Sunday, November 4, 2012

||సాఈ సమర్థావతరణం నామ చతుర్థోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత 
|| అథ శ్రీసాఈసచ్చరిత |||| అధ్యాయ ౪ థా || 

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

పూర్విల దో అధ్యాయీ మంగలాచరణ | కథిలే గ్రంథప్రయోజన |
అధికారీ అనుబంధ నిరూపణ | సాంగ వివరణ జాహలే | ||౧||
1. మంగళాచరణం తరువాత, రెండు అధ్యాయాలలో ఈ గ్రంథ ప్రయోజనాన్ని గురించి చెప్పబడింది. గ్రంథకర్త అర్హత, గ్రంథానికి మరియు దానిలోని విషయానికి గల సంబంధాన్ని గూర్చి వివరంగా చెప్పబడింది. 
ఆతా యా సంతాంచా అవతార | కింనిమిత్త యే ధరిత్రీవర |
ఏసే హే కాయ కర్మ ఖడతర | జేణే తే అవతరత భూలోకీ | ||౨||
2. ఈ సంతులు భూమిపై ఎందుకు అవతరిస్తారు? ఏ కష్టమైన పనిని చేయటానికి ఇక్కడికి వస్తారు? అన్నదాని గురించి ఇప్పుడు వినండి. 
ఆతా శ్రోతే మహారాజ | మీ ఎక తుమచా చరణరజ |
మజ తో అవధాన కృపేచే కాజ | మాగతా లాజ మజ నాహీ | ||౩||
3. శ్రోతమహారాజులారా! మీ పాద ధూళిలో నేను ఓ చిన్న నలుసుని. నన్ను కరుణించి సావధానంగా వినండి అని మిమ్మల్ని వేడుకోవడంలో నాకు బిడియం లేదు. 
ఆధీంచ గోడ సంతచరిత్ర | తశాంత హే తో సాఈ కథామృత |
సేవూని సాఈచే అనన్య భక్త | ఆనందయుక్త హోవోత | ||౪||
4. సంతుల చరిత్రలే ఎంతో మధురం. అందులోనూ ఇది అమృతానికి సమమైన సాయి కథ. దీనిని సాయియొక్క అనన్య భక్తులు సేవించి, ఆనంద భరితలవుగాక. 
బ్రాహ్మణ హేళసితీ ఆశ్రమ వర్ణ | శూద్ర హోఊ పాహతీ బ్రాహ్మణ |
ధర్మాచార్యాంచే మాన ఖండణ | కరూ దండణ పాహాతీ | ||౫||
5. బ్రాహ్మణులు తమ జాతికి సంబంధించిన నియమాలను అలక్ష్యం చేసినప్పుడు; శూద్రులు బ్రాహ్మణులై పోవాలనుకున్నాప్పుడు; ధర్మ ఆచార్యులను అవహేళన చేయడమే కాకుండా వారిని శిక్షించాలని అనుకున్నప్పుడు; 
కోణీ న మానీ ధర్మవచన | ఘరోఘరీ సర్వచి విద్వాన |
ఎకావరతీ ఎకాచీ తాణ | మానీనా కోణ కోణాచే | ||౬||
6. ధర్మసూత్రాలను ఎవరూ పాటించనప్పుడు; ఇంటింటా అందరూ తామే పండితులమని అనుకుంటున్నప్పుడు; ఒకరిపై ఒకరు పెద్దరికాన్ని చెలాయిస్తున్నప్పుడు; ఒకరి మాటను ఇంకొకరు లక్ష్య పెట్టనప్పుడు; 
సేవ్యాసేవ్య భక్ష్యాభక్ష్య | ఆచారవిచారీ పూర్ణ దుర్లక్ష |
మద్యమాంస అవఘ్యాంసమక్ష | బ్రాహ్మణ ప్రత్యక్ష సేవితీ | ||౭||
7. తినకూడనివి తింటూ, సేవించ కూడనివి సేవిస్తూ, ఆచార విచారాలను పూర్తిగా వదిలివేసినప్పుడు; అందరి ఎదుట బ్రాహ్మణులు మద్య మాంసాదులను సేవిస్తున్నప్పుడు; 
ఘేఊన ధర్మాచే పాంఘరూణ | అత్యాచార చాలవితీ ఆంతూన |
పంథద్వేష జాతీ మాజూన | జన జాజాఊన జాతీ జై | ||౮||
8. ధర్మం పేరిట లోలోపల అత్యాచారాలను చేస్తున్నప్పుడు; వీని కారణంగా ధార్మిక సాంప్రదాయాలలో ద్వేషం పెరిగిపోయి, ప్రజలు కష్టాలతో బాధ పడుతున్నప్పుడు; 
బ్రాహ్మణ కంటాళతీ సంధ్యాస్నానా | కర్మఠ కంటాళతీ అనుష్ఠానా |
యోగీ కంటాళతీ జప తప ధ్యానా | సంతావతరణా సమయ తో | ||౯||
9. స్నాన సంధ్యలయందు బ్రాహ్మణులకు శ్రద్ధ లేనప్పుడు; దైవకార్యాలను, పితృకార్యాలను శ్రద్ధగా పాటించేవారు వానిని చేయడానికి విసుక్కుంటున్నప్పుడు; జప తప ధ్యానలయందు యోగులకు ఇష్టం లేనప్పుడు; సంతులు అవతరిస్తారు. 
జన ధన మాన పుత్ర దారా | హాచి సుఖ సర్వస్వా థారా |
మానూని విన్ముఖ పరమార్థ విచారా | సంత అవతారా తై యేతీ | ||౧౦||
10. భార్య, బిడ్డలు, డబ్బు, గౌరవం, వీనినే జనులు అన్ని సుఖాలకు అవసరమని తలచి, దైవంగురించి ఆలోచనలను వదిలివేసినప్పుడు, సంతులు అవతరిస్తారు. 

ఆత్యంతిక శ్రేయప్రాప్తి | ధర్మగ్లాని పాయీ జై ముకతీ | 
కరావయా ధర్మజాగృతీ | సంత యేతీ ఆకారా | ||౧౧|| 
11. ధర్మం నశించి, ప్రజలు శాశ్వతమైన శ్రేయస్సును పోగొట్టుకున్నప్పుడు, ధర్మాన్ని మేలుకొలపటానికి సంతులు మానవ రూపంలో అవతరిస్తారు. 
ఆయురారోగ్య ఏశ్వర్యా ముకతీ | జన శిశ్నోదర పరాయణ బహకతీ | 
నిజోద్ధరణా సర్వస్వీ హుకతీ | అవతారా యేతీతై సంత | ||౧౨||
12. ఆయురారోగ్య ఐశ్వర్యాలను పోగొట్టుకుని, కామంతో పాటు నోటి రుచిని తృప్తి పరచటంలో మునిగి, నీతి భ్రష్టులై తమ ఉద్ధారాన్ని లక్ష్య పెట్టనప్పుడు; సంతులు అవతరిస్తారు. 
వ్హావయా వర్ణాశ్రమధర్మరక్షణ | కరావయా అధర్మాంచే నిర్దళణ | 
దీన గరీబ దుబళ్యాంచే సంరక్షణ | క్షితీ అవతరణ సంతాంచే | ||౧౩|| 
13. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించి, అధర్మాన్ని నాశనం చేసి, దీనులను, దుర్బలులను, పేదలను సంరక్షించటానికి సంతులు భూమిపై అవతరిస్తారు. 
సంత స్వయే ఠాయీచే ముక్త | దీనోద్ధరణీ సదైవ ఉద్యుక్త | 
అవతార తయాచా కేవళ పరార్థ | నిజస్వార్థ త్యా నాహీ | ||౧౪|| 
14. సంతులు, సత్పురుషులు ఎప్పుడూ ముక్తులే. దీనులను ఉద్ధరించటానికే ఎల్లప్పుడూ కృషి చేస్తుంటారు. వారి అవతారం ఇతరుల కోసమే కాని, తమ స్వార్థం కోసం కాదు. 
నివృత్తీచా పాయా భరతీ | ప్రవృత్తీచ్యా డోల్హార్యాభవతీ | 
పరమార్థాచే మందిర ఉభారతీ | భక్తా ఉద్ధరతీ సహజ గతీ | ||౧౫|| 
15. ప్రవృత్తి అనే ప్రవాహంలో కొట్టుకునే ప్రాపంచికులను, నివృత్తి అనే పునాదిపై పరమార్థ మందిరాన్ని నిర్మించి, తమ సహజ గతిలో భక్తులను ఉద్ధరిస్తారు. 
ధర్మకార్య ధర్మ జాగృతి | కరూన అవతారకార్య సంపాదితీ | 
హోతా నిజకార్య పరిపూర్తి | అవతార సమాప్తి కరితాత | ||౧౬|| 
16. ధర్మ పనులను చేసి, ధర్మాన్ని మేలుకొలిపి, తమ అవతార కార్యాన్ని సాధిస్తారు. అది పూర్తి కాగానే తమ అవతారాన్ని చాలిస్తారు. 
సకల జగదానందకరూ | ప్రత్యగాత్మాచ పరమేశ్వరూ | 
జో పరమేశ్వరూ తోచ గురూ | తోచ శంకర సుఖకరూ | ||౧౭|| 
17. ప్రతియొక్క జీవిలో ఉండే జీవాత్మయే పరమాత్మ. అతడే గురువు. అతడే జగత్తు అంతటా సుఖాన్నిచ్చి ఆనందాన్ని ప్రసాదించేవాడు. 
తేచ తో నిరతిశయ ప్రేమాస్పద | నిత్య నిరంతర అభేద | 
నేణే జో దేశ కాలవస్తుభేద | పరిచ్ఛేదాతీత జో | ||౧౮|| 
18. అతడే ప్రేమానికి నిలయం. ఎల్లప్పుడూ భేదం లేని స్వరూపుడు. దేశం, కాలం, వస్తు భేదాలను ఎరుగనివాడు, ఛేదించలేనివాడు. 
పరాపశ్యంతీ మధ్యమా వైఖరీ | వాణీ వర్ణితా థకల్యా చారీ | 
'నేతి నేతి' తి ఘేతలీ హారీ | వేదీ చాతురీ చాలేనా | ||౧౯|| 
19. పర, పశ్యంతి, మధ్యమ మరియు వైఖరి అను నాలుగు రకాల వాణి అతనిని వర్ణించలేక పోయాయి. జ్ఞానంతో నిండి ఉన్న వేదాలూ ఇక్కడ పనికి రాలేదు. ‘నేతి, నేతి’ అంటూ అవి ఓడిపోయాయి. 
లాజలీ షట్శాతస్త్రే షడ్దతర్శనే | థకలీ పురాణే ఆణి కీర్తనే | 
అఖేర కాయా వాచా మనే | ఠరలీ నమనేంచ సాధనే | ||౨౦||  
20. ఆరు శాస్త్రాలు, ఆరు దర్శనాలు సిగ్గుతో మౌనం వహించాయి. పురాణాలు, హరికథలు అలసిపోయాయి. చివరకు మిగిలింది, అతనికి కాయా వాచా మనసా నమస్కారం చేయటం ఒక్కటే. 

ఏసియా సంత సాఈచే చరిత్ర | లీలా జయాచ్యా అత్యంత విచిత్ర | 
పరిసోన జయాచ్యా కథా పవిత్ర | పావనశ్రోత్ర హోఊతకా | ||౨౧|| 
21. అత్యంత అద్భుతమైన లీలలతో కూడుకున్న ఇలాంటి సాయి సంతుని చరిత్రను విని, శ్రోతల చెవులు పవిత్రమౌగాక. 
తోచ చాలక సకలేంద్రియా | బుద్ధి దేఈ గ్రంథరచాయా | 
యథాక్రమ చరిత్ర సుచాయా | అనాయాసే కారణ తో | ||౨౨|| 
22. అన్ని ఇంద్రియాలను నడిపించేది వారే. ఈ గ్రంథ రచనకు స్ఫూర్తినిచ్చినది వారే. వారి సూచనల వలనే ఈ చరిత్ర క్రమబద్ధంగా వ్రాయబడ్డది. 
తో సర్వాంచ్యా అంతర్యామీ | బాహ్యాభ్యంతర సర్వగామీ | 
మగ హే కాళజీ కరావీ కా మీ | వ్యర్థ రికామీ కిమర్థ | ||౨౩|| 
23. అందరి మనసులలో ఉంటూ, ఈ విశ్వమంతటా లోపల బయట స్వేచ్ఛగా తిరిగే వారు ఉండగా నేనెందుకు అనవసరంగా చింతించాలి? 
గుణ ఎకేక తయాచే ఆఠవితా | పడె వృత్తీస తాటస్థతా | 
యేఈల వాచేస కైసా తొ వర్ణితా | దృఢ మౌనతా తత్కథన | ||౨౪|| 
24. వారి ఒక్కొక్క సుగుణాన్నీ తలచుకుంటూ ఉంటే, మనసు పని చేయడం ఆగిపోతుంది. అలాంటప్పుడు మాటలు వారిని ఎలా వర్ణించగలవు? దృఢమైన మౌనమే వారిని వర్ణించటానికి ఉత్తమం. 
ఘ్రాణే సుమన హుంగావే | త్వచా శీతోష్ణ స్పర్శావే | 
నయనే సౌందర్య సుఖఘ్యావే | సుఖవావే ఆపాపణా | ||౨౫|| 
25. పువ్వుల సువాసనను ముక్కుతో తెలుసుకుంటాము. చలువ, వేడి వీటిని చర్మంతో అనుభవిస్తాము. సౌందర్యాన్ని కళ్లతో చూస్తాము. ఇంద్రియాలు వాని సుఖాలను అవే అనుభవిస్తాయి. 
జివ్హా శర్కరేచా స్వాద | జాణే పరీనేణే అనువాద | 
తైసాచ సాఈ గుణానువాద | కరూ విశద నేణే మీ | ||౨౬|| 
26. పంచదారయొక్క తీపిని నాలుక రుచి చూడగలదు, కాని ఆ అనుభవాన్ని అది వర్ణించలేదు. అలాగే, సాయియొక్క గుణాలను వివరంగా చెప్పటం నా చేత కాని పని. 
సద్గురూచేచ జంవ యేఈ మనా | తోచ స్వయే దేఈ ప్రేరణా | 
అనిర్వచనీయాచే నిర్వచనా | స్వజనా కరవీ కరవీతో | ||౨౭|| 
27. కాని, సద్గురువు తాను తలచుకున్నప్పుడే, తన భక్తులకు ప్రేరణ కలిగించి, మాటలకు అందని భావాలని వివరంగా వర్ణించేలా చేస్తారు. 
హా న కేవళ శిష్టాచార | బోల హే న కేవళ ఉపచార | 
మనోభావాచే హే ఉద్గారర | అవధానాదర ప్రార్థితో | ||౨౮|| 
28. ఇది కేవలం పొగడటానికి చెప్పిన పై పై మాట కాదు. మనసులోనుండి వచ్చిన మాట. అందుకే శ్రద్ధగా వినండి అని ప్రార్థిస్తున్నాను.
జైసే గాణగాపుర నృసింహవాడీ | జైసే ఔదుంబర వా భిల్లవడీ | 
తైసేంచ పవిత్ర గోదేచే థడీ | క్షేత్ర ’శిరడీ’ ప్రసిద్ధ | ||౨౯|| 
29. గాణగాపురం, నరసింహవాడి, ఔదుంబర, భిల్లవడీ వలెనే పవిత్రమైన గోదావరి తీరాన ప్రసిద్ధమైన శిరిడీ క్షేత్రం ఉంది. 
గోదావరీచే పవిత్ర తీర | గోదావరీచే పవిత్ర నీర | 
గోదావరీచా శీతసమీర | హీ భవతిమిర నాశక | ||౩౦|| 
30. గోదావరియొక్క పవిత్ర తీరం, గోదావరియొక్క పవిత్రమైన నీరు, గోదావరియొక్క పవిత్రమైన చల్లని గాలులు, ఇవి ప్రాపంచిక కష్టాల చీకటిని, అజ్ఞానాన్ని తొలగిస్తాయి. 

గోదావరీచే మాహాత్మ్య రూచిర | ప్రఖ్యాత జే అఖిల జగతీవర | 
ఎకాహూన ఎక ధురంధర | సంత ప్రవర తై ఝాలే | ||౩౧|| 
31. మొత్తం ప్రపంచంలో గోదావరి మహాత్మ్యం ప్రసిద్ధి చెందినది. ఒకరికంటే ఒకరు గొప్ప సాధు శ్రేష్ఠులు ఇక్కడనుంచే వచ్చారు. 
అనేక తీర్థ యా గోమతీ తీరీ | అఘవినాశక జేథీల వారీ | 
భవరోగ స్నానే పానే నివారీ | పురాణాంతరీ వర్ణిలే | ||౩౨|| 
32. ఈ గోమతీ తీరంలో చాలా తీర్థస్థలాలున్నాయి. ఈ నది నీరు పాపాలను తొలగిస్తాయి. గోదావరి నీటిలో స్నానం చేసినా, ఆ నీరు త్రాగినా, పాపాలను తొలగి పోవటమే కాక, సాంసారిక కష్టాలన్ని మాయమౌతాయి. 
తె హె గోదా అహమదనగరీ | కోపరగావ తాలుక్యాభీతరీ | 
కోపరగావాచియా శేజారీ | మార్గ దేఈ శిరడీచా | ||౩౩|| 
33. అహమ్మదనగరు జిల్లాలో ఉన్న కోపర్గాం తాలూకాలోని కోపర్గాం దగ్గరనుండి ప్రవహిస్తూ, శిరిడీకి త్రోవను సూచిస్తుంది. 
గోదా వళంఘూన పైలతీరీ | సుమారే తీన కోసాంవరీ | 
తాంగా ప్రవేశతా నిమ గాంవాభీతరీ | సమోర శిరడీ దిసతసే | ||౩౪|| 
34. గోదావరిని దాటి, అవతల తీరానికి సుమారు మూడు కోసుల (ఆరు మైళ్ళు) దూరంలోని నీమ్గాం అనే ఊరిలోనికి టాంగా రాగానే, మనకు శిరిడీ కనిపిస్తుంది. 
నివృత్తి జ్ఞానదేవ ముక్తాబాఈ | నామా జనీ గోరా గోణాఈ | 
తుకా నరహరీ నరసీ భాఈ | సజన కసాఈ సాంవతా | ||౩౫|| 
35. నివృత్తి, జ్ఞానదేవ, ముక్తాబాయి, నామదేవ, జనాబాయి, గోరాగోణాయి, తుకారాం, నరహరి, నరసీభాయి, సజన కసాయి, సావత మాలి; 
పూర్వీ సంత హోఊని గేలే | సాంప్రతహీ తే బరేచ ఝాలే | 
హే వసుధైవ కుటుంబీ భలే | ఆధార రంజలే గాంజల్యాచే | ||౩౬|| 
36. మొదలగు సత్పురుషులు ఎందరో మునుపు ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. వీరందరూ వసుదైవ కుటుంబం, జగత్తంతా మనదే అని అనుకునేవారు. సాంసారిక బాధలతో దుఃఖ పడేవారికి వీరే ఆధారం. 
రామదాస సంత ప్రవర | సోడూనియా గోదాతీర | 
ప్రకట ఝాలే కృష్ణా తటాకావర | జగదుద్ధారాకారణే | ||౩౭|| 
37. సాధువులలో శ్రేష్ఠుడైన రామదాసు, గోదావరీ తీరాన్ని వదిలి, జగత్తును ఉద్ధరించటానికి కృష్ణా నదీ తీరాన అవతరించారు. 
తైసెచ హె యోగేశ్వర సాఈ | మహాన శిరడీచీ పుణ్యాయీ | 
జగదుద్ధారాచియే పాయీ | గోదె ఠాయీ అవతరలే | ||౩౮|| 
38. అలాగే, శిరిడీయొక్క మహా పుణ్యం కొద్దీ, యోగీశ్వరులైన శ్రీసాయి, జగత్తును ఉద్ధరించటానికి గోదావరీ నది సమీపాన అవతరించారు. 
పరీస లోహా దె కనక స్థితీ | తయా పరిసా సంతా ఉపమితీ | 
సంతాంచీ పరీ అలౌకిక కృతి | నిజరూప దేతీ భక్తాంతే | ||౩౯| 
39. పరశువేది రాయి ఇనుమును బంగారంగా మారుస్తుంది. సాధువులను పరశువేదితో పోలుస్తారు. కాని, సాధువులు అద్భుతంగా భక్తులను, తాము ఉండే స్థితికి ఉద్ధరిస్తారు. సత్పురుషులు అలా అలౌకికమైన పనులను చేస్తారు. 
సాండూనియా భేదభావ | స్థిరచర అవఘే బ్రమ్హస్వ భావ | 
ఆపణాంసహ హె విశ్వవిభవ | అఖండ వైభవ బ్రమ్హాచే | ||౪౦||
40. భేదభావాలని మించి, జగత్తులో ఉన్న జీవరాశులన్నింటిలోనూ, బ్రహ్మ రూపాన్ని చూసి, ఈ సృష్టిలోని అద్భుతమంతా బ్రహ్మదే అనుకోవటం; 

ఏసే అఖిల విశ్వ జేవ్హా | మీ చ మీ హే ప్రబొధేల తేవ్హా | 
మగ త్యా సుఖాచా కాయ సుహావా | పరమ సద్భావా పావేల | ||౪౧|| 
41. ఇలా విశ్వమంతటా కేవలం నేనే ఉన్నాను అన్న అసలైన జ్ఞానం కలిగితే, అందువల్ల వచ్చే సుఖాన్ని, ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు? ఆ అనుభవాన్ని పొందిన మనిషి, అత్యంత శుద్ధమయిన మంచితనానికి చేరుకుంటాడు. 
ఏసే మీపణ జేవ్హా పావావే | వైర తే కరావే కోణాసవే | 
కిమర్థ వా కవణాస భ్యావే | అన్యచి ఠావే జంవ నాహీ | ||౪౨|| 
42. ఇలా అంతటా నేనే అన్న జ్ఞానం కలిగిన తరువాత, ఎవరితో వైరం ఉంటుంది? నన్ను మించి వేరేవారు అసలు ఎవరూ లేరు అని తెలిశాక, ఎవరి గురించి అయినా ఎందుకు భయపడతాను? 
దామాజీ జైసే మంగళవేఢీ | సమర్థ రామదాస సజ్జనగడీ | 
నృసింహసరస్వతీ జైసే వాడీ | తైసేచ శిరడీ సాఈనాథ | ||౪౩|| 
43. మంగళ వేఢిలో దామాజి, సజ్జనగడలో సమర్థ రామదాసు, నరసింహవాడిలో నృసింహ సరస్వతి వెలిసినట్లు, శిరిడీలో సాయినాథులు వెలిశారు. 
పరమ దుర్ఘట ఆణి దుస్తర |జీంకిలా జయానే హా సంసార | 
శాంతి జయాచా అలంకార | మూర్త భండార జ్ఞానాచే | ||౪౪|| 
44. దాటటానికి సాధ్యం కానిది, అతి కష్టకరమూ అయిన మాయా ప్రపంచాన్ని వీరు జయించారు. మూర్తీభవించిన జ్ఞానభండారం. శాంతి వారి అలంకరణ. 
వైష్ణవాంచే హె మాహేర ఘర | ఉదారాంచా హా ఉదార | 
పరమార్థ కర్ణాచా అవతార | సారాచే సార హా సాఈ | ||౪౫|| 
45. వైష్ణవులకు వారు పుట్టినిల్లు. ఉదారులలో ఉదారులు. పరమార్థాన్ని అనుగ్రహించటంలో దాన కర్ణుని అవతారం. జ్ఞానికి సారం ఈ సాయి. 
ప్రీతి నాహీ నాశివంతీ | ఆత్మస్వరూపీ రంగలీ వృత్తి | 
లక్షఎక పరమప్రాప్తీ | కాయతే స్థితి వర్ణావీ | ||౪౬|| 
46. ఏది నశిస్తుందో దాని గురించి వారికి ప్రీతిలేదు. వారి మనసు ఎప్పుడూ ఆత్మ స్వరూపంలో లీనమై ఉంటుంది. జీవితంలో పొందగల అతి ఉన్నతమైన లక్ష్యాన్ని పొందటమే వారి గురి. అలాంటి వారి స్థితిని ఎలా వర్ణించగలము?
ఏహికాచా న ఉత్కర్షాపకర్ష | ఆముత్రికాచా న హర్షామర్ష | 
అంతరంగ నిర్మల జైసా ఆదర్శ | వాచా వర్షత అమృత సదా | ||౪౭|| 
47. ప్రాపంచిక విషయాలలో ఏ రకమైన ఆసక్తి లేనివారు, పరలోక విషయాలలో కూడ ఆనందంకాని, దుఃఖంకాని లేక వారి మనసు అద్దంవలె నిర్మలంగా ఉంటుంది. వారి మాటలు ఎప్పుడూ అమృతాన్ని కురిపిస్తుంది. 
రాజా రంక దరిద్రీదీన | జయాచే దృష్టీ సమసమాన | 
స్వయే ఠావా న మానాపమాన | భూతీ భగవాన భరలేలా | ||౪౮|| 
48. డబ్బుగలవారు, లేనివారు, దీనులు, బలహీనులు, అందరి పట్లా వారి దృష్టి సమానం. మానాపమానాలకు వారు లోనుకారు. అన్ని జీవులలోను నిండి ఉన్న పరమాత్ముని రూపమే వారు. 
జనాసవే బోలేచాలే | పాహీ మురల్యాంచే నాచ చాళే | 
గజ్జల గాణే ఏకతా డోలే | రేస న హాలే సమాధి | ||౪౯|| 
49. అందరితో తిరుగాడినా, మాట్లాడినా, నాట్యాన్ని చూసినా, గజల్‍ గానాన్ని విని ఆనందించినా, వారి సమాధి స్థితి కొంచెమైనా భంగం కాదు. 
అల్లా నామాచీ జయా ముద్రా | జగ జాగతా జయాయే నిద్రా | 
జాగే జగాస లాగతా తంద్రా | శాంత సముద్రా సమఉదర | ||౫౦||
50. అల్లా నామమే వారి గుర్తింపు. అందరూ మేలుకొన్నప్పుడు వారు నిద్రిస్తారు. ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వారు మేలుకొని ఉంటారు. వారి మనసు సముద్రంవలె ప్రశాంతంగా ఉంటుంది. 

ఆశ్రమ నిశ్చయ కాహీ నకళే | కాహీ నిశ్చిత కర్మా నాతళే | 
బహుధా బసల్యా ఠాయీంచా న ఢళే | వ్యవహార సగళే జో జాణే | ||౫౧|| 
51. వర్ణాశ్రమాలలో వారు ఏ ఆశ్రమానికి చెందినవారో ఖచ్చితంగా తెలియదు. ఏ ఆచారాలని, నియమాలని పాటించరు. కూర్చున్న చోటునుండి సాధారణంగా కదలరు. అయినా, జరుగుతున్న సంగతులన్నీ వారికి తెలుసు. 
దరబారాచా బాహ్య థాట | గోష్టీ సాంగే తీనశే సాఠ | 
ఏసా జరీ నిత్యాచా ఠాట | మౌనాచీ గాంఠ సోడీనా | ||౫౨|| 
52. బయటకు దర్బారు నడిపించి, అందులో చాలా ఆర్భాటంగా కనిపిస్తూ, ఎన్నెన్నో కథలను రోజూ చెప్పినా, మనసులో మటకు వారు మౌనాన్ని వదిలేవారు కాదు. 
భింతీసటేకూన ఉభే అసతీ | సకాళా దుపారా ఫేరీ ఫిరతీ | 
లేడీవరీ వా చావడీస జాతీ | ఆత్మస్థితి అఖండ | ||౫౩|| 
53. మసీదులో గోడకు ఆనుకుని నిలబడినా; ప్రొద్దున, మధ్యాహ్నం లెండీ తోటకో, లేదా చావడికో వెళ్లినా; వారు ఎప్పుడూ ఆత్మ రూపంలోనే లీనమై ఉంటారు. 
న జాణూ కవణ్యా జన్మాంతరీ | కవణ్యా ప్రసంగీ కవణ్యా అవసరీ | 
కేలే మ్యా తప కైశియాపరీ | ఘేతలే పదరీ సాఈనే | ||౫౪|| 
54. ఏ జన్మలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ తపస్సు చేశానో తెలియదు. సాయి నన్ను తమ ఒడిలోకి తీసుకున్నారు. 
హే కాయ మ్హణావే తపాచే ఫళ | తరీ మీ తో జన్మాచా ఖళ | 
సాఈచ స్వయే దీనవత్సల | కృపా హీ నిశ్చళ తయాచీ | ||౫౫|| 
55. తపస్సు ఫలమని అనుకుందామా అంటే, నేను పుట్టుకతోనే చెడ్డవాణ్ణి. అయినా సాయికి దీనులంటే ప్రీతి. వారి తరగని కృపయే ఇది. 
సిద్ధ కోటీంత జరీ జనన | సాధకా ఏసే తయాచే వర్తన | 
వృత్తి నిరభిమాన అతిలీన | రాఖీ మన సకాళాంచే | ||౫౬|| 
56. అన్ని సిద్ధులను పొందిన వారైనా, ఎప్పుడూ సాధకునివలె నడచుకునే వారు. అభిమానం ఏ మాత్రము లేక అందరితోనూ వినయంతో అందరినీ ఆనందపరిచేవారు. 
నాథాంహీ జైసే పైఠణ | జ్ఞాన దేవాంహీ ఆళందీ జాణ | 
తైసేంచ సాఈనీ శిరడీ స్థాన | మహిమా సంపన్న కేలే కీ | ||౫౭|| 
57. పైఠణుని ఏకనాథులు, ఆళందిని జ్ఞానదేవులు పావనం చేసినట్టుగా, శిరిడీ క్షేత్రాన్ని మహిమా సంపన్నం చేశారు. 
ధన్య శిరడీచే తృణ పాషాణ | అనాయాసే జయా అనుదిన | 
ఘడలే బాబాంచే చరణచుంబన | పదరజధారణ మస్తకీ | ||౫౮|| 
58. ప్రతి రోజూ, బాబా పాదలను ముద్దు పెట్టుకొని, వారి పాదల ధూళిని తలపై ధరించిన శిరిడీలోని తృణ పాషాణాలు ధన్యం. 
శిరడీచ ఆమ్హా పంఢరపూర | శిరడీచ జగన్నాథ ద్వారకానగర | 
శిరడీచ గయా కాశీ విశ్వేశ్వర | రామేశ్వరహీ శిరడీచ | ||౫౯|| 
59. శిరిడీయే మన పంఢరీపురం, శిరిడీయే మన పూరీ జగన్నాథం, మరియు మన ద్వారకానగరం. శిరిడీయే గయ, కాశీ విశ్వేశ్వరుని వారణాసి, శిరిడీయే మన రామేశ్వరం.
శిరడీచ ఆమ్హా బద్రికేశ్వర | శిరడీచ నాశీక త్ర్యంబకేశ్వర | 
శిరడీచ ఉజ్జయినీ మహాంకాళేశ్వర | శిరడీచ మహాబళేశ్వర గోకర్ణ | ||౬౦||
60. శిరిడీయే మన బదరీ కేదారం, నాసికులోని త్రయంబకం, శిరిడీయే ఉజ్జయినీ మహాకాళేశ్వరం, మరియు మహాబళేశ్వర-గోకర్ణం. 

శిరడీంత సాఈచా సమాగమ | తేచ ఆమ్హా ఆగమ నిగమ | 
తోచ సకళ సంసారోపశమ | అత్యంత సుగమ పరమార్థ | ||౬౧|| 
61. సాయితో శిరిడీలో ఉండటమే మనకు ఆగమ నిగమాలు. ప్రపంచంలోని బాధలన్నింటినీ తొలగించేది శిరిడీయే. పరమార్థానికి సులభమైనది శిరిడీయే. 
సమర్థ సాఈంచే జే దర్శన | తేచి ఆమ్హా యోగసాధన | 
కరితా తయాంసీ సంభాషణ | హోయ క్షాలన పాపాచే | ||౬౨|| 
62. సమర్థ సాయియొక్క దర్శనమే మనకు యోగసాధనం. వారితో మాట్లాడటమే మన పాపలను కడిగేసుకోవటం. 
తయాంచే జే చరణ సంవాహన | తేంచి ఆమ్హా త్రివేణీ స్నాన | 
తయాంచే చరణతీర్థ సేవన | తేంచి నిర్మూలన వాసనాంచే | ||౬౩|| 
63. వారి పాదాల సేవయే మనకు త్రివేణి సంగమ స్నానం. వారి పాద తీర్థన్ని త్రాగడమే అన్ని ఇంద్రియాల కోరికలను తొలగించుకోవటం. 
తయాంచే జే ఆజ్ఞాపన | తేంచి ఆమ్హా వేద వచన | 
తయాంచ్యా ఉదీ ప్రసాదాచే సేవన | పుణ్యపావన సర్వార్థీ | ||౬౪|| 
64. వారి ఆజ్ఞ మనకు వేద వాక్కు. వారి విభూతి ప్రసాదాలను సేవించడమే అన్ని విధాలా పుణ్య పావనం.
సాఈచ ఆమ్హా పరబ్రహ్మ | సాఈచ ఆముచా పరమార్థ పరమ | 
సాఈచ శ్రీకృష్ణ శ్రీరామ | నిజారామ శ్రీసాఈ | ||౬౫|| 
65. సాయియే మనకు పరబ్రహ్మ. సాయియే మనకు జీవితాన అతి శ్రేష్ఠమైన లక్ష్యం. సాయియే శ్రీకృష్ణుడు, సాయియే శ్రీరాముడు. మనకు శాశ్వతమైన ఆశ్రయం కూడా శ్రీసాయియే. 
సాఈ స్వయే ద్వంద్వాతీత | కధీ న ఉద్విగ్న వా ఉల్లసిత | 
సదైవ నిజస్వరూపీ స్థిత | సదోదిత సన్మాత్ర | ||౬౬|| 
66. విరుద్ధ భావాలకు (సుఖం - దుఃఖం, ఆనందం - వ్యథ, కోపం - శాంతం, ఇలాంటివి) సాయి అతీతులు. సుఖంలో పొంగిపోక, దుఃఖంలో కృంగిపోక ఎప్పుడూ ఆత్మ స్వరూపంలో లీనమై ఉండే బ్రహ్మ వారు. 
శిరడీ కెవళ కేంద్రస్థాన | క్షేత్ర బాబాంచే అతి విస్తీర్ణ | 
పంజాబ కలకత్తా హిందుస్థాన | గుజరాథ దఖ్ఖన కానడా | ||౬౭|| 
67. శిరిడీ కేవలం కేంద్ర స్థానం. పంజాబు, కలకత్తా, గుజరాతు, దఖ్ఖను, కర్ణాటకలలోనే కాక, దేశమంతటా బాబాయొక్క ప్రభావం వ్యాపించి ఉంది. 
శిరడీచీ సాఈచీ సమాధి | తిచ అఖిల సంతాంచీ మాందీ | 
జెథీల మార్గ క్రమితా ప్రతిపదీ | తుటతే గ్రంథీ జీవాచీ | ||౬౮|| 
68. శిరిడీలోని సాయి సమాధియే సాధువులందరూ కలుసుకునే స్థలం. అక్కడికి చేరుకునే మార్గంలో అడుగు అడుగున జీవాత్మల సాంసారిక కట్లు ఒక్కొక్కటే వీడిపోతాయి. 
సార్థక జన్మా ఆలియాంచే | కేవళ సమాధిదర్శన సాచే | 
మగ సేవేసీ జయాంచే ఆయుష్య వేచే | భాగ్య తయాంచే కాయ వానూ | ||౬౯|| 
69. సమాధి దర్శనం చేసుకున్నంత మాత్రమే జన్మ తరిస్తుంది. ఇక, సాయి సేవలో జీవితాన్ని గడిపిన వారి భాగ్యాన్ని ఎంతని వర్ణించను? 
మశీద ఆణి వాడియాంవరీ | సుందర నిశాణాంచ్యా హారీ | 
ఫడకతీ ఉంచ గగనోదరీ | పాలవతీ కరీ భక్తాంసీ | ||౭౦||
70. మసీదుపైన, వాడపైన (సమాధి మందిరం) అందమైన పతాకాలు కనిపిస్తాయి. భక్తులను చేతులతో పిలుస్తున్నట్లుగా అవి ఆకాశంలో ఎగురుతుంటాయి.

బాబా మహంత ప్రసిద్ధ కీర్తి | గాంవో గావీ పసరలీ మహతీ | 
కోణీ తయా సత్‍శ్రద్ధా1 నవసితీ2 | దర్శనే నివతీ జన కోణీ | ||౭౧|| 
71. బాబా మహాత్ములని ప్రసిద్ధి చెందారు. వారి కీర్తి ప్రతిష్ఠలు ఊరూరా వ్యాపించాయి. కొందరు నిజమైన నమ్మకంతో వారికి మ్రొక్కుకుంటారు. కొందరు దర్శనంతోనే తృప్తి చెందుతారు. 
కోణాచే కైసేహి మనోగత | అసో బుద్ధీ శుద్ధ వా కుత్సిత | 
దర్శనమాత్రేంచ నివే చిత్త | జన విస్మిత అంతరీ | ||౭౨|| 
72. ఎవరి మనసు ఎలా ఉన్నా సరే, నిర్మలంగా కాని, చెడు బుద్ధితో గాని, వారి దర్శనం చేసుకుంటే మనసు శాంతిస్తుంది. ఇది గమనించి జనులు చాలా ఆశ్చర్య పోయారు. 
పంఢరీత విఠ్ఠల రఖుమాఈ | యాంచ్యా దర్శనీ జీ నవలాఈ | 
తేంచ విఠ్ఠల దర్శన దేఈ | బాబా సాఈ శిరడీంత | ||౭౩|| 
73. పంఢరిలో విఠల రఖుమాబాయి దర్శనంతో ఎంత ఆనందం అనుభవమౌతుందో, ఆ విఠల దర్శనాన్నే భక్తులకు సాయి శిరిడీలో ప్రసాదిస్తారు. 
కోణాస వాటల్యాహీ అతిశయోక్తి | ఏకావీ గౌళీబువాంచీ ఉక్తి | 
జయాసీ దృఢ విఠ్ఠలాచీ భక్తి | సంశయ నివృత్తి హోఈల | ||౭౪|| 
74. ఇది అతిశయోక్తి అని కొందరికి అనిపించ వచ్చు. విఠలునియందు దృఢమైన భక్తి కలిగిన గౌలిబువా మాటను వింటే, మీ సందేహం తీరుతుంది.
పంఢరీచే హే వారకారీ | జైశీ వర్షాస పంఢరీచీ ఫేరీ | 
తైశీచ కరితీ హే శిరడీచీ వారీ | ప్రేమ భారీ బాబాంచే | ||౭౫|| 
75. బువా నియమంగా ప్రతి సంవత్సరమూ పంఢరిపురానికి వెళ్ళే యాత్రికుడు. అలా పంఢరిపురానికి వెళ్ళేటప్పుడు శిరిడీకి కూడా వచ్చేవాడు. బాబా అంటే అతనికి విపరీతమైన ప్రేమ.
గర్దభ ఎక బరోబర | శిష్య ఎక సాథీదార | 
జివ్హా ‘రామకృష్ణ హరి’ గజర | కరీ నిరంతర బువాంచే | ||౭౬|| 
76. అతని వెంట తోడుగా ఒక శిష్యుడు ఉండేవాడు. ఒక గాడిద కూడా ఉండేది. నాలుకపై ఎప్పుడూ ‘రామ కృష్ణ హరి’ అని నామాన్ని పలుకుతూ బువా యాత్ర చేసేవాడు. 
పంచాణ్ణవతీ వర్షే వయాస | చాతుర్మాసీ గంగాతట నివాస | 
పంఢపురీ అష్టమాస | భేటీ వర్షాస బాబాంచీ | ||౭౭|| 
77. అతని వయస్సు ౯౫ సంవత్సరాలు. చాతుర్మాసాలు గంగా తీరంలో ఉండి, మిగతా ఎనిమిది నెలలు పంఢరిపురంలో ఉండేవారు. ప్రతి ఏడూ బాబాను దర్శించేవారు. 
బాబాంకడే పహాత పహాత | మ్హణావే యానీ హోఊని వినత | 
హాచి తో ముర్త3 పంఢరీనాథ | అనాథనాథ దయాళ | ||౭౮|| 
78. బాబానే చూస్తూ చూస్తూ, ‘ఇతనే సాక్షాత్తు పంఢరినాథుని అవతారం. అనాథలుకు దీనులకు ఆశ్రయం, కరుణామయుడు ఇతడే’ అని వినయంగా అనేవాడు. 
ధోత్రే నేసూన రేశీమ కానీ | హోతీల కాయ సంత కొణీ | 
కరూలాగతీ హాడాంచే మణీ | రక్తాంచే పాణీ నిజకష్టే | ||౭౯|| 
79. ‘జరీ అంచు ధోవతి కట్టుకోగానే ఎవరైనా సాధువులై పోగలరా? ఇక్కడ, ఎముకలు పూసలుగా, రక్తాన్ని నీరులా మారెలా కష్ట పడాలి. 
ఫుకాచా కాయ హోఈల దేవ | హాచి హో ప్రత్యక్ష పంఢరీరావ | 
జగ వేడే రే వేడే హా దృఢ భావ | ఠేవూని దేవ లక్షావా | ||౮౦||
80. ‘ఏ కష్టమూ లేకుండా దేవుడై పోగలరా? వీరే కనిపించే పంఢరినాథుడు. ఈ ప్రపంచం భ్రమ అని దృఢమైన నమ్మకంతో దైవాన్ని గ్రహించండి. 

జయా పంఢరీనాథాచీ భక్తి | ఏసియా భగవద్భనక్తాచీ హే ఉక్తి | 
తేథ మజపామరాచా అనుభవ కితీ | శ్రోతా ప్రతీతీ పహావీ | ||౮౧|| 
81. పంఢరీనాథుడంటే భక్తి ఉన్న భగవత్భక్తుడు ఇలా చెప్పాడంటే, ఇక పామరుణ్ణయిన నా అనుభవమెంతటిది? శ్రోతలు తమ అనుభవాలతోనే గ్రహించాలి.
  నామ స్మరణీ మోఠీ ప్రీతీ | ‘అల్లా మాలీక’ అఖండ వదతీ | 
నామ సప్తే కరవూన ఘేతీ | దివస రాతీ సన్ముఖ | ||౮౨|| 
82. బాబాకు నామస్మరణ అంటే చాలా ప్రీతి. ఎప్పుడూ ‘అల్లా మాలిక్‍’ అని అంటుండేవారు. రాత్రీపగలూ తమ ఎదుట నామ సప్తాహాలను చేయించేవారు. 
ఆజ్ఞా ఎకదా దాస గణూలా | నామ సప్తాహ మాండావయాలా | 
హోతా గణుదాస వదతీ తయాంలా | విఠ్ఠల ప్రగటలా పాహిజే | ||౮౩|| 
83. నామ సప్తాహం చేయమని ఒక సారి సాయి దాసగణును ఆజ్ఞాపించారు. దాసగణు అందుకు వారితో, ‘చేస్తాను గాని, విఠలుడు ప్రత్యక్షమవాలి మరి’ అని అన్నాడు. 
బాబా తంవ ఛాతీస హాత లావితీ | దాసగణూస నిక్షూన వదతీ | 
“హో హో ప్రగటేల విఠ్థల మూర్తి | భక్త భావార్థీ పాహిజే | ||౮౪|| 
84. బాబా తమ చేతిని గుండెపై వేసుకుని, “భక్తి భావం ఉంటే విఠలుడు తప్పక కనిపిస్తాడు” అని దాసగణుతో అన్నారు. 
డాకురనాథాచీ డంకపురీ | అథవా విఠ్ఠలరాయాచీ పంఢరీ | 
తీ హీచ రణఛోడ ద్వారకానగరీ | జాణే న దూరీ పహావయా | ||౮౫|| 
85. “డాకురనాథుని డంకపురి, విఠలుని పంఢరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా నగరం ఇదే. చూడటానికి ఎంతో దూరం వెళ్లే అవసరం లేదు. 
విఠ్ఠల కాయ ఎకాంతీచా ఉఠూన | యేణార ఆహే దుసరా కుఠూన | 
భక్తప్రేమే ఉత్కటూన | ఎథేంహీ ప్రగటూన రాహీల | ||౮౬|| 
86. “విఠలుడేమైనా ఎక్కడో ఏకాంత స్థలంనుండి ఇక్కడికి రావాలా? భక్తి, ప్రేమలు, చూడాలనే ఆతురత ఉంటే ఇక్కడే కనిపిస్తాడు. 
పుండలికే వడిలాంచీ సేవా | కరూన భులవిలే దేవాధిదేవా | 
పుండలికాచ్యా త్యా భక్తి భావా | విటే విసాంవా ఘేతలా” | ||౮౭|| 
87. “తల్లి తండ్రుల సేవ చేసి, పుండలీకుడు దేవాది దేవుణ్ణి మోహితుణ్ణి చేసి, వశపరచుకున్నాడు. అతని భక్తి భావానికి భగవంతుడు ఇటుకపైన నిలుచుండి పోయాడు” అని అన్నారు. 
అసో హోతా సప్త్యాచీ సమాప్తి | ఝాలీ మ్హణతీ దాసగణూ ప్రతీ | 
శిరడీస విఠ్ఠల దర్శన ప్రాప్తీ | హీ ఘ్యా ప్రతీతి బాబాంచీ | ||౮౮|| 
88. అలా నామ సప్తాహం సమాప్తి కాగానే దాసగణునకు శిరిడీలో విఠలుని దర్శనమైందని అంటారు. బాబా మాటలు అనుభవంలోకి వచ్చాయి. 
ఎకదా కాకా సాహేబ దీక్షిత | నియమానుసార ప్రాతఃస్నాన | 
అసతా ఆసన స్థిత ధ్యానస్థ | దర్శన పావత విఠ్ఠలాంచే | ||౮౯|| 
89. ఒక సారి, ఎప్పటిలాగే నియమంతో ఉదయానే స్నానం చేసి, ఆసనంలో ధ్యానంలో ఉండగా, కాకాసాహేబు దీక్షితుకు విఠలుని దర్శనమైంది. 
పుఢే జాతా బాబాంచే దర్శనా | నవల బాబా పుసతీ తయాంనా | 
“విఠ్ఠలపాటీల ఆలా హోతాంనా? | భేట ఝాలీనా? తయాచీ | ||౯౦||
90. తరువాత బాబా దర్శనానికి వెళ్లినప్పుడు, “విఠల పటేలు వచ్చాడు కదా, అతనిని కలిశావా?” అని విచిత్రంగా బాబా ప్రశ్నించారు. 

మోఠా పళపుట్యా బరే తో విఠ్ఠల | మేఖ మారూని కరీ త్యా అఢళ | 
దృష్టి చుకవూని కాఢీల పళ | హేతా పళ ఎక దుర్లక్ష” | ||౯౧|| 
91. “ఆ విఠలుడు పారుబోతు! అలక్ష్యం చేసి, ఒక్క క్షణమైనా దృష్టిని మరలిస్తే, పారిపోతాడు. గట్టిగా మేకు కొట్టి అతనిని కదలకుండా ఉంచు” అని అన్నారు.
హాతో ప్రాతఃకాళీ ప్రకార | పుఢే జెవ్హా భరలీ దుపార | 
పహా ఆణిక ప్రత్యంతర | విఠ్ఠలదర్శనసోహళా | ||౯౨|| 
92. ఇది ఉదయం జరిగింది. విఠలుని దర్శన వైభవం మధ్యాహ్నం మరో సారి అనుభవానికి వచ్చింది. 
పంఢరపురచ్యా విఠొబాచ్యా | ఛబ్యా పాంచపంచవీస సాచ్యా | 
ఘేఊని కోణీ బాహేరగాంవీచా | వికావయాచ్యా ఇచ్ఛే యే | ||౯౩|| 
93. పంఢరీపుర విఠలుని పాతిక చిత్రపటాలను అమ్ముకోవాలని ఇంకొక ఊరినుంచి ఒకడు శిరిడీ వచ్చాడు. 
సకాళాధ్యానీ ఆలీ తీ మూర్తీ | తియేచీచ సంపూర్ణ హోతీ ప్రతికృతీ | 
పాహూని దీక్షిత విస్మిత చిత్తీ | బోల ఆఠవతీ బాబాంచే | ||౯౪|| 
94. ఉదయం ధ్యానంలో కనిపించిన రూపంలాంటి ఫోటోలు, పూర్తిగా అదే రూపం, చూసి దీక్షితు ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతనికి బాబా మాటలు గుర్తుకు వచ్చాయి. 
దీక్షిత తంవ అతి ప్రీతీ | వికణారాసీ మోల దేతీ | 
ఛబీ ఎక వికతఘేతీ | భావే లావితీ పూజేస | ||౯౫|| 
95. అమ్ముకునే వానికి డబ్బిచ్చి, ఎంతో ప్రేమతో ఒక పటాన్ని కొని, భక్తిగా పూజకోసం పెట్టుకున్నాడు. 
విఠ్ఠల పూజూనీ సాఈచా ఆదర | ఆణీక ఎక కథానక సుందర | 
పరిసా బహు శ్రవణ మనోహర | ఆనంద నిర్భర మానసే | ||౯౬|| 
96. విఠలుని పూజ అంటే సాయికి గల ఆదరణను తెలియ పరచే మనోహరమైన మరొక అందమైన కథను ఆనందంగా వినండి. 
భగవంతరావ క్షీరసాగర | వడీల విఠ్ఠల భక్త ప్రవర | 
పంఢరపురాస వారంవార | ఫేరీ వరచేవర కరీత | ||౯౭|| 
97. భగవంతరావ క్షీరసాగరుని తండ్రి విఠలుని భక్త శ్రేష్ఠుడు. తరచూ పంఢరీపుర యాత్ర కూడా చేసేవాడు.
ఘరాంత హోతీ విఠ్ఠల మూర్తి | వడీల పంచత్వ పావల్యావరతీ | 
జాహలీ పూజానైవేద్య సమాప్తి | శ్రాద్ధతిథీహీ రాహిలీ | ||౯౮|| 
98. పూజ కోసం విఠలుని విగ్రహం వారింట్లో ఒకటుందేది. తండ్రి చనిపోగానే, పూజ, అర్చనలు, నైవేద్య, సమర్పణలు ఆగిపోయాయి. శ్రాద్ధం కూడా ఆగిపోయింది. 
నాహీ వారీచీ కథావార్తా | భగవంతరావ శిర్డీస యేతా | 
బాబా ఆఠవూని తయాచా పితా | మ్హణతీ ‘తో హోతా దోస్త మాఝా | ||౯౯|| 
99. పంఢరీ యాత్ర గురించి అసలు మాటే లేదు. ఈ భగవంతరావు శిరిడీకి వచ్చినప్పుడు, అతని తండ్రిని గుర్తుచేసుకుంటూ బాబా “ఇతని తండ్రి నా స్నేహితుడు.
హా త్యా మాఝ్యా స్నేహ్యాచా సుత | మ్హణూన యాస మీ ఆణిలా ఖేంచిత | 
నాహీ కధీ హా నైవేద్య కరీత | ఉపాసీ ఠేవీత మజలాహీ | ||౧౦౦||
100. “ఆ నా స్నేహితుని కుమారుడే ఇతడు. అందుకే నేను ఇతనిని ఇక్కడకు లాక్కుని వచ్చాను. ఎప్పుడూ నైవేద్యం పెట్టకుండా ఇతను నన్ను కూడా పస్తులు ఉంచుతున్నాడు. 

విఠలాసహీ ఠేవీ ఉపాశీ | మ్హణూన శిరడీసీ ఆణిలే యాసీ | 
ఆతా దేఈన ఆఠవణీసీ | లావీన పూజేసీ యాజలా” | ||౧౦౧|| 
101. “విఠలుని కూడా పస్తులుంచాడు. అందుకే ఇతనిని శిరిడీకి తీసుకుని వచ్చాను. ఇప్పుడు, అతనికి అన్నీ గుర్తుకు తెచ్చి, మరల ఇతడు పూజ ప్రారంభించేలా చేస్తాను” అని చెప్పారు.
ఎకదా పర్వవిశేష జాణూన | కరావే ప్రయాగతీర్థీ స్నాన | 
దాస గణూచే జాహలే మన | ఆలే ఆజ్ఞాపన ఘ్యావయా | ||౧౦౨|| 
102. ఒక సారి, ఒక పర్వదినాన దాసగణుకు ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలన్న కోరిక కలిగింది. బాబా అనుమతి కోసం వారి వద్దకు వచ్చాడు. 
బాబా దేతీ ప్రత్యుత్తర | నలగే తదర్థ జాణే దూర | 
హేంచ ఆపులే ప్రయాగతీర | విశ్వాస ధర దృఢ మనీ | ||౧౦౩|| 
103. అప్పుడు బాబా ఆతనితో “దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదే మన ప్రయాగ తీర్థం. మనసులో దృఢమైన నమ్మకముంచు” అని చెప్పారు. 
ఖరేంచ సాంగావే కాయ కౌతుక | బాబాంచే చరణీ ఠేవితా మస్తక | 
ఉభయాంగుష్ఠీ నిథళలే ఉదక | గంగాయమునౌదక పాఝరలే | ||౧౦౪|| 
104. నిజం చెప్పాలంటే, ఎంత అద్భుతమైన ఘటన! బాబా పాదాలపై దాసగణు తన తలను పెట్టగానే, వారి రెండు బొటన వేళ్ళనుండి గంగా యమునల నీరు ప్రవహించింది. 
పాహూనియా తో చమత్కార | దాస గణూస ఆలా గాహింవర | 
కాయ బాబాంచా మహదుపకార | ఫుటలా పాఝర నయనాస | ||౧౦౫|| 
105. ఆ చమత్కారాన్ని చూసి, దాసగణు గగుర్పాటు చెందాడు. బాబా ఎంతటి ఉపకారాన్ని చేశాడు! కృతజ్ఞతతో కళ్ళనుండి నీరు ధారలుగా కారాయి. 
వైఖరీస చఢలే స్ఫురణ | ప్రేమ ఆలే ఉచంబళూన | 
అగాధశక్తి అఘటిత లీలా వర్ణన | కరూన సమాధాన పావలే | ||౧౦౬|| 
106. వెంటనే స్ఫురణ వచ్చింది. ప్రేమ ఉప్పొంగి, బాబాయొక్క అద్భుతమైన లీలను, అంతులేని శక్తి మహిమను వర్ణించి, అతడు తృప్తి చెందాడు. 
దాస గణూచే పద హే గోడ | వేళీంచ పురావే శ్రోతియాంచే కోడ | 
మ్హణోని త్యా ప్రాసాదిక పదాచీ జోడ | దేవోని హీ హోడ పురవితో | ||౧౦౭||
107. దాసగణుయొక్క ఈ మధురమైన రచనలోని ప్రసాదించ బడిన పదాల కూర్పును శ్రోతలకు తెలియజేసి, వారి కుతూహలాన్ని తీరుస్తాను. 

(పద) 
అగాధ శక్తి అఘటిత లీలా తవ సద్గురూరాయా | 
జడజీవాతే భవి తారాయా తూ నౌకా సదయా | ||ధ్రు.|| 
వేణీమాధవ ఆపణ హోఊని ప్రయాగ పద కేలే | 
గంగా యమునా ద్వయ అంగుష్ఠీ ప్రవాహ దాఖవిలే | ||౧|| 
కమలోద్భువ కమలావర శివహర త్రిగుణాత్మక మూర్తీ | 
తూంచి హోఊనీ సాఈసమర్థా విచరసీ భూవరతీ | ||౨|| 
ప్రహర దిసాలా బ్రహ్మాసమ తే జ్ఞాన ముఖే వదసీ | 
తమోగుణాలా ధరూని రూద్ర రూప కధి కధి దాఖవిసీ | ||౩|| 
కధీ కధీ శ్రీకృష్ణాసమ త్యా బాలలీలా కరిసీ | 
భక్త మనానిత సరస కరూనీ మరాళ తూ బనసీ | ||౪|| 
యవన మ్హణావే తరీ ఠేవిసీ గంధావర ప్రేమా | 
హిందు మ్హణూ తరి సదైవ వససీ మశిదింత సుఖధామా | ||౫|| 
ధనిక మ్హణావే జరీ తులా తరి భిక్షాటణ కరిసీ | 
ఫకిర మ్హణావే తరీ కుబేరా దానే లాజవిసీ | ||౬|| 
తవౌకసాతే4 మశిద మ్హణూ తరి వన్హీ తే ఠాయా | 
ధునింత సదా ప్రజ్వళీత రాహే ఉది లోకా ఘ్యాయా | ||౭|| 
సకాళపాసుని భక్తసాబడే పూజన తవ కరితీ | 
మాధ్యాన్హీలా దినకర యేతా హోత అసే ఆరతీ | ||౮|| 
చహూంబాజూలా పార్శ్వదగణసమ భక్త ఉభే రాహతీ | 
చౌరి చామరే కరీ ధరూని తుజవర ఢాళీతీ | ||౯|| 
శింగ ఘడయాళే సూర సనయ్యా దణదణతే ఘంటా | 
చోపదార లలకారితి ద్వారీ ఘాలునియా పట్టా | ||౧౦|| 
ఆరతి సమయీ దివ్యాసని తూ కమలావరదిససీ | 
ప్రదోషకాళీ బసుని ధునిపుఢే మదనదహన హోసీ | ||౧౧|| 
అశ్యా లీలా త్యా త్రయదేవాంచ్యా ప్రత్యహి తవ ఠాయీ | 
ప్రచీతీస యెతాతీ అముచ్యా హే బాబా సాఈ | ||౧౨|| 
ఏసె అసతా ఉగీచ మన్మన భటకత హే ఫిరతే | 
ఆతా వినంతీ హీచ తులా బా స్థిర కరీ త్యాతే | ||౧౩|| 
అధమాధమ మీ మహాపాతకీ శరణ తుఝ్యా పాయా | 
ఆలో, నివారా దాసగణూంచే త్రితాప గురూరాయా | ||౧౪||
(పదం)  
సద్గురుదేవా! మీయొక్క శక్తి అంతులేనిది. 
మీ లీల అద్భుతం. దయామయా! 
అజ్ఞానులైన, అమాయకులైన జీవులను
ఈ సంసార సాగరంనుండీ తరింపజేసే నౌక సదా మీరే||ధ్రు.|| 
వేణు మాధవుడై మీ పాదాలు రెండింటినీ ప్రయాగ చేసి
రెండు బొటన వేళ్ళనుండి గంగా యమునల ప్రవాహాన్ని చూపారు (౧) 
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిగుణాత్మక మూర్తి అయి 
సాయి సమర్థులై భూమిపై మీరు విహరిస్తున్నారు (౨) 
ఒకప్పుడు బ్రహ్మ అయి జ్ఞానాన్ని బోధిస్తారు. 
ఒక్కొక్కప్పుడు తమోగుణం చూపటానికి రుద్ర రూపం ధరిస్తారు (౩) 
మరొక్కప్పుడు శ్రీకృష్ణునివలె బాల లీలలను చూపిస్తారు. 
అప్పుడప్పుడు, భక్తుల మనసు అనే సరోవరంలో హంసవలె విహరిస్తారు (౪) 
మిమ్ము ముస్లిములని అందునా, మీకు చందనమంటే ప్రీతి. 
హిందువులని అందునా, మీరెప్పుడూ మసీదులో సుఖంగా ఉంటారు (౫) 
శ్రీమంతులని అందునా, భిక్షాటన చేస్తారు. 
పోని ఫకీరు అని అందునా, దానంలో కుబేరుడే సిగ్గుపడతాడు.||౬|| 
మీ నివాసం మసీదులో. కాని, అక్కడ 
భక్తులకు విభూతి ప్రసాదించటానికై ధునిలో రాత్రి పగలూ అగ్ని ప్రజ్వలిస్తుంది. (౭) 
ఉదయంనుండి భక్తులు మీ పూజ చేస్తారు. 
మధ్యాహ్నం, సూర్యుడు తలపై వచ్చినప్పుడు, మీకు హారతి ఇస్తారు (౮) 
భక్తులు దేవదూతలవలె నలువైపుల నిలబడి, 
మీకు వీవనలు వింజామరలు వీస్తారు. (౯) 
సన్నాయి, ఢోలు, ఘంట బాగా మ్రోగుతున్నాయి. 
దండధరులు పట్టీని ధరించి, ద్వారం దగ్గర జయజయ ధ్వనులు పలుకుతారు. (౧౦) 
హారతి సమయంలో, దివ్యాసనంలో మీరు శ్రీవిష్ణువులా కనిపిస్తారు. 
సాయంత్రం ధుని ఎదుట కూర్చుని, కాముణ్ణి దహించిన పరమ శివునిలా కనిపిస్తారు (౧౧) 
ఈ విధంగా రోజు రోజుకూ త్రిమూర్తుల లీలలను మీరు మాకు అనుభవింప చేస్తునారు. 
అయినా, ఈ మనసు ఇంకా విచ్చలవిడిగా తిరుగుతుంది. దీనిని స్థిరంగా ఉంచమనే కోరికనొక్కటే ఇప్పుడు వేడుకుంటున్నాను. (౧౩) 
అందరికంటే నీచుణ్ణి. మహా పాపిని. మీ పాదాల వద్ద శరణుజొచ్చి వచ్చాను. 
గురుదేవా! ఈ దాసగణుని మూడు తాపాలను తొలగించండి. (౧౪)

అసో అఘోర పాపే ధువాయా | జన జాతీ గంగేచ్యా ఠాయా | 
గంగా లాగే సంతాంచే పాయా | నివారావయా నిజతాపే | ||౧౦౮|| 
108. భయంకరమైన తమ పాపాలను కడిగేసుకోవటానికి గంగకు వెళ్ళుతారు. అయితే, తనకు అంటిన పాపాలను తొలగించుకోవటానికి, గంగ సంతుల పాదాలను ఆశ్రయించ వలసి ఉంటుంది. 
సోడూనియా చరణా పవిత్రా | న లగే గంగా గొదా యాత్రా | 
భావే పరిసా యా సంత స్తోత్రా | గోడచరిత్రా సాఈచ్యా | ||౧౦౯|| 
109. అందు వలన ఈ సాయి సత్పురుషుని పవిత్ర చరణాలను వదిలి గంగ గోదావరి తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవసరం లేదు. సాయియొక్క మధుర చరిత్రను వారి స్తోత్రాన్ని భక్తిగా వినండి. 
జైసే గోణాఈస భీమరథీంత | తమాలాస భాగీరథీంత | 
నామా కబీర శింపాల్యా ఆంత | సుదైవే ప్రాప్త జాహలే | ||౧౧౦||
110. భాగ్యవశాత్తు భీమరథి నదిలో గోణాయికి నామదేవు, భాగీరథీ నదిలో ముత్యపు చిప్పులో తమాలుకు కబీరు లభించారు. 

తైసేచ హె శ్రీసాఈనాథ | తరూణ సోళా వర్షాంచే వయాంత | 
నింబాతళీ శిరడీ గాంవాంత | ప్రథమ భక్తార్థ ప్రకటలే | ||౧౧౧|| 
111. అలాగే, శ్రీసాయిబాబా పదహారు ఏళ్ళ యువ వయసులో, శిరిడీ గ్రామంలోని వేపచెట్టు క్రింద భక్తుల కొరకు మొదట కనిపించారు. 
ప్రకటతాంచ బ్రహ్మజ్ఞానీ | నాహీ విషయవాసనా స్వప్నీ | 
మాయా త్యాగిలీ లాథేహాణునీ | ముక్తీ చరణీ వినటలీ | ||౧౧౨|| 
112. మొదట కనిపించినప్పటికే వారు బ్రహ్మజ్ఞాని. కలలో కూడా వారికి ఇంద్రియాల కోరికలు లేవు. మాయను తన్ని తరిమేశారు. ముక్తి వారి పాదాలయందు దొర్లుతుండేది.
జన్మ బాబాంచా కోణ్యా దేశీ | అథవా కోణ్యా పవిత్ర వంశీ | 
కోణ్యా మాతాపితరాంచ్యా కుశీ | హే కోణాసీ ఠావేనా | ||౧౧౩|| 
113. ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లి తండ్రుల గర్భాన వారు జన్మించారో ఎవ్వరికీ తెలియదు.
ఠావీ న కోణా పూర్వావస్థా | కోణ తో తాత వా కోణ మాతా | 
థకలే సమస్త పుసతా పుసతా | కోణా న పత్తా లాగలా | ||౧౧౪|| 
114. వారి వెనుకటి వివరాలు కూడా ఎవరూ ఎరుగరు. వారి తల్లి తండ్రులు ఎవ్వరు అని అడిగి అడిగి అందరూ అలసిపోయారే కాని వారి వివరాలు ఎవరికీ తెలియలేదు.
సోడూని మాతా పితర ఆప్త | గణగోత ఆణి జాత పాత | 
త్యాగూని సకల సంసార జాత | ప్రకటలా జనహితార్థ శిరడీంత | ||౧౧౫|| 
115. తల్లి తండ్రులను, ఆప్తులను, జాతి మతాలను, ప్రపంచ వ్యవహారాలను, సంసారం అంతటినీ త్యజించి, ప్రజల మేలుకోసం వారు శిరిడీలో కనిపించారు.
శిరడీచీ ఎక వృద్ధ బాఈ | నానా చోపదారాచీ ఆఈ | 
కథితీ ఝాలీ పరమ నవలాఈ | బాబా సాఈ చరితాచీ | ||౧౧౬|| 
116. శిరిడీలోని ఒక ముసలి స్త్రీ, నానా చోప్దారుయొక్క తల్లి, సాయి చరిత్రలోని కొన్ని విశేషాలని చెప్పింది.
మ్హణే ఆరంభీ హే పోర | గోరే గోమటే అతి సుందర | 
నింబాతళీ ఆసనీ స్థిర | ప్రథమ దృగ్గోచర జాహలే | ||౧౧౭|| 
117. చాలా అందమైన బాలునిలా, వేప చెట్టు క్రింద ధ్యానం చేస్తూ, వారు మొదట కనిపించారు అని ఆమె చెప్పింది.
పాహూని సుందర బాళరూప | లోకాంమనీ విస్మయ అమూప | 
కోవళ్యా వయాంత ఖడతర తప | శీత ఆతప సమసామ్య | ||౧౧౮|| 
118. అంత సుందర రూపుడైన ఆ బాలుడు, కోమలమైన చిన్న వయసులోనే అతి కష్టమైన తపస్సును చేయటం చూసి ప్రజలందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఎండైనా, చలియైనా సమానంగా సహిస్తూ ఆ బాలుడు కఠిన తపస్సులో ఉన్నాడు.
వయ కోవళే నవల స్థితీ | గ్రామస్థ సకళ విస్మయ పావతీ | 
గాంవోగాంవీచే లోక యేతీ | దర్శన నిమిత్తీ ములాచ్యా | ||౧౧౯|| 
119. ఎంత చిన్న వయసు! ఎంత కఠిన తపస్సు! గ్రామస్థులంతా ఆశ్చర్య పోయారు. ఆ బాలుని చూడటానికి ఎక్కడేక్కడినుండో జనం వచ్చేవారు.
దివసా నవ్హే కోణాచీ సంగతీ | రాత్రీస నాహీ కోణాచీ భీతీ | 
ఆలీ కోఠూన హీ బాల మూర్తి | ఆశ్చర్య చిత్తీ సకళీకా | ||౧౨౦||
120. పగలు అతనికి ఎవరూ తోడు లేరు. రాత్రి ఎవరి భయమూ లేదు. ఈ బాలుడు ఎక్కడినుండి వచ్చాడా అని అందరికీ ఆశ్చర్యం. 

రూపరేఖా అతిగోజిరీ | పాహతా ప్రేమ దాటే అంతరీ | 
నాహీ కుణాచే ఘరీ నా దారీ | లింబాశేజారీ అహర్నిశ | ||౧౨౧|| 
121. ఎంత అందమైన ముఖం! ఎంత ఆకట్టుకునే రూపం! ఆ బాలుని చూస్తుంటే హృదయంలో ప్రేమ ఉప్పొంగేది. రాత్రి పగలు వేప చెట్టు క్రిందేగాని, ఎవరి ఇంటికీ పోలేదు. 

జో తో కరీ ఆశ్చర్య థోర | ఏసే కైసే తరీ హే పోర | 
వయ కోవళే రూప మనోహర | రాహీ ఉఘడ్యావర రాత్రందిన | ||౧౨౨|| 
122. వయస్సేమో చాలా చిన్నది. రూపమేమో చాలా మనోహరమైనది. అంత పసి బాలుడు, రాత్రి పగలు ఆరు బయట ఎలా ఉండగలుగుతున్నాడా అని అందరికీ ఆశ్చర్యం. 
బాహ్యాత్కారీ దిసే ఫోర | పరీ కృతీనే థోరాంహునీ థోర | 
వైరాగ్యాచా పూర్ణావతార | ఆశ్చర్య ఫార సకళికా | ||౧౨౩|| 
123. పైకి బాలుని వలె కనిపించినా, అతను చేసే పనులు గొప్పవారికంటే గొప్పగా, అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఉండేవి. మానవ రూపంలో ఉన్న వైరాగ్యంయొక్క అవతారం అతడు. 
ఎకే దివశీ నవల ఝాలే | ఖండోబాచే వారే ఆలే | 
దోఘే చౌఘే ధుజూ లాగలే | పుసూ లాగలే జన ప్రశ్న | ||౧౨౪|| 
124. ఒక రోజు ఒక విచిత్రం జరిగింది. కొందరిపై ఖండోబా దేవుడు ఆవేశమై వారు ఊగుతుంటే, జనం వారిని కొన్ని ప్రశ్నలను అడిగారు. 
కోణా సభాగ్యాచే హే పోర | కోఠూన కైసే హె ఆలే ఇథవర | 
దేవా ఖండోబా తూ తరీ శోధ కర | ప్రశ్న విచారీత తై ఎక | ||౧౨౫|| 
125. ‘దేవా! ఖండోబా! ఇతడు ఏ భాగ్యవంతుల బిడ్డ? ఎక్కడినుండి ఇక్కడికి వచ్చాడు? నువ్వైనా కనుక్కుని తెలియజెయ్యి’ అని ఒకరు అడిగారు. 
దేవ మ్హణే జా కుదళీ ఆణా | దావితో తే జాగీ ఖణా | 
లాగేల యా పోరాచా ఠికాణా | కుదళీ హాణా యే జాగీ | ||౧౨౬|| 
126. దానికి ఖండోబా దేవుడు, ‘వెళ్లి గునపం తెచ్చి, నేను చూపించిన చోటులో త్రవ్వండి. ఈ బాలుని వివరాలు తెలుస్తాయి’ అని జవాబిచ్చాడు. 
మగ తేథేంచ త్యా గాంవకుసాజవళీ | త్యాచ నింబవృక్షాచే తళీ | 
మారితా కుదళీవరీ కుదళీ | విటా తే స్థళీ ఆఢళల్యా | ||౧౨౭|| 
127. అప్పుడు, ఆ గ్రామ శివారులలో, వేపచెట్టు క్రింద గునపంతో త్రవ్వగా, అక్కడ ఇటుకలు కనిపించాయి. 
పురా హోతాంచ విటాంచా థర | జాత్యాచీ తళీ సారితా దూర | 
దృష్టీస పడలే ఎక భుయార | సమయా చార జళతీ జై | ||౧౨౮|| 
128. ఆ ఇటుకల వరసను తొలగించాక, తిరగలి క్రింది రాయి కనిపించింది. దానిని ప్రక్కకు జరపగా, ఒక సొరంగం, అందులో వెలుగుతున్న నాలుగు ప్రమిదలు కనిపించాయి. 
చునెగచ్ఛీ తే తళఘర | గోముఖీ, పాట మాళ సుందర | 
దేవ మ్హణే బారా వర్షే హా పోర | తప ఆచరలా యే స్థళీ | ||౧౨౯|| 
129. సున్నం గచ్చుతో కట్టిన ఆ భూగృహంలో, గోముఖం, పీట, అందమైన మాలలు ఉన్నాయి. ఇక్కడే ఈ బాలుడు పన్నెండు ఏళ్లు తపస్సు చేశాడని ఖండోబా దేవుడు చెప్పాడు.
మగ జన సర్వ ఆశ్చర్య కరితీ | ఖోద ఖోదూన పోరాస పుసతీ | 
పోర తో బారా ములఖాచా గమతీ | కథా భలతీచ సాంగితలీ | ||౧౩౦||
130. ఇది చూసి, జనమంతా ఆశ్చర్యపోయారు. ఆ బాలుని గ్రుచ్చి గ్రుచ్చి ప్రశలను అడిగారు. కాని, ఆ బాలుడు, తుంటరితనంతో, ఇంకేదో వేరే కథ చెప్పాడు. 

మ్హణే హే మాఝ్యా గురూచే స్థాన | అతి పవిత్ర హే మాఝే వతన | 
ఆహే తైసేంచ కరా హే జతన | మానా మద్వచన ఎవఢే | ||౧౩౧|| 
131. “ఇది మా గురువుయొక్క స్థానం. నాకు అతి పవిత్రమైన భూమి. నా మాట విని, దీనిని ఇలాగే భద్రపరచండి” అని చెప్పాడు. 
బాబా ఝాలే ఏసే బోలతే | కథితే ఝాలే శ్రవణ కరితే | 
బాబా వదలే తె వదలే భలతే | ఏసీ హీ వళతే జివ్హా కా | ||౧౩౨|| 
132. అలా బాబా చెప్పారు, అని దానిని విన్నవారు చెప్పారు. మరి, సంబంధం లేని కథను బాబా చెప్పారు అని నా నాలుక అనిందేమిటి? 
ఆశ్చర్య వాటే మాఝేచి మజ | బాబా విషయీ హా కా సమజ | 
పరీ తో ఆతా పడలా ఉమజ | అసేల సహజ వినోద హా | ||౧౩౩|| 
133. నాకే ఆశ్చర్యం కలిగింది. బాబా గురించి ఇలా అనుకున్నానేమిటి? ఇప్పుడు, నాకు అర్థమైంది, అది కేవలం వినోదం కోసం అయి ఉంటుంది అని. 
బాబా మూళచేచ వినోదప్రియ | అసేలహీ భుయార త్యాంచేచ ఆలయ | 
పరీ గురూచే మ్హణతా కాయ జాయ | మహత్వ కాయ వేచేంకీ | ||౧౩౪|| 
134. అసలు బాబా చాలా వినోద ప్రియులు. ఈ భూమి లోపలి ఇల్లు వారి ఆలయమే అయి ఉండవచ్చు. అయినా, గురువుదని చెబితే పోయేదేముంది? దాని మహాత్మ్యం నష్టపోతుందా? అని అలా చెప్పి ఉంటారు. 
అసో బాబాంచ్యా ఆజ్ఞేవరూన | పూర్వీప్రమాణే విటా లావూన | 
భుయార టాకిలే బంద కరూన | నిజగురూస్థాన మ్హణూన తే | ||౧౩౫|| 
135. అలా బాబా ఆజ్ఞ అయిన తరువాత, అది ‘గురుస్థానం’ అని మునుపటివలనే ఇటుకలను పేర్చి, ఆ భూగృహాన్ని, సొరంగాన్ని మూసి వేశారు. 
జైసా అశ్వత్థ వా ఔదుంబర | తైసాచ బాబాంస తో నింబతరూవర | 
ప్రీతి ఫార త్యా నింబావర | అతి ఆదర తయాంచా | ||౧౩౬|| 
136. అశ్వత్థ వృక్షం, ఔదుంబర వృక్షాల వలె ఆ వేపచెట్టుపై కూడా బాబాకు అతి ప్రీతి, విపరీతమైన గౌరవం కూడాను. 
మ్హాళసాపతి ఆదికరూన | జునే శిరడీచే గ్రామస్థ జన | 
బాబాంచ్యా గురూచే హె సమాధిస్థాన | మ్హణూన వందన త్యా కరితీ | ||౧౩౭|| 
137. మహల్సాపతి, శిరిడీలోని వృద్ధులు బాబాయొక్క గురువుగారి సమాధి స్థానమని, అక్కడ నమస్కారం చేసేవారు. 
తయా సమాధి సన్నిధానీ | ద్వాదశ వర్షే మౌన ధరూనీ | 
తపశ్చర్యా కేలీ బాబాంనీ | ప్రసిద్ధ జనీ హీ వార్తా | ||౧౩౮|| 
138. ఆ సమాధి దగ్గర కూర్చుని, పన్నెండు సంవత్సరాలు మౌనంగా బాబా తపస్సు చేశారన్న సంగతి, అక్కడి గ్రామస్థులందరిలో బాగా ప్రసిద్ధి చెందింది. 
సమాధి ఆణి నింబ సమేత | చౌఫేర జాగా ఘేఊని వికత | 
సాఠే సాహేబ బాబాంచే భక్త | చౌసోపీ ఇమారత ఉఠవితీ | ||౧౩౯|| 
139. వేప చెట్టుతో సహ సమాధికి నలువైపులా ఉన్న స్థలాన్ని బాబా భక్తుడు సాఠే కొని, అక్కడ నాలుగు వరండాలు మధ్యన చేరే భవనాన్ని నిర్మించాడు. 
హీచ ఇమారత హాచ వాడా | యాత్రేకరూంచా మూళ ఆఖాడా | 
ఆలియా గోలియాంచా రాడా | ఎకచి గాఢా తే స్థానీ | ||౧౪౦||
140. ఈ భవనమే, ఈ వాడాయే వచ్చిపోయే యాత్రికులకు మునుపు అక్కడ ఉన్న ఒకే ఒక వసతి గృహం. 

బాంధిలా సాఠ్యాంనీ నింబాస పార | మాడ్యా కాఢిల్యా దక్షిణోత్తర | 
ఉత్తరేచా జినా తయార | కరితా హే భుయార దాఖవిలే | ||౧౪౧|| 
141. వేప చెట్టు చుట్టూ సాఠే అరుగు కట్టించాడు. దక్షిణ ఉత్తర దిశలో ఈ భవనాన్ని నిర్మించాడు. ఉత్తర దిశలో మెట్లు కట్టుతుండగా, ఈ భూగృహాన్ని గమనించారు.
జిన్యా ఖాలీ దక్షిణాభిముఖ | కోనాడా ఎక ఆహే సురేఖ | 
తేథేంచ పారావర తయాసన్ముఖ | భక్త ఉదడ్ముహఖ బైసతీ | ||౧౪౨|| 
142. మెట్ల క్రింద, దక్షిణ దిశలో ఒక చక్కటి గూడు ఉంది. దాని ఎదుట, ఉత్తరంవైపు ముఖం పెట్టి, భక్తులు కూర్చుంటారు. 
"గురూవార ఆణి శుక్రవారీ | సూర్యాస్తీ సారవూనియా వరీ | 
ఊద జాళీల జో క్షణభరీ | దేఈల శ్రీహరి సుఖ తయా" | ||౧౪౩|| 
143. “గురువారం, శుక్రవారాలు, సూర్యుడు అస్తమించే సమయంలో, అక్కడ అలికి, శుభ్రం చేసి, సాంబ్రాణి ధూపం వేసేవారికి శ్రీహరి తప్పకుండా సుఖాలను ప్రసాదిస్తాడు”. 
హీ అతిశయోక్తి కివా ఖరే | సాశంక హోతీల శ్రోత్యాంచీ అంతరే | 
పరీ హీ సాఈముఖీంచీ అక్షరే | శ్రవణ ద్వారే పరిసిలీ | ||౧౪౪|| 
144. ఇది నిజమేనా, లేక అతిశయోక్తియా అని శ్రోతల మనసులో అనుమానం కలుగవచ్చు. కాని, ఇవి సాయి నోటినుంచి వచ్చిన మాటలు, నేను నా చెవులతో విన్నవి. 
నాహీ మాఝియా పదరచే విధాన | శంకా న ధరా అణు ప్రమాణ | 
ప్రత్యక్ష జ్యాంనీ కేలే హే శ్రవణ | తే ఆజ విద్యమాన అసతీ కీ | ||౧౪౫|| 
145. ఇవి నేను కల్పించిన మాటలు కావు. అందుచేత కొంచం కూడా సందేహించకండి. ఈ మాటలను ప్రత్యక్షంగా విన్నవారు ఈ నాటికీ ఉన్నారు. 
పుఢే ఝాలా దీక్షితాంచా వాడా | సోయ ఝాలీ ప్రశస్త బిర్హాడా | 
అల్పకాలాంత తేథేంచ పుఢా | దగడీవాడా హీ ఊఠలా | ||౧౪౬|| 
146. ఆ తరువాత, దీక్షితు వాడా కట్టబడింది. దానివలన, భక్తులు బస చేయటానికి మంచి సదుపాయం కలిగింది. తరువాత, చాలా తక్కువ సమయంలోనే అక్కడ ఒక రాతి వాడా నిర్మించబడింది. 
దీక్షిత ఆధీంచ పుణ్యకీర్తి | భావార్థాచీ ఓతీవ మూర్తి | 
ఆంగ్లభూమీచే యాత్రేస జాతీ | తేథ రోవితీ నిజ బీజ | ||౧౪౭|| 
147. అప్పటికే, తన మంచి పనులతో, భక్తి శ్రద్ధ మూర్తీభవించినట్లు ఉండే దీక్షితు కీర్తి గడించాడు. ఇంగ్లాండుకు ప్రయాణమై వెళ్ళినప్పుడు, అక్కడ పారమార్థిక బీజం అతనిలో నాటబడింది. 
యేథే శ్రోతే ఘేతీల శంకా | సోడూని మథురా కాశీ ద్వారకా | 
ధర్మబాహ్య జీ ఆంగ్ల భూమికా | పరమార్థదాయకా కైసీపా | ||౧౪౮|| 
148. ఇది విన్న శ్రోతలకు అనుమానం కలగటం సహజం. మథుర, కాశి, ద్వారక వంటి పుణ్య క్షేత్రాలను వదిలి వేసి, హిందూ ధర్మానికి విరుద్ధమైన ఆంగ్లేయుల భూమిలో పరమార్థం ఎలా నాటబడింది? అని. 
శ్రోత్యాంస శంకా హీ సాహజిక | నిరసతా తీ వాటేల కౌతుక | 
విషయాంతర ఘడేల అల్పక | క్షమా సకళిక కరితీల | ||౧౪౯|| 
149. శ్రోతలకు ఇలాంటి అనుమానం రావటం సహజం. వారి కౌతుకాన్ని తొలగించటానికి మునుపు, ఇక్కడ కొంచెం విషయం మారుతుంది. అందరూ క్షమించాలి. 
కాశీ ప్రయాగ బదరికేదార | మథురా వృందావన ద్వారకాపూర | 
 ఇత్యాది యాత్రా పుణ్య నికర | పదరీ పూర్వీచ తయాంచే | ||౧౫౦||
150. కాశి, ప్రయాగ, బదరీ కేదారాలు, మథురా బృందావనం, ద్వారక మొదలైన పుణ్యక్షేత్రాల యాత్ర చేసిన పుణ్యం దీక్షితుకు అంతకు ముందే ఉంది. 

శివాయ వడిలాంచీ పుణ్యాఈ | ధన్య భాగ్యాచీ అపూర్వాఈ | 
సర్వ పూర్వార్జితాచీ భరపాఈ | జాహలే సాఈ దర్శన | ||౧౫౧|| 
151. అంతే కాకుండా, తల్లిదండ్రుల పుణ్యం వలన, అంతులేని భాగ్యం కొద్దీ, పూర్వార్జిత పుణ్య ఫలం కారణంగా, దీక్షితుకు సాయి దర్శనం కలిగింది.
యా దర్శనా ఆది కారణ | ప్రాక్తనీంచే పాంగుళ పణ | 
ఆంగ్లభూమీంత అసతా జాణ | పాయ నిసరూన జే ఆలే | ||౧౫౨|| 
152. ఈ దర్శనానికి తక్షణ కారణం, అదృష్టం కొద్ది అతనికి కలిగిన కుంటితనం. ఇంగ్లాండులో ఉండగా, దీక్షితు కాలు జారి పడ్డాడు. 
దిసాయా దిసలా జరీ కుయోగ | తరీ పరిపాకే గురూపుష్యయోగ | 
తేణే ఫళలా సదుద్యోగ | అలభ్య సంయోగ సాఈంచా | ||౧౫౩|| 
153. పైకి దురదృష్టంగా కనిపించినా, నిజానికి అది చాలా అరుదుగా జరిగే శుభమైన ఘటన. అతని పుణ్య పనుల ఫలితంగా, ఈ కుంటితనం వలనే, చాలా కష్టమైన సాయియొక్క సహవాసం అతనికి దొరికింది. 
చాందోరకరాంచీ గాంఠ పడలీ | సాఈచీ కీర్తి కర్ణీ ఆలీ | 
మ్హణతీ పహా దర్శన నవ్హాళీ | జాఈల పాంగుళీక తత్కాళ | ||౧౫౪|| 
154. అనుకోకుండా నానా చాందోర్కరును కలవటంతో, సాయి కీర్తి చెవులలో పడింది. చాందోర్కరు అతనితో, ‘సాయి దర్శనంలోని అద్భుతాన్ని చూడు! నీ కుంటితనం వెంటనే పోతుంది’ అని చెప్పాడు. 
పరీ హా పాయాంచా లంగడేపణా | దీక్షిత న మానీత ఉణేపణా | 
ఖరా లంగడేపణా తో మనా| ఘాలవా మ్హణాలే సాఈస | ||౧౫౫|| 
155. కాని, తన కుంటితనాన్ని దీక్షితు ఒక లోపంగా అనుకోలేదు. మనసు స్థిరంగా ఉండకపోవటమే నిజమైన లోపమని, దానిని పోగొట్టమని సాయిని కోరాడు. 
త్వాచా రూధిర మాంస హాడా | సముదాయ నరదేహాచా సాంగాడా | 
హా క్షణభంగూర సంసార గాడా | పాయ లంగడా రాహో కీ | ||౧౫౬|| 
156. చర్మం, ఎముకలు రక్త మాంసాల కలయికే ఈ మానవ శరీరం. అది ఈ ప్రపంచంలో ఉండేది కొన్ని క్షణాలు మాత్రమే. అలాంటప్పుడు, కాలి కుంటితనం ఉంటే ఏం నష్టం? 
ఎకోణీససె నఊ సన | మహినా నోవ్హేంబర తారీఖ దోన | 
దీక్షితాంసీ తై పుణ్యపావన | సాఈదర్శన ఆరంభీ | ||౧౫౭|| 
157. క్రి. శ. ౧౯౦౯వ సంవత్సరంలో నవంబరు రెండవ తారీఖున, మొదటి సారి దీక్షితుకు పుణ్య పావనమైన సాయి దర్శనం కలిగింది. 
మగ తే పుఢే త్యాచవర్షీ | పునశ్చ గేలె డిసెంబర మాసీ | 
శిరడీస శ్రీచ్యా పునర్దర్శనాసీ | వ్హావే రహివాసీ మన ఝాలే | ||౧౫౮|| 
158. అదే సంవత్సరం డిసెంబరు నెలలో శ్రీవారిని మరల దర్శించటానికి శిరిడీ వెళ్ళాడు. అప్పుడు, శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలనే కోరిక అతని మనసులో కలిగింది. 
కాఢావే పంచవీస శేఅర | బాంధావే ఎక పత్ర్యాచే ఛప్పర | 
యాత్రేకరూంస హీ సోఈస్కర | ప్రథమ విచార హా స్ఫురలా | ||౧౫౯|| 
159. ఇరవై ఐదు షేర్లను అమ్మి, అక్కడ రేకుల షేడ్డును కట్టించాలని అతనికి మునుపు అనిపించింది. దానివలన వచ్చిపోయే యాత్రికులకు కూడా సదుపాయంగా ఉంటుందని అనుకున్నాడు. 
పుఢే బాంధావా ఎక వాడా | ఏసా జాహలా మనాచా ధడా | 
పుఢీల వర్షీచ ముహూర్త మెఢా | నిక్షేప దగడాసీ పాయాచ్యా | ||౧౬౦||
160. కాని తరువాత, ఒక వాడాను కట్టించటానికి నిశ్చయించుకున్నాడు. తరువాతి సంవత్సరంలోనే ఒక మంచి ముహూర్తాన రాళ్ళ పునాదితో పని మొదలైంది. 

నఊ డిసెంబర తో దిన | బాబాంచే ఘేతలే అనుమోదన | 
తోచ సుముహూర్త మానూన | పాయాబంధన సారిలే | ||౧౬౧|| 
161. డిసెంబరు తొమ్మిదవ తారీఖున, బాబా అనుమతిని పొంది, అదే మంచి ముహూర్తమని, పునాది పని మొదలు పెట్టారు.
బోలావూన హీ యేణార నవ్హే | తె దీక్షితాంచే బంధూహీ తెథే | 
తే దివశీ త్యాచ ముహూర్తే | ఆలేహీ హోతె ఆధీంచ | ||౧౬౨|| 
162. పిలిచినా రాని, దీక్షితుని సోదరుడు కూడా ముందుగానే వచ్చి, ఆ ముహూర్తానికి అక్కడే ఉన్నాడు. 
శ్రీయుత దాదాసాహేబ ఖాపర్డే | పూర్వీచ ఆలే హోతే సడే | 
పరవానగీ5 మాగతా బాబాంకడే | కోణ సాంకడే తయాంలా | ||౧౬౩|| 
163. శ్రీ దాదాసాహేబు ఖాపర్డే అంతకు ముందునుంచే అక్కడ ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళటానికి బాబా అనుమతి దొరకటం కొంచెం కష్టమైంది. 
పరీ ఖాపర్డ్యాతే ఘరీ జావయా | దీక్షితాంతే పాయా ఘాలావయా | 
జాహల్యా యా ఆజ్ఞా ఉభయా | దహా డిసెంబర యా దినీ | ||౧౬౪|| 
164. డిసెంబరు పదవ తారీఖున, ఖాపర్డేకు ఇంటికి వెళ్ళటానికీ, దీక్షితు వాడాకు పునాది వేయటానికీ, బాబా ఆజ్ఞ అయింది.
ఆణఖీ యా దివసాచీ మహతీ | చావడీచీ జీ శేజారతీ | 
తీహీ యాచ దివసాపాసూన కరతీ | పరమ భక్తి ప్రీతీయుత | ||౧౬౫|| 
165. ఈ రోజు ఇంకొక కారణంగానూ చాలా గొప్ప దినము. ఈ రోజునుంచే పరమ భక్తి శ్రద్ధలతో, చావడిలో శేజారతి మొదలైంది. 
పుఢే సన ఎకూణీసశే అకరా | రామనవమీచా ముహూర్త బరా | 
సాధూని గృహ ప్రవేశ సంస్కారా | విధిపురఃసర సారిలే | ||౧౬౬|| 
166. తరువాత, క్రి. శ. ౧౯౧౧వ సంవత్సరం శ్రీరామనవమి సుముహూర్తాన గృహప్రవేశ శుభకార్యం, విధి పూర్వకంగా జరిగింది. 
పుఢే శ్రీమంత బుట్టీంచా ఇమలా | అలోట పైకా ఖర్చీ ఘతలా | 
దేహహీ బాబాంచా తేథ విసవలా | పైకా లాగలా సార్థకీ | ||౧౬౭|| 
167. ఇంకా కొంత కాలం తరువాత, శ్రీమంతుడైన బుట్టీ చాలా డబ్బు ఖర్చుపెట్టి, ఒక వాడను కట్టించాడు. మహాసమాధి తరువాత, బాబా దేహం అక్కడ విశ్రమించడం వలన, అతను ఖర్చుపెట్టిన డబ్బు సార్థకమైంది. 
వాడే ఝాలే తీన ఆతా | జేథే పూర్వీ ఎకహీ నవ్హతా | 
ఆరంభీ సాఠ్యాంచే వాడ్యాచీ ఉపయుక్తతా | ఫారచి సమస్తా జాహలీ | ||౧౬౮|| 
168. మునుపు ఒక్కటైనా లేని శిరిడీలో, ఈ రకంగా మూడు వాడాలు తయారయ్యాయి. మునుపటి రోజులలో సాఠే వాడాయే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండేది. 
ఆణిక ఎక యా వాడ్యాచీ మహతీ | ఆరంభీ యాచ స్థానావరతీ | 
ఫులఝాడాంచీ బాగ హోతీ | నిర్మిలీ నిజ హస్తీ బాబాంనీ | ||౧౬౯|| 
169. ఈ సాఠే వాడాకు మరొక ఘనత ఉంది. ఈ స్థలంలోనే మొదట బాబా స్వయంగా తమ చేతులతో పెంచిన పూలతోట ఉండేది. 
బాగేచీ యా అల్ప కథా | పుఢీల అధ్యాయీ యేఈల వర్ణితా | 
హేమాడ సాఈచరణీ మాథా | ఠేవి శ్రోతా సమవేత | ||౧౭౦||
170. ఈ తోటను గూర్చిన చిన్న కథను వచ్చే అధ్యాయంలో వర్ణిస్తాను. శ్రోతల సమేతంగా హేమాడు సాయి పాదాలయందు తలను ఉంచుతున్నాడు. 

వామన తాత్యా ఘడే పురవీత | సాఈ సమర్థ పాణీ శింపత | 
ఉఖర జాగీ బాగ ఉఠవీత | పుఢే తే గుప్త జాహలే | ||౧౭౧|| 
171. బంజరు భూమిలో సాయి సమర్థులు మొక్కలు నాటి, వామన తాత్యా (కుమ్మరి) ఇచ్చిన కుండలతో నీరు పెట్టి, తోటను పెంచారు. తరువాత ఒక రోజు, బాబా ఎవరికీ కనిపించకుండా మాయమైనారు.
పుఢే ఔరంగబాదేపాశీ | చాంద పాటీల భేటలే త్యాంసీ | 
లగ్నాచియా వర్హాడాసీ | ఆలే శిరడీసీ మాగుతె | ||౧౭౨|| 
172. ఆ తరువాత, ఔరంగాబాదు దగ్గర వారికి చాందుపాటీలు కలిశాడు. అతని ఇంటి పెళ్ళివారితో, బాబా మరల శిరిడీకి వచ్చారు. 
పుఢే దేవీదాసాచీ భేట | పడలీ జానకీదాసాచీ గాంఠ | 
గంగాగీరాంచీ దృష్టాదృష్ట | మిళాలే త్రికూట శిరడీంత | ||౧౭౩|| 
173. అక్కడ దేవీదాసును కలుసుకోవటం, జానకీదాసుతో స్నేహం, గంగాగీరును చూడటం జరిగింది. ఈ ముగ్గురూ శిరిడీలో కలిశారు. 
మోహిద్దీనా సవే కుస్తీ | తెథూన మగ మశిదీ వస్తీ | 
జడలీ డేంగళ్యా లాగీ ప్రీతీ | భక్త భోవతీ మిళాలే | ||౧౭౪|| 
174. మోహిద్దీనుతో కుస్తీ పట్టటం జరిగింది. దాని తరువాత బాబా మసీదులో ఉండసాగారు. వారికి డేంగలేపై ప్రీతి కలగటం, బాబా వద్ద భక్తులు గుమిగూడటం; 
యా సర్వ కథా వార్తాంచే కథన | హోఈల పుఢీల అధ్యాయీ శ్రవణ | 
ఆతా హేమాడ సాఈసీ శరణ | ఘాలీత లోటాంగణ అనన్య | ||౧౭౫||
175. మొదలైన కథలను తరువాత అధ్యాయంలో వినండి. ఇప్పుడు హేమాడు సాయికి మనసు పూర్వకంగా శరణుజొచ్చి, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 

| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | సాఈ సమర్థావతరణం నామ | 

| చతుర్థోధ్యాయః సంపూర్ణః | 



||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||  

 

టిపణీ: 
1. ఖర్యా శ్రద్ధేనే. 
2. నవస కరతాత. 
3. మూర్తిమంత. 
4. తవ+ఓక్స్ (ఘరా) = తుఝ్యా ఘరాలా. 
 5. ఘరీ జావయాస బాబాంచీ ఆజ్ఞా. 
*. అధ్యాయ ౪, ఓవీ క్ర. ౩౩ మధ్యే శిరడీ 'కోపరగాంవ' తాలుక్యాభీతరీ అసా ఉల్లేఖ ఆహే. శిరడీచ్యా సధ్యాచ్యా తాలుక్యాచే నావ 'రాహాతా' అసే ఆహే.

No comments:

Post a Comment