Thursday, March 28, 2013

||ఈశావాస్యభావార్థబోధనం నామ వింశోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత 
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౨౦ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

ఓం నమోజీ గురు మానససరా | ప్రసాదవాక్యముక్తాకరా | 
అనన్యభక్త మరాళ నికరా | చరణీ థారా తుజపాశీ | ||౧|| 
1. ఓ సద్గురు, మీకు నమస్కారాలు! మీరు మాకు మానస సరోవరంలాంటి వారు! అనుగ్రహింపు మాటలనే ముత్యాలు కలిగిన వారు! స్థిరమైన నమ్మకం కలిగిన భక్తులు, మీ పాదాల దగ్గర హంసలవలె ఆశ్రయించి ఉన్నారు.
సదాశ్రయా మహా ఉదారా | ఘలూని ప్రసాద ముక్తచారా | 
దేఊని నిజ విశ్రాంతి ఆసరా | యేరఝారా చుకవిసీ | ||౨|| 
2. మహా ఉదారులైన మీరు, మిమ్మల్ని నమ్ముకున్న వారికి, మీ అనుగ్రహమనే ముత్యాలను ప్రసాదించి, వారికి ఆత్మ రూపాన్ని చూపించి, వారి చావు పుట్టుకలను తొలగిస్తారు. 
కాయ తో సిద్ధాశ్రమ | దర్శనే నివే సంసారశ్రమ | 
నికటవర్తీ భవభ్రమ | దవడీ అవిశ్రమ సహవాసే | ||౩|| 
3. సిద్ధులకు ఆధారాన్నిచ్చే సాయి ఎంత గొప్పవారు! వారి దర్శనంతోనే సంసారంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. వారి దగ్గర ఉన్నవారికి, సంసారం వలన కలిగిన అపోహలని, అశాంతిని పారిపోయేలా చేస్తారు. 
సాఈ మూళ నిరాకార | భక్తకాజాలాగీ సాకార | 
కరోని మాయా నటీచా స్వీకార | ఖేళలా సాచార నట జైసా | ||౪|| 
4. అసలు సాయికి ఏ ఆకారమూ లేకపోయినా, భక్తుల కొరకు మనిషి రూపాన్ని ధరించారు. మాయా నటియొక్క సవాలును స్వీకరించి, అనుభవంగల నటునివలె, వారు కూడా తమ లీలలను చూపించారు. 
ఏసియా సాఈస ఆణూ ధ్యానీ | క్షణభర జాఊ శిరడీ స్థానీ | 
దోన ప్రహరచ్యా ఆరతీ మాగూని | లక్ష లావూని పాహూయా | ||౫|| 
5. అలాంటి సాయిని ఒక్క క్షణం కళ్ళ ముందుకు తెచ్చుకుని, శిరిడీకి వెళ్ళి, అక్కడ మధ్యాహ్న హారతి తరువాత, ఏమి జరుగుతున్నదో శ్రద్ధగా చూద్దాం. 
మధ్యాన్హీ ఆరతీపాఠీ | యేఊని మశీదీచ్యా కాఠీ | 
మహారాజ అతి కృపాదృష్టీ | ఉదీ వాటీత భక్తాంస | ||౬|| 
6. మధ్యాహ్న హారతి తరువాత, సాయి మహారాజు మసీదు చివరకు వచ్చి, ఎంతో ప్రేమతో భక్తులకు ఉదీని పంచి పెడుతున్నారు. 
భక్తహీ ప్రేమళ ఉఠాఉఠీ | ఘాలీత సమచరణీ మిఠీ | 
ఉభ్యానే ముఖ న్యాహాళీతా దృష్టీ | భోగీత వృష్టీ ఉదీచా | ||౭|| 
7. భక్తులు కూడా అంతే ప్రేమతో, వెంటనే వారి పాదాలను కౌగలించుకుని, నిలబడి, సాయి ముఖాన్నే చూస్తూ, తమపై బాబా కురిపించే ఉదీని తీసుకుంటున్నారు. 
బాబాహీ భరభరోని ముష్టీ | ఘాలీత భక్తాంచ్యా కరసంపుటీ | 
అంగుష్ఠే లావీత తయాంచ్యా లలాటీ | ప్రేమ పోటీ అనివార | ||౮|| 
8. పిడికిళ్ళ నిండా బాబా ఉదీని నింపుకుని, భక్తుల దోసిళ్ళలో పోస్తున్నారు. తమ బొటన వేలితో, భక్తుల నుదుట ఉదీ వ్రాసేవారు. భక్తులంటే వారికి ఎంత ప్రేమయో! 
“జా భాఊ జా జేవావయాస | జా అణ్ణా జా తూ ఖా సుగ్రాస | 
జా అవఘే జా నిజస్థానాస” | ప్రత్యేకాస వదత తే | ||౯|| 
9. “తమ్ముడూ! భోజనానికి వెళ్ళు. అణ్ణా! నువ్వు కూడా వెళ్ళి కమ్మని భోజనాన్ని తిను. వెళ్ళండి, వెళ్ళండి, మీరందరూ ఇళ్ళకు వెళ్ళండి” అని ఒక్కొక్కరికీ చెబుతున్నారు. 
ఆతా జరీ తే పాహూ న మిళే | పరి తే సర్వే గత సోహళే | 
శిరడీస త్యా త్యా స్థానీ త్యా వేళే | దృఢ ధ్యానబళే దిసతాత | ||౧౦||
10. అదంతా గడిచి పోయిన వైభవం. శిరిడీలో ఆయా చోట్లలో, ఆయా సమయాలలో జరిగిన దానిని, ఇప్పుడు చూడలేము. అయినా, మనసును స్థిరపరచుకుని, ధ్యానిస్తే మన కళ్ళ ముందుకు మళ్ళీ వాటిని తెచ్చుకోవచ్చు. 

అసో ఏసే కరూన ధ్యాన | అంగుష్ఠాపాసూన ముఖావలోకన | 
ప్రేమే ఘాలూని లోటాంగణ | కథానుసంధాన చాలవూ | ||౧౧|| 
11. ఇలా, సాయి రూపాన్ని, పాదాలనుండి తలదాకా ధ్యానిస్తూ, భక్తిగా వారికి సాష్టాంగ నమస్కారం చేసి, కథను కొనసాగిస్తాను. 
గతాధ్యాయాచియా అంతీ | కథిలే హోతే శ్రోతయాంప్రతీ | 
కీ బాబాంహీ మోలకరిణీహాతీ | అర్థ శ్రుతీచా ఉకలవిలా | ||౧౨|| 
12. ఒక పనిపిల్ల ద్వారా, బాబా శ్రుతియొక్క అర్థాన్ని వివరించారు, అని పోయిన అధ్యాయం చివరిలో, శ్రోతలకు చెప్పాను కదూ! 
ఈశావాస్య భావార్థ బోధినీ | ఆరంభిలీ హోతీ గణుదాసాంనీ | 
ఆశంకా ఉపజతాంచ సద్గురుచరణీ | ఘాతలీ నేఊన శిర్డీస | ||౧౩|| 
13. ‘ఈశావాస్య భావార్థబోధిని’ అన్న గ్రంథాన్ని గణుదాసు వ్రాయడం మొదలు పెట్టాడు. అలా వ్రాస్తున్నప్పుడు, కొన్ని అనుమానాలు కలిగి, వాటిని తొలగించుకోవటానికి శిరిడీకి వచ్చి, సద్గురు పాదాల దగ్గరకు చేరాడు. 
బాబా తై వదలే జే వచన | తుఝ్యా యా శంకేచే నివారణ | 
కరీల కాకాచ్యా ఘరచీ మోలకరీణ | జాశీల పరతోన తే సమయీ | ||౧౪|| 
14. అప్పుడు బాబా, “నీవు తిరిగి వెళ్ళినప్పుడు, కాకా ఇంట్లోని పనిపిల్ల, నీ అనుమానాలను పోగొడుతుంది” అని చెప్పారు. 
తేంచ కీ సాంప్రత కథానుసంధాన | ఆతా యేథూన చాలవూ ఆపణ | 
శ్రోతీ హోఈజే దత్తావధాన | హోఈల శ్రవణ అవికళ | ||౧౫|| 
15. ఇప్పుడు ఆ మాటలతోనే కథను ముందుకు సాగిద్దాము. అక్కడినుండే మొదలు పెడదాం. శ్రోతలు శ్రద్ధగా ఉంటే, వారు చక్కగా వినవచ్చు. 
సంస్కృత భాషానభిజ్ఞార్థ1 | ఈశావాస్యోపనిషదర్థ2
ఓవీద్వారా పదపదార్థ | సంకలితార్థ వివరావా | ||౧౬|| 
16. సంస్కృత భాష తెలియని వారి కోసం, ప్రతి పదానికి అర్థంతో, ఈశావాస్యోపనిషత్తు గొప్పతనాన్ని మరాఠీ భాషలో, ఓవీ ఛందస్సులో, వివరించాలని, 
ఏసీ ఆస్థా ధరోని మనీ | ఈశావాస్య భావార్థబోధినీ | 
ప్రాకృత భాషా సుగమ సాధనీ | గణుదాసాంనీ ఆరంభిలీ | ||౧౭|| 
17. గణుదాసు ‘ఈశావాస్య భావార్థబోధిని’ని వాడుకలో ఉన్న భాషలో వ్రాయాలని, మొదలు పెట్టాడు. 
గూఢార్థ ప్రచుర హే ఉపనిషద | భాషాంతర ఝాలే పదప్రపద | 
వినా అంతర్గత రహస్య బోధ | హోఈ న ఆనంద మనాతే | ||౧౮|| 
18. కష్టమైన, రహస్యమైన అర్థాలతో ఉన్న ఈ ఉపనిషత్తులోని పదాలను, చక్కగా అనువదించాడు. కాని, ఆ పదాల వెనుక దాగి ఉన్న జ్ఞానం బయట పడక పోతే, మనసుకు తృప్తి లేదు. 
చహూ వేదాంచే జే సార | తేంచ ఉపనిషదాంచే భాండార | 
హరి గురుకృపా నసలియావర | అతిదుస్తర గాఠావయా | ||౧౯|| 
19. నాలుగు వేదాలలో దాగి ఉన్న సారమే ఉపనిషత్తులలోని నిధి. శ్రీహరి మరియు గురువు అనుగ్రహం లేకుండా, ఆ జ్ఞాన నిధి దొరకటం చాలా కష్టం. 
మ్హణేల కోణీ మీ సజ్ఞాన | ఆపుల్యా మతే కరోని యత్న | 
కరీన ఉపనిషదాంచే ఆకలన | ప్రతిపాదన యథార్థ | ||౨౦||
20. ‘నేను జ్ఞానిని, నా స్వంత ప్రయత్నంతోనే ఉపనిషత్తులను ఆకళింపు చేసుకుని, ఉన్నది ఉన్నట్లుగా సరిగ్గా వివరిస్తాను’, అని ఎవరైనా అనుకుంటే, 

తరీ తే కల్పాంతీహీ న ఘడే | హే తో గురుకృపా నసతా సాంకడే | 
గుప్తప్రమేయ హాతీ న చఢే | మార్గీ అవఘడే పదోపదీ | ||౨౧|| 
21. అది ఈ ప్రపంచం ముగిసే వరకు సాధ్యం కాదు. గురువు అనుగ్రహం లేకపోతే, అడుగడుగునా కష్టాలు ఎదురై, దాగి ఉన్న రహస్యాలు బోధ పడదు.
తేంచ జో గురుపదీ జడే | తయా నాహీ అణుమాత్ర సాంకడే | 
తయాచియా దృష్టీపుఢే | ఆపేఆప ఉఘడే గూఢార్థ | ||౨౨|| 
22. అదే, గురువు పాదాలకు శరణుజొచ్చిన వారికి కొంచెం కూడా శ్రమ ఉండదు. దాగివున్న రహస్యమైన అర్థాలన్నీ, అతని ముందు, వాటంతట అవే వెల్లడి అవుతాయి. 
ఆత్మజ్ఞానాచే హే శాస్త్ర | జన్మమరణోచ్ఛేదక శస్త్ర | 
జే నిరభిమాన నిఃసంగమాత్ర | తేచ సత్పాత్ర వివేచనా | ||౨౩|| 
23. చావు పుట్టుకల చక్రాన్ని నాశం చేసే ఆయుధం, ఈ ఆత్మజ్ఞానం గురించిన శాస్త్రం. ఏ మాత్రం అభిమానం లేక, సంసార బంధాలను తెంచుకున్న వారే దీని గురించి వివరించగలరు. 
ఏసియాంచీ కాస ధరితా | క్షణాంత ఉపజే అర్థబోధకతా | 
బుద్ధీచీ జాఈ ప్రతిబద్ధకతా | హోయ విశదతా గూడార్థీ | ||౨౪|| 
24. అలాంటి వారి దగ్గరకు వెళ్ళితే, అర్థాలు క్షణంలో అర్థమౌతాయి. బుద్ధికి అడ్డుగా ఉన్న అడ్డంకులన్నీ తొలగి పోయి, దాగివున్న రహస్యమైన అర్థాలు కూడా బోధ పడతాయి. 
ఈశావాస్య ప్రాకృతీ ఆణీతా | దాసగణూంచీ హేచ అవస్థా | 
పరి సాఈనాథే కృపా కరితా | తద్దుర్గమతా3 విరాలీ4 | ||౨౫|| 
25. ఈశావాస్యాన్ని వాడుకలో ఉన్న మరాఠీ భాషలో అనువదిస్తున్నప్పుడు, దాసగణుకు ఇదే పరిస్థితి ఎదురైంది. సాయినాథుని అనుగ్రహంతో ఆ కష్టాలన్నీ తొలగిపోయాయి. 
గీర్వాణ భాషేచే అల్పజ్ఞాన | తత్రాపి ఆచార్య విద్యారణ్య | 
వందూన సాఈబాబాంచే చరణ | ఓవీ లేఖన ఆదరిలే | ||౨౬|| 
26. సంస్కృత భాష గురించి అతనికి బాగా తెలియక పోయినా, ఆచార్య విద్యారణ్య స్వామి మరియు సాయినాథుని పాదాలకు నమస్కరించి, ఓవీలో రచనను మొదలు పెట్టాడు. 
గణుదాస వాణీ దుగ్ధధారా | ప్రసాద సాఈచా తయాంత శర్కరా | 
తేథీల మాధుర్య పరంపరా | క్షణైక ఆదరాజీ శ్రోతే | ||౨౭|| 
27. పాలధారవంటి గణుదాసు మాటలకు, సాయి అనుగ్రహమనే పంచదార తోడైంది. ఒక క్షణమైనా, శ్రోతలు అందులోని మాధుర్యాన్ని అనుభవించాలి. 
అసో హే బోధినీ దిగ్దర్శన5 | హృద్గతార్థా6 కరా మూలావలోకన7
యా మత్కథేచే అనుసంధాన | ఆహే కీ ఆన అవధారా | ||౨౮|| 
28. ఈశావాస్య భావార్థ బోధినిలోని, దాగివున్న రహస్యమైన అర్థాలను తెలుసుకోవాలంటే, మూల గ్రంథాన్ని చదవాలి. ఈ కథను ఇప్పుడు చెప్పటంలో ఉద్దేశం వేరే. ఈ కథను వినండి. 
నిజభక్త కరితా గ్రంథావలోకన | ఆఢళే జధీ8 దుర్బోధ వచన | 
మహారాజ కరితీ సమాధాన | బోలల్యావీణ కైసేపా | ||౨౯|| 
29. తమ భక్తులు గ్రంథాలను చదువుతున్నప్పుడు, అర్థం కాని సంగతులను, మాట్లాడకుండానే సాయి మహారాజు ఎలా బోధ పరచేవారో గమనించండి. 
హాచ యా కథేచా హేత | శ్రోతయా వ్హావా తాత్పర్యే విదిత | 
ఇతుకేంచి మాఝే మనోగత | దత్తచిత్త పరిసాజీ | ||౩౦||
30. ఈ కథలోని ముఖ్యమైన ఉద్దేశం ఇదే. దీనిని సారాంశంగా శ్రోతలకు తెలియ చేయాలన్నదే నా కోరిక. అందుకే, శ్రద్ధగా వినండి. 

ఓవీబద్ధ టీకా కేలీ | విద్వజ్జనాంస మాన్య ఝాలీ | 
గణుదాసాంచీ మనీషా ఫిటలీ | ఆశంకా రాహిలీ పై ఎక | ||౩౧|| 
31. గణుదాసు ఛందోబద్ధంగా ఓవీలలో టీకా వ్రాశాడు. నిపుణతగల పండితులు దానిని మెచ్చుకొని, అతనిని గౌరవించారు. అతని మనసులోని కోరిక నెరవేరింది. కాని, ఇంకా ఒక సందేహం మిగిలిపోయింది. 
మండిలీ తీ పండితాంసమోర | ఊహాపోహ కేలా థోర | 
పరి హోఈనా సమాధానపర | శంకా నిర్ధార కోణాహీ | ||౩౨|| 
32. తన సందేహాన్ని అతను పండితుల ముందుంచాడు. గొప్ప వాద, వివాదాలు, చర్చలు జరిగాయి. కాని, తృప్తికరంగా ఎవరూ ఆ సందేహాన్ని తీర్చలేకపోయారు. 
ఇతుక్యాంత శిరడీస కాంహీ కారణే | దాసగణూంచే ఘడలే జాణే | 
ఆశంకేచే నివారణ హోణే | సహజపణే ఝాలే కీ | ||౩౩|| 
33. ఇంతలో, ఏదో కారణంగా, దాసగణు శిరిడీకి వెళ్ళవలసి వచ్చింది. ఏ శ్రమా లేకుండా, సహజంగానే అతని సంశయం నివారించ బడింది. 
ఘేఊ గేలే సాఈంచే దర్శన | మస్తకీ ధరిలే శ్రీచే చరణ | 
కరూనియా సాష్టాంగ వందన | సుఖ సంపన్న జాహలే | ||౩౪|| 
34. సాయి దర్శనానికై మసీదుకు వెళ్ళాడు. శ్రీవారి పాదాలపై తలనుంచి, సాష్టాంగ నమస్కారం చేసి, తృప్తితో ఆనందించాడు. 
సంత కృపేచే అవలోకన | సంత ముఖీంచే మధురవచన | 
సంతాంచే తే సుహాస్య వదన | కృతకల్యాణ భక్తగణ | ||౩౫|| 
35. సత్పురుషులు దయతో చూసే ఒక చూపు, వారి నోటినుండి వచ్చే తియ్యని మాటలు, చిరునవ్వుతో ఉన్న వారి ముఖం, భక్తులకు ఎంతో మేలు చేసేవి. 
కేవళ సంతాంచే దర్శన | కరీ సకల దోషాంచే క్షాలన | 
జయాంసీ త్యాంచే నిత్య సన్నిధాన | కాయ తే పుణ్య వర్ణావే | ||౩౬|| 
36. సత్పురుషుల దర్శన మాత్రంతో, అన్ని దోషాలు తొలగిపోతాయి. అలాంటి వారితో ఎల్లప్పుడూ ఉండగలిగిన వారి పుణ్యాన్ని ఎంతని వర్ణించగలను? 
కా గణూ కోఠూన ఆగమన | పుసతీ బాబా వర్తమాన | 
కుశల ఆహే న సమాధాన | చిత్త ప్రసన్న సర్వదా | ||౩౭|| 
37. “ఏం గణూ! ఎక్కడనుండి రావడం? అంతా కుశలమేనా? మనసు ఎప్పుడూ తృప్తిగా సంతోషంగా ఉందా?” అని బాబా అడిగారు. 
గణుదాస దేతీ ప్రత్యుత్తర | అసతా ఆపులే కృపాఛత్ర | 
కిమర్థ వ్హావే మ్యా ఖిన్నాంతర | ఆనందనిర్భర అసే మీ | ||౩౮|| 
38. ‘మీ అనుగ్రహమనే గొడుగు క్రింద నేనుండగా, ఎందుకు దుఃఖించాలి? చాలా సంతోషంగా ఉన్నాను’ అని బదులిచ్చాడు. 
ఆపణహీ హే సర్వ జాణతా | లోకోపచారార్థ ప్రశ్న కరితా | 
మీహీ జాణూని ఆహే చిత్తా | కుశలవృత్తా కా పుసతా | ||౩౯|| 
39. ‘మీకన్నీ తెలుసు. అయినా, ఆచారం కనుక అడుగుతున్నారు. క్షేమ సమాచారాలను మీరు ఎందుకు అడుగుతున్నారు అన్నదీ నాకు తెలుసు. 
స్వయే మజకరవీ ఆరంభ కరవితా | పుఢే తో రంగారూపాస యేతా | 
మధ్యేంచ ఏసీ మేఖ మారితా | కోణాహీ ఉకలితా ఉకలేనా | ||౪౦||
40. ‘మీరే నాతో ఒక పనిని మొదలు పెట్టించి, అది రంగు రూపాలతో ఒక దశకు రాగానే, మధ్యలో మీరే ఒక సమస్యను తెచ్చి పెడతారు. దానిని ఎవరూ నివారించ లేరు. 

ఏసే పరస్పర చాలలే భాషణ | కరీత గణుదాస పాదసంవాహన | 
ఈశావాస్య భావార్థబోధన | సంబంధే ప్రశ్న పూసిలా | ||౪౧|| 
41. ఈ రకంగా వారిరువురూ మాట్లాడుకుంటూ, బాబా కాళ్ళను మెల్లగా నొక్కుతూ, ఈశావాస్య భావార్థ బోధిని గురించి, గణుదాసు అడిగాడు.
ఈసావాస్య భావార్థబోధినీ | లిహూ జాతా అడఖళే లేఖణీ | 
శంకా కుశంకా రాహతీ మనీ | బాబా త్యా ఉకలూని సాంగావ్యా | ||౪౨|| 
42. ‘బాబా! ఈశావాస్య భావార్థ బోధినిని వ్రాస్తుంటే, నా మనసులో ఏవేవో సందేహాలు కలిగి, కలం ఆగిపోయింది. వానిని విడమర్చి చెప్పండి. 
సాద్యంత ఘడలా జో జో ప్రకార | కేలా బాబాంచ్యా పాయీ సాదర | 
ఆశంకా హీ దుర్నివార | మాండిలీ సమోర బాబాంచ్యా | ||౪౩|| 
43. అని జరిగినదంతా బాబా పాదాల దగ్గర మొర పెట్టుకుని, తన సంశయాలు నివారించటం కష్టమని బాబాకు చెప్పాడు. 
గణుదాస వినవీ సాఈనాథా | మాఝే గ్రంథపరిశ్రమ వృథా | 
హీ యా ఈశావాస్యాచీ కథా | ఆపణ సర్వథా జాణతా | ||౪౪|| 
44. ‘సాయినాథా! నా గ్రంథ రచనంతా దండుగ అయింది అని మీకు బాగా తెలుసు. నా ఈశావాస్య గురించిన కథ ఇదే. 
ఆశంకా దూర ఝాల్యావినా | గ్రంథాచా యా ఉకల పడేనా | 
మహారాజ దేతీ ఆశీర్వచనా | ప్రసన్నమనా అసే తూ | ||౪౫|| 
45. ‘నా అనుమానాలు తీరక పోతే, గ్రంథంలో దాగివున్న రహస్యమైన అర్థాలు, సరిగ్గా అర్థం కావు’ అని విన్నవించుకోగా, సాయి మహారాజు అతనిని ఆశీర్వదించి “నీవు ప్రసన్నంగా ఉండు, 
“కాయరే యాంత ఆహే కఠిణ | జాతా ఆలియా స్థళీ పరతోన | 
త్యా కాకాచీ మోలకరీణ | శంకా నివారణ కరీల కీ” | ||౪౬|| 
46. “ఏముందిరా ఇందులో కష్టమైంది? నీవు ఎక్కడునుంచి వచ్చావో, అక్కడికి మరల వెళ్ళీనప్పుడు, నీ సందేహాన్ని కాకా పనిమనిషి తీరుస్తుందిగా” అని చెప్పారు. 
కాకా తే భాఊసాహేబ దీక్షిత | బాబాంచే ఎక ప్రేమళ భక్త | 
కాయావాచామనే సతత | గురుసేవానిరత సర్వదా | ||౪౭|| 
47. కాకా అంటే భావూసాహేబు దీక్షితు. బాబాకు ప్రేమగా ఉండే ఒక భక్తుడు. దేహం, మాట, మనసుతో ఎల్లప్పుడూ గురు సేవలో ఉండేవాడు. 
ప్రఖ్యాత ముంబాపురీ నగరీ | తేథూన అల్ప అంతరావరీ | 
పారలే నామ గ్రామాభీతరీ | రాహతీ హరిభాఊ హే | ||౪౮|| 
48. ఈ హరీభావూ బొంబాయి పట్టణానికి కొంత దూరంలో ఉన్న పార్లే అన్న గ్రామంలో ఉంటాడు. 
ఖరే నాంవ తయాంచే హరి | ఆఈబాపే ఠేవిలే ఘరీ | 
జన మ్హణతీ భాఊసాహేబ జరీ | బాబాంచే పరి తిసరేంచ | ||౪౯|| 
49. అతని అసలు పేరు హరి అని. అమ్మా నాన్న పెట్టిన పేరు. జనులు అతన్ని భావూసాహేబని పిలిచినా, బాబా దగ్గర అతనికి మరో పేరు. 
మహాజనీస9 బడే కాకా | నిమోణకరా10 మ్హాతారే కాకా | 
భాఊసాహేబాంస లంగడే కాకా | బంబ్యా కాకాహీ మ్హణతీ తే | ||౫౦||
50. కాకా మహాజనిని ‘బడే కాకా’ అని, నిమోంకరును ‘ముసలి కాకా’ అని, భావూసాహేబును ‘కుంటి కాకా’ అనో లేక ‘బంబ్యా కాకా’ అని కూడా బాబా పిలిచేవారు. 

ఆఈబాపే ఠేవితీ ఎక | రాశీచే తే అసతే ఆణిక | 
టోపణ నాంవేహీ మారితీ హాక | రీతీ హీ అనేకపరీచీ | ||౫౧|| 
51. అమ్మా నాన్న ఒక పేరు పెడతారు. జాతకంలో రాశిని బట్టి మరో పేరుంటుంది. ముద్దుగా ఇంకో పేరుతో పిలుస్తుంటారు. ఇలా ఎన్నో రకాల పద్ధతులు. 
మహారాజ ఠేవితా నామే నిరాళీ | తీచ మగ చాలతీ వేళోవేళీ | 
జాణో తీంచ మగ బిరుదావళీ | ప్రేమ సమేళీ ధరిజేతీ | ||౫౨|| 
52. మహారాజు విచిత్రమైన పేర్లను పెట్టేవారు. అలా పేర్లు పెట్టించుకున్న వారు, ఆ పేర్లతోనే ఎప్పుడూ చలామణి అయ్యేవారు. భక్తులు కూడా ఆ పేర్లను ఎంతో ప్రేమగా బిరుదులవలె అనుకునేవారు. 
కధీ భిక్షు కధీ కాకా | బాబాంనీ పాడిలా హాచి శిక్కా | 
త్యాచ నామే శిరడీంత లోకా | ప్రసిద్ధ కాకా జాహలే | ||౫౩|| 
53. ఒక సారి ‘భిక్షు’ అని, ఇంకో సారి ‘కాకా’ అని అంటూ బాబా వేసిన ముద్రతోనే దీక్షితు శిరిడీలో కాకా అని ప్రసిద్ధుడయ్యాడు. 
ఆశ్చర్య వాటలే గణూదాసా | ఆశ్చర్య సకళాంచే మానసా | 
కాయ కాకాంచీ మోలకరీణ ఏసా | ఉలగడా కైసా కరణార | ||౫౪|| 
54. గణుదాసుకు ఆశ్చర్యం కలిగింది. అందరి మనసులోనూ ఆశ్చర్యమే. ‘ఏమిటీ! కాకా పనిమనిషి ఈ చిక్కు ముడిని విడదీస్తుందా, ఎలా?’ 
మోలకరీణ తీ మోలకరీణ | కాయ తిచే అసావే శిక్షణ | 
తీ కాయ ఏసీ విచక్షణ | వాటే విలక్షణ హే సారే | ||౫౫|| 
55. ‘ఎంతైనా పనిమనిషి పనిమనిషే కదా! ఆమె చదువెంత? ఆమె తెలివి అంత గొప్పదా? ఏదో ఇదంతా చాలా చిత్రంగా ఉంది!’ 
కోఠే శ్రుతీంచీ అర్థవ్య్తుత్పత్తి | కోఠే మోలకరణీచీ మతి | 
మహారాజ హీ తో థట్టా కరితీ | జన వదతీ ఎణే పరీ | ||౫౬|| 
56. ‘శ్రుతలను విడమర్చి భావార్థం చేప్పగలిగే తెలివి ఎక్కడ? పనిపిల్ల జ్ఞానం ఎక్కడ! మహారాజు ఏదో ఎగతాళి చేస్తున్నారు’ అని జనులు అనుకున్నారు. 
మహారాజ కేవళ వినోద కరితీ | ఏసేంచ వాటలే సర్వా చిత్తీ | 
పరి బాబాంచ్యా వినోదోక్తి | సత్యచి గమతీ గణుదాసా | ||౫౭|| 
57. కేవలం వినోదం కోసమే బాబా అలా అన్నారని అందరికీ అనిపించింది. కాని, బాబా వినోదం కోసం అలా చెప్పినా, అది నిజమే అవుతుందని గణుదాసుకు అనిపించింది. 
పరిసూని త్యా సాఈచ్యా బోలా | సాఈ బోలలే అవలీలా | 
సకృద్దర్శనీ వాటలే జనాలా | దాసగణూలా తే సత్య | ||౫౮|| 
58. బాబా అన్న మాటలు విన్నవారికి, అవి ఏదో ఊరికే పైపైకి, వినోదానికోసం, అన్నవని అందరికీ అనిపించింది. కాని గణుదాసుకు అలా కాకుండా, అవి నిజమని తెలుసు. 
సాఈ బోలలే అవలీలా | పరి బోలామాజీల లీలా | 
సదాసర్వదా పహావయాలా | ఆతుర ఝాలా జనలోక | ||౫౯|| 
59. అవలీలగా సాయి ఆ మాటలను చెప్పినా, దాని వెనుక ఏ లీల ఉంటుందో చూడాలని భక్తులకు కుతూహలంగా, ఆతురంగా ఉంది. 
అసో వా నసో వినోద వాణీ | కదా న తీ హోణే నిష్కారణీ | 
బాబాంచ్యా ఎకేకా అక్షరగణీ | అసతీ ఖాణీ అర్థాచ్యా | ||౬౦|| 
60. ఆ మాటలను వినోదానికే అని ఉండవచ్చు, కాకనూ పోవచ్చు. కాని, అది ఏ కారణమూ లేకుండా ఎన్నటికీ ఉండదు. బాబా పలికే ఒక్కొక్క అక్షరంలోనూ అర్థం అనే నిధి దాగి ఉంటుంది. 

బాబా జే జే వాచే వదత | బోల నవ్హత తే బ్రహ్మలిఖిత | 
ఎకహీ అక్షర న హోఈ వ్యర్థ | సాధీల కార్యార్థ వేళేవర | ||౬౧|| 
61. తమ నోటితో బాబా ఏమి చెప్పినా, అవన్నీ ఒట్టి మాటలు కావు. అవి బ్రహ్మ రాసిన వ్రాతలు. ఒక్క అక్షరమైనా వృథా కాకుండా, ఆయా సమయానికి సరిగ్గా జరిగేవి.
హీ దృఢభావనా దాసగణూచీ | అసో కైసీహీ తీ ఇతరాంచీ | 
నిష్ఠా జేథే జైసీ జయాచీ | ఫళ తయాసీ తైసేంచ | ||౬౨|| 
62. అని దాసగణుకు బాగా గట్టి నమ్మకం. వారి వారి ఆలోచనలను బట్టి, నమ్మకాన్ని బట్టి, ఫలితం కలుగుతుంది. 
జైసీ భావనా తైసే ఫళ | జైసా విశ్వాస తైసే బళ | 
అంతఃకరణ జైసే ప్రేమళ | బోధహీ నిర్మళ తైసాచ | ||౬౩|| 
63. భావన ఎలా ఉంటే, ఫలితాలు అలా ఉంటుంది. నమ్మకం ఎంత ఉంటే, దాని బలం కూడా అంత ఉంటుంది. మనసు ఎంత ప్రేమగా ఉంటే, జ్ఞానం కూడా అంత నిర్మలంగా ఉంటుంది. 
జ్ఞానియాంచా శిరోమణీ | మిథ్యా నవ్హే తయాచీ వాణీ | 
నిజభక్తాచీ పురవావీ మాగణీ | బ్రీద హే చరణీ బాంధిలే | ||౬౪|| 
64. జ్ఞానులలో సాయి తలమానికం. వారి మాట ఎప్పుడూ నిజం కాక పోదు. తమ భక్తుల కోరికలను నెరవేరుస్తానని వారు ప్రతిజ్ఞ బూనారు. 
గురువచన నవ్హే అన్యథా | మన లావూన పరిసా హీ కథా | 
హరేల సకల భవవ్యథా | సాధనపంథా లాగాల | ||౬౫|| 
65. గురువు మాటలు ఎప్పుడూ జరగక పోవు. ఈ కథను బాగా మనసు పెట్టి వినండి. సంసారంలోని భయాలు, బాధలు అన్నీ తొలగిపోయి, సాధనా మార్గంలో చేరుకుంటారు. 
పరతలే గణుదాస పారలే గ్రామీ | కాకాసాహెబ దీక్షితా ధామీ | 
ఉత్కంఠా కాకాంచీ మోలకరీణ కామీ11 | పడతే కైసీ మీ పాహీన | ||౬౬|| 
66. పార్లేలోని కాకాసాహేబు దీక్షితు ఇంటికి గణుదాసు తిరిగి వెళ్ళాడు. కాకా పనిమనిషి తన పనిలో ఎలా సహాయం చేస్తుందో చూడాలని చాలా ఉత్సుకతతో ఉన్నాడు. 
దుసరే దివశీ ప్రథమ ప్రహరీ | గణూదాస అసతా శేజేవరీ | 
సాఖరఝోంపేచ్యా ఆనందాభీతరీ | తై నవలపరీ వర్తలీ | ||౬౭|| 
67. మరునాడు తెల్లవారే, గణుదాసు ఇంకా పడకమీద సుఖమైన నిద్రలో ఆనందంగా ఉన్నప్పుడు, ఒక అద్భుతం జరిగింది. 
కోణీ ఎక కుణబ్యాచీ పోరీ | గాత హోతీ మంజూళ స్వరీ | 
ఖోంచలీ తీ సుందర లకేరీ | జివ్హారీ గణుదాసాంచ్యా | ||౬౮|| 
68. ఎవరో ఒక కుణబి జాతి రైతు బిడ్డ, చాలా ఇంపైన గొంతుతో పాడుతూ ఉంది. ఆ స్వరాలలోని తియ్యదనం గణుదాసు హృదయంలోకి చొచ్చుకొని పోయింది. 
దీర్ఘ ఆలాపయుక్త తే గాన | జయాంత మంజూళ పదబంధన | 
పరిసోని తల్లీన ఝాలే మన | లక్ష దేఊన ఏకతీ | ||౬౯|| 
69. దీర్ఘమైన ఆలాపనతో పాడిన ఆ పాటలోని, చక్కటి పదాల కూర్పును విని, అతని మనసు తల్లీనమవటంతో, అతడు ఇంకా శ్రద్ధగా వినసాగాడు. 
ఖడబడూన జాగే ఝాలే | గీతార్థబోధనీ లక్ష వేధలే | 
సావచిత్తాచి ఏకత రాహిలే | ప్రసన్న ఝాలే అభ్యంతరీ | ||౭౦||
70. ఆ పాటలోని పదాల అర్థం తెలియగానే, ఉలిక్కిపడి లటుక్కున లేచి, ఇంకా శ్రద్ధగా వినసాగాడు. వింటున్నంత సేపూ అతనికి చాలా ఆనందమైంది. 

మ్హణతీ హీ ఆహే కోణాచీ పోర | గాతసే గంభీర ఆణి సుస్వర | 
ఈశావాస్యాచే తే కోడే థోర | ఉకలిలే పార కీ ఈనే | ||౭౧|| 
71. ‘చక్కటి గొంతుతో ఇంత మధురంగా పాడుతున్న ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఈశావాస్యంలోని చిక్కు సమస్యను విడదీసేది ఈ అమ్మాయేనా?’ 
అసో హీచ తీ మోలకరీణ | పాహూంతరీ ఆహే కోణ | 
జీచ్యా అసంస్కృత వాణీమధూన | శ్రుత్యర్థ ఖూణ పటవిలీ | ||౭౨|| 
72. ‘అయితే ఆ పనిమనిషి ఈ పిల్లేనా? ఏ సాధనా లేని పల్లె పిల్ల గొంతులోంచి, శ్రుతుల గొప్పతనాన్ని చెప్పే పిల్ల ఎవరో చూడాలని’ అనుకుని, 
బాహేర జాఊని జో పాహతీ | ఖరేంచ కుణబ్యాచీ పోర హోతీ | 
తీ కాకాచ్యా మోరీవరతీ | ఘాశీత హోతీ బాసనే12 | ||౭౩|| 
73. బయటకు రాగానే, నిజంగానే ఒక కుణబి జాతి బిడ్డ, కాకా ఇంట్లో మోరీ దగ్గర, అంట్ల గిన్నెలు తోముతూంది. 
శోధాంతీ కళలీ నవలపరీ | హోతా తేవ్హా దీక్షితాంచే ఘరీ | 
నామ్యా గడీ తయాంచే చాకరీ | బహీణ హీ పోరీ తయాచీ | ||౭౪|| 
74. ఆమె గురించి విచారించగా, దీక్షితు ఇంట్లో పనిచేసే ‘నామ్యా’ అనే నౌకరు చెల్లెలు అని తెలిసింది. 
హీచ తీ కాకాంచీ మోలకరీణ | గీతే యా ఝాలే శంకా నివారణ | 
రేడ్యాముఖే వేద గాయన | సంతీ కాయ న కేలే జీ | ||౭౫|| 
75. అయితే, కాకా ఇంట్లో పనిమనిషి ఈ పిల్లే! ఆమె పాట ద్వారా అతని సంశయం తొలగి పోయింది. ఎనుబోతు నోటినుండి వేదాన్ని చెప్పించగలిగిన (జ్ఞానేశ్వరుడు) ఈ సత్పురుషులు ఏం చేయలేరు? 
ఏసే తే పోరీచే గాయన | ఝాలే దాసగణూంచే సమాధాన | 
బాబాంచ్యా థట్టేచేహీ మహిమాన | ఆలే కీ కళూన సకళాంతే | ||౭౬|| 
76. ఆ పిల్లయొక్క గానంతో దాసగణు మనసుకు తృప్తి కలిగింది. వినోదానికి అన్నవి అనుకున్న బాబా మాటలలోని మహిమ అందరికీ తెలిసి వచ్చింది. 
కోణీ మ్హణతీ గణుదాస | బసలే హోతే దేవపూజేస | 
కాకాంచే యేథే దేవఘరాస | తదా యా గీతాస పరిసిలే | ||౭౭|| 
77. కాకా ఇంట్లోని పూజ గదిలో, గణుదాసు దేవుని పూజకు కూర్చుని ఉండగా, ఈ పాటను విన్నాడని కొందరు అంటారు. 
అసో తే జైసే అసేల తైసే | తాత్పర్యార్థ ఎకచి అసే | 
మహారాజ నిజభక్తా శికవితీ కైసే | అనేక మిసే అవలోకా | ||౭౮|| 
78. ఏది ఏమైనా కాని, దాని అర్థం ఒకటే. సాయి మహారాజు తమ భక్తులకు ఎన్నో నెపాలతో, ఎలాంటి శిక్షణను ఇచ్చేవారో గమనించండి. 
“ఠాఈంచ బైసోని మజలా పుసా | ఉగీచ కా రానోమాళ గింవసా | 
పురవితో మీ తుమచా ధింవసా | ఎవఢా భరంవసా రాఖావా | ||౭౯|| 
79. “మీరు ఎక్కడున్నా, ఉన్న చోటే కూర్చుని, నన్ను అడగండి. ఊరికే అడవులలోనో లేక ఎక్కడెక్కడో అనవసరంగా తిరగటం ఎందుకు? తెలుసుకోవాలన్న మీ కుతూహలాన్ని నేను తీర్చుతాను. ఆ మాత్రం నన్ను నమ్మండి. 
అసో మీ భరలో సర్వాంఠాయీ | మజవీణ రితా ఠావ నాహీ | 
కుఠేహీ కసాహీ ప్రకటే పాహీ | భావాపాయీ భక్తాంచ్యా” | ||౮౦||
80. “నేను అంతటా ఉన్నాను. నేను లేని ఖాలీ చోటు లేదు. భక్తుల భావాన్ని బట్టి, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే వారికి కనిపిస్తాను”. 

అసో తీ ఆఠా వరసాంచీ పోర | కాసేస ఎక ఫాటకే ఫటకూర | 
పరి నారింగీ సాడీచా బడివార | గాఈ తీ సుస్వర గీతాంత | ||౮౧|| 
81. ఎనిమిదేళ్ళ ఆ పనిపిల్ల, చిరిగి పోయిన గుడ్డ ముక్కను నడుముకు చుట్టుకుని ఉంది. అయినా నారింజ రంగు చీర అందాన్ని వర్ణిస్తూ, చక్కని గొంతుతో పాట పాడ సాగింది.
“కాయ త్యా సాడీచా భరజర | కాయ త్యా సాడీచా కాంఠ సుందర | 
కాయ మౌజేచా తిచా పదర” | యాంతచి తీ చూర గాతానా | ||౮౨|| 
82. ‘ఆ జరీ చీర ఎంత గొప్పగా ఉంది! ఆ చీర అంచు ఎంత అందంగా ఉంది! దాని కొంగు ఎంత అద్భుతంగా ఉంది!’ అని పాడుతూ ఆ చీరను వర్ణించడంలో లీనమైపోయింది. 
ఖాయాలా మిళేనా పోటభర | చింధీ న వేఢాయా బోటభర | 
పరి కోణాచ్యాహీ నారింగీ సాడీవర | హర్షనిర్భర తీ దిసలీ | ||౮౩|| 
83. కడుపు నిండా తినటానికి తిండి లేదు. ఒంటి నిండా కప్పుకోవటానికి చిరిగిన పాత గుడ్డ కూడా లేదు. అయినా, ఎవరిదో నారింజ రంగు చీరను వర్ణించడంలోనే ఆమె ఆనందంతో నిండిపోయింది. 
పాహూని తియేచీ దైన్య స్థితీ | ఆణి మనాచీ రంగేల వృత్తీ | 
కీంవ ఉపజలీ గణుదాసాంప్రతీ | కాయ నివేదితీ మోరేశ్వరా13 | ||౮౪|| 
84. అంత దైన్య స్థితిలోనూ ఆ పిల్ల మనసులోని ఆనందాన్ని చూచి, గణుదాసుకు జాలి కలిగి, మోరేశ్వరునితో (ప్రధాన్) ఏం చెప్పాడంటే, 
పహా హో హిచే అంగ ఉఘడే | ద్యా కీ తిలా ఎకాదే లుగడే | 
రుజూ హోఈల ఈశ్వరాకడే | పుణ్యహీ ఘడేల తుమ్హాంతే | ||౮౫|| 
85. ‘ఆ పిల్లను చూడు! ఒంటి నిండా బట్ట కూడా లేదు. ఆమెకు ఒక చీర ఇవ్వు. నీ సేవను ఈశ్వరుడు మెచ్చుకుంటాడు. నీకు పుణ్యం కూడా వస్తుంది’. 
ఆధీంచ మోరేశ్వర కృపామూర్తీ | వరీ దాసగణూంచీ వినంతీ | 
సుందర సాడీ ఖరేదీ కరితీ | ఆనందే అర్పితీ పోరీతే | ||౮౬|| 
86. అసలే మోరేశ్వరుడు దయగలవాడు. ఆ పైన దాసగణుయొక్క కోరిక. అందమైన చీరనొకటి కొని, సంతోషంగా ఆ పిల్లకు ఇచ్చాడు. 
నిత్య ఖాణారీ జీ కదన్న | తిలా లాధావే పంచపక్వాన్న | 
తేవీ తీ ములగీ సుప్రసన్న | జాహలీ పాహూన తీ సాడీ | ||౮౭|| 
87. రోజూ సద్దన్నం తినే వారికి, పంచభక్ష్యాలు దొరికినట్లుగా, ఆ చీరను చూచి, ఆ పిల్ల చాలా సంతోషించింది. 
దుసరే దివశీ తీ ల్యాలీ సాడీ | ఫేర14 ధరీ తీ ఖేళే ఫుగడీ | 
దిసలీ ఇతర పోరీవర కడీ | మోఠీ ఆవడీ సాడీచీ | ||౮౮|| 
88. మరునాడే ఆ చీరను కట్టుకుని వచ్చింది. గిరగిరా తిరుగుతూ, ఇతర పిల్లలతో ‘ఫుగడీ’లో గెంతుతూ, తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. మిగిలిన పిల్లల కంటే ఆమె చాలా గొప్పగా కనిపించింది. ఆ చీర అంటే ఆమెకు విపరీతమైన ప్రేమ. 
తీచ పుఢే దుసరే దివశీ | సాడీ ఠేవూని పడదణీసీ15
గుండాళీ పూర్వీల ఫటకురాసీ | పరి హిరముసీ దిసేనా | ||౮౯|| 
89. దానికి మరునాడు, ఆ కొత్త చీరను దాచుకుని, మునుపటి వలె చింకి గుడ్డను చుట్టుకుంది. అయినా ఆమె కుంగిపోయినట్టు కాని, బాధపడినట్లు కాని, కనిపించలేదు. 
నాహీ ల్యాలీ, కేలీ జోగవణ | తథాపి తిచే పూర్వీల దైన్య | 
గణుదాసా భాసే ఝాలే విచ్చిన్న | భావనేచ్యా భిన్నత్వే | ||౯౦||
90. కొత్త చీర కట్టుకోలేదు, అయినా ఆమె దైన్య స్థితి తొలగిపోయినట్లు గణుదాసుకు అనిపించింది. ఆమె మనసులోని ఆలోచనలు మారడంతో, మునుపున్న దైన్యం పోయినట్లు అతనికి అనిపించింది. 

నవీ సాడీ ఠేవిలీ సదనీ | జరీ ఆలీ ఫాటకే నేసూనీ | 
తరీ తీ దిసేనా ఖిన్న మనీ | నవ్హతీ కీ ఉణీవ సాడీచీ | ||౯౧|| 
91. కొత్త చీరను ఆ పిల్ల ఇంట్లో దాచుకుని, చింకి గుడ్డను కట్టుకుని వచ్చినా, కొత్త చీరను కట్టుకోలేదన్న బాధ కాని, లోటు కాని, ఆమె మనసులో లేదు. 
అసమర్థపణే ఫాటకే లేణే | సమర్థపణే హీ తైసేంచ కరణే | 
యా నాంవ దైన్య సంపన్నపణే మిరవణే | భావనే గుణే సుఖదుఃఖ | ||౯౨|| 
92. చేత కాకుండా పేదరికంలో పాత బట్టలు కట్టుకున్నా, బాగా ఉన్నప్పుడు కూడా అవే పాత బట్టలను కట్టుకోవటం అంటే, పేదరికానికి గౌరవాన్నిచ్చినట్లు. మనసులోని ఆలోచనల వలనే సుఖదుఃఖాలు అనేవి. 
హేంచ తే గణుదాసాంచే కోడే | ఎణే పరీ జేవ్హా ఉలగడే | 
ఈశావాస్యాచే కేణే16 సాంపడే | ఠాయీంచ పడే అర్థబోధ | ||౯౩|| 
93. ఈ విధంగా గణుదాసు సమస్య తీరడంతో, అతనికి ఈశావాస్యంయొక్క సారాంశం తెలిసి, దాని అర్థం వెంటనే బొధ పడింది. 
ఈశేంచ17 ఆచ్చాదిలా జేథే సారా | హా అవఘా బ్రహ్మాండాచా పసారా | 
తేథే తయావీణ ఉఘడా థారా18 | కోణ విచారా మానీయా | ||౯౪|| 
94. ఈశ్వరుడే ఈ బ్రహ్మాండాన్నంతా వ్యాపించి ఉన్నప్పుడు, అతను లేని ఖాళీ చోటు ఉన్నదని ఎవరు అనుకోగలరు? 
తేహీ19 పూర్ణ హేహీ పూర్ణ | పూర్ణాపాసావ ఉద్భవలే పూర్ణ | 
పూర్ణాంతూని కాఢితా పూర్ణ | రాహీల పూర్ణచి అవశేష | ||౯౫|| 
95. అదీ పూర్ణం, ఇదీ పూర్ణం. పూర్ణంనుండి పూర్ణం పుట్టింది. పూర్ణంనుంచి పూర్ణం తీసి వేస్తే, మిగిలేదీ పూర్ణమే. 
పోరీచే దైన్య ఈశ్వరీ అంశ | ఫటకూర సాడీ హేహీ తదంశ | 
దాతా దేయ దాన హేహీ అశేష | ఎకచి ఈశ భరలేలా | ||౯౬|| 
96. ఆ పసిపిల్ల పేదరికంలో ఈశ్వరుని అంశం ఉంది. చిరిగిన చీర కూడా ఈశ్వరుని అంశము. ఇచ్చేవాడు, ఇవ్వటం మరియు ఇవ్వబడేది, వీటన్నిటిలోనూ ఆ ఈశ్వరుడే నిండి ఉన్నాడు. 
“మీ మాఝే” హే పార దవడావే | నిరభిమానత్వే సదా వర్తావే | 
త్యాగపూర్వక భోగ భోగావే | అభిలాషావే నచ కాంహీ | ||౯౭|| 
97. ‘నేను, నాది’ అనే భావనలను పారద్రోలి, ఎప్పుడూ అభిమానం అనేది లేకుండా, దేనినీ కోరకుండా, దొరికిన దానిని, వైరాగ్యంతో కాని, త్యాగంతో కాని అనుభవించాలి. 
ఏసీ బాబాంచీ అమోఘ వాణీ | ప్రచీతీ మిళవిలీ అనేకాంనీ | 
అప్రాణాంత శిరడీ న సోడూని | జనీ విజనీ ప్రకటత | ||౯౮|| 
98. ఇలాంటి బాబాయొక్క శక్తియుతమైన మాటలను అనేకులు అనుభవంతో తెలుసుకున్నారు. శిరిడీనుంచి ఎక్కడికి పోకున్నా, దేహమున్నంత వరకు, బాబా జనులు ఉన్న చోటగాని, లేని చోట గాని, ఎక్కడైనా కనిపించేవారు. 
కోణాస మచ్చిందర గడావర | కోణాస కోఠేహీ అసో శహర | 
కోల్హాపూర సోలాపూర రామేశ్వర | ఇచ్ఛామాత్ర ప్రకటత | ||౯౯|| 
99. ఒకరికి మచ్చిందర కొండపైన, మరొకరికి కొల్హాపూరులోనో, సోలాపూరులోనో, రామేశ్వరంలోనో లేదా ఇంకేదైనా పట్టణంలోగాని, వారికి ఇష్టమైన రీతిగా కనిపించేవారు. 
కోణాస అపుల్యా బాహ్యవేషీ | కోణాస జాగృతీ వా స్వప్నవిశేషీ | 
దర్శన దేత అహర్నిశీ | పురవీత అసోశీ భక్తాంచీ | ||౧౦౦||
100. కొందరికి తాము ఉన్న రూపంలోనే, మరి కొందరికి కలలో, ఇంకొందరికి మేల్కొన్నప్పుడే దర్శనమిచ్చి, రాత్రింబవళ్ళూ భక్తుల కోరికలను తీర్చుతారు. 

ఏసే అనుభవ ఎక నా దోన | కితీ మ్హణోని కరావే వర్ణన | 
శిరడీంత జరీ వసతిస్థాన | అలక్ష్య ప్రస్థాన కోఠేహీ | ||౧౦౧|| 
101. ఇలాంటి అనుభవాలు ఒకటా, రెండా! ఎన్నని వర్ణించను? బాబా ఉండేది శిరిడీలోనే అయినా, ఎవరికీ తెలియకుండా, వారు ఎక్కడికైనా వెళ్ళగలరు.
పహా హీ పోర కోణాచీ కోణ | యఃకశ్చిత గరీబ మోలకరీణ | 
నారంగీ సాడీవర తిచే తే గాయన | నిఘాలే ముఖాంతూన సాహజిక | ||౧౦౨|| 
102. ‘ఈ సంగతి గమనించండి. ఈ పిల్ల ఎవరు? ఎవరి బిడ్డ? ఆమె పేదరికంలో ఉన్నా, ఆమె నోటినుండి నారింజ రంగు చీర గురించిన పాట సహజంగానే వచ్చింది. 
శంకా మ్హణూన బాబాంస పుసావీ | యా మోలకరిణీనే తీ నిరసావీ | 
తీహీ కాకాంచ్యా ఇథే అసావీ | రచనా హీ మాయావీ నాహీ కా | ||౧౦౩|| 
103. ‘సందేహం కలిగిందని, బాబాను అడగటం, ఆ సందేహాన్ని కాకా ఇంట్లోని పనిమనిషే తీర్చటం, ఇదంతా ఏదో మాయ చేసినట్టు అనిపించదూ! 
ఆధీ హీ తేథే మోలకరీణ | అసావీ హే కైసే బాబాంస జ్ఞాన | 
తీహీ భవిష్యకాళీ హే గాఊన | శ్రుత్యర్థ బోధన వ్హావే కసే | ||౧౦౪|| 
104. ‘అసలు, కాకా ఇంట్లో ఒక పనిమనిషి ఉందని, ఆమె భవిష్యత్తులో పాటపాడి, శ్రుతుల అర్థాన్ని బోధిస్తుందని, ముందుగానే బాబాకు ఎలా తెలుసు? 
పరి తే ఝాలే ఝాలే ఖాస | వాటలే ఆశ్చర్య గణు దాసాంస | 
 ఆశంకేచా ఝాలా నిరాస | ఈశావాస్య ఆకళలే | ||౧౦౫|| 
105. ‘కాని, జరగటమేమో అలానే జరిగింది’. గణుదాసుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎలాగైనా, అతని సందేహం తీరి, ఈశావాస్య గురించి బాగా అర్థమైంది. 
శ్రోతియా మనీ యేఈల శంకా | ఖటాటోప హా తరీ కా ఇతుకా | 
స్వయేంచ స్వముఖే బాబాంనీచ కా | ఫేడిలీ న ఆశంకా తేథేచ | ||౧౦౬|| 
106. ‘అసలు ఈ గొడవంతా ఎందుకు? తమ నోటితోనే, స్వయంగా బాబాయే ఆ సందేహాన్ని అక్కడే తీర్చేయవచ్చు కదా!’ అని శ్రోతలకు అనుమానం కలుగుతుంది. 
హే కాయ జాగీచ నసతే కరవలే | పరి తే నసతే మహిమాన కళలే | 
ఈశే త్యా పోరీసహీ ఆచ్చాదిలే | ప్రకట హే కేలే బాబాంనీ | ||౧౦౭|| 
107. నిజమే, అలా అక్కడే చేయవచ్చు, కాని, ఆ ఘటనలోని గొప్ప మహాత్యం ఎలా తెలిసేది? ఆ చిన్న పిల్లలో కూడా ఈశ్వరుడు నిండి ఉన్నాడు అన్న దానిని బాబా నిరూపించారు. 
ఆత్మయాథాత్మ్య నిరూపణ | హేంచ సర్వోపనిషదాంచే పర్యవసాన | 
హేంచ మోక్షధర్మ నిష్కర్షణ | గీతార్థ ప్రవచన తే హేంచ | ||౧౦౮|| 
108. ఆత్మయొక్క అసలైన జ్ఞానాన్ని తెలియ చేయటమే ఉపనిషత్తులన్నిటి గురి. మోక్షం పొందటానికి పాటించాల్సిన నియమాల వివరణ ఇదే. గీతయొక్క నిజమైన గొప్పతనం కూడా ఇదే. 
ప్రాణీ భిన్న ఆత్మా అభిన్న | ఆత్మా కతృత్వ భోక్తృత్వహీన | 
తో న అశుద్ధ పాపపుణ్యాధీన | కర్మాచరణ త్యా నాహీ | ||౧౦౯|| 
109. జీవులు వేరు వేరుగా ఉన్నా, ఆత్మ ఒక్కటే. ఆత్మ ఏ పనీ చేయదు (కతృత్వం); ఆ పని వలన వచ్చే ఫలితాలనూ అనుభవించదు (భోక్తృత్వం). ఆత్మ ఎప్పుడూ పవిత్రం. ఆత్మకు పాప పుణ్యాలు లేవు. ఆత్మ పనులను చేయాలని (కర్మాచరణ) లేదు. 
మీ జాతీనే ఉచ్చ బ్రాహ్మణ | ఇతర మజహూన నీచవర్ణ | 
వసే ఏసే జో భేదజ్ఞాన | కర్మాచరణ ఆవశ్యక | ||౧౧౦||
110. ‘నేను గొప్ప జాతి బ్రాహ్మణుడను. మిగతావారు నాకంటే నీచమైన కులంవారు’ అన్న భేద భావం ఉన్నంత వరకూ, పనులను చేస్తూ ఉండాలి. 

మీ అశరీర సర్వత్ర ఎక | మజహూన కోణీ నాహీ ఆణిక | 
మీచ కీ సకలాంచా వ్యాపక | స్వరూపోన్ముఖ హే జ్ఞాన | ||౧౧౧|| 
111. ‘ఏ ఆకారమూ లేక, అన్ని చోట్లలోనూ ఒకే రకంగా ఉండే ఆత్మను నేనే. నా తప్ప వేరే ఎవరూ లేరు. అన్నింటిలోనూ నేనే ఉన్నాను’ అని తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానం. 
పూర్ణబ్రహ్మస్వరూపచ్యుత | ఏసా హా జీవాత్మా పూర్వవత | 
కధీంతరీ స్వస్వరూపాప్రత | పావావా నిశ్చిత హే ధ్యేయ ||౧౧౨|| 
112. పూర్ణమైన బ్రహ్మనుండి విడిపోయింది జీవాత్మ. మరల ఏ విధంగానైనా మునుపటి లాగే ఆ పూర్ణ బ్రహ్మను చేరుకోవటమే గురి కావాలి. 
శ్రుతి స్మృతి ఆణి వేదాంత | యా సర్వాంచా హాచి సిద్ధాంత | 
హేంచి అంతిమ సాధ్య నిశ్చిత | చ్యుతాసీ అచ్యుతపద ప్రాప్తీ | ||౧౧౩|| 
113. శ్రుతి, స్మృతి మరియు వేదాంతం అన్నింటి తత్త్వం ఇదే. చివరకు సాధించవలసింది కూడా ఖచ్చితంగా ఇదే. విడిపోయిన జీవాత్మ పూర్ణ బ్రహ్మతో ఒక్కటి కావటమే. 
“సమః సర్వేషు భూతేషు” | జోంవరి అప్రాప్త హా స్థితి విశేషూ | 
తోంవరీ న భూతాత్మా హృషీకేశూ | జ్ఞాన ప్రకాశూ సమర్థ | ||౧౧౪|| 
114. అన్ని జీవులలోనూ ఒకే రకంగా ఈశ్వరుడు ఉన్నాడని తెలుసుకునే వరకు, అన్ని జీవాలలో ఉండే శ్రీకృష్ణ (హృషీకేశ), జ్ఞానమనే దీపాన్ని వెలిగించనంత వరకు, 
విహితకర్మే చిత్త శుద్ధ | హోతా హోఈల అభేద బోధ | 
శోక మోహాది సంసృతి విరుద్ధ | ప్రకటేల సిద్ధ జ్ఞాన తే | ||౧౧౫|| 
115. శాస్త్రాలు నియమించిన పనులను చేస్తూంటే, మనసు పరిశుద్ధమై, అంతా ఒకటే అన్న జ్ఞానం కలుగుతుంది. దుఃఖం, బాధలు, ఆకర్షణలు తొలగిపోయి, నిజమైన ఆత్మ తనను తాను కనిపించుకుంటుంది. 
అఖిల త్రైలోక్య సచరాచర | ఆచ్చాదీ జో ఈశ పరమేశ్వర | 
నిష్క్రియ నిష్కల జో పరాత్పర | తో అశరీర సదాత్మక | ||౧౧౬|| 
116. మూడు లోకాలలో ఉండే, కదిలే, కదలని అన్ని వస్తువులలో ఉన్న ఈశ్వరుడు – మార్పు లేనివాడు, నిర్మలుడు, ఏ పనీ చేయని వాడు, ఏ ఆకారము లేకుండా, ఎల్లప్పుడూ ఉండేదే ఆత్మ. 
నామరూపాత్మక హే విశ్వ | సబాహ్య ఆచ్చాదీ హా ఈశ | 
తో మీచ మీ భరలో అశేష | నిర్విశేష రూపత్వే | ||౧౧౭|| 
117. ‘నామ రూపాలతో ఉన్న ఈ జగత్తులో, లోపలా బయటా ఉన్నది ఆ ఈశ్వరుడే. ఏ ప్రత్యేకమైన గుణాలూ లేక అన్నింటిలో సమానంగా ఉన్న ఆ ఈశ్వరుడు నేనే’. 
అస్తు వస్తుతః జే నిరాకార | మాయాగుణే భాసే సాకార | 
కాముకాపాఠీ హా సంసార | తోచి అసార నిష్కామా | ||౧౧౮|| 
118. అసలు ఆత్మకు ఏ ఆకారమూ లేదు. కేవలం మాయా గుణం వలనే ఆకారంతో ఉన్నట్లు కనిపిస్తుంది. కోరికలు ఉన్న వారికే ఈ ప్రపంచంగాని, కోరికలు లేనివారికి అది చాలా సారం లేనిదిగా ఖాళీగా కనిపిస్తుంది. 
హే యత్కించిత భూతభౌతిక | జగత చేతనాచేతనాత్మక | 
ఈశ్వరాచి హా అద్వితీయ ఎక | నిర్ధార నిఃశంక కరావా | ||౧౧౯|| 
119. పంచ భూతాలతో, కదిలే, కదలని వస్తువులతో నిండి ఉన్న ఈ జగత్తులో, ఈశ్వరుడు ఒక్కడే గాని రెండవ వారెవరూ లేరని, ఏ సందేహమూ లేక, ఖచ్చితంగా తెలుసుకోవాలి. 
జగద్బుద్ధీచా హా వివేక | జరీ మనాసీ పటేనా దేఖ | 
తరి హే ధనహిరణ్యాదిక | యాంచా అభిలాఖ న కరావా | ||౧౨౦||
120. జగత్తు గురించిన ఈ సూక్ష్మ బుద్ధి, మనసుకు నచ్చకపోతే, కనీసం డబ్బు, బంగారం వీటి వెనుకబడటమైనా వదిలి వేయాలి. 

హేహీ జరీ న ఘడే తరీ | జాణావే ఆపణ కర్మాధికారీ | 
ఆమరణాంత శతసంవత్సరీ | కర్మచి కరీత రహావే | ||౧౨౧|| 
121. అది కూడా కాకపోతే, పనులు చేయటమే మన పని అని తెలుసుకుని, ఈ జీవితం ముగిసేంత వరకూ, పనులను చేస్తూనే ఉండాలి. అది వందేళ్ళయినా సరే!
తేంహీ స్వవర్ణాశ్రమోచిత | యథోక్తానుష్ఠానసహిత | 
అగ్నిహోత్రాది నిత్యవిహిత | చిత్త అకలంకిత హోఈతో | ||౧౨౨|| 
122. ఆ పనులైనా, తమ తమ జాతికి, వయస్సుకు సరిపోయే విధంగా, శాస్త్రాలలో చెప్పిన రీతిగా, అగ్నిహోత్రం మొదలైన రోజూ చేసే పనులను, శ్రద్ధగా చేస్తే, మనసు పరిశుద్ధమౌతుంది. 
హా ఎక చిత్తశుద్ధీచా మార్గ | దుజా సర్వసంగ పరిత్యాగ | 
హే న ఆక్రమితా జ్ఞానయోగ | కర్మభోగచి కేవళ | ||౧౨౩|| 
123. మనసు శుద్ధం కావటానికి ఇది ఒక దారి (కర్మయోగం). రెండవది, అందరినీ, అన్నింటినీ వదిలి పెట్టి, ఒంటరిగా ఉండటం (జ్ఞానయోగం). ఈ రెండింటిలో దేనినీ అనుసరించ లేకపోతే, కేవలం పనులను చేస్తూ, దైవం నిర్ణయించిన సుఖదుఃఖాలను అనుభవించటమే. 
హీ బ్రహ్మవిద్యా హే ఉపనిషద | సర్వా న దేతీ అధికారవిద20
వృత్తీ న జోంవర ఝాలీ అభేద | ఉపనిషద్బోధ శాబ్దిక | ||౧౨౪|| 
124. ఎవరికి ఏ అర్హత ఉన్నదో తెలుసుకోగలిగిన సద్గురువు, ఆత్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల జ్ఞానాన్ని అందరికీ ఇవ్వరు. మనసులో ‘అంతా ఒక్కటే’ అనే భావం కలగక పోతే, ఉపనిషత్తుల జ్ఞానం అర్థం కాకుండా, చిలక పాఠంలా, పదాలను తెలుసుకోవడమే. 
తరీ తోహీ వ్హావా లాగే | జిజ్ఞాసు ఆధీ తోచ మాగే | 
మ్హణోని బాబాంహీ పాఠవిలే మాగే | మోలకరీణ సాంగేల మ్హణోని | ||౧౨౫|| 
125. అయినా, అలాంటి పదాల జ్ఞానం కూడా అవసరం. ఎందుకంటే, తెలుసుకోవాలని ఆరాట పడేవారు, దానినే ముందుగా అడుగుతారు. అందుకే, పనిపిల్ల చెబుతుందని అతనిని బాబా పార్లేకు పంపారు. 
స్వయేంచ బాబా హా బోధ దేతే | తరీ హే పుఢీల కార్య న ఘడతే | 
’ఎకమేవాద్వితీయ’ నసతే | జ్ఞాన హే కళతే బాబాంచే | ||౧౨౬|| 
126. దీనిని బాబా తామే వివరించి చెప్పి ఉంటే, తరువాతి ఘటన జరిగేది కాదు. ‘అంతా ఒక్కటే, మిగతాది ఏదీ లేదు’ అని వారు చెప్పదలచుకున్న బోధ అతనికి అర్థమయ్యేది కాదు. 
మజవాంచూన ఆణీక కోణ | ఆహే తీ కాకాంచీ మోలకరీణ | 
మీచ తీ హీ దిధలీ ఖూణ | ఈశావాస్య జాణవిలే | ||౧౨౭|| 
127. “కాకాయొక్క పనిమనిషి నేను కాక ఇంకెవరు?” ఆమె రూపంలో “ఆమె నేనే” అన్న జ్ఞానాన్ని బోధించి, ఈశావాస్యం అన్న దానికి అర్థాన్ని వివరించారు. 
పరమేశ్వరానుగ్రహ లేశ | ఆచార్యానుగ్రహ విశేష | 
నసతా న ఆత్మజ్ఞానీ ప్రవేశ | సిద్ధోపదేశచి ఆవశ్యక | ||౧౨౮|| 
128. ఈశ్వరానుగ్రహం కొంచెం కూడా లేకపోయినా, గురువుల ప్రత్యేకమైన అనుగ్రహం లేకపోయినా, సిద్ధుల ఉపదేశం ఉంటేనే ఆత్మజ్ఞానం దొరికేది. 
ఆత్మప్రతిపాదక జే జే శాస్త్ర | శ్రవణీ ఆణావే తే తేంచ మాత్ర | 
ప్రతిపాద్య జేతే మీచ సర్వత్ర | మజవీణ అన్యత్ర కాంహీచ న | ||౧౨౯|| 
129. ‘అన్ని చోట్లా నేనే, నేను కాక మిగతాదేదీ లేదు’ అని తెలిపే, ఆత్మ గురించి వివరించే, శాస్త్రాలను మాత్రమే వినాలి. 
హోతా ఆత్మతత్వాచే వివరణ | తోచ మీ ఆత్మా నవ్హే ఆన | 
హే జయాసీ అభేదానుసంధాన | ఆత్మాహీ ప్రసన్న తయాసీచ | ||౧౩౦||
130. అలా ఆత్మ గురించి వివరంగా తెలిసిన తరువాత, ‘నేనే ఆత్మను, వేరే కాదు’ అని తెలుసుకున్న వారికే ఆత్మ ప్రసన్నమై కనిపిస్తుంది. 

అసో ఆత్మనిరూపణ హోతా | ఏసేంచ ఆత్మానుసంధాన రాఖితా | 
ఏసీచ నిశ్చల ధరితా ఆత్మతా | పరమాత్మా హాతా యేఈల | ||౧౩౧|| 
131. ఈ విధంగా, ఆత్మను తెలుసుకుంటే, ఇలా ఎప్పుడూ ఆత్మతో ఒక్కటైతే, అప్పుడే పరమాత్మ దొరికేది. 
పుఢీల అధ్యాయ కథానుసంధాన | వినాయక ఠాకూరాది21 కథా కథన | 
శ్రోతే కరోత సాదర శ్రవణ | పరమార్థ ప్రవణ హోతీల | ||౧౩౨|| 
132. తరువాతి అధ్యాయంలో, వినాయక ఠాకూరు మొదలగు వారి కథలను శ్రద్ధగా వింటే, శ్రోతలు పరమార్థం వైపు ఆకర్షితులవుతారు. 
త్యాహీ కథా ఏశాచ గోడ | ఏకతా పురేల శ్రోతియాంచే కోడ | 
మహాపురుష దర్శనాచీ హోడ | పురేల చాడ భక్తాంచీ | ||౧౩౩|| 
133. ఆ కథలు కూడా ఇలాగే మధురంగా ఉంటాయి. మహాపురుషుల దర్శనం చేసుకోవాలనే శ్రోతల కోరిక ఆ కథలను వినటంతో తీరుతుంది. 
జైసా ఉగవతా దినమణీ | అంధార జాయ నిరసోనీ | 
తేవీ యా కథా పీయూషపానీ22 | మాయా హరపోనీ జాతసే | ||౧౩౪|| 
134. సూర్యుడి రాకతో, చీకటి తొలగిపోయేలా, ఈ కథలలోని అమృతం తాగిన వెంటనే, మాయ హరించుకుని పోతుంది. 
అతర్క్య సాఈంచే విందాన | త్యావీణ కోణ కరీల కథన | 
మీ తో ఎక నిమిత్త కరూన | తేచి తే వదవూన ఘేతీల | ||౧౩౫||
135. ఆలోచనలకు అందనివి సాయి లీలలు. వాటిని వారు తప్ప ఎవరు సరిగ్గా చెప్పగలరు? నేను నిమిత్త మాత్రుణ్ణి అంతే. నాతో చెప్పించేది వారే. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | ఈశావాస్యభావార్థబోధనం నామ | 
| వింశోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. సంస్కృత భాషా న జాణణార్యాంకరితా. (౧౬ భాషానభిజ్ఞార్థ) 
2. ‘ఈశావాస్య’ నావాచ్యా ఉపనిషదాచా అర్థ. (౧౬ ఈశావాస్యోపనిషదర్థ) 
3. త్యాచా అవఘడపణా. (౨౫ తద్దుర్గమతా) 4. నాహీశీ ఝాలీ. (౨౫ విరాలీ) 
5. భావార్థబోధినీ. (౨౮ బోధినీ-దిగ్దర్శన) 
6. యా భావార్థబోధినీచే హృద్గత, మ్హణజే మర్మ జాణావయాస. (౨౮ హృద్గతార్థా) 
7. మూళ గ్రంథాచే అవలోకన. (౨౮ మూలావలోకన) 8. జేవ్హా. (౨౯ జధీ) 
9. కాకా మహాజనీ. (౫౦ మహాజనీస) 10. నానాసాహేబ నిమోణకర. (నిమోణకరా) 
11. ఉపనిషదాచా అర్థావబోధ కరణ్యాచ్యా కామీ. (౬౬ కామీ) 12. భాండీ. (౭౩ బాసనే) 
13. రా. మోరేశ్వర విశ్వనాథ ప్రధాన. (౮౪ మోరేశ్వరా) 14. గరగరా ఫిరణే. (౮౮ ఫేర) 
15. సాఠవణీచే సణంగాత. (౮౯ పడదణీసీ) 16. గడ్డా. (౯౩ కేణే) 
17. ఈశ్వరానేచ. (౯౪ ఈశేంచ) 18. స్థళ. (౯౪ థారా) 
19. ‘ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యత | 
           పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||’. (౯౫ తేంహీ) 
20. కోణాచా అధికార కాయ ఆహే హే జాణణారే. (౧౨౪ అధికారవిద) 
21. రా. వినాయక హరిశ్చంద్ర ఠాకూర, బీ. ఎ. ఇత్యాదికాంచ్యా. (౧౩౨ వినాయక ఠాకూరాది) 
22. కథామృత. (౧౩౪ కథాపీయుషపానీ)

No comments:

Post a Comment