Tuesday, January 28, 2014

||భక్తత్రయవృత్తకథనం నామ ఎకపంచాశత్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౫౧ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

జయ జయ సాఈ భక్తాధారా | గీతార్థప్రకాశకా గురువరా | 
సర్వసిద్ధీచియా దాతారా | కృపా కరా మజవరీ | ||౧|| 
1. భక్తులకు ఆశ్రయమైన సాయీ! మీకు జయము, జయము. భగవద్గీతకు అర్థాన్ని చెప్పిన గురువరా! అన్ని కోరికలనూ ప్రసాదించే ప్రభూ! నన్ను కరుణించండి.
కరావయా నిదాఘశమన1 | మలయగిరీ ఉగవే చందన | 
అథవా సుఖవావయా విశ్వజన | వర్షతో ఘన భూమీవరీ | ||౨|| 
2. వేడిని తగ్గించడానికి మలయగిరిపై చందనపు చెట్లు పెరుగుతాయి. అలాగే ప్రపంచంలోని ప్రజలను సుఖపెట్టడానికి మేఘాలు భూమిపై వానలను కురిపిస్తాయి. 
కింవా దేవాంచే వ్హావయా పూజన | ప్రకటే వసంతసమయీ సుమన | 
అథవా కరాయా శ్రోతృ సమాధాన | ఉదయా యే ఆఖ్యాన పరంపరా | ||౩|| 
3. దేవతలను పూజించటానికి, వసంత ఋతువులో పూలు పూస్తాయి. అలాగే శ్రోతలను సంతోష పరచటానికి ఈ సాయికథా పరంపరలు ఉదయించాయి. 
ఏకతా హే సాఈ చరిత్ర | శ్రోతే వక్తే దోఘేహీ పవిత్ర | 
పవిత్ర ఏకతీ త్యాంచే శ్రోత్ర | పవిత్ర వక్త్ర2 వక్త్యాచే | ||౪|| 
4. ఈ సాయి చరిత్రను వింటే, వినేవారు, చెప్పేవారు ఇరువురూ పవిత్రులౌతారు. విన్నవారి చెవులు, చెప్పిన వారి నోళ్లూ పవిత్రమౌతాయి. 
గతాధ్యాయీ అజ్ఞాన నిరసన | హోతా కైసే ప్రకటే జ్ఞాన | 
‘తద్విద్ధి ప్రణీపాతేన’3 | శ్లోకార్థ నిరూపణ జాహలే | ||౫|| 
5. గత అధ్యాయంలో, అజ్ఞానము నశిస్తే జ్ఞానం ఎలా బయట పడుతుంది అన్న విషయం, మరియు ‘తద్విద్ధి ప్రణిపాతేన’ అన్న శ్లోకానికి అర్థం చెప్పడం జరిగింది. 
భగవద్గీతా పరిసమాప్తీ | అఠరావియా అధ్యాయాఅంతీ | 
బహాత్తరావే శ్లోకప్రాంతీ | అర్జునా పుసతీ శ్రీకృష్ణ | ||౬|| 
6. భగవద్గీత చివరలో, పదునెనిమిదవ అధ్యాయం చివరన, డెబ్బై రెండవ శ్లోకం చివర, శ్రీకృష్ణుడు అర్జునుని అడిగాడు, 
యేథవరీ జే జాహలే ప్రవచన | తేణే ‘ఝాలే కా మోహనిరసన’ | 
హాచ స్పష్ట కేలా కీ ప్రశ్న | ‘ఝాలే కా జ్ఞాన’ పుసిలే నా | ||౭|| 
7. “ఇప్పటి వరకు ప్రవచనం విన్నావు కదా! మరి దాంతో నీకు మోహం తొలగిపోయిందా?” అని ఇదే ప్రశ్నను స్పష్టంగా అడిగాడు. కాని, జ్ఞానం కలిగిందా అని అడగలేదు. 
తైసీచ పార్థేంహీ దిధలీ పావతీ | ‘మోహ మాఝా గేలా దిగంతీ’ | 
మ్హణే నా ‘ఝాలీ జ్ఞానప్రాప్తి’ | మోహవిచ్ఛిత్తీచ జాహలీ’ మ్హణే | ||౮|| 
8. అలాగే అర్జునుడు కూడా ‘నా మోహం తొలగి పోయింది’ అని జవబు ఇచ్చాడే కాని ‘జ్ఞానం కలిగింది’ అని చెప్పలేదు. ‘మోహం నాశమైందని’ చెప్పాడు. 
మోహనామ కేవల అజ్ఞాన | దిసాయా మాత్ర శబ్ద దోన | 
అర్థావబోధ నాహీ భిన్న | గీతార్థజ్ఞ జాణతీ | ||౯|| 
9. మోహం అంటే కేవలం అజ్ఞానం. భగవద్గీతయొక్క అర్థం తెలిసిన వారికి, ఈ రెంటి అర్థం ఒక్కటే అని తెలుసు. 
‘యత్వయోక్తం వచస్తేన’4 | ‘మోహోయం విగతో’5 జాణ | 
అకరావే అధ్యాయా ఆరంభీ అర్జున | కరీ హేంచి కథన శ్రీకృష్ణా | ||౧౦||
10. దీనినే పదకొండవ అధ్యాయం మొదట్లో అర్జునుడు శ్రీకృష్ణునితో ‘యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో’ అని అన్నాడు. 

ఆతా సాంప్రత అధ్యాయ నూతన | ఆరంభీ కాకాసాహేబాం6 లాగూన | 
కైసే శిరడీంత కేలే స్థాపన | కరూ తే వివేచన నవలాచే | ||౧౧|| 
11. కాకాసాహేబు దీక్షితును, బాబా మొదట శిరిడీలో ఎలా స్థిరపరచారు అన్న విశేషమైన విషయాన్ని ఇప్పుడు ఈ నూతన అధ్యాయంలో వివరిస్తాను. 
త్యాంచా శిరడీంచా ఋణానుబంధ | త్యాంచా సాఈశీ దృఢసంబంధ | 
కైసా ముళీంచా కారణనిర్బంధ | ఏకా తో సంబంధ ఆమూల | ||౧౨|| 
12. శిరిడీతో అతనికి గల ఋణానుబంధం, అతనికి సాయిబాబాతో గల దృఢమైన సంబంధం ఏర్పడటానికి మూల కారణం, వీటన్నిటినీ మొదటినుండి వినండి. 
కథా త్యాంచ్యా ఆహేత బహుత | లహానథోరా సర్వాం విదిత | 
పరీ తే ఆరంభీ కైసే శిరడీప్రత | ఆలే తే అవిశ్రుత సకళాంస | ||౧౩|| 
13. విస్తారమైన అతని కథ, చిన్నాపెద్దా అందరికీ తెలిసినదే. కాని, మొదట అతడు శిరిడీకి ఎలా వచ్చాడు అని అందరికీ తెలియదు. 
పూర్వ పుణ్యాఈచ్యా గోష్టీ | తేణే పరమేశ కృపా దృష్టీ | 
తేణేంచ పుఢే సద్గురుభేటీ | స్వానందపుష్టీ శిష్యాస | ||౧౪|| 
14. పూర్వ పుణ్యం కారణంగా పరమేశ్వరుని కృపాదృష్టి లభిస్తుంది. దాని వలననే, తరువాత సద్గురువుతో కలయిక ఏర్పడి, శిష్యునికి విపరీతమైన ఆనందం లభిస్తుంది. 
యాసహ ఆతా హా అధ్యాయ | శ్రోతయా వర్ణీల కథాత్రయ7
తీన భక్తాంచా హా మహోదయ | శ్రోత్యాంచే హృదయ నివవీల | ||౧౫|| 
15. ఇదే విషయం గురించి, ఈ అధ్యాయంలో వినేవారి మనసుకు ఆనందాన్ని కలిగించే ముగ్గురు భక్తుల మహాభాగ్యం అయిన మూడు కథలను వర్ణిస్తాను. 
ఇతర ఉపాయ కోట్యానకోటీ | కరా పరమార్థ ప్రాప్తీసాఠీ | 
హోతా న సద్గురుకృపాదృష్టి | పడే్నా గాంఠీ పరమార్థ | ||౧౬|| 
16. పరమార్థం పొందటానికి, కోటానుకోటి ఇతర ఉపాయాలెన్నో ఉన్నా, సద్గురు కృపాదృష్టి లేకుంటే పరమార్థం లభించదు. 
యేఅర్థీచీ కథా గోడ | శ్రవణ కరితా పురేల కోడ | 
శ్రోతయా మనీ ప్రకటేల ఆవడ | వాఢేల చాడ నిజస్వార్థీ | ||౧౭|| 
17. ఇదే విషయం గురించిన మధురమైన ఈ కథను వింటే, వినేవారి కోరిక తీరి, వారికి తమ శ్రేయస్సును పొందాలనే శ్రద్ధ కలుగుతుంది. 
గురుభక్తాంచే సమాధాన | తో హా అధ్యాయ పరమపావన | 
శ్రోతాంచిత్తే సావధాన | కరావా శ్రవణ హితకర | ||౧౮|| 
18. గురు భక్తులను సమాధాన పరచే, పరమ పావనమైన ఈ అధ్యాయాన్ని, శ్రోతలు తమ మంచి కోసం, నెమ్మది అయిన మనసుతో వినండి. 
హరీ సీతారామ దీక్షిత | కాకాసాహేబ నాంవే జే విశ్రుత | 
సకల సాఈ బాబాంచే భక్త | ఆదరే జ్యా స్మరత ప్రేమానే | ||౧౯|| 
19. హరి సీతారాం దీక్షితు, కాకాసాహేబు అన్న పేరుతో ప్రస్తిద్ధుడు. బాబా భక్తులందరూ అతనిని సగౌరవంగా స్మరిస్తారు. 
తయాంచీ తీ పూర్వపీఠికా | ఆనందదాయక బహుశ్రుత రసికా | 
సాదర కథితో భక్తభావికా | చరిత్ర శ్రవణోత్సుక సుఖార్థ | ||౨౦||
20. అతని గత చరిత్రను వినాలన్న ఉత్సుకత గల భావికులైన భక్తులకు, రసికులకు, ఆనందదాయకమైన అతని కథను సగౌరవంగా చెప్తాను. 

సన ఎకోణీసశే నఊపర్యంత | పూర్వీ ‘సాఈ’ హే నాంవ జ్యా అపరిచిత | 
తేచ పుఢే సాఈచే పరమ భక్త | సర్వవిశ్రుత జాహలే | ||౨౧|| 
21. క్రి. శ. ౧౯౦౯వ సంవత్సరం వరకు కాకాసాహేబుకు ‘సాయిబాబా’ అన్న పేరు తెలియదు. తరువాత, సాయియొక్క పరమ భక్తునిగా అతడు ప్రసిద్ధి చెందాడు.
విశ్వవిద్యాలయ శిక్షణానంతర | కిత్యేక వర్షే లోటలియావర | 
నానాసాహేబ చాందోరకర | ఆలే లోణావళ్యావర8 ఎకదా | ||౨౨|| 
22. విశ్వవిద్యాలయంలోని విద్య పూర్తి అయింది. తరువాత, ఎన్నో సంవత్సరాలు గడిచాక, ఒకసారి దీక్షితుని కలవటానికి, నానాసాహేబు చాందోర్కరు లోనావాలాకు వచ్చాడు. 
దీక్షిత త్యాంచే జునే స్నేహీ | భేటీ ఝాల్యా ఫార వర్షాంహీ | 
సుఖదుఃఖాచ్యా వార్తా త్యాంహీ | పరస్పరాంహీ త్యా కేల్యా | ||౨౩|| 
23. దీక్షితుకి, నానా పాత స్నేహితుడు. చాలా సంవత్సరాల తరువాత వారిద్దరూ కలుసుకుని, పరస్పర సుఖదుఃఖ విషయాలను ముచ్చటించుకున్నారు. 
లండన శహరీ గాడీత చఢతా | దీక్షితాంచా పాయ ఘసరతా | 
జాహలీ త్యా పాయాంజీ వ్యథా | శమేనా ఉపాయశతాంహీ9 | ||౨౪|| 
24. లండను నగరంలో రైలుబండి ఎక్కుతున్నప్పుడు, దీక్షితుని కాలుజారి, తగిలిన గాయం బాధ, శత విధాల చికిత్సలు చేసినా తగ్గలేదు. 
త్యా వ్యథేచీ సాద్యంత వార్తా | సహజ నిఘాలీ సంభాషణ కరితా | 
తేథే శ్రీసాఈబాబాంచీ ఉపయుక్తతా | ఆఠవలీ చిత్తాంత నానాంచ్యా | ||౨౫|| 
25. బాధ గురించిన సంగతి చెప్పుకుంటుండగా, సహజంగా అక్కడ శ్రీ సాయిబాబా మహిమ నానాకు గుర్తు వచ్చింది. 
‘తో పాయాచా లంగడేపణా | నిఃశేష జావా యేతే కా మనా? | 
చలా మాఝియా గురూచే దర్శన’ | ఏసే తంవ నానా వదలే తయా | ||౨౬|| 
26. ‘ఈ కాలి కుంటితనం పూర్తిగా పోవాలని ఉందా? ఉంటే, మా గురువుగారి దర్శనానికి రండి’ అని నానా కాకాసాహేబుతో అన్నాడు. 
మగ నానాంహీ నవల విశేష | మ్హణూన సాఈచే వృత్త అశేష | 
కథిలే ఆనందే దీక్షితాంస | సంతావతంస మహిమ్యాతే10 | ||౨౭|| 
27. తరువాత, సాయియొక్క ఆశ్చర్యకరమైన సంగతులను, ఆ సత్పురుష శిరోమణి గురించిన మహిమలను, ఎంతో సంతోషంగా నానా దీక్షితునికి తెలియ చేశాడు. 
“మాఝే మాణూస కితీహీ దూర | అసేనా సాతా సముద్రాపార | 
చిడీసారఖా మీ బాంధుని దోర | ఓఢూని సత్వర ఆణీతో” | ||౨౮|| 
28. “నా మనుషులు ఎంత దూరంలో ఉన్నా, ఏడు సముద్రాల అవతల ఉన్నా సరే, దారం కట్టి పిచ్చుకని లాక్కుని వచ్చినట్లు వెంటనే లాక్కుని వస్తాను”. 
ఏసే బాబాంచే నిత్య వచన | వరీ నానాంహీ కేలే ప్రవచన | 
మ్హణాలే బాబాంచే నసల్యా ఆపణ | హోణే న ఆకర్షణ తయాంచే | ||౨౯|| 
29. ‘అని బాబా ఎప్పుడూ చెప్పే మాట. మనం వారి మనుష్యులం కాకపోతే వారి వైపు ఆకర్షింప బడము’ అని నానా చెప్పాడు. 
‘తుమ్హీ తయాంచే అసల్యావీణ | హోణార నాహీ తుమ్హా దర్శన | 
హీచ బాబాంచీ మోఠీ ఖూణ | తుమ్హీ కా ఆపణ జాతా తిథే?’ | ||౩౦||
30. ‘మీరు వారి మనిషి కాకపోతే, మీకు వారి దర్శనం కాదు. బాబాయొక్క గుర్తు ఇదే. కనుక మీ అంతట మీరు అక్కడికి వెళ్లలేరు’. 

అసో హే ఏకూన సాఈచే వర్ణన | దీక్షితాంచే ధాలే అంతఃకరణ | 
మగ తే మ్హణాలే నానా లాగూన | ‘ఘేతో మీ దర్శన బాబాంచే | ||౩౧|| 
31. అలా సాయి గురించిన వర్ణన విని, దీక్షితు మనసుకు చాలా తృప్తి కలిగి ‘నేను వచ్చి బాబాను దర్శనం చేసుకుంటానని నానాతో అన్నాడు. 
మాఝీ యా పాపాచీ కాయ కథా | సకల దేహాచీ నశ్వరావస్థా11
 రాహేనా సుచిర12 పాయాచీ వ్యథా | నాహీ మజ చింతా తదర్థ | ||౩౨|| 
32. ‘నా ఈ కాలిగురించిన దానికి ఎందుకు? శరీరం ఎప్పుడైనా నశించేదే. కనుక, ఈ కాలి బాధ ఎంత కాలమైనా ఉండని, దాని గురించిన చింత నాకేం లేదు. 
‘జాతో మీ ఆపులియా గురూచే దర్శన | పరీ తే నిరతిశయ సౌఖ్య సంపాదనా13
అల్పసుఖాచీ నాహీ మజ కామనా | త్యాచీ న యాచనా కరీ మీ | ||౩౩|| 
33. ‘మీ గురువుగారి దర్శనానికి వెళ్లానంటే, అది కేవలం శాశ్వతమైన సుఖానికే. నాకు చిన్న చిన్న సుఖాలపై కోరిక లేదు. వానిని నేను కోరను. 
‘బ్రహ్మావేగళే నాహీ సుఖ | తేంచ ఎక సుఖ అమోలిక | 
హోఈనా మీ తుమచ్యా గురూచా పాయిక | యా ఎక అమోలిక సుఖాస్తవ | ||౩౪|| 
34. ‘బ్రహ్మను మించిన సుఖం వేరే లేదు. అదొక్కటే వెలకట్టలేని సుఖం. ఆ సుఖం కొరకు నేను మీ గురువుకు దాసుణ్ణవుతాను. 
‘అసో పాయాచా లంగడేపణా | త్యాచీ న మజ కాంహీ వివంచనా | 
పరీ మాఝియా లంగడియా మనా | తాళ్యావరీ ఆణా ప్రార్థనా హీ | ||౩౫|| 
35. ‘ఈ కాలి కుంటితనం ఇలాగే ఉండిపోనీ! దాని చింత నాకు లేదు. కాని నా కుంటి మనసును బాగు చేయమని ప్రార్థిస్తాను. 
‘బహుత శిణలో కరితా సాధన | పరీ న నిశ్చల రాహీ మన | 
 ప్రయత్నే ఠేవూ మ్హణతా స్వాధీన | జాఈ తే నిసటూన నకళత | ||౩౬|| 
36. ‘ఎన్నెన్నో సాధనలు చేసి, చాలా శ్రమ పడ్డాను. కాని, మనసు స్థిర పడలేదు. స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంత ప్రయత్నించినా, నాకు తెలియకుండానే అది జారిపోతుంది. 
‘కితీహీ అసావే సావధాన | అత్యంత మనోనిగ్రహ కరూన | 
కధీ జాఈల నజర చుకవూన | ఆశ్చర్య గహన మనాచే | ||౩౭|| 
37. ‘దానిని అధీనంలో ఉంచుకోవాలని ఎంత జాగ్రత్త పడినా, ఆశ్చర్యంగా దృష్టికి అందకుండా తప్పించుకుని తిరుగుతుంది. 
‘తరీ మీ నానా మనాపాసూన | ఘేఈన తుమచ్యా గురూచే దర్శన | 
మాఝియా మనాచే లంగడేపణ | ఘాలవా మీ ప్రార్థీన తయాంతే’ | ||౩౮|| 
38. ‘అందుకే నానా! నేను మీ గురువు దర్శనానికి వచ్చి, నా మనసు కుంటితనాన్ని తొలగించమని వారిని ప్రార్థిస్తాను’. 
నశ్వర శరీరసౌఖ్యీ ఉదాస | జయా ఆత్యంతిక సుఖాచీ హౌస | 
ఏశియా భక్తాచ్యా పరమార్థాస | పరమ ఉల్హాస సాఈస | ||౩౯|| 
39. నశించే ఈ శరీరం గురించిన సుఖాలపై విరక్తి కలిగి, పరమాత్మ వలన దొరికే సుఖంపై ప్రీతిగల భక్తులు పరమార్థాన్ని పొందటమే సాయికి పరమ సంతోషం. 
ధారా సభేచీ నివడణూక | సర్వాంఠాయీ హా విషయ ఎక | 
జికడేతికడే అనేక లోక | గుంతలే సార్వత్రిక యా కామీ | ||౪౦||
40. ఆ రోజుల్లో, శాసన సభా ఎన్నికల గురించే మాట్లాడుకుంటూ, ఎక్కడ చూచినా ఆ పనులలోనే జనులందరూ నిమగ్నులయ్యారు. 

కాకాసాహేబ అపులేసాఠీ | మిళవావయా లోకమతపుష్టీ | 
ఘేత అసతా స్నేహ్యాంచ్యా భేటీ | పాతలే ఉఠాఉఠీ నగరాస | ||౪౧|| 
41. తనకోసం ప్రజల అభిమతాన్ని సంపాదించటానికి కాకాసాహేబు కూడా స్నేహితులను కలవసాగాడు. దీని గురించే, అనుకోకుండా అహమ్మదునగరుకు వెళ్లాడు.
కాకాసాహేబ మిరీకర | నామే ఎక తేథీల సరదార | 
దీక్షితాంచా ఘరోబా ఫార | ఉతరలే సుఖకర త్యా స్థానీ | ||౪౨|| 
42. కాకాసాహేబు మిరికర్ అక్కడి సర్దారు. దీక్షితుకు అతడు చాలా సన్నిహితుడవటం వలన అతని వద్దే దీక్షితు బస చేశాడు. 
త్యాచ సమయాస అనుసరూన | హోతే నగరీ ఘోడ్యాంచే ప్రదర్శన | 
తదర్థ నానాప్రకారచే జన | హోతే కీ నిమగ్న త్యా కామీ | ||౪౩|| 
43. అహమ్మదునగరంలో అప్పుడు గుర్రాల ప్రదర్శన ఉన్నందువలన, అనేక రకాల మనుష్యులు దానికోసం అక్కడ పనిచేస్తున్నారు. 
బాళాసాహేబ మిరీకర | కోపరగాంవచే మామలేదార | 
ప్రదర్శనార్థ హోతే హాజర | అహమదనగర శహరాంత | ||౪౪|| 
44. కోపర్గాం మామలేదారు అయిన బాళాసాహేబు మిరికరు కూడా దానికోసం అహమ్మదునగర్కు వచ్చాడు. 
యదర్థ దీక్షిత ఆలే తేథే | కార్య తే అవఘే ఆటపలే హోతే | 
శిరడీస కైసే జాణే ఘడతే | కోణ మజ నేతే తేథవర | ||౪౫|| 
45. దీక్షితు అహమ్మదునగరుకు వచ్చిన పని అయిపోయింది. తరువాత శిరిడీకి ఎలా వెళ్లాలి? ఎవరు తీసుకుని వెళ్లగలరు? అని, 
ఉరకతా తేథీల కార్యభాగ | దిసో లాగలా శిరడీచా మార్గ | 
ఘడావా బాబాంచా దర్శనయోగ | హా ఎకచి ఉద్యోగ దీక్షితా | ||౪౬|| 
46. అతనికి శిరిడీ ధ్యాస పట్టుకుంది. బాబాతో దర్శన యోగం కలగాలి అన్నదొక్కటే దీక్షితుకు ఆలోచన. 
యేఈల కోణ మజబరోబర | నేఈల కోణ బాబాంచే సమోర | 
ఘాలీల మజ త్యాంచే పాయావర | కాళజీ అనివార దీక్షితా | ||౪౭|| 
47. ‘నా వెంట ఎవరు వచ్చి, నన్ను బాబా సన్నిధికి తీసుకుని వెళ్లి, వారి పాదాలపై పడవేస్తారు’ అనే చింత దీక్షితును పట్టుకుంది. 
నివడణుకీచే కామ సరతా | కైసే జావే శిరడీస ఆతా | 
లాగూన రాహిలీ దీక్షితా చింతా | వినవితీ సాదరతా మిరీకరా | ||౪౮|| 
48. ఎన్నికల పని అయిపోగానే, ఇక శిరిడీకి ఎలా వెళ్లాలనే చింత దీక్షితును పట్టుకుంది. ఆ సంగతే మిరికరుకు మనవి చేశాడు. 
కాకాసాహేబ మిరీకర | యాంచే బాళాసాహేబ హే కుమర | 
విచార కరితీ పరస్పర | దీక్షితాంబరోబర కోణ జాతో | ||౪౯|| 
49. కాకాసాహేబు మిరికరు, అతని కుమారుడు బాళాసాహేబు ఇద్దరూ తమలో దీక్షితు వెంట ఎవరు వెళ్లాలి అని ఆలోచించారు. 
దోఘాంపైకీ కోణీహీ ఎక | అసల్యాస సాంగతీ నకో ఆణీక | 
తరీ మగ జావే కోణీ నిశ్చయాత్మక | చాలలా ఆవశ్యక విచార | ||౫౦||
50. ఆ ఇద్దరిలో దీక్షితుకు తోడుగా ఎవరో ఒకరు వెళ్లితే చాలు, ఇంకెవరూ అక్కర లేదు. అందుకే, ఎవరు వెళ్లాలి అని నిశ్చయించటానికి, ఆలోచించ సాగారు. 

మనుష్యాచ్యా మానవీ కల్పనా | ఈశ్వరాచీ ఆణీక యోజనా | 
దీక్షితాంచే శిరడీచ్యా గమనా | అకల్పిత ఘటనా ప్రకటలీ | ||౫౧|| 
51. మానవుడు ఒకటి ఆలోచిస్తే, దైవం ఇంకొకటి ఆలోచిస్తుంది. దీక్షితుని శిరిడీ ప్రయాణానికి, అనుకోని ఘటన ఒకటి జరిగింది. 
ఇకడే ఏసీ తళమళ | దుసరీకడే పహా చళవళ | 
పాహూని భక్తాచీ ఇచ్ఛా ప్రబళ | సమర్థ కళవళలే కైసే | ||౫౨|| 
52. దీక్షితు ఇక్కడ తపిస్తూ ఉండగా, ఇంకొక చోట వేరొక రకమైన కదలికలు జరిగాయి. భక్తుడిలో అంతటి తీవ్రమైన కోరికను చూసి, సాయి సమర్థులు కరిగిపోయారు. 
ఎవం విచారారూఢ దీక్షిత | బైసలే అసతా తేథే సాచింత | 
మాధవరావచి14 ఆలే నగరాంత | ఆశ్చర్యచకిత జన అవఘే | ||౫౩|| 
53. దీక్షితు చింతిస్తూ, బాధతో కూర్చుని ఉండగా, అందరికీ ఆశ్చర్యం కలిగించేలా మాధవరావు అహమ్మదునగరుకు వచ్చాడు. 
మాధవరావాంస త్యాంచే శ్వశుర | నగరాహూన కరితీ తార | 
సాసూ ఆపులీ ఫార బేజార | భేటీస యా సత్వర సహకుటుంబ | ||౫౪|| 
54. మాధవరావు అత్తగారి ఆరోగ్యం బాగలేదు, వెంటనే భార్యతో సహ రమ్మని అహమ్మదునగరునుండి అతని మామ టెలిగ్రాం ఇచ్చాడు. 
తార యేతాంచ కేలీ తయారీ | మిళతాంచ బాబాంచీ అనుజ్ఞా వరీ | 
ఘేవోనియా కుటుంబ బరోబరీ | గేలీ చిథళీవరీ15 తీ దోఘే | ||౫౫|| 
55. ఆ తంతి వార్త అందగానే, తయారై బాబా అనుమతిని తీసుకుని, భార్యతో సహ మాధవరావు చిథళీకు వెళ్లాడు. 
తీన వాజాచీ గాడీ గాంఠలీ | ఉభయతా తీ నగరా గేలీ | 
గాడీ యేఊన ద్వారీ థడకలీ | ఉతరతీ ఖాలీ ఉభయతా | ||౫౬|| 
56. ఆ ఇద్దరూ మూడు గంటలకు బయలుదేరే బండిలో అహమ్మదునగరు చేరుకుని, టాంగా బండిలో ఇంటికి వచ్చి, గుమ్మం వద్ద దిగారు. 
ఇతక్యాంత నానాసాహేబ పానశే | ఆపాసాహేబ గద్రే అసే | 
పాతలే తేథే ప్రసంగవశే | ప్రదర్శన మిషే త్యా మార్గే | ||౫౭|| 
57. గుర్రాల ప్రదర్శన చూడటానికి, అదే దారిన వెళుతూ, నానాసాహేబు పానశే, ఆపాసాహేబ గద్రే ఇద్దరూ అక్కడికి వచ్చారు. 
మాధవరావ ఖాలీ ఉతరతా | దృష్టీస పడలే యాంచే అవచితా | 
వాటలీ తయా అతి విస్మయతా | ఆనంద చిత్తా న సమాయే | ||౫౮|| 
58. అనుకోకుండా, మాధవరావు టాంగా బండినుండి దిగటం చూచి, వారికి అత్యంత ఆశ్చర్యంతో, పట్టలేని ఆనందం కలిగింది. 
మ్హణతీ పహా హే యేథే సుదైవే | మాధవరావ శిరడీచే బడవే | 
యాహూన ఆతా కోణీ హో బరవే | శిరడీస న్యావే దీక్షితా? | ||౫౯|| 
59. అప్పుడు వారిరువురూ ‘భాగ్యవశాత్తు శిరిడీయొక్క ‘బడవా’ మాధవరావు ఇక్కడికి వచ్చాడు. దీక్షితుని శిరిడీ తీసుకుని వెళ్లటానికి ఇంతకంటే మంచి తోడు ఎవరుంటారు’ అని అన్నారు. 
మగ తయాతే మారూని హాంకా | మ్హణతీ ఆలే దీక్షిత కాకా | 
మిరీకరాంచే యేథే జా దేఖా | కౌతుక అవలోకా బాబాంచే | ||౬౦||
60. మాధవరావుని పిలిచి, ‘మిరికరు ఇంటికి కాకాసాహేబు దీక్షితు వచ్చాడు. నీవు అక్కడికి వెళ్లి, బాబాయొక్క అద్భుతమైన లీలను చూడు. 

దీక్షిత అముచే స్నేహీ అలౌకిక | తుమచీ త్యాంచీ హోఈల ఓళఖ | 
శిరడీస జాయా తే అత్యంత ఉత్సుక | తుమచ్యా ఆగమనే సుఖ త్యాంతే | ||౬౧|| 
61. ‘దీక్షితు మాకు అలౌకికమైన స్నేహితుడు. నీవు వెళ్లితే, మీ ఇద్దరికీ పరిచయమౌతుంది. శిరిడీ వెళ్లాలని దీక్షితు అత్యంత కుతూహలంగా ఉన్నందు వలన, నీ రాక అతనికి ఎంతో ఆనందంగా ఉంటుంది’.
దేఊని ఏసా నిరోప త్యాంనా | వృత్త హే కళవిలే దీక్షితాంనా | 
ఏకోని హరలీ త్యాంచీహీ వివంచనా | సంతోష మనా అత్యంత | ||౬౨|| 
62. అని అతనితో చెప్పి, ఈ సంగతిని దీక్షితుకు తెలియ చేశారు. అది విని దీక్షితు చింత దూరమై, అతనికి సంతోషం కలిగింది. 
శ్వశురగృహీ జాఊని పాహతీ | సాసూచీహీ ఠీక ప్రకృతి | 
మాధావరావ థోడే విసవతీ | మిరీకర ధాడితీ బోలావూ | ||౬౩|| 
63. మామగారి ఇంటికి వెళ్లి చూడగా, అత్తగారి ఆరోగ్యం బాగానే ఉంది. మాధవరావు కాసేపు విశ్రమించగా, మిరికరు వద్దనుండి పిలుపు వచ్చింది. 
బోలావణ్యాస దేఊని మాన | హోతా థోడా అస్తమాన | 
మాధవరావ గేలే నిఘూన | దీక్షితాం లాగూన భేటావయా | ||౬౪|| 
64. ఆ ఆహ్వానాన్ని అందుకుని, మాధవరావు సాయంకాలం పూట దీక్షితుని కలుసుకోవటానికి బయల్దేరి వెళ్లాడు. 
తీచ త్యాంచీ ప్రథమ భేట | బాళాసాహేబ ఘాలితీ గాంఠ | 
రాత్రీ దహాచే గాడీచా ఘాట | ఠరలా కీ స్పష్ట దోఘాంచా | ||౬౫|| 
65. అతడు దీక్షితుని చూడటం అదే మొదటి సారి. బాళాసాహేబు ఒకరిని ఒకరికి పరిచయం చేశాడు. ఇద్దరూ ఆ రాత్రి పదిగంటల బండిలో వెళ్లటానికి ప్రయాణం నిశ్చయమైంది. 
ఏసా హా బేత ఠరల్యావరీ | పుఢే పహా నవలపరీ | 
బాళాసాహేబ సారితీ దూరీ | పడదా బాబాంచే ఛబీవరీల | ||౬౬|| 
66. ఈ రకంగా నిర్ధారణ అయాక, ఆ తరువాత జరిగిన వింతను చూడండి. బాబాయొక్క ఫోటోపైనున్న తెరను బాళాసాహేబు తొలగించాడు. 
హే బాబాంచే ఛాయాచిత్ర | మేఘా బాబాంచా నిఃసీమ ఛాత్ర | 
పరమప్రేమే పూజీ పవిత్ర | శంకర హా త్రినేత్ర భావునీ | ||౬౭|| 
67. బాబా భక్తుడైన మేఘాయొక్క బాబా ఫోటో అది. బాబాను త్రినేత్రుడైన శంకరునిగా భావించి, పరమ ప్రేమతో పూజించేవాడు. 
కాంచ ఫుటలీ ఝాలే నిమిత్త | మ్హణూనియా తీ వ్హావయా దురుస్త | 
బాళాసాహేబాంసవే నగరాంత | ఆరంభీ నిఘత శిరడీహూన | ||౬౮|| 
68. ఆ పటం పైని గాజు పలక విరిగి పోయింది. దానిని బాగు చేయించటానికి శిరిడీనుండి, బాళాసాహేబు తన వెంట నగరుకు తెచ్చాడు. 
తీచ హీ తసబీర హోఊన దురుస్త | దీక్షితాంచీ జణూ వాటచి పహాత | 
మిరీకరాంచే దివాణఖాన్యాంత | హోతీ వస్త్రావృత ఠేవిలేలీ | ||౬౯|| 
69. బాగు పరచిన తరువాత, మిరికరు ఇంట్లోని హాలులో బట్టతో కప్పబడి, దీక్షితుని కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. 
అశ్వప్రదర్శన సమాప్తీస | బాళాసాహేబ పరతావయాస | 
హోతా అజూన థోడా అవకాశ | మ్హణూన మాధవరావాస సోపిలీ16 | ||౭౦||
70. గుర్రాల ప్రదర్శన అయిపోయాక, బాళాసాహేబు తిరిగి శిరిడీ వెళ్లటానికి ఇంకా సమయం ఉండటం వలన, ఆ ఫోటోను శిరిడీకి తీసుకుని వెళ్లే బాధ్యతను మాధవరావుకు అప్పచెప్పాడు. 

పడదా సారూని కేలీ అనావృత17 | మాధవరావాంస కేలీ సుప్రత18
మ్హణాలే బాబాంచియా సమాగమాంత | శిరడీపర్యంత జావే సుఖే | ||౭౧|| 
71. ఫోటోపైని తెరను తొలగించి, మాధవరావుకు ఇచ్చి, ‘బాబాతొ సుఖంగా శిరిడీకి వెళ్లండి’ అని అతనికి చెప్పాడు.
తవ తీ సర్వాంగమనోహర | ప్రథమ దృష్టీ పడతా తసబీర | 
కాకాసాహేబ ఆనందనిర్భర | ప్రణిపాత పురఃసర అవలోకితీ | ||౭౨|| 
72. అద్భుతంగా ఉన్న ఆ ఫోటోని మొదటి సారి చూడగానే, దీక్షితు నమస్కరించి, ఆనందంతో నిండిన మనసుతో, అలాగే చూస్తూ ఉండిపోయాడు. 
పాహోనియా తీ ఘటనా విచిత్ర | తైసేంచ అకల్పిత రమ్య పవిత్ర | 
సమర్థ సాఈచే ఛాయాచిత్ర | వేఘలే నేత్ర దీక్షితాంచే | ||౭౩|| 
73. అకస్మాత్తుగా ఆ విచిత్ర ఘటన ద్వారా దర్శనమిచ్చిన సాయి సమర్థుని చూచి, దీక్షితుని కళ్లు చెమర్చాయి. 
జయాంచే దర్శనీ ధరిలా హేత | తయాంచీ ప్రతిమా హీ మూర్తిమంత | 
మార్గీంచ యావీ అవలోకనాంత | ఆల్హాద అత్యంత జాహలా | ||౭౪|| 
74. ఎవరి దర్శనాన్ని కోరుకుంటున్నాడో, దారిలోనే వారి మూర్తిలా వారి పటం కనిపించటం, అతనికి చాలా సంతోషాన్ని కలిగించింది. 
తీహీ యావీ శిరడీహూనీ | కాకాసాహేబ మిరీకర భవనీ19
తేచ వేళీ దీక్షిత తే స్థానీ | యోగ హా పాహోని విచిత్ర | ||౭౫|| 
75. అంతే కాకుండా, ఆ పటం శిరిడీనుండి మిరికరు ఇంటికి రావటం, దీక్షితు కూడా అదే సమయంలో అక్కడ ఉండటం, ఇది ఒక విచిత్రమైన ఘటన. 
జైసా దీక్షిత మనీ భావార్థ | తైసా పురవావయా సాఈసమర్థ | 
వాటలే యా మిషే ఆలే తేథ | మిరీకర భక్త భవనాస | ||౭౬|| 
76. దీక్షితు మనసులోని కోరికను తీర్చాలనే మిషతో, సాయి సమర్థులు మిరికరు ఇంటికి వచ్చినట్లు అనిపించింది. 
లోణావళ్యాస నానాంచే దర్శన | తయాంసవే ఝాలేలే భాషణ | 
తేథేంచ బాబాంచే గురుత్వాకర్షణ | బీజారోపణ భేటీచే | ||౭౭|| 
77. లోణావాలలో నానాను కలిసి, మాట్లాడటంనుంచే, బాబాయొక్క ఆకర్షణ శక్తి ఆరంభించింది. వారిని కలుసుకోవాలనే కోరికకు కూడా అక్కడే అంకురార్పణ జరిగింది. 
నాతరీ హీ శిరడీచీ ఛబీ | యాచ వేళీ యేథే కా యావీ | 
ఇతుకా వేళ కా ఆవృత అసావీ | యేథేంచ కా రహావీ పాయాతళీ | ||౭౮|| 
78. లేకుంటే, శిరిడీలోని బాబా పటం అప్పుడే అక్కడికి ఎందుకు రావాలి? అంత కాలం ఎందుకు బట్టతో కప్పబడి ఉంది? 
అసో ఏసే హోతా నిశ్చిత | ఘేఊనియా తీ ఛబీ సమవేత | 
మాధవరావ ఆణి దీక్షిత | నిఘాలే ఆనందిత మానసే | ||౭౯|| 
79. అనుకున్న ప్రకారం, బాబా పటాన్ని వెంట పెట్టుకుని, మాధవరావు మరియు దీక్షితు ఆనందంగా బయలుదేరారు. 
తేచ రాత్రీ భోజనోత్తర | దోఘేహీ గేలే స్టేషనావర | 
భరోని దుసరే వర్గాచా దర | తికీటే బరోబర ఘేతలీ | ||౮౦||
80. ఆ రాత్రి భోజనాలు అయాక, ఇద్దరూ స్టేషను వెళ్లి, రెండవ తరగతి టికట్టును తీసుకున్నారు. 

దహాచా ఠోకా పడతా కర్ణీ | యేఊ లాగలా అగ్నిరథ ధ్వనీ | 
దుసరా వర్గ చికార భరూనీ | గేలా హే నయనీ అవలోకిలే | ||౮౧|| 
81. సరిగ్గా పది గంటలయే సరికి, రైలుబండి చప్పుడు వినిపించింది. రెండవ తరగతి బోగీలో జనం నిండిపోయి ఉండటం చూచారు. 
ప్రసంగ ఏసా యేఊని పడతా | దోఘాంసి లాగలీ దుర్ధర చింతా | 
వేళహీ థోడా ఉరలా ఆతా | కరావీ వ్యవస్థా కైసీ పా | ||౮౨|| 
82. అలాంటి పరిస్థితిలో ఇద్దరికీ బాగా చింత పట్టుకుంది. బండి కదలటానికి కొంచెం సమయమే ఉంది. కాని, లోపలికి పోలేరు. ఇప్పుడు ఏం చేయాలి? 
అసో ఆతా యా గర్దీచే పాయీ | పరత జావే ఆలియా ఠాయీ | 
నిశ్చయ కేలా హా దోఘాంహీ | జావే కీ శిరడీస ఉదయీక | ||౮౩|| 
83. జనం ఎక్కువ ఉండటం వలన వెనుకకు వెళ్లిపోయి, మరునాడు శిరిడీకి వెళ్లాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. 
ఇతక్యాంత గాడీచా గార్డ అవచితా | ఓళఖీచా దిసలా దీక్షితా | 
పహిల్యా వర్గాంత బసణ్యాచీ వ్యవస్థా | కేలీ నిర్ఘోరతా తయానే | ||౮౪|| 
84. ఇంతలో, అకస్మాత్తుగా దీక్షితుకు పరిచయమున్న గార్డు కూడా అదే బండిలో ఉన్నాడు. అతడు వారికి చక్కగా మొదటి తరగతిలోనే కూర్చునే ఏర్పాటు చేశాడు. 
పుఢే గాడీంత హోతా ఉపస్థిత | చాలల్యా బాబాంచ్యా గోష్టీ మనసోక్త | 
మాధవరావ కథీత కథామృత | ఆనందే ఓసండత దీక్షిత | ||౮౫|| 
85. బండిలో కూర్చున్న తరువాత, బాబాయొక్క కథామృతాన్ని మాధవరావు ప్రేమావేశంతో చెప్పుతుంటే, దీక్షితు చాలా ఆనందంతో వినసాగాడు. 
ఏసే త్యా మార్గీ సుఖ పరవడీ | వేళ గేలా అతి తాంతడీ | 
కోపరగాంవీ పాతలీ గాడీ | ఆనంద నిరవడీ ఉతరలే | ||౮౬|| 
86. ఈ విధంగా ప్రయాణం చేస్తున్న సమయం సుఖంగా, త్వరగా గడిచిపోయింది. బండి కోపర్గాం చేరగానే ఇద్దరూ ఆనందంతో బండి దిగారు. 
తేచ సమయీ స్టేశనావర | నానాసాహేబ చాందోరకర | 
పాహూని దీక్షిత ఆనందనిర్భర | భేటలే పరస్పర అకల్పిత | ||౮౭|| 
87. అక్కడ స్టేషనులో అనుకోకుండా నానాసాహేబు చాందోరకరును చూచి, దీక్షితుకు చాలా సంతోషం కలిగింది. అలా వారిద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు. 
తేహీ ఘ్యావయా బాబాంచే దర్శన | నిఘాలే హోతే శిరడీలాగూన | 
హా అనపేక్షిత యోగ పాహూన | విస్మయాపన్న తిఘేహీ | ||౮౮|| 
88. నానా కూడా బాబా దర్శనానికి శిరిడీ బయల్దేరారు. ఆశించకుండానే జరిగిన ఈ ఘటనకు ముగ్గురూ ఆశ్చర్యపోయారు. 
మగ తే తిఘే తాంగా కరూన | బోలత చాలత నిఘాలే తేథూన | 
మార్గాంత కరూన గోదావరీ స్నాన | పాతలే పావన శిరడీంత | ||౮౯|| 
89. తరువాత ఆ ముగ్గురూ టాంగా కట్టించుకుని, ముచ్చటించుకుంటూ అక్కడనుంచి బయల్దేరారు. దారిలో గోదావరిలో స్నానం చేసి, పవిత్ర శిరిడీ క్షేత్రానికి చేరుకున్నారు. 
పుఢే హోతా సాఈచే దర్శన | దీక్షితాంచే ద్రవలే మన | 
నయన ఝాలే అశ్రుపూర్ణ | స్వానంద జీవన ఓసండలే | ||౯౦||
90. ఆ తరువాత జరిగిన సాయి దర్శనంతో దీక్షితుని మనసు కరిగిపోయింది. కళ్ళు నీళ్లతో నిండాయి. ఆనందం ఉప్పొంగింది. 

“మీహీ తుఝీ పాహూని వాట | పుఢే శామ్యాస పాఠవిలా థేట | 
నగరాస తుఝీ ఘ్యావయా భేట” | వదలే మగ స్పష్ట సాఈ తయా | ||౯౧|| 
91. “నేను కూడా నీ కోసం ఎదురు చూచి, నిన్ను కలుసుకోవటానికి శామ్యాను నేరుగా నగరుకు పంపాను” అని సాయి స్పష్టంగా చెప్పారు.
రోమహర్షిత దీక్షిత శరీర | కంఠీ దాటలా బాష్పపూర | 
చిత్త జాహలే హర్షనిర్భర | ధర్మ సర్వాంగీ దరదరలా | ||౯౨|| 
92. దీక్షితుకు శరీరం పులకించింది. కన్నీరుతో కంఠం గద్గదమైంది. శరీరమంతా చెమటలు పట్టి, కంపించింది. మనసంతా సంతోషంతో నిండిపోయింది. 
దేహ సూక్ష్మ కంపాయమాన | చిత్తవృత్తి స్వానంద నిమగ్న | 
నేత్ర పావలే అర్ధోన్మీలన | ఆనందఘన దాటలా | ||౯౩|| 
93. శరీరం సన్నగా వణక సాగింది. కళ్లు సగం మూతబడి, అతి ఆనందంతో మనసు అంతర్ముఖమైంది. 
‘ఆజ మాఝీ సఫళ దృష్టీ’ | మ్హణోని చరణీ ఘాతలీ మిఠీ | 
మనా ధన్యతా వాటలీ మోఠీ | ఆనంద సృష్టీ న సమాయే | ||౯౪|| 
94. అంతులేని ఆనందంతో ‘ఈ రోజు నా దృష్టి సఫలమైంది’ అని సాయి పాదాలను కౌగలించుకున్నాడు. మనసుకు తృప్తి అనిపించింది. అతనికి ఎనలేని ఆనందం కలిగింది. 
పుఢే వర్షాంచీ వర్షే గేలీ | సాఈ చరణీ నిష్ఠా జడలీ | 
పూర్ణ సాఈచీ కృపా సంపాదిలీ | సేవేసీ వాహిలీ నిజ కాయా | ||౯౫|| 
95. తరువాత ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. సాయి పాదాలలో అతనికి నిష్ఠ కుదిరింది. సాయి అనుగ్రహాన్ని పూర్తిగా పొందాడు. తన శరీరాన్ని సాయి సేవకు అర్పించాడు. 
యథాసాంగ సేవాహీ చాంగలీ | కరణ్యాలాగీ మఠీహీ20 బాంధిలీ | 
శిరడీంత బహుసాల వస్తీహీ కేలీ | మహతీ వాఢవిలీ సాఈచీ | ||౯౬|| 
96. సాయి సేవ చక్కగా చేయటానికి శిరిడీలో ఒక ఇంటిని కట్టుకుని చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. సాయి మహిమను బాగా విస్తరింప చేశాడు. 
సారాంశ త్యాచా జో ధరితో కామ | నిశ్చయే తయాసీ కరీ నిష్కామ | 
సాఈ నిజభక్తవిశ్రామధామ | భక్తాంసీ పరమ సుఖదాయీ | ||౯౭|| 
97. సారాంశంలో చెప్పాలంటే, సాయి తమను సేవించే భక్తులను కోరికలు లేనివారుగా చేస్తారు. వారు భక్తులకు శాంతి నివాసం. భక్తులకు పరమ సుఖాన్ని ప్రసాదిస్తారు. 
చంద్రాచకోర అపరిమీత | చకోరా ఎకచి నక్షత్రనాథ21
తైసే తిజలా సుత జరీ బహుత | మాతా తీ అవఘ్యాంస ఎకచి | ||౯౮|| 
98. చంద్రుణ్ణి కోరుకునే చకోరాలు ఎన్నో. కాని, ఆ చకోరాలకు నక్షత్రనాథుడు చంద్రుడు ఒక్కడే. అలాగే, తల్లికి అనేక మంది బిడ్డలున్నా, బిడ్డలందరికీ తల్లి ఒక్కతే. 
దినకరా కుముదినీ అపార | పరీ కుముదినీంస ఎకచి దినకర | 
భక్తా తుఝియా నాహీ పార | పితా తూ గురువర ఎకలాచి | ||౯౯|| 
99. సూర్యునికి కమలాలు ఎన్నో, కాని కమలాలకు మాత్రం సూర్యుడు ఒక్కడే. గురువుకు భక్తులు లెక్కలేనంత. కాని, భక్తులకు తండ్రి అయిన గురువర్యులు సాయి ఒక్కరే. 
మేఘా ఆతుర చాతక కైక | మేఘ తేథూని చాతకా ఎక | 
తైసే త్యాచే భక్త అనేక | జననీజనక తో ఎక | ||౧౦౦||
100. మేఘం కోసం ఆతుర పడే చాతక పక్షులు అనేకం. కాని, చాతక పక్షులకు మేఘం ఒక్కటే. అలాగే బాబాకు అనేక మంది భక్తులు, కాని భక్తులకు తల్లి తండ్రి సాయి ఒక్కరే. 

శరణ జే జే సద్భావే సహజ | త్యాంచీ త్యాంచీ రక్షూని లాజ | 
ఆవడీ నిజాంగే పురవితో కాజ | పాహతసో ఆజ ప్రత్యక్ష | ||౧౦౧|| 
101. భక్తితో వారి శరణుజొచ్చిన భక్తుల గౌరవాన్ని కాపాడటం, ప్రేమతో ఆ భక్తుల పనులను సఫలం చేయటం అనేవి, ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. 
జగీ జో జో ప్రాణీ జివంత | మరణ కరణార తయాంచా అంత | 
సాఈ దీక్షితా అభయ దేత | “తుజ మీ విమానాంత నేఈన” | ||౧౦౨|| 
102. ఈ జగత్తులో, ప్రాణంతో ఉన్న జీవులందరినీ మరణం అంతం చేస్తుంది. “నేను నిన్ను విమానంలో తీసుకుని వెళ్లుతాను” అని సాయి దీక్షితుకు అభయమిచ్చారు. 
జైసా సాఈవాచాదత్త | తైసాచ ఝాలా దీక్షితా అంత | 
వాచేనే సాఈచే గుణగణ గాత | దేఖిలే మీ సాక్షాత్‍ నిజ డోళా | ||౧౦౩|| 
103. వారు చెప్పిన ప్రకారమే, దీక్షితు తన నోటితో సాయియొక్క గుణగణాలను గానం చేస్తూ ఉండగా, అతని మరణం జరిగింది. దీనిని నేను ప్రత్యక్షంగా నా కళ్లతో చూచాను. 
అగ్నిరథీ ఎక బాకావర | బసలో అసతా ఆమ్హీ పరస్పర | 
సమర్థ సాఈచ్యా వార్తాంత చూర | విమానీ జణూ భరకన ఆరూఢలే | ||౧౦౪|| 
104. రైలుబండిలో ఒక బల్ల మీద మేము కూర్చుని ఒకరికొకరు సాయి సమర్థుని గూర్చిన విషయాలలో లీనమై ఉండగా, అతడు అకస్మాత్తుగా విమానాన్ని ఎక్కినట్లు అనిపించింది. 
పహా సాధిలీ అవచిత సంధీ | మాన దేఊని మాఝియే స్కంధీ | 
పావలే అవచిత విమానసిద్ధీ | సౌఖ్య నిరవధి దీక్షిత | ||౧౦౫|| 
105. సరియైన సమయం రాగానే దానిని ఉపయోగించుకుని, దీక్షితు అకస్మాత్తుగా తన మెడను నా భుజంపై ఆన్చి, అంతులేని శాశ్వత ఆనందాన్ని పొందాడు. 
నాహీ ఆళా నాహీ పీళ | నాహీ ఘరఘర నాహీ కళ | 
బోలతా చాలతా దేఖతా సకళ | శరీర నిశ్చళ రాహిలే | ||౧౦౬|| 
106. అతని శరీరం అటూ ఇటూ పొరలలేదు, కంఠంలో గురక శబ్దం లేదు. ఏ విధమైన బాధా లేదు. అందరూ చూస్తుండగా, నడుస్తూ మాట్లాడుతూ ఉన్న అతని దేహం, కదలిక లేకుండా, జీవమూ లేకుండా అయింది. 
మానవభూమికా ఏసీ విసర్జిలీ | నిజరూపీ నిజజ్యోతి మిళవిలీ | 
విమానమార్గే స్వరూపీ స్థాపిలీ | జ్యోతీంత సమరసలీ నిజ జ్యోత | ||౧౦౭|| 
107. అలా దీక్షితు తన మానవ శరీరాన్ని వదిలి, తన ప్రాణజ్యోతిని ఆత్మలో లీనం చేశాడు. విమాన మార్గాన ఆత్మ స్వరూపంలో కలిసిపోయాడు. అతని జ్యోతి, విశ్చజ్యోతిలో కలిసిపోయింది. 
సాఈచరణీ లాగతా ధ్యాన | గళాలా పూర్ణ దేహాభిమాన | 
వృత్తి పావలీ సమాధాన | పూర్ణ కృష్ణార్పణ దేహాస | ||౧౦౮|| 
108. సాయి పాదాలను ధ్యానం చేస్తుండగా, అతని శరీర అభిమానం పూర్తిగా నశించి, మనసు పూర్తిగా శాంతించి, తన దేహాన్ని కృష్ణార్పణం చేశాడు. 
శకే అఠరాశే అఠ్ఠేచాళీస | జ్యేష్ఠ వద్య ఎకాదశీస | 
దీక్షిత పావలే బ్రహ్మపదాస | యా కర్మభూమీస త్యాగునీ | ||౧౦౯|| 
109. క్రి. శ. ౧౯౨౬వ సంవత్సరం జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున దీక్షితు ఈ కర్మభూమిని వదిలి, బ్రహ్మ పదాన్ని పొందాడు. 
మ్హణా హే త్యాంచే దేహావసాన | అథవా తయాంతే ఆలే విమాన | 
ఝాలే తే సాఈపదవిలీన | కోణాసహీ ప్రమాణ హీ గోష్ట | ||౧౧౦||
110. దీనిని అతని చావు అని అనుకున్నా, లేక అతనికి విమానం వచ్చిందని అనుకున్నా, అతడు సాయి పాదాలలో లీనమైనాడు. దీనిని ఎవరైనా అంగీకరించాల్సిందే. 

ఏశా ఉపకారా వ్హావే ఉత్తీర్ణ | ఏసే భావీ తో అభక్త పూర్ణ | 
దృశ్యదానే ఉతరాయీపణ | స్వప్నీంహీ జాణ ఘడేనా | ||౧౧౧|| 
111. ఇలాంటి ఉపకారానికి ఋణం తీర్చుకోవచ్చు అని అనుకునే వారు భక్తి విశ్వాసాలు అసలు లేనివారు. ఎందుకంటే, ప్రపంచంలో కనిపించే వస్తువులను ఇచ్చి గురువు ఋణాన్ని తీర్చుకోవటం కలలో కూడా సాధ్యం కాదు.
చింతామణీ దేఊ పహాల | నిత్య చింతా వాఢవాల | 
తేణే అచింత్యదానియా వ్హాల | ఉతరాఈ హా బాలనిర్ణయ22 | ||౧౧౨|| 
112. చింతామణిని ఇవ్వాలనుకుంటే, అది చింతను పెంచుతుంది. ఆలోచనకు అందని ఆత్మ వస్తువును చూపించే గురు ఋణాన్ని, అటువంటి వస్తువును ఇచ్చి, తీర్చుకోవాలని అనుకోవటం అవివేకం. 
బరే కల్పతరూహీ ద్యాల | గురూస జాల కరాయా న్యహాల | 
గురు నిర్వికల్పదానీ కుశల | ఉత్తీర్ణతా హోఈల కా తేణే | ||౧౧౩|| 
113. ఏ విధమైన అనుమానమూలేని ఆత్మ వస్తువును ప్రసాదించే గురువుకు, కల్పతరువును ఇచ్చి, ఋణం తీర్చుకోవడం సాధ్యమా? 
ఆతా అసో యా సర్వాపరీస | గురూస దేఊ పహాల పరీస | 
పరీస లోహాచే సువర్ణ సరస | కరీల గురు బ్రహ్మరస పాజీల | ||౧౧౪|| 
114. పోనీ, వీటన్నింటి కంటే, పరశువేదిని గురువుకు ఇవ్వాలనుకుంటే, పరశువేది ఇనుమును కేవలం బంగారంగా మాత్రం చేస్తుంది. కాని, గురువు బ్రహ్మ రసాన్ని త్రాగించుతారు. 
కామధేనూ అర్పాల గురూస | ఉత్తీర్ణ మానాల గురూపకారాస23
కామనా వాఢవాల అసమసాహస24 | నిష్కామ నిరాయాస దానీ గురూ | ||౧౧౫|| 
115. కామధేనువును ఇచ్చి గురువు ఋణాన్ని తీర్చుకోవాలంటే తీరుతుందా? అది కోరికలను ఇంకా పెంచుతుంది. ఏ కోరికలూ లేని గురువు, భక్తులకు కోరికలు లేని స్థితిని ప్రసాదిస్తారు. 
అఖిల విశ్వామాజీల సంపత్తీ | దేఊని గురూపకార ఫేడూ జే ఇచ్ఛితీ | 
అమాయిక దాత్యా జే మాయిక అర్పితీ | యేణే కా పావతీ ఉత్తీర్ణతా | ||౧౧౬|| 
116. ప్రపంచంలోని సంపత్తినంతా గురువుకు ఇచ్చి ఋణం తీర్చుకుందామంటే, అది తీరుతుందా? మాయనుంచి వేరైన పరతత్వాన్ని ప్రసాదించే గురువుకు, మాయతో కప్పబడిన ఈ ప్రపంచంలోని సంపత్తి దేనికి? 
దేహ ఓవాళూ గురూవరూన | తరీ తో కేవళ నశ్వర జాణ | 
జీవ సాండావా ఓవాళూన | తరీ తో జాణ మిథ్యా స్వయే | ||౧౧౭|| 
117. పోనీ, ఈ శరీరాన్నే గురువుకు దిగదుడుపుగా ఇద్దామనుకుంటే, శరీరం నాశమైయేదే కదా! ప్రాణాలను గురువుకు నివాళిగా అర్పించాలనుకున్నా అది కూడా మాయే. 
సద్గురు సత్య వస్తూచా దాతా | తయా మిథ్యా వస్తూ అర్పితా | 
ఉతరాయీ కాయ హోఈల దాతా | ఆహే హీ వార్తా అశక్య | ||౧౧౮|| 
118. సద్గురువు శాశ్వతమైన, నిజమైన వస్తువును ప్రసాదించే దాత. వారికి మాయతో కూడుకున్న వస్తువులను అర్పిస్తే ఋణం తీరటం అసాధ్యం. 
మ్హణోని అనన్య శ్రద్ధాపూర్ణ | ఘాలోని దండవత లోటాంగణ | 
మస్తకీ వందా సద్గురు చరణ | ఉపకారస్మరణపూర్వక | ||౧౧౯|| 
119. అందువలన, శ్రద్ధా భక్తితో సాష్టాంగ నమస్కారాలను అర్పించి, వారి ఉపకారాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ సద్గురు పాదాలకు శిరసుతో నమస్కారం చేయండి. 
అఖండ గురూపకారస్మృతి | హేంచ భూషణ శిష్యాప్రతీ | 
త్యాంతూన ఉత్తీర్ణ హోఊ జే పాహతీ | నిజ సుఖా ఆంచవతీ తే శిష్య | ||౧౨౦||
120. గురువుయొక్క ఉపకారాన్ని ఎల్లప్పుడూ తలచుకుంటూ ఉండటమే శిష్యునికి అలంకారం. అంతేగాని, వారి ఉపకారాన్నుండి ఋణముక్తులు కావాలని తలచే శిష్యులు ఆత్మయొక్క ఆనందాన్ని, సుఖాన్ని పోగొట్టుకుంటారు. 

కథా ఇతుకీ హోతా శ్రవణ | శ్రోతయాంచీ వాఢలీ తహాన | 
జిజ్ఞాసాపూర్ణ ఆతురతా పాహూన | కథా ఎక లహాన నివేదితో | ||౧౨౧|| 
121. కథను ఇంతవరకూ విన్న తరువాత, విన్నవారి కోరిక ఇంకా పెరిగింది. వారి కుతూహలాన్ని గమనించి, ఇంకా తెలుసుకోవాలనే వారి కోరికను తీర్చే ఒక చిన్న కథను మనవి చేస్తాను. 
సంతహీ అపులే బంధుప్రేమ | వ్యక్త కరితీ సంసారియాం సమ | 
అథవా దక్ష లోకసంగ్రహీ పరమ | అసతీ హే వర్మ జాణవతీ | ||౧౨౨|| 
122. సామాన్య సంసారుల వలె, సాధువులు కూడా బంధువులయెడ ప్రేమను చూపుతారు. లేక, లౌకిక వ్యవహారాలలో తాము ఎంత నేర్పుతో నడచుకుంటారో, ఆ రహస్యాన్ని తెలియ చేస్తారు. 
కింవా స్వయే సాఈచ ఆపణ | కరావయా నిజభక్త కల్యాణ | 
త్యా త్యా భూమికా నిజాంగే నటూన | పరమార్థ శిక్షణ దేతాత | ||౧౨౩|| 
123. తమ భక్తులను ఉద్ధరించడానికి, సాయియే వేరు వేరు పాత్రలను స్వయంగా నటిస్తూ, పరమార్థానికి సంబంధించిన సంగతులను బోధిస్తారు. 
యే అర్థీంచీ త్రోటక కథా | సాదర శ్రవణ కీజే శ్రోతా | 
కళేల జేణే న సాంగతా సవరతా | సంతాంచీ సంతా నిజఖూణ | ||౧౨౪|| 
124. ఈ విషయాన్ని తెలిపే ఒక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఎవరూ ఏమీ చెప్పకుండానే, సంతులు ఇతర సాధువులను ఎలా గుర్తు పడతారు అన్న సంగతి తెలుస్తుంది. 
ఎకదా శ్రీగోదాతీరీ | ప్రసిద్ధ రాజమహేంద్రీ శహరీ | 
ఆలీ శ్రీవాసుదేవానందాచీ స్వారీ | ఉపనామధారీ ‘సరస్వతీ’ | ||౧౨౫|| 
125. ఒక సారి, శ్రీ వాసుదేవానంద స్వాములవారు గోదావరీ నదీ తీరాన ఉన్న రాజమహేంద్ర పట్టణానికి విచ్చేశారు. ‘సరస్వతి’ అన్నది వారి ఉపనామం. 
మహాథోర అంతర్జ్ఞా నీ | కర్మమార్గాచే కట్టే అభిమానీ | 
అఖండ జయాచీ కీర్తి స్వర్ధునీ25 | రాహిలీ గర్జూనీ మహీతళీ | ||౧౨౬|| 
126. వారు గొప్ప అంతర్జ్ఞాని. కర్మ మార్గాన్ని నిష్ఠగా పాటించేవారు. వారి కీర్తి గంగ భూమిపై ప్రతిధ్వనిస్తూ ఉంది. 
కర్ణోపకర్ణీ వార్తా పరిసునీ | పుండలీకరావ26 ఆదికరూనీ | 
నాందేడ శహరీంచ్యా భావికజనీ | ధరిలా దర్శనీ దృఢ హేత | ||౧౨౭|| 
127. ఆ నోట ఈ నోట వారి కీర్తి గురించి చెప్పుకోగా విన్న నాందేడు పట్టణంలోని పుండలీకరావు, మొదలగు భక్తులు స్వామి దర్శనానికి వెళ్లాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. 
అసో పుఢే తీ మండళీ నిఘాలీ | రాజమహేంద్రీ నగరీ పాతలీ | 
గోదే కాఠీ ప్రాతఃకాళీ | దర్శనా ఆలీ స్వామీంచ్యా | ||౧౨౮|| 
128. వారు బయలుదేరి రాజమహేంద్ర పట్టణం చేరుకున్నారు. స్వామి దర్శనానికోసం ఉదయమే గోదావరీ తీరానికి వచ్చారు. 
సమయ హోతా సుప్రభాత | నాందేడకర మండళీ సమస్త | 
నిఘాలీ స్నానార్థ గంగేప్రత | ముఖానే గాత స్త్రోత్రపాఠ | ||౧౨౯|| 
129. ఉదయాన శుభ సమయాన, నాందేడ్కరు ఇతర భక్తులు, నోటితో స్త్రోత్రాలను చెప్పుకుంటూ గోదావరి స్నానానికి బయల్దేరారు. 
తేథేంచ స్వామీ దేఖోని స్థిత | మండళీ సద్భావే సాష్టాంగ నమిత | 
సహజ కుశల ప్రశ్న చాలత | వార్తా తో నిఘత శిరడీచీ | ||౧౩౦||
130. అక్కడే ఉన్న స్వామిని చూచి, భక్తులు వారికి భక్తిగా సాష్టాంగ నమస్కారం చేశారు. సహజంగా కుశల ప్రశ్నలూ అవీ అయ్యాక, మాటలలో శిరిడీ విషయం వచ్చింది. 

కర్ణీ పడతా సాఈనామ | స్వామీ స్వకరే కరీత ప్రణామ | 
మ్హణాలే ‘తే అముచే బంధు నిష్కామ | ఆమ్హాంసీ నిఃసీమ ప్రేమ త్యాంచే’ | ||౧౩౧|| 
131. సాయి నామం చెవులలో పడగానే స్వామి తమ చేతులను జోడించి నమస్కారం చేసి, ‘వారు మాకు సోదరులు. కోరికలు లేని వారు. వారియందు మాకు అపారమైన ప్రేమ’ అని చెప్పారు.
ఘేఊని తేథీల ఎక శ్రీఫళ | దేఊని పుండలీకరావాంజవళ | 
మ్హణాలే ‘వందూని బంధు పదకమళ | అర్పా హే శిరడీస జాల తేవ్హా | ||౧౩౨|| 
132. అక్కడే ఉన్న ఒక శ్రీఫలాన్ని (కొబ్బరి కాయ) స్వామి పుండలీకరావు చేతికిచ్చి, ‘శిరిడీకి వెళ్లినప్పుడు దీనిని మా సోదరుని పాదాలకు వందనం చేసి అర్పించు. 
‘సాంగా మాఝా నమస్కార | మ్హణా అసో ద్యా కృపా యా దీనావర | 
పడూ న ద్యావా యాచా విసర | ప్రేమ నిరంతర వాఢావే | ||౧౩౩|| 
133. ‘ఈ దీనునిపై అనుగ్రహముండాలని, వీనిని మరచి పోవద్దని, నాకు వారిపై ఎల్లప్పుడూ ప్రేమ పెరుగుతూ ఉండాలని చెప్పు. 
‘తుమ్హీ శిరడీ గ్రామాలాగూన | పునశ్చ జేవ్హా కరాల గమన | 
కరా హే మాఝే బంధూస అర్పణ | ఆదరే స్మరణపూర్వక | ||౧౩౪|| 
134. ‘వారికి నా నమస్కారమని చెప్పు. మీరు మరల శిరిడీకి వెళ్లినప్పుడు, నా సోదరునికి ఈ శ్రీఫలాన్ని నా నమస్కారాలతో అర్పించండి. 
‘ఆమ్హీ స్వామీ న కరావే వందన | అసే జరీ హే ఆమ్హా నిబంధన | 
పరీ త్యా నియమాచే కరణే ఉల్లంఘన | ప్రసంగీ కల్యాణకారక | ||౧౩౫|| 
135. ‘మేము స్వాములం. మేము ఎవరికీ నమస్కారం చెయరాదని మా నియమం. అయినా ఈ సందర్భంలో అది శుభప్రదమని ఆ నియమాన్ని అతిక్రమిస్తున్నాము. 
మ్హణూని ఘేతా సాఈదర్శన | హోఊ న ద్యా యా గోష్టీచే విస్మరణ | 
సాఈపదీ హే శ్రీఫళ అర్పణ | కరా కీ స్మరణపూర్వక’ | ||౧౩౬|| 
136. ‘అందుకని సాయి దర్శనానికి వెళ్లినప్పుడు, ఈ శ్రీఫలాన్ని సాయి పాదాలయందు మరచిపోకుండా అర్పించిండి’ అని చెప్పారు. 
ఏకోనియా తయాంచ్యా వచనా | పుండలీకరావ లాగతీ చరణా | 
మ్హణతీ ‘జైసీ స్వామీచీ అనుజ్ఞా | ఆణీన ఆచరణా తీ తైసీ | ||౧౩౭|| 
137. వారి మాటలను విని, పుండలీకరావు వారి పాదాలకు నమస్కరించి, ‘స్వామి ఆజ్ఞ ప్రకారమే నడచుకుంటాను’ అని చెప్పాడు. 
‘కరోని ఆజ్ఞా శిరసామాన్య | యేణే మీ ఆపణ మానితో ధన్య’ | 
స్వామీస శరణ జాఊని అనన్య | నిఘాలే తేథూన పుండలీకరావ | ||౧౩౮|| 
138. ‘ఎంతో శ్రద్ధతో ఆజ్ఞను పాటిస్తాను. అలా చేయడం వలన నేను చాలా ధన్యుణ్ణి అవుతాను’ అని స్వామికి శరణు వేడి, పుండలీకరావు అక్కడినుండి వెళ్లిపోయాడు. 
స్వామీ జే బాబాంస బంధూ వదత | తే కాయ హోతే అవఘే నిరర్థ | 
‘యావజ్జీవమగ్నిహోత్రం జుహుయాత్‍’ | బాబా యా శ్రుతిసంమత వర్తత | ||౧౩౯|| 
139. స్వామి సాయిని తన బంధువు అని అనటం పొరపాటా? ‘యావజ్జీవం అగ్నిహోత్రం జుహూయాత్’ అన్న శ్రుతి వచనానికి తగినట్టు సాయి నడుచుకున్నారు. 
జన జయా ‘ధునీ’ వదత | తీ బాబాంచే సన్ముఖ నిత | 
అష్టౌ ప్రహర హోతీ ప్రజ్వలిత | హే బాబాంచే వ్రత హోతే | ||౧౪౦||
140. అందరూ ‘ధుని’ అని పిలిచే అగ్ని, రాత్రీ పగలూ బాబా ఎదుట మండుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. అది బాబాయొక్క వ్రతం. 

చిత్తశుద్ధి ద్వారా ప్రమాణ | అగ్నిహోత్ర కర్మాది సాధన | 
బ్రహ్మాప్రాప్త్యర్థ కరీత ధారణ | లోకసంగ్రహ కారణ జే | ||౧౪౧|| 
141. భక్తుల బాగు కోసం, వారి మానసిక శుద్ధి కొరకు, బ్రహ్మను పొందడానికి, అగ్నిహోత్రం మొదలైన పనులను, శ్రుతలలో చెప్పబడిన ఇతర సాధనలను బాబా ఆచరించేవారు. 
శ్రీవాసుదేవానంద సరస్వతీ | తేహీ యతీ తైసేచ వ్రతీ | 
మగ తే బాబాంస బంధు మ్హణతీ | హీ కాయ ఉక్తి వైయర్థిక27 | ||౧౪౨|| 
142. శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామి కూడా సన్యాసి. వారూ అగ్నిహోత్రం మొదలైన నియమాలను పాటించేవారు. అందువలన, వారు బాబాను సోదరుడని అనటం అర్థంలేని మాట ఎలా అవుతుంది? 
పుఢే సంపలా నాహీ జో మహినా | సవే ఘేఊన చార మిత్రాంనా | 
యోగ ఆలా పుండలీకరావాంనా | నిఘాయా దర్శనా సాఈచే | ||౧౪౩|| 
143. తరువాత, నెల తిరగకుండానే, పుండలీకరావు తన నలుగురు మిత్రులను వెంటబెట్టుకుని, సాయి దర్శనానికి బయలుదేరే సమయం వచ్చింది. 
ఘేతలే సామాన ఫళఫళావళ | స్మరణపూర్వక ఘేతలా నారళ | 
సాఈదర్శనా నిఘాలే సకళ | ఆనందే అవికళ మానసే | ||౧౪౪|| 
144. వారి సామానులతో సహ పళ్ళు ఫలహారాలను, మరియు స్వామి ఇచ్చిన కొబ్బరికాయను మరచి పోకుండా తీసుకుని, అందరూ సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. 
పుఢే మనమాడాస ఉతరల్యావర | కోపరగాంవాచీ గాడీ సుటల్యావర | 
అవకాశ మ్హణూన గేలే ఓఢ్యావర | తృషాహీ ఫార లాగలీ | ||౧౪౫|| 
145. తరువాత, మన్మాడులో దిగారు. కోపర్గాం బండికి ఇంకా కొద్ది సమయం ఉంది. బాగా దప్పిక కలిగితే, ఒక కాలువ దగ్గరికి అందరూ వెళ్లారు. 
అనశేపోటీ నుసతే పాణీ | పీతా హోఈల ప్రకృతీస హానీ | 
మ్హణూన ఎక పురచుండీ ఆణీ | చివడ్యాచీ కోణీ ఫరాళా | ||౧౪౬|| 
146. పరగడుపున ఒట్టినీరు త్రాగటం ఆరోగ్యానికి మంచిది కాదని, ఫలహారానికి తెచ్చుకున్న అటుకుల చివడా పొట్లాన్ని బయటకు తీశారు. 
తోండాంత ఘాలితో చివడ్యాచీ చిముట | చివడా లాగలా అత్యంత తిఖట | 
నారళావాచూని చివడా ఫుకట | జాహలీ ఖటపట హీ వ్యర్థ | ||౧౪౭|| 
147. ఆ చివడాను కొంచెం నోటిలో వేసుకోగా, అవి చాలా కారంగా ఉన్నాయి. వారి కష్టమంతా వ్యర్థమనిపించి, కొబ్బరి లేకుండా దానిని తినలేమని తెలుసుకున్నారు. 
తేవ్హా ఎక మ్హణే త్యా సకళా | యుక్తి ఎక ఆఠవలీ మలా | 
నారళ ఫోడూన చివడ్యాంత మిసళా | పహా మగ తీ కళా చివడ్యాచీ | ||౧౪౮|| 
148. అప్పుడు, వారిలో ఒకడు ‘కొబ్బరికాయ కొట్టి చివడాలో కలిపి వాని రుచిని చూడండి’ అని ఉపాయాన్ని చెప్పాడు. 
నారళ మ్హణతా నారళ తయార | ఫోడావయాస కైచా ఉశిర | 
మిసళతా చివడా లాగలా రుచకర | ప్యాలే మగ త్యావర తే పాణీ | ||౧౪౯|| 
149. ‘కొబ్బరికాయ’ అని అనగానే అది వెంటనే సిద్ధమైంది. ఇంక పగల కొట్టటం ఎంతసేపు? కొబ్బరి ముక్కలను కలుపుకుని తింటే చివడా చాలా రుచికరంగా ఉంది. అది తిని నీరు త్రాగారు. 
నారళ మ్హణతా నారళ ఆలా | తో కోణాచా నాహీ విచారిలా | 
క్షుధేనే ఏసా కహర కేలా | విసర పాడిలా అవఘయాచా | ||౧౫౦||
150. ‘కొబ్బరికాయ’ అనగానే కొబ్బరికాయ వచ్చింది. అది ఎవరిదీ అని ఎవరూ ఆలోచించలేదు. ఆకలి బాధలో ఉన్నందు వలన ఆ సంగతి మొత్తం మరచి పోయారు. 

అసో పుఢే గేలే ఠికాణీ | కోపరగాంవచే గాడీంత బసునీ | 
మార్గీ పుండలీకరావాం లాగునీ | ఆఠవలా మనీ నారళ | ||౧౫౧|| 
151. స్టేషనుకు వెళ్లి, కోపర్గాం బండిలో కూర్చున్న తరువాత, దారిలో, పుండలీకరావుకు కొబ్బరికాయ గుర్తుకు వచ్చింది.
ఆలీ పాహునీ శిరడీ జవళ | పుండలీకరావా లాగలీ తళమళ | 
వాసుదేవానందాంచేచ శ్రీఫళ | చుకీనే చివడ్యాంత మిసళలే | ||౧౫౨|| 
152. శిరిడీ దగ్గరకు వస్తున్న కొద్దీ, పుండలీకరావులో కలవరం మొదలైంది. వాసుదేవానంద సరస్వతి స్వామి వారి శ్రీఫలం పొరపాటున చివడాలో కలిసిపోయిందని, 
కళలే జేవ్హా నారళ ఫుటలా | పుండలీకరావ భయే దాటలా | 
సర్వ అంగా కంప సుటలా | అపరాధ ఘడళా సంతాచా | ||౧౫౩|| 
153. అదే కొబ్బరికాయ పగిలిందీ అని తెలుసుకుని పుండలీకరావు చాలా భయపడ్డాడు. శరీరమంతా వణక సాగింది. సత్పురుషుని పట్ల అపరాధం జరిగింది. 
జాహలా తయా అతి సంతాప | జోడలే తరీ కేవఢే పాప | 
పడతీల మాథా స్వామీచే శాప | ఝాలే తే ప్రలాప వ్యర్థ మాఝే | ||౧౫౪|| 
154. అతనికి చాలా బాధ కలిగింది. ఎంత పాపాన్ని మూట కట్టుకున్నాను. స్వామి శాపానికి గురి అయ్యాను. అక్కడ వారి వద్ద నా మాటలన్నీ అర్థం లేనివయ్యాయి. 
శ్రీఫళాచీ ఏసీ గత | వ్హావీ పహాతా మోఠీ ఫసగత | 
పుండలీకరావాంచే చిత్త | విస్మయే తటస్థ జాహలే | ||౧౫౫|| 
155. శ్రీఫలానికి పట్టిన గతిని చూసి, పుండలీకరావు చాలా కలవర పడ్డాడు. ఆశ్చర్యంతో అతని మనసు మూగపోయింది. 
ఆతా కాయ బాబాంస దేఊ | కైసియా రీతీ త్యా సమజావూ | 
కైసే మీ తయా వదన దావూ | శ్రీఫళ గమాఊన బైసలో | ||౧౫౬|| 
156. ‘ఇప్పుడు బాబాకు నేనేమి ఇవ్వను? వారితో ఏ విధంగా చెప్పాలి? వారికి నా మొహం ఎలా చూపించను? వారికి ఇవ్వవలసిన శ్రీఫలాన్ని పోగొట్టుకున్నాను కదా? 
హోణార సాఈచరణీ సమర్పణ | ఫరాళ త్యాచా జాహలా పాహూన | 
పుండలీకరావ మనీ ఖిన్న | మ్హణాలే హా అపమాన సంతాచా | ||౧౫౭|| 
157. ‘సాయి పాదాలకు అర్పించ వలసిన శ్రీఫలం ఫలాహారమై పోయింది. సంతునికి అగౌరవం జరిగింది’ అని పుండలీకరావు తనలో తాను చాలా దుఃఖ పడ్డాడు. 
ఆతా జై బాబా మాగతీ నారళ | అధోవదన హోతీల సకళ | 
కారణ మనమాడావర త్యాచా ఫరాళ | కేలా హీ ఖళబళ సర్వాంతరీ | ||౧౫౮|| 
158. ‘ఇప్పుడు బాబా కొబ్బరికాయను అడిగితే, మన్మాడులో దానిని ఫలహారం చేశామని, ఆ కొబ్బరికాయ లేదని చెప్పలేక అందరూ సిగ్గుతో తలలు దించుకోవాలి’ అని అందరి మనసులలోనూ బాధగా ఉంది. 
నారళ నాహీ జవళ ఆజ | ఖరే సాంగావే తరీ లాజ | 
ఖోటే సాంగూన భాగే నా కాజ | సాఈమహారాజ సర్వసాక్షీ | ||౧౫౯|| 
159. ‘ఈ రోజు నా దగ్గర ఆ కొబ్బరికాయ లేదు’ అని నిజాన్ని చెప్పటానికి సిగ్గు. కాని, వారితో అబద్ధం చెప్పితే పని జరగదు. ఎందుకంటే సాయి మహారాజుకు అన్నీ తెలుసు. 
అసో సాఈచే ఘేతా దర్శన | మండళీ ఝాలీ సుఖసంపన్న | 
ఆనందాశ్రుపూర్ణ నయన | ప్రసన్నవదన తే సకళ | ||౧౬౦||
160. సాయి దర్శనంతో భక్తులు సంతోషించారు. సంతోషంతో వారి కళ్లు నీళ్లతో నిండి పోయి, వారి మనసులు చాలా ప్రసన్నమైనాయి. 

ఆతా ఆమ్హీ అహర్నిశ | పాఠవితో బినతారేచే సందేశ | 
దిమాఖ యాచా దావితో విశేష | అభిమానవశ హోఊని | ||౧౬౧|| 
161. ఇప్పటి కాలంలో, తీగెలు లేకుండానే మనం వార్తలను పంపుతుంటాము. విజ్ఞాన పరంగా ఎంతగానో పురోగమనాన్ని సాధించామని చాలా గొప్పగా గర్వపడతాము. 
యదర్థ ఉభారూ లాగతీ స్థానే | లాగే అపార పైసా ఖర్చణే | 
తేథే హీ సంతాంస న లగతీ సాధనే | పాఠవితీ మనేంచ సందేశ | ||౧౬౨|| 
162. దాని కోసం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టి అక్కడక్కడా స్టేషన్లను నిర్మించాలి. కాని, సాధు సంతులు ఏ సాధనలూ లేకుండా, మనసుతోనే వార్తలను పంపుతారు. 
స్వామీనీ పుండలీకరావాంస | నారళ దిధలా తే సమయాస | 
పాఠవిలా హోతా సాఈనాథాంస | పుర్వీచ హా సందేశ బినతారీ | ||౧౬౩|| 
163. పుండలీకరావుకు కొబ్బరికాయను ఇచ్చిన వెంటనే, ఏ తంతులూ లేకుండానే, ఈ సంగతిని స్వామి సాయినాథునికి పంపించారు. 
పుండలీకరావ ఘేతా దర్శన | సాఈబాబా ఆపణ హోఊన | 
మ్హణాలే “మాఝీ వస్తు ఆణ | బంధూచ్యా జవళూన ఆలేలీ” | ||౧౬౪|| 
164. పుండలీకరావు దర్శనం చేసుకుంటున్నప్పుడు, సాయిబాబా తమంతట తామే “మా సోదరుని వద్దనుండి తెచ్చిన నా వస్తువును ఇవ్వు” అని అడిగారు. 
మగ తో ఖిన్న పుండలీకరాయ | ధరూనియా శ్రీబాబాంచే పాయ | 
మ్హణే క్షమేవీణ దుసరా ఉపాయ | నాహీ మజ కాయ సాంగూ మీ | ||౧౬౫|| 
165. శ్రీబాబా పాదాలను పట్టుకొని, విపరీతమైన వ్యథతో, పుండలీకరావు, ‘నేనేమని చెప్పను! మిమ్మల్ని క్షమించమని ప్రార్థించడం తప్ప నాకు వేరే దారి లేదు. 
నారళాచీ మజ ఆఠవ హోతీ | పరీ భుకేచీ కరావయా తృప్తి | 
ఆమ్హీ జంవ గేలో ఓఢియావరతీ | జాహలీ విస్మృతి సకళాంస | ||౧౬౬|| 
166. ‘కొబ్బరికాయను నేను గుర్తు పెట్టుకుని మరీ తెచ్చాను. కాని, ఆకలిని తీర్చుకోవటానికి, కాలువ దగ్గరకు వెళ్లినప్పుడు, దాని గురించి అందరం మరచి పోయాం. 
తేథే చివడ్యాచా కరితా ఫరాళ | ఫోడూని మిసళలా హాచ కీ నారళ | 
మ్హణూని ఆణితో దుసరే శ్రీఫళ | స్వీకారా నిశ్చళ మానసే | ||౧౬౭|| 
167. ‘చిడవా తింటున్నప్పుడు, అదే కొబ్బరికాయను పగలగొట్టి, దానితో కలిపి అందరమూ ఫలహారం చేశాము. అయినా, మీకు మరొక కాయను తెచ్చి ఇస్తాను, ఏ కోపమూ లేకుండా దయతో స్వీకరించండి’. 
ఏసే మ్హణూని ఉఠూ లాగతా | పుండలీకరావ ఫళాకరితా | 
సాఈమహారాజ ధరోని హస్తా | తయా నివారితా దేఖిలే | ||౧౬౮|| 
168. అలా అని అతను లేవబోతుండగా, సాయి మహారాజు అతని చేతిని పట్టుకుని వద్దని వారించారు. 
నేణతా ఘడలా విశ్వాసఘాత | కృపాళూ ఆపణ ఘ్యా పదరాంత | 
క్షమస్వ వ్హా మజ కృపావంత | అసే మీ నితాంత అపరాధీ | ||౧౬౯|| 
169. ‘తెలియకుండానే, నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. కాని, దయామయులైన మీరు నన్ను మీ అక్కున చేర్చుకొండి. నన్ను క్షమించండి. నామీద దయచూపండి, ఎందుకంటే నేను మీకు మహా అపరాధం చేశాను. 
స్వామీసారిఖా సాధూ సజ్జన | అవగణూనీ తయాంచే వచన | 
కరావే జే ఆపణా అర్పణ | తే మ్యా భక్షణ ఫళ కేలే | ||౧౭౦||
170. ‘స్వామిలాంటి సాధువు, సజ్జనుడి మాట పాటించకుండా, మీకు అర్పించ వలసిన శ్రీఫలాన్ని నేను తిన్నాను. 

హా తో సంతాంచా అతిక్రమ | కేవఢా మీ అపరాధీ పరమ | 
ఆహే కాయ యా పాపా ఉపరమ | కైసా మీ బేశరమ జాహలో | ||౧౭౧|| 
171. ‘ఇది సాధువుల, సంతుల నియమాలని అతిక్రమించడం. నేను ఎంతటి మహా అపరాధిని? నా ఈ పాపానికి అసలు ప్రాయశ్చిత్తం అంటూ ఉందా? ఓ, నేను ఎంతటి సిగ్గుమాలిన వాణ్ణయ్యాను?
తవ హీ ఏకతా ఝాలేలీ మాత | హాంసూని బోలలే శ్రీసాఈనాథ | 
“ఘ్యావా కశాస నారళ హాతాంత | ఠేవణే వ్యవస్థిత జరీ నవ్హతే | ||౧౭౨|| 
172. జరిగినదంతా విని, నవ్వుతూ బాబా, “బాధ్యతగా దగ్గర ఉంచుకోలేని వాడివి, అసలు ఆ కొబ్బరికాయను ఎందుకు తీసుకున్నావు? 
“తుమ్హీ మాఝీ వస్తు మజప్రత | ద్యాల ఏసే జాణూని నిశ్చిత | 
మాఝ్యా బంధూనే తుమచియా బోలాంత | విశ్వాస అత్యంత ఠేవలా | ||౧౭౩|| 
173. “నా వస్తువును నాకు నువ్వు తెచ్చి ఇస్తావని, నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసాన్ని ఉంచాడు. 
“త్యాచా కా వ్హావా హా పరిణామ | హేచ కా తుమ్హీ విశ్వాసధామ | 
పురలా న మాఝ్యా బంధూచా కామ | ఏసేచ కా కామ హే తుమచే” | ||౧౭౪|| 
174. “దాని పరిణామం ఇదేనా? ఇదేనా నీవు నమ్మకాన్ని నిలబెట్టుకునే పద్ధతి? నా సోదరుని కోరిక తీరలేదు, నీవు పని చేసే తీరు ఇదేనా? 
మ్హణాలే “త్యా ఫళాచీ యోగ్యతా | యేఈన ఇతర కితీహీ దేతా | 
ఘడావయాచే ఘడలే ఆతా | వ్యర్థ దుఃశ్చిత్తతా కిమర్థ | ||౧౭౫|| 
175. “ఆ శ్రీఫలానికి బదులుగా, నువ్వు వేరే ఎన్ని కొబ్బరికాయలను తెచ్చి ఇచ్చినా, అవి దానికి సమానం కావు. జరగవలసిందేదో జరిగింది. ఇప్పుడు అనవసరంగా ఎందుకు దుఃఖిస్తున్నావు? 
“స్వామీనీ తుజ దిధలా నారళ | తోహీ మాఝాచ సంకల్ప కేవళ | 
మాఝ్యాచ సంకల్పే ఫుటలే తే ఫళ | అభిమాన నిర్ఫళ కా ధరిసీ | ||౧౭౬|| 
176. “నా ఇష్టం ప్రకారమే స్వామి నీకు కొబ్బరికాయను ఇచ్చాడు. నా కోరిక ప్రకారమే, ఆ కాయ పగిలింది. అనవసరంగా, ఆ పని చేసిన బాధ్యతను నీపైన ఎందుకు వేసుకుంటావు? 
“అహంకారాచీ ధరిసీ బుద్ధీ | తేణే అపణా మానిసీ అపరాధీ | 
ఎవఢే నిరహంకర్తృత్వ సాధీ | అవఘీ ఉపాధీ చుకేల | ||౧౭౭|| 
177. “నీకున్న అహంకార బుద్ధితో, నేను అపరాధిని అని అనుకుంటున్నావు. చేసేవాడిని నేను కాను అన్న అహంకారం లేని భావాన్ని అలవరచుకుంటే, ఏ బాధా ఉండదు. 
“పుణ్యాచాచి కాయ అభిమాన | పాపాచా కా నాహీ అభిమాన | 
ప్రతాప దోహీంచా సమసమాన | మ్హణూని నిరభిమాన వర్తే తూ | ||౧౭౮|| 
178. “పుణ్య కార్యాలు మాత్రం తాము చేశామని జనులు అనుకున్నప్పుడు, పాప కర్మలను కూడా తామే చేశామని ఎందుకు అనుకోరు? రెండు కర్మల ప్రభావమూ ఒక్కటే. అందువలన, అహంకారం లేకుండా నడచుకో. 
“తులా మాఝీ ఘడావీ భేటీ | ఏసే జే ఆలే మాఝియా పోటీ | 
తేవ్హాంచ నారళ తుఝియా కరసంపుటీ | పడలా హీ గోష్టీ త్రిసత్య | ||౧౭౯|| 
179. “నీవు నన్ను కలుసుకోవాలన్న నా ఇష్టం వలననే ఆ కొబ్బరికాయ నీ దోసిలిలో పడింది. ఈ మాట ముమ్మాటికి నిజం. 
“తుమ్హీ తరీ మాఝీచ ములే | ఫళ జే తుమ్హా ముఖీ లాగలే | 
తేంచ తుమ్హీ మజ అర్పణ కేలే | సమజా మజ పావలే నిశ్చిత” | ||౧౮౦||
180. “మీరు నా బిడ్డలు. ఆ కాయ మీ నోట్లో పడినప్పుడే దానిని మీరు నాకు అర్పించారు. నిశ్చయంగా అది నాకు అందినట్లే అని తెలుసుకో”. 

ఏసీ జేవ్హా ఝాలీ సమజూత | తేవ్హాంచ పుండలీకరావాచే చిత్త | 
సాఈముఖీచ్యా వచనే విరమత | ఉద్విగ్నతా వితళత హళూ హళూ | ||౧౮౧|| 
181. ఈ రకంగా బాబా తమ మాటలతో సమాధాన పరచగా, పుండలీకరావు బాధ మెల్లమెల్లగా తగ్గి, అతని మనసు కుదుట పడింది. 
నారళ గేలా ఝాలే నిమిత్త | ఉపదేశే నివళే ఉద్విగ్న చిత్త | 
ఎవం తే సర్వ అహంకార విలసిత | అభిమాన నిర్ముక్త నిర్దోష | ||౧౮౨|| 
182. కొబ్బరికాయ పోవటమనేది ఒక నెపం మాత్రమే. దాంతొ బాబా చేసిన ఉపదేశంతో, అతని మనసులోని బాధ పోయింది. అహంభావంతో సతమతమౌతున్న వారి అహంకారం తొలగిపోయి, వారు తాము దోషులనే భావననుండి ముక్తులయ్యారు. 
యేవడేంచ యా కథేచే సార | వృత్తీ జో జో నిరహంకార | 
తో తో పరమార్థీ లాహే అధికార | సహజ భవపార హోఈల | ||౧౮౩|| 
183. ఈ కథయొక్క సారం ఇదే. మనసులో అహంకారం తగ్గుతున్న కొద్దీ, పరమార్థంలో ప్రగతిని సంపాదించి, సంసార సాగరాన్ని దాటడం సులువుగా ఉంటుంది. 
ఆతా తిసర్యా భక్తాచా అభినవ | శ్రవణ కరా గోడ అనుభవ | 
దిసలే బాబాంచే అతుల వైభవ | సామర్థ్య గౌరవ ఎకసరే | ||౧౮౪|| 
184. ఇప్పుడు అపూర్వము, మధురము అయిన మూడవ భక్తుని అనుభవాన్ని వింటే బాబాయొక్క అసమాన వైభవం, వారి సామార్థ్యం తెలుస్తుంది. 
వాంద్రే నామ తాలుక్యామాఝారీ | ఉత్తరేస వాంద్రే శహరాశేజారీ | 
శాంతాక్రూస నామక నగరీ | వసత ధురంధర హరిభక్త | ||౧౮౫|| 
185. బాంద్రా తాలూకాలో, బాంద్రా పట్టణానికి ఉత్తర దిశగా, శాంతాక్రూజ్ అనే పట్టణంలో హరిభక్తులైన ధురంధర కుటుంబం ఉండేది. 
సకల బంధు సంతప్రేమీ | నిష్ఠా జయాంచీ దృఢతర రామీ | 
అనన్య శ్రద్ధా రామనామీ | నావడే రికామీ ఉఠాఠేవ | ||౧౮౬|| 
186. ఆ సోదరులందరికి సాధువులంటే చాలా భక్తి. వారికి శ్రీరామునియందు దృఢమైన భక్తి విశ్వాసాలు. రామనామమంటే, వారికి విపరీతమైన శ్రధ్ధ. ఇతరుల విషయాలలో జోక్యం కలగించుకోవటం వారికి ఇష్టముండేది కాదు. 
సాధీ తయాంచీ సంసారసరణీ | తైసీ ములాబాళాంచీ రాహణీ | 
స్త్రీవర్గహీ నిర్దోష ఆచరణీ | ఋణీ చక్రపాణీ తేణే తయా | ||౧౮౭|| 
187. వారి జీవనం అందరిలాగే సాధారణంగా ఉండేది. వారి పిల్లలు మంచి నడత కలిగి ఉండేవారు. వారి స్త్రీలు కూడా మంచి ఆదరణ కలిగి ఉండేవారు. అందుకు చక్రపాణి(విష్ణు) ఋణపడి ఉన్నాడు. 
బాళారామ త్యాంతీల ఎక | విఠ్ఠలభక్త పుణ్యశ్లోక | 
రాజదరబారీ జ్యాంచా లౌకిక | ఆవడతా దేఖ సర్వత్రా | ||౧౮౮|| 
188. ఆ సోదరులలో బాళారాం ఒకరు. అతడు విఠల భక్తుడు. పుణ్యకార్యాలు చేయటంలో ప్రసిద్ధుడు. అందరికీ ప్రీతిపాత్రుడు. రాజదర్బారులో అతనికి మంచి పేరు ఉంది. 
తారీఖ ఎకోణీస ఫెబ్రువారీ | సన అఠరాశే అఠ్యాహత్తరీ | 
ఎకా రామభక్తాచి యే ఉదరీ | ఉపజలే మహీవరీ హే రత్న | ||౧౮౯|| 
189. క్రి. శ. ౧౮౭౮వ సంవత్సరంలో ఫెబ్రువరి ౧౯వ తారీఖున, రాముని ఒక భక్తుని ఇంట ఈ రత్నం భూమి మీద వచ్చింది. 
అలంకార పాఠారే ప్రభు జ్ఞాతీంత | ప్రసిద్ధ ఘరందాజ ఘరాణ్యాంత | 
సన అఠరాశే అఠ్యాహత్తరాంత | ఆలే హే ముంబఈత జన్మాస | ||౧౯౦||
190. పాఠారే ప్రభు జాతికి చెందిన ఈ భూషణం, ముంబయిలో ఒక ప్రసిద్ధ గౌరవనీయమైన కుటుంబంలో పుట్టాడు. 

పాశ్చాత్య విద్యా పారంగత | ఆడ్వ్హోదకేట పదవీ భూషిత | 
తత్వజ్ఞానా మాజీ నిష్ణాంత | విద్వాన విఖ్యాత సర్వత్ర | ||౧౯౧|| 
191. పాశ్చాత్య విద్యలో ఇతడు ప్రవీణుడు. వృత్తి రీత్యా ఇతను న్యాయవాది. తత్త్వ జ్ఞానంలో పారంగతుడు. విద్వాంసుడని అంతటా ప్రసిద్ధి చెందినవాడు.
పాండురంగీ అతిప్రేమ | పరమార్థాచీ ఆవడ పరమ | 
పితయాచే ఆరాధ్యదైవత రామ | పుత్రాచే నిజధామ విఠ్ఠల | ||౧౯౨|| 
192. పాండురంగడంటే ఇతనికి అత్యంత ప్రేమ. పరమార్థంలో చాలా శ్రద్ధ. ఇతని తండ్రియొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు. కొడుకుకేమో విఠలునిపై భక్తి. 
అవఘే బంధూ పదవీధర | వృత్తీ సదైవ ధర్మపర | 
శుద్ధ బీజాచే శుద్ధ సంస్కార | బాళారామావర అపూర్వ | ||౧౯౩|| 
193. సోదరులందరూ డిగ్రీలున్నవారు. వారి వ్యవహారం ఎప్పుడూ ధర్మంగానే ఉండేది. అయినప్పటికీ, బాళారాం వారసత్వంగా అపూర్వమైన మంచి సంస్కారాన్ని పొందాడు. 
కోటిక్రమాచీ మోహక మాండణీ | సరళ శుద్ధ విచారసరణీ | 
కుశాగ్ర బుద్ధీ సదాచరణీ | గుణ హే అనుకరణీయ తయాంచే | ||౧౯౪|| 
194. ఆకట్టుకునే విధంగా విషయాన్ని చెప్పే విధానం, నిర్మలంగా, నేరంగా ఉండే విచార సరళి, కుశాగ్ర బుద్ధి, మంచి నడక, ఈ గుణాలు అనుకరణీయాలు. 
సమాజసేవా కేలీ నితాంత | స్వయే లిహిలా సమాజ వృత్తాంత | 
సంపతా హే వ్రత అంగీకృత | నిఘాలే పరమార్థ సాధాయా | ||౧౯౫|| 
195. చాలా సమాజ సేవ చేశాడు. తమ సమాజాన్ని గురించి స్వయంగా పుస్తకం వ్రాశాడు. తను తీసుకున్న బాధ్యతలన్నీ ముగిసిన తరువాత, పరమార్థాన్ని సంపాదించాలని బయలుదేరాడు. 
త్యాంతహీ ఆక్రమునీ బరాచ ప్రాంత | భగవద్గీతా జ్ఞానేశ్వరీ గ్రంథ | 
వాచూని సంపాదిలే ప్రావీణ్య త్యాంత | అధ్యాత్మ విషయాంత నావాజలే | ||౧౯౬|| 
196. అందులో కూడా మంచి ప్రగతిని సాధించాడు. భగవద్గీత, జ్ఞానేశ్వరి గ్రంథాలను పఠించి, వానిలో ప్రావిణ్యాన్ని సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాలలో దిట్ట అని పేరు పొందాడు. 
తే సాఈచే పరమ భక్త | సన ఎకోణీసశే పంచవీసాంత | 
బ్రహ్మీభూత అల్పవయాంత | అల్ప తచ్చరిత పరిసావే | ||౧౯౭|| 
197. ఇతడు సాయియొక్క పరమ భక్తుడు. అతి చిన్న వయసులోనే, క్రి. శ. ౧౯౨౫వ సంవత్సరంలో, ఈ సాయి భక్తుడు బ్రహ్మను చేరుకున్నాడు. అతని గురించిన చిన్న కథను వినండి. 
తారీఖ నఊ మాహే జూన | ఎకోణీసశే పంచవీస సన | 
ఇహలోకీ యాత్రా సంపవూన | విఠ్ఠలీ విలీన హే ఝాలే | ||౧౯౮|| 
198. జూన్ నెల ౯వ తారీఖున, క్రి. శ. ౧౯౨౫వ సంవత్సరంలో, ఇతడు ఈ లోక యాత్రను ముగించి విఠలునిలో కలిసిపోయాడు. 
ఎప్రీల ఎకోణీసశే బారా | సాలీ పాహూని దిన ఎక బరా | 
సంతదర్శనా సాఈ దరబారా | బంధు ధురంధరా యోగ ఆలా | ||౧౯౯|| 
199. క్రి. శ. ౧౯౧౨వ సంవత్సరంలో, ఏప్రిలు నెలలో, ఒక మంచి రోజున ధురంధర్ సోదరునికి సాయి సత్పురుషుని దర్బారుకు వెళ్లే అవకాశం వచ్చింది. 
శిరిడీస బాబులజీ జ్యేష్ఠ సహోదర | ఘేఊని వామనరావ బరోబర | 
దర్శన ఘేఊన సహా మహిన్యా అగోదర | ఆనందానే పరతలే | ||౨౦౦||
200. దీనికంటే ఆరు నెలల ముందు అందరిలోకి పెద్దవాడైన బాబుల్జీ శిరిడీ వెళ్లి వామనరావు వెంట సాయి దర్శనం చేసుకుని సంతోషంగా తిరిగి వచ్చాడు. 

తయాంచా తో గోడ అనుభవ | అనుభవాయా ఇతర సర్వ | 
దర్శనలాభ జోడాయా అభినవ | బాళారామాది తవ గేలే | ||౨౦౧|| 
201. అతడు పొందిన మధురమైన అనుభవాన్ని, మరియు సాయియొక్క అపూర్వమైన దర్శన లాభాన్ని తాము కూడా పొందాలని బాళారాం మొదలగు వారు శిరిడీ వెళ్లారు. 
హే యేణ్యాచే ఆధీంచ దేఖ | “ఆజ మాఝే దరబారచే లోక | 
యేణార ఆహేత యేథే అనేక” | బాబా అవఘ్యా దేఖత బోలలే | ||౨౦౨|| 
202. వీరు శిరిడీకి రాకముందే, “ఇవాళ ఇక్కడికి నా దర్బారు జనులు అనేకులు వస్తున్నారు” అని బాబా అందరి వైపు చూస్తూ అన్నారు. 
పరిసూన ఏసీ ప్రేమాచీ వార్తా | ధురంధర బంధూస అతి విస్మయతా | 
శిరడీస యేణ్యాచే కోణా న కళవితా | బాబాంస హీ వార్తా కళలీ కైసీ | ||౨౦౩|| 
203. ప్రేమతో నిండిన ఆ మాటలను ఎవరో తమకు చెప్పగా విని, తాము శిరిడీ వస్తున్నట్లు ఎవరికీ కబురు చేయలేదే, మరి ఈ సంగతి బాబాకు ఎలా తెలిసింది అని ధురంధరు సోదరునికి చాలా ఆశ్చర్యం కలిగింది. 
పుఢే సాఈ పాహోని దృష్టీ | ధావోని చరణీ ఘాతలీ మిఠీ | 
హళూ హళూ చాలల్యా గోష్టీ | సుఖసంతుష్టీ సర్వత్రా | ||౨౦౪|| 
204. తరువాత, కళ్ల ఎదుట సాయిని చూడగానే, పరుగున పోయి, వారి పాదాలను కౌగలించుకున్నాడు. మెల్లమెల్లగా కబుర్లు చెప్పుకుంటుంటే, అందరికీ ఆనందం కలిగింది. 
శివాయ పాహూని మండళీ ఆలీ | నిఘాలీ బాబాంచీ వచనావలీ | 
“పహా హీ దరబారచీ మాణసే ఆలీ | యేణార మ్యా మ్హటలీ హోతీ తీ” | ||౨౦౫|| 
205. ధురంధర సోదరులు రావటం చూచి, బాబా, “నా దర్బారు మనుషులు వస్తారని చెప్పాను కదూ, వీరే వారు” అని చెప్పారు. 
ఆణీక పుఢే భాషా బాబాంచీ | శబ్దే శబ్ద ఏకా తీ సాచీ | 
“తుమచీ ఆమచీ సాఠ పిఢ్యాంచీ | ఓళఖ పూర్వీచీ ఆహే బరే” | ||౨౦౬|| 
206. తరువాత, బాబా చెప్పిన మాటలలో ఒక్కో పదాన్ని వినండి. “నీకు నాకు మునుపటినుండీ పరిచయం. మనది అరవై తరాల సంబంధం” అని బాబా అన్నారు. 
బాళారామాది బంధుజన | సకళహీ తే వినయసంపన్న | 
ఉభే సన్మూఖ కర జోడూన | రాహిలే శ్రీచరణ లక్షీత | ||౨౦౭|| 
207. బాళారాం మొదలగు ధురంధరు సోదరులందరూ వినయంగా చేతులు జోడించుకుని, బాబా పాదాలనే చూస్తూ, వారి ఎదుట నిలుచున్నారు. 
శ్రీసాఈచే దర్శన హోతా | బాళరామాది సర్వాంచే చిత్తా | 
సోల్లాస అనివార ప్రేమావస్థా | ఆల్యాచీ సార్థకతా వాటలీ | ||౨౦౮|| 
208. శ్రీసాయి దర్శనంతో, వారందరి మనసులు ప్రేమతో ఉత్సాహంతో నిండిపోయాయి. వారి కళ్లు ఆనందంతో నిండిపోయాయి. వారికి జన్మ సార్థకమనిపించింది. 
అశ్రుపూర్ణ ఝాలే నయన | కంఠ రోధిలా బాష్పే కరూన | 
రోమాంచ ఉఠలే సర్వాంగావరూన | ఆలే దాటూన అష్టభావ | ||౨౦౯|| 
209. కళ్లు నీళ్లతో నిండింది. గొంతు గద్గదమయింది. శరీరమంతా రోమంచితమయింది. ఎనిమిది భావాలు ఉప్పొంగాయి. 
పాహోని బాళారామాచీ అవస్థా | ఉల్లాస28 సాఈనాథాచే చిత్తా | 
బోలూ లాగలే తయా సమస్తా | ఉపదేశవార్తా ప్రేమాచ్యా | ||౨౧౦||
210. బాళారాం పరిస్థితిని చూసి, సాయినాథునికి సంతోషం కలిగింది. ఎంతో ప్రేమతో వారందరికీ ఉపదేశంతో నిండిన మాటలను చెప్పారు. 

“శుక్లపక్షాచియా చడత్యా కలా | తేణే పరీ భజే జో మజలా | 
ధన్య జేణే మనోధర్మ అపులా | నిఃశేష వికలా మదర్థ | ||౨౧౧|| 
211. “శుక్ల పక్షంలోని చంద్రుని కళలు రోజు రోజుకు ఎలా పెరుగుతాయో అలా నన్ను రోజు రోజుకూ అధికంగా ఆరాధించేవారు, మరియు వారి మనసును, కామ క్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు.
“దృఢ విశ్వాస ధరోని మనీ | ప్రవర్తే జో నిజగురు భజనీ | 
తయాచా ఈశ్వర సర్వస్వే ఋణీ | పాహీ న కోణీ వక్ర తయా | ||౨౧౨|| 
212. “దృఢమైన విశ్వాసంతో తమ గురువులను ఆరాధించే వారికి పరమేశ్వరుడు ఋణపడి ఉంటాడు. అట్టి వారిని ఎవరూ చెడు బుద్ధితో చూడరు. 
“వాయా న దవడితా అర్ధఘడీ | జయాసీ హరిగురు భజనీ ఆవడీ | 
తయా తే దేతీల సుఖ నిర్వడీ | భవ పైలథడీ ఉతరతీల” | ||౨౧౩|| 
213. “అర ఘడియ అయినా వ్యర్థం చేయక, హరియొక్క, గురువుయొక్క భజనలో శ్రద్ధ కలిగి ఉన్న వారికి, గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి సంసార సాగరాన్ని దాటిస్తారు”. 
పరిసోనియా ఏసే వచన | సర్వా నేత్రీ ఆనందజీవన | 
చిత్త ఝాలే సుప్రసన్న | అంతఃకరణ సద్గదిత | ||౨౧౪|| 
214. ఇలాంటి బాబాయొక్క మాటలను విని, ఆనందంతో అందరి కళ్లల్లో నీళ్లు నిండాయి. మనసులు ప్రసన్నమయ్యాయి. అంతఃకరణం గద్గదమైంది. 
సాఈ వాక్య సుమనమాళా | అవఘీ వందోని ఘాతలీ గళా | 
తేణే ఆనంద ఝాలా సకళా | కారణ ఉమాళా భక్తీచా | ||౨౧౫|| 
215. అందరూ నమస్కారం చేసి, సాయి మాటలనే పూలమాలను తమ మెడలో వేసుకున్నారు. దానితో భక్తి ఉప్పొంగి ఆనందం కలిగింది. 
అసో హే పుఢే వాడ్యాంత ఆలే | భోజనోత్తర థోడే విసావలే | 
తిసరే ప్రహరీ పునశ్చ గేలే | లోటాంగణీ ఆలే బాబాంస | ||౨౧౬|| 
216. తరువాత, అందరూ వాడాకు వెళ్లి, భోజనం చేసి, కాసేపు విశ్రమించి, మరల సాయంత్రం, నాలుగు నాలుగున్నర గంటల సమయంలో, బాబా వద్దకు వెళ్లి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. 
బాళారామ వినయసంపన్న | కరూ లాగలే పాదసంవాహన | 
బాబాంనీ చిలీమ పుఢే కరూన | ఓఢావయాస ఖూణ కేలీ | ||౨౧౭|| 
217. బాళారాం వినయశాలి. బాబా పాదాలను వత్తసాగాడు. చిలుం గొట్టాన్ని అతని ముందుకు జరిపి, దానిని పీల్చమని బాబా సైగ చేశారు. 
మగ తీ చిలీమ ప్రసాద మ్హణూన | సంవయీ నసతా కష్టే ఓఢూన | 
పున్హా బాబాంచే హాతీ దేఊన | కేలే అభివందన సద్భావే | ||౨౧౮|| 
218. అలవాటు లేక పోయినా, అది బాబా ప్రసాదమని అతడు కష్టంగా పీల్చి, దానిని మరల బాబా చేతికిచ్చి, భక్తిగా వారికి నమస్కారం చేశాడు. 
బాళారామాస భాగ్యాచా దిన | లాభలా పహా తై పాసూన | 
త్యాంచీ దమ్యాచీ వ్యథా జాఊన | పూర్ణ సమాధాన జాహలే | ||౨౧౯|| 
219. బాళారాం భాగ్యంకొద్దీ, అప్పటినుండి అతని ఉబ్బసపు జబ్బు పూర్తిగా నయమయింది. 
దమా న ఎకా దో దివసాంచా | వికార పూర్ణ సహా వర్షాంచా | 
కానాంత మంత్ర సాంగావా జైసా | ప్రభావ చిలమీచా తో తైసా | ||౨౨౦||
220. ఆ ఉబ్బసపు జబ్బు అతనికి ఒకటి రెండు రోజులది కాదు. పూర్తిగా ఆరు సంవత్సరాల నాటిది. చెవిలో మంత్రం ఊదినట్లుగా అనిపించినంత సులువుగా చిలుం తన ప్రభావం చూపింది. 

ఝురకా ఎక చిలమీచా మారునీ | పరత కేలీ సవినయ నమునీ | 
దమా జో గేలా తైం పాసునీ | ఉఠలా న పరతోనీ కేవ్హాంహీ | ||౨౨౧|| 
221. ఒక్క సారి చిలుమును పీల్చి, సవినయంగా నమస్కరించి, తిరిగి ఇచ్చేశాడు. అప్పటినుండి అతని ఉబ్బసపు జబ్బు మాయమై పొయింది. మరల ఎప్పుడూ రాలేదు. 
మాత్ర మధ్యే ఎకే దివశీ | బాళారామాస ఉఠలీ ఖాసీ29
పరమ విస్మయ తో సర్వాంసీ | కళేనా కోణాసీ కారణ తే | ||౨౨౨|| 
222. కాని, మధ్యలో ఒక్క రోజు మాత్రం బాళారాంకు దగ్గు వచ్చింది. అందరికీ అది చాలా ఆశ్చర్యం కలిగించింది. కారణం ఎవరికీ అర్థం కాలేదు. 
మాగూన యాచీ కరితా చౌకశీ | బాబాంనీ నిజదేహ త్యాచ దివశీ | 
ఠేవిలా హే కళలే సర్వాంసీ | ఖూణ హీ భక్తాసీ దాఖవిలీ | ||౨౨౩|| 
223. తరువాత విషయాన్ని కనుక్కోగ, ఆ రోజే బాబా తమ శరీరాన్ని వదిలి పెట్టారని తెలిసింది. ఆ భక్తునికి, బాబా అలా సూచించారు. 
బాళారామాస ఠసకా జే దివశీ | తేచ దిశీ బాబా దేహాసీ | 
ఝాలే సమర్పితే అవనీశీ | ఖూణ హీ తయాంసీ దిధలీ కీ | ||౨౨౪|| 
224. బాళారాంకు దగ్గు వచ్చిన రోజే బాబా తమ శరీరాన్ని త్యాగం చేశారు. అలా తమ నిధనాన్ని బాబా ఆ భక్తునికి సూచించారు. 
తేవ్హాంపాసూని పునశ్చ త్యాసీ | కధీంహీ ఆమరణ ఉఠలీ న ఖాశీ | 
యా చిలిమీచ్యా అనుభవాసీ | విసర కా కోణాసీ హోఈల | ||౨౨౫|| 
225. అప్పటినుండి అతని మరణం వరకు, మరల ఎప్పుడూ దగ్గు రాలేదు. ఈ చిలుము అనుభవాన్ని ఎవరైనా, ఎప్పటికైనా మరచి పోగలరా? 
అసో తో దివసహీ గురువారచా | త్యాంతచి చావడీ మిరవణుకీచా | 
తేణే ద్విగుణిత ఆనందాచా | స్మరణీయ సాచా త్యా ఝాలా | ||౨౨౬|| 
226. బాళారాం సాయి దర్శనం చేసిన రోజు గురువారం. పైగా ఆ రోజు చావడి ఊరేగింపు. ధురందరు సోదరులకు రెండింతల ఆనందం లభించి, ఆ రోజు మరవలేని రోజుగా మిగిలింది. 
ఆఠాపాసూన నవాపర్యంత | బాబాంసన్ముఖ ఆంగణాంత | 
టాళమృదంగాచియా తాలాంత | భజనరంగాంత థాటతసే | ||౨౨౭|| 
227. రాత్రి ఎనిమిదినుండి తొమ్మిది వరకు బాబా ఎదుట, ప్రాంగణంలో తాళాలు తప్పెట్లు, మృదంగ వాదనలతో, భజన జరిగింది. 
యేకీకడే అభంగ మ్హణతీ | దుసరీకడే పాలఖీ సజవితీ | 
పాలఖీ తయార ఝాల్యావరతీ | బాబా మగ నిఘతీ చావడీస | ||౨౨౮|| 
228. ఒక్క వైపు అభంగాలు పాడుకుంటూ, మరో వైపు భక్తులు పల్లకిని అలంకరిస్తుండేవారు. పల్లకి తయారయాక, బాబా చావడికి బయలుదేరారు. 
పూర్వీ సప్తత్రింశత్తమోధ్యాయీ | చావడీచీయా నవలాయీ | 
సవిస్తరపణే వర్ణిలీ పాహీ | ద్విరుక్తి హోఈల యే స్థానీ | ||౨౨౯|| 
229. ఇంతకు మునుపు, ముప్పది ఏడవ అధ్యాయంలో చావడి ఊరేగింపును విస్తారంగా వర్ణించాను. ఇక్కడ చెప్పటం, దానినే మరల చెప్పడమవుతుంది. 
ఎక రాత్ర మశీదీంత | దుజీ చావడీమాజీ కాఢీత | 
ఏసా బాబాంచా నేమ హా సతత | ఆమరణ అవ్యాహత చాలతసే | ||౨౩౦||
230. ఒక రాత్రి మసీదులో, మరునాటి రాత్రి చావడిలో బాబా గడిపేవారు. వారి ఆ నియమం ఆగకుండా, వారు శరీరాన్ని త్యాగం చేసేవరకూ సాగింది. 

దేఖావయా చావడీచా సోహళా | ఉల్హాస బాళారామ ప్రేమళా | 
తదర్థ యేతా చావడీచీ వేళా | ధురంధర మేళా పాతలా | ||౨౩౧|| 
231. ఆ చావడీ వైభవాన్ని చూడాలని బాళారాంకు కుతూహలం. అందుకు, చావడి ఊరేగింపు సమయానికి సరిగ్గా ధురంధర సోదరులు అక్కడికి వచ్చారు.
శిరడీ క్షేత్రీచే నారీనర | బాబాంస ఘేఊన బరోబర | 
ఉల్లాసే కరీత జయజయకార | నిఘాలే చావడీవర జాయా | ||౨౩౨|| 
232. శిరిడీ గ్రామవాసులైన స్త్రీలు, పురుషులు బాబాను వెంటబెట్టుకుని ఎంతో ఉత్సాహంగా జయజయకారాలు చేస్తూ చావడికి బయలుదేరారు. 
ఘాతలీ జ్యావరీ భరజరీ పాఖర | చఢవిలే సుందర అలంకార | 
నామహీ జయాచే శామసుందర30 | అఘాడీ థయకార కరీత | ||౨౩౩|| 
233. వీపు మీద జరీ వస్త్రాన్ని ధరించి, చక్కటి అలంకారాలతో థై థై అని నాట్యం చేస్తున్నట్లుగా బాబా గుర్రమైన శ్యామసుందర ముందు నడిచింది. 
శింగే కర్ణే తుతార్యా వాజత | త్యా శృంగారల్యా శామకర్ణాసహిత | 
సంగే పాలఖీ సాఈ మిరవత | చాలే భక్తావృత ఛత్రశిరీ | ||౨౩౪|| 
234. సన్నాయి, ఢోలు మొదలగు వాద్యాలు మ్రోగుతుండగా, అలంకరించిన శ్యామకర్ణతో బాబా పల్లకి వెంట ఊరేగారు. భక్తులు ఛత్రాన్ని పట్టుకున్నారు. 
ధ్వజాపతాకా ఘేతీ కరీ | ఛత్ర ధరితీ శ్రీచే శిరీ | 
వారితీ మోరచేలేసీ చవరీ | దివట్యా ధరితీ చౌపాసీ | ||౨౩౫|| 
235. పతాకాన్ని చేత పట్టుకుని, ఛత్రాన్ని శ్రీసాయి తలపై పట్టుకుని వింజామరలను వీస్తూ, నలువైపులా దివిటీలను పట్టుకుని నడిచారు. 
సవే ఘేఊన మృదంగ సుస్వర | టాళఘోళాది వాద్యే మధుర | 
భజన కరీత భక్త నికర | దుబాజూ చాలత బాబాంచ్యా | ||౨౩౬|| 
236. తాళాలు, మృదంగం మొదలగు వాద్యాలను వాయిస్తూ, చక్కగా భజన చేస్తూ, బాబాకు ఇరువైపులా భక్తులు నడిచారు. 
అసో ఏసీ తీ రమ్య మిరవణూక | యే జేవ్హా చావడీసన్ముఖ | 
బాబా థాంబూని ఉత్తరాభిముఖ | కరీత విధిపూర్వక హస్తక్రియా | ||౨౩౭|| 
237. ఇటువంటి మనోహరమైన ఊరేగింపు చావడి సమీపానికి రాగానే, బాబా ఆగి ఉత్తర దిశగా నిలచి, విధి పూర్వకంగా చేతులతో ఏవో సూచనలను చేశారు. 
దక్షిణాంగీ బాబాంచా భగత | నిజకరీ బాబాంచా పదర ధరీత | 
వామాంగీ తాత్యా పాటీల హస్తాంత | ఘేఊన చాలత కందీల | ||౨౩౮|| 
238. బాబా భక్తుడు మహల్సాపతి బాబాకు ఎడమవైపున బాబా ఉత్తరీయాన్ని పట్టుకున్నాడు. బాబాకు కుడివైపున, తాత్యా పాటీలు లాంతరు పట్టుకుని నడిచాడు. 
ఆధీంచ బాబాంచే ముఖ పీతవర్ణ | త్యాంతచి దీపాది తేజాచే మిశ్రణ | 
తామ్రమిశ్రిత పీత సువర్ణ | తైసే ముఖ శోభే అరుణప్రభా | ||౨౩౯|| 
239. అసలే బాబా ముఖం బంగారు రంగు కలది. పైగా దీపాల వెలుగులో రాగి కలిపిన బంగారంలా, ఉదయించే సూర్యుడిలా శోభిస్తుంది. 
ధన్య తే కాళీచే పవిత్ర దర్శన | ఉత్తరాభిముఖ ఎకాగ్ర మన | 
వాటే కరీత కోణాస పాచారణ | అధోర్ధ్వ దక్షిణకర కరూనీ | ||౨౪౦||
240. ఆ సమయంలోని వారి పవిత్ర దర్శనం మహాభాగ్యం. ఉత్తర దిశవైపు ముఖంగా నిల్చుని, ఏకాగ్ర మనసుతో బాబా కుడి చేతిని క్రిందకూ పైకి ఊపినప్పుడు, ఎవరినో పిలుస్తున్నట్లుగా అనిపించింది. 

తేథూని పుఢే చావడీప్రతీ | నేఊని బాబాంస సన్మానే బసవితీ | 
దివ్యాలంకారవస్త్రే అర్పితీ | చందన చర్చితీ అంగాస | ||౨౪౧|| 
241. అక్కడినుండి బాబాను చావడికి తీసుకుని వెళ్లి, గౌరవ పూర్వకంగా కూర్చోబెట్టి, వస్త్రాలను, దివ్యాలంకారాలను అర్పించారు. వారి శరీరానికి చందనం పూశారు. 
కధీ శిరపేచ కలగీ తురా | కధీ సువర్ణ ముగుట సాజిరా | 
కధీ ఘాలితీ మందిలగహిరా | భరజరీ పేహరావ సురుచిర | ||౨౪౨|| 
242. ఒకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను, మరొకప్పుడు బంగారు కిరీటాన్ని, లేదా ముదురు రంగు తలపాగాను, వారి తలపై ఉంచారు. అందమైన జరీ కోటును తొడిగారు. 
హిరే మోతీ పాచూచ్యా మాళా | ప్రేమే ఘాలీత బాబాంచే గళా | 
కోణీ తయాంచ్యా లావితీ భాళా | సుగంధ టిళా కస్తురీచా | ||౨౪౩|| 
243. అందమైన రత్నాల, ముత్యాల మాలలను ప్రేమగా వారి మెడలో వేశారు. ఒకరు వారి నొసటపై పరిమళ కస్తూరి తిలకాన్ని దిద్దారు. 
కోణీ చరణ ప్రక్షాళిత | అర్ఘ్యపాద్యాది పూజా అర్పిత | 
కోణీ కేశర ఉటీ లావీత | తాంబూల ఘాలీత ముఖాంత | ||౨౪౪|| 
244. ఒకరు వారి పాదాలను కడిగి, అర్ఘ్య పాద్యాది పూజలు చేశారు. మరొకరు కుంకుమ పూవు కలిపిన చందనాన్ని అద్దారు. ఒకరు వారి నోటికి తాంబూలాన్ని అందించారు. 
ఘేఊనియా పంచారత | నీరాంజన కర్పూరవాత | 
జేవ్హా బాబాంస ఓవాళీత | శోభా తై దిసత అనుపమ | ||౨౪౫|| 
245. పంచారతిని, కర్పూర నీరాజనాన్ని బాబాకు ఇచ్చినప్పుడు, వారి దివ్య తేజస్సుయొక్క శోభ, వర్ణించడానికి కానంత అద్భుతంగా కనిపించింది. 
పాండురంగ మూర్తీంచే వదన | జ్యా దివ్య తేజే శోభాయమాన | 
త్యాచ తేజే సాఈముఖమండన | పాహూని విస్మయాపన్న ధురంధర | ||౨౪౬|| 
246. పాండురంగ మూర్తి ముఖం ఎంత దివ్య తేజస్సుతో శోభాయమానంగా వెలిగిపోతుందో, సాయి ముఖం కూడా అంతే తేజోవంతంగా ప్రకాశించటం చూచి, ధురంధరులు ఆశ్చర్యపోయారు. 
వీజ జైసీ నభోమండళీ | తళపే కోణా న లక్షే భూతళీ | 
తైసే తేజ సాఈచ్యా నిఢళీ | చమకోని డోళే దీపలే | ||౨౪౭|| 
247. ఆకాశంలో మెరిసే మెరుపును ఎలా భూమిపైనుండి చూడలేమో, అలా సాయి నొసటన తేజస్సు చూడలేక కళ్లు మెరిశాయి. 
పహాటే హోతీ కాకడ ఆరతీ | గేలే తేథే ధురంధర ప్రభృతీ | 
తేథేంహీ బాబాంచే ముఖావరతీ | తీచ తేజస్థితి అవలోకిలీ | ||౨౪౮|| 
248. మరునాడు తెల్లవారు ఝామున జరిగే కాకడ ఆరతికి, ధురంధర సోదరులు వచ్చారు. అప్పుడు కూడా బాబా ముఖంలో అదే తేజస్సును చూశారు. 
తేవ్హాంపాసూని ఆమరణాంత | బాళారామాచీ నిష్ఠా అత్యంత | 
సాఈపదీ జీ జడలీ నిశ్చిత | యత్కించిత తీ న ఢళలీ | ||౨౪౯|| 
249. అప్పటినుండి, సాయి పాదాలయందు బాళారాంకు కుదిరిన దృఢమైన నిష్ఠ, మరణించేవరకూ ఏ కొంచెమైనా చలించలేదు. 
హేమాడ సాఈపదీ శరణ | పుఢీల అధ్యాయీ గ్రంథ పూర్ణ | 
సింహావలోకనే హోఈల నిరూపణ | ద్యా మజ అవధాన శేవటచే | ||౨౫౦||
250. హేమాడు సాయి పాదాలకు శరణుజొచ్చి, తరువాతి అధ్యాయంలో ఈ గ్రంథాన్ని పూర్తి చేసి, సింహావలోకనం చేస్తాడు. చివరి సారిగా నాయందు శ్రద్ధ చూపించండి. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | భక్తత్రయవృత్తకథనం నామ | 
| ఎకపంచాశత్తమోధ్యాయః సంపూర్ణః |

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

 
టిపణీ: 
1. ఉష్ణతా. 2. ముఖ. 3. భగవద్గీతా, అ.౪, శ్లోక ౩౪. 
4. ఆపణ జో మలా ఉపదేశ కేలా త్యానే. 
5. హా మాఝా మోహ, హే మాఝే అజ్ఞాన నాహీసే ఝాలే. 
6. హరీ సీతారామ దీక్షిత. 7. తీన కథా. 
8. యా ఠికాణీ కై. కాకాసాహేబాంచే బంగలే అజూన ఆహేత. 
9. శేకడో ఉపాయాంనీ. 10. యా సంతశిరోమణీచా మహిమా. 
11. నాశివంత స్థితీ. 12. వాటేల తితకా వేళ. 
13. ఆత్యంతిక మోక్షసుఖ మిళవిణ్యాసాఠీ. 
14. మాధవరావ బళవంత దేశపాండే, రాహణార శిరడీ. 
15. చిథళీ స్టేశనావర. 
16. తీ శిరడీస నేణ్యాచీ కామగిరీ మాధవరావజీంవర నిరవలీ. 
17. ఉఘడీ. 18. హవాలీ కేలీ. 19. ఘరీ. 20. ఆశ్రమ, ఘర. 
21. చంద్ర. 22. ములాంచా సిద్ధాంత. 23. గురూనే కేలేల్యా ఉపకారాస. 
24. అత్యంత. 25. కీర్తిరూప గంగా. 26. నాందేడచే ప్రసిద్ధ వకీల. 
27. నిరర్థక. 28. ఆనంద, హర్ష. 29. ఖోకలా. 30. శ్యామకర్ణ ఘోడా.