
శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౫ వా ||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
చాందపాటలా సవే ఆగమన | జాహలే తే కథన పరిసావే | ||౧||
1. ఇప్పుడు మునుపటి కథను కొనసాగిస్తూ, శిరిడీలో మాయమైన బాబా, చాందుపాటీలుతో మరల శిరిడీకి వచ్చిన కథను వినండి.
గంగాగీరాది సంత సంమేలన | కథా విందాన పావనతే | ||౨||
2. స్వయంగా బాబా నీరు మోసి తోటను పెంచడం, గంగాగీరు మొదలైన సాధువులతో కలయిక, మొదలగు పావనమైన కథలలోని విశేషాలను వినండి.
పుఢే కాహీ కాలపర్యంత | బాబా హోతె జే జాహలే గుప్త | ముసలమానాచే వర్హాడాంత | ఆఢళలే శిరడీంత హే రత్న | ||౩||
3. కొంత కాలం వరకు ఎవరికీ కనిపించకుండా ఉండిన బాబా, మహమ్మదీయుల పెళ్ళివారితో మరల శిరిడీకి వచ్చి, రత్నంవలె ప్రకాశించ సాగారు.
తయా ఆధీంచ దేవీదాస | కరూన హోతె శిరడీంత వాస | పుఢే ఆలే జానకీదాస | గోసావీ శిరడీస రాహావయా | ||౪||
4. వారు రాక మునుపే దేవీదాసు శిరిడీలో ఉండేవాడు. కొంత కాలం తరువాత, జానకీదాసు గోసావి కూడా శిరిడీలో ఉండటానికి వచ్చాడు.
తో కైసా ఘడలా ప్రకార | కథితో ఆతా సవిస్తార | హోఊనియా అవధాన పర | శ్రోతా సాదర పరిసిజే | ||౫||
5. ఇదంతా ఎలా జరిగింది అని వివరంగా చెబుతాను. శ్రోతలు సావధానులై శ్రద్ధగా వినండి.
ఔరంగాబాద జిల్హ్యాంతీల | ధూప ఖేడెగాంవామధీల | ముసలమాన భాగ్యశీల | చాందపాటీల నాంవ జయా | ||౬||
6. ఔరంగాబాదు జిల్లాలోని ధూపఖేడెగాం అనే చిన్న గ్రామంలో చాందుపాటీలు అనే మహమ్మదీయ భాగ్యశాలి ఉండేవాడు.
సఫర కరితా ఔరంగాబాదేచీ | ఘోడీ ఎక హరవలీ త్యాచీ | దోన మహినే దాద న తీచీ | ఆతా కశాచీ ఆఢళతే | ||౭||
7. ఔరంగాబాదులో తిరుగుతుండగా అతని గుర్రమొకటి తప్పిపోయింది. రెండు నెలలు గడిచినా దాని జాడ తెలియలేదు. ‘ఇంక ఏం దొరుకుతుంది?’
పాటీల పూర్ణ నిరాశ ఝాలె | ఘోడీలాగీ బహు హళహళలే | ఖోగీర పాఠీవరీ మారిలే | మాఘారా ఫిరలె మార్గానే | ||౮||
8. అని పాటీలు పూర్తిగా నిరాశ చెంది, గుర్రం గురించి దుఃఖిస్తూ, గుర్రపు జీనుని భుజం మీద వేసుకొని, తిరుగు దారి పట్టాడు.
ఔరంగాబాద మాగే టాకిలె | సాడె చార కోస ఆలే | మార్గాత ఆంబ్యాచే ఝాడ లాగలే | తళీ దిసలే హె రత్న | ||౯||
9. ఔరంగాబాదునుండి నాలుగున్నర కోసుల (తొమ్మిది మైళ్ళు) దూరం ప్రయాణించాడు. దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని క్రింద ఈ మానవులలో రత్నాన్ని చూశాడు.
డోఈస టోపీ అంగాత కఫనీ | ఖాకేస సటకా తమాఖూ చురూనీ | తయారీ కేలీ చిలీమ భరూనీ | నవలే తే స్థానీ వర్తలే | ||౧౦||
10. తలపై టోపి, దేహం మీద కఫినీ, చంకలో సటకా ఉన్నాయి. పొగాకును నలిపి గొట్టంలో నింపి, చిలుము తయారు చేస్తుండగా, ఆశ్చర్యకరమైన విచిత్రం జరిగింది.
చాందపాటీల రస్త్యానే జాతా | ఫకీర ఏకీలా హాకా మారితా |
యేరే చిలీమ పిఊన జా పుఢతా | ఛాయే ఖాలతా బైస జరా | ||౧౧||
11. తన దారిన పోతుండగా, చాందుపాటీలుకు ఆ ఫకీరు పిలిచినట్లు అనిపించింది. “ఒరే బాబూ! నీడలో కూర్చుని చిలుం పీల్చి, ముందుకు పో” అని అన్నారు.
ఫకీర పుసే హే ఖోగీర కసలే | పాటీల మ్హణే జీ ఘోడే హరవలే | మగ తో మ్హణే జా శోధ తే నాలే | ఘోడే సాంపడలే తాత్కాళ | ||౧౨||
12. “ఈ జీను దేనికి?” అని ఆ ఫకీరు ప్రశ్నించాడు. ‘నా గుర్రం తప్పిపోయింది బాబా!’ అని పాటీలు చెప్పాడు. “వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు” అని ఫకీరు చెప్పారు. ఆశ్చర్యకరంగా, అక్కడికి వెళ్ళిన వెంటనే గుర్రం కనిపించింది.
చాందపాటీల విస్మిత ఝాలా | మనీ మ్హణే అవలియా భేటలా | పార నాహీ హ్యా కృత్యాలా | మానవ హ్యాలా మ్హణూ నయే | ||౧౩||
13. చాందుపాటీలు విపరీతంగా ఆశ్చర్యపోయాడు. ‘అవలియా దొరికారు. వీరి లీలలకు అంతు లేదు. వీరిని సాధారణ మానవులని అనలేము’ అని పాటీలు మనసులో అనుకున్నాడు.
పుఢే తో ఘోడీ ఘేఊన పరతలా | పాటీల పూర్వస్థళీ పాతలా | ఫకీర పాసీ బైసవీ త్యాలా | చిమటా ఉచలిలా స్వహస్తే | ||౧౪||
14. తరువాత అతను గుర్రాన్ని వెంటబెట్టుకుని మరల ఫకీరు ఉన్న చోటికి వచ్చాడు. అతనిని తన వద్ద కూర్చోబెట్టుకుని, ఫకీరు చిమ్టాను చేతిలోకి తీసుకున్నాడు.
మగ తో తెథేంచ మాతీంత ఖుపసిలా | ఆంతూన ప్రదీప్త నిఖారా కాఢిలా | హాతాంతీల చిలమీవర ఠేవిలా | సటకా ఘేతలా ఉచలునీ | ||౧౫||
15. దానిని అక్కడే మట్టిలో గుచ్చాడు. లోపలినుండి మండుతున్న నిప్పును తీసికొని చిలిం గొట్టంపై ఉంచి, సటకా తీసుకున్నాడు.
పుఢే ఛాపీ భిజవావయాస | పాణీ నాహీ జవళ పాస | సటకా ఆపటీ జమినీస | పాణీ నిఘాయాస లాగలే | ||౧౬||
16. గుడ్డముక్క తడపటానికి దగ్గరలో ఎక్కడా నీరు లేదు. సటకాతో నేలపై కొట్టగా, వెంటనే నీరు పైకి వచ్చింది.
ఛాపీ భిజవూనియా పిళిలీ | మగ తీ చిలమీ సభోంవతీ వేష్టిలీ | స్వయే ప్యాలా తయాహీ పాజిలీ | మతీ గుంగలీ పాటలాచీ | ||౧౭||
17. దానితో గుడ్డను తడిపి, నీటిని పిండేసి, చిలుం గొట్టానికి చుట్టాడు. తను పీల్చి, పాటీలుకు కూడా ఇచ్చాడు. పాటీలుకు మతి పోయింది.
పడలా ఫకీరాస ఆగ్రహ | పవిత్ర కరా హో మాఝే గృహ | పాటిలావరీ కేలా అనుగ్రహ | లీలావిగ్రహధారకే యా | ||౧౮||
18. ‘నాతో వచ్చి మా ఇంటిని పావనం చేయండి’ అని ప్రార్థించాడు. ఇలాంటి లీలలను చేయటానికే అవతరించిన ఫకీరు అతనిని అనుగ్రహించాడు.
దుసరే దివశీ గావాంత గేలే | పాటిలాచ్యా యేథే ఉతరలే | కాంహీ కాళ తెథేంచ రాహిలే | పుఢే తే పరతలే శిరడీస | ||౧౯||
19. ఆ మరునాడే పాటీలు గ్రామానికి వెళ్ళి, అతని ఇంట కొన్ని రోజులు ఉండి, తరువాత మరల శిరిడీకి వచ్చారు.
హా చాందపాటీల కారభారీ | ధూప ఖేడ్యాచా గ్రామాధికారీ | స్వస్త్రీచ్యా భాచ్యాలాగీ నోవరీ | జుళలీ సోఇరీక శిరడీంత | ||౨౦||
20. ఈ చాందుపాటీలు ధూపఖేడె గ్రామానికి అధికారి. అతని భార్యయొక్క మేనల్లుడికి శిరిడీలో సంబంధం కుదిరింది.
చాందభాఈచ్యా కుటుంబాచా | లగ్నయోగ్య జాహలా భాచా |
సుయోగ శరీరసంబంధాచా | ఘడలా శిరడీచ్యా వధూచా | ||౨౧||
21. చాందభాయి భార్య మేనల్లుడికి పెళ్ళీడు రావడం వలన, శిరిడీలోని ఒక వధువుతో పెళ్ళి నిశ్చయమైంది.
మగ త్యా చాందభాఈచే ఓఢీ | బాబాహీ వర్హాడీ ప్రవిష్ట | ||౨౨||
22. గుర్రపు బండ్ల వెంట పెళ్ళివారు శిరిడీకి బయలుదేరారు. చాందభాయి పైన ప్రేమతో బాబా కూడా పెళ్ళివారితో కలిశారు.
లగ్న ఝాలే వర్హాడ పరతలే | బాబా ఎకటేచ మాగే రాహిలే | రాహిలే తె రాహూన గేలే | భాగ్య ఉదేలే శిరడీచే | ||౨౩||
23. పెళ్ళి అయిన తరువాత పెళ్ళివారు వెనక్కు వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉండిపోయారు. ఆ ఉండటం ఉండటం అక్కడే ఉండిపోయారు. అప్పటినుండి శిరిడీ భాగ్యం ఉదయించింది.
సాఈ అవినాశ పురాతన | నాహీ హిందూ నా యవన | జాత పాత కుళ గోతహీన | స్వరూప జాణ నిజబోధ | ||౨౪||
24. సాయి సనాతనలు. వారు నశించరు. వారు హిందువు కాదు, ముసల్మాను కాదు. వారికి జాతి, మతాలు, కుల గోత్రాలు లేవు. ఆత్మజ్ఞానమే వారి ఉనికి.
సాఈ సాఈ మ్హణతీ జే జన | తే తరీ కాయ నామాభిధాన | ‘యా సాఈ’ మ్హణవూన బహుమాన | పురఃసర సంబోధన జే తె హే | ||౨౫||
25. ప్రజలందరూ ‘సాయి, సాయి’ అని అంటారు, అది వారి పేరా? ‘రండి సాయి!’ అని వారిని మర్యాదతో పిలిచిన పిలుపు అది.
ఖండోబాచే దేఉళాపాశీ | మ్హాళసాపతీచియా ఖళియాసీ | ఆరంభీ బాబా వర్హాడానిశీ | ఉతరల్యా దివశీ హే పడలే | ||౨౬||
26. ఖండోబా ఆలయం దగ్గర, మహల్సాపతి పొలంలో, పెళ్ళివారితో మొదట బాబా దిగిన రోజే ఈ పేరు వచ్చింది.
ఆరంభీ తే భగతాచే ఖళే | పుఢే తే అమీనభాఈచే ఝాలే | వర్హాడ లగ్నాచే జే ఆలే | యేథేంచ ఉతరలే వడాతళీ | ||౨౭||
27. మొదట ఆ పొలం మహల్సాపతికి చెందినది. తరువాత అది అమీనభాయిది అయింది. పెళ్ళివారు ఇక్కడే మర్రి చెట్టు క్రింద దిగారు.
గాడ్యా సర్వ సుటల్యా ఖళ్యాంత | ఖండోబాచే పటాంగణాంత | బాబాహీ తేథే వర్హాడాసమేత | సర్వా సమవేత ఉతరలే | ||౨౮||
28. ఖండోబా ఆలయానికి ఆనుకుని ఉన్న ఆ పొలంలో బళ్ళనన్నిటినీ విప్పారు. అక్కడ పెళ్ళివారితో పాటు, బాబా కూడా దిగారు.
హే బాల ఫకీర గాడీంతూన ఉతరలే | ప్రథమ భగతాచే దృష్టీస జై పడలే | 'యా సాఈ’ మ్హణూన సామోరే గేలే | నామ తే పడలె తేథూని | ||౨౯||
29. ఈ బాల ఫకీరు బండినుండి దిగగానే, మహల్సాపతి వారిని మొదట చూశాడు. వెంటనే ‘రండి సాయి!’ అని వారి ఎదుటకు వెళ్ళాడు. అప్పటినుండి వారికి ఆ పేరే ఉండిపోయింది.
పుఢే మగ తేవ్హాంపాసూన | సాఈ సాఈ ఏసే మ్హణూన | మారూ లాగలే హాకహీ జన | నామాభిధాన తే ఝాలే | ||౩౦||
30. అప్పటినుండి జనులు వారిని ‘సాయి, సాయి’ అని పిలవటం మొదలు పెట్టారు. అలా ఆ పేరే వారికి శాశ్వతంగా నిలిచిపోయింది.
మగ తే తెథే చిలీమ ప్యాలే | మశీదీంత వాస్తవ్య కేలె |
దేవీదాస సహవాసీ రమలే | ఆనందలే శిరడీంత | ||౩౧||
31. అక్కడ, మహల్సాపతి పొలంలో, వారు చిలుం త్రాగారు. తరువాత మసీదుకు వెళ్ళి, అక్కడ ఉండ సాగారు. దేవీదాసు స్నేహం వారికి ఆనందాన్నిచ్చింది. శిరిడీలో వారు చాలా సంతోషంగా ఉన్నారు.
కధీ బైఠక చావడీంత | కధీ దేవీదాసాచే సంగతీంత | కధీ మారూతీచే దేవాలయాంత | స్వచ్ఛంద రత రహావే | ||౩౨||
32. అప్పుడప్పుడు చావడిలో కూర్చునేవారు. మరొకప్పుడు దేవీదాసుతో స్నేహంగా, ఇంకొకప్పుడు మారుతీ ఆలయంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉండేవారు.
పుఢే ఆలే జానకీదాస గోసావీ | మహానుభావీ శిరడీంత | ||౩౩||
33. ఈ దేవీదాసు బాబా కంటే ముందునుంచే శిరిడీ గ్రామంలో ఉన్నారు. ఆ తరువాత మహానుభావుడైన జానకీదాసు గోసావి శిరిడీకి వచ్చాడు.
తయా జానకీదాసాసవే | మహారాజాంనీ బోలత బసావే | కింవా మహారాజ జేథే అసావే | తేథే బసావే జానకీదాసే | ||౩౪||
34. సాయి మహారాజు ఈ జానకీదాసు వద్దకు వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చునేవారు. లేకుంటే, జానకీదాసే సాయి మహారాజు ఉన్న చోటికి వచ్చి కూర్చునేవాడు.
ఉభయతాంసీ మోఠే ప్రేమ | బైఠకీ హోతీ నిత్యనేమ | ఏసా తయాంచా సమాగమ | సుఖ పరమ సకళీకా | ||౩౫||
35. వారిరువురకీ ఒకరి మీద ఇంకొకరికి చాలా ప్రేమ ఉండేది. ప్రతి రోజూ నియమంగా వారిరువురూ కలిశేవారు. వారిరువురి స్నేహం అందరికీ చాలా ఆనందంగా ఉండేది.
తైసేచ ఎక గంగాగీర | మహా ప్రసిద్ధ వైష్ణవ వీర | గృహస్థాశ్రమీ పుణతాంబేకర | శిరడీస వరచెవర ఆగమన | ||౩౬||
36. అలాగే, మరో ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు, పుణతాంబే నివాసి, గృహస్తుడు, గంగాగీరు శిరిడీకి తరచూ వచ్చేవాడు.
ఆరంభీ సాఈ విహిరీవరీ | ఉభయ హస్తీ మాతీచ్యా ఘాగరీ | సాఈ పాణీ వాహీ హే దేఖోని అంతరీ | ఆశ్చర్య కరీత గంగాగీర | ||౩౭||
37. రెండు చేతులతో, మట్టి కుండలను పట్టుకొని, బావినుంచి సాయి నీరు మోసుకొని రావటాన్ని చూసి, మొదట గంగాగీరు ఆశ్చర్యపోయాడు.
ఏసీ హీ సాఈచీ దృష్టాదృష్ట | హోతాంచ బువా వదలే తై స్పష్ట | ధన్య శిరడీచే భాగ్య వరిష్ఠ | జోడలే శ్రేష్ఠ హే రత్న | ||౩౮||
38. తరువాత సాయిని ముఖాముఖి కలసినప్పుడు, ‘ఈ అమూల్య రత్నాన్ని పొందిన శిరిడీ భాగ్యం ధన్యం’ అని స్పష్టంగా చెప్పాడు.
హా ఆజ ఖాందా పాణీ వాహీ | పరీ హీ మూర్తి సామాన్య నాహీ | హోతే యా భూమీచే పుణ్య కాంహీ | తరీచ యే ఠాయీ పాతలీ | ||౩౯||
39. ‘ఈ రోజు ఇతను భుజాన నీరు మోస్తున్నాడు కాని ఇతను సామాన్యుడు కాదు. ఈ భూమియొక్క పుణ్యం చాలా ఉండబట్టే, ఇక్కడికి వచ్చాడు’, అని చెప్పాడు.
తైసేచి ఎక ఆణిక సంత | ఆనందనాథ నామే విఖ్యాత | తయాంచేహీ హేంచ భాకీత | కర్తృత్వ అద్భుిత కరితీల హే | ||౪౦||
40. అలాగే, ఆనందనాథ అనే పేరు ప్రఖ్యాతి చెందిన మరొక సాధువు కూడా ‘సాయి అద్భుతమైన పనులు చేస్తాడు’ అని భవిష్యాన్ని తెలియజేశాడు.
మహాప్రసిద్ధ ఆనందనాథ | యేవలే గ్రామీ మఠ స్థాపీత |
కాంహీ1 శిరడీకరాంసమవేత | ఆలె తె శిరడీంత ఎకదా | ||౪౧||
41. బాగా ప్రసిద్ధి పొందిన ఈ ఆనందనాథు యవలా గ్రామంలో మఠాన్ని నెలకొల్పాడు. కొంత మంది శిరిడీ గ్రామస్థుల వెంట ఒక సారి ఇతను శిరిడీ వచ్చాడు.
మ్హణాలే పాహూని సాఈస సమక్ష | ‘హిరా హో ప్రత్యక్ష హా హిరా’ | ||౪౨||
42. ఆనందనాథు అక్కలకోట మహారాజు శిష్యుడు. సాయిని ఎదురుగా చూసినప్పుడు, ‘ఈతను వజ్రం. అసలైన వజ్రం!’
ఆజ జరీ హా ఉకిరడ్యావర | తరీ హా హిరా నాహీ గార | ఆనందనాథాంచె హే ఉద్గా ర | బాబాంచే పోరవయ హోతే తో | ||౪౩||
43. ‘ఈ రోజు ఇక్కడ పెంటకుప్ప మీద ఉన్నా, ఇతడు వజ్రమే కాని, రాయి కాదు’ అని పలికాడు. బాబా ఇంకా కౌమార అవస్థలో ఉన్నప్పుడు పలికిన మాటలవి.
ధ్యానాంత ఠేవా హే మాఝే బోల | పుఢే తుమ్హాంస ఆఠవ యేఈల | భవిష్య కథూన హె పుఢీల | మగ తే యేవల్యాస పరతలే | ||౪౪||
44. ‘ఈ నా మాటలను గుర్తుంచుకోండి. తరువాత ఇవి మీకు గుర్తుకు వస్తాయి’ అని భవిష్యాన్ని చెప్పి, అతడు యవలాకు వెళ్ళిపోయాడు.
కేశ మాథ్యాచే సబంధ రాఖీత | డోకే న కధీ ముండవీత | పహిలవానాసమ పేహేరావ కరీత | తరూణ వయాంత హే సాఈ | ||౪౫||
45. ఆ వయసులో, సాయి తల వెంట్రుకలను పెంచుకునేవారు. ఎప్పుడూ కత్తరించేవారు కాదు. పహిల్వాను వలె దుస్తులను ధరించేవారు.
రహాత్యాస బాబా జేవ్హా జాత | ఝేండూ జాఈ జుఈ ఆణీత | నిజహస్తే ఉఖరీ2 ఖుపసీత | పాణీ హీ ఘాలీత నేమానే | ||౪౬||
46. రహాతాకు వెళ్ళినప్పుడు, బంతి మరియు జువ్వి మొక్కలను తెచ్చేవారు. బంజరు భూమిలో ఆ మొక్కలను తమ చేతులతోనే నాటి, వానికి నియమంగా నీరు కూడా పోసేవారు.
వామన2A తాత్యా తయాంచే భక్త | మృత్తికేచే ఘడే తత్ప్రీ త్యర్థ | కచ్చే దోన ప్రత్యహీ పురవీత | బాబా శింపీత నిజహస్తే | ||౪౭||
47. వామన తాత్యా వారి భక్తుడు. ప్రతి రోజూ వారికి రెండు పచ్చి కుండలను ఇచ్చేవాడు. వానితోనే బాబా తమ చేతులతో నీరు పోసేవారు.
ఆడావరీల కుండీమధూన | పాణీ ఆణీత ఖాందా వాహూన | ఘడే మగ హోతా అస్తమాన | ఠేవీత నేఊన నింబాతళీ | ||౪౮||
48. ఆ కుండలతో బావినుండి నీరు తమ భుజాలపై మోసుకొని వచ్చి, మొక్కలకు పోసేవారు. సూర్యుడు అస్తమించిన తరువాత, ఆ కుండలను తీసుకుని వెళ్ళి, వేపచెట్టు క్రింద ఉంచేవారు.
ఠేవణ్యాచాచ అవకాశ తేథ | జాగచే జాగీంచ భంగూని జాత | ఉదయీక3 తాత్యా ఆణూని దేత | ఘడే తయాంప్రత నూతన | ||౪౯||
49. అవి పచ్చివి గనుక, చెట్టు క్రింద పెట్టిన వెంటనే అక్కడిక్కడే పగిలి పోయేవి. మరునాడు తాత్యా మరో రెండు క్రొత్త కుండలనిచ్చేవాడు.
ఘడా భాజలా టికాఊ బరా | పరీ త్యా4 లాగే కచ్చా కోరా | ఆవ్యాచే శ్రమావీణ కుంభారా | ఆధీంచ వికరా ఘడ్యాచా | ||౫౦||
50. కుండలు బాగా కాలితే, కొన్నాళ్ళ పాటు నిలువ ఉంటాయి. కాని, బాబాకు పచ్చివే కావాలి. కుమ్మరివాడు, కుండలను కాల్చే శ్రమా లేకుండానే, అదే ధరకు వానిని అమ్మేవాడు.
తీన వర్ష హాచీ ఉద్యోగ | ఉఘడయా జాగీ ఉఠవిలా బాగ |
తేచి స్థానీ ఆజ హా సుయోగ | వాడ్యాచా ఉపభోగ జన ఘేతీ | ||౫౧||
51. ఈ విధంగా మూడు సంవత్సరాలు బాబా కష్ట పడగా, ఎందుకు పనికిరాని ఆ స్థలంలో మంచి తోట తయారయింది. ఆ స్థలానికి మంచి యోగం పట్టింది. ఆ స్థలంలోనే, అదృష్టం కొద్ది, ప్రజలు ఇప్పుడు వాడయొక్క సౌలభ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు.
యేథేంచ నింబాతళీ సాధకా | భాఈ నామే భక్తే ఎకా | అక్కలకోటచ్యా స్వామీంచ్యా పాదుకా | పూజాకాముకా5 స్థాపిల్యా | ||౫౨||
52. ఇక్కడే, వేపచెట్టు క్రింద ‘భాయి’ అనే ఒక భక్తుడు, అక్కలకోట స్వామియొక్క పాదుకలను భక్తులు పూజించాలనే ఉద్దేశంతో స్థాపించాడు.
అక్కలకోటచే స్వామీసమర్థ | హోతే భాఈంచే ఉపాస్యదైవత | ఛబీ పూజన నిత్యనియమిత | భాఈ కరీత నిష్ఠేనే | ||౫౩||
53. తను ఆరాధించే దైవమైన అక్కలకోట స్వామి సమర్థుల పటాన్ని అతను నియమ నిష్ఠలతో పూజించేవాడు.
వాటలే అక్కలకోటీ జావే | పాదుకాంచే దర్శన ఘ్యావే | పూజాఉపచార సమర్పావే | మనోభావే పాదుకాంసీ | ||౫౪||
54. ఒక సారి, అక్కలకోటకు వెళ్ళి, అక్కడ స్వామివారి పాదుకలను దర్శించి, భక్తిగా పూజోపచారాలను సమర్పించుకోవాలని అతనికి కోరిక కలిగింది.
ముంబఈహూన నిఘావయాచీ | కేలీ సర్వ తయారీ సాచీ | ఉద్యా నిఘణార తో నిశ్చయ తైసాచి | రాహూన శిరడీచీ వాట ధరిలీ | ||౫౫||
55. ముంబయినుండి బయలుదేరాలని ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు. కాని, మరునాడు అక్కడికి వెళ్ళాలన్న నిశ్వయం మారి, శిరిడీ దారి పట్టాడు.
ఉద్యా జాణార తో ఆజ స్వప్న | స్వామీసమర్థ ఆజ్ఞాపన | శిరడీస సాంప్రత మమ స్థాన | తేథే తూ ప్రస్థాన కరీగా | ||౫౬||
56. ఉదయం బయలుదేరాలని అనుకున్న మునపటి రాత్రి అతనికి కల వచ్చింది. ‘ఇప్పుడు నా స్థానం శిరిడీలో, నీవు అక్కడికే వెళ్ళు’ అని కలలో స్వామి సమర్థ ఆజ్ఞాపించారు.
అశీ తీ ఆజ్ఞా శిరీ వందూన | భాఈ నిఘాలె ముంబఈహూన | శిరడీస ఎక షణ్మాస రాహూన | ఆనంద సంపన్న జాహలే | ||౫౭||
57. ఇలా ఆజ్ఞ అయినప్పుడు, దానిని అతను శిరసావహించి, ముంబయినుండి ప్రయాణమై, శిరిడీ వెళ్ళి, అక్కడ ఆరు నెలలు ఆనందంగా గడిపే భాగ్యాన్ని పొందాడు.
భాఈ పూర్ణ నిష్ఠావంత | స్మరణీ రహావా తో దృష్టాంత | మ్హణోని నింబాతళీ తేథ | పాదుకా స్థాపీత స్వామీంచ్యా | ||౫౮||
58. పూర్తిగా నిష్ఠావంతుడైన భాయి తనకు కలిగిన ఈ దృష్టాంతం ఎప్పటికీ గుర్తుండాలని, వేపచెట్టు క్రింద పాదుకలను స్థాపించాడు.
శకే అఠరాసే చౌతీస సాలీ | శ్రావణ శుద్ధ పర్వకాళీ | పాదుకా స్థాపిల్యా నింబాతళీ | భజనమేళీ సప్రేమే | ||౫౯||
59. శక సంవత్సరం ౧౮౩౪లో (క్రి. శ. ౧౯౧౨) శ్రావణమాసం, శుక్లపక్షం పర్వ కాలంలో, స్వామి పాదుకలను చాలా భక్తిప్రేమలతో వేపచెట్టు క్రింద స్థాపించాడు.
దాదా కేళకరాంచ్యా హస్తే | పాదుకా ప్రస్థాపన కరవిలే ముహూర్తే | సశాస్త్ర విధివిధానాంతే | కెలె నిజహస్తే ఉపాసనీంనీ | ||౬౦||
60. ఒక శుభముహూర్తాన, దాదా కేల్కరు చేతల మీదుగా, విధివిధానాలతో శాస్త్రోక్తంగా ఉపాసనీ మహారాజు స్వయంగా పాదుకలను స్థాపించారు.
పుఢీల వ్యవస్థేచీ నిరవణ | పూజాకరీ దీక్షిత బ్రాహ్మణ |
వ్యవస్థా పాహీ భక్త సగుణ | ఏసే హే ఆఖ్యాన పాదుకాంచే6 | ||౬౧||
61. తరువాత పాదుకలకు జరగవలసిన పూజా వ్యవస్థలను బ్రాహ్మణుడైన దీక్షితు (గోవింద కమలాకర దీక్షితు) చేసేవాడు. మిగతా ఏర్పాట్లను సగుణ మేరు చూసేవాడు. ఇది పాదుకల కథ.
కరావయా జగదుద్ధార | ఉపకారార్థ అవతరతీ | ||౬౨||
62. ఏ బంధాలు, కోరికలు లేని సంతులు మనకు, కనిపించే ఈశ్వరుని అవతారాలు. జగత్తును ఉద్ధరించటానికే వీరు ఈ విధంగా అవతరిస్తారు.
పుఢే కాంహీ దివస జాతా | ఘడలీ ఆశ్చర్యకారక వార్తా | శ్రోతీ సాదర శ్రవణ కరితా | నవల చిత్తా వాటేల | ||౬౩||
63. కొన్ని రోజుల తరువాత, చాలా ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి జరిగింది. శ్రోతలు శ్రద్ధగా వింటే, విచిత్రంగా అనిపిస్తుంది.
తాంబోళీ ఎక మోహిద్దీన భాఈ | తయాసవే తేఢ పడూని కాంహీ | గేలీ ఝోంబీ జుంపోన పాహీ | లాగలీ లఢాఈ పరస్పర | ||౬౪||
64. మొహిద్దీన భాయి అనే తమలపాకులను అమ్ముకునే వానికి, బాబాకు మధ్యన మాటామాట పెరిగి అది కుస్తీకి దారి తీసి, ఇద్దరం పొట్లాడారు.
పహిలవాన దోఘే కుశల | హోణారాపుఢే న చలే బళ | మోహిద్దీన హోఊని ప్రబళ | బాబా హతబళ జిత ఝాలే | ||౬౫||
65. ఇద్దరూ చాలా నేర్పు ఉన్న పహిల్వానులే. అయినా, విధి ముందు ఎవరి బలమూ సాగదు. బలవంతుడైన మోహిద్దీను చేతిలో బాబా ఓడిపోయారు.
తేథూని మగ నిశ్చయ కేలా | పోశాఖ అవఘా బాబాంనీ బదలలా | కఫనీ ఓఢిలీ లంగోట లావిలా | ఫడకా గుండాళిలా మాథ్యాస | ||౬౬||
66. అప్పటినుండి, బాబా ఒక నిశ్చయానికొచ్చి, తమ దుస్తులన్నీ మార్చివేశారు. లంగోటీని కట్టుకుని కఫనీను తొడుక్కున్నారు. తలకు రుమాలు చుట్టుకున్నారు.
కెలె గోణాచే వరాసన | గోణాచేంచ అంథరూణ | ఫాటకే తుటకె కరోన పరిధాన | త్యాంతచి సమాధాన మానావే | ||౬౭||
67. కూర్చోవటానికి వారికి ఆసనం గోనెపట్టా. పడుకోవడం కూడా గోనెపట్టా పైనే. పాత చింకి గుడ్డలను ధరించి, వానితోనే తృప్తి చెందేవారు.
గరీబీ అవ్వల బాదశాహీ | అమీరిసే లాఖ సవాఈ | గరీబోంకా అల్లా భాఈ | అక్షయీ సాఈ వదత కీ | ||౬౮||
68. “మహారాజు పదవికంటే పేదరికమే గొప్ప రాజరికం. ఐశ్వర్యం కంటే పేదరికమే లక్ష రేట్లు శ్రేష్ఠం. పేదలకు అల్లాయే బంధువు”. అని సాయి ఎప్పుడూ అంటుండేవారు.
గంగాగీరహీ యేచ స్థితి | తాలిమబాజీచీ అతి ప్రీతి | ఎకదా ఖేళత అసతా కుస్తీ | జాహలీ ఉపరతీ తయాంతే | ||౬౯||
69. గంగాగీరు పరిస్థితి కూడా ఇలాంటిదే. కుస్తీలపై అతనికి ఎంతో మోజు. ఒక సారి కుస్తీ పడుతుండగా అతనికి వైరాగ్యం కలిగింది.
ప్రాప్త కాళ ఘటకా ఆలీ | ఎకా సిద్ధాచీ వాణీ వదలీ | దేవా సవేంచ కరీత కేలీ7 | తనూహీ ఝిజవిలీ పాహిజే | ||౭౦||
70. సరియైన సమయం వచ్చేసరికి, ఒక సిద్ధుని మాట పలికింది. ‘దేవునితో ఆడాలి. అలా ఆడుతూ శరీరం అరిగిపోవాలి’.
కుస్తీ ఖేళతా ఖేళాతా కానీ | పడలీ అనుగ్రహరూపహీ వాణీ |
సంసారావర ఓతూని పాణీ | పరమార్థ భజనీ లాగలే | ||౭౧||
71. అనుగ్రహ రూపమైన ఈ మాటలు అతడు కుస్తీ పడుతుండగా అతని చెవులలో పడింది. అంతే, దాంతో ప్రపంచాన్ని వదిలి, అతడు పరమార్థ సాధనలో పడ్డాడు.
పుణతాంబ్యాచి యా నికటీ | నదీచ్యా ఉభయ ప్రవాహా పోటీ | ఆహే బువాంచా మఠ త్యా బేటీ | సేవేసాఠీ శిష్యహీI ||౭౨||
72. పుణతాంబేకు దగ్గరగా, గోదావరీ నదియొక్క రెండు ప్రవాహాల మధ్య, ఒక చిన్న ద్వీపంలో ఇతని మఠం ఉంది. ఇతని సేవ కోసం శిష్యులు కూడా ఉన్నారు.
అసో పుఢే సాఈనాథ | విచారల్యాచేంచ ఉత్తర దేత | స్వయే ఆపణ కోణాసమవేత | కధీంహీ బోలత నసత తే | ||౭౩||
73. కాలం గడిచిన కొద్దీ, ఎవరైనా ఏదైనా అడిగితేనే సాయి జవాబిచ్చేవారు. స్వతఃగా వారెప్పుడూ ఎవరితోనూ మాట్లాడేవారు కాదు.
దివసా బైఠక నింబాఖాలీ | కధీ శివేచ్యా ఓఢ్యాజవళీ | బాభళీచీ ఆడవీ డహాళీ | బైసావే సాఉలియే తియేచ్యా | ||౭౪||
74. పగటిపూట వేపచెట్టు క్రింద కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు, గ్రామ శివారులలో ఉన్న కాలువ దగ్గర, తుమ్మ చెట్టు క్రింద నీడలో కూర్చునేవారు.
కధీ తేథూన ఎక మైలావరీ | నిమగాంవ గాంవాచియా శేజారీ | బాబా దివసా దుపారీ తిపారీ | స్వేచ్ఛాచారీ హిండత | ||౭౫||
75. మరొకప్పుడు, అక్కడినుండి మైలు దూరంలో ఉన్న నీంగాం దగ్గరకు, మధ్యాహ్నంగాని సాయంత్రం గాని వెళ్ళేవారు. అలా పగలంతా స్వేచ్ఛగా తిరిగేవారు.
ప్రసిద్ధ త్రింబకజీ డేంగళ్యాఘరీ | నిమగాంవ గాంవాచీ జహాగిరదారీ | తేథీల బాబాసాహేబ డేంగళ్యావరీ | ప్రీతి భారీ బాబాంచీ | ||౭౬||
76. ప్రసిద్ధుడైన త్రింబకజీ డేంగ్లే నీమగాంయొక్క జాగీర్దారు. వారి ఇంట్లో ఉన్న బాబాసాహేబు డేంగ్లే అంటే బాబాకు చాలా ప్రేమ.
నిమగాంవావరీ జాతా ఫేరీ | బాబానీ జావే తయాంచే ఘరీ | అతి ప్రేమే తయా బరోబరీ | దివసభరీ బోలావే | ||౭౭||
77. నీమగాం గ్రామానికి వెళ్ళినప్పుడు, బాబా అతని ఇంటికి వెళ్ళి, రోజంతా అతనితో ప్రేమగా మాట్లాడేవారు.
బంధు తయాంసీ హోతే లహాన | నానాసాహెబ నామాభిధాన | తయాంస నవ్హతే పుత్ర సంతాన | తేణే తే ఖిన్న మానసీ | ||౭౮||
78. అతని తమ్ముడు నానాసాహేబు డేంగ్లేకు పుత్ర సంతానం లేదు. అందుకు మనసులో చాలా బాధపడేవాడు.
ప్రథమ కుటుంబాస యోగ మంద | మ్హణూని కేలా ద్వితీయ సంబంధ | తరీహీ చుకేనా ఋణానుబంధ | దైవ నిర్బంధ అగాధ | ||౭౯||
79. మొదటి భార్యకు పిల్లలు పుట్టక పోవడంతో, రెండవ పెళ్ళి చేసుకున్నాడు. అయినా తలరాతను ఎవరూ తప్పించుకోలేరు. దైవ నిర్ణయం అర్థం కానిది.
పుఢే బాబాసాహెబ త్యాంస | పాఠవీత సాఈ దర్శనాస | పావతే జాహలే ఆశీర్వాదాస | పుత్ర ప్రసాదాసహీ నానా | ||౮౦||
80. బాబాసాహేబు అతనిని సాయి దర్శనానికి పంపాడు. సాయియొక్క ఆశీర్వాదంతో నానాకు మగ సంతానం కలిగింది.
పుఢే సాఈంచే దర్శనాలా | జనసముదాయ లోటూ లాగలా |
మహిమా సాఈంచా వాఢత గేలా | వార్తా నగరాలా పోహోచలీ | ||౮౧||
81. ఆ తరువాత, సాయియొక్క దర్శనానికి ప్రజలు గుంపులు గుంపులుగా రాసాగారు. సాయియొక్క కీర్తి అలా పెరుగుతూ పెరుగుతూ, వారి సంగతి అహమ్మదునగరం వరకు చేరింది.
తైసేచ చిదంబర కేశవ మ్హణూన | తెహీ చిటణీస జాణ జిల్హ్యాలా | ||౮౨||
82. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి, నానాసాహేబు తరచూ వస్తుండేవాడు. అక్కడే, చిదంబర కేశవ ఆ జిల్లా కలెక్టరు వద్ద కార్యదర్శిగా పనిచేశేవాడు.
సాఈసమర్థ దర్శనపాత్ర | ఘేఊని ఆపులె ఇష్ట మిత్ర | దర్శనార్థ యావే పుత్ర కలత్ర | ధాడిలే పత్ర తయాంస | ||౮౩||
83. సాయి సమర్థుల దర్శనానికి భార్యాబిడ్డలను, బంధుమిత్రులను వెంటబెట్టుకొని రమ్మని అతనికి నానా ఉత్తరం వ్రాశాడు.
ఏసే ఎకామాగూన ఎక | శిరడీస యేఊ లాగలె అనెక | వాఢలా జైసా బాబాంచా లౌకిక | పరివారహీ దేఖ తైసాచి | ||౮౪||
84. ఈ విధంగా ఒకరి వెనుక ఒకరు అనేకులు శిరిడీకి రాసాగారు. దాంతో బాబా కీర్తి పెరగటమే కాక, వారి లౌకిక పరివారం కూడా పెరిగింది.
నలగే జరీ కోణాచా సాంగాత | తరీ దివసా భక్తపరివారాక్రాంత8 | అస్తమానానంతర శీరడింత | పడక్యా మశిదీంత నిజావె | ||౮౫||
85. వారికి ఎవరి సాంగత్యమూ అవసరం లేక పోయినా, రోజంతా భక్తులు వారి చుట్టూ మూగి ఉండేవారు. సూర్యుడు అస్తమించిన తరువాత, శిరిడీలోని పాడు పడిన మసీదులో సాయి నిద్రించేవారు.
చిలీమ తమాఖూ టమరేల | అంగాంత కఫనీ పాయఘోళ | మాథ్యాస ఫడకా ధవల | సటకా జవళ సర్వదా | ||౮౬||
86. చిలుం, పొగాకు, మరి రేకు డబ్బా వారి దగ్గర ఎప్పుడూ ఉండేవి. పాదాలవరకు ఉండే కఫనీని ధరించి, తలకు తెల్లని గుడ్డ చుట్టుకునేవారు. చేతిలో సటకా కర్ర ఎప్పడూ ఉండేది.
తె ధూత వస్త్ర ఎక ధవల | వామకర్ణా మాగే సుఢాళ | జటా జూట సమ దేఊని పీళ | గుండాళీ తో శిరాసీ | ||౮౭||
87. ఉతికిన తెల్ల గుడ్డను తలకు చుట్టి, ఎడమ చెవి వెనుక జుట్టులో ముడి వేసుకునేవారు.
యా వసనాచే ఆచ్ఛాదన | ఆఠాఠ దిన స్నాన విహీన | పాయీ జోడా నా వహాణ | ఎక ఆసన గోణాచే | ||౮౮||
88. ఇలా దుస్తులు ధరించి, కొన్ని మార్లు ఎనిమిదేసి రోజులు కూడా స్నానం లేకుండా ఉండేవారు. పాదాలకు జోళ్ళుగాని, చెప్పులుగాని లేకుండా వారు నడిచేవారు. గోనెపట్టా పైనే కూర్చునేవారు.
పోత్యాచా తుకడా ఎక | తయావరీ నిత్య బైఠక | తక్యా కసా తో నాహీ ఠాఊక | ఆరాణుక కైసెనీ | ||౮౯||
89. ఆ గోనెముక్క పైనే ఎల్లప్పుడూ కూర్చునేవారు. తలగడ సుఖం ఎలా ఉంటుందో వారికి తెలియదు. ఉన్నదానిలోనే తృప్తిగా ఉండేవారు.
తోంవరీ తె జీర్ణతరట | తీచ త్యాంచీ ఆవడతీ బైఠక | సదా సర్వదా తైశీచ నిష్టంక | అష్టౌ ప్రహర తె జాగీ | ||౯౦||
90. ఆ పాత, చిరిగిపోయిన గోనెముక్కే వారికి ప్రియమైన ఆసనం. రాత్రి పగలూ అది ఎప్పుడూ ఒకే చోటులో ఉండేది.
తేంచి ఆసన వా ఆస్తరణ | కాంసే ఎక కౌపీన పరిధాన |
నాహీ దుజె వస్త్ర ప్రవరణ | శీత నివారణ ఎక ధుని | ||౯౧||
91. అదే వారి ఆసనం, అవే వారి దుస్తులు. కౌపీనం తప్ప మిగతా వేరే గుడ్డలు ఏవీ ఉండేవి కావు. చలిబాధను తొలగించటానికి, ఒక ధుని మాత్రమే ఉండేది.
దక్షిణాభిముఖ ఆసనస్థ9 | కఠడ్యావరీ వామ హస్త | సమోర ధునికడే అవలోకీత | బాబా మశిదీంత బైసత | ||౯౨||
92. మసీదులో దక్షిణ ముఖంగా కూర్చుని, ఎదుటనున్న ధునినే రెప్పలు ఆడించకుండా చూస్తూ, బాబా తమ ఎడమ చేతిని కట్టడాపైన వేసి, కూర్చునేవారు.
అహంకార వాసనా సమవేతీ | నానావిధ వృత్తీంచ్యా ఆహుతీ | ప్రపంచ ప్రవృత్తి సమగ్ర హవితీ | యుక్తి ప్రయుక్తీ ధునీస | ||౯౩||
93. వారు అలా కూర్చుంటే, అహంకారాన్ని, అనేకమైన ఇంద్రియల కోరికలను, ఇతర ఎన్నో మానసిక ఆలోచనలను, యుక్తి ప్రయుక్తులను, అన్నిటినీ వారు ధునిలో ఆహుతి చేస్తున్నట్టు అనిపించేది.
ఏసియా త్యా ప్రఖర కుండా | లావిలా జ్ఞానాభిమానాచా ఓండా | అల్లా మాలీక సదైవ తోండా | తయాచా ఝెండా అఖండ | ||౯౪||
94. ధునిలో మండుతున్న అగ్నిగుండంలో, అభిమానం నిండిన జ్ఞానాన్ని సమిధలుగా వేశారు. వారి నోట ఎల్లప్పుడూ “అల్లా మాలిక” అన్న ఉచ్చరణ ఉండేది. అలా వారి పతాకం ఎప్పుడూ ఎగురుతూ ఉండేది.
మశీద తరీ తీ కెఉతీ | అవధీ జాగా దోన ఖణ తీ | త్యాంతచి బసతీ ఉఠతీ నిజతీ | భేట దెతీ సమస్తా | ||౯౫||
95. ఆ మసీదైనా ఎంత ఉండేది? మొత్తం స్థలమంతా రెండు కంభాల మధ్య ఉన్నంత. అందులోనే బాబా కూర్చోవటం, లేవటం, పడుకోవటం, అందరినీ కలుసుకోవటం అన్నీ జరిగేవి.
గాదీ తక్యా హే తో ఆతా | భక్త సముదాయ మిళలా భంవతా | ఆరంభీ తయాంచ్యా నికట జాతా | సకళాంస నిర్భయతా నవ్హతీచ | ||౯౬||
96. కూర్చోవటానికి ఒక గద్దె, ఆనుకోవటానికి ఒక తలగడ అన్నీ ఇప్పుడు వచ్చాయి. మొదట్లో వారి దగ్గరికి వెళ్ళాలి అంటేనే అందరికీ భయం.
సన ఎకోణీసశే బారా | తెథూన నవా ప్రకార సారా | మశీదీచియా స్థిత్యంతరా | ఆరంభ ఖరా తెథూన | ||౯౭||
97. క్రి. శ. ౧౯౧౨వ సంవత్సరంనుండి మసీదులో క్రొత్త రకమైన మార్పు మొదలైంది.
ఢోపర ఢోపర జమీనీసీ | ఖడ్డే హోతె మశీదీసీ | ఎకే నిశీంత ఝాలీ ఫరసీ | భావాసరసీ భక్తాంచ్యా | ||౯౮||
98. మసీదు నేలలో, మోకాలి లోతు గుంతలు ఉండేవి. ప్రేమికులైన భక్తుల ద్వారా ఒక్క రాత్రిలో నేలను చదును చేసి, బండలు పరచబడ్డాయి.
మశీదీచియా వసతీ ఆధీ | బాబా రహాత తకియా మధీ | తెథేంచ కిత్యేక కాలావధీ | అబాధీత రమలే తే | ||౯౯||
99. మసీదుకు రాక మునుపు, చాలా కాలం బాబా తకియా (ఫకీరులుండే చోటు)లో హాయిగా ఆనందంగా ఉండేవారు.
తెథేంచ చరణీ బాంధోని ఘుంగుర | ఖంజిరీచియా తాలావర | నాచావే బాబాంనీ అతిసుందర | గాంవేహీ మధూర ప్రేమానె | ||౧౦౦||
100. అక్కడే (తకియాలో) వారు తమ కాళ్ళకు గజ్జెలు కట్టుకుని, ఖంజరీ తాళానికి సరిగ్గా, అతి సుందరంగా నాట్యం చేసేవారు. భక్తిగా, మధురంగా పాడేవారు కూడా.
ఆరంభీ సాఈ సమర్థాంస | దీపోత్సవాచి మోఠీ హౌస |
తదర్థ స్వయే దుకానదారాంస | తేల మాగావయాస తే జాత | ||౧౦౧||
101. మొదట్లో సాయి సమర్థులకు దీపాలను వెలిగించటమంటే చాలా ఇష్టంగా ఉండేది. అందుకు వారు స్వయంగా దుకాణుదారుల వద్ద వెళ్ళి నూనెను అడిగేవారు.
స్వయే తేలాచీ భిక్షా మాగతీ | ఆణూని భరతీ పణత్యాంత | ||౧౦౨||
102. రేకు డబ్బా చేతిలో పుచ్చుకొని, నూనె వర్తకుల అంగళ్ళకు స్వయంగా వెళ్ళి, నూనెను అడిగి తెచ్చి, ప్రమిదలలో నింపేవారు.
పణత్యా లావీత ఝగఝగీత | దెఊళీ ఆణి మశీదీంత | ఏసే కాంహీ దివస పర్యంత | సదోదీత చాలలే | ||౧౦౩||
103. ఆలయాలలో, మసీదులో, ప్రకాశవంతంగా దీపాలను వెలిగించేవారు. అలా కొన్ని రోజుల వరకు ఆగకుండా జరిగింది.
దీపారాధనీ బహు ప్రీత | దివాళీచాహీ దీపోత్సవ కరీత | చింధ్యా కాఢూనీ వాతీ వళీత | దీప ఉజళీత మశీదీ | ||౧౦౪||
104. దీపాలతో ఆరాధన వారికి చాలా ప్రీతి. దీపావళిలాగే దీపోత్సవాలను చేసేవారు. చింకి గుడ్డలతో వత్తులను చేసి, మసీదులో దీపాలను వెలిగించారు.
తేల తో రోజ ఆణీత ఫుకట | వాణియా మనీ ఆలే కపట | సర్వా మిళూని కేలా కట | పురే కటకట హీ ఆతా | ||౧౦౫||
105. రోజూ ఉచితంగా నూనెను తెచ్చేవారు. దాంతో వర్తకుల మనసులో దురాలోచన కలిగింది. ఇక ఈ గొడవను ముగించాలని అందరూ కలిసి నిశ్చయించుకున్నారు.
పుఢే నిత్యనియమానుసారతా | బాబా తేల మాంగూ యేతా | సర్వాంనీహీ నాహీ మ్హణతా | కాయ ఆశ్చర్యతా వర్తలీ | ||౧౦౬||
106. తరువాత, ఎప్పటిలాగే బాబా నూనెను అడగటానికి వెళ్ళగా, వర్తకులందరూ నూనె లేదని చెప్పారు. అప్పుడు చాలా ఆశ్చర్యగొలిపే,
బాబా నిముట గేలే పరత | కాంకడే సుకేచ ఠేవిలే పణత్యాంత | తేల నసతా హే కాయ కరీత | వాణీ పహాత మౌజ తీ | ||౧౦౭||
107. ఒక అద్భుతం జరిగింది. ఏమీ మాట్లాడకుండా బాబా తిరిగి వచ్చారు. ప్రమిదలలో వట్టి పోడివత్తులను వేసారు. నూనె లేకుండా బాబా ఏం చేస్తారో అని వర్తకులు సరదాగా చూడసాగారు.
మశీదీచ్యా జోత్యావరీల | బాబా ఉచలూన ఘేతీ టమరెల | త్యాంత హోతే ఇవలేసే తేల | కష్టే లాగేల సాంజవాత | ||౧౦౮||
108. మసీదులోని పిట్టగోడ పైని రేకు డబ్బాను బాబా తీసుకున్నారు. అందులో కొంచమే నూనె ఉంది. దాంతో సాయంత్రం ఒక్క దీపాన్ని వెలిగించడం కూడా కష్టం.
త్యా తేలాంత ఘాతలే పాణీ | స్వయే బాబా గేలే పిఉనీ | ఏసే తే బ్రహ్మార్పణ కరూనీ | నివ్వళ పాణీ ఘేతలే | ||౧౦౯||
109. ఆ నూనెలో నీరు పోసి, దానినంతా బాబా స్వయంగా త్రాగేశారు. ఆ విధంగా బ్రహ్మకు అర్పించిన తరువాత, ఒట్టి నీటిని తీసుకున్నారు.
మగ తే పాణీ పణత్యాంత ఓతునీ | సుకే కాంకడే పూర్ణ భిజవూనీ | తయాంస కాండే ఓఢూని లావూనీ | దీప పేటవూని దావిలే | ||౧౧౦||
110. ఆ నీటిని తరువాత ప్రమిదలలో పోసి, వానిలో పొడి వత్తులను తడిపి, అగ్గిపుల్లను గీచి దీపాలను వెలిగించారు.
పాహూనియా తే పాణీ పెటె | వాణీ ఘాలితీ తోండాంత బోటే |
బాబాంస ఆపణ వదలో ఖోటే | కేలే ఓఖటే మనీ మ్హణతీ | ||౧౧౧||
111. నీటితో దీపాలు వెలగటం చూసిన వర్తకులు ఆశ్చర్యపోయి, ముక్కు మీద వేలేసుకున్నారు. బాబాతో అబద్ధం చెప్పి మనము మంచి పని చేయలేదు అని వారు మనసులో అనుకున్నారు.
తేల నసతా అణూమాత్ర | పణత్యా జళాల్యా సర్వరాత్ర | వాణీ సాఈచ్యా కృపేస అపాత్ర | వదూ సర్వత్ర లాగలే | ||౧౧౨||
112. కొంచెము కూడా నూనె లేకుండా రాత్రంతా దీపాలు వెలిగాయి. సాయియొక్క అనుగ్రహానికి ఈ వర్తకులు యోగ్యులు కారని అందరూ అనుకున్నారు.
బాబాంచా హా కాయ ప్రతాప | అసత్య భాషణే ఝాలే పాప | దిధలా బాబాంస వ్యర్థ సంతాప | హా పశ్చాతాప వాణియా | ||౧౧౩||
113. ఏమిటి బాబాయొక్క ఈ అద్భుత శక్తులు అని వర్తకులు అనుకున్నారు. బాబాకు అబద్ధం చెప్పి పాపం తెచ్చుకోవడమే కాక అనవసరంగా వారికి కష్టం కలిగించామని వర్తకులు మరల పశ్చాత్తాప పడ్డారు.
బాబాంచ్యా తే నాహీ మనీ | రాగ ద్వేషాంనాతళే జనీ | శత్రు మిత్ర తయా నా కోణీ | సర్వహీ ప్రాణీ సారిఖే | ||౧౧౪||
114. కాని, బాబా మనసులో ఏమి అనుకోలేదు. ఇతరులపై కోపం, ద్వేషం మొదలైనవి వారికి లేవు. వారికి శత్రువులు, మిత్రులు అంటూ ఎవరూ లేరు. వారికి అన్ని ప్రాణులు సమానమే.
అసో ఆతా పూర్వానుసంధాన | కుస్తీంత యశస్వీ మోహిద్దీన | యాహూన పుఢీల చరిత్ర మహిమాన | దత్తావధాన పరిసిజే | ||౧౧౫||
115. ఇప్పుడు మునుపటి కథను కొనసాగిద్దాము. మొహిద్దీను కుస్తీలో గెలిచిన తరువాతి కథను జాగ్రతగా గమనించండి.
కుస్తీ నంతర పాంచవే వర్షీ | ఫకీర అహమదనగర నివాసీ | జవ్హార అలీ నామ జయాసీ | ఆలా రహాత్యాసీ సశిష్య | ||౧౧౬||
116. కుస్తీ జరిగిన ఐదేళ్ళ తరువాత, అహమ్మదునగరం నివాసియైన జవ్హార అలీ అనే ఒక ఫకీరు, శిష్యులతో సహ రహాతాకు వచ్చాడు.
పాహూన ఎక ఉఘడీ బఖళ | వీరభద్రాచే దేఊళాజవళ | ఫకిరానే దిధలా తళ | ఫకీర తో సబళ దైవాచా | ||౧౧౭||
117. వీరభద్రుని ఆలయం దగ్గర ఒక ఖాళీ స్థలాన్ని చూసి అక్కడ తిష్ఠ వేశాడు. కాని, ఫకీరు మాత్రం చాలా అదృష్టవంతుడు.
జరీ నసతా తో దైవాచా | తరీ తయాతే లాధతా కైంచా | సాఈసారఖా శిష్య మౌజేచా | డంకా జయాచా సర్వత్ర | ||౧౧౮||
118. అదృష్టవంతుడు కాకపోతే, సాయి వంటి ప్రసిద్ధి చెందిన గొప్ప శిష్యుడు ఎలా దొరకుతాడు?
లోక గాంవాంత హోతే అనేక | త్యాంతహీ హోతే మరాఠే కైక | త్యాంతీల భగూ సదాఫళ ఎక | జాహలా సేవక తయాంచా | ||౧౧౯||
119. ఆ ఊళ్ళో అనేక మంది ఉన్నారు. వారిలో కొందరు మరాఠీలూ ఉన్నారు. వారిలో ఒకరైన భగూ సదాపళ ఆ ఫకీరుకు సేవకుడైనాడు.
ఫకీర హోతా మోఠా పఢీక | కురాణ శరీఫ కరతలామలక | స్వార్థీ పరమార్థీ ఆణి భావిక | లాగలే అనేక తచ్చరణీ | ||౧౨౦||
120. ఫకీరు గొప్ప పండితుడు. ఖురానే శరీఫ గురించి అతనికి తెలియనిది ఏదీ లేదు. అతని ఈ జ్ఞానానికోసం, కొందరు స్వార్థపరులు, కొందరు దైవ భక్తులు, నమ్మకం కలవారు కొందరు, ఇలా అనేక రకాలవారు అతని పాదాలను ఆశ్రయించారు.
ఇదగా బాంధావయా ఆరంభ కేలా | ఏసా కాంహీ కాళ గేలా |
వీరభద్రదేవ బాటవిలా | ఆరోప ఆలా త్యాజవర | ||౧౨౧||
121. జవ్హార అలీ అక్కడ ఈద్గా నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. అలా కొంత కాలం గడిచింది. ఈద్గా కట్టి, వీరభద్రదేవుని అపవిత్రం చేస్తున్నాడన్న నింద అతనిపై పడింది.
పుఢే తో ఇదగా బంద పడలా | ఫకీర గాంవాబాహేర ఘాలవిలా |
తెథూన మగ తో శిరడీస ఆలా | మశీదీంత రాహిలా బాబాంపాశీ | ||౧౨౨||
122. దాంతో ఈద్గా పని ఆగిపోయింది. ఫకీరుని ఊరినుండి బైటికి గెంటివేశారు. అక్కడినుండి అతడు శిరిడీకి వచ్చి, బాబాతో పాటే మసీదులో ఉండ సాగాడు.
ఫకీర మోఠా మృదుభాషణీ | గాంవ లాగలా తయాచే భజనీ |
బాబాంసహీ కాంహీ కేలీ కరణీ | ఘాతలీ మోహినీ జన మ్హణతీ | ||౧౨౩||
123. జవ్హార అలీ గొప్ప మృదు భాషి. దానితో ఊరివారంతా అతనిని ఇష్ట పడ సాగారు. బాబాను కూడా అతడు ఏదో మాయ చేసి తన వశం చేసుకున్నాడని జనులు అనుకున్నారు.
హో మ్హణే తూ మాఝా చేలా | స్వభావ బాబాంచా బహు రంగేలా |
హూ మ్హణతా ఫకీర సంతొషలా |ఘేఊన నిఘాలా బాబాంస | ||౧౨౪||
124. అతడు బాబాతో ‘నువ్వు నా శిష్యుడిగా ఉండు’ అని అన్నాడు. వినోద స్వభావంగల బాబా సరే అని అనగానే అతడు చాలా ఆనందించి, బాబాను వెంట తీసుకుని వెళ్ళాడు.
బాబాంసారిఖా శిష్య సధరూ | జవ్హార అలీ జాహలే గురూ |
మగ దోఘాంచా జాహలా విచారూ | రహివాస కరూ రహాత్యాంత | ||౧౨౫||
125. బాబావంటి సాధు స్వభావంగల శిష్యునికి జవ్హార అలీ గురువయ్యాడు. ఆ తరువాత ఇద్దరూ రహాతాలో ఉండాలని నిశ్చయించుకున్నారు.
గురూ నేణె శిష్యాచీ కళా | శిష్య జాణే గురూచ్యా అవకళా |
పరీ న కెవ్హాంహీ అనాదర కేలా | స్వధర్మ రాఖిలా శిష్యాచా | ||౧౨౬||
126. గురువుకు శిష్యుని గొప్పదనం తెలియదు. కాని, శిష్యునికి గురువులో ఉన్న లోపాలు తెలుసు. అయినా, గురువును ఎప్పుడూ అనాదరణ చేయకుండా, మంచి శిష్యుని ధర్మాన్ని బాబా పాటించారు.
గురూముఖాంతూన బాహేర ఆలే | "యోగ్యాయోగ్య" నాహీ పాహిలే |
వచన వరిచేవరీ ఝేలిలే | పాణీహీ వాహిలే గురూగృహీ | ||౧౨౭||
127. గురువు నోటినుండి వచ్చిన మాటలు యోగ్యమా అయోగ్యమా అని చూడకుండా, తూచా తప్పకుండా పాటించారు. గురువు ఇంటికి నీరు కూడా మోశారు.
ఏసీ చాలలీ గురూసేవా | శిరడీస యావే కెవ్హా కెవ్హా |
ఏసే హోఊ లాగలే జెవ్హా | కాయ మగ తెవ్హా జాహలే | ||౧౨౮||
128. ఇలా గురుసేవ చేస్తూ, అప్పుడప్పుడు శిరిడీకి వచ్చేవారు. అలా ఉండగా, ఏమి జరిగిందో వినండి.
ఏసే వరచేవర హోఊ లాగలే | రాహాత్యాసచి రాహూ లాగలే |
ఫారచి ఫకీరా నాదీ భరలే | వాటలే అంతరలే శిరడీలా | ||౧౨౯||
129. అలా తరచూ వస్తూపోతూ ఉన్నా, బాబా రహాతాలోనే ఉండసాగారు. బాబా ఫకీరు వశమైపోయారు, ఇక శిరిడీ విడిచి పెట్టినట్లే అని శిరిడీ ప్రజలు అనుకోసాగారు.
జనాంస వాటె జవ్హార అలీ | సాఈస నిజయోగబళే ఆకళీ |
సాఈచీ తో కళా వేగళీ | అభిమాన జాళీ దేహాచా | ||౧౩౦||
130. జవ్హార అలీ తన యోగ బలంతో సాయిని కట్టేసుకున్నాడని అందరికీ అనిపించింది. కాని, దేహం మీద ఉన్న అభిమానాన్ని దహింపచేయటానికి సాయి ఈ పద్ధతిని ఉపయోగించారు.
సాఈసి కోఠూన ఆలా అభిమాన | శ్రోతే సహజ కరితీల అనుమాన |
పరీ హే లోక సంగ్రహార్థ ఆచరణ | అవతరణ కార్య తే హేంచ | ||౧౩౧||
131. సాయికి అభిమానం ఎక్కడిదని శ్రోతలకు సందేహం కలగడం సహజం. కాని, వారి పద్ధతులంతా లోక కల్యాణానికే. వారి అవతారం కూడా దీనికోసమే.
శిరడీస్థ బాబాంచే ప్రేమీ భక్త | బాబాంచె ఠాయీ అతి ఆసక్త | తయాంతే బాబాంపాసూన వియుక్త | రాహణే అయుక్త వాటలే | ||౧౩౨||
132. శిరిడీ గ్రామ ప్రజలకు బాబాయందు విపరీతమైన ప్రేమ. బాబా తమ వద్ద లేకపోవటం వారికి చాలా తప్పుగా అనిపించింది.
సాఈ సర్వస్వీ తయా ఆధీన | పాహూని గ్రామస్థ ఉద్విగ్న మన | కైసే కరావే తయా స్వాధీన | విచారీ నిమగ్న జాహలే | ||౧౩౩||
133. తమ సర్వస్వం అయిన సాయిని జవ్హార అలీ తన వశం చేసుకోవటం చూసి, శిరిడీ ప్రజలు మనసులో చాలా బాధ పడ్డారు. ఏ విధంగా సాయిని మరల తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అని ఆలోచించ సాగారు.
జైసే కనక ఆణి కాంతి | జైసా దీప ఆణి దీప్తి | తైసీచ హే గురూ శిష్య స్థితి | ఏక్య ప్రతీతి ఉభయాంసీ | ||౧౩౪||
134. బంగారం, దాని మెరుగు మరి దీపం, దాని వెలుగు వలె ఆ గురుశిష్యులు ఇద్దరి మధ్య ఐక్యత ఉండేది.
మగ తె శిరడీచె భక్త మండళ | గేలే రహాత్యాస త్యా ఇదగ్యాజవళ | పాహూ ప్రయత్న వేంచూని ప్రబళ | బాబాంసహ సకళ మగ పరతూ | ||౧౩౫||
135. శిరిడీలోని భక్తులంతా రహాతాలోని ఈద్గా వద్దకు వెళ్ళారు. గట్టి ప్రయత్నం చేసి, ఎలాగైనను బాబాను వెంటబెట్టుకొనే శిరిడీ తిరిగి వెళ్ళాలి అని వారు అనుకున్నారు.
బాబా తై దేతీ ఉలట బుద్ధి | "ఫకీర ఆహే మహాక్రోధీ | లాగూ నకా తయాచే నాదీ | తో మజ కధీంచ న విసంబే | ||౧౩౬||
136. కాని, బాబా వారికి విరుద్ధంగా “ఫకీరు మహా కోపిష్ఠి. అతని జోలికి వెళ్ళకండి. అతడు నన్ను అసలు విడిచి పెట్టడు.
తుమ్హీ యెథూన కరా పలాయన | ఆతాంచ యేఈల గాంవాంతూన | కరీల తుమచే నిసంతాన | పరమ కఠీణ క్రోధ తయాచా | ||౧౩౭||
137. “మీరిక్కడనుండి త్వరగా వెళ్ళిపోండి. లేకుంటే ఇప్పుడే ఊళ్ళోనుండి వచ్చి, మీ పని పడతాడు. అతని కోపం పరమ కఠినం.
రాగ తయాచా మోఠా కడక | యేతాంచ హోఈల లాలభడక | జా జా నిఘూన జా కీ తడక | ధరా కీ సడక శిరడీచీ" | ||౧౩౮||
138. “అతని కోపం చాలా తీవ్రం. దాంతో ముఖమంతా ఎర్రగా అయిపోతుంది. తొందరగా ఇక్కడనుండి వెళ్ళి, శిరిడీ దారి పట్టండి” అని చెప్పారు.
ఆతా పుఢే కాయ కర్తవ్యతా | బాబ తో కథితీ ఉలటీ కథా | ఇతుక్యాంత ఫకీర ఆలా అవచితా | జాహలా పుసతా తయాంతే | ||౧౩౯||
139. ‘ఇప్పుడు ఏమి చేయటం? బాబా ఇలా విరుద్ధంగా చెప్పారేమిటి?’ అని అనుకోసాగారు. ఇంతలో, అనుకోకుండా ఫకీరు అక్కడికి వచ్చాడు.
"ఆలాంత కాయ పోరాసాఠీ | కాయ కరితసా యేథే గోష్టీ | శిరడీస మాఘారా న్యావే హే పోటీ | పరీ యా కష్టీ పడూ నకా" | ||౧౪౦||
140. ‘అయితే, మీరు కుర్రవాడి కోసం వచ్చారా? ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? మరల శిరిడీకి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చారు కదూ! అంత కష్ట పడకండి’.
ఏసే జరీ తో ప్రథమ వదలా | గ్రామస్థాంపుఢే తోహీ కచరలా |
మ్హణే మలాహీ ఘేఊని చలా | సవే ములాలా నేఊ కీ | ||౧౪౧||
141. అని మొదట అంత దృఢంగా అన్నా, తరువాత, గ్రామస్థుల ఒత్తిడికి, ‘మీతో నన్ను కూడా తీసుకుని వెళ్ళండి. అందరూ కలిసి ఈ కుర్రవానిని మన వెంట శిరిడీకి తీసుకుని వెళ్ళుదాము’ అని అన్నాడు.
బాబాంసహీ న తయా విసంబవే | న కళే సంభవే కైసే | ||౧౪౨||
142. అలా ఫకీరు కూడా బాబా వెంట వచ్చాడు. అతను బాబాను విడిచి ఉండలేడు, బాబా కూడా అతనిని విడిచి ఉండలేరు. ఇది ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు.
సాఈ పరబ్రహ్మ పుతళా | జవ్హార అలీ భ్రమాచా భోపళా | దేవీదాసే కసాస లావిలా | భోపళా ఫుటలా శిరడీంత | ||౧౪౩||
143. సాయి అవతరించిన పరబ్రహ్మ. జవ్హార అలీయేమో భ్రమలతో కూడుకున్న గుమ్మడి పండు. శిరిడీలో దేవీదాసు పరీక్షించినప్పుడు, గుమ్మడి పండు బ్రద్దలైంది.
దేవీదాసాచా బాంధా సుందర | డోళే సతేజ రూప మనోహర | దహా అకరా వర్షాంచీ ఉమర | ప్రథమ శిరడీవర ఆలా తై | ||౧౪౪|
144. సుందరమైన ఆకారం, మెరుస్తున్న కళ్ళు, మనోహరమైన రూపంగల దేవీదాసు, పది పదకొండు సంవత్సరాల వయసులో మొదటి సారిగా శిరిడీకి వచ్చాడు.
ఏసా తో అల్ప వయాసీ | ఎక లంగోట మాత్ర కాసేసీ | మారూతీచే దేఉళాసీ | తీర్థవాసీ తో ఉతరలా | ||౧౪౫||
145. ఆ లేత వయసులో అతని నడుముకు ఒక లంగోటి మాత్రమే ఉండేది. తీర్థయాత్రలకని వచ్చి, మారుతీ ఆలయంలో ఉండిపోయాడు.
ఆప్పాభిల్ల మ్హాళసాపతీ | తయాకడే జాతీ యేతీ | కాశీరామాదీక శిధా దేతీ | వాఢలీ మహతీ తయాచీ | ||౧౪౬||
146. అప్పా భిల్లు, మ్హాళసాపతీ అతని వద్దకు తరచూ వస్తూండేవారు. కాశీరాం మొదలైన వారు అతనికి స్వయంపాకానికి సరుకులిచ్చేవారు. రోజులు గడిచే కొద్దీ, అతని మహిమ పెరగసాగింది.
వర్హాడాసమేత జై బాబా ఆలే | తయా ఆధీంచ బారా సాలే | దేవీదాస యేఊన పహిలే | బసతే జాహలే శిరడీంత | ||౧౪౭||
147. పెళ్ళివారితో పాటు బాబా రావటానికి పన్నెండేళ్ళ ముందే, దేవీదాసు శిరిడీకి వచ్చి, అక్కడే ఉండసాగాడు.
ఆపా భిల్ల పాటీవర శికవీ | వ్యంకటేశ స్త్రోత్ర పఢవీ | సర్వాంకరవీ ముఖాద్గిత మ్హణవీ | పాఠ చాలవీ నేమానే | ||౧౪౮||
148. అప్పా భిల్లుకు ఇతను పలకపైన వ్రాయడం నేర్పించాడు. వెంకటేశ స్త్రోత్రం చదివించేవాడు. అందరితో కంఠస్థం చేయించాడు. అలా పాఠాలు నియమంగా చెప్పేవాడు.
దేవీదాస మహాజ్ఞానీ | గురూత్వ ఘేతలే తాత్యాబాంనీ10 | కాశీనాథాదిక శిష్యాగ్రణీ | తయా చరణీ లాగలే | ||౧౪౯||
149. దేవీదాసు మహాజ్ఞాని. తాత్యా అతనిని గురువుగా అనుకున్నాడు. కాశీనాథు మొదలైన వారు అతనికి ముఖ్య శిష్యులై అతని పాదాలను నమ్ముకున్నారు.
తయాపుఢే తో ఫకీర ఆణిలా | శాస్త్రీయ వాదవివాద మాండిలా | వైరాగ్యానే ఫకీర జింకిలా | హాంకూని లావిలా తెథూని | ||౧౫౦||
150. అతని వద్దకు ఫకీరును తీసుకుని వచ్చారు. శాస్త్రాలపై వాద వివాదాలు జరిగాయి. విరాగియైన దేవీదాసు చేతిలో ఫకీరు ఓడిపోయాడు. తరువాత, జవ్హార అలీను అక్కడనుండి తరిమి వేశారు.
మగ తో జో తెథూన నిసటలా | వైజాపురీ జాఊని రాహిలా |
పుఢే కిత్యేక వర్షాంనీ ఆలా | నమస్కారిలా సాఈనాథ | ||౧౫౧||
151. అక్కడనుండి పోయి, జవ్హార అలీ వైజాపురులో ఉన్నాడు. చాలా సంవత్సరాల తరువాత, తిరిగి శిరిడీకి వచ్చి, సాయినాథునికి నమస్కరించాడు.
ఆపణ గురూ సాఈ చేలా | హా సర్వ త్యాచా భ్రమ నిరసలా | బాబాంనీహీ పూర్వవత సత్కారిలా | శుద్ధ జాహలా పశ్చాతాపే | ||౧౫౨||
152. తను గురువు, సాయి శిష్యుడు అన్న భ్రమ తొలగిపోయింది. బాబా అతనిని మునుపటి వలెనే సత్కరించాడు. పశ్చాత్తాపంతో అతను శుద్ధుడయ్యాడు.
ఏసీ బాబాంచీ అగాధ లీలా | నివాడ హోణ్యాచా తెవ్హా ఝాలా | పరీ తో గురూ ఆపణ చేలా | భావ హా ఆదరిలా తేథవర | ||౧౫౩||
153. బాబా లీలలు ఇలా ఎవరికీ అర్థం కాని విధంగా ఉండేవి. జవ్హార అలీ భ్రమలు తొలగిపోయేంత వరకూ, అతనే గురువు, తాను శిష్యుడు అనే భావాన్ని బాబా ఆదరించారు.
తయాంచే గురూపణ తయాలా | ఆపులే చేలేపణ ఆపణాలా | హా తరీ ఎక ఉపదేశ ఎథిలా | స్వయే ఆచరిలా సాఈనాథ | ||౧౫౪||
154. అతను గురువని అనుకుంటే అది అతని బాధ్యత. తాము శిష్యుడిగా అన్ని బాధ్యతలూ నెరవేర్చారు. ఈ కథ ఉపదేశం ఇదే. దీనిని సాయినాథులు స్వయంగా ఆచరించి చూపారు.
ఆపణ కోణాచే హోఊన రహావే | కింవా కోణాస ఆపులే కరావే | యాహూన అన్య అసణే న బరవే | తెణే న ఉతరవే పరపార | ||౧౫౫||
155. గురువుకు ఒకే మనసుతో శరణు పోవడానికంటే మంచి స్థితి ఇంకొకటి లేదు. లేక, ఎవరైనా మన శిష్యులయితే, వారి పూర్తి బాధ్యతను మనము తీసుకోవాలి. ఈ రెండింటికంటే వేరుగా ఇంకొక రకంగా ఉంటే, అది మంచిది కాదు. దానివల్ల మనము ఈ సంసార సాగరాన్ని దాటలేము.
హాచ ఎక యే వర్తనీ ధడా | పరీ దుర్లభ ఏసా నిధడా | హోఈల జయాచే మనాచా ధడా | నిరభిమాన గడా చఢేల | ||౧౫౬||
156. ఈ కథయొక్క పాఠం ఇదే. కాని, అహంకారాన్ని వదిలించుకోవాలని నిశ్చయించికునే వారు చాలా అరుదు. అలాంటి అభిమానం లేనివారు మాత్రమే శరీరం మీదున్న మమకారాన్ని జయించగలరు.
యేథే స్వబుద్ధి పరికల్పిత | చతురాఈ న కామా యేత | జయా మనీ సాధావే స్వహిత | అభిమాన రహిత వర్తావే | ||౧౫౭||
157. ఇక్కడ మన బుద్ధి చెప్పే కల్పనలు, అతి తెలివి, పనికి రావు. అతి ఉన్నతమైన మంచిని కోరుకునేవారు, అహంకారం లేకుండా నడచుకోవాలి.
జేణే దేహాచా అభిమాన జాళిలా | తెణేంచ హా దేహ సార్థకీ లావిలా | తో మగ కోణాచాహీ హోఈల చేలా | సాధావయాలా పరమార్థ | ||౧౫౮||
158. శరీరం మీదున్న ఆశను దహింప చేసుకున్నవారే ఈ జన్మలో శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు. అలాంటివారే పరమార్థాన్ని పొందడానికి, ఎవరికైనా శిష్యులుగా ఉంటారు.
పాహోనియా తీ నిర్విషయ స్థితీ | లహాన థోర విస్మిత చిత్తీ | వయ లహాన గోజిరీ మూర్తి | చోజ కరితీ జన సారే | ||౧౫౯||
159. ఇంద్రియాల కోరికలు అసలే లేని మానసిక స్థితిని, అతి లేత వయస్సు, మనోహరమైన రూపంగల బాబాలో గమనించిన వారంతా ఆశ్చర్యపోయారు.
జ్ఞానియాచా దేహవ్యాపార | హోతసే పూర్వ కర్మానుసార | తయా న ప్రారబ్ధ కర్మభార | కర్మ కర్తార హో నేణే | ||౧౬౦||
160. జ్ఞానులు తమ శరీరంతో చేసే పనులు, వారి మునుపటి పనుల ప్రకారం జరుగుతాయి. వారికి ప్రారబ్ధ కర్మల భారం, బాధలు ఉండవు. జరిగే పనులకు తాము కారణమని వారు అనుకోరు.
జరీ సూర్యాస అంధారీ రిఘావ | తరీచ జ్ఞానియా ద్వైతభావ |
స్వస్వరూపచి జయా అవఘే విశ్వ | వసతా ఠావ అద్వైత | ||౧౬౧||
161. సూర్యుడు చీకటిలో ఉండనట్లే, జ్ఞానుల బుద్ధి కూడా విరుద్ధ భావాలలో ఉండదు. వారికి ఈ జగత్తంతా ఆత్మ స్వరూపమే. వారు ఎప్పుడూ విరుద్ధ భావాలుకు వేరుగా ఉండే స్థితిలో ఉంటారు.
హే గురూశిష్యాచే ఆచరిత | సాఈనాథాంచే పరమభక్త | మ్హాళసాపతీనీ కరవిలే శ్రుత | తైసేంచి సాద్యంత కథియేలె | ||౧౬౨||
162. గురు శిష్యుల ఈ కథను సాయియొక్క పరమ భక్తుడైన మ్హాళసాపతి చెప్పగా, ఆయన చెప్పినట్లే వినిపించాను.
అసో ఆతా హే ఆఖ్యాన | పుఢీల చరిత్ర యాహూన గహన | హోఈల తే కథాక్రమ కథన | సావధాన శ్రవణీ వ్హా | ||౧౬౩||
163. ఈ కథను ఇంతటితో చాలించి, ఇంతకంటే లోతైన అర్థంగల తరువాత చరిత్రను యథా క్రమంగా చెబుతాను. శ్రద్ధగా వినండి.
మశీద పూర్వీ హోతీ కైసీ | కైసియా కష్టీ జాహలీ ఫరసీ | సాఈ హిందు వా యవన వంశీ | నెణవే భరంవశీ హే కవణా | ||౧౬౪||
164. మసీదు మునుపు ఎలా ఉండేది? ఎలా శ్రమ పడి నేలను చదును చేశారు? సాయి హిందువా, లేక ముసల్మానా అన్నది ఎవరికీ ఖచ్చితంగా తెలియని సంగతి;
ధోతీ పోతీ ఖండయోగ | కరీత, భోగీత భక్తాంచే భోగ | హే సర్వ నివేదన యథాసాంగ | హోఈల చాంగ పుఢారా | ||౧౬౫||
165. ధోతి పోతి, ఖండయోగం మొదలైన ప్రక్రియల గురించి; మరియు ఎలా బాబా భక్తుల బాధలను తాము అనుభవించారు అన్న సంగతులతో పాటు మిగిలిన సంగతులను తరువాత మనవి చేస్తాను.
హేమాడ సాఈస శరణ | చరణ ప్రసాద హే కథానిరూపణ | శ్రవణే హోఈల దురిత నివారణ | పుణ్య పావన హీ కథా | ||౧౬౬||
166. హేమాడు సాయికి శరణుజొచ్చి, వారి పాద ప్రసాదమైన ఈ కథను చెప్పగా, శ్రద్ధగా వింటే, పాపాల నాశనమే కాక, పుణ్య పావనం కూడా అని చెబుతున్నాడు.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | శ్రీసాఈ పునఃప్రకటీభవనం నామ |
| పంచమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
1. జ్యాంచ్యాబరోబర ఆలే త్యాంచీ నావే - మాధవరావ బళవంత దేశపాండే, దగడూ భాఊ గాయకే, నందరామ శివరామ మారవాడీ వ భాగచంద మారవాడీ, సర్వ రాహణార శిరడీ. హే యేవల్యాస ఆనందనాథాంచే దర్శన ఘేఊన బైలగాడీతూన శిరడీస పరత యేతా అసతా గావకరీ ‘నకో నకో’ మ్హణత అసతా ఆనందనాథ మహారాజ గాడీ చాలత అసతా ఎకాఎకీ ధావత యేఊన త్యా గాడీత బళేచ బసలే ఆణి ‘మలా శిరడీస యావయాచే ఆహే’ అసే మ్హణూన త్యా మండళీంబరోబర శిరడీస గేలే. హే ఆనందనాథ మూళచే దక్షిణ కోకణాతీల మ్హణజే రత్నగిరీ జిల్హ్యాతీల కుడాళదేశకర గౌడబ్రాహ్మణ జ్ఞాతీచే అసూన పూర్వాశ్రమీ అసతా యాంచే వాస్తవ్య బరాచ కాళపర్యంత ముంబఈ శహరాత హోతే.
2. ఉజాడ జాగేత.
2A. వామనరావ గోందకర వ తాత్యాబా కోతే పాటీల.
3. దుసర్యా దివశీ ప్రాతఃకాళీ.
4. బాబాంస.
5. పూజా కరణ్యాచీ ఇచ్ఛా అసణార్యాంకరితా.
6. శ్రీ సాఈలీలా, మాసిక, వర్ష 11, అంక 1, పృ. 25 యాత యా పాదుకాంవిషయీచీ సవిస్తర హకీకత దిలేలీ ఆహే.
7. క్రీడా.
8. భక్తమండళీంనీ వేష్టిత.
9. గోణాచ్యా ఆసనావర బసలేలే.
10. తాత్యా గణపత పాటీల కోతే.
No comments:
Post a Comment