Saturday, March 2, 2013

||బ్రహ్మజ్ఞాన కథనం నామ సప్తదశోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత
 || అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౭ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

గతాధ్యాయీ అభివచన | కీ యే అధ్యాయీ హోఈల నిరూపణ | 
శ్రేయ ఆణి ప్రేయ లక్షణ | సాదరే శ్రవణ తే కీజే | ||౧|| 
1. ఈ అధ్యాయంలో శ్రేయం (మనకు శ్రేయస్సును, అంటే మేలు, చేకూర్చేది) మరియు ప్రేయ (మనకు ప్రియమైనది, అంటే నచ్చినది) లక్షణాలను వర్ణిస్తానని వెనుకటి అధ్యాయంలో చెప్పాను కదూ! వానిని శ్రద్ధగా ఇప్పుడు వినండి.
ప్రకాశ ఆణి అంధకార | జైసే అన్యోన్య వృత్త్యాకార | 
భిన్నరూప తే పరస్పర | శ్రేయ ప్రేయ తయా పరీ | ||౨|| 
2. వెలుగు, చీకటి ఒకటికొకటి సంబంధ పడి ఒకేలా ఉన్నా, అవి ఒకటికొకటి వేరుగా విరుద్ధంగా ఉంటాయి. అలాగే శ్రేయ, ప్రేయాలు అంతే. 
ప్రేయార్థ జయాచే మన ధాంవే | స్వార్థాపాసావ తో భ్రంశ పావే | 
శ్రేయ తే వివేకరూప ఆహే | అవివేక రూప ప్రేయ కీ | ||౩|| 
3. ప్రేయ వెనుక పరుగెత్తే మనసుగల వారు, స్వార్థంతో నాశమౌతారు. శ్రేయ వివేకానికి రూపమైతే, ప్రేయ అవివేకానికి రూపం. 
శ్రేయాచా విషయ కేవళ విద్యా | ప్రేయాచా తో నిఖళ అవిద్యా | 
ప్రేయ కధీ నా భులవీ సూజ్ఞా | శ్రేయ అజ్ఞా నావడే | ||౪|| 
4. శ్రేయాలకు సంబంధించిన సంగతులు కేవలం జ్ఞానంతో ముడి పడినవి. ప్రేయాల సంగతులు అజ్ఞానానికి సంబంధించినవి. వివేకవంతులు ఎప్పుడూ ప్రేయాల గురించి మోసపోరు. అజ్ఞానులకు శ్రేయాలు నచ్చవు. 
జోంవరీ కనక కామినీ హోడ | ఇంద్రియాంసీ విషయాంచీ ఆవడ | 
వివేక వైరాగ్యా నాహీ జోడ | ప్రేయచి గోడ తోంవరీ | ||౫|| 
5. డబ్బు, స్త్రీలు వీటి కోసం విపరీతమైన మోహం ఉన్నంత వరకు, ఇంద్రియాలకు సుఖాలపై కోరిక ఉన్నంత వరకు, వివేకం వైరాగ్యం పొందనంత వరకు, ప్రేయాలే చాలా మధురంగా ఉంటాయి. 
నీర క్షీరాచీ మిసళ | తేవీ ప్రేయశ్రేయాంచీ భేసళ | 
జేవీ దుగ్ధ తేవఢే నివళ | సేవితీ మరాళ మానసీ | ||౬|| 
6. నీరు, పాలు ఎలా కలిసి పోతాయో, అలా ప్రేయాలు శ్రేయాలు కలిసే ఉంటాయి. మానస సరోవరంలోని హంస ఒక్కటే ఈ మిశ్రమంలో నుంచి, నీరును వేరు చేసి, పాలను మాత్రమే త్రాగుతుంది. 
తేవీంచ జే ధీర బుద్ధిమంత | వివేకీ ఆణి భాగ్యవంత | 
శ్రేయస కేవళ లోలంగత | ప్రేయాసీ విన్ముఖ సర్వదా | ||౭|| 
7. ధీరులు, బుద్ధిమంతులు, అదృష్టవంతులు, కేవలం శ్రేయాలనే కోరుకుంటారు. ప్రేయాలనుంచి ఎప్పుడూ దూరంగా ఉంటారు. 
తేచ పహా మందబుద్ధీ | శరీర పశు పుత్ర ధన మానాది | 
యోగక్షేమాచ్యా లాగోని నాదీ | ప్రేయ సాధితీ ఎకలే | ||౮|| 
8. కాని తెలివి లేనివాళ్ళు, దేహం గురించిన సుఖాలు, పశువులు, కొడుకులు, డబ్బు, కీర్తి, గౌరవాలు, వీటి వెంట పరుగెత్తుతూ, ప్రేయాలనే పొందుతారు. 
శ్రేయ కాయ ప్రేయ కాయ | జ్ఞాత ఝాలే జరీ ఉభయ | 
తైసాచి గ్రహణ వ్యవసాయ | జరీ స్వాయత్త1 పురుషాసీ | ||౯|| 
9. శ్రేయాలు కాని, ప్రేయాలు కాని, ఈ రెంటినీ బాగా తెలుసుకున్న తరువాత కూడా, మనుషులకు స్వతంత్ర బుద్ధి ఉండటంతో, ఈ రెంటిలో దేనిని కోరుకోవాలి అన్నది వారి చేతిలోనే ఉంటుంది. 
తరీహీ ప్రాప్త హోతా ఉభయ | నివడ కరణే అవఘడ విషయ | 
కరూని మందబుద్ధీవరీ జయ | ఆలింగీ ప్రేయ తయాసీ | ||౧౦||
10. అవి రెండూ దొరకినప్పుడు, వాటిలో దేనిని కోరుకోవాలో నిర్ణయించడం చాలా కష్టం. ప్రేయాలు తెలివి లేని వాళ్ళను జయించి, గట్టిగా కౌగలించుకుంటుంది. 

సారూ2 ప్రేయ ఆదరూ శ్రేయ | పురుషార్థ తో హాచి హోయ | 
అసతా పయమిశ్రిత తోయ | పయచి ఘేఈ హంస జైసా | ||౧౧|| 
11. నీరు కలిసిన పాలలో నుండి, పాలను మాత్రమే తీసుకునే హంసలా, ప్రేయాన్ని వదిలి, శ్రేయాన్నే తీసుకోవాలి. ఇదే మనుషులు సాధించాల్సిన ఉత్తమ స్థితి. 
శ్రేయ ఆణి ప్రేయ హీ దోన | జరీ హీ పురుషాచే స్వాధీన | 
అసమర్థ కరాయా హే వివేచన | వివేకహీన మందమతీ | ||౧౨|| 
12. శ్రేయ మరియు ప్రేయ, ఇవి రెండూ మన చేతిలో ఉన్నా, వివేకం లేనివారికి, తెలివి లేనివారికి, ఈ రెంటిలోని తేడాను తెలుసుకో గలిగే శక్తి ఉండదు. 
శ్రేయ తే ఆహే కశాంత | ఆరంభీ జాణిలే పాహిజే నిశ్చిత | 
మగ యేతా ప్రతిబంధ మార్గాంత | ప్రతికార3 సాద్యంత కరూంయే | ||౧౩|| 
13. ముందుగా, శ్రేయ దేనిలో ఉంది అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ తరువాత, దానిని పొందటానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవచ్చు. 
యేథేంచ పురుషార్థ దృష్టీపుఢా | యేవోని ఠాకే దత్త నిఘడా| 
మ్హణోని శ్రేయార్థచి కరా ఝగడా | కరోని ధడా బుద్ధీచా | ||౧౪|| 
14. శ్రేయను పొందటానికి, దృఢమైన, శక్తివంతమైన మానవ ప్రయత్నం కావాలి. అందుకే, మునుపే బుద్ధితో బాగా నిశ్చయించుకుని, శ్రేయం కొరకు పోరాడాలి. 
అతర్క్య సంసారచక్రాచే ఫేర | అఖండ భ్రమతీ అష్టౌప్రహర | 
ఆధ్యాత్మికాది త్రితాప ప్రఖర | దుర్నివార నర సాహే | ||౧౫|| 
15. ఈ సంసార చక్రం తిరగటం అంతుపట్టనిది. రాత్రి పగలూ ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతూ ఉండటం వలన, భయంకరము, తొలగించటానికి వీలు కాని, అధ్యాత్మికాది మూడు తాపాలను మనుషులు అనుభవిస్తుంటారు. 
తేణే ఆత్యంతిక దుఃఖహర | సహన కరితా హోఈ జర్జర | 
శోధీ మగ తన్నివర్తనపర | సోపీ సుఖకర సాధనే | ||౧౬|| 
16. దానివలన, విపరీతమైన దుఃఖాలను సహిస్తూ, విసిగిపోయి, వానిని తొలగించు కోవటానికి సుఖకరమైన సాధనలను వెతుకుతారు. 
దుఃసహ హే భవచక్ర పరివర్తన | హోఈల కైసే యాచే స్తంభన | 
తదర్థ అసేల కాయ సాధన | హే అన్వేషణ4 ఆదరీ | ||౧౭|| 
17. భరించలేని, ఈ సంసార చక్రం తిరగడాన్ని ఆపడానికి, ఏవైనా సాధనాలున్నాయా అని శ్రద్ధగా వెతుకుతారు. 
థోర భాగ్యే హే బుద్ధి ఉపజతా | తేథూన నిపజే పురుషార్థతా | 
మగ తో సదుపాయ సాధకతా | నిజస్వార్థా వరీల | ||౧౮|| 
18. గొప్ప అదృష్టం వలన ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు, ఉత్తమమైన జీవితాన్ని (శ్రేయాలను) పొందటానికి చేసే మానవ ప్రయత్నం, మొదలవుతుంది. ఆ తరువాత, తన మేలు కోసం, తన లక్ష్యాన్ని పొందటానికి, సరియైన మార్గాన్ని కనుక్కుంటాడు. 
అనాది అవిద్యా అథవా మాయా | శుక్తిరజత మృగజలవత వాయా | 
అధ్యాసరూప మహదంతరాయా | విలయా నేలే పాహిజే | ||౧౯|| 
19. ముత్యపు చిప్పులోని వెండిలాగ, ఎండమావుల్లోని నీరు లాగ, ఎప్పటినుంచో వస్తున్న ఈ మాయ, లేక విద్య లేకపోవటం, ఎంతో మోసం చేసేది, మరియు వ్యర్థమైనది. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించే ఈ మాయ, అడ్డంకులలో చాలా ముఖ్యమైనది. దీనిని నశింప చేయాలి. 
స్వప్నాంత సోన్యాచ్యా గారా వర్షతీ | ప్రయత్నే సాంఠవణ కేల్యా అమితీ5
వాటే వేళీ కామాస యేతీ | హారవూన జాతీ జాగృతీ | ||౨౦||
20. కలలో బంగారపు వడగళ్ళ వాన పడుతుంది. ఎప్పటికైనా పనికి వస్తుందని చాలా కష్టపడి, వానిని మూట కట్టుకునే ప్రయత్నం చేస్తే, మెలుకువ రాగానే అవి మాయమైపోతాయి. 

దృష్టాదృష్ట భోగ వాసనా | ఆశా తృష్ణా వా కామనా | 
సదైవ ప్రతిబంధక జాణా | సమూళ ఖాణా6 యా ఆధీ | ||౨౧|| 
21. కనిపించేవి, కనిపించనివి మొదలైన ఇంద్రియ సుఖాలను అనుభవించాలనే విపరీతమైన కోరిక, వాటిని కావలని అనుకోవటం కాని, వాటి గురించి ఆలోచించటం కూడా పెద్ద అడ్డంకులు, అని తెలుసుకోవాలి. ముందు వీటిని తొలగించుకోవాలి.
అశక్య దిసాయా సూర్యకరే7 | బుద్ధి జేథూన మాఘారీ ఫిరే | 
జేథ వేదశ్రుతీచే పాఊల న శిరే | తే నిజకరే గురు దావీ | ||౨౨|| 
22. సూర్యుని వెలుగులో చూడలేని దానిని, బుద్ధికి అందని దానిని, వేద శ్రుతులకు అంతు పట్టని దానిని, గురువు తమ చేత్తో చూపిస్తారు. 
కామ క్రోధ ఉభయవృత్తీ | కరూ న దేతీ జ్ఞాన ప్రాప్తీ | 
శ్రవణ మనన సమాధి విచ్చితి8 | హాతో హాతీ త్యా కరితీ | ||౨౩|| 
23. కామ క్రోధాలు రెండూ మనసుకు వచ్చే మార్పులు. ఇవి జ్ఞానాన్ని పొందనీయవు. పైగా కథా, కీర్తనలను వినటానికి, తలచుకోవటానికి, సమాధి చెందటానికి, వెంటనే చెడుగొట్టుతాయి. 
దీపాంకర్పూరా హోతా లగటీ9 | సంభవే కాయ లోటాలోటీ10
ఉభయత్ర భేటీ హోణ్యాచీ ఖోటీ | దీపత్వే ఉఠే కర్పూర | ||౨౪|| 
24. దీపం, కర్పూరం రెండూ కలసినప్పుడు, ఒకటి ఇంకొక దానిని తోసి వేయటం సాధ్యమా? ఆ రెండూ కలసిన వెంటనే, కర్పూరం దీపమై వెలుగుతుంది. 
శ్రుతిస్మృతీలా అవిహిత | దుష్కర్మీ లోళే జో అవిరత | 
జ్ఞానీ అసని కాయ హిత | విహితావిహిత జో నేణే | ||౨౫|| 
25. శ్రుతి స్మృతులలో, చేయకూడదని చెప్పిన చెడు పనులనే ఎప్పుడూ చేస్తూ, అందులోనే మునిగి ఉండి, ఏది సరియైనది, ఏది కాదు అని తెలుసుకోలేని మనిషి, శాస్త్రాల జ్ఞాని అయితే మాత్రం ఏం ప్రయోజనం? 
తైసాచ జో నిత్య అశాంత | అంతఃకరణ అసమాహిత | 
ఇంద్రియలౌల్యే విక్షిప్తచిత్త | జ్ఞానే నిర్వృత్త11 హోఈనా | ||౨౬|| 
26. అలాగే, మనసులో అలజడి కారణంగా, ఎప్పుడూ శాంతి లేకుండా ఉండేవారు, ఇంద్రియ సుఖాల గురించి మనసులో కలవర పడేవారు, జ్ఞానంలో ఎన్నటికీ పరిపూర్ణులు కాలేరు. 
జ్యాచే చిత్తాస సమాధాన | జో గురుపుత్ర ఆచారవాన | 
జ్యాచే నిశ్చల ఆత్మానుసంధాన | జ్ఞానసంపన్న తో ఎక | ||౨౭|| 
27. మనసులో తృప్తిగా ఉండేవాడు, ఆచారాలను తెలిసిన వాడు, నిజమైన న్యాయపరమైన గురు పుత్రుడు, నిలకడగా ఉండే మనసుతో, ఆత్మతో లీనమౌతాడో అలాంటి వాడొక్కడే జ్ఞానాన్ని పొందినవాడు. 
హో సంసార వా మోక్షగామీ | జాణే జరీ నిజధామీ | 
హోఈ శరీరరథస్వామీ12 | కేవళ వాగ్మీ13 కాయ కరీ | ||౨౮|| 
28. సంసారి అయినా, మోక్షాన్ని ఇష్టపడేవాడైనా, తను చేరుకోవాలిసిన చోటుకు చేరాలంటే, దేహమనే ఈ రథాన్ని తన అధీనంలో ఉంచుకోవాలి. ఊరికే ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు ఏమి సాధించగలడు? 
యేథే వాచేసీ నాహీ థార | అభ్యాస ఎక సర్వసార | 
రథస్థానీ14 యోజీ శరీర | స్వయే స్థిర బైసేగా | ||౨౯|| 
29. తెలివిగా మాట్లాడగలిగే ధాటికి ఇక్కడ చోటు లేదు. అసలైన అభ్యాసం అవసరం. దేహాన్ని రథంగా అనుకుని, నిలకడగా కూర్చోవాలి. 
యా నిజ శరీరాచ్యా రథీ | నిజబుద్ధీస కరీ సారథీ | 
స్వయే స్వామీ బైసే రథీ | స్వస్థచిత్తీ ఏస తూ | ||౩౦||
30. దేహమనే ఈ రథంలో, తన బుద్ధిని సారథిగా చేసి, యజమాని అయిన తాను, స్థిరమైన మనసుతో కూర్చోవాలి. 

దుర్గమరూప రసమార్గరాజీ15 | కంఠావయా మగ సారథీ యోజీ | 
ఆవరీ మనఃప్రగ్రహాంమాజీ16 | దశేంద్రియవాజీ17 ఉచ్చృంఖళ | ||౩౧|| 
31. బుద్ధిని సారథిగా నియమించి, ఇంద్రియాలనే పది గుర్రాలను, మనసు అనే పగ్గంతో తన అధీనంలోకి తెచ్చుకోవాలి. విచ్చలవిడిగా పరుగెత్తే ఈ గుర్రాలను, ఇంద్రియ సుఖాలనే మార్గాల మీద, తెలివితో నడిపించాలి. 
ఘోడే జరీ సైరా18 ధాంవతీ | లగామ రాఖీల స్థానావరతీ | 
తో నిరవూన సారథియా హాతీ | స్వస్థ చిత్తీ బైసే తూ | ||౩౨|| 
32. గుర్రాలు తమ ఇష్టం వచ్చినట్లు పరుగెత్తాలని అనుకున్నా, మనసనే పగ్గం అదుపులో ఉంచుతుంది. కనుక, దీనిని సారధి చేతికిచ్చి, నీవు ఏ చింతా లేకుండా కూర్చో. 
సారథీ కుశల ఆణి నిపుణ | తరీచ ఘోడే చాలతీ కసూన | 
తోచ మనఃప్రగ్రహపరాధీన19 | హోతా బలహీన హోతసే | ||౩౩|| 
33. నేర్పు గల, ఉపయోగకరమైన సారథి అయితేనే, గుర్రాలు బాగా పరుగెత్తుతాయి. కాని, మనసు అనే పగ్గం బలహీనమైతే, గుర్రాలు అదుపులో ఉండవు. 
వివేక బుద్ధీచే సారథ్య జేథ | జో సమనస్క20 సమాహితచిత్త21
తయాసీచ పరమపద ప్రాప్త | ఇతర మార్గాంత థకతాత | ||౩౪|| 
34. వివేకంతో ఉన్న బుద్ధియొక్క సారథ్యం ఉండి, మనసును బలంగా నిగ్రహించుకుని, ఏకాగ్రతతో ఉన్నవారు, పరమ పదాన్ని చేరుకోగలరు. మిగతావారు, మార్గంలో అలసిపోతారు. 
జయాచే సదా ఆయుక్త మన | తయా న కదా సమాధాన | 
తయా న తత్పదాభిగమన | సంసారపరివర్తన చుకేనా | ||౩౫|| 
35. మనసు అధీనంలో ఉండకపోతే, వారికి శాంతి ఉండదు. పరమాత్మ కూడా వారికి లభించడు. చావు పుట్టుకల చక్రం తప్పదు. 
ఏసే తే పద పరమ మోఠే | వాస్తవ్య తరీ తయాచే కోఠే | 
మనీంచీ హే ఆశంకా ఫిటే | ప్రకట జై తే ఓపైసే | ||౩౬|| 
36. ఇలాంటి గొప్ప పరమపదం, తనంతట తానే కనిపించినప్పుడు, ‘ఇది నిజంగా ఎక్కడుంది?’ అనే మనసులోని సంశయం దూరం అవుతుంది. 
యేథే న చలే తర్కవాద | అనువాద ప్రవాద వా సంవాద | 
ఈశకృపేనేంచ లాగేల దాద | ఇతర వాద తే వ్యర్థ | ||౩౭|| 
37. తర్కాలు, వాదాలు ఇక్కడ పనికి రావు. దేవుడి అనుగ్రహంతోనే, అడ్డంకులు తొలగిపోయి, ఆత్మయొక్క చోటు తెలుస్తుంది. ఇతర వాదాలు దండుగ. 
న చలే యేథ తర్కాచీ చతురాఈ | తర్కజ్ఞమతి కుంఠిత హోఈ | 
భోళా భావచి సిద్ధీస జాఈ | హేచ నవలాఈ యేథీల | ||౩౮|| 
38. తర్కాలలో, వాదాలలో ఉండే చాతుర్యం ఇక్కడ పనికి రాదు. ఎంతో జ్ఞానం ఉన్న తర్క శాస్త్రజ్ఞుల తెలివి, భ్రమతో కూడుకున్నవి. వినేవారిని కలవర పెట్టేవిగా ఉంటాయి. నమ్మకం ఉన్న అమాయకులే సిద్ధిని పొందగలరు. ఇదే ఇక్కడి విశేషం. 
సమ్యగ్జ్ఞానాసీ జే కారణ | తే గతి ఆన తే బుద్ధీహీ ఆన | 
తో ఆగమజ్ఞహీ వేగళాచ జాణ | ఉత్తమ జ్ఞానదానీ జో | ||౩౯|| 
39. అతి ఉత్తమమైన మంచి జ్ఞానాన్ని చేరుకునే మార్గం వేరు. దానికి కావలసిన బుద్ధి కూడా వేరు. ఆ జ్ఞానాన్ని బోధించ గలిగిన, శాస్త్రాలను తెలిసిన నిపుణులు కూడా వేరు. 
కాయా అమోలిక చాలిలీ వాయా | ధన కామ హీ దుపారచీ ఛాయా | 
జాణోని హరీచీ దుర్ఘట మాయా | లాగే పాయా సంతాంచ్యా | ||౪౦||
40. వెల కట్టలేని ఈ దేహం వృథాగా పాడై పోతూ ఉంది. డబ్బు మీది వ్యామోహం, మధ్యాహ్నపు నీడలాగా క్షణికమైనదని తెలుసుకోవాలి. అలాగే, శ్రీహరియొక్క మాయను జయించటం కూడా చాలా కష్టమని కూడా తెలుసుకోవాలి. అందుకే సత్పురుషుల పాదాలను ఆశ్రయించాలి. 

సంత భవసాగరీంచే తారూ | తూ హో తేథీల ఎక ఉతారూ | 
తయాంవీణ పైలపారూ | కోణ ఉతరూ సమర్థ | ||౪౧|| 
41. సత్పురుషులు ఈ సంసార సాగరాన్ని దాటించే నౌకలు. ఆ నౌకలలో నీవు ఒక ప్రయాణికుడు కావాలి. వారి తప్ప, ఈ నౌకలను తీరానికి చేర్చగల సమర్థులెవరు?
వివేక వైరాగ్య యాంచీ జోడ | బాంధీల తయాంచీ జో సాంగడ | 
తో హో కా జడమూఢ దగడ | అవఘడ నా త్యా భవసింధు | ||౪౨|| 
42. వివేకం, వైరాగ్యం, ఈ రెంటినీ మూట కట్టుకున్నవారు, జడులైనా, మూఢులైనా, రాయి లాంటి కఠినులైనా, సంసార సాగరాన్ని దాటటం వారికి ఏ మాత్రం కష్టం కాదు. 
షడ్గుణైశ్వర్య భగవంతాచే | వైరాగ్య హే ప్రథమైశ్వర్య సాచే | 
అసతీల జే మహద్భాగ్యాచే | వినా ఇతరాంచే వాంట్యా న యే | ||౪౩|| 
43. దేవుడి షడ్గుణ ఐశ్వర్యాలలో, వైరాగ్యం మొదటి ఐశ్వర్యం. ఎంతో అదృష్టవంతులకు తప్ప, మిగతా వారికి ఇది దొరకదు. 
విహితకర్మ22 కేలియావీణ | హోఈనా చిత్తశుద్ధీ నిర్మాణ | 
చిత్తశుద్ధీ న హోతా జాణ | జ్ఞాన సంపాదన ఘడేనా | ||౪౪|| 
44. శాస్త్రాలు నియమించిన పనులను చేయకపోతే, మనసు శుద్ధి కాదు. మనసు శుద్ధంగా లేకపోతే, జ్ఞానం దొరకటం సాధ్యం కాదు. 
తస్మాత్ కర్మచి ఎక జాణ | జ్ఞాన ప్రాప్తీచే మూల కారణ | 
నిత్యనైమిత్తిక కర్మానుష్ఠాన | తేణేంచ క్షాళణ మళాచే | ||౪౫|| 
45. కనుక, మనము చేసే పనులే (కర్మ) జ్ఞానం లభించటానికి మూల కారణమని తెలుసుకోవాలి. నియమించిన పనులను రోజూ చేయటం వలనే, మనసులోని మురికిని కడిగి వేయటం జరుగుతుంది. 
ఎవం శుద్ధ ఝాలేల్యా చిత్తీ | వివేక వైరాగ్యా ఉత్పత్తీ | 
శమదమాది సాధన సంపత్తీ | విదేహ ముక్తీ యే హాతీ | ||౪౬|| 
46. ఇలా పరిశుద్ధమైన మనసులో, వివేక వైరాగ్యాలు పుట్టి, శమ దమాది సాధన సంపత్తి (శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష మరియు సమాధాన) లభించి, ఈ దేహం ఉండగానే మోక్షం కలుగుతుంది. 
ఫల కామ సంకల్పత్యాగే | చిత్తైకాగ్రతేచ్యా యోగే | 
అనన్యత్వే జో గురూసీ శరణ రిఘే | పదరీ ఘే త్యా సద్గురూ | ||౪౭|| 
47. చేసే పనులకు వచ్చే ఫలం గురించి ఆలోచించకుండా, స్థిరమైన మనసుతో గురువును సాటిలేని శరణుజొచ్చితే, సద్గురువులు అక్కన చేర్చుకుంటారు. 
జో బహిఃప్రవృత్తిశూన్య | భావీక భక్త అనన్య | 
జ్ఞానలాభే హోఈ ప్రజ్ఞ | ఉపాయ అన్య చాలేనా | ||౪౮|| 
48. బయటి ప్రపంచపు పనులలో అసలు ఆసక్తి లేకుండా, మనసును నిలకడగా చేసుకున్న భక్తులకు జ్ఞానం లభించి, ప్రజ్ఞావంతులు అవుతారు. మిగతా ఏ ఉపాయాలూ పనికి రావు. 
తేంహీ జ్ఞాన లాభల్యావరీ | అధర్మమార్గే ఆచరణ కరీ | 
అత్ర నా అముత్ర ఖాలీ నా వరీ | త్రిశంకూపరీ లోళకంబే | ||౪౯|| 
49. జ్ఞానం దొరికిన తరువాత, అధర్మమైన దారులను అనుసరించే వారు, ఇహ పరాలకు దూరమై, క్రింద కాకా, పైనా కాక, త్రిశంకులా, మధ్యన వ్రేలాడుతారు. 
జీవాచీ జే అజ్ఞాన వృత్తీ | తీచ ఖరీ సంసార ప్రవృత్తీ | 
ఝాలియా ఆత్మజ్ఞాన ప్రాప్తీ | తేచ నివృత్తీ సంసారా | ||౫౦||
50. జీవులలోని అజ్ఞానమే ఈ సంసారం వైపు జీవులను ఆకర్షిస్తుంది. ఆత్మ జ్ఞానం దొరకగానే, లౌకిక జీవితంనుంచి ముక్తి లభిస్తుంది. సంసారంలో ఉన్నా, జ్ఞాని సంసారానికి చేరిన వాడు కాదు. 

ఆత్మజ్ఞ సదా అహంభావ రహిత | ధర్మాధర్మ శుభాశుభ విరహిత | 
తయాంస తే సంసారాంతర్గత | హితాహిత కాయ పా | ||౫౧|| 
51. ఆత్మను తెలుసుకున్నవారు, ఎప్పుడూ అహంకారం లేకుండా ఉంటారు. వారికి సంసారంలోని ధర్మ అధర్మాలు, శుభ అశుభాలు, హిత అహితాలు, వీటితో ఏం పని? 
విరాలీ దేహాహంకార వృత్తీ | తాత్కాళ తేథేంచ సంచలీ నివృత్తీ | 
తీచ జీవాచీ పరమాత్మ స్థితీ | ఖూణ నిశ్చితీ బాంధావీ | ||౫౨|| 
52. తానే ఈ దేహం అనే అహంకారం తొలగిపోయిన వెంటనే, ఈ సంసార వ్యవహారాలనుంచి విరక్తి కలుగుతుంది. జీవుడు దేవుడితో ఒకటైన స్థితి అదే అని, ఖచ్చితంగా తెలుసుకోవాలి. 
ప్రవృత్తీ ఠాయీ శత్రూ మిత్ర | నివృత్తీచే తో హే విచిత్ర | 
మీచ మీ పాహతా సర్వత్ర | శత్రుత్వ మిత్రత్వ తై కైంచే | ||౫౩|| 
53. ప్రాపంచిక వ్యవహారాలలో ఆసక్తి ఉన్నప్పుడు, శత్రువులు, మిత్రులు ఉంటారు. కాని, విరక్తి కలిగిన తరువాత అలా కాదు. అంతటా నేను నేనుగా కనిపించగా, ఇంక శత్రువులు ఎక్కడ, మిత్రులు ఎక్కడా? 
ఏసియా మహాసుఖాపుఢే | దేహ మహద్దుఃఖ తే బాపుడే | 
తై కోణ ఏహిక సుఖా రడే | మహత్సుఖ ఆతుడే జై | ||౫౪|| 
54. ఇలాంటి మహా సుఖం ముందు, దేహానికి కలిగే దుఃఖాలు ఏపాటివి? అంత అద్భుతమైన సుఖం దొరికిన తరువాత, లౌకిక సుఖాలకు ఎవరు ఏడుస్తారు? 
ఏహిక దుఃఖాచే డోంగర | కోసళోత మగ తయావర | 
పరి తో న హాలే లవభర | గిరివర కేవళ ధీరాచా | ||౫౫|| 
55. ఈ లౌకిక దుఃఖాలు కొండల వలె వారి మీద పడ్డా, వారు ఏ మాత్రమూ చలించరు. కొండంత ధైర్యంతో ఎదుర్కొంటారు. 
భగవంత జ్యావరీ ప్రసన్న హోతో | త్యాలాచ మగ తో వైరాగ్య దేతో | 
త్యాశీ వివేకాచీ సాంగడ బాంధితో | పార ఉతరవితో భవసాగర | ||౫౬|| 
56. దేవుడు ఎవరిని ఇష్టపడితే, వారికి వైరాగ్యాన్ని ఇస్తాడు. దానితో పాటు వివేకాన్ని కూడా జత చేసి, వారిని ఈ సంసార సాగరంనుంచి దాటిస్తాడు. 
ఆదర్శీ ఉమటల్యా ముఖాపరీ | స్పష్టాత్మదర్శనీ హేతు జో ధరీ | 
తయా యేథే భూ23 కీ బ్రహ్మలోక23 వరీ | జాగా తిసరీ నాహీంచ | ||౫౭|| 
57. అద్దంలో కనిపించే మొహంయొక్క ప్రతిబింబం లాగా, స్పష్టంగా ఆత్మను చూడాలనే కోరికగలవారికి కోరిక తీరేది, ఇక్కడ భూలోకంలో, లేక పైన బ్రహ్మ లోకంలో. అంతే కాని, మూడో చోటు వేరే లేదు. 
యాగీ హోతా దేవతా తృప్తీ | పితృలోకాచీ హోఈల ప్రాప్తీ | 
లాధేల కర్మ ఫలోపభుక్తీ | ఆత్మసంవిత్తీ లాధేనా | ||౫౮|| 
58. యజ్ఞ యాగాలు చేయడంతో, దేవతలు తృప్తి చెందితే, పితృలోకం చేరి, కర్మ ఫలాలను అనుభవించ వచ్చు, కాని ఆత్మ జ్ఞానం దొరకదు. 
గంధర్వ మహర్జనస్తపః సత్య | తేథీల ఆత్మదర్శన అతి అవివిక్త24
యాలాగీ జే ఆత్మదర్శనాసక్త | భూలోక యథోక్త వాంచ్చితీ | ||౫౯|| 
59. గంధర్వ, మహా, జన, సత్య, తపో మొదలైన లోకాలలో దొరికే ఆత్మ జ్ఞానం చాలా మసక మసకగా, అస్పష్టంగా ఉంటుంది. అందుకే, ఆత్మను తెలుసుకోవాలని అనుకునే వారు భూలోకాన్నే కోరుకుంటారు. 
యేథే హోతే చిత్తశుద్ధీ | ఆదర్శాపరీ నిర్మల బుద్ధీ | 
శుద్ధ ఆత్మస్వరూప త్రిశుద్ధీ | ప్రతిబింబీత హోతసే | ||౬౦||
60. ఇక్కడ, మనసు శుద్ధి కలిగి, అద్దం వలె నిర్మలమై, శుద్ధమైన ఆత్మ రూపాన్ని ప్రతిబింబిస్తుంది. 

దుజే స్థాన జే బ్రహ్మలోక | తేథేంహీ హోతో ఆత్మావలోక25
పరి సాయాస లాగతీ అనేక | కష్టకారక అతితర తో | ||౬౧|| 
61. రెండవ చోటైన బ్రహ్మ లోకంలో కూడా, ఆత్మ రూపాన్ని తెలుసుకోవచ్చు. కాని, అక్కడ అనేక రకాల కష్టాలు ఉండగా చాలా శ్రమ కలుగుతుంది.
సర్పావాణీ26 మాయా వేటాళీ | అక్షీ27 ఆంతూన ఆంతడీ పిళీ | 
బాహేరహీ సర్వాంగ కవటాళీ | సమర్థ టాళీ కోణ తియే | ||౬౨|| 
62. పాము వలె, మాయ లోపలి ప్రేగులను, బయట అన్ని అంగాలను పెనవేసి పిండేస్తూంటే, దానిని ఆపగల సమర్థులెవరు? 
“తుమ్హీ బసల్యా బసల్యా పహాతా | ఖిశీంత పన్నాసపట రూపయే అసతా | 
కాఢా పాహూ బాహేర ఆతా | బ్రహ్మా తో ఖిశాంత తుమచేచ” | ||౬౩|| 
63. “ఊరికే కూర్చుని, ఏమీ పట్టనట్టుగా నువ్వు చూస్తున్నావు. జేబులో యాభై రెట్లు రూపాయలు ఉన్నాయి. వానిని ఇప్పుడు బయటికి తీయ్యి. చూద్దాం! అక్కడ, నీ జేబులోనే బ్రహ్మ ఉన్నాడు!” 
కాఢా మ్హణతా హాత ఘాలితీ | గృహస్థ పుడకే ఖిశాంతూన కాఢితీ | 
దహాదహాంచ్యా పంచవింశతీ | నోటా మోజితీ పుడక్యాంత | ||౬౪|| 
64. అని బాబా తీయమని చెప్పగా, ఆ గృహస్థుడు జేబులో చేయి వేసి నోట్ల కట్టను తీశాడు. అందులో పది రూపాయల నోట్లను, ఇరవై ఐదు లెక్క పెట్టాడు. 
గృహస్థ విరఘళే మనీంచే మనీ | కేవఢే మహారాజ అంతర్జ్ఞానీ | 
మస్తక ఠేవితీ తయాంచే చరణీ | ఆశీర్వచనీ ఉత్కంఠా | ||౬౫|| 
65. అతడు లోలోపల సిగ్గు పడ్డాడు. అవలీలగా అన్నీ తెలుసుకో గలిగిన బాబా శక్తిని చూచి, భయపడి, వెంటనే తన తలను వారి పాదాలపై ఉంచాడు. 
మగ బాబా మ్హణతీ తే వేళే | “గుండాళ ఆపులే బ్రహ్మగుండాళే | 
లోభాచే జాహల్యావీణ వాటోళే | బ్రహ్మ న మిళే తుజ లాగీ | ||౬౬|| 
66. అప్పుడు బాబా అతనితో “నీ బ్రహ్మను చుట్టి దాచేసుకో! నిన్ను చుట్టుకున్న పిసినారితనం తొలగి పోనంత వరకు, నీవు బ్రహ్మను కనుక్కో లేవు. 
పుత్రపశ్వాది విత్తార్జన | ఆసక్త యాంతచి జయాచే మన | 
తయాస కైంచే బ్రహ్మజ్ఞాన | ద్రవ్యవ్యవధాన న సుటతా | ||౬౭|| 
67. “కొడుకులు, పశువులు, డబ్బును కూడబెట్టుకోవటం లాంటి ఆలోచనలలో ఆసక్తి ఉన్నవారికి, డబ్బు మీద ఉన్న వ్యామోహం పోయేంత వరకు, బ్రహ్మజ్ఞానం ఎలా దొరుకుతుంది? 
మహా కఠిణ విత్తమోహ | తృష్ణావర్త దుఃఖగాహ28
మద మత్సర మకర దుఃసహ | ఎక నిఃస్పృహ తరేల | ||౬౮|| 
68. “డబ్బు మీద ఉండే వ్యామోహాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. డబ్బు వ్యామోహం అనే సుడిగుండాలు గల దుఃఖాల చెరువులో, అహంకారం, ఈర్ష్య అనే మొసళ్ళు భరించ లేనంతగా ఉంటాయి. కనుక ఒక్క విరాగియే (వైరాగ్యం కలవాడు) తరించగలడు. 
లోభాశీ బ్రహ్మాచే అఖండ వైర | తేథే ధ్యానా నాహీ అవసర | 
కైంచీ ముక్తీ విరక్తీ సాచార | ఆచారభ్రష్ట లోభిష్ట | ||౬౯|| 
69. “బ్రహ్మకు లోభానికి (పిసినారితనం) అంతు లేని వైరం. లోభం ఉన్న చోట మనసు నిలకడగా ఉండదు. ఆచారాలనుండి దూరంగా ఉండే పిసినారికి, విరక్తి, ముక్తి ఎలా సాధ్యం? 
లోభా ఠాయీ నసే శాంతీ | నా సమాధాన నా నిశ్చింతీ | 
ఎక లోభ వసతా చిత్తీ | జాతీ మాతీంత సాధనే | ||౭౦||
70. “పిసినారికి శాంతి, తృప్తి, సమాధానం, అనేవి ఏవీ ఉండవు. లోభమనే ఈ ఒక్క గుణం మనసులో ఉంటే, మిగతా సాధనలన్నీ మట్టి కొట్టుకు పోతాయి. 

శ్రుతి స్మృతీస అవిహిత | ఏసే నిషిద్ధ జే దుశ్చరిత | 
త్యాంతచి సదైవ జో ఆసక్త | అసమాహిత చిత్త తో | ||౭౧|| 
71. “శ్రుతులు, స్మృతులు చేయకూడదని చెప్పిన పనులనే చేయడంలో, ఎప్పుడూ ఆసక్తి కలిగిన దుష్టులకు, మనశ్శాంతి అనేది ఉండదు. 
తయా నాంవ ‘విక్షిప్తచిత్త’ | సదైవ దుష్కర్మీ వ్యావృత్త29
అఖండ విషయకర్దమీ లోళత | హితాహిత దేఖేనా | ||౭౨|| 
72. “అలాంటి వారిని ‘విక్షిప్త చిత్త’ (కలత చెందిన మనసు) అని అంటారు. వారు ఎప్పుడూ చెడు పనులలోనే మునిగి ఉంటారు. మంచి, చెడు అనేది చూడకుండా, ఎప్పుడూ ఇంద్రియ సుఖాలనే బురదలో పడి పొర్లుతుంటారు. 
హో కా బ్రహ్మవిజ్ఞాన సంపన్న | నాహీ జో ఫళేచ్చేసీ నిర్విణ్ణ30
తోంవరీ వావ31 తే బ్రహ్మ విజ్ఞాన | ఆత్మ సంపన్న నాహీ తో | ||౭౩|| 
73. “బ్రహ్మ జ్ఞానాన్ని పొందినా, చేసిన పనులకు వచ్చే ఫలం మీద విరక్తి కలుగనంత వరకు, పొందిన జ్ఞానం దండుగ. అలాంటి వారు అసలైన ఆత్మ జ్ఞానాన్ని అనుభవించలేరు. 
కోణ కాంహీ మాగూ యేతా | అధికార పాహతీ సంత ప్రథమతా | 
జైసీ జయాచీ యోగ్యాయోగ్యతా | తైసేంచ త్యాతే దేతీ తే | ||౭౪|| 
74. “ఎవరైనా, ఏదైనా, కోరటానికి వచ్చినప్పుడు, సత్పురుషులు, ముందు వారి యోగ్యతను చూస్తారు. తరువాత, వారి వారి యోగ్యతలను బట్టి అడిగినది ఇస్తారు. 
జయా మనీ రాత్రందిన | దేహాభిమాన విషయచింతన | 
తయా గురూపదేశాచా శీణ | వ్యర్థ నాగవణ ఉభయార్థా | ||౭౫|| 
75. “రాత్రింబవళ్ళూ దేహం మీద ప్రేమతో, మనసులో ఇంద్రియ సుఖాల గురించే ఆలోచించే వారికి, గురువు ఉపదేశం వృథా. వారికి ఇహం లోనూ, పరం లోనూ ఏదీ దొరకదు. 
చిత్తశుద్ధీ జాహల్యావీణ | పరమార్థీ రిఘూ పాహే జో ఆపణ | 
జ్ఞాన గర్వాచీ తీ మిరవణ | కేవళ శీణ తో ఖరా | ||౭౬|| 
76. “శుద్ధమైన మనసు లేకుండా, పరమార్థ మార్గంలో చేరాలని అనుకోవడం, తమ జ్ఞాన గర్వాన్ని చాటుకోవడమే గాని, అది నిజంగా వ్యర్థం. 
యాస్తవ రూచేల తేంచ బోలావే | పచేల తితుకేంచ అన్న ఖావే | 
నా తరీ వ్యర్థ అజీర్ణ వ్హావే | హే తో ఠావే సకళీకా | ||౭౭|| 
77. “తమకు నచ్చిన సంగతులే చెప్పాలి. జీర్ణమయేంత అన్నమే తినాలి. లేకుంటే అన్నం ఎక్కువై అజీర్ణం అవుతుందని అందరికీ తెలిసిందే కదా! 
మాఝా భాండార భరపూర ఆహే | దేఈన జో జో జే జే చాహే | 
పరి గ్రాహకాచీ శక్తి పాహే | దేతో మీ సాహే తేంచ కీ | ||౭౮|| 
78. “నా భాండారం పూర్తిగా నిండి ఉంది. ఎవరు ఏమి అడిగినా ఇవ్వగలను. కాని, పుచ్చుకునే వారి తాహత్తును చూచి, వారు భరించగలిగినంతే ఇస్తాను. 
ఏకాల జరీ హే లక్ష దేఊన | పావాల తుమ్హీ కృతకల్యాణ | 
యా పవిత్ర మశీదీంత బైసూన | అసత్య భాషణ న కరీ మీ” | ||౭౯|| 
79. “దీనిని శ్రద్ధగా వింటే నీవు ధన్యుడవుతావు. ఈ పవిత్రమైన మసీదులో కూర్చుని, నేనే అబద్ధమైన మాటలను పలకను”. 
హీ సంతవాక్యసుధాసరితా | భావార్థే యేథే బుడీ దేతా | 
అంతర్బాహ్య లాధే శుద్ధతా | క్షాళణ హోతా మళాచే | ||౮౦||
80. ఇది సత్పురుషుని నోటినుండి ప్రవహించిన అమృత ఝరి. దీనిలో మునకలు వేస్తే, మురికి కడగ బడి, లోపల బయటా పరిశుద్ధి కలుగుతుంది. 

ఏసా సాఈనాథాచా మహిమా | వర్ణూ జాతా న పురే సీమా | 
ఉపమూ కైసే త్యా నిరుపమా | శుద్ధప్రేమా ఆధీన తో | ||౮౧|| 
81. ఇలాంటి సాయినాథుని మహిమను వర్ణించటం మొదలు పెట్టితే, దానికి ముగింపే ఉండదు. పోల్చడానికి సాధ్యం కాని వారిని దేనితో పోల్చగలం? నిర్మలమైన ప్రేమతోనే వారిని పొందగలము.
మాఉలీ తీ సకళాంచీ | విశ్రాంతీ ఆర్తశ్రాంతాంచీ | 
కల్పవల్లీ ఆశ్రితాంచీ | దీనా దుబళ్యాంచీ జీ ఛాయా | ||౮౨|| 
82. వారు అందరికీ తల్లి. ఆర్తులకు, కష్టాలతో అలసి పోయినవారికి వారే ఆశ్రయం. ఆశ్రితులకు వారు కల్పవృక్షం. దీనులకు, శక్తి లేని వారికి వారు నీడ. 
సంసారావరీ పాణీ దేఊన | గిరీకపాటీ మౌన ధరూన | 
ఎకాంతవాస స్వీకారూన | నిజకల్యాణైక దక్ష జో | ||౮౩|| 
83. సంసారానికి నీళ్ళు వదిలేసి, మౌనంగా కొండలలో, గుహలలో, ఒక్కరే ఉండి తమ మేలును సాధించుకునే వారూ ఉంటారు. 
ఏసే సంత అసతీ బహుత | కేవళ జే సాధితీ నిజస్వార్థ | 
అథవా కేవళ నిజపరమార్థ | కాయకీ అర్థ ఇతరాతే | ||౮౪|| 
84. అలాంటి సాధువులు చాలా మంది ఉంటారు. వారు కేవలం తమ స్వార్థాన్ని లేదా పరమార్థాన్ని సాధించుకుంటారు. వారినుంచి మిగతా వారికి ఏం ప్రయోజనం? 
తేవీ న సాఈబాబా మహంత | నసతా ఆప్తేష్ట గణగోత | 
ఘరదార వా జాయాసుత | ప్రపంచాంత రాహతీ | ||౮౫|| 
85. కాని సాయిబాబా అలాంటి మహాత్ములు కారు. ఆప్తులు, ప్రియులు, బంధువులు, ఇల్లూ వాకిలి, భార్యా పిల్లలు, ఎవరూ లేకున్నా, ఈ ప్రపంచంలోనే ఉన్నారు. 
కరతల భిక్షా పాంచ ఘరా | తరూతలవాస అష్టౌ ప్రహరా | 
మాండూని థితా ప్రపంచ పసారా | వ్యవహార సారా శికవితీ | ||౮౬|| 
86. ఐదు ఇళ్ళలో చేతికిచ్చిన భిక్షను తీసుకుని, ఇరవై నాలుగు గంటలూ చెట్టు క్రింద ఉంటూ, తమదంటూ ఏమీ లేకున్నా, ప్రపంచంలో ఎలా మెలగాలని బోధించేవారు. 
సాధూని నిజ బ్రహ్మస్థితీ | జనతేచ్యా కల్యాణా ఝిజతీ | 
ఏసే సంత మహామతి | విరళా జగతీ అసతీల | ||౮౭|| 
87. తాము బ్రహ్మ స్థితిలో ఉంటూ, ప్రజల శ్రేయస్సు కొరకు కష్టపడేవారు. మహాజ్ఞానులైన ఇలాంటి సత్పురుషులు జగత్తులో చాలా అరుదుగా ఉంటారు. 
ధన్య తో దేశ ధన్య తే కుళ | ధన్య తీ ఆఈబాపే నిర్మళ | 
ధన్య త్యాంచా కుసవా సోజ్వళ | ప్రసవలా నిర్మళ హే రత్న | ||౮౮|| 
88. ఈ పవిత్ర రత్నం జన్మించిన దేశం ధన్యం. ఆ కులం ధన్యం. పవిత్రులైన ఆ తల్లి తండ్రులూ ధన్యులు. 
అనాయాసే పరిస లాధలా | పాషాణ సమజూని బహుతీ ఝుగారిలా | 
శిరడీంత యా పరమ భాగవతాలా | కోణీ న ఓళఖిలా బహుకాళ | ||౮౯|| 
89. ఏ కష్టము లేకుండా, పరుశవేది దొరికితే, అది ఓ రాయి అని అనుకుని పారవేసుకున్నట్లు, శిరిడీలోని ఈ పరమ దైవాన్ని, చాలా కాలం వరకూ ఎవరూ తెలుసుకోలేదు. 
జైసే ఉకిరడా రత్న పడావే | పోరాంబాళా సాంపడావే | 
త్యాంనీ వాటేల తేథే ఉడవావే | ఖుశాల తుడవావే దగడసే | ||౯౦||
90. చెత్త కుప్పలో పడి ఉన్న రత్నం పిల్లలకు దొరికితే, దాన్ని రాయి అనుకుని వారు ఇష్టమొచ్చినట్లు సంతోషంతో ఎగర వేసి, కాలుతో తొక్కుతారు. 

అసో యాపరీ తో బ్రహ్మాచా భోక్తా | ఆశీర్వచనీ పావే తృప్తతా | 
తీచ గత తుమ్హా ఆమ్హా సమస్తా | బికట రస్తా సోడావా | ||౯౧|| 
91. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని కోరి వచ్చిన మనిషి, బాబా ఆశీస్సులతొ తృప్తి చెందాడు. దారి కష్టమైనప్పుడు, దానిని వదలాలి. నాకైనా, మీకైనా అదే ఉపాయం. 
జోవరీ బాహ్య విషయాంచే సేవన | శబ్దశ్రవణ స్పర్శసంవేదన | 
ఆమోదాఘ్రాణన32 బాహ్యాంగదర్శన | తో న విరోధన33 విషయార్థా | ||౯౨|| 
92. శబ్దాలను వింటూ, స్పర్శ సుఖాన్ని పొందుతూ, మంచి వాసనలను అనుభవిస్తూ, బయట కనిపించే రూపాలను చూస్తూ, ఇలా బయట ప్రపంచాన్ని సేవిస్తున్నంత వరకూ, ఇంద్రియాలను అదుపులో పెట్టటం కాని పని. 
ఝాలియావీణ ఇంద్రియనిరోధన | స్వభావప్రవృత్తిపరావర్తన34
ప్రత్యగ్రూపాచే35 అవలోకన | వా తద్బోధన36 అశక్య | ||౯౩|| 
93. ఇంద్రియాలను అదుపులో పెట్టకుండా, వాటి సుఖాలనుండి దూరం కాకుండా, ఆత్మ జ్ఞానం కావలంటే, అది అసాధ్యం. 
ఆధీ వ్హావే సర్వేషణావిహీన | మగ సద్గురూసీ అనన్య శరణ | 
ఏసా జో దృఢ శ్రద్ధాసంపన్న | ఆత్మవిజ్ఞానా పాత్ర తో | ||౯౪|| 
94. మునుపు, కోరికలను వదలాలి. తరువాత, దృఢమైన శ్రద్ధా భక్తులతో, సద్గురువుకు శరణుజొచ్చితే, అప్పుడు ఆత్మ జ్ఞానానికి యోగ్యులవుతారు. 
శ్రోత్రాది పంచజ్ఞానేంద్రియే | త్యాగిజేతీల జై స్వ స్వ విషయే | 
మన సంకల్ప వికల్ప స్వయే | త్యాగీల నిశ్చయే జే కాళీ | ||౯౫|| 
95. చెవులు మొదలైన ఐదు జ్ఞానేంద్రియాలు తమ తమ కోరికలను వదిలి వేసినప్పుడు, మనసు తనంతట తానే, అనుమానాలను, చర్చలను వదిలివేస్తే, 
ఎవం ప్రతినివృత్త జై అంతర | బుద్ధిహీ సాండీల నిశ్చయవ్యాపార37
తేచ తే పరమగతీ సాచార | నిర్వికార బ్రహ్మ తే | ||౯౬|| 
96. అలా అన్నింటినుండి బయట పడ్డ మనసులో, బుద్ధి కూడా నిర్ణయం తీసుకునే పనిని మానినప్పుడు, అదే మోక్షం. అదే నిర్వికార బ్రహ్మతో ఒక్కటైన స్థితి. 
బుద్ధీ హోఈల నిశ్చయశూన్య | చిత్తహీ జై పావేల చైతన్య | 
తైంచ తోచ ఎక న తదన్య | ఆత్మ్యాతే ధన్య జాణీల | ||౯౭|| 
97. బుద్ధి శూన్యమై, మనసు చైతన్య మయమై, ఆ పరమాత్మ ఒక్కడే తప్ప వేరే ఎవరూ లేరని ఆత్మను తెలుసుకున్న మనిషి ధన్యుడు. 
హోతా విషయాంపాసూన విన్ముఖ | హోతీల ఇంద్రియే ఆత్మోన్ముఖ | 
తేవ్హాంచ ప్రకటేల నిజసుఖ | ఇతర సర్వ అసుఖ తే | ||౯౮|| 
98. ఇంద్రియ సుఖాలనుండి దూరమైనప్పుడు, ఇంద్రియాలు వాటంతట అవే ఆత్మవైపు చూడటం మొదలౌతుంది. అప్పుడే నిజమైన ఆత్మ సుఖం కనిపిస్తుంది. మిగతావన్నీ సుఖాలు కావు. 
జే విషయ వికార ప్రచ్ఛన్న38 | అతిసూక్ష్మ దుర్దర్శ39 ఆత్మజ్ఞాన | 
పరమానందప్రాప్తీచే సాధన | అతిగహన ఆకళాయా | ||౯౯|| 
99. ఇంద్రియాల కోరికలతో, వాటి ఆసక్తితో కప్పబడి ఉన్నంత వరకూ, సూక్ష్మమైన ఆత్మాన్ని తెలుసుకోవటం కష్టం. ఆత్మను తెలుసుకుంటేనే, పరమాత్మతో ఒక్కటవటానికి అవకాశం ఉంది. 
హిరణ్యగర్భపదాపర్యంత | ఇహాముత్ర40 విషయీ విరక్త | 
తోచ ఎక బ్రహ్మపదాభిషిక్త41 | తో ఎక ముక్త జాణావా | ||౧౦౦||
100. బ్రహ్మ పదవి వరకు ఉండే ఇహ పర సుఖాలన్నిటి లోనూ విరక్తి కలిగినవారే, బ్రహ్మ పదమునకు యోగ్యులు. అలాంటి వారే ముక్తులని తెలుసుకోవాలి. 

చిత్తాస విషయాపాసూన | హళూహళూ మాఘౌతే42 ఫిరవూన | 
ఆత్మరూపీ స్థిర కరూన | ఆత్మజ్ఞాన జోడావే | ||౧౦౧|| 
101. ఇంద్రియాలను తృప్తి పరిచే వస్తువులనుంచి, మనసును మెల్ల మెల్లగా వెనుకకు మరలించి, ఆత్మ రూపంలో స్థిరపరచి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి.
ఇహాముత్రఫళభోగవిరాగ | హర్ష శోకాది ద్వంద్వత్యాగ | 
బుద్ధిమంతాసీంచ హా భోగ | అధ్యాత్మయోగ తో హాచి | ||౧౦౨|| 
102. ఇహ లోకంలో, పర లోకంలో దొరికే కర్మ ఫలాలను, ఆనందం - దుఃఖం లాంటి విరుద్ధ భావాలను, వైరాగ్యంతో త్యజించిన బుద్ధిమంతులకే వైరాగ్య సుఖం దొరుకుతుంది. దానినే అధ్యాత్మ యోగమని అంటారు. 
అధిదైవాధ్యాత్మాధిభౌతికీ43 | నిఖిల వడవానల జ్వాలాదికీ | 
సంతప్త సంసారార్ణవోదకీ44 | కోణ కీ సుఖీ అసేల | ||౧౦౩|| 
103. అధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికాలనే మూడు తాపాల బడబానల మంటలలో మరిగి పోతున్న సంసార సాగరంలోని నీటిలో, ఎవరు సుఖంగా ఉండగలరు? 
తేణే వ్హావయా నిజసముద్ధరణ | వ్హావే సాఈప్రసాదసంపన్న | 
కరావే తచ్చరిత్రావలోకన | శ్రవణ మనన సాదరే | ||౧౦౪|| 
104. అలాంటి తాపాలనుండి తమను తాము ఉద్ధరించుకోవటానికి, సాయి అనుగ్రహాన్ని పొందాలి. వారి చరిత్రను శ్రద్ధగా విని, తలచుకుంటూ ఉండాలి. 
హె శ్రీసాఈనాథ చరిత్ర | శ్రోతీ సపుత్ర మిత్ర కలత్ర45
పరిసతా సాధేల ఇహ పరత్ర | లీలా విచిత్ర బాబాంచీ | ||౧౦౫|| 
105. శ్రోతలు తమ భార్య, కొడుకులు, మిత్రులు, మరియు బంధువులతో సహా, సాయినాథుని చరిత్రను వింటే, ఇహ పర సుఖాలు లభిస్తాయి. 
సభాగ్య శ్రద్ధాళూ శ్రోతే | తేచి యా కథాంచే పరిసతే | 
పరిసతా అతి హళువార చిత్తే | శాంతతే యేతే శాంతతా | ||౧౦౬|| 
106. శ్రద్ధా, భక్తి, నమ్మకమున్న అదృష్టవంతులైన శ్రోతలు ఈ కథలను, నిలకడగా ఉన్న మనసుతో వింటే, శాంతి లభిస్తుంది. 
యా కథాంనిఃస్యందనిర్ఝరే46 | కర్మాకర్మలవణ47 విరే | 
శ్రవణద్వారే నయనీ శిరే | రూప సాజిరే సాఈచే | ||౧౦౭|| 
107. సెలయేరు లాంటి ఈ కథా ప్రవాహంలో, కర్మ, అకర్మలనే ఉప్పు కరిగిపోతుంది. చెవుల ద్వారా సాయి సుందర రూపం కళ్ళ ముందుకు వస్తుంది. 
చరిత్ర శ్రవణే పాతకాం ర్హాస48 | చరిత్ర శ్రవణే కాళావరీ కాస49
చరిత్ర శ్రవణే పరమోల్హాస | శ్రోతే నిరాయాస పావతీ | ||౧౦౮|| 
108. సాయి కథలను వినటంతో అన్ని పాపాలు నశిస్తాయి. ఈ కథలను విని, శ్రోతలు చావుతో పోరాడి గెలువగలుగుతారు. ఈ కథలు వినటంతో శ్రోతలు ఉత్సాహాన్ని, సంతోషాన్ని సులభంగా పొందగలరు. 
శ్రవణే శుద్ధ అంతఃకరణ | శ్రవణే చుకేల జన్మమరణ | 
శ్రవణే శ్రోతయా బ్రహ్మపణ | కేవళ50 బ్రహ్మార్పణకర్మానే51 | ||౧౦౯|| 
109. ఈ కథలను వింటే, మనసు శుద్ధమౌతుంది. ఈ కథలను వినటంతో చావు పుట్టుకలు వదిలి పోతాయి. వీటిని విని శ్రోతలు బ్రహ్మత్వాన్ని పొందుతారు. బ్రహ్మార్పణ బుద్ధితో ఈ కథలను వినాలి. 
ఏసా హా సాఈసేవాకామ52 | సేవకా సదా కరీ నిష్కామ53
నిజ భక్తా శ్రీసాఈరామ | దేఈల ఆరామ సర్వదా | ||౧౧౦||
110. ఇలా సాయి సేవను కోరుకునే సేవకులను, భక్తులను, శ్రీసాయిరాముడు కోరికలు లేనివారిగా చేసి, వారి మనసుకు ఎల్లప్పుడూ సుఖాన్ని కలిగిస్తారు. 

భాగశః యా గ్రంథాచే వాచన | అథవా శ్రవణ ఆణీ పరిశీలన | 
మనన ఆణి నిదిధ్యాసన | కరా అనుదిన శ్రోతే హో | ||౧౧౧|| 
111. ఓ శ్రోతలారా! ప్రతి రోజూ ఈ గ్రంథంలోని ఒక్క అధ్యాయాన్ని అయినా చదివి, లేక విని, మననం, నిధిధ్యాసనం చేసి, ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండండి. 
“ఆనందో బ్రహ్మేతి వ్యజానాత” | హె తరీ తైత్తిరీయ శ్రుతి విఖ్యాత | 
తేంచ తే బాబా అనువాదత | శ్రుతినిర్ణీత భక్తాంతే | ||౧౧౨|| 
112. ‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత’ అన్న తైత్తరీయ ఉపనిషత్తులోని మాట బాగా ప్రసిద్ధి చెందినది. ఈ మాటలను బాబా తమ భక్తులకు పదే పదే చెప్పేవారు. 
“ఫికీర న కరావీ యత్కించిత | సదా అసావే ఆనందభరిత | 
చింతా న కరావీ ఆమరణాంత” | ఉపదేశ నిత్య బాబాంచా | ||౧౧౩|| 
113. “మీరు కించిత్తైనా దిగులు పడకండి. ఎప్పుడూ ఆనందంగా ఉండండి. జీవితాంతం చింత పెట్టుకోకండి” అని బాబా ఎప్పుడూ బోధించేవారు. 
అసో బ్రహ్మతత్వ నిర్ధారణ | హే యా అధ్యాయాచే ధోరణ | 
కీ హీ నౌకా భవతారణ | జాఈల శరణ సాఈంస త్యా | ||౧౧౪|| 
114. ఈ అధ్యాయంయొక్క ఉద్దేశం, బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడం. సాయికి శరణుజొచ్చిన వారిని, సంసార సాగరాన్నుండి తరింపచేసేది, బ్రహ్మ తత్వమనే ఈ నౌకయే. 
హితవచన వారంవార | సాంగావే కరావా పరోపకార | 
బాబా తయాచా కరూన అనుకార | తదనుసార ప్రవర్తతీ | ||౧౧౫|| 
115. శాస్త్రాలు చెప్పిన ‘ఇతరులకు మంచి బోధ చేయండి, ఇతరుల మీద దయతో ఉండి, పరోపకారం చేయండి’ అన్న మాటలను తాము స్వయంగా పాటిస్తూ, భక్తులకు పదే పదే చెప్పే వారు. 
హే సయుక్తిక కీ అయుక్తిక | హే మతభేద కేవళ వైయ్యక్తిక54
జేణే సామాన్య జనతేసీ తోఖ55 | తోచ కీ రోఖ యే గ్రంథీ | ||౧౧౬|| 
116. ఇది తగునా లేక తగదా అనే అభిప్రాయాలు కేవలం వ్యక్తిగతం. సామాన్య జనులకు సంతోషం కలిగించి, మేలు చేయడమే ఈ గ్రంథంయొక్క ప్రయోజనం. 
హేంచి ఆహే యేథే ప్రయోజన | బాబా జాణీత కార్యకారణ | 
జైసే తయాచే మనేప్సిత జాణ | హోష్యమాణ56 హీ తైసేంచ | ||౧౧౭|| 
117. ఇక్కడ అసలు ఉద్దేశం అదే. చేసే పనులకు కలిగే ప్రయోజనాలు, ఆ పనుల వెనుక ఉన్న కారణాలు, అన్నీ బాబాకు బాగా తెలుసు. వారు అనుకున్నదానిని బట్టే భవిష్యత్తు జరుగుతుంది. 
గురూముఖీంచ్యా కథా ఏకావ్యా | అతర్క్యే లీలా అనుభవావ్యా | 
స్మరతీల త్యా సంగ్రహీ ఠేవావ్యా | పరిసవావ్యా ఇతరాంతే | ||౧౧౮|| 
118. గురువు నోటినుండి వచ్చిన కథలను విని, వారి ఊహకందని లీలలను అనుభవించి, ఆ లాలలన్నిటినీ గుర్తుగా సంగ్రహించి ఇతరులకు వినిపించాలి. 
సాఈంచే హే చరిత్ర బరే | శ్రవణ కరితా అత్యాదరే | 
శ్రోతియావక్త్యాంచే దైన్య హరే57 | దుర్దిన ఓసరే అవఘ్యాంచే | ||౧౧౯|| 
119. అద్భుతమైన ఈ సాయి చరిత్రను అతి ఆదరంగా వింటే, చెప్పే వారి మరియు వినేవారి దైన్యం నశిస్తుంది. అంతే కాదు, అందరి చెడు రోజులూ తొలగిపోతాయి. 
పాహోని బాబాంచీ అలౌకిక లీలా | కోణ అభాగీ చకిత న ఝాలా | 
కేవళ దర్శనమాత్రేంచి నివాలా | లీన ఝాలా పదకమలీ | ||౧౨౦||
120. బాబాయొక్క అలౌకికమైన లీలలను చూసి, చకితుడు కాని దురదృష్టవంతుడు ఎవడన్నా ఉన్నాడా? కేవలం వారి దర్శన మాత్రంతోనే తృప్తి చెంది వారి పాదాలలో లీనమై పోతాడు. 

విశద చరితే యా సాఈచీ | ప్రశస్త చిత్తే ఏకావయాచీ | 
సంధీ యేతా ఏసీ సుఖాచీ | కోణ ఫుకాచీ దవడీల | ||౧౨౧|| 
121. విస్తారమైన ఈ సాయి చరితను, పరిశుద్ధమైన మనసుతో వినటానికి మంచి అవకాశం దొరికితే, ఎవరు కాదని అనుకుంటారు?
పుత్ర మిత్ర కలత్రావర్త | కామక్రోధాదిగ్రాహయుక్త58
నానా59 రోగ తిమింగిలోజ్జృంభిత60 | ఉద్దేలిత61 ఆశాకల్లోళీ | ||౧౨౨|| 
122. కొడుకు, భార్య, మిత్రులనే సుడిగుండాలలో, కామం క్రోధం అనే మొసళ్ళు, అనేక రోగాలనే తిమింగలాలు విజృంభిస్తుంటాయి. ఆశలనే అలలు కలవర పెడతుంటాయి. 
వేళీ ఉద్వేగాచా ఝటకా | యేవోని జాతో ఘటకోఘటకా | 
ద్వంద్వ మాజూని ఉడతో ఖటకా | పరి న తటకా తోడవే | ||౧౨౩|| 
123. దుఃఖం, వ్యథ అనే దెబ్బలు మళ్ళీమళ్ళీ తగులుతుంటాయి. సుఖదుఃఖాలనే విరుద్ధ భావాలు మనసులో సంశయాలను పుట్టిస్తాయి. అయినా ప్రపంచాన్ని వదిలి పెట్టలేరు. 
స్వయేంచ జీవాస కరావా బోధ | కీ తూంచ ఆహేస బ్రహ్మ శుద్ధ | 
ఝాలాసీ దేహసంగే బద్ధ | నలికాపినద్ధ62 శుక జైసా | ||౧౨౪|| 
124. ‘శుద్ధమైన బ్రహ్మవు నీవే. కాని, శరీరమనే పంజరములో బంధింపబడి ఉన్నావు. పంజరంలోని తీగను గట్టిగా పట్టుకుని తలక్రిందులుగా వ్రేలాడే చిలుకలా ఉన్నావు’, అని మనం స్వయంగా జీవాత్మకు బోధించాలి. 
భులలాసీ కేవళ మోహమాయే | తేణే విసరలాసీ నిజ సోయే | 
తూఝా తూంచ సావధ హోయే | స్వరూపా యే ఝడకరీ | ||౧౨౫|| 
125. ‘కేవలం మాయా, మోహం వలన మతి చదిరింది. ఆ కారణంగా నీ మంచిని మరచిపోయావు’ అని నిన్ను నీవే హెచ్చరించుకుని త్వరగా నీ స్వరూపాన్ని తెలుసుకో. 
భ్రమాముళే వాఢలా భ్రమ | దేహాభిమానాది సంభ్రమ | 
మృగజలసమ హే ‘మీ మమ’ | జాణూని నిర్మమ హోఈకా | ||౧౨౬|| 
126. ‘ఒక పొరబాటు కారణంగా ఇంకా ఎన్నో పొరబాటులు ఎక్కువై, దేహం మీద అభిమానం, కోరికలు కలుగుతుంటాయి. ‘నేను నాది’ అన్నది ఎండమావులలాంటిదే అని తెలుసుకుని, ఏ మమకారాలు లేకుండా ఉండాలి’. 
యా మీ తూ పణాచే ప్రపంచీ | గుంతావే కా నీట వివంచీ63
సోడ ఆవళలే పాయ పంచీ64 | ఉడ్డాణే ఉంచీ విహరకీ | ||౧౨౭|| 
127. ‘నీవు, నేను అన్న ఈ ప్రపంచంలో ఎందుకు చిక్కుకోవాలి? చిలుకా! నీ కాలికి ఉన్న బంధనాన్ని విదిలించుకుని పైకి ఎగిరి విహరించు. 
ముక్త తేథే బద్ధతా అసే | బద్ధతేపాశీ ముక్తతా వసే | 
పరత హోఊనియా ఉభయదశే | శుద్ధ స్వవశే రాహీ బా | ||౧౨౮|| 
128. ‘ముక్తి ఉన్న చోట బంధనమూ ఉంటుంది. అలాగే బంధనమున్న చోట ముక్తి కూడా ఉంటుంది. ఈ రెండు దశలను దాటి శుద్ధమైన ఆత్మ రూపంలో స్థిరపడాలి’. 
హే తో సాక్షేపతేచే జ్ఞాన | సుఖ వా దుఃఖ సర్వాజ్ఞాన | 
దవడోని సంపాదీ విజ్ఞాన | బ్రహ్మజ్ఞాన పాశీంచ65 | ||౧౨౯|| 
129. ఇవి ఒకటికొకటి సంబంధించినవి. సుఖం మరియు దుఃఖం అనేవి అజ్ఞానం వలనే కలిగేవి. అజ్ఞానాన్ని తొలగించుకుని, జ్ఞానాన్ని పొందితే, బ్రహ్మజ్ఞానం దగ్గరలోనే ఉన్నట్లు. 
దేహీ జోవర మీ తూ పణా | తో న తూ నిజ హితాచా దేఖణా66
తో టాక పాహీ ఆపఆపణా | కృపణపణా భిరకావీ | ||౧౩౦||
130. ‘దేహంలో ‘నీవు నేను’ అనే భేద భావం ఉన్నంత వరకు నీవు నీ మేలును తెలుసుకోలేవు. అందుకే ‘నీ, నా’ అన్న దాన్ని వదిలేసేయి. పిసినారిలా దేహాన్ని అంటిపెట్టుకోవటం మాని, నిన్ను నీవు తెలుసుకో. 

కుబేరాసమ ధనవంత | భిక్షావృత్తి జరీ విచరత | 
తరీ తే కేవళ నష్ట చరిత | విపరీత పణ అజ్ఞానానే | ||౧౩౧|| 
131. కుబేరుడిలాంటి ధనవంతుడు, భిక్షాటనం చేస్తుంటే, అది కేవలం అజ్ఞానం వలన కలిగిన దౌర్భాగ్యమే. 
కరావే నిత్య సచ్చాస్త్ర శ్రవణ | విశ్వాసే పాళావే సద్గురువచన | 
రాహూని సదా సావధాన | అనుసంధాన రాఖావే | ||౧౩౨|| 
132. ఎప్పుడూ ఉత్తమమైన శాస్త్రాలను వినాలి. సద్గురువు మాటలను నమ్మకంతో పాటించాలి. వానిని శ్రద్ధగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. 
పాహోని జన తే ఆచార పద్ధతి | నిజోద్ధార మార్గ చోఖాళతీ | 
అసంఖ్య జీ ఉద్ధరతీ | సహజ గతీ త్యాంచేనీ | ||౧౩౩|| 
133. గురువుల ఆచార పద్ధతులను చూసి, జనులు తమను తాము ఉద్ధరించుకోవటానికి దారులను ఎన్నుకుంటారు. అలా లెక్కలేనన్ని జీవులు ఉద్ధరింపబడి, మోక్షాన్ని సహజంగా పొందుతారు. 
కదా యేఈల ఏసీ ఘటకా | ఘడేల భవపాశాంతుని సుటకా | 
జయా అహర్నిశ హా మనాస చటకా | అవచట తటకా తో సోడీ | ||౧౩౪|| 
134. ఈ సంసార బంధనాలు ఎప్పుడు విడిపోతాయో అని రాత్రింబవళ్ళూ ఆలోచించేవారు, త్వరగా విముక్తిని పొందుతారు. 
సాధవేల తో ఎకాంత సాధూన | సంసార నిఃసార హీ గాంఠ బాంధూన | 
అధ్యయన ఆణి ఆత్మచింతన | యాంత చిరంతన67 అసావే | ||౧౩౫|| 
135. ఈ సంసారం నిస్సారం అని బాగా తెలుసుకుని, వీలైనంత వరకు ఏకాంతాన్ని సదుపయోగం చేసుకుని, ఏకాంతంలో ఎప్పుడూ అధ్యయనంలోను ఆత్మ చింతనలో ఉండాలి. 
భక్తి శ్రద్ధాన్విత మనే | శిష్యే పూర్ణ వినయసంపన్నే | 
శరణ సాష్టాంగ గేలియావిణే | జ్ఞానకేణే68 గురూ న దే | ||౧౩౬|| 
136. పూర్తి వినయం విధేయతలతో, శ్రద్ధ భక్తిగల మనసుతో, శిష్యులు సాష్టాంగ పడి శరణు వేడితే తప్ప, గురువు జ్ఞాన సంపదను ప్రసాదించరు. 
సర్వస్వీ గురూశుశ్రూషా కరావీ | బంధమోక్షవృత్తీ69 వివరావీ | 
విద్యావిద్యాది ప్రశ్నీ ధరావీ | గురూరావీ సఫలతా | ||౧౩౭|| 
137. ఉన్నదంతా గురువుకు అర్పించి, వారి సేవ చేయాలి. బంధం ముక్తి గురించి బాగా తెలుసుకోవాలి. విద్య, అవిద్యల గురించిన ప్రశ్నలను గురువుని అడిగి తెలుసుకుని, సఫలతను సాధించాలి. 
ఆత్మా కోణ పరాత్మా కోణ | కోణా న సాంగావే గురూవీణ | 
గురూహీ న యేతా శరణ పూర్ణ | దేతీ న కణహీ జ్ఞానాచా | ||౧౩౮|| 
138. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న సంగతులను గురువు తప్ప వేరే ఎవరూ చెప్పరు. పూర్తిగా గురువుకు శరణాగతులైతే తప్ప, వారు ఆవగింజంత జ్ఞానాన్ని కూడా ప్రసాదించరు. 
గురూవినా ఇతరే దేతా జ్ఞానా | సంసార నివర్తకతే హోఈనా | 
మోక్షఫలప్రద లవహి అసేనా | మనా ఠసేనా కదాపి | ||౧౩౯|| 
139. గురువు కాకుండా, ఇంకెవరైనా జ్ఞాన బోధ చేసినా, దానితో సంసార బంధనాలు విడిపోవు. దానివల్ల కొంచెం కూడ ముక్తి కలుగదు. అది మనసులో అసలు నాటుకోదు. 
తస్మాత గురూవినా జ్ఞాన నోహే | విదిత సకల విద్దానా హే | 
బ్రహ్మాత్మైక్య విషయీ సోయే | సమర్థ పాయ గురూచే | ||౧౪౦||
140. గురువు లేక జ్ఞాన పొందడం సాధ్యం కాదని పండితులందరికీ తెలిసినదే. బ్రహ్మ మరియు ఆత్మ ఒక్కటే అన్న నిజాన్ని అనుభవింప చేసే సామర్థ్యం గురు పాదాలకే ఉంది. 

తేథే న కరితా అనమాన | సాండోని తాఠా అభిమాన | 
హోవోని అఖండ దండాయమాన | ఖాలవా మన గురుపదీ | ||౧౪౧|| 
141. అక్కడ, ఏ అనుమానాలూ లేకుండా, దర్పాలను, అభిమానాలను వదిలివేసి, ఎంతో వినయంగా, గురువుకు సాష్టాంగ దండ నమస్కారం చేసి, వారి పాదాలపై తలునుంచాలి.
దాసానుదాస మీ తుమచా | భరవసా ఎక తవ పదాచా | 
ధరోని పావలో మ్హణా వాచా70 | ధడా జీవాచా దృఢ కరా | ||౧౪౨|| 
142. నిలకడగా ఉండే మనసుతో, గురువు పాదాలను గట్టిగా పట్టుకుని, ‘నేను మీ దాసానుదాసుణ్ణి, మీ పాదాలొకటే నాకు నమ్మకం’ అని నోటితో అంటే చాలు. 
మగ పహా చమత్కార తయాచా | తో గురుదయార్ణవ హేలావే సాచా | 
నిజశేజీ తరంగాచ్యా71| ఝేలీ వరచ్యావరీ తో | ||౧౪౩|| 
143. ఆ తరువాత, వారి చమత్కారాన్ని చూడండి. దయాసాగరులైన ఆ గురువు తమ అనుగ్రహమనే అలల పడకపై తేలి ఆడించగలరు. 
శిరీ ఠేవీ అభయహస్త | ఇడా పిడా కరోని ఉద్వస్త | 
జాళోని పాతకాచ్యా రాశీ సమస్త | ఉదీ మస్తకీ ఫాసీ తో | ||౧౪౪|| 
144. రక్షణనిచ్చే తమ చేతిని, తలపై ఉంచి, ఇడ-పింగళ అనే నాడులను సరి చేసి, మహా పాపాల రాశిని కాల్చి వేసి, నుదుట ఉదీని పెడతారు. 
ఎవం బ్రహ్మార్థియా బ్రహ్మనిరూపణ | హే తో కేవళ నిమిత్త జాణ | 
జీవశీవైక్యతేచీ ఖూణ | భక్తా సంపూర్ణ కథియేలీ | ||౧౪౫|| 
145. ఆ విధంగా, బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన మనిషిని, కేవలం నిమిత్త మాత్రునిగా చేసి, జీవుడు శివుడు ఒక్కటే అనే జ్ఞానాన్ని, బాబా పూర్తిగా భక్తులందరికీ బోధించారు. 
ఆతా మహారాజాంచీ ఎవఢీ | అతుల ప్రజ్ఞా విద్యా గాఢీ | 
అసతా థట్టేచీ కాయ హీ ప్రౌఢీ | కాయ ఆవడీ వినోదీ | ||౧౪౬|| 
146. ఇంతటి గొప్ప విద్య, సాటిలేని ప్రజ్ఞ ఉన్న మహారాజుకు, హాస్యం అంటే ఎందుకంత ఇష్టం? వినోదానికి ఎందుకంత ప్రాముఖ్యతను ఇచ్చారు? 
సహజ శంకా ఘేఈల మన | పరి పాహతా విచారూన | 
ఎకచి ఆహే సమాధాన | సావధాన పరిసిజే | ||౧౪౭|| 
147. అనే అనుమానం సహజంగా కలుగుతుంది కదూ! బాగా ఆలోచిస్తే, దొరికేది ఒక్కటే సమాధానం. అదేమిటని శ్రద్ధగా వినండి. 
ములాంబాళాంసవే బోలతా | తయాంచ్యా బోబడ్యా బోలాంత రమతా | 
ప్రౌఢత్వాచ్యా కథా వార్తా | కధీంహీ హోతాత కాయకీ | ||౧౪౮|| 
148. పసిపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, వారి వచ్చీ రాని ముద్దు మాటలను విని ఆనందిస్తున్నప్పుడు, మనమెవరైనా పెద్దవారిలా మాట్లాడతామా? 
నసతే ప్రేమ కా తయావరీ | తే కాయ వర్ణూ సకేల వైఖరీ | 
పరి బోధప్రదాన కుసరీ | వినోద మస్కరీ హీ ఎక | ||౧౪౯|| 
149. వారి మీద మనకు ప్రేమ లేకనా? మాట్లాడటంలో అది ఒక రకం. అలాగే వినోదం, హాస్యంతో జ్ఞానాన్ని బోధించటం కూడా ఒక కళ. 
కాయ ఆహే రోగ పోటీ | హే కాయ ఆహే బాళాస దృష్టీ | 
మాతేస పాజావీ లాగే గుట్టీ | జరీ తే హట్టీ పిఈనా | ||౧౫౦||
150. పొట్టలో ఏ రోగం ఉందో పిల్లలకు తెలుస్తుందా? వారికి తల్లే కదా మాత్రలూ మందూ ఇవ్వాలి! ఒకవేళ, మందు త్రాగనని వారు మొండికేస్తే, 

కధీ ఆంజారూన గోంజారూన | కధీ నేత్ర పింజారూన | 
కధీ చతుర్దశరత్న ప్రయోజన72 | కధీ ఆలింగన సప్రేమ | ||౧౫౧|| 
151. వారిని బ్రతిమలాడో, బామాడో లేక కొన్ని సార్లు కళ్ళు ఎర్రగా చేశో, ఇంకొన్ని సార్లు బెత్తంతో రెండు వాయించో, చాలా మార్లు ప్రేమగా వారిని గుండెలకు హత్తుకునేది తల్లే కదా! 
తీంచ హోఊ లాగతా ప్రౌఢ | కరావే వాటే తయాంచే కోడ | 
పరి బుద్ధీ తీవ్ర వా బోజడ | తైసాచ నివాడ జ్ఞానాచా | ||౧౫౨|| 
152. పిల్లలు పెరిగిన కొద్దీ, వారి బుద్ధి పెరగటాన్ని కూడా గమనించి, వారిని లాలించాలి. అలాగే జ్ఞానం బోధించేటప్పుడు కూడా. 
తీవ్ర బుద్ధీచే తీవ్ర గ్రహణ | ఉపదేశ ఠరతా నలగే క్షణ | 
తేంచ జడబుద్ధీచే విలక్షణ | బహూత రక్షణ సాయాస | ||౧౫౩|| 
153. చాకులాంటి బుద్ధిగలవారు, క్షణం కూడా ఆలస్యం చేయకుండా, జ్ఞానాన్ని తొందరగా అర్థం చేసుకుంటారు. అదే బుద్ధి తక్కువ ఉన్నవారికి, చెప్పినది తలకెక్కటం కొంచెం కష్టం. వారికి తెలియచేయటానికి కొంచెం ఎక్కువ కష్ట పడాల్సి ఉంటుంది. 
సమర్థ సాఈ జ్ఞాననిధీ | జయా భక్తాంచీ జైసీ బుద్ధీ | 
ఆధీ నిర్ధారూని పాత్రశుద్ధీ | జ్ఞాన సమృద్ధి వితరత | ||౧౫౪|| 
154. సాయి సమర్థులు జ్ఞానానికి నిధి. ముందు భక్తులయొక్క బుద్ధిని, వారి యోగ్యతను తెలుసుకుని, తరువాత సాయి జ్ఞానాన్ని సమృద్ధిగా వారికి ఇచ్చేవారు. 
తయాంస పూర్ణ అంతర్జ్ఞాన | తయాంస ఆధీంచ సర్వాంచీ జాణ73
జయాస జైసే యోగ్య సాధన | తయాచే నియమన తైసేంచ | ||౧౫౫|| 
155. వారికి అవలీలగా అన్నీ తెలిసేవి. అందరి గురించీ వారికి ముందే తెలుసు. వారివారి యోగ్యతలను బట్టి, వారికి ఆయా సాధనలను నియమించే వారు. 
జైసా జయాచా అధికార | తయాచా ఆధీంచ కరూని విచార | 
యోగ్యాయోగ్యతేనుసార | భక్తాంచా భార బాబాంనా | ||౧౫౬|| 
156. అలాగే వారివారి అర్హతలను బట్టి, దాని ప్రకారంగా భక్తుల బాధ్యతలను వారు తీసుకునేవారు. 
తైసేచ ఆమ్హీ దిసాయా థోర | పరి త్యా సిద్ధ సాఈసమోర | 
ఖరేచ ఆమ్హీ పోరాంహుని పోర | వినోదీ ఆతుర సర్వదా | ||౧౫౭|| 
157. వయస్సు మళ్ళిన వారిలా మనము పైకి కనిపించినా, సాయి సిద్ధుల ఎదుట, నిజంగా మనము పిల్లల కంటే పిల్లలం. అందుకే ఎప్పుడూ హాస్యం, వినోదం కోసమే ఆత్రంగా ఉంటాము. 
వినోదాంచే బాబా ఆగర | జే జే ఠాయీ జయాసీ ఆదర | 
తే తే యథేష్ట పురవూని సమగ్ర | రాఖీత అవ్యగ్ర భక్తాంస | ||౧౫౮|| 
158. బాబా వినోదాలకు నిలయం. ఎవరికి ఏది రుచిస్తుందో, తెలుసుకుని, ఆ భక్తులకు ఇష్టమైన వానినే చక్కగా వారికిచ్చి, వారిని తృప్తి పరిచే వారు. 
సుబుద్ధ వా బుద్ధిమంద | వాచితా ప్రకటేల పరమానంద | 
పరిసతా వాఢేల శ్రవణ ఛంద | మననే స్వానంద సంతుష్టీ | ||౧౫౯|| 
159. బుద్ధి ఉన్న వారైనా సరే, లేని వారైనా సరే, ఈ చరిత్రను పఠిస్తే, పరమానందం కలుగుతుంది. విన్న కొద్దీ, ఇంకా వినాలనే కుతూహలం పెరుగుతుంది. దానినే తలచుకున్న కొద్దీ, తృప్తి, ఆనందం కలుగుతాయి. 
ఆవర్తనీ74 పరమార్థబోధ | నిదిధ్యాసనీ మహదాల్హాద | 
సౌఖ్య ఉపజేల అఖండ నిర్బాధ | ఏసీ అగాధ హీ లీలా | ||౧౬౦||
160. మరల మరల పఠిస్తే, పరమార్థ జ్ఞానం కలుగుతుంది. నిధి ధ్యాసలు చేస్తే, అంతు లేని, శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. అలాంటిది బాబాయొక్క ఈ అమోఘమైన లీల. 

భాగ్యే జేణే అనుభవ యేథీలా | యత్కించితహీ అసేల భోగిలా | 
కాయావాచామనే తో ఖిళిలా | అతర్క్య లీలా సాఈచీ | ||౧౬౧|| 
161. ఈ అనుభవాన్ని పొందిన భాగ్యవంతులు, ఎంత కొంచెమైనా సరే, దేహంతో మాటలలో మనసుతో సాయికి అంకితమై పోయారు. ఊహకు అందనివి సాయి లీలలు. 
హేమాడ సాఈపాయీ శరణ | వినోదమార్గే జ్ఞానప్రదాన | 
భక్తకల్యాణ ఎక ప్రయోజన | నిమిత్త జాణ బ్రహ్మార్థియా | ||౧౬౨|| 
162. హేమాడు సాయి పాదాలకు శరణుజొచ్చి, హాస్యంతో వినోదంతో భక్తుల శ్రేయస్సు కోసం బాబా జ్ఞానాన్ని పంచడం గురించి చెప్పాడు. బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన మనిషి కేవలం నిమిత్త మాత్రుడే. 
పుఢీల అధ్యాయ యాహూన గోడ | శ్రవణార్థియాంచే పురేల కోడ | 
మాఝియా జీవీంచీ గుప్త హోడ | ఫోడ ఫోడోని పురవిలీ | ||౧౬౩|| 
163. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురం. వినేవారి కోరికలను తీరుస్తుంది. నా మనసులో రహస్యంగా ఉన్న కోరిక, స్పష్టంగా బయటికి చెప్పబడి, తీర్చటం కూడా జరుగుతుంది. 
మీ జాఈన మాధవాపాశీ75 | బాబాంచా నిరోప దేఈన త్యాంశీ | 
పావేన కైసా అనుగ్రహాశీ | సాద్యంతేశీ పరిసా జీ | ||౧౬౪||
164. మాధవరావు దగ్గరకు నేను వెళ్ళి, అతనికి బాబాయొక్క సందేశాన్ని అందించి, సాయి అనుగ్రహాన్ని పొందిన సంగతిని, పూర్తిగా వినండి. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 

| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | బ్రహ్మజ్ఞాన కథనం నామ | 

| సప్తదశోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||


  టిపణీ: 
1. స్వావలంబీ. 2. దూర కరూ. 
3. ప్రతిబంధ, నివారణ్యాచా ఉపాయ. 4. శోధ. 
5. పుష్కళ. 6. ఖణూన కాఢా. 
7. సూర్యప్రకాశానే. 8. భంగ. 9. సమాగమ. 
10. ఎకమేకాంచీ ఢకలాఢకలీ. 11. పరిపూర్ణ. 
12. శరీరూపీ జో రథ త్యాచా ధనీ. 13. వాచాళ, నుసతా శబ్దచ్ఛల కరణారా. 
14. రథాచ్యా ఠికాణీ. 15. విషయాంచ్యా అనేక మార్గాంచీ పరంపరా. 
16. మనరూపీ లగామానే. 17. దశేంద్రియరూప దహా ఘోడే. 
18. వాటేల తికడే. 19. మనరూపీ లగామ తాబ్యాబాహేర గేల్యావర. 
20. మనావర జ్యాచా తాబా ఆహే తో. 21. జ్యాచే చింత ఎకాగ్రతా పావలే ఆహే. 
22. శాస్త్రానే యోగ్య మ్హణూన ఠరవిలేలే కర్మ. 23. ఖాలీ భూలోక ఆణి వర బ్రహ్మలోక. 
24. అస్పష్ట. 25. ఆత్మప్రాప్తి. 
26. సర్పాప్రమాణే. 27. సమూళ, పూర్ణపణే.
28. దుఃఖాచా డోహ. 29. గఢలేలా. 30. విరక్త. 
31. ఫుకట, వ్యర్థ. 32. సుగంధ ఘేణే. 33. సంయమన. 
34. స్వభావతఃచ ఆలేలే విన్ముఖపణ. 35. ప్రత్యగాత్మ్యాచే. 
36. త్యాచా ప్రబోధ. 37. నిశ్చయ కరణ్యాచా జో బుద్ధీచా వ్యాపార తో. 
38. విషయ-వికార యాంనీ ఝాకలేలే. 39. దిసణ్యాస అవఘడ. 
40. యా లోకీచ్యా వ పరలోకీచ్యా విషయాంమధ్యే. 
41. బ్రహ్మపదావర జ్యాలా అభిషేక ఝాలా ఆహే అసా. 42. మాఘారే. 
43. అధిదైవిక, ఆధ్యాత్మిక యా తీన తాపాంత. 44. సంసారరూపీ సాగరాత. 
45. ఆపలే కుటుంబ, పుత్ర ఆణి ఆప్త యాంసహ. 46. యా కథారూప ఝర్యాచ్యా ప్రవాహాత. 
47. కర్మరూప వ అకర్మరూప క్షార. 48. నాశ. 
49. ఝగడూన విజయీ హోణ్యాచీ తయారీ. 50. ఫక్త. 
51. హాతూన జే జే కర్మ ఘడేల త్యాచ్యా ఫలప్రాప్తీచీ ఇచ్ఛా న ఠేవతా తే బ్రహ్మార్పణ కేల్యానే. 
52. సాఈచ్యా సేవేచీ ఇచ్ఛా. 53. ఇచ్ఛారహిత. 54. వ్యక్తివ్యక్తీచే. 
55. సంతోష. 56. హోణారే. 57. నష్ట హోఈ. 58. భోవరా. 59. సుసరీ, నక్ర. 
60. తిమింగిల నావాచా ఎక మోఠా మాసా. 61. ఖవళలేలా. 
62. పకడణ్యాసాఠీ బాంధలేల్యా నళీలా పాయాంనీ ఘట్ట ధరూన జో ఆపల్యాస ఉలటా టాంగూన ఘేతో అసా పోపట. 63. విచార కర. 64. హే పోపటా. 
65. జవళచ. 66. పాహణారా. 
67. నిరంతర. 68. జ్ఞానాచా ఠేవా. 69. బంధమోక్షాచ్యా గోష్టీ. 70. వాచేనే. 
71. లాటాంచ్యా శయ్యేవర. 72. చౌదావ్యా రత్నాచీ (ఛడీచీ) యోజనా. 
73. జాణీవ. 74. ఎకావర ఎక పాఠ. 
75. మాధవరావ దేశపాండే, జ్యాంనా బాబా ‘శామా’ యా నావానే సంబోధిత.

No comments:

Post a Comment