|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౯ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
ఆతా పూర్వకథానుసంధాన | న హోతా బాబాంచే అనుజ్ఞాపన |
భక్త నిజఠాయా జాతా పరతోన | కైసే తే శీణ పావత | ||౧||
1. మునుపటి అధ్యాయంలోని కథను ముందువరిస్తూ, బాబా అనుమతి లేకుండా భక్తులు బయలుదేరితే, వారు ఎలా ఇబ్బంది పడేవారు;
తైసీచ బాబాంచీ భైక్ష్యవృత్తి | అనిర్వాణాంత జీ సేవిలీ హోతీ | తీ పంచసూనాది పాపనివృత్తి | కల్యాణార్థీ భక్తాంచ్యా | ||౨||
2. భక్తుల శ్రేయస్సు కొరకు పంచసూనాది పాపాలను తొలగించటానికి, బాబా తమ జీవితాంతం భిక్షాటన చేయటం;
తైసేంచ ఆబ్రహ్మస్థావరాంత | సాఈచ సర్వత్ర అనుస్యూత | సాఈచ హోఊని కృపావంత | భూతీ భగవంత హే ఠసవీ | ||౩||
3. అలాగే, సాయి ఎలా ఈ బ్రహ్మాండాన్నంతా వ్యాపించి ఉన్నారు; అన్ని ప్రాణులలో దేవుడు ఉన్నాడని కరుణతో సాయి అందరి మనసులలో నాటడం, ఇవన్నీ ఇప్పుడు చెప్పబడతాయి.
మ్హణవూని సకళ శ్రోతేజన | ప్రార్థితో మీ శ్రవణావధాన | సాదర పరిసతా యా కథా పావన | కృతకల్యాణ పావాల | ||౪||
4. అందుకు, ఈ పావన కథలను శ్రద్ధగా వినండి అని నేను శ్రోతలను ప్రార్థిస్తున్నాను. వీనిని వింటే ఎంతో శ్రేయస్సు కలుగుతుంది.
శిరడీచ్యా యాత్రేచే హే ఎక లక్షణ | బాబాంచీ అనుజ్ఞా ఝాల్యావీణ | యాత్రేకరూ పరతతా జాణ | కరీ తో ఆమంత్రణ విఘ్నాంతే | ||౫||
5. శిరిడీయాత్రలో ఒక ప్రత్యేకత ఉంది. బాబా అనుమతి లేకుండా యాత్రికులు తిరిగి వెళ్ళిపోతే, కష్టాలను కొని తెచ్చుకున్నట్లే.
తీచ ఎకదా ఆజ్ఞా హోతా | శిరడీంత యేఈనా క్షణ ఎక వసతా | వసతా చఢలేంచ విఘ్న మాథా | అనుభవ సమస్తా ఆహేచ | ||౬||
6. అలాగే, ఒక సారి బాబా ఆజ్ఞ అయితే, తరువాత ఒక్క క్షణమైనా శిరిడీలో ఉంటే, కష్టాలు తలపై పడేవి. ఇది అందరికీ అనుభవం.
ఆజ్ఞేబాహేర జే జే వాగలే | తయాంచే వాటేంత హాల ఝాలే | కితీఎకాంస చోరాంనీ లుటిలే | స్మరణ రాహిలే జన్మాచే | ||౭||
7. బాబా ఆజ్ఞను మీరిన వారు, దారిలో చాలా కష్టాలు పడేవారు. ఎందరినో దారిలో దొంగలు దోచుకునేవారు. ఇలాంటి అనుభవాలను వారు జీవితాంతం గుర్తుంచుకునే వారు.
భాకర తుకడా ఖాఊన జా మ్హణతా | కోణీ ఉపాశీచ ఘాఈనే1 నిఘతా | గాడీ న మిళతా ఉపాశీ రఖడతా | అనేక భక్తాంహీ పాహిలే ||౮||
8. “రొట్టె తిని వెళ్ళు” అని బాబా చెప్పగా, తినకుండా త్వరపడి బయల్దేరి వెళ్ళితే, బండి దొరకక ఉపవాసంతో వారు మాడిపోయేవారు. దీనిని చాలా మంది భక్తులు అనుభవంతో తెలుసుకున్నారు.
ఎకదా పాటీల తాత్యా కోతే | కోపరగాంవాస చాలలే హోతే | ఆఠవడ్యాచా బాజార తెథే | జాహలే యేతే మశీదీ | ||౯||
9. కోపర్గాంలో వారం, వారం జరిగే సంతకు పోవాలని తాత్యా కోతే పాటీలు బయలుదేరే ముందు, ఒక సారి, మసీదుకు వచ్చాడు.
తాంగా ఠేవిలా ఉభా కరూన | ఘేతలే బాబాంచే దర్శన | చరణ వందిలే యేతో మ్హణూన | హే ఆజ్ఞాపన మిష కేలే | ||౧౦||
10. బయట టాంగాను నిలిపి, బాబా దర్శనం చేసుకుని, వారి అనుమతిని తీసుకునే వంకతో, ‘వెళ్లి వస్తాను’ అంటూ బాబా పాదాలకు నమస్కారం చేశాడు.
భక్త కరోత టాళాటాళ | బాబా జాణత వేళ అవేళ |
పాహోని తాత్యా ఉతావీళ | మ్హణతీ అమంళ థాంబావే | ||౧౧||
11. అప్పుడప్పుడు, భక్తులు తొందరపాటులో బాబా అనుమతిని తీసుకోకున్నా, బాబాకు ఏది మంచి సమయము, ఏది కానిది అనేది బాగా తెలుసు. తాత్యా తొందరను చూసి “కొంచెం ఆగు” అని అన్నారు.
రాహూ దే హోఈల బాజార | జాఊ నకో గావా బాహేర | పరీ పాహూన తాత్యాచా ఆగ్రహ ఫార | మ్హణాలే బరోబర శామా నే | ||౧౨||
12. “సంత ఉంటే ఉంటుంది లే, మరొక సారి వెళ్ళొచ్చు. ఇప్పుడు మటుకు ఊరి బయటకు వెళ్ళొద్దు” అని చెప్పారు. కాని తాత్యాయొక్క మొండి పద్ధతిని చూసి, “శ్యామాను వెంటబెట్టుకుని వెళ్ళు” అని అన్నారు.
కాయ శామ్యాచే ఆహే కారణ | కేలే తయా ఆజ్ఞేచే అవగణన | బైసలే తాత్యా టాంగ్యాంత జాఊన | బాజారాలాగూన చాలలే | ||౧౩||
13. ‘శ్యామా ఎందుకులే’ అని తలచి, బాబా మాటను లెక్క చేయకుండా, తాత్యా టాంగాలో కూర్చుని, సంతకు బయలుదేరాడు.
దోహో ఘోడ్యాంత ఎక చపళ | రూపయే తీనశేచే పాఠబళ | సాఊళ విహీర యేతా జవళ | అతి ఉచ్ఛృంఖల చాలలే | ||౧౪||
14. టాంగాకు కట్టిన రెండు గుర్రాలలో, ఒకటి వేగంగా పరుగెత్తేది. ౩౦౦ రూపాయల ఖరీదైనది. సావూల విహీర (శిరిడీనుండి ౩ కి.మీ. దూరంలో ఉంది) దగ్గర ఆ గుర్రం వేగం పెంచుకుని, అదుపు తప్పి, పరుగెత్త సాగింది.
కధీ న ఖాణారా చాబూక ఫటకా | బాజారా జాణారా న భరతా ఘటకా | ఘోడా పడలా కంబరేత లటకా | భరలా టచకా ఎకాఎకీ | ||౧౫||
15. ఎన్నడూ కొరడా దెబ్బ తిననిది, త్వరగా సంతకు వెళ్ళగల గుర్రం, పడిపోయింది. దాంతో, బండి కూడా పడిపోయింది. తాత్యాకు నడుం పట్టింది.
కైచా బాజార కైచే కాయ | తాత్యాంస ఆఠవలీ సాఈ మాయ | వేళీ ఏకతో టళతా అపాయ | నాహీ ఉపాయ గత గోష్టీ | ||౧౬||
16. ఇక ఎక్కడి సంత ఎక్కడి బజారు? తాత్యాకు సాయిమాత గుర్తుకు వచ్చారు. ‘వారి మాట విని ఉంటే, ఈ అపాయం తప్పేది కదా, జరగాల్సింది జరిగిపోయింది, దీని గురించి ఆలోచించడం దండుగ’.
ఏసేంచ ఆణిక ఎకదా ఘడలే | తాత్యా కోల్హార గాంవా నిఘాలే | టాంగా జోడూన పుసాయా ఆలే | వందిలీ పాఉలే బాబాంచీ | ||౧౭||
17. ఇలాగే ఇంకొక సారి కూడా జరిగింది. తాత్యా కోల్హార గ్రామానికి పోవడానికి టాంగా సిద్ధం చేసుకొని వచ్చి, బాబా పాదాలకు నమస్కరించి, ‘వెళ్ళి వస్తానని’ చెప్పాడు.
ఆతా జాఊన యేతో మ్హణాలే | పూర్ణానుమోదన నవ్హతే మిళాలే | తథాపి తాత్యా తైసేచ నిఘాలే | పరిసా వర్తలే కాయ పుఢే | ||౧౮||
18. ‘తొందరగానే వచ్చేస్తాను’ అని అన్నాడు. బాబా అనుమతి పూర్తిగా దొరకక ముందే బయల్దేరాడు. ఆ తరువాత ఏం జరిగిందో వినండి.
టాంగా ఆధీంచ తో భిరక్యాచా | బేఫామ భరధాంవ ఉధళలా సాచా | పాహీ న వాట ఖళగే ఖాచా | జివావరచా ప్రసంగ | ||౧౯||
19. ఆ టాంగా చిన్నది, బరువు తక్కువైనది. గుర్రాలు అదుపు లేకుండా, దారి తెన్ను, మిట్ట పల్లాలు చూడకుండా, చాలా వేగంగా పరుగెత్తగా, తాత్యాకు ప్రాణం మీదకు వచ్చింది.
అసో తో సాఈకృపేనే టళలా | టాంగా బాభుళీవర ఆదళలా | బరే ఝాలే తెథేంచ మోడలా | దగా వటావలా పుఢీల | ||౨౦||
20. సాయి దయతో ఆ అపాయం తొలగింది. తుమ్మ చెట్టుకు టాంగా గ్రుద్దుకొని ఆగిపోయింది. ఎంతో నయం. అక్కడితో తాత్యా వెనుకకు మరలాడు. తరువాత జరిగే ప్రమాదంనుండి తప్పించుకున్నాడు.
ఏసాచి ఎక ముంబాపురస్థ | ఆంగ్లభౌమ థోర గృహస్థ |
మనీ ధరోని కాంహీ హేత | ఆలా దర్శనార్థ సాఈంచ్యా | ||౨౧||
21. ఇలాగే, ముంబైలో ఉండే ఒక ఆంగ్లేయుడు బాబా దర్శనానికి వచ్చాడు. గొప్ప గృహస్థుడు. మనసులో ఏదో కోరికతో సాయిని చూడటానికి వచ్చాడు.
హోతా చాందోరకరాంచా వశీలా | పత్ర లావిలే మాధవరావాలా | తంబూ ఎక మాఖూని ఘేతలా | నివాస లాధలా సుఖాచా | ||౨౨||
22. నానా చాందోర్కరు దగ్గరనుండి సిఫారసు కాగితాన్ని తెచ్చుకున్నాడు. ఒక గుడారాన్ని అడిగి తీసుకుని, అందులో సుఖంగా ఉండ సాగాడు.
బాబాంచియా ఇచ్ఛేవిరూద్ధ | మ్హణేల కోణీ చఢేన మశీద | పరతేన దర్శన ఘేఊని స్వచ్ఛంద | అశక్య హే ప్రసిద్ధ సర్వత్ర | ||౨౩||
23. బాబా ఇష్టానికి వ్యతిరేకంగా, ఎవరైనా కాని మసీదు మెట్లెక్కి వెళ్ళి, తృప్తిగా వారి దర్శనం చేసుకోవడం ఎంత సాధ్యం కాని పనో, అది అందరికీ తెలిసినదే.
యత్న కేలా తీన వేళా | మశీదీసీ చఢావయాలా | పరి తో సర్వ నిర్ఫళ గేలా | పాహుణా హిరముసలా మనాంత | ||౨౪||
24. ఆంగ్లేయుడు మూడు సార్లు మసీదు మెట్లెక్కాలని ప్రయత్నం చేశాడు. కాని, ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో అతడు చాలా నిరుత్సాహ పడ్డాడు.
ఇచ్ఛా హోతీ తయాచే మనీ | మశీదీంత వరతీ జాఊని | వందావే బాబాంస గుడఘే టేకూని | హస్త చుంబూని బైసావే | ||౨౫||
25. మసీదు పైకి వెళ్ళి, మోకాళ్ళపై వంగి, బాబాకు నమస్కారం చేసి, వారి చేతిని చుంబించి, అక్కడ కూర్చోవాలనేది, అతని మనసులోని కోరిక.
ఇచ్ఛా తయాంచీ ఏసీ | బాబా న యేఊ దేత తయాంసీ | మశీదీంత బైసావయాసీ | ఆపులే పాశీ తెధవా | ||౨౬||
26. అది అతని కోరిక. కాని, పైకి వచ్చి, తమ దగ్గర కూర్చోవడానికి బాబా, అప్పుడు, అనుమతించ లేదు.
ఖాలీంచ సభామండపీ అసావే | తెథేంచ పాహిజే తరీ బైసావే | దర్శన ఘేణే తెథూని ఘ్యావే | పరి న యావే వర తేణే | ||౨౭||
27. క్రింద సభామండపంలోనే కూర్చుని, తమ దర్శనం కావాలంటే, అక్కడినుండే అతడు దర్శనం చేసుకోనీ, కాని పైకి రాకూడదని బాబా అనుకున్నారు.
అసో పుఢే తో నిఘే జావయా | అంగణీ ఆలా నిరోప ఘ్యావయా | జాశీల ఉదయీక మ్హణతీ తయా | ఘాఈ కాసయా హీ ఇతుకీ | ||౨౮||
28. కొంత కాలం తరువాత, తిరిగి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుని, బాబా అనుమతి కోసం, సభామండపంలోకి రాగా, బాబా “రేపు వెడుదువు గానిలే, ఎందుకింత తొందర?” అని అన్నారు.
లోకాంహీ బహుత కథిలే | నానాపరీ తయా వినవిలే | పరవానగీ న హోతా జే గేలే | బహు పస్తావలే మ్హణవూని | ||౨౯||
29. అక్కడున్న జనులు కూడా వెళ్ళవద్దని నచ్చ చెప్పారు. బాబా అనుమతి లేకుండా వెళ్ళినవారు తరువాత ఎంత పశ్చాత్తాప పడ్డారు అని కూడా చెప్పారు. ఎన్నో రకాలుగా జనులు అతనికి నచ్చ చెప్పారు.
హోణారాపుఢే కాంహీ న చలే | నాహీ తయాచ్యా మనా తే పటలే | పరవానగీ విరహిత నిఘాలే | హాల జాహలే మార్గాంత | ||౩౦||
30. మునుపే నిశ్చయించుకున్నందు వలన, అతను ఎవరి మాట వినలేదు. జరగవలసిన దాని ముందు ఏదీ సాగదు. బాబా అనుమతి లేకుండా అతడు బయలుదేరి, దారిలో చాలా బాధ పడ్డాడు.
గాడీ ఆరంభీ నీట చాలలీ | పుఢే ఘోడ్యాంనీ వాట సోడిలీ |
సాఊళ2 విహీర మాత్ర ఓలాండిలీ | తో పుఢే ఆలీ బాయసికల | ||౩౧||
31. బండి మొదట్లో బాగానే నడిచింది. తరువాత గుర్రాలు దారి తప్పాయి. సావూల విహీర దాటే సరికి, అకస్మాత్తుగా ఒక సైకిలు అడ్డం వచ్చింది.
గృహస్థ హోతా మాగే బసలా | పుఢే తాంగా ఎకాకీ చమకలా | తోల జాఊని తైసాచ కలథలా | మాగే ఉలండలా మార్గాంత | ||౩౨||
32. గృహస్థుడు వెనుక కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా అడ్డం రాగానే, గుర్రాలు బెదరి, కుదుపు వచ్చి, ఒక్క సారిగా టాంగా పట్టు తప్పింది. వెనుక ఉన్న గృహస్థుడు, పట్టు తప్పి, రోడ్డు మీద వెల్లకిలా పడ్డాడు.
మహత్ప్రయత్నే తాంగా థాంబవిలా | గృహస్థ ఘసరత ఘసరత గేలా | మగ ఉచలూన తాంగ్యాంత బసవిలా | తాంగా హాంకిలా పుఢారా | ||౩౩||
33. అతి ప్రయత్నం మీద, టాంగాను ఆపగలిగారు. రోడ్డు మీద పడ్డ ఆ గృహస్థుణ్ణి, టాంగా కొంత దూరం వరకూ ఈడ్చుకుంటూ వెళ్ళింది. తరువాత అతన్ని లేవనెత్తి, టాంగాలో కూర్చోబెట్టగా, టాంగా ముందుకు సాగింది.
శిరడీ రాహిలీ ఎకీకడే | ముంబఈ రాహిలీ దుసరీకడే | కోపరగాంవీ ఆస్పీటల జికడే | తాంగా మగ తికడే ఘేతలా | ||౩౪||
34. శిరిడీ ఒక వైపు, ముంబై మరొక వైపు! టాంగా మాత్రం, అతనిని కోపర్గాం హాస్పిటలు దగ్గరకు తీసుకెళ్ళింది.
అసో కాంహీ దివస తెథ | గృహస్థ పశ్చాత్తాపవ్యథిత | హోతే అవజ్ఞా ప్రాయశ్చిత్త | భోక్తృత్వ భోగీత పడలే తే | ||౩౫||
35. అలా కొన్ని రోజులు ఆ గృహస్థుడు, జరిగిన దానికి పశ్చాత్తాప పడుతూ, బాబా మాటను జవదాటినందుకు ప్రాయశ్చిత్తంగా, తన కర్మను అనుభవిస్తూ, ఆస్పత్రిలో పడి ఉన్నాడు.
ఏసే అసంఖ్య అనుభవ ఆలే | లోక సహజీ శంకూ లాగలే | బాబాంచీ ఆజ్ఞా పాళూ సరలే | కరూ న ధజలే అవ్హేర | ||౩౬||
36. ఇలాంటి అనుభవాలు ఎన్నో కలుగగా, జనులు కీడు శంకించి, భయంతో బాబా మాటలను పాటించ సాగారు. బాబా ఆజ్ఞలను జవదాటే సాహసం ఎవరూ చేయలేదు.
కోణ్యా గాడీచే చక్ర3 నిసటలే | కోణ్యాచే తే ఘోడే థకలే | గాడ్యా చుకలే ఉపాశీ రాహిలే | చురమురే ఫాంకిలే కితీ ఎకీ | ||౩౭||
37. కొందరి బండి చక్రాలు ఊడి పోయేవి. మరి కొందరి గుర్రాలు అలసి పోయేవి. ఇంకా కొందరికి రైలు బండి తప్పిపోయి, ఉపవాసం ఉండేవారు. నిరాశగా, ఏమి చేయాలో తెలియక, కొందరు మరమరాలు తినేవారు.
తీచ ఆజ్ఞా జయాంనీ వందిలీ | అవేళీంహీ గాడీ సాధిలీ | ముశాఫరీహీ సుఖాచీ ఝాలీ | ఆఠవ రాహిలీ జన్మాచీ | ||౩౮||
38. బాబా ఆజ్ఞను పాటించిన వారు, వేళ కాని వేళ కూడా రైలును అందుకొని, సుఖంగా ప్రయాణం చేసేవారు. దానిని జీవితాంతం గుర్తుంచుకునే వారు.
వర్షానవర్షే భైక్ష్యవృత్తి | రూచావీ కా బాబాంప్రతి | ఏసే ఆలియా కోణాచే చిత్తీ | శంకానివృత్తీ అవధారా | ||౩౯||
39. ఏళ్ళ తరబడి బాబా భిక్షాటననే ఎందుకు ఇష్ట పడ్డారు అని ఎవరికైనా అనిపిస్తే, ఆ సంశయాన్ని ఇప్పుడు తొలగిస్తాను, వినండి.
పాహూ జాతా బాబాంచే ఆచరిత | భిక్షాచ మాగణే తయాంతే ఉచిత | ఆనంద దేఈ సాధీ నిజహిత | సాధీ గృహస్థ కర్తవ్య | ||౪౦||
40. బాబా జీవిత శైలిని చూస్తే, వారు భిక్షాటన చేయటమే సరి అయినది అని అనిపిస్తుంది. అలా చేయడం వలన, గృహస్థులకు తమ ధర్మాన్ని పాటించి, దాని ఫలితంగా తమ శ్రేయస్సును పొందటానికి అవకాశం ఇచ్చారు. దీనితో ఆ గృహస్థులకూ తృప్తిగా, ఆనందంగా ఉండేది.
కాయావాచా చిత్తవిత్త | సాఈపదీ జో సమర్పిత |
ఏసా జో సాఈచా అనన్యభక్త | ఆవడే అత్యంత సాఈస | ||౪౧||
41. తమ దేహం, మాట, మనసు మరియు సంపదను సాయి పాదాలకు సమర్పించే, దృఢమైన నమ్మకంగల భక్తులపై సాయికి విపరీతమైన ప్రేమ.
జే జే అన్న పాకే ఆశ్రమీ | స్వామీ తయాచా గృహస్థాశ్రమీ | యతీ ఆణి బ్రహ్మచర్యాశ్రమీ | యాంసీ హోమీ ప్రథమతా | ||౪౨||
42. గృహస్థాశ్రమంలో ఉంటూ, అన్నం వండుకునే వారి ఇంటి యజమాని, తాను తినే మునుపు, సన్యాసులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి.
న దేతా ఆధీ తయా అవదాన | స్వయే గృహస్థ జై కరీ సేవన | ఆచరూ లాగే చాంద్రాయణ | శాస్త్ర నిర్బంధన త్రిశుద్ధీ | ||౪౩||
43. అలా చేయకుండా, యజమాని తానే ముందుగా భోజనం చేస్తే, దేహం, మాట, మరియు మనసు అను ఈ త్రికరణాల శుద్ధి కొరకు, చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలనేది, శాస్త్ర నియమం.
యతీ బ్రహ్మచారీ యాంప్రతీ | నిషేధిలీసే పాకనిష్పత్తి | తే కరూ జాతా చాంద్రాయణ మాథీ | ఆదళే నిశ్చితీ తయాంచ్యా | ||౪౪||
44. సన్యాసులు, బ్రహ్మచారులు, శాస్త్ర ప్రకారంగా, తమ ఆహారాన్ని తామే వండుకోకూడదు. అలా చేసినట్లయితే, వారు కూడా చాంద్రాయణ వ్రతాన్ని చేయాల్సిందే.
మ్హణవూని తయాంచీ ఉదరపూర్తి | శాస్త్రే నిరవిలీ గృహస్థావరతీ | యతీ కధీంహీ న ఉద్యమ కరితీ | కరాయా భరతీ పోటాచీ | ||౪౫||
45. అందువలన, వారి పొట్టలను నింపే బాధ్యతను, శాస్త్రాలు, గృహస్థులపై వేశాయి. సన్యాసులు తమ పొట్ట నింపు కోవటం కోసం, ఎప్పుడూ ఏ ప్రయత్నమూ చేయకూడదు.
బాబా నవ్హేత గృహస్థ | కింవా నవ్హేత వానప్రస్థ | కేవళ బ్రహ్మచారీ బాళ సంన్యస్త | భిక్షాచ ప్రశస్త తయాంసీ | ||౪౬||
46. బాబా గృహస్థులు కారు. వానప్రస్థానికి చెందరు. వారు కేవలం బ్రహ్మచారులు. బాల సన్యాసి. అందువలన వారికి భిక్షయే సరియైనది.
అఖిల విశ్వ మాఝే ఘర | మీచ వాసుదేవ విశ్వంభర | మీచ పరబ్రహ్మ అక్షర | హా దృఢబోధ నిర్ధార జయాచా | ||౪౭||
47. ‘ఈ విశ్వమంతా నా ఇల్లు. నేనే వాసుదేవుణ్ణి. ఈ విశ్వమంతటా నేనే వ్యాపించి ఉన్నాను. నేనే ఎప్పటికీ నశించని పరబ్రహ్మను’ అని దృఢమైన జ్ఞానం ఉన్నవారు, భిక్షాటనకు పూర్తి అధికారులు.
భిక్షాన్నాచా పూర్ణ అధికార | తయా విశ్వకుటుంబియాసచి సాచార | ఇతరాంచే విడంబన ప్రకార | చవ్హాట్యావర పహావే | ||౪౮||
48. ‘ఈ జగత్తంతా ఒకే కుటుంబం’ అని నమ్మినవారే, భిక్షాటనకు పూర్తిగా తగినవారు. ఇలాంటి పవిత్రమైన కార్యాన్ని, మిగతా వారెందరో వీధులలో అడుక్కుంటుంటే, చూసిన వాళ్ళకు నవ్వు తెప్పించేదిగా ఉంటుంది.
ఆధీ త్యజావీ పుత్రైషణా | మగ విత్తైషణా లోకైషణా | జో ఎషణ్ణాత్రయ నిర్ముక్త జాణా | తేణేంచ భిక్షాశనా ఇచ్ఛావే | ||౪౯||
49. కొడుకు (పిల్లలు, కుటుంబం) మీద ప్రేమ, డబ్బు మీది ప్రేమ, మరియు కీర్తి మీద ప్రేమ, ఈ మూడు కోరికలనూ వదిలి వేసిన వారు మాత్రమే భిక్షాటన చేయటం గురించి ఆశించాలి.
నాతరీ ‘భిక్షాపాత్ర అవలంబణే | జళో జిణే లాజిరవాణ’ | మహారాజ తుకాబాంచే గాణే | అర్థావిణే హే నిఃసార | ||౫౦||
50. లేకుంటే, తుకారాం మహారాజు వ్రాసిన ‘భిక్షా పాత్ర మీద ఆధార పడే బ్రతుకు సిగ్గు చేటు’ అన్న మాటను అర్థం చేసుకోలేక పోతే, ఆ మాటకు విలువ ఉండదు.
సాఈ సమర్థ మహాన సిద్ధ | లహాన థోరా హే తో ప్రసిద్ధ |
పరి ఆమ్హీచ సదా ఆశాబద్ధ | అసన్నద్ధ సత్పదీ | ||౫౧||
51. సాయి సమర్థులు చాలా గొప్ప సిద్ధులని, చిన్నా పెద్దా అందరికీ బాగా తెలుసు. కాని, మనము ఎల్లప్పుడూ ఆ మూడు కోరికలచే బంధించ బడడం వలన, వారి శ్రీచరణాలను చేరుకోవడానికి మనము సిద్ధంగా లేము.
పంచమహాయజ్ఞావిణ4 | గృహస్థాస జే నింద్య జెవణ | తే శిరడీంత రోజ పవిత్ర భోజన | స్వయే కరవూన ఘే సాఈ | ||౫౨||
52. ఐదు మహాయజ్ఞాలను చేయకుండా గృహస్థులు భోజనం చేయకూడదు. ప్రతి రోజూ, శిరిడీలో బాబా, గృహస్థులచే వీనిని చేయించి, వారి భోజనాన్ని పవిత్రం చేయించేవారు.
ప్రత్యహీ పాంచ ఘరే జాఈ | అతిథి యజ్ఞాచే స్మరణ దేఈ | భాగ్యవాన హా లాభ ఘేఈ | ఆపులే గేహీ బైసూన | ||౫౩||
53. ప్రతి రోజూ వారు అయిదు ఇళ్ళకు వెళ్ళి, అతిథి యజ్ఞాన్ని గుర్తు చేసేవారు. తమ ఇళ్ళల్లోనే ఉంటూ, ఇంత గొప్ప లాభాన్ని పొందిన ఆ గృహస్థులు, ఎంతటి అదృష్టవంతులో!
సారూనియా జే పంచమహాయజ్ఞ | అవశిష్టాన్న కరితీ సేవన | అజ్ఞాత పంచసూనా పాపగహన | తయాంచే నిర్దహన తేణేని | ||౫౪||
54. ఐదు మహాయజ్ఞాలను చేసిన తరువాత, మిగిలిన ఆ అన్నాన్ని తింటే, తెలియకుండా వారు చేసిన, చాలా క్లిష్టమైన పంచ మహాపాపాలు నశించి పోతాయి.
కండణీ చుల్లీ పేషణీ | ఉదకుంభీ ఆణి మార్జనీ | హీ పంచసూనా యా నాంవాంనీ | ఆహేత జనీ ప్రసిద్ధ | ||౫౫||
55. ఐదు మహాపాపాలైన కండణి, చుల్లీ, పేషణి, ఉదకుంభీ, మరియు మార్జని అనేవే పంచ సూనాలని జనులలో ప్రసిద్ధి చెందాయి.
ఉఖళీ ధాన్యదాణా ఘాలూని | వరీ ముసళాచే ఘావ హాణూని | తూస కోండా టాకితీ కాఢూని | హోతే న జాణూని జీవ హింసా | ||౫౬||
56. రోటిలో గింజలు వేసి, రోకలితో దంచి, పొట్టును తీసేటప్పుడు, మనకు తెలియకుండానే, ఎంతో జీవ హింస జరుగుతుంది.
పడేనా తే ధాన్య పచనీ | ప్రయోగ ఇతుకా జాహల్యావాంచూని | మ్హణోని హే పంచసూనాగ్రణీ | పాప కండణీ యా నాంవ | ||౫౭||
57. కాని, ఇలా దంచక పోతే, ఆ గింజలు వంటకు పనికి రావు. ఇదే పంచ సూనాలలో మొదటిదైన కండణి పాపం.
చులీస సర్పణ లాంకడే లావిలీ | తెణే పాకనిష్పత్తి ఝాలీ | తెథేంహీ నకళత జీవహత్యా ఘడలీ | త్యా నాంవ చుల్లీ పాప దుజే | ||౫౮||
58. వండేటప్పుడు, పొయ్యిలో కర్రలు పెట్టి, మంట పెట్టినప్పుడు, ఎన్నో చిన్న చిన్న జీవాలు మనకు తెలియకుండానే చచ్చిపోతాయి. పంచ సూనాలలో రెండవది అయిన చుల్లీ అనేది ఇదే.
ఘేఊని జాతే వా జాతణీ | పిష్ట కరితా ధాన్యాచే కోణీ | న కళత అసంఖ్య జీవాంచీ హానీ | హోతే త్యా పేషణీ హే నాంవ | ||౫౯||
59. పొట్టు తీయబడ్డ గింజలను తిరగలిలో వేసి పిండి చేస్తున్నప్పుడు, ఎన్నో ప్రాణులకు ప్రాణ హాని కలుగుతుంది. దీనినే పేషణి అని అంటారు.
వాపీకూప తడాగా మధుని | కుంభ ఘేఉని ఆణితీ పాణీ | కింవా నరనారీ ధుతా ధుణీ | అసంఖ్య ప్రాణీ మరతాత | ||౬౦||
60. బావి, చెరువు మొదలైన చోట్లనుంచి నీళ్ళు తెచ్చేటప్పుడు, లేక అక్కడ స్త్రీలు, పురుషులు తోమడం, లేక మురికి బట్టలను ఉతికేటప్పుడు, లెక్కలేనన్ని ప్రాణులు చస్తాయి.
సాధావయా కుంభ స్వచ్ఛతే | ఘాంసతా వా ఉటతా హాతే |
అనిచ్ఛా జీ హత్యా ఘడతే | పాప చౌథే ఉదకుంభీ | ||౬౧||
61. బిందెలను కడిగేటప్పుడు, వానిని చేత్తో తోమటంతో, తెలియకుండానే, ఎన్నో హత్యలు జరుగుతాయి. దీనినే ఉదకుంభీ అంటారు. ఇది నాలుగవ పాపం.
తైసేంచ శీతోష్ణ ఉదకే స్నాన | కరూ జాతా సడా సంమార్జన | జీవహత్యా ఘడే జీ దారూణ | మార్జనీ జాణ త్యా నాంవ | ||౬౨||
62. అలాగే, చన్నీళ్ళతోగాని, వేడి నీళ్ళతోగాని స్నానం చేస్తున్నప్పుడు, కల్లాపి చల్లుతున్నప్పుడు, ఎన్నో ప్రాణులు దారుణంగా చంపబడుతాయి. ఇదే మార్జనీ అనే ఐదవ పాపం.
యా పంచ పాపనిర్ముక్తీస | పంచమహాయజ్ఞ గృహస్థాస | హోతా పంచసూనా నిరాస | చిత్త శుద్ధీస లాధే తో | ||౬౩||
63. ఈ ఐదు మహాపాపాలను పోగొట్టుకోవటానికి, గృహస్థులు ఐదు మహాయజ్ఞాలను చేస్తే, ఈ పాపాలు తొలగిపోయి, మనసు శుద్ధమవుతుంది.
చిత్తశుద్ధీచే హేంచి బళ | శుద్ధజ్ఞాన ఉపజే సోజ్వళ | జ్ఞానానంతర మోక్ష అఢళ | పావతీ సకళ భాగ్యాచే | ||౬౪||
64. మనసు శుద్ధమవటంతో, వెలుగును చూపే శుద్ధ జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగిన తరువాత, దాని ఫలితంగా, భాగ్యవంతులు శాశ్వతమైన ముక్తిని పొందుతారు.
అసో హే సాఈచే భైక్ష్యవ్రత | లిహితా లిహితా వాఢలా గ్రంథ | పరిసా ఎక కథా అన్వర్థ | అధ్యాయ సమాప్త కరూ మగ | ||౬౫||
65. సాయియొక్క ఈ భిక్షాటన గూర్చి వ్రాస్తూంటే, గ్రంథం పెరిగిపోతుంది. నిజంగా జరిగిన ఒక కథను తెలిపి, ఈ అధ్యాయాన్ని ముగిస్తాను.
ప్రేమ అసావే మాత్ర చిత్తా | కోణాహీ సర్వే కాంహీంహీ ధాడితా | జాహలీ జరీ తయా విస్మరణతా | బాబా న విసరతా మాగత | ||౬౬||
66. మనసులో ప్రేమ ఉండి, ఎవరితోనైనా బాబాకు మనము, ఏదైనా పంపితే, తీసుకెళ్ళినవారు ఇవ్వటం మరిచి పోయినా, మరిచి పోకుండా బాబా దానిని అడిగి తీసుకునేవారు.
అసో భాజీ, భాకర, పేఢా | భక్తిభావ అసావా గాఢా | భేటతా ఏసా భక్త నిధడా | సాఈస ఉభడా ప్రేమాచా | ||౬౭||
67. భక్తితో, ప్రేమతో ఇచ్చినప్పుడు, ఇచ్చినది రొట్టె కూరగాని, పాలకోవాగాని, మరేదైనా చిన్న వస్తువైనా కాని, ఫరవా లేదు. అలా భక్తి, ప్రేమ ఉన్న భక్తులు కనిపిస్తే, బాబాకు ప్రేమ పొంగిపోయేది.
తీ ఎక ప్రేమళ భక్తాచీ కథా | ఏకతా ఆనంద హోఈల చిత్తా | కోణీహీ స్వీకృతకార్యీ చుకతా | బాబాచ రస్తా లావితీ | ||౬౮||
68. అలాంటి ప్రేమగల ఒక భక్తుని కథను వింటే మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. పైన వేసుకున్న బాధ్యతను సరిగా చేయక పోతే, అప్పుడు వారిని, బాబాయే దారిలో పెట్టేవారు.
ఏశీ హీ గోడ శిక్షణ పద్ధతి | యోగ్యవేళీ దేతీ జాగృతి | ధన్య భాగ్యాచే జే హే అనుభవితీ | ఆనందస్థితీ అవర్ణ్య | ||౬౯||
69. సరియైన సమయంలో, ఎంతో మెత్తగా, మనసుకు సంతోషం కలిగేలా, బాబా వారిని సరిదిద్ది, దారిలో పెట్టేవారు. ఇలాంటి శిక్షణ అనుభవించిన వారు ఎంతో భాగ్యవంతులు. వారు పొందిన సంతోషాన్ని వర్ణించడం కష్టం.
భక్తశ్రేష్ఠ రామచంద్ర నామ | వడీల జయాంచే ఆత్మారామ | తర్ఖడ జయాంసీ ఉపనామ | విశ్రామ ధామ సాఈ జయా | ||౭౦||
70. సాయి భక్తులలో గొప్పవాడైన వాడు రామచంద్రుడు. అతని తండ్రి పేరు ఆత్మారాముడు. ఇంటి పేరు తర్ఖడ్ అని. అతనికి సాయి పాదాలే రక్షణ.
పరి జేణే నిత్య సంబోధన | తే బాబాసాహెబ తర్ఖడ జాణ |
తెణేంచ హీ పోథీ చాలవూ ఆపణ | నాహీ కారణ యా పరతే | ||౭౧||
71. కాని, అతనిని అందరూ ఎప్పుడూ బాబాసాహేబ తర్ఖడ అని పిలిచేవారు. వేరే ఏ కారణమూ లేక పోవటం చేత, ఇప్పుడు అతని గురించిన కథను చెబుతాను.
సాఈప్రేమే ఉచంబళూన | తర్ఖడ జై జాత ఓథంబూన | కరూ లాగతీ అనుభవ కథన | కాయ తే శ్రవణ సుఖకర | ||౭౨||
72. సాయిపై ప్రేమ పొంగిపోతూ తర్ఖడ చెప్పిన అతని అనుభవాలను వినటం ఎంతో సంతోషంగా ఉంటుంది.
కాయ తయాంచే భక్తి విభవ | పదోపదీ సాఈచే అనుభవ | ఎకామాగూన ఎక అభినవ | సరసావిర్భావ జై కథితీ | ||౭౩||
73. అడుగడుగునా అతనికి సాయి అనుభవాలే! ఒక దానిని మించిన ఇంకో అనుభవం అతను హావభావాలతో, రసవత్తరంగా చెప్పేవాడు. అతని భక్తి వైభవం ఎంత గొప్పది!
బాబాసాహేబ అతుల ప్రేమీ | సాఈచీ ఆలేఖ్య ప్రతిమా ధామీ | భవ్య చందనీ దేవ్హారా నామీ | పూజన కామీ త్రికాళ | ||౭౪||
74. సాయి చిత్రపటాన్ని అంతులేని ప్రేమతో తన ఇంట్లో, అందమైన చందన మండపంలో ఉంచి, రోజూ మూడు పూటలూ, పూజలు చేసేవాడు.
తర్ఖడ మోఠే పుణ్యవాన | పుత్రహీ పోటీ భక్తిమాన | సాఈస నైవేద్య సమర్పిల్యావీణ | కరీనా అన్నగ్రహణ తో | ||౭౫||
75. సాయి మీద అంతే భక్తి, ప్రేమ గల కొడుకు ఉన్నందుకు, తర్ఖడ చాలా గొప్ప పుణ్యాత్ముడు. సాయికి నైవేద్యం సమర్పించకుండా భోజనం చేసేవాడు కాదు.
కరూనియా ప్రాతఃస్నాన | కాయావాచామనే కరూన | కరీ నిత్య ఛబీచే పూజన | నైవేద్య సమర్పణ భక్తీనే | ||౭౬||
76. తెల్లవారే స్నానం చేసి, కాయా వాచా మనసా ప్రతి రోజూ, బాబా పటాన్ని పూజించి, భక్తిగా నైవేద్యం సమర్పించేవాడు.
హా తయాచా నిత్య క్రమ | అసతా చాలలా అవిశ్రమ | జాహలా సఫల పరిశ్రమ | అనుభవ అనుత్తమ లాధలా | ||౭౭||
77. అలా అతను నిత్యం క్రమం తప్పకుండా పూజ చేయగా, అతని శ్రమ ఫలించి, అద్భుతమైన అనుభవం ఒకటి అతనికి కలిగింది.
మాతాహీ సాఈంచీ పరమ భక్త | శిరడీస జాఊ ఝాలీ ఉత్సుక | ములానే మార్గాంత తిచ్యా సమవేత | అసావే హా హేత వడిలాంచా | ||౭౮||
78. అతని తల్లి (తర్ఖడ భార్య) కూడా సాయియొక్క పరమ భక్తురాలు. శిరిడీ వెళ్ళాలని ఆమె చాలా ఉబలాట పడింది. ఆమె వెంట తోడుగా కొడుకును పంపాలని తండ్రి అనుకున్నాడు.
ఇచ్ఛా తియేసీ శిరడీస జావే | సమర్థ శ్రీచే దర్శన ఘ్యావే | తెథేంచ కాంహీ దివస క్రమావే | చరణ సేవావే ప్రత్యక్ష | ||౭౯||
79. శిరిడీ వెళ్ళి, సాయి సమర్థుల దర్శనం చేసుకుని, కొన్ని రోజులు అక్కడే ఉండి, స్వయంగా సాయి పాదాలను సేవించాలని ఆమె కోరిక.
ఏసా జరీ వడిలాంచా హేత | జాణే నవ్హతే ములాచే మనాంత | కోణీ మాగే పూజా ఘరాంత | కరీల నియమిత హీ చింతా | ||౮౦||
80. కాని, తండ్రి అనుకున్నట్లుగా వెళ్ళాలని, కొడుకు మనసులో లేదు. తను లేనప్పుడు, నియమంగా, రోజూ ఇంట్లో ఎవరు పూజ చేస్తారు అని అతని చింత.
వడీల ప్రార్థనాసమాజిష్ట | తయాంస మూర్తిపూజేచే కష్ట |
దేణే కైసే హోఈల ఇష్ట | కోడే హే ప్రకృష్ట ములాలా | ||౮౧||
81. తండ్రి ప్రార్థనా సమాజానికి (విగ్రహాలను ఆరాధించరు) చెందిన వాడు. అలాంటిది, అతనిని విగ్రహారాధన చేయమని ఎలా ఇబ్బంది పెట్టగలడు? అదీ అతని సమస్య.
తరీ జాణోని తయాంచే మనోగత | చిరంజీవ ప్రయాణీ ఉద్యత | ప్రేమపురఃసర వడిలాంస వినవీత | కాయ తీ మాత పరిసావీ | ||౮౨||
82. అయినా, తండ్రి మనసులోని కోరిక తెలుసుకుని, కొడుకు ప్రయాణానికి సిద్ధమై, ఎంతో ప్రేమతో తండ్రితో అన్న మాటలను వినండి.
సాఈంస నైవేద్య కేల్యావిణే | ఘరీ కోణీంహీ అన్న న సేవణే | హే ఇతుకే మాన్య కేలియావిణే | ఘడేనా జాణే నిశ్చింత | ||౮౩||
83. ‘సాయికి నైవేద్యం పెట్టకుండా ఇంట్లో ఎవరూ భోజనం చేయమని మాట ఇస్తేనే గాని, నేను నిశ్చింతగా ప్రయాణం చేయలేను’.
హే ములాచే నిత్యవ్రత | వడిలాంస హోతే ఆధీంచ అవగత | ‘జా మీ కరీన నైవేద్య నిత | రాహీ తూ నిశ్చిం’ వదతీ తే | ||౮౪||
84. కొడుకు నిత్య పూజా విధానం తండ్రికి బాగా తెలుసు కనుక, ‘నేను నిత్యం నైవేద్యం సమర్పిస్తాను, నీవు నిశ్చింతగా ఉండు.
‘ఆధీ న కరితా సాఈసమర్పణ | న కరూ కోణీహీ అన్నగ్రహణ’ | ‘హే మాఝే వచన మానీ ప్రమాణ | న కరీ అనమాన జా స్వస్థ’ | ||౮౫||
85. ‘ముందుగా సాయికి నైవేద్యం సమర్పించకుండా, మేము ఎవరమూ అన్నాన్ని తీసుకోము. ఈ నా మాటలను ప్రమాణంగా తీసుకుని, ఏ అనుమానం పెట్టుకోకుండా, సుఖంగా వెళ్ళు’ అని చెప్పాడు.
ప్రాప్త హోతా హే ఆశ్వాసన | ములగా శిరడీస కరీ ప్రయాణ | పుఢే ఉగవతా దుసరా దిన | కరితీ పూజన తర్ఖడ స్వయే | ||౮౬||
86. తండ్రి హామీ ఇచ్చాక, కొడుకు శిరిడీ ప్రయాణమయ్యాడు. మరునాడు, తెల్లవారే తర్ఖడ స్వయంగా పూజ చేశాడు.
బాబాసాహేబ తర్ఖడాంనీ | పూజనారంభీచ దుసరే దినీ | ఆలేఖ్యప్రతిమే సన్ముఖ యేఊని | లోటాంగణీ ప్రార్థియేలే | ||౮౭||
87. ఆ రోజు, పూజ ప్రారంభించక మునుపు, బాబా చిత్రపటం ముందు సాష్టాంగ నమస్కారం చేసి, బాబాసాహేబ తర్ఖడు బాబాను ప్రార్థించాడు,
ములగా జైసీ పూజా కరీ | తైసీచ బాబా మాఝీ చాకరీ | అసావీ కవాఈత న ఘడావీ మజకరీ | ప్రేమ అంతరీ ఘ్యా మాతే | ||౮౮||
88. ‘బాబా! నా కుమారుడు చేసిన విధంగానే, నా పూజ, సేవ ఉండని. ఈ పూజ యాంత్రికంగా పైపైన పూజలా కాకుండా, నాలో నిజమైన ప్రేమ కలిగించేదిగా కావాలి’.
బ్రాహ్మ ముహూర్తీ స్నాన కరూన | ఏసే ప్రార్థనాపూర్వక పూజన | తర్ఖడ కరూ లాగలే ప్రతిదిన | నైవేద్య సమర్పణ సమవేత | ||౮౯||
89. ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తాన లేచి స్నానం చేసి, ఇదే ప్రార్థనతో పూజ చేసి, ప్రతి దినం తర్ఖడ నైవేద్య సమర్పణ కూడా చేసేవాడు.
నైవేద్యార్థ శర్కరా ఖండ | బాబాసాహేబ అర్పీత అఖండ | ఏసా నియమ చాలలా ఉదండ | పడలా త్యా ఖండ ఎకదినీ | ||౯౦||
90. ఇలా ప్రతి రోజూ బాబాసాహేబు పటిక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించేవాడు. ఈ విధంగా పూజ చక్కగా, నియమంగా జరుగుతుండగా, ఒక రోజు, నియమం తప్పింది.
వ్యవహార వ్యాపృత అంతఃకరణ | తర్ఖడాంస నాహి రాహిలే స్మరణ |
హోఊని గేలే సర్వాంచే భోజన | నైవేద్యావిణ ఎక దినీ | ||౯౧||
91. తర్ఖడ మనసు వ్యవహారాలలో ఉండటంతో, మరచి పోయి, ఒక రోజు నైవేద్యం లేకుండానే, అందరి భోజనాలు అయ్యాయి.
ఎకా మోఠ్యా గిరణీవరీ | తర్ఖడసాహేబ ముఖ్యాధికారీ | తదర్థ ప్రాతఃకాళచే ప్రహరీ | జాణే బాహేరీ నిత్య త్యాం | ||౯౨||
92. తర్ఖడ ఒక పెద్ద మిల్లులో ముఖ్యాధికారి. అందువలన, రోజూ తెల్లవారే అతను పనికి వెళ్ళవలసి వచ్చేది.
పుఢే మగ దుపార భరతా | బాహేరూన పరత యేతా | పూర్వనివేదిత శర్కరా ప్రసాదతా | భోజనీ బసతా పావతతే | ||౯౩||
93. మధ్యాహ్నం తిరిగి వచ్చిన తరువాత, భోజనానికి కూర్చున్నప్పుడు, తాను తెల్లవారి బాబాకు నైవేద్యం పెట్టిన పటిక బెల్లం ప్రసాదాన్ని తీసుకునేవాడు.
ఏసా నియమ చాలతా | పడలే ఎకదా విస్మరణ చిత్తా | రాహిలీ శర్కరాఖండనివేదనతా | ప్రసాద గ్రహణతా అంతరలీ | ||౯౪||
94. ఇది రోజూ జరిగే నియమం. ఒక రోజు పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టటం మరచి పోయాడు. దాని వలన, భోజనానికి కూర్చున్నప్పుడు, ప్రసాదం ఉండలేదు.
కరావయా బైసతా భోజన | శర్కరాశేష స్వైంపాకిణ | పాత్రీ వాఢీ అనుదిన | తీచ కీ జాణ అన్నశుద్ధి | ||౯౫||
95. ప్రతి రోజూ భోజనానికి కూర్చున్నప్పుడు, వంట మనిషి ఆ పటిక బెల్లం నైవేద్యాన్ని పళ్ళెంలో వడ్డించేది. అదే అన్న శుద్ధి.
పరి తే దివశీ పూజా సమయీ | హోఊన కాంహీ తరీ ఘాఈ | శర్కరా నైవేద్య రాహూన జాఈ | ప్రసాద ఠాయీ పడేనా | ||౯౬||
96. కాని ఆ రోజు పూజా సమయంలో, తర్ఖడు తొందరలో ఉన్నందున నైవేద్యాన్ని మరచి పోయాడు. అందుకే ఆ రోజు భోజనానికి ప్రసాదాన్ని వడ్డించలేదు.
త్యాచ వేళీ పాత్రావరూన | తర్ఖడ అనుతాపయుక్త హోఊన | సాఈప్రతిమా అభివందూన | సాశ్రు నయన బోలత | ||౯౭||
97. పశ్చాత్తాపంతో, పళ్ళెం ముందునుండి లేచి, సాయి పటానికి నమస్కారం చేసి, కళ్ళలో నీరు నిండగా, ఆవేదనతో సాయిని వేడుకున్నాడు.
బాబా హీ కాయ మాయా దావిలీ | కైసీ మజలా భూల పాడిలీ | కవాఈతచి మజకరీ ఘడవిలీ | క్షమా వహిలీ మజ కరా | ||౯౮||
98. ‘బాబా! ఏమిటి ఈ మాయ? నానుండి ఈ పొరపాటు ఎలా జరిగింది? యాంత్రికంగా నా పూజ జరిగి పోయింది. మునుపు, నన్ను క్షమించండి.
నవ్హే భూల హే మహాపాప | పావలే మీ మహదనుతాప | చుకలో చుకలో మీ నిస్త్రప్త | వ్హావే మజ సకృప మహారాజా | ||౯౯||
99. ‘ఇది పొరపాటు కాదు, మహాపాపం! అందుకు నేను చాలా పశ్చాత్తాప పడుతున్నాను. సిగ్గులేని వాణ్ణి నేను, నా తప్పే, అంతా నా తప్పే. మహాప్రభూ! నన్ను కరుణించండి!’
లోటాంగణ ఘాతలే ఛబీచే చరణా | సఖేద గహింవరలే అంతఃకరణా | మ్హణతీ మహారాజా దయాఘనా | కరీగా కరూణా మజవరీ | ||౧౦౦||
100. మనసులో విపరీతమైన బాధతో, బాబా పటం ముందు సాష్టాంగ పడ్డాడు. ‘మహారాజా! దయాఘనా! నాపై కరుణ చూపండి’ అని సాయిని ప్రార్థించాడు.
"ఘడలా మజకడూని ప్రమాద థోర | క్షమా కర గా" ప్రార్థావే | ||౧౦౧||
101. వేరే గతి లేక, చాలా దీనుడై, కొడుకుకు ఉత్తరం వ్రాశాడు. ‘నా వలన పెద్ద ప్రమాదం జరిగింది, అందుకు నన్ను క్షమించమని సాయిని ప్రార్థించు.
"దయా కరా యా అనన్యశరణా" | ఏసీ సాఈంశీ భాకావీ కరూణా | అభయకర ఆణి అభయవచనా | మాగావే దీనా దాసాతే | ||౧౦౨||
102. ‘సంపూర్ణంగా శరణుజొచ్చిన నన్ను కరుణించమని సాయిని ప్రార్థించు. మరియు ఈ దీన దాసుని కోసం, వారి దయ మరియు క్షమించాననే ఒక్క మాటను వేడుకో.
వాంద్రే గ్రామీ హా ప్రకార | శిరడీ శంభర కోస దూర | తాత్కాళ తేథే పావలీ ఖబర | పరిసా తై ఉద్గార బాబాంచే | ||౧౦౩||
103. బాంద్రా గ్రామంలో జరిగిన ఈ సంగతి, సుమారు ౨౦౦ మైళ్ళ దూరంలో ఉన్న శిరిడీకి, కొంచెం కూడా ఆలస్యం లేకుండా, వెంటనే చేరింది. అప్పుడు బాబా అన్న మాటలను వినండి.
భూత భవిష్య వర్తమాన | దేశకాలాద్యనవఛిన్న | మహారాజాంస త్రికాలజ్ఞాన | పహా తే ప్రమాణ ప్రత్యక్ష | ||౧౦౪||
104. భూత, భవిష్యత్తు, వర్తమానాలను, దేశ కాలాలను మీరిన సాయి త్రికాల జ్ఞాని అని అనటానికి ఇదొక ప్రమాణం.
ఇకడే ములగా శిరడీస అసతా | తేచదినీ తే సమయీ జీ వార్తా | ఘడలీ సాఈస వందూ జాతా | శ్రోతా సావధానతా పరిసావీ | ||౧౦౫||
105. అదే రోజు, శిరిడీలో ఉన్న అబ్బాయి, సాయికి నమస్కారం చేయడానికి వెళ్ళగా, ఆ సమయంలో జరిగిన దానిని శ్రోతలు జాగ్రత్తగా వినండి.
ములగా యేఊన అతి ఉల్హాసతా | ఆఈ సమవేత చరణ వందితా | సాఈ జే ఆఈస వదలే తే పరిసతా | పావలా విస్మితతా అత్యంత | ||౧౦౬||
106. ఎంతో ఉత్సాహంతో, తల్లితో ఆ అబ్బాయి సాయి పాదాలకు నమస్కరించగా, బాబా ఆ తల్లితో అన్న మాటలను విని, అబ్బాయికి ఆశ్చర్యం కలిగింది.
"కాయ కరావే ఆఈ ఆజ | గేలే మీ వాంద్ర్యాస జైసా రోజ | నాహీ ఖావయా పేజ | ఉపాశీ మజ యావే లాగలే | ||౧౦౭||
107. “ఏం చేయను తల్లీ! ప్రతి రోజులాగే ఈ రోజూ నేను బాంద్రాకు వెళ్ళాను. తినటానికి, త్రాగటానికి ఏమీ లేక, ఆకలితో నేను తిరిగి రావల్సి వచ్చింది.
కైసా పహా ఋణానుబంధ | కవాడ హోతే జరీ బంద | తరీ మీ ప్రవేశలో స్వచ్ఛంద | కోణ ప్రతిబంధ మజ కరీ | ||౧౦౮||
108. “తలుపులు మూసి ఉన్నా, ఋణానుబంధం వలన స్వతంత్రంగా నేనే లోపలికి వెళ్ళాను. నన్నెవరు ఆపగలరు?
మాలక నాహీ మిళాలా ఘరీ | ఆంతడీ మాఝీ కళకళలీ భారీ | తసాచ మీ అన్నవిణ మాఘారీ | భరదుపారీ పరతలో" | ||౧౦౯||
109. “యజమాని ఇంట్లో లేడు. ఆకలితో నా కడుపులోని ప్రేగులు అరుస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం పూట, అన్నం లేకుండానే నేను అలాగే వెనుకకు తిరిగి వచ్చేశాను”.
ఏసే హె బోల జేవ్హా పరిసిలే | చిరంజీవానీ తాత్కాళ తాడిలే | ఆపులే వడీల బహుధా విసరలే | దావాయా చుకలే నైవేద్య | ||౧౧౦||
110. ఈ మాటలను విన్న వెంటనే, తన తండ్రి నైవేద్యం సమర్పించటం బహుశా మరచి పోయాడని ఆ అబ్బాయి తెలుసుకున్నాడు.
ములగా బాబాంస కరీ వినంతీ | మజలా జాఊ ఘ్యా ఘరాప్రతీ |
బాబా తయాంస జాఊ న దేతీ | తెథేంచ ఘేతీ తే పూజా | ||౧౧౧||
111. తను ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఇమ్మని ఆ అబ్బాయి బాబాను వేడుకున్నాడు. కాని, బాబా అతనిని వెళ్ళనివ్వలేదు. అక్కడే, అతనిచే పూజ చేయించుకున్నారు.
త్యాచ దివశీ శిరడీహూన | ధాడిలే సవిస్తర పత్ర లిహూన | వితళలే వడిలాంచే అంతఃకరణ | పత్ర తే వాచూన పాహతా | ||౧౧౨||
112. జరిగినదంతా విస్తారంగా, తండ్రికి అదే రోజు శిరిడీనుండి అబ్బాయి ఉత్తరం వ్రాశాడు. అది చదివి ఆ తండ్రి మనసు కరిగిపోయింది.
ఇకడీల పత్ర తికడే పావలే | ములాలాహీ ఆశ్చర్య వాటలే | తయాచ్యాహీ నయనీ దాటలే | అశ్రూ లాగలే వహావయా | ||౧౧౩||
113. అంతకు మునుపు ఆ తండ్రి వ్రాసిన ఉత్తరం అప్పుడే శిరిడీలో కొడుకుకు అందింది. ఆ అబ్బాయికి కూడా చాలా ఆశ్చర్యం కలిగి, కళ్ళనుండి నీరు జారాయి.
పహా కైసా హా సాఈచా ఖేళ | కైసే న ప్రేమ ఉచంబళేల | ఏసా కోణ పాషాణ అసేల | జో న ద్రవేల యేణేనీ | ||౧౧౪||
114. సాయియొక్క ఈ లీల ఎలాంటిదో చూడండి! ప్రేమ పొంగకుండా ఎలా ఉంటుంది? దీనికి కరగని రాయిలాంటి వారెవరైనా ఉంటారా?
యాచ ములాచీ ప్రేమళ ఆఈ | శిరడీస అసతా ఎకే సమయీ | కరీత అనుగ్రహ బాబా సాఈ | తీ నవలాఈ పరిసిజే | ||౧౧౫||
115. ప్రేమమూర్తి అయిన ఆ తల్లి ఒక మారు శిరిడీలో ఉండగా, బాబా ఆమెను అనుగ్రహించిన అద్భుతమైన సంగతి వినండి.
అసతా తెథే భోజనాగారీ | పాత్రే వాఢూని ఝాలీ తయారీ | ఇతుక్యాంత ఎక శ్వాన ద్వారీ | భుకేలే దుపారీ పాతలే | ||౧౧౬||
116. ఆమె భోజన శాలలో భోజనానికి కూర్చుండగా, ఆకులలో అన్నీ వడ్డించి ఉన్నాయి. మిట్ట మధ్యాహ్నం పూట, ఆకలితో ఉన్న ఓ కుక్క తలుపు దగ్గరకు వచ్చింది.
భాకర హోతీ జీ పాత్రావర | శ్వానాస బాఈ జో ఘాలీ చతకుర | తో ఎక చిఖలాంత మాఖలా సూకర | తెథేంచ క్షుధాతుర పాతలా | ||౧౧౭||
117. ఆకులో ఉన్న రొట్టె ముక్కను ఆమె ఆ కుక్కకు వేసింది. అప్పుడే, బురదతో నిండి, ఆకలితో ఉన్న ఒక పంది అక్కడికి వచ్చింది. (దానికి కూడా ఆమె రొట్టె ముక్కను వేసింది).
వార్తా ఘడలీ స్వాభావికపణీ | నాహీ బాఈచ్యా ధ్యానీ మనీ | పరి దుపారీ ఆపణ హోఊని | తీచ సాఈనీ కాఢిలీ | ||౧౧౮||
118. ఇవన్నీ చాలా సహజంగానే జరిగిపోయాయి. వీటిని ఆమె పట్టించుకోలేదు. కాని, మధ్యాహ్నం బాబా తమంతట తామే వీటిని గురించి చెప్పారు.
దుపారీ భోజన జాహల్యానంతర | మశీదీంత నిత్యక్రమానుసార | బాఈ యేఊని బైసతా దూర | సాఈ సాదర పూసితీ | ||౧౧౯||
119. మధ్యాహ్న భోజనం తరువాత, ఎప్పటిలాగే, ఆమె మసీదులో దూరంగా కూర్చుని ఉండగా బాబా ప్రేమగా ఆమెతో,
"ఆఈ త్వా ఆజ మజ జేవూ ఘాతలే | తేణే హే ఆకంఠ పోట భరలే | హోతే హే ప్రాణ వ్యాకుళ ఝాలే | తే తృప్త కేలే గే తువా | ||౧౨౦||
120. “తల్లీ! ఈ రోజు నాకు నువ్వు తిండి పెట్టావు. గొంతు వరకు తిన్నాను. కడుపు నిండిపోయింది. ఆకలితో బాధ పడుతున్న ఈ ప్రాణాలను నువ్వు తృప్తి పరచావు.
ఏసేచ కరీత జావే నిత్య | హేంచ కామీ యేఈల సత్య |
మశీదీంత బైసూన మీ అసత్య | బోలేన హే త్రిసత్య ఘడేనా | ||౧౨౧||
121. “రోజూ ఇలాగే చేస్తూ ఉండు. పనికి వచ్చేది ఇదే. మసీదులో కూర్చుని నేను అబద్ధం చెప్పటమనేది, ఎప్పటికీ జరగదు.
అశీచ మాఝీ దయా జాణావీ | భుకేల్యా భాకర ఆధీ ద్యావీ | ఆపుల్యా పోటా నంతర ఖావీ | ధరావే జీవీ హే నీట" | ||౧౨౨||
122. “ఇలాగే ఎప్పుడూ దయ చూపించు. ఆకలిగొన్న వారికి ముందు పెట్టి, తరువాత మనం తినాలి. ఈ నిజాన్ని మనసులో బాగా గుర్తుంచుకో”.
కాయ వదలే హే సాఈసమర్థ | బాఈస కాంహీచ కళేనా అర్థ | కాయ అసావా కీ భావార్థ | వాణీ నిరర్థక నవ్హే కదా | ||౧౨౩||
123. సాయి సమర్థులు చెప్పినవి ఏవీ ఆవిడకు అర్థం కాలేదు. వారు చెప్పిన దాంట్లో భావార్థం ఏమిటో? బాబా మాటలు ఎప్పుడూ అర్థం లేకుండా ఉండవు.
మ్హణే మీ తుమ్హాంస వాఢీన ఏసే | ఘడావే తరీ మజకరీ కైసే | మీచ పరతంత్ర దేఊని పైసే | మిళేల తైసే ఖాతసే | ||౧౨౪||
124. అప్పుడు ఆమె ‘నేనే ఇంకొకరిపై ఆధార పడి, డబ్బు పెట్టి దొరికిందేదో తింటున్నాను. అలాంటిది, నేను మీకివ్వటం ఎలా జరుగుతుంది?’ అని అన్నది.
"సేవూనియా తీ ప్రేమాచీ భాకర | జాహలో మీ తృప్తి నిర్భర | అజూన మజలా యేతీ ఢేకర" | బాబా ప్రత్యత్తర కరితాత | ||౧౨౫||
125. “ప్రేమగా నువ్వు పెట్టిన రొట్టె తిని, పూర్తిగా తృప్తి పొందాను. ఇప్పటికీ, నాకింకా త్రేనుపులు వస్తున్నాయి”. అని బాబా జవాబిచ్చారు.
తూ జేఊ బైసతా ద్వారీ యేతా | పోటీ క్షుధేచీ జయా వ్యాకులతా | త్వా దేఖిలే జ్యా శ్వానా అవచితా | మజ ఎకాత్మతా తయా సవే | ||౧౨౬||
126. “నువ్వు భోజనానికి కూర్చున్నప్పుడు, ఆకలితో బాధ పడుతూ, తలుపు దగ్గరకు, అకస్మాత్తుగా వచ్చిన ఒక కుక్కను చూచావు కదా? అది, నేను ఒకటే అని తెలుసుకో.
తైసే సర్వాంగీ మాఖిలా చిఖలాసీ | దేఖిలే త్వా జయా సూకరాసీ | భుకేనే వ్యాకుళ ఝాలేలియాసీ | మాఝీ తయాసీ ఎకాత్మతా" | ||౧౨౭||
127. “అలాగే, శరీరమంతా బురదతో నిండి, ఆకలితో బాధపడుతున్న పందిని చూడలేదూ, అది నేనూ ఒక్కటే”.
ఏకోని బాబాంచీ వచనోక్తీ | బాఈ పావలీ విస్మయ చిత్తీ | శ్వానే సూకరే మాంజరే వావరతీ | బాబాచ కాయ తీ సమస్త | ||౧౨౮||
128. ఆ మాటలు విని ఆమె చాలా ఆశ్చర్యపడింది. ‘చుట్టూతా ఎన్నో కుక్కలు, పిల్లులు, పందులూ తిరుగుతుంటాయి. వాటన్నిటి లోనూ బాబాయేనా!’
"కధీ మీ శ్వాన కధీ సూకర | కధీ మీ గాయ కధీ మాంజర | కధీ ముంగీ మాశీ జలచర | ఏసియా విచరత రూపే మీ | ||౧౨౯||
129. “ఒకప్పుడు కుక్కను, ఇంకొకప్పుడు పందిని, మరొకప్పుడు ఆవును, కొన్ని మార్లు పిల్లిని, మరొకప్పుడు చీమ, దోమ లేదా నీటిలో ఉండే ప్రాణిని. ఇలా ఎన్నో రూపాలతో నేను ఈ ప్రపంచంలో తిరుగుతుంటాను.
పాహీ భూతమాత్రీ జో మజ | తోచి మాఝియా ప్రీతీచా సమజ | తరీ తూ భేదబుద్ధీతే త్యజ | ఏసీచ భజ మజలాగీ" | ||౧౩౦||
130. “అన్ని ప్రాణులలోనూ నన్ను చూసేవారే నాకు చాలా ఇష్టం అని తెలుసుకో. వేరు చేసే బుద్ధిని వదిలి, ఇలాగే నన్ను పూజించు.
వచన నవ్హే తే పరమామృత | సేవూని బాఈ సద్గదిత |
నేత్ర ఆనందాశ్రూభరిత | కంఠ దాటత బాష్పాంహీ | ||౧౩౧||
131. ఇవి, వట్టి మాటలు కావు. పరమామృతం. దానిని విన్న ఆవిడ మనసు కరిగింది. కళ్ళు నీళ్ళతో నిండాయి. గొంతు గద్గదమైంది.
ఏసీచ ఆణీక యా బాఈచీ | కథా సుందర ప్రేమరసాచీ | సమర్థ సాఈంచ్యా భక్తైక్యతేచీ | ఎకాత్మతేచీ నిజ ఖూణ | ||౧౩౨||
132. ప్రేమ మూర్తి అయిన ఆవిడదే ఇటువంటి మరొక అందమైన కథ. దీని ద్వారా, ప్రాణులలోనే కాదు, భక్తుల ఆత్మలలోనూ, సాయి సమర్థులు ఉన్నారని తెలుస్తుంది.
ఘేఊని కుటుంబ ములే బాళే | ఎకదా పురందరే5 శిరడీస నిఘాలే | దేఈ తీ దోన వృంతాకపళే6 | ప్రేమ సమేళే తయాంసవే | ||౧౩౩||
133. భార్యా పిల్లలతో పురందరే (సాయి భక్తుడు) ఒక మారు శిరిడీకి బయలుదేరాడు. అతని భార్యకు, తర్ఖడ భార్య, ప్రేమగా బాబాకు వండి పెట్టమని, రెండు వంకాయలను ఇచ్చింది.
వినవీ తయాంచే కుటుంబాస | భరీత ఎకాచే కరీ బాబాంస | దుజయాచ్యా తళూన కాచర్యా ఖరపూస | వాఢీ బహువస తయాంతే | ||౧౩౪||
134. ఒక కాయతో ‘భరీత’ను (గుత్తివంకాయ), రెండవ దానితో ‘కచరియ’ (వేపుడు కూరలాంటిది) నూ వండి, బాబాకు తృప్తిగా వడ్డించమని ఆమెను (పురందరే భార్యను) కోరింది.
బరే మ్హణోని తీ వాంగీ ఘేతలీ | బాఈ జేవ్హా శిరడీస పాతలీ | ఆరతీపాఠీ భోజనవేళీ | ఘేఊన గేలీ భరీత | ||౧౩౫||
135. ‘అలాగే’ అని ఆమె వంకాయలను తీసుకుంది. శిరిడీ చేరుకున్నాక, హారతి ముగిసిన తరువాత, ఆమె భోజన వేళకు వంకాయ భరీతను తీసుకుని వెళ్ళింది.
నిత్యా ప్రమాణే నైవేద్య దావూని | బాఈ గేలీ తాట ఠేవూని | సర్వాంచే నైవేద్య గోళా కరూని | బాబా భోజనీ బైసలే | ||౧౩౬||
136. ఎప్పటిలాగే, నైవేద్యాన్ని సమర్పించి, ఆ పళ్ళెమును అక్కడే ఉంచి, ఆమె వెళ్ళిపోయింది. అందరి నైవేద్యాన్ని కలిపి, ముద్ద చేసుకుని, బాబా భోజనానికి కూర్చున్నారు.
భరితాచీ చవీ చాఖితా | లాగలే రూచకర వాటిలే సమస్తా | కాచర్యా ఖావ్యాసే వాటలే చిత్తా | వదతీ ఆతా ఆణా త్యా | ||౧౩౭||
137. బాబాతో పాటు అందరూ భరీతను రుచి చూసి, బాగా రుచికరంగా ఉందని మెచ్చుకున్నారు. బాబాకు కచరియా తినాలని అనిపించింది. “దాన్ని ఇప్పుడే తెచ్చిపెట్టండి” అని బాబా అన్నారు.
నిరోప గేలా రాధాకృష్ణీస | బాబా ఖోళంబలే జేవావయాస | కాచర్యాంవరీ గేలే మానస | కరావే కాయ సమజేనా | ||౧౩౮||
138. కచరియా తినాలనే కొరికతో, బాబా భోజనం ఆపారు అని రాధాకృష్ణబాయికి కబురు వెళ్ళింది. ఏమి చేయాలో ఎవరికీ అర్థం కాలేదు.
హంగామ నాహీ హా వాంగ్యాంచా | ఆతా హా పదార్థ హోణార కైచా | శోధ పురందర్యాంచే కుటుంబాచా | ఆణిక భరితాచా చాలలా | ||౧౩౯||
139. కాని, నిజంగా అది వంకాయలు కాసే కాలం కాదు. వంకాయలు లేకుండా కచరియా ఎలా తయారు చేయడం? భరీతను తెచ్చింది ఎవరు అని కనుక్కొని, పురందరే భార్య కోసం వెదక సాగారు.
తిణే ఆణిలే జే తాట | భరీత హే తో హోతే తయాంత | అసతీల తిచియా సామగ్రీంత | వాంగీ కదాచిత వాటలే | ||౧౪౦||
140. ఎందుకంటే, ఆమె తెచ్చిన పళ్ళెంలోనే భరీత ఉండేది. అందుకే ఆమె వద్ద ఇంకా వంకాయలు ఉండి ఉంటాయని అనిపించింది.
మ్హణూని తిచే పాసీ పుసతా | కళలీ కాచర్యాంచీ అన్వర్థతా |
ఎవఢే బాబాంచే ప్రేమ కా త్యాంకరితా | చుకలే సమస్తా కళూన | ||౧౪౧||
141. ఆమెను అడగగా, అప్పుడు వంకాయ కచరియాయొక్క రహస్యం తెలిసింది. దానిపై బాబాకు ఎందుకింత ప్రీతి అన్న అసలు సంగతి అందరికీ అర్థమైంది.
బాఈ మ్హణే భరీత ఝాలే | ఎకాచే దుపారీ అర్పణ ఝాలే | కాచర్యా నేఈన మాగాహూన మ్హటలే | దుసరే తే చిరిలే తదర్థ | ||౧౪౨||
142. ‘ఒక కాయతో ‘భరీత’ చేసి మధ్యాహ్నం సమర్పించాను. రెండవ కాయతో ‘కాచర్యా’ చేసి, తరువాత తీసుకుని వెళ్ళాలని, కోసి ఉంచాను’ అని ఆమె చెప్పింది.
పుఢే హీ వాంగ్యాంచీ సమూళ వార్తా | హళూ హళూ జై కళలీ సమస్తా | జో తో ఆశ్చర్య కరీ చిత్తా | పాహూని వ్యాపకతా సాఈచీ | ||౧౪౩||
143. తరువాత, ఆ వంకాయల కథ ప్రారంభంనుంచి క్రమ క్రమంగా అందరికీ తెలిసి, అన్ని చోట్లా ఉండగలిగే సాయియొక్క శక్తి తెలుసుకుని అందరూ ఆశ్చర్య పడ్డారు.
ఆణిక ఎకదా డిసెంబర మాసీ | సన ఎకూణీసశే పంధరాచే వర్షీ | యాచ బాఈనే అతి ప్రేమేసీ | పేఢా బాబాంసీ పాఠవిలా | ||౧౪౪||
144. మరొక సారి, క్రి. శ. ౧౯౧౫వ సంవత్సరం డిసెంబరు నెలలో, తర్ఖడ భార్యయే అంతులేని ప్రేమతో బాబాకు పాలకోవాను పంపింది.
బాళారామ పరలోకవాసీ | క్రియా కర్మాంతర కరావయాసీ | ములాస త్యాచ్యా జాణే శిరడిసీ | పుసావయాసీ పాతలా | ||౧౪౫||
145. బాళారాం (మాన్కరు) శిరిడీలో చనిపోయాడు. అంత్య సంస్కారాలు చేయటానికి అతని కొడుకు శిరిడీ బయలుదేరుతూ, ఆ సంగతి చెప్పటానికి తర్ఖడ దగ్గరకు వచ్చాడు.
జాతో మ్హణూన సాంగావయాసీ | ఆలా ములగా తర్ఖడాంపాశీ | తయాంసవే కాంహీ బాబాంసీ | ద్యావే మనాసీ కుటుంబాచ్యా | ||౧౪౬||
146. ‘శిరిడీ వెళుతున్నాను’ అని చెప్పటానికి తర్ఖడ దగ్గరకు వచ్చాడు. అతనితో బాబాకు ఏదైనా పంపాలని తర్ఖడ భార్యకు అనిపించింది.
పేఢ్యావాంచూన దుసరే కాంహీ | పాహూజాతా ఘరాంత నాహీ | ఆధీంచ నివేదిత పేఢా తోహీ | ములాస ఘాఈ జాణ్యాచీ | ||౧౪౭||
147. ఎంత వెతికినా, ఇంట్లో పాలకోవా తప్ప వేరే ఏమీ దొరకలేదు. అది కూడా, ఇదివరకే నైవేద్యం పెట్టిన పేడా. ఆ అబ్బాయేమో వెళ్ళడానికి తొందర పడుతున్నాడు.
శివాయ తో ములగా సుతకీ | పేఢాహీ ఎక ఉచ్ఛిష్ట శిలకీ | తోచ పాఠవీ తయాసవేంచ కీ | సాఈ ముఖీ అర్పావయా | ||౧౪౮||
148. అబ్బాయి ఏమో సూతకంలో ఉన్నాడు, ఒక సారి అర్పించిన పాలకోవా తప్ప వేరే ఏమీ ఇంట్లో లేదు. చివరకు, దానినే సాయికి అబ్బాయితో పంపాలనుకుంది.
మ్హణే దుసరే కాంహీ నాహీ | హాచ ఆతా ఘేఊని జాఈ | ప్రేమ పురఃసర హాచ దేఈ | ఖాతీల సాఈ ఆవడీనే | ||౧౪౯||
149. ‘వేరే ఏమీ లేదు, దీనినే తీసుకెళ్ళి, ప్రేమగా బాబాకు ఇవ్వు. దానినే వారు ప్రీతిగా తింటారు’ అని చెప్పింది.
పేఢా గోవిందజీనే7 నేలా | పరి తో జేవ్హా దర్శనార్థ గేలా | పేఢా బిర్హాడీ విసరూని రాహిలా | ధీర తై ధారిలా బాబాంనీ | ||౧౫౦||
150. గోవిందు (బాళారాం మాన్కరు కొడుకు) పాలకోవాను తీసుకుని వెళ్ళాడు. కాని, బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, తాను బస చేసిన చోటే, దానిని మరచి పోయాడు. అయినా, బాబా ఓపికగా ఉన్నారు.
పుఢే జేవ్హా తిసరే ప్రహరీ | ములగా పునశ్చ ఆలా దరబారీ |
తెవ్హాహీ విసరలా పూర్వీంచ్యా పరీ | ఆలా రిక్త కరీ మశీదీస | ||౧౫౧||
151. తరువాత, సాయంత్రం మరల సాయి దర్బారుకు వెళ్ళినప్పుడు కూడా, మునపటి లాగే, మరచి పోయి, ఆ అబ్బాయి మసీదుకు వట్టి చేతులతో వెళ్ళాడు.
"త్వాం మజసాఠీ కాయ ఆణిలే" | బాబాంనీ త్యాస పుసూన పాహిలే | "కాంహీ నాహీ" మ్హణతా పుసిలే | స్మరణ దిధలే లవమాత్ర | ||౧౫౨||
152. “నాకోసం నువ్వు ఏమి తెచ్చావు?” అని బాబా అతనిని అడిగి చూశారు. ‘ఏమీ తేలేదు’ అని అతడు చెప్పగా, మృదువుగా బాబా గుర్తు చేశారు.
"తులా కోణీ కాంహీ వస్తూ | దిధలీ నాహీ కా మజప్రీత్యర్థ" | "నాహీ" మ్హణతా సాఈసమర్థ | ప్రశ్న స్పష్టార్థ పూసితీ | ||౧౫౩||
153. “నా కోసమని నీకెవ్వరూ ఏమీ ఇవ్వలేదా?” అని అడిగారు. ‘లేదు’ అని అతను చెప్పగా, సాయి సమర్థులు స్పష్టంగా అడిగారు.
"అరే ఘరాహూన నిఘతే వేళీ | నాహీ కా దిధలా తుఝియా జవళీ | ఖాఊ ఆఈనే ప్రేమసమేళీ" | తెవ్హా మగ ఝాలీ ఆఠవణ | ||౧౫౪||
154. “అరే! నువ్వింటినుండి వెళ్ళినప్పుడు, ప్రేమతో ఆ తల్లి, నేను తినటానికని, మిఠాయి నీకివ్వలేదూ?” అని స్పష్టంగా అడిగారు. అప్పుడతనికి గుర్తుకు వచ్చింది.
జాహలా అతి లజ్జాయమాన | కైసే తరీ పడలే విస్మరణ | అధోవదన క్షమా మాగూన | చరణ వందూని నిఘాలా | ||౧౫౫||
155. ‘ఎలా మరచి పోయానా’ అని ఎంతో సిగ్గుపడ్డాడు. సిగ్గుతో తల వంచుకుని, బాబా పాదాలకు నమస్కరించి, క్షమించమని వేడుకున్నాడు.
ధాంవత ధాంవత బిర్హాడీ గేలా | పేఢా ఆణూన బాబాంస దిధలా | హాతీ పడతాంచ ముఖీ సమర్పిలా | భావ సంతర్పిలా ఆఈచా | ||౧౫౬||
156. వెంటనే, పరుగు పరుగున బసకు వెళ్ళి, పాలకోవాను తెచ్చి బాబాకు అర్పించాడు. చేతిలో పడగానే, బాబా దాన్ని నోట్లో వేసుకున్నారు. ఆ తల్లియొక్క భక్తికి చాలా తృప్తి పడ్డారు.
ఏసా హా సాఈ మహానుభావ | జయా మనీ జైసా భావ | తయా తైసా దేఊని అనుభవ | భక్తగౌరవ వాఢవీ | ||౧౫౭||
157. ఇలాంటి ఈ సాయి, గొప్ప మహానుభావులు, ఎవరి మనసులో ఏ భావముంటే, దానికి తగ్గట్టే అనుభవాలను కలుగ చేసి, భక్తుల గౌరవాన్ని నిలబెట్టేవారు.
ఆణిక యా కథాంచే ఇంగీత | భూతీ సదైవ పహావా భగవంత | హేంచి సకల శాస్త్ర సంమత | హాచి సిద్ధాంత యేథీల | ||౧౫౮||
158. అన్ని జీవులలోనూ దేవుణ్ణి చూడాలి అనేదే ఈ కథలలోని మరొక ఉద్దేశం. అన్ని శాస్త్రాలు దీనినే చెబుతాయి. దీనినే ఈ కథలలో చూపబడింది.
ఆతా పుఢీల అధ్యాయ శ్రవణీ | కళోన యేఈల బాబాంచీ రాహణీ | కోఠే తే నిజత కవణ్యా ఠికాణీ | సావచిత్తపణీ ఆకర్ణిజే | ||౧౫౯||
159. తరువాతి అధ్యాయంలో, బాబా ఎక్కడ ఉండేవారు – ఎలా పడుకునే వారు అన్న దానిని సావధానమైన మనసుతో, శ్రద్ధగా వినండి.
హేమాడ సాఈపదీ శరణ | శ్రోతా ఆదరే కరిజే మనన | ఝాలియా కథేచే నిధిధ్యాసన | కృతకల్యాణ పావాల | ||౧౬౦||
160. హేమాడు సాయి పాదాలకు శరణుజొచ్చి, ఈ కథలను శ్రోతలు వినటంతో పాటు, మననం, నిధిధ్యాసనం కూడా చేస్తే, ఎంతో శ్రేయస్సు పొందుతారు అని మనవి చేస్తున్నాడు.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | నవమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
1. ఎకదా తాత్యాసాహేబ నూలకరాంచీ వ భాఊసాహేబ దీక్షితాంచీ మండళీ శిరడీహూన నిఘణార హోతీ. మహారాజ త్యాంనా మ్హణాలే, “ఉద్యా సకాళీ జా వ కోపరగావాహూన జేవూన జా!” త్యాంనీ త్యాప్రమాణే తయారీ కేలీ వ కోపరగావాచ్యా ఖాణావళీత తయారీ ఠేవణ్యావిషయీ నిరోప పాఠవిలా. పణ కోపరగావాస పోహోచలే తేవ్హా జేవణ తయార నవ్హతే ఆణి గాడీచీ వేళ జవళ ఆల్యాముళే న జేవతా తసేచ స్టేశనవర గేలే. తేథే పాహిలే తో గాడీలా దీడ తాస ఉశీర హోతా. మగ గావాత టాంగా పాఠవూన టాంగేవాలా బ్రాహ్మణ హోతా త్యాచ్యా హాతీ ఖాణావళీతూన జేవణ ఆణవిలే వ తీ సర్వ మండళీ స్టేశనావర జేవలీ. జేవల్యావర దహా మినిటాంనీ గాడీ ఆలీ. ఆతా యాచ్యా ఉలట నమూనా పాహా -
ఎకదా రా. రఘువీర భాస్కర పురందరే ఆపల్యా సర్వ మండళీసహ మహారాజాంచ్యా దర్శనాస గేలే హోతే. యేతానా త్యాంచ్యా ఆఈచ్యా ఆగ్రహావరూన త్యాంనీ నాశికలా జాణ్యాచీ పరవానగీ మాగితలీ. మహారాజ మ్హణాలే, “జా, దోన దివస రాహా ఆణి పుఢే జా!” త్యాప్రమాణే సర్వ మండళీ నాశికలా గేలీ. త్యాచ దివశీ త్యాంచ్యా ధాకట్యా భావాస అతిశయ తాప భరలా. సర్వ మండళీ ఘాబరలీ వ ముంబఈస తాబడతోబ నిఘూన జావే, అసే మ్హణూ లాగలీ. త్యాంచే ఉపాధ్యేహీ తసేచ మ్హణూ లాగలే. పణ పురందరే మ్హణూ లాగలే, ‘మహారాజాంనీ దోన దివస రాహావయాచే సాంగితలే ఆహే, తర దోన దివస ఝాల్యాశివాయ మీ యేథూన హలణార నాహీ’. మగ నాఇలాజ హోఊన సర్వ మండళీ రాహిలీ. దుసర్యా దివశీ భావాచా తాప ఆపోఆప గేలా వ తిసర్యా దివశీ మండళీ ముంబఈ యేథే సుఖరూప యేఊన పోహోచలీ.
2. శిరడీపాసూన హే ఠికాణ సుమారే తీన మైలాంవర ఆహే.
3. హా అనుభవ తర ఖుద్ద యా చరిత్రలేఖకాచా ఆహే. హా ఆరంభీ ఎకదా ములే-బాళే వ కుటుంబ యాంసహ శ్రీసాఈచే దర్శన ఘేఊన, “భాకర తుకడా ఖాఊన దుపారనంతర పరత జావయాస నిఘ,” అసే సాఈబాబా మ్హణాలే తరీ తికడే దుర్లక్ష కరూన, ఘాఈఘాఈనే బైలగాడీనే స్టేశనచయా వాటేస లాగలా. ఆగగాడీచీ వేళ సాధావీ మ్హణూన గాడీ భరధావ కాఢలీ అసతా బైలగాడీచే డావీకడీల చాక ఎకాఎకీ నిసటూన గటరాత జాఊన పడలే. దైవ థోర మ్హణూన గాడీ మోడలీ నాహీ వ కోణీ దగావలే నాహీ. పణ తే చాక ఆణూన వ్యవస్థితపణే బసవూన గాడీ పున్హా సురూ హోఈతో ఆగగాడీచీ వేళ నిఘూన జాఊన కోపరగావీ ఖాణావళీత ఉతరూన జేవూన మగ దుసర్యా గాడీనే త్యాలా ముంబఈస జాణే భాగ పడలే.
4. వేదాధ్యయన హా బ్రహ్మయజ్ఞ. హా శిరడీత రోజ చాలే. భక్తాంచ్యా అధికారానురూప మహారాజ హే కోణాకడూన ఉపనిషదే తర కోణాకడూన గీతా భాగవతాది గ్రంథ వాచవూన ఘేత. ఉదాహరణార్థ - కై. బాళూకాకాంకడూన సభామండపాత భగవద్గీతా ఆణి హైద్రాబాదచ్యా ఎకా శాస్త్ర్యాంకడూన దివసా భాగవత ఆణి రా.వఝే యాంచ్యాకడూన రాత్రీ ఎకనాథీ భాగవత వాచవీత. రా. బ. సాఠేసాహేబాంచ్యా వాడ్యాత రా. బాపూసాహేబ జోగ ఆణి రా. భాఊసాహేబ దీక్షిత యాంచ్యా వాడ్యాత ఖుద్ద దీక్షితాంనా హీ కామే సొపవిలీ హోతీ. తే దోఘే ఆణి కై. బాళాసాహేబ భాటే యాంచ్యా హస్తేహీ హా యజ్ఞ హోత అసే. స్వధాకారానే పితరాంస ఆణి స్వాహాకారానే దేవాంస ఆహితీ దేణే హా పితృయజ్ఞ వ దేవయజ్ఞ. భూతాంనా బలిదాన హా భూతయజ్ఞ ఆణి అతిథీంనా భోజనదాన హా మనుష్యయజ్ఞ.
బాబా యా భూతయజ్ఞ ఆణి మనుష్యయజ్ఞ యాంసాఠీ రోజ ౫/౭ ఘరే స్వతః భిక్షా మాగత; ఆణి ఆలేల్యా యాత్రేకరూంకడే ఇతర అనార్థీ అతిథీసాఠీ మాధ్యాన్హ జేవణకాళీ కోణాకడూన తరీ ఝోళీ ఫిరవీత.
5. రఘువీర భాస్కర పురందరే మ్హణూన ఎక భక్త వాంద్ర్యాత రహాత హోతే తే.
6. వాంగీ.
7. బాళారామ మానకర మ్హణూన బాబాంచే ఎక భక్త హోతే త్యాంచా హా ములగా.
No comments:
Post a Comment