Tuesday, November 26, 2013

||శ్రీగురుచరణ మహిమా నామ పంచచత్వారింశోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౫ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

సహజ జాతే మాండూని దళతా | జేణే ప్రవర్తవిలే నిజ సచ్చరితా | 
కాయ అలౌకిక తయాచీ కుశలతా | భక్త సత్పంథా లావిలే | ||౧||
1. తిరగలిలో సహజంగా విసురుతూ, భక్తులను సన్మార్గంలో పెట్టాలని, తమ సచ్చరితను స్ఫురింప చేసిన వారి కౌశలం ఎంత అలౌకికమైనది!
మోక్ష జో కా పరమపురుషార్థ | త్యాహూనిహీ గురుచరణ సమర్థ | 
సేవితా ఏసియా గురుచరణీంచే తీర్థ | మోక్ష నకళత ఘర రిఘే | ||౨|| 
2. గురువు పాదాలు పరమ పురుషార్థమైన మోక్షం కంటే శక్తివంతమైనవి. ఇలాంటి గురువుయొక్క పాద తీర్థాన్ని సేవిస్తే, మోక్షం తనంతట తానే, ఎవరికీ తెలియకుండా లభిస్తుంది. 
హోఈల గురు కరుణాకర | తరీచ సుఖాచా హా సంసార | 
ఘడోని యేఈ న ఘడణార | లావీల పరపార క్షణార్థే | ||౩|| 
3. గురువు కరుణ లభిస్తే, ఈ సంసారం సుఖమయమౌతుంది. జరగనివన్నీ జరుగుతాయి. అరక్షణంలో గురువు ఆవలి ఒడ్డుకు చేరుస్తారు. 
జరీ జాహలీ ఇతుకీ పోథీ | కథా కథిలీసే అతి సంకలితీ | 
సాఈచీ తీ అగాధ కీర్తి | తీ మ్యా కితీ వర్ణావీ | ||౪|| 
4. ఇంత గ్రంథం వ్రాసినా, కథ మాత్రం సంక్షిప్తంగానే చెప్పబడింది. సాయియొక్క అగాధమైన, అంతులేని కీర్తిని నేనెంతని వర్ణించను? 
జిచేని దర్శనే నిత్యతృప్తీ | జిచేని సహవాసే ఆనంద భుక్తీ | 
జిచేని భవభయ వినిర్ముక్తి | తీ సాఈమూర్తి హారపలీ | ||౫|| 
5. ఎవరిని చూసినంత మాత్రాన నిత్య తృప్తి దొరికేదో, ఎవరి సహవాసం అంతులేని ఆనందాన్ని ఇచ్చేదో, ఎవరు మనకు సంసార భయాన్ని తొలగిస్తారో, ఆ దివ్యమైన సాయి మూర్తిని పోగొట్టుకున్నాం. 
జిచేని పరమార్థ మార్గ ప్రవృత్తీ | జిచేని మాయామోహ నివృత్తీ | 
జిచేని ఆత్యంతిక క్షేమ ప్రాప్తి | తీ సాఈమూర్తీ హారపలీ | ||౬|| 
6. ఎవరివలన మనలో పరమార్థ ప్రవృత్తి కలిగేదో, ఎవరివలన మాయా మోహ నివృత్తి కలిగి, ఎవరివలన అత్యంత క్షేమం కలుగుతుందో ఆ దివ్యమైన సాయిమూర్తిని పోగొట్టుకున్నాం. 
జిచేని నవ్హతీ భవభయ భీతి | జిచేని జాగృత న్యాయనీతీ | 
జిచేని సంకటీ మనాస ధృతి | తీ సాఈమూర్తీ హారపలీ | ||౭|| 
7. ఎవరివలన సంసార భయం ఉండదో, ఎవరివలన న్యాయం, నీతి జాగృతమై, కష్టాలను ఎదురించగలిగే ధైర్యం కలిగేదో, అలాంటి సాయిమూర్తిని శాశ్వతంగా పోగొట్టుకున్నాం. 
ధ్యానీ స్థాపూనియా నిజమూర్తీ | సాఈ జాఈ నిజధామా ప్రతి | 
నిజావతారా కరీ సమాప్తి | హే యోగస్థితి అతర్క్య | ||౮|| 
8. ధ్యానించుకోవటానికి అనువుగా తమ రూపాన్ని మన మనసులో స్థాపించి, తమ అవతారాన్ని చాలించి, సాయి తమ నివాస స్థానానికి వెళ్లిపోయారు. తర్కానికి అందని అమోఘమైనది వారి యోగ స్థితి. 
పూర్ణ హోతా అవతార కృతి | హారపలీ తీ పార్థివాకృతి | 
తరీ హా గ్రంథ హీ వాంగ్మయ మూర్తి | దేఈల స్మృతి పదోపదీ | ||౯|| 
9. అవతార కార్యం పూర్తి కాగానే, వారి దేహం మనకు కనిపించకుండా పోయింది. అయినా, వారి వాక్కు రూపమైన ఈ గ్రంథం, వారి జ్ఞాపకాన్ని ప్రతి క్షణమూ మనకు గుర్తుకు తెస్తుంది. 
శివాయ హ్యాచియా కథా పరిసతా | మనా లాభే జీ ఎకాగ్రతా | 
తజ్జన్య శాంతీచీ అపూర్వతా | కేవీ అవర్ణీయతా వర్ణావీ | ||౧౦||
10. అంతేకాక, వారి చరిత్రను చదివినా, వినినా, దానివలన మన మనసుకు కలిగే ఏకాగ్రత, అంతకు మునుపు ఎప్పుడూ కలగని, వర్ణించటానికి వీలుకాని శాంతిని, పదాలలో వర్ణించడం అసాధ్యం. 

ఆపణ శ్రోతే సర్వే సూజ్ఞ | మీ తో తుమ్హాంపుఢే అల్పజ్ఞ | 
తథాపి హా సాఈచా వాగ్యజ్ఞ | ఆదరా కృతజ్ఞ బుద్ధీనే | ||౧౧|| 
11. శ్రోతలూ! మీరందరూ జ్ఞానులు. మీ ముందు నేను ఏమీ తెలియని అజ్ఞాని. అయినా సాయి కోసం చేస్తున్న ఈ శబ్ద యజ్ఞాన్ని మీరందరూ కృతజ్ఞతా భావంతో ఆదరించండి. 
కల్యాణప్రద హా వాగ్యజ్ఞ | పుఢే కరూని మజసమ అజ్ఞ | 
పూర్ణ కరీ నిజకార్యజ్ఞ | శ్రోతే సర్వజ్ఞ జాణతీ | ||౧౨|| 
12. అందరికీ మేలు చేసే ఈ వాగ్యజ్ఞాన్ని నాలాంటి అజ్ఞాని ద్వారా సాయి చేయిస్తున్నారని అన్నీ తెలిసిన శ్రోతలకు తెలుసు. 
కరూనియా ఎకాగ్ర మన | అభివందూన సాఈ చరణ | 
మహామంగల పరమ పావన | కరీ జో శ్రవణ యా కథా | ||౧౩|| 
13. ఏకాగ్ర మనసుతో సాయి పాదాలకు నమస్కరించి, మహా మంగళకరమూ, పరమ పావనమూ అయిన ఈ చరిత్రను వినే భక్తుల మరియు; 
జో భక్త భక్తి సమన్విత | నిజస్వార్థ సాధావయా ఉద్యత | 
హోఊనియా ఎకాగ్రచిత్త | కథామృత హే సేవీల | ||౧౪|| 
14. తమ శ్రేయస్సును సాధించుకోవటానికి ఎంతో ఉత్సుకతతో, అనన్య మనసుతో, భక్తిపూర్వకంగా ఈ కథామృతాన్ని వినే భక్తులకు; 
సాఈ పురవీల తయాచే అర్థ | పురవీల స్వార్థ ఆణి పరమార్థ | 
సేవా కధీంహీ జాఈ న వ్యర్థ | అంతీ తో కృతార్థ కరీల | ||౧౫|| 
15. వారి స్వార్థ పరమైన కోరికలనే కాక, పరమార్థ అవసరాలను కూడా సాయి తీరుస్తారు. వారి సేవ ఎప్పుడూ వ్యర్థం కాదు. ఆ సేవయే వారిని చివరకు కృతార్థులను చేస్తుంది. 
చవ్వేచాళీస అధ్యాయ పోథీ | సాఈ నిర్యాణ పరిసలే అంతీ | 
తరీహీ యా పోథీచీ ప్రగతీ | హీ కాయ చమత్కృతి కళేనా | ||౧౬|| 
16. ఈ గ్రంథంలోని నలుబది నాలుగవ అధ్యాయం ముగింపులో సాయి నిర్వాణాన్ని గురించి విన్నారు. అయినా ఈ గ్రంథం కొనసాగుతూనే ఉంది. మరి ఇదేమి చమత్కారమో అర్థం కావటం లేదు. 
గతాధ్యాయీ సాఈనిర్యాణ | యథానుక్రమ జాహలే పూర్ణ | 
తరీ యా సాఈలీలేచీ కాతిణ | విసంబేనా క్షణభరీ | ||౧౭|| 
17. పోయిన అధ్యాయంలో యథాక్రమంగా సాయి నిర్వాణాన్ని పూర్తిగా వర్ణించడమైనది. అయినా, సాలె పురుగువలె, సాయి లీలలకు క్షణమైనా విశ్రాంతి లేదు. 
పాహూ జాతా నవల నాహీ | నిర్యాణ కేవళ దేహాస పాహీ | 
జన్మమరణాతీత హా సాఈ | అవ్యక్తీ రాహీ పూర్వవత | ||౧౮|| 
18. వాస్తవానికి, ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. నిర్యాణం దేహానికి మాత్రమే. సాయి చావు పుట్టుకలకు అతీతులు. అందుకే, వారు మునుపటి వలె కనిపించకుండా ఉన్నారు. 
దేహ గేలా ఆకార గేలా | అవ్యక్తీ జైసా తైసాచ ఠేలా | 
దేహ నిర్యాణా మాగూన లీలా | ఆహేత సకళాంలా అవగత | ||౧౯|| 
19. దేహం పోయింది. దాంతో ఆకారం కూడా పోయింది. కాని, ఎప్పటి వలె వారు కనిపించకుండా ఉన్నారు. శరీరాన్ని వదిలిన తరువాత కూడా జరుగుతున్న వారి లీలలు అందరికీ తెలిసినదే. 
వర్ణూ జాతా త్యాహీ అపార | పరీ న వ్హావా గ్రంథ విస్తార | 
మ్హణూన త్యాంతీల ఘేఊ సార | కరూ కీ సాదర శ్రోతయా | ||౨౦||
20. అలాంటి లెక్కలేని వారి లీలలను వర్ణించాలంటే, ఈ గ్రంథం చాలా పెద్దదై పోతుంది. అందుకు, వాటిలోని సారాన్ని మాత్రమే శ్రోతలకు మనవి చేస్తాను. 

ధన్య ఆముచీ భాగ్యస్థితీ | కీ జే కాలీ సాఈ అవతరతీ | 
తేచ కాలీ ఆమ్హా హే సత్సంగతీ | సహజావృత్తీ లాధలీ | ||౨౧|| 
21. మన భాగ్యం ధన్యం. సాయి అవతరించిన కాలంలోనే వారి పావనమైన సాన్నిధ్యం మనకు కూడా సహజంగా లభించింది.
ఏసే అసతాంహీ చిత్తవృత్తి | జరీ నపవే సంసార నివృత్తి | 
జరీ న జడే భగవంతీ ప్రీతీ | యాహోని దుర్గతీ తీ కాయ | ||౨౨|| 
22. అయినా, మన మనసును సంసారంనుండి నివృత్తి చేయకపోతే, భగవంతునిపై ప్రీతిని పెంచుకోకపోతే, ఇంతకంటే దుర్గతి ఏముంటుంది? 
సర్వేంద్రియీ సాఈచీ భక్తి | తీచ కీ ఖరీ భజన స్థితి | 
నా తరీ డోళా పాహతా మూర్తి | ఖిళీ దాతీ వాచేచ్యా | ||౨౩|| 
23. అన్ని ఇంద్రియాలను సాయి భక్తితో నింపడమే నిజమైన ఆరాధన. అలా కాకపోతే, కళ్లు సాయిను చూస్తున్నా, నోరు పెగలక పోవడంతో, మాట బయటికి రాదు. 
కాన ఏకతా సాఈ కీర్తన | రసనా మధుర ఆమ్రరసీ నిమగ్న | 
కరితా సాఈపాదస్పర్శన | మృదూలీవర్జన ఖపేనా | ||౨౪|| 
24. చెవులు సాయి కీర్తనలను వింటున్నా, నాలుక మటుకు మధురమైన మామిడి పళ్ళ రసం తాగడంలో మగ్నమైతే ఎలా? చేతులు సాయి పాదాలను తాకుతున్నా, మనసు మృదువైన పరుపు సుఖం గుర్తుకు తెచ్చుకుంటే ఎలా? 
సాఈపాసూన క్షణహీ విభక్త | తో కాయ హోఈల సాఈభక్త | 
తో కాయ మ్హణావా చరణాసక్త | సంసారీ విరక్త హో నేణే | ||౨౫|| 
25. క్షణ కాలమైనా సాయినుండి దూరం ఉండగలవాడు అసలు సాయి భక్తుడేనా? సంసారమందు విరక్తి కలగని వారికి సాయి పాదాలయందు ఆసక్తి ఎలా ఉంటుంది? 
ఎకా పతీ వంచూని కోణీ | యేతా తిచియా మార్గావరునీ | 
శ్వశుర దీర భాఊ జాణూనీ | హోఈ వందనీ సాదర | ||౨౬|| 
26. భర్త కాక వేరే మగవారు ఎవరైనా మార్గంలో కనిపిస్తే, వారిని మామగారని, మరిది అని, లేక సహోదరుడని తలచి, గౌరవంగా వందనం చేస్తుంది. 
పతివ్రతేచే నిశ్చళ అంతర | కదా న సాండీ ఆపులే ఘర | 
నిజపతీచాచ ప్రేమా అపార | ఆజన్మ ఆధార తో ఎక | ||౨౭|| 
27. పతివ్రతా స్త్రీ మనసు అలా ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. ఆమె తన ఇల్లు ఎప్పుడూ విడిచి పెట్టదు. తన భర్తపైనే ఆమెకు అంతులేని ప్రేమ. జీవితాంతం ఆమెకు అతడొక్కడే ఆధారం. 
పతివ్రతా సాధ్వీ సతీ | అన్యా భావోనియా నిజపతి | 
తయాచే దర్శన ఘ్యావయా ప్రతీ | కధీంహీ చిత్తీ ఆణీనా | ||౨౮|| 
28. అలాంటి పతివ్రతా సతి, మిగతావారిని తన భర్తగా ఎన్నడూ ఊహించుకోదు. వారిని చూడాలని మనసులోనైనా ఎప్పుడూ తలవదు. 
తీస ఆపులా పతీ తో పతీ | ఇతర కేవ్హాంహీ తయా న తులతీ | 
తయా ఠాయీంచ అనన్య ప్రీతి | శిష్యహీ తే రీతీ గురుపాయీ | ||౨౯|| 
29. ఆమెకు తన భర్తయే సర్వస్వం. మిగతావారెవరూ అతని సమానులు కారు. ఆమె అనన్యమైన ప్రేమ అంతా అతని కొరకే. గురు పాదాలంటే శిష్యుడి ప్రేమ కూడా అలాంటిదే. 
పతివ్రతేచ్యా పతిప్రేమా | గురుప్రేమాస దేతీ ఉపమా | 
పరీ త్యా ప్రేమాస నాహీ సీమా | జాణే తో మహిమా సచ్ఛిష్య | ||౩౦||
30. శిష్యుడి గురు ప్రేమను, పతివ్రతయొక్క పతి ప్రేమతో, పోలుస్తారు. కాని, శిష్యుడి గురు ప్రేమకు పరిమితి అంటూ లేదు. ఉత్తమ శిష్యుడొక్కడికే గురు ప్రేమలోని మహిమ తెలుసు. 

మగ నా జయాచేని సంసారా సాహ్యతా | తీ కాయ సాహ్యా యేతీల పరమార్థా | 
అసో వ్యాహీ జాంవయీ వా వనితా | భరంవసా కోణాచా ధరితా నయే | ||౩౧|| 
31. లౌకికంగా కూడా ఏ సహాయం చేయలేనివారు, పరమార్థంలో మాత్రం ఏ సహాయం చేయగలరు? వియ్యంకుడు గాని, అల్లుడు కాని, లేదా భార్య గాని, ఎవరూ నమ్మకస్థులు కారు. 
మాతా పితా కరితీల మమతా | సత్తేచా పుత్ర లక్షీల విత్తా | 
కుంకువాలాగీ రడేల కాంతా | కోణీ న పరమార్థా సాహకారీ | ||౩౨|| 
32. తల్లితండ్రులు మమకారాన్ని చూపుతారు. కొడుకు దృష్టి, తనకి వచ్చే ఆస్తిపైనే ఉంటుంది. తన పసుపు కుంకుమల గురించి భార్య ఏడుస్తుంది. అంతే కాని, పరమార్థం కోసం సహాయం చేసే వారు ఎవ్వరూ లేరు. 
తరీ ఆతా రాహిలే కోణ | జయాచేని పరమార్థాపాదన | 
కరూ జాతా విచారే నిదాన | ఆపులా ఆపణ అంతీ ఉరే | ||౩౩|| 
33. పరమార్థం కోసం సహాయ పడటానికి మిగిలింది ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే, చివరకు మిగిలేది మనమే. 
కరోని నిత్యానిత్య వివేక | త్యాగోని ఫళ భోగ ఏహికాముష్మిక | 
సాధోనియా శమదమాదిషట్క | మోక్షైక సాధక తో ధన్య | ||౩౪|| 
34. శాశ్వతమైనది ఏది, శాశ్వతం కానిదేది, అనే వివేకంతో, ఇహంలోగాని, పరంలోగాని ఫలాపేక్షను వదిలి, శమ, దమ మొదలైన ఆరు సంపత్తుల సాధన చేసి, మోక్షాన్ని పొందినవారే ధన్యులు. 
తేణే సోడూని దుజియాచీ ఆస | ఠేవావా బళకట ఆత్మవిశ్వాస | 
మారావీ ఆపణ ఆపులీ కాంస | సాధేల తయాసచి పరమార్థ | ||౩౫|| 
35. ఇంకొకరి ఆధార లేకుండా, తనపైనే దృఢమైన నమ్మకంతో, తన ప్రయత్నాన్ని తానే చేసుకునే వారికి పరమార్థం సిద్ధిస్తుంది. 
బ్రహ్మ నిత్య జగ అనిత్య | గురురేక బ్రహ్మ సత్య | 
అనిత్యత్యాగే గురు ఎక చింత్య | భావనాసాతత్య సాధన హే | ||౩౬|| 
36. బ్రహ్మ ఒక్కటే శాశ్వతం. ప్రపంచం మిథ్య. గురు ఒక్కడే నిజమైన బ్రహ్మ. శాశ్వతం కానిదానిని విడచి, గురు ఒక్కడినే ధ్యానించాలి. ఇలాంటి సతతమైన భావన ఒక్కటే పరమార్థ ప్రగతికి సాధనం. 
అనిత్యత్యాగే వైరాగ్య జనన | సద్గురు బ్రహ్మచైతన్య ఘన | 
ఉపజే భూతీ భగవంతపణ | అభేద భజన యా నాంవ | ||౩౭|| 
37. శాశ్వతం కానిదానిని విడిచి పెట్టితే, వైరాగ్యం పుట్టుకొస్తుంది. సద్గురువే బ్రహ్మ, అన్ని ప్రాణులలో భగవంతుడే ఉన్నాడన్న భావన కలగటం, దీనినే అభేద ఉపాసన అని అంటారు. 
భయే అథవా ప్రేమే జాణ | జయా జయాచే నిత్య ధ్యాన | 
ధ్యాతా హోఈ ధ్యేయచి ఆపణ | కంస రావణ కీటకీ | ||౩౮|| 
38. భయంతో గాని, ప్రేమతో గాని, దేనినైనా సతతంగా ధ్యానం చేస్తే, ధ్యానం చేసేవారు ధ్యానించిన వస్తువై పోతారు - కంసుడు, రావణుడు, కీటకం మొదలైనవి కృష్ణుడిగాను, రాముడిగాను మరియు తుమ్మెదలా మారినట్లు. 
చింతనీ వ్హావే అనన్యపణ | ధ్యానా సారిఖే నాహీ సాధన | 
కరీ జో అభ్యాస ఆపులా ఆపణ | తయా నిజోద్ధరణ రోకడే | ||౩౯|| 
39. ఏకాగ్రతతో, అనన్యంగా ధ్యానించాలి. అలాంటి ధ్యానానికి సమానమైన సాధన మరొకటి లేదు. ధ్యానాన్ని సాధన చేసేవారు తప్పకుండా తమను తాము తరింప చేసుకుంటారు. 
తేథే కైంచే జన్మ మరణ | జీవభావాసీ పూర్ణ విస్మరణ | 
ప్రపంచాచే మావళే భాన | ఆత్మానుసంధానసుఖ లాహే | ||౪౦||
40. అప్పుడు, చావు పుట్టుకలు ఎక్కడిది? దేహమే జీవుడు అనే భావన పోయి, ప్రపంచ ధ్యాస లేకుండా, ఆత్మను పొందిన సుఖమైన అనుభవం కలుగుతుంది. 

మ్హణోని నిజగురునామావర్తన | తేణోని పరమానందా జనన | 
భూతీ భగవంతాచే దర్శనే | నామాచే మహిమాన కాయ దుజే | ||౪౧|| 
41. అందు వలన, గురు నామాన్ని జపిస్తూ ఉంటే, పరమానందం జనిస్తుంది. అన్ని ప్రాణులలోనూ భగవంతుని దర్శనం కలుగుతుంది. ఇంతకంటే, నామంయొక్క మహిమ వేరే ఏమి ఉంటుంది?
ఏసీ జయాచ్యా నామాచీ మహతీ | తయా మాఝీ సద్భావే ప్రణతీ | 
కాయావాచామనే మీ త్యా ప్రతీ | అనన్యగతీ యే శరణ | ||౪౨|| 
42. ఇంతటి మహిమగల నామం ఉన్నవారికి, నేను భక్తితో నమస్కరిస్తాను. కాయా, వాచా, మనసా నేను వారికి అనన్య శరణుజొచ్చుతున్నాను. 
యే అర్థీంచీ ద్యోతక కథా | కథితో శ్రోతయాకరితా ఆతా | 
తరీ తీ ఏకిజే నిజహితార్థా | ఎకాగ్రచిత్తా కరూనియా | ||౪౩|| 
43. ఇప్పుడు ఈ విషయాన్నే స్పష్టం చేసే ఒక కథను శ్రోతలకు నేను చెబుతాను. దీనిని మీరు, మీ శ్రేయస్సు కోసమే ఏకాగ్ర చిత్తంతో వినండి. 
కైలాసవాసీ కాకా దీక్షిత | సాఈసమర్థా అజ్ఞాంకిత | 
నిత్యనేమ వాచీత భాగవత | ఆహే కీ అవగత సమస్తా | ||౪౪|| 
44. సాయి సమర్థుల ఆజ్ఞ మేరకు కీ. శే. కాకా దీక్షితు నిత్యం నియమంగా (ఏకనాథ) భాగవతాన్ని పఠించేవాడు అనేది అందరికీ తెలిసినదే. 
ఎకే దివశీ దీక్షితాంనీ | కాకా మహాజనీ యాంచే సదనీ | 
చౌపాటీవర భోజన సారునీ | పోథీ నేమానీ వాచిలీ | ||౪౫|| 
45. ముంబయిలోని చౌపాటీలో ఉన్న కాకా మహాజని ఇంటిలో, ఒక రోజు, భోజనం తరువాత, దీక్షితు గ్రంథాన్ని పఠించ సాగాడు. 
ఎకాదశాచా అద్వితీయ | ఏసా తో సరస ఆణి ద్వితీయ | 
పరిసతా అనుక్రమే అధ్యాయ | శ్రోత్యాచే ధాయ అంతరంగ | ||౪౬|| 
46. సాటిలేని పదుకొండవ స్కంధంలో, రసభరితమైన రెండవ అధ్యాయాన్ని దీక్షితు పఠిస్తుండగా, వింటున్న శ్రోతల మనసులు, సుఖ శాంతులతో నిండిపోయాయి. 
మాధవరావ బాబాంచే భక్త | కాకా మహాజనీ తయాం సమవేత | 
బైసలే ఏకావయా భాగవత | ఎకాగ్ర చిత్త కరూనియా | ||౪౭|| 
47. బాబా భక్తుడైన మాధవరావుతో సహ, కాకా మహాజని కూడా ఏకాగ్ర చిత్తంతో భాగవతాన్ని వినటానికి కూర్చున్నారు. 
కథాహీ భాగ్యే ఫారచి గోడ | జేణే పురేల శ్రోత్యాంచే కోడ | 
జడేల భగవద్భక్తీచీ ఆవడ | ఏసీచ తీ చోఖడ నిఘాలీ | ||౪౮|| 
48. అదృష్టం కొద్దీ, కథ కూడా చాలా మధురమైనది. శ్రోతల కోరికలను తీర్చి, భగవద్భక్తి యందు ప్రీతిని కలిగించే మంచి కథ అది. 
ఋషభ కుళీంచే నఊ1 దీపక | కవి హరి అంతరిక్షాదిక | 
నిఘాలే యాంచేంచ గోడ కథానక | ఆనందజనక బోధప్రద | ||౪౯|| 
49. ఋషభ కులంలోని, కవి, హరి, అంతరిక్ష మొదలైన తొమ్మిది మంది కులదీపకులు చెప్పిన జ్ఞాన బోధ ప్రధానమూ, ఆనందదాయకమూ అయిన మధురమైన కథ అది. 
నఊహీ తే భగవత్స్వ రూప | పోటీ క్షమా శాంతీ అమూప | 
వర్ణితా భాగవత ధర్మప్రతాప | జనక2 నిష్కంప తటస్థ | ||౫౦||
50. ఆ తొమ్మిది మంది కూడా భగవత్స్వరూపులు. అంతులేని క్షమా, శాంతి కలవారు. వారు శక్తివంతమైన భాగవత ధర్మ మహిమను వర్ణించగా, విని జనక మహారాజు ఆశ్చర్యంతో, మౌనంగా ఉండిపోయాడు. 

కాయ తే ఆత్యంతిక క్షేమ | కాయ హరీచీ భక్తి పరమ | 
కైసేన హీ హరి మాయా సుగమ | నిఃశ్రేయస ఉత్తమ గురుచరణ | ||౫౧|| 
51. అన్నింటికంటే క్షేమమైనది ఏది? హరియొక్క పరమ భక్తి ఎటువంటిది? హరియొక్క మాయను సులభంగా దాటే ఉపాయం ఏది? గురువు పాదాలే అన్నిటికంటే ఉత్తమమైనవి. 
కర్మ అకర్మ ఆణి వికర్మ | యా సర్వాంచే ఎకచి వర్మ | 
గురు హేంచ రూప పరమాత్మ | భాగవత ధర్మ గురుభక్తి | ||౫౨|| 
52. గురువే పరమాత్మ రూపం, గురువుయందే భక్తి ఉండటమే భాగవత ధర్మం. కర్మ, అకర్మ, మరియు వికర్మలన్నింటిలో ఉన్న మర్మం ఈ భావనే. 
హరిచరిత్ర అవతార గుణ | ద్రుమిల నాథే కేలే నిరూపణ | 
పురుషావతారాచీ దావూని ఖూణ | రూపే నారాయణ వర్ణిలా | ||౫౩|| 
53. శ్రీ విష్ణువు చరిత్ర, మరియు అవతారాలలోని విశిష్టతను ద్రుమిలనాథుడు వర్ణించాడు. నారాయణ స్వరూపమైన పురుషావతారాన్ని గుర్తించే లక్షణాలను కూడా అతను వివరించాడు. 
పుఢే అభక్త గతి విన్యాస | విదేహా కథీ నాథ చమస | 
వేదవిహిత కర్మాచీ కాంస | సోడిల్యా హో నాశ సర్వస్వీ | ||౫౪|| 
54. భక్తి లేనివారికి పట్టే దుర్గతిని, వేదాలు చెప్పిన కర్మలను చేయని వారందరూ నాశమౌతారనియూ చమస్నాథుడు జనక మహారాజుకు వివరించాడు. 
సర్వాంతరీ హరీచా వాస | మ్హణోని న కరావా కోణాచా ద్వేష | 
పిండీ పిండీ పహావా పరేశ | రితా న రేస త్యావీణ | ||౫౫|| 
55. దేవుడైన హరి అన్ని ప్రాణులలోనూ ఉన్నాడు కనుక, ఎవరినీ ద్వేషించరాదు. ప్రతి ప్రాణిలోనూ పరమేశ్వరుని చూడాలి. దేవుడు లేని చోటంటూ ఏదీ లేదు. 
అంతీ నవవే కరభాజన | కృతత్రేతాది యుగీంచే పూజన | 
కైశా కైశా మూర్తీంచే ధ్యాన | కరితే నిర్వచన జాహలే | ||౫౬|| 
56. చివరలో, తొమ్మిదవ వాడైన కరభాజనుడు, కృత, త్రేతాది యుగాలలో ఏ ఏ దేవతల మూర్తులను ఎలా పూజించాలి, ఎలా ధ్యానించాలి అని వివరించాడు. 
కలియుగీ ఎకచి సాధన | హరి గురు చరణ స్మరణ | 
తేణేంచ హోయ భవభయహరణ | హే ఎక నిజ శరణ శరణాగతా | ||౫౭|| 
57. హరియొక్క, గురువుయొక్క పాదాలను తలచుకోవటం ఒక్కటే కలియుగంలో మనకున్న సాధనం. దానితోనే భవభయం తొలగిపోతాయి. శరణాగతులకు ఉన్న ఏకైక శరణం ఇదే. 
ఏసీ పోథీ జాహల్యాఅంతీ | కాకాసాహేబ పృచ్ఛా కరితీ | 
కాయ హో హీ నవనాథకృతి | అతర్క్య వృత్తి తయాంచీ | ||౫౮|| 
58. గ్రంథ పఠనం ఇంతవరకూ వచ్చిన తరువాత, కాకా సాహేబు, ‘ఈ నవ నాథుల చర్యలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి! వారి మనోవృత్తి కూడా తర్క రహితంగా ఉంది’ అని ఆశ్చర్యపోయాడు. 
ఆవడీ మాధవరావాంస వదతీ | కితీ హో హీ అవఘడ భక్తి | 
ఆమ్హా మూఢా కైచీ హీ శక్తి | జన్మజన్మాంతీ న ఘడే హే | ||౫౯|| 
59. తరువాత, ప్రేమగా మాధవరావుతో, ‘ఈ భక్తి ఎంత కఠినమైనది! మనవంటి మూఢులకు అంతటి శక్తి ఎక్కడిది? జన్మ జన్మలకూ ఇది సాధ్యం కానిది. 
కోఠే హే నాథ మహాప్రతాపీ | కోఠే ఆపణ ఠాయీంచే పాపీ | 
ఆహే కాయ భక్తి హీ సోపీ | సచ్ఛిద్రూపీ తే ధన్య | ||౬౦||
60. ‘ఇంత శక్తివంతులైన ఆ నాథులు ఎక్కడ? పుట్టుకతోనే పాపులైన మనం ఎక్కడ? ఇంతటి భక్తి సులభ సాధ్యమా? సత్యం, జ్ఞానంయొక్క స్వరూపులైన వారు నిజంగా ధన్యులు. 

ఆమ్హా హీ భక్తి ఘడేల కాయ | కైసేన హోఈల తరణోపాయ | 
జాహలో హతాశ గళాలే పాయ | ఝాలా కీ వాయఫళ జన్మహా | ||౬౧|| 
61. ‘ఇలాంటి భక్తి మనకు లభిస్తుందా? మనకింక వేరే దారి ఏది? నేను హతాశుణ్ణయి పోయాను. ఈ జన్మ వ్యర్థమైపోయింది’ అని అన్నాడు.
కాకాసాహేబ భక్త ప్రేమళ | అసావీ జీవాస కాంహీ హళహళ | 
సుస్థిరవృత్తి వ్హావీ కా చంచళ | ఉడాలీ ఖళబళ శామాచీ | ||౬౨|| 
62. కాకాసాహేబు ప్రేమమయుడైన భక్తుడు. అతని మనసు స్థిరంగా ఉండక, ఇలా ఎందుకు చంచలమై తపన పడుతున్నాడు అని శ్యామా మనసులో బాధ పడ్డాడు. 
శామానామే మాధవరావ | జయాంచా కాకాంలాగీ సద్భావ | 
తయాంస కాకాంచా హా స్వభావ | దైన్యాచా ప్రభావ నావడలా | ||౬౩|| 
63. శ్యామా అనబడే మాధవరావుకు కాకాసాహేబు అంటే చాలా అభిమానం. అతనికి కాకాయొక్క నిరాశ, నిస్పృహ, దైన్యం నచ్చలేదు. 
మ్హణతీ బాబాంసారిఖే లేణే | భాగ్య లాధలే జయాసీ తేణే | 
ముఖ కరావే కేవిలవాణే | వ్యర్థ కీ జీణే తయాచే | ||౬౪|| 
64. ‘బాబాలాంటి ఆభరణాన్ని పొందిన భాగ్యం ఉండి కూడా, ఇంతటి దైన్యం ఎందుకు? అతడు జీవించడం వ్యర్థం’ అని అనుకున్నాడు. 
సాఈచరణీ శ్రద్ధా అఢళ | తరీ హీ కా మనాచీ తళమళ | 
నాథాంచీ భక్తి అసేనా ప్రబళ | ఆపులీహీ ప్రేమళ నవ్హే కా? | ||౬౫|| 
65. ‘సాయి పాదాలలో ఇంతటి దృఢమైన విశ్వాసం ఉండీ కూడా, మనసులో ఇంతటి అలజడి ఎందుకు? నవనాథుల భక్తి ప్రబలమైనదే కావచ్చు. కాని, మన భక్తిలో ప్రేమ లేదా?’ 
ఎకనాథీ టీకేసహిత | ఎకాదశస్కంధ భాగవత | 
వాచావే భావార్థ రామాయణ నిత | ఆపణా నిశ్చిత హీ ఆజ్ఞా | ||౬౬|| 
66. ‘టీకా సహితంగా ఏకనాథ భాగవతంలోని పదుకొండవ స్కంధం మరియు భావార్థ రామాయణాన్ని మీరు రోజూ పఠించాలని బాబా ఆజ్ఞయే కదా! 
తైసేంచ హరిగురు నామస్మరణ | హీ బాబాంచీ ఆజ్ఞా ప్రమాణ | 
యాంతచి అపులే భవభయ తారణ | చింతేచే కారణ కాయ తుమ్హా? | ||౬౭|| 
67. ‘అలాగే, హరినామ స్మరణ, గురునామ స్మరణ, సంసార సాగరం దాటడానికి సాధన, అనేది కూడా బాబా ఆజ్ఞయే కదా? అలాంటప్పుడు, ఎందుకు మీకు ఇంత చింత?’ అని అన్నాడు. 
పరీ త్యా నవయోగ్యాచే చరిత | తయాచే తే అసిధారావ్రత | 
సాధేల కాయ ఆపణా యత్కించిత | చింతన హే సతత కాకాంచే | ||౬౮|| 
68. అయినా, ఆ నవయోగుల చరిత్ర, వారి నియమ నిష్ఠలు, వారు పాలించిన కత్తి మీద సామువంటి వ్రతాలు, వీటిలో ఏ కొంచమైనా మనకు సాధ్యమా? అని కాకా సతతంగా ఆలోచిస్తుండేవాడు. 
లాగలీ జీవాస మోఠీ చుటపుట | నవయోగ్యాంచీ భక్తిచ ఉద్భట | 
కవణ్యా ఉపాయే హోఈల ప్రకట | తరీచ మగ నికట దేవ ఖరా | ||౬౯|| 
69. ఆ నవయోగుల భక్తియే అన్నిటికంటే ఉత్తమమైనది, శ్రేష్ఠమయినది అనియూ, అది ఎలా లభిస్తుంది? ఆ భక్తిద్వారానే భగవంతుని సామీప్యం సాధ్యం, అనియూ కాకా మనసులో తీవ్రమైన కోరిక ఏర్పడింది. 
అసో ఏసీ లాగలీ హురహుర | ఆసనీ శయనీ హాచ విచార | 
ఉదయీక ఘడలా చమత్కార | శ్రోతీ తో సవిస్తర పరిసావా | ||౭౦||
70. అలా, ఈ ఆవేదన ఎంతగా పెరిగిందంటే, కూర్చున్నా, పడుకున్నా, అదే ఆలోచన కాకాను బాధపెట్ట సాగింది. అప్పుడు జరిగిన అద్భుతమైన చమత్కారాన్ని శ్రోతలూ, సవిస్తారంగా వినండి. 

అనుభవాచా పహా నవలావ | ప్రాతఃకాళీంచ ఆనందరావ | 
పాఖాడే హే జయా ఉపనాంవ | ఆలే మాధవరావా శోధావయా | ||౭౧|| 
71. ఆశ్చర్యకరమైన ఆ అనుభవాన్ని గమనించండి. రెండవ రోజు ఉదయమే ఆనందరావు పాఖాడే అనే వ్యక్తి మాధవరావును వెదుకుతూ వచ్చాడు. 
తేహీ ఆలే ప్రాతఃకాళీ | భాగవత వాచావయాచే వేళీ | 
బైసలే మాధవరావాజవళీ | స్వప్నాచీ నవాళీ సాంగత | ||౭౨|| 
72. అది కూడా, తెల్లవారే, సరిగ్గా భాగవత పఠన సమయానికి వచ్చి, మాధవరావు ప్రక్కన కూర్చుని, గత రాత్రి తనకొచ్చిన కల విశేషాన్ని చెప్పసాగాడు. 
ఇకడే చాలలీ ఆహే పోథీ | తికడే పరస్పర దోఘే ఫుసఫుసతీ | 
తేణే శ్రోత్యా వక్త్యాంచే చిత్తీ | అస్థైర్య స్థితి పాతలీ | ||౭౩|| 
73. ఇక్కడ ఒక వైపు గ్రంథ పఠనం సాగుతుంటే, మరోవైపు అక్కడ, వారిద్దరూ గుసగుసలాడుకొంటున్నారు. దీనివలన, చెప్పేవారికి, వినేవారికీ గ్రంథ పఠనంపై ఏకాగ్రత తప్పిపోయింది. 
ఆనందరావ చంచల వృత్తీ | మాధవరావాంస స్వప్న కథితీ | 
వదతా పరిసతా దోఘే కుజబుజతీ | రాహిలీ పోథీ క్షణభర | ||౭౪|| 
74. ఆనందరావు చంచల మనస్కుడు. తన కల గురించి మాధవరావుకు వివరిస్తుండగా, వారిరువురూ ఒకరికొకరు అడగటం, చెప్పటం వలన గ్రంథ పఠనానికి ఆటంకం కలిగింది. 
కాకాసాహేబ తంవ త్యా పుసతీ | కాయ తీ ఏసీ నవల స్థితి | 
దోఘేచ తుమ్హీ ఆనంద వృత్తి | సాంగా న ఆమ్హా ప్రతీ కాయ కీ | ||౭౫|| 
75. అప్పుడు కాకాసాహేబు వారితో, ‘మీరిద్దరూ ఇంత ఆనందంగా ఉన్నారు, ఏమిటి విశేషం? అదేమిటో మాకు కూడా కాస్త చెప్పండి’ అని అన్నాడు. 
తవ తే మాధవరావ వదతీ | కాలచ కీ ఆపణా శంకా హోతీ | 
సమాధాన ఘ్యా హాతోహాతీ | తారక భక్తి లక్షణ | ||౭౬|| 
76. అందుకు మాధవరావు, ‘నిన్ననే కదా మీకు సంశయం కలిగింది, దానికి వెంటనే సమాధానం వచ్చింది. సంసార సాగరాన్ని దాటించే భక్తియొక్క లక్షణాలను వినండి. 
పరిసా పాఖాడ్యాంచే స్వప్న | దిధలే బాబాంనీ కైసే దర్శన | 
హోఈల అపుల్యా శంకేచే నిరసన | గురుపదవందన భక్తి పురే | ||౭౭|| 
77. ‘పాఖాడేయొక్క కల గమనించండి. అందులో బాబా ఎలా దర్శనమిచ్చారో వింటే, మీ సందేహాలు తొలగి పోయి, గురువు పాదాలకు నమస్కరించే భక్తి ఉంటే చాలు, అని అర్థమౌతుంది’ అని అన్నాడు. 
మగ తే స్వప్న ఏకావయాచీ | ప్రబళ జిజ్ఞాసా త్యా సర్వాంచీ | 
విశేషే కాకాసాహేబ యాంచీ | శంకాహీ తయాంచీచ ఆరంభీ | ||౭౮|| 
78. ఆ కల గురించి వినటానికి అందరికీ కుతూహలం కలిగింది. ముఖ్యంగా కాకాసాహేబుకు, తెలుసుకోవాలనే ఆతురత, ఎందుకంటే అతనికేగా మొదట సంశయం కలిగింది! 
పాహోనియా సర్వాంచా భావ | స్వప్న సాంగే ఆనందరావ | 
చిత్తీ ఠేవూనియా సద్భావ | శ్రోత్యాంసహీ నవలావ వాటలా | ||౭౯|| 
79. అందరి ఆతురతను గమనించి, ఆనందరావు తన కలను శ్రద్ధగా చెప్పసాగాడు. అక్కడ ఉన్నవారందరికీ నమ్మకం ఉంది కాబట్టి, చాలా వింతగా వినసాగారు. 
ఎకా మహా సముద్రాంత | ఉభా మీ కంబరభర ఉదకాంత | 
తేథే మాఝియా దృష్టిపథాంత | ఆలే శ్రీసమర్థ అకల్పిత | ||౮౦||
80. ‘నేను ఒక సముద్రంలో, నడుము లోతు నీటిలో నిలబడి ఉన్నాను. అప్పుడు, అక్కడ శ్రీ సాయి సమర్థులు నా దృష్టికి కనిపించారు. 

రత్నఖచిత సింహాసన | వరీ సాఈ విరాజమాన | 
ఉదకాంతర్గత జయాంచే చరణ | ఏసే తే ధ్యాన దేఖిలే | ||౮౧|| 
81. ‘రత్న ఖచితమైన సింహాసనంపై వారు కూర్చుని ఉన్నారు. వారి పాదాలు నీటి లోపలే ఉన్నాయి. అలాంటి దృశ్యాన్ని చూశాను.
పాహూని ఏసే మనోహర ధ్యాన | జాహలే అత్యంత సమాధాన | 
తే స్వప్న హే కోణాస భాన | మన సుఖసంపన్న దర్శనే | ||౮౨|| 
82. ‘వారి మనోహరమైన రూపాన్ని చూసి, నాకు అత్యంత ఆనందం కలిగింది. అలాంటి దృశ్యం కల అనే భావన ఎవరికి కలుగుతుంది? వారి దర్శనంతో మనసుకు ఎంతో సంతోషం కలిగింది. 
కాయ త్యా యోగాచా నవలావ | తేథేంచ ఉభే మాధవరావ | 
పాయా పడా హో ఆనందరావ | వదలే మజ భావపురఃసర | ||౮౩|| 
83. ‘ఇంకా ఆశ్చర్యకరమైన ఘటన అంటే, మాధవరావు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. మాధవరావు భావావేశంతో నాతో, ‘వారి పాదాలపై పడు, ఆనందరావు!’ అని అన్నాడు. 
తంవ మీ తయా ప్రత్యుత్తర దేత | ఇచ్ఛా మాఝీహీ ఆహే బహుత | 
పరీ తే పాయ ఉదకాంతర్గత | కైసే మజ హాతాంత యేతీల | ||౮౪|| 
84. ‘ ‘అలా చేయాలనే నాకూ కోరికగా ఉంది కాని, వారి పాదాలు నీటిలో ఉన్నాయి. నా చేతికి అవి ఎలా అందుతాయి?’ అని నేను బదులు చెప్పాను. 
ఉదకామాజీ పాయ అసతా | కైసా పాయీ ఠేవూ మాథా | 
తరీ మీ కాయ కరావే ఆతా | నకళే మజ తత్వతా కాంహీంహీ | ||౮౫|| 
85. ‘ ‘నీటిలో ఉండే ఆ పాదాలపై నా శిరసును ఎలా పెట్టగలను? నేనిప్పుడు ఏం చేయాలి? నాకు నిజంగా ఏమీ అర్థం కావటం లేదు’ అని అన్నాను. 
ఏసే పరిసూని మాధవరావ | పరిసా బాబాంస వదలే కాయ | 
దేవా3 కాఢ రే వరతీ పాయ | ఆహేత తే తోయ ప్రచ్ఛన్న | ||౮౬|| 
86. ‘ఇది విన్న మాధవరావు అప్పుడు బాబాతో ఏమన్నాడో వినండి. ‘దేవా! నీటిలో ఉన్న మీ పాదాలను పైకి తీయండి’ అని 
ఏసే వదతాంచ తత్క్షేణ | కాఢిలే బాబాంనీ బాహేర చరణ | 
ఆనందరావాంనీ మగ తే ధరూన | కేలే అభివందన అవిలంబే | ||౮౭|| 
87. అలా అన్న వెంటనే, బాబా తమ పాదాలను బయటికి తీశారు. ఆలస్యం చేయకుండా, ఆనందరావు బాబా పాదాలను పట్టుకుని వందనం చేశాడు. 
ఏసే ధరితా దృఢ చరణ | బాబాంనీ దిధలే ఆశీర్వచన | 
“హోఈల జారే తుఝే కల్యాణ | కాంహీ న కారణ భీతీచే” | ||౮౮|| 
88. ‘నేను అలా వారి పాదాలను దృఢంగా పట్టుకుని ఉన్నప్పుడు, బాబా, “నీకు అన్నీ శుభం కలుగుతుంది. నీవు భయ పడవలసినది ఏదీ లేదు, 
ఆణిక బాబా వదలే దేఖ | “రేశీమ కాంఠీ ధోతర ఎక | 
శామ్యాస మాఝ్యా దేఊన టాక | తుజ సుఖదాయక హోఈల” | ||౮౯|| 
89. “జరీ అంచు ధోవతిని నా శ్యామాకు ఇవ్వు. అందు వలన నీకు శుభం కలుగుతుంది” అని కూడా అన్నారు. 
తరీ తీ వందూని ఆజ్ఞా శిరీ | ధోతర మ్యా ఆణిలే రేశీమధారీ | 
కాకాసాహేబ ఆపణ తే స్వకరీ | మాధవరావ స్వీకారీ ఏసే కరా | ||౯౦||
90. ‘వారి ఆజ్ఞను శిరసావహించి, జరీ అంచు ధోవతిని తెచ్చాను. కాకాసాహేబ్! దానిని మాధవరావు మీ చేతుల ద్వారా తీసుకునేలా చేయండి. 

మాన్య కరా జీ హీ మమ వినంతీ | మాధవరావ హే పరిధాన కరితీ | 
కరా ఏసే సుఖవా మజప్రతీ | హోఈన మీ అతీ ఉపకారీ | ||౯౧|| 
91. ‘నా ఈ విన్నపాన్ని మన్నించండి. మాధవరావు దీనిని కట్టుకునేలా చేయండి. దానివలన నాకు సంతోషం కలుగుతుంది. నేను మీకు చాలా కృతజ్ఞుణ్ణి అవుతాను’. 
ఆనందరావాచీ హీ మాత | మాధవరావ స్వయే పరిసత | 
కాకాసాహేబ జంవ తే దేత | తే న స్వీకారిత తే వస్త్ర | ||౯౨|| 
92. ఆనందరావు మాటలను తను స్వయంగా విన్నా, కాకాసాహేబు ఇచ్చిన ధోవతిని మాధవరావు తీసుకోలేదు. 
తయాంచే మనీ హే తో స్వప్న | ఆమ్హాస పటలీ పాహిజే ఖూణ | 
దృష్టాంత కాంహీ జాహల్యావిణ | ఘ్యావే న ఆపణ హే వస్త్ర | ||౯౩|| 
92. ఆనందరావు మాటలను తను స్వయంగా విన్నా, కాకాసాహేబు ఇచ్చిన ధోవతిని మాధవరావు తీసుకోలేదు. 
కాకాసాహేబ తేవ్హా వదత | ఆతా బాబాంచీ పాహూ ప్రచీత | 
ఘేణే హే ఉచిత అథవా అనుచిత | హోఈల తే సూచిత చిఠ్ఠ్యాంనీ | ||౯౪|| 
94. అప్పుడు కాకాసాహేబు, ‘బాబా అభిప్రాయాన్ని తెలుసుకుందాం. తీసుకోవటం సరియైనదా, కాదా అనేది చీటీల ద్వారా తెలుస్తుంది’ అని అన్నాడు. 
దేతీల బాబా చిఠ్ఠీ జైసీ | మానూ తయాంచీ ఆజ్ఞా తైసీ | 
చిఠ్ఠ్యా బాబాంచియా పాయాపాసీ | కృతసంకల్పేసీ టాకిల్యా | ||౯౫|| 
95. ‘బాబా ఇచ్చిన చీటీయే వారి ఆజ్ఞగా తీసుకుందాం’ అని నిశ్చయించుకుని, చీటీలలో వ్రాసి, బాబా పాదాల వద్ద ఉంచాడు. 
కాకాసాహేబ యాంచా భార | హోతా సర్వస్వీ సాఈచియావర | 
ఆధీ ఘ్యావా త్యాంచా విచార | కరావా తో వ్యవహార పుఢారా | ||౯౬|| 
96. కాకాసాహేబు తన భారాన్నంతా సాయిపైనే ఉంచేవాడు. బాబా అభిప్రాయాన్ని ముందుగా తెలుసుకున్న తరువాతే ఏ పనైనా చేసేవాడు. 
హే తో బాబాంచే హయాతీంత | తోచ కీ క్రమ తయాంచే పశ్చాత | 
చిఠ్ఠ్యా టాకూన ఆజ్ఞా ఘేత | తైసేచ తే వర్తత నిశ్చయే | ||౯౭|| 
97. అలా ఏమో, బాబా శరీరంతో ఉన్నప్పుడు చేసేవాడు. వారు శరీరాన్ని వదిలిన తరువాత, చీటీలు వేసి బాబా ఆజ్ఞను తీసుకునేవాడు. ఆ ఆజ్ఞను తప్పక పాలించేవాడు. 
కార్య మోఠే అథవా సాన | చిఠ్ఠీనే ఆజ్ఞా ఘేతల్యావీణ | 
కాంహీ న కరణే గేలియా ప్రాణ | అనుజ్ఞా ప్రమాణ సర్వథా | ||౯౮|| 
98. పని చిన్నదైనా పెద్దదైనా, చీటీల ద్వార బాబా ఆజ్ఞను తీసుకోకుండా, ప్రాణం పోయినా, ఏ పనీ చేసేవాడు కాదు. బాబా ఆజ్ఞయే సర్వదా ప్రమాణం. 
దేహచి జేథే నాహీ అపులా | ఎకదా బాబాంచ్యా పాయీ వాహిలా | 
మగ తయాచ్యా చలనవలనాలా | కాయ అపుల్యా అధికార | ||౯౯|| 
99. ‘బాబా పాదాలకు అంకితం చేసిన తరువాత, దేహమే మనది కానప్పుడు, దాని వ్యవహారాల పైన మనకు అధికారం ఎక్కడుంటుంది?’ 
పహా యా ఎకా భావనేవర | లాఖో రుపయాంచే కమాఈవర | 
లాథ మారిలీ పరీ హా నిర్ధార | దృఢ ఆమరణాంత రాఖిలా | ||౧౦౦||
100. అనే ఈ ఒక్క భావంతో, లక్షలాది రుపాయల సంపాదనను కాలద్రోసుకున్నాడు కాని, తన దృఢ నిర్ణయాన్ని జీవితాంతం వరకు పాటించాడు. 

“ఫళా యేఈల తుఝే ఇమాన | ధాడీన మీ తుజలాగీ విమాన | 
నేయన త్యాంత బైసవూన | నిశ్చింత మన రాహీ తూ” | ||౧౦౧|| 
101. “నీ నమ్మకం ఫలిస్తుంది. నీ కోసం నేను విమానం పంపి, అందులో నిన్ను కూర్చోబెట్టి, తీసుకొని పోతాను. నిశ్చింత మనస్కుడవై ఉండు”.
హీ బాబాంచీ ప్రసాదోక్తి | అక్షరే అక్షర ఆలీ ప్రతీతి | 
సాఈలీలా వాచకాంప్రతి | ఠావీ నిర్గమ స్థితీ కాకాంచీ | ||౧౦౨|| 
102. బాబాయొక్క ఈ అనుగ్రహ వచనంలోని ప్రతి అక్షరం నిజంగా జరిగింది. కాకాసాహేబుయొక్క విశిష్టమైన నిర్యాణం గురించి, సాయిలీలా మాసికం పాఠకులకు ఇప్పటికే తెలుసు. 
హోతా తయా స్థితీచే స్మరణ | ఆణీక తే కాయ విమాన ప్రయాణ | 
కాయ తే ఆనందాచే మరణ | గురునామావర్తన సమవేత | ||౧౦౩|| 
103. అప్పటి స్థితి తలచుకుంటే, విమాన ప్రయాణమంటే ఇంతకంటే వేరే ఏముంటుంది, అని అనిపిస్తుంది. అనంతమైన గురు నామ స్మరణ జరుగుతుండగా, ఆనందమయమైన ఎంతటి సునాయాస మరణం! 
ఏసే దీక్షిత కరారీ ఆపణ | చిత్తీ నిరంతర సాఈ చరణ | 
ఇష్ట మిత్రాంహీ దేఊని శికవణ | జాహలే విలీన గురుపాయీ | ||౧౦౪|| 
104. అలా, దీక్షితు తన నిశ్చయంలో దృఢంగా ఉండేవాడు. సాయి పాదాలలో ఎప్పుడూ అతని మనసు లీనమై ఉండేది. ఇష్టులకు, మిత్రులకు దీనినే నేర్పించి, గురు చరణాలలో విలీనమై పోయాడు. 
ఆతా పూర్వానుసంధాన స్థితి | దోఘాంహీ మానలీ చిఠ్ఠ్యాంచీ యుక్తి | 
కారణ దోఘాంచీ కాకాంవర ప్రీతి | చిఠ్ఠ్యా మగ లిహవితీ అవిలంబే | ||౧౦౫|| 
105. ఇప్పుడు మునపటి కథకు వస్తే, ఆనందరావు, మాధవరావు ఇద్దరూ కాకాపైని ప్రీతితో చీటీల ఉపాయాన్ని ఒప్పుకున్నారు. ఆలస్యం చేయకుండా, చీటీలను వ్రాయించారు. 
ఎకా చిఠ్ఠీంత ‘ఘ్యావే ధోతర’ | దుసరీంత ‘త్యాచా కరావా అవ్హేర’ | 
ఏసే లిహూన సాఈచ్యా పాయావర | టాకిల్యా ఛాయా చిత్రాతళీ | ||౧౦౬|| 
106. ఒక చీటీలో ‘ధోవతిని తీసుకో’ అని, రెండవ దానిలో ‘తీసుకోవద్దు’ అని వ్రాసి, సాయియొక్క చిత్రపటం క్రింద, వారి పాదాల వద్ద ఉంచారు. 
తత్రస్థ ఎకా అర్భకాస | త్యాంతీల చిఠ్ఠీ ఉచలావయాస | 
లావితా ధోతర ఘ్యావయాస | మాధవరావాంస యే ఆజ్ఞా | ||౧౦౭|| 
107. అక్కడున్న బాలునితో, ఒక చీటీని తీయించగా, అందులో ‘ధోవతిని స్వీకరించు’ అని మాధవరావుకు ఆజ్ఞ అయింది. 
జైసే స్వప్న తైసీచ చిఠ్ఠీ | ఆనంద ఝాలా సకళా పోటీ | 
మగ తే ధోతర రేశీమ కాంఠీ | ఘాతలే కరసంపుటీ శామాచియా | ||౧౦౮|| 
108. కలలో ఉన్నట్టే, చీటీలోనూ ఉండటం వలన, అందరికీ ఆనందం కలిగింది. అప్పుడు, జరీ అంచు ధోవతిని మాధవరావు చేతిలో పెట్టటం జరిగింది. 
త్యాంచే స్వప్న యాంచీ చిఠ్ఠీ | పరస్పరాంశీ పడతా మిఠీ | 
పరమానంద న మాయ పోటీ | సుఖసంతుష్టీ ఉభయాంతే | ||౧౦౯|| 
109. ఆనందరావు కల, మాధవరావు చిట్టి, రెండూ ఒకటే అవటం వలన, వారిద్దరికీ భరించలేనంత పరమానందం కలిగింది. ఆ ఇద్దరికీ సంతోషం, తృప్తి కలిగాయి. 
మాధవరావ అంతరీ ఖూష | ఆనందరావాసహీ సంతోష | 
ఝాలా సాఈభక్తి పరిపోష | ఆశంకా నిరాస కాకాంచా | ||౧౧౦||
110. మాధవరావు లోలోపల ఆనందించాడు. ఆనందరావు కూడా చాలా సంతోష పడ్డాడు. సాయి భక్తి పరిపుష్టి కావడంతో, కాకా సంశయం కూడా తొలగింది. 

అసో యా సర్వ కథేంచే సార | జ్యాచా త్యాణే కరావా విచార | 
ఠేవిల్యా గురుపాయావర శీర | గురువదనోద్గార లక్షావే | ||౧౧౧|| 
111. ఏమైనా, ఈ కథ సారాంశమేమిటంటే, గురువు పాదాలయందు శిరసును ఉంచినప్పుడు, గురువు నోటినుండి వచ్చిన మాటలను, చాలా శ్రద్ధతో పాటించాలి అనే దానిని గురించి, ఎవరికి వారు, ప్రతియొక్కరూ ఆలోచించాలి. 
ఆపణాహూన ఆపులీ స్థితి | ఆపులీ భూమికా వా చిత్తవృత్తి | 
గురు జాణే నఖశిఖాంతీ | ఉద్ధారగతీహీ తోచ | ||౧౧౨|| 
112. మన స్థితిగతులు, మన చిత్తవృత్తి, మన భూమిక, వీటి గురించి మనకంటే, మన గురువుకే బాగా తెలుసు. అలాగే, మనల్ని ఎలా ఉద్ధరించాలన్నది కూడా గురువుకే తెలుసు. 
జైసా రోగ తైసే నిదాన | తైసేంచ ఔషధ వా అనుపాన | 
సద్గురునేమీ శిష్యాలాగూన | భవరోగ నివారణ కార్యార్థ | ||౧౧౩|| 
113. రోగానికి తగిన విధంగా ఔషధం అన్నట్టు, భవ రోగ నివారణ కోసం, సద్గురువు శిష్యునికి ఔషధ రూపంగా నియమాలను విధిస్తారు. 
స్వయే తో జీ కరితో కరణీ | ఆణూ నయే ఆపులే అనుకరణీ | 
తుమ్హా కారణే గురుముఖాంతునీ | నిఘేల తీ వాణీ ఆదరావీ | ||౧౧౪|| 
114. గురువు ఆచరించే విధానాన్ని మనము అనుకరించ కూడదు. కాని, గురువు నోటినుండి మన కోసం వచ్చే మాటలను శ్రద్ధగా ఆచరించాలి. 
త్యాచ శబ్దాంవర ఠేవావే మన | తయాంచేచ నిత్య కరావే చింతన | 
తేంచ తుమచ్యా ఉద్ధారా కారణ | ఠేవా హే స్మరణ నిరంతర | ||౧౧౫|| 
115. ఆ మాటలనే ఏకాగ్రతతో విని, వాటినే మననం చేయాలి. అవే మీ ఉద్ధరణకు ఉపయోగ పడతాయని ఎప్పుడూ గుర్తుంచుకోండి. 
గురు సాంగే తే పోథీపురాణ | తే తో తద్వచన స్పష్టీకరణ | 
ముఖ్య ఉపదేశీ ఠేవా ధ్యాన | తే నిగమజ్ఞాన ఆపులే | ||౧౧౬|| 
116. గురువు చెప్పినదే, మనకు పురాణ గ్రంథాలలో చెప్పిన మాటలు. వారి మాటలు వాటినే స్పష్టం చేస్తాయి. కాని, మన ధ్యానం ఎప్పుడూ వారి ముఖ్యోపదేశాల పైనే ఉండాలి. అవే మనకు వేద వాక్యాలు. 
కోణాహీ సంతాచే వచన | త్యాచా కరూ నయే అవమాన | 
ఆపులీ మాయ ఆపులీ జతన | కరీల తీ అన్య కోణ కరీ | ||౧౧౭|| 
117. ఏ సత్పురుషుని మాటలనైనా అవమానించ కూడదు. మన కన్న తల్లి మనల్ని చూసినట్లు మిగతా వారెవరు చూస్తారు? 
ఖరా మాయేచా జివ్హాళా | లేంకురాలాగీ తిచా కనవాళా | 
బాళ నేణే తో సుఖసోహళా | ఘేఈల తో లళా తీ పురవీ | ||౧౧౮|| 
118. కన్న తల్లికి తన బిడ్డల పైన, నిజమైన వాత్సల్యం ఉంటుంది. తన గురించి చేసే పనులలో, ఆమె పొందే సుఖం బిడ్డకు తెలియదు. బిడ్డల ప్రతి కోరికనూ తల్లి తీరుస్తుంది. 
సంత సృష్టీమాజీ ఉమాప | “ఆపులా బాప తో ఆపులా బాప” | 
సాఈముఖీంచే హే కరుణాలాప | కోరా స్వహృదయపటావరీ | ||౧౧౯|| 
119. సృష్టిలో లెక్కలేనంత సంతులు ఉన్నారు. కాని, "మన తండ్రి మన తండ్రే" అని సాయి నోటినుండి వెలువడిన కరుణా వచనాన్ని మీ హృదయ ఫలకంపై వ్రాసుకోండి. 
మ్హణోని సాఈముఖీంచే వచన | తేథేంచ ఠేవా అనుసంధాన | 
అంతీ తోచ కృపానిధాన | తాపత్రయ శమన కరీల | ||౧౨౦||
120. అందు వలన, సాయి నోటినుండి వెలువడిన మాటలయందే ధ్యానం ఉంచండి. దయామయులైన వారే చివరకు మన తాపత్రయాలను నివారించేది. 

తోచ జాణే త్యాచీ కళా | ఆపణ పహావే కౌతుక డోళా | 
కాయ అద్భుత తయాచ్యా లీలా | సహజ అవలీలా ఘడతీ జ్యా | ||౧౨౧|| 
121. వారి కళ వారికే తెలుసు. వారి ఆ కళా కౌశలాన్ని మనం కళ్లతో చూడాలి అంతే. ఎంతో సహజంగా, అవలీలగా సంభవించే వారి లీలలు, అంతే అద్భుతం.
దుసరా ఎక మ్హణతో మ్హణూన | త్యాంచే సర్వ ఘ్యావే ఏకూన | 
మోడూ న ద్యావే నిజానుసంధాన | నిజగురువచన విసరూ నయే | ||౧౨౨|| 
122. ఇంకొకరు ఏది చెప్పినా, ఆ మాటలన్నింటినీ వినండి. మీ గురువుయొక్క మాటలను మాత్రం మరచిపోకండి. మీ ధ్యేయాన్నీ, మీ ధ్యానాన్నీ వదలకండి. 
యాంతచి ఆహే పరమకల్యాణ | యాంతచి ఆహే భవభయతరణ | 
యాంతచి అవఘే పోథీపురాణ | జపతపానుష్ఠానచి హే | ||౧౨౩|| 
123. ఇందులోనే భవభయ నివారణమూ, ఇందులోనే పురాణాలు, గ్రంథాలు, ఇందులోనే జప, తప మరియు అనుష్ఠానాలూ ఉన్నాయి. ఇదే మనకు పరమ శుభప్రదము. 
సారాంశ ప్రేమ కరా గురూవర | అనన్యభావే నమస్కార | 
దినకరాపుఢే కైచా అంధార | తయాంసీ భవసాగర నాహీంచ | ||౧౨౪|| 
124. సారాంశంలో చెప్పాలంటే, గురువును ప్రేమించండి, వారికి అనన్య భావంతో నమస్కరించండి. సూర్యుడి ముందు చీకటి ఎలా ఉంటుంది? అలాగే, గురువు వద్ద సంసార సాగరము ఉండదు. 
అసా కుఠేహీ సృష్టీవర | నికట అథవా కితీహీ దూర | 
సాతా సముద్రాచ్యాహీ పార | భక్తార్థ అనివార ప్రేమళ | ||౧౨౫|| 
125. సృష్టిలో ఎక్కడున్నా - దగ్గరలో గాని, దూరంలో గాని, ఏడు సముద్రాల అవతల ఉన్నా సరే - శిష్యులయందు గురువు అత్యంత ప్రేమ కలిగి ఉంటారు. 
అసో ఏసే హే లిహితా లిహితా | కథా ఎక ఆఠవలీ చిత్తా | 
ఎకాచే పాహూని దుజ్యానే కరితా | కైసియా ఆపదా హోత జీవా | ||౧౨౬|| 
126. ఇలా వ్రాస్తూ, వ్రాస్తూ ఉండగా, ఒకరిని చూచి మరొకరు అనుకరిస్తే ఎంతటి ఆపదలు కలుగుతాయనే ఇంకొక కథ నాకు గుర్తుకు వచ్చింది. 
ఎకదా బాబా మశీదీంత | అసతా మ్హాళసాపతీ సమవేత | 
పూర్వీల ఫళీచీ శేజ అవచిత | స్మరే అకల్పిత తయాంతే | ||౧౨౭|| 
127. ఒక సారి, మహల్సాపతితో బాబా మసీదులో ఉండగా, అకస్మాత్తుగా మునుపు తాము పలకపై పడుకున్న సంగతి వారికి గుర్తుకు వచ్చింది. 
రుందీ అవఘీ సవావీత | దోనీ టోకాంస చింధ్యా బాంధిత | 
మశీదీచియా ఆఢ్యాస టాంగిత | ఝోంపాళా కరీత తియేచా | ||౧౨౮|| 
128. ఆ చెక్క వెడల్పు సుమారు ఒక అడుగు మాత్రమే. దానిపై పడుకోవటానికి, రెండు వైపులా దానికి పాత గుడ్డ పీలికలను కట్టి, మసీదు దూలానికి అడ్డంగా వ్రేలాడ గట్టేవారు. 
నిజూ నయే అంధారాంత | తదర్థ ఉశాపాయథ్యా లగత | 
ఠేవూని రాత్రౌ పణత్యా జళత | బాబా నిజత ఫళీవర | ||౧౨౯|| 
129. చీకటిలో పడుకోకూడదని, తల వద్దా, కాళ్ళ వద్దా దీపాలను ఉంచి, అవి రాత్రంతా వెలుగుతుండగా, బాబా ఆ చెక్కపైన పడుకునే వారు. 
యా ఫళీచే సమూళ వృత్త | పూర్వీల ఎకా అధ్యాయాంత4
ఆధీంచ వర్ణిలే ఆహే యేథ | పరిసా కీ మహత్వ తియేచే | ||౧౩౦||
130. ఈ చెక్క పలక వృత్తాంతాన్ని అంతా, ఇదివరకే ఒక అధ్యాయంలో (అధ్యాయం పది) వర్ణించాను. దాని మహత్వాన్ని ఇప్పుడు వినండి. 

ఎకదా యా ఫళీచీ మహతీ | మనోభావే బాబా వర్ణితీ | 
కాకాసాహేబ దీక్షితా చిత్తీ | ఉదేలీ వృత్తీ తీ పరిసా | ||౧౩౧|| 
131. ఒక సారి, ఈ చెక్క పలక గొప్పదనాన్ని బాబా వర్ణిస్తుండగా, కాకాసాహేబు దీక్షితు మనసులో కలిగిన ఆలోచనను వినండి. 
మ్హణతీ మగ తే బాబాంప్రతీ | ఫళీవరీ శయనప్రీతి | 
అసేల తరీ తీ టాంగతో ప్రీతీ | మగ స్వస్థ చిత్తీ పహుడావే | ||౧౩౨|| 
132. బాబాతో అతడు, 'మీకు ఆ చెక్క పలకపై శయనించాలని అంత కోరికగా ఉంటే, ఒక చెక్క పలకను ప్రేమతో వ్రేలాడ కట్టిస్తాను. అప్పుడు మీరు దానిపై సుఖంగా పడుకోవచ్చు' అని అన్నాడు. 
బాబా తయాంస ప్రత్యుత్తర దేతీ | “ఖాలీ టాకూన మ్హాళసాపతీ | 
ఆపణచి వర నిజావే కేఉతీ | బరా మీ ఖాలతీ ఆహే తో” | ||౧౩౩|| 
133. "మహల్సాపతిని క్రింద వదలి, నేను ఒక్కణ్ణే పైన ఎలా పడుకోగలను? నేను క్రింద బాగానే ఉన్నాను" అని బాబా జవాబిచ్చారు. 
త్యావర కాకా అతిప్రీతీ | ఆణీక ఫళీ టాంగూ మ్హణతీ | 
ఆపణ నిజావే ఎకీవరతీ | మ్హాళసాపతీ దుసరీవర | ||౧౩౪|| 
134. అప్పుడు కాకా చాలా ప్రేమతో, 'ఇంకొక చెక్క పలక కట్టిస్తాను. ఒక దానిపై మీరు, రెండవదానిపై మహల్సాపతి పడుకోవచ్చు' అని చెప్పాడు. 
త్యావరీ పహా బాబాంచే ఉత్తర | “తో కాయ నిజతో ఫళీవర | 
జయా అంగీ గుణప్రకర5 | తోచ ఫళీవర నిజేల | ||౧౩౫|| 
135. దానికి బాబా ఏమన్నారో వినండి. "అతడు అసలు చెక్కపై పడుకోగలడా? శరీరంలో సుగుణ సంపదలు ఉన్నవాడే చెక్కపైన పడుకోగలడు. 
“నాహీ ఫళీవర శయన సోపే | కోణ తియేవర మజవీణ ఝోంపే | 
నయన ఉఘడే నిద్రా లోపే | తయాసచి ఝేపే హే శయన | ||౧౩౬|| 
136. "చెక్క పలకపై పడుకోవటం అంత సులభం కాదు. నేను తప్ప, దానిపైన ఎవరు పడుకోగలరు? నిద్రను మానుకుని, కళ్లు తెరుచుకుని ఉండగలవారే దానిపై పడుకోగలరు. 
“మీ జై కరూ లాగే శయన | తై మీ కరీ యాసీ6 ఆజ్ఞాపన | 
‘కర మద్హృూదయావరీ ఠేవూన | రాహీ బైసూన సన్నిధ’ | ||౧౩౭|| 
137. "'నేను నిద్రిస్తుంటే, నా గుండెపైన చేయి వేసి, నా దగ్గరే కూర్చోమని' అతనికి చెప్పాను. 
“తేంహీ కామ యాస న హోఈ | బసల్యా జాగీ డులక్యా ఘేఈ | 
తయా న ఫళీ హీ కామాచీ కాంహీ | ఫళీ హీ బిఛాఇత మాఝీచ | ||౧౩౮|| 
138. "కాని ఆ పని కూడా అతని చేత కాలేదు. కూర్చున్న చోటే కునుకు తీస్తాడు. అతనికి ఈ చెక్క పనికి రాదు. ఈ చెక్క పలక నాకు మాత్రమే పక్క. 
‘నామస్మరణ చాలే హృదయాంత | పాహే తేథే ఠేవూని హాత | 
నిజతా మీ మజ కరీ జాగృత’ | ఏసా అనుజ్ఞాపిత తో అసతా | ||౧౩౯|| 
139. "'నా హృదయంలో నిరంతరం నామ స్మరణ జరుగుతుంటుంది. అక్కడ చేతిని ఉంచి చూడు. నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు' అని అతనిని ఆజ్ఞాపించగా, 
“త్యాసచి నిద్రా లాగతా జడ | కర హో త్యాచా జైసా దగడ | 
‘భగత’ మ్హణతా నేత్రాచీ ఝాపడ | ఉడూని ఖడబడ జో కరీ | ||౧౪౦|| 
140. "అతనికే నిద్ర వచ్చి, అతని చేయి బరువెక్కి రాయిలా అవుతుంది. భగత్ అని నేను పిలవగానే అతని నిద్ర మాయమై, ఆందోళన పడతాడు. 

“బసవే న జయా ధరేవర | ఆసన జయాచే నాహీ స్థిర | 
జో నర నిద్రాతమకింకర | నిజేల ఉంచావర కేవీ” | ||౧౪౧|| 
141. "నేలపైనే సరిగ్గా కూర్చోలేనివాడు, ఆసనంపై స్థిరంగా ఉండలేనివాడు, తమోగుణమైన నిద్రకు కింకరుడైన వాడు, ఎత్తుపైన ఎలా పడుకోగలడు?" 
మ్హణోని “ఆపులే ఆపుల్యాసంగే | దుజియాచే తే దుజియాసంగే” | 
హే తో బాబా వేళ ప్రసంగే | భక్తానురాగే అనువదత | ||౧౪౨|| 
142. అలా బాబా భక్తుల పైని ప్రేమతో, "మీ స్వభావం ప్రకారం మీరు చేయండి, ఇంకొకరిని వారి స్వభావానికి అనుగుణంగా చేయనివ్వండి" అని సందర్భానుసారంగా చెప్పేవారు. 
అగాధ సాఈనాథాంచీ కరణీ | మ్హణూని హేమాడ లాగలా చరణీ | 
తయాంనీ హీ కృపాశీర్వచనీ | ఠేవిలా నిజస్మరణీ అఖండ | ||౧౪౩||
143. సాయినాథుని లీలలు అగాధం. కనుక, హేమాడు వారి చరణాలను ఆశ్రయించగా, బాబా కూడా అతనిని ప్రేమతో, కృపతో, ఆశీస్సులతో ఎప్పుడూ తమ స్మరణలో ఉంచారు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | శ్రీగురుచరణ మహిమా నామ | 
| పంచచత్వారింశోధ్యాయః సంపూర్ణః |

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. కవీ, హరీ, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్హోత్ర, ద్రుమిల, చమస, కరభాజన. 
2. జనకరాజా. 
3. శ్రీ సాఈబాబాంస మాధవరావ దేశపాండే ‘దేవా’ మ్హణూన నేహమీ సంబోధీత. 
4. అధ్యాయ ౧౦ వా. 
5. సముదాయ. 
6. మ్హాళసాపతీస.

No comments:

Post a Comment