శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౭ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
ఆతా పూర్వకథేచీ సంగతీ | స్మరణపూర్వక ఆణూ చిత్తీ |
దేఉళాంచ్యా జీర్ణోద్ధారార్థీ | కైసీ ప్రీతి బాబాంస | ||౧||
1. మనం ఇప్పుడు మునుపటి కథను గుర్తుకు తెచ్చుకుందాం. అందులో, దేవాలయాల జీర్ణోద్ధరణ గురించి బాబాకు ఎంత ఇష్టమో దాని గురించి,
కైసా నిజాంగే దేహ ఝిజవీత | దుఃఖేహీ సోశీత భక్తాంచీ | ||౨||
2. అందరి మంచికొరకు బాబా ఎంత కష్ట పడేవారో, తమ భక్తులను ఎలా చూచుకునేవారో, భక్తుల కష్టాలను సహించడానికి తమ శరీరాన్ని ఎలా శ్రమ పెట్టేవారో,
సమాధీ సమవేత ఖండయోగ | ధోతీ పోతీ ఇత్యాది ప్రయోగ | కదా కరపదశిరవియోగ | కదా సంయోగ పూర్వవత్ | ||౩||
3. వారు సమాధి, ధౌతి-పోతి, ఖండయోగం మొదలైన ప్రయోగాలను చేసేవారో, ఇందులో భాగంగా చేతులు, కాళ్ళు, శిరస్సును వేరుగా చేసి, మరలా వానిని మునుపటిలా కలిపేవారో, ఇవన్నీ ఈ అధ్యాయంలో చెప్పబడతాయి.
హిందూ మ్హణతా దిసత యవన | యవన మ్హణతా హిందూ సులక్షణ | ఏసా హా అవతార విలక్షణ | కోణ విచక్షణ వర్ణీల | ||౪||
4. బాబా హిందువు అని అనుకుంటే, ముస్లిమువలె కనిపించేవారు. మరి, ముస్లిము అని అనుకుందామంటే, హిందువుల లక్షణాలన్నీ కనిపించేవి. ఇంతటి విలక్షణమైన అవతారాన్ని ఎవరు మాత్రం వర్ణించగలరు?
జాత హిందూ కీ ముసలమాన | థాంగ న లాగలా అణుప్రమాణ | ఉభయ వర్గా సమసమాన | జయాంచే వర్తన సర్వదా | ||౫||
5. వారు హిందువా, ముస్లిమా అన్నది కొంచెం కూడా ఎవరికీ తెలియదు. హిందువైనా, ముస్లిమైనా, ఇద్దరినీ వారు సమానంగా చూచేవారు.
రామనవమీ హిందూచా సణ | కరవీతసె స్వయే ఆపణ | సభామండపీ పాళణా బాంధవూన | కథా కీర్తన కరవీత | ||౬||
6. రామనవమి హిందువుల పండగ. దానిని వారు స్వయంగా జరిపించేవారు. సభా మండపం మధ్యన ఊయలను కట్టించి, కథా సంకీర్తనను చేయించేవారు.
చౌకాంత సన్ముఖ లాగే పాళణా | కరవూని ఘేతీ రామకీర్తనా | తేచీ రాత్రీ సందల మిరవణా | అనుజ్ఞా యవనాంహీ దేత | ||౭||
7. తమ ఎదుట ఊయల ఉండగా, రామ కీర్తనను చేయించేవారు. అదే రాత్రి, ముస్లిముల సందల్ (చందనోత్సవం) ఊరేగింపుకు కూడా అనుమతిని ఇచ్చేవారు.
జమవూన జమతీల తితుకే యవన | సమారంభె సందల మిరవణ | ఉభయ ఉత్సవ సమసమాన | ఘేత కరవూన ఆనందే ||౮||
8. చాలా మంది ముస్లిములు కలిసి, చందన ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా జరుపుకునేవారు. ఈ రెండు ఉత్సవాలను బాబా సమానంగా, సంతోషంగా జరిపించేవారు.
యేతా రామనవమీచా దివస | కుస్త్యా లావణ్యాచీ హౌస | ఘోడే తోడే పగడ్యా బక్షీస | అతి ఉల్హాస ద్యావయా | ||౯||
9. రామనవమి రోజు రాగానే, ఎంతో ఉత్సాహంతో, బాబా కుస్తీల పోటీలను పెట్టించి, గుర్రాలను, తలపాగాలను, కంకణాలను బహుమతిగా ఇచ్చేవారు.
సణ గోకుళ అష్టమీ ఆలా | కరవూని ఘేతీ గోపాళ కాలా | తైసీచ ఈద యేతా యవనాంలా | నిమాజాలా అటకనా | ||౧౦||
10. గోకులాష్టమి పండుగ వచ్చినప్పుడు, గోపాలకాలా జరిపించేవారు. అలాగే, ముస్లిముల పండుగ వస్తే, నమాజు చదవటానికి, అడ్డు చెప్పేవారు కాదు.
ఎకదా ఆలా మోహరమాచా సణ | ఆలే మశీదీస కాంహీ యవన |
మ్హణతీ ఎక తాజా1 బనవూన | కరూ మిరవణ గ్రామాంత | ||౧౧||
11. ఒక సారి, మొహరం పండుగ వచ్చినప్పుడు, కొందరు ముస్లిములు మసీదుకు వచ్చి, ఒక తాజా (తాబూతు) ను చేయించి, గ్రామంలో ఊరేగించాలన్నారు.
ఆజ్ఞేసరసా తాజా ఝాలా | చార దివస ఠేవూంహీ దిధలా | పాంచవే దివశీ ఖాలీ కాఢిలా | నాహీ మనాలా సుఖ దుఃఖ | ||౧౨||
12. బాబా అనుమతిని ఇచ్చిన తరువాత, తాజా తయారు చేసి నాలుగు రోజులు ఉంచి, ఐదవ రోజున దానిని క్రిందకు దించేశారు. అందు వలన బాబాకు సంతోషమూ కలగ లేదు, దుఃఖమూ కలగ లేదు.
అవింధ మ్హణతా వింధితకాన | హిందూ మ్హణతా సుంతా ప్రమాణ | ఏసా నా హిందూ నా యవన | అవతార పావన్ సాఈంచా | ||౧౩||
13. బాబా ముస్లిము అని అనుకుందాము అంటే, చెవులు కుట్టి ఉన్నాయి. హిందువు అని అనుకుంటే, వారికి సుంతీ జరిగింది. హిందువు కన్నా, ముస్లిము కన్నా అతీతమైన పావన అవతారం సాయిది.
హిందూ మ్హణావె జరీ తయాంస | మశీదీంత సదా నివాస | యవన మ్హణావే తరీ హుతాశ2 | అహర్నిశ మశీదీంత | ||౧౪||
14. వారిని హిందువు అంటే, వారి నివాసం ఎప్పుడూ మసీదులోనే. ముస్లిము అని అంటే, రాత్రింబవళ్ళూ అగ్నిహోత్రం చేసేవారు.
మశీదీంత జాత్యాచే దళణ | మశీదింత ఘంటాశంఖవాదన | మశీదీంత అగ్నిసంతర్పణ | ముసలమాన కైస్ హే | ||౧౫||
15. మసీదులో విసరటం, మసీదులో ఘంటా నాదం, అక్కడే శంఖు ఊదటం, అక్కడే అగ్నికి ఆహుతులు ఇవ్వడం, ఇక వారు ముస్లిము ఎలా అవుతారు?
మశీదీంత సదైవ భజన | మశీదీంత అన్నసంతర్పణ | మశీదీంత అర్ఘ్య-పాద్య-పూజన | ముసలమాన కైసే హే | ||౧౬||
16. మసీదులోనే ఎల్లప్పుడూ భజనలు, అర్ఘ్య పాద పూజలు, అక్కడే అన్న సంతర్పణలు, ఇవన్నీ ఉన్న తరువాత వారు ముసల్మాను ఎలా అవుతారు?
మ్హణావీ జరీ మ్లేంచ్ఛ జాతీ | బ్రాహ్మణోత్తమ పూజన కరితీ | అగ్నిహోత్రీ లోటాంగణీ యేతీ | త్యాగూని స్ఫీతీ3 సోంవళ్యాచీ | ||౧౭||
17. ముస్లిము అని అనుకుందాము అంటే, వారిని శ్రేష్ఠమైన బ్రాహ్మణులు పూజిస్తారు. అభిమానాన్ని, మడిని, విడిచి పెట్టి, అగ్నిహోత్రులు వారి పాదాలకు సాష్టాంగ పడతారు.
ఏసే జన విస్మిత చిత్తీ | పాహూ యేతీ జే జే ప్రచీతీ | తేహీ తైసేంచ ఆపణ వర్తతీ | మూగ గిళితీ దర్శనే | ||౧౮||
18. అలా జనులు ఆశ్చర్యపోయారు. తామే స్వతహాగా కనుక్కుందామని వచ్చినవారు కూడా అలాగే నడుచుకుంటారు. బాబా దర్శనంతో వారికి నోటి మాట రాక, ఊరికే ఉండిపోతారు.
తరీ జో సర్వదా హరీసీ శరణ | త్యా కాయ మ్హణావే హిందూ వ యవన | అసో శూద్ర అతిశూద్ర యాతివిహీన | జాతీ న ప్రమాణ అణుమాత్ర | ||౧౯||
19. ఎల్లప్పుడూ హరి శరణులో ఉండేవారిని, హిందువని లేక ముస్లిమని ఎలా అనగలం? వారు శూద్రుడైనా, అంత కన్నా తక్కువైనా, లేక జాతి లేకున్న వారైనా, వారి యోగ్యతను తెలుసుకోవటానికి వారి జాతి ఏ మాత్రం ఆధారం కాదు.
నాహీ జయాస దేహాభిమాన | అసో హిందూ వా ముసలమాన | సకల వర్ణా సమసమాన | తయా న భిన్నపణ జాతీచే | ||౨౦||
20. దేహం మీద ఏ మాత్రం అభిమానము లేని, వారు, హిందువునైనా, ముస్లిమునైనా, ఏ జాతి వారినైనా సమానంగా చూస్తారు.
ఫకీర పంక్తీసీ మాంస భోజన | అథవా యదృచ్ఛ మత్స్యసేవన |
తెథేంచ తోండ ఘాలితా శ్వాన | విటే న మన జయాచే | ||౨౧||
21. ఫకీరులతో కూర్చుని, మాంసాన్ని, లేదా చేపలను, ఏది దొరికితే దానిని తినేవారు. అందులో కుక్కలు మూతి పెట్టినా అసహ్యించుకునే వారు కాదు.
కీ పుఢీల సాలీ ఆలియా తోటా | వేళీ పురవఠా హోఈల | ||౨౨||
22. రైతులు ఆ సంవత్సరంలో పండిన ధాన్యాన్ని, తరువాత ఎప్పుడైనా ధాన్యం కొరత ఏర్పడితే ఆ అవసరానికి వాడుకోవటానికి, ముందుగానే పోగు చేసి, సంచుల్లో కట్టి ఉంచుతారు.
తైసే సంగ్రహీ గవ్హాంచే పోతే | దళాయా మశీదీంత అసే జాతే | పాఖడావయా సూపహీ హోతే | న్యూన నవ్హతే సంసారాస | ||౨౩||
23. అలాగే, బాబా గోధుమలను ఒక బస్తాలో నింపి, మసీదులో ఉంచేవారు. విసురుకోవటానికి అక్కడ తిరగలి కూడా ఉండేది. చెరగటానికి చేటలూ ఉండేవి. సంసారానికి కావలసిన వాటికి ఏ కొరతా లేదు.
సభామండపీ శోభాయమాన | సుందర ఖాసే తులసీ వృందావన | తెథేంచ ఎక లాంకడీ స్యందన4 | అతి సులక్షణ కాంతీవ | ||౨౪||
24. సభామండపంలో అందమైన తులసీ బృందావనం, లక్షణమైన ఒక చెక్క రథం కూడా అక్కడ ఉండేవి.
హోతే కాహీ పుణ్య గాంఠీ | తేణే యా సద్వస్తూచీ ఝాలీ భేటీ | ఏసీ దృఢ సాంఠవా హృదయ సంపుటీ | పడేనా తుటీ ఆమరణాంత | ||౨౫||
25. మునపటి జన్మలలో ఏదో పుణ్యం చేసుకోగా, ఈ మంచి వస్తువులకు ఇక్కడ పరమేశ్వరుని అవతారమైన సాయితో కలయిక ఏర్పడింది. ఇటువంటి వస్తువులను మన హృదయంలో గట్టిగా పెట్టుకుంటే, చనిపో్యేవరకు ఏ లోటూ ఉండదు.
కాహీ పూర్వార్జిత సభాగ్యతా | తేణే హే పాయ ఆలే హాతా | మనాస లాభలీ శాంతతా | నిశ్చింతతా హీ ప్రపంచీ | ||౨౬||
26. వెనుకటి జన్మలలో సంపాదించుకున్న పుణ్యం వలనే మనకు సాయి పాదాల దగ్గర చోటు దొరికి, సాంసారిక సమస్యలనుంచి ముక్తి మరియు మనసుకు శాంతి లభించింది.
పుఢే కితీహీ సుఖసంపన్న | ఝాలో తరీ తే సుఖ న యే పరతోన | జే శ్రీసాఈ సమర్థ సమాగమజన్య | భోగితా ధన్య ఝాలో మీ | ||౨౭||
27. తరువాత ఎంత సంపద, సుఖం దొరికినా, శ్రీ సాయితో గడిపి ధన్యుణ్ణైన ఈ సుఖం, ఆనందం మరల ఎప్పటికీ రాదు.
స్వానందైక చిద్ఘన సాఈ | కాయ వానూ త్యాచీ నవలాఈ | జో తో రాతలా తయాచ్యా పాయీ | జో జో ఠాయీంచ బైసవిలా | ||౨౮||
28. ఎప్పుడూ ఆత్మలో లీనమై, పూర్తి ఆనందానికి నిలయం సాయి. వారి గొప్పతనాన్ని, వారి లీలలను నేను ఎలా వర్ణించగలను? వారి పాదాలను నమ్ముకున్న భక్తుల నమ్మకాన్ని వారు ఎప్పుడూ దృఢ పరుస్తారు.
అజిన దండధారీ తాపసీ | హరిద్వారాది తీర్థవాసీ | తడీ తాపడీ ఆణి సంన్యాసీ | త్యాగీ ఉదాసీ బహు యేతీ | ||౨౯||
29. జింక చర్మాన్ని కట్టుకుని, చేతిలో కర్రను పట్టుకున్న తాపసులు, హరిద్వారం మొదలైన పుణ్య క్షేత్రాలలో ఉండేవారు, సన్యాసులు, త్యాగులు, బైరాగులు, బిచ్చగాళ్ళు, మొదలగు అనేక రకాల జనులు బాబా వద్దకు వచ్చేవారు.
బోలే చాలే హసే ఉదండ | జివ్హేస అల్లా మాలీక అఖండ | నావడే వాద కింవా వితండ | నికట దండ5 సర్వదా | ||౩౦||
30. బాబా మాట్లాడుతూ, తిరుగుతూ, నవ్వుతూ ఉండేవారు. వారి పెదవుల మీద ఎప్పుడూ ‘అల్లా మాలిక’ అన్న పేరు ఉండేది. వారికి వాదాలన్నా, పనికి రాని మాటలన్నా, అసలు ఇష్టం ఉండేది కాదు. సటకాను ఎప్పుడూ తమ దగ్గరే ఉంచేవారు.
తాపస వృత్తి శమీ దాంత | వాచా స్త్రవే పూర్ణ వేదాంత |
కోణాహీ న లాగలా అంత | అఖేరపర్యంత బాబాంచా | ||౩౧||
31. వారు గొప్ప తపస్వి. మనసును స్థిరంగా ఉంచి, ఇంద్రియాలను జయించినవారు. సంపూర్ణమైన వేదాంతం వారి మాటలలో ఎప్పుడూ ప్రవహిస్తుండేది. చివరి వరకు, వారి స్వభావాన్ని ఎవరూ సరిగ్గా కనుక్కో లేక పోయారు.
రావ అసో వా రంక | సమసామ్య సకళా నిష్టంక | లక్ష్మీపుత్ర వా భికారీ రంక | ఉభయాంస ఎకచి మాప తెథే | ||౩౨||
32. సాహుకారైనా, బిచ్చగాడైనా, ఇద్దరినీ వారు సమంగా చూసేవారు. శ్రీమంతుడైనా, బికారి అయినా ఇద్దరినీ ఒకే త్రాసులో తూచేవారు.
కోణాచే బరే వాఈట కర్మ | జాణతసే జివా ఆంతులే మర్మ | సాంగూన దేత ఖూణ వర్మ | ఆశ్చర్య పరమ భక్తాంనా | ||౩౩||
33. అందరి మంచి పనులు, చెడు పనులు, వారి మనసులోని రహస్యాలు, ఇవి సాయికి తెలిసేవి. భక్తుల రహస్యాలను వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పి, వారిని ఆశ్చర్య పరచేవారు.
జాణపణాచే తే సాఠవణ | నేణతపణాచే పాంఘరూణ | మాన సంపాదన జయాస శీణ | ఎవం లక్షణ శ్రీసాఈ | ||౩౪||
34. వారు జ్ఞానం కోశాగారం. కాని ఏమీ ఎరుగనట్లుగా అజ్ఞానివలె నటించేవారు. గౌరవాలు, సన్మానాలు అంటే వారికి నచ్చేవి కావు. ఇవి శ్రీ సాయిలోని కొన్ని లక్షణాలు.
కాయా జరీ మానవాచీ | కరణీ అపూర్వ దేవాచీ | శిరడీంత ప్రత్యక్ష దేవ తో హాచి | భావితీ హేంచి జన సారే | ||౩౫||
35. మనిషి దేహంలో ఉన్నా, వారు చేసే పనులు, దేవుళ్ళు చేసే పనులలా ఉండేవి. శిరిడీలో ఉన్న ప్రత్యక్ష దేవుడు వీరే అని జనులంతా నమ్మేవారు.
కాయ బాబాంచే చమత్కార | కితీ మ్హణూన మీ వర్ణూ పామర | దేవా దేఉళాంచేహీ జీర్ణోద్ధార | బాబాంనీ అపార కరవిలే | ||౩౬||
36. బాబా చమత్కారాల గురించి అజ్ఞాని అయిన నేను ఎంతని వర్ణించను? లెక్కలేనన్ని ఆలయాలను చక్కగా పునరుద్ధరణ చేయించారు.
శిరడీస తాత్యా పాటీలా హాతీ | శనీ గణపతీ శంకరపార్వతీ | గ్రామదేవీ ఆణి మారూతీ | యాంచీహీ సుస్థితీ లావిలీ | ||౩౭||
37. శిరిడీలోని గ్రామ దేవతల, గణపతి, ఉమామహేశ్వరుల మరియు మారుతి మందిరాలను తాత్యా పాటీలు ద్వార పునరుద్ధరణ చేయించారు.
లోకాంపాసూని దక్షిణామిషే | ఘేత అసత బాబా జే పైసే | కాహీ ధర్మార్థ వాటీత జైసే | కాంహీ తైసేచ తే దేత | ||౩౮||
38. దక్షిణ నెపంతో భక్తుల దగ్గరనుండి తీసుకున్న డబ్బును కొంత ధర్మ కార్యాలకు ఖర్చు పెట్టి, మిగతా డబ్బును జనులకు ఇచ్చేవారు.
కోణాస రోజ రూపయే తీస | కోణాస దహా పంధరా, పన్నాస | ఏసే మన మానేల తయాంస | వాంటీత ఉల్హాస వృత్తీనే | ||౩౯||
39. ఒకరికి ముప్పై, ఇంకొకరికి పది, పదిహేను లేక యాభై ఇలా తమకు తోచినట్లుగా ప్రతిరోజూ సంతోషంగా పంచేవారు.
హా తో సర్వ ధర్మాచా పైసా | ఘేణారాసహీ పూర్ణ భరవసా | వినియోగహీ వ్హావా తైసా | హీచ మనీషా బాబాంచీ | ||౪౦||
40. ఈ డబ్బంతా ధర్మంగా వచ్చింది. దానిని పొందినవారు, ఆ డబ్బును మంచి పనులకే ఉపయోగించాలని అనుకునేవారు. బాబా మనసులో కూడా వారు దానిని మంచి పనులకు ఉపయోగించాలనే అభిప్రాయం ఉండేది.
అసో కిత్యేక దర్శనే పుష్ట | కిత్యేక ఝాలే దృష్టాంచే సుష్ట |
కిత్యేకాంచే గేలే కుష్ట | పావలే అభీష్ట కితీ ఎక | ||౪౧||
41. సాయి దర్శనంతోనే ఎంతో మంది ఆరోగ్యవంతులు అయ్యారు. చెడు పనులు చేసే ఎందరో మంచివారయ్యారు. కుష్టు రోగంతో బాధపడుతున్న ఎందరికో వారి వ్యాధి నయమయింది. చాలా మంది కోరికలు ఫలించాయి.
ఆలే పాయ కితీక పంగూంస | కెవళ పాయాంస లాగతా | ||౪౨||
42. ఏ అంజనం గాని, ఆకు రసం కాని వేయకుండానే, వారి పాదాలను తాకినందుకు ఎందరో గ్రుడ్డివాళ్ళకు కళ్ళ చూపు వచ్చింది. కుంటివాళ్ళెందరికో కాళ్ళు బాగయ్యాయి.
మహిమా తయాంచా అనివార | కోణా న లాగే తయాంచా పార | యాత్రా యేఊ లాగలీ అపార | అపరంపార చౌబాజూ | ||౪౩||
43. అంతు లేని వారి మహిమయొక్క మూలం ఎవరికీ అర్థం కాలేదు. నలువైపులనుండి జనులు తండోపతండాలుగా సాయి దగ్గరకు రాసాగారు.
ధునీ నికట తేచ స్థానీ | మలమూత్రాతే విసర్జూనీ | కధీ పారోసే కధీ స్నానీ | నిత్య ధ్యానీ నిరత జే | ||౪౪||
44. ధుని దగ్గరలోనే, మలమూత్రాలను చేసేవారు. ఒకప్పుడు స్నానం చేసేవారు. మరొకప్పుడు చేసేవారు కాదు. ఎప్పుడూ ధ్యానంలో మగ్నులై ఉండేవారు.
డోఈస సఫేత పాగోటే ఖాసే | స్వచ్ఛ ధోతర లావీత కాసే | అంగాంత సదరా కీ పైరణ అసే | పెహరావ ఏసా ఆరంభీ | ||౪౫||
45. తలకు తెల్లటి పాగా కట్టుకుని, నడుముకు శుభ్రమైన లుంగీని కట్టుకుని, ఒంటిమీద జుబ్బా కాని, చొక్కా కాని తొడిగేవారు. మొదట్లో దుస్తులు ఇలా ధరించేవారు.
ఆరంభీ గాంవీ వైద్యకీ కరీత | పాహూన పాహూన దవా దేత | హాతాలాహీ యశ బహుత | హకీమ విఖ్యాత జాహలే | ||౪౬||
46. మొదట్లో ఊరి జనులకు బాబా వైద్యం చేసేవారు. బాగా పరీక్షించి మందులను ఇచ్చేవారు. వారి హస్తవాసి మంచిదన్న కీర్తితో, వైద్యుడిగా పేరు పొందారు.
ఎకదా ఎకా భక్తాచే డోళే | సుజూని ఝాలే లాల గోళే | రక్త బంబాళ దోనీ బుబుళే | వైద్య న మిళే శిరడీంత | ||౪౭||
47. ఒక మారు, ఒక భక్తునికి కళ్ళు బాగా వాచి, రెండు కనుగుడ్లు ఎర్రని గోళాల మాదిరి అయ్యాయి. అతనికి శిరిడీలో వైద్యులెవరూ దొరకలేదు.
భక్త బిచారే భావిక భోళే | బాబాంస దాఖవితే ఝాలే డోళే | బిబే ఠేచూని కరవిలే గోళే | సత్వర తే వేళే బాబాంనీ | ||౪౮||
48. పాపం, ఏమీ తెలియని ఆ భక్తుడు తన కళ్ళను బాబాకు చూపించాడు. వెంటనే బాబా జీడి గింజలను చితక కొట్టి, ముద్దలా చేసారు.
కోణీ ఘాలీల సురమ్యాచ్యా కాడ్యా | కోణి గాఈచ్యా దుధాచ్యా ఘడ్యా | కోణీ శీతళ కాపురాచ్యా వడ్యా | దేఈల పుడ్యా అంజనాచ్యా | ||౪౯||
49. సామాన్యంగా, ఇలాంటి కళ్ళ జబ్బుకు కాటుకను పెడుతారు, లేక ఆవు పాలతో కట్టు కడతారు. కొందరు కర్పూరపు బిళ్ళగాని, లేక అంజనం గాని వేస్తారు.
బాబాంచా తో ఉపాయచి వేగళా | స్వహస్తే ఉచలిలా ఎకేక గోళా | చిణూని భరలా ఎకేక డోళా | ఫడకా వాటోళా వేష్టిలా | ||౫౦||
50. కాని, బాబా పద్ధతే వేరు. జీడి ముద్దలను ఒక్కొక్కటిగా తమ చేతుల్లోకి తీసుకుని, ఒక్కో కంట్లో బాగా నింపి, బట్టతో కట్టు కట్టారు.
ఉదయీక డోళ్యాచీ పట్టీ సోడిలీ | వరీ పాణ్యాచీ ధార ధరిలీ |
సూజ హోతీ తీ సర్వ నివళలీ | బుబుళే జాహలీ నిర్మళ | ||౫౧||
51. మరునాడు తెల్లవారే, కళ్ళకు కట్టిన పట్టీని విప్పి, కళ్ళపై ధారగా నీరు పోశారు. ఆ భక్తుని కళ్ళ వాపంతా తగ్గిపోయి, కళ్ళు శుభ్రమయ్యాయి.
డోళ్యా సారిఖా నాజూక భాగ | నాహీ బిబ్యాచీ ఝాలీ ఆగ | బిబ్యానే దవడిలా నేత్ర రోగ | ఏసే అనేక అనుభవ | ||౫౨||
52. చాలా నాజూకు అయిన కళ్ళలో జీడి గింజలను వేస్తే, కళ్ళు మండలేదు సరికదా, కళ్ళ జబ్బు పారిపోయింది. ఇలాంటి అనుభవాలు ఎన్నో!
ధోతీ పోతీ తయా అవగత | నకళత ఎకాంత స్థళీ జాత | స్నాన కరితా ఆంతడీ ఓకీత | ధుఊన టాకీత వాళావయా | ||౫౩||
53. హఠయోగంలో భాగాలైన ధౌతి-పోతి వంటి యోగ ప్రక్రియలు బాబాకు తెలుసు. ఎవరికీ తెలియకుండా ఒక ఏకాంత చోటుకు వెళ్ళి, స్నానం చేసేటప్పుడు, పొట్టలోని ప్రేగులను బయటకు తీసి, కడిగి, శుభ్రం చేసి, ఎండ బెట్టేవారు.
మశీదీహూన జితకా ఆడ6 | తితకేంచ పుఢే వడాచే ఝాడ | తయాహీపలీకడే ఎక ఆడ | దో దివసా ఆడ జాత తే | ||౫౪||
54. మసీదునుండి బావి ఎంత దూరాన ఉందో, అంత దూరం ముందుకు వెళితే, అక్కడ ఒక మర్రి చెట్టు ఉండేది. దానికి అవతల ఇంకొక బావి ఉండేది. ఈ రెండవ బావి దగ్గరకు బాబా రెండు రోజులకొక సారి వెళ్ళేవారు.
భర దుపారీ ప్రఖర ఊన | కోణీ న తెథే ఏసే పాహూన | స్వయే ఆడాంతూన పాణీ కాఢూన | ముఖ మార్జన కరీత | ||౫౫||
55. మిట్ట మధ్యాహ్నం మండుతున్న ఎండలో, అక్కడికి ఎవరూ వచ్చేవారు కాదు. అది చూచి, బాబా తామే నీరు చేదుకొని, మొహం కడుక్కునే వారు.
అసో ఏసియా ఎకా ప్రసంగీ | బైసలే అసతా స్నానాలాగీ | ఆంతడీ కాఢూని లాగవేగీ | ధుఊ తె జాగీ లాగలే | ||౫౬||
56. ఇలాంటి ఒకప్పుడు బాబా స్నానానికి కూర్చుని, ప్రేగులను తీసి, వానిని త్వర త్వరగా కడగ సాగారు.
అజా మారితా తిచీ ఆంతడీ | బాహ్యాభ్యంతర కరూని ఉఘడీ | ధుఊని ఘాలితీ ఘడీవర ఘడీ | నిర్మళ చోఖడీ కరితాత | ||౫౭||
57. మేకను చంపినప్పుడు, దాని ప్రేగులను బయటకు తీసి, కడిగి, శుభ్రం చేసి, చుట్ట పెడతారు.
తైసీచ ఆపులీ ఆంతడీ కాఢూన | ఆంతూన బాహేర స్వచ్ఛ ధుఊనీ | పసరలీ జాంబాచే ఝాడావరూని | ఆశ్చర్య జనీ బహు కేలే | ||౫౮||
58. అలాగే, బాబా తమ ప్రేగులను బయటకు తీసి, లోపలా బయటా శుభ్రంగా కడిగి, జామ చెట్టుపై పరచి, ఎండబెట్టేవారు. చూచిన జనులకు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉండేది.
జ్యాంహీ హీ స్థితీ డోళా దేఖిలీ | త్యాంతీల కాంహీ హయాత మండళీ | ఆహేత అజూన శిరడీంత ఉరలీ | మ్హణతీ వల్లీ తో అపూర్వ | ||౫౯||
59. తమ కళ్ళతో బాబాయొక్క ఈ అద్భుత లీలను చూచిన వారిలో కొందరు, ఇప్పటికీ శిరిడీలో ఉన్నారు. వారంతా బాబాకు సాటిగా ఇంకెవ్వరూ లేరని అనేవారు.
కధీ లావీత ఖండయోగ | కరీత హస్తపాదాది విలగ | ఏసే మశీదీంత జాగోజాగ | అవయవ అలగ తే పడత | ||౬౦||
60. ఇంతే కాకుండా, ఖండయోగంతో తమ కాళ్ళూ, చేతులూ వేరు చేయడం కూడా బాబాకు తెలుసు. అలా చేసినప్పుడు, బాబా అవయవాలు మసీదులో అక్కడక్కడా పడి ఉండేవి.
దేహ ఏసా ఖండ విఖండ | దేఖావా తో భయంకర ప్రచండ |
పాహూ ధాంవత లోక ఉదండ | బాబా అఖండ త్యా దిసతీ | ||౬౧||
61. దేహం ఇలా ఖండ ఖండాలుగా పడి ఉందని తెలిసి, ఆ భయంకర దృశ్యాన్ని చూద్దామని ప్రజలు పరుగెట్టుకుంటూ వెళితే, వారికి యథాప్రకారం పూర్తిగా బాబా కనిపించేవారు.
కోణా దృష్టే బాబాంస ఠార | కెలే అత్యాచార హా | ||౬౨||
62. ఇలా ఒక సారి బాబా అవయవాలను ముక్కలు ముక్కలుగా చూసిన ఒక గ్రామస్థుడు, బాబాను ఏ దుర్మార్గుడో అత్యాచారం చేసి, హతమార్చాడు, అని చాలా గాబరా పడ్డాడు.
మశీదీంత ఠికఠికాణీ | అవయవ దిసతీ చార హీ కోనీ | రాత్ర మధ్యాన్హ జవళీ న కోణీ | చింతా మనీ ఉద్భ వలీ | ||౬౩||
63. బాబా అవయవాలు, మసీదులో వేరు వేరుగా, విడి విడిగా నలుదిక్కులూ పడి ఉన్నాయి. అర్ధరాత్రి సమయాన వారి దగ్గర ఎవరూ లేరే అని అతను చాలా బాధపడ్డాడు.
జావే కోణాస సాంగావయాలా | హోఈల ఉలట టాంగావయాలా | ఏసా విచార పడలా తయాలా | జాఊని బైసలా బాహేర | ||౬౪||
64. ఈ సంగతి ఎవరికైనా చెబుదాము అని అనుకుంటే, మొదట తననే అనుమానిస్తారు అని తలచి, వెళ్ళి బయట కూర్చున్నాడు.
అసేల సాఈచా హా యోగ కాంహీ | హే తో తయాచ్యా స్వప్నీంహీ నాహీ | పాహోని ఛిన్నభిన్నతాహీ | భీతి హృదయీ ధడకలీ | ||౬౫||
65. సాయియొక్క యోగ క్రియ ఇది అని అతనికి అసలు తెలియదు. భిన్నాభిన్నంగా పడి ఉన్న బాబా దేహాన్ని చూచి, అతని హృదయం దడదడలాడింది.
కోణాస తరీ కళవావా ప్రకార | మనాంత త్యాచే యేఈ ఫార | పరీ మీచ ఠరేన గున్హేగార | ప్రథమ ఖబర దేణారా | ||౬౬||
66. ఎవరికైనా ఈ సంగతి తెలియ చేద్దామని అతనికి చాలా అనిపించింది. కాని, ఎవరికి చెప్పినా, మొదట తనే అపరాధి అని అనుకుంటారు.
మ్హణూన కోణాస సాంగవేనా | యేత మనాంత అసంఖ్య కల్పనా | మ్హణూన పహాటే జాఊన పున్హా | పహాతా మనా విస్మిత | ||౬౭||
67. అని, చాలా రకాలుగా ఆలోచించి, ఎవరికీ చెప్పలేదు. తెల్లవారు ఝాము కాగానే ఇంకొక సారి వెళ్ళి చూచి, ఆశ్చర్యపోయాడు.
అదృశ్య పూర్వీల సర్వ ప్రకార | బాబా కుశలస్థానీ స్థిర | హే స్వప్న నాహీంనా ఏసా విచార | యేఊని పహాణార సాశ్చర్య | ||౬౮||
68. తను ముందు చూచినదేమీ కనిపించలేదు. ఎప్పటిలాగే, బాబా క్షేమంగా తమ చోటులో కూర్చుని ఉన్నారు. ఇది కల కాదు కదా అని అతను విస్తుపోయాడు.
హే యోగ హే ధోతీపోతీ | బాళపణాపాసూని ఆచరతీ | కోణా న కళేతీ అగమ్యగతి | యోగస్థితీ తయాంచీ | ||౬౯||
69. ధౌతి-పోతి అను ఈ యోగ ప్రక్రియలు బాబాకు చిన్నప్పటినుంచే అలవాటు. కాని, వారికి యోగంలో ఉన్న పట్టు, దాని వలన కలిగే శక్తి గురించి ఎవరికీ అర్థం కాలేదు.
దిడకీస నాహీ కోణాచ్యా శివలే | గుణానే ప్రఖ్యాతీతే పావలే | గరీబ దుబళ్యాంస ఆరోగ్య దిధలే | హకీమ గాజలే తే ప్రాంతీ | ||౭౦||
70. ఎవరి దగ్గరా బాబా దమ్మిడి అయినా తీసుకునే వారు కాదు. వారి కీర్తి, రోగాలను నయం చేయడంతో వచ్చినది. పేదలకు, బలహీనులకు, ఆరోగ్యాన్నిచ్చి, ఆ ప్రాంతంలో హకీముగా పేరు పొందారు.
హకీమ హా తో కేవళ పరార్థా | అతి ఉదాస తో నిజస్వార్థా |
సాధావయా పరకీయార్థా | అసహ్యానర్థా సాహతసే | ||౭౧||
71. కాని ఈ హకీము కేవలం ఇతరులకు వైద్యం చేయడం వరకే. తమ విషయంలో చాలా వైరాగ్యంగా ఉండేవారు. ఇతరుల కోసం ఎంత సహింపరాని బాధనైనా సహించేవారు.
యే అర్థీంచీ అభినవ కథా | నివేదితో మీ శ్రోతియాం కరితా | విదిత హోఈల బాబాంచీ వ్యాపకతా | తైశీచ దయార్ద్రతా తయాంచీ | ||౭౨||
72. ఈ సందర్భంలో, శ్రోతలకు, ఎవరూ ఊహించని ఒక కథను, నేను మనవి చేస్తాను. దాంతో బాబాయొక్క దయగల మనస్సు, మరియు వారు అన్ని చోట్లా వ్యాపించి ఉండటం గురించి తెలుస్తాయి.
సన ఎకోణీసశే దహా సాలీ | సమయ ధనతేరస7 దివాళీ | బాబా సహజ ధునీజవళీ | బైసలే జాళీత లాంకడే | ||౭౩||
73. క్రి. శ. ౧౯౧౦ వ సంవత్సరంలో దీపావళి ముందు వచ్చే త్రయోదశి రోజు (ధన్‍తెరాస్), బాబా మామూలుగా ధుని దగ్గర కూర్చుని, ధునిలో కట్టేలను కాల్చుతున్నారు.
ప్రఖర తెవలీ హోతీ ధునీ | నిజహస్త త్యాంతచి ఖుపసునీ | బాబా బైసలే నిశ్చింత మనీ | హాత భాజూని నిఘాలా | ||౭౪||
74. ధుని బాగా మండుతుండగా, చుట్టు ప్రక్కల ధ్యాస లేకుండా, బాబా తమ చేతిని నిప్పులో దూర్చి, అలానే కూర్చున్నారు. వారి చేయి చాలా దారుణంగా కాలింది.
మాధవ నామే తయాంచా సేవక | లక్ష గేలే తయాచే సాహజిక | దేశపాండేహీ8 హోతే నజీక | తేహీ తాత్కాలిక ధాంవలే | ||౭౫||
75. మాధవ అనే వారి సేవకుడు దాన్ని చూచాడు. మాధవరావు దేశపాండే కూడా వారి దగ్గరే ఉన్నాడు. ఇది చూసి, వెంటనే బాబా వెనుకకు పరుగెత్తాడు.
జాఊనీ మాగే మారూని బైసకా | కంబరేస ఘట్ట ఘాతలా విళఖా | బాబాంస మాగే ఓఢోని దేఖా | పుసతీ విలోకా మగ కాయ | ||౭౬||
76. వారి వెనుక కూర్చుని, వారి నడుము చుట్టూ చేయి వేసి, గట్టిగా పట్టుకుని, వెనుకకు లాగాడు. లాగి, ‘దేవా! ఎందుకిలా చేశారు?’ అని అడిగాడు.
హాహా దేవా హే కాయ కేలే | మ్హణతా బాబా ధ్యానావర ఆలే | ఎక పోరరే ఖాకేచే మ్హణతీ నిసటలే | భట్టీంత పడలే ఎకాకీ | ||౭౭|
77. బాబా వెంటనే తేరుకుని, “ఒక పసిపాప తన తల్లి చంకలోనుండి హఠాత్తుగా జారి, కమ్మరి వాని కొలిమిలో పడింది.
ఏకూని నిజపతీచ్యా హాకే | లోహారాచీ రాండరే ధాకే | మారూని ఆపుల్యా పోరాస ఖాంకే | భాతా ఫుంకే భట్టీచా | ||౭౮||
78. “తన బిడ్డను ఒడిలో వేసుకున్న ఒక కమ్మరి వాని భార్య, భర్త పిలుపు విని, భయంతో కొలిమి తిత్తిని వేగంతో ఊదసాగింది.
ఫుంకతా ఫుంకతా లక్ష చుకలీ | ఖాంకేస పోర హే తీ విసరలీ | పోర తీ అచపళ తెథూన నిసటలీ | పడతాంచ ఉచలలీ మీ శామా | ||౭౯||
79. “అలా కొలిమిని ఊదుతూ ఊదుతూ, తన ఒడిలో ఉన్న బిడ్డ సంగతి మరిచిపోయింది. ఆ పాప దుడుకుగా అక్కడినుండి జారిపోయింది. కాని శ్యామా, జారిన వెంటనే నేను పైకి లేవనెత్తాను.
కాఢావయాస త్యా పోరీలా | గేలో తో హా ప్రకార ఘడలా | భాజూ దేరే హా హాత మేలా | ప్రాణరే వాచలా పోరీచా | ||౮౦||
80. “ఆ పాపను బయటికి తీయబోతే, ఇలా జరిగింది. ఈ చేయి కాలితే కాలనీ, బిడ్డ ప్రాణం దక్కింది కదా” అని అన్నారు.
ఆతా యా హాతాచే దుఖణే | కైసా ఉపాయ కరావా కవణే |
చాందోరకరాస పత్ర ఘాలణే | మాధవరావానే ఠరవిలే | ||౮౧||
81. ‘ఇప్పుడు ఈ చేతి బాధను ఎలా నయం చేయాలి?’ అని మాధవరావు ఆలోచించాడు. నానా చాందోర్కరుకు ఉత్తరం వ్రాయాలని నిశ్చయించుకున్నాడు.
సమవేత ఘేఊనియా సత్వర | ఆలే చాందోరకర శిరడీస | ||౮౨||
82. ఏదీ వదలకుండా జరిగినదంతా ఉత్తరంలో వ్రాశాడు. పరమానంద అనే ప్రసిద్ధమైన డాక్టరును తీసుకుని నానా వెంటనే శిరిడీకి వచ్చాడు.
ఉపయోగా పడతీ దాహోపశమనా | ఏశీ ఘేతలీ ఔషధే నానా | పరమానంద సమవేత నానా | సాఈ చరణా పాతలే | ||౮౩||
83. కాలిన గాయాన్ని తగ్గించటానికి అవసరమైన ఎన్నో రకాల మందులతో, మంచి డాక్టరుతో, నానా సాయి పాదాల వద్దకు వచ్చాడు.
కరూని బాబాంసి అభివందన | పుసతీ కుశల వర్తమాన | నివేదిలే ఆగమన ప్రయోజన | హస్తావలోకన ప్రార్థిలే | ||౮౪||
84. బాబా పాదాలకు నమస్కరించి, కుశల ప్రశ్నల తరువాత, తాను వచ్చిన పనిని తెలిపి, బాబాయొక్క చేతిని చూపించమని నానా ప్రార్థించాడు.
ఆధీంచ హాత పోళల్యాపాసూన | భాగోజీ శిందా తూప చోళూన | పట్టయా బాంధీతసే కరకరూన | పాన బాంధూన ప్రత్యహీ | ||౮౫||
85. చేయి కాలినప్పటినుండే, భాగోజీ శిండే బాబా చేతికి నేయి వ్రాసి, ప్రతిరోజూ ఆకులు వేసి గట్టిగా కట్టు కట్టేవాడు.
తో హాత సోడోనియా పహావా | పరమానందాస దాఖవావా | దవా ఉపచార సురూ కరావా | గుణ పడావా బాబాంనా | ||౮౬||
86. ఆ కట్లను విప్పి, పరమానందకు చూపించి, సరియైన మందులతో ఉపచారం చేస్తే, బాబాకు తొందరగా నయమవుతుంది.
హీ సదిచ్ఛా ధరూని మనీ | బహుత నానాంనీ కేలీ మనధరణీ | ప్రయత్నహీ కేలా పరమానందానీ | పట్టయా సోడూని పహావే | ||౮౭||
87. అన్న మంచి ఉద్దేశంతో నానా బాబాను ఎంతో ప్రార్థించాడు. కట్లు విప్పి, చేతి గాయాన్ని తను చూడాలని పరమానందు కూడా విశ్వ ప్రయత్నం చేశాడు.
ఆజ ఉద్యా ఆజ ఉద్యా కరూనీ | వైద్య ఆపులా అల్లా మ్హణూనీ | హస్త న దిధలా పహావయా లాగూనీ | ఖేదహీ న మనీ తయాచా | ||౮౮||
88. ఇవాళ రేపు, ఇవాళ రేపు, అంటూ, “నా వైద్యుడు అల్లా” అని చెప్పుతూ, తమ చేతిని బాబా అసలు చూడనివ్వలేదు. అలా చూపక పోవడం వలన వారి మనసులో ఏ వ్యథా లేదు.
పరమానందాచా ఆణిలేలా దవా | తయా న లాగలీ శిరడీచీ హవా | పరీ సాఈదర్శన సుహావా | తయా ఘడావా యోగ హా | ||౮౯||
89. పరమానందు తెచ్చిన మందులకు శిరిడీ గాలి కూడా సోకలేదు. కాని, సాయి దర్శనం, దానితో పొందే ఆనందం, అతనికి అదృష్టవశాత్తు కలిగింది.
భాగోజీచీచ నిత్య సేవా | భాగోజీనేంచ హాత చోళావా | తేణే కాళే హాతహీ బరవా | హోఊని సర్వా సుఖ ఝాలే | ||౯౦||
90. భాగోజీయే ప్రతి రోజూ సేవ చేసేవాడు. బాబా చేతిని బాగా మర్దించేవాడు. అతని సేవ, భక్తి వలన బాబాయొక్క కాలిన చేయి, కొద్ది రోజులకు నయమై, అందరికీ ఆనందం కలిగింది.
ఏసా జరీ హాత బరా ఝాలా | న కళే బాబాంస యేఈ కాయ దుకళా |
తీ ప్రాతఃకాళచీ యేతా వేళా | పట్టయాంచా సోహళా ప్రతిదినీ | ||౯౧||
91. ఇలా బాబా చేతి గాయం నయమైన తరువాత కూడా, ఏ కారణం చేతనో, ప్రతి రోజు తెల్లవారగానే కట్టు విప్పే కార్యక్రమం జరుగుతుండేది. బాబాకు అసలు చేతి వలన ఏ బాధా ఉండలేదు, కాని, ఆ సమయం రాగానే, ఈ కార్యక్రమం మొదలైయ్యేది.
నసతా హాతాస కాంహీంహీ వేదనా | నిత్య నిష్కారణ తయాచీ జోపాసనా | ఘృతమర్దన నిష్పీడన జోపాసనా | ఆమరణాంత చాలవిలీ | ||౯౨||
92. వారికి చేతి నొప్పి ఏ మాత్రం లేకపోయినా, ఏ కారణమో తెలియక, ప్రతి రోజూ వారి చేతికి నేతి మర్దన సేవ మటుకు, బాబా సమాధి వరకు జరిగింది.
హీ ఉపాసనా భాగోజీచీ | సాఈ సిద్ధా న ఆవశ్యకతా జీచీ | భాగోజీస ఘడవితీ నిత్యనేమాచీ | భక్తకాజాచీ ఆవడీ | ||౯౩||
93. స్వతహాగా తామే సిద్ధులవటంతో, భాగోజీయొక్క ఈ సేవ, ఉపచారం బాబాకు అవసరం ఉండలేదు. కాని, భక్తుల శ్రేయస్సుపై ప్రీతి కల బాబా, భాగోజీకి ఈ నిత్య సేవా భాగ్యాన్ని ప్రసాదించారు.
పూర్వ జన్మీంచే మహాదోష | భాగోజీ పావల కుష్ట క్లేశ | పరీ తయాచే భాగ్య విశేష | సాఈ సహవాస లాధలా | ||౯౪||
94. వెనుకటి జన్మలో చేసిన ఏ మహాపాపం వలనో, కాబోలు, భాగోజీకి కుష్టు రోగం వచ్చింది. అయినా, అతని అసాధారణమైన భాగ్యం వలన, సాయి సహవాసం కలిగింది.
లెండీవరీ నిఘతా ఫేరీ | భాగోజీ బాబాంచా ఛత్రధారీ | రక్తపితీ భరలీ శరీరీ | పరీ సేవేకరీ ప్రథమ తో | ||౯౫||
95. బాబా లెండీకి వెళ్ళేటప్పుడు, భాగోజీ వారికి గొడుగు పట్టేవాడు. ఒంటిలో పుళ్ళూ, చీము, రక్తంతో నిండి ఉన్నా, బాబా పరిచారకులలో అతడు మొదటి వాడు.
ధునీపాసలే స్తంభాపాశీ | బాబా జెవ్హా ప్రాతఃసమయాశీ | ప్రత్యహీ బైసత నిజారామాశీ | హజర సేవేసీ తై భాగ్యా | ||౯౬||
96. ప్రతి రోజూ తెల్లవారి, ధునికి చేరువలో ఉన్న కంభం దగ్గర, విశ్రామంగా బాబా కూర్చున్నప్పుడు, భాగోజీ వారి సేవకు హాజరయ్యేవాడు.
హాతాపాయాంచ్యా పట్టయా సోడణే | త్యా త్యా ఠాయీంచే స్నాయూ మసళణే | మసళల్యా ఠాయీ తూప చోళణే | సేవా కరణే భాగ్యానే | ||౯౭||
97. బాబా కాళ్ళకు, చేతులకు ఉన్న కట్లను విప్పి, అక్కడి కండరాలను నేతితో బాగా మర్దన సేవ చేసేవాడు.
పూర్వజన్మీంచా మహాపాపిష్ట | సర్వాంగీ భరలే రక్త కుష్ట | భాగోజీ శిందా మహావ్యాధిష్ట | పరీ భక్త వరిష్ఠ బాబాంచా | ||౯౮||
98. వెనుకటి జన్మలలో మాహాపాపి అయినా, దేహమంతా కుష్టు రోగం నిండి ఉన్నా, బాబా భక్తులలో భాగోజీ శ్రేష్ఠుడు.
రక్తపితీనే ఝడలీ బోటే | దుర్గంధీనే సర్వాంగ ఓఖటే | ఏసే జయాచే దుర్భాగ్య మోఠే | భాగ్య చోఖటే సేవా సుఖే9 | ||౯౯||
99. కుష్టు రోగం వలన అతని వ్రేళ్ళు పోయాయి; అన్ని అవయవాలలోనుండి భరింపరాని చెడు వాసన వస్తూ ఉండేది. ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నా, అన్నింటికన్నా గొప్పదైన బాబాయొక్క సేవా భాగ్యాన్ని పొందాడు.
కితీ మ్హణూని శ్రోతయాంలా | వర్ణూ బాబాంచ్యా అగాధ లీలా | ఎకదా గాంవీ గ్రంథీజ్వర10 ఆలా | చమత్కార ఝాలా తో పరిసా | ||౧౦౦||
100. ఇలాంటి బాబాయొక్క అద్భుత లీలలను ఎన్నని వర్ణించను? ఒక సారి గ్రామంలో ప్లేగు రోగం వచ్చింది. అప్పుడు జరిగిన చమత్కారాన్ని వినండి.
దాదాసాహేబ ఖాపర్డ్యాంచా11 | ములగా ఎక లహాన వయాచా |
ఆనంద సాఈసహవాసాచా | నిజ మాతేచ్యా సహభోగీ | ||౧౦౧||
101. దాదాసాహేబు ఖాపర్డే కొడుకు, ఇంకా చిన్నవాడు, తన తల్లితో పాటు సాయితో సహవాసంతో వచ్చే ఆనందాన్ని పొందుతున్నాడు.
మాతేచే హృదయ ఆలే ఉలూన | అస్వస్థమన జాహలీ | ||౧౦౨||
102. అసలే పసివాడు. అతనికి శరీరం కాలిపోయేలా జ్వరం రాగా, కన్నతల్లి హృదయం ద్రవించి, అశాంతితో మనసు తల్లడిల్లింది.
ఉమరావతీ వసతీస్థాన | ఆలే మనీ కరావే ప్రస్థాన | సాయంకాళచీ వేళ సాధూన | ఆలీ ఆజ్ఞాపన ఘ్యావయా | ||౧౦౩||
103. తన ఊరైన అమరావతికి వెళ్ళిపోవాలని ఆమె ఆలోచించింది. సాయంత్రం మంచి అదను చూసుకుని, సాయి అనుమతి పొందటానికి వచ్చింది.
అస్తమానచీ కరితా ఫేరీ | బాబా యేతా వాడియాశేజారీ | బాఈ జాఊని పాయ ధరీ | నివేదన కరీ ఘడలే జే | ||౧౦౪||
104. సాయంకాలం బయటికి వెళ్తూ, బాబా వాడా దగ్గరకు రాగానే, ఆమె వెళ్ళి బాబా పాదాలను పట్టుకుని, జరిగినదంతా బాబాతో చెప్పింది.
ఆధీంచ స్త్రియాంచీ జాత ఘాబరీ | తశాంత ములాచీ థాంబేనా శిరశిరీ | గ్రంథి జ్వరాచీ భీతీహీ భారీ | నివేదన కరీ ఘడలే తే | ||౧౦౫||
105. అసలే ఆడవారిది కలవర పడే స్వభావం. పైగా కొడుకు జ్వరం తగ్గక, ప్లేగు భయంతో మరీ భయపడిపోయి, ఆమె బాబాకు మనవి చేసింది.
బాబా వదతీ మృదు వచన | ఆభాళ ఆలే ఆహే జాణ | పడేల పాఉస పీకపికోన | ఆభాళ వితూళూన జాఈల | ||౧౦౬||
106. ఆమెతో బాబా చాలా మెల్లగా మాట్లాడుతూ, “ఆకాశంలో మబ్బులు క్రమ్ముకున్నాయి. వర్షం పడి పంట పండుతుంది. మబ్బులు తొలగిపోతాయి.
భితా కిమర్థ ఏసే వదూన | కఫనీ కంబరేపర్యంత ఉచలూన | దావితే ఝాలే సకళాం లాగూన | గ్రంథీ టవటవూన ఉఠలేల్యా | ||౧౦౭||
107. “ఎందుకు భయపడుతున్నావు?” అని అంటూ తమ కఫనీని నడుం వరకు లేవనెత్తి, ఎర్రగా పొంగిన బొబ్బలను అందరికీ చూపించారు.
కుక్కుటీచ్యా అండ్యాంఎవఢే | చార గ్రంథీ చోహీకడే | మ్హణతీ పహా హే భోగణే పడే | తుమచే సాంకడే మజలాగీ | ||౧౦౮||
108. కోడి గ్రుడ్లంత పెద్దగా, నలువైపులా నాలుగు గడ్డలున్నాయి. “చూడు, మీ బాధలను నేనిలా భరిస్తున్నాను” అని చెప్పారు.
హే దివ్య ఆణి అలౌకిక | కర్మ పాహోని విస్మిత లోక | భక్తాంలాగీ దుఃఖేహీ కైక | భోగితీ అనేక సంత కశీ | ||౧౦౯||
109. అసామాన్యమూ, దైవికమూ అయిన ఈ లీలను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. భక్తుల లెక్కలేనన్ని కష్టాలను, సత్పురుషులు ఎలా అనుభవిస్తారో, కదా!
మేణాహూని మఊచిత్త | సబాహ్య జైసే నవనీత | లాభేవీణ భక్తాంసీ ప్రీత | భక్తచి గణగోత జయాచే | ||౧౧౦||
110. మైనం కంటే మెత్తని, వెన్నలాంటి మనసుగల బాబా, స్వంత లాభాలేవీ లేకుండానే, భక్తులను ప్రేమిస్తారు. భక్తులే వారి బంధువులు.
ఎకదా ఏసా వర్తలా ప్రకార | నానాసాహేబ చాందోరకర |
నిఘాలే సోడూని నందురబార | పంఢరపురాస జావయా | ||౧౧౧||
111. ఒక మారు, నానాసాహేబు చాందోర్కరు నందర్బారు వదిలి పండరీపురం వెళ్ళటానికి బయలుదేరాడు.
నానా పరమ భాగ్యశాలీ | సాఈంచీ అనన్య సేవా ఫళలీ | భూవైకుంఠ ప్రాప్తి ఘడలీ | మామలత మిళాలీ తెథీల | ||౧౧౨||
112. నానా చాలా భాగ్యవంతుడు. బాబాకు అతను చేసిన సేవ ఫలించింది. భూలోకంలో వైకుంఠమనే పండరీపురం ప్రాప్తి కలిగి, అతడు అక్కడ మామలతుదారునిగా నియమింపబడ్డాడు.
యేతాంచ హుకూమ నందురబారీ | జాణే హోతే అతి సత్వరీ | తాతడీనె కేలీ తయారీ | హేత అంతరీ దర్శనాచా | ||౧౧౩||
113. నందర్బారులో ఉత్తరవు అందుకున్న వెంటనే, పండరీపురం వెళ్ళిపోవలసి ఉండింది. బాబాను చూడాలనే కోరికతో, గబగబా ప్రయాణానికి సిద్ధమయ్యాడు.
సహకుటుంబ సహపరివార | శిరడీస జాణ్యాచా ఝాలా విచార | శిరడీచ ప్రథమ పంఢరపుర | కరూ నమస్కార బాబాంసీ | ||౧౧౪||
114. అతనికి శిరిడీయే మొదటి పండరీపురం కనుక, సకుటుంబ సపరివారంగా శిరిడీ వెళ్ళి, బాబాకు నమస్కారం చేయాలన్న ఆలోచన వచ్చింది.
నాహీ కోణాస పత్ర పాఠవిలే | నాహీ నిరోప వృత్త కళవిలే | సరసమాన సర్వ ఆవరిలే | గాడీంత బైసలే లగబగా | ||౧౧౫||
115. తాను శిరిడీ వస్తున్నట్లు ఎవరికీ ఉత్తరం వ్రాయలేదు. కనీసం కబురు కూడా పంపలేదు. ఉన్న సామానంతా సర్దుకొని, త్వరగా బండిలో కూర్చున్నాడు.
ఏసే జే హే నానా నిఘాలే | నసేల శిరడీంత కోణాస కళలే | పరీ సాఈంస సర్వ సమజలే | సర్వత్ర డోళే తయాంచే | ||౧౧౬||
116. ఇలా తొందరగా నానా బయలుదేరిన సంగతి, శిరిడీలో ఎవరికీ తెలియదు. కాని, సాయికి అన్నీ తెలుసు. వారి దృష్టి అందరి మీద, అన్ని చోట్లా ఉన్నాయి.
నానా నిఘాలే సత్వర | అసతీల నిమగావాచే శివేవర | తో శిరడీంత చమత్కార | ఘడలా సాచార తో పరిసా | ||౧౧౭||
117. నానా అంత త్వరగా నందర్బారు వదిలి, నీంగాం ఊరి శివారుకు వచ్చే సరికి, శిరిడీలో ఒక అద్భుతమైన చమత్కారం జరిగింది. దాని గురించి వినండి.
బాబా హోతే మశీదీంత | మ్హాళసాపతీ సమవేత | ఆపాశిందే కాశీరామ భక్త | వార్తా కరీత బసలేలే | ||౧౧౮||
118. మ్హాలసాపతితో మాట్లాడుతూ బాబా మసీదులో ఉన్నారు. అప్పా శిండే, కాశీరాం మొదలగు భక్తులు ముచ్చటించుకుంటూ కూర్చున్నారు.
ఇతుక్యాంత బాబా మ్హణతీ అవఘే | మిళున కరూంయా భజన చౌఘే | ఉఘడిలె పంఢరీచే దరవాజే | భజన మౌజెనే చాలవూ | ||౧౧౯||
119. ఇంతలో అకస్మాత్తుగా “పండరీపురం తలుపులు తెరచుకున్నాయి. మనం నలుగురం కలిసి, ఆనందంగా భజన చేద్దాం” అని బాబా అన్నారు.
సాఈ పూర్ణ త్రికాలజ్ఞాతా | కళూన చుకలీ తయా హీ వార్తా | నానా శివేచ్యా ఓఢ్యాసీ అసతా | భజనోల్లాసతా బాబాంస | ||౧౨౦||
120. భూత, భవిష్యత్తు, వర్తమానం, ఈ మూడు కాలాలు పూర్తిగా తెలిసిన జ్ఞాని సాయి. నానా వచ్చేది వారికి తెలుసు. గ్రామ శివారు దగ్గరకు నానా రాగానే, ఎంతో ఉత్సాహంతో భజన పాడటం ఆరంభించారు.
||భజన||
"పంఢరపురలా జాయాచే జాయాచే | తిథేంచ మజలా రాహ్యాచే ||
తిథేంచ మజలా రాహ్యాచే రాహ్యాచే | ఘర తే మాఝ్యా రాయాచే ||"
||భజన||
||భజన||
"పంఢరపురానికి వెళ్ళుతాను, వెళ్ళుతాను| అక్కడ నేను ఉండాలి||
అక్కడే నేను ఉండాలి, ఉండాలి| నా స్వామి ఇల్లు అదే"||
పంఢరీచే ప్రేమాంత రంగతీ | ఇతక్యాంత యేతీ నానాహీ | ||౧౨౧||
121. స్వయంగా బాబాయే భజన పాడుతుంటే, అక్కడ కూర్చున్న భక్తులందరూ వారితో పాటు పాడ సాగారు. అందరూ పంఢరీనాథుని భక్తిలో, ప్రేమలో లీనమై పోయారు. అనుకోకుండా, అప్పుడే నానా కూడా వచ్చాడు.
సహకుటుంబ పాయీ లాగత | మ్హణతీ ఆతా ఆమ్హాం సమవేత | మహారాజాంనీ పంఢరపురాంత | నివాంస నిశ్చింత బైసావే | ||౧౨౨||
122. సకుటుంబంగా సాయి పాదాలకు నమస్కరించాడు. ‘మహారాజ్, మాతో పండరీపురానికి వచ్చి, నిశ్చింతగా, ప్రశాంతంగా మాతోనే ఉండండి’ అని నానా సాయిని వేడుకున్నాడు.
తో హీ వినంతీ నకోచ హోతీ | ఆధీంచ బాబాంచి ఉల్హాస వృత్తి | పంఢరీ గమన భజన స్థితి | జన నివేదితీ తయాంస | ||౧౨౩||
123. అలా నానా ప్రార్థించే అవసరం లేకుండానే, బాబా అప్పటికే పండరీపుర ప్రయాణానికై, ఉత్సాహంగా భజన చేస్తున్నారని భక్తులు నానాకు చెప్పారు.
నానా మనీ అతి విస్మిత | లీలా పాహూని ఆశ్చర్య చకిత | తయా పాయీ డోఈ ఠేవీత | సద్గ దీత జాహలే | ||౧౨౪||
124. మనసులోనే, నానా చాలా ఆశ్చర్య చకితుడైయాడు. బాబా లీల అతనిని నోట మాట రాకుండా చేసింది. గద్గదమైన గొంతుతో, భావావేశుడై సాయి పాదాలపై తన తలను ఉంచాడు.
ఘేఊనియా ఆశీర్వచన | ఉదీ ప్రసాద మస్తకీ వందూన | చాందోరకర పంఢరపురా లాగూన | నిరోప ఘేఊన నిఘాలే | ||౧౨౫||
125. ఊది ప్రసాదము మరియు సాయి ఆశీర్వాదం పొంది, వారి అనుమతితో, చాందోర్కరు పండరీపురానికి బయలుదేరాడు.
ఏశా గోష్టీ సాంగూ జాతా | హోఈల గ్రంథవిస్తారతా | మ్హణఊని ఆతా పరదుఃఖ నివృత్తితా | విషయ ఆటోపతా ఘేఊ హా | ||౧౨౬||
126. ఇలా కథలను చెప్పుకుంటూ పోతే, ఈ గ్రంథం చాలా పెద్దదై పోతుంది. అందుకే, భక్తుల దుఃఖాలను బాబా తొలగించే సంగతుల గురించిన సాయి లీలలను ఇప్పుడు త్వరగా ముగిస్తాను.
సంపవూ హా అధ్యాయ ఆతా | అంత నాహీ బాబాంచే చరితా | పుఢీల అధ్యాయీ అవాంతర కథా | వదేన స్వహితాలాగీ మీ | ||౧౨౭||
127. బాబా చరిత్రకు అంతమంటూ ఉందా? అందువలన ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము. తరువాతి అధ్యాయంలో, నా శ్రేయస్సు కొరకు, మిగతా కొన్ని కథలను చెప్పుతాను.
హీ మీపణాచీ అహంవృత్తీ | జిరవూ జాతా జిరేనా చిత్తీ | హా మీ కోణ న కళే నిశ్చితీ | సాఈచ వదతీల నిజ కథా | ||౧౨౮||
128. ఈ ‘నా’ అన్న అహంభావాన్ని ఎంత అణచి వేయాలనుకున్నా కావటం లేదు. అయినా, ఈ ‘నా’ అనేది ఎవరు అని నిశ్చయంగా తెలియదు. కనుక సాయియే తమ కథను చెప్పుతారు.
వదతీల నర జన్మాచీ మహతీ | కథితీల నిజభైక్ష్య వృత్తి | బాయజాబాఈచీ తీ భక్తీ | భోజన స్థితీ హీ అపులి | ||౧౨౯||
129. మానవ జన్మయొక్క మహిమను వారే తెలియ చేస్తారు. తమ భిక్షాటన గురించి, బాయజాబాయి భక్తిని గూర్చి, తమ భోజన పద్ధతిని కూడా వారే చెప్పుతారు.
సవే ఘేఊని మ్హాళసాపతీ | తైసేచ కోతే తాత్యా గణపతీ | బాబా నిజత మశీదీప్రతీ | కైసియే రీతీ తే పరిసా | ||౧౩౦||
130. మహల్సాపతిని, తాత్యా కోతే గణపతిని తమ వెంట పెట్టుకుని, మసీదులో బాబా ఎలా పడుకునే వారో, వినండి.
పంత హేమాడ సాఈంస శరణ | మ్హణవీ భక్త-పాయీంచీ వహాణ |
తయాసీ సాఈచీ ఆజ్ఞా ప్రమాణ | ఝాలే నిరూపణ యేథవర | ||౧౩౧||
131. హేమాడపంతు సాయికి శరణుజొచ్చి, తాను భక్తుల కాలి చెప్పు అని తెలియ చేస్తున్నాడు. తనకు సాయి మాటే ప్రమాణం. సాయి ఆజ్ఞను బట్టే ఇంతవరకు ఈ కథ చెప్పటం జరిగింది.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | వివిధకథా నిరూపణం నామ |
|సప్తమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
1. తాబూత.
2. అగ్నీ.
3. అభిమాన.
4. హా ఎక సుందర, కాతీవ కాంకడీ రథ శిరడీస మశీదీచ్యా మండపాత అసతో. హా ఇందూరచే బాబాంచే ప్రేమళ భక్త రా. బాళాసాహేబ రేగే, దాజీసాహేబ అవస్థీ వగైరేంనీ ఉత్సవాచ్యా దివశీ గావాత మిరవణుకీసాఠీ సంస్థానాస అర్పణ కేలా ఆహే.
5. హా దండ మ్హణజే హాత - దీడ హాత లాంబ ఆణి చాంగలా పాయాచ్యా అంగఠ్యా ఎవఢా జాడ అసా మజబూత కాళ్యా లాకడాచా సటకా, జో బాబాంచ్యాపాశీ నిత్య అసే. మశీదీతూన చావడీత జాతానా ఆణి తేథూన మశీదీత పరత యేతానా బాబా ఎకా హాతాత త్యాంచీ చిలీమ వ తంబాఖూచీ పురచుండీ ఆణి దుసర్యా హాతాత హా త్యాంచా సటకా, అసే బరోబర ఘేఊన నిత్య జాత వ యేత.
6. విహీర. 7. ధనత్రయోదశీ (దివాళీచ్యా పూర్వదివశీ).
8. మాధవరావ దేశపాండే.
9. సేవా కరావయాసాఠీ కోణీహీ యేవో, సాఈబాబాంనీ కోణాచా కధీహీ అవ్హేర కేలా నాహీ. ఉలట త్యాస ప్రేమానేచ వాగవిలే ఆహే. ఎకదా ఎక మహారోగీ బాఈ మహారాజాంకడే ఆలీ. మహారాజాంనీ భీమాబాఈ నావాచ్యా ఎకా మరాఠా జాతీచ్యా బాఈలా తిలా ఆపల్యా ఘరీ రాహణ్యాస జగా దేణ్యావిషయీ సాంగితలే. భీమాబాఈ మ్హణాలీ, ‘బాబా, తిలా మహారోగ ఝాలా ఆహే నా? తిలా మాఝ్యా ఘరాత జాగా కశీ దేఊ?’ మహారాజ మ్హణాలే, “అగే, తీ మహారోగీ అసలీ మ్హణూన కాయ ఝాలే? తీ మాఝీ బహీణ ఆహే. సఖ్ఖీ బహీణ ఆహే. తిలా ఆపల్యా ఘరీ ఘేఊన జా.” అసే మహారాజాంచే శబ్ద నిఘాల్యావర భీమాబాఈ తిలా ఆపల్యా ఘరీ ఘేఊన గేలీ వ తినే తిలా ఉతరావయాలా జాగా దిలీ. తీ మహారోగీ బాఈ ఎక మహీనా రాహూన తినే తేథేచ ఆపలా దేహ ఠేవలా. బాళాజీ పాటీల నేవాసకర హే ఎకదా ఆపల్యా గావీ జాణ్యాసాఠీ పరవానగీ మాగూ లాగలే. మహారాజ మ్హణాలే, “దగడూభాఊ ఆజరీ ఆహే, త్యాచ్యాకడే ఆపణ లక్ష ద్యావే.” దగడూభాఊ హా జాతీచా ముసలమాన రక్తపితీనే అత్యంత పిడలా హోతా. పాటలాంనీ రోజ త్యాచ్యా అంగాతలే కిడే కాఢావే, సగళీ లస స్వతః ధువావీ ఆణి త్యాలా స్నాన ఘాలావే, అసా క్రమ ఎక మహినా చాలలా. పుడే తో దగడూభాఊ మేలా ఆణి పాటలాలా మహారాజాంనీ ఘరీ జాణ్యాచీ పరవానగీ దిలీ.
10. ప్లేగ.
11. ది. ఆనరేబల గణేశ శ్రీకృష్ణ ఖాపర్డే, జే ఇండియా సరకారచ్యా లేజిస్లేటివ్హ అసేంబ్లీచే మెంబర హోతే.