Thursday, October 31, 2013

||శ్రీ సాఈనాథ నిర్యాణం నామ త్రిచత్వారింశోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౩ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

పూర్వాధ్యాయీ ఝాలే నిరూపణ | సంత సాఈ సమర్థ నిర్యాణ | 
ఆతా జే అవశేష అపూర్ణ | హోఈల కీ సంపూర్ణ యే ఠాయీ | ||౧|| 
1. గతాధ్యాయంలో సత్పురుషులైన సాయి సమర్థుల నిర్వాణ వర్ణన జరిగింది. అసంపూర్తిగా మిగిలి పోయిన మిగతా విషయాలను ఇప్పుడు ఇక్కడ పూర్తి చేస్తాను.
సాఈలాగీ ప్రేమ అద్భుత | తేహీ ఉపజవీ తోచ సమర్థ | 
హేమాడ తయాచే చరణీ నిరత | రేఖాటిత కీ తచ్చరిత | ||౨|| 
2. సాయియందు అద్భుతమైన ప్రేమ ఉండాలి. దానిని వారే ఉత్పన్నం చేయగల సమర్థులు. హేమాడు వారి చరణాలకు అంకితమై, వారి చరిత్రని రచిస్తున్నాడు. 
తోచ దేఈ భక్తిప్రేమా | తోచి వాఢవీ చరిత్ర మహిమా | 
తేణేంచ గౌరవ భజన ధర్మా | యేఈ ఉపరమా సంసార | ||౩|| 
3. భక్తి ప్రేమలను వారే ఇచ్చి, తమ చరిత్ర మహిమను తామే తెలియజేస్తారు. దానితో వారి ఆరాధనలో శ్రద్ధ కలిగి, ప్రపంచమందు విరక్తి కలుగుతుంది. 
మ్హణోని కాయా వాచా మనే | తయా మాఝీ సహస్త్రాంత నమనే | 
చింతవే న త్యాచా మహిమా చింతనే | కేవళ అనన్యే శరణ రిఘే | ||౪|| 
4. అందుకే, దేహంతో, మాటతో, మనసుతో, వారికి నా సహస్ర నమస్కారాలు. వారికి అనన్య శరణుజొచ్చితే తప్ప, కేవలం వారి మహిమను మనసులో ధ్యానిస్తే, వారిని తెలుసుకోలేం. 
సాంచలా పాపాచా మళ | తో ధుఊని కాఢావయా సకళ | 
కరావయా అంతర నిర్మళ | ఇతర నిష్ఫళ సాధన | ||౫|| 
5. పేరుకుని పోయిన పాపాల మాలిన్యాలను కడిగి, మనసును నిర్మలం చేసుకోవటానికి, ఇతర సాధనలు పనికి రావు. 
కరణే హరిభక్త యశస్మరణ | తయాంచే భజన అథవా కీర్తన | 
త్యావిణ చిత్తశుద్ధీసీ సాధన | సోపే న ఆన శోధితా | ||౬|| 
6. హరిభక్తుల యశస్సును తలచుకోవటం, మరియు వారి భజన సంకీర్తనలు తప్ప, మనసును శుద్ధి చేసే, వేరే సులభ సాధనలు, ఎంత వెదికినా దొరకదు. 
అసో గతకథానుసంధాన | కరూ సంకలిత పర్యాలోచన | 
సాఈ నిజానందావస్థాన | చాలవూ వ్యాఖ్యాన పుఢారా | ||౭|| 
7. గత కథానుసంధానాన్ని స్మరించుకుని, ఆత్మానందానికి నిలయమైన సాయియొక్క కథ వ్యాఖ్యానాన్ని మరల కొనసాగిస్తాను. 
మాగా సాద్యంత జాహలే కథన | విజయాదశమీసచి కా ప్రయాణ | 
తాత్యాబామిషే భవిష్య నివేదన | ఆధీంచ కైసోని జాహలే | ||౮|| 
8. వారి ప్రయాణం విజయదశమి రోజే ఎందుకు, తాత్యాబా నెపంతో భవిష్యాన్ని ముందుగానే ఎలా సూచించారు అన్న సంగతులు విపులంగా చెప్పబడ్డాయి. 
పుఢే హోతా దేహావసాన | రాఖూనియా ధర్మావధాన | 
కైసే లక్ష్మీస కేలే దాన | జాహలే నిరూపణ సమగ్ర | ||౯|| 
9. తరువాత, దేహావసాన సమయంలో దాన ధర్మాల పద్ధతి ప్రకారం, బాబా లక్ష్మీకి చేసిన దానం సంగతి కూడా పూర్తిగా వర్ణించడమైనది. 
ఆతా యే అధ్యాయీ కథన | కైసే నికట యేతీ నిధన | 
సాఈ కరీత రామాయణ శ్రవణ | హితార్థ బ్రాహ్మణ ముఖానే | ||౧౦||
10. ఇప్పుడు ఈ అధ్యాయంలో, తమ శ్రేయస్సుకై, బ్రాహ్మణుని ద్వారా సాయి, రామాయణ పారాయణాన్ని చేయించి, వినిన విషయం చెప్పబడుతుంది. 

కైసే సమాధిస్థాన నియోజన | కైసే అలక్షిత ఇష్టకాపతన1
కైసే సమాధిస్థాన నియోజన | దత్తావధాన పరిసావే | ||౧౧|| 
11. తమ సమాధిస్థానాన్ని వారు ఎలా ఎన్నుకున్నారు, ఎలా అకస్మాత్తుగా వారికిష్టమైన ఇటుక పడిపోవటం, మొదలగు వానిని శ్రద్ధగా వినండి. 
తైసేంచ ఎకదా బ్రహ్మాండీ ప్రాణ | చఢవూని బైసతా తీన దిన | 
కైంచీ సమాధి తేంచ దేహావసాన | నిశ్చితమన జన ఝాలే | ||౧౨|| 
12. అలాగే - ఒక సారి వారు తమ ప్రాణాలను బ్రహ్మాండంలో (నిర్వికల్ప సమాధి) లీనం చేసి, మూడు రోజులు నిశ్చలంగా ఉండగా, అది సమాధి కాదని, దేహావసానమే అని ప్రజలు నిర్ణయించడం - వీటన్నిటి గురించి వినండి. 
కేలీ ఉత్తర విధీచీ తయారీ | అవచిత బాబా దేహావరీ | 
యేతాంచ లోక దచకలే అంతరీ | కైసీ తేపరీ పరిసిజే | ||౧౩|| 
13. ప్రజలు ఎలా అంతిమ సంస్కారాలకు కూడా సిద్ధపడ్డారు, అకస్మాత్తుగా బాబా శరీరంలో ప్రవేశించే సరికి, ప్రజలు ఎలా చకితులైనారో అనే విషయాన్ని గురించి కూడా వినండి. 
అసో ఆతా హే నిర్యాణ కథా | శ్రోతే శ్రమతీల శ్రవణ కరితా | 
హీ తో దేహావసానాచీ వార్తా | నరుచే చిత్తా కవణాచ్యా | ||౧౪|| 
14. కాని, ఇది వారి నిర్యాణ కథ. ఇది వినటానికి శ్రోతలు ఇబ్బంది పడతారు. ఈ దేహావసాన వార్తను వినటం ఎవరికీ ఇష్టముండదు. 
పరీ హే సాధుసంతాంచే నిర్యాణ | శ్రోత్యాంవక్త్యా కరీల పావన | 
విస్తారభయాస్తవ భాగశః శ్రవణ | కరావే సమాధాన రాహీతో | ||౧౫|| 
15. కాని ఇది సాధు సంతుల నిర్యాణాన్ని గూర్చిన వర్ణన. వినేవారిని, చెప్పేవారిని కూడ ఇది పావనం చేస్తుంది. విస్తారంగా ఉందని భయ పడక, మీకు తృప్తి కలిగించేలా, కొంచెం కొంచెంగా వినండి. 
దేహత్యాగే అగమ్యగతి | నిజప్రాప్తి సుఖాచీ వసతీ | 
బాబా పావలే అక్షయ స్థితి | పునరావృత్తీ విరహిత | ||౧౬|| 
16. దేహాన్ని త్యజించి, పునర్జన్మ లేని, పొందటానికి కష్టమైన, శాశ్వత ఆత్మానంద స్థితిని, బాబా పొందారు. 
దేహధారణే హోతే వ్యక్త | దేహత్యాగే పావలే అవ్యక్త | 
జరీ ఎకాంగ అవతార సమాప్త | సర్వాంగ సువ్యక్త లాధలే | ||౧౭|| 
17. దేహాన్ని ధరించినప్పుడు కనిపించి, దేహాన్ని వదిలి, వారు కనిపించకుండా పోయారు. శరీరంలో ఉన్న ఒక అవతారాన్ని ముగించి, సర్వ జీవులలోనూ కనిపించే స్థితిని పొందారు. 
ఎకదేశీయత్వా ముకలే | సర్వ గతత్వాతే పావలే | 
పూర్ణపణే సనాతన ఝాలే | నిజీ సమరసలే నిజత్వే | ||౧౮|| 
18. ఒక చోట ఉండే స్థితిని వదిలి, సర్వ వ్యాపకత్వాన్ని పొందారు. తమ నిజమైన ఆత్మలో విలీనమై, సంపూర్ణంగా శాశ్వతులైనారు. 
సాఈ సకళాంచే జీవన | సాఈ సకళాంచా జీవ ప్రాణ | 
సాఈవీణ గ్రామవాసీజన | హీనదీన జాహలే | ||౧౯|| 
19. సాయి అందరికీ జీవనం. సాయి సకల జీవులకూ ప్రాణం. సాయి లేకుండా గ్రామవాసులు దీనులయ్యారు, దుర్బలులైనారు. 
దేహ పడతా నిచేష్టిత | జాహలా ఎకచి ఆకాంత | 
ఆబాలవృద్ధ చింతాక్రాంత | జాహలా ప్రాణాంత సమస్తా | ||౨౦||
20. శరీరం చేతనా రహితమవగానే, అందరూ గట్టిగా ఒకేలా రోదించారు. ఆబాలవృద్ధులు చింతాక్రాంతులై, జీవచ్ఛవాల వలె అయ్యారు. 

నవజ్వరాది లౌకికీ బాధా | పాఠీస లాగతీ ప్రపంచ బద్ధా | 
యోగియాంచా వాటే కదా | అమర్యాదా న కరితీ | ||౨౧|| 
21. నవజ్వరాది లౌకిక బాధలు ప్రపంచానికి కట్టుబడి ఉన్నవారిని బాధిస్తాయి. కాని అవి తమ పరిమితిని అతిక్రమించి యోగులను బాధ పెట్టవు.
చేతవోనియా నిజ తేజాతే | సంత దాహితీ నిజ దేహాతే | 
తోచ కీ ప్రకార నిజహాతే | బాబా కరితే జాహలే | ||౨౨|| 
22. సంతులు తమ తేజస్సును ప్రజ్వలింప చేసి, తమ శరీరాన్ని దహింపజేస్తారు. బాబా కూడా అదే విధంగా తమ చేతులతో చేశారు. 
న వ్హావే తే హోఊని గేలే | మహారాజ సాయుజ్యీ సమరసలే | 
జన అత్యంత హిరముసలే | కుసముసలే మనాంత | ||౨౩|| 
23. జరగకూడనిది అప్పుడే జరిగిపోయింది. సాయి మహారాజు సాయుజ్యం పొందారు. ప్రజలు చాలా బాధ పడ్డారు. మనసులో అత్యంత ఆవేదన పడ్డారు. 
బరే హోతే నసతో గేలో | అంత సమయీంచ్యా భేటీస ముకలో | 
అసతో కాంహీ ఉపయోగా ఆలో | భులీ భరలో ప్రసంగీ | ||౨౪|| 
24. ‘బాబా దగ్గరనుండి వెళ్లిపోకుండా ఉంటే ఎంత బాగుండేది. అంతిమ సమయంలో, చివరి సారిగా చూడలేక పోయాం. ఉండి ఉంటే, దేనికైనా ఉపయోగ పడేవారం. ఆ క్షణంలో నా బుద్ధి పనిచేయలేదు’. 
ఏశా నానావిధ విచారాంనీ | ఖిన్న ఝాలా జో తో మనీ | 
బాబాంచ్యా కాయ అంతఃకరణీ | అసేల తే కోణీ జాణావే | ||౨౫|| 
25. అని అనేక రకాలు ఆలోచించి, ప్రజలు తమలో తామే చాలా దుఃఖపడ్డారు. అసలు బాబా మనసులో ఏముందో ఎవరికి తెలుస్తుంది! 
నాహీ ఘరఘర నాహీ శ్వాస | నాహీ ఖాంసీ నాహీ కాస | 
నాహీ జీవాచీ కాసావీస | కేలే ఉల్లాసే ప్రయాణ | ||౨౬|| 
26. గొంతులో ఏ బాధాలేదు. శ్వాస పీల్చుకోవటంలో ఆయాసం లేదు. దగ్గు లేదు. ప్రాణానికి ఏ కష్టమూ లేక, ఉల్లాసంగా ప్రయాణమయ్యారు. 
ఆతా కైచే సాఈదర్శన | కైచే సాఈపదసంవాహన | 
కైచే సాఈచరణక్షాళణ | తీర్థప్రాశన తే కైచే | ||౨౭|| 
27. ఇంక ఎక్కడి సాయి దర్శనం? ఎక్కడి సాయి పాద సేవ? ఎక్కడి సాయి చరణాల ప్రక్షాళణం? ఇంకెక్కడి పాద తీర్థ సేవనం? 
తరీ మగ తే భక్త ప్రేమళ | ఆలీ పాహోని అంతవేళ | 
దూర కేలే కా అసతా జవళ | తయాంస తళమళ లావిలీ కా | ||౨౮|| 
28. తమ అంతిమ సమయం సమీపించిందని గ్రహించి, దగ్గరున్న ప్రియమైన భక్తులను దూరంగా ఎందుకు పంపించి వేశారు? ఎందుకు వారికింత బాధ కలిగించారు? 
సర్వచి జీవాచీ భక్తమండళీ | పాహూని జవళీ అంతకాళీ | 
సమయీ బాబాంచే ప్రేమాస ఉసళీ | అంతకాళీ యేతీ కీ | ||౨౯|| 
29. అంతిమ సమయంలో ప్రియమైన భక్తులు తమ దగ్గరుండటం చూచి, బాబాకు వారిపై ప్రేమ ఉప్పొంగిందేమో! 
పావావయా సాయుజ్య సదన | ఆడవే యేతే ప్రేమబంధన | 
వేళీ న కరితా తయాచే ఛేదన | మన నిర్వాసన కైసేనీ | ||౩౦||
30. భక్తుల ప్రేమబంధం, మోక్ష ప్రాప్తికి అడ్డు తగులుతుంది. సమయానికి దానిని త్రుంచకపోతే, మనసు వాసనారహితం కాదు. 

ఏసే న ఘడతా దేహ పడలా | సవేంచ చఢలా జీవ ధడధడలా | 
తాత్కాళ నవా సంసార జడలా | బాజార ఉఘడలా వాసనేచా | ||౩౧|| 
31. అలా జరగకుండా శరీరాన్ని వదిలితే, జీవుడు మరల పుట్టి, వెంటనే క్రొత్త బంధనాలలో చిక్కుకుంటాడు. దాంతో, అనేక రకాల కోరికలూ, ఆశలూ మొదలవుతాయి. 
టాళావయా హా ప్రకార | సాధూసంత దక్ష నిరంతర | 
బాబాంచ్యాహీ మనాచా నిర్ధార | లోక వ్యవహార రక్షావా | ||౩౨|| 
32. వీనిని తొలగించటానికి, సాధు సంతులు ఎప్పుడూ సావధానులై ఉంటారు. అలాగే, బాబా కూడా లోక వ్యవహారాన్ని కాపాడటానికి నిశ్చయించుకున్నారు. 
అంతకాళీ హీచ సావధతా | శాంతతా ఆణి ఎకాంతతా | 
ధ్యేయ మూర్తి యావీ చిత్తా | విక్షేపతా విరహిత | ||౩౩|| 
33. అంతిమ సమయంలో జాగ్రతతో ఉండవలసినది దీనికోసమే. ఏకాంతంలో ప్రశాంతంగా, ఏ వికల్పాలూ భయాలూ లేక, మనసును ఇష్ట దైవంలో లీనం చేయాలి. 
‘అంతేమతిః సాగతిః’ | హే తో ప్రసిద్ధ సర్వ జాణతీ | 
భగవద్భక్త స్వయే ఆచరతీ | లోకసంగ్రహ రీతీ హే | ||౩౪|| 
34. ‘అంతే మతిః సా గతిః’ అనే నుడి అందరూ ఎరుగుదురు. భగవద్భక్తులు దీనినే స్వయంగా ఆచరిస్తారు. ఇదే లోకాచార పద్ధతి. 
అవకాశ చవదా దివస రాహిలా | కాళ బాబాంచా జవళ ఆలా | 
మ్హణోని బాబాంనీ వఝే2 యోజిలా | వాచావయాలా రామవిజయ | ||౩౫|| 
35. తమ దేహావసానానికి పదునాలుగు రోజులే మిగిలాయి, అని వఝే అను భక్తుణ్ణి, రామ విజయాన్ని పఠించటానికి బాబా నియమించారు. 
మశీదీంత వఝే బైసలే | పోథీ పారాయణ సురూ ఝాలే | 
బాబా శ్రవణ కరూ లాగలే | దివస గేలే కీ ఆఠ | ||౩౬|| 
36. మసీదులో కూర్చుని వఝే గ్రంథ పారాయణను ప్రారంభించాడు. బాబా వినసాగారు. ఎనిమిది రోజులు గడిచాయి. 
పుఢే బాబా ఆజ్ఞా కరీత | పోథీ చాలవా అస్ఖలీత | 
ఏసే తీన దివస రాత | వఝే తీ వాచిత రాహిలే | ||౩౭|| 
37. “ఆపకుండా మరల పారాయణం జరగని” అని బాబా ఆజ్ఞాపించారు. మూడు పగళ్లు మూడు రాత్రులూ వఝే చదువుతూనే ఉన్నాడు. 
పూర్ణ అకరా దివస బైసలే | పుఢే అశక్తపణే తే థకలే | 
వాచతా వాచతా కంటాళలే | ఏసే గేలే తీన దిన | ||౩౮|| 
38. అలా పూర్తిగా పదకొండు రోజులు కూర్చుని, వరుసగా చదివి, వఝే నీరసించి పోయాడు. చదివి చదివి బాగా అలసిపోయాడు. అలా మూడు రోజులు గడిచాయి. 
పుఢే బాబాంనీ కాయ కేలే | పోథీ వాచన సమాప్త కరవిలే | 
వఝ్యాంస తేథూన ఘాలవూన లావిలే | ఆపణ రాహిలే నివాంత | ||౩౯|| 
39. తరువాత బాబా ఏమి చేశారంటే, గ్రంథ పారాయణను సమాప్తి చేయించారు. వఝేను అక్కడినుండి పంపించి వేసి, తాము ప్రశాంతంగా ఉన్నారు. 
ఘాలవూని లావణ్యాచే కారణ | మ్హణతీల శ్రోతే కరవా కీ శ్రవణ | 
కరితో యథామతి నివేదన | దత్తావధాన పరిసావే | ||౪౦||
40. ‘వఝేను పంపించి వేయడానికి కారణం ఏమిటి?’ అని శ్రోతలు అడుగ వచ్చు. నాకు చేతనైనంత వరకూ తెలియ చేస్తాను. శ్రద్ధగా వినండి. 

నికట యేతా దేహావసాన | సాధుసంత ఆణి సజ్జన | 
ఘేతీ వాచవూన పోథీపురాణ | సావధాన పరిసతీ | ||౪౧|| 
41. దేహావసాన సమయం సమీపించినప్పుడు, సాధు సంతులు సత్పురుషులు, పురాణాలను, సద్గ్రంథాలను చదివించి శ్రద్ధగా వింటారు.
శుకాచార్య దివస సాత | కథితే జాలే మహా భాగవత | 
ఏకూన ధాలా రాజా పరీక్షిత | సుఖే దేహాంత లాధలా | ||౪౨|| 
42. పరీక్షిత్తు మహారాజుకు, శుకాచార్యులు మహాభాగవతాన్ని ఏడు రోజులు చెప్పగా, దానిని విని మహారాజు సుఖంగా శరీరాన్ని వదిలాడు. 
శ్రవణ కరితా భగవల్లీలా | భగవన్మూర్తీ దేఖతా డోళా | 
అంతకాళ జయాచా జాహలా | తేణేంచ సాధిలా నిజస్వార్థ | ||౪౩|| 
43. భగవంతుని లీలలను వింటూ, భగవంతుని రూపాన్ని కళ్లతో చూస్తూ, అంతిమ కాలాన్ని గడిపిన వారు, తమ శ్రేయస్సును సాధించుకుంటారు. 
హీ తో లోక ప్రవృత్తి స్థితి | సంత నిరంతర స్వయే ఆచరతీ | 
లోకసంగ్రహ మార్గ న మోడితీ | కింబహునా అవతరతీ తదర్థచీ | ||౪౪|| 
44. ఇది లోకాచార పద్ధతి. దీనిని సంతులు ఎప్పుడూ ఆచరిస్తారు. లోకాచారానికి విరుద్ధంగా వారు ఎప్పుడూ ప్రవర్తించరు. ప్రజల మార్గదర్శనం కోసమే వారు అవతరిస్తారు. 
జయా యా భౌతికపిడీ అనాస్థా | తయా దేహావసానావస్థా | 
నాహీ దుఃఖశోకావేగతా | హీ స్వాభావికతా తయాంచీ | ||౪౫|| 
45. భౌతిక శరీరం పైన ఏ ఆసక్తీ లేని వారికి, శరీరాన్ని త్యజించేటప్పుడు, ఏ రకమైన శోకావేశాలు కలగవు. ఇది వారికి సహజం. 
అసో యేథే శ్రోతా శంకిజే | బ్రహ్మసుఖే సుఖావలే జే | 
తయాంస మాయామోహే ఆతళిజే | బోల హా సాజే కైసేనీ | ||౪౬|| 
46. ‘బ్రహ్మానందంలో సుఖంగా ఉండేవారికి మాయామోహాలు ఉంటాయా?’ అని ఇక్కడ శ్రోతలకు అనుమానం కలగవచ్చు. 
జే స్వరూపీ సావధాన | ‘అల్లా మాలీక’ అనుసంధాన | 
తయాంసీ భక్తాంచే సన్నిధాన | ప్రతిబంధన కైసేనీ | ||౪౭|| 
47. ఎప్పుడూ ఆత్మలో లీనమై, ఎప్పుడూ “అల్లా మాలీక” అని ధ్యానిస్తూ ఉన్నవారికి, భక్తులు తమ వద్ద ఉండటం ప్రతిబంధకమెలా అవుతుంది? 
తయాచా తో ప్రపంచ సరలా | పరమార్థహీ ఠాఈచా ఠేలా | 
ద్వంద్వభావ సమూళ గేలా | స్వయే సంచలా స్వరూప | ||౪౮|| 
48. ప్రపంచ వ్యవహారాలన్నీ బాబాకు తీరిపోయాయి. పరమార్థం కూడా ఆగిపోయింది. విరుద్ధ భావాలు సమూలంగా నిర్మూలనమయ్యాయి. వారు ఆత్మస్వరూపంలో లీనమైపోయారు. 
అక్షరే అక్షర సకళ సత్య | యాంత అణుమాత్ర నాహీ అసత్య | 
పరి లోకసంగ్రహ అవతార కృత్య | కరూన కృతకృత్య సంతజనీ | ||౪౯|| 
49. ఇదంతా అక్షరం అక్షరం సత్యం. ఇందులో అణుమాత్రమైనా అసత్యంలేదు. కాని లోక సంరక్షణ కోసం, సత్పురుషులు తమ అవతార కార్యాలను చేసి కృతకృత్యులౌతారు. 
సంత షడ్భావ వికార వర్జిత | జే నిరంతర అప్రకట స్థిత | 
భక్తోద్ధారార్థ ప్రకటీభూత | నిధన కింభూత తయాతే | ||౫౦||
50. సంతులు కామక్రోధాధి షట్‍ వికారాలు లేనివారు. ఎప్పుడూ కనిపించని స్థితిలో ఉంటారు. భక్తులను ఉద్ధరించటానికే వారు కనిపిస్తారు. అటువంటి వారికి చావెక్కడిది? 

దేహేంద్రియ సంయోగ తే జనన | దేహేంద్రియ వియోగ తే మరణ | 
హే పాశబంధన వా ఉకలన | జన్మమరణ యా నాంవ | ||౫౧|| 
51. శరీరం మరియు ఇంద్రియాల కలయికే పుట్టుట. ఇవి రెండూ విడిపోవటమే చావు. ఈ బంధనం ముడిపడటాన్ని, విడిపోవడాన్ని, చావు పుట్టుకలని అంటారు. 
జననాపాఠీ చికటలే మరణ | ఎకాహూన ఎక అభిన్న | 
మరణ జీవ ప్రకృతి లక్షణ | జీవాచే జీవన తీ వికృతి | ||౫౨|| 
52. జననంతో పాటే మరణం ముడిపడి ఉంటుంది. ఒకటినుండి ఇంకొకటి వేరుగా ఉండవు. మరణం జీవుని స్వాభావిక లక్షణం. జీవనమే జీవుని అస్వాభావిక లక్షణం. 
మరణ మారూని జే ఉరతీ | పాయ కాళాచే శిరీ జే దేతీ | 
తయా కాయ ఆయుర్దాయాచీ క్షితీ | అవతరతీ జే స్వేచ్ఛేనే | ||౫౩|| 
53. మరణాన్నే చంపి బ్రతికే వారు, కాళ్లతో కాలుని తలను అణచివేసి, స్వేచ్ఛగా అవతరించేవారు, తమ ఆయుర్దాయాన్ని ఖాతరు చేస్తారా? 
భక్తకల్యాణైక వాసనా | తేణే జే ధరితీ అవతార నానా | 
తే కాయ ఆతళతీ జన్మమరణా | మిథ్యా కల్పనా యా దోన్హీ | ||౫౪|| 
54. భక్తులను ఉద్ధరించే సంకల్పంతోనే భూమిపై అనేక అవతారాలను ధరించేవారు, జనన మరణాలతో బంధింపబడతారా? ఈ రెండూ నిజం కాని కల్పనలే! 
దేహపాతా ఆధీంచ దేఖ | జేణే దేహాచీ కేలీ రాఖ | 
తయాసీ మరణాచా కాయసా ధాక | మరణ హే ఖాక జయాపుఢే | ||౫౫|| 
55. శరీరం నేలపై పడక ముందే దానిని కాల్చి, బూడిదగా చేసేవారికి, మరణ భయం ఎందుకు ఉంటుంది? మరణం వారికి బూడిదతో సమానం. 
మరణ హీ దేహాచీ ప్రకృతి | మరణ హీ దేహాచీ సుఖస్థితి | 
జీవన హీ దేహాచీ వికృతి | విచారవంతీ విచారిజే | ||౫౬|| 
56. మరణం శరీరంయొక్క సహజ స్థితి. మరణం శరీరంయొక్క సుఖస్థితి. జీవితమే శరీరంయొక్క వికృతి అని జ్ఞానులు భావిస్తారు. 
సాఈసమర్థ ఆనందఘన | ఠావే న జయా దేహాచే జనన | 
తయాంచ్యా దేహాస కైసే మరణ | దేహస్ఫురణ వర్జితతే | ||౫౭|| 
57. సాయి సమర్థులు ఆనందఘనులు. వారు శరీరంయొక్క జననాన్ని ఎరుగరు. శరీరంయొక్క ధ్యాసే వారికి లేదు. అటువంటి వారి శరీరానికి మరణమెక్కడిది? 
సాఈ పరబ్రహ్మా పూర్ణ | తయా కైంచే జన్మమరణ | 
బ్రహ్మ సత్యత్వే జగన్మిథ్యాపణ | దేహాచే భాన కైంచే త్యా | ||౫౮|| 
58. సాయి పూర్ణ పరబ్రహ్మ. వారికి జనన మరణాలెక్కడివి? ‘బ్రహ్మ సత్యం జగన్మిథ్యం’ అని తెలుసుకున్నవారికి శరీరంయొక్క జ్ఞానం ఎందుకుంటుంది? 
ప్రాణధారణ వా విసర్జన | అలక్ష్య రూపే పరిభ్రమణ | 
హే తో స్వచ్ఛందయోగక్రీడన | భక్తోద్ధారణ నిమిత్తే | ||౫౯|| 
59. ప్రాణాన్ని ధరించడం, ప్రాణాన్ని వదలటం, కనిపించకుండా తిరుగటం, ఇవన్నీ భక్తులను ఉద్ధరించటానికి వారు తమ ఇష్టంతో చేసే యోగ క్రీడలు. 
మ్హణతీ రవీస లాగలే గ్రహణ | ఝాలా కీ హో ఖగ్రాస పూర్ణ | 
హా తో కేవళ దృష్టీచా దోషగుణ | సంతాంసీ మరణ తైసేంచ | ||౬౦||
60. సూర్యునికి గ్రహణం పట్టిందనీ, సూర్యుడు పూర్తిగా కనిపించకుండా పోయాడని, అంటారు. ఇది కేవలం దృష్టి దోషగుణమే. సత్పురుషుల మరణం కూడా అటువంటిదే. 

దేహ హీ కేవళ ఉపాధి | తయా కైచీ ఆధివ్యాధి | 
అసల్యా కాంహీ ప్రారబ్ధానుబంధీ | తయాచీ న శుద్ధి తయాంలా | ||౬౧|| 
61. దేహమే వారికి ఒక బాధ. ఇక దైహిక, మానసిక బాధలు ఎక్కడివి? ప్రారబ్ధంతో సంబంధించినవి ఏవైనా ఉన్నా, వానిని వారు పట్టించుకోరు.
భక్తపూర్వార్జితీ జో సంచలా | అవ్యక్తరూపీ భక్తీ భరలా | 
తోహా భక్త కైవారార్థ ప్రకటలా | శిరడీంత దిసలా తేవ్హాంచ | ||౬౨|| 
62. కనిపించకుండా ఉన్నప్పుడు, భక్తుల భక్తి నిండిపోగా, భక్తులయొక్క పూర్వార్జిత పుణ్యంవలన అవతరించి, భక్తులను రక్షించటానికి బాబా శిరిడీలో కనిపించారు. 
ఆతా భక్తకార్యార్థ సంపలా | మ్హణూన మ్హణతీ దేహ ఠేవిలా | 
కోణ విశ్వాసీల యా బోలా | గతీ యోగ్యాలా కాయ హే | ||౬౩|| 
63. భక్తుల కొరకు వచ్చిన పని పూర్తయిందని, ఇప్పుడు శరీరాన్ని వదిలివేశారు అని అంటారు. ఈ మాటలను ఎవరు నమ్ముతారు? యోగికి జనన మరణాలు అసలు ఉంటాయా? 
ఇచ్ఛామరణీ సాఈ సమర్థ | దేహ జాళిలా యోగాగ్నీంత | 
స్వయే సమరసలే అవ్యక్తాంత | భక్తహృదయాంత తే ఠేలే | ||౬౪|| 
64. ఇచ్ఛామరణి అయిన సాయి సమర్థులు తమ ఇచ్ఛానుసారమే శరీరాని యోగాగ్నిలో దహించి, తాము కనిపించకుండా పోయినా, భక్తుల హృదయాలలో ఉన్నారు. 
జయాచే కేవళ నామస్మరతా | జన్మమరణాచీ నురే వార్తా | 
తయాస కైచీ మరణావస్థా | పూర్వీల అవ్యక్తతా తో పావే | ||౬౫|| 
65. ఎవరి నామాన్ని తలచినంత మాత్రమే, జనన మరణాలు వదిలి పోతాయో, అలాంటి వారికి మరణావస్థ ఎక్కడిది? శరీరాన్ని వదిలిన తరువాత వారు, మునుపటి కనిపించని స్థితిని పొందారు. 
ఉల్లంఘోని జడస్థితి | బాబా సమరసలే అవ్యక్తీ | 
తేథేంహీ భోగితీ స్వరూపస్థితి | సదా జాగవితీ భక్తాంతే | ||౬౬|| 
66. జడ స్థితిని దాటి, బాబా అవ్యక్తంలో లీనమయ్యారు. అక్కడ కూడా, ఆత్మస్వరూపంలో ఉంటూ, భక్తులను సదా జాగృతం చేస్తూంటారు. 
సచైతన్య జో ముసముసలా | భక్తహృదయీ జో అఢళ ఠసలా | 
తో దేహకాయ మ్హణావా నిమాలా | బోల హా మనాలా మానేనా | ||౬౭|| 
67. భక్తుల హృదయాలలో చైతన్యంతో నిండి, దృఢంగా నిలచినవారు, మరణించారని అనగలమా? ఇలాంటి మాటలను మనసు ఒప్పుకోదు. 
మ్హణోని హా అనాద్యనంత సాఈ | అభంగ రాహీల విశ్వప్రళయీ | 
జన్మ మరణచియా అపాయీ | న కదాంహీ పడేల | ||౬౮|| 
68. అందువలన, ఆది, అంతం లేని ఈ సాయి, విశ్వప్రళయం వచ్చేంతవరకూ ఉంటారు. జనన మరణాలనే అపాయాలలో ఎప్పుడూ పడరు. 
మహారాజ జ్ఞానోబా కాయ గేలే | తీన శతకాంతీ దర్శన దిధలే | 
నాథమహారాజ3 భేటూన ఆలే | ఉపకార కేలే జగావర | ||౬౯|| 
69. జ్ఞానేశ్వర మహారాజు వెళ్లిపోయారా? మూడు వందల ఏళ్లయాక మరల దర్శనమిచ్చారు. ఏకనాథ మహారాజు వారిని కలిసి, జగానికి ఎంతో ఉపకారం చేశారు. 
జైసే తే నాథ కృపావంత | పైఠణీచీ జాహలీ జ్యోత | 
తుకారామ మహారాజ దేహూంత | ఆళందీత నరసింహసరస్వతీ | ||౭౦||
70. దయామయులైన ఏకనాథ మహారాజు పైఠనులో వెలసినట్లు, దేహులో తుకారాం మహారాజులా, నరసింహ సరస్వతి ఆళందిలోలా, 

సమర్థ రామదాస పరళీంత | అక్కలకోటకర అక్కలకోటాంత | 
ప్రభుమాణిక హుమణాబాదేంత | సాఈ హే శిరడీంత తైసేచి | ||౭౧|| 
71. పర్లీలో సమర్థ రామదాసు, అక్కలకోటలో అక్కలకోట మహారాజులా, మాణిక ప్రభు హుమ్నాబాదులో వలె, శిరిడీలో సాయి అట్లే వెలిశారు. 
జయా మనీ జైసా భావ | ఆజహీ తయా తైసా అనుభవ | 
హా సిద్ధచి జయాచా ప్రభావ | మరణ భావ కైచా త్యా | ||౭౨|| 
72. మనోభావాలననుసరించి అనుభవాలు కలుగుతుంటాయి. ఈ నాటికీ అనుభవాలు కలుగుతుంటాయి. ఇట్టి సిద్ధి ప్రభావమున్నవారికి మరణమెలా సంభవం? 
తో హా భక్తకాజ కైవారీ | దేహ ఠేవిలా శిరడీ భీతరీ | 
స్వరూపే భరలాసే చరాచరీ | లీలావతారీ సమర్థ | ||౭౩|| 
73. శరీరాన్ని శిరిడీలో ఉంచి, భక్తుల సేవాకార్యానికై సకల చరాచరాలల ఆత్మలో నిండిఉన్న లీలావతారి ఈ సమర్థులు. 
ఆతా కాయ ఆహే శిరడీంత | సమర్థ ఝాలే బ్రహ్మీభూత | 
ఏసీ న శంకా యావీ మనాంత | మరణాతీత శ్రీ సాఈ | ||౭౪|| 
74. సాయి సమర్థులు బ్రహ్మలో లీనమయ్యారు కదా, ఇంక శిరిడీలో ఏముంది? అన్న అనుమానం మనసులో పెట్టుకోకండి. శ్రీసాయి మరణానికి అతీతులు. 
సంత ముళీంచ గర్భాతీత | పరోపకారార్థ ప్రకట హోత | 
బ్రహ్మస్వరూప మూర్తిమంత | భాగ్యవంత అవతరతీ | ||౭౫|| 
75. సంతులు అయోనిజలు. వారు మూర్తీభవించిన బ్రహ్మస్వరూపులు. ఆ పుణ్యాత్ములు పరోపకారం కోసం అవతరించి, అందరికీ కనిపిస్తారు. 
జన్మ ఆణి మరణస్థితీ | అవతారీయా కదా న యే తీ | 
కార్య సరతా తే స్వరూపీ మిళతీ | సమరసతీ తే అవ్యక్తీ | ||౭౬|| 
76. ఇలాంటి అవతార పురుషులకు జనన మరణాలు ఎప్పుడూ ఉండవు. అవతార కార్యం పూర్తి కాగానే, ఆత్మలో కలిసిపోయి, కనిపించకుండా పోతారు. 
అవఘా దేహ సాడేతీన హాత | బాబా కాయ త్యాంతచి సమాత | 
 తే విశిష్ట వర్ణ స్వరూపయుక్త | హే తో అయుక్త బోలణే | ||౭౭|| 
77. మొత్తం మూడున్నర మూరల శరీరంలోనే, బాబా పరిమితమై ఉన్నారా? వారు ఫలానా విశేషమైన రంగు, రూపాలు కలవారని చెప్పటం సరి కాదు. 
ఆణిమాగరిమాది అష్టసిద్ధీ | ఆలియా గేలియా క్షయ నా వృద్ధి | 
స్వయేంచ అఖండ జయాచీ సమృద్ధి | ఏసీ ప్రసిద్ధి తయాంచీ | ||౭౮|| 
78. అణిమ, గరిమాది అష్ట సిద్ధులూ ఉన్నవారి ఐశ్వర్యం ప్రజల రాకపోకల వలన పెరగదు, తరగదు. శాశ్వతంగా, సమృద్ధిగా ఉండే వారి ఐశ్వర్యం వారికే స్వంతం. వారి ప్రఖ్యాతి అలాంటిది. 
ఏసియా మహానుభావాంచా ఉదయ | లోకకల్యాణ హాచ ఆశయ | 
ఉదయాస ఆహే స్థితి విలయ | లోకసంగ్రహమయ సంత | ||౭౯|| 
79. ఇలాంటి మహాత్ముల జననానికి ఏకైక కారణం, లోక కల్యాణమే. ఈ జననానికి స్థితిలయలు ఉంటాయి. సంతులు ప్రజల ఉద్ధరణకు సదా సిద్ధంగా ఉంటారు. 
జన్మభ్రాంతి మృత్యుభ్రాంతి | ఆత్మైకత్వ అవినాశ స్థితి | 
స్వప్నామాజీల సుఖసంపత్తి | తేచ పరిస్థితి తయాంచీ | ||౮౦||
80. జనన మరణాలు వారికి వట్టి భ్రాంతి. ఆత్మంతో ఐక్యత్వ జ్ఞానం, వారి అవినాశ స్థితి. ఇది స్వప్నంలో సుఖాన్ని, సంపత్తిని అనుభవించినట్లే. మహాత్ముల పరిస్థితి కూడా అటువంటిదే. 

నా తరీ జో జ్ఞాన నిధాన | సదైవ జయా ఆత్మానుసంధాన | 
తయాస దేహాచే జోపాసన | ఆణీక పతన సారిఖే | ||౮౧|| 
81. జ్ఞాననిధియూ, ఎప్పుడూ ఆత్మాలో లీనిమై ఉన్నవారికి, శరీరం పోషించటం లేక శరీర పతనం రెండూ సమానమే.
అసో పడలే బాబాంచే శరీర | కోసళలా దుఃఖాచా డోంగర | 
హాహాకార శిరడీభర | ఎకచి కహర ఉసళలా | ||౮౨|| 
82. అలా బాబా శరీరం పడిపోగానే, దఃఖమనే పర్వతం అందరినీ కూల్చి వేసింది. శిరిడీ అంతా హాహాకారాలు. అంతటా ఒకే కేకలు. 
ఏకూని బాబాంచే నిర్యాణ | వార్తా ఖోంచలీ జైసా బాణ | 
పడలే నిత్య వ్యవసాయా ఖాణ | దాణాదాణ ఉడాలీ | ||౮౩|| 
83. బాబా నిర్వాణం వార్త, అందరినీ బాణంలా గ్రుచ్చుకున్నది. దైనందిన కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. కలవరంతో జనులు చెల్లా చెదురైపోయారు. 
పసరతా తీ అమంగల మాత | సకళాంస గమలా వజ్రాఘాత | 
విచారీ బైసలే నివాంత | ఇతరీ ఆకాంత మాండిలా | ||౮౪|| 
84. అమంగళకరమైన ఆ వార్త వ్యాపించి, అందరికీ వజ్రఘాతంలా అనిపించింది. వివేకవంతులు మౌనంగా కూర్చున్నారు. మిగతావారు గట్టిగా రోదించారు. 
అతి ఆవడీచేని పడిభారే | కంఠ తయాంచా దాటే గహివరే | 
దుఃఖాశ్రునీర నయనీ పాఝరే | ‘శివ శివ హరే’ ఉద్గారలే | ||౮౫|| 
85. విపరీతమైన ప్రేమావేశంతో కంఠం గద్గదమైంది. కళ్లనుండి అశ్రువులు ప్రవహిస్తుండగా, అందరూ ‘శివశివా హరహరా’ అంటూ అరిచారు. 
ఘరోఘరీ ఝాలీ హడబడ | ఉడాలీ ఎకచీ గడబడ | 
ఛాతీంత భరలీ ధడధడ | లోక దడదడ ధాంవిన్నలే | ||౮౬|| 
86. ప్రతి ఇంట్లోనూ ఇదే గొడవ. దడదడలాడే గుండెలతో అందరూ ఆందోళనతో పరుగెత్తసాగారు. 
మహారాజాంచే దేహావసాన | ప్రాణాంతచి ఓఢవలా గ్రామస్థాంపూర్ణ | 
మ్హణతీ దేవా హా ప్రసంగ దారూణ | హృదయవిదారణ ఝాలే గా | ||౮౭|| 
87. మహారాజు మరణించారు. ఇది గ్రామస్థులకు పూర్తిగా ప్రాణాంతకమైంది. ‘దేవా! హృదయ విదారకమైన ఈ సంఘటన మహా దారుణంగా ఉంది’ అని అన్నారు. 
జో ఉఠే తో పళత సుటే | మశీద మండప గచ్చ దాటే | 
అవస్థా పాహోని హృదయ ఫాటే | కంఠ నాటే దుఃఖానే | ||౮౮|| 
88. లేచినవారు లేచినట్లే పరుగు తీశారు. మసీదు మండపం బాగా నిండిపోయింది. అక్కడ పరిస్థితిని చూస్తే గుండెలు బ్రద్దలయేలా ఉంది. దుఃఖంతో ఎవరికీ గొంతు పెగలటం లేదు. 
గేలే శిరడీచే వైభవ సరలే | సుఖ సౌభాగ్య సర్వ హరపలే | 
డోళే సర్వాంచే అశ్రూనీ భరలే | ధైర్య భంగలే సకళాంచే | ||౮౯|| 
89. శిరిడీయొక్క వైభవమంతా పోయింది. ఆ సుఖం, ఆ భాగ్యం అంతా శాశ్వతంగా హరించుకుని పోయింది. అందరి కళ్లూ కన్నీటితో నిండిపోయింది. వారి ధైర్యం సడలిపోయింది. 
కాయ త్యా మశీదీచీ మహతీ | సప్తపుర్యాంత జిచీ గణతీ | 
ద్వారకామాఈ జీస మ్హణతీ | బాబా నిశ్చితీ సదైవ | ||౯౦||
90. సప్తపురాలలో ఒకటిగా గణించ బడి, బాబాచే ద్వారకామయి అని నిశ్చయించ బడిన ఆ మసీదు మహిమ ఎంత గొప్పది? 

అసో నిర్యాణ, నిర్వాణ వా నిధన | ద్వారకా సాయుజ్య ముక్తీచే స్థాన | 
జయా ఈశ్వరీ నిత్యానుసంధాన | తయా అవస్థాన యే ఠాయీ | ||౯౧|| 
91. ‘నిర్యాణం’ అనినా, ‘నిధనం’ అన్నా, లేదా ‘నిర్వాణం’ అన్నా, ద్వారకామాయి సాయుజ్యముక్తికి స్థానం. ఎప్పుడూ పరమేశ్వరుని ధ్యానంలో ఉండేవారికి, అక్కడ స్థానం లభిస్తుంది. 
తో హా గురూరాజ సాఈరాయ | భక్త కనవాళూ బాప మాయ | 
భక్తా విశ్రాంతీచా ఠాయ | ఆఠవ హోయ నిత్యాచీ | ||౯౨|| 
92. భక్తులకు దయగల తల్లి, తండ్రీ మరియు విశ్రామ ధామం – ఈ గురురాయ సాయిరాయలవారు. వారు ప్రతి రోజూ గుర్తుంటారు. 
బాబావీణ శిరడీ ఓస | దాహీ దిశా శూన్య ఉదాస | 
ప్రాణ జాతా జే శరీరాస | కళా శిరడీస తే ఆలీ | ||౯౩|| 
93. బాబా లేని శిరిడీ, దశదిశలూ శూన్యమై, ఉదాసీనమయ్యాయి. ప్రాణం పోయిన తరువాత శరీరానికి పట్టే ప్రేత కళ, శిరిడీకి పట్టింది. 
సుకోని జాతా తళ్యాంతీల జీవన | తళమళతీ జైసే ఆంతీల మీన | 
తైసే ఝాలే శిరడీచే జన | కలాహీన ఉద్విగ్న | ||౯౪|| 
94. చెరువులోని నీరు ఇంకిపోతే, తపించిపోయే చేపలవలే, శిరిడీ జనులు కళావిహీనులై బాధతో విలవిలలాడారు. 
కమలావీణ సరోవర | పుత్రావీణ శూన్య ఘర | 
కీ దీపావీణ మందిర | మశీదపరిసర తో తేవీ | ||౯౫|| 
95. కమలాలు లేని సరోవరంలా, కొడుకు లేని శూన్యగృహంలా, దీపంలేని మందిరంలా, మసీదు పరిసర ప్రాంతమంతా కళావిహీనంగా ఉన్నది. 
కీ ఘరధన్యావీణ ఘర | కీ రాజయావీణ నగర | 
కీ ద్రవ్యావాంచూని భాండార | శిరడీ కాంతార4 బాబావిణే | ||౯౬|| 
96. యజమాని లేని ఇల్లులా, రాజులేని నగరంలా, డబ్బులేనీ భోషాణంలా, బాబాలేని శిరిడీ, అరణ్యంలా అయిపోయింది. 
జననీ జైసీ అర్భకా | కింవా మేఘోదక చాతకా | 
తేంచి ప్రేమ శిరడీచే లోకా | ఆణీక భక్తా సకళికా | ||౯౭|| 
97. పసిబిడ్డకు తల్లిలాంటిది, చాతక పక్షికి మేఘోదకం వంటిది, మరియు శిరిడీ ప్రజలకు, భక్తులందరికీ కూడా, బాబా ప్రేమ అటువంటిదే. 
శిరడీ ఝాలీ కలాహీన | మృతప్రాయ హీన దీన | 
జీవనేవీణ జేంవీ మీన | తేవీ జన తళమళతీ | ||౯౮|| 
98. శిరిడీ హీనంగా, దీనంగా, కళావిహీనంగా మృతప్రాయమైంది. నీరులేని చేపలవలె, జనులు బాబా లేక తపించిపోయారు. 
వర్జితా కాంతా నిజ భ్రతారే | అథవా మాతా స్తనీంచీ పోరే | 
జైసీ గాఈచీ చుకలీ వాసరే | లహాన థోరే త్యాపరీ | ||౯౯|| 
99. భర్త విడిచిన భార్యవలె, తల్లికి దూరమైన పాలు త్రాగే పసిబిడ్డవలె, ఆవునుండి విడిపోయిన దూడవలె అయింది, అక్కడి పెద్ద, చిన్నవారి పరిస్థితి. 
అనివార హే దుఃఖావస్థా | ఝాలీ శిరడీచ్యా జనా సమస్తా | 
బిదోబిదీ అస్తావేస్తా | జన చౌరస్తా ధాంవతీ | ||౧౦౦||
100. శిరిడీ జనులకు ఆ దుఃఖం భరించలేనిదిగా అయింది. జనులు అస్తవ్యస్తంగా నలుదిక్కులూ పరుగెత్త సాగారు. 

సాఈముళేంచ శిరడీ పవిత్ర | సాఈముళేంచ శిరడీ చరిత్ర | 
సాఈముళేంచ శిరడీ క్షేత్ర | సాఈచ ఛత్ర సర్వాంతే | ||౧౦౧|| 
101. సాయి ఒక్కరి వలనే శిరిడీ పవిత్ర పుణ్య క్షేత్రమైంది. సాయి ఒక్కరి వలననే శిరిడీకి ఒక చరిత్ర. సాయి ఒక్కరే అందరికీ ఆశ్రయ స్థానం.
కోణీ కరీ ఆక్రందన | కోణీ తేథే ఘేఈ లోళణ | 
కోణీ పడే మూర్చ్ఛాపన్న | దుఃకాపన్న జన ఝాలే | ||౧౦౨|| 
102. అందుకే కొందరు ఏడవ సాగారు. మరి కొందరు నేలపైన పొర్లసాగారు. ఇంకా కొందరు తెలివి తప్పి పడిపోయారు. జనులు అందరూ దుఃఖంలో మునిగిపోయారు. 
దుఃఖాశ్రూంనీ స్త్రవతీ నయన | నరనారీ అతి ఉద్విగ్న | 
టాకోనియా అన్నపాన | దీనవదన తీ ఝాలీ | ||౧౦౩|| 
103. కళ్లనుండి దుఃఖాశ్రువులు స్రవించసాగాయి. స్త్రీలు, పురషులు అన్నపానాలు మాని అత్యంత వ్యథతో దీనవదనులయ్యారు. 
పాహోని బాబాంచీ తే అవస్థా | గ్రామస్థాంసీ పరమావస్థా | 
ఆబాలవృద్ధ భక్తా సమస్తా | మహదస్వస్థతా పాతలీ | ||౧౦౪|| 
104. బాబాను ఆ స్థితిలో చూచి, గ్రామంలోని ఆబాల వృద్ధులు, భక్తులు, అందరి వేదన తారస్థాయికి చేరుకుంది. అందరూ చాలా ఖిన్నులైనారు. 
జేథే గోడ కథా సురస | జేథే రోజ ఆనంద బహువస | 
జేథే శిరావయా న మిళే ఘస | తే మశీద ఉద్వస తంవ దిసే | ||౧౦౫|| 
105. ఎక్కడ ఒకప్పుడు మధురమైన రసభరితమైన కథలు ఉండేవో, ఎక్కడ అమితమైన ఆనందం ఉండేదో, ఎక్కడ ప్రవేశించటానికే వీలు లేకుండా నిండుగా ఉండే మసీదు, ఆ రోజు కళావిహీనమైంది. 
నిత్య శ్రీ నిత్యమంగల | హోతీ జీ శిరడీ పూర్వీ సకళ | 
బాబాచ ఎక కారణ మూళ | తేణే హళహళ గ్రామస్థా | ||౧౦౬|| 
106. శిరిడీ నిత్యం ఐశ్వర్యంతో, నిత్యం మంగళంగా ఉండటానికి మూల కారణం బాబా ఒక్కరే. అందుకే గ్రామస్థులు అందరూ వ్యథలో మునిగిపోయారు. 
ఆకందకందా ఆనంద విగ్రహా | భక్త కార్యార్థ ధరిలే దేహా | 
తో అర్థ సంపాదూన అహాహా | నగరీ విదేహా పావలాసీ | ||౧౦౭|| 
107. ఆనందానికి మూలమైన, ఆనంద విగ్రహమైన సాయీ! భక్తుల ఉద్ధరణకు శరీరం ధరించి, ఆ కార్యం సమాప్తమవగానే శిరిడీ గ్రామంలోనే దేహాన్ని త్యజించారు. 
అష్టౌప్రహర నిరాలస | కళకళీచా హితోపదేశ | 
కరీతసా కీ రాత్రందివస | బుద్ధిభ్రంశ ఆమ్హా తై | ||౧౦౮|| 
108. బుద్ధి భ్రంశమైన మాకు దయతో, అలసట లేకుండా, అహర్నిశలూ హితోపదేశం చేసేవారు. 
జైసే ఉపడీ ఘడ్యావర పాణీ | ఉపదేశ తైసా ఆమ్హా లాగునీ | 
గేలా వరచే వర వాహునీ | బిందుహీ ఠికాణీ లాధేనా | ||౧౦౯|| 
109. కాని, ఆ హితోపదేశాలన్నీ, బోర్లించిన కుండపైన పోసిన నీరువలె పైపైనే కొట్టుకుని పోయాయి. ఒక్క చుక్క అయినా మా ఒంట పట్టలేదు. 
‘తుమ్హీ కోణాస బోలతా ఉణే | మజలా తాత్కాళ యేతే దుఖణే’ | 
పదోపదీ హే అపులే సాంగణే | పరీ న మానణే తే ఆమ్హీ | ||౧౧౦||
110. “మీరు ఎవరినైనా దూషించితే, నాకు వెంటనే బాధ కలుగుతుంది” అని మీరు పదే పదే చెప్పినా మేము వినలేదు. 

ఏసే ఆపులే అపరాధీ కితీ | మానిలీ నాహీ జ్యాంనీ హీ సదుక్తి | 
తయాంచీ ఆజ్ఞాభంగ నిష్కృతి | ఎణేరీతీ ఫేడిలీ కా | ||౧౧౧|| 
111. ఇటువంటి అపరాధాలను ఎన్నో చేశాం. మీ హితోపదేశాలను వినక, ఆజ్ఞాభంగం చేసిన పాపానికి, ఈ విధంగా మమ్మల్ని శిక్షించారా? 
బాబా త్యా సకళాంచే పాప | త్యాంచే భరలే కాహే మాప | 
ఆతా హోఊన కాయ అనుతాప | భోగావే ఆపాప భోక్తృత్వ | ||౧౧౨|| 
112. ఆ మా పాపాలన్నింటినీ ఈ విధంగా తూచారా, బాబా! ఇప్పుడు పశ్చాత్తాప పడి ఏం లాభం? అనుభవించవలసిన వానిని అనుభవించక తప్పదు కదా. 
తేణేంచ ఆమ్హాంతే కంటాళలా | తరీచ కా పకద్యా ఆడ ఝాలా | 
ఆమ్హాంవరీ హా అవచిత ఘాలా | కాళే ఘాతలా కైసా కీ | ||౧౧౩|| 
113. మాపై విసుగు పుట్టి, కనుమరుగై తెర వెనుకకు వెళ్లిపోయారా, బాబా! అకస్మాత్తుగా మృత్యువు మాపై ఎంతటి దెబ్బ కొట్టాడు? 
కానీ కపాళీ ఓరడ కరితా | కంఠాస తుమచే కోరడ పడతా | 
కంటాళలా వాటతే చిత్తా | అముచీ ఉదాసతా దేఖోని | ||౧౧౪|| 
114. మీ గొంతు ఎండుకుని పోయేలా మాకు నచ్చచెప్పినా, వినిపించుకోని మా ఉదాసీనతనుగని, మీకు మాపై విసుగు జనించినట్లుంది. 
మ్హణోని ఆమ్హాంవరీ రుసలా | పూర్వప్రేమ సారే విసరలా | 
కీ ఋణానుబంధచి ఆజ సరలా | కీ ఓసరలా స్నేహపాన్హా | ||౧౧౫|| 
115. అందువలన మాపై అలిగి, మునుపటి ప్రేమనంతా మరచిపోయారా? లేదా, మాతోటి ఋణానుబంధం నేటితో తీరిపోయిందా? లేక, మీ వాత్సల్యపు ధార ఎండిపోయిందా? 
ఆపణ ఇతుకే సత్వర జాతే | ఏసే జరీ ఆధీ సమజతే | 
తరీ ఫారచీ బరవే హోతే | సావధ రాహతే జన ఆధీ | ||౧౧౬|| 
116. ఇంత త్వరగా మీరు వెళ్లి పోతారని మునుపే తెలిసి ఉంటే ఎంతో బాగుండేది. జనులు ముందునుంచే జాగ్రత్త పడేవారు. 
ఆమ్హీ సకళ సుస్త రాహిలో | ఝోపా ఘేత స్వస్థ బైసలో | 
అఖేర హే ఏసే ఫసలో | అసలో నసలో సారఖే | ||౧౧౭|| 
117. సోమరితనంతో మేమంతా నిశ్చింతగా నిద్రపోయాము. చివరకు మోసపోయాము. ఉండీ లేనివారలం అయిపోయాము. 
ఝాలో ఆమ్హీ గురుద్రోహీ | వేళీ కాహీంచ కేలే నాహీ | 
స్వస్థ బసావే తరీ తేంహీ | ఘడలే నాహీ ఆమ్హాంతే | ||౧౧౮|| 
118. మేము గురుద్రోహులమయ్యాం. సమయానికి సరిగ్గా ఏదీ చేయలేదు. ప్రశాంతంగా కూర్చున్నా బాగుండేది. మావల్ల అది కూడా సాధ్యం కాలేదు. 
లాంబ లాంబూన శిరడీస జావే | తేథేంహీ చకాట్యా పిటీత బసావే | 
తీర్థాస ఆలో హే సమూళ విసరావే | తేథేంహీ ఆచరావే యథేచ్ఛ | ||౧౧౯|| 
119. ఎంతెంతో దూరంనుండి శిరిడీకి వచ్చినా, అక్కడ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. తీర్థక్షేత్రానికి వచ్చామన్న సంగతే మరచిపోయి, అక్కడ కూడా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాము. 
తర్హేతర్హేచే భక్త అనేక | జ్ఞానీ అభిమానీ భావార్థీ తార్కిక | 
జయా సద్రూపే అవఘే ఎక | నేణే న్యూనాధిక్య జో భేద | ||౧౨౦||
120. భక్తులు అనేక రకం. కొందరు జ్ఞానులు, కొందరు అభిమానులు, ఇంకా కొందరు తార్కికులు, మరి కొందరు భావార్థిలు. కాని వారినందరినీ బాబా ఆత్మస్వరూపులవలె చూచేవారు. వారికి ఎక్కువ తక్కువ అనే భేదభావం తెలియదు. 

జగీ భగవంతావాచూన | దృష్టీ న జ్యాచ్యా పదార్థ ఆన | 
ఏసే జయాచే దేఖణేపణ | జో న ఆపణహీ దుజా | ||౧౨౧|| 
121. జగత్తులో వారు భగవంతుణ్ణే చూచారు తప్ప, ఇంకేమీ చూడలేదు. వారి దృష్టి అలా ఉండటం వలనే, వారు తమను వేరుగా అనుకునేవారు కాదు.
భక్త హేహీ స్వయే ఈశ్వర | మీ గురూహీ నవ్హే ఇతర | 
ఉభయాంస స్వస్వరూప విసర | భేద హే పరస్పర త్యా యోగే | ||౧౨౨|| 
122. భక్తుడు స్వయం ఈశ్వర స్వరూపుడే. అలాగే గురువు కూడా వేరు కారు. గురుశిష్యులిద్దరూ తమ ఆత్మస్వరూపాన్ని విస్మరించటం వలన, వారిద్దరూ వేరు వేరు అనే భేదభావం ఏర్పడుతుంది. 
వస్తుతః ఈశ్వరచి ఆహో ఆపణ | పరీ పరమార్థ స్వరూప విస్మరణ | 
హేంచ ముఖ్య భేదాచే లక్షణ | అధఃపతన తే హేంచ | ||౧౨౩|| 
123. నిజానికి, మనమూ ఈశ్వరులమే. కాని ఈ పరమార్థ స్వరూపాన్ని మరచి పోవటమే, మనలో భేదభావానికి ముఖ్య లక్షణం. దీనినే అధఃపతనం అని అంటారు. 
సార్వభౌమాస్వప్న హోఈ | భిక్షార్థ దారోదారీ జాఈ | 
నిజ బోధాచీ జాగ యేఈ | అవలోకీ ఠాయీంచ ఆపణా | ||౧౨౪|| 
124. సార్వభౌముడు భిక్షకోసం ఇంటింటికి వెళ్లినట్లు కలగంటాడు. కాని మేలుకున్న తరువాత తన పూర్వపు నిజస్థితిని తెలుసుకుంటాడు. 
ప్రవృత్తి హీ జీ జాగృతీ | తీచ నివృత్తి స్వప్నస్థితీ | 
ఖరీ జాగృతీ నిజానుభూతీ | పూర్ణ అద్వైతీ సమరసణే | ||౧౨౫|| 
125. మేలుకుని జాగృతావస్థలో చేసే పనులనుండి స్వప్నావస్థలో విరమిస్తాము. సంపూర్ణంగా అద్వైతంలో లీనమైపోవటమే నిజమైన జాగృతి ఆత్మానుభూతి. 
జ్ఞానీ అజ్ఞానీ సర్వ ఆశ్రిత | సర్వాంవరీ ప్రేమ అత్యంత | 
జీవాహూని మానీ ఆప్త | భేద నా తేథ యత్కించిత | ||౧౨౬|| 
126. తమను ఆశ్రయించిన జ్ఞానులు, అజ్ఞానులూ, అందరియందూ బాబాకు అత్యంత ప్రేమ. ఆప్తులుగా, తమ ప్రాణం కంటే మిన్నగా భక్తులను ఏ భేదభావం లేకుండా చూచేవారు. 
మనుష్యరూపే దేవచి హోతే | జరీ హే ఆణిలే ప్రచీతీతే | 
పరీ త్యాచియా లడివాళతేతే | బళీ పడలే తే సమస్త | ||౧౨౭|| 
127. మానవరూపంలో ఉన్న దేవుడు వారే అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. అయినా, వారి వాత్సల్యం భక్తులను వివశులను చేసింది. 
కోణాస దిధలీ ధనసంపత్తి | కోణాస సంసారసుఖ సంతతి | 
తేణే మహాన పడలీ భ్రాంతీ | జ్ఞాన ప్రాప్తీస ఆంచవలే | ||౧౨౮|| 
128. కొందరికి ధనసంపత్తిని ఇచ్చారు. మరి కొందరికి సంసార సుఖాన్ని, సంతానాన్నీ ఇచ్చారు. దీనితో ప్రజలు సంసార మోహంలొ పడి, జ్ఞానప్రాప్తికి దూరమయ్యారు. 
కధీ జయాసవే హాంసత | తయా అంగీ అభిమాన దాటత | 
కీ తయావరీచ ప్రేమ అద్భూత | ఇతరా న దావీత తే తైసే | ||౧౨౯|| 
129. ఎవరితోనైనా చనువుగా ఒకసారి బాబా నవ్వితే, తమయందే బాబాకు ఎక్కువ ప్రేమయని, ఇతరులపై లేదని తలచి గర్వపడేవారు. 
తేంచ కోణా క్రోధే వదతా | మ్హణతీ న తో తయా ఆవడతా | 
ఆమ్హా విశీంచ అధిక ఆదరతా | ఇతరా న దేతాత తో మాన | ||౧౩౦||
130. ఎవరినైనా బాబా కోప్పడితే, బాబాకు వారిపై మక్కువ లేదు, మాపైనే వారికి చాలా గౌరవం, ఇతరులను అలా గౌరవించరు అని కూడా అనుకునేవారు. 

ఏసేచ ఆమ్హీ నంబర లావితా | బాబాంచ్యా తే స్వప్నీహీ నసతా | 
ఉగాచ నాగవలో నిజస్వార్థా | కృతకర్తవ్యతా విసరలో | ||౧౩౧|| 
131. అటువంటి భావం బాబాకు కలలో కూడా లేకున్నా, ఆ విధంగా మేమే అనుకొని, మా కర్తవ్యాన్ని మరచిపోయి, వృథాగా పరమార్థాన్ని పోగొట్టుకున్నాం. 
పరబ్రహ్మ సగుణ మూర్తి | దైవే అసతా ఉశాగతీ | 
ఖర్యా కార్యాచీ హోఊని విస్మృతి | వినోదీ ప్రీతి ధరియేలీ | ||౧౩౨|| 
132. మన అదృష్టం కొద్దీ, సాక్షాత్తు పరబ్రహ్మ సగుణ రూపంలో మన ప్రక్కనే ఉన్నా, వారి వాస్తవమైన కార్యాన్ని మరచిపోయి, వినోదాల కోసం మనసు పడ్డాము. 
యేతాంచ బాబాంచే దర్శన ఘ్యావే | ఫళఫూల అవఘే సమర్పావే | 
దక్షణా మాగతా మగ కచరావే | నచ రహావే తే ఠాయీ | ||౧౩౩|| 
133. రాగానే బాబా దర్శనం చేసుకుని, పూలు పళ్లు సమర్పించి, వారు దక్షిణను అడగగానే, సందేహించి ఇక అక్కడ ఉండేవారము కాము. 
సాంగతా హితవాదాచ్యా గోష్టీ | పాహునీ ఆముచీ క్షుద్ర దృష్టి | 
ఝాలా వాటతే ఖరేంచ కష్టీ | గేలా ఉఠాఉఠీ నిజధామా | ||౧౩౪|| 
134. మీరు మా మేలుకోసమే హితోపదేశం చేశారు. మా అల్పబుద్ధిని చూసి, మనసు చాలా బాధపడి, బాబా తమ ధామానికి వెళ్లిపోయారేమో అని అనిపిస్తుంది. 
ఆతా తీ ఆపులీ స్వానందస్థితి | పునశ్చ కా హే నయన దేఖతీ | 
గేలీ హరపలీ తీ ఆనంద మూర్తి | జన్మజన్మాంతీ అదృశ్య | ||౧౩౫|| 
135. కాని ఇప్పుడు, ఆత్మానందాన్ని కలిగించే వారి రూపాన్ని, మరల ఈ కళ్లు చూడగలవా? అదృశ్యమైన ఆ ఆనందమూర్తిని, జన్మ జన్మలకూ లభించకుండా, పోగొట్టుకున్నాము. 
హా హా దారుణ కర్మ దేఖా | అంతరలా ఠాఈచా సాఈ సఖా | 
నిర్హేతుక దయాద్రృ తయా సారిఖా | ఝాలా పారఖా ఆమ్హాంసీ | ||౧౩౬|| 
136. ఎంత దారుణమైన కర్మ మనది? అతి చేరువలో ఉన్న సాయిలాంటి ఆప్తమిత్రుణ్ణి పోగొట్టుకున్నాము. అలాంటి నిస్వార్థులు, దయార్ద్ర హృదయులూ అయిన వారు, మనకిప్పుడు దూరమయ్యారు. 
“బరే నవ్హే కోణాతే ఛళణే | తేణే యేతే మజలా దుఖణే” | 
మనా నాణిలే హే బాబాంచే మ్హణణే | కేలీ భాండణే యథేచ్ఛ | ||౧౩౭|| 
137. “ఎవరినైనా కష్ట పెట్టటం మంచిది కాదు. దానివలన నాకు చాలా దుఃఖం కలుగుతుంది” అన్న బాబా మాటలను పాటించక, ఇష్టం వచ్చినట్లు పొట్లాడుకున్నాం. 
ఛళ కరితా భక్తాంభక్తా | ఆమ్హీ ముకలో కీ సాఈనాథా | 
హోతో తయాచా అనుతాప ఆతా | ఆఠవతీ వార్తా తయాంచ్యా | ||౧౩౮|| 
138. అలా చేసి, భక్తులను ఇతరులనూ బాధపెట్టాము, అందుకే మనం బాబాను కోల్పోయాము. సాయినాథుని ఉపదేశాలను తలచుకుంటూ, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాము. 
ఆఠా వర్షాచా బాళ జనీ | ప్రకట హోఈన మీ మాగుతేనీ | 
ఏసే మహారాజ భక్తా లాగునీ | ఆహేతీ సాంగునీ రాహిలే | ||౧౩౯|| 
139. “ఎనిమిది ఏళ్ల బాలునిగా నేను మరల జనులలో ప్రకటమౌతాను” అని సాయి మహారాజు భక్తులతో చెప్పారు. 
ఆహే హీ సంతాచీ వాణీ | వృథా మానూ నయే కోణీ | 
కృష్ణావతారీ చక్రపాణీ | కేలీ కరణీ ఏసీచ | ||౧౪౦||
140. ఇవి సంతులు పలికిన మాటలు. వీటిని వ్యర్థమని ఎవరూ భావించరాదు. విష్ణుమూర్తి కూడా కృష్ణావతారంలో ఇలాగే చేశారు. 

ఆఠ వర్షాచీ సుందర కాంతి | చతుర్భుజ ఆయుధే హాతీ | 
దేవకీ పుఢే బందీశాళేప్రతి | కృష్ణమూర్తీ ప్రకటలీ | ||౧౪౧|| 
141. ఎనిమిది ఏళ్ల వయసులో సుందరమైన తేజస్సుతో కృష్ణమూర్తి చతుర్భుజాలతో, చేతులలో ఆయుధాలను ధరించి, బందీఖానాలో దేవకీ ఎదుట ప్రకటమయ్యారు.
తేథే కారణ భూభారహరణ | యేథే దీనభక్తోద్ధారణ | 
తరీ కిమర్థ శంకా జనన | అతర్క్య విందాన సంతాంచే | ||౧౪౨|| 
142. అక్కడ భూభారాన్ని తగ్గించటానికి అయితే, ఇక్కడ దీన భక్తోద్ధారణ కోసం అవతరించారు. ఇందులో సందేహించటానికి ఆస్కారమేమున్నది? సంతుల లీలలు ఊహకందనివి. 
హా కాయ ఎకా జన్మాచా నిర్బంధ | బహాత్తర పిఢ్యాంచా ఋణానుబంధ | 
భక్తాంచా బాబానీ పూర్వ సంబంధ | కథానుబంధ కథియేలా | ||౧౪౩|| 
143. ఒక జన్మ బంధమా ఇది? డెబ్బై రెండు జన్మల ఋణానుబంధం, బాబాతో ఉన్న అపూర్వ సంబంధం. ఏదో మాటల సందర్భంలో ఈ విషయాన్ని బాబాయే చెప్పారు. 
ఏసే బాంధునీ ప్రేమ ఫాంసా | వాటతీ మహారాజ గేలే ప్రవాసా | 
యేతీల మాగుతేనీ హా పూర్ణ భరంవసా | భక్త మానసా ఝాలాసే | ||౧౪౪|| 
144. ఇలాంటి ప్రేమపాశంతో బంధించి, సాయి మహారాజు ఏదో ప్రయాణానికి వెళ్లినట్లు అనిపించినా, తప్పకుండా మరల వస్తారని భక్తుల పూర్తి నమ్మకం. 
సాక్షాత్కార కిత్యేకాంసీ | దృష్టాంతానుభవ బహుతేకాంసీ | 
చమత్కార తో అనేకాంసీ | గుప్త రూపేసీ దావితీ | ||౧౪౫|| 
145. బాబా ఎందరికో దర్శనాన్ని, ఇంకెందరికో కలలో దర్శనాన్ని కలిగించారు. మిగతా కొందరికి, రహస్యంగా చమత్కారలను చూపించారు. 
అభావికా గుప్త అసతీ | భక్తా భావికా ఠాఈంచ దిసతీ | 
జైసీ జయాచీ చిత్తవృత్తి | తైసీచ అనుభూతి రోకడీ | ||౧౪౬|| 
146. నమ్మకం లేనివారికి గుప్తంగానూ, నమ్మిన భక్తులకు స్పష్టంగానూ కనిపిస్తారు. మనోవృత్తిని అనుసరించి, అలాంటి అనుభూతి వారికి తప్పక కలుగుతుంది. 
చావడీంత గుప్త రూప | మశీదీంత బ్రహ్మరూప | 
సమాధీంత సమాధి రూప | సుఖస్వరూప సర్వత్ర | ||౧౪౭|| 
147. చావడిలో గుప్తంగానూ, మసీదులో బ్రహ్మరూపంలోనూ, సమాధి మందిరంలో సమాధిస్థితిలోనూ, మిగతా చోట్లలో ఆనంద స్వరూపంలోను అన్ని చోట్లా బాబా ఉన్నారు. 
అసో సాంప్రత హాచ విశ్వాస | భక్తీ ధరావా నిజ జీవాస | 
భంగ నాహీ సమర్థ సాఈస | అక్షయ రహివాస అఖండ | ||౧౪౮|| 
148. సాయి సమర్థుల సన్నిధికి ఏ భంగం రాలేదనీ, వారు శాశ్వతంగా ఇక్కడే నాశరహితంగా ఉన్నారనీ, ఇప్పుడు భక్తులు తమ హృదయంలో భక్తిగా విశ్వసించాలి. 
దేవ జాతీ నిజధామాప్రతి | సంతా ఠాయీంచ బ్రహ్మస్థితి | 
గమనాగమన తే నేణతీ | సమరసతీ ఆనందీ | ||౧౪౯|| 
149. దేవతలు తమ నిలయాలకి వెళ్లిపోతారు, కాని సంతులు ఇక్కడే, వారు ఉన్న స్థలంలోనే, బ్రహ్మస్థితిలో ఉంటారు. వారికి రాకపోకలు ఉండవు. వారు సదా ఆనందంలో లీనమై ఉంటారు. 
మ్హణోని ఆతా హేచ వినంతీ | నమ్రపూర్వక కరితో ప్రణతీ | 
సానా థోరా అవఘియా ప్రతీ | సాదర చిత్తీ అవధారా | ||౧౫౦||
150. అందుకు, చిన్నా పెద్దా అందరికీ వినయ పూర్వకంగా నమస్కరించి శ్రద్ధగా ఆలకించమని మనవి చేస్తున్నాను. 

జడో ఉత్తమశ్లోకసంగతీ | గురుచరణీ నిష్కామ ప్రీతీ | 
గురుగుణానుకథనాసక్తి | నిర్మల భక్తి ప్రకట హో | ||౧౫౧|| 
151. అత్యుత్తమైన కీర్తి ప్రతిష్ఠలు కలవారి సాంగత్యం మనకు కలుగని. గురుపాదాలలో నిష్కామమైన ప్రీతి కలిగి, గురువుయొక్క గుణాలను వర్ణించాలనే ఆసక్తి కలిగి, నిర్మలమైన భక్తి మనకు లభించుగాక. 
జడో ప్రీతి అనవచ్ఛిన్న | న హోత స్నేహపాశ భిన్న | 
అసోత భక్త సుఖసంపన్న | రాత్రందిన గురుపదీ | ||౧౫౨|| 
152. ఎడతెగని ప్రేమ మనకు కలగాలని, గురుపాదాలతో ముడిపడ్డ స్నేహబంధం తెగిపోకుండా ఉండని. రాత్రింబవళ్ళూ గురుపాదాలలో భక్తులు సుఖ సంపన్నులై ఉందురుగాక. 
అసో పుఢే త్యా దేహాచే ఉచిత | కరావే కాయ తే నిశ్చిత | 
యేచ విచారీ జన సమస్త | శిష్య గ్రామస్థ లాగలే | ||౧౫౩|| 
153. తరువాత, వారి దేహాన్ని తగిన విధంగా ఏ రీతిలో ఉంచాలి అని భక్తులు, గ్రామస్థులు ఆలోచించ సాగారు. 
శ్రీమంత బుట్టీ మోఠే భావూక | జణూ యా పుఢీల భవిష్యాచే స్మారక | 
టోలేజంగ వాడా సుఖకారక | బాంధూన స్థాఈక ఠేవిలా | ||౧౫౪|| 
154. శ్రీమంతుడైన బుట్టీ గొప్ప భక్తుడు. భవిష్యత్తులో స్మారకంగా ఉంటుందా అన్నట్లుగా, విశాలంగా, అందంగా ఉండే భవనాన్ని అప్పటికే నిర్మించి ఉంచాడు. 
మగ పుఢే తే కలేవర | కుఠే అసావే యా విషయావర | 
హోఊని ఛత్తీస తాస విచార | ఘడలే హోణార జే హోతే | ||౧౫౫|| 
155. ఆ తరువాత, ముప్పై ఆరు గంటలు బాబా శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అని ఆలోచించారు. కాని, జరగవలసిందే జరిగింది. 
ఎక మ్హణే యా కలేవరాసీ | స్పర్శూ న ద్యావే ఆతా హిందూసీ | 
ముసలమానాంచ్యా కబరస్థానాసీ | సమారంభేసీ నేఊయా | ||౧౫౬|| 
156. ఇక ఈ శరీరాన్ని హిందువులచే తాకనీయరాదు. ముసల్మానుల శ్మశానానికే ఊరేగింపుతో తీసుకుని పోదాము అని కొందరు అన్నారు. 
దుజా మ్హణే హే కలేవర | ఠేవావే నేఊన ఉఘడ్యావర | 
థడగే ఎక బంధావే సుందర | తయాంత నిరంతర రహావే హే | ||౧౫౭|| 
157. ఆరు బయట ఖాళీ స్థలంలో శరీరాన్ని ఉంచి, అక్కడ సుందరమైన దర్గా కట్టించి అందులో ఉంచాలి అని మరి కొందరు అన్నారు. 
ఖుశాలచంద అమీర శక్కర | యాంచాహీ హోతా హాచ విచార | 
పరీ “వాడియాంత పడో హే శరీర” | హోతే హే ఉద్గార బాబాంచే | ||౧౫౮|| 
158. ఖుశాలచందు మరియు అమీర శక్కరల ఉద్దేశం కూడా అదే. కాని “ఈ దేహాన్ని వాడాలో ఉంచండి” అని బాబా చెప్పారు. 
పాటీల రామచంద్ర మోఠే కరారీ | తేహీ ఎక గ్రామాధికారీ | 
బాబాంచే ప్రేమళ సేవేకరీ | వదతీ తే గాంవకరియాంసీ | ||౧౫౯|| 
159. రామచంద్ర పాటీలు చాలా దక్షత కలవాడు. దృఢమైన నిర్ణయాన్ని తీసుకోగల గ్రామాధికారి కూడా, పైగా బాబా భక్తుడు. అతడు గ్రామస్థులతో, 
అసోత తుమచే విచార కాంహీ | సమూళ ఆమ్హాంతే మాన్య నాహీ | 
వాడ్యా బాహేర ఇతరా ఠాయీ | క్షణభరీహీ సాఈ ఠేవూ నయే | ||౧౬౦||
160. ‘మీ ఆలోచనలు ఎలా ఉన్నా, అవి మాకు సమ్మతం కాదు. సాయి దేహాన్ని వాడాలో తప్ప, బయట ఎక్కడా కాసేపైనా ఉంచడానికి వీల్లేదు’ అని దృఢంగా చెప్పాడు. 

హిందూ ఆపులే ధర్మానుసార | మసలమానహీ తైసాచ విచార | 
యోగ్యాయోగ్య చర్చా ప్రకార | సబంధ రాత్రభర జాహలే | ||౧౬౧|| 
161. హిందువులు వారి ధర్మానుసారంగా, ముసల్మానులు వారి మతానుసారంగా, ఆలోచించ సాగారు. ఏది తగినది, ఏది కాదు అన్న చర్చ రాత్రంతా జరిగింది.
ఇకడే లక్ష్మణమామా ఘరీ | అసతా పహాంటే నిద్రేచ్యా భరీ | 
బాబా తయాంచ్యా ధరూని కరీ | మ్హణాలే “ఝడకరీ ఊఠ చల | ||౧౬౨|| 
162. ఇక్కడ, లక్ష్మణ మామా తన ఇంట్లో గాఢంగా నిద్రిస్తుండగా, తెల్లవారు ఝామున కలలో బాబా అతని చెయ్యి పట్టుకుని “లేచి త్వరగా పద. 
బాపూసాహేబ న యేణార ఆజ | మీ మేలో హా తయాచా సమజ | 
తూ తరీ కాకడ ఆరతీ మజ | కరీ పూజన సమవేత” | ||౧౬౩|| 
163. “బాపూసాహేబు ఇవాళ రాడు. నేను మరణించానని అతని అభిప్రాయం. నీవైనా వచ్చి పూజతో కాకడ ఆరతిని ఇవ్వు” అని అన్నారు. 
తాత్కాళ నిత్య క్రమానుసార | సవే ఘేఊన పూజసంభార | 
లక్ష్మణమామా ఆలే వేళేవర | పూజేసీ సాదర జాహలే | ||౧౬౪|| 
164. తక్షణమే నిత్యక్రమానుసారం పూజా సామగ్రిని వెంట తీసుకుని, లక్ష్మణ మామా సమయానికి సరిగ్గా పూజ చేయడానికి వచ్చాడు. 
గ్రామజోశీ హే శిరడీచే | సఖే మామా మాధవరావాంచే | 
పూజన కరీత నిత్య బాబాంచే | ప్రాతఃకాళచే సమయాస | ||౧౬౫|| 
165. ఇతడు శిరిడీ గ్రామంలోని పురోహితుడు. మాధవరావుయొక్క మేనమామ. నిత్యం ప్రాతఃకాల సమయంలో బాబా పూజ చేసేవాడు. 
మామా మోఠే కర్మఠ బ్రాహ్మణ | ప్రాతఃకాళీ కరూన స్నాన | 
కరూని ధూతవస్త్ర పరిధాన | ఘేత దర్శన బాబాంచే | ||౧౬౬|| 
166. మామా గొప్ప నిష్ఠావంతుడైన బ్రాహ్మణుడు. రోజూ ఉదయమే స్నానం చేసి, శుభ్రంగా ఉతికిన బట్టలను ధరించి, బాబా దర్శనం చేసుకునేవాడు. 
పాద ప్రక్షాలన గంధాక్షత చర్చన | పుష్పపత్రీ తులసీ సమర్పణ | 
ధూప దీప నైవేద్య నీరాంజన | దక్షిణాప్రదాన మగ కరితీ | ||౧౬౭|| 
167. బాబా పాదాలను కడిగి, గంధాక్షతలను అద్ది, తులసీదళాలతో, పత్రి పుష్పాలతో, ధూప దీప నైవేద్యాలతో పూజించి, నీరాజనమిచ్చి, దక్షిణను ఇచ్చేవాడు. 
ప్రార్థనాపూర్వక సాష్టాంగ నమన | హోతా ఘేతీ ఆశీర్వచన | 
మగ సమస్తా ప్రసాద దేఊన | తిలక రేఖూన తే జాత | ||౧౬౮|| 
168. తరువాత, ప్రార్థనా పూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి, బాబా ఆశీస్సులు తీసుకుని, అందరికీ గంధం బొట్టు పెట్టి, ప్రసాదాన్ని ఇచ్చి వెళ్లేవాడు. 
తేథూన పుఢే గజానన | శనిదేవ ఉమారమణ | 
మారూతిరాయ అంజనీనందన | యాంచే పూజన కరీత తే | ||౧౬౯|| 
169. దాని తరువాతే, గణేశుని, శనిదేవుని, శివుని మరియు అంజనీపుత్రుడైన మారుతినీ పూజ చేసేవాడు. 
ఏసే సర్వ గ్రామ దేవా | నిత్య పూజీత జోశీబువా | 
మ్హణోని సాగ్ర పూజా త్యా శవా | ప్రేమభావా ఆణిలీ | ||౧౭౦||
170. ఈ విధంగా గ్రామదేవతలందరినీ లక్షణమామా నిత్యం పూజించేవాడు. అలాగే ఇప్పుడు, బాబా శరీరానికి ఎంతో ప్రేమతో సకలోపచారాలతో పూజ చేశాడు. 

మామా ఆధీంచ నిష్ఠావంత | తయావరీ సాక్షాత హా దృష్టాంత | 
ఆలే కాకడ ఆరతీ హాతాంత | కేలా ప్రణిపాత సాష్టాంగ | ||౧౭౧|| 
171. అసలే మామా చాలా నిష్ఠాపరుడు. పైగా ఇప్పుడు సాక్షాత్తు బాబా స్వప్న దర్శనం. కాకడ ఆరతి పళ్లెమును చేత్తో పట్టుకుని వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు. 
ముఖావరీల వస్త్ర కాఢూన | కరూని సప్రేమ నిరీక్షణ | 
కరచరణ క్షాళణ శుద్ధాచమన | సారిలే పూజన యథావిధి | ||౧౭౨|| 
172. బాబా ముఖము పైని వస్త్రాన్ని తొలగించి, ప్రేమగా చూసి, యథావిధిగా శుద్ధాచమనంతో వారి కర చరణాలను ప్రక్షాళన చేశాడు. 
మౌలవీ ఆది కరూన అవింధ | స్పర్శ కరాయా కరీతీ ప్రతిబంధ | 
మామాంనీ న మానితా లావిలే గంధ | పూజాహీ సంబంధ సారిలీ | ||౧౭౩|| 
173. మౌల్వీ మొదలగు మహమ్మదీయులు బాబాని తాకనివ్వక అడ్డు పడినా, మామా వారిని లెక్కచేయకుండా, బాబాకు గంధం రాసి, పూజనంతా చేశాడు. 
శవ తరీ తే సమర్థాంచే | ఆపుల్యా ఆరాధ్యదైవతాచే | 
హిందూచే కీ అవింధాచే | నాహీ మామాంచే స్వప్నీంహీ | ||౧౭౪|| 
174. ఆ శవం తన ఆరాధ్య దైవమయిన సమర్థులది. అంతే కాని, అది హిందువుదా, మహమ్మదీయునిదా అన్న ఆలోచన కలలో కూడా మామాకు రాలేదు. 
పూజ్య శరీర అసతా సజీవ | తయా పూజేచా కేవఢా ఉత్సవ | 
తేంచ ఆతా హోతా శవ | పూజావైభవ నా ఔపచారిక | ||౧౭౫|| 
175. ఆ పూజ్య శరీరం సజీవంగా ఉన్నప్పుడు ఎంత ఘనంగా పూజ జరిగేదో, ఇప్పుడు కూడా ఆ శరీరానికి అంతే వైభవంగా పూజ జరిగింది కాని, ఔపచారికంగా మాత్రం కాదు. 
తశాంత పాహూని బాబాంచే చిన్హ | ఆధీంచ మామా దుఃఖానే ఖిన్న | 
కరూ ఆలే అఖేరచే పూజన | పునర్దర్శన దుర్లభ | ||౧౭౬|| 
176. బాబాని ఆ స్థితిలో చూచి అసలే దుఃఖంతో బాధపడుతున్నా, వారి పునర్దర్శనం దుర్లభమని, వారి చివర పూజకై వచ్చాడు. 
భరలే అశ్రూంహీ లోచన | కరవే నా త్యా స్థితీచే ఆలోచన | 
హస్తపాద కంపాయమాన | ఉదాస మన మామాంచే | ||౧౭౭|| 
177. అతని కళ్లు అశ్రువులతో నిండి పోయాయి. వారిని ఆ స్థితిలో చూడలేక పోయాడు. కాళ్లూ చేతులూ వణక సాగాయి. మామా మనసు బాధతో మూగవోయింది. 
అసో వళలేల్యా ముఠీ ఉఘడూన | విడా దక్షిణా త్యాంత ఠేవూన | 
శవ తే పూర్వవత ఝాంకూన | మామా నిఘూన మగ గేలే | ||౧౭౮|| 
178. అయినా, మూసుకుని ఉన్న సాయి చేతిని తెరచి, అందులో తాంబూలాన్నీ దక్షిణను ఉంచి, వారి శరీరాన్ని మునపటివలె కప్పి, మామా బాధతో బయలుదేరి వెళ్లిపోయాడు. 
పుఢే మగ దుపారచీ ఆరతీ | నిత్యా ప్రమాణే మశీదీంత వరతీ | 
బాపూసాహేబ జోగ కరితీ | ఇతరాం సమవేతీ సాఈచీ | ||౧౭౯|| 
179. తరువాత, మసీదులో ప్రతిరోజూ జరిగేలా, మధ్యాహ్న ఆరతిని బాపూసాహేబు జోగు ఇతరులతో కలిసి చేశాడు. 
అసో యేథూన పుఢీల వృత్త | పుఢీల అధ్యాయీ హోఈల కథిత | 
కైసా బాబాంచా దేహ సంస్కారిత | అతి ప్రశస్త స్థానాంత | ||౧౮౦||
180. అత్యంత ప్రశస్తమైన స్థలంలో, బాబా శరీరానికి, ఏ విధంగా అంతిమ సంస్కారాలు జరిగాయి, అన్న మిగతా సంగతులను తరువాతి అధ్యాయంలో చెప్పబడింది. 

కైసీ తయాంచీ అతి ఆవడతీ | బహుతా వర్షాచీ సాంగాతీ | 
వీట భంగతా దుశ్చిన్హ స్థితీ | దేహాంత సుచవితీ జాహలీ | ||౧౮౧|| 
181. ఎన్నో సంవత్సరాలుగా వారి దగ్గర ఉండిన, అత్యంత ప్రియమైన ఇటుక విరిగి పోగా, దానిని వారు అశుభ చిహ్నంగా భావించి, తమ అంతిమ సమయాన్ని సూచించటం జరిగింది. 
కైసా జో ఆలా ప్రసంగ ఆతా | బత్తీస వర్షాపూర్వీంచ యేతా | 
బ్రహ్మాండీ ప్రాణ చఢవిలా అసతా | కఠీణ అవస్థా దేహాస | ||౧౮౨|| 
182. ఇప్పుడు జరిగిన ఘటనే, ముప్పైరెండు సంవత్సరాల క్రితమే, బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసినప్పుడు (నిర్వికల్ప సమాధి) జరిగి ఉంటే, వారి శరీరానికి ఎంత కఠిన పరిస్థితి ఏర్పడి ఉండేది; 
కైసే భక్త మ్హాళసాపతీ | అహోరాత్ర బాబాంస జపతీ | 
కైసీ ఆశా సోడితా సమస్తీ | అవచిత మగ పావతీ ఉత్థాన | ||౧౮౩|| 
183. భక్త మహల్సాపతి ఏ విధంగా అహోరాత్రులూ బాబాను రక్షించాడు, అందరూ ఆశను వదలుకోగా వారు అకస్మాత్తుగా ఎలా లేచారు; 
ఏసా ఆమరణ బ్రహ్మచర్య | ఆచరలా జో యోగాచార్య | 
జో జ్ఞానియాంచా జ్ఞానీవర్య | కాయ తే ఏశ్వర్య వానావే | ||౧౮౪|| 
184. జీవితాంతం బ్రహ్మచర్యాన్ని ఆచరించిన యోగాచార్యులు, జ్ఞానులలో జ్ఞానవర్యులు అయిన సాయియొక్క ఐశ్వర్యాన్ని ఎలా వర్ణించను? 
అసో ఏసీ జయాచీ మహతీ | కరూ తయా సద్భావే ప్రణతీ | 
దీన హేమాడ అనన్యగతీ | శరణ తయాప్రతీ యేతసే | ||౧౮౫||
185. ఇంత మహిమగల సాయికి సద్భావంతో ప్రణామం చేద్దాము. దీనుడైన హేమాడు వారిని అనన్య శరణు వేడుచున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | శ్రీ సాఈనాథ నిర్యాణం నామ | 
| త్రిచత్వారింశోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||


టిపణీ: 
1. వీట. 
2. యా ఆడనావాచా బాబాంచా ఎక భక్త. 
3. ఎకనాథ మహారాజ. 
4. అరణ్య. 

No comments:

Post a Comment