శ్రీ సాఈ సచ్చరిత
||అథ శ్రీ సాఈ సచ్చరిత||అధ్యాయ ౩౦ వ||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
ఓం నమోజీ సాఈసదయా | భక్తవత్సలా కరుణాలయా |
దర్శనే వారిసీ భక్త భవభయా | నేసీ విలయా ఆపదా | ||౧||
1. ఓం నమో సాయి దయామయ! భక్తవత్సలా! కరుణాలయా! మీ దర్శన మాత్రంతో భక్తుల భయాలను తొలగించి, వారి ఆపదలను నశింప చేస్తారు.
ఆరంభీ వసతీ నిర్గుణీ | తొ తూ భక్తభావాంచియా గుణీ |
ఓవూని ఆణిలాసీ సగుణీ | సంతచూడామణీ సాఈనాథా | ||౨||
2. ఓ సంత చూడామణీ, సాయినాథా! మొదట ఏ రూపమూ గుణమూ లేకుండా ఉన్న మీరు, భక్తుల ప్రేమ, నమ్మకంతో కట్టుబడి, రూపాన్ని ఆకారాన్ని దాల్చినారు.
నిజభక్తోధ్ధారణకార్య | సంతాసర్వదా అపరిహార్య |
తూ తర సంతవృందాచా ఆచార్య | తుజసీ హీ అనివార్య తే ఆహె | ||౩||
3. తమ భక్తులను ఉద్ధరించటం సత్పురుషులకు తప్పనిసరి. సత్పురుషులందరికీ మీరు ఆచార్యులు కనుక, మీరు కూడా భక్తులను ఉద్ధరించటం తప్పక చేయాల్సిన పని.
జిహీ ధారిలె తవ చరణద్వయ | పావలె సకళ కిల్మిష లయ |
జాహలా పూర్వసంస్కారోదయ | మార్గ నిర్భయ నిష్కంటక | ||౪||
4. మీ రెండు పాదాలను ఆశ్రయించిన వారి అన్ని దోషాలు తొలగిపోయి, మునుపటి సంస్కారాలు మళ్ళీ కనిపించి, వారి దారి, భయం కాని, కష్టాలు కాని, లేకుండా సులభమౌతుంది.
ఆఠవూనియా ఆపులే చరణ | యేతి మహాతీర్థీంచే బ్రాహ్మణ |
కరితీ గాయత్రీ పురశ్చరణ | పోథీ పురాణ వాచితీ | ||౫||
5. గొప్ప గొప్ప తీర్థ క్షేత్రాలనుండి, బ్రాహ్మణులు మీ పాదాలను తలచుకుని, వచ్చి, గాయత్రీ మంత్రాన్ని చెప్పి, పురాణాలను గ్రంథాలను, మీ ఎదుట పఠిస్తారు.
సంస్కారహీన అల్పశక్తి | కాయ ఆమ్హీ జాణూ భక్తి |
టాకిలే జరీ ఆమ్హా సమస్తీ | సాయీ న దేతీ అంతర | ||౬||
6. సంస్కారం కాని, శక్తి కాని లేని మాకు, భక్తి అంటే ఏం తెలుస్తుంది? అందరూ మమ్మల్ని వదిలివేసినా, సాయి ఎప్పటికీ వదలరు.
జయావరీ తే కృపా కరితీ | అచింత్య మహాశక్తీ పావతీ |
ఆత్మానాత్మా వివేక సంపత్తీ | సవేంచి ప్రాప్తీ జ్ఞానాచీ | ||౭||
7. వారి అనుగ్రహాన్ని పొందిన వారు, ఎంతో శక్తివంతులౌతారు. ఆత్మ, ఆత్మ కానిదానిని విడమర్చే వివేకాన్ని, జ్ఞానాన్ని కూడా పొందుతారు.
సాఈముఖవచన లాలసే | భక్తజన హోఊన పిసే |
శబ్దాశబ్దాంచే జోడూని ఠసె | పాహత భరవసే ప్రతీతి | ||౮||
8. సాయి నోటినుండి వచ్చిన మాటలను, వినాలనే విపరీతమైన కోరిక, భక్తులను వెర్రివాళ్ళను చేస్తుంది. వారి మాటలలోని ప్రతి శబ్దాన్ని, భక్తులు తమ మనసులో భద్రంగా ఉంచుకుని, దాని నిజాన్ని అనుభవంతో తెలుసుకుంటారు.
నిజభక్తాంచా మనోరథ | జాణే సంపూర్ణ సాఈనాథ |
పురవితాహీ తోచ సమర్థ | తేణేంచ కృతార్థ తద్భక్త | ||౯||
9. తమ భక్తుల మనసులోని కోరికలన్నీ, సాయినాథులకు తెలుసు. వానిని తీర్చే సమర్థులు కూడా వారే. అందుకే, వారి భక్తులు ధన్యులవుతారు.
ధాంవ పావగా సాఈనాథ | ఠేవితో తుఝియా చరణీ మాథా |
విసరోనియా అపరాధా సమస్తా| నివారీ చింతా దాసాచీ | ||౧౦||
10. సాయినాథా! పరుగెత్తుకుని రండి! మీ పాదాల మీద నా తలను ఉంచుతున్నాను. నా తప్పులన్నింటినీ మన్నించి, మీ దాసుని చింతను దూరం చేయండి.
ఏసా సంకటీ గాంజితా | భక్త స్మరే జో సాఈనాథా |
తయాచియా ఉద్విగ్న చిత్తా | శాంతిదాతా తో ఎక | ||౧౧||
11. ఎన్నో కష్టాలలో చిక్కుకున్న భక్తుడు, ఇలా సాయినాథుని తలచుకుంటే, దుఃఖంతో నిండిన తన మనసుకు, శాంతిని ఇచ్చేది వారొక్కరే, అని తెలుసుకుంటాడు.
ఏసే సాఈ దయాసాగర | కృపా కరితే ఝాలే మజవర| తేణేంచ వాచకా ఝాలా హా సాదర | గ్రంథ మంగలకారక | ||౧౨||
12. ఇలాంటి దయాసాగరులైన సాయి, నన్ను అనుగ్రహించారు. దాని వలనే, మంగళకరమైన ఈ గ్రంథం పాఠకులకు అందింది.
నా తరీ మాఝా కాయ అధికార | కోణ హే కార్య ఘేతా శిరావర | జ్యాచా తోచ నిరవతా అసల్యావర | కాయసా భార మజవరతా | ||౧౩||
13. లేకుంటే, నాకు ఈ అర్హత ఎక్కడిది? ఇంతటి కష్టమైన పనిని, ఎవరు తలమీద వేసుకుంటారు? వారి పనిని వారే చేసేటప్పుడు, నాకింకా భారమెక్కడిది?
అసతా మద్దాచాప్రకాశక | సాఈ సమర్థ జ్ఞానదీపక | అజ్ఞాన తమ విధ్వంసక | కిమర్థ సాశంక అసావే | ||౧౪||
14. అజ్ఞానమనే చీకటిని తొలగించే, జ్ఞాన దీపమైన సాయి సమర్థులు, నా మాటలకు దారి చూపుతుండగా, నేనెందుకు అనుమానించాలి?
త్యా దయాఘన ప్రభూచా భరవసా | తేణే న వాటలా శ్రమ అణుమాత్రసా| పురలా మాఝే మనీచా ధింవసా | కృపాప్రసాద హా త్యాచా | ||౧౫||
15. దయామయులైన ఆ ప్రభువు మీద నమ్మకం వలన, నాకు ఏమాత్రం కష్టం అనిపించకుండా, నా కోరిక తీరింది. ఈ గ్రంథం వారి కృపా ప్రసాదం.
హీ గ్రంథరూపీ సంతసేవా | మాఝ్యా పూర్వపుణ్యాఈచా ఠేవా | గోడ కరూన ఘేతలీ దేవా | ధన్య దైవాచా తేణే మీ | ||౧౬||
16. పూర్వ జన్మల పుణ్యాల ఫలంగా, ఈ గ్రంథ రూపంలో, సత్పురుషుని సేవ చేసే భాగ్యం, నాకు దక్కింది. సాయిదేవులు ఈ సేవను చక్కగా చేయించుకున్నారు. ఈ భాగ్యం వలన, నేను ధన్యుణ్ణయ్యాను.
గతాధ్యాయీ జాహలే శ్రవణ | నానా పరీచే దృష్టాంత దేఊన | కైసే భక్తాంస బోధప్రదాన | సాఈ దయాఘన కరీత తే | ||౧౭||
17. దయామయులైన సాయి, భక్తులకు కలల ద్వారా, ఏ రకంగా జ్ఞానాన్ని బోధిస్తారు, అన్న సంగతిని పోయిన అధ్యాయంలో విన్నారు.
ఆతా ప్రకృతాధ్యాయీ హీ ఏక | సప్తశృంగీ దేవీచే ఉపాసక | తయాచే హే గోడ కథానక | ఆనందదాయక పరిసిజే | ||౧౮||
18. మధురమూ, ఆనందాన్నిచ్చేదీ అయిన, సప్తశృంగీదేవి భక్తుని కథను, ఈ అధ్యాయంలో ఇప్పుడు వినండి.
దేవదేవీ నిజభక్తాంప్రతీ | కైసే నిరవతీ సంతాంహాతి | హీ తరీ ఎక చమత్కృతీ | సాదర చిత్తీ అవలోకా | ||౧౯||
19. దేవీ దేవతలు, తమ భక్తుల జవాబ్దారీను, సత్పురుషుల వశానికి అప్పగించటం అనేది, ఒక చమత్కారం. దీనిని శ్రద్ధగా ఇప్పుడు వినండి.
మహారాజాంచ్యా కథా బహుత | ఎకాహూన ఎక అద్భుత | హీహీ కథా శ్రవణోచిత | సావచిత్త పరిసావీ | ||౨౦||
20. సాయి మహారాజుల కథలు అనేకం. ఒకటికంటే ఒకటి అద్భుతం. వినడానికి యోగ్యమైన ఈ కథను, శ్రద్ధగా వినండి.
కథా నవ్హే హే అమృతపాన | యేణే పావాల సమాధాన |
కళోన యేఈల సాఈచే మహిమాన | వ్యాపకపణ హీ తైసేంచ | ||౨౧||
21. ఇది కథ కాదు. ఇది అమృతం. దీనిని తాగితే, మనసుకు శాంతి దొరుకుతుంది. అన్ని చోట్ల, సాయి ఉన్నారన్న నమ్మకం, మరియు వారి మహిమ, తెలుస్తుంది.
యేథే నాహీ వాదావాదీ | ప్రేమ నిరవధీ పాహిజే | ||౨౨ ||
22. అనుమానించే వారికి, తర్కవాదులకు, ఇవి నచ్చవు. ఇక్కడ కావలసినది, వాదోపవాదాలు కాదు, అంతులేని గాఢమైన ప్రేమ ఉండాలి.
జ్ఞానీ అసూన వ్హావా భావిక | శ్రద్ధాశీల విశ్వాసూక | కింవా సంతాఘరీంచా పాఈక | ఇతరా యా మాఈక కాహణ్యా | ||౨౩||
23. వినేవారు జ్ఞానులైనా, వారిలో భక్తి, శ్రద్ధ మరియు నమ్మకం ఉండాలి. నిష్ఠావంతులు, సాధువుల సేవ చేసే వారై ఉండాలి. మిగతా వారికి, ఇవి కట్టుకథలుగా అనిపిస్తుంది.
హా సాఈలీలా కల్పతరూ | నిర్వికల్ప ఫలపుష్ప ధరూ | అసేల భక్త భాగ్యాచా సధరూ | తోచి ఉతారూ యే తళీ | ||౨౪||
24. సాయియొక్క లీలల ఈ కల్పతరువు, పువ్వులను, పళ్ళను ఇస్తుంది. కాని, భాగ్యవంతులైన భక్తులే ఆ పువ్వులను, పళ్ళను చెట్టునుంచి కిందకు దించగలరు.
ఏకాహో కథా పరమ పావనీ | పరమార్థియా మోక్షదానీ | సకళ సాధనా పోటీ ముఖరణీ | కృతకల్యాణీ సకళికా | ||౨౫||
25. పరమ పావనమైన ఈ కథ, పరమార్థాన్ని కోరే వారికి, మోక్షాన్ని ఇస్తుంది. సాధనలలో అన్నింటికంటే ముఖ్యమైనది, అందరికీ మేలు చేసేది అయిన ఈ కథను, భక్తులారా! వినండి.
సహజే జడజీవోద్ధారణ | తే హే సాఈకథామృతపాన | ప్రాపంచికాచే సమాధాన | మోక్షసాధన ముముక్షువా | ||౨౬||
26. మూర్ఖులైన వారిని కూడా, సహజంగా ఉద్ధరించే, ఈ సాయి కథామృత పానం, లౌకికులకు, ఇది మనసుకు శాంతిని కలిగిస్తుంది. పరమార్థాన్ని పొందాలనే వారికి మోక్షాన్ని ఇస్తుంది.
కరితా ఏక కల్పనా ఎథ | పావే ఆణిక కల్పనాతీత | మ్హణోన హేమాడ హోఊని వినీత | శ్రోతయా పాలవీత1 శ్రవణార్థ | ||౨౭||
27. ఒక కథను చెప్పుతుంటే, మరొక అద్భుతమైన కథ గుర్తుకు వస్తుంది. అందుకు, హేమాడు శ్రోతలను వినయంగా, వినడానికి పిలుస్తున్నాడు.
ఏసీ ఎకేక కథా కథితా | వాఢేల లీలారసాస్వాదతా | హోఈల సమాధాన భవదవార్తా | సాఈసమర్థతా తీ హీచ | ||౨౮||
28. ఇలా ఒకటి తరువాత ఇంకొక కథను చెప్పుతుంటే, సాయియొక్క లీలలలోని ఆసక్తి, ఆనందం పెరుగుతుంది. సంసారంలోని కష్టాలను అనుభవిస్తున్న వారికి, శాంతి దొరుకుతుంది. ఇదే సాయియొక్క సమర్థత.
జిల్హా నాశిక గ్రామ వణీ | కాకాజీ వైద్య నామక కోణీ | అసతీ తేథే వాస్తవ్య కరూని | ఉపాధ్యే తే స్థానీ దేవీచే | ||౨౯||
29. నాశిక జిల్లాలోని వణి అనే గ్రామంలో, కాకాజీ వైద్య అనే అతను ఉండేవాడు. అక్కడి దేవి గుడిలో అతను పూజారిగా ఉండేవాడు.
దేవీచే నామ సప్తశృంగీ | ఉపాధ్యే అస్థిర అంతరంగీ | అనేక దుర్ధర ఆపత్తి ప్రసంగీ | సంసారసంగీ గాంజలే | ||౩౦||
30. ఆ దేవి పేరు సప్తశృంగీ. సంసారంలో చిక్కుకుని, ఎన్నో రకాల కష్టాలతో బాధ పడుతున్న ఆ పూజారికి, మనసు స్థిరంగా లేదు.
యేతా కాలచక్రాచా ఫేరా | మన హే భోవే జైసా భోవరా |
దేహహీ ధావే సైరావైరా | శాంతీ క్షణభరా లాధేనా | ||౩౧||
31. కాలచక్రం తిరుగుతున్న వేగంలో, మనసు సుడిగుండం లాగ గిరగిరా తిరుగుతుంటుంది. దేహం కూడా ఇటూ అటూ పరుగెత్తుతుంది. ఒక్క క్షణమైనా శాంతి ఉండదు.
తేణే కాకాజీ అతి దుఃఖిత | జాఊనియా దేఉళా ఆంత | దేవీపాశీ కరుణా భాకీత | చింతా విరహిత వ్హావయా | ||౩౨||
32. దాంతో, కాకాజీ చాలా దుఃఖితుడై, తన బాధను పోగొట్టుకోవటానికి, గుడిలోకి వెళ్ళి, దేవిని కరుణించమని వేడుకున్నాడు.
మనోభావే కేలా ధావా | దేవీ హీ తుష్టలీ పాహూని భావా | తేచ రాత్రీ దృష్టాంత వ్హావా | శ్రోతీ పరిసావా నవలావా | ||౩౩||
33. అలా అతను భక్తితో ప్రార్థించగా, దేవి అతని భక్తికి సంతోషించి, అదే రాత్రి, దేవీ అతని కలలో కనిపించిన అద్భుతాన్ని వినండి.
దేవీ సప్తశృంగీ ఆఈ | కాకాజీచ్యా స్వప్నీ యేఈ | మ్హణే తూ బాబాపాశీ జాఈ | మన హోఈల సుస్థిర | ||౩౪||
34. దేవీ సప్తశృంగీ మాత, కాకాజీ కలలో కనిపించి ‘నీవు బాబా దగ్గరకు వెళ్ళు. మనసు కుదుట పడుతుంది’ అని చెప్పింది.
హే బాబా కోఠీల కవణ | కరీల దేవీ స్పష్టీకరణ | మ్హణవూన కాకా జై ఉత్కంఠిత మన | నయనోన్మీలన2 పావలే | ||౩౫||
35. ఈ బాబా ఎవరో, ఎక్కడివారో అన్ని వివరాలు, దేవి స్పష్టంగా చెప్పుతుందనే ఉత్సాహంతో, కాకాజీ కళ్ళు తెరచాడు.
జిజ్ఞాసా తీ తైసీచ రాహిలీ | స్వప్నవృత్తి తాత్కాళ మావళలీ | కాకాజీనే బుద్ధి చాలవిలీ | ‘బాబా’ జే వదలీ తే కోణ | ||౩౬||
36. కళ్ళు తెరచిన వెంటనే, కల కరిగిపోయింది. అతని కుతూహలం తీరలేదు. దేవీ చెప్పిన బాబా ఎవరై ఉంటారు అని, కాకాజీ ఆలోచించ సాగాడు.
అసతీల ’బాబా’ త్ర్యంబకేశ్వర | కాకాజీ మనీ హాచ నిర్ధార | నిఘాలే ఘేతలే దర్శన సత్వర | రాహీనా అస్థిరతా మనాచీ | ||౩౭||
37. బాబా అంటే త్ర్యంబకేశ్వరుడై ఉండవచ్చు, అని కాకాజీ మనసులోనే నిశ్చయించుకుని, వెంటనే బయలుదేరి వెళ్ళి, త్ర్యంబకేశ్వరుని దర్శనం చేసుకున్నాడు. కాని, అతని మనసులోని అశాంతి తగ్గలేదు.
కాకాజీనే దహా దివస | త్ర్యంబకేశ్వరీ కేలా వాస | అఖేరపర్యంత రాహిలా ఉదాస | మనోల్లాస లాధేనా | ||౩౮||
38. కాకాజీ త్ర్యంబకేశ్వరులో, పది రోజులు ఉన్నాడు. కాని, చివరిదాకా, అతను చింతలోనే ఉన్నాడు. అతనికి ఏ మాత్రం ఉత్సాహం కలుగులేదు.
జాఈనా మనాచీ దుశ్చిత్తతా | శమేనా తయాచీ చంచలతా | దివసేదివస వాఢే ఉద్విగ్నతా | నిఘాలా మాగుతా కాకాజీ | ||౩౯||
39. మనసులోని అలజడి తగ్గలేదు. చింత దూరం కాలేదు. ఇంకా, రోజురోజుకూ కలవరం ఎక్కువై, కాకాజీ ఇంటికి బయలుదేరాడు.
నిత్య ప్రాతఃస్నాన కరీ | రూద్రావర్తన లింగావరీ | సంతత ధార అభిషేక ధరీ | పరి అంతరీ అస్థీర | ||౪౦||
40. రోజూ తెల్లవారి స్నానం చేసి, శివలింగంపై, ధారతో అభిషేకం చేసి, రుద్రావర్తన చేసేవాడు. అయినా, అతని మనసులో అశాంతి అలాగే ఉంది.
పునశ్చ జాఊని దేవీద్వారీ | వదే కాం ధాడిలే త్రయంబకేశ్వరీ |
ఆతా తరీ మజ స్థిర కరీ | యా యేరఝారీ నకో గే | ||౪౧||
41. దేవి దగ్గరకు మరల వెళ్ళి, ‘అమ్మా! నన్ను త్ర్యంబకేశ్వరానికి ఎందుకు పంపావు? ఇకనైనా, నా మనసును స్థిరపరచు. ఈ రాకపోకలు లేకుండా చేయి తల్లీ!’
దేవీ త్యా దర్శన దే రాతీ | వదే దృష్టాంతీ తయాతే | ||౪౨||
42. అని చాలా దీనంగా దేవిని వేడుకున్నాడు. ఆ రాత్రి దేవీ అతని కలలో కనిపించి,
మ్హణే మీ జే బాబా వదత | తే శిరడీచే సాఈ సమర్థ | త్ర్యంబకేశ్వరీ గమన కిమర్థ | కేలే కాం నిరర్థక కళేనా | ||౪౩||
43. ‘నేను చెప్పిన బాబా, శిరిడీలోని సాయి సమర్థుడు. త్ర్యంబకేశ్వరుకు, నువ్వు ఎందుకు వెళ్ళావో తెలియదు’ అని అన్నది.
కోఠే శిర్డీ కైసే జావే | బాబా హే న ఆపణా ఠావే | ఆతా హే జాణే కైసే ఘడావే | నకళే వ్హావే కైసే కీ | ||౪౪||
44. ‘శిరిడీ ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? బాబా ఎవరు? నాకేమీ తెలియదు. శిరిడీకి వెళ్ళడం ఎలా జరుగుతుందో, ఏమీ అర్థం కావటం లేదే!’
పరి జో సంతచరణీ రత | మనీ ధరీ దర్శన హేత | సంతచి కాయ పరీ అనంత | సదిచ్ఛా పురవీత తయాచీ | ||౪౫||
45. సత్పురుషుల పాదాల మీద భక్తి ఉండి, వారిని చూడాలని మనసులో కోరిక కలిగితే, సత్పురుషులే కాదు, దేవుడు కూడా వారి మంచి కోరికను తీరుస్తాడు.
జో జో సంత తో తో అనంత | నసే లవలేశ భేద ఉభయాంత | కింబహునా ఉభయ మానణే హేంచి ద్వైత | సంతా అద్వైత అనంతీ | ||౪౬||
46. సత్పురుషులైనా, దేవుడైనా ఒక్కరే. ఆ ఇద్దరిలో కొంచెం కూడా తేడా లేదు. పైగా వారిద్దరినీ ఇద్దరుగా అనుకోవటం అంటే ద్వైతం అవుతుంది. సత్పురుషులూ, పరమేశ్వరుడూ ఒక్కరే.
చాలూన జాఈన సంతదర్శనా | స్వేచ్ఛా పురవీన మనీచీ కామనా | హీ తో కేవళ అభిమాన వల్గనా | అఘటిత ఘటనా సంతాంచీ | ||౪౭||
47. ‘నేరుగా, నా ఇష్టంతో వెళ్ళి, సత్పురుషులను చూసి, మనసులోని కోరికను తీర్చుకుంటాను’ అని అనుకోవటం, కేవలం మన అహంకారం. సత్పురుషుల బుద్ధి, వారి ఏర్పాటు చేసుకునే పద్ధతి, మన ఊహకందనిది.
వినా ఆలియా సంతాంచ్యా మనా | కోణ జాఈల తయాంచే దర్శనా | ఆశ్చర్య తయాంచ్యా సత్తేవినా | పాన హాలేనా వృక్షాచే | ||౪౮||
48. సత్పురుషులు మనసులో అనుకోకుంటే, వారి దర్శనానికి ఎవరు వెళ్ళగలరు? అంత కంటే ఆశ్చర్యమేమిటంటే, వారి తలుచుకోకుండా చెట్టు ఆకులు కూడా కదలవు.
జైసీ జయాచీ దర్శనోత్కంఠా | జైసా భావ జైసీ నిష్ఠా | సానందానుభవ పరాకాష్ఠా | భక్తశ్రేష్ఠా లాధతే | ||౪౯||
49. వారిని చూడాలనే బలమైన కోరిక, వారి మీద భక్తి, శ్రద్ధా, నిష్ఠలు, ఎంత ఎక్కువైతే, భక్తులు పొందే ఆనందం, అనుభవం అంతే అద్భుతంగా ఉంటాయి.
కైసే జావే సాఈ దర్శనా | ఇకడే కాకాజీస హీ వివంచనా | తికడే తయాంచా శోధీత ఠికాణా | పాతలా పాహుణా శిరడీచా | ||౫౦||
50. ‘సాయిని చూడటానికి ఎలా వెళ్ళాలి’, అని ఇక్కడ కాకాజీ ఆలోచిస్తూ ఉండగా, అతని ఇంటిని వెతుక్కుంటూ, శిరిడీనుండే ఒక అతిథి వచ్చాడు.
పాహుణా తరీ కాయ సామాన్య | అవఘ్యాపరీస జో బాబాస మాన్య |
జయాచ్యా ప్రేమాస తుళేనా అన్య | అధికార హీ ధన్య జయాచా | ||౫౧||
51. ఆ వచ్చిన అతిథి ఏమైనా సామాన్యమైన వాడా? అతను బాబాకు అందరికంటే ఎక్కువ ప్రియుడు. ఆ ప్రేమకు, అతనితో వేరే ఎవ్వరూ సరితూగలేరు. అతని యోగ్యత కూడా చాలా గొప్పది.
మాధవరావ నామాభిధాన | దేశపాండేపణాచే వతన | బాబాంపాశీ అతి లడివాళపణ | చాలేనా ఆన కవణాచే | ||౫౨||
52. అతని పేరు మాధవరావు. దేశపాండే అన్నది వంశపారంపర్యంగా వచ్చింది. బాబా దగ్గర అతనికంటే వేరే ఎవ్వరికీ అంత చనువు ఉండేది కాదు.
సదా సర్వదా ప్రేమాచే భాండణ | అరే తురేచే ఎకేరీ భాషణ | పోటచ్యా పోరాసమ ప్రేమ విలక్షణ | పాతలా తత్‍క్షణ వణీస | ||౫౩||
53. ప్రేమతో ఎప్పుడూ ఒకరికొకరు దెబ్బలాడుకోవడం, అరే, ఒరే అనే ఏకవచన సంబోధన. అతనంటే, బాబాకు కన్న కొడుకు మీద ఉన్నంత ప్రేమ. ఇప్పుడు అతను వణికి వచ్చాడు.
బాళాస జంవా జాహలే దుఖణే | ఆఈనే దేవీస ఘాతలే గార్హాణే | తుఝ్యా ఓటీంత ఘాతలే హే తాన్హే | తారణే మారణే తుజకడే | ||౫౪||
54. పసిపాపగా ఉన్నప్పుడు జబ్బు చేస్తే, ఆ తల్లి దేవికి మ్రొక్కుకుంది. ‘తల్లీ! ఈ పసిపాపను నీ ఒడిలో వేస్తున్నా. వీణ్ణి చంపినా, బ్రతికించినా నీదే భారం.
బాళ మాఝే బరే హోతా | చరణావరీ ఘాలీన తత్త్వతాం | ఎణేపరీ దేవీస నవసితా | లాధలీ ఆరామతా బాళాస | ||౫౫||
55. ‘నా బిడ్డ బాగైతె, నీ దర్శనానికి తీసుకుని వస్తాను’ అని మ్రొక్కుకోగానే, బాలుడు బాగయ్యాడు.
వైద్య కాయ దేవ కాయ | కార్య ఉరకతా విసర హోయ | విపత్కాలీంచ నవసాచీ సయ3 | పావే జంవ భయ న ఫేడితా | ||౫౬||
56. వైద్యుణ్ణి కాని, దేవుణ్ణే కాని, మన పని పూర్తి కాగానే మరచిపోతాం. మ్రొక్కు కష్టకాలంలోనే గుర్తుంటుంది. మ్రొక్కు తీరక పోతే, అదే భయానికి కారణమవుతుంది.
కిత్యేక వర్షే మహినే దివస | లోటలే విసరలే కేలేలా నవస | అంతీ మాతేనే అంత సమయాస | మాధవరావాంస వినవిలే | ||౫౭||
57. రోజులు, నెలలు, మరి ఎన్నో ఏళ్ళు గడచిపోయాయి. మ్రొక్కు మరచి పోయింది. చివరకు, తన అంతిమ ఘడియల్లో ఆ తల్లి, మాధవరావుతో,
బహుతా వర్షాంచా హా నవస | ఫేడతా ఫేడతా ఆలే హే దివస | బరవీ న దీర్ఘసూత్రతా బహువస | జాఈ గా దర్శనాస దేవీచ్యా | ||౫౮||
58. ‘చాలా ఏళ్ళనుండి ఉన్న మ్రొక్కును, నేను ఇంతవరకు తీర్చలేదు. ఇంత ఆలస్యం చేయటం మంచిది కాదు. నీవు దేవీ దర్శనానికి వెళ్ళు’ అని చెప్పింది.
తైసేచ మాతేచ్యా దోనీ స్తనాంస | ఖాండకే పడూని త్రాసలీ అసోస | హోఊనియా బహు దుఃసహక్లేశ | ఆణికహీ దేవీస నవసిలే | ||౫౯||
59. అంతేకాక, ఆమె రెండు స్తనాలలో తామర వచ్చి, చాలా బాధ పడింది. విపరీతమైన ఆ బాధను భరించలేక, దేవికి మరొక మ్రొక్కును మ్రొక్కుకుంది.
యేతే మాతే లోటాంగణీ | తారిసీల జరీ యా యాతనాంతూని | రౌప్య స్తనద్వయ తుజవరుని | ఓవాళూని వాహీన | ||౬౦||
60. ‘తల్లీ! నీకు సాష్టాంగ నమస్కారం. ఈ బాధనుండి నన్ను రక్షిస్తే, రెండు వెండి స్తనాలను నీకు సమర్పిస్తాను’ అని మ్రొక్కుకుంది.
తోహీ నవస రాహిలా హోతా | ఫేడూ ఫేడూ మ్హణతా మ్హణతా |
తోహీ ఆఠవలా మాతేచ్యా చిత్తా | దేహావసానతా సమయాస | ||౬౧||
61. ఆ మ్రొక్కును కూడా తీర్చాలి, తీర్చాలి అని అనుకుంటూనే, తీర్చలేక పోయింది. చివరి ఘడియల్లో, ఆ తల్లికి ఇది కూడా గుర్తుకు వచ్చింది.
మాతా హోఊనియా నిర్వాసన | గేలీ సమరసోన హరిచరణీ | ||౬౨||
62. ఈ మ్రొక్కును కూడా బబ్యాకు (మాధవరావు) గుర్తు చేసి, ‘మ్రొక్కలు తీరుస్తానని’ అతని చేత మాట తీసుకుని, ఏ కోరికలూ లేక, ఆ తల్లి శ్రీహరి పాదాలను చేరుకుంది.
పుఢే మగ జాఊ జాఊ మ్హణతా | దివస మహినే వర్ష లోటతా| మాధవరావాస జాహలీ విస్మరణతా | నవస ఫేడితా రాహిలే | ||౬౩||
63. ఆ తరువాత, ‘వెళ్ళాలి, వెళ్ళాలి’ అని అనుకుంటూ రోజులు, నెలలు, చివరకు సంవత్సరాలు కూడా గడచి పోయాయి. మాధవరావు మ్రొక్కులను తీర్చటం మరచి పోయాడు.
ఎణేపరీ వర్ష తీస | హోతా కాయ ఘడలే శిర్డీస | జ్యోతిషీ ఎక కరీత ప్రవాస | త్యాచ స్థానాస పాతలా | ||౬౪||
64. ఈ రకంగా, ముప్పై ఏళ్ళు గడిచాక, ఒక జ్యోతిష్యుడు అక్కడక్కడా తిరుగుతూ, తన ప్రయాణంలో భాగంగా, శిరిడీకి వచ్చాడు.
జోతిర్విద్యేచే జ్ఞాన గహన | జాణే భూత భవిష్య వర్తమాన | అనేక జిజ్ఞాసూ తృప్త కరూన | వాహవా మిళవూన రాహిలా | ||౬౫||
65. జ్యోతిష్య విద్యలో అతనికి గొప్ప పాండిత్యం ఉంది. జరిగినది, జరుగబోయేది, మరి జరుగుతున్నది అన్నింటినీ అతను తెలుపగల వాడు. ఎంతో మందికి కలిగిన కుతూహలాన్ని తృప్తి పరచి, అందరి చేతా మెప్పులు పొందాడు.
శ్రీమంత కేశవరావజీ బుట్టీ | ఆదీ కరూన బహుతాంచ్యా గోష్టీ | వర్తవూని సకళాంచీ సంతుష్టీ | ఉఠా ఉఠీ సంపాదిలీ | ||౬౬||
66. శ్రీమంత కేశవరావు బుట్టీ మొదలైన ఎందరికో జరుగబోయేది చెప్పి, వారిని తృప్తి పరిచి, వారి అభిమానాన్ని పొందాడు.
మాధవరావాంచా కనిష్ట భ్రాతా | బాపాజీ అపులే భవిష్య పుసతా | జ్యోతిషీ తో జాహలా వర్తవితా | దేవీచీ అప్రసన్నతా తయావర | ||౬౭||
67. మాధవరావు తమ్ముడైన బాపాజీ, తన భవిష్యాన్ని గూర్చి అడుగగా, జ్యోతిష్యుడు, దేవీ అతని మీద ప్రసన్నంగా లేదని చెప్పాడు.
మ్హణే మాతేనే కేలేలే నవస | తిచ్యా దేహాంతాచియా సమయాస | తిణే తుఝియా జ్యేష్ఠ బంధూస | ఫేడావయాస ఆజ్ఞాపిలే | ||౬౮||
68. ‘మీ తల్లి, తన చివరి ఘడియల్లో తన మ్రొక్కుల సంగతినీ, వానిని తీర్చమనీ మీ అన్నకు చెప్పింది’ అని అన్నాడు.
తే న ఫేడితా ఆజవరీ | నడా దేతే దేవీ భారీ | మాధవరావ యేతా ఘరీ | బాపాజీ సారీ కథీ కథా | ||౬౯||
69. ‘వానిని ఈ నాటి వరకూ తీర్చలేదు కనుక, దేవి బాధను కలిగిస్తూ ఉంది’ అని చెప్పాడు. మాధవరావు ఇంటికి రాగానే, ఈ కథనంతా బాపాజీ అతనికి చెప్పాడు.
మాధవరావాంస పటలీ ఖూణ | సువర్ణకార ఆమంత్రూన | కరవిలే దోన రౌప్య స్తన | గేలే కీ ఘేఊన మశీదీ | ||౭౦||
70. మాధవరావుకు అంతా గుర్తుకు వచ్చింది. కంసాలిని పిలిపించి, రెండు వెండి స్తనాలను చేయించి, వానిని తీసుకుని, మసీదుకు వెళ్ళాడు.
ఘాలూని బాబాంస లోటాంగణ | పుఢే ఠేవూన దోనీ స్తన |
వదతే ఝాలే బాబాంలాగూన | మ్హణతీ ఘ్యా ఫేడూన తే నవస | ||౭౧||
71. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆ రెండు వెండి స్తనాలను వారి ముందుంచి, ‘వీనిని తీసుకుంటే, మా మ్రొక్కు తీరుతుంది’.
తూంచ అముచీ సప్తశృంగీ | తూంచ దేవీ ఆమ్హాలాగీ | హీ ఘే వాచాదత్త దేణగీ | ఘేఊని ఉగీ రహావే | ||౭౨||
72. ‘మీరే మా సప్తశృంగీ, మీరే మాకు దేవత. మ్రొక్కుకున్న ఈ మ్రొక్కును తీసుకుని శాంతించండి. అని అన్నాడు.
బాబా వదతీ ప్రత్యుత్తరీ | జాఊని సప్తశృంగీచ్యా మందిరీ | వాహే తిచీ తీస చరణావరీ | స్తనే హీ సాజిరీ నిజహస్తే | ||౭౩||
73. దానికి జవాబుగా బాబా, “సప్తశృంగీ గుడికి వెళ్ళి, నీ చేతులతో, ఈ స్తనాలను ఆమె పాదాల దగ్గర అర్పించు” అని అన్నారు.
పడతా ఏసా బాబాంచా ఆగ్రహ | మాధవరావాచ్యా మనాచాహీ గ్రహ | తైసాచ హోఊని సోడిలే గ్రహ | జాహలా నిగ్రహ దర్శనాచా | ||౭౪||
74. బాబా అలా బలవంత పెట్టగా, మాధవరావుకు కూడా అలాగే అనిపించి, ఇల్లు వదిలి, దేవీ దర్శనానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.
ఘేతలే బాబాంచే దర్శన | ప్రార్థిలే శుభ ఆశీర్వచన | కరోని ఉదీ ప్రసాద గ్రహణ | అనుజ్ఞా ఘేఉన నిఘాలే | ||౭౫||
75. బాబాను దర్శించుకుని, వారి ఆశీస్సులకు ప్రార్థించి, వారిచే ఉదీ ప్రసాదాన్ని, అనుమతిని పొంది, బయలుదేరాడు.
ఆలే పహా తే సప్తశృంగీస | లాగలే కులోపాధ్యాయ శోధావయాస | సుదైవే కాకాజీచేంచ గృహాస | అనాయాస ప్రాప్త తే | ||౭౬||
76. సప్తశృంగికి వచ్చి, వారి తెగకు చెందిన పూజారికై వెదక సాగాడు. అదృష్టం కొద్దీ, ఏ కష్టమూ లేక కాకాజీ ఇంటికి చేరుకున్నాడు. కాకాజీ కూడా ఇంట్లోనే ఉన్నాడు.
కాకాజీచ్యా ఉత్కంఠా పోటీ | శీఘ్ర వ్హావీ బాబాంచీ భేటీ | తోంచ హీ మాధవరావాంచీ గాఠీ | హే కాయ గోఠీ సామాన్య | ||౭౭||
77. ఇక్కడ కాకాజీ మనసులో, బాబాను త్వరగా దర్శించుకోవాలనే బలమైన కోరిక ఉండగా, అప్పుడే, మాధవరావు వచ్చి కలవటం అనేది సామాన్యమైన సంగతా?
ఆపణ కోణ కోఠీల పుసతా | శిర్డీహూనచి ఆలే సమజతా | కాయ త్యా ఆనందా పారావారతా | పడలీ ఉభయతా మిఠీచ | ||౭౮||
78. ‘మీరెవరు, ఎక్కడినుండి వచ్చారు?’ అని అడుగగా, అతడు శిరిడీనుండే వచ్చాడని తెలియగానే, కాకాజీకి కలిగిన ఆనందానికి హద్దులు లేవు. ఇరువురూ అనుకోని ఈ ఘటనకు ఆశ్చర్యం పొంది, ఒకరినొకరు కౌగలించుకున్నారు.
ఏసే తే దోఘే ప్రసన్నచిత్త | సాఈలీలా గాత గాత | పూర్ణ హోతా నవసకృత్య | ఉపాధ్యే నిఘత శిరడీతే | ||౭౯||
79. ఎంతో సంతోషంతో, ఇద్దరూ సాయి లీలలను చెప్పుకున్నారు. మ్రొక్కుబడి అర్పించే పని పూర్తి కాగానే, కాకాజీ శిరిడీకి బయలుదేరాడు.
మాధవరావాసారఖీ సోబత | తీహీ లాధలీ ఏసీ అకల్పిత | ఊపాధ్యేబువా ఆనందభరిత | మార్గ లక్షీత శిరడీచా | ||౮౦||
80. అనుకోకుండా, మాధవరావువంటి మంచి సహవాసం దొరకటంతో, కాకాజీ చాలా ఆనందించాడు. అతని లక్ష్యమంతా ఇప్పుడు శిరిడీ చేరుకోవటమే.
నవస ఫిటతాం శీఘ్రగతీ | దోఘే పాతలే శిరడీ ప్రతీ |
యేతాంచ సాఈదర్శనా నిఘతీ | పరమ ప్రీతీ ప్రోత్కంఠా | ||౮౧||
81. మ్రొక్కు తీరిన వెంటనే, ఆ ఇద్దరూ, ఎంతో ఉత్సాహంతో, ఎంతో ప్రేమతో, సాయి దర్శనం కోసం శిరిడీకి బయలుదేరారు.
పాతలే కాకాజీ గోదేథడీ | జేథూన శిరడీ సన్నిధ | ||౮౨||
82. మనసులో మునుపున్న ఉత్సాహంతోనే, ఇప్పుడు ప్రయాణించి, గోదావరీ తీరానికి చేరుకున్నారు. దగ్గరలోనే శిరిడీ ఉంది.
పుజారీ వందీ బాబాంచే చరణ | కరీత సజల నయనీ స్నపన | హోఊని దర్శన సుఖ సంపన్న | చిత్త ప్రసన్న జాహలే | ||౮౩||
83. బాబా పాదాలకు నమస్కరించి, పూజారి తన కన్నీటితో వానిని కడిగాడు. సాయి దర్శనంతో తృప్తి పొందిన అతని మనసు ఎంతో శాంతించి, ఆనందించింది.
దేవీచా దృష్టాంత హోతా యదర్థ | దృష్టీ దేఖతా తే బాబాసమర్థ | కాకాజీ సుఖావలే యథార్థ | పురలా మనోరథ తయాంచా | ||౮౪||
84. కలలో దేవీ చెప్పిన ఆ సాయి సమర్థుని, తన కళ్ళతో కళ్ళారా చూసి, కాకాజీ నిజమైన సంతోషాన్ని పొందాడు. అతని మనసులోని కోరిక తీరింది.
అసో కాకాజీ సుఖసంపన్న | దర్శనసేవనే చిత్త ప్రసన్న | జాహలే ఖరేంచ నిశ్చింత మన | కృపాఘన వర్షణే | ||౮౫||
85. అలా, సాయిని చూసిన తరువాత, కాకాజీ మనసు ఆనందంతో నిండిపోయింది. బాబా కురిపించిన అనుగ్రహంతో, అతని మనసులోని చింతలన్నీ నిజంగా తొలగిపోయాయి.
హరపలే మనాచే చంచలపణ | స్వయే జహాలే విస్మయాపన్న | ఆపణాసచి పుసతీ ఆపణ | కాయ విలక్షణ హీ కరణీ | ||౮౬||
86. అతని మనసులోని కలవరం మాయమైంది. దాంతో అతనికి చాలా ఆశ్చర్యమయింది. ‘ఇది ఎలాంటి విలక్షణమైన లీల’ అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు.
నాహీ కాహీ వదలే వచన | నాహీ ప్రశ్న సమాధాన | నాహీ దిధలే ఆశీర్వచన | కేవళ దర్శన సుఖదాఈ | ||౮౭||
87. ‘నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రశ్నలు అడగటం, జవాబులు చెప్పటంలాంటివేవీ లేవు. ఆశీర్వచనాలు లేవు. కేవలం చూపుతోనే, సుఖం కలిగింది.
మాఝీ చంచల చిత్తవృత్తి | కేవళ దర్శనే పావలీ నివృత్తి | లాధలీ అలౌకిక సుఖసంవిత్తి | ‘దర్శనమహతీ’ యా నావ | ||౮౮||
88. ‘నా మనసులోని అలజడి అంతా, కేవలం ఒక్క చూపుతో మాయమైంది. అలౌకికమైన సుఖం దొరికింది. దీనినే అద్భుతమైన దర్శన మహిమ అని అంటారు’.
సాఈపాయీ జడలీ దృష్టీ | తేణే వాచేస పడలీ మిఠీ | కర్ణీ పరిసతా బాబాంచ్యా గోష్టీ | ఆనంద పోటీ న సమాయే | ||౮౯||
89. అతని చూపంతా సాయి పాదాలలో నిమగ్నమైంది. దానితో అతనికి మాటలు రాలేదు. బాబా మాటలు చెవులలో పడగానే, పట్టలేని ఆనందం కలిగింది.
ఉపాధ్యేబువా నిజభావేసీ | శరణ గేలే సమర్థాసీ | పావతే ఝాలే నిజ సుఖాసీ | విసరలే వృత్తీస పూర్వీల | ||౯౦||
90. ఎంతో వినయంగా, సాయి సమర్థులకు శరణుజొచ్చి, పూజారిబువా (కాకాజీ) ఆనందాన్ని పొందాడు. మునుపున్న మనసులోని అలజడిని మరచి పోయాడు.
ఏసే కాకాజీ బారా దివస | రాహతే ఝాలే తై శిరడీస |
హోఊనియా సుస్థిరమానస | సప్తశృంగీస పరతలే | ||౯౧||
91. ఇలా, కాకాజీ శిరిడీలో పన్నెండు రోజులు ఉన్నాడు. తన మనసు స్థిరంగా ఉండటంతో, సంతోషంతో సప్తశృంగికి వెళ్ళిపోయాడు.
స్వప్నాంసహీ లాగే కాళ | ఉషఃకాల వా ప్రాతఃకాళ | తెవ్హా జీ పడతీ తీంచ సఫళ | స్వప్నే నిర్ఫళ తదితర | ||౯౨||
92. కలలకు కూడా ఒక సమయం ఉంటుంది. తెల్లవారి కాని, లేక సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల మునుపు కాని, వచ్చిన కలలు ఫలిస్తాయి. మిగతా వేళలో వచ్చే కలలన్నీ ఫలించనివి.
ఏసీ సార్వత్రిక ప్రసిద్ధీ | పరి యా శిరడీచ్యా స్వప్నాంచీ సిద్ధీ | పడోత తీ కుఠే ఆణీ కధీ | భక్తా అబాధిత అనుభవ | ||౯౩||
93. అని అంతటా ప్రసిద్ధి. కాని, శిరిడీలో కలలు ఎక్కడ వచ్చినా, ఎప్పుడు వచ్చినా, అవి తప్పక ఫలిస్తాయి. ఇది భక్తులకు తప్పని సరిగా, ఎప్పుడూ కలిగే అనుభవం.
యే అర్థీంచీ అల్ప వార్తా | సాదర కరితో శ్రోతయాం కరితా | కౌతుక వాటేల పరమ చిత్తా |శ్రవణోల్లాసతా వాఢేల | ||౯౪||
94. ఈ సందర్భంలో, ఒక చిన్న సంగతిని శ్రోతలకు మనవి చేస్తాను. అది విని వారు ఎంతో ఆనందించి, వారి ఉల్లాసం ఎక్కువవుతుంది.
దోనప్రహరీ ఎకే దివశీ | బాబా వదతీ దీక్షితా పాశీ | టాంగా ఘేఊన జా రహాత్యాసీ | ఖుశాల భాఊసీ5 ఘేఊన యే | ||౯౫||
95. ఒక రోజు మధ్యాహ్నం వేళప్పుడు, దీక్షితుతో బాబా, “టాంగా తీసుకుని, రహాతాకు వెళ్ళి, ఖుశాలభావును వెంటబెట్టుకుని రా.
జాహలే కీ దివస బహుత | భేటావయాచీ మనీ ఆర్త | మ్హణావే బాబానీ తుమ్హాప్రత | భేటీప్రీత్యర్థ బోలావిలే | ||౯౬||
96. “ ‘చాలా రోజులుగా నిన్ను కలవాలని కోరికగా ఉండటం వలన, బాబా నిన్ను పిలిచారు’ అని చెప్పు” అని అన్నారు.
కరూనియా ఆజ్ఞాభివందన | దీక్షిత గేలే టాంగా ఘేఊన | ఖుశాలభాఊ భేటలే తత్క్షణ | నివేదిలే ప్రయోజన ఆగమనాచే | ||౯౭||
97. వారి పాదాలకు నమస్కరించి, వారి ఆజ్ఞ ప్రకారం, దీక్షితు టాంగా చేసుకుని వెళ్ళాడు. ఖుశాలభావును వెంటనే కలిశాడు. తను వచ్చిన సంగతిని దీక్షితు చెప్పాడు.
ఏకూనియా బాబాంచా నిరోప | ఖుశాలభాఊస ఆశ్చర్య అమూప | మ్హణతీ హాచ ఉఠలో ఘేఊన ఝోంప | ఝోంపేత ఆజ్ఞాపత హేంచి మజ | ||౯౮||
98. బాబాయొక్క సందేశాన్ని విని, ఖుశాలభావుకు విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. ‘ఇప్పుడే నేను నిద్రనుండి లేచాను. నిద్రలో కూడా, నాకు బాబా ఆజ్ఞ ఇదే.
ఆతాంచ మీ దుపారా జేవుని | కరీత అసతా ఆరామ శయనీ | డోళ్యాస డోళా లాగతా క్షణీ | బాబాహీ స్వప్నీ హేంచ వదత | ||౯౯||
99. ‘ఇప్పుడే, మధ్యాహ్నం, నేను భోజనం చేసి, ప్రక్క మీద విశ్రమిస్తుండగా, కళ్ళు మూతలు బడి, కల వచ్చింది. అందులో బాబా ఇదే చెప్పారు.
మ్హణాలే ఆతాంచ శిరడీస చల | మాఝీహీ ఇచ్ఛా జాహలీ ప్రబళ | కరూ కాయ ఘోడే న జవళ | ములాస కళవాయా ధాడిలే | ||౧౦౦||
100. ‘ ‘ఇప్పుడే శిరిడీకి బయలుదేరు’ అని నాతో అన్నారు. వారిని కలవాలని, నాకు కూడా చాలా కోరికగా ఉంది. కాని, ఏం చేయను? దగ్గరలో గుర్రం లేదు. ఇది వారికి తెలపటానికి, మా అబ్బాయిని పంపాను.
ములగా వేశీచ్యా బాహేర పడలా | తోంచ హా అపులా టాంగా ఆలా |
దీక్షిత వినోదే మ్హణతీ తయాలా | తదర్థచ మజలా ఆజ్ఞాపిలే | || ౧౦౧||
101. ‘అబ్బాయి గ్రామ పొలిమేర దాకా వెళ్ళాడో లేదో, మీ టాంగా వచ్చింది’ అని అన్నాడు. దీక్షితు సరదాగా అతనితో, ‘అందుకేగా మరి, బాబా నన్ను పంపారు’ అని అన్నాడు.
మగ తే శిరడీస ఆనందనిర్భర | దీక్షితా బరోబర పాతలే | ||౧౦౨||
102. ‘ఇప్పుడు మీరు వచ్చేటట్లైతే, బయట టాంగా బండి సిద్ధంగా ఉంది’ అని దీక్షితు చెప్పాడు. అతడు దీక్షితు వెంట ఆనందంగా శిరిడీకి వచ్చాడు.
తాత్పర్య ఖుశాలభాఊ భేటలే | బాబాంచేహీ మనోరథ పురలే | ఖుశాలభాఊహీ బహు గహివరలే | పాహూన యా లీలేస బాబాంచ్యా | ||౧౦౩||
103. దాంతో, ఖుశాలభావును కలుసుకోవాలన్న బాబా కోరిక తీరింది. బాబాయొక్క ఆ లీలను చూసి, ఖుశాలభావుకు గొంతు గద్గదమైంది.
ఎకదాం ఎక పంజాబీ బ్రాహ్మణ | రామలాల నామాభిధాన | ముంబఈమధ్యే వసతా జాణ | బాబాంనీ స్వప్న దిలే తయా | ||౧౦౪||
104. ఒక సారి, రామలాలు అనే పంజాబీ బ్రాహ్మణుడు, ముంబైలో ఉండగా, అతని కలలో బాబా దర్శనమిచ్చారు.
దిఙ్‍వాయు రవివరూణాది దేవతా | యాంచ్యా అనుగ్రహాంచియా సత్తా | బాహ్యాంతఃకరణ విషయగ్రాహకతా | జాగరితతా6 త్యా నాంవ | ||౧౦౫||
105. బయట, లోపలి ప్రపంచంలో జరిగేవానిని, ఆకాశం, వాయు, సూర్యుడు, వరుణుడు మొదలైన దేవతల శక్తి వలన తెలుసుకుంటాం. ఈ తెలుసుకునే జ్ఞానాన్ని జాగ్రదావస్థ అని అంటాము.
విరమే జంవ సకల ఇంద్రియగణ | హోఈ జాగ్రత్సంస్కార ప్రబోధన | గ్రాహ్య గ్రాహక రూపే స్ఫురణ | అసే హే లక్షణ స్వప్నాంచే | ||౧౦౬||
106. దేహంలోని అన్ని ఇంద్రియాలూ విశ్రమిస్తుండగా, జాగ్రదావస్థలో మనసు మీద పడ్డ భావనలను, ఆ మనిషి స్వభావాన్ని బట్టి, మరల కనిపింప చేసే సాధనమే కల.
త్యాంచే స్వప్న తో విలక్షణ | ఠావే న బాబాచే రూప లక్షణ | పూర్వీ కధీ నాహీ దర్శన | "మజకడే యేఊన జా" మ్హణత | ||౧౦౭||
107. రామలాలుకు వచ్చిన కల ఎంతో వింతైనది. అతనికి బాబా రూపు రేఖలు తెలియవు. మునుపెన్నడూ అతను వారిని చూడలేదు. అయినా, “నా దగ్గరకు రా!” అని అన్నారు.
ఆకృతీవరూన దిసలే మహంత | పరి న ఠావే తే కోఠే వసత | రామలాల హోఊన జాగృత | విచారాకులిత జాహలా | ||౧౦౮||
108. చూడటానికి వారు గొప్ప మహాత్మునిలాగా ఉన్నారు. కాని, వారు ఎక్కడివారో తెలియదు. రామలాలు మేలుకొని, దీర్ఘంగా ఆలోచించ సాగాడు.
జావే ఏసే వాటలే మనా | పత్తా నాహీ ఠావ ఠికాణా | పరి జో బోలవీ తయాసీ దర్శన | తయాచీ రచనా తో జాణే | ||౧౦౯||
109. వారు పిలిచారు కనుక వెళ్ళాలని అనిపించింది కాని, వారుండే స్థలం, వారి చిరునామా, ఏదీ తెలియదు. కాని, అతనిని రమ్మని పిలిచిన వారికి, దర్శనమివ్వటం ఎలాగో కూడా తెలుసు.
మగ తేచ దివశీ దుపారీ | సహజ రస్త్యానే మారితా ఫేరీ | ఛబీ ఎకే దుకానావరీ | పాహూని అంతరీ చమకలా | ||౧౧౦||
110. అదే రోజు మధ్యాహ్నం, ఏమీ తోచక రామలాలు, రొడ్డు మీద పోతుంటే, ఒక అంగడిలో ఒక పటాన్ని చూసి, ఆశ్చర్యపోయాడు.
స్వప్నీ జే రూప దిసలే తయాలా | తేంచ తే గమలే రామలాలాలా |
విచారపూస కరాయా లాగలా | దుకానదారాలా తాత్కాళ | ||౧౧౧||
111. తాను కలలో చూసిన మనిషే ఆ పటంలో ఉన్నట్లు అతనికి అనిపించింది. వెంటనే అంగడి వానిని, పటంలోని మనిషి గురించి వివరాలు అడిగాడు.
లక్ష లావూన ఛబీ పాహే | కోణ కోఠీల ఆహేత హో హే | కళతాం హా సాఈ శిరడీంత రాహే | స్వస్థ రాహే రామలాల | ||౧౧౨||
112. శ్రద్ధగా పటాన్ని చూశాడు. వారు ఎవరు ఎక్కడుంటారు అని అంగడివానిని అడుగగా, వారు శిరిడీలోని సాయిబాబా అని తెలిసింది. దానితో రామలాలు మనసు కుదుటపడింది.
పుఢీల పత్తా పుఢే లాగలా | రామలాల శిరడీస గేలా | బాబాంచియా నిర్వాణకాలా | పర్యంత రాహిలా త్యా పాశీ | ||౧౧౩||
113. తరువాత, పూర్తి వివరాలను తెలుసుకుని, శిరిడీ వెళ్ళి, బాబా నిర్వాణం వరకూ, బాబా దగ్గరే ఉన్నాడు.
అపుల్యా భక్తాంచే పురవావే హేత | ఆణావే తయాంస దర్శనార్థ | పురవావే స్వార్థ వా పరమార్థ | హేచి మనోరథ బాబాంచే | ||౧౧౪||
114. భక్తులను తమ దగ్గరకు రప్పించుకుని, వారి సాంసారిక కోరికలను, వారి పారమార్థిక అవశ్యకతలను తీర్చడమే బాబాయొక్క హృదయపూర్వక కోరిక.
నాతరీ తే అవాప్త కామ | స్వయే సర్వదా నిష్కామ | నిఃస్వార్థ నిరహంకార నిర్మమ | భక్త కామైక అవతార | ||౧౧౫||
115. లేకుంటే, వారికి వేరే ఏ కోరికా లేక, అన్ని కోరికలూ తీరినవారు. స్వార్థం అనేది అసలే లేనివారు, ఏ మమకారాలూ లేని వారు బాబా. భక్తుల కోరికలు తీర్చడానికే వారు అవతరించారు.
క్రోధ జ్యాచా ఘేఈన వారా | ద్వేషాస జేథే న లభే థారా | డోళా న దేఖే జో ఉదరంభరా | సాధు ఖరా తో సమజావా | ||౧౧౬||
116. ఎవరికి కోపమనేది అసలు లేదో, ఎవరిని ద్వేషమనేది తాకదో, ఎవరికి ‘నేను, నాది’ అనే భావన లేదో, అతడే నిజమైన సాధువని తెలుసుకోవాలి.
సర్వాంఠాయీ ప్రేమ నిఃస్వార్థ | హాచ జ్యాచా పరమపురుషార్థ | వేంచీ న ధర్మ విషయావ్యతిరిక్త | వాచా హీ వ్యర్థ పళభరీ | ||౧౧౭||
117. స్వార్థం అనేది అసలు లేకుండా, అందరినీ సమంగా ప్రేమించడమే, వారి పరమ లక్ష్యం. ధర్మ గురించిన సంగతులు తప్ప, మిగతా దేనిలోనూ క్షణం కూడా వ్యర్థం చేయరు.
సారాంష మాఝా ధరుని హాత | లిహవూన ఘేతా హే నిజ చరిత | భక్తీ హ్వావే నిజస్మరణరత | హేంచి కీ ఇంగిత యేథీల | ||౧౧౮||
118. సారాంశంలో చెప్పాలంటే, నా చేతిని పట్టుకుని, తమ చరిత్రను బాబా వ్రాయించుకోవటం, భక్తులు ఎప్పుడూ తమను స్మరిస్తూ ఉండాలనే. ఇదే ఇందులోని అసలు రహస్యం.
మ్హణవూని హేమాడ అతి వినీత | నిత్య శ్రోతయా హేంచి వినవీత | హోఊని శ్రద్ధా భక్తిసమన్విత | సాఈ సచ్చరిత పరిసావే | ||౧౧౯||
119. అందుకే, శ్రీసాయి సచ్చరితను, ఎల్లప్పుడూ శ్రద్ధా భక్తులతో వినండి, అని హేమాడు, అత్యంత నమ్రతతో, శ్రోతలకు మనవి చేస్తున్నాడు.
తేణే మనాస హోఈల శాంతీ | ఉపజేల వ్యసన మగ్నా ఉపరతీ | జడేల సాఈచరణీ భక్తీ | భవ నిర్ముక్తీ దాయక | ||౧౨౦||
120. దాని వలన, మనసుకు శాంతి లభిస్తుంది. వ్యసనాలలో చిక్కుకున్న వారికి, ఇది ఓదార్పు కలిగిస్తుంది. సాయి పాదాలలో భక్తి కలిగి, సంసార బంధాలనుండి ముక్తి కలుగుతుంది.
అసో పుఢీల అధ్యాయీ ఆతా | సంన్యాసీ విజయానందాచీ కథా |
జయాస మానససరాసీ జాతా| లాధలీ నిర్ముక్తతా నిజపదీ | ||౧౨౧||
121. ఇక, తరువాతి అధ్యాయంలో, విజయానందుడనే సన్యాసి కథ. మానస సరోవరానికి బయలుదేరిన సన్యాసికి, సాయి పాదాల దగ్గర ముక్తి దొరికింది.
భక్త మానకర బాళారామ | తయాహీ తైసాచ దిధలా విశ్రామ | తోచ నూలకర మేఘాచా కామ | పురవీ ప్రకామ సాఈనాథ | ||౧౨౨||
122. అలాగే, సాయి భక్తుడు బాళారామ మాన్కరుకు కూడా శాశ్వతమైన విశ్రాంతినిచ్చారు. నూల్కరు మరియు మేఘాల కోరికలను చక్కగా తీర్చారు.
వ్యాఘ్రాసారఖా క్రూర ప్రాణీ | తయాహీ దిధలా ఠావ చరణీ | ఏసీ అఘాధ సాఈచీ కరణీ | శ్రవణా పర్వాణీ మహోత్సవ | ||౧౨౩||
123. పులివంటి కౄర మృగానికి కూడా, తమ పాదాల దగ్గర బాబా చోటిచ్చారు. ఇలాంటి సాయియొక్క, ఊహకందని లీలల గురించి వినడం, ఎంతో సంతోషకరమైంది, మహోత్సవంలాంటిది.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | నవసాదికథా కథనం నామ |
| త్రింశత్తమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
1. బోలావీత.
2. డోళే ఉఘడలే, జాగే ఝాలే.
3. ఆఠవణ.
4. ఆఈ మాధవరావాంస ‘బబ్యా’ మ్హణే.
5. తేథీల ఎక శేట జే బాబాంచే భక్త హోతే.
6. జాగృతావస్థా.
No comments:
Post a Comment