Thursday, October 24, 2013

||శ్రీసాఈనాథ నిర్యాణం నామ ద్వి చత్వారింశోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౨ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

ఓం నమోజీ సద్గురూ దాతారా | శ్రీమద్గోదా తట విహారా | 
బ్రహ్మమూర్తే కౌపీనాంబరా | సంతవరా నమో తుజ | ||౧|| 
1. ఓం నమో సద్గురు దాతా! శ్రీ గోదా తీర విహారా! బ్రహ్మమూర్తి కౌపీనాంబరా! సంతశ్రేష్ఠా! మీకు నమస్కారం.
దావీ భవనదీ ఉతరూ | దీనా దే నిజపదీ అవసరూ | 
తోహా భక్తకాజ కల్పతరూ | సంతావతారూ సాఈచా | ||౨|| 
2. భక్తుల పాలిటి కల్పతరువైన సాయి, సత్పురుషుల అవతారం. వారు సంసారమనే నదిని దాటే దారిని చూపుతూ, తమ పాదాలయందు దీనులకు ఆశ్రయమిస్తారు.
గతాధ్యాయీ జాహలే కథన | గోడ కథా నవల విందాన | 
సాఈ ఛబీచే జలనిమజ్జన | టళూని రక్షణ ఝాలే కసే | ||౩|| 
3. సాయియొక్క చిత్రపటం నీళ్ళలో మునిగి పోకుండా ఎలా రక్షింపబడింది, అన్న అద్భుతమైన మధుర కథ, పోయిన అధ్యాయంలో చెప్పబడింది.
తైసీచ ఎకా భక్తాచీ కామనా | సాఈనీ పురవిలీ యేఊని స్వప్నా | 
లావిలే తయా జ్ఞానేశ్వరీ వాచనా | దేఊని అనుజ్ఞా విస్పష్ట | ||౪|| 
4. అలాగే, ఒక భక్తుని కలలో సాయి కనిపించి, జ్ఞానేశ్వరిని పఠించాలనే అతని కోరిక సానుకూలంగా సాగడానికి, స్పష్టంగా ఆజ్ఞనిచ్చిన కథను కూడా విన్నారు.
సారాంశ గురుకృపా ఉజియేడే | ఫిటే భవభయాచే సాంకడే | 
నిఃశ్రేయస మార్గద్వార ఉఘడే | అసుఖ రోకడే సుఖ హోయ | ||౫|| 
5. సారాంశంలో, గురు కృపా యోగం కలిగిన క్షణంలో, సంసార భయాలనే ముడులు తెగిపోయి, ముక్తిమార్గ ద్వారాలు తెరుచుకుని, కష్టాలు, దుఃఖాలు సుఖాలుగా మారిపోతాయి.
నిత్య స్మరతా సద్గురూచరణ | విరే విఘ్నాంచే విఘ్నపణ | 
మరణాసీహీ యేఈల మరణ | పడే విస్మరణ భవదుఃఖా | ||౬|| 
6. సద్గురు పాదాలను నిత్యం తలచుకుంటే, విఘ్నం కలిగించే విఘ్నాలు మాయమౌతాయి. చావుకే చావు వచ్చి, ప్రాపంచిక దుఃఖాలు మరచి పోతాయి.
మ్హణోని యా సమర్థాచీ కథా | శ్రోతా పరిసిజే అపులాల్యా హితా | 
జయాచియా శ్రవణే తత్వతా | అతి పావనతా లాధేల | ||౭|| 
7. అందువలన, శ్రోతలు తమ మేలు కోసమే ఈ సమర్థుని చరిత్రను వినాలి. దీనివలన, వారు చాలా పావనులౌతారు.
ఆతా యే అధ్యాయీ ఆపణ | కరూం యా సాఈస్వభావ నిరూపణ | 
కైసే మనాచే తీవ్రపణ | అథవా మవాళపణ తయాంచే | ||౮|| 
8. ఇప్పుడు ఈ అధ్యాయంలో, మనం సాయియొక్క స్వభావాన్ని, అంటే వారి మనసులోని కాఠిన్యాన్ని, లేదా మృదుత్వాన్ని గూర్చి వర్ణించుకుందాం.
ఎకదా తాత్యాసాహేబ నూలకరాంచే | స్నేహీ డాక్టర పండిత నాంవాచే | 
ఘ్యావయా దర్శన సాఈ బాబాంచే | ఆలే ఎకదాంచే శిరడీంత | ||౯|| 
9. ఒక సారి, తాత్యాసాహేబు నూల్కరు స్నేహితుడు, డాక్టరు పండిత్‍ అనే పేరుగల మనిషి, సాయి బాబా దర్శనానికని శిరిడీ వచ్చాడు.
పాఊల ఠేవితా శిరడీంత | ఆరంభీ గేలే మశీదీంత | 
కరూని బాబాంసీ ప్రణిపాత | బైసలే నివాంత క్షణ భరీ | ||౧౦||
10. శిరిడీలో అడుగు పెట్టగానే, ముందుగా మసీదుకు వెళ్ళి, బాబాకు నమస్కరించి, కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు.

బాబా మగ వదతీ తయాంతే | “జాఈ దాదా భటాచ్యా యేథే | 
జా అసే జా” మ్హణూని బోటే హాతే | లావితీ మార్గాతే తయాస | ||౧౧|| 
11. “దాదాభట్టు వద్దకు వెళ్లు, ఇలా వెళ్లు” అని చెప్పి, తమ చేత్తో బాబా దారిని చూపించారు. 
పండిత దాదాంకడే గేలే | దాదాంనీ యోగ్య స్వాగత కేలే | 
మగ దాదా బాబాంచే పూజేస నిఘాలే | యేతా కా విచారిలే తయాంసి | ||౧౨|| 
12. దాదా వద్దకు పండిత్‍ వెళ్ళాడు. దాదా అతనిని సముచితంగా స్వాగతించాడు. ఆ తరువాత, బాబా పూజకు బయలుదేరుతూ, ‘మీరూ వస్తారా’ అని దాదా పండిత్‍ని అడిగాడు.
దాదా సమవేత పండిత గేలే | దాదానీ బాబాంచే పూజన కేలే | 
కోణీహీ న తోంవర లావాయా ధజలే | గంధాచే టికలే బాబాంస | ||౧౩|| 
13. దాదా వెంట పండిత్‍ వెళ్లాడు. బాబా పూజను దాదా చేశాడు. అప్పటివరకూ, బాబాకు గంధం బొట్టు పెట్టటానికి ఎవరూ సాహసించలేదు.
కోణీ కసాహీ యేవో భక్త | కపాళీ గంధ లావూ న దేత | 
మాత్ర మ్హాళసాపతీ గళ్యాసీ ఫాంసీత | ఇతర తే లావీత పాయాంతే | ||౧౪|| 
14. భక్తుడెవరైనా సరే, బాబా తమ నుదుట గంధం రాయనిచ్చేవారు కాదు. మహల్సాపతి మాత్రం వారి గొంతుకు చందనం పూసేవాడు. ఇతరులు వారి పాదాలకు పూసేవారు.
పరీ హే పండిత భోళే భావిక | దాదాంచీ తబకడీ కేలీ హస్తక | 
ధరూనియా శ్రీసాఈచే మస్తక | రేఖిలా సురేఖ త్రిపుండ్ర | ||౧౫|| 
15. కాని, ఈ పండిత్‍ అమాయకుడు, భావికుడు. చందనం గిన్నెను తన చేతిలోనికి లాక్కొని, సాయి నుదుటి మీద త్రిపుండ్ర (మూడు అడ్డమైన గీతలు) రేఖలను దిద్దాడు.
పాహూని హే తయాంచే సాహస | దాదాంచే మనీ ధాసధూస | 
చఢతీల బాబా పరమ కోపాస | కాయ హే ధాడస మ్హణావే | ||౧౬|| 
16. అతని ధైర్యాన్ని చూచి, పండిత్‍ సాహసానికి బాబా కోపోగ్రులవుతారేమో అని దాదా మనసులో కలవర పడ్డాడు.
ఏసే అఘడతే జరీ ఘడలే | బాబా ఎకహీ న అక్షర వదలే | 
కింబహునా వృత్తీనే ప్రసన్న దిసలే | ముళీ న కోపలే తయాంవర | ||౧౭|| 
17. కాని, జరగకూడనిది జరిగినా, బాబా ఒక్క ముక్కైనా అనలేదు సరికదా, చాలా ప్రసన్నంగా కనిపించారు. కోపం ఏ మాత్రమూ చూపలేదు.
అసో తీ వేళ జాఊ దిలీ | దాదాంచే మనీ రూఖరూఖ రాహిలీ | 
మగ తేచ దినీ సాయంకాళీ | బాబాంస విచారిలీ తీ గోష్ట | ||౧౮|| 
18. ఎలాగో ఆ రోజు గడవనిచ్చాడు. కాని దాదా మనసులోని చింత అలాగే ఉంది. ఆ రోజు సాయంకాలం బాబాను దానిగురించి అడిగాడు.
ఆమ్హీ గంధాచా ఉలాసా టిళా | లావూ జాతా ఆపులియా నిఢళా | 
స్పర్శ కరూ ఘ్యానా కపాళా | ఆణి హే సకాళా కాయ ఘడలే | ||౧౯|| 
19. ‘మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని ఎంత ఉత్సాహ పడినా, మమ్మల్ని అసలు తాకనివ్వరు కదా, మరి ఈ ఉదయం ఏం జరిగింది?
ఆముచ్యా టిళ్యాచా కంటాళా | పండితాంచ్యా త్రిపుండ్రాచా జివ్హాళా | 
హా కాయ నవలాచా సోహళా | బసేనా తాళా సుసంగత | ||౨౦||
20. ‘మా తిలకం మీకు ఇష్టం ఉండదు కాని, ఆ పండిత్‍ త్రిపుండ్ర రేఖలంటే అంత ప్రేమా? ఏమిటీ వింత? దేనికీ పొంతన లేదు’ అని అన్నాడు.

తంవ సస్మితవదన ప్రీతీ | సాఈ దాదాంలాగీ వదతీ | 
పరిసావీ తీ మధుర ఉక్తీ | సాదర చిత్తీ సకళికీ | ||౨౧|| 
21. అప్పుడు, ముఖం మీద మందహాసంతో ప్రేమగా, దాదాతో బాబా పలికిన మధురమైన పలుకులను శ్రద్ధగా వినండి.
“దాదా తయాచా గురూ బామణ | మీ జాతీచా ముసలమాన | 
తరీ మీ తోచి ఏసే మానూన | కేలే గురూపూజన తయానే | ||౨౨|| 
22. “దాదా! అతని గురువు బ్రాహ్మణుడు. నేను ముసల్మాను జాతీయుణ్ణి. అయినా, అతడు నన్ను తన గురువే అని అనుకుని పూజ చేశాడు. 
ఆపణ మోఠే పవిత్ర బ్రాహ్మణ | హా జాతీచా అపవిత్ర యవన | 
కైసే కరూ త్యాంచే పూజన | ఏసే న తన్మన శంకలే | ||౨౩|| 
23. “ ‘నేను చాలా పవిత్ర బ్రాహ్మణుడను, ఇతడు అపవిత్ర జాతిలోని ముసల్మాను కదా, అతనిని ఎలా పూజించడం’ అని అతడు ఒక్క మారు కూడా మనసులో శంకించలేదు. 
ఏసే మజ త్యానే ఫసవిలే | తెథే మాఝే ఉపాయ హరలే | 
నకో మ్హణణే జాగీంచా రాహిలే | ఆధీన కేలే మజ తేణే ” | ||౨౪|| 
24. “అలా నన్ను తన వశం చేసుకున్నాడు. అప్పుడు వేరే ఉపాయమేమీ సాగక, నేను అతనిని వద్దని చెప్పలేక పోయాను. అలా నన్ను తన స్వాధీనం చేసుకున్నాడు”. 
ఏసే జే హే ఉత్తర పరిసిలే | వాటలే కేవళ వినోదే భరలే | 
పరీ తయాంతీల ఇంగిత కళలే | మాఘారా పరతలే జై దాదా | ||౨౫|| 
25. ఈ సమాధానాన్ని విని, ‘అది కేవలం వినోదానికే’ అని దాదా అనుకున్నాడు. ఇంటికి వెళ్లిన తరవాతే, ఆ సమాధానంలోని ఇంగితాన్ని తెలుసుకున్నాడు. 
హీ బాబాంచీ విసంగతతా | దాదాంచ్యా ఫారచ లాగలీ చిత్తా | 
పరీ పండితాసవే వార్తా కరితా | కళలీ సుసంగతతా తాత్కాళ | ||౨౬|| 
26. బాబా ప్రవర్తన పొంతనలేనిదని దాదా మనసులో బాగా నాటుకుంది. దీని గురించి పండిత్‍తో ముచ్చటించాక, బాబా ప్రవర్తన విశదమైంది. 
ధోపేశ్వరీంచే రఘునాథ సిద్ధ | ‘కాకా పురాణిక’ నామే ప్రసిద్ధ | 
పండిత తయాంచే పదీ సన్నద్ధ | ఋణానుబంధ శిష్యత్వే | ||౨౭|| 
27. ధోపేశ్వర్‍లోని రఘునాథుడు సిద్ధుడు. కాకా పురాణిక అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. శిష్యత్వ ఋణానుబంధం కారణంగా, పండిత్‍ వారి పాదాలయందు భక్తి కలిగి ఉన్నాడు. 
త్యానీ కాకాంచా ఘాతలా ఠావ | తయాంస తైసాచ ఆలా అనుభవ | 
జయా మనీ జైసా భావ | భక్తి ప్రభావహీ తైసాచ | ||౨౮|| 
28. బాబాను చూచిన వెంటనే, అతనికి తన గురువైన కాకా కనిపించాడు. అదే అతనికి అనుభవమయింది కూడా. మనసులో ఉండే భావాన్ని బట్టి, భక్తి ప్రభావం కూడా ఉంటుంది. 
ఆతా చిత్త కరూని సమాహిత | పరిసిలే ఆతాపర్యంత ఆచరిత | 
తైసేంచ బాబాంచే దేహోత్సర్గ చరిత్ర | తేంహీ సుచిత్త అవధారా | ||౨౯|| 
29. ఇంతవరకూ, ఒకే మనసుతో బాబాయొక్క స్వభావం గురించి విన్నట్లే, ఇప్పుడు, బాబా తమ శరీరాన్ని త్యజించిన సంగతిని కూడా శ్రద్ధగా వినండి. 
ధన్య ధన్య శిరడీచే లోక | జయా బాబాంచే సహవాస సుఖ | 
అర్ధ శతకాహునీహీ అధిక | అతి సుఖకారక జాహలే | ||౩౦||
30. బాబాయొక్క సహవాస సుఖాన్ని అర్ధ శతాబ్దం కంటే ఎక్కువ కాలం అనుభవించిన శిరిడీ ప్రజలు నిజంగా ధన్యులు, అతి ధన్యులు. 

శకే అఠరాశే చాళిసాంత | దక్షిణాయన ప్రథమ మాసాంత | 
విజయా దశమీ శుక్లపక్షాంత | దివసా దేహాంత బాబాంచా | ||౩౧|| 
31. శక. సం|| ౧౮౪౦ లో దక్షిణాయన ప్రథమ మాసంలో, శుక్ల పక్షంలోని విజయదశమి రోజున (క్రి. శ. ౧౯౧౮వ సం|| అక్టోబరు ౧౫న), బాబా తమ శరీరాన్ని వదిలారు. 
నఊ తారీఖ ముసలమానీ | కత్తలచీ రాత్ర తయా దినీ | 
తిసరే ప్రహరీ సాఈ నాథాంనీ | కేలీ నిర్యాణీ తయారీ | ||౩౨|| 
32. ముసల్మానుల మొహర్రం నెలలోని తొమ్మిదవ తారీఖున, ‘కత్తల్‍’ రాత్రి రోజున, సుమారు మూడవ ఝామున (మధ్యాహ్నం రెండు గంటలప్పుడు) బాబా నిర్వాణానికి సిద్ధమయ్యారు. 
బుద్ధాచీ తై బుద్ధ జయంతీ | సాఈచీ తై పుణ్యతిథీ | 
దేవాదికాంచీ జీ జయంతీ | తీచ పుణ్యతిథీ సంతాంచీ ||౩౩|| 
33. గౌతమ బుద్ధుని బుద్ధ జయంతి రోజున, సాయియొక్క పుణ్యతిథి. దేవతల జయంతి వలనే సంతుల పుణ్యతిధి కూడా జరుపబడుతుంది. 
సాడే బారాచా ఘంటా పడలా | దశమీచా కాళ సంపూర్ణ ఝాలా | 
ఎకాదశీ ఆలీ ఉదయాలా | నిర్యాణ కాళా ఎకాదశీ | ||౩౪|| 
34. పన్నెండున్నర గంటలు గడిచిన తరువాత, దశమి కాలం పూర్తిగా దాటిపోయి, ఏకాదశి వచ్చింది. కనుక సాయియొక్క నిర్వాణ కాలం ఏకాదశి. 
సూర్యోదయాచీ ఉదయతిథీ | తీచ దసర్యాచీ తిథీ మానితీ | 
మ్హణోన విజయా దమీ ధరితీ | ఉత్సవ కరితీ తే దినీ | ||౩౫|| 
35. సూర్యోదయంనుండి తిథిని పాటిస్తే, ఆ రోజు దశమి. అందువల్ల సాయి నిర్వాణం విజయదశమిగా భావించి, ఆ రోజే ఉత్సవం చేస్తారు. 
మంగళవార కత్తలచీ రాత | ఏసా తో దివస అతి విఖ్యాత | 
మ్హణవూతీ తే దినీ సాఈ మహంత | జ్యోతీంత జ్యోత మిళవితీ | ||౩౬|| 
36. ఆ మంగళవారం రాత్రి ‘కత్తల్‍’ రాత్రిగా ప్రసిద్ధి చెందినది. అందుకే, ఆ రోజు సాయి తమ జీవనజ్యోతిని విశ్వజ్యోతితో ఐక్యం చేశారు. 
వంగదేశీంచా ప్రసిద్ధ సణ | దుర్గాపూజా సమాప్తి దిన | 
తో హా ఉత్తర హిందుస్థానామధూన | ఉత్సవ దిన సకళాంచా | ||౩౭|| 
37. వంగదేశంలో ప్రసిద్ధమైన దుర్గా పూజా ముగిసే రోజు, ఆ దినం. ఉత్తర హిందూస్థానంలోని వారందరికీ కూడా ఉత్సవ దినం. 
శకే అఠరాశే అడతిసీ | విజయా దశమీచేచ దివశీ | 
సాయంకాళీ ప్రదోష సమయాసీ | భవిష్యాసీ సూచవిలే | ||౩౮|| 
38. శక సం|| ౧౮౩౮ విజయదశమి రోజునే, సాయంకాలం ప్రదోష సమయాన, బాబా భవిష్యాన్ని సూచించారు. 
కైసే తీ కథితో అపూర్వ లీలా | హోఈల విస్మయ శ్రోతియాంలా | 
సమర్థ సాఈచ్యా అకళ కళా | తేణే సకళా కళతీల | ||౩౯|| 
39. అది ఎలా సూచించారనే అపూర్వ లీలను చెప్పుతాను. శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. కాని, దానితో సాయి సమర్థుల అంతు పట్టని మహిమ గురించి తెలుస్తుంది. 
ఇసవీసన ఎకూణీససే సోళా | సణ దసరా సిలింగణ వేళా | 
ఫేరీ పరతతా సాయంకాళా | లీలా అద్భుత వర్తలీ | ||౪౦||
40. క్రి. శ. ౧౯౧౬వ సం|| దసరా పండుగ రోజున, సీమోల్లంఘన వేళ. సాయంకాలం ప్రజలు పూజ చేసి తిరిగి వస్తుండగా, అద్భుతమైన లీల జరిగింది. 

నభప్రదేశీ మేఘ గడగడే | అవచిత విద్యుల్లతా కడకడే | 
తేవీ జమదగ్నీ స్వరూప రోకడే | ప్రగట కేలే బాబాంనీ | ||౪౧|| 
41. ఆకాశంలో ఉరిమే మేఘాల వలె, అకస్మాత్తుగా మెరుపులు మెరిసినట్లు, బాబా జమదగ్ని స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూపించారు.
సోడోని శిరీంచా సుడకా | కాఢూని కఫనీ తడకా ఫడకా | 
ఫేడూని కౌపీన లంగోటా | కేలా భడకా ధునీంత | ||౪౨|| 
42. తల మీద ఉండే రుమాలును తీసివేశారు. క్షణంలో, వేసుకున్న కఫ్నీను, కట్టుకున్న లంగోటినీ విప్పి వేశారు. వీటన్నింటినీ ధునిలో వేయగ, ధుని భగ్గుమంది. 
ఆధీంచ తో అగ్ని సోజ్వళ | సాహ్య హోతా ఆహుతీ ప్రబళ | 
ఉసళలా శిఖాంచా1 కల్లోళ | భక్తాంస ఘోళ పడియేలా | ||౪౩|| 
43. అప్పటికే ధునిలో అగ్ని ప్రజ్వలంగా ఉంది. దానికి తోడుగా అందులో ఈ ఆహుతిని వేసేసరికి, జ్వాలలు మరింతగా పైకి లేచి, భక్తులను కలవర పెట్టాయి. 
హే సర్వ ఘడలే అవచితీ | నకళే కాయ బాబాంచే చిత్తీ | 
శిలింగణ కాళీంచీ తీ వృత్తి | మహత్భీతిప్రద హోతీ | ||౪౪|| 
44. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో, ఏమో, ఎవరికీ అర్థం కాలేదు. కాని, సీమోల్లంఘన కాలంలో వారి చర్యలు, విపరీతమైన భయాన్ని కలిగించాయి. 
అగ్నీనే పసరిలే నిజ తేజ | త్యాహూన బాబా దిసలే సతేజ | 
ఝాంకోళలే నయన సహజ | పరాఙ్ముేఖ జన ఝాలే | ||౪౫|| 
45. అగ్ని తన తేజస్సును ప్రదర్శించింది. కాని, బాబా తేజస్సు అంతకంటే ఎంతో ఎక్కువగా ఉంది. ఆ తేజస్సును తట్టుకోలేక, భక్తులు కళ్లు మూసుకుని, ముఖాలను త్రిప్పుకున్నారు. 
సంత హస్తీంచే హే అవదాన | సేవూని ప్రసన్న అగ్నినారాయణ | 
దిగంబర బనలే తే జామదగ్న్య | ధన్య నయన దేఖత్యాంచే | ||౪౬|| 
46. సంతులు తమ చేతులతో అర్పించిన దానిని స్వీకరించి, అగ్ని నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. జామదగ్ని (పరశురాముడు) వలె ఉగ్రులైన బాబా, దిగంబరులైనారు. చూచినవారి కళ్లు ధన్యం. 
త్వేషే టవకారిలే నయన | క్రోధే ఝాలే ఆరక్త నయన | 
మ్హణతీ “కరారే ఆతా నిదాన | మీ ముసలమాన కీ హిందూ” ||౪౭|| 
47. వారి కళ్లు కోపంతో మెరుస్తున్నాయి. విపరీతమైన కోపంతో, రక్తంతో ఎర్రబడ్డ కళ్లతో, “ఇప్పుడు నిర్ణయించుకోండిరా! నేను హిందువునా లేక మహమ్మదీయుణ్ణా అని” అని బాబా అన్నారు. 
గర్జోని బాబా వదతీ “పహా జీ | మీ హిందూ కీ యవన ఆజీ | 
నిర్ధారా యథేచ్ఛ మనా మాజీ | ఆశంకా ఘ్యాజీ ఫేడూనియా” ||౪౮|| 
48. “చూడండి! నేను హిందువునా లేక యవనుణ్ణా? ఈ రోజే నిర్ణయించుకొండి. మీకు తృప్తిగా, అన్ని సందేహాలను తొలగించుకొండి” అని బాబా గట్టిగా గర్జించారు. 
దేఖావా హా అవలోకూన | మండళీ ఝాలీ కంపాయమాన | 
హోఈల కైసే శాంతవన | నిత్య చింతన చాలలే | ||౪౯|| 
49. ఆ దృశ్యాన్ని చూచి భక్తులు తల్లడిల్లి పోయారు. బాబాని ఎలా శాంత పరచాలనే చింత భక్తులను ఆవరించింది. 
భాగోజీ శిందా మహావ్యాధిష్ట | పరీ బాబాంచా భక్త శ్రేష్ఠ | 
ధీర కేలా ఆలా నికట | నేసవీ లంగోట బాబాంసీ | ||౫౦||
50. మహా వ్యాధిగ్రస్తుడైన భాగోజీ శిండే బాబా భక్తశ్రేష్ఠులలో ఒకడు. అతను ధైర్యాన్ని పుంజుకుని బాబా దగ్గరకు వెళ్లి వారికి లంగోటిని చుట్టాడు. 

మ్హణే బాబా హే కాయ చిన్హ | ఆజ శిలింగణ దసర్యాచా సణ | 
మ్హణతీ మాఝే హేచ శిలింగణ | హాణితీ సణసణ సటక్యానే | ||౫౧|| 
51. ‘ఏమిటిదంతా బాబా! ఈ రోజు దసరా పండుగ సీమోల్లంఘనం’ అని అనగా “నా సీమోల్లంఘనం ఇదే!” అని చెప్పి బాబా సటకాతో టపటపమని కొట్టారు. 
ఎణే పరీ ధునీపాశీ | ఉభే బాబా దిగంబరవేషీ | 
చావడీ హోతీ తే దివశీ | ఘడతే కైశీ హే చింతా | ||౫౨|| 
52. ఈ విధంగా ధుని వద్ద, బాబా దిగంబరుడై నిలుచున్నారు. ఆ రోజు చావడి ఉత్సవం కనుక, ఆ ఊరేగింపు ఎలా జరుగుతుందో అని అందరికీ చింత పట్టుకుంది. 
నవాచీ చావడీ దహా ఝాలే | పరీ బాబా నాహీ స్థిరావలే | 
లోక జాగజాగీ తటస్థ ఠేలే | టకమక ఉగలే పాహతీ | ||౫౩|| 
53. తొమ్మిదింటికి జరగాల్సిన చావడి, పదైనా జరుగలేదు. బాబా ఇంకా శాంతించలేదు. ఎక్కడి భక్తులు అక్కడే కనురెప్పలాడించకుండా మౌనంగా ఉండిపోయారు. 
హోతా హోతా ఝాలే అకరా | బాబాహీ తేవ్హా నివళలే జరా | 
నేసోనియా లంగోటా కోరా | కఫనీ పేహరావ మగ కేలా | ||౫౪|| 
54. అలా అలా పదకొండు అయింది. అప్పుడు బాబా కాస్తంత శాంతించి క్రొత్త లంగోటిని, కఫ్నీనీ ధరించారు. 
చావడీచీ ఘంటా జాలీ | మండళీ హోతీ తటస్థ బైసలీ | 
పాలఖీ ఫులాంనీ శృగారలీ | అంగణీ ఆణిలీ ఆజ్ఞేనే | ||౫౫|| 
55. చావడి ఉత్సవానికి గంట మ్రోగింది. అంతవరకూ మౌనంగా కూర్చున్న భక్తులు, బాబా ఆజ్ఞ ప్రకారం, పల్లకిని పూలతో శృంగారించి, ప్రాంగణం లోనికి తీసుకుని వచ్చారు. 
రజతదండ పతాకా చవరీ | ఛత్రధ్వజాది రాజోపచారీ | 
శృంగారిలీసే మిరవణూక స్వారీ | నిఘే బాహేరీ ఎకాంతరా2 | ||౫౬|| 
56. వెండి దండం, పతాకం, వింజామరలు, ఛత్రచామరాది రాజోపచారాలతో, అలంకారాలతో, రోజు విడిచి రోజు వెడలే ఊరేగింపు, బయటికి బయలుదేరింది. 
ఝాలా ఎకచి మహాగజర | సాఈనాథాంచా జయజయకార | 
కాయ వర్ణావా తో గిరాగజర | ఆనందాపూర లోటలా | ||౫౭|| 
57. ‘సాయినాథ్ మహారాజ్‍కీ జై!’ అని ఒకటే కేకలు. ఆ జయజయకారాలను ఎలా వర్ణించడం? అంతటా ఆనందం తొణకిసలాడింది. 
మగ శోధూని శుభ్ర ధడకా | బాబా డోక్యాస గుండీతీ ఫడకా | 
ఘేతీ చిలీమ తమాఖూ సటకా | జణూ తోచ నేటకా సుముహూర్త | ||౫౮|| 
58. తెల్లటి శుభ్రమైన రుమాలను తలకు చుట్టుకుని, చిలుం పొగాకు సటకా చేతపుచ్చుకుని, అదే సుముహూర్తమన్నట్లు బాబా బయలుదేరారు. 
కోణీ ఛత్రీ కోణీ చవరీ | కోణీ తీ మోరచేలే సాజిరీ | 
కోణీ గురూడటకే అబదాగిరీ | ఘేతీ నిజకరీ వేత్రదండ | ||౫౯|| 
59. ఒకరు ఛత్రం, ఒకరు చామరం, ఒకరు అందమైన నెమిలి పింఛముల వీవన, మరొకరు గరుడుని చిత్రం ఉన్న పతాకం, ఇంకొకరు దండం పట్టుకున్నారు. 
ఎణే పరీ కరూనియా మీస | బాబాంనీ సుచవిలే సర్వత్రాంస | 
భవసాగర సీమోల్లంఘనాస | దసరాచ ఎక సుముహూర్త | ||౬౦||
60. ఈ విధంగా, సీమోల్లంఘనం మిషతో, సంసార సాగర సీమోల్లంఘనానికీ దసరాయే మంచి ముహూర్తమని బాబా అందరికీ సూచించారు. 

తదనంతర ఎకచి దసరా | బాబాంనీ దాఖవిలా శిరడీంకరా | 
పుఢీలచి దసరా సుముహూర్త బరా | దేహ ధరార్పణ కేలా కీ | ||౬౧|| 
61. దాని తరువాత, శిరిడీ ప్రజలకు ఒక్కటే దసరా పండుగను చూపించి, మరొక దసరా సుముహూర్తాన, బాబా తమ శరీరాన్ని త్యజించారు.
హే న కేవళ సూచవిలే | స్వయే అనుభవా ఆణూన దావిలే | 
నిజ దేహ శుద్ధ వస్త్ర వాహిలే | యోగాగ్నీంత హవిలే యేచ దీనీ | ||౬౨|| 
62. సూచించటమే కాదు, శిరిడీ ప్రజలకు స్వయంగా అనుభవమయేలా చూపించారు. తెల్ల రంగు శుద్ధ వస్త్రాన్ని (తమ దేహాన్ని) యోగాగ్నికి ఆ రోజే సమర్పించారు. 
సన ఎకోణీససే అఠరా | తే సాలీచా తో సణ దసరా | 
తోచ సుముహూర్త కేలా ఖరా | నిజ పరాత్పరా సమరసలే | ||౬౩|| 
63. క్రి. శ. ౧౯౧౮వ సం. దసరా పండుగ రోజును, అత్యంత శుభమైన ముహూర్తంగా చేసి, తమ శరీరాన్ని పరబ్రహ్మ స్వరూపంలో లీనం చేశారు. 
ఏసీచ బాబాంచీ ఆణిక ప్రచితీ | లిహితా లిహితా ఆఠవలీ చిత్తీ | 
కీ యాచ విజయా దశమీచీ తిథీ | హోతీ నిశ్చితీ ఆధీంచ | ||౬౪|| 
64. దీనిని వ్రాస్తుండగా, ఇలాంటిదే బాబాయొక్క మరొక లీల గుర్తుకు వచ్చింది. దీనివల్ల ఇదే విజయదశమి తిథి, తమ నిర్వాణానికి సుముహూర్తం, అని బాబా ముందుగానే నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది. 
శిరడీచే పాటీల రామచంద్ర దాదా | ఝాలే అతి దుఖణాఈత ఎకదా | 
జీవాస సోసవతీ న ఆపదా | అతి తాపదాయక భోక్తృత్వ | ||౬౫|| 
65. శిరిడీలోని రామచంద్ర పాటీలు, ఒకసారి చాలా జబ్బు పడ్డాడు. ప్రాణాంతకమయిన ఆ వ్యాధి బాధను భరించలేక పోయాడు. 
ఉపాయ కాంహీ బాకీ న రాహిలా | పడేనా జంవ దుఖణ్యాస ఆళా | 
ఆలా జీవితాచా కంటాళా | అతి కదరలే పాటీల | ||౬౬|| 
66. ఏ విధమయిన చికిత్స మిగలకుండా, అన్నిటినీ ప్రయత్నించాడు. కాని, దేని వలనా వ్యాధిని నిగ్రహించలేక పోయాడు. జీవితంపై విరక్తి కలిగి, పటేలు చాలా బాధపడిపోయాడు. 
హోతా ఏసీ మనాచీ స్థితీ | ఎకే దివశీ మధ్యరాతీ | 
ఎకాఎకీ బాబాంచీ మూర్తి | త్యాంచే ఉశాగతీ ప్రగటలీ | ||౬౭|| 
67. ఇలాంటి మానసిక స్థితిలో ఉండగా, ఒక రోజు, ఆకస్మికంగా అర్ధరాత్రి వేళప్పుడు, బాబా అతని తలవైపు కనిపించారు. 
తంవ తే పాటీల పాయ ధరితీ | నిరాశ హోఊని బాబాంస వదతీ | 
‘కధీ యేఈల మజ మరణ నిశ్చితి | ఎవఢేంచ మజప్రతీ వదాజీ | ||౬౮|| 
68. తక్షణమే, పాటీలు బాబా పాదాలు పట్టుకుని నిరాశతో, ‘బాబా! నా మరణం ఎప్పుడు వస్తుంది? ఇదొక్కటీ నిశ్చయంగా చెప్పండి. 
ఆలా ఆతా జీవాచా వీట | నాహీ మజ మరణాచే సంకట | 
కధీ మజ దేఈల తే భేట | పాహే మీ వాట ఎవఢీంచ’ | ||౬౯|| 
69. ‘జీవితంపై నాకు విరక్తి కలిగింది. చావు సంకటం అని అనిపించటం లేదు. చావు ఎప్పుడు నన్ను కలుసుకుంటుందా అని ఎదురు చూస్తున్నాను’ అని అన్నాడు. 
తంవత్యా బాబా కరూణా మూర్తి | మ్హణతీ “న కరీ చింతా చిత్తీ | 
టళలీ తుఝీ గండాంతర భీతి | కిమర్థ ఖంతీ కరిసీరే | ||౭౦||
70. అప్పుడు కరుణామూర్తి అయిన బాబా “నీవు ఏ చింతా పెట్టుకోకు. ప్రాణాంతకం అయిన వ్యాధినుండి నీ గండం గడిచింది. అనవసరంగా ఎందుకు బాధ పడతావు? 

తుజలా నాహీ కాహీంచ భీతీ | తుఝీ హుండీ పరతలీ పురతీ | 
పరీ న తాత్యాచీ ధడగతీ | దిసే మజ ప్రతీ రామచంద్రా | ||౭౧|| 
71. “నీకేం భయం లేదు. నీ హుండి తిరిగి వచ్చింది. కాని రామచంద్రా! నాకు తాత్యా స్థితి ఆశాజనకంగా కనిపించటం లేదు. 
శకే అఠరాశే చాళీస | దక్షిణాయన ఆశ్వినమాస | 
విజయాదశమీ శుక్లపక్ష | పావేల అక్షయపద తాత్యా3 | ||౭౨|| 
72. “శక సం||౧౮౪౦ (౧౯౧౮) దక్షిణాయనంలోని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షపు విజయదశమి రోజున తాత్యా ముక్తిని పొందుతాడు. 
పరీ న బోలావే తయాపాశీ | హాయ ఘేఊని బైసేల జీవాశీ | 
ఝురణీస పడేల అహర్నిశీ | మరణ కోణాసీ ఆవడేనా” | ||౭౩|| 
73. “ఈ సంగతి అతనితో చెప్పవద్దు. దీనినే మనసులో పెట్టుకుని, రాత్రి పగలు చింతించి, క్షీణించి పోతాడు. చావు ఎవరికీ ఇష్టముండదు”. 
అవఘీ దోనచ వర్షే ఉరలీ | తాత్యాచీ వేళా జవళ ఆలీ | 
రామచంద్రాస కాళజీ ఉద్భవలీ | బాబాంచీ బోలీ వజ్రలేప | ||౭౪|| 
74. కేవలం రెండు సంవత్సరాలే మిగిలాయి. తాత్యాకు సమయం సమీపించింది. రామచంద్రునికి దిగులు పట్టుకుంది. ఎందుకంటే, బాబా మాట వజ్రలేపనం వంటిది. 
తాత్యాపాసోన గుప్త ఠేవిలీ | బాళా శింప్యాచే కానీ ఘాతలీ | 
కోణా న కళవావీ ప్రార్థనా కేలీ | చింతా తీ లాగలీ ఉభయాంతే | ||౭౫|| 
75. తాత్యాకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. బాలా శింపి చెవిన వేసి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని వేడుకున్నాడు. వారిద్దరికీ చింత ఆవరించింది. 
ఖరేంచ రామచంద్ర పాటీల ఉఠలా | త్యాచా బిఛానా తేథూన సుటలా | 
దివస మోజతా మోజతా లోటలా | నకళత గేలా తో కాళ | ||౭౬|| 
76. నిజంగానే రామచంద్ర పాటీలు జబ్బు తగ్గింది. మంచంపైనుండి లేచాడు. రోజులు లెక్కపెడుతూ, లెక్కపెడుతూ అతనికి తెలియకుండానే కాలం గడిచిపోయింది. 
నవల బాబాంచే బోలాచా తాళా | చాళీసాచా భాద్రపద సరలా | 
మాస ఆశ్విన డోకాఊ లాగలా | తాత్యాబా పడలా పథారీవర | ||౭౭|| 
77. బాబా మాటలలోని నిజాన్ని గమనించండి. శక సం||౧౮౪౦ లోని భాద్రపద మాసం గడిచి, ఆశ్వయుజం అడుగు పెట్టింది. తాత్యా మంచాన పడ్డాడు. 
తికడే తాత్యా తాపానే అజారీ | ఇకడే బాబాంస భరలీ శిరశిరీ | 
తాత్యాచా భరంవసా బాబాంవరీ | బాబాంచా శ్రీహరి రక్షితా | ||౭౮|| 
78. అక్కడ తాత్య జ్వరంతో జబ్బు పడితే, ఇక్కడ బాబాకు చలితో వణుకు పట్టుకుంది. తాత్యాకు బాబాపై నమ్మకం. కాని, బాబాను రక్షించేవాడు శ్రీహరియే! 
సుటేనా తాత్యాచా బిఛానా | యేవవేనా బాబాంచే దర్శనా | 
అనివార దేహాచ్యా యాతనా | సోసవేనా తయాతే | ||౭౯|| 
79. పక్కపైనుంచి తాత్యా లేవలేక పోయాడు. బాబా దర్శనానికి కూడా వెళ్లలేకుండా ఉన్నాడు. అతడు శరీర బాధను భరించలేక పోతున్నాడు. 
ఎక తో నిజవ్యథావ్యథిత | బాబాపాశీ లాగలే చిత్త | 
నాహి చాలవత నా హాలవత | దుఖణేంహీ వాఢత గేలే తే | ||౮౦||
80. విశేషమేమిటంటే, అంతటి యాతనలో ఉన్నా, అతని మనసు బాబాపైనే ఉంది. నడవలేకుండా, కదలలేకుండా ఉన్నాడు. అతని బాధ బాగా పెరిగి పోతూ ఉంది. 

ఇకడే బాబాంచే కణ్హణే కుంథణే | దివసేం దివస వాఢలే ద్విగుణే | 
హా హా మ్హణతా తేంహీ దుఖణే | అనావరపణే హటేనా | ||౮౧|| 
81. ఇక్కడ, బాబా బాధతో మూలగటం రోజు రోజుకూ పెరుగుతూ రెండింతలైంది. చూస్తుండుగా, వారి వ్యాధి నియంత్రించ లేనంతగా పెరిగిపోయింది.
మ్హణతా మ్హణతా జవళ ఆలా | దివస బాబాంనీ జో భాకిత కేలా | 
బాళా శింప్యాస ఘామ సుటలా | తైసాచ పాటిలా రామచంద్రా | ||౮౨|| 
82. తొందరలోనే, బాబా సూచించిన రోజు సమీపించింది. బాలా శింపేకు ముచ్చెమటలు పట్టసాగాయి. అలాగే రామచంద్ర పాటీలుకూ భయం ఆవరించింది. 
మ్హణతీ ‘బాబాంచే ఖరే హోతే | ఏసేంచ ఆతా వాటూ లాగలే | 
బరవే న కీ హే చిన్హ దిసతే | ప్రమాణ వాఢతేంచ దుఖణ్యాచే’ | ||౮౩|| 
83. ‘బాబా చెప్పింది నిజంగానే జరిగేలా ఉంది. మంచి లక్షణాలు ఏవీ కనిపించటం లేదు. వ్యాధి బాగా ముదిరి పోయినట్లుంది’ అని వారిరువురూ అనుకున్నారు. 
ఝాలే ఆలీ శుద్ధ దశమీ | నాడీ వాహూ లాగలీ కమీ | 
 తాత్యా పడలా మరణసంభ్రమీ | ఆప్తేష్ట శ్రమీ జాహలే | ||౮౪|| 
84. శుక్ల పక్షం దశమి రానే వచ్చింది. తాత్యా నాడి కొట్టుకోవడం మెల్లగా తగ్గసాగింది. అతనికి చావు సమీపించిందని భావించి, ఆప్తులు, ఇష్టులు గాభరా పడ సాగారు. 
అసో పుఢే నవల వర్తలే | తాత్యాంచేహీ గండాంతర టళలే | 
తాత్యా రాహిలే బాబాచ గేలే | జణు మోబదలే కేలే కీ | ||౮౫|| 
85. కాని, తరువాత అద్భుతం జరిగింది. తాత్యా గండం తప్పి, బ్రతికి పోయాడు. బాబా వెళ్లిపోయారు. తాత్యాకు బదలుగా, తామే వెళ్లిపోయారు. 
పహా ఆతా బాబాంచీ వాణీ | నాంవ దిధలే తాత్యాచే లావునీ | 
కేలీ తయారీ నిజ ప్రయాణీ | వేళా న చుకవునీ అణుభర | ||౮౬|| 
86. బాబా వాణిని గమనించండి. తాత్యా పేరు చెప్పి, తమ నిర్యాణానికి సన్నాహ పరుచుకున్నారు. క్షణం కూడా అటూ ఇటూ కాకుండ చెప్పిన సమయానికి సరిగ్గా వెళ్లి పోయారు. 
నాహీ మ్హణావే తరీ హీ సూచనా | దేవునీ ఆణిలే భవిష్య నిదర్శనా | 
గోష్ట ఘడేపర్యంతహీ రచనా | దిసలీ న మనా కవణాచే | ||౮౭|| 
87. అందరికీ అర్థమయేలా, వారు భవిష్యాన్ని సూచించారు కూడా. అయినా, అంతా జరిగిపోయే వరకూ ఎవరికీ అది అర్థం కాలేదు. 
జన మ్హణతీ తాత్యాంచే మరణ | నిజ దేహాచా బదలా దేఊన | 
బాబాంనీ ఏసే కేలే నివారణ | తయాంచే విందాన త్యా ఠావే | ||౮౮|| 
88. తాత్యాకు బదలుగా బాబా తమ ప్రాణాన్నిచ్చి, తాత్యాను మృత్యువునుంచి కాపాడారని ప్రజలు అనుకుంటున్నారు. ఏమో! వారి లీల వారికే తెలియాలి. 
బాబాంనీ దేహ ఠేవిల్యారాతీ | అరూణోదయీ సుప్రభాతీ | 
బాబా స్వప్నాంత పంఢరపురాప్రతీ | దృష్టాంత దేతీ గణుదాసా | ||౮౯|| 
89. బాబా శరీరాన్ని వదిలిన రాత్రి, సుప్రభాతాన, అరుణోదయ వేళప్పుడు, పంఢరిపురంలో దాసగణుకు కలలో కనిపించారు. 
“మశీద పడలీ ఢాంసళోనీ | అవఘే శిరడీచే తేలీ వాణీ | 
త్రాసవూని సోడిలే మజలాగునీ | జాతో తేథూని మీ ఆతా | ||౯౦||
90. “మసీదు కూలిపోయింది. శిరిడీలోని నూనె వ్యాపారులందరూ నన్ను బాగా కష్టపెట్టారు. అక్కడినుండి నేను ఇప్పుడు వెళ్లిపోతున్నాను. 

మ్హణోని ఆలో యేథవరీ | ఫులాంహీ మజ ‘బరఖళ’ డబరీ | 
ఇచ్ఛా ఎవఢీ పురీ కరీ | చల ఝడకరీ శిరడీంత” | ||౯౧|| 
91. “అందుకే నేను ఇక్కడి వరకూ వచ్చాను. నన్ను పూలతో బాగా కప్పు. నా ఈ కోరిక తీర్చు. వెంటనే శిరిడీకి పద”. 
ఇతుక్యాంత శిరడీహూన పత్ర జాతా | కళలీ బాబాంచీ సమాధిస్థతా | 
ఏకూని గణుదాస నిఘాలే హీ వార్తా | క్షణ న లాగతా శిరడీస | ||౯౨|| 
92. ఇంతలో శిరిడీనుండి ఉత్తరం అందగా, బాబా సమాధి చెందినట్లు తెలిసింది. ఆ వార్త విని, క్షణం కూడా వృథా చేయకుండా దాసగణు శిరిడీకి బయలుదేరాడు. 
సవే ఘేఊని శిష్య పరివార | యేఊనియా సమాధీ సమోర | 
మాండిలా కీర్తన భజన గజర | అష్టౌప్రహర నామాచా | ||౯౩|| 
93. శిష్య పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చి, సమాధి ఎదుట నిల్చుని జయ జయకారాలతో, రాత్రి పగలు భజన, నామ సంకీర్తన చేశాడు. 
హరినామాచా కుసుమహార | స్వయే గుంఫోని అతి మనోహర | 
ప్రేమే చఢవిలా సమాధీవర | అన్నసంతర్పణ సమవేత | ||౯౪|| 
94. తను స్వయంగా, హరి నామంతో అత్యంత మనోహరంగా అల్లిన పూలహారాన్ని, ప్రేమతో సమాధిపై అలంకరించాడు. అన్న సంతర్పణం కూడా చేశాడు. 
ఏకతా నామాచా గజర అంకుఠ | శిరడీ గమలీ భూవైకుంఠ | 
నామఘోషాచీ భరలీ పేఠ | కరవిలీ లూట గణుదాసీ | ||౯౫|| 
95. ఆ అఖండ నామ ఘోషతో, శిరిడీ భూలోక వైకుంఠమైంది. ఆ నామం ప్రతిధ్వని ఆ ప్రాంతమంతా నిండిపోయేలా, దాసగణు నామాల పుష్పాలను కురిపించాడు. 
దసర్యాచీచ కా బాబాంస ప్రీతి | కీ తో ముహూర్త సాడే తీన ముహూర్తీ | 
శుభకాళ విశేషే ప్రయాణ కృత్యీ | హే తో విశ్రుత సకళాతే | ||౯౬|| 
96. బాబాకు దసరాయందే ప్రీతి ఎందుకు? అంటే, సంవత్సరంలోని మూడున్నర రోజుల ముహూర్తాలలో, ప్రయాణ కార్యాలలో, దసరాను విశేష శుభ సమయంగా భావించటం అందరికీ తెలిసినదే. 
హేంహీ బోలణే నాహీ ప్రమాణ | జయాస నాహీ గమనాగమన | 
తయాంస కోఠూన అసేల నిర్యాణ | ముహూర్త ప్రయోజన కాయ త్యా | ||౯౭|| 
97. అయినా ఇది సరియైనది కాదేమో! రాకపోకలనేవి లేని వారికి నిర్యాణం ఎక్కడుంటుంది? అలాంటి వారికి శుభ ముహూర్తం ఎందుకు? 
జయాన ధర్మాధర్మ బంధన | జాహలే సకల బంధోపశమన | 
జయాచే ప్రాణాస నాహీ ఉత్క్ర మణ | తయాస నిర్యాణ తే కాయ | ||౯౮|| 
98. ధర్మాధర్మ బంధనాలు లేనివారికి, సకల బంధాలూ విడిపోయిన వారికి, ప్రాణం పోవటమనేదే లేనివారికి, నిర్యాణమెక్కడిది? 
‘బ్రహ్మైవ సన్బ్రఉహ్మాప్యేతి’ | ఏశియా సాఈ మహారాజా ప్రతీ | 
నాహీ ఆగతీ అథవా గతీ | నిర్యాణ స్థితీ కైంచీ త్యా | ||౯౯|| 
99. ‘బ్రహ్మైవ సన్‍ బ్రహ్మాప్యేతి’ అన్నట్లు బ్రహ్మ వంటి సాయి మహారాజుకు, రావటం పోవటం లేని బాబాకు, నిర్యాణ మెందుకు? 
అసో ఉత్తర వా దక్షిణాయన | కరణేంచ నాహీ జయా ప్రయాణ | 
ఠాయీంచ సమరసతీ జయాచే ప్రాణ | దీప నిర్వాణ సమకాళే | ||౧౦౦||
100. అసలు పయనమనేదే లేనివారికి, ఉత్తరాయణమైతే ఏం? దక్షిణాయనమైతేనేం? దీపపు జ్యోతి దీపంలోనే మిళితమయేలా, వారు ప్రాణాలను పరబ్రహ్మలో విలీనం చేశారు. 

దేహ తో ఆహే ఉసనవారీ | పంచభూతాంచీ సావకారీ | 
నిజస్వార్థ సాధలియావరీ | పరతణే మాఘారీ జ్యాచా త్యా | ||౧౦౧|| 
101. ఈ శరీరం అప్పుగా తెచ్చుకున్నదే. పంచభూతాలు అప్పుగా ఇచ్చాయి. తమ పని సాధించుకున్న తరువాత, ఎవరివి వారికి తిరిగి ఇచ్చేయాలి కదా!
యా పుఢీల హోణారాచే సూచక | ఆధీంచ బాబాంనీ దావిలే కౌతుక | 
నిఘూన గేలీ వేళ అమోలిక | కీర్తి స్థాఈక రాహిలీ | ||౧౦౨|| 
102. భవిష్యత్తులో జరిగేదానిని బాబా ముందుగానే సూచించారు. ఆ అమూల్యమైన క్షణం (బాబా నిర్యాణం) దాని కీర్తిని శాశ్వతంగా విడిచి వెళ్లిపోయింది. 
జ్వర ఆలియాచే నిమిత్త | లౌకికీ రీతీచా అనుకార కరిత | 
కధీ కుంథత కధీ కణ్హత | సదైవ సావచిత్త అంతరీ | ||౧౦౩|| 
103. జ్వరం రావటం నిమిత్త మాత్రమే. లౌకిక రీతిని అనుసరిస్తూ, ఒకప్పుడు మూలుగుతూనో లేక బాధ పడతూ పైకి కనిపించినా, ఆంతర్యంలో వారు ఎప్పుడూ సావధానంగా ఉండేవారు. 
దివసా అష్ట ఘటకా భరతా | నిర్యాణ కాళ నికట యేతా | 
ఉఠూని బైసలే తే నిజసత్తా | అవికళ చిత్తా మాఝారీ | ||౧౦౪|| 
104. ఆ రోజు ఉదయం సుమారు తొమ్మిది, పది గంటలప్పుడు, నిర్యాణ కాలం సమీపించగా, బాబా తమంతట తాము లేచి నిశ్చలంగా కూర్చున్నారు. 
పాహోని బాబాంచీ తయీ ముద్రా | భరతీ ఆలీ ఆశా సముద్రా | 
కీ తీ భయంకర వేళా అభద్రా | టళలీ సమగ్రా వాటలే | ||౧౦౫|| 
105. ఆ సమయంలో బాబా ముఖాన్ని చూచి, భయంకరమైన అశుభ సమయం దాటి పోయిందని, అందరికీ అనిపించి, ఆశా సముద్రం ఉప్పొంగింది. 
అసో యాపరీ కరీత ఖంత | సర్వ బైసలే తే అసతా సచింత | 
పాతలా బాబాంచా నికట అంత | ఘడలా వృత్తాంత పరిసా తో | ||౧౦౬|| 
106. అందరూ అలా కూర్చుని దుఃఖిస్తుండగా, బాబా అంతిమ సమయం సమీపించింది. అప్పుడు జరిగిన సంగతిని గమనించండి. 
క్షణైక అవకాశ ప్రాణోత్క్ర మణాలా | నకళే కాయ ఆలే మనాలా | 
హస్త కఫనీచే ఖిశాంత ఘాతలా | తీ ధర్మ వేళా జాణోని | ||౧౦౭|| 
107. ప్రాణం పోవటానికి క్షణం ముందు, ఏం తోచిందో గాని తెలియదు. అది దాన ధర్మాలు చేయవలసిన సమయమని తలచి కాబోలు, వారు తమ చేతిని కఫ్నీ జేబులో పెట్టారు. 
లక్ష్మీ నామే సులక్షణీ | నామా సారిఖీ జిచీ కరణీ | 
నిత్య నిరత జీ సాఈ చరణీ | తీ సన్నిధానీ తై హోతీ | ||౧౦౮|| 
108. అప్పుడు సాయి సన్నిధిలో, లక్ష్మీబాయి అనే సుగుణవతి ఉంది. పేరుకు తగినట్లుగా ప్రవర్తిస్తూ, ఎల్లప్పుడూ సాయి చరణాలలో ప్రీతి కలిగి ఉండేది. 
తిజలా కాంహీ ద్రవ్యదాన | బాబా కరీత అతి సావధాన | 
క్షణాంత హోణార దేహావసాన | చుకలే కళూన బాబాంనా | ||౧౦౯|| 
109. క్షణంలో తమ దేహావసానమని తెలిసి, చాలా జాగరూకతతో, బాబా ఆమెకు డబ్బు దానం చేశారు. 
హీచ లక్ష్మీబాఈ శిందే | బాబా పాశీ మశీదీమధ్యే | 
అక్షయీ కామకాజా సంబంధే | నేమ నిర్బంధే వర్తతసే | ||౧౧౦||
110. ఈ లక్ష్మీబాయి శిండేయే మసీదులో, బాబా వద్ద నియమ నిర్బంధనాలను పాటిస్తూ, పనులను చక్కగా నిర్వహిస్తుండేది. 

దివసా నిత్య హే పరిపాఠీ | దరబార ఖులా సర్వాంసాఠీ | 
బహుశః కోణా న ఆడకాఠీ | మర్యాదా మోఠీ రాత్రీచీ | ||౧౧౧|| 
111. ప్రతి రోజూ పగటి పూట, బాబా దర్బారులో ఏ అడ్డూ ఆటంకం లేకుండా, అందరికీ ప్రవేశముండేది. కాని, రాత్రి మాత్రం కఠినమయిన నియమాలు ఉండేవి. 
సాయంకాళచీ ఫెరీ జై సరతే | తేథూని మండళీ ఘరోఘర పరతే | 
తీ జంవ దుసరే దివశీ ఉజాడతే | తేవ్హాంచ యేతే మశీదీ | ||౧౧౨|| 
112. సాయంకాలం బాబా తిరిగి రాగానే, భక్తులు తమ ఇళ్లకు వెళ్లిపోయి, మరునాడు తెల్లవారిన తరువాత మసీదుకు వచ్చేవారు. 
పరీ భగత మ్హాళసాపతీ | దాదా లక్ష్మీ యాంచీ భక్తీ | 
 పాహూని తయాంస రాత్రీచ్యాహీ వక్తీ | మనాఈ నవ్హతీ బాబాంచీ | ||౧౧౩|| 
113. కాని, భక్త మహల్సాపతి, దాదా కేల్కరు, లక్ష్మీబాయిల భక్తి కారణంగా, బాబా రాత్రి పూట కూడా వారికి ఏ విధమైన నిషేధమూ పెట్టలేదు. 
హీచ లక్ష్మీ అతిప్రీతీ | ప్రత్యహీ పాఠవీ బాబాంప్రతీ | 
భాజీ భాకర వేళేవరతీ | సేవా హీ కితీ వానావీ | ||౧౧౪|| 
114. ఈ లక్ష్మీయే ఎంతో ప్రేమగా, ప్రతి రోజూ, బాబాకు సమయానికి సరిగ్గా రొట్టె కూర పంపేది. ఆమె సేవను ఎవరు వర్ణించగలరు? 
యా భాకరీచా ఇతిహాస పరిసతా | కళం సరేల బాబాంచీ దయార్ద్ర తా | 
శ్వానసూకరీ బాబాంచీ ఏక్యతా | ఆశ్చర్య చిత్తా హోఈల | ||౧౧౫|| 
115. ఈ రొట్టె కథను గమనిస్తే, బాబాయొక్క దయార్ద్ర హృదయం మరియు కుక్కలు, పందులతో వారి ఆత్మైక భావం తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. 
బాబా ఎకదా సాయంకాళీ | భింతీస టేకూన వక్షఃస్థళీ | 
వార్తా చాలతా ప్రేమసమేళీ | లక్ష్మీ ఆలీ తే స్థానీ | ||౧౧౬|| 
116. ఒక సారి, బాబా తమ ఛాతిని గోడకు ఆన్చి ప్రేమగా ముచ్చటిస్తుండగా, లక్ష్మీ అక్కడికి వచ్చింది. 
తాత్యా పాటీల జవళ హోతే | ఆణీక వరకడ అసతా తేథే | 
లక్ష్మీనే అభివందిలే బాబాంతే | బాబా తియేతే తంవ వదతీ | ||౧౧౭|| 
117. తాత్యా పాటీలు మరి ఇతరులు కూడా దగ్గరే ఉన్నారు. రాగానే, బాబా పాదాలకు లక్ష్మీ వందనం చేసింది. బాబా అప్పుడు ఆమెతో, 
“లక్ష్మీ లాగలీసే భూక మాతే” | ‘బాబా మీ భాకర ఘేఊని యేతే’ | 
నిఘాలే హీ ఆతా ఆణితే | ఏసీచ జాతే మాఘారా | ||౧౧౮|| 
118. “లక్ష్మీ! నాకు ఆకలిగా ఉంది” అని చెప్పారు. ‘బాబా! ఇప్పుడే వెళ్లి మీకోసం రొట్టె తీసుకుని వస్తాను’. 
ఏసే మ్హణూని నిఘూని గేలీ | భాకర్యా భాజూని ఘేఊని పరతలీ | 
కోరడ్యాసమవేత4 అవిలంబే ఆలీ | సన్ముఖ ఠేవిలీ తీ న్యాహారీ | ||౧౧౯|| 
119. అని చెప్పి, వెంటనే వెళ్లి రొట్టె చేసి, కూర పచ్చడితో సహ తీసుకుని వచ్చి, ఆ అల్పాహారాన్ని బాబా ఎదుట ఉంచింది. 
బాబాంనీ తే పాన ఉచలిలే | కుత్ర్యాసమోర తైసేంచ మాండిలే | 
‘బాబా హే కాయ ఆపణ కేలే’ | లక్ష్మీనే పుసిలే తాత్కాళ | ||౧౨౦||
120. బాబా ఆ విస్తరిని తీసి అక్కడున్న కుక్క ఎదుట ఉంచారు. వెంటనే లక్ష్మీ, ‘బాబా! మీరిలా చేశారేమిటి?’ అని అడిగింది. 

మీ జీ ఇతుకీ గేలే సత్వరీ | హాతోహాతీ భాజిల్యా భాకరీ | 
తయాంచీ హీ కాయ నవలపరీ | శ్వానాచీ ఖరీ ధన కేలీ | ||౧౨౧|| 
121. ‘ఇంత త్వరగా నేను వెళ్లి, రొట్టె కూరను చేసి తెస్తే, దాని ఫలితం ఇంతేనా? కుక్కను బాగా సంతృప్తి పరచావు!
లాగలీ హోతీ తుమ్హాంస భూక | త్యా భుకేచే హే కాయ కౌతుక | 
వదనీ సూదిలా5 న ఎకహీ కుటక6 | లావిలీ చుటక ఉగా మజజ’ | ||౧౨౨|| 
122. ‘నీకు ఆకలిగా ఉంది కదా, ఆకలి తీర్చుకోవటం ఇలాగేనా? ఒక్క ముక్కైనా నోట్లో వేసుకోలేదు. అనవసరంగా నేను తొందర పడ్డాను’. 
మగ బాబా తియేస వదతీ | “వ్యర్థ కశాచీ కరితేస ఖంతీ | 
యా కుత్ర్యాచీ జే ఉదరపూర్తీ | మాఝీచ తృప్తి తీ జాణ | ||౧౨౩|| 
123. అప్పుడు బాబా ఆమెతో, “వృథాగా ఎందుకు బాధ పడతావు? ఈ కుక్క తృప్తి పడితే, నేను తృప్తి చెందినట్లే అని తెలుసుకో” అని అన్నారు. 
యా స్వానాచా జీవ నాహీ కా | ప్రాణిమాత్రాచ్యా ఎకచ భుకా | 
జరీ తో ముకా ఆణి మీ బోలకా | భేద అసే కా భుకేంత | ||౧౨౪|| 
124. “ఈ కుక్కకు ప్రాణం లేదా? ప్రాణులన్నింటికీ ఆకలి ఒక్కటే. అది మూగది, నేను మాట్లాడగలను అంతే కాని, ఆకలిలో భేదం ఉంటుందా? 
క్షుధేనే వ్యాకూళ జయాచే ప్రాణ | తయాంస దేతీ జే అన్నావదాన | 
మాఝియా ముఖీంచ తే సూదిలే జాణ | సర్వత్ర ప్రమాణ మానీ హే” | ||౧౨౫|| 
125. “ఆకలితో ప్రాణం విలవిలలాడుతూ బాధ పడేవారికి, అన్నం పెడితే, అది నా నోటికి అందించినట్లే అని తెలుసుకో! ఇది అన్ని చోట్లా నిజం”. 
ప్రసంగ సోపా వ్యవహారాచా | బోధ అవఘా పరమార్థాచా | 
ఏసీ ఉపదేశపర సాఈచీ వాచా | ప్రేమరసాచా పరిపాక | ||౧౨౬|| 
126. ఇలాంటి సందర్భం, రోజూ జరిగేదే అయినా, బోధ మాత్రం అంతా పరమార్థం. సాయియొక్క ఉపదేశ వచనాలు ఇలా ప్రేమరసంతో నిండి పరిపక్వంగా ఉంటాయి. 
బోలూన సోపీ ప్రపంచ భాషా | ఆంఖీత పరమార్థ రూపరేషా | 
న కాఢితా కోణాచ్యా వర్మా దోషా | శిష్య సంతోషా రాఖీత | ||౧౨౭|| 
127. సులభమైన వ్యావహారిక భాషలో చెప్పినా, పరమార్థ రూపురేఖలను చిత్రిస్తారు. ఎవరినీ దూషించక, ఎవరి దోషాలనూ చూపకుండా, భక్తులను సంతోష పరుస్తారు. 
తేథూనియా ఉపదేశానుసార | సురూ ఝాలీ లక్ష్మీచీ భాకర | 
కరూన ఠేవీ దుగ్ధాంత కుస్కర | ప్రేమ పురస్సర ప్రత్యహీ | ||౧౨౮|| 
128. వారి ఉపదేశానుసారం, ప్రతిరోజూ లక్ష్మి రొట్టె ముక్కలను పాలలో వేసి, ప్రేమ పూర్వకంగా తెచ్చి పెట్ట సాగింది. 
పుఢే బాబాహీ భక్తిప్రేమే | భాకర తీ ఖాఊ లాగలే నియమే | 
వేళీ హోతా విలంబ న కరమే | జేవణ న గమే బాబాంస | ||౧౨౯|| 
129. అప్పటినుండి, నియమానుసారంగా బాబా కూడా ఆమె ఇచ్చిన రొట్టెను ప్రేమతో తినేవారు. ఎప్పుడైనా ఆలస్యమైతే, బాబాకు ఆ భోజనం రుచించేది కాదు. 
హోతా లక్ష్మీచ్యా భాకరీస వేళ | జరీ పాత్రే తై వాఢిలీ సకళ | 
జేవావయాచా టళేనా కాళ | ముఖీ న కవళ ఘాలీత | ||౧౩౦||
130. లక్ష్మీ రొట్టె తేవడం ఆలస్యమైనప్పుడు, పళ్లెంలో అన్నం వడ్డించి ఉన్నా, భోజన సమయం దాటిపోయినా, లక్ష్మీ రొట్టె తెచ్చేవరకూ, బాబా నోట్లో ముద్ద పెట్టుకునే వారు కాదు. 

నివూన జాఈల పాత్రీచే అన్న | భుకేనే బసతీల ఖోళంబూన | 
పరీ లక్ష్మీచీ భాకర ఆలియావీణ | అన్న సేవన హోఈనా | ||౧౩౧|| 
131. పళ్లెంలోని అన్నం చల్లబడి పోయినా, అందరూ ఆకలితో అలమటించిపోతూ కూర్చోవటమే కాని, లక్ష్మీ రొట్టె తెచ్చేవరకూ, భోజనం చేసేవారు కాదు. 
పుఢే కాంహీ దివస వరీ | బాబాంనీ ప్రత్యహీ తిసరే ప్రహరీ | 
శేవయా మాగవావ్యా లక్ష్మీచ్యా కరీ | సేవావ్యా శేజారీ బైసూన | ||౧౩౨|| 
132. తరువాత, కొంత కాలం వరకూ, ప్రతిరోజూ మధ్యాహ్నం మూడునుంచి మూడున్నర గంటల వేళప్పుడు, బాబా లక్ష్మీతో ‘సేమ్యా’ను తెప్పించుకుని, ఆమె వద్ద కూర్చుని సేవించేవారు. 
బాబా సేవిత అతి పరిమిత | శేష రాధాకృష్ణేస దేత | 
యాచ లక్ష్మీచే హస్తే దేవవిత | ఉచ్ఛిష్టప్రీత బహు తిజలా | ||౧౩౩|| 
133. బాబా అతి పరిమితంగా సేవించి, మిగిలిన దానిని, రాధాకృష్ణబాయికి లక్ష్మీ ద్వారానే పంపించేవారు. రాధాకృష్ణబాయి బాబా ఉచ్ఛిష్ట ప్రసాదాన్ని ప్రీతిగా కోరుకుని సేవించేది. 
అసతా చాలలీ దేహవిసర్జన వార్తా | హీ భాకరీచీ భాకడకథా | 
కిమర్థ ఏసే న మ్హణీజే శ్రోతా | సాఈ వ్యాపకతా నిదర్శక హే | ||౧౩౪|| 
134. శ్రోతలారా! సాయియొక్క శరీర విసర్జన వృత్తాంతాన్ని చెబుతూ, సంబంధం లేని ఈ రొట్టె కథ ఎందుకు అని అనుకోకండి. ఇది సాయియొక్క సర్వ వ్యాపకత్వాన్ని తెలియ చేస్తుంది. 
హే సకల దృశ్య చరాచర | యాచ్యాహీ పైల పరాత్పర | 
సాఈ భరలాసే నిరంతర | జో అజ అమర తో సాఈ | ||౧౩౫|| 
135. సకల చరాచర దృశ్యాలకు అతీతంగా, పరాత్పరులైన ఈ సాయి, ఎప్పుడూ అంతటా నిండి ఉన్నారు. వారికి జననం లేదు. వారు అమరులు. 
హే ఎక తత్వ యా కథేచ్యా పోటీ | ఏసీహీ గోడ లక్ష్మీచీ గోఠీ | 
సహజ స్మరలీ ఉఠాఉఠీ | శ్రోతయాంసాఠీంచ మీ మానే | ||౧౩౬|| 
136. ఈ ఒక్క తత్వాన్ని తెలియ చేయటమే ఈ కథయొక్క ఉద్దేశం. లక్ష్మికి సంబంధించిన ఈ మధురమైన సంగతి, సహజంగా నాకు గుర్తుకు వచ్చింది, శ్రోతల మంచి కోసమే అని నేను భావిస్తాను. 
అసో ఏసీ లక్ష్మీచీ సేవా | కైసా విసర సాఈస వ్హావా | 
సావధానాచా కాయ నవలావా | వృత్తాంత పరిసావా సాదరతా | ||౧౩౭|| 
137. ఇటువంటి లక్ష్మీయొక్క సేవను, బాబా ఎప్పుడైనా ఎలా మరచిపోగలరు? వారు ఎంత బాగా గుర్తుంచుకున్నారో ఆ విషయాన్ని శ్రద్ధగా వినండి. 
జరీ ఆలా కంఠీ ప్రాణ | శరీర విగళిత నాహీ త్రాణ | 
బాబా నిజహస్తే కరితీ దాన | దేహావసాన సమయీ తిస | ||౧౩౮|| 
138. ప్రాణం కంఠం వరకూ వచ్చినా, శరీరం చిక్కి నీరసించిపోయినా, తమ అవసాన సమయంలో, బాబా తమ చేతులతో, లక్ష్మీకి దానం చేశారు. 
ఎకదా పాంచ ఎకదా చార | రుపయే ఖిశాంతూన కాఢూని బాహేర | 
ఠేవీత తియేచే హాతాంవర | తీచ కీ అఖేర బాబాంచీ | ||౧౩౯|| 
139. ఒక మారు అయిదు, మరొక మారు నాలుగు రూపాయలను జేబులోనుండి బయటికి తీసి, ఆమె చేతిలో ఉంచారు. బాబా చేసిన చివరి దానం ఇదే. 
కీ హీ నవవిధా భక్తీచీ ఖూణ | కింవా నవరాత్ర అంబికా పూజన | 
ఝాలే ఆజ ఆహే శిలింగణ | సీమోల్లంఘన దక్షిణాహీ | ||౧౪౦||
140. ఇది నవ విధి భక్తికి సంకేతమా? లేక దుర్గానవరాత్రి పూజలయాక సీమోల్లంఘన రోజున ఇచ్చే దక్షిణా ఇది? 

కింవా శ్రీమద్భాగవతీ | శ్రీకృష్ణే కథిలీ ఉద్ధవాప్రతీ | 
తీ నవలక్షణ శిష్యస్థితి | తియేచీ స్మృతీ దేత బాబా | ||౧౪౧|| 
141. లేక, శ్రీమద్భాగవతంలో ఉద్ధవునితో శ్రీకృష్ణుడు చెప్పిన శిష్యుల నవలక్షణాలను బాబా గుర్తుకు తెచ్చారా?
ఎకాదశాచ్యా దశమాధ్యాయీ | షష్ఠమ శ్లోకాచీ పహా నవలాఈ | 
శిష్యే కైసీ కరావీ కమాఈ | కవణ్యా ఉపాయీ వర్తావే | ||౧౪౨|| 
142. పదకొండవ స్కందంలో, పదవ అధ్యాయంలో, ఆరవ శ్లోకం యొక్క విశేషాన్ని గమనించండి. గురువుల అనుగ్రహాన్ని పొందటానికి, శిష్యులు ఎలా ప్రవర్తించాలో చెప్పబడి ఉంది. 
ఆధీ పూర్వార్ధీ కథిలీ పాంచ | ఉత్తరార్ధీ చారచి సాచ | 
బాబాహీ ధరితీ క్రమ అసాచ | వాటే జణూ హాచ హేతు పోటీ | ||౧౪౩|| 
143. అందులో, మొదటి సగంలో అయిదు, తరువాతి సగంలో నాలుగు, లక్షణాలను చెప్పబడింది. బాబా కూడా అదే క్రమంలో, అదే ఉద్దేశంతో ఇచ్చినట్లు అనిపిస్తుంది. 
అమానీ దక్ష నిర్మత్సర | శిష్య నిర్మమ గురుసేవాపర | 
అసావా పరమార్థ జిజ్ఞాసాతత్పర | నిశ్చల అంతర జయాచే | ||౧౪౪|| 
144. గౌరవ మర్యాదలను ఆశించనివాడుగా, గర్వం లేనివాడుగా, ఏ మమకారం లేక గురు సేవాపరుడు, నిశ్చలమైన మనసు కలవాడుగా, పరమార్థం గురించి తెలుసుకోవాలనే కోరిక గల శిష్యుడు ఉండాలి. 
జయా ఠావీ నాహీ అసూయా | వాచా విగ్లాపన కరీ న వాయా | 
ఇహీ లక్షణీ నిజగురురాయా | సంతోషవాయా ఝటావే | ||౧౪౫|| 
145. అసూయ, అనవసరంగా గొప్పలు చెప్పుకోవడం, అనేవి లేకుండా ఉండాలి. ఈ లక్షణాలతో తన గురువును సంతుష్ట పరచాలి. 
హాచ శ్రీసాఈనాథాచా హేత | ఏసియా రూపీ వ్యక్త కరీత | 
కేవళ స్వకీయ భక్త హితార్థ | కరూణావంత సంత సదా | ||౧౪౬|| 
146. ఇదే శ్రీసాయినాథుల ఉద్దేశం. ఇదే విధంగా తెలియచేశారు. కరుణామయులైన సత్పురుషులు ఎప్పుడూ భక్తుల శ్రేయస్సను మాత్రమే కోరుతారు. 
లక్ష్మీ ఖాఊన పిఊన సధన | నవాంచీ కథా కాయ తిజలాగూన | 
తీహీ తితుకే టాకీల ఓవాళూన | తథాపి తే దాన అపూర్వతిస | ||౧౪౭|| 
147. లక్ష్మీ నిజంగా, బాగా ఉన్న ధనవంతురాలు. ఈ తొమ్మిది రూపాయలు ఆమెకు ఒక లెక్కా? తలుచుకుంటే, వానిని ఆమె దిగతుడిచి పారేయగలదు. కాని, ఇది ఆమెకు లభించిన అపూర్వమైన కానుక. 
పరమథోర భాగ్యే ఆగళీ | తేణేంచ ఏశియా కృపేచీ నవాళీ | 
పావతీ ఝాలీ నవరత్నావలీ | నిజకర కమళీ సాఈచ్యా | ||౧౪౮|| 
148. ఎంతో భాగ్యం కారణంగా, సాయి కృపా ప్రసాదమైన ఇలాంటి నవరత్నావళిని, సాయియొక్క కరకమలం ద్వారా ఆమె పొందగలిగింది. 
గేలే జాతీల కితీ సే నవ | పరీ హే దాన అతి అభినవ | 
కీ జో తిచా జీవాంత జీవ | దేఈల కా ఆఠవ సాఈచీ | ||౧౪౯|| 
149. ఇంతవరకు ఇలాంటి ఎన్నెన్నో తొమ్మిది రూపాయలు ఖర్చు చేసి ఉంటుంది. కాని ఈ కానుక అత్యంత అపూర్వం. ఆమె జీవించి ఉన్నంత వరకూ, ఆమెకు సాయి స్మరణను గుర్తు చేస్తూ ఉంటుంది. 
ఆలే సన్నిధ దేహావసాన | తరీహీ రాఖూన అనుసంధాన | 
చారాపాంచాచీ సాంగడ ఘాలూన | ఆమరణ స్మరణ దిధలే తిస | ||౧౫౦||
150. శరీరావసానం సమీపిస్తున్నా, లక్ష్మీని బాగా గుర్తుంచుకొని, ఆమెకు నాలుగు మరియు అయిదు రూపాయలను ఇచ్చి, జీవితాంతం ఆమె వారిని స్మరించుకునేలా చేశారు సాయి. 

ఏసే దావోని సావధపణా | నికటవర్తీ పాఠవిలే భోజనా | 
మాత్ర గ్రామస్థాంతీల ఎకా దోఘానా | బైసవితానా దేఖిలే | ||౧౫౧|| 
151. ఎంతో జాగరూకతతో, తమ దగ్గరవారిని అందరినీ భోజనానికి పంపించి, ఒకరిద్దరు ఊరివారిని మాత్రం కూర్చుండనిచ్చారు. 
పరీ కాంహీ ప్రేమళ భక్తాంనీ | హట్టచి ధరిలా కిత్యేకాంనీ | 
జాఊ నయే బాబాంపాసూని | వేళ తీ కఠిణ మానునీ | ||౧౫౨|| 
152. ఆ క్లిష్ట సమయంలో బాబా వద్దనుండి వెళ్లకూడదని, కొంత మంది భక్తులు ప్రేమతో, వారి వద్దనుండి వెళ్లమని మొండికెత్తారు. 
పరీ ప్రసంగీ అంతసమయీ | పడేనా కాయ మోహాచే అపాయీ | 
మ్హణోనియా జణూ ఘాఈ ఘాఈ | అవఘియాంహీ దవడిలే | ||౧౫౩|| 
153. కాని, అంతిమ సమయంలో ఎవరి మోహంలోనైనా పడే అపాయానికి భయపడి, బాబా వారినందరినీ త్వరత్వరగా తరిమి వేశారు. 
నిర్యాణ సమయ నికట అతి | జోణోని బుట్టీ కాకాదికాంప్రతీ | 
బాబా “వాడియాంత జా జా” మ్హణతీ | “భోజనాంతీ మగ యావే” | ||౧౫౪|| 
154. తమ నిర్వాణం సమీపించిందని తెలుసుకొని, బాబా బాపూసాహేబు బుట్టీకి, కాకాకు, మిగతావారికి, “వాడాకు వెళ్లండి, భోజనం చేసి రండి” అని చెప్పారు. 
పాహోని ఇతరాంచీ హీ వ్యగ్రతా | బాబా దుశ్చిత నిజ చిత్తా | 
“జా జా జేవూని యా జా ఆతా” | ఏసే సమస్తా7 ఆజ్ఞాపితీ | ||౧౫౫|| 
155. భక్తుల దుఃఖాన్ని చూచి, బాబా మనసు విచలితమైంది. అందుచేత, “వెళ్లండి, వెళ్లండి. భోజనం చేసి రండి” అని అందరినీ ఆజ్ఞాపించారు. 
ఏసే హే నిత్యాచే సాంగతీ | సఖే అహర్నిశ నికటవర్తీ | 
జరీ మనాచీ దుశ్చిత్తవృత్తి | ఆజ్ఞేనే ఉఠతీ జావయా | ||౧౫౬|| 
156. రాత్రింబవళ్ళూ వారి దగ్గరే ఉంటూ, ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉండేవారు, మనసు బాధ పడుతున్నా, బాబా ఆజ్ఞానుసారం లేచారు. 
ఆజ్ఞా తరీ నుల్లంఘవే | వేళీ సాన్నిధ్యహీ న త్యాగవే | 
బాబాంచే మనహీ న మోడవే | గేలే వాడియా భోజనా | ||౧౫౭|| 
157. వారి ఆజ్ఞను ఉల్లంఘించలేరు. ఆ సమయంలో వారి సాన్నిధ్యాన్నీ వదలలేరు. బాబా మనసును బాధపెట్ట లేక, వారు వాడాకు భోజనానికి వెళ్లారు. 
భయంకర దుఖణ్యాచే ప్రమాణ | కైచే జేవణ కైచే ఖాణ | 
బాబాంపాశీ గుంతలే ప్రాణ | విస్మరణ క్షణ సాహేనా | ||౧౫౮|| 
158. బాబా బాధ భయంకరంగా అధికమౌతూ ఉంటే, ఎక్కడి భోజనం, ఎక్కడ తినటం? వారి ప్రాణాలన్నీ బాబా వద్దనే చిక్కుకు పోయినవి. ఒక్క క్షణమైనా వారు బాబాయొక్క విస్మరణను సహించలేక పోయారు. 
అసో జాఊన జేవూ బైసలే | ఇతక్యాంత మాగూన బోలావూ ఆలే | 
అర్ధపోటీంచ ధావత ఆలే | తంవ తే అంతరలే భేటీలా | ||౧౫౯|| 
159. అయినా, వెళ్లి వారు భోజనానికి కూర్చున్నారు. ఇంతలో, వెంటనే పిలుపు వచ్చింది. అరగడుపుతోనే పరుగు పరుగున వచ్చారు. కాని, వారు చివరి సారిగా బాబాను కలుసుకోలేక పోయారు. 
ఆయుర్దాయ8 స్నేహ సరతా | ప్రాణజ్యోతీ మంద హోతా | 
బయాజీచే9 అంకావరతా | దేహ విశ్రామతా10 పావలా | ||౧౬౦||
160. ఆయుర్దాయ తైలం ముగిసి పోయింది. ప్రాణజ్యోతి మందగించింది. బయాజీ కోతే ఒడిలో, బాబా శరీరం శాశ్వతంగా విశ్రమించింది. 

నాహీ పడూన వా నిజూన | స్వస్థపణే గాదీసీ బైసూన | 
ఏసా స్వహస్తే ధర్మ కరూన | కేలే విసర్జన దేహాచే | ||౧౬౧|| 
161. నేలపై పడిపోయిగాని, లేదా నిదురలోగాని కాక, చక్కగా గద్దెపై కూర్చుని స్వహస్తాలతో దానం చేస్తూ, వారు శరీరాన్ని విసర్జించారు.
సమర్థీంచే మనోగత | న హోతా కోణాసహీ అవగత | 
దేహ విసర్జిలా హాతోహాత | బ్రహ్మీభూత జాహలే | ||౧౬౨|| 
162. సమర్థుల మనసులో ఏముందో ఎవరికీ తెలిసేది కాదు. శరీరాన్ని విడిచిన తక్షణం, వారు బ్రహ్మంలో లీనమయ్యారు. 
ఘేఊని దేహ మాయేచీ బుంథీ | సంత సృష్టీ మాజీ అవతరతీ | 
హోతా ఉద్ధార కార్యపూర్తీ | తాత్కాళ సమరసతీ అవ్యక్తీ | ||౧౬౩|| 
163. మాయయొక్క శక్తివలన శరీరాన్ని ధరించి, సంతులు సృష్టిలో అవతరిస్తారు. ఉద్ధరణ కార్యం పూర్తి అయిన వెంటనే, వారు కనుమరుగై పోతారు. 
నట ధరితో వేష నానా | అంతరీ పూర్ణ జాణే ఆపణా | 
తయా అవతారియా పరిపూర్ణా | సాంకడే మరణాచే తే కాయ ||౧౬౪|| 
164. నటులు ఎన్నో రకాల పాత్రలను ధరించినా, తమ వ్యక్తిత్వాన్ని తాము పూర్తిగా గుర్తుంచుకుంటారు. అలాగే, పరిపూర్ణంగా అవతరించిన వారికి, చావు ఒక పెద్ద సమస్యా? 
లోక సంగ్రహార్థ జో అవతరలా | కార్య సంపతా అవతార సంపవిలా | 
తో కాయ జన్మమరణాచా అంకిలా | విగ్రహ స్వలీలా ధరితో జో | ||౧౬౫|| 
165. లోక కల్యాణానికి అవతరించిన వారి అవతారం, వారి కార్యం పూర్తి కాగానే, సమాప్తమౌతుంది. స్వంత ఇచ్ఛానుసారం రూపాన్ని ధరించినవారు, చావు పుట్టుకలకు కట్టుబడి ఉంటారా? 
పరబ్రహ్మ జ్యాచే వైభవ | తయా కైంచా నిధనసంభవ | 
నిర్మమత్వ జయాచా అనుభవ | కైచా భవాభవ త్యా బాధీ | ||౧౬౬|| 
166. పరబ్రహ్మమే ఎవరి వైభవమో, వారికి మరణమెలా సంభవం? మమకారమనేదే లేని వారిని, చావు పుట్టుకలు ఎలా బాధించగలవు? 
దిసలా జరీ కర్మీ ప్రవృత్త | కధీ న కర్మే కేలీ యత్కించిత | 
సదా కర్మీ అకర్మ దేఖత | అహంకార రహితత్వే | ||౧౬౭|| 
167. కర్మ చేస్తున్నట్లు చూపించినా, వారు ఎప్పుడూ కర్మనుంచి ముక్తిని పొందినవారే. అహంకారం లేకుండా, వారు ఎప్పుడూ కర్మలలో అకర్మనే చూసేవారు. 
“నాభుక్తం క్షీయతే కర్మ” | హే తో స్మృత్యుక్త కర్మాచే వర్మ | 
పరీ బ్రహ్మజ్ఞాత్యాచా న సంభ్రమ | దేఖే జో బ్రహ్మచి వస్తుమాత్రీ | ||౧౬౮|| 
168. ‘నా భుక్తం క్షీయతే కర్మ’ (అనుభవించకుండా కర్మఫలం తగ్గదు) అంటే అనుభవించనిదే కర్మ ఎవరినీ వదలదు. ఇది స్మృతిలో చెప్పిన కర్మ రహస్యం. కాని, బ్రహ్మతో ఐక్యత్వం పొందినవారు, అంతటా, అన్నింటిలోనూ బ్రహ్మనే చూస్తారు గనుక, ఏ భ్రమలోనూ ఉండరు. 
క్రియాకారక ఫలజాత | హే తో అవఘే ప్రసిద్ధ ద్వైత | 
తేంహీ బ్రహ్మవిద బ్రహ్మచి మానిత | జేవీ కా రజత శుక్తికే వరీ | ||౧౬౯|| 
169. చేసిన అన్ని కర్మల పరిణామమే కర్మఫల సముదాయం. దీనిలోని ద్వైత భేదం అంతటా ప్రసిద్ధం. ముత్యపు చిప్పపై వెండిని చూచేలా, బ్రహ్మజ్ఞానులు కర్మను కూడా బ్రహ్మగా చూస్తారు. 
బాబా సారఖీ మాయాళూ జననీ | పడలీ కైసీ కాళాచే వదనీ | 
దివసా గ్రాసీ అంధారీ రజనీ | తైసీచ హీ కాహాణీ ఝాలీ కీ | ||౧౭౦||
170. బాబావంటి కరుణాళువైన మాత, కాలుని నోటిలో ఎలా పడింది? పగటి దినాన్ని, చీకటి రాత్రి మ్రింగి వేసినట్లుగా ఈ కథ జరిగింది. 

ఆతా హా అధ్యాయ సంపవూ యేథే | రాఖూ మాసిక మర్యాదేతే | 
అతి విస్తారే దుశ్చిత్తతేతే | నా తరీ శ్రోతే పావతీల | ||౧౭౧|| 
171. ప్రతి నెలలోని నియమాన్ని పాటించి, ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడే సమాప్తి చేద్దాం. ఇంకా విస్తారమైతే, శ్రోతలు విసుగు చెందుతారు. 
పుఢీల అవశేష నిర్యాణ కథా | యేఈల యథాక్రమ పుఢే పరిసతా | 
శరణ హేమాడ సాఈసమర్థా | పావలా కృతార్థా యత్కృపే | ||౧౭౨||
172. నిర్యాణంలోని మిగతా కథను, తరువాత క్రమంగా శ్రవణం చేయగలరు. హేమాడు సాయి సమర్థుని శరణుజొచ్చి, వారి కృపతో కృతార్థుడయ్యాడు. 


| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | శ్రీసాఈనాథనిర్యాణం నామ | 
| ద్వి చత్వారింశోధ్యాయః సంపూర్ణః |

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. జ్వాళాంచా. 2. ఎక దివసాఆడ. 3. తాత్యా గణపత పాటీల కోతే. 
4. భాజీ, చటణీ వగైరే సహిత. 5. ఘాతలా. 6. తుకడా. 
7. శ్రీమంత బాపూసాహేబ బుట్టీ, కాకా దీక్షిత ఇత్యాదీ భక్తాంస. 
8. తేల. 9. బయాజీ అప్పా కోతే. 10. విశ్రాంతీ. 

No comments:

Post a Comment