|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౦ వా ||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
జో సర్వలోకహితీ రత | బ్రహ్మ స్వరూపీ నిత్యస్థిత |
స్మరా తయాతే అవిరత | ప్రేమ భరిత అంతరే | ||౧||
1. లోకంలోని అందరికీ మంచిని చేస్తూ, తాను మటుకు సదా బ్రహ్మతో ఒకటైన వారిని, భక్తి నిండిన మనసుతో ఎప్పుడూ గుర్తు చేసుకోండి.
జయాచ్యా స్మరణమాత్రేంచ | ఉకలే జన్మమరణాచా పేంచ | సాధనాంత సాధన తే హేంచ | నాహీ వేంచ కపర్దిక | ||౨||
2. వారిని గుర్తు చేసుకున్నంత మాత్రమే, చావు పుట్టుకల చక్రం తొలగిపోతుంది. సాధనలలో ఇదే ఉత్తమమైన సాధనం. దీని కోసం ఒక గవ్వైనా ఖర్చు కాదు.
అల్ప ప్రయాసే అనల్పఫళ | అనాయాసే హాతా యే సకళ | జోవరీ హా ఇంద్రియగణ అవికల | తోంవరీ పళపళ సాధావే | ||౩||
3. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలం సులభంగా చేతికి దక్కుతుంది. మన ఇంద్రియాలు దృఢంగా ఉన్నంత వరకు, ప్రతి క్షణాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి.
ఇతర దేవ సారే మాయిక | గురూచి శాశ్వత దేవ ఎక | చరణీ ఠేవితా విశ్వాస దేఖ | రేఖేవర మేఖ మారీతో | ||౪||
4. ఇతర దేవతలందరూ మాయ, మనకు చిక్కనివారు. కాని, గురువొక్కరే ఎప్పటికీ ఉండే దైవం. వారి పాదాలయందు నమ్మకం ఉంచితే, వారు విధి వ్రాతను కూడా మార్చగలరు.
జేథే సద్గురూ సేవా చోఖట | సంసారాచే సమూళ తళపట | న్యాయ మీమాంసాది ఘటపట | నలగే ఖటపట కాంహీహీ | ||౫||
5. సద్గురువును శుద్ధమైన మనసుతో, శ్రద్ధతో సేవిస్తే, సంసారంలోని, సుఖ దుఃఖాలన్నీ నాశమవుతాయి. ఏ రకమైన న్యాయ, మీమాంసల చర్చలు, లేక ఇతర బుద్ధితో కూడిన శ్రమ అవసరం లేదు.
అధిభూత ఆణి అధ్యాత్మిక | తిసరే దుఃఖ తే అధిదైవిక | తరూన జాతీ భక్త భావిక | హోతా నావిక సద్గురూ | ||౬||
6. సద్గురువు నావికుడైతే, అధిభౌతిక, ఆధ్యాత్మిక, అధిదైవికం అనే మూడు దుఃఖాలనుండి, నమ్మకం ఉన్న భక్తులు తరింప బడుతారు.
తరూ జాతా లౌకిక సాగర | విశ్వాస లాగే నావాడియావర | తోచ తరావయా భవసాగర | నిజగురూవర ఠేవావా | ||౭||
7. సాగరాన్ని దాటటానికి నావికునిపై నమ్మకం ఉంచాలి కదా! అలాగే, ఈ సంసార సాగరాన్ని దాటటానికి గురువు మీద నమ్మకం ఉంచాలి.
పాహోని భక్తాంచీ భావ భక్తి | కరితో కరతలగత సంవిత్తి | ఆనంద లక్షణ మోక్షప్రాప్తి | దేతో హాతీ లీలేనే | ||౮||
8. భక్తుల భక్తి, శ్రద్ధలను గమనించి, గురువు వారికి జ్ఞానాన్ని అందజేస్తారు. అప్పుడు, ఆ జ్ఞానం, అరచేతిలోని ఉసిరికాయలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జ్ఞానం వలన ఆనందకరమైన మోక్షం సులభంగా దొరకుతుంది.
యద్దర్శనే హృదయగ్రంథీ | తుటేహో సర్వ విషయనివృత్తి | సంచిత క్రియమాణ క్షయాజాతీ | గాఊ చరితీ తయాతే | ||౯||
9. ఎవరి దర్శన మాత్రంతోనే – మనసులోని అనుమానాలన్నీ (ఆత్మ, పరమాత్మ వేరు వేరనే విరుద్ధ భావం), ఇంద్రియాల కోరికలన్నీ, మరియు ఇంతవరకు కూడబెట్టుకున్న, ఇప్పుడు చేస్తున్న – కర్మలు కరగి పోతాయో, అలాంటి సద్గురువు చరిత్రను నేను గానం చేస్తాను.
అష్టమోధ్యాయీ జాహలే కథన | నరజన్మాచే ప్రయోజన | నవమీ భిక్షావృత్తీచే గహన | గుజవర్ణన పరిసిలే | ||౧౦||
10. ఎనిమిదవ అధ్యాయంలో మనిషి జన్మ ప్రయోజనం, తొమ్మిదవ అధ్యాయంలో భిక్షాటన గొప్పతనం గురించి విన్నారు.
బాయజాబాఈచీ భాజీభాకర | ఖుశాలచందాచా సమాచార |
మ్హాళసాపతీ తాత్యాంచా శయనప్రకార | శ్రవణసుఖకర వానిలా | ||౧౧||
11. బాయజాబాయియొక్క రొట్టె కూర గురించి, ఖుశాలచందు సంగతులు, మహల్సాపతి తాత్యాతో బాబా పడుకునే పద్ధతి, వినడానికి ఎంతో ఆనందంగా వర్ణించడం జరిగింది.
ఆతా శ్రోతే దత్తచిత్త | ఏకా పుఢీల బాబాంచే చరిత | కైసే తే రాహాత కోఠే నిజత | కైసే విచరత అలక్ష్య | ||౧౨||
12. బాబాయొక్క తరువాతి చరిత్రను, వారు ఎక్కడ ఎలా పడుకునేవారు, ఎలా ఎక్కడెక్కడ తిరిగేవారు అన్న సంగతులను, శ్రోతలూ ఇప్పుడు శ్రద్ధగా వినండి.
కేవఢా లౌకిక ఆయుర్దాయ | హిందూయవనా ఉభయా మాయ | వాఘాబకర్యాంచ్యా విశ్వాసా ఠాయ | ప్రేమే నిఃసంశయ విహరతీ | ||౧౩||
13. ఎంత గొప్ప జీవనం బాబాది! హిందువులు, ముస్లిములు ఇద్దరికీ వారు తల్లి. పులి, మేకలవంటి శత్రువులైనా, బాబాయే వారికి నమ్మకమైన ఆశ్రయం. ఏ భయమూ లేకుండా, ప్రేమగా వారి వద్ద తిరిగేవి.
ఝాలీ పోటాపాణ్యాచీ కహాణీ | ఆతా కైసీ సాఈంచీ రహాణీ | కోఠే తే నిజత కోణ్యా ఠికాణీ | సాదర శ్రవణీ హోతే వ్హా | ||౧౪||
14. బాబాయొక్క ఆహారం గురించి విన్నారు. ఇప్పుడు బాబా ఎలా ఉండేవారు, ఎలా పడుకునేవారో, శ్రోతలు శ్రద్ధగా వినండి.
చౌహాతీ లాంబ లాంకడీ ఫళీ | రూంద ఎక వీతచి సగళీ | ఝోపాళ్యాపరీ ఆఢ్యాస టాంగలీ | చింధ్యాహీ బాంధిలీ ఉభయాగ్రీ | ||౧౫||
15. నాలుగు మూరల పొడవు (సుమారు 72”), ఒక జానెడు (సుమారు 10”) వెడల్పుగల చెక్క పలకపై, రెండు వైపులా గుడ్డ పేలికలు కట్టి, దానిని పైకప్పుకు వ్రేలాడగట్టి, ఆ చెక్కపై బాబా పడుకునేవారు.
ఏశా ఫళీవరీ బాబా నిజత | ఉశాపాయథ్యా పణత్యా జళత | కేవ్హా చఢత కేవ్హా ఉతరత | అలక్ష్య గతి తయాంచీ | ||౧౬||
16. వారి తలవద్దా, కాళ్ళవద్దా, దీపాలు వెలుగుతుండేవి. దాని పైకి, వారు ఎప్పుడు ఎక్కేవారో, ఎప్పుడు దిగేవారో, ఎవరూ చూసి ఎరుగరు.
మాన వాంకవూన వరతీ బైసతీ | కింవా తిచ్యావర నిద్రిస్త అసతీ | పరి తే కేవ్హా చఢతీ కేవ్హా ఉతరతీ | నకళే తే గతి కవణాహీ | ||౧౭||
17. దానిపై మెడ వంచుకుని కూర్చునేవారు. లేదా, దానిపై నిద్రించేవారు. కాని, వారు దానిపై ఎక్కడం, దిగడం ఎవరూ చూడలేదు.
ఏసీ చింధ్యానీ బాంధిలీ ఫళీ | వజన బాబాంచే కైసే సంభాళీ | మహాసిద్ధి అసతా జవళీ | నాంవాలా ఫళీ కేవళ తీ | ||౧౮||
18. చింకి గుడ్డలతో కట్టిన ఆ పలక బాబా బరువును ఎలా భరించేది? వారి దగ్గర మహామహా సిద్ధులుండగా, ఆ పలక ఏ పాటిది? అది ఒక నెపం అంతే!
అతిసూక్ష్మ కణ డోళా ఖుపే | తెథే అణిమావంత సుఖే లపే | మాశీ కీడ ముంగీ యా రూపే | సంచార సోపే బాబాంచే | ||౧౯||
19. అతి చిన్నదైన నలుసు కళ్ళలో గ్రుచ్చుకో గలిగినప్పుడు, అణిమా సిద్ధి (తనను తాను అణు మాత్రంగా మార్చుకోగల శక్తి) ని సాధించిన బాబా, అవలీలగా చెక్కపైకి ఎక్కగలరు. చీమల, దోమల, క్రిముల రూపంలో బాబా చాలా సులభంగా తిరిగేవారు.
అణిమా జయాచే ఘరచీ దాసీ | వేళ కా తయాతే హోతా మాశీ | వసేల జో అధాంతరీ ఆకాశీ | మాత త్యా కాయసీ ఫళీచీ | ||౨౦||
20. అణిమా సిద్ధి వారి ఇంట దాసి కాగా, దోమలా కావటానికి వారికి ఎంత సేపు? ఏ ఆధారమూ లేక ఆకాశంలో ఉండగలిగే వారికి, చెక్క పలక ఒక లెఖ్ఖా?
అణిమా మహిమా లఘిమా ఆది | అష్టసిద్ధి నవనిధీ |
బద్ధాంజలీ ఉభ్యా జయాచ్యా సంన్నిధీ | ఫళీ త్యా నుసధీ నిమిత్తా | ||౨౧||
21. అణిమ, మహిమ, లఘీమవంటి అష్ట సిద్ధులు, నవ నిధులు, చేతులు జోడించుకుని, వారి ప్రక్కన రెండు వైపులా నిలబడినప్పుడు, వారికి చెక్క పలక కేవలం నెపం మాత్రమే.
కీడ ముంగీ సూకర శ్వాన | పశు పక్షీ మనుష్య జాణ | రాజా రంక థోర సాన | సమసమాన పాహీ జో | ||౨౨||
22. చీమలను, క్రిమి కీటకాలను, కుక్కలను, పందులను, పశు పక్షులను, మనుషులను, రాజును, పేదను, చిన్నవారిని, పెద్దవారిని, అందరినీ బాబా సమానంగా చూసేవారు.
దిసాయా జరీ శిరడీనివాసీ | సాడేతీన హాతాచీ మిరాశీ | తరీ తే సర్వ హృదయవాసీ | పుణ్యరాశీ మహారాజ | ||౨౩||
23. మూడున్నర మూరల దేహంతో, చూడటానికి శిరిడీలో ఉన్నట్లు పైకి కనిపించినా, పుణ్యాల రాశి అయిన ఆ మహారాజు అందరి హృదయాలలో ఉన్నారు.
అంతరీ నిఃసంగ ఉదాస | బాహేర లోకసంగ్రహాచా సోస | అంతరీ జరీ పరమ నిరాశ | బాహేర పాశ భక్తాంచా | ||౨౪||
24. లోపల, ఎవరితోనూ సంబంధము లేక, ఏ కోరికలూ లేకుండా ఉన్నా, బయటకు మాత్రం, భక్తుల ప్రేమతో బంధించబడి, వారికి మార్గదర్శిగా ఉండేవారు.
అంతరీ అత్యంత నిష్కామ | బాహ్యతః భక్తార్థ అతి సకామ | అంతరీ నిజశాంతీచే ధామ | బాహ్యప్రకామ సంతప్త | ||౨౫||
25. లోపల, ఏ ఆశలూ లేకున్నా, బయటకు మాత్రం, భక్తుల మంచి కోసం ఎంతో కష్ట పడేవారు. లోపల ఎంత ప్రశాంతంగా ఉన్నా, బయట అప్పుడప్పుడు విపరీతమైన కోపాన్ని చూపే వారు.
అంతరీ పరబ్రహ్మస్థితి | బాహేర దావీ పైశాచవృత్తి | అంతరీ అద్వైత ప్రీతి | బాహ్యాతః గుంతీ విశ్వాచీ | ||౨౬||
26. లోపల, బ్రహ్మతో ఒకటైనా, బయటకు చాలా పైశాచికంగా నడుచుకునేవారు. లోపల, భేదభావం లేని ప్రేమతో ఉన్నా, బయటకు ప్రపంచపు పనులలో చిక్కుకున్నట్లు కనిపించేవారు.
కధీ పాహీ ప్రేమభావే | కధీ పాషాణ ఘేఊని ధాంవే | కధీ శివ్యా శాపాంతే ద్యావే | కధీ కవటాళావే స్వానందే | ||౨౭||
27. ఒకొకప్పుడు ఎంతో ప్రేమ చూపేవారు. మరొకప్పుడు, రాయి తీసుకుని కొట్టడానికి వెంట పడేవారు. ఒకొకప్పుడు కోపంతో చీవాట్లు పెట్టినా, మరొకప్పుడు ఆనందంగా కౌగలించుకునేవారు.
కధీ శాంత దాంత ఉపరత | తితిక్షూ సదా సమాహిత | ఆత్మస్థిత ఆణి ఆత్మరత | ప్రసన్న చిత్త భక్తాంసీ | ||౨౮||
28. కాని, నిజానికి వారు ఎప్పుడూ ఓర్పుతో, సహనంతో, సమాధి స్థితిలో ఆనందంగా, ప్రశాంతంగా ఉండేవారు. భక్తుల మీద వారు ఎప్పుడూ ప్రేమగా, సంతోషంగా ఉండేవారు.
ఎకాసనీ నిత్య లీన | నాహీ జయాసీ గమనాగమన | సటకా జయాచే దండనిధాన | తూష్ణ్యవస్థాన నిశ్చింత | ||౨౯||
29. కదలికే లేక, ఒకే ఆసనంలో మౌనంగా కూర్చుని, చేతిలో సటకా పట్టుకుని, ప్రశాంతంగా ఉండేవారు.
నాహీ కీర్తి విత్తైషణా | భిక్షాచర్య ప్రాణ రక్షణా | కరూని ఏశియా యోగారోహణా | కాలక్రమణా కరీ జో | ||౩౦||
30. కీర్తి పొందాలని ఆశ లేదు, డబ్బు సంపాదించాలనే కోరిక లేదు. బ్రతకటానికి భిక్షాటన చేస్తూ, ఇంద్రియాల కోరికలను బంధించిన యోగంతో, వారు కాలం గడిపేవారు.
ప్రత్యక్ష సంన్యాస వేష యతి | సటకా తోచి దండ హాతీ |
అల్లా మాలిక వాక్యానువృత్తీ | భక్తప్రీతి అఖండ | ||౩౧||
31. సన్యాసి వేషంతో అచ్చు యతీశ్వరునివలె ఉండేవారు. వారి సటకాయే సన్యాసి దగ్గర ఉండే దండం. ఎప్పుడూ “అల్లా మాలిక” అంటూ భక్తులపై ప్రేమను కురిపించేవారు.
ఏశీ సాఈచీ సగుణమూర్తి | మనుష్యరూపే అభివ్యక్తి | పూర్వ పుణ్యార్జిత హీ సంపత్తి | అవచిత హాతీ లాధలీ | ||౩౨||
32. మనిషి రూపంలో అవతరించిన సాయి సగుణ రూపం ఇది. ఎన్నో జన్మల పుణ్య ఫలంగా, వెలలేని ఈ సంపద, అనుకోకుండా మనకు దొరికింది.
తయాసీ జే మనుష్య భావితీ | మందభాగ్య తే మందమతి | విచిత్ర జయాంచీ దైవగతి | తయా హే ప్రాప్తీ కైసేనీ | ||౩౩||
33. సాయిని ఒక మామూలు మనిషిగా అనుకున్నవారు - మంద మతులు, అదృష్టం లేనివారు. వారి విధి విచిత్రమైనది. కాకుంటే, ఈ భాగ్యం వారికి ఎలా దొరకుతుంది?
సాఈ ఆత్మబోధాచీ ఖాణ | సాఈ ఆనంద విగ్రహపూర్ణ | ధరా కాస తయాచీ తూర్ణ | భవార్ణవ సంపూర్ణ తరాయా | ||౩౪||
34. సాయి ఆత్మ జ్ఞానానికి గని. సంపూర్ణ ఆనందం మూర్తీభవించిన వారు సాయి. ఈ సంసార సాగరాన్ని దాటటానికి, రక్షణ కోసం, వారిని గట్టిగా పట్టుకోండి.
ఖరేంచ జే అపార అనంత | భరలే ఆబ్రహ్మస్తంబ పర్యంత | ఏసే జే నిరంతర అభిన్న అత్యంత | మూర్తిమంత తే బాబా | ||౩౫||
35. నిజంగా వారు అపారం, అంతు లేనివారు, శాశ్వతము, మరియు వేరు చేయలేనివారు. ఆ పరబ్రహ్మనుండి, చిన్న చిన్న పొదల దాకా, ఈ విశ్వమంతటా వారు నిండి ఉన్నారు.
కలియుగాచా కాలప్రసార | చార లక్ష బత్తీస హజార | భరతా స్థూలమానే పాంచ హజార | ఝాలా అవతార బాబాంచా | ||౩౬||
36. కలియుగంలో నాలుగు లక్షల ముప్పైరెండు వేల సంవత్సరాలు. సుమారుగా ఐదు వేల సంవత్సరాలు గడిచిన తరువాత బాబా అవతరించారు.
యేథే శ్రోతే ఆశంకా ఘేతీ | ఠావీ నసతా జన్మతిథి | కాయ ఆధారే కేలే హే నిశ్చితీ | సాదర చిత్తీ పరిసీజే | ||౩౭||
37. బాబా పుట్టిన తేది తెలియకుండా, ఏ ఆధారంతో ఇలా నిశ్చయంగా చెప్పగలరని శ్రోతలకు సందేహం కలగవచ్చు. శ్రద్ధగా వినండి.
ఆనిర్వాణకృతసంకల్పేసీ | హోఊని శిరడీ క్షేత్రనివాసీ | కంఠిలే సాఠ సంవత్సరాంసీ | క్షేత్రసంన్యాసీ వృత్తీనే | ||౩౮||
38. శిరిడీలోనే తమ జీవితాంతం వరకూ ఉండాలని నిశ్చయించుకొని, అరవై సంవత్సరాలు బాబా అక్కడ సన్యాసిగా గడిపారు.
సోళా వర్షాంచియా వయాస | ఆరంభీ బాబా ప్రకటలే శిరడీస | తీన వర్షే తే సమయాస | కరూని వాస హేతే తే | ||౩౯||
39. పదహారు సంవత్సరాల వయసులో, మొదటి సారి, శిరిడీలో బాబా కనిపించారు. మూడేళ్ళు అక్కడ ఉన్నారు.
తెథూని మగ జే కోఠే సటకలే | దూర నిజామశాహీంత ఆఢళలే | తే మగ వర్హాడాసమవేత ఆలే | శిరడీంత రాహిలే అక్షయీ | ||౪౦||
40. అక్కడినుండి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళారో కాని, దూరాన ఉన్న నైజాం రాజ్యంలో మరల కనిపించారు. తరువాత, పెళ్ళివారితో పాటు వచ్చి, శిరిడీలోనే ఎప్పటికీ ఉండిపోయారు.
వీస వర్షే హోతీ వయాస | తెథూని అఖండ శిరడీ సహవాస |
తెథేంచ సాఠ వర్షే వాస | సర్వత్రాంస హే ఠావే | ||౪౧||
41. ఇరవై ఏళ్ళ వయసునుండి, అరవై ఏళ్ళు వారు శిరిడీలోనే ఉన్నది అందరికీ తెలిసినదే.
శకే అఠరాశే చాళీస | ఆశ్విన శుద్ధ దశమీస | విజయదశమీచే సుముహూర్తాస | బాబా నిజావాస పావలే | ||౪౨||
42. శక సంవత్సరం ౧౮౪౦ (౧౫ అక్టోబరు ౧౯౧౮) ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున, విజయదశమి శుభ దినాన, బాబా తమ శాశ్వత నివాసానికి చేరుకున్నారు.
ఎవం ఏశీంచా ఆయుర్దాయ | స్థూలమానాచా హా నిశ్చయ | కీ శకే సతరాశే సాఠ హోయ | జన్మనిర్ణయ బాబాంచా | ||౪౩||
43. ఈ విధంగా, బాబా జీవితం ౮౦ ఏళ్ళనుకుంటే, వారు సుమారు శక సంవత్సరం ౧౭౬౦ (క్రి. శ. ౧౮౩౮) లో పుట్టారని నిర్ణయించవచ్చు.
కాళాచ్యా మాథా దేణార పాయ | ఏసియా మహాత్మ్యాంచా ఆయుర్దాయ | కరవేల కధీ నిశ్చిత కాయ | అవఘడ హే కార్య సాధాయా | ||౪౪||
44. కాల గమనాన్ని త్రొక్కి పట్టి ఉంచే మహాత్ముల జీవిత కాలాన్ని ఎప్పుడైనా నిశ్చయంగా చెప్పగలరా? ఇది చాలా కష్టమైన పని.
మహాత్మే నిత్య స్వస్థానీ స్థిత | జన్మ ఆణి మరణ విరహిత | దినమణీస కైచా ఉదయాస్త | తో తో అచల స్వస్థ సదా | ||౪౫||
45. మహాత్ములెప్పుడూ వారి స్థానంలోనే ఉంటారు. చావు పుట్టుకలు వారికి లేవు. సూర్యునికి ఉదయించడం, అస్తమించడం అనేవి ఎక్కడివి? సూర్యుడు ఎప్పుడూ స్థిరంగా ఉన్న చోటే ఉంటాడు.
శకే సోళాశే తీన సాలీ | రామదాసాంచీ సమాధీ ఝాలీ | పురీ దోనహీ న శతకే గేలీ | ఉదయా ఆలీ హీ మూర్తి | ||౪౬||
46. శక సంవత్సరం ౧౬౦౩ (క్రి. శ. ౧౭౮౧) లో శ్రీ సమర్థ రామదాసు సమాధి చెందారు. తరువాత, ౨౦౦ సంవత్సరాలు పూర్తి కాక మునుపే ఈ మూర్తి కనిపించారు.
భరత భూమి యవనాక్రాంత | హిందూ నృప పాదాక్రాంత | భక్తిమార్గ ఝాలా లుప్త | ధర్మరహిత జన ఝాలే | ||౪౭||
47. భారత భూమి ముస్లిములచే ఆక్రమింపబడి, హిందూ రాజులు ఓడిపోయారు. భక్తి మార్గం అప్పటినుంచి క్రమక్రమంగా మాయమైంది. ప్రజలు ధర్మాన్ని వదల సాగారు.
తై రామదాస ఝాలే నిర్మాణ | శివరాయాతే హాతీ ధరూన | కేలే యవనాంపాసూన రాజ్యరక్షణ | గో బ్రాహ్మణ సంరక్షణ | ||౪౮||
48. అప్పుడు శ్రీ సమర్థ రామదాసు పుట్టి, శివాజీ ద్వారా రాజ్యాన్ని ముస్లిములనుండి రక్షించారు. బ్రాహ్మణుల, ఆవుల, సంరక్షణ కూడా చేశారు.
పురీ దోనహీ న శతకే గేలీ | పూర్వీల ఘడీ పునశ్చ బిఘడలీ | హిందూ అవింధీ దుహీ పడలీ | తీ మగ తోడిలీ బాబాంనీ | ||౪౯||
49. రెండు శతాబ్దాలు పూర్తి కాకుండానే, మునపటి లాగానే, మరల కాలం చెడిపోయి, హిందూ ముస్లిముల మధ్య మత భేదాల వలన చీలికలు వచ్చాయి. బాబా ఈ చీలికలను తొలగించటానికి ప్రయత్నం చేశారు.
రామ ఆణి రహీమ ఎక | యత్కించితహీ నాహీ ఫరక | మగ భక్తీంచ ధరావీ కా అటక | వర్తావే తుటక కిమర్థ | ||౫౦||
50. “రాముడు రహీము ఇద్దరూ ఒక్కరే. వారిలో ఏ మాత్రం తేడా లేదు. అలాంటప్పుడు, వారి భక్తిలో అడ్డంకులెందుకు? భక్తులలో విరోధమెందుకు?
కాయ తుమ్హీ లేంకరే ముఢ | బాంధా హిందూ అవింధాచీ సాంగడ |
వ్హా దృఢ సువిచారారూఢ | తరీచ పైలథడ పావాల | ||౫౧||
51. “మూర్ఖులైన పసివారిలా ఉన్నారు! హిందూ ముస్లిములను స్నేహంతో కలపండి. మీ మనసులలో దృఢమైన మంచి ఆలోచనలుంటేనే, మీరు అవతలి గట్టుకు చేరగలరు.
వాదావాదీ నాహీ బరీ | నకో కుణాచీ బరోబరీ | వ్హా నిత్య నిజహితాచే విచారీ | రక్షీల శ్రీహరీ తుమ్హాంలా | ||౫౨||
52. “వాద వివాదాలు మంచివి కావు. ఒకరితో ఒకరు పోటీ పడకండి. ఎప్పుడూ మీ శ్రేయస్సును గురించే ఆలోచించండి. శ్రీహరి మిమ్మల్ని రక్షిస్తాడు”.
యోగయాగతపజ్ఞాన | హే సర్వ హరిప్రాప్తీచే సాధన | అసూన హే జో హరి విహీన | వ్యర్థ జనన తయాచే | ||౫౩||
53. దేవుణ్ణి పొందటానికి, యోగాలు, యాగాలు, తపస్సు, జ్ఞానం మొదలైన సాధనలు ఉన్నాయి. అయినా దేవుణ్ణి తెలుసుకొని, మనసులో పెట్టుకోకపోతే, అలాంటి వారి పుట్టుక దండుగ.
కోణీ కాంహీ కేలియా అపకార | ఆపణ న కరణే ప్రతికార | కరవేల తరీ కరా ఉపకార | ఉపదేశ సార హా త్యాంచా | ||౫౪||
54. మనకు ఎవరైనా, ఏదైనా అపకారం చేస్తే, చేయగలిగితే ఉపకారమే చేయాలి గాని, మనం ప్రతీకారం చేయకూడదు. బాబా ఉపదేశాల సారం ఇదే.
స్వార్థాస తైసాచ పరమార్థాస | ఉపదేశ హా హితావహ బహువస | ఉచ్చ నీచ స్త్రీ శూద్రాస | ధోపట సకళాంస హా మార్గ | ||౫౫||
55. స్వార్థానికైనా, పరమార్థానికైనా, ఇది మంచి ఉపదేశం. గొప్పవారైనా, తక్కువ వారైనా, స్త్రీలకు, శూద్రులకు, అందరికీ ఇది చాలా సులభమైన మార్గం.
స్వప్నీంచ్యా రాజ్యాచే వైభవ | జాగే ఝాలియా జైసే వావ | తైసాచ సంసార కేవళ మావ | భావనా హీ తయాచీ | ||౫౬||
56. కలలో చూసిన రాజ్య వైభవం మనం మేలుకోగానే ఎలా మాయమై పోతుందో, అలాగే, ఈ ప్రపంచమంతా కేవలం మాయ అని బాబా అనేవారు.
దేహాది సుఖదుఃఖమిథ్యత్వ | హేంచ జయాచే ప్రపంచతత్వ | నిజానుసంధానే స్వప్న భ్రమత్వ | దవడోని ముక్తత్వ సాధిలే | ||౫౭||
57. దేహానికి, మనసుకు కలిగే సుఖ దుఃఖాలన్నీ నిజం కావు. అవి కలల వంటివి. ఈ నిజాన్ని, ఆత్మ జ్ఞానంతో తెలుసుకొని, వాటిని వదిలించుకున్న వారు ముక్తిని పొందారు.
పాహోని శిష్యాచీ బద్ధతా | అతికళవళా జయాచే చిత్తా | కైసీ లాధేల దేహాతీతతా | హేచి చింతా అహర్నిశ | ||౫౮||
58. ఈ సంసారంతో ముడి పడి ఉన్న భక్తులను చూచి, బాబా మనసు కరిగిపోయేది. దేహానికి మించిన స్థితిని వీరు ఎలా పొందగలరా అని సాయికి రాత్రి పగలూ చింత.
అహంబ్రహ్మాకారవృత్తి | అఖండానందాచీ మూర్తి | నిర్వికల్ప చిత్తస్థితి | యేఈ నివృత్తి విసావియా | ||౫౯||
59. అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో, ఎనలేని ఆనందంలో, ఉండే స్వభావం వారిది. ఏ కోరికలు కాని, ఏ బంధం కాని, లేని మానసిక స్థితి వారిది.
ఘేఊనియా టాళ విణే | దారోదార భటకణే | ఆల్యా గేల్యా కేవిలవాణే | హాత పసరణే ఠావే నా | ||౬౦||
60. కొందరు చేస్తున్నట్లు, ఒక చేత్తో తంబూర పట్టుకుని, ఇంకొక చేత్తో చిరుతలు పుచ్చుకుని, ఇంటింటా తిరుగుతూ, వచ్చేపోయే వారి ఎదుట చేయి చాపి దీనంగా బ్రతకటం, బాబాకు ఇష్టంగా ఉండేది కాదు.
దేతీ బళేంచ కాన మంతరూ | సింతరూని విత్తార్థ | ||౬౧||
61. చాలా మంది గురువులు, శిష్యులను పోగు చేసుకుని, డబ్బు కోసం బలవంతంగా వారి చెవులలో మంత్రాలను ఊదుతారు.
శిష్యాస ధర్మాచీ శిక్షణ | స్వయే అధర్మాచే ఆచరణ | త్యాచేని కైసే భవతరణ | జన్మ మరణ చుకేల | ||౬౨||
62. శిష్యులకు ‘ధర్మం’ గురించి చెబుతారు. తాము మాత్రం ఎప్పుడూ అధర్మాన్నే పాటిస్తారు. ఇలాంటి గురువులు సంసార సాగరంనుంచి ఎలా దాటించగలరు? చావు పుట్టుకలనుంచి ఎలా తప్పించగలరు?
ఆపుల్యా ధార్మికత్వాచీ ఖ్యాతి | వ్హావీ ఝేండే ఫడకావే జగతీ | హే లవహీ న జయాచే చిత్తీ | ఏసీ హీ మూర్తి సాఈచీ | ||౬౩||
63. తమ ధార్మికత్వాన్ని నాలుగు దిశలూ చాటుకోవాలని కాని, ప్రజలనుంచి పొగడ్తలు పొందాలని కాని, ఏ మాత్రం ఆశలేని, అసమానమైన సద్గురువు సాయి.
దేహాభిమానా న జేథే వసతీ | శిష్యా ఠాయీ అత్యంత ప్రీతి | సదైవ జేథే హేచి ప్రవృత్తి | ఏసీ హీ మూర్తి సాఈచీ | ||౬౪||
64. దేహం మీద కొంచెం కూడా అభిమానం లేదు. భక్తులను ఎప్పుడూ ప్రేమతో చూసే స్వభావం గల ప్రేమమయి, శ్రీసాయి.
నియత ఆణి అనియత గురూ | అసతీ గురూ దో ప్రకారూ | ఎకేకాచా కార్య నిర్ధారూ | స్పష్ట కరూ శ్రోతియా | ||౬౫||
65. నియత గురువు, అనియత గురువు అని రెండు రకాల గురువులు ఉంటారు. ఒక్కొక్కరి పద్ధతిని శ్రోతలకు స్పష్టంగా చెప్పుతాను.
దైవీ సంపత్తి పరిపక్వ కరణే | నిర్మల హోణే అంతఃకరణే | ఎవఢేంచ అనియత గురూచే దేణే | మాగీ లావణే మోక్షాచ్యా | ||౬౬||
66. మనసును శుద్ధపరచి, మోక్ష మార్గంలో ప్రవేశ పెట్టి, దైవీ సంపదతో పరిపూర్ణులుగా చేయటమే అనియత గురువుల పని.
నియత గురూశీ హోతా సఖ్య | ద్వైత జాఊని హోయ ఏక్య | తత్వమసి మహావాక్య | తయాచీ సాక్ష తో దావీ | ||౬౭||
67. నియత గురువుల దగ్గర శిష్యత్వం చేస్తే, మనసులోని విరుద్ధ భావాలు తొలగిపోయి, జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం మేల్కొంటుంది. అలాంటి గురువులు, ‘తత్త్వమసి’ (‘నువ్వే అది’ - నువ్వే బ్రహ్మ) అనే బ్రహ్మ సూత్రాన్ని శిష్యులు స్వయంగా అనుభవంతో తెలుసుకునేలా చేస్తారు.
చరాచరీ భరలే గురూ | భక్తార్థ హోతీ సాకారూ | సరతా అవతార కార్యభారూ | నిజావతారూ సంపవితీ | ||౬౮||
68. ఇలాంటి నియత గురువులు, తత్త్వ రూపంలో, కనిపించకుండా ఈ విశ్వమంతటా నిండి, భక్తుల కొరకు, మనిషి రూపంలా అవతరించి, తమ పని ముగిసి పోగానే, తమ అవతారాన్ని చాలిస్తారు.
యా ద్వితీయ కోటీంతీల సాఈ | చరిత్ర తయాచే వర్ణూ మీ కాయీ | జైసీ తో మజ బుద్ధి దేఈ | తైసేంచి హోఈ లేఖన హే | ||౬౯||
69. ఈ రెండవ కోవకు చెందిన వారే శ్రీసాయి. వారి జీవితాన్ని నేనెలా వర్ణించను? నాకు వారు ఎలా దారిని చూపిస్తే, అలా ఈ చరిత్ర రచన సాగుతుంది.
లౌకికీ విద్యాంచే అనేక గురూ | స్వరూపీ స్థాపీ తోచి సద్గురూ | సమర్థ తోచీ జో దావీ భవపారూ | మహిమా అగోచరూ తయాచా | ||౭౦||
70. లౌకిక విద్యలను నేర్పటానికి ఎంతో మంది గురువులుంటారు. కాని, ఆత్మ జ్ఞానాన్ని కలిగించే వారే సద్గురువు. సంసార సాగరాన్ని దాటించగల వారే సమర్థులు. వారి మహిమ, గొప్పతనం ఊహించలేనంతది.
జో జో జాఈ కరాయా దర్శన | తయాచే భూత భవిష్య వర్తమాన |
సాఈ న పుసతా కరితీ నివేదన | ఊణ ఖూణ సంపూర్ణ | ||౭౧||
71. వారి దర్శనానికి ఎవరైనా వెళ్ళితే, వారు అడుగకుండానే, వారి గతం, భవిష్యత్తు మరియు జరుగుచున్నవన్నీ, వారి ఉద్దేశాలను, వారి ఆలోచనలను సాయి పూర్తిగా తెలిపేవారు.
బ్రహ్మభావే భూతమాత్ర | అవలోకీ జో సర్వత్ర | దేఖే సమ సామ్యే అరి మిత్ర | భేద తిళమాత్ర నేణే జో | ||౭౨||
72. అన్ని చోట్లా ఉండే అన్ని ప్రాణులలోనూ వారు దేవుణ్ణి చూచేవారు. మిత్రులు, శత్రువులు ఇరువురినీ వారు సమానంగా చూసేవారు. కొంచెమైనా భేదం చేసేవారు కాదు.
నిరపేక్ష ఆణి సమదర్శీ | అపకారియాంహీ అమృత వర్షీ | సమచిత్త ఉత్కర్షాపకర్షీ | స్పర్శీ వికల్ప నా జయాతే | ||౭౩||
73. ఎవరి దగ్గరా ఏమీ ఆశించేవారు కాదు. ఎప్పుడూ సమమైన దృష్టి కలిగినవారు. అపకారం చేసినవారి మీద కూడా అమృతాన్ని కురిపించేవారు. హెచ్చు తగ్గులు లేకుండా ఒకేలా ఉండేవారు. ఏ అనుమానాలూ, సందేహాలూ వారికి లేవు.
వర్తతా య నశ్వర దేహీ | దేహ గేహీ జో గుంతలా నాహీ | దిసాయా దేహీ అంతరీ విదేహీ | తో యేచ దేహీ నిర్ముక్త | ||౭౪||
74. నశించే ఈ దేహంలో ఉన్నా, దేహానికి సంబంధించిన ఏ వస్తువుల (స్త్రీ, ఇల్లు, ఆస్తి) మోహంలోనూ చిక్కుకోలేదు. దేహంలో ఉంటూ, దేహానికి మించిన స్థితిలో ఎప్పుడూ ఉండేవారు. అలాంటి వారికి ఈ దేహంలోనే ముక్తి దొరకుతుంది.
ధన్య శిరడీచే జన | సాఈచ జయాంచే దేవతార్చన | కరితా అశన భోజన శయన | అఖండ చింతన సాఈచే | ||౭౫||
75. శిరిడీ గ్రామస్థులు ధన్యులు. సాయియే వారు పూజ చేసుకునే దైవం. భోజనం చేస్తున్నా, పడుకున్నా, ఎప్పుడూ సాయినే ధ్యానించేవారు.
ధన్య ధన్య తయాంచీ ప్రేమళతా | ఖళ్యాంత పరసాంత కామే కరితా | దళితా కాండతా డేరే ఘుసళితా | మహిమా గాతాత బాబాంచా | ||౭౬||
76. వారి ప్రేమ ధన్యం. పొలాలో పని చేస్తున్నా, ఇళ్ళల్లో పని చేసుకుంటూ, దంచుతున్నా, విసురుతున్నా, మజ్జిగ చిలుకుతున్నా, బాబా మహిమనే పాటగా చేసి పాడేవారు.
ఆసనీ భోజనీ శయనీ | బాబాంచ్యా నాంవాచీ అక్షయ స్మరణీ | ఎకా బాబావీణ దుజా కోణీ | దేవ జ్యాంనీ నాఠవిలా | ||౭౭||
77. విరామంగా కూర్చున్నా, తింటున్నా, పడుకున్నా, ఎప్పుడూ సాయి పేరునే తలుచుకునేవారు. ఒక్క బాబా తప్ప, వారు వేరే ఏ దైవాన్నీ కొలిచేవారు కాదు.
కాయ త్యా బాయాంచా ప్రేమా తరీ | కాయ తయాంచే ప్రేమాచీ మాధురీ | నిర్మళ ప్రేమచి కవన కరీ | విద్వత్తా న కరీ కవనాస | ||౭౮||
78. ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది! ఆ ప్రేమలో ఎంత తీపి ఉంది! ఇలాంటి నిర్మలమైన ప్రేమతోనే కవితలు పుడతాయి కాని, విద్వత్తుతో కాదు.
సాధీ సరళ భాషా ఖరీ | విద్యా నాహీ తిళభరీ | త్యాంతూన జే కవిత్వ చమక మారీ | మాన చాతురీ డోలవిజే | ||౭౯||
79. ఆ పాటలు అతి సాధారణ భాషలో, ఏ మాత్రం పాండిత్యం లేకుండా, ఉండేవి. కాని, వాటిలోని కవిత్వానికి పండితులు కూడా తలలు ఊపాల్సిందే.
ఖర్యా ప్రేమాచే ఆవిర్భవన | తయా నాంవ ఖరే కవన | తే యా బాయాంచ్యా వాణీమధూన | శ్రోతీ పాహూన ఘ్యావే కీ | ||౮౦||
80. నిజమైన ప్రేమను పుట్టించేదే అసలైన కవిత్వం. ఇప్పటికీ ఆ స్త్రీల గానంలోని తీపిని, శ్రోతలు విని, అనుభవించ వచ్చు.
అసేల సాఈబాబాంచీ ఇచ్ఛా | పూర్ణ సంగ్రహ లాధేల యాంచా |
పురేల శ్రోతియాంచీ శ్రవణేచ్ఛా | అధ్యాయ కవనాంచా హోఈల | ||౮౧||
81. సాయిబాబా అనుగ్రహం ఉండి, ఆ పాటలన్నింటినీ సేకరించగలిగితే, ఒక అధ్యాయంగా చేసి, పాటలను వినాలనే శ్రోతల కోరికను తీరుస్తాను.
అసో నిరాకార భక్తకృపే | శిరడీంత ప్రకటలే సాఈరూపే | దేహాహంకార వికార లోపే | భక్తిస్వరూపే ఓళాఖిజే | ||౮౨||
82. ఆకారం లేని దేవుడు భక్తులను అనుగ్రహించటానికి శిరిడీలో సాయి రూపంలో కనిపించాడు. సాయిని తెలుసుకోవటానికి, దేహం మీద అభిమానమూ, అన్ని రకాల అహంకారాలూ పోయి, భక్తి కలగాలి. సాయికి శరీరంపై అభిమానం లేదు, మనసులో ఏ రకమైన కోరికలూ లేవు.
అథవా భక్తాంచే పుణ్య ఫళలే | తే ప్రాప్తకాల వసత మేళే | సాఈరూపే పూర్ణ అంకురలే | ఫళా ఆలే శిరడీంత | ||౮౩||
83. లేక, భక్తుల పుణ్యమంతా పోగై, సరియైన సమయం వచ్చినప్పుడు, సాయి రూపంలో మొలకెత్తి, శిరిడీలో పక్వానికి వచ్చింది.
అనిర్వాచ్య ఫుటలీ వాచా | అజన్మ్యాసీ జన్మ సాచా | అమూర్తాచ్యా మూర్తీచా సాచా | కరూణ రసాచా ఓతీవ | ||౮౪||
84. వర్ణించటానికి సాధ్యం కాని తత్త్వానికి వర్ణన వచ్చింది. పుట్టుకే లేనిది, పుట్టింది. ఆకారం లేని ఆ తత్త్వం, కరుణ రసం నింపుకుని, మనిషి ఆకారాన్ని ధరించింది.
యశవంత ఆణి శ్రీమంత | వైరాగ్యశాలీ జ్ఞానవంత | ఏశ్వర్య ఔదార్య మండిత | షడ్గుణాన్విత మూర్తి హే | ||౮౫||
85. యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం, వైభవం అనే ఆరు గుణాలతో చేయబడ్డ ఆకారమే సాయి.
విలక్షణ బాబాంచా నిగ్రహ | స్వయే జరీ అపరిగ్రహ | అమూర్త తరీ ధరితీ విగ్రహ | భక్తానుగ్రహ కారణే | ||౮౬||
86. చాలా అసాధారణమైంది బాబా నిగ్రహం. ఎవరి దగ్గరనుండీ వారు ఏమీ తీసుకునేవారు కాదు. భక్తులను అనుగ్రహించటానికే, నిరాకారులైన వారు ఒక రూపాన్ని ధరించారు.
కాయ తయాంచా కృపాప్రభావ | ఘేతీ భక్తాంచా జడవూని భావ | నాహీ తరీ తయాంచా ఠావ | కోణ దేవ గివసితా | ||౮౭||
87. ఎంతటి కరుణా స్వభావం వారిది! భక్తుల ప్రేమ మరియు భక్తిని గెలుచుకున్నారు. ఇక వారి అసలు తత్త్వాన్ని, బహుశా దేవుడు కూడా పూర్తిగా తెలుసుకోలేడేమో!
వాగ్దేవతా జే వదూ న ధజే | శ్రవణహీ జే పరిసతా లాజే | ఏసే బోల భక్త కల్యాణకాజే | సాఈమహారాజే వదావే | ||౮౮||
88. వాగ్దేవత కూడా చెప్పటానికి సాహసించని, చెవులు వినటానికి సిగ్గు పడే మాటలను, సాయి మహారాజు అనేవారు. కాని, అది కూడా భక్తుల శ్రేయస్సు కొరకే.
జయా శబ్దాంచా అనువాద కరణే |తయాంహూన బరే ముకేంచ అసణే | పరి న బరవే కర్తవ్యా చుకణే | మ్హణోని వదణే ప్రాప్త ఝాలే | ||౮౯||
89. వారు వాడిన మాటలను చెప్పటం కంటే ఊరికే ఉండటం మంచిది. కాని, కర్తవ్యం వదిలి పెట్టటం మంచిది కాదు కనుక, చెప్పవలసి వచ్చింది.
భక్తకణవా బాబాంచీ వాణీ | వదతీ ఝాలీ అతి లీనపణీ | దాసానుదాస మీ తుమచా ఋణీ | నివాలో దర్శనీ తుమచియా | ||౯౦||
90. భక్తులతో అతి వినయంగా బాబా “నేను మీ దాసానుదాసుణ్ణి. మీకు ఋణపడి ఉన్నాను. మీ దర్శనానికై వచ్చాను.
హీ ఎక తుమచీచ కృపా మోఠీ | ఝాలీ మజ తుమచే పాయాంచీ భేటీ |
కిడా మీ తుమచే విష్ఠే పోటీ | ధన్య మీ సృష్టీ తేణేనీ” | ||౯౧||
91. “మీ దయవలెనే మీ పాదాలను చేరుకోగలిగాను. మీ మలంలోని క్రిమిని నేను. దాని వలనే ఈ సృష్టిలో నేను ధన్యుణ్ణి” అని అనేవారు.
కాయ బాబాంచీ హీ లీనతా | నమ్రపణాచీ హీ హౌస చిత్తా | కాయ హీ ఉచ్చ నిరభిమానతా | శాలీనతా హీ తైశీచ | ||౯౨||
92. ఎంతటి అణకువ బాబాది! వినమ్రంగా ఉండాలని మనసులో ఎంతటి కోరిక! ఎంత గొప్పదైన నిరభిమానం అది! ఎంతటి నయం, సౌమ్యం!
వరీల హే బాబాంచే ఉద్గార | ఖరే మ్హణూన కేలే కీ సాదర | కోణాస వాటేల హా అనాదర | తరీ మీ పదర పసరితో | ||౯౩||
93. పై మాటలు, నిజంగా బాబా చెప్పినవే. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా అగౌరవంగా అనిపిస్తే, క్షమించమని వేడుకుంటాను.
విటాళ ఝాలా అసేల వాచే | పాపహీ టాళావయా శ్రవణాచే | ఆవర్తన కరూ సాఈనామాచే | దోష సకళాంచే జాతీల | ||౯౪||
94. ఆ మాటలు చెప్పటంతో, నా వాక్కు కలుషితమైంది. అందుకు నేను, విన్న పాపానికి మీరు, ఇద్దరం సాయి నామాన్ని జపిద్దాము. దాని వలన, ఇద్దరి పాపాలూ తొలగిపోతాయి.
జన్మోజన్మీంచ్యా ఆముచ్యా తపా | ఫళ తీ కేవళ సాఈకృపా | తృషార్తాసీ జైసీ ప్రపా | తైసీ అపార సుఖదాతీ | ||౯౫||
95. కేవలం సాయి కృపతోనే, ఎన్నో జన్మల మన తపస్సు ఫలించింది. సాయి కృప అనేది, దప్పికగొన్న వారికి చలివేంద్రం వలె, విపరీతమైన సుఖాన్ని ఇస్తుంది.
జివ్హాద్వారా రస చాఖితీ | ఏసే సమస్తా జరీ భాసతీ | పరి తే చాఖిలే హే నేణతీ | రసస్ఫూర్తి న రసనేసీ | ||౯౬||
96. బాబా నాలుక ద్వారా రసాన్ని ఆనందిస్తున్నట్లు అందరికీ అనిపిస్తుంది. కాని, వారి నాలుకకు రసాలను తెలుసుకునే స్ఫూర్తి లేదు. అందుకే సాయి ఏ రుచినీ ఎరుగరు.
జయాసీ నాహీ విషయ స్ఫూర్తి | కైసే తరీ తే విషయ సేవితీ | విషయ జయాచ్యా ఇంద్రియా న శివతీ | తే కాయ గుంతతీ విషయాంత | ||౯౭||
97. ఇంద్రియాలలో స్ఫూర్తి లేనివారు ఇంద్రియ సుఖాలను ఎలా అనుభవిస్తారు? కోరికలు వారి ఇంద్రియాలను తాకనప్పుడు, వారు వాటిలో ఎలా చిక్కుకోగలరు?
నయనద్వారే అవలోకితీ | పదార్థ జే జే యేతీల పుఢతీ | పరి తే అవలోకిలే నేణతీ | స్ఫూర్తి దేఖతీ తెథనా | ||౯౮||
98. ఎదుటికి వచ్చిన వస్తువులను కళ్ళు చూడటమే తప్ప, వారు ఏమి చూస్తున్నారు అనేది వారు ఎరుగలేరు. ఎందుకంటే, చూడాలనే కోరిక వారికి లేదు.
జైసీ హనుమంతాచీ గర్భకాస | గోచర ఎక మాతేస కీ రామాస | మగ తయాచే బ్రహ్మచర్యాస | తులనా కవణాస కరవేల | ||౯౯||
99. హనుమంతుని లంగోటి అతని తల్లికి, రామునికి మాత్రమే కనిపించేది. మిగతా ఎవరికీ కనిపించేది కాదు. అంతటి బ్రహ్మచర్యను పాటించిన హనుమంతునికి సాటి ఎవరు?
జేథే మాతే న లింగావలోకన | ఇతరాంచే తై కాయ కథన | బాబాంచే బ్రహ్మచర్యహీ పరమ కఠీణ | పూర్ణపణ తే అపూర్వ | ||౧౦౦||
100. తల్లి ఆ అవయవాన్ని చూసినా, మిగతా వాళ్ళ సంగతేమిటి? బాబా బ్రహ్మచర్యం కూడా అంతటి కఠినమైంది, అసామాన్యమైనది.
కాసే కౌపీన లంగోటీ | లింగ అజాగల స్తన కోటీ |
కేవళ మూత్ర విసర్గ పరిపాటీ | అవయవా పోటీ అవయవ | ||౧౦౧||
101. వారు లంగోటిను నడుము వరకు కట్టుకునేవారు. వారి అవయవం కేవలం మూత్రాన్ని వదలటానికే. అంత కన్నా వాటికి వేరే పని లేదు. మేక మెడ క్రింద ఉండే చన్నులతో ఎంత ఉపయోగమో ఇదీ అంతే. అవయవాలన్నీ ఉండాలి గనుక ఉన్నాయి.
ఏసీ బాబాంచీ దేహస్థితీ | ఇంద్రియే జరీ కర్మీ ప్రవర్తతీ | తరీ తయాంస విషయస్ఫూర్తి | లవ సంవిత్తీ అసేనా | ||౧౦౨||
102. వారి శరీరం ఇలా ఉండేది. దేహంలోని అవయవాలు వాటి పనులను అవి చేసేవి కాని, వాని గురించి ఏ కోరికగాని, కనీసం అవి ఉన్నాయన్న సంగతిని కూడా బాబా పట్టించుకునే వారు కాదు.
సత్వ రజ తమాది గుణా | సవే ఇంద్రియే ఖీళిలీ ఠాణా | జరీ లౌకికీ కర్తేపణా | సంగా కోణా నాతళతీ | ||౧౦౩||
103. మూడు గుణాలైన సత్వ, రజ, తమో గుణాలతో అవయవాలన్నీ వాని వాని చోట్లలో కట్టుబడి ఉన్నాయి. లౌకికమైన వాటి పనులను అవి చేస్తున్నా, దేనిలోనూ చిక్కుకోవు.
నిఃసంగ చిన్మాత్ర ఆత్మారామ | కామ క్రోధా విశ్రామధామ | బాబా సదైవ నిష్కామ | అవాప్త కామ పూర్ణత్వే | ||౧౦౪||
104. బాబా ఎప్పుడూ ఒకరే ఉండేవారు. శుద్ధమైన జ్ఞానానికి రూపం. ఆనందంగా ఉండేవారు. కోరికలు, కోపాలు అన్నీ అణిగి పోయాయి. వారు ఏ కోరికలూ లేనివారు. అన్ని కోరికలూ పూర్తిగా తీరి, తృప్తిగా ఉండేవారు.
ఏసీ తయాంచీ ముక్తస్థితీ | విషయహీ జయాంస బ్రహ్మ హోతీ | పుణ్య పాపాచియా పరతీ | పూర్ణ నివృత్తిస్థాన తే | ||౧౦౫||
105. వారిది ఎంత ముక్త స్థితి అంటే, ఇంద్రియాలను కూడా వారు బ్రహ్మయే అని తలచేవారు. పుణ్యం పాపాలకు మించిన స్థితిలో ఉన్న వారు, మిగతా వారికి ఆధారం.
నానావల్లీనే1 ఊఠ మ్హణతా | గాదీ సోడూన ఝాలా జో పరతా | జయా ఠాయీ దేహాభిమానతా | అథవా విషమతా స్వప్నీ నా | ||౧౦౬||
106. నానావల్లి లేవమనగానే, తమ గద్దె విడిచి పెట్టిన వారికి, దేహం మీద ప్రేమ కాని, భేద భావం కాని, కలలో కూడా లేవు.
ఇహలోకీ న ప్రాప్తవ్య కాంహీ | సాధ్య పరలోకీహీ ఉరలే నాహీ | ఏసా హా కేవళ లోకానుగ్రహీ | సంత యే మహీ అవతరలా | ||౧౦౭||
107. ఈ ప్రపంచంలో పొందవలసినవి కాని, పైలోకంలో సాధించాల్సినవి కాని, వారికి ఏవీ లేవు. కేవలం లోక కళ్యాణం కోసమే ఈ భూమిపై అవతరించిన సత్పురుషులు వారు.
ఏసే హే సంత కరూణాఘన | అవతారా యేణ్యాచే ప్రయోజన | పరానుగ్రహవిణ నా ఆన | కృపాళూ పూర్ణ పరహితీ | ||౧౦౮||
108. ఇలాంటి కరుణామయులు అవతరించడం, కేవలం ప్రజలకు శ్రేయస్సును అనుగ్రహించడానికే కాని, వేరే ప్రయోజనాలకు కాదు. ఇతరుల మంచి గురించి వారు చాలా కరుణను చూపుతారు.
హృదయ యాంచే జైసే లోణీ | అతీవ మృదు మ్హణతీ కోణీ | పరి సంత ద్రవతీల పరతాపణీ2 | నిజ తాపేచ పాఝరణీ లోణియా | ||౧౦౯||
109. వారి మనసు వెన్నలా చాలా మెత్తనైనది అని అంటారు. శాకం తగిలితేనే కాని వెన్న కరగదు. సత్పురుషులు ఇతరులకు ఏ మాత్రం కష్టం కలిగినా కరిగి పోతారు.
కఫనీ ఠిగళ్యాంచీ జయాచే వసన | తరట జయాచే ఆసనాస్తరణ | వృత్తిశూన్య జయాచే మన | రౌప్య సింహాసన కాయ త్యా | ||౧౧౦||
110. వారు తొడుగుకునే కఫనీకు ఎన్నో అతుకులు. కూర్చోవటానికి గోనెపట్టా. మనసులో ఏ కోరికా లేదు. ఇలాంటి వారికి వెండి సింహాసనంతో ఏం పని?
పాహోని భక్త భావాకడే | తయాస జరీ గమలే తే సాంకడే |
తరీ తే లోటితా పాఠీకడే | లక్షహీ తికడే దేతీనా | ||౧౧౧||
111. అసలు సింహాసనం ఉంటే, వారికి ఇబ్బందే. కాని, భక్తులు బలవంతంగా దాని మీద కూర్చో పెట్టితే, వారు అడ్డగించేవారు కాదు. సింహాసనానికంటే, వారికి భక్తుల ప్రేమ, భక్తి ముఖ్యం.
బాబా శిరడీ సరోవరీంచే కమళ | భక్త సేవితీ పరిమళ | అభాగీ భేకాంచే వాంట్యాస చిఖల | సర్వ కాళ కాలవితీ | ||౧౧౨||
112. శిరిడీలాంటి సరోవరంలో బాబా ఒక కమలం. భక్తులు దాని పరిమళాన్ని సేవిస్తారు. అదృష్టం లేనివారు, నమ్మకం లేనివారు కప్పలలా బరదతోనే సంతోషిస్తారు.
కోణా న సాంగే ఆసన | ప్రాణాపాన వ ఇంద్రియదమన | మంత్ర తంత్ర వా యంత్ర భజన | ఫుంకణే కాన తేంహీ నా | ||౧౧౩||
113. యోగాసనాలు, ప్రాణాయామం, ఇంద్రియాలను అణిచి వేయటం, మంత్రం, యంత్రం, భజనల గురించి బాబా ఎప్పుడూ ఎవరికీ చెప్పేవారు కాదు. కనీసం చెవిలో మంత్రాలను ఊదటం కూడా చేయలేదు.
లౌకికీ దిసతీ లోకాచారీ | పరి అంతరీచీ ఆణిక పరీ | అత్యంత దక్ష వ్యవహారీ | న యే కుసరీ దుజయాతే | ||౧౧౪||
114. లోక వ్యవహారాలలో లౌకికంగా నడచుకుంటున్నట్లు కనిపిస్తారు. కాని, వారి మనసులో మరో రకంగా ఉండేది. ఆ వ్యవహారాలలో, తెలివితో వారు చూపే నేర్పు, మరెవరికీ ఉండదు.
భక్తార్థ ధరితీ ఆకార | తదర్థచి తయాంచే వికార | హే సంతాంచే లౌకికాచార | జాణా సాచార సకళిక | ||౧౧౫||
115. భక్తుల కొరకే వారు ఆకారాన్ని ధరించారు. భక్తుల కొరకే వారి మనసులోని ఆలోచనలు, భావాలు, ఆవేశాలు. సత్పురుషుల లౌకిక ఆచారాలను అందరూ తెలుసుకోండి.
సాఈ మహారాజ సంతనిధాన | కేవళ శుద్ధ పరమానంద స్థాన | తయా మాఝే సాష్టాంగ వందన | నిరభిమాన నిర్లేప | ||౧౧౬||
116. సాయి మహారాజు సాధువులకు ఆశ్రయం. శుద్ధమైన ఆనందానికి నిలయం. అలాంటి శుద్ధమైన మనసుగలవారికి, అభిమానం లేనివారికి, నా సాష్టాంగ నమస్కారాలు.
మహత్పుణ్య పావన తే స్థాన | జేథే మహారాజ ఆలే చాలూన | గాంఠీ పూర్ణ సంచిత అసల్యావిణ | ఏసే నిధాన దుర్లభ | ||౧౧౭||
117. తమంతట తామే వారు నడిచి వచ్చి చేరిన ఆ చోటు చాలా పుణ్యమూ పావనమూ అయినది. గతంలో సంపాదించుకున్న పుణ్యం లేకుంటే, ఇలాంటి పెన్నిధి దొరకడం చాలా కష్టం.
శుద్ధ బీజాచియా పోటీ | యేతీ ఫళే రసాళ గోమటీ | యా ప్రసిద్ధ ఉక్తీచీ కసవటీ | ఘేతలీ శిరడీంత లోకాంనీ | ||౧౧౮||
118. మంచి విత్తనంనుండి రసవత్తరమైన పండ్లు వస్తాయన్న మాటను, శిరిడీ ప్రజలు, పరీక్ష చేసి తెలుసుకున్నారు.
తో నా హిందూ నా యవన | తయా నా ఆశ్రమ నా వర్ణ | పరి కరీ సమూళ నికృంతన | నిఃసంతాన భవాచే | ||౧౧౯||
119. బాబా హిందువూ కాదు, ముస్లిమూ కాదు. వారు ఏ జాతికీ చెందలేదు. ఏ ఆశ్రమానికీ చేందలేదు. అయినా వారు ఈ సంసారంలోని అన్ని కష్టాలను సమూలంగా నశింపజేస్తారు.
అనంత అపార జైసే గగన | తైసే బాబాంచే చరిత్ర గహన | తయాంచే తే యథార్థ ఆకలన | తయావిణ కోణ కరీ | ||౧౨౦||
120. అనంతమూ, అపారమూ అయిన ఆకాశం వలె, బాబా జీవితం చాలా లోతనైది. దానిని మొత్తంగా అర్థం చేసుకోవటం వారికే తప్ప, ఇంకెవరికి సాధ్యం?
విషయ దిల్యా త్యా విషయ చింతన | గురూ చింతన త్యా గురూ దిధల్యా | ||౧౨౧||
121. ఆలోచించడమే మనసు పని. విషయము ఏదైనా సరే, ఆలోచనలు లేకుండా అది ఒక క్షణమైనా ఊరికే ఉండదు. దానికి ఇంద్రియ సుఖాల గురించి ఇస్తే, వాటి గురించే ఆలోచిస్తుంది. గురువును ఇస్తే, గురువు గురించే ధ్యానిస్తుంది.
తరీ సర్వేంద్రియాంచే కరూన కాన | ఏకిలేత జే గురూ మహిమాన | తే సహజ స్మరణ సహజ భజన | సహజ కీర్తన సాఈచే | ||౧౨౨||
122. అందువలన, మనకున్న అన్ని ఇంద్రియాలను చెవులలో కేంద్రీకరించి, గురువు మహిమను వింటే, అదే సహజంగా సద్గురు సాయిని తలచుకుని, భజన, కీర్తన చేసినట్లు అవుతుంది.
పంచాగ్నిసాధన యజ్ఞయాగ | మంత్రతంత్ర అష్టాంగయోగ | ద్విజాంసీచ హే శక్య ప్రయోగ | కాయ ఉపయోగ ఇతరాంనా | ||౧౨౩||
123. పంచాగ్ని సాధన, యజ్ఞయాగాదులు, ఎనిమిది రకాల యోగాలు, మంత్ర తంత్ర ప్రయోగాలు, ఇవన్నీ బ్రాహ్మణులకు మాత్రమే సాధ్యం. ఇవేవీ ఇతరులకు ఉపయోగ పడవు.
తైశా నవ్హేత సంతకథా | సకలా లావితీ త్యా సత్పథా | భవభయాచీ హరితీ వ్యథా | నిజ పరమార్థా ప్రకటితీ | ||౧౨౪||
124. సాధు సంతుల కథలు అలా కాదు. అవి అందరినీ మంచి మార్గంలో పెడుతాయి. సంసార సాగరంలోని భయాలను, కష్టాలను తొలగిస్తుంది. మోక్షాన్ని ఎలా సాధించాలో తెలుపుతాయి.
సంతకథా శ్రవణ మనన | పరిశీలన వా నిదిధ్యాసన | ద్విజశూద్ర వా స్త్రీజన | యెణే పావన హోతాత | ||౧౨౫||
125. సాధు సంతుల జీవిత చరిత్రను విని, మననం, అధ్యయనం, నిధి ధ్యాసనం చేస్తే, బ్రాహ్మణులు, శూద్రులు, స్త్రీలు అందరూ పవిత్రులౌతారు.
ప్రేమచి నాహీ జయాచే ఠాయీ | ఏసా మానవ హోణేంచ నాహీ | కోణాచే కాంహీ కోణాచే కాంహీ | అధిష్ఠాన పాహీ ఆనాన | ||౧౨౬||
126. ప్రేమ అనేదే లేని మనిషి ఉండనే ఉండరు. ఒకరికి వస్తువుల ప్రేమ, ఇంకొకరికి ఇంకొకటి, ఇలా వేరు వేరుగా ఉంటాయి కాని, అసలు ప్రేమే లేకుండా ఎవరూ ఉండరు.
కోణాచే ప్రేమాచీ జాగా సంతతీ | కోణాచి తీ ధనమాన సంపత్తి | దేహ గేహ లౌకిక కీర్తి | విద్యా ప్రాప్తి కోణాచీ | ||౧౨౭||
127. కొందరికి వారి సంతానం మీద ప్రేమ. మరొకరికి గౌరవ మర్యాదలు, ధన సంపదలపై ప్రేమ ఉంటుంది. ఇంకొకరికి దేహం మీద, ఇంటి మీద, లౌకికమైన కీర్తి, ప్రతిష్ఠల మీద, విద్యను సంపాదించటం మీద ప్రేమ ఉంటుంది.
ప్రేమ జె విషయీ వాటతే | తే సర్వ జై ఎకవటతే | హరిచరణ ముశీంత జే ఆటతే | తై తే ప్రకటతే భక్తిరూపే | ||౧౨౮||
128. ఇంద్రియ సుఖాల మీద ఉన్న ప్రేమనంతటినీ ఒకటిగా చేసి, శ్రీహరి పాదాలనే మూసలో వేస్తే, అదే భక్తి రూపంలో బయటికి వస్తుంది.
మ్హణవూని దేహ ప్రపంచాలా సోపా | చిత్త సాఈ చరణీ సమర్పా | మగ తయాచీ హోఈల కృపా | ఉపాయ సోపా హా ఎక | ||౧౨౯||
129. అందువలన, ఈ దేహంతో సంసారంలోని పనులను చేస్తూ, మనసును సాయి పాదాలకు సమర్పిస్తే, వారి అనుగ్రహం కలుగుతుంది. వారి అనుగ్రహం పొందటానికి ఇదొక సులభమైన ఉపాయం.
ఏసి యాహీ అల్ప సాధనీ | మహల్లాభ హో ఘడతో జనీ | తరీ యా శ్రేయ సంపాదనీ | ఔదాసీన్య కైసేపా | ||౧౩౦||
130. ఇలాంటి సులభమైన, చిన్న చిన్న సాధనలతో గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఐనా, తమ శేయస్సుని పొందటానికి జనులు ఎందుకు వీటిని ఆచరించరు?
సహజీ శ్రోతియా అంతరీ | ఆశంకేచీ ఉఠేల లహరీ |
మహల్లాభ అల్పోపాయీ తరీ | నాదరితీ కా బహుజన | ||౧౩౧||
131. ‘ఇంత చిన్న ఉపాయంతో అంత గొప్ప లాభం కలుగుతుందంటే, మరి జనులు ఎందుకు దానిని ఆచరించరు?’ అనే సందేహం శ్రోతల మనసులో సహజంగా కలుగుతుంది.
ఆహే యాసీ ఎకచి కారణ | లాలసాహీ నుపజే భగవత్కృపేవిణ | తోచ భగవంత జఇి సుప్రసన్న | ప్రకటే శ్రవణ లాలసా | ||౧౩౨||
132. దానికి కారణం ఒక్కటే. దేవుడి దయ లేకుంటే, సాధు సంతుల జీవిత కథలను వినాలనే ఆశ కలుగదు. దేవుడు ప్రసన్నుడై అనుగ్రహించినప్పుడే, వినాలనే కోరిక కలుగుతుంది.
తరీ సాఈస జాఈ శరణ | కృపా కరీల నారాయణ | శ్రవణ లాలసేచే హోఈల జనన | స్వల్పసాధన హాతీ యే | ||౧౩౩||
133. అందువలన, సాయిని శరణు వేడితే, నారాయణుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు, ఈ కథలను వినాలనే ఆశ కలిగి, ఈ సులభమైన ఉపాయం చేజిక్కుతుంది.
గురూకథేచీ సత్సంగతి | ధరా ఉగవా సంసార గుంతీ | యాంతచి తుమచే సార్థక నిశ్చితీ | వికల్ప చిత్తీ న ధరావా | ||౧౩౪||
134. గురు కథలను వినటం అనే మంచి స్నేహాన్ని పొంది, సాంసారిక బాధలను వదిలించుకోండి. నిశ్చయంగా మీ జీవితానికి తృప్తినిచ్చేది ఇదే. ఇందులో ఏ సందేహాలనూ పెట్టుకోకండి.
సోడూనియా లాఖ చతురాఈ | స్మరా నిరంతర సాఈ సాఈ | బేడా పార హోఈల పాహీ | సందేహ కాంహీ న ధరావా | ||౧౩౫||
135. అతి తెలివితో కూడిన ఎన్నో వాద వివాదాలను వదిలి వేయండి. ఎప్పుడూ ‘సాయీ, సాయీ’ అని ధ్యానించండి. మీరు తరిస్తారు. ఇందులో ఏ సందేహమూ లేదు.
హే నాహీంత మాఝే బొల | అసతీ సాఈముఖీంచే సఖోల | మానూ నకా హో హే ఫోల | యాచే తే తోల కరూ నకా | ||౧౩౬||
136. ఇవి నా మాటలు కావు. సాయి నోటినుండి వచ్చిన గంభీరమైన మాటలు. వీనిని, అర్థం లేని మాటలని అనుకోకండి. వెల కట్టటానికి ప్రయత్నించకండి. ఇవి చాలా అమూల్యమైన మాటలు.
కుసంగ తెథూన సర్వ ఖోటా | తో మహద్దుఃఖాంచా వసౌటా | నకళతచి నేఈల అవ్హాంటా | దేఈల ఫాంటా సౌఖ్యాలా | ||౧౩౭||
137. చెడు సహవాసం ఎప్పటికీ మంచిది కాదు. అది అనేక దుఃఖాలకు మూలం. మనకు తెలియకుండానే, మనకు మేలు చేసే మంచి మార్గాన్నుంచి, మరలించి, చెడు దార్లను పట్టిస్తుంది.
ఎకా సాఈనాథావాంచూన | అథవా ఎకా సద్గురూవిణ | కుసంగాచే పరిమార్జన | కరీల ఆన కవణకీ | ||౧౩౮||
138. ఒక సాయినాథులు కాని, లేక ఒక సద్గురువు కాని లేకుండా, చెడు సహవాసంనుండి మనల్ని రక్షించే వారెవరు?
కళవళ్యాచే గురూముఖాంతూన | నిఘాలే జే గురూవచన | కరా కరా భక్త హో జతన | కుసంగ నిరసన హోఈల | ||౧౩౯||
139. ఓ భక్తులారా! కనికరించి, ప్రేమమయులైన గురువు నోటినుండి పలికిన ఈ మాటలను శ్రద్ధగా మీ మనసులో భద్రపరచుకోండి. ఎలాంటి చెడు సహవాసాన్నైనా అవి తొలగిస్తాయి.
సుష్టిజాత డోళా భరతే | సౌందర్య లోలూప మన తై రమతే | తీచ దృష్టీ జై మాగే పరతే | తై తీచ రతే సత్సంగీ | ||౧౪౦||
140. సృష్టిలో ఉండే రూపాలు కళ్ళను ఆకర్షించినప్పుడు, సౌందర్యాన్ని కోరుకునే మనసు, వాటిని ఆరాధిస్తుంది. అదే దృష్టిని మనము లోపలకు త్రిప్పితే, అది సాధు సంతుల మంచి స్నేహంతో తృప్తి చెందుతుంది.
ఇతుకే సత్సంగాచే మహిమాన | సమూళ నిర్దళీ దేహాభిమాన |
మ్హణూన సత్సంగాపరతే సాధన | పాహతా ఆన అసేనా | ||౧౪౧||
141. సత్సంగంయొక్క గొప్ప మహిమ అలాంటిది. దేహం మీద ఉన్న అభిమానాన్ని అది మొత్తం నశింపచేస్తుంది. అందు వలన, సత్సంగం కంటే వేరే సాధన లేదు.
ధరావా నిత్య సత్సంగ | ఇతర సంగ నిత్య సవ్యంగ | సత్సంగ ఎకచి నిర్వ్యంగ | అంగ ప్రత్యంగ నిర్మళ | ||౧౪౨||
142. నిత్యమూ సత్సంగం చేయండి. ఇతర సహవాసాలు దోషంతో కూడుకున్నవి. దేహాన్ని అంతటినీ శుభ్రం చేసేది, ఏ దోషాలూ లేని సత్సంగం ఒక్కటే.
సత్సంగ తోడీ దేహాసక్తి | ఎవఢీ బలవత్తర తయాచీ శక్తి | ఎథ ఎకదా జడల్యా భక్తి | సంసార నిర్ముక్తి రోకడీ | ||౧౪౩||
143. సాధు సంతుల సహవాసం, దేహం మీద ప్రేమను, అభిమానాన్ని తొలగిస్తుంది. మంచి సహవాసం పట్ల ఒక్క మారు శ్రద్ధ కలిగితే, దాని బలమైన శక్తివలన సంసారబంధం నుండి తప్పక ముక్తి కలుగుతుంది.
భాగ్యే ఘడల్యా సత్సంగ | సహజ ఉపదేశ యథా సాంగ | తత్క్షణీ విరే కుసంగ | రమతే నిఃసంగ మన తెథే | ||౧౪౪||
144. మన అదృష్టం కొద్దీ మంచి సహవాసం దొరికిందా, పారమార్థిక ఉపదేశాలు వాటంతట అవే వస్తాయి. వాటిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. చెడు సహవాసాలన్నీ తొలగిపోయి, మనసు కదలిక లేని స్థితిలో ఉండి, ఆనందిస్తుంది.
వ్హావయా పరమార్థీ రిఘావ | విషయ విరక్తి ఎక ఉపావ | న ధరితా సత్సంగాచీ హావ | స్వరూప ఠావ లాగేనా | ||౧౪౫||
145. పరమార్థ మార్గంలో ప్రవేశించటానికి, ఇంద్రియ సుఖాలయందు విరక్తి ఒకటే ఉపాయం. మంచి సహవాసం కావాలనే బలమైన కోరిక కలగకుండా, ఆత్మను తెలుసుకోవడం సాధ్యం కాదు.
సుఖాపాఠీ యేతే దుఃఖ | దుఃఖాపాఠీంచ యేతే సుఖ | సుఖాసీ జీవ సదా సన్ముఖ | తోచి విన్ముఖ దుఃఖాసీ | ||౧౪౬||
146. సుఖాల వెంట దుఃఖాలు, దుఃఖాల వెంట సుఖాలు వస్తుంటాయి. జీవుడు ఎప్పుడూ సుఖాలనే ఆశిస్తూ, దుఃఖాలకు దూరంగా ఉంటాడు.
వ్హా సన్ముఖ వా విన్ముఖ | హోణార హోతే ఆవశ్యక | యా ఉభయ భోగాంచా మోచక | సంగాచి ఎక సంతాంచా | ||౧౪౭||
147. ఆశించినా, ఆశించకపోయినా, జరగవలసినది జరిగే తీరుతుంది. సుఖదుఃఖాలనే ఈ రెండు అనుభవాలనుంచి ముక్తి కలిగించేది, సత్పురుషుల సహవాసం ఒక్కటే.
సత్సంగే నాసే దేహాభిమాన | సత్సంగే తుటే జన్మమరణ | సత్సంగే భేటే చైతన్యఘన | గ్రంథీ విచ్ఛేదన తాత్కాళ | ||౧౪౮||
148. మంచి సహవాసం వలన దేహం మీద ఉండే అభిమానం తొలగిపోతుంది. దాని వలన చావు పుట్టుకల వలయంనుంచి ముక్తి దొరుకుతుంది. దాని వలనే చైతన్య స్వరూపుడైన పరమాత్మను చేరుకోవచ్చు. ఈ సంసార బంధాలనుంచి విముక్తిని కూడా సత్సంగం ఇస్తుంది.
పావావయా ఉత్తమ గతి | పావన ఎక సంత సంగాతి | శరణ జాతా అనన్య గతి | నిజ విశ్రాంతీ ఆందణీ | ||౧౪౯||
149. ఉత్తమ గతిని పొందటానికి, మంచి సహవాసం ఒక్కటే పావనమైంది. సాధు సంతులకు మనస్సు పూర్వకంగా శరణుజొచ్చితే, ఆత్మ శాంతి నిశ్చయం.
నాహీ నామ నాహీ నమన | నాహీ భావ నాహీ భజన | తయా కరాయా నిజ పారాయణ | సంత మహాజన అవతార | ||౧౫౦||
150. దేవుడి పేరును అసలు చెప్పని వారిని, భక్తితో ఎప్పుడూ దేవుడికి నమస్కరించని వారిని, దేవుడి నామస్మరణ, భజన, ఆరాధన చేయని వారిని, భక్తులుగా మార్చటానికి సాధు సంతులు అవతరిస్తారు.
గంగాభాగీరథీ గోదా | కృష్ణా వేణ్యా కావేరీ నర్మదా |
యాహీ వాంఛితీ సాధూచ్యా పదా | యేతీల కదా స్నానార్థ | ||౧౫౧||
151. గంగా-భాగీరథి, గోదావరి, కృష్ణవేణి, కావేరి, నర్మదా నదులు, సాధు సంతులు ఎప్పుడు స్నానం చేయటానికి వస్తారా అని ఎదురు చూస్తుంటాయి. దాని వలన వారి పాదాలను తాకే అవకాశం వాటికి వస్తాయి.
జగాచీ పాతకే స్వయే క్షాలితీ | పరి తయాంచీ పాప నివృత్తి | వినా సంత పద ప్రాప్తి | హోఈనా తీ కదాపి | ||౧౫౨||
152. ప్రపంచంలోని జనులందరి పాపాలను స్వయంగా ఈ నదులే కడిగేస్తుంటాయి. అలా ఈ నదులు పొందిన పాపాలని కడగటానికి సత్పురుషుల పాదాలు తప్ప వేరే గతి లేదు.
జన్మాంతరీచే భాగ్య ఉదేలే | మహారాజ సాఈంచే చరణ జోడలే | జన్మమరణ ఠాయీంచ ఠేలే | భవ భయ హరలే సమస్త | ||౧౫౩||
153. ఎన్నో జన్మల మన పుణ్యాల వలన మనకు సాయి మహారాజు పాదాలు దొరికి, భక్తులు చావు పుట్టుకల వలయంనుంచి తప్పించుకున్నారు. సంసార బంధాల భయం మొత్తంగా హరించుకుని పోయింది.
ఆతా సంత శ్రోతే జన | కేల్యా శ్రవణాచే కరూ మనన | విసాంవా ఘేఊ ఆపణ | పుఢీల నిరూపణ పుడారా | ||౧౫౪||
154. సాధువులైన శ్రోతలారా! ఇంత వరకు మీరు విన్నదానిని గురించి ఆలోచించండి. ఇక మనం విశ్రాంతి తీసుకుందాం. మిగతా వర్ణనలు తరువాత.
హేమాడ సాఈస శరణ | మీ తో తయాంచ్యా పాయీంచీ వహాణ | కరీత రాహీన కథా నిరూపణ | హోఈన సుఖసంపన్న తితుకేనీ | ||౧౫౫||
155. హేమాడు సాయికి శరణుజొచ్చుతున్నాడు. నేను సాయి పాదాలకు పాద రక్షను. వారి కథను చెబుతూ సుఖంతో ఆనందిస్తాను.
కాయ తే మనోహర గోమటే ధ్యాన | మశీదీచే కడేవర రాహూన | కరీత ఎకేకా ఉదీ ప్రదాన | భక్తకల్యాణ హేతూనే | ||౧౫౬||
156. భక్తుల శ్రేయస్సు కొరకు, బాబా మసీదు చివర నిలబడి, ఒక్కొక్కరికీ విభూతి ప్రసాదాన్ని ఇస్తుంటే, చూడటానికి ఎంత అద్భుతమైన దృశ్యం!
సంసార మిథ్యా జయాచే జ్ఞాన | బ్రహ్మానందీ అఖండ లీన | మన సదైవ ఉఫలలే సుమన | సాష్టాంగ నమన తయాతే | ||౧౫౭||
157. ఈ ప్రపంచం నిజం కాదు అన్న పూర్తి జ్ఞానంతో, ఎప్పుడూ బ్రహ్మ ఆనందంలో లీనమై, సదా వికసించిన పువ్వులాంటి మనసుగల, వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం.
డోళా జై ఘాలీ జ్ఞానాంజన | ఠాయీంచ పాడీ నిజనిధాన | ఏసే జయా సాఈచే మహిమాన | సాష్టాంగ వందన తయాతే | ||౧౫౮||
158. వారు కళ్ళకు జ్ఞానమనే కాటుకను వ్రాస్తే, వెంటనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇంతటి మహిమ గల సాయికి సాష్టాంగ నమస్కారం.
పుఢీల అధ్యాయ యాహూన బరా | అంతరీ శిరతా శ్రవణ ద్వారా | కరీల పునీత హృదయ మందిరా | ఖళ మళ సారా దవడీల | ||౧౫౯||
159. తరువాతి అధ్యాయం ఇంతకంటే బాగుంటుంది. చెవుల ద్వారా మనసులోకి ప్రవేశించి, అన్ని మాలిన్యాలని, బాధలని తొలగించి, హృదయమనే మందిరాన్ని పావనం చేస్తుంది.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | శ్రీసాఈసమర్థమహిమానం నామ |
| దశమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ:
1. నానావల్లీ మ్హణూన ఎక పిశాచ్చ వృత్తీనే రాహణారే ధష్టపుష గృహస్థ బరీచ ముదత శిరడీంత రాహిలే హోతే. త్యాంనీ తేథే అసల్యా ముదతీత అతోనాత స్వైరవర్తన కేలే. శ్రీసాఈబాబాంచ్యా దరబారచా బందోబస్త ఠేవణ్యాకడే త్యాంచే ఫార లక్ష అసే. లహర ఆల్యాస కోణాస కవటాళీత, తర కోణాచ్యా థోబాడీతహీ భడకావీత. కధీ సర్వాంగ చిఖలాత మాఖవూన, కధీ వానరవేష ఘేఊన వ గావాతీల పోరాంస వానరవేష దేఊన సభామండపాత యేత వ ఖూప గడబడ కరీత అసత. శ్రీసమర్థాంవర త్యాంచే వ త్యాంచ్యావర శ్రీసమర్థాంచే ఫార ప్రేమ అసే. ఎకదా లహరీత సాఈబాబాంచా హాత ధరూన త్యాంనా యాంనీ గాదీవరూన ఉఠవిలే వ ఎక మినిటభర ఆపణ త్యాంచ్యా గాదీవర బసలే ఆణి లగేచ త్యాంనా అత్యాదరపూర్వక గాదీవర బసవూన త్యాంనా సాష్టాంగ నమస్కార ఘాతలా. హే గృహస్థ సాఈబాబాంస ’కాకా’ మ్హణూన హాక మారీత వ సాఈబాబాంనీ దేహ ఠేవల్యాపాసూన త్యాంనీ జే దుఖణే ఘేతలే త్యా దుఖణ్యానే సాఈబాబాంచ్యా దేహావసనాచ్యా తేరావ్యాచ దివశీ త్యాంనీ ’కాకా...కాకా’ మ్హణూన ఆపలా దేహ ఠేవలా. త్యాంచే స్మారక మ్హణూన శిరడీస త్యాంచ్యా దేహావర సమాధీ బాంధణ్యాత ఆలేలీ ఆహే.
2. పరక్యాస ఝాలేల్యా తాపానే.