శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౩౩ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
ఆతా నమూ సంతసజ్జన | హోతా జయాంచే కృపావలోకన |
తాత్కాళ పాతకపర్వత దహన | కలిమలక్షాలన రోకడే | ||౧||
1. ఇప్పుడు సాధు సజ్జనులకు నమస్కరిద్దాం. కొండలవలె పేరుకున్న పాపాలను కాల్చి, కలియుగంలోని చెడునంతా, వారి దయగల చూపు కడిగి వేస్తుంది.
జయాంచ్యా ఉపకారాంచ్యా రాశీ | ఫిటతీ న జన్మజన్మాంతరాసీ |
సహజ బోలణే హితోపదేశీ | పరమ అవినాశీ సుఖదాఈ | ||౨||
2. అలాంటి వారి ఉపకారాల రాసి, జన్మ జన్మలకూ తీరదు. వారి మామూలు మాటలు కూడా, ఉపదేశాలవలె ఎప్పటికీ ఉండిపోయే సుఖాలను కలుగ చేస్తాయి.
హే అపులే హే పరావే | నాహీ జయాంచే చిత్తాస ఠావే |
భేదభావావృత సంసృతిచే ఉఠావే | మనీ నుమటావే జయాంచే | ||౩||
3. వారి మనసులో ‘ఇది నాది, అది ఇతరులది’ అనే ఆలోచన ఎప్పటికీ రాదు. సంసార జీవితంలో వచ్చే ఇలాంటి వేరు చేసే భావం, వారి మనసులో అసలు కలగవు.
పూర్వీల అధ్యాయీ జాహలే శ్రవణ | గురు గరిమేచే అంశనిరూపణ |
ఆతా యే అధ్యాయీ శ్రోతేజన | పరిసా కీ మహిమాన ఉదీచే | ||౪||
4. పోయిన అధ్యాయంలో, గురువుయొక్క గొప్పతనాన్ని గురించి ఎంతో కొద్దిగా చెప్పబడింది. ఇప్పుడు, ఈ అధ్యాయంలో, శ్రోతలు ఉదీ (విభూతి) మహిమను గురించి వినండి.
మాగమాగోని దక్షిణా ఘేత | దీనా దుబళ్యాంస ధర్మ కరీత |
ఉరల్యాచ్యా మోళ్యా ఖరీదీత | ఢీగ రిచవీత కాష్ఠాంచే | ||౫||
5. దక్షిణను మరీ అడిగి పుచ్చుకుని, దానిని బాబా పేదలకు, దీనులకు దానం చేసి, మిగిలిన డబ్బుతో కట్టెపుల్లల కట్టలను కొని, రాసి పోసి ఉంచేవారు.
తయా శుష్క కాష్ఠాంప్రత | సన్ముఖ ధునీమాజీ హోమీత |
తయాంచీ రాఖ హోఈ జీ అమిత | ఉదీ తీ ఓపీత భక్తాంస | ||౬||
6. ఎండిన ఆ కట్టెపుల్లలను తమ ఎదుట ఉన్న ధునిలో పెట్టి కాల్చేవారు. దాంతో అంతు లేనంతగా వచ్చే బూడిదను, భక్తులకు ఉదీగా ఇచ్చేవారు.
శిరడీహూని గాంవీ పరతతా | బాబాంపాశీ రజా మాగతా |
ఉదీ దేణ్యాచా పరిపాఠ హోతా | ఠావే హే సమస్తా భక్తాంస | ||౭||
7. శిరిడీనుండి భక్తులు తమ ఇళ్ళకు మరలి వెళ్ళేటప్పుడు, బాబా దగ్గర సెలవు తీసుకోవటానికి వచ్చినప్పుడు, వారికి ఉదీ ఇవ్వటం బాబాయొక్క ఆచారం. ఇది భక్తులందరికీ తెలుసు.
కింబహునా ఆణా ఉదీ మ్హణతా | ఖరీ అనుజ్ఞా ఝాలీ ఆతా |
మ్హణోన జ్యాచే త్యాచే చిత్తా | పరతాయా ఉల్హాసతా వాటతసే | ||౮||
8. అంతే కాదు, ‘ఉదీ తీసుకుని రండి’ అని బాబా అంటే, అప్పుడు బాబా అనుమతి అయింది అని తలచి, సంతోషంగా మరలి వెళ్ళిపోయేవారు.
తైసేంచ శిరడీంత వాస్తవ్య అసతా | మాధ్యాన్హీ ఆణీ సాయంప్రాతః |
బాబా కోణాసహీ ఉదీ న దేతా | రిక్తహస్తా పాఠవీత | ||౯||
9. అలాగే, శిరిడీలోనే ఉన్నవారు తెల్లవారి, మధ్యాహ్నం లేక సాయంత్రం ఎప్పుడు వచ్చినా, వారికి బాబా ఉదీ ఇవ్వకుండానే ఇళ్ళకు పంపేవారు.
హాచ ప్రత్యహీ హోతా క్రమ | పరి త్యా ఉదీచా కాయ ధర్మ |
మశీదీంత ధునీ కా అవిశ్రమ | కా హా ఉపక్రమ నిత్యాచా | ||౧౦||
10. ఇది ప్రతి రోజూ జరిగే కార్యక్రమం. అయితే ఆ ఉదీయొక్క గొప్పతనమేమిటి? ప్రతి రోజూ, ఆపకుండా మసీదులో ధుని ఎందుకు? రోజూ ఈ కార్యక్రమం ఎందుకు?
విభూతిదానీ మనోగత | బాబా కాయ సుచవీత |
హే దృశ్య సకళ విశ్వాంతర్గత | రాఖ హే నిశ్చిత మనీ ఉమజా | ||౧౧||
11. ఇలా ఉదీ ఇవ్వటంలో బాబా ఉద్దేశం ఏమిటి? అందులోని సూచన ఏమిటి? అంటే, ఈ జగత్తులో కనిపించేవి అన్నీ బూడిదవంటిది అని అందరూ నిశ్చయంగా తెలుసుకోవాలి అని.
దేహహీ పంచభూతాంచే కాష్ఠ | భోగ భోగావయా అవశిష్ట |
భోగ సరతా పడేల నిచేష్ట | హోఈల విస్పష్ట హీ రాఖ | ||౧౨||
12. ఈ దేహం కూడా పంచభూతాల (భూమి, ఆకాశం, నిప్పు, నీరు మరియు గాలి)తో చేయబడిన తడిక. సుఖాలను, దుఃఖాలను, నొప్పిని అనుభవించటానికే చేయబడినది. అవి ముగిసి పోగానే, కదలకుండా పడిపోయి, ఇది కూడా బూడిదే అని తెలుపుతుంది.
తుమచీ మాఝీ హీచ స్థితీ | తియేచీ తుమ్హాంస వ్హావీ స్మృతీ |
అహర్నిశ మజహీ జాగృతీ | తదర్థ విభూతీ దేతసే | ||౧౩||
13. “మీది, నాది కూడా ఇదే స్థితి. దీనిని మీకు గుర్తు చేయాలని, రాత్రింబవళ్ళూ ఇది నాకు కూడా తెలిసి ఉండాలని, విభూతిని ఇస్తాను”.
అఖిల విశ్వ మాయా విజృంభిత | బ్రహ్మ సత్య బ్రహ్మాండ అనృత |
యాచీ ఖూణ హీ ఉదీ సత్య | నిశ్చితార్థ హా మానా | ||౧౪||
14. ఈ జగత్తంతా మాయయొక్క తమాషా. బ్రహ్మ ఒక్కటే నిజమైనది. బ్రహ్మాండం నిజం కానిది. ఈ నిజాన్ని తెలిపేదే ఉదీ. దీనినే నిశ్చయమని తెలుసుకొండి.
యేథే నాహీ కోణీ కుణాచే | దారా, పుత్ర, మామే, భాచే |
నగ్న ఆలో నగ్న జాయాచే | ఉదీహీ యాచే స్మారక | ||౧౫||
15. ఇక్కడ ఎవరికి ఎవరూ లేరు. భార్యా బిడ్డలు, మామా అల్లుడు అని ఎవరూ లేరు. ఏమీ లేకుండా వచ్చాము, ఏమీ లేకుండానే వెళ్ళిపోతాము. ఉదీ దీనినే గుర్తు చేస్తుంది.
ఉదీచే యా కేలియా చర్చన | ఆధి వ్యాధీ హోతీ నిరసన |
పరి యా ఉదీచా తత్వార్థ గహన | వివేకపూర్ణ వైరాగ్య | ||౧౬||
16. ఈ ఉదీని దేహానికి రాసుకుంటే, దైహిక మరియు మానసిక బాధలన్నీ తొలగిపోతాయి. కాని, ఏది నిజం, ఏది నిజం కాదు అని తెలివితో వైరాగ్యాన్ని పాటించాలనెదే ఈ ఉదీయొక్క లోతైన, రహస్యమైన అర్థం.
దేవవేల తీ దేఊని దక్షిణా | సాధాయా ప్రవృత్తి వైరాగ్యలక్షణా |
పుఢే మగ నివృత్తి వైరాగ్య ఖుణా | కళతీల ఆపణా హళూ హళూ | ||౧౭||
17. ఇవ్వగలిగినంత దక్షిణను ఇచ్చి, సాంసారిక వ్యవహారాలలో వైరాగ్యాన్ని పొందిన తరువాత, క్రమక్రమముగా సంసారాన్ని వదులుకోవటానికి కావలిసిన వైరాగ్యంయొక్క లక్షణాలు మనకు తెలుస్తాయి.
ఆలే జరీ వైరాగ్య హాతీ | వివేక జరీ నాహీ సంగతీ |
తరీ తయాచీ హోఈల మాతీ | మ్హణూన విభూతీ ఆదరా | ||౧౮||
18. నిజానిజాలు తెలుసుకోలేని వైరాగ్యం అబ్బినా, ఆ వైరాగ్యం మట్టికొట్టుకు పోతుంది. అందుకు విభూతిని గౌరవించి, దాని విలువను తెలుసుకోండి.
వివేక వైరాగ్యాచీ జోడ | తీచ హీ విభూతీ దక్షిణేచీ సాంగడ |
బాంధిల్యావీణ భవనదీచీ థడ | అతి అవఘడ గాంఠావయా | ||౧౯||
19. నిజానిజాలు తెలుసుకునే వివేకం, మరియు వైరాగ్యాల జంటవలె, విభూతి-దక్షిణల జంట. ఇవి లేకపోతే, సంసార సాగరం ఆవలి వైపు చేరటం చాలా కష్టం.
లహాన థోర దర్శనా యేత | చరణీ బాబాంచే హోఊని వినత |
జేవ్హా జేవ్హా మాఘారా జాత | విభూతీ దేత త్యా బాబా | ||౨౦||
20. పెద్దలు, పిల్లలు బాబా దర్శనానికి వచ్చి, ఎంతో వినయంగా వారి పాదాలకు నమస్కారం చేస్తారు. వారు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు, వారికి బాబా విభూతిని ఇస్తారు.
మశీదీంత నిత్యాచీ ధునీ | అక్షయీ ప్రదీప్త నిశిదినీ |
త్యాంతీల మూఠమూఠ రక్షా దేఉని | బాబా బోళవణీ కరీత | ||౨౧||
21. రాత్రింబవళ్ళు, మసీదులో ధుని ఎప్పటికీ మండుతుంటుంది. అందులోని విభూతినే బాబా పిడికెళ్ళతో తీసి, భక్తులకు ఇచ్చి, సాగనంపేవారు.
సవేంచి తో హస్త శిరీ ఠేవిత | కల్యాణ ఇచ్ఛిత భక్తాంచే | ||౨౨||
22. ప్రసాదమని విభూతిని ఇచ్చేవారు. తమ బొటన వ్రేలితో భక్తుల నొసటన దిద్ది, అలాగే తమ చేతిని వారి తలపై ఉంచి, వారికి శుభాన్ని ఇచ్చేవారు.
రక్షా విభూతీ ఆణి ఉదీ | శబ్ద తీన పరి ఎకార్థవాదీ | హాచీ ప్రసాద నిత్య నిరవధీ | బాబా అబాధీత వాంటీత | ||౨౩||
23. రక్ష అన్నా, విభూతి అన్నా, ఉదీ అన్నా, అవి వేరు వేరు పదాలు కాని, అర్థం మాత్రం ఒక్కటే. ఇదే ప్రసాదాన్ని ఆపకుండా, బాబా ప్రతి రోజూ పంచేవారు.
సంసార ఆహే ఉదీసమాన | హే ఎక యా ఉదీచే మహిమాన | యేఈల ఏసా ఎక దిన | మనీ ఆఠవణ హీ ఠేవా | ||౨౪||
24. సంసారం ఉదీతో సమానం. మనం కూడా ఇలా బూడిదయ్యే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇదే నిజమైన విభూతియొక్క సారం. దీనిని ఎప్పుడూ గుర్తుంచుకోండి.
కమల-దల-జలసమాన | నశ్వర హా దేహ హోఈల పతన | మ్హణూని యాచా త్యాగా అభిమాన | ఉదీ ప్రదాన హే దావీ | ||౨౫||
25. తామరాకు మీద నీటి బిందువు ఎలా నిలవదో, అలా ఈ దేహం ఎదో ఒక రోజు పడిపోయేదే కనుక, దానిపై అభిమానాన్ని వదలాలి, అని బాబా ఇచ్చే ఉదీ సూచిస్తుంది.
సకళ విశ్వాచా హా పసారా | రాఖరాంగోళీసమ నిర్ధారా | కరా జగన్మిథ్యత్వవిచారా | సత్యత్వా థారా ఉదీంత | ||౨౬||
26. ఈ జగత్తంతా బూడిదలాగే, సారం లేనిదని ఖచ్చితంగా తెలుసుకుని, ఈ సంసారంయొక్క మాయను అర్థం చేసుకొండి. ఉదీయే నిజమైనదని నమ్మండి.
ఉదీ మ్హణజే కేవళ మాతీ | నామరూపాచీ అంతిమ గతీ | వాచారంభణ వికార జగతీ | మృత్తికే ప్రతీతీ సత్యత్వే | ||౨౭||
27. ఉదీ అంటే కేవలం మట్టి. పేరు, ఆకారం ఉన్నది ఏదైనా, చివరికి బూడిద కావాల్సిందే. ఏ మార్పూ రాని బూడిదయొక్క గుణాన్ని తెలుసుకుంటే, ఈ జగత్తులో జరిగే మార్పులన్నీ, పేరుకు మాత్రమే అన్న నిజం తెలుస్తుంది. నిజానికి అంతా మట్టియే.
స్వయే బాబాహీ ప్రేమాంత యేతా | ఏకిలే ఆహేత గాణే గాతా | త్యాంతీల చుటకా ఉదీపురతా | పరిసిజే శ్రోతా సాదరతా | ||౨౮||
28. మనసులో ప్రేమ పొంగినప్పుడు, బాబా స్వయంగా పాటలు పాడుతుండగా విన్నాం. పాటలో ఉదీని గురించిన చిన్న ముక్కను శ్రోతలు శ్రద్ధగా వినండి.
“రమతే రామ ఆయోజీ ఆయోజీ |
ఉదియాంకీ గోనియా లాయోజీ” ||ధృ||
లాగతా మనాచీ లహర | హోఊనియా హర్షనిర్భర |
ఇతుకేంచ ధ్రుపద వరచేవర | అతి సుస్వర మ్హణత తే | ||౨౯||
29. “రాముడు తిరుగుతూ తిరుగుతూ వచ్చాడు. ఊదీ సంచులను పట్టుకుని వచ్చాడు”. మనసు సంతోషంగా ఉన్నప్పుడు, ఎంతో ఆనందంతో, చాలా విన సొంపుగా, మాట మాటికీ ఈ రెండు పాదాలను పాడేవారు.
సారాంశ, హీ బాబాంచీ ధునీ | ప్రసవలీ కితీక ఉదీచ్యా గోణీ | నాహీ గణాయా సమర్థ కోణీ | పరమ కల్యాణీ హీ ఉదీ | ||౩౦||
30. సారాంశం ఏమిటంటే, బాబాయొక్క ఈ ధుని ఎన్నో విభూతి సంచులను ఇచ్చింది. వానిని లెక్క పెట్టటం ఎవరి తరమూ కాదు. అంత పవిత్రమైనది ఈ ఉదీ.
పరిసోని ఉదీదాన గుహ్యార్థ | తైసాచ పరమార్థ ఆణి భావార్థ |
పుసతీ శ్రోతే శుద్ధ స్వార్థ | యోగక్షేమార్థ ఉదీచా | ||౩౧||
31. ఉదీయొక్క రహస్యమైన, లోతైన అర్థాన్ని, భావార్థాన్ని, మరియు పరమార్థాన్ని తెలుసుకున్న తరువాత, ఈ విభూతి తమ మేలు కొరకు, యోగక్షేమాల కొరకు, ఏమి చేస్తుందని శ్రోతలు అడుగుతుంటారు.
ఉదీపోటీ హాహీ గుణ | మహతీ కైసీ వాఢేల యావీణ | సాఈ పరమార్థ మార్గీచా ధురీణ | స్వార్థ సాధూన పరమార్థ దే | ||౩౨||
32. అలా అడగకపోతే, ఉదీ గొప్పతనం అందరికీ ఎలా తెలుస్తుంది? పరమార్థంలో సాయి ప్రవీణులు, కాని, భక్తుల సాంసారికమైన కోరికలను తీర్చి, వారికి పరమార్థాన్ని కూడా అందిస్తారు!
యా ఉదీచ్యా యోగక్షేమకథా | సాంగూ యేతీల అసంఖ్యాతా | పరి త్యా కథితో అతి సంకలితా | గ్రంథవిస్తరతా టాళావయా | ||౩౩||
33. ఈ ఉదీనుంచి భక్తులు పొందిన మేలు గురించిన కథలు ఎన్నో చెప్పవచ్చు. కాని గ్రంథం పెద్దదై పోతుందని, కొన్నే కొద్దిగా చెప్పుతున్నాను.
ఎకదా నారాయణ మోతీరామ | జానీ హే జయాంచే ఉపనామ | బ్రాహ్మణ ఔదీచ గృహస్థాశ్రమ | వసతీచే స్థళ నాశీక | ||౩౪||
34. గుజరాతీ ఔదీ శాఖకు చెందిన బ్రాహ్మణ గృహస్థుడు ఒకడు నాశికలో ఉండేవాడు. అతని పేరు నారాయణ మోతీరాం. ఇంటి పేరు జానీ.
తైసేచ బాబాంచే ఆణిక భక్త | నామే రామచంద్ర వామన మోడక | హే నారాయణరావ తయాంచే సేవక | భక్త భావిక బాబాంచే | ||౩౫||
35. బాబా భక్తుడైన ఈ నారాయణరావు, రామచంద్ర వామనరావు మోడక అనే మరొక బాబా భక్తుని దగ్గర పని చేసేవాడు.
సవే ఘేఊన మాతోశ్రీతే | బాబా జై దేహధారీ హోతే | నారాయణరావ జాహలే జాతే | దర్శనాతే బాబాంచ్యా | ||౩౬||
36. బాబా దేహంతో ఉన్నప్పుడు, తల్లిని వెంటబెట్టుకుని, నారాయణరావు బాబా దర్శనానికి వెళ్ళాడు.
తేవ్హాంచ ఆపణ హోఊన తీతే | బాబాంనీ ఆధీంచ సుచవిలే హోతే | ఆతా న యేథూన సేవాధర్మాతే | రాహిలా ఆముతే సంబంధ | ||౩౭||
37. అప్పుడు, తమంతట తామే బాబా అతని తల్లితో, “ఇక ముందు నౌకరీ చేయటమనే సేవా ధర్మం ఉండదు” అని ముందుగానే సూచించారు.
పురే హీ తాబేదారీ ఆతా | స్వతంత్ర ధందా బరవా యాపరతా | పుఢే మగ అల్పకాల జాతా | దయా భగవంతా ఉపజలీ | ||౩౮||
38. “ఈ బానిస బ్రతుకు ఇంక చాలు. స్వతంత్రంగా ఏదో వ్యాపారం చేయటం దీనికంటే ఎంతో మంచిది” అని అన్నారు. తరువాత కొంత కాలానికి, దేవుడి దయ కలిగింది.
సుటలీ నోకరీ పరాధీనతా | ఆవడు లాగలీ స్వతంత్రతా | భోజన, వసతీ గృహవ్యవస్థా | స్థాపిలీ స్వసత్తా తేథేంచ | ||౩౯||
39. ఇంకొకరి క్రింద పని చేయటం తప్పింది. స్వతంత్రంపై ప్రీతి కలిగింది. దాంతో తన స్వంత శక్తితో, భోజన మరియు వసతి గృహాన్ని అక్కడే స్థాపించాడు.
నామ ఠేవిలే ఆనందాశ్రమ | త్యాంతచీ కేలే పరిశ్రమ | దివసేందివస వాఢలే నామ | జాహలా ఆరామ చిత్తాలా | ||౪౦||
40. దానికి ‘ఆనందాశ్రమం’ అని పేరు పెట్టాడు. అందులో బాగా కష్ట పడ్డాడు. రోజు రోజుకీ దాని పేరు ప్రఖ్యాతలు పెరిగాయి. దాంతో అతని మనసుకి శాంతి, ఆనందం దొరికాయి.
పాహూని ఏసీ వార్తా ఘడలీ | నిష్ఠా సాఈపదీ వాఢలీ |
తీ మగ దృఢభక్తిస్వరూపా చఢలీ | అనుభవే ఠసలీ అఢళతా | ||౪౧||
41. బాబా మాటలు నిజం కావటం గమనించి, అతనికి సాయి పాదాలమీద నిష్ఠ పెరిగి, అది దృఢమైన భక్తిగా మారింది. అనేక అనుభవాలు కలగటంతో, ఆ భక్తి బలంగా నాటుకుంటుంది.
ప్రేమ వాఢలే సాఈచరణీ | అఘటిత కరణీ సాంఈచీ | ||౪౨||
42. సాయి మాటలలోని నిజాన్ని అతను అనుభవించాడు గనుక, వినేవారికి ఇది ఒక కథగా మిగిలింది. అతనికి సాయి పాదాలమీద ప్రేమ ఎక్కువైంది. సాయియొక్క లీలలు ఊహించటానికి కానివి.
బోలణే అవఘే ప్రథమ పురుషీ | పరి తే నిత్య దుజియావిశీ | లక్ష ఠేవూని దేఖణారాసీ | అహర్నిశీ ప్రత్యయ హా | ||౪౩||
43. దేనిగురించైనా, బాబా ఎప్పుడైనా చెప్పినా, దానిని ఉత్తమ పురుషలో(నేను, నాకు) చెప్పేవారు. అలా చెప్పినా, అదంతా ఇతరుల గురించి చెప్పినవే. జాగ్రత్తగా గమనించిన వారికి, ఇది ఎప్పుడూ అనుభవమవుతుంది.
పుఢే జైసా జైసా అనుభవ | వాఢలే భక్తిప్రేమవైభవ | ఆణఖీ ఎక తయాంచా అభినవ | భక్తిభావ పరిసావా | ||౪౪||
44. తరువాత, అలా అనుభవాలు కలిగిన కొద్దీ, నారాయణరావు భక్తి ప్రేమలు బాగా పెరిగాయి. అతనికి సంబంధించిన మరొక సంగతిని భక్తి భావంతో వినండి.
అసో ఎకదా ఎక దివస | నారాయణరావాంచే మిత్రాస | జాహలా ఎకాకీ వృశ్చికదంశ | వేదనావివశ బహు ఝాలా | ||౪౫||
45. ఒక రోజు, నారాయణరావు స్నేహితుడికి అకస్మాత్తుగా తేలు కుట్టి, చాలా బాధ కలిగింది.
లావావయా దంశాచే జాగీ | బాబాంచీ ఉదీ ఫార ఉపయోగీ | పరి జాతా శోధావయాలాగీ | లాధేనా మాగీ1 తియేచీ | ||౪౬||
46. అలాంటప్పుడు, తేలు కుట్టిన చోట ఉదీని రాసుకుంటే, చాలా ఉపయోగం. కాని, ఎంత వెదికినా, ఉదీ కనిపించలేదు.
స్నేహ్యాస సోసవతీ న వేదనా | ఉదీచా కాంహీ శోధ లాగేనా | ఘేఊని బాబాంచ్యా ఛబీచ్యా దర్శనా | భాకిలీ కరుణా బాబాంనా | ||౪౭||
47. స్నేహితుడి బాధ సహించ లేనంతగా పెరిగింది. ఉదీ దొరకలేదు. అప్పుడు, నారాయణరావు బాబా పటానికి నమస్కరించి, వారి కరుణను ప్రార్థించాడు.
మగ తేథేంచ త్యా ఛబీచే తళీ | జళత్యా ఉదబత్తీచీ కోజళీ | హోతీ పడలేలీ రక్షా తే స్థళీ | ఉదీచ భావిలీ క్షణభరీ | ||౪౮||
48. తరువాత, ఆ పటం క్రింద అగరువత్తులనుండి రాలిన బూడిదను, ఆ క్షణంలో విభూతిగా అనుకున్నాడు.
ఘేఊని త్యాంతీల ఎక చిమటీ | దంశ జాహల్యా జాగీ ఫాంసటీ | ముఖే సాఈనామ మంత్ర పుటపుటీ | భావనేపోటీ అనుభవ | ||౪౯||
49. సాయి పేరును మంత్రంగా నోటితో చెప్పుతూ, ఒక చిటికెడు తీసి, తేలు కుట్టిన చోట రాసాడు. భక్తి భావం ఎలా ఉంటే, అనుభవం కూడా అలాగే ఉంటుంది.
ఏకతా వాటేల నవల మోఠే | రక్షా చోళితాంక్షణీంచ బోటే | వేదనా2 పళాల్యా ఆలియా వాటే | ప్రేమ దాటే ఉభయాంసీ | ||౫౦||
50. వినేవారికి ఇది చాలా వింతగా అనిపించవచ్చు. కాని, విభూతిని రాసిన వెంటనే, బాధ వచ్చినట్లే పారిపోయింది. ఆ ఇద్దరి మనసులలో ప్రేమ ఉప్పొంగింది.
హీ తరీ ఉదబత్తీచీ విభూతీ | వ్యథితాప్రతీ లావిలీ హోతీ |
పరీ ఉదీ మ్హణూన మార్గీంచీ మాతీ | ఏసీచ అనుభూతీ ప్రకటితే | ||౫౧||
51. ఇదైనా అగరువత్తులనుండి రాలిన విభూతి. దీనిని బాధపడిన మనిషికి రాయడం జరిగింది. కాని, దారిలోని మట్టి కూడా, విభూతి అని అనుకున్నప్పుడు, ఇలాంటి అనుభవాన్నే కలిగిస్తుంది.
మాతీ పరీ తియేచా సంసర్గ | జయాస ఝాలే దుఖణే వా రోగ | తయావీణ ఇతరాంవరీ ప్రయోగ | కరితాంహీ ఉపయోగ ఘడతసే | ||౫౨||
52. ఆ మట్టిని బాధపడే వారికే కాక, వేరే ఎవరికి రాసినా, బాధ పడుతున్న వారి బాధ తగ్గిపోతుంది.
ఎకదా ఎకా భక్తాచీ దుహితా | గ్రంథిజ్వరే ఘేరలీ హీ వార్తా | గ్రామాంతరాహూని యేతా అవచితా | ఉద్భవలీ చింతా పితయాస | ||౫౩||
53. ఒక సారి, ఒక భక్తుని కూతురు, గ్రంథి జ్వరంతో (ప్లేగు) బాధపడుతూ ఉందని, వేరే ఊరిలో ఉన్న తండ్రికి అకస్మాత్తుగా తెలిసి, ఆ భక్తుడు చింతించ సాగాడు.
పితా వాంద్రేశహరవాసీ | ములగీ అన్య గ్రామీ రహివాసీ | ఉదీచా సంగ్రహ నాహీ పాశీ | నిరోప నానాశీ పాఠవిలా | ||౫౪||
54. తండ్రి బాంద్రాలో ఉన్నాడు. అతని కూతురు వేరే గ్రామంలో ఉంది. అతని దగ్గర విభూతి లేదు. అందుకు నానాకు (నానాసాహేబు చాందోర్కరు) కబురు పంపాడు.
కరావీ ఆపణ బాబాంచీ ప్రార్థనా | దూర కరావీ మాఝీ వివంచనా | మ్హణూన ప్రార్థిలే చాందోరకరాంనా3 | ఉదీ ధాడానా ప్రాసాదిక | ||౫౫||
55. ‘మీరు బాబాను ప్రార్థించి, నా దుఃఖాన్ని దూరం చేయండి. ఉదీ ప్రసాదాన్ని పంపించండి’ అని నానా చాందోర్కరును వేడుకున్నాడు.
నిరోప ఘేఊన జాణారియాస | నానాహీ భేటలే మార్గాస4 | జాత హోతే కల్యాణాస | కుటుంబాసమవేత తే సమయీ | ||౫౬||
56. ఆ కబురు తీసుకుని వెళ్ళిన వానికి, నానా దారిలోనే కలిశాడు. అప్పుడు, నానా భార్యతో కల్యాణ్ వెడుతున్నాడు.
ఠాణే శహరీ స్టేశనాపాశీ | నిరోప పావలా హా నానాశీ | ఉదీ పాహతా నాహీ హాతాశీ | ఉచలిలే మృత్తికేసీ మార్గీచ్యా | ||౫౭||
57. నానా ఠాణే స్టేషను దగ్గర ఉండగా, ఈ కబురు అందింది. ఆ సమయంలో అతని దగ్గర విభూతి లేదు. దారిలో నేలమీదున్న మట్టినే చేతిలో తీసుకున్నాడు.
తేథేంచ ఉభే రాహూని రస్తా | గార్హాణే ఘాలూని సాఈసమర్థా | మాగే వళూని స్వస్త్రీచే మాథా | చిముట తత్వతా లావిలీ | ||౫౮||
58. అక్కడే దారిలో నిలబడి, సాయి సమర్థుని ప్రార్థించి, వెనుకకు తిరిగి, చిటికెడు మట్టిని తన భార్య నొసటన రాశాడు.
యేరీకడే తో భక్త నిఘాలా | ములగీ హోతీ త్యా గాంవీ పాతలా | తేథే తయాస జో వృత్తాంత కళలా | ఏకూన సుఖావలా అత్యంత | ||౫౯||
59. ఇక్కడ భక్తుడు, తన కూతురు ఊరికి వెళ్ళి, అక్కడ సంగతిని తెలుసుకుని, చాలా ఆనందించాడు.
ములగీస తీన దివస జ్వర | ఆలా హోతా అత్యంత ప్రఖర | వేదనాంనీ జాహలీ జర్జర | కాలచి తిళభర ఆరామ | ||౬౦||
60. మూడు రోజులనుంచి ఆ అమ్మాయి విపరీతమైన జ్వరంతో బాధ పడి, బాగా నీరసించి పోయింది. అంతకు ముందు రోజే, కొంచెం నయమై, విశ్రాంతి కలిగింది.
పాహూ జాతా తీచ తీ వేళా | ఉదీ జాణూని మృత్తికేచా టిళా |
కరూని నానాంహీ జై సాఈ గార్హాణిలా | ఉతార పడలా తేథూని | ||౬౧||
61. తరువాత తెలిసిందేమిటంటే, బాబాను ప్రార్థించి, మట్టినే నానా విభూతిగా భావించి, తన భార్య నొసటన దిద్దినప్పటినుండే, ఆ అమ్మాయి బాధ తగ్గింది అని.
అసో త్యా దుఖణ్యాచీ హీ కథా | యోగ్య ప్రసంగీ సవిస్తరతా | పుఢే మాగే యేఈల కథితా | ఉదీ పురతాచ చుటకా హా | ||౬౨||
62. ఆ అమ్మాయి బాధ గురించిన ఈ కథను సరియైన అవకాశం వచ్చినప్పుడు వివరంగా చెప్పవచ్చు. ఉదీ గురించిన చిన్న చిట్కా అంతే, ఇక్కడ.
హేచ ప్రేమళ చాందోరకర | అసతా జామనేరీ మామలతదార | సాఈ నిజభక్త కల్యాణైక తత్పర | కరీత చమత్కార తో పరిసా | ||౬౩||
63. ప్రేమతో నిండిన ఈ నానా చాందోర్కరు జాంనేరులో మామలతుదారుగా ఉన్నప్పుడు, తన భక్తుల మేలు కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే సాయి, చేసిన అద్భుతమైన చమత్కారం గురించి ఇప్పుడు వినండి.
ఉదీచా యా మహిమా అపార | శ్రోతా హోఈజే శ్రవణ తత్పర | కథితో దుజా తో చమత్కార | ఆశ్చర్య థోర వాటేల | ||౬౪||
64. ఈ ఉదీ మహిమ అంతా ఇంతా కాదు. శ్రోతలు శ్రద్దగా వినడానికి సిద్ధంగా ఉండండి. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మరొక ఉదీ చమత్కారాన్ని చెప్తాను.
ఆసన్నప్రసవ నానాంచీ దుహితా | అసహ్య చాలల్యా ప్రసూతివ్యథా | జామనేరాహూన సాఈ సమర్థా | హాంకా సర్వథా మారితీ | ||౬౫||
65. నానా కూతురుకు ప్రసవ సమయం దగ్గరై, సహించలేని ప్రసవ వేదన పడుతూ, సాయి సమర్థుని ఎన్నో విధాలుగా పిలువ సాగింది.
జామనేరీచీ హీ స్థితీ | శిరడీస కోణాస ఠావీ నవ్హతీ | బాబా సర్వజ్ఞ సర్వగతీ | కాంహీ న జగతీ అజ్ఞాత త్యా | ||౬౬||
66. జాంనేరులోని ఈ పరిస్థితి, శిరిడీలో ఎవరికీ తెలియదు. కాని, బాబాకు అన్నీ తెలుసు, అన్ని చోట్లా ఉంటారు. జగత్తులో వారికి తెలియనిదంటూ ఏదీ లేదు.
బాబాంసీ భక్తాంచీ ఎకాత్మతా | జాణూన నానాంచే ఎథీల అవస్థా | సమర్థ సాఈ ద్రవలే చిత్తా | కరితీ తత్వతా తే కాయ | ||౬౭||
67. భక్తులతో ఒకటై ఉండటం వలన, నానా ఇంట్లో జరుగుతున్న అవస్థ బాబాకు తెలిసి, వారి హృదయం కనికరంతో నిండింది. వెంటనే ఏం చేశారంటే,
ఉదీ ధాడావీ ఆలే జీవా | ఇతుక్యాంత గోసావీ రామగీరబువా | జాహలా తయాచ్యా మనాచా ఉఠావా | ఆపులే గాంవా గమనార్థీ | ||౬౮||
68. నానాకు విభూతిని పంపించాలని వారు అనుకున్నారు. ఇంతలో, రామగీరు బువా అనే గోసావి మనసులో, తన ఊరికి వెళ్ళాలన్న కోరిక కలిగింది.
గాంవ తయాచా ఖానదేశీ | నిఘాలా సర్వ తయారీనిశీ | పాతలా బాబాంచే పాయాంపాశీ | దర్శనాసీ మశీదీ | ||౬౯||
69. అతని ఊరు ఖానదేశంలో ఉంది. ప్రయాణానికి సిద్ధమై, మసీదుకు బాబా దర్శనానికని, వారి పాదాల దగ్గరకు అతడు వచ్చాడు.
బాబా దేహధారీ అసతా | ఆధీ తయాంచే పాయా న పడతా | కోణీహీ కవణ్యాహీ కార్యానిమిత్తా | అనుజ్ఞా న ఘేతా జాఈనా | ||౭౦||
70. బాబా దేహంలో ఉన్న కాలంలో, ముందుగా వారి పాదాలపై పడకుండా, వారి అనుమతిని తీసుకోకుండా, ఎవరైనా, ఏ పని కోసమైనా సరే, వెళ్ళరు.
అసో లగ్న వా మౌంజీబంధన | మంగల కార్య విధి విధాన |
కార్య కారణ వా ప్రయోజన | లాగే అనుమోదన బాబాంచే | ||౭౧||
71. అలాగే, పెళ్ళి కాని, ఉపనయనం కాని, శాస్త్ర ప్రకారంగా చేసే ఏ మంచి పనినైనా కాని, అసలు వాని గురించి ఆలోచించడానికి కూడా, బాబా అంగీకారం తప్పని సరిగా కావలసిందే.
హోణార నాహీ కార్య నిర్విఘ్న | భావనా పూర్ణ సకళాంచీ | ||౭౨||
72. వారి పూర్తి అంగీకారం, వారి ఆశీర్వాదం, వారి ఉదీ ప్రసాదం లేకపోతే, ఏ పనీ అడ్డంకులు లేకుండా జరగవని అందరి దృఢ నమ్మకం.
అసో ఏశీ త్యా గాంవీ రీత | తదనురోధే రామగీర యేత | పాయాంస బాబాంచే లాగత | అనుజ్ఞా మాగత నిఘావయా | ||౭౩||
73. ఊరిలోని ఆ పద్ధతి ప్రకారమే, రామగీరు వచ్చి, బాబా పాదాలకు నమస్కరించి, బయలుదేరటానికి వారి అనుమతిని కోరాడు.
మ్హణే బాబా ఖానదేశీ | యేతో జాఉనియా గాంవాసీ | ద్యా కీ ఉదీ ఆశీర్వాద మజసీ | అనుజ్ఞా దాసాసీ నిఘావయా | ||౭౪||
74. ‘బాబా! ఖానదేశులోని మా ఊరికి వెళ్ళి వస్తాను. బయలుదేరటానికి అనుమతిని, ఉదీని ఈ దాసునికి ఇవ్వండి’ అని అడిగాడు.
జయాస బాబా ప్రేమ భావా | బాహతీ ‘బాపూగీర’ యా నాంవా | మ్హణతీ “జాఈ ఖుశాల తూ గాంవా | మార్గీ విసావా ఘే థోడా | ||౭౫||
75. బాబా ప్రేమగా అతనిని బాపూగీరు అని పిలిచేవారు. “సరే, క్షేమంగా వెళ్ళు. కాని, దారిలో కొంత విశ్రాంతిని తీసుకో.
ఆధీ జాఈ జామనేరా | ఉతర తేథే నానాంచ్యా ఘరా | ఘేఊని తయాచ్యా సమాచారా | మగ తూ పుఢారా మార్గ ధరీ” | ||౭౬||
76. “అందుకు, ముందుగా జాంనేరుకు వెళ్ళి, నానా ఇంట్లో ఉండు. వారి క్షేమ సమాచారాలను తెలుసుకుని, తరువాత నీవు ముందుకు పో” అని చెప్పారు.
మ్హణతీ మాధవరావ దేశపాండ్యాప్రతీ | “ఉతరూన దే రే కాగదావరతీ | శామా తీ అడకరాచీ ఆరతీ | గోసావ్యా హాతీ నానాతే” | ||౭౭||
77. మాధవరావు దేశపాండేతో “శామా! అడ్కరు వ్రాసిన ఆరతిని కాగితంపై వ్రాసి ఇవ్వరా, ఈ గోసావి వెంట నానాకు పంపించాలి” అని చెప్పారు.
మగ గోసావియా ఉదీ దేతీ | ఆణిక థోడీ పుడీంత బాంధితీ | పుడీ దేఊన త్యాచే హాతీ | బాబా పాఠవితీ నానాస | ||౭౮||
78. తరువాత, గోసావికి కొంత విభూతినిచ్చి, మరి కొంత విభూతిని పొట్లం కట్టి, అతని చేతికిచ్చి, నానాకు బాబా పంపించారు.
వదతీ “హీ పుడీ ఆణి హీ ఆరతీ | నేఊని దేఈ నానాప్రతీ | పుసూని క్షేమ కుశల స్థితీ | నిఘే పుఢతీ నిజ గాంవా” | ||౭౯||
79. “ఈ పొట్లాన్ని, ఈ ఆరతిని తీసుకుని వెళ్ళి, నానాకు ఇవ్వు. వారి క్షేమాన్ని అడిగి తెలుసుకున్న తరువాత మీ ఊరికి వెళ్ళు” అని చెప్పారు.
జైసీ రామాజనార్దనకృతీ | “ఆరతీ జ్ఞానరాజా” హీ ఆరతీ | తైసీచ “ఆరతీ సాఈబాబా” నిశ్చితీ | సమాన స్థితీ ఉభయాంచీ | ||౮౦||
80. ఈ ‘ఆరతి సాయిబాబా’ అనే ఆరతి, రామ జనార్దనుడు రాసిన ‘ఆరతి జ్ఞాన రాజా’ అనే ఆరతి పాటలాంటిదే. రాగం, తాళం రెండిటికీ ఒకటే.
రామాజనార్దన జనార్దన భక్త | మాధవ అడకర సాఈ పదాంకిత |
రచనా ప్రసాదపూర్ణ అత్యంత | భజన తద్రహిత అపూర్ణ | ||౮౧||
81. రామజనార్దనడేమో జనార్దన స్వామి భక్తుడు. మాధవ అడ్కరు సాయి పాదాలకు అంకితమైనవాడు. ఇతని ఆరతి పాట రచన ఎంతో అనుగ్రహంతో నిండినది. ఈ ఆరతి లేకుండా సాయి పూజ పూర్తి కాదు.
అసో హీ బాబాంచీ ఆవడతీ | శ్రోతా పరిసిజే సాద్యంత ఆరతీ | ఉదీసమవేత బాబా జీ పాఠవితీ | పుఢే ఫలశ్రుతీ దిసేల | ||౮౨||
82. ఇది బాబాకు చాలా ప్రియమైనది. ఉదీతో పాటు, బాబా పంపిన ఆరతి పాటను మొత్తం, శ్రోతలు వినండి. దీని ఫలశ్రుతి తరువాత తెలుస్తుంది.
ఆరతీ
ఆరతీ సాఈబాబా | సౌఖ్యదాతారాజీవా | చరణరజాతళీ |
నిజ దాసా విసావా | భక్తా విసావా | ||ఆరతీ||
జాళునియా అనంగ | స్వస్వరూపీ రాహే దంగ | ముముక్షు జనా దావీ |
నిజడోళా శ్రీ రంగ | డోళా శ్రీరంగ | ||ఆరతీ|| ౧ ||
జయా మనీ జైసా భావ | తయా తైసా అనుభవ | దావిసీ దయాఘనా |
ఏసీ తుఝీ హీ మావ | తుఝీ హీ మావ | ||ఆరతీ || ౨ ||
తుమచే నామ ధ్యాతా | హరే సంసృతివ్యథా | అగాధ తవ కరణీ |
మార్గ దావి అనాథా | దావి అనాథా | ||ఆరతీ|| ౩ ||
కలియుగీ అవతార | సగుణ బ్రహ్మ సాచార | అవతీర్ణ ఝాలాసే |
స్వామీ దత్త దిగంబర | దత్తదిగంబర | || ఆరతీ || ౪ ||
ఆఠా దివసా గురువారీ | భక్త కరితీ వారీ | ప్రభుపద పహావయా |
భవభయ నివారీ | భయ నివారీ | ||ఆరతీ|| ౫ ||
మాఝా నిజ ద్రవ్యఠేవా | తవ చరణరజసేవా | మాగణే హేంచి అసే |
తుమ్హా దేవాధిదేవా | దేవాధిదేవా | ||ఆరతీ || ౬ ||
ఇచ్ఛిత దీన చాతక | నిర్మళ తోయ నిజసుఖ | పాజావే మాధవా |
సంభాళ ఆపులీ హీ భాక | ఆపులీ హీ భాక | ||ఆరతీ|| ౭ ||
గోసావీ వదే బాబాలాగూన | మజపాశీ అవఘే రుపయే దోన |
ఇతుకే న కేవీ మీ పోహచేన | బాబా జాఊన జామనేరీ | ||౮౩||
83. గోసావి బాబాతో ‘నా దగ్గర మొత్తం రెండు రూపాయలే ఉన్నాయి. వీనితో నేను జాంనేరు వెళ్ళిన తరువాత, ఇల్లు ఎలా చేరుకోగలను?’ అని అడిగాడు.
బాబా వదతీ “తూ స్వస్థ జాఈ | లాగేల తుఝీ సర్వ సోయీ” |
విశ్వాస ఠేవూని సాఈచే పాయీ | నిఘాలే గోసావీ జావయా | ||౮౪||
84. “నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నీకు కావలసినవన్నీ అమర్చబడతాయి” అని బాబా చెప్పారు. సాయి పాదాల మీద నమ్మకం ఉంచి, గోసావి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు.
ఆజ్ఞా వందూని బాపూగీర | ఘేఊని ఏసా బాబాంచా విచార |
ఉదీప్రసాద పావూని సత్వర | కార్యతత్పర నిఘాలా | ||౮౫||
85. బాబా ఆజ్ఞకు తలవంచి, ఉదీ ప్రసాదాన్ని తీసుకుని, బాబా అనుమతిని పొంది, తనకిచ్చిన పనిని త్వరగా ముగించాలని, బాపూగీరు బయలుదేరాడు.
జామనేరాస జైసా ఆతా | నవ్హతా తేవ్హా అగ్నిరథాచా రస్తా |
నవ్హతీ ప్రవాసాచీ సులభతా | ఉపజలీ చింతా గోసావియా | ||౮౬||
86. ఇప్పటిలాగ, అప్పుడు జాంనేరుకు రైలుమార్గం ఉండేది కాదు. ప్రయాణీకులకు ఏ సౌకర్యం ఉండలేదు. గోసావికి చింత మొదలైంది.
బైసూనియా అగ్నిరథాంత | ప్రవాసీ ఉతరలే జళగాంవాంత |
తేథూన పుఢీల మార్గ సమస్త | జావే లాగత పాదచారీ | ||౮౭||
87. రైలు బండిలో కూర్చున్న ప్రయాణీకులు, జలగాంలో దిగి, అక్కడనుంచి జాంనేరుకు నడిచి వెళ్ళాలి.
ఎక రుపయా చవదా ఆణే | భరలే అగ్నిరథాచే దేణే |
ఉరలే అవఘే చవలీచే నాణే | కైసేని జాణే పుఢారా | ||౮౮||
88. శిరిడీనుండి జలగాంకు ఒక రూపాయి పదునాలుగు అణాల రైలు టికెట్టు కొన్న తరువాత, మిగిలిన రెండు అణాల డబ్బుతో, ముందుకు ఎలా వెళ్ళాలి?
ఏసా గోసావీ చింతాతూర | అసతా జళగాంవ స్టేశనావర |
టికీట దేఉన పడే జో బాహేర | శిపాఈ దూర దేఖిలా | ||౮౯||
89. అని గోసావి ఆలోచిస్తూ, జలగాం స్టేషనులో టికట్టు ఇచ్చి, బయటపడి, దూరాన ఒక సిపాయిని చూశాడు.
శిపాఈ ఆధీంచ శోధావర | యేఊనియా ఉతారూసమోర |
పుసే శిరడీచా బాపూగీర | తో కోణ సాచార కథా హో | ||౯౦||
90. అప్పటికే అతడు ‘శిరిడీనుండి వచ్చిన బాపూగీరు ఎవరు?’ అని వెతుకుతూ, కనబడిన ప్రయాణీకుల ముందుకు వచ్చి, ‘నిజంగా చెప్పండి, మీలో శిరిడీనుంచి వచ్చిన బాపూగీరు ఎవరు?’ అని అడుగుతున్నాడు.
తే త్యా శిపాయాచే పుసణే | జాణూని కేవళ ఆపుల్యా కారణే |
గోసావీ పుఢే హోఊని మ్హణే | మీచ తో, మ్హణణే కాయ కీ | ||౯౧||
91. అతడు తన గురించే అడుగుతున్నాడని తెలుసుకుని, అతని ముందుకు వెళ్ళి, ‘నేనే అతను, ఏం కావాలో చెప్పు’ అని అన్నాడు.
చలా సత్వర టాంగ్యాంత బైసూని | రాహిలే పాహుని మార్గ తుమచా | ||౯౨||
92. ‘మీ కోసం చాందోర్కరు నన్ను పంపించారు. త్వరగా వచ్చి టాంగాలో కూర్చొండి. మీ కోసం వారు ఎదురు చూస్తుంటారు’ అని చెప్పాడు.
బువాస అత్యంత ఆనంద ఝాలా | నానాస శిరడీహూన నిరోప గేలా | తరీంచ హా వేళేవర టాంగా ఆలా | ఘోరచీ చుకలా హా మోఠా | ||౯౩||
93. బువాకు చాలా సంతోషమయ్యింది. ‘శిరిడీనుండి నానాకు కబురు వెళ్ళిందేమో, అందుకే ఇప్పుడు టాంగా వచ్చింది. ఘోరమైన కష్టం తప్పింది’ అని అనుకున్నాడు.
శిపాఈ దిసలా మోఠా చతూర | దాఢీ మిశా కల్లేదార | నీట నేటస ల్యాలేలా ఇజార | తాంగాహీ సుందర దేఖిలా | ||౯౪||
94. సిపాయి చాలా తెలివైనవాడిలా కనిపించాడు. గడ్డం, మీసాలు, గిరిజాలు ఉన్నాయి. పంట్లాం అదీ చక్కగా వేసుకున్నాడు. టాంగా కూడా అందంగా ఉంది.
జైసా తాంగా తైసేచ ఘోడే | తే కాయ హోతే భాడ్యాచే థోడే? | నిఘతీ ఇతర తాంగ్యాంచే పుఢే | ఉత్సాహ ఓఢే5 కార్యాచ్యా | ||౯౫||
95. దానికి తగ్గట్టు గుర్రాలు. అవేమన్నా బాడుగకు కట్టేవా! ఎంతో ఉత్సాహంతో, మిగతా టాంగా బళ్ళకంటే, ఎంతో వేగంగా బయలుదేరింది.
భరతా ద్వాదశ ఘటకానిశీ | సుటలా తాంగా జో వేగేసీ | థాంబవిలా తో పహాటేసీ | ఓఢియాపాశీ వాటేత | ||౯౬||
96. రాత్రి ౧౨ ఘటికలప్పుడు (౧౧ గంటలు) వేగంగా బయలుదేరిన టాంగా, తెల్లవారు ఝామున, దారిలో ఒక కాలువ దగ్గర ఆగింది.
తంవ తో తాంగేవాలా సోడీ | పాణీ పాజావయా ఆపులీ ఘోడీ | మ్హణే ఆతాంచ యేతో తాతడీ | కరూ సుఖ పరవడీ ఫరాళ | ||౯౭||
97. అక్కడ బండివాడు, గుర్రాలను నీరు త్రాగడానికి వదిలాడు. ‘నేను క్షణంలో వచ్చేస్తాను, తరువాత హాయిగా ఫలహారం చేద్దాం’ అని అన్నాడు.
పాణీ ఘేఊని యేతో థోడే | ఖాఊ ఆపణ ఆంబే పేఢే | ఆణిక గుళపాపడీచే తుకడే | జుంపూని ఘోడే నిఘూ మగ | ||౯౮||
98. ‘నేను వెళ్ళి, మనిద్దరికి మంచి నీరు తీసుకుని వస్తాను. తరువాత మనం మామిడి పళ్ళు, పేడాలు, బెల్లం అప్పాలు, తిందాము. తిన్న తరువాత బండికి గుర్రాలను కట్టి, బయలుదేరుదాం’ అని అన్నాడు.
దాఢీ పేహేరావ ముసలమానీ | పరిసూని ఏసీ తయాచీ వాణీ | హోయ సాశంకిత రామగీర మనీ | ఫరాళ హా కోణీ కరావా | ||౯౯||
99. ఆ మాటలు విని, అతని దుస్తులు, గడ్డం అన్నీ ముసల్మానుల వలె ఉండటం చూసి, ‘ఈ ఫలహారాన్ని ఎవరు తింటారు?’ అనే అనుమానం రామగీరుకు వచ్చింది.
మ్హణోని తయాస విచారీ జాత | మ్హణే తూ కా ఝాలాసీ శంకిత | మీ హిందూ గరవాల క్షత్రియ పూత | అసే మీ రజపూత జాతీచా | ||౧౦౦||
100. దాంతో, గోసావి అతని కులం గురించి అడిగాడు. అందుకు టాంగావాడు, ‘మీకు అనుమానం ఎందుకు వచ్చింది? నేను హిందువును. గరవాల క్షత్రియుని కొడుకు. రాజపూత జాతివాణ్ణి.
ఫరాళహీ హా నానా దేతీ | తుఝియాలాగీ మజ సంగతీ |
శంకూ నకో యత్కించిత నిశ్చితీ | స్వస్థ చిత్తీ సేవీ హా | ||౧౦౧||
101. ‘ఈ ఫలహారం కూడా నానా మీకోసం నాతో పంపించారు. అందుకు, మనసులో ఏ అనుమానాలూ లేక నిశ్చింతగా తినండి’ అని చెప్పాడు.
ఏసా జేవ్హా విశ్వాస పటలా | మగ త్యా దోఘాంనీ ఫరాళ కేలా | తాంగేవాల్యానే తాంగా జోడిలా | ప్రవాస సంపలా అరుణోదయీ | ||౧౦౨||
102. అలా అతనిపై నమ్మకం కుదిరిన తరువాత, ఆ ఇద్దరూ ఫలహారం తిన్నారు. టాంగావాడు గుర్రాలను బండికి కట్టాడు. సూర్యోదయానికి వారి ప్రయాణం ముగిసింది.
తాంగా ప్రవేశతా గాంవాభీతరీ | దిసూ లాగలీ నానాచీ కచేరీ | ఘోడేహీ విసవలే క్షణభరీ | సుఖావే అంతరీ రామగీర | ||౧౦౩||
103. ఊరిలోకి టాంగా రాగానే, నానాయొక్క కార్యాలయం కనిపించింది. గుర్రాలు క్షణం పాటు విశ్రాంతి కోసం ఆగాయి. రామగీరు మనసులో సంతోషించాడు.
బువాస దాటలీ లఘుశంకా | బసాయా గేలే బాజూస ఎకా | పూర్వస్థళీ పరతతీ జో కా | ఆశ్చర్య దేఖా వర్తలే | ||౧౦౪||
104. అంతలో, బువాకు మూత్ర విసర్జన చేయాలనిపించి, ప్రక్కగా వెళ్ళి కూర్చుని వచ్చేసరికి, ఆశ్చర్యం!
నాహీ తాంగా, నాహీ ఘోడీ | దిసేనా తాంగేవాలా గడీ | కోణీహీ తేథే న దిసే తే ఘడీ | జాగా ఉఘడీ దేఖిలీ | ||౧౦౫||
105. గుర్రాలు కనిపించ లేదు, టాంగా కూడా లేదు. ఎవరూ లేక అక్కడ ఖాళీ స్థలం కనిపించింది.
రామగీర మనీ విచారీ | చమత్కార హా కాయ తరీ | ఆణోనియా మజ యేథవరీ | ఇతుక్యాంత దూరీ గేలా కుఠే | ||౧౦౬||
106. రామగీరు మనసులో ‘ఇదేం చమత్కారం! ఇంతవరకు నన్ను తీసుకుని వచ్చినవాడు, ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు?’ అని ఆశ్చర్య పడ్డాడు.
బువా జావోనీ కచేరీ ఆంత | నానాంచీ భేట ఘ్యావయా ఉత్కంఠిత | అసతీ నిజగృహీ హే కళతా వృత్త | జావయా తై ప్రవృత్త జాహలా | ||౧౦౭||
107. అయినా, నానాను కలుసుకోవాలనే ఆతురతతో, బువా కార్యాలయానికి వెళ్ళి, నానా ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని, అక్కడికి బయలుదేరాడు.
బువా వాటేనే పుసత చాలలా | సహజ నానాచా పత్తా లాగలా | ఓటీవర జో జాఊన బైసలా | ఆంత బోలావిలా నానాంహీ | ||౧౦౮||
108. దారిలో దొరికిన వారిని అడిగి తెలుసుకుని, సులువుగానే నానా ఇంటికి చేరుకున్నాడు. బయట అరగు మీద కూర్చుని ఉంటే, నానా లోపలికి పిలిచాడు.
పరస్పరాంచీ భేట జాహలీ | ఉదీ ఆరతీ బాహేర కాఢిలీ | నానాంచియా సన్ముఖ ఠేవిలీ | వార్తా నివేదిలీ సంపూర్ణ | ||౧౦౯||
109. ఒకరినొకరు కలుసుకున్నారు. ఉదీని, ఆరతి కాగితాన్ని, రామగీరు బయటకు తీసి, నానా ఎదుట ఉంచి, జరిగినదంతా చెప్పాడు.
నవల హీ జంవ ఉదీ ఆలీ | ములగీ నానాంచీ త్యాచ కాలీ | ప్రసూత్యర్థ హోతీ అడలీ | జాహలేలీ అతి కష్టీ | ||౧౧౦||
110. ఆశ్చర్యకరమైన సంగతేమిటంటే, ఉదీ వచ్చినప్పుడు, నానా కూతురు ప్రసవ వేదనను పడుతూ ఉంది.
పాహూని సప్తశతీ పాఠపఠణ | విస్మయాపన్న గోసావీ | ||౧౧౧||
111. ఆ కష్టాన్ని తప్పించటానికి, నవచండీ హోమం, మరియు దుర్గా సప్తశతి పారాయణ జరుగుతుండేది. అది చూసి, గోసావీ ఆశ్చర్య పోయాడు.
జైసే క్షుధార్తా అకల్పిత | తాట యావే పక్వాన్నపూరిత | కింవా తృషిత చకోరా ముఖీ అమృత | తైసే తంవ హోత నానాంలా | ||౧౧౨||
112. ఇవన్నీ జరుగుతున్నా, ఉదీని, ఆరతి కాగితాన్ని చూసి, ఆకలితో ఉన్నవానికి అకస్మాత్తుగా విందు భోజనంతో నిండిన పళ్ళెం ముందుకు వచ్చినట్లు, దాహంతో ఉన్న చకోర పక్షి నోటికి అమృతం అందినట్లు, నానాకు అనిపించింది.
హాంక మారిలీ కుటుంబాలా | ఉదీ దిధలీ పాజావయాలా | స్వయే ఆరతీ మ్హణావయాలా | ఆరంభ కేలా నానాంహీ | ||౧౧౩||
113. భార్యను పిలిచి, కూతురుకి నీటిలో వేసి త్రాగించమని ఉదీనిచ్చాడు. ఆరతి పాటను తానే స్వయంగా పాడటం మొదలుపెట్టాడు.
వేళ క్షణభర గేలా న గేలా | బాహేర ఆంతూని నిరోప ఆలా | ఓఠాస లావితా ఉదీచా ప్యాలా | ఆరామ పడలా ములగీస | ||౧౧౪||
114. క్షణం గడిచే లోపల, ఉదీ వేసిన గ్లాసు నోటికి అందించగానే, ఆ అమ్మాయికి బాధ తగ్గి, ఎంతో సుఖమనిపించింది.
తాత్కాళ క్లేశనిర్ముక్తీ జాహలీ | ములగీ నిర్విఘ్న ప్రసూత పావలీ | సుఖానే హాతీ పాయీ సుటలీ | కాళజీ ఫిటలీ సర్వాంచీ | ||౧౧౫||
115. ఆమె బాధ వెంటనే తొలగి పోయి, సుఖంగా ప్రసవించింది. గండం గడిచి పోగా, అందరి ఆదుర్దా తొలగి పోయింది.
తాంగేవాలా కుఠే గేలా | యేథేంహీ మజ నాహీ ఆఢళలా | రామగీర పుసే నానాంలా | తాంగా ధాడిలా తో కుఠే | ||౧౧౬||
116. ‘కాని, టాంగావాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ కూడా కనిపించటం లేదు. మీరు పంపిన ఆ టాంగా ఎక్కడ? అని రామగీరు నానాను అడిగాడు.
నానా వదతీ మ్యా న ధాడిలా | తాంగా కుఠలా ఠావా న మజలా | తుమ్హీ యేతా హే ఠావే కుణాలా | తాంగా కశాలా ధాడీన మీ | ||౧౧౭||
117. దానికి నానా ‘ఏ టాంగా? నేనేం పంపించలేదే! అసలు నీవు వస్తున్నట్లు ఇక్కడ ఎవరికీ తెలియనప్పుడు, నేను టాంగా ఎలా పంపిస్తాను?’ అని అన్నాడు.
మగ బువాంనీ తాంగ్యాచీ కథా | ఆమూలాగ్ర కథిలీ సమస్తా | విస్మయ దాటలా నానాంచే చిత్తా | పాహూని వత్సలతా బాబాంచీ | ||౧౧౮||
118. అప్పుడు, బువా టాంగా గురించిన కథనంతా వివరంగా చెప్పాడు. భక్తుల మీద బాబాకు ఉండే తల్లిప్రేమను తెలుసుకుని నానాకు ఆశ్చర్యం కలిగింది.
కుఠలా తాంగా, కుఠలా శిపాఈ | నట నాటకీ హీ మాఉలీ సాఈ | సంకటసమయీ ధాంవత యేఈ | భావా పాయీ భక్తాంచ్యా | ||౧౧౯||
119. ఎక్కడి టాంగా, ఎక్కడి సిపాయి! నటించేది, నటింప చేసేది అంతా సాయిమాతయే. భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు, వారి మీద ప్రేమతో బాబా ఏ వేషంలోనైనా కాని, పరుగెత్తుకుంటూ వస్తారు.
అసో; ఆతా కథనుసంధాన | పుఢే చాలవూ పూర్వీల కథన | పుఢే కాంహీ కాలాంతరే కరూన | బాబాహీ నిర్వాణ పావలే | ||౧౨౦||
120. కాని, ఇప్పుడు మునుపటి (నారాయణరావు) కథను ముందుకు సాగిద్దాం. అది జరిగిన కొంత కాలానికి బాబా మహాసమాధి చెందారు.
సన ఎకూణీసశే అఠరా | విజయదశమీ సణ దసరా |
పాహోని బాబాంనీ హా శుభదిన బరా | కేలా ధరార్పణ నిజదేహ | ||౧౨౧||
121. క్రి. శ. ౧౯౧౮వ సంవత్సరంలో, విజయదశమి దసరా పండుగ రోజున, మంచి దినమని తలచి, బాబా తమ దేహాన్ని భూమికి అర్పించారు.
మగ పుఢే జాహలీ సమాధీ | నారాయణరావ తయా ఆధీ | బాబా దేహధారీ తధీ | దర్శన సాధీ దో వేళా | ||౧౨౨||
122. తరువాత సమాధి వచ్చింది. ఇవన్నీ జరగక మునుపే, బాబా దేహంతో ఉండగానే, నారాయణరావు రెండు సార్లు బాబా దర్శనాన్ని చేసుకున్నాడు.
సమాధీస ఝాలే తీన సంవత్సర | దర్శనేచ్ఛా జరీ బలవత్తర | పరి యేతా యేఈనా యోగ్య అవసర | తేణే అధీర జాహలే | ||౧౨౩||
123. బాబా సమాధి చెంది మూడు ఏళ్ళు గడిచాక, నారాయణరావుకు బాబాను చూడాలన్న బలమైన కోరిక కలిగింది. కాని, దానికి సరియైన అవకాశం దొరకక, చాలా నిరాశ చెందాడు.
సమాధీమాగే వర్ష భరలే | నారాయణరావ వ్యాధీనీ పీడిలే | ఔషధోపచార సర్వ సరలే | ఉపాయ హరలే లౌకీకీ | ||౧౨౪||
124. బాబా సమాధి చెందిన ఒక సంవత్సరానికి, నారాయణరావు జబ్బుతో బాధ పడ్డాడు. అన్ని రకాల మందులను వాడి చూశారు. కాని, చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
గేలే జరీ వ్యాధీనే గాంజూన | రాత్రందిన బాబాంచే ధ్యాన | గురురాయాస కైచే మరణ | దిధలే దర్శన నారాయణా | ||౧౨౫||
125. జబ్బుతో చిక్కి పోతున్నా, అతడు రాత్రింబవళ్ళూ బాబా ధ్యానమే చేసేవాడు. గురురాయులకు చావనేది ఉంటుందా? నారాయణునకు వారు దర్శనమిచ్చారు.
ఏకే రాత్రీ పడలే స్వప్న | సాఈ ఎకా భుయారామధూన | నారాయణరావాంపాశీ యేఊన | దేతీ ఆశ్వాసన తయాంతే | ||౧౨౬||
126. ఒక రాత్రి అతనికి ఒక కల వచ్చింది. అందులో, సాయి ఒక సొరంగంనుండి బయటకు రావడం నారాయణరావు చూశాడు. వారు అలా నారాయణరావు దగ్గరికి వచ్చి, అతనికి ధైర్యం చెప్పారు.
“కాళజీ కాంహీ న ధరీ మనీ | ఉతార పడేల ఉద్యాంపాసూని | ఎక ఆఠవడా సంపతాక్షణీ | బసశీల ఉఠూని తూ స్వయే” | ||౧౨౭||
127. “నీవు మనసులో ఏ చింతా పెట్టుకోకు. రేపటినుండి నీ బాధ తగ్గిపోతుంది. ఒక వారం గడిచే సరికి, నీయంతట నీవే లేచి కూర్చుంటావు.”
అసో, మగ ఆఠ దివస లోటలే | అక్షరేఅక్షర ప్రత్యంతర ఆలే | నారాయణరావ ఉఠూన బైసలే | అంతరీ ధాలే అనివార | ||౧౨౮||
128. అలాగే, ఎనిమిది రోజులు కాగానే, బాబా చెప్పిన మాటలలోని, ప్రతి అక్షరం అనుభవంలోకి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. అతని ఆనందానికి అంతే లేకుండా పోయింది.
ఏసేచ కాంహీ జాతా దివస | ఆలే నారాయణరావ శిరడీస | సమాధీచే దర్శనాస | తేవ్హా యా అనుభవాస కథియేలే | ||౧౨౯||
129. అలాగే కొన్ని రోజులు గడిచాక, సమాధి దర్శనానికని అతడు శిరిడీకి వచ్చాడు. అప్పుడు తన ఈ అనుభవాన్ని చెప్పాడు.
దేహధారీ మ్హణూని జిత | సమాధిస్థ జే తే కాయ మృత | సాఈ జననమరణాతీత | సదా అనుస్యూత స్థిరచరీ | ||౧౩౦||
130. సాయి దేహంతో ఉన్నప్పుడు బ్రతికి ఉన్నారని, సమాధి చెందిన తరువాత చనిపోయారని, ఎలా చెప్పగలం? వారు చావు పుట్టుకలను మించిన వారు. ఎల్లప్పుడూ వారు కదిలి కదలని ఈ జగత్తులో వ్యాపించి ఉన్నారు.
వన్హీ జైసా కాష్ఠీ గుప్త | దిసేనా పరి తదంతర్హిత |
ఘర్షణ ప్రయోగే హోఈ ప్రదీప్త | తైసాచ భక్తార్థ హా సాఈ | ||౧౩౧||
131. కట్టె లోపల, నిప్పు దాగి ఉంటుంది. అది పైకి కనిపించదు. రాపిడి చేయటంతో అది రాచుకుంటుంది. అలాగే, భక్తుల కోసం సాయి కూడా.
ఎకదా జో ప్రేమే దేఖిలా | తయాచా ఆజన్మ అంకిత ఝాలా | కేవళ అనన్య ప్రేమాచా భుకేలా | తయాచ్యా హాంకేలా ఓ దేఈ | ||౧౩౨||
132. ఒక సారి వారిని ప్రేమతో చూస్తే, జీవితాంతం సాయి వారికి అంకితమై పోతారు. వారు కేవలం ప్రేమనే కోరుకుంటారు. ప్రేమగా పిలిస్తే, ఓ అని పలుకుతారు.
నలగే తయాసీ స్థళ వా కాళ | ఉభా నిరంతర సర్వ కాళ | కైసీ కోఠూన దాబీల కళ | కరణీ అకళ తయాచీ | ||౧౩౩||
133. దేశం కాని, కాలం కాని, వారిని బంధించ లేవు. ఎల్లప్పుడూ భక్తుల కోసం వారు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు ఎక్కడ వారి చాతుర్యాన్ని చూపుతారో, ఎవరికీ తెలియదు. వారి లీలలు ఊహకందనివి.
ఏసీ కాంహీ కరీల రచనా | మనాంత యేతీల కుతర్క నానా | తో తో దృష్టీ ఠేవితా చరణా | ధ్యానధారణా వాఢేల | ||౧౩౪||
134. వారు కల్పించే పరిస్థితుల వలన, మనకు ఎన్నో కుతర్కాలు, అనుమానాలు కలుగుతాయి. అలాంటప్పుడు, వారి పాదాల మీది మన చూపు నిలిపి, ధ్యానిస్తే, మనం ధ్యానించే శక్తి పెరుగుతుంది.
ఏసే ఝాలియా ఎకాగ్ర మన | ఘడేల అత్యంత సాఈచింతన | హేంచ హా సాఈ ఘేఈ కరవూన | కార్యహీ నిర్విఘ్న పార పడే | ||౧౩౫||
135. ఇలా మనసుకు ఏకాగ్రత ఏర్పడినప్పుడు, సాయిపై ధ్యానం చక్కగా కుదురుతుంది. ఇదే మనతో సాయి చేయించేది. ఏ అడ్డంకులూ రాకుండా ఇది జరిగిపోతుంది.
వ్యవహార నలగే సోడావయాస | సుటేల ఆపోఆప హవ్యాస | ఏసా హా మనా లావితా అభ్యాస | కార్యహీ అప్రయాస ఘడేల | ||౧౩౬||
136. సంసారంలోని పనులను విడిచి పెట్టాల్సిన అవసరం లేదు. సాయిని ధ్యానిస్తూ ఉంటే, ఇంద్రియ సుఖాల మీద ఉండే కోరిక దానంతట అదే వదిలి పోతుంది. ఇలా మనసును ధ్యానంలో ఉంచితే, ఏ పనైనా సులువుగా జరుగుతుంది.
కర్మ భూమీస ఆలాసే దేహ | కర్మే ఘడతీల నిఃసందేహ | స్త్రీ, పుత్ర, విత్త ఆణి గేహ | యథేచ్ఛ పరిగ్రహ హోవో కా | ||౧౩౭||
137. మనకు ఈ దేహం కర్మభూమి మీద వచ్చింది కనుక, కర్మలను తప్పని సరిగా చేయాల్సిందే. భార్యాబిడ్డలను, డబ్బును, ఇళ్ళను, మనసుకు కావలిసినంత పోగు చేసుకోవచ్చు.
హోణార తే హోఉంద్యా యథేష్ట | సద్గురుచింతన ఆపులే అభీష్ట | సంకల్ప వికల్ప హోతీల నష్ట | సంచిత అనిష్ట టళేల | ||౧౩౮||
138. జరగాల్సిన వానిని జరగనివ్వండి. సద్గురువును ధ్యానించడమే మన కోరిక అయినప్పుడు, మనసులో ఉండే మిగతా అనుమానాలు, కోరికలు నశించిపోతాయి. కూడబెట్టుకున్న కర్మ ఫలము, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి.
పాహోనియా భక్తభావ | కైసే సాఈ మహానుభావ | దావీత భక్తాంస ఎకేక అనుభవ | వాఢవిత వైభవ భక్తీచే | ||౧౩౯||
139. భక్తుల మనసులోని ప్రేమను గమనించి, దానికి సరిపడే ఎన్నో అనుభవాలను, సాయి మహానుభావులు కలిగించి, భక్తియొక్క గొప్పదనాన్ని చాటుతారు.
వాటేల తైసా వేష ఘేతీ | మానేల తేథే ప్రకట హోతీ | భక్తకల్యాణార్థ కుఠేహీ ఫిరతీ | శిష్యభావార్థీ పాహిజే | ||౧౪౦||
140. తమకిష్టమైన రూపంలో, తమకు ఇష్టం వచ్చిన చోట, వారు కనిపిస్తారు. భక్తుల మేలు కొరకు ఎక్కడెక్కడైనా తిరుగుతారు. కాని, కావలసింది వారి మీద భక్తులకు నమ్మకం.
యే అర్థీచీ ఆణిక కథా | శ్రోతా పరిసిజే సాదర చిత్తా |
సంత ఆపుల్యా భక్తా కరితా | కైసే శ్రమతాత అహర్నిశ | ||౧౪౧||
141. ఈ సందర్భానికి సరిపడే మరొక కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. సత్పురుషులు తమ భక్తుల కొరకు రాత్రింబవళ్ళూ ఎలా కష్ట పడతారు అన్నది ఈ కథ వలన తెలుస్తుంది.
ఖోలూనియా కానాంచీ కవాడే | హృదయమందిర కరా కీ ఉఘడే | రిఘూంద్యా ఈస6 ఆంతులీకడే | భవభయ సాంకడే వారీల | ||౧౪౨||
142. మీ చెవుల తలుపులను తెరచి, మీ మనసులోని మందిరాన్ని తెరచి, ఈ కథను వాని లోపలికి వెళ్ళనివ్వండి. సంసారంతో ముడి పడిన భయాలను, కష్టాలను తొలగిస్తుంది.
హే జే సాంప్రత సరలే ప్రసిద్ధ | శార్మణ్య దేశీంయాశీ యుద్ధ | లష్కర కరూ లాగే సిద్ధ | శత్రూవిరుద్ధ సంగ్రామా | ||౧౪౩||
143. జర్మనీయులతో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, శత్రువులతో పోరాడటానికి, సైన్యాన్ని సిద్ధ పరచాల్సి వచ్చింది.
ఆంగ్లభౌమ రాజ్యాధికారీ | యా భరతభూమీచియా భీతరీ | లష్కరభరతీ శహరోశహరీ | హోతే కరీత చోహీకడే | ||౧౪౪||
144. దాని కోసమై, బ్రిటిషు ప్రభుత్వం భారతభూమిలోని అన్ని పట్టణాలనుంచి, ప్రజలను సిపాయిలుగా నియమించ సాగారు.
సన ఎకోణీసశే సతరా సాలీ | ఎకా భక్తాచీ వేళ ఆలీ | ఠాణే జిల్హ్యాస నేమణూక ఝాలీ | కథా వర్తలీ నవల పరీ | ||౧౪౫||
145. క్రి. శ. ౧౯౧౭వ సంవత్సరంలో, ఒక భక్తునికి ఆ అవకాశం వచ్చింది. ఠాణా జిల్లాలో నియమించబడినప్పుడు, ఒక వింత ఘటన జరిగింది.
ఆపాసాహేబ కుళకర్ణీ నాంవ | జడలా సాఈచరణీ భావ | హా తరీ ఎక సాఈచా ప్రభావ | లీలా అథావ7 తయాచీ | ||౧౪౬||
146. ఆ భక్తుని పేరు ఆపాసాహేబు కుళకర్ణీ. సాయియొక్క ప్రభావం వలన, అతనికి సాయి పాదాలయందు దృఢమైన భక్తి కలిగింది. సాయి లీలలు అద్భుతం.
తయాంతే బహుతా వర్షాంపూర్వీ | బాళాసాహేబ భాట్యాంకరవీ | ప్రాప్త జాహలీ బాబాంచీ ఛవీ | హోతీ లావిలీ పూజేస | ||౧౪౭||
147. చాలా ఏళ్ళ క్రింద, బాలాసాహేబు భాటే దగ్గరనుండి, బాబా చిత్రపటం ఒకటి అతనికి దొరికింది. అప్పటినుండి, అతడు ఆ పటాన్ని పూజించ సాగాడు.
కాయా వాచా మనేకరూన | ప్రాప్త గంధాక్షత పుష్ప ఘాలూన | నిత్య నేమే ఛబీచే పూజన | నైవేద్య సమర్పణ కరీత | ||౧౪౮||
148. ప్రతి రోజూ, మాట, మనసు మరియు పనులతో, ఆ పటానికి గంధం అక్షతలతోను, పువ్వులతోను పూజించి, నైవేద్యాన్ని సమర్పించే వాడు.
సరేల కేవ్హా కర్మభోగ | హోఈల కేవ్హా మనాజోగ | సాఈ ప్రత్యక్ష దర్శనయోగ | ఆపాస హృద్రోగ లాగలా | ||౧౪౯||
149. దాంతో ఎప్పుడు, కర్మల ఫలం ముగిసిపోతాయి, ఎప్పుడు సాయిని ఎదురుగా చూసే భాగ్యం కలుగుతుంది, ఎప్పుడు తన మనసులోని కోరిక తీరుతుంది అని ఆపాసాహేబు చింతించ సాగాడు.
సాఈబాబాంచ్యా ఛబీచే దర్శన | తేంహీ ప్రత్యక్ష దర్శనాసమాన | భావ మాత్ర అసావా పూర్ణ | వేళేవర ఖూణ పావాల | ||౧౫౦||
150. సాయిబాబా చిత్రపటాన్ని చూడటం కూడా, వారిని ఎదురుగా చూసిన సమానమే. పూర్తి భక్తిభావముంటే, తగిన సమయంలో, దీని అనుభవమౌతుంది.
కేవళ ఛబీచే దర్శన హోతా | ప్రత్యక్ష దర్శనాచీ త్యా సమతా |
యేవిషయీంచీ అన్వర్థతా | శ్రోతా సాదరతా పరిసీజే | ||౧౫౧||
151. ఇప్పుడు, కేవలం పటాన్ని చూసినంతనే, బాబాను ఎదురుగా చూడటంతో సమానమని తెలియచేసే కథను శ్రోతలు శ్రద్దగా వినండి.
ఎకదా బాళాబువా సుతార | ముంబాపురస్థ భజనకార | అర్వాచిన తుకారామ నామధర | గేలే శిరడీస దర్శనా | ||౧౫౨||
152. ఒక సారి, అభినవ తుకారాం అని పిలువబడే హరిదాసు, ముంబైలో ఉండే బాళాబువా సుతార, బాబా దర్శనానికి శిరిడీకి వెళ్ళాడు.
హీచ తయాంచీ ప్రథమ భేట | పూర్వీ కధీహీ నసతా గాంఠ | హోతాంచ ఉభయతా దృష్టాదృష్ట | సాఈ తో స్పష్ట త్యా వదలే | ||౧౫౩||
153. అదే అతను బాబాను మొదటి సారి కలవడం. అంతకు మునుపెప్పుడూ చూడలేదు. అతడు, బాబా ఒకరినొకరు చూసుకోగానే, సాయి అతనితో,
చార వర్షాపాసూన పాహే | మజలా యాచీ ఓళఖ ఆహే | బాళాబువా విస్మిత హోయే | ఏసే కా హే వదతాత | ||౧౫౪||
154. “నాలుగేళ్ళనుంచి ఇతను నాకు తెలుసు” అని స్పష్టంగా చెప్పారు. ‘బాబా ఇలా ఎందుకు అంటున్నారు’ అని బాళాబువా ఆశ్చర్యపోయాడు.
బాబాంనీ నాహీ శిరడీ సోడిలీ | మీహీ డోళా ఆజచి దేఖిలీ | త్యా మజ చార వర్షా పహిలీ | ఓళఖ పడలీ హే కైసే | ||౧౫౫||
155. ‘శిరిడీ వదిలి బాబా ఎక్కడికీ పోలేదు. నేను కూడా వారిని ఇవాళే చూస్తున్నాను. మరి వీరికి నేను నాలుగేళ్ళ మునుపటినుండి ఎలా తెలుసు?’
ఏసా విచార కరితా కరితా | చారచి వర్షాంమాగీల వార్తా | ఛబీ ఎకదా బాబాంచీ నమితా | ఆఠవలీ చిత్తా బువాంచ్యా | ||౧౫౬||
156. అని ఆలోచిస్తూ ఉంటే, నాలుగేళ్ళ వెనక ఒక సారి, తాను బాబా పటానికి నమస్కరించటం, బువాకు గుర్తుకు వచ్చింది.
మగ త్యా బోలాచీ అన్వర్థతా | బాళాబువాంస పటలీ తత్వతా | మ్హణతీ పహా సంతాంచీ వ్యాపకతా | భక్తవత్సలతా హీ త్యాంచీ | ||౧౫౭||
157. బాబా మాటలలోని నిజం అప్పుడు వెంటనే అతనికి అర్థమైంది. సత్పురుషులు అన్ని చోట్లా వ్యాపించి ఉండటాన్ని, భక్తుల మీద వారికి ఉండే ప్రీతిని గమనించండి.
మీ తో కేవళ ఛబీ నమిలీ | ప్రత్యక్ష మూర్తీ ఆజచి పాహిలీ | బాబాంనీ పరి ఓళఖ ధరిలీ | మీ తీ హరవిలీ కధీంచ | ||౧౫౮||
158. ‘అప్పుడు నేను కేవలం వారి పటానికి నమస్కరించాను. కాని, ఎదురుగా ఈ రోజే చూశాను. అయినా, నన్ను బాగా గుర్తుంచుకున్నారు. కాని, నేను దాని గురించి, ఎప్పుడో మరచిపోయాను’ అని అనుకున్నాడు.
హరవిలీ మ్హణణే హేంహీ న సార్థ | కీ తాత్కాళ కళేనా బోలాచా అర్థ | ఛబీ నమనీ ఓళఖ హా పదార్థ | జాణాయా సమర్థ నవ్హతో మీ | ||౧౫౯||
159. ‘నేను మరచి పోయానని అనుకోవటం కూడా సరియైనది కాదు. బాబా మాటల వెనుక ఉండే అర్థం నాకు వెంటనే తెలియలేదు. పటానికి నమస్కరించటం ద్వారా, నేను వారికి పరిచయమయ్యానని వారు అన్నది, తెలుసుకునే శక్తి నాకు లేదు.
మాఝీ ఓళఖ బాబాంస ఠావీ | మాఝ్యా హీ తో నవ్హతీ గాంవీ | సంతాంనీ జై ఆఠవణ ద్యావీ | తేవ్హాంచ పడావీ ఠాయీ తీ | ||౧౬౦||
160. ‘బాబాకు నేను తెలుసు, కాని, ఆ సంగతి నాకు తెలియదు. సత్పురుషులు గుర్తుకు తెచ్చి, తెలియ చేస్తేనే, దేనినైనా మనం తెలుసుకుంటాము’.
నిర్మల ఆరసా నిర్మల ఉదక | తై బింబాచే ప్రతిబింబ దేఖ |
ఛబీ హేంహీ ప్రతిబింబ ఎక | శుద్ధ ప్రతీక బింబాచే | ||౧౬౧||
161. నిర్మలమైన అద్దంలోనో, లేక నిర్మలమైన నీటిలోనో, సూర్యుని, లేక చంద్రుని, రూపాన్ని చూస్తాం. అలాగే, పటం కూడా ఒక ప్రతిబింబమే. మనిషియొక్క నిర్మలమైన రూపాన్ని చూపిస్తుంది.
మ్హణూన సంతాంచ్యా ఛబీచే దర్శన | ఆహే ప్రత్యక్ష దర్శనాసమాన | సర్వదర్శీ సంతాంచీ జాణ | తీచ హీ శికవణ సర్వాంతే | ||౧౬౨||
162. అందు వలన, సత్పురుషుల చిత్రపటాన్ని చూడటం, వారిని ఎదురుగా చూసిన దానితో సమానం. దీనినే అన్నీ తెలిసిన సత్పురుషులు బోధిస్తారు.
అసో ఆతా పూర్వీల కథా | పరిసావయా సావధానతా | అసావీ శ్రోతయాంచే చిత్తా | అనుసంధానతా రాఖావీ | ||౧౬౩||
163. ఇప్పుడు, సగంలో వదిలిన మునుపటి కథను వినటానికి, శ్రోతలు సావధానంగా ఉండండి.
వాస్తవ్య ఆప్పాంచే ఠాణే శహరీ | ఆలీ భివండీచీ కామగిరీ | ఆఠా దివసా యేఈన మాఘారీ | పడలే బాహేరీ సాంగూన | ||౧౬౪||
164. ఆపా ఠాణా పట్టణంలో ఉంటాడు. భివండిలో పని ఉండటం వలన, ఎనిమిది రోజులలో తిరిగి వస్తానని చెప్పి, బయటకు వెళ్ళాడు.
దివస దోనచీ గేలియావరీ | ఘడలే అపూర్వ పహా మాఘారీ | పాతలా ఎక ఫకీర దారీ | తయాంచే ఘరీ ఠాణ్యాస | ||౧౬౫||
165. కాని, రెండు రోజులలోనే ఒక విచిత్రమైన ఘటన జరిగింది. ఠాణాలోని అతని ఇంటి ముందర ఒక ఫకీరు వచ్చాడు.
హోతా తయాచీ దృష్టాదృష్ట | సాఈచ సర్వాంస వాటలే స్పష్ట | ఛబీచే సామ్య నఖశిఖాంత | రూపరేఖేంత సంపూర్ణ | ||౧౬౬||
166. అతనిని చూడగానే, సాయియే వచ్చాడని అందరికీ అనిపించింది. అతని రూపం, ఆకారం, కాళ్ళనుండి తలదాకా, పూర్తిగా పటంలోని బాబాలాగానే ఉన్నాయి.
కుటుంబ ఆణి ములే బాళే | ఫకీరాకడే సర్వాంచే డోళే | విస్మయాపన్న జాహలే సగళే | బాబాచ ఆలే వాటలే | ||౧౬౭||
167. ఆపాయొక్క భార్య బిడ్డలు ఆశ్చర్యంతో ఆ ఫకీరును చూస్తూ ఉండిపోయారు. ‘బాబాయే వచ్చారా!’ అని వారికి అనిపించింది.
పూర్వీ న కోణాస ప్రత్యక్ష దర్శన | పరి ఛబీచ్యా సాదృశ్యావరూన | హేచ తే బాబా ఏసే జాణూన | జిజ్ఞాసాసంపన్న జాహలే | ||౧౬౮||
168. అంతకు మునుపు వారెవ్వరూ బాబాను ఎదురుగా చూడలేదు. కాని, అచ్చం పటంలో వలెనే ఉండటంతో, వీరే సాయిబాబా అని అనుకుని, కుతూహలంతో,
సాఈ శిరడీచే తేచ కీ ఆపణ | అవఘీ ఫకీరాస కేలా ప్రశ్న | తయా తో ఫకీర కరీ జే నివేదన | శ్రోతీ సావధాన పరిసిజే | ||౧౬౯||
169. ‘మీరు శిరిడీ సాయిబాబాయేనా?’ అని ఫకీరును అడిగారు. ఫకీరు చెప్పిన దానిని, శ్రోతలు, జాగ్రత్తగా వినండి.
సాఈ స్వయే మీ నవ్హే సాచా | పరి మీ బందా ఆజ్ఞాంకిత త్యాంచా | సమాచారార్థ ములాబాళాంచ్యా | ఆలోంసే తయాంచ్యా ఆజ్ఞేనే | ||౧౭౦||
170. ‘నిజంగా, నేను స్వయంగా సాయిని కాను. కాని, వారి ఆజ్ఞను పాలించే దాసుణ్ణి. వారి ఆజ్ఞ ప్రకారం, మీ కుటుంబ క్షేమ సమాచారాలను తెలుసుకోవటానికి వచ్చాను’.
పుఢే తో మాగూ లాగతా దక్షిణా | ములాంచీ మాతా కరీ సంభావనా |
ఎక రుపయా దేఈ తత్క్షణా | ఉదీ ప్రదానా తోహీ కరీ | ||౧౭౧||
171. అని చెప్పి, దక్షిణను అడగగా, ఆ తల్లి వెంటనే ఒక రూపాయిని దక్షిణగా ఇచ్చింది. అతడు కూడా బాబా ఉదీని ఇచ్చాడు.
దేఈ సాఈబాబాంచీ విభూతీ | పుడీంత బాంధూన బాఈప్రతీ | మ్హణే ఠేవీ త్యా ఛబీచే సంగతీ | సౌఖ్య ప్రాప్తీ హోఈల | ||౧౭౨||
172. సాయిబాబా ఉదీని ఒక పొట్లంలో కట్టి, ఆమెకు ఇచ్చి, ‘దీనిని ఆ పటం దగ్గర ఉంచండి. మీకు సుఖం కలుగుతుంది’ అని చెప్పాడు.
ఏసా సంపాదూని నిజకార్యార్థ | సాఈ అసేల మార్గ లక్షీత | ఏసే మ్హణూన నిరోప ఘేత | జాహలా మార్గస్థ ఫకీర | ||౧౭౩||
173. వచ్చిన పని పూర్తి చేసుకోవటంతో, ‘సాయి నా కోసం ఎదురు చూస్తుంటారు’ అని సెలవు తీసుకుని, ఆ ఫకీరు వెళ్ళిపోయాడు.
మగ తో తేథూనియా జో నిఘాలా | ఆలియా మార్గే చాలూన గేలా | యేరీకడే జో వృత్తాంత ఘడలా | అపూర్వ లీలా సాఈచీ | ||౧౭౪||
174. అక్కడనుండి బయటకు వెళ్ళి, వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. కాని, ఆపా ఇంట్లో జరిగినది మాత్రం ఒక అద్భుతమైన లీల.
ఆప్పాసాహేబ భివండీస గేలే | పుఢే న జాతా మాగే పరతలే | ఘోడే టాంగ్యాచే అజారీ ఝాలే | గమన రాహిలే పుఢారా | ||౧౭౫||
175. భివండికి వెళ్ళిన ఆపాసాహేబు, అక్కడికి పోక, వెనుకకు మరలాడు. టాంగా బండి గుర్రాలు జబ్బు చేయటంతో, అతని ప్రయాణం ముందుకు సాగక, ఆగిపోయింది.
తే మగ దుపారీ ఠాణ్యాస ఆలే | వృత్త సర్వ ఝాలేలే కళలే | ఆప్పాసాహేబ మనీ చురచురలే | కీ తే అంతరలే దర్శనా | ||౧౭౬||
176. మధ్యాహ్నం అతను ఠాణాకు వచ్చి, జరిగిన సంగతులను తెలుసుకున్నాడు. ఫకీరు దర్శనం చేసుకోనందుకు, ఆపా మనసు బాధ పడింది.
అవఘీ రుపయాచ దక్షిణా దిధలీ | తేణే మనాలా లజ్జా వాటలీ | మీ అసతో తర దహాచే ఖాలీ | నసతీచ ఝాలీ బోళవణీ | ||౧౭౭||
177. పైగా, కేవలం ఒకే రూపాయిని దక్షిణగా ఇచ్చినందుకు, తనలోనే సిగ్గు పడ్డాడు. ‘నేను ఉండి ఉంటే, పదికి తక్కువ ఇవ్వకుండా, అసలు పంపేవాణ్ణి కాను’.
ఏసే ఆప్పాసాహేబ వదలే | చిత్తాస కించిత ఖిన్నత్వ వాటలే | ఫకీర మశీదీంత సాంపడతీల వాటలే | శోధార్థ నిఘాలే ఉపవాసీ | ||౧౭౮||
178. అని అనుకుని, ఆపా తనలోనే బాధపడ్డాడు. ఆ ఫకీరు మసీదు దగ్గర దొరకవచ్చని అనుకుని, అతనిని వెదకటానికి భోజనం చేయకుండానే బయలుదేరాడు.
మశీద తకియా ఠికఠికాణీ | జేథే జేథే ఉతరతీ కోణీ | స్థానే సమస్త శోధిలీ ఆప్పానీ | ఫకీరాలాగూని తేధవా | ||౧౭౯||
179. ఫకీరులు సాధారణంగా బస చేసే మసీదు, తకియా మరి ఇంకా ఎన్నో చోట్లలో ఆపా వెదికాడు.
శోధాశోధ కరితా థకలే | ఫకీర కోఠేంహీ తో నాఢళే | మగ తే భుకేలే జాఊన జేవలే | నిరాశ ఝాలే తేధవా | ||౧౮౦||
180. వెదికి వెదికి, ఆపా అలసిపోయాడు కాని, ఎక్కడా ఆ ఫకీరు కనిపించలేదు. చాలా నిరాశ చెంది, ఆకలిగా ఉన్నందుకు, ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు.
పరి తయాంస నాహీ ఠావే | రిత్యా పోటీ న శోధా నిఘావే |
ఆధీ నిజాత్మ్యాస సంతుష్టవావే | పాఠీ ఉటావే శోధార్థ | ||౧౮౧||
181. కాని, అతనికి తెలియనిదేమిటంటే, ఖాళీ కడుపుతో దేనినీ వెదకటానికి వెళ్ళకూడదు, అని. మన ఆత్మను మునుపు తృప్తి పరచి, తరువాత వెదకటానికి వెళ్ళాలి.
యే అర్థాచీ బాబాంచీచ కథా | దావీల యా నిజ తత్వాచీ యథార్థతా | కిమర్థ యేథే తిచీ ద్విరుక్తతా | అధ్యాయ తో శ్రోతా అవగత | ||౧౮౨||
182. దీని గురించి, ఇంతకు మునుపు బాబా చెప్పిన కథ, ఈ తత్వంలోని నిజాన్ని తెలుపుతుంది. శ్రోతలకు ఆ అధ్యాయం తెలుసు కనుక, మళ్ళీ ఇక్కడ చెప్పడమెందుకు?
గురు గరిమా నామే ఎక | గతాధ్యాయీ కథా సురేఖ | తేథ స్వముఖే నిజ గురుచీ భాక | వర్ణిలీ కారుణిక శ్రీసాఈనీ | ||౧౮౩||
183. ‘గురువుయొక్క మహిమ’ అన్న పోయిన అధ్యాయంలోని కథలో, కరుణామయులైన శ్రీసాయి, తమ గురువు గొప్పతనాన్ని తామే స్వయంగా వర్ణించారు.
తేంచ సత్య అనుభవా ఆలే | ఆప్పా జేవ్హా జేవూన నిఘాలే | సవే స్నేహీ చిత్రే ఘేతలే | సహజ చాలలే ఫిరావయా | ||౧౮౪||
184. ఆ మాటలలోని నిజమే, ఇప్పుడు అనుభవమైంది. ఆప్పా భోజనం చేసి, తన స్నేహితుడైన చిత్రేను వెంటబెట్టుకుని, మామూలుగా తిరగటానికి బయల్దేరాడు.
అసో, కాంహీ మార్గ క్రమితా | అనులక్షూన ఆపణాకరితా | దేఖిలే యేతా ఎకా గృహస్థా | అతి సత్వరతా తే స్థళీ | ||౧౮౫||
185. కొంత దూరం వెళ్ళిన తరువాత, ఒక పెద్ద మనిషి తననే చూస్తూ, తన వైపు త్వర త్వరగా రావటాన్ని గమనించాడు.
యేఊని ఉభే రాహతా జవళీ | ఆప్పాసాహేబ హళూచ న్యహాళీ | హేచ ఆలే అసతీల సకాళీ | వాటలే తే వేళీ తయాంస | ||౧౮౬||
186. అలా అతను దగ్గర వచ్చి, తన ఎదుట నిలబడ్డాడు. ఆప్పాసాహేబు అతనిని పరీక్షించి చూసి, ‘తెల్లవారి వచ్చినది ఇతనే,
ఆధీ జయాతే శోధీత హోతో | హాచి గమే మజ ఫకీర కీ తో | ఆనఖాగ్ర ఛబీసీ జుళతో | విస్మయ హోతో బుద్ధీసీ | ||౧౮౭||
187. ‘ఇంతకు మునుపు నేను వెతుకుతున్న ఫకీరు ఇతనే అయి ఉంటాడు. ఇతని రూపం ఆకారం అన్నీ పటంలో లాగానే ఉన్నాయి. ఇతన్ని చూడగానే, నా మనసు చాలా కలవర పడుతుంది’.
ఏసే ఆప్పా తర్కితీ అంతరీ | తోంచ తో ఫకీర హాత పసరీ | ఠేవి ఎక రుపయా కరీ | ఆప్పా తే అవసరీ తయాచే | ||౧౮౮||
188. అని ఆప్పా తనలో తాను తర్కించుకుంటూ ఉండగా, ఆ ఫకీరు చేయి చాచాడు. ఆప్పా ఆ చేతిలో ఒక రూపాయిని ఉంచాడు.
ఆణిక మాగతా ఆణిక ఎక | దిధలా తయావరీ తిసరా దేఖ | తరీ తో ఫకీర మాగే ఆణిక | నవల కౌతుక పుడేంచ | ||౧౮౯||
189. ఫకీరు ఇంకా అడగగా, మరొకటి, ఆ పైన మూడో రూపాయిని కూడా ఇచ్చాక, ఆ ఫకీరు మళ్ళీ అడిగాడు. అసలైన అద్భుతం ముందుంది.
చిత్ర్యాంపాసీ హోతే తీన | తేహీ ఆప్పా ఘేతీ మాగూన | దేతీ తయా ఫకీరాలాగూన | తరీ తో రాహీ న మాగతా | ||౧౯౦||
190. చిత్రే దగ్గర ఉన్న మూడు రూపాయలను, ఆప్పా అడిగి తీసుకుని, ఫకీరుకు ఇచ్చాడు. అయినా, ఫకీరు అడగటం మానలేదు.
ఆప్పాసాహేబ వదతీ తయాస | ఆణిక దేఈన యేతా ఘరాస |
బరే మ్హణూన ఘరాకడేస | తిఘే తే సమయాస పరతలే | ||౧౯౧||
191. ‘నువ్వు ఇంటికి వస్తే. ఇంకా ఇస్తాను’ అని ఆప్పా అనగా, ఫకీరు ‘సరే’ అని అన్నాడు. ముగ్గురూ ఇంటికి తిరిగి వచ్చారు.
ఘరీ యేతాంచ ఆణిక తీన | హాతీ దిధలే రుపయే కాఢూన | ఝాలే నఊ తరీ అజూన | ఫకీర సమాధాన పావేనా | ||౧౯౨||
192. ఇంటికి వచ్చిన వెంటనే, ఆప్పా మరో మూడు రూపాయలను ఫకీరుకు ఇచ్చాడు. అలా మొత్తం తొమ్మిది రూపాయలనిచ్చినా, ఫకీరు తృప్తి చెందలేదు.
పుఢే అధిక దక్షిణా మాగతా | ఆప్పాసాహేబ వదతీ తత్వతా | బందీ దహాచీ నోటచి ఆతా | బాకీ రహాతా రాహిలీ | ||౧౯౩||
193. ఫకీరు ఇంకా దక్షిణను అడగగా, ఆప్పా అతనితో, ‘ఈ పది రూపాయల నోటు మాత్రమే నా దగ్గర ఇప్పుడు మిగిలి ఉంది,
సుటే రుపయే సర్వ సరలే | నాహీ దుసరే కాంహీ ఉరలే | నోట దేఈసనా ఫకీర బోలే | తైసేంహీ కేలె ఆప్పానీ | ||౧౯౪||
194. ‘చిల్లర రూపయలన్నీ అయిపోయాయి. వేరే ఏదీ లేదు’ అని అనగా, ఆ ఫకీరు ‘దానిని నాకిచ్చేయ రాదూ’ అని అన్నాడు. ఆప్పా అలాగే ఇచ్చేశాడు.
నోట జంవ తీ హాతీ లాగే | నఊ దేఊని టాకీ మాగే | ఫకీర మగ తో ఆలియా మార్గే | గేలా అతివేగే పరతోని | ||౧౯౫||
195. నోటు చేతిలో పడగానే, మునుపు తీసుకున్న తొమ్మిది రూపాయలను తిరిగి ఇచ్చేసి, వచ్చిన దారినే ఆ ఫకీరు చాలా వేగంగా వెళ్ళిపోయాడు.
పాహతా యా కథేచే సార | జయా భక్తాచే జైసే ఉద్గార | తైసే తే పూర్ణ కరవూన ఘేణార | బ్రీద హే సాచార సాఈంచే | ||౧౯౬||
196. ఈ కథను గమనిస్తే, భక్తులు అనుకున్న దానిని పూర్తిగా చేయించుకోవటమే, సాయియొక్క వాగ్దానం అని తెలుస్తుంది.
పాహూని శ్రోత్యాంచీ శ్రవణోత్సుకతా | యేచ అర్థీచీ ఆణిక వార్తా | స్మరలీ జీ మజ ప్రసంగోపాత్తతా | అతి సాదరతా పరిసావీ | ||౧౯౭||
197. ఇంకా వినటానికి శ్రోతలు చూపిస్తున్న ఆసక్తిని గమనించి, దీనికి సంబంధించినదే మరొక కథ, ఇప్పుడే సరిగ్గా గుర్తుకు వచ్చింది. దానిని వినండి.
ఆహేత ఎక భక్త భావిక | నామ హరిభాఊ కర్ణీక | డహాణూ గ్రామీచే స్థాఈక | అనన్య పాఈక సాఈచే | ||౧౯౮||
198. డహాణూ అన్న ఊరిలో, సాయి పాదాల మీద విపరీతమైన భక్తిగల హరీభావూ కర్ణీక అనే అతను, ఉండేవాడు.
సన ఎకోణీసశే సతరా | పాహోని గురుపౌర్ణిమా పవిత్రా | కరూ ఆలే శిరడీచీ యాత్రా | త్యా అల్ప చరిత్రా సాంగతో | ||౧౯౯||
199. క్రి. శ. ౧౯౧౭వ సంవత్సరంలో, పవిత్రమైన గురు పౌర్ణిమ రోజు, అతను శిరిడీ యాత్ర చేశాడు. అతనికి జరిగిన చిన్న అనుభవాన్ని ఇప్పుడు చెప్తాను.
యథావిధీ పూజా ఝాలీ | దక్షిణా వస్త్రే అర్పణ కేలీ | ఆజ్ఞా ఘేఊని ఉతరతా ఖాలీ | కల్పనా ఆలీ మనాస | ||౨౦౦||
200. అనుకున్న విధంగా బాబా పూజ ముగిసాక, వస్త్రాలను, దక్షిణను సమర్పించి, బాబా అనుమతిని పొంది, వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. మెట్లనుంచి క్రిందకు దిగుతుండగా, అతనికి ఒక ఆలోచన వచ్చింది.
వాటలే ఆణీక రుపయా | వరతీ జాఊన బాబాంస ద్యావా |
తోంచ తో విచార లాగలా త్యాగావా | రుపయా ఠేవావా తైసాచ | ||౨౦౧||
201. పైకి వెళ్ళి, బాబాకు మరొక రూపాయిని ఇవ్వాలని అనిపించింది. కాని, ఆ ఆలోచనను మానుకోవాల్సి వచ్చింది. ఆ రూపాయిని తన దగ్గరే ఉంచుకున్నాడు.
జ్యా గృహస్థే8 ఆజ్ఞా దేవవిలీ | త్యానేంచ వరూన ఖూణ కేలీ | ఆతా ఎకదా ఆజ్ఞా ఝాలీ | పుఢీల పాఉలీ మార్గక్రమా | ||౨౦౨||
202. తిరిగి వెళ్ళిపోవటానికి ఒక సారి బాబా అనుమతిని ఇచ్చిన తరువాత, వెంటనే వెళ్ళి పోవాలని, తనకు బాబా దర్శనం చేయించిన మనిషి (మాధవరావు దేశపాండే) పైనుండి సైగ చేశాడు.
విశ్వాస ఠేవూనియా సంకేతీ | కర్ణీక తైసేచ పుఢే నిఘతీ | ఉతరతే ఝాలే నాశికావరతీ | మిత్రసమవేతీ మార్గాంత | ||౨౦౩||
203. ఆ సైగను పూర్తిగా నమ్మి, కర్ణీకు ముందుకు వెళ్ళిపోయాడు. దారిలో స్నేహితునితో సహా నాసికలో ఆగాడు.
కాళ్యా రామాచే దేఉళాంత | కర్ణీక జాతా దర్శనార్థ | నరసింగ మహారాజ సంత | దర్శన అవచిత జాహలే | ||౨౦౪||
204. కాలారాముని గుడిలో దర్శనానికి కర్ణీక వెళ్ళగా, అనుకోకుండా అక్కడ, నరసింగ మహారాజు అనే సాధువు దర్శనం కలిగింది.
భక్త పరివార అసతా భోంవతీ | మహారాజ అకస్మాత ఉఠతీ | కర్ణికాంస మణిబంధీ ధరితీ | రుపయా మ్హణతీ దే మాఝా | ||౨౦౫||
205. భక్తులంతా అతని చూట్టూ ఉన్నారు. అయినా, ఆ మహారాజు అకస్మాత్తుగా లేచి, కర్ణీకయొక్క చేతి మణికట్టును పట్టుకుని, ‘నా రూపాయి నాకివ్వు’ అని అడిగాడు.
కర్ణీక మనీ జాహలీ విస్మిత | రుపయా మోఠ్యా ఆనందే దేత | కైసా సాఈహీ మనోదత్త | రుపయా స్వీకారీత వాటలే | ||౨౦౬||
206. కర్ణీకుకు చాలా ఆశ్చర్యమయ్యింది. ఎంతో సంతోషంగా రూపాయిని ఇచ్చాడు. తాను ఇవ్వాలని అనుకున్న రూపాయిని, సాయియే ఇలా తీసుకున్నారని తృప్తి పడ్డాడు.
సాఈ స్వీకారిత హేంహీ న సాచ | ధ్యానీ మనీంహీ నసతా తసాచ | ఖేంచూన బలాత్కార తే మాగత | తైసీచ హీ మాత జాహలీ | ||౨౦౭||
207. సాయి తీసుకున్నారని అనడం కూడా సరి కాదు. ఎందుకంటే, ఆ ఆలోచనే మన మనసులో లేనప్పుడు, సాయి బలవంతంగా లాక్కుంటారు. ఇక్కడ అదే జరిగింది.
మన హే సంకల్ప వికల్పాత్మక | తరంగావర తరంగ అనేక | సత్కృద్దర్శనీ భావీ ఎక | ప్రసంగీ ఆణిక కల్పనా | ||౨౦౮||
208. అనుకోవటం, అనుమానాలు, వీటన్నిటికీ చోటు మన మనసు. అక్కడ ఎన్నో ఆలోచనల అలలు ఒకటి పైన మరొకటి లేస్తుంటాయి. ఏదైనా అనుకుని, అలాగే చేద్దాం అని అనుకునే లోపల, వెంటనే ఇంకొక ఆలోచన వస్తుంది.
ఆరంభీ చిత్తీ ఉఠే జీ లహరీ | మాత్ర తీ సద్వృత్తీ అసావీ బరీ | హోఈల తియేచాచ పరిపోష జరీ | కల్యాణకారీ తీ ఎక | ||౨౦౯||
209. కాని, మొదట వచ్చిన ఆలోచననే, అది మంచిదైనప్పుడు, పోషిస్తే, అది మేలు చేస్తుంది.
తియేచేంచ అనుసంధాన | దృఢాభ్యసన నిదిధ్యసన | హోఊ న ద్యావే మనా విస్మరణ | రాఖావే వచన ప్రయత్నే | ||౨౧౦||
210. దానినే మనసు చక్కగా లోతుగా ఆలోచించి, దానినే ధ్యానించి, మరల మరల తలచుకుంటూ ఉండాలి. దానిని మరచి పోకూడదు. చెప్పిన మాటను నిలబెట్టుకోవటానికి, ఎంత కష్టమైనా, ప్రయత్నం చేయాలి.
ఆప్పాసాహేబ బోలూన గేలే | పుఢే మాగే అసతే విసరలే |
బోల ఉఠతాంచ పురవూన ఘేతలే | నవల దర్శవిలే భక్తీచే | ||౨౧౧||
211. ఆప్పాసాహేబు చెప్పిన మాటను, కొంత కాలం తరువాత మరచిపోయేవాడేమో. కాని, బాబా అతని కోరికను తీర్చి, భక్తియొక్క అద్భుతాన్ని ప్రపంచానికి చూపించారు.
నాహీ తరీ త్యా ఫకిరాపాశీ | నోటీ సమవేత ఎకోనవింశీ9 | అసతా నఊీచ కా దిధలే ఆప్పాంశీ | హోతీ అసోసి దహాచీచ | ||౨౧౨||
212. ఫకీరు దగ్గర పది రూపాయల నోటుతో పాటు మొత్తం ౧౯ రూపాయలుండగా, అతడు ఆప్పాకు తొమ్మిది రూపాయలను మాత్రమే ఎందుకు ఇచ్చాడు? అంటే, ఆప్పాకు, పది రూపాయలకంటే తక్కువ కాకుండా, ఇవ్వాలని ఉండేది.
జయాస బాబాంచా లాగలా కర | తో హా నఊ పుతళ్యాంచా హార | నవవిధ భక్తి ప్రేమ నికర | స్మరణ ప్రకార బాబాంచా | ||౨౧౩||
213. బాబా చేతి స్పర్శ తగిలిన ఆ తొమ్మిది బంగారు నాణెముల హారం, నవ విధ భక్తి ప్రేమలను గుర్తు చేయటం బాబా పద్ధతి.
దేహ విసర్జన కథా ఏకతా | స్వయే బాబా నిజదేహ త్యాగితా | కళూన యేఈల అభినవ దానతా | నవదాన10 దేతా తే సమయీ | ||౨౧౪||
214. దేహాన్ని వదిలి పెట్టే సమయంలో, వారు స్వయంగా, తొమ్మిది రూపాయలను దానంగా ఇచ్చిన కథను వింటే, బాబాయొక్క వింతైన దానం పద్ధతి అర్థమౌతుంది.
దిధలా కాయా వాచా మనే | ఎకచి రుపయా కుటుంబానే | స్వీకారిలా అతి సంతుష్టపణే | అధిక మాగణే నవ్హతే తై | ||౨౧౫||
215. మనసుతో, మాటతో మరి చేతితో ఆప్పా భార్య ఒకే రూపాయిని ఇచ్చినప్పుడు, ఫకీరు తృప్తిగా తీసుకున్నాడు. మరల అడగలేదు.
పరి తే నిజ కుటుంబాచే దేణే | ఆప్పాంచే మనాస వాటలే ఉణే | మీ అసతో తర దేతో దశగుణే | ఫకీరా కారణే తేవ్హాంచ | ||౨౧౬||
216. కాని, తన భార్య ఇచ్చినది తక్కువ అని, ఆప్పా మనసుకు అనిపించింది. ‘నేనైతే అప్పటికప్పుడే దాని పదింతలు ఇచ్చేవాణ్ణి’ అని అనుకున్నాడు.
ఏసే ఆప్పా జై వాచా దత్త | దహా రుపయే దేతో మ్హణత | తే సంపూర్ణ న దేతా వచననిర్ముక్త | హోతీల ఋణముక్త కైసే తే | ||౨౧౭||
217. ఆప్పా అలా పది రూపాయలు ఇస్తానని అనిన మాటకు కట్టుబడి ఉన్నప్పుడు, వానిని ఇవ్వక పోతే, ఆడిన మాట తప్పినట్టయి, ఋణంనుండి ఎలా ముక్తుడు కాగలడు?
ఫకీర నవ్హతా హా ఇతరాంపరీ | హా కాయ కోణీ హోతా భికారీ | కాంహీహీ పడతా జయాచే కరీ | జాఈల మాఘారీ పరతోన | ||౨౧౮||
218. ఆ ఫకీరు మిగతా వారిలా కాదు. చేతిలో ఏదో డబ్బు పడగానే, వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి అతనేమైనా బికారియా?
జాహలే నవ్హతే దివసగత | బోలల్యాచ దిశీ మాగతా యేత | పరి తే కోణీహీ ఫకీర అపరిచిత | మ్హణూన సాశంకిత ఆప్పా తై | ||౨౧౯||
219. కాని, రోజు గడవక మునుపే, అదే రోజు మరల వచ్చాడు. ‘ఎవరో తెలియని ఫకీరు’ అని ఆప్పా అనుకున్నాడు.
ఆరంభీ మాగణే కరితే వేళీ | సహా రుపయే హోతే జవళీ | పరి తీ రక్కమ హాతా వేగళీ | తదర్థ కేలీ నా త్యాంనీ | ||౨౨౦||
220. ఫకీరు వచ్చి, చేయి చాచినప్పుడు, ఆప్పా దగ్గర ఆరు రూపాయలు ఉన్నాయి. కాని అన్నిటినీ ఒకే మారు ఇవ్వలేదు.
అసో ఆప్పాంవరీ ప్రేమ నసతే | ఫకీర వేషే బాబా కా యేతే |
జరీ దక్షిణేచే మిష న కరితే | కథేస యేతే రస కైచే | ||౨౨౧||
221. ఆప్పాపై బాబాకు ప్రేమ లేకపోతే, ఫకీరు వేషంలో ఎందుకు వచ్చేవారు? దక్షిణ అనే సాకుతో కాకపోతే, ఈ కథ ఇంత రసవత్తరంగా ఉండేదా?
ఆప్పాసాహేబ కేవళ నిమిత్త | తుమ్హా ఆమ్హా ఎకచ గత | జరీ ఆరంభీ గోడ హేత | ప్రసంగీ ఆచరిత ప్రసంగాసమ | ||౨౨౨||
222. ఆప్పాసాహేబు నిమిత్త మాత్రుడు, అంతే. మీది, మాది, మనందరి పద్ధతి కూడా ఇలాగే ఉంటుంది. ఎంతో పెద్ద పెద్ద ఆలోచనలతో ఏదో చేయాలని అనుకుంటాము. కాని, అది చేయాల్సిన సమయం వచ్చినప్పుడు, అనుకున్నది చేయలేక, సందర్భాన్ని బట్టి పనులను చేస్తాము.
ఆపణ సర్వ వాగ్దానీ తత్పర | దాన కాళీ శంకా ఫార | జీవ హోఈ ఖాలీంవర | నిశ్చితతా తర దుర్లభ | ||౨౨౩||
223. మనమంతా ఎన్నో వాగ్దానాలను చేస్తాం. దానం చేసేటప్పుడు, ఎన్నో అనుమానాలు కలిగి, ప్రాణం క్రిందా మీదా అవుతుంది. అనుకున్నది చేయటమనేది చాలా అరుదు.
తథాపి హిత ఆణి మిత బోలేల | బోలా ఏసేంచ జో వాగేల | ఖరే కరూన దావీ నిజ బోల | ఎకాదాచ లాల హరీచా | ||౨౨౪||
224. తక్కువగా మాట్లాడుతూ, అందరి మేలు కోరుతూ, తాము అన్న ప్రకారం నడుచుకునే వారు, తమ మాటను నిజంగా చేసి చూపించగలిగే, హరియొక్క ప్రియమైన కుమారులు, ఎక్కడో ఒకరు ఉంటారు.
అసో జో భక్త అనన్యభావిక | జో జో జే జే అర్థీ కాముక | అసో ఏహిక వా ఆముష్మిక | సాఈ ఫలదాయక సమర్థ | ||౨౨౫||
225. సాటిలేని భక్తి భావంతో ఉండే భక్తుల కోరికలను, అవి ఈ లోకానికి సంబంధించినవి కాని లేక పరలోకానివి కాని, సాయి సమర్థులు వానిని తీరుస్తారు.
జరీ హే ఆప్పాసాహేబ హుషార | ఆంగ్లవిద్యా విభూషిత చతుర | ఆరంభీ చాళీస టికల్యాచ పగార | దేతసే సరకార తయాంతే | ||౨౨౬||
226. ఆప్పాసాహేబు ఆంగ్ల విద్య నేర్చుకున్నవాడు. చాలా తెలివిగలవాడు. అయినా, ప్రభుత్వం మునుపు అతనికి నలభై రూపాయల జీతం మాత్రమే ఇచ్చేది.
తే పుఢే హీ ఛబీ లాధతా | హళూ హళూ వాఢూ లాగతా | చాళిసాంచ్యా బహు గుణే వరతా | పగార ఆతా ఝాలాసే | ||౨౨౭||
227. బాబా పటం దొరికిన తరువాత, క్రమక్రమంగా జీతం పెరిగి, ఆ నలభైకంటే ఎన్నో రేట్లు పెరిగింది.
ఎకచియా దశగుణే దేతా | దశగుణే అధికార దశగుణే సత్తా | హాతో అనుభవ హాతో హాతా | సకళాం దేఖతా బాబాంచా | ||౨౨౮||
228. మనమిచ్చిన దానికి పదింతలు బాబా ఇస్తారు. పదింతల అధికారం, పదింతల సత్తా. ఇది బాబా దగ్గర అందరికీ ఎప్పుడూ కలిగే అనుభవం.
శివాయ పరమార్థాచీ దృష్టీ | వాఢీస లాగే నిష్ఠేచ్యా పోటీ | హీ కాయ ఆహే సామాన్య గోఠీ | విచిత్ర హాతోటీ బాబాంచీ | ||౨౨౯||
229. పైగా, ఇలాంటి దృఢమైన నమ్మకంతో, పరమార్థం వైపు గమనం పెరుగుతుంది. ఇది ఏమైనా సామాన్యమైన సంగతా? బాబా లీలలు అద్భుతమైనవి.
పుఢే ఆప్పాసాహేబ మాగతీ | ఫకీరానే దిలేలీ విభూతీ | పాహూ జాతా తీ పుడీ హోతీ | ప్రేమే పాహతీ ఉఘడూన | ||౨౩౦||
230. తరువాత, ఫకీరు ఇచ్చిన విభూతి పొట్లాన్ని, భక్తిగా, ఆప్పా తెరచి చూశాడు.
ఉదీ సమవేత పుష్పే అక్షతా | పుడీ మాజీ నిఘాలీ తత్వతా |
తాఈత బనవూన అతిపూజ్యతా | బాంధిలీ నిజహస్తా మాఝారీ | ||౨౩౧||
231. ఆ పొట్లంలో ఉదీతో పాటు పూలు, అక్షింతలూ ఉన్నాయి. వానిని ఒక తాయతులో ఉంచి, ఎంతో పూజ్య భావంతో, దానిని చేతికి కట్టుకున్నాడు.
పుఢే బాబాంచే దర్శన ఘేతా | స్వయే బాబాంనీ జో దిధలా హోతా |
తో కేసహీ అతి ప్రేమళతా | ఘాతలా తాఇతా మాఝారీ | ||౨౩౨||
232. తరువాత, బాబా దర్శనం చేసుకున్నప్పుడు, బాబా స్వయంగా ఇచ్చిన తమ వెంట్రుకను కూడా తన తాయత్తులో భద్రపరచుకున్నాడు.
కాయ బాబాంచ్యా ఉదీచే మహిమాన11 | ఉదీ శంకరాచేంహీ భూషణ |
భావే భాళీ కరీజో చర్చన | విఘ్ననిరసన తాత్కాళ | ||౨౩౩||
233. బాబాయొక్క ఉదీకి ఎంత గొప్ప మహిమ ఉందో! ఉదీ శంకరునికి భూషణం. భక్తిగా నొసటన రుద్దుకుంటే, ఉన్న అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయి.
కరూని ముఖమార్జన స్నాన | కరీ జో నిత్య ఉదీ విలేపన |
చరణ తీర్థ సమవేత పాన | పుణ్య పావన హోఈల తో | ||౨౩౪||
234. తెల్లవారి చేసే పనులను చేసి (స్నానాదులు), ప్రతి రోజూ ఉదీని రాసుకుని, బాబా పాద తీర్థంతో పాటు తీసుకుంటే, పవిత్రత, పుణ్యం కలుగుతాయి.
శివాయ యా ఉదీచా విశేష | సేవితా హోఈల పూర్ణాయుష |
హోఈల పాతక నిరసన అశేష | సుఖ సంతోష సర్వదా | ||౨౩౫||
235. అంతే కాదు, ఉదీ గొప్పతనం ఏమిటంటే, రోజూ ఉదీని తీసుకుంటే, పూర్ణాయువు కలుగుతుంది. అన్ని పాపాలూ నశించి, ఆనందం, తృప్తి ఎల్లప్పుడూ ఉంటాయి.
ఏసే యా గోడ కథామృతాచే పారణే | సాఈనే కేలే ఆప్పాంకారణే |
తేథ ఆపణ ఆగంతుక పాహుణే | యథేష్ట జేవణే పంక్తీస | ||౨౩౬|
236. ఇలా, ఆప్పా సాకుతో, అమృతంలాంటి ఈ కథతో సాయి మనకు అద్భుతమైన విందును వడ్డించారు. ఆ విందు పంక్తిలో, మనము పిలవని అతిథులం కనుక, మనస్సు తృప్తి చెందేవరకు ఆరగిద్దాము.
పాహుణే అథవా ఘరధనీ | ఉభయాంసి ఎకచి మేజవానీ |
ప్రపంచ నాంహీ రసాస్వాదనీ | స్వానంద భోజనీ వ్హా తృప్త | ||౨౩౭||
237. అతిథులు కాని, ఇంటి యజమాని కాని, అందరికీ ఒకటే విందు. తీయదనంలో కాని రుచిలో కాని, ఏ తేడా లేదు. ఆత్మకు ఆనందాన్నిచ్చే ఈ విందును ఆరగించి, తృప్తులవ్వండి.
హేమాడ సాఈ చరణీ శరణ | పురే ఆతా హే ఇతుకేంచ శ్రవణ |
పుఢీల అధ్యాయీ హోఈల కథన | యాహూన మహిమాన ఉదీచే | ||౨౩౮||
238. హేమాడు సాయి పాదాలలో శరణుజొచ్చుచున్నాడు. ఇంతవరకు విన్నది చాలు. తరువాతి అధ్యాయంలో, ఇంతకంటే గొప్పగా ఉన్న ఉదీ మహిమను చెప్పుతాను.
ఉదీ చర్చన సాఈ దర్శన | హాడ్యావ్రణ నిర్మూల నిరసన |
నారూ నివారణ గ్రంథిజ్వర హరణ | అవధాన పూర్ణ పరిసావే | ||౨౩౯||
239. ఉదీని రాసుకుని, సాయిని దర్శించినంతనే, ఎముకలలోని వ్రణం నిర్మూలనం కావటం, నారు కురుపు నివారణం, గ్రంథి జ్వరం తొలగి పోవటం ఎలా జరిగింది అనే దానిని శ్రద్ధగా వినండి.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | ఉదీప్రభావో నామ |
| త్రయస్త్రింశత్తమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ:
1. పత్తా.
2. అశాచ బాబతీత రా. హరీ సీతారామ దీక్షిత యాంనీ టిపూన ఠేవలేలే అనుభవ - ఎకదా బాపూసాహేబ జోగాంనా వించూ చావలా. త్యా వేళేలా సుమారే రాత్రీచే ఆఠ వాజలే హోతే. తే తాబడతోబ మహారాజాంకడే గేలే. పాయరీ చఢత అసతానాచ మహారాజ మ్హణాలే, “బాపూసాహేబ కాయ ఆహే?” బాపూసాహేబ మ్హణాలే, “బాబా మలా వించూ చావలా.” మహారాజ మ్హణాలే, “బరే హోఈల జా!” బాపూసాహేబ తసేచ పాయరీవరూన పరత ఫిరలే, తే కంపాఊండచ్యా బాహేర గేలే నాహీత, తోచ వేదనా అజిబాత బంద ఝాల్యా.
శిరడీస ఎక కర్పపిశాచ్చ సాధ్య కరూన ఘేతలేలే జ్యోతిషీబువా గేలే హోతే. తే మహారాజాంచ్యా దర్శనాలా గేలే; పణ త్యాంచే లక్ష పైశాంకడే బరేచ హోతే. తేథే త్యాంనా పైసే మిళణ్యాచా ఫారసా సంభవ వాటలా నాహీ; మ్హణూన తే దర్శన ఘేఊన లవకరచ రాహాత్యాస గేలే. తేథే రాత్రీ త్యాంనా వించూ చావలా. ఫార వేదనా హోఊ లాగల్యా. తేవ్హా త్యాంనీ మహారాజాంనీ దిలేలీ ఉదీ లావలీ వ ఎకసారఖే మహారాజాంచే నామస్మరణ చాలూ కేలే. త్యాముళే వేదనా థాంబల్యా వ త్యాంచీ మహారాజాంవర శ్రద్ధా బసలీ. దుసర్యా దివశీ జోశీబువా పరత శిరడీస గేలే. తేథే త్యాంచే పంధరా-వీస దివస రాహణే ఝాలే వ మహారాజాంచ్యా కృపేనే త్యాంనా తేథే జవళ జవళ తీనశే రుపయే మిళాలే.
3. కై. నారాయణ గోవింద చాందోరకర యాంస.
4. రస్త్యాత.
5. ఉత్సాహాచ్యా ఓఢీనే.
6. యా కథేస.
7. అగాధ.
8. మాధవరావ దేశపాండే.
9. ఎకోణీస.
10. నఊ రుపయాంచే దాన, సౌ. లక్ష్మీబాఈలా కేలే తే.
11. యా ఉదీచ్యా మహత్త్వాచా ఆణఖీ ఎక దాఖలా రా. హరీ సీతారామ దీక్షిత యాంనీ టిపూన ఠేవలేలా ఆహే త్యాచా ఉతారా -
“పార్ల్యాస పంజాబ్యాచ్యా చాళీత ఖిమజీ లాలజీ జోశీ యా నావాచే గృహస్థ రాహత హోతే. త్యాంచీ ములగీ బరేచ దివస ఆజారీ హోతీ. ఎకే దివశీ తీ అత్యవస్థ ఝాలీ. తేవ్హా తిచీ ఆఈ ఆమచ్యా ఘరీ యేఊన మహారాజాంచీ ఉదీ ఘేఊన గేలీ. త్యా ఉదీనే తిలా తాబడతోబ థోడా గుణ ఆలా. పుఢే ఖిమజీ ములీలా వ బాయకోలా ఘేఊన శిరడీస గేలే. ములగీ ఇతకీ అశక్త హోతీ కీ, తిలా చాలవత నవ్హతే. హాతా-పాయాంచ్యా అగదీ కాడ్యా ఝాల్యా హోత్యా. తిలా ఎకా మాణసానే ఉచలూన మహారాజాంజవళ నేఊన బసవిలే. మహారాజాంనీ తిలా ఉదీ లావిలీ వ ఆశీర్వాద దిలా. దోన-చార దివసాంత తీ ఆపల్యా పాయాంని చాలూ లాగలీ. మాత్ర, ఉఠతా-బసతా తిలా త్రాస హోత అసే. మగ తినే మహారాజాంకడే త్యాబద్దల గార్హాణే కేలే. మహారాజాంనీ తిలా ఎక ఫళ ఖావయాస దిలే వ తేవ్హాపాసూన తిచీ ఉఠణ్యాచీ అడచణహీ దూర ఝాలీ.
మాఝే ఎక మిత్ర ఎక దివస మాఝా ఆఫిసాత ఆలే వ మ్హణూ లాగలే, “ఆజ ఆఠ దివస మలా ఝోప యేత నాహీ. డాక్టరాంచే ఔషధ ఘేత అసతో; పణ కాహీ ఉపయోగ హోత నాహీ.” మీ త్యాంనా మహారాజాంచీ ఉదీ దిలీ వ తీ తీన దివస ఘేణ్యాస సాంగితలే. దుసర్యాచ దివశీ తే మాఝ్యా ఆఫిసాత ఆలే వ మ్హణూ లాగలే, “కాల రాత్రీ మీ ఉదీ ఘేతలీ వ మలా రాత్రభర ఫార ఉత్తమ ఝోప లాగలీ”.
తసేచ, వాంద్రే యేథే రాహణ్యా మాఝ్యా ఎక స్నేహ్యాచ్యా ములాలా దోన మహినే ఝోప యేత నవ్హతీ. త్యాచ్యా బాపానే త్యాస శిరడీస మహారాజాంచ్యా దర్శనాస నేలే. త్యాచ రాత్రీ త్యాలా ఝోప ఆలీ వ తేవ్హాపాసూన రోజ రాత్రీ ఝోప యేఊ లాగలీ.