శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౮ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
జయ సద్గురో పరమ నిత్యా1 | జయ సద్గురో బ్రహ్మసత్యా |
అనుభవే దావిసీ జగ్న్మిథ్యా | మాయా నియంత్యా జయ జయ | ||౧||
1. ఎప్పటికీ ఉండే, పరమ సత్యమూ అయిన సద్గురు దేవా! నీకు జయము జయము! ఈ జగత్తు సత్యం కాదని, మీ భక్తులకు అనుభవాన్నిచ్చి మీరు తెలుపుతారు. మాయను ఎప్పుడూ మీ అధీనంలో ఉంచుకునే దేవా! మీకు జయము జయము!
జయజయాజీ అనాద్యనంతా | జయజయాజీ ద్వంద్వాతీతా2 |
జయజయాజీ వికారరహితా3 | నిజరూప4 బోధితా తూ ఎక | ||౨||
2. చివర, మొదలు లేని మీకు జయము జయము! విరుద్ధ భావాలను మీరిన మీకు జయము జయము! ఏ రకమైన మార్పులు లేని మీకు జయము జయము! వేరే ఎవ్వరికీ బోధించడం సాధ్యం కాని, ఆత్మ రూపాన్ని, మీరొక్కరే స్పష్టంగా బోధించగలరు.
సాగరీ రిఘాలీ కరూ ఆంఘోళీ | పరతేల కాయ సైంధవాచీ5 పుతళీ5 |
హేతో న ఘడే కదాకాళీ | తుజజవళీహీ తైసేంచ | ||౩||
3. ఉప్పుతో చేయబడ్డ బొమ్మ, స్నానానికని సాగరంలో దిగితే, బయటకు రాగలదా? అది ఎప్పటికీ సాధ్యం కాని పని. మీ గురించి తెలుసుకోవటం కూడా అట్లే.
వేదశ్రుతి హీ జయావిశీ | వివాద కరితీ అహర్నిశీ |
తే అలక్ష్య తూ బోటానే దావిశీ | అప్రయాసే భక్తాంసీ | ||౪||
4. ఊహకందని పరబ్రహ్మ గురించి, వేదాలు శ్రుతులూ రాత్రింబవళ్ళూ చర్చించుకుంటాయో, అలాంటి ఆ బ్రహ్మను, భక్తులకు చాలా సులభంగా, మీ వ్రేలితో మీరు చూపిస్తారు.
ఆలాచ దైవాచా యోగ జర కా | పడలా పురేకా తుఝా గర్కా6 |
మగ హా ఆపులా వాహా పరకా | నాహీ యా కుతర్కా స్థాన తై | ||౫||
5. దేవుడి దయవల్ల, ఎవరైనా మీ ఆశ్రయంలోకి వస్తే, వారికి ‘తమది, ఇతరులది’ అనే తక్కువ భావాలు ఉండవు.
గతాధ్యాయీ కథా పావన | బ్రహ్మ గుండాళ్యాచే ఆవిష్కరణ |
బ్రహ్మార్థియాచే లోభావరణ | ప్రతిబంధ కారణ వర్ణిలే | ||౬||
6. నోట్ల కట్టలో చుట్టి ఉన్న బ్రహ్మను బయటికి తీసి, బ్రహ్మను కోరుకునే వారికి, పిసినారితనం పెద్ద అడ్డంకని తెలిపిన పావన కథను, మునుపటి అధ్యాయంలో వర్ణించడమైనది.
ఆతా మదనుగ్రహ7 కథా | శ్రవణ కీజే ఆదరే శ్రోతా |
అనుభవా యేఈల తుమచియా చిత్తా | మార్గ దర్శకతా బాబాంచీ | ||౭||
7. ఇప్పుడు చెప్పబోయే, బాబా నన్ను అనుగ్రహించిన, ఈ కథను, శ్రోతలు శ్రద్ధగా వింటే, భక్తులకు బాబా ఎలా దారిని చూపేవారో మీకు అనుభవమవుతుంది.
హీ హీ ఆహే గోడ వార్తా | తీ మీ కథితో యథార్థతా8 |
శ్రోతా ఆపులాలియా స్వార్థా | స్వస్థ చిత్తా పరిసావీ | ||౮||
8. మధురమైన ఈ కథను, అది ఎలా జరిగిందో అలానే మీకు చెబుతాను. తమ శ్రేయస్సు కొరకు, శ్రోతలు శాంతంగా, నెమ్మదిగా వినండి.
అసతా శ్రవణార్థీ సాదర | వక్త్యాస ఉల్హాస ఆణి ఆదర |
హృదయా ఫుటే ప్రేమ పాఝర | ఆనంద నిర్భర ఉభయతా | ||౯||
9. వినేవారు శ్రద్ధగా వింటే, చెప్పేవారికీ ఉత్సాహం కలిగి, అలా ఇద్దరి హృదయాలలో ప్రేమ పొంగి, ఆనందం కలుగుతుంది.
న కరితా బుద్ధిభేద తిళభర | జైసా జయాచా అధికార |
తైసాచ తయాస మార్గ సాచార | ఉపదేశ పురఃసర దావితీ | ||౧౦||
10. భక్తుల మనసులో ఏ మాత్రం కలత, అలజడి కలగించకుండా, వారు తెలుసుకోగలిగిన రీతిలోనే, వారికి సరియైన దారిని, బాబా బోధించేవారు.
ఏసే కితీఎకాంచే మతే | గురూనే జే కథిలే జ్యాతే |
కథితా9 నయే తే ఇతరాంతే | విఫల హోతే గురువాణీ | ||౧౧||
11. గురువు చెప్పిన ఉపదేశాన్ని, ఇతరులకు తెలియ చేస్తే, గురువు చెప్పినది ఫలించదని అనేకులు అనుకుంటారు.
హెతో కేవళ కాల్పనిక | నసతే స్తోమ నిరర్థక |
ప్రత్యక్ష కాయ స్వప్నోక్త10 హీ దేఖ | కథితీ సద్బోధక సకళాంతే | ||౧౨||
12. కాని, ఇది ఒట్టి అనుకోవటమే. అర్థం లేని ఆలోచనలు. అంతే కాదు. ఎదురుగా గురువులు చెప్పే ఉపదేశాన్నే కాకుండా, కలలో చెప్పిన సంగతులను కూడా ఇతరులకు తెలియ చేస్తే, అది అందరికీ మంచిని చేస్తుంది.
మానాల జరీ హే అప్రమాణ | బుధకౌశిక ఋషి ప్రమాణ |
రామరక్షా దీక్షేచే స్వప్న | కేలే కథన సర్వత్రా | ||౧౩||
13. దీనికి సాక్ష్యం లేదని అనుకుంటారేమో! బుధకౌశిక ఋషియే దీనికి ప్రమాణం. తనకు కలలో బోధించిన రామరక్షా దీక్షా మంత్రాన్ని ఆయన అందరికీ చెప్పేశాడు.
గురు వర్షాకాళీంచే ఘన | ఆవడీ వర్షతీ స్వానందజీవన |
తే కాయ ఠేవావే కోంబూన11 | యథేచ్చ సేవూన సేవవావే | ||౧౪||
14. వానాకాలంలోని మబ్బులాంటివారు గురువు. ఆనందమనే నీరును వారు ఉత్సాహంగా కురిపిస్తారు. అలాంటి నీరు సేకరించుకుని, దాచుకోవటానికా? తామూ తీసుకుని, ఇతరులకూ కావలిసినంత పంచి పెట్టాలి.
లేంకరాచీ ధరూన హనువటీ | మాయ తయాచ్యా ఆరోగ్యాసాఠీ |
మాయాళూపణే పాజీ గుటీ | తీచ హాతవటీ బాబాంచీ | ||౧౫||
15. బిడ్డల ఆరోగ్యం కోసం, తల్లి వారి గడ్డాన్ని పట్టుకుని, మాయ మాటలను చెప్పి, వారికి మందు త్రాగిస్తుంది. భక్తులకు ఉపదేశాన్ని బోధించడంలో, బాబా కౌశలం కూడా అలాంటిదే.
మార్గ తయాంచా నవ్హతా గుప్త | కోణ్యా రీతీ కైసా అవచిత |
నిజభక్తాంచా హేతు పురవిత | సావచిత్త తే ఏకా | ||౧౬||
16. వారు చెప్పే దారి, దాచుకోవటానికి కాని, రహస్యంగా కాని, ఉండేది కాదు. ఏ విధంగా, అకస్మాత్తుగా భక్తుల కోరికలను వారు తీర్చేవారో ఇప్పుడు శ్రద్ధగా వినండి.
ధన్య ధన్య సద్గురూ సంగతీ | కోణా వర్ణవే తియేచీ మహతీ |
ఆఠవితా ఎకేక తయాంచ్యా ఉక్తీ | నిజస్ఫూర్తి ఉచంబళే | ||౧౭||
17. సద్గురువుయొక్క సహవాసం ధన్యం. దాని మహిమను ఎవరు మటుకు వర్ణించగలరు? సద్గురువుయొక్క ఒక్కొక్క మాటను తలుచుకుంటే, స్ఫూర్తి పొంగుతుంది.
ప్రేమే కరితా ఈశ్వరార్చన | గురుసేవా గురూ పూజన |
హోఈల గురుగమ్య సంపాదన | ఇతర సాధన తే ఫోల | ||౧౮||
18. దేవుణ్ణి భక్తితో, ప్రేమతో పూజ చేస్తే, గురు సేవను దృఢమైన నమ్మకంతో చేస్తే, అప్పుడు గురువు బోధించగల జ్ఞానం దొరకుతుంది. ఆ జ్ఞానాన్ని పొందాలని చేసే ఇతర సాధనలన్నీ దండుగ.
విక్షేప ఆణి ఆవరణ | తేణే హా భవమార్గ సంకీర్ణ |
గురువాక్య దీపకిరణ | నిర్విఘ్న మార్గదర్శక | ||౧౯||
19. లేనిది ఆరోపించడం వలన (విక్షేపం), ఉన్నదానిని కప్పి వేయడం వలన (ఆవరణం), సాంసారిక జీవనం అయోమయంగా, మసక మసకగా ఉంటుంది. ఇలాంటి దారిని దాటటానికి, గురువుయొక్క మాటలే దీపపు వెలుగులాంటివి.
గురు ప్రత్యక్ష ఈశ్వర | బ్రహ్మ విష్ణూ మహేశ్వర |
గురూచి వస్తుతః పరమేశ్వర | బ్రహ్మ పరాత్పర గురురాయ | ||౨౦||
20. గురువే ఈశ్వరుడు. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. నిజానికి గురువే పరమేశ్వరుడు, గురువే అతి ఉత్తమమైన పరబ్రహ్మ.
గురు జననీ గురు పితా | గురు త్రాతా దేవ కోపతా |
గురు కోపతా కోణీ న త్రాతా | సదా సర్వదా జాణావే | ||౨౧||
21. గురువే తల్లి. గురువే తండ్రి. దేవుడు కోపిస్తే, గురువు రక్షిస్తాడు. కాని, గురువు కోపిస్తే, ఎవరూ రక్షించలేరు. దీనిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
ధర్మాధర్మ విరక్తీచా | వేదశ్రుతీచా ప్రవక్తా | ||౨౨||
22. సాంసారిక జీవితంలోనూ, తీర్థయాత్రాది, వ్రతాలలోనూ, ధర్మాధర్మ మరియు విరక్తి మార్గాలలో గురువే మనకు దారి చూపేది. వేదాలలోని, శ్రుతులలోని జ్ఞానాన్ని బోధించేది గురువే.
ఉఘడూని బుద్ధీచే డోళే | సంత దావితీ నిజరూప సోహళే | పురవితీ భక్తీచే డోహళే | అతి కోవళే కారుణిక | ||౨౩||
23. బుద్ధి వికాసం చెందేలా చేసి, ఆత్మ రూపంయొక్క వైభవాన్ని చూపించేది గురువే. అతి కోమల హృదయులు, కరుణామయులు అయిన సత్పురుషులు, భక్తితో కలిగిన మనుషుల కోరికలను తీరుస్తారు.
తేణే విషయ వాసనా మావళే | నిద్రేంతహీ జ్ఞానచి చావళే | వివేక వైరాగ్య ఫళ జావళే12 | కృపాబళే హాతీ యే | ||౨౪||
24. దానితో, ఇంద్రియ సుఖాల మీదున్న కోరికలు తొలగిపోయి, నిద్రలో కూడా జ్ఞాన దృష్టి ఉంటుంది. వారి దయతో, వివేకం మరియు వైరాగ్యాలనే ఫలాలు చేజిక్కుతాయి.
జాహలియా సత్సమాగమ | సంతసేవా సంతప్రేమ | స్వయే భక్తకామ కల్పద్రుమ | సర్వ శ్రమ నివారీ | ||౨౫||
25. సత్పురుషులతో ఉంటూ, ప్రేమతో వారి సేవ చేస్తే, భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షమైన దేవుడు స్వయంగా కష్టాలన్నిటినీ తొలగిస్తాడు.
సదా అసావే సత్పరాయణ | కరావ్యా సంతకథా శ్రవణ | వందావే సంతాంచే చరణ | పాపక్షాలన హోఈల | ||౨౬||
26. అందువలన, ఎల్లప్పుడూ సాధు సంతులతో ఉంటూ, వారి కథలను వింటూ, వారి పాదాలకు పూజ చేస్తే, పాపాలన్నీ తొలగిపోతాయి.
లార్డ రే జై ఇలాఖాధిపతీ | క్రాఫర్డశాహీ ఘాతలీ పాలథీ | తత్కాలీన ఎక ప్రసిద్ధ కీర్తి | లాగలే భక్తీస బాబాంచ్యా | ||౨౭||
27. బ్రిటిషు ప్రభుత్వంలో, ముంబై సంస్థానానికి, లార్డు రే గవర్నరుగా ఉన్నప్పుడు, క్రాఫర్డు (మునిసిపల్ కమీషనరు) పాలన పడిపోయింది. ఆ కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి, బాబాకు భక్తుడయ్యాడు.
హా సంసార తాపత్రయ ఖోటా | వ్యాపార ధంద్యాంత ఆలా తోటా | మనాస కంటాళా వీట మోఠా | ఘేతలా లోటా నిఘాలే | ||౨౮||
28. ఆ వ్యక్తి వ్యాపారంలో బాగా నష్టపోయి, మనసుకు చాలా విరక్తి కలిగింది. కష్టాలతో నిండి ఉన్న ఈ ప్రపంచం పనికి రానిదిగా అనిపించింది. దానితో, అన్నిటినీ వదులుకొని, చేతిలో ‘లోటా’ పట్టుకుని, బయట పడ్డాడు.
చిత్త ఝాలే అతి అస్థిర | వాటే ప్రవాసా జావే దూర | సేవావా ఎకాంత సుఖకర | ఏసా విచార దృఢ కేలా | ||౨౯||
29. మనసు చాలా కలత చెంది, దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఏకాంతంగా, సుఖంగా ఉండాలన్న ఆలోచన వచ్చింది. దానినే ఆచరించాలని నిశ్చయించుకున్నాడు.
జీవ జై పడే అతిసంకటీ | దేవ ఆఠవే తదా కష్టీ | మగ తో భక్త కరీ హాకాటీ13 | లాగే పాఠీ దేవాచ్యా | ||౩౦||
30. మనుషులు చాలా కష్టాలలో ఉన్నప్పుడే, దేవుడు గుర్తుకు వస్తాడు. నిరాశ, నిస్పృహలతో దేవుణ్ణి తలుచుకుంటూ, దేవుడి వెంట పడతారు.
పరి న లాగతా దుష్కర్మా ఓహటీ | దేవాచే నాంవ యేఈనా ఓఠీ14 |
మగ సప్రేమతా పాహూని జగజేఠీ | సంత భేటీ కరవితో | ||౩౧||
31. పాపపు పనులను చేయడం తగ్గే వరకూ, దేవుని పేరు నోటికి ఆనదు. అయినా, దేవుడు మనుషుల భక్తిని చూచి, వారిని సాధు సంతుల దగ్గరకు చేరుస్తాడు.
తైసేంచ త్యా భక్తాచే జాహలే | పాహూని సంసారా అతి కావలే15 |స్నేహీ తయాచే వదతే ఝాలే | హితవచన వహిలే తే ఏకా | ||౩౨||
32. ఆ భక్తునికి కూడా అలాగే జరిగింది. ప్రపంచంపై బాగా విరక్తి చెందిన ఆ మనిషిని చూచి, అతని స్నేహితుడు అతనికి చెప్పిన మంచి మాటలను వినండి.
కాంహో ఆపణ శిరడీస జానా | సమర్థ సాఈనాథాంచే దర్శనా |కరా కీ తయాంస ప్రార్థనా | దయాఘనా త్యా సంతా | ||౩౩||
33. ‘శిరిడీకి వెళ్ళి, సాయి సమర్థుల దర్శనం ఎందుకు చేసుకోకూడదు? అక్కడికి వెళ్ళి, దయామయులైన ఆ సత్పురుషుని ప్రార్థించండి.
క్షణైక సంత సంగతీ లాధతే | చంచల మన నిశ్చల హోతే |తాత్కాళ హరిచరణీ జడతే | మగ అవఘడ తే పరతాయా | ||౩౪||
34. ‘సత్పురుషుల సహవాసం ఒక్క క్షణం లభించినా, కలత చెందిన మనసు, శాంతించి, వెంటనే శ్రీహరి పాదాలలో లీనమై పోతుంది. అక్కడనుండి వెనుకకు మరలించడం కష్టం.
దేశోదేశీచే లోక జాతీ | సాఈపదరజీ లోళతీ |మహారాజాంచ్యా ఆజ్ఞేత వర్తతీ | అభిష్ట16 పావతీ సేవేనే | ||౩౫||
35. ‘ఎందరో దేశ దేశాలనుండి అక్కడికి వచ్చి, సాయి పాద ధూళిలో పొర్లుతారు. ఆ సాయి మహారాజు ఆజ్ఞను పాటిస్తూ, వారి సేవ చేస్తూ తమ మనసులోని కోరికలను తీర్చుకుంటారు.
ఏసీ తయాంచీ ప్రసిద్ధ కీర్తీ | ఆబాలవృద్ధ సర్వ జాణతీ |తయాంసీ యేతా కాకుళతీ | దుఃఖనివృత్తి లాధాల | ||౩౬||
36. ‘అలాంటిది వారి కీర్తి! చిన్న పిల్లలనుండి, వయసు మీరిన వారందరికీ ఇది తెలుసు; వారికి దయ కలిగితే, అన్ని వ్యథలు, నొప్పులనుండి ముక్తి కలుగుతుంది.
శిరడీ సాంప్రత పవిత్ర స్థాన | యాత్రా వాహే రాత్రందిన |తుమ్హీహీ పహా అనుభవ ఘేఊన | సంతదర్శన హితకారీ | ||౩౭||
37. ‘రాత్రింబవళ్ళూ భక్తులు రావటంతో, ఇప్పుడు శిరిడీ ఒక పుణ్య క్షేత్రం అయింది. మీరు కూడా వెళ్ళి, వారి దర్శన భాగ్యంతో జరిగే మంచిని, మీరు కూడా అనుభవంచ వచ్చు’, అని ఆ స్నేహితుడు చెప్పాడు.
అవర్షణే ఉద్విగ్న అకించన17 | అవచిత వర్షే విపుల ఘన |హోతా భుకేనే వ్యాకుళ ప్రాణ | పంచపక్వాన్న వాఢిలే | ||౩౮||
38. వానలు లేక, ఎంతగానో బాధ పడుతున్న దరిద్రునికి, అకస్మాత్తుగా బాగా వాన కురిసినట్లు, ఆకలితో అల్లాడిపోతున్న వాడికి, పంచ భక్ష్యాలు వడ్డించినట్లు -
తైసీ స్నేహ్యానే కథిలీ వార్తా | మానవలీ తీ తయా భక్తా |అనుభవ ఘ్యావా ఆలే చిత్తా | ధరిలా రస్తా శిరడీచా | ||౩౯||
39. స్నేహితుడి మాటలు అతనికి అనిపించింది. అతని సలహాను తీసుకుని, దానితో తన అనుభవాన్ని తెలుసుకోవాలని, శిరిడీకి బయలుదేరాడు.
ఆలే గాంవీ ఘేతలే దర్శన | పాయీ ఘాతలే లోటాంగణ | తత్కాళ నివాలే నయన | సమాధాన జాహలే | ||౪౦||
40. శిరిడీ చేరుకుని, సాయిని దర్శించుకుని, సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే, అతని కళ్ళు తృప్తితో నిండిపోయాయి, మనసు శాంతించింది.
జే పూర్ణబ్రహ్మ సనాతన | స్వయంజ్యోతి నిరంజన |
పాహూన ఏసే సాఈంచే ధ్యాన | సుప్రసన్న మన జాహలే | ||౪౧||
41. పూర్ణమైన పరబ్రహ్మ, ఆది అంతం లేనివాడు, తనే స్వయంగా వెలుగు రూపమైన సాయిని చూచి, అతని మనసు ఆనందంతో నిండిపోయింది.
చిత్తాస లాధలీ శాంతతా | నిశ్చింతతా దర్శనే | ||౪౨||
42. వెనుకటి ఎన్నో జన్మల పుణ్య ఫలంగా, అదృష్టం కొద్దీ, బాబా పాదాలు దొరికాయి అని అనిపించింది. సాయి దర్శనంతో, ఉన్న చింతలు దూరమయ్యి, మనసుకు శాంతి చేకూరింది.
ఉపనామ జయాంచే సాఠే | అంతరీ నిశ్చయాచే మోఠే | గురుచరిత్ర పారాయణ నేటే | నేమనిష్ఠే ఆరంభిలే | ||౪౩||
43. అతని ఉపనామం సాఠే అని. దృఢ నిశ్చయంతో, గురు చరిత్ర పారాయణను నియమ నిష్ఠలతో మొదలు పెట్టాడు.
సప్తాహ పూర్ణ హోతా నిశీ | బాబా దేతీ దృష్టాంత త్యాంశీ | నిజకరీ ఘేఊని త్యా పోథీశీ | అర్థ సాఠ్యాంసీ సమజావీత | ||౪౪||
44. వారం రోజులు పారాయణం చేసిన తరువాత, ఒక రాత్రి, గురు చరిత్ర గ్రంథాన్ని తమ చేతిలో పట్టుకుని, సాఠేకు బాబా అర్థాన్ని తెలియ చేస్తున్నట్లుగా, సాఠేకు కల వచ్చింది.
స్వయే స్థిత నిజాసనీ | సమోర సాఠ్యాంస బైసవూని | గురుచరిత్రాచీ పోథీ ఘేఊనీ | నిరూపణీ తత్పర | ||౪౫||
45. తమ ఆసనంలోనే కూర్చుని, తమ ఎదుట సాఠేను కూర్చోబెట్టుకుని, గురు చరిత్ర గ్రంథాన్ని పట్టుకుని, బాబా దాని అర్థాన్ని చెప్పసాగారు.
బాబా గ్రంథావర్తన కరితీ | పురాణికసే19 కథా నిరూపితీ | సాఠే శ్రోతేపణే స్వస్థచిత్తీ | సాదర ఏకతీ గురుకథా | ||౪౬||
46. పురాణికుని వలె బాబా గ్రంథ పారాయణ చేస్తూ, వర్ణించడం, శ్రోతవలె స్థిరమైన మనసుతో సాఠే శ్రద్ధగా గురు కథను వినటం,
హే కాయ ఏసే ఉఫరాటే | విచారాంత పడలే సాఠే | వాటలే తయాంస ఆశ్చర్య మోఠే | కంఠ దాటే ప్రేమానే | ||౪౭||
47. తాను చేయాల్సిన దానిని బాబా చేస్తూ, బాబా బదులు తాను శ్రోత కావడంలాంటి కలకు అర్థమేమిటని సాఠే ఆలోచించ సాగాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రేమతో అతని కంఠం గద్గదమైంది.
ఆజ్ఞాన తమఉశీసీ | ఠేవూనియా మానేపాశీ | ఘోరత పడలే జే వాసనా కుశీసీ | త్యా జాగవిసీ దయాళా | ||౪౮||
48. ‘అజ్ఞానమనే తలగడను తల క్రింద పెట్టుకుని, ఇంద్రియ సుఖాల కోరికలనే పడకపై, గుర్రు పెట్టి నిద్రిస్తున్న వారిని, దయామయులైన సాయి మేల్కొలుపుతారు.
పహా ఏసియాహీ సమయాసీ | థాపటోనియా ఆపణాసీ | గురుచరిత్ర పీయూషాసీ20 | పాజిలేంసీ కృపాళా | ||౪౯||
49. ‘అలాంటి సమయంలో, నా వెన్ను తట్టి, గురు చరిత్ర అనే అమృతాన్ని నాచే త్రాగించారు కదూ! కృపాళూ!’
అసో ఏసా దృష్టాంత పడతా | సాఠే జాగృత ఝాలే తత్వతా | కళవితీ కాకాసాహేబ దీక్షితా | సాద్యంత వార్తా ఘడలీ తీ | ||౫౦||
50. అలా తనకు వచ్చిన కలనుండి, సాఠే వెంటనే మేల్కొన్నాడు. జరిగిన దానిని వివరంగా, కాకాసాహేబు దీక్షితుకు తెలియ చేశాడు.
మ్హణతీ న కళే యాచా అర్థ | జాణతీ ఎక బాబా సమర్థ |
కాయ కీ న కళే త్యాంచే మనాంత | కాకా సాధ్యంత పుసా కీ | ||౫౧||
51. ‘దీని అర్థమేమిటో నాకు తెలియలేదు. సాయి సమర్థులు ఒక్కరికే అది తెలుస్తుంది. వారి మనసులో అసలు ఏమున్నదో నాకు తెలియడం లేదు. కాకా! సాధ్యమైతే, వారిని అడగండి.
పునశ్చ పాఠ21 సురూ కరావా | కీ ఝాలా తితకాచ పురా సమజావా | మనోదయ బాబాంచా పుసావా | తేణేంచ విసావా యే మనా | ||౫౨||
52. ‘నేను మరల ఇంకొక సారి పారాయణ చేయాలా, లేక ఇంత వరకు చేసింది చాలా? అని మీరు అడిగి, వారి ఉద్దేశాన్ని కనుక్కోండి. అప్పుడే నా మనస్సుకు శాంతి’.
మగ కాకా బాబాంప్రతీ | సమయ పాహూని స్వప్న నివేదితీ | దేవా ఆపణ య దృష్టాంతీ | కాయ సాఠ్యాంప్రతీ జాణవిలే | ||౫౩||
53. తగిన సమయం చూసుకుని, సాఠే కలను బాబాకు తెలిపి, కాకా, ‘బాబా! ఈ కలతో సాఠేకు ఏమని తెలియ చేశారు?
సప్తాహ ఏసాచ సురూ ఠేవావా | కివా యేథూన పురా కరావా | దృష్టాంతార్థ స్వయే వివరావా22 | మార్గ దావావా తయాంతే | ||౫౪||
54. ‘ఇంకొక వారందాకా పారాయణం మొదలు పెట్టాలా లేక ఇంతటితో నిలిపి వేయాలా? కలలోని అర్థాన్ని మీరే స్వయంగా వివరించండి. అతనికి దారిని చూపించండి.
ఇతుకీచ పాయీ మాఝీ వినంతీ | సాఠే మోఠే భక్త భావార్థీ | కృపా వ్హావీ తయాంవరతీ | పురవావీ ఆర్తీ తయాంచీ | ||౫౫||
55. ‘సాఠే మంచి భక్తుడు. యోగ్యుడు, మోసం తెలియని వాడు. అతని మీద దయ తలచి, అతని కోరికను తీర్చండి. మీ పాదాలకు ఇదే నా విన్నపం’ అని చెప్పాడు.
మగ బాబా ఆజ్ఞాపితీ | “హోఊ ద్యా ఆణిక ఎక ఆవృత్తీ | వాచితాంహీ గురూచీ పోథీ | భక్త హోతీ నిర్మళ | ||౫౬||
56. “ఇంకా ఒక మారు పారాయణ జరగని” అని బాబా ఆజ్ఞాపించి, “గురువుయొక్క ఈ పవిత్ర గ్రంథాన్ని పారాయణం చేస్తే, భక్తులు నిర్మలమౌతారు.
యా పోథీచే పారాయణ | కరితా హోఈల కల్యాణ | పరమేశ్వర హోఈల ప్రసన్న | భవబంధన సటేల” | ||౫౭||
57. “ఈ గ్రంథాన్ని పారాయణం చేస్తే, శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు తృప్తి చెందుతాడు. సాంసారిక బంధనాలు విడిపోతాయి” అని చెప్పారు.
హే జవ బాబాంనీ కేలే కథన | కరీత హోతో మీ పాదసంవాహన23 | ఝాలో అంతరీ విస్మయాపన్న | వృత్తీ స్ఫురణ పావలీ | ||౫౮||
58. బాబా ఇలా అంటున్నప్పుడు, నేను వారి పాదాలు పట్టుతున్నాను. బాబా చెప్పిన మాటలు విని, నా మనసులో ఆశ్చర్యం కలిగి, చాలా ఆలోచనలు వచ్చాయి.
బాబా తరీ హే ఏసే కైసే | సాఠ్యాంస ఫళతీ అల్పాయాసే | మాఝీ గేలీ వర్షానువర్షే | సాతచి దివసే ఫల త్యాంసీ | ||౫౯||
59. ‘బాబా! మరి ఇలా అయితే ఎలా? ఏడు రోజుల, కొద్ది శ్రమతోనే సాఠేకు ఫలితమూ, ఏళ్ళ తరబడి చేసిన నా శ్రమకు ఏమీ లేదా?
ఎకచి పాఠ గురుచరిత్రాచా | కేలా సాఠ్యాంనీ సాతా దిసాంచా | చాళీస వర్షాచా పాఠ జయాచా | విచార తయాచా నాహీంచ కా | ||౬౦||
60. ‘ఏడు రోజులలో, ఒక్క మారే సాఠే గురు చరిత్ర పారాయణం చేశాడు. నలభై ఏళ్ళుగా చేస్తున్న పారాయణ గురించి ఏ ఆలోచనా లేదా?
ఎకాస ఫళతీ సాత దివసే | ఎకాచీ నిష్ఫళ సాత24 వర్షే |
వాట పాహే మీ చాతక ప్రకర్షే | దయాఘన హా వర్షేల కై | ||౬౧||
61. ‘ఒకరికేమో ఏడు రోజులలో ఫలితం, ఇంకొకరి ఏడేళ్ళ పారాయణ దండుగా? ఈ దయామయులు ఎప్పుడు నాపై దయ కురిపిస్తారా అని చాతక పక్షిలా ఎదురు చూస్తున్నాను.
ఫేడీల మాఝియా మనీచీ హౌస | దేఈల ఉపదేశ మజ కాయ | ||౬౨||
62. ‘ఈ సత్పురుషులు సంతోషించి, నాకు ఉపదేశాన్నిచ్చి, నా మనసులోని కోరికను తీర్చే రోజు ఎప్పుడైనా వస్తుందా’ అని చూస్తున్నాను.
భక్తవత్సల శ్రీగురూ సాఈ | పహా తయాంచీ కాయ నవలాఈ | మనీ వృత్తి ఉఠలీ తే సమయీ | తాత్కాళ త్యాంహీ జాణిలీ | ||౬౩||
63. సద్గురు సాయి చేసిన చమత్కారాన్ని చూడండి. నా మనసులో ఉబికి వస్తున్న ఆలోచనలను, వెంటనే తెలుసుకున్నారు.
ఏశాచ అవిద్యేచ్యాహీ పోటీ | బర్యా వాఈట కోట్యనుకోటీ | వాసనా ఉఠతీ ఉఠాఉఠీ | తితుక్యాంచీ దృష్టీ తయాంనా | ||౬౪||
64. అజ్ఞానం వలన (నాకు కలిగినట్లు) కోటానుకోటి మంచి, చెడు కోరికలు మనసులో వెంట వెంటనే లేస్తుంటాయి. అవి లేస్తున్నట్లే బాబాకు తెలిసిపోతుంటాయి.
“మన చింతీ తే వైరీ న చింతీ” | హేతో సర్వాంస ఠావే నిశ్చితీ | ఇతర కోణీ జరీ తే నేణతీ | మహారాజ ఓళఖతీ తాత్కాళ | ||౬౫||
65. తన శత్రువు తానే కనుక, మనసు ఆలోచించే చెడు ఆలోచనలను శత్రువు కూడా ఆలోచించడు. ఇది అందరికీ తెలిసినదే. మిగతావారికి ఇది తెలియక పైనా, సాయి మహారాజుకు వెంటనే తెలిసిపోతుంటాయి.
పరి తీ మాయ అతికృపాళ | పోటాంత ఘాలీ నింద్య సకళ | అనింద్య పాహూన ప్రాప్తకాళ | తితుక్యాస చాలన దేఈ తీ | ||౬౬||
66. కాని, కరుణామయి అయిన సాయిమాతా, అందరి చెడు ఆలోచనలనూ తన కడుపులో దాచుకుంటుంది. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ తల్లి వాటిని ప్రోత్సాహ పరుస్తుంది.
తంవ తే మనోగత జాణూనీ | బాబా వదతీ మజలాగూనీ | ఊఠ త్యా శామ్యాకడే26 జాఊనీ | రుపయే ఘేఊనీ పంధరా యే | ||౬౭||
67. నా మనసులోని ఆలోచనలను తెలుసుకుని, బాబా ఇలా అన్నారు, “లే! లేచి ఆ శామ్యా దగ్గరకు వెళ్ళి, పదిహేను రుపాయలను తీసుకుని రా.
బైసే తయాపాసీ క్షణభర | గోష్టీ బోలా పరస్పర | దక్షిణా దేఈల తీ ఘేఊన సత్వర | యేఈ మాఘారా పరతోన | ||౬౮||
68. “అతని దగ్గరే కాసేపు కూర్చుని, ఇద్దరూ కబుర్లు చెప్పుకోండి. తరువాత అతనిచ్చె దక్షిణను తీసుకుని, తొందరగా తిరిగి రా”.
కృపా ఉపజలీ సాఈనాథా | దక్షిణేచ్యా కరూని నిమిత్తా | మ్హణతీ మాగ జా ఆతాంచే ఆతా | రుపయే మజకరితా శామాకడే | ||౬౯||
69. సాయినాథునికి నాపై దయ కలిగి, దక్షిణ నెపంతో “మరి, తొందరగా ఇప్పుడే వెళ్ళు. నా పరంగా శామాను రూపాయలు అడుగు”.
ఝాలియావరీ ఏసీ ఆజ్ఞా | బైసావయా పుఢే కోణాచీ ప్రాజ్ఞా | బైసతా తీ హోఈల అవజ్ఞా | ఘేఊని అనుజ్ఞా ఊఠలో | ||౭౦||
70. అలా వారి ఆజ్ఞ అయ్యిన తరువాత, అక్కడ కూర్చునే ధైర్యం ఎవరికుంటుంది? అలా కూర్చుంటే, వారి ఆజ్ఞను మీరినట్లే కదా? అందుకే, వారి అనుమతిని పొంది, లేచాను.
మగ మీ తాత్కాళ గమన కేలే | శామరావహీ బాహెర ఆలే |
హోతే నుకతేంచ స్నాన కేలే | నేసత ఠేలే ధోతర | ||౭౧||
71. వెంటనే బయలుదేరాను. శామరావు బయటికి వచ్చాడు. అప్పుడే స్నానం చేసి, పంచను కట్టుకుంటున్నాడు.
నుకతేంచ ఝాలె హోతే స్నాన | ధూత వస్త్ర పరిధాన కరూన |హోతే ఘాలీత ధోతరాచీ చూణ | ముఖే గుణగుణ నామాచీ | ||౭౨||
72. అప్పుడే స్నానం చేయడం వలన, ఉతికిన పంచను చుట్టుకుని, కుచ్చిళ్ళను సవరించుకుంటూ, నోటితో నామాలను గునుగుతున్నాడు.
మ్హణతీ “కాయ మధ్యేచ కోఠే | మశీదీంతూన ఆలాంత వాటే |చర్యేవరీ కా చంచలతా ఉమటే | అసే ఎకటే కా ఆజ | ||౭౩||
73. ‘ఏమిటి ఈ వేళప్పుడు ఇక్కడ ఉన్నారు? మసీదునుండి వచ్చినట్లున్నారు. ముఖం మీద ఈ అలజడి ఎందుకు? ఇవాళ ఒక్కరే వచ్చారేమిటి?’ అని అన్నాడు.
యా బసా మీ ఆతాంచ న్హాలో | హా పహా ధోతర చుణీత ఆలో |జాతో దేవావర పాణీ ఘాలో | సమజా పరతలో ఏసాచ | ||౭౪||
74. ‘రండి, కూర్చొండి. నేనిప్పుడే స్నానం చేశాను. చూడండి, పంచె కట్టుకుని కుచ్చిళ్ళను సవరించుకుంటూ వస్తున్నాను. వెళ్ళి, దేవుడికి అభిషేకం చేసి, వెంటనే వచ్చేస్తాను.
ఆపణ కరితా తాంబూల భక్షణ | తో మీ సారితో పూజావిధాన |కరూ మగ వార్తా సావధాన | సమాధానపూర్వక” | ||౭౫||
75. ‘మీరు తాంబూలం వేసుకునే లోగా, నేను పూజా విధానాన్ని పూర్తి చేసి, వచ్చేస్తాను. తరువాత, మనిద్దరం తాపీగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు’.
మాధవరావ ఘరాంత జాతీ | మగ తేథేంచ ఖిడకీవరతీ |హోతీ నాథభాగవతాచీ27 పోథీ | సహజ హాతీ ఘేతలీ | ||౭౬||
76. అని చెప్పి, మాధవరావు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడే కిటికీ పైన ఉన్న ఏకనాథ భాగవత గ్రంథాన్ని, చేతికి అందుకున్నాను.
యదృచ్చేనే గ్రంథ ఉఘడలా | అకల్పిత జేథే ఆరంభ కేలా |ప్రాతఃకాళీ జో అపూర్ణ టాకిలా | వాచావయా ఆలా తోచ భాగ | ||౭౭||
77. ఊరికే పుస్తకాన్ని తెరిచే సరికి, అనుకోకుండా, తెల్లవారి నేను చదువుతూ, మధ్యలోనే ఆపేసిన భాగం, కనిపించింది.
అతి ఆశ్చర్య మనా వాటలే | ప్రాతఃకాళీ వాచన జే హేళసిలే28 |బాబాంనీ తే సంపూర్ణ కరవిలే | వరీ లావిలే నియమన | ||౭౮||
78. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. తెల్లవారి నేను చదవని భాగాన్ని, ఇప్పుడు పూర్తి చేయించి, నియమాన్ని పాటించేలా బాబా చేశారు.
నియమన మ్హణజే నియమే వాచన | న హోతా సంపూర్ణ నిశ్చింత పరిశీలన |అపురే టాకూన నియమితోపాసన29 | స్థానాపాసూన చళూ నయే | ||౭౯||
79. ఇక్కడ నియమం అంటే, ప్రతి రోజూ, ఎంచుకున్న గ్రంథాన్నుంచి, అనుకున్న భాగాన్ని చదవడం. అనుకున్న భాగాన్ని పూర్తిగా చదవకుండా, మధ్యలో మానేసి, కూర్చున్న చోటునుండి లేవకూడదు.
ఆతా థోడీసీ ఉపకథా | ఓఘాస ఆలీ న యే టాకితా |శ్రోతా పరిసావీ సాదరతా | యా నాథభాగవతా సంబంధే | ||౮౦||
80. నాథ భాగవతానికి చెందిన ఒక చిన్న ఉపకథ, ఇప్పుడు గుర్తుకు వచ్చింది. వదిలి పెట్టలేనిది ఆ కథ. దీనిని శ్రోతలు శ్రద్ధగా వినాల్సిందే.
తే హే నాథభాగవత | గురుభక్తిరసే పరిప్లుత30 |
సాఈకృపా పాత్రభూత | నిత్య దీక్షిత31 వాచితీ | ||౮౧||
81. సాయి కృపను పొందిన సీతారాం దీక్షితు, గురు భక్తి రసంతో నిండిన ఈ ఏకనాథ భాగవతాన్ని ప్రతి రోజూ పఠించేవాడు.
పేరిలే తే మగ నారద క్షేత్రీ త్యాణే | బీజ ఆణిలే కణసాసీ | ||౮౨||
82. జగత్తును ఉద్ధరించాలని, బ్రహ్మ అనే భూమిలో, నారాయణుడు భక్తి బీజాన్ని నాటాగా, అది నారదుడనే పొలంలో పంటకు వచ్చింది.
జయా క్షేత్రాచీ దశలక్షణీ | కేలీ సంవంగణీ బాదరాయణీ | శుకే పరీక్షితీచ్యా ఖళ్యాంత మళణీ | కేలీ నివడణీ కణసాంచీ | ||౮౩||
83. ఆ పొలంలో పండిన పది లక్షణాలుగల పంటను, వ్యాస మహర్షి సంగ్రహ పరచాడు. పరీక్షిత్తు అనే కళ్ళంలో, శుక మహర్షి ఆ గింజలను వేరు పరచగా,
స్వామీ శ్రీధరే మారిలే హడప32 | స్వామీ జనార్దనే కేలే మాప | రసభరిత పక్వాన్నే ఉమాప33 | నాథప్రతాప భోజన | ||౮౪||
84. శ్రీధర స్వామి తూర్పార పట్టాడు. వచ్చిన పంటను, జనార్దన స్వామి కొలవగా, రసవత్తరమైన భోజనాన్ని ఏకనాథ మహారాజు తయారు చేశాడు.
స్కంధ ఎకాదశ త్యాంతీల జాణ | భక్తిప్రేమసుఖాచీ ఖాణ | తే హే బత్తీసఖణీ34* వృందావన | నిత్య వాచన దీక్షితా | ||౮౫||
85. భాగవతంలోని పదకొండవ అధ్యాయం, భక్తి ప్రేమ ఆనందాలకు గని. ముప్పైరెండు అధ్యాయాలతో ఉన్న బృందావనం లాంటి ఈ గ్రంథాన్ని దీక్షితు ప్రతి రోజూ చదివేవాడు.
దివసా తయాచే కరితీ నిరూపణ | రాత్రౌ వాచితీ భావార్థ రామాయణ | హాహీ గ్రంథ గుర్వాజ్ఞా మ్హణూన | జాహలా ప్రమాణ దీక్షితా | ||౮౬||
86. పగటి పూట దానికి అర్థం చెప్పేవాడు. రాత్రి పూట భావార్థ రామాయణాన్ని చదివే వాడు. గురువు ఆజ్ఞతో, ఈ గ్రంథం కూడా, దీక్షితుకు ప్రమాణికమైంది.
భక్తిసుఖామృతాచే సార | జ్ఞానేశ్వరీచా ద్వితీయావతార | తో హా నాథాంచా మూర్త ఉపకార | మహారాష్ట్రావర ఉదండ | ||౮౭||
87. నాథ భాగవతం భక్తి రసామృతానికి సారం. జ్ఞానేశ్వరికి రెండవ అవతారం. మహారాష్ట్రకు ఏకనాథ మహారాజు చేసిన మహోపకారం ఈ భాగవత గ్రంథం.
కరోనియా ప్రతఃస్నాన | నిత్యనేమ సాఈపూజన | అన్య దేవ దేవతార్చన | నైవేద్య నీరాజన ఉరకతా | ||౮౮||
88. తెల్లవారి స్నానం చేసి, నిత్య నియమంగా సాయిబాబా పూజ, ఇతర దేవీదేవతల అర్చనలయ్యాక, దీక్షితు నైవేద్యం నీరాజనాలు ఇచ్చి,
మగ శ్రోత్యాంసమవేత సవిస్తర | పయఃప్రసాద35 అల్పాహార36 | సారోని నిత్యక్రమానుసార | పోథీ సాదర వాచితీ | ||౮౯||
89. నివేదించిన పాలు, ఫలహారాన్ని శ్రోతలతో పాటు తానూ తీసుకుని, ప్రతి రోజూ గ్రంథాన్ని శ్రద్ధగా చదివే వాడు.
జయా గోడియే సహస్త్ర పారాయణే | భగవత్పరాయణ తుకారామానే | కేలీ భండార్యావర37 ఎకాంతపణే | తే గోడీ కవణే వర్ణావీ | ||౯౦||
90. భండారా అనే కొండపై, భక్తుడైన తుకారాం ఒక్కడే కూర్చుని, ఈ నాథ భాగవతాన్ని వేయి సార్లు పారాయణం చేశాడు. అందులోని మాధుర్యాన్ని ఎవరు వర్ణించగలరు?
హా మహా ప్రాసాదిక దివ్య గ్రంథ | దీక్షిత శిష్య నిష్ఠావంత |
మ్హణోని జీవాంచ్యా ఉద్ధారార్థ | సాఈసమర్థ ఆజ్ఞాపితీ | ||౯౧||
91. జీవుల ఉద్ధారం కోసం, దైవ ప్రేరణతో రచించబడిన ఈ దివ్య గ్రంథాన్ని, నిష్ఠాపరుడైన దీక్షితు, రోజూ పఠించాలని సాయి సమర్థులు ఆజ్ఞాపించారు.
జాణే నలగే వనాప్రతీ | భగవంత ప్రగటే ఉద్ధవగీతీ38 | శ్రద్ధాయుక్త జే పారాయణ కరితీ | భగవత్ప్రాప్తి రోకడీ | ||౯౨||
92. దేవుణ్ణి చూడటానికి అడవులకు వెళ్ళవలసిన పనిలేదు. భాగవతంలోని పదకొండవ అధ్యాయంలో ఉండే ఉద్ధవ గీతలో దేవుడు కనిపిస్తాడు. శ్రద్ధా భక్తితో పఠిస్తే, దేవుడు ఖచ్చితంగా దొరకుతాడు.
భారతీ సంవాద కృష్ణార్జునాచా | త్యాహూన సరస హా కృష్ణోద్ధవాచా | తో యా భాగవతీ ఉపదేశ సాచా | ప్రేమళ వాచా నాథాంచీ | ||౯౩||
93. భారతంలోని శ్రీకృష్ణార్జునుల సంవాదం కంటే, ఇందులోని కృష్ణ ఉద్ధవుల సంభాషణ చాలా రసభరితంగా ఉంది. శ్రీకృష్ణుని ఉపదేశాన్ని ఏకనాథ మహారాజు ఎంతో ప్రేమగా వర్ణించారు.
అసో ఏసా హా ప్రాసాదిక గ్రంథ | జ్ఞానదేవ భావార్థదీపికా39 సమవేత | సమర్థ కృపాళూ సాఈనాథ | వాచవీత నిత్య శిరడీంత | ||౯౪||
94. ఇలాంటి దైవికమైన గ్రంథాన్ని, మరియు జ్ఞానదేవుని భావార్థ దీపికను, శిరిడీలో ప్రతిరోజూ, దయామయులైన సాయి సమర్థులు, చదివించే వారు.
సఖారామ హరీ జోగ | తయాంస హా బాబాంచా నియోగ40 | సాఠ్యాంచే వాడియాంత హా యోగ | భక్తా ఉపయోగ హా మోఠా | ||౯౫||
95. ఈ భాగవత గ్రంథాన్ని, సఖారామ హరి జోగు సాఠేవాడాలో చదవాలని, బాబా ఆజ్ఞ. ఇది భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది.
ప్రత్యహీ యా గ్రంథాచే శ్రవణ | బాబా కిత్యేక భక్తాంలాగూన | శ్రవణ కరవితీ కళవళూన | భక్త కల్యాణ వాంఛేనే | ||౯౬||
96. భక్తుల శ్రేయస్సు కోరి, వారి మీద కరుణతో, ప్రతిరోజూ ఈ గ్రంథాన్ని, బాబా భక్తుల చేత వినిపించేవారు.
అగాధ బాబాంచీ అనుగ్రహకుసరీ41 | భక్తా ఉపదేశితీ పరోపరీ | భక్త జవళీ వా దేశాంతరీ | బాబా అంతరీ సన్నీధచి | ||౯౭||
97. భక్తులను అనుగ్రహించే బాబా పద్ధతి సులభంగా అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉపదేశం చేసేవారు. భక్తులు దగ్గరలో ఉన్నా, దేశాంతరాలలో ఉన్నా, బాబా ఎప్పుడూ వారి హృదయాలలో ఉండేవారు.
ఆపణ జరీ మశీదీ బసతీ | కోణాహీ కాంహీ కార్య నేమితీ | తయాసీ దేఊనియా నిజశక్తీ | కరవూని ఘేతీ తే కార్య | ||౯౮||
98. ఎవరికైనా ఏదైనా పని అప్ప చెప్పితే, తాము మసీదులోనే కూర్చుని, చెప్పిన వారికి తమ శక్తిని ఇచ్చి, బాబా ఆ పనిని చేయించుకునే వారు.
బాపూసాహేబ జోగాప్రత | వాడ్యాంత పోథీ వాచాయా సాంగత | తే తీ వాచీత నిత్య నేమస్త | శ్రోతేహీ యేత ఏకాయా | ||౯౯||
99. వాడాలో గ్రంథాన్ని పఠించమని బాపూసాహేబు జోగుకు వారు చెప్పారు. దానిని అతడు ప్రతి రోజూ నియమంగా చదివేవాడు. వినడానికి శ్రోతలు కూడా వచ్చేవారు.
జోగ హీ దుపారా భోజనాంతీ | నిత్య జాఊని బాబాంప్రతీ | చరణ వందూని ఘేఊని విభూతి42 | ఆజ్ఞాపన43 ఘేతీ పోథీచే | ||౧౦౦||
100. రోజూ, మధ్యాహ్న భోజనం తరువాత జోగు, బాబా దగ్గరకు వచ్చి, వారి పాదాలకు నమస్కరించి విభూతిని తీసుకుని, గ్రంథ పఠనకై వారి ఆజ్ఞను తీసుకునే వాడు.
కధీ వాచీత జ్ఞానేశ్వరీ | కధీ తే నాథభాగవతావరీ |
పారాయణ మాండీత ఆనందనిర్భరీ | వ్యాఖ్యాన కరీత అర్థాచే | ||౧౦౧||
101. ఒక్కొక్కప్పుడు జ్ఞానేశ్వరిని, ఇంకొకప్పుడు ఏకనాథ భాగవతాన్ని, దాని అర్థాన్ని చెబుతూ ఎంతో ఆనందంతో బాగా పఠించేవాడు.
కితి ఎకా పోథీ ఏకావయాసాఠీ | ఉఠాఉఠీ పాఠవీత | ||౧౦౨||
102. అలా అతనికి ఆజ్ఞ ఇచ్చిన తరువాత, తమ దర్శనానికి వచ్చిన కొందరు భక్తులను, పారాయణాన్ని వినమని, బాబా వెంటనే వాడాకు పంపించేవారు.
కధీ సాంగత సంక్షిప్త గోష్టీ | శ్రోతా జో సాంఠవీ నిజకర్ణసంపుటీ | తోంచ బాబా మ్హణతీ “జా ఉఠీ | త్యా పోథీసాఠీ వాడ్యాంత” | ||౧౦౩||
103. కొన్ని మార్లు, చిన్న కథలుగా చెప్పి, వానిని శ్రోతలు తమ చెవులలో నింపుకునే లోగా, “లేవండి! వెంటనే వాడాకు వెళ్ళి, గ్రంథం వినండి” అని బాబా చెప్పేవారు.
శ్రోతా భావార్థీ పోథీస జాతా | నిఘావీ పోథీంతహీ ఏసీచ కథా | కీ జో పూర్వీల కథేచీ దృఢతా | అర్థావబోధకతా పూర్ణ కరీ | ||౧౦౪||
104. భక్తి భావంతో, శ్రోతలు వెంటనే వాడాకు వెళ్ళగా, వారికి బాబా చెప్పిన కథే అక్కడ నడుస్తుండేది. అది విన్న తరువాత, వారికి ఆ కథ గురించిన ప్రాముఖ్యత బాగా స్పష్టంగా అర్థమయేది.
జ్ఞానేశ్వరాంచీ జ్ఞానేశ్వరీ | అథవా ఎకనాథాంచీ వైఖరీ | బాబాంచ్యా కథేచాచ అనువాద కరీ | శ్రోతయా నవల పరీ హీ మోఠీ | ||౧౦౫||
105. జ్ఞానేశ్వరుని జ్ఞానేశ్వరి, లేదా ఏకనాథుని భాగవతం చదువుతున్నా, అది బాబా చెప్పిన కథలనే వివరిస్తుంటే, శ్రోతలకు చాలా ఆశ్చర్యం కలిగేది.
ఎకాద్యా పోథీచా వివక్షిత భాగ | వాచావా ఏసా నసతాంహీ నియోగ | పూర్వ నివేదిత గోష్టీచా సుయోగ | పోథీంత జోగ వాచీత | ||౧౦౬||
106. గ్రంథంలోని ఏదో ఒకటి రెండు భాగాలను చదవమని బాబా చెప్పక పోయినా, అంతకు ముందు బాబా చెప్పిన ప్రసంగానికి సరిపోయే కథలనే జోగు చదివే వాడు.
భగవద్గీతా భాగవత | ముఖ్యతః హేచ దోన గ్రంథ | భాగవత ధర్మాచే సారభూత | జోగ హే నిత్య వాచీత | ||౧౦౭||
107. జోగు రోజూ పఠించే భగవద్గీత, భాగవతం ఈ రెండూ ముఖ్య గ్రంథాలే. భాగవత ధర్మానికి ఇవి ఆధారం.
గీతా జ్ఞానేశ్వరీ టీకా | జయ నాంవ “భావార్థదీపికా” | భాగవత ఎకాదశమస్కంధనికా | పరమార్థ భూమికా నాథాంచీ | ||౧౦౮||
108. ‘భావార్థ దీపిక’ అనబడే జ్ఞానేశ్వరి, భగవద్గీతకు అర్థ సహితంగా చెప్పబడిన టీకా. భాగవతంలోని పదకొండవ అధ్యాయం ఆధారంతోనే, ఏకనాథుడు పరమార్థాన్ని వివరించాడు.
అసో యా నిత్య క్రమానుసార | భాగవత వాచనాచా ప్రచార | మీహీ తే వాచీ నిరంతర | పడలే అంతర తే దినీ | ||౧౦౯||
109. అలా, రోజూ నియమంగా భాగవత పఠన జరుగుతుండగా, నేను కూడా రోజూ దానిని పఠించేవాణ్ణి. కాని, ఆ రోజు అనుకున్న భాగాన్ని పూర్తిగా చదవలేక పోయాను.
కథా ఎక ఆధీ వాచిలీ | మండళీ మశీదీ జావయా నిఘాలీ | వాచతా వాచతా పోథీ ఠేవిలీ | ధాంవ మారిలీ మీ తేథే | ||౧౧౦||
110. ఒక కథను సగం చదువుతుండగా, భక్తులు అందరూ మసీదుకు బయలుదేరారు. అప్పుడు, చదువుతున్న గ్రంథాన్ని అక్కడే పెట్టి, నేను కూడా వారితో మసీదుకు పరుగెత్తాను.
ఇచ్ఛా ఏకావ్యా బాబాంచ్యా గోష్టీ | బాబాంచ్యా పరీ ఆణిక పోటీ |
భాగవత సోడూని ఇతర కష్టీ | నాహీంచ తుష్టీ తయాంనా | ||౧౧౧||
111. నాకేమో బాబా మాటలను వినాలన్న కోరిక. కాని, బాబా అనుకునేదే వేరు. భాగవత పఠనాన్ని వదిలి, మిగతా పనులు చేయటం వారికి ఇష్టం కాదు.
యేచ అర్థీ నేటే పాటే | రాహిలే44 భాగవత వాచవిలే వాటే | ఏసే హే బాబాంచే కౌతుక మోఠే | ప్రేమ లోటే ఆఠవితా | ||౧౧౨||
112. అందుకే, నేను ఆ రోజు చదవ వలసిన భాగాన్ని, బాబా నాచే చదివించారేమో అని అనిపిస్తుంది. వారి లీలలను తలచుకుంటే, ప్రేమ ఉప్పొంగుతుంది.
అసో భాగవతీ కథా సంపలీ | ఉపకథాహీ యేథే సరలీ | మాధవరావాంచీ పూజా ఆటపలీ | స్వారీ ఆలీ బాహేర | ||౧౧౩||
113. దీంతో, భాగవత కథ, దానికి సంబంధించిన ఉపకథ కూడా అయిపోయినవి. పూజ ముగించుకుని, మాధవరావు బయటకు వచ్చాడు.
అహో బాబాంచా నిరోప ఆహే | తోచ మీ ఘేఊని ఆలో పాహే | “శామా పాసూన పంధరా రుపయే | దక్షిణా యే ఘేఊని” | ||౧౧౪||
114. ‘“శామా దగ్గరనుండి పదిహేను రూపాయల దక్షిణను తీసుకునిరా” అన్న బాబా సందేశము తీసుకుని వచ్చాను’.
బైసలో హోతా సేవా కరీత | అకస్మాత తుమచే స్మరణ హోత | “ఊఠ శామాకడే జా మ్హణత | దక్షిణేసీ45 పరత యే” | ||౧౧౫||
115. ‘నేను బాబా పాద సేవ చేస్తూ కూర్చుండగా, అకస్మాత్తుగా నీవు గుర్తుకు వచ్చావు. అంతే, “లే, శామా దగ్గరకు పో” అని చెప్పి, “దక్షిణతో తిరిగి రా” అని అన్నారు’.
“బైస మ్హణాలే తయాంచే ఘరీ | విళభర46 తయాసవే వార్తా కరీ | బోలూన చాలూన పరస్పరీ | మగ మాఘారీ తూ యేఈ” | ||౧౧౬||
116. ‘“అతని ఇంట్లో కాసేపు కూర్చుని, మీరు ఇద్దరూ కబుర్లు చెప్పుకోండి. తర్వాత, తిరిగి రా” అని బాబా చెప్పారు’.
మాధవరావ జంవ హే పరిసత | ఝాలే అత్యంత ఆశ్చర్యచకిత | రుపయాంఏవజీ నమస్కార సాంగత | దక్షిణా మ్హణత హీ ఆముచీ | ||౧౧౭||
117. అది విని మాధవరావుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ‘రూపాయలకు బదులుగా నా నమస్కారాలే నా దక్షిణ’ అని అన్నాడు.
బరే అసో ఎక ఝాలే | పంధరా నమస్కార పదరీ బాంధలే | పరి వార్తా కరావయాస యా కీ వహిలే | మ్హణూని మ్హటలే తయాంస | ||౧౧౮||
118. ‘సరే, అలాగే’ అని అతని పదిహేను నమస్కారాలను కొంగున మూట కట్టుకున్నాను. ఒక పనైంది. ఇక అతనితో ముచ్చటించాలి కదా.
కాయ గోష్టీ సాంగతా సాంగా | ఫేడా కీ మాఝ్యా శ్రవణ పాంగా | బాబాంచీ నిర్మళ యశగంగా | దురితభంగా కరూ కా | ||౧౧౯||
119. అతనితో ‘ఏం కబుర్లు చెబుతావో చెప్పి, నా కుతూహలాన్ని తీర్చు. పావనమైన బాబాయొక్క అద్భుతమైన కథలలో మునిగి, మన పాపాలను తొలగించుకుందాం’ అని అన్నాను.
మగ మాధవరావ మ్హణతీ బైసా | యా దేవాచా ఖేళచి ఏసా | తుమ్హీహీ సర్వ జాణతసా | క్షణైక విసావా ఘ్యా బసా | ||౧౨౦||
120. అప్పుడు మాధవరావు, ‘సరే, కూర్చోండి. ఈ దేవుని లీలలు ఎంత సాటిలేనివో, మీకంతా తెలుసు. కాసేపు విశ్రామంగా కూర్చోండి.
హే ఘ్యా పాన హా ఘ్యా కాథ | చునా సుపారీ ఆహే డబ్యాంత |
హా మీ ఆలో ఎకా క్షణాంత | టోపీ డోక్యాంత ఘాలూని | ||౧౨౧||
121. ‘ఇదిగో, ఈ ఆకులు, కాచు తీసుకోండి. వక్కలు, సున్నం డబ్బాలో ఉన్నాయి. తల మీద టోపీ పెట్టుకుని, ఇదిగో, ఒక క్షణంలో వచ్చేస్తాను.
ఆపణ కాయ థోడ్యా దేఖిల్యా | శిరడీస ఆల్యాపాసోని | ||౧౨౨||
122. ‘సాయిబాబా లీలలు ఊహకందనివి. ఎన్నని నేను మీకు చెప్పను? బాబా శిరిడీకి వచ్చినప్పటినుండి, మనం చూసింది కొంచెమా?
మీ తో కేవళ ఖేడవళ47 | ఆపణ శహరవాసీ సకళ | కాయ వానావ్యా ఆపణాజవళ | లీలా అకళ తయాంచ్యా | ||౧౨౩||
123. ‘నేనొట్టి పల్లె వాణ్ణి. మీరంతా ఊళ్ళలో ఉండేవాళ్ళు. అంతు లేని వారి లీలలను, మీకు నేనెలా వర్ణించను?’
యేతో మ్హణూని ఘరాంత గేలే | దేవాస ఫూల పాన వాహిలే | తాత్కాళ టోపీ ఘాలూన ఆలే | బోలత బైసలే మజసవే | ||౧౨౪||
124. అని అంటూ, మాధవరావు ఇంట్లోకి వెళ్ళి, దేవునికి పత్రి, పుష్పాలను సమర్పించి, టోపీ పెట్టుకుని, వెంటనే వచ్చి, నా దగ్గర కబుర్లు చెప్పాలని కూర్చున్నాడు.
కాయ దేవాచీ అతర్క్య లీలా | కోణ జాణేల యాచీ కళా | అంత నాహీ యాచ్యా ఖేళా | ఖేళూన ఖేళానిరాళా | ||౧౨౫||
125. ‘ఈ దేవా లీలలు తర్కానికి అందనివి. వారి నేర్పును ఎవరు అర్థం చేసుకోగలరు? వారి లీలలకు అంతు అనేదే లేదు. అవి చాలా ప్రత్యేకమైనవి.
కాయ తుమ్హీ విద్యేచే భోక్తే | ఎకాహూని ఎక జ్ఞాతే | ఆమ్హా గాంవఢళా కాయ కళతే | చరిత్ర అకళతే బాబాంచే | ||౧౨౬||
126. ‘మీరంతా చాలా గొప్ప విద్యావంతులు. ఒకరిని మించిన జ్ఞానులు ఇంకొకరు. తెలివి లేని పల్లెవాసులైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమౌతుంది?
తే కాయ గోష్టీ వార్తా న సాంగతీ | ఆమ్హాపాశీ కిమర్థ పాఠవితీ | త్యాంచీ కరణీ తేచ జాణతీ | మానవీ వృత్తీ నాహీ తీ | ||౧౨౭||
127. ‘వారు అసలు ఏ సంగతీ చెప్పరు. అలాంటిది మా దగ్గరికెందుకు పంపించటం? వారేం చేస్తారో అది వారికే తెలియాలి. వారి పనులు మటుకు, మనుషులు చేసేవి కావు, దేవుడు చేసేవి.
ఆలేచ ఆతా ఓఘావరీ | గోష్టహీ మజ ఆఠవలీ బరీ | కరూ వార్తా కాంహీతరీ | వేళ సాజరీ కరూ కీ | ||౧౨౮||
128. ‘ఓ మంచి సంగతి ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఆ కథను చెప్పి, కాలాన్ని సరిగ్గా ఉపయోగిద్దాం.
ప్రత్యక్ష ఆముచే దృష్టీసమోర | కథితో యేథే ఘడలేలా ప్రకార | జయా మనీ జైసా నిర్ధార | తైసా తే పార పాడితీ | ||౧౨౯||
129. ‘నా కళ్ళెదుటే ఇక్కడ ప్రత్యక్షంగా జరిగిన, ఒక సంగతి చెబుతాను. ఎవరి మనసులో ఏ కోరికుంటే, అలాగే జరిగేలా బాబా చేసేవారు.
కధీ కధీ బాబాహీ కితీ | మనుష్యాచా అంత పాహతీ | భక్తి ప్రేమ కసాస లావితీ | తేవ్హాంచ దేతీ ఉపదేశ | ||౧౩౦||
130. ‘కొన్ని మార్లు, మనుషులను బాబా చివరిదాకా పరీక్షించేవారు. భక్తి, ప్రేమలను బాగా పరీక్షించిన తరువాతే, ఉపదేశాలను ఇచ్చేవారు’.
‘ఉపదేశ’ హా శబ్ద కానీ పడతా | స్మరలీ సాఠ్యాంచీ గురుచరిత్ర కథా |
సకృద్దర్శనీ జణూ విద్యుల్లతా | చమకలీ చిత్తా మాఝియా | ||౧౩౧||
131. అని అంటుండగా, ‘ఉపదేశం’ అన్న మాట నా చెవులలో పడగానే, మెరుపు మెరిసినట్లు, వెంటనే సాఠేయొక్క గురు చరిత్ర కథ నా మనసులో మెరిసింది.
నసేల కాహీ శామాచీ యోజనా | మశీదీంతీల మమ చంచల మనా | స్థైర్య ఆణావయాలాగీ కల్పనా | అఘటిత ఘటనా బాబాంచీ | ||౧౩౨||
132. మసీదులో కలత చెందిన నా మనసును, స్థిర పరచటానికే, శామా దగ్గరకు బాబా నన్ను పంపించారేమో అని అనిపించింది. బాబా పనులన్నీ ప్రత్యేకం!
అసో హీ జీ ఉఠలీ వృత్తి | తైసీచ దాబూన ఠేవిలీ చిత్తీ | కథా శ్రవణీ దుణావలీ ఆర్తీ | తియేచీ పూర్తీ సంపాదూ | ||౧౩౩||
133. ఇలా మనసులో లేచిన ఆలోచనలను అణచి వేశాను. కథ వినాలనే కోరిక బలమై, దానిని ముందు తీర్చుకోవాలని అనుకున్నాను.
మగ బాబాంచ్యా గోష్టీ వార్తా | థోడ్యా థోడ్యా సురూ హోతా | ఆనంద వాటూ లాగలా చిత్తా | భక్త వత్సలతా పాహూని | ||౧౩౪||
134. కొంచెం కొంచెంగా బాబా మాటలు, లీలలు వింటున్న కొద్ది, భక్తుల మీద వారికున్న ప్రీతిని తెలుసుకుని, మనసుకు చాలా ఆనందం కలిగింది.
పుఢే ఆణిక కథా సాంగతీ | మ్హణతీ ఎక దేశముఖీణ హోతీ | తియేచ్యా పహా ఆలే చిత్తీ | సంత సంగతీ కరావీ | ||౧౩౫||
135. అటు తరువాత, శామా మరో కథను చెప్ప సాగాడు. దేశముఖ అనే ఇంటి పేరు గల ఒక స్త్రీ ఉండేది. సత్పురుషుల సహవాసం చేసుకోవాలని అకస్మాత్తుగా ఆమెకు అనిపించింది.
ఏకూన సాఈబాబాంచీ కీర్తీ | సంగమనేరచే లోకాం సంగతీ | ఆలీ బాఈ శిరడీ ప్రతీ | దర్శన ప్రీతీ బాబాంచ్యా | ||౧౩౬||
136. సాయిబాబా కీర్తి విని, వారి దర్శనం చేసుకోవాలన్న ఆశతో, సంగమనేరు జనులతో, ఆమె శిరిడీకి వచ్చింది.
ఖాశాబా దేశముఖాచీ హీ ఆఈ | నామ ఇయేచే రాధాబాఈ | నిష్ఠా ధరూన సాఈంచే పాయీ | దర్శన ఘేఈ సాఈంచే | ||౧౩౭||
137. ఆమె ఖాశాబా దేశముఖకు తల్లి. ఆమె పేరు రాధాబాయి. సాయి పాదాల మీద విపరీతమైన నమ్మకం కలిగి, వారి దర్శనం చేసుకుంది.
దర్శన ఘడలే యథాసాంగ | గేలా మార్గీచా శీణ భాగ | జడలా శ్రీచరణీ అనురాగ | కార్యభాగ ఆఠవలా | ||౧౩౮||
138. దర్శనంతో కలిగిన తృప్తి వలన దారిలో కలిగిన అలసట తీరింది. సాయి పాదాలయందు భక్తి పెరిగింది. తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది.
హోతీ తియేచ్యా మనీ ఆర్త | గురు కరావే సాఈసమర్థ | కరితీల ఉపదేశ యథార్థ | జేణే పరమార్థ సాధేల | ||౧౩౯||
139. సాయి సమర్థులను తన గురువుగా చేసుకుంటే, వారు తనకు సరియైన ఉపదేశాన్ని ఇస్తారు, అన్న ఒక ఆశ ఆమెలో చిగురించింది. ఆ ఉపదేశంతో తాను పరమార్థాన్ని పొందవచ్చు.
బాఈ వయానే మ్హాతారీ | నిష్ఠా అత్యంత బాబాంవరీ | మిళావా ఉపదేశ కాంహీతరీ | నిర్ధార అంతరీ హా కేలా | ||౧౪౦||
140. వయసు మీరిన ముసలావిడ ఆమె. కాని, బాబాపై విపరీతమైన భక్తి కలగటం వలన, వారి వద్ద ఎలాగైనా ఉపదేశాన్ని పొందాలని మనసులో నిశ్చయించుకుంది.
బాబా జోంవరీ మజలా స్వతంత్ర | దేతీ న ఎకాదా కానమంత్ర |
కరితీ న మజ కృపాపాత్ర | తోంవరీ అన్యత్ర జాణేనా | ||౧౪౧||
141. ‘బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి, నన్ను అనుగ్రహించేటంత వరకు, ఎక్కడికీ వెళ్ళను’ అని అనుకున్నది.
శ్రీసాఈ సంతాగ్రణీ పవిత్ర | అనుగ్రహ పాత్ర మజ కరో | ||౧౪౨||
142. ‘ఆ మంత్రం సాయి నోటినుండే రావాలి. ఇతరులతో వస్తే, అది అపవిత్రం. శ్రీ సాయి సత్పురుషులలో శ్రేష్ఠులు, పవిత్రులు కనుక, నన్ను అనుగ్రహం పొందేలా చేయాలి’.
కరూని ఏసా అంతఃకరణే | దృఢనిశ్చయ త్యా వృద్ధ బాఈనే | వర్జ్య కరూని ఖాణే పిణే | ఘేఊని ధరణే బైసలీ | ||౧౪౩||
143. అని ఆమె మనసులో దృఢంగా నిశ్చయించుకుని, అన్న పానాదులను మాని, మొండిపట్టు పట్టి కూర్చుంది.
ఆధీంచ వయానే మ్హాతారీ | పోటాంత అన్న నాహీ తిళభరీ | పాణీహీ పిఈనా ఘోటభరీ | శ్రద్ధా భారీ ఉపదేశీ | ||౧౪౪||
144. అసలే వయసు మీరిన ముసలామె. కడుపులో కాసింతైనా అన్నం లేదు. ఓ గుక్క నీరు కూడా త్రాగలేదు. బాబా చెప్పే ఉపదేశం మీద శ్రద్ధతో, నమ్మకంతో, ఎదురు చూస్తూంది.
తీన దివస అహర్నిశీ | మ్హాతారీ రాహిలీ ఉపవాశీ | బాబా ఉపదేశ దేతీల జే దిశీ | ప్రయోపవేశీ48 తోంవరీ | ||౧౪౫||
145. అలా మూడు రోజులు, రాత్రింబవళ్ళూ ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశం చేసే వరకూ, తాను అలాగే ఉపవాసంలో ఉంటానని, గట్టిగా దీక్షతో ఉంది.
మంత్రోపదేశ ఘేతల్యావిణే | కిమర్థ శిరడీంచే జాణే యేణే | ఉతరల్యా స్థళీ ఘేతలే ధరణే | నిర్వాణ తీణే మాండిలే | ||౧౪౬||
146. ఉపదేశం లేకుండా, శిరిడీకి రావటం కాని, శిరిడీనుండి పోవటం కాని దండుగ అని, తాను బస చేసిన చోట, చావుకు కూడా సిద్ధపడింది.
అన్న పాన కేలే వర్జన | ఏసే తప తే తీన దిన | కరితా కష్టలీ దేశముఖీణ | ఉదాసీన బహు ఝాలీ | ||౧౪౭||
147. అలా అన్న పానాదులు మాని, మూడు రోజులు తపస్సు చేసి, ఆమె అలసి నీరసించి పోయింది. చాలా నిరాశతో ఉంది.
మాధవరావాంస విచార పడలా | ప్రకార హా తవ నాహీ భలా | కాయ కరావే యా భవితవ్యాలా | మ్హాతారీ మరణాలా భిఈనా | ||౧౪౮||
148. మాధవరావు కలత చెందాడు. ‘ఈ ముసలామేమో చావుకు కూడా భయపడటం లేదు. జరుగుతున్నది అసలేం బాగా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి?’ అని ఆలోచించ సాగాడు.
మగ తే జాఊని మశీదీసీ | బైసతే ఝాలే బాబాంపాశీ | నిత్యాచియా కుశలవృత్తాసీ | ఆదరేంశీ తే పుసత | ||౧౪౯||
149. మసీదుకు వెళ్ళి బాబా దగ్గర కూర్చున్నాడు. ఎప్పటి లాగే, బాబా ఎంతో ప్రేమతో, అందరి కుశలాన్ని అడిగారు.
“శామా ఆజ కాయ విచార | ఠీక ఆహే నా సమాచార | తో నారాయణ49 తేలీ చళలా ఫార | గాంజీ అనివార మజలాగీ” | ||౧౫౦||
150. “శామా! ఏమిటి ఇవాళ సంగతి? అంతా బాగానే ఉంది కదా? ఆ నూనెల నారాయణుని బుర్ర తిరిగి, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు” అని అన్నారు.
పాహోని మ్హాతారీచా విచార | శామా ఆధీంచ కష్టీ ఫార |
కైసే కరావే తరీ సాచార | పుసే నిర్ధార బాబాంసీ | ||౧౫౧||
151. ముసలామె దీక్ష చూసి, మాధవరావు అసలే బాధతో ఉన్నాడు. అప్పుడు వెంటనే, ‘నిజంగా, ఇప్పుడేం చేయాలి?’ అని బాబాను అడిగాడు.
హే కాయ గౌడబంగాల దేవా | ఖేళ ఆపులా ఇతరా న ఠావా | త్వా మాణసే ఎకేక ఆణావీ గాంవా | ఆమ్హా పుసావా విచార | ||౧౫౨||
152. ‘ఈ రహస్యమేమిటి? మీ లీలలు ఎవరికీ అర్థం కాదు. ఒక్కో మనిషిని గ్రామానికి రప్పించి, వారి గురించి మమ్మల్ని అడుగుతారు! ఏం గారడి ఇది?
తీ దేశముఖీణ వయాతీత | అన్నాపాణ్యావిరహిత | రాహిలీ తీన దివస ఉపోషిత | తుజవరీ హేత ధరూని | ||౧౫౩||
153. ‘ఆ దేశముఖి ముసలామె, అన్న పానాదులు మాని, మూడు రోజులునుండి, మీ కోసం ఉపవాసంగా ఉంది.
మ్హాతారీ తీ పరమ హట్టీ | తుఝియా పాయీ నిష్ఠా కట్టీ | తూ తో తీస న పాహసీ దృష్టీ | కరితోస కష్టీ కా తిస | ||౧౫౪||
154. ‘ఆమె పరమ మొండి. కాని, మీ పాదాల మీద ఆమెకు చాలా నిష్ఠ. ఇక మీరేమో - ఆమె వైపు కూడా అసలు చూడటం లేదు. ఆమెను ఎందుకిలా బాధపెడుతున్నారు?
ఆధీంచ తే శుష్క కాష్ఠ | దురాగ్రహీ మహా ఖాష్ట | అన్నావీణ వాటతే స్పష్ట | ప్రాణాచి నష్ట హోతీల | ||౧౫౫||
155. ‘అసలే ఆమె ఎండిపోయిన కర్రలా ఉంది. పైగా మొండి పట్టుదలతో ఉంది. అన్నం కూడా తినకుండా ప్రాణం పోగొట్టుకునేలా ఉంది.
మ్హణతీల మ్హాతారీ గేలీ దర్శనా | ఉపదేశాచీ ధరూన వాసనా | సాఈబాబాంసీ నాహీ కరుణా | కేలే మరణాధీన తిలా | ||౧౫౬||
156. ‘‘ముసలామె దర్శనం చేసుకుని, ఉపదేశం పొందాలని ఎంతో ఆశతో వెళ్ళింది. కాని సాయిబాబాయే కరుణించగా, ఆమెను చావుకు వదిలేశారు’ అని లోకులు అంటారు.
బాబా ఘడో న దే ఏసా ప్రవాద50 | సాంగోని తిచా తిలా హితవాద | కరానా కా తిజవరీ ప్రసాద | హా అప్రమాద51 నిరసా కీ | ||౧౫౭||
157. ‘బాబా! లోకలు ఇలా అనుకోకూడదు. ఆమెకు హితోపదేశం చేసి, ఆమెనెందుకు అనుగ్రహించటం లేదు? అపవాదాలను ఆపండి.
అంగాంత నాహీ ఉరలే త్రాణ | కాసావీస హోతీల ప్రాణ | మ్హాతారీ తీ పావేల మరణ | తుమ్హాంస అపశరణ52 యేఈల | ||౧౫౮||
158. ‘దేహంలో శక్తి లేదు. ప్రాణం విలవిలాడుతూ, ఎంతో బాధపడి, ఆ ముసలామె చస్తుంది. మీకు అపకీర్తి వస్తుంది.
మ్హాతారీచే దుర్ధర వ్రత | ఆమ్హాస పడలీ చింతా బహుత | దుర్దైవే మ్హాతారీ జాలియా మృత | గోష్ట అనుచిత ఘడేల | ||౧౫౯||
159. ‘ఆమె దీక్ష ఎంతో కష్టంగా ఉంది. మేమందరమూ చాలా చింతతో ఉన్నాము. దురదృష్టంతో ఆమె చస్తే, జరగకూడనిది జరిగినట్లు అవుతుంది.
మ్హాతారీనే మాండిలా త్రాగా53 | న కరితా తిజవరీ కృపానురాగా | దిసే న ధడగత తిచీ మలా గా | స్వముఖే సాంగా తిస కాంహీ | ||౧౬౦||
160. ‘ఆమెను మీరు కరుణించక పోతే, ఆ ముసలామె చావటానికి సిద్ధమైంది. ఆమె బ్రతికే ఆశ లేదు. మీరే ఆమెకేదైనా చెప్పండి’ అని అన్నాడు.
ఝాలీ సీమా అధ్యాయాచీ | పుఢీల శ్రవణేచ్ఛా శ్రోతయాంచీ |
పుఢీల అధ్యాయీ పురేల సాచీ | ప్రేమరసాచీ తీ జోడ | ||౧౬౧||
161. ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది. ముందు ఏమి జరిగింది అని తెలుసుకోవాలనే కోరిక, తరువాతి అధ్యాయంలో, ప్రేమ రసంతో నిండిన కథతో, తీరుతుంది.
పుఢే బాబాంనీ ప్రేమళపణే | ఉపదేశ జో కేలా త్యా మ్హాతారీ కారణే | తయాచియా సాదర శ్రవణే | ఉఠేల ధరణే అవిద్యేచే | ||౧౬౨||
162. ఎంతో ప్రేమతో బాబా ఆ ముసలామెకు చేసిన హితోపదేశాన్ని వింటే, మొండిపట్టు తొలగిపోయి, అజ్ఞానం నశిస్తుంది.
హేమాడ సాఈపాయీ శరణ | శ్రోతయా ఘాలీ లోటాంగణ | అల్పాయాసే భవతరణ | కరాయా శ్రవణ తత్పర వ్హా | ||౧౬౩||
163. హేమాడు సాయి పాదాలకు శరణుజొచ్చి, సులభంగా సంసార సాగరాన్ని దాటటానికి, శ్రద్ధగా వినండి అని శ్రోతలకు నమస్కరిస్తున్నాడు.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | మదనుగ్రహ నామ |
| అష్టాదశోధ్యాయః సంపూర్ణః |
||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ:
1. నాశరహితా. (నిత్యా) 2. నిర్ద్వంద్వా. (ద్వంద్వాతీతా) 3 .నిర్వికారా. (వికారరహితా)
4. స్వరూప. (నిజరూప) 5. మిఠాచీ బాహులీ. (సైంధవాచీ) 6. వేఢా. (గర్కా)
7. మజవర ఝాలేల్యా అనుగ్రహాచీ గోష్ట. (మదనుగ్రహ) 8. జశీ ఝాలీ తశీ. (యథార్థతా)
9. కథూ నయే. (కథితా) 10. స్వప్నాత సాంగితలేలే. (స్వప్నోక్తహీ)
11. గచ్చ భరూన. (కోంబూన) 12. జువళే. (జావళే)
13. నావానే ఎకసారఖ్యా హాకా మారణే, నామస్మరణ కరణే. (హాకాటీ)
14. తోండీ. (ఓంఠీ) 15. కాతావలేలే (కావలే) 16. ఉచ్ఛిత మనోరథ. (అభీష్ట)
17. దరిద్రీ. (అకించన) 18. పూర్వపుణ్యాఉర్చ్యా బళానే (పూర్వార్జిత)
19. పురాణికాప్రమాణే. (పురాణికసే) 20. అమృతాలా. (పీయూశాసీ)
21. (గురుచరిత్రాచే అమృతరూపీ) ఆవర్తన. (పాఠ) 22. స్పష్ట సాంగావా. (వివరావా)
23. పాయ దాబణే. (పాదసంవాహన) 24. బాబాంచే దర్శన ఝాల్యాపాసూనచీ సాత వర్షే. (సాత)
25. సంతచూడామణీ. (సంతవతంస) 26. మాధవరావ దేశపాండే. (శామ్యాకడే)
27. భాగవతాచ్యా ఎకాదశ స్కంధావరీల ఎకనాథ మహారాజాంచీ టీకా. (నాథభాగవతాచీ)
28. ఆళసానే వాచావయాచే టాకలే (హేళసిలే) 29. నేమాచీ ఉపాసనా. (నియమితోపాసన)
30. పూర్ణ భరలేలే. (పరిలుప్త) 31. శ్రీ హరీ సీతారామ దీక్షిత. (దీక్షిత)
32. సూప ఘేఊన ఝడపణే తే. (హడప) 33. పుష్కళ. (ఉమాప)
1. నాశరహితా. (నిత్యా) 2. నిర్ద్వంద్వా. (ద్వంద్వాతీతా) 3 .నిర్వికారా. (వికారరహితా)
4. స్వరూప. (నిజరూప) 5. మిఠాచీ బాహులీ. (సైంధవాచీ) 6. వేఢా. (గర్కా)
7. మజవర ఝాలేల్యా అనుగ్రహాచీ గోష్ట. (మదనుగ్రహ) 8. జశీ ఝాలీ తశీ. (యథార్థతా)
9. కథూ నయే. (కథితా) 10. స్వప్నాత సాంగితలేలే. (స్వప్నోక్తహీ)
11. గచ్చ భరూన. (కోంబూన) 12. జువళే. (జావళే)
13. నావానే ఎకసారఖ్యా హాకా మారణే, నామస్మరణ కరణే. (హాకాటీ)
14. తోండీ. (ఓంఠీ) 15. కాతావలేలే (కావలే) 16. ఉచ్ఛిత మనోరథ. (అభీష్ట)
17. దరిద్రీ. (అకించన) 18. పూర్వపుణ్యాఉర్చ్యా బళానే (పూర్వార్జిత)
19. పురాణికాప్రమాణే. (పురాణికసే) 20. అమృతాలా. (పీయూశాసీ)
21. (గురుచరిత్రాచే అమృతరూపీ) ఆవర్తన. (పాఠ) 22. స్పష్ట సాంగావా. (వివరావా)
23. పాయ దాబణే. (పాదసంవాహన) 24. బాబాంచే దర్శన ఝాల్యాపాసూనచీ సాత వర్షే. (సాత)
25. సంతచూడామణీ. (సంతవతంస) 26. మాధవరావ దేశపాండే. (శామ్యాకడే)
27. భాగవతాచ్యా ఎకాదశ స్కంధావరీల ఎకనాథ మహారాజాంచీ టీకా. (నాథభాగవతాచీ)
28. ఆళసానే వాచావయాచే టాకలే (హేళసిలే) 29. నేమాచీ ఉపాసనా. (నియమితోపాసన)
30. పూర్ణ భరలేలే. (పరిలుప్త) 31. శ్రీ హరీ సీతారామ దీక్షిత. (దీక్షిత)
32. సూప ఘేఊన ఝడపణే తే. (హడప) 33. పుష్కళ. (ఉమాప)
34. బత్తీస అధ్యాయ జ్యాలా ఆహేత అసే (*యా ఠికాణీ ఎకనాథీ భాగవతాత ౩౨ అధ్యాయ ఆహేత అసే మ్హటలే ఆహే, తే చుకీనే హేమాడపంతాంనీ మ్హటలే ఆహే. మహారాష్ట్ర శాసనానే మార్చ ౧౯౭౧ సాలీ ప్రకాశిత కేలేల్యా శ్రీ ఎకనాథీ భాగవతాచ్యా ప్రతీత ౩౧ అధ్యాయచ ఆహేత. తసేచ, శ్రీ రామచంద్ర కృష్ణ కామత సంపాదిత వ కేశవ భికాజీ ఢవళే ప్రకాశిత, ౧౯౮౫ సాలచ్యా ఆవృత్తీతసుద్ధా ౩౧చ అధ్యాయ ఆహేత. అసే సమజతే కీ, హేమాడపంత యాంచ్యా నేహమీచ్యా వాచనాత శ్రీ లక్ష్మణ రామచంద్ర సంపాదిత వ తుకారామ జావళీ, నిర్ణసాగర ప్రింటీంగ ప్రేస యాంనీ ౧౯౧౦సాలీ ప్రకాశిత కేలేలీ ఆవృత్తీ అసే. తిచ్యాతసుద్ధా ౩౧చ అధ్యాయ ఆహేత. స్వతః హేమాడపంతాంనీ ’శ్రీ సాఈలీలా’చ్యా వర్ష ౫వే, అంక ౬-౭-౮ మధ్యే పృష్ఠ ౭౨౯వర ఎకనాథీ భాగవత ఆణి భావార్థ రామాయణ వ సాఈమహారాజ యా సంబంధిత ఆపల్యా లేఖాత ఎకనాథీ భాగవతాత ౩౧ అధ్యాయ ఆహేత, అసే నమూద కేలే ఆహే.) (బత్తీసఖణీ*).
35. దుధాచా నైవేద్య. (౮౯ పయఃప్రసాద)
36. అల్ప ఫలాహార (౮౯ అల్పాహార) 37. యా నావాచ్యా డోంగరావర (౯౦ భండార్యావర)
38. యా ఎకాదశస్కంధాస ’ఉద్ధవగీత’ అసే మ్హణతాత. (౯౨ ఉద్ధవదీతీ)
39. జ్ఞానేశ్వరీ. (౯౪ భావార్థదీపికా) 40. ఆజ్ఞా. (౯౫ నియోగ)
41. శైలీ (౯౭ అనుగ్రహకుసరీ) 42. ఉదీ, అంగారా. (౧౦౦ విభూతి)
43. పోథీ వాచావయాస ఆజ్ఞా. (౧౦౦ ఆజ్ఞాపన)
44. నిత్యపాఠాపైకీ వాచావయాచా బాకీ రాహిలేలా భాగ. (౧౧౨ రాహిలే)
45. దక్షిణేసహ. (౧౧౫ దక్షిణేసీ) 46. పళభర. (౧౧౬ విళభర) 47. గావఢేకరీ (ఖేడ్యాతీల) - (౧౨౩ ఖేడవళ)
48. అన్న వ పాణీ యాంవాచూన వ్రతస్థ బసణే. (౧౪౫ ప్రాయోపవేశీ)
49. ‘నారాయణ తేలీ’ హే అంతఃస్థ ఎఖాద్యా దృష్టవృత్తీలా అనులక్షూన శ్రీ సాఈబాబా వరచేవర మ్హణత అసత (౧౫౦ నారాయణ)
50. లోకాంత పరస్పరాంత బోలణే. (౧౫౭ ప్రవాద)
51. దోషారోప (౧౫౭ అప్రమాద)
52. అపయశ. (౧౫౮ అపశరణ)
53. నిర్వాణ. (౧౬౦ త్రాగా)
No comments:
Post a Comment