Saturday, August 24, 2013

||చావడీవర్ణనం నామ సప్తత్రీంశత్తమోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౩౭ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

ధన్య ధన్య సాఈచే చరిత | ధన్య తయాచే నిత్యాచరిత | 
క్రియాహీ అకళ అత్యద్భూత | ఇత్థంభూత అకథ్య | ||౧|| 
1. సాయి చరిత్ర ధన్యం. వారు రోజూ చేసే పనులు కూడా ధన్యం. అర్థం కాని వారి పనులను, జరిగినవి జరిగినట్టు వర్ణించడం సాధ్యం కానిది.
అగాధ త్యాచే సచ్చరిత | ధన్య తయాచే జీవనవృత్త | 
ధన్య ధన్య తే అప్రతిహత | అసిధారావ్రత తయాచే | ||౨|| 
2. వారి సచ్చరితను తెలుసుకోవడం అసాధ్యం. వారి జీవనం ధన్యం. మార్పు లేని వారి రోజువారి జీవనం, కత్తి మీద సాములాంటిది, మరియు తిరుగులేనిది.
కధీ బ్రహ్మానందే ఉన్మత్త | కధీ తే నిజబోధే తృప్త | 
కధీ సర్వ కరూని అలిప్త | ఏసీ అనిశ్చిత తీ స్థితీ | ||౩|| 
3. ఒకప్పుడు, బ్రహ్మానందంలో ఉన్న బాబా, పిచ్చివానిలా కనిపిస్తారు. ఒకప్పుడు ఆత్మ జ్ఞానంలో తృప్తులై ఉంటారు. మరొకప్పుడు, అన్నీ చేస్తూ ఉన్నా, దేనికీ సంబంధించనట్లు ఉంటారు. ఇలా వారి స్థితి, చెప్పలేని రీతిగా ఉంటుంది.
కధీ సర్వ ప్రవృత్తి శూన్య | తరీ తో నవ్హే నిద్రాసంపన్న | 
నిజస్వార్థీ ఠేవూని మన | సదా సావధాన నిజరూపీ | ||౪|| 
4. ఒకప్పుడు ఏ పనీ లేకుండా ఉంటారు. అయినా, నిద్రపోయే స్థితిలో ఉండరు. తమ మేలు గురించే ఆలోచిస్తూ, ఎప్పుడూ ఆత్మ రూపంలో సావధానులై ఉంటారు.
కధీ సాగరాసమ ప్రసన్న | పరీ తో దురంత దుర్విగాహ్య గహన | 
కోణా హే అగాధరూప నిరూపణ | యథార్థేపణే కరవేల | ||౫|| 
5. మరొకప్పుడు, సముద్రంవలె ప్రసన్నంగా ఉంటారు. కాని, వారి ఆలోచనల లోతు, ముగింపు ఎవరికీ తెలియవు. లోతే తెలియని సముద్రంలాంటి వారి స్వభావాన్ని, ఉన్నది ఉన్నట్లుగా ఎవరు వర్ణించగలరు?
పురుషాంసవే ధరీ బంధుతా | స్త్రియా తయాచ్యా బహిణీ మాతా | 
బ్రహ్మచారీ ఊర్ధ్వరేతా | ఠావా సమస్తా సర్వదా | ||౬|| 
6. భక్తులలో మగవారు, వారికి సోదరులవంటి వారు. ఆడవారు, తల్లి లేక అక్కచెల్లెళ్ళతో సమానులు. వారు ఇంద్రియాలను జయించిన, ఆజన్మ బ్రహ్మచారి అని అందరికీ తెలిసినదే.
ఏసియాచే సత్సంగతీ | ప్రాప్త ఝాలీ జీ మతి | 
తీచ రాహో నిశ్చల స్థితి | నిధనపాప్తీ పర్యంత | ||౭|| 
7. ఇలాంటి వారి సహవాసంలో పొందిన, మనసుయొక్క చలించని స్థితి మరియు తెలివి, ఈ జీవితం ముగిసేదాక ఉండని.
ఉదండ వ్హావీ సేవావృత్తి | చరణీ జడావీ అనన్య భక్తి | 
భగవద్భావ సర్వాం భూతీ | అఖండ ప్రీతి తన్నామీ | ||౮|| 
8. వారి సేవ చేయాలన్న కోరిక ఎప్పటికీ స్థిరంగా ఉండుగాక. వారి పాదాల మీద ఉండే భక్తి, దృఢపడుగాక. అన్ని ప్రాణులలోనూ దేవుడున్నాడు అనే భావం కలుగుగాక. సాయి నామం మీద అంతు లేని ప్రీతి కలుగుగాక.
పాహోని త్యాచ్యా ఎకేక కృతీ | జే జే కారణ శోధూ జాతీ | 
తే తే కుంఠిత హోఉని అంతీ | స్వస్థచి బైసతీ తటస్థ | ||౯|| 
9. ఒకటికంటే ఒకటి అద్భుతమైన వారి పనులను చూసి, అవి ఎలా జరిగాయి అని తెలుసుకోవాలనే ప్రయత్నం చేసిన వారందరికీ, తెలివి పారక, వారి ప్రయత్నాలని మానుకోవాల్సి వచ్చింది.
కితిఎక స్వర్గసౌఖ్యా ఝగడతీ | వానితీ అత్యంత స్వర్గాచీ మహతీ | 
తే భూలోకా తుచ్ఛ మానితీ | మరణాచీ భీతి మ్హణతీ ఇథే | ||౧౦||
10. స్వర్గ సుఖాలు కావాలని కొందరు ఆశిస్తారు. ఇక్కడ, భూలోకంలో ఎప్పుడూ చావు భయం ఉంటుందని, దీనిని చిన్న చూపు చూస్తారు.

పరీ అవ్యక్తాంతూన ఆకారా యేతీ | తియేసచి మ్హణతీ వ్యక్త స్థితి | 
పుఢే తీచ ప్రవేశతా అవ్యక్తీ | మృత్యు మ్హణతీ తియేస | ||౧౧|| 
11. కాని, వారే కనిపించని స్థితినుండి, కనిపించే స్థితికి వచ్చారు. అలాగే, కనిపించే స్థితినుండి, కనిపించని స్థితికి పోవటమే చావు అని అంటారు. 
అధర్మ అజ్ఞాన రాగ ద్వేష | ఇత్యాదిక హే మృత్యుపాశ | 
యాంచే ఉల్లంఘన కరీ జో అశేష | త్యాసీచ ప్రవేశ స్వర్లోకీ | ||౧౨|| 
12. అధర్మం, అజ్ఞానం, కోపాలు, ఓర్వలేనితనం, అనే సంకెళ్ళే, చావు వైపుకు లాక్కుని పోతాయి. వానిని పూర్తిగా జయించిన తరువాతే, స్వర్గానికి పోవటం.
స్వర్గ స్వర్గ తో కాయ ఆణిక | వైరాజ తోచ స్వర్గ లోక | 
విరాట ఆత్మస్వరూప దేఖ | మానస దుఃఖ వివర్జిత | ||౧౩|| 
13. స్వర్గం! అయినా స్వర్గం అంటే ఏమిటి? వైరాగ్యమే స్వర్గం. ఈ జగత్తంతా నిండి ఉన్న పరమేశ్వరుడే ఆత్మ అని తెలుసుకోవటం, నొప్పి, బాధలనుండి మనసునుంచి దూరం చేయటమే స్వర్గం.
జేథే నాహీ రోగాది నిమిత్త | నాహీ చింతా వ్యాధీ దుఃఖ | 
జేథే న క్షుధా తృషాకులిత | కోణీ న వ్యథిత జరాభయే | ||౧౪|| 
14. అక్కడ రోగాల బాధలు, చింతలు, దుఃఖాలు ఉండవు. ఆకలి దప్పులుండవు. ఎవరూ ముసలితనంతో బాధపడరు.
జేథే నాహీ మృత్యు భయ | నాహీ విధినిషేధ ద్వయ | 
జీవ వావరే అత్యంత నిర్భయ | తీచ కీ దివ్య స్వర్గస్థితి | ||౧౫|| 
15. ఎక్కడ చావు భయం అసలు ఉండదో, ఎక్కడ ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనే బంధాలు లేవో, ఎక్కడ జీవులు అసలు భయమే లేక తిరుగగలరో, అదే ఆ దివ్యమైన స్వర్గం.
జే ఆబ్రహ్మస్థావరాంత | పూర్ణ స్థావర జంగమాంత | 
తేంచ తత్వ పరత్రీ వా యేథ | నానాత్వవిరహిత తేంచ తే | ||౧౬|| 
16, బ్రహ్మనుండి మొదలుకుని, కదిలీ కదలని వస్తువులు అన్నింటిలో, ఏది ఈ ప్రపంచమంతా నిండి ఉన్నదో, అదే తత్త్వం, చావు తరువాత కూడా ఉంటుంది. అది అక్కడైనా, ఇక్కడైనా, వేరుగా కాకుండా, ఒక్కటిగానే ఉంటుంది.
అసతా సంసార ధర్మ వర్జిత | హోతా ఉపాధి సమన్విత | 
తేంచ ఆభాసే అబ్రహ్మవత | అవిద్యామోహిత జీవాస | ||౧౭|| 
17. అజ్ఞానంతో, మాయతో కప్పబడిన వానికి, సంసారాన్ని వదులుకున్నా, ఈ ఆత్మ బ్రహ్మలాగ కనిపించదు.
పరబ్రహ్మ తే మజహూన భిన్న | తే మీ నవ్హే మీ తో ఆన | 
ఏసే జయాచే భేదజ్ఞాన | తో మరణాధీన సర్వదా | ||౧౮|| 
18. ‘నేను జీవుణ్ణి, పరమాత్మను కాను’ అని వేరుగా ఆలోచించే వారు, ఎప్పుడూ చావు చేతిలో చిక్కుకుని ఉంటారు.
జననాపాఠీ లాగలే మరణ | మరణాపాఠీ పునర్జనన | 
హే సంసృతిచక్ర పరివర్తన | పాఠీస చిరంతన తయాచ్యా | ||౧౯|| 
19. పుట్టుక వెనుకే చావు, చావు వెనుక మరల పుట్టుట, ఈ చావు పుట్టుకల చక్రం, వారి వెంట ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది.
దుష్కర యజ్ఞ తపోదాన | ఇహీ జయాచే హోయ ఆపాదన | 
తే నారాయణ పద స్మృతివిహీన | స్వర్గాయతన కిమర్థ | ||౨౦||
20. చేయటానికి ఎంతో కష్టమైన యజ్ఞ, దాన, తపసుల వలన దొరికే స్వర్గంలో, నారాయణుని పాదలను తలుచుకోలేకపోతే, ఇంక ఆ స్వర్గం ఎందుకు?

కేవళ విషయ భోగాచే స్థాన | నలగే ఆముతే స్వర్గభువన | 
జేథే న గోవింద నామస్మరణ | కాయ కారణ తయాచే | ||౨౧|| 
21. కేవలం ఇంద్రియాల కోరికలను తీర్చుకునే చోటైన స్వర్గం, మనకు అవసరం లేదు. గోవిందుని పేరు తలచుకోలేని చోటు, మనకు ఎందుకు?
స్వర్గా జా అథవా నరకా | ఫరక నాహీ విషయసుఖా | 
ఇంద్రా వా గర్ధభా దేఖా | సుఖ విలోకా ఎకచీ | ||౨౨|| 
22. స్వర్గం కాని, లేక నరకం కాని, ఇంద్రియాల సుఖాలలో ఏ భేదమూ లేదు. దేవేంద్రునికైనా, గాడిదకైనా, ఇంద్రియాల సుఖాలు ఒక్కటే.
ఇంద్ర నందనవనీ ఘోళే | తోచ రాసభ ఉకిరడా లోళే | 
సుఖ పాహాతా ఎకచి తుళే | నాహీ తే వేగళే లవమాత్ర | ||౨౩|| 
23. ఇంద్రుడు నందనవనంలో అనుభవిస్తే, గాడిద పెంట కుప్పలో పొర్లాడి, అదే సుఖాన్ని అనుభవిస్తుంది. అలా, సుఖం ఒక్కటే. కొంచెం కూడా తేడా లేకుండా, సమానంగా ఉంటుంది.
జేథూని పుణ్యక్షయే పతన | కింన్నిమిత్త తదర్థ యత్న | 
త్యాహూన బరవే ఎథీల జనన | మహత్వే గహన భూలోక | ||౨౪|| 
24. సంపాదించుకున్న పుణ్యం కరిగి పోగానే, పడిపోయే స్వర్గం కోసం, ఎందుకు ప్రయత్నించటం? అంతకంటే గొప్పదైన ఈ భూలోకంలో పుట్టడమే మంచిది కదా!
జేథే ఆయుష్య కల్పవరీ | కాయ త్యా బ్రహ్మలోకాచీ థోరీ | 
అల్పాయుష్య హో కా క్షణభరీ | భూలోక పరీ ఆణీక | ||౨౫|| 
25. ఒక కల్పం అంటే, మనుషులకు ౪౩౨ కోట్ల ౨౦ లక్షల సంవత్సరాలు. ఒక కల్పంకంటే ఎక్కువ ఆయువు బ్రహ్మలోకంలో ఉన్నా, దాని గొప్పదనమేమిటి? తక్కువ ఆయువుతో, ఒక్క క్షణం ఉన్నా, ఈ భూలోకంవంటి చోటు ఇంకొకటి లేదు.
క్షణభంగూర ఆయుష్యపణ | కేలే కర్మ ఎక క్షణ | 
కరీ జో సర్వ ఈశ్వరార్పణ | పావే అభయ స్థాన తో | ||౨౬|| 
26. ఇక్కడ ఆయువు క్షణ మాత్రమైనా, ఈశ్వరునికి అర్పించి, ఏ ఒక్క పని క్షణం చేసినా, పడిపోయే భయం లేని చోటు దొరుకుతుంది.
జేథే న భగవద్భక్త జన | కరితీ న హరిగురుకథావర్ణన | 
సంగీత నృత్య భగవత్పూజన | తే కాయ స్థాన కామాచే | ||౨౭|| 
27. ఎక్కడ భగవద్భక్తులు లేరో, ఎక్కడ గురువుల కథా వర్ణన లేదో, హరి కీర్తన, సంగీత నృత్యాలతో దేవుని పూజ లేదో, ఆ చోటు, ఎందుకు పనికి వస్తుంది?
బ్రహ్మాత్మైకత్వ విజ్ఞాన | ఆత్యంతిక నిశ్రేయస సాధన | 
తే తో యా స్వర్గాహూన గహన | భూలోక హే స్థాన తయాచే | ||౨౮|| 
28. బ్రహ్మ, ఆత్మ, ఇవి ఒక్కటే అన్న దానిని, అనుభవంతో తెలుసుకోవటమనేది అన్నింటికంటే, గొప్ప జ్ఞానం. దీనిని పొందటానికి, గొప్ప స్వర్గ లోకంకంటే, ఈ భూలోకమే ఉత్తమం.
కాయావాచామనే కరూన | కరా పంచహీ ప్రాణ సమర్పణ | 
నిశ్చయాత్మక బుద్ధి హీ న లీన | హోవో గుర్వధీన సర్వస్వీ | ||౨౯|| 
29. దేహం, మాట, మనసుతో పాటు, పంచప్రాణాలను గురువుకు అర్పించి, బుద్ధిని కూడా ఆత్మలో లీనం చేసి, అన్ని విధాల గురువు పాదాల అధీనంలో ఉండాలి.
ఎవం సద్గురూస శరణ జాతా | భవభయాచీ కాయసీ వార్తా | 
ప్రపంచాచీ కిమర్థ చింతా | అసతా నివారితా సర్వస్వీ | ||౩౦||
30. ఇలా సద్గురువుకు శరణుజొచ్చితే, సంసారమంటే భయం ఎందుకుంటుంది? అన్ని దుఃఖాలనూ తొలగించే వారుండగా, సంసారంలోని కష్టాల గురించిన చింత ఎందుకు?

అవిద్యేచా జేథే వాస | తేథే పుత్ర పశ్వాది పాశ | 
సంసారచింతా అహర్నిశ | నాహీ లవలేశ సువిచార | ||౩౧|| 
31. ఎక్కడ అజ్ఞానం ఉంటుందో, ఎక్కడ భార్యాబిడ్డలు, పశు పక్షులు మొదలైన మాయా బంధాలుంటాయో, అక్కడ రాత్రింబవళ్ళూ సంసారం గురించిన చింతే ఉంటుంది. అక్కడ మంచి ఆలోచనలు రావటానికి, అసలు అవకాశమే లేదు.
అవిద్యా సర్వా మూళ కారణ | ఉపస్థాపి నానాత్వవిందాన | 
ఆచార్యాగమ సంస్కృత జ్ఞాన | తదర్థ సంపాదన కరావే | ||౩౨|| 
32. వీటన్నిటికీ అజ్ఞానమే మూల కారణం. ఈ అజ్ఞానమే సృష్టి, సృష్టికర్త, వేరు వేరనే భ్రమను కలిగిస్తుంది. అందుకే, శాస్త్రాలనుంచి, ఆచార్యులనుంచి, సంస్కృతంలో ఉన్న వేద జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.
హోతా అవిద్యానివర్తన | ఉరే న అణుమాత్ర నానాత్వ జ్ఞాన | 
చుకే తయాచే జన్మ మరణ | ఎకత్వ విజ్ఞాన యా మూళ | ||౩౩|| 
33. ఒక సారి ఈ అజ్ఞానం తొలగిపోతే, వేరు వేరనే జ్ఞానం కొంచెం కూడా ఉండదు. ‘అంతా ఒక్కటే’ అనే జ్ఞానం కలిగిన వారికి, చావు పుట్టుకలు వదిలి పోతాయి.
ధరీ జో అత్యల్ప భేదదృష్టీ | పడేల జన్మ మరణాచే కష్టీ | 
తయాస వినాశ ఆణి సృష్టీ | లాగలీ పాఠీ సదోదిత | ||౩౪|| 
34. అన్నీ వేరు, వేరన్న ఆలోచన, ఏ కొంచెం ఉన్నవారైనా, చావు పుట్టుకల కష్టాలలో పడతారు. వినాశం మరియు సృష్టి, వారి వెంటే ఉంటాయి.
శ్రేయ హాచి జిచా విషయ | తీచ తీ విద్యా నిఃసంశయ | 
జిచా విషయ కేవళ ప్రేయ | అవిద్యా నామధేయ తియేస | ||౩౫|| 
35. దేని లక్ష్యం, మేలు చేయటమే (శ్రేయ) ఉంటుందో, అదే అసలైన జ్ఞానం. దేని లక్ష్యం, దైహికంగా (ప్రేయ) ఉంటుందో, దానిని అజ్ఞానం అంటారు.
మృత్యూ హేంచ మోఠే భవభయ | తయాపాసూన వ్హావయా నిర్భయ | 
ఘట్ట ధరా గురు చరణద్వయ | దేతీల అద్వయ బుద్ధీతే | ||౩౬|| 
36. సాంసారిక భయాలలో అన్నిటికంటే గొప్పది, చావు భయం. దానినుండి తప్పించుకోవాలంటే, గురువు రెండు పాదాలనూ, గట్టిగా పట్టుకోవటమే. వారు ‘అన్నీ ఒక్కటే (అద్వైతం)’ అనే బుద్ధిని అనుగ్రహిస్తారు.
జేథే ద్వితీయ అభినివేశ | తేథేంచ కీ యా భయాసీ ప్రవేశ | 
మ్హణోని జేథే న భయ లవలేశ | తే నిర్విశేష పద సేవా | ||౩౭|| 
37. అంతా వేరు వేరన్న భావన ఉన్నది అంటే, అక్కడ భయం కూడా ఉంటుంది. ఏ విధమైన భేదభావం లేని, గురువు పాదాల సేవలో ఉన్న వారికి, భయం ఏ మాత్రం కూడా ఉండదు.
శుద్ధప్రేమ మలయాగర | లావా తయాచితయా1 భాళావర2
నేసవా భావార్థ పీతాంబర | దావీల విశ్వంభర నిజభక్తా | ||౩౮|| 
38. నిర్మలమైన ప్రేమ, అనే చందనాన్ని గురువు నొసటన దిద్దండి. భక్తి భావమనే పట్టు వస్త్రాలను, వారికి కట్టండి. అన్ని చోట్లా వ్యాపించి ఉన్న దేవుణ్ణి, వారు తమ భక్తులకు చూపిస్తారు.
దృఢ శ్రద్ధేచే సింహాసన | అష్టభావమండిత పూర్ణ | 
ఆనందాశ్రూజలే స్నపన3 | సద్యః ప్రసన్న ప్రకటేల | ||౩౯|| 
39. చలించని, దృఢమైన నమ్మకం, అనే సింహాసనాన్ని వారికి అర్పించి, ఎనిమిది భావాల కంటి నీటితో, వారికి అభిషేకం చేస్తే, వారు వెంటనే ప్రసన్నులౌతారు.
భక్తి మేఖళా కటీభోంతీ | బాంధోని ఆకళా4 తయాప్రతీ | 
సర్వస్వాచే నింబలోణ ప్రీతీ | కరా మగ ఆరతీ ఓంవాళా | ||౪౦||
40. భక్తి అనే నడుంపట్టీను, వారి నడుముకు చుట్టి, ఉన్నదంతా వారికి అర్పించి, చివరిలో, ప్రేమతో, వారికి ఆరతిని ఇవ్వండి.

కోణ్యాహీ కార్యాచా ప్రవిలయ | హోఈ ధరూని అస్తిత్వాశ్రయ | 
ఖడ్యానే ఘట ఫోడిలా జాయ | నివృత్త హోయ ఆకారచి | ||౪౧|| 
41. ఏ వస్తువు కాని, లేక పని కాని, నశించి పోతే, దాని ఉనికి నశించి పోదు. రాయితో కుండను పగలుగొట్టితే, ఆ కుండ ఆకారం మాత్రమే మారుతుంది.
ఘటాస్తిత్వాంశ లవమాత్రహీ | నాహీ ఏసా హోత నాహీ | 
ఫుటక్యా ఖాపర్యాంచియాహీ ఠాయీ | అనువృత్తీ హోఈ ఘటాచీ | ||౪౨|| 
42. కాని, ఆ కుండ ఉనికికి కారణమైన మట్టి, అసలు లేకుండా పోవటం అనేది జరగదు. విరిగిన కుండ పెంకులతో, ఆ కుండ ఆకారాన్ని మరల పొందవచ్చు.
మ్హణూన కార్యాచే జే ప్రవిలాపన | తే అస్తిత్వనిష్ఠ చిరంతన | 
మ్హణూన కోణాచేహీ దేహావసాన | నవ్హే పర్యవసాన శూన్యత్వీ | ||౪౩|| 
43. కనుక, ఏ వస్తువు నశించి పోయినా, దాని ఉనికియొక్క గుర్తులు మిగిలే ఉంటాయి. అలాగే, ఎవరు చనిపోయినా, ఆ చావు ఫలితం శూన్యం కాదు.
కార్య న కారణావ్యతిరిక్త | ఝాలే వ్యక్త జరీ అవ్యక్త | 
తరీ తే సదైవ సదన్విత | హే తో సుప్రతీత సర్వత్ర | ||౪౪|| 
44. కారణం లేకుండా ఏ పనీ ఉండదు. కనిపించనిది కనిపించినా, అది ఎప్పుడూ నిజంతోనే ముడిపడి ఉంటుంది. అనుభవంతో ఇది అందరికీ తెలిసినదే.
సూక్ష్మతేచియా న్యూనాధిక్యాచీ | పరంపరాహీ దర్శవీ హేంచి | 
 స్థూల కార్య విలయీ సాచీ | సూక్ష్మకారణచి అవశిష్ట | ||౪౫|| 
45. సూక్ష్మత్వంలోని, ఎక్కువ తక్కువలు కూడా, దీనినే తెలుపుతాయి. కంటికి కనిపించే ఏ వస్తువైనా నాశనమైనా, సూక్ష్మమైన దాని కారణం మిగిలే ఉంటుంది.
తయాచా హీ విలయ హోతా | త్యాహూన సూక్ష్మ అవశిష్ట రాహతా | 
సకలేంద్రియ మన బుద్ధి గ్రాహకతా | పావే వికలతా గ్రహణార్థీ | ||౪౬|| 
46. అది కూడా నశించిపోతే, అంతకంటే సూక్ష్మమైనది మిగిలి ఉంటుంది. తరువాత, అన్ని ఇంద్రియాల, మనసు, బుద్ధియొక్క గ్రహించే శక్తి, తగ్గి పోతుంది.
తాత్పర్య బుద్ధి హీ జేథే ఠకే | తేథేంచి మూర్త అమూర్తీ ఠాకే | 
పరీ త్యాచా న సద్భావ ఝాకే | సన్మాత్ర ఝళకే సర్వత్ర | ||౪౭|| 
47. చెప్పేదేమిటంటే, బుద్ధి కూడా అరిగిపోయిన తరువాత, కనిపించేది కనిపించకుండా పోతుంది. అయినా, దాని ఉనికి మాత్రం పోదు. అది ఎప్పుడూ, అన్ని చోట్లా వెలుగుతూనే ఉంటుంది.
బుద్ధి కామాస దేఈ ఆశ్రయ | మ్హణోని హిచా హోతా విలయ | 
తాత్కాళ హోఈ ఆత్మోదయ | పడే అక్షయ పద ఠాయీ | ||౪౮|| 
48. బుద్ధి ఎప్పుడూ కోరికలకు తావిస్తుంది. ఆ బుద్ధే నశించిపోతే, కోరికలూ నశించి, వెంటనే ఆత్మ ఉదయించి, శాశ్వతమైన స్థానం చేరుకుంటుంది.
అవిద్యా మాయా కామ కర్మ | హేచ ముఖ్య మృత్యూచే ధర్మ | 
హోతా యా సర్వాంచా ఉపరమ | హోఈ ఉపశమ బంధాచా | ||౪౯|| 
49. అజ్ఞానం, మాయ, కోరికలు, కర్మ, ఇవే చావుయొక్క ముఖ్య ధర్మాలు. ఇవన్నీ తొలగిపోతే, సాంసారిక బంధనాలు తొలగిపోతాయి.
హోతా సర్వ బంధననాశ | ప్రకటే ఆత్మా అప్రయాస | 
జైసా మేఘ జాణ్యాచా అవకాశ | స్వయంప్రకాశ చమకే రవీ | ||౫౦||
50. ఈ బంధాలన్నీ విడిపోగానే, మబ్బుల అడ్డు తొలగి పోయిన వెంటనే, స్వయంగా వెలిగే సూర్యుడిలా, ప్రయత్నం లేకుండానే ఆత్మ కనిపిస్తుంది.

శరీర మీ, హే మాఝే ధన | యా నాంవ దృఢ దేహాభిమాన | 
హేంచి హృదయగ్రంథి నిబంధన | దుఃఖాధివేశన మాయేచే | ||౫౧|| 
51. ‘ఈ దేహమే నేను, ఈ డబ్బు నాది’, అనే ఆలోచనలను ‘దేహాభిమానం’ అని అంటారు. దీని మూలంగానే, హృదయం బంధించబడి, మాయ కారణంగా అన్ని దుఃఖాలూ కలుగుతాయి.
జరీ హా దేహ ఎకదా నిమాలా | కర్మబీజే దేహాంతర లాధలా | 
తే బీజ నిఃశేష జాళావయాలా | చుకలా కీ ఆలా పునర్జన్మ | ||౫౨|| 
52. ఒక వేళ ఈ దేహం నశించిపోయినా, కర్మల ఫలంగా మరో దేహాన్ని పొందుతారు. ఆ కర్మ ఫలాలను, వేళ్ళతో సహ, కాల్చివేయక పోతే, మళ్ళీ పుట్టుక తప్పదు.
పునశ్చ బీజాంచే వృక్ష హోతీ | వాసనాబీజే జే దేహాంతర ప్రాప్తి | 
ఏసే హే చక్ర అవ్యాహత గతి | వాసనా నిమతీ తోంవరీ | ||౫౩|| 
53. మళ్ళీ అవి పెరిగి పెద్ద మానులౌతాయి. ఇలా, కోరికల విత్తనాల వలన మరో పుట్టుకను కలిగించే ఈ చావు పుట్టుకల చక్రం, ఆ కోరికలు తగ్గిపోనంత వరకూ, ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది.
కామాంచా జై సమూళ వినాశ | తైంచ హృదయగ్రంథినిరాస | 
తైంచ అమర మర్త్య మనుష్య | హాచ ఉపదేశ వేదాంతీ | ||౫౪|| 
54. కోరికలను వేళ్ళతో సహ నశించి వేస్తేనే, హృదయానికి బంధనాలనుంచి విడుదల లభిస్తుంది. అప్పుడే, మనిషి చావుని మించి, అమరుడౌతాడు. వేదాంతం ఉపదేశించేది ఇదే.
ధర్మాధర్మవిహిత స్థితీ | జియే నామ విరజా వదతీ | 
అవిద్యా కామ నిర్మూలన కర్తీ | జేథే న లవ గతి మృత్యూతే | ||౫౫|| 
55. ధర్మాధర్మాలను మించిన స్థితిని ‘విరజా (అంటే కోరికలు లేనిది అని)’ స్థితి అని అంటారు. ఇది అజ్ఞానాన్ని, కోరికలను, వేళ్ళతో సహ నశింప చేస్తుంది. ఇక్కడ చావుకు కూడా ఏ శక్తీ ఉండదు.
వాసనాంచా పరిత్యాగ | తోచ బ్రహ్మానందాచా యోగ | 
నిరాలేఖ్యా త్యా శబ్ద ప్రయోగ | వాచావినియోగ అనిర్వాచ్యా | ||౫౬|| 
56. కోరికలను వదిలి వేసుకోవటమే బ్రహ్మానంద యోగం. ‘నిరాలేఖ్యా’ అంటే దీనికి ఎవరూ అర్థం చెప్పలేక పోయినా, మాటలతో చెప్పాలని ప్రయత్నిస్తారు. ‘అనిర్వాచ్యా’ అంటే, ఈ స్థితి మాటలకు అందనిదైనా, మాటలతోనే చెప్పాలనే ప్రయత్నం.
ఝాలియా పరబ్రహ్మ సంవిత్తి | తీచ సకలానిష్ట నివృత్తి | 
తీచ మనేప్సిత ఇష్టప్రాప్తి | హే శ్రీతిస్మృతి ప్రామాణ్య | ||౫౭|| 
57. బ్రహ్మ జ్ఞానం పొందటమే అన్ని అనిష్టాలనుంచి ముక్తి. అదే మన మనసులోని కోరిక కావాలి, శ్రుతులు, స్మృతులూ కూడా దీనినే చెబుతాయి.
“బ్రహ్మవిదాప్నోతి పరం” | హేంచ బ్రహ్మానందసాధ్య చరమ | 
యాహూన అన్య కాయ పరమ | “తరతి శోకమాత్మవిత్‍” | ||౫౮|| 
58. ‘బ్రహ్మావిదాప్నోతి పరం’ అంటే, బ్రహ్మను తెలుసుకున్న వారికే శాశ్వతమైన స్థానం దొరుకుతుంది అని. బ్రహ్మానందానికి ఇదే చివరి సాధన. ఇంతకంటే గొప్పది ఏముంటుంది? ‘తరతి శోకం ఆత్మ విత్’ అంటే, ఆత్మను తెలుసుకున్న వారు దుఃఖంనుండి తరిస్తారు అని.
సంసారార్ణవ తమోమూళ | పావావయా పరకూల5
బ్రహ్మజ్ఞానచి ఉపాయ నిఖళ | సాధన సకళ ప్రాప్తీచే | ||౫౯|| 
59. అజ్ఞానానికి కారణమైన ఈ సంసార సాగరాన్ని దాటటానికి, బ్రహ్మజ్ఞానమే ఉపాయం. దేనిని పొందాలన్నా, ఇదే అన్నింటికీ సాధనం.
పూర్ణ శ్రద్ధా ఆణి ధీర | హేచి మూర్త ఉమామహేశ్వర | 
మస్తకీ నసతా యత్కృపాకర | దిసే న విశ్వంభర హృదయస్థ | ||౬౦||
60. పూర్తి శ్రద్ధ, మరియు ధైర్యం, ఈ రెండూ పార్వతీ పరమేశ్వరులు. దయతో కూడిన వారి చేయి, మన తలపై లేకపోతే, హృదయంలోని విశ్వంభరుడు కనిపించడు.

వదలే సాఈనాథ గురువర్య | ఉద్గార జ్యాంచే అమోఘవీర్య | 
పాహిజే నిష్ఠేచే అల్ప ధైర్య | మహదైశ్వర్య పావాల | ||౬౧|| 
61. అని సాయినాథ గురువర్యులు అన్నారు. వారి మాటలు అమోఘమైన శక్తిగలవి. శ్రద్ధా, నిష్ఠలతో పాటు, సహనం కూడా ఉంటే, మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు.
అసన్మాత్ర అవఘే దృశ్య | హే తో మానణే యేతే అవశ్య | 
స్వప్నదర్శన ఘ్యా ప్రత్యక్ష | సర్వహీ అదృశ్య ప్రబోధీ | ||౬౨|| 
62. కనిపించే ఈ జగత్తంతా నిజం కానిది. అంటే ఉనికి లేనిది. దీనిని మనం ఒప్పుకోవలసినదే. ఎందుకంటే, కలలో మనకు కనిపించేదంతా, మేలుకోగానే కనిపించకుండా పోతుంది. 
యేథవరీ బుద్ధీచీ ధాంవ | యేథవరీచ ఆత్మ్యాశీ సద్భావ | 
పరీ జేథే న సదసతా ఠావ | తో తత్వభావ తో ఆత్మా | ||౬౩|| 
63. మన బుద్ధి ఇంతవరకే ఆలోచించగలదు. అందుకే, ఆత్మ గురించిన మన జ్ఞానం కూడా ఇంతవరకే. కాని, సత్యం మరియు అసత్యం అనేవి బుద్ధితో తెలుసుకోలేనివి అనే తత్వమే నిజమైన ఆత్మ. 
సదసదాది ప్రత్యయవర్జిత | అలింగ సర్వ విశేషరహిత | 
తేంచ శబ్ద శబ్దాంతర వర్ణిత | తేంచ సర్వగత గురురూప | ||౬౪|| 
64. నిజమో, మాయో అనే గుణాలు లేకుండా, ఆడా మగా తేడా లేకుండా, ఏ ప్రత్యేకమైన గుణాలూ లేనిది, మరియు ఎన్నో రకాలుగా వర్ణించబడి, అంతటా వ్యాపించి ఉన్న ఆత్మయొక్క రూపమే, గురు రూపం. 
ఆత్మా సర్వ విశేష రహిత | జరా జన్మ మరణాతీత | 
హా పురాణ ఆణి శాశ్వత | అపక్షయ వర్జిత సర్వదా | ||౬౫|| 
65. ఈ ఆత్మకు ప్రత్యేకమైన గుణాలు ఏవీ లేవు. ఇది ముసలితనానికి, చావుకు లోబడనిది. ఎప్పటినుంచో శాశ్వతంగా ఉంటూ, నాశం కానిది. 
హా నిత్య అజ పురాతన | సర్వగత జైసే గగన | 
అనాది ఆణి అవిచ్ఛిన్న | వృద్ధి శూన్య అవిక్రియ | ||౬౬|| 
66. మార్పు లేనిదిగా, పుట్టుక లేనిదిగా, ఎప్పటినుంచో ఉన్నదిగా, ఈ ఆత్మ ఆకాశం వలె అన్ని చోట్లా వ్యాపించి ఉంటుంది. ఆత్మ ముక్కలుగా చేయలేనిది. దీనికి మొదలు, చివర లేదు. ఎప్పటికీ మారకుండా ఒకే రకంగా ఉంటుంది. 
జే అశబ్ద ఆణి అరూప | అనాది అనంత ఆణి అమూప | 
అవ్యయ అగంధ అరస అలేప | కవణాతే స్వరూప వర్ణవేల | ||౬౭|| 
67. రూపం లేనిది, మొదలు, చివర లేనిది, కొలవటానికి వీలు కానిది, ఎన్నటికీ తరగనిది, వాసన, రుచి లేనిది అయిన ఈ ఆత్మ రూపాన్ని ఎవరు వర్ణించగలరు? 
పరీ దిసేనా ఏసియా నిర్గుణా | నేణతపణే జరీ నేణా | 
జ్ఞానే దవడా హా అజ్ఞానపణా | కధీంహీ న మ్హణా శూన్య తయా | ||౬౮|| 
68. కళ్ళకు కనిపించని, ఇలాంటి గుణాలు లేని, ఆత్మను అజ్ఞానంతో తెలుసుకోలేము. ఈ అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగించాలి. అంతే కాని, ఆత్మ లేదు అని ఎప్పటికీ అనకూడదు. 
కాయ తీ పరమహంస స్థితీ | శ్రీసాఈచీ నిజ సంపత్తీ | 
కాళే చోరిలీ హాతోహాతీ | దిసేల మాగుతీ తీ కాయ | ||౬౯|| 
69. శ్రీసాయియొక్క పరమహంస స్థితి, వారి అద్భుతమైన పారమార్థిక సంపత్తి, ఎంత గొప్పవి! కాలం దోచుకొని పోయిన ఆ సంపత్తిని, మనం మరల చూడగలమా? 
ధనసుతదారాసక్త భక్త | రాహూ ద్యా కీ యాంచీ మాత | 
దర్శనా యేత యోగీ విరక్త | రాహత ఆసక్త పదకమలీ | ||౭౦||
70. భార్యాబిడ్డలు, డబ్బు, వీటి మోహంలో చిక్కుకున్న సాధారణ భక్తులే కాక, యోగులు, విరాగులు కూడా వారి దర్శనానికి వచ్చి, వారి పాద కమలాల మీద భక్తి కలిగి, అక్కడే ఉండి పోతారు. 

కామ కర్మ బంధ విముక్త | సర్వైషణా వినిర్ముక్త | 
దేహ గేహాదికీ విరక్త | జగీ భక్త తో ధన్య | ||౭౧|| 
71. కోరికలనుండి, కర్మబంధాలనుండి, డబ్బు భార్య కొడుకుల (ఈషణత్రయాలు) మీద గల వ్యామోహంనుండి, ముక్తి చెందినవారు, దేహం, సంసారం మొదలైన వానినుంచి బయటపడిన భక్తులు, ఈ జగత్తులో ధన్యులు. 
సాఈ జయాచా దృష్టి విషయ | తయా వస్త్వంతర దిసేల కాయ | 
దృశ్యమాత్రీ సాఈ శివాయ | రికామా ఠాయ దిసేనా | ||౭౨|| 
72. కళ్ళకు కనిపించేది అంతా సాయియే అని అనుకునే వారికి, వేరే వస్తువు కనిపిస్తుందా? ఎక్కడ చూసినా సాయియే తప్ప, ఖాళీ చోటు కనిపించదు. 
వదనీ శ్రీసాఈచే నామ | హృదయీ శ్రీసాఈచే ప్రేమ | 
తయా నిత్య ఆరామ క్షేమ | రక్షీ స్వయమేవ సాఈ త్యా | ||౭౩|| 
73. సాయి పేరు ఎప్పుడూ చెప్పేవారి, మనసులో సాయి మీద ప్రేమ ఉన్నవారి, యోగక్షేమాలను సాయియే స్వయంగా చూస్తారు. 
శ్రవణాచీహీ తీచ గత | శబ్ద నాహీ సాఈవ్యతిరిక్త | 
ఘ్రాణీ సాఈ పరిమళ భరత | రసనా పఘళత సాఈరసే | ||౭౪|| 
74. అలాగే చెవులతో వినటం కూడా. ఎప్పుడూ సాయి అనే శబ్దం తప్ప వేరే దేనినీ వినకుండా, ముక్కుతో సాయి సువాసనను పీల్చుతూ, నాలుకతో ఎప్పుడూ సాయి అనే మధుర రసాన్ని చవి చూస్తూ ఉండాలి. 
సుఖాచే జే సోలీవ సుఖ | కాయ సాఈచే సుహాస్య ముఖ | 
ధన్య భాగ్యాచా తో దేఖ | జేణే తే శబ్ద పీయుఖ సేవిలే | ||౭౫|| 
75. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఆ ముఖం, సుఖాలలోకెల్లా ఎంతో మంచిదైన సుఖాన్ని ఇస్తుంది. అమృతంలాంటి సాయి మాటలను విన్నవారే ధన్యులు. 
కల్యాణాచే నిధాన | సుఖ శాంతీచే జన్మస్థాన | 
సదసద్వివేక వైరాగ్యవాన | సదా సావధాన అంతరీ | ||౭౬|| 
76. అన్ని శుభాలకూ తావై, అన్ని సుఖ శాంతులకు పుట్టిల్లు అయి, నిజానిజాల తేడా తెలిసిన వివేకంతోను, వైరాగ్యంతోను, సాయి ఎప్పుడూ మనసులో జాగరూకులై ఉంటారు. 
గోరసేంసీ వత్స ధాలే | తరీ న మాయేపాసూన హాలే | 
తైసే మన హే పాహిజే బాంధిలే | దావణీ దావిలే గురుపాయీ | ||౭౭|| 
77. పాలు తాగుతూ, కడుపు నిండినా, దూడ తల్లి ఆవు దగ్గరనుండి కదలదు. అందుకే దూడను తల్లినుండి దూరంగా కట్టివేసినట్లు, మనసును కోరికలనుండి దూరం లాగి, గురువు పాదాలకు కట్టి పడేయాలి. 
వ్హావయా గురుకృపానురాగా | వందా తత్పద కమలపరాగా | 
కేలియా హితబోధా జాగా | అనుభవ ఘ్యాగా పదోపదీ | ||౭౮|| 
78. గురువు అనుగ్రహాన్ని పొందటానికి, వారి పాద కమలాలకు నమస్కారం చేయండి. వారు చెప్పిన మంచి మాటలను చక్కగా తెలుసుకుని, ప్రతి క్షణమూ గొప్ప అనుభవాలను పొందండి. 
యథేచ్ఛ రమతా ఇంద్రియార్థీ | అంతరీ ఠేవా సాఈ ప్రీతీ | 
తోచి కామా యేఈల అంతీ | స్వార్థీ పరమార్థీ ఉభయత్ర | ||౭౯|| 
79. ఇంద్రియాల సుఖాలను అనుభవిస్తూ, తృప్తి చెందుతున్నా, మనసులో సాయి మీద ప్రేమ కలిగి ఉండండి. అదే చివరకు స్వార్థానికి, పరమార్థానికి రెంటికీ పనికి వస్తుంది. 
మంత్రసిద్ధ మాంత్రిక అంజన | దావీ పాయాళూస భూమిగత ధన | 
తైసేచ గురుపదరజ ధూసర నయన | జ్ఞాన విజ్ఞాన పావతీ | ||౮౦||
80. మంత్రసిద్ధిగల మాంత్రికుడు, అంజనం వేసుకుని, భూమిలో దాగివున్న నిధిని చూపించినట్లే, గురు పాదాల ధూళితో నిండిన కళ్ళు, జ్ఞాన విజ్ఞానాలను తెలుసుకుంటాయి. 

సిద్ధాంచీ జీ జీ లక్షణే | సాధకాంచీ తీ తీంచ సాధనే | 
సాధ్య కరాయా దీర్ఘప్రయత్నే | అభ్యాస సూజ్ఞే కరావా | ||౮౧|| 
81. సిద్ధ పురుషులకు ఏయే లక్షణాలు ఉన్నాయో, అవన్నీ సాధకులకు సాధనాలు. వానిని పొందటానికి తెలివిగా, గట్టి ప్రయత్నంతో, అభ్యాసం చేయాలి.
దుగ్ధాపోటీ ఆహే ఘృత | పరీ న కరితా తే ఆమ్లయుత | 
నాహీ తక్ర నా నవనీత | తేంహీ అపేక్షిత సంస్కారా | ||౮౨|| 
82. పాలలో నేయి ఉంటుంది. కాని, పాలను కాచి, పెరుగు వేసి, తోడు పెట్టకపోతే, మజ్జిగ కాని, వెన్నగాని రాదు. అది కూడా సరియైన పద్ధతిలో చేస్తేనే, అప్పుడు వెన్న వస్తుంది. 
తక్ర ఘుసల్యా విరహిత | ప్రాప్త హోఈనా నవనీత | 
తేంహీ న కరితా అగ్నిసంయుక్త | స్వాదిష్ట ఘృత లాభేనా | ||౮౩|| 
83. మజ్జిగను చిలకకుండా, వెన్న దొరకదు. వెన్నను మంటపై కాచక పోతే, రుచికరమైన నేయి దొరకదు. 
పాహిజే సంస్కార బలవత్తతా | పూర్వాభ్యాసే బుద్ధిమత్తా | 
అభ్యాసావీణ న చిత్త శుద్ధతా | తిజవీణ దుర్గమతా జ్ఞానాస | ||౮౪|| 
84. బలమైన అభ్యాసం లేకుంటే, మనసు పరిశుద్ధం కాదు. అది పరిశుద్ధం కాకపోతే, జ్ఞానం పొందటం చాలా కష్టం. అది కూడా, పుట్టుకతో అలవాటు చేసిన ధార్మిక ప్రభావం వలన, మరియు బుద్ధి కుశలత, సంస్కారం వలన ఇది సాధ్యమౌతుంది. 
వ్హావీ నిర్మళ చిత్తవృత్తీ | తరీచ హోఈల ఆత్మప్రాప్తీ | 
హాతా నయే జో తీ స్వరూప స్థితి | భగవద్భక్తి సోడూ నయే | ||౮౫|| 
85. మనసు పరిశుద్ధంగా ఉంటేనే, ఆత్మ అనుభవమౌతుంది. కనుక, ఆత్మ జ్ఞానం కలిగేంత వరకూ, దేవుని మీద భక్తిని విడిచి పెట్టరాదు. 
లాగే భగవద్భక్తీచా పాయా | మందిర ఆత్మజ్ఞానాచే ఉఠాయా | 
చారీ ముక్తీచే కళస ఝళకాయా | ధ్వజా ఫడకాయా విరక్తీచీ | ||౮౬|| 
86. ఆత్మజ్ఞానం అనే గొప్ప గుడి కట్టడానికి, ఆ గుడి మీద వైరాగ్యమనే పతాకం ఎగరటానికి, మరియు నాలుగు రకాల ముక్తి అనే కలశాలు నిలపటానికి, దేవుని మీద భక్తి అనే పునాది చాలా అవసరం. 
రాత్రందిన కర్దమీ లోళతీ | శ్వాన సూకరే విష్ఠా భక్షితీ | 
విషయభోగ తీంహీ భోగితీ | తీచ కా మహతీ నరదేహీ | ||౮౭|| 
87. కుక్కలు, పందులు కూడా రాత్రింబవళ్ళూ బురదలో పొర్లుతూ, మలాన్ని తింటూ, ఇంద్రియ సుఖాలను అనుభవిస్తాయి. మనిషి దేహానికీ అవే ఉంటే, అందులో గొప్పతనమేముంది? 
హోయ జేణే చిత్త శుద్ధి | జేణే అఖండ బ్రహ్మసిద్ధి | 
తే స్వధర్మాచరణ ఆధీ | తప హే సాధీ నరదేహే | ||౮౮|| 
88. మనసును పరిశుద్ధం చేసి, మన ధర్మాన్ని ఆచరించడమనే తపస్సును చేస్తే, దొరికే బ్రహ్మ సిద్ధిని, ఈ దేహంతోనే సాధించాలి. 
సాధుసేవా ముక్తీచే ఘర | స్త్రైణసంగ నరకద్వార | 
హే పూజ్య వృద్ధజనోద్గార | విచారార్హ సర్వథా | ||౮౯|| 
89. సాధువుల, సత్పురుషుల సేవ చేస్తే, ముక్తి దొరకుతుంది. విపరీతమైన ఆడవారి సహవాసం నరకానికి దారి తీస్తుందని, పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. 
సదా సదాచార సంపన్న | దేహ నిర్వాహాపురతే అన్న | 
గృహదారాది స్పృహాశూన్య | ఏసా జో ధన్య తో సాధూ | ||౯౦||
90. ఎప్పుడూ సరియైన ఆచారంతో, దేహాన్ని పోషించటానికే అన్నం తింటూ, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మొదలైన వాటి మీద ఏ మాత్రం ధ్యానం లేని సాధువులు ధన్యులు. 

జే జే అనిమేష చింతితీ సాఈ | ప్రచీతీచీ పహా నవలాఈ | 
స్వయే సాఈ తయాంస ధ్యాఈ | హోఊన ఉతరాఈ తయాంచా | ||౯౧|| 
91. ఎప్పుడూ సాయినే మనసులో తలచుకుంటూ ఉండే వారి అనుభవాలను గమనిస్తే, అలాంటి వారినే సాయి కూడా తలచుకుంటూ, ఋణపడి ఉంటారు. 
ధన్య నామస్మరణ మహతీ | గురూహీ భక్తస్మరణ కరితీ | 
ధ్యాతా ప్రవేశే ధ్యేయస్థితి | పూర్ణ విస్మృతి పరస్పరా | ||౯౨|| 
92. పేరును తలుచుకోవడంలో ఉండే గొప్పతనం ధన్యం. గురువు కూడా, భక్తులను తలచుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు, దేని గురించి ధ్యానిస్తున్నారో, దానితో ఒకటై, తమ మొదటి స్థితిని పూర్తిగా మరచి పోతారు. 
“తుమ్హీ జాణా తుమచీ కరణీ | మజ తో అహర్నిశ తుమచీ ఘోకణీ” | 
ఏశీ బాబాంచీ ప్రేమళ వాణీ | అసేల స్మరణీ బహుతాంచ్యా | ||౯౩|| 
93. “మీరు చేసే పనులు, మీకే బాగా తెలుసు. కాని, నాకు మాత్రం రాత్రింబవళ్ళూ మీ చింతే” అని చెప్పిన బాబాయొక్క ప్రేమతో నిండిన మాటలు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. 
నలగే ఆమ్హా జ్ఞానకథా | పురే హా ఎక సాఈచా గాథా | 
కితీహీ పాపే అసోత మాథా | సంకటీ త్రాతా హా ఆమ్హా | ||౯౪|| 
94. బుద్ధి చెప్పే కథలు మనకు అవసరం లేదు. సాయియొక్క ఈ చరిత్ర చాలు. మన నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నా, ఇది మనలను కష్టాలనుండి రక్షిస్తుంది. 
జరీ న కరవతీ పారాయణే | తరీ యాంతీల గురుభక్తి ప్రకరణే | 
శ్రోతా కీజే హృదయాభరణే | నిత్య శ్రవణే నేమానే | ||౯౫|| 
95. దీనిని రోజూ పారాయణ చేయలేక పోతే, ఇందులోని గురుభక్తి గురించిన అధ్యాయాలను నియమంగా చదివి, వానిని మనసుకు గొప్ప ఆభరణాలుగా చేసుకోండి. 
దివసాచ్యా కోణత్యాహీ ప్రహరీ | వాచీల నిత్య హే చరిత్ర జరీ | 
నిజ గురురాజ సహ శ్రీహరీ | భేటేల నిర్ధారీ భావికా | ||౯౬|| 
96. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలోనైనా, ఈ చరిత్రను చదివే భక్తులకు, గురువుతో సహా శ్రీహరి తప్పక కనిపిస్తాడు. 
అఖండ లక్ష్మీ నాందేల ఘరీ | వాచితీల జే నిరంతరీ | 
నిదాన జో ఎక సప్తాహ కరీ | దరిద్ర దూరీ తయాచే | ||౯౭|| 
97. ఈ గ్రంథాన్ని ఎప్పుడూ చదివే వారి ఇంటిలో, లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది. ఓర్పుతో ఒక వారం పారాయణ చేస్తే, వారి దారిద్ర్యం తొలగి పోతుంది. 
హే మీ వదతో ఏసే న మ్హణా | తేణే సంశయ ఘేరీల మనా | 
సాఈచ వదవీ మాఝియే వదనా | క్లిష్ట కల్పనా సోడావీ | ||౯౮|| 
98. ఇది నేను చెబుతున్నానని అనుకోకండి. అలా అనుకుంటే, మనసులో ఎన్నో అనుమానాలు పుట్టుకొస్తాయి. సాయియే నా నోటితో చెప్పిస్తూ ఉన్నారు, కనుక, అనవసరమైన ఆలోచనలను విడిచి పెట్టండి. 
తో హా సకళ గుణ ఖాణీ | సాఈ నిజభక్త కైవల్యదానీ | 
కథా జయాచీ కలిమల హరణీ | శ్రోతా శ్రవణీ పరిసిజే | ||౯౯|| 
99. అన్ని గుణాలకు తావైన ఈ సాయి, తమ భక్తులకు మోక్షాన్ని ఇస్తారు. కలియుగంలోని పాపాలను తొలగించే వారి కథలను, శ్రోతలు, శ్రద్ధగా వినండి. 
ఏసియా సంత కథాంపుఢే | స్వర్గ సౌఖ్య తే కాయ బాపుడే | 
కోణ ఢుంకూన పాహీల తికడే | టాకూన రోకడే సత్కథన | ||౧౦౦||
100. ఇలాంటి సత్పురుషుల చరిత్ర ముందు, స్వర్గ సుఖం ఏ పాటిది? వెంటనే ఫలితాన్నిచ్చే, ఈ సచ్చరితను వదిలి, స్వర్గం వైపు ఎవరైనా చూస్తారా? 

సుఖ దుఃఖ హే తో చిత్తవికార | సత్సంగ సర్వదా నిర్వికార | 
కరీ చిత్త చైతన్యాకార | సుఖదుఃఖా థార దేఈనా | ||౧౦౧|| 
101. సుఖం, దుఃఖం అనేవి మనసుకు కలిగే మార్పులు. సత్సంగంలో ఇలాంటి మార్పులు ఏవీ ఉండవు. దానివలన, సత్సంగాలు ఎప్పుడూ మనసును చైతన్యంలో లీనం చేసి, సుఖదుఃఖాలకు చోటు లేకుండా చేస్తాయి.
జే సుఖ విరక్తా ఎకాంతీ | కీ జే భక్తా కరితా భక్తి | 
అసో ఇంద్ర కీ చక్రవర్తీ | న మిళే కల్పాంతీ తయాంనా | ||౧౦౨|| 
102. వైరాగ్యం పొందిన వానికి ఒక్కడే ఉండటంలో దొరికే సుఖం, భక్తునికి భక్తి ద్వారా లభించే సుఖం, ఇంద్రునికైనా, ఏ చక్రవర్తికైనా, కాలం ముగిసేంత వరకూ కూడా దొరకదు. 
ప్రారబ్ధభోగ బలవత్తర | బుద్ధి ఉపజే కర్మానుసార | 
ఉపజో పరీ హే నేమనేమాంతర | భక్త తత్పర టాళీల | ||౧౦౩|| 
103. వెనుకటి జన్మలనుంచి సంపాదించుకున్న ప్రారబ్ధ కర్మల ఫలం చాలా బలవత్తరమైనది. మనిషి బుద్ధి ఈ కర్మాలను బట్టీ పనిచేస్తుంది. మునుపే నిర్ణయించబడిన ఇలాంటి కర్మ ఫలాలను కూడా, భక్తుడు తప్పించుకోగలడు. 
కరా కీ భగీరథ ఉద్యోగ | చుకేనా ప్రారబ్ధకర్మభోగ | 
అవశ్య భావిత్వాచా యోగ | తయాచా వియోగ అశక్య | ||౧౦౪|| 
104. ఎంత భగీరథ ప్రయత్నం చేసినా, ప్రారబ్ధ కర్మల ఫలాలను అనుభవించక తప్పదు. జరగాల్సింది తప్పక జరుగుతుంది. దానినుండి తప్పించుకోవటం అసాధ్యం. 
జైసే యే దుఃఖ అవాంఛిత | సుఖహీ తైసేంచ అకల్పిత | 
దేహప్రారబ్ధాచీ హీ గత | ఆధీంచ అవగత సంతాంస | ||౧౦౫|| 
105. వద్దనుకున్నా వచ్చే దుఃఖాల లాగే, సుఖాలు కూడా అనుకోకుండా వస్తాయి. ఈ ప్రారబ్ధ కర్మల ఫలాల గురించి, సత్పురుషులకు ముందే తెలిసి ఉంటుంది. 
అఖండ తన్నామావర్తన | హేంచి ఆమ్హా వ్రత తప దాన | 
వేళోవేళీ శిరడీ ప్రయాణ | హేంచి తీర్థాటణ ఆముచే | ||౧౦౬|| 
106. ఆపకుండా చేసే సాయినామ సంకీర్తనే మన తపస్సు, వ్రతం, దానం మరియు ధర్మం. తరచూ శిరిడీ వెళ్ళిరావడమే మన తీర్థయాత్రా పర్యటన. 
సాఈ సాఈతి నామస్మరణ | యాచ మంత్రాచే అనుష్ఠాన | 
హేంచ ధ్యాన హేంచ పురశ్చరణ | అనన్య శరణ యా జావే | ||౧౦౭|| 
107. ఒకే మనసుతో సాయికి శరణుజొచ్చి, ‘సాయి, సాయి’ అని వారి పేరును ఎప్పుడూ తలచుకోవటమే, మనము జపించే మంత్రం, అదే మన ధ్యానం, అదే మన పురశ్చరణ. 
నిష్కపట ప్రేమానుసంధాన | ఇతుకేంచ ఖరే తయాచే పూజన | 
మగ అంతరీ ఘ్యా అనుభవూన | అతర్క్య విందాన తయాచే | ||౧౦౮|| 
108. వారి మీద మోసం లేని ప్రేమను కలిగి ఉండటమే, వారి అసలైన పూజ. తరువాత, వారి అమోఘమైన లీలల అనుభవాలను మనసులోనే పొందండి. 
పురే ఆతా హే గుర్హాళ | ఆమ్హా పాహిజే సత్వర గూళ | 
పూర్వ సూచిత కథా రసాళ | శ్రవణార్థ సకళ ఉత్సుక | ||౧౦౯|| 
109. ఇక ఈ బెల్లపు తయారీ చాలు. మనకు వెంటనే బెల్లం కావాలి. మునుపు చెప్పిన రసభరితమైన కథను వినటానికి, అందరూ ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. 
ఏసా శ్రోతృవృందాంచా భావ | జాణూని సూచిత కథా నవలావ | 
ఆవరిలా హా గ్రంథ గౌరవ | అవధానసౌష్ఠవ రాఖాయా | ||౧౧౦||
110. శ్రోతల ఈ శ్రద్ధను గమనించే, చెప్పిన కథను వినటంలో వారి మనసు నిలకడతో ఉండాలని, ఈ గ్రంథాన్ని కుదించాను. 

కావ్య పదబంధ వ్యుత్పత్తీ | నేణే మీ పామర మందమతీ | 
కరధృత లేఖణీ ధరోని హాతీ | సాఈచ లిహవితీ తే లిహితో | ||౧౧౧|| 
111. చదువు రాత రాని, తెలివి లేని వాణ్ణైన నాకు, గ్రంథాన్ని ఎలా వ్రాయాలో తెలియదు. కలం పట్టుకుని ఉన్న నా చేతిని పట్టుకుని, స్వయంగా సాయియే వ్రాయిస్తుంటే, నేను వ్రాస్తున్నాను, అంతే. 
సాఈ నసతా బుద్ధిదాతా | తరీ మీ కోణ చరిత్ర లిహితా | 
త్యాచీ కథా తోచి వదవితా | ఆణీక లిహివితాహీ తోచ | ||౧౧౨|| 
112. సాయి నాకు బుద్ధిని ఇవ్వకుండా ఉంటే, నేనీ చరిత్రను ఎలా వ్రాయగలను? వారి కథలను వారే చెప్పిస్తారు. వ్రాయించేది కూడా వారే. 
అసో ఆతా కథానుసంధాన | చావడీ హండీ ప్రసాద కథన | 
కరూ మ్హణూన దిధలే ఆశ్వాసన | కథా నిరూపణ తే పరిసా | ||౧౧౩|| 
113. ఇప్పుడు కథను ముందుకు సాగిద్దాం. చావడి ఊరేగింపు మరియు బాబా వంట పాత్ర, మరియు ప్రసాదాన్ని పంచటం గురించి, చెబుతానని మాట ఇచ్చాను. ఆ కథలను జాగ్రత్తగా వినండి. 
ఆణీకహీ తదంగభూత | అథవా దుజియా కథా జ్యా స్మరత | 
త్యా త్యా సాంగూ శ్రోతయాంప్రత | త్యా సావచిత్త పరిసావ్యా | ||౧౧౪|| 
114. ఆ కథలే కాక, వానికి సంబంధించినవి కాని, లేదా గుర్తుకు వచ్చిన వేరే కథలను కూడా చెబుతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. 
ధన్య సాఈ కథాంచా నవలావ | ధన్య ధన్య శ్రవణ ప్రభావ | 
మననే ప్రకటే నిజస్వభావ | థోరావే సద్భావ సాఈపదీ | ||౧౧౫|| 
115. ధన్యం సాయి కథలలోని అద్భుతం. వానిని విని కలిగే ప్రభావం ధన్యం. వానిని ఎప్పుడూ తలచుకుంటూ ఉంటే, అసలైన మన మంచి స్వభావం బయటకు రావటంతో, సాయి పాదాల మీద మంచి భక్తి కలుగుతుంది. 
ఆతా ఆధీ చావడీ వర్ణన | సమారంభాచే కరూ దిగ్దర్శన | 
బాబా కరీత ఎకాంతరా6 శయన | చావడీ లాగూన నియమానే | ||౧౧౬|| 
116. ఇప్పుడు చావడి గురించి మొదలు వర్ణిస్తాను. తరువాత, జరిగే ఉత్సవం గురించి చెబుతాను. రోజు విడిచి రోజు, నియమంగా, బాబా చావడిలో పడుకునే వారు. 
ఎక రాత్ర మశీదీంత | దుజీ క్రమీత చావడీప్రత | 
ఏసా హా క్రమ బాబాంచా సతత | సమాధీ పర్యంత చాలలా | ||౧౧౭|| 
117. ఒక రాత్రి మసీదులో, రెండవ రాత్రి చావడిలో గడిపే వారు. ఇలా ఈ పద్ధతిని వారు సమాధి చెందేవరకు కొనసాగించారు. 
పుఢే ఎకూణీసశే నఊ సన | దహా డిసేంబర తైం పాసూన | 
చావడీమాజీ సాఈచే అర్చన | భజన పూజన హో లాగే | ||౧౧౮|| 
118. తరువాత, క్రి. శ. ౧౯౦౯ సంవత్సరం డిసెంబరు పదవ తారీఖునుండి, బాబాకు చావడిలో పూజార్చనలు, భజనలు మొదలయ్యాయి. 
తో చావడీచా సమారంభ | యథామతి కరూ ఆరంభ | 
కరీల సాఈ కృపాసంరంభ7 | తడీస విశ్వంభర నేఈల | ||౧౧౯|| 
119. ఆ చావడి ఉత్సవాన్నే ఇప్పుడు, నా శక్తి కొలది, ఉన్నది ఉన్నట్లుగా, చెబుతాను. సాయి దయ అనే ఉత్సాహంతో, దీనిని పూర్తిగా చూద్దాం. 
చావడీచీ యేత రాత | భజన మండళీ మశీదీ యేత | 
భజన దోన ప్రహరపర్యంత | మండపాంత చాలతసే | ||౧౨౦||
120. బాబా చావడికి వెళ్ళే రోజు, మధ్యాహ్నం రెండవ ఝాముకే, భజన మండలి వారు మసీదుకు వచ్చి, సభామండపంలో భజన చేసేవారు. 

మాగే రథ శోభాయమాన | దక్షిణాంగీ తులసీ వృందావన | 
సన్ముఖ బాబా స్థానాపన్న | మధ్యే భక్తజన భజనార్థీ | ||౧౨౧|| 
121. వెనుక వైపు అందంగా అలంకరించబడిన రథం, దాని కుడి వైపు తులసీ బృందావనం, దాని ఎదుట బాబా కూర్చునే వారు. మధ్యలో భజన మండలిలోని భక్తులు కూర్చునేవారు.
హరిభజనీ జయా ఆదర | ఏసే భక్త నారీ నర | 
సభామండపీ యేఊని సత్వర | భజనతత్పర ఠాకతీ | ||౧౨౨|| 
122. హరి భజన అంటే ఇష్టమున్న ఆడా మగా భక్తులు, తొందర తొందరగా సభామండపంలోకి వచ్చి, భజనకు హాజరయేవారు. 
కోణీ కరీ ఘేఊని టాళ | కోణీ చిపళియా కరతాళ | 
కోణీ మృదంగ ఖంజిరీ ఘోళ | భజన కల్లోళ మాండీత | ||౧౨౩|| 
123. ఒకరు తాళాలు, ఇంకొకరు చిరుతలు, వేరొకరు మృదంగం, మరి ఇంకొకరు ఖంజరీను మ్రోగిస్తూ, గట్టిగా భజన చేసేవారు. 
సాఈ సమర్థ చుంబక మణీ | నిజ సత్తేచియా ఆకర్షణీ | 
జడలోహ భక్తా లావూని ఓఢణీ | నకళత చరణీ ఓఢీంత | ||౧౨౪|| 
124. సూదంటు రాయిలాంటి సాయి సమర్థులు, తమ సహజమైన ఆకర్షణ శక్తితో, ఇనుమువంటి భక్తులను, వారికి తెలియకుండానే, తమ పాదాల దగ్గరకు లాక్కుని వచ్చేవారు. 
హలకారే దివట్యా పాజళతీ అంగణీ | తేథేంచ పాలఖీ శృంగారితీ కోణీ | 
ద్వారీ సజ్జ వేత్రపాణీ | కరీత లలకారణీ జయఘోష | ||౧౨౫|| 
125. దివిటీలు పట్టుకునే వారు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. అక్కడే, ఇంకొకరు పల్లకిని అలంకరించేవారు. వాకిలి దగ్గర, చక్కగా ముస్తాబైన దండధారులు, గట్టిగా జయజయకారాలు చేసేవారు. 
చవ్హాట్యావరీ మఖరే తోరణే | వరీ అంబరీ ఝళకతీ నిశాణే | 
నూతన వస్త్రే దివ్యాభరణే | బాలకే భూషణీ శృంగారిలీ | ||౧౨౬|| 
126. నాలుగు దారులు కలిసే కూడలిలో, మకర తోరణాలు కట్టేవారు. జెండాలు ఆకాశంవైపు ఎగురుతుండేవి. చిన్న పిల్లలు కొత్త బట్టలను కట్టుకుని, ఆభరణాలను అలంకరించుకునే వారు. 
మశీదీచియా పరిసరీ | ఉజళత దీపాంచ్యా బహు హారీ | 
వారూ శ్యామకర్ణ అంగణ ద్వారీ | పూర్ణ శృంగారీ విరాజత | ||౧౨౭|| 
127. మసీదు చుట్టు ప్రక్కల ఉండే స్థలంలో, అనేకమైన వెలుగుతున్న దీపాల వరుసలుండేవి. వాకిలి దగ్గర, బాబా గుర్రం శ్యామకర్ణ చక్కగా అలంకరింపబడి ఉండేది. 
ఇతక్యాంత తాత్యా పాటీల యేత | ఘేఊనియా మండళీ సమవేత | 
బాబాపాశీ యేఊని బైసత | నిఘాయా ఉద్యత బాబాంసవే | ||౧౨౮|| 
128. ఇంతలో తాత్యా పాటీలు భక్తులతో వచ్చి, బాబా దగ్గర కూర్చుని, బాబాతో బయలుదేరటానికి సిద్ధంగా ఉండేవాడు. 
బాబా జరీ తయార అసత | తాత్యా పాటీల యేఈపర్యంత | 
జాగచే జాగీ బైసూని రాహత | వాట పాహత తాత్యాంచీ | ||౧౨౯|| 
129. బాబా సిద్ధంగా ఉన్నా, తాత్యా పాటీలు వచ్చే వరకు, అతని కోసం ఎదురు చూస్తూ, తామున్న చోటులోనే కూర్చుని ఉండేవారు. 
జేవ్హా కాఖేంత ఘాలూని హాత | తాత్యా పాటీల బాబాంస ఉఠవీత | 
తేవ్హాంచ బాబా నిఘాయా సజత | చావడీప్రత తేథునీ | ||౧౩౦||
130. వారి చంక కింద చేతితో పట్టుకుని తాత్యా పాటీలు లేపితేనే, బాబా లేచి, చావడికి బయలుదేరే వారు. 

తాత్యా బాబాంస మ్హణత మామా | ఏసా పరస్పర తయాంచా ప్రేమా | 
ఏశా తయాంచ్యా ఆప్త ధర్మా | నాహీ ఉపమా ద్యావయా | ||౧౩౧|| 
131. బాబాను తాత్యా ‘మామా’ అని పిలిచేవాడు. వారిరువురి మధ్య అంతటి ప్రేమ ఉండేది. ఇలాంటి వారి ప్రేమతో కూడుకున్న సంబంధాన్ని, వేరే దేనితోనూ పోల్చలేం. 
అంగాంత నిత్యాచీ కఫనీ | సటకా అపులా బగలేస మారునీ | 
తమాఖూ ఆణి చిలీమ ఘేఉనీ | ఫడకా టాకుని స్కంధావర | ||౧౩౨|| 
132. ఎప్పుడూ వేసుకునే కఫనీతో, చంకలో సటకా పట్టుకుని, పొగాకును, చిలుం గొట్టాన్ని తీసుకుని, భుజం మీద రుమాలును వేసుకుని, బాబా సిద్ధంగా ఉండేవారు. 
బాబా జంవ ఏసే తయార | ఘాలితీ తాత్యా అంగావర | 
జరీకాఠీ శేలా సుందర | కరితీ శిరావర సారిఖా | ||౧౩౩|| 
133. బాబా ఇలా సిద్ధంగా ఉన్నప్పుడు, అందమైన జరీ అంచు శాలువాను, తలపై కూడా ఉండేలా, చక్కగా తాత్యా కప్పేవాడు. 
బాబా మగ పాఠీల భింతీ తళీ | అసే పడలీ సర్పణాచీ మోళీ | 
తదగ్రీ దక్షిణ పాదాంగుళీ | హాలవీత తే స్థళీ క్షణభర | ||౧౩౪|| 
134. ఆ తరువాత, గోడ కింద వెనుక ఉన్న కర్రల, ముందు భాగాన్ని, తమ కుడికాలి బొటన వ్రేలితో బాబా ఒక క్షణం కదిపే వారు. 
లగేచ తేథీల జళతీ జోత | స్వయే మారుని దక్షిణ హాత | 
ఆధీ సాఈ బుఝావీత | మాగూన నిఘత చావడీతే | ||౧౩౫|| 
135. అలాగే, అక్కడ వెలుగుతున్న దీపాన్ని, స్వయంగా కుడి చేత్తో ఆర్పి వేసిన తరువాత, చావడికి బయలుదేరే వారు. 
సాఈ నిఘతా జావయా | వాద్యే లాగత వాజావయా | 
నళే చంద్రజోతీ హవయా | ప్రకాశతీ దివటియా చౌపాసీ | ||౧౩౬|| 
136. బాబా బయలుదేరబోతుండగా, వాద్యాలు మ్రోగేవి. టపాకాయలు పేలేవి. నలుదిక్కులా దివిటీలు వెలిగేవి. 
కోణీ వర్తుల ధనుష్యాకృతీ | శింగే కర్ణే తుతార్యా ఫుంకితీ | 
కోణీ తాస ఝాంజ వాజవితీ | నాహీ మితీ టాళకరియా | ||౧౩౭|| 
137. బిల్లులా వంగి ఉన్న కొమ్మ బూరాను కొందరు ఊదేవారు. మరి కొందరు తాళాలు, చిరుతలు వాయించేవారు. చప్పట్లు కొట్టేవారి సంఖ్య అసలు లెక్కకు రాదు. 
మృదంగ వీణా ఝణత్కారీ | సాఈనామాచియా గజరీ | 
భజన సమవేత హారోహారీ | ప్రేమే నరనారీ చాలత | ||౧౩౮|| 
138. తంబూర, మృదంగ శబ్దాలతో, సాయి నామ ఘోషతో, భజన చేస్తూ, ఆడా మగా భక్తులు ప్రేమతో వరుసగా నడిచేవారు. 
దిండీ పతాకా ఝేలిత | కోణీ గరుడటకే8 మిరవిత | 
నాచత ఉడత భజన కరిత | నిఘత మగ సమస్త జావయా | ||౧౩౯|| 
139. ఊరేగింపు పతాకాన్ని జాగ్రత్తగా పట్టుకుని కొందరు, మరొకరు గరుడధ్వజాన్ని పట్టుకుని, నాట్యం చేస్తూ, గెంతుతూ, భజన చేస్తూ, బయలుదేరే వారు. 
అతి ఆనంద సకల లోకా | ఘేఊని నిఘతీ దిండ్యా పతాకా | 
తాశ తుతారే కర్ణ్యాంచా దణకా | జయకార థయకార వారూచా | ||౧౪౦||
140. అందరూ ఎంతో ఆనందంతో, తప్పెట్లు, బాకాలు, జయజయకార ధ్వనులతో, పతాకాన్ని పట్టుకుని నడుస్తుంటే, శ్యామకర్ణ 'థైథై' అని నాట్యం చేసేది. 

ఏసియా వాజంతరాంచే గజరీ | మశీదీంతూన నిఘే స్వారీ | 
భాలదార దేత లలకారీ | పాయరీవర బాబా జో | ||౧౪౧|| 
141. అలాంటి వాద్యాల చప్పుళ్ళతో, మసీదునుండి బాబా బయలుదేరి, మెట్ల దగ్గరకు రాగానే, దండధారులు గట్టిగా బాబాకు పరాకులు పలికేవారు.
టాళ ఝాంజ మృదంగ మేళీ | కోణీ వీణా కోణీ చిపళీ | 
భజన కరీత భక్తమండళీ | సుఖ సమేళీ తే స్థానీ | ||౧౪౨|| 
142. తాళాలు, తప్పెట్లు వగైరా వాద్యాలకు అనుగుణంగా, కొందరు వీణను వాయిస్తుంటే, మరి కోందరు చిటికెలు చిరతలతో తాళం వేసే వారు. కొందరు భక్తులు ఎంతో ప్రేమగా, ఆనందంతో భజన చేసేవారు. 
టకే పతాకా ఘేఊని కరీ | భక్త చాలతీ ఆనందనిర్భరీ | 
దుబాజూ దోన చవరధరీ | పంఖే కరీ వీజితీ | ||౧౪౩|| 
143. పతాకాలను చేత్తో పట్టుకుని, భక్తులు సంతోషంగా నడుస్తుంటే, బాబాకు రెండు వైపులా వింజామరలను, వీవనలను వీచేవారు. 
శేలే దుశేలే ఎకేరీ కరితీ | పాయఘడ్యా మార్గాంత అంథరితీ | 
బాబాంస హాతీ ధరోని చాలవితీ | చవర్యా ఢాళితీ తయాంవరీ | ||౧౪౪|| 
144. ఇంకా కొందరు, బాబా నడిచే దారిలో, శాలువాలను, దుప్పట్లను పరచి, వాని మీద బాబాను చేయిపట్టుకుని నడిపించేవారు. వారిపై వింజామరలను వీచేవారు. 
తాత్యాబా వామ హస్త ధరీ | మ్హాళసాపతి దక్షిణ కరీ | 
బాపూసాహేబ9 ఛత్ర శిరీ | చాలలీ స్వారీ చావడీసీ | ||౧౪౫|| 
145. బాబా ఎడమ చేతిని తాత్యా పట్టుకోగా, బాబా కుడి చేతిని మహల్సాపతి పట్టుకునే వారు. బాబా తలపై ఛత్రాన్ని బాపూసాహేబు జోగు పట్టుకోగా, ఊరేగింపు చావడి వైపు సాగేది. 
అఘాడీ ఘోడా తో తామ్రవర్ణ | నామ జయాచే శామకర్ణ | 
ఘుంగురే ఝణత్కారితీ చరణ | సర్వాభరణ మండిత జో | ||౧౪౬|| 
146. కాళ్ళకు కట్టిన గజ్జలు గలగలలాడగా, అన్ని అలంకారాలతో అలంకరింపబడిన ఎర్రటి గుర్రం, శామకర్ణ ముందు ఉండేది. 
వేత్రపాణీ పుఢే చాలత | సాఈనామాచా లలకార కరిత | 
ఛత్రధారీ ఛత్ర ధరీత | చవర్యా వారిత చవరధర | ||౧౪౭|| 
147. దండధారులు సాయి నామాన్ని గట్టిగా ఘోషిస్తూ ముందు నడిచేవారు. కొందరు ఛత్రాన్ని పట్టుకుంటే, ఇంకొందరు వింజామరలను వీచేవారు. 
తాశే వాజంత్రే వాజత | భక్త జయజయకారే గర్జత | 
ఏసా భక్తసంభార చాలత | ప్రేమే పుకారత భాలదార | ||౧౪౮|| 
148. ఎన్నో రకాల వాద్యాలు మ్రోగుతుండగా, భక్తులు జయజయకారాలు చేస్తూ, నడిచేవారు. దండధారులు కూడా ప్రేమతో, వారితో కలిసి జయజయకారాలు చేసేవారు. 
హరినామాచా ఎకచి గజర | టాళ ఝాంజ మృదంగ సుస్వర | 
సవే తాలావర భక్త సంభార | గర్జత లలకారత చాలతీ | ||౧౪౯|| 
149. బాబాకు జయజయకారాలు చేస్తూనే, కొందరు హరినామాన్ని కూడా చెప్పేవారు. ఇంకొందరు వాద్యాల చప్పుళ్ళకు అనుగుణంగా జయకారాలు చేస్తూ నడిచేవారు. 
ఏసా భజనీ భక్త సంభార | హోఊనియా ఆనంద నిర్భర | 
వాటేనే సాఈచా జయజయకార | కరీత చవ్హాట్యావర ఠాకత తై | ||౧౫౦||
150. ఇలా భజన చేస్తున్న భక్తులు, దారిలో ఆనందంగా సాయికి జయజయకారాలు చేస్తూ, నాలుగు దారులున్న కూడలిలో ఆగేవారు. 

టాళ ఝాంజ ఢోళ ఘోళ | వాద్యే వాజతీ అతి తుంబళ | 
సాఈనామాచా ఎకచి కల్లోళ | భజన ప్రేమళ మౌజేచే | ||౧౫౧|| 
151. తాళాలు, తప్పెట్లు మొదలైన వాద్యాలు ఒకే సారి గట్టిగా మ్రోగగా, సాయినామాన్ని ఘోషిస్తూ, భక్తులు ప్రేమగా ఆనందంగా భజన చేస్తూ ముందుకు సాగేవారు. 
సవే చాలతీ నారీ నర | సర్వ భజనానందీ నిర్భర | 
కరీత సాఈనామాచా గజర | నాదే అంబర కోందాటే | ||౧౫౨|| 
152. ఆడా మగా కలిసి వెంటవెంట నడిచేవారు. అందరూ ఆనందంగా భజనలో లీనమై పోయేవారు. వాద్యాల చప్పుళ్ళతో, సాయి నామ ఘోషతో, ఆకాశం దద్దరిల్లేది. 
గగన గర్జే వాజంతరీ | ప్రేక్షక సముదాయ ప్రసన్న అంతరీ | 
ఏసీ ప్రేక్షణీయ చావడీచీ స్వారీ | శోభా సాజిరీ అనుపమ్య | ||౧౫౩|| 
153. ఆ చప్పుళ్ళకు ఆకాశం మారుమోగుతుండగా, కన్నులకు పండుగ చేసి, మనసుకు ఆనందాన్నిచ్చే, అద్భుతమైన ఆ చావడి ఊరేగింపు, ఎంతో వైభవంగా ఉండేది. 
అరుణ సంధ్యారాగే నభా | జైసీ తప్తకాంచన ప్రభా | 
తైసీ జయాచీ శ్రీముఖశోభా | సన్ముఖ జై ఉభా చావడీచ్యా | ||౧౫౪|| 
154. చావడి ఎదుట నిలబడిన శ్రీవారి ముఖం, సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు ఆకాశంలో ఉండే బంగారు రంగు కాంతిలా, మెరుస్తుండేది. 
తే సమయీంచీ తీ ముఖశోభా | పసరలీ జణూ బాలారుణ ప్రభా | 
కేవళ చైతన్యాచా గాభా | కోణ త్యా లాభా టాళీల | ||౧౫౫|| 
155. ఆ సమయంలో వారి ముఖం ఉదయిస్తున్న సూర్యుడి వెలుగులాగా, శుద్ధమైన చైతన్యంయొక్క బుగ్గలాగా కనిపించేది. ఇంతటి అద్భుతమైన దర్శనాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు? 
ధన్య తే సమయీంచే దర్శన | ముఖప్రభా ఆరక్తవర్ణ | 
ఉత్తరాభిముఖ ఎకాగ్ర మన | కరీ పాచారణ జణు కోణా | ||౧౫౬|| 
156. రక్తం రంగులో వెలుగుతున్న బాబా ముఖం కాంతిని, ఆ సమయంలో దర్శించటమే ధన్యం. వారు ఉత్తర దిక్కువైపు చూస్తూ, ఎవరినో పిలుస్తున్నట్లుగా, ఉండేది. 
తాశే వాజంత్ర్యాంచా గజర | మహరాజ ఆనంద నిర్భర | 
కరితీ అధోర్ధ్వ దక్షిణకర | వరచేవర తేధవా | ||౧౫౭|| 
157. అప్పుడు ఆ వాద్యాల చప్పుళ్ళలో, మహారాజు పూర్తి ఆనందంతో, కుడి చేతిని పైకి, కిందకూ మాటిమాటికీ ఆడించేవారు. 
రౌప్య తాటీ కుసుమనికర | ఘేఊన దీక్షిత10 భక్తప్రవర | 
పుష్పవృష్టీ సర్వాంగావర | కరీత వరచేవర తే సమయీ | ||౧౫౮|| 
158. ఆ సమయంలో, వెండి పళ్ళెంలోని పూలను, భక్త శ్రేష్ఠుడైన దీక్షితు, మాటి మాటికీ బాబా ఒంటిమీద, పూల వానలా కురిపించేవాడు. 
సాఈచియా మస్తకావరతీ | గులాబ పుష్పే గులాల మిశ్రితీ | 
కాకాసాహేబ ఉధళత రాహతీ | ప్రేమభక్తీ సంయుక్త | ||౧౫౯|| 
159. గులాబి పూలను గులాలుతో కలిపి, కాకాసాహేబు, భక్తి ప్రేమలతో బాబా తలమీద, కురిపించేవాడు. 
ఏశా జంవ త్యా పుష్పకాళికా | గులాలయుక్త ఉధళితీ కాకా | 
తాస ఝాంజ టాళాంచా ఠోకా | ఎకచి కడాకా వాద్యాంచా | ||౧౬౦||
160. కాకా అలా గులాబి పూలను గులాలును కురిపిస్తూ ఉంటే, వాద్యాల వారు చప్పుళ్ళను ఇంకా ఎక్కువగా చేసేవారు. 

గ్రామలోక బాబాంచే భక్త | దర్శనా యేతీ ప్రీతీయుక్త | 
ముఖచర్యా అరుణ రక్త | అభినవసువ్యక్త తేవేళీ | ||౧౬౧|| 
161. బాబా భక్తులైన శిరిడీ ప్రజలు, ఎంతో ప్రేమతో బాబా దర్శనానికి వచ్చేవారు. అప్పుడు, ఎర్రగా, ఎంతో వింతగా, అందంగా బాబా ముఖం కనిపించేది.
పాహోనియా తో తేజవిలాస | ప్రేక్షకనేత్ర పావతీ వికాస | 
ప్రేమళా మనా హోఈ ఉల్హాస | భవసాయాస నివృత్తి | ||౧౬౨|| 
162. వారి ముఖం మీద మెరుస్తున్న తేజస్సును చూసి, చూసినవారి కళ్ళు బాగా తెరుచుకునేవి. వారి మనసులకు ఆనందం కలిగి, సంసారంలోని దుఃఖాలను మరచి పోయేవారు. 
అహా తే దివ్య తేజ అద్భుత | శోభే జైసా బాల భాస్వత11
సన్ముఖ తాశే కహాళా గర్జత | ఉభే రాహత బహుసాల | ||౧౬౩|| 
163. ఆహా! ఏమి అద్భుతమైన దివ్యతేజం! అప్పుడే ఉదయించిన సూర్యునివలె వెలుగుతుంటే, వారి ఎదుట చాలా సేపు నిలబడి, తాళాలు, తప్పెట్లు, వగైరా వాద్యాలను మరీ గట్టిగా చప్పుడు చేసేవారు. 
కరూని సతత ఖాలీవర | హేలకావీత దక్షిణ కర | 
ఉదంగ ముఖ ఎకా స్థళావర | అర్ధ ప్రహరపర్యంత | ||౧౬౪|| 
164. ఒకే చోటులో నిలుచుని, గంటన్నర వరకు ఉత్తర దిక్కువైపు ముఖం త్రిప్పి, కుడి చేతిని క్రిందకు పైకి ఆడించే వారు. 
పీతవర్ణ కేతకీ గాభా | కించిత ఆరక్త ముఖప్రభా | 
జివ్హా న వర్ణూ శకే తీ శోభా | నేత్రేంచ లాభా సేవావే | ||౧౬౫|| 
165. మొగలి పూవులాంటి పచ్చని రంగు మేనుతో, కొంచెం ఎర్రని ముఖ వర్చస్సుగల ఆ శోభను వర్ణించలేము. ఆ వైభవ లాభాన్ని కళ్ళే అనుభవించాలి. 
తితక్యాంత జేవ్హా కా మ్హాళసాపతీ | సంచార హోఊని నాచూ లాగతీ | 
తేవ్హా హీ బాబాంచీ ఎకాగ్ర స్థితీ | పాహతా చిత్తీ ఆశ్చర్య | ||౧౬౬|| 
166. అప్పుడు, ఆవేశంతో మహల్సాపతి నాట్యం చేస్తున్నా, బాబా ఒకే మనసుతో ఉండటం, చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. 
దక్షిణాంగీ ఉభా భగత | అంచల బాబాంచే కరే ధరీత | 
వామాంగీ తాత్యా కోతే చాలత | ఘేఊని హస్తాంత కందీల | ||౧౬౭|| 
167. బాబాకు కుడివైపు మహల్సాపతి నిలబడి, బాబా కఫనీను చేత్తో పట్టుకోగా, ఎడమ వైపు తాత్యా కోతే లాంతరును చేత్తో పట్టుకుని నడిచేవాడు. 
కాయ మౌజేచా తో ఉత్సవ | భక్తి ప్రేమాచే తే గౌరవ | 
పాహావయా తయాచా నవలావ | అమీర ఉమరావ ఎకవటతీ | ||౧౬౮|| 
168. భక్తి ప్రేమలతో కూడుకున్న ఆ ఉత్సవం, ఎంత ఆనందంగా ఉండేదో! ఆ వైభవాన్ని చూడటానికి పెద్ద మనుషులు, ధనవంతులు ఒక చోట గుమిగూడే వారు. 
నిజతేజే ఘవఘవీత | ముఖచంద్ర సోజ్వళ ఆరక్త | 
అవర్ణనీయ శోభా శోభత | స్వానంద పూరిత జననయన | ||౧౬౯|| 
169. ఎర్రని రక్తం రంగుతో వెలిగిపోతున్న, అందమైన బాబా ముఖం చెప్పలేని తేజస్సుతో వెలుగుతుంటే, భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోయేవి. 
హళూ హళూ చాలతీ వాటే | భక్త సముదాయ దుబాజూ థాటే | 
అనివార భక్తిప్రేమ దాటే | స్వానంద కోందాటే ఘనదాట | ||౧౭౦||
170. బాబాకు రెండు వైపులా, భక్తుల గుంపు, దర్జాగా, మెల్లమెల్లగా, ఎంతో పరమానందాన్ని తమ మనసులో నింపుకుని, ప్రేమతో నడిచేవారు. 

ఆతా పుఢే ఏసా సోహళా | కోణీహీ పాహూ న సకే డోళా | 
గేలే తే దివస ఆణి తీ వేళా | మనాసీ విరంగుళా12 స్మరణేంచ | ||౧౭౧|| 
171. ఇలాంటి వైభవాన్ని ఇక ముందు, తమ కళ్ళతో ఎవరూ చూడలేరు. ఆ కాలం, ఆ రోజులు ఎప్పటికీ గడిచిపోయాయి. ఇప్పుడు, ఆ జ్ఞాపకాలే మనసుకు తృప్తిని కలిగించాలి. 
వాజతీ వాజంత్రీ అపార | మార్గీ కరితీ జయజయకార | 
నేఉని చావడీసీ ఆసనావర | దివ్యోపచార అర్పితీ | ||౧౭౨|| 
172. అలా భజంత్రీలు విపరీతంగా మ్రోగుతుండగా, దారిలో జయజయకారాలు చేస్తూ, చావడిలోని ఆసనం దగ్గరకు బాబాను తీసుకుని వెళ్ళి, వారికి దివ్యోపచారాలు చేసేవారు. 
వరీ బాంధీత శుభ్ర వితాన13 | హండ్యా ఝుంబరే శోభాయమాన | 
ఆరసా ప్రకాశ పరావర్తన | దైదీప్యమాన దేఖావా | ||౧౭౩|| 
173. చావడి లోపల, పైన జాలీలాంటి తెల్లటి బట్టను కట్టేవారు. రకరకాల దీపాలను, దీపశాఖలను వేలాడగట్టేవారు. వాని వెలుగు అక్కడక్కడా వేలాడదీసిన అద్దాలలో ప్రతిఫలించి, చూడటానికి ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉండేది. 
భక్త మండళీ సర్వ మిళూన | చావడీతే జాతీ జమూన | 
తాత్యాబా మగ ఘాలితీ ఆసన | బాబాంస ధరూన బైసవిత | ||౧౭౪|| 
174. భక్తులందరూ చావడిలో గుమిగూడేవారు. తాత్యాబా ఆసనం వేసి, బాబాను పట్టుకుని, మెల్లగా ఆ ఆసనంపై కూర్చుండబెట్టేవాడు. 
ఏసే తే తయార వరాసన | పాఠీసీ లోడాచే ఓఠంగణ14
బాబా హోతాంచ స్థానాపన్న | అంగరఖా పరిధాన కరవీత | ||౧౭౫|| 
175. ఎత్తుగా తయారు చేసిన ఆ ఆసనం వెనుక భాగాన, బాబాకు ఆనుకోవటానికి అనుకూలంగా బాలీసును వేసేవారు. బాబా కూర్చోగానే, వారిపై కండువాను కప్పేవారు. 
ఘాలీత అంగావర దివ్యాంబరే | పూజా కరీత హర్షనిర్భరే | 
కరీత ఆరత్యా మహాగజరే | హారతురే చఢవీత | ||౧౭౬|| 
176. మంచి దివ్యమైన బట్టలను, ఆనందంగా బాబాకు కప్పి, ఎంతో భక్తితో పూజ చేసేవారు. పూలమాలలను వేసి, గట్టిగా ఆరతి పాడుతూ, ఆరతినిచ్చేవారు. 
సుగంధ చందన చర్చూన | కరీత సాఈస కరోద్వర్తన | 
ఉంచ వస్త్రీ అలంకారూన | ముకుట ఘాలూన పాహత | ||౧౭౭|| 
177. పరిమళ చందనాన్ని, సుగంధ వస్తువులను బాబా చేతులకు పూసేవారు. విలువైన బట్టలతో అలంకరించి, తల మీద కిరీటాన్ని ఉంచి, చూసేవారు. 
కధీ సువర్ణ ముకుట సాజిరా | కధీ శిరపేచీ మందిల గహిరా | 
ఝలకే జయావరీ కలగీ తురా | కంఠీ హిరా మాణికే | ||౧౭౮|| 
178. ఒకొక్కప్పుడు బంగారు కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు. రత్నాల మాలనో మాణిక్యాల మాలనో, 
ధవళ ముక్తాఫళాంచ్యా మాళా | ఘాలితీ మగ తయాంచ్యా గళా | 
దివాబత్తీచ్యా యోగే ఝళాళా | తేజే ఆగళా పేహరావ | ||౧౭౯|| 
179. లేదా, తెల్లని ముత్యాల మాలలను, వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుతురులో బాగా ధగధగా మెరుస్తుండేవి. 
సుగంధ కస్తూరీరచిత కాళీ | ఉర్ధ్వరేషా రేఖితీ నిఢళీ | 
కృష్ణ తిలక లావితీ భాళీ | వైష్ణవ కుళీ జేణే పరీ | ||౧౮౦||
180. కస్తూరి పరిమళంతో, వైష్ణవ పద్ధతిలో, బాబా నొసటన నల్లటి నామాన్ని, మధ్య నల్లటి తిలకం దిద్దేవారు. 

తో జాంభళా మఖమాలీ భరజరీ | అంగరఖా దో ఖాంద్యావరీ | 
హళూచ మాగూన వరచేవరీ | సరకతా సావరీత దోబాజూ | ||౧౮౧|| 
181. నేరేడు రంగుల మఖమలు జరీ కండువాను, వారి రెండు భుజాల పైన వేసి, అది జారిపోతుంటే, ఎవరూ గమనించకుండా, రెండు వైపులా మాటిమాటికి భక్తులు సవరించేవారు.
తైసేంచ డోఈస ముగుటాభరణ | అథవా మందీల పాలటూన | 
వరిచే వరీచ ధరీత ఝేలూన | హళూచ మాగూన నకళత | ||౧౮౨|| 
182. అలాగే, తలపైని కిరీటాన్ని, లేదా తలపాగాను కూడా వారికి తెలియకుండా, వెనుకనుండే సవరించేవారు. 
హో కా ముకూట అథవా మందీల | స్పర్శ హోతా ఫేకూన దేతీల | 
హోతీ జరీ హీ చింతా ప్రబళ | ప్రేమకుతూహల నిఃసీమ | ||౧౮౩|| 
183. కిరీటంగాని, తలపాగాగాని తమ తలకు తగిలితే, ఎక్కడ దానిని బాబా విసిరేస్తారో అని భయపడుతున్నా, వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ ఉత్సాహం ఎంతగానో ఉండేది. 
సాఈ జో సర్వాంతర్‍జ్ఞానీ | తో కాయ నేణే భక్తాంచీ ఛపవణీ | 
పరీ తయాంచే కౌతుక పాహునీ | బుద్ధ్యాచ జాణూని మౌన ధరీ | ||౧౮౪|| 
184. స్వతహాగా అన్నీ తెలిసిన సాయి, భక్తులు వెనుక దాగి చేస్తున్న దానిని, తెలుసుకోలేరా? భక్తుల ఉత్సాహాన్నిగని, ఏమీ తెలియనట్లు ఊరికే ఉండేవారు. 
బ్రహ్మానుభవే విరాజమాన | తయాస భర్జరీ అంగరఖా భూషణ | 
నిజశాంతీనే శోభాయమాన | తయా అలంకరణ ముగుటాచే | ||౧౮౫|| 
185. బ్రహ్మానందంతో మెరిసిపోతున్న వారికి, జరీ కండువా ఆభరణం, అలంకారం కాగలదా? ఎప్పుడూ ఆత్మ శాంతితో వెలిగిపోతున్న వారికి, కిరీటం ఒక అలంకారమా? 
తరీహీ నానాపరీచే సురుచిర | బాబాంస ఘాలితీ అలంకార | 
కపాళీ టిళక మనోహర | రేఖితీ కేశర మిశ్రిత | ||౧౮౬|| 
186. అయినా, భక్తులు ఎన్నో రకాల అందమైన అలంకారాలతో, బాబాను అలంకరించేవారు. కేసరి మిశ్రమంతో, వారి నొసటన అందమైన తిలకం దిద్దేవారు. 
హిరే మోతియాంచ్యా మాళా | కోణీ తేథే ఘాలితీ గళా | 
కోణీ లలాటీ లావితీ టిళా | చాలవీ లీళా భక్తాంచ్యా | ||౧౮౭|| 
187. ఒకరు రత్నాల మాలనో, ముత్యాల మాలనో, వారి గొంతుకు అలంకరిస్తే, ఇంకొకరు వారి నొసటన తిలకం దిద్దేవారు. అలా, భక్తుల ముచ్చటలను బాబా తీర్చేవారు. 
శృంగార జేవ్హా చఢతీ సమస్త | మస్తకీ జై ముకుట విరాజిత | 
ముక్తాహార కంఠీ ఝళకత | దిసే అత్యద్భూత తై శోభా | ||౧౮౮|| 
188. అన్ని అలంకారాలు ముగిసిన తరువాత, వారి తలపై కిరీటం, గొంతులో ముత్యాల హారం మెరుస్తుంటే, ఆ దృశ్యం అతి అద్భుతంగా ఉండేది. 
నానాసాహేబ నిమోణకర | ధరీత బాబాంవర ఛత్ర పాండుర | 
కాఠీ సవే తే వర్తులాకార | ఫిరే ఝాలర సమవేత | ||౧౮౯|| 
189. కొనలకు కుచ్చులతో అలంకరించిన తెల్లని బట్టతో చేసి, గుండ్రంగా తిప్పబడే కర్రకు అమర్చబడి ఉన్న గొడుగును, నానాసాహేబు నిమోన్కరు బాబా తలమీద, పట్టుకునేవాడు. 
బాపూసాహేబ అతి ప్రీతీ | గురుచరణ ప్రక్షాలితీ | 
అర్ఘ్యపాద్యాది భావే అర్పితీ | పూజా కరితీ యథోచిత | ||౧౯౦||
190. సద్గురు పాదాలను ప్రేమతో కడిగి, అర్ఘ్య పాద్యాదులను భక్తిగా బాపూసాహేబు జోగు సాయికి అర్పించి, ఎప్పటిలాగే నియమంతో పూజ చేసేవాడు. 

పుఢే ఠేవూన రౌప్య తామ్హణ | తయాంత బాబాంచే ఠేవూని చరణ | 
అత్యాదరే కరీత క్షాళణ | కరోద్వర్తన మాగుతే | ||౧౯౧|| 
191. బాబా ఎదుట వెండి పళ్ళెమును పెట్టి, అందులో బాబా పాదాలనుంచి, వానిని ఎంతో ఆదరంగా అభిషేకం చేసి, సుగంధ చందనం పూసేవాడు. 
ఘేఊని కేశరాచీ వాటీ | మగ లావీత హస్తా ఉటీ | 
తాంబూల అర్పీత కరసంపుటీ | ప్రసన్న దృష్టీ సాఈచీ | ||౧౯౨|| 
192. కేసరి గిన్నెను తీసుకుని, అందులోని మిశ్రమాన్ని వారి చేతులకు ప్రేమతో రాసేవాడు. ఆ పైన, తాంబూలాన్ని వారి చేతులలో ఉంచేవాడు. ఇవన్నీ అయిన తరువాత, బాబా ఎంతో ఆనందంగా కనిపించేవారు. 
బాబా జంవ గాదీస బైసత | తాత్యాబాది ఉభేచ ఠాకత | 
హాతీ ధరూన బాబాంస బసవీత | ఆదరే నమిత తచ్చరణా | ||౧౯౩|| 
193. తమ గద్దెపై బాబా కూర్చుంటుండగా, తాత్యాబా మొదలైన వారు పక్కలోనే నిలబడి, బాబాకు కూర్చోవటానికి సహాయం చేసేవారు. వారు కూర్చున్న తరువాత, వారి పాదాలకు, భక్తిగా నమస్కరించేవారు. 
నిర్మళ చావడీ భూమికా శుద్ధ | ఘోటీవ ఆణి స్ఫటిక బద్ధ | 
మిళణీ మిళతీ ఆబాల వృద్ధ | ప్రేమే నిబద్ధ శ్రీపదీ | ||౧౯౪|| 
194. ఎప్పుడూ నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్నా, చావడి నేలను తెల్లగా స్పటికం లాగా మెరిసేలా కడిగేవారు. అక్కడికి, బాబాయొక్క శ్రీ పాదాలలో చోటు పొందటానికి, చిన్నా పెద్దా అందరూ వచ్చేవారు. 
హోతా గాదీవర విరాజమాన | బసత తక్యాస టేకూన | 
చవరీ చామర ఆందోలన | వీజితీ వ్యజన దోబాజూ | ||౧౯౫|| 
195. బాబా వారి గద్దెపై కూర్చుని, వెనుక ఉన్న తలగడను ఆనుకోగానే, వారికి రెండు వైపులా, వీవనలను, వింజామరలనూ వీచేవారు. 
మాధవరావ తమాఖూ చురితీ | చిలీమ తాత్కాళ తయార కరితీ | 
దేతీ తాత్యాబాంచే హాతీ | తాత్యాబా ఫుంకీతీ ఆరంభీ | ||౧౯౬|| 
196. ఇవన్నీ అయ్యాక, మాధవరావు పొగాకును నలిపి, పొడి చేసి, చిలుం తయారు చేసి, తాత్యాబా చేతికిచ్చేవాడు. తాత్యాబా దానిని మొదట ఊదేవాడు. 
తమాఖూచీ జ్వాలా నిఘతా | తాత్యాబా దేత బాబాంచే హాతా | 
బాబాంచా ప్రథమ ఝురకా సంపతా | మగ తీ భగతాస అర్పీత | ||౧౯౭|| 
197. పొగాకు బాగా రాజుకోగానే, బాబా చేతికిచ్చే వాడు. దానిని బాబా ఒక మారు పీల్చి, మహల్సాపతికిచ్చే వారు. 
మగ తీ చిలీమ సంపే తోంవర | ఇకడూన తికడే వర్తులాకార | 
భగత శామా తాత్యా బరోబర | వరచేవర భ్రమతసే | ||౧౯౮|| 
198. అలా, ఆ చిలుం అయిపోయేంత వరకు, మహల్సాపతి, శామా, తాత్యాబాల మధ్య ఇక్కడినుండి అక్కడికి, అక్కడినుండి ఇక్కడికి, చుట్టూ గుండ్రంగా తిరిగేది. 
ధన్య తీ నిర్జీవ వస్తూ పరీ | కాయ తిచీయా భాగ్యాచీ థోరీ | 
ఆమ్హా సజీవా న తిచీ సరీ | సేవా తీ ఖరీ తియేచీ | ||౧౯౯|| 
199. ప్రాణం లేనిదైనా, ఆ చిలుం చాలా ధన్యమైనది. దానిది ఎంతటి గొప్ప భాగ్యం! ప్రాణంతో ఉన్నా, మనం దానికి సమం కాము. దాని సేవ అసలైనది. 
తపశ్చర్యా హీ మహా కఠిణ | లాథా తుడవిలే బాళకపణ | 
పుఢే సోసూన శీతోష్ణతపన | అగ్నీంత తావూన నిఘాలీ | ||౨౦౦||
200. దాని తపస్సు ఎంతో కష్టమైనది. పసితనంలో గట్టిగా తొక్కించుకుని, తరువాత విపరీతమైన వేడిని చలిని సహించి, నిప్పులో కాలి, బయటకు వచ్చింది. 

భాగ్యే బాబాంచే కరస్పర్శన | పునశ్చ ధునీమాజీ భర్జన | 
మాగుతీ గౌరికా ఉటీ చర్చన | ముఖ చుంబన తై లాధే | ||౨౦౧|| 
201. ఎంతో అదృష్టం కొద్దీ, బాబా చేతి స్పర్శ తగిలి పవిత్రమై, ధునిలో కాలి, ఎర్ర రంగును పూసుకుని, చివరకు బాబా పెదిమలను ముద్దు పెట్టుకునే అవకాశం దొరికింది.
అసో కర్పూర కేశర చందన | కరితీ ఉభయహస్తా విలేపన | 
గళా సుమనమాళా ఘాలూన | గుచ్ఛావఘ్రాణన కరవితీ | ||౨౦౨|| 
202. కర్పూరం, కేసరిలను కలిపిన చందనాన్ని భక్తులు, బాబా చేతులకు అద్దేవారు. గొంతులో పూలమాలను వేసి, సువాసనను పీల్చటానికి పూలగుత్తిని వారికి ఇచ్చేవారు. 
సదా జయాచే సుహాస్యవదన | అతి సప్రేమ సదయ అవలోకన | 
తయాస కాయ శృంగారాభిమాన | రాఖిలా హా మాన భక్తాంచా | ||౨౦౩|| 
203. అందరినీ ఎంతో ప్రేమతో చూస్తూ, దయను కురిపించి, ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉండే సాయికి, అలంకారాల మీద అభిమానం ఎందుకుంటుంది? అంతా, భక్తుల ముచ్చటను తీర్చటానికే. 
జయా అంగీ భక్తీచీ లేణీ | శృంగారిలా జో శాంతి భూషణీ | 
తయా యా లౌకికీ మాళామణీ | అలంకరణీ కాయ హోత | ||౨౦౪|| 
204. వెలలేని భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే అలంకారాన్ని పొందిన వారికి, లౌకికమైన ఈ మణుల మాలల అలంకారం ఏ పాటిది! 
కీ జో వైరాగ్యాచా పుతళా | తయాస కిమర్థ పాచూంచ్యా మాళా | 
పరీ అర్పితా ఓఢవీ గళా | భక్తాంచా సోహళా పురవీ తో | ||౨౦౫|| 
205. మూర్తీభవించిన వైరాగ్యానికి, పచ్చల హారం ఎందుకు? భక్తులు వానిని మెడలో వేసినప్పుడు, వారి ముచ్చటలను తీర్చటానికే, బాబా వేయించుకునే వారు. 
స్వర్ణ పాచూ దివ్యహార | గళా విరాజతీ ముక్తసర | 
అష్టాష్ట షోడశ జయాంచే పదర | అభినవ పుష్కర మిశ్రిత | ||౨౦౬|| 
206. బంగారపు పచ్చల హారం, ఎనిమిది వరుసలుగానీ, పదహారు వరుసలుగానీ, నీలి రంగు కమలాలతో కలిసిన ముత్యాల మాల, వారి మెడను అద్భుతంగా అలంకరించేది. 
జాఈ జుఈ తులసీ మాళా | ఆపాద జయాచే రుళతీ గళా | 
ముక్తకంఠా కంఠనాళా | మిరవీ ఝళాళా అపూర్వ | ||౨౦౭|| 
207. మెడలోని మల్లెలు, మొల్లలు, మరియు తులసీ మాలలు, వారి పాదాల వరకూ వ్రేలాడుతుండేవి. అపూర్వమైన ముత్యాల హారాలు, వారి మెడలో ధగధగమని మెరుస్తుండేవి. 
సవే పాచూచా హేమహార | సువర్ణ పదక హృదయావర | 
నిఢళీ శామ తిలక సుందర | అతి మధుర శోభా దే | ||౨౦౮|| 
208. బంగారపు పచ్చల హారం, దానిలోని పతకం, బాబా ఎదపై వ్రేలాడేది. అందంగా వారి నొసటన దిద్దిన నల్లని తిలకం, ఎంతో చూడ ముచ్చటగా ఉండేది. 
తయాస కాయ మ్హణావే ఫకీర | భాసే సతేజ వైష్ణవప్రవర | 
వరీ డోలతీ ఛత్రచామర | శేలా జరతార శిరీ శోభే | ||౨౦౯|| 
209. తల మీద జలతారు శాలువతో, ఛత్ర చామరాల సేవలతో, వైష్ణవ భక్తునిలాగా విపరీతమైన తేజస్సుతో మెరుస్తున్న వారిని, ఎవరైనా ఫకీరు అని అనగలరా! 
బహుధా జోగ ప్రేమనిర్భరీ | మంగలవాద్యాంచియా గజరీ | 
పంచారత ఘేఊని కరీ | బాబాంవరీ ఓవాళీత | ||౨౧౦||
210. మంగళ వాద్యాలు చప్పుడు చేస్తుండగా, సంబరంగా చేతిలో పంచారతిని పట్టుకుని జోగు, ఎంతో ప్రేమతో, బాబాకు ఆరతినిచ్చేవాడు. 

పంచోపచార పూజాసమేత | ఘేఊని పంచారత ఘవఘవిత | 
నీరాంజన కర్పూర వాత | ఓవాళీత బాబాంస | ||౨౧౧|| 
211. పంచోపచార పూజలను చేసిన తరువాత, బాబాకు మెరిసిపోయే పంచారతితో, కర్పూర నీరాజనాన్ని ఇచ్చేవాడు. 
మగ హీ ఆరతీ జేవ్హా సంపత | ఎకేక ఎకేక సకళ భక్త | 
బాబాంస కరోని సాష్టాంగ ప్రణిపాత | నిఘూని జాత ఘరోఘర | ||౨౧౨|| 
212. ఈ ఆరతి ముగిసిన తరువాత, ఒక్కొక్కరుగా, బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, భక్తులు అందరూ తమతమ ఇళ్ళకు బయలుదేరేవారు. 
చిలీమ అత్తర గులాబపాణీ | దేఊనీ బాబాంచీ అనుజ్ఞా ఘేఊనీ | 
తాత్యాబా నిఘతా జావయా నిజసదనీ | మ్హణావే బాబాంనీ “సాంభాళ మజ | ||౨౧౩|| 
213. అత్తరు, పన్నీరు మరియు చిలుమును బాబాకు ఇచ్చి, వారి అనుమతిని పొంది, తాత్యాబా తన ఇంటికి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు బాబా అతనితో, “నన్ను చూసుకో. 
జాతోస జా పరీ రాత్రీమాజీ | మధూన మధూన ఖబర ఘే మాఝీ” | 
బరే హో మ్హణూన మగ తాత్యాజీ | చావడీ త్యజీ జాఈ ఘరీ | ||౨౧౪|| 
214. “వెళ్ళాలంటే, వెళ్ళు. కాని, రాత్రి సమయంలో, అప్పుడప్పుడు వచ్చి, నన్ను గమనిస్తూ ఉండు” అని చెప్పేవారు. ‘అలాగే’ అని తాత్యా చావడినుండి తన ఇంటికి వెళ్ళేవాడు. 
ఏసే లోక జాతా సమస్త | బాబా స్వహస్తే గాంఠోడే సోడీత | 
ధోతరాంచ్యా ఘడ్యా పసరీత | స్వహస్తే రచిత నిజ శేజ | ||౨౧౫|| 
215. అలా అందరూ వెళ్ళిపోయాక, తమ చేతులతో మూటను విప్పి, ధోవతులను తీసి, మడతలను విప్పి, ఒకటి మీద ఒకటి వేసుకుంటూ, బాబా తమ పక్కను తామే పరచుకునే వారు. 
సాఠ పాసష్ట శుభ్ర చాదరీ | ఘడియా మాండూనియా పుఢారీ | 
స్వయే తయాంచ్యా రచూని హారీ | పహుడతీ వరీ మగ బాబా | ||౨౧౬|| 
216. అరవై, లేక అరవై ఐదు తెల్లగా శుభ్రంగా ఉన్న దుప్పట్లను, తామే స్వయంగా, ఒకటి మీద ఒకటిని పరచుకుని, వానిపై పడుకునేవారు. 
ఏసియా చావడీచీ పరీ | ఇత్థంభూత ఝాలీ ఇథవరీ | 
ఆతా కథా జీ రాహిలీ దుసరీ | అధ్యాయాంతరీ వర్ణిజేల | ||౨౧౭|| 
217. అలాంటి చావడి కథను, జరిగినది జరిగినట్లుగా, ఇంతవరకూ చెప్పడం జరిగింది. ఇక రెండవ కథ తరువాతి అధ్యాయంలో వర్ణింపబడుతుంది. 
తరీ శ్రోతా కీజే క్షమా | అగాధ యా సాఈచా మహిమా | 
సంక్షిప్త వదతా రాహీ న సీమా | గురుత్వధర్మా పావే తో | ||౨౧౮|| 
218. శ్రోతలు క్షమించాలి. అంతులేని సాయి మహిమలను, కొద్దిలో చెప్పటానికి వీలు పడదు. అవి పెరుగుతూనే ఉంటాయి. 
ఆతా సాఈచీ హండీచీ కథా | ఆణీక జ్యా జ్యా రాహిల్యా వార్తా | 
పుఢీల అధ్యాయీ కథీన సమస్తా | సాదర చిత్తా అసావే | ||౨౧౯|| 
219. ఇక సాయియొక్క కొప్పెర కథ, మిగతా సంగతులు, తరువాతి అధ్యాయంలో చెప్తాను. శ్రద్ధగా వినండి. 
అఖండ గురుస్మరణ స్వార్థ | తోచ హేమాడా నిజ పరమార్థ | 
గురు చరణాభివందనే కృతార్థ | చారీహీ పురుషార్థ త్యాపోటీ | ||౨౨౦||
220. ఆపకుండా గురు స్మరణలో ఉండటమే, హేమాడు స్వార్థం. అదే అతని పరమార్థం కూడా. గురు పాదాలకు నమస్కరించడంలోనే ధన్యత పొందుతాడు. ఎందుకంటే, ఆ పాదాలలోనే నాలుగు పురుషార్థాలనూ పొందవచ్చు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | చావడీవర్ణనం నామ | 
| సప్తత్రీంశత్తమోధ్యాయః సంపూర్ణః |

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. గురుచ్యా. 2. కపాళావర. 3. స్నాన. 4. స్వాధీన కరా. 
5. పైలపార. 6. ఎక దివసాఆడ. 7. కృపేచా ఉత్సాహ. 
8. గరుడాచే చిత్ర అసలేలా ధ్వజ. 9. బాపూసాహేబ జోగ. 
10. కాకాసాహేబ దీక్షిత. 11. సూర్య. 12. సమాధాన. 
13. ఛత. 14. టేకూ.

 

Wednesday, August 14, 2013

||సాఈసర్వవ్యాపకతా తదాశీర్వచన సాఫల్యతానామ శట్‍త్రింశత్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౩౬ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

ఆతా గతాధ్యాయానుసంధాన | రమ్య చౌర్యకథానిరూపణ | 
దిధలే హోతే ఆశ్వాసన | దత్తావధాన వ్హా తయా | ||౧|| 
1. పోయిన అధ్యాయాన్ని ఇప్పుడు ముందుకు సాగిద్దాము. ఆసక్తి కలిగించే దొంగతనపు కథను చెబుతానని చెప్పాను. శ్రోతలు దానిని శ్రద్ధగా వినండి.
కథా నవ్హే హే స్వానందజీవన | పీతా వాఢేల తృష్ణా దారుణ | 
తియేచేహీ కరాయా శమన | కథాంతర కథన హోఈల | ||౨|| 
2. ఇది కథ కాదు. ఇది ఒక ఆత్మానంద రసం. దీనిని త్రాగిన కొద్దీ, దాహం ఎక్కువ అవుతుంది. ఆ దాహాన్ని తీర్చటానికి మరొక కథను చెప్పాల్సి వస్తుంది. 
జేణే శ్రవణే సుఖావే శ్రోతా | ఏసీ రసాళ తీ హీ కథా | 
నివారే సంసారశ్రాంతవ్యథా | సుఖావస్థా ఆతుడే | ||౩|| 
3. దాని వలన శ్రోతలకు వినటంలో ఎంతో సుఖం కలుగుతుంది. ఇప్పుడు చెప్పే కథ ఎంతో ఆసక్తికరంగా ఉండటం వలన, శ్రోతలు విని ఆనందిస్తారు. సంసారంలోని కష్టాలన్నీ తొలగించి, వారికి ఆనందాన్ని, శాంతిని కలుగ చేస్తుంది. 
నిజహిత సాధావయాచీ కామనా | అసేల జయా సభాగ్యాచ్యా మనా | 
తయానే సాఈకథానిరూపణా | సాదర శ్రవణా అసావే | ||౪|| 
4. తన మేలును సాధించాలని అనుకునే భాగ్యవంతులు, సాయి కథల వర్ణనలను శ్రద్ధగా, భక్తితో వినండి. 
సంత మహిమా అపరంపార | కవణా న వర్ణవే సాచార | 
తేథే కాయ మాఝా అధికార | జాణీవ సాచార హీ మజలా | ||౫|| 
5. సాధు సంతుల మహిమలను మొత్తం ఎవరూ వర్ణించలేరు. అలాంటిది నాకు ఆ అర్హత ఎక్కడిది? లేదని నాకు బాగా తెలుసు. 
ఇతుక్యా పురే వక్త్యాచే మీపణ | సాఈ లాఘవీ ఘేఊన ఆపణ | 
కోణాహీ కరవీ నిజగుణకథన | కరవీ శ్రవణ నిజభక్తా | ||౬|| 
6. నా ఈ కొద్ది అహంకారాన్ని కూడా సాయి తమ ప్రేమతో తొలగించారు. ఎవరి చేతనైనా, సాయి తమ వైభవాన్ని తామే వర్ణింప చేసి, భక్తులు వినేటట్టు చేస్తారు. 
తో హా పరాత్పరసరోవర హంస | హంసోసోహంవృత్తి1 ఉదాస | 
బ్రహ్మ ముక్తసేవనోల్లాస2 | అసమసాహస3 జయాస | ||౭|| 
7. దేవుడనే సరోవరంలో విహరించే సాయి అనే హంస, ‘హంసః సోహం’ అని అనుకొని, దేనిలోనూ ఆసక్తి లేక, బ్రహ్మ రూపంలో ఉన్న ముత్యాలను, ఎంతో ఉత్సాహంతో, ఆహారంగా తీసుకుంటుంది. 
జయా నసతా నావ గావ | అంగీ అపరంపార వైభవ | 
క్షణే కరీల రంకాచా రావ | భ్రుకుటీ4 లాఘవ హే జ్యాచే | ||౮|| 
8. వారికి ఊరూ లేదు, పేరూ లేదు. కాని విపరీతమైన వైభవం ఉంది. ఒక క్షణంలో, తమ చూపులోని శక్తితో, పేదవాణ్ణి రాజుగా మార్చగలరు. ఇది వారి అద్భుతమైన లీల. 
తో హా తత్వజ్ఞానావతార | దావీ సాక్షిత్వే సాక్షాత్కార | 
నామానిరాళా రాహూని దూర | ఘడవీ ప్రకార నానావిధ | ||౯|| 
9. బ్రహ్మజ్ఞానమే మూర్తీభవించినట్లు ఉన్న వారు, పేరు ప్రతిష్ఠలకు చాలా దూరం. అయినా, ఎన్నో రకాల అనుభవాలతో, భక్తులకు సాక్షాత్కారాన్ని కలగచేస్తారు. 
తో జయావరీ కరీ కృపా | దావీ తయా వివిధరూపా | 
అఘటిత ఘటనా రచీ అమూపా | ప్రౌఢ ప్రతాపా పరిసా త్యా | ||౧౦||
10. వారు ఎవరిని అనుగ్రహిస్తారో, వారికోసం ఎన్నో అనుభవాలను కలిగించి, తమ వివిధ రూపాలను చూపుతారు. వారి కోసం లెక్కలేనన్ని ఘటనలను పుట్టిస్తారు. వారి అపారమైన మహిమను గురించి వినండి. 

తయా జే జే ఆకళితీ ధ్యానే | అథవా గాతీ ప్రేమళ భజనే | 
పడోంనేదీ తయాంచే ఉణే | సాంభాళీ పూర్ణపణే తయాంతే | ||౧౧|| 
11. ధ్యానం చేసి, వారిని తెలుసుకోవాలనే వారిని, లేదా భక్తిగా వారిని పాడేవారిని, పూర్తిగా రక్షించి, ఏ లోటూ లేకుండా, వారి కోరికలను తీర్చుతారు. 
ఆవడ నిజ కథాంచీ బహుత | మ్హణోని ఆఠవ దేఈ అనవరత5
కరోని శ్రోత్యావక్త్యాంచే నిమిత్త | పురవీ మనోరథ భక్తాంచే | ||౧౨|| 
12. తమ కథలంటే సాయికి చాలా ఇష్టం. అందుకే ఎప్పుడూ వానిని గుర్తుకు తెచ్చి, చెప్పేవారిని, వినేవారిని, నిమిత్త మాత్రులుగా చేసి, భక్తుల కోరికలను తీర్చుతారు. 
పరమార్థాచా పూర్ణ అభిమానీ | ప్రపంచావర సోడోనీ పాణీ | 
జయానే జోడిలా చక్రపాణీ | అనంత ప్రాణీ ఉద్ధరిలే | ||౧౩|| 
13. తన సాంసారిక జీవితాన్ని పూర్తిగా వదులుకొని, పరమార్థాన్నే పూర్తిగా ఆశ్రయించి, చక్రపాణినే (శ్రీ విష్ణు) నమ్మిన వారిని ఎందరినో, వారు ఉద్ధరించారు. 
దేశీ విదేశీ జయాతే భజత | భక్తిధ్వజ జయాచా ఫడకత | 
దీనా దుబళ్యా పాలవీత6 | కామనా పురవీత సకళాంచ్యా | ||౧౪|| 
14. ఎన్నో దేశవిదేశాల వారు వారిని ఆరాధిస్తారు. వారి భక్తి పతాకం ఎప్పుడూ ఎగురుతుంటుంది. దీనులను, పేదలను ఎప్పుడూ కాపాడుతూ, అందరి కోరికలను తీర్చుతారు. 
అసో ఆతా హే పరమ పవిత్ర | పరిసా సాదర సాఈచరిత్ర | 
శ్రోత్యా వక్త్యాంచే శ్రోత్ర వక్త్ర | పావన సర్వత్ర హోవోత | ||౧౫|| 
15. చెప్పేవాని నోటిని, వినేవారి చెవులనూ పావనం చేసే, పరమ పవిత్రమైన ఈ సాయి చరిత్రను భక్తిగా, శ్రద్ధతో వినండి. 
గోమాంతకస్థ దోఘే గృహస్థ | ఆలే సాఈ దర్శనార్థ | 
దోఘేహీ సాఈ చరణీ వినటత | హోఊని ఆనందిత దర్శనే | ||౧౬|| 
16. సాయిని దర్శించుకోవాలని ఇద్దరు వ్యక్తులు గోవానుండి వచ్చారు. దర్శనంతో ఆనందించి, వారిద్దరూ, సాయి పాదాలకు నమస్కారం చేశారు. 
దోఘే జరీ బరోబర యేత | సాఈ దక్షిణా ఎకాసిచ మాగత | 
పంధరా రుపయే దే మజ మ్హణత | తో మగ తే దేత ఆనందే | ||౧౭|| 
17. ఇద్దరూ కలిసే వచ్చినా, అందులో ఒకరినే సాయి “నాకు పదిహేను రూపాయలు దక్షిణను ఇవ్వు” అని అడగగా, అతడు ఆనందంగా ఇచ్చాడు. 
దుజియా పాశీ కాంహీ న మాగతా | ఆపణ హోఊన పసతీస7 దేతా | 
సాఈ తాత్కాళ తే అవ్హేరితా | అతి ఆశ్చర్యతా తయాతే | ||౧౮|| 
18. రెండవ వ్యక్తి, అసలు అడగకుండానే, తనంతట తానే, ముప్పై ఐదు రూపాయలను ఇచ్చాడు. కాని, సాయి దానిని వెంటనే తిరిగిచ్చే సరికి, అతనికి ఆశ్చర్యం కలిగింది. 
ఏసియా తయా సమయాతే | మాధవరావహీ8 తేథేంచ హోతే | 
పాహూనియా త్యా విషమతేతే9 | పుసతీ సాఈతే తే పరిసా | ||౧౯|| 
19. అప్పుడు మాధవరావు కూడా అక్కడే ఉన్నాడు. జరిగిన భేద భావాన్ని చూసి, సాయిని ఏమని అడిగాడో వినండి. 
బాబా ఏసే కైసే కరితా | దోఘే స్నేహీ బరోబర యేతా | 
ఎకాచీ దక్షిణా మాగూన ఘేతా | పరతతా దేతా స్వయే దుజా | ||౨౦||
20. ‘బాబా! నువ్వెందుకిలా చేసావు? స్నేహితులిద్దరూ కలిసి వచ్చారు. ఒకరిని అడిగి మరీ దక్షిణను తీసుకున్నారు. రెండవ ఆయన, తనంతట తానే ఇచ్చినా, తిరిగిచ్చేసి, ఆయనను నిరాశ పరిచారు. 

సంతాపాసీ కా హీ విషమతా | ఆపణ హోఊని ఎకా మాగతా | 
స్వేచ్ఛే కోణీ దేతా పరతతా | హిరమోడ కరితా తయాచా | ||౨౧|| 
21. ‘సత్పురుషుల దగ్గర ఇలాంటి భేదభావమెందుకు? మీ అంతట మీరు ఒకరిని అడిగారు. తమంతట తామే ఇంకొకరు ఇస్తే, దానిని తిరిగిచ్చి, అతనిని నిరాశ పరచారు.
అల్పవిత్తీ ధరితా ప్రీతీ | బహుతా లాగీ నిర్లోభ వృత్తీ | 
అసతో మీ జరీ అపులే స్థితి | ఏసీ న రీతీ ఆచరితో | ||౨౨|| 
22. ‘కొంచెం డబ్బునేమో ప్రేమగా తీసుకుని, ఎక్కువ డబ్బుకు ఆశ పడలేదు. నేనే మీ స్థితిలో ఉంటే, ఇలా ఖచ్చితంగా చేసేవాణ్ణి కాదు’ అని అన్నాడు. 
“శామ్యా తుజలా ఠాఊక నాహీ | మీ తో కోణాచే కాంహీ న ఘేఈ | 
యేణే10 మాగే మశీదఆయి11 | ఋణముక్త హోఈ దేణారా | ||౨౩|| 
23. “శామ్యా! నీకేమీ అర్థం కాదు. నేను ఎవరి దగ్గరనుండీ, ఏమీ తీసుకోను. ఇక్కడున్న మసీదు మాత, బాకీ ఉన్న డబ్బును అడుగుతుంది. అది ఇచ్చి, వారు రుణాన్ని తీర్చుకుంటారు. 
మజలా కాయ ఆహే ఘర | కివా మాఝా ఆహే సంసార | 
జే మజ లాగే విత్తాచీ జరూర | మీ తో నిర్ఘోర సర్వాపరీ12 | ||౨౪|| 
24. “నాకేమైనా ఇల్లుందా? లేక నాకేమైనా సంసారం ఉందా? నాకు డబ్బుతో అవసరం ఏమిటి? అన్ని విధాల నేను ఏ చింతా లేకుండా ఉన్నాను. 
పరీ ఋణ వైర ఆణి హత్యా | కల్పాంతీహీ న చుకతీ కర్త్యా13
దేవీ నవసితీ గరజే పురత్యా | మజ ఉద్ధరిత్యా14 సాయాస | ||౨౫|| 
25. “కాని, అప్పు, శత్రుత్వం, హత్య చేసిన వారిని, అవి కాలం ముగిసే వరకూ విడిచి పెట్టవు. వారికి పని పడినప్పుడు, జనం దేవతలకు మ్రొక్కుకుంటారు. ఆ మ్రొక్కునించి వారిని ముక్తులని చేయటానికి నేను కష్ట పడాలి. 
తుమ్హాంస నాహీ త్యాచీ కాళజీ | వేళే పురతీ కరితా అజీజీ15
అనృణీ16 జో భక్తాంమాజీ | తయా మీ రాజీ సదైవ | ||౨౬|| 
26. “మీకు అలాంటి చింతలేవీ లేవు. మీ అవసరాలు తీర్చుకోవటానికి, మీరు మ్రొక్కుకుని వేడుకుంటారు. రుణాన్ని తీర్చుకున్న భక్తులంటే నాకు ఎప్పుడూ ప్రీతి పాత్రులు. 
ఆరంభీ హా అంకిచన17 తయాసీ | పంధరా18 దేతాంచ కేలే నవసాసీ | 
పహిలా ముశాహిరా19 దేఈన దేవాసీ | భూల తయాసీ పడలీ పుఢే | ||౨౭|| 
27. “మునుపు ఇతడు పేదవాడు. మొదటి జీతం రాగానే, దేవునికి ఇస్తానని మొక్కుకుని, పదిహేను రూపాయల జీతం వచ్చిన తరువాత, మరచిపోయాడు. 
పంధ్రాచే తీస ఝాలే నంతర | తిసాచే సాఠ, సాఠాంచే శంభర | 
దుప్పట చౌపట వాఢతా పగార | బళావలా విసర20 అత్యంత | ||౨౮|| 
28. “కొంత కాలానికి ఆ పదిహేను రూపాయల జీతం, ముప్పై అయ్యింది. ముప్పైనుండి, అరవై, అరవైనుండి నూరు, అలా రెండింతలు, నాలుగింతలుగా జీతం పెరిగింది. అలాగే అతని మరపు కూడా బాగా పెరిగింది. 
హోతా హోతా జాహలే సాతశే | పాతలే యేథే నిజకర్మవశే | 
 తేవ్హా మీ మాఝే పంధరా హే ఏసే | దక్షిణా మిషే మాగితలే” | ||౨౯|| 
29. “అలా పెరిగి, పెరిగి అతని జీతం ఏడువందల రూపాయలు అయ్యింది. అదృష్టవశాత్తు, తన కర్మకొద్దీ, ఇక్కడికి వచ్చాడు. దాంతో నేను దక్షిణ నెపంతో, ఆ పదిహేను రూపాయలను అడిగాను. 
“ఆతా ఏక దుసరీ గోఠీ21 | ఫిరతా ఎకదా సముద్రకాఠీ | 
లాగలీ ఎక హవేలీ మోఠీ | బైసలే ఓటీవర తియేచ్యా | ||౩౦||
30. “ఇక రెండవ కథ విను. ఒక సారి, సముద్ర తీరంలో పోతుండగా, ఒక పెద్ద ఇల్లు కనిపించింది. అక్కడ వరండాలో కూర్చున్నా. 

హవేలీచా బ్రాహ్మణ మాలక | హోతా కులీన మోఠా ధనిక | 
కేలే స్వాగత ప్రేమపూర్వక | యథేష్ట అన్నోదక అర్పునీ | ||౩౧|| 
31. “ఆ ఇంటి యజమాని, బ్రాహ్మణుడు. మంచి వంశంలో పుట్టిన ధనికుడు. నన్ను ప్రేమగా పిలిచి, నాకు అన్న పానీయాలను తృప్తిగా పెట్టాడు. 
తేథేంచ ఎకా ఫడతాళా పాసీ | స్వచ్ఛ సుందర జాగా ఖాశీ | 
దిధలీ మజలా నిజావయాశీ | నిద్రా మజసీ లాగలీ | ||౩౨|| 
32. “అక్కడే ఉన్న అలమారా దగ్గర, నేను పడుకోవటానికి, శుభ్రమైన ప్రత్యేక చోటును ఇచ్చాడు. నాకు బాగా నిద్ర పట్టింది. 
పాహూని ఝోంప లాగలీ సుస్త | దగడ సారూని ఫోడిలీ భింత | 
ఖిసా మాఝా కాతరిలా నకళత | నాగవిలే సమస్త మజ త్యానే | ||౩౩|| 
33. “నేను బాగా నిద్రపోతున్నదాన్ని చూసి, అతడు గోడలోని ఒక రాతిని ఊడబెరకి, గోడకు కన్నం వేసి, నాకు తెలియకుండానే నా జేబును కత్తిరించి, నన్ను పూర్తిగా దోచుకున్నాడు. 
జాగా హోతా హే జంవ కళలే | ఎకాఎకీ రడూ కోసళలే | 
రుపయే తీస హజార గేలే | మన హళహళలే అత్యంత | ||౩౪|| 
34. “నేను మేలుకొన్న తరువాత, జరిగినది తెలియగానే, వెంటనే బాగా ఏడుపు వచ్చింది. ముప్పై వేల రూపాయలు పోయినవి. మనసుకు చాలా దుఃఖం కలిగింది. 
త్యాతో హోత్యా అవఘ్యా నోటా | హోతా ఏసా అవచిత తోటా | 
భరలా మాఝే హృదయీ ధడకా | బ్రాహ్మణ ఉలటా సమజావీ | ||౩౫|| 
35. “ఆ డబ్బంతా నోట్ల కట్టలుగా ఉండేది. అనుకోకుండా అంత నష్టం వచ్చేసరికి, నా గుండె చెదిరి పోయింది. పైగా, బ్రాహ్మణుడు నన్ను ఓదార్చ సాగాడు. 
గోడ న లాగే అన్నపాణీ | హోఊని ఏసా దీనవాణీ | 
పంధరా దివస తేచ ఠికాణీ | రాహిలో బైసూని ఓటీవర | ||౩౬|| 
36. “అన్న పానీయాలు నాకు రుచించలేదు. అలా పదిహేను రోజులు, అక్కడే వరండాలో, ఏడుపు మొహంతో కూర్చున్నాను. 
పంధరావా దివస సంపతా | సవాల కరీత రస్త్యానే ఫిరతా | 
ఫకీర ఎక ఆలా అవచితా | మజ రడతాంనా పాహిలే | ||౩౭|| 
37. “పదిహేనవ రోజు పూర్తవతుండగా, అకస్మాత్తుగా, దేవుని గురించి గట్టిగా ప్రశ్నలను అడుగుతూ, ఆ దారి వెంట పోతున్న ఒక ఫకీరు, నేను ఏడుస్తుండటం చూశాడు. 
పుసే తో మజ దుఃఖాచే కారణ | కేలే మ్యాతే సమస్త నివేదన | 
తో మ్హణే హే హోఈల నివారణ | కరిశీల సాంగేన మీ తైసే | ||౩౮|| 
38. “నేనెందుకు వ్యథలో ఉన్నానని అడిగాడు. జరిగినదంతా నేను అతనికి చెప్పాను. ‘నేను చెప్పినట్లు నువ్వు చేస్తే, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. 
ఫకీర ఎక తుజ సాంగేన | దేఈన త్యాచే ఠావఠికాణ | 
తయాలాగీ జాఈ తూ శరణ | తో తుజ దేఈల ధన తుఝే | ||౩౯|| 
39. “ ‘నీకు ఒక ఫకీరు ఉండే చోటు, మరియు వారి గురించి చెప్పుతాను. నీవు వారి శరణు వేడుకో. వారు నీ డబ్బును నీకు మరల దొరికేటట్లు చేస్తారు. 
పరీ మీ సాంగే తే ఆచరే వ్రత | ఇచ్ఛితార్థ ప్రాప్తీపర్యంత | 
త్యాగ తుఝా ఆవడతా పదార్థ | తేణే తవ కార్యార్థ సాధేల | ||౪౦||
40. “ ‘కాని, నీవు కోరుకున్నది నీకు దొరికే వరకు, నేను చెప్పిన విధంగా వ్రతాన్ని పాటించాలి. నీకు చాలా ఇష్టమైన ఒక వస్తువును వదిలి పెట్టు. దానివల్ల నీవనుకున్నది జరుగుతుంది’ అని చెప్పాడు. 

ఏసే కరితా ఫకీర భేటలా | పైకా మాఝా మజలా మిళాలా | 
మగ మీ తో వాడా22 సోడిలా | కినారా23 ధరిలా పూర్వవత | ||౪౧|| 
41. “ ‘ఆయన చెప్పినట్లు చేయగా, ఆ ఫకీరు కలిశారు. నా డబ్బు నాకు తిరిగి దొరికింది. తరువాత, నేను ఆ ఇంటిని విడిచి పెట్టాను. మునుపటిలాగే, మరల సముద్ర తీరానికి వచ్చాను.
మార్గ క్రరితా లాగలీ నావ24 | హోఈ న తేథే మజ శిరకావ | 
తో ఎక శిపాఈ సుస్వభావ | దేఈ మజ ఠావ నావేంత | ||౪౨|| 
42. “అలా నడుస్తుండగా, ఒక నావ కనిపించింది. కాని, అందులో నేను వెళ్ళలేక పోయాను. అయినా, ఒక మంచి సిపాయి వలన, నాకు నావలో చోటు దొరికింది.
లాగోని సుదైవాచా వారా | ఆలీ నావ తీ పరతీరా | 
గాడీంత బైసలో ఆలో జంవ ఘరా | దిసలీయా నేత్రా మశీదమాఈ” | ||౪౩|| 
43. “గాలి అనుకూలంగా ఉండటం వలన, నావ తీరానికి చేరుకుంది. బండిలో కూర్చుని, ఇంటికి రాగా, మసీదు మాత నా ఈ కళ్ళకు కనిపించింది”.
యేథే బాబాంచీ గోష్ట సరలీ | పుఢే శామాసీ ఆజ్ఞా ఝాలీ | 
ఘేఊని జాఈ హీ పాహుణే మండళీ | జేఊ త్యా ఘాలీ ఘరాసీ | ||౪౪|| 
44. ఇంతటితో, బాబా చెప్పటం ముగిసింది. “ఈ అతిథులను ఇంటికి తీసుకుని వెళ్ళి, భోజనం పెట్టు” అని శ్యామాకు బాబా ఆజ్ఞాపించారు.
అసో; పుఢే పాత్రే వాఢిలీ | మాధవరావాంస జిజ్ఞాసా ఝాలీ | 
పాహుణ్యాలాగీ పృచ్ఛా కేలీ | గోష్ట తీ పటలీ కీ తుమ్హా | ||౪౫|| 
45. తరువాత వారికి పళ్ళేలలో భోజనాన్ని వడ్డించి, ఎంతో కుతూహలంగా మాధవరావు, ‘బాబా చెప్పిన సంగతులు మీకేమైనా అర్థమైందా?’ అని అడిగాడు.
పాహూ జాతా వాస్తవీక | సాఈబాబా ఇథలే స్థాయిక | 
నాహీ సముద్ర నావ నావిక | తయా హే ఠాఊక కేవ్హాంహీ | ||౪౬|| 
46. ‘నిజంగా చూస్తే, సాయిబాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. అలాంటిది, సముద్రం, నావ, నావికుడు, వారికెలా తెలుస్తుంది?
కైచా బ్రాహ్మణ కైచీ హవేలీ | జన్మ గేలా వృక్షాచే తళీ | 
కోఠూని ఎవఢీ సంపత్తి ఆణిలీ | జీ మగ చోరిలీ చోరానే | ||౪౭|| 
47. ‘ఎక్కడి బ్రాహ్మణుడు, ఎక్కడి ఇల్లు? వారి జన్మంతా చెట్టు క్రిందే గడిచినప్పుడు, దొంగలు దోచుకుని పోయేటంత సంపద వారికెక్కడనుంచి వచ్చింది?
మ్హణోని హీ గోష్ట నివేదిలీ | తీహీ తుమ్హీ యేతాంచ ఆరంభిలీ | 
ఎణేమిషే తుమ్హాంసీ పటవిలీ | వాటే ఘడలేలీ పూర్వ కథా | ||౪౮|| 
48. ‘ఈ సంగతిని మీరు రాగానే చెప్పటం మొదలుపెట్టారు. కనుక, ఇది మీకు సంబంధించిన మునుపటి కథ కావచ్చు. మీకు గుర్తు చేయటానికి చెప్పినట్లుంది’ అని అన్నాడు.
తేవ్హా పాహుణే హోఊని సద్గద | మ్హణాలే సాఈ ఆహేత సర్వవిద25
పరబ్రహ్మ అవతార నిర్ద్వంద్వ | అద్వైత అభేద వ్యాపక | ||౪౯|| 
49. అది విని, వచ్చినవారు గద్గదులై, ‘సాయిబాబా సర్వజ్ఞులు, పరబ్రహ్మావతారం, విరుద్ధ భావాలు లేనివారు. ఏ భేదభావం లేనివారు, అన్ని చోట్లా ఉండేవారు.
తయాంనీ జీ కథిలీ ఆతా | అక్షరే అక్షర తీ అముచీచ కథా | 
చలా హే గోడ భోజన సరతా | కథితో సవిస్తరతా తుమ్హాంతే | ||౫౦||
50. ‘ఇప్పుడు వారు చెప్పిన కథలోని ప్రతి అక్షరం మా కథే. ఎంతో గొప్పగా ఉన్న ఈ భోజనమయాక, మీకు విస్తారంగా చెప్పుతాను.

బాబా జే జే బోలూన గేలే | తే తే సర్వచి కీ ఘడలేలే | 
ఓళఖ నసతా త్యా కైసే కళలే | మ్హణూన సగళే అఘటిత హే | ||౫౧|| 
51. ‘బాబా చెప్పినదంతా నిజంగా జరిగినదే. కాని, మేము వారికి తెలియకున్నా, మా గురించి ఇన్ని వివరాలు ఎలా తెలుసుకున్నారు? అందుకే ఇది చాలా చాలా వింతగా ఉంది’ అని చెప్పారు. 
అసో; పురే హోతా భోజన | మాధవరావా సహ వర్తమాన | 
చాలలే అసతా తాంబూల చర్వణ | కథానిరూపణ ఆరంభిలే | ||౫౨|| 
52. భోజనం అయిన తరువాత, మాధవరావుతో తాంబూలాన్ని నములుతూ, వారు తమ కథా వర్ణనను మొదలు పెట్టారు.
వదే దోఘాంమాజీల ఎక | ఘాటచి మాఝా మూళ ములూఖ | 
పరీ త్యా సముద్రపట్టీచా దేఖ | హోతా అన్నోదక సంబంధ | ||౫౩|| 
53. వారిద్దరిలో ఒకరు ఇలా చెప్పసాగారు. ‘నా మూల స్థానం సహ్యాద్రి కొండల ప్రాంతం. కాని, బ్రతుకు తెరువు కోసం, సముద్ర తీరంతో సంబంధం ఏర్పడింది.
తదర్థ గేలో గోమాంతకాంత | నోకరీ మిళవావీ ఆలే మనాంత | 
ఆరాధిలా తత్‍ ప్రీత్యర్థ దత్త | నవసిలా అత్యంత ఆదరే | ||౫౪|| 
54. ‘అందుకోసం, ఉద్యోగం వెతుక్కుంటూ గోవాకు వెళ్ళాను. ఉద్యోగం తొందరగా దొరకాలనే ఆశతో దత్త భగవానుని వేడుకున్నాను. ఎంతో భక్తిగా మొక్కుకున్నాను.
దేవా-కుటుంబ రక్షణార్థ | నోకరీ కరణే ఆహే ప్రాప్త | 
తరీ హోఊని కృపావంత | దేఈ తీ, లాగత పాయాంస | ||౫౫|| 
55. ‘దేవా! కుటుంబాన్ని పోషించటానికి, ఏదో ఒక ఉద్యోగం కావాలి. కరుణామయా! నేను నీ శరణుజొచ్చాను. నాకొక ఉద్యోగాన్ని ఇవ్వు.
అద్య ప్రభృతి అల్పావకాశీ | జరీ తూ నిజ బ్రీద రాఖిశీ | 
ప్రాప్తీ జీ హోఈల ప్రథమ మాసీ | సమగ్ర తుజసీ అర్పీన | ||౫౬|| 
56. ‘ ‘ఈ రోజునుంచి, తొందరగా నీ మాట నిలబెట్టుకుంటే, నా మొదటి నెల జీతమంతా నీకు అర్పిస్తాను’ అని మొక్కుకున్నాను.
భాగ్యే దత్త ప్రసన్న ఝాలా | అల్పావకాశీ నవసా పావలా | 
రుపయే పంధరా పగార మజలా | మిళూ లాగలా ఆరంభీ | ||౫౭|| 
57. ‘నా అదృష్టం కొద్దీ, దత్త భగవానుడు కరుణించాడు. తొందరలోనే మొక్కు ఫలించింది. నాకు మొదటి నెల జీతం పదిహేను రూపాయలు వచ్చింది.
పుఢే సాఈబాబాంనీ వర్ణిలీ | తైశీచ మాఝీ బఢతీ జాహలీ | 
సయ26 నవసాచీ సమూళ బుజాలీ | తీ మజ దిధలీ యే రీతీ | ||౫౮|| 
58. ‘తరువాత, సాయిబాబా చెప్పినట్లే, నా జీతం పెరిగింది. కాని, నా మొక్కును పూర్తిగా మరచి పోయాను. దానినే వారు ఇప్పుడు గుర్తుకు తెచ్చారు.
కోణాస వాటేల ఘేతలీ దక్షిణా | దక్షిణా నవ్హే తీ ఫేడిలే ఋణా | 
దిధలే ఎణే మిషే మజ స్మరణా | అత్యంత పురాణ్యా నవసాచే | ||౫౯|| 
59. ‘వారు దక్షిణను తీసుకున్నారని ఎవరికైనా అనిపిస్తుందేమో కాని, అది దక్షిణ కాదు. వారు నా అప్పు తీరేటట్లు చేశారు. అలా, దక్షిణ అనే నెపంతో, నా పాత మొక్కును గుర్తు చేశారు’ అని చెప్పారు.
తాత్పర్య సాఈ ద్రవ్య న యాచీత | నిజభక్తాంసహీ యాచూ న దేత | 
అర్థ హా నిత్య అనర్థ మానీత | భక్తా న పాడిత తన్మోహీ | ||౬౦||
60. తాత్పర్యమేమిటంటే, సాయి డబ్బును అడగరు. అంతే కాదు, వారు తమ భక్తులను కూడ డబ్బు అడగనివ్వరు. డబ్బు ఎప్పుడూ అనర్థమని అనుకునేవారు కనుక, బాబా తమ భక్తులను డబ్బు మోహంలో పడనివ్వరు.

మ్హాళసాపతీసారిఖా భక్త | సదా సాఈపదీ అనురక్త | 
జరీ సంకటే చాలవీ చరితార్థ | తయా న లవ అర్థ జోడూ దే | ||౬౧|| 
61. ఎప్పుడూ వారి పాదాలనే ఆలోచించే మహల్సాపతివంటి భక్తుడు, ఎన్నో కష్టాలతో జీవితాన్ని గడుపుతున్నా, ఎవరి దగ్గరనుండీ ఏ మాత్రం డబ్బును సాయి తీసుకోనిచ్చే వారు కాదు.
స్వయే సాఈ లోకా అనేకదా | దక్షిణామిషే ఆలేలీ సంపదా | 
వాంటీ పరీ కపర్దిక కదా | దేఈ న ఆపదాత్రస్తా త్యా | ||౬౨|| 
62. దక్షిణగా వచ్చిన డబ్బును, సాయి స్వయంగా ఎందరికో పంచి పెట్టేవారు. కాని, కష్టాలలో ఉన్న మహల్సాపతికి మాత్రం, ఎప్పుడూ, కొంచెం కూడా ఇచ్చేవారు కాదు.
తోహీ మోఠా బాణేదార | జరీ సాఈ ఏసా ఉదార | 
కధీ న తేణే పసరిలా కర | యాచనా తత్పర హోఉనీ | ||౬౩|| 
63. అతడు కూడా చాలా ఆత్మగౌరవం ఉన్నవాడు. సాయి ఎంత ఉదారంగా ఉన్నా, ఎన్నడూ వారిని అతను చేయి చాచి అడగలేదు.
సాంపత్తిక స్థితీ నికృష్ట | పరీ వైరాగ్య అతి ఉత్కృష్ట | 
వేఠీ గరీబీచేహీ కష్ట | అల్పసంతుష్ట సర్వదా | ||౬౪|| 
64. అతని ఆర్థిక పరిస్థితి చాలా దరిద్రంగా ఉండేది. అయినా, అతనికి ఎంతో గొప్పదైన వైరాగ్యముండేది. పేదరికంతో బాధపడుతున్నా, ఉన్నదానితోనే అతను సంతోషంగా ఉండేవాడు.
ఎకదా ఎక దయాళూ వ్యాపారీ | హంసరాజ అభిధానధారీ | 
మ్హాళసాపతీస కాంహీతరీ | ద్యావేసే అంతరీ వాటలే | ||౬౫|| 
65. జాలి గుండే గల హంసరాజు అనే ఒక వ్యాపారికి, ఒక సారి, మహల్సాపతికి ఏమైనా ఇవ్వాలని అనిపించింది.
పాహూని గరిబీచా సంసార | కరావా శక్య తో ఉపకార | 
లావావా కాంహీ హాతభార | సహజ సువిచార హా స్ఫురలా | ||౬౬|| 
66. అతని పేద సంసారం చూసి, తన చేతనైన సహాయం చేయాలనే, మంచి బుద్ధి ఆ వ్యాపారికి కలిగింది.
ఏసీ జరీ తయాచీ అవస్థా | ఇతర కోణీహీ దేఊ జాతా | 
తేంహీ నావడే సాఈనాథా | ద్రవ్యీ ఉదాసతా ఆవడే | ||౬౭|| 
67. అతను ఎంత పేదతనంలో ఉన్నా, ఇతరులెవరైనా అతనికి సహాయం చేయాలని అనుకున్నా, అది సాయినాథునికి నచ్చేది కాదు. డబ్బు మీద ఆసక్తి చూపటం వారికి ఇష్టముండదు.
మగ తో వ్యాపారీ కాయ కరీ | ద్రవూని త్యా భక్తార్థ అంతరీ | 
దోఘేహీ సమక్ష అసతా దరబారీ | ద్రవ్య సారీత త్యాకరీ | ||౬౮|| 
68. అందుకు ఆ వ్యాపారి ఏమి చేశాడంటే, దర్బారులో సాయి, మహల్సాపతి ఇద్దరూ ఉన్నప్పుడు, ఎంతో కనికరంతో, కొంత డబ్బును మహల్సాపతి చేతిలో పెట్టాడు.
హోఊనియా అతి వినీత | మ్హాళసాపతీ కరీ తే పరత | 
మ్హణే సాఈంచియా ఆజ్ఞేవిరహిత | మజలా న కరవత స్వీకార | ||౬౯|| 
69. దానికి మహల్సాపతి, ఎంతో వినయంగా ఆ డబ్బును తిరిగి ఇచ్చేసి, ‘సాయి అనుమతి లేకుండా నేను తీసుకోను’ అని చెప్పాడు.
భక్త నవ్హతా హా పైశాచా | మోఠా భుకేలా పరమార్థాచా | 
పదీ వినటలా కాయావాచా | ప్రేమళ మనాచా నిఃస్వార్థీ | ||౭౦||
70. అతను డబ్బుకు భక్తుడు కాదు. పరమార్థం అంటే ఎంతో పరితపించే వాడు. ప్రేమ నిండిన హృదయంతో, నిస్వార్థంగా, తన దేహం, మనసు మరియు మాటను సాయి పాదాలకు అర్పించినవాడు.

హంసరాజ సాఈతే వినవీ | సాఈ ఎకా కవడీస న శివవీ | 
వదే మద్భక్తాంహీ ద్రవ్య న భులవీ | విత్తాచ్యా వైభవీ న గవే తో | ||౭౧|| 
71. అప్పుడు హంసరాజు సాయితో ‘బాబా! అతనిని కొంతైనా తాకనివ్వరే?’ అని అంటే, అందుకు వారు, “నా భక్తులను డబ్బు ఆకర్షించదు. వారు డబ్బు మోహంలో చిక్కుకో కూడదు” అని చెప్పారు. 
పుఢే మగ తో దుసరా పాహుణా | మ్హణే మాఝ్యాహీ పటల్యా ఖుణా | 
పరిసా కరితో సమగ్ర కథనా | యేఈల శ్రవణ ఉల్హాస | ||౭౨|| 
72. తరువాత రెండవ వ్యక్తి మొదలుపెట్టాడు. ‘నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది. నా కథనంతా చెప్తాను వినండి. వింటూంటే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
పస్తీస వర్షాంచా మాఝా బ్రాహ్మణ | నిరాలస ఆణి విశ్వాసూ పూర్ణ | 
దుర్దైవే బుద్ధిభ్రంశ హోఊన | కరీ తో హరణ మమ ఠేవా | ||౭౩|| 
73. ‘ముప్పై ఐదు ఏళ్ళనుండి నా దగ్గర ఎంతో నమ్మకంగా, శ్రద్ధగా పని చేస్తున్న బ్రాహ్మణునికి, దురదృష్టం కొద్దీ, బుద్ధి భ్రష్టు పట్టి, నేను కూడబెట్టిన డబ్బును దొంగిలించాడు.
మాఝియా ఘరాచ్యా భింతీత | ఫడతాళ ఆహే బసవిలే ఆంత | 
తేథీల చిరా సారూని అలగత27 | పాడిలే నకళత ఛిద్ర తయా | ||౭౪|| 
74. ‘మా ఇంటి గోడలోనే ఒక అలమారా అమర్చి ఉంది. ఆ గోడలోని ఇటుక రాయిని మెల్లగా ఊడదీసి, ఎవరికీ తెలియకుండా, కన్నం వేశాడు.
బాబా వర జే ఫడతాళ వదలే | త్యాసచి త్యానే ఛిద్ర పాడిలే | 
తదర్థ భింతీచే చిరే కాఢిలే | సర్వా నిజలేలే ఠేవూన | ||౭౫|| 
75. ‘అందరూ నిద్రించాక, బాబా చెప్పిన అలమారాలోనే, కన్నం వేయటానికని, గోడలోని రాయిని ఊడదీశాడు.
పుఢే బాబా ఆణీక వదలే | రుపయే మాఝే చోరూన నేలే | 
తేంహీ అవఘే సత్యత్వే భరలే | పుడకే నేలే నోటాంచే | ||౭౬|| 
76. ‘ “నా డబ్బు దొంగిలించ బడింది” అని బాబా చెప్పారు కదా! అదంతా కూడా నిజమే. అక్కడున్న నోట్ల కట్టను తీసుకుని పోయాడు.
తీస హజారచి త్యాంచీ కింమత | నకళే బాబాంస కైసే అవగత | 
శ్రమ సంపాదిత జాతా విత్త | బసలో మీ రడత అహర్నిశ | ||౭౭|| 
77. ‘అవి ముప్పై వెల రూపాయలు. ఇది బాబాకెలా తెలిసిందో అర్థం కావటం లేదు. కష్టపడి సంపాదించిన డబ్బు పోగా, రాత్రింబవళ్ళూ నేను ఏడుస్తూ కూర్చున్నా.
శోధ లావితా థకలీ మతి | నకళే కైశీ కరావీ గతి | 
పంధరా దివస చింతావర్తీ28 | పడలో నిర్గతీ లాగేనా | ||౭౮|| 
78. ‘వెదకివెదకి అలసిపోయాను. ఏం చేయాలో తెలియలేదు. పదిహేను రోజులు అలా చింతలో ఉన్నా. దానినుండి బయట పడే దారి కనిపించలేదు.
ఎకే దివశీ ఓటీవర | బసలో అసతా అతి దిలగీర | 
వాటేనే చాలలా ఎక ఫకీర | సవాల కరీత కరీత | ||౭౯|| 
79. ‘ఒక రోజు అలా దుఃఖంతో, వరాండాలో కూర్చుని ఉండగా, దైవాన్ని గురించిన ప్రశ్నలను గట్టిగా అడుగుతూ, ఆ దారిన ఒక ఫకీరు వెళ్తున్నాడు.
పాహూని మజ ఖిన్నవదన | ఫకీర పుసే ఖేదాచే కారణ | 
మగ మీ కరితా సాద్యంత నివేదన | సాంగే నివారణ తో మజ | ||౮౦||
80. ‘బాధ పడుతున్న నన్ను చూసి, నా దుఃఖానికి కారణం అడిగాడు. సంగతంతా నేను చెప్పగా, అతడు నాకు దుఃఖాన్ని తొలగించుకునే ఉపాయం చెప్పాడు.

కోపరగాంవ తాలుక్యాస | శిరడీ నామక ఎకా గాంవాస | 
కరీ సాఈ అవలియా వాస | కరీ తయాస తూ నవస | ||౮౧|| 
81. ‘ ‘కోపర్గాం తాలూకాలో, శిరిడీ అనే ఒక గ్రామంలో సాయి అనే ఒక అవలియా ఉన్నారు. నువ్వు వారికి మొక్కుకో.
ఆవడ తుఝీ జయావర | తయాచే సేవన వర్జ్య కర | 
“దర్శన తుమచే హోఈతోంవర | వర్జిలే” సాచార వద తయా | ||౮౨|| 
82. ‘ ‘నీకు చాలా ఇష్టమైన వస్తువును తినడం మానివేసి, ‘మీ దర్శనం అయ్యేవరకు నేను దీనిని తీసుకోను’ అని మొక్కుకో’.
ఏసే మజ ఫకీరే కథితా | అన్న వర్జిలే క్షణ న లాగతా | 
వదలో “బాబా చోరీ మిళతా | దర్శన హోతా సేవీన తే” | ||౮౩|| 
83. ‘అని ఆ ఫకీరు చెప్పిన వెంటనే, నేను అన్నం తినడం మానుకున్నాను. ‘బాబా! దొంగిలించబడ్డ నా డబ్బు దొరికాక, మీ దర్శనం చేసుకుని, తరువాత అన్నం తింటాను’ అని మొక్కుకున్నాను.
పుఢే ఎకచి పంధరవడా గేలా | నకళే కాయ ఆలే మనాలా | 
బ్రాహ్మణ ఆపణ హోఊన ఆలా | ఠేవా దిధలా మజ మాఝా | ||౮౪|| 
84. ‘అంతే! ఒక పదిహేను రోజులు గడిచే సరికి, బ్రాహ్మణుని మనసుకు ఏమి తోచిందో తెలియదు, కాని, అతడు తనంతట తానే వచ్చి, నా డబ్బును నాకు ఇచ్చేశాడు.
మ్హణే మాఝీ బుద్ధి చళలీ | తేణే హీ ఏసీ కృతీ ఘడలీ | 
ఆతా పాయీ డోఈ ఠేవిలీ | “క్షమా మీ కేలీ” ఏసే వదా | ||౮౫|| 
85. ‘ ‘నా బుద్ధి చెడిపోవటం వలన, నేను ఇలాంటి పని చేశాను. ఇప్పుడు మీ పాదాలపై నా తలనుంచుతున్నాను. నన్ను క్షమించానని చెప్పండి’ అని వేడుకున్నాడు.
అసో; పుఢే ఝాలే గోడ | సాఈదర్శనీ ఉదేలీ ఆవడ | 
తేంహీ ఆజ పురవిలే కోడ | ధన్య హీ జోడ భాగ్యాచీ | ||౮౬|| 
86. ‘అలా అంతా బాగానే జరిగింది. సాయిని చూడాలని మనసు చాలా ఆరాట పడ సాగింది. ఆ కోరిక కూడా, ఇవాళ తీరింది. ఇంత భాగ్యం నాకు కలిగినందుకు నేను చాలా ధన్యుణ్ణి.
అసతా ఖిన్న దుఃఖీ సంకటీ | బసలో అసతా ఆపులే ఓటీ | 
ఆలా జో మమ సాంత్వనాసాఠీ | పునరపి భేటీ న తయాచీ | ||౮౭|| 
87. ‘నేను కష్టంలో దుఃఖ పడుతూ, వరండాలో కూర్చుని ఉండగా, నాకు ధైర్యాన్ని కలిగించిన ఆ ఫకీరు మరల కనిపించలేదు.
జయా మాఝీ కళకళ పోటీ | జేణే కథిలీ సాఈచీ గోఠీ | 
జేణే దావిలీ శిరడీ బోటీ | పునరపి భేటీ న తయాచీ | ||౮౮|| 
88. ‘నా మీద కరుణతో, నాకు సాయిని గురించి చెప్పి, శిరిడీని చేతితో చూపించిన వారిని, మరల కలవలేదు.
జయాచీ మజ అవచి గాఠీ | సవాల ఘాలీత ఆలా జో వాక్పుటీ | 
నవస కరవూని గేలా శేవటీ | పునరపి భేటీ న తయాచీ | ||౮౯|| 
89. ‘అకస్మాత్తుగా నన్ను కలిసి, నా సంగతి అడిగి తెలుసుకుని, చివరకు నా మొక్కును తీర్చుకునేలా చేసిన వారు, మరల కలవలేదు.
తోచ ఫకీర వాటే సాచా | సాఈచ హా అవలియా తుమచా | 
లాభ ఆమ్హా నిజ దర్శనాచా | ద్యావయా లాచావలా స్వయే | ||౯౦||
90. ‘నిజంగా, ఆ ఫకీరే అవలియా అయిన ఈ సాయి అని నాకు అనిపిస్తుంది. నాకు వారి దర్శనాన్ని కలిగించటానికి, వారు కూడా ఎంతో ఉత్సాహ పడ్డారు.

కోణీ కాంహీ ఘేఊ లాచావతీ | మజ యా దర్శనీ ఇచ్ఛాహీ నవ్హతీ | 
ఫకీర ఆరంభీ కరీ ప్రవృత్తి | విత్త ప్రాప్తీ ప్రీత్యర్థ | ||౯౧|| 
91. ‘ఎవరైనా కాని, ఏదో ఒక కోరికతోనే, సాధువుల దర్శనానికి వెళ్ళుతారు. కాని, నాకు అసలు వీరిని చూడాలనే కోరికే లేదు. నా డబ్బు దొరకాలని, ఆ ఫకీరే మొదట వీరికి మొక్కుకొమ్మని ప్రోత్సాహించాడు. 
తేహీ విత్త జయాచ్యా నవసే | ప్రాప్త ఝాలే అప్రయాసే | 
తో కాయ మాఝ్యా యా పసతిసే29 | లాచావే ఏసే న ఘడేచ | ||౯౨|| 
92. ‘ఎవరికి మొక్కుకుంటే, ఎంతో సులభంగా నా డబ్బు దొరికిందో అలాంటివారు, ముప్పై అయిదు రూపాయలను ఆశించటం జరగదు.
ఉలట ఆమ్హీ అజ్ఞాన నర | ఆమ్హా కరావయా పరమార్థ తత్పర | 
ఆముచ్యా కల్యాణీ ఝటే నిరంతర | ఆణీ వాటేవర యా మిషే | ||౯౩|| 
93. ‘పైగా, అజ్ఞానులైన మనల్ని, పరమార్థంవైపు నడిపించటానికి, మనకు ఎల్లప్పుడూ మంచి చేయడానికి, వారు కష్ట పడతారు. దక్షిణ అనే నెపంతో, మనలను దారికి తీసుకువస్తారు.
ఎతదర్థచి హా అవతార | నా తో ఆమ్హీ అభక్త పామర | 
హోతా కైచా హా భవ పార | కరా కీ విచార స్వస్థపణే | ||౯౪|| 
94. ‘దానికోసమే ఈ అవతారం. లేకపోతే, ఏ భక్తీలేని వారమైన మనం, పామరులం, ఎలా ఈ సంసార సాగరాన్ని దాటగలం? బాగా ఆలోచించండి.
అసో; చోరీ మిళాల్యావర | ఝాలా మజ జో హర్ష ఫార | 
పరిణామీ పడలా నవసాచా విసర | మోహ దుర్ధర విత్తాచా | ||౯౫|| 
95. ‘అలా, నా డబ్బు దొరికిన సంతోషంలో, మొక్కుబడిని మరచిపోయాను. డబ్బు మీద మోహాన్ని తొలగించుకోవడం చాలా కష్టం.
పుఢే పహా ఎక దివస | అసతా కులాబ్యాచే బాజూస | 
స్వప్నీ పాహిలే మీ సాఈస | తైసాచ శిరడీస నిఘలో | ||౯౬|| 
96. ‘తరువాత, కులాబా (ముంబైలోని ఒక ప్రాంతం) దగ్గర ఉన్నప్పుడు, రాత్రి కలలో సాయిని చూశాను. వెంటనే, శిరిడీకి బయలుదేరాను.
సమర్థే కథిలా నిజప్రవాస | మనాఈ నావేంత చఢావయాస | 
శిపాయానే కరితా ప్రయాస | చుకలా సాయాస తే సత్య | ||౯౭|| 
97. ‘సాయి సమర్థులు తమ యాత్ర అని చెప్పినట్లే, నన్ను నావలో ఎక్కనివ్వక అడ్డుపడ్డారు. అప్పుడు, ఒక సిపాయి ప్రయత్నంతో, నా కష్టం తీరింది. ఇదీ నిజమే.
యా తో సర్వ మాఝ్యా అడచణీ | పాతలో జేవ్హా నావేచ్యా ఠికాణీ | 
ఖరేంచ ఎక శిపాఈ కోణీ | కరీ మనధరణీ మజసాఠీ | ||౯౮|| 
98. ‘ఇవన్నీ నా కష్టాలే. నేను రేవు వద్దకు వచ్చినప్పుడు, నిజంగానే ఎవరో ఒక సిపాయి, నా కోసం, వాళ్ళని వేడుకున్నాడు.
తేవ్హాంచ నావేచా అధికారీ | ఆరంభీ జరీ మజ ధిఃకారీ | 
దేఊని మజ వావ30 నావేవరీ | కేలే ఆభారీ మజ తేణే | ||౯౯|| 
99. ‘అంతకు ముందు నన్ను అడ్డగించిన నావ అధికారులు, నాకు నావలో చోటిచ్చి, నన్ను కృతజ్ఞుణ్ణి చేశారు.
శిపాఈహీ అగదీ అనోళఖీ | మ్హణే యాంచీ మాఝీ ఓళఖీ | 
మ్హణోని ఆమ్హా కోణీ న రోఖీ | బైసలో సుఖీ నావేంత | ||౧౦౦||
100. ‘ఆ సిపాయి ఎవరో నాకు అసలు తెలియదు. అయినా, నేను తనకి తెలుసని చెప్పగా, నావలో ఎవరూ నన్ను అడ్డగించలేదు. నావలో సుఖంగా కుర్చున్నాము.

ఏసీ హీ నావేచీ వార్తా | తైశీచ తీ శిపాయాచీ కథా | 
ఆమ్హాసంబంధే ఘడలీ అసతా | ఘేతీ నిజ మాథా సాఈ హే | ||౧౦౧|| 
101. ‘ఇదే ఆ నావ దగ్గర జరిగిన సిపాయి సంగతి. ఇది నాకు జరిగినా, సాయి దీనిని తమపై వేసుకున్నారు.
పాహూని ఏసీ అద్భుత స్థితి | కుంఠిత హోతే మాఝీ మతి | 
వాటే మజ ఇత్థంభూత జగతీ | భరలే అసతీ హే సాఈ | ||౧౦౨|| 
102. ‘ఈ అద్భుతమైన వింతను చూసి, నాకు మతి పోయింది. ఈ జగత్తంతా సాయియే నిండి ఉన్నట్లు, ఇప్పుడు నాకు అనిపిస్తోంది.
నాహీ అణూరేణూ పురతీ | జాగా యయాంచ్యావీణ రీతీ | 
ఆమ్హాంస జైసీ దిధలీ ప్రచీతీ | ఇతరాంహీ దేతీల తైశీచ | ||౧౦౩|| 
103. ‘వీరు లేకుండా, అణువంత చోటు కూడా లేదు. ఇలా, మాకు అనుభవాన్ని కలగజేసినట్లే, ఇతరులకు కూడా వీరు అలాగే అనుభవాలను కలిగిస్తారు.
ఆమ్హీ కోణ, వాస్తవ్య కోఠే | కేవఢే ఆముచే భాగ్య మోఠే | 
ఓఢూన ఆమ్హాంస నేటేపాటే | ఆణిలే వాటేవర హే ఏసే | ||౧౦౪|| 
104. ‘మేము ఎవరం? ఎక్కడి వారం? అయినా మా భాగ్యం ఎంత గొప్పదంటే, మమ్మల్ని తమ దగ్గరకు లాక్కొని వచ్చి, ఇలా చక్కని దారికి తీసుకుని వచ్చారు.
కాయ ఆమ్హీ నవస కరావా | కాయ ఆముచా ఠేవా చోరావా | 
కాయ నవస ఫేడీచా నవలావా | ఠేవాహీ మిళావా ఆయతా | ||౧౦౫|| 
105. ‘మేము మొక్కుకోవటం, మా డబ్బు దొంగిలించబడటం, ఆ మొక్కును ఎంత అద్భుతంగా తీర్చటం, ఎంత సులభంగా ఆ డబ్బు చేతికందటం!
కాయ ఆముచే భాగ్య గహన | నాహీ జయాచే పూర్వీ దర్శన | 
నాహీ చింతన నాహీ శ్రవణ | తయాహీ స్మరణ ఆముచే | ||౧౦౬|| 
106. ‘మా భాగ్యమెంత గొప్పది! మేము వారిని మునుపెప్పుడూ చూడలేదు. వారిని తలచుకోలేదు. కనీసం వారి గురించి విననైనా లేదు. అయినా, వారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు.
మగ తయాచియా సంగతీంత | వర్షానువర్షే జే జే వినటత | 
జే జే అహర్నిశ తత్పద సేవిత | భగవద్భక్త తే ధన్య | ||౧౦౭|| 
107. ‘ఇలాంటి వారి సహవాసంలో, ఇన్ని ఏళ్ళున్న వారు, రాత్రింబవళ్ళూ వారి పాదాలను సేవించే భగవద్భక్తులు, నిజంగా ధన్యులు.
జయాసంగే సాఈ ఖేళలే | హంసలే, బసలే, బోలలే, చాలలే | 
జేవలే, పహుడలే, రాగేజలే31 | భాగ్యాగళే32 తే సర్వ | ||౧౦౮|| 
108. ‘ఎవరెవరితో సాయి ఆడుకున్నారో, నవ్వారో, కూర్చున్నారో, నడిచారో, భోజనం చేశారో, పడుకున్నారో, కోపగించారో, వారందరూ ఎంతో అదృష్టవంతులు.
కాంహీంహీ న ఘడతా ఆమ్హా హాతీ | ఇతుకే ఆమ్హా జై కళవళతీ | 
తుమ్హాంతేహీ నిత్య సంగతీ | భాగ్య స్థితీ ధన్య తుమచీ | ||౧౦౯|| 
109. ‘చేతులారా వారికి మేము ఏ సేవ చేయకపోయినా, వారు మాపై ఇంత అనుగ్రహాన్ని చూపారు. ఎప్పుడూ వారి సహవాసంలో ఉన్న మీరు ధన్యులు, భాగ్యవంతులు.
వాటే తుమచ్యా పుణ్యార్జిత సత్కృతీ | ధారణ కరవూని మనుష్యాకృతీ | 
తుమ్హీంచ పరమ భాగ్యవంతీ | ఆణవిలీ హీ మూర్తీ శిరడీంత | ||౧౧౦||
110. ‘మీ మంచి పనులతో, మీరు సంపాదించుకున్న పుణ్యంతో, ఎంతో భాగ్యవంతులైన మీరే, మనిషి రూపంలో ఉన్న ఈ దివ్యమూర్తిని శిరిడీకి రప్పించినట్లు అనిపిస్తుంది.

అనంత పుణ్యాఈచ్యా కోడీ | తేణే ఆమ్హా లాధలీ శిరడీ | 
వాటే శ్రీసాంఈచ్యా దర్శనపరవడీ | కరావీ కురవండీ సర్వస్వీ | ||౧౧౧|| 
111. ‘అనంత కోటి జన్మల పుణ్యఫలం వలన, మాకు శిరిడీ రావటం జరిగింది. శ్రీసాయి దర్శన భాగ్యం కలగటానికి, ఉన్నదంతా అర్పించేయాలని అనిపిస్తుంది. 
సాఈ సజ్జన స్వయే అవతార | మహా వైష్ణవసా ఆచార | 
జ్ఞానద్రుమాచా కోంభచి సాచార | శోభే హా భాస్కర చిదంబరీ | ||౧౧౨|| 
112. ‘సాయి సజ్జనులు స్వయంగా అవతార పురుషులు. గొప్ప విష్ణు భక్తునిలా నడచుకుంటారు. నిజంగా వారు జ్ఞానమనే చెట్టుకు కొమ్మ. ఈ జ్ఞానమనే ఆకాశంలో ఎప్పుడూ వెలుగుతున్న సూర్యుడు వారు.
అసో, ఆముచీ హీ పుణ్యాఈ | మ్హణోని భేటే హీ మశీద ఆఈ | 
నవస ఆముచే ఫేడూన ఘేఈ | దర్శన దేఈ సవేంచ | ||౧౧౩|| 
113. ‘మా పుణ్యం కొద్దీ, ఈ మసీదు మాత దొరికి, మా మొక్కులను తీర్చి, సాయి దర్శనం కలిగించింది.
ఆమ్హా హాచ ఆముచా దత్త | ఎణేంచ ఆజ్ఞాపిలే తే వ్రత | 
ఎణేంచ ఆమ్హా బసవిలే నావేంత | దర్శనా శిరడీంత ఆణిలే | ||౧౧౪|| 
114. ‘మాకు వీరే దత్త భగవానులు. అందుకే, ఆ వ్రతం చేయమని ఆజ్ఞాపించి, మమ్మల్ని నావలో కూర్చోబెట్టి, తమ దర్శనానికని శిరిడీకి తీసుకుని వచ్చారు.
ఏసీ సర్వ వ్యాపకతేచీ | నిజ సర్వాంతర్యామిత్వాచీ | 
దిధలీ సాంఈనీ జాణీవ సాచీ | సాక్షిత్వాచీ సర్వత్ర | ||౧౧౫|| 
115. ‘ఇలా, తాము అన్ని చోట్లా ఉన్నారని, అందరి మనసులో ఉన్నారని, అన్నిటికీ తాము సాక్షి అని, సాయి తెలియచేశారు.
పాహోనియా సస్మిత ముఖ | ఝాలే మనీ పరమ సుఖ | 
ప్రపంచీ విసరే ప్రపంచ దుఃఖ | నసమాయే హరిఖ పరమార్థీ | ||౧౧౬|| 
116. ‘నవ్వుతూ ఉండే వారి ముఖాన్ని చూసి, పరమానందం కలిగింది. ప్రపంచంలోని దుఃఖాన్ని మరచిపోయాము. పరమార్థాన్ని సాధించాలనే ఉత్సాహం కలిగింది.
హోణార హోవో ప్రారబ్ధగతీ | ఏశీ వ్హావీ నిశ్చిత మతీ | 
సాఈచరణీ అఖండ ప్రీతీ | రాహో హీ మూర్తీ నిత్య నయనీ | ||౧౧౭|| 
117. ‘ ‘ఏది జరగాలని ఉందో, దానిని జరగనీ’ అని మనసులో నిశ్చయించుకుని, సాయి పాదాలలో ఎప్పటికీ ప్రేమ ఉండాలి, పవిత్రమైన వారి రూపం ఎల్లప్పుడూ కళ్ళల్లో ఉండాలి.
అగాధ అగమ్య సాఈ లీలా | సీమా నాహీ ఉపకారాలా | 
వాటే తుమ్హావరూనీ దయాళా | ఓంవాళావా హా దేహ | ||౧౧౮|| 
118. ‘అగాధము, అర్థం కానివి అయిన సాయి లీలలకు, వారి ఉపకారాలకు, ముగింపనేదే లేదు. దయాళువైన సాయీ! ఈ దేహాన్ని మీకు అర్పించాలని అనిపిస్తుంది’.
అసో, ఆతా ఏకా కథాంతర | సావధాన హోఊని క్షణభర | 
సాఈ ముఖీ వదలే జే అక్షర | తే తో నిర్ధార బ్రహ్మలేఖ | ||౧౧౯|| 
119. ఇప్పుడు, కాసేపు సావధానంగా, శ్రద్ధగా మరో కథను వినండి. సాయి నోటినుండి బయటపడిన అక్షరాలు, ఖచ్చితంగా బ్రహ్మ రాసిన రాతలే.
సఖారామ ఔరంగాబాదకర | నివాసస్థాన సోలాపూర శహర | 
పుత్ర సంతానాలాగీ ఆతుర | పాతలే కలత్ర శిరడీస | ||౧౨౦||
120. సఖారాం ఔరంగాబాద్కరు సోలాపూరు పట్టణంలో నివాసి. కొడుకు పుట్టాలని ఎంతో ఆశతో, అతని భార్య శిరిడీకి వచ్చింది.

సాఈబాబా సంతపవిత్ర | ఏకూన త్యాంచే అగాధ చరిత్ర | 
సవే ఘేఊన సాపత్నపుత్ర | ఆలీ సత్పాత్రదర్శనా | ||౧౨౧|| 
121. సత్పురుషులు, పరమ పావనులైన సాయియొక్క అద్భుతమైన జీవిత చరిత్రను విని, తన సవతి కొడుకుని వెంటబెట్టుకుని, సాయి దర్శనానికి వచ్చింది.
సత్తావీస వర్షే న్హాతా | గేలీ పరీ న సంతానవార్తా | 
థకలీ దేవదేవీ నవసితా | నిరాశ చిత్తా జాహలీ | ||౧౨౨|| 
122. పెళ్ళై ఇరవై ఏడు ఏళ్ళయినా, ఆమెకు పిల్లలు పుట్టలేదు. దేవీ దేవతలకు మొక్కుకున్నా, ఆమె మనసు నిరాశతోనే ఉండిపోయింది. 
అసో; ఏసీ తీ సువాసినీ | హేతూ ధరూని బాబాంచే దర్శనీ | 
ఆలీ ఏసీ శిరడీలాగునీ | విచార మనీ ఉద్భవలా | ||౧౨౩|| 
123. ఆ సువాసిని, తన మనసులోని కోరికతో, బాబా దర్శనానికి శిరిడీకి వచ్చింది. వచ్చి, ఆలోచించ సాగింది. 
బాబా సదా భక్తజనవేష్ఠిత | కైసే మజ సాంపడతీ నివాంత | 
కైసే కథిజేల మాఝే హృద్గత | మ్హణోని సంచిత జాహలీ | ||౧౨౪|| 
124. ‘ఇలా బాబా చుట్టూ ఈ భక్తులు గుమిగూడి ఉంటే, బాబాతో నాకు ఒంటరిగా మాట్లాడి, నా మనసులోని కోరికను వారికి ఎలా చెప్పాలి?’ అని చింతించ సాగింది. 
ఉఘడీ మశీద ఉఘడే అంగణ | బాబాభోవతే సదా భక్తగణ | 
కైసా మిళేల నివాంత క్షణ | ఆర్ద్ర నివేదన వ్హావయా | ||౧౨౫|| 
125. ‘మసీదు తెరిచే ఉంటుంది, ప్రాంగణం కూడా తెరిచే ఉంటుంది. బాబా భక్తులు ఎప్పుడూ ఉంటారు. ఒంటరిగా, తన బాధను చెప్పుకోవటానికి, ఎవరూ లేని సమయం ఎప్పుడు దొరుకుతుందో?’ అని బాగా ఆలోచించేది. 
తీ ఆణి తీచా సుత | నామ జయాచే విశ్వనాథ | 
రాహిలే దోన మహినేపర్యంత | సేవా కరీత బాబాంచీ | ||౧౨౬|| 
126. అలా ఆమె, ఆమె కొడుకు విశ్వనాథుడు, ఇద్దరూ బాబా సేవను చేస్తూ, అక్కడ రెండు నెలలు గడిపారు. 
ఎకదా మాధవరావా వినవణీ | విశ్వనాథ అథవా కోణీ | 
బాబాంపాశీ నాహీ పాహునీ | కరీ తీ కామినీ తీ పరిసా | ||౧౨౭|| 
127. ఒక సారి, బాబా దగ్గర విశ్వనాథుడుగాని, వేరే ఎవరూ గాని, లేని సమయం చూసి, ఆ స్త్రీ తన కోరికను మాధవరావుతో చెప్పుకుంది. 
తుమ్హీ తరీ పాహూని అవసర | మాఝియా మనీచే హే హార్ద్ర | 
పాహూని బాబా శాంతస్థీర | ఘాలా కీ కానావర తయాంచే | ||౧౨౮|| 
128. ‘ఎవరూ లేకుండా, బాబా ప్రశాంతంగా ఉన్నప్పుడు, మంచి అదును చూసి, మీరైనా కనీసం, నా మనసులోని కోరికను బాబా చెవిలో వేయండి. 
తేహీ జేవ్హా అసతీ ఎకలే | నాహీ భక్త పరివారే వేఢిలే | 
తేవ్హాంచ కీ హే సాంగా వహిలే | కోణీ న ఏకిలే జాయ అసే | ||౧౨౯|| 
129. ‘అది కూడా, బాబా చుట్టూ ఎవరూ లేకుండా, వారు ఒక్కరే ఉన్నప్పుడు, ఎవరూ వినకుండా చెప్పాలి’ అని వేడుకుంది. 
మాధవరావ ప్రత్యుత్తర కరితీ | మశీద హీ తో కధీ న రీతీ | 
కోణీ నా కోణీ దర్శనార్థీ | యేతచి అసతీ నిరంతరీ | ||౧౩౦||
130. దానికి, మాధవరావు ఆమెతో, ‘ఈ మసీదు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు దర్శనానికి వస్తూనే ఉంటారు. 

సాఈచా హా దరబార ఖులా | యేథే మజ్జావ నాహీ కుణాలా | 
తథాపి ఠేవితో సాంగూన తుజలా | ఆణ కీ ఖులాసా హా ధ్యానీ | ||౧౩౧|| 
131. ‘ఈ సాయి దర్బారు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎవరికీ ఏ అడ్డూ లేదు. అయినా, ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో.  
ప్రయత్న కరణే మాఝే కామ | యశదాతా మంగల ధామ | 
అంతీ తోచి దేఈల ఆరామ | చింతేచా ఉపశమ హోఈల | ||౧౩౨|| 
132. ‘ప్రయత్నించటం నా పని. కాని, ఫలితాన్నిచ్చేవాడు ఆ దేవుడు. చివరకు సుఖాన్ని కలిగించేది ఆ దేవుడే, మీ చింతలన్నీ తొలగిపోతాయి. 
తూ మాత్ర బైస ఘేఉని హాతీ | నారళ ఎక ఆణి ఉదబత్తీ | 
సభామండపీ దగడావరతీ | బాబా జేవూ బైసతీ తై | ||౧౩౩|| 
133. ‘బాబా భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక టెంకాయను, అగరవత్తులను చేతపట్టుకుని, నువ్వు సభామండపంలో, రాతిమీద కూర్చొని ఉండు. 
మగ మీ భోజన ఝాలియావరతీ | పాహీన జేవ్హా ఆనందిత వృత్తి | 
ఖుణావీన కీ తుజప్రతీ | తేవ్హాంచ వరతీ యావే త్వా | ||౧౩౪|| 
134. ‘బాబా భోజనమయాక, వారు ఆనందంగా ఉన్నప్పుడు చూసి, నేను నీకు సైగ చేస్తాను. అప్పుడే నువ్వు పైకి రా’ అని చెప్పాడు. 
అసో; ఏసే కరితా కరితా | ప్రాప్త ఘడీచ యోగ యేతా | 
ఎకదా సాఈచే భోజన ఉరకతా | పాతలీ అవచితా తీ సంధీ | ||౧౩౫|| 
135. ఆమె అలా ఎదురు చూస్తుండగా, మంచి ఘడియ కలిసిరాగా, ఒక సారి, సాయి భోజనం చేసిన తరువాత, అనుకోకుండా ఆ అవకాశం వచ్చింది. 
సాఈ ఆపులే హస్త ధూతా | మాధవరావ వస్త్రానే పుసతా | 
ఆనంద వృత్తీమధ్యే అసతా | తే కాయ కరితాత పహావే | ||౧౩౬|| 
136. సాయి తమ చేతులు కడుక్కున్న తరువాత, మాధవరావు వారి చేతిని వస్త్రంతో తుడుస్తుండగా, వారు సంతోషంగా ఉన్నది చూసి, ఏం చేశాడో చూడండి. 
ప్రేమోల్హాసే మాధవరావాచా | బాబా తంవ ఘేతీ గాలగుచ్చా | 
ఏసి యే సంధీచా దేవా-భక్తాచా | సంవాద వాచా ప్రేమాచా | ||౧౩౭|| 
137. మాధవరావు మీద ప్రేమ పొంగి, బాబా అతని బుగ్గను గిల్లారు. అప్పుడు, దేవునికి, భక్తునికి జరిగిన ప్రేమతో నిండిన మాటలను వినండి. 
మాధవరావ వినయసంపన్న | పరీ రాగాచా ఆవ దావూన | 
వినోదే మ్హణతీ బాబాలాగూన | ‘హే కాయ లక్షణ బరే కా? | ||౧౩౮|| 
138. మాధవరావు ఎంతో వినయంతో ఉన్నా, కోపాన్ని నటిస్తూ, బాబాతో వినోదంగా ‘ఇది మంచి లక్షణమేనా! 
నలగే ఏసా దేవ ఖట్యాళ | గాలగుచ్చే జో ఘేఈ ప్రబళ | 
ఆమ్హీ కాయ తుఝే ఓశాళ | సలగీచే ఫళ హే కాయ?’ | ||౧౩౯|| 
139. ‘ఇంత గట్టిగా బుగ్గ గిల్లే తుంటరి దేవుడు, మాకు అనసరం లేదు. మేము ఏ రకంగానైనా, మీకు బాకీ ఉన్నామా? మన స్నేహానికి ఇదా ఫలితం?’ అని అన్నాడు. 
తంవ బాబా ప్రత్యుత్తర దేత | “కధీ అవఘ్యా బహాత్తర పిఢీంత | 
లావిలా రే మ్యా తుజ హాత | అసే కా స్మరణ పహా బరే” | ||౧౪౦||
140. దానికి జవాబుగా బాబా, “మొత్తం డెబ్బై రెండు జన్మలలో, నేను ఎప్పుడైనా నీ మీద చేయి వేశానా? బాగా గుర్తు చేసుకో” అని అన్నారు. 

తంవ బోలతీ మాధవరావ | ‘ఆమ్హా పాహిజే ఏసా దేవ | 
దేఈల జో ముకే సదైవ | మిఠాఈ అభినవ ఖావయా | ||౧౪౧|| 
141. దానికి మాధవరావు, ‘తినటానికి కొత్తకొత్త మిఠాయిలను ఎప్పుడూ ఇచ్చే దేవుడు, మాకు కావాలి.
నలగే ఆమ్హా తుఝా మాన | అథవా స్వర్గలోకీంచే విమాన | 
జాగో తుఝియా పాయీ ఇమాన | ఇతుకేంచి దాన దేఈ మజ’ | ||౧౪౨|| 
142. ‘మీ గౌరవ మర్యాదలు, లేదా స్వర్గలోక విమానాలు, మాకు అవసరం లేదు. మీ పాదాల దగ్గర ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండేలా కరుణించండి. అంతే, ఇంత దానం ఇస్తే చాలు’ అని అన్నాడు.
తంవ బాబా లాగలే బోలో | “ఎతదర్థాచి మీ యేథే ఆలో | 
తుమ్హాంస ఖాఊ ఘాలూ లాగలో | లాగలా లోలో33 మజ తుమచా” | ||౧౪౩|| 
143. అందుకు బాబా, “అందుకేగా నేను ఇక్కడికి వచ్చాను. నాకు మీ మీద ప్రేమ ఉండటంతోనే, మీకు తిండి పెట్టటానికే నేను ఇక్కడికి వచ్చాను.
ఇతుకే హోతా కఠడ్యాపాశీ | బాబా బైసతా నిజాసనాసీ | 
మాధవరావ కరితా ఖుణేసీ | బాఈ నిజకార్యాసీ సావధ | ||౧౪౪|| 
144. అదయిన తరువాత, బాబా వెళ్ళి, కటకటాల దగ్గర ఉన్న తమ ఆసనంపై కూర్చోగానే, మాధవరావు ఆ స్త్రీకి సైగ చేశాడు. ఆమె తన కోరికను తీర్చుకోవటానికి సిద్ధమైంది.
ఖూణ హోతాంచ తాత్కాళ ఉఠలీ | లగబగీనే పాయర్యా చఢలీ | 
బాబాంచియా సన్ముఖ ఆలీ | నమ్ర ఝాలీ సవినయ | ||౧౪౫|| 
145. సైగ అందిన వెంటనే లేచి, గబగబా మెట్లెక్కి, బాబా ఎదుటికి వచ్చి, వినయంగా, నమ్రతతో నిలబడింది.
తాత్కాళ చరణీ అర్పిలే శ్రీఫళ | వందిలే మగ చరణకమళ | 
బాబాంనీ నిజ హస్తే తో నారళ | హాణీతలా సబళ కఠడ్యావరీ | ||౧౪౬|| 
146. బాబాకు శ్రీఫలాన్ని (కొబ్బరికాయ) అర్పించి, వారి పాదాలకు నమస్కారం చేసింది. ఆ కొబ్బరికాయను బాబా తమ చేతులతో గట్టిగా కటకటాల పైన కొట్టారు.
మ్హణతీ “శామా హా కాయ మ్హణతో | నారళ ఫారచి రే గుడగుడతో” | 
శామా మగ తీ సంధీ సాధతో | కాయ వదతో బాబాంస | ||౧౪౭|| 
147. “శామా! ఇది ఏమంటుంది? కొబ్బరికాయ బాగా చప్పుడు చేస్తూ ఉంది రా” అని అన్నారు. శామా ఆ అవకాశాన్ని వెంటనే అందుకుని, ఏమన్నాడంటే,
‘మాఝియే పోటీ ఏసేంచ గుడగుడో | బాఈ హీ మనీ మ్హణే తే ఘడో | 
అఖండ మన తంవ చరణీ జడో | కోడే ఉలగడో తియేచే | ||౧౪౮|| 
148. ‘తన కడుపులో కూడా ఇలాంటి చప్పుడు అవ్వాలని ఈమె తన మనసులో అనుకుంటూ ఉంది. ఆమె కోరిక తీరాలి. ఆమె మనసు ఎప్పుడూ మీ పాదాల మీదే లగ్నమై, ఆమె సమస్య తీరుగాక.
పాహీ తిజకడే కృపాదృష్టీ | టాక తో నారళ తిచే ఓటీ | 
తుఝియా ఆశీర్వాదే పోటీ | బేటా బేటీ ఉపజోత’ | ||౧౪౯|| 
149. ‘ఆమెను అనుగ్రహించి, ఆ కొబ్బరికాయను ఆమె ఒడిలో వేయండి. మీ ఆశీర్వాదంతో, ఆమె కడుపు పండి, కొడుకులు, కూతుళ్ళూ కలుగుతారు’ అని అన్నాడు.
తంవ బాబా తయా వదతీ | “కాయ నారళే పోరే హోతీ | 
ఏశా కైశా వేడ్యా సమజుతీ | చళలే వాటతీ జనలోక” | ||౧౫౦||
150. దానికి బాబా అతనితో, “కొబ్బరికాయలతో పిల్లలు కలుగుతారా? ఇలా వెర్రిగా ఎందుకనుకుంటారు? జనానికి పిచ్చి పట్టినట్లు అనిపిస్తూ ఉంది” అని అన్నారు.

శామా వదే ఆహే ఠాఊక | తుఝియా బోలాచే కౌతుక | 
లేండార మాగే లాగేల ఆపసుఖ | ఏసా అమోలిక బోల తుఝా | ||౧౫౧|| 
151. దానికి శామా, ‘మాకు బాగా తెలుసు. మీ మాటల అద్భుతమైన శక్తితో, వరుసగా పిల్లలు పుట్టుతారు. మీ మాటలు అంత అమూల్యమైనవి.
పరీ తూ సాంప్రత ధరిశీ భేద | నేదిశీ ఖరా ఆశీర్వాద | 
ఉగాచ ఘాలీత బససీ వాద | నారళ ప్రసాద దేఈ తిస | ||౧౫౨|| 
152. ‘కాని మీరు ఇప్పుడు, భేదభావంతో, ఊరికెనే కూర్చుని, ఆశీర్వాదాన్ని ఇవ్వకుండా, వృథాగా వాదన చేస్తున్నారు. ఆమెకు కొబ్బరికాయను ప్రసాదంగా ఇవ్వండి’ అని అన్నాడు.
“నారళ ఫోడ” బాబా వదత | శామా వదే టాక పదరాంత | 
ఏసీ బరీచ హోతా హుజత | హారీస యేత తంవ బాబా | ||౧౫౩|| 
153. “సరే, కొబ్బరికాయను పగులగొట్టు” అని బాబా అంటే, ‘కాదు, కాదు ఆమె ఒడిలో వేయండి’ అని శామా అన్నాడు. ఇలా బాగా వాదులాడాక, చివరికి, బాబా ఒప్పుకున్నారు.
“మ్హణతీ హోఈల జా రే పోర” | శామా మ్హణే “కధీ” దే ఉత్తర | 
వదతా “బారా మాహిన్యానంతర” | నారళ తాడకర ఫోడిలా | ||౧౫౪|| 
154. “అలాగే రా, ఆమెకు బిడ్డలు కలుగుతారు, ఇక వెళ్ళు” అని అన్నారు. శామా కదలకుండా ‘ఎప్పుడు?’ అని నిలదీసి అడిగాడు. “పన్నెండు నెలల తరువాత” అని బాబా చెప్పగా, శామా ధన్‍మని కొబ్బరికాయను పగులకొట్టాడు.
అర్ధభాగ దోఘీ సేవిలా | అర్ధ రాహిలా బాఈతే దిధలా | 
మాధవరావ వదే బాఈలా | “మాఝియా బోలా తూ సాక్షీ | ||౧౫౫|| 
155. అందులో సగం కాయను ఇద్దరూ తిని, మిగిలిన సగాన్ని ఆ స్త్రీకి ఇచ్చారు. మాధవరావు ఆమెతో ‘నా మాటలకు నీవే సాక్షి.
బాఈ తుజ ఆజపాసూన | బారా మహినే నవ్హతా పూర్ణ | 
జాహలే నాహీ పోటీ సంతాన | కాయ మీ కరీన తే పరిస | ||౧౫౬|| 
156. ‘ఇవాల్టినుండి పన్నెండు నెలలు పూర్తి కాక మునుపే, నీ కడుపు పండి, బిడ్డ పుట్టకపోతే, నేను ఏమి చేస్తానో విను.
ఏసాచ నారళ డోకీంత ఘాలూన | యా దేవాలా మశీదీమధూన | 
మీ న జరీ లావీ కాఢూన | తరీ న మ్హణవీన మాధవ | ||౧౫౭|| 
157. ‘వీరి తలపై ఇలాగే కొబ్బరికాయను కొట్టి, ఈ దేవుణ్ణి మసీదునుండి తరిమి వేయకపోతే, నా పేరు మాధవరావు కాదు.
ఏసా దేవ న మశీదీంత | ఠేవూ దేణార వదతో ఖచిత | 
యేఈల వేళీ యాచీ ప్రచిత | నిర్ధార నిశ్చిత హా మాన” | ||౧౫౮|| 
158. ‘ఇలాంటి దేవుణ్ణి, మసీదులో ఉండనివ్వను అని, ఖచ్చితంగా చెప్పుతున్నాను. దీనికి ప్రమాణం సరియైన సమయంలో నీకు అనుభవమౌతుంది అని తెలుసుకో’ అని చెప్పాడు.
ఏసే మిళతా ఆశ్వాసన | బాఈ మనీ సుఖాయమాన | 
పాయీ ఘాలోని లోటాంగణ | గేలీ స్వస్థమన నిజ గ్రామా | ||౧౫౯|| 
159. నమ్మకాన్ని పుట్టించే అతని మాటలను విని, ఆ స్త్రీ మనసులో ఆనందించి, బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, ఏ చింతా లేకుండా తన గ్రామానికి వెళ్ళిపోయింది.
పాహూని శామా నిత్యాంకిత | రక్షావే భక్త మనోగత | 
సాఈ ప్రేమరజ్జూనియంత్రిత | ఆలా న కించిత కోప తయా | ||౧౬౦||
160. శామా మాటలు విని సాయికి కొంచెం కూడా కోపం రాలేదు. ఎందుకంటే, శామా తమకు అంకితమై పోయాడు. అంకిత భక్తుల ప్రేమతో కట్టుబడి ఉన్న సాయి, ఎప్పుడూ ఆ భక్తుల కోరికలను తీర్చుతారు.

ఖరే కరాయా భక్తవచన | ప్రణతపాళ కరుణాఘన | 
సాఈ దయాళ భక్తాశ్వాసన | లడివాళపణ పురవీత | ||౧౬౧|| 
161. భక్తులు చెప్పిన మాటలు నిజమని చూపించటానికి, భక్తులను పాలించే కరుణామయులైన సాయి, భక్తులు చెప్పినదాన్ని ప్రేమతో తీరుస్తారు. 
శామా అపులా లాడకా భక్త | లడివాళ నేణే యుక్తాయుక్త | 
సంత భక్తసంకల్ప పురవీత | హేంచ నిజవ్రత తయాచే | ||౧౬౨|| 
162. “శామా నాకిష్టమైన భక్తుడు. తన ప్రేమలో, ఏది సరియైనదో, ఏది కాదో తెలియని అమాయకుడు”. భక్తుల కోరికలను తీర్చటం సత్పురుషుల వ్రతం.
అసో, భరతా బారా మాస | కృత నిర్ధార నేలా తడీస | 
తీనచి మహినే హోతా బోలాస | పాతలే గర్భాస సంతాన | ||౧౬౩|| 
163. పన్నెండు నెలలు గడిచే సరికి, తాము తలచుకున్నదానిని బాబా పూర్తి చేశారు. బాబా అనుగ్రహించిన మూడు నెలల తరువాత, ఆ స్త్రీ గర్భవతి అయ్యింది.
భాగ్యే జాహలీ పుత్రవతీ | పాంచా మహిన్యాంచే బాళ సంగతీ | 
ఘేఊని ఆలీ శిరడీప్రతీ | పతిసమవేతీ దర్శనా | ||౧౬౪|| 
164. అదృష్టం కొద్దీ, ఆమె కొడుకును కనింది. ఐదు నెలల బిడ్డను వెంట తీసుకుని, తన భర్తతో సహా, ఆమె బాబా దర్శనానికి శిరిడీకి వచ్చింది.
పతీనేం హీ ఆనందోనీ | సాఈ సమర్థ చరణ వందోనీ | 
పాయీ పంచశత రుపయే అర్పునీ | కృతజ్ఞ నిజ మనీ జాహలా | ||౧౬౫|| 
165. ఎంతో ఆనందంతో, ఆమె భర్త సాయి సమర్థుని పాదాలకు నమస్కరించి, కృతజ్ఞతతో, వారికి ఐదు వందల రూపాయలను అర్పించాడు.
బాబాంచా వారూ శామకర్ణ | తయాచే సాంప్రత వసతిస్థాన | 
తయాచ్యా భింతీ ఘేతల్యా బాంధూన | రుపయే లావూన హేచ పుఢే | ||౧౬౬|| 
166. కొన్ని రోజుల తరువాత, ఆ డబ్బును, బాబాయొక్క గుర్రం శ్యామకర్ణను ఉంచే చోటులో, గోడలను కట్టించటానికి ఉపయోగించారు.
మ్హణోని ఏసా సాఈ ధ్యావా | సాఈ స్మరావా సాఈ చింతావా | 
హాచ హేమాడా నిజ విసావా | కరీ న ధాంవాధాంవ కుఠే | ||౧౬౭|| 
167. అందుకే ఇలాంటి సాయి సమర్థుని తలచుకొండి. వారి గురించి ఆలోచించండి, ధ్యానించండి. వారే ఎప్పటికీ హేమాడుకు నిజమైన విశ్రాంతి ధామం. వేరే ఎక్కడికీ వెతుక్కుంటూ పరుగులు పెట్టకండి.
నిజ నాభీంత అసతా జవాదీ34 | కిమర్థ భ్రమావే బిదోబిదీ | 
అఖండ వినటత సాఈపదీ | హేమాడ నిరవధి సుఖ లాహే | ||౧౬౮|| 
168. మన బొడ్డులోనే కస్తూరిని ఉంచుకుని, వేరే ఎక్కడో వెతుక్కోవడం ఎందుకు? హేమాడు ఎల్లప్పుడూ సాయి పాదాలలోనే మగ్నమై, అంతులేని సుఖాన్ని ఆనందిస్తున్నాడు.
పుఢీల అధ్యాయ యాహూన రసాళ | కైసే బాబాంసీ భక్త ప్రేమళ | 
మశీదీంతూన చావడీజవళ | మిరవీత సకళ ఆనందే | ||౧౬౯|| 
169. తరువాతి అధ్యాయం ఇంతకంటే ఆసక్తికరమైనది. ప్రేమికులైన బాబా భక్తులందరూ, ఎంతో ఆనందంతో బాబాను మసీదునుండి చావడికి ఎలా ఉత్సాహంతో ఊరేగించేవారో,
తైసీచ బాబాంచ్యా హండీచీ కథా | ప్రసాదదాన వినోదవార్తా | 
పుఢీల అధ్యాయీ పరిసిజే శ్రోతా | చఢేల ఉల్హాసతా శ్రవణాస | ||౧౭౦||
170. దాని గురించి, మరియు బాబాయొక్క వంట పాత్ర కథ, ప్రసాదాన్ని పంచటం, ఇంకా ఎన్నో వినోదమైన సంగతులను, శ్రోతలారా, తరువాతి అధ్యాయంలో వినండి. మీకు వినాలనే ఉత్సాహం ఎక్కువ అవుతుంది.

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | సాఈసర్వవ్యాపకతా తదాశిర్వవచన సాఫల్యతానామ | 
| శట్‍త్రింశత్తమోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. మీ తోచ తో, తో తోచ మీ. 2. బ్రహ్మరూప మోత్యాంచా చారా. 
3. అత్యంత. 4. కటాక్షలీలా. 5. నిరంతర. 6. బోలావీత. 
7. పస్తీస రుపయే. 8. మాధవరావ దేశపాండే మ్హణజే బాబాంచా శామా. 
9. భేదవృత్తీస. 10. కోణాపాసూన యేణే ఠరలేలీ రక్కమ. 
11. మశీదీచీ అధిష్ఠాత్రీ దేవతా. 12. సర్వ ప్రకారే. 13. కరణార్యాలా. 
14. భక్తోద్ధార కరణార్యా మలా. 15. అతినమ్రపణే కేలేలీ వినవణీ. 
16. జ్యాలా ఋణ నాహీ తో. 17. గరీబ, ద్రవ్యహీన. 18. పంధరా రుపయే. 
19. పగార. 20. విస్మరణ. 21. గోష్ట. 22. హవేలీ. 23. సముద్రకాఠ. 
24. గలబత, ఆగబోట. 25. సర్వజ్ఞ. 26. ఆఠవణ. 27. అగదీ హళూ. 
28. చింతేచ్యా భోవర్యాత. 29. పస్తీస రుపయాంచ్యా దక్షిణేనే. 
30. జాగా. 31. రాగావలే. 32. భాగ్యానే శ్రేష్ఠ . 33. ఆవడ, ప్రేమ. 
34. కస్తురీ, జవాదీ జాతీచ్యా మాంజరాచ్యా అండ్యాతీల కస్తురీ.