Tuesday, November 26, 2013

||శ్రీగురుచరణ మహిమా నామ పంచచత్వారింశోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౫ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

సహజ జాతే మాండూని దళతా | జేణే ప్రవర్తవిలే నిజ సచ్చరితా | 
కాయ అలౌకిక తయాచీ కుశలతా | భక్త సత్పంథా లావిలే | ||౧||
1. తిరగలిలో సహజంగా విసురుతూ, భక్తులను సన్మార్గంలో పెట్టాలని, తమ సచ్చరితను స్ఫురింప చేసిన వారి కౌశలం ఎంత అలౌకికమైనది!
మోక్ష జో కా పరమపురుషార్థ | త్యాహూనిహీ గురుచరణ సమర్థ | 
సేవితా ఏసియా గురుచరణీంచే తీర్థ | మోక్ష నకళత ఘర రిఘే | ||౨|| 
2. గురువు పాదాలు పరమ పురుషార్థమైన మోక్షం కంటే శక్తివంతమైనవి. ఇలాంటి గురువుయొక్క పాద తీర్థాన్ని సేవిస్తే, మోక్షం తనంతట తానే, ఎవరికీ తెలియకుండా లభిస్తుంది. 
హోఈల గురు కరుణాకర | తరీచ సుఖాచా హా సంసార | 
ఘడోని యేఈ న ఘడణార | లావీల పరపార క్షణార్థే | ||౩|| 
3. గురువు కరుణ లభిస్తే, ఈ సంసారం సుఖమయమౌతుంది. జరగనివన్నీ జరుగుతాయి. అరక్షణంలో గురువు ఆవలి ఒడ్డుకు చేరుస్తారు. 
జరీ జాహలీ ఇతుకీ పోథీ | కథా కథిలీసే అతి సంకలితీ | 
సాఈచీ తీ అగాధ కీర్తి | తీ మ్యా కితీ వర్ణావీ | ||౪|| 
4. ఇంత గ్రంథం వ్రాసినా, కథ మాత్రం సంక్షిప్తంగానే చెప్పబడింది. సాయియొక్క అగాధమైన, అంతులేని కీర్తిని నేనెంతని వర్ణించను? 
జిచేని దర్శనే నిత్యతృప్తీ | జిచేని సహవాసే ఆనంద భుక్తీ | 
జిచేని భవభయ వినిర్ముక్తి | తీ సాఈమూర్తి హారపలీ | ||౫|| 
5. ఎవరిని చూసినంత మాత్రాన నిత్య తృప్తి దొరికేదో, ఎవరి సహవాసం అంతులేని ఆనందాన్ని ఇచ్చేదో, ఎవరు మనకు సంసార భయాన్ని తొలగిస్తారో, ఆ దివ్యమైన సాయి మూర్తిని పోగొట్టుకున్నాం. 
జిచేని పరమార్థ మార్గ ప్రవృత్తీ | జిచేని మాయామోహ నివృత్తీ | 
జిచేని ఆత్యంతిక క్షేమ ప్రాప్తి | తీ సాఈమూర్తీ హారపలీ | ||౬|| 
6. ఎవరివలన మనలో పరమార్థ ప్రవృత్తి కలిగేదో, ఎవరివలన మాయా మోహ నివృత్తి కలిగి, ఎవరివలన అత్యంత క్షేమం కలుగుతుందో ఆ దివ్యమైన సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. 
జిచేని నవ్హతీ భవభయ భీతి | జిచేని జాగృత న్యాయనీతీ | 
జిచేని సంకటీ మనాస ధృతి | తీ సాఈమూర్తీ హారపలీ | ||౭|| 
7. ఎవరివలన సంసార భయం ఉండదో, ఎవరివలన న్యాయం, నీతి జాగృతమై, కష్టాలను ఎదురించగలిగే ధైర్యం కలిగేదో, అలాంటి సాయిమూర్తిని శాశ్వతంగా పోగొట్టుకున్నాం. 
ధ్యానీ స్థాపూనియా నిజమూర్తీ | సాఈ జాఈ నిజధామా ప్రతి | 
నిజావతారా కరీ సమాప్తి | హే యోగస్థితి అతర్క్య | ||౮|| 
8. ధ్యానించుకోవటానికి అనువుగా తమ రూపాన్ని మన మనసులో స్థాపించి, తమ అవతారాన్ని చాలించి, సాయి తమ నివాస స్థానానికి వెళ్లిపోయారు. తర్కానికి అందని అమోఘమైనది వారి యోగ స్థితి. 
పూర్ణ హోతా అవతార కృతి | హారపలీ తీ పార్థివాకృతి | 
తరీ హా గ్రంథ హీ వాంగ్మయ మూర్తి | దేఈల స్మృతి పదోపదీ | ||౯|| 
9. అవతార కార్యం పూర్తి కాగానే, వారి దేహం మనకు కనిపించకుండా పోయింది. అయినా, వారి వాక్కు రూపమైన ఈ గ్రంథం, వారి జ్ఞాపకాన్ని ప్రతి క్షణమూ మనకు గుర్తుకు తెస్తుంది. 
శివాయ హ్యాచియా కథా పరిసతా | మనా లాభే జీ ఎకాగ్రతా | 
తజ్జన్య శాంతీచీ అపూర్వతా | కేవీ అవర్ణీయతా వర్ణావీ | ||౧౦||
10. అంతేకాక, వారి చరిత్రను చదివినా, వినినా, దానివలన మన మనసుకు కలిగే ఏకాగ్రత, అంతకు మునుపు ఎప్పుడూ కలగని, వర్ణించటానికి వీలుకాని శాంతిని, పదాలలో వర్ణించడం అసాధ్యం. 

ఆపణ శ్రోతే సర్వే సూజ్ఞ | మీ తో తుమ్హాంపుఢే అల్పజ్ఞ | 
తథాపి హా సాఈచా వాగ్యజ్ఞ | ఆదరా కృతజ్ఞ బుద్ధీనే | ||౧౧|| 
11. శ్రోతలూ! మీరందరూ జ్ఞానులు. మీ ముందు నేను ఏమీ తెలియని అజ్ఞాని. అయినా సాయి కోసం చేస్తున్న ఈ శబ్ద యజ్ఞాన్ని మీరందరూ కృతజ్ఞతా భావంతో ఆదరించండి. 
కల్యాణప్రద హా వాగ్యజ్ఞ | పుఢే కరూని మజసమ అజ్ఞ | 
పూర్ణ కరీ నిజకార్యజ్ఞ | శ్రోతే సర్వజ్ఞ జాణతీ | ||౧౨|| 
12. అందరికీ మేలు చేసే ఈ వాగ్యజ్ఞాన్ని నాలాంటి అజ్ఞాని ద్వారా సాయి చేయిస్తున్నారని అన్నీ తెలిసిన శ్రోతలకు తెలుసు. 
కరూనియా ఎకాగ్ర మన | అభివందూన సాఈ చరణ | 
మహామంగల పరమ పావన | కరీ జో శ్రవణ యా కథా | ||౧౩|| 
13. ఏకాగ్ర మనసుతో సాయి పాదాలకు నమస్కరించి, మహా మంగళకరమూ, పరమ పావనమూ అయిన ఈ చరిత్రను వినే భక్తుల మరియు; 
జో భక్త భక్తి సమన్విత | నిజస్వార్థ సాధావయా ఉద్యత | 
హోఊనియా ఎకాగ్రచిత్త | కథామృత హే సేవీల | ||౧౪|| 
14. తమ శ్రేయస్సును సాధించుకోవటానికి ఎంతో ఉత్సుకతతో, అనన్య మనసుతో, భక్తిపూర్వకంగా ఈ కథామృతాన్ని వినే భక్తులకు; 
సాఈ పురవీల తయాచే అర్థ | పురవీల స్వార్థ ఆణి పరమార్థ | 
సేవా కధీంహీ జాఈ న వ్యర్థ | అంతీ తో కృతార్థ కరీల | ||౧౫|| 
15. వారి స్వార్థ పరమైన కోరికలనే కాక, పరమార్థ అవసరాలను కూడా సాయి తీరుస్తారు. వారి సేవ ఎప్పుడూ వ్యర్థం కాదు. ఆ సేవయే వారిని చివరకు కృతార్థులను చేస్తుంది. 
చవ్వేచాళీస అధ్యాయ పోథీ | సాఈ నిర్యాణ పరిసలే అంతీ | 
తరీహీ యా పోథీచీ ప్రగతీ | హీ కాయ చమత్కృతి కళేనా | ||౧౬|| 
16. ఈ గ్రంథంలోని నలుబది నాలుగవ అధ్యాయం ముగింపులో సాయి నిర్వాణాన్ని గురించి విన్నారు. అయినా ఈ గ్రంథం కొనసాగుతూనే ఉంది. మరి ఇదేమి చమత్కారమో అర్థం కావటం లేదు. 
గతాధ్యాయీ సాఈనిర్యాణ | యథానుక్రమ జాహలే పూర్ణ | 
తరీ యా సాఈలీలేచీ కాతిణ | విసంబేనా క్షణభరీ | ||౧౭|| 
17. పోయిన అధ్యాయంలో యథాక్రమంగా సాయి నిర్వాణాన్ని పూర్తిగా వర్ణించడమైనది. అయినా, సాలె పురుగువలె, సాయి లీలలకు క్షణమైనా విశ్రాంతి లేదు. 
పాహూ జాతా నవల నాహీ | నిర్యాణ కేవళ దేహాస పాహీ | 
జన్మమరణాతీత హా సాఈ | అవ్యక్తీ రాహీ పూర్వవత | ||౧౮|| 
18. వాస్తవానికి, ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నిర్యాణం దేహానికి మాత్రమే. సాయి చావు పుట్టుకలకు అతీతులు. అందుకే, వారు మునుపటి వలె కనిపించకుండా ఉన్నారు. 
దేహ గేలా ఆకార గేలా | అవ్యక్తీ జైసా తైసాచ ఠేలా | 
దేహ నిర్యాణా మాగూన లీలా | ఆహేత సకళాంలా అవగత | ||౧౯|| 
19. దేహం పోయింది. దాంతో ఆకారం కూడా పోయింది. కాని, ఎప్పటి వలె వారు కనిపించకుండా ఉన్నారు. శరీరాన్ని వదిలిన తరువాత కూడా జరుగుతున్న వారి లీలలు అందరికీ తెలిసినదే. 
వర్ణూ జాతా త్యాహీ అపార | పరీ న వ్హావా గ్రంథ విస్తార | 
మ్హణూన త్యాంతీల ఘేఊ సార | కరూ కీ సాదర శ్రోతయా | ||౨౦||
20. అలాంటి లెక్కలేని వారి లీలలను వర్ణించాలంటే, ఈ గ్రంథం చాలా పెద్దదై పోతుంది. అందుకు, వాటిలోని సారాన్ని మాత్రమే శ్రోతలకు మనవి చేస్తాను. 

ధన్య ఆముచీ భాగ్యస్థితీ | కీ జే కాలీ సాఈ అవతరతీ | 
తేచ కాలీ ఆమ్హా హే సత్సంగతీ | సహజావృత్తీ లాధలీ | ||౨౧|| 
21. మన భాగ్యం ధన్యం. సాయి అవతరించిన కాలంలోనే వారి పావనమైన సాన్నిధ్యం మనకు కూడా సహజంగా లభించింది.
ఏసే అసతాంహీ చిత్తవృత్తి | జరీ నపవే సంసార నివృత్తి | 
జరీ న జడే భగవంతీ ప్రీతీ | యాహోని దుర్గతీ తీ కాయ | ||౨౨|| 
22. అయినా, మన మనసును సంసారంనుండి నివృత్తి చేయకపోతే, భగవంతునిపై ప్రీతిని పెంచుకోకపోతే, ఇంతకంటే దుర్గతి ఏముంటుంది? 
సర్వేంద్రియీ సాఈచీ భక్తి | తీచ కీ ఖరీ భజన స్థితి | 
నా తరీ డోళా పాహతా మూర్తి | ఖిళీ దాతీ వాచేచ్యా | ||౨౩|| 
23. అన్ని ఇంద్రియాలను సాయి భక్తితో నింపడమే నిజమైన ఆరాధన. అలా కాకపోతే, కళ్లు సాయిను చూస్తున్నా, నోరు పెగలక పోవడంతో, మాట బయటికి రాదు. 
కాన ఏకతా సాఈ కీర్తన | రసనా మధుర ఆమ్రరసీ నిమగ్న | 
కరితా సాఈపాదస్పర్శన | మృదూలీవర్జన ఖపేనా | ||౨౪|| 
24. చెవులు సాయి కీర్తనలను వింటున్నా, నాలుక మటుకు మధురమైన మామిడి పళ్ళ రసం తాగడంలో మగ్నమైతే ఎలా? చేతులు సాయి పాదాలను తాకుతున్నా, మనసు మృదువైన పరుపు సుఖం గుర్తుకు తెచ్చుకుంటే ఎలా? 
సాఈపాసూన క్షణహీ విభక్త | తో కాయ హోఈల సాఈభక్త | 
తో కాయ మ్హణావా చరణాసక్త | సంసారీ విరక్త హో నేణే | ||౨౫|| 
25. క్షణ కాలమైనా సాయినుండి దూరం ఉండగలవాడు అసలు సాయి భక్తుడేనా? సంసారమందు విరక్తి కలగని వారికి సాయి పాదాలయందు ఆసక్తి ఎలా ఉంటుంది? 
ఎకా పతీ వంచూని కోణీ | యేతా తిచియా మార్గావరునీ | 
శ్వశుర దీర భాఊ జాణూనీ | హోఈ వందనీ సాదర | ||౨౬|| 
26. భర్త కాక వేరే మగవారు ఎవరైనా మార్గంలో కనిపిస్తే, వారిని మామగారని, మరిది అని, లేక సహోదరుడని తలచి, గౌరవంగా వందనం చేస్తుంది. 
పతివ్రతేచే నిశ్చళ అంతర | కదా న సాండీ ఆపులే ఘర | 
నిజపతీచాచ ప్రేమా అపార | ఆజన్మ ఆధార తో ఎక | ||౨౭|| 
27. పతివ్రతా స్త్రీ మనసు అలా ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. ఆమె తన ఇల్లు ఎప్పుడూ విడిచి పెట్టదు. తన భర్తపైనే ఆమెకు అంతులేని ప్రేమ. జీవితాంతం ఆమెకు అతడొక్కడే ఆధారం. 
పతివ్రతా సాధ్వీ సతీ | అన్యా భావోనియా నిజపతి | 
తయాచే దర్శన ఘ్యావయా ప్రతీ | కధీంహీ చిత్తీ ఆణీనా | ||౨౮|| 
28. అలాంటి పతివ్రతా సతి, మిగతావారిని తన భర్తగా ఎన్నడూ ఊహించుకోదు. వారిని చూడాలని మనసులోనైనా ఎప్పుడూ తలవదు. 
తీస ఆపులా పతీ తో పతీ | ఇతర కేవ్హాంహీ తయా న తులతీ | 
తయా ఠాయీంచ అనన్య ప్రీతి | శిష్యహీ తే రీతీ గురుపాయీ | ||౨౯|| 
29. ఆమెకు తన భర్తయే సర్వస్వం. మిగతావారెవరూ అతని సమానులు కారు. ఆమె అనన్యమైన ప్రేమ అంతా అతని కొరకే. గురు పాదాలంటే శిష్యుడి ప్రేమ కూడా అలాంటిదే. 
పతివ్రతేచ్యా పతిప్రేమా | గురుప్రేమాస దేతీ ఉపమా | 
పరీ త్యా ప్రేమాస నాహీ సీమా | జాణే తో మహిమా సచ్ఛిష్య | ||౩౦||
30. శిష్యుడి గురు ప్రేమను, పతివ్రతయొక్క పతి ప్రేమతో, పోలుస్తారు. కాని, శిష్యుడి గురు ప్రేమకు పరిమితి అంటూ లేదు. ఉత్తమ శిష్యుడొక్కడికే గురు ప్రేమలోని మహిమ తెలుసు. 

మగ నా జయాచేని సంసారా సాహ్యతా | తీ కాయ సాహ్యా యేతీల పరమార్థా | 
అసో వ్యాహీ జాంవయీ వా వనితా | భరంవసా కోణాచా ధరితా నయే | ||౩౧|| 
31. లౌకికంగా కూడా ఏ సహాయం చేయలేనివారు, పరమార్థంలో మాత్రం ఏ సహాయం చేయగలరు? వియ్యంకుడు గాని, అల్లుడు కాని, లేదా భార్య గాని, ఎవరూ నమ్మకస్థులు కారు. 
మాతా పితా కరితీల మమతా | సత్తేచా పుత్ర లక్షీల విత్తా | 
కుంకువాలాగీ రడేల కాంతా | కోణీ న పరమార్థా సాహకారీ | ||౩౨|| 
32. తల్లితండ్రులు మమకారాన్ని చూపుతారు. కొడుకు దృష్టి, తనకి వచ్చే ఆస్తిపైనే ఉంటుంది. తన పసుపు కుంకుమల గురించి భార్య ఏడుస్తుంది. అంతే కాని, పరమార్థం కోసం సహాయం చేసే వారు ఎవ్వరూ లేరు. 
తరీ ఆతా రాహిలే కోణ | జయాచేని పరమార్థాపాదన | 
కరూ జాతా విచారే నిదాన | ఆపులా ఆపణ అంతీ ఉరే | ||౩౩|| 
33. పరమార్థం కోసం సహాయ పడటానికి మిగిలింది ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే, చివరకు మిగిలేది మనమే. 
కరోని నిత్యానిత్య వివేక | త్యాగోని ఫళ భోగ ఏహికాముష్మిక | 
సాధోనియా శమదమాదిషట్క | మోక్షైక సాధక తో ధన్య | ||౩౪|| 
34. శాశ్వతమైనది ఏది, శాశ్వతం కానిదేది, అనే వివేకంతో, ఇహంలోగాని, పరంలోగాని ఫలాపేక్షను వదిలి, శమ, దమ మొదలైన ఆరు సంపత్తుల సాధన చేసి, మోక్షాన్ని పొందినవారే ధన్యులు. 
తేణే సోడూని దుజియాచీ ఆస | ఠేవావా బళకట ఆత్మవిశ్వాస | 
మారావీ ఆపణ ఆపులీ కాంస | సాధేల తయాసచి పరమార్థ | ||౩౫|| 
35. ఇంకొకరి ఆధార లేకుండా, తనపైనే దృఢమైన నమ్మకంతో, తన ప్రయత్నాన్ని తానే చేసుకునే వారికి పరమార్థం సిద్ధిస్తుంది. 
బ్రహ్మ నిత్య జగ అనిత్య | గురురేక బ్రహ్మ సత్య | 
అనిత్యత్యాగే గురు ఎక చింత్య | భావనాసాతత్య సాధన హే | ||౩౬|| 
36. బ్రహ్మ ఒక్కటే శాశ్వతం. ప్రపంచం మిథ్య. గురు ఒక్కడే నిజమైన బ్రహ్మ. శాశ్వతం కానిదానిని విడచి, గురు ఒక్కడినే ధ్యానించాలి. ఇలాంటి సతతమైన భావన ఒక్కటే పరమార్థ ప్రగతికి సాధనం. 
అనిత్యత్యాగే వైరాగ్య జనన | సద్గురు బ్రహ్మచైతన్య ఘన | 
ఉపజే భూతీ భగవంతపణ | అభేద భజన యా నాంవ | ||౩౭|| 
37. శాశ్వతం కానిదానిని విడిచి పెట్టితే, వైరాగ్యం పుట్టుకొస్తుంది. సద్గురువే బ్రహ్మ, అన్ని ప్రాణులలో భగవంతుడే ఉన్నాడన్న భావన కలగటం, దీనినే అభేద ఉపాసన అని అంటారు. 
భయే అథవా ప్రేమే జాణ | జయా జయాచే నిత్య ధ్యాన | 
ధ్యాతా హోఈ ధ్యేయచి ఆపణ | కంస రావణ కీటకీ | ||౩౮|| 
38. భయంతో గాని, ప్రేమతో గాని, దేనినైనా సతతంగా ధ్యానం చేస్తే, ధ్యానం చేసేవారు ధ్యానించిన వస్తువై పోతారు - కంసుడు, రావణుడు, కీటకం మొదలైనవి కృష్ణుడిగాను, రాముడిగాను మరియు తుమ్మెదలా మారినట్లు. 
చింతనీ వ్హావే అనన్యపణ | ధ్యానా సారిఖే నాహీ సాధన | 
కరీ జో అభ్యాస ఆపులా ఆపణ | తయా నిజోద్ధరణ రోకడే | ||౩౯|| 
39. ఏకాగ్రతతో, అనన్యంగా ధ్యానించాలి. అలాంటి ధ్యానానికి సమానమైన సాధన మరొకటి లేదు. ధ్యానాన్ని సాధన చేసేవారు తప్పకుండా తమను తాము తరింప చేసుకుంటారు. 
తేథే కైంచే జన్మ మరణ | జీవభావాసీ పూర్ణ విస్మరణ | 
ప్రపంచాచే మావళే భాన | ఆత్మానుసంధానసుఖ లాహే | ||౪౦||
40. అప్పుడు, చావు పుట్టుకలు ఎక్కడిది? దేహమే జీవుడు అనే భావన పోయి, ప్రపంచ ధ్యాస లేకుండా, ఆత్మను పొందిన సుఖమైన అనుభవం కలుగుతుంది. 

మ్హణోని నిజగురునామావర్తన | తేణోని పరమానందా జనన | 
భూతీ భగవంతాచే దర్శనే | నామాచే మహిమాన కాయ దుజే | ||౪౧|| 
41. అందు వలన, గురు నామాన్ని జపిస్తూ ఉంటే, పరమానందం జనిస్తుంది. అన్ని ప్రాణులలోనూ భగవంతుని దర్శనం కలుగుతుంది. ఇంతకంటే, నామంయొక్క మహిమ వేరే ఏమి ఉంటుంది?
ఏసీ జయాచ్యా నామాచీ మహతీ | తయా మాఝీ సద్భావే ప్రణతీ | 
కాయావాచామనే మీ త్యా ప్రతీ | అనన్యగతీ యే శరణ | ||౪౨|| 
42. ఇంతటి మహిమగల నామం ఉన్నవారికి, నేను భక్తితో నమస్కరిస్తాను. కాయా, వాచా, మనసా నేను వారికి అనన్య శరణుజొచ్చుతున్నాను. 
యే అర్థీంచీ ద్యోతక కథా | కథితో శ్రోతయాకరితా ఆతా | 
తరీ తీ ఏకిజే నిజహితార్థా | ఎకాగ్రచిత్తా కరూనియా | ||౪౩|| 
43. ఇప్పుడు ఈ విషయాన్నే స్పష్టం చేసే ఒక కథను శ్రోతలకు నేను చెబుతాను. దీనిని మీరు, మీ శ్రేయస్సు కోసమే ఏకాగ్ర చిత్తంతో వినండి. 
కైలాసవాసీ కాకా దీక్షిత | సాఈసమర్థా అజ్ఞాంకిత | 
నిత్యనేమ వాచీత భాగవత | ఆహే కీ అవగత సమస్తా | ||౪౪|| 
44. సాయి సమర్థుల ఆజ్ఞ మేరకు కీ. శే. కాకా దీక్షితు నిత్యం నియమంగా (ఏకనాథ) భాగవతాన్ని పఠించేవాడు అనేది అందరికీ తెలిసినదే. 
ఎకే దివశీ దీక్షితాంనీ | కాకా మహాజనీ యాంచే సదనీ | 
చౌపాటీవర భోజన సారునీ | పోథీ నేమానీ వాచిలీ | ||౪౫|| 
45. ముంబయిలోని చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో, ఒక రోజు, భోజనం తరువాత, దీక్షితు గ్రంథాన్ని పఠించ సాగాడు. 
ఎకాదశాచా అద్వితీయ | ఏసా తో సరస ఆణి ద్వితీయ | 
పరిసతా అనుక్రమే అధ్యాయ | శ్రోత్యాచే ధాయ అంతరంగ | ||౪౬|| 
46. సాటిలేని పదుకొండవ స్కంధంలో, రసభరితమైన రెండవ అధ్యాయాన్ని దీక్షితు పఠిస్తుండగా, వింటున్న శ్రోతల మనసులు, సుఖ శాంతులతో నిండిపోయాయి. 
మాధవరావ బాబాంచే భక్త | కాకా మహాజనీ తయాం సమవేత | 
బైసలే ఏకావయా భాగవత | ఎకాగ్ర చిత్త కరూనియా | ||౪౭|| 
47. బాబా భక్తుడైన మాధవరావుతో సహ, కాకా మహాజని కూడా ఏకాగ్ర చిత్తంతో భాగవతాన్ని వినటానికి కూర్చున్నారు. 
కథాహీ భాగ్యే ఫారచి గోడ | జేణే పురేల శ్రోత్యాంచే కోడ | 
జడేల భగవద్భక్తీచీ ఆవడ | ఏసీచ తీ చోఖడ నిఘాలీ | ||౪౮|| 
48. అదృష్టం కొద్దీ, కథ కూడా చాలా మధురమైనది. శ్రోతల కోరికలను తీర్చి, భగవద్భక్తి యందు ప్రీతిని కలిగించే మంచి కథ అది. 
ఋషభ కుళీంచే నఊ1 దీపక | కవి హరి అంతరిక్షాదిక | 
నిఘాలే యాంచేంచ గోడ కథానక | ఆనందజనక బోధప్రద | ||౪౯|| 
49. ఋషభ కులంలోని, కవి, హరి, అంతరిక్ష మొదలైన తొమ్మిది మంది కులదీపకులు చెప్పిన జ్ఞాన బోధ ప్రధానమూ, ఆనందదాయకమూ అయిన మధురమైన కథ అది. 
నఊహీ తే భగవత్స్వ రూప | పోటీ క్షమా శాంతీ అమూప | 
వర్ణితా భాగవత ధర్మప్రతాప | జనక2 నిష్కంప తటస్థ | ||౫౦||
50. ఆ తొమ్మిది మంది కూడా భగవత్స్వరూపులు. అంతులేని క్షమా, శాంతి కలవారు. వారు శక్తివంతమైన భాగవత ధర్మ మహిమను వర్ణించగా, విని జనక మహారాజు ఆశ్చర్యంతో, మౌనంగా ఉండిపోయాడు. 

కాయ తే ఆత్యంతిక క్షేమ | కాయ హరీచీ భక్తి పరమ | 
కైసేన హీ హరి మాయా సుగమ | నిఃశ్రేయస ఉత్తమ గురుచరణ | ||౫౧|| 
51. అన్నింటికంటే క్షేమమైనది ఏది? హరియొక్క పరమ భక్తి ఎటువంటిది? హరియొక్క మాయను సులభంగా దాటే ఉపాయం ఏది? గురువు పాదాలే అన్నిటికంటే ఉత్తమమైనవి. 
కర్మ అకర్మ ఆణి వికర్మ | యా సర్వాంచే ఎకచి వర్మ | 
గురు హేంచ రూప పరమాత్మ | భాగవత ధర్మ గురుభక్తి | ||౫౨|| 
52. గురువే పరమాత్మ రూపం, గురువుయందే భక్తి ఉండటమే భాగవత ధర్మం. కర్మ, అకర్మ, మరియు వికర్మలన్నింటిలో ఉన్న మర్మం ఈ భావనే. 
హరిచరిత్ర అవతార గుణ | ద్రుమిల నాథే కేలే నిరూపణ | 
పురుషావతారాచీ దావూని ఖూణ | రూపే నారాయణ వర్ణిలా | ||౫౩|| 
53. శ్రీ విష్ణువు చరిత్ర, మరియు అవతారాలలోని విశిష్టతను ద్రుమిలనాథుడు వర్ణించాడు. నారాయణ స్వరూపమైన పురుషావతారాన్ని గుర్తించే లక్షణాలను కూడా అతను వివరించాడు. 
పుఢే అభక్త గతి విన్యాస | విదేహా కథీ నాథ చమస | 
వేదవిహిత కర్మాచీ కాంస | సోడిల్యా హో నాశ సర్వస్వీ | ||౫౪|| 
54. భక్తి లేనివారికి పట్టే దుర్గతిని, వేదాలు చెప్పిన కర్మలను చేయని వారందరూ నాశమౌతారనియూ చమస్నాథుడు జనక మహారాజుకు వివరించాడు. 
సర్వాంతరీ హరీచా వాస | మ్హణోని న కరావా కోణాచా ద్వేష | 
పిండీ పిండీ పహావా పరేశ | రితా న రేస త్యావీణ | ||౫౫|| 
55. దేవుడైన హరి అన్ని ప్రాణులలోనూ ఉన్నాడు కనుక, ఎవరినీ ద్వేషించరాదు. ప్రతి ప్రాణిలోనూ పరమేశ్వరుని చూడాలి. దేవుడు లేని చోటంటూ ఏదీ లేదు. 
అంతీ నవవే కరభాజన | కృతత్రేతాది యుగీంచే పూజన | 
కైశా కైశా మూర్తీంచే ధ్యాన | కరితే నిర్వచన జాహలే | ||౫౬|| 
56. చివరలో, తొమ్మిదవ వాడైన కరభాజనుడు, కృత, త్రేతాది యుగాలలో ఏ ఏ దేవతల మూర్తులను ఎలా పూజించాలి, ఎలా ధ్యానించాలి అని వివరించాడు. 
కలియుగీ ఎకచి సాధన | హరి గురు చరణ స్మరణ | 
తేణేంచ హోయ భవభయహరణ | హే ఎక నిజ శరణ శరణాగతా | ||౫౭|| 
57. హరియొక్క, గురువుయొక్క పాదాలను తలచుకోవటం ఒక్కటే కలియుగంలో మనకున్న సాధనం. దానితోనే భవభయం తొలగిపోతాయి. శరణాగతులకు ఉన్న ఏకైక శరణం ఇదే. 
ఏసీ పోథీ జాహల్యాఅంతీ | కాకాసాహేబ పృచ్ఛా కరితీ | 
కాయ హో హీ నవనాథకృతి | అతర్క్య వృత్తి తయాంచీ | ||౫౮|| 
58. గ్రంథ పఠనం ఇంతవరకూ వచ్చిన తరువాత, కాకా సాహేబు, ‘ఈ నవ నాథుల చర్యలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి! వారి మనోవృత్తి కూడా తర్క రహితంగా ఉంది’ అని ఆశ్చర్యపోయాడు. 
ఆవడీ మాధవరావాంస వదతీ | కితీ హో హీ అవఘడ భక్తి | 
ఆమ్హా మూఢా కైచీ హీ శక్తి | జన్మజన్మాంతీ న ఘడే హే | ||౫౯|| 
59. తరువాత, ప్రేమగా మాధవరావుతో, ‘ఈ భక్తి ఎంత కఠినమైనది! మనవంటి మూఢులకు అంతటి శక్తి ఎక్కడిది? జన్మ జన్మలకూ ఇది సాధ్యం కానిది. 
కోఠే హే నాథ మహాప్రతాపీ | కోఠే ఆపణ ఠాయీంచే పాపీ | 
ఆహే కాయ భక్తి హీ సోపీ | సచ్ఛిద్రూపీ తే ధన్య | ||౬౦||
60. ‘ఇంత శక్తివంతులైన ఆ నాథులు ఎక్కడ? పుట్టుకతోనే పాపులైన మనం ఎక్కడ? ఇంతటి భక్తి సులభ సాధ్యమా? సత్యం, జ్ఞానంయొక్క స్వరూపులైన వారు నిజంగా ధన్యులు. 

ఆమ్హా హీ భక్తి ఘడేల కాయ | కైసేన హోఈల తరణోపాయ | 
జాహలో హతాశ గళాలే పాయ | ఝాలా కీ వాయఫళ జన్మహా | ||౬౧|| 
61. ‘ఇలాంటి భక్తి మనకు లభిస్తుందా? మనకింక వేరే దారి ఏది? నేను హతాశుణ్ణయి పోయాను. ఈ జన్మ వ్యర్థమైపోయింది’ అని అన్నాడు.
కాకాసాహేబ భక్త ప్రేమళ | అసావీ జీవాస కాంహీ హళహళ | 
సుస్థిరవృత్తి వ్హావీ కా చంచళ | ఉడాలీ ఖళబళ శామాచీ | ||౬౨|| 
62. కాకాసాహేబు ప్రేమమయుడైన భక్తుడు. అతని మనసు స్థిరంగా ఉండక, ఇలా ఎందుకు చంచలమై తపన పడుతున్నాడు అని శ్యామా మనసులో బాధ పడ్డాడు. 
శామానామే మాధవరావ | జయాంచా కాకాంలాగీ సద్భావ | 
తయాంస కాకాంచా హా స్వభావ | దైన్యాచా ప్రభావ నావడలా | ||౬౩|| 
63. శ్యామా అనబడే మాధవరావుకు కాకాసాహేబు అంటే చాలా అభిమానం. అతనికి కాకాయొక్క నిరాశ, నిస్పృహ, దైన్యం నచ్చలేదు. 
మ్హణతీ బాబాంసారిఖే లేణే | భాగ్య లాధలే జయాసీ తేణే | 
ముఖ కరావే కేవిలవాణే | వ్యర్థ కీ జీణే తయాచే | ||౬౪|| 
64. ‘బాబాలాంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండి కూడా, ఇంతటి దైన్యం ఎందుకు? అతడు జీవించడం వ్యర్థం’ అని అనుకున్నాడు. 
సాఈచరణీ శ్రద్ధా అఢళ | తరీ హీ కా మనాచీ తళమళ | 
నాథాంచీ భక్తి అసేనా ప్రబళ | ఆపులీహీ ప్రేమళ నవ్హే కా? | ||౬౫|| 
65. ‘సాయి పాదాలలో ఇంతటి దృఢమైన విశ్వాసం ఉండీ కూడా, మనసులో ఇంతటి అలజడి ఎందుకు? నవనాథుల భక్తి ప్రబలమైనదే కావచ్చు. కాని, మన భక్తిలో ప్రేమ లేదా?’ 
ఎకనాథీ టీకేసహిత | ఎకాదశస్కంధ భాగవత | 
వాచావే భావార్థ రామాయణ నిత | ఆపణా నిశ్చిత హీ ఆజ్ఞా | ||౬౬|| 
66. ‘టీకా సహితంగా ఏకనాథ భాగవతంలోని పదుకొండవ స్కంధం మరియు భావార్థ రామాయణాన్ని మీరు రోజూ పఠించాలని బాబా ఆజ్ఞయే కదా! 
తైసేంచ హరిగురు నామస్మరణ | హీ బాబాంచీ ఆజ్ఞా ప్రమాణ | 
యాంతచి అపులే భవభయ తారణ | చింతేచే కారణ కాయ తుమ్హా? | ||౬౭|| 
67. ‘అలాగే, హరినామ స్మరణ, గురునామ స్మరణ, సంసార సాగరం దాటడానికి సాధన, అనేది కూడా బాబా ఆజ్ఞయే కదా? అలాంటప్పుడు, ఎందుకు మీకు ఇంత చింత?’ అని అన్నాడు. 
పరీ త్యా నవయోగ్యాచే చరిత | తయాచే తే అసిధారావ్రత | 
సాధేల కాయ ఆపణా యత్కించిత | చింతన హే సతత కాకాంచే | ||౬౮|| 
68. అయినా, ఆ నవయోగుల చరిత్ర, వారి నియమ నిష్ఠలు, వారు పాలించిన కత్తి మీద సామువంటి వ్రతాలు, వీటిలో ఏ కొంచమైనా మనకు సాధ్యమా? అని కాకా సతతంగా ఆలోచిస్తుండేవాడు. 
లాగలీ జీవాస మోఠీ చుటపుట | నవయోగ్యాంచీ భక్తిచ ఉద్భట | 
కవణ్యా ఉపాయే హోఈల ప్రకట | తరీచ మగ నికట దేవ ఖరా | ||౬౯|| 
69. ఆ నవయోగుల భక్తియే అన్నిటికంటే ఉత్తమమైనది, శ్రేష్ఠమయినది అనియూ, అది ఎలా లభిస్తుంది? ఆ భక్తిద్వారానే భగవంతుని సామీప్యం సాధ్యం, అనియూ కాకా మనసులో తీవ్రమైన కోరిక ఏర్పడింది. 
అసో ఏసీ లాగలీ హురహుర | ఆసనీ శయనీ హాచ విచార | 
ఉదయీక ఘడలా చమత్కార | శ్రోతీ తో సవిస్తర పరిసావా | ||౭౦||
70. అలా, ఈ ఆవేదన ఎంతగా పెరిగిందంటే, కూర్చున్నా, పడుకున్నా, అదే ఆలోచన కాకాను బాధపెట్ట సాగింది. అప్పుడు జరిగిన అద్భుతమైన చమత్కారాన్ని శ్రోతలూ, సవిస్తారంగా వినండి. 

అనుభవాచా పహా నవలావ | ప్రాతఃకాళీంచ ఆనందరావ | 
పాఖాడే హే జయా ఉపనాంవ | ఆలే మాధవరావా శోధావయా | ||౭౧|| 
71. ఆశ్చర్యకరమైన ఆ అనుభవాన్ని గమనించండి. రెండవ రోజు ఉదయమే ఆనందరావు పాఖాడే అనే వ్యక్తి మాధవరావును వెదుకుతూ వచ్చాడు. 
తేహీ ఆలే ప్రాతఃకాళీ | భాగవత వాచావయాచే వేళీ | 
బైసలే మాధవరావాజవళీ | స్వప్నాచీ నవాళీ సాంగత | ||౭౨|| 
72. అది కూడా, తెల్లవారే, సరిగ్గా భాగవత పఠన సమయానికి వచ్చి, మాధవరావు ప్రక్కన కూర్చుని, గత రాత్రి తనకొచ్చిన కల విశేషాన్ని చెప్పసాగాడు. 
ఇకడే చాలలీ ఆహే పోథీ | తికడే పరస్పర దోఘే ఫుసఫుసతీ | 
తేణే శ్రోత్యా వక్త్యాంచే చిత్తీ | అస్థైర్య స్థితి పాతలీ | ||౭౩|| 
73. ఇక్కడ ఒక వైపు గ్రంథ పఠనం సాగుతుంటే, మరోవైపు అక్కడ, వారిద్దరూ గుసగుసలాడుకొంటున్నారు. దీనివలన, చెప్పేవారికి, వినేవారికీ గ్రంథ పఠనంపై ఏకాగ్రత తప్పిపోయింది. 
ఆనందరావ చంచల వృత్తీ | మాధవరావాంస స్వప్న కథితీ | 
వదతా పరిసతా దోఘే కుజబుజతీ | రాహిలీ పోథీ క్షణభర | ||౭౪|| 
74. ఆనందరావు చంచల మనస్కుడు. తన కల గురించి మాధవరావుకు వివరిస్తుండగా, వారిరువురూ ఒకరికొకరు అడగటం, చెప్పటం వలన గ్రంథ పఠనానికి ఆటంకం కలిగింది. 
కాకాసాహేబ తంవ త్యా పుసతీ | కాయ తీ ఏసీ నవల స్థితి | 
దోఘేచ తుమ్హీ ఆనంద వృత్తి | సాంగా న ఆమ్హా ప్రతీ కాయ కీ | ||౭౫|| 
75. అప్పుడు కాకాసాహేబు వారితో, ‘మీరిద్దరూ ఇంత ఆనందంగా ఉన్నారు, ఏమిటి విశేషం? అదేమిటో మాకు కూడా కాస్త చెప్పండి’ అని అన్నాడు. 
తవ తే మాధవరావ వదతీ | కాలచ కీ ఆపణా శంకా హోతీ | 
సమాధాన ఘ్యా హాతోహాతీ | తారక భక్తి లక్షణ | ||౭౬|| 
76. అందుకు మాధవరావు, ‘నిన్ననే కదా మీకు సంశయం కలిగింది, దానికి వెంటనే సమాధానం వచ్చింది. సంసార సాగరాన్ని దాటించే భక్తియొక్క లక్షణాలను వినండి. 
పరిసా పాఖాడ్యాంచే స్వప్న | దిధలే బాబాంనీ కైసే దర్శన | 
హోఈల అపుల్యా శంకేచే నిరసన | గురుపదవందన భక్తి పురే | ||౭౭|| 
77. ‘పాఖాడేయొక్క కల గమనించండి. అందులో బాబా ఎలా దర్శనమిచ్చారో వింటే, మీ సందేహాలు తొలగి పోయి, గురువు పాదాలకు నమస్కరించే భక్తి ఉంటే చాలు, అని అర్థమౌతుంది’ అని అన్నాడు. 
మగ తే స్వప్న ఏకావయాచీ | ప్రబళ జిజ్ఞాసా త్యా సర్వాంచీ | 
విశేషే కాకాసాహేబ యాంచీ | శంకాహీ తయాంచీచ ఆరంభీ | ||౭౮|| 
78. ఆ కల గురించి వినటానికి అందరికీ కుతూహలం కలిగింది. ముఖ్యంగా కాకాసాహేబుకు, తెలుసుకోవాలనే ఆతురత, ఎందుకంటే అతనికేగా మొదట సంశయం కలిగింది! 
పాహోనియా సర్వాంచా భావ | స్వప్న సాంగే ఆనందరావ | 
చిత్తీ ఠేవూనియా సద్భావ | శ్రోత్యాంసహీ నవలావ వాటలా | ||౭౯|| 
79. అందరి ఆతురతను గమనించి, ఆనందరావు తన కలను శ్రద్ధగా చెప్పసాగాడు. అక్కడ ఉన్నవారందరికీ నమ్మకం ఉంది కాబట్టి, చాలా వింతగా వినసాగారు. 
ఎకా మహా సముద్రాంత | ఉభా మీ కంబరభర ఉదకాంత | 
తేథే మాఝియా దృష్టిపథాంత | ఆలే శ్రీసమర్థ అకల్పిత | ||౮౦||
80. ‘నేను ఒక సముద్రంలో, నడుము లోతు నీటిలో నిలబడి ఉన్నాను. అప్పుడు, అక్కడ శ్రీ సాయి సమర్థులు నా దృష్టికి కనిపించారు. 

రత్నఖచిత సింహాసన | వరీ సాఈ విరాజమాన | 
ఉదకాంతర్గత జయాంచే చరణ | ఏసే తే ధ్యాన దేఖిలే | ||౮౧|| 
81. ‘రత్న ఖచితమైన సింహాసనంపై వారు కూర్చుని ఉన్నారు. వారి పాదాలు నీటి లోపలే ఉన్నాయి. అలాంటి దృశ్యాన్ని చూశాను.
పాహూని ఏసే మనోహర ధ్యాన | జాహలే అత్యంత సమాధాన | 
తే స్వప్న హే కోణాస భాన | మన సుఖసంపన్న దర్శనే | ||౮౨|| 
82. ‘వారి మనోహరమైన రూపాన్ని చూసి, నాకు అత్యంత ఆనందం కలిగింది. అలాంటి దృశ్యం కల అనే భావన ఎవరికి కలుగుతుంది? వారి దర్శనంతో మనసుకు ఎంతో సంతోషం కలిగింది. 
కాయ త్యా యోగాచా నవలావ | తేథేంచ ఉభే మాధవరావ | 
పాయా పడా హో ఆనందరావ | వదలే మజ భావపురఃసర | ||౮౩|| 
83. ‘ఇంకా ఆశ్చర్యకరమైన ఘటన అంటే, మాధవరావు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. మాధవరావు భావావేశంతో నాతో, ‘వారి పాదాలపై పడు, ఆనందరావు!’ అని అన్నాడు. 
తంవ మీ తయా ప్రత్యుత్తర దేత | ఇచ్ఛా మాఝీహీ ఆహే బహుత | 
పరీ తే పాయ ఉదకాంతర్గత | కైసే మజ హాతాంత యేతీల | ||౮౪|| 
84. ‘ ‘అలా చేయాలనే నాకూ కోరికగా ఉంది కాని, వారి పాదాలు నీటిలో ఉన్నాయి. నా చేతికి అవి ఎలా అందుతాయి?’ అని నేను బదులు చెప్పాను. 
ఉదకామాజీ పాయ అసతా | కైసా పాయీ ఠేవూ మాథా | 
తరీ మీ కాయ కరావే ఆతా | నకళే మజ తత్వతా కాంహీంహీ | ||౮౫|| 
85. ‘ ‘నీటిలో ఉండే ఆ పాదాలపై నా శిరసును ఎలా పెట్టగలను? నేనిప్పుడు ఏం చేయాలి? నాకు నిజంగా ఏమీ అర్థం కావటం లేదు’ అని అన్నాను. 
ఏసే పరిసూని మాధవరావ | పరిసా బాబాంస వదలే కాయ | 
దేవా3 కాఢ రే వరతీ పాయ | ఆహేత తే తోయ ప్రచ్ఛన్న | ||౮౬|| 
86. ‘ఇది విన్న మాధవరావు అప్పుడు బాబాతో ఏమన్నాడో వినండి. ‘దేవా! నీటిలో ఉన్న మీ పాదాలను పైకి తీయండి’ అని 
ఏసే వదతాంచ తత్క్షేణ | కాఢిలే బాబాంనీ బాహేర చరణ | 
ఆనందరావాంనీ మగ తే ధరూన | కేలే అభివందన అవిలంబే | ||౮౭|| 
87. అలా అన్న వెంటనే, బాబా తమ పాదాలను బయటికి తీశారు. ఆలస్యం చేయకుండా, ఆనందరావు బాబా పాదాలను పట్టుకుని వందనం చేశాడు. 
ఏసే ధరితా దృఢ చరణ | బాబాంనీ దిధలే ఆశీర్వచన | 
“హోఈల జారే తుఝే కల్యాణ | కాంహీ న కారణ భీతీచే” | ||౮౮|| 
88. ‘నేను అలా వారి పాదాలను దృఢంగా పట్టుకుని ఉన్నప్పుడు, బాబా, “నీకు అన్నీ శుభం కలుగుతుంది. నీవు భయ పడవలసినది ఏదీ లేదు, 
ఆణిక బాబా వదలే దేఖ | “రేశీమ కాంఠీ ధోతర ఎక | 
శామ్యాస మాఝ్యా దేఊన టాక | తుజ సుఖదాయక హోఈల” | ||౮౯|| 
89. “జరీ అంచు ధోవతిని నా శ్యామాకు ఇవ్వు. అందు వలన నీకు శుభం కలుగుతుంది” అని కూడా అన్నారు. 
తరీ తీ వందూని ఆజ్ఞా శిరీ | ధోతర మ్యా ఆణిలే రేశీమధారీ | 
కాకాసాహేబ ఆపణ తే స్వకరీ | మాధవరావ స్వీకారీ ఏసే కరా | ||౯౦||
90. ‘వారి ఆజ్ఞను శిరసావహించి, జరీ అంచు ధోవతిని తెచ్చాను. కాకాసాహేబ్! దానిని మాధవరావు మీ చేతుల ద్వారా తీసుకునేలా చేయండి. 

మాన్య కరా జీ హీ మమ వినంతీ | మాధవరావ హే పరిధాన కరితీ | 
కరా ఏసే సుఖవా మజప్రతీ | హోఈన మీ అతీ ఉపకారీ | ||౯౧|| 
91. ‘నా ఈ విన్నపాన్ని మన్నించండి. మాధవరావు దీనిని కట్టుకునేలా చేయండి. దానివలన నాకు సంతోషం కలుగుతుంది. నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అవుతాను’. 
ఆనందరావాచీ హీ మాత | మాధవరావ స్వయే పరిసత | 
కాకాసాహేబ జంవ తే దేత | తే న స్వీకారిత తే వస్త్ర | ||౯౨|| 
92. ఆనందరావు మాటలను తను స్వయంగా విన్నా, కాకాసాహేబు ఇచ్చిన ధోవతిని మాధవరావు తీసుకోలేదు. 
తయాంచే మనీ హే తో స్వప్న | ఆమ్హాస పటలీ పాహిజే ఖూణ | 
దృష్టాంత కాంహీ జాహల్యావిణ | ఘ్యావే న ఆపణ హే వస్త్ర | ||౯౩|| 
92. ఆనందరావు మాటలను తను స్వయంగా విన్నా, కాకాసాహేబు ఇచ్చిన ధోవతిని మాధవరావు తీసుకోలేదు. 
కాకాసాహేబ తేవ్హా వదత | ఆతా బాబాంచీ పాహూ ప్రచీత | 
ఘేణే హే ఉచిత అథవా అనుచిత | హోఈల తే సూచిత చిఠ్ఠ్యాంనీ | ||౯౪|| 
94. అప్పుడు కాకాసాహేబు, ‘బాబా అభిప్రాయాన్ని తెలుసుకుందాం. తీసుకోవటం సరియైనదా, కాదా అనేది చీటీల ద్వారా తెలుస్తుంది’ అని అన్నాడు. 
దేతీల బాబా చిఠ్ఠీ జైసీ | మానూ తయాంచీ ఆజ్ఞా తైసీ | 
చిఠ్ఠ్యా బాబాంచియా పాయాపాసీ | కృతసంకల్పేసీ టాకిల్యా | ||౯౫|| 
95. ‘బాబా ఇచ్చిన చీటీయే వారి ఆజ్ఞగా తీసుకుందాం’ అని నిశ్చయించుకుని, చీటీలలో వ్రాసి, బాబా పాదాల వద్ద ఉంచాడు. 
కాకాసాహేబ యాంచా భార | హోతా సర్వస్వీ సాఈచియావర | 
ఆధీ ఘ్యావా త్యాంచా విచార | కరావా తో వ్యవహార పుఢారా | ||౯౬|| 
96. కాకాసాహేబు తన భారాన్నంతా సాయిపైనే ఉంచేవాడు. బాబా అభిప్రాయాన్ని ముందుగా తెలుసుకున్న తరువాతే ఏ పనైనా చేసేవాడు. 
హే తో బాబాంచే హయాతీంత | తోచ కీ క్రమ తయాంచే పశ్చాత | 
చిఠ్ఠ్యా టాకూన ఆజ్ఞా ఘేత | తైసేచ తే వర్తత నిశ్చయే | ||౯౭|| 
97. అలా ఏమో, బాబా శరీరంతో ఉన్నప్పుడు చేసేవాడు. వారు శరీరాన్ని వదిలిన తరువాత, చీటీలు వేసి బాబా ఆజ్ఞను తీసుకునేవాడు. ఆ ఆజ్ఞను తప్పక పాలించేవాడు. 
కార్య మోఠే అథవా సాన | చిఠ్ఠీనే ఆజ్ఞా ఘేతల్యావీణ | 
కాంహీ న కరణే గేలియా ప్రాణ | అనుజ్ఞా ప్రమాణ సర్వథా | ||౯౮|| 
98. పని చిన్నదైనా పెద్దదైనా, చీటీల ద్వార బాబా ఆజ్ఞను తీసుకోకుండా, ప్రాణం పోయినా, ఏ పనీ చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞయే సర్వదా ప్రమాణం. 
దేహచి జేథే నాహీ అపులా | ఎకదా బాబాంచ్యా పాయీ వాహిలా | 
మగ తయాచ్యా చలనవలనాలా | కాయ అపుల్యా అధికార | ||౯౯|| 
99. ‘బాబా పాదాలకు అంకితం చేసిన తరువాత, దేహమే మనది కానప్పుడు, దాని వ్యవహారాల పైన మనకు అధికారం ఎక్కడుంటుంది?’ 
పహా యా ఎకా భావనేవర | లాఖో రుపయాంచే కమాఈవర | 
లాథ మారిలీ పరీ హా నిర్ధార | దృఢ ఆమరణాంత రాఖిలా | ||౧౦౦||
100. అనే ఈ ఒక్క భావంతో, లక్షలాది రుపాయల సంపాదనను కాలద్రోసుకున్నాడు కాని, తన దృఢ నిర్ణయాన్ని జీవితాంతం వరకు పాటించాడు. 

“ఫళా యేఈల తుఝే ఇమాన | ధాడీన మీ తుజలాగీ విమాన | 
నేయన త్యాంత బైసవూన | నిశ్చింత మన రాహీ తూ” | ||౧౦౧|| 
101. “నీ నమ్మకం ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపి, అందులో నిన్ను కూర్చోబెట్టి, తీసుకొని పోతాను. నిశ్చింత మనస్కుడవై ఉండు”.
హీ బాబాంచీ ప్రసాదోక్తి | అక్షరే అక్షర ఆలీ ప్రతీతి | 
సాఈలీలా వాచకాంప్రతి | ఠావీ నిర్గమ స్థితీ కాకాంచీ | ||౧౦౨|| 
102. బాబాయొక్క ఈ అనుగ్రహ వచనంలోని ప్రతి అక్షరం నిజంగా జరిగింది. కాకాసాహేబుయొక్క విశిష్టమైన నిర్యాణం గురించి, సాయిలీలా మాసికం పాఠకులకు ఇప్పటికే తెలుసు. 
హోతా తయా స్థితీచే స్మరణ | ఆణీక తే కాయ విమాన ప్రయాణ | 
కాయ తే ఆనందాచే మరణ | గురునామావర్తన సమవేత | ||౧౦౩|| 
103. అప్పటి స్థితి తలచుకుంటే, విమాన ప్రయాణమంటే ఇంతకంటే వేరే ఏముంటుంది, అని అనిపిస్తుంది. అనంతమైన గురు నామ స్మరణ జరుగుతుండగా, ఆనందమయమైన ఎంతటి సునాయాస మరణం! 
ఏసే దీక్షిత కరారీ ఆపణ | చిత్తీ నిరంతర సాఈ చరణ | 
ఇష్ట మిత్రాంహీ దేఊని శికవణ | జాహలే విలీన గురుపాయీ | ||౧౦౪|| 
104. అలా, దీక్షితు తన నిశ్చయంలో దృఢంగా ఉండేవాడు. సాయి పాదాలలో ఎప్పుడూ అతని మనసు లీనమై ఉండేది. ఇష్టులకు, మిత్రులకు దీనినే నేర్పించి, గురు చరణాలలో విలీనమై పోయాడు. 
ఆతా పూర్వానుసంధాన స్థితి | దోఘాంహీ మానలీ చిఠ్ఠ్యాంచీ యుక్తి | 
కారణ దోఘాంచీ కాకాంవర ప్రీతి | చిఠ్ఠ్యా మగ లిహవితీ అవిలంబే | ||౧౦౫|| 
105. ఇప్పుడు మునపటి కథకు వస్తే, ఆనందరావు, మాధవరావు ఇద్దరూ కాకాపైని ప్రీతితో చీటీల ఉపాయాన్ని ఒప్పుకున్నారు. ఆలస్యం చేయకుండా, చీటీలను వ్రాయించారు. 
ఎకా చిఠ్ఠీంత ‘ఘ్యావే ధోతర’ | దుసరీంత ‘త్యాచా కరావా అవ్హేర’ | 
ఏసే లిహూన సాఈచ్యా పాయావర | టాకిల్యా ఛాయా చిత్రాతళీ | ||౧౦౬|| 
106. ఒక చీటీలో ‘ధోవతిని తీసుకో’ అని, రెండవ దానిలో ‘తీసుకోవద్దు’ అని వ్రాసి, సాయియొక్క చిత్రపటం క్రింద, వారి పాదాల వద్ద ఉంచారు. 
తత్రస్థ ఎకా అర్భకాస | త్యాంతీల చిఠ్ఠీ ఉచలావయాస | 
లావితా ధోతర ఘ్యావయాస | మాధవరావాంస యే ఆజ్ఞా | ||౧౦౭|| 
107. అక్కడున్న బాలునితో, ఒక చీటీని తీయించగా, అందులో ‘ధోవతిని స్వీకరించు’ అని మాధవరావుకు ఆజ్ఞ అయింది. 
జైసే స్వప్న తైసీచ చిఠ్ఠీ | ఆనంద ఝాలా సకళా పోటీ | 
మగ తే ధోతర రేశీమ కాంఠీ | ఘాతలే కరసంపుటీ శామాచియా | ||౧౦౮|| 
108. కలలో ఉన్నట్టే, చీటీలోనూ ఉండటం వలన, అందరికీ ఆనందం కలిగింది. అప్పుడు, జరీ అంచు ధోవతిని మాధవరావు చేతిలో పెట్టటం జరిగింది. 
త్యాంచే స్వప్న యాంచీ చిఠ్ఠీ | పరస్పరాంశీ పడతా మిఠీ | 
పరమానంద న మాయ పోటీ | సుఖసంతుష్టీ ఉభయాంతే | ||౧౦౯|| 
109. ఆనందరావు కల, మాధవరావు చిట్టి, రెండూ ఒకటే అవటం వలన, వారిద్దరికీ భరించలేనంత పరమానందం కలిగింది. ఆ ఇద్దరికీ సంతోషం, తృప్తి కలిగాయి. 
మాధవరావ అంతరీ ఖూష | ఆనందరావాసహీ సంతోష | 
ఝాలా సాఈభక్తి పరిపోష | ఆశంకా నిరాస కాకాంచా | ||౧౧౦||
110. మాధవరావు లోలోపల ఆనందించాడు. ఆనందరావు కూడా చాలా సంతోష పడ్డాడు. సాయి భక్తి పరిపుష్టి కావడంతో, కాకా సంశయం కూడా తొలగింది. 

అసో యా సర్వ కథేంచే సార | జ్యాచా త్యాణే కరావా విచార | 
ఠేవిల్యా గురుపాయావర శీర | గురువదనోద్గార లక్షావే | ||౧౧౧|| 
111. ఏమైనా, ఈ కథ సారాంశమేమిటంటే, గురువు పాదాలయందు శిరసును ఉంచినప్పుడు, గురువు నోటినుండి వచ్చిన మాటలను, చాలా శ్రద్ధతో పాటించాలి అనే దానిని గురించి, ఎవరికి వారు, ప్రతియొక్కరూ ఆలోచించాలి. 
ఆపణాహూన ఆపులీ స్థితి | ఆపులీ భూమికా వా చిత్తవృత్తి | 
గురు జాణే నఖశిఖాంతీ | ఉద్ధారగతీహీ తోచ | ||౧౧౨|| 
112. మన స్థితిగతులు, మన చిత్తవృత్తి, మన భూమిక, వీటి గురించి మనకంటే, మన గురువుకే బాగా తెలుసు. అలాగే, మనల్ని ఎలా ఉద్ధరించాలన్నది కూడా గురువుకే తెలుసు. 
జైసా రోగ తైసే నిదాన | తైసేంచ ఔషధ వా అనుపాన | 
సద్గురునేమీ శిష్యాలాగూన | భవరోగ నివారణ కార్యార్థ | ||౧౧౩|| 
113. రోగానికి తగిన విధంగా ఔషధం అన్నట్టు, భవ రోగ నివారణ కోసం, సద్గురువు శిష్యునికి ఔషధ రూపంగా నియమాలను విధిస్తారు. 
స్వయే తో జీ కరితో కరణీ | ఆణూ నయే ఆపులే అనుకరణీ | 
తుమ్హా కారణే గురుముఖాంతునీ | నిఘేల తీ వాణీ ఆదరావీ | ||౧౧౪|| 
114. గురువు ఆచరించే విధానాన్ని మనము అనుకరించ కూడదు. కాని, గురువు నోటినుండి మన కోసం వచ్చే మాటలను శ్రద్ధగా ఆచరించాలి. 
త్యాచ శబ్దాంవర ఠేవావే మన | తయాంచేచ నిత్య కరావే చింతన | 
తేంచ తుమచ్యా ఉద్ధారా కారణ | ఠేవా హే స్మరణ నిరంతర | ||౧౧౫|| 
115. ఆ మాటలనే ఏకాగ్రతతో విని, వాటినే మననం చేయాలి. అవే మీ ఉద్ధరణకు ఉపయోగ పడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోండి. 
గురు సాంగే తే పోథీపురాణ | తే తో తద్వచన స్పష్టీకరణ | 
ముఖ్య ఉపదేశీ ఠేవా ధ్యాన | తే నిగమజ్ఞాన ఆపులే | ||౧౧౬|| 
116. గురువు చెప్పినదే, మనకు పురాణ గ్రంథాలలో చెప్పిన మాటలు. వారి మాటలు వాటినే స్పష్టం చేస్తాయి. కాని, మన ధ్యానం ఎప్పుడూ వారి ముఖ్యోపదేశాల పైనే ఉండాలి. అవే మనకు వేద వాక్యాలు. 
కోణాహీ సంతాచే వచన | త్యాచా కరూ నయే అవమాన | 
ఆపులీ మాయ ఆపులీ జతన | కరీల తీ అన్య కోణ కరీ | ||౧౧౭|| 
117. ఏ సత్పురుషుని మాటలనైనా అవమానించ కూడదు. మన కన్న తల్లి మనల్ని చూసినట్లు మిగతా వారెవరు చూస్తారు? 
ఖరా మాయేచా జివ్హాళా | లేంకురాలాగీ తిచా కనవాళా | 
బాళ నేణే తో సుఖసోహళా | ఘేఈల తో లళా తీ పురవీ | ||౧౧౮|| 
118. కన్న తల్లికి తన బిడ్డల పైన, నిజమైన వాత్సల్యం ఉంటుంది. తన గురించి చేసే పనులలో, ఆమె పొందే సుఖం బిడ్డకు తెలియదు. బిడ్డల ప్రతి కోరికనూ తల్లి తీరుస్తుంది. 
సంత సృష్టీమాజీ ఉమాప | “ఆపులా బాప తో ఆపులా బాప” | 
సాఈముఖీంచే హే కరుణాలాప | కోరా స్వహృదయపటావరీ | ||౧౧౯|| 
119. సృష్టిలో లెక్కలేనంత సంతులు ఉన్నారు. కాని, "మన తండ్రి మన తండ్రే" అని సాయి నోటినుండి వెలువడిన కరుణా వచనాన్ని మీ హృదయ ఫలకంపై వ్రాసుకోండి. 
మ్హణోని సాఈముఖీంచే వచన | తేథేంచ ఠేవా అనుసంధాన | 
అంతీ తోచ కృపానిధాన | తాపత్రయ శమన కరీల | ||౧౨౦||
120. అందు వలన, సాయి నోటినుండి వెలువడిన మాటలయందే ధ్యానం ఉంచండి. దయామయులైన వారే చివరకు మన తాపత్రయాలను నివారించేది. 

తోచ జాణే త్యాచీ కళా | ఆపణ పహావే కౌతుక డోళా | 
కాయ అద్భుత తయాచ్యా లీలా | సహజ అవలీలా ఘడతీ జ్యా | ||౧౨౧|| 
121. వారి కళ వారికే తెలుసు. వారి ఆ కళా కౌశలాన్ని మనం కళ్లతో చూడాలి అంతే. ఎంతో సహజంగా, అవలీలగా సంభవించే వారి లీలలు, అంతే అద్భుతం.
దుసరా ఎక మ్హణతో మ్హణూన | త్యాంచే సర్వ ఘ్యావే ఏకూన | 
మోడూ న ద్యావే నిజానుసంధాన | నిజగురువచన విసరూ నయే | ||౧౨౨|| 
122. ఇంకొకరు ఏది చెప్పినా, ఆ మాటలన్నింటినీ వినండి. మీ గురువుయొక్క మాటలను మాత్రం మరచిపోకండి. మీ ధ్యేయాన్నీ, మీ ధ్యానాన్నీ వదలకండి. 
యాంతచి ఆహే పరమకల్యాణ | యాంతచి ఆహే భవభయతరణ | 
యాంతచి అవఘే పోథీపురాణ | జపతపానుష్ఠానచి హే | ||౧౨౩|| 
123. ఇందులోనే భవభయ నివారణమూ, ఇందులోనే పురాణాలు, గ్రంథాలు, ఇందులోనే జప, తప మరియు అనుష్ఠానాలూ ఉన్నాయి. ఇదే మనకు పరమ శుభప్రదము. 
సారాంశ ప్రేమ కరా గురూవర | అనన్యభావే నమస్కార | 
దినకరాపుఢే కైచా అంధార | తయాంసీ భవసాగర నాహీంచ | ||౧౨౪|| 
124. సారాంశంలో చెప్పాలంటే, గురువును ప్రేమించండి, వారికి అనన్య భావంతో నమస్కరించండి. సూర్యుడి ముందు చీకటి ఎలా ఉంటుంది? అలాగే, గురువు వద్ద సంసార సాగరము ఉండదు. 
అసా కుఠేహీ సృష్టీవర | నికట అథవా కితీహీ దూర | 
సాతా సముద్రాచ్యాహీ పార | భక్తార్థ అనివార ప్రేమళ | ||౧౨౫|| 
125. సృష్టిలో ఎక్కడున్నా - దగ్గరలో గాని, దూరంలో గాని, ఏడు సముద్రాల అవతల ఉన్నా సరే - శిష్యులయందు గురువు అత్యంత ప్రేమ కలిగి ఉంటారు. 
అసో ఏసే హే లిహితా లిహితా | కథా ఎక ఆఠవలీ చిత్తా | 
ఎకాచే పాహూని దుజ్యానే కరితా | కైసియా ఆపదా హోత జీవా | ||౧౨౬|| 
126. ఇలా వ్రాస్తూ, వ్రాస్తూ ఉండగా, ఒకరిని చూచి మరొకరు అనుకరిస్తే ఎంతటి ఆపదలు కలుగుతాయనే ఇంకొక కథ నాకు గుర్తుకు వచ్చింది. 
ఎకదా బాబా మశీదీంత | అసతా మ్హాళసాపతీ సమవేత | 
పూర్వీల ఫళీచీ శేజ అవచిత | స్మరే అకల్పిత తయాంతే | ||౧౨౭|| 
127. ఒక సారి, మహల్సాపతితో బాబా మసీదులో ఉండగా, అకస్మాత్తుగా మునుపు తాము పలకపై పడుకున్న సంగతి వారికి గుర్తుకు వచ్చింది. 
రుందీ అవఘీ సవావీత | దోనీ టోకాంస చింధ్యా బాంధిత | 
మశీదీచియా ఆఢ్యాస టాంగిత | ఝోంపాళా కరీత తియేచా | ||౧౨౮|| 
128. ఆ చెక్క వెడల్పు సుమారు ఒక అడుగు మాత్రమే. దానిపై పడుకోవటానికి, రెండు వైపులా దానికి పాత గుడ్డ పీలికలను కట్టి, మసీదు దూలానికి అడ్డంగా వ్రేలాడ గట్టేవారు. 
నిజూ నయే అంధారాంత | తదర్థ ఉశాపాయథ్యా లగత | 
ఠేవూని రాత్రౌ పణత్యా జళత | బాబా నిజత ఫళీవర | ||౧౨౯|| 
129. చీకటిలో పడుకోకూడదని, తల వద్దా, కాళ్ళ వద్దా దీపాలను ఉంచి, అవి రాత్రంతా వెలుగుతుండగా, బాబా ఆ చెక్కపైన పడుకునే వారు. 
యా ఫళీచే సమూళ వృత్త | పూర్వీల ఎకా అధ్యాయాంత4
ఆధీంచ వర్ణిలే ఆహే యేథ | పరిసా కీ మహత్వ తియేచే | ||౧౩౦||
130. ఈ చెక్క పలక వృత్తాంతాన్ని అంతా, ఇదివరకే ఒక అధ్యాయంలో (అధ్యాయం పది) వర్ణించాను. దాని మహత్వాన్ని ఇప్పుడు వినండి. 

ఎకదా యా ఫళీచీ మహతీ | మనోభావే బాబా వర్ణితీ | 
కాకాసాహేబ దీక్షితా చిత్తీ | ఉదేలీ వృత్తీ తీ పరిసా | ||౧౩౧|| 
131. ఒక సారి, ఈ చెక్క పలక గొప్పదనాన్ని బాబా వర్ణిస్తుండగా, కాకాసాహేబు దీక్షితు మనసులో కలిగిన ఆలోచనను వినండి. 
మ్హణతీ మగ తే బాబాంప్రతీ | ఫళీవరీ శయనప్రీతి | 
అసేల తరీ తీ టాంగతో ప్రీతీ | మగ స్వస్థ చిత్తీ పహుడావే | ||౧౩౨|| 
132. బాబాతో అతడు, 'మీకు ఆ చెక్క పలకపై శయనించాలని అంత కోరికగా ఉంటే, ఒక చెక్క పలకను ప్రేమతో వ్రేలాడ కట్టిస్తాను. అప్పుడు మీరు దానిపై సుఖంగా పడుకోవచ్చు' అని అన్నాడు. 
బాబా తయాంస ప్రత్యుత్తర దేతీ | “ఖాలీ టాకూన మ్హాళసాపతీ | 
ఆపణచి వర నిజావే కేఉతీ | బరా మీ ఖాలతీ ఆహే తో” | ||౧౩౩|| 
133. "మహల్సాపతిని క్రింద వదలి, నేను ఒక్కణ్ణే పైన ఎలా పడుకోగలను? నేను క్రింద బాగానే ఉన్నాను" అని బాబా జవాబిచ్చారు. 
త్యావర కాకా అతిప్రీతీ | ఆణీక ఫళీ టాంగూ మ్హణతీ | 
ఆపణ నిజావే ఎకీవరతీ | మ్హాళసాపతీ దుసరీవర | ||౧౩౪|| 
134. అప్పుడు కాకా చాలా ప్రేమతో, 'ఇంకొక చెక్క పలక కట్టిస్తాను. ఒక దానిపై మీరు, రెండవదానిపై మహల్సాపతి పడుకోవచ్చు' అని చెప్పాడు. 
త్యావరీ పహా బాబాంచే ఉత్తర | “తో కాయ నిజతో ఫళీవర | 
జయా అంగీ గుణప్రకర5 | తోచ ఫళీవర నిజేల | ||౧౩౫|| 
135. దానికి బాబా ఏమన్నారో వినండి. "అతడు అసలు చెక్కపై పడుకోగలడా? శరీరంలో సుగుణ సంపదలు ఉన్నవాడే చెక్కపైన పడుకోగలడు. 
“నాహీ ఫళీవర శయన సోపే | కోణ తియేవర మజవీణ ఝోంపే | 
నయన ఉఘడే నిద్రా లోపే | తయాసచి ఝేపే హే శయన | ||౧౩౬|| 
136. "చెక్క పలకపై పడుకోవటం అంత సులభం కాదు. నేను తప్ప, దానిపైన ఎవరు పడుకోగలరు? నిద్రను మానుకుని, కళ్లు తెరుచుకుని ఉండగలవారే దానిపై పడుకోగలరు. 
“మీ జై కరూ లాగే శయన | తై మీ కరీ యాసీ6 ఆజ్ఞాపన | 
‘కర మద్హృూదయావరీ ఠేవూన | రాహీ బైసూన సన్నిధ’ | ||౧౩౭|| 
137. "'నేను నిద్రిస్తుంటే, నా గుండెపైన చేయి వేసి, నా దగ్గరే కూర్చోమని' అతనికి చెప్పాను. 
“తేంహీ కామ యాస న హోఈ | బసల్యా జాగీ డులక్యా ఘేఈ | 
తయా న ఫళీ హీ కామాచీ కాంహీ | ఫళీ హీ బిఛాఇత మాఝీచ | ||౧౩౮|| 
138. "కాని ఆ పని కూడా అతని చేత కాలేదు. కూర్చున్న చోటే కునుకు తీస్తాడు. అతనికి ఈ చెక్క పనికి రాదు. ఈ చెక్క పలక నాకు మాత్రమే పక్క. 
‘నామస్మరణ చాలే హృదయాంత | పాహే తేథే ఠేవూని హాత | 
నిజతా మీ మజ కరీ జాగృత’ | ఏసా అనుజ్ఞాపిత తో అసతా | ||౧౩౯|| 
139. "'నా హృదయంలో నిరంతరం నామ స్మరణ జరుగుతుంటుంది. అక్కడ చేతిని ఉంచి చూడు. నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు' అని అతనిని ఆజ్ఞాపించగా, 
“త్యాసచి నిద్రా లాగతా జడ | కర హో త్యాచా జైసా దగడ | 
‘భగత’ మ్హణతా నేత్రాచీ ఝాపడ | ఉడూని ఖడబడ జో కరీ | ||౧౪౦|| 
140. "అతనికే నిద్ర వచ్చి, అతని చేయి బరువెక్కి రాయిలా అవుతుంది. భగత్ అని నేను పిలవగానే అతని నిద్ర మాయమై, ఆందోళన పడతాడు. 

“బసవే న జయా ధరేవర | ఆసన జయాచే నాహీ స్థిర | 
జో నర నిద్రాతమకింకర | నిజేల ఉంచావర కేవీ” | ||౧౪౧|| 
141. "నేలపైనే సరిగ్గా కూర్చోలేనివాడు, ఆసనంపై స్థిరంగా ఉండలేనివాడు, తమోగుణమైన నిద్రకు కింకరుడైన వాడు, ఎత్తుపైన ఎలా పడుకోగలడు?" 
మ్హణోని “ఆపులే ఆపుల్యాసంగే | దుజియాచే తే దుజియాసంగే” | 
హే తో బాబా వేళ ప్రసంగే | భక్తానురాగే అనువదత | ||౧౪౨|| 
142. అలా బాబా భక్తుల పైని ప్రేమతో, "మీ స్వభావం ప్రకారం మీరు చేయండి, ఇంకొకరిని వారి స్వభావానికి అనుగుణంగా చేయనివ్వండి" అని సందర్భానుసారంగా చెప్పేవారు. 
అగాధ సాఈనాథాంచీ కరణీ | మ్హణూని హేమాడ లాగలా చరణీ | 
తయాంనీ హీ కృపాశీర్వచనీ | ఠేవిలా నిజస్మరణీ అఖండ | ||౧౪౩||
143. సాయినాథుని లీలలు అగాధం. కనుక, హేమాడు వారి చరణాలను ఆశ్రయించగా, బాబా కూడా అతనిని ప్రేమతో, కృపతో, ఆశీస్సులతో ఎప్పుడూ తమ స్మరణలో ఉంచారు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | శ్రీగురుచరణ మహిమా నామ | 
| పంచచత్వారింశోధ్యాయః సంపూర్ణః |

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. కవీ, హరీ, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిల, చమస, కరభాజన. 
2. జనకరాజా. 
3. శ్రీ సాఈబాబాంస మాధవరావ దేశపాండే ‘దేవా’ మ్హణూన నేహమీ సంబోధీత. 
4. అధ్యాయ ౧౦ వా. 
5. సముదాయ. 
6. మ్హాళసాపతీస.

Friday, November 15, 2013

||శ్రీ సాఈనాథ నిర్యాణం నామ చతుశ్చత్వారింశోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౪ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

ఓం నమో శ్రీసాఈ చిత్ఘ న | సకల సౌఖ్యాచే ఆయతన | 
సకల సంపదాచే నిధాన | దైన్యనిరసన యత్కృపా | ||౧|| 
1. ఓం నమో శ్రీసాయి చిత్ఘనా! అన్ని సుఖాలకూ మీరు నిలయం. అన్ని సంపదలకూ మీరు నిధి. మీ కృపతోనే దైన్యం నశిస్తుంది.
కరితా అవలీలా చరణ వందన | సమస్త పాపా హోయ క్షాలన | 
మగ జో భావే భజన పూజన | కరీ తో త్యాహూనహీ ధన్య | ||౨|| 
2. మీ పాదాలకు కనీసం వందనం చేసినవారికి కూడా అన్ని పాపాలూ తొలగిపోతాయి. ఇక భక్తిగా మీ పూజలు, భజనలు చేసినవారు ఎంతో ధన్యులు. 
పాహతా జయాచే సస్మిత ముఖ | విసరే సమస్త సంసారదుఃఖ | 
ఠాయీంచ విరే తహాన భూక | ఏసే అలౌకిక దర్శన | ||౩|| 
3. మీ మందహాస పూరితమైన ముఖాన్ని చూస్తే, సంసార దుఃఖాలన్నీ మరచిపోతాయి. ఆకలి దప్పులు కూడా ఉడిగి పోతాయి. అలాంటి అలౌకిక దర్శనం మీది. 
“అల్లా మాలిక” జయా ధ్యాన | జో నిష్కామ నిరభిమాన | 
నిర్లోభ నిర్వాసన జయాచే మన | తయాచే మహిమాన కాయ వానూ | ||౪|| 
4. సదా “అల్లా మాలిక్‍” అనే ధ్యానంలో ఉంటూ, ఏ కోరికలూ లేకుండా, నిరభిమానంగా, లోభము లేకుండా, వాసనారహితంగా ఉండే వారి మహిమను ఏమని వర్ణించను? 
అపకార్యాంహీ జో ఉపకారీ | ఏసీ శాంతి జయాచే పదరీ | 
తయా న విసంబే కోణీహీ క్షణభరీ | ద్యావా నిజాంతరీ నివాస | ||౫|| 
5. శాంత స్వభావులై, అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసే, వారిని క్షణమైనా ఎవరూ మరవకుండా, అంతరంగంలో ప్రతిష్ఠించుకోవాలి. 
రామ కృష్ణ రాజీవాక్ష | సంత హీనాక్ష వా ఎకాక్ష | 
దేవ రూపే సుందర సురూప | ఆనందస్వరూప సంత సదా | ||౬|| 
6. రాముడు, కృష్ణుడు కమలాలవంటి కనులు కలిగినవారు. సంతులు, ఒక కన్ను, ఇంకొందరికి రెండు కళ్లూ, లేని వారు. దేవతలు అందంగా ఉంటారు. కాని, సంతులు ఎప్పుడూ ఆనంద స్వరూపులై ఉంటారు. 
దేవాంచే నేత్ర శ్రవణాంత | సంత దృష్టీస నాహీ అంత | 
“యే యథా మా” దేవ వదత | సంత ద్రవత నిందకాంహీ | ||౭|| 
7. మనము పిలిచినప్పుడే దేవతలు మనల్ని చూస్తారు. కాని, సంతుల దయా దృష్టికి అంతం అంటూలేదు. ‘యే యథా మాం’ (నన్ను ఎవరు ఎలా పూజిస్తే అలా వారికి ఫలమిస్తా) అని దేవతలంటారు. కాని, నిందించే వారిని కూడా సంతులు దయతో చూస్తారు. 
రామ కృష్ణ ఆణి సాఈ | తిఘాంమాజీ అంతర నాహీ | 
నామే తీన వస్తు పాహీ | ఠాయీంచే ఠాయీ ఎకరూప | ||౮|| 
8. రాముడు, కృష్ణుడు మరియు సాయి - ఈ ముగ్గురిలో ఏ భేదమూ లేదు. పేరుకు ముగ్గురైనా, వారంతా ఒక్కటే. 
తియే వస్తూస మరణావస్థా | వార్తా హీ తో సమూళ మిథ్యా | 
కాళావరహీ జయాచీ సత్తా | తయా కా వ్యథా త్యా హాతీ | ||౯|| 
9. అలాంటివారికి మరణమన్న మాట నిరాధారమైన మిథ్య. కాలుని కూడా జయించగల శక్తిగల వారిని కాలం ఎలా బాధ పెట్టగలదు? 
ప్రారబ్ధ సంచిత న కళే ఆపణా | నేణే మీ త్యా క్రియమాణా | 
కరుణాకర సాఈ గురురాణా | జాణోని కరుణా భాకీతసే | ||౧౦||
10. ప్రారబ్ధ సంచిత క్రియామాణ కర్మలు ఏవో నాకు తెలియవు. సాయి గురురాణా కరుణాళువని తెలుసు. అందుకే వారిని కరుణించమని ప్రార్థిస్తాను. 

వాసనేచ్యా లాటా నానా | తేణే ఉసంత నాహీ మనా | 
కృపా తూఝీ అసలియావినా | స్థైర్య యేఈనా జీవాస | ||౧౧|| 
11. వాసనల అనేక అలల తాకిడి వలన మనసుకు విశ్రాంతి లేదు. నీ కృప లేనిదే ఈ జీవికి నిలుకడ లేదు. గతాధ్యాయారంభీ వచన | దిధలే పరీ న ఝాలే పాలన | 
ఘడలే న సాంగ నిరూపణ | సాద్యంత సంపూర్ణ పరిసావే | ||౧౨|| 
12. గతాధ్యాయం ఆరంభంలో ఇచ్చిన మాట ప్రకారం, వివరించటం కుదరలేదు. ఇప్పుడు మొదటినుండి చివరివరకు వినండి. 
అంతకాల సమీప జాణూన | బ్రాహ్మణ ముఖే రామాయణ శ్రవణ | 
కేలే చతుర్దశ రాత్రందిన | బాబాంనీ అనుసంధానపూర్వక | ||౧౩|| 
13. అంతిమ కాలం సమీపించిందని తెలుసుకుని, బ్రాహ్మణుని ద్వారా పదునాలుగు రోజులు అహర్నిశలూ, బాబా శ్రద్ధగా రామాయణ శ్రవణం చేశారు. 
ఏసే దోన సప్తాహ భరతా | రామాయణ శ్రవణ కరితా | 
విజయాదశమీ దివస యేతా | బాబా విదేహతా పావలే | ||౧౪|| 
14. ఇలా రెండు వారాలు రామాయణ శ్రవణం చేసి, విజయదశమి రోజు రాగానే బాబా శరీరాన్ని త్యజించారు. 
గతాధ్యాయీ జాహలే కథన | హోతా బాబాంచే ప్రాణోత్క్ర మణ | 
లక్ష్మణమామాంనీ1 కేలే పూజన | జోగాంనీ2 నిరాంజన ఆరతీ | ||౧౫|| 
15. వారు ప్రాణం వదిలిన తరువాత, లక్ష్మణమామ పూజ చేశాడని, జోగు ఆరతి చేసి, నిరాంజనాన్ని (అఖండ దీపం) వెలిగించాడని గతాధ్యాయంలో చెప్పబడింది. 
తేథూన పుఢే ఛత్తీస తాస | హిందు ఆణి ముసలమానాంస | 
లాగలే విచార కరావయాస | కేవీయా కలేవరాస సద్గతి | ||౧౬|| 
16. తరువాత, బాబా శరీరానికి అంతిమ సంస్కారాలు ఏ విధంగా చేయాలి అని చర్చించడానికి, హిందువులకు, ముస్లిములకు ముప్పై ఆరు గంటలు పట్టింది. 
కైసే సమాధిస్థాన నియోజన | కైసీ అకల్పిత ఇష్టికాపతన3
కైసా ఎకదా బ్రహ్మాండీ ప్రాణ | చఢవిలా తీన దిన బాబాంహీ | ||౧౭|| 
17. తమ సమాధి స్థలాన్ని బాబా ముందుగానే ఎలా నిర్ణయించారు, అకస్మాత్తుగా ఇటుక పడిపోవటం, మరియు ఎలా ఒక సారి బాబా తమ ప్రాణాలను మూడు రోజులు బ్రహ్మాండంలో లీనం చేశారు అనేది, 
సమాధి కీ దేహావసాన | సకళ ఝాలే సంశయాపన్న | 
పాహూని శ్వాసోచ్ఛ్వాసావరోధన | అశక్య ఉత్థాన4 వాటలే | ||౧౮|| 
18. అది వారి నిర్వికల్ప సమాధియా లేక శరీరాన్ని త్యజించారా అనే సందేహం అందరికీ కలిగింది. వారి శ్వాసోఛ్వాసాలు ఆగిపోవటంతో, వారు పునరుజ్జీవితులవడం అసాధ్యమని అందరికీ అనిపించింది. 
ఏసే తీన దివస జాతా | ప్రాణోత్క్రతమణచి వాటలే నిశ్చితతా | 
మగ ఉత్తర విధీచీ వార్తా | సహజచి సమస్తా ఉదేలీ | ||౧౯|| 
19. ఇలా మూడు రోజులు గడిచాక, వారు ప్రాణం విడిచారని నిశ్చయించుకున్నారు. ఇక వారి ఉత్తర క్రియలు ఏ విధంగా చేయాలని అందరూ ఆలోచించ సాగారు. 
ఏసయాహీ తయా అవసరీ | పరమ సావధ బాబా అంతరీ | 
యేఊని అవచిత నిజదేహావరీ | ఘాలవిలీ దురీ జనచింతా | ||౨౦||
20. ఆ సమయంలో, అంతరంగంలో జాగురూకంగా ఉన్న బాబా, అకస్మాత్తుగా శరీరంలోనికి పునర్‍ప్రవేశించి అందరి చింతలను దూరం చేశారు. 

ఇత్యాది సకల కథా | ప్రేమభావే పరిసిజే శ్రోతా | 
శ్రవణే ఆనంద హోఈల చిత్తా | కంఠ గహివరతా దాటేల | ||౨౧|| 
21. ఈ కథలనంతా ప్రేమతో, భక్తిభావంతో, శ్రోతలారా, వినండి. శ్రవణంతో మనసుకు ఆనందం కలుగుతుంది. కంఠం గద్గదమౌతుంది.
కథా నవ్హే హీ ఎక సందూక5 | గర్భీ సాఈ రత్న అమోలిక | 
ఉఘడూన పహా ప్రేమపూర్వక | అనుభవా సుఖ దర్శనాచే | ||౨౨|| 
22. ఇవి కథలు కావు. సాయి అనే అమూల్యమైన రత్నాలు దాగివున్న పీటిక ఇది. ప్రేమతో తెరచి చూస్తే వారి దర్శన భాగ్యం సుఖం అనుభవమౌతుంది. 
యా అవఘియా అధ్యాయాఆంత | ఖచిలా దిసేల సాఈనాథ | 
శ్రవణే పురతీల మనోరథ | స్మరణే సనాథ హోఈజే | ||౨౩|| 
23. ఈ అధ్యాయాలన్నింటిలోనూ సాయినాథులు నిండుగా దర్శనమిస్తారు. వీనిని శ్రవణం చేస్తే మీ మనసులోని కోరికలన్నీ సిద్ధిస్తాయి. వీనిని స్మరిస్తే సాయి రక్షణ లభిస్తుంది. 
పరమ ఉదార జయాచే ఆచరిత | తయా సాఈచే హే చరిత | 
కరావయా శ్రవణ వ్హా ఉద్యత | అవ్యగ్ర చిత్త సప్రేమ | ||౨౪|| 
24. పరమ ఉదార ఆచరణగల సాయియొక్క చరితం ఇది. ఏకాగ్ర చిత్తంతో, ప్రేమగా శ్రవణం చేయటానికి సిద్ధమవండి. 
ఏసీ పావన కథా ఏకతా | ధణీ న పురే భక్తచిత్తా | 
పూర్ణ దాటే పరమానందతా | సంసార శ్రాంతా విశ్రామ | ||౨౫|| 
25. ఈ పావన చరితాన్ని ఎంత విన్నా, భక్తుల మనసుకు తృప్తి ఉండదు. సంసారంలోని బాధలనుండి విశ్రామం, పూర్ణ పరమానందం కలుగుతాయి. 
చిత్త ప్రసన్నతేచా హరిఖ | నిజానంద ఠాకే సన్ముఖ | 
సర్వ సుఖాచే సోలీవ సుఖ | తే హే కథానక సాఈచే | ||౨౬|| 
26. ప్రసన్నమైన మనసుకు ఆత్మానందం లభిస్తుంది. అన్ని సుఖాలకంటే అతి నిర్మలమైన సుఖాన్ని సాయియొక్క కథలు కలుగచేస్తాయి. 
కితీహీ ఏకా నిత్య నూతన | రమణీయతేచే6 హేంచి లక్షణ | 
మ్హణోని హీ సంతకథా పావన | హోఊని అనన్య పరివాసీ | ||౨౭|| 
27. ఎన్ని సార్లు విన్నా, ఇవి ఎప్పటికీ కొత్తగా ఉంటాయి. ఇదే రమణీయత లక్షణం. అందుకే పావనమైన ఈ సంతుని కథను ఏకాగ్ర చిత్తంతో వినండి. 
అసో పుఢే కలేవర సద్గతి | యాచ వాదాచీ భవతి నభవతి | 
కరితా కరితా సమస్త థకతీ | పహా ప్రచీతీ అఖేర | ||౨౮|| 
28. అలా తరువాత, బాబా శరీరానికి అంతిమ సంస్కారం ఎక్కడ ఎలా చేయాలి అని చర్చించి అందరూ అలసిపోయారు. చివరకు ఏమి జరిగిందో వినండి. 
బుట్టీచే వాడ్యాచే దాలన | త్యాంతీల గాభార్యాచే ప్రయోజన | 
హోణార హోతే మురలీధర స్థాపన | ఠరలే తే స్థాన బాబాంచే | ||౨౯|| 
29. బుట్టీయొక్క వాడాలోని మధ్య భాగంలో, మురలీధరుని స్థాపనకోసం నిర్ణయించిన చోటుని, బాబా కోసమే అని నిశ్చయమైంది. 
ఆరంభీ జై పాయా ఖోదిలా | జాత అసతా బాబా లేండీలా | 
మాధవరావాంచ్యా వినవణీలా | మాథా డోలవిలా బాబాంనీ | ||౩౦||
30. ఇంతకు మునుపు, పునాది తవ్వుతున్నప్పుడు, లెండీకి వెళ్లుతూ, బాబా మాధవరావు విన్నపాన్ని విని తలను ఆడించి సమ్మతించారు. 

మాధవరావ కరీత వినంతీ | నారళ దేఊని బాబాంచే హాతీ | 
మురలీధరాచా గాభారా ఖోదితీ | అవలోకా మ్హణతీ కృపేనే | ||౩౧|| 
31. మురలీధరుని గర్భగుడి కోసం పునాది తవ్వుతుండగా, మాధవరావు బాబా చేతికి కొబ్బరికాయను ఇచ్చి, ‘బాబా కృపతో అవలోకించండి’ అని ప్రార్థించాడు. 
పాహూనియా తీ శుభవేళ | బాబా మ్హణాలే “ఫోడా హా నారళ | 
ఆపణ సమస్త బాళగోపాళ | యేథేంచ కాళ క్రమూ కీ | ||౩౨|| 
32. ఆ శుభ సమయాన్ని గమనించి, బాబా “ఈ కొబ్బరికాయను కొట్టు. మనమంతా, బాలగోపాలురం, ఇక్కడ కాలం గడుపుదాం. 
యేథేంచ ఆపణ బసతా ఉఠతా | సుఖాదుఃఖాచ్యా కరూ వార్తా | 
యేథేంచ పోరంసోరా సమస్తా | చిత్తస్వస్థతా లాధేల” | ||౩౩|| 
33. “ఇక్కడే కూర్చుని సుఖదుఃఖాలని ముచ్చటించుకుందాం. పిల్లలందరికీ ఇక్కడే మనఃశాంతి లభిస్తుంది”. 
బాబా కాహీ తరీ హే వదలే | ఏసేంచ ఆరంభీ సర్వాంస దిసలే | 
పుఢే జేవ్హా అనుభవా ఆలే | కళూన చుకలే తే బోల | ||౩౪|| 
34. బాబా ఊరికెనే, సరదాగా అలా అన్నారని, మొదట అందరికీ అనిపించింది. కాని, తరువాత, వారి వచనం అనుభవానికి వచ్చినప్పుడు, ఆ మాటల్లోని విలువ తెలిసింది. 
హోతా బాబాంచే దేహావసాన | రాహిలే మురలీధరాచే స్థాపన | 
హేంచ వాటలే ఉత్తమ స్థాన | సాఈనిధాన రక్షావయా | ||౩౫|| 
35. బాబా దేహత్యాగం చేయడంతో మురలీధరుని ప్రతిష్ఠాపన ఆగిపోయింది. దానితో, సాయి అనే నిధిని రక్షించుకోవటానికి అదే ఉత్తమ స్థానమని అనిపించింది. 
“వాడియాంత పడో హే శరీర” | అంతీ బాబాంచే జే ఉద్గార | 
తోచ శేవటీ ఠరలా విచార | జాహలే మురలీధర బాబాచ | ||౩౬|| 
36. “ఈ శరీరాన్ని వాడాలో ఉంచండి” అన్న బాబా చివరి మాట ప్రకారం, అదే నిశ్చయమైంది. అలా స్వయంగా బాబాయే మురలీధరుడయ్యాడు. 
శ్రీమంత బుట్టీ ఆదికరూన | హిందు ముసలమాన సర్వత్ర జన | 
యాచ విచారా రాజీ హోఊన | వాడా సత్కారణీ లాగలా | ||౩౭|| 
37. శ్రీమంతుడైన బుట్టీ మొదలగు భక్తులు, హిందువులూ, ముసల్మానలూ, అందరూ ఈ ఆలోచనకు సమ్మతించినందున, బుట్టీ వాడా సత్కార్యానికి ఉపయోగ పడింది. 
ఏసా బహుమోల వాడా అసూన | బాబాంచా దేహ కుఠేంహీ పడూన | 
జాతా, మగ తో వాడాహీ శూన్య | అత్యంత భయాణ భాసతా | ||౩౮|| 
38. ఎంతో ధనం వెచ్చించి కట్టిన వాడా ఉండగా, బాబా దేహాన్ని మరెక్కడో ఉంచితే, అప్పుడు వాడా శూన్యంగా, అత్యంత భయంకరంగా ఉండేది. 
ఆజ తేథే జే భజనపూజన | కథా కీర్తన పురాణ శ్రవణ | 
అతిథీ అభ్యాగతా అన్నదాన | హోతే, త్యా కారణ శ్రీసాఈ | ||౩౯|| 
39. ఈ రోజు అక్కడ జరిగే భజనలూ, పూజా కథా కీర్తనలూ, పురాణ శ్రవణం, అతిథి అభ్యాగతులకు అన్నదానం మొదలగునవి జరగటానికి శ్రీసాయియే కారణం. 
ఆజి తేథే జే అన్నసంతర్పణ | లఘురూద్రమహారూద్రావర్తన | 
దేశోదేశీంచే యేతీ జన | త్యా సర్వా కారణ శ్రీసాఈ | ||౪౦||
40. ఇప్పుడు, అక్కడ జరిగే అన్నసంతర్పణలకు, లఘురుద్ర మహారుద్రావర్తనకు, దేశదేశాలనుండి భక్తులు రావటానికీ, అన్నిటికీ శ్రీసాయియే కారణం. 

అసో ఏసీ హే సంతాచీ వాణీ | అక్షరే అక్షర సాంఠవా శ్రవణీ | 
కాంహీ తరీ తే బోలతీ మ్హణునీ | నావమానూని త్యాగావీ | ||౪౧|| 
41. ఇలాంటి సంతుల మాటలలోని అక్షరం, అక్షరం చెవులలో భద్రపరుచుకోవాలి. ఏదో చెప్పి ఉంటారని అలక్ష్యం కాని, అగౌరవం కాని, చేయకండి.
ఆరంభీ తీ కితీహీ ముగ్ధ | అథవా దిసో కితీహీ సందిగ్ధ | 
కాలే హోతో అర్థావబోధ | జరీ తీ దుర్బోధ ఆరంభీ | ||౪౨|| 
42. మొదట వారి మాటలు అస్పష్టంగానో లేక అసందర్భంగానో ఉన్నా, కాలం గడిచాక అవి సరిగ్గా అర్థమౌతాయి. 
అసతా దేహపాతాస అవధీ | పుఢీల హోణారే గోష్టీ సంబంధీ | 
దుశ్చిన్హే ఘడలీ కాంహీ ఆధీ | మశీదీ మధీ శిరడీంత | ||౪౩|| 
43. బాబా నిర్వాణానికి మునుపు, శిరిడీలోని మసీదులో, జరగబోయే దానికి సంబంధించిన అపశకునాలు జరిగాయి. 
తయాంమాజీల ఎకచి ఆతా | నివేదితో మీ శ్రోతయాం కరితా | 
కీ తీ సకళ సాంగూ జాతా | గ్రంథ విస్తారతా పావేల | ||౪౪|| 
44. వాటిలోని ఒక్కటి మాత్రం శ్రోతలకు మనవి చేస్తాను. అన్నిటినీ చెబితే, గ్రంథం పెద్దదైపోతుంది. 
కితి ఎక బహుతా వర్షాపాసూనీ | హోతీ ఎక బాబాంచీ జునీ | 
వీట, జియేవరీ తే హాత టేంకునీ | ఆసన లావూని బైసత | ||౪౫|| 
45. చాలా సంవత్సరాలనుండి, బాబా వద్ద ఒక పాత ఇటుక ఉండేది. యోగాసనం వేసుకుని కూర్చునేటప్పుడు, వారు దానిపై చేతిని ఆన్చేవారు. 
విటేచా త్యా ఆధార ఘేఉనీ | నిత్య ఎకాంతీ హోతా రజనీ | 
బాబా మశీదీంత స్వస్థ మనీ | ఆసన లావూని బైసత | ||౪౬|| 
46. ప్రతి రాత్రి మసీదులో బాబా ఏకాంతంగా, ఆ ఇటుక ఆధారంగా, యోగాసనం వేసుకుని ఏకాగ్ర మనసుతో కూర్చునేవారు. 
ఏసా కిత్యేక వర్షాచా క్రమ | నిర్వేధ చాలలా హోతా అవిశ్రమ | 
పరి హోణారాసి న చలే నియమ | ఘడతసే అతిక్రమ అకల్పిత | ||౪౭|| 
47. అలా ఎన్నో సంవత్సరాలు ఏ ఆటంకం లేకుండా గడిచాయి. జరుగనున్నది అనుకోకుండా జరిగి పోతుందే కాని, నియమాలను ఉల్లంఘించినంత మాత్రాన, మటుకు కాదు. 
బాబా నసతా మశీదీంత | పోరగా ఎక హోతా ఝాడీత | 
తళీంచా కేర కాఢావయాచే నిమిత్త | వీట తీ కించిత ఉచలలీ | ||౪౮|| 
48. బాబా మసీదులో లేనప్పుడు, ఒక కుర్రాడు మసీదును శుభ్ర పరస్తున్నప్పుడు, ఇటుక క్రింద చెత్తను తుడవటానికి, ఇటుకను కాస్త లేవనెత్తాడు. 
ఫుటావయాచీ వేళ ఆలీ | వీట పోరాచే హాతూని నిసటలీ | 
ధాడకినీ తీ ఖాలీ పడలీ | దుఖండ ఝాలీ తాత్కాళ | ||౪౯|| 
49. ఆ ఇటుకకు విరిగిపోయే వేళ వచ్చింది. అంతే, ఆ కుర్రాడి చేతిలోనుండి జారి దభేలున క్రింద పడి, వెంటనే రెండు మ్రుక్కలయింది. 
ఏకతా హే బాబాంనీ మ్హటలే | వీట నాహీ కీ కర్మచి ఫుటలే | 
ఏసే వదూనీ అతి హళహళలే | నేత్రీ ఆలే దుఃఖాశ్రు | ||౫౦||
50. ఈ సంగతి విని బాబా, “ఇటుక కాదు, నా కర్మే బ్రద్దలయింది” అని ఎంతో కలవరపడ్డాడు. వారి కళ్లనుండి దుఃఖాశ్రువులు రాలాయి. 

నిత్య యోగాసన జ్యా విటే | ఘాలీత బాబా తీ జంవ ఫుటే | 
తేణే దుఃఖే హృదయ ఫాటే | కంఠ దాటే తయాంచా | ||౫౧|| 
51. యోగాసనానికి వారు రోజూ ఉపయోగించే ఇటుక విరిగిపోగా, వారి హృదయానికి చాలా బాధ కలిగి, కంఠం గద్గదమైంది. 
ఏసీ బహుతాకాళాచీ జునాట | నిజాసనాచే మూళపీఠ | 
అవచట భంగలీ పాహూని వీట | మశీద సునాట వాటే త్యా | ||౫౨|| 
52. చాలా పాతకాలం నాటి ఇటుక, వారి ఆసనానికి మూలాధారమైనది, అకస్మాత్తుగా విరిగిపోవటంతో, వారికి మసీదు శూన్యంగా అనిపించింది. 
వీటచి పణ తీ ప్రాణాపరతీ | బాబాంచీ హోతీ అతి ఆవడతీ | 
పాహూని తియేచీ ఏసీ తీ స్థితి | బాబా అతి చిత్తీ హళహళలే | ||౫౩|| 
53. ఇటుకే అయినా అది బాబాకు ప్రాణ సమానంగా, అత్యంత ప్రియమైనది. అందుకే దాని స్థితిని చూచి, వారు చాలా వ్యథ చెందారు. 
త్యాచ విటేసీ టేంకూని కోపర | బాబా ఘాలవిత ప్రహరాచే ప్రహర | 
ఘాలూన ఆసన యోగ తత్పర | మ్హణూన తిజవర ప్రేమ మోఠే | ||౫౪|| 
54. ఆ ఇటుకపైనే మోచేతిని ఆన్చి, బాబా గంటల తరబడి యోగాసనంలో తత్పరులై కూర్చునేవారు. అందుకే అదంటే వారికి చాలా ప్రేమ. 
జియే సంగే ఆత్మచింతన | జీ మజ హోతీ జీవ కీ ప్రాణ | 
తీ భంగలీ మాఝీ సాంగాతీణ | మీహీ తిజవీణ న రాహే | ||౫౫|| 
55. “దాని సహవాసంలో ఆత్మచింతన చేసేవాణ్ణి. అది నా ప్రాణం. నా తోడు విరిగిపోయింది. అది లేకుండా నేను కూడా ఉండలేను. 
వీట జన్మాచీ సాంగాతీణ | గేలీ కీ ఆజ మగ సాండూన | 
ఏసే తియేచే గుణ ఆఠవూన | బాబాంనీ రూదన మాండిలే | ||౫౬|| 
56. “ఆ ఇటుక, నా జన్మనుంచి తోడుగా ఉండి, ఈ రోజు నన్ను వదిలి వెళ్లిపోయింది” అని దాని గుణాలను తలచుకుని, బాబా రోదించారు. 
యేథే సహజీ యేఈల ఆశంకా | వీటహీ క్షణభంగుర నాహీ కా | 
ఎతదర్థ కరావే కా శోకా | కాయ లోకాంనీ మ్హణావే | ||౫౭|| 
57. సహజంగా ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. ఇటుక క్షణభంగురమైనది కదా, మరి దానికోసం శోకించటం ఎందుకు? లోకులు ఏమనుకుంటారు? 
ఆశంకాహీ ప్రథమ దర్శనీ | ఉఠేల కవణాచ్యాహీ మనీ | 
ప్రవర్తే మీ సమాధానీ | పాయ నమునీ సాఈచే | ||౫౮|| 
58. అని మొదట ఎవరికైనా సరె, సంశయం కలుగుతుంది. సాయి చరణాలకు నమస్కరించి, నేను దానికి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను. 
కైసా హోఈల జగదుద్ధార | కైసే తరతీల దీన పామర | 
ఎకదర్థచి సంతాంచా అవతార | కర్తవ్య ఇతర నాహీ త్యా | ||౫౯|| 
59. జగత్తును ఉద్ధరించటానికి, మరియు దీనులను, పామరులను తరింపజేయటానికే సంతులు అవతరిస్తారు కాని, వారికి వేరే ఏ కర్తవ్యమూ లేదు. 
హాస్య రూదన క్రీడా ప్రకార | లౌకిక నాట్యచి యేథీల సార | 
జైసా జైసా శ్రేష్ఠాచార | లోకవ్యవహారహీ తైసా | ||౬౦||
60. నవ్వటం, ఏడవటం, ఆడటం మొదలగు లౌకిక ఆచరణలు, నటనలే అని ఇందులోని సారం. శ్రేష్ఠులు ఆచరించినట్లుగానే లోకులు వ్యవహరిస్తారు. 

సంత జరీ పూర్ణ జ్ఞానీ | అవాప్త సకల సంకల్ప జనీ | 
తరీ లోక తరావయా లాగునీ | కర్మాచరణీ ఉద్యుక్త | ||౬౧|| 
61. సంతులు పూర్ణ జ్ఞానులైనా, అన్ని కోరికలూ తీరిపోయిన వారైనా, లోకులను తరింప చేయటానికి, కర్మాచరణలను చేస్తారు.
అసో హే దేహావసాన వ్యావయా ఆధీ | బత్తీస వర్షాపుర్వీచ సమాధీ | 
హోణార పరీ మ్హాళసాపతీచీ బుద్ధీ | నివారీ త్రిశుద్ధీ హా కుయోగ | ||౬౨|| 
62. ఈ నిర్వాణానికి ముప్పైరెండు సంవత్సరాల మునుపే, వారి సమాధి అయిపోయి ఉండేది. కాని, మహల్సాపతియొక్క బుద్ధి చాతుర్యం వలన ఆ దురదృష్ట ఘటన ఆగింది. 
టళతా న జరీ హా దుష్టయోగ | కైంచా అవఘ్యాతే సాఈసుయోగ | 
త్రేచాళీస వర్షామాగేంచ వియోగ | హోతా కీ కుయోగ ఏసా తో | ||౬౩|| 
63. ఆ దుర్ఘటన ఆగిపోకుండా ఉంటే, సాయియొక్క దర్శన యోగం అందరికీ ఎలా కలిగేది? నలభైమూడు సంవత్సరాల క్రితమే బాబాతో వియోగం ఏర్పడే దురదృష్టం పట్టి ఉండేది. 
మార్గశీర్ష శుద్ధ పౌర్ణిమా | బాబా అస్వస్థ ఉఠలా దమా | 
సహన కరావయా దేహధర్మా | బ్రహ్మాండీ ఆత్మా చఢవిలా | ||౬౪|| 
64. మార్గశీర్ష శుద్ధ పౌర్ణమినాడు, బాబా ఆయాసంతో అస్వస్థులయ్యారు. దైహిక బాధను సహించటానికి, వారు ప్రాణాలను బ్రహ్మాండంలో (నిర్వికల్ప సమాధి) చేర్చారు. 
“ఆతా యేథూన తీన దిన | ఆమ్హీ చఢవితో బ్రహ్మాండీ ప్రాణ | 
ప్రభోధూ నకా ఆమ్హా లాగూన” | బాబాంనీ సాంగూన ఠేవిలే | ||౬౫|| 
65. “ఈ రోజునుండి మూడు రోజులు, నేను ప్రాణాలను బ్రహ్మసహస్రారంలో నిలిపి ఉంచుతాను. నన్ను మేలుకొలప వద్దు” అని బాబా అందరితో చెప్పారు. 
పహా తో సభామండప కోణ7 | బాబాహీ బోటే దావిలే ఠికాణ | 
మ్హణాలే “తేథే సమాధి ఖోదూన | ద్యా మజ ఠేవూన త్యా జాగీ” | ||౬౬|| 
66. మసీదులోని సభామండపంలో, మూలనున్న ఒక చోటుని తమ వ్రేలితో చూపించి, “అక్కడ సమాధికోసం త్రవ్వి, ఆ స్థలంలో నన్ను ఉంచండి” అని చెప్పారు. 
స్వయే మ్హాళసాపతీస లక్షూన | బాబా తదా వదతీ “నిక్షూన | 
నకా మజ సాండూ ఉపేక్షూన | దివస తీన పర్యంత | ||౬౭|| 
67. మహల్సాపతితో, “మూడు రోజుల వరకూ నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు” అని స్పష్టంగా చెప్పారు. 
తయేస్థానీ నిశాణే దోన | లావూని ఠేవా నిదర్శక ఖూణ” | 
ఏసే వదతా వదతా ప్రాణ | ఠేవిలా చఢవూన బ్రహ్మాండీ | ||౬౮|| 
68. “గుర్తుగా, నా సమాధిపైన రెండు పతాకాలను ఉంచండి” అని చెప్పుతూ చెప్పుతూ బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేశారు. 
భరావీ ఎకాఎకీ భవండీ | తేవీ నిచేష్టిత దేహదాండీ | 
మ్హాళసాపతీనే దిధలీ మాండీ | ఆశా తీ సాండిలీ ఇతరాంనీ | ||౬౯|| 
69. అకస్మాత్తుగా తల తిరిగి పడినట్లు, నిశ్చేష్టగా పడబోతూ ఉంటే, వారు క్రింద పడకుండా, మహల్సాపతి తన ఒడిలో వారిని పడుకో బెట్టుకున్నాడు. అందరూ బాబాపై ఆశను వదులుకున్నారు. 
రాత్రీచా సమయ ఝాలే దహా | తేవ్హాంచా హా ప్రకార పహా | 
స్తబ్ధ ఝాలే జన అహాహా | కాయ అవచిత హా ప్రసంగ | ||౭౦||
70. అప్పుడు రాత్రి పదిగంటల సమయం. అకస్మాత్తుగా ఇలా జరిగిందేమిట అని అందరూ స్తబ్ధులై, ఎవరికీ నోట మాట రాలేదు. 

నాహీ శ్వాస నాహీ నాడీ | వాటే ప్రాణే సాండిలీ కుడీ | 
జనాస భయంకర అవస్థా గాఢీ | సుఖ నిరవడీ సాఈస | ||౭౧|| 
71. శ్వాస లేదు, నాడీ కూడా ఆడటం లేదు. ప్రాణం దేహాన్ని వదిలినట్లే అనిపించింది. ఆ పరిస్థితి జనులకు చాలా భయంకరంగా అనిపించింది. కాని సాయి మాత్రం సుఖంగా ఉన్నారు. 
మగ పుఢే మ్హాళసాపతీ | అహోరాత్ర సావధవృత్తీ | 
సాఈబాబాలాగీ జపతీ | తేథేంచ బైసతీ జాగతా | ||౭౨|| 
72. తరువాత, అతి జాగరూకతతో, అహర్నిశలూ మేలుకొని, సాయిని జపిస్తూ, సాయి దేహాన్ని రక్షిస్తూ, మహల్సాపతి కదలకుండా కూర్చున్నాడు. 
జరీ హోతీ సాఈముఖీంచీ | ఆజ్ఞా సమాధీ ఖోదావయాచీ | 
తరీ తే తైసే కరావయాచీ | హింమత కవణాచీ చాలేనా | ||౭౩|| 
73. సమాధిని త్రవ్వమని స్వయంగా సాయియే ఆజ్ఞాపించినా, అలా చేయటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. 
పాహోని బాబా సమాధిస్థ | మిళాలా తేథే గాంవ సమస్త | 
జన విస్మిత పాహతీ తటస్థ | కాఢీనా భగత మాండీతే | ||౭౪|| 
74. బాబా సమాధి స్థితిలో ఉండటాన్ని చూడాలని, గ్రామప్రజలందరూ ఆక్కడ చేరి, చాలా ఆశ్చర్యంగా చూడసాగారు. మహల్సాపతి మాత్రం, బాబా తలను ఒడినుండి క్రిందకు దింపలేదు. 
ప్రాణ గేలా కళతా దేఖా | బైసేల ఎకాఎకీ ధక్కా | 
సాంగూన తీన దివస మజ రాఖా | ఝకవిలే లోకా సాఈనే | ||౭౫|| 
75. ‘ప్రాణం పోయిందని తెలిస్తే, భక్తులకు అకస్మాత్తుగా ఆఘాతం కావచ్చని, “మూడు రోజులు ఉంచండి” అని బాబా లోకులను మభ్య పెట్టారు’ అని జనులు అనుకున్నారు. 
శ్వాసోచ్ఛ్వాస జాహలా బంద | తాటస్థ్య పావలీ ఇంద్రియే సబంధ | 
నాహీ చలన వలనాచా గంధ | తేజహీ మంద జాహలే | ||౭౬|| 
76. శ్వాసోఛ్వాసలు ఆగిపోయాయి. ఇంద్రియాలన్నీ చలన రహితమయ్యాయి. ఏదీ కదలే సూచనే లేదు. శరీరంలోని తేజస్సు కూడా తగ్గింది. 
హరపలే బాహ్యావ్యవహారభాన | వాచేసీ పడలే దృఢ మౌన | 
కైసే శుద్ధీవర మాగుతేన | చింతాహీ గహన సర్వత్రా | ||౭౭|| 
77. బాహ్య ప్రపంచ స్పృహ అసలు లేదు. మాట దృఢమౌనం వహించింది. ‘ఇలాంటప్పుడు మరల స్పృహకు ఎలా వస్తారు?’ అని అందరూ చింతించ సాగారు. 
వృత్తీవరీ యేఈనా శరీర | కాళ క్రమిలా దోన దివసాంవర | 
ఆలే మౌలవీ ములనాఫకీర | మాండిలా విచార పుఢీల | ||౭౮|| 
78. శరీరానికి స్పృహ రాలేదు. ఇలా రెండు రోజులు గడిచిపోయాయి. మౌల్వీ, ముల్లా, ఫకీరులు వచ్చి తరువాత ఏం చేయాలి అని ఆలోచించ సాగారు. 
అప్పా కులకర్ణీ కాశీరామ | ఆలే కేలా విచార ఠామ | 
బాబాంనీ గాంఠిలే నిజ సుఖధామ | ద్యావా కీ విశ్రామ దేహాసీ | ||౭౯|| 
79. అప్పా కులకర్ణి, కాశీరాంలు వచ్చి, బాగా ఆలోచించి, ‘బాబా తమ శాశ్వత నివాసానికి చేరుకున్నారు’ అని నిశ్చయించారు. కనుక, వారి శరీరానికి విశ్రాంతి కావాలి. 
కోణీ మ్హణతీ థాంబా క్షణభరీ | ఘాఈ ఇతుకీ నాహీ బరీ | 
బాబా నవ్హేత ఇతరాంపరీ | అమోఘ వైఖరీ బాబాచీ | ||౮౦||
80. ‘కొంచెం సేపు ఆగటం మంచిది, ఇంత తొందర పనికి రాదు. బాబా మిగతావారిలా కాదు. వారి మాట తిరుగులేనిది’ అని కొందరు అన్నారు. 

తాత్కాళ ప్రత్యుత్తర కరావే ఇతరీ | థండగార పడల్యా శరీరీ | 
యేఈల కోఠూన చైతన్య తరీ | కైసే అవిచారీ సకళే హే | ||౮౧|| 
81. వెంటనే మిగతావారు ‘శరీరం చల్లబడింది. ఇంక చైతన్యం ఎక్కడినుండి వస్తుంది? ఎంత తెలివి లేనివారు వీరందరూ’ అని అన్నారు.
ఖోదా కబర దావిల్యా స్థళీ | బోలవా కీ సకళ మండళీ | 
ద్యా మూఠమాతీ వేళచ్యావేళీ | తయారీ సగళీ కరా కీ | ||౮౨|| 
82. ‘వారు చూపించిన చోటులో తవ్వండి. భక్తులనందరినీ పిలవండి. వేళకు సరిగ్గా సమాధి చేయండి. అన్నీ సిద్ధపరచండి’. 
ఏసీ భవతీ న భవతీ హోతా | పూర్ణ ఝాలీ దినత్రయయత్తా | 
పుఢే పహాటే తీన వాజతా | చేతనా యేతా ఆఢళలీ | ||౮౩|| 
83. అలా చర్చ జరుగుతున్నప్పుడే మూడు రోజుల గడవు తీరిపోయింది. తరువాత, తెల్లవారు ఝామున మూడు గంటలప్పుడు దేహంలో చైతన్యం రావడం, వారు చూశారు. 
హళూ హళూ దృష్టీ వికసితా | ఆళేపిళే శరీరా దేతా | 
శ్వాసోచ్ఛ్వాస చాలూ హోతా | పోటహీ హాలతా దేఖిలే | ||౮౪|| 
84. మెల్ల మెల్లగా స్పృహ రాసాగింది. శరీరం అటు ఇటు కదిలింది. శ్వాసోఛ్వాసలు మొదలయ్యాయి. పొట్ట కూడా కదలసాగింది. 
దిసూ లాగలే ప్రసన్న వదన | హోఊ లాగలే నేత్రోన్మీలన | 
జాఊనియా నిచేష్టితపణ | ప్రబోధ లక్షణ ఉమటలే | ||౮౫|| 
85. వదనం ప్రసన్నంగా కనిపించింది. కళ్లు తెరుచుకున్నాయి. చైతన్య రహితంగా ఉన్న శరీరంలో మేలుకుంటున్న లక్షణాలు కనిపించాయి. 
జణూ విసరలే దేహభావా | తయాచా పునశ్చ ఆఠవ వ్హావా | 
చుకలా ఠేవా ఠాయీ పడావా | భాండార ఉఘడావా తీ గత | ||౮౬|| 
86. శరీరం ఉందనే స్పృహ మరచిపోయి, తరువాత మరల గుర్తుకు వచ్చినట్లు అనిపించింది. లేక, పోయిన నిధి మరల దొరికి, భోషాణం తెరచుకున్నట్లు అనిపించింది. 
దేఖోని సాఈ సావధాన | జాహలే సకళ ప్రసన్నవదన | 
టళలే దేవదయేనే విఘ్న | ఆశ్చర్య నిమగ్న భక్తజన | ||౮౭|| 
87. సాయికి మరల స్పృహ రావడం చూసి, అందరూ ఆనందంగా ప్రసన్నులైనారు. భగవంతుని దయవలన ఆపద తొలిగింది. అయినా, అందరూ ఈ వింత చూసి, ఆశ్చర్యంలో మునిగిపోయారు. 
భగత పాహీ ముఖ కౌతుకే | సాఈహీ మాన హళూచ తుకే | 
మౌలవీ ఫకీర పడలే ఫికే | కీ ప్రసంగ చుకే భయంకర | ||౮౮|| 
88. మహల్సాపతి బాబా ముఖాన్ని ఆరాధనతో చూచాడు. సాయి కూడా మెల్లగా తలను ఆడించారు. మౌల్వీలు, ఫకీరుల ముఖాలు పాలిపోయాయి. భయంకరమైన సంఘటన తొలిగిపోయింది. 
పాహూని మౌలవీచీ దురాగ్రహతా | భగత ఆజ్ఞాపాలనీ చుకతా | 
యత్కించతహీ నిశ్చయా ఢళతా | వేళ తో యేతా కఠీణ తై | ||౮౯|| 
89. మౌల్వీయొక్క దురాగ్రహాన్ని చూసి, బాబా ఆజ్ఞను మహల్సాపతి పాటించకుండా, తన నిశ్చయాన్ని ఏ మాత్రం సడలించి ఉన్నా చాలా క్లిష్ట పరిస్థితి ఏర్పడేది. 
త్రేచాళీస వర్షా ఆధీంచ కబర | హోఊని జాతీ కైంచీ మగ ఖబర | 
కైంచే మగ తే దర్శన మనోహర | హోతే సుఖకర సాఈచే | ||౯౦||
90. నలభై మూడు సంవత్సరాల మునుపే సమాధి జరిగిపోయి ఉండేది. అప్పుడు, మనోహరమైన సాయి దర్శనం, ఆనందకరమైన వారి మాటలు ఎలా ప్రాప్తించేవి? 

లోకోపకార హేంచి కారణ | కరూని సమాధీచే విసర్జన | 
సాఈ పావతే ఝాలే ఉత్థాన | సమాధాన భక్తజనా | ||౯౧|| 
91. లోకోపకారం కోసమే సాయి సమాధిని వదిలి, పునర్జీవితులవడం చూసి భక్తులు అమితంగా సంతుష్టులయ్యారు. 
భక్తకార్యార్థ జో భాగలా | పరమానందీ లయ లాగలా | 
కైసా ఆధీ జాఈ ప్రబోధిలా | అకళ లీలా తయాచీ | ||౯౨|| 
92. భక్తుల కార్యార్థం చేసిన కృషితో అలిసి, పరమానందంలో లీనమైన వారిని, ఇంతకంటే మునుపు ఎవరు మాత్రం ఎలా మేలుకొలుపగలరు? వారి లీలలు అంతు పట్టలేనివి. 
దేఖూని బాబా సావధాన | సుఖావలే భక్తజన | 
జో తో ధాంవే ఘ్యావయా దర్శన | పునరూజ్జీవన సుఖాతే | ||౯౩|| 
93. బాబా మేలుకున్నట్లు తెలుసుకుని, భక్తులు ఆనందంతో వారి దర్శనం కోసం, పరుగు తీశారు. ఇలా బాబా పునర్జీవించడం అందరికీ చాలా సంతోషదాయకమైంది. 
అసో పూర్వీల కథానుసంధాన | తే అఖేరచే దేహావసాన | 
జాహలే జయాచే సంపూర్ణ కథన | యథా స్మరణ ఆజవరీ | ||౯౪|| 
94. అలా, అసంపూర్ణంగా మిగిలిపోయిన బాబా నిర్వాణం కథ, ఈ రోజు నాకు గుర్తున్నంతవరకూ, పూర్తిగా చెప్పటం ఇప్పుడు జరిగింది. 
మ్హణోని ఆపణ శ్రోతా సకళిక | మనీ విచారా కీ క్షణ ఎక | 
కాసయా వహావా హర్షశోక | దోనీహీ అవివేక మూలక | ||౯౫|| 
95. శ్రోతలూ! ఒక క్షణం ఆలోచించండి. ఎందుకు సంతోషించాలి? ఎందుకు శోకించాలి? ఇవి రెండూ అవివేకమే కదా? 
ఔట హాతాచా స్థూళ గాడా | దేహేంద్రియాంచా జో సాంగాడా | 
తో కాయ అపులా సాఈ నిధడా | సమూళ సోడా హా భ్రమ | ||౯౬|| 
96. మూడున్నర మూరల ఈ స్థూల శరీరమేనా మన సాయి? ఇంద్రియాల గూడు మాత్రమేనా మన సాయి? ఈ భ్రమనంతా సమూలంగా తొలగించండి. 
సాఈ మ్హణావే జరీ దేహా | తరీ త్యా నావచి నాహీ విదేహా | 
రూపహి నాహీ వస్తూసి పహా | రూపాతీత శ్రీసాఈ | ||౯౭|| 
97. సాయి అంటే ఈ శరీరమే అని అనుకుంటే, ఇక పేరు, రూపం లేని అనిర్వచనీయమైన ఆ ఆత్మను ఏమని పిలవాలి? శ్రీసాయి రూపానికి అతీతులు. 
దేహ తరీ నాశివంత | వస్తు స్వతంత్ర నాశరహిత | 
దేహ పంచభూతాంతర్గత | అనాద్యనంత నిజవస్తూ | ||౯౮|| 
98. శరీరం నాశమవుతుంది. ఆత్మ నాశరహితం, స్వతంత్రం. శరీరం పంచభూతాలతో కూడినది. కాని ఆత్మ అనాది, అనంతం. 
త్యాంతీల శుద్ధ సత్వాత్మక | బ్రహ్మరూప చైతన్య దేఖ | 
జడ ఇంద్రియా జో చాలక | సాఈ నామక తీ వస్తు | ||౯౯|| 
99. జడమైన ఇంద్రియాలను నడిపించే బ్రహ్మచైతన్యం, మరియు శరీరంలోని నిర్మలమైన సత్వమే ఆత్మ. ఆ ఆత్మ పేరే సాయి. 
తీ తో ఆహే ఇంద్రియాతీత | ఇంద్రియే జడ తీతే నేణత | 
తీంచ ఇంద్రియా ప్రవర్తవీత | చాళవీత ప్రాణాంతే | ||౧౦౦||
100. అందువలనే, ఇంద్రియాలకు అతీతమైనది ఆత్మ. ఇంద్రియాలు జడమైనవి గనుక ఆత్మను తెలుసుకోలేవు. ఇంద్రియాలు పని చేయటానికి కారణం ఆత్మ. ప్రాణాలను నడిపించేది కూడా ఆత్మే. 

త్యా శక్తీచే నామ సాఈ | తిజవీణ రితా ఠావ నాహీ | 
తిజవీణ ఓస దిశా దాహీ | భరలీ పాహీ చరాచరీ | ||౧౦౧|| 
101. ఆ ఆత్మశక్తి పేరే సాయి. అది లేని చోటు లేదు. అది లేకుండా పది దిక్కులు కూడా శూన్యం. సజీవ నిర్జీవ సృష్టి అన్నింటిలోనూ అది నిండి ఉన్నది.
తీచ కీ హీ అవతార స్థితి | తీచ హోతీ ఆధీ అవ్యక్తీ | 
నామరూపీ ఆలీ వ్యక్తీ | సమరసలీ అవ్యక్తీ కార్యాంతీ | ||౧౦౨|| 
102. ఆ శక్తియే సాయి రూపంలో అవతరించింది. అంతకు మునుపు కనిపించకుండా ఉండి, తరువాత నామ రూపాలతో కనిపించ సాగింది. వచ్చిన పని పూర్తి కాగానే, మరల కనిపించకుండా పోయింది. 
అవతారకృత్య సంపవూనీ | అవతారీహీ దేహత్యజూనీ | 
జైసే ప్రవేశతీ నిర్వికల్పభువనీ | తైసీచ హీ కరణీ సాఈచీ | ||౧౦౩|| 
103. అవతారాలన్నియూ పని పూర్తి కాగానే, ఉన్న శరీరాన్ని వదిలి, తమ నిర్వికల్ప నివాసాన్ని చేరుకున్నట్లే, సాయి దేహత్యాగం కూడా జరిగింది. 
గుప్త వ్హావే యేతా మనీ | జైసే స్వామీ గాణగాభువనీ8
పర్వత యాత్రేస జాతో మ్హణునీ | గేలే నిఘూనీ ఎకాకీ | ||౧౦౪|| 
104. గుప్తమై పోవాలనే ఆలోచన వచ్చిన వెంటనే, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, పర్వత యాత్రకు వెడతానని గాణగాపురంనుంచి బయలుదేరినప్పుడు, 
భక్తాంనీ ధరితా అడవూన | తయాంచే కేలే సమాధాన | 
లోకాచారీ హే మాఝే గమన | గాణగాభువన సోడీనా | ||౧౦౫|| 
105. భక్తులు వారిని అడ్డగించగా, “నా ఈ ప్రయాణం లోకాచారమే. గాణగాపురాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికీ పోను. 
కృష్ణాతీరీ ప్రాతఃస్నాన | బిందుక్షేత్రీ అనుష్ఠాన | 
మఠాంత కరావే పాదుకా పూజన | తేథేంచ నిరంతర వాస మాఝా | ||౧౦౬|| 
106. “తెల్లవారే కృష్ణా తీరంలో స్నానం చేసి, బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసి, మఠంలో పాదుకల పూజ చేయించుకుంటూ, శాశ్వతంగా ఇక్కడే ఉంటాను” అని వారు భక్తులను శాంత పరచారు. 
తైసీచ సాఈబాబాంచీ పరీ | నిధన కేవళ లోకాచారీ | 
పాహూ జాతా ఆహేత స్థిరచరీ | సర్వాంఅంతరీ శ్రీసాఈ | ||౧౦౭|| 
107. అలాగే, సాయిబాబా రీతి కూడా. వారి నిర్యాణం కేవలం లోకాచారం కోసమే. జాగ్రతగా పరిశీలిస్తే, స్థిర చరాలన్నింటిలోనూ శ్రీసాయి ఉన్నారు. 
జైసీ జయాచీ భజనస్థితి | తయాసీ తైసీ నిత్య ప్రచీతి9
సందేహ కాహీ న ధరావా చిత్తీ | మరణాతీత శ్రీసాఈ | ||౧౦౮|| 
108. వారి వారి భక్తికి తగ్గట్లు, భక్తులకు అనుభవాలు కలుగుతూనే ఉన్నాయి. శ్రీ సాయి మరణాతీతులు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. 
సాఈ భరలా స్థిరచరీ | సాఈ సర్వాంచ్యా ఆంతబాహేరీ | 
సాఈ తుమ్హా ఆమ్హాం భీతరీ | నిరంతరీ నాందతసే | ||౧౦౯|| 
109. సజీవ నిర్జీవ సృష్టి అన్నింటిలోనూ సాయి నిండి ఉన్నారు. లోపల బయట అందరిలోనూ సాయి ఉన్నారు. మీలోనూ నాలోనూ సాయి నిరంతరం ఉన్నారు. 
సాఈ సమర్థ దీన దయాళ | భావార్థీ భక్త ప్రణతపాళ | 
పరమప్రేమాచే తే భుకాళ | అతి స్నేహాళ సకళికా | ||౧౧౦||
110. దీన దయాళువైన సాయి సమర్థులు భక్తులను పాలిస్తారు. వారు నిర్మలమైన ప్రేమకోసం తపిస్తారు. అందరినీ అత్యంత స్నేహభావంతో ఆదరిస్తారు. 

జరీ చర్మచక్షూసీ న దిసతీ | తరీ తే తో సర్వత్ర అసతీ | 
స్వయే జరీ సూక్ష్మత్వీ లపతీ | తరీహీ లావితీ వేడ ఆమ్హా | ||౧౧౧|| 
111. మన కళ్లకు కనిపించక పోయినా వారు సర్వత్ర ఉన్నారు. సూక్ష్మ రూపంలో ఉన్నా, వారు మనలను మంత్రముగ్ధులను చేస్తారు. 
త్యాంచే నిధన కేవళ ఢోంగ | ఆమ్హా ఫసవిణ్యా ఆణిలే సోంగ | 
నటనాటకీ తే అవ్యంగ | భంగోని అభంగ జాహలే | ||౧౧౨|| 
112. వారి నిర్యాణము కేవలం బూటకం. మనలను మభ్య పెట్టటానికి ఆడిన నాటకం. ఎన్నెన్నో పాత్రలను అవలీలగా నటించగల నటులు వారు. నశ్వరమైన శరీరాన్ని వదిలి, నాశ రహితమయ్యారు. 
త్యాచియా ఠాయీ జో అనురాగ | తేణే కరూని పాఠలాగ | 
అంతీ లావూ తయాచా మాగ | కార్యభాగ సాధూ కీ | ||౧౧౩|| 
113. మనకోసం వారు హృదయంలో దాచుకున్న ప్రేమను దృఢంగా పట్టుకుని, వారిని అవగాహన చేసుకుంటూ, మన కార్యాన్ని సాధించుకుందాం. 
మనోభావే పూజా కరితా | భక్తిభావే తయా ఆఠవితా | 
అనుభవ యేఈల సకళ భక్తా | సర్వవ్యాపకతా దిసేల | ||౧౧౪|| 
114. మనఃపూర్వకంగా వారిని ఆరాధిస్తూ, భక్తిభావంతో ఎప్పుడూ వారిని స్మరించే భక్తులందరికీ వారి సర్వ వ్యాపకత్వం అనుభవంతో తెలుస్తుంది. 
ఉత్పత్తి స్థితి ఆణి లయ | చిత్స్వారూపా యాంచే న భయ | 
తే సదాసర్వదా చిన్మయ | వికారా ఆశ్రయ నా తేథే | ||౧౧౫|| 
115. చిత్‍స్వరూపులైన వారికి సృష్టి, స్థితి, లయల భయం లేదు. ఎల్లప్పుడూ వారు చిన్మయులు. వికారాలకు వారి వద్ద స్థానం లేదు. 
జైసే సువర్ణ సువర్ణపణే | రాహీ అలంకారాహీవిణే | 
కేలీ నానాపరీచీ ఆభరణే | తరీ న సోనేపణ త్యాగీ | ||౧౧౬|| 
116. బంగారాన్ని ఎన్ని రకాలైన ఆభరణాలుగా మార్చినా, అది బంగారంగానే ఉంటుంది. తన ఉనికిని అది వదులుకోదు. 
పరోపరీచే అలంకార | హే తో సర్వ వినాశీ వికార | 
ఆటితా ఉరే హేమ అవికార | నాసే ఆకార నామహీ | ||౧౧౭|| 
117. బంగారంతో చేసిన నగలు, బంగారంయొక్క నశించిపోయే రూపాంతరాలు. ఆ నగల నామ రూపాలు పోతే, మిగిలేది ఏ ఆకార వికారాలూ లేని బంగారం. 
తరీ యా హేమీ హా హేమాడపంత | విరోని జావో సమూళ నితాంత | 
ఎవంగుణ సాఈ పదాంకిత | ఆప్రలయాంత వాస కరో | ||౧౧౮|| 
118. హేమాడు పంతు ఈ బంగారంలో సంపూర్ణంగా లీనమైపోయి, సుగుణాలుగల సాయి చరణాలకు అంకితమై, ప్రళయాంతం వరకూ వసించుగాక. 
పుఢే కేలా తేరావా దిన | బాళాసాహేబ భక్తరత్న | 
మిళవూనియా గ్రామస్థ బ్రాహ్మణ | ఉత్తర విధాన ఆరంభిలే | ||౧౧౯|| 
119. తరువాత, పదమూడవ దినం జరిపారు. భక్త రత్నమైన బాలాసాహేబు (భాటే) గ్రామంలోని బ్రాహ్మణులను సమకూర్చుకుని ఉత్తరక్రియా విధిని ప్రారంబించాడు. 
కరూనియా సచైల స్నాన | బాళాసాహేబ హస్తే జాణ | 
కరవిలీ తిలాంజులీ తిలతర్పణ | పిండప్రదానహీ కేలే | ||౧౨౦||
120. సచేల స్నానం చేసిన తరువాత, బాలాసాహేబు తన చేతిమీదుగా, తిలాంజలి, తిలతర్పణం మరియు పిండప్రధానం చేశాడు. 

సపిండీ ఆదిక ఉత్తరక్రియా | శాస్త్రాధారే త్యా త్యా సమయా | 
జాహల్యా మాసికాసహ అవఘియా | ధర్మన్యాయాప్రమాణే | ||౧౨౧|| 
121. సపిండీకరణం మొదలైన ఉత్తరక్రియలన్నీ ఆయా వేళలయందు శాస్త్రోక్తంగా జరిగాయి. మాసికాలు కూడా న్యాయప్రమాణంగా, ధర్మబద్ధంగా జరిగాయి.
భక్తశ్రేష్ఠ ఉపాసనీంనీ | జోగాంసమవేత జాఉనీ | 
భాగీరథీచ్యా పవిత్ర స్థానీ | హోమహవనీయ సంపాదిలే | ||౧౨౨|| 
122. భక్తశ్రేష్ఠులైన ఉపాసనీ, జోగుతో వెళ్లి భాగీరథీ నదీ పవిత్ర తటంలో హోమాలు చేశాడు. 
బ్రహ్మభోజన అన్నసంతర్పణ | యథాసాంగ దక్షిణాప్రదాన | 
కరూని సశాస్త్ర విధివిధాన | ఆలే తే పరతోన మాఘారా | ||౧౨౩|| 
123. శాస్త్ర ప్రకారంగా, బ్రాహ్మణులకు భోజనం, అన్నసంతర్పణం, దక్షిణ ప్రదానాలు, విధివిధానంగా చేసి తిరిగి వచ్చారు. 
నాహీ బాబా నా సంవాద | ఆతా జరీ హా ఏసా భేద | 
పరీ దృష్టీ పడతా తీ మశీద | గత సుఖానువాద ఆఠవతీ | ||౧౨౪|| 
124. బాబా ఇప్పుడు ప్రత్యక్షంగా లేకపోయినా, వారితో జరిగే సంభాషణ లేకపోయినా, మసీదును చూడగానే, మునుపటి మధుర క్షణాలు గుర్తుకు వస్తాయి. 
బాబాంచీ నిత్య ఆసనస్థితీ | ఘ్యావయా తియేచీ సుఖానుభూతీ | 
ఉత్తమోత్తమ ఆలేఖ్యమూర్తి10 | మశీదీ స్థాపిలీసే ప్రీతీ | ||౧౨౫|| 
125. రోజూ బాబా కూర్చునే పద్ధతిలో వారిని చూచిన ఆనందానుభూతిని మరల పొందటానికి, మసీదులో వారి తైల వర్ణ చిత్రపటాన్ని ప్రీతిగా స్థాపించారు. 
జాహలీ సాఈ దేహనివృత్తి | ప్రతిమాదర్శనే హోయ అనువృత్తి | 
వాటే నిజభక్త భావార్థీ | పునరావృత్తీచ హీ మూర్త | ||౧౨౬|| 
126. సాయి దేహాన్ని త్యజించినా, వారు సశరీరంగా మనకు కనిపించక పోయినా, ఈ చిత్రపటాన్ని చూస్తే, వారు మరల వచ్చినట్లుగా భావార్థులైన భక్తులకు అనిపిస్తుంది. 
శామరావ ఉపనామే జయకర | తయాంనీ హీ రేఖిలీ సుందర | 
ఏసీ హీ ప్రతిమా మనోహర | స్మరణ నిరంతర దేతసే | ||౧౨౭|| 
127. అందమైన ఈ చిత్రాన్ని శ్యామరావు జయకర్‍ చిత్రించాడు. మనోహరమైన ఈ చిత్రపటం ఎప్పుడూ బాబాను స్మరణకు తెస్తుంది. 
జైసే హే ప్రసిద్ధ చిత్రకార | తైసేచ బాబాంచే భక్త హీ థోర | 
బాబాంచియా ఆజ్ఞేనుసార | వర్తతీ విచారపూర్వక | ||౧౨౮|| 
128. జయకర్‍ ప్రసిద్ధ చిత్రకారుడే కాక, గొప్ప బాబా భక్తుడు కూడా. శ్రద్ధగా బాబా ఆజ్ఞానుసార ప్రకారమే నడుచుకునే వాడు. 
యాంచియాహీ హస్తేకరూన | సుందర ఛాయాచిత్రే ఘడవూన | 
కరవిలీ భక్తభవనీ స్థాపన | ధరావయా ధ్యానధారణా | ||౧౨౯|| 
129. ధ్యాన ధారణల నిమిత్తం, ఇతని ద్వారా బాబా చిత్రపటాలను గీయించి, భక్తులు తమ ఇళ్లలో పెట్టుకున్నారు. 
సంతాంస నాహీ కధీంహీ మరణ | పూర్వీ అనేకదా యాంచే వివరణ | 
ఝాలేంచ ఆహే అసేల స్మరణ | న లగే స్పష్టీకరణ ఆణీక | ||౧౩౦||
130. సంతులకు మరణమనేది ఎప్పూడూ ఉండదు. ఇంతకు మునపు ఈ విషయాన్ని అనేక సార్లు వివరించటం జరిగింది. ఇది మీకు గుర్తు ఉండాలి. మరల మరల స్పష్టపరచటం అనవసరం. 

బాబా న ఆజ దేహధారీ | తరీ జో తయాంచే స్మరణ కరీ | 
తయా తే అజూనహీ హితకారీ | పూర్వీల పరీ సదేహసే | ||౧౩౧|| 
131. ఈ రోజు బాబా సశరీరులగా లేరు. అయినా వారిని స్మరించేవారికి, ఇప్పుడు కూడా, మునుపటి వలెనే, బాబా శుభాలను కలుగ చేస్తున్నారు. 
కోణాస కాంహీ బోలూన గేలే | పరీ న కాహీ అనుభవా ఆలే | 
జరీ తే దేహావసానహీ ఝాలే | మ్హణూన తే రాహిలే న మనావే | ||౧౩౨|| 
132. ‘ఎవరికో ఏదో చెప్పారు కాని, ప్రస్తుతానికి వారు శరీరాన్ని విడిచి వెళ్లిపోయారు, కనుక వారు చెప్పినది జరగదని’ అనుకోకండి. 
బోల బాబాంచే బ్రహ్మలిఖిత | విశ్వాస ధరూని పహావీ ప్రచిత | 
అనుభవ ఆలా జరీ న త్వరిత | యేణార తో నిశ్చిత కాలాంతరే | ||౧౩౩|| 
133. బాబా మాట బ్రహ్మ లిఖితం. దృఢమైన విశ్వాసంతో ఆ అనుభవానికి ఎదురు చూడండి. వెంటనే అది జరగక పోయినా, కొంత కాలానికైనా తప్పక జరిగి తీరుతుంది. 
అసో యా జోగాంచే నాంవ యేతా | కథేంత ఆఠవలీ ఆడకథా | 
ఏకా తియేచీ హీ అపూర్వతా | దిసేల ప్రేమళతా సాఈచీ | ||౧౩౪|| 
134. జోగు పేరు వచ్చేసరికి, కథలో మరో ఉపకథ గుర్తుకు వచ్చింది. ఆ కథను వింటే అది ఎంత అపూర్వమైనది అని మరియు సాయియొక్క ప్రేమ తత్వం కూడా తెలుస్తుంది. 
జరీ అసే హా త్రోటక సంవాద | గురూభక్తాంసీ అతి బోధప్రద | 
సభాగ్య తో జ్యా వైరాగ్యబోధ | అభాగీ బద్ధ సంసారీ | ||౧౩౫|| 
135. ఈ సంభాషణ చిన్నదే అయినా, గురుభక్తులకు అది అత్యంత బోధప్రధానమైనది. వైరాగ్యాన్ని పొందిన వారు భాగ్యవంతులు. ప్రాపంచిక విషయాలలో బంధించ బడినవారు అభాగ్యలు. 
ఎకదా జోగ బాబాంస పుసతీ | అజూన హీ మాఝీ కాయ స్థితి | 
విచిత్ర మాఝీ కర్మగతి | పావేన సుస్థితీ కేవ్హా మీ | ||౧౩౬|| 
136. జోగు బాబాతో ఒకసారి, ‘నా స్థితి ఇంక ఇంతేనా? నా కర్మ ఇంత విచిత్రంగా ఎందుకు ఉంది? ఎప్పుడు మంచి స్థితిని పొందుతాను? 
బహుత వర్షే అనన్య సేవా | ఘడలీ అపులీ మజలా దేవా | 
తరీ యా చంచల చిత్తా విసాంవా | అజూని నసావా హే కాయ | ||౧౩౭|| 
137. ‘ఎన్నేళ్లనుంచో మీకు నేను అనన్య సేవ చేస్తున్నాను కదా, మరి దేవా! ఎందుకు ఇంకా ఈ చంచల మనసుకు శాంతి లేదు? 
ఏసా కైసా మీ దుర్భాగీ | హీచ కా ప్రాప్తి సంతసంగీ | 
సత్సంగాచా పరిణామ అంగీ | కవణియా ప్రసంగీ భోగీన మీ | ||౧౩౮|| 
138. ‘నేనెలా ఇంతటి దౌర్భాగ్యుణ్ణయ్యాను? సంతుల సాంగత్యంలో లభించింది ఇంతేనా? సత్సంగంయొక్క ఫలితం ఈ దేహానికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది?’ అని ప్రశ్నించాడు. 
పరిసూని హీ భక్తాచీ వినతీ | సాఈసమర్థ పరమ ప్రీతీ | 
జోగాంస కాయ ప్రత్యుత్తర దేతీ | స్వస్థ చిత్తీ పరిసావే | ||౧౩౯|| 
139. భక్తునియొక్క ఆ మొర విని, సాయి సమర్థులు పరమ ప్రీతితో, జోగుకు ఏమని జవాబిచ్చారో, శాంత మనస్కులై ఆలకించండి. 
“దుష్కర్మాచీ హోఈల హోళీ | పుణ్యపాపాచీ రాఖరంగోళీ | 
పాహీన తుఝియా కాంఖేస ఝోళీ | తై తుజ భాగ్యశాలీ మానీన | ||౧౪౦||
140. “దుష్కర్మలు నశించి, పాప పుణ్యాలు బూడిదై, నీ భుజానికి జోలిని చూచినప్పుడు (వైరాగ్యానికి చిహ్నం) నీవు భాగ్యశాలివని అంగీకరిస్తాను. 

ఉపాధీచా హోఈల త్యాగ | నిత్య భగవద్భక్తీచా లాగ | 
తుటతీల ఆశాపాశ సాంగ | తై మీ తుజ సభాగ్య మానీన | ||౧౪౧|| 
141. “మాయయొక్క పొరలన్నీ తొలిగి, సదా భగవద్భక్తిలో లీనమై, ఆశాపాశ బంధాలన్నీ తెంచుకున్నప్పుడు, నిన్ను నేను భాగ్యవంతుడని తలుస్తాను.
విషయాసక్తి మానూని త్యాజ్య | మీ తూం పణ సర్వథా అయోగ్య | 
జివ్హాఉపస్థ జింక హో యోగ్య | తై మీ తుజ సభాగ్య మానీన” | ||౧౪౨|| 
142. “విషయ సుఖాలలోని ఆసక్తిని త్యజించి, నీవు, నేను అనే భేదభావం యుక్తమైనది కాదని తలచి, నాలుకను, జననేంద్రియాలను అదుపులో ఉంచుకున్నప్పుడే నీవు భాగ్యశాలివని నేను అంగీకరిస్తాను”. 
అసో యావర కాంహీ కాలే | బోల బాబాంచే అన్వర్థ ఝాలే | 
సద్గురుకృపే జోగాంస ఆలే | వైరాగ్య జే వదలే బాబా తే | ||౧౪౩|| 
143. అలా కొంత కాలం గడిచిన తరువాత, బాబా మాటలు సత్యమయ్యింది. సద్గురు కృప వలన, బాబా చెప్పినట్లే జోగుకు వైరాగ్యం కలిగింది. 
నాహీ పుత్రసంతతీ పాశ | కలత్ర లావిలే సద్గతీస | 
దేహత్యాగా ఆధీ సంన్యాస | ఝాలే కీ వైరాగ్య సహజచి | ||౧౪౪|| 
144. పుత్ర సంతాన బంధం ఆయనకు లేదు. భార్య సద్గతిని పొందింది. మరణించడానికి మునుపే జోగు సన్యసించాడు. దానితో వైరాగ్యం సహజంగానే వచ్చింది. 
అసో హే జోగహీ భాగ్యవాన | సత్యా ఝాలే సాఈవచన | 
 అంతీ హోఊని సంన్యాససంపన్న | బ్రహ్మీ విలీన జాహలే | ||౧౪౫|| 
145. సాయి మాటలు సత్యమై, జోగు భాగ్యవంతుడయ్యాడు. చివరకు సన్యాస సంపన్నుడై బ్రహ్మలో ఐక్యమయ్యాడు. 
జైసీ జైసీ సాఈనీ కథిలీ | తైసీచ పరిణామీ స్థితి ఝాలీ | 
ఉక్తి సాఈచీ సార్థ ఝాలీ | భాగ్యశాలీ జోగ ఖరే | ||౧౪౬|| 
146. సాయి చెప్పినట్లే అతని స్థితి పరిణమించి, సాయి మాటలు సత్యమైంది. జోగు నిజంగానే భాగ్యశాలి. 
తాత్పర్య బాబా దీనదయాళ | భక్తకల్యాణాలాగీ కనవాళ | 
అర్పీత బోధామృతాచా సుకాళ | శిరడీంత త్రికాళ తో పరిసా | ||౧౪౭|| 
147. సారాంశమేమిటంటె, దీనదయాళువైన బాబా, భక్తుల శ్రేయస్సు కొరకు శిరిడీలో త్రికాలాలలోనూ బోధామృతాన్ని కురిపించేవారు. దానినే ఇప్పుడు వినండి. 
“జయా మాఝీ ఆవడ మోఠీ | తయాంచే మీ అఖండ దృష్టీ | 
తయా మజవీణ ఓస సృష్టీ | మాఝియాచ గోష్టీ తయా ముఖీ | ||౧౪౮|| 
148. “నా మీద అత్యంత ప్రేమగలవారిపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. నేను లేని ప్రపంచం వారికి శూన్యం. వారి నోట ఎల్లప్పుడూ నా మాటే ఉంటుంది. 
“తయా మాఝే అఖండ ధ్యాన | జివ్హేసీ మాఝేంచ నామావర్తన | 
కరూ జాతా గమనాగమన | చరిత్ర గాయన మాఝే తయా | ||౧౪౯|| 
149. “నిరంతరంగా వారు నా ధ్యానమే చేస్తారు. నాలుకతో నా నామాన్నే జపిస్తారు. వస్తున్నా, పోతున్నా, ఏం చేస్తున్నా, నా చరిత్రనే గానం చేస్తారు. 
“ఏసే హోతా మదాకార | కర్మాకర్మీ పడేల విసర | 
జేథే హా మత్సేవేచా ఆదర | తిష్ఠే మీ నిరంతర తేథేంచి | ||౧౫౦||
150. “ఇలా మనసులో నా ఆకారాన్నే పొందినప్పుడు, కర్మ అకర్మలయందు ఆసక్తి తగ్గుతుంది. నా సేవయందు ఇంతటి ఆదరం ఉన్నచోట, నేను ఎల్లప్పుడూ అక్కడే తిష్ఠ వేసుకుని ఉంటాను. 

“మజ హోఊని అనన్య శరణ | జయా మాఝే అఖండ స్మరణ | 
తయాచే మజ మాథా ఋణ | ఫేడీంన ఉద్ధరణ కరూనియా | ||౧౫౧|| 
151. “నాకు అనన్య శరణుజొచ్చి, నిరంతరం నా స్మరణ చేసేవారికి నేను ఋణపడి ఉంటూ, వారిని ఉద్ధరించి నా ఋణం తీర్చుకుంటాను. 
“ఆధీ మజ న దిధల్యావాంచూన | కరితా భోజన రసప్రాశన | 
జయా మాఝే హే నిదిధ్యాసన | తయా ఆధీన మీ వర్తే | ||౧౫౨|| 
152. “నాకు ముందుగా అర్పించకుండా ఏదీ తినకుండా, రసాస్వాదన చేయకుండా, ఎప్పుడూ నా నిధి ధ్యాసలో ఉండేవారి ఆధీనంలో నేను ఉంటాను. 
“మాఝీచ జయా భూకతహాన | దుజే న జ్యాతే మజసమాన | 
తయాచేంచ మజ నిత్య ధ్యాన | తయా ఆధీన మీ వర్తే | ||౧౫౩|| 
153. “ఆకలి దప్పులు కూడా నేనే అయి, నా సమానులు వేరెవరూ లేరని తలచే వారినే నేను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను. 
“పితామాతా గణగోత | ఆప్తఇష్ట కాంతాసుత | 
యాంపాసావ జో పరావృత్త | తోచి కీ అనురక్త మత్పదీ | ||౧౫౪|| 
154. “తల్లి తండ్రి బంధువులు ఆప్తులు ఇష్టులు భార్యాబిడ్డలు వీరి మోహంనుండి బయట పడినవారే, నా పాదాలయందు భక్తి కలిగి ఉంటారు. 
“వర్షాకాళీ నానాసరితా | మహాపూర సముద్రా మిళతా | 
విసరతీ సరితాపణాచీ వార్తా | మహాసాగరతా పావతీ | ||౧౫౫|| 
155. “వానాకాలంలో అనేక నదులు ఉప్పొంగి ప్రవాహంగా మారి సముద్రంలొ కలిసిపోతాయి. తమ అస్థిత్వాన్ని మరచిపోయి, అవి మహాసాగరమైపోతాయి. 
“రూప గేలే నామ గేలే | జళహీ జాఊని సాగరీ మిసళలే | 
సరితాసాగర లగ్న లాగలే | ద్వైత హారపలే ఎకత్వీ | ||౧౫౬|| 
156. “ఆ నదుల రూపాలు పోయి, పేర్లు పోయి, నీరు కూడా సాగరంలో కలిసిపోతాయి. సరితా సాగరాల లగ్నమై, ద్వైతం పోయి ఏకత్వం సిద్ధిస్తుంది. 
“పావోని ఏసీ సమరసతా | చిత్త విసరలే నామరూపతా | 
తే మజసి పాహీల నిజస్వభావతా | నాహీ మజపరతా ఠావ తయా | ||౧౫౭|| 
157. “ఇలాంటి ఏకత్వాన్ని పొందిన భక్తుల మనసులు నామ రూపాలను మరచిపోతాయి. ఆ భక్తులు నన్ను ఆత్మస్వరూపంగా భావిస్తారు. వారికి నాకంటే వేరే చోటే లేదు. 
“పరీస నవ్హే మీ దగడ | ఏసే జనా కరావయా ఉఘడ | 
పుస్తకపండితీ కరోతి బడబడ | లోహాచే అగడ11 ఆణీలే | ||౧౫౮|| 
158. “నేను ఒట్టి రాయిని, పరుశవేదిని కాను అని జనులకు తెలపటానికి, పుస్తక పండితులు ఇనుప ముక్కను తెచ్చి నా పై ప్రయోగించారు. 
“తయీ మజవరీ కరితా ఘావ | ఉలట ప్రకటతా సువర్ణభావ | 
మాఝే దగడపణ జాహలే వావ | అనుభవ నవలావ దాటలా | ||౧౫౯|| 
159. “అలా ఇనుప కమ్మీతో నన్ను కొట్టినప్పుడు, అది సువర్ణమై పోయింది. దానితో నేను రాయిని కాననే విచిత్రమైన అనుభవం వారికి కలిగింది. 
“వినా అభిమాన అణుప్రమాణ | మజ హృదయస్థా యావే శరణ | 
హోఈల అవిద్యా తాత్కాళ నిరసన | శ్రవణ కారణ సంపేల | ||౧౬౦||
160. “మీ హృదయంలో నివసించే నన్ను, అణు ప్రమాణమైనా గర్వం లేకుండా శరణుజొచ్చితే, మాయయనే అజ్ఞానం నశించిపోయి, శ్రవణం చేయవలసిన అవసరం సమాప్తమౌతుంది. 

“అవిద్యా ప్రసవే దేహబుద్ధీ | దేహబుద్ధీస్తవ ఆధివ్యాధి | 
తీచ కీ లోటీ విధి నిషేధీ | ఆత్మసిద్ధీ విఘాతక | ||౧౬౧|| 
161. “శరీరమే నేను అనే బుద్ధి, అజ్ఞానం వలనే కలుగుతుంది. ఈ బుద్ధి కారణంగానే, దైహిక, మానసిక వ్యాధులు కలుగుతాయి. ఈ బుద్ధే ఆత్మప్రాప్తికి ప్రతిభంధకమై, మనుషులను కర్తవ్య నిషేధాల వద్దకు నెట్టుతుంది.
“మ్హణాల ఆతా మీ ఆహే కోఠే | ఆతా మీ తుమ్హా కైసా భేటే | 
తరీ మీ తుమచి హృదయీంచ తిష్ఠే | వినాకష్టే సన్నికట | ||౧౬౨|| 
162. “ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను, నన్ను ఎలా కలుసుకోగలరని మీరు అనుకుంటారు. నేను మీ హృదయాలలోనే తిష్ఠవేసుకుని ఉన్నాను. ఏ కష్టమూ లేకుండ మీ సమీపంలోనే, నేను మీకు లభిస్తాను. 
“మ్హణాల హృదయస్థ కైసా కోణ | కైసే కాయ త్యాచే లక్షణ | 
ఏసీ కాయ తయాచీ ఖూణ | జేణే త్యా ఆపణ జాణావే | ||౧౬౩|| 
163. “అప్పుడు మీరు, హృదయంలో ఎవరున్నారు? వారు ఎలా ఎటువంటి లక్షణాలతో ఉంటారు? వారిని తెలుసుకోవటానికి గుర్తులు ఏవి? అని అడుగుతారు. 
“తరీ వ్హావే దత్తావధాన | పరిసా తయాచే స్పష్ట వ్యాఖ్యాన | 
జయాలాగీ జాణే శరణ | తో హృదయస్థ కోణ హే ఆతా | ||౧౬౪|| 
164. “హృదయంలో ఉన్నది ఎవరు? వారిని ఎలా శరణు వేడాలి అన్న విషయానికి స్పష్టమైన వివరణను శ్రద్ధగా వినండి. 
“నానానామే నానారూపే | సృష్టీమాజీ భరలీ అమూపే | 
జయాంచీ కవణా నా కరవతీ మాపే | మాయేచీ స్వరూపే తీ అవఘీ | ||౧౬౫|| 
165. “గణించడానికి సాధ్యం కాని అనేక రూపాలు, అసంఖ్యాకమైన పేర్లు ఈ సృష్టిలో ఉన్నాయి. ఈ నామ రూపాలన్నీ మాయయొక్క స్వరూపం. 
“తైసేచ సత్వరజ తమగుణ | తయా త్రిగుణా ఓలాండూన | 
సత్తేచే జే స్ఫురే స్ఫురణ | తే రూప జాణ హృదయస్థాచే | ||౧౬౬|| 
166. “అలాగే, సత్వ రజస్సు, తమస్సు అనే త్రిగుణాలకు అతీతమైన సత్యంయొక్క స్ఫురణే, మీ హృదయంలో ఉన్న రూపమని గ్రహించండి. 
“నామరూప విరహితపణ | ఉర్వరిత జే తుఝే తూంపణ | 
తేంచ హృదయస్థాచే లక్షణ | జాణూని శరణ త్యా జావే | ||౧౬౭|| 
167. “నామ, రూపాలను తొలగించిన తరువాత మిగిలిన నువ్వే, నీ హృదయంలో ఉన్న వారి లక్షణమని తెలుసుకొ. వారినే శరణు వేడాలి. 
“మీచ తో తూ ఏసే పాహతా | హీచ దృష్టీ పుఢే విస్తారతా | 
భూత మాత్రీ యే నిజగురుతా | ఠావ న రితా మజవినా | ||౧౬౮|| 
168. “నీ హృదయంలో ఉన్నది నేనే అని గ్రహించినప్పుడు, అన్ని ప్రాణులలోనూ నేనే విస్తరించి ఉన్నాను అని, నేను లేని చోటు లేదనీ అర్థమౌతుంది. 
“ఏసా అభ్యాస కరితా కరితా | అనుభవా యేఈల మాఝీ వ్యాపకతా | 
మగ తూ మజసీ పావూని సమరసతా | పూర్ణ అనన్యతా భోగిసీల | ||౧౬౯|| 
169. “ఇలా అభ్యాసం చేస్తూ ఉంటే, నా సర్వవ్యాపకత్వం అనుభవంలోకి వస్తుంది. అప్పుడు, నీవు నాతో సామరస్యం పొంది, సంపూర్ణ అనన్యత్వాన్ని అనుభవిస్తావు. 
“చిత్స్వపరూపీ అనుసంధాన | లాధేల హోశీల శుద్ధాంతఃకరణ | 
ఘడేల హే తుజ గంగాస్నాన | గంగాజీవన నాతళతా | ||౧౭౦||
170. “సర్వవ్యాపియైన చైతన్యంతో ధ్యానం లగ్నమైతే అంతఃకరణం పరిశుద్ధమౌతుంది. అప్పుడు, గంగాజలాన్ని తాకకుండానే, గంగా స్నానమౌతుంది. 

“ప్రకృతికర్మాచా అభిమాన | జేణే పావే దృఢబంధన | 
తయా బిలగూ న దేతీ సజ్ఞాన | అంతరీ సావధాన సదైవ | ||౧౭౧|| 
171. “ప్రకృతి సిద్ధంగా జరిగిపోయే కర్మలగురించి అభిమానం ఉంటే, బంధనం ఏర్పడుతుంది. అందుకే, జ్ఞానులు ఎల్లప్పుడూ వానికై ప్రాకులాడకుండా, అంతరంగంలో జాగరూకులై ఉంటారు. 
“స్వస్వరూపీ మాండూన ఠాణ | చళే న తేథూన అణుప్రమాణ | 
తయా సమాధీ వా ఉత్థాన | నాహీ ప్రయోజన ఉభయాంచే” | ||౧౭౨|| 
172. “స్వస్వరూపంలో ధ్యానమగ్నులై, అణువంతైనా అక్కడినుండి కదలకుండా ఉంటారు. అందువలన, వారు సమాధిలో ఉన్నా, లేక సమాధినుండి లేచినా, రెంటితోనూ ఏ ప్రయోజనమూ లేదు”. 
మ్హణోని శ్రోతయా చరణీ మాథా | ఠేవోని వినవీ అతి సప్రేమతా | 
దేవా సంతా భక్తా సమస్తా | ఠాయీ ప్రేమళతా ఆదరావీ | ||౧౭౩|| 
173. అందువలనే, దేవుడు, సంతులు, భక్తులు వీరందరియందు భక్తి గౌరవాలను కలిగి ఉండమని, శ్రోతల చరణాలకు శిరసు వంచి, అత్యంత ప్రేమగా విన్నవించటం. 
బాబా కితీదా సాంగూన గేలే | కోణీ కోణాస ఛద్మీ బోలలే | 
త్యానే మాఝేంచ వర్మ కాఢిలే | జివ్హారీ ఖోచలే మజ జాణ | ||౧౭౪|| 
174. “ఎవరైనా సరే, ఎవరినైనా నిందిస్తె, నన్నే దూషించినట్లే. నా హృదాయాన్ని గాయపరచినట్లే అని తెలుసుకోండి” అని తరచూ బాబా చెప్పేవారు. 
కోణీ కోణాస దుర్వచే తాడిలే | తేణే మజ తాత్కాళ దుఖణే ఆణిలే | 
తేచ జేణే తే ధైర్య సోశిలే | తేణే మజ తుష్టవిలే బహుకాళ | ||౧౭౫|| 
175. “ఎవరినైనా చెడు మాటలతో బాధ పెడితే, నన్ను బాధ పెట్టినట్లే. కాని, ధైర్యంతో బాధను సహిస్తే, ఎప్పుడూ నన్ను సంతోష పరచినట్లే”. 
ఏసా భూతమాత్రాచ్యా ఠాయీ | అంతర్బాహ్య భరలా సాఈ | 
ఎకా ప్రేమావాంచూన కాంహీ | ఆవడచ నాహీ తయాతే | ||౧౭౬|| 
176. ఇలా సాయి అన్ని చోట్లలోనూ, అన్ని ప్రాణులలోనూ, లోపల బయటా నిండి ఉన్నారు. ప్రేమ తప్ప వారికి ఇంకేదీ ఇష్టం లేదు. 
పరమ మంగల హే పరమామృత | సాఈముఖీ సర్వదా స్త్రవత | 
కోణా సభాగ్యా హే నాహీ అవగత | ప్రేమ హే అత్యంత భక్తార్థ | ||౧౭౭|| 
177. అత్యంత మంగళకరమైన దివ్యామృతం వారి నోటినుండి ఎప్పుడూ స్రవిస్తూ ఉంటుంది. భక్తుల పట్ల వారికి అత్యంత ప్రేమ. ఏ భాగ్యవంతునికి మాత్రం ఇది తెలియదు? 
జయా పంక్తీచా లాభ దిధలా | జయాంసంగే హాంసలా ఖేళలా | 
తయాంస మాయేచా చటకా లావిలా | వాటేల మనాలా కాయ త్యాచే | ||౧౭౮|| 
178. వారితో సహపంక్తి భోజన లాభం పొందిన, వారితో నవ్వుతూ ఆడుతూ వ్యవహరించిన, వారికోసం తపించిన భక్తుల మనసుకు ఏమనిపించి ఉంటుంది? 
ఏసియా శిష్టాచియా భోజనీ | మీ తో ఉచ్ఛిష్టాచా ధనీ | 
శీతే శీత ఠేవిలే వేంచునీ | వాటితో శిరాణీ తయాచీ | ||౧౭౯|| 
179. ఇలాంటి దివ్యాత్ముల విందులో, వారు వదిలివేసిన ప్రతి చిన్న చిన్న కణాన్నీ నేను జాగ్రతగా సేకరించాను. వాటినే ఇప్పుడు ఆనందంతో పంచి పెడుతున్నాను. 
ఝాల్యా యేథవర జ్యాచ్యా కథా | త్యా కాయ ఠావ్యా హేమాడపంతా | 
సమర్థ సాఈ తయాంచా వక్తా | లిహితా లిహవితాహీ తోచ | ||౧౮౦|| 
180. ఇంతవరకూ చెప్పబడిన కథల గురించి హేమాడ్‍పంతుకు ఏమి తెలుసు? కథయొక్క వక్త సాయి సమర్థులే. వ్రాసేవారు, వ్రాయించేవారు కూడా వారే. 

అసీ హీ సాఈసమర్థ కథా | ధాయే న మన మాఝే కథితా | 
సదైవ ధ్యాస లాగలా చిత్తా | శ్రోతేహీ పరిసతా ఆనంద | ||౧౮౧|| 
181. ఈ సాయి సమర్థుల కథను ఎంత వర్ణించినా మనసుకు తృప్తి లేదు. ఎప్పుడూ నాకు అదే ధ్యాస. శ్రవణం చేసిన శ్రోతలకు కూడా అంతే ఆనందం. 
శివాయ జే సాఈ కీర్తి గాతీ | తైసేచ జే జే సద్భావే పరిసతీ | 
ఉభయహీ సాఈస్వరూప హోతీ | హే దృఢ చిత్తీ జాణావే | ||౧౮౨|| 
182. అలాగే, సాయి కీర్తి గానం చేసిన వారు, మంచి మనసుతో వినిన వారు, ఉభయులూ, సాయితో ఐక్యత్వం పొందుతారు. దీనిని మీరు దృఢంగా తెలుసుకొండి. 
ఆతా హా అధ్యాయ కరూని పూర్ణ | హేమాడ సాఈస కరీ సమర్పణ | 
ప్రేమే ధరీ సాఈచే చరణ | పుఢీల నిరూపణ పుఢారా | ||౧౮౩||
183. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి, సాయికి సమర్పించి, ప్రేమతో వారి చరణాలను హేమాడ్‍ పట్టుకుంటాడు. తరువాత కథ దాని సమయం వచ్చినప్పుడు వినిపించబడుతుంది. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | శ్రీ సాఈనాథ నిర్యాణం నామ | 
| చతుశ్చత్వారింశోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||


టిపణీ: 
1. యా నావాచే గ్రామజోశీ వ శ్రీసాఈబాబాంచే ఎక భక్త. 
2. కై. సఖారామ హరీ జోగ. 3. వీట పడణే. 4. సమాధివిసర్జన. 
5. పేటీ. 
6. “ప్రతిక్షణం యన్నవతాముపైతి, తదేవ రూపం రమణీయతాయ: |” - కాలిదాస. 
7. కోపరా. 8. శ్రీనృసింహసరస్వతీ. 
9. ఎకదా శ్రీసాఈబాబాంచే ఎక భక్త రా. మోరేశ్వరరావ సావ యాంచీ బాబాంచ్యా భండార్యాలా శిరడీస జాణ్యాచీ ఫార ఉత్కంఠా హోతీ; పణ దోన దివస ఆధీ తే ఎకాఎకీ ఆజారీ పడలే వ త్యాంచే ముంబఈహూన తేథే జాణే హోఊ శకలే నాహీ. త్యాముళే త్యాంనా అతిశయ వాఈట వాటలే. త్యాంచే మన ఫారచ ఉద్విగ్న ఝాలే వ రాత్రీ ఝోపహీ యేఈనా; పణ భండార్యాచ్యా దివశీ పహాటేస త్యాంచా డోళా లాగలా. తితక్యాత మహారాజాంనీ త్యాంనా స్వప్నాత దర్శన దిలే వ దక్షిణా మాగూన ఘేతలీ. జాగే ఝాల్యాబరోబర వృత్తీత ఎకదమ ఫరక పడలా వ తళమళ పార జాఊన సమాధాన వాటూ లాగలే. మహారాజాంనీ దేహ సోడాలా ఆహే, తరీ ఆపల్యా భక్తాంచీ తళమళ కోణత్యాహీ తర్హేనే తే ఖాస శమవితాత. 
10. కాగదావరచీ తసబీర. 11. తటబందీచే ఖాంబ.