|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౮ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
మాగీల అధ్యాయీ జాహలే కథన | కైసే సాఈ హిందూ వా యవన |
కాయ త్యా శిరడీచే భాగ్య గహన | జే నిజ స్థాన బాబాంచే | ||౧||
1. ఇంతకు మునుపటి అధ్యాయంలో, సాయి హిందువా లేక ముస్లిమా అన్నదానని గురించి, బాబా ఉన్న శిరిడీ గ్రామంయొక్క మహాభాగ్యం గురించి చెప్పబడింది.
కైసే బాబా ఆరంభీ పోర | పుఢే జాహలే వేడే ఫకీర | కైసీ బనవిలీ బాగ సుందర | మూళచ్యా ఉఖర స్థళాచీ | ||౨||
2. ఎలా బాబా మొదట పసివానిగా రావటం, తరువాత పిచ్చి ఫకీరుగా మారటం, బంజరు భూమిలో అందమైన తోటను నిర్మించడం,
కైసా కాలే కరూన పుఢా | త్యాచి జాగేవర జాహలా వాడా | ధోతీ పోతీ ఖండయోగ గాఢా | వర్ణిలా నిఘడా బాబాంచా | ||౩||
3. కొంత కాలం గడిచిన తరువాత, అదే చోటులో పెద్ద భవనం తయారవటం, బాబాయొక్క ధౌతి-పోతి, ఖండయోగ ప్రక్రియల గురించి, వర్ణించడమైనది.
ఝిజవూనియా నిజకాయ | బాబాంనీ సాహిలే కైసే అపాయ | భక్త కైవారీ సాఈరాయ | వర్ణూ మీ కాయ తయాతే | ||౪||
4. భక్తులను కాపాడే సాయినాథుడుగా, వారి బాధలన్నీ తనపై తీసుకుని, తామే బాధ భరించటం, ఇలాంటి బాబాను నేను ఏమని వర్ణించను?
ఆతా ఏకా నరజన్మాచే మహిమాన | సాఈంచ్యా భైక్ష్యవృత్తీచే వర్ణన | బాయజాబాఈంచే సంతసేవన | బాబాంచే భోజన కౌతుక | ||౫||
5. మానవ జన్మ గొప్పతనము, బాబా భిక్షాటనం, బాయజాబాయి సాధు సేవ, ఆశ్చర్య పరిచే బాబా భోజన పద్ధతి గురించి, ఇప్పుడు వినండి.
తాత్యా బాబా మ్హాళసాపతీ | తిఘే కైసే మశిదీ నిజతీ | కైసే ఖుశాలచందాచే గృహా జాతీ | రాహాత్యాప్రతీ సమర్థ | ||౬||
6. అలాగే, తాత్యా, మహల్సాపతితో బాబా మసీదులో ఎలా పడుకునేవారు, రాహాతాలో ఉన్న ఖుశాలచందు ఇంటికి సాయి సమర్థులు ఎలా వెళ్ళేవారు మొదలైన సంగతుల గురించి వినండి.
ప్రత్యహీ ఉదయ ప్రత్యహీ అస్త | వర్షానువర్ష జాహలీ ఫస్త | అర్ధా జన్మ నిద్రితావస్థ | ఉరలా హీ స్వస్థ భోగవేనా | ||౭||
7. ప్రతి రోజూ తెల్లవారుతుంది, తరువాత రాత్రి అవుతుంది. ఇలా ఎన్నో ఏళ్ళు గడిచి పోతాయి. బ్రతికి ఉన్న కాలంలో సగం నిద్రలో గడుస్తుంది. మిగిలిన సగం జీవితం కూడా ఏ సుఖం, శాంతి లేకుండా గడిచిపోతుంది.
బాళపణీ క్రీడాసక్త | తరూణపణీ తరూణీరక్త | వృద్ధాపకాళీ జరాగ్రస్త | సదైవ శ్రస్త ఆధీనీ | ||౮||
8. చిన్నప్పుడు ఆటల్లో ఆసక్తి, యవ్వనం రాగానే యువతుల మీద, ముసలితనం వచ్చిందంటే ఇక ఎప్పుడూ రోగాలు, బాధలతో పీడించబడుతూ ఉంటాము.
జన్మాస యేఉనీ పుష్ట హోణే | శ్వాసోచ్ఛ్వాస కరీత రాహణే | దీర్ఘాయుష్య వరీ వాచణే | హే కాయ కేణే యా జన్మీ | ||౯||
9. పుట్టటం, బాగా తిని పుష్టిగా పెరగటం, గాలిని పీలుస్తూ, వదులుతూ ఎన్నో ఏళ్ళు బ్రతకటం, జీవితానికి ఇదేనా అర్థం?
పరమాత్మప్రాప్తి హేచి సాచీ | ఇతికర్తవ్యతా నరజన్మాచీ | నా తరీ శ్వాన సూకరాదికాంచీ | జీవికాచి కాయ ఉణీ | ||౧౦||
10. పరమార్థాన్ని పొందడమే మనిషి జన్మయొక్క లక్ష్యం. ఇదే నిజం. లేకుంటే, కుక్కలు, పందులు మొదలైన వాటి జన్మలలో ఏమి తక్కువైంది?
శ్వానేహీ ఆపులీ పోటే భరతీ | ప్రజోత్పాదన యథేష్ట కరితీ |
తెథే నరదేహాచీచ కాయ మహతీ | సామ్య స్థితీ ఉభయతా జై | ||౧౧||
11. కుక్కలు కూడా తమ పొట్టలు నింపుకుంటాయి. ఇష్టం వచ్చినట్లు పిల్లలను కూడా పుట్టిస్తాయి. మనిషి కూడా ఇవే పనులు చేస్తే, ఇంక మనిషికి ఉన్న గొప్పతనమేమిటి?
పిండపోషణ ఆణి మైథున | హేంచ జరీ నరదేహాచే సాధన | హేంచ జరీ యా జన్మాంచే పర్యవసాన | తరీ తో నరజన్మ నిరర్థ | ||౧౨||
12. దేహం పెంచడం, సంభోగించటం ఇవే మనిషి దేహంతో చేసే పనులైతే, ఇవే మానవ జీవితానికి లక్ష్యం అయితే, ఈ మనిషి బ్రతుకు నిజంగా దండుగ!
ఆహార నిద్రాది చతుష్టయ | యాంతచి హోతా ఆయుష్య క్షయ | మగ శ్వానాం మానవా భేద కాయ | కరా నిర్ణయ వివేకే | ||౧౩||
13. ఆహారం, నిద్ర, భయం, సంభోగించడం, ఈ నాలుగింటితోనే బ్రతుకు ముగిసిపోతే, ఇక కుక్కలకు మనిషికీ తేడా ఏముంది? మీరే ఆలోచించి, నిర్ణయించుకోండి.
హీచ జరీ నరదేహసఫలతా | తరూ జన్మీ కాయ న్యూనతా | భస్త్రాహీ1 కరీ శ్వాసోఛ్వాసతా | శరీర పుష్టతా శ్వానాంహీ | ||౧౪||
14. మనిషి దేహానికి ఇదే అర్థమైతే, మానుగా పుట్టితే మాత్రం లోటేమిటి? కొలిమి తిత్తి కూడా గాలిని పీల్చి, వదులుతూ ఉంటుంది. కుక్కలు కూడా తిని పుష్టిగా పెరుగుతాయి.
మనుష్య ప్రాణీ ముక్త ఆహే | తో నిర్భయ తో స్వతంత్ర పాహే | తో శాశ్వత హీ జాణీవ రాహే | సఫలతా హే జన్మాచీ | ||౧౫||
15. కాని, మనిషి ముక్తుడు. భయం లేనివాడు. స్వతంత్రుడు మరియు ఎప్పటికీ ఉండేవాడు అని తెలుసుకోవటమే ఈ మనిషి జన్మకు అర్థం.
ఆలా కోఠూని ఆహే కోణ | నరజన్మాచే కాయ కారణ | ఎథీల బీజ జాణే తో ప్రవీణ | త్యావీణ శీణ మగ సారా | ||౧౬||
16. నేనెవరు? ఎక్కణ్ణుంచి వచ్చాను? నాకు ఈ మనిషి జన్మ ఎందుకు వచ్చింది? అనే ఈ రహస్యాలను తెలుసుకున్న వారే వివేకవంతులు. తెలుసుకోకపోతే, ఈ జన్మ దండుగ.
జైసీ నందాదీపాచీ జ్యోతీ | ఎకచి దిసే ఆదిఅంతీ | పరీ వేగళీ క్షణాక్షణాప్రతీ | తైశీచ స్థితి దేహాచీ | ||౧౭||
17. నందాదీపంయొక్క జ్యోతి మొదటినుంచి చివరిదాకా ఒకేలా ఉంటున్నట్లు అనిపిస్తుంది. కాని, అది ప్రతి క్షణానికీ వేరు వేరుగా మారుతుంటుంది. మన దేహం కూడా అంతే.
బాల్య తారూణ్య వార్ధక్యావస్థా | యా తో ప్రకట జనా సమస్తా | పరీ జాతీ యేతీ జాతీ స్వభావతః2 | కోణా న కళతా కదాంహీ | ||౧౮||
18. బాల్యం, యవ్వనం, ముసలితనం ఇవి అందరికీ వస్తాయి. కాని, అవి ఎలా వచ్చి ఎలా పోతాయి అనేది ఎవరికీ తెలియకుండానే జరిగిపోతాయి.
దిసే తీచ తత్క్షణీ నాసే | అపరిమిత తరీ ఎకచి భాసే | తైసాచి దేహ జో యా క్షణీ అసే | క్షణాంతీ నసే పూర్వీల | ||౧౯||
19. చూస్తూ ఉండగానే, కళ్ళకు కనిపించేది వెంటనే నశించి పోతుంది. ప్రతి క్షణం మారుతున్నా, ఒకటిగానే అనిపిస్తుంది. మన శరీరం కూడా ఈ క్షణంలో ఉన్నట్లు వచ్చే క్షణంలో ఉండదు.
దేహ మళమూత్రాచీ న్హాణీ | శ్లేష్మ పూయలాళీచీ ఘాణీ | మరణ ఠేవిలే క్షణోక్షణీ | కులక్షణీ మోఠా హా | ||౨౦||
20. మలమూత్రాలు, శ్లేష్మం, చీము రక్తాల మురికి కాలువ ఈ దేహం. చావు దీనిని ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటుంది. చాలా చెడు లక్షణాలు గలది ఈ దేహం.
జే హె క్రిమీకీటకాంచే ఘర | నానా రోగాంచే ఆగర |
అశ్వత్థ3 ఆణి క్షణభంగుర | తే హే శరీర మానవీ | ||౨౧||
21. మనిషి దేహం క్రిమి కీటకాలకు వాస స్థానం. అనేక రోగాలకు ఇల్లు. నిలకడ లేనిది మరియు ఎప్పుడైనా నాశనం అయేది.
మాంస శోణిత స్నాయూచా గాడా | తో హా అస్థి చర్మాచా సాంగాడా | మూత్ర పురీష దుర్గంధీచా రాడా | జీవాచా ఖోడా ప్రత్యక్ష | ||౨౨||
22. రక్త మాంసాలు, నరాలతో ఉన్న ఓ వాహనం ఇది. ఎముకలు, చర్మాలతో కూడిన ఒక ఆకారం. మలమూత్రాల చెడు వాసనల గొయ్యి. ఎప్పటికీ ఇది జీవుణ్ణి అడ్డగించేది.
త్వాచా మాంస రూధిర స్నాయూ | మేద మజ్జా అస్థివాయూ | అమంగల అంగే ఉపస్థ పాయూ | తే అల్పాయూ హే కాయా | ||౨౩||
23. రక్త మాంసాలు, చర్మం, నరాలు, కొవ్వు, మజ్జ, ఎముకలు, గాలి మరియు మలమూత్రాలు విసర్జించే అంగాంగాలు కల ఈ దేహం ఆయువు కూడా చాలా తక్కువది.
ఏసా అమంగల ఆణి నశ్వర | నరదేహ జరీ క్షణభంగూర | తరీ మంగలధామ శ్రీపరమేశ్వర | హాతీ యేణార ఎణేంచ | ||౨౪||
24. ఇలాంటి మంగళకరం కానిది, ఎప్పటికైనా నశించేది, నిలకడ లేనిది అయినా, మంగళకరుడైన పరమేశ్వరుణ్ణి పొందాలంటే, ఈ దేహం వలనే జరుగుతుంది.
సదైవ లాగలే జన్మ మరణ | కల్పనేచేంచ భయ దారూణ | నాహీ లాగతా కానాలా కాన | ప్రాణ హా నిఘూన జాఈల | ||౨౫||
25. చావు పుట్టుకలు మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. తలుచుకున్నంత మాత్రమే విపరీతమైన భయాన్ని కలుగ చేస్తాయి. ప్రాణం పోయేటప్పుడు, అకస్మాత్తుగానే పోతుంది.
కోణ లక్షీ దివసరాతీ | కితీ యేతీ ఆణిక జాతీ | మార్కండేయాచ్యా ఆయుష్యే జన్మతీ | తయాంహీ కాలగతి చుకేనా | ||౨౬||
26. పగలు రాత్రి ఎంత మంది వస్తున్నారో, మరి ఎంత మంది పోతున్నారో, ఎవరు గమనిస్తారు? మార్కండేయుని వలె కొంత మంది పూర్తి ఆయువుతో పుట్టినా, వారికి కూడా కాలగతి తప్పదు.
ఏశియా క్షణభంగుర నరదేహీ | పుణ్యశ్లోక కథావార్తాహీ | గేలేలా కాళచి పడేల సంగ్రహీ | తద్విరహిత తో వ్యర్థ | ||౨౭||
27. నిలకడలేని ఇటువంటి మనిషి దేహంతో, పుణ్యం తెచ్చి పెట్టే శ్లోకాలు, కథా వార్తలూ విన్న సమయమే అర్థవంతమవుతుంది. మిగతా సమయమంతా దండుగ.
హీచ జాణీవ ఝాలియా నిశ్చిత | హేంచి జన్మా ఆల్యాచే హిత | పరి హా విశ్వాస నాహీ పటత | అనుభవావ్యతిరిక్త కోణాహీ | ||౨౮||
28. ఇది బాగా నమ్మకంగా తెలుసుకోవటమే ఈ మనిషి జన్మకు ప్రయోజనం. కాని, ఇలా నమ్మకం కలగాలంటే, స్వంతంగా అనుభవం కావాలి. లేకుంటే నమ్మకం కుదరదు.
పరీ యావయా హా అనుభవ | కరూ లాగే అభ్యాస విభవ | తరీ శాశ్వత సుఖార్థీ హా జీవ | తేణే హె వైభవ సాధావే | ||౨౯||
29. ఈ అనుభవం కావాలంటే, బాగా అభ్యాసం చేయాలి. శాశ్వతమైన ఆనందాన్ని ఆశించే జీవుడు, ఈ వైభవాన్ని అప్పుడే పొందగలడు.
దారా సుత వైభవ విత్త | పృథ్వీ సముద్రవలయాంకిత | ఈశ్వరకృపే ఇతుకేంహీ ప్రాప్త | తరీ తో అతృప్త మానసీ | ||౩౦||
30. దేవుడి దయవలన, మంచి భార్యాబిడ్డలు, సంపద, వైభవం, సముద్రంచే చుట్టబడి ఉన్న భూమి అంతా దొరికినా, మనసులో మటుకు తృప్తి అనేది ఉండదు.
భూతీ భగవంత హే ఎక ఉపాస్తి | పరమ ప్రాప్తిదాయక | ||౩౧||
31. ఎప్పటికీ ఉండే సుఖ శాంతులను పొందాలనే లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని, ప్రతి జీవిలోనూ ఉండే ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తే, అప్పుడు ముక్తి, మోక్షం దొరుకుతుంది.
త్వచా మాంస రూధిర హాడా | జోడూని కేలా హా దేహసాంగాడా | పరమార్థాచా ప్రత్యక్ష ఖోడా | మమత్వ సోడా తయాచే | ||౩౨||
32. మనిషి దేహం చర్మం, ఎముకలు, రక్తమాంసాలతో తయారయింది. పరమార్థం పొందటానికి ఇది కనిపించే అడ్డు. దీనిపై మమకారాన్ని వదలాలి.
మానావా తొ కేవళ చాకర | నకా బసవూ త్యా డోక్యావర | లాడ న పురవా నిరంతర | నరకద్వార కరూ నకా | ||౩౩||
33. ఈ మనిషి దేహాన్ని ఒక సేవకుడని అనుకోండి. దీనిని నెత్తిన కూర్చో పెట్టుకోకండి. అతిగా గారాబం చేసి, అది నరకానికి దారి తీసేలా చేసుకోకండి.
నిర్వాహా పురే అన్న ఆచ్ఛాదన | తైసేంచ తాత్పురతే లాలన పాలన | లావా అధ్యాత్మిక ఉన్నతీ లాగూన | జన్మమరణ చుకవావయా | ||౩౪||
34. బ్రతికి ఉండటానికి సరిపడా అన్న వస్త్రాలు, కొద్దిగా ఆలనా పాలనా చేసి, చావు పుట్టుకలనుంచి తప్పించుకోవటానికి, ఆధ్యాత్మిక ప్రగతి కొరకు, ఈ దేహాన్ని వాడుకోండి.
జన్మమరణాది అనర్థాత్మక | ప్రతిక్షణ వినాశోత్ముఖ | కైసే క్షణిక యాచే సుఖ | నిరంతర అసుఖ జో | ||౩౫||
35. చావు పుట్టుకలతో కూడి, ప్రతి క్షణం నాశనం వైపు పరుగెడుతూ, ఎప్పటికీ దుఃఖాలను కలిగించేది ఈ దేహం. అది ఇచ్చే సుఖాలు కూడా క్షణికమే.
జైశీ విద్యులతా పాహీ | ఆతా ఆహే ఆతా నాహీ | క్షణిక సాగర తరంగతాహీ | విచార కాంహీ కరావా | ||౩౬||
36. ఈ సుఖాలు మెరుపు తీగలవలె ఒక క్షణం ఉండి వెంటనే మాయమై పోతాయి. ఇవి సముద్రంపైని అలల వలె క్షణికమని తెలుసుకోండి.
దేహగేహాపత్య స్త్రీ జన | హి సర్వ నాశివంత జాణూన | మాతా పిత్యాంసీ ఖాందాం వాహూన | స్వయే జో ఉమజేన ఆపణ | ||౩౭||
37. ఈ దేహం, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, అంతా నశించేవని మనము తెలుసుకోము. తల్లిదండ్రులను స్వయంగా భుజాల మీద మోసుకొని పోయినా, వారిలాగా, మనమూ వెళ్ళాలనే నిజాన్ని తెలుసుకోము.
మేల్యా మాగే ఖుశాల మరే | ఫిరే జన్మమరణాచే ఫేరే | పరీ తే కోణ్యా గుణే ఆవరే | విచార న కరీ క్షణభరీ | ||౩౮||
38. చనిపోయిన వారి తరువాత చావటం, మరల పుట్టటం, అలా చావు పుట్టుకల చక్రంలో చిక్కుకుని తిరగడమే కాని, వీటిని ఏ రకంగా తొలగించు కోవాలి అని ఒక్క క్షణమైనా ఆలోచించము.
కరితా నిత్య కుటుంబాచీ భర | ఆయుష్య జాతసే భరాభర | కాళ ఆయుష్య గణనా తత్పర | కర్తవ్య విసర త్యా నాహీ | ||౩౯||
39. ప్రతి నిత్యం, సంసార భారాన్ని మోయటంతో, ఆయువు కూడా వేగంగా గడిచిపోతుంది. కాలం ఎప్పుడూ మన ఆయువును లెక్కపెట్టటంలో నిమగ్నమై ఉంటుంది. అది తన కర్తవ్యాన్ని ఎన్నటికీ మరిచిపోదు.
భరతా అఖేరచీ ఘడీ | మగతో థాంబేనా ఎకచిపడీ4 | ధీవర జైసా జాళే ఓఢీ | మరణీ తడఫడీ జీవ తైసా | ||౪౦||
40. చివరి ఘడియ రాగానే, కాలం ఒక్క క్షణమైనా ఆగదు. జాలరి తన వలను బలంగా లాగినప్పుడు, అందులో చిక్కుకున్న చేపలవలె, చచ్చేటప్పుడు జీవులు గిలగిలా కొట్టుకుంటారు.
మహద్భాఠగ్యాచియా పరవడీ | వేంచూనియా పుణ్యకోడీ |
లాధలీ నరదేహాచీ జోడీ | ఘడీనే ఘడీ సాధావీ | ||౪౧||
41. మహాభాగ్యం వలన, ఎన్నో జన్మలలో చేసిన మంచి పనుల వలన వచ్చిన పుణ్య ఫలంగా, ఈ మనిషి దేహం దొరికింది. ప్రతి ఘడియా దీనిని మంచి పనులకు వాడుకోండి.
కరూ జాతా భగీరథ యుక్తి | యా నరదేహాచీ నాహీ ప్రాప్తి | కేవళ అదృష్టే యే అవచట హాతీ | వ్యర్థచి మాతీంత మిళవా నా | ||౪౨||
42. ఎంత భగీరథ ప్రయత్నం చేసినా, ఈ మనిషి దేహం దొరకదు. కేవలం మన అదృష్టం కొద్దీ, అనుకోకుండా దొరికిన ఈ అవకాశాన్ని, మట్టిలో కలిపి దండుగ చేసుకోకండి.
పుఢీల జన్మీ కరూ మ్హణతా | ఎకదా హా హాతీంచా జాతా | పుఢే హాచ యేఈల హీ నిశ్చితతా | ఏసె మానితో తో మూర్ఖ | ||౪౩||
43. వచ్చే జన్మలో చేద్దాము అని అనుకోకండి. అలా అనుకున్నవారు మూర్ఖులు. ఎందుకంటే, ఒక సారి చేయి జారిపోయిందా, ఇక అంతే, ఈ అవకాశం మరల తప్పక దొరకుతుందనే నిశ్చయం లేదు.
కితి ఎక పాపీ దేహవంత | హోఊని శుక్రబీజ సమన్విత | యోనిద్వారాస హోతీ ప్రాప్త | శరీర గ్రహణార్థ నిజకర్మే | ||౪౪||
44. వారు చేసిన పనుల ప్రభావం వలన, కొందరు పాపులు, శుక్ర బీజాలలో కలిసి, యోని ద్వారా జన్మించే శరీరాలను పొందుతారు.
కితీఎక తే త్యాహూన అధమ | అసతా జంగమవర్గీ జన్మ | మాగుతీ స్థావర భావపరమ | యథాకర్మ ప్రాప్త త్యా | ||౪౫||
45. అంతకంటే నీచులు, వారి కర్మ ఫలం ప్రకారం, క్రింది జాతిలో భాగమైన కదిలే వర్గాలలో, కదలిక లేకుండా పుడతారు.
జేణే జైసే ఉపార్జిలే జ్ఞాన | జయాచే జైసే కర్మానుష్ఠాన | తదనుసార తయా శరీర గ్రహణ | శ్రుతిప్రమాణ హా యోగ | ||౪౬||
46. వారి వారి కర్మ ఫలాన్ని బట్టి, వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టి, వారికి శరీరం లభిస్తుందని శ్రుతి కూడా చెబుతుంది.
'యథాప్రజ్ఞం హి సంభవా'5 | వదే శ్రుతి మాయ అతికణవా | జైసా జయాచా విజ్ఞాన ఠేవా | జననహీ జీవా తైసేంచ | ||౪౭||
47. ‘యథా ప్రజ్ఞం హీ సంభవాః’ అని శ్రుతి మాత చాలా కరుణతో చెప్పింది. వారి వారి జ్ఞాన సంపదను బట్టి కూడా పుట్టుక ఉంటుంది.
అతర్క్య ఈశ్వరీ విందాన6 | అశక్య తయాచే సంపూర్ణ జ్ఞాన | అంశమాత్రే లాధే జరీ కవణ | ఎక తో ధన్య నరదేహ | ||౪౮||
48. ఈశ్వరుడి లీల అర్థం కానిది. దానిని పూర్తిగా తెలుసుకోవటం సాధ్యం కాని పని. ఎవరికైనా కించిత్తైనా అర్థమయితే, వారి జన్మ ధన్యం.
పరమభాగ్యే హా నరజన్మ | మహత్పుణ్యే బ్రాహ్మణవర్ణ | ఈశకృపే సాఈచే చరణ | లాభ హా సంపూర్ణ అలభ్య | ||౪౯||
49. పరమ భాగ్యం వలన ఈ మనిషి దేహం లభిస్తుంది. అందులోను, మహాపుణ్యం వలన బ్రాహ్మణ జాతిలో పుట్టటం, పరమేశ్వరుని అనుగ్రహం వలన సాయి పాదాలు దొరకడం, ఇవన్నీ చాలా అరుదుగా దొరికే లాభాలు.
ఆహేత జరీ నానా యోనీ | మానవచి శ్రేష్ఠ సర్వాహునీ | ఆలో కోఠునీ నిర్మిలే కోణీ | వివేక శ్రేణీ మానవీచ | ||౫౦||
50. ఎన్నో రకాల పుట్టుకలున్నా, మనిషి జన్మ అన్నిటికంటే గొప్పది. ‘మనము ఎక్కడనుంచి వచ్చాం?’ ‘మనలను ఎవరు సృష్టించారు?’ అని తెలివిగల మనుషులు మాత్రమే ఆలోచించగలరు.
ఇతర యోనీ హే న జాణతీ | ఉపజతీ తైశా నాశ పావతీ |
భూతభావీవర్తమాన గతి | ఈశ్వరస్థితీ నేణతీ | ||౫౧||
51. ఇతర యోనులలో జన్మించే ప్రాణులు వీటిని తెలుసుకోలేవు. అవి ఎలా పుడతాయో అలాగే చచ్చిపోతాయి. భూత భవిష్యత్తు వర్తమానాల సంగతి గురించి గాని, ఈశ్వరుని గురించి గాని వాటికి తెలియవు.
మ్హణోని హా నరదేహ నిర్మూన | ఈశ్వర ఝాలా ఆనంద సంపన్న | కీ వివేక వైరాగ్యాతే వరూన | నర మద్భజన కరీల | ||౫౨||
52. అందుకే, ఈ మనిషి దేహాన్ని సృష్టించి, వివేక వైరాగ్యాలతో మానవుడు తనను ఆరాధిస్తాడు, అని ఆ పరమేశ్వరుడు ఆనందించాడు.
వినాశీ నర కరితా సాధన | హోఈల అవినాశీ నారాయణ | నరదేహసమ సాధనసంపన్న | దుజా న ఆనయే సుష్టీ | ||౫౩||
53. నశించి పోయే ఈ దేహాన్ని కలిగిన మనిషి, సాధనతో నాశం కాని నారాయణుడు కాగలడు. ఈ సృష్టిలో, మనిషి దేహానికి సమానమైన సాధనా సంపద ఇంకొకటి లేదు.
గారూడీ స్వయే మోఠా చతుర | ఖేళ న కరీ అజ్ఞానియా సమోర | జాణే కుశలతేచే వర్మసార | తో ప్రేక్షక సంభార అపేక్షీ | ||౫౪||
54. మాయాలవాడు చాలా తెలివివంతుడు. తెలివి లేని వాళ్ళ ముందు తన ఆటలను చూపడు. తన కళా కౌశలంలోని మర్మాలను తెలుసుకోగల ప్రేక్షకుల కోసమే ఎదురు చూస్తుంటాడు.
తైసాచ పశుపక్షీ వృక్షసంభార | జీవ జంతు నిర్మూన అపార | సఖేదాశ్చర్య పరమేశ్వర | లీలా నిఃసార గమలీ త్యా | ||౫౫||
55. అలాగే, పశు పక్షులు మొదలగు జీవ జంతువులను, చెట్లు చేమలను, విపరీతంగా సృష్టించిన దేవుడికి, తన లీలకు అర్థం లేదనిపించి, నిరాశతో దుఃఖం కలిగింది.
అఫాట హా బ్రహ్మాండ విస్తార | చంద్రసూర్య తారా భార | నిర్మిత్యాచ్యా కౌతుకాచా విచార | లవ భార కోణీహీ కరీనా | ||౫౬||
56. సూర్య చంద్రులు, లెక్కలేనన్ని తారలు, ఎన్నో జీవ జంతువులు నిండిన ఇంతటి విస్తారమైన బ్రహ్మాండాన్ని నిర్మించిన తన అద్భుతమైన కౌశలాన్ని ఎవరూ కొంచెమైనా తెలుసుకోలేదు.
హా సర్వ ఖేళ కరణ్యా ఆంతు | మాఝా జగదీశాచా కాయ హేతు | యే అర్థీంచా నిశ్చయమాతు | ఎకహీ జంతూ జాణేనా | ||౫౭||
57. “ఈ సకల లీలలను చేయటంలో జగత్తుకే ఈశ్వరుడైన నా ఉద్దేశం ఏమిటి అని ఖచ్చితంగా ఏ ఒక్క జీవి అయినా తెలుసుకోవటం లేదు.
మాఝీ అతుల వైభవ సమృద్ధి | జాణీల ఏసా కుశాగ్రబుద్ధి | ప్రాణీ నిర్మిలా నాహీంతదవధి | విఫల త్రిశుద్ధి మమ కార్య | ||౫౮||
58. “నా ఈ అసమానమైన అపార వైభవాన్ని తెలుసుకో గలిగే సూక్ష్మ బుద్ధి కల ప్రాణిని సృష్టించనంత వరకు నా పని ముమ్మాటికీ నిష్ఫలం”.
ఏసే జాణూన జగదీశే | నిర్మిలా ప్రాణీ మానవవేషే | కీ జో సారాసార బుద్ధివశే | మజ సామర్థ్యే జాణీల | ||౫౯||
59. అని అనుకొని జగదీశ్వరుడు – తన శక్తిని, సృష్టిలోని సారాన్నంతా – తన విచక్షణా బుద్ధితో తెలుసుకోగల ప్రాణిని, మనిషి ఆకారంలో సృష్టించాడు.
అగాధ మాఝే వైభవ | తైశీచ మాఝీ శక్తి అపూర్వ| మాఝ్యా మాయేచా హా ఖేళ సర్వ | ఆశ్చర్యపూర్వక తో జాణే | ||౬౦||
60. “అంతులేని నా వైభవాన్ని, అసమానమైన నా శక్తిని, నా మాయా లీల అంతటినీ అతడు ఆశ్చర్య పడుతూ తెలుసుకుంటాడు”.
తోచ కరీల జ్ఞాన సంపాదన | మచ్చింతన ఆణి మదవలోకన |
తోచ హోఈల ఆశ్చర్య సంపన్న | హోఈల తై పూర్ణ ఖేళ మాఝా | ||౬౧||
61. “అతడే నా గురించి ఆలోచిస్తూ, విచారణ చేస్తూ, ధ్యానం చేసి, ఆశ్చర్యంతో నిండిపోతాడు. అప్పుడు నా లీల సంపూర్ణం అవుతుంది.
ప్రేక్షకాచీ జీ ఆనంద సంపన్నతా | తీచ మజ మాఝే ఖేళాచీ సాంగతా | పాహూని మాఝీ జగన్నియంతృతా | నర కృతార్థతా మానీల | ||౬౨||
62. “చూసిన వారు ఆనందిస్తేనే, నాయొక్క లీలకు పరిపూర్ణత్వం వస్తుంది. ఈ జగత్తును నేను శాసించే పద్ధతిని చూచి, మనిషి తృప్తి పొందాలి”.
కామ్యకర్మే ద్రవ్యోపార్జన | ఎతదర్థ న శరీర పోషణ | యావజ్జీవ తత్వజ్ఞాన సంపాదన | హేంచ జీవన సాఫల్య | ||౬౩||
63. ఈ దేహాన్ని పోషించటం, ఇంద్రియాల కోరికలను తీర్చటానికి కాని, డబ్బును గడించటానికి కాని, కాదు. బ్రతికి ఉన్నంత కాలము, తత్త్వ జ్ఞానాన్ని సంపాదించటమే, దానికి సాఫల్యతనిస్తుంది.
తత్వ తేంచ జే అభేదజ్ఞాన | తేంచి ఉపనిషద్బ్ర హ్మజ్ఞాన | తేంచ పరమాత్మోపాసన | తేంచ తో భగవాన భక్తాంచా | ||౬౪||
64. జీవాత్మ, పరమాత్మ, వేరు కాదు అన్న జ్ఞానమే తత్త్వం. దీనినే ఉపనిషత్తులలో బ్రహ్మజ్ఞానమనీ చెప్పబడింది. పరమాత్మను పూజించటం, సేవ చేయటం అనినా ఇదే. భక్తులు భగవంతుడు అనేదీ దీనినే.
గురూ బ్రహ్మ నవ్హేత దోన | ఝాలే జయా హే అభేద జ్ఞాన | హీచ భక్తీ ఘడతా జాణ | మాయా తరణ సుగమ జే | ||౬౫||
65. గురువు, బ్రహ్మ వేరు కాదు అని తెలుసుకోవడమే భక్తి. ఈ భక్తితో మాయనుంచి ముక్తి పొందటం చాలా సులభమని తెలుసుకోండి.
జే శ్రద్ధావంత పురూషయోగ్య | సంపాదితీ జ్ఞాన వైరాగ్య | హే ఆత్మతత్వచి నిజభోగ్య | భక్త సభాగ్య తే జాణా | ||౬౬||
66. యోగ్యులు, శ్రద్ధ కలిగిన పురుషులు, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని సంపాదించుకుంటారు. ఈ ఆత్మ తత్త్వంలో లీనమైన భక్తులు భాగ్యవంతులు.
స్వస్వరూపాచే జే అభాన | తే అజ్ఞాన నిరసల్యావీణ | స్వయే కృతార్థ మానీ జో ఆపణ | ప్రతిబంధ విలక్షణ హా ఎక | ||౬౭||
67. ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా కలిగే అజ్ఞానం వలన, ‘నేను సంపూర్ణం’ అనుకుని తృప్తి చెందడం, చెడు లక్షణంగల ఒక ఇబ్బంది.
జ్ఞాన ఆణి అజ్ఞాన | దోనీ హే వికార అవిద్యాజన్య | కాంటియానే కాంటా ఫేడూన | తైసీ ఉడవూన ఘ్యా దోనీ | ||౬౮||
68. జ్ఞానం మరియు అజ్ఞానం, ఈ రెండూ సరియైన విద్య లేనందున కలిగిన మానసిక స్థితి. దీనివలన ఎన్నో తప్పులు, వంచనలు పుట్టుకొస్తాయి. ముల్లును ముల్లుతో తీసినట్లు, ఒకటినుంచి ఇంకొకటిని ఏరి పారేయాలి.
జ్ఞానానే దూర కరా అజ్ఞాన | జ్ఞానాజ్ఞానాతీత హోఊన | నిర్మళ స్వస్వరూపావస్థాన | హే ఎక పర్యావసాన నరజన్మా | ||౬౯||
69. జ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించండి. తరువాత జ్ఞానం, అజ్ఞానం ఈ రెండింటినీ దాటి, శుద్ధమైన ఆత్మ స్వరూపంలో లీనమవడమే ఈ మనిషి జన్మకు లక్ష్యం.
న కరితా స్నేహాచీ7 రాంగోళీ8 | అజ్ఞాన తమాచీ కోజళీ9 | మీ మమ యా వాతీచీ హోళీ | జ్ఞాన న పాజళీ నిజప్రభా | ||౭౦||
70. ఇంద్రియాల కోరికలనే చమురంతా అయిపోయి, అజ్ఞానమనే చీకటి కాలి బూడిద అయ్యేవరకు, ‘నేను, నాది’ అనే వత్తి కాలిపోనంత వరకు, జ్ఞానమనే జ్యోతి తన ప్రభను ప్రకాశింప చేయదు.
హే తో సర్వ బుద్ధికర్తవ్య | నిశ్చయప్రాయ జాణావే | ||౭౧||
71. మనిషి దేహానికి సంబంధించిన అన్ని పనులూ, అవి తప్పనిసరి అయినా కాకపోయినా, అవన్నీ బుద్ధి నిర్ణయించినవని తెలుసుకోవాలి.
నాహీ ఆపణా దుజే కామ | స్వస్థ భోగావే ఏశ్వర్య ఆరామ | అథవా చింతావే రామనామ | హోఊ నిష్కామ నిశ్చింత | ||౭౨||
72. సుఖంగా ఐశ్వర్యాన్ని, విశ్రాంతినీ అనుభవించటం, లేక రామ నామాన్ని జపించటం - ఈ రెండు తప్ప మనకు మరో పని లేదు. కనుక, ఏ కోరికలూ లేకుండా నిశ్చింతగా ఉండండి.
శరీరేంద్రియ మన బుద్ధి | యా తో సర్వ ఆత్మ్యాచ్యా ఉపాధీ | హ్రహీంచ ఆత్మా భోక్తృత్వ ఆపాదీ | స్వయే అనాది అభోక్తా | ||౭౩||
73. దేహం అంగాంగాలు, మనసు, బుద్ధి ఇవన్నీ ఆత్మకు అడ్డంకులు. అందుకే, ఆది అనేది లేనిది, స్వతహాగా ఏమీ అనుభవించనిది అయిన ఆత్మ, కర్మ ఫలాన్ని తనే అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది.
ఆత్మ్యాచే భోక్తృత్వ ఔపాధిక | స్వయే అభోక్తా స్వాభావిక | శాస్త్ర న్యాయ అన్వయ వ్యతిరేక | ప్రమాణ దేఖా యే అర్థీ | ||౭౪||
74. అలా తన అడ్డంకుల వల్ల ఆత్మ తానే అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆత్మ స్వయంగా ఏదీ అనుభవించక పోవడం అనేది దాని స్వభావం. దీన్ని న్యాయ శాస్త్రము అన్వయ-వ్యతిరేకులతో ప్రమాణాన్ని ఇస్తుంది.
హే ఎక జాణోని నిజవర్మ | బుద్ధీస సోంపావే ప్రాప్తకర్మ | తిచే హాతీ మనాచే ధర్మ | స్వయే నిష్కర్మ వర్తావే | ||౭౫||
75. ఈ నిజమైన రహస్యాన్ని తెలుసుకొని, కలిగిన పనులను బుద్ధికి అప్ప చెప్పి, దాని ద్వారా మనసులోని ధర్మాలను చేయిస్తూ, తాను స్వయంగా ఏ పనీ చేయనట్లు నడచుకోవాలి.
స్వధర్మాచే అనుష్ఠాన | సదైవ ఆత్మానాత్మచింతన | హేంచ నరజన్మాచే పర్యవసాన | సమాధాన స్వరూపీ | ||౭౬||
76. నీ ధర్మం ప్రకారం, నీవు నడుచుకో. ఎల్లప్పుడూ ఏది ఆత్మ, ఏది ఆత్మ కానిది అన్నది ఆలోచిస్తూ, ఒకటిని ఇంకొకటినుంచి వేరు చేయాలి. ఇలా ఎప్పుడూ ఆత్మ చింతనలో లీనమై పోతే, వచ్చే తృప్తియే జన్మయొక్క అంతిమ లక్ష్యం.
నాహీ నరదేహాపరీ ఆన | చారీ పురూషార్థ సాధాయా సాధన | జో నర అభ్యాస పరాయణ | తో నారాయణ పద పావే | ||౭౭||
77. మనిషి జన్మ సాధించాల్సిన నాలుగు పురుషార్థాలను - ధర్మ, అర్థ, కామ మరియు మోక్షం - సాధించటానికి, మనిషి దేహంకంటే వేరే దారి లేదు. ఎవడు సదా దీని గురించే ఆలోచిస్తూ, అభ్యాసం చేస్తాడో ఆ నరుడు నారాయణ పదవిని పొందగలడు.
మ్హణూన ఝాలే న జో శరీరపతన | ఆత్మజ్ఞానార్థ కరా యత్న | నర జన్మాచా ఎకహీ క్షణ | ఉపేక్షూన టాకూ నకా | ||౭౮||
78. అందుకే, ఈ శరీరం నాశమైయేంత వరకు, ఆత్మ గురించి జ్ఞానం పొందటానికి ప్రయత్నించండి. ఈ మనిషి జన్మను అలక్ష్యం చేసి, ఒక్క క్షణమైనా దండుగ చేసుకోకండి.
సముద్రీచే క్షారోదక | మేఘాహాతీ పడతా దేఖ | హోతే జైసే గోడ పీయూష | తే సుఖ జడతా గురూపాయీ | ||౭౯||
79. సముద్రంలోని ఉప్పు నీరు, మబ్బులలో పడగానే అవి అమృతంలా మధురమైనట్లు, గురువు పాదాలను ఆశ్రయించిన వారి దుఃఖాలన్నీ, సుఖాలుగా మారిపోతాయి.
ఏశియా నరదేహాచీ సద్గతీ | గురూవినా నకళే కవణ్యాప్రతీ | గురూచ జేవ్హా ధరతీల హాతీ | తైంచ ఉద్ధరతీల జడ జీవ | ||౮౦||
80. మనిషి దేహానికి సద్గతి ఎలా కలుగుతుంది అనేది గురువు తప్ప ఇంకెవరికీ తెలియదు. గురువు స్వయంగా తమ దగ్గర చేర్చుకున్నప్పుడు, అప్పటిదాకా జడ పదార్థాల వలె ఉన్న జీవులు ఉద్ధరింప బడతారు.
మంత్ర తీర్థ దేవ ద్విజ | జ్యోతిర్వేద ఆణి భేషజ |
తైసేచ సాతవే గురూరాజ | భావ నా కాజ యా అవఘియా | ||౮౧||
81. మంత్రం, తీర్థ క్షేత్రాలు, బ్రాహ్మణుడు, జ్యోతిష్కుడు, మరియు వైద్యుడు - వీరి లాగే ఏడవ వారైన గురు మహారాజు, వీరందరి మీద భక్తి, నమ్మకం ఉంటేనే, వారినుండి మనకు ప్రయోజనం కలదు.
యయాంచ్యా ఠాయీ జైశీ భావనా | సిద్ధీహీ తైశీచ త్యాప్రమాణా | వేగ జైసా అధిక ఉణా | సిద్ధీహీ జాణా తైశీచ | ||౮౨||
82. వీరియందు ఏ ప్రమాణంలో ఎంతటి భక్తిభావం, నమ్మకం ఉంటే అంతే ప్రమాణంలోనే మనకు ప్రయోజనం కలదు. భక్తి తీవ్రత ఎంత ఎక్కువగానో, తక్కువగానో ఉంటే, ప్రయోజనం కూడా అట్లే అని తెలుసుకోండి.
బద్ధాస కరితీ ముముక్షూసంత | ముముక్షూచా కరితీ ముక్త | అవ్యక్తాచే హోఊన వ్యక్త | పరోపకారార్థ హే కరితీ | ||౮౩||
83. సత్పురుషులు సంసారంలో బంది అయిన వాళ్ళను, పరమాత్మ గురించి ఆలోచించే ముముక్షువులుగాను, అలాంటి ముముక్షువులను ముక్తులుగాను మార్చుతారు. దీనికోసం వారు కనిపించని అవ్యక్తంలోంచి బయటకు వచ్చి, కనిపించే రూపం దాల్చుతారు. ఇదంతా పరోపకారం కోసమే.
కార్య నవ్హే జే వ్యాఖ్యానే పురాణే | సుకర హోఈ తే సత్పురూషా చరణే | తయాచే హాలణే బోలణే చాలణే | ఉపదేశణే నిఃశబ్ద | ||౮౪||
84. వేదాలపై చేసిన వ్యాఖ్యలు, ప్రవచనాలు, పురాణాలు ఇవేవీ చేయలేని పనులు, సత్పురుషుల నడవడి, వారు మౌనంగానే చేసే ఉపదేశాల ద్వారా సులభమవుతాయి.
క్షమా శాంతి నిఃసంగతా | భూతదయా పరోపకారతా | ఇందియనిగ్రహ నిరహంకారతా | యాంచా ఆచరతా దుర్లభ | ||౮౫||
85. క్షమ, శాంతి, ఏకాంతం, జీవుల మీద దయ, పరోపకారం, ఇంద్రియాలపై పట్టు ఉన్నవారు, అహంకారం అసలు లేనివారు, ఇలాంటి గుణాలున్న వారు దొరకడం సాధ్యం కానిది.
జే న లాభే పఢతా గ్రంథ | సులభతే పహాతా ఎక క్రియావంత | కరీ జే న తారాంగణ అనంత | సంపాదీ భాస్వత ఎకలా | |౮౬||
86. పుస్తకాలను పఠించడం వలన రాని మంచి గుణాలు, ఆ గుణాలను ఆచరించేవారిని చూస్తే సులభంగా లభిస్తాయి. లెక్కలేనన్ని తారలు ఇవ్వలేని వెలుగును ఒక్క సూర్యుడే ఇవ్వగలుగుతాడు.
తైసేచ హే ఉదార సంత | సహజ క్రియా త్యాంచ్యా అనంత | కరితీ జీవాంస బంధముక్త | సౌఖ్య అత్యంత దేతాత | ||౮౭||
87. సత్పురుషుల మంచితనం కూడా అలాంటిదే! స్వాభావికమైన తమ ఆచరణ ద్వారా అనేక జీవులను సంసార బంధాలనుంచి ముక్తులను చేసి, గొప్ప ఆనందాన్ని ప్రసాదిస్తారు.
యాంతీలచి ఎక సాఈమహంత | ఏశ్వర్యవంత శ్రీమంత | పరీ ఫకీరాసమ ఆచరిత | ఆత్మనిరత సర్వదా | ||౮౮||
88. సాయి మహాత్ములు ఈ కోవకు చెందినవారే. వారు పరమార్థంతో నిండిన ఐశ్వర్యవంతులు, గొప్ప శ్రీమంతులు; అయినా, ఫకీరుని వలె నడుచుకునేవారు. ఎల్లప్పుడూ ఆత్మ చింతనలో మునిగి ఉన్నవారు.
అనవచ్ఛిన్న జయాచీ సమతా | మీ మాఝే హీ నాహీ వార్తా | జీవమాత్రీ సదా సదయతా | భూతీ భగవంతతా మూర్తిమంత | ||౮౯||
89. అన్ని ప్రాణులనూ వారు ఒకే సమంగా చూచేవారు. ‘నేను, నాది’ అన్న మాట వారికి రాదు. అన్ని ప్రాణులను దయతో చూచేవారు, అన్ని జీవులలోనూ దేవుణ్ణి చూసేవారు.
సౌఖ్యే జయాసీ నాహీ హరిఖ | దుఃఖే జయాసీ నాహీ శోక | సరిసే జయా రావరంక | హే కాయ కౌతుక సామాన్య | ||౯౦||
90. సుఖాలతో వారికి ఆనందం లేదు, దుఃఖాలలో శోకమూ లేదు. రాజును, పేదను సమానంగా చూడటం సామాన్యమైన సంగతా?
జయాచీ భ్రూవిక్షేపలహరీ | క్షణాంత రంకాచా రావ కరీ |
తో హా ఘేఊని చౌపాలవీ కరీ | దారోదారీ హిండతసే | ||౯౧||
91. తలుచుకున్న వెంటనే నిరుపేదను మహారాజుగా మార్చగల సాయి, భుజం మీద జోలి వేసుకుని, గడప గడపకు భిక్షాటన చేస్తూ తిరిగేవారు.
ధన్య తే జన జయాంచే ద్వారీ | బాబా హోఊని భిక్షేకరీ | పోరీ ఆణగే చతకుర భాకరీ | మ్హణూని పసరీ నిజకర | ||౯౨||
92. బిచ్చగానివలె “అమ్మాయి! రొట్టెముక్క తెచ్చిపెట్టు” అని ఎవరింటికి బాబా వెళ్ళి చేయి చాపేవారో, వారు ధన్యులు.
ఘేఈ టమరేల ఎకే కరీ | దుజియా హాతీ చౌపదరీ | స్వయే ఫిరే దారోదారీ | నియమిత ఘరీ ప్రతిదినీ | ||౯౩||
93. భుజం మీద జోలి తగిలించుకొని, చేతిలో ఒక రేకు డబ్బాతో, ప్రతి రోజూ నియమ ప్రకారం కొన్ని ఇళ్ళకు భిక్ష కోసం, సాయి వెళ్ళేవారు.
భాజీ సాంబారే దూధ తాక | పదార్థ తితుకే సకళిక | టమరేలాంత ఓతితీ లోక | పహా హె కవతీక ఖాణ్యాచే | ||౯౪||
94. కూర, సాంబారు, పాలు, మజ్జిగ వంటి పలచని పదార్థాలను జనులు రేకు డబ్బాలో పోసేవారు. సాయియొక్క అసాధారణ భోజన పద్ధతిని గమనించండి.
శిజలా భాత అథవా భాకరీ | ఘ్యావయా పసరలీ చౌపదరీ | పాతళ పదార్థ మగ కైసీహీపరీ | టమరేలా భీతరీ రిచవితీ | ||౯౫||
95. గట్టి పదార్థాలైన అన్నమును, రొట్టెను, జోలిలో వేయించుకునేవారు. పలచని పదార్థాలను రేకు డబ్బాలో వేయించుకునేవారు.
పదార్థా పదార్థీచీ చవీ ఘ్యావయా | లాలసా కోఠూన వ్హావీ | రసాసక్తి జివ్హే న ఠావీ | జీవీ ఉఠావీ కైసేనీ | ||౯౬||
96. నాలుకకు రుచులను అనుభవించాలన్న ఆశ ఎలాగూ లేదు. అలాంటప్పుడు, మనసులో వేరు వేరు పదార్థాల రుచులను తెలుసుకోవాలన్న కోరిక ఎందుకుంటుంది?
ఝోళీంత పడలే జే యదృచ్ఛేనే | తృప్త అసావే తయాచ్యాచ సేవనే | రూచకర కీ బేచవ హే నేణే | చవీచ రసనే నాహీ కీ | ||౯౭||
97. తమ జోలిలో పడిన వానిని తిని తృప్తి పడేవారు. ఏది రుచిగా ఉంది, ఏది రుచిగా లేదు అని వారి నాలుకకు తెలియదు.
ప్రహర దివసా వస్తీ లాగునీ | భిక్షా మాగత ప్రతిదినీ | తేణే ఉదర పూర్తి కరూనీ | సమాధానీ వర్తత | ||౯౮||
98. ప్రతి రోజూ వారు భిక్ష కోసం, ఊళ్ళోకి వెళ్ళేవారు. దానితో కడుపు నింపుకుని తృప్తి పొందేవారు.
భిక్షాతరీ కాయ నియమిత | ఇచ్ఛేస యేఈల తెవ్హా మాగత | కధీ బారా వేళ ఎకా దివసాంత | భిక్షేస జాత గాంవాంత | ||౯౯||
99. అదీ ఒక పద్ధతి ప్రకారమా? కానే కాదు. వెళ్ళాలని అనిపించినప్పుడు వెళ్ళేవారు. ఒక్కొకప్పుడు ఒకే రోజు పన్నెండు మారులు భిక్షకు ఊళ్ళోకి వెళ్ళేవారు.
ఎణేపరీ జే అన్న ఆణీత | మశీదీంతీల కుండీత ఠేవీత | కావళే కుత్రే త్యాంతచి ఖాత | కధీ న హాంకీత తయాంనా | ||౧౦౦||
100. ఇలా తెచ్చిన అన్నాన్ని, మసీదులోని ఒక మట్టి పాత్రలో ఉంచేవారు. కాకులు, కుక్కలు అందులోనే తింటున్నా, ఎప్పుడూ వానిని తరిమే వారు కాదు.
మశీద ఆంగణ ఝాడణారీ | త్యాంతూన దహాబారా భాకరీ |
ఘేఊన జాఈ ఆపులే ఘరీ | కోణీ న వారీ తిజలాగీ | ||౧౦౧||
101. మసీదును, దాని ముంగిలిని చిమ్మే స్త్రీ కూడా పది, పన్నెండు రొట్టెలను తనింటికి తీసుకు వెళ్ళేది. ఆమెను ఎప్పుడూ ఎవరూ వారించలేదు.
కుత్ర్యా మాంజరా హడహడ కరణే | స్వప్నాంతహీ జో కదా నేణే | తో కాయ గరీబ దుబళ్యా నకో మ్హణే | ధన్య జిణే తయాంచే | ||౧౦౨||
102. కుక్కలను పిల్లులను తరమటం అన్నదే వారు కలలో కూడా ఎరుగరు. అలాంటిది, పేదలను అడ్డగిస్తారా? వారి జీవితం ధన్యం.
ఆరంభీ హా వేడా ఫకీర | యేచ నామే జనా మహశూర | తుకడే మాగూని భరీ జో ఉదర | కైచా బడివార తయాచా | ||౧౦౩||
103. మొదట్లో వారు పిచ్చి ఫకీరు అనే జనులలో ప్రసిద్ధి అయ్యారు. రొట్టె ముక్కలను అడుక్కొని పొట్ట నింపుకొనే వారిలో, వారి గొప్పతనం మిగతా వారికి ఎలా కనిపిస్తుంది?
ఫకీర పరీ హాతాచా సఢళ | నిరపేక్ష ఆణి స్నేహాళ | బాహ్య చంచల అంతరీ అచళ | కళా అకళ తయాచీ | ||౧౦౪||
104. ఫకీరుగా ఉన్నా, వారు చాలా ఉదార స్వభావులు. స్నేహ మూర్తులు, ఏ కోరికలూ లేనివారు; పైకి వారి స్వభావం క్షణ క్షణం మారినా, లోపల నిశ్చలంగా, శాంతంగా ఉండేవారు. వారి నడక అంతుపట్టనిది.
ఏసియాహీ త్యా కుగ్రామాంత | జాత్యా అతీవ దయావంత | హోతే కాంహీ భాగ్యవంత | తే త్యా మహంత మానీత | ||౧౦౫||
105. శిరిడీలాంటి చిన్న గ్రామంలో కూడా ఉదార స్వభావంగల భాగ్యవంతులు ఉండేవారు. వారు బాబాను మహాత్మునిగా భావించేవారు.
తాత్యా కోతే యాంచీ ఆఈ | నాంవ జియేచే బాయజాబాఈ | పాటీంత భాకర్యా ఘేఊని డోయీ | రానాంత జాఈ దుపారా | ||౧౦౬||
106. బాయజాబాయి అనే తాత్యాకోతే తల్లి, రొట్టెల బుట్టను తలపై పెట్టుకుని మధ్యాహ్నం ఎండలో అడవిలోకి వెళ్ళేది.
కోస కోస రాన ధుండావే | దాట ఝాడ ఝుడూప తుడవావే | వేడ్యా ఫకీరాస యా హుడకావే | పాయా పడావే తయాచ్యా | ||౧౦౭||
107. మైళ్ళు మైళ్ళు నడిచి, చెట్లు పొదలు దాటుకుంటూ వెళ్ళి, పిచ్చి ఫకీరును వెదికి పట్టుకుని, వారి పాదాలపై పడేది.
కాయ తిచ్యా త్యా సత్వాచీ థోరీ | ఓలీ కోరడీ భాజీ భాకరీ | రానీవనీ దుపారీ తిపారీ | భరవీ న్యాహారీ బాబాంతే | ||౧౦౮||
108. ఎంతటి గొప్ప స్వభావం ఆమెది! మధ్యాహ్నం, సాయంత్రం, అడవికి వెళ్ళి, బాబాకు రొట్టె, కూర పెట్టేది.
ఏసే తిచే తపాచరణ | బాబాహీ న విసరలే ఆమరణ | కేలే తిచ్యా పుత్రాచే కల్యాణ | పూర్ణ స్మరణపూర్వక | ||౧౦౯||
109. ఆమెయొక్క ఈ భక్తి పూరితమైన సేవను, జీవితాంతం బాబా మరిచి పోలేదు. దానిని గుర్తుపెట్టుకుని, ఆమె కొడుకుకు మేలు చేశారు.
ఉభయతా త్యా స్త్రీ పురూషాంచా | ఫకీరాపాయీ దృఢభావ సాచా | ఫకీరచి దేవ త్యా ఉభయతాంచా | భావార్థియాచాచ దేవ కీ | ||౧౧౦||
110. ఆమెకు, ఆమె భర్తకు, ఇద్దరికీ ఫకీరు పాదాలయందు దృఢమైన నమ్మకం ఉండేది. వాళ్ళిద్దరికీ ఫకీరే దేవుడు. ఎంతైనా, భక్తితో నమ్మకమున్న వారికే, దేవుడు చెందుతాడు.
ఫకీరానే ధ్యానస్థ అసావే | బాయజాబాఈనే పాన మాండావే |
పాటీంతీల అన్న వాఢావే | ఖావవావే ప్రయత్నే| ||౧౧౧||
111. ఫకీరు ఎప్పుడూ ధ్యానంలో ఉండగా, బాయజాబాయి ఆకు వేసి, బుట్టలోని అన్నం వడ్డించి, పట్టుదలగా బాబాకు తినిపించేది.
ఫకీరీ అవ్వల బాదశాహీ | ఫకీరీహీ చిరంతన రాహీ | అమీరీ క్షణభంగుర పాహీ | సదా బాబాంహీ మ్హణావే | ||౧౧౨||
112. అందుకే బాబా ఎప్పుడూ “రాజ వైభవం కంటే పేదరికమే శ్రేష్ఠం. ఎప్పుడూ నిలకడగా ఉండేది పేదరికమే. భాగ్యం ఈ క్షణం ఉంటుంది, మరు క్షణం ఉండదు” అని అనేవారు.
పుఢే బాబాంనీ రాన త్యాగిలే | గాంవాంత యేఊన రాహూ లాగలే | మశీదీంత అన్న ఖాఊ ఆదరిలే | కష్ట చుకవిలే ఆఈచే | ||౧౧౩||
113. తరువాత, బాబా అడవులను వదిలి, గ్రామంలోకి వచ్చి ఉంటూ, మసీదులోనే అన్నం తినటం మొదలు పెట్టారు. ఆ తల్లికి కలిగే కష్టాన్ని తొలగించారు.
ఏసా హా నేమ తెవ్హాంపాసునీ | జైసా చాలవిలా త్యా ఉభయతాంనీ | తైసాచ తో తయాంచే మాగునీ | తాత్యాంనీంహీ చాలవిలా | ||౧౧౪||
114. అప్పటినుంచి, నియమం ప్రకారంగా ఆ దంపతులు బాబాకు అన్నం తీసుకెళ్ళేవారు. వారి తరువాత, తాత్యా కూడా ఆ నియమాన్ని పాటించాడు.
ధన్య ధన్య తే సంత సదైవ | జయాచే హృదయీ వాసుదేవ | ధన్య తయా భక్తాంచే సుదైవ | సమాగమ వైభవ జ్యా త్యాంచే | ||౧౧౫||
115. వాసుదేవుడు ఎప్పుడూ హృదయంలో ఉండే ఆ సత్పురుషులు నిజంగా ధన్యులు. అదృష్టం కొద్ది అలాంటి సత్పురుషుల సహవాస సుఖం పొందిన ఆ భక్తులు ఇంకా ధన్యులు.
తాత్యా మహా భాగ్యవాన | మ్హాళసాపతీచేహీ పుణ్య గహన | బాబాంచే సమాగమాచా మాన | సమసమాన భోగీత | ||౧౧౬||
116. తాత్యా మహా భాగ్యవంతుడు. మహల్సాపతి కూడా గొప్ప పుణ్యాత్ముడు. ఎందుకంటే, వీరిద్దరూ బాబాయొక్క సహవాస సుఖాన్ని సమానంగా అనుభవించారు.
తాత్యా ఆణి మ్హాళసాపతి | మశీదీంతచ శయన కరితీ | బాబాంచీహీ అనుపమ ప్రీతీ | దోఘాంవరతీ సారఖీ | ||౧౧౭||
117. తాత్యా మరియు మహల్సాపతి ఇద్దరూ మసీదులోనే పడుకునేవారు. వీరిద్దరి పైనా బాబాకు సమానంగా అసమానమైన ప్రేమ.
పూర్వపశ్చిమే ఉత్తరేస | డోయా తిఘాంచ్యా తీన దిశేస | పాయ పరస్పరాంచే పాయాంస | మధ్య బిందూస భిడవితీ | ||౧౧౮||
118. తూర్పు, పడమర, ఉత్తరం ఈ మూడు దిక్కులలో ముగ్గురూ తలలనుంచి, మధ్యన ఒకరి పాదాలు మరొకరికి తగిలేలా పడుకునే వారు.
తాణూని ఏశియా పథార్యా | గోష్టీ వార్తా చాలతీ సార్యా | ఎకాస యేతా నిద్రేచ్యా లకేర్యా | తయాస దుసర్యానే జాగవావే | ||౧౧౯||
119. ప్రక్కల పరచుకుని, కథలు, కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురూ పడుకునేవారు. ఒకరికి కునుకు వస్తే రెండోవారు లేపేవారు.
తాత్యా ఘోరూ లాగతా | ఉఠావే బాబాంనీ అవచితా | కరోని తయాంసీ ఉలథాపాలథా | దాబావా మాథా తయాంచా | ||౧౨౦||
120. తాత్యా గుర్రు పెట్టేవాడు. అప్పుడు బాబా అతనిని ఇటూ అటూ దొర్లించి, అతని తలను పట్టుకుని వత్తుతూ, వెంటనే లేపేవారు.
ఘేఊని సమవేత మ్హాళసాపతీ | బిలగతీ దోఘే తాత్యాప్రతీ |
ఆవళూన ధరితీ పాయ దాబితీ | పాఠహీ రగడితీ తయాచీ | ||౧౨౧||
121. మహల్సాపతితో కలిసి, తాత్యాను గట్టిగా పట్టుకుని, బాబా అతని కాళ్ళు పట్టేవారు. అతని వీపును కూడా మర్దించేవారు.
ఏశీ సబంధ చవదా సాలే | బాబాంసవే తాత్యా మశీదీంత నిజలే | కాయ భాగ్యాచే తే దివస గేలే | స్మరణీ రాహిలే అఖండ | ||౧౨౨|
122. ఇలాంటి ఎడతెగని సంబంధంతో, ౧౪ సంవత్సరాలు తాత్యా బాబాతో కలిసి మసీదులో నిద్రించాడు. ఎంత అద్భుతమైన రోజులవి! అవి గడిచిపోయి, ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మిగిలిపోయాయి.
ఘరీ ఠేవూనియా మాయబాపే | బాబాంచ్యా ఆవడీ మశీదీ ఝోంపే | ప్రేమ తే మాపావే కవణ్యా మాపే | మోల యా కృపేచే కోణ కరీ | ||౧౨౩||
123. తల్లి తండ్రులను ఇంట్లో వదిలేసి, బాబాపై ప్రీతితో తాత్యా మసీదులో పడుకునేవాడు. తాత్యాకు గల ప్రేమను ఎలా తూచగలం? అతని పైనున్న బాబా కృపను ఎవరు విలువ కట్టగలరు?
పుఢే వడీల పంచత్వ పావలే | తాత్యా ఘర సంసారాంత పడలే | ఝాలే ఘరధనీ స్వయే దాదులే | నిజూ లాగలే నిజగృహీ | ||౧౨౪||
124. తండ్రి చనిపోయిన తరువాత సంసారం బాధ్యత తాత్యాపై పడింది. ఇంటికి యజమాని అయ్యాడు. తరువాత గృహస్థుడైయాడు. తరువాత ఇంట్లోనే పడుకునేవాడు.
అసో ఏసా నిష్ఠావంత భావ | తయాసీంచ సాఈచా అనుభవ | అనాహూత ఉభా స్వయమేవ | భక్త నవలావ పాహూ యే | ||౧౨౫||
125. ఇలాంటి భక్తులకు, శ్రద్ధా నిష్ఠలున్న వారికే సాయియొక్క అనుభవాలు కోరకుండానే కలుగుతాయి. భక్తులు దీనినే చమత్కారమని అనుకుంటారు.
తైసేచ రాహాత్యాంత ఎక గృహస్థ | ఖుశాలచంద నామే విఖ్యాత | హోతే బాబాంచే భక్త ధనవంత | నగరశేట గాంవీంచే | ||౧౨౬||
126. అలాగే, రాహాతాలో ఖుశాలుచందు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు బాబా భక్తుడు, ధనవంతుడు, ఆ ఊరికి షావుకారు.
ప్రసిద్ధ పాటీల గణపత కోతే | జైసే బాబాంచే ఫార ఆవడతే | చులతే ఖుశాలచందాచే హోతే | తైసేచ బాబాంతే ప్రియ బహు | ||౧౨౭||
127. ప్రసిద్ధి పొందిన గణపతి కోతే పాటీలు పైన బాబాకు ఉన్నంత ప్రేమ, ఖుశాలుచందు పినతండ్రి పైన కూడా ఉండేది.
జరీ జాతీచే మారవాడీ | బాబాలాగీ మోఠీ ఆవడీ | పరస్పరాంచ్యా ఘడోఘడీ | భేటీ సుఖపరవడీ తే ఘేత | ||౧౨౮||
128. జాతిలో మార్వాడి అయినా, అతనికి బాబాపై చాలా ప్రేమ. ఇద్దరూ తరచుగా ప్రీతితో కలుసుకునేవారు.
హరిచ్ఛేనే కాంహీ కాలే | వడీల శేటజీ పంచత్వ పావలే | తరీహీ న బాబా విసరలే | ప్రేమ పాహిలే దుణావలే | ||౧౨౯||
129. కొంత కాలానికి, దైవేచ్ఛతో పెద్ద సేఠు చనిపోయాడు. అయినా బాబా అతనిని మరచి పోలేదు. ఇంకా, ఆ కుటుంబం మీద ప్రేమ రెండింతలయింది.
పుఢేహీ ఖుశాలచందావరతీ | వాఢత గేలీ బాబాంచీ ప్రీతి | ఆదేహాంత దివసరాతీ | కల్యాణా జాగతీ తయాచే | ||౧౩౦||
130. తరువాత కూడా, ఖుశాలుచందు పైన బాబా ప్రేమ పెరుగుతూనే ఉండేది. తమ జీవితాంతం వరకు, బాబా అతని బాగోగులను రాత్రి పగలు కనిపెట్టుతూ ఉండేవారు.
కధీ గోరథీ కింవా హయరథీ | సవే ఘేఊని ప్రేమాచే సాంగాతీ |
తెథూన దీడ మైలావరతీ | రహాత్యాప్రతీ జాత బాబా | ||౧౩౧||
131. ప్రేమతో భక్తులతో సహా, బాబా ఒక సారి ఎద్దుల బండిలోను, ఇంకో మారు గుర్రపు బండిలోను, మైలున్నర దూరంలో ఉన్న రహాతాకు బాబా వెళ్ళేవారు.
గ్రామస్థ లోక సామోరే యేత | తాశే వాజంత్రీ సవే ఘేత | బాబాంస గాంవాంచే వేశీవర భేటత | లోటాంగణీ యేత ప్రేమానే | ||౧౩౨||
132. అక్కడి గ్రామస్థులు డోలు, సన్నాయి మొదలగు వాద్యాలతో, ఊరి పొలిమేర వద్దకు వచ్చి, బాబాకు స్వాగతం పలికి, ప్రేమతో వారికి సాష్టాంగ నమస్కారం చేసేవారు.
మగ తెథూన గాంవా ఆంత | బాబాంస సమారంభే నేత | అతి ప్రేమే వాజత గాజత | ఆనంద భరిత మానసే | ||౧౩౩||
133. తరువాత, ప్రేమ ఆనందం ఉప్పొంగుతుండగా, అక్కడినుండి మేళ తాళాలతో, బాబాను అతి వైభవంగా ఊళ్ళోకి తీసుకుని వెళ్ళేవారు.
ఖుశాలచంద ఆపులే సదనీ | బాబాంస మగ జాత ఘేఉని |
తెథే అల్పాహార కరవునీ | సుఖాసనీ బైసవీత | ||౧౩౪||
పరస్పరాంచ్యా ఆనందచిత్తా | కోణాస వర్ణితా యేఈల తో | ||౧౩౫||
బాబా మగ స్వానందనిర్భర10 | సహ పరివార పరతతీ | ||౧౩౬||
యా దోహోంచ్యా మధ్యే ఠావ | శిరడీ గాంవ వస్తీచా ||౧౩౭||
స్థూల దేహే కేలే న అనిర్వాణ | తరీ తయా జాణ సర్వత్ర | ||౧౩౮||
తరీ త్యా రథాచే గమనాగమన | వేళ ప్రమాణ త్యా ఠావే | ||౧౩౯||
ఆజ్ఞా మాగూ జాతా జవళ | మ్హణావే ఉతావీళ కా ఝాలా | ||౧౪౦||
బాబా న కరితా ఆతా తాతడీ | చుకేల మాఝీ ముంబఈచీ గాడీ |
నోకరీవర యేఈల ధాడీ | సాహేబ కాఢీల మజలా కీ | ||౧౪౧||
జా ఖా భాకర తుకడా జరా | జాఈ దుపారా జేవునీ | ||౧౪౨||
లహానా థోరా శహాణ్యా సుజ్ఞా | అనుభవ విజ్ఞాన సకళా హే | ||౧౪౩||
పరీ జయానే తీ అవమానిలీ | ప్రచీతీ ఘేతలీ రోకడీ | ||౧౪౪||
అనేకాంచే అనేక అపూర్వ | సంక్షేప పూర్వక సాంగేన | ||౧౪౫||
భక్త పరతతా గాంవాలాగూన | బాబాంచే ఆజ్ఞాపన హో లాగే | ||౧౪౬||
అవమానితా పడే అపాయీ | పుఢీల అధ్యాయీ దిగ్దర్శన | ||౧౪౭||
పంచసూనాది పాతక క్షాలన | కథా నిరూపణ పుఢారా | ||౧౪౮||
కరాయా సాఈచరిత్ర శ్రవణ | నిజకల్యాణా కారణే | ||౧౪౯||
1. భాతా. 2. స్వాభావికపణే. 3. క్షణభంగుర, ఉద్యా నాహీ తో.
4. క్షణ. 5. స్వతఃచ్యా జ్ఞానాలా అనుసరూన జన్మ మిళతో. 6. లీలా.
7. విషయప్రీతిరూప తేలాచీ. 8. సమూళ నాశ.
9. వాత జళల్యానంతర రాఖస్వరూప రాహతే తీ.
ఖుశాలచంద ఆపులే సదనీ | బాబాంస మగ జాత ఘేఉని |
తెథే అల్పాహార కరవునీ | సుఖాసనీ బైసవీత | ||౧౩౪||
134. అక్కడ, ఖుశాలుచందు బాబాను తన ఇంటికి తీసుకుని వెళ్ళేవాడు. ఇంట్లో ఫలాహారాలను సేవింప చేసి, వారిని సుఖంగా కూర్చుండ పెట్టేవాడు.
మగ త్యా జున్యా పురాణ్యా వార్తా | ఆఠవూని కథితీ ఉభయతా | పరస్పరాంచ్యా ఆనందచిత్తా | కోణాస వర్ణితా యేఈల తో | ||౧౩౫||
135. ఆ తరువాత ఇద్దరూ పాత కథలను, గడచిన జ్ఞాపకాలను గురించి ముచ్చటించుకునే వారు. ఒకరికొకరు వారు పొందుతున్న ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు?
ఎణే ప్రమాణే ఆనంద విహార | పూర్ణ హోతా ఫళాహార | బాబా మగ స్వానందనిర్భర10 | సహ పరివార పరతతీ | ||౧౩౬||
136. ఇలా ఆనందంగా కాలం గడిపి, ఫలాహారాన్ని సేవించిన తరువాత, తమతో వచ్చినవారితో బాబా సంతోషంగా శిరిడీకి తిరిగి వచ్చేవారు.
ఎకీకడే హే రహాతే గాంవ | దుసరీకడే తే నిమగాంవ | యా దోహోంచ్యా మధ్యే ఠావ | శిరడీ గాంవ వస్తీచా ||౧౩౭||
137. ఒక వైపు రహాతా గ్రామం, ఇంకో వైపు నీంగాం గ్రామం. ఈ రెంటి మధ్యన శిరిడీ గ్రామం ఉండేది.
జరీ యా మధ్యబిందూ పాసూన | యా దోన గాంవాబాహేర ప్రయాణ | స్థూల దేహే కేలే న అనిర్వాణ | తరీ తయా జాణ సర్వత్ర | ||౧౩౮||
138. ఇలా రెండు గ్రామాల మధ్యన ఉన్న శిరిడీ గ్రామంలో ఉంటూ, జీవితాంతం వరకు, తమ దేహంతో బాబా ఎప్పుడూ ఈ రెండు గ్రామాల అవతల ప్రయాణం చేయలేదు. అయినా, ఎక్కడ ఏమి జరుగుతున్నదీ అనేది అంతా వారికి తెలుసు.
నాహీ ఇతర కోఠే ప్రయాణ | నాహీ అగ్నిరథాచే దర్శన | తరీ త్యా రథాచే గమనాగమన | వేళ ప్రమాణ త్యా ఠావే | ||౧౩౯||
139. వేరే ఏ చోటికీ వారు వెళ్ళలేదు. రైలు బండిని అసలు చూడనే లేదు. అయినా, రైలు బళ్ళ రాక పోకల వేళల గురించి అంతా వారికి తెలుసు.
సాధావయా గాడీచీ వేళ | భక్తాంనీ కరావీ తయారీ ప్రబళ | ఆజ్ఞా మాగూ జాతా జవళ | మ్హణావే ఉతావీళ కా ఝాలా | ||౧౪౦||
140. సమయానికి సరిగ్గా రైలు బండిలో వెళ్ళాలని భక్తులు, ప్రయాణానికై బాబా అనుమతి కోసం వారి వద్దకు వెళ్ళితే, “అంత తొందర పడుతున్నారెందుకు?” అని అడిగేవారు.
బాబా న కరితా ఆతా తాతడీ | చుకేల మాఝీ ముంబఈచీ గాడీ |
నోకరీవర యేఈల ధాడీ | సాహేబ కాఢీల మజలా కీ | ||౧౪౧||
141. ‘బాబా! తొందరగా వెళ్ళక పోతే, ముంబై వెళ్ళే రైలు తప్పిపోతుంది. ఉద్యోగానికి ముప్పు వస్తుంది. మా యజమాని, ఉద్యోగంనుండి నన్ను తీసేస్తాడు’.
సాహేబ యేథే నాహీ దుసరా | కశాస వ్హావీ ఇతుకీ త్వరా | జా ఖా భాకర తుకడా జరా | జాఈ దుపారా జేవునీ | ||౧౪౨||
142. అని అంటే, “ఇక్కడ ఇంకొక యజమాని ఎవరూ లేరు. ఎందుకింత తొందర? వెళ్ళి కొంచెం రొట్టె తిను. మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళవచ్చు” అని చెప్పేవారు.
ఏసీ కోణాచీ ఆహే ప్రజ్ఞా | కీ త్యా వాణీచీ కరీల అవజ్ఞా | లహానా థోరా శహాణ్యా సుజ్ఞా | అనుభవ విజ్ఞాన సకళా హే | ||౧౪౩||
143. వారి మాటను జవదాటే ధైర్యం ఎవరికి ఉంటుంది? పిన్నలు, పెద్దలు, తెలివైనవారు, అందరికీ ఇది అనుభవమే!
జ్యానే జ్యానే ఆజ్ఞా మానిలీ | గాడీ తయాచీ కధీ న చుకలీ | పరీ జయానే తీ అవమానిలీ | ప్రచీతీ ఘేతలీ రోకడీ | ||౧౪౪||
144. వారి ఆజ్ఞను పాటించిన వారికి, బండి ఎప్పుడూ తప్పి పోలేదు. కాని, వారి మాటను వినని వారు తప్పక కష్టాలను అనుభవించేవారు.
ఎకామాగూన ఎక అభినవ | సంఖ్యా విరహిత ఏసే అనుభవ | అనేకాంచే అనేక అపూర్వ | సంక్షేప పూర్వక సాంగేన | ||౧౪౫||
145. లెక్కలేనన్ని ఇలాంటి అనుభవాలు ప్రతి మారు, మునుపెన్నడూ జరగనివి, క్రొత్తవి జరిగేవి. ఎంతో మందికి కలిగిన ఇలాంటి అనుభవాలను ఒకటి తరువాత ఇంకొకటి సంగ్రహంగా చెప్పుతాను.
హేమాడ సాఈపదీ శరణ | పుఢీల అధ్యాయీ హేంచి నిరూపణ | భక్త పరతతా గాంవాలాగూన | బాబాంచే ఆజ్ఞాపన హో లాగే | ||౧౪౬||
146. హేమాడు సాయి పాదాలకు శరణుజొచ్చి, తరువాతి అధ్యాయంలో, భక్తులు తమ ఊళ్ళకు వెళ్ళేటప్పుడు, బాబా అనుమతిని ఎలా తీసుకోవాల్సి వచ్చేదో చెబుతాడు.
ఆజ్ఞా హోఈ తో తో జాఈ | ఆజ్ఞా నాహీ తో తో రాహీ | అవమానితా పడే అపాయీ | పుఢీల అధ్యాయీ దిగ్దర్శన | ||౧౪౭||
147. అనుమతి దొరికిన వారే వెళ్ళటం, దొరకని వారు ఉండి పోవటం, లేక పోతే, బాబా మాటను జవదాటటం వలన అపాయాలకు గురి కావడం గురించి తెలియ చేస్తాడు.
తైసేంచ మధుకరీ వృత్తీచే ధారణ | సాఈంస కిమర్థ భిక్షాన్న సేవన | పంచసూనాది పాతక క్షాలన | కథా నిరూపణ పుఢారా | ||౧౪౮||
148. అలాగే, బాబా భిక్షాటన చేసి, భిక్షాన్నాన్ని ఎందుకు తినేవారు, పంచసూనాది పాతకాలను నిర్మూలించటం మొదలగు కథల వర్ణన తరువాత చేయబడుతుంది.
మ్హణవూన శ్రోతయా చరణీ ప్రార్థనా | కరితో ఆగ్రహే క్షణక్షణా | కరాయా సాఈచరిత్ర శ్రవణ | నిజకల్యాణా కారణే | ||౧౪౯||
149. అందువలన, మీ శ్రేయస్సు కోసం సాయి చరిత్రను వినండి అని హేమాడు శ్రోతల పాదాలకు నమస్కరించి మాటి మాటికీ వేడుకుంటున్నాడు.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | సాఈసమర్థావతరణం* నామ |
| అష్టమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిప్పణీ: 1. భాతా. 2. స్వాభావికపణే. 3. క్షణభంగుర, ఉద్యా నాహీ తో.
4. క్షణ. 5. స్వతఃచ్యా జ్ఞానాలా అనుసరూన జన్మ మిళతో. 6. లీలా.
7. విషయప్రీతిరూప తేలాచీ. 8. సమూళ నాశ.
9. వాత జళల్యానంతర రాఖస్వరూప రాహతే తీ.
10. యా సంబంధీ రా. హరీ సీతారామ దీక్షిత యాంనా ఆలేలా ఎక అనుభవ - ఎకే దివశీ దోనప్రహరీ మలా మహారాజ మ్హణాలే, “ఖుశాలభాఊ పుష్కళ దివసాంత ఆలే నాహీత. తూ టాంగా ఘేఊన రాహాత్యాస జా వ త్యాంనా ఘేఊన యే. త్యాంనా మ్హణావే, తుమ్హాలా బాబాంనీ బోలవిలే ఆహే.” త్యాప్రమాణే మీ టాంగా ఘేఊన రాహాత్యాస గేలో. ఖుశాలభాఊంచీ భేట ఝాలీ. తే మ్హణాలే, ‘మీ దుపారీ జేవూన నిజలో హోతో. మాఝా డోళా లాగలా తోచ మహారాజ స్వప్నాత ఆలే వ మలా మ్హణాలే, “శిరడీస చల”. త్యాప్రమాణే మలా యేణ్యాచీ ఉత్కట ఇచ్ఛా ఝాలీ. పణ ఆజ మాఝే ఘోడే యేథే నాహీత మ్హణూన మలా యేత నాహీ. మ్హణూనచ మీ మాఝ్యా ములాలా ఆత్తాచ శిరడీస పాఠవిలే ఆహే’. త్యావర మీ మ్హటలే, ‘మ్హణూనచ మహారాజాంనీ మలా టాంగా ఘేఊన పాఠవిలే ఆహే. ఆపణ యేత అసాల తర మాఝా టాంగా తయార ఆహే.’ త్యావర తే మోఠ్యా ఆనందానే మాఝ్యాబరోబర ఆలే.
*. శ్రీ సాఈనాథాంచ్యా ఎకా సద్భక్తానే సుచవిలే ఆహే కీ, ‘శ్రీసాఈసమర్థావతరణం’ హా చౌథ్యా అధ్యాయాత యేఊన గేలా ఆహే వ యా అధ్యాయాత ‘నర-జన్మాచీ మహతీ, భిక్షాన్న-సేవన, బాయజాబాఈచీ భక్తీ వ తాత్యా-మ్హాళసాపతీ శయనం’ యాంచీ వర్ణనే ఆహేత. త్యాప్రమాణే వాచకాంనీ లక్షాత ఘ్యావే.
No comments:
Post a Comment