రహ్మాండాన్ని పుట్టించిన దానిని అవ్యక్తము లేక మాయ అని అంటారు. సద్గురు స్థానం ఆ మాయనుంచి వేరుగా ఉంటుంది.
తయాచే వానావయా మహిమాన | వేదశాస్త్రీ ధరిలే మౌన | యుక్తిజుక్తీచే ప్రమాణ | తేథే జాణ చాలేనా | ||౪౮||
48. వారి మహిమను వివరించలేక వేద శాస్త్రాలు మౌనం వహించాయి. అతి తెలివివలన వాడే ప్రమాణాలు వారి వద్ద చెల్లవు.
జ్యా జ్యా దుజ్యా తుజ ఉపమావే | తో తో ఆహేస తూంచీ స్వభావే | జే జే కాహీ దృష్టి పడావే | తే తే నటావే త్వాం స్వయే | ||౪౯||
49. ఓ సద్గురు! మిమ్ము దేనితో పోల్చాలన్నా అంతటా మీరే. కంటికి ఏవి కనిపించినా, అవన్నీ మీరు స్వయంగా నటించే మీ రూపాలే.
ఏసియా శ్రీసాఈనాథా కరూణార్ణవా సద్గుదరూ సమర్థా | స్వసంవేధ్యా సర్వాతీతా | అనాధ్యనంతా తుజ నమో | ||౫౦||
50. ఇటువంటి సమర్థ సద్గురు శ్రీసాయినాథా! కరుణాసాగరా! స్వసంవేద్యా! సర్వాతీతా! అనాది అనంతా! మీకు నా నమస్కారం.
ప్రణామ తూతే సర్వోత్తమా | నిత్యానందా పూర్ణకామా |
స్వప్రకాశా మంగలధామా | ఆత్మారామా గురూవర్యా | || ౫౧||
51. నిత్యానందా! పూర్ణకామా! స్వప్రకాశా! సర్వోత్తమా! మంగళధామా! ఆత్మారామా! గురువర్యా! మీకు నా ప్రణామాలు.
కరూ జాతా తుఝే స్తవన | వేదశ్రుతీహీ ధరితీ మౌన | తేథే మాఝే కోణ జ్ఞాన | తుజ ఆకలన కరాయా | ||౫౨||
52. మీ గుణగణాలు పాడలేక వేదాలు, శృతులు మౌనం వహించగా, మీ గురించి తెలుసుకోవటానికి నా జ్ఞానం ఏ పాటిది?
జయ జయ సద్గుోరూ కరూణాగారా | జయ జయ గోదాతీరవిహారా | జయ జయ బ్రహ్మేశ రమావరా | దత్తావతారా తుజ నమో | ||౫౩||
53. జయ జయ సద్గురు కరుణాసాగరా! జయ జయ గోదావరీ తీర విహారా! జయ జయ బ్రహ్మ విష్ణు మహేశ్వరా! దత్తావతారా! మీకు నా నమస్కారం.
బ్రహ్మాసీ జే బ్రహ్మపణ | తే నాహీ సద్గుజరూవీణ | కురవండావే పంచప్రాణ | అనన్యశరణ రిఘావే | ||౫౪||
54. సద్గురువు లేకపోతే బ్రహ్మకు బ్రహ్మత్వం లేదు. అలాంటి సద్గురువుకు ప్రేమగా, అనన్య శరణుజొచ్చి, పంచ ప్రాణాలను సమర్పించాలి.
కరావే మస్తకే అభివందన | తైసేంచి హస్తాంహీ చరణసంవాహన | నయనీ పాహత అసావే వదన | ఘ్రాణే అవఘ్రాణన తీర్థాచే | ||౫౫||
55. శిరస్సుతో పాదాలకు నమస్కరించి, చేతులతో వారి పాదాలను మెల్లగా ఒత్తుతూ, కళ్ళతో ముఖాన్ని చూస్తూ, ముక్కుతో వారి చరణ తీర్థాన్ని ఆఘ్రాణించాలి.
శ్రవణే సాఈగుణశ్రవణ | మనే సాఈమూర్తీచే ధ్యాన | చిత్తే అఖండ సాఈచింతన | సంసారబంధన తూటేల | ||౫౬||
56. చెవులతో సాయి గుణగణాలు వింటూ, మనస్సుతో వారిని ధ్యానిస్తూ, మనస్సులోని కంటిముందు ఎల్లప్పుడూ వారి రూపాన్ని ఉంచి, ఎప్పుడూ వారిని ధ్యానిస్తూ ఉంటే ప్రాపంచిక బంధనం తొలగిపోతుంది.
తన-మన-ధన సర్వ భావే | సద్గురూ పాయీ సమర్పావే | అఖండ ఆయుష్య వేచావే | గురూసేవేలాగునీ | ||౫౭||
57. భక్తి శ్రద్ధలతో దేహం, మనస్సు మరియు ధనం, సద్గురు పాదాలకు సమర్పించి, సద్గురు సేవలో జీవితాంతం మన సమయాన్ని వెచ్చించాలి.
గురూనామ ఆణి గురూసహవాస | గురూకృపా ఆణి గురూచరణ పాయస | గురూమంత్ర ఆణి గురూగృహవాస | మహత్ప్రయాస ప్రాప్తీ హీ | ||౫౮||
58. గురు నామం, గురువుయొక్క సహవాసం, గురుకృప, మరియు గురుచరణ పాయసం, గురుమంత్రం మరియు గురుగృహనివాసం ఇవన్నీ ఎంతో కష్ట ప్రయాసలతో లభిస్తాయి.
ప్రచండ శక్తి యయా పోటీ | అనన్య భక్తీ ఘేతలీ కసవటీ | భక్తాంసీ మోక్షద్వారవంటీ | నేతీల లోటీత నకళతా | ||౫౯||
59. వీటన్నిటిలో ప్రచండ శక్తి ఉంది. భక్తులను పరీక్షించి, వారికి తెలియకుండానే వారిని మోక్ష ద్వారం వరకు ఇవి నెట్టుకుంటూ తీసుకొని పోతాయి.
గురూసంగతి గంగాజళ | క్షాళితే మళ కరితే నిర్మళ | మనాసమ దుజే కాయ చచళ | కరితే నిశ్చళ హరిచరణీ | ||౬౦||
60. గురు సాంగత్యం, గంగాజలంవలె మనస్సులోని మాలిన్యాన్ని కడిగి నిర్మలం చేస్తుంది. మనస్సువంటి చంచలమైనది మరొకటి ఉందా? అటువంటి దానిని కూడా హరి చరణాలయందు నిశ్చలంగా స్థిరపరుస్తుంది.
ఆముచే వేదశాస్త్రపురాణ | శ్రీ సద్గురూ రచణసేవన |
ఆమ్హా యోగయాగతపసాధన | లోటాంగణ గురూపాయీ | ||౬౧||
61. శ్రీ సద్గురువు పాద సేవయే మనకు వేదశాస్త్ర పురాణాలు. సద్గురు పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయడమే, మనకు యోగ, యాగ, తపస్సాధనలు.
శ్రీసద్గుయరూనామ పవిత్ర | హేంచీ ఆముచే వేదశాస్త్ర | ‘సాఈసమర్థ’ ఆముచా మంత్ర | యంత్రతంత్రహీ తే ఏక | ||౬౨||
62. శ్రీ సద్గురువుయొక్క పవిత్ర నామమే మనకు వేదశాస్త్రం. సాయి సమర్థ అనే నామమే మన మంత్రం. యంత్ర, తంత్ర, కూడా ఇది ఒక్కటే.
‘బ్రహ్మ సత్య’ హే నిజప్రతీతీ | ‘జగన్మిథ్యా’ హే నిత్య జాగృతీ | ఏసా హీ పరమప్రాప్తీచీ స్థితీ | సాఈ అర్పితీ నిజభక్తా | ||౬౩||
63. ఈ జగత్తు మాయ అన్న జ్ఞానం, మరియు బ్రహ్మ మాత్రమే సత్యం అన్న జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా కలిగించే పరమార్థ ప్రాప్తి స్థితిని, తమ భక్తులకు సాయి ప్రసాదిస్తారు.
పరమాత్మసుఖ పరమాత్మప్రాప్తీ | బ్రహ్మానందస్వరూపస్థితీ | ఇత్యాది హీ శబ్దజాళాచీ గుంతీ | ఆనందవృత్తి పాహిజే | ||౬౪||
64. పరమాత్మ సుఖం, పరమాత్మ ప్రాప్తి, బ్రహ్మానంద స్వరూప స్థితి, ఇత్యాది పదాల వలలో పడకుండా, మనస్సును ఎప్పుడూ ఆనందమయం చేసుకోవాలి.
జయాసీ బాణలీ హీ ఏక వృత్తీ | సదా సర్వదా హీ ఏక స్థితీ | సుఖశాంతి సమాధాన చిత్తీ | పరమప్రాప్తి తీ హీచ | ||౬౫||
65. ఎవరి మనస్సు ఎల్లప్పుడూ ఇట్టి ఆనంద స్థితిలో ఉంటుందో, అలాంటి వారి మనస్సు ఎప్పుడూ సుఖంగా, శాంతంగా ఉంటుంది. ఇదే పరమపద ప్రాప్తి.
సాఈ ఆనందవృత్తీచీ ఖాణ | అసలియా భక్త భాగ్యాచా జాణ | పరమానందాచీ నాహీ వాణ | సదైవ పరిపూర్ణ సాగరసా | ||౬౬||
66. ఇలాంటి ఆనందానికి సాయి గని. సదా సాగరంలా పరిపూర్ణంగా ఉండే సాయి వద్ద, భక్తులు భాగ్యవంతులై, పరమానందానికి కొరత లేకుండా ఉంటారు.
శివశక్తి పురూషప్రకృతీ | పాణగతీ దీపదీప్తీ | హీ శుద్ధబ్రహ్మచైతన్యవికృతీ | ఏకీ కల్పితీ ద్వైతతా | ||౬౭||
67. శివుడు-శక్తి, పురుషుడు-ప్రకృతి, దీపం-దీప్తి ఇవి శుద్ధ బ్రహ్మ చైతన్యంయొక్క మారిన రూపాలు. ఇవి ఒక్కటే అయినా, వేరు వేరుగా ఉన్న భావాన్ని కలిగిస్తాయి.
‘ఏకాకీ న రమతే’ హీ శ్రుతీ | ‘బహు స్యామ్’ ఏశితా ప్రీతీ | ఆవడూ లాగే దుజియాచీ సంగతీ | పునరపి మిళతీ ఏకత్వీ | ||౬౮||
68. ఒక్కరే రమించలేడని, అందువలన, ఇతరుల సాంగత్యాన్ని కోరి, పరబ్రహ్మ అనేకంగా మారుతాడు అనేది శృతి వచనం. అనేకంగా మారినా, మరల ఒక్కటిగా కలసి పోవటం జరుగుతుంది.
శుద్ధబ్రహ్మరూప జే స్థితీ | తేథే నా పురూష నా ప్రకృతీ | దినమణీచీ జేథే వస్తీ | దివస వా రాతీ కైంచీ తే | ||౬౯||
69. శుద్ధ బ్రహ్మ స్థితిలో, పురుషుడు లేడు ప్రకృతీ లేదు. సూర్యుడు ఉన్న చోట పగలు, రాత్రి అనేవి రెండూ ఎలా ఉంటాయి?
గుణాతీత మూళ నిర్గుణ | భక్తకల్యాణాలాగీ సగుణ | తో హా సాఈ విమలగుణ | అనన్య శరణ తయాసీ | ||౭౦||
70. గుణాలకు అతీతమైన సాయికి, ఏ గుణాలూ లేవు. కాని, భక్తుల శ్రేయస్సు కొరకు సత్వగుణ శోభితుడై, సగుణ సాకార రూపంలో అవతరించిన సాయికి శరణు.
శరణ రిఘాలే సాఈసమర్థా | త్యాంహీ చుకవిలే బహుతా అనర్థా |
మ్హణవూని యా మీ నిజస్వార్థా | పాయీ మాథా ఠేవితో | ||౭౧||
71. సాయి సమర్థులకు అనన్య శరణుజొచ్చిన వారికి ఎన్నో కష్టాలు తొలగి పోయాయి. అందుకే, నా స్వార్థం కోసం వారి పాదాలయందు నా శిరసును ఉంచుతున్నాను.
తత్వదృష్ట్యా జో తుళే నిరాళా | భక్తిసుఖార్థ రాహీ జో వేగళా | కరీ దేవభక్తాంచ్యా లీలా | తయా ప్రేమళా ప్రణిపాత | ||౭౨||
72. వాస్తవానికి సాయికి గుణాలు, ఆకారం లేకున్నా, భక్తులు భక్తిలోని ఆనందాన్ని భక్తులు అనుభవించటానికి, దేవుడు-భక్తుడు అన్న లీలను చూపారు. ఆ ప్రేమ స్వరూపునకు నా సాష్టాంగ నమస్కారం.
జో సర్వ జీవాంచీ చిత్కలా | సంవిత్స్ఫరణే జో అధిష్ఠిలా | జో జడచైతన్యే ఆకారలా | తయా ప్రేమళా ప్రణిపాత | ||౭౩||
73. సకల జీవులలోని జ్ఞాన శక్తికి మూలమై, చరాచరాలలో చైతన్యంగా ఉన్న ఆ ప్రేమమయునకు నా సాష్టాంగ నమస్కారాలు.
తూ తవ మాఝీ పరమగతీ | తూంచి మాఝీ విశ్రాంతీ | పురవితా మజ ఆర్తాచీ ఆర్తీ | సుఖమూర్తి గురూరాయా | ||౭౪||
74. గురుదేవా! మీరు మూర్తీభవించిన ఆనందం. మీరే నా పరమ గతి. మీరే నా విశ్రాంతి నిలయం. మీరే మాలాంటి ఆర్తుల కష్టాలను తీర్చేది.
ఆతా యా నమనాచీ అఖేరీ | భూతీ భగవంత ప్రత్యంతరీ | జీవమాత్రాసీ మీ వందన కరీ | ఘ్యా మజ పదరీ ఆపుల్యా | ||౭౫||
75. ఈ వందన సమర్పణ చివరగా సర్వ జీవులలోనున్న, సర్వజీవులకు నమస్కారం చేసి, వారందరూ నన్ను తమ అక్కున చేర్చుకోవాలని ప్రార్థిస్తున్నాను.
నమన సకల భూతజాతా | యేణే సుఖావో విశ్వభర్తా | తో విశ్వంభర అంతర్బాహ్యతా | ఏకాత్మా అభేదే | ||౭౬||
76. సర్వజీవులకూ నమస్కరించటం వలన, ఈ జగత్తు లోపల, బయటా, ఒకే ఆత్మగా, వేరు చేయలేని రూపంగా వ్యాపించి, విశ్వాన్ని పోషించే విశ్వంభరుడు ఆనందిస్తాడు.
ఏవం పరిపూర్ణ ఝాలే నమన | జే ఆరబ్ధ పరిసమాప్తీచే సాధన | హేంచి యా గ్రంథాచే మంగలాచరణ | ఆతా ప్రయోజన నివేదీ | ||౭౭||
77. దీంతో వందన సమర్పణ పరిపూర్ణమైంది. మొదలుపెట్టిన పని చక్కగా జరగటానికి ఇది సాధనం. ఇదే ఈ గ్రంథంయొక్క మంగళాచరణం. ఇక ఈ గ్రంథంయొక్క ప్రయోజనాన్ని చెప్తాను.
సాఈనీ మజ కృపా కరూన | అనుగ్రహిలే జై పాసూన | తయాంచేచ మజ అహర్నిశ చింతన | భవ భయకృంతన తేణేనీ | ||౭౮||
78. సాయి నన్నుఅనుగ్రహించినప్పటినుండి, నేను పగలూ రాత్రీ, వారినే ధ్యానిస్తున్నాను. దానివల్ల భవభీతి నశిస్తుంది.
నాహీ మజ దుసరా జప | నాహీ మజ దుసరే తప | అవలోకీ ఏక సగుణరూప | శుద్ధస్వరూప సాఈచే | ||౭౯||
79. అంతకంటే నాకు వేరే ఏ జపాలూ లేవు, తపస్సులూ లేవు. శుద్ధమైన, కనిపిస్తున్న సాయి స్వరూపాన్ని చూడటం ఒకటే నా పని.
పాహతా శ్రీసాఈచే ముఖ | హరూన జాతసే తహానభూక | కాయ తయాపుఢే ఇతర సుఖ | పడే భవదుఃఖవిస్మృతి | ||౮౦||
80. వారి సుందరమైన ముఖాన్ని చూస్తుంటే, ఆకలి దప్పులు లేకుండా పోతాయి. ప్రపంచంలోని దుఃఖాలను మరిపించగల ఆ ఆనందం ముందు, ఇతర సుఖాలు ఎందుకు?
పాహతా బాబాంచే నయనాకడే | ఆపఆపణా విసర పడే |
ఆతునీ యేతీ జై ప్రేమాచే ఉభడే | వృత్తి బుడే రసరంగీ | ||౮౧||
81. బాబా కళ్ళను చూస్తుంటే, చూసేవారు తమ్ము తాము మరచిపోతారు. హృదయంనుండి ప్రేమ ఉప్పొంగి మనస్సు ఆనందంలో మునిగిపోతుంది.
కర్మధర్మ శాస్త్రపురాణ | యోగయాగ అనుష్ఠాన | తీర్థయాత్రా తపాచరణ | మజ ఏక చరణ సాఈచే | ||౮౨||
82. సాయి పాదాలే నాకు కర్మ, ధర్మ, శాస్త్ర, పురాణాలు, యోగ, యాగాలు చేసినట్టే. తీర్థయాత్రలు, తపస్సు అన్నీ కూడా, నాకు సాయి పాదాలే.
అఖండ గురూవాక్యానువృత్తీ | దృఢ ధరితా చిత్తవృత్తీ | శ్రద్ధేచియా అఢళ స్థితీ | స్థైర్యప్రాప్తి నిశ్చళ | ||౮౩||
83. గురువు ఉపదేశం ప్రకారం నడుచుకుంటూ, పగలూ రాత్రీ మనస్సును శ్రద్ధాస్థితిలో స్థిరపరుస్తే, మనసుకు శాశ్వతమైన పరమ శాంతి లభిస్తుంది.
హేచి కర్మానుబంధస్థితీ | వాఢలీ సాఈపదాసక్తీ | ప్రత్యయా ఆలీ అర్తక్య శక్తీ | కాయ మ్యా కితీ వర్ణావీ | ||౮౪||
84. వెనక చేసిన పనులయొక్క ఫలితంగా, నాకు సాయి పాదాలయందు ఆసక్తి కలిగింది. దాని పరిణామంగా వారి శక్తి అనుభవమైంది. దానిని నేను ఎంతని వర్ణించను?
జే శక్తి ఉపజవీ భక్తీ | సమర్థ సాఈచరణాసక్తీ | సంసారీ రాహూని సంసారనివృత్తీ | ఆనందవృత్తి జే దేఈ | ||౮౫||
85. భక్తిని పుట్టించే ఈ శక్తి, సమర్థ సాయి పాదాలయందు ప్రీతిని పెంపొందిస్తుంది. ప్రపంచంలో ఉంటూనే, దానినుండి వేరుగా ఉండే భావాన్ని కలిగించి, ఆ ఆనందాన్ని అనుభవింప చేస్తుంది.
నానా ప్రకారీ నానా మతీ | భక్తీచే ప్రకార బహుత కథితీ | సంక్షేపే తయాంచీ లక్షణస్థితీ | యథానిగుతీ కథీన | ||౮౬||
86. భక్తిని అనేకులు అనేక రకాలుగా వర్ణించారు. వాని లక్షణాలను, నా శక్తికొలది సంక్షిప్తంగా మనవి చేస్తాను.
‘స్వస్వరూపానుసంధాన’ | హే ఏక భక్తీచే ముఖ్య లక్షణ |
మ్హణతీ వేదశాస్త్రవ్యుత్పన్న| జ్ఞానసంపన్న ఆచార్య | ||౮౭|| ‘స్వస్వరూపానుసంధాన’ | హే ఏక భక్తీచే ముఖ్య లక్షణ |
87. మన ఆత్మయొక్క నిజమైన రూపాన్ని, ఎల్లప్పుడూ ధ్యానిస్తు ఉండడమే, భక్తియొక్క ముఖ్య లక్షణమని వేదశాస్త్రలు చదివిన పండితులు, జ్ఞాన సంపన్నులైన ఆచార్యులు అన్నారు.
పూజాదికీ ప్రేమవ్యక్తీ | అర్చనభక్తీచీ హే రీతీ | ఏసీ పారాశర వ్యాసోక్తీ | భక్తి మ్హణతీ తీ ఏక | ||౮౮||
88. పూజాదులతో ప్రేమను తెలుపడం, అర్చన భక్తి లక్షణమని పరాశరుని కొడుకైన వ్యాస మహర్షి అన్నాడు.
గురూప్రీత్యర్థ ఉపవన | పారిజాతాది పుష్పావచయ జాణ |
గోమయ - సండా - సంమార్జన | గుర్వగణ ఝాడావే | ||౮౯|| గురూప్రీత్యర్థ ఉపవన | పారిజాతాది పుష్పావచయ జాణ |
89. గురువుగారి ప్రీతి కోసం వనాలనుండి పారిజాతం మొదలగు పువ్వులను తీసుకుని వచ్చి వారికి అర్పించి, వారి ఇంటి ముందర శుభ్రం చేసి, గోమయంతో అలకాలి.
ప్రథమ స్నాన సంధ్యా కరణే | గురూదేవార్థ గంధ ఉగాళణే | పంచామృతస్నాన ఘాలణే | ధూపదీపార్చనేసీ | ||౯౦||
90. తరువాత, తాము ముందుగా స్నానం చేసి, సంధ్యావందనం ముగించుకొని, గురుదేవుల కొరకు గంధం తీసి, పంచాభిషేకం చేసి, ధూప దీపాలతో అర్చన చేసి,
తదుపరీ నైవేద్య సమర్పణే | ఆరతీ ధూపారతీ కరణే |
ఏసే జే సప్రేమ ఘడణే | ‘అర్చన’ నావ యా సకళా | ||౯౧||
91. నైవేద్యం సమర్పించి, హారతి నీరాజనాలు ఇవ్వడం మొదలగు వానిని భక్తి శ్రద్ధలతో ప్రేమపూర్వకంగా చేయటాన్ని అర్చన-భక్తి అని అంటారు.
ఆపులే హృదయీంచీ చిత్కలా | శుద్ధ-బుద్ధ-స్వభావ నిర్మలా | మూర్తీత ఆమంత్రూని తిజలా | అర్చనాలా లాగావే | ||౯౨||
92. తరువాత తమ హృదయంలోని నిర్మలమైన శుద్ధ జ్ఞాన స్వరూపమైన చైతన్యాన్ని ప్రతిమా మూర్తియందు ఆహ్వానించి, పూజించాలి.
మగ తే చిత్కలా మాగుతీ | పూజనార్చన విసర్జనాంతీ | నిజహృదయీ పూర్వస్థితీ | అవస్థిత కరావీ | ||౯౩||
93. అర్చనాదుల తరువాత ఆ చైతన్యాన్ని మరల తమ హృదయంలోని మునుపటి స్థితియందు స్థాపించాలి.
ఆతా అవాంతర భక్తీచే లక్షణ | గర్గాచార్యమతీ జాణ | మన హోయ గుణకీర్తనీ తల్లీన | హోయ విలీన హరిరంగీ | ||౯౪||
94. గర్గాచార్యుల ప్రకారం, మనసును హరియొక్క గుణగణాలను సంకీర్తన చేస్తు, దానిలో తల్లీనత చెంది హరియందు విలీనమై పోవటం మరొక భక్తికి లక్షణం.
అఖండ ఆత్మానుసంధాన | కథాకీర్తన విహితాచరణ | హే తో పుఢీల భక్తీ జాణ | శాండిల్యవచన హే ఏసే | ||౯౫||
95. ఎల్లప్పుడూ ఆత్మను ధ్యానిస్తూ, శాస్త్రాలలో చెప్పిన ప్రకారం నడుచుకుంటూ, హరికథ, సంకీర్తనలలో పాల్గొనటం, ఒక రకమైన భక్తి లక్షణమని శాండిల్య ముని అన్నారు.
జయా మనీ సాధావే స్వహిత | తే తే ఆచరతీ వేదవిహిత | కర్మ నిషిద్ధ ఆణి అవిహిత | టాళితీ నిజహితబాధక జే | ||౯౬||
96. తమ హితం సాధించదలచిన వారు, వేదశాస్త్రాలలో చెప్పిన పనులను ఆచరిస్తారు. తమకు చెడు కలిగించే పనులను, వేదాలలో చెప్పనివి మరియు నిషిద్ధమైనవి, ఆచరించకుండా ఉంటారు.
కోణ్యాహీ క్రియేచా వా ఫలాచా | కర్తా భోక్తా నాహీ మీ సాచా | హా భావ ఉపజే జై నిరహంకృతీచా | బ్రహ్మార్పణాచా తో యోగ | ||౯౭||
97. అహంకార భావం మొత్తంగా నశించి, క్రియకు కాని, దాని ఫలానికి కాని తాను కారణం కాదని నిజంగా అనుకున్నప్పుడు, మనసు తనంతట తాను భగవంతుడికి అర్పించుకుంటుంది.
ఏసియా రీతీ కరితా | సహజీ ఉపజే నైష్కర్మ్యతా | కర్మ కదాపి న యే త్యాంగితా | కర్మకర్తృతా త్యాగూ యే | ||౯౮||
98. ఈ విధంగా పనులను ఆచరిస్తే, సహజంగా కర్మనుంచి ముక్తి సిద్ధిస్తుంది. కర్మ త్యాగం సంభవం కాదు, కాని కర్మకు కారణం తాను, అనే అహంభావాన్ని త్యాగం చేయవచ్చు.
కాంట్యానే కాంటా కాఢిల్యావిణ | కర్మ థాంబేనా కర్మావాచూన | హాతీ లాగతా నిజాత్మఖూణ | కర్మ సంపూర్ణ రాహీల | ||౯౯||
99. ముల్లును ముల్లుతో తీసే విధంగా, కర్మను కర్మతోనే తొలగించాలి. ఆత్మ నిజమైన రూపాన్ని తెలుసుకున్న వెంటనే కర్మ పూర్తిగా నశిస్తుంది.
ఫలాశేచా పూర్ణవిరామ | కామ్యత్యాగాచే హేచి వర్మ | కరణే నిత్యనైమిత్తిక కర్మ | ‘శుద్ధ స్వధర్మ’ యా నావ | ||౧౦౦||
100. కర్మలను చేసి, వానిలోంచి వచ్చే ఫలానికి ఆశ పడకపోవటమే, కోరికలను త్యజించడంలోని మర్మం. శాస్త్రాలలో చెప్పబడిన నిత్య కర్మలను ఆచరించటం శుద్ధ స్వధర్మం అని అంటారు.
సర్వ కర్మ భగవంతీ అర్పణ | క్షణైక విస్మరణే నిర్విణ్ణ మన |
ఏసే నారదీయ భక్తీంచే వర్ణన | భిన్నలక్షణ1 భక్తి హే | ||౧౦౧||
101. అన్ని కర్మలనూ భగవంతునికే సమర్పించి, అన్నీ మరచిపోయి, ఒక్క క్షణమైనా నిశ్చలమైన మనసుతో ఉండటం, నారదుడు వర్ణించిన మరొక రకమైన భక్తి లక్షణం.
ఏశీ భక్తీచీ అనేక లక్షణే | ఏకాహూని ఏక విలక్షణే | ఆపణ కేవళ గురూకథానుస్మరణే | కోరడ్యా చరణే భవ తరూ | ||౧౦౨||
102. ఈ విధంగా ఒకటికంటే మరొకటి విలక్షణమైన అనేక భక్తి లక్షణాలుండగా, మనం కేవలం గురుకథా శ్రవణంతో, సంసార సాగరాన్ని కాళ్లకు తడి అంటకుండా, అవలీలగా దాటగలం.
హా గురూకథాశ్రవణఛంద | లాగలా మజ ఝాలో దంగ | స్వయేహీ కరావే కథాప్రబంధ | అనుభవసిద్ధ వాటలే | ||౧౦౩||
103. నేను కూడా గురుకథా శ్రవణమందు ఆసక్తి కలిగి, దానిలో తల్లీనుణ్ణయ్యాను. అనుభవ సిద్ధమైన కథలతో, స్వయంగా గ్రంథాన్ని రచించాలని అనిపించింది.
పుఢే ఏకదా శిరడీస అసతా | దర్శనార్థ మశిదీ జాతా | బాబాంసీ దేఖిలే గహూ దళతా | అతివిస్మయతా ఉదేలీ | ||౧౦౪||
104. శిరిడీలో ఉండగా, ఒక సారి నేను బాబా దర్శనానికి మసీదుకు వెళ్లినప్పుడు, అక్కడ బాబా గోధుమలను విసరటం చూచి, నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది.
ఆధీ కథితో తీ కథా | శ్రవణ కరావీ స్వస్థచిత్తా | త్యాంతూని ఉద్భథవ యా సాఈచరితా | ఝాలా కేఉతా మగ పరిసా | ||౧౦౫||
105. ముందుగా ఆ కథను వివరిస్తాను. శ్రద్ధగా వినండి. ఈ సాయి సచ్చరిత దానిలోనుండి ఎలా జన్మించిందో అనేది కూడా వినండి.
‘ఉత్తమశ్లోకగుణానువాద’ | తయాచా ప్రేమకథాసంవాద | కరితా హోఈల చిత్త శుద్ధ | బుద్ధీహీ విశద హోఈల | ||౧౦౬||
106. ఉత్తమమైన వారి కీర్తి, గుణాలను వర్ణించడం, మరియు ప్రేమపూరితమైన వారి కథలను చర్చించుకోవడం వలన మనసు శుద్ధమై, బుద్ధి వికాసవంతమవుతుంది.
పుణ్యశ్లోకగుణానువర్ణన | తత్త్కథా తల్లీలా శ్రవణ | యేణే భగవత్పురితోషణ | క్లేశనివారణ త్రితాపా | ||౧౦౭||
107. వారి గుణాలను వర్ణించి, వారి గుణాలను, లీలలను శ్రవణం చేస్తే, భగవంతుడు ప్రసన్నుడై కష్టాలను, బాధలను తొలగించి, దుఃఖాలను నివారిస్తాడు.
అధిభూతాదితాపనిర్విణ్ణ | ఆత్మహితేచ్ఛు ఆత్మప్రవణ | ఆవడీ తయాంచే ధరితీ చరణ | అనుభవసంపన్న మగ హోతీ | ||౧౦౮||
108. అది భౌతిక, ఆధ్యాత్మిక, అధి దైవికము అను మూడు తాపలతో బాధ పడేవారు, తమ హితాన్ని కోరుకునే వారు, ఆత్మానందాన్ని కోరుకునే వారు, అందరూ సాయి పాదాలను ప్రేమతో ఆశ్రయిస్తే, ఆత్మయొక్క రూపాన్ని కనుగొన్న భావాన్ని పొందగలరు.
అసో ఆతా దత్తచిత్త | వ్హా జీ పరిసా గోడ వృతాంత్త | వాటేల బాబాంచే ఆశ్చర్య బహుత | కృపావంతత్వ పాహూని | ||౧౦౯||
109. బాబాయొక్క దయాగుణాన్ని తెలియపరచే అత్యంత ఆశ్చర్యకరమైన మధుర సంగతులను సావధాన చిత్తులై ఆలకించండి.
ఏకే దివశీ సకాళీ జాణ | బాబా కరోని దంతధావన | సారోనీ ముఖప్రక్షాళణ | మాండూందళణ ఆరభిలే | ||౧౧౦||
110. ఒక రోజు ఉదయం, దంతధావనం, ముఖ ప్రక్షాళనం చేసుకుని బాబా విసరటానికి మొదలుపెట్టారు.
హాతీ ఘేతలే ఏక సూప | గేలే గవ్హాంచే పొత్యాసమీప |
భరభరూని మాపావర మాప | గహూ సుపాంత కాఢిలే | ||౧౧౧||
111. చేటను చేత పుచ్చుకుని, మొదట, గోధుమలున్న గోనె సంచీ వద్దకు వెళ్లారు. ఒక డబ్బాతో కొలచి కొలచి, గోధుమలను చేటలోకి పోసుకున్నారు.
దుసరా రికామా గోణ పసరిలా | వరీ జాత్యాచా ఠావ ఘాతలా | ఖుంటా ఠోకూని ఘట్ట కేలా | వ్హావా న ఢిలా దళతానా | ||౧౧౨||
112. తరువాత, ఖాళీ గోనె సంచీని నేలపై పరచి, దానిపై తిరుగలిని ఉంచారు. విసిరేటప్పుడు దాని పిడి వదులై ఊడిపోకుండా గట్టిగా బిగించారు.
మగ అస్తన్యా సారూని వరీ | కఫనీచా ఘోళ ఆవరీ | బైసకా దేఊని జాత్యాచే శేజారీ | పసరూని పాస బైసలే | ||౧౧౩||
113. అనంతరం, చేతిపై చొక్కాను పైకి లాక్కొని తిరుగలి ముందు కాలు చాపుకొని కూర్చున్నారు.
మహదాశ్చర్య మాఝియే మనా | దళణాచీ హీ కాయ కల్పనా |
అపరిగ్రహా అకించనా | హీ కా వివంచనా అసావీ | ||౧౧౪||
114. నాకు అత్యంత ఆశ్చర్యం కలిగింది. ఇలా విసరటంలో వీరి ఉద్దేశం ఏమిటి? ఎప్పుడూ, ఏమీ ఆశించని వారికి, ఏమీ సంగ్రహించని వారికి, ఈ బాధ ఎందుకు?
అసో ఖుంటా ధరోని హాతీ | మాన ఘాలోనియా ఖాలతీ | బాబా నిజహస్తే జాతే ఓఢితీ | వైరా రిచవితీ నిఃశంక | ||౧౧౫||
115. చేతిలో తిరగలి పిడిని పట్టుకుని, మెడను క్రిందకు వంచి కూర్చుని, తమ చేతులతో స్వయంగా తిరగలిని త్రిప్పుతూ, గోధుమలను విసర సాగారు.
సంత దేఖిలే అనేక | పరీ దళణారా హాచి ఏక | గహూ పిసణ్యాచే తే కాయ సుఖ | త్యాంచే కౌతుక జో జాణే | ||౧౧౬||
116. అనేక మంది సాధువులను చూచాను, కాని, ఇలా తిరగలితో పిండి విసిరిన వారు వీరొక్కరే. గోధుమలను విసరటంలోని సుఖమేమిటో వారికే తెలియాలి.
లోక పాహతీ సాశ్చర్య చిత్తా | ధీర న పుసాయా హే కాయ కరితా | గాంవాంత పసరతా హే వార్తా | పాతల్యా తత్త్వతాం నరనారీ | ||౧౧౭||
117. అక్కడున్న జనం ఆశ్చర్య చకితులై ఆ వింతను చూస్తున్నారే కాని, ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. ఊరిలో వారికి ఈ సంగతి తెలిసిన వెంటనే స్త్రీలు, పురుషులు అంతా వచ్చారు.
ధావతా ధావతా బాయా థకల్యా | చౌఘీ లగబగా మశీదీ చఢల్యా | జాఊని బాబాంచే హాతా ఝోబల్యా | ఖుంటా ఘేతలా హిసకోని | ||౧౧౮||
118. పరుగు పరుగున వచ్చిన స్త్రీలు అలసిపోయారు. వారిలో నలుగురు స్త్రీలు, బాబా చేతిని వదిలించి, తిరగలి పిడిని లాక్కొన్నారు.
బాబా త్యాసవే భాండతీ | త్యా ఏకసరా దళూ లాగతీ | దళతా బాబాంచ్యా లీలా వానితీ | గీతే గాతీ బాబాంచీ | ||౧౧౯||
119. బాబా వారితో దెబ్బలాడారు. అయినా ఆ స్త్రీలు వినకుండా, బాబా లీలలను వర్ణించే పాటలను పాడుతూ విసర సాగారు.
పాహూని బాయాంచే ప్రేమాలా | ఉసనా రాగ ఠాయీంచ నివాలా | రాగాచా తో అనురాగ ఝాలా | హసూ గాలాంత లాగలే | ||౧౨౦||
120. ఆ స్త్రీల ప్రేమను చూసి, అరువు తెచ్చుకున్న కపట కోపం చల్లబడి, ప్రేమగా వారిని చూచి, బాబా నవ్వసాగారు.
దళణ ఝాలే పాయలీచే | సూప రికామే ఝాలే సాచే |
బాయాంచే మగ తరంగ మనాచే | లాగలే నాచూ అనివార | ||౧౨౧||
121. నాలుగు సేర్లంత గోధుమలనంతా ఆ స్త్రీలు విసిరారు. చేటలు ఖాలీ అయ్యాయి. అప్పుడు ఆ స్త్రీల మనసులో ఆలోచనల అలలు ఏ అడ్డంకూ లేకుండా నాట్యం చేయసాగాయి.
బాబా న స్వయే భాకర కరితీ | త్యాంచీ తో ప్రత్యక్ష భైక్ష్యవృత్తీ | తే యా పిఠాచే కాయ కరితీ | బాయా తర్కితీ మనాంత | ||౧౨౨||
122. 'బాబా స్వయంగా రొట్టెలను చేసుకోరు, ఎందుకంటే వారు భిక్షాటనతో జీవిస్తారు. అలాంటప్పుడు ఇంత పిండిని ఆయన ఏం చేసుకుంటారు?' అని వారు మనసులో తర్కించుకున్నారు.
నాహీ బాఈల నాహీ లేక | బాబా తో ఏకులతే ఏక | ఘరదార న సంసార దేఖ | కశాస కణిక ఏవఢీ | ||౧౨౩||
123. 'వారికి పెళ్ళాం పిల్లలు ఎవరూ లేరు. వారు ఒక్కరే ఒక్కరు. ఇల్లు, వాకిలిగాని, సంసారంగాని ఏవీ లేవు. మరి వారికి ఇంత పిండి ఎందుకు?
ఏక మ్హణే బాబా పరమకృపాళ | ఆమ్హాప్రీత్యర్థ తయాంచా ఖేళ | ఆతా హీ కణిక నిఖళ | దేతీల సకళ ఆమ్హాతే | ||౧౨౪||
124. 'బాబా పరమ కృపాళువు. వారి లీల మనలను సంతోష పెట్టడానికే. ఇప్పుడు ఈ పిండిని అంతా వారు మనకే ఇస్తారు' అని వారిలో ఒకామె అన్నది.
కరితీల ఆతా చార భాగ | ఏకేకీచా ఏకేక విభాగ | ఏసే మనాంత మాండే దేఖ | త్యా సకళీక భాజితీ | ||౧౨౫||
125. ఇప్పుడు ఆ పిండిని నాలుగు భాగాలుగా చేసి, ఒక్కో భాగం ఒక్కొకరికి ఇచ్చేస్తారని వారంతా మనసులో అనుకున్నారు.
బాబాంచే ఖేళ బాబాంసీ ఠావే | కో్ణీ న తయాంచా అంత పావే | పరీ బాయాంచే మనాచే ఉఠావే | లోభే లుటావే బాబానా | ||౧౨౬||
126. కాని, బాబా లీలలు బాబాకే తెలుసు. అవి ఎవ్వరికీ అంతు పట్టవు. అయినా బాబాను దోచుకోవాలని ఆ స్త్రీల మనసులో దురాశ పుట్టింది.
పీఠ పసరలే గోధూమ సరలే | జాతే భింతీసీ టేకూని ఠేచిలే | సుపాంత బాయానీ పీఠ భరిలే | నేఊ ఆదరిలే ఘరోఘర | ||౧౨౭||
127. గోధుమలు అయిపోయి, పిండిని పరచారు. తిరగలిని గోడకు ఆనించి పెట్టారు. చేటలలో పిండిని నింపుకుని, ఇళ్ళకు వెళ్ళటానికి ఆ స్త్రీలు సిద్ధమయ్యారు.
తేథపర్యంత బాబా కాహీ | చకార శబ్ద వదలే నాహీ | భాగ కరితా చార చౌఘీహీ | వదతీ పాహీ మగ కైసే | ||౧౨౮||
128. అంతవరకూ, బాబా ఏం మాట్లాడలేదు. కాని, ఆ నలగురు స్త్రీలు పిండిని పంచుకున్నాక, వారు ఏమన్నారో వినండి.
“చళల్యా కాయ కుఠే నేతా | బాపాంచా మాల ఘేఊని జాతా | జా శివేవరీ నేఊని ఆతా | పీఠ తత్త్వతాం టాకా తే | ||౧౨౯||
129. “పిండిని ఎక్కడికి తీసుకొని వెళ్లుతున్నారు? మీ బాబు సొమ్మని తీసుకుని వెళ్లుతున్నారా? దీనిని పట్టుకుని పోయి, గ్రామ సరిహద్దులలో చల్లండి.
ఆల్యా రాండా ఫుకటఖాఊ | లుటాయా మజ ధాంవధావూ | గహూ మాఝే కాయ కర్జాఊ | పీఠ నేఊ పాహతా” | ||౧౩౦||
130. “తేరగా దొరికింది కదా అని, నన్ను దోచుకోవడానికి పరుగు పరుగున వచ్చారు. నేనేం మీకు గోధుమలు బాకీ ఉన్నానా? పీండిని పట్టుకుని వెళ్ళాలనుకుంటున్నారు?”
బాయా మనీ బహు చురమురల్యా | లోభా పాయీ ఫజిత పావల్యా |
ఆపఆపసాంత కుజబుజూ లాగల్యా | తాత్కాళ గేల్యా శివేవరీ | ||౧౩౧||
131. ఆ స్త్రీలు మనసులో చాలా కోపగించుకున్నారు. తమ దురాశ గురించి సిగ్గు పడ్డారు. వారిలో వారు గుసగుసలాడుకుని, తక్షణమే గ్రామ సరిహద్దుకు వెళ్లారు.
ఆరంభ బాబాంచా కోణాహీ నకళే | కారణ ప్రథమతః కాహీహీ నకళే | ధీర ధరితా పరిణామీ ఫళే | కౌతుక ఆగళే బాబాంచే | ||౧౩౨||
132. బాబాయొక్క పనికి కారణం మొదట ఎవరికీ అర్థం కాలేదు. కాని, ఓపికతో ఉంటే, బాబా లీలయొక్క పరిణామం అర్థమవుతుంది.
పుఢే మగ మ్యా లోకా పుసిలే | హే కా బాబానీ ఏసే కేలే | రోగరాఈస సంపూర్ణ ఘాలవిలే | జన వదలే ఏసేనీ | ||౧౩౩||
133. తరువాత, బాబా ఎందుకిలా చేశారని నేను జనులను ప్రశ్నించగా, వారు బాబా అలా చేసి, మహమ్మారి కలరా రోగాన్ని పూర్తిగా తొలగించారు అని అన్నారు.
గోధూమ నాహీ తీ మాహామారీ | భరడావయా జాత్యాంత వైరీ | తో మగ భరడా శివేవరీ | ఉపరాఉపరీ టాకవీ | ||౧౩౪||
134. అవి గోధుమలు కావు, మహమ్మారి కలరాను బాబా తిరగలిలో వేసి, పిండి చేసారు. తరువాత దానిని గ్రామ సరిహద్దులలో చల్లించారు.
పీఠ టాకిలే ఓఢియాకాంఠీ | తేథూని రోగాసీ లాగలీ ఓహటీ | దుర్దిన గేలే ఉఠాఉఠీ | హే హాతోటీ బాబాంచీ | ||౧౩౫||
135. ఈ రకంగా పిండిని కాలువ గట్టున చల్లినప్పటినుండి కలరా వ్యాధి తగ్గి, చెడు రోజులు వెంటనే పోయాయి. ఇదే బాబాయొక్క కౌశలం.
గావాంత హోతీ మరీచీ సాంథ | కరితీ హా తోడగా సాఈనాథ | ఝాలీ రోగాచీ వాతహత | గాంవాస శాంతత్వ లాధలే | ||౧౩౬||
136. గ్రామంలో కలరా వ్యాధి ప్రబలి ఉండటం వలన సాయినాథులు ఈ ఉపాయం చేశారు. దానితో కలరా వ్యాధి పోయి, గ్రామంలో ప్రశాంతత మళ్లి నెలకొంది.
పాహోని దళణాచా దేఖావా | కౌతుక వాటలే మాఝియా జీవా | కైసా కార్యకారణభావ జుళవావా | తాళా మిళవావా హా కైసా | ||౧౩౭||
137. పిండి విసిరిన దృశ్యాన్ని చూచి నాకు కుతూహలం కలిగింది. ఈ పని పరిణామానికి, కారణానికి కల సంబంధం ఏమిటి? ఒకదానికొకటి ఎలా సమన్వయ పరచాలి?
కాయ అసావా హా అనుబంధ | గవ్హా-రోగాచా కాయ సంబంధ | పాహూని అతక్య్ర కారణ నిర్బంధ | వాటలే ప్రబంధ లిహావా | ||౧౩౮||
138. గోధుమలకు, కలరాకు ఏమి సంబంధం? అంతు పట్టని ఈ చర్యను చూసి, బాబా లీలల గురించి, గ్రంథం వ్రాయాలనే సంకల్పం కలిగింది.
క్షీరసాగరా యావ్యా లహరీ | ప్రేమ ఉచంబళలే తైసే అంతరీ | వాటలే గావీ తీ పోటభరీ | కథా మాధురీ బాబాంచీ | ||౧౩౯||
139. పాల సముద్రంపైన లేచే అలల వలె, నా మనసులో ప్రేమ తరంగాలు ఉప్పొంగాయి. బాబాయొక్క మధుర గాథను మనసారా గానం చేయాలనే కోరిక కలిగింది.
హేమాడ సాఈనాథాసీ శరణ | సంపలే తే మంగలాచరణ | సంపలే ఆప్తేష్టసంతనమన | సద్గు రూవందన అఖండ | ||౧౪౦||
140. హేమాడు సాయినాథుల శరణు వేడుకుంటున్నాడు. దీనితో, మంగలాచరణం ముగిసింది. ఆప్తులకు, మిత్రులకు, సాధు సంతులకు, వందనం ముగిసింది. సద్గురువుకు అంతులేని నమస్కారాలు.
పుఢీల అధ్యాయీ గ్రంథ ‘ప్రయోజన’ | ‘అధికారీ’ ‘అనుబంధ’ దర్శన |
యథామతి కరీన కథన | శ్రోతా స్వస్థమన పరిసిజే | ||౧౪౧||
141. తరువాతి అధ్యాయంలో గ్రంథ రచనకు ప్రయోజనం, గ్రంథకర్తయొక్క యోగ్యత, మరియు వీటికీ కథకు గల సంబంధం గురించి, నాకు తోచిన రీతిలో తెలియజేస్తాను. శ్రోతలు నిశ్చల మనసుతో వినండి.
తైసేచి శ్రోత్యాతవక్త్యాంచే నిజహిత | ఏసే హే శ్రీసాఈ-సచ్చరిత |
రచితా హా కోణ హేమాడపంత | హోఈలహీ విదిత పుఢారా | ||౧౪౨||
టిపణీ:
1. జిచీ లక్షణే భిన్న ఆహేత అశీ.
తైసేచి శ్రోత్యాతవక్త్యాంచే నిజహిత | ఏసే హే శ్రీసాఈ-సచ్చరిత |
రచితా హా కోణ హేమాడపంత | హోఈలహీ విదిత పుఢారా | ||౧౪౨||
142. అలాగే, విన్నవారికి, చెప్పినవారికి, శ్రేయస్సును కలిగించే ఈ సాయి సచ్చరితను రచించిన హేమాడుపంతు ఎవరు అన్న సంగతి కూడా తరువాత తెలుపబడుతుంది.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | మంగలాచరణ నామ |
| ప్రథమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ:
1. జిచీ లక్షణే భిన్న ఆహేత అశీ.
thank you so much andi. Great sai seva. We are blessed
ReplyDelete