శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౫౦ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
జన్మదాతే మాయతాత | యాంచియా ఉపకారా నాహీ అంత |
మానవదేహ దిధలా మజప్రత | ఉపజలో న జంత త్యా పోటీ | ||౧||
జన్మదాతే మాయతాత | యాంచియా ఉపకారా నాహీ అంత |
మానవదేహ దిధలా మజప్రత | ఉపజలో న జంత త్యా పోటీ | ||౧||
1. మానవ దేహంతో నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రుల ఉపకారానికి అంతు లేదు. దేహంలోని క్రిమిలా జన్మించనందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి.
ఉపజలో నా ముకా బహిరా | జన్మలో పురా సుపిండ | ||౨||
2. గ్రుడ్డివానిగానో, కుంటివానిగానో, మెల్ల కంటివానిగానో, నత్తివానిగానో, లేక మూగవానిగానో, చెవిటివానిగానో పుట్టి తల్లి గర్భాన్ని బాధించేలా పుట్టలేదు. మంచి శరీరంతో సరిగ్గానే పుట్టాను.
జయాచే దేవ వందీ చరణ | ఏసా జో ఉత్తమ బ్రాహ్మణవర్ణ | తేథ మీ ఈశ్వరకృపే అవతీర్ణ | జాహలో పూర్ణ దైవాచా | ||౩||
3. ఈశ్వరుని కృపవలన, దేవతలు కూడా పాదాలకు నమస్కారం చేసే ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో పుట్టాను. నేను నిజంగానే చాలా భాగ్యశాలి.
జన్మోజన్మీ మాతా పితా | కోట్యానకోటీ జన్మ ఘేతా | పరీ యా జన్మమరణా చుకవితా | తయాచీ దుర్మిళతా అనివార | ||౪||
4. కోటానుకోట్ల జన్మ జన్మలకూ, ప్రతి జన్మలోనూ తల్లిదండ్రులు లభిస్తారు. కాని, చావు పుట్టుకలను తప్పించే తల్లిదండ్రులు లభించడం చాలా అరుదు.
జన్మదాతా తోహీ పితా | దుజా మౌంజీబంధన కర్తా | తిజా అన్నప్రదానే పాళితా | చౌథా భయభీత సోడవితా | ||౫||
5. జన్మనిచ్చువారు తండ్రి. మౌంజీ బంధనం (ఉపనయనం) చేసేవారు రెండవ తండ్రి.. అన్న ప్రదానం చేసి పోషించేవారు మూడవ తండ్రి. భయాలనించి, కష్టాలనుంచి తొలగించేవారు నాలుగవ తండ్రి.
జగీ హే సర్వ సమసమాన | పరీ కృపాళూ సద్గురూవీణ | ఖరా జనక నాహీ ఆన | నవల విందాన పరిసావే | ||౬||
6. ప్రపంచంలో వీరంతా సమసమానులే. కాని, కృపాళువైన సద్గురువు కంటే నిజమైన తండ్రి ఎవరూ లేరు. సద్గురువు విశేషమైన లీలను గమనించండి.
జననీ గర్భీవీర్య నిక్షేపితా | యోనిద్వారా జన్మదాతా | హాతో కేవళ లౌకికీ పితా | సద్గురు జనితా అలౌకిక | ||౭||
7. తల్లి గర్భంలోకి వీర్యాన్ని పంపించి, యోనిద్వారా జన్మను ప్రసాదించినవారు కేవలం లౌకిక తండ్రి. సద్గురువు అలౌకికమైన తండ్రి.
తో న వేంచితా వీర్యాచా కణ | నీచ యోనిద్వారావీణ | దేఊనియా నిజపుత్రా జనన | అనుగ్రహపూర్ణ కరవీత | ||౮||
8. వారు ఒక్క వీర్యాకణాన్ని కూడా వెచ్చించకుండా, నీచమైన యోనిద్వార కాకుండా, తన కొడుకుకి జన్మనిచ్చి అనుగ్రహాన్ని కురిపిస్తారు.
నమో త్యా జన్మమరణనివర్తకా | కరుణాఘనా జ్ఞానప్రకాశకా | వేదగుహ్య సచ్చిత్ప్రరతిపాదకా | సర్వ వ్యాపకా గురువర్యా | ||౯||
9. చావుపుట్టుకలనుంచి తప్పించి, కరుణాఘనలు, జ్ఞానమనే వెలుగునిచ్చి, వేదాలలో దాగి ఉన్న నిజాలను తెలిపిన, సర్వవ్యాపకులైన గురువర్యులకు నమస్కరిస్తున్నాను.
నమో సంసారతమదినకరా | ఆత్మానుభవసంతశేఖరా | భక్తచిత్తచకోరచంద్రా | కల్పతరూవరా గురువర్యా | ||౧౦||
10. సంసారంలోని చీకటికి సూర్యుడు, ఆత్మానుభవాన్ని పొందిన సంతుల శేఖరడూ, భక్త చిత్త చకోర చంద్రుడూ, కల్పతరువుల్లో శ్రేష్ఠుడూ అయిన గురువర్యులకు నమస్కరిస్తున్నాను.
అగాధ గురురాయాచే మహిమాన | వర్ణితా గళే వాచేచా అభిమాన |
బరే అసావే ముకియాసమాన1 | ఖాలవోని మాన గురుచరణీ | ||౧౧||
11. గురువర్యుల మహిమ అగాధం. దానిని వర్ణించి, వాక్కు తన అభిమానాన్ని తొలగించుకుంటుంది కనుక, గురు పాదాల మీద తలనుంచి, మూగవానిలా మౌనంగా ఉండటమే మంచిది.
పూర్వజన్మీ అనవచ్ఛిన్న2 | నసతా కోణీ తపఃసంపన్న | హోఈ న తయా సంతదర్శన | త్రితాపనిరసనకారక | ||౧౨||
12. పూర్వ జన్మలో అఖండ తపస్సుచేసి తపఃసంపన్నులు కానివారికి, మూడు తాపాలను నశింపచే సంతుని దర్శనం కాదు.
పరమార్థ మోక్ష వా నిజహిత | సాధావే ఏసా జయాసీ హేత | తేణే వ్హావే సంతాంచే అంకిత | ఉణే న యత్కించిత మగ తయా | ||౧౩||
13. పరమార్థాన్ని, మోక్షాన్ని, మరియు తమ శ్రేయస్సుని కోరే వారు, సంతులకు అంకితమైపోతే, కొంచెం కూడా లోటు ఉండదు.
ధన్య ధన్య సత్సంగతీ | కాయ వర్ణావీ తిచీ మహతీ | తియే పాసావ వివేకవిరక్తి | పరమ శాంతీ సద్భక్తా | ||౧౪||
14. ధన్యం ధన్యం సత్సంగం. దాని మహిమను ఏమని వర్ణింతును? అది సద్భక్తులకు వివేకాన్ని, విరక్తిని, పరమ శాంతిని కలిగిస్తుంది.
సాఈ కేవళ చైతన్యమూర్తీ | అవ్యక్తచి తే ఆలే వ్యక్తీ | కాయ త్యాంచీ నిర్విషయ స్థితి | కోణ నిశ్చితీ వానీల | ||౧౫||
15. సాయి కేవలం చైతన్యమూర్తి. కనిపించని స్థితినుంచి, కనపడే స్థితికి వచ్చారు. కోరికలు లేని వారి స్థితిని, ఏమని నిశ్చయంగా ఎవరు వర్ణించగలరు?
భక్త భావార్థీ శ్రోతే ప్రేమళ | తయాంలాగీ తోచి కనవాళ3 | ప్రేమే వదే నిజచరిత రసాళ | కేవళ జే రాఊళ4 తయాంచే | ||౧౬||
16. భావార్థులైన భక్తుల కొరకు, ప్రేమికులైన శ్రోతల కొరకు, వారికి పవిత్ర మందిరమైనటువంటి రసవత్తరమైన తమ జీవిత చరితాన్ని, కరుణామయులైన వారు ప్రేమతో, తామే తెలియ చేశారు.
శిరీ జయాచా పడతా కర | అహంభావాచా హోఈ చూర | సోహంభావాచా చాలే గజర | ఆనంద నిర్భర దృశ్యజాత | ||౧౭||
17. తలపై వారి చేయి పడగానే, అహంభావం తునాతునకలైపోయి, "సోహం" (సహ+అహం = అది నేనే) అనే మంత్రం మనసులో పుట్టి, కనిపించే జగమంతా ఆనందంతో నిండిపోతుంది.
కాయ మజ పామరా శక్తి | వానావయా తయాంచీ కీర్తి | జ్యాచా తోచ భక్తప్రీతి | ప్రకటవీ పోథీ కృపేనే | ||౧౮||
18. నీచుడు, బుద్ధిహీనుడు అయిన నాకు, వారి కీర్తిని వర్ణించడానికి శక్తి ఎక్కడిది? భక్తులపై ప్రేమతో, కృపతో ఈ గ్రంథాన్ని వారే వెల్లడి చేశారు.
లోటాంగణ త్యా సాఈచరణా | అభివందన శ్రోతృగణా | నమన సాధు సంత సజ్జనా | ప్రేమాలింగన సకళికా | ||౧౯||
19. ఆ సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారము. శ్రోతలకు నమస్కారము.. సాధు సంతులకు, సజ్జనులకు నమస్కారాలు. అందరికీ ప్రేమాలింగనం.
సహజ లీలేనే వార్తా సాంగతీ | జయా గర్భీ సంపూర్ణ నీతీ | జయాచే లేణే నిత్యశాంతీ | మహానుభావ ధ్యాతీ జ్యా | ||౨౦||
20. సహజంగా, అవలీలగా ముచ్చటలను సాయిబాబా చెప్పేవారు. వానిలో సంపూర్ణమైన నీతి నిండి ఉండేది. శాశ్వతంగా, శాంతిని అలంకారంగా కలిగి ఉన్న వారిని, మహానుభావులు ధ్యానిస్తారు.
సూర్యా ఉపమితా నాహీ సోఈ | కీ తో సూర్య అస్తాస జాఈ |
చంద్రా ఉపమూ తరీ తో క్షయీ | సదైవ సంపూర్ణ సాఈ హా | ||౨౧||
21. సూర్యునితో పోల్చటం తగదు. ఎందుకంటే సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రునితో పోల్చాలంటే, వాడు తరుగుతూ ఉంటాడు. సాయి ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటారు.
పరిసా జీ కథా శ్రద్ధాయుక్త | దత్త చిత్త ఆవడీనే | ||౨౨||
22. వారి పాదాలకు హేమాడ్ నమస్కరించి, ఈ కథను శ్రద్ధగా, మనసును నిలకడగా ఉంచుకుని, వినండి అని ప్రేమతో సవినయంగా శ్రోతలకు విన్నవిస్తున్నాడు.
భూమీ ఉత్తమ నాంగరూన | బీజ ఠేవిలే ఆహే పురూన | పరీ న వర్షతా తుమ్హీ కృపాఘన5 | పీక తే నిర్మాణ హోఈల కా | ||౨౩||
23. భూమిని ఉత్తమంగా దున్ని, విత్తనాలను నాటడం అయింది. కాని, కృపాఘన, నీవు వర్షించక పోతే, పంట పండుతుందా?
పడతా సంతకథా కానీ | పాతకాంచీ నురే కాహాణీ | పుణ్యే అంకురతీ కథా శ్రవణీ | ఘ్యా హ్యా పర్వణీచా లాభ | ||౨౪||
24. సంతుల కథ చెవిన పడగానే పాపాలు నశిస్తాయి. కాని, ఈ కథలను వింటే, పుణ్యం మొలకెత్తుతుంది.. అందువల్ల ఈ పండుగయొక్క లాభాన్ని పొందండి.
సలోకతాదిచారీ6 ముక్తి | నలగే తేథే ఆమ్హా ఆసక్తి | జడో త్యా సాఈచి నిశ్చళ భక్తి | పరమ ప్రాప్తి హీచ ఆమ్హా | ||౨౫||
25. సాలోక్యం మొదలైన నాలుగు ముక్తులయందు మనకు ఆసక్తి లేదు. సాయియందు మారని భక్తి కుదిరితే, అదే మనకు పరమ ప్రాప్తి.
ఆమ్హీ ముళీచే నాహీ బద్ధ | కాయ ఆమ్హా ముక్తీచా సంబంధ | హోవో సంత భక్తీచా ఉద్బోధ | తేణేంచ కీ శుద్ధ అంతర | ||౨౬||
26. అసలు మనం దేనికీ కట్టుబడి లేము.. ఇక ముక్తితో మనకేమి సంబంధం? సంతులయందు భక్తి పుట్టితే, అదే మనసును శుద్ధి చేస్తుంది.
జేథే న మీతూంపణస్ఫూర్తి | ఏసీ జే కా ‘సహజ స్థితి’ | ఆమ్హా వ్హావీ తే అభేదభక్తి | హేంచి సాఈప్రతి మాగూ | ||౨౭||
27. ఎక్కడ ‘నీ, నా’ అన్న ఆలోచన లేదో, అలాంటి ‘సహజ స్థితి’ని, మరియు తనయందు భేదము లేని భక్తిని, సాయినుంచి కోరుకుందాం.
ఆతా శ్రోతయా హీచ వినంతీ | వాచూ ఘేతా గ్రంథ హాతీ | వాచ్య వాచన వాచక వ్యక్తి | ఎకాత్మస్థితీ దేఖావీ | ||౨౮||
28. ఇప్పుడు శ్రోతలకు ఇదే వినంతి. చేతిలో ఈ గ్రంథాన్ని తీసుకొని చదివేటప్పుడు, వాచ్యం (చదువుతున్న వస్తువు - అంటే గ్రంథం), వాచనం (చదవటం) మరియు వాచక వ్యక్తి (చదివే మనిషి) ఈ మూడింటిని ఒకటిగా చూడండి.
సోడూని ద్యావే హేమాడపంతా | కీ తో న కర్తా యా సచ్చరితా | కేవళ భక్తాంచియా నిజహితార్థా | కారణ నిమిత్తా తో ఎక | ||౨౯||
29. హేమాడ్పంత్ను వదిలేసేయండి. ఈ సచ్చరితకు ఇతడు కర్తకాడు. కేవలం భక్తుల శ్రేయస్సు కొరకు కారణమైన, ఒక నిమిత్త మాత్రుడంతే.
దైవే లాధలా శింపా7 త్యాగితీ | త్యాంచే హాతీచే గేలే మోతీ | కాయ కీజే అశ్వథ్యోత్పత్తి8 | వ్హావే న స్వార్థీ9 ఉదాస | ||౩౦||
30. దైవవశాత్తు దొరికిన ముత్యపు చిప్పను వదిలివేస్తే, అందులోని ముత్యాలు కూడా చేజారి పోతాయి. అశ్వథ్ధ వృక్షంయొక్క పుట్టుక గురించి మనకెందుకు? తమ శ్రేయస్సు గురించి ఉదాసీనత పనికిరాదు.
యేథే శబ్దమాత్రా శబ్దవితా | నాహీ కోణీ సాఈ పరతా |
తోచి శ్రావ్య శ్రవణ శ్రోతా | హీ ఎకాత్మతా న ఢళావీ | ||౩౧||
31. సాయి తప్ప, ఈ కథలను చెప్పేవారు వేరే ఎవరూ ఇక్కడ లేరు. వారే శ్రావ్యం (వినిపించేది), శ్రవణం (వినటం) మరియు శ్రోత (వినేవారు) అనే ఒక్క సంగతి మరచిపోరాదు.
నా తరీ తే నాహీ వాచన | శ్రవణీ సాదర నాహీ కాన | జేథే న వృత్తీ ఎకతాన | పారఖీ10 కవణ శబ్దార్థా | ||౩౨||
32. లేకుంటే, అది పఠనం కాదు. చెవులు శ్రద్ధగా వినకపోతే, మనసు ఏకాగ్రతతో లేకుంటే, అప్పుడు శబ్దాల అర్థాలను ఎవరు గమనిస్తారు?
శ్రవణీ ధరా నిరభిమానతా | శ్రోతే హీ సాఈచ భావావే చిత్తా | తరీచ త్యా శ్రవణాచీ సార్థకతా | అఖండ అద్వైతతా రాఖావీ | ||౩౩||
33. వినటం అభిమానం లేకుండా ఉండాలి. వినేవారే సాయి అనే భావం మనసుకు రావాలి. అప్పుడే ఆ వినటానికి సార్థకత. అలా ఎప్పుడూ ఒక్కటే అనే భావంతో ఉండాలి.
తేవ్హాంచ సకల ఇంద్రియ ప్రవృత్తీ | సాఈరూప హోతీల నిశ్చితీ | జళీ జళతరంగ స్థితి | ఏసియా వృత్తీ సమరసతీ | ||౩౪||
34. అప్పుడే, అన్ని ఇంద్రియాల నడక నిశ్చయంగా సాయి రూపమవుతుంది. నీరులోని నీటి అలలవలె, ఈ నడకలు సాయిలో లీనమవుతాయి.
తరీచ జ్ఞానియా పరమార్థబోధ | వినోదియాంతే వినోదామోద11 | కవితాకోవిదా12 పదప్రబంధ | గ్రంథీ యా ఆనంద సర్వత్రా | ||౩౫||
35. అప్పుడే జ్ఞానులకు పరమార్థ బోధ. వినోద ప్రియులకు వినోదం, కవితా కోవిదులకు రసాస్వాదం. ఈ గ్రంథంనుంచి సర్వత్రా ఆనందం.
అసో పూర్వీ యా సచ్చరితీ | అధ్యాయ ఎకోనచత్వారింశతీ | ఎకా నిజోత్తమ భక్తాప్రతీ | సమర్థ జో కరితీ ఉపదేశ | ||౩౬||
36. అలా, ఇంతకు మునుపు ఈ సచ్చరితలోని ముప్పైతొమ్మిదవ అధ్యాయంలో, సాయి సమర్థులు తమ ఉత్తముడైన ఒక భక్తునికి బోధించిన ఉపదేశం -
అసతా తే భక్త బాబాపాశీ | భగవద్గీతా చతుర్థాధ్యాయాసీ | ఆరంభాపాసూన ఆవర్తనాసీ | హోతే తే సమయాసీ కరీత | ||౩౭||
37. ఆ భక్తుడు బాబా వద్ద, భగవద్గీతలోని నాలుగవ అధ్యాయాన్ని మొదటినుండి వల్లిస్తూ ఉండగా -
ఎకీకడే చరణసేవా | ముఖే హళూచ పాఠ మ్హణావా | మ్హణతా సంపతా తేహతిసావా | ఘేతలా చౌతిసావా మ్హణావయా | ||౩౮||
38. ఒక వైపు పాద సేవ చేస్తూ, మెల్లగా శ్లోకాలను గునుగుతూ; ముప్పై మూడవ శ్లోకం ముగియగానే, ముప్పై నాలుగవ శ్లోకాన్ని చెప్పడం మొదలు పెట్టాడు.
నిశ్వళ మనే లయ లాఉనీ | మ్హణత హోతే మనీచే మనీ | పరీ నసతా కళేసే జనీ | అసణార కోఠునీ కాయ తరీ | ||౩౯||
39. నిశ్చలమైన మనసుతో, తన్మయత్వంతో, తనలో తాను చెప్పుకుంటున్నాడు కనుక, అది జనులకు వినపించ లేదు. దానివల్ల వారికి అది అర్థం కాకపోతే ఏమౌతుంది?
మ్హణూ ఘేతా చౌతిసావా | ఆలే సాఈనాథాంచియా జీవా | ఆతా యేథే అనుగ్రహ కరావా | సన్మార్గ దావావా భక్తోత్తమా | ||౪౦||
40. ముప్పై నాలుగవ శ్లోకాన్నిచెబుతుండగా, ఉత్తముడైన ఆ భక్తుని అనుగ్రహించి, అతనిని సన్మార్గంలో పెట్టాలని సాయినాథులవారికి అనిపించింది.
తయా భక్తాచే నామ నానా | తంవ బాబా మ్హణతీ తయాంనా |
“నానా కాయ రే పుటపుటసీ మనా | స్పష్ట రే కా నా వదసీ ముఖే | ||౪౧||
41. ఆ భక్తుని పేరు నానా. అతనితో బాబా, "నానా, మనసులో ఏదో గొణుక్కుంటున్నావు? స్పష్టంగా నోటితో ఎందుకు చెప్పవు?" అని అన్నారు.
పరీ ఆవాజ పరిస్ఫుట నోహే | ఏసే హే గుహ్య కాయ కిరే” | ||౪౨||
42. "ఎప్పటినుంచో చూస్తున్నాను. ఏదో గొణగుడు జరుగుతుంది. కాని, ధ్వని స్పష్టంగా వినపించటం లేదు. ఏమిటి అంతటి రహస్యం?"
మగ నానా వదతీ ‘స్పష్ట | కరీత ఆహే గీతేచా పాఠ | ఇతరా న వ్హావీ మాఝీ కటకట | ఆహే హీ పుటపుట తదర్థ’ | ||౪౩||
43. నానా అప్పుడు అన్నాడు, "గీతలోని పాఠాన్ని స్పష్టం చేసుకుంటున్నాను. ఇతరులకు ఇబ్బంది కాకూడదని మెల్లగా చెప్పుకోవడమే ఈ గొణగుడుకి అర్థం".
“అసో తీ ఝాలీ లోకాంచీ గోష్ట | పరీ మజసాఠీ బోల పా స్పష్ట | తుఝా తులా తరీ కళేకా పాఠ | పాహూ దే నీట” వదలే శ్రీ | ||౪౪||
44. "సరే, అది ఇతరుల సంగతి. నా కోసమైనా స్పష్టంగా చెప్పు. అసలు నీవు చెబుతన్నది, నీకైనా అర్థమైందా అని చూడని" అని శ్రీవారు అన్నారు.
మగ ‘తద్విద్ధి ప్రణిపాతేన’ | ఉచ్చస్వరే హా శ్లోక మ్హణూన | దావిలా నానాంహీ ప్రణిపాత కరూన | ఏకతా సమాధాన బాబాంస | ||౪౫||
45. అప్పుడు నమస్కారం చేసి, ‘తద్విద్ధి ప్రణిపాతేన’ అనే శ్లోకాన్ని ఉచ్చ స్వరంలో చెప్పాడు. అది విని బాబా సమాధాన పడ్డారు.
పుఢే యా శ్లోకాచా అర్థ పుసతా | పూర్వాచార్య కథిత అర్థా | యథా సాంగ నానా హీ కథితా | బాబాంనీ మాథా డోలవిలా | ||౪౬||
46. తరువాత, ఆ శ్లోకానికి అర్థం చెప్పమనగా, అంతకు మునుపు ఆచార్యులు చెప్పిన ప్రకారంగా, నానా అర్థాన్ని వివరించాడు. బాబా తల ఊపారు.
పున్హా నానాస కరితీ ప్రశ్న | “ ‘ఉపదేక్ష్యంతి తే జ్ఞానం’ | నానా పాహీ హా తృతీయ చరణ | కరీ పా మనన తయాచే | ||౪౭||
47. మరల నానాను ప్రశ్నిస్తూ, "నానా, ‘ఉపదేక్ష్యంతి తే జ్ఞానం’ అన్న తృతీయ చరణాన్ని గమనించి, దానిని బాగా మననం చేయి".
“త్యాంతీల ‘తే’ యా అక్షరాపాఠీ | ‘అ’కారార్థీ అవగ్రహా పోటీ | అజ్ఞానపదే అర్థ పరిపాటీ | హోతే కా ఉఫరాటీ పాహీ పా | ||౪౮||
48. "అందులోని ‘తే’ అక్షరం తరువాత, ‘అ’కారం అర్థాన్ని తెలిపే అవగ్రహ గురుతును (‘s’) ఉంచితే, వచ్చే అజ్ఞానమనే పదంతో విరుద్ధ అర్థం వస్తుందేమో చూడు".
“శంకరానంద జ్ఞానేశ్వర | ఆనందగిరీ ఆణి శ్రీధర | మధుసూదనాది భాష్యకార | కరితీ జ్ఞాన పర జో అర్థ | ||౪౯||
49. “శంకరానందులు, జ్ఞానేశ్వర, ఆనందగిరీ మరియు శ్రీధర, మధుసూదనాది భాష్యకారులు జ్ఞానం అనే పదాన్ని గురించి చెప్పిన అర్థం -
తో మాన్య ఆహే జైసా సకళీకా | తైసాచ ఆహే మజహీ ఠావకా | పరీ అవగ్రహే13 హోణారియా కౌతుకా13 | జాణూనియా వ్యర్థ కా ముకావే?” | ||౫౦||
50. “అందరికీ ఆమోదమైంది నాక్కూడా తెలుసు. కాని, అవగ్రహాన్ని ఉంచడం వలన వచ్చే విశేషార్థం వ్యర్థంగా ఎందుకు కోల్పోవటం?”
ఏసే మ్హణూన సాఈ కృపాఘన | భక్త చకోర చాతకా కారణ |
వర్షలేజే బోధామృతకణ | ఝాలే నిరూపణ పూర్వీంచ14 | ||౫౧||
51. అని చెప్పి, కృపాఘనులైన సాయి, చాతక చకోర పక్షుల వంటి భక్తుల కోసం వర్షించిన బోధామృత కణాలని ఇదివరకే నిరూపించడమైనది.
పరీ యా సాఈలీలేచే వాచక | సర్వాంసీచ యా అర్థాచే కౌతుక | వాటలే నాహీ కాంహీ సాశంక | రాహిలే ఆశ్చర్యకారక హే | ||౫౨||
52. కాని, సాయిలీల పాఠకులందరూ ఆ అర్థాన్ని ఒప్పుకోలేదు. కొందరు సందేహాన్ని వెలిబుచ్చారు.. ఇది ఆశ్చర్యకారకం అయింది.
అసో తయాంచే సమాధాన | జేణే హోఈల సప్రమాణ | అసా ఆణీక అల్ప ప్రయత్న | కరితో ‘అజ్ఞాన’ - సమర్థనా15 | ||౫౩||
53. అలాంటివారిని సమాధాన పరిచేందుకు, ‘అజ్ఞానం’ అనే పదాన్ని సమర్థించటానికి, సాక్ష్యాలతో సహ, మరొకమారు చిన్న ప్రయత్నం చేస్తాను.
బాబాంస కోఠీల సంస్కృత జ్ఞాన | ఏసీహీ శంకా ఘేఈల కోణ | సంతా న అనధీత16 కాంహీంహీ జాణ | శంకేచే కారణ ఆణీకచి | ||౫౪||
54. ‘బాబాకు సంస్కృత జ్ఞానం ఎక్కడిది’, అని కొందరు సందేహించవచ్చు. సంతులకు తెలియనదేదీ లేదని తెలుసుకొండి. సందేహానికి కారణం వేరేదో అయి ఉంటుంది.
అహో ‘ఎకేన జ్ఞాతేన | సర్వ హి విజ్ఞాతం భవతి’ ప్రమాణ | కోణా న మాన్య హే శ్రుతివచన | తే అపరోక్షజ్ఞాన సాఈస | ||౫౫||
55. ‘ఏకేన జ్ఞాతేన సర్వ హీ విజ్ఞాతం భవతి’ అనేది ప్రమాణం. ఈ శ్రుతి వచనాన్ని ఎవరు మాత్రం అంగీకరించరు? అలాంటి కనిపించే జ్ఞానం సాయిది.
జైసా కరతలస్థిత ఆమలక17 | తైసే ఆమూళ18 విశ్వ జ్యా దేఖ | తయా సంతా కాయ నా ఠాఊక | సవితాహీ ప్రకాశక జ్యాంచేనీ | ||౫౬||
56. విశ్వాన్నంతా, అరచేతిలో ఉన్న ఉసిరికాయలా, ఎలా చూడగలరో, ఎవరినుంచి సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, అలాంటి సంతులకు తెలియనిదేది?
జయాతే హే ఎక జ్ఞాన | తయాస కోఠే ఉరలే అజ్ఞాన | తయా విద్యాజాత అవగత జాణ | మహత్వ కోణ సంస్కృతా | ||౫౭||
57. ఇంత జ్ఞానం ఉన్నవారికి, అజ్ఞానం ఎలా ఉంటుంది? వారికి విద్యలన్నీ తెలుసు అని తెలుసుకొండి. ఇక సంస్కృతం గొప్పతనమేమిటి?
అసో యా లీలేచే19 కాంహీ వాచక | మ్హణతీ ‘నానా అప్రామాణిక | త్యాంచా హా స్వకపోలకల్పిత అప్రయోజక | అజ్ఞానవ్యంజక అవగ్రహ | ||౫౮||
58. సాయిలీలా మాసిక పాఠకలు కొందరు, ‘నానా నమ్మదగినవాడు కాదు. ఇదంతా అతని స్వంత కల్పితం. అజ్ఞానాన్ని తెలిపే అవగ్రహ గుర్తు అనవసరమైనది’ అని అంటారు.
త్యాంనీంచ రచిలే హే థోతాండ | అవగ్రహాన్విత అజ్ఞానకాండ | ఉగీచ ఉఠవిలా హా వాదవితండ | నిజజ్ఞాన అఖండ మిరవావయా | ||౫౯||
59. ‘నానాయే ఈ నాటకాన్నంతా రచించాడు. తన జ్ఞానాన్ని గొప్పగా చాటుకోవటానికే, అవగ్రహంతో కూడుకున్న ఈ అజ్ఞానకాండాన్ని, వితండ వాదాన్ని, వ్యర్థంగా లేవదీశాడు’.
నసతాచి అవగ్రహ కేలా ప్రస్థాపిత | జ్ఞానాచే జాగీ అజ్ఞాన కాఢీత | ఏసా కాంహీ తరీ విపరీత | లావీత తే అర్థ గీతేచా’ | ||౬౦||
60. ‘అనవసరమైన అవగ్రహ గుర్తును చెప్పి, జ్ఞానం అనే చోట అజ్ఞానం అన్న పదాన్ని వేసి, గీతకు విపరీతార్థం ఎలా ఇస్తాడు?’
పరీ పాహతా వస్తుస్థితీ | విచార కరితా సూక్ష్మ చిత్తీ |
సాఈలీలా ఎకోనచత్వారింశతీ | కాంహీ న విసంగతీ కథేత | ||౬౧||
61. వాస్తవాన్ని గమనించి, చాలా జాగ్రతగా ఆలోచిస్తే, సాయిలీలా ముప్పైతొమ్మిదవ అధ్యాయంలో ఎటువంటి అసంబద్ధమూ చెప్పలేదు.
పరీ తయాంనీ కేలేలియా కథనా | వృథా వల్గనా20 న మ్హణావే | ||౬౨||
62. నానా మాట ప్రామాణికమో, అప్రామాణికమో, ఎవరు ఏమి అనుకున్నా, అతను చెప్పినది వ్యర్థమైనదని, అర్థం లేనిదని అనుకోరాదు.
దూర సారితా దృష్టీచే దోష | దిసేల అశేష నిర్దోష | ||౬౩||
63. నానాపైని అయిష్టతను వదిలేసి, ఏ వికారానికీ వశం కాకుండా, పాఠకులు తమ దృష్టి దోషాన్ని తొలగించుకుంటే, అన్నిటినీ ఏ దోషం లేకుండా చూడగలరు.
సాఈలీలా ఉత్తమోత్తమ | అధ్యాయ ఎకోనచత్వారింశత్తమ | వాచిల్యావీణ యా అధ్యాయీ నిర్గమ21 | హోణార నాహీ సుగమపణే | ||౬౪||
64. ‘సాయిలీలా’ లోని ఉత్తమోత్తమమైన ముప్పై తొమ్మిదవ అధ్యాయాన్ని చదవకుండా ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవటం సులభం కాదు.
భగవద్గీతా శ్రీకృష్ణముఖీ | చతుర్థాధ్యాయీ జ్ఞానముఖీ22 | చతుస్త్రింశత్తమ శ్లోకీ | అజ్ఞానోన్ముఖీ ప్రవచన | ||౬౫||
65. శ్రీకృష్ణుని నోటినుండి వెలువడిన భగవద్గీతలోని, జ్ఞానయజ్ఞమనే నాలుగవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకంలో అజ్ఞానంపైన ఈ ప్రవచనమున్నది.
‘తద్విద్ధి ప్రణిపాతేన | పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం | జ్ఞానినస్తత్వదర్శినః’ | ||౬౬||
హా తో గీతేచా మూళ శ్లోక | యాంతీల తృతీయ చరణీ దేఖ |
జ్ఞానపదాఆధీ అవగ్రహ ఎక | ‘అజ్ఞాన’ నిదర్శక నిఘతసే | ||౬౭||
67. ఇది గీతలోని మూల శ్లోకం. ఇందులోని మూడవ చరణాన్ని గమనించండి. ‘జ్ఞానం’ అనే పదానికి ముందు ఒక అవగ్రహాన్ని వేస్తే ‘అజ్ఞానం’ అనే పదాన్ని సూచిస్తుంది.
నాణితా మనా అవగ్రహ | ‘జ్ఞాన’ హే పద యే నిఃసందేహ | తద్విరుద్ధ న కోణాహీ దురాగ్రహ | తో అర్థ సంగ్రాహ్య సర్వత్రాం | ||౬౮||
68. అవగ్రహాన్ని ఆలోచించక పోతే, నిస్సందేహంగా అది ‘జ్ఞానం’ అన్న పదమే. దానికి విరుద్ధంగా ఎవరూ అడ్డు చెప్పరు. ఆ అర్థం అందరికీ తెలిసినదే.
‘జ్ఞానాదేవ తు కైవల్యం’ | హే శ్రుతివచన సర్వత్రాం మాన్య | తరీ జ్ఞానచి తత్వజ్ఞాం ఉపదేశ్య | బంధన హే అనావశ్యక త్యా | ||౬౯||
69. ‘జ్ఞానాదేవతు కైవల్యం’ అన్న శ్రుతి వచనాన్ని అందరూ అంగీకరిస్తారు. అలా అని తత్వజ్ఞులు జ్ఞానాన్నే ఉపదేశించాలని బంధించడం అనావశ్యకం.
మీ ఆత్మా సాక్షీ నిర్మళ | శుద్ధ బుద్ధ ముక్త కేవళ | ప్రత్యగ్భూత చైతన్య సోజ్వళ | అద్వయానంద అఢళత్వే | ||౭౦||
70. ‘నేను ఆత్మను. కేవలం నిర్మలమైన సాక్షి. శుద్ధ బుద్ధ ముక్తుణ్ణి. అన్ని ప్రాణులలోని మెరిసే చైతన్యాన్ని. ఎప్పుడూ తరగని అద్వైతానందంతో సంపూర్ణంగా ఉన్నాను’.
పరంతు మీ నవ్హే అజ్ఞాన | అజ్ఞానాచే కార్యహీ మీ న |
‘అయమాత్మా బ్రహ్మ’23 మీ జాణ | ‘ప్రజ్ఞానమానంద’24 నిధాన మీ | ||౭౧||
71. ‘కాని, నేను అజ్ఞానం కాను. అజ్ఞానంతో చేసే కార్యాన్ని కూడా కాను. "అయం ఆత్మా బ్రహ్మ" లో ఆత్మను నేనే అని తెలుసుకో. "ప్రజ్ఞానం ఆనందం" అనే నిధినీ నేనే’.
‘అహం బ్రహ్మాస్మి’25 నిత్య స్ఫురణ | శుద్ధ ‘విద్యా’ తే హేచ జాణ |
మీ పాపీ అభాగీ దైవహీన | యా వృత్తీచీ ఖాణ ‘అవిద్యా’ | ||౭౨||
72. "అహం బ్రహ్మాస్మి" అని నిత్యం గుర్తుకు తెచ్చుకోవడమే శుద్ధమైన ‘విద్య’ అని తెలుసుకో. నేను పాపిని, అభాగ్యుణ్ణి, దురదృష్టవంతుణ్ణి అని అనుకోవటమే ‘అవిద్య’.
యా మాయేచ్యా పురాతన శక్తీ | ఎకీచే పాయీ26 బంధస్థితి |
దుజీపాసావ27 బంధనిర్ముక్తీ | యా జీవాప్రతీ అనాది | ||౭౩||
73. అవి మాయయొక్క పురాతన శక్తులు. ఒకటినించి (అవిద్య) బంధనం, రెండవదానినుండి (విద్య) బంధ విముక్తి ఏర్పడతాయి. ఇవి ప్రతి జీవునికి అనాదినుండి ఉన్నవి.
నామరూపాచా సకళ భ్రమ | హా తో అవఘా మాయాసంభ్రమ |
అనిర్వచనీయ మాయా పరమ | మోఠీ దుర్గమ తరావయా | ||౭౪||
74. నామ రూపాలన్నీ మాయయొక్క ఆట. ఈ మాయ ఇలా ఉంటుందని వర్ణించడం సాధ్యం కాదు. దానిని దాటటం మరీ కష్టం.
కల్పనేచే జే జే స్ఫురణ | తేంచ మాయేచే నివాసస్థాన |
బద్ధముక్త స్థితీచే జనన | కల్పనేమధూన నిశ్చిత | ||౭౫||
75. ఊహనుంచి ఏవేవి గుర్తుకు వస్తాయో అవే మాయయొక్క నివాస స్థానం. బంధనం, మరియు ముక్తి, ఈ రెండు స్థితిలూ నిశ్చయంగా ఊహనుంచే పుట్టినవి.
‘జ్ఞానాదేవ తు కైవల్యం’ | అబాధిత28 హే శ్రుతిప్రమేయ29 |
పరీ న హోతా పాపకర్మక్షయ | జ్ఞానాచా ఉదయ అశక్య | ||౭౬||
76. "జ్ఞానాదేవతు కైవల్యం" – ‘జ్ఞానంతోనే మోక్షం’ అన్న శ్రుతి సిద్ధాంతం అత్యంత సత్యం. కాని, పాప కర్మలు తగ్గేవరకూ జ్ఞానం కలగటం అసాధ్యం.
జయా బాణలే శుద్ధజ్ఞాన | సంకల్పే తయాస త్యాగిలే జాణ |
తయా నాహీ మాయేచే బంధన | వికారా స్థాన తే నవ్హే | ||౭౭||
77. శుద్ధ జ్ఞానం ఉన్నవారిని కోరికలే వదిలేస్తాయి. వారికి మాయయొక్క బంధం ఉండదు. వికారాలకూ వారివద్ద చోటు ఉండదు.
శుకా సారిఖా పరమజ్ఞానీ | వికల్పే30 ఝాలీ తయాహీ హానీ |
అజ్ఞాన ప్రకటే వికల్పాపాసునీ | తే గురువాంచూనీ నిరసేనా | ||౭౮||
78. శుక మహర్షి వంటి పరమ జ్ఞానికీ వికల్పాల (సంశయాల) వల్ల హాని కలిగింది. ఈ సంశయాలవల్లే అజ్ఞానం కలగుతుంది. వీటిని గురువు తప్ప ఎవరూ తొలగించలేరు.
ప్రవేశతా వికల్ప జ్ఞానీ | హోయ జ్ఞానియా31 హీ అభిమానీ |
విటే కాంజీచ్యా32 థేంబే దుధాణీ33 | హోతసే ఘాణీ దుగ్ధాచీ | ||౭౯||
79. జ్ఞానులలో సంశయాలు కలగితే, జ్ఞానులూ అభిమానులవుతారు. వారి స్థితి, పాలతో నిండివున్న పాత్రలో చుక్క పులుపు పడితే, పాలన్నీ విరిగి పాడైపోయినట్టు, అవుతుంది.
మ్హణోని ‘అజ్ఞాన’ సమజావే ఆధీ | తన్నిరాసే మనఃశుద్ధి |
హోతాంచ ప్రకటేల ‘జ్ఞాన’ నిరవధి34 | అభేద సమాధి లాధేల | ||౮౦||
80. అందుకే ముందు "అజ్ఞానం" ని తెలుసుకోవాలి అనేది. తరువాతే చిత్తశుద్ధి కలుగుతుంది. అంతులేని "జ్ఞానం" కలగుతుంది. శాశ్వతమైన సమాధి లభిస్తుంది.
జయా ద్రవ్య వైభవ ధ్యాన | విషయసేవనీ అతృప్తమన |
స్త్రీపుత్రాంచే అఖండ చింతన | తయాచే జ్ఞాన అజ్ఞానచి | ||౮౧||
81. వస్తువులను, వైభవాన్ని ఎవరు ధ్యానిస్తారో, ఎవరు ఇంద్రియాల కోరికలను అనుభవించటంలో తృప్తి చెందలేదో, భార్యాబిడ్డల గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటారో, అలాంటివారి జ్ఞానం కూడా అజ్ఞానమే.
మ్హణోని జోంవర భక్తీ విరహిత | అజ్ఞానావృత్త జ్ఞాన త్యాచే | ||౮౨||
82. డబ్బు, భార్యాబిడ్డల వల్ల అలా మోహితులైన వారు, జ్ఞానులైనా, తమ హితాన్ని తెలుసుకోలేరు. భక్తి కలగనంత వరకూ, వారి జ్ఞానం అజ్ఞానంతో నిండి ఉంటుంది.
జీవజాత35 అజ్ఞానయుక్త | అజ్ఞానాంతూన హోఊని ముక్త | జ్ఞానీ ఆణిక జ్ఞానాతీత | హోణే తే నిశ్చిత బ్రహ్మరూప | ||౮౩||
83. జీవకోటి అంతా అజ్ఞానంతో నిండియున్నది. ఈ అజ్ఞానంనుండి ముక్తి పొంది, జ్ఞానులైన తరువాత, జ్ఞానాన్ని దాటి పోవడమే, నిశ్చయంగా బ్రహ్మరూపాన్ని పొందటం.
అజ్ఞాన జాతా ప్రకటే జ్ఞాన | క్షమాశాలీ తో సజ్ఞాన | గేలా న జోంవర దేహాభిమాన | తోంవర తో ఆధీన ప్రకృతీచే | ||౮౪||
84. అజ్ఞానం పోతే జ్ఞానం కనిపిస్తుంది. క్షమాశీలురే జ్ఞానులు. కాని, శరీరాభిమానం పోనంత వరకూ, వారు మాయ అధీనంలో ఉన్నట్లే.
రామకృష్ణాది జే జే అవతార | సనత్సనకాది శిష్టప్రవర | తయాంచ్యా ఆజ్ఞేచీ ప్రకృతి కింకర | జియేనే తదితర36 భూలవిలే | ||౮౫||
85. అందరినీ భ్రమింప చేసే మాయ, రామకృష్ణాది అవతార పురుషులకు, సనత్సనకాది శ్రేష్ఠులకు, వారు చెప్పినట్లు నడచుకునే దాసి.
హృదయస్థ అసతా సర్వాంభూతీ | కోణీ నేణే స్వరూపస్థితి | ఏసీయా మాయేచీ అతర్క్య స్థితి | ఆవరణశక్తి అగాధ | ||౮౬||
86. అన్ని ప్రాణుల హృదయాలలో ఉన్నా, ఆత్మ స్వరూప స్థితి ఎవరికీ తెలియదు. అలాంటిది మాయయొక్క అర్థం కాని స్థితి. దీని ఆవరణ శక్తి అగాధం.
తరీ ‘మీ కర్తా మీచి భోక్తా’ | సోడిల్యావీణ ఖోటీ అహంతా | తయా హృదయస్థా శరణ న రిఘతా | నిజనిర్ముక్తతా లాభేనా | ||౮౭||
87. అందువల్ల, "నేను కర్తను, నేనే అనుభవిస్తాను" అన్న నిజం కాని అహం భావం విడవకుంటే, మన హృదయంలో ఉన్న ఆత్మకు శరణాగతి కాకుంటే, మనకు ముక్తి లభించదు.
నిత్యానిత్య వస్తు వివేచన | శ్రవణమనన నిదిధ్యాసన | కరా, వ్హా, శమదమాది షట్కసంపన్న | తేణేంచ నివర్తన అజ్ఞానా | ||౮౮||
88. శాశ్వతమైనదేది, శాశ్వతం కానిదేది అని వస్తువును ఆలోచనతో వేరు చేసి, శ్రవణ, మనన, నిధిధ్యాసన చేసి, శమ దమ మొదలైన ఆరు సంపత్తిని సాధించు. అప్పుడే అజ్ఞానం పోతుంది.
జగ మజహూన సారే భిన్న | మీ తో పరిమిత37 పరిఛిన్న38 | ‘దేహ తోచి మీ’ హే భాన | హే తో అజ్ఞాన నిర్భేళ | ||౮౯||
89. ఈ జగత్తు మొత్తం వేరు, నేను వేరు. నేను పరిమితుణ్ణి, పరిచ్ఛిన్నుణ్ణి. ‘ఈ దేహమే నేను’ అన్న భావనే శుద్ధమైన అజ్ఞానం.
జ్ఞానప్రతిపాదక వేదాంతశాస్త్ర | తేథ అనుబంధ చతుష్టయ ప్రకార | పరమ కారుణిక భాష్యకార | వర్ణితీ విస్తారపూర్వక | ||౯౦||
90. జ్ఞానంతో నిండిన వేదాంత శాస్త్రాలలో, పరమ దయామయులైన భాష్యకారులు, "అనుబంధ చతుష్టయాన్ని" (వేదాలను, వేదాంతా గ్రంథాలను ఎవరు చదవాలి (అధికారి)? అందులో ఏమి చెప్పదలచుకున్నారు (విషయం)? దానిని ఎంతవరకు చెప్పగలిగారు (సంబంధం)? మరియు వానిని చదవటం వలన వచ్చే ప్రయోజనాలు ఏవి (ప్రయోజనం)? అన్న నాలుగింటిని ‘అధ్యయన చతుష్టయం’ అని అంటారు.) విస్తార పూర్వకంగా వర్ణించారు.
‘అధికారీ’ ‘విషయ’ ‘సంబంధ’ తీన | అనుబంధ చౌథా మ్హణజే ‘ప్రయోజన’ |
ప్రయోజనాచే హోతా వివేచన | అజ్ఞాననివర్తన తై కళతే | ||౯౧||
91. అందులో, ‘అధికారి’, ‘విషయం’, ‘సంబంధం’ అనేవి మూడు. నాలుగవ అనుబంధం అంటే ‘ప్రయోజనం’. ప్రయోజనంనుంచి వివేచనం (విమర్శ) అవుతుంది. దానివల్ల అజ్ఞానాన్ని తొలగించే మార్గం తెలుస్తుంది.
జీవబ్రహ్మాచీ జీ ఏక్యతా | తోచ ముఖ్య ‘విషయ’ యా వేదాంతా | త్యా ఏక్యప్రమేయాంతర్గత జీ అజ్ఞానతా | తన్నివర్తతా తే ‘ప్రయోజన’ | ||౯౨||
92. ఈ జీవం, బ్రహ్మ ఇద్దరూ ఒక్కటే అనేదే, వేదాంతంలోని ముఖ్య ‘విషయం’. ఆ ఒక్కటే అనే సంగతిలో, దాగి ఉన్న అజ్ఞానాన్ని తొలగించడమే, ‘ప్రయోజనం’.
త్యా మూలా జ్ఞానాచీ నివృత్తి | తీచ కీ స్వరూపానందప్రాప్తి | మ్హణోని కరూని యుక్తిప్రయుక్తి | అజ్ఞానోచ్ఛిత్తీ39 ఆవశ్యక | ||౯౩||
93. సమూలంగా అజ్ఞానాన్ని తొలగించడమే ఆత్మయొక్క స్వరూపాన్ని తెలుసుకుని పొందే ఆనందం. అంటే, యుక్తి, ప్రయుక్తులతో అజ్ఞానాన్ని తొలగించటము ఆవశ్యకం.
జో న భేదాచే నిరసన | తో న కోణీహీ సజ్ఞాన | దేహాభిమానీ యాంచే జ్ఞాన | పూర్ణ ‘అజ్ఞాన’ త్యా నాంవ | ||౯౪||
94. ఈ భేదాన్ని తొలగించక పోతే, ఎవరూ జ్ఞానులు కారు. దేహం మీద అభిమానం ఉన్నవారి జ్ఞానం, సంపూర్ణ ‘అజ్ఞానం’ అని పిలవబడుతుంది.
స్వయే మిరవీ సజ్ఞాన | కరీ అవిహిత40 కర్మాచరణ | జళో త్యాచే జాగేపణ | తో కుంభకర్ణ నిద్రిస్త | ||౯౫||
95. తామే జ్ఞానులమని చెప్పుకుని, చేయకూడని పనులను చేసే వారి జాగృతత్వం తగల బడినట్లే. వారు నిద్రిస్తున్న కుంభకర్ణులు.
వేదబాహ్య జ్యాచే వర్తన | న కరీ వర్ణాశ్రమపరిపాలన | తయాచ్యా చిత్తశుద్ధీచే సాధన | అవిద్యానిరసన హే ఎక | ||౯౬||
96. వేదాలలో చెప్ప బడని విచిత్ర నడకతో, వర్ణాశ్రమలను పరిపాలించకుండా ఉండేవారి చిత్తశుద్ధికి సాధనం, అజ్ఞానాన్ని నశింప చేయటమొక్కటే.
సత్వాది త్రిగుణత్రిప్రకారే | శబ్దాది విషయ నానావికారే | ఉపస్థ41 ఆణీ జివ్హాద్వారే | బ్రహ్మాది సారే ఠకియేలే | ||౯౭||
97. సత్వాది త్రిగుణాలు, శబ్దాది మూడు రకాలైన విషయాలు, నానా రకమైన వికారాలు, రహస్య అంగాంగాలు, నాలుక మొదలైన ఇంద్రియాలు, వీని ద్వారా బ్రహ్మాదులందరూ మొసగింప బడ్డారు.
జగజ్జంగమ ప్రాణిజాత | అనాది అవిద్యా మాయా పరివృత్త | రాగద్వేషాది వికారే మోహిత | అజ్ఞానావృత హే సర్వ | ||౯౮||
98. జగత్తులోని ప్రాణులన్నీ అనాదినుండి అజ్ఞానం మాయతో కప్పబడి ఉన్నాయి. రాగద్వేషాది వికారాలతో మోహింప బడి, అజ్ఞానంతో ఇవన్నీ కప్పబడి ఉన్నాయి.
అవిద్యేమాజీ జీవబద్ధ | త్యాచే ప్రకటావయా రూప శుద్ధ | అవిద్యా కామ కర్మబంధ | తుటలా సంబంధ పాహిజే | ||౯౯||
99. జీవుడు అవిద్యవల్ల కట్టబడి ఉన్నాడు. ఈ అవిద్య, కోరికలు మరియు కర్మ బంధాలు విడిపోవాలి. అప్పుడే, అతని శుద్ధ ఆత్మ స్వరూపం బయటికి వస్తుంది.
దుగ్ధే తుడుంబ గళతీ సడ42 | తేథేంచ ఘట్ట చికటలే గోచిడ | పరీ తయా అశుద్ధీ43 ఆవడ | దుగ్ధాచీ కాయ చాడ44 తయా | ||౧౦౦||
100. పాలతో పొదుగు నిండుగా ఉంటుంది. జోరీగ పొదుగును గట్టిగా పట్టుకుని అక్కడే ఉంటుంది. కాని, దానికి అశుద్ధి (రక్తం) అంటే ప్రీతి. పాల అవసరం దానికి ఏముంటుంది?
పహా దుర్దర ఆణి భ్రమర | కమళ సుందర దోఘాంచే ఘర |
పరీ పరాగీ భ్రమరా విహార | దుర్దురా ఆహార చిఖలాచా | ||౧౦౧||
101. అలాగే, కప్ప మరియు తుమ్మెదను చూడండి. అందమైన తామర పువ్వు రెండింటికీ నివాస స్థానం. కాని, తుమ్మెద పువ్వులో విహరిస్తే, పక్కనే ఉన్న బురద కప్పకు ఆహారం.
అజ్ఞానచి వాటే జ్ఞాన మూఢా | జ్ఞానాచా పాఢా కాయ తయా | ||౧౦౨||
102. ఎదురుగా జ్ఞాన నిధి కనిపించినా, మూర్ఖుడు అజ్ఞానం వైపే ఆకర్షింపబడతాడు. అజ్ఞానమే జ్ఞానమని మూర్ఖునికి అనిపిస్తుంది. జ్ఞానం గురించిన పాఠాలు వానికి ఎందుకు?
హోతా అవిద్యేచే నిర్మూలన | స్వయే ప్రకటే బ్రహ్మజ్ఞాన | మ్హణూన అవిద్యేచే ప్రతిపాదన | ఆవశ్యక జాణ ఆరంభీ | ||౧౦౩||
103. అవిద్యయొక్క నాశమైతె, బ్రహ్మజ్ఞానం స్వయంగా బయటికి వస్తుంది. అందుకే, ముందే అవిద్య గురించి తెలుసుకోవడం ఆవశ్యకమని తెలుసుకో.
ఎకా బ్రహ్మజ్ఞానాసమాన | నాహీ పవిత్ర త్రిజగీ ఆన | త్యాచ్యాచ ఉపదేశా అత్యంత మాన | త్యావీణ జీవన నిర్ఫళ | ||౧౦౪||
104. ఒక్క బ్రహ్మజ్ఞానానికి సమానంగా పవిత్రమైనది, మూడు లోకాలలో వేరే ఏదీ లేదు. దాని గురించిన ఉపదేశం అత్యంత మహత్వం గలది. అది లేని జీవనం వ్యర్థం.
బుద్ధ్యాదికాంచా చేష్టా విషయ | బ్రహ్మ హే అసతే ఏసే కార్య | తరీ ఎకాదే తరీ ఇంద్రియ | తే హే హోయసే దాఖవితే | ||౧౦౫||
105. బుద్ధి మొదలైన ఇంద్రియాలు చేసే పనులలో, బ్రహ్మ ఒక విషయమైతే, ఏ ఒక్క ఇంద్రియమైనా బ్రహ్మను చూపించి ఉండేది.
బ్రహ్మతత్వ బుద్ధిగ్రాహీ | ‘బుద్ధిగ్రాహ్యమతీంద్రియ’45 పాహీ | ఏసే స్మృతి గర్జతాంహీ | శ్రుతీస తే నాహీ సంమత | ||౧౦౬||
106. బ్రహ్మతత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు. ‘బుద్ధిగ్రాహ్యమతీంద్రియ’ – ‘ఇంద్రియాలకు అర్థంకానిదానిని, బుద్ధి గ్రహించగలదు’ అని స్మృతులు గర్జించినా, అది శ్రుతి సమ్మతం కాదు.
బుద్ధ్యాదికాంచా ఝాల్యా అభావ | గ్రహణ కారణచి ఝాలే వావ | మగ బ్రహ్మాచా అస్తిత్వభావ | ఉరలా న ఠావ మానావయా | ||౧౦౭||
107. బుద్ధి మొదలైన ఇంద్రియాలు పని చేసే స్థితిలో లేనప్పుడు, అర్థం చేసుకునే సాధనలు ఉండవు. అప్పుడు, బ్రహ్మ ఉనికిని ఒప్పుకునే సమస్యే ఉండదు.
కరణగోచర46 జే జే కాంహీ | తే తే ఆహే ఇతర నాహీ | హే తో సర్వత్ర ప్రసిద్ధ పాహీ | బ్రహ్మ కదాహీ అసతా నయే | ||౧౦౮||
108. ఇంద్రియాలకు గోచరించేవన్నీ ఉన్నాయి కాని, మిగతావేవీ లేవు అని అంతటా ప్రసిద్ధి. అలాంటప్పుడు బ్రహ్మ కూడా లేనట్టే.
ఏసా హోఈల యాచా అర్థ | పరీ తేణే హోఈల అనర్థ | సూక్ష్మతారతమ్యపరంపరార్థ | బుద్ధిహీ సత్ నిరంతర | ||౧౦౯||
109. ఇలా దీని అర్థం చెబితే, దానివల్ల చాలా అనర్థం అవుతుంది. సూక్ష్మమైన తర తమ దృష్టితో గ్రహించిన పారంపారిక అర్థం బట్టీ, బుద్ధియే ఎల్లప్పుడూ ఉండే మంచి వస్తువు.
హోఈనా కా తిచాహీ ప్రలయ | తేథేంహీ తీ వసే సత్ప్ర త్యయ | ఆత్మా విశ్వాచే మూళ నిఃసంశయ | అస్తిత్వనిష్ఠ లయ సర్వ | ||౧౧౦||
110. దాని అంతమై పోయినా, అది అక్కడే సద్వస్తువుగా ఉంటుంది. నిస్సందేహంగా విశ్వానికి ఆత్మ మూలం. అన్నీఅంతమై పోయినా, ఆత్మయొక్క ఉనికి ఎప్పుడూ ఉంటుంది.
ఖడా మారితా ఘటావరతీ | ఆకారవిలయే ఖాపర్యా ఉరతీ |
ఘటకారా జరీ నివృత్తి | ఖాపర్యా అనువృత్తిదర్శక | ||౧౧౧||
111. కుండను రాయితో కొట్టితే, దాని ఆకారం పోయి పెంకులు మిగులుతాయి. కుండ ఆకారం లేకున్నా, పెంకులు దాని ఉనికిని తెలుపుతాయి.
జరీ ఘటకార్యాచా ధ్వంస | ఘటస్తిత్వా నాహీ నాశ | ఖాపర్యా కారణ అనువృత్తీస | కార్యస్తిత్వాంశ తేణేపరీ | ||౧౧౨||
112. కుండ ఆకారం ఉద్దేశం ధ్వంసం అయినా, కుండయొక్క ఉనికి నాశనం కాలేదు. పెంకులు దాని ఉనికికి సాక్ష్యం. కుండ ఆకారం యొక్క ఉనికి అంశ ఆ పెంకుల్లో మిగిలి ఉంటుంది.
శూన్యత్వీ జ్యాచే పర్యవసాన | ఏసే న కేవ్హాంహీ కార్యప్రవిలాపన | అస్తిత్వనిష్ఠ లయ హే ప్రమాణ | సత్ప్రకత్యయలీన సద్బుద్ధి | ||౧౧౩||
113. ఏ కార్యమైనా శూన్యంలో సమాప్తి చెందదు. ఏది అంతమైనా, దాని ఉనికి సూక్ష్మరూపంలో ఉంటుంది. సత్యొక్క అనుభవం సద్బుద్ధిలో తెలియడమే దీనికి ప్రమాణం.
సర్వ తీర్థే వ్రతే పావన | పావనాహూన పావన జ్ఞాన | తయా బ్రహ్మజ్ఞానావాచూన | భజనపూజన నిరర్థక | ||౧౧౪||
114. అన్ని తీర్థాలు, వ్రతాలు పావనం. కాని వీటికంటే పావనం, పావనమైన జ్ఞానం. అలాంటి బ్రహ్మజ్ఞానం లేకుంటే భజనలు, పూజలూ అర్థం లేనివి.
అవిద్యేనే చిత్త మలిన | త్యా చిత్తాచే మలక్షాలన | నాహీ ఈశభక్తీవాంచూన | భక్తీవీణ జ్ఞాన ఉపజేనా | ||౧౧౫||
115. అవిద్యతో మనసు మలినమౌతుంది. ఆ మనసుయొక్క మలినాన్ని కడగటం ఈశ్వరుని భక్తితో తప్ప, వేరే దేనితోనూ జరగదు. భక్తి లేకుండా జ్ఞానం చిగురించదు.
మ్హణూన ఆధీ అజ్ఞాన జాణ | తయాచా బోధ తయాచే నిరూపణ | హోతా హోఈల తద్బంధనిరసన | భక్తీచ ప్రమాణ తయాతే | ||౧౧౬||
116. అంటే, ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాని స్వభావం, దాని నిరూపణ స్పష్టంగా తెలుసుకుంటే, దాని బంధనం సడలిస్తుంది. భక్తియే దీనికి సాధనం.
పాయాళాచే డోళా అంజన | పడతా దేఖే భూమిగత ధన | తేవీ భక్తీచే హోతా అవలంబన | అజ్ఞాననిరసన జ్ఞానోదయ | ||౧౧౭||
117. ఎదురు కాళ్లతో పుట్టినవారు, అంజనం వేసిన కళ్లతో, భూమిలో దాగి ఉన్న ధనాన్ని చూసినట్లు, భక్తిని అవలంబిస్తే, అజ్ఞానం తొలగిపోయి, జ్ఞానోదయం అవుతుంది.
జ్ఞాన తేంచ స్వరూపప్రాప్తి | తయా మూళ అజ్ఞాననివృత్తి | ఘడల్యావాంచూని ఈశభక్తి | మాయేచీ శక్తి అనివార | ||౧౧౮||
118. ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. దానికి మూలమైన అజ్ఞానాన్ని తొలగించుట. ఈశుని భక్తి లేకుండా మాయయొక్క శక్తిని ఎదుర్కోవటం అసాధ్యం.
జ్ఞానాజ్ఞానాచీ భేసళ | అజ్ఞాన వేంచూని కాఢావే నిఖళ | ఖడే టాకూన ఘ్యావే తాందుళ | ఆధణీ నివళ వైరావయా | ||౧౧౯||
119. జ్ఞానం, అజ్ఞానం రెండూ కలిసే ఉంటాయి. వానినుండి అజ్ఞానాన్ని జాగ్రత్తగా వేరు చేయాలి. ఎసరులో పోసి వండటానికి రాళ్లను ఏరేసి బియ్యాన్నే తీసుకోవాలి.
భూతీ భగవంత ఠాయీ ఠాయీ | జ్ఞానయజ్ఞాది ఉపాసనాహీ | విశ్వతో ముఖ కృష్ణా జో పాహీ | అజ్ఞానదాహీ జ్ఞానాస్తవ | ||౧౨౦||
120. అంతటా, అన్ని ప్రాణులలోనూ, భగవంతుడే ఉన్నాడన్న భావంతో జ్ఞానయజ్ఞాది ఉపాసనలను చేసి, సర్వవ్యాపి అయిన శ్రీకృష్ణుని చూసేవారు, జ్ఞానం కొరకు అజ్ఞానాన్ని దహించివేస్తారు.
ఆతా జ్ఞానయజ్ఞాచే స్వరూప | ‘అహం బ్రహ్మాస్మి’ జేథీల యూప |
పంచమహాభూతే యజ్ఞమండప | జీవేశ్వర భేద పశు తేథే | ||౧౨౧||
121. ఇప్పుడు జ్ఞానయజ్ఞంయొక్క స్వరూపాన్ని గమనించండి. “అహం బ్రహ్మాస్మీ” (“నేనే బ్రహ్మను”) అన్నదే అందులోని స్థంభం (యజ్ఞ పశువు కోసం చేయబడిన ఆధారం). జీవాత్మ వేరె, ఈశ్వరుడు వేరే అన్న తత్వమే అక్కడ కట్టబడిన యజ్ఞ పశువు. పంచ మహాభూతాలు యజ్ఞమండపం.
మనబుద్ధీచియా కుండాంమధూన | ప్రదీప్తీకరణ జ్ఞానాగ్నీచే | ||౧౨౨||
122. పంచేద్రియాలు, పంచప్రాణాలు ఇవే యజ్ఞ సామగ్రి. మనసు, బుద్ధి అనే యజ్ఞకుండంలో జ్ఞానాగ్ని రగుల్కొల్ప బడుతుంది.
యజ్ఞకర్తా జీవ యజమాన | కరీ అజ్ఞానఘృతావదాన | ఆత్మానందరసీ నిమగ్న | అవభృథస్నాన జీవా ఘడే | ||౧౨౩||
123. యజ్ఞకర్త యజమాని అయిన జీవుడు. అజ్ఞానమనే నేతిని ఆహుతి చేస్తాడు. దానితో లభించే ఆత్మానంద రసంలో నిమగ్నమైన ఆ జీవునికి అవభృత స్నానం (యజ్ఞం చేసేటప్పుడు జరిగే లోప దోషాలను నివారించటానికి, యజ్ఞం తరువాత చేసే స్నానం) జరుగుతుంది.
తాత్పర్య అజ్ఞానఘృతావాచూన | కదా న ప్రకటే జ్ఞానహుతాశన | జీవేశ్వర భేదాతే జాళూన | అభేదజ్ఞాన ప్రకట కరీ | ||౧౨౪||
124. జీవాత్మకు ఈశ్వరుడికి ఉన్న భేదాన్ని కాల్చి, జీవాత్మ ఈశ్వరుడు ఒక్కటే అనే జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానాగ్నికి, అజ్ఞానమనే నేతిని వెయ్యకుంటే, ఆ అగ్ని ప్రజ్వలించదు అనేదే దీని తాత్పర్యం.
ఆదర్శ స్వచ్ఛ మలాచ్ఛాదిత | వన్హి ప్రకాశ ధూమావృత | తైసే కామక్రోధాభిభూత | అజ్ఞానే తిరోహిత తే జ్ఞాన | ||౧౨౫||
125. నిర్మలమైన అద్దం దుమ్ముతో కమ్ముకున్నట్లు, అగ్ని ప్రకాశం పొగతో కప్ప బడినట్లు, కామక్రోధాలకు వశమైన జ్ఞానం, అజ్ఞానంతో కప్ప బడింది.
చంద్రబింబా రాహూ గ్రాసీ | అథవా శైవాల జైసే జలాసీ | తైసే స్వయంప్రకాశ జ్ఞానాసీ | ఆచ్ఛాదీ కైసీ హీ మాయా | ||౧౨౬||
126. చంద్రబింబాన్ని రాహువు మ్రింగినట్లు, నీటిని నాచు ఆవరించినట్లు, స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని మాయ కప్పివేస్తుంది.
మోఠమోఠ్యా జ్ఞాత్యాంచీ మతీ | భ్రష్ట హోఊని జాతీ అధోగతీ | ఉపాయ మాహితీ పరీ న తగతీ | ఆచరణ కరితీ యథేచ్ఛ | ||౧౨౭||
127. గొప్ప గొప్ప జ్ఞానులు మతి భ్రష్టు పట్టి, అధోగతి పాలవుతారు. ఉపాయం తెలిసినా రక్షింప బడరు. ఇష్టం వచ్చినట్లు నడచుకుంటారు.
డోళస అసతా అంధ హోతీ | సంగ సోడూని నిఃసంగ వర్తతీ | తేహీ బళే కుసంగే నాడతీ | ఆచరణ కరితీ యథేచ్ఛ | ||౧౨౮||
128. కళ్లున్నా గ్రుడ్డివారౌతారు. ఉన్న తోడుని వదులుకుని, తోడు లేనివారౌతారు. వారు కూడా చెడు సహవాసంతో నాశనమౌతారు. ఇష్టం వచ్చినట్లు నడచుకుంటారు.
వానప్రస్థ గృహస్థాశ్రమ ఘేతీ | కరూ నయే తే అచూక కరితీ | జియా వస్తూచీ చిళస ఘేతీ | తీచ స్వీకారితీ ప్రియ మ్హణునీ | ||౧౨౯||
129. వానప్రస్థానానికి వచ్చినా, గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తారు. చేయరానివన్నీ తప్పకుండా చేస్తారు. మునుపు అసహ్యించుకున్న వాటినే ప్రేమగా స్వీకరిస్తారు.
ప్రయత్నే జే పాపే చుకవితీ | తేహీ అదృష్టే పాపాంత పడతీ | కాయ మ్హణావే ఏసియే స్థితీ | హీ కాయ జ్ఞాతీ జ్ఞాన్యాచీ | ||౧౩౦||
130. ప్రయత్నంతో ఏ పాపాలను తొలగించుకున్నారో, దురదృష్టం కొద్దీ, మరల అవే పాపాలలో పడిపోతారు. ఇటువంటి స్థితిని ఏమనాలి? ఇటువంటి జ్ఞానులది ఏ జాతి?
జరీ మోఠా జ్ఞానీ ఝాలా | నేచ్ఛీ పాపాచే సావలీలా |
తరీ తో కార్యాకార్యజ్ఞతేలా | భులే దీపాలా పతంగసా | ||౧౩౧||
131. గొప్ప జ్ఞానియై ఉండి, పాపపు నీడనైనా కోరనివాడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే ఆలోచనా శక్తిని కోల్పోయి, దీపానికి ఎరయై పోయే పురుగులా వ్యామోహంలో చిక్కుకుంటాడు.
పాప కరణే హే అజ్ఞాన | యాచీ తయా పూర్ణ జాణ | పరీ హా కామ ప్రవృత్తికారణ | కరీ నా గుమాన తయాచీ | ||౧౩౨||
132. పాపం చేయడం అజ్ఞానమని పూర్తిగా తెలిసినా, కోరికల ఒత్తడి వలన, దానిని లక్ష్య పెట్టడు.
హే అవఘే క్రియాజాత | కేవళ ఎకా కామాచే చేష్టిత | కామ సర్వానర్థా హేత | తోచ కీ పరిణత క్రోధరూపే | ||౧౩౩||
133. జరుగుతున్న ఈ పనులన్నీ కేవలం ఒక్క కామం అనబడే కోరికల వలననే. కామం అన్ని అనర్థాలకు మూలం. అదే క్రోధమనే కోప రూపంగా పరిణమిస్తుంది.
కామగతీస జై అవరోధ | తైంచ తో కామ హోఈ క్రోధ | పదోపదీ హా మోక్షాస విరుద్ధ | జ్ఞానప్రతిబంధక హీ వృత్తి | ||౧౩౪||
134. కామం దారికి అడ్డు కలిగినప్పుడు, అదే కామం క్రోధమౌతుంది. అడుగడుగునా మోక్షానికి అది అడ్డుపడుతుంది. ఈ నడతే జ్ఞానాన్ని అడ్డగిస్తుంది.
కామక్రోధ యాంచా త్రాస | జడలాచ ఆహే యా జీవాస | బ్రహ్మస్వరూపా జవళపాస | జ్ఞానాచే పంక్తీస వాస యాంచా | ||౧౩౫||
135. కామక్రోధాల బాధలు జీవులను అంటిపెట్టుకుని ఉంటాయి. బ్రహ్మ స్వరూపం సమీపంలో, జ్ఞాన పంక్తిలోనే వీటి వాస స్థానం.
పాణ్యావాంచూన బుడవితాత | అగ్నీవాంచూన జాళితాత | శస్త్రావాంచూన మారతాత | దోరావీణ కరితాత బంధన | ||౧౩౬||
136. నీరు లేకుండానే ముంచేస్తాయి. అగ్ని లేకుండానే దహించి వేస్తాయి. శస్త్రాలు లేకుండానే సంహరిస్తాయి. త్రాడు లేకుండానే కట్టి పడేస్తాయి.
తయాపుఢే జ్ఞానీహీ న టికత | జ్ఞానియా కరితీ పైజేనే చిత47 | మహాప్రలయ కరణ్యాచే సామర్థ్య | నకళతా గ్రాసీత ప్రణియా | ||౧౩౭||
137. వీని ముందు జ్ఞానులు కూడా నిలవలేరు. జ్ఞానులను చిత్తుగా ఓడించేస్తాయి. మహాప్రళయాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది. ప్రాణులకు తెలియకుండానే మ్రింగేస్తాయి.
చందనాచే వృక్షాముళీ | జైసీ కాళసర్పాచీ వేటోళీ | తైసీ కామక్రోధాచీ ఖోళీ | వరూన వేటోళీ జ్ఞానగర్భా | ||౧౩౮||
138. చందనం చెట్టు మూలానికి చుట్టుకున్న కాలసర్పం వలె, జ్ఞానన్ని, కామ క్రోధాలు చుట్టుకుని ఉన్నాయి.
ఇంద్రియే బుద్ధి ఆణి మన | హీ త్యా కామాచే ఆయతన | తయాంచ్యా యోగే జీవాచే జ్ఞాన | ఝాంకూన మోహన ఘాలీ తయా | ||౧౩౯||
139. ఇంద్రియాలు, బుద్ధి మరియు మనసు ఇవి కామంయొక్క నివాస స్థలం. వీటి ద్వారా జీవుల జ్ఞానాన్ని మూతపెట్టి, (మాయ) మోహంలో పడేస్తుంది.
జరీ తుమ్హా పాహిజే చందన | తరీ సర్పాచే కరా కందన | కామక్రోధాచే సారూని ఆవరణ | సాధావే నిధాన జ్ఞానాచే | ||౧౪౦||
140. చందనం మీకు కావాలంటే సర్పాన్ని చంపేయండి. అలాగే, కామ క్రోధాల ముసుగును తొలగించి, జ్ఞాన నిధిని సాధించండి.
న కరితా సర్పాచే కందన | లాభేల కాయ కవణా చందన |
కృష్ణసర్ప సంహారిల్యావీణ | పురలేలే ధన లాభేల కాం | ||౧౪౧||
141. సర్పాన్ని చంపకుండా ఎవరికైనా చందనం లభిస్తుందా? కృష్ణ సర్పాన్ని చంపకుండా పూడ్చి పెట్టిన ధనం లభిస్తుందా?
ప్రకృతి జవనికా నిస్సారణ | హే ఎకచి సాధన తదర్థ | ||౧౪౨||
142. అలాగే, పర తత్త్వమైన ఆత్మ జ్ఞానాన్ని పొందటానికి మాయయొక్క ముసుగును తొలగించాలి. దానికి అదోక్కటే సాధనం.
మ్హణోన ఆధీ ఇంద్రియనియమన | తేణే కామ క్రోధా నిర్దళణ | జీవ కామక్రోధా ఆధీన | అజ్ఞాన ఆవరణ జ్ఞానాస | ||౧౪౩||
143. కనుక, ముందు ఇంద్రియాలను మన అధీనంలో ఉంచుకుంటే, కామక్రోధాలు అణగిపోతాయి. లేకుంటే, జీవుడు కామక్రోధాల అధీనంలో ఉంటాడు. అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేస్తుంది.
దేహాహూన ఇంద్రియే సూక్ష్మ | మన తయాంహూన సూక్ష్మ పరమ | బుద్ధీ మనాహూనహీ సూక్ష్మతమ | పరమాత్మా బుద్ధీహూన సూక్ష్మ | ||౧౪౪||
144. దేహం కంటే ఇంద్రియాలు సూక్ష్మం. మనసు వానికంటే సూక్ష్మం. బుద్ధి మనసు కంటే సూక్ష్మతమం. పరమాత్మ బుద్ధి కంటేనూ సూక్ష్మం.
సర్వ సంసారధర్మ వర్జిత | ఏసే హే పరాత్పర పరమసత | తో హా పరమాత్మా పరమహిత | తేంచ అమృత నిజరూప | ||౧౪౫||
145. సంసార ధర్మాలకు లోబడకుండా వేరుగా ఉన్నదే పరమాత్మ - ఇది పరమ సత్యం. పరమ హితకారి అయిన పరమాత్మయే అమృతమైన నిజరూపం.
శుద్ధ బుద్ధ నిత్య ముక్త | తేంచ తత్వ అభేదస్థిత | తేంచ పరమానందభూత | ప్రత్యగ్భూత చైతన్యాతే | ||౧౪౬||
146. జీవాత్మ, పరమాత్మ ఒక్కటే అన్న తత్వం శుద్ధమైనది, బుద్ధికి సమ్మతమైనది, ఎల్లప్పుడూ ఉండే స్థితి. అదే పరమానందంనుంచి పుట్టుకొచ్చిన చైతన్యం.
జయా నామ పంచీకరణ | తేంచ కీ మాయారూపదర్శన | అధ్యారూపాంపవాదైకసాధన48 | వ్హావయా ప్రబోధన తయాచే | ||౧౪౭||
147. “పంచీకరణ” (పంచీకరణం అనేది వేదాంతంలోని ఒక తత్వం. శుద్ధ చైతన్యమయిన సత్+చిత్+ఆనందంనుంచి ఐదు భూతాలు (ఆకాశం, అగ్ని, వాయు, జలం, మరియు పృథ్వి) ఎలా పుట్టాయి అనేదే ఈ తత్వం. అంటే, శక్తినుండి భౌతికమైన జడ వస్తువులు ఎలా పుట్టాయి అనేదే పంచీకరణం.) అని దేనినంటారో, అదే మాయయొక్క రూపం. దానిని తెలుసుకోవటానికి “అధ్యారోప, అపవాదాలు” ఒక్కటే సాధనం (అధ్యారోప, అపవాదాలు అంటే లేనిదానిని మునుపు ఆపాదించి, తరువాత దానిని ఖండించడం).
అపంచీకృత పంచమహాభూతే | పంచతన్మాత్రా వదతీ జ్యాంతే | తత్కార్య ప్రాణేంద్రియ మనోబుద్ధీతే | ‘సూక్ష్మ’ శరీరతా యేతే ఆత్మయాచీ | ||౧౪౮||
148. “పంచీకరణం” కాని పంచ మహా భూతాలను, పంచ తన్మాత్రలని అంటారు. ప్రాణేంద్రియాలు, మనసు, బుద్ధి, వీనితో ఆత్మయొక్క సూక్ష్మ శరీరాన్ని తయారు చేయటమే “పంచ తన్మాత్రల” పని.
పహా పంచీకృత పంచభూతే | తేథూన విరాట ఉదయా యేతే | తయా ఆత్మ్యాచే ‘స్థూల’ దేహాతే | ‘విరాట’ జ్ఞాతే వదతాత | ||౧౪౯||
149. “పంచీకృత” పంచభూతాలను గమనించండి. అందులోంచి విరాట పురుషుడు ఉదయిస్తాడు. ఆత్మయొక్క స్థూల (సూక్ష్మం కాని) దేహాన్ని ‘విరాట’ అని జ్ఞానులు అంటారు.
స్థూల సూక్ష్మ శరీరా కారణ | కేవళ స్వస్వరూపాజ్ఞాన | తేంచ సాభాస ‘అవ్యాకృత’ జాణ | శరీర ‘కారణ’ ఆత్మ్యాచే | ||౧౫౦||
150. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం, నిజమైన ఆత్మ స్వరూపం గురించి అజ్ఞానమే. అదే, మనము అనుకునే కనిపించని ఆత్మయొక్క ‘కారణ’ శరీరం అని తెలుసుకో.
హే కారణ శరీర ఖ్యాత | జే చైతన్యప్రతిబింబయుత |
కేవలా జ్ఞానా కారణభూత | అవ్యాకృత అవ్యక్త జ్యా నామ | ||౧౫౧||
151. కనిపించని ఈ కారణ శరీరమే చైతన్యంయొక్క ప్రతిబింబము అని అనుకోవటానికి కేవలం అజ్ఞానమే కారణం. దీనినే అవ్యక్తమని (కనిపించనిది), అవ్యాకృతమని (విభజించలేనిది) అంటారు.
ఆత్మ్యాచే అజ్ఞాన తే యా కారణ | నా నిరవయవ నా సావయవ నా ఉభయ జాణ | కేవళ బ్రహ్మాత్మైకత్వజ్ఞాన | తేణేంచ కీ నిరసన యా దేహా | ||౧౫౨||
152. ఆత్మ గురించిన అజ్ఞానమే దీనికి కారణం. ఇది అవయవాలతో కాని, అవయవాలు లేకుండా కాని, రెండిటితో కాని, ఉండదు అని తెలుసుకో. కేవలం బ్రహ్మ ఆత్మ ఏకత్వం జ్ఞానంతోనే ఈ దేహం నశించటం.
స్వస్వరూపీ అవస్థాన | తయాసీచ ‘మోక్ష’ అభిధాన | యావీణ మోక్ష నాహీ ఆన | స్వరూపావస్థాన తో మోక్ష | ||౧౫౩||
153. ఆత్మ స్వరూపంలో స్థిరపడటమే ‘మోక్షం’. ఇంతకంటే మోక్షం వేరే ఏదీ లేదు. ఆత్మ స్వరూపంలో స్థిరంగా ఉండటమే మోక్షం.
కేవల బ్రహ్మాత్మైకత్వ జ్ఞాన | జాహల్యా హోఈల అజ్ఞాననిరసన | మ్హణూన అజ్ఞాన సమజావయా జాణ | తయాచే నిరూపణ ఆవశ్యక | ||౧౫౪||
154. బ్రహ్మ, ఆత్మ రెండూ ఒక్కటే అనే ఏకత్వ జ్ఞానం కలిగితేనే అజ్ఞానం నశిస్తుంది. అందువలన, అజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, దాని నిరూపణ అవశ్యకం అని తెలుసుకో.
అవిద్యేనే శబల ఝాలే | తేణే బ్రహ్మా శబలత్వ ఆలే | తయా ‘సత్’ హే నామ ఠేవిలే | ఏసే తే పావలే వాచ్యత్వ | ||౧౫౫||
155. అవిద్యం వలనే బ్రహ్మ అనేక భాగాలుగా విభజింపబడింది. అలా బ్రహ్మకు బహుత్వం వచ్చింది. దానికి ‘సత్’ అని పేరు పెట్టారు. ఇలా అది మాటలకు అందే విషయమైంది.
జరీ అతీంద్రియ ముళచే వాహిలే | ‘బుద్ధిగ్రాహ్య’ వాచేనే కేలే | తేవ్హాంచ తే మనీ ప్రవిష్టలే | ఆకారా ఆలే ॐకారే | ||౧౫౬||
156. మొదటలో అది ఇంద్రియాలకు చిక్కనదిగా ఉన్నా, వాక్కు దానిని బుద్ధితో గ్రహించేదిగా చేసింది. అప్పుడే అది మనసులో ప్రవేశించి, ఓంకారమనే ఆకారాన్ని పొందినది.
యా ॐకారబ్రహ్మాచే ధ్యాన | సవే కరితా ఈశ్వరస్మరణ | హోఈ జయాచే దేహావసాన | పావే తో జననసార్థక | ||౧౫౭||
157. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానం చేస్తూ, ఈశ్వర స్మరణ చేస్తూ, ఎవరి దేహాం అంతం అవుతుందో, వారు జన్మ సార్థకత్వాన్ని పొందుతారు.
అసో యా వాచ్య బ్రహ్మాపాసావ | అవ్యక్తాచా ప్రాదుర్భావ | అవ్యక్తాపాసూని మహత్తత్వ | ఉపజే అహంభావ త్యాపోటీ | ||౧౫౮||
158. ఈ బ్రహ్మ శబ్దం నుండి అవ్యక్తంయొక్క పుట్టుక, అవ్యక్తంనుండి బుద్ధి, బుద్ధినుంచి “అహంభావం” పుట్టుకొస్తాయి.
పంచతన్మాత్రా అహంకారీ | పంచమహాభూతే త్యామాఝారీ | పంచమహాభూతాంచియా ఉదరీ | జగ నిర్ధారీ జన్మలే | ||౧౫౯||
159. అహంకారంలో పంచ తన్మాత్రలు, వానినుండి పంచ మహాభూతాలు, ఈ పంచ మహాభూతాల గర్భంనుంచి, నిర్ధారంగా, జగత్తు జన్మించింది.
అవిద్యామాయారూపదర్శన | తేంచ యా జగావే రూపలక్షణ | యా అవిద్యేచే కరాయా నిరసన | అజ్ఞానవివేచన ఆవశ్యక | ||౧౬౦||
160. అవిద్యయే మాయయొక్క రూపం. ఇవే ఈ జగత్తుయొక్క రూపం, లక్షణాలు. ఈ అవిద్యను నిర్మూలించడానికి అజ్ఞానంయొక్క వివేచన, వివరణ ఆవశ్యకం.
అత్యంత విశుద్ధ ఆణి నిర్మళ | జే చిన్మాత్ర స్వరూప కేవళ |
త్యాహూన వేగళే జే తే ‘శబల’ | దోఘాంచీ భేసళ కరితా నయే | ||౧౬౧||
161. అత్యంత పరిశుద్ధమూ, నిర్మలమూ, కేవలం జ్ఞాన స్వరూపమూ అయిన దానిని, దానికంటే వేరే అయిన దాని వర్ణనను, రెంటినీ కలపటం సాధ్యం కాదు.
మ్హణూన హీ అజ్ఞానాచీ పడళే | ఉపదేశబళే సారావీ | ||౧౬౨||
162. లక్ష్యమైన బ్రహ్మ వేరని తెలుసుకో. మాటలతో వర్ణించే బ్రహ్మకంటే అత్యంత విశిష్టమైనది. అందువలన, ఈ అజ్ఞానపు పొరలను ఉపదేశ బలంతో తొలగించాలి.
నిద్రేమాజీ పడతా స్వప్న | డోళే నసతా డోళస మన | స్వయే దేఖే అఖిల త్రిభువన | అవిద్యాకారణ యా సర్వా | ||౧౬౩||
163. నిద్రలో కల వస్తే, కళ్లు లేకున్నా మనసు తన కళ్లతో మూడు లోకాలను అన్నిటినీ స్వయంగా చూస్తుంది. దీనికంతటికీ కారణం అవిద్యే.
పాహూ జాతా వస్తు ఎక | పరీ ఆభాసేతీ ఆణిక | రజ్జూ భాసే సర్ప దేఖ | రజత శుక్తికే గర్భాంత | ||౧౬౪||
164. ఒక వస్తువును చూడబోతే, వాస్తవానికి, అది మరోలా కనిపిస్తుంది. త్రాడు పాములా భాసిస్తుంది, ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు.
పహా సూర్యాచే కిరణ కేవళ | జన మ్హణే తయా ‘మృగజళ’ | పరీ హా కేవళ మాయేచా ఖేళ | జ్ఞానీహీ హతబళ ఇజపుఢే | ||౧౬౫||
165. చూడటానికి అవి కేవలం సూర్యుని కిరణాలే అయినా, వానిని ప్రజలు ‘ఎండమావులు’ అని అంటారు. ఇదంతా కేవలం మాయయొక్క లీల మాత్రమే. దీనిముందు జ్ఞానులు కూడా హతాశులౌతారు.
పేటలేలే కోలీత హాతీ | జేవ్హా కోణీ గరగర ఫిరవితీ | అగ్నికంకణ దృష్టోత్పత్తీ | యేతే హీ ఖ్యాతీ మాయేచీ | ||౧౬౬||
166. మండుతున్న కర్రను చేతబట్టుకుని ఎవరైనా గిరగిర త్రిప్పితే, అది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. ఇదే మాయయొక్క విశిష్టత.
పాహూ జాతా అగ్నీ ఖరా | అలాతచక్రా నాహీ థారా | తైసాచ హా మాయామోహపసారా | నసతియా సంసారా ఉత్పాదీ | ||౧౬౭||
167. చూడటానికి అది అగ్ని, నిజమే. కాని, గుండ్రటి చక్రానికి అవకాశమే లేదు. అలాగే, ఈ మాయామోహాలు, లేని ప్రపంచాన్ని సృష్టిస్తాయి.
ఏసియా నిర్ధారే గేలియా భ్రమ | సంసార తేవ్హాంచ పావే ఉపరమ | మీ దేహ మాఝే కలత్ర ధామ | వ్యర్థ పరిశ్రమ హా సారా | ||౧౬౮||
168. ఇదంతా భ్రమ అని నిర్ధారిస్తే, దానివల్ల సృష్టించిన సంసారం కూడా చప్పబడుతుంది. ‘ఈ దేహమే నేను’, ‘నా భార్య, నా ఇల్లు’ అన్నవన్నీ వ్యర్థ పరిశ్రమలౌతాయి.
పుత్రపశ్వాది తృష్ణాపాశ | ఇహీ వేష్టిలే జాఊని అశేష | మ్హణవితీ జ్ఞానీ పండితేశ | సుఖ న లవలేశ గాంఠీస | ||౧౬౯||
169. పుత్ర పశువాది వానిపై విపరీతమైన కోరికలతో కట్టుబడటం వలన, జ్ఞానులమని పండితులమని చెప్పుకునేవారు, కొంచెమైనా నిజమైన ఆనందాన్ని పొందలేరు.
శాస్త్రకుశల ప్రజ్ఞావాన | దుజా నాహీ ఆపణాసమాన | అంతరీ మోఠా హా అభిమాన | అసమాధానకారక | ||౧౭౦||
170. శాస్త్రాలలో ప్రజ్ఞావంతులం, మాకు సమానం ఇంకొకరు లేరు అనే మనసులోని విపరీతమైన అభిమానం అశాంతికి కారణం.
హేచ మాయా వా అజ్ఞాన | అథవా అవిద్యా ప్రకృతిప్రధాన |
ఆరంభీ జ్ఞానీ యాంచేచ నిరసన | కరితా మగ జ్ఞాన ఉపతిష్ఠే | ||౧౭౧||
171. ఇదే మాయ, లేదా అజ్ఞానం, లేదా అవిద్యయొక్క ముఖ్యమైన స్వభావం. దీనినే జ్ఞానులు ముందే తొలగిస్తారు. అప్పుడే జ్ఞానం లభిస్తుంది.
జ్ఞాన హే తో స్వయంప్రకాశ | కరణే నలగే యాచా ఉపదేశ | అజ్ఞానాచా హోతా నిరాస | జ్ఞానోల్లాస ప్రకటేల | ||౧౭౨||
172. జ్ఞానం స్వయం ప్రకాశకం. దీనిని ఉపదేశించే అవసరం లేదు. అజ్ఞానం తొలగిపోతే జ్ఞాన ప్రకాశం తనంతట తానే బయట పడుతుంది.
తేజఃపుంజ ఎకాదే రత్న | జాతా కేరా మాతీంత దాటూన | గేలీ వర్షాంచీ వర్షే లోటూన | బుజాలే స్మరణ తయాచే | ||౧౭౩||
173. తేజోవంతమైన ఒక రత్నం మట్టిలో పూడుకుని పోయి ఉంటే, సంవత్సరాలు దాటిన తరువాత, దాని స్మరణ ఎవరికీ ఉండదు.
కర్మధర్మసంయోగప్రాప్తీ | కదా కాళీ లాగతా హాతీ | వాటే హరపలీ సమూళ దీప్తి | దగడమాతీ సంగతీ | ||౧౭౪||
174. కర్మ ధర్మ సంయోగం వలన, తరువాత ఎప్పుడైనా చేతికి లభిస్తే, రాళ్లలో మట్టిలో ఉండటం వలన, దాని మునుపటి తేజస్సు తగ్గిపోయి ఉంటుంది.
పుఢే తే స్వచ్ఛ ఘాసతా | వరీల కాట మాతీ జాతా | పావే తే పూర్వీల తేజఃపుంజతా | తైసీచ అవస్థా జ్ఞానాచీ | ||౧౭౫||
175. తరువాత, బాగా రుద్ది అంటుకున్న మట్టిని తీసి, శుభ్రం చేస్తే, తన మునుపటి కాంతిని మరల పొందుతుంది. జ్ఞానం కూడా అంతే.
మాతీ కాటతే అజ్ఞాన | యాచ అజ్ఞానే ఆవృత జ్ఞాన | కరితా కాట మాతీచే నిరసన | ఉజళేల రత్న సహజేంచ | ||౧౭౬||
176. మట్టి, మురికి అజ్ఞానం. ఈ అజ్ఞానమే జ్ఞానాన్ని కప్పేసింది. మట్టిని తొలగిస్తే రత్నం తన సహజమైన కాంతితో ప్రకాశిస్తుంది.
పాపకర్మ వినాశక | నిత్యానిత్య వస్తువివేక | తోచి సత్వ శుద్ధి ప్రదాయక | తోచి ఉత్పాదక జ్ఞానాచా | ||౧౭౭||
177. ఏది ఎల్లప్పుడూ ఉండేది, ఏది కాదు అనే ఆలోచన, పాప కర్మలను నాశం చేస్తుంది. అదే సత్త్వ శుద్ధిని ఇస్తుంది. అదే జ్ఞానన్ని కలిగిస్తుంది.
హే జగ మాయేచా బాజార | ఖర్యా నకలీ వస్తు అపార | ఖర్యా మ్హణూని నకలీ ఘేణార | ఏసే గిర్హాఇక ఫార తేథే | ||౧౭౮||
178. ఈ జగత్తు మాయయొక్క బజారు. నిజమైనవి, నకిలీవి వస్తువులు ఇక్కడ చాలా ఉంటాయి. నకిలీని నిజమైనవి అనుకుని తీసుకునే గ్రాహకులే ఇక్కడ చాలా మంది.
తరీ నివడావీ కైసీ నకలీ | భల్యాభల్యాంచీ బుద్ధీ థకలీ | జియే లక్షణీ ఆణావీ భులీ | తీ తవ సమజలీ పాహిజేత | ||౧౭౯||
179. మరి, నకిలీ వానిని గుర్తించి, వేరు చేయటమెలా? మంచి మంచి వారి బుద్ధి కూడా అలసిపోయింది. ఏ లక్షణాల వల్ల ఇలా మోసగింప బడుతున్నామో అన్నది తెలుసుకోవాలి.
మ్హణోని సవే లాగే పారఖీ | నకలీ కా దిసే ఖర్యా సారఖీ | హే తో49 దావీల దేఖోదేఖీ | జాఈల శేఖీ అజ్ఞాన | ||౧౮౦||
180. అందుకు, పరీక్షించి చెప్పగలవారు తోడుండాలి. నకిలీవి నిజమైనవిగా ఎందుకు కనిపిస్తుందో వారు చూచీ చూడగానే తెలియచేస్తారు. దాంతో, చివరకు అజ్ఞానం తొలగిపోతుంది.
అజ్ఞాన జాతా రాహీల జ్ఞాన | హోఈల సహజచి మాయా నిరసన |
ఉరేల తీచి సద్వస్తూ జాణ | నలగే ప్రమాణ ప్రత్యక్షా | ||౧౮౧||
181. అజ్ఞానం పోతే జ్ఞానం మిగులుతుంది. సహజంగా మాయ తొలగిపోతుంది. ఇక మిగిలినదే నిజమైన ఆత్మ అని తెలుసుకో. ఏది కనిపిస్తూ ఉందో, దానికి ప్రమాణం అవసరం లేదు.
హే తిమిర ఉపదేశే పళే | ఉరే జే సగళే తే జ్ఞాన | ||౧౮౨||
182. బుద్ధి చాలా తేజోవంతమైనదే అయినా, ఊహ అనే చీకటితో కప్పబడి ఉంటుంది. ఈ చీకటి ఉపదేశంతో పారిపోతుంది. ఇక మిగిలి ఉన్నదంతా జ్ఞానమే.
వస్తుతః జరీ మార్గీ మాళ | దృష్టీ దేఖతా సాంజ వేళ | మాళ అసతా భాసలా వ్యాళ | అజ్ఞాన పడళ కారణ త్యా | ||౧౮౩||
183. నిజానికి, దారి మూలలో పడి ఉన్న మాలను, సాయంత్రం వేళప్పుడు చూస్తే, మాల పామువలె కనిపిస్తుంది. అజ్ఞానపు పొర దీనికి కారణం .
ఖిశామాజీల గుప్త దీప | ఉజళీతా ఝాలా అజ్ఞానలోప | ప్రకట ఝాలే ఖరే స్వరూప | వ్యాలత్వ ఆపాప మావళలే | ||౧౮౪||
184. జేబులో దాగివున్న టార్చిలైటు వెలిగిస్తే, అజ్ఞానం లోపించి నిజ స్వరూపం కనిపించి, పాము అనే ఊహ దానంతట అదే మాయమౌతుంది.
మ్హణోని అజ్ఞానాచా అపాయ | ఘాలవావయా ఉపదేశ ఉపాయ | తదర్థ జ్ఞానీ ఝిజవోని కాయ | అజ్ఞాన తే కాయ ఉపదేశితీ | ||౧౮౫||
185. అందువలన, అజ్ఞానం వలన కలిగే అపాయాన్ని, ఉపదేశమనే ఉపాయంతో తొలగించుకోవాలి. అందుకే, అజ్ఞానం అంటే ఏమిటి అని అందరికీ తెలియ చెప్పటానికి, జ్ఞానులు తమ జీవితాన్ని అరగదీస్తారు.
అసతా ప్రపంచీ వర్తమాన | ప్రసంగే ప్రారబ్ధే జే ఆపన్న | తే భూతకార్య అజ్ఞానజన్య | ఆధీ హే జ్ఞాన ఆవశ్యక | ||౧౮౬||
186. ఇప్పటి ప్రపంచంలో ఉంటూ, ఆయా సందర్భాలలో కలిగే మంచి చేడు అనుభవాలు, పూర్వ జన్మలో అజ్ఞానంతో చేసిన పనుల ఫలితాలు అని ముందుగా తెలుసుకోవాలి.
‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ | అవిద్యా మాయా సకళ భ్రమ | యా భ్రమా జై హోఈల ఉపరమ | తైంచ సంభ్రమ జ్ఞానాచా | ||౧౮౭||
187. జ్ఞానమొక్కటే అసలైన సత్యం. బ్రహ్మ అంతు లేనిది. అవిద్య, మాయ ఇవన్నీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనుకోవటమే. ఈ భ్రాంతి పోయినప్పుడే జ్ఞానం గురించిన అనుమానాలు తొలగిపోతాయి.
జ్యాచా గేలా న దేహాభిమాన | తయాసీ కోణ మ్హణే సజ్ఞాన | అభిమానాచే అధిష్ఠాన | త్యా నాంవ అజ్ఞాన మూర్తిమంత | ||౧౮౮||
188. దేహాభిమానం పోని వారిని జ్ఞానులని ఎవరు అంటారు? అభిమానంయొక్క ప్రభావమే మూర్తీభవించిన అజ్ఞానం అని పిలువబడుతుంది.
జయాస మ్హణతీ మాయేచా పూర | జయామాజీ హే జగత చూర | తో హా దేఖత భూలసంసార | అజ్ఞాన మూలాధార తయాస | ||౧౮౯||
189. ఏది మాయతో నిండి ఉన్నదని అనబడుతుందో, మనసును మోహింపచేసే ఈ జగత్తు దేనిలో మగ్నమై ఉందో, దానికి మూలాధారం అజ్ఞానమే.
అజ్ఞానాపాసావ యాచా ఉద్భవ | అజ్ఞానజనిత యాచే వైభవ | ఎకత్వీ జో అనేకత్వ భావ | తయాచా ఠావ అజ్ఞాన | ||౧౯౦||
190. అజ్ఞానంనుంచి పుట్టినది కనుక, దీని వైభవమంతా అజ్ఞానంతో పుట్టినదే. ఏకత్వంలో అనేకత్వ భావనకు కారణం అజ్ఞానం.
కించిత ప్రకాశ కించిదంధార50 | ఏసియా సమయీ మార్గీంచా దోర |
దోరచి అసతా భాసే విఖార51 | భయ అపార వాటతసే | ||౧౯౧||
191. కొంచెం వెలుతురు, కొంచెం చీకటి, ఇలాంటి సమయంలో, దారిలోని త్రాడు, పాములా కనిపించి, విపరీతమైన భయాన్ని కలుగచేస్తుంది.
సర్పాభాస కేవళ అజ్ఞాన | త్యా అజ్ఞానే ఝాంకిలే జ్ఞాన | న హోతా హే అజ్ఞాననిరసన | హోఈనా మన నిర్భయ | ||౧౯౨||
192. పాము అనే ఆలోచన కేవలం అజ్ఞానం. ఆ అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసింది. ఈ అజ్ఞానం తొలగకపోతే, మనసు నిర్భయం కాదు.
కోణాస భాసే సుమనమాళా52 | కోణాస దిసే దండ53 డోళా | ఎవంచ హా భాసచి సగళా | భ్రాంతీచ్యా అవకళా అనివార | ||౧౯౩||
193. కొందరికి పూలమాలలా, మిగతా కొందరి కళ్లకు కర్రలా కనిపించినా, అదంతా అజ్ఞానం వలన కలిగే భ్రాంతి.
కేవళ ఆగమవచనానుసారీ54 | జో అస్తిత్వ శ్రద్ధానుకారీ | తోచ బ్రహ్మజ్ఞానాధికారీ | నాస్తిక జన్మజన్మాంతరీ నేణేచ | ||౧౯౪||
194. వేదాలు చెప్పినట్లు నడచుకుని, దేవుని మీద భక్తి కలిగి, శ్రద్ధగా ఉండేవారే బ్రహ్మ జ్ఞానానికి యోగ్యులు. దేవుడు లేదని అనుకునే నాస్తికులు, జన్మ జన్మలకూ యోగ్యులు కాలేరు.
విశ్వ హే విపరీతదర్శియా55 భ్రమ | త్యాంచా న ఫిటే జన్మమరణ క్రమ | బ్రహ్మ తత్వ తయా56 జే దుర్గమ | తే అత్యంత సుగమ అధికాంరియా | ||౧౯౫||
195. దేవుడి మీద నమ్మకమున్నవారికి, ఈ జగత్తంతా దేవుని లీలగా కనిపిస్తుంది. విపరీత దృష్టితో ఉండే నాస్తికులకు, ఇదే జగత్తు నామ రూపాలతో కనిపించి, భ్రమను కలిగిస్తుంది. వారికి చాలా కష్టమైన బ్రహ్మ తత్వం, దేవుని నమ్మినవారికి చాలా సులభం.
యేథే న కామీ యేఈ ప్రవచన | అథవా అనేక వేదస్వీకరణ | అథవా న మేధా గ్రంథార్థధారణ | గ్రంథావలోకన బహుశ్రుతతా | ||౧౯౬||
196. ఇక్కడ ప్రవచనాలు కాని, వేదపాండిత్యం కాని, గ్రంథాల అర్థాలను తెలుసుకున్న తెలివి కాని, చాలా గ్రంథాలను చదివిన తెలివి కాని, పనికి రావు.
శబ్దే హోఈల శబ్దజ్ఞాన | తేణే కా హోఈల వస్తువిజ్ఞాన | బుద్ధి అతివివేక సంపన్న | వస్తూ న తదధీన కేవ్హాంహీ | ||౧౯౭||
197. పదాల గుంపుతో శబ్దజ్ఞానం కలుగుతుంది. వానితో వస్తువిజ్ఞానం ఎలా కలుగుతుంది? బుద్ధి చాలా తెలివైనది, కాని ఆత్మవస్తు దాని ఆధీనంలో ఎప్పుడూ ఉండదు.
శ్రుతీనీ మోఠీ బాంధిలీ హావ | పరీ న లాధతా వస్తూచా ఠావ | పరతల్యా ఏసే వస్తూచే వైభవ | ఖుంటలీ ధాంవ జాణివేచీ | ||౧౯౮||
198. శ్రుతులు దాని కోసం గొప్పగా ప్రయత్నించాయి. కాని, ఆత్మవస్తువు జాడ లభించక వెనుతిరుగాయి. ఇటువంటిది ఆత్మవస్తువుయొక్క వైభవం. బుద్ధి ఇంతకు మించి పోలేదు.
షడ్దర్శనే టేకీస ఆలీ | అద్యాపి వాదచ కరీత రాహిలీ | ఆత్మవస్తూ ఠాయీంచ ఠేలీ | శబ్దా న ఆకళలీ కేవ్హాంహీ | ||౧౯౯||
199. ఆరు దర్శనాలూ అలసిపోయాయి. వాదించటంలోనే అవి ఉండిపోయాయి. ఆత్మవస్తువు మాత్రం ఎక్కడ ఉన్నదో అక్కడే ఉంది. పదజాలం దానిని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు.
ఝాలే మోఠే శబ్దపండిత | వస్తుసూర్యాపుఢే ఖద్యోత | ఎకదా ఝాలియా వస్తు ప్రాప్త | మావళే సమస్త శబ్దజాల | ||౨౦౦||
200. గొప్ప శబ్దపండితులు, ఆత్మవస్తువనే సూర్యుడి ముంది మిణుగురు పురుగులలా అయ్యారు. ఒక సారి ఆత్మవస్తు ప్రాప్తిస్తే, సమస్త శబ్దజాలం మాయమై పోతాయి.
జగీ పహా అంధారే రాతీ | దీపప్రకాశే క్రియా చాలతీ |
పరీ సూర్యోదయ హోతా ప్రభాతీ | జన ఉపేక్షితీ దీపాతే | ||౨౦౧||
201. ప్రపంచాన్ని చీకటి రాత్రిలో గమనించండి. అన్ని కార్యాలూ దీపపు ప్రకాశంలో జరుగుతాయి. కాని, తెల్లవారి సూర్యోదయం అవగానే, జనులు దీపాలను ఉపేక్షిస్తారు.
మ్హణోని అజ్ఞాననిరసన ధ్యేయ | అసావే ఆఖ్యేయ వక్త్యాతే | ||౨౦౨||
202. దానివల్ల, మాటకు సంబంధించని సంగతిని ఎలా ఉపదేశం చేయగలం? అందువలన, అజ్ఞానాన్ని తొలగించటమే ఉపదేశం చేసేవారి ధ్యేయం కావాలి.
ఎక అస్తిత్వ బుద్ధయా ఉపాసన | తేణేంచ ఆత్మా హోఊన ప్రసన్న | కరీ నిజతత్వభావ ప్రకాశన | హోఈ ఉపలభ్యమాన ఉపాసకా | ||౨౦౩||
203. ఆత్మ ఉన్నదని నమ్మి, ఆరాధిస్తే, ఆత్మ ప్రసన్నమై తన రూపాన్ని చూపి, ధ్యానించే వారికి లభ్యమౌతుంది.
ఆత్మ్యాచే ఠాయీ పరమాత్మ ధ్యాన | దోహీ మాజీ అభేదానుసంధాన | యేణేపరీ కరితా ఉపాసన | ఆత్మాచి ప్రసన్న ఉపాసకా | ||౨౦౪||
204. ఆత్మ స్థానంలో పరమాత్మను ధ్యానం చేయాలి. ఆత్మ, పరమాత్మ, ఈ రెండూ ఒకటే అనుకుని, ఉపాసన చేస్తే, ఉపాసకులకు ఆత్మ ప్రసన్నమౌతుంది.
తయా నాహీ అన్య సాధన | తేణేంచ వ్హావే లాగే ప్రసన్న | సాధక పాహూన ఆత్మప్రవణ | ఆత్మా త్యా ఆపణచి కరీ కృపా | ||౨౦౫||
205. దానికోసం, వేరే సాధనలు లేవు. ఆత్మ తానే ప్రసన్నం కావాలి. సాధకుని ఆత్మనిష్ఠను చూసి, ఆత్మ తనంతట తానే సాధకుని కరుణిస్తుంది.
హోతా గ్రంథాచీ విషయసమాప్తి | వక్తే శ్రోతయా సదైవ ప్రార్థితీ | శ్రవణశ్రమార్థ క్షమా మాగతీ | హీ శిష్టరీతి సర్వత్ర | ||౨౦౬||
206. గ్రంథంలోని విషయం ముగిసి పోగా, చెప్పేవారు వినేవారిని తప్పకుండా ప్రార్థిస్తారు - శ్రవణంలో శ్రమ పడినందుకు క్షమాపణ కోరుతూ. ఈ గొప్ప పద్ధతి అన్ని చోట్లా ఉంది.
తైసే నవ్హే యా సచ్చరితీ | కర్తృత్వ యాచే న మాఝే మాథీ | స్వయే సాఈచ నిజ కథాలిహవతీ | లేఖణీ మజ హాతీ దేఊన | ||౨౦౭||
207. కాని, ఈ సచ్చరితకు అది వర్తించదు. దానిని రచించిన అధికారం నా తలపై లేదు. స్వయంగా సాయియే తమ కథను వ్రాయించుకున్నారు - నా చేతికి కలం ఇచ్చి.
మ్హణూన నవ్హే మీ గ్రంథకర్తా | యేథే న శ్రాంత కోణీ మజకరితా | క్షమాకీజే శ్రోతీ మ్హణతా | ఆదళే మాథా కర్తృత్వ | ||౨౦౮||
208. కనుక, నేను గ్రంథ రచయితను కాను. ఇక్కడ నావల్ల ఎవరూ శ్రమ పడలేదు. ‘శ్రోతలారా క్షమించండి’, అని అంటే, దానిని రచించిన వాడు నేనే అవుతాను.
మజ నాహీ యేథే భూషణ | కింవా నాతళే అంగా దూషణ | జేథే సాఈచ కర్తా ఆపణ | తయాచేని సంపూర్ణ హా విషయ | ||౨౦౯||
209. నాకు పొగడ్త అనే భూషణం అవసరం లేదు. ఏ దూషణా నాకు అంటదు. సాయియే రచయిత కనుక వారి అనుగ్రహంతో విషయం సంపూర్ణమైంది.
ఘేఊని సాఈచే అనుజ్ఞాపన | కేలే త్యాంనీ జైసే కథన | తైసే తైసే కేలే మీ లేఖన | అజ్ఞానవివేచన శ్రవణార్థ | ||౨౧౦||
210. సాయియొక్క అనుమతి పొంది, వారు ఎలా కథను సెలవిస్తే, అలా అజ్ఞాన వివేచనను వినటాని కోసం వ్రాశాను.
ప్రకట కరాయా నిజవైభవ | అపులా ప్రతాప ఆపులా గౌరవ |
ప్రవేశోని మజమాజీ స్వయమేవ | విషయార్థ గురుదేవ ప్రకాశీ | ||౨౧౧||
211. తమ వైభవాన్ని, తమ ప్రతాపం, తమ గౌరవం, బయట పెట్టటానికి, స్వయంగా గురుదేవులు నా మనసులో ప్రవేశించి, విషయార్థాన్ని వివరించారు.
దేఈల జో యా గ్రంథా దూషణ | అథవా త్యాచే మానీ జో భూషణ | తే దోఘే మజ వంద్య పూర్ణ | నిజ నారాయణస్వరూప | ||౨౧౨||
212. ఈ గ్రంథాన్ని దూషించేవారు, అథవా దీనిని భూషణంగా భావించేవారు, ఇరువురూ నాకు వంద్యులు. సంపూర్ణంగా వారు నిజ నారాయణ స్వరూపులు.
భక్తాచియా పరమహితా | స్వయే నిర్మోని నిజ చరితా | హేమాడాచియా ధరోని హాతా | కథా లిహివితా శ్రీ సాఈ | ||౨౧౩||
213. భక్తుల పరమ హితం కొరకు, తమ చరితను స్వయంగా నిర్మించి, హెమాడు చేతిని పట్టుకుని, శ్రీసాయి వ్రాయించారు.
జయాచా శరీరపరిగ్రహ | కేవళ కరావయా లోకానుగ్రహ | ఖండావయా కుతర్క దురాగ్రహ | లోకసంగ్రహ రక్షావయా | ||౨౧౪||
214. కేవలం లోకానుగ్రహం కోసం, కుతర్కాలను, దురాగ్రహాన్ని ఖండించటానికి, మరియు లోకాన్ని రక్షించటానికి వారు శరీరాన్ని గ్రహించారు.
మ్హణోని హేమాడ తయా చరణీ | అనన్యభావే యేఈ లోటాంగణీ | పుఢీల రసాళ కథాంచ్యా శ్రవణీ | వ్హావే శ్రోతృగణీ సావచిత్త | ||౨౧౫||
215. హేమాడు వారి చరణాలకు అనన్య భావంతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. తరువాత వచ్చే రసవత్తరమైన కథలను శ్రవణం చేయమని శ్రోతృగణాలను సవినయంగా మనవి చేస్తున్నాడు.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | అజ్ఞాననిరసనం నామ |
| పంచాశత్తమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
1. ముక్యాసారఖే అసలేలే బరే. 2. పూర్ణ. 3. కృపాళూ.
4. ఘర, మందిర. 5. కృపారూపీ మేఘ.
6. సాలోక్య, సారూప్య, సామీప్య వ సాయుజ్య.
7. మోత్యాంచా శింపలా. 8. ‘కాకవిష్ఠేమాజీ పింపళ’ - (వేంకటేశస్తోత్ర).
9. స్వకల్యాణావిషయీ. 10. ఓళఖతో. 11. వినోదజన్య ఆనంద.
12. కావ్యరసజ్ఞాంనా. 13. అవగ్రహ ఘాతల్యానే హోణార్యా గంమతీలా.
14. అధ్యాయ ౩౯ పహావా. 15. ‘అజ్ఞాన’ ప్రతిపాదనార్థ.
16. అజ్ఞాత. 17. ఆవళా. 18. సంపూర్ణ. 19. ‘శ్రీ సాఈలీలా’ మాసికాచే.
20. బడబడ. 21. గతీ, ప్రవేశ. 22. ‘జ్ఞానయజ్ఞ’ నామక అధ్యాయాత.
23. అథర్వవేదాచే మహావాక్య.
24. ఋగ్వేదాచే మహావాక్య.
25. యజుర్వేదాచే మహావాక్య.
26. అవిద్యేముళే. 27. విద్యేముళే. 28. అత్యంత సత్య.
29. శ్రుతిసిద్ధాంత. 30. సంశయానే. 31. జ్ఞానీసుద్ధా.
32. ఆంబలేల్యా పేజేచ్యా. 33. దుధానే భరలేలే మోఠే భాండే.
34. పరమావధీచే, ఆత్యంతిక. 35. జీవసముదాయ.
36. ఇతర లోక. 37. అల్ప, మర్యాదిత. 38. శుద్ధ, చోఖ.
39. అజ్ఞానాచా నాశ. 40. అయోగ్య. 41. జననేంద్రియ.
42. గాయీచీ స్తనే. 43. రక్తాత. 44. ఇచ్ఛా, గరజ.
45. భగవద్గీతా, అ.౬/౨౧. 46. ఇంద్రియగోచర. 47. పరాభూత.
48. అధ్యారోప వ అపవాద హీ వేదాంతశాస్త్రాతీల ఎక ప్రక్రియా ఆహే. ‘అధ్యారోప’ మ్హణజే సత్య బ్రహ్మాచ్యా ఠికాణీ మిథ్యా జగాచా ఆరోప కరణే వ ‘అపవాద’ మ్హణజే హా ఆరోప సమూళ మిథ్యా ఆహే, అసే జాణణే.
49. సద్గురు.
50. థోడాసా అంధార.
51. సర్ప. 52. ఫులాంచా హార.
53. కాఠీ (హే సర్వ త్యా మంద ప్రకాశాతీల దృష్టీవరచే భాస).
54. వేదశాస్త్రాచ్యా వచనాలా అనుసరూన జో ఆస్తిక బుద్ధీ ధారణ కరతో.
55. ఉలట మ్హణజే అయథార్థ దృష్టీనే పాహణార్యా లోకాంనా చరాచర విశ్వ హే విశ్వరూపానే దిసతే, హా త్యాంచా భ్రమ ఆహే. (వస్తుతః తత్వదర్శీ-యథార్థదర్శీ లోకాంనా ‘విశ్వ నసూన విశ్వాత్మా’ దిసతో.).
56. అజ్ఞానీ మ్హణజే విపరీత జ్ఞానీ లోకాంనా.
No comments:
Post a Comment