శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౩౧ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
గతాధ్యాయీ జాహలే కథన | సప్తశృంగీచ్యా భక్తాచే ఆఖ్యాన |
మాధవరావాంచా నవస హీ పూర్ణ | సాఈ ఫేడూన ఘేవవిత | ||౧||
1. పోయిన అధ్యాయంలో, సప్తశృంగీ దేవి భక్తుని కథ, మాధవరావుచే సాయి మ్రొక్కును తీర్పించటం,
కైసే దిధలే స్వప్నీ దర్శన | ఖుశాలశేట రామలాలా లాగూన |
కైసియాపరీ ఘేతలే ఠే్వూన | అనిర్వాణ రామలాలాలా | ||౨||
2. ఖుశాల సేటుకు, రామలాలుకు కలలో కనిపించిన సంగతి, మరియు రామలాలును బాబా తమ సమాధివరకూ, తమ దగ్గరే ఉంచుకోవటం గురించి చెప్పబడింది.
త్యాహూన అపూర్వ హీ ప్రకృత కథా | శ్రోతా పరిసిజే అతి సాదరతా |
సంన్యాసీ ఎక మానసా1 జాతా | కైసా నిజ ముక్తతా లాధలా | ||౩||
3. వీటన్నిటికంటే ఇంకా అద్భుతమైనది, ఇప్పటి కథ. శ్రోతలు దీనిని చాలా శ్రద్ధగా వినండి. ఒక సన్యాసి మానస సరోవరానికి బయలుదేరి, అనుకోకుండా ఎలా ముక్తిని పొందాడు,
కైసా మానకర2 నూలకర3 మేఘా | యాంచా హీ హేతూ పురవిలా అవఘా |
హే తర నర పరి ఎకా క్రూర వాఘా | నిజపదీ జాగా దిధలీ | ||౪||
4. మాన్కరు, నూల్కరు, మేఘాల కోరికలను కూడా సాయి ఎలా తీర్చారు; మనుషులకే కాక, కౄర మృగమైన ఒక పులికి కూడా, తమ పాదాల దగ్గర ఎలా చోటిచ్చారు;
కథా ఆహేత అతి విస్తృత | గ్రంథవిస్తార హోఈల బహుత |
కథీన సంక్షిప్త సారభూత | హోఈల నిజహిత సాధక | ||౫||
5. మొదలైన కథలన్నీ చాలా విస్తారమైనవి. గ్రంథం పెద్దదైపోతుంది కనుక, శ్రోతలకు మేలు చేసే కథాసారాన్ని, సంక్షిప్తంగా చెప్పుతున్నాను.
అంతఃకాలీ జైసీ మతీ | తైసీ ప్రాణ్యాంస లాభే గతీ |
కిడే భీతీనే భ్రమర హోతీ | హరిణప్రీతీ4 జడభరత | ||౬||
6. చివరి ఘడియల్లో మనసు ఎలా ఉంటే, ప్రాణులకు, తరువాతి గతి కూడా అలాగే ఉంటుంది. భయంతో, కీటకం తేనెటీగగా మారిపోతుంది. జింకపై ప్రీతితో, జడభరతుడు తరువాతి జన్మలో, జింకగా పుట్టాడు.
అంతఃకాళీ జే జే ధ్యాన | తే తేంచ రూపే పునర్జనన |
భగవత్పదీ ఝలియా లీన | జన్మవిహీన హోఈ తో | ||౭||
7. చివరి ఘడియల్లో ధ్యానించిన రూపమే, మళ్ళీ వచ్చే జన్మలో కలుగుతుంది. కాని, దేవుని పాదాలలో మనసు లీనం చేసుకున్న వారికి, మళ్ళీ పుట్టుక ఉండదు.
యాచ కరితా నామస్మరణ | లావిలా అభ్యాస హేంచ కారణ |
ప్రసంగీ జావే న గాంగరూన | అంతీ ఆఠవణ రహావీ | ||౮||
8. అందుకే, భక్తులచే నామస్మరణను అలవాటు చేయించటం; అలా చేస్తే, చావు వచ్చినప్పుడు, ఏ కలవరపాటు లేకుండా, దేవుణ్ణి తలచుకుంటారు.
ఆయుష్యభర జాగృత రాహిలా | అంతఃకాళీ జరీ కా నిదేలా |
తరీ తో శేవటీ ఫుకట గేలా | యదర్థ కేలా సత్సంగ | ||౯||
9. అలాగే, జీవితమంతా జాగ్రత్తగా ఉండి, చివరి సమయంలో నిద్రపోతే, జీవించిన బ్రతుకంతా వ్యర్థమై పోతుంది. అందుకే ఎప్పుడూ సత్సంగం చేయాలి.
మ్హణూని జే భక్త భావార్థీ | తే జీవ నిరవితీ సంతా హాతీ |
కీ తే జాణతీ గతీ నిర్గతీ | అంతీచే సాంగాతీ తే ఎక | ||౧౦||
10. అంటే, భక్తులలో అమాయకులైన వారు, తమను తామే సత్పురుషులకు అప్పగించుకుంటారు. ఎందుకంటే, సత్పురుషులకు జీవుల గతి, నిర్గతి బాగా తెలిసి ఉంటుంది. చివరి ఘడియల్లో వారే తోడు.
యే అర్థీంచీ గోడ కథా | సాఈ సమోర ఘడలేలీ వార్తా |
ఏకతా దిసేల శ్రోతయా చిత్తా | భక్తవత్సలతా సాఈంచీ | ||౧౧||
11. దీనికి సంబంధించినట్టు, సాయి ఎదుట జరిగిన ఒక మధురమైన కథను వింటే, సాయికి భక్తుల మీద ఉన్న ప్రేమ, శ్రోతలకు అర్థమౌతుంది.
కోఠే మద్రాస కోఠే శిరడీ | కోఠే మానస సరోవరదరడీ | కైసీ భక్తాంచీ భరతా ఘడీ | ఆణీత ఓఢీత పాయాంపాశీ | ||౧౨||
12. ఎక్కడి మద్రాసు? ఎక్కడి శిరిడీ? ఎత్తైన కొండల మీదుండే మానస సరోవరం ఎక్కడ? భక్తులకు చివరి ఘడియలు దగ్గరైనప్పుడు, బాబా వారిని తమ పాదాల దగ్గరకు రప్పించుకుంటారు.
ఎకదా ఎక మద్రాసీ సంన్యాసీ | విజయానంద నామ జయాసీ | మద్రాసేహూన మానస సరోవరాశీ | మహదుల్హాసీ నిఘాలా | ||౧౩||
13. ఒక సారి, మద్రాసులోని విజయానందుడనే సన్యాసి, ఎంతో ఉత్సాహంగా మానస సరోవరం చూడటానికి బయలుదేరాడు.
ఎకా జపానీ ప్రవాశాచా | నకాశా మానస సరోవరాచా | పాహూన నిశ్చయ ఝాలా మనాచా | దర్శనాచా ఉత్కట | ||౧౪||
14. మానస సరోవరం పటాన్ని ఒక జపాను ప్రయాణీకుని దగ్గర చూసి, తాను కూడా మానస సరోవరం చూడాలని నిశ్చయించుకున్నాడు.
వాటేంత లాగలా శిరడీ గాంవ | కర్ణీ పడలా నామాచా ప్రభావ | దర్శనాచీ ధరూని హాంవ | ఆలే ఠావ శోధిత | ||౧౫||
15. దారిలో శిరిడీ గ్రామం ఉంది. బాబా మహిమను విని, వారి దర్శనం చేసుకోవాలనే కోరికతో, వారున్న చోటును వెతుక్కుంటూ వచ్చాడు.
సాఈ మహారాజ మోఠే సంత | కీర్తిమంత జగవిఖ్యాత | ఏకూనీ ధరిలా దర్శనీ హేత | థాంబలే మార్గాంత జాతాంనా | ||౧౬||
16. సాయి మహారాజు గొప్ప మహాత్ములు, కీర్తి ప్రతిష్ఠలు కలవారు, జగద్విఖ్యాతి చెందిన వారు అని విని, వారి దర్శనం కోసం, దారిలోవున్న శిరిడీలో ఆగాడు.
హోతే తేవ్హా శిరడీమాజీ | హరిద్వారచే స్వామీ సోమదేవజీ | ఉభయతాంచీ భేట సహజీ | భక్త సమాజీ జాహలీ | ||౧౭||
17. హరిద్వారంలోని సోమదేవ స్వామిజీ అప్పుడు శిరిడీలోనే ఉన్నారు. మిగతా భక్తులలాగే, వారిరువురూ సహజంగా కలుసుకున్నారు.
తయాంస మగ సంన్యాసీ పుసతీ | మానస సరోవర తే దూర కితీ | పాంచశే మైల స్వామీ మ్హణతీ | గంగోత్రీవరతీ ఆహే తే | ||౧౮||
18. ‘మానస సరోవరం ఎంత దూరం ఉంది?’ అని సన్యాసి, స్వామిని అడిగాడు. ‘గంగోత్రికి పైన, ౫౦౦ మైళ్ళు దూరంలో ఉంది’ అని స్వామి చెప్పారు.
తేథే బర్ఫ ఫారచి పడతే | పన్నాస కోసాంత భాషా బదలతే | భూతానవాసియా శంకా యేతే | పరస్థాంతే బహు పీడా | ||౧౯||
19. అక్కడ మంచు చాలా ఎక్కువగా కురుస్తుందని, ప్రతి యాభై కోసుల (వంద మైళ్ళు) దూరానికి, మాట్లాడే భాష మారుతుంటుందని, అక్కడున్న భూటానీయులు పరదేశీయులను అనుమానాలతో చాలా పీడిస్తారని చెప్పాడు.
స్వామీముఖీంచే వర్తమాన | పరిసోన సంన్యాసీ ఖిన్నవదన | జాహలే తయాచే దుశ్చిత్త మన | చింతానిమగ్న ఝాలా తో | ||౨౦||
20. స్వామి మాటలను విని, సన్యాసి ఉత్సాహం బాగా తగ్గిపోయింది. అతని మనసు కలత చెంది, చింతలో మునిగి పోయాడు.
ఘేతలే సాఈబాబాంచే దర్శన | ఘాతలే పాయీ లోటాంగణ |
చిత్త ఝాలే సుప్రసన్న | బసలే ఆసన ఘాలునీ | ||౨౧||
21. సాయి దర్శనం చేసుకుని, సన్యాసి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అతని మనసు శాంతించి, ఎంతో సంతోషం కలిగింది. కొంత దూరం వెళ్ళి, కూర్చున్నాడు.
“ద్యా హాకలూన యా సంన్యాశాప్రతీ | నాహీ సంగతీ కామాచీ” | ||౨౨||
22. అకస్మాత్తుగా, బాబాకు కోపం వచ్చి, అక్కడున్న భక్తులతో, “ఈ సన్యాసిని వెళ్ళగొట్టండి. అతని సహవాసం పనికి రాదు” అని చెప్పారు.
ఆధీ సంన్యాసీ తో నవా | స్వభావ బాబాంచా నాహీ ఠావా |జరీ ఖజీల ఝాలా జీవా | పహాత సేవా బైసలా | ||౨౩||
23. అసలే, సన్యాసి అక్కడికి కొత్త. బాబా స్వభావం తెలియనివాడు. బాబా కేకలు విని, కొంత భంగ పడ్డాడు. అయినా, భక్తులు బాబాకు చేస్తున్న సేవలను చూస్తూ కూర్చున్నాడు.
ప్రాతఃకాళీంచా దరబార | మశీదీంత మండళీ చికార |భక్తోపచార పూజా సంభార | పాహూన తో గార ఝాలా | ||౨౪||
24. అది పొద్దున్నే జరిగే దర్బారు. మసీదులో భక్తులు గుమిగూడి ఉన్నారు. భక్తులు చేసే పూజోపచారాలను, పూజా సామాగ్రిని చూసి, సన్యాసికి ఆశ్చర్యమైంది.
కోణీ బాబాంచే పాయ ధూతీ | పళీంత అంగుష్ఠతీర్థ ఘేతీ |శుద్ధ సద్భావే సేవన కరితీ | నేత్ర స్పర్శితీ తై కోణీ | ||౨౫||
25. ఒకరు బాబా పాదాలను కడిగి, వారి బొటనవేలి తీర్థాన్ని, శుద్ధమైన భక్తిభావంతో, తీసుకుంటున్నారు. ఇంకొకరు, దాన్ని కళ్ళకద్దుకుంటున్నారు.
కోణీ లావితీ తయాంస గంధ | కోణీ ఫాంసితీ అత్తర సుగంధ |బ్రాహ్మణ శూద్రాది జాతి నిర్బంధ | గేలే సంబంధ విసరూని | ||౨౬||
26. మరొకరు గంధాన్ని, ఇంకొకరు అత్తరు సువాసనను అద్దుతున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రాది జాతి భేదాలన్నిటినీ మరచి పోయారు.
బాబా జరీ భరలే రాగే | సంన్యాసీ ఉచంబళలే అనురాగే |తయాచే పాఊల న నిఘే మాగే | బైసల్యా జాగే ఉఠేనా | ||౨౭||
27. బాబాకు కోపం వచ్చినా, సన్యాసికి వారిపై ప్రేమ ఉప్పొంగింది. కూర్చున్న చోటునుండి వెనుకకు పోవటం కాని, లేవటం కాని చేయలేదు.
రాహిలా శిరడీంత దోన దివస | ఇతుక్యాంత పత్ర ఆలే తయాస |అత్యావస్థ మాతా గాంవాస | తేణే ఉదాస తో ఝాలా | ||౨౮||
28. శిరిడీలో రెండు రోజులున్నాడో లేదో, ఇంతలో, ఊరిలో తన తల్లి చాలా జబ్బుతో ఉందని ఉత్తరం వచ్చింది. దాన్ని చూసి, అతనికి దుఃఖం కలిగింది.
ఆఈస భేటావే ఆలే మనీ | పరత జావే స్వదేశాలాగుని |పరి న బాబాంచే ఆజ్ఞేవాంచునీ | పాఊల తేథుని కాఢవే | ||౨౯||
29. వెంటనే తన ఊరికి తిరిగి వెళ్ళి, తల్లిని కలుసుకోవాలని అనిపించింది. కాని, బాబా అనుమతి లేకుండా, వెళ్ళాలని అనిపించ లేదు. అందుకే అడుగు కదల్చలేక పోయాడు.
మగ తే పత్ర ఘేఊని హాతీ | సంన్యాసీ గేలా మశీదీప్రతీ |బాబాంస కరూ లాగలా వినంతీ | మాతేచీ స్థితీ నివేదునీ | ||౩౦||
30. చేతిలో ఆ ఉత్తరాన్ని పట్టుకుని, సన్యాసి మసీదుకు వెళ్ళాడు. తల్లి పరిస్థితిని బాబాకు వివరించి, అనుమతి కోసం ప్రార్థించాడు.
‘మహారాజ సాఈ సమర్థా | మనీ మాతేచ్యా భేటీచీ ఆస్థా |
ఆజ్ఞా దీజే ప్రసన్నచిత్తా | మజ మార్గస్థా కృపా కరీ’ | ||౩౧||
31. ‘మహారాజా! సాయి సమర్థా! తల్లిని కలుసుకోవాలని నా మనసులో కోరికగా ఉంది. నా పై దయచూపి, వెళ్ళటానికి అనుమతిని ఇవ్వండి. ఈ యాత్రికుణ్ణి కరుణించండి’.
ధాంవోనీ లాగలా బాబాంచే చరణీ | ‘హోఈల కీ ఆజ్ఞా కృపా కరూనీ | మాతా ప్రాణ కంఠీ ధరుని | అసేల ధరణీ ఖిళలేలీ | ||౩౨||
32. అంటూ బాబా పాదాలను పట్టుకుని, ‘బాబా! దయచేసి నాకు అనుమతినిస్తారా? గొంతులో ప్రాణం పెట్టుకుని, నా తల్లి నేలపై పడి ఉంటుంది.
అసేల పాహత మాఝీ వాట | ఘేఊ ద్యా మజ దృష్టి భేట | హోతీల తిచే సహ్య కష్ట | సుఖే శేవట హోఈల’ | ||౩౩||
33. ‘నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళి నా కళ్ళతో చూసుకోనివ్వండి. దాంతో, ఆమె తన బాధను మరిచి సుఖంగా మరణిస్తుంది’.
సాఈ సమర్థ అంతర్‍జ్ఞానీ | త్యాచేంచ ఆయుష్య సరలే జాణునీ | వదతీ కాయ తయా లాగూనీ | చిత్త దేఊనీ తే పరిసా | ||౩౪||
34. అన్నీ తెలిసిన జ్ఞాని, సాయి సమర్థులు. సన్యాసి ఆయువే తీరిపోయిందని తెలుసు కనుక, అతనితో అన్న మాటలను శ్రద్ధగా వినండి.
“హోతా ఇతుకా మాతేచా లళా | తరీ కా హా వేష స్వీకారిలా | సాజేనా మమత్వ యా వేషాలా | కలంక భగవ్యాలా లావిలా | ||౩౫||
35. “తల్లికి ఇంతటి గారాల పట్టివైతే, ఈ సన్యాసి వేషాన్ని ఎందుకు వేసుకున్నావు? ఈ వేషానికి, మమకారం శోభించదు. కాషాయానికి కళంకం తెచ్చావు.
జా బైస త్వా వ్హావే న ఉదాస | జాఊ దే కీ థోడే దివస | కరూ మగ పుఢీల విచారాస | ధీర త్వా చిత్తాస ధరావా | ||౩౬||
36. “వెళ్ళి కూర్చో. ఏమీ చింతించకు. కొన్ని రోజులు గడవని. అప్పుడు ఆలోచిద్దాం. మనసును శాంతించి, ధైర్యం తెచ్చుకో.
వాడ్యాంత అసతీ బహుత చోర | కవాడే లావోని రహావే హుశార | సర్వస్వాచా కరితీల అపహార | ఘాలా అనివార ఘాలితీల | ||౩౭||
37. “వాడాలో చాలా మంది దొంగలుంటారు. తలుపులు వేసుకుని, జాగ్రత్తగా ఉండు. నీ మీద దాడి చేసి, అన్నింటినీ దొంగలించుకుని పోతారు.
వైభవ కధీంహీ నవ్హే శాశ్వత | శరీర హే తో సర్వదా అనిత్య | జాణూని మృత్యు నిత్య సన్నిహిత | ధర్మ జాగృత ఠేవావా | ||౩౮||
38. “కలిమి ఎప్పుడూ ఉండేది కాదు. ఈ దేహం శాశ్వతం కాదు. చావు ఎల్లప్పుడూ మన దగ్గరలోనే ఉన్నదని తెలుసుకుని, ధర్మ ప్రకారంగా నడుచుకోవాలి.
దేహ స్త్రీ పుత్రాదికీ | అహంమమాభిమాన జో లో్కీ | తత్‍ప్రయుక్త తాపత్రికీ5 | అనర్థ ఏహికీ యా నాంవ | ||౩౯||
39. “ఈ లోకంలో, దేహం మీద, భార్యాబిడ్డల మీద, ‘నేను, నాది’ అనే అభిమానం వలన కలిగే కష్టాలను, అనర్థాలను, ‘ఐహికాలు’ అని అంటారు.
దుజా అనర్థ ఆముష్మిక6 | జన జే జే పరలోకకాముక | పరలోక హీ మోక్ష ప్రబంధక | అధోముఖ7 సర్వదా | ||౪౦||
40. “రెండవ అనర్థం, ‘ఆముష్మికం’ అనేది. పరలోక సుఖాలు కావాలని అనుకునే వారికి, పరలోకాలు కూడా, మోక్షానికి అడ్డంకులు. అవి ఎప్పుడూ దిగజారటానికి కారణాలు.
తేథే నాహీ పుణ్యోపచయ | తేథీల ప్రాప్తీ నాహీ నిర్భయ |
క్షీణ పుణ్యే పతనభయ | ఆహే నిఃసంశయ తేథేంహీ | ||౪౧||
41. “అక్కడ పుణ్యాన్ని కూడబెట్టు కోవడానికి అవకాశం లేదు. భయం లేకుండా, స్వర్గ సుఖం కలుగదు. పుణ్యం కరిగిపోగానే, దిగజారటం ఉంటుంది. ఇందులో అనుమానమే లేదు.
తయాంచా త్యాగ నిఃశేఖ | ఆద్యోత్పాదక ఆనందా | ||౪౨||
42. “అందుకే ఈ ఐహిక, ఆముష్మికాలనే రెండు భోగాలు, అనర్థాలను కలిగించేవే. దాని కోసం, వానిని మూలంగా వదిలేయటం, ఆనందాన్ని కలిగించే ముఖ్య కారణాలు అవుతాయి.
సంసారాస జే జే విటలే | అఢళ హరి పదీ జే జే వినటలే | తయాంచ్యా బంధాచే బిరడేంచ ఫిటలే | ధరణే ఉఠలే అవిద్యేచే | ||౪౩||
43. “సంసారం పై విరక్తి కలిగి, శ్రీహరి పాదాలలో నిశ్చలమైన భక్తి కలిగిన వారి బంధనాలు విడిపోయి, వాటి మీద ఉన్న అజ్ఞానం తొలగిపోతుంది.
హరి భజన స్మరణాచీ ఘడీ | పాప తాప దైన్య దవడీ | ధ్యానాసి ఆణితా బహు ఆవడీ | సంకటీ ఉడీ ఘాలీ తో | ||౪౪||
44. “శ్రీహరి భజనలో, శ్రీహరిని తలచుకోవటంలో, గడిచిన సమయం, పాప, తాప, దైన్యాలను పోగొట్టుతుంది. ప్రేమతో శ్రీహరిని ధ్యానిస్తే, కష్టాలనుండి అతడు మనల్ని రక్షిస్తాడు.
తుఝీ పూర్వ పుణ్యాఈ గహన | తేణేంచ ఆలాసి హా ఠావ ఠాకూన | ఆతా మద్వచనీ ద్యావే అవధాన | కరూని ఘే సాధన జీవాచే | ||౪౫||
45. “వెనుకటి జన్మలలో నీవు పోగు చేసుకున్న పుణ్యం వలనే, ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు, నా మాటలను శ్రద్ధగా విని, జీవితాన్ని సార్థకం చేసుకో.
ఉద్యాంపాసూన భాగవతాచే | పరిశీలన కరావే సాచే | తీన సప్తాహ త్యా గ్రంథాచే | కాయా వాచా మనే కరీ | ||౪౬||
46. “రేపటినుండి, నీ ఆలోచన, మాట మరియు కార్యంలో శ్రద్ధ వహించి, భాగవతాన్ని మూడు వారాల పాటు పారాయణం చేయి.
హోఊనియా నిర్వాసన | కరీ త్యా గ్రంథాచే శ్రవణ | అథవా మనోభావే వాచన | నిదిధ్యాసన తత్పర | ||౪౭||
47. “ఏ కోరికలూ లేకుండా, ఆ గ్రంథాన్ని విను, లేదా, చదివినది మనసులో ఆలోచించుకుని, భక్తితో నీవే చదువుకో.
ప్రసన్న హోఈల భగవంత | సర్వ దుఃఖాంచా కరీల అంత | హోఈల మాయా మోహ శాంత | సౌఖ్య అత్యంత లాభేల | ||౪౮||
48. “భగవంతుడు ఆనందించి, నీకున్న అన్ని కష్టాలను తొలగిస్తాడు. నీకున్న మాయామోహాలు విడిపోయి, విపరీతమైన సుఖం దొరుకుతుంది.
హోఊనియా శుచిర్భూత | ఠేవూని హరిచరణీ చిత్త | సంపాదీ హే సాంగ వ్రత | మోహనిర్ముక్త హోశీల” | ||౪౯||
49. “స్నానం చేసిన తరువాత, హరి పాదాలలో మనసునుంచి, ఈ వ్రతాన్ని పూర్తి చేయి. మోహంనుండి ముక్తుడవుతావు” అని చెప్పారు.
ఆలా నికట స్వదేహా8 అపాయ | పాహూని బాబాంనీ హాచ ఉపాయ | యోజిలా వాచవిలా రామవిజయ | జేణే మృత్యుంజయ సంతుష్టే | ||౫౦||
50. తమ దేహానికి చివరి ఘడియలు దగ్గరకొచ్చాయని తెలుసుకుని, మృత్యుంజయుని తృప్తి పరచే రామవిజయాన్ని, బాబా చదివించుకున్నారు.
దుసరే దివశీ ప్రాతఃకాళీ | సారోని ముఖమార్జన అంఘోళీ |
వాహూని బాబాంస పుష్పాంజుళీ | చరణధుళీ వందిలీ | ||౫౧||
51. మరునాడు తెల్లవారే, సన్యాసి మొహం కడుక్కుని, స్నానం చేసి, బాబా పాదాల మీద పూవులు ఉంచి, నమస్కరించాడు. వారి పాద ధూళిని తన నొసట మీద రాసుకున్నాడు.
బగలేస మారిలే భాగవత | పాహిజే వాచావయాస ఎకాంత | లేండీస్థాన మౌజేచే శాంత | పడలే పసంత తయాంసీ | ||౫౨||
52. తరువాత, చంకలో భాగవతాన్ని పెట్టుకుని, పారాయణకు కావలిసిన ఏకాంతమైన చోటు వెదుకగా, శాంతంగా ఉన్న లెండీ అతనికి నచ్చింది.
గేలే బైసలే ఘాలూని ఆసన | సురూ కేలే పారాయణ | సంన్యాసీచ తే భగవత్పరాయణ | కేలే సంపూర్ణ దోన సప్తే | ||౫౩||
53. అక్కడికి వెళ్ళి, యోగంలో వేసుకునే ఆసనం వేసుకుని, పారాయణాన్ని ఆరంభించాడు. ఎప్పుడూ దేవుడి గురించే ఆలోచించే సన్యాసి, రెండు వారాలను పూర్తి చేశాడు.
కరూ ఘేతా తిసరా సప్తా | వాటలీ ఎకాఎకీ అస్వస్థతా | వాఢూ లాగలీ అశక్తతా | టాకిలా అపురతా తైసాచ | ||౫౪||
54. మూడవ సప్తాహం మొదలుపెట్టే సమయానికి, అకస్మాత్తుగా అతని ఆరోగ్యం చెడి, నీరసం ఎక్కువ అవటంతో, పారాయణను పూర్తి కాకుండానే ఆపివేశాడు.
ఆలా వాడియాంత పరతోన | కాఢిలే కష్టే దివస దోన | ఉజాడతా తిసరా దిన | బువాంనీ నయన ఝాంకిలే | ||౫౫||
55. వాడాకు తిరిగి వచ్చి, అక్కడ రెండు రోజులు చాలా కష్టంగా గడిపాడు. మూడవ రోజు తెల్లవారే సరికి, సన్యాసి శాశ్వతంగా కళ్ళు మూశాడు.
ఠేవూనియా నిజశిర | ఫకీర బాబాంచే మాండీవర | సంన్యాసీ ఝాలా తేథే స్థిర | ముక్తశరీర విదేహీ | ||౫౬||
56. ఫకీరు బాబా ఒడిలో తన తలనుంచి, కదలికలు లేక, స్థిరంగా ఉండిపోయాడు. దేహంనుంచి, అన్ని కోరికలనుంచి, ముక్తిని పొందాడు.
సంన్యాశాచే దేహావసాన | హోతా బాబాంస నివేదన | జాహలే తయాంచే ఆజ్ఞాపన | దేహ దినభర ఠేవావా | ||౫౭||
57. సన్యాసియొక్క మరణ వార్తను బాబాకు తెలిపినప్పుడు, ఆ దేహాన్ని ఒక రోజు అలాగే ఉంచమని వారు ఆజ్ఞాపించారు.
“ఇతక్యాంత టాకూ నకా పురూన” | హోఈల త్యాచే పునర్జీవన | లోకాంనీ బహు ఆశా ధరూన | కేలే రక్షణ దేహాచే | ||౫౮||
58. “అప్పుడే పూడ్చి పెట్టకండి” అని బాబా అన్నారు. దానితో, సన్యాసి మరల బ్రతుకుతాడేమో అని ప్రజలు చాలా ఆశతో, ఆ శరీరాన్ని కాపాడారు.
గేలా ఎకదా ప్రాణ నిఘూన | తో కాయ యే మాగే పరతోన | పరి బాబాంచా శబ్ద ప్రమాణ | దేహాచే జతన తే కేలే | ||౫౯||
59. ఒక సారి పోయిన ప్రాణం, మళ్ళీ తిరిగి వస్తుందా? అయినా, బాబా మాటల మీద నమ్మకంతో, ఆ దేహాన్ని భద్రపరిచారు.
పరిణామీ తే ఫళా ఆలే | నివారసీ ప్రేత రక్షిలే గేలే | పోలిసాంచే సంశయ ఫిటలే | జీవన కసలే మేల్యాంచే | ||౬౦||
60. దాని పరిణామం మంచిదే అయింది. దిక్కులేని శవాన్ని ఉంచటం వలన, పోలీసుల అనుమానాలు తీరిపోయాయి. అయినా చచ్చిన తరువాత, దేహంలో ఏం ప్రాణం ఉంటుంది?
హే కాయ బాబాంస నవ్హతే ఠావే | కీ మేలేలే కైసే ఉఠవావే |
హేతు న యోగ్య చౌకశీ అభావే | భుఈంత దాటావే త్యా ప్రేతా | ||౬౧||
61. మరి, మరణించిన వారిని బ్రతికించడం బాబాకు తెలియదా? (వారికి ఆ శక్తి ఉన్నది). కాని, సరియైన విచారణ జరగక మునుపే, శవాన్ని పూడ్చరాదు అనేదే బాబా ఉద్దేశం.
వ్హావీ న ఆధీంచ ప్రేతాచీ దాటణీ | మ్హణోన బతావణీ బాబాంచీ | ||౬౨||
62. వారసులు లేనివారికి, ప్రభుత్వమే దిక్కు. అందుకే, ఆకస్మిక చావులపై ప్రభుత్వం విచారణ జరుపుతుంది. కనుక, ఆ విచారణకు మునుపే శవాన్ని పూడ్చరాదు అని బాబా అలా చెప్పారు.
అసో పుఢే హే సర్వ ఝాలే | యథావిధీ ప్రేత తే సంస్కారిలే | యోగ్య స్థళీ మగ తే పురలే | కార్య ఉరకలే సంతాంచే | ||౬౩||
63. అదంతా జరిగిన తరువాత, ప్రేత సంస్కారం జరిగింది. శవాన్ని యోగ్యమైన చోటులో పూడ్చి పెట్టారు. దాంతో బాబా అనుకున్నది ముగిసింది.
ఏసీచ ఆణిక ఎక వార్తా | శ్రోతయాం లాగీ కథితో ఆతా | పరిసా క్షణభర సాదర చిత్తా | దిసేల వ్యాపకతా సాఈచీ | ||౬౪||
64. ఇలాంటిదే ఇంకొక సంగతిని శ్రోతలకు ఇప్పుడు చెప్పుతాను. దీనిని శ్రద్ధగా వినండి, తరువాత, సాయియొక్క వ్యాపకత్వం తెలుసుకుంటారు.
భక్త ఎక బాళారామ | మానకర జయాచే ఉపనామ | హోతే బాబాంచే భక్త పరమ | గృహస్థాశ్రమ కరూన | ||౬౫||
65. బాళారామ అని ఒక సాయి భక్తుడు. అతని ఉపనామం మాన్కరు. అతడు గృహస్థుడు.
పరి పుఢే తయాంచీ భార్యా | పంచత్వ పావూని ఆశ్రమకార్యా | వ్యత్యయ ఆలా అంతరలే స్థైర్యా | పరమైశ్వర్యా తే చఢలే | ||౬౬||
66. కొన్ని ఏళ్ళ తరువాత, అతని భార్య చనిపోయింది. దాంతో, గృహస్థాశ్రమంలో కొన్ని పనులు సరిగ్గా జరగక, ధైర్యం సడలి, మనసుకు శాంతి లేకుండా పోయింది. అదే అతనికి గొప్ప అదృష్టాన్ని తెచ్చి పెట్టింది.
పూర్వార్జిత ఫలప్రాప్తి | లాధలీ సాఈ చరణ సంగతీ | జడలీ తేథే నిశ్చల భక్తి | పూర్ణ విరక్తీ సంసారీ | ||౬౭||
67. వెనుక జన్మలలో చేసిన పుణ్యం వలన, అతనికి సాయి పాదాల సహవాసం దొరికింది. దాంతో నిశ్చలమైన భక్తి, సంసారం పట్ల పూర్తిగా విరక్తి కలిగాయి.
ఆశాపాశ ములే బాళే | తోడూనియా హే బంధ సగళే | పహా మానకర దైవా ఆగళే | సంసారా వేగళే జాహలే | ||౬౮||
68. ఆశా పాశాలను, బిడ్డల మీద ఉన్న మమకారాన్ని, బంధాలను, అన్నింటినీ వదులుకుని, భాగ్యవంతుడైన మాన్కరు, సంసారంనుండి బయట పడ్డాడు.
పరమార్థ ద్వారాచీ అర్గళా | పరసేవేచీ మోహనమాళా | ఘాలూనియా నిజపుత్రాంచే గళా | ఏహికా టాళా దిధలా | ||౬౯||
69. ఇతరుల సేవ అనేది, సాంసారిక జీవనంలో అందమైన ఒక అలంకార మాల. కాని, అదే పరమార్థానికి పెద్ద అడ్డంకి. అందుకే దానిని తన కొడుకు మెడలో వేసి, సంసార బాధ్యతలకు స్వస్తి చెప్పాడు.
హాహీ ఎక జాతీచా సంన్యాస | సంన్యాసాచ్యా పరి9 బహువస | పరి జో నవ్హే జ్ఞానగర్భన్యాస | ఉపజవీ త్రాస పదోపదీ | ||౭౦||
70. ఇది కూడా ఒక రకమైన సన్యాసమే. సన్యాసంలో ఎన్నో రకాలు. కాని, జ్ఞానాన్ని ఇవ్వని సన్యాసం, అడుగడుగునా కష్టాలనే తెచ్చి పెట్టుతుంది.
మ్హణూన హా సాఈ ఉదారమూర్తి | మానకరాచీ అనన్య భక్తీ |
కృపా కరావీ ఆలే చిత్తీ | కేలీ విరక్తీ దృఢ త్యాచీ | ||౭౧||
71. ఉదారమూర్తి అయిన సాయి, మాన్కరుని భక్తికి మెచ్చి, అతనిని అనుగ్రహించాలని అనుకొని, అతని వైరాగ్యాన్ని బాగా బలపరచారు.
అనంత జన్మీచే సంస్కార పటల | చంచల మన రాహీనా అచల | మనోరాజ్యాచే తరంగ ప్రబళ | వైరాగ్య అఢళ ఠరేనా | ||౭౨||
72. ఎన్నో జన్మల ప్రభావం వలన, అతని చంచలమైన మనసు స్థిరంగా ఉండుట లేదు. మనసులో లేచే, ఎన్నో బలమైన ఆలోచనల అలలు, కోరికలు, అతని వైరాగ్యాన్ని స్థిరంగా నిలువనీయటం లేదు.
శిరడీచ నవ్హే మాఝే స్థాన | మీ తో దేశకాళానవచ్ఛిన్న | దావావయా హే సప్రమాణ | కరీత ఆజ్ఞాపన మానకరా | ||౭౩||
73. “శిరిడీ ఒక్కటే నా చోటు కాదు. నేను దేశాలను, కాలాన్ని మీరిన వాణ్ణి” అని అనుభవంలో తెలియ చేయటానికి, బాబా మాన్కరుతో,
“పురే ఝాలీ ఆతా శిరడీ | హీ ఘే ఖర్చీ బారా రోకడీ10 | తపార్థ జాఈ మచ్ఛిందరగడీ | సుఖనిర్వడీ11 వస తేథే” | ||౭౪||
74. “ఇప్పటికి ఇక శిరిడీ చాలు! ఈ పన్నెండు రూపాయలను ఖర్చుకు తీసుకొని, మచ్ఛిందరగడకు వెళ్ళి, అక్కడ తపస్సు చేయి. సుఖంగా ఉండాలనే దృఢ నిశ్చయంతో అక్కడ ఉండు” అని చెప్పారు.
పరిసూని ఏసే సాఈవచన | ఆజ్ఞా కరూని శిరసా వందన | ఘాలూని సాష్టాంగ లోటాంగణ | కేలే అభివందన పాయాంచే | ||౭౫||
75. సాయి మాటలను విని, మాన్కరు తల వంచి, వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
హోఊనియా అతి వినీత | వదే బాళారామ సాఈప్రత | ‘నాహీ ఆపులే దర్శన జేథ | కాయ మ్యా తేథ కరావే | ||౭౬||
76. ఎంతో వినయంగా సాయితో, ‘మీ దర్శనం కూడా లేని చోట, నేనేం చేయాలి?’ అని బాళారామ అడిగాడు.
యేథే నిత్య పాయాంచే దర్శన | ఘడే చరణతీర్థ సేవన | హోఈ అహర్నిశ సహజీ చింతన | తేథే మీ అకించన ఎకలా | ||౭౭||
77. ‘ఇక్కడ ప్రతి రోజూ మీ పాదలను చూడగలను, మీ పాద తీర్థాన్ని తీసుకోగలను, మరియు సహజంగా రాత్రింబవళ్ళూ మీ ధ్యాసే ఉంటుంది. అక్కడ దీనుణ్ణైన నేను ఒక్కణ్ణే ఉండాలి.
తరీ బాబా ఆపణా విరహిత | కాయ తేథే మాఝే స్వహిత | హే ఆకళాయా నాహీ మీ సమర్థ | ధాడితా మజ కిమర్థ తే స్థానీ’ | ||౭౮||
78. ‘అయినా బాబా! మీరు లేకుండా, అక్కడ నాకేం మంచి జరుగుతుందో, తెలుసుకోగల శక్తి నాకు లేదు. నన్నెందుకు అక్కడికి పంపిస్తున్నారు?’ అని అన్నాడు.
పరీ న భక్తే ధరావా అల్ప | నిజ గురు వచనీ ఏసా వికల్ప | తాత్కాళ మనాంత ఉఠలా సంకల్ప | నిర్వికల్ప మానకర | ||౭౯||
79. ‘గురువు మాటల మీద భక్తులకు ఏ కొంచెం కూడా అనుమానాలు ఉండకూడదు’ అని మాన్కరు అనుకున్నాడు. వెంటనే అతని అనుమానాలన్నీ తొలగిపోయాయి.
మ్హణే ‘బాబా క్షమా కీజే | క్షుద్ర బుద్ధీచే విచార మాఝే | ఝాలో శంకిత తేణే మీ లాజే | శంకా న సాజే హీ మజ | ||౮౦||
80. ‘బాబా! క్షమించండి. క్షుద్రబుద్ధి వలన కలిగిన నా అనుమానాలన్నీ తొలిగాయి. అందుకు నేను సిగ్గు పడుతున్నాను. ఇలాంటి సందేహాలు నాకు శోభించవు.
మీ తో అపులా ఆజ్ఞాధర | రాహూన నామస్మరణ తత్పర |
కేవళ అపుల్యా సామర్థ్యావర | గడావరహీ రాహీన | ||౮౧||
81. ‘నేను కేవలం మీ ఆజ్ఞను పాటించే దాసుణ్ణి. ఎల్లప్పుడూ, మీ నామస్మరణలో లీనమైనవాణ్ణి. కేవలం మీ బలంతోనే, నేను ‘గడ’ లో ఉంటాను.
అపుల్యాచ పాయాంచే చింతన | హేంచి చిరంతన తప మాఝే | ||౮౨||
82. ‘అక్కడే మీ ధ్యానం చేస్తాను. దయామయులైన మీ ముఖాన్ని తలచుకుంటూ ఉంటాను. మీ పాదాలనే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాను. అదే నా శాశ్వతమైన తపస్సు.
అనన్య శరణ మీ తుమ్హాప్రతీ | మాఝీ గమనాగమన స్థితీ | దిధలీ అసతా తుమ్హా హాతీ | హా కా చిత్తీ విచార | ||౮౩||
83. ‘వేరే ఏ ధ్యాసా లేకుండా, మీకు శరణుజొచ్చుతున్నాను. నా రాకపోకలను మీ చేతులలో పెట్టాను, ఇక నేనెందుకు అనుమానించాలి?
తవాజ్ఞేచీ నిజ సత్తా | తేథేంహీ మనాస దేఈల శాంతతా | ఏసీ తుమచీ అసతా సమర్థతా | వ్యర్థ కా చింతా వాహూ మీ’ | ||౮౪||
84. ‘మీ ఆజ్ఞ, మీ బలంతో, నా మనసుకు శాంతి కలుగుతుంది. మీ సామర్థ్యం ఇంతగా ఉండగా, నేను వ్యర్థంగా ఎందుకు చింతించాలి?’ అని అన్నాడు.
సాఈ సమర్థ బ్రహ్మ సనాతన | బ్రహ్మలిఖిత తయాచే వచన | పాహీల జో విశ్వాస ఠేవూన | ఘేఈల పూర్ణ అనుభవ తో | ||౮౫||
85. సాయి సమర్థులు తుది మొదలు లేని బ్రహ్మ. వారి మాటలు బ్రహ్మలిఖితాలు. నమ్మకమున్న వారికి దీని నిజం అనుభవంతో తెలుస్తుంది.
మగ బాబా వదతీ తయాసీ | “సావధాన హోఊని మనాసీ | పరిస గా తూ మద్వచనాసీ | వికల్ప సాయాసీ పడూ నకో | ||౮౬||
86. తరువాత, బాబా అతనితో, “నా మాటలను జాగ్రత్తగా విను. వేరే అనుమానాలతో కష్టపెట్టుకోకు.
జాఈ మచ్ఛిందరగడీ సత్వర | కరీ ప్రత్యహీ తప త్రివార | కాంహీ కాళ క్రమిల్యావర | స్వానంద నిర్భర హోసీల” | ||౮౭||
87. “తొందరగా మచ్ఛిందరగడకు వెళ్ళు. ప్రతి రోజూ మూడు సార్లు తపస్సు చేయి. కొంత కాలానికి పరమానందాన్ని అనుభవిస్తావు” అని చెప్పారు.
ఏకతా ఏసే ఆశ్వాసన | మానకరాంసీ పడలే మౌన | పుఢే మీ కాయ బోలూ దీన | గడాభిగమన ఆరంభీ | ||౮౮||
88. ఆ నమ్మకాన్ని కలిగించే మాటలను విని, మాన్కరు, ‘ఇక నేనేం మాట్లాడగలను?’ అని మౌనంగా ఉన్నాడు. తరువాత ’గడ’ కు పోవడానికి సిద్ధమయ్యాడు.
పునశ్చ లాగోని సాఈ చరణా | పావోని ఉదీ ప్రసాదాశిర్వచనా | మగ మానకర స్వస్థ మనా | మచ్ఛిందర భువనా నిఘాలే | ||౮౯||
89. మళ్ళీ సాయి పాదాలకు నమస్కరించి, వారి ఆశీస్సులు, ఉదీ ప్రసాదాన్ని తీసుకుని, మచ్ఛిందరకు బయలుదేరాడు.
ఠాకోనియా తే రమ్య స్థాన | జేథే శుద్ధ నిర్మళ జీవన | మంద మంద వాహే పవన | సమాధాన పావలే | ||౯౦||
90. ఆ సుందరమైన చోటుకు చేరుకుని, అక్కడి నిర్మలమైన నీటిని, మెల్లమెల్లగా వీచే గాలిని చూసి, మాన్కరు ఎంతో సమాధానం పొందాడు.
ఏసే మానకర సాఈ ప్రయుక్త | అసతా గడావర సాఈ వియుక్త |
ఆచారితే ఝాలే తప యథోక్త | యథానియుక్త రాహూని తై | ||౯౧||
91. సాయి ఆజ్ఞతో, మాన్కరు అలా ఆ ‘గడ’ లోనే, సాయి లేకుండా, వారు చెప్పినట్లు, నియమంగా తపస్సును చేస్తూ ఉన్నాడు.
పహా బాబాంచా చమత్కార | తపనిమగ్న అసతా మానకర | ప్రత్యక్ష దిధలే దర్శన గడావర | ఝాలా సాక్షాత్కార తయాంస | ||౯౨||
92. బాబా చమత్కారాన్ని చూడండి. మాన్కరు తపస్సులో ఉండగా, ‘గడ’ లో బాబా దర్శనమిచ్చారు. మాన్కరుకు ఈ అద్భుతమైన అనుభవం కలిగింది.
హోఈల దర్శన సమాధిస్థా | యదర్థీ కాంహీ నాహీ ఆశ్చర్యతా | పరీ ఆసనస్థిత ఉత్థానావస్థా | అసతా శ్రీ సమర్థా దేఖిలే | ||౯౩||
93. ధ్యానంలో లీనమై ఉన్నప్పుడు, దర్శనం కలగటంలో ఏమీ ఆశ్చర్యం లేదు. కాని, మేలుకొని ఉన్నప్పుడు, ఆసనంలో కూర్చుని ఉండగా, అతనికి సాయి దర్శనం కలిగింది.
నాహీ కేవళ దృష్టీ దేఖిలే | బాళకరామే సమక్ష పుసిలే | ‘కా మజ బాబా యేథే ధాడిలే’ | కాయ దిధలే ప్రత్యుత్తర | ||౯౪||
94. కళ్ళతో చూడటం ఒకటే కాదు, బాళకరాము బాబాను ‘బాబా! నన్నెందుకు ఇక్కడకు పంపారు?’ అని అడిగాడు కూడా. దానికి బాబా జవాబు ఏమిటి?
“శిరడీంత అసతా అనేక కల్పనా | ఉఠూ లాగలే తరంగ నానా | మ్హణోని తుఝియా చంచల మనా | గడప్రయాణా నేమియలే | ||౯౫||
95. “శిరిడీలో ఉండగా, ఎన్నో రకాల ఆలోచనలు, అనుమానాలు, నీ మనసులో లేచేవి కదా, అందుకని, చంచలమైన నీ మనసు కుదుట పడాలని గడ ప్రయాణానికి ఆజ్ఞాపించాను.
పృథ్వీ ఆపాదికాంచా గారా | రచోని రచియేల్యా యా అగారా12 | సాడే తీన హాతాంచియా ఘరా | శిరడీ బాహేరా నవ్హతో తుజ | ||౯౬||
96. “నేల, నీరు మొదలైన పంచభూతాల కలయికతో చేయబడిన ఈ మూడున్నర మూరల దేహం, శిరిడీ బయట ఉండదని అనుకున్నావు.
ఆతా జో యేథే తోచ కీ తేథే | పాహూని ఘేఈ స్వస్థ చిత్తే | తేథూని జే మ్యా పాఠవిలే తూతే | తేయేచ నిమిత్తే తూ జాణ” | ||౯౭||
97. “కాని, ఇప్పుడు ఇక్కడ నీవు చూస్తున్న నేనే, అక్కడా ఉండేది. స్థిరమైన మనసుతో, సరిగ్గా చూడు. నిన్ను అక్కడనుండి పంపినది దీని కోసమే”.
అసో పుఢే హే మానకర | ఉద్దిష్ట కాళ క్రమిల్యావర | యావయా అపుల్యా ముక్కామావర | సోడిలా మచ్ఛిందరగడ త్యాంనీ | ||౯౮||
98. అలా నిర్ణయించిన కాలం గడిచాక, మాన్కరు తన గ్రామానికి చేరుకోవాలని, మచ్ఛిందరగడను విడిచాడు.
వాంద్రే గ్రామ వసతిస్థాన | యావే తేథే జాహలే మన | దాదరపర్యంత పుణ్యాహూన | యోజిలే ప్రయాణ అగ్నిరథే | ||౯౯||
99. బాంద్రా అతని గ్రామం. అక్కడికి వెళ్ళాలని అనిపించింది. అందుకు పుణేనుండి దాదరు వరకు, రైలు బండిలో ప్రయాణం చేయాలని అనుకున్నాడు.
గేలే పుణ్యాచే స్టేశనావర | యేతా తికీట ఘేణ్యాచా అవసర | హోతా ఖిడకీపాశీ సాదర | వర్తలా చమత్కార తంవ ఎక | ||౧౦౦||
100. పుణే స్టేషనుకు వెళ్ళి, టికెట్టు తీసుకోవటానికి కిటికీ దగ్గరకు వెళ్ళగానే, ఒక చమత్కారం జరిగింది.
లంగోటీ ఎక కటిప్రదేశీ | ఖాందా కాంబళీ కుణబీ వేషీ |
ఏసా ఎక అనోళఖీ ప్రవాసీ | ఖిడకీపాశీ దేఖిలా | ||౧౦౧||
101. నడుముకు ఒక లంగోటీని కట్టుకుని, భుజంపై ఒక కంబళిని వేసుకుని, ఒక తెలియని కుణబి (రైతు) ప్రయాణికుడు కిటికీ దగ్గర కనిపించాడు.
బాలకరామాచీ దృష్టాదృష్ట | హోతాంచి నికట పాతలా | ||౧౦౨||
102. దాదరుకు టికెట్టును తీసుకుని, అతను వెనుకకు తిరిగాడు. బాలకరామును చూసి, అతని దగ్గరకు వచ్చాడు.
మ్హణే తుమ్హీ కోఠే జాతా | దాదరాస బాళకరామ వదతా | తికీట దేఊని టాకిలే తత్వతా | మ్హణే హే ఆతా తుమ్హీ ఘ్యా | ||౧౦౩||
103. ‘మీరు ఎక్కడికి వెడుతున్నారు?’ అని అడిగాడు. ‘దాదరకు’ అని బాళకరాం జవాబిచ్చాడు. వెంటనే అతను తన టికెట్టును బాళకరాంకు ఇస్తూ, ‘మీరు దీనిని తీసుకొండి.
మీహీ జాణార హోతో తేథే | పరి మహత్కార్యాంతర యేథే | కర్తవ్య ఆహే ఆఠవలే మాతే | మ్హణూన జాణే తే రాహిలే | ||౧౦౪||
104. ‘నేను కూడా అక్కడికే వెళ్ళాల్సింది, కాని ఇంతలో ఇక్కడ పెద్ద పని ఒకటి గుర్తుకు వచ్చింది. దాని వలనే, నేను ప్రయాణం చేయటం లేదు’.
వేంచితాంహీ గాంఠీచే దామ | తికీట మిళవిణే కఠీణ కామ | తే జై లాధే అవిశ్రమ | సంతోష పరమ మానకరా | ||౧౦౫||
105. డబ్బు ఖర్చుపెట్టి, శ్రమ పడినా, టికెట్టు దొరకడం కష్టం. అలాంటిది, ఇంత సులభంగా టికెట్టు చేతికందినందుకు, మాన్కరుకు పరమానందం కలిగింది.
పుఢే తే మోల చుకవవాయాలా | ఖిశాంతూన జో పైకా కాఢిలా | తోంచ తో కుణబీ దాటీంత ఘుసలా | కోఠే నిసటలా కళేనా | ||౧౦౬||
106. టికెట్టు డబ్బులివ్వడానికి జేబులోనుండి డబ్బు తీసి చూడగా, ఆ కుణబి గుంపులో కలిసి పోయి, మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో, తెలియలేదు.
తేవ్హా తో కుణబీ శోధావయాలా | బాళకరామే ప్రయత్న వేంచిలా | పరి తో సర్వ నిర్ఫళ గేలా | యేఊని ఠేలా అగ్నిరథ | ||౧౦౭||
107. కుణబీని వెదకాలని, బాళకరాం చాలా ప్రయత్నం చేశాడు. కాని, అతను దొరకలేదు. ఇంతలో, రైలు బండి వచ్చింది.
నాహీ జోడా వహాణ పాయీ | ఫటకూర ఎక వేష్టిలే డోఈ | ఖాందీ కాంబళ లంగోటీ లావీ | కుణబీ భాఈ హా కోణ | ||౧౦౮||
108. ‘పాదాలకు జోళ్ళు లేవు. తలకొక పాత గుడ్డ చుట్టుకుని, భుజం మీద కంబళి, నడుముకు లంగోటీతో ఉన్న ఈ కుణబీ సోదరుడు ఎవరు?’
భాడే నాహీ థోడే థోకడే | తేంహీ దేఊని పల్లవచే రోకడే | కా మజ ఆభారాచే సాంకడే | ఘాతలే హే కోడే నులగడే | ||౧౦౯||
109. ‘టికెట్టు డబ్బు కూడా కాస్తోకూస్తో కాదు. పెద్ద మొత్తమే. అదీ అతని స్వంత డబ్బు. నన్నెందుకు ఇలా ఋణగ్రస్తుణ్ణి చేశాడు? ఏమిటో ఈ చిక్కుముడి అర్థం కావటం లేదు’.
ఉదార ఆణి నిరపేక్ష స్వాంతీ13 | ఏసా హా కోణ కుణబీ వరకాంతీ | రాహూన గేలే అనిశ్చిత అంతీ | లాగలీ ఖంతీ మానకరా | ||౧౧౦||
110. ‘ఏమీ ఆశించని ఉదారుడు. పైకి రైతులా కనిపించినా, ఈ కుణబీ ఎవరై ఉంటారు?’ అనే చింత చివరి వరకూ మాన్కరుకు విడదీయరాని సమస్యగా తయారైంది.
తైసేచ మగ తే ఆశ్చర్యచకిత | ధరోని భేటీచా పోటీ హేత |
అగ్నిరథ జాగేచా హాలేపర్యంత | ఠేలే తటస్థ ద్వారాంత | ||౧౧౧||
111. ఎంతో కుతూహలంతో, అతడు మళ్ళీ కలుస్తాడేమోనని, రైలు బండి తలుపు దగ్గరే నిలబడ్డాడు. కాని, అంతలో రైలు బండి కదిలింది.
పుఢే జేవ్హా గాడీ సుటలీ | సమూళ భేటీచీ ఆశా ఖుంటలీ | జాణూన గాడీచీ ఖీళ పకడిలీ | ఉడీ మారిలీ గాడీంత | ||౧౧౨||
112. బండి కదిలాక, ఇక అతడు కలుస్తాడన్న ఆశంతా పోయి, రైలు తలుపులకు ఉన్న కమ్మిని పట్టుకుని, బండిలోకి దూకాడు.
గడావరీల ప్రత్యక్ష గాంఠ | తైసాచ ఇకడే హా నిరాళా ఘాట | పాహూన కుణబ్యాచా విచిత్ర థాట | లాగలీ చుటపుట14 మానకరా | ||౧౧౩||
113. ‘గడ’ లో ఎదురుగా దర్శనం, ఇక్కడ ఈ అనుకోని ఘటన. కుణబియొక్క విచిత్ర రూపాన్ని తలుచుకుని, మాన్కరు ఆలోచనలో పడ్డాడు.
అసో పుఢే హే సద్భక్త | సాఈపదీ పూర్ణానురక్త | దృఢ శ్రద్ధా భక్తి సంయుత | జాహలే కృతార్థ శిరడీంత | ||౧౧౪||
114. అలా తరువాత, ఈ సద్భక్తుడికి సాయి పాదాలయందు స్థిరమైన ప్రేమ, భక్తి, శ్రద్ధలు కలిగి, తన జీవితాన్ని శిరిడీలోనే సార్థకం చేసుకున్నాడు.
సాఈ సంలగ్న పదాబ్జరజీ | సాఈనామాచీ ఘాలీత రుంజీ | భక్త భ్రమర బాలకరామజీ | శిరడీమాజీంచ రాహిలే | ||౧౧౫||
115. కమలం పుప్పొడి చుట్టూ తిరిగే తేనెటీగలాగా, సాయి పాదాల చుట్టూ, సాయి నామాన్ని ధ్యానిస్తూ, బాలకరామజీ శిరిడీలోనే ఉన్నాడు.
ఘేఊని బాబాంచే అనుజ్ఞాపన | ముక్తారామజీ సవే ఘేఊన | కధీ కధీ హే శిరడీ సోడూన | కరీత భ్రమణ బాహేర | ||౧౧౬||
116. అప్పుడప్పుడు, బాబా అనుమతితో, ముక్తారాంను వెంటబెట్టుకుని, శిరిడీ విడిచి బయటికి వెళ్ళేవాడు.
పరి శిరడీ కేంద్రస్థాన | వేళో వేళీ యేత పరతోన | అఖేర జాహలే దేహ విసర్జన | పరమ పావన శిరడీంత | ||౧౧౭||
117. ఎక్కడికి వెళ్ళినా, మళ్ళీ శిరిడీకే వస్తుండే వాడు. చివరికి, పావనమైన శిరిడీలోనే తన దేహాన్ని చాలించాడు.
ధన్య పూర్వకృత భాగధేయ15 | హోఊని సాఈచా దృష్టి విషయ | లాగూన తయా పాయీ లయ | మరణ నిర్భయ పావే జో | ||౧౧౮||
118. వెనుకటి జన్మలలో పుణ్యం సంపాదించుకున్న వారు, సాయి దృష్టిలో పడి, సాయి పాదాలలో లీనమైన వారు, ఏ భయమూ లేని చావును పొందుతారు.
ధన్య తాత్యాసాహేబ నూలకర | ధన్య మేఘా భక్తప్రవర | అంతీ శిరడీంత భజనతత్పర | జిహీ కలేవర16 విసర్జిలే17 | ||౧౧౯||
119. ధన్యుడు తాత్యాసాహేబు నూల్కరు, ధన్యుడు భక్తశ్రేష్ఠుడైన మేఘా. వీరు కూడా సాయి భజనలో లీనమై, చివరకు శిరిడీలోనే తమ ప్రాణాలను విడిచిన ధన్యులు.
మేఘా జేవ్హా పావలా పంచత్వ18 | పహా తై ఉత్తరవిధాన మహత్వ | ఆణీక బాబాంచే భక్త సఖ్యత్వ | మేఘా తో కృతకృత్య ఆధీంచ | ||౧౨౦||
120. మేఘా చనిపోయినప్పుడు, అతని అంతిమ క్రియలు చాలా గొప్పగా జరిగాయి. ఆ భక్తుని పైన బాబాకు గల అభిమానాన్ని గమనించండి. మేఘా తన జన్మను సార్థకం చేసుకున్నాడు.
సవే ఘేఊన భక్త సమస్త | స్మశాన యాత్రేస గేలే గ్రామస్థ |
బాబాహీ గేలే స్మశానాప్రత | పుష్పే వర్షత మేఘావర | ||౧౨౧||
121. భక్తులంతా వెంట రాగా, గ్రామస్థులు మేఘాను స్మశానానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళినప్పుడు, బాబా కూడా వారి వెంట వెళ్ళి, మేఘా దేహంపై పువ్వులను కురిపించారు.
మాయానువర్తీ మానవా సమ | శోకనిర్విణ్ణ మానస | ||౧౨౨||
122. అంతిమ సంస్కారమంతా జరిగాక, బాబా కళ్ళల్లో నీరు నిండింది. మాయలో చిక్కుకున్న ఒక సాధారణ మనిషివలె దుఃఖించ సాగారు.
ప్రేమే బాబాంనీ నిజ కరే | ప్రేత ఆచ్ఛాదిలే సుమన నికరే | శోకహీ కరూని కరుణ స్వరే | మగ తే మాఘారే పరతలే | ||౧౨౩||
123. ఎంతో ప్రేమతో, బాబా తమ చేతులతో శవాన్ని పూలతో కప్పి, దీనంగా శోకించి, వెనుకకు మరలి వచ్చారు.
మానవాంచా ఉద్ధార కరితీ | ఏసే సంత దేఖిలే బహుతీ | పరి సాఈబాబాంచీ తీ మహతీ | వర్ణన కితీ కరావీ | ||౧౨౪||
124. తోటి మనుషులను ఉద్ధరించే సాధువులను ఎందరినో చూశాము కాని, సాయిబాబాయొక్క గొప్పతనం ఎంతని వర్ణించగలం?
వ్యాఘ్రాసారిఖా క్రూర ప్రాణీ | తో కాయ మనుష్యాపరీ జ్ఞానీ | పరీ తోహీ లాగే తయాంచే చరణీ | అఘటీత కరణీ బాబాంచీ | ||౧౨౫||
125. ఎంతో కౄరమైన పులిలాంటి ప్రాణికి, మనుషుల లాగ జ్ఞానం ఉంటుందా? అది కూడా వారి పాదాలను ఆశ్రయించింది. బాబా లీలలు అమోఘంగా ఉంటాయి!
యే అర్థీచీ రమ్య కథా | పరిసా నీట దేఊని చిత్తా | మగ కళేల బాబాంచీ వ్యాపకతా | సమచిత్తతా సకళికీ | ||౧౨౬||
126. ఈ సందర్భంలో ఒక అందమైన కథను శ్రద్ధగా వినండి. దాంతో, అందరి మీద బాబాకున్న సమానమైన ప్రేమ, మరియు వారు అంతటా వ్యాపించివున్న సంగతి మనకు తెలుస్తుంది.
శిరడీస ఎకదా చమత్కార ఝాలా | అసతా సప్త దిన నిర్యాణాలా19 | గాడా ఎక బైలాంచా ఆలా | రాహిలా ఉభా ద్వారాంత | ||౧౨౭||
127. శిరిడీలో ఒక సారి ఒక చమత్కారం జరిగింది. బాబా మహాసమాధికి ఏడు రోజులు మునుపు, ఒక ఎద్దుల బండి వచ్చి, మసీదు తలుపుల దగ్గర నిలబడింది.
వరీ ఎక వ్యాఘ్ర ప్రచండ | గళా జయాచే సాఖళదండ | జఖడూన టాకిలా ఉదండ | భ్యాసూర తోండ మాగిలీకడే | ||౧౨౮||
128. ఆ బండి వెనుకకు ఒక భయంకరమైన పులి. దాని మెడ గొలసులతో గట్టిగా కట్టబడి ఉంది. దాని మొహం చాలా భయంకరంగా ఉంది.
త్యాలా కాంహీ హోతీ వ్యథా | దరవేశీ థకలే ఉపాయ కరితా | సంత దర్శనోపాయ సరతా20 | మానలా చిత్తా తయాంచే | ||౧౨౯||
129. దానికి ఏదో బాధ ఉండేది. దానితో ఉన్న ‘దరవేశీలు’ దానికి ఎన్నెన్నో చికిత్సలు చేయించి అలసిపోయారు. చివరికి, సత్పురుషుల దర్శనంతో అది బాగు పడవచ్చు అని వారికి అనిపించింది.
హోతే తే దరవేశీ తీన | తో వ్యాఘ్ర త్యాంచ్యా జీవికేచే సాధన | గాంవోగాంవీ ఖేళ కరూన | కరితీ గుజరణ ఆపులీ | ||౧౩౦||
130. ఆ పులిని ఆడించే ‘దరవేశీలు’ ముగ్గురు. ఆ పులినుంచే వారి బ్రతుకు తెరువు. ఊరూరు తిరుగుతూ, పులిని ఆడిస్తూ, బ్రతుకుతున్న వారు.
ఫిరతా ఫిరతా త్యా బాజూలా | కర్ణీ ఆలీ బాబాంచీ లీలా |
మ్హణతీ దర్శన ఘేఊ చలా | వాఘహీ నేఊ తే ఠాయీ | ||౧౩౧||
131. శిరిడీ దగ్గర వారు తిరుగుతండగా, బాబా లీలలు వారి చెవిన పడ్డాయి. ‘బాబా దర్శనం చేసుకుందాం, పులిని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళుదాము’ అని అనుకున్నారు.
చరణ తయాచే చింతామణీ | అష్టసిద్ధీ లోటాంగణీ | నవనిధీ యేతీ లోళణీ | ఘేతీ పాయవణీ21 తయాచే | ||౧౩౨||
132. ‘వారి పాదాలు, కోరికలను తీర్చే చింతామణి. ఎనిమిది సిద్ధులూ, వారికి సాష్టాంగ పడతాయి. తొమ్మిది నిధులూ, వారి పాదాల దగ్గర దొర్లుతూ, వారి పాద తీర్థాన్ని తీసుకుంటున్నాయి.
మాథా ఠేవూ తయా చరణీ | దువా మాగూ వ్యాఘ్రాలాగునీ | సంతాంచ్యా ఆశీర్వాద వచనీ | కల్యాణ హోఈల సర్వాంచే | ||౧౩౩||
133. ‘కనుక, వారి పాదాల మీద తలనుంచి, పులి కోసం వారి అనుగ్రహాన్ని కోరుకుందాం. సత్పురుషుల ఆశీర్వచనం అందరికీ మంచిది’.
ఎతదర్థ తే దరవేశీ | వ్యాఘ్రాస ఉతరవితీ ద్వారాపాశీ | ఘట్ట ధరూని సాఖళీదండాసీ | తిష్ఠత ద్వారాసీ రాహిలే | ||౧౩౪||
134. అని అనుకుని, వారు పులిని తలుపుల దగ్గర దింపి, గొలసులతో గట్టిగా పట్టుకుని, తలుపుల దగ్గర నిలుచున్నారు.
ఆధీంచ హింస్త్ర భయానక మస్త | వరీ హోతా తో రోగగ్రస్త | తేణే తో అత్యంత అస్వస్థ | కౌతూక సమస్త పాహతీ | ||౧౩౫||
135. అసలే పులి భయంకరమైన కౄర ప్రాణి. పైగా జబ్బు చేసింది. దానివలన, అది మరీ కలవరంతో ఉంది. అందరూ దానిని కుతూహలంగా చూస్తున్నారు.
వ్యాఘ్రాచీ స్థితీ బాబాంచే కానీ | ఘాతలీ సమగ్ర దరవేశాంనీ | బాబాంచీ ఆధీ సంమతీ మిళవూని | ఆలే పరతోని దారాశీ | ||౧౩౬||
136. తరువాత ఆ దరవేశీలు, పులి జబ్బు గురించి, బాబాకు విన్నవించారు. బాబా అనుమతిని పొంది, మళ్ళీ తలుపుల దగ్గరికి వచ్చారు.
సాఖళదండ దృఢ కసితీ | తోడూన న పళే ఏసే కరితీ | మగ త్యాస సాంభాళూని ఆణితీ | సాఈప్రతీ సమోర | ||౧౩౭||
137. గొలుసులను తెంపుకుని పులి పారిపోకుండా, బాగా గట్టిగా పట్టుకుని, దానిని జాగ్రత్తగా సాయి ఎదుటికి తెచ్చారు.
పాహోని సాఈ తేజోరాశీ | వ్యాఘ్ర యేతాంచ పాయరీ పాసీ | నకళే కాయ దచకలా మానసీ | అత్యాదరేసీ అధోముఖ | ||౧౩౮||
138. మెట్ల దగ్గరకు రాగానే, ఎంతో కాంతితో వెలుగుతున్న సాయిని చూసి, ఆ పులికి ఏమనిపించిందో కాని, ఎంతో గౌరవంగా ముఖాన్ని క్రిందకు వంచింది.
కాయ పహా చమత్కార | హోతా పరస్పర నజరానజర | వ్యాఘ్ర చఢతాంచ పాయరీవర | ప్రేమపురఃసర నిరీక్షీ | ||౧౩౯||
139. ఏమి ఆ చమత్కారం! మెట్లెక్కుతున్న పులి, బాబా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ పులి ఎంతో ప్రేమగా బాబాను చూసింది.
లగేచ పుచ్ఛాచా గోండా ఫులవిలా | త్రివార ధరిత్రీ ప్రహార కేలా | సాఈచరణీ దేహ ఠేవిలా | వికళ పడలా నిశ్చేష్ట | ||౧౪౦||
140. అంతే, వెంటనే తోకను పైకి ఎత్తి, మూడు సార్లు భూమిని కొట్టి, సాయి పాదాల దగ్గర ప్రాణం వదిలి, కదలిక లేకుండా పడిపోయింది.
ఎకదాంచ భయంకర డరకలా | తాత్కాళ ఠాయీంచ పంచత్వ పావలా |
జన సకళ విస్మయాపన్న ఝాలా | వ్యాఘ్ర నిమాలా పాహూని | ||౧౪౧||
141. భయంకరంగా ఒక సారి గట్టిగా గర్జించి, వెంటనే, అక్కడే చనిపోయింది. ఆ చావు చూసి, అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
కీ రోగగ్రస్త ఆసన్నమరణ | ప్రాణీ నిర్వాణ పావలా | ||౧౪౨||
142. దరవేశీలు దుఃఖ పడ్డారు, కాని, ఇంకో రకంగా ఆనందించారు కూడా. ఎందుకంటే, జబ్బుతో బాధ పడటం కంటే, ఆ పులి తన చావుతో, ముక్తిని పొందింది.
సాధుసంతాంచే దృష్టీసమోర | ప్రాణోత్‍క్రమణీ పుణ్య థోర | కృమి కీటక వా వ్యాఘ్ర | పాప సమగ్ర తో తరలా | ||౧౪౩||
143. సాధు సత్పురుషుల కళ్ళెదుట ప్రాణం పోవటం, చాలా గొప్ప పుణ్యం. క్రిమి కీటకాలు కాని, పులిగాని, వాని పాపాలన్నీ తొలగిపోతాయి.
కాంహీ మాగీల జన్మాచా ఋణీ | ఫేడిలే ఋణ ఝాలా అనృణీ | దేహ ఠేవిలా సాఈచరణీ | అఘటిత కరణీ విధీచీ | ||౧౪౪||
144. వెనుకటి జన్మలో, ఏదో ఋణం బాకీ ఉండి ఉంటుంది. దానిని ఇప్పుడు ఆ పులి తీర్చుకుని, ముక్తిని పొందింది. సాయి పాదాల దగ్గర ప్రాణాన్ని వదిలింది. విధియొక్క లీలలు, నిజంగా ఊహకందనివి.
ఠేవితా సంత పదీ డోఈ | జయా ప్రాణీయా మరణ యేఈ | సవేంచ తో ఉద్ధరోని జాఈ | హీచ కమాఈ జన్మాచీ | ||౧౪౫||
145. సత్పురుషుల పాదాలమీద తలనుంచి, చావును పొందిన ప్రాణి, వెంటనే ఉద్ధరింప బడుతుంది. ఆ ప్రాణి తన జీవితంలో సంపాదించుకున్న అసలైన లాభం ఇదే.
అసల్యావీణ భాగ్యాచా థోర | సంతాచియా దృష్టీ సమోర | పడేల కాయ ఉగాచ శరీర | హోఈల ఉద్ధార తయాచా | ||౧౪౬||
146. అంత గొప్ప భాగ్యం లేకుంటే, సత్పురుషుని ఎదుట శరీరాన్ని చాలించి, వెంటనే ఉద్ధరించ బడటం సాధ్యమా?
సాధూంచియా దృష్టీ సన్ముఖ | దేహ ఠేవితా పరమసుఖ | పీతా విఖ హోయ పీయూఖ | మరణాచా హరిఖ నా దుఃఖ | ||౧౪౭||
147. సత్పురుషుల ఎదుట, ప్రాణం వదలటం పరమ సుఖం. అక్కడ విషం తాగినా, అది అమృతమే అవుతుంది. అలాంటి చావుకు ఆనందం కాని, దుఃఖం కాని ఉండదు.
దృష్టీ పుఢే సంతచరణ | అసతా జయా ప్రాణియా మరణ | ధన్య దేహ తో కృష్ణార్పణ | పునర్జనన నాహీ త్యా | ||౧౪౮||
148. కళ్ళెదుట సత్పురుషుల పాదాలు ఉండగా, చావు పొందిన ప్రాణులు ధన్యులు. వారి దేహం శ్రీకృష్ణుడికి అర్పితమై, వారికి మళ్ళీ జన్మ ఉండదు.
సంతాచియా దృష్టీ సన్ముఖ | మరణ నవ్హే తే వైకుంఠసుఖ | జింకిలా తేణే మృత్యు లోక | న పునర్భవ శోక తయా | ||౧౪౯||
149. సత్పురుషుల కళ్ళెదుట వచ్చే చావు, చావు కాదు. అది వైకుంఠ సుఖం. మృత్యు లోకాన్ని జయించినట్లే. దాంతో సంసార బాధలు తొలగిపోయినట్లే.
సంతా దేఖతా దేహ త్యాగితీ | తయా నాహీ పునరావృత్తీ | తీచ పాపాంచీ నిష్కృతీ | ఉద్ధారగతీ పావలా | ||౧౫౦||
150. సత్పురుషుల ఎదుట దేహాన్ని వదిలిన వారికి, మళ్ళీ పుట్టుక ఉండదు. అలా చావటంతోనే అన్ని పాపాలూ నశించి, వారు ఉద్ధరించబడతారు.
ఆనఖాగ్ర సంతావలోకన | కరితా కరితా జే దేహపతన |
తయా కాయ మ్హణావే మరణ | నిజోద్ధారణ తే సాచే | ||౧౫౧||
151. కాలిగోటినుండి తలదాకా, సత్పురుషులను చూస్తూ, దేహాన్ని వదిలిన వారిది చావా? కానే కాదు. అది వారి ఆత్మ ఉద్ధరించబడటం.
పాహూ జాతా పూర్వ విధాన | కోణీ తరీ హా పుణ్యవాన | మిరవూ జాతా విద్యాభిమాన | పావలా అవమాన హరిభక్త | ||౧౫౨||
152. ‘ఇది విధి వ్రాత’ అని అనుకుంటే, వెనుకటి జన్మలో ఈ పులి, ఎవరో పుణ్యాత్ముడుగా పుట్టి, విద్యా గర్వంతో మిడిసి పడుతూ, ఎవరో ఒక హరిభక్తుని, అవమాన పరచి ఉండవచ్చు.
తయాచియా శాపాపాసూని | పావలా హీ క్రూర యోనీ | ఉఃశాప యోగే లాగలా చరణీ | అభినవ కరణీ భక్తాంచీ | ||౧౫౩||
153. ఆ భక్తుని శాపం కారణంగా, ఈ జన్మలో కౄర మృగంగా పుట్టి ఉండవచ్చు; సత్పురుషుని పాదాల దగ్గర, శాపవిమోచనం కలిగి ఉండవచ్చు. భక్తుల పనులు నిజంగా విచిత్రంగా ఉంటాయి.
వాటే జాహలా త్యా ఉఃశాప | సాఈ దర్శనే జళేల పాప | తుటలే బంధ సరలే తాప | ఝాలా ఆపాప ఉద్ధార | ||౧౫౪||
154. సాయిని దర్శించటంతో, దాని పాపాలన్నీ కాలిపోయి, బంధనాలు విడిపోయి, కష్టాలన్నీ తొలగిపోయి, శాపవిమోచనం కలిగి, ఏ శ్రమా లేకుండా ముక్తిని పొందింది.
పూర్ణ సభాగ్య అసల్యావీణ | కైచే సంత దృష్టీ పుఢే మరణ | త్రితాప త్రిపుటీ త్రిగుణ మర్దన | హోఊని నిర్గుణ ఠాకలా | ||౧౫౫||
155. సంపూర్ణమైన భాగ్యం లేకుంటే, సత్పురుషుల ఎదుట చావు ఎలా వస్తుంది? త్రితాపాలు (అధిభౌతిక, అధిదైవిక మరియు అధ్యాత్మిక), త్రిపుటి (చూసేవాడు, చూసేది, దృశ్యం), త్రిగుణాలు (సత్వ, తమస్, రజస్) నశించిపోయి, గుణాలు లేని పరమాత్మలో లీనమై పోయింది.
ఏసా పూర్వ కర్మానుబంధ | సుటలా క్రూర దేహ సంబంధ | తుటలా లోహ శృంఖళాబంధ | ఈశ్వరీ నిర్బంధ హా ఎక | ||౧౫౬||
156. వెనుకటి జన్మల కర్మల వలన దొరికిన, కౄరమైన మృగం దేహంతో, సంబంధం విడిపోయింది. ఇనుప గొలసుల బంధనం వదిలిపోయింది. ఇదే దైవ నియమం.
సాధూసంతాంచ్యా చరణాపరతీ | ఇతరత్ర కోఠే ఉద్ధార గతీ | తీ లాధతా యా వ్యాఘ్రాప్రతీ | ప్రసన్న చిత్తీ దరవేశీ | ||౧౫౭||
157. సాధు సత్పురుషుల పాదాల కంటే, వేరే ఎక్కడ ముక్తి దొరుకుతుంది? పులికి ముక్తి దొరికినందుకు, దాని యజమానులైన దరవేశీలు ఆనందించారు.
వ్యాఘ్ర తయాంచే చరితార్థ సాధన | వ్యాఘ్ర తయాంచే కుటుంబ పోషణ | తయా వ్యాఘ్రాలా యేతా మరణ | ఖిన్నవదన దరవేశీ | ||౧౫౮||
158. పులి వారి కుటుంబాలను పోషించేది; వారి జీవనానికి అది ఆధారం. అందుకు, పులి మరణించినందుకు వారు బాధ పడ్డారు.
దరవేశీ మహారాజాంస పుసతీ | ఆతా పుఢే కైసీ గతీ | కైసీ ద్యావీ మూఠమాతీ | లావా సద్గతీ నిజహస్తే | ||౧౫౯||
159. దరవేశీలు సాయి మహారాజును, ‘ఇప్పుడు ఈ పులిని ఏం చేయాలి? దీనిని ఎలా పూడ్చి పెట్టాలి? మీ చేతులతో, దీనికి సద్గతిని మీరే కలిగించండి’ అని ప్రార్థించారు.
మహారాజ మ్హణతీ న కరా ఖంత | యేథేంచ హోతా తయాచా అంత | తోహీ మోఠా పుణ్యవంత | సౌఖ్య అత్యంత పావలా | ||౧౬౦||
160. “మీరేం బాధపడకండి. దాని చావు ఇక్కడే ఉంది. ఎంతో పుణ్యం చేసుకోవటం వలన, ఇక్కడ గొప్ప శాంతిని పొందింది.
త్యా తక్యాచే పలీకడే | శంకరాచే దేఊళ జికడే |
నేఊన త్యాలా పురా తికడే | నందీ నికట ద్యా గతీ | ||౧౬౧||
161. “తకియా వెనుక ఉన్న శివాలయం దగ్గరకు తీసుకుని వెళ్ళి, నంది దగ్గర దీనిని పూడ్చి పెట్టండి.
పురలియా తేథే తయాప్రతీ | లాధేల తో హీ సద్గతీ | ఋణ నిర్ముక్తీ బంధముక్తీ | తుమచియా హస్తీ పావేల | ||౧౬౨||
162. “అక్కడ పూడిస్తే, దానికి సద్గతి కలుగుతుంది. మీనుండి ఋణ విముక్తే కాక, మీ బంధంనుండి కూడా దానికి ముక్తి దొరుకుతుంది.
గత జన్మీచా దేణేదార | ఫేడావయా ఋణ హా అవతార | తుమచియా బంధనీ సాచార | తో ఆజవర రాహిలా | ||౧౬౩||
163. “పోయిన జన్మలో బాకీ ఉన్న ఋణాన్ని తీర్చుకోవటానికి, ఈ రూపంలో పుట్టి, ఇంత వరకు మీ బంధంలో ఉంది” అని సాయి మహారాజు చెప్పారు.
దరవేశీ మగ ఉచలూన తయాసీ | జాతే జాహలే దేఉళా పాశీ | నందీచియా పశ్చాత్‍ప్రదేశీ | తయా ఖాచేశీ దాటితీ | ||౧౬౪||
164. దరవేశీలు దానిని ఎత్తుకొని, శివాలయం వరకు తీసుకుని వెళ్ళి, నంది వెనుక, గోతిలో పూడ్చి పెట్టారు.
కాయ తరీ చమత్కార వహిలా | వ్యాఘ్ర తాత్కాళ కైసా నిమాలా | ప్రకార ఇతుకాచి అసతా ఘడలా | విసర పడలా అసతా కీ | ||౧౬౫||
165. ఎంత విచిత్రమైన చమత్కారం! వెంటనే ఆ పులి ఎలా చచ్చిపోయింది? ఇంత మాత్రమే జరిగి ఉంటే, కొన్ని రోజుల తరువాత ఈ సంగతి గుర్తుండేది కాదు.
పరీ యేథూని సాతవేచ దినీ | బాబాంనీ దేహ ఠేవిలా ధరణీ | తేణేహీ ఆఠవణ వరచేవర మనీ | ఉచంబళోని యేతసే | ||౧౬౬||
166. కాని, సరిగ్గా ఇది జరిగిన ఏడవ రోజు, బాబా కూడా తమ దేహాన్ని వదిలి పెట్టటం వలన, మాటమాటికీ ఈ సంగతి, మనసులో మెదులుతూనే ఉంటుంది.
పుఢీల అధ్యాయ యాహూన గోడ | బాబాహీ వర్ణిలే నిజగురూచే కోడ | పురవిలీ గోఖలేబాఈచీ హోడ | అనుగ్రహ జోడ దేఊని | ||౧౬౭||
167. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురంగా ఉంటుంది. తమ గురువుయొక్క లీలలను బాబా వర్ణించారు. గోఖలే బాయిని వారు అనుగ్రహించి, ఆమె కోరికను తీర్చారు.
హేమాడ సాఈనాథాంసీ శరణ | గురుహస్తే కూపీ ఉఫరాటే టాంగవూన | కైసీ బాబాంనీ కృపా సంపాదన | కేలీ తే శ్రవణ కరావే | ||౧౬౮||
168. హేమాడు సాయినాథుని శరణుజొచ్చుచున్నాడు. గురువు ద్వారా తలక్రిందులుగా బావిలో వ్రేలాడదీయబడి, గురువు అనుగ్రహాన్ని బాబా ఎలా సంపాదించారో వినండి.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | దర్శన మహిమా నామ |
| ఎకత్రింశత్తమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
1. మానససరోవరాస. 2. బాలకరామ మానకర.
3. తాత్యాసాహేబ నూలకర. 4. హరిణీవర జడలేల్యా ప్రీతీనే.
5. ఆధీదైవిక, ఆధిభౌతిక ఆణి ఆధ్యాత్మిక. 6. పారలౌకిక.
7. పతనోన్ముఖ. 8. స్వతః సాఈబాబాంనీ ఆపల్యా దేహాస.
9. ప్రకార, తర్హా. 10. బారా రూపయే. 11. సుఖాచ్యా నిశ్చయానే.
12. ఘరా. 13. అంతఃకరణాత. 14. తళమళ. 15. సదైవ, పూర్వపుణ్య.
16. శరీర. 17. సోడలే. 18. మరణ.
19. స్వతః సాఈబాబాంచే దేహావసానాలా.
20. ఉత్తమ. 21. తీర్థ.
No comments:
Post a Comment