Thursday, March 28, 2013

||ఈశావాస్యభావార్థబోధనం నామ వింశోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత 
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౨౦ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

ఓం నమోజీ గురు మానససరా | ప్రసాదవాక్యముక్తాకరా | 
అనన్యభక్త మరాళ నికరా | చరణీ థారా తుజపాశీ | ||౧|| 
1. ఓ సద్గురు, మీకు నమస్కారాలు! మీరు మాకు మానస సరోవరంలాంటి వారు! అనుగ్రహింపు మాటలనే ముత్యాలు కలిగిన వారు! స్థిరమైన నమ్మకం కలిగిన భక్తులు, మీ పాదాల దగ్గర హంసలవలె ఆశ్రయించి ఉన్నారు.
సదాశ్రయా మహా ఉదారా | ఘలూని ప్రసాద ముక్తచారా | 
దేఊని నిజ విశ్రాంతి ఆసరా | యేరఝారా చుకవిసీ | ||౨|| 
2. మహా ఉదారులైన మీరు, మిమ్మల్ని నమ్ముకున్న వారికి, మీ అనుగ్రహమనే ముత్యాలను ప్రసాదించి, వారికి ఆత్మ రూపాన్ని చూపించి, వారి చావు పుట్టుకలను తొలగిస్తారు. 
కాయ తో సిద్ధాశ్రమ | దర్శనే నివే సంసారశ్రమ | 
నికటవర్తీ భవభ్రమ | దవడీ అవిశ్రమ సహవాసే | ||౩|| 
3. సిద్ధులకు ఆధారాన్నిచ్చే సాయి ఎంత గొప్పవారు! వారి దర్శనంతోనే సంసారంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. వారి దగ్గర ఉన్నవారికి, సంసారం వలన కలిగిన అపోహలని, అశాంతిని పారిపోయేలా చేస్తారు. 
సాఈ మూళ నిరాకార | భక్తకాజాలాగీ సాకార | 
కరోని మాయా నటీచా స్వీకార | ఖేళలా సాచార నట జైసా | ||౪|| 
4. అసలు సాయికి ఏ ఆకారమూ లేకపోయినా, భక్తుల కొరకు మనిషి రూపాన్ని ధరించారు. మాయా నటియొక్క సవాలును స్వీకరించి, అనుభవంగల నటునివలె, వారు కూడా తమ లీలలను చూపించారు. 
ఏసియా సాఈస ఆణూ ధ్యానీ | క్షణభర జాఊ శిరడీ స్థానీ | 
దోన ప్రహరచ్యా ఆరతీ మాగూని | లక్ష లావూని పాహూయా | ||౫|| 
5. అలాంటి సాయిని ఒక్క క్షణం కళ్ళ ముందుకు తెచ్చుకుని, శిరిడీకి వెళ్ళి, అక్కడ మధ్యాహ్న హారతి తరువాత, ఏమి జరుగుతున్నదో శ్రద్ధగా చూద్దాం. 
మధ్యాన్హీ ఆరతీపాఠీ | యేఊని మశీదీచ్యా కాఠీ | 
మహారాజ అతి కృపాదృష్టీ | ఉదీ వాటీత భక్తాంస | ||౬|| 
6. మధ్యాహ్న హారతి తరువాత, సాయి మహారాజు మసీదు చివరకు వచ్చి, ఎంతో ప్రేమతో భక్తులకు ఉదీని పంచి పెడుతున్నారు. 
భక్తహీ ప్రేమళ ఉఠాఉఠీ | ఘాలీత సమచరణీ మిఠీ | 
ఉభ్యానే ముఖ న్యాహాళీతా దృష్టీ | భోగీత వృష్టీ ఉదీచా | ||౭|| 
7. భక్తులు కూడా అంతే ప్రేమతో, వెంటనే వారి పాదాలను కౌగలించుకుని, నిలబడి, సాయి ముఖాన్నే చూస్తూ, తమపై బాబా కురిపించే ఉదీని తీసుకుంటున్నారు. 
బాబాహీ భరభరోని ముష్టీ | ఘాలీత భక్తాంచ్యా కరసంపుటీ | 
అంగుష్ఠే లావీత తయాంచ్యా లలాటీ | ప్రేమ పోటీ అనివార | ||౮|| 
8. పిడికిళ్ళ నిండా బాబా ఉదీని నింపుకుని, భక్తుల దోసిళ్ళలో పోస్తున్నారు. తమ బొటన వేలితో, భక్తుల నుదుట ఉదీ వ్రాసేవారు. భక్తులంటే వారికి ఎంత ప్రేమయో! 
“జా భాఊ జా జేవావయాస | జా అణ్ణా జా తూ ఖా సుగ్రాస | 
జా అవఘే జా నిజస్థానాస” | ప్రత్యేకాస వదత తే | ||౯|| 
9. “తమ్ముడూ! భోజనానికి వెళ్ళు. అణ్ణా! నువ్వు కూడా వెళ్ళి కమ్మని భోజనాన్ని తిను. వెళ్ళండి, వెళ్ళండి, మీరందరూ ఇళ్ళకు వెళ్ళండి” అని ఒక్కొక్కరికీ చెబుతున్నారు. 
ఆతా జరీ తే పాహూ న మిళే | పరి తే సర్వే గత సోహళే | 
శిరడీస త్యా త్యా స్థానీ త్యా వేళే | దృఢ ధ్యానబళే దిసతాత | ||౧౦||
10. అదంతా గడిచి పోయిన వైభవం. శిరిడీలో ఆయా చోట్లలో, ఆయా సమయాలలో జరిగిన దానిని, ఇప్పుడు చూడలేము. అయినా, మనసును స్థిరపరచుకుని, ధ్యానిస్తే మన కళ్ళ ముందుకు మళ్ళీ వాటిని తెచ్చుకోవచ్చు. 

అసో ఏసే కరూన ధ్యాన | అంగుష్ఠాపాసూన ముఖావలోకన | 
ప్రేమే ఘాలూని లోటాంగణ | కథానుసంధాన చాలవూ | ||౧౧|| 
11. ఇలా, సాయి రూపాన్ని, పాదాలనుండి తలదాకా ధ్యానిస్తూ, భక్తిగా వారికి సాష్టాంగ నమస్కారం చేసి, కథను కొనసాగిస్తాను. 
గతాధ్యాయాచియా అంతీ | కథిలే హోతే శ్రోతయాంప్రతీ | 
కీ బాబాంహీ మోలకరిణీహాతీ | అర్థ శ్రుతీచా ఉకలవిలా | ||౧౨|| 
12. ఒక పనిపిల్ల ద్వారా, బాబా శ్రుతియొక్క అర్థాన్ని వివరించారు, అని పోయిన అధ్యాయం చివరిలో, శ్రోతలకు చెప్పాను కదూ! 
ఈశావాస్య భావార్థ బోధినీ | ఆరంభిలీ హోతీ గణుదాసాంనీ | 
ఆశంకా ఉపజతాంచ సద్గురుచరణీ | ఘాతలీ నేఊన శిర్డీస | ||౧౩|| 
13. ‘ఈశావాస్య భావార్థబోధిని’ అన్న గ్రంథాన్ని గణుదాసు వ్రాయడం మొదలు పెట్టాడు. అలా వ్రాస్తున్నప్పుడు, కొన్ని అనుమానాలు కలిగి, వాటిని తొలగించుకోవటానికి శిరిడీకి వచ్చి, సద్గురు పాదాల దగ్గరకు చేరాడు. 
బాబా తై వదలే జే వచన | తుఝ్యా యా శంకేచే నివారణ | 
కరీల కాకాచ్యా ఘరచీ మోలకరీణ | జాశీల పరతోన తే సమయీ | ||౧౪|| 
14. అప్పుడు బాబా, “నీవు తిరిగి వెళ్ళినప్పుడు, కాకా ఇంట్లోని పనిపిల్ల, నీ అనుమానాలను పోగొడుతుంది” అని చెప్పారు. 
తేంచ కీ సాంప్రత కథానుసంధాన | ఆతా యేథూన చాలవూ ఆపణ | 
శ్రోతీ హోఈజే దత్తావధాన | హోఈల శ్రవణ అవికళ | ||౧౫|| 
15. ఇప్పుడు ఆ మాటలతోనే కథను ముందుకు సాగిద్దాము. అక్కడినుండే మొదలు పెడదాం. శ్రోతలు శ్రద్ధగా ఉంటే, వారు చక్కగా వినవచ్చు. 
సంస్కృత భాషానభిజ్ఞార్థ1 | ఈశావాస్యోపనిషదర్థ2
ఓవీద్వారా పదపదార్థ | సంకలితార్థ వివరావా | ||౧౬|| 
16. సంస్కృత భాష తెలియని వారి కోసం, ప్రతి పదానికి అర్థంతో, ఈశావాస్యోపనిషత్తు గొప్పతనాన్ని మరాఠీ భాషలో, ఓవీ ఛందస్సులో, వివరించాలని, 
ఏసీ ఆస్థా ధరోని మనీ | ఈశావాస్య భావార్థబోధినీ | 
ప్రాకృత భాషా సుగమ సాధనీ | గణుదాసాంనీ ఆరంభిలీ | ||౧౭|| 
17. గణుదాసు ‘ఈశావాస్య భావార్థబోధిని’ని వాడుకలో ఉన్న భాషలో వ్రాయాలని, మొదలు పెట్టాడు. 
గూఢార్థ ప్రచుర హే ఉపనిషద | భాషాంతర ఝాలే పదప్రపద | 
వినా అంతర్గత రహస్య బోధ | హోఈ న ఆనంద మనాతే | ||౧౮|| 
18. కష్టమైన, రహస్యమైన అర్థాలతో ఉన్న ఈ ఉపనిషత్తులోని పదాలను, చక్కగా అనువదించాడు. కాని, ఆ పదాల వెనుక దాగి ఉన్న జ్ఞానం బయట పడక పోతే, మనసుకు తృప్తి లేదు. 
చహూ వేదాంచే జే సార | తేంచ ఉపనిషదాంచే భాండార | 
హరి గురుకృపా నసలియావర | అతిదుస్తర గాఠావయా | ||౧౯|| 
19. నాలుగు వేదాలలో దాగి ఉన్న సారమే ఉపనిషత్తులలోని నిధి. శ్రీహరి మరియు గురువు అనుగ్రహం లేకుండా, ఆ జ్ఞాన నిధి దొరకటం చాలా కష్టం. 
మ్హణేల కోణీ మీ సజ్ఞాన | ఆపుల్యా మతే కరోని యత్న | 
కరీన ఉపనిషదాంచే ఆకలన | ప్రతిపాదన యథార్థ | ||౨౦||
20. ‘నేను జ్ఞానిని, నా స్వంత ప్రయత్నంతోనే ఉపనిషత్తులను ఆకళింపు చేసుకుని, ఉన్నది ఉన్నట్లుగా సరిగ్గా వివరిస్తాను’, అని ఎవరైనా అనుకుంటే, 

తరీ తే కల్పాంతీహీ న ఘడే | హే తో గురుకృపా నసతా సాంకడే | 
గుప్తప్రమేయ హాతీ న చఢే | మార్గీ అవఘడే పదోపదీ | ||౨౧|| 
21. అది ఈ ప్రపంచం ముగిసే వరకు సాధ్యం కాదు. గురువు అనుగ్రహం లేకపోతే, అడుగడుగునా కష్టాలు ఎదురై, దాగి ఉన్న రహస్యాలు బోధ పడదు.
తేంచ జో గురుపదీ జడే | తయా నాహీ అణుమాత్ర సాంకడే | 
తయాచియా దృష్టీపుఢే | ఆపేఆప ఉఘడే గూఢార్థ | ||౨౨|| 
22. అదే, గురువు పాదాలకు శరణుజొచ్చిన వారికి కొంచెం కూడా శ్రమ ఉండదు. దాగివున్న రహస్యమైన అర్థాలన్నీ, అతని ముందు, వాటంతట అవే వెల్లడి అవుతాయి. 
ఆత్మజ్ఞానాచే హే శాస్త్ర | జన్మమరణోచ్ఛేదక శస్త్ర | 
జే నిరభిమాన నిఃసంగమాత్ర | తేచ సత్పాత్ర వివేచనా | ||౨౩|| 
23. చావు పుట్టుకల చక్రాన్ని నాశం చేసే ఆయుధం, ఈ ఆత్మజ్ఞానం గురించిన శాస్త్రం. ఏ మాత్రం అభిమానం లేక, సంసార బంధాలను తెంచుకున్న వారే దీని గురించి వివరించగలరు. 
ఏసియాంచీ కాస ధరితా | క్షణాంత ఉపజే అర్థబోధకతా | 
బుద్ధీచీ జాఈ ప్రతిబద్ధకతా | హోయ విశదతా గూడార్థీ | ||౨౪|| 
24. అలాంటి వారి దగ్గరకు వెళ్ళితే, అర్థాలు క్షణంలో అర్థమౌతాయి. బుద్ధికి అడ్డుగా ఉన్న అడ్డంకులన్నీ తొలగి పోయి, దాగివున్న రహస్యమైన అర్థాలు కూడా బోధ పడతాయి. 
ఈశావాస్య ప్రాకృతీ ఆణీతా | దాసగణూంచీ హేచ అవస్థా | 
పరి సాఈనాథే కృపా కరితా | తద్దుర్గమతా3 విరాలీ4 | ||౨౫|| 
25. ఈశావాస్యాన్ని వాడుకలో ఉన్న మరాఠీ భాషలో అనువదిస్తున్నప్పుడు, దాసగణుకు ఇదే పరిస్థితి ఎదురైంది. సాయినాథుని అనుగ్రహంతో ఆ కష్టాలన్నీ తొలగిపోయాయి. 
గీర్వాణ భాషేచే అల్పజ్ఞాన | తత్రాపి ఆచార్య విద్యారణ్య | 
వందూన సాఈబాబాంచే చరణ | ఓవీ లేఖన ఆదరిలే | ||౨౬|| 
26. సంస్కృత భాష గురించి అతనికి బాగా తెలియక పోయినా, ఆచార్య విద్యారణ్య స్వామి మరియు సాయినాథుని పాదాలకు నమస్కరించి, ఓవీలో రచనను మొదలు పెట్టాడు. 
గణుదాస వాణీ దుగ్ధధారా | ప్రసాద సాఈచా తయాంత శర్కరా | 
తేథీల మాధుర్య పరంపరా | క్షణైక ఆదరాజీ శ్రోతే | ||౨౭|| 
27. పాలధారవంటి గణుదాసు మాటలకు, సాయి అనుగ్రహమనే పంచదార తోడైంది. ఒక క్షణమైనా, శ్రోతలు అందులోని మాధుర్యాన్ని అనుభవించాలి. 
అసో హే బోధినీ దిగ్దర్శన5 | హృద్గతార్థా6 కరా మూలావలోకన7
యా మత్కథేచే అనుసంధాన | ఆహే కీ ఆన అవధారా | ||౨౮|| 
28. ఈశావాస్య భావార్థ బోధినిలోని, దాగివున్న రహస్యమైన అర్థాలను తెలుసుకోవాలంటే, మూల గ్రంథాన్ని చదవాలి. ఈ కథను ఇప్పుడు చెప్పటంలో ఉద్దేశం వేరే. ఈ కథను వినండి. 
నిజభక్త కరితా గ్రంథావలోకన | ఆఢళే జధీ8 దుర్బోధ వచన | 
మహారాజ కరితీ సమాధాన | బోలల్యావీణ కైసేపా | ||౨౯|| 
29. తమ భక్తులు గ్రంథాలను చదువుతున్నప్పుడు, అర్థం కాని సంగతులను, మాట్లాడకుండానే సాయి మహారాజు ఎలా బోధ పరచేవారో గమనించండి. 
హాచ యా కథేచా హేత | శ్రోతయా వ్హావా తాత్పర్యే విదిత | 
ఇతుకేంచి మాఝే మనోగత | దత్తచిత్త పరిసాజీ | ||౩౦||
30. ఈ కథలోని ముఖ్యమైన ఉద్దేశం ఇదే. దీనిని సారాంశంగా శ్రోతలకు తెలియ చేయాలన్నదే నా కోరిక. అందుకే, శ్రద్ధగా వినండి. 

ఓవీబద్ధ టీకా కేలీ | విద్వజ్జనాంస మాన్య ఝాలీ | 
గణుదాసాంచీ మనీషా ఫిటలీ | ఆశంకా రాహిలీ పై ఎక | ||౩౧|| 
31. గణుదాసు ఛందోబద్ధంగా ఓవీలలో టీకా వ్రాశాడు. నిపుణతగల పండితులు దానిని మెచ్చుకొని, అతనిని గౌరవించారు. అతని మనసులోని కోరిక నెరవేరింది. కాని, ఇంకా ఒక సందేహం మిగిలిపోయింది. 
మండిలీ తీ పండితాంసమోర | ఊహాపోహ కేలా థోర | 
పరి హోఈనా సమాధానపర | శంకా నిర్ధార కోణాహీ | ||౩౨|| 
32. తన సందేహాన్ని అతను పండితుల ముందుంచాడు. గొప్ప వాద, వివాదాలు, చర్చలు జరిగాయి. కాని, తృప్తికరంగా ఎవరూ ఆ సందేహాన్ని తీర్చలేకపోయారు. 
ఇతుక్యాంత శిరడీస కాంహీ కారణే | దాసగణూంచే ఘడలే జాణే | 
ఆశంకేచే నివారణ హోణే | సహజపణే ఝాలే కీ | ||౩౩|| 
33. ఇంతలో, ఏదో కారణంగా, దాసగణు శిరిడీకి వెళ్ళవలసి వచ్చింది. ఏ శ్రమా లేకుండా, సహజంగానే అతని సంశయం నివారించ బడింది. 
ఘేఊ గేలే సాఈంచే దర్శన | మస్తకీ ధరిలే శ్రీచే చరణ | 
కరూనియా సాష్టాంగ వందన | సుఖ సంపన్న జాహలే | ||౩౪|| 
34. సాయి దర్శనానికై మసీదుకు వెళ్ళాడు. శ్రీవారి పాదాలపై తలనుంచి, సాష్టాంగ నమస్కారం చేసి, తృప్తితో ఆనందించాడు. 
సంత కృపేచే అవలోకన | సంత ముఖీంచే మధురవచన | 
సంతాంచే తే సుహాస్య వదన | కృతకల్యాణ భక్తగణ | ||౩౫|| 
35. సత్పురుషులు దయతో చూసే ఒక చూపు, వారి నోటినుండి వచ్చే తియ్యని మాటలు, చిరునవ్వుతో ఉన్న వారి ముఖం, భక్తులకు ఎంతో మేలు చేసేవి. 
కేవళ సంతాంచే దర్శన | కరీ సకల దోషాంచే క్షాలన | 
జయాంసీ త్యాంచే నిత్య సన్నిధాన | కాయ తే పుణ్య వర్ణావే | ||౩౬|| 
36. సత్పురుషుల దర్శన మాత్రంతో, అన్ని దోషాలు తొలగిపోతాయి. అలాంటి వారితో ఎల్లప్పుడూ ఉండగలిగిన వారి పుణ్యాన్ని ఎంతని వర్ణించగలను? 
కా గణూ కోఠూన ఆగమన | పుసతీ బాబా వర్తమాన | 
కుశల ఆహే న సమాధాన | చిత్త ప్రసన్న సర్వదా | ||౩౭|| 
37. “ఏం గణూ! ఎక్కడనుండి రావడం? అంతా కుశలమేనా? మనసు ఎప్పుడూ తృప్తిగా సంతోషంగా ఉందా?” అని బాబా అడిగారు. 
గణుదాస దేతీ ప్రత్యుత్తర | అసతా ఆపులే కృపాఛత్ర | 
కిమర్థ వ్హావే మ్యా ఖిన్నాంతర | ఆనందనిర్భర అసే మీ | ||౩౮|| 
38. ‘మీ అనుగ్రహమనే గొడుగు క్రింద నేనుండగా, ఎందుకు దుఃఖించాలి? చాలా సంతోషంగా ఉన్నాను’ అని బదులిచ్చాడు. 
ఆపణహీ హే సర్వ జాణతా | లోకోపచారార్థ ప్రశ్న కరితా | 
మీహీ జాణూని ఆహే చిత్తా | కుశలవృత్తా కా పుసతా | ||౩౯|| 
39. ‘మీకన్నీ తెలుసు. అయినా, ఆచారం కనుక అడుగుతున్నారు. క్షేమ సమాచారాలను మీరు ఎందుకు అడుగుతున్నారు అన్నదీ నాకు తెలుసు. 
స్వయే మజకరవీ ఆరంభ కరవితా | పుఢే తో రంగారూపాస యేతా | 
మధ్యేంచ ఏసీ మేఖ మారితా | కోణాహీ ఉకలితా ఉకలేనా | ||౪౦||
40. ‘మీరే నాతో ఒక పనిని మొదలు పెట్టించి, అది రంగు రూపాలతో ఒక దశకు రాగానే, మధ్యలో మీరే ఒక సమస్యను తెచ్చి పెడతారు. దానిని ఎవరూ నివారించ లేరు. 

ఏసే పరస్పర చాలలే భాషణ | కరీత గణుదాస పాదసంవాహన | 
ఈశావాస్య భావార్థబోధన | సంబంధే ప్రశ్న పూసిలా | ||౪౧|| 
41. ఈ రకంగా వారిరువురూ మాట్లాడుకుంటూ, బాబా కాళ్ళను మెల్లగా నొక్కుతూ, ఈశావాస్య భావార్థ బోధిని గురించి, గణుదాసు అడిగాడు.
ఈసావాస్య భావార్థబోధినీ | లిహూ జాతా అడఖళే లేఖణీ | 
శంకా కుశంకా రాహతీ మనీ | బాబా త్యా ఉకలూని సాంగావ్యా | ||౪౨|| 
42. ‘బాబా! ఈశావాస్య భావార్థ బోధినిని వ్రాస్తుంటే, నా మనసులో ఏవేవో సందేహాలు కలిగి, కలం ఆగిపోయింది. వానిని విడమర్చి చెప్పండి. 
సాద్యంత ఘడలా జో జో ప్రకార | కేలా బాబాంచ్యా పాయీ సాదర | 
ఆశంకా హీ దుర్నివార | మాండిలీ సమోర బాబాంచ్యా | ||౪౩|| 
43. అని జరిగినదంతా బాబా పాదాల దగ్గర మొర పెట్టుకుని, తన సంశయాలు నివారించటం కష్టమని బాబాకు చెప్పాడు. 
గణుదాస వినవీ సాఈనాథా | మాఝే గ్రంథపరిశ్రమ వృథా | 
హీ యా ఈశావాస్యాచీ కథా | ఆపణ సర్వథా జాణతా | ||౪౪|| 
44. ‘సాయినాథా! నా గ్రంథ రచనంతా దండుగ అయింది అని మీకు బాగా తెలుసు. నా ఈశావాస్య గురించిన కథ ఇదే. 
ఆశంకా దూర ఝాల్యావినా | గ్రంథాచా యా ఉకల పడేనా | 
మహారాజ దేతీ ఆశీర్వచనా | ప్రసన్నమనా అసే తూ | ||౪౫|| 
45. ‘నా అనుమానాలు తీరక పోతే, గ్రంథంలో దాగివున్న రహస్యమైన అర్థాలు, సరిగ్గా అర్థం కావు’ అని విన్నవించుకోగా, సాయి మహారాజు అతనిని ఆశీర్వదించి “నీవు ప్రసన్నంగా ఉండు, 
“కాయరే యాంత ఆహే కఠిణ | జాతా ఆలియా స్థళీ పరతోన | 
త్యా కాకాచీ మోలకరీణ | శంకా నివారణ కరీల కీ” | ||౪౬|| 
46. “ఏముందిరా ఇందులో కష్టమైంది? నీవు ఎక్కడునుంచి వచ్చావో, అక్కడికి మరల వెళ్ళీనప్పుడు, నీ సందేహాన్ని కాకా పనిమనిషి తీరుస్తుందిగా” అని చెప్పారు. 
కాకా తే భాఊసాహేబ దీక్షిత | బాబాంచే ఎక ప్రేమళ భక్త | 
కాయావాచామనే సతత | గురుసేవానిరత సర్వదా | ||౪౭|| 
47. కాకా అంటే భావూసాహేబు దీక్షితు. బాబాకు ప్రేమగా ఉండే ఒక భక్తుడు. దేహం, మాట, మనసుతో ఎల్లప్పుడూ గురు సేవలో ఉండేవాడు. 
ప్రఖ్యాత ముంబాపురీ నగరీ | తేథూన అల్ప అంతరావరీ | 
పారలే నామ గ్రామాభీతరీ | రాహతీ హరిభాఊ హే | ||౪౮|| 
48. ఈ హరీభావూ బొంబాయి పట్టణానికి కొంత దూరంలో ఉన్న పార్లే అన్న గ్రామంలో ఉంటాడు. 
ఖరే నాంవ తయాంచే హరి | ఆఈబాపే ఠేవిలే ఘరీ | 
జన మ్హణతీ భాఊసాహేబ జరీ | బాబాంచే పరి తిసరేంచ | ||౪౯|| 
49. అతని అసలు పేరు హరి అని. అమ్మా నాన్న పెట్టిన పేరు. జనులు అతన్ని భావూసాహేబని పిలిచినా, బాబా దగ్గర అతనికి మరో పేరు. 
మహాజనీస9 బడే కాకా | నిమోణకరా10 మ్హాతారే కాకా | 
భాఊసాహేబాంస లంగడే కాకా | బంబ్యా కాకాహీ మ్హణతీ తే | ||౫౦||
50. కాకా మహాజనిని ‘బడే కాకా’ అని, నిమోంకరును ‘ముసలి కాకా’ అని, భావూసాహేబును ‘కుంటి కాకా’ అనో లేక ‘బంబ్యా కాకా’ అని కూడా బాబా పిలిచేవారు. 

ఆఈబాపే ఠేవితీ ఎక | రాశీచే తే అసతే ఆణిక | 
టోపణ నాంవేహీ మారితీ హాక | రీతీ హీ అనేకపరీచీ | ||౫౧|| 
51. అమ్మా నాన్న ఒక పేరు పెడతారు. జాతకంలో రాశిని బట్టి మరో పేరుంటుంది. ముద్దుగా ఇంకో పేరుతో పిలుస్తుంటారు. ఇలా ఎన్నో రకాల పద్ధతులు. 
మహారాజ ఠేవితా నామే నిరాళీ | తీచ మగ చాలతీ వేళోవేళీ | 
జాణో తీంచ మగ బిరుదావళీ | ప్రేమ సమేళీ ధరిజేతీ | ||౫౨|| 
52. మహారాజు విచిత్రమైన పేర్లను పెట్టేవారు. అలా పేర్లు పెట్టించుకున్న వారు, ఆ పేర్లతోనే ఎప్పుడూ చలామణి అయ్యేవారు. భక్తులు కూడా ఆ పేర్లను ఎంతో ప్రేమగా బిరుదులవలె అనుకునేవారు. 
కధీ భిక్షు కధీ కాకా | బాబాంనీ పాడిలా హాచి శిక్కా | 
త్యాచ నామే శిరడీంత లోకా | ప్రసిద్ధ కాకా జాహలే | ||౫౩|| 
53. ఒక సారి ‘భిక్షు’ అని, ఇంకో సారి ‘కాకా’ అని అంటూ బాబా వేసిన ముద్రతోనే దీక్షితు శిరిడీలో కాకా అని ప్రసిద్ధుడయ్యాడు. 
ఆశ్చర్య వాటలే గణూదాసా | ఆశ్చర్య సకళాంచే మానసా | 
కాయ కాకాంచీ మోలకరీణ ఏసా | ఉలగడా కైసా కరణార | ||౫౪|| 
54. గణుదాసుకు ఆశ్చర్యం కలిగింది. అందరి మనసులోనూ ఆశ్చర్యమే. ‘ఏమిటీ! కాకా పనిమనిషి ఈ చిక్కు ముడిని విడదీస్తుందా, ఎలా?’ 
మోలకరీణ తీ మోలకరీణ | కాయ తిచే అసావే శిక్షణ | 
తీ కాయ ఏసీ విచక్షణ | వాటే విలక్షణ హే సారే | ||౫౫|| 
55. ‘ఎంతైనా పనిమనిషి పనిమనిషే కదా! ఆమె చదువెంత? ఆమె తెలివి అంత గొప్పదా? ఏదో ఇదంతా చాలా చిత్రంగా ఉంది!’ 
కోఠే శ్రుతీంచీ అర్థవ్య్తుత్పత్తి | కోఠే మోలకరణీచీ మతి | 
మహారాజ హీ తో థట్టా కరితీ | జన వదతీ ఎణే పరీ | ||౫౬|| 
56. ‘శ్రుతలను విడమర్చి భావార్థం చేప్పగలిగే తెలివి ఎక్కడ? పనిపిల్ల జ్ఞానం ఎక్కడ! మహారాజు ఏదో ఎగతాళి చేస్తున్నారు’ అని జనులు అనుకున్నారు. 
మహారాజ కేవళ వినోద కరితీ | ఏసేంచ వాటలే సర్వా చిత్తీ | 
పరి బాబాంచ్యా వినోదోక్తి | సత్యచి గమతీ గణుదాసా | ||౫౭|| 
57. కేవలం వినోదం కోసమే బాబా అలా అన్నారని అందరికీ అనిపించింది. కాని, బాబా వినోదం కోసం అలా చెప్పినా, అది నిజమే అవుతుందని గణుదాసుకు అనిపించింది. 
పరిసూని త్యా సాఈచ్యా బోలా | సాఈ బోలలే అవలీలా | 
సకృద్దర్శనీ వాటలే జనాలా | దాసగణూలా తే సత్య | ||౫౮|| 
58. బాబా అన్న మాటలు విన్నవారికి, అవి ఏదో ఊరికే పైపైకి, వినోదానికోసం, అన్నవని అందరికీ అనిపించింది. కాని గణుదాసుకు అలా కాకుండా, అవి నిజమని తెలుసు. 
సాఈ బోలలే అవలీలా | పరి బోలామాజీల లీలా | 
సదాసర్వదా పహావయాలా | ఆతుర ఝాలా జనలోక | ||౫౯|| 
59. అవలీలగా సాయి ఆ మాటలను చెప్పినా, దాని వెనుక ఏ లీల ఉంటుందో చూడాలని భక్తులకు కుతూహలంగా, ఆతురంగా ఉంది. 
అసో వా నసో వినోద వాణీ | కదా న తీ హోణే నిష్కారణీ | 
బాబాంచ్యా ఎకేకా అక్షరగణీ | అసతీ ఖాణీ అర్థాచ్యా | ||౬౦|| 
60. ఆ మాటలను వినోదానికే అని ఉండవచ్చు, కాకనూ పోవచ్చు. కాని, అది ఏ కారణమూ లేకుండా ఎన్నటికీ ఉండదు. బాబా పలికే ఒక్కొక్క అక్షరంలోనూ అర్థం అనే నిధి దాగి ఉంటుంది. 

బాబా జే జే వాచే వదత | బోల నవ్హత తే బ్రహ్మలిఖిత | 
ఎకహీ అక్షర న హోఈ వ్యర్థ | సాధీల కార్యార్థ వేళేవర | ||౬౧|| 
61. తమ నోటితో బాబా ఏమి చెప్పినా, అవన్నీ ఒట్టి మాటలు కావు. అవి బ్రహ్మ రాసిన వ్రాతలు. ఒక్క అక్షరమైనా వృథా కాకుండా, ఆయా సమయానికి సరిగ్గా జరిగేవి.
హీ దృఢభావనా దాసగణూచీ | అసో కైసీహీ తీ ఇతరాంచీ | 
నిష్ఠా జేథే జైసీ జయాచీ | ఫళ తయాసీ తైసేంచ | ||౬౨|| 
62. అని దాసగణుకు బాగా గట్టి నమ్మకం. వారి వారి ఆలోచనలను బట్టి, నమ్మకాన్ని బట్టి, ఫలితం కలుగుతుంది. 
జైసీ భావనా తైసే ఫళ | జైసా విశ్వాస తైసే బళ | 
అంతఃకరణ జైసే ప్రేమళ | బోధహీ నిర్మళ తైసాచ | ||౬౩|| 
63. భావన ఎలా ఉంటే, ఫలితాలు అలా ఉంటుంది. నమ్మకం ఎంత ఉంటే, దాని బలం కూడా అంత ఉంటుంది. మనసు ఎంత ప్రేమగా ఉంటే, జ్ఞానం కూడా అంత నిర్మలంగా ఉంటుంది. 
జ్ఞానియాంచా శిరోమణీ | మిథ్యా నవ్హే తయాచీ వాణీ | 
నిజభక్తాచీ పురవావీ మాగణీ | బ్రీద హే చరణీ బాంధిలే | ||౬౪|| 
64. జ్ఞానులలో సాయి తలమానికం. వారి మాట ఎప్పుడూ నిజం కాక పోదు. తమ భక్తుల కోరికలను నెరవేరుస్తానని వారు ప్రతిజ్ఞ బూనారు. 
గురువచన నవ్హే అన్యథా | మన లావూన పరిసా హీ కథా | 
హరేల సకల భవవ్యథా | సాధనపంథా లాగాల | ||౬౫|| 
65. గురువు మాటలు ఎప్పుడూ జరగక పోవు. ఈ కథను బాగా మనసు పెట్టి వినండి. సంసారంలోని భయాలు, బాధలు అన్నీ తొలగిపోయి, సాధనా మార్గంలో చేరుకుంటారు. 
పరతలే గణుదాస పారలే గ్రామీ | కాకాసాహెబ దీక్షితా ధామీ | 
ఉత్కంఠా కాకాంచీ మోలకరీణ కామీ11 | పడతే కైసీ మీ పాహీన | ||౬౬|| 
66. పార్లేలోని కాకాసాహేబు దీక్షితు ఇంటికి గణుదాసు తిరిగి వెళ్ళాడు. కాకా పనిమనిషి తన పనిలో ఎలా సహాయం చేస్తుందో చూడాలని చాలా ఉత్సుకతతో ఉన్నాడు. 
దుసరే దివశీ ప్రథమ ప్రహరీ | గణూదాస అసతా శేజేవరీ | 
సాఖరఝోంపేచ్యా ఆనందాభీతరీ | తై నవలపరీ వర్తలీ | ||౬౭|| 
67. మరునాడు తెల్లవారే, గణుదాసు ఇంకా పడకమీద సుఖమైన నిద్రలో ఆనందంగా ఉన్నప్పుడు, ఒక అద్భుతం జరిగింది. 
కోణీ ఎక కుణబ్యాచీ పోరీ | గాత హోతీ మంజూళ స్వరీ | 
ఖోంచలీ తీ సుందర లకేరీ | జివ్హారీ గణుదాసాంచ్యా | ||౬౮|| 
68. ఎవరో ఒక కుణబి జాతి రైతు బిడ్డ, చాలా ఇంపైన గొంతుతో పాడుతూ ఉంది. ఆ స్వరాలలోని తియ్యదనం గణుదాసు హృదయంలోకి చొచ్చుకొని పోయింది. 
దీర్ఘ ఆలాపయుక్త తే గాన | జయాంత మంజూళ పదబంధన | 
పరిసోని తల్లీన ఝాలే మన | లక్ష దేఊన ఏకతీ | ||౬౯|| 
69. దీర్ఘమైన ఆలాపనతో పాడిన ఆ పాటలోని, చక్కటి పదాల కూర్పును విని, అతని మనసు తల్లీనమవటంతో, అతడు ఇంకా శ్రద్ధగా వినసాగాడు. 
ఖడబడూన జాగే ఝాలే | గీతార్థబోధనీ లక్ష వేధలే | 
సావచిత్తాచి ఏకత రాహిలే | ప్రసన్న ఝాలే అభ్యంతరీ | ||౭౦||
70. ఆ పాటలోని పదాల అర్థం తెలియగానే, ఉలిక్కిపడి లటుక్కున లేచి, ఇంకా శ్రద్ధగా వినసాగాడు. వింటున్నంత సేపూ అతనికి చాలా ఆనందమైంది. 

మ్హణతీ హీ ఆహే కోణాచీ పోర | గాతసే గంభీర ఆణి సుస్వర | 
ఈశావాస్యాచే తే కోడే థోర | ఉకలిలే పార కీ ఈనే | ||౭౧|| 
71. ‘చక్కటి గొంతుతో ఇంత మధురంగా పాడుతున్న ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఈశావాస్యంలోని చిక్కు సమస్యను విడదీసేది ఈ అమ్మాయేనా?’ 
అసో హీచ తీ మోలకరీణ | పాహూంతరీ ఆహే కోణ | 
జీచ్యా అసంస్కృత వాణీమధూన | శ్రుత్యర్థ ఖూణ పటవిలీ | ||౭౨|| 
72. ‘అయితే ఆ పనిమనిషి ఈ పిల్లేనా? ఏ సాధనా లేని పల్లె పిల్ల గొంతులోంచి, శ్రుతుల గొప్పతనాన్ని చెప్పే పిల్ల ఎవరో చూడాలని’ అనుకుని, 
బాహేర జాఊని జో పాహతీ | ఖరేంచ కుణబ్యాచీ పోర హోతీ | 
తీ కాకాచ్యా మోరీవరతీ | ఘాశీత హోతీ బాసనే12 | ||౭౩|| 
73. బయటకు రాగానే, నిజంగానే ఒక కుణబి జాతి బిడ్డ, కాకా ఇంట్లో మోరీ దగ్గర, అంట్ల గిన్నెలు తోముతూంది. 
శోధాంతీ కళలీ నవలపరీ | హోతా తేవ్హా దీక్షితాంచే ఘరీ | 
నామ్యా గడీ తయాంచే చాకరీ | బహీణ హీ పోరీ తయాచీ | ||౭౪|| 
74. ఆమె గురించి విచారించగా, దీక్షితు ఇంట్లో పనిచేసే ‘నామ్యా’ అనే నౌకరు చెల్లెలు అని తెలిసింది. 
హీచ తీ కాకాంచీ మోలకరీణ | గీతే యా ఝాలే శంకా నివారణ | 
రేడ్యాముఖే వేద గాయన | సంతీ కాయ న కేలే జీ | ||౭౫|| 
75. అయితే, కాకా ఇంట్లో పనిమనిషి ఈ పిల్లే! ఆమె పాట ద్వారా అతని సంశయం తొలగి పోయింది. ఎనుబోతు నోటినుండి వేదాన్ని చెప్పించగలిగిన (జ్ఞానేశ్వరుడు) ఈ సత్పురుషులు ఏం చేయలేరు? 
ఏసే తే పోరీచే గాయన | ఝాలే దాసగణూంచే సమాధాన | 
బాబాంచ్యా థట్టేచేహీ మహిమాన | ఆలే కీ కళూన సకళాంతే | ||౭౬|| 
76. ఆ పిల్లయొక్క గానంతో దాసగణు మనసుకు తృప్తి కలిగింది. వినోదానికి అన్నవి అనుకున్న బాబా మాటలలోని మహిమ అందరికీ తెలిసి వచ్చింది. 
కోణీ మ్హణతీ గణుదాస | బసలే హోతే దేవపూజేస | 
కాకాంచే యేథే దేవఘరాస | తదా యా గీతాస పరిసిలే | ||౭౭|| 
77. కాకా ఇంట్లోని పూజ గదిలో, గణుదాసు దేవుని పూజకు కూర్చుని ఉండగా, ఈ పాటను విన్నాడని కొందరు అంటారు. 
అసో తే జైసే అసేల తైసే | తాత్పర్యార్థ ఎకచి అసే | 
మహారాజ నిజభక్తా శికవితీ కైసే | అనేక మిసే అవలోకా | ||౭౮|| 
78. ఏది ఏమైనా కాని, దాని అర్థం ఒకటే. సాయి మహారాజు తమ భక్తులకు ఎన్నో నెపాలతో, ఎలాంటి శిక్షణను ఇచ్చేవారో గమనించండి. 
“ఠాఈంచ బైసోని మజలా పుసా | ఉగీచ కా రానోమాళ గింవసా | 
పురవితో మీ తుమచా ధింవసా | ఎవఢా భరంవసా రాఖావా | ||౭౯|| 
79. “మీరు ఎక్కడున్నా, ఉన్న చోటే కూర్చుని, నన్ను అడగండి. ఊరికే అడవులలోనో లేక ఎక్కడెక్కడో అనవసరంగా తిరగటం ఎందుకు? తెలుసుకోవాలన్న మీ కుతూహలాన్ని నేను తీర్చుతాను. ఆ మాత్రం నన్ను నమ్మండి. 
అసో మీ భరలో సర్వాంఠాయీ | మజవీణ రితా ఠావ నాహీ | 
కుఠేహీ కసాహీ ప్రకటే పాహీ | భావాపాయీ భక్తాంచ్యా” | ||౮౦||
80. “నేను అంతటా ఉన్నాను. నేను లేని ఖాలీ చోటు లేదు. భక్తుల భావాన్ని బట్టి, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే వారికి కనిపిస్తాను”. 

అసో తీ ఆఠా వరసాంచీ పోర | కాసేస ఎక ఫాటకే ఫటకూర | 
పరి నారింగీ సాడీచా బడివార | గాఈ తీ సుస్వర గీతాంత | ||౮౧|| 
81. ఎనిమిదేళ్ళ ఆ పనిపిల్ల, చిరిగి పోయిన గుడ్డ ముక్కను నడుముకు చుట్టుకుని ఉంది. అయినా నారింజ రంగు చీర అందాన్ని వర్ణిస్తూ, చక్కని గొంతుతో పాట పాడ సాగింది.
“కాయ త్యా సాడీచా భరజర | కాయ త్యా సాడీచా కాంఠ సుందర | 
కాయ మౌజేచా తిచా పదర” | యాంతచి తీ చూర గాతానా | ||౮౨|| 
82. ‘ఆ జరీ చీర ఎంత గొప్పగా ఉంది! ఆ చీర అంచు ఎంత అందంగా ఉంది! దాని కొంగు ఎంత అద్భుతంగా ఉంది!’ అని పాడుతూ ఆ చీరను వర్ణించడంలో లీనమైపోయింది. 
ఖాయాలా మిళేనా పోటభర | చింధీ న వేఢాయా బోటభర | 
పరి కోణాచ్యాహీ నారింగీ సాడీవర | హర్షనిర్భర తీ దిసలీ | ||౮౩|| 
83. కడుపు నిండా తినటానికి తిండి లేదు. ఒంటి నిండా కప్పుకోవటానికి చిరిగిన పాత గుడ్డ కూడా లేదు. అయినా, ఎవరిదో నారింజ రంగు చీరను వర్ణించడంలోనే ఆమె ఆనందంతో నిండిపోయింది. 
పాహూని తియేచీ దైన్య స్థితీ | ఆణి మనాచీ రంగేల వృత్తీ | 
కీంవ ఉపజలీ గణుదాసాంప్రతీ | కాయ నివేదితీ మోరేశ్వరా13 | ||౮౪|| 
84. అంత దైన్య స్థితిలోనూ ఆ పిల్ల మనసులోని ఆనందాన్ని చూచి, గణుదాసుకు జాలి కలిగి, మోరేశ్వరునితో (ప్రధాన్) ఏం చెప్పాడంటే, 
పహా హో హిచే అంగ ఉఘడే | ద్యా కీ తిలా ఎకాదే లుగడే | 
రుజూ హోఈల ఈశ్వరాకడే | పుణ్యహీ ఘడేల తుమ్హాంతే | ||౮౫|| 
85. ‘ఆ పిల్లను చూడు! ఒంటి నిండా బట్ట కూడా లేదు. ఆమెకు ఒక చీర ఇవ్వు. నీ సేవను ఈశ్వరుడు మెచ్చుకుంటాడు. నీకు పుణ్యం కూడా వస్తుంది’. 
ఆధీంచ మోరేశ్వర కృపామూర్తీ | వరీ దాసగణూంచీ వినంతీ | 
సుందర సాడీ ఖరేదీ కరితీ | ఆనందే అర్పితీ పోరీతే | ||౮౬|| 
86. అసలే మోరేశ్వరుడు దయగలవాడు. ఆ పైన దాసగణుయొక్క కోరిక. అందమైన చీరనొకటి కొని, సంతోషంగా ఆ పిల్లకు ఇచ్చాడు. 
నిత్య ఖాణారీ జీ కదన్న | తిలా లాధావే పంచపక్వాన్న | 
తేవీ తీ ములగీ సుప్రసన్న | జాహలీ పాహూన తీ సాడీ | ||౮౭|| 
87. రోజూ సద్దన్నం తినే వారికి, పంచభక్ష్యాలు దొరికినట్లుగా, ఆ చీరను చూచి, ఆ పిల్ల చాలా సంతోషించింది. 
దుసరే దివశీ తీ ల్యాలీ సాడీ | ఫేర14 ధరీ తీ ఖేళే ఫుగడీ | 
దిసలీ ఇతర పోరీవర కడీ | మోఠీ ఆవడీ సాడీచీ | ||౮౮|| 
88. మరునాడే ఆ చీరను కట్టుకుని వచ్చింది. గిరగిరా తిరుగుతూ, ఇతర పిల్లలతో ‘ఫుగడీ’లో గెంతుతూ, తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. మిగిలిన పిల్లల కంటే ఆమె చాలా గొప్పగా కనిపించింది. ఆ చీర అంటే ఆమెకు విపరీతమైన ప్రేమ. 
తీచ పుఢే దుసరే దివశీ | సాడీ ఠేవూని పడదణీసీ15
గుండాళీ పూర్వీల ఫటకురాసీ | పరి హిరముసీ దిసేనా | ||౮౯|| 
89. దానికి మరునాడు, ఆ కొత్త చీరను దాచుకుని, మునుపటి వలె చింకి గుడ్డను చుట్టుకుంది. అయినా ఆమె కుంగిపోయినట్టు కాని, బాధపడినట్లు కాని, కనిపించలేదు. 
నాహీ ల్యాలీ, కేలీ జోగవణ | తథాపి తిచే పూర్వీల దైన్య | 
గణుదాసా భాసే ఝాలే విచ్చిన్న | భావనేచ్యా భిన్నత్వే | ||౯౦||
90. కొత్త చీర కట్టుకోలేదు, అయినా ఆమె దైన్య స్థితి తొలగిపోయినట్లు గణుదాసుకు అనిపించింది. ఆమె మనసులోని ఆలోచనలు మారడంతో, మునుపున్న దైన్యం పోయినట్లు అతనికి అనిపించింది. 

నవీ సాడీ ఠేవిలీ సదనీ | జరీ ఆలీ ఫాటకే నేసూనీ | 
తరీ తీ దిసేనా ఖిన్న మనీ | నవ్హతీ కీ ఉణీవ సాడీచీ | ||౯౧|| 
91. కొత్త చీరను ఆ పిల్ల ఇంట్లో దాచుకుని, చింకి గుడ్డను కట్టుకుని వచ్చినా, కొత్త చీరను కట్టుకోలేదన్న బాధ కాని, లోటు కాని, ఆమె మనసులో లేదు. 
అసమర్థపణే ఫాటకే లేణే | సమర్థపణే హీ తైసేంచ కరణే | 
యా నాంవ దైన్య సంపన్నపణే మిరవణే | భావనే గుణే సుఖదుఃఖ | ||౯౨|| 
92. చేత కాకుండా పేదరికంలో పాత బట్టలు కట్టుకున్నా, బాగా ఉన్నప్పుడు కూడా అవే పాత బట్టలను కట్టుకోవటం అంటే, పేదరికానికి గౌరవాన్నిచ్చినట్లు. మనసులోని ఆలోచనల వలనే సుఖదుఃఖాలు అనేవి. 
హేంచ తే గణుదాసాంచే కోడే | ఎణే పరీ జేవ్హా ఉలగడే | 
ఈశావాస్యాచే కేణే16 సాంపడే | ఠాయీంచ పడే అర్థబోధ | ||౯౩|| 
93. ఈ విధంగా గణుదాసు సమస్య తీరడంతో, అతనికి ఈశావాస్యంయొక్క సారాంశం తెలిసి, దాని అర్థం వెంటనే బొధ పడింది. 
ఈశేంచ17 ఆచ్చాదిలా జేథే సారా | హా అవఘా బ్రహ్మాండాచా పసారా | 
తేథే తయావీణ ఉఘడా థారా18 | కోణ విచారా మానీయా | ||౯౪|| 
94. ఈశ్వరుడే ఈ బ్రహ్మాండాన్నంతా వ్యాపించి ఉన్నప్పుడు, అతను లేని ఖాళీ చోటు ఉన్నదని ఎవరు అనుకోగలరు? 
తేహీ19 పూర్ణ హేహీ పూర్ణ | పూర్ణాపాసావ ఉద్భవలే పూర్ణ | 
పూర్ణాంతూని కాఢితా పూర్ణ | రాహీల పూర్ణచి అవశేష | ||౯౫|| 
95. అదీ పూర్ణం, ఇదీ పూర్ణం. పూర్ణంనుండి పూర్ణం పుట్టింది. పూర్ణంనుంచి పూర్ణం తీసి వేస్తే, మిగిలేదీ పూర్ణమే. 
పోరీచే దైన్య ఈశ్వరీ అంశ | ఫటకూర సాడీ హేహీ తదంశ | 
దాతా దేయ దాన హేహీ అశేష | ఎకచి ఈశ భరలేలా | ||౯౬|| 
96. ఆ పసిపిల్ల పేదరికంలో ఈశ్వరుని అంశం ఉంది. చిరిగిన చీర కూడా ఈశ్వరుని అంశము. ఇచ్చేవాడు, ఇవ్వటం మరియు ఇవ్వబడేది, వీటన్నిటిలోనూ ఆ ఈశ్వరుడే నిండి ఉన్నాడు. 
“మీ మాఝే” హే పార దవడావే | నిరభిమానత్వే సదా వర్తావే | 
త్యాగపూర్వక భోగ భోగావే | అభిలాషావే నచ కాంహీ | ||౯౭|| 
97. ‘నేను, నాది’ అనే భావనలను పారద్రోలి, ఎప్పుడూ అభిమానం అనేది లేకుండా, దేనినీ కోరకుండా, దొరికిన దానిని, వైరాగ్యంతో కాని, త్యాగంతో కాని అనుభవించాలి. 
ఏసీ బాబాంచీ అమోఘ వాణీ | ప్రచీతీ మిళవిలీ అనేకాంనీ | 
అప్రాణాంత శిరడీ న సోడూని | జనీ విజనీ ప్రకటత | ||౯౮|| 
98. ఇలాంటి బాబాయొక్క శక్తియుతమైన మాటలను అనేకులు అనుభవంతో తెలుసుకున్నారు. శిరిడీనుంచి ఎక్కడికి పోకున్నా, దేహమున్నంత వరకు, బాబా జనులు ఉన్న చోటగాని, లేని చోట గాని, ఎక్కడైనా కనిపించేవారు. 
కోణాస మచ్చిందర గడావర | కోణాస కోఠేహీ అసో శహర | 
కోల్హాపూర సోలాపూర రామేశ్వర | ఇచ్ఛామాత్ర ప్రకటత | ||౯౯|| 
99. ఒకరికి మచ్చిందర కొండపైన, మరొకరికి కొల్హాపూరులోనో, సోలాపూరులోనో, రామేశ్వరంలోనో లేదా ఇంకేదైనా పట్టణంలోగాని, వారికి ఇష్టమైన రీతిగా కనిపించేవారు. 
కోణాస అపుల్యా బాహ్యవేషీ | కోణాస జాగృతీ వా స్వప్నవిశేషీ | 
దర్శన దేత అహర్నిశీ | పురవీత అసోశీ భక్తాంచీ | ||౧౦౦||
100. కొందరికి తాము ఉన్న రూపంలోనే, మరి కొందరికి కలలో, ఇంకొందరికి మేల్కొన్నప్పుడే దర్శనమిచ్చి, రాత్రింబవళ్ళూ భక్తుల కోరికలను తీర్చుతారు. 

ఏసే అనుభవ ఎక నా దోన | కితీ మ్హణోని కరావే వర్ణన | 
శిరడీంత జరీ వసతిస్థాన | అలక్ష్య ప్రస్థాన కోఠేహీ | ||౧౦౧|| 
101. ఇలాంటి అనుభవాలు ఒకటా, రెండా! ఎన్నని వర్ణించను? బాబా ఉండేది శిరిడీలోనే అయినా, ఎవరికీ తెలియకుండా, వారు ఎక్కడికైనా వెళ్ళగలరు.
పహా హీ పోర కోణాచీ కోణ | యఃకశ్చిత గరీబ మోలకరీణ | 
నారంగీ సాడీవర తిచే తే గాయన | నిఘాలే ముఖాంతూన సాహజిక | ||౧౦౨|| 
102. ‘ఈ సంగతి గమనించండి. ఈ పిల్ల ఎవరు? ఎవరి బిడ్డ? ఆమె పేదరికంలో ఉన్నా, ఆమె నోటినుండి నారింజ రంగు చీర గురించిన పాట సహజంగానే వచ్చింది. 
శంకా మ్హణూన బాబాంస పుసావీ | యా మోలకరిణీనే తీ నిరసావీ | 
తీహీ కాకాంచ్యా ఇథే అసావీ | రచనా హీ మాయావీ నాహీ కా | ||౧౦౩|| 
103. ‘సందేహం కలిగిందని, బాబాను అడగటం, ఆ సందేహాన్ని కాకా ఇంట్లోని పనిమనిషే తీర్చటం, ఇదంతా ఏదో మాయ చేసినట్టు అనిపించదూ! 
ఆధీ హీ తేథే మోలకరీణ | అసావీ హే కైసే బాబాంస జ్ఞాన | 
తీహీ భవిష్యకాళీ హే గాఊన | శ్రుత్యర్థ బోధన వ్హావే కసే | ||౧౦౪|| 
104. ‘అసలు, కాకా ఇంట్లో ఒక పనిమనిషి ఉందని, ఆమె భవిష్యత్తులో పాటపాడి, శ్రుతుల అర్థాన్ని బోధిస్తుందని, ముందుగానే బాబాకు ఎలా తెలుసు? 
పరి తే ఝాలే ఝాలే ఖాస | వాటలే ఆశ్చర్య గణు దాసాంస | 
 ఆశంకేచా ఝాలా నిరాస | ఈశావాస్య ఆకళలే | ||౧౦౫|| 
105. ‘కాని, జరగటమేమో అలానే జరిగింది’. గణుదాసుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎలాగైనా, అతని సందేహం తీరి, ఈశావాస్య గురించి బాగా అర్థమైంది. 
శ్రోతియా మనీ యేఈల శంకా | ఖటాటోప హా తరీ కా ఇతుకా | 
స్వయేంచ స్వముఖే బాబాంనీచ కా | ఫేడిలీ న ఆశంకా తేథేచ | ||౧౦౬|| 
106. ‘అసలు ఈ గొడవంతా ఎందుకు? తమ నోటితోనే, స్వయంగా బాబాయే ఆ సందేహాన్ని అక్కడే తీర్చేయవచ్చు కదా!’ అని శ్రోతలకు అనుమానం కలుగుతుంది. 
హే కాయ జాగీచ నసతే కరవలే | పరి తే నసతే మహిమాన కళలే | 
ఈశే త్యా పోరీసహీ ఆచ్చాదిలే | ప్రకట హే కేలే బాబాంనీ | ||౧౦౭|| 
107. నిజమే, అలా అక్కడే చేయవచ్చు, కాని, ఆ ఘటనలోని గొప్ప మహాత్యం ఎలా తెలిసేది? ఆ చిన్న పిల్లలో కూడా ఈశ్వరుడు నిండి ఉన్నాడు అన్న దానిని బాబా నిరూపించారు. 
ఆత్మయాథాత్మ్య నిరూపణ | హేంచ సర్వోపనిషదాంచే పర్యవసాన | 
హేంచ మోక్షధర్మ నిష్కర్షణ | గీతార్థ ప్రవచన తే హేంచ | ||౧౦౮|| 
108. ఆత్మయొక్క అసలైన జ్ఞానాన్ని తెలియ చేయటమే ఉపనిషత్తులన్నిటి గురి. మోక్షం పొందటానికి పాటించాల్సిన నియమాల వివరణ ఇదే. గీతయొక్క నిజమైన గొప్పతనం కూడా ఇదే. 
ప్రాణీ భిన్న ఆత్మా అభిన్న | ఆత్మా కతృత్వ భోక్తృత్వహీన | 
తో న అశుద్ధ పాపపుణ్యాధీన | కర్మాచరణ త్యా నాహీ | ||౧౦౯|| 
109. జీవులు వేరు వేరుగా ఉన్నా, ఆత్మ ఒక్కటే. ఆత్మ ఏ పనీ చేయదు (కతృత్వం); ఆ పని వలన వచ్చే ఫలితాలనూ అనుభవించదు (భోక్తృత్వం). ఆత్మ ఎప్పుడూ పవిత్రం. ఆత్మకు పాప పుణ్యాలు లేవు. ఆత్మ పనులను చేయాలని (కర్మాచరణ) లేదు. 
మీ జాతీనే ఉచ్చ బ్రాహ్మణ | ఇతర మజహూన నీచవర్ణ | 
వసే ఏసే జో భేదజ్ఞాన | కర్మాచరణ ఆవశ్యక | ||౧౧౦||
110. ‘నేను గొప్ప జాతి బ్రాహ్మణుడను. మిగతావారు నాకంటే నీచమైన కులంవారు’ అన్న భేద భావం ఉన్నంత వరకూ, పనులను చేస్తూ ఉండాలి. 

మీ అశరీర సర్వత్ర ఎక | మజహూన కోణీ నాహీ ఆణిక | 
మీచ కీ సకలాంచా వ్యాపక | స్వరూపోన్ముఖ హే జ్ఞాన | ||౧౧౧|| 
111. ‘ఏ ఆకారమూ లేక, అన్ని చోట్లలోనూ ఒకే రకంగా ఉండే ఆత్మను నేనే. నా తప్ప వేరే ఎవరూ లేరు. అన్నింటిలోనూ నేనే ఉన్నాను’ అని తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానం. 
పూర్ణబ్రహ్మస్వరూపచ్యుత | ఏసా హా జీవాత్మా పూర్వవత | 
కధీంతరీ స్వస్వరూపాప్రత | పావావా నిశ్చిత హే ధ్యేయ ||౧౧౨|| 
112. పూర్ణమైన బ్రహ్మనుండి విడిపోయింది జీవాత్మ. మరల ఏ విధంగానైనా మునుపటి లాగే ఆ పూర్ణ బ్రహ్మను చేరుకోవటమే గురి కావాలి. 
శ్రుతి స్మృతి ఆణి వేదాంత | యా సర్వాంచా హాచి సిద్ధాంత | 
హేంచి అంతిమ సాధ్య నిశ్చిత | చ్యుతాసీ అచ్యుతపద ప్రాప్తీ | ||౧౧౩|| 
113. శ్రుతి, స్మృతి మరియు వేదాంతం అన్నింటి తత్త్వం ఇదే. చివరకు సాధించవలసింది కూడా ఖచ్చితంగా ఇదే. విడిపోయిన జీవాత్మ పూర్ణ బ్రహ్మతో ఒక్కటి కావటమే. 
“సమః సర్వేషు భూతేషు” | జోంవరి అప్రాప్త హా స్థితి విశేషూ | 
తోంవరీ న భూతాత్మా హృషీకేశూ | జ్ఞాన ప్రకాశూ సమర్థ | ||౧౧౪|| 
114. అన్ని జీవులలోనూ ఒకే రకంగా ఈశ్వరుడు ఉన్నాడని తెలుసుకునే వరకు, అన్ని జీవాలలో ఉండే శ్రీకృష్ణ (హృషీకేశ), జ్ఞానమనే దీపాన్ని వెలిగించనంత వరకు, 
విహితకర్మే చిత్త శుద్ధ | హోతా హోఈల అభేద బోధ | 
శోక మోహాది సంసృతి విరుద్ధ | ప్రకటేల సిద్ధ జ్ఞాన తే | ||౧౧౫|| 
115. శాస్త్రాలు నియమించిన పనులను చేస్తూంటే, మనసు పరిశుద్ధమై, అంతా ఒకటే అన్న జ్ఞానం కలుగుతుంది. దుఃఖం, బాధలు, ఆకర్షణలు తొలగిపోయి, నిజమైన ఆత్మ తనను తాను కనిపించుకుంటుంది. 
అఖిల త్రైలోక్య సచరాచర | ఆచ్చాదీ జో ఈశ పరమేశ్వర | 
నిష్క్రియ నిష్కల జో పరాత్పర | తో అశరీర సదాత్మక | ||౧౧౬|| 
116. మూడు లోకాలలో ఉండే, కదిలే, కదలని అన్ని వస్తువులలో ఉన్న ఈశ్వరుడు – మార్పు లేనివాడు, నిర్మలుడు, ఏ పనీ చేయని వాడు, ఏ ఆకారము లేకుండా, ఎల్లప్పుడూ ఉండేదే ఆత్మ. 
నామరూపాత్మక హే విశ్వ | సబాహ్య ఆచ్చాదీ హా ఈశ | 
తో మీచ మీ భరలో అశేష | నిర్విశేష రూపత్వే | ||౧౧౭|| 
117. ‘నామ రూపాలతో ఉన్న ఈ జగత్తులో, లోపలా బయటా ఉన్నది ఆ ఈశ్వరుడే. ఏ ప్రత్యేకమైన గుణాలూ లేక అన్నింటిలో సమానంగా ఉన్న ఆ ఈశ్వరుడు నేనే’. 
అస్తు వస్తుతః జే నిరాకార | మాయాగుణే భాసే సాకార | 
కాముకాపాఠీ హా సంసార | తోచి అసార నిష్కామా | ||౧౧౮|| 
118. అసలు ఆత్మకు ఏ ఆకారమూ లేదు. కేవలం మాయా గుణం వలనే ఆకారంతో ఉన్నట్లు కనిపిస్తుంది. కోరికలు ఉన్న వారికే ఈ ప్రపంచంగాని, కోరికలు లేనివారికి అది చాలా సారం లేనిదిగా ఖాళీగా కనిపిస్తుంది. 
హే యత్కించిత భూతభౌతిక | జగత చేతనాచేతనాత్మక | 
ఈశ్వరాచి హా అద్వితీయ ఎక | నిర్ధార నిఃశంక కరావా | ||౧౧౯|| 
119. పంచ భూతాలతో, కదిలే, కదలని వస్తువులతో నిండి ఉన్న ఈ జగత్తులో, ఈశ్వరుడు ఒక్కడే గాని రెండవ వారెవరూ లేరని, ఏ సందేహమూ లేక, ఖచ్చితంగా తెలుసుకోవాలి. 
జగద్బుద్ధీచా హా వివేక | జరీ మనాసీ పటేనా దేఖ | 
తరి హే ధనహిరణ్యాదిక | యాంచా అభిలాఖ న కరావా | ||౧౨౦||
120. జగత్తు గురించిన ఈ సూక్ష్మ బుద్ధి, మనసుకు నచ్చకపోతే, కనీసం డబ్బు, బంగారం వీటి వెనుకబడటమైనా వదిలి వేయాలి. 

హేహీ జరీ న ఘడే తరీ | జాణావే ఆపణ కర్మాధికారీ | 
ఆమరణాంత శతసంవత్సరీ | కర్మచి కరీత రహావే | ||౧౨౧|| 
121. అది కూడా కాకపోతే, పనులు చేయటమే మన పని అని తెలుసుకుని, ఈ జీవితం ముగిసేంత వరకూ, పనులను చేస్తూనే ఉండాలి. అది వందేళ్ళయినా సరే!
తేంహీ స్వవర్ణాశ్రమోచిత | యథోక్తానుష్ఠానసహిత | 
అగ్నిహోత్రాది నిత్యవిహిత | చిత్త అకలంకిత హోఈతో | ||౧౨౨|| 
122. ఆ పనులైనా, తమ తమ జాతికి, వయస్సుకు సరిపోయే విధంగా, శాస్త్రాలలో చెప్పిన రీతిగా, అగ్నిహోత్రం మొదలైన రోజూ చేసే పనులను, శ్రద్ధగా చేస్తే, మనసు పరిశుద్ధమౌతుంది. 
హా ఎక చిత్తశుద్ధీచా మార్గ | దుజా సర్వసంగ పరిత్యాగ | 
హే న ఆక్రమితా జ్ఞానయోగ | కర్మభోగచి కేవళ | ||౧౨౩|| 
123. మనసు శుద్ధం కావటానికి ఇది ఒక దారి (కర్మయోగం). రెండవది, అందరినీ, అన్నింటినీ వదిలి పెట్టి, ఒంటరిగా ఉండటం (జ్ఞానయోగం). ఈ రెండింటిలో దేనినీ అనుసరించ లేకపోతే, కేవలం పనులను చేస్తూ, దైవం నిర్ణయించిన సుఖదుఃఖాలను అనుభవించటమే. 
హీ బ్రహ్మవిద్యా హే ఉపనిషద | సర్వా న దేతీ అధికారవిద20
వృత్తీ న జోంవర ఝాలీ అభేద | ఉపనిషద్బోధ శాబ్దిక | ||౧౨౪|| 
124. ఎవరికి ఏ అర్హత ఉన్నదో తెలుసుకోగలిగిన సద్గురువు, ఆత్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల జ్ఞానాన్ని అందరికీ ఇవ్వరు. మనసులో ‘అంతా ఒక్కటే’ అనే భావం కలగక పోతే, ఉపనిషత్తుల జ్ఞానం అర్థం కాకుండా, చిలక పాఠంలా, పదాలను తెలుసుకోవడమే. 
తరీ తోహీ వ్హావా లాగే | జిజ్ఞాసు ఆధీ తోచ మాగే | 
మ్హణోని బాబాంహీ పాఠవిలే మాగే | మోలకరీణ సాంగేల మ్హణోని | ||౧౨౫|| 
125. అయినా, అలాంటి పదాల జ్ఞానం కూడా అవసరం. ఎందుకంటే, తెలుసుకోవాలని ఆరాట పడేవారు, దానినే ముందుగా అడుగుతారు. అందుకే, పనిపిల్ల చెబుతుందని అతనిని బాబా పార్లేకు పంపారు. 
స్వయేంచ బాబా హా బోధ దేతే | తరీ హే పుఢీల కార్య న ఘడతే | 
’ఎకమేవాద్వితీయ’ నసతే | జ్ఞాన హే కళతే బాబాంచే | ||౧౨౬|| 
126. దీనిని బాబా తామే వివరించి చెప్పి ఉంటే, తరువాతి ఘటన జరిగేది కాదు. ‘అంతా ఒక్కటే, మిగతాది ఏదీ లేదు’ అని వారు చెప్పదలచుకున్న బోధ అతనికి అర్థమయ్యేది కాదు. 
మజవాంచూన ఆణీక కోణ | ఆహే తీ కాకాంచీ మోలకరీణ | 
మీచ తీ హీ దిధలీ ఖూణ | ఈశావాస్య జాణవిలే | ||౧౨౭|| 
127. “కాకాయొక్క పనిమనిషి నేను కాక ఇంకెవరు?” ఆమె రూపంలో “ఆమె నేనే” అన్న జ్ఞానాన్ని బోధించి, ఈశావాస్యం అన్న దానికి అర్థాన్ని వివరించారు. 
పరమేశ్వరానుగ్రహ లేశ | ఆచార్యానుగ్రహ విశేష | 
నసతా న ఆత్మజ్ఞానీ ప్రవేశ | సిద్ధోపదేశచి ఆవశ్యక | ||౧౨౮|| 
128. ఈశ్వరానుగ్రహం కొంచెం కూడా లేకపోయినా, గురువుల ప్రత్యేకమైన అనుగ్రహం లేకపోయినా, సిద్ధుల ఉపదేశం ఉంటేనే ఆత్మజ్ఞానం దొరికేది. 
ఆత్మప్రతిపాదక జే జే శాస్త్ర | శ్రవణీ ఆణావే తే తేంచ మాత్ర | 
ప్రతిపాద్య జేతే మీచ సర్వత్ర | మజవీణ అన్యత్ర కాంహీచ న | ||౧౨౯|| 
129. ‘అన్ని చోట్లా నేనే, నేను కాక మిగతాదేదీ లేదు’ అని తెలిపే, ఆత్మ గురించి వివరించే, శాస్త్రాలను మాత్రమే వినాలి. 
హోతా ఆత్మతత్వాచే వివరణ | తోచ మీ ఆత్మా నవ్హే ఆన | 
హే జయాసీ అభేదానుసంధాన | ఆత్మాహీ ప్రసన్న తయాసీచ | ||౧౩౦||
130. అలా ఆత్మ గురించి వివరంగా తెలిసిన తరువాత, ‘నేనే ఆత్మను, వేరే కాదు’ అని తెలుసుకున్న వారికే ఆత్మ ప్రసన్నమై కనిపిస్తుంది. 

అసో ఆత్మనిరూపణ హోతా | ఏసేంచ ఆత్మానుసంధాన రాఖితా | 
ఏసీచ నిశ్చల ధరితా ఆత్మతా | పరమాత్మా హాతా యేఈల | ||౧౩౧|| 
131. ఈ విధంగా, ఆత్మను తెలుసుకుంటే, ఇలా ఎప్పుడూ ఆత్మతో ఒక్కటైతే, అప్పుడే పరమాత్మ దొరికేది. 
పుఢీల అధ్యాయ కథానుసంధాన | వినాయక ఠాకూరాది21 కథా కథన | 
శ్రోతే కరోత సాదర శ్రవణ | పరమార్థ ప్రవణ హోతీల | ||౧౩౨|| 
132. తరువాతి అధ్యాయంలో, వినాయక ఠాకూరు మొదలగు వారి కథలను శ్రద్ధగా వింటే, శ్రోతలు పరమార్థం వైపు ఆకర్షితులవుతారు. 
త్యాహీ కథా ఏశాచ గోడ | ఏకతా పురేల శ్రోతియాంచే కోడ | 
మహాపురుష దర్శనాచీ హోడ | పురేల చాడ భక్తాంచీ | ||౧౩౩|| 
133. ఆ కథలు కూడా ఇలాగే మధురంగా ఉంటాయి. మహాపురుషుల దర్శనం చేసుకోవాలనే శ్రోతల కోరిక ఆ కథలను వినటంతో తీరుతుంది. 
జైసా ఉగవతా దినమణీ | అంధార జాయ నిరసోనీ | 
తేవీ యా కథా పీయూషపానీ22 | మాయా హరపోనీ జాతసే | ||౧౩౪|| 
134. సూర్యుడి రాకతో, చీకటి తొలగిపోయేలా, ఈ కథలలోని అమృతం తాగిన వెంటనే, మాయ హరించుకుని పోతుంది. 
అతర్క్య సాఈంచే విందాన | త్యావీణ కోణ కరీల కథన | 
మీ తో ఎక నిమిత్త కరూన | తేచి తే వదవూన ఘేతీల | ||౧౩౫||
135. ఆలోచనలకు అందనివి సాయి లీలలు. వాటిని వారు తప్ప ఎవరు సరిగ్గా చెప్పగలరు? నేను నిమిత్త మాత్రుణ్ణి అంతే. నాతో చెప్పించేది వారే. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | ఈశావాస్యభావార్థబోధనం నామ | 
| వింశోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. సంస్కృత భాషా న జాణణార్యాంకరితా. (౧౬ భాషానభిజ్ఞార్థ) 
2. ‘ఈశావాస్య’ నావాచ్యా ఉపనిషదాచా అర్థ. (౧౬ ఈశావాస్యోపనిషదర్థ) 
3. త్యాచా అవఘడపణా. (౨౫ తద్దుర్గమతా) 4. నాహీశీ ఝాలీ. (౨౫ విరాలీ) 
5. భావార్థబోధినీ. (౨౮ బోధినీ-దిగ్దర్శన) 
6. యా భావార్థబోధినీచే హృద్గత, మ్హణజే మర్మ జాణావయాస. (౨౮ హృద్గతార్థా) 
7. మూళ గ్రంథాచే అవలోకన. (౨౮ మూలావలోకన) 8. జేవ్హా. (౨౯ జధీ) 
9. కాకా మహాజనీ. (౫౦ మహాజనీస) 10. నానాసాహేబ నిమోణకర. (నిమోణకరా) 
11. ఉపనిషదాచా అర్థావబోధ కరణ్యాచ్యా కామీ. (౬౬ కామీ) 12. భాండీ. (౭౩ బాసనే) 
13. రా. మోరేశ్వర విశ్వనాథ ప్రధాన. (౮౪ మోరేశ్వరా) 14. గరగరా ఫిరణే. (౮౮ ఫేర) 
15. సాఠవణీచే సణంగాత. (౮౯ పడదణీసీ) 16. గడ్డా. (౯౩ కేణే) 
17. ఈశ్వరానేచ. (౯౪ ఈశేంచ) 18. స్థళ. (౯౪ థారా) 
19. ‘ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యత | 
           పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||’. (౯౫ తేంహీ) 
20. కోణాచా అధికార కాయ ఆహే హే జాణణారే. (౧౨౪ అధికారవిద) 
21. రా. వినాయక హరిశ్చంద్ర ఠాకూర, బీ. ఎ. ఇత్యాదికాంచ్యా. (౧౩౨ వినాయక ఠాకూరాది) 
22. కథామృత. (౧౩౪ కథాపీయుషపానీ)

Tuesday, March 19, 2013

||మదనుగ్రహ నామ ఎకోనవింశోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౯ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

సూక్ష్మాహూని సూక్ష్మ అత్యంత | మహతాహూనహీ అత్యంత మహత | 
ఏసే ఆబ్రహ్మస్తంబ పర్యంత | వస్తుజాత హా సాఈ | ||౧|| 
1. సాయి అణువు కంటే చాలా చిన్న, అతి పెద్దదాని కంటే అత్యంత పెద్ద. బ్రహ్మనుండి మొదలుగొని, అతి చిన్న పొద - అన్నింటిలోనూ సాయియే ఉన్నారు.
ఏసియా సద్వస్తూసీ పాహీ | రంగరూపాది ఆకార కాంహీ | 
దేఊని పహావే చర్మచక్షూహీ | ఇచ్చా హీ ఉదేలీ అంతరీ | ||౨|| 
2. ఆకారం లేని ఇలాంటి పరబ్రహ్మకు, రంగు రూపాలతో ఒక ఆకారాన్నిచ్చి, మన కళ్ళతో చూడాలని కోరిక కలిగింది. 
సూర్యాస కాడవాతీచీ ఆరతీ | భక్తిభావే సౌర1 కరితీ | 
కింవా గుళాచా కరూన గణపతీ | గూళ నివేదితీ గాణపత్య2 | ||౩|| 
3. సూర్యుణ్ణి పూజించే వారు, భక్తి భావంతో, వత్తులతో హారతినిస్తారు. వినాయకుణ్ణి పూజించే భక్తులు, బెల్లంతో గణేశుని బొమ్మను చేసి, నైవేద్యంగా బెల్లాన్ని సమర్పిస్తారు. 
అథవా మహార్ణవాచ్యా మధూని | ఓంజళీనే ఘేఊని పాణీ | 
అర్ఘ్యార్పణ తయాలాగూని | సకృద్దర్శనీ అనుచిత | ||౪|| 
4. ఇంకా కొందరు, తమ దోసిలితో సముద్రంలోని నీటిని తీసుకుని, సముద్రానికే అర్ఘ్యమిస్తారు. ఇవన్నీ చూస్తే, సరియైనదని అనిపించదు. 
సూర్యార్ణవ3 మహాప్రభావ | పరి తే పాహతీ భక్తభావ | 
ఉచితానుచితా కైంచా ఠావ | భక్త గౌరవ త్యా కాజ | ||౫|| 
5. సూర్యుడు, సముద్రుడు ఎంతో శక్తివంతులైనా, వారు భక్తుల భక్తిని ఉదార స్వభావంతో చూస్తారు. భక్తుల గౌరవాన్ని నిలబెట్టటం ఒకటే వారి ఉద్దేశం అయినప్పుడు, సూర్యుడు కాని, సముద్రుడు కాని, ఏది సరియైనది, ఏది కాదు అని చూడరు. 
‘సమానశీల వ్యసనేషు సఖ్యమ్’ | ఆహే జరీ హా సామాన్య నియమ | 
తత్రాపి హా దేహాత్మసంగమ | అపవాద పరమ అనివార్య | ||౬|| 
6. ఒకే స్వభావం గలవారు కలిసి, స్నేహితులవడం సామాన్య నియమమైనా, దీనికి విరుద్ధంగా, ఆత్మ మరియు దేహంయొక్క కలయిక ఒక గొప్ప, తప్పని సరియైన ఘటన. 
స్వభావే హే పరస్పర భిన్న | పరి దోఘాంచా స్నేహ విలక్షణ | 
ఎకా న గమే దుజియావీణ | వేగళే న క్షణ రాహతీ | ||౭|| 
7. ఇవి రెండూ ఒకటికొకటి చాలా విరుద్ధమైన స్వభావం కలవి. అయినా రెంటికీ ఊహించని స్నేహం. ఒకటి లేక ఇంకొకటి విడిగా ఒక క్షణమైనా ఉండలేవు. 
తరీ హా దేహ ఆహే నశ్వర | ఆత్మా నిర్వికార అక్షర | 
దోఘాంచే ప్రేమ అపరంపార | తేణేంచ సంసారపరిభ్రమ | ||౮|| 
8. దేహం నశిస్తుంది, ఆత్మ నశించదు. అయినా రెంటికీ విపరీతమైన ప్రేమ. అందుకే, ఈ సంసార చక్రం తిరుగుతూ ఉంది. 
ఆత్మా తేచ శక్తీ మహత్ | తియేహూన సూక్ష్మ అవ్యాకృత4
తేంచ ఆకాశ ప్రకృతి అవ్యక్త | మాయాహీ వదత తియేసచి | ||౯|| 
9. ఆత్మ అణువు కంటే చిన్నది, మహా శక్తి కలది. కాని దీనికంటే చిన్నది, కనిపించనిది అయిన ఆకాశం. దీనినే ప్రకృతి అని అంటారు. మాయ అని కూడా అంటారు. 
యా సర్వాహూన పురుష సూక్ష్మ | శుద్ధ బ్రహ్మ తేహేంచ | 
తేథేంచ ఇంద్రియాదికాంసీ ఉపరమ | తీచ అంతిమ గతి పరమ | ||౧౦||
10. వీటి అన్నింటి కంటే పురుషుడు చిన్న. ఇంద్రియాలన్నీ అక్కడే విశ్రాంతి పొందుతాయి. అందరూ చేరుకోవలసిన గమ్యం అదే. శుద్ధ బ్రహ్మ కూడా అదే! 

ఏసా ఆత్మా హా సంసారీ | భాసే మాయా కర్మానుసారీ | 
అసూని స్వయే నిర్వికారీ | స్ఫటికాపరీ నిర్లేప | ||౧౧|| 
11. శుద్ధంగా, మార్పులేనిదిగా, స్పటికంలా ఉండే ఇలాంటి ఆత్మ, మాయ ప్రభావం వలన, మరియు మనము చేసే పనుల వలన, ఈ సంసారానికి కట్టబడినట్లు కనిపిస్తుంది. 
స్ఫటిక లాల కాళా పివళా | జైసా రంగ తైసీ కళా | 
పరి తో సర్వా రంగా నిరాళా | వికారా వేగళా నిర్మళ | ||౧౨|| 
12. ఎరుపు, నలుపు, పసుపు రంగులను స్పటికం ప్రతిబింబించినా, అది మాత్రం, అన్ని రంగుల కంటే వేరుగా ఉంటుంది. మార్పులేనిదిగా, శుద్ధంగా ఉంటుంది. 
మాళావరీల జైసే మృగజళ | శుక్తికాధిష్ఠిత5 రౌప్య ఝళాళ | 
పాహతా దోరీచే వేంటాళ6 | నసతా వ్యాళ7 ఆభాసే | ||౧౩|| 
13. దూరంలోని ఎండమావులలో నీరు, ముత్యపు చిప్పులో వెండి, చుట్టుకొని ఉన్న త్రాడులో పాము, కనిపిస్తాయి. 
దోరీవరీ సర్పారోపణ8 | వస్తుగత్యా9 అప్రమాణ | 
తైసేంచ ‘మీ దేహ’ హా అభిమాన | మిథ్యా బంధన ముక్తాసీ | ||౧౪|| 
14. త్రాడును పాము అనుకోవటం నిజం కాని ఆరోపణ. అలాగే, ఏ బంధనం లేని ఆత్మకు ‘నేను ఈ శరీరాన్ని’ అని అభిమానం కల్పించటం కూడా, నిజం కాని ఆరోపణ. 
దేహేంద్రియ మనఃప్రాణ | ఆత్మా యాంహూనహీ విలక్షణ | 
స్వయంజ్యోతి శుద్ధ చైతన్య | వికారవిహీన నిరాకృతీ | ||౧౫|| 
15. దేహం, ఇంద్రియాలు, మనసు, ప్రాణం వీటన్నిటికంటే ఆత్మ వేరైనది. ఆత్మ స్వయంగా వెలిగే జ్యోతి. అది శుద్ధ చైతన్యం. దానికి ఏ ఆకారం కాని, మార్పులు కాని లేవు. 
దేహ బుద్ధీ మన ప్రాణ | యా సర్వాంచా జవ అభిమాన | 
తంవ తే కతృత్వ భోక్తృత్వ ప్రమాణ | సుఖదుఃఖభాన అనివార్య | ||౧౬|| 
16. దేహం, బుద్ధి, మనసు, ప్రాణం వీనిపై అభిమానం ఉన్నంత వరకు, చేయవలసిన పనులు ఉంటాయి. వాటి ఫలితంగా కలిగే సుఖాలు దుఃఖాల అనుభవం తప్పదు. 
వటకణికా10 సూక్ష్మ కితీ | గర్భీ సాంఠవీ వటవృక్షశక్తీ | 
అగణిత కణికా వృక్షాంపోటీ | వృక్షకోటీ11 తయాంత | ||౧౭|| 
17. మర్రి విత్తనం ఎంత చిన్నది! దాని కడుపులో మర్రి చెట్టుయొక్క శక్తి ఇమిడి ఉంది. ఒక్కొక్క చెట్టులోనూ లెక్కలేనన్ని విత్తనాలు, ఆ విత్తనాలలో కోట్లాది మర్రి చెట్లు ఉంటాయి. 
ఏసే కణికేగణీత12 వృక్ష | ఆప్రలయాంత13 దేతీలసాక్ష | 
ఏసేంచ విశ్వ ప్రత్యక్ష | అవలోకా లక్ష దేఉని | ||౧౮|| 
18. అలా, ప్రతి మర్రి విత్తనంలో ఒక్కో చెట్టు ఉంటుంది. ఈ అద్భుతం ప్రపంచం ఉన్నంత వరకూ ఉంటుంది. ఈ విశ్వం కూడా ఇలాగే కనిపిస్తుంది. శ్రద్ధగా చూడండి. 
శాశ్వతతా నిర్భయతా ముక్తతా | స్వతంత్రతా పరమాత్మప్రాప్తతా | 
హీచ జీవాచీ సాఫల్యతా | ఇతికర్తవ్యతా జన్మాచీ | ||౧౯|| 
19. నిర్భయం, ఎల్లప్పుడూ మార్పు లేకుండా ఒకే రకంగా ఉండగలగటం, ముక్తిని, స్వాతంత్ర్యాన్ని, పరమాత్మను పొందటంలోనే మన జీవితం పండుతుంది. మనిషి జన్మయొక్క లక్ష్యం ఇదే. 
మోక్ష నాహీ జ్ఞానావినా | వినా విరక్తి న పవే జ్ఞానా | 
సంసార జో వాటేనా అనిత్య మనా | స్ఫురేనా కల్పనా విరక్తీచీ | ||౨౦||
20. జ్ఞానం లేకుండా, ముక్తి లేదు. విరక్తి లేకుండా, జ్ఞానం లేదు. ఈ సంసారం ఎప్పటికీ ఉండేది కాదని మనసుకు తెలిసే వరకూ, విరక్తి కలుగదు. 

త్యా అనిత్యత్వాచ్యా వాటే | విశ్వాభాసే దృష్టీ ఫాటే | 
తేణే పాంథస్థ మధ్యే చాకాటే | జావే కోఠే ఆకళేనా | ||౨౧|| 
21. ఈ ప్రపంచం ఎప్పటికీ ఉండేది కాదని తెలుసుకునే లోపల, అందులోని మాయ, దాని బులుపు, కంటికి కనిపిస్తుంది. దాని వలన, బాటసారికి పరమార్థం వైపు వెళ్ళాలో, మాయ వైపు వెళ్ళాలో తెలియక మధ్యలో తడబడతాడు.
ఏసా హా విశ్వాభాస | చిన్మాత్రీ మిథ్యా మాయావిలాస | 
ప్రపంచ జాత స్వప్నవిన్యాస14 | తదర్థ ప్రయాస కా వ్యర్థ | ||౨౨|| 
22. ఈ విశ్వంయొక్క మాయ ఇలాంటిది. శుద్ధ జ్ఞానానికి రూపమైన పరమాత్మయొక్క ఇంకొక రూపమే మాయ. సంసారంలోనుండి పుట్టిన, ఒక కలలోని దృశ్యంలా ఉంటుంది. కల చెదరి పోతే, దృశ్యం కూడా మిగలదు. ఇలాంటి దాని కొరకు వ్యర్థమైన కష్టాలు ఎందుకు? 
స్వప్నాంతూన జాగృతీత | యేతాంచ స్వప్న హోయ అస్తంగత | 
మ్హణూని జో నిజస్వరూపీ స్థిత | తయా ప్రపంచార్థ స్మరేనా | ||౨౩|| 
23. కలనుండి మేలుకున్న వెంటనే, కల కనపడకుండా మాయమౌతుంది. అందుకే, ఆత్మ రూపంలో స్థిరపడినవారు, సంసారంలోని ఇంద్రియ సుఖాలను కోరుకోరు. 
వినా ఆత్మైక్యత్వ విజ్ఞాన | వినా ఆత్మయాథాత్మ్య ప్రకాశన | 
తుటావయా శోకమోహాది బంధన | జాగృతీ ఆన15 అసేనా | ||౨౪|| 
24. ఈ సృష్టిలో ఉన్న జీవులన్నిటిలోను ఉన్న ఆత్మ ఒక్కటే అని, స్వయంగా అనుభవించి పొందిన జ్ఞానం కాని, ఆత్మ స్వభావం గురించి పూర్తి అవగాహన కాని, లేక పోతే, బాధలు, మోహాలను విడిపించుకోవటానికి వేరే ఏ దారి లేదు. 
జరీ సర్వాహూన శ్రేష్ఠ జ్ఞాన | బాబా ఉపదేశీత రాత్రందిన | 
తరీహీ భక్తిమార్గాచే అవలంబన | సర్వసాధారణ నివేదీత | ||౨౫|| 
25. అన్ని సాధనలలోనూ జ్ఞానమే శ్రేష్ఠమైనా, బాబా రాత్రింబవళ్ళూ, సాధారణంగా, భక్తి మార్గాన్నే ఎన్నుకోవాలని ఉపదేశించే వారు. 
వదత జ్ఞానమార్గాచే మహిమాన | మార్గ తో రామఫళాసమాన | 
భక్తిమార్గ సీతాఫళ సేవన | స్వల్ప సాధన రసమధుర | ||౨౬|| 
26. జ్ఞాన మార్గం మహిమను తెలుపుతూ, అది రామ ఫలంతో సమానమని, తక్కువ శ్రమతో, సులభంగా దొరికే, మధుర రసంతో నిండి ఉన్న సీతాఫలం లాంటిదని బాబా చెప్పేవారు. 
భక్తి హీ సోజ్వళ సీతాఫళ | జ్ఞాన హే పరిపక్వ రామఫళ | 
ఎకాహూన ఎక రసాళ | మధుర పరిమళ తైసాచ | ||౨౭|| 
27. శుభ్రంగా ఉన్న సీతాఫలం లాంటిది భక్తి. పరిపక్వమైన రామఫలం లాంటిది జ్ఞానం. ఒకటికంటే ఇంకొకటి, సువాసనలతో, తియ్యగా ఉంటాయి. 
రామఫళ గర్భీచా గీర16 | ఫళ కాఢూన పికవితా ఉగీర17
వృక్షీంచ పికే తో ధరీ జో ధీర | తయాసీచ మధుర లాగే తో | ||౨౮|| 
28. రామఫలం కాయగానే, కోసి, దానిని కృత్రిమంగా పండు చేస్తే, దానిలోని గుజ్జు వగరుగా ఉంటుంది. చెట్టుపైనే పండే వరకు ఓపికగా ఉంటేనే, దాని తియ్యదనాన్ని అనుభవించ వచ్చు. 
రామఫళాచీ గోడీ సరస | దేఠేసీ పరిపక్వ హోఈ జో తరూస | 
ఉగీర లాగే పడతా భుఈస | అతి మిఠాస వర పికతా | ||౨౯|| 
29. చెట్టుపైనే రామఫలాన్ని దాని కాడ దాక పండనిస్తే, అది తియ్యని రసంతో ఉంటుంది. నేల పైన పండు చేస్తే, వగరుగా ఉంటుంది. 
వరచేవర జో పికవూ జాణే | తేణేంచ త్యాచా ఆస్వాద ఘేణే | 
సీతాఫళ హే సాయాస నేణే | అల్ప గుణే బహు మోల | ||౩౦||
30. చెట్టు పైన దానిని పండించటం తెలిసిన వారే, దాని తియ్యదనాన్ని ఆనందించగలరు. సీతాఫలానికి ఈ కష్టం అవసరం లేదు. గుణం తక్కువైనా, విలువ ఎక్కువే. 

రామఫళాసీ పతనభయ | జ్ఞానియాహీ18 నాహీ నిర్భయ | 
ఝాలా పాహిజే సిద్ధివిజయ19 | లవ హయగయ కామా నయే | ||౩౧|| 
31. రామఫలం క్రింద పడుతుందేమో అనే భయం ఎప్పుడూ ఉంటుంది. అలాగే జ్ఞానులు కూడా క్రింద పడే భయం ఎప్పుడూ ఉంటుంది. క్రింద పడకుండా ఉండటానికి, వారికి అష్టసిద్ధుల మీద పూర్తిగా పట్టు ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత పనికి రాదు. 
మ్హణూన సాఈ దయాఘన | బహుధా నిజ శిష్యాంలాగూన | 
భక్తీ ఆణి నామస్మరణ | యాచేంచ వివరణ కరీత | ||౩౨|| 
32. అందుకే, సాయి దయామయులు, చాలా వరకు తమ భక్తులకు, భక్తి మార్గం మరియు నామ స్మరణ గురించే వివరించేవారు. 
జ్ఞానాహూనహీ శ్రేష్ఠ ధ్యాన | అర్జునాలాగీ కథీ భగవాన | 
తుటావయా భక్తభవబంధన | సాఈహీ సాధన హే వదే | ||౩౩|| 
33. జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్ఠమైనదని, శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు. అలాగే, సంసార బంధాలను తెంచుకోవటానికి ఇదే సాధన, అని సాయి కూడా భక్తులకు చెప్పారు. 
అసో యే విషయీంచీ కథా | పూర్వాధ్యాయీ వర్ణితా వర్ణితా | 
అపూర్ణ రాహిలీ తీ మీ ఆతా | కథితో శ్రోతా పరిసిజే | ||౩౪|| 
34. ఈ సంగతిని ఇలానే ఉంచి, పోయిన అధ్యాయంలో వర్ణిసూ, వర్ణిస్తూ, పూర్తి చేయకుండా వదిలిన దానిని ఇప్పుడు నేను చెప్పుతాను. శ్రోతలారా! శ్రద్ధగా వినండి. 
వయోవృద్ధ శక్తిక్షీణ | మ్హాతారీ ఎక మాండీ నిర్వాణ | 
మంత్ర మాగావయా సాఈపాసూన | ప్రాయోపవేశన20 ఆరంభీ | ||౩౫|| 
35. దేహంలోని శక్తి అంతా ఉడిగి పోయిన ముసలామె, సాయి దగ్గర మంత్రోపదేశాన్ని పొందాలని, ఉపవాస వ్రత దీక్షను చేపట్టి, మొండి పట్టుతో చావటానికి కూడా సిద్ధమైంది. 
పాహోనియా తియేచీ స్థితీ | మాధవరావాంస పడలీ భీతీ | 
కరూ గేలే బాబాంశీ మధ్యస్థీ | కథానుసంగతీ పూర్వీల | ||౩౬|| 
36. ఆమె పరిస్థితిని చూసి, ఏమౌతుందో అని భయపడి, మాధవరావు, బాబా దగ్గరకు వెళ్ళి, మధ్యవర్తిగా మాట్లాడాడు. ఇది ఇంతవరకూ జరిగిన కథ. 
సాఈసంకల్ప విద్యోతీ21 | ఉజళలీ హీ చరిత్రజ్యోతీ22
మార్గదర్శక హోవో తద్దీప్తి23 | మార్గ భావార్థీ ఉమగోత | ||౩౭|| 
37. సాయి ఆలోచనలను భక్తులకు తెలుపటానికోసం, ఈ చరిత్ర అనే జ్యోతిని వెలిగించడమైంది. ఈ జ్యోతి వెలుగు భక్తులకు దారి చూపి, వారికి యోగ్యమైన దారి లభించుగాక. 
బాబాంచియా ఆజ్ఞేనుసార | మాధవరావాంనీ మజబరోబర | 
ఆరంభిలీ జీ కథా సుందర | తీచ పుఢారా చాలవూ | ||౩౮|| 
38. బాబా ఆజ్ఞాపించిన విధంగా, మాధవరావు నాకు చెప్పాలని మొదలు పెట్టిన సుందరమైన కథలోని తరువాతి భాగాన్ని ఇప్పుడు మనవి చేస్తాను. 
మ్హణతీ పాహూని మ్హాతారీచా నిగ్రహ | బాబాంనీ తీస దిధలా అనుగ్రహ | 
ఫిరవిలా తియేచే మనాచా గ్రహ | కథా సంగ్రహ అభినవ | ||౩౯|| 
39. ‘ముసలామె పట్టుదలను చూసి, బాబా ఆమె మనసు మార్చి, ఆమెను అనుగ్రహించిన అద్భుతమైన కథ’ అని మాధవరావు అన్నాడు. 
పుఢే బాబాంనీ ప్రేమళపణే | హాంక మారిలీ తిజకారణే | 
“ఆఈ తూ కాంగే ఘేతలే ధరణే | కా తుజ మరణే ఆఠవలే” | ||౪౦||
40. ప్రేమతో ఆమెను పిలిపించి, బాబా “అమ్మా! నువ్వెందుకిలా పట్టుదలతో దీక్షలో ఉన్నావు? చావాలని ఎందుకు అనుకుంటున్నావు? 

కోణీహీ అసో ప్రౌఢ బాఈ | తిజలా హాంక మారీత ’ఆఈ’ | 
పురుషాంస ‘కాకా’, ‘బాపూ’, ‘భాఈ’ | గోడ నవలాఈ హాంకేచీ | ||౪౧|| 
41. ఆడవారిని “అమ్మా” అని, మగవాళ్ళను “కాకా”, “బాపూ”, “భావూ” అని బాబా మధురంగా పిలిచేవారు.
అంతరంగ జైసే ప్రేమళ | బోలహీ తైసేచ మంజూళ | 
రంజల్యా గాంజల్యాంచే కనవాళ | దీనదయాళ శ్రీసాఈ | ||౪౨|| 
42. వారి మనసు ఎంత ప్రేమమయమో, వారి పలుకులు కూడా అంతే మంజులంగా ఉండేవి. దీనుల మీద దయ కలిగిన సాయి, దీనులను, దుర్బలులను ఎంతో కరుణతో చూసేవారు. 
అసో తిజలా హాంక మారిలీ | ఆపులే సన్ముఖ బైసవిలీ | 
నిజ గురుత్వాచీ గుప్త కిల్లీ | ప్రేమే దిధలీ తిజహాతే24 | ||౪౩|| 
43. ఆమెను పిలిచి, తమ ఎదుట కూర్చుండ బెట్టుకుని, తమ గురుత్వం గురించిన, రహస్యాన్ని ఆమెకు ప్రేమగా చెప్పారు. 
కరాయా భవసంతాపశమన | భక్తచకోర తృషాపనయన | 
వర్షలే జే బాబా చిత్ఘన | స్వానంద జీవన తే సేవా | ||౪౪|| 
44. సంసారంలోని దుఃఖాలను తొలగించటానికి, చకోర పక్షులవలె ఎదురు చూస్తున్న తమ భక్తుల దప్పికను తీర్చటానికి, బాబా కురిపించిన జ్ఞాన వర్షాన్ని ఇప్పుడు త్రాగి ఆనందించండి. 
మ్హణతీ “ఆఈ, ఖరేంచ సాంగే | హాల జీవాచే కరిసీ కాం గే | 
ఫకీర మీ కేవళ తుకడే మాగే | పాహీ అనురాగే మజకడే | ||౪౫|| 
45. “అమ్మా! నిజం చెప్పు. నీ మీద నీవే ఎందుకింత ముప్పు తెచ్చుకుంటున్నావు? రొట్టే ముక్కలను అడుక్కునే ఫకీరును మాత్రమే నేను. నాపై దయ చూపించు. 
ఖరేంచ మీ లేక తూ ఆఈ | ఆతా మజకడే లక్ష దేఈ | 
సాంగతో తుజ ఎక నవలాఈ | పరమ సుఖదాఈ హోఈల | ||౪౬|| 
46. “నిజంగా, నేను నీ బిడ్డను, నీవు నా తల్లివి. గొప్ప సుఖాన్ని కలిగించే ఒక సంగతి నీకు చెబుతాను, శ్రద్ధగా విను. 
హోతా పహా మాఝా గురూ | మోఠా అవలియా కృపాసాగరూ | 
థకలో తయాచీ సేవా కరకరూ | కానమంతరూ25 దేఈనా | ||౪౭|| 
47. “మా గురువు గొప్ప సాధువు, దయాసాగరుడు. వారి సేవ చేసి, చేసి నేను అలసి పోయాను. కాని, నా చెవిలో వారు ఏ మంత్రాన్నీ ఉపదేశించ లేదు. 
మాఝ్యా హీ మనీ ప్రబళ ఆస | కధీ న సోడావీ తయాచీ కాస | 
తయా ముఖేంచ ఘ్యావే మంత్రాస | దీర్ఘ సాయాస కరూని | ||౪౮|| 
48. “ఎంత కష్ట పడైనా సరే, వారి నోటినుండి మంత్రాన్ని పొందాలనే నా కోరిక. వారిని ఎన్నడూ వదిలి పెట్టకూడదని, నేను మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాను. 
ఆరంభీ తయానే మజ ముండిలే | పైసే మజ దోనచి యాచిలే | 
తే మీ తాత్కాళ దేఊని టాకిలే | బహూ మీ ప్రార్థిలే మంత్రాక్షర | ||౪౯|| 
49. “కాని, ముందు వారే నన్ను దోచుకొన్నారు. రెండు పైసలనే అడిగారు; వానిని నేను వెంటనే ఇచ్చేశాను. మంత్రాల కోసం ఎంతగానో ప్రార్థించాను. 
మాఝా గురూ పూర్ణకామ | దోన పైశాంచే కాయ కామ | 
కైసే మ్హణావే త్యా నిష్కామ | శిష్యాంసీ దామ మాగే జో | ||౫౦||
50. “మా గురువు ఏ కోరికలూ లేనివారు. శిష్యులను డబ్బు అడిగే వారిని కోరికలు లేనివారని ఎలా అనగలం? వారికి రెండు పైసలతో ఏం పని? 

ఏసీ న శంకా యేవో మనా | వ్యావహారిక పైశాంచీ న త్యా కామనా | 
హీ తో నాహీ తయాచీ కల్పనా | కర్తవ్య కాంచనా కాయ త్యా | ||౫౧|| 
51. “అని సందేహించకు. వారికి లౌకికమైన పైసలపై ఏ కోరికా లేదు. వారికి పైసలతో కాని, బంగారంతో కాని, ఏం పని? వారికి పైసల ఆలోచనే లేదు. 
నిష్ఠా ఆణి సబురీ26 దోన | హేచ తే పైసే నవ్హేత ఆన | 
మ్యా తే తేవ్హాంచ టాకిలే దేఊన | తేణే మజ ప్రసన్న గురుమాయ | ||౫౨|| 
52. “వారు అడిగినవి శ్రద్ధా మరియు సహనం. ఇవే ఆ రెండు పైసలు. వేరే ఏవీ కావు. నేను వానిని వెంటనే ఇచ్చేశాను. దానితో గురుమాత తృప్తి చెందారు. 
ధైర్య తీచ గే బాఈ సబురీ | సాండూ నకో గే తిజలా దూరీ | 
పడతా కేవ్హాం హీ జడభారీ | హీచ పర పారీ నేఈల | ||౫౩|| 
53. “అమ్మా! ధైర్యమే సహనం. దీనిని ఎప్పుడూ దూరం చేసుకోకు. ఎలాంటి కష్టమైన పరిస్థితి వచ్చినా, ఎప్పుడైనా, ఇదే తీరానికి చేరుస్తుంది. 
పురుషాంచే పౌరుష తీ హీ సబురీ | పాప తాప దైన్యతా నివారీ | 
యుక్తి ప్రయుక్తీ ఆపత్తీ వారీ | బాజూస సారీ భయ భీతీ | ||౫౪|| 
54. “ఈ సహనమే మగవారిలోని మగతనం. ఇదే పాపాలను, బాధలను, పేదరికాన్ని తొలగిస్తుంది. యుక్తితో ఆపదలను దూరం చేస్తుంది. భయాన్ని నెట్టివేస్తుంది. 
సబురీ వరీ యశాచా వాటా | విపత్తీ పళవీ బారా వాటా | 
యేథ అవిచారాచా కాటా | నాహీ ఠావకా కోణాహీ | ||౫౫|| 
55. “కీర్తి ప్రతిష్ఠలను కలిగించేది ఈ సహనమే. కష్టాలను తరిమి వేస్తుంది. ఎవరికీ ఇది అంతు పట్టనిది. ఆలోచించకుండా ఎవరు ఎంత బాధ పెట్టినా, సహనం ఉన్న చోట, ఏ బాధ అనిపించదు. 
సబురీ సద్గుణాంచీ ఖాణీ | సద్విచారరాయాచీ హే రాణీ | 
నిష్ఠా ఆణి యా సఖ్యా బహిణీ | జీవ ప్రాణ దోఘీంసీ | ||౫౬|| 
56. “మంచి గుణాలకు సహనం గని. మంచి ఆలోచనలకు రాణి. శ్రద్ధా మరియు సహనం, ఈ రెండూ స్నేహంగా, ప్రాణానికి ప్రాణంగా ఉండే అక్కాచెల్లేళ్ళు. 
సబురీవీణ మనుష్య ప్రాణీ | స్థితీ తయాచీ దైన్యవాణీ | 
పండిత అసోకా మోఠా సద్గుణీ | వ్యర్థ జీణే హిజవీణ | ||౫౭|| 
57. “సహనం లేని మనుషుల పరిస్థితి చాలా దీనంగా ఉంటుంది. గొప్ప పండితుడైనా, గుణవంతుడైనా, సహనం లేక పోతే, వారి జీవితం వ్యర్థం. 
గురూ జరీ మహా ప్రబళ | అపేక్షీ శిష్యప్రజ్ఞాచ కేవళ | 
గురూపదీ నిష్ఠా సబళ | ధైర్యబళ సబురీ | ||౫౮|| 
58. “గురువు స్వయంగా ఎంత సమర్థులైనా, శిష్యులనుండి, చురుకైన ప్రజ్ఞను, గురు పాదాలలో దృఢమైన నమ్మకాన్ని, శ్రద్ధను, సహనాన్ని నిరీక్షిస్తారు. 
జైసా దగడ ఆణి మణీ | ఉజళతీ దోన్హీ ఘాసితా సహాణీ | 
పరి దగడ రాహే దగడపణీ | మణీ తో మణీ తేజాళ | ||౫౯|| 
59. “రాయిని, రత్నాన్ని రెంటినీ చక్కగా అరగ తీస్తే, రెండూ బాగా మెరుస్తాయి. కాని, రాయి రాయిగానే ఉంటుంది. మణి మణీలా వెలుగుతుంది. 
ఎకచి సంస్కార దోఘా ఉజళణీ | దగడా చఢేల కాయ మణ్యాచే పాణీ| 
ఘడేల మణ్యాచీ సతేజ హిరకణీ | దగడ నిజగుణీ తుళతుళీత | ||౬౦||
60. “మెరవటానికి, రెంటినీ ఒకేలా అరగ తీయాలి. కాని, రాయి రత్నంయొక్క తత్వాన్ని పొందగలదా? మణిలాగా తేజస్సుతో వెలగగలదా? తన స్వభావం కారణంగా, రాయి నున్నగా కాగలదు అంతే. 

బారా వర్షే పాయీ వసవటా | కేలా గురూనే లహానాచా మోఠా | 
అన్నావస్త్రాసీ నవ్హతా తోటా | ప్రేమ పోటాంత అనివార | ||౬౧|| 
61. “పన్నెండేళ్ళు గురువు పాదాల దగ్గర ఉన్నాను. చిన్నవాణ్ణయిన నన్ను గురువు పెద్దవాణ్ణిగా చేశారు. అన్న వస్త్రాలకు అక్కడ ఏం లోటు లేదు. వారికి నాపై ఎంతో ప్రేమ.
భక్తిప్రేమాచా కేవళ పుతళా | జయాస శిష్యాచా ఖరా జివ్హాళా | 
మాఝ్యా గురూసమ గురూ విరళా | సుఖ సోహళా న వర్ణవే | ||౬౨|| 
62. “మూర్తీభవించిన భక్తి, ప్రేమ వారు. శిష్యులపైన వారికి నిజమైన ప్రేమ. మా గురువుకు సమానమైన గురువు అరుదు. ఆ సుఖాన్ని, వైభవాన్ని వర్ణించడం సాధ్యం కాదు. 
కాయ త్యా ప్రేమాచే కరావే వర్ణన | ముఖ పాహతా ధ్యానస్థ నయన | 
ఆమ్హీ ఉభయతా ఆనందఘన | అన్యావలోకన27 నేణే మీ | ||౬౩|| 
63. “వారి ప్రేమను ఎలా వర్ణించను? వారిని చూడగానే ధ్యానంతో కళ్ళు మూసుకుంటాయి. మేమిద్దరం ఆనందంలో మునిగి పోయేవారం. ఇతర వస్తువులను చూచి నేను ఎరుగను. 
ప్రేమే గురుముఖావలోకన | కరావే మ్యా రాత్రందిన | 
నాహీ మజ భూక నా తహాన | గురూవీణ మన అస్వస్థ | ||౬౪|| 
64. “రాత్రింబవళ్ళూ ప్రేమగా, నేను గురు ముఖాన్నే చూసేవాణ్ణి. నాకు ఆకలి దప్పులు ఉండేవి కావు. గురువు లేకపోతే, మనసు కలత చెందేది. 
తయావీణ నాహీ ధ్యాన | తయావీణ న లక్ష్య ఆన | 
తోచ ఎక నిత్య అనుసంధాన | నవలవిందాన గురూచే | ||౬౫|| 
65. “వారు తప్ప వేరే ధ్యానం లేదు. వేరే లక్ష్యం లేదు. రోజు వారొక్కరినే తలచుకునేవాణ్ణి. గురువుయొక్క నేర్పు అద్భుతం. 
హీచ మాఝ్యా గురూచీ అపేక్షా | కాంహీ న ఇచ్చీతో యాపేక్షా | 
కేలీ న మాఝీ కేవ్హాంహీ ఉపేక్షా | సంకటీ రక్షా28 సదైవ | ||౬౬|| 
66. “మా గురువు కూడా ఇదే అపేక్షించినది. ఇంతకంటే వేరే ఏదీ కోరలేదు. నన్నెప్పుడూ వారు అలక్ష్యం చేయలేదు. కష్టాలనుండి వారు నన్నుఎప్పుడూ రక్షించేవారు. 
కధీ మజ వాస పాయాంపాశీ | కధీ సముద్ర పరపారాశీ29
 పరి న అంతరలో సంగమ సుఖాసీ | కృపాదృష్టీసీ సాంభాళీ | ||౬౭|| 
67. “ఒక్కొక్కప్పుడు వారు నన్ను తమ పాదాల దగ్గర, మరొకప్పుడు సముద్ర తీరానికి అవతల ఉంచేవారు. అయినా, వారి సహవాస సుఖాన్నుంచి దూరం కాకుండా, తమ కృపా దృష్టితో నన్ను చూచుకునేవారు. 
కాసవీ జైసీ ఆపులే పోరా | ఘాలితే నిజదృష్టీచా చారా30
తైసీచ మాఝే గురూచీ తర్హా | దృష్టీనే లేంకరా సాంభాళీ | ||౬౮|| 
68. “తాబేలు తన పిల్లలకు తన దృష్టి ద్వారానే ఆహారం ఇచ్చేలా, మా గురువు కూడా అలాగే కృపా దృష్టితో నన్ను పోషించేవారు. 
ఆఈ యా మశీదీంత బైసూన | సాంగతో తే తూ మానీ ప్రమాణ | 
గురూనే న ఫుంకలే మాఝేచ కాన | తుఝే మీ కైసేన31 ఫుంకరూ | ||౬౯|| 
69. “అమ్మా! ఈ మసీదులో కూర్చుని చెప్పుతున్నాను. ప్రమాణ పూర్వకంగా నమ్ము. నా చెవిలో గురువు ఏ మంత్రమూ ఊదలేదు. అలాంటిది, నేను నీకెలా ఊదుతాను? 
కాంసవీచీ ప్రేమదృష్టీ | తేణేంచ పోరాంసీ సుఖ సంతుష్టీ | 
ఆఈ ఉగీచ కిమర్థ కష్టీ | ఉపదేశ గోష్టీ నేణే మీ | ||౭౦||
70. “తల్లి దృష్టిలోని ప్రేమమే తాబేలు పిల్లలకు సుఖాన్ని, తృప్తిని ఇస్తాయి. తల్లీ! ఊరికే ఎందుకు కష్ట పడతావు? ఉపదేశం గురించి నాకు ఏమీ తెలియదు. 

కాంసవీ నదీచే ఎకే తటీ | పోరే పైల వాళవంటీ | 
పాలన పోషణ దృష్టాదృష్టీ | వ్యర్థ ఖటపటీ మంత్రాచ్యా | ||౭౧|| 
71. “నదికి ఒక ఒడ్డున తాబేలు ఉంటుంది. ఇంకొక తీరాన దాని పిల్లలు ఉంటాయి. వాని పాలన పోషణ అన్నీ చూపులతోనే. అలా ఉన్నప్పుడు, మంత్రాల గొడవ ఎందుకు? 
తరీ తూ జా అన్న ఖాఈ | నకో హా ఘాలూ జీవ అపాయీ | 
ఎక మజకడే లక్ష దేఈ | పరమార్థ యేఈల హాతాస | ||౭౨|| 
72. “నువ్విప్పుడు వెళ్ళి అన్నం తిను. నీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకు. నా మీద దృష్టి ఉంచు. పరమార్థం చేతికి అందుతుంది. 
తూ మజకడే అనన్య32 పాహీ | పాహీన తుజకడే తైసాచ మీహీ | 
మాఝ్యా గురూనే అన్య కాంహీ | శికవిలే నాహీంచ మజ లాగీ | ||౭౩|| 
73. “ఒకే మనసుతో నన్ను చూడు. నేను కూడా నిన్ను అలాగే చూస్తాను. మా గురువు నాకు ఇంతకంటే వేరే ఏమీ నేర్పించ లేదు. 
నలగే సాధనసంపన్నతా | నలగే షట్శాస్త్ర చాతుర్యతా | 
ఎక విశ్వాస అసావా పురతా | కర్తా హర్తా గురూ ఏసా | ||౭౪|| 
74. “ఆత్మ జ్ఞానం గురించి సాధనలు అవసరం లేదు. షట్‍శాస్త్రాల పాండిత్యమూ అవసరం లేదు. రక్షించేవాడూ, బాధలను తొలగించేవాడూ గురువు ఒక్కడే అన్న దృఢమైన నమ్మకమొకటి ఉంటే చాలు. 
మ్హణూని గురూచీ థోర మహతీ | గురు హరిహరబ్రహ్మ మూర్తీ | 
జో కోణ జాణే తయాచీ గతీ | తో ఎక త్రిజగతీ ధన్యగా” | ||౭౫|| 
75. “గురువుయొక్క అపారమైన మహిమ అలాంటిది. గురువే హరి హర బ్రహ్మ మూర్తి. వారి శక్తిని తెలుసుకున్న వారొక్కరే ఈ మూడు జగాలలో ధన్యులు”. 
యేణే పరీ తీ మ్హాతారీ బోధితా | ఠసలీ తియేచే మనా తీ కథా | 
ఠేవూని మహారాజాంచే పాయీ మాథా | వ్రత నివృత్తతా ఆదరిలీ | ||౭౬|| 
76. ఈ విధంగా బాబా ఆ ముసలామెకు బోధించగా, ఆ సంగతి ఆమె మనసులో బాగా నాటుకుంది. బాబా పాదాలపై తలనుంచి, ఆమె తన దీక్షను వదిలింది. 
ఏకూని హీ సమూళ కథా | జాణూన తీచీ సమర్పకతా | 
సానంద విస్మయ మాఝియా చిత్తా | కథా సార్థకతా అవలోకితా | ||౭౭|| 
77. మొదటినుంచి ఆ కథను విన్న తరువాత, నా పరిస్థితికి అది సరిగ్గా పొందటం చూసి, నా మనసులో ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. 
పాహోని బాబాంచీ హీ లీలా | పరమానందే కంఠ దాటలా | 
ప్రేమోద్రేకే గహింవర ఆలా | అంతరీ ఠసలా సద్బోధ | ||౭౮|| 
78. బాబాయొక్క ఈ లీలను చూసి, పరమానందంతో గొంతు గద్గదమైంది. ప్రేమోద్రేకంతో శరీరం రోమాంచితమైంది. బాబా బోధ నా మనసులో బాగా నాటుకుంది. 
పాహోని సద్గద కంఠ ఝాలా | మాధవరావ వదలే మజలా | 
కాంహో అణ్ణాసాహేబ గహింవరలా | స్వస్థ బసలా హే కాయ | ||౭౯|| 
79. నా గొంతు గద్గదమైందాన్ని చూచి, మాధవరావు ‘ఏమిటి అణ్ణాసాహేబు! ఊరికే మౌనంగా కూర్చుండి పోయారెందుకు? ఒళ్ళు పులకరించింది కదూ! 
ఏశా బాబాంచ్యా అగణిత కథా | కితీ మ్హణూన సాంగూ ఆతా | 
ఏసే మాధవరావ బోలత అసతా | ఘంటా వాజతా ఏకిలీ | ||౮౦||
80. ‘బాబాకు సంబంధించిన ఇలాంటి కథలు, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎన్నని నేను చెప్పను?' అని మాధవరావు చెప్పుతుండగా గంట మ్రోగటం వినిపించింది. 

రోజ దుపారా జేవణా ఆధీ | భక్త జాఊనియా బైసతీ మశీదీ | 
కరితీ గంధాక్షత అర్ఘ్యపాద్యాదీ | పూజా సవిధీ బాబాంచీ ||౮౧|| 
81. ప్రతి రోజూ, మధ్యాహ్న భోజనానికి ముందు, భక్తులు మసీదుకు వెళ్ళి కూర్చుంటారు. నియమ ప్రకారంగా, బాబాకు గంధాక్షతలతో, అర్ఘ్య పాద్యాది పూజను చేస్తారు.
తదనంతర తీ పంచారతీ | బాపూసాహేబ జోగ కరితీ | 
భక్తి ప్రేమే ఓవాళితీ | ఆరత్యా మ్హణతీ భక్తజన | ||౮౨|| 
82. దాని తరువాత, బాపూసాహేబు జోగు భక్తి ప్రేమలతో పంచారతిని ఇస్తాడు. భక్తులంతా హారతిని పాడుతారు. 
త్యా ఆరతీచీ నిదర్శక భలీ | ఘంటా ఘణ ఘణ వాజూ లాగలీ | 
ఆమ్హీ మశీదీంచీ వాట ధరిలీ | మనీషా ఫిటలీ మనాచీ | ||౮౩|| 
83. హారతికి సమయమైందని తెలుపుతూ, గంట గణ గణమని మ్రోగ సాగింది. నా మనసులోని సంశయం దూరమైంది. మేము మసీదుకు బయలుదేరాం. 
మధ్యాన్హ సమయీంచీ హీ ఆరతీ | నరనారీ మిళూనియా కరితీ | 
స్త్రియా మశీదీంత వరతీ | పురుష ఖాలతీ మండపీ | ||౮౪|| 
84. మధ్యాహ్న సమయంలోని ఈ హారతిని మగవారూ, ఆడవారూ కలిసి చేస్తారు. ఆడవారు మసీదుపైన, మగవారు క్రింద మండపంలో ఉండేవారు. 
మంగల వాద్యాంచియా గజరీ | తాసాచియా ఝణత్కారీ | 
ఆరత్యా మ్హణతీ ఉచ్చస్వరీ | హర్షనిర్భరీ తేధవా | ||౮౫|| 
85. తాళాలు, తప్పెట్లు, మంగళ వాద్యాలు మ్రోగుతుండగా, ఎత్తైన స్వరంతో, ఉత్సాహంతో ఆనందంగా అందరూ హారతిని పాడుతారు. మేము మండప ద్వారం వద్దకు వెళ్ళాం. 
పాతలో ఆమ్హీ మండపద్వారీ | ఆరతీ చాలలీ ఘన గజరీ | 
పురుష మండళీ వేష్టిలీ పాయరీ | రీఘ నా వరీ జావయా | ||౮౬|| 
86. సభా మండపం వాకిలి దగ్గరకు మేము వెళ్ళే సరికి, హారతి గొప్పగా జరుగుతూంది. మగవారు మెట్ల దగ్గర గుమిగూడి ఉన్నారు. పైకి పోవటానికి చోటు లేదు. 
మాఝ్యా మనీ అసావే ఖాలీ | జోంవరీ ఆరతీ నాహీ సంపలీ | 
సంపతాంచ మగ బాబాంజవళీ | జావే మండళీ సమవేత | ||౮౭|| 
87. క్రిందనే ఉండి, హారతి పూర్తి అయిన తరువాత భక్తులతో పాటు బాబా దగ్గరకు పోవచ్చు, అని నేను అనుకున్నాను. 
మ్హణోని మీ జో మనీ ఆణిలే | మాధవరావ పాయరీ చఢలే | 
కరాగ్రీ ధరూని మజహీ ఓఢిలే | జవళీ నేలే బాబాంచే | ||౮౮|| 
88. నేనలా అనుకున్నా, మాధవరావు మెట్లు ఎక్కి, నా చేయి పట్టుకుని, నన్ను కూడా బాబా దగ్గరకు లాక్కుని వెళ్ళాడు. 
బాబా నిజ స్థానీ స్థిత | స్వస్థ మనే చిలీమ పీత | 
సమోర జోగ పంచారతీ ఓంవాళీత | ఘంటా వాజవీత వామకరే | ||౮౯|| 
89. తాము ఎప్పుడూ కూర్చునే చోటులోనే, బాబా కదలకుండా కూర్చుని, చిలుము పీలుస్తున్నారు. వారి ఎదుట జోగు, ఎడమ చేత్తో ఘంట వాయిస్తూ, పంచారతిని ఇస్తున్నాడు. 
ఏశా త్యా ఆరతీచే రంగీ | మాధవరావ బాబాంచే దక్షిణ భాగీ | 
స్వయే బైసతీ మజహీ బైసవితీ | సన్ముఖ స్థితీ బాబాంచే | ||౯౦||
90. అలా హారతియొక్క ఆనంద సమయంలో, మాధవరావు బాబాకు కుడి వైపున కూర్చుని, నన్ను బాబా ఎదురుగా కూర్చోబెట్టాడు. 

మగ శాంతమూర్తీ సంతమణీ | బాబా బోలతీ మంజుళ వాణీ | 
దక్షిణా కాయ దిధలీ ఆణీ | శామరావాంనీ మజప్రతీ | ||౯౧|| 
91. సత్పురుషులలో తలమానికం అయిన, శాంతమూర్తి బాబా, మంజుల స్వరంతో “శామరావు దక్షిణగా నాకేమిచ్చాడు?” అని అడిగారు. 
బాబా హే శామరావ యేథేంచ అసతీ | దక్షిణే ఏవజీ నమస్కార దేతీ | 
హేచ పంధరా రుపయే మ్హణతీ | బాబాంప్రతి అర్పావే | ||౯౨|| 
92. ‘బాబా! ఇదిగో, ఆ శామరావు ఇక్కడే ఉన్నాడు. ‘దక్షిణకు బదులుగా నమస్కారాలు ఇస్తాను. అవే బాబాకు నేను అర్పించే పదిహేను రూపాయలు’ అని అన్నాడు’ అని చెప్పాను. 
బరే అసో కేల్యా కా వార్తా | కాంహీ బోలలా కా ఉభయతా | 
కాయ గోష్టీ కేల్యా ఆతా | సాంగ సమస్తా మజప్రతీ | ||౯౩|| 
93. “సరే కాని, మీరిద్దరూ కబుర్లు చెప్పుకున్నారా? ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారు? వివరంగా అవన్నీ నాకిప్పుడు చెప్పు. 
అసో నమస్కారాచీ కథా | కేల్యాస కాయ తయాసీ వార్తా | 
కాయ కైశా త్యా సమగ్రతా | పరిసవీ ఆతా మజప్రతీ | ||౯౪|| 
94. “నమస్కారాల సంగతి అలా ఉంచు. అతనితో ఏం కబుర్లు చెప్పుకున్నావు? ఏమిటి, ఎలా, అన్నది వివరంగా నాకు ఇప్పుడు చెప్పు” అని వారు అనగా, 
గోష్ట సాంగావీ హీ ఉత్కంఠా | ఆరతీచా తో గజర మోఠా | 
పరమానంద మాఈనా పోటా | ప్రవాహే ఓఠాంతూన తో | ||౯౫|| 
95. జరిగినదంతా బాబాతో చెప్పాలని నాకెంతో ఉత్సాహంగా ఉంది కాని, హారతి చాలా గట్టిగా చప్పుడు చేస్తూ ఉంది. కాని, నాలోని ఉత్సాహం, ఆగకుండా, పెదవులనుండి ప్రవహించ సాగింది. 
బాబా జే తక్యాస ఓఠంగలే | గోష్ట ఏకావయా పుఢే ఝాలే | 
మీహీ పుఢే వదన కేలే | కరూ ఆరంభిలే కథన తే | ||౯౬|| 
96. తలగడకు ఆనుకుని కూర్చున్న బాబా, నా మాటలు వినాలని, ముందుకు జరిగారు. నేను కూడా ముందుకు జరిగి, చెప్పడం మొదలు పెట్టాను. 
బాబా తేథే ఝాల్యా జ్యా వార్తా | సర్వచి వాటల్యా గోడ చిత్తా | 
త్యాంతచి ఎక తీ మ్హాతారీచీ కథా | అతి నవలతా తియేచీ | ||౯౭|| 
97. ‘బాబా! అక్కడ మేము మాట్లాడుకున్నదంతా మనసుకు ఎంతో మధురంగా అనిపించింది. అందులోని ఆ ముసలామె కథ చాలా అద్భుతంగా ఉంది. 
శామరావే తీ గోష్ట కథితా | దిసోని ఆలీ ఆపులీ అకళతా | 
జణూ త్యా కథేచ్యా మిషే మజవరతా | కేలాంత నిశ్చితతా అనుగ్రహ | ||౯౮|| 
98. ‘శామరావు ఆ కథను నాకు చెప్పటంతో, నా అజ్ఞానం నాకు తెలిసింది. ఆ కథ నెపంతో, మీరు నన్ను అనుగ్రహించారని అర్థమైంది’ అని చెప్పాను. 
తంవ బాబా అతి ఉత్సుకతా | మ్హణతీ సాంగ మజ తీ సమగ్ర కథా | 
కాయ పాహూ కైసీ నవలతా | అనుగ్రహతా తీ కైసీ | ||౯౯|| 
99. అప్పుడు బాబా చాలా ఉత్సుకతతో, “చెప్పు, చెప్పు, కథ మొత్తం నాకు చెప్పు. అందులో ఏం విశేషం ఉందో చూద్దాం. దాని ద్వారా నిన్ను నేనెలా అనుగ్రహించాను?” 
గోష్ట హోతీ తాజీ ఏకిలీ | శివాయ మనాంత ఫారచి ఠసలేలీ | 
బాబాంస అస్ఖలిత నివేదన కేలీ | ప్రసన్న దిసలీ చిత్తవృత్తీ | ||౧౦౦||
100. ఆ కథ అప్పుడే వినటం వలన, బాగా గుర్తుంది. పైగా నా మనసులో బాగా నాటుకున్నది. ఎక్కడా పొల్లు పోకుండా, ఉన్నది ఉన్నట్లు అంతా బాబాకు చెప్పాను. అది విని బాబా ప్రసన్నులైనట్లు కనిపించారు. 

ఏసే కథిలే సకలవృత్త | బాబా హీ ఏకత దేఊని చిత్త | 
సర్వేంచి మగ మాతే వదత | జీవీ ధరీత జావే హే | ||౧౦౧|| 
101. అలా జరిగినదంతా చెప్పాను. బాబా ఒకే మనసుతో విని, వెంటనే నాతో “ఈ సంగతిని బాగా గుర్తుంచుకో” అని చెప్పారు.
ఆణిక పుసతీ అతి ఉల్హాసతా | “కితీ హీ గోడ ఏకిలీ కథా | 
బాణలీ కా తే తవ చిత్తా | ఖరీచ సార్థకతా మానలీ కా” | ||౧౦౨|| 
102. మళ్ళీ, ఎంతో ఉత్సాహంగా, “నీవు విన్న కథ నిజంగా ఎంతో మధురంగా ఉంది! నీ మనసులో బాగా నాటుకుందా? నిజంగా అది నీకు ప్రయోజనమైందా?” అని అడిగారు. 
బాబా యా కథా శ్రవణాంతీ | లాధలో మీ నిజ విశ్రాంతీ | 
ఫిటలీ మాఝే మనాచీ ఆర్తీ | మార్గ నిశ్చితీ మజ కళలా | ||౧౦౩|| 
103. ‘బాబా! ఆ కథ విన్న తరువాత నా మనసులోని కలత పోయి, శాంతి కలిగింది. అనుమానాలు, ఆవేదనలు అన్ని తొలిగాయి. నాకు నిజమైన దారి తెలిసింది’ అని చెప్పాను. 
మగ బాబా వదతీ తయావరీ | “కళాచ ఆముచీ ఆహే న్యారీ | 
హీ ఎకచ గోష్ట జీవీ ధరీ | ఫార ఉపకారీ హోఈల | ||౧౦౪|| 
104. అప్పుడు బాబా “మన పద్ధతి సాటిలేనిది. ఈ ఒక్క కథను గుర్తుంచుకో. నీకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. 
ఆత్మయాచే సమ్యగ్విజ్ఞాన | సమ్యగ్విజ్ఞానా కారణ ధ్యాన33
తే ధ్యానచి ఆత్మానుష్ఠాన | తేణేంచ సమాధాన వృత్తీచే | ||౧౦౫|| 
105. “ఆత్మను తెలుసుకోవడానికి, జ్ఞానం కావాలి. జ్ఞానం దొరకడానికి, ధ్యానం చేయాలి. ఆత్మ గురించి ఒకే మనసుతో ఆలోచించటమే ఆ ధ్యానం. అదే మనసుకు శాంతి, తృప్తిని ఇస్తుంది. 
హోఊని సర్వేషణా వినిర్ముక్త | ధ్యానా ఆణావా సర్వ భూతస్థ | 
ధ్యాన హోఈల వ్యవస్థిత | ప్రాప్తవ్య ప్రాప్త హోఈల | ||౧౦౬|| 
106. “మునుపు, కోరికలన్నింటినీ వదిలి, తరువాత, అన్ని జీవులలో ఉన్న పరమాత్మ గురించి ధ్యానించాలి. ధ్యానం సరిగ్గా కుదిరినప్పుడు, అనుకున్నది లభిస్తుంది. 
కేవల జే మూర్త జ్ఞాన | చైతన్య అథవా ఆనందఘన | 
తేంచ మాఝే స్వరూప జాణ | తే నిత్య ధ్యాన కరీగా | ||౧౦౭|| 
107. “శుద్ధమైన జ్ఞానం, శుద్ధమైన మనసు, మరియు శుద్ధమైన ఆనందమే నా నిజమైన స్వరూపం. అది తెలుసుకుని, ఆ రూపాన్ని ఎప్పుడూ ధ్యానించు. 
జరీ న ఆతుడే ఏసే ధ్యాన | కరీ సగుణ రూపానుసంధాన | 
మనీ నఖశిఖాంత మీ సగుణ | రాత్రందిన ఆణావా | ||౧౦౮|| 
108. “అలాంటి ధ్యానం కుదరకపోతే, కనిపించే నా ఈ రూపాన్ని ధ్యానించు. పాదాలనుంచి, తలదాకా, అన్ని గుణాలు ఉన్న ఈ రూపాన్ని రాత్రింబవళ్ళూ ధ్యానించు. 
ఏసే కరితా మాఝే ధ్యాన | వృత్తీ హోఈల ఎకతాన | 
ధ్యాతా ధ్యాన ధ్యేయాచే భాన | నష్ట హోఊన జాఈల | ||౧౦౯|| 
109. “అలా నన్ను ధ్యానిస్తే, మనసు కుదట పడి, ఒకే లక్ష్యం మీద గురి ఏర్పడుతుంది. దాని వలన, ధ్యానం, ధ్యానం చేసేవారు, మరియు ధ్యానించే గురి - ఈ మూడింటి (త్రిపుటి) మధ్య ఉన్న భేదం తొలగిపోతుంది. 
ఎవం హీ త్రిపుటీ విలయా జాతా | ధ్యాతా పావే చైతన్యఘనతా | 
తీచ కీ ధ్యానాచీ ఇతికర్తవ్యతా | బ్రహ్మ సమరసతా పావసీ | ||౧౧౦||
110. “ఈ త్రిపుటి పోగానే, ధ్యానం చేసేవారు చైతన్యంతో నిండిపోతారు. ఇదే ధ్యానంయొక్క గురి. దీని ద్వారా బ్రహ్మతో ఒక్కటి అవుతావు. 

కాసవీ నదీచే ఏల కాఠీ | తిచీ పిల్లే పైల తటీ | 
నా దూధ న ఊబ కేవళ దృష్టీ | దేఈ పుష్టీ బాళకా | ||౧౧౧|| 
111. “తాబేలు నదికి ఈ ఒడ్డున ఉంటుంది. దాని పిల్లలు అవతలి ఒడ్డున ఉంటాయి. వానికి పాలుగాని, వెచ్చదనం కాని ఉండవు. కేవలం తల్లి దృష్టితోనే పిల్లలు పుష్ఠిగా పెరుగుతాయి. 
పిలియా సదా ఆఈచే ధ్యాన | నలగే కాంహీచ కరణే ఆన | 
నలగే దుగ్ధ నా చారా నా అన్న | మాతానిరీక్షణ పోషణ త్యా ||౧౧౨|| 
112. “పిల్లలు ఎప్పుడూ తల్లినే ధ్యానిస్తుంటాయి. అంతే! అవి చేయాల్సింది ఇంకేమీ లేదు. పాలుగాని, వేరే ఆహరంగాని వానికి అవసరం లేదు. తల్లి చూపులే వానికి పోషణ. 
హే జే నిరీక్షణ కూర్మదృష్టీ | హీ తో ప్రత్యక్ష అమృతవృష్టీ | 
పిలియా లాధే స్వానందపుష్టీ | ఏక్యసృష్టీ గురుశిష్యా | ||౧౧౩|| 
113. “ఈ కూర్మ దృష్టియే అమృత దృష్టిలాంటిది. ఇదే పిల్లలకు స్వంతం ఆనందాన్నిస్తుంది. అలాగే గురు శిష్యుల మధ్యలో ఐక్యత పుడుతుంది”. 
హోతా హా సాఈముఖే ఉచ్చార | థాంబలా ఆరతీచా గజర | 
“శ్రీసచ్చిదానంద సద్గురు జయజయకార” | కేలా పుకార సకళాంనీ | ||౧౧౪|| 
114. సాయి నోటినుండి వచ్చిన ఈ మాటలు ముగిసే సరికి హారతి చప్పుడు ఆగి, “శ్రీ సచ్చిదానంద సద్గురుకి జైజై” అంటూ అందరూ కేకలు వేశారు. 
సరలా నీరాంజనోపచార | సరలీ ఆరతీ సవిస్తర | 
జోగ మగ అర్పితా ఖడీసాఖర | బాబా కరపంజర పసరితీ | ||౧౧౫|| 
115. నీరాజనాలు మొదలైన హారతికి సంబంధిన పనులు ముగిశాయి. జోగు పటిక బెల్లాన్ని అర్పించగా, బాబా తమ చేతులను చాపారు. 
తయాంత నిత్య క్రమానుసార | ఖడీసాఖర తీ ఓంజళభర | 
ఘాలితీ జోగ ప్రేమపురఃసర | నమస్కార పూర్వక | ||౧౧౬|| 
116. రోజులాగే, ఆ చేతుల నిండా, పటిక బెల్లాన్ని, దోసిలి నిండా జోగు ప్రేమతో పెట్టి, నమస్కరించాడు. 
తీ సబంధ శర్కరా మాఝే హాతీ | బాబా రిచవితీ ఆణి వదతీ | 
“యా సాఖరేవాణీ హోఈల స్థితీ | ఠేవితా చిత్తీ హీ గోష్ట | ||౧౧౭|| 
117. ఆ మొత్తం పటిక బెల్లాన్ని బాబా నా చేతులో గుమ్మరించారు. గుమ్మరించి, “నేను చెప్పిన సంగతులన్నీ మనసుకు బాగా పట్టించుకుంటే, నీ స్థితి ఈ పటిక బెల్లంవలె అవుతుంది. 
జైసీ ఖాడీసాఖర హీ గోడ | తైసేంచ పురేల మనీంచే కోడ | 
హోఈల తుఝే కల్యాణ చోఖడ” | పురేల హోడ అంతరీచీ | ||౧౧౮|| 
118. “ఈ పటిక బెల్లం ఎలా తియ్యగా ఉందో, నీ మనసులోని కోరికలు తీరి, నీకు చాలా మేలు జరుగుతుంది” అని చెప్పారు. 
మగ మీ బాబాంస అభివందోన | మాగితలే హేంచి కృపాదాన | 
హేంచ పురే మజ ఆశీర్వచన | సాంభాళూన ఘ్యా మజ | ||౧౧౯|| 
119. నేను బాబాకు నమస్కారం చేసి, ‘బాబా! నాకు మీ ఆశీర్వాదమే చాలు. నన్ను ఎల్లప్పుడూ రక్షించండి’ అని వారి కరుణను ప్రార్థించాను. 
బాబా వదతీ ’కథా శ్రవణ | కరా మనన ఆణి నిదిధ్యాసన | 
హోఈల స్మరణ ఆణి ధ్యాన | ఆనందఘన ప్రకటేల | ||౧౨౦||
120. అప్పుడు బాబా “ఈ కథను విని, మననం చేసి, ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తే, ధ్యానం కుదిరి, ఆనందం దొరికి, పరమాత్మ కనిపిస్తాడు. 

ఎణేపరీ జే పరిసిలే కానీ | తే జరీ తూ ధరిసీల మనీ | 
ఉఘడేల నిజకల్యాణాచీ ఖనీ | హోఈల ధుణీ పాపాచీ | ||౧౨౧|| 
121. “నీ చెవులతో విన్న కథనంతా, నీ మనసులో దాచుకుంటే, శుభమైన ఒక గని తెరుచుకుంటుంది. నీ పాపాలన్నీ తొలగిపోతాయి.
వార్యాచా చాలతా సోసాటా | సముద్రావరీ ఉసళతీ లాటా | 
అసంఖ్య బుద్బుద ఫేణాచా సాఠా | ఆదళతీ కాఠా యేఊని | ||౧౨౨|| 
122. “తుఫాను వీస్తుంటే, సముద్రం మీద ఎత్తైన అలలు లేచి, తీరానికి కొట్టుకుని, లెక్కలేనన్ని బుడుగులుగా, బుడుగులు నురగలుగా మారి పోతాయి. 
లాటా బుడబుడే ఫేణ భవరే | ఎకా పాణ్యాచే ప్రకార సారే | 
హే సకళ దృగ్భ్రమాచే పసారే | శాంత వారే హోతీ తో | ||౧౨౩|| 
123. “అలలు, బుడగలు, నురుగులు, సుడిగుండాలు, ఇవన్నీ ఎన్నో రూపాలుగా కనిపించే ఒకే నీరు. ఇదంతా మన చూపులోని భ్రమ వలనే జరిగేది. తుఫాను శాంతించగానే, అన్నీ మామూలుగా ఒక్కటే నీరు. 
హే కాయ ప్రకార మ్హణావే ఝాలే | కింవా మ్హణావే కా నాశ పావలే | 
జాణోని మాయేచే సర్వ కేలే34 | ఝాలే గేలే సరిసేంచ | ||౧౨౪|| 
124. “ఎందుకు ఈ విధంగా ఎందుకు జరిగింది? అనో లేక, నాశమెందుకు అయింది? అనో అనగలమా? జరిగినదంతా మాయయొక్క లీల అని అర్థం చేసుకోవాలి అంతే. 
తైసీచ సృష్టీచీ ఘడామోడ | వివేకియా న తయాచే కోడ | 
తే నాశివంతీ న ధారితీ హోడ | సాధితీ జోడ నిత్యాచీ | ||౧౨౫|| 
125. “సృష్టిలో జరిగేవన్నీ ఇలాగే ఉంటాయి అని తెలుసుకుని, జ్ఞానులు నశించే వానిని ఎప్పుడూ కోరరు. ఎల్లప్పుడూ ఉండే ఆత్మనే సాధిస్తారు. 
మహత్వే జ్ఞానాపరీస ధ్యాన | తదర్థ లాగే యథార్థ జ్ఞాన | 
హోతా న వస్తూచే35 సాద్యంత ఆకలన | యథార్థ ధ్యాన ఆతుడేనా | ||౧౨౬|| 
126. “జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్ఠమైనది. ధ్యానానికి, ధ్యానించే లక్ష్యం గురించి సరియైన తెలివి ఉండాలి. బ్రహ్మ తత్వం గురించి, పూర్తిగా తెలివి లేకపోతే, ధ్యానం సరిగ్గా కుదరదు. 
సమ్యగ్విజ్ఞాన మూళధ్యాన | యా నాంవ ప్రత్యగాత్మానుష్ఠాన | 
పరి జో విక్రియా రహిత జాణ | ఆణవే ధ్యానా కైసేనీ | ||౧౨౭|| 
127. “ఆత్మ గురించి, స్వంతంగా అనుభవించి తెలుసుకున్న జ్ఞానమే, ధ్యానానికి మూలం. ఆత్మను ప్రసన్నం చేసుకునే పని కూడా ఇదే. కాని, ఏ ప్రత్యేకమైన గుణాలూ లేని దానిని గురించి, మనసుకు తెచ్చుకోవటం కాని, ధ్యానించటం కాని ఎలా? 
ప్రత్యగాత్మా తోచ ఈశ్వరూ | ఆణి జో ఈశ్వరూ తోచ గురూ | 
తిహీంత భేద నాహీ అణుమాత్రు | నాగవే కరూ జాఈ తో | ||౧౨౮|| 
128. “ఆత్మయే ఈశ్వరుడు. మరియు ఈశ్వరుడే గురువు. ఈ ముగ్గురిలో అణు మాత్రం కూడా వ్యత్యాసం లేదు. వారిని వేరువేరుగా చూసినవారు నష్టపోతారు. 
హోతా నిదిధ్యాస పరిపక్వతా | ధ్యాన ధ్యాతా విరోన జాతా | 
నివాత దీపవచ్చిత్తా | శాంతతా తే ’సమాధీ’ | ||౧౨౯|| 
129. “పదేపదే చేసే ధ్యాస పక్వమైతే, ధ్యానం-ధ్యానం చేసేవారు-ధ్యానంయొక్క గురి ఈ మూడూ ఒకటైనప్పుడు, మనసు శాంతించి, స్థిరంగా ఉంటుంది. అదే సమాధి. 
హోఊని సర్వేషణా వినిర్ముక్త | జాణూని ఆహే తో సర్వభూతస్థ | 
హోతా అద్వితీయత్వే అభయ ప్రాప్త | మగ తో యేత ధ్యానాతే | ||౧౩౦||
130. “ఏ కోరికలూ లేక, అన్ని జీవులలోనూ ఉండేది ఒకే దేవుడని, మరియు ‘నేను తప్ప రెండవ వస్తువు ఏదీ లేదు’ అని భయం లేని జ్ఞానం కలిగితే, అప్పుడు ధ్యానంలో ఆత్మ కనిపిస్తుంది. 

మగ అవిద్యా కృతకర్మ బంధ | తుటతీ తటాతట తయాచే సంబంధ | 
సుటతీ విధినిషేధ నిర్బంధ | భోగీ ఆనంద ముక్తీచా | ||౧౩౧|| 
131. అప్పుడు, అజ్ఞానం వలన చేసిన పనులతో కలిగిన బంధాలు తొలగిపోతాయి. నియమంతో చేయాల్సినవి, చేయకూడనివి అనే బంధాలు కూడా తొలగిపోతాయి. వీటన్నింటి వలన కలిగిన ముక్తితో వచ్చే సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తారు. 
ఆధీ ఆత్మా ఆహే కీ నాహీ | అద్వైత కీ నిరాళా ఠాయీ ఠాయీ | 
కర్తా కీ అకర్తా పాహీ | సాహీ శాస్త్రే ధుండావీ | ||౧౩౨|| 
132. “అన్నింటికంటే మునుపు, ‘ఆత్మ అనేది అసలు ఉందా? ఉంటే అది అంతటా ఒక్కటేనా? లేక, అందరిలోనూ వేరు వేరుగా ఉందా? అది పనులు (కర్మలు) చేస్తుందా, లేక ఏ కర్మా చేయనిదా?’ అన్న ప్రశ్నలకు జవాబులు, షట్శాస్త్రాలు వెదికి తెలుసుకోవాలి. 
ఆత్మైకవిజ్ఞాన హేంచి | పరాకాష్ఠా అసే జ్ఞానాచీ | 
 మోక్ష ఆణి పరమానందాచీ | ఉత్పత్తీ సాచ తేథూని | ||౧౩౩|| 
133. “ఆత్మ ఒక్కటే అన్నదానిని స్వయంగా, అనుభవంతో తెలుసుకోవడమే జ్ఞానంయొక్క చివరి మెట్టు. అక్కడే, మోక్షం, పరమానందం దొరుకుతాయి. 
అంధాస హత్తీచే వర్ణనాకరితా | ఆణిలా బృహస్పతీసమాన వక్తా | 
వక్తృత్వే స్వరూప యేఈనా చిత్తా | వాచాతీతా36 న వర్ణవే | ||౧౩౪|| 
134. “ఒక గుడ్డివానికి, ఏనుగును వర్ణించడానికి, బృహస్పతి వంటి మాటకారిని తీసుకుని వస్తే మాత్రం, ఏం లాభం? అతని మాటల చాతుర్యం ఏనుగు రూపాన్ని చూపించగలదా? అలాగే, మాటలకు అందని దానిని వర్ణించడానికి సాధ్యం కాదు. 
వక్త్యాచే వక్త్ర శ్రోత్యాంచే శ్రోత్ర | ఆణితీల కాయ గేలేలే నేత్ర | 
హస్తి స్వరూపావలోకన పాత్ర | కేవళ నేత్రచి సత్యత్వే | ||౧౩౫|| 
135. “మాటకారియొక్క నోరు, గుడ్డివాని చెవులు, అతనికి చూపును ఇవ్వగలవా? ఏనుగు రూపాన్ని చూడటానికి, గుడ్డివానికి నిజంగా ఉపయోగ పడేవి అతని కళ్ళే కదా! 
నేత్ర నసతా కైసా హస్తీ | యేఈల అంధాచియే ప్రతీతీ | 
తైసేచ దివ్య నేత్ర జై గురు దేతీ | జ్ఞానసంవిత్తి తేధవా | ||౧౩౬|| 
136. “మరి, ఆ కళ్ళు, కళ్ళలోని చూపు లేనప్పుడు, గుడ్డివాడు ఏనుగును ఎలా చూడగలడు? అలాగే, గురువు దివ్యమైన కళ్ళను ఇచ్చినప్పుడే, జ్ఞానం లభిస్తుంది”. 
సాఈస్వరూప యథార్థ జ్ఞాన | స్వయే జో పరిపూర్ణ విజ్ఞానఘన | 
హేంచ తయాచే ధ్యాన అనుష్ఠాన | హేంచ దర్శన తయాచే | ||౧౩౭|| 
137. అనుభవంతో పొందిన, ఏ దోషమూ లేని, సంపూర్ణ జ్ఞానానికి సాయి ప్రతిరూపం. ఇది తెలుసుకోవటమే వారిని ప్రసన్నులుగా చేసుకుని ధ్యానించటం. అదే వారి దర్శనం. 
అవిద్యా కామ కర్మబంధన | యాంచే వ్హావయా అశేష మోచన | 
నాహీ నాహీ అన్య సాధన | గాంఠ హీ బాంధూన ఠేవాకీ | ||౧౩౮|| 
138. అజ్ఞానంనుండి, కోరికలనుండి, చేసిన పనుల వలన కలిగే బంధాలనుంచి, ముక్తి కావాలంటే, ఇంతకంటే వేరే సాధనలు లేవు. దీనిని బాగా గుర్తుంచుకోండి. 
సాఈ నాహీ తుమచా వా ఆముచా | తో తో సర్వభూతస్థ సాచా | 
సూర్య జైసా సకల జగాచా | హా సకళాంచా తైసాచ | ||౧౩౯|| 
139. సాయి మీ వారు మాత్రమే కాదు, మావారు మాత్రమే కాదు. వారు అన్ని జీవులలో ఉండే పరమాత్మ. సూర్యుడు మొత్తం ప్రపంచానికి చెందినట్లు, వారు కూడా అందరికీ చెందినవారే. 
ఆతా పరిసా తయాంచే బోల | సర్వసాధారణ ఆణి అనమోల | 
స్మరణీ ఠేవితా వేళోవేళ | స్వార్థ సఫళ సర్వదా | ||౧౪౦||
140. వారు తరచుగా చెప్పే మాటలను ఇప్పుడు వినండి. ఇవి సాధారణమైనవే అయినా, చాలా విలువగలవి. వానిని ఎల్లప్పుడూ తలచుకుంటుంటే, మనకు ఎంతో మేలు కలుగుతుంది. 

“నసల్యా లాగాబాంధా కాంహీ | కోణీహీ కోఠేంహీ జాతచి నాహీ | 
నరాస కాయ పశుపక్ష్యాంహీ | న కరీ కుణాహీ హడహడ | ||౧౪౧|| 
141. “వెనుకటి జన్మల ఋణానుబంధం లేకుండా, ఎవరూ ఎక్కడికీ వెళ్ళనే వెళ్ళరు. మనుషులే కాదు, పశుపక్షులు కూడా అంతే. అంచేత, ఎవరినీ ‘పో పోమ్మని’ తరమకండి.
ఆల్యాగేల్యాచా ఆదర కరీ | తృషీతా జల భుకేల్యా భాకరీ | 
ఉఘడ్యాస వస్త్ర బసాయా ఓసరీ | దేతా శ్రీహరీ తుష్టేల | ||౧౪౨|| 
142. “వచ్చీపోయే వారిని ఆదరించండి. దప్పిక ఉన్నవారికి నీరు, ఆకలైన వారికి అన్నం, బట్టలు లేనివారికి బట్టలు, అలాగే అలసిపోయిన వారికి విశ్రమించటానికి చోటునిస్తే, శ్రీహరి ఆనందిస్తాడు. 
కుణాలా వ్హావా అసేల పైసా | తుఝియా చిత్తీ ద్యావా కైసా | 
దేఊ నకో పరి వసవసా | శ్వానా ఏసా వర్తూ నకో | ||౧౪౩|| 
143. “ఎవరికైనా డబ్బు కావలిసి వచ్చినప్పుడు, ఇవ్వటానికి నీ మనసు సందేహిస్తే, ఇవ్వవద్దు. కాని, వారిపై కుక్కలా అరవకు. 
కోణీహీ బోల బోలో శంభర | స్వయే నేదీ కటు ఉత్తర | 
ధరితా సహిష్ణుతా నిరంతర | సుఖ అపార లాధేల | ||౧౪౪|| 
144. “వంద రకాలుగా ఎవరెన్ని బాధలు పెట్టినా, నీవు కఠినంగా బదులివ్వకు. ఎల్లప్పుడూ సహనాన్ని వహిస్తే, చాలా సుఖం కలుగుతుంది. 
దునియా ఝాలియా ఇకడచీ తికడే | ఆపణ వ్హావే న మాగే పుఢే | 
ఠాయీంచ నిశ్వళ రాహూన రోకడే | కౌతూక తేవఢే పహావే | ||౧౪౫|| 
145. “ప్రపంచం తలక్రిందులైనా, మనం చలించ కూడదు. అటూ ఇటూ కదలక, ఉన్న స్థలంలోనే ఉండి, మనం తమాషాను చూడాలి. 
తుమ్హాఆమ్హాంమధీల భింత | పాడూన టాకా పహా సమస్త | 
మగ జాణ్యాయేణ్యాస మార్గ ప్రశస్త | అతి నిర్ధాస్త హోఈల | ||౧౪౬|| 
146. “నీకు, నాకు మధ్యనున్న గోడను పడగొట్టేసి చూడు. అప్పుడు, ఏ భయం లేకుండా, రాకపోకలకు, వెడల్పు అయిన దారి ఏర్పడుతుంది. 
మీ తూం పణాచీ భేదవృత్తీ | హేచ తే గురుశిష్యాంతర్గత భింతీ | 
తే న పడితా నిశ్చితీ | అభేద స్థితీ దుర్గమ | ||౧౪౭|| 
147. “నువ్వు, నేను అను భేద బుద్ధియే గురు శిష్యుల మధ్యనున్న గోడ. దానిని పడగొట్టక పోతే, ఇద్దరూ ఒకటే అన్న అద్వైత స్థితి కలగదు. 
అల్లా మాలిక అల్లా మాలిక | వాలీ న త్యావీణ కోణీ ఆణీక | 
కరణీ తయాచీ అలౌకిక | అమోలిక అకళ తీ | ||౧౪౮|| 
148. “అల్లా మాలిక, అల్లా మాలిక! అతడు కాకా రక్షించేవారు ఎవరూ లేరు. అతని లీల, అర్థం కానిది, వెల కట్టలేనిది! 
తో జే కరీల తేంచ హోఈల | మార్గ తయాచా తోచ దావీల | 
క్షణ న లాగతా వేళ యేఈల | మురాద37 పురేల మనీంచీ | ||౧౪౯|| 
149. “అతడు ఏది అనుకుంటే, అదే అవుతుంది. తనను చేరుకునే దారిని అతడే చూపిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు, క్షణం కూడా ఆలస్యం కాకుండా, మనసులోని కోరికలు తీరుతాయి. 
ఋణానుబంధాచియా గాంఠీ | భాగ్యే ఆమ్హా తుమ్హా భేటీ | 
ధరూ పరస్పర ప్రేమ పోటీ | సుఖ సంతుష్టీ అనుభవూ | ||౧౫౦||
150. “వెనుకటి జన్మల ఋణానుబంధం కారణంగా, అదృష్టం కొద్దీ, మీరు నేను కలుసుకున్నాం. ఒకరికొకరు ప్రేమగా ఉంటూ, సుఖాలను, తృప్తిని అనుభవిద్దాం. 

కోణ యేథే అమర ఆహే | కృతార్థ తో జో పరమార్థ లాహే | 
నాతరీ శ్వాసోశ్వాస వాహే | తోవరీ రాహే జీవ మాత్ర” | ||౧౫౧|| 
151. “చావు లేనివారు ఇక్కడ ఎవరు ఉన్నారు? పరమార్థాన్ని పొందిన వారే ధన్యులు. ఊపిరి ఆడుతున్నంత వరకు, మాత్రమే, మిగతావారు జీవులుగా ఉంటారు”. 
కానీ పడతా హే కృపావచన | సుఖావలే మాఝే ఆతుర మన | 
తృషార్త మీ లాధలో జీవన | ఆనందసంపన్న జాహలో | ||౧౫౨|| 
152. బాబాయొక్క ఈ దయతో నిండిన ఈ మాటలు చెవులలో పడగానే, దప్పిక గొన్న వానికి నీరు దొరికినట్లుగా, ఆతురతతో ఉన్న నా మనసుకు ఆనందం కలిగింది. 
అసేల గాంఠీ ప్రజ్ఞా అతుళ | తైసీచ శ్రద్ధా మోఠీ అఢళ | 
పరి జోడాయా సాఈసమ గురుబళ | దైవచి సబళ అవశ్యక | ||౧౫౩|| 
153. సాటిలేని తెలివి, దృఢమైన శ్రద్ధ ఉన్నా, సాయివంటి గురువు రక్ష దొరకటానికి, బలమైన దైవ శక్తి అవసరం. 
పాహూ జాతా యాంతీల సార | భగవంత బోలిలా హాచి నిర్ధార | 
“యే యథా38 మా” హేచి ఉద్గార | అఖిల భార కర్మావరీ | ||౧౫౪|| 
154. ఇందులోని సారం చూడగా, భగవద్గీతలో (అధ్యాయం ౪, శ్లోకం ౧౧) శ్రీకృష్ణుడు చెప్పినట్లు, ఖచ్చితంగా, అన్ని భారాలు, మనం చేసే పనుల (కర్మ) మీదే ఉంటుంది. 
యథా కర్మ యథా శ్రుత | జైసా అభ్యాస తైసే హిత | 
హేంచ యా అధ్యాయాంతీల ఇంగిత | హేంచ బోధామృత యేథీచే | ||౧౫౫|| 
155. ‘నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు సంపాదించిన జ్ఞానాన్ని బట్టి, నువ్వు ఎలా సాధన చేస్తే, అలాగే నీకు మేలు జరుగుతుంది’. ఇదే ఈ అధ్యాయంలోని రహస్యమైన ఉద్దేశం. అమృతంలా తియ్యగా ఉండే బోధ కూడా ఇదే. 
“అనన్యాశ్చింతయంతో మామ్” | హెచ భగవద్గీతా వర్మ | 
ఏశా నిత్య యుక్తాంచా యోగక్షేమ | చాలవీ ప్రకామ గోవింద | ||౧౫౬|| 
156. “అనన్యాశ్చింతయంతో మాం” అనేదే భగవద్గీత (అధ్యాయం ౯, శ్లోకం ౨౨) లోని మర్మం. వేరే ఏ ఆలోచనా లేకుండా, ఒకే మనసుతో ఆరాధించే వారి యోగక్షేమాలను గోవిందుడు చూసుకుంటాడు. 
హా గోడ ఉపదేశ ఏకూన | ఉభే రాహీ స్మృతీచే వచన | 
“దేవాన్భావయతానేన” | మగతే తుజ లాగూన కళవళతీ | ||౧౫౭|| 
157. ఈ తియ్యని ఉపదేశాలను విని, “దేవాన్ భావయతానేన” అన్న స్మృతిలోని మాట గుర్తుకు వచ్చింది. భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు. 
తుమ్హీ జోర కాఢూ లాగా | దుధాచీ కాళజీ సర్వస్వీ త్యాగా | 
వాటీ ఘేఊన ఉభాచ మీ మాగా | పృష్ఠభాగా ఆహే కీ | ||౧౫౮|| 
158. “నువ్వు చేసే ప్రయత్నం, నువ్వు బాగానే చేయి. గిన్నెలోని పాల (అంటే ఫలితం) గురించిన చింతను వదిలి పెట్టు. పాలగిన్నె పట్టుకుని నీ వెనుకే నేను నిలబడి ఉన్నాను. 
మ్హణాల జోర మ్యా కాఢావే | దుధాచే ప్యాలే తుమ్హీ రిచవావే39
హే తో ఆపణా నాహీ ఠావే | దక్ష అసావే కార్యార్థీ | ||౧౫౯|| 
159. “అని చెబితే, ప్రయత్నం మీరు చేయండి, పాలగిన్నెను నేను ఖాళీ చేస్తాను, అని అంటారేమో! అలాంటిది నాకు తెలియదు. చేసే పనిలో నేర్పు ఉండాలి”. 
హే బాబాంచీ ప్రతిజ్ఞా వాణీ | ప్రమాణ మానూని వర్తతీల జే కోణీ | 
ఇహ పరత్ర సుఖాచీ ఖాణీ | గాంఠిలీ తయాంనీ జాణావే | ||౧౬౦||
160. అన్న బాబాయొక్క ప్రతిజ్ఞతో కూడిన మాటలను నిజమని నమ్మి, నడుచుకునే వారు, ఎవరైనా సరే, ఈ లోకంలో, పై లోకంలో, సుఖాల గని దొరికినట్లు భావించాలి. 

ఆతా ఆణిక వినవితో శ్రోతా | క్షణైక సుస్థీర కరావే చిత్తా | 
పరిసా ఎక స్వానుభవ కథా | నిశ్చయ పోషకతా సాఈచీ | ||౧౬౧|| 
161. ఇప్పుడు శ్రోతలకు మరో సారి విన్నపం. ఒక్క క్షణం, స్థిరమైన మనసుతో, నా స్వంత అనుభవాన్ని తెలిపే, కథను వినండి. నా నిశ్చయాన్ని బాబా ఎలా బలపరచారని అది చెప్పుతుంది.
సద్వృత్తీచే కరితా నియమన40 | మహారాజ దేతీ కైసే ఉత్తేజన | 
పరిసా ఓఠ హాలవిల్యా వాంచూన | అనుగ్రహదాన సాఈచే | ||౧౬౨|| 
162. మంచి నిశ్చయం మన మనసులో కలిగితే, సాయి మహారాజు దానిని ప్రోత్సాహ పరచి, తమ పెదవులు కదపకుండానే, అనుగ్రహించిన సంగతి వినండి. 
భక్తే అనన్య శరణ వ్హావే | కౌతుక భక్తీచే అవలోకావే | 
మగ సాఈచ్యా కళేచే నవలావే | అనుభవావే నిత్య నవే | ||౧౬౩|| 
163. ఒకే మనసుతో వారికి శరణుజొచ్చితే, అప్పుడు జరిగే భక్తియొక్క అద్భుతాన్ని చూడండి. ఆ పైన ప్రతి మారూ క్రొత్తగా ఉండే, సాయియొక్క సాటిలేని లీలలను అనుభవించండి. 
అసో ప్రాతఃకాళీంచే ప్రహరీ | సుషుప్తీంతూన యేతా జాగరీ | 
సద్వృత్తీచీ ఉఠతా లహరీ | తీచ నిర్ధారీ వాఢవావీ | ||౧౬౪|| 
164. ‘తెల్లవారే సమయం. నిద్రనుండి మేలుకోగానే, మనసులో మంచి ఆలోచనలు వస్తే, దానిని మరింతగా బల పరచాలి. 
త్యాచ వృత్తీచా పరిపోష | హోతా హోఈల అతి సంతోష | 
బుద్ధీహీ పావేల వికాస | హోఈల మనాస ప్రసన్నతా | ||౧౬౫|| 
165. ‘ఆ ఆలోచనలనే సరిగ్గా బలపరిస్తే, విపరీతమైన సంతోషం కలుగుతుంది. బుద్ధి కూడా వికసిస్తుంది. మనస్సుకు సుఖం కలుగుతుంది’. 
హీ ఎక ఆహే సంత ఉక్తీ | వాటలే తియేచీ ఘేఊ ప్రచీతీ | 
అనుభవే ఘడలీ మనాస శాంతీ | నవల చిత్తీ వాటలే | ||౧౬౬|| 
166. అనేది ఒక సత్పురుషుని మాట. దీనిని అనుభవంతో తెలుసుకోవాలని అనిపించింది. చాలా ఆశ్చర్యకరంగా, అనుకున్నట్లే అనుభవమై, మనసుకు శాంతి లభించింది. 
శిరడీ సారఖే పవిత్ర స్థాన | గురువారాసమ మంగల దిన | 
రామనామాచే అఖండ ఆవర్తన | కరావే మన జాహలే | ||౧౬౭|| 
167. శిరిడీ లాంటి పవిత్రమైన చోటులో, గురువారం వంటి మంగళకరమైన రోజు, ఎడతెగని రామనామ స్మరణను మొదలుపెట్టాలనే కోరిక కలిగింది. 
భుధవారీ రాత్రీ శయ్యేవరీ | దేహ నిద్రావశ హోఈ తోవరీ | 
మన రామస్మరణాభీతరీ | ఘాలూన అంతరీ రాఖిలే | ||౧౬౮|| 
168. బుధవారం రాత్రి, పరుపు మీద, దేహం నిద్రకు వశమయే వరకు, రామనామ స్మరణలో ఉంచి, అదే ధ్యాసతో ఉన్నాను. 
ప్రాతఃకాళీ జాగ యేతా | రామనామ స్మరలే చిత్తా | 
మగ తే ఏసీ వృత్తీ ఉఠతా | జివ్హేచీ సార్థకతా జాహలీ | ||౧౬౯|| 
169. తెల్లవారి, మేలుకోగానే, మనసుకు రామనామం గుర్తుకు వచ్చింది. దాంతో నాలుక సార్థకమైందని అనిపించింది. 
నిశ్చయే కేలీ మనాచీ ధారణా | సారోనియా శౌచముఖమార్జనా | 
నిఘాలో సాఈ ప్రాతర్దర్శనా | ప్రాప్త సుమనా ఘేఊని | ||౧౭౦||
170. మనసులోని ఆలోచనను దృఢ పరచుకుని, ముఖం కడుక్కుని, శుచిగా, దొరికిన పూలను పట్టుకుని, సాయియొక్క తెల్లవారి దర్శనానికి వెళ్ళాను. 

సోడూని దీక్షితాంచే ఘర | పడతా బుట్టీచ్యా వాడ్యాబాహేర | 
పద ఎక మధుర ఔరంగాబాదకర | మ్హణతా సుందర ఏకిలే | ||౧౭౧|| 
171. దీక్షితు వాడా దాటి, బుట్టీ వాడా బయటనుండి వెళ్ళుతుండగా, ఔరంగాబాదుకరు ఒక సుందరమైన పద్యాన్ని, ఎంతో మధురంగా పాడటం విన్నాను. 
పదాచీ త్యా సమయోచితతా | ఓవీరూపే కథూ జాతా | 
జాఈల మూళాచీ41 స్వారస్యతా | హోఈల విరసతా శ్రోతియా | ||౧౭౨|| 
172. ఆ పద్యాన్ని ఓవీ రూపంలో చెప్పాలంటే, పద్యంలో ఉండే మాధుర్యం పోతుంది. శ్రోతలు ఆనందించలేరు. 
మ్హణవూన తే పదచి సమూళ | అక్షరే అక్షర గాతో మీ సకళ | 
తేణేంచ ఆనందిత హోతీల ప్రేమళ42 | ఉపదేశ నిర్మళ మూళపదీ | ||౧౭౩|| 
173. అందుకే, మొత్తం పద్యాన్ని అక్షరమక్షరం గానం చేస్తాను. దాని వలన ప్రేమమయులైన శ్రోతలు, ఆ పద్యంలోని ఉపదేశాన్ని అర్థం చేసుకుని ఆనందిస్తారు. 

 ||పద|| 
“గురుకృపాంజన పాయో మేరే భాఈ | రామబినా కఛూ మానత నాహీ | ||ధృ|| 
అందర రామా బాహేర రామా | సపనేమే దేఖత సీతారామా | ||౧|| 
జాగత రామా సోవత రామా | జహా దేఖే వహా పూరనకామా | ||౨|| 
ఎకా జనార్దనీ అనుభవ నీకా | జహా దేఖే వహా రామ సరీఖా” | ||౩||గురు|| 

 పద్యం 
గురు కృప అను అంజనం దొరికింది నా సోదరుడా | రాముని తప్ప ఏదీ ఒప్పుకోవట్లేదు | ||ధృ|| 
లోపల రాముడు బయట రాముడు | కలలో కనిపించేది సీతారాముడే | ||౧|| 
మేలుకున్నా రాముడు పడుకున్నా రాముడు | ఎక్కడ చూస్తే అక్కడ పూర్ణకాముడు | ||౨|| 
ఒకే జనార్దనుడు అనుభవాలనేకం | ఎక్కడ చూస్తే అక్కడ రాముడే | ||౩||గురు|| 

ఆదీచ మనానే కేలే నిశ్చిత | నియమావే రామనామీ చిత్త | 
నిశ్చయా జో ప్రారంభ హోత | పద హే దేత దృఢతా తయా | ||౧౭౪|| 
174. నేను నా మనసును రామనామ స్మరణలో ఉంచాలని ముందే నిశ్చయించుకుని, మొదలు పెట్టటాన్ని, పై పద్యం బల పరచింది. 
తేణే మనాస ఝాలే బోధన | యా మన్నిశ్చయాంకురా లాగూన | 
సాఈ సమర్థ కరుణాఘన | పదాంబుషేచన కరితీ కా | ||౧౭౫|| 
175. దానితో, నా మనో నిశ్చయమనే చిన్న చెట్టుకు, కరుణా మూర్తులైన సాయి సమర్థులు ఆ పద్య రూపంలో, నీరును చిలుకరించారని అనిపించింది. 
ఘేఊనియా హాతీ తంబురీ | సాఈసన్ముఖ అంగణాభీతరీ | 
ఔరంగాబాదకర ఉంచ స్వరీ | మ్హణతా హీ లకేరీ పరిసిలీ | ||౧౭౬|| 
176. మండపం లోపల, సాయి ఎదురుగా, చేతిలో తంబురాను పట్టుకుని, ఎత్తైన స్వరంతో, ఔరంగాబాదుకరు గట్టిగా పాడుతున్న ఆ పాటను విన్నాను. 
ఔరంగాబాదకర బాబాంచా భక్త | మజసమ బాబాంచే పాయీ అనురక్త | 
అసతా అనేక పదే ముఖోద్గత | హెంచ కా స్ఫురత తే వేళీ | ||౧౭౭|| 
177. ఔరంగాబాదుకరు బాబా భక్తుడు. నా లాగే బాబా పాదాల మీద నమ్మకం ఉన్నవాడు. అతనికి ఎన్నో పద్యాలు కంఠస్థమై ఉండగా, ఆ వేళప్పుడు, ఆ పద్యమే ఎందుకు పాడాలని అనిపించింది? 
మాఝె మనోగత కోణా న ఠావే | హేంచ పద కా తై గాఇలే జావే | 
జైసే బాబాంన సూత్ర హాలవావే | స్ఫురణ వ్హావే తైసేచ | ||౧౭౮|| 
178. నా మనసులోని నిర్ణయం ఎవరికీ తెలియదు. మరి అతడు ఆ పద్యాన్నే ఎందుకు పాడాడు? బాబా ఏ రకంగా తాడుని కదలిస్తుంటే, మనసులో ఆలోచనలు అలాగే కదులుతాయి. 
ఆమ్హీ సకళ కేవళ బాహులీ | సూత్రధార సాఈ మాఉలీ | 
స్వయే న బోలతా ఉపాసనా భలీ | హాతీ దిధలీ అచూక | ||౧౭౯|| 
179. మనమంతా కేవలం కీలుబొమ్మలం. సాయిమాతయే సూత్రధారి. వారు స్వయంగా చెప్పకున్నా, పూజించటానికి నాకు ఒక మంచి విధానాన్ని అందించారు. 
అంతరీచీ మాఝీ వృత్తీ | ప్రతిబింబలీ జణు బాబాంచే చిత్తీ | 
ఎణే మార్గే ప్రత్యక్ష ప్రతీతి | వాటే నిశ్చితీ దాఖవిలీ | ||౧౮౦||
180. నా మనసులోని ఆలోచన, బాబా మనసులోకి వచ్చిందా అన్నట్లు, కనిపించే విధంగా, బాబా నాకు అనుభవాన్ని కలిగించారని అనిపించింది. 

కేవఢీ యా నామాచీ మహతీ | వర్ణిలీసే సంత మహంతీ | 
కాయ మ్యా పామరే తీ వానావీ కితీ | స్వరూపప్రాప్తీ యేణేనీ | ||౧౮౧|| 
181. నామంయొక్క మహత్వం ఎంత గొప్పది! దీనిని సంతులు, మహాత్ములు ఎంతగానో వర్ణించారు. అలాంటిది, చదువురాని వాణ్ణి నేను, ఎంతని వర్ణించగలను? నామ జపం వలననే, ఆత్మ స్వరూపం తెలిసేది.
హీ దో అక్షరే ఉలటీ స్మరలా | తో కోళీ43 వాటపాడ్యాహీ44 ఉద్ధరలా | 
వాల్యాచా వాల్మీక హోఊని గేలా | వాక్సిద్ధీ పావలా నవలాచీ | ||౧౮౨|| 
182. రెండు అక్షరాలను తిరగేసి ‘మరా, మరా’ అని జపం చేసినా, దారి దోపిడి చేసే బోయవాడు, ఉద్ధరింప బడి, వాల్యా వాల్మీకి అయ్యాడు. పలికిన మాటలన్నీ నిజంగా జరిగే వాక్సిద్ధిని పొందాడు. 
“మరా45 మరా” ఉలటే మ్హణతా | రామ ప్రకటాలా జివ్హేవరతా | 
జన్మాఆధీంచ46 అవతారచరితా | జాహలా లిహితా రామాచే | ||౧౮౩|| 
183. ‘మరా, మరా’ అని తిరగేసి జపించినా, అతని నాలుకపై రాముడు కనిపించాడు. రాముడు పుట్టక మునుపే, రాముని అవతార చరిత్రను వ్రాశాడు. 
రామనామే పతితపావన | రామనామే లాభ గహన | 
రామనామే అభేద భజన | బ్రహ్మసంపన్న యా నామే | ||౧౮౪|| 
184. రామనామం ద్వారా పతితులు పావనులౌతారు. రామనామంతో ఎన్నో ప్రయోజనాలు. రామనామంతో భేద బుద్ధి తొలగి, అందరూ ఒక్కటే అనే భావం కలుగుతుంది. రామనామంతో బ్రహ్మ లభిస్తాడు. 
రామానామాచ్యా ఆవర్తనే | ఉఠేల జన్మమరణాంచే ధరణే | 
ఎకా రామనామాచియా స్మరణే | కోటిగుణే హే లాభ | ||౧౮౫|| 
185. రామనామ జపంతో చావు పుట్టుకలు తొలగిపోతాయి. ఒక్క రామనామ జపంతో కోటి లాభాలు. 
జేథే రామనామాచే గర్జన | ఫిరే తేథే విష్ణూచే సుదర్శన | 
కరీ కోటీ విఘ్నాంచే నిర్దళణ | దీనసంరక్షణ నామ హే | ||౧౮౬|| 
186. రామనామ ధ్వని ఉన్న చోట, విష్ణువుయొక్క సుదర్శన చక్రం తిరుగుతూ, కోటి అడ్డంకులను నాశం చేస్తుంది. ఈ రామనామం, దీనులను రక్షిస్తుంది. 
సాఈంస ఉపదేశా నలగే స్థళ | నలగే సమయ కాళవేళ | 
బసతా ఉఠతా చాలతా నిఖళ | సహజచి సకళ ఉపదేశ | ||౧౮౭|| 
187. ఉపదేశించటానికి, సాయికి ఒక నియమిత కాలంగాని, స్థలంగాని, అవసరం లేదు. కూర్చుని ఉన్నా, నిల్చుని ఉన్నా, నడుస్తున్నా, చాలా సహజంగా ఉపదేశాలను ఇచ్చేవారు. 
యేవిషయీంచీ గోడ కథా | సాదర శ్రవణ కీజే శ్రోతా | 
ప్రత్యయా యేఈల సాఈంచీ సదయతా | తైసీచ వ్యాపకతా తయాంచీ | ||౧౮౮|| 
188. దీని గురించి ఒక మధురమైన కథను శ్రోతలు శ్రద్ధగా వింటే, సాయియొక్క దయ, మరియు, వారు అన్ని చోట్ల ఉండటం గురించి, అర్థం అవుతుంది. 
ఎకదా ఎక భక్తశ్రేష్ఠ | కోణాచీ కోణీ బోలతా గోష్ట | 
 స్వయే హోఊని కుతర్కాకృష్ట | నిందా సన్నిష్ట జాహలే | ||౧౮౯|| 
189. ఒక సారి, ఒక గొప్ప భక్తుడు, ఇంకొకరి గురించి మాట్లాడుతూ, చెడు ఆలోచనలతో, వారిని నిందిస్తూ, చీవాట్లు పెడుతున్నాడు. 
గుణ రాహిలే ఎకీకడా | నిందా ప్రవాహే ముఖీ దుథడా | 
గోష్టీచా హోవోనియా చుథడా | ఆలాకీ ఉభడా47 పైశున్యా48 | ||౧౯౦||
190. నిందించ బడ్డ మనిషి మంచి గుణాలన్నీ మూలన ఉండిపోయాయి. అసలు సంగతి అడుగున పడి, నింద పైకి వచ్చింది. భక్తుడి నోటినుండి, నింద మటుకు, వరద లాగా ప్రవహించ సాగింది. 

అసల్యా కాహీ తరీ కారణ | అసల్యా కోణాచే గర్హ్య ఆచరణ | 
కరావే సన్ముఖ తయాచే ప్రబోధన | కీంవ జాణూన తయాచీ | ||౧౯౧||
191. ఎంచేతనైనా, ఒకరి నడత సరిగ్గా లేకపోతే, దాని గురించి వారికి వారి ఎదుటే తెలియచేసి, వారిపై దయ చూపించాలి.
నిందా కధీహీ కరూ నయే | హే తో ప్రత్యేక జాణే స్వయే | 
పరి న వృత్తీ జై దాబిలీ జాయే | తీ నా సమాయే పోటాంత | ||౧౯౨||

192. ‘ఎవరినైనా సరే ఎప్పుడూ నిందించ కూడదు’ అని ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. ఎంత కాదనుకున్నా, కొన్ని సార్లు ఈ నిందించే గుణం, పొట్టలో దాగి ఉండక, బయటకు వచ్చేస్తుంది.
తేథూన మగ యేఈ కంఠీ | కంఠాంతూని జివ్హేచే తటీ | 
తేథూన హళూహళూ ఓఠీ | సుఖ సంతుష్టీ ప్రవాహే | ||౧౯౩|| 

193. కడుపులోనుండి గొంతులోనికి, గొంతునుండి నాలుక పైకి, అక్కడనుండి మెల్ల మెల్లగా పెదవుల పైకి అలా సుఖంగా సంతోషంగా బయటకు ప్రవహిస్తుంది. 
నాహీ దుజా నిందకాపరీ | త్రిభువనాంతహీ కోణీ ఉపకారీ | 
నిందా జయాచీ తయాచే కరీ | పరోపరీ కల్యాణ | ||౧౯౪|| 

194. ఈ మూడు లోకాలలో, నిందించే వాడికన్నా ఎక్కువ ఉపకారం చేసేవారు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే, నిందించడం వలన, ఆ మనిషికి తన లోపాలు తెలిపి మేలు చేస్తాడు. 
మళ కాఢీతీ కోణీ రిఠ్యానే | కోణీ సాబణాదికీ సాధనే | 
కోణీ శుద్ధ నిర్మల జీవనే | నిందక జివ్హేనే కాఢితీ | ||౧౯౫|| 

195. కొందరు మురికిని కుంకుడు కాయలతోను, ఇంకొందరు సబ్బు, శీకాయ మొదలైన వస్తువులతో కడుగుతారు. మరి కొందరు మంచి నీటితో కడుగుతారు. కాని నింద చేసేవాడు, ఇతరుల మురికిని తన నాలుకతో శుభ్రం చేస్తాడు. 
స్వీయ మానసిక అధోగతీ | పరోపకారార్థే జే సాహతీ | 
అవర్ణనీయ తీ మహదుపకృతీ | నిందక నిశ్చితీ అతివంద్య | ||౧౯౬|| 

196. ఇతరులను నిందించి, వారికి ఉపకారం చేసేటప్పుడు, తాము మానసికంగా అధోగతిని పొందటాన్ని కూడా సహిస్తారు. నిందించే వారి మహోపకారం వర్ణించడానికి సాధ్యం కాదు. ఇతరుల నిందన చేసేవారు చాలా వందనీయులు. 
పావలోపావలీ సావధ కరితీ | నిందామిషే దోష కళవితీ | 
భావీ పరాంచే అనర్థ టాళవితీ | ఉపకార హే కితీ వానూ మీ | ||౧౯౭|| 
197. నింద నెపంతో, వారి దోషాలను తెలియ పరుస్తూ, అడుగడుగునా హెచ్చరిస్తూ, అనేక రకాల కీడును తొలగిస్తూ, సహాయం చేస్తారు. అలాంటి వారి ఉపకారాన్ని నేనెంతని వర్ణించను? 
బహుతా పరీ సాధుసంతీ | వర్ణిలీసే జయాంచీ మహతీ | 
తయా నిందక వృందాప్రతీ | కరితో మీ ప్రణతి సాష్టాంగ | ||౧౯౮|| 
198. అలాంటి వారి గొప్పతనాన్ని ఎందరో సాధు సంతులు ఎన్నో రకాలుగా వర్ణించారు. అలా నింద చేసేవారికి, నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను. 
ఆలీ శ్రోతియా అత్యంత చిళసీ | నిందకహీ నిఘాలే బహిర్దిశీ49
మండళీ చాలలీ మశీదీసీ | దర్శనాసీ బాబాంచ్యా | ||౧౯౯|| 
199. ఇదంతా విని శ్రోతలకు చాలా అసహ్యంగా అనిపించి ఉండవచ్చు. నింద, చీవాట్లు చేసిన భక్తుడు మలవిసర్జనానికి బయలు ప్రదేశానికి వెళ్ళాడు. అప్పటికే, భక్తులు బాబా దర్శనానికి మసీదుకు బయలుదేరారు. 
బాబా పూర్ణ అంతర్జ్ఞానీ | దేతీ వేళీంచ భక్తాంస శికవణీ | 
పుఢే కైసా ప్రకార తయాంనీ | ఆణిలా ఘడవూని తే పరిసా | ||౨౦౦||
200. బాబాకు అన్నీ అవలీలగా తెలిసేవి. వారు సంపూర్ణమైన అంతర్‍జ్ఞాని. సరియైన సమయంలో భక్తులకు సరియైన శిక్షణను ఇచ్చేవారు. తరువాత, వారు ఏం చేశారో ఇప్పుడు వినండి. 

మండళీసహ జాతా లేండియేసీ | బాబా పుసతీ తయా భక్తావిసీ | 
మండళీ మ్హణే ఓఢియాపాసీ50 | బహిర్దిశేసీ గేలేతీ | ||౨౦౧|| 
201. భక్తులతో లెండీకి వెడుతూ, ఆ నింద చేసినవానిని గురించి బాబా అడిగారు. కాలువ దగ్గర బయలు ప్రదేశానికి వెళ్ళాడని భక్తులు చెప్పారు.

కార్యక్రమ ఆటపల్యావరీ | లేండీవరూన పరతలీ స్వారీ51
ఓఢియావరూన భక్తహీ మాఘారీ | ఫిరలే ఘరీ జావయా | ||౨౦౨|| 
202. అక్కడ పని ముగిసిన తరువాత, బాబా లెండీనుండి తిరిగి వచ్చారు. కాలువకు వెళ్ళిన భక్తుడు కూడా ఇంటికి బయలుదేరాడు. 
భేటీ హోతా పరస్పరా | ఘడలా జో వృత్తాంత తయే అవసరా | 
వినవీ శ్రోతయా జోడూని కరా | తో అవధారా సాదర | ||౨౦౩|| 
203. ఆ ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు. అప్పుడు జరిగినదాన్ని, చేతులు జోడించుకుని, నేను శ్రోతలకు మనవి చేస్తాను. శ్రద్ధగా వినండి. 
తేథేంచ ఎకా కుంపణా శేజారీ | యథేష్ట విష్ఠా మిష్టాన్నావరీ | 
ఎక గ్రామ సూకరీ మిటక్యా మారీ | బాబా నిజకరీ దావితీ త్యా | ||౨౦౪|| 
204. అక్కడే ఒక కంచె ప్రక్కన, ఒక ఊరి పంది మలాన్ని ఎంతో ఆనందంతో, చప్పరిస్తూ తినేస్తోంది. తమ చేతితో దానిని బాబా అతనికి చూపించారు. 
“పహా త్యా జిభేలా కాయ గోడీ | జనా లోకాంచీ విష్ఠా చివడీ | 
బంధు స్వజనావర చడఫడీ | యథేష్ట ఫేడీ నిజ హౌస | ||౨౦౫|| 
205. “చూశావా! జనుల మలం దాని నాలుకకు ఎంత మధురంగా ఉందో! తనకు కావలిసిన వారి మీద ఉన్న కోపాన్ని చూపాలనే తన కోరికను, ఎంతో ఇష్టంగా తీర్చుకుంటుంది. 
బహుత సుకృతాచియే జోడీ | ఆలా నరజన్మ ఏసా జో దవడీ | 
తయా ఆత్మఘ్నా52 హీ శిరడీ | సుఖ పరవడీ కాయ దే” | ||౨౦౬|| 
206. “ఎంతో పుణ్యం వలన దొరికిన ఈ మనిషి జన్మను ఇలా వ్యర్థం చేసుకుని, తన్ను తాను నాశనం చేసుకునే వానికి, ఈ శిరిడీ ఏ సుఖాన్ని కాని, శాంతిని కాని ఇవ్వగలదు?” 
ఏసే బోలత బాబా గేలే | భక్త అంతరీ బహుత ఖోంచలే | 
ప్రాతవృత్త సర్వ ఆఠవలే | బోలతే టోచలే బహు వర్మీ | ||౨౦౭|| 
207. అని అంటూ బాబా వెళ్ళిపోయారు. నింద చేసిన ఆ భక్తుడు మనసులోనే చాలా బాధపడ్డాడు. తెల్లవారి తాను చేసిన నింద, చీవాట్లు గుర్తుకు వచ్చింది. బాబా మాటలు అతని హృదయంలో బాగా గుచ్చుకున్నాయి. 
అసో బాబా తో పరోపరీ | భక్తా బోధితీ ప్రసంగానుసారీ | 
యాంతీల సార సాంఠవిల్యా అంతరీ | కాయహో దూరీ పరమార్థ | ||౨౦౮|| 
208. సమయాలను అనుసరించి, బాబా అలా భక్తులకు బోధించేవారు. ఆ బోధలోని సారాన్ని మనసులో భద్రపరచుకుంటే, పరమార్థం ఎంతో దూరంలో ఉండదు. 
“అసేల జరీ మాఝా హరీ | తరీ మజ దేఈల ఖాటల్యావరీ” | 
మ్హణీచీ యా సత్యతా ఖరీ | పరి తీ అన్న ఆచ్చాదనీ53 | ||౨౦౯|| 
209. ‘దేవుడి దయ నామీదుంటే, కూర్చున్న చోటే అన్నీ దొరుకుతాయి’ అన్న మాట నిజమే కాని, అది తినే అన్నానికి, కట్టుకునే బట్ట వరకే. 
పరి తీ జో పరమార్థ లావీల | పరమార్థ సర్వస్వీ నాగవీల | 
“జైసే జో కరీల తైసే భరీల” | అమోల హె బోల బాబాంచే | ||౨౧౦||
210. పరమార్థం గురించి కూడా అలాగే జరుగుతుందని అనుకుంటే, పరమార్థాన్ని వదులుకోవాల్సిందే. "ఎవరు ఎంత చేస్తే అంత అనుభవిస్తారు అని బాబా చెప్పిన మాటలు చాలా విలువైనవి. 

ఆణీకహీ బాబాంచే బోల | పరిసతా దేతీల స్వానందా డోల | 
భావ భక్తీచీ అసలియా ఓల | ముళే సఖోల జాతీల | ||౨౧౧|| 
211. బాబా మాటలను విన్న కొద్దీ, మనసులో ఆనందం అంతకంతకూ ఎక్కువవుతుంది. శ్రద్ధా భక్తులతో నేల సిద్ధంగా ఉంటే, వేళ్ళు అంత లోతుకు చొచ్చుకు పోతాయి. 
“జల స్థల కాష్ట ప్రదేశీ | జనీ వనీ దేశీ విదేశీ | 
సంచలో మీ తేజీ ఆకాశీ | ఎకదేశీ మీ నవ్హే | ||౨౧౨|| 
212. “నీరులో, నేల మీద, మ్రానులో, జనులలో, వనాలలో, దేశ విదేశాలలో, ఆకాశంలో, వెలుగులో, ఇలా అన్ని చోట్ల నేనే వ్యాపించి, తిరుగుతుంటాను. నేను ఏ ఒక్క దేశానికి కట్టుబడి లేను. 
ఔట హాత దేహ పరిమీత | హేచ మద్వ్యాప్తీ జే మానీత | 
త్యాంస కరావయా నిభ్రాంత | మూర్తిమంత మీ ఝాలో | ||౨౧౩|| 
213. “మూడున్నర మూరలలోనే ఉన్నానని, నేను వ్యాపించి ఉన్నది ఇంతే అని అనుకునే వారి తప్పు భావనను తొలగించటానికే, శరీరాన్ని ధరించాను. 
నిష్కామత్వే అనన్య భజన | కరితీ జే మాఝే రాత్రందిన | 
తే ప్రత్యక్ష మాఝే మీపణ | దుజేపణ విరహిత | ||౨౧౪|| 
214. “రాత్రింబవళ్ళూ, ఒకే మనసుతో, ఏ కోరికా లేక, నన్ను ఆరాధించే వారు, జీవాత్మ పరమాత్మ వేరు వేరనే భావనను తొలగించుకుని, నాలో ఒకటవుతారు. 
గూళ రాహీల గోడీ వేగళా | సాగర లాటాం పాసావ నిరాళా | 
తేజా సోడోని రాహీల డోళా | మజవీణ భోళా భక్త తై | ||౨౧౫|| 
215. “తీపి లేని బెల్లం, అలలు లేని సముద్రం, వెలుగు లేని కళ్ళు ఉంటాయోమో కాని, నేను లేకుండా ఏ అమాయక భక్తుడూ ఉండడు. 
చుకావా జన్మమరణావర్త | ఏసే జయాచే మనీ నిశ్చిత | 
ప్రయత్నే రహావే ధర్మవంత | స్వస్థ చిత్త సర్వదా | ||౨౧౬|| 
216. “చావు పుట్టుకల చక్రంనుంచి తప్పించుకోవాలని నిశ్వయించుకున్నవారు, ప్రయత్నం చేసి, శాస్త్రాలు చెప్పిన ధర్మం ప్రకారమే నడుచుకోవాలి. అలా నడుచుకుని, మనసును ఎప్పుడూ చలించకుండా శాంతంగా ఉంచాలి. 
త్యాగావే తేణే బోల వర్మీ | కోణాసీ ఛేదూ నయే మర్మీ | 
సదా నిరత శుద్ధ కర్మీ | చిత్త స్వధర్మీ ఠేవావే | ||౨౧౭|| 
217. “ఎవరి మనసునూ మాటలతో నొప్పించరాదు. కఠినమైన మాటలు వదులుకోవాలి. ఎల్లప్పుడూ పరిశుద్ధమైన మంచి పనులనే చేయాలి. తన ధర్మమేదో అది చేయాలి. 
మాఝీయే ఠాయీ మన బుద్ధీ | సమర్పా స్మరా మజ నిరవధి | 
దేహాచే కాంహీహీ హోవో కధీ | భయ త్రిశుద్ధీ త్యా నాహీ | ||౨౧౮|| 
218. “మీ మనసు, బుద్ధి రెంటినీ నాకు సమర్పించి, ఎల్లప్పుడూ నన్ను తలచుకుంటూ ఉండండి. ఇలా చేస్తే, శరీరానికి ఎప్పుడు ఏం జరిగినా, ముమ్మాటికీ ఏ భయమూ ఉండదు. 
జో పాహే మజకడే అనన్య | వర్ణీ పరిసే మత్కథా ధన్య | 
న ధరీ భావనా మదన్య | చిత్త చైతన్య లాధేల” | ||౨౧౯|| 
219. “ఒకే మనసుతో నా మీద చూపు నిలిపి, నా కథలను వర్ణించే వారు, వినేవారు ధన్యులు. నా ఆలోచన తప్ప మిగతా ఏ ఆలోచనలూ లేకుండా ఉంటే, మనసు పరమాత్మలో లీనమై పోతుంది”. 
మాఝే నాంవ ఘ్యా మజ శరణ యా | హే తో సాంగత గేలే అవఘియా | 
పరి మీ కోణ హే జాణణీయా | శ్రవణ మనన ఆజ్ఞాపిలే | ||౨౨౦||
220. “నా పేరును తలచుకో, నా శరణు పొందు” అని బాబా అందరికీ చెప్పేవారు. దానితో పాటు తాను ఎవరు అని తెలుసుకోవటానికి, వారి కథలను విని, వాటినే తలచుకోవాలని ఆజ్ఞాపించారు. 

ఎకాస భగవన్నామ స్మరణ | ఎకాస భగవల్లీలా శ్రవణ | 
ఎకాస భగవత్పాద పూజన | ఆనాన54 నియమన ఆనానా55 | ||౨౨౧|| 
221. ఒకరికి దేవుని నామాన్ని జపించడం, ఒకరికి దేవుని లీలలను వినటం, మరొకరికి దేవుని పాద పూజ, ఇలా వేరు వేరు స్వభావం కలవారికి, వేరువేరు సాధనలను చెప్పారు.
కోణాస అధ్యాత్మ రామాయణ | కోణాస జ్ఞానేశ్వరీ పురశ్చరణ | 
కోణాస హరివరదా పారాయణ | గురు చరిత్రావలోకన కోణాతే | ||౨౨౨|| 
222. ఒకరికి ఆధ్యాత్మ రామాయణం చదవటం, ఇంకొకరికి జ్ఞానేశ్వరిని నియమంతో చదవటం, మరొకరికి హరివరదను పారాయణం చేయడం, వేరొకరికి గురుచరిత్ర చదవటం ఇలా చెప్పేవారు.
కోణా బసవితీ పాయాజవళీ | కోణాస ఖండోబాచే దేఉళీ | 
కోణాచ్యా విష్ణు సహస్త్ర నామావళీ | బాంధితీ గళీ కళకళీనే | ||౨౨౩|| 
223. ఒకరిని తమ పాదాల దగ్గర కూర్చో బెట్టుకుంటే, మరొకరిని ఖండోబా మందిరానికి పంపారు. ఇంకొకరి గొంతుకు ప్రేమతో విష్ణు సహస్రనామావళి కట్టారు.
కోణాస ఉపదేశితీ రామవిజయ | కోణాసీ ధ్యాన నామమాహాత్మ్య | 
కోణాసీ ఛాందోగ్య గీతారహస్య | విశ్వాసే స్వారస్య అనుభవిజే | ||౨౨౪|| 
224. ఒకరికి రామ విజయాన్ని ఉపదేశిస్తే, మరొకరికి ధ్యానాన్ని మరియు నామ మహాత్మ్యాన్ని, ఇంకొకరికి ఛాందోగ్య ఉపనిషత్తును, గీతా రహస్యాన్ని ఉపదేశించి, వీనిలో విశ్వాసం ఉంచి, వీనిలోని సహజంగా ఉండే మాధుర్యాన్ని అనుభవించమని చెప్పేవారు.
కోణాస కాంహీ కోణాస కాంహీ | దీక్షా ప్రకారా సీమాచ నాహీ | 
కోణా ప్రత్యక్ష కోణా దృష్టాంతాహీ | ఉపదేశ నవలాఈ అపూర్వ | ||౨౨౫|| 
225. అలా బాబా ఒకరికి ఒకటి, మరొకరికి మరొకటి, బోధ చేసేవారు. వారి దీక్షా పద్ధతులు ఎన్నో రకాలుగా ఉండేవి. అవి అంతు లేనివి. కనిపించేలా ఒకరికి, ఎదురుగా దీక్షనిస్తే, మరొకరికి కలల ద్వారా ఇచ్చేవారు. వారి ఉపదేశాలు సాటిలేనివిగా ఉండేవి.
భక్త అఠరా పగడ జాతీ | ధాంవ ధాంవూన దర్శనా యేతీ | 
జయాంస మద్యావర అతి ప్రీతి | స్వప్నీహీ జాతీ తయాంచే | ||౨౨౬|| 
226. అన్ని జాతుల భక్తులు, పరుగు పరుగున వారి దర్శనం కోసం వచ్చేవారు. మద్యపానం పైన ప్రీతి ఉన్న ఒకరి కలలోకి వెళ్ళారు.
వక్షఃస్థళావరీ బైసతీ | హాతీపాయీ ఛాతీ దడపితీ | 
స్పర్శాచా56 కానాస ఖడా లావవితీ | భాక57 ఘేతీ తవ జాతీ | ||౨౨౭|| 
227. వారి ఎదపై కూర్చుని, కాళ్ళూ, చేతులూ, గుండెను, బాగా అదిమి పట్టి, వారు మరల మద్యం ముట్టుకోమని ప్రమాణం చేస్తేగాని, వారిని విడిచి పెట్టేవారు కాదు.
లగ్నగృహీ భింతీ వరతీ | జ్యోతిషీ జైసే హరిహర కాఢితీ | 
“గురుబ్రహ్మాది58” మంత్ర లిహితీ | కోణ్యా భక్తార్థీ స్వప్నాంత | ||౨౨౮|| 
228. పెళ్ళిళ్ళు జరిగే ఇళ్ళల్లో, జ్యోతిష్యులు హరి హరుల బొమ్మలను వేసినట్లుగా, భక్తుని కలలోకి వెళ్ళి, గోడపైన ‘గురుః బ్రహ్మ’ అనే మంత్రాన్ని వ్రాసేవారు.
కోణీ చోరూన లావితా ఆసనే | కరూ ఆదరితా హఠయోగ సాధనే | 
బాబాంస కళే తే అంతర్జ్ఞానే | అచూక బాణే ఖోంచితీ | ||౨౨౯|| 
229. ఎవరైనా రహస్యంగా ఆసనాలను వేస్తూ, హఠయోగ సాధనలను చేస్తుంటే, తమ దివ్య జ్ఞానంతో తెలుసుకుని, గురి తప్పని బాణం గ్రుచ్చుకునేలా, బాబా వారికి బోధించేవారు.
కోణా అపరిచితా హాతీ ధరూన | నిరోప దేతీ పాఠవూన | 
స్వస్థ న బసవేకా భాకార ఖాఊన | సబూరీ ధరూన రహావే | ||౨౩౦||
230. ఎవరో తెలియని వాణ్ణి పట్టుకుని, “ఉన్న భాకరీ (జొన్న రొట్టె) తిని హాయిగా ఉండలేవా? ఓపిక పట్టు” అని కబురు పంపారు.

కోణాస ప్రత్యక్ష నిక్షూన సాంగతీ | ఆముచీ తో మోఠీ కడవీ జాతీ | 
సాంగూన పాహూ ఎకా దో వక్తీ | శేవటచీ గతీ బహు కఠిణ | ||౨౩౧|| 
231. ఇంకొకరితో ఎదురెదురుగా “మాది చాలా కఠినమైన పద్ధతి. ఒకటికి రెండు సార్లు చెప్పి చూస్తాం. చివరి ప్రయత్నం చాలా కష్టంగా ఉంటుంది.
సాంగూ ఎకదా సాంగూ దోనదా | న కరీ జో గుమాన ఆముచే శబ్దా | 
త్యా మగ పోటచే పోరాస సుద్ధా | చిరూన ద్విధా ఫేకూ కీ | ||౨౩౨|| 
232. “ఒక సారి చెప్తాం, రెండు సార్లు చెప్తాం. ఎవరైనా మా మాటలను లక్ష్య పెట్టక పోతే, కన్నబిడ్డలనైనా సరే, రెండు ముక్కలుగా చీరి పారేస్తాం” అని చెప్పేవారు.
మహానుభావ తే మహామతి | కాయ మీ పామర వానూ చమత్కృతీ | 
కోణా దే జ్ఞానప్రాప్తీ విరక్తీ | సద్భావ భక్తీ కవణా దే | ||౨౩౩|| 
233. సాయిబాబా మహాజ్ఞాని. దీనుణ్ణి అయిన నేను, ఆ మహానుభావుని చమత్కారాలను ఎలా వర్ణించగలను? ఒకరికి విరక్తిని, జ్ఞానాన్ని కలుగ చేస్తారు. ఇంకొకరికి మంచి భావనలను, భక్తిని కలుగ చేస్తారు.
కోణాస కాంహీ వ్యవహారీ ప్రశస్త | వర్తనాచీ లావీత శిస్త | 
చుటకా ఎక ఉదాహరణార్థ | శ్రోతృవృందార్థ మీ కథితో | ||౨౩౪|| 
234. కొందరికి, ఈ ప్రపంచంలో ఎలా నడచుకోవాలని పద్ధతిగా, సరియైన రీతిలో శిక్షణనిస్తారు. ఒక విచిత్రమైన ఘటనను, ఉదాహరణగా, శ్రోతలకు ఇప్పుడు చెప్తాను.
ఎకదా బాబా భర దుపారీ | కాయ ఆలే నకళే అంతరీ | 
రాధాకృష్ణీచ్యా59 ఘరాశేజారీ | ఆలీ స్వారీ అవచితా | ||౨౩౫|| 
235. ఒక మిట్ట మధ్యాహ్నం వేళప్పుడు, బాబా మనసుకు ఏం తోచిందో ఏమో, అకస్మాత్తుగా వారు రాధాకృష్ణబాయి ఇంటి ప్రక్కకు వచ్చారు.
సమవేత హోతే కాంహీ జన | మ్హణతీ ఆణాఆణా రే నిసణ60
తో ఎకానే తాత్కాళ జాఊన | శిడీ తై ఆణూన ఠేవిలీ | ||౨౩౬|| 
236. వారి వెంట కొందరు భక్తులున్నారు. వారితో బాబా “వెళ్ళి నిచ్చెనను పట్టుకుని రండి” అని అనగానే, వెంటనే ఒకరు వెళ్ళి నిచ్చెనను తెచ్చి పెట్టారు.
బాబా తీ లావవితీ ఘరావరీ | స్వయే చఢతీ ఛపరావరీ | 
కోణా న ఠావే కాయ అంతరీ | యోజనా తరీ హే కాయ | ||౨౩౭|| 
237. బాబా దానిని ఆ ఇంటి పైకి వేయించారు. వారే కప్పు పైకి ఎక్కారు. వారి మనసులో ఏ ఉద్దేశముందో ఏమిటో, ఎవరికీ తెలియదు.
వామన గోందకరాచే ఘరా | శిడీ లావవిలీ తే అవసరా | 
చఢలే శిడీవరూని ఛపరా | స్వయే ఝరఝరా శ్రీసాఈ | ||౨౩౮|| 
238. వామన గోందకరుని ఇంటి కప్పుకు నిచ్చెనను వేయించి, వారే స్వయంగా చరచరా ఇంటి కప్పు పైకి ఎక్కారు.
తేథూన రాధాకృష్ణీచే ఛపర | శేజారీంచ ఘరాసీ ఘర | 
తేంహీ వళంఘూని గేలే సత్వర | కాయ హా చమత్కార కళేనా | ||౨౩౯|| 
239. అక్కడినుండి, గోందకరుని ఇంటికి ఆనుకుని ఉన్న రాధాకృష్ణబాయి ఇంటి కప్పును దాటుకుంటూ వెళ్ళారు. అదేం చమత్కారమో ఏమో! ఎవరికీ అర్థం కాలేదు.
రాధాకృష్ణాబాఈస మాత్ర | తేచ సంధీస మోఠా ప్రఖర | 
ఆలా హోతా శీతజ్వర | అత్యంత అస్థిర త్యా హోత్యా | ||౨౪౦||
240. కాని, ఆ సమయంలో, రాధాకృష్ణబాయి విపరీతమైన చలిజ్వరంతో, నిద్ర లేక, బాధ పడుతుండేది.

దోఘే దోబాజూ ధరూ లాగత | తేవ్హాంచ బాబా చాలూ సకత | 
స్వయే ఎవఢే అసతా అశక్త | కోఠూని సామర్థ్య ఆలే హే | ||౨౪౧|| 
241. ఇద్దరు మనుషులు పట్టుకుంటేనే, నడవగలిగే స్థితిలో బాబా అప్పుడు ఉన్నారు. అంత బలహీనంగా ఉన్నా, అంతటి శక్తి వారికి ఎక్కడనుండి వచ్చిందో?
లగేచ దుసరే బాజూచీ వళచణ | వళంఘోనియా తేథీల ఉతరణ | 
తేథేంహీ లావవోని తీచ నిసణ | ఆలే ఉతరూని ఖాలతీ | ||౨౪౨|| 
242. వెంటనే, ఇంటి కప్పుకు రెండవ వైపుకు, అదే నిచ్చెనను వేయించుకుని, బాబా క్రిందకు దిగి వచ్చారు. 
పాయ లాగతా ధరేసీ | దోన రుపయే నిసణవాల్యాసీ | 
దిధలే బాబాంనీ అతి దక్షతేసీ | అవిలంబితేసీ తాత్కాళ | ||౨౪౩|| 
243. నేల మీద కాలు పెట్టగానే, ఆలస్యం చేయకుండా, వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి రెండు రూపాయలు ఇచ్చారు. 
లావిలీ దో ఠాయీ శిడీ | హీచ కాయ తీ శ్రమాచీ ప్రౌఢీ | 
యదర్థ బాబా భరపాఈ ఎవఢీ | కరితీ ఫేడీ తయాచీ | ||౨౪౪|| 
244. రెండు వైపులా నిచ్చెనను వేయటం ఏమంత కష్టమైన పని? ఆ కష్టానికి ఫలితంగా, బాబా అంత డబ్బు ఇచ్చి, ఋణం తీర్చుకున్నారు. 
జనాస సహజీ జిజ్ఞాసా | నిసణవాల్యాస ఇతుకా పైసా | 
బాబా దేతీ తరీ హా కైసా | మ్హణతీ హే పుసా తయాంస | ||౨౪౫|| 
245. జనులకు సహజంగా కుతూహలం కలిగి ‘నిచ్చెన తెచ్చిన వానికి బాబా అంత డబ్బు ఎందుకిచ్చారు?’ అని వారిని అడగాలనుకున్నారు. 
కేలా ఎకానే తేధవా ధీర | బాబా దేతీ ప్రత్యూత్తర | 
కోణాచ్యాంహీ శ్రమాచా భార | ఫుకట లవభార ఘేఊ నయే | ||౨౪౬|| 
246. ధైర్యం చేసి ఒకడు వారిని అడగగా, బాబా “ఎవరి శ్రమ భారాన్నైనా ఉచితంగా కొంచెం కూడా తీసుకోకూడదు. 
కోణాహీపాసూన ఘ్యావే కామ | పరీ జాణావే తయాచే శ్రమ | 
లావావా జీవాస ఏసా నియమ | ఫుకట పరిశ్రమ ఘేఊ నయే | ||౨౪౭|| 
247. “ఎవరితోనైనా పని చేయించుకోండి. వారి కష్టాన్ని తెలుసుకోండి. కాని ‘ఎవరి శ్రమనూ ఉచితంగా తీసుకో రాదు’ అని ఒక నియమాన్ని పాటించాలి” అని బాబా జవాబిచ్చారు. 
కోణీ జాణావే ఖరీ ఇంగిత | బాబా హే కా ఏసే కరీత | 
హే తో తయాంచే తయా అవగత | సంతాంతర్గత అతి గూఢ | ||౨౪౮|| 
248. బాబా ఇలా ఎందుకు చేశారు అని చెప్పాలంటే, వారి ఉద్దేశాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? వారి సంగతులు వారికే అర్థం అవుతాయి. సత్పురుషుల ఆలోచనలు చాలా రహస్యంగా ఉంటాయి. 
పరిసతా ముఖీంచే ఉద్గార | తేచ సర్వస్వీ ఆమ్హా ఆధార | 
ఠేవితా తైసా వర్తన నిర్ధార | చాలేల వ్యవహార సురళీత | ||౨౪౯|| 
249. వారి నోటినుండి వెలువడిన మాటలే మనకు ఆధారం. వారి చెప్పినట్లు నడుచుకోవాలి అని నిర్ణయించుకుంటే, ప్రపంచంలోని పనులన్నీ ఎంతో చక్కగా సుఖంగా సాగిపోతాయి. 
అసో పుఢీల అధ్యాయాచీ గోడీ | యాహూన ఆహే అతి చోఖడీ | 
ఎకా మోలకరిణీచీ పోర భాబడీ | కోడే ఉలగడీ శ్రుతీంచే | ||౨౫౦||
250. తరువాతి అధ్యాయం, ఇంతకంటే మధురం, రస భరితం. అమాయకురాలైన ఒక పనిపిల్ల, శ్రుతులలోని రహస్యమైన చిక్కు ముడిని విడతీస్తుంది. 

గణుదాస ప్రాసాదిక హరిదాస | ఉపకార కరావయా ప్రాకృత జనాస | 
ఈశావాస్య భాషాంతరాస | కరావయా కాస ఘాతలీ | ||౨౫౧|| 
251. గణు దాసు దైవ ప్రేరితుడైన హరిదాసు. జనులకు ఉపకారం చేయాలని, ఈశావాస్య ఉపనిషత్తును మరాఠీ భాషలోకి అనువదించాలని, నడుం కట్టాడు. 
సాఈకృపే గ్రంథ లిహిలా | పరి కాంహీ గూఢార్థ రాహిలా | 
తేణే మనాస సంశయ పడలా | కైసా ఫేడిలా బాబాంనీ | ||౨౫౨|| 
252. సాయి అనుగ్రహంతో గ్రంథ రచన పూర్తయింది. కాని, ఏవో కొన్ని రహస్యార్థాలు తెలియక, అతని మనసుకు సందేహం కలిగింది. మరి ఆ అనుమానాల్ని బాబా ఎలా తీర్చారు? 
బాబా వదత61 శిరడీంత బసూన | పారల్యాస జై జాసీల పరతోన | 
కాకాంచ్యా62 ఘరచీ మోలకరీణ | శంకా సమాధాన కరీల | ||౨౫౩|| 
253. శిరిడీలోనే కూర్చుని, దాసగణుతో బాబా “నీవు పార్లేకు తిరిగి వెళ్ళినప్పుడు, కాకా దీక్షితు ఇంట్లోని పని పిల్ల, నీ సందేహాలను తీర్చుతుంది” అని చెప్పారు. 
ఈశావాస్య పద్మ పరిసరీ | రూంజీ ఘాలీల వాగ్దేవీ భ్రమరీ | 
తే ఆమోద సేవితీ63 కళాకుసరీ | శ్రోతా చతురీ భోగిజే | ||౨౫౪|| 
254. ఈశావాస్యమనే కమలం పువ్వుల సరోవరంలో, వాగ్దేవి అనే తుమ్మెద ఝంకారం చేస్తూ, తిరుగుతుంటే, సాధువులైన శ్రోతలారా, ఆ ఆనందాన్ని అనుభవించండి. 
అసో పుఢీల అధ్యాయీ హే కథన | కర్తా కరవితా సాఈ దయాఘన | 
శ్రోతా యథావకాశ శ్రవణ | కరావే కల్యాణ హోఈల | ||౨౫౫|| 
255. తరువాతి అధ్యాయంలో ఈ కథను చెప్పేవారు, చెప్పించేవారు సాయి దయామయులే. సావకాశంగా వింటే, శ్రోతలకు మేలు జరుగుతుంది. 
పంత హేమాడ సాఈంస శరణ | తైసాచ భూతీ భగవంతీ లీన | 
శ్రోతా దేణే అవధాన దాన | సాఈ నివేదన గోడ హే | ||౨౫౬||                 
256. పంతు హేమాడు సాయికి శరణుజొచ్చి, మరియు అన్ని జీవులలోని దేవుడికి శరణు వేడుతూ, సాయియొక్క తియ్యని కథలను, శ్రోతలు సావధానంగా వినాలని, వేడుకుంటున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | మదనుగ్రహ నామ | 
| ఎకోనవింశోధ్యాయగోడహాః సంపూర్ణః |

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. సూర్యోపాసక. (౩ సౌర) 2. గణపతీచే భక్త. (౩ గణపత్య) 
3. సూర్య ఆణి సాగర. (౫ సూర్యార్ణవ) 4. అవ్యక్త. (౯ అవ్యాకృత) 
5. శింపల్యావర భాసమాన హోణారే రూప. (౧౩ శుక్తికాధిష్ఠిత) 
6. వేటోళే. (౧౩ వేంటాళ) 7. ఖరోఖరచ సర్ప ఆహే అసా భాస హోతో. (౧౩ వ్యాళ) 
8. సర్పాచా అధ్యారోప (౧౪ సర్పారోపణ) 9. వస్తుతః. (౧౪ వస్తుగత్యా) 
10. వడాచే బీజ. (౧౭ వటకణికా) 11. కోట్యావధీ వృక్ష. (౧౭ వృక్షకోటీ) 
12. ప్రత్యేక బీజాపోటీ ఎక. (౧౮ కణికేగణిత) 13. సృష్టిప్రలయ హోఈపర్యంత. (౧౮ ఆప్రలయాంత) 
14. స్వప్నాంచా దేఖావా (౨౨ స్వప్నవిన్యాస) 15. దుసరీ. (౨౪ ఆన) 
16. ఫళాచా అంతర్గత సేవ్య పదార్థ. (౨౮ గీర) 17. ఉగ్ర. (౨౮ ఉగీర) 
18. జ్ఞానీ. (౩౧ జ్ఞానియాహీ) 19. అష్ట సిద్ధీంవర తాబా బసలా పాహిజే. (౩౧ సిద్ధివిజయ) 
20. ఉపవాసాచే వ్రత. (౩౫ ప్రాయోపవేశన) 21. దర్శక. (౩౭ విద్యోతీ) 
22. సాఈసచ్చరితరూప జ్యోతీ. (౩౭ చరిత్రజ్యోతీ) 23. త్యా జ్యోతీచా ఉజేడ. (౩౭ తద్దీప్తి) 
24. ‘తిజహాతీ’ హా పాఠహీ శోభేల. (౪౩ నిజహాతే) 25. కానమంత్ర. (౪౭ కానమంతరూ) 
26. ధైర్య. (౫౨ సబూరీ) 27. దుసరే కాహీ పాహణే. (౬౩ అన్యావలోకన) 
28. రక్షణ. (౬౬ రక్షా) 29. పైలకాఠాపలీకడే. (౬౭ పరపారాసీ) 30. ఖాణే. (౬౮ చారా) 
31. కసే. (౬౯ కైసేన) 32. మాఝ్యావాచూన దుసరా కోణీ నాహీ అశా దృష్టీచే జే పాహణే తే. (౭౩ అనన్య) 
33. ‘శ్రేయో హి జ్ఞానమభ్యసాత్ జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే’ - శ్రీమద్ భగవద్గీతా, అ.౧౨, శ్లో.౧౨ (౧౦౫ ధ్యాన). 
34. కార్య. (౧౨౪ కేలే). 35. బ్రహ్మ సద్వస్తు. (౧౨౬ వస్తూచే) 
36. వాణీలా అగమ్య అశాలా. (౧౩౪ వాచాతీతా) 37. అభీష్ట. (౧౪౯ మురాద) 
38. ‘యే యథా మాం ప్రపద్యంతే|’ (౧౫౪ యథా) 39. యథేచ్ఛ ప్యావే. (౧౫౯ రిచవావే) 
40. ‘నియమ’ మ్హణజే నేమ యా అర్థీ హా శబ్ద యోజిలేలా దిసతో. (౧౬౨ నియమన) 
41. మూళ పదాచీ. (౧౭౨ మూళాచీ) 42. ప్రేమళ శ్రోతేజన. (౧౭౩ ప్రేమళ) 
43. వాల్మీకీ. (౧౮౨ కోళీ) 44. రస్త్యానే జాణార్యా-యేణార్యాస గాఠూన లుటణారా. (౧౮౨ వాటపాడ్యాహీ) 
45. నిత్య మారహాణ కరణ్యాచా ధందా అసల్యాముళే త్యాచ్యా జిభేవర తాత్కాళ చఢేల అసాచ ‘మరా మరా’ హాచ మంత్ర మహర్షి నారదాంనీ యా కోళ్యాలా దిలా హోతా. (౧౮౩ మరా మరా) 
46. రామ జన్మాస యేణ్యాచ్యా ఆధీచ. (౧౮౩ జన్మాఆధీంచ) 47. ఊత. (౧౯౦ ఉభడా) 
48. నిందేలా. (౧౯౦ పైశున్యా) 49. శౌచాసాఠీ. (౧౯౯ బహిర్దిశీ) 
50. గావాచా ఓఢా, జేథే శ్రీ బాబా రోజ సకాళీ ౮-౯ వాజతా ప్రాతర్విధీస మ్హణూన జాత. (౨౦౧ ఓఢియాపాసీ) 
51. బాబాంచీ స్వారీ. (౨౦౨ స్వారీ) 52. స్వతఃచా ఘాత కరణార్యాలా. (౨౦౬ ఆత్మఘ్నా) 
53. హీ మ్హణ అన్న-వస్త్ర ఎవఢ్యాచపురతీ లాగూ ఆహే. (౨౦౯ అన్నాఅచ్ఛాదనీ) 
54. వేగవేగళే. (౨౨౧ ఆనాన) 55. వేగవేగళ్యా అధికారీ జనాంస. (౨౨౧ ఆనానా) 
56. మద్యస్పర్శాచా. (౨౨౭ స్పర్శాచా) 
57. ఇతఃపర మద్యాస శివణార నాహీ మ్హణూన హాతావర హాత. (౨౨౭ భాక) 
58. ‘గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః | గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః||’ హా మంత్ర. (౨౨౮ ‘గురూబ్రహ్మాది’) 
59. రాధాకృష్ణాబాఈస శ్రీ సాఈబాబా ‘రాధాకృష్ణీ’ అసే మ్హణత. (౨౩౪ రాధాకృష్ణీచ్యా) 
60. శిడీ. (౨౩౬ నిసణ). 61. దాసగణూంస బోలలే (౨౫౩ వదత) 
62. శ్రీ హరీ సీతారామ దీక్షిత యాంజలా బాబా ‘కాకా’ యా నావానే సంబోధీత. (౨౫౩ కాకాంచ్యా) 
63. సభోవార. (౨౫౪ ఈశావాస్యపద్మపరిసరీ) 64. వాస సేవన కరణ్యాచీ. (౨౫౪ సేవితీ)