Sunday, October 6, 2013

||సాఈకృపానుగ్రహదానం నామ ఎక చత్వారింశత్తమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౧ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

హేంచ సాఈకథేచే మహిమాన | కితీహీ పరిసా నలగే ప్రోత్సాహన | 
శ్రోతేచ రాఖూని పూర్వానుసంధాన | అతి సావధాన శ్రవణార్థీ | ||౧|| 
1. ఎంత విన్నా, ఇంకా వినటానికి శ్రోతలను ప్రోత్సాహ పరచే అవసరం లేదు. ఇదే సాయి కథలలోని మహిమ. పూర్వ కథను గుర్తుంచుకుని శ్రోతలే శ్రద్ధగా వినటానికి సిద్ధంగా ఉంటారు.
కరావయా కథాపాన | జేథే శ్రోతేచ సావధాన | 
కిమర్థ మగ ప్రార్థావే అవధాన | వృత్తీ జై ఎకతాన ఆధీంచ | ||౨|| 
2. శ్రోతలే ఏకాగ్ర మనసుతో కథామృత పానానికి సిద్ధంగా ఉండగా, శ్రద్ధగా వినండని వారిని ప్రార్థించడం ఎందుకు?
గాతా పరిసతా నిజగురు మహతీ | హోఈల నిర్మళ చిత్తవృత్తీ | 
దృఢ ధ్యాన నామానువృత్తీ | సుఖైక మూర్తీ ప్రకటేల | ||౩|| 
3. మన గురువుయొక్క మహిమను గానం చేసినా, వినినా, మనసు నిర్మలమౌతుంది. దృఢమైన మనసుతో వారి నామాన్ని జపిస్తూ, ధ్యానిస్తే, అత్యంత సుఖాన్నిచ్చే మూర్తిగా వారు ప్రకటమౌతారు.
గతాధ్యాయీ జాహలే కథన | కైసే ఎకావ్రతాచే ఉద్యాపన | 
యథా సాంగ జాహలే పూర్ణ | దృష్టాంత ఖూణ సమవేత | ||౪|| 
4. ఒక వ్రతంయొక్క ఉద్యాపనం (వ్రతం తరువాత చేసే అన్న సంతర్పణం) యథావిధిగా ఎలా పూర్తి అయిందో, దృష్టాంతంతో సహ గతాధ్యాయంలో చెప్పబడింది.
తైసీచ సాఈచీ పార్థీవ1 ఛబీ | కవణ్యా పరీ ఆకస్మిత యావీ | 
కైసీ వేళేవర ఇచ్ఛా పురవావీ | కథా పరిసావీ హీ ఆతా | ||౫|| 
5. అలాగే, ఆకస్మికంగా, సమయానికి సరిగ్గా వచ్చి, సాయి చిత్రపటం, కోరికను పూర్తి చేసిన కథను ఇప్పుడు గమనించండి.
ఎకా హోళీచియా సణా | యేతా మీ ఆజ ఘాలీ భోజనా | 
సాఈ ఏసియా దేఊని స్వప్నా | హోయ మనకామనా పురవితా | ||౬|| 
6. ఒక హోళీ పండుగ నాడు, నా కలలో సాయి కనిపించి, “నేను ఈ రోజు భోజనానికి వస్తాను” అని చెప్పి, నా మనసులోని కోరికను తీర్చటం,
కథా హీ పూర్వీంచ కథిలీ సవిస్తర | పరి తీ ప్రతిమా కైసీ వేళేవర | 
యావీ హా కైసా కాయ చమత్కార | తే ఆజ సాదర పరిసావే | ||౭|| 
7. ఈ కథ ఇదివరకే సవిస్తారంగా చెప్పబడింది. కాని, ఆ చిత్రపటం, ఎలా సమయానికి వచ్చిందనే చమత్కారం గురించి, ఈ రోజు శ్రద్ధగా వినండి.
కథా సాంగే అల్లీ మహమద | వాటలీ పరమ ఆశ్చర్యప్రద | 
హీ తరీ ఎక లీలాచ విశద | అతి వినోదకారక | ||౮|| 
8. అల్లీ మహమ్మదు చెప్పిన ఆ కథ, నాకు పరమాశ్చర్యం కలిగించింది. కాని, ఇది కూడా, బాబా లీలలో అత్యంత వినోదకారకమైనదే కదా.
యానీంచ తీ హోళీచ్యా దివసీ | ఆమ్హీ దుపారా జేవావయాసీ | 
బైసావయాచే ఏన సమయాసీ | ఆణూని ఉల్లాసిత కేలే మజ | ||౯|| 
9. ఇతనే ఆ హోళీ రోజున మధ్యాహ్నం, మేము భోజనానికి కూర్చున్న సమయానికి సరిగ్గా, బాబా పటాన్ని తెచ్చి ఇచ్చి, నన్ను ఆనందింప చేసినది.
హే తో పూర్వీల కథానుసంధాన | ఆతా శ్రోతా సావధాన | 
పరిసిజే పుఢీల నిరూపణ | చరిత్ర పావన సాఈచే | ||౧౦||
10. ఇది జరిగిన కథ. ఇప్పుడు పావనమైన సాయి చరిత్రలోని తరువాతి కథను శ్రోతలూ, శ్రద్ధగా గమనించండి.

తీ హీ కథా సరస పూర్ణ | శ్రోతే ఆధీంచ దత్తావధాన | 
వక్తా సాఈపదీ లీన | చరిత్ర గహన సాఈచే | ||౧౧|| 
11. ఇదే ఆ రసభరితమైన కథ. శ్రోతలు అప్పుడే ఒకే మనసుతో ఉన్నారు. వక్త సాయి పాదాలలో లీనమై ఉన్నాడు. సాయి చరిత్ర సులభంగా అర్థం కానిది. 
పరోపకారాచీ తీ ప్రతిమా | పరోపకారార్థ ఝిజవీ ఆత్మా | 
సదా సర్వదా నిర్వైరధర్మా | అఖండ సత్కర్మా వాహిలా | ||౧౨|| 
12. మూర్తీభవించిన పరోపకారం వారు. పరోపకారం కొరకు, వారు తమ శరీరాన్ని శ్రమ అరగదీశారు. సదా సర్వదా, ఏ వైరమూ లేని భావంతో, సత్కార్యాలను చేయడానికే అంకితమైనవారు.
బరీ వాఈట కైసీహీ స్థితీ | దేహకర్మే దేహా నా సుటతీ | 
పరి తీ లావా అంతర్వృత్తీ | గురుచరణీ ప్రీతీపూర్వక | ||౧౩|| 
13. మంచిగాని, చెడుగాని, ఎటువంటి పరిస్థితులలోనైనా, శరీర కర్మలు శరీరాన్ని వదలవు. కనుక ప్రీతిపూర్వకంగా, మీ మనసుని గురు పాదాల వేపు మరలించండి.
మగ నిజభక్తాచా యోగ క్షేమ | గురు కైసా చాలవీ అవిశ్రమ | 
తే గురుచరణీ ఠేవూని ప్రేమ | పహా అత్యుత్తమ అనుభవే | ||౧౪|| 
14. అప్పుడు, గురువు తమ భక్తుల యోగక్షేమాలను, విరామమే లేకుండా, ఎలా రక్షిస్తారో, అత్యుత్తమమైనా అనుభవాన్ని మీరే పొంది చూడండి.
హే స్థితీ మాగితల్యా న మిళే | ఠాయీ పడే గురుకీర్తన మేళే | 
జే న మహత్‍ప్రయత్నేహీ ఆతళే | తే గురుకృపాబళే చాలత యే | ||౧౫|| 
15. అటువంటి ఉత్తమ స్థితి, కోరితే దొరికేది కాదు. కాని, గురువును కీర్తిస్తే, ఆరాధిస్తే లభిస్తుంది. ఎంతో కష్టంతో కూడా సాధించ లేనిది, గురు కృపా బలంతో సులభంగా ప్రాప్తిస్తుంది.
ధరోనియా దురభిమాన | కరూ ఆలే జే సూక్ష్మనిరీక్షణ | 
తేహీ సర్వ పరతలే త్యక్తాభిమాన | సుఖాయమాన దర్శనసుఖే | ||౧౬|| 
16. దురభిమానంతో సూక్షంగా పరీక్షించాలని వచ్చిన వారంతా, దర్శనానందంతో, అభిమానాన్ని వదిలి, సుఖంగా వెళ్ళారు.
యశ శ్రీ ఔదార్య జ్ఞాన | శాంతీ వైరాగ్య హే షడ్గుణ | 
ఇహీ శ్రీసాఈ భగవంత పూర్ణ | ఏశ్వర్యే సంపూర్ణ హరి జైసా | ||౧౭|| 
17. యశస్సు, ఐశ్వర్యం, ఔదార్యం, జ్ఞానం, శాంతి, వైరాగ్యం - ఈ షడ్గుణ సంపన్నులైన శ్రీసాయి కూడా నారాయణుని వలె భగవంతుడే.
కితీ హో ఆముచే భాగ్య గహన | జేణే హా సాఈ చైతన్య ఘన | 
వినాఅర్చన పూజన భజన | దేఈ దర్శన ఆమ్హాంతే | ||౧౮|| 
18. మనం ఎంతటి భాగ్యవంతులం! చైతన్య ఘనులైన శ్రీసాయి, ఏ పూజార్చనలూ, భజనలూ లేకుండానే, మనకు దర్శనమిస్తున్నారు.
మ్హణతీ భక్తీపాశీ దేవ | ఆమ్హాంపాశీ భక్తీచా అభావ | 
పరి హా సాఈ మహానుభావ | కనవాళూ స్వభావ దీనార్థ | ||౧౯|| 
19. భక్తి ఉంటేనే భగవంతుడు, అని అంటారు. మనకు భక్తియొక్క కొరత ఉంది. అయినా, ఈ సాయి మహానుభావులు, దీనులు, పేదలయెడల దయా స్వభావాన్ని కలిగి ఉన్నారు.
అసో తో అల్లీచ వదేజీ ఆతా | శ్రోతా సాద్యంత ఏకిజే వార్తా | 
కళేల సాఈలీలా గహనతా | ఆణీక నిజసత్తా తయాచీ | ||౨౦||
20. అల్లీ చెప్పిన కథనంతా శ్రోతలు వింటే, సాయిలీల ఎంత అర్థం కానిదో, వారి శక్తి ఎంతో, తెలుస్తుంది.

ఎకే దివశీ ముంబానగరీ | ఫిరత అసతా రస్త్యావరీ | 
చిత్రే మనోహర ఆణి తసబిరీ | వికణారా వ్యాపారీ అవలోకిలా | ||౨౧|| 
21. ‘ముంబయి నగరంలో, ఒకరోజు, దారివెంట నడుస్తుండగా, ఒక వ్యాపారి, అందమైన చిత్రపటాలను, మూర్తులను, అమ్ముతూ ఉండటం చూచాను.
చిత్రే సుందర నానాపరీ చీ | సంతా మహంతా అవలియాంచీ | 
పాహోని జాహలీ వృత్తీ మనాచీ | కవణా కవణాచీ తీ పాహూ | ||౨౨|| 
22. ‘సంతుల, మహంతుల, అవలియాల సుందరమైన నానా రకమైన పటాలు, మూర్తులు ఉన్నాయి. అవి ఎవరెవరివో చూడాలనిపించింది. 
మ్హణోని ఎకేక పాహూ లాగతా | ఆవడలీ హీ తసబీర చిత్తా | 
సర్వాంహూని తిచీ మోహకతా | శివాయ తీ ఆరాధ్య దేవతాహీ | ||౨౩|| 
23. ‘అలా అనిపించి, ఒక్కొక్కటే చూస్తుండగా, వాటిలో అన్నింటికంటే ఆకర్షణీయంగా ఉన్న ఈ మూర్తి, నాకు బాగా నచ్చింది. పైగా వారు నాకు ఆరాధ్య దైవం. 
ఆధీంచ మనీ సాఈచీ ఆవడ | సన్ముఖ తయాంచీ మూర్తీహీ ఉఘడ | 
పాహూని ఘ్యావయా జాహలీ తాంతడ | కింమత మీ రోకడ మోజిలీ | ||౨౪|| 
24. ‘అప్పటికే నాకు సాయియంటే చాలా అభిమానం. వారి మూర్తి నా కళ్ళెదుట కనిపించే సరికి, తక్షణమే కొనాలనే కోరిక కలిగింది. వెంటనే, దాని వెల నగదు చెల్లించాను. 
మగ తీ తసబీర ఆణిలీ ఘరీ | టాంగూన ఠేవిలీ భింతీవరీ | 
ఆనందే నిత్యదర్శన కరీ | ప్రేమహి మజ భారీ బాబాంచే | ||౨౫|| 
25. ‘తరువాత, ఆ పటాన్ని ఇంటికి తెచ్చి గోడకు తగిలించాను. బాబాపై నాకు చాలా ప్రేమ గనుక, ప్రతిరోజూ ఎంతో ఆనందంతో దర్శనం చేసుకునేవాణ్ణి. 
దిధలీ మీ హీ తుమ్హాపాశీ | తయా ఆధీ తిసరే మాసీ | 
ఆరామ నవ్హతా మాఝియే జీవాసీ | రాహిలో సహవాసీ మేహుణ్యాచ్యా | ||౨౬|| 
26. ‘మీకివ్వటానికి మూడు నెలల మునుపు, నా ఆరోగ్యం బాగా లేక, నా బావమరిదితో ఉండేవాణ్ణి. 
నూరమహమద పీరభాయ | మేహుణా హా మజలా హోయ | 
సుజలా హోతా మాఝా పాయ | కేలా మజ ఉపాయ శస్త్రక్రియేచా | ||౨౭|| 
27. ‘నూర్ మహమ్మదు పీరభాయి, నాకు బావమరిది. నా కాలు వాచిపోగా శస్త్ర చికిత్స జరిగింది. 
ఏసా అసతా దుఖణాఈత | తీన మహినే రాహిలో తేథ | 
కోణీచ నవ్హతే మాఝియే ఘరాంత | యా తీన మహిన్యాంత వస్తీస | ||౨౮|| 
28. ‘ఆ అనారోగ్య పరిస్థితిలో, నేను అక్కడ మూడు నెలలు ఉన్నాను. ఆ మూడు నెలలూ నా ఇంట్లో ఎవరూ లేరు. 
ప్రసిద్ధ బాబా అబదుల రహిమాన | మౌలానా సాబ మహమద హుసేన | 
బాబాసాఈ బాబా తాజుద్దీన | ఇహీ న తే స్థాన త్యాగిలే | ||౨౯|| 
29. ‘అయినా, ప్రసిద్ధులైన బాబా అబ్దుల్ రహమాన, మౌలానా సాహేబు, మహమ్మదు హుసేన్, సాయిబాబా, మరియు తాజుద్దీన్ బాబాలు నా ఇల్లు వదిలి పెట్టి పోలేదు. 
హే సర్వ ఆణి ఏసేచ ఇతర | యాంచీ ఛాయా చిత్రే భింతీవర | 
హోతీ మాఝియే ఘరాంత మనోహర | సోడీ న హే కాలచక్ర తయాంహీ | ||౩౦||
30. ‘వీరందరివి, మరియు ఇతరుల పటాలు కూడా నా ఇంట్లో చక్కగా గోడపై ఉండేవి. కాని, కాల చక్రం వారిని కూడా వదిలి పెట్టలేదు. 

మాఝీ ఇకడే ఏసీ గతీ | చిత్రాంమాగే కా సాడేసాతీ | 
వాటే వస్తూసీ హోతా ఉత్పత్తీ | ప్రలయ స్థితీహీ దుర్లంఘ్య | ||౩౧|| 
31. ‘ఇక్కడ నా పరిస్థితే ఇలా ఉండగా, పటాలకు కూడా ‘సాడే సాతి’ ఎందుకు పట్టిందో? సృష్టింప బడ్డ ప్రతి వస్తువూ నశించక తప్పదు అని అనిపించింది. 
అసో ఏసీ అసతా పరిస్థితీ | సాఈచ కైసే త్యాంతూన చుకతీ | 
హే తో హా కాళవరీ హీ మజ ప్రతీ | కోణీహీ న సకతీ సాంగావయా | ||౩౨|| 
32. ‘పరిస్థితులు అలా ఉండగా, సాయి మాత్రం ఆ దుస్థితిని ఎలా తప్పించుకున్నారు అన్నది, నాకు ఇంత వరకూ ఎవరూ చెప్పలేక పోయారు. 
యే విషయీంచీ సమూళ కథా | విస్మయ వాటేల తుమ్హా పరిసతా | 
కళేల సాఈచీ స్థితచరాత్మకతా | అతర్క్య విందానతా తయాచీ | ||౩౩|| 
33. ‘మీరు ఈ కథను మొదటినుంచి వింటే, అత్యాశ్చర్యం కలుగుతుంది. స్థిర చరాలలోని వారి వ్యాపకాన్నీ, అంతు పట్టని వారి లీలలను, మనము చూడగలుగుతాము. 
సంతబాబా అబదుల రహిమాన | యాంచే ఎక చిత్ర లహాన | 
మహమదహుసేన థారియాటోపణ | యాంచే స్వాధీన హోతే కీ | ||౩౪|| 
34. ‘సంత బాబా అబ్దుల్ రహమానుయొక్క చిన్న చిత్రం, థారియా అని కూడా పిలువ బడ్డ మహమ్మదు హుసేను వద్ద ఉండేది. 
తేణే తయాచీ మజ ఎక ప్రత | దిఘల్యా జాహలీ వర్షే బహుత | 
తీ మీ మాఝే మేహుణ్యాస దేత | కీ తే అంకిత తయాంచే2 | ||౩౫|| 
35. ‘చాలా ఏళ్ళ క్రితం, ఆ చిత్రంయొక్క ప్రతిని నాకిచ్చాడు. మా బావమరిది అబ్దుల్ రహమాన్ అంకిత భక్తుడు గనుక, ఆ చిత్రం యొక్క ప్రతిని బావమరిదికి ఇచ్చాను. 
తీహీ ఆఠ వర్షేపర్యంత | హోతీ తయాచే మేజాచే ఖాణాంత | 
సహజ ఎకదా ఆఢళతా అవచిత | నేలీ తీ దుకానాంత3 ముంబఈస | ||౩౬|| 
36. ‘అతని దగ్గర కూడా, అతని బల్ల సొరగులో, ఆ పటం ఎనిమిదేళ్లు ఉంది. అకస్మాత్తుగా ఒకసారి కనిపిస్తే, దానిని ముంబైలోని దుకాణానికి తీసుకుని పోయాడు. 
జితుకే బాబా అబదుల మోఠే | చిత్రహీ కరవిలే తేవఢే గోమటే | 
కీ తే న్యావే తయాంచియా భేటే4 | ప్రేమహీ దాటేల తదంతరీ | ||౩౭|| 
37. ‘బాబా అబ్దుల్ రహమాన్ నిలువెత్త సైజులో, ఆ పటాన్ని అందంగా తయారు చేయించాడు. ఆ పటాన్ని చూసి, వారు చాలా ప్రసన్నులౌతారని, దానిని వారికి బహూకరించ తలచాడు. 
తయావరూన ఘేతల్యా నకలా | ఆప్తేష్టమిత్రా దిధల్యా సకళా | 
త్యాంతీలచి ఎక దిధలీ మజలా | హోతీ మీ భింతీలా లావిలేలీ | ||౩౮|| 
38. ‘అటువంటివే మరిన్ని ప్రతులను తీయించి, ఆప్తులకు మిత్రులకు పంచాడు. నాకు కూడా ఒక ప్రతిని ఇవ్వగా, దానిని గోడపై తగిలించాను. 
మగ తీ పరమ సుందర తసబీర | భరతా అబదుల రహిమాన దరబార | 
నూరమహమద జాహలా తత్పర | కరావయా సాదర త్యా సంతా | ||౩౯|| 
39. ‘అబ్దుల్ రహమాన్ దర్బారు కొలువై ఉండగా, అందమైన వారి పటాన్ని, వారికి సమర్పించటానికి, నూర్ మహమ్మదు సిద్ధంగా ఉన్నాడు. 
పాహూని హే తయాచే మన | చిత్ర పాహతాంచ అబదుల రహిమాన | 
జాహలే అత్యంత కోపాయమాన | ఉఠలే త్యా తాడణ కరావయా | ||౪౦||
40. ‘ఆ పటాన్ని చూసి, వాని మనసు తెలుసుకొని, అబ్దుల్ రహమాన్ కోపోద్రిక్తుడై, అతనిని కొట్టాలని నిలబడ్డాడు. 

కరూనియా నిర్భత్‍సర్న | దిధలే తయాస ఘాలవూన | 
తేణే తో అత్యంత ఖిన్నవదన | చింతాగహన ఉద్భవలీ | ||౪౧|| 
41. ‘అతనిని బాగా అవమానించి, అక్కడినుండి తరిమి వేశాడు. దానితో అతనికి చాలా వ్యథ అయింది. బాగా చింత కూడా పట్టుకుంది.
మగ తో హోఊని హీనదీన | ఉదాస ఆణి ఉద్విగ్న మన | 
పైక్యాపరీ పైకాహీ జాఊన | గురుకృపే విఘ్న ఉద్భవలే | ||౪౨|| 
42. ‘తరువాత దీనంగా, ఉదాసీనతతో, బాధతో, నిరాశ చెందాడు. డబ్బుకు డబ్బూ పోయి, గురు కృపకూ విఘ్నం కలిగింది. 
హోతో ఆజ గురుకృపా సంపన్న | తోచ మీ ఝాలో రోషాస కారణ | 
ఏసే వదూన సాశంక హోఊన | చిత్ర విసర్జన ఆరంభీ | ||౪౩|| 
43. ‘ ‘గురు కృప కలిగిన నేను, ఇప్పుడు గురువు కోపానికి కారణమయ్యాను.’ అలా అనుకుంటూ, అనుమానాలతో నిండిన మనసుతో, ఆ పటాలను నీటిలో ముంచటానికి మొదలు పెట్టాడు. 
మ్హణే ఆతా యా సంతప్రతిమా | కధీంహీ న ఘరీ ఠేవితా కామా | 
తేణేంచ అంతరలో నిజగురుప్రేమా | కిమర్థ రికామా హా ధందా | ||౪౪|| 
44. ‘ ‘ఈ సాధువుల పటాలు ఇంట్లో ఎప్పుడూ ఉంచరాదు. వాటి వలననే నేను గురు ప్రేమకు దూరమయ్యాను. ఎందుకు ఈ అనవసరమైన పని? 
మ్హణే జయా చిత్రాచ్యా పాయీ | గురు మాఝా మజ నారాజ హోఈ | 
పాడీల కధీ తరీ తే అపాయీ | తే మజ నాహీ కామాచే | ||౪౫|| 
45. ‘ ‘ఈ పటం కారణంగా నా గురువు నన్ను కోపగించారు. ఎప్పటికైనా నాకు హాని కలగవచ్చు. దానితో నాకు పని లేదు. 
హే తరీ ఎక ప్రతిమాపూజన | నావడే మమ గురు లాగూన | 
తరీ మగ యా నారాజ ఠేవూన | చిత్రాచే ప్రయోజన కాయ మజ | ||౪౬|| 
46. ‘ ‘అది కూడా ఒక రకమైన మూర్తి పూజ. నా గురువుకు అది ఇష్టం లేదు. వారికి కోపాన్ని తెప్పించిన ఆ పటం వలన నాకేం ప్రయోజనం? 
జాహలా బహు ద్రవ్యవ్యయ | కరావయా యా చిత్రాంచా సంచయ | 
తరీ త్యా ఆతా న దుజా ఉపాయ | శివాయ తోయ విసర్జనా | ||౪౭|| 
47. ‘ ‘ఆ పటాన్ని సేకరించటానికి డబ్బు చాలా ఖర్చు అయింది. అయినా ఇప్పుడు దానిని నీటిలో వదిలి పెట్టడం తప్ప వేరే గత్యంతరం లేదు’. 
మ్హణోన మగ మాఝా మేహుణా | సవే ఘేఊన తీ ఛబీ జాణా | 
న దేతాంహీ మాగతియా కవణా | పాతలే విసర్జనా ధక్క్యావర | ||౪౮|| 
48. ‘అలా అనుకుని నా బావమరిది, ఎవరడిగినా ఇవ్వకుండా, ఆ పటాన్ని నీటిలో ముంచాలని నేరుగా హార్బరుకు వెళ్లాడు. 
గేలే అపాలో బందరీ థేట | ఠరవిలీ ఎక భాడ్యానే బోట | 
జావవేల తో జాఊని థేట | సముద్రీ తీ శేవట విసర్జిలీ | ||౪౯|| 
49. ‘నేరుగా అపోలో బందరు (ముంబయిలో) వద్దకు వెళ్లి, ఒక నావను అద్దెకు తీసుకుని, సముద్రంలో కొంత దూరం వెళ్లి, చివరకు దానిని నీటిలో వదిలేశాడు. 
అసో తే యేథేంచ నాహీ థాంబలే | వాంద్రే యేథేంహీ తేంచ ఆరంభిలే | 
సర్వా ఆప్తేష్టమిత్రా వినవిలే | ఫోటో ఘేతలే మాగూన | ||౫౦||
50. ‘అంతటితో ఆగలేదు. బాంద్రా వచ్చి, మరల అదే పని మొదలు పెట్టాడు. ఆప్తులను, బంధువులను, మిత్రులను ప్రార్థించి, ఇచ్చిన పటాలన్నింటినీ అడిగి తీసుకున్నాడు. 

మ్హణాలే బాబా అబదుల కోపలే | ఫోటో జ్యాణీ త్యాణీ ఆపలే | 
పరత ద్యావే పాహిజే విసర్జిలే | సకళా వినవిలే ఎణే పరీ | ||౫౧|| 
51. ‘ ‘బాబా అబ్దుల్ గారు కోపగించారు. కనుక, ఎవరి వద్ద ఉన్నా, ఆ పటాలని తిరిగి ఇవ్వండి, వాటిని నీటిలో వదిలేయాలి’ అని ప్రార్థించాడు. 
మజకడూనహీ దిధలేలీ ప్రత | ఘేతలీ మాఝే భావాచీహీ పరత | 
బహిణీచీహీ కేలీ హస్తగత | మిళవిల్యా సమస్త సహా ప్రతీ | ||౫౨|| 
52. ‘నాకు ఇచ్చిన ప్రతిని, మరియు, నా సోదరి, బావనుండీ కూడా ఆ పటాన్ని తిరిగి తీసుకున్నాడు. ఇలా మొత్తం ఆరు ప్రతులను తీసుకున్నాడు. 
మగ తో ఘేఊని సహాహీ ప్రతీ | వాంద్రే శహరీ సముద్రావరతీ | 
థేట జేథే జమీన సరతీ | పాతలా తే ప్రాంతీ సరోష | ||౫౩|| 
53. ‘తరువాత చాలా కోపంగా, ఆ పటాలన్నీ తీసుకుని, బాంద్రాలో సముద్రం దగ్గర నేల, నీరు కలిసే చోట చేరుకున్నాడు. 
పాచారూని ఎక కోళీ | మగ తీ అవఘీ చిత్రే తే కాళీ | 
కరూంనియా తయాచే హవాలీ | నిక్షేపియేలీ అబ్ధిజలీ5 | ||౫౪|| 
54. ‘ఒక బెస్త వానిని పిలిచి, ఆ పటాలన్నింటినీ వానికిచ్చి, సముద్రం నీటిలో వేయించాడు. 
మీహీ తేవ్హా వ్యథాగ్రస్త | హోతో తయాచియా ఘరాంత | 
మలాహీ తో ఏసేంచ ఉపదేశీత | సంకటే ఆణీత యా ప్రతీ | ||౫౫|| 
55. ‘నేనప్పుడు జబ్బుతో అతని ఇంట్లో ఉన్నాను. ‘ఆ పటం కష్టాలు కలిగిస్తూందని’ నాకు ఉపదేశించాడు. 
తరీ త్యా అవఘ్యా గోళా కరూన | కరిసీల జేవ్హా సముద్రీ విసర్జన | 
తేవ్హాంచ తుఝియా వ్యథేచే నిరసన | హోఈల జాణ నిర్ధారే | ||౫౬|| 
56. ‘ ‘దానితో, ఇతర పటాలన్నింటినీ, సముద్రంలో వదిలినప్పుడే, నీ వ్యథలన్నీ తీరుతాయనీ ఖచ్చితంగా తెలుసుకో’. 
మీహీ మాఝా పాచారిలా మేథా | కిల్లీ దేఊని త్యాచియే హాతా | 
ఆణావిల్యా తసబిరీ సంతాంచ్యా సమస్తా | సోంపిలీ వ్యవస్థా మేహుణ్యాతే | ||౫౭|| 
57. ‘నా వ్యవహారాలను చూసుకునే నా గుమాస్తాను పిలిచి, ఇంటి తాళం చెవిని అతనికిచ్చి, ఇంట్లో ఉన్న సత్పురుషుల పటాలన్నింటినీ తెప్పించి, నా బావమరిదికి అప్పగించాను. 
త్యానే అపులా బోలవిలా మాళీ | తయా కరవీ త్యా తాత్కాళీ | 
చింబాఈచ్యా దేవళా జవళీ | సముద్రజళీ నిక్షేపవిల్యా | ||౫౮|| 
58. ‘తక్షణమే, బావమరిది తన తోటమాలిని పిలిచి, అతని ద్వారా, వానిని చింబాయి దేవాలయం వద్దనున్న సముద్రం నీటిలో వదిలేశాడు. 
పుఢే జాతా దోన మాస | హోతా ఆరామ మమ జీవాస | 
జాతా మీ అపులియా బిర్హాడాస | అతి ఆశ్చర్యాస పావలో | ||౫౯|| 
59. ‘రెండు నెలలు గడిచాక, నా ఆరోగ్యం బాగుపడి, ఇంటికి వెళ్లిన వెంటనే, అత్యంత ఆశ్చర్య పడ్డాను. 
తుమ్హాంస మ్యా జీ దిలీ తసబీర | తీ ద్వారా సమోరచి భింతీవర | 
పాహోనియా పూర్వవత స్థీర | వాటలా మజ థోర విస్మయ | ||౬౦||
60. ‘మీకిచ్చిన మూర్తి, ద్వారానికి ఎదురుగా ఉన్న గోడపై చక్కగా మునపటి వలనే ఉండటం చూచి, విపరీతంగా చకితుణ్ణయ్యాను. 

అవఘీ చిత్రే మేథానే ఆణిలీ | హీచ తసబీర కైసీ కీ చుకలీ | 
మ్హణోని మీ తీ తాత్కాళ కాఢిలీ | ఛపవూన ఠేవిలీ కపాటీ | ||౬౧|| 
61. ‘గుమాస్తా అన్ని పటాలనూ తీసుకుని వచ్చాడు కదా! మరి, ఈ మూర్తిని మాత్రం ఎలా మరిచి పోయాడు? అని అనుకుని, వెంటనే దాన్ని తీసి అలమారాలో దాచి ఉంచాను.
పడతాంచ మేహుణ్యాచీ దృష్టీ | ఘేఈల తో తీ ఉఠాఉఠీ | 
నేఈల జలసమాధీ సాఠీ | ఏసే మజ పోటీ వాటలే | ||౬౨|| 
62. ‘నా బావమరిది దృష్టిలో పడిందంటే, వెంటనే తీసుకుని వెళ్లి, జలసమాధి చేస్తాడని అనిపించింది. 
ఠేవో న లాహే నిజ గృహాతే | మేహుణా పాహతాంచి బుడవీత హాతే | 
దేవో న లాహే ఆణికాతే | నిఃశంక చిత్తే అభక్తా | ||౬౩|| 
63. ‘అందువలన, దీనిని ఇంట్లో ఉంచరాదు. బావమరిది చూసిన వెంటనే, నీళ్లలో ముంచేస్తాడు. కాని, ఇతరులకు, భక్తులు కాని వారికి, నిస్సందేహంగా ఇవ్వలేను. 
వినా విచారే దేఈన కవణా | తరీ న ఝాలియా యోగ్య జోపాసనా | 
రాహీల అస్వస్థతా సదైవ మనా | హీ దీర్ఘ వివంచనా సర్వదా | ||౬౪|| 
64. ‘బాగా ఆలోచించకుండా, ఎవరికైనా ఇస్తే, పూజోపచారాలు సరిగ్గా జరుగుతాయో లేదో, అనే సందేహం. ఇదే నా మనసులో జరిగిన దీర్ఘ కాల ఆందోళన. 
తరీ తే జేథే రాహీల సురక్షిత | పహావే ఏసే స్థళ త్యా ఉచిత | 
ఠేవీల అపులే ఘరీ జో వ్యవస్థిత | తయాచ్యా హస్తగత కరావే | ||౬౫|| 
65. ‘అందుకు, ఈ మూర్తికి సురక్షితమైన స్థలాన్ని వెదకాలి. తన ఇంట్లో సురక్షితంగా ఉంచి, శ్రద్ధగా అట్టి పెట్టుకునే వారికే ఇవ్వాలి. 
ఏసే మన పడతా అడకిత్తా | సాఈచ సువిచార సుచవీ చిత్తా | 
జావే మౌలానా దరబారీ ఆతా | ఇసమూస వృత్తాంత కథావే | ||౬౬|| 
66. ‘అలా నా మనసు సతమతమౌతుంటే, సాయియే చక్కని ఆలోచనను సూచించారు. మౌలానా దర్బారుకు వెళ్లి అక్కడ ఇస్మూకు సంగతంతా తెలియ చేయమనేదే, ఆ సూచన. 
మగ మీ తేవ్హా తైసాచి సత్వరీ | గేలో పీర మౌలావా దరబారీ | 
ముజావర ఇస్మూస హీ వార్తా సారీ | కళవిలీ అత్యాదరీ ఎకాంతీ | ||౬౭|| 
67. ‘ఈ సూచన రాగానే, నేను పీరు మౌలానా దర్బారుకు వెళ్లి, విషయమంతటినీ ఏకాంతంలో సాదరంగా ముజావర్ ఇస్మూతో చెప్పాను. 
ఆమ్హా ఉభయతాంచా నిర్ణయ | అపులేపాశీ రాహీల హీ నిర్భయ | 
మ్హణోని తే దినీంచ ఆమ్హీ ఉభయ | కేలా కీ నిశ్చయ మనాచా | ||౬౮|| 
68. ‘మేమిద్దరమూ, మీ వద్ద నిర్భయంగా ఉంచవచ్చని, నిర్ణయించాము. ఆ రోజే మేమిద్దరమూ ఏం నిశ్చయించుకున్నామంటే, 
కీ హీ సమర్థ సాఈచీ ఛబీ | అపులే యేథేంచ ఠేవిలీ జావీ | 
స్వయే ఆపణా సమర్పావీ | తేణేంచ తీ ఠాయీ పడేల | ||౬౯|| 
69. ‘ఈ సమర్థ సాయి మూర్తి, మీ వద్దనే సురక్షితంగా ఉంటుందని, దానిని మీ వద్దనే ఉంచాలని, స్వయంగా వచ్చి, మీకు సమర్పించాలని అనుకున్నాం. 
తంవ త్యా కృత నిశ్చయానుసార | కేలీ తీ ప్రతిమా ఆపణా సాదర | 
పాహూని ఆపులే జేవణ తయార | తసాచ మీ సత్వర పరతలో | ||౭౦||
70. ‘ఆ నిశ్చయానుసారంగా మూర్తిని మీకు ఇచ్చాం. మీరు అప్పుడు భోజనానికి సిద్ధంగా ఉండటం చూచి, నేను వెంటనే తిరిగి వచ్చేశా. 

హీ లాంబ కథా పరిసావయాస | నవ్హతా ఆపణా తేవ్హా అవకాశ | 
 పుఢే మాగే కథూ తీ సావకాశ | ధరూని హా ఉద్దేశ గేలో మీ | ||౭౧|| 
71. ‘ఇంత పెద్ద కథను వినటానికి, మీకు అప్పుడు తీరిక లేదు. సావకాశంగా చెప్పవచ్చని నేను వచ్చేశాను. 
ఆజ ఉద్యా కరితా కరితా | సబంధ నఊ వర్షే భరతా | 
ఆజ హీ ఝాలీ భేట అవచితా | ఆపణా ఉభయతా పరస్పర | ||౭౨|| 
72. ‘ఈ రోజు, రేపు అని అనుకుంటూ, తొమ్మిది ఏళ్లు పూర్తిగా గడిచాక, అనుకోకుండా, ఈ రోజు మనమిద్దరం కలుసుకున్నాం. 
తేణే హీ ఆఠవలీ పూర్వపీఠికా | ఆపణహీ కథిలే స్వప్న కౌతుకా | 
సంబంధ జుళలా అపూర్వ కథానకా | నాహీ అద్భుత కా హీ లీలా | ||౭౩|| 
73. ‘అలా ఈ పాత కథ నాకు గుర్తుకొచ్చింది, ఈ కథతో సంబంధించిన, మీ వింత కల గురించి కూడా, మీరు చెప్పారు. ఈ లీల చాలా అద్భుతం కదూ!’ 
ఆతా ఎక దుజీ కథా | సావధ చిత్తే పరిసిజే శ్రోతా | 
సాఈ కైసా ప్రేమళ భక్తా | అతి సప్రేమతా వాగవిత | ||౭౪|| 
74. శ్రోతలూ! ఇప్పుడు మరో కథను సావధాన చిత్తులై వినండి. ప్రేమికులైన తమ భక్తులను, అత్యంత ప్రేమతో బాబా ఎలా చూసుకునేవారో గమనించండి. 
జయా పరమార్థీ ఖరీ గోడీ | తయాంచీ సాఈస మోఠీ ఆవడీ | 
వారూని సర్వ తయాంచీ సాంకడీ | స్వానంద జోడీ దే తయా | ||౭౫|| 
75. పరమార్థం గురించి నిజమైన శ్రద్ధగలవారంటే, బాబాకు చాలా అభిమానం. అట్టివారి సకల కష్టాలను తొలగించి, వారికి ఆత్మానందాన్ని ప్రసాదిస్తారు. 
యే అర్థీచా అనుభవ గోడ | బాళాసాహేబ6 దేవాంచీ హోడ7
పురవిలీ పురవూని తయాంచే కోడ8 | దిధలీ త్యా జోడ భక్తీచీ | ||౭౬|| 
76. బాలాసాహేబు దేవు (బి.వి. దేవ్) కోరికను తీర్చి, అతని వ్రతాన్ని నెరవేర్చి, అతనికి భక్తిని ప్రసాదించిన, మధురమైన అనుభవం ఈ కథలోని విషయం. 
దివసా నోకరీ కేల్యాశివాయ | యోగక్షేమా నవ్హతా ఉపాయ | 
పరి రాత్రౌ పరమార్థ వ్యవసాయ | కరాయా వ్యత్యయ కా యావా | ||౭౭|| 
77. పగలు ఉద్యోగం చేయకపోతే, దేవుకు జీవనం గడవదు. కాని, రాత్రి పూట పరమార్థ సాధనకు ఇబ్బందులు ఎందుకు రావాలి? 
ఇచ్ఛా ఫార దివసాపాసూన | కరావే నిత్య జ్ఞానేశ్వరీ వాచన | 
పరి కాంహీ నా కాంహీ విఘ్న | యేఊన తే హాతూన ఘడేనా | ||౭౮|| 
78. నిత్యం జ్ఞానేశ్వరిని పఠించాలని ఎంతో కాలంనుండి దేవు కోరిక. కాని, ఏదో ఒక విఘ్నం రావడం వలన అతనికి అది సాధ్యం కాలేదు. 
భగవద్గీతా ఎక అధ్యాయ | జైసా రోజ నేమానే హోయ | 
తైసాచ జ్ఞానేశ్వరీచా నిశ్చయ | వినా అంతరాయ తగేనా | ||౭౯|| 
79. భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని, ప్రతి రోజూ నియమంగా పఠించినట్లే, జ్ఞానేశ్వరిని కూడా, ఏదో ఒక అంతరాయం రావడం వలన, పఠించలేక పోయాడు. 
హాతీ ఘేతా ఇతర గ్రంథ | నిత్య నేమే వాచిలే జాత | 
జ్ఞానేశ్వరీవరీ ప్రబల హేత | నియమ న జాత తడీస | ||౮౦||
80. చేతిలో తీసుకున్న, ఇతర ఏ గ్రంథాలనయినా నియమంగా చదువగలిగేవాడు కాని, జ్ఞానేశ్వరిని పఠించాలనే అతని ప్రబలమైన కోరిక మాత్రం తీరలేదు. 

ఘేఊని రజా తీన మాస | ఎకదా దేవ గేలే శిరడీస | 
తేథూన నిజగృహీ పౌండాస | సుఖే ఘ్యావయాస విశ్రాంతీ | ||౮౧|| 
81. మూడు మాసాల సెలువు తీసుకుని, దేవు ఒక సారి శిరిడీకి వెళ్ళాడు. అక్కడినుండి, పౌండులోని తన ఇంటికి, సుఖంగా విశ్రాంతి పొందాలని వెళ్ళాడు.
తేథేంహి ఇతర కార్యే ఝాలీ | ఇతర నేమాచీ పోథీ వాచిలీ | 
జ్ఞానేశ్వరీచీ హౌస న పురలీ | వేళ న ఆలీ తియేలా | ||౮౨|| 
82. అక్కడ కూడా, మిగతా పనులన్నీ జరిగాయి. నియమంగా చదివే ఇతర గ్రంథాలను పఠించాడు కాని, జ్ఞానేశ్వరిని పఠించాలన్న అతని కోరిక తీరే కాలం రాలేదు. 
హాతీ ఘేతా జ్ఞానేశ్వరీ | వికల్ప కాంహీ ఉఠావే అంతరీ | 
జేణే వాచన హోఈ వరవరీ | ప్రేమ అంతరీ ఉపజేనా | ||౮౩|| 
83. పఠించాలని జ్ఞానేశ్వరిని చేతిలోకి తీసుకోగానే, మనసులో ఎన్నో ఆలోచనలు రావటంతో, పైపైన చదవడమే జరిగింది కాని, దాని గురించి ఆంతర్యంలో ప్రేమ ఉప్పొంగలేదు. 
కాయ కరూన కాసావిసీ | కేలా నిశ్చయ న పావే సిద్ధీసీ | 
పాంచ ఓవ్యాహీ నిత్య నేమేంసీ | ఘడలే న ప్రతిదివశీ వాచావయా | ||౮౪|| 
84. ఎంతగా తపించి పోతున్నా, తీసుకున్న నిశ్చయం సిద్ధించడం లేదు. నియమంగా ప్రతి రోజూ, కనీసం అయిదు శ్లోకాలనూ, పఠించలేక పోయాడు. 
ప్రత్యహీ పాంచ ఓవ్యా నిదాన | నిశ్చయ కేలా మనాపాసూన | 
త్యాహీ న నేమే మజ హాతూన | ఉల్హాసే వాచూన జాహల్యా | ||౮౫|| 
85. ‘ప్రతి రోజూ, కనీసం అయిదు శ్లోకాలను చదవాలని, ఎంతో శ్రద్ధతో నిశ్చయించుకున్నాను. కాని, నియమంగా దానిని కూడా ఉత్సాహంతో చేయలేకపోతున్నాను. 
మ్హణోని మగ కేలా నేమ | సాఈచ జేవ్హా దేతీల ప్రేమ | 
మ్హణతీల “వాచ” తేవ్హాంచ ఉపక్రమ | కరీన సంభ్రమవిరహీత9 | ||౮౬|| 
86. ‘అందుకే, సాయి ప్రేమగా, “చదువు” అని స్వయంగా ఆజ్ఞాపించినప్పుడే, ఏ ఆలోచనలూ లేక, ప్రేమతో పఠించడానికి ఉపక్రమిస్తాను. 
నిష్ఠా సాఈచ్యా పాయాపాశీ | జేవ్హా సాఈ దేతీల ఆజేశీ | 
తేవ్హాంచ వాచీన జ్ఞానేశ్వరీశీ | కృత నిశ్చయేంసీ బైసలో | ||౮౭|| 
87. ‘సాయి పాదాలలో సంపూర్ణమైన నిష్ఠతో, సాయి ఆజ్ఞాపించినప్పుడే జ్ఞానేశ్వరిని చదువుతానని, దృఢ నిర్ణయం తీసుకున్నాను’. 
అసో యేతా మహోదయ10 పర్వ | సవే మాతోశ్రీ భగినీ సర్వ | 
పహావయా గురు పూజా గౌరవ | పాతలే మగ దేవ శిరడీస | ||౮౮|| 
88. మహోదయ పర్వం రాగా, గురు పూజా వైభవాన్ని చూడటానికి, తన తల్లి, సోదరితో దేవు శిరిడీకి వచ్చాడు. 
కాంహో ఆతాశా నాహీ వాచత | జ్ఞానేశ్వరీ ఆపణ నిత్య | 
జోగ తేథే దేవాంసీ పుసత | ప్రత్యుత్తర దేత తే పరిసావే | ||౮౯|| 
89. ‘ఈ రోజుల్లో, మీరు నిత్యం జ్ఞానేశ్వరిని ఎందుకు పఠించరు?’ అని జోగు అతనిని ప్రశ్నించాడు. అప్పుడు దేవు ఇచ్చిన జవాబును వినండి. 
జ్ఞానేశ్వరీచీ మోఠీ హౌస | పరి న తీ జాఈ సిద్ధీస | 
ఆతా బాబాచ జేవ్హా వాచావయాస | వదతీల తే వేళేస వాచీన | ||౯౦||
90. ‘జ్ఞానేశ్వరిని పఠించాలనే కోరిక, నాకూ చాలా ఉంది. కాని అది సిద్ధించటం లేదు. ఇక, బాబాయే దానిని “చదవు” అని ఆజ్ఞాపించినప్పుడే పఠిస్తాను’. 

తంవ జోగ కథితీ యుక్తీ | జ్ఞానేశ్వరీచీ ఆణూన పోథీ | 
ద్యావీ సాఈబాబాంచియే హాతీ | వాచావీ తే దేతీ తవ తుమ్హీ | ||౯౧|| 
91. అప్పుడు, ‘జ్ఞానేశ్వరిని తీసుకుని వచ్చి, సాయిబాబా చేతిలో పెడితే, వారు “చదువు” అని మీకు తిరిగి ఇచ్చిన తరువాత, మీరు పఠించవచ్చు’ అనే ఉపాయం చెప్పాడు. 
నలగే మజ కాంహీ యుక్తీ | బాబా మాఝే అంతర జాణతీ | 
తే కా న మాఝీ అఢీ11 పురవీతీ | ‘వాచ’ స్పష్టోక్తీ వదతీల | ||౯౨|| 
92. ‘నాకు అలాంటి యుక్తి అవసరం లేదు. బాబాకు నా ఆంతర్యం తెలుసు. అలాంటప్పుడు, నా కోరికను ఎందుకు తీర్చరు? వారే స్పష్టంగా “చదువు” అని చెబుతారు’ అని అన్నాడు. 
ఘేతా సమర్థాంచే దర్శన | రుపయా ఎక కేలా అర్పణ | 
“ఎకచీ కా వీస ఆణ” | మ్హణతీ త్యాలాగూన తంవ బాబా | ||౯౩|| 
93. సమర్థుల దర్శనం చేసుకున్నప్పుడు, దేవు వారికి ఒక రూపాయిని సమర్పించాడు. బాబా, “ఒక్కటే ఎందుకు? ఇరవై తీసుకురా” అని అతనికి చెప్పారు. 
ఆణూన వీస రుపయే దిధలే | రాత్రీ బాలకరామాస భేటలే | 
సాఈకృపా కైసీ పావలే | వృత్త త్యా పుసిలే పూర్వీల | ||౯౪|| 
94. ఇరవై రుపాయలను తెచ్చి ఇచ్చాడు. రాత్రి బాలకరాంను కలిశాడు. అప్పుడు దేవు అతనిని ‘బాబా కృపను ఎలా పొందావు?’ అని పూర్వపు సంఘటన గురించి ప్రశ్నించాడు. 
‘ఉద్యా ఆరతీ ఝాల్యావరతీ | సాంగేన మీ సకళ తుమ్హాప్రతీ’ | 
ఏసే బాలకరామ ఆశ్వాసితీ | బరే మ్హణతీ తేవ తయా | ||౯౫|| 
95. ‘రేపు ఆరతి ముగిసిన తరువాత, నీకు మొత్తం చెబుతానని’ అతడు మాటివ్వగా, దేవు ‘సరే’ అని అన్నాడు. 
పున్హా దేవ దుసరే దివశీ | జాతా మశీదీ దర్శనాసీ | 
వీస రుపయే మాగితలే త్యాంశీ | దిధలే సుఖ సంతోషీ దేవానే | ||౯౬|| 
96. రెండవ రోజు, మరల దేవు, దర్శనానికి మసీదుకు వెళ్లగా, బాబా మళ్ళీ ఇరవై రుపాయలను అడిగారు. దేవు సంతోషంగా ఇచ్చాడు. 
పాహూని తేథే అత్యంత బీడ | దేవ రాహిలే బాజూస ఆడ | 
బాబా పుసతీ “కోఠే రే సాంకడ | జాగేంత అవఘడ తో దడలా” | ||౯౭|| 
97. అక్కడ జనం చాలా మూగి ఉండటం చూచి, దేవు చాటుగా ఒక ప్రక్కన నిలబడ్డాడు. బాబా, “ఇంత జనంలో అతను ఇరుకుగా ఎక్కడ దాక్కున్నాడు?” అని ప్రశ్నించారు. 
దేతీ దేవ ప్రత్యుత్తర తేథే | ‘బాబా హా మీ ఆహే న యేథే’ | 
“కా సాతచి నా ఝాలేత దేతే” | బాబా తంవ తయాతే పుసతాత | ||౯౮|| 
98. ‘బాబా! ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను’ అని దేవు జవాబిచ్చాడు. అప్పుడు బాబా, “సరే! ఏడే ఎందుకిచ్చావు?” అని అడిగారు. 
దేవ వదతీ ‘వీస దిధలే’ | “పైసే కోణాచే” బాబాంనీ పుసిలే | 
‘బాబా ఆపులే’ తంవ తే వదలే | “కా మగ సుటలే పళత తుమ్హీ | ||౯౯|| 
99. ‘ఇరవై ఇచ్చాను’ అని దేవు చెప్పాడు. “డబ్బు ఎవరిది?” అని బాబా ప్రశ్నించగా, ‘మీదే బాబా’ అని అన్నాడు. “మరి నువ్వు ఎందుకు పారిపోతున్నావు? 
యావే ఏసే జవళ యావే | స్వస్థ చిత్తే నికట బైసావే” | 
ఆజ్ఞేప్రమాణే కేలే దేవే | మనోభావే తే బైసలే | ||౧౦౦||
100. “రా! దగ్గరకు రా! ప్రశాంతంగా నా దగ్గర కూర్చో” అని అన్నారు. వారి ఆజ్ఞానుసారం దేవు వెళ్లి కూర్చున్నాడు. 

నిత్యనేమ ఆరతీ ఝాలీ | మండళీ స్వస్థానీ పరతలీ |
బాళకరామా దేవా గాంఠ పడలీ | పృచ్ఛా తీ ఆరంభిలీ పూర్వీల | ||౧౦౧||
101. నిత్య నియమానుసారం హారతి అయిపోగానే, భక్తులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. దేవు, బాలకరాం కలుసుకున్నారు. దేవు అతనిని మరల పూర్వపు విషయాన్ని అడిగాడు.
తయాంచా పూర్వవృత్తాంత పుసిలా | తయాంనీ తో సాద్యంత కథిలా |
కైసే లావియలే ఉపాసనేలా | దేవ మగ తయాలా వదతాత | ||౧౦౨||
102. అతనిని జరిగిన దానిని గురించి అడుగగా, అతడు అంతా చెప్పాడు. తరువాత దేవు, ‘ఉపాసనలో నిన్ను ఎలా దీవించారు?
కేలే కాయ తుమ్హా నివేదన | కైసే కరావే బ్రహ్మచింతన |
కరాకీ మాఝీ జిజ్ఞాసాపూర్ణ | దేవ మగ త్యాంలాగూన ప్రార్థితీ | ||౧౦౩||
103. ‘బ్రహ్మ చింతన ఎలా చేయాలని నీకు ఉపదేశించారా? నా తెలుసుకోవాలనే కుతూహలాన్ని తీర్చు’ అని ప్రార్థించాడు.
బాలకరామహీ దేవాంప్రతీ | కరావయా తయాంచీ జిజ్ఞాసాపూర్తీ |
ఉత్తర ద్యాయా జో ఆరంభ కరితీ | బాబాచ బోలావితీ దేవాంస | ||౧౦౪||
104. దేవు కుతూహలాన్ని పూర్తి చేయాలని, బాలకరాం చెప్పనారంభించే సరికి, దేవును బాబా పిలువనంపారు.
కైసా సాఈ పరమ లాఘవీ | చంద్రూస12 దేవాంతే బోలావూ పాఠవీ |
దేవ న క్షణ విలంబ లావీ | ఆలే శ్రీసాఈస భేటాయా | ||౧౦౫||
105. ఎంతటి కరుణామయులు సాయి! దేవుని పిలుచుకుని రమ్మని చంద్రుని పంపారు. క్షణమైనా ఆలస్యం చేయకుండా దేవు శ్రీ సాయి వద్దకు వచ్చాడు.
ఝాలే హోతే తీన ప్రహర | మశీదీచియా తటావర |
టేకూనియా దోన్హీ కర | దిసలే సమోరచి శ్రీసాఈ | ||౧౦౬||
106. సమయం సాయంత్రం నాలుగు గంటలు, మసీదు చివర, గోడపైన రెండు చేతులు ఆన్చి నిలుచున్న శ్రీసాయి, ఎదుట కనిపించారు.
దేవ జాతాంచ కేలే వందన | బాబా తయాంస పుసతీ ప్రశ్న |
“కోఠే కోణాసీ కాయ ఆపణ | కరీత సంభాషణ హోతా కీ” | ||౧౦౭||
107. దేవు వెళ్లి వారికి వందనం చేశాడు. బాబా అతనిని, “ఎక్కడ, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు?” అని ప్రశ్నించారు.
మగ దేవ ఉత్తర దేతీ | కాకాంచియా మాడీవరతీ |
బాలకరామాచియా సంగతీ | ఆపులీచ కీర్తీ పరిసియలీ | ||౧౦౮||
108. ‘మీ కీర్తిని బాలకరాం చెప్పుతుంటే, కాకా దీక్షితు మేడపైన వింటున్నాను’ అని దేవు జవాబిచ్చాడు.
“రుపయే ఆణ పంచవీస” | బాబా ఆజ్ఞాపితీ దేవాంస |
ఆణూనియా తేచ సమయాస | రుపయే బాబాంస సమర్పిలే | ||౧౦౯||
109. “ఇరవై అయిదు రుపాయలను పట్టుకురా” అని బాబా దేవుని ఆజ్ఞాపించారు. దేవు వెంటనే రూపాయలను తెచ్చి బాబాకు సమర్పించాడు.
కితీ పుసతీ ఆణిలేస | దేవ వదతీ పంచవీస |
బాబా మ్హణతీ “చలయే బైస” | గేలే తంవ మశీదీస బాబాంసహ | ||౧౧౦||
110. “ఎంత తెచ్చావు?” అని బాబా ప్రశ్నించగా, ‘ఇరవై అయిదు’ అని దేవు అన్నాడు. “వచ్చి నా దగ్గర కూర్చో” అని బాబా అనగానే, దేవు బాబా వెంట మసీదులోనికి వెళ్లాడు.

బాబా బైసలే ఖాంబాపాశీ | దుజే న కోణీహీ మశీదీసీ | 
మ్హణతీ “తువా మాఝియే చింధీసీ | చోరియేలేసీ మజ న కళతా” | ||౧౧౧|| 
111. స్తంభం దగ్గర బాబా కూర్చున్నారు. మసీదులో వేరెవరూ లేరు. అప్పుడు బాబా, “నాకు తెలియకుండా, నా గుడ్డ పీలికలను నీవు దొంగిలించావు” అని అన్నారు.
‘మలా చింధీ ఠాఊక నాహీ’ | మ్హణోని దేవ దేతీ గ్వాహీ | 
“యేథేంచ కోఠే తరీ పాహీ | ఝాలే మగ” సాఈ వదతే తయా | ||౧౧౨|| 
112. ‘గుడ్డ పీలికల గురించి నాకు తెలియదు’, అని దేవు చెప్పాడు. “అయితే ఇక్కడే ఎక్కడో ఉంటుంది చూడు” అని బాబా అతనితో అన్నారు.
‘యేథే ఆహే కోఠే చింధీ’ | ఏసే దేవ వదలే తే సంధీ | 
బాబా ఉఠలే మ్హణతీ “తూ శోధీ | ఖోటీ హీ బుద్ధీ చోరీచీ | ||౧౧౩|| 
113. ‘గుడ్డ పీలికలు ఇక్కడ ఎక్కడున్నాయి?’ అని దేవు అప్పుడనగా బాబా లేచి నిలబడి, “బాగా వెదుకు, దొంగిలించే ఈ పాడు బుద్ధి మంచిది కాదు.
కవణ్యా కారట్యానే తీ నేలీ | బఘ బఘ పాహిజే యేథేంచ అసలీ” | 
ఏకూన దేవాంనీ ఆణిక శోధిలీ | నాహీ తీ ఆఢళలీ తరీ హీ | ||౧౧౪|| 
114. “అల్లరి కుర్రవాడేవరైనా తీసుకుని పోయి ఉంటాడు, చూడు! బాగా చూడు! ఇక్కడే ఎక్కడో ఉండాలి” అని అన్నారు. దేవు మరల వెదికాడు. అయినా అవి దొరకలేదు.
మగ భృకుటీస ఘాలూన ఆంకడే | పాహూనియా ఇకడే తికడే | 
దృష్టి టవకారూనీ దేవాకడే | సాఈ కడకడే దేవాంవర | ||౧౧౫|| 
115. కనుబొమ్మలు ముడిచి, అటూ ఇటూ చూచి, బాబా దేవు వైపు దృష్టిని సారించి, దేవును గట్టిగా కోపగించడం ఆరంభించారు.
మ్హణజే “తూంచ లబాడ హోసీ | తుజవీణ కోణ యే సమయాసీ | 
యేఈల చింధీ చోరావయాసీ | చోర మీ తుజసీంచ సమజతో | ||౧౧౬|| 
116. “నువ్వే మోసగాడివి. నీవు తప్ప, ఈ వేళలో, పాత గుడ్డ పీలికలను దొంగిలించటానికి ఎవరు వస్తారు? నువ్వే దొంగవని అనుకుంటున్నాను.
ఏసా యేథే జో యేతోస | తో కాయ చోర్యా కరావయాస | 
ఝాలే కాళ్యాచే పాంఢరే కేంస | ఖోడ న లవలేశ కీ జాఈ | ||౧౧౭|| 
117. “నువ్విక్కడికి రావటం ఇలా దొంగిలిచటానికా? వెంట్రుకలు తెల్లబడినా, చెడు అలవాట్లు కొంచెం కూడా పోలేదు.
తులా కుర్హాడీనే హాణీన | తులా కాపీన ఠార కరీన | 
జాశీల కోఠే మాఝియా హాతూన | యేఈన మారీన తేథే తుజ | ||౧౧౮|| 
118. “గొడ్డలితో నిన్ను నరుకుతాను, కోస్తాను. చంపేస్తాను. నా చేతుల్లో నుండి తప్పించుకుని ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోయినా, నేను అక్కడికే వచ్చి నిన్ను చంపేస్తాను.
ఘరూన యేతోస జో శిరడీస | తో కాయ చోర్యా కరావయాస | 
ఘే హే అపులే వాపస | ఆణూన చింధీస దే మాఝ్యా” | ||౧౧౯|| 
119. “దొంగతనం చేయడానికా, ఇంటినుండి శిరిడీకి రావటం? నీ డబ్బు తీసుకొని, నా గుడ్డ పీలికలను నాకిచ్చేయి”.
క్రోధే లాల ఝాలే సాఈ | ఉద్ధారియేలీ ఆఈ మాఈ | 
శివ్యా శాపాంచీ లాగలీ రయీ | సంతాపే లాహీ జాహలీ | ||౧౨౦||
120. అలా అంటూ ఉండగా బాబా ముఖం కోపంతో ఎర్రబారిపోయింది. విపరీతమైన తిట్లను, శాపాలను కురిపించారు. కోపంతో అగ్గిలా మండి పడ్డారు.

కోపలే దేఖూని సాఈనాథ | దేవ కౌతుక పాహతాత | 
ఉగేచ ఉభే రాహతాత | ఆశ్చర్యభరిత మానసే | ||౧౨౧|| 
121. సాయినాథుల కోపాన్ని చూచి, దేవు కౌతుకంతో, ప్రేమతో, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నోట మాట రాకుండా దిగ్భ్రాంతుడై నిలబడి పోయాడు.
దేవ సన్నిధ ఆణి ఎకటే | పాళీ మారాచీ యేణార వాటే | 
కీ హే విశ్వరూప దర్శన గోమటే | జాణూని దాటే ఆనంద | ||౧౨౨|| 
122. దేవు ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు దెబ్బలు తినేవంతు వచ్చిందా లేక, బాబా తనకు ఎంతో అందమైన విశ్వరూప దర్శనమిస్తున్నారా అనే ఆలోచనతో, తనలో తానే ఆనందించాడు. 
ఘేతీల కాయ సటకా ఆతా | కరితీల కాయ త్వేషే ఆఘాతా | 
ఎకలా మీ సాంపడలో హాతా | యేఈల చిత్తా తే కరో | ||౧౨౩|| 
123. ‘ఇప్పుడు సటకా తీసుకుని బాగా కొడతారేమో, ఒంటరిగా వారి చేతిలో చిక్కాను. వారికి తోచినట్లు చేయనీ’ అని అనుకున్నాడు. 
పరీ హే చింధీచే కాయ కోడే | తే తో దేవాంస కాంహీహీ నులగడే | 
“జా, నిఘూన జా” మ్హణతా ఎకీకడే | తవతే పాయరీకడే సరకలే | ||౧౨౪|| 
124. కాని ఆ గుడ్డ పీలికల సంగతేమిటో దేవుకు ఏమీ అర్థం కాలేదు. “పో! ఇక్కడినుండి వెళ్లి పో!” అని అనగానే దేవు మెల్లగా మెట్ల దగ్గరకు జరిగాడు. 
కాయ చింధీచా గుహ్యార్థ | జాణావయా మీ నాహీ సమర్థ | 
పావేన సాఈకృపేచా స్వార్థ | తయీ తో శ్రోత్యాంర్థ నివేదీన | ||౧౨౫|| 
125. గుడ్డ పీలికలలోని అంతరార్థాన్ని తెలుసుకోగల సమర్థుణ్ణి కాను. సాయి కృప కలిగి నాకు తెలిసినప్పుడు, శ్రోతలకు దానిని మనవి చేస్తాను. 
హోతా అర్ధ ఘటకాభర | ఆలే దేవ బాబాం సమోర | 
చాలూచ హోతా శివ్యాంచా గజర | “ఆలాస కా వర” మ్హణాలే | ||౧౨౬|| 
126. అర్ధ ఘడియ గడిచాక, దేవు బాబా ఎదుటికి వెళ్లాడు. తిట్ల వర్షం ఇంకా సాగుతూనే ఉన్నాయి. “పైకి ఎందుకు వచ్చావు?” అని బాబా అడిగారు. 
“జా హో చాలతా వాడియాంత” | మ్హణతా దేవ ఆజ్ఞా వందీత | 
నమన కరూన చరణాప్రత | పాతలే పరత వాడియా మాజీ | ||౧౨౭|| 
127. “వెళ్లి పో! వాడకు వెళ్లి పో!” అని చెప్పగా దేవు వారి ఆజ్ఞను శిరసా వహించి, వారి చరణాలకు నమస్కరించి వాడకు వెళ్లాడు. 
ఝాలేలీ సర్వ హకీగత | ఘడలీ జైసీ తైసీ యథార్థ | 
జోగాంస ఆణి బాలకరామాప్రత | కేలీ నివేదిత సాద్యంత | ||౧౨౮|| 
128. జరిగినదంతా యథాతథంగా, జోగుకు, బాలకరాంకు వివరంగా మనవి చేశాడు. 
పుఢే ఎక సబంధ ఘటకా | ఉడాలా శివ్యా శాపాంచా దణకా | 
ప్రహరా దోప్రహరాం మాగే మగ లోకా | బాబాచ అవలోకా ఆమంత్రీత | ||౧౨౯|| 
129. ఒక ఘడియ తరువాత కూడా, తిట్లు, శాపాలు, కేకల దండకం జరుగుతూనే ఉంది. నాలుగైదు గంటల సమయమప్పుడు, బాబాయే భక్తులను పిలువ సాగారు. 
దేవహీ మగ తేథే ఆలే | ఇతరాం మాజీ జాఊన బైసలే | 
“మ్హాతార్యాచియా జీవా లాగలే” | అసేల మగ బోలే శ్రీసాఈ | ||౧౩౦||
130. దేవు కూడా అందరితో అక్కడికి వచ్చి కూర్చున్నాడు. “ముసలాడి మనసు నొచ్చుకున్నట్లుంది” అని శ్రీసాయి అన్నారు. 

“చింధీచీ తీ కథా కాయ | తరీ మ్యా దురుక్తీ కేలే ఘాయ | 
హోతీచ చోరిలీ త్యా కాయ ఉపాయ | బోలల్యా శివాయ రహావేనా | ||౧౩౧|| 
131. “గుడ్డ పీలికల సంగతేమిటో గాని, అతనిని తిట్లతో, బాగా గాయ పరిచాను. దొంగిలించాడు కదా, మరి ఏం చేయను? అలా అనకుండా ఉండలేక పోయాను. 
అసో అల్లా సారే బఘీల | తోహీ తయాచే బరే కరీల | 
తంవ ఎ భాఊ దక్షిణా దేసీల” | పుసతీ క్షమాశీల శ్రీసాఈ | ||౧౩౨|| 
132. “అల్లా అన్నీ చూస్తుంటాడు. అల్లాయే అతనిని బాగు చేస్తాడు” అని క్షమాశీలియైన శ్రీసాయి, “తమ్ముడూ! దక్షిణ ఇస్తావా?” అని అడిగారు. 
‘కితీ ఆణూ’ దేవ పుసతీ | “బారా ఘేఊని యేఈ త్వరితీ” | 
పాహూ జాతా నోటచి హోతీ | రుపయే న మిళతీ తియేచే | ||౧౩౩|| 
133. ‘ఎంత తీసుకుని రాను’ అని దేవు అడిగితే “పన్నెండు తీసుకుని త్వరగా రా” అని చెప్పారు. దేవు చూసుకోగా, తన దగ్గర నోటు కాగితమే కాని, చిల్లర రూపాయలు లేవు. 
దేవే తైసేంచ బాబాంస కథిలే | “రాహూ దే మజ నకో” తే వదలే | 
“సకాళీ త్వా దోనదా దిధలే | స్మరణ న రాహిలే మజ త్యాచే” | ||౧౩౪|| 
134. దానినే దేవు బాబాతో చెప్పాడు. “పోనిలే, నాకిప్పుడొద్దు” అని చెప్పి “ఉదయం నీవు రెండు సార్లు ఇచ్చావు. అది నాకు గుర్తు రాలేదు” అని అన్నారు. 
తరీహీ దేవాంనీ రుపయే మిళవిలే | బాబా లాగీ ఆణూన దిధలే | 
సవే తయాంచే చరణహీ వందిలే | పరిసా మగ నిఘాలే జే బోల | ||౧౩౫|| 
135. అయినా దేవు రుపాయలను తెచ్చి, బాబాకు సమర్పించి, వారి పాదాలకు వందనం చేశాడు. బాబా అప్పుడు ఏమన్నారో గమనించండి. 
“కాయ రే తూ కరీత అససీ” | ‘కాంహీ నాహీ’ వదతా తయాసీ | 
“పోథీ వాచిత జా నేమేంసీ” | కేలే దేవాంసీ ఆజ్ఞాపన | ||౧౩౬|| 
136. “ఏరా! నువ్విప్పుడు ఏం చేస్తున్నావు?” అని దేవుని ప్రశ్నించారు. ‘ఏం లేదు’ అని చెప్పాడు. 
“వాడియా మాజీ జాఊని బసావే | నిత్య నేమే వాచీత జావే | 
వాచితాంనా సాంగతహీ అసావే | నిరూపణ భావే సకళికా | ||౧౩౭|| 
137. “వాడలో కూర్చుని, నిత్యం నియమంగా గ్రంథాన్ని పఠించు. నీవు చదువుతూ భక్తిగా అందరికీ భావాన్ని తెలియ చేస్తూ ఉండు. 
సబంధ భరజరీ సుందర శేలా | బసలో అసతా తుజ ద్యావయాలా | 
జాసీ కా చింధ్యా చోరావయాలా | సవఈ కా తుజలా చోరీచీ” | ||౧౩౮|| 
138. “చక్కటి జరీ శాలువను నీకివ్వటానికి, నేనిక్కడ కూర్చుని ఉండగా, గుడ్డ పీలికలను దొంగిలించటానికి ఎందుకు పోతావు? నీకీ దొంగతనపు అలవాటు ఏమిటి?” అని అడిగారు. 
అసో “కరావే పోథీ వాచన” | సాఈ ముఖీంచే హే వచన | 
పావూని మాఝీ మీ అంతరీ ఖూణ | అతి సుఖసంపన్న జాహలో | ||౧౩౯|| 
139. అలా “గ్రంథాన్ని పఠించు” అని సాయి నోటినుండి వచ్చిన మాట, తన మనసులోని మాట బాబాకు అర్థమయినందుకు, దేవుకు అత్యంత ఆనందం కలిగింది. 
మానూని తీ ఆజ్ఞా ప్రమాణ | మగ మ్యా తయా దివసాపాసూన | 
నిత్య జ్ఞానేశ్వరీచే వాచన | తైసేంచ నిరూపణ ఆరంభిలే | ||౧౪౦||
140. ‘వారి ఆజ్ఞను ప్రమాణ పూర్వకంగా తలచి, నిత్యం నియమంగా జ్ఞానేశ్వరిని పఠించటం, దాని భావార్థాన్ని ఇతరులకు చెప్పటంతో ఆరంభించాను. 

మిళాలీ ఆజ్ఞా వాంఛిలీ ఆతా | ఫిటలీ వ్రతస్థ మనాచీ చింతా | 
యేథూన మజ జ్ఞానేశ్వరీ వాచితా | యేఈల నియమితతా వాచనా | ||౧౪౧|| 
141. ‘నేను కోరినట్లే, బాబా ఆజ్ఞా నాకు లభించింది. ప్రతిజ్ఞవలన మనసును ఆవరించుకున్న చింత వదిలింది. ఇకనుండి నేను జ్ఞానేశ్వరిని చదివితే, పారాయణంలో నియమం ఏర్పడుతుంది.
ఆతా మీ గుర్వనుజ్ఞాధర | ఆతా ప్రసన్న మజ జ్ఞానేశ్వర | 
మాజీ పడలే జే ఝాలే ఆజవర | వర్తణే అతఃపర నియమానే | ||౧౪౨|| 
142. ‘ఇప్పుడు నేను గురు ఆజ్ఞా బద్ధుడను. ఇక నాకు జ్ఞానేశ్వరుడు ప్రసన్నమైనట్లే. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు శ్రద్ధాపూర్వకంగా నియమంతో పఠిస్తాను.
సాక్ష మజలా మాఝే మన | వరీ సాఈ ఆజ్ఞా ప్రమాణ | 
ఆజ్ఞాబళే పోథీ పారాయణ | ఆతా నిర్విఘ్న ఘడేల | ||౧౪౩|| 
143. ‘నా మనసే నాకు సాక్షి. ఆ పైన, సాయి ఆజ్ఞయే నాకు ప్రమాణం. ఇక ముందు ఏ విఘ్నమూ లేక గ్రంథ పారాయణం జరుగుతుంది.
బాబా మీ యేతో లోటాంగణ | అనన్య భావే తుమ్హా శరణ | 
పదరీ ఘ్యాయా లేంకరా ఆపణ | కరవూన ఘ్యా వాచన మజ కరవీ | ||౧౪౪|| 
144. ‘బాబా! మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. అనన్య భావంతో, మీకు శరణుజొచ్చిన ఈ బిడ్డను, మీ ఒడిలోకి తీసుకుని, నాతో చదివించండి.
చింధీ తే కాయ ధ్యానాంత ఆలే | బాలకరామాస హోతే జే పుసిలే | 
త్యాచ చింధ్యా తేంచ న రుచలే | సాఈస జై భరలే రాగానే | ||౧౪౫|| 
145. ‘గుడ్డ పీలికలు ఏమిటో, ఇప్పుడు నాకు అర్థమైంది. బాలకరాంను నేను అడగటమే గుడ్డ పీలికలు. అదే వారికి నచ్చలేదు. కనుకనే సాయికి కోపం వచ్చింది.
కైసే తుమ్హాస ఉపాసనేస | కైసే పరబ్రహ్మ చింతనాస | 
లావిలే మ్హణూన బాలకరామాస | పుసిలే తే బాబా నావడలే | ||౧౪౬|| 
146. ‘ఉపాసన గురించి, పరబ్రహ్మ చింతన గురించి, ఎలా బోధించారు అని నేను బాలకరాంను అడగటం బాబాకు అసలు నచ్చలేదు.
వాటేల త్యా ప్రశ్నాచే ఉత్తర | స్వయే ద్యావయా అసతా తత్పర | 
కిమర్థ చౌకశా కరావ్యా పరస్పర | మ్హణోని మజ దుర్ధర ఛళియేలే | ||౧౪౭|| 
147. ‘ఆ ప్రశ్నలన్నింటికీ జవాబు ఇవ్వటానికి, స్వయంగా వారే ఇక్కడ తత్పరతతో ఉండగా, ఇతరులను అడగటం ఎందుకు? అందుకే వారు నన్ను బాధించారని అనిపిస్తుంది.
‘ఛళియేలే’ హే బోలచి ఉద్ధత | ప్రేమే భక్తార్థ జో ఓథంబత | 
భక్తచ్ఛల జ్యా స్వప్నీంహీ న దిసత | ఛళణే త్యా అనుచిత క్రియాపద | ||౧౪౮|| 
148. ‘బాధించారు అనే మాట కఠినంగా ఉంది. భక్తుల కోసం ప్రేమను కురిపించే వారు, కలలో కూడా భక్తుల బాధను చూడలేరు. వారి గురించి, బాధించటం అనే క్రియాపదం వాడటం చాలా అనుచితం.
ఛళిలే నవ్హే మజ శికవిలే | చిత్తీ తుఝియా జే జే ఉద్భవలే | 
తే తే మ్యా పాహిజే స్వయే పురవిలే | కధీ న చోరిలే కామా యే | ||౧౪౯|| 
149. ‘వారు నన్ను బాధించలేదు. “నీ మనసులో ఉప్పొంగే కోరికలన్నీ తీర్చేవాడు, స్వయంగా నేనే కదా” అని నాకు నేర్పించారు. కనుక దొంగిలించటం ఎప్పటికీ పనికి రాదు’.
సాఈ బాహ్య క్రోధాభిభూత | అంతరీ తే నిత్య ముదిత | 
బాహ్య సంతాపే దిసత సంతప్త | అంతరీ తే తృప్త ఆనందే | ||౧౫౦||
150. సాయి పైకి కోపం వచ్చినట్లు కనిపించినా, లోపల ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటారు. పైకి సంతాపంతో తపించి పోతున్నా, లోపల వారు సంతృప్తితో ఆనందంగా ఉంటారు.

క్రోధాచే బాహ్య లౌకిక లాఘవ | అంతరీ పరమానంద గౌరవ | 
తయా సాఈచే లీలా వైభవ | గావయా సుదైవచి పాహిజే | ||౧౫౧|| 
151. కోపాన్ని పైకి లౌకికంగా చూపించినా, లోపల పరమానందంలో ఉంటారు. అలాంటి సాయియొక్క లీలా వైభవాన్ని గానం చేయటానికి ఎంతో భాగ్యముండాలి.
సాధావయా నిజ స్వార్థ | జయా పోటీ అత్యంత ఆర్త | 
శివ్యా పుష్ప లాఖోల్యా మానిత | దృష్టీ నిజహిత తత్పర | ||౧౫౨|| 
152. తమ స్వార్థాన్ని సాధించుకోవాలనే తీవ్రమైన కోరిక ఉన్నవారు, తమ శ్రేయస్సునే ఆశిస్తారు. కనుక తిట్లను పుష్ప వృష్టిలా భావిస్తారు.
పరిసూని కర్ణకటు అశ్లీల వచన | డళమళేనా దేవాచే మన | 
పోటీ ప్రేమాచే భరతే గహన | వాటే తే తాడణ పుష్పాంచే | ||౧౫౩|| 
153. కర్ణ కఠోరంగానూ, అశ్లీలంగానూ ఉన్న మాటలు విని, దేవు మనసు చలించలేదు. ప్రేమతో నిండిన అతని మనసుకు, అవన్నీ పూలతో కొట్టినట్లు అనిపించింది.
దుగ్ధే భరలీ ధేనూచీ కాస | భాగ్యవానాస లాభే గోరస | 
కాసే పాసీచ గోచిడా వాస | అశుద్ధచి13 కర్మాస తయాచ్యా | ||౧౫౪|| 
154. ఆవు పొదగు పాలతో నిండి ఉన్నా, భాగ్యవంతులకే ఆ పాలు లభిస్తాయి. పొదగు వద్దనే ఉన్నా, జోరీగలకు మురికి రక్తమే ప్రాప్తి.
దర్దురా కమలకందా శేజార | లుటీ కమల మకరంద భ్రమర | 
దుర్దైవీ దర్దురా14 పంకాచా15 ఆహార | దైవాస న పార భ్రమరాచ్యా | ||౧౫౫|| 
155. కమలాల దగ్గరే సరోవరంలో కప్పలూ ఉంటాయి. కాని, ఆ కమలాల మకరందాన్ని స్వేచ్ఛగా దోచుకునే భాగ్యం తుమ్మెదలదయితే, దౌర్భాగ్యపు కప్పలకు బురదయే ఆహారం.
తైసే తుమ్హీ భాగ్యవాన | తుమ్హా ఆమ్హా సన్నిధాన | 
మానేల తే ఘ్యా రే పుసూన | శంకా సమాధాన సాఈ వదే | ||౧౫౬|| 
156. అలాగే “మీరు భాగ్యవంతులు. మనం ఒకరినొకరు కలుసుకున్నాం. కోరినదానిని అడిగి తీసుకోండి. మీ సంశయాలను తీర్చుతాను” అని సాయి అన్నారు.
పహా మాఝీ పోథీచీ అఢీ | వాచీన “వాచ” వదతిల తే ఘడీ | 
తోంవర జ్ఞానేశ్వరీ మీ నుఘడీ | పురవిలీ రోకడీ బాబాంనీ | ||౧౫౭|| 
157. ‘నా మొండితనాన్ని చూడండి. స్వయంగా బాబాయే చదువు అని చేప్పేవరకు, జ్ఞానేశ్వరిని తెరవను, అన్న నా పట్టుదలను బాబా తీర్చారు’.
కైసీ మాఉలీ కరీ లాడ | నిజబాలకాచే పురవీ కోడ | 
తయాచీ హీ ప్రతీతీ గోడ | భక్తీచీ జోడ హీ కథా | ||౧౫౮|| 
158. అని దేవు అనుకున్నాడు. తల్లి ఎలా గారాబంగా, తన బిడ్డల మురిపాలను తీరుస్తుందో అని తెలిపే మధురానుభూతికరమైన ఈ కథ భక్తిని దృఢ పరుస్తుంది.
వాచ మ్హణూన నాహీ థాంబలే | దేవ వదతీ వర్ష న ఉలటలే | 
స్వప్నీ యేఊన దర్శన దిధలే | ఆశ్చర్య మజ పుసిలే తే పరిసా | ||౧౫౯|| 
159. ‘చదువు అని చెప్పటంతో ఆగలేదు. సంవత్సరం తిరగకుండానే కలలో దర్శనమిచ్చి, ఆశ్చర్యంగా, నా గురించి అడగటం గమనించండి’ అని దేవు అన్నాడు.
సన ఎకూణీసశే చవదా | ఎప్రీల దుసరీ తారీఖ తదా | 
వార గురువార ఉజాడతా ఎకదా | స్వప్న ప్రసాదా పావలో | ||౧౬౦||
160. ‘క్రి. శ. ౧౯౧౪ వ సం|| ఏప్రిలు రెండవ తారీఖున, గురువారం, తెల్లవారుతుండగా, ఒక సారి కలలో వారి అనుగ్రహాన్ని పొందాను.

సమర్థ సాఈ స్వప్నీ ఆలే | ఆహేత మాడీవరతీ బైసలే | 
“పోథీ సమజతే కా” మజ విజారిలే | ఉత్తర దిధలే నకారీ | ||౧౬౧|| 
161. సాయి సమర్థులు కలలోకి వచ్చినప్పుడు, వాడలోని మేడపై కూర్చున్నారు. “గ్రంథం అర్థమౌతుందా?” అని అడిగారు. నేను ‘లేదు’ అని జవాబిచ్చాను.
తైసాచ ప్రశ్న ఝాలా నంతర | “మగ తీ కేవ్హా సమజణా” | 
ఆలే మాఝియా నేత్రాస నీర | కాయ మ్యా ప్రత్యూత్తర దిధలే | ||౧౬౨|| 
162. తరువాత అలాంటిదే మరో ప్రశ్న. “మరి ఎప్పుడు అర్థం చేసుకుంటావు?” నా కళ్లలో నీళ్లు నిండాయి. నేను ఏం జవాబిచ్చానంటే, 
కృపా ఆపులీ ఝాలియావీణ | పోథీ వాచణే కేవళ శీణ | 
సమజణే తో త్యాహూనహీ కఠిణ | బాబా మీ నిక్షూణ సాంగతో | ||౧౬౩|| 
163. ‘మీ అనుగ్రహం లేకుండా, గ్రంథ పఠన కేవలం శ్రమ. దానిని అర్థం చేసుకోవటం దానికంటే కఠినం. బాబా! ఇది నేను గట్టిగా చెప్పగలను’. 
బాబా వదతీ “పోథీ పఢతా | ఫారచి ఆపణ ఘాఈ కరితా | 
వాచా పాహూ తీ మజ దేఖతా | నికట బైసతా మజ పాశీ” | ||౧౬౪|| 
164. “గ్రంథం చదివేటప్పుడు, నీవు చాలా తొందర పడుతున్నావు. ఏది, నా దగ్గర కూర్చుని చదువు, నేనూ చూస్తాను” అని బాబా అన్నారు. 
‘కాయ వాచూ’ దేవ వదతీ | అధ్యాత్మాచీ ఆజ్ఞా దేతీ | 
దేవ పోథీ ఆణూ జాతీ | నేత్ర ఉఘడతీ తాత్కాళ | ||౧౬౫|| 
165. ‘ఏది చదవను’ అని దేవు అడిగితే, “ఆధ్యాత్మికతకు సంబంధించినది చదువు (అధ్యాయం ౯)” అని బాబా ఆజ్ఞ ఇచ్చారు. గ్రంథం తేవటానికి వెడుతుంటే, వెంటనే కళ్లు తెరుచుకున్నాయి. 
దేవ తేవ్హా జాగే హోతీ | స్వప్నస్థితీ పాహూని నిశ్చితీ | 
కాయ వాటావే తయాంచే చిత్తీ | కల్పనా శ్రోతీ కీజేతీ | ||౧౬౬|| 
166. దేవు అప్పుడు మేలుకున్నాడు. మేలుకున్నాక, తన కలను గుర్తుకు తెచ్చుకున్న దేవు మనసు, ఎలా ఉంటుందో, శ్రోతలే ఊహించవచ్చు! 
పాహూనియా వర్షభర వాట | మనీ కీ బాళ ఆజ్ఞా నీట | 
కరితో కీ నిత్య పోథీచా పాఠ | కాళజీ ఉద్భట హీ కోణ | ||౧౬౭|| 
167. సంవత్సరం పాటు గడిచాక, బాలుడు ఆజ్ఞను పాలిస్తూ, నిత్యం గ్రంథం పఠిస్తున్నాడా లేదా, అన్న చింత ఎవరికి ఉంటుంది? 
పాళీ కాయ లావిలీ శిస్త | దిధలా ధడా గిరవీ కా నిత్య | 
చుకే కోఠే వా కింనిమిత్త | కవణ హే సతత పాహీల | ||౧౬౮|| 
168. శిస్తుగా చెప్పినట్లు చేస్తున్నాడా లేదా? పొరపాటేమైనా చేస్తున్నాడా? ఎక్కడ, ఎందుకు పొరపాటు చేస్తున్నాడు? అని ఎప్పుడూ గమనించేవారు ఎవరు? 
వాచకే అసావే కైసే దక్ష | ఠేవణే కోఠే విశేష లక్ష | 
సాఈ మాఉలీవీణ ప్రత్యక్ష | కవణ హీ సాక్ష పటవీల | ||౧౬౯|| 
169. పాఠకులు ఎలా దక్షతతో ఉండాలి, ఎక్కడ విశేష ధ్యానం కలిగి ఉండాలి, అని సాయి మాత తప్ప, ఎవరు ప్రత్యక్షంగా గమనిస్తారు? 
ఏసీ సాఈ సమర్థ లీలా | ఏసా స్వానందాచా సోహళా | 
భక్తీ భోగిలా అసంఖ్య వేళా | దేఖిలా మ్యా డోళా ప్రత్యక్ష | ||౧౭౦||
170. సాయి సమర్థుని ఇటువంటి లీలలు, ఇలాంటి ఆత్మానంద వైభవాన్ని, భక్తులు అనేక సమయాలలో అనుభవించడం, ప్రత్యక్షంగా నేను నా కళ్లతో చూచాను. 

ఆతా ఆపణ శ్రోతే మండళీ | హోఊ కీ లీన గురుపద కమళీ | 
పరిసూ పుఢీల కథేచీ నవ్హాళీ | యథాకాళీ పుఢారా | ||౧౭౧|| 
171. శ్రోతలారా! ఇప్పుడు మనం గురు పాద కమలాలో లీనమై పోదాము. తరువాతి కథా విచిత్రాలను, ఆ కథా సమయం వచ్చినప్పుడు విందాము. 
ఆఠవూని శ్రీసమర్థ చరణ | సద్భావే మీ యేఈ లోటాంగణ | 
తేణేంచ సకల భవదఃఖవిమోచన | భావార్థే శరణ హేమాడ | ||౧౭౨|| 
172. శ్రీసమర్థుని పాదాలను గుర్తు తెచ్చుకుని, సద్భావంతో, సాష్టాంగ పడుతున్నాను. సకల సంసార దుఃఖాలనుండి, విమోచనం కలిగించే వారి పాదాలలో, హేమాడు శరణు వేడుతున్నాడు. 
సాఈచ ఎక తయాచా స్వార్థ | సాఈచ నిరతిశయ సుఖపరమార్థ | 
సాఈచ తయా కరీల కృతార్థ | నిశ్చిత హా భావార్థ తయాచా | ||౧౭౩||
173. హేమాడుకు సాయియే స్వార్థం. సాయియే పరమార్థ సుఖము. సాయియే తనను కృతార్థునిగా చేసేది, అని అతని నిశ్చితాభిప్రాయం, నమ్మకం. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | సాఈకృపానుగ్రహదానం నామ | 
| ఎక చత్వారింశత్తమోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. జడ ఫోటో, తసబీర. 2. బాబా అబ్దుల రహిమానచే. 
3. ఫోటోగ్రాఫరచ్యా దుకానాత. 4. భేట దేణ్యాస. 
5. సముద్రాచ్యా పాణ్యాత. 
6. అ. ౪౦ యాత ఉద్యాపనాచీ కథా జ్యాంచీ దిలేలీ ఆహే తేచ హే బాళాసాహేబ దేవ. 
7. పణ. 8. ఇచ్ఛా, కౌతుక. 9. ఉద్వేగరహిత, చింతారహిత. 
10. ఇ. స. ౧౯౧౪ చా ఫేబ్రువరీ మహినా. 11. మనాతీల గాఠ, హేతూ. 
12. యా నావాచా ఎక వ్యాధిష్ఠ త్యా వేళీ బాబాంపాశీ హోతా. 
13. రక్త. 14. బేడకాస. 15. చిఖలాచా. 

No comments:

Post a Comment