శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౬ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
ధన్య శ్రీసాఈ తుఝే చరణ | ధన్య శ్రీసాఈ తుఝే స్మరణ |
ధన్య శ్రీసాఈ తుఝే దర్శన | జే కర్మబంధన మోచక | ||౧||
ధన్య శ్రీసాఈ తుఝే చరణ | ధన్య శ్రీసాఈ తుఝే స్మరణ |
ధన్య శ్రీసాఈ తుఝే దర్శన | జే కర్మబంధన మోచక | ||౧||
1. ధన్యం శ్రీసాయి మీ చరణాలు! ధన్యం శ్రీసాయి మీ స్మరణ! కర్మబంధనాలనుండి విముక్తి ప్రసాదించే మీ దర్శనం, శ్రీసాయి, ధన్యం!
సమాధిస్థ జాగతీ జ్యోతీ | సద్యఃప్రతీతీ భక్తార్థ | ||౨||
2. ఇప్పుడు మీరు అదృశ్యంగా ఉన్నా, మీలో భక్తిభావాన్ని ధరిస్తే, సమాధిలో ఉన్న మీ జ్యోతి జాగృతమౌతుంది. భక్తులు నేటికీ దీనిని అనుభవ రూపంగా చూస్తున్నారు.
దోరీ సూక్ష్మ ధరిసీ ఏసీ | పాహూ జాతా దిసో నా దేశీ | పరీ నిజభక్తా ఖేంచూన ఆణిశీ | దేశీ విదేశీ అసో కీ | ||౩||
3. మేమంతా ఎంత ప్రయత్నించినా కనిపించని సూక్ష్మమైన దారంతో, మీ భక్తులు ఈ దేశంలో ఉన్నా, విదేశాలలో ఉన్నా, మీ వద్దకు లాక్కుని వస్తారు.
ఆణూని సోడిసీ పాయాపాశీ | ప్రేమే ధరిసీ త్యా పోటాశీ | మాతా జైసీ నిజబాళకాసీ | తైసా తూ పోశిసీ అవలీలా | ||౪||
4. వారిని మీ పాదాల వద్దకు తెచ్చిన వెంటనే, వారిని ప్రేమతో కౌగలించుకుని, తల్లి తన బిడ్డలను చూచేలా మీరు వారిని ప్రేమగా, సునాయాసంగా పోషిస్తారు.
ఏసే కాంహీ సూత్ర చాళవిసీ | నకళే కోణా కోఠే అససీ | పరీ పరిణామీ వాటే మనాసీ | ఆహేస కీ పాఠీసీ భక్తాంచ్యా | ||౫||
5. సూత్రాలను ఎలా నడిపిస్తారంటే, మీరు ఎక్కడున్నది ఎవరికీ తెలియదు. కాని, పరిణామాలు ఎలా ఉంటాయంటే, మీరు భక్తుల వెనుకే ఎప్పుడూ ఉన్నట్లు వారికి అనుభవమౌతుంది.
జ్ఞానీ, పండిత శహాణే సుర్తే | అభిమానే రుతతీ సంసారగర్తే | భోళే భాబడే అజ్ఞానీ నేణతే | త్యా నిజసత్తే ఖేళవిసీ | ||౬||
6. జ్ఞానులు, పండితులు, చతురులు వారి అహంభావం వలనే ప్రపంచమనే సుడిగుండంలో చిక్కుకుంటారు. కాని, అమాయకులను, అజ్ఞానులను, ఏమీ తెలియని వారిని మీ స్వశక్తితో ఆడిస్తారు.
ఆంతూన సకల ఖేళ ఖేళసీ | అలిప్తతేచా ఝేండా మిరవిసీ | కరోని అకర్తా స్వయే మ్హణవిసీ | నకళే కవణాసీ చరిత్ర తుఝే | ||౭||
7. లోలోపల ఎన్నో లీలలను చేస్తూ, పైకి మాత్రం ఏమీ అంటనట్లు కనిపిస్తారు. అన్నీ చేస్తూ, నేనేమీ చేయను, నేను కర్తను కాను అని చెప్పుకుంటారు. మీ చరిత్ర నిజంగా ఎవరికీ అర్థం కానిది.
మ్హణోని కాయావాచా మన | కరూ తుఝియా పాయీ అర్పణ | ముఖీ నిరంతర నామస్మరణ | హోఈల క్షాలన పాపాచే | ||౮||
8. అందుకే, శరీరాన్ని, వాక్కుని, మనసును మీ పాదాలకు సమర్పించి, నిరంతరం నోటితో మీ నామ స్మరణ చేస్తే, పాపాలన్నీ తొలగిపోతాయి.
సకామాచా పురవీసీ కామ | నిష్కామా దేసీ నిజసుఖధామ | ఏసే గోడ తుఝే నామ | ఉపాయ సుగమ సద్భక్తా | ||౯||
9. కోరికలున్నవారి కోరికలు తీర్చి, ఏ కోరికలూ లేనివారికి శాశ్వత ఆత్మానందాన్ని ప్రసాదిస్తారు. ఇటువంటి మధురమైన మీ నామమొక్కటే సద్భక్తులకు సులభమైన ఉపాయం.
తేణే పాపాంచా హోఈల క్షయ | రజతమ జాతీల నిఃసంశయ | సత్వ గుణాచా క్రమే ఉపచయ | ధర్మసంచయ త్యాపాఠీ | ||౧౦||
10. దానివలన, పాపాలు నశించి పోయి, రజస్తమో గుణాలు నిశ్శేషంగా తొలగిపోయి, క్రమేణ సత్వ గుణం అభివృద్ధి చెంది, ధర్మం మనలో నెలకొంటుంది.
ధర్మవృత్తీ హోతా జాగృత | వైరాగ్య యేఈ మాగే ధాంవత |
నామశేష విషయ హోత | తాత్కాళ ప్రకటత నిజజ్ఞాన | ||౧౧||
11. ఈ రకంగా ధర్మవృత్తి మనలో జాగృతం కాగానే, వైరాగ్యం వెంటనే తొందరగా వస్తుంది. విషయ సుఖాల కోరికలన్నీ నశించి, ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమౌతుంది.
వివేకేంసీ లాభతా జ్ఞాన | స్వస్వరూపీ అనుసంధాన | తేంచ గురుపదీ అవస్థాన | పూర్ణ ‘గుర్వర్పణ’ యా నాంవ | ||౧౨||
12. నిత్యానిత్య వివేకంతో జ్ఞానం కలగగానే, ఆత్మస్వరూపంతో ఐక్యత కుదురుతుంది. అదే గురుచరణాలలో స్థిరపడటం. దీనినే గురువుకు సంపూర్ణ అర్పణ అని అంటారు.
మన సాఈపదీ అర్పణ | జాహలే యాచీ ఎకచ ఖూణ | సాధక హోయ శాంతి ప్రవణ | ఉల్హాసే సంపూర్ణ నిజభక్తి | ||౧౩||
13. మనసు సాయి పాదాలకు అంకితమైంది అని అనటానికి ఒకటే గుర్తు. సాధకుని మనసు శాంతినే ఆశిస్తుంది. అతని భక్తి పరాకాష్ఠ చెందుతుంది.
సప్రేమ గురుభక్తి యా నాంవ ‘ధర్మ’ | అవఘా తో మీచ హే ‘జ్ఞానవర్మ’ | విషయీ అరతి ‘వైరాగ్య’ పరమ | సంసారా ‘ఉపరమ’ తే ఠాయీ | ||౧౪||
14. ప్రేమపూర్వకమైన గురుభక్తికి ధర్మం అని పేరు. అంతటా నేనే అన్నది జ్ఞానసారం. విషయసుఖాలలో నిరాసక్తి కలగటం పరమ వైరాగ్యం. దానితో మనసు ప్రపంచంనుండి విరమిస్తుంది.
ఏసియా భక్తీచా మహిమా ధన్య | కేలియా జీవేభావే అనన్య | శాంతి విరక్తి కీర్తి యా తీన | జియేచ్యా ఆధీన సర్వదా | ||౧౫||
15. ఇలాంటి భక్తియొక్క మహిమ ధన్యం. దీనినే ఏకాగ్ర మనసుతో సాధించినవారికి శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడూ ఎప్పుడూ అధీనంలో ఉంటాయి.
గురుభక్తి ఏసీ జయాసీ | ఉణే కైచే తరీ తయాసీ | ఇచ్ఛీల జే జే అపులే మానసీ | తే తే అప్రయాసీ లాధేల | ||౧౬||
16. ఇలాంటి గురుభక్తి ఉన్నవారికి ఏమి లోటు ఉంటుంది? మనసులో దేనిని కోరినా అది అప్రయాసంగా లభిస్తాయి.
ఏసియా త్యా భక్తీపాసీ | బ్రహ్మస్థితి తో ఆందణీ దాసీ | తేథే కోణీ న మోక్షా పుసీ | తీర్థే పాయాంసీ లాగతీ | ||౧౭||
17. ఇలాంటి భక్తి ఉన్న చోట బ్రహ్మస్థితి దాసివలే ఉంటుంది. అక్కడ మోక్షాన్ని ఎవరూ ఖాతరు చేయరు. అట్టివారి పాదాల వద్దకు పుణ్యతీర్థాలు చేరుతాయి.
పూర్వీల అధ్యాయీ జాహలే కథన | దీక్షితాంచే భాగవత వాచన | నవయోగియాంచే భక్తివర్ణన | చరణదర్శన సాఈచే | ||౧౮||
18. గత అధ్యాయంలో దీక్షితు భాగవతాన్ని పఠించటం, నవయోగులయొక్క భక్తి వర్ణన, సాయియొక్క పాద దర్శనం గురించి చెప్పబడింది.
సాఈ భక్త ఆనందరావ | పాఖాడే జయాలాగీ ఉపనావ | కథిలే తయాంచే స్వప్నలాఘవ | భక్తీచే వైభవ సాఈచ్యా | ||౧౯||
19. అలాగే, పాఖాడే అనే ఉపనామమున్న ఆనందరావుయొక్క అద్భుతమైన స్వప్న వృత్తాంతాన్ని గురించి, సాయియొక్క భక్తి వైభవాన్ని గురించీ చెప్పాను.
సాఈ జయాస ఘేతీ పదరీ | తో ఘరీ అసో వా ద్వీపాంతరీ |
తయా సన్నిధ అష్టౌ ప్రహరీ | వసే నిర్ధారీ శ్రీసాఈ | ||౨౦||
20. సాయి ఎవరిని తమ దరికి చేర్చుకున్నారో వారు ఇంటిలో ఉన్నా, ఎక్కడో ద్వీపాంతరంలో ఉన్నా, శ్రీసాయి ఎల్లప్పుడూ వారి వద్దే తప్పకుండా ఉంటారు.
భక్త జేథే జేథే జాఈ | తేథే తేథే కవణ్యాహీ ఠాయీ |
ఆధీంచ జాఊన ఉభా రాహీ | దర్శన దేఈ అకల్పిత | ||౨౧||
21. భక్తులు ఎక్కడెక్కడికి వెళ్ళినా అక్కడక్కడకి, ఏ ప్రదేశమైనా, సాయి ముందుగానే వెళ్లి అకస్మాత్తుగా వారికి దర్శనమిస్తారు.
విస్మయ వాటేల శ్రవణ కరితా | ఆనంద చిత్తా హోఈల | ||౨౨||
22. దీని గురించే ఒక అభినవ కథను శ్రోతలైన మీకు చెప్పుతాను. ఈ కథను వింటే మనసుకు ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి.
యేథీల సాఈ ముఖీచీ అక్షరే | భావే సేవితా శ్రవణద్వారే | సమాధి సౌఖ్య ఫిరే మాఘారే | స్వానందే తరతరే సద్భక్త | ||౨౩||
23. ఇక్కడ సాయి నోటినుండి వచ్చిన మాటలను చెవుల ద్వారా భక్తిగా వింటే, సమాధి సుఖం కూడా దానికి సమం కాదు. సద్భక్తులు ఆత్మానందంతో తరిస్తారు.
జేథ ప్రతిపదీ చమత్కారతా | ఏసీ హీ గోడ కథా పరిసతా | ఆప ఆపణా విసరేల శ్రోతా | అలోట గహివరతా దాటేల | ||౨౪||
24. అడుగడుగున చమత్కారంతో నిండిన ఇటువంటి మధురమైన కథను వింటే శ్రోతలు తమను తాము మరచిపోతారు. అత్యంత భావోద్రేకంతో వారు పులకించి పోతారు.
కాకాసాహేబ దీక్షితాంచా | జ్యేష్ఠ పుత్ర బాబూ యాచా | నాగపురీ వ్రతబంధ సాచా | కరావయాచా నిశ్చయ | ||౨౫||
25. కాకాసాహేబు దీక్షితుని పెద్ద కుమారుడైన బాబుకు నాగపూరులో ఒడుగు చేయాలని నిశ్చయమైంది.
నానాసాహేబ చాందోరకర | తయాంచాహీ జ్యేష్ఠ పుత్ర | తయాచ్యాహీ లగ్నాచా విచార | జాణే గ్వాల్హేర శహరాసీ | ||౨౬||
26. నానాసాహేబు చాందోర్కరుని పెద్ద కుమారునికి కూడా వివాహం చేయాలని అనుకోగా, దాని కోసం గ్వాలియరు పట్టణానికి వెళ్లవలసి ఉంది.
మౌంజీబంధన ఝాలియా పాఠీ | గ్వాల్హేరీస లగ్నాసాఠీ | కాకాముళే వ్హావీ న ఖోటీ | హోతే హే పోటీ నానాంచ్యా | ||౨౭||
27. ఒడుగు కార్యం పూర్తయాక గ్వాలియరుకు రావటానికి కాకాకు కొంత సమయం కావలసి ఉంటుంది అనేది నానా ఆలోచన.
నాగపురాహూని గ్వాల్హేరీస | కాకానే యావే స్వస్థ మానస | ఏసియా ధరిలే సుముహూర్తాస | జో కీ ఉభయతాంస సోయీచా | ||౨౮||
28. నాగపూరునుండి గ్వాలియరుకు కాకా సానుకూలంగా రావటానికోసం, ఇద్దరికీ వీలుగా ఉండే ముహూర్తాలను నిర్ణయించాడు.
నంతర సాఈచే దర్శనాస | లగ్నాచ్యాహీ ఆమంత్రణాస | నానాసాహేబ భక్తావతంస1 | పాతలే శిరడీస ఉత్సాహే | ||౨౯||
29. తరువాత, సాయిని దర్శనం చేసుకుని, అలాగే వివాహానికి కూడా పిలవటానికి, భక్త శ్రేష్ఠుడైన నానాసాహేబు ఎంతో ఉత్సాహంగా శిరిడీకి వచ్చాడు.
కాకాసాహేబ తేథేంచ హోతే | నానా జాఊన మశీదీతే | బాబాంస నిమంత్రితీ లగ్నాతే | కర సంపుటాతే జోడూన | ||౩౦||
30. కాకాసాహేబు అక్కడే ఉన్నాడు. నానా మసీదుకు వెళ్లి చేతులు జోడించుకుని బాబాను వివాహానికి రావలసిందిగా ఆహ్వానించాడు.
తంవ బాబా “బరే” మ్హణతీ | “సవే శామ్యాస2 నేఈ” వదతీ |
పుఢే దో దివసీ కాకాహీ పుసతీ | బాబాంస ఆమంత్రితీ ముంజీతే | ||౩౧||
31. బాబా అప్పుడు “సరే” అని తరువాత “శ్యామ్యాను వెంటబెట్టుకుని వెళ్లు” అని చెప్పారు. కాకాసాహేబు కూడా బాబాను ఒడుగుకు రావలసిందిగా ఆహ్వానించాడు.
త్యాంసహీ బాబా తైసేంచ వదతీ | “శామ్యాస నేఈ” మ్హణతీ సంగతీ | కాకాసాహేబ ఆగ్రహ కరితీ | స్వయే యేణ్యాప్రతీ బాబాంస | ||౩౨||
32. అతనికి కూడా “శ్యామ్యాను వెంటబెట్టుకుని వెళ్లు” అని బాబా చెప్పారు. కాని, కాకాసాహేబు బాబా స్వయంగా రావాలని వారిని బలవంత పెట్టాడు.
తయావరీహీ తాత్కాళ ఉత్తర | “కాశీప్రయాగ కరూని సత్వర | శామ్యాచేహీ యేతో అగోదర | మజ కాయ ఉశీర యావయా” | ||౩౩||
33. అందుకు బాబా వెంటనే “కాశీ ప్రయాగ యాత్రలు త్వరగా చేసి, శ్యామ్యాకంటే ముందుగానే వస్తాను. రావటానికి నాకేం ఆలస్యం” అని జవాబిచ్చారు.
ఆతా శ్రోతీ యా శబ్దాంవర | దేఊన చిత్త వ్హావే అర్థపర | పహావయా తయాంచే ప్రత్యంతర | బాబాంచీ సర్వవ్యాపకతా | ||౩౪||
34. ఈ మాటలను శ్రోతలు గుర్తుంచుకోండి. వాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే, సాయియొక్క సర్వ వ్యాపకత్వాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవచ్చు.
అసో భోజన ఝాలియావర | మాధవరావ కరితీ విచార | ‘ఎకదా పదరీ పడతా గ్వాల్హేర | కాశీ మగ కాయ దూర అసే’ | ||౩౫||
35. అలా, భోజనం చేసి, మాధవరావు ‘ఒకసారి గ్వాలియరు వరకూ బయలుదేరితే ఇక కాశి ఎంత దూరంలో ఉంటుంది’ అని ఆలోచించాడు.
రుపయే ఖర్చీస ఘేతలే శంభర | నందరామాచే3 ఉసనవార | గేలే బాబాంచా ఘ్యావయా రుకార | పుసతీ అతి ఆదరపూర్వక | ||౩౬||
36. దారి ఖర్చుకోసం నందరాము దగ్గర వంద రూపాయలను అప్పు తీసుకుని, బాబా అనుమతిని తీసుకోవడానికి వెళ్లాడు. ఎంతో ఆదర ఫూర్వకంగా,
‘ఆతా లగ్న ముంజీ నిమిత్త | ఘడతసే జాణే గ్వాల్హేరీ పర్యంత | కాశీ గయా ప్రసంగోపాత్త | సాధావీ ఉచిత వాటే మనా | ||౩౭||
37. ‘ఒడుగు, వివాహం కారణంగా ఇప్పుడు గ్వాలియరు వరకు వెళ్లుతున్నాను కదా, కాశీగయా యాత్రలు కూడా చేస్తే మంచిదని అనుకుంటున్నాను.
తరీ దేవా పడతసే పాయా | కరూని యేఊ కా కాశీ గయా’ | బాబాంనీ ఆజ్ఞా దిధలీ జావయా | మాధవరావాస ఆనందే | ||౩౮||
38. ‘అందుకు దేవా, మీ చరణాలకు నమస్కరించి ప్రార్థిస్తునాను, మరి కాశీగయా వెళ్లిరానా?’ అని అడిగాడు. బాబా ఆనందంతో మాధవరావుకు వెళ్లటానికి అనుమతిని ఇచ్చారు.
ఆణీక వరతీ వదలే తయాంసీ | “వావగే తరీ తూ కాయ పుససీ | సహజ ఘడే జే అప్రయాసీ | అచూక తే నిశ్చయేసీ సాధావే” | ||౩౯||
39. ఇంకా అతనితో బాబా “నీవు ఆడుగుతున్న దానిలో అనుచితం ఏముంది? ఎందుకు అడుగుతున్నావు? ఏ కష్టం లేకుండా సహజంగా జరిగేదానిని తప్పకుండా సాధించుకోవాలి” అని చెప్పారు.
అసో ఏసీ ఆజ్ఞా ఝాలీ | మాధవరావానీ గాడీ కేలీ | వాట కోపరగాంవాచీ ధరలీ | గాంఠ తంవ పడలీ ఆపాచీ4 | ||౪౦||
40. అలా అతనికి బాబా అనుమతిని ఇచ్చారు. మాధవరావు బండి చేసుకుని కోపర్‍గాం మార్గాన పడ్డాడు. అప్పుడు అప్పా కోటేను కలిశాడు.
ఆణావయాస అపులీ నాత | ఆపా జాత చాందవడా ప్రత |
ఏకూనియా తీ కాశీచీ మాత | ఉడీ తే టాకీత తాంగ్యాంతునీ | ||౪౧||
41. అప్పా తన మనవరాలిని తీసుకుని రావటానికి చాంద్‍వాడాకు వెళ్లుతున్నాడు. కాశీ యాత్రను గురించి విని టాంగాలోనుండి దూకాడు.
మాధవరావాసారఖా సహవాస | ఆపా కోత్యాంస త్యాగవేనా | ||౪౨||
42. కాశీ ప్రయాణానికి అతని వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ మాధవరావు వంటి తోడును వదులుకోలేక పోయాడు.
మాధవరావాంనీ దిధలా ధీర | ఆపా కోత్యాంస మగ కాయ ఉశిర | ఆనందే గాడీంత బైసలే సత్వర | ప్రసంగతత్పర హోఊని | ||౪౩||
43. మాధవరావు ధైర్యం చెప్పిన తరువాత, ఇక అప్పాకోతేకు ఆలోచించవలసినది ఏముంది? ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఆనందంగా బండిలో కూర్చున్నాడు.
ఆపా కోతే పాటీల సధన | పరీ న మార్గీ పైశాచే సాధన | తదర్థ త్యాంచే కాశీ ప్రయాణ | చుకేల హీ దారుణ చింతా తయా | ||౪౪||
44. అప్పా కోతే పాటీలు ధనవంతుడే. కాని చాంద్‍వాడాకని వెళ్లినందువలన అప్పుడు చేతిలో డబ్బు లేకపోవడంతో, కాశీ ప్రయాణం ఆగిపోతుందేమోనని అతనికి పెద్ద చింత.
వాహత్యా గంగేచియా ఆంత | హాత ధువావే ఆలే మనాంత | మాధవరావాసారఖీ సోబత | సాధావీ హే మనోగత ఆపాచే | |||౪౫||
45. చేజిక్కిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా పుణ్యం సంపాదించుకోవాలి. పైగా మాధవరావు వంటి తోడు ఉన్నప్పుడు తన కోరికను తీర్చుకోవాలి అని అప్పా ఆలోచన.
అసో హీ త్యాంచీ వేళ జాణూన | వేళీ తయాసీ ధీర దేఊన | మాధవరావానీ సవే నేఊన | కాశీ త్యా ఘడవూన దీధలీ | ||౪౬||
46. అతని బాధను గ్రహించి, అతనికి ధైర్యం చెప్పి, మాధవరావు అతనిని వెంట పెట్టుకుని వెళ్లి, కాశీయాత్ర పుణ్యం ఆయనకు కూడా వచ్చేలా చేశాడు.
పుఢే తే గేలే నాగపురాస | ముంజీచియా సమారంభాస | కాకాసాహేబ మాధవరావాంస | దేతీ ఖర్చావయాస దోనశే5 | ||౪౭||
47. తరువాత, వారిద్దరూ ఉపనయన శుభకార్యానికి నాగపూరుకి వెళ్లారు. దారి ఖర్చుకోసం కాకాసాహేబు మాధవరావుకు రెండు వందల రూపాయలను ఇచ్చాడు.
తేథూన కేలే గ్వాల్హేరీస | తేథీల లగ్నసమారంభాస | నానాసాహేబ మాధవరావాంస | దేతీ తే సమయాస శంభర6 | ||౪౮||
48. అక్కడనుండి, వివాహ సమారంభానికి గ్వాలియరు వెళ్లారు. నానాసాహేబు మాధవరావుకు వంద రూపయలను ఇచ్చాడు.
నానాంచే వ్యాహీ శ్రీమంత జఠార | తయాంనీహీ దిధలే శంభర | ఏశియా రీతీ ప్రేమసంభార | ఝాలా గురుబంధూవర నానాంచ్యా | ||౪౯||
49. నానా వియ్యంకుడు, శ్రీమంత జఠారు కూడా వంద రూపాయలను ఇచ్చాడు. ఈ విధంగా తన గురుబంధువును నానా సత్కార పూర్వకంగా గౌరవించాడు.
కాశీస మంగళ ఘాటావర | జడావాచే కోరీంవ సుందర | లక్ష్మీ నారాయణాచే మందిర | జయాచే హే జఠార మాలక | ||౫౦||
50. కాశీలోని మంగళఘాటు వద్ద బంగారు రేకులతో పొదగిన సుందరమైన లక్ష్మీనారాయణ మందిరం ఉంది. దానికి ఈ జఠారే యజమాని.
అయోధ్యేంతహీ శ్రీరామమందిర | జఠారాంచే ఆహే సుందర |
దోన్హీహీ క్షేత్రీ ఆదరసత్కార | తయాంచే మునీమాంవర సోంపవిలా | ||౫౧||
51. అయోధ్యలో కూడా జఠారుకు సుందరమైన శ్రీరామ మందిరమున్నది. ఈ రెండు క్షేత్రాలలోనూ అప్పాకు, మాధవరావుకు గౌరవాదరాలు చేయవలసిన పనిని తన గుమాస్తాకు అప్పగించాడు.
పేంఢారకరహీ9 హోతే ఆలే | తిఘేహీ పరతలే తేథూన | ||౫౨||
52. గ్వాలియరు నుండి వారిద్దరూ మథురకు వెళ్లారు. వారితో వఝే, బినివాలే, పెండార్కర్ కూడా వెళ్లి, తరువాత తిరిగి వచ్చేశారు.
మాధవరావ ఆణి కోతే | తేథూన ప్రయాగా ఝాలే జాతే | రామనవమీచ్యా ఉత్సవాతే | అయోధ్యే ఆంతౌతే ప్రవేశలే | ||౫౩||
53. మాధవరావు, అప్పా కోతే మటుకు అక్కడనుండి ప్రయాగకు వెళ్లి, శ్రీరామ నవమి ఉత్సవం సమయానికి అయోధ్యకు వచ్చారు.
దిన ఎకవీస తేథే రాహిలే | మహినే దోన కాశీంత కాఢలే | చంద్రసూర్య గ్రహణ ఝాలే | దోఘే మగ నిఘాలే గయేస | ||౫౪||
54. అక్కడ ఇరవై ఒక్క రోజులు ఉన్నారు. తరువాత కాశీలో రెండు నెలలు గడిపారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గడిచాక, ఇద్దరూ గయకు బయల్దేరారు.
గయేంత గ్రంథీ జ్వరాచీ సాథ | గల్లోగల్లీ జన సచింత | ఏసీ తేథే పరిసిలీ మాత | అసతా అగ్నిరథాంత దోఘాంనీ | ||౫౫||
55. గయలో ప్లేగు వ్యాపించి ఉందని, సందులలో గొందులలో ఉన్న జనం అదే చింతలో ఉన్నారని, అక్కడ పరిస్థితి రైలు బండిలో ఉండగానే వారిద్దరికీ తెలిసింది.
అగ్నిరథ స్టేశనాంత | యేఊన థాంబతా పడలీ రాత | తేథేంచ మగ ధర్మశాళేంత | దోఘేహీ స్వస్థ విసావలే | ||౫౬||
56. గయ స్టేషనులో రైలుబండి ఆగే సరికి రాత్రయింది. అందువలన వారిద్దరూ అక్కడే ఉన్న ధర్మశాలలో విశ్రమించారు.
అసో హోతా ప్రాతఃకాళ | భేటీస ఆలా గయావళ | తో వదే కరా ఉతావళ | యాత్రాహీ సకళ చాలలీ | ||౫౭||
57. తెల్లవారగానే గయలోని పిండారి (పిండ ప్రదానం చేయించే బ్రాహ్మణుడు) వచ్చి, ‘యాత్రికులంతా వెళ్లిపోతూ ఉన్నారు. త్వరగా పదండి’ అని చెప్పాడు.
మాధవరావ ఉద్విగ్నచిత్త | తయాంలాగీ హళూచ పుసత | యేతో పరీ జ్వరాచీ సాథ | తుమచియా వస్తీంత ఆహే కా | ||౫౮||
58. మాధవరావు భయంతో మెల్లగా, ‘సరే వస్తాం. కాని మీ బస్తీలో కూడా ప్లేగు ఉందా’ అని అడిగాడు.
మగ తో తయా దేఈ ఉత్తర | యేఊని పహా కీ హో తేథవర | తేథే నాహీ తసలా ప్రకార | చలా మజబరోబర నిఃశంక | ||౫౯||
59. అందుకు ఆయన, ‘అక్కడ అలాంటిదేమీ లేదు. మీరే అక్కడికి వచ్చి చూడండి. నిశ్చింతగా మీరు నా వెంట రండి’ అని చెప్పాడు.
అసో పుఢే హే దోఘేజణ | గయావళాచే యేథే జాఊన | పాహూని త్యాచే సదన విస్తీర్ణ | ప్రసన్నాంతఃకరణ జాహలే | ||౬౦||
60. వారిరువురూ అతనితో వెళ్లి, విశాలమైన అతని ఇంటిని చూచి సంతోషించారు.
ప్రసన్నతేచే ఆణీక కారణ | తే జో తేథే బైసతీ జాఊన |
సమోర బాబాంచీ ఛబీ పాహూన | మాధవరావ గహింవరూన దాటలే | ||౬౧||
61. వారి సంతోషానికి మరో కారణం, వారు కూర్చోగానే ఎదుట బాబా పటాన్ని చూచారు. మాధవరావు హృదయం ద్రవించి, గద్గదుడైయ్యాడు.
పడేల సాఈచీ ఛబీ నయనీ | ఆశ్చర్య మనీ దోఘాంచ్యా | ||౬౨||
62. గయవంటి దూర ప్రదేశంలో, సాయియొక్క పటం కళ్లకు కనిపిస్తుందని అతడు అసలు అనుకోలేదు. ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
మాధవరావ అతి గహింవరలే | ఆనందాశ్రు నయనీ లోటలే | కా హో ఆపణ రడూ లాగలే | ఏసే త్యా పుసిలే గయావళే | ||౬౩||
63. మాధవరావు కళ్లనుండి ఆనందాశ్రువులు దొర్లి, మనసంతా ప్రేమతో నిండిపోయింది. ‘మీరు ఎందుకు ఏడుస్తున్నారు?’ అని బ్రాహ్మణుడు ప్రశ్నించాడు.
కాంహీ ఎక నసతా కారణ | మాధవరావ కరితా రూదన | గయావళ హోయ సందేహాపన్న | జాహలా ఉద్విగ్న మానస | ||౬౪||
64. ఏ కారణమూ లేకుండా మాధవరావు ఏడుస్తుంటే, బ్రాహ్మణునికి సందేహం కలిగింది. అతని మనసు వికలమైంది.
గయేమాజీ గ్రంథిజ్వర | కైసీ యాత్రా ఘడేల నిర్ధార | మాధవరావా మనీ హా విచార | గయావళ ఫార చింతాపలా | ||౬౫||
65. ‘గయలో ప్లేగు ఉంది, యాత్ర అనుకున్నట్లుగా చక్కగా జరుగుతుందా లేదా అని మాధవరావు చింతిస్తూ ఉన్నాడని’ అతడు బాధపడ్డాడు.
ఆధీంచ ఆపణ కళవిలే హోతే | కీ గ్రంథిజ్వర నాహీ యేథే | తరీహీ ఆపణ కరితా చింతేతే | ఆశ్చర్య ఆమ్హాతే వాటతే | ||౬౬||
66. ‘ఇక్కడ ప్లేగు లేదని ముందుగానే మీకు చెప్పాను కదా. అయినా మీరు దుఃఖపడటం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
నసేల ఆమ్హాంవరీ విశ్వాస | పుసూన ఘ్యానా యా అవఘియాంస | యేథే న భీతి తుమచియా కేసాస | పాణీ కా డోళ్యాంస ఆణితా | ||౬౭||
67. ‘మామీద నమ్మకం లేకపోతే, వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుకవాసి అంత కూడా భయం లేదు. మరి ఎందుకు కళ్లవెంట నీరు కారుస్తున్నారు?’ అని ప్రశ్నించాడు.
ఘేతలా గ్రంథీచే సాథీచా ధసకా | మోడలీ జయాచే ధైర్యాచీ బైసకా | మ్హణూన రడే హా యాత్రేకరూ దేఖా | ఏసా హా ఎక సారఖా నిష్కారణ | ||౬౮||
68. ‘ప్లేగు భయంతో యాత్రికుని ధైర్యం సడలిపోయి, నిష్కారణంగా ఊరికే ఏడుస్తున్నాడు’.
మ్హణోని గయావళ కరీ సమజీ | మాధవరావాచే మనామాజీ | మాఝ్యా ఆధీంచ మాఉలీ మాఝీ | కైసీ హీ ఆజి మజపుఢే | ||౬౯||
69. అలా అనుకుని బ్రాహ్మణుడు వారికి నచ్చచెప్పి శాంత పరుచబోయాడు. కాని, మాధవరావు మనసులో, మా సాయి తల్లి నా కంటే ముందుగా వచ్చి నా ఎదుట ఎలా ఉంది?
“కాశీ ప్రయాగ కరీని సత్వర | శామ్యాచ్యాహీ యేతో అగోదర” | హే జే బాబాంచే పూర్వీల ఉద్గార | తే హే ప్రత్యంతర మూర్తిమంత | ||౭౦||
70. “కాశీ ప్రయాగ యాత్ర ముగించుకుని శామ్యా కంటే ముందుగా వస్తానని” బాబా మునుపు చెప్పిన వచనం ప్రత్యక్షంగా అనుభవమైంది.
ఛబీ బాబాంచీ డోళ్యాసమోర | దిసతా గృహప్రవేశాబరోబర |
పాహూని హా అకల్పిత ప్రకార | వాటలా చమత్కార అత్యంత | ||౭౧||
71. ఇంట్లోకి అడుగుపెట్టగానే బాబా పటం కళ్ల ఎదుట కనిపించగా, అనుకోకుండా సంభవించిన ఈ అనుభవం అత్యంత చమత్కారంగా అతనికి అనిపించింది.
కంఠీ ప్రేమాచా గహింవర | డోళా ఆనందాశ్రూంచా పూర | ఉఠలే రౌమాంచ సర్వాంగావర | ఫుటలా పాఝర ఘర్మాచా | ||౭౨||
72. ప్రేమతో కంఠం గద్గదమైంది. కళ్లు ఆనందాశ్రువులతో నిండాయి. శరీరమంతా రోమాంచితమై చెమట పట్ట సాగింది.
ఏసీ మాధవరావాంచీ స్థితీ | గయావళాచే విపరీత చిత్తీ | గ్రంథి జ్వరాచీ పడలీ భీతి | మ్హణోని హే రడతీ సత్య వాటే | ||౭౩||
73. ఈ స్థితిలో మాధవరావుని చూచి, ‘అతడు ప్లేగు ఉందని భయపడ్డాడు, అందువలనే ఏడుస్తున్నాడు’ అని బ్రాహ్మణుడు మరో విధంగా తలచాడు.
శామాచ పుఢే జిజ్ఞాసా ప్రేరిత | గయావళాసీ పృచ్ఛా కరీత | కైసేని హీ తుమ్హాంసీ ప్రాప్త | కథా హే సాద్యంత ఆమ్హాతే | ||౭౪||
74. తరువాత, చాలా విస్మయంతో శ్యామాయే బ్రాహ్మణుని, ‘ఈ పటం నీకు ఎలా లభించిందో మొత్తం చెప్పు’ అని అడిగాడు.
పుఢే గయావళ సాంగూ లాగలా | సమగ్ర వృత్తాంత మాధవరావాలా | బారా వర్షామాగే జో ఘడలా | నవలావ ఝాలా పరిసా తో | ||౭౫||
75. అప్పుడు ఆ బ్రాహ్మణుడు పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన విశేషాన్నంతా మాధవరావుకు చెప్పసాగాడు. దానిని వినండి.
ఎక నా దోన తీనశే నోకర | గయావళాచే పగారదార | మనమాడ ఆణి పుణతాంబ్యావర | యాత్రా సవిస్తర నోందీత | ||౭౬||
76. ఆ బ్రాహ్మణుని వద్ద, వంద కాదు, రెండు మూడు వందల మంది జీతం పుచ్చుకునే నౌకర్లు ఉన్నారు. వారు మన్మాడు, పుణతాంబేలలో కూడా ఉన్నారు. యాత్రికులకు సదుపాయాన్ని కలిగించటం అతని నిత్య వృత్తి.
యాత్రేకరూంచీ లావావీ సోయ | గయావళాంచా నిత్య వ్యవసాయ | చాలలే అసతా ఏసే కార్య | గయావళ హా జాయ శిరడీతే | ||౭౭||
77. యాత్రికులకు సదుపాయం కలిగించే అతని నిత్య వ్యవహారం అలా జరుగుతుండగా అతను శిరిడీకు వెళ్లాడు.
సాఈ సమర్థ మోఠే సంత | ఏసీ త్యాంనే పరిసిలీ మాత | వ్హావే తయాంచ్యా దర్శనే పునిత | ధరిలా హా హేత తయానే | ||౭౮||
78. సాయి సమర్థులు గొప్ప సంతులని అతను విన్నాడు. అందుకు వారి దర్శనంతో పునీతుడవ్వాలని అతని కోరిక.
ఘేతలే సాఈబాబాంచే దర్శన | కరూనియా పాయాంచే వందన | ఛబీ తయాంచీ వ్హావీ సంపాదన | ఇచ్ఛా హీ నిర్మాణ జాహలీ | ||౭౯||
79. సాయిబాబా దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాడు. వారి పటాన్ని పొందాలని అతనికి కోరిక కలిగింది.
హోతీ మాధవరావాపాశీ | ఛబీ ఎక టాంగిలీ భింతీశీ | గయావళ మాంగూ లాగలా తియేసీ | పుసూని బాబాశీ తీ దిధలీ | ||౮౦||
80. మాధవరావు వద్ద గోడకి తగిలించిన బాబా పటం ఒకటి ఉంటే, దానిని చూచి, ఆ బ్రాహ్మణుడు దానిని కోరాడు. బాబా అనుమతితో మాధవరావు అతనికి దానిని ఇచ్చాడు.
తీచ కీ తీ ఆపులీ ఛబీ | తోచ గయావళ హే మగ ఆఠవీ |
తేథేంచ బాబా కైసే మజ పాఠవీ | కైసే మజ భేటవీ దీర్ఘకాలే | ||౮౧||
81. ఇదే ఆ పటము అని, ఇతడే ఆ బ్రాహ్మణుడు అని మాధవరావుకు గుర్తుకు వచ్చింది. ‘బాబా నన్ను ఇక్కడికే ఎలా పంపించారు? ఇంత కాలానికి ఈ కలయికను ఎలా సంభవింప చేశారు?’
కోణ కిమర్థ కీ హీ స్మరతా | కధీ న చిత్తా ఆఠవలీ | ||౮౨||
82. ‘వాస్తవానికి పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన దానిని ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? ఇది మనసుకు ఎప్పుడూ గుర్తుకు రాలేదు’.
పరీ బాబాంచీ అగాధ లీలా | తేథేంచ పాఠవిలే శామాలా | తేథేంచ దిధలే నిజదర్శనాలా | గయావళహీ ధాలా అత్యంత | ||౮౩||
83. కాని, బాబా లీలలు అగాధం. శ్యామాను అక్కడికి పంపించి, అక్కడే తమ దర్శనాన్ని కలిగించారు. బ్రాహ్మణుడు కూడా అత్యంత సంతుష్టుడయ్యాడు.
హీచ కీ దిధలీ అపులే యేథూన | సాఈబాబాంచీ ఆజ్ఞా ఘేఊన | యాచ గయావళా లాగూన | జాహలే స్మరణ శామాస | ||౮౪||
84. ‘సాయిబాబా అనుమతిని తీసుకుని, ఇదే పటాన్ని ఈ బ్రాహ్మణుడికే నేను ఇచ్చాను’ అని శ్యామాకు గుర్తు వచ్చింది.
యాంచేచ యేథే పూర్వీ ఆపణ | ఉతరలో హోతో శిరడీస యేఊన | యానీంచ బాబాంచే కరవిలే దర్శన | జాహలే స్మరణ గయావళా | ||౮౫||
85. ‘మునుపు శిరిడీకి వెళ్లినప్పుడు ఇతని వద్దే బస చేసాను. ఇతడే బాబా దర్శనాన్ని చేయించాడు’ అని బ్రాహ్మణుడికీ కూడా గుర్తుకు వచ్చింది.
మగ పరస్పర కృతోపకార | నాహీ ఆనందా పారావార | ఠేవిలీ ఉత్తమ వ్యవస్థా ఫార | త్యాంనీ గయేవర శామాచీ | ||౮౬||
86. ఒకరికి ఒకరు చేసుకున్న ఉపకారాలను తలచుకుని ఇద్దరూ చాలా సంతోషించారు. బ్రాహ్మణుడు శ్యామాకు గయలో చాలా మంచి సదుపాయాలను చేశాడు.
తయా ఘరచీ కాయ శ్రీమంతీ | దారీ జయాచే ఝులతీ హత్తీ | ఆపణ పాలఖీమాజీ బైసతీ | శామాస బైసవితీ హత్తీవర | ||౮౭||
87. అతడికి ఎంత ఐశ్వర్యముందంటే, ఏనుగులు అతని ఇంటి ముందు ఉండేవి. తాను పల్లకీలో కూర్చుని, శ్యామాను ఏనుగుపై అంబారీలో కూర్చుండ బెట్టాడు.
ఆనందే విష్ణుపదావర జాఊన | పూజాసంభార సవే ఘేఊనీ | ఘాతలే దేవాస అభిషేక స్నాన | కేలే పిండప్రదాన యథావిధీ | ||౮౮||
88. చాలా ఆనందంతో పూజా సామగ్రిని వెంట తీసుకిని విష్ణుపాదం దగ్గరకు వెళ్లి దేవునికి అభిషేకం చేయించి, యథావిధిగా పిండప్రదానం కూడా చేయించాడు.
జాహలే మగ బ్రాహ్మణ సంతర్పణ | నైవేద్య సమర్పణపూర్వక భోజన | ఆనందే ఝాలీ యాత్రా సంపూర్ణ | ఘేతలీ కరవూన బాబాంనీ | ||౮౯||
89. దాని తరువాత, బ్రాహ్మణులకు సంతర్పణ, నైవేద్యం సమర్పణ పూర్వకంగా జరిగిన భోజనంతో యాత్ర తృప్తికరంగా సంపూర్ణమైంది. ఇదంతా వారి చేత బాబా చేయించినదే.
అసో యా సర్వ కథేచే సార | సార్థ బాబాచే ముఖోద్గార | అనుభవా యేతీ అక్షరే అక్షర | ప్రేమహీ భక్తాంవర అనివార | ||౯౦||
90. ఈ కథ సారంశం ఏమిటంటే, బాబా నోటినుండి వెలువడిన మాటలు అర్థభరితం మరియు అవి అక్షరం అక్షరం అనుభవంలోకి వస్తాయి అనేదే. బాబాకు భక్తుల పైన ప్రేమ కూడా అపారమైనది.
హే తర కాయ భక్తప్రేమ | ఇతర జీవాంసహీ దేఖత సమ |
తయాంసీ హీ తాదాత్మ్య పరమ | ఆవడ హీ నిఃసీమ తయాంచీ | ||౯౧||
91. అయితే, భక్తులపైనేనా బాబా ప్రేమ? వాస్తవానికి, ఇతర ప్రాణులను కూడా వారు సమానంగా చూస్తారు. ఇతర ప్రాణుల పైన ప్రేమే కాకుండా, అన్ని ప్రాణులతోనూ తాదాత్మ్యం చెందేవారు.
కళప ఎకదా శేళ్యాంచా భేటతా | పరమానందతా బాబాంస | ||౯౨||
92. లెండీనుండి మసీదుకు తిరిగి వచ్చేటప్పుడు, మామూలుగా దారిన నడుస్తుండగా, ఎప్పుడైనా మేకల మంద కలిస్తే, బాబాకు పరమానందం.
తంవ త్యా సమస్త కళపాంవరూన | నిజ అమృత దృష్టీ ఫిరవూన | త్యాంతూన కధీ ఎక వ దోన | శేళ్యా తే నివడూన కాఢీత | ||౯౩||
93. అప్పుడు, ఆ మంద మొత్తంవైపు తమ అమృత దృష్టిని ప్రసరింప చేసి, ఆ మందలోనుండి ఒకటో రెండో మేకలను ఏరుకుని తీసుకునేవారు.
ధణీ మాగేల జీ తీ కీంమత | బాబా తత్కాళ దేఊని టాకిత | కోండాజీచే పాశీ ఠేవిత | ఏసీ హీ పద్ధత బాబాంచీ | ||౯౪||
94. వాటి యజమాని అడిగినంత డబ్బును వెంటనే ఇచ్చి, మేకలను కొని, కొండాజీ వద్ద ఉంచేవారు. అది వారి పద్ధతి.
ఎకే దివశీ శేళ్యా దోన | కింమత బత్తీస దేఊన | బాబా ఆలే ఖరీదూన | సకళాం లాగూన ఆశ్చర్య | ||౯౫||
95. ఒక రోజు, ముప్పైరెండు రూపాయల వెల చెల్లించి రెండు మేకలను కొనుక్కుని వచ్చారు. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
పడతా యా దోనీ దృష్టీ | అవచిత ఆవడీ ఉపజలీ పోటీ | జాఊనియా తయాంచే నికటీ | పాఠీ థోపటీ తయాంచీ | ||౯౬||
96. ఆ రెండు మేకలను చూసిన వెంటనే వారి మనసులో ప్రీతి ఉత్పన్నమైంది. వాని వద్దకు వెళ్లి, వాని వెన్ను తట్టారు.
పశు జన్మీ దేఖూని ఉభయతా | కృపా ఉపజలీ సాఈ సమర్థా | స్థితి పాహోని కళవళలే చిత్తా | ప్రేమోద్రేకతా దాటలీ | ||౯౭||
97. వాని పశు జన్మను చూచి, సాయి సమర్థులకు జాలి కలిగింది. వాని పరిస్థితిని చూచి, వారి మనసు కరిగి, ప్రేమ ఉప్పొంగింది.
ఘేవోనియా తయాంసీ జవళీ | సాఈ ప్రేమే తయా కురవాళీ | సాశ్చర్య ఝాలీ భక్తమండళీ | పాహోని నవ్హాళీ బాబాంచీ | ||౯౮||
98. వానిని దగ్గరకు తీసుకుని, సాయి ప్రేమతో నిమిరారు. బాబాయొక్క ఈ వింత చర్యను గని భక్తులు ఆశ్చర్యపోయారు.
పూర్వజన్మీంచా లోభ పరమ | స్మరలా సాఈస ఆలే ప్రేమ | పాహూని తయాంచా పశుజన్మ | కళవళా అప్రతిమ ఉపజలా | ||౯౯||
99. వాని పూర్వ జన్మలోని పరమ లోభం సాయికు గుర్తుకు వచ్చి, వానిపై ప్రేమ పెరిగింది. వాని జన్మను గని వారు కరుణతో కరిగిపోయారు.
దోన రుపయే జీచీ కింమత | తీన అథవా చార తిజప్రత | దేతీ బాబా సోళా హే విపరీత | పాహోని హో చకిత తాత్యాబా10 | ||౧౦౦||
100. వాని ఖరీదు రెండు రూపాయలు. లేదా మూడో లేక నాలుగో. కాని, బాబా పదహారు రూపాయలను ఇవ్వగా చూచి, తాత్యా చకితుడయ్యాడు.
‘దేఈ వాణీ ఘేఈ ప్రాణీ’ | ఏసే ప్రత్యక్ష దేఖూని నయనీ |
తాత్యాసహ మాధవరావాంనీ | ధిక్కారిలీ కరణీ బాబాంచీ | ||౧౦౧||
101. వ్యాపారి అడిగినంత డబ్బు ఇచ్చి మేకలను కొనటం ప్రత్యక్షంగా చూచి, తాత్యాతో పాటు మాధవరావు కూడా బాబా చర్యను దుయ్య బట్టాడు.
కీ తే యథేచ్ఛ కాంహీ తరీ కరితీ | ఏసీహీ ఉపపత్తి బైసేనా | ||౧౦౨||
102. రెండు రూపాయల వస్తువుకు పదహారు ఎందుకు ఇచ్చినట్లు? బాబాకు డబ్బు విలువ తెలియదా? అందుకే యథేచ్ఛగా ఏదో చేస్తుంటారా అంటే ఇది కూడా సరియైన మాట కాదు.
దోఘే అంతరీ బహు చడఫడతీ | ఏసా కా బాబా హా సౌదా కరితీ | దోఘేహీ బాబాంస దూషణ దేతీ | హీ కాయ రీతీ సౌద్యాచీ | ||౧౦౩||
103. ‘బాబా ఎందుకిలాంటి బేరం చేశారు’ అని ఇద్దరూ చిరచిరలాడారు. ‘బేరమాడే పద్ధతి ఇలాగేనా?’ అని ఇద్దరూ బాబాను దూషించారు.
ఏసే కైసే బాబా ఫసలే | పాహూ అవఘే లోక తై జమలే | బాబా అంతరీ స్వస్థ ఠేలే | జాణో న హరవలే యత్కించిత | ||౧౦౪||
104. అసలు బాబా ఎలా మోసగించ బడ్డారు? ఆ వింత చూడటానికి అందరూ అక్కడ పోగయ్యారు. ఏ మాత్రం నష్టం కలగనట్లు, బాబా తమలో తాము నిశ్చింతగా ఉన్నారు.
జరీ హే దోఘే ఏసే కోపలే | బాబాంస దూషణ దేఊ సరలే | తరీ న బాబా యత్కించిత ఢళలే | అచల ఠేలే శాంతి సుఖే | ||౧౦౫||
105. వారిరువురూ కోపంతో బాబాను దూషిస్తున్నా, బాబా కించిత్తైనా చలించలేదు. అచలంగా, ప్రశాంతంగా, సంతోషంతో ఉన్నారు.
మగ ఆదరోనీ వినయవృత్తీ | దోఘేహీ తే బాబాంస పుసతీ | హీ కాయ ఉదారపణాచీ రీతీ | రుపయే బత్తీస గేలేనా | ||౧౦౬||
106. తరువాత, వారిరువురూ వినయంగా, ఆదరపూర్వకంగా, ‘ముప్పైరెండు రూపాయలు వృథాగా పోయాయి కదా, ఇదేం ఉదారబుద్ధి’ అని బాబాను అడిగారు.
కేవళ పైశాచా తో ప్రశ్న | పరిసోని సాఈ హాస్యవదన | మనీ మ్హణే హే వేడే జన | కైసే మ్యా సమాధాన కరావే | ||౧౦౭||
107. కేవలం డబ్బును గురించిన ప్రశ్నను విని సాయి, నవ్వు ముఖంతో, “పిచ్చి జనులారా! మిమ్మల్ని నేను ఎలా సమాధాన పరచను” అని తమలో అనుకున్నారు.
పరీ బాబాంచీ శాంతీ విలక్షణ | స్థైర్య న ఢళే అణు ప్రమాణ | హేంచ పరమ శాంతీచే లక్షణ | ఆశ్చర్య అవఘేజణ కరితీ | ||౧౦౮||
108. వారి శాంతి విలక్షణమైనది. వారి స్థైర్యం అణుమాత్రమైనా చలించలేదు. ఇదే పరమ శాంతికి లక్షణం, అని అందరూ ఆశ్చర్య పడ్డారు.
క్రోధ నాహీ జయాచ్యా గాంవీ | పరమశాంతీచ జో అనుభవీ | భూతమాత్రీ జో భగవంత భావీ | కైశీ త్యా శివావీ అవివేకతా | ||౧౦౯||
109. క్రోధమనేదే లేకుండా, పరమ శాంతిని అనుభవించే వారిని, సృష్టిలోని ప్రతి వస్తువులోనూ భగవంతుని చూచేవారిని అవివేకం ఎలా తాకగలదు?
వివేకదృష్టీచే జే నిధడే | క్రోధ యేఊ న దేతీ పుఢే | విపాయే11 జై హా ప్రసంగ జడే | భాండార ఉఘడే శాంతీచే | ||౧౧౦||
110. వివేక దృష్టిగల సమర్థులు కోపాన్ని తమ ఎదుటకు రానీయరు. అనుకోకుండా అలాంటి సందర్భం వస్తే, వారి శాంతి భోషాణం తెరుచుకుంటుంది.
“అల్లా మాలిక” నిరంతర ధ్యాన | తయాచే కాయ వానూ మహిమాన |
చరిత్ర అగాధ ఆణీక గహన | అతిపావన హితకర | ||౧౧౧||
111. ఎల్లప్పుడూ “అల్లా మాలీక్” అని ధ్యానం చేసేవారి మహిమను ఎంతని వర్ణించను? వారి చరిత్ర అగాధం, అర్థం కానిది, అతి పావనము మరియు శుభప్రదము.
జ్ఞాన గర్భ వైరాగ్యనిధీ | నిజశాంతీచా జో ఉదధీ | కరుణా పరిపూర్ణ జయాచీ బుద్ధి | వదలా త్రిశుద్ధీ తే పరియేసా | ||౧౧౨||
112. జ్ఞాన స్వరూపుడు, వైరాగ్యనిధి, శాంతి సాగరం, మరియు పరిపూర్ణ కరుణా బుద్ధిగల సాయి ఏమన్నారో వినండి.
పాహూనియా దోఘాంచా ఆగ్రహ | బాబాంనీహీ కేలా నిగ్రహ | “జ్యా మజ బసావా ఠావ నా గృహ | త్యా మజ సంగ్రహ కిమర్థ | ||౧౧౩||
113. ఆ ఇద్దరి ఆగ్రహాన్నిగని, “కూర్చోవటానికి, ఉండటానికి ఇల్లు వాకిలి లేని వాణ్ణి. అలాంటి నేను డబ్బు పోగుచేసుకోవడంలో ఏమర్థం ఉంది?” అని చాలా నిగ్రహంతో బాబా వారిని అడిగారు.
మ్హణాలే జాఊని దుకానాంత | ఆధీ ఆణా డాళ వికత | చారా శేరభర త్యా మనముక్త | మగ ద్యా త్యా పరత ధనగరా” | ||౧౧౪||
114. “ముందు అంగడికి వెళ్లి ఒక సేరు పప్పు కొనుక్కొని రండి. వానికి తృప్తిగా మేత పెట్టి, తరువాత వానిని గొల్లవానికి ఇచ్చివేయండి” అని చెప్పారు.
ఆజ్ఞేనుసార మగ తాత్కాళ | శేళ్యాంస ఖాఊ ఘాతలీ డాళ | మగ కాంహీహీ న దవడితా వేళ | పాఠవిల్యా పరత కళపాంత | ||౧౧౫||
115. వారి ఆజ్ఞానుసారం, వెంటనే పప్పును తెచ్చి, ఆ మేకలకు మేత పెట్టారు. తరువాత ఆలస్యం చేయకుండా వానిని మరల మందలోకి పంపించి వేశారు.
మూర్తిమంత పరోపకార | తో హా ప్రత్యక్ష సాఈ అవతార | తయాస తాత్యా, శామా, వా ఇతర | కాయ సువిచార సుచవితీల | ||౧౧౬||
116. మూర్తీభవించిన పరోపకారానికి ప్రత్యక్ష అవతారం సాయి. అలాంటివారికి, తాత్యా కాని, శ్యామా కాని, లేక ఇంకెవరైనా కాని, మంచి ఆలోచనలను సూచించగలరా?
డాళ చారవూని పరమ ప్రీతీ | పాహూని శేళ్యా పావల్యా తృప్తీ | మగ మ్హణతీ “ద్యా ధనియా ప్రతీ | ఘేవోత విశ్రాంతీ కళపాంత” | ||౧౧౭||
117. మేకలకు ఎంతో సంతోషంగా పప్పు తినిపించి, అవి తృప్తి చెందినట్లు గమనించి, “వానిని వాని యజమానికి ఇచ్చివేయండి. మందలో విశ్రమిస్తాయి” అని బాబా చెప్పారు.
రుపయే గేలే రుపయా పరీ | శేళ్యా గేల్యా ఫుకటవారీ | పుఢే గత జన్మీచీ నవలపరీ | కథిలీ సారీ బాబాంనీ | ||౧౧౮||
118. అలా డబ్బుకు డబ్బూ పోయింది, మేకలు కూడా ఉచితంగా పోయాయి. తరువాత, ఆశ్చర్యకరమైన మేకల గతజన్మని గురించి బాబా చెప్పారు.
జైసా తాత్యా తైసాచ శామా | దోఘాంవరీహీ బాబాంచా ప్రేమా | తయాంచియా కోపోపరమా | కథితీ మనోరమా ఆఖ్యాయికా | ||౧౧౯||
119. తాత్యా ఎంతో శ్యామా కూడా అంతే. ఆ ఇద్దరిపైనా బాబాకు అమితమైన ప్రేమ. వారి కోపాన్ని శాంత పరచటానికి, బాబా మనోహరమైన ఈ కథను చెప్పారు.
సాఈ స్వయే హోఊని ఆపణ | దోఘాంలాగీ కరితీ నివేదన | శేళ్యాంచే పూర్వ జన్మాచే కథన | శ్రోతాంహీ శ్రవణ కీజే తే | ||౧౨౦||
120. తమంతట తాము, సాయి స్వయంగా మేకల పూర్వ జన్మ కథను ఆ ఇద్దరికీ చెప్పారు. శ్రోతలు కూడా దానిని వినండి.
పూర్వజన్మీ యాంచే సుదైవ | తేవ్హా హే జీవ హోతే మానవ |
మజపాశీంచ బసావయా ఠావ | కర్మ ప్రభావ యాంనా హీ | ||౧౨౧||
121. “గత జన్మలో ఆ మేకల భాగ్యం కొద్దీ అవి మానవులుగా పుట్టాయి. నా దగ్గరే ఉండేవారు. వారికి కూడా కర్మ ప్రభావ ఫలితం తప్పలేదు.
భాండతా పరస్పర ఝాలీ సీమా | తే యా పరిణామ పావలే | ||౧౨౨||
122. “ఇప్పుడు మీకు మేకలుగా కనిపిస్తున్నాయి కదా! ఇవి, పూర్వ జన్మలో సోదరులు. పరస్పరం విపరీతంగా కొట్టుకున్న పరిణామంగా ఈ రూపాన్ని పొందాయి.
బంధూ బంధూంత ఆరంభీ ప్రేమ | ఎకత్ర అశన12 శయన నేమ | నిత్య చింతితీ కుశల క్షేమ | ఎకాత్మతా పరమ ఉభయాంసీ | ||౧౨౩||
123. “మొదట్లో అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండేది. ఒక కంచంలో తిని, ఒకే మంచంపైన పడుకునేవారు. రోజూ ఒకరి యోగక్షేమాల గురించి ఒకరు ఆలోచించేవారు. ఇద్దరిలోనూ ఐక్యత బాగా ఉండేది.
ఏసే దోఘే జరీ సహోదర | కర్మధర్మసంయోగ దుర్ధర | ద్రవ్యలోభ అతి భయంకర | పాడిలే వైర పరస్పరీ | ||౧౨౪||
124. “ఆ ఇద్దరూ అన్నదమ్ములే అయినా, దుర్భరమైన కర్మ ధర్మల కలయిక వలన, భయంకరమైన డబ్బు వ్యామోహం కారణంగా వారిలో శత్రుత్వం ప్రబలింది.
జ్యేష్ఠ బంధూ మహా ఆళశీ | కనిష్ఠ వ్యవసాయీ అహర్నిశీ | తేణే జోడిల్యా ద్రవ్య రాశీ | మత్సర జ్యేష్ఠాంసీ సంచరలా | ||౧౨౫||
125. “పెద్దవాడు చాలా సోమారి. చిన్నవాడు రాత్రి పగలూ శ్రమించి ధనాన్ని కూడబెట్టాడు. దానివలన పెద్దవానికి అసూయ కలిగింది.
కాఢూనియా టాకావా కాంటా | మగ ద్రవ్యాచా నాహీ తోటా | ఏసియా విచారే ఆడవాటా | ఆవడల్యా జ్యేష్ఠా ధనలోభే | ||౧౨౬||
126. “‘ముల్లులా గ్రుచ్చుకుంటున్న తమ్ముని తొలగించితే తనకు డబ్బుకు లోటుండదు’, అని పెద్దవాడు ధనలోభంతో చెడుగా ఆలోచించ సాగాడు.
ధనమోహే దృష్టి ప్రతిబంధ | డోళే అసతా జాహలా అంధ | విసరలా బంధుప్రేమసంబంధ | జాహలా సన్నద్ధ తద్ఘాతా | ||౧౨౭||
127. “ధనం మీది మోహం దృష్టికి అడ్డు పడింది. కళ్లు ఉండీ అతడు అంధుడయ్యాడు. బంధుత్వాన్ని, సోదర ప్రేమనూ మరచిపోయి, తమ్ముని హతమార్చటానికి సిద్ధమయ్యాడు.
పరమ కఠిణ ప్రారబ్ధభోగ | ఉపజలా నిష్కారణ వైరయోగ | ఫుటలే గుప్త కపటప్రయోగ | లోభావేగ13 అనావర | ||౧౨౮||
128. “ప్రారబ్ధ కర్మాన్ని అనుభవించడం పరమ కఠినమైనది. నిష్కారణంగా శత్రుత్వం పుట్టింది. రహస్యంగా ఉన్న మోసం బయట పడింది. లోభం నిగ్రహించుకోలేనంతగా పెరిగింది.
హోతే త్యాంచే ఆయుష్య సరలే | బంధుత్వప్రేమ సమూళ విసరలే | దురభిమానే అత్యంత ఖవళలే | వైరీసే ఝగటలే పరస్పర | ||౧౨౯||
129. “వారి ఆయువు తీరిపోయింది. సోదర ప్రేమను పూర్తిగా మరచిపోయారు. దురభిమానం ఎంతగానో పెరిగి పోయింది. శత్రువులవలె ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు.
సోటా హాణోనియా మాథా | ఎకానే దుజియా పాడిలే ఖాలతా | తేణే కుర్హాడీచియా ఆఘాతా | సరసా నిజ భ్రాతా మారిలా | ||౧౩౦||
130. “తలపైన బలంగా కొట్టి ఒకడు ఇంకొక్కణ్ణి క్రింద పడవేశాడు. రెండవవాడు గొడ్డలితో కొట్టి తన సోదరుణ్ణి చంపేశాడు.
మగ తే ధోఘే పడలే మూర్ఛిత | ఛిన్న భిన్న రుధిరోక్షిత |
అల్పావకాశే అసువిరహిత | పావలే పంచత్వ దోఘేహీ | ||౧౩౧||
131. “ఇద్దరూ రక్తం కారుస్తూ, ఛిన్నా భిన్నమై మూర్చ పడిపోయారు. కొంత సేపటికే ప్రాణాలను కోల్పోయి, ఇద్దరూ చనిపోయారు.
ఏసా త్యాంచా హోతా అంత | ప్రవేశలే తే యా యోనీంత | ఏసా యాంచా హా వృత్తాంత | స్మరలా మజ సాద్యంత తయా పహాతా | ||౧౩౨||
132. “జీవితాలు అలా అంతం కాగా, వారు ఈ యోనిలో ప్రవేశించారు. వారిని చూడగానే, వారి ఈ వృత్తాంతమంతా నాకు గుర్తుకు వచ్చింది.
తే కృతకర్మ భోగావయాసీ | ఆలే శేళీచియా జన్మాసీ | అవచిత కళపాంత దేఖతా త్యాంసీ | ప్రేమావేశీ ఆలో మీ | ||౧౩౩||
133. “చేసిన కర్మను అనుభవించటానికి మేకలుగా పుట్టారు. అకస్మాత్తుగా మందలో వారిని చూచి, నాకు వారిపై ప్రేమ కలిగింది.
మ్హణోని ఖర్చోని పల్లవచే దామ | వాటలే తయాంసీ ద్యావా విశ్రామ | తుమచియా మిషే తయాంచే కర్మ | ఆడవే కీ ఠామ తయాంపుఢే | ||౧౩౪||
134. “అందుకే, స్వంత డబ్బు ఖర్చుపెట్టి, వానికి విశ్రామాన్ని కలిగించాలని అనిపించింది. కాని, మీ కారణంగా వాని కర్మ వానికి అడ్డు తగిలింది.
శేళియాంలాగీ దయా పోటీ | పరీ తుమచియా ఆగ్రహాసాఠీ | మీహీ జాహలే కబూల శేవటీ | ద్యావయా త్యాపాఠీ ధనగరా” | ||౧౩౫||
135. “మేకల మీద దయ ఉన్నా, మీ బలవంతం వలన, చివరకు నేనే వానిని గొల్లవానికి తిరిగి ఇచ్చి వేయటానికి ఒప్పుకున్నాను” అని చెప్పరు.
అసో యేథే సంపలీ కథా | క్షమా కరావీ మజలా శ్రోతా | పుఢీల అధ్యాయ పుఢా పరిసతా | ఆనంద చిత్తా హోఈల | ||౧౩౬||
136. అలా ఈ కథ ఇక్కడితో ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. తరువాత అధ్యాయాన్ని వింటే మనసుకు సంతోషం కలుగుతుంది.
తోహీ పరమ ప్రేమభరిత | తేంహీ సాఈముఖీంచే అమృత | హేమాడ సాఈ చరణీ వినత | హోఊని వినవీత శ్రోతయా | ||౧౩౭||
137. అది కూడా సాయి నోటినుండి స్రవించిన అమృతమే, పరమ ప్రేమ భరితం, అని హేమాడు పంతు సాయి చరణాలయందు వినమ్రుడై శ్రోతలకు మనవి చేస్తున్నాడు.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | కాశీగయాగమన అజాజన్మ కథనం నామ |
| షట్చత్వారింశత్తమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ:
1. భక్తాంత శ్రేష్ఠ - భక్తమణీ. 2. మాధవరావ దేశపాండ్యాంస.
3. శిరడీచా నందరామ మారవాడీ. 4. ఆపా కోతే.
5. దోనశే రుపయే. 6. శంభర రుపయే.
7. పళస్ప్యాచే ఓఝే ఆడనావాచే ఇనామదార.
8. హే నానాసాహేబాంచే సాడూ. 9. హే నానాసాహేబాంచే జామాత.
10. తాత్యా గణపత పాటీల కోతే. 11. అకల్పిత.
12. జేవణఖాణ. 13. లోభాచా ఝటకా.
No comments:
Post a Comment