Monday, December 16, 2013

||శ్రీసాఈముఖశ్రుత కథాకథనం నామ సప్తచత్వారింశోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౭ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

జ్యాంచే క్షణైక దేఖిల్యా వదన | హోయ అనంత జన్మ దుఃఖదలన | 
తే పరమానంద జనన స్థాన | ధన్య శ్రీవదన సాఈచే | ||౧|| 
1. పరమానందాన్నిచ్చే సాయియొక్క ముఖాన్ని ఒక్క క్షణం చూసినా చాలు. అది అనంత జన్మల దుఃఖాన్ని నశింప చేస్తుంది. అలాంటి సాయి శ్రీముఖం ధన్యం.
జ్యాంచే ఝాలియా కృపావలోకన | తాత్కాళ కర్మబంధవిమోచన | 
స్వానంద పుష్టీ నిజభక్తజన | న లాగతా క్షణ లాధతీ | ||౨|| 
2. వారి కృపాదృష్టితో భక్తులకు వెంటనే కర్మబంధనుంచి విముక్తి కలిగి, క్షణం కూడా ఆలస్యం లేకుండా సమృద్ధిగా ఆత్మానందం లభిస్తుంది. 
జ్యాంచియా కృపాదృష్టీపుఢే | కర్మాకర్మాచే ఫిటే బిరడే | 
యత్కృపాసూర్యాచియా ఉజియేడే | భవఖద్యోత దడే నిస్తేజ | ||౩|| 
3. వారి కృపా దృష్టితో, కర్మ అకర్మల చిక్కుముడి విడిపోతుంది. ఆ కృపా భాస్కరుని వెలుగులో సంసార సాగరమనే మిణుగురు పురుగు నిస్తేజమౌతుంది. 
జగాచీ పాపే భాగీరథీ ధూతే | తేణే తీ స్వయే మలయుక్త హోతే | 
సాంచలా నిజమల నిరసావయాతే | సాధూంచే ఇచ్ఛితే చరణరజ | ||౪|| 
4. ప్రపంచంలోని పాపాలను కడిగి వేయటం వలన గంగ మలినమౌతుంది. తన ఆ మాలిన్యాన్ని తొలగించుకోవటానికి సత్పురుషుల పాద ధూళిని కోరుకుంటుంది. 
కధీ సాధూంచే పాయ లాగతీ | కధీ మజమాజీ స్నానార్థ యేతీ | 
త్యావీణ నిజపాపాచీ నిర్గతీ | నవ్హే హే నిశ్చితీ జాణే తీ | ||౫|| 
5. సాధువుల పాదాల స్పర్శ ఎప్పుడు లభిస్తుంది? వారు ఎప్పుడు నా వద్దకు స్నానికి వస్తారు? అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే, వారు తప్ప ఆ పాపాలకు ముక్తినిచ్చేవారు లేరు అని ఆమెకు నిశ్చయంగా తెలుసు. 
ఏసియా సాధూంచా ముకుటమణీ | సమర్థసాఈ యాంచీ హీ వాణీ | 
జాణూని అత్యాదరే భావిక సజ్జనీ | ఆకర్ణిజే పావనీ హీ కథా | ||౬|| 
6. ఇలాంటి సాధువులకు మకుటమణి అయిన సాయి సమర్థుల వాణి ఇది అని తెలుసుకుని, భక్తులు, సజ్జనులు, ఈ పావన చరిత్రను అత్యంత ఆదరంగా ఆలకించండి. 
నవల యా కథేచే మహిమాన | శ్రోతే సజ్ఞాన వా అజ్ఞాన | 
పరిసతా తుటేల కర్మబంధన | పరమపావన కథా హే | ||౭|| 
7. జ్ఞానులైనా, అజ్ఞానులైనా ఈ పరమ పావన కథను వింటే, శ్రోతల కర్మ బంధనం విడిపోవడమే ఈ కథలోని విశేషమైన మహిమ. 
నయనాంచాహీ నయన సాఈ | శ్రవణాంచాహీ శ్రవణ పాహీ | 
తేణేంచి రిఘోని మాఝియే హృదయీ | వార్తాజీ హీ నివేదిలీ | ||౮|| 
8. నయనాలకు దృష్టి, శ్రవణానికి శ్రవణము, అయిన సాయియే నా హృదయంలో ప్రవేశించి ఈ కథను చెప్పారు. 
సాఈ స్వయే మహానుభావ | పరిసతా యా కథేచా నవలావ | 
శ్రోతే విసరతీల దేహభావ | అష్టప్రేమభావ దాటతీల | ||౯|| 
9. స్వయం సాయియే మహానుభావులు. విశేషమైన ఈ కథను వింటే శ్రోతలు తమ శరీరభావాన్ని మరచి పోతారు. వారిలో ఎనిమిది ప్రేమ భావాలు పెల్లుబుకుతాయి. 
సాఈ ముఖాచీ హే కథా | లక్ష లావూని తీచ్యా హృద్గతా | 
తాత్పర్యావరీ దృష్టీ ఠేవితా | కృతకర్తవ్యతా శ్రోత్యాంస | ||౧౦||
10. సాయి నోటినుండి వచ్చిన ఈ కథలోని ఉద్దేశాన్ని శ్రద్ధగా తెలుసుకుని, తాత్పర్యమందు దృష్టి ఉంచితే శ్రోతలు కృతకృత్యులౌతారు. 

తరీ వినంతీ పరిసిజే శ్రోతా | జరీ మీ యా కథేచా వక్తా | 
మీహీ తుమ్హాంసారిఖాచ రితా | న ఘేతా మథితార్థా యేథీల | ||౧౧|| 
11. కనుక శ్రోతలు, నా మనవిని వినండి. నేను ఈ కథను చెప్పేవాడినే అయినా, ఇందులోని సారాన్ని తెలుసుకోలేకపోతే నేను కూడా మీవలనే రిక్త మనస్కుణ్ణి. 
ఆఠవితా తయాచే భక్తప్రేమ | మన విసరే మనోధర్మ | 
హోయ సంసారత్రస్తా ఉపరమ | యాహూని పరమ లాభ కాయ | ||౧౨|| 
12. భక్తులపైన బాబాకు ఉన్న ప్రేమను స్మరించుకుంటే మనసు తన మనోధర్మాన్ని మరచిపోతుంది. ప్రపంచ బాధలనుండి ఉపశమనం కలుగుతుంది. ఇంత కంటే పరమ లాభం ఇంకేముంది? 
పూర్వకథేచే అనుసంధాన | శ్రోతా పరిసిజే సావధాన | 
హోఈల జీవా సమాధాన | కథా అవ్యవధాన పరిసతా | ||౧౩|| 
13. మునుపటి కథతో సంబంధం ఉన్న ఈ కథను, శ్రోతలు శ్రద్ధగా, సావధానంగా వింటే మనసుకు సంతృప్తి కలుగుతుంది. 
గతాధ్యాయాచియే అంతీ | ఏకిలీ శేళ్యాంచీ కథా శ్రోతీ | 
తయా ఠాయీ బాబాంచీ ప్రీతీ | గతజన్మస్మృతీ తయాంచీ | ||౧౪|| 
14. మునుపటి అధ్యాయం చివరలో శ్రోతలు మేకల కథను, మేకలపై బాబా ప్రీతిని, వాని గత జన్మ గురించిన జ్ఞాపకం గురించి విన్నారు కదూ! 
తైసీచ ఆతా హేహీ కథా | ద్రవ్యలోభాచీ పరమావస్థా | 
కైసీ నేఈ అధఃపాతా | సావధానతా పరిసావీ | ||౧౫|| 
15. ఈ కథ కూడా అలాంటిదే. విపరీతమైన ధనలోభం ఎలా పతనానికి దారి తీస్తుందో శ్రద్ధగా వినండి. 
సాఈచ పూర్ణ కృపాదృష్టి | కథా సూచవీ ఉఠాఉఠీ | 
యేఊ న దేఈ శ్రవణా తుటీ | సుఖ సంతుష్టీ వాఢవీ | ||౧౬|| 
16. సాయియే సంపూర్ణ కరుణా దృష్టితో ఒకటి తరువాత మరొక కథను సూచించారు. శ్రవణంలో ఏ అడ్డుంకులనూ రానీయకుండా సుఖ సంతోషాలను పెంపొందిస్తారు. 
కథా వక్తా ఆణి వదన | స్వయే సాఈ సమర్థ ఆపణ | 
తేథే హేమాడ కిమర్థ కవణ | ఉగాచ టోపణ నాంవాచా | ||౧౭|| 
17. కథ, కథను చెప్పేవారు, నోరు అన్నీ స్వయం సాయి సమర్థులే అయినప్పుడు ఇంక ఈ హేమాడు ఎవరు? ఎందుకు? ఊరికే పేరుకే! 
బైసలే సాఈ కథాబ్ధితటీ | త్యా ఆమ్హా కాయ కథాంచీ ఆటాటీ | 
కల్పతరూచియా తళవటీ | కామనా ఉఠీ తో సిద్ధీ | ||౧౮|| 
18. కథా సాగర తీరాన సాయియే కూర్చుండగా మనకు కథలకు కరువా? కల్పతరువు క్రింద కోరిక కలిగిన వెంటనే, అది సిద్ధిస్తుంది. 
కాయ దినకరాచియా ఘరీ | కోణ దీపాచీ చింతా కరీ | 
జయా అమృతపాన నిరంతరీ | విషాచీ లహరీ కాయ తయా | ||౧౯|| 
19. సూర్యుని ఇంట దీపం కోసం ఎవరు చింతిస్తారు? నిరంతరం అమృతం సేవించే వారికి, విషం ఎందుకు గుర్తుకొస్తుంది? 
అసతా ఆమ్హా సాఈసారిఖా | సదైవ ఆముచా పాఠిరాఖా | 
వాణ కాయ కథాపీయూఖా | యథేచ్ఛ చాఖా త్యా హారిఖా | ||౨౦||
20. సాయి వంటి దైవం మనకు ఎప్పుడూ వెంట ఉండగా, కథామృతానికి ఏం కరువు? యథేచ్ఛగా ఆ సంతోషాన్ని అనుభవించండి. 

కర్మసూత్ర మోఠే గహన | కోణాసహీ నా హోఈ ఆకలన | 
ఠకిజేతి మహాసజ్ఞాన | భావార్థీ అజ్ఞాన తరిజేత | ||౨౧|| 
21. కర్మ సూత్ర సిద్ధాంతం చాలా కఠినమైనది, ఎవరికీ అర్థం కానిది. మహా మహా జ్ఞానులను కూడా మోసగిస్తుంది. కాని, ఏమీ తెలియని అమాయక భక్తులను తరింప చేస్తుంది.
తైసాచ దుర్గమ ఈశ్వరీ నియమ | కోణ కరీల త్యాచా అతిక్రమ | 
ఆచరా నిత్య లౌకిక ధర్మ | కరావే సత్కర్మ సర్వదా | ||౨౨|| 
22. అలాగే, దైవ నియమం కూడా కఠినమైనది. దానిని ఎవరు అతిక్రమించగలరు? కనుక, లౌకిక ధర్మం ప్రకారమే మంచి పనులను ఎప్పుడూ చేస్తూ ఉండాలి. 
నాహీ తరీ అత్యంత అధర్మ | పావూనియా మరణధర్మ | 
జైసే జైసే జయాంచే కర్మ | పావతీ జన్మ తదనురూప | ||౨౩|| 
23. లేకుంటే, చేసే పనులు నైతిక సూత్ర ప్రకారం ఉండక, మరణం తరువాత వచ్చే జన్మలు, వారు చేసిన పనుల ఆధారంగా ఉంటాయి. 
‘యథా కర్మ యథాశ్రుత’ | శుక్రబీజ సమన్విత | 
కాంహీ యోనిద్వారీ ప్రవేశత | స్థావర భావాప్రత కాంహీ | ||౨౪|| 
24. ‘యథా కర్మ యథా శ్రుతి’ - వారి వారి జ్ఞానం బట్టి, వారి వారి కర్మలను బట్టి, కొందరు శుక్రబీజాలతో కలిసి యోని ద్వారా ప్రవేశిస్తారు. మిగతా కొందరు చలనం లేక జన్మిస్తారు. 
‘యథాప్రజ్ఞం హి సంభవాః’ | శ్రుత్యర్థ నాహీ కవణా ఠావా | 
జన్మ ఘేణే తరీ తో ఘ్యావా | రుచేల జీవా జో జైసా | ||౨౫|| 
25. ‘యథా ప్రజ్ఞం హి సంభవాః’ - వారి వారి బుద్ధిని అనుసరించి జన్మ. ఈ శ్రుతి వచనానికి అర్థం ఎవరికి తెలియదు! జన్మను పొందాలి అనుకుంటే, నచ్చిన విధంగా దానిని పొందాలి. 
జాణా హే మూఢ అవిద్యావంత | శరీర గ్రహణాలాగీ ఉద్యత | 
జైసే జయాంచే ఉపార్జిత | శరీర ప్రాప్త తైసే తయా | ||౨౬|| 
26. మరల శరీరాన్ని పొందాలని కోరుకునే మూఢులు, అజ్ఞానులు, తాము సంపాదించుకున్న కర్మ ఫలం అనుసరించే, తమకు శరీరాలు ప్రాప్తిస్తాయని తెలుసుకోవాలి. 
మ్హణూన శరీరపాతా ఆధీ | నరజన్మాచీ అమోల సంధీ | 
దవడీ నా జో ఆత్మబోధావధీ | తో ఎక సుధీ జాణావా | ||౨౭|| 
27. అందు వలన, శరీరం నేల రాలి పోక మునుపే, మానవ జన్మయొక్క అమూల్య అవకాశాన్ని, ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వినియోగించుకునే వారే జ్ఞానులు. 
తోచ సంసార బంధముక్త | ఇతర సంసార చక్రీ పడత | 
కధీంహీ శరీరత్వాసీ న ముకత | యాతనా న చుకత జన్మాచ్యా | ||౨౮|| 
28. అలాంటి వారే సంసార బంధాలనుండి ముక్తులౌతారు. ఇతరులు ప్రపంచ చక్రంలో పడతారు. వేరొక శరీరాన్ని ప్రవేశించకుండా ఉండలేరు. వారికి జన్మ జన్మల యాతన తప్పదు. 
ఆతా యా కథేచా నవలావ | దృష్టవృత్తీసీ అంతర్భావ | 
బుజే ‘మీ దేహ’ హీ ఆఠవ | సాత్విక అష్టభావ ఉఠతీల | ||౨౯|| 
29. ‘నేను శరీరాన్ని’ అన్న చెడు ఆలోచన తొలగిపోయి, సాత్వక అష్ట భావాలు ఉప్పొంగడమే ఇప్పుడు ఈ కథలోని విశేషం. 
గాంఠీ అసతా అమూప ధన | స్వభావే జో అత్యంత కృపణ | 
ధిగ్‍ ధిగ్‍ తయాచే జీవన | ఆమరణ శీణ అనుభవీ | ||౩౦||
30. తమ వద్ద ఎంతో ధనమున్నా, అత్యంత లోభ స్వభావం గలవారి జీవనం సిగ్గుచేటు. అట్టివారు జీవితాంతం వ్యర్థమైన శ్రమను అనుభవిస్తారు. 

త్యాంతహీ వైర వృత్తీచా వారా | కదా కాళీంహీ నవ్హే బరా | 
తయాపాసావ మనాసీ ఆవరా | కరీల మాతేరా జన్మాచా | ||౩౧|| 
31. పైగా, మనసులో ఏ మాత్రం శత్రుత్వ భావం ఉన్నా, అది ఎప్పటికీ మంచిది కాదు. ఆ భావం రాకుండా మనసును నిగ్రహించుకోవాలి, లేదా, అది జీవితాన్ని నాశనం చేస్తుంది. 
పరస్పరవైరాచా పరిణామ | ఉత్తమాచా జన్మే అధమ | 
ఋణ వైర హత్యాంచా ధర్మ | ఫిటే తో జన్మపరంపరా | ||౩౨|| 
32. ఇప్పుడు ఉత్తమ జన్మలో పుట్టినా, పరస్పర వైరం కారణంగా, నీచ జన్మకు పోవటం తప్పదు. ఋణం, శత్రుత్వం, హత్య, వీని ధర్మం ప్రకారం, ఇవి తీరేవరకు జనన మరణ పరంపర తప్పదు. 
యే అర్థీంచీ అమృతవాణీ | సాఈముఖోద్గార పరమపావనీ | 
కరితో సాదర శ్రోతయాంలాగుని | అసావే శ్రవణీ సావధాన | ||౩౩|| 
33. ఈ విషయంలో సాయి నోటినుండి వచ్చిన పరమ పావనమైన అమృత వాణిని శ్రోతలకు చెప్తాను. సావధానంగా వినండి. 
తీహీ కథా జైసీ ఏకిలీ | జైసీ మాఝియా స్మరణీ రాహిలీ | 
తైసీచ కథితో త్యాచ బోలీ | జే తీ మాఉలీ వదలీ తే | ||౩౪|| 
34. విన్నది విన్నట్లు నాకు గుర్తుండి పోవడం వలన, సాయిమాత చెప్పిన ఈ కథను, సాయి మాటలలోనే ఇప్పుడు మీకు చెప్తాను. 
సాఈచ స్వయే చరిత్రకార | లిహవూన ఘేఈ కథావిస్తార | 
హేమాడ కేవళ నిమిత్త మాత్ర | సూత్రధార జ్యాచా తో | ||౩౫|| 
35. సాయియే స్వయంగా చరిత్రకారులు. తామే కథను సవిస్తారంగా వ్రాసుకుంటారు. హేమాడు కేవలం నిమిత్త మాత్రుడు. అతడిని నడిపించే సూత్రధారి సాయియే. 
“ఎకే ప్రాతఃకాళచే ప్రహరీ | ఆఠ వాజావయాచే అవసరీ | 
కరూనియా నిత్యాచీ న్యాహరీ | పడలో బాహేరీ ఫిరావయా | ||౩౬|| 
36. “ఒక రోజు ఉదయం ఎనిమిది గంటల సమయాన, ప్రాతఃకర్మలను ముగించి, బయట తిరగటానికి వెళ్లాను. 
మార్గీ జాతా జాతా శ్రమలో | నదీ కినారీ ఎకా పాతలో | 
పాయ ధుతలే స్నాన కేలో | అంతరీ ధాలో బహువస | ||౩౭|| 
37. ‘దారిన నడుస్తూ నడుస్తూ, అలసిపోయి, ఒక నదీ తీరాన్ని చేరుకున్నాను. కాళ్లు కడుక్కుని స్నానం చేశాను. మనసుకు చాలా సంతోషం కలిగింది. 
నదీ తరీ హోతీ కేవఢీ | యా రాహత్యాచ్యా నదీ ఎవఢీ | 
పాణీ భరలే హోతే దుథడీ | కాంఠాసీ ఝాడీ లవ్హాళ్యాంచీ | ||౩౮|| 
38. ‘ఆ నది ఎంత? ఈ రహతా నది అంతే పెద్దది. తీరాలను తాకుతూ నీరు నిండుగా ఉంది. ఒడ్డున ‘లవాలా’ అనే గడ్డి చెట్లు ఉన్నాయి. 
హోతీ తేథే పాయవాట | గాడీమార్గహీ హోతా స్పష్ట | 
వృక్షహీ కాంఠీ హోతే ఘనదాట | ఛాయాహీ ఉత్కృష్ట పడలేలీ | ||౩౯|| 
39. అక్కడే కాలిబాట ఉంది. బండి వెళ్లే దారి కూడా స్పష్టంగా ఉంది. నదీ తీరాన వృక్షాలు దట్టంగా ఉండటం వలన, వాని నీడ కూడా బాగా ఉంది. 
వాయు వాహే మంద మంద | తేణే మనాలా బహు ఆనంద | 
దృష్టీ దేఖోని వృక్షవృంద | బైసలో స్వచ్ఛంద ఛాయేసీ | ||౪౦||
40. చల్లని గాలి మెల్లమెల్లగా వీస్తూ ఉంటే, మనసుకు చాలా ఆనందంగా ఉంది. చెట్లు గుంపుగా ఉన్న చోటును చూచి, వాని నీడలో విశ్రాంతిగా కూర్చున్నాను. 

జాతా చిలీమ భరావయాలా | తదర్థ ఛాపీ భిజవావయాలా | 
‘డరావ డరావ’ శబ్ద ఏకిలా | ధ్వనీ మజ వాటలా బేడకాచా | ||౪౧|| 
41. చిలుంగొట్టు నింపాలని, దాని చుట్టూ పట్టుకోవడానికి అనువుగా బట్టను తడపటానికి వెళ్లగా, అక్కడ బెక బెక మనే చప్పుడు వినిపించింది. అది కప్పదే అయి ఉండవచ్చు అని నాకు అనిపించింది.
నవల కాయ పాణీచ జేథే | బేడూక అసణే సహజ తేథే | 
ఛాపీ భిజవూన తంవ మీ పరతే | ఘేతలీ హాతే చకమక | ||౪౨|| 
42. ఇందులో విశేషం ఏముంది? నీరు ఉన్న చోట కప్పలు ఉండటం సహజం. బట్టను తడుపుకుని నేను తిరిగి వచ్చి చెకుముకు రాయిని చేతిలో తీసుకున్నాను. 
గారేవరీ ఠిణగీ పాడూన | చిలీమ తయార ఝాలీ పేటూన | 
తోంచ ఎక వాటసరూ యేఊన | బైసలా వందూన మజపాశీ | ||౪౩|| 
43. రాతినుండి నిప్పురవ్వ వచ్చి, చిలుం వెలిగి తయారైంది. అకస్మాత్తుగా ఒక బాటసారి వచ్చి, వందనం చేసి నా దగ్గర కూర్చున్నాడు. 
నమ్రపణే మజకడూన | చిలీమ ఆపులే హాతీ ఘేఊన | 
‘లఈ లాంబ ఝుకలాంత’ మ్హణూన | ఆదరే మజ పుసూన రాహిలా | ||౪౪|| 
44. వినయంగా, నా వద్దనుండి చిలుం తన చేతిలోనికి తీసుకుని, ‘చాలా దూరం వచ్చారు’ అని సగౌరవంగా పలకరించాడు.  
‘మశీద ఫార లాంబ యేథూన | తేథే జాతా హోఈల ఊన | 
హే పలీకడే మాఝే సదన | చిలీమ పిఊన జాఊ కీ | ||౪౫|| 
45. ‘ఇక్కడనుండి మసీదు చాలా దూరం. అక్కడికి మీరు వెళ్లే సరికి, ఎండ ఎక్కిపోతుంది. ఈ వెనకే మా ఇల్లు. చిలుం త్రాగి ఇంటికి వెడదాం. 
తేథే వాంఈచ1 ఖా కీ భాకర | స్వస్థ ఆరామ కరా విళభర2
మగ ఊన ఖాలీ ఝాలియావర | ఖుశాల మాఘారా పరతావే | ||౪౬|| 
46. ‘అక్కడ కొంచెం రొట్టె అదీ తిని, కాసేపు విశ్రమించి, ఎండ బాగా తగ్గిపోయాక, సంతోషంగా తిరిగి వెళ్లవచ్చు. 
మీహీ యేఈన బరోబర’ | ఏసే భాషణ ఝాలియావర | 
చిలీమ పేటవునియా వాటసర | దేఈ మజ సాదర ఓఢావయా | ||౪౭|| 
47. ‘నేను కూడా మీ వెంట వస్తాను’ అని చెప్పి, బాటసారి చిలుం వెలిగించి, పీల్చటానికి గౌరవంగా నాకు ఇచ్చాడు. 
తికడే తో బేడూక ఆర్త స్వరే | ఓరడ కరూ లాగే గజరే | 
చౌకశీ కేలీ త్యా వాటసరే | ‘కోణ బరే హా ఓరడతో’ | ||౪౮|| 
48. అక్కడ, ఆ కప్ప ఆర్త స్వరంతో బిగ్గరగా ఏడవ సాగింది. ‘అలా బిగ్గరగా ఎవరు ఏడుస్తున్నారు?’ అని బాటసారి నన్ను అడిగాడు.  
తంవ మీ వదే నదీ కాంఠీ | బేడూక సాంపడలాసే సంకటీ | 
లాగలే త్యాచే కర్మ త్యా పాఠీ | ఏక తీ గోఠీ తుజ కథితో | ||౪౯|| 
49. అప్పుడు నేను అతనితో, నదీ తీరాన ఒక కప్ప కష్టంలో చిక్కుకుంది. దాని కర్మ దానిని వెంబడిస్తుంది. ఆ కథ నీకు చెప్తాను, విను. 
పూర్వ జన్మీ జైసే కరావే | ఇయే జన్మీ తైసే భరావే | 
కర్మభోగా సాదర వ్హావే | ఆతా రడావే కిమర్థ | ||౫౦||
50. పూర్వ జన్మలో చేసుకున్న దానిని ఈ జన్మలో అనుభవించాలి. కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? 

మగ ఏసే హే పరిసూన | చిలీమ మాఝియా హాతీ దేఊన | 
నిఘాలా వాటసరూ తేథూన | మ్హణే ‘మీ పాహూన యేతో జరా | ||౫౧|| 
51. ఇది విని, చిలుం నా చేతికిచ్చి, ‘నేను వెళ్లి చూచి వస్తాను’ అని బాటసారి అక్కడినుండి బయలుదేరాడు. 
అసే ఖరోఖర తో బేడూక | అథవా కోణీ ప్రాణీ ఆణిక | 
మన తరీ కరూ నిఃశంక | కాయ త్యా దుఃఖ ఆహే తే’ | ||౫౨|| 
52. ‘అది నిజంగా కప్పయేనా లేక వేరే జీవియా? అయితే దానికి ఏం దుఃఖం అన్న నా సందేహాన్ని తీర్చుకుంటాను’. 
ఏసీ తయాచీ ఇచ్ఛా బఘునీ | మ్హణాలో మీ జా యే పాహోని | 
ఎకా మోఠ్యా సర్పాచే వదనీ | బేడూక పడునీ ఓరడతసే | ||౫౩|| 
53. అతని ఇచ్ఛ అలా ఉండగా, “వెళ్లి చూడు. ఒక పెద్ద పాము నోట్లో కప్పపడి ఏడుస్తూ ఉంది” అని నేనన్నాను.  
దోఘేహీ మహా హరామఖోర | దోఘాంచీహీ కృత్యే అఘోర | 
పూర్వ జన్మీంచీ పాపే భయంకర | పావలే దేహాంతర భోగావయా | ||౫౪|| 
54. అవి రెండూ మహా దుష్టులు. వాని కృత్యాలు ఘోరమైనవి. పూర్వ జన్మల భయంకరమైన పాప కర్మల ఫలితాన్ని అనుభవించటానికి, ఈ శరీరాలను పొందాయి. 
అసతా చాలలే ఏసే విచార | గేలా వాటసరూ త్యా జాగ్యావర | 
ఆలా పాహూని ప్రత్యక్ష ప్రకార | మ్హణే ‘తో సాచార వృత్తాంత | ||౫౫|| 
55. అలాంటి ఆలోచనలు మనసులో వస్తూంటే, బాటసారి ఆ స్థలానికి వెళ్లి, ప్రత్యక్షంగా చూచి వచ్చిన విషయాన్ని, నాకు చెప్పాడు. 
సర్పహీ తో జైసా కాళ | ఏసా మోఠా జబడా విశాళ | 
బేడూకహీ మోఠా విక్రాళ | పరి తో ఫరాళ సర్పాచా | ||౫౬|| 
56. ‘కాల సర్పంలాంటి ఆ పెద్ద పాముకు, నోరు చాలా పెద్దగా ఉంది. కప్ప కూడా భయంకరంగా ఉంది కాని, అది పాముకు ఆహారం అయింది. 
ఘడీ అర్ధ ఘడీచా సోబతీ | పడలీ సర్పాముఖీ ఆహుతీ | 
కాయ విచిత్ర కర్మగతీ | క్షణాంత నిశ్చింతీ హోఈల త్యా’ | ||౫౭|| 
57. ‘పాము నోటిలో అది ఆహుతి అయిపోతుంది. గంటో, అరగంటో అంతే. కర్మ గతి ఏంత విచిత్రం? క్షణంలో దానికి నిష్కృతి కలుగుతుంది’.  
తంవ మీ మ్హణాలో తయాతే | తో కాయ కరితో నిశ్చింతీతే | 
త్యాచా మీ బాప ఆహే నా యేథే | మగ మీ కశా తే పాహిజే | ||౫౮|| 
58. అప్పుడు అతనితో నేను, “అది ఏం నిష్కృతినిస్తుంది? దాని బాబును నేను లేనూ! లేకుంటే నేనెందుకు ఇక్కడ?” అని అన్నాను. 
సోడూనియా అపులే స్థాన | బైసలో జో యేథే యేఊన | 
తో కాయ బేడూక ఖాఊ దేఈన | పహా సోడవీన త్యా కైసా | ||౫౯|| 
59. “నా స్థలాన్ని వదిలి, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. మరి ఆ కప్పను అలా తిననిస్తానా? చూడు! దానిని నేనెలా విడిపిస్తానో! 
ఆతా హీ ఝుంజ సోడవిల్యావరీ | ఆపణ జాఊ ఆపులే ఘరీ | 
జా జా ఎకదా చిలీమ భరీ | పాహూ మగ కాయ కరీ సర్ప | ||౬౦||
60. “ఇప్పుడు, ఈ దెబ్బలాటనుంచి వారిరువురినీ విడిపించి, మనం ఇంటికి పోదాం. పద, పద ఒకసారి చిలుం నింపు. ఆ పాము తరువాత ఏం చేస్తుందో చూద్దాం”. 

చిలీమ తాత్కాళ తయార కేలీ | వాటసరూనే స్వయే చేతవిలీ | 
ఝురకా మారూన మజపుఢే కేలీ | హాతీ మీ ఘేతలీ ఓఢావయా | ||౬౧|| 
61. ‘బాటసారి వెంటనే చిలుం తయారు చేసి తను స్వయంగా గట్టిగా పీల్చి, నాకు అందించాడు. నేను దానిని పీల్చటానికి చేతికి అందుకున్నాను.
మారిలే మ్యా ఝురకే దోన | వాటసరూలా సవే ఘేఊన | 
గేలో త్యా లవ్హాళ్యా మధూన | పావలో తే స్థాన వివక్షిత | ||౬౨|| 
62. ‘నేను రెండు మార్లు పీల్చాను. బాటసారిని వెంటబెట్టుకుని చెట్ల మధ్యనుండి ఆ ప్రత్యేక స్థలానికి చేరుకున్నాను. 
పునఃశ్చ సర్ప అవలోకూన | వాటసరూ తో గేలా భిఊన | 
కేవఢే హే ధూడ మ్హణూన | నివారీ మజ లాగూన భీతీనే | ||౬౩|| 
63. ఆ పామును మరల చూచి, బాటసారి భయపడిపోయాడు. ‘ఎంతటి భయంకరమైన ప్రాణి’ అని నన్ను వారించాడు. 
మ్హణే నకో హో జాఊ పుఢే | సర్ప తో యేఈల అపులేకడే | 
పళూ మ్హణతా స్థళ హే సాంకడే | నకో హో తికడే జాఊ నకా | ||౬౪|| 
64. ‘మీరు ముందుకు వెళ్లకండి. ఆ పాము మన దగ్గరకు రాగలదు. ఈ చోటు చాలా ఇరుకుగా ఉంది. ఇక్కడినుండి పరుగెత్తాలన్నా వీలు కాదు. కనుక, మీరు అటు వెళ్లవద్దు’ అని అన్నాడు. 
అవలోకితా ఏసా దేఖావా | వాటసరూ తో భ్యాలా జీవా | 
మగ త్యా దాఘాంచియా వైరభావా | సంబంధే పరిసావా ఉపదేశ | ||౬౫|| 
65. మొత్తం దృశ్యాన్ని చూచేసరికి బాటసారికి ప్రాణ భయం పట్టుకుంది. తరువాత, నేను తెలియ చేసిన ఆ రెండింటి శత్రుత్వ భావానికి సంబంధిన కథను వినండి. 
అరే బాబా వీరభద్రాప్పా | అఝూన హా తుఝా వైరీ బసాప్పా | 
పావలా నాహీ కా అనుతాపా | దర్దుర రూపా ఆలా తరీ | ||౬౬|| 
66. ‘ఒరే బాబూ! వీరభద్రప్పా! ఈ బసప్పా నీకు ఇప్పటికీ శత్రువేనా? కప్పరూపం వచ్చినా పశ్చాత్తాపం పొందలేదా? 
తూంహీ ఆలాసీ సర్పయోనీ | తరీహీ హాడవైర అజునీ | 
ఆతా తరీ శరమ ధరూనీ | వైర త్యజూనీ స్వస్థ రహా | ||౬౭|| 
67. ‘నీవు కూడా సర్పయోనికి వచ్చావు! అయినా, ఇంకా శత్రుత్వమేనా? ఇకనైనా సిగ్గుపడు. శత్రుత్వాన్ని మాని నిశ్చింతగా ఉండు. 
శబ్ద పడతా ముఖాంతునీ | సర్ప జో పళాలా బేడూక సోడూనీ | 
సత్వర ఖోల పాణ్యాంత శిరూనీ | అదృశ్య తేథూని జాహలా | ||౬౮|| 
68. నా నోటినుండి ఆ మాటలు రాగానే పాము కప్పను వదిలి, వేగంగా పారిపోయి, వెంటనే నీటిలోనికి దూరి అదృశ్యమైంది. 
మృత్యూచియే ముఖామధలా | బేడూక టణకర ఉడూన గేలా | 
తోహీ ఝాడీంత జాఊన లపలా | వాటసరూ ఝాలా సాశ్చర్య | ||౬౯|| 
69. మృత్యు ముఖంనుండి బయట పడిన కప్ప ఎగిరి, దూకి, చెట్లలోనికి పోయి దాక్కుంది. బాటసారి ఆశ్చర్యపోయాడు. 
మ్హణే ‘హే కాయ న కళే మజలా | శబ్ద ముఖీంచా తో కాయ పడలా | 
బేడూక కైసా సాపానే సోడిలా | సాపహీ దడలా తో కైసా | ||౭౦||
70. ‘ఇవేమీ నాకు అర్థం కాలేదు! మీ నోటినుండి మాటలు రాగానే, కప్పను పాము ఎలా వదిలింది? వదిలి, పాము ఎలా అదృశ్యమైంది?’ అని అతను అన్నాడు. 

యాంతీల వీరభద్రాప్పా కోణ | తైసాచ యాంతీల బసాప్పా కోణ’ | 
వాటసరూ పుసే వైరాచే కారణ | మ్హణే ‘మజ నివేదన కరా కీ’ | ||౭౧|| 
71. ‘వీరిలో వీరభద్రప్ప ఎవరు? అలాగే బసప్ప ఎవరు? వీరి శత్రుత్వానికి కారణమేమిటో నాకు చెప్పండి’ అని అడిగాడు. 
బరే ఆధీ ఝాడాఖాలతీ | జాఊ ఓఢూ చిలీమ మాగుతీ | 
మ్హణాలో కరీన జిజ్ఞాసాపూర్తీ | మగ మీ స్వస్థళాప్రతీ జాఈన | ||౭౨|| 
72. ‘సరే, ముందు చెట్ల క్రిందకు పోయి, చిలుం పీల్చుకున్న తరువాతనే, నీ కుతూహలాన్ని తీర్చి నేను నా స్థలానికి వెళ్లిపోతానని’ చెప్పాను. 
ఆలో దోఘే ఝాడాఖాలీ | పడలీ హోతీ దాట సాంఉలీ | 
గార వార్యాచీ ఝుళుక చాలలీ | పునఃశ్చ సళగావలీ చిలీమ | ||౭౩|| 
73. చెట్లక్రిందకు ఇద్దరమూ వచ్చాం. బాగా నీడగా ఉంది. చల్లగాలి వీచసాగింది. మరల చిలుం వెలిగించాం. 
వాటసరూనే ఆధీ ఓఢిలీ | పశ్చాత మాఝియే కరీ దిధలీ | 
తీ మీ ఓఢితా ఓఢితా కథిలీ | కథా త్యా వహిలీ వాటసరూస | ||౭౪|| 
74. ముందు బాటసారి పీల్చి, తరువాత నా చేతికి ఇచ్చాడు. నేను దానిని పీల్చుతూ, పీల్చుతూ అతనికి కథను చెప్పాను. 
పహా మాఝియే స్థళాపాసూన | కోస దోన అథవా తీన | 
ఇతకేంచ దూర పవిత్రస్థాన | మహిమాసంపన్న హోతే జునే | ||౭౫|| 
75. నేనున్న స్థలంనుండి కోసు, రెండు కోసులు లేదా మూడు కోసల దూరంలో, చాలా మహిమగల, పురాతనమైంది, ఒక పవిత్ర స్థానం ఉండేది. 
తేథే ఎక మహాదేవాచే | మోడకే దేఊళ కధీ కాళాచే | 
తయాచియా జీర్ణోద్ధారాచే | ఆలే సర్వాంచే మనాంత | ||౭౬|| 
76. అక్కడ, ఏనాటి కాలానిదో, శిథిలమై పోయిన ఒక శివాలయం ఉండేది. దాని పునరుద్ధరణ చేయాలని అందరికీ అనిపించింది. 
తదర్థ మోఠీ వర్గణీ కేలీ | బరీచ రక్కమ గోళా ఝాలీ | 
పుజేఅర్చేచీ వ్యవస్థా ఠరవిలీ | పూర్ణ ఆంఖిలీ రూపరేషా | ||౭౭|| 
77. అందుకోసం, విరాళాల రూపంలో చాలా ధనాన్ని పోగు చేశారు. గుడియొక్క రూపురేఖలను, పూజార్చన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. 
తేథీల ఎక మోఠా ధనిక | నేమిలే త్యా వ్యవస్థాపక | 
పైసా కేలా తయాచే హస్తక | పూర్ణ నిర్ణాయక తో కేలా | ||౭౮|| 
78. అక్కడే ఉన్న ఒక గొప్ప షావుకారును నిర్వాహకునిగా నియమించారు. అన్ని నిర్ణయాలనూ అతడే తీసుకోవాలని చెప్పి, అతని చేతికి డబ్బిచ్చారు.  
తయానే కీర్ద ఠేవావీ పృథక | తీంత అపులీ వర్గణీ రోఖ | 
జమా కరావీ హే కార్యహీ అచూక | కరావే ప్రామాణికపణానే | ||౭౯|| 
79. అతడు తన విరాళాన్నీ జతపరచి, ఆ ధనాన్ని వేరుగా ఉంచి, చక్కగా జమా ఖర్చుల లెక్క వ్రాసి, కార్యాన్ని ప్రామాణికంగా, ఏ పొరపాటూ చేయకుండా, చేస్తాడని ఆశించారు. 
పరి తో జాత్యా మోఠా కంజూష | ఖార న లాగావా పదరాస | 
ఏసియా ధోరణే చాలవీ కామాస | తేణే తే తడీస జాఈనా | ||౮౦||
80. స్వాభావికంగా అతడు చాలా పిసినారి. తన డబ్బు ఏమాత్రం నష్టం కాకుండా పని చేయించడం వలన, గుడి పని పూర్తి కాలేదు. 

ఖర్చ కేలీ సారీ రకమ | అర్ధేముర్ధే జాహలే కామ | 
ఖర్చీనా హా పదరచా దామ | గాంఠీచా ఛదామ సోడీనా | ||౮౧|| 
81. పోగు చేసిన డబ్బంతా అయిపోయింది. కాని పని సగమే అయింది. అయినా, అతడు తన స్వంత డబ్బు ఒక్క పైసా అయినా ఖర్చు పెట్టలేదు.
జరీ మోఠా సావకార | కృపణపణాచా పూర్ణావతార | 
బోలాచీ నుసతీ పేరీ సాఖర | కామాసీ ఆకార యేఈనా | ||౮౨|| 
82. గొప్ప షావుకారు అయినప్పటికీ, అతడు మూర్తీభవించిన లోభి. తియ్యతియ్యగా మాట్లాడేవాడు కాని, ఆ మాటలకు కార్య రూపం ఇవ్వలేదు. 
పుఢే త్యాచ్యా జమలీ ఘరీ | మండళీ పైసా జమవిణారీ | 
మ్హణే హీ తుఝీ సావకారీ | కాయ తరీరే కామాచీ | ||౮౩|| 
83. తరువాత, పోగు చేసిన డబ్బును అతని వద్ద ఉంచిన వారంతా సమావేశమయ్యారు. ‘నీకు ఇంత డబ్బు ఉందిగాని, ఏం ప్రయోజనం?’ 
మహాదేవాచా జీర్ణోద్ధార | తూ న లావితా హాతభార | 
పడేల కైసా నకళే పార | కాంహీ విచార కర యాచా | ||౮౪|| 
84. ‘నీ సహాయం లేకుండా ఈ మహాదేవుని మందిరం ఎలా పునరుద్ధరింప బడుతుంది? దీని గురించి కొంచమైనా ఆలోచించు.’ 
కరూని లోకాంచీ మనధరణీ | పునశ్చ మిళవూ ఆణిక వర్గణీ | 
తీహీ దేఊ తుజ పాఠవూనీ | ఆణ కీ ఠికాణీ హే కామ | ||౮౫|| 
85. ‘ప్రజల వద్ద మేము మరల విరాళాలు వసూలు చేసి, ఆ డబ్బును కూడా నీకు అందిస్తాము. ఎలాగైనా ఈ కార్యాన్ని పూర్తి చేయి’ అని చెప్పారు. 
పుఢే ఆణిక పైసా జమలా | ఉత్తమ ప్రకారే హాతీ ఆలా | 
కాంహీ న త్యాచా ఉపయోగ ఝాలా | ధనిక బైసలా తో స్వస్థ | ||౮౬|| 
86. అలాగే మరల డబ్బు పోగు చేసి అతనికి చక్కగా అందించారు. అయినా, దానివల్ల ఏమీ ప్రయోజనం కాలేదు. షావుకారు నిశ్చింతగా కూర్చున్నాడు.  
అసో జాతా కాంహీ దివస | ఆలే దేవాజీచ్యా మనాస | 
యాచ ధనికాచియా కుటుంబాస | జాహలా తే సమయాస దృష్టాంత | ||౮౭|| 
87. కొన్ని రోజులు గడిచాక, దేవునికే ఏదైనా చేయాలని అనిపించింది. అప్పుడు ఆ ధనికుని భార్యకు ఒక కల వచ్చింది.  
తూ తరీ హో జాగీ ఊఠ | బాంధీ జా త్యా దేఉళా ఘుమట | 
జే ఖర్చశీల త్యాచీ శతపట | తుజ తో నీళకంఠ దేఈల | ||౮౮|| 
88. ‘నీవైనా మేలుకో! దేవాలయానికి గోపురాన్ని కట్టించు. నీవు ఖర్చు పెట్టిన దానికి నూరింతలు నీలకంఠుడు నీకు ఇస్తాడు’ అని. 
దుసరే దివశీ తో దృష్టాంత | పతీచ్యా కానీ ఘాతలా సాద్యంత | 
కవడీ ఖర్చతా జయా ప్రాణాంత | తయా హా అత్యంత ఉద్వేగక | ||౮౯|| 
89. మరునాడు, ఆ కలను మొత్తంగా ఆమె తన భర్త చెవిన వేసింది. ఒక్క గవ్వైనా ఖర్చు పెట్టాలంటే అతనికి ప్రాణాంతకం. అందువల్ల, ఆ మాటలు అతనికి కోపాన్ని కలిగించాయి. 
కరావా అహర్నిశ విత్త సంచయ | దుజా న జ్యాచ్యా చిత్తా విషయ | 
తయాస యా స్వప్నాచా ఆశయ | ద్రవ్యాచా వ్యయ కేవి పటే | ||౯౦||
90. రాత్రీ పగలూ డబ్బు పోగు చేయటం తప్ప వేరే విషయం తెలియనివానికి, డబ్బు ఖర్చుతో సంబంధించిన ఈ కల ఎలా నచ్చుతుంది?  

త్యానే సాంగితలే పత్నీస | మీ న మానీ దృష్టాంతాస | 
ముళీంచ నాహీ మాఝా విశ్వాస | మాండలా ఉపహాస తియేచా | ||౯౧|| 
91. అతడు భార్యతో ‘నేను ఈ దృష్టాంతాన్ని నమ్మను. ఇలాంటివాటిలో నాకు అసలు విశ్వాసం లేదు’ అని చెప్పాడు. ఆమెను హేళన చేశాడు. 
జైసీ జయాచీ చిత్తవృత్తీ | తైసీచ తయా జగత్స్థిాతీ | 
స్వయే అసలియా శఠప్రకృతి | ఇతరహీ దిసతీ తైసేచ | ||౯౨|| 
92. వారివారి మనసును బట్టి జగత్తు, వారికి అలాగే కనిపిస్తుంది. మొండివాడికి ఇతరులు కూడా అలాగే కనిపిస్తారు. 
జరీ అసతే దేవాచే మనీ | మాఝాచ పైసా ఘ్యావా కాఢునీ | 
మీ కాయ దూర హోతో తుజపాసూనీ | తుఝేచ స్వప్నీ కా గేలా | ||౯౩|| 
93. ‘దేవునికి నా డబ్బే తీసుకోవాలని ఉంటే, నేను నీకంటే దూరంగా ఉన్నావా? ఆ కల నీకే ఎందుకు వచ్చింది? 
తులాచ కా హా దృష్టాంత ఝాలా | మలాచ కా తో దేవే న దిధలా | 
మ్హణోని యేఈనా భరంవసా మజలా | యాచా న సమజలా మజ భావ | ||౯౪|| 
94. ‘ఆ కల నీకు మాత్రమే ఎందుకు రావాలి? దేవుడు ఆ కలను నాకెందుకు కలిగించలేదు? దీని భావం నాకేమీ అర్థం కావడం లేదు. కనుక నాకు నమ్మకం కుదరడం లేదు.  
అసావే హే ఖోటే స్వప్న | అథవా హా అసేల ఈశ్వరీ యత్న | 
నవరా బాయకోంత వ్హావీ ఉత్పన్న | దుహీ హే చిన్హ దిసతే మజ | ||౯౫|| 
95. ‘కల అబద్ధమైనా అయి ఉండాలి, లేక భార్యాభర్తల మధ్య తగువులాట పెట్టాలని ఆ ఈశ్వరడు పన్నిన పన్నాగం అని నాకు అనిపిస్తూంది. 
జీర్ణోద్ధారాచియే కామీ | సాహ్య మాఝే ఆహే కా కమీ | 
మహిన్యా మహిన్యాస హోతే రికామీ | థైలీ ఆమ్హీ భరలేలీ | ||౯౬|| 
96. ‘జీర్ణోద్ధరణ కార్యంలో, నా సహకారమేమైనా తక్కువగా ఉందా? నెలనెలా మేము నింపి పెట్టిన సంచులు ఖాళీ అవుతున్నాయి. 
లోక ఆణితీ రకమ సారీ | దిసతే ఖరే హే బాహ్యాత్కారీ | 
జమాఖర్చాచీ పద్ధతీ వ్యాపారీ | నుకసానకారీ మజ బహు | ||౯౭|| 
97. ‘డబ్బంతా ప్రజలు తెచ్చి ఇస్తున్నట్లు పైకి కనిపిస్తుంది. కాని, జమా ఖర్చుల ఈ వ్యాపార పద్ధతి వలన నాకు చాలా నష్టం. 
లోకాంనాహీ నాహీ అవగత | కళావే తే కైసే తుజప్రత | 
తేవ్హా హా జో తుఝా దృష్టాంత | యేఈనా యథార్థ మానావయా | ||౯౮|| 
98. ‘ప్రజలకే తెలియని ఇది నీకు ఎలా తెలియచేయాలి? నీకు కలిగిన కల నిజమని అనుకోవడానికి లేదు.  
ఖరా మానితా హోఈల ఫసగత | నిద్రాభంగే పడతీ దృష్టాంత | 
తే కాయ కోణీ మానీ యథార్థ | ధనికే హా సిద్ధాంత ఠరవిలా | ||౯౯|| 
99. ‘నిజమని అనుకుంటే మొత్తంగా మోసపోతాం. నిద్రాభంగం కలిగినప్పుడు ఏవేవో కలలు కలుగుతాయి. వానిని ఎవరైనా నిజమని అనుకుంటారా?’ అని ఆ షావుకారు సిద్ధాంతాంగా నిర్ణయించాడు.  
ఏకూన బాఈల బైసే నివాంత | పతీపుఢే తీ నిరుత్తర హోత | 
పైసా జరీ లోక జమవీత | సంతోషే దేత క్వచితచీ | ||౧౦౦||
100. అతని భార్య మౌనం వహించింది. భర్త మాటలకు ఏం జవాబు చెప్పాలో ఆమెకు తెలియలేదు. శక్తి కొలది ప్రజలు డబ్బు సేకరించినా, సంతోషంగా ఇష్టం కొద్ది, ఇచ్చినవారు చాలా తక్కువ. 

ప్రేమేవీణ భిడేభాడే | పడతా ఆగ్రహ అథవా సాంకడే | 
జే దిధలే తే దేవా నావడే | గోడీచే థోడేంహీ బహు మోల | ||౧౦౧|| 
101. ప్రేమ లేకుండా, బలవంతంగానో లేదా బాధపడుతూనో ఇస్తే దేవునికి ఇష్టం ఉండదు. ప్రేమతో ఇచ్చిన ఏ కొంచెంమైనా అది చాలా విలువైనది.
జైసా జైసా పైసా జమత | కామహీ తైసే తైసే హోత | 
పైసా థకతా కామహీ థకత | ఏసే తే దిరంగత చాలలే | ||౧౦౨|| 
102. డబ్బు పోగైనప్పుడు, దేవాలయం పని జరగడం, డబ్బు రావడం ఆగిపోతే, పని కూడా ఆగిపోవటం, అలా ఆ పని ఆలస్యం కాసాగింది. 
ధనిక కాఢీనా కృపణ జైసా | అపుల్యా పిశవీంతీల ఎకహీ పైసా | 
పునశ్చ ఝాలా దృష్టాంత కైసా | కాంతేస తో పరిసా ధనికాచ్యా | ||౧౦౩|| 
103. లోభి అయిన ధనికుడు మాత్రం తన సంచి నుండి ఒక్క పైసా కూడా తీయలేదు. అప్పుడు, అతని భార్యకు మరల కలిగిన దృష్టాంతాన్ని వినండి. 
‘నకో ఆగ్రహ కరూ పతీస | పైసా దేణ్యాస దేఊళాస | 
భావ తుఝా పురే దేవాస | ద్యావే తవ ఇచ్ఛేస యేఈల తే | ||౧౦౪|| 
104. ‘దేవాలయానికి డబ్బును ఇవ్వమని నీ భర్తను బలవంత పెట్టకు. భగవంతునికి నీ శ్రద్ధాభక్తులు చాలు. నీకు ఇష్టమైనంత ఇవ్వు. 
‘పైసా ఎక మనోభావాచా | స్వసత్తేచా తో లాఖాచా | 
అర్పణ దేవాస కరీ సాచా | విచార పతీచా ఘేఊన | ||౧౦౫|| 
105. ‘నీవు హృదయపూర్వకంగా ఒక్క పైసా ఇచ్చినా సరె, అది లక్షల విలువ చేస్తుంది. కనుక నీ భర్తను సంప్రదించి, దేవునికి అర్పించు. 
‘కరూ నకో వ్యర్థ శీణ | మనా యేఈల తే ద్యావే ఆపణ | 
స్వసత్తేచే అల్ప ప్రమాణ | అసేనా అర్పణ కరీ తే | ||౧౦౬|| 
106. ‘అనవసరంగా శ్రమ పడకు. నీ మనసుకు తోచినంత ఇవ్వు. కొంచెమైనా సరే, నీ స్వంతమైన దానిని అర్పించు. 
‘యేథే కేవళ భావ కారణ | తుఝా తో ఆహే హే జాణూన | 
కాంహీ తరీ దే దే మ్హణూన | ఆగ్రహ జాణ దేవ ధరీ | ||౧౦౭|| 
107. ‘ఇక్కడ కేవలం భక్తి భావనే ముఖ్యం. నీకు భక్తి ఉన్నదని తెలిసి ఏమైనా అర్పించమని, దేవుడు మరల మరల అడుగుతున్నాడు. 
‘తరీ జే అసేల అల్ప విత్త | దేఊని హోఈ తూ నిశ్చింత | 
భావావీణ దేణే తే అనుచిత్త | దేవా న యత్కించిత ఆవడే | ||౧౦౮|| 
108. ‘అందువల్ల, నీ దగ్గరున్న ఏ కొంచెం ధనమైనా ఇచ్చి, నీవు నిశ్చింతగా ఉండు. భక్తి భావం లేకుండా ఇవ్వడం మంచిది కాదు. అది భగవంతునికి అసలు ఇష్టముండదు. 
‘వినాభావ జో దేఈల | త్యాచే తే సర్వ మాతీమోల | 
అంతీ సమూళ నిష్ఫళ హోఈల | అనుభవ హా యేఈల అవిలంబే’ | ||౧౦౯|| 
109. ‘శ్రద్ధ లేకుండా చేసే దానం మట్టితో సమానం. చివరకు అది నిష్ఫలమౌతుంది. త్వరలోనే ఇది అనుభవమౌతుంది.’ 
అసో హా దృష్టాంత ఏకునీ | కేలా తినే నిశ్చయ మనీ | 
పితృదత్త అలంకార వేంచూని | మాగణే పరిపూర్ణ కరావే | ||౧౧౦||
110. కలలోని సందేశాన్ని విన్న తరువాత, ఆమె తన తండ్రి ఇచ్చిన నగలను దేవునికి అర్పించాలని నిశ్చయించుకుంది.  

మగ తీనే పతీ లాగూన | కేలా తో నిశ్చయ నివేదన | 
పతీనే తే ఘేతలే ఏకూన | అంతరీ ఉద్విగ్న జాహలా | ||౧౧౧|| 
111. తన నిశ్చయాన్ని భర్తకు తెలియచేసింది. అది వినిన తరువాత, భర్తకు, తన మనసులో, అతిగా కోపమొచ్చింది.  
లోభ తేథే కైంచే విచార | నాహీ దేవధర్మ ఆచార | 
మనీ మ్హణే ‘హా కాయ అవిచార | భ్రాంతిష్ట సాచార హీ ఝాలీ’ | ||౧౧౨|| 
112. లోభమున్న చోట ఆలోచన ఎక్కడిది? అక్కడ దేవుడు, ధర్మం, ఆచారం అవి ఏవీ ఉండవు. ‘ఏమిటీ ఈమె తెలివిలేని ఆలోచన, ఈమె మతి భ్రమించింది’, అని అనుకున్నాడు. 
మ్హణే ‘హే తిచే అలంకార | కరూనియా సర్వాంచా ఆకార | 
మోల ఠరవూని ఎక హజార | జమీన నాంవావర చఢవావీ’ | ||౧౧౩|| 
113. ‘ఈమె నగలన్నిటికీ ఒక వేయి రూపాయలకు విలువ కట్టి, ఈమె పేరిట దేవునికి భూమి అర్పించాలి’ అని అనుకున్నాడు. 
అలంకార ఖరీదిలే ఆపణ | పైశా ఏవజీ పత్నీలాగూన | 
దిధలీ అపులీ జమీన ఖాజణ3 | హోతీ జీ గహణ కోణాచీ | ||౧౧౪|| 
114. ఆమె నగలన్నీ తనే కొనుక్కుని, డబ్బుకు బదులుగా ఎవరిదో తన వద్ద తాకట్టుగా ఉన్న బంజరు భూమిని భార్యకు ఇచ్చాడు. 
జమీనహీ తీ హోతీ ఓసిక4 | పర్జన్య కాళీంహీ నాపీక | 
పత్నీస మ్హణే ‘కరూన టాక | అర్పణ పినాకపాణీస | ||౧౧౫|| 
115. ఆ భూమేమో సాగులేనిది. వర్షాకాలంలో కూడా అందులో ఏమీ పండదు. అలాంటి ‘భూమిని ఈశ్వరునికి అర్పించు’ అని అన్నాడు. 
హజారాచీ ఏసీ జమీన | కరితా దేవాలాగీ దాన | 
దృష్టాంతానురూప హోఈల ప్రసన్న | హోసీల ఉత్తీర్ణ ఋణాంతూనీ’ | ||౧౧౬|| 
116. ‘వేయి రూపాయల భూమిని దేవునికి దానం చేస్తే, దృష్టాంతంలో చెప్పినట్లుగా దేవుడు ప్రసన్నుడౌతాడు. నీవు ఋణముక్తురాలౌతావు’ అని చెప్పాడు. 
అసో మానుని పతీచే వచన | కృపణకాంతా తంవ జమీన | 
ప్రేమభావే కరీ అర్పణ | శంకర సంతోషణ వ్హావయా | ||౧౧౭|| 
117. భర్త మాటలను విని లోభి భార్య ఆ భూమిని శంకరునికి ప్రీత్యర్థంగా ప్రేమతో అర్పించింది. 
వస్తుస్థితీ పాహూ జాతా | దోనశేంచ్యా కర్జాకరితా | 
ధనికాపాశీ గహణ అసతా | డుబకీచీ సత్తా హిజవర | ||౧౧౮|| 
118. వాస్తవానికి, ఆ భూమిని రెండు వందల రూపాయలకు డుబకీ అనే స్త్రీ ఆ ధనికుని వద్ద తాకట్టు పెట్టింది. 
డుబకీ ఎక అనాథ బాఈ | జమీన తీచ్యా సత్తేచీ హీ | 
తీ హీ జమీన గహణ దేఈ | ఆపత్తీపాయీ ద్రవ్యాచ్యా | ||౧౧౯|| 
119. డుబకీ ఒక అనాథ స్త్రీ. ఆ భూమి యజమానురాలు ఆమెయే. డబ్బుకు ఇక్కట్టు కలిగినప్పుడు, ఆమె తన భూమిని తాకట్టు పెట్టింది. 
పరి ధనిక మహాలోభీ | శంకరహీ ఫసవితా న భీ | 
కాంతేచే స్త్రీధన దాబీ | కపటలాభీ సుఖ మానీ | ||౧౨౦||
120. కాని, ఆ ధనికుడు మహా లోభి. శంకరుని మోసగించటానికి కూడా భయపడలేదు. తన భార్యయొక్క స్త్రీ ధనాన్ని కాజేసి, కపటంతో లాభాలు పొందటం సుఖమని అనుకున్నాడు. 

బహు ఖోటీ హే విషయలాలసా | కరీ విషయాసక్తాచే నాశా | 
గుంతూ నయే యా విషయపాశా | జీవితాశా అసేల జరీ | ||౧౨౧|| 
121. ఇంద్రియ సుఖాల గురించి విపరీతమైన కోరిక చాలా చెడ్డది. ఈ కోరిక ఆసక్తి కలవారిని నాశనం చేస్తుంది. జీవితం మీద ఆశ ఉంటే ఈ పాశంలో చిక్కుకోకండి.
శ్రవణలాలసే మరే కురంగ | సుందర మణి ధారణే భుజంగ | 
తేజావలోకన గోడియే పతంగ | ఏసా హా కుసంగ విషయాంచా | ||౧౨౨|| 
122. వినాలనే విపరీతమైన కోరికతో జింక చచ్చి పోతుంది. అందమైన మణిని ధరించడం వలన పాము, వెలుగును చూడాలనే కోరికతో కీటకం చచ్చిపోతాయి. ఇలా ఇంద్రియ సుఖాలయందు ఆసక్తి, చాలా హానికరం.  
విషయభోగా లాగే ధన | తదర్థ యత్న కరితా గహన | 
విషయతృష్ణా వాఢే దారుణ | అశక్య నివారణ తియేచే | ||౧౨౩|| 
123. ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి, డబ్బు అవసరం. దానికోసం గట్టి ప్రయత్నం చేస్తే, ఈ కోరిక దారుణంగా ఎక్కువౌతుంది. దానిని తొలగించుకోవటం అసాధ్యం.  
నిఃసంశయ బుడీత జమీన | ప్రయత్నేంహీ న పికే కణ | 
తీ మ్హణే కరా కృష్ణార్పణ | కాయ తే పుణ్య దానాచే | ||౧౨౪|| 
124. నిస్సందేహంగా, ఆ భూమి అస్సలు పనికి రానిది. ఎంత శ్రమ పడినా ఒక గింజ కూడా ఫలించని దానిని కృష్ణార్పణమని అనుకుంటే, అటువంటి దానం వలన ఏం పుణ్యం? 
జేథే న యత్కించితహీ సంకల్ప | కృష్ణార్పణ తే నిర్వికల్ప | 
ఏసే నవ్హే తే జోడిలే పాప | అంతీ జే సంతాపకారక | ||౧౨౫|| 
125. కొంచెం కూడా కోరిక లేకుండా అర్పించిన దానాన్ని నిర్వికల్ప దానమని అంటారు కాని, ఇలాంటి దానిని కాదు. ఇలాంటి దానంతో, చివర దుఃఖం కలిగి, పాపాన్ని మూట కట్టుకోవటమే. 
యేరీకడే గరీబ బ్రాహ్మణ | జో త్యా దేవాచే కరీ పూజన | 
దేవార్థ జమీన హోతా సంపాదన | పావలా సమాధాన అత్యంత | ||౧౨౬|| 
126. ఇక్కడ, పేద బ్రాహ్మణుడైన దేవాలయంలోని పూజారి మాత్రం దేవునికి భూమి లభించిందని చాలా సంతోషించాడు. 
అసో పుఢే కాంహీ కేలే | విపరీతచి హోఊని గేలే | 
కృత్తికా నక్షత్ర అపార వరసలే | తుఫాన ఝాలే భయంకర | ||౧౨౭|| 
127. కాని, కొంత కాలానికి ఒక విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్ర ప్రభావంతో వర్షం విపరీతంగా కురిసింది. భయంకరమైన తుఫాను చెలరేగింది. 
ఎకాఎకీ వీజ పడలీ | ఇమారత తీ సారీ ఖచలీ | 
ధనీ5 తేవఢీ సురక్షిత రాహిలీ | దగ్ధ ఝాలీ అవశేష | ||౧౨౮|| 
128. అకస్మాత్తుగా, పిడుగు పడింది. షావుకారు ఇల్లంతా కూలిపోయింది. దేవునికి ఇచ్చిన భూమి మాత్రం సురక్షితంగా ఉంది. మిగతాదంతా కాలి పోయింది.  
ధనికావరహీ పడలా ఘాలా | నిజకాంతేసహ తోహీ నిమాలా | 
డుబకీహీ పావలీ పంచత్వాలా | శేవట హా ఝాలా తిఘాంచా | ||౧౨౯|| 
129. షావుకారు కూడా నాశనమయ్యాడు. తన భార్యతో సహ అతడు కూడా మరణించాడు. డుబకీ కూడా చచ్చిపోయింది. అలా ఆ ముగ్గురూ మరణించారు.  
పుఢే హా ధనిక మథురా నగరీ | ఎకా గరీబ బ్రాహ్మణా ఉదరీ | 
తయాచీ తీ భావిక అంతురీ | పుజార్యా ఘరీ జన్మలీ | ||౧౩౦||
130. ఆ షావుకారు, తరువాత, మథురా నగరంలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట్లో పుట్టాడు. భక్తురాలైన ధనికుని భార్య శివాలయం పూజారి ఇంట్లో జన్మించింది.  

నాంవ తీచే ఠేవిలే గౌరీ | డుబకీచీహీ ఆణీక పరీ | 
శంకరాచియా గురవాచే ఉదరీ | తియే నారీచా నర ఝాలా | ||౧౩౧|| 
131. ఆమెకు గౌరి అని పేరు పెట్టారు. డుబకీ కూడా మరో విధంగా శంకరునియొక్క ‘గురువ’ అనే కుటుంబంలో, మగ బిడ్డగా పుట్టింది. 
తయా నరాచే బారసే కేలే | చనబసాప్పా నామ ఠేవిలే | 
ఏసే తిఘాంచే స్థిత్యంతర ఘడలే | ఫలోన్ముఖ ఝాలే తత్కర్మ | ||౧౩౨|| 
132. ఆ బిడ్డకు బారసాల చేసి, చెన్నబసప్ప అని పేరు పెట్టారు. ఇలా ముగ్గురి స్థితి గతులలో అంతరం ఏర్పడింది. వారి కర్మ ఫలించే సమయం వచ్చింది. 
ధనిక పావతా పునర్జన్మ | వీరభద్ర ఠేవిలే నామ | 
హేంచ కీ ప్రారబ్ధ కర్మాచే వర్మ | భోగేంచ ఉపరమ తయాసీ | ||౧౩౩|| 
133. పునర్జన్మలో షావుకారుకు వీరభద్రప్ప అని పేరు పెట్టారు. ఇదే ప్రారబ్ధ కర్మయొక్క రహస్యం. ఈ కర్మ అనుభవిస్తేనే అంతమౌతుంది.  
శంకరాచా జో పుజారీ | తయాచీ మజ ఆవడ భారీ | 
నిత్య యేఊని ఆమ్హా ఘరీ | చిలీమ మజబరోబరీ పీతసే | ||౧౩౪|| 
134. శంకరుని పూజారి అంటే నాకు చాలా ఇష్టం. రోజూ మా ఇంటికి వచ్చి, నాతో బాటు చిలుం పీల్చేవాడు. 
మగ ఆమ్హీ ఆనంద నిర్భర | గోష్టీ కరావ్యా రాత్రభర | 
గౌరీ వాఢలీ ఝాలీ ఉపవర | తీసహీ బరోబర ఆణీతసే | ||౧౩౫|| 
135. తరువాత, మేము రాత్రంతా ఆనందంగా కబుర్లు చెప్పుకునే వారం. గౌరి పెద్దదై పెళ్ళికి ఎదిగింది. ఆమెను కూడా వెంటబెట్టుకుని తీసుకుని వచ్చేవాడు. 
తీహీ మాఝీ భక్తీ కరీ | ఎకే దివశీ పుసే పుజారీ | 
ధూండూని పాహిలీ స్థళే సారీ | కుఠేంహీ పోరీచే జమేనా | ||౧౩౬|| 
136. ఆమె కూడా నన్ను అభిమానించేది. ఒక రోజు పూజారి ‘ఈ అమ్మాయికి అన్ని చోట్లా సంబంధాలు వెదికాను. ఎక్కడా కుదరటం లేదు. 
బాబా ఠికాణ పాహతా థకలో | ప్రయత్న హరలే టేకీస ఆలో | 
కిమర్థ వాహసీ చింతా మీ వదలో | వర మార్గ చాలో లాగలా | ||౧౩౭|| 
137. ‘బాబా! సంబంధాలు చూచి నేను అలసిపోయాను. నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి’ అని అన్నాడు. అందుకు నేను, “ఎందుకు చింతిస్తావు? ఆమె వరుడు దారిలో ఉన్నాడు” అని అన్నాను. 
ములగీ తుఝీ భాగ్యశాలీ | హోఈల మోఠీ పైసేవాలీ | 
తిలాచ శోధీత ఆపులే పాఊలీ | వర తిచా చాలీస లాగలా | ||౧౩౮|| 
138. “మీ అమ్మాయి భాగ్యశాలి. గొప్ప ధనవంతురాలవుతుంది. ఆమెనే వెదుక్కుంటూ వరుడు స్వయం నడుచుకుంటూ వస్తున్నాడు. 
అల్పావకాశే తుఝియా సదనా | యేఈల పురవీల తుఝీ కామనా | 
కరీల గౌరీచియా పాణిగ్రహణా | తూఝియా వచనా అనుసార | ||౧౩౯|| 
139. “త్వరలోనే నీ ఇంటికి వచ్చి, నీ కోరికను తీర్చుతాడు. నువ్వు చెప్పిన ప్రకారంగా గౌరిని వివాహం చేసుకుంటాడు” అని నేను చెప్పాను. 
యేరీకడే వీరభద్ర | గరీబీచా ఘర సంసార | 
ఆఈబాపాంస దేఊని ధీర | సోడోని జో ఘర నిఘాలా | ||౧౪౦||
140. ఇక్కడ, వీరభద్రుడు పేద కుటుంబంలో ఉన్నందు వలన, తల్లి తండ్రులకు ధైర్యం చెప్పి, ఆ ఇంటిని వదిలి బయలుదేరాడు. 

తో గాంవోగాంవీ భిక్షాటన | కధీ మోలమజూరీ కరూన | 
కధీ జే మిళే తేంచ ఖాఊన | సంతుష్ట రాహూన ఫిరతసే | ||౧౪౧|| 
141. ఊరూరు భిక్షాటన చేస్తూ, ఒక్కో చోట కూలి పని చేస్తూ, ఎక్కడ ఏది దొరికితే, దానినే తింటూ, సంతోషంగా తిరగ సాగాడు.
ఫిరతా ఫిరతా దైవే ఆలా | పుజార్యాచియే సదనా పాతలా | 
అల్లామియాచీ అఘటిత లీలా | ఆవడూ లాగలా సకళాంస | ||౧౪౨|| 
142. తిరుగుతూ తిరుగుతూ, దైవ వశాత్తు పూజారి ఇంటికి వచ్చి చేరాడు. అల్లా మియాయొక్క ఊహించని లీల. అందరికీ అతడు ప్రీతి పాత్రుడయ్యాడు. 
హోతా హోతా లోభ జడలా | వాటలే గౌరీ ద్యావీ త్యాలా | 
నాడీ గోత్ర గణ యోగ జుళలా | ఆనంద ఝాలా పుజారియా | ||౧౪౩|| 
143. కాలక్రమేణ, వారి అభిమానాన్ని సంపాదించాడు. గౌరిని అతనికి ఇవ్వాలని పూజారికి అనిపించింది. ఆ ఇద్దరి గోత్రాలు, నాడి, గణ, యోగాలు కలిశాయి. పూజారికి ఆనందం కలిగింది. 
సవే ఘేఊన వీరభద్రాలా | ఎకే దివశీ పుజారీ ఆలా | 
దోఘా పాహూని త్యా సమయాలా | విచార స్ఫురలా ఎకాఎకీ | ||౧౪౪|| 
144. ఒక రోజు, వీరభద్రుని వెంటబెట్టుకుని పూజారి నా దగ్గరకు వచ్చాడు. ఆ ఇద్దరినీ చూడగానే అకస్మాత్తుగా, నాకో ఆలోచన స్ఫురించింది. 
విచారా సరిసా ఉచ్చార ఝాలా | సాంప్రత లగ్నాలా ముహూర్త అసలా | 
తర తూ యాలా యా గౌరీలా | దేఊని మోకళా హో ఆతా | ||౧౪౫|| 
145. ఆ ఆలోచన వెంటనే మాటలుగా మారింది. “ఇప్పుడేమైనా వివాహ ముహూర్తం ఉంటే, ఇతనికి గౌరిని ఇచ్చి, నీ బాధ్యతను తీర్చుకో” అని చెప్పాను. 
ఘేఊనియా కాంతేచే అనుమత | వర వీరభద్ర కేలా నిశ్చిత | 
పాహోనియా వివాహ ముహూర్త | వివాహ యథోచిత లావిలా | ||౧౪౬|| 
146. తన భార్య అనుమతిని తీసుకుని, పూజారి వీరభద్రుని వరునిగా నిశ్చయించాడు. వివాహ ముహూర్తాన్ని చూచి, యథోచితంగా పెళ్ళి జరిపించాడు. 
పూర్ణ హోతా నిజకార్యార్థ | కుటుంబ ఆలే దర్శనార్థ | 
ఆణిక మాఝియా ఆశీర్వాదార్థ | ప్రపంచీ కృతార్థ వ్హావయా | ||౧౪౭|| 
147. కార్యక్రమాలంతా ముగిసిన తరువాత, ఆ కుటుంబం సంసారంలో ధన్యులవాలని, ఆశీస్సుల కోసం నా దర్శనానికి వచ్చారు. 
దిధలే ఉల్హాసే ఆశీర్వచన | మిళూ లాగతా సుఖాచే అన్న | 
వీరభద్రాచీ ముద్రా ప్రసన్న | జాహలీ సుఖసంపన్న హోతాంచి | ||౧౪౮|| 
148. వారిని సంతోషంగా ఆశీర్వదించాను. సుఖంగా భోజనం లభిస్తుండగా, సుఖమయ జీవనంతో, వీరభద్రుడు ఆనందంగా ఉన్నాడు. 
తోహీ మాఝే భక్తీస లాగలా | అల్పావకాశే సంసార థాటలా | 
పరి భాగ్యాచా కోణ ఆథిలా | యేథే న జో విటలా పైశావీణ | ||౧౪౯|| 
149. అతడు కూడా నన్ను భక్తిగానే అభిమానించ సాగాడు. అతని సంసారం త్వరలోనే బాగా స్థిర పడింది. కాని, డబ్బు కోరతకు చికాకు పడని భాగ్యవంతుడు ఉంటాడా? 
యా పైశాచా మోఠా పేంచ | థోరాంమోఠ్యాంసహీ త్యాచా జాచ | 
వీరభద్రాహీ సమయీ టాంచ | ద్రవ్యాచా అసాచ హా ఖేళ | ||౧౫౦||
150. ఈ డబ్బు పిశాచి చాలా చిక్కులుగలది. గొప్ప గొప్పవారు కూడా దీనినుంచి బయట పడలేరు. వీరభద్రుడు కూడా అప్పుడప్పుడు డబ్బు లోటు అనుభవించ సాగాడు. డబ్బుయొక్క లీల ఇలాగే ఉంటుంది.  

బాబా హే బేడీ మోఠీ దుర్ధర | పైశావాంచూన హోతో బేజార | 
కాంహీ తరీ సాంగా ప్రతికార | జేణే మజ సంసార ఝేపేల | ||౧౫౧|| 
151. వీరభద్రుడు నాతో, ‘బాబా! ఈ వివాహ బంధం చాలా కష్టమైనది. డబ్బులు లేక విసుగెత్తి పోతున్నాను. ఈ ప్రపంచంలో సుఖంగా బ్రతకడానికి మీరు ఏదైనా ఉపాయం చెప్పండి, 
ఘాలితో పాయీ లోటాంగణ | ఆతా న బరవే ప్రతారణ | 
కరా మాఝే సంకట నివారణ | తుమ్హీచ యా కారణ లగ్నాలా | ||౧౫౨|| 
152. ‘మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఈ మోసం ఇక మంచిది కాదు. ఈ పెళ్ళికి మీరే కారణం కనుక నా కష్టాలను తీర్చండి.’ 
మీహీ త్యాలా బహు బోధానే | ప్రేమే ఆశీర్వచనా ద్యావే | 
అల్లా మాలిక త్యా హే ఠావే | సంకట నిరసావే త్యానేంచ | ||౧౫౩|| 
153. నేను కూడా అతనికి బాగా బోధించాను. ప్రేమతో ఆశీర్వదించాను. “అల్లా మాలిక్ వారికి అంతా తెలుసు. కష్టాలను వారే తొలగించాలి” అని చెప్పాను. 
జాణోని వీరభద్ర మనోగత | పురావే ఇచ్ఛిత మనోరథ | 
మ్హణోని మీ త్యాతే ఆశ్వాసిత | వ్హావే న దుశ్చిత్త యత్కించిత | ||౧౫౪|| 
154. వీరభద్రుని మనసును తెలుసుకుని, అతని కోరికలు తీరుతాయని, “నీవు ఏ మాత్రం చింతించకు” అని అతనికి ధైర్యం చెప్పాను. 
నికట తుఝా భాగ్యకాళ | కరూ నకో వ్యర్థ తళమళ | 
ద్రవ్య తుఝ్యా హాతాచా మళ | హోఈల సుకాళ తయాచా | ||౧౫౫|| 
155. “త్వరలో నీ భాగ్యం పండుతుంది. అనవసరంగా తపన పడకు. మంచి కాలం వస్తుంది. నీ చేతినిండా డబ్బు ఉంటుంది” అని చెప్పాను. 
ద్రవ్యానే మాండిలీ మాఝీ హేళణా | విసంబేనా కాంతేచా ఆణా | 
పురే పురే హీ ఆతా విటంబనా | నకో హా మోఠేపణా లగ్నాచా | ||౧౫౬|| 
156. ‘డబ్బు నన్ను హేళన చేస్తూ ఉంది. భార్య అవి ఇవి అడగటం మానదు. ఈ అవమానం ఇక చాలు. పెళ్ళి వలన వచ్చిన గొప్పతనం నాకు వద్దు’ అని అన్నాడు. 
అసో పుఢే ఝాలే అభినవ | పహా గౌరీచ్యా గ్రహాచే గౌరవ | 
ఖాజణ జమినీస చఢలా భావ | కళేనా మావ దేవాచీ | ||౧౫౭|| 
157. తరువాత, ఒక అద్భుతం జరిగింది. గౌరియొక్క గ్రహబలం చూడండి. తాకట్టు పెట్టిన బంజరు భూమి ధర పెరిగింది. దైవలీల నిజంగా అర్థం కానిది. 
ఆలా ఎక ఖరేదిదార | లాఖ రుపయే ద్యావయా తయార | 
అర్ధే రోఖ దిధలే జాగేవర | అర్ధే హప్త్యావర ఠరవిలే | ||౧౫౮|| 
158. ఆ భూమిని కొనడానికి ఒకడు వచ్చి, లక్ష రూపాయలను ఇవ్వటానికి సిద్ధ పడ్డాడు. అందులో సగం డబ్బు ఇచ్చేశాడు. మిగతా డబ్బును వాయిదా పద్ధతిలో ఇవ్వడానికి నిశ్చయించ బడినది. 
ప్రతి వర్షీ దోన హజార | సవ్యాజ ద్యావే ఝాలా విచార | 
పైకా పంచవీస వర్షానంతర | భరపాఈ భరపూర గౌరీచీ | ||౧౫౯|| 
159. ప్రతి సంవత్సరం వడ్డీతో సహ రెండు వేలు. అలా ఇరవై ఐదు సంవత్సరాలలో గౌరియొక్క మిగతా డబ్బునంతా ఇచ్చేలా ఒప్పుకున్నారు. గౌరికి పెద్ద మొత్తం లభించింది. 
ఠరావ సర్వాస పసంత పడలా | చనబసప్పా గురవ ఉఠిన్నలా | 
పైకా మ్హణే జో శంకరా అర్పిలా | గురవ పహిలా మాలిక త్యా | ||౧౬౦||
160. ఆ నిర్ణయం అందరికీ నచ్చింది. కాని, ధర్మకర్త చెన్నబసప్ప లేచి, ‘శంకరునికి అర్పించిన డబ్బుకు మొదటి యజమాని అయిన ధర్మకర్త తను,  

తో మ్హణే మజ గురవాసాఠీ | అర్ధే వ్యాజ వర్షాకాఠీ | 
మిళావే మాఝియా హిశాపోటీ | త్యావీణ సంతుష్టీ మజ నాహీ | ||౧౬౧|| 
161. ‘కనుక, ప్రతి సంవత్సరం లభించే వడ్డీలో సగం తనకు వాటాగా ఇవ్వాలి. లేకుంటే, తనకు ఇది సమ్మతం కాదు’ అని చెప్పాడు.
వీరభద్రాప్పా నేదీ కాంహీ | చనబసాప్పా స్వస్థ న రాహీ | 
జుంపలీ వాదావాదీ పాహీ | ఆలే తే దోఘేహీ మజకడే | ||౧౬౨|| 
162. అసలు అతనికి ఏమీ ఇవ్వకూడదని వీరభద్రప్ప, అందుకు అసలు ఒప్పుకోనని చెన్నబసప్ప, అలా ఇద్దరూ వాదులాడుకున్నారు. తరువాత, ఇద్దరూ నా వద్దకు వచ్చారు. 
శంకర తియేచా పూర్ణ స్వామీ | జమీన యేఈనా తీ ఇతరా కామీ | 
న పడావే వ్యర్థ లోభసంభ్రమీ | దోఘాంస మగ మీ సాంగితలే | ||౧౬౩|| 
163. “ఆ భూమికి పూర్తి యజమాని శంకరుడు. భూమి ఎవరికీ ఏ విధంగానూ పనికి రాదు. కనుక అనవసరంగా లోభంతో ఆశపడకండి” అని ఇద్దరికీ చెప్పాను. 
అర్పిలీ జీ శంకరాప్రతీ | తిచేంచ మోల ఆహే హే నిశ్చితీ | 
గౌరీవీణ జే జే అభిలాషితీ | తయాంచ్యా మాతీ తోండాంత | ||౧౬౪|| 
164. “ఇది శంకరునికి అర్పించిన భూమియొక్క డబ్బు. ఈ డబ్బుని గౌరి తప్ప, ఎవరు ఆశించినా వారి నోట మట్టే.  
దేవాచియా అనుజ్ఞేవీణ | శివేల జో యా పైశాలా కోణ | 
హోఈల దేవాచే కోపాస కారణ | మత్తా హీ సంపూర్ణ దేవాచీ | ||౧౬౫|| 
165. “దేవుని అనుమతి లేకుండా ఈ డబ్బుని ఎవరైనా ముట్టుకుంటే, దేవుని కోపానికి గురి అవుతారు. ఎందుకంటే, ఇది మొత్తం దేవుని ఆస్తి కనుక.  
ప్రభుత్వ జీవర పుజారియాచే | గౌరీచే నాతే వారసపణాచే | 
కాయ చాలే తై పరకీయాంచే | ధన తే గౌరీచే స్వసత్తేచే | ||౧౬౬|| 
166. “భూమి పైన పూజారికి అధికారం ఉంది. అతని వారసురాలిగా గౌరికి హక్కు ఉంది. అంతేకాని, ఇతరులకు ఏం హక్కు ఉంటుంది? అది గౌరియొక్క స్వంత డబ్బు.  
మ్హణోని మగ మీ త్యా దోఘాంతే | వదలో గౌరాఈచియా సత్తే | 
వర్తతా ఘేఊని తిచ్యా అనుమతాతే | కృతార్థతేతే పావాల | ||౧౬౭|| 
167. “అది గౌరియొక్క డబ్బు కనుక, ఆమె అనుమతిని తీసుకుని ప్రవర్తిస్తే, మీ బాధ్యతను నిర్వహించిన వారవుతారు” అని నేను ఆ ఇద్దరికీ చెప్పాను.  
వర్తల్యా తిచియా ఇచ్ఛేబాహేర | దేవ నాహీ రాజీ హోణార | 
వీరభద్రాప్పాస నాహీ అధికార | స్వతంత్ర వ్యవహార కరావయా | ||౧౬౮|| 
168. “ఆమె ఇష్టానికి విరుద్ధంగా చేస్తే దేవుడు ఒప్పుకోడు. స్వతంత్రంగా వ్యవహరించటానికి వీరభద్రప్పకు అసలు అధికారం లేదు.” 
ఏసా జరీ మీ మాఝా విచార | కేలా పరిస్ఫుట తేథే సాచార | 
తరీ వీరభద్ర రాగావలా మజవర | శివ్యాంచా గజర వరసలా | ||౧౬౯|| 
169. అని నా అభిప్రాయాన్ని నేను స్పష్టంగా తెలియ చేయగా, వీరభద్రునికి నా పై కోపం వచ్చి, తిట్ల వర్షాన్ని కురిపించాడు. 
తో మ్హణే బాబా తుమచియా మనీ | మాఝియా పత్నీచీ మాలకీ స్థాపునీ | 
సర్వ రకమేచా ఢేంకర దేఊని | నిజహిత సాధునీ బైసావే | ||౧౭౦||
170. ‘నా భార్యను యజమానురాలిగా చేసి డబ్బంతా కాజేసి, నీ పని సాధించుకోవాలనుకుంటున్నావు కదూ బాబా!’ అని అన్నాడు.  

పరిసోని హే తయాచే శబ్ద | ఝాలో మీ జాగచే జాగీ స్తబ్ధ | 
అల్లామియాచీ కరణీ అగాధ | ఉగాచ కా ఖేద కరావా | ||౧౭౧|| 
171. అతని మాటలు విని, నేను అక్కడే మాట రాకుండా ఆశ్చర్య పోయాను. అల్లామియా లీల అగాధం. వ్యర్థంగా ఎందుకు దుఃఖ పడటం. 
వీరభద్రాప్పా మజ హే బోలలా | ఘరీ కాంతేవరీ అతి తణాణలా | 
తీ తవ దుపారీ దర్శనాలా | యేఊని వినవాలా లాగలీ | ||౧౭౨|| 
172. నన్ను అలా తిట్టిన తరువాత, వీరభద్రప్ప ఇంట్లో భార్యపై కూడా విరుచుకుపడ్డాడు. మధ్యాహ్నం దర్శనానికి నా వద్దకు వచ్చినప్పుడు మొరపెట్టుకుంది. 
బాబా కోణాచియా బోలావర | లక్ష దేఊని అవకృపా మజవర | 
న కరావీ మీ పసరితే పదర | లోభ మజ కన్యేవర అసావా | ||౧౭౩|| 
173. ‘బాబా! ఎవరివో మాటలను పట్టించుకుని, మీ కృపకు నన్ను దూరం చేయకండి. మీ కూతురునైన నా పై మీ ప్రేమ ఎప్పుడూ ఉండాలి అని నేను యాచిస్తున్నాను.’ 
ఏసే తిచే శబ్ద పరిసోన | మ్యా తీస దిధలే పూర్ణ ఆశ్వాసన | 
సాత సముద్ర న్యహాల6 కరీన | తుజ త్వా ఖిన్న నసావే | ||౧౭౪|| 
174. ఆమె మాటలు విని, నేను ఆమెతో, “నిన్ను దయతో సప్త సముద్రాలు దాటిస్తాను. నీవేమి దుఃఖ పడకు” అని ఆమెకు పూర్తి ధైర్యాన్నిచ్చాను. 
తేచ రాత్రీ అసతా నిద్రిస్త | గౌరీబాఈస ఝాలా దృష్టాంత | 
శంకరానే యేఊని స్వప్నాంత | కథిలే తీ మాత పరిసావీ | ||౧౭౫|| 
175. ఆ రాత్రి గౌరిబాయి నిద్రలో ఉండగా, ఆమెకు కల వచ్చింది. శంకరుడు కలలో కనిపించి, ఆమెతో ఏం చెప్పాడో వినండి.  
పైసా హా సర్వ తుఝా పాహీ | దేఊ నకో కోణాస కాంహీ | 
వ్యవస్థా తుజ వదతో తీహీ | సదా రాహీల ఏసే కరీ | ||౧౭౬|| 
176. ‘చూడు! ఈ డబ్బంతా నీదే. ఎవరికీ ఏమీ ఇవ్వవద్దు. దాన్ని ఎలా ఖర్చుపెట్టాలో, ఆ ఏర్పాటును చెప్పుతాను. అట్లే చేయి.  
దేవళాప్రీత్యర్థ జో జో పైసా | చనబసాప్పా సాంగేల తైసా | 
లావావా మజ త్యాచా భరంవసా | నిర్బంధ హా ఏసా రాఖావా | ||౧౭౭|| 
177. ‘దేవాలయం కోసం, చెన్నబసప్ప చెప్పిన విధంగా డబ్బుని ఉపయోగించు. నాకు అతనిపై విశ్వాసముంది. నీవు ఈ నియమాన్ని పాటించు.  
ఇతర కార్యా పైసా లావితా | వ్హావీ న పైశాచీ అవ్యవస్థా | 
మ్హణూన మశీదీంతీల బాబాంస న పుసతా | కాంహీంహీ వ్యవస్థా న కరావీ | ||౧౭౮|| 
178. ‘ఇతర పనులకు డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు, ఆ డబ్బు దుర్వినియోగం కాకుండా ఉండటానికి, మసీదులోని బాబాను అడగకుండా, ఎటువంటి ఏర్పాటును చేయరాదు.’ 
గౌరీబాఈనే తో మజలా | దృష్టాంత సాద్యంత కథన కేలా | 
మీంహీ సల్లా యథోచిత దిధలా | మానావయాలా దృష్టాంత | ||౧౭౯|| 
179. తన కల మొత్తంగా గౌరీబాయి నాతో చెప్పింది. ఆ కలలో చెప్పినట్లుగానే పాటించమని, నేను కూడా ఆమెకు సరియైన సలహ ఇచ్చాను.  
ముద్దల తుఝే తూంచ ఘేఈ | చనబసాప్పాస వ్యాజాచీ నిమాఈ7
ఏసే నిత్య కరీత జాఈ | సంబంధ నాహీ వీరభద్రా | ||౧౮౦||
180. “డబ్బు నీదే. అసలు నీవే తీసుకో. వడ్డీలో సగ భాగం చెన్నబసప్పకు ఇవ్వు. ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉండు. ఇందులో వీరభద్రునికి ఏ సంబంధమూ లేదు.” 

ఏసే ఆమ్హీ అసతా బోలత | దోఘేహీ తే ఆలే భాండత | 
పరస్పరాంనీ వ్హావే శాంత | ఉపాయ మీ అత్యంత వేచలే | ||౧౮౧|| 
181. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా, ఇద్దరూ పోట్లాడుకుంటూ వచ్చారు. వారిని శాంత పరచటానికి నేను చాలా ప్రయత్నించాను.
శంకరాచా తో దృష్టాంత | ఝాలా జో హోతా గౌరాఈప్రత | 
దోఘాంసహీ కథిలా సాద్యంత | పరిసోని ఉన్మత్త వీరభద్ర | ||౧౮౨|| 
182. గౌరికి కలిగిన శంకరుని కలను మొత్తం, వివరంగా వారికి చెప్పాను. అది విని వీరభద్రుడు కోపంతో పిచ్చివాడయ్యాడు.  
వీరభద్రే శివ్యాంచీ లాఖోలీ | ప్రతిపక్షావర యథేచ్ఛ వాహిలీ | 
అద్వాతద్వా భాషణే కేలీ | వృత్తీ గాంగరలీ దుజియాచీ | ||౧౮౩|| 
183. వీరభద్రుడు తిట్ల వర్షాన్ని కురిపించాడు. తన విరోధి అయిన చెన్నబసప్పను అమర్యాదకరమైన మాటలను అన్నాడు. దాంతో అతడు గాబరా పడిపోయాడు. 
తయాస ఝాలా ఉన్మత్త వాత | శివ్యాశాపాంచీ బడబడ కరీత | 
సాంపడశీల తేథే ఘాత | కరీన మీ మ్హణత ముఖానే | ||౧౮౪|| 
184. వీరభద్రుడి పిచ్చి ముదిరి, ‘నీవు ఎక్కడ దొరికినా చంపేస్తాను’ అని నోటితో గట్టిగా తిట్టాడు. 
చనబసాప్పాస అనులక్షూన | వీరభద్రాప్పా ఉన్మత్త హోఊన | 
మ్హణే మీ తుఝే తుకడే కరీన | ఖాఈన గిళీన సగళేచ | ||౧౮౫|| 
185. చెన్నబసప్పను చూస్తున్న కొద్దీ వీరభద్రప్ప రెచ్చిపోయి, ‘నిన్ను ముక్కలు చేస్తాను, నిన్ను మొత్తం మ్రింగేస్తాను’ అని అనసాగాడు. 
చనబసాప్పా భీతిత్రస్త | పాయ మాఝే ఘట్ట ధరీత | 
మ్హణే కరా మజ సంకటముక్త | అభయ మగ దేత మీ త్యాలా | ||౧౮౬|| 
186. చెన్నబసప్ప భయపడిపోయి నా పాదాలను గట్టిగా పట్టుకుని, ‘ఈ కష్టంనుండి నన్ను కాపాడండి’ అని వేడుకున్నాడు. నేను అతనికి అభయమిచ్చాను. 
తంవ మీ దీన చనబసాప్పాతే | ధీర దేఊని వదలో తేథే | 
వీరభద్రాచియా హస్తే | మరూ మీ తూంతే దేఈ నా | ||౧౮౭|| 
187. దీనుడైన చెన్నబసప్పకు ధైర్యాన్నిచ్చి, ‘నేను నిన్ను వీరభద్రుని చేతిలో చావనివ్వను’ అని చెప్పాను. 
అసో పుఢే హోఊని వాత | వీరభద్రాచా జాహలా అంత | 
తో మగ జన్మలా సర్పయోనీంత | ఏసే త్యా దేహాంతర జాహలే | ||౧౮౮|| 
188. అటు తరువాత, వాతంతో ప్రకోపించిన వీరభద్రుడు మరణించి, పాముగా పుట్టి, వేరే శరీరాన్ని పొందాడు.  
చనబసాప్పాస పడలీ దహశత | తీంతచి ఝాలా త్యాచా అంత | 
జన్మ పావే దుర్దర యోనీంత | ఏసే హే చరిత తయాంచే | ||౧౮౯|| 
189. చెన్నబసప్పకు దిగులు పట్టుకుంది. ఆ దిగులుతోనే అతడు చనిపోయి, కప్ప యోనిలో పుట్టాడు. ఇది అతని చరిత్ర. 
పూర్వ జన్మీంచ్యా వైరాసాఠీ | జన్మ ఆలా సాపా పోటీ | 
లాగలా బసాప్పా దుర్దురా పాఠీ | ధరీ త్యా శేవటీ వీరభద్ర | ||౧౯౦|| 
190. పూర్వ జన్మలోని శత్రుత్వం కారణంగా, వీరభద్రుడు పాముగా పుట్టి, కప్పగా పుట్టిన బసప్ప వెంటబడి, చివరకు అతన్ని పట్టుకున్నాడు.  

దర్దుర రూపే బసాప్పా దీన | భద్రాప్పా సర్పాముఖీ పడూన | 
పరిసూన తయాచే కరుణా వచన | హేలావలే కీ మన మాఝే | ||౧౯౧|| 
191. పాముగా పుట్టిన వీరభద్రుని నోటపడి, కప్ప రూపంలో ఉన్న బసప్ప దీనంగా అరుస్తుంటే, ఆ దీనాలాపాన్ని విని నా మనసు కరిగిపోయింది. 
పూర్వ దత్తవచన స్మరూన | సర్పాచియా తోండామధూన | 
చనబసాప్పా ముక్త కరూన | పాళిలే వచన మీ అపులే | ||౧౯౨|| 
192. పూర్వం నేను ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి, పాము నోటినుండి చెన్నబసప్పను విడిపించి, నా మాటను నిలబెట్టుకున్నాను. 
అల్లా నిజ భక్తాం లాగూన | సంకట సమయీ యే ధాఊన | 
త్యానేంచ యేథే మజ పాఠవూన | కరవిలే రక్షణ భక్తాచే | ||౧౯౩|| 
193. తన భక్తుల కోసం, వారి కష్ట సమయంలో, అల్ల పరుగెత్తుకుని వస్తాడు. అతడే నన్ను ఇక్కడకు పంపి భక్తుని రక్షించాడు. 
హే తో ప్రత్యక్ష అనుభవా ఆలే | వీరభద్రాప్పాస హాంకూన లావిలే | 
చనబసాప్పాస సంకటీ తారిలే | సకల హే కేలే దేవాచే | ||౧౯౪|| 
194. ఇది ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవమైంది. వీరభద్రుని తరిమి వేసి, చెన్నబసప్పను కష్టంనుండి రక్షించాడు. ఇదంతా దేవుని లీల. 
అసో ఆతా భర కీ చిలీమీ | పిఊని జాఈన అపులే ధామీ | 
తూంహీ జాఈ ఆపులే గ్రామీ | లక్ష మన్నామీ అసూ దే | ||౧౯౫|| 
195. సరే, ఇప్పుడు చిలుం నింపు. త్రాగేసి నా చోటికి వెళ్లిపోతాను. నీవు కూడా మీ ఊరికి వెళ్లు. నన్ను గుర్తుంచుకో. 
ఏసే వదోని చిలీమ ప్యాలో | సత్సంగాచే సౌఖ్య లాధలో | 
ఫిరత ఫిరత పరత ఆలో | పరమ మీ ధాలో నిజాంతర” | ||౧౯౬||
196. అని చెప్పిన తరువాత, మేమిద్దరమూ చిలుం త్రాగాము. సత్సంగంయొక్క సుఖం లభించింది. ఆ విధంగా తిరిగి తిరిగి, వెనుకకు మరలి వచ్చాను. మనసులో అత్యంత ఆనందాన్ని పొందాను” అని చెప్పారు. 
 
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | శ్రీసాఈముఖశ్రుత కథాకథనం నామ | 
| సప్తచత్వారింశోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

టిపణీ: 
1. థోడీశీ.  2. క్షణభర.  3. ఖార్యా పాణ్యాచీ రేతాళ జమీన.  
4. ఓస, పడీత జమీన.  5. బేవారశీ ఘరాచీ జమీన.  
6. కృపేనే బహాల కరీన.  7. నిమ్మే, అర్ధే.  

No comments:

Post a Comment