శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౩౨ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
ఆతా పూర్వాధ్యాయీ కథన | పావలా విజయానంద నిర్వాణ |
బాళకరామహీ నిజానందలీన | సాఈచరణ సంనిధ | ||౧||
1. పోయిన అధ్యాయంలో, విజయానందు చనిపోవడం గురించి, సాయి పాదాలలో బాళకరాం ఆత్మానందంలో లీనమై పోవటం,
ఉభయతాంహీ అర్పిలే శరీర | దృష్టీసమోర సాఈచ్యా | ||౨||
2. అలాగే, తాత్యాసాహేబు నూల్కరు, మరియు గొప్ప భక్తుడైన మేఘా, వీరిరువురూ సాయి ఎదుట దేహాలను వదలటం,
యాహూన మోఠా చమత్కార | వ్యాఘ్రాసారిఖా ప్రాణీ క్రూర | తయాచాహీ నిధనప్రకార | పరిసిలా సవిస్తార శ్రోత్యానీ | ||౩||
3. వీటన్నిటికంటే గొప్ప చమత్కారం, పులిలాంటి కౄర ప్రాణి కూడా చనిపోయిన విధానాన్ని, శ్రోతలు వివరంగా విన్నారు.
ఆతా సాంప్రత అధ్యాయాంత | స్వయే బాబాంచ్యా ముఖే వర్ణిత | ఏసా గోడ కథితో వృత్తాంత | శ్రోతయా అత్యంత హితకారీ | ||౪||
4. ఈ అధ్యాయంలో ఇప్పుడు, బాబా స్వయంగా చెప్పిన అద్భుతమైన సంగతిని, వారి మాటలలోనే, చెప్పుతాను. వినేవారికి ఇది ఎంతో మేలు చేకూరుస్తుంది.
అసతా ఎకదా బాబా వనాంత | ఝాలే గురుదర్శన అకల్పిత | కైసీ గురూచి కరణీ అద్భుత | పరిసా తే చిత్త దేఊని | ||౫||
5. ఒక సారి, బాబా అడవిలో ఉండగా, అనుకోకుండా, గురువు దర్శనమైంది. గురువుయొక్క అద్భుతమైన పనుల గురించి, శ్రద్దగా వినండి.
యా కథేచీ పరమ నవలాఈ | వానూ మీ పామర కితీ కాఈ | భక్తిశ్రద్ధాముక్తిదాఈ | స్వముఖే సాఈ వదలే జీ | ||౬||
6. సాయి స్వయంగా తమ నోటినుండి చెప్పిన, భక్తిని పెంచే ఈ కథయొక్క ప్రత్యేకతను, పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించగలను? ఈ కథ శ్రద్ధా భక్తి, ముక్తిని ప్రసాదిస్తుంది.
తైసేంచ ఎకా బాఈచే మన | హోతా ఘ్యావే బాబాంచే దర్శన | వసావే తేథే దివస తీన | రహావే నిరశన వ్రతస్థ | ||౭||
7. బాబాను దర్శించుకుని, శిరిడీలో మూడు రోజుల ఉపవాస వ్రతం చేయాలని, ఒక స్త్రీ తన మనసులో అనుకున్నది.
కైసా తియేసీ ఆణీలా ప్రసంగ | కైసా కరవిలా నిర్ధారభంగ | కైశా పురణపోళియా సురంగ | కరవిల్యా ఖమంగ తిజకరవీ | ||౮||
8. కాని, ఒక మంచి అవకాశాన్ని కల్పించి, ఆమె నిశ్చయాన్ని మార్చి, ఆమెచే కమ్మని బొబ్బట్లను బాబా ఎలా చేయించారు?
పోళ్యా కేవళ నాహీ కరవిల్యా | యథేచ్ఛ తిజకరవీ ఖావవిల్యా | పరకార్యార్థ దేహ ఝిజవిల్యా | సార్థకీ లావిల్యా హే శ్రేయ | ||౯||
9. బొబ్బట్లను చేయించడమే కాదు, ఆనందంతో ఆమె తన ఇష్టం కొద్దీ తినేలా చేశారు. ఎదుటి వారి సేవలో శరీరాన్ని శ్రమించి, జన్మను సార్థకం చేసుకోవటమే మంచిదని, బాబా ఆమెకు చెప్పారు.
యాంతచి ఆహే పరమ కల్యాణ | ఉపాసాహూన అనేక గుణ | కైసే తిజలా దిలే ఠసవూన | కధీంహీ విస్మరణ న ఘడేసే | ||౧౦||
10. ఉపవాస వ్రతం వలన కలిగే మేలుకంటే, ఎదుట వారికి సాయపడటం ఎంతో మంచిదని, ఎన్నటికీ మరచి పోన్నట్లు, బాగా తెలియచేశారు.
తైసేంచ జయా పరమార్థీ ఆవడ | కైసా కరావా అభ్యాస దృఢ |
కరావే కైసే సాహస అవఘడ | సాధాయా జోడ నిత్యాచీ | ||౧౧||
11. అలాగే, పరమార్థం అంటే ఇష్టం ఉన్నవారు, ఎలా దృఢమైన మనసుతో సాధన చేయాలి? అన్నిటికంటే గొప్పదైన, ఎప్పటికీ ఉండే మంచి కోసం, కష్టమైన సాహసం ఎలా చేయాలి?
యే అర్థీంచా కథానుక్రమ | అమృతాహూనహీ గోడ పరమ | శ్రోతయా ఉపజేల భక్తిప్రేమ | దుఃఖాచా ఉపరమ హోఈల | ||౧౨||
12. వీటి గురించిన కథలు, అమృతం కంటే చాలా మధురం. ఇవి వినేవారికి, భక్తి ప్రేమలను కలిగించి, దుఃఖాన్ని తొలగిస్తాయి.
ఆతా యేథోని కథా గోడ | శ్రవణార్థియాంచే పురేల కోడ | వక్త్యా శ్రోతయా స్వానందజోడ | పురేల హోడ శ్రవణాచే | ||౧౩||
13. ఇక ఇప్పటినుండి, వినేవారి కోరికలను తీర్చి, చెప్పేవారికి, వినేవారికి ఇరువురికీ ఆనందాన్ని, తృప్తినీ కలిగించే, మధురమైన కథ చెప్పబడుతుంది.
ప్రేమభరిత అలౌకిక | వదవితీల సాఈకథానక | మజ పామరా మూర్ఖా దేఖ | లిహితాంహీ కౌతుక పదోపదీ | ||౧౪||
14. అలౌకికము, ప్రేమతో నిండినవి అయిన కథలను, పామరుణ్ణి, మూర్ఖుణ్ణి అయిన నాచే బాబా చెప్పిస్తున్నారు. వీనిని వ్రాస్తున్నప్పుడు కూడా, అడుగడుగునా ఎంతో ఉత్సాహం ఉంటుంది.
జేవీ గంగాదర్శనే పాప | అథవా చంద్రాచ్యా దర్శనే తాప | తేవీ సాఈముఖీంచే ఆలాప | పాప - సంతాప - హారక | ||౧౫||
15. గంగానది దర్శనంతో పాపం, చంద్రుని దర్శనంతో తాపం తొలగిపోయేలా, సాయి నోటినుండి వెలువడిన మాటలు, పాపాలను తాపాలను తొలగిస్తాయి.
ఆతా ఆపణ శ్రోతేజన | కరా శ్రవణార్థీ సాదర మన | మహారాజ సాఈఃముఖీంచే వచన | నిజగురూదర్శనకారక | ||౧౬||
16. తమకు గురువు దర్శనం ఎలా కలిగింది, అని స్వయంగా సాయి మహారాజే చెప్పిన మాటలను, శ్రోతలారా, భక్తి శ్రద్ధలతో వినండి.
జరీ వేదవేదాంగ అధ్యయన | కేలే శ్రుతిశాస్త్ర పారాయణ | గురుకృపేవీణ నాహీ జ్ఞాన | ఇతర తో శీణ కేవళ | ||౧౭||
17. వేద, వేదాంగాలను చదివినా, శ్రుతి శాస్త్రాలు పారాయణాలు చేసినా, గురువు అనుగ్రహం లేకుంటే, జ్ఞానం లభించదు. వేరే సాధనలన్నీ అనవసరంగా కష్ట పడటం మాత్రమే.
అవ్యక్తాది స్థావరాంత | హా సంసారవృక్ష అతి విస్తృత | జన్మమరణ శోకాకులిత | దృష్టజాత నాశివంత | ||౧౮||
18. అతి విశాలమైన సంసారమనే ఈ చెట్టు, మొదట కనిపించకుండా, తరువాత కనిపించి, కళ్ళతో చూడగలిగేది, ఎంతో బాధాకరమైన చావు పుట్టుకలతో కూడుకున్నది. అయినా, దీనిని నాశనం చేయవచ్చు.
ఛేద ఆణి నాశయుక్త | మ్హణోని యాతే వక్ష వదత | తో హా అవ్యక్త స్థావరాంత | వృక్షోపమిత సంసార | ||౧౯||
19. నరకబడేది, నశించిపోయేది కనుక, దీనిని చెట్టు అని అంటారు. కనిపించని ఈ సంసారం, ఒక రూపం పొంది, కనిపించ సాగింది. అందుకే దీనిని చెట్టుతో పోల్చబడింది.
తో హా దృష్ట నష్టస్వరూప | ఊర్ధ్వమూళ సంసార విటప | జయాచా అపార శాఖావ్యాప | నాకళే అత్యల్ప హీ కవణా | ||౨౦||
20. కంటికి కనిపించేది, నాశమైయేది, అయిన ఈ సంసారం అనే చెట్టుయొక్క వ్రేళ్ళు, పైకి ఉంటాయి. దాని రెమ్మలు విశాలంగా, ఊహకు అందని విధంగా, వ్యాపించి ఉంటాయి.
కధీ దురూన రమణీయ వాటే | ఆలింగితా కాంటే సర్వాంగీ | ||౨౧||
21. ప్రతి క్షణానికీ ఈ రెమ్మలు ఎక్కువవుతూ ఉంటాయి. దూరంనుండి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. కాని, దగ్గరకు వెళ్ళి, కౌగలించుకుంటే, దేహమంతా ముళ్ళతో గుచ్చుకుంటాయి.
తృష్ణాజలే బద్ధపరికర | ఏసా హా తరువర సాజిరా | ||౨౨||
22. అరటి చెట్టు స్తంభం లాగ ఇది కూడా సత్తువ లేనిది. సారం లేనిది. ఎండమావులవలె, గంధర్వ నగరంవలె (అన్ని సుఖాలు గల గంధర్వ నగరాలు, ఆకాశంలో పక్షులలాగా విహరిస్తుంటాయి. అవి ఒకొక్కప్పుడు కనిపిస్తాయి, మిగతా అప్పుడు కనిపించవు), విపరీతమైన ఆశలతో, కోరికలతో బంధిస్తుంది. బయటనుండి అందంగా కనిపించే ఈ చెట్టు గొప్పతనమిది.
అవిద్యా కామ కర్మోద్భవ | అవ్యక్త బీజామాజీ ప్రభావ | జో ప్రతిక్షణ అన్యథా స్వభావ | అసతా అభావాత్మక స్వయే | ||౨౩||
23. తప్పుడు కోరికలవలన చేసే పనులనుండి పుట్టిన ఈ చెట్టు, కనిపించని విత్తనుండి పుట్టినది. తనకు తానుగా ఏ ఉనికీ లేకున్నా, ప్రతి క్షణం వేరువేరు స్వభావాలతో కనిపిస్తూ ఉంటుంది.
అనర్థాత్మక హా ఠాయీంచా | అవిద్యేపోటీ జన్మ యాచా | ఈషణాతృష్ణాది పాణియాచా | సాంఠా తయాచ్యా సభోంవతీ | ||౨౪||
24. అజ్ఞానం వలన పుట్టి, విపరీతమైన కోరికలు, ఆశలతో కప్పబడి ఉంది, కనుక, ఇది చాలా అనర్థాలను కలిగిస్తుంది.
ధనధాన్య పుత్రదారా | పరిగ్రహాచా జయా పసారా | దేహబుద్ధీముళే యా థారా | తయా ఆధారా తో వర్తే | ||౨౫||
25. మనిషి బుద్ధికి స్వాభావికంగా, సంసారం ముఖ్యమైనది కనుక, ఈ జీవనమనే చెట్టులో ధనధాన్యాలు, భార్యాబిడ్డలు, పరివారం మొదలైనవి చోటు చేసుకుంటాయి.
అనంత ప్రాణీ లింగభేద | హేచ జయా వృక్షాచే స్కంధ | కర్మవాసనాది పారంబ్యా నిర్బంధ | తేణే హా సబంధ ఫోఫావే | ||౨౬||
26. ఆడా మగా తేడాలతో పుట్టే ఎన్నో ప్రాణులు, ఈ చెట్టుకు రెమ్మలు. కోరికలు, వాని కోసం చేసే పనులనే వ్రేళ్ళు క్రిందికి పాకుతూ, ఈ చెట్టును అడ్డగిస్తాయి. అయినా ఈ చెట్టు పెరుగుతూ ఉంటుంది.
శ్రుతిస్మృత్యాది పత్రీ జో భరలా | శబ్దస్పర్శాది పల్లవీ తరతరలా | యజ్ఞదాన క్రియాకుసుమీ డవరలా | రసరసలా జో ద్వంద్వరసీ | ||౨౭||
27. శ్రుతి, స్మృతిలనే ఆకులతో నిండి, మాట, స్పర్శ అనే చిగుళ్ళతో నిగనిగలాడుతూ, యజ్ఞం, దానం మొదలైన పనులనే పువ్వులతో శోభిస్తూ, సుఖ దుఃఖాలనే విరుద్ధ భావాల రసంతో ఈ చెట్టు నిండి ఉన్నది.
అంత నాహీ యాచియే ఫళా | ఉపజీవికాభూత హా సకళా | భూర్భువాది లోక హా సగళా | యయావేగళా రాహీనా | ||౨౮||
28. దీనికి అంతు లేని పళ్ళు. అన్నింటికీ, అందరికీ ఇదే జీవనాధారం. ఈ చెట్టు లేకుండా భూమి, ఆకాశం మొదలైనవి ఏవీ లేవు.
కధీ నృత్య గీత వాదన | కధీ క్రీడా హాస్య రుదన | ఏసా హా అశ్వత్థ సనాతన | అధోవదన సర్వదా | ||౨౯||
29. ఒకప్పుడు నాట్యాలు, పాటలు, వాద్యాలతో; మరొకప్పుడు నవ్వు లేదా ఏడుపులతో; ఆటలతో, ఎంతో ప్రాచీనమైన ఈ అశ్వత్థ చెట్టు, ఎప్పుడూ తల దించుకునే ఉంటుంది.
శబల బ్రహ్మీ ఆవిర్భవ | అసంగ శస్త్రే జయాతే అభావ | శుద్ధమూలాధార జో సద్భావ | జ్యోతిస్వభావ తో జాణా | ||౩౦||
30. బ్రహ్మ పుట్టించిన మాయలో ఇది ఉంటుంది. వైరాగ్యమనే ఆయుధంతో ఇది నశిస్తుంది. ఈ చెట్టుకి శుద్ధమైన మంచి భావనే మూలం. ఎప్పుడూ వెలుగటమే దీని స్వభావం అని తెలుసుకోవాలి.
తే బ్రహ్మ సత్య సర్వాధార | జగ హే మిథ్యా స్వప్నాకార |
జయా న ఆద్యంత నిర్ధార | మధ్యేంచ వసణార కైసే తే | ||౩౧||
31. సత్యమైన బ్రహ్మే అంతటికీ ఆధారం. ఈ జగత్తు కలలాగా ఒక అబద్ధం. మొదలేది, చివరేది అని నిర్ధారించ లేనప్పుడు, దీనికి మధ్య మాత్రం ఎలా ఉండగలదు?
యదర్థ పరిశ్రమ కరితీ విరక్త | సంత సంతత జేథే అనురక్త | ముముక్షూంచే జే అపేక్షిత | జే అభీప్సిత సాధకా | ||౩౨||
32. విరక్తి పొందిన వారు, ఏది కావాలని కష్ట పడతారో; సాధువులు దేని మీద ఎప్పుడూ ఆసక్తులై ఉంటారో; పరమార్థాన్ని వెదికే వారు దేనిని కావాలని కోరుకుంటారో; దేనిని సాధకులు ఇష్టపడతారో;
అసేల ఇచ్ఛా తే ఠాయీ పడావే | తేణే సంతాశీ శరణ రిఘావే | మగ తే వదతీల తే తే ఏకావే | సమూళ వర్జావే కుతర్కా | ||౩౩||
33. ఆ ఆత్మ తత్త్వాన్ని తెలుసుకోదలచిన వారు, సత్పురుషులను శరణుజొచ్చి, అన్ని అనుమానాలనీ, వాద వివాదాలనీ విడిచిపెట్టి, వారు చెప్పినది వినాలి.
బంధూనియా మనాచీ మోట | కరూని బుద్ధీచా కడేలోట | హోఊనియా నిఃసంగ నిఫట | లక్షావే నీట గురూచరణా | ||౩౪||
34. మనసులోని ఆలోచనలన్నిటినీ కట్టిపెట్టి, అతి తెలివిని వదలి, మమకారాలను విడిచి పెట్టి, అన్ని సహవాసాలనీ తెంచుకుని, చక్కగా గురువు పాదాలనే ధ్యానించాలి.
కుతర్కాంచా కరా ఝాడా | నా తో కరితీల మార్గాంత ఝగడా | అభిమాన పాయాతళీ రగడా | తరీచ పైలతడా పావాల | ||౩౫||
35. ఎగతాళి చేసే వాద వివాదాలను వదులుకోవాలి. అవి దారిలో అడ్డు తగులుతాయి. అహంకారాన్ని అరికాలి క్రింద నలిపి వేస్తేనే, సంసార సాగరంయొక్క ఆవలి తీరాన్ని చేరుకోగలం.
యే అర్థీచీ గోడ ఆఖ్యాయికా | బాబా స్వయే వదలే తీ ఏకా | సేవితా గురువచన పీయుఖా | పరమ హరిఖా పావాల | ||౩౬||
36. ఈ సందర్భంలో, బాబా స్వయంగా చెప్పిన, ఒక మధురమైన కథను వినండి. గురువు మాటలనే అమృతాన్ని తీసుకుంటే, పరమానందాన్ని పొందగలరు.
ఎకదా ఆమ్హీ చౌఘేజణ | వాచూని పోథీపుస్తక పురాణ | కరూ లాగలో బ్రహ్మనిరూపణ | జ్ఞానసంపన్న హోఊని | ||౩౭||
37. “ఒక సారి, మేం నలుగురం, పురాణాలను, గ్రంథాలను చదివి, జ్ఞానంతో నిండిపోయామని అనుకుని, బ్రహ్మను తెలుసుకోవాలని, ప్రయత్నం మొదలు పెట్టాము.
ఉద్ధరేదాత్మనాత్మానం | హే గీతేచే ఘేఉనీ వచన | ఆయుక్త సర్వథైవ పరావలంబన | ఐసే ప్రవచన ఎక కరీ | ||౩౮||
38. ‘‘ఉద్ధరేత్ ఆత్మానాం ఆత్మానాం’ అనే గీతలో(భగవద్గీత 6: 5) చెప్పిన మాట ప్రకారం, ఇంకొకరి మీద ఆధార పడటం పనికి రాదు’ అని ఒకరు అభిప్రాయ పడ్డారు.
తయా ప్రత్యుత్తర కరీ అన్య | మన స్వాధీన తోచి ధన్య | అసావే సంకల్ప-వికల్ప-శూన్య | కాంహీ న ఆపణావీణ జగీ | ||౩౯||
39. ‘మనసును స్వాధీనంలో ఉంచుకున్న వాడే ధన్యుడు. నిర్ణయాలు, అనుమానాలు లేకుండా ఉండాలి. జగత్తులో ‘నేను’ తప్ప వేరే ఏదీ లేదు’ అని ఇంకొకరు జవాబు చెప్పారు.
అనిత్య సర్వ సవికార | నిత్య ఎక నిర్వికార | మ్హణోని నిత్యానిత్య విచార | కరా నిరంతర తిజా వదే | ||౪౦||
40. మార్పు చెందేది ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఎప్పటికీ మారదు. అందుకే, ఏది మార్పు చెందేది, ఏది చెందనిది, వీటి గురించే ఆలోచించాలి అని మూడవ వాడు అన్నాడు.
చవథ్యా నావడే పుస్తకీ జ్ఞాన | కరూ ఆదరీ విహితాచరణ |
కాయావాచా పంచప్రాణ | కరీ సమర్పణ గురూచరణీ | ||౪౧||
41. నాలుగవ వానికి, పుస్తక జ్ఞానంపై నమ్మకం లేదు. ‘శాస్త్రాలు చెప్పిన పనులను ఆచరించాలి’ అన్నది అతని నమ్మకం. ‘ఐదు ప్రాణాలను, దేహం, మాట అన్నిటినీ గురువు పాదాలకు సమర్పించాలి’ అన్నది అతని అభిప్రాయం.
ఏసా వ్హావయా నిజ నిర్ధార | నిష్ఠా అపార ఆవశ్యక | ||౪౨||
42. గురువే దేవుడు అని తెలుసుకోవటానికి, దృఢమైన, గాఢమైన నమ్మకముండాలి. అప్పుడే, కదలీ కదలని అన్నింటిలోనూ, లోపలా, బయటా, గురువే నిండి ఉన్నారని ఖచ్చితంగా తెలుసుకోవటం జరుగుతుంది.
అనాగమజ్ఞ కేవళ తర్కిక | వాదోన్ముఖ ఆణి చికిత్సక | తయా స్వప్నీంహీ జ్ఞాన సమ్యక | శుద్ధ భావిక పాహిజే | ||౪౩||
43. ప్రాచీన శాస్త్రాల జ్ఞానం పొందినవారికి, వాదానికి కాలు దువ్వే తార్కికులకు, అనుమానాలు ఉన్నవారికి, పూర్తి జ్ఞానం కలలో కూడా దొరకదు. ఇక్కడ కావలసింది శుద్ధమైన, నమ్మకమున్న భక్తి.
ఏసే ఆమ్హీ చౌఘే సుబుద్ధ | నిఘాలో లావూ1 కాంహీ శోధ | స్వబుద్ధీనేంచ వ్హావా తో బోధ | స్వతంత్ర నిర్వేధమానసే | ||౪౪||
44. ఇలా మేం నలుగురు తెలివివంతులు, బ్రహ్మను వెదుక్కుంటూ బయలుదేరాం. ‘స్వతంత్రంగా, చింతలు లేని మనసుతో, స్వయం బుద్ధితో, బ్రహ్మను తెలుసుకోవాలి’.
ఏసీ ఇచ్ఛా తిఘాంచ్యా అంతరీ | వనీ విచరతా స్వచ్ఛంద పరీ | భేటలా మార్గాంత ఎక వణజారీ2 | ప్రశ్న తో కరీ ఆమ్హాంతే | ||౪౫||
45. అని ఆ ముగ్గురి మనసులోని కోరిక. అలా అడవిలో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటే, దారిలో ఒక వణజారి జాతివాడు కలిసి,
ఊన పడలే ఆహే ప్రఖర | ప్రయాణ కిమర్థ ఆణి కుఠవర | చాలలో తయాస కేలే ప్రత్యుత్తర | వనవనాంతర ధుండాయా | ||౪౬||
46. ‘ఎండ చాలా తీవ్రంగా ఉంది. ప్రయాణం దేని కోసం, మరి ఎంతవరకు?’ అని అడిగాడు. ‘అడవిలో వెదకటానికి’ అని జవాబు చెప్పాం.
పుసే ఆమ్హాస తో వణజారీ | శోధ కశాచా లావితా తరీ | ఆమ్హీ వదతే జాహలో ఉత్తరీ | గుప్తార్థీ న బరీ పరిస్ఫుటతా | ||౪౭||
47. ‘దేనిని వెదకటానికి?’ అని ఆ వణజారీ అడగగా, ‘రహస్యంగా ఉన్నదాన్ని, బయట పెట్టడం మంచిది కాదు’ అని మేం జవాబు ఇచ్చాం.
పాహూనీ తయాంచీ ధాంవాధాంవ | వణజారియాచా కళవళలా జీవ | మ్హణే వన దుర్గమ నకళతా ఠావ | స్వేచ్ఛాస్వభావ విచరూ నయే | ||౪౮||
48. మా ఆతురతను, అటూ ఇటూ మా తిరగటాన్ని చూసి, ఆ వణజారి హృదయంలో మా మీద కనికరం పుట్టింది. ‘అడవి చాలా దట్టమైనది, లోపల వెళ్ళటానికి కష్టం కూడా. బాగా తెలియకుంటే, దాని లోపల ఇష్టం వచ్చినట్లు తిరగకూడదు.
రానీంవనీ హిండావయాస | సర్వే ఘ్యావే వాటాడియాస | భర దుపారీ ఏసే సాహస | కరితా ఆయాస కిమర్థ | ||౪౯||
49. ‘ఇలాంటి అడవులలో తిరగటానికి, ఎవరైనా దారి చూపేవాణ్ణి మీతో తీసుకుని వెళ్ళాలి. మిట్ట మధ్యాహ్నం ఈ సాహసం ఎందుకు? ఇంత శ్రమ దేనికోసం?
నకా సాంగూ గుప్తార్థ పరీ | బసా ఖా భాకర తుకడా తరీ | పాణీ ప్యా జా తదనంతరీ | రాఖా సబూరీ అంతరీ | ||౫౦||
50. ‘రహస్యమైన దానిని చెప్పకండి. కాని, కూర్చొని, కొంచెం రొట్టె తిని, నీరు తాగండి. తరువాత వెళ్ళండి. మనసులో ఓర్పు వహించండి’ అని అన్నాడు.
ఆలా జరీ ఇతుకా కాకుళతీ | ఆమ్హీ తైసేంచ నిఘాలో పుఢతీ |
ధిఃకారిలీ తయాచీ వినంతీ | థకలో కీ అతీవ మార్గాంత | ||౫౧||
51. ఎంతో కనికరంతో చెప్పినా, అతని మాటలు వినకుండా, మేము అలాగే బయలుదేరాము. దారిలో బాగా అలసి పోయాం.
ఆమ్హీ అవఘేచ బుద్ధిమాన | కాఢూ అపులా మార్గ శోధూన | వాటాడియాచే కాయ ప్రయోజన | హోతా కీ అభిమాన హా పోటీ | ||౫౨||
52. ‘మేమందరం తెలివైన వాళ్ళు కనుక, మా దారిని మేమే వెతుక్కోగలం. దారి చూపేవాడు దేనికి?’ అన్నది మా మనసులోని అహంభావం.
పరీ తే రాన అతి విస్తీర్ణ | విశాలతుంగ విటపీ3 వికీర్ణ | రిఘే న జేథే సూర్యకిరణ | మార్గక్రమణ కై తేథే | ||౫౩||
53. కాని, ఆ అడవి చాలా పెద్దదైనది. దట్టంగా చెట్లు పెరగడంతో, గడ్డి, సూర్యుని కిరణాలు కూడా రానప్పుడు, అక్కడ మాకు దారి ఎలా తెలుస్తుంది?
హోఊనియా దిశాభూల | భ్రమలో ఇతస్తతః నిర్ఫల | థోర దైవాచే తేణేంచ హే స్థళ | మాగుతీ నిశ్చల పావలో | ||౫౪||
54. ఎటునుంచి వచ్చామో మరచిపోయి, ఎటు వెళ్ళాలో తెలియక, వృథాగా అటూ ఇటూ తిరిగాము. కాని, దేవుడి దయవల్ల, బయలుదేరిన చోటుకే మళ్ళీ చేరుకున్నాం.
దైవే లావిలే ఆల్యా వాటే | పునశ్చ పూర్వీల వణజారీ భేటే | మ్హణే భరలా వాటతే అవ్హాటే4 | చాతుర్య ఆటే బుద్ధీచే | ||౫౫||
55. దైవమే పంపిందని అనిపించింది. అదే వణజారీని మళ్ళీ కలుసుకున్నాం. ‘దారి తప్పినట్లున్నారు. ఒక్కొక్కప్పుడు తెలివి ఒకటే పనికి రాదు.
కార్య సాన అథవా మోఠే | మార్గ దావాయా లాగే బోటే | శోధ న లాగే రిత్యా పోటే | బుద్ధీచే ఫాటే అఫాట | ||౫౬||
56. ‘చేసే పని చిన్నదైనా, పెద్దదైనా, దారి చూపించే వారొకరు ఉండాలి. ఖాళీ కడుపుతో, దేనినీ కనుక్కోలేము. అలాంటి పరిస్థితిలో బుద్ధి పనిచేయదు.
అసల్యావీణ ఈశ్వరీ ఘాట | మార్గీ హోఈ న కోణాచీ గాంఠ | దేఊ నయే అన్నాసీ పాఠ | వాఢిలే తాట డావలూ5 నయే | ||౫౭||
57. ‘ఈశ్వరుని ఆజ్ఞ లేనిదే, దారిలో ఎవరినీ కలవరు. వడ్డించిన భోజనాన్ని తిరస్కరించకండి. అన్నం పళ్ళాన్ని త్రోసి పుచ్చకండి.
భాకరతుకడా దేఈ కోణ | ఘే ఖా మ్హణే తయాచే వచన | మానావా పూర్ణ శుభశకున | కార్య నిర్విఘ్నకారక | ||౫౮||
58. ‘ఎవరైనా రొట్టెముక్కను ఇచ్చి, తినమని చెప్పితే, వారి మాట మంచి శకునమని, చేస్తున్న పని ఏ అడ్డంకులూ లేకుండా సాగి పోతుందని తెలుసుకోవాలి.
కరా ఆతా అల్పాహార | ధరా చిత్తీ కించిత ధీర | పరి త్యా రుచేనా హా సువిచార | పునశ్చ నిరాహార నిఘాలే | ||౫౯||
59. ‘ఇప్పుడు ఈ కొద్ది ఆహారాన్ని తీసుకోండి. మనసుకు ధైర్యం తెచ్చుకోండి’ అని చెప్పాడు. కాని అతని మంచి మాటలు నచ్చక, మళ్ళీ ఏమీ తినకుండా, బయలుదేరారు.
న లావితా శోధ కాంహీ | అన్నసేవన కరణే నాహీ | ఏసే వదూన మగ తే పాహీ | దురాగ్రహీ నాడలే | ||౬౦||
60. ‘వెదుకుతున్నది దొరికే దాకా, అన్నం తీసుకోం’ అన్న మొండి పట్టుదలతో ఆ ముగ్గురూ నష్టపోయారు.
వణజారియాచేహీ ప్రేమ అలోలిక | వాటలే కవతుక తయాచే | ||౬౧||
61. నాకు ఆకలిగా ఉంది. దాహంతో గొంతు ఎండి పోయింది. వణజారీ ప్రేమ అలౌకికం. స్వార్థం లేని అతని ప్రేమ నాకు నచ్చింది.
ఉష్ట్యా హాతే అసతా ధనిక | హాంకిలా న కాక6 ఎకానే | ||౬౨||
62. మేమంతా బాగా చదువుకున్న పండితులం. మాకు దయా దాక్షిణ్యాలు లేవు. ఎంగిలి చేత్తో కాకిని తరిమి కొట్టం.
హా తో అవిద్వాన అనధికారీ | నీచ వర్ణ జ్ఞాత వణజారీ | పరి స్వాభావిక ప్రేమ అంతరీ | భాజీ భాకరీ ఖా మ్హణే | ||౬౩||
63. కాని, ఏ చదువూ లేని, ఏ యోగ్యతా లేని, తక్కువ కులంవాడయిన ఈ వణజారి, హృదయంలో ఎంతో ప్రేమను నింపుకుని, రొట్టె, కూర తినమని అంటున్నాడు.
ఏసే లాభావీణ ప్రేమ | కరీ జో తోచ సుబుద్ధ పరమ | తయాచా ఆదర హాచి అప్రతిమ | విద్యోపక్రమ వాటలా | ||౬౪||
64. ఇలా ఏ లాభాన్నీ ఆశించకుండా, స్వార్థం లేని ప్రేమను, చూపించే వాడే, నిజమైన జ్ఞాని. అతని మాటను గౌరవించడమే, బ్రహ్మ విద్యను తెలుసుకోవటానికి సర్వోత్తమమైన దారి అని అనిపించింది.
మ్హణోనియా ఆదరపూర్వక | వణజారియానే దిధలేలా ఎక | చతకోర ఖావోని ప్యాలో మీ ఉదక | తో కాయ కౌతుక వర్తలే | ||౬౫||
65. ఎంతో గౌరవంతో అతడు ఇచ్చిన రొట్టె ముక్కను తిని, నీరు త్రాగాను. అంతే! ఏం ఆశ్చర్యం!
గురురాజ ఆలే అకల్పిత | మ్హణతీ వాదావాదీ కిమర్థ | మగ నివేదిలా ఇత్థంభూత | వర్తలా వృత్తాంత తయాంస | ||౬౬||
66. అనుకోకుండా, అక్కడ గురుమహారాజు కనిపించారు. ‘వాదోపవాదాలు దేనికోసం?’ అని అడగగా, జరిగినదంతా వారికి మనవి చేశాను.
యేతా కాయ మజసమేత | లావూని దేతో శోధ త్వరిత | పరి జో ఆదరిల మద్వచనార్థ | తయాచాచ స్వార్థ ఫళేల | ||౬౭||
67. ‘నాతో వస్తావా? నీవు వెదుకుతున్న దానిని, వెంటనే చూపెడతాను. కాని, నా మాటలను నమ్మి, నేను చెప్పినట్లు చేసే వారి కోరికే ఫలిస్తుంది’ అని చెప్పారు.
ఇతరాంనీ తే నాహీ మానిలే | పరి మ్యా శిరసా మాన్యకేలే | ఇతర సర్వ నిఘూన గేలే | మగ మజ ఘేతలే గురురాయే | ||౬౮||
68. మిగతావారు దానికి ఒప్పుకోలేదు. గురువు మాట వినకుండా వారు వెళ్ళిపోయారు. కాని, నేను వారి ఆజ్ఞను పాటించాను. తరువాత, గురువుగారు నన్ను తీసుకున్నారు.
నేలే ఎకా విహిరీవర | దోన్హీ పాయాంస బాంధిలా దోర | వరతీ పాయ ఖాలతీ శిర | పాణ్యాబరోబర సోడిలా | ||౬౯||
69. ఒక బావి దగ్గరకు తీసుకుని వెళ్ళి, నా రెండు కాళ్ళకు తాడు కట్టి, కాళ్ళు పైన, తల క్రింద ఉండేలా, నీటి పైకి వదిలారు.
పాణ్యాస పోహోంచూ నయేత హాత | పాణీహీ జాఊ నయే ముఖాంత | ఏసే మజ అలగత లోంబత | సోడిలే విహిరీంత గురురాయే | ||౭౦||
70. చేతులు నీటికి అందకుండా, నీరు ముఖంలోనికి పోకుండా, చక్కగా నన్ను బావిలో వేలాడదీశారు.
బాంధూన గేలే గురురాయ నిఃశంక | కోణా న ఠాఊక కోఠే తే | ||౭౧||
71. తాడు రెండవ కొనను, బావి పక్కనున్న ఒక చెట్టుకు బాగా కట్టి, గురువుగారు, ఏ అనుమానమూ లేకుండా, ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి అని ఎవరికీ తెలియదు.
ఘటకా గేల్యా దహా బారా | పరతలే మగ తే మాఘారా | కాఢోని బాహేర మజ ఝరఝరా | పుసలే కీ బరా ఆహేస తూ | ||౭౨||
72. పది, పన్నెండు ఘటికల తరువాత, గురువుగారు మరల వచ్చారు. చరచరా నన్ను బయటికి లాగి, ‘బాగున్నావా?’ అని అడిగారు.
మగ మ్యా దిధలే ప్రత్యుత్తర | హోతో అత్యంత ఆనందనిర్భర | భోగిలే జే సౌఖ్య అపార | తే కాయ పామర మీ వానూ | ||౭౩||
73. దానికి నేను ‘చాలా ఆనందంగా ఉన్నాను. నేను అనుభవించిన అపార సుఖాన్ని, పామరుణ్ణైన నేను ఎలా వర్ణించను?’ అని బదులిచ్చాను.
పరిసతా హే మాఝే వచన | జాహలే గురురాయ సుఖసంపన్న | నిజహస్త అంగావరీ ఫిరవూన | జవళీ రహావూన ఘేతలే | ||౭౪||
74. నా మాటలు విని గురువుగారు చాలా ఆనందించారు. తమ చేతులతో నా ఒంటిని నిమిరి, నన్ను వారి వద్ద అట్టిపెట్టుకున్నారు.
సాంగతా యేతీ ప్రేమాచే ఉమాళే | మగ మజ నేలే గురునే శాళే | పక్షిణీ పిలియా పాంఖీ కవళే | మజలాగీ కళవళే తే రీతీ | ||౭౫||
75. ఇదంతా చెబుతూ ఉంటేనే, నాలో ప్రేమ ఉప్పొంగి పోతుంది. తరువాత, గురుమహారాజు నన్ను వారి పాఠశాలకు తీసుకుని వెళ్ళారు. పక్షి తన పిల్లలను, రెక్కలలో ఒదిగి పెట్టుకునే రీతిలో, గురువు నా పై ప్రేమను చూపారు.
కాయ గోడ గురూచీ శాళా | సుటలా జనక జననీ్చా లళా | తుటలీ మోహ మమతేచీ శృంఖళా | లాధలో అవలీళా ముక్తతా | ||౭౬||
76. గురువుగారి ఆ పాఠశాల ఎంత బాగుందో! అక్కడ తల్లి తండ్రుల ప్రేమ మరచి పోయాను. మాయా, మోహం, మమకారం అనే సంకెళ్ళు విడిపోయాయి. చాలా సులభంగానే ముక్తిని పొందాను.
సుటలా దురాపాశ సగళా | భంగలీ ప్రవృత్తీ-ప్రతిబంధ-అర్గళా | వాటే యా గురూచ్యా గళ్యాంతచి గళా | ఘాలూని త్యా డోళా వసవావే | ||౭౭||
77. ఉండకూడని బంధాలన్నీ విడిపోయాయి. పరమార్థంలో అడ్దు వచ్చే బంధాలు తొలగిపోయాయి. గురువు గొంతును పెనవేసుకుని, వారి కళ్ళలో ఉండి పోవాలని అనిపించేది.
తయాచే ప్రతిబింబ నసతా డోళా | తో కాయ శుద్ధ మాంసాచా గోళా | అథవా త్యాహూన బరా మీ ఆంధళా | ఏసీ హీ శాళా మజ ఝాలీ | ||౭౮||
78. వారి రూపం లేని కళ్ళు, ఒట్టి మాంసపు గోళాలు. అలాంటి కళ్ళు ఉండడం కంటే, గుడ్డివాణ్ణైనా బాగుణ్ణు అని అనిపించింది. వారి పాఠశాల నాకు అంత ముఖ్యంగా ఉండేది.
లాగతా యా శాళేస పాయ | కోణ హతభాగీ మాఘారా జాయ | మాఝే ఘరదార బాపమాయ | సర్వాచి గురురాయ జాహలే | ||౭౯||
79. అలాంటి పాఠశాలలో అడుగు పెట్టాక, వెనుకకు మరలి పోవాలి అని అనుకునే దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారా? ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి, నా సర్వస్వం అన్ని నాకు గురువే అయ్యారు.
ఇతర ఇంద్రియే సహితమనా | సోడునియా నిజస్థానా | ఠేలీ యేఊని ఎకా నయనా | ధ్యానావధానాకారణే | ||౮౦||
80. గురువును ధ్యానించటానికి, మనసుతో సహ మిగతా ఇంద్రియాలన్నీ, తమ స్థానాలను వదిలి, కళ్ళలోనే ఉండిపోయాయి.
గురు ఎకదృష్టీచే ధ్యాన | ఇతర సర్వ గురు సమాన |
నాహీ గురువీణ దుజే ఆన | అనన్య అవధాన యా నాంవ | ||౮౧||
81. ధ్యానించేటప్పుడు, మన కళ్ళకు గురువే కనిపిస్తూ, మిగతా అంతా గురువులాగే కనిపిస్తున్నప్పుడు, గురువు తప్ప మరెవరూ లేరనే భావం ఉంటే, దానిని ‘అనన్య అవధానం’ అని అంటారు.
మ్హణోని శేవటీ కరావే నమన | నిఃశబ్ద మౌన ధరోనియా | ||౮౨||
82. ఇలా గురువు రూపాన్ని ధ్యానం చేస్తుంటే, మన బుద్ధి పని చేయటం ఆగిపోతుంది. అంటే, ఏ శబ్దమూ లేక, మౌనంగా, గురువుకు నమస్కరించాలి.
నాతో జ్ఞానార్థ గురు కరావే | శూన్య సదుపదేశాచ్యా నాంవే | దక్షిణా దేతా విత్తా ముకావే | అనుతాపా పావావే పరిణామీ | ||౮౩||
83. జ్ఞానం కోసం గురువును ఆశ్రయించే అవసరం లేదు. పనికి రాని ఉపదేశాల కోసం, దక్షిణను ఇచ్చి, డబ్బును పోగొట్టుకుని, తరువాత పశ్చాత్తాప పడటమే అవుతుంది.
గుహ్య జ్ఞానాచీ కేవళ చావటీ | మిరవే ప్రాంజళపణాచీ దివటీ | పాజిలీ దంభే జయా బాళగుటీ | దేఈల శేవటీ తో కాయ | ||౮౪||
84. రహస్యమైన జ్ఞానం గురించి గొప్పగా చెప్పుకుంటూ, శుద్ధమైన, మోసంలేని, తన గురించి చాటుకునేవారు, చిన్నతనంనుండి కపట నాటకాలు ఆడుతూ పెరిగిన వారు, శిష్యునికి ఏమివ్వగలరు?
బాహ్యాత్కారీ మోఠా సోంవళా | అంతర్యామీ నాహీ కోంవళా | ప్రతీతీచ్యా నాంవే ఆంవళా | తయాచీ శాళా నికామీ | ||౮౫||
85. బయటనుండి చూడటానికి, ఎంతో పవిత్రంగానూ, శుద్ధంగానూ, కనిపిస్తూ, పక్వంకాని మనసులో మాత్రం అలజడి, అశాంతి, అనుభవ జ్ఞానం అసలే లేని గురువుయొక్క పాఠశాల, పనికి రానిది.
జేథే శబ్దజ్ఞానాలా ఊత | బ్రహ్మజ్ఞానాచీ నాహీ ప్రచీత | స్వముఖే గురు నిజ గరిమా గాత | శిష్య నిజహిత తే కైచే | ||౮౬||
86. విపరీతమైన పుస్తక జ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంలో ఏ మాత్రం అనుభవం లేని గురువు, తన గొప్పతనాన్ని స్వయంగా తన నోటితో చాటుకునే గురువు దగ్గర, శిష్యులు ఏం లాభం పొందుతారు?
జయాచా బోల ఝోంబేనా వర్మీ | సాక్షీ న పటే అంతర్యామీ | తయాంచే గురుత్వ కాయ కామీ | వ్యర్థ రికామీ వటవట తీ | ||౮౭||
87. మనసులో చొచ్చుకుని పోని గురువు మాటలు, మన మనసులో ఏ అనుభవమూ కలుగ చేయని గురువు మాటలు, ఒట్టి పనికిరాని వాగుడే కాని, ఆ గురుత్వం ఎందుకు పనికి వస్తుంది?
అసో ఏసీ దిధలీ సేవా | దావిలా మజ జ్ఞానాచా ఠేవా | లాగలా న మజ శోధ కరావా | అర్థ గింవసావా కించితహీ | ||౮౮||
88. ఇలా మా గురువు, నాచే ఉపాసన చేయించి, నాకు నిజమైన జ్ఞానాన్ని చూపించారు. నేను దానిని వెతుక్కునే అవసరం కలగలేదు. అలాగే, ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకోవటానికి, ఏ మాత్రం శ్రమా అవసరం లేకుండా పోయింది.
అర్థజాత స్వయే ప్రకటలే | అప్రయాసీ హాతీ చఢలే | గురుకృపేచే ఏసే కేలే | శోధణే ఠేలే ఠాయీంచ | ||౮౯||
89. దాగివున్న అర్థాలన్నీ వాటంతట అవే స్వయంగా తెలియ సాగాయి. కొంచెం కూడా కష్ట పడకుండా, జ్ఞానం చేతికందింది. గురువుయొక్క అద్భుతమైన కృపవల్ల, నా వెతకడం అక్కడికక్కడే ఆగిపోయింది.
ఖాలీ డోకే వరతీ పాయ | టాంగీ ఉఫరాటే జై గురురాయ | తై మజ ఆనంద కైసా హోయ | సమర్థ గురుమాయ జాణాయా | ||౯౦||
90. తల క్రింద, కాళ్ళు పైన ఉంచి, తలక్రిందులుగా వేలాడదీసినప్పుడు, నాకు కలిగిన ఆనందం ఏమిటో, సమర్థులైన గురువొక్కరికే తెలుసు.
సంతా ఘరచీ ఉలటీచ ఖూణ | హే తో అనుభవజన్య జ్ఞాన |
ఎథే నిష్ఠాచ ఎక ప్రమాణ | ఎక సాధన గురుకృపా | ||౯౧||
91. ప్రపంచం రీతికంటే, సత్పురుషుల రీతి వ్యతిరేకంగా ఉంటుంది. జ్ఞానాన్ని అనుభవంతో తెలుసుకోవాలి. ఇక్కడ, గురువు మీద నమ్మకం ఉండటం, మరియు గురువు కృప, ఇవొక్కటే దారి.
కర్మఠాస విధినిషేధపణ | జ్ఞానియాతే జ్ఞానాభిమాన | యోగియాతే దంభాచా శీణ | విశ్వాసావీణ చాలేనా | ||౯౨||
92. కఠినమైన ఆచారాలను పాటించేవారికి (కర్మఠులు), నియమాలు, నిషేధాలు; జ్ఞానులకు తమ జ్ఞానం మీద అభిమానం; యోగులకు డాంభికము ఉంటాయి. కాని, ఇక్కడ శ్రద్ధ, నమ్మకం తప్ప ఏవీ సాగవు.
పండితాంచే గర్వాంధ డోళే | అభిమానాచే ప్రత్యక్ష పుతళే | జ్ఞానియా పాహూన తయాస పళే | సంగే న మైళే తయాచ్యా | ||౯౩||
93. పండితులు గర్వంతో గుడ్డివారై ఉంటారు. అహంకారం మూర్తీభవించిన రూపం వారు. జ్ఞానులు వారిని చూసి, వారి సహవాసం ఇష్టపడక పారిపోతారు.
జ్ఞానీ వదే మాఝియావీణ | దేవ తరీ దుసరా కోణ | మీ తో స్వయేచ జ్ఞానసంపన్న | చిత్‍ఘన పరిపూర్ణ తో మీచ | ||౯౪||
94. జ్ఞానియేమో, ‘నా కంటే వేరే దేవుడు ఎవరున్నారు? పూర్తి జ్ఞానం నాలోనే ఉంది. నేనే పూర్ణమైన ఉనికిని’ అని అంటాడు.
భక్త స్వకీయ భక్తిభావీ | జ్ఞానాచీ తీ ప్రౌఢీ న మిరవీ | తనుమనధనేసీ స్వామీసీ గోంవీ | స్వామీసీ నిరవీ సర్వస్వ | ||౯౫||
95. భక్తుడు తన భక్తిలో లీనమై ఉంటాడు. తనకున్న జ్ఞానాన్ని చాటుకోడు. దేహం, మనసు, ధనం అన్నీ స్వామి సేవకే వినియోగిస్తూ, తన సర్వస్వాన్నీ స్వామికే అర్పిస్తాడు.
హీ ఎక మాఝీ కర్తబగారీ | హీ మత్సామర్థ్యాచీ థోరీ | హీ మద్బుద్ధివైభవాచీ ఉజరీ7 | నసే హీ ఫుజరీ8 తయాతే | ||౯౬||
96. ‘ఇది నా ప్రతాపం, ఇది నా సామర్థ్యంయొక్క వైభవం, ఇది నా బుద్ధియొక్క ప్రభావం’ అనే అహంకారం అతనికి ఉండవు.
జే జే ఘడే తే దేవ ఘడవీ | తోచ ఉతరవీ తోచ చఢవీ | తోచ లఢే అథవా లఢవీ | కర్తా కరవీ తో ఎక | ||౯౭||
97. ఏది జరిగినా, అది దైవం చేసిందేనని, క్రిందకు దించినా, పైకి ఎత్తినా అది దేవుడేనని, పోట్లాడినా, పోట్లాడించినా, అన్నీ దేవుడే అని, చేసేవాడు, చేయించేవాడు అంతా దేవుడొక్కడే అని,
కర్తృత్వ ఠేవూన స్వామీచే మాథా | స్వయే స్వీకారీ అతి నమ్రతా | భక్తా సదైవ దేవతంత్రతా9 | నాహీ స్వతంత్రతా తయాతే | ||౯౮||
98. భారమంతా దేవుని మీద వేసి, స్వయంగా తాను చాలా వినయంగా ఉంటాడు. భక్తులు ఎప్పుడూ దేవుడి మీదే ఆధార పడి ఉంటారు. వారికి స్వాతంత్ర్యం ఉండదు.
అసో హే జే చౌఘే ప్రబుద్ధ | కరీత హోతే కశాచా శోధ | హే తో యేథవర రాహిలే ముగ్ధ | పరిసావా ఉద్బోధ10 తయాచా | ||౯౯||
99. అలా ఆ నలుగురు తెలివైన వారు, దేనిని వెదకాలని బయలుదేరారో, ఇంతవరకూ తెలియకుండానే ఉంది కదూ! ఇప్పుడు దాని గురించి వినండి.
హే సర్వ కర్మఠ ఘనపాఠీ | విద్వత్తేచీ ఘమండీ పోటీ | కరితా శబ్దజ్ఞానాచీ చావటీ | నిఘాలీ గోఠీ దేవాచీ | ||౧౦౦||
100. ఆ నలుగురూ, కష్టతరమైన ఆచారాలను సమర్థించే వేద పండితులు. వారి జ్ఞానం గురించి, వారికి మనసులోనే కొంత గర్వం ఉండేది. అనుభవం లేని, పుస్తక జ్ఞానాన్ని, వారు చర్చించుకుంటూ ఉండగా, దేవుడి గురించి మాట వచ్చింది.
నిజజ్ఞానాచియా నేటేపాటే | దేవ కైసా కోఠే రాహాటే |
ఆపణా కైసా కవణ్యా వాటే | యుక్తీనే భేటే హా హేత | ||౧౦౧||
101. తమకున్న జ్ఞానంతో, ‘దేవుడు ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? ఏ ఉపాయాలతో, ఏ విధంగా మనకు తొందరగా దొరకుతాడు?’ అన్నది తెలుసుకోవాలని వారి ఆలోచన.
పరబ్రహ్మ స్వయే దేఖ | తే కా హా అవివేక ఆలంబితీ | ||౧౦౨||
102. ఆ బుద్ధిమంతులలో సాయి ఒకరు. వీరు మూర్తీభవించిన వివేక, వైరాగ్యాల మూర్తి. ‘వారు స్వయం పరబ్రహ్మ అయి ఉండీ, మరి ఎందుకు అలా వివేకం లేని వారిలాగ నడచుకున్నారు?’
ఏసీ శ్రోతే ఘేతీల ఆశంకా | తరీ హా లోకసంగ్రహ దేఖా | సాఈసమర్థా భక్తోద్ధారకా | హీనత్వ హే కా ఆణీల | ||౧౦౩||
103. అని శ్రోతలకు అనుమానం కలుగుతుంది. ఇది కేవలం భక్తులకు బోధించటానికే. భక్తులను ఉద్ధరించే సాయి సమర్థులకు, ఇది లోపం ఎలా అవుతుంది?
స్వయే ఆపణ అసతా అవతారీ | వంద్య మానూనియా వణజారీ | అన్నబ్రహ్మ నిజ నిర్ధారీ | సేవూని థోరీ గాఇలీ | ||౧౦౪||
104. తామే స్వయంగా అవతార పురుషులైనా, వణజారీవానిని గౌరవించి, అతనిచ్చిన ఆహారాన్ని తీసుకుని, ‘అన్నం పరబ్రహ్మ’ అని తెలియజేసి, దాని మహిమను చాటి చెప్పారు.
తైసేంచ తయా జో అవమానీ | తయాచీ కైసీ హోతే హానీ | గాఇలీ హీ ప్రబుద్ధాంచీ కాహణీ | కోణీ న జ్ఞానీ గురువీణ | ||౧౦౫||
105. అలాగే, ఆహారాన్ని అవమానం చేసిన వారికి, ఎలా నష్టం కలుగుతుంది అని, ఈ పండితుల కథ ద్వారా తెలియచేసి, ‘గురువు లేకుండా ఎవరూ జ్ఞాని కారు’ అని చెప్పారు.
మాతృపిత్రాచార్యానుశాసన | యాంవీణ అశక్య ధర్మజ్ఞాన | తేంహీ సర్వ అధ్యయనాధీన | వినా అనుష్ఠాన తే వ్యర్థ | ||౧౦౬||
106. తల్లి, తండ్రి, గురువుల బోధ లేకుండా, ధర్మం గురించి తెలుసుకోవటం సాధ్యం కాదు. అవి కూడా నేర్చుకోవటం మీద ఉండే ఆసక్తి బట్టి ఉంటుంది. నేర్చుకున్నది ఆచరించక పోతే, అంతా వ్యర్థం.
సంపాదూ లాగే ఆశీర్వచన | హోఈ మాతృవాన పితృవాన | ఆణిక హోఈ ఆచార్యవాన | శ్రుతివచన విశ్రుత హే | ||౧౦౭||
107. తల్లి, తండ్రి, గురువుల ఆశీర్వాదాలను పొందాలని శృతి కూడా, ‘మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ’ అని చెప్పుతుంది.
యా త్రయీచే జే అనుసంధాన | అథవా ఈజ్యాధ్యయనదాన | జన్మమృత్యూచే వ్హావయా ఉల్లంఘన | పరమ సాధన హే ఎక | ||౧౦౮||
108. ఈ ముగ్గురి మాటలను పాటించాలి. లేదా, వేద పఠనం, యజ్ఞాలు, దాన ధర్మాలు చేయాలి. చావు పుట్టుకలనుంచి తప్పించుకోవటానికి, ఇవే గొప్ప సాధనలు.
హీ సర్వ చిత్తశుద్ధీచీ సాధనే | యాంవీణ ఆత్మవస్తూచే నాణే | హాతీ న చఢే ఏసే తే జిణే | వ్యర్థ యేణే జన్మాస | ||౧౦౯||
109. ఇవన్నీ మనసును శుభ్ర పరచే సాధనాలు. ఇవి లేకుండా ఆత్మ చేతికందదు. ఆత్మను తెలుసుకోలేని జీవితం వ్యర్థం.
శరీర ఇంద్రియ ఆణి మన | బుద్ధీహీ నేణే కరూ ఆకలన | ఏసే జే ఆత్మస్వరూప గహన | తయాచే దర్శన గురుకృపే | ||౧౧౦||
110. దేహం, ఇంద్రియాలు, మనసు మరియు బుద్ధి, ఇవేవీ ఆత్మను తెలుసుకోలేవు. ఇలాంటి రహస్యమైన ఆత్మ రూపాన్ని, కేవలం గురువు అనుగ్రహంతోనే తెలుసుకోవచ్చు.
జేథే ప్రత్యక్ష వా అనుమాన | ఉభయ ప్రమాణే అప్రమాణ |
తయా కరతలగత అమలకా11 సమాన | కోణ గురువీణ దావీల | ||౧౧౧||
111. కళ్ళతో చూసి తెలుసుకోవటం కాని, తర్కంతో తెలుసుకోవటం కాని వీలు పడనప్పుడు, గురువు తప్ప, అంత సులభంగా, అరచేతిలోని ఉసిరికాయలాగా, వేరే ఎవరు ఆత్మను చూపించగలరు?
ధర్మ అర్థ తిసరా కామ | ప్రాప్త హోతీల కరితా శ్రమ | పరి చవథా పురుషార్థ పరమ | గురువీణ శ్రమ సర్వథా | ||౧౧౨||
112. ధర్మం, అర్థం మరియు మూడవదైన కామం, ఈ మూడూ కష్ట పడితే, సాధించగలిగేవి. కాని, నాలుగవది, చాలా ముఖ్యమైనది, అయిన మోక్షం, గురువు లేకుండా సాధించటం సాధ్యం కాదు.
యా శిరడీ సంతాచియా దరబారా | జోశీహీ యేతీ దేతీ ముజరా | సాంగతీ నరదేహాచా హోరా | భవిష్య థోరా మోఠ్యాంస | ||౧౧౩||
113. ఈ శిరిడీ సత్పురుషుని దర్బారుకు, బాబాకు నమస్కరించటానికి జ్యోతిష్యులు కూడా వచ్చేవారు. గొప్పవారికి వారి జీవిత ప్రమాణాన్ని గొప్పగా చెప్పేవారు.
ధన ధాన్య వైభవ భోగీ | రాజే రజవాడే ఆణి జోగీ | తడీ తాపడీ రాగీ విరాగీ | దర్శనాలాగీ ఉత్కంఠిత | ||౧౧౪||
114. ధనధాన్యాల వైభవాలను అనుభవించే రాజులు, మరియు భిక్షాటన చేసే బైరాగులు, గోసావిలు, విరక్తులు, సంసారంలో ఆసక్తిగలవారు, అందరూ సాయి దర్శనం కోసం వచ్చేవారు.
జపీ తపీ వ్రతీ సంన్యాసీ | యాత్రేకరూ క్షేత్రనివాసీ | గాయక నర్తక పరివారేసీ | యేత శిరడీసీ దర్శనా | ||౧౧౫||
115. జపం చేసేవారు, తపస్సు చేసేవారు, వ్రతాన్ని పాటిస్తున్నవారు, సన్యాసులు, యాత్రికులు, తీర్థక్షేత్రాలలో ఉండేవారు, గాయకులు, నర్తకులు మొదలైనవారు, పరివార సమేతంగా సాయి దర్శనానికని శిరిడీకి వస్తారు.
మహారహీ యేఈ జోహారా | యా శ్రీసాఈచియా దరబారా | మ్హణే హాచి ఎక మాయ బాప ఖరా | చుకవిల యేరఝారా జన్మాచ్యా | ||౧౧౬||
116. ‘వీరే మమ్మల్ని నిజంగా ఆదుకునేవారు, వీరే మమ్మల్ని చావు పుట్టుకలనుండి తప్పించేవారు’ అని అనుకుని, హరిజనులు కూడా ఈ సాయి దర్బారుకు వచ్చి నమస్కరించేవారు.
ఆత్మలింగ జయాచే గళా | విభూతి ఫాంసిలీ జయాచే భాళా | జయాచా కోరాన్న భిక్షేవర డోళా | పహావా సోహళా జంగమాచా | ||౧౧౭||
117. మెడలో ఆత్మలింగాన్ని వేసుకుని, నొసట విభూతిని దిద్దుకుని, భిక్షగా ఇచ్చే ధాన్యపు గింజల వైపే చూపు గల జంగముని విచిత్రమైన వేషం చూడ తగినది.
మానభావ గారోడీ యేతీ | గోంధళీ ప్రేమే గోంధళ ఘాలితీ | భవానీచా జోగవా మాగతీ | అతి ప్రీతీ బాబాంసీ | ||౧౧౮||
118. మనసులో మోసం ఉన్నా, పైకి తియ్యగా మాట్లాడే గారడీవారు కూడా వస్తారు. దేవిని ఆరాధించే గోంధళి ఉపాసకులు వస్తారు. భవాని భక్తులు బాబా దగ్గరకు వచ్చి, ప్రీతిగా భిక్షను కోరుకుంటారు.
అంధ పంగూ కానఫాటే | జోగీ నానక భాట దివటే | సమర్థ సాఈచ్యా భక్తిపేఠే | ధాంవతీ మోఠే ప్రేమానే | ||౧౧౯||
119. గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, గురు నానక భక్తులు, భట్రాజులు, దివిటీలు పట్టుకునే వారు, ఎంతో భక్తితో, సాయి సమర్థులయందు పరిగెత్తుకొని వస్తారు.
డుగడుగే సరోదే పాంగూళ | కోల్హాటిణీహీ కరితీ ఖేళ | తేథేంచ హా వణజారీ ప్రేమళ | ఆలా కీ వేళ సాధునీ | ||౧౨౦||
120. ఢక్కాలు, ఢమరుకాలు వాయించుకుంటూ సోది చెప్పేవారు వస్తారు. కోలాటం ఆడే వారు కూడా వచ్చి కోలాటం ఆడుతారు. అలాగే, ఎంతో ప్రేమతో వణజారీ కూడా అక్కడికి వచ్చాడు.
ధన్య ధన్య సాఈచీ ఆకృతీ | వైరాగ్యాచీ ఓతీవ మూర్తీ |
నిర్విషయ నిఃసంగ నిస్వార్థీ | భక్త భావార్థీ అనుపమ్య | ||౧౨౧||
121. సాయియొక్క అవతారం ధన్యం. మూర్తీభవించిన వైరాగ్యం వారు. వారికి ఇంద్రియాల కోరికలు లేవు. ఏ సహవాసం లేక, స్వార్థం లేకుండా, ఉండే వారికి, భక్తులపైన విపరీతమైన ప్రేమ.
సురూ కరూ కీ ఆఖ్యాన | శ్రోతీ అవధాన దేఈజే | ||౧౨౨||
122. మునుపు చెప్పిన కథను ఇప్పుడు ముందుకు సాగిద్దాం. శ్రోతలు సావధానులై వినండి.
బాబా న స్వయే ఉపాసీ రాహత | కోణాసహీ న రాహూ దేత | ఉపోషితాచే న స్వస్థ చిత్త | కైంచా పరమార్థ తయాచా | ||౧౨౩||
123. స్వయంగా బాబా ఉపవాసం ఉండేవారు కాదు, ఎవరినీ ఉండనిచ్చే వారు కూడా కాదు. ఉపవాసం చేసేవారి మనసు స్థిరంగా ఉండదు. అలాంటి వారు పరమార్థాన్ని ఎలా పొందగలరు?
దేవ న లాధే రిత్యా పోటీ | ఆధీ ఆత్మ్యాచీ కరా సంతుష్టీ | యా ఉపదేశాచీ ఆణిక గోష్టీ | శ్రోతయాసాఠీ నివేదితో | ||౧౨౪||
124. ‘ఖాళీ కడుపుతో దేవుడు దొరకడు. కనుక, ముందుగా మన ఆత్మను సంతోష పరచాలి’ అన్న ఈ ఉపదేశానికి సంబంధించిన ఇంకొక కథను శ్రోతలకు మనవి చేస్తాను.
భుకేనే ఏన దుపారచే వక్తీ | ఖాలచీ మాతీ జై హోతే వరతీ | అన్నబ్రహ్మపదాభివ్యక్తి | ఉపజతే వృత్తీస చిత్తాచ్యా | ||౧౨౫||
125. మంచి మిట్ట మధ్యాహ్న వేళప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, కిందున్న నేల తలక్రిందులైనప్పుడు, అన్న బ్రహ్మకు ఉండే ప్రత్యేక స్థానం ఏమిటో, మనసుకు తెలుస్తుంది.
అతి దుర్ధర ఏసీ వేళా | తోండీ న దేతా అన్నాచా గోళా | హీనదీన ఇంద్రియమేళా | విసరే నిజకళా సర్వస్వీ | ||౧౨౬||
126. అలాంటి కష్ట కాలంలో, అన్నం ముద్దను నోటికి అందించక పోతే, ఇంద్రియాలన్నీ నీరసించిపోయి, తమతమ పనులను మరచిపోతాయి.
పోటీ నసతా అన్నాచా ఓలావా | దేవ కవణ్యా డోళా పహావా | కవణ్యా వాచే మహిమా వర్ణావా | కర్ణే పరిసావా తో కవణ్యా | ||౧౨౭||
127. పొట్టలో అన్నం లేకపోతే, కళ్ళు దేవుణ్ణి ఎలా చూడగలవు? దేవుని మహిమను, నోరు ఎలా వర్ణించగలదు? చెవులు ఎలా వినగలవు?
సారాంశ సకల ఇంద్రియా శక్తీ | తరీచ ఘడే దేవాచీ భక్తీ | జరీ అన్నావీణ క్షీణత్వా యేతీ | తరీ త్యా న గతీ పరమార్థీ | ||౧౨౮||
128. ఇంతకూ చెప్పేదేమిటంటే, ఇంద్రియాలు అన్నీ శక్తివంతంగా ఉన్నప్పుడే, దేవుణ్ణి భక్తితో ఆరాధించగలము. ఆహారం లేకుంటే, దేహం నీరసిస్తుందే తప్ప, పరమార్థం వైపు ఒక్క అడుగూ సాగదు.
అతిభోజన తేంహీ న హితకర | మితభోజన ఖరే సుఖకర | ఉపావాస అతిరేక భయంకర | అసుఖ నిరంతర భోగవీ | ||౧౨౯||
129. ఎక్కువగా భోజనం చేసినా, మంచిది కాదు. నిజానికి, మితమైన భోజనం సుఖకరమైనది. ఉపవాసం చేయటం చాలా భయంకరం. అది ఎప్పుడూ బాధను కలిగిస్తుంది.
ఎకదా ఎక బాఈ శిరడీస | పత్ర ఘేఊన కేళకరాస12 | ఆలీ సాఈచే దర్శనాస | పరమ ఉల్లాస మానసీ | ||౧౩౦||
130. ఒక సారి ఒక స్త్రీ, తనతో కేల్కరుకు ఉత్తరాన్ని తీసుకుని, శిరిడీకి వచ్చింది. ఎంతో ఉత్సాహంతో, సాయి దర్శనానికి వచ్చింది.
మహారాజాంచే పాయాపాశీ | బసావే తీన దివస ఉపవాసీ |
బాఈనే నిర్ధారిలే మానసీ | తిచే తిజపాశీంచ రాహిలే | ||౧౩౧||
131. సాయిని దర్శించుకుని, అక్కడే, మూడు రోజులు ఉపవాస వ్రతంతో కూర్చోవాలని ఆమె నిశ్చయించుకుంది. కాని, ఆమె అనుకున్నట్టు జరగలేదు.
బాబాంచ్యా నిత్య క్రమానుసార | పరమార్థాచా కరితా విచార | ఆధీ కంబరేస బాంధావీ భాకర | బాఈచా నిర్ధార ఉఫరాటా | ||౧౩౨||
132. బాబా ఆచరించే పద్ధతి ప్రకారం, పరమార్థాన్ని పొందాలని అనుకునే వారందరూ, ముందు రొట్టెను దగ్గరుంచు కోవాలి. కాని, ఆమె అనుకున్నది దీనికి విరుద్ధమైనది.
జయా మనీ దేవ గింవసావా | భాకర తుకడా ఆధీ ఖావా | అసల్యావీణ సమాధాన జీవా | కైసేనీ దేవా ఉమగావే | ||౧౩౩||
133. దేవుణ్ణి చూడాలని అనుకునే వారందరూ, ముందుగా ఆహారాన్ని తీసుకోవాలి. జీవుడే శాంతించక పోతే, దేవుణ్ణెలా తెలుసుకోగలం?
భుకేల్యా పోటీ దేవ సాంపడే | హే తో కల్పాంతీహీ న ఘడే | ఉపాస తాపస యాంచే సాంకడే | చాలేనా ఇకడే సాఈసీ | ||౧౩౪||
134. ఆకలి కడుపుతో దేవుణ్ణి పొందటం, ఈ ప్రపంచం ముగిసినా సాధ్యం కాదు. ఉపవాస, తపవాసాలనే కష్టాలు సాయి దగ్గర సాగవు.
అంతర్సాక్షీ మహారాజాంసీ | హోతేంచ హే ఠావే పూర్వీల దివసీ | ఆధీంచ దాదా కేళకరాపాశీ | హోతే కీ భాషిత ఝాలేలే | ||౧౩౫||
135. అన్నీ అవలీలగా తెలుసుకునే సాయి, ఆ స్త్రీ రాక ముందు రోజే, ఈ సంగతి తెలుసుకుని, దాదా కేల్కరుతో,
ఆతా యా శిమగ్యాచా సణాశీ | రాహతీల కా మాఝీ పోరే ఉపాశీ | కైసే మీ రాహూ దేఈన త్యాంసీ | మగ మీ కశాసీ పాహిజే | ||౧౩౬||
136. “ఇప్పుడు, ఇలాంటి హోళీ పండుగలాంటి రోజు, నా బిడ్డలు ఉపవాసం ఉంటారా? వారిని నేనెలా ఉపవాసం ఉండనిస్తాను? అప్పుడు నేనెందుకు ఇక్కడ?”
సాఈముఖావాటే బాహేర | పడలే నాహీంత జో హే ఉద్గార | తోంచ దుసరే దివశీ తయార | పాతలీ శిరడీవర హీ బాఈ | ||౧౩౭||
137. సాయి నోటినుండి ఈ మాటలు వచ్చాయో లేదో, రెండవ రోజే ఆ స్త్రీ శిరిడీకి వచ్చింది.
ఉపనాంవ బాఈచే గోఖలే | ఉక్త ప్రకారే మనీ నిర్ధారిలే | దాదాంచ్యా యేథేంచ గాంఠోడే లావిలే | పత్ర దిధలే తయాంస | ||౧౩౮||
138. ఆమె ఇంటి పేరు గోఖలే. ఈమె ఉపవాసం చేయాలని నిశ్చయించుకుని వచ్చింది. దాదా కేల్కరు ఇంట్లో తన సామాను మూటను ఉంచి, తను తెచ్చిన ఉత్తరాన్ని అతనికిచ్చింది.
కానీటకర కాశీబాఈ | ఆప్తసంబంధే పత్ర దేఈ | వినవీ దాదాంస లావాయా సోఈ | దర్శనార్థ సాఈబాబాంచ్యా | ||౧౩౯||
139. దగ్గర చుట్టమైన కాశీబాయి కానీటకరు, ఆ స్త్రీకు సాయిబాబా దర్శనానికి సహాయం చేయాలని, దాదాకు ఉత్తరం వ్రాసింది.
బాఈ శిరడీస యేఊన పాతల్యా | తాత్కాళ బాబాంచ్యా దర్శనా గేల్యా | దర్శన హోఊన క్షణభర బసల్యా | తోంచ తయాంస ఉపదేశ | ||౧౪౦||
140. శిరిడీకి వచ్చిన వెంటనే, ఆమె సాయి దర్శనానికి వెళ్ళింది. బాబా దర్శనం చేసుకుని, కాసేపు అక్కడ కూర్చుందో లేదో, బాబా ఉపదేశం మొదలు పెట్టారు.
కోణాచే కాయ అంతర్గత | సాఈనాథ జాణే సమస్త |
ఏసే న కాంహీ భూమండళాంత | నసే జే అవగత తయాంస | ||౧౪౧||
141. ఎవరెవరి మనసులో ఏమేముందో, అన్నీ సాయినాథులకు తెలుసు. ఈ భూమండలంలో వారికి తెలియనిదంటూ ఏదీ లేదు.
నిరాహార ఆణి నిరాప14 | కిమర్థ హా వ్యాప వాఉగా | ||౧౪౨||
142. అన్నమన్నాద (అన్నం, మరియు అన్నం తినేవారు ఇరువురూ విష్ణు స్వరూపం.యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞసాధనః |
యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యం అన్నం అన్నాదం ఏవ చ || ౧౦౫ || - శ్రీ విష్ణు సహస్రనామం
). ఉపవాస తపవాసాలు, నీరు లేకుండా కాని లేక నిరాహారంగా కాని ఉండడం, ఇవన్నీ వ్యర్థంగా ఎందుకు?
కాయ ఆవశ్యకతా ఆపుల్యాలా | ఉపాస తాపాస కరావయాలా | బాబా ఆపణ హోఊన తియేలా | ఏసియా బోలా బోలలే | ||౧౪౩||
143. “ఈ ఉపవాస, తపవాసాలన్నీ చేయాల్సిన అవసరం మనకేముంది?” అని బాబా తమంతట తాము ఆమెతో అన్నారు.
జా త్యా దాదాభటాచే15 ఘరీ | ఖుశాల పురణాచ్యా పోళ్యా కరీ | తయాచ్యా పోరాంబాళాంస చారీ | స్వయేంహీ పోట భరీ తూ ఖాఈ | ||౧౪౪||
144. “వెళ్ళు! ఆ దాదాభట్టు ఇంటికెళ్ళి, చక్కగా బొబ్బట్లు చేయి. వారి పిల్లలకు పెట్టి, నీవు కూడా కడుపు నిండా తిను” అని చెప్పారు.
నవల తో శిమగ్యాసారిఖా సణ | బాఈ యేణ్యాచా యోగహీ విలక్షణ | దాదాంచే కుటుంబహీ తత్‍క్షణ | అస్పర్శ హోఊన బసలేలే | ||౧౪౫||
145. అసలు సంగతి ఏమిటంటే, ఆ హోళీ పండుగ రోజున, దాదా భార్య అంటరాకుండా, బయట చేరింది. ఆ రోజే ఈ స్త్రీ కూడా శిరిడీకి వచ్చింది.
విరాలీ ఉపోషణాచీ ఉకళీ | స్వయంపాకాచీ ఆలీ పాళీ | మగ తీ పరమ ప్రేమ సమేళీ | ఆజ్ఞా పాళీ బాబాంచీ | ||౧౪౬||
146. అందుకే, ఉపవాస వ్రతం చేయాలనే ఆమె కోరిక పోయి, వంట చేయటం ఆమె వంతుకు వచ్చింది. కాని, ఎంతో ప్రేమతో ఆమె బాబా ఆజ్ఞను పాలించింది.
చరణ బాబాంచే అభివందూన | దాదాంచియా ఘరీ జాఊన | పురణపోళీచే జేవణ కరూన | సర్వాంస వాఢూన జేవలీ | ||౧౪౭||
147. భక్తితో బాబా పాదాలకు నమస్కరించి, ఆమె దాదా ఇంటికి వెళ్ళి, బొబ్బట్లను చేసి, అందరికీ పెట్టి, తనూ తిన్నది.
కాయ ఆఖ్యాయికా హీ సుందర | కాయ అంతర్గత అర్థోపసంహార | వ్హావే ఏసే గురువచనీ స్థిర | నాహీ మగ ఉశీర ఉద్ధారా | ||౧౪౮||
148. ఎంత అందమైన కథ ఇది! ఇందులో ఎంత రహస్యం దాగి ఉంది! గురువు మాటలను పాటించే వారి ఉద్ధరణకు, ఆలస్యమే లేదు.
ఏశీచ ఎక ఆణిక కథా | ఆఠవలీ హోతీ సాఈ సమర్థా | కథిలీ ప్రేమే భక్తా సమస్తా | సాదర శ్రోతా పరిసిజే | ||౧౪౯||
149. ఇలాంటిదే మరొక కథ, సాయి సమర్థులకు గుర్తుకు వచ్చి, ఎంతో ప్రేమతో భక్తులకు చెప్పారు. శ్రోతలూ, దీనిని శ్రద్ధగా వినండి.
జయా మనీ పరమార్థీ ఆస | తయానే కేలే పాహిజే సాయాస | కరూ లాగే దృఢ అభ్యాస | వ్హావే సాహసహీ స్వల్ప | ||౧౫౦||
150. పరమార్థాన్ని పొందాలని ఆశించేవారు, చాలా కష్టపడి, దృఢమైన అభ్యాసం చేయాలి. ఈ సాధనలో కొంత సాహసం కూడా చేయాలి.
ఏసే హే సత్కథామృత చరణతీర్థ | సేవావే నిత్య కల్యాణార్థ |
హోతా సంతచరణీ వినీత | హోఈల పునీత అంతర | ||౧౫౧||
151. ఈ మంచి కథలనే సాయి పాద తీర్థం అమృతాన్ని, మనకు శుభం కలగటానికి ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉండాలి. వినయంగా సత్పురుషుల పాదాలను చేరుకుంటే, మన మనసు శుద్ధమౌతుంది.
ఎకదా మీ లహాన అసతా | ఫడకా బాంధోన పోటాభోంవతా | ధందా మిళావా నిర్వాహాపురతా | ఆణూని చిత్తా నిఘాలో | ||౧౫౨||
152. “ఒక సారి నా చిన్నతనంలో, బ్రతకటానికి ఏదైనా పని చేయాలని, నడుముకు బట్ట కట్టుకుని, బయలుదేరాను.
చాలతా చాలతా బీడగాంవా | ఆలో తేథే ఘేతలా విసావా | ఫకిరాచా మాఝ్యా న్యారాచ16 కావా17 | ఆనంద జీవా వాటలా | ||౧౫౩||
153. “నడచినడచీ, బీడ్గాం అనే ఊరు చేరుకుని, అక్కడ విశ్రాంతి తీసుకున్నాను. కాని, మా ఫకీరు నా గురించి ఇంకేదో ఆలోచించి ఉంచాడు. దాంతో నాకు ఎంతో ఆనందం కలిగింది.
తికడే మిళాలే జరీచే కామ | మీహీ ఖపలో అవిశ్రమ | ఫళలే తే మాఝే సకళ శ్రమ | పహా పరాక్రమ ఫకిరాచా | ||౧౫౪||
154. “అక్కడే నాకు జరీ పని దొరికింది. విశ్రాంతి లేకుండా, నేను బాగా కష్టపడ్డాను. నా కష్టం ఫలించింది. మా ఫకీరు శక్తి అలాంటిది!
మాఝ్యా ఆధీంచ లావిలేలే | హుషార హుషార నావాజలేలే | చార పోరాంహీ హీ కామ కేలే | తే్హీ మాపిలే తే సమయీ | ||౧౫౫||
155. “నాకంటే ముందుగా పనిలో చేరినవారు, తెలివైన వారని పేరుపొందిన వారు. నలుగురు బాబులూ పని చేస్తున్నారు. వారి పనికి కూడా విలువ కట్టారు.
ఎకానే పన్నాస రుపయాంచే కేలే | శంభరాంచే దుజియాచే ఝాలే | తిజియాచే దీడశాంచే భరలే | మాఝే సర్వాహూని ద్వితుణిత | ||౧౫౬||
156. “ఒకడు యాభై రూపాయల విలువంత పని చేశాడు. రెండవ వాడు వంద, మూడవ వాడు వందా యాభై. నాది, అందరిదీ కలిపిన దానికంటే రెండింతలు.
పాహూనియా మాఝీ హుషారీ | ధనీ బహు ఆనందలా అంతరీ | బహుతాంపరీ మజ గౌరవ కరీ | ప్రేమ భారీ మజవరీ | ||౧౫౭||
157. “నా పనిలోని నేర్పును చూసి, యజమాని చాలా ఆనందించాడు. నా పై ఎంతో ప్రేమతో, మిగతా వారికంటే, ఎక్కువగా నన్ను అభిమానించాడు.
మజ తయానే పోషాఖ దిధలా | డోఈస పాగోటే అంగావర శేలా | పరి మీ తో బాంధూన ఠేవిలా | జైసా దిధలా తైసాచ | ||౧౫౮||
158. “నాకు బట్టలు ఇచ్చాడు. తలకు పాగా, శరీరం పైన శాలువను ఇచ్చాడు. కాని, ఇచ్చిన వానిని నేను అలాగే మూట కట్టి, ఉంచాను.
కోణాచే దేణే కోణాస పురతే | కితీహీ ద్యావే సదా అపురతే | మాఝే సరకార18 జై దేఊ సరతే19 | న సరతే20 తే కల్పాంతీ | ||౧౫౯||
159. “ఎవరైనా ఇచ్చింది, ఎంతవరకు సరిపోతుంది? ఎంత ఇచ్చినా, అది ఎప్పుడూ తక్కువే అని అనిపిస్తుంది. కాని, నా ప్రభువు ఇస్తే, కాలం ముగిసేంత వరకూ, దానికి అంతు ఉండదు.
దేణే ఎక మాఝ్యా సరకారచే | తయాసీ తుళే కాయ తే ఇతరాంచే | అమర్యాదాస మర్యాదేచే | భూషణ కైచే అసావే | ||౧౬౦||
160. “ఇవ్వగలిగేది నా ప్రభువొక్కడే. మిగతావారు ఇచ్చేది, దానితో సరితూగగలవా? కొంచెమైన దానిని, ‘అంతులేనిది’ అని అంటే శోభిస్తుందా?
మాఝే సరకార న్యా న్యా వదే | మజలాచ జో తో మ్హణే దే దే |
కోణీ న మాఝ్యా బోలాసీ లక్ష దే | ఎకహీ సుధే ఏకేనా | ||౧౬౧||
161. “నా ప్రభువేమో ‘తీసుకో, తీసుకో’ అని అంటారు. అందరూ నన్ను ‘ఇవ్వు, ఇవ్వు’ అని అడుగుతారు. కాని, నా మాటను ఎవరూ లక్ష్య పెట్టరు. ఒక్క మాటైనా సరిగ్గా వినరు.
ఖణా మ్హణతా కోణీహీ ఖణీనా | ప్రయత్న కోణా కరవేనా | ||౧౬౨||
162. “నా ప్రభువు నిధి నిండి, పొంగి పోతూ ఉంది. ఒక్కడైనా బండి తెచ్చుకోడు. ‘త్రవ్వుకోండి’ అంటే, ఒక్కరైనా త్రవ్వుకోరు. ఎవరూ అసలు ప్రయత్నమే చేయరు.
మీ మ్హణే తో పైకా ఖణావా | గాడ్యావారీ లుటూన న్యావా | ఖరా మాఈచా పూత అసావా | తేణేంచ భరావా భాండార | ||౧౬౩||
163. “ ‘ఆ సంపదను త్రవ్వుకొండి, బాగా దోచుకుని బళ్ళ మీద తీసుకుని పోండి. తల్లి కొడుకు ఎవడైనా వచ్చి, నిధిని నింపుకొండి’ అని చెప్పుతాను.
ఆముచీ తరీ కాయ గతి | మాతీచీ హోఊన జాఈల మాతీ | వారా జాఈల వార్యాచ్యా సంగతీ | యేఈన మాగుతీ హా వేళ | ||౧౬౪||
164. “ఎంతైనా, నా గతి ఏమిటి? మట్టి మట్టిలో కలిసిపోతుంది. గాలి గాలిలో కలిసిపోతుంది. ఈ అవకాశం పోయిందంటే, మరల ఎప్పటికీ రాదు.
అసో మాఝియా ఫకిరాచీ కళా | మాఝియా భగవానాచీ లీళా | మాఝియా సరకారాచా తాళా | లఈ నిరాళా న్యారాచ | ||౧౬౫||
165. “అయినప్పటికీ, నా ఫకీరు నేర్పు, నా దేవుని లీల, తాళ బద్ధమైన నా ప్రభువు పనులు, ఇవన్నీ చాలా ప్రత్యేకమైనవి, అద్భుతమైనవి.
మీహీ కధీంచ కోఠే జాతో | కోణ్యాహీ ఠాయీ జాఊన బసతో | పరి హా జీవ మాయేంత ఘోటాళతో | గోతే ఖాతో అనివార | ||౧౬౬||
166. “నేను కూడా అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఏదో ఒక చోట కూర్చుంటాను. కాని, ఈ జీవుడు మాయలో పడి, (గాలిపటంలాగా, లేక పక్షులలాగా) మునకలు వేస్తుంటాడు.
మాయా ఆహే ఫార కఠిణ | తిణే కేలో మీ హీన దీన | మాఝియా మాణసాంచీ రాత్రందిన | ఘోంకణీ కరూన అసతో మీ | ||౧౬౭||
167. “మాయ చాలా కష్టమైనది. నేను దానిని హీనంగా, దీనంగా చేసేశాను. రాత్రింబవళ్ళూ, నా వాళ్ళను గురించే చింతిస్తుంటాను.
‘జో జో జైసే జైసే కరీల | తో తో తైసే తైసే భరీల’ | ధ్యానాంత ఠేవీ జో మాఝే బోల | సౌఖ్య అమోల పావేల తో | ||౧౬౮||
168. “ఎవరు ఎలా చేస్తే, అలా అనుభవిస్తారు. నా మాటలను గుర్తుంచుకునే వారు, ఎనలేని సుఖాన్ని పొందుతారు”.
హేమాడ సాఈసీ శరణ | అపూర్వ హే కథా నిరూపణ | సాఈచ స్వయే కరీ జై ఆపణ | మాఝే మీపణ ఫికే తై | ||౧౬౯||
169. హేమాడు సాయికి శరణుజొచ్చి, వేడుకుంటున్నాడు. ప్రత్యేకమైన ఈ కథా వర్ణనను సాయియే స్వయంగా చేస్తుండగా, నా అహం దానిముందు చప్పబడి పోతుంది.
తోచ యా కథేచా నివేదితా | తోచ వాచితా తోచ పరిసతా | తోచ లిహితా ఆణి లిహవితా | అర్థబోధకతాహీ తోచ | ||౧౭౦||
170. ఈ కథను చెప్పేది వారే. పఠించేవారూ వారే. వినేవారు కూడా వారే. వ్రాయించేవారు, వ్రాసేవారు కూడా వారే. అర్థాన్ని చెప్పేది కూడా వారే.
సాఈచ స్వయే నటే హీ కథా | తోచ ఇయే కథేచీ రుచిరతా |
తోచ హోఈ శ్రోతా వక్తా | స్వానందభోక్తాహీ తోచ | ||౧౭౧||
171. ఈ కథలో ముఖ్య పాత్ర సాయిదే. ఈ కథలోని మాధుర్యం వారే. వారే చెప్పేవారు, వారే వినేవారు, పరమానందాన్ని పొందేవారు కూడా వారే.
మగ ఏసియా శ్రవణాచీ గోడీ | హీ కాయ థోడీ పరమార్థ జోడీ | భక్త సభాగ్య జే హే సుఖ పరవడీ | ఆనంద నిరవడీ భోగితీ | ||౧౭౨||
172. మరి ఇలాంటి వినే మాధుర్యం, పరమార్థం పొందటానికి సరిపోతుందా? ఈ ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించే భక్తులే నిజమైన భాగ్యవంతులు.
ఆతా పుఢీల అధ్యాయాచే సార | సాఈచ్యా ఉదీచా మహిమా అపార | శ్రోతే సజ్జన పసరితో పదర | హోఊని సాదర పరిసావా | ||౧౭౩||
173. ఇక తరువాతి అధ్యాయంలోని సారాంశం - అపారమైన సాయియొక్క ఊది మహిమను సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి అని వేడుకుంటున్నాను.
హేమాడ వదే అతి వినీతతా | కృపా ఉపజలీ సాఈ సమర్థా | త్యాంనీంచ వదవిలే నిజసచ్చరితా | కథా రసభారితా అపూర్వ | ||౧౭౪||
174. సాయి సమర్థులకు దయకలిగి, అద్భుతమైన తమ సచ్చరిత కథను, ఇంత రసభరితంగా, వారే నాచే చెప్పించారని, హేమాడు వినయంగా విన్నవించుకుంటున్నాడు.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | గురుమహిమా వర్ణనం నామ|
| ద్వాత్రింశత్తమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
1. లావణ్యాసాఠీ. 2. లమాణ జాతీచా. 3. వృక్షాంనీ.
4. ఆడమార్గాలా. 5. ఢకలూన దేఊ నయే. 6. కావళా.
7. ప్రభావ. 8. ఫుగారా, తాఠా. 9. దేవాధీనపణా.
10. ఖులాసా, స్పష్టీకరణ. 11. ఆవళా.
12. కై. దామోదర వామన ఊర్ఫ కేళకరాంస.
13. అన్న ఆణి అన్న ఖాణారా. 14. పాణీ న పితా రాహణారా.
15. దాదా కేళకరాంచే. 16. నిరాళాచ. 17. మతలబ, సంకల్ప.
18. పరమేశ్వర. 19. దేఊ లాగతే. 20. సంపాత నాహీ.
No comments:
Post a Comment