Friday, December 27, 2013

||సాశంకభక్తానుగ్రహకరణం నామ అష్టచత్వారింశోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౪౮ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

ఆతా హా అధ్యాయ కరితా సురూ | జయా అత్యంత శ్రవణాదరూ | 
ఏసా శ్రోతా లాగలా విచారూ | గురు కీ సద్గురూ శ్రీసాఈ | ||౧|| 
1. శ్రీసాయి గురువా, లేక సద్గురువా అని అత్యంత శ్రద్ధతో ఉన్న ఒక శ్రోత, ఈ అధ్యయాన్ని ఆరంభిస్తుండగా, ప్రశ్నించారు.
తయాచియా సమాధానా | కథూ సద్గురూచ్యా సంక్షిప్త లక్షణా | 
జేణే శ్రీసాఈసమర్థచరణా | మిళతీల ఖుణా సద్గురూచ్యా | ||౨|| 
2. వారిని సంతృప్తి పరచటానికి, సద్గురువుయొక్క లక్షణాలను సంక్షిప్తంగా చెబుతాను. దానితో సాయి సమర్థునిలో ఉన్న సద్గురువుయొక్క గుణాలను గుర్తించవచ్చు. 
జేథూని ప్రాప్త వేదాధ్యయన | అథవా సాహీ శాస్త్రాంచే జ్ఞాన | 
జిహీ కరవిలే వేదాంత నిరూపణ | జ్ఞాతే న సద్గురు మ్హణతీ తయా | ||౩|| 
3. ఎవరినుంచి వేదాలను అధ్యయనం చేస్తామో వారిని, ఎవరినుంచి షట్శాస్త్రాల జ్ఞానాన్ని పొందుతామో వారిని, వేదాంతాలను నిరూపించేవారిని, జ్ఞానులు సద్గురువులని అనరు. 
కోణీ ఎక వాయు కోండితీ | తప్త ముద్రా ధారణ కరితీ | 
బ్రహ్మానువాదే శ్రోతయా రిఝవితీ | జ్ఞాతే న సద్గురు మ్హణతీ తయా | ||౪|| 
4. ప్రాణాయామంతో శ్వాసను బిగబట్టి నిగ్రహించే వారిని, దేహం మీద కాచబడిన ధాతువులతో బొమ్మలను వేసుకున్నవారిని, బ్రహ్మగురించి వ్యాఖ్యానించి శ్రోతల మనసులను రంజింప చేసే వారిని కాని, జ్ఞానులు సద్గురువులు అని అనరు. 
శిష్యా శాస్త్రోక్త మంత్ర హీ దేతీ | జప కరావయా ఆజ్ఞా కరితీ | 
హోఈల కేవ్హా ఫలప్రాప్తీ | విశ్వాస న చిత్తీ కోణాహీ | ||౫|| 
5. కొందరు శాస్త్రాల ప్రకారం శిష్యులకు మంత్రాలను ఉపదేశించి, జపించమని ఆజ్ఞాపిస్తారు. కాని అవి ఎప్పుడు సిద్ధిస్తాయి అని ఎవరికీ నమ్మకం ఉండదు. 
తత్వ నిరూపణ అతి రసాళ | శబ్దజ్ఞాన అఘళపఘళ | 
స్వానుభవాచా మాత్ర దుష్కాళ | శాబ్దిక పోకళ తే జ్ఞాన | ||౬|| 
6. అత్యంత రసవత్తరంగా, చక్కటి మాటలతో మనసును ఆకట్టుకునే విధంగా పరమాత్మ తత్వాన్ని చెప్పేవారికి, స్వంత అనుభవం లేనందు వలన, అలాంటి జ్ఞానం మాటల గారడియే కాక, కేవలం శుష్కమైనది. 
ఏకతేక్షణీ నిరూపణ నీట | ఉభయ భోగాంచా యేఈల వీట | 
పరి అనుభవాచీ చవీ చోఖట | అనుభవీ తోచ ప్రకటవీ | ||౭|| 
7. శ్రద్ధగా విన్న క్షణంలో, వేదాంత నిరూపణతో ఇహ పర సుఖ భోగాలయందు విరక్తి కలుగుతుంది. కాని, పరమాత్మను పొందిన అనుభవం కలగదు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారే ఆ అనుభవాన్ని తెలియ చేయగలరు. 
అసోని సంపూర్ణ శబ్దజ్ఞానీ | పూర్ణానుభవీ అపరోక్షదానీ | 
త్యాంచాచి అధికార శిష్య ప్రబోధనీ | మ్హణావే త్యాలాగోని సద్గురు | ||౮|| 
8. సంపూర్ణమైన శాస్త్ర జ్ఞానం ఉండి, పరమాత్మ సాక్షాత్కారాన్ని తెలియ చేసే వారికే, శిష్యులకు బోధించే అధికారం ఉంది. అలాంటి వారినే సద్గురువులు అని పిలవాలి. 
స్వయే జ్యాతే అనుభవ నాహీ | తో కాయ శిష్యాతే దేఈల పాహీ | 
జయా న అపరోక్ష అనుభవ కాంహీ | సద్గురు కదాహీ న మ్హణావా | ||౯|| 
9. అలాంటి అనుభవం తమకే లేనప్పుడు, శిష్యులకు ఏమివ్వగలరు? పరమాత్మ సాక్షాత్కారంయొక్క అనుభవం అసలు లేనివారిని సద్గురువులని ఎప్పుడూ అనరాదు. 
శిష్యాపాసూన ఘ్యావీ సేవా | స్వప్నీంహీ న ధరీ ఏసియా భావా | 
ఉలట శిష్యార్థ నిజదేహ లాగావా | ఇచ్ఛీ తో జాణావా సద్గురూ | ||౧౦||
10. కలలోనైనా శిష్యులతో సేవ చేయించుకోవాలని అనుకోనివారు, తమ శరీరాన్ని శిష్యుల కొరకు వినియోగించాలనే కోరిక గలవారే, సద్గురువులని తెలుసుకోవాలి. 

శిష్య మ్హణజే కిం పదార్థ | గురు కాయ తో శ్రేష్ఠాంత శ్రేష్ఠ | 
ఏసియా అహంభావా విరహిత | తోచి సద్గురు హితకారీ | ||౧౧|| 
11. గురువే శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు, శిష్యుడు ఎందుకూ పనికిరాని వాడు, అన్న అహంభావం కొంచెమైనా లేకుండా ఉన్నవారే, సద్గురువులు. వారి వలనే హితం జరుగుతుంది. 
శిష్య తోహీ పూర్ణబ్రహ్మ | తయాఠాయీంహీ పుత్రప్రేమ | 
ఇచ్ఛీ న త్యాపాసావ యోగక్షేమ | సద్గురు తో పరమ శ్రేష్ఠ జగీ | ||౧౨|| 
12. తన పోషణకు కూడా శిష్యుని వద్దనుంచి ఏదీ ఆశించని వారు, శిష్యుడు పూర్ణ బ్రహ్మ స్వరూపమని భావించే వారు, అతనిని పుత్ర ప్రేమతో చూసేవారే సద్గురువులు. జగత్తులో వారే పరమ శ్రేష్ఠులు. 
పరమ శాంతీచే జే నిధాన | విద్వత్తేచా న జేథే అభిమాన | 
సాన థోర సమసమాన | తేంచ సద్గురుస్థాన జాణావే | ||౧౩|| 
13. పరమ శాంతికి నిలయమై, విద్యా జ్ఞాన దర్పం కొంచమైనా లేకుండా, చిన్నైనా, పెద్దైనా, అందరినీ సమానంగా చూసేవారే, సద్గురువులని తెలుసుకోవాలి. 
ఏసీ హీ సర్వ సాధారణే | సద్గురుచీ సంక్షిప్త లక్షణే | 
నివేదిలీ మ్యా అనన్య శరణే | శ్రోతయాంకారణే సంకలిత | ||౧౪|| 
14. సద్గురువులో ఉండే ఇటువంటి సర్వ సాధారణమైన లక్షణాలను సంకలనం చేసి, శ్రోతలకు సంక్షిప్తంగా నేను మనవి చేశాను. 
సాఈదర్శనే తుష్టలే లోచన | తయా భాగ్యవంతా లాగూన | 
మీ కాయ యాహూన వర్ణూ సకేన | సద్గురులక్షణ హే సత్య | ||౧౫|| 
15. సాయి దర్శనంతో సంతృప్తి పొందిన భాగ్యవంతులకు, సద్గురువుల లక్షణాలను ఇంతకంటే ఎక్కువగా నేను ఏం వర్ణించగలను? 
జన్మోజన్మీచా పుణ్యాతిశయ | గాంఠీస హోతా త్యాచా సంచయ | 
తేణే హే ఆమ్హాంస లాధలే పాయ | యా సద్గురురాయ సాఈచే | ||౧౬|| 
16. అనేక జన్మలనుంచి విపరీతమైన పుణ్యాల కలయిక వలనే మనకు సాయి సద్గురువు పాదాలు లభించాయి. 
పూర్ణ తారుణ్యీం హీ అపరిగ్రహ | నిరాధార నా వేస నా గృహ | 
తమాఖూ చిలీమ హా కాయ తో సంగ్రహ | మనోనిగ్రహ భయంకర | ||౧౭|| 
17. చిన్న వయసునుండీ వారికి ఏ ఆస్థులూ లేవు. ఏ ఆధారమూ లేక, ఇల్లు, వాకిలి వంటివేవీ లేక ఉండేవారు. పొగాకు, చిలుం గొట్టం మరి మనోనిగ్రహమే వారికున్న ఆస్థి. 
వర్షే అష్టాదశ అసతా వయ | తేవ్హాంపాసూనహీ పూర్ణ మనోజయ | 
సదా ఎకాంతీ వసావే నిర్భయ | లావూనియా లయ స్వరూపీ | ||౧౮|| 
18. పద్దెనిమిది సంవత్సరాల వయసునుండీ, వారు మనసును సంపూర్ణంగా జయించి, ఎప్పుడూ నిర్భయంగా, ఏకాంతంగా, ఆత్మ స్వరూపంలో లీనమై ఉండేవారు. 
పాహోని భక్తాచీ ఆవడీ శుద్ధ | “భక్తపరాధీన మీ” హే బ్రీద | 
భక్తవృందా దావావయా విశద | భక్తప్రేమాస్పద వర్తే జో | ||౧౯|| 
19. భక్తులయొక్క నిర్మలమైన ప్రేమను చూసి, తాను భక్త పరాధీనుణ్ణి అన్న విషయం భక్తులకు తెలియ చేయటానికి, ఇలాంటి ప్రేమ ఎక్కడున్నా, వారు ఎప్పుడూ అక్కడే ఉంటారు. 
జయ పరబ్రహ్మా సనాతనా | జయ దీనోద్ధార ప్రసన్నవదనా | 
జయ చైతన్యఘనా భక్తాధీనా | దే నిజదర్శనా నిజభక్తా | ||౨౦||
20. జయ పరబ్రహ్మ సనాతన! జయ దీనోధారా! ప్రసన్న వదనా! జయ చైతన్య ఘనా! భక్తాధీన! భక్తులకు తమ దర్శనాన్ని ప్రసాదించండి. 

జయజయాజీ ద్వంద్వాతీతా | జయజయాజీ అవ్యక్త వ్యక్తా | 
సర్వసాక్షీ సర్వాతీతా | అకళ అభక్తా సకళికా | ||౨౧|| 
21. జయ జయ ద్వంద్వాతీతా! జయ జయ అవ్యక్త వ్యక్తా! సర్వసాక్షీ! సర్వాతీత! భక్తి లేనివారు మిమ్ము తెలుసుకోలేరు.
జయజయ భవసంతాపహరణా | జయజయ భవగజవిదారణా | 
జయజయ ఆశ్రితప్రేమపూర్ణా | సంకట నిరసనా సద్గురురాయా | ||౨౨|| 
22. జయ జయ భవసంతాపహరణా! జయ జయ భవగజ విచారణా! జయ జయ ఆశ్రిత ప్రేమపూర్ణా! కష్టాలను తొలగించే సద్గురుదేవా! 
తుజ అవ్యక్తీ సమరసతా | ఆకార పావలా నిరాకారతా | 
పరీ తవ భక్తకల్యాణకరితా | దేహ ఠేవితాంహీ న సరే | ||౨౩|| 
23. అవ్యక్తంలో లీనమై మీరు నిరాకారులయ్యారు. శరీరాన్ని త్యజించిన తరువాత కూడా, భక్తుల శ్రేయస్సు కొరకు చేసే మీ కార్యాలు ఆగిపోలేదు. 
దేహీ అసతా జీ జీ కృతి | తోచ సమరసతా అవ్యక్తీ | 
తేచ అనుభవ ఆజహీ భోగితీ | జే తవ భక్తీ లాగలే | ||౨౪|| 
24. మీరు సశరీరులై ఉన్నప్పుడు చేసిన మీ లీలలను అనుభవించిన భక్తులు, మీరు అవ్యక్తంలో కలిసిపోయిన తరువాత కూడా జరుగుతున్న మీ లీలల అనుభవాలను మీయందు నమ్మకంగల భక్తులు, నేటికీ పొందుతున్నారు. 
త్వాం మజ పామరా నిమిత్త కరూనీ | నిరసావయా అవిద్యారజనీ | 
ప్రకట కేలా నిజ చరిత్ర తరణీ | జో భక్తోద్ధరణీ సమర్థ | ||౨౫|| 
25. నావంటి పామరుణ్ణి, నిమిత్త మాత్రునిగా చేసి, మీ చరిత్ర తయారు చేయించారు. భక్తుల అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వారిని తరింప చేసే సమర్థవంతమైన జ్ఞాన జ్యోతి ఇది. 
ఆస్తిక్యబుద్ధి శ్రద్ధా స్థితీ | హీచ భక్తాచీ హృదయపణతీ | 
ప్రేమస్నేహే ఉజళిజేవాతీ | జ్ఞానజ్యోతీ ప్రకటేల | ||౨౬|| 
26. దేవుడు ఉన్నాడనే నమ్మకం, మరియు దేవునియందు భక్తి శ్రద్ధలు ఇవే భక్తుని హృదయంలో ప్రమిదలు. వానిలో ప్రేమయనే చమరు పోసి వత్తిని వెలిగిస్తే, జ్ఞాన జ్యోతి కనిపిస్తుంది. 
ప్రేమావీణ శుష్క జ్ఞాన | తయాంచే కోణా కాయ ప్రయోజన | 
వినా ప్రేమ న సమాధాన | ప్రేమ అవిచ్ఛిన్న అసావే | ||౨౭|| 
27. ప్రేమ లేని జ్ఞానం శుష్కం. దానివలన ఎవరికైనా ఏం ప్రయోజనం? ప్రేమ లేనిదే శాంతి ఉండదు. ప్రేమ ఒకే చోట వేరు కాకుండా ఉండాలి. 
కాయ వానూ ప్రేమ మహిమాన | తయాపుఢే తుచ్ఛ ఆన | 
గాంఠీ నసల్యా ప్రేమ గహన | శ్రవణ వాచన నిర్ఫళ | ||౨౮|| 
28. ప్రేమయొక్క మహిమను ఎంతని వర్ణించగలం? ప్రేమ ముందు అన్నీ తుచ్ఛమే. గాడమైన ప్రేమ లేకపోతే శ్రవణం, పఠనం నిష్ఫలం. 
ప్రేమాపాశీ నాందే భక్తీ | తేథేంచ అవఘీ శాంతీ విరక్తి | 
తేథేంచ పాఠీ తిష్ఠే ముక్తీ | నిజ సంపత్తీ సమవేత | ||౨౯|| 
29. ప్రేమలో భక్తి ఉంటుంది. విరక్తి, శాంతి కూడా అక్కడే ఉంటాయి. తన సంపత్తి సహితంగా, వాని వెనకాలే ముక్తి కూడా నిలబడి ఉంటుంది! 
ప్రేమ నుపజే భావావీణ | భావ తేథే దేవ జాణ | 
భావా పోటీ ప్రేమ పూర్ణ | భావచి కారణ భవతరణా | ||౩౦||
30. నమ్మకం లేని చోట ప్రేమ ఉత్పన్నం కాదు. నమ్మకమున్న చోట దేవుడున్నాడని తెలుసుకోండి. నమ్మకమున్న చోట ప్రేమ పూర్ణంగా ఉంటుంది. సంసార సాగరాన్ని దాటడానికి నమకమే ప్రధానం. 

గంగోదకాసమ పవిత్ర | పరమగోడ సాఈచరిత్ర | 
తేణేంచి త్యాచే సజవిలే స్త్రోత్ర | నిమిత్తమాత్ర హేమాడ | ||౩౧|| 
31. గంగా జలంతో సమానంగా పవిత్రమూ, అతి మధురమైనది శ్రీసాయి చరిత్ర. సాయియే దీనిని పద్యాలతో అలంకరింప చేశారు. హేమాడు నిమిత్త మాత్రుడు. 
శ్రవణ కరితా సాఈసచ్చరిత | శ్రోతే వక్తే నిత్య పూత | 
పాపపుణ్యాచా హోఈ ఘాత | నిత్య ముక్త దోఘేహీ | ||౩౨|| 
32. ఈ సాయి సచ్చరితను వినే శ్రోతలు, చెప్పే వక్త ఎప్పుడూ పవిత్రులు. వారి పాప పుణ్యాలు నశించిపోయి వారికి ముక్తి లభిస్తుంది. 
భాగ్యే ఆగళే ఏకతా శ్రోత్ర | భాగ్యే ఆగళే వక్తయాచే వక్త్ర | 
ధన్య హే శ్రీ సాఈస్తోత్ర | అతిపవిత్ర నిజభక్తా | ||౩౩|| 
33. దీనిని వినే చెవులు భాగ్యవంతములు. వక్తయొక్క నోరు భాగ్యవంతము. భక్తులకు అతి పవిత్రమైన ఈ శ్రీ సాయి స్తోత్రం ధన్యం. 
హోఊనియా శుద్ధచిత్త | సద్భావే జే పరిసతీ చరిత | 
తయాంచే తే సకళ మనోరథ | హోతీల సుఫలిత సదైవ | ||౩౪|| 
34. శుద్ధమైన మనసుతో, మంచి భావంతో వినే భక్తుల అన్ని కోరికలూ ఎల్లప్పుడూ తీరుతాయి. వారి జీవనం ఎల్లప్పుడూ సుఫలంగానే ఉంటుంది. 
పరమ భావార్థే ఆదరేసీ | ఏకతీ యా సచ్చరితాసీ | 
నిజపదభక్తీ అనాయాసీ | లాభే తయాసీ అవిలంబే | ||౩౫|| 
35. ఈ సచ్చరితాన్ని పరమ శ్రద్ధతో, భక్తిగా వింటే, వెంటనే ప్రయత్నం లేకుండా సులభంగానే సాయి పాదాలయందు భక్తి లభిస్తుంది. 
భక్తిభావే సాఈచరణ | సేవితా కరితా సాఈస్మరణ | 
హోఈనా యథేచ్ఛ ఇంద్రియాచరణ | సహజ భవతరణ రోకడే | ||౩౬|| 
36. భక్తి భావంతో సాయి చరణాలను సేవిస్తూ, వారిని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటే, ఇంద్రియాలు వశం తప్పి పోవు. సులభంగా సంసార సాగరాన్ని దాటటం నిశ్చయం. 
భక్తచాతకా నిజజీవన | ఏసే హే సాఈసచ్చరితకథన | 
శ్రోతా శ్రవణాపాఠీ మనన | కీజే శ్రీ ఆయతన కృపేచే | ||౩౭|| 
37. చాతక పక్షులకు నీరులా, ఈ సాయి సచ్చరిత కథనం భక్తులకు జీవనం. దీనిని వినిన తరువాత మననం కూడా చేసి శ్రోతలు శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందండి. 
సర్వావస్థీ సావధాన | హోఊని శ్రోతీ కేలియా శ్రవణ | 
సహజ హోయ భవతరణ | కర్మబంధన తుటోన | ||౩౮|| 
38. అన్ని పరిస్థితులలోనూ సావధానంగా వినే శ్రోతల కర్మ బంధనాలు విడిపోతాయి. వారు సంసార సాగరాన్ని సులభంగా దాటగలరు. 
అసో మనీ మ్హణతీల శ్రోతే | కేవ్హాంహో ఆరంభ హోణార కథేతే | 
దవడితో త్యాంచియా అస్వస్థతేతే | ప్రస్తావనేతే కరోని | ||౩౯|| 
39. కాని, ఇప్పుడు కథ ఎప్పుడు ఆరంభమౌతుంది అని శ్రోతలు తమలో అనుకుంటున్నారు. కనుక ప్రస్తావనను ఆరంభించి వారి ఆతురతను తొలగిస్తాను. 
పూర్వాధ్యాయీ ఝాలే కథన | వైర హత్యా ఆణి ఋణ | 
హీ ఫేడావయా పునర్జన్మ | యేఈ నిజకర్మ భోగావయా | ||౪౦||
40. శత్రుత్వం, హత్య మరియు ఋణం, వీటి వలన ప్రాప్తమయ్యే కర్మ ఫలాన్ని అనుభవించటానికి పునర్జన్మ కలుగుతుందని గత అధ్యాయంలో చెప్పబడింది. 

తయాంస నాహీ పూర్వస్మరణ | పరీ యా సంతా కదా న విస్మరణ | 
కరితీ నిజభక్త సంకటనివారణ | అసేనా జనన కోఠేంహీ | ||౪౧|| 
41. మానవులకు పూర్వ జన్మల గురించి గుర్తుండదు. కాని, సత్పురుషులు దేనినీ మరచిపోరు. తమ భక్తులు ఎక్కడ జన్మించినా వారిని కష్టాలనుండి రక్షిస్తారు.
తైసీచ ఆతా దుసరీ కథా | దేతా ఘేతా బసతా ఉఠతా | 
సంతాంపాయీ విశ్వాస ఠేవితా | పావతీ సఫలతా నిజభక్త | ||౪౨|| 
42. అలాంటిదే ఇప్పుడు మరొక కథ. దేనినైనా ఇచ్చేటప్పుడు, లేదా పుచ్చుకునేటప్పుడు, నుంచుని ఉన్నా కూర్చుని ఉన్నా, సత్పురుషుని పాదాలయందు నమ్మకముంచితే భక్తులు సఫలీకృతులౌతారు. 
కర్మారంభ కరూ జాతా | ఆధీ హరిగురుచరణ స్మరతా | 
తేచ నివారితీ నిజభక్తచింతా | కర్మీ నిజదక్షతా ఠేవిలియా | ||౪౩|| 
43. ఏ పనినైనా మొదలు పెట్టే ముందుగా, హరిని మరియు గురువు పాదాలను స్మరించి శ్రద్ధగా పని చేస్తే చాలు. వారే భక్తుల చింతలను దూరం చేస్తూ, ఆ పనిని సత్పురుషులు భక్తుల చేత చేయిస్తారు. 
కర్మ మాత్ర మీ కరణార | సమర్థ హరిగురు ఫల దేణార | 
ఏసా జ్యాచా దృఢ నిర్ధార | బేడా పార తయాచా | ||౪౪|| 
44. పనిని మాత్రమే నేను చేసేవాణ్ణి. ఫలితాన్ని ఇచ్చేవారు హరి మరియు గురువు అన్న గట్టి నమ్మకమున్న వారి లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. 
సంత ఆరంభీ ఉగ్ర భాసతీ | తరీ త్యాంపోటీ లాభేవీణ ప్రీతి | 
అల్ప ధీర పాహిజే చిత్తీ | కరతీల అంతీ కల్యాణ | ||౪౫|| 
45. మొదట సంతులు ఉగ్రంగా కఠోరంగా కనిపిస్తారు. కాని, ఏ ప్రత్యుపకారాన్నీ ఆశించని ప్రీతి వారిలో ఉంటుంది. కాస్త ధైర్యంగా ఉంటే చాలు. చివరకు వారు శుభాలను కలుగ చేస్తారు. 
శాపతాప సంసృతి మాయా | సత్సంగాచీ పడతా ఛాయా | 
ఠాయీంచే ఠాయీంచ జాతీల విలయా | మ్హణోని త్యా పాయా చికటావే | ||౪౬|| 
46. సత్సంగమనే నీడ పడితే చాలు, శాప తాపాలు మమకారాలు అక్కడికక్కడే మాయమైపోతాయి. అందువలన సంతుల పాదాలను ఆశ్రయించండి. 
సవినయ ఆణి అనుద్ధత | హోఊని సంతా శరణాగత | 
ప్రార్థావే త్యా నిజగుజహిత | దేతీల చిత్తస్వాస్థ్యాతే | ||౪౭|| 
47. సవినయంగా, నిరహంకార భావంతో సంతుల శరణాగతులై, తమ మనసులోని కోరికను వేడుకుంటే, వారు చిత్త శాంతిని ప్రసాదిస్తారు. 
అల్పజ్ఞానాచియా అభిమానీ | సంతవచనీ వికల్ప మానీ | 
హోతే త్యా ఆధీ కైసీ హానీ | విశ్వాసే నిదానీ కల్యాణ | ||౪౮|| 
48. మిడి మిడి జ్ఞానంతోను, గర్వంతోను సంతుల మాటలను సంశయించే వారికి, మొదట హాని కలగినా, సంతులయందు నమ్మకముంచితే వారికి శుభం కలుగుతుంది. 
శుద్ధమనే వా కపటే సర్వథా | ఖర్యా సంతాచే చరణ ధరితా | 
అంతీ పావే తో నిర్ముక్తతా | అగాధ యోగ్యతా సంతాంచీ | ||౪౯|| 
49. మంచి మనసుతోనైనా, లేక కపట బుద్ధితోనైనా సరే, అసలైన సంతుల పాదాలను ఆశ్రయిస్తే, ప్రపంచ బంధనాలనుండి విముక్తులౌతారు. సంతుల మహిమలు అగాధం. 
యే అర్థీంచీ బోధక కథా | శ్రవణ కీజే సావధానతా | 
స్వానంద నిర్భర హోఈల శ్రోతా | తైసాచి వక్తా ఉల్లసిత | ||౫౦||
50. ఈ అర్థం వచ్చేటట్టు, జ్ఞానోపదేశాన్ని చేసే కథను సావధానంగా వింటే, శ్రోతలకు ఆనందం కలుగుతుంది. అలాగే, కథను చెప్పేవారికి కూడా ఉత్సాహం పెరుగుతుంది. 

వకీల అక్కలకోట నివాసీ | సపటణేకర నామ జయాంసీ | 
పరిసా తయాంచే అనుభవాసీ | మన ఉల్లాసిత హోఈల | ||౫౧|| 
51. అక్కలకోటలో ఉండే సపటణేకరు అను పేరుగల వకీలు అనుభవాన్ని వింటే మనసు ప్రసన్నమౌతుంది. 
వకీలీచా రాత్రందివస | కరీత అసతో తే అభ్యాస | 
భేటలే విద్యార్థీ శేవడే త్యాంస | కరీత విచారపూస పరస్పర | ||౫౨|| 
52. వకీలు పరీక్షకు అతడు రాత్రి పగలూ అధ్యయనం చేస్తుండగా, శేవడే అను ఒక విద్యార్థితో కలిసి తమ పరీక్ష సంగతులను గురించి ఇద్దరూ ముచ్చటించుకున్నారు. 
సహాధ్యాయీహీ ఇతర ఆలే | తేథేచ ఖోలీంత ఎకత్ర బసలే | 
ప్రశ్న ఎకేకా పుసూ లాగలే | పహాయా అభ్యాసిలే తాడూన | ||౫౩|| 
53. వారితో చదివే ఇతర విద్యార్థులు కూడా గదిలోకి వచ్చి వారితో కలిసి కూర్చున్నారు. ఎవరెవరు ఎంత బాగా పరీక్షకు సిద్ధమయ్యారు అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకోసాగారు. 
పహావే కోఠే కోణాచే చుకతే | కోణాచే ఉత్తర బరోబర యేతే | 
కరావే సంశయనివృత్తీతే | చిత్తస్వస్థతే లాగూనీ | ||౫౪|| 
54. ఎవరు ఎక్కడ ఏ తప్పులు చేస్తున్నారు, ఎవరి జవాబులు సరిగ్గా ఉన్నాయి అని తమ సంశయాలను తీర్చుకోవటానికి, తమ తమ మనో ధైర్యాన్ని పరీక్షించుకోసాగారు. 
శేవడే యాంచీ చుకలీ ఉత్తరే | అంతీ మ్హణాలే విద్యార్థీ సారే | 
కైసేన యాంచీ పరీక్షా ఉత్తరే | అభ్యాసిలే అపూరే సర్వచి | ||౫౫|| 
55. అడిగిన ప్రశ్నలకు శేవడే సరిగ్గా సమాధానమివ్వలేదు. ‘ఇతడు సరిగ్గా చదవలేదు, ఇక పరీక్షలో ఎలా ఉత్తీర్ణుడౌతాడు’ అని విద్యార్థులందరు అనుకున్నారు. 
కేలా జరీ త్యాంనీ ఉపహాస | శేవడ్యాంచా పూర్ణ విశ్వాస | 
పురా వా అపూరా అభ్యాస | వేళీ మీ పాస హోణార | ||౫౬|| 
56. వారందరు అలా హేళన చేశారు గాని, ‘చదివినా చదవక పొయినా కాలం వచ్చినప్పుడు తాను తప్పక ఉత్తీర్ణుడనౌతానని’ శేవడేకు పూర్తి నమ్మకం. 
మీ న జరీ అభ్యాస కేలా | మాఝా సాఈబాబా మజలా | 
పాస కరాయా ఆహే బైసలా | కరూ మీ కశాలా కాళజీ | ||౫౭|| 
57. ‘నేను అసలు చదవక పోయినా, నన్ను పాసు చేయించడానికి మా సాయిబాబా ఉన్నారు. నాకెందుకు దిగులు?’ 
పరిసతా ఏసియా బోలా | ఆశ్చర్య వాటలే సపటణేకరా | 
నేఊని శేవడ్యాంస ఎకే బాజూలా | పుసావయాలా లాగలే | ||౫౮|| 
58. అని అతడు అన్న మాటలు సపటణేకరుకు ఆశ్చర్యాన్ని కలిగించింది. శేవడేను ఒక ప్రక్కకు పిలిచి, 
అహో హే సాఈబాబా కోణ | జయాంచే ఎవఢే వర్ణితా గూణ | 
జయాంవర తుమచా విశ్వాస పూర్ణ | వసతీచా ఠావ కవణ కీ | ||౫౯|| 
59. ‘ఇంత గొప్పగా నీవు వర్ణించిన ఈ సాయిబాబా ఎవరు? నీవు ఇంతగా నమ్మే ఆ బాబా ఎక్కడ ఉంటారు?’ అని అడిగాడు. 
మగ త్యా సాఈబాబాంచీ మహతీ | ప్రత్యుత్తరీ శేవడే కథితీ | 
సవేంచి ఆత్మవిశ్వాస స్థితీ | తయాంసీ వదతీ ప్రాంజళపణే | ||౬౦||
60. దానికి జవాబుగా, సాయిబాబాయొక్క మహిమను, వారిపై తనకున్న గట్టి నమ్మకాన్ని గురించి ఎంతో భక్తిగా శేవడే చెప్పాడు. 

సుప్రసిద్ధ నగర జిల్హా | త్యామాజీల శిరడీ గాంవాలా | 
ఫకీర ఎక మశీదీ బసలా | అసే బహు నాంవాజలా సత్పురుష | ||౬౧|| 
61. ‘సుప్రసిద్ధమైన అహమ్మదు నగర్‍ జిల్లాలో, శిరిడీ అనే గ్రామంలోని మసీదులో ఒక ఫకీరు ఉన్నారు. వారు బాగా పేరు పొందిన సత్పురుషులు.
సంత ఆహేత జాగోజాగ | పరీ తయాంచే భేటీచా యోగ | 
గాంఠీస నసతా పుణ్య అమోఘ | ప్రయత్నే హా సుయోగ లాభేనా | ||౬౨|| 
62. ‘సంతులు అక్కడక్కడా ఉంటారు. కాని, ఎంతో పుణ్యముంటే తప్ప, వారిని కలుసుకునే అవకాశం, మనము ఎంత ప్రయత్నించినా లభించదు. 
విశ్వాస మాఝా పూర్ణ త్యావర | కరీల తో జే తేంచ హోణార | 
వదేల వాచే తేంచ ఘడణార | నాహీ తే చుకణార కల్పాంతీ | ||౬౩|| 
63. ‘వారియందు నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. వారు తలచుకున్నదే జరుగుతుంది. వారు నోటితో ఏది పలికితే అది జరుగుతుంది. కల్పాంతలోనైనా వారి మాట పొల్లుపోదు. 
కితీహీ కేల్యా యందా ప్రయాస | పరీక్షేంత మీ హోణార నాపాస | 
పరీ పుఢీల వర్షీ అప్రయాస | హోణార మీ పాస త్రిసత్య | ||౬౪|| 
64. ‘ఎంత ప్రయాస పడినా, ఈ సంవత్సరం నేను పరీక్ష పాసుకాను. వచ్చే సంవత్సరం ఏ శ్రమా లేకుండా పాసవుతాను. ఇది ముమ్మాటికీ నిజం. 
మజ హే ఆహే త్యాచే ఆశ్వాసన | తయావర మాఝా భరవసా పూర్ణ | 
హోణే న త్యాచే అన్యథా వచన | గాంఠ మీ బాంధూన ఠేవిలీసే | ||౬౫|| 
65. ‘నాకు వారి హామీ ఉంది, వారియందు నాకు పూర్తీ నమ్మకం. వారి మాటలు మరొలా జరగవు. ఇది నా గట్టి నమ్మకం. 
నవల కాయ హీ తో హోఈల | హోఈల పరీక్షా యాచ్యాహీ పుఢీల | 
హాస్యాస్పద హే వాటలే బోల | నిఃసంశయ ఫోల సపటణేకరా | ||౬౬|| 
66. ‘ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇదే కాదు, దీని తరువాత పరీక్ష కూడా పాసు అవుతాను.’ అని చెప్పగా, అతని మాటలు సపటణేకరుకు హాస్యాస్పదంగానూ, ఒట్టి పొల్లు మాటలుగాను నిఃసంశయంగా అనిపించాయి. 
వికల్పపూర్ణ త్యాంచే మన | త్యాంనా హే కాయ ఆవడే కథన | 
అసో శేవడే గేలే తేథూన | పరిసా తే వర్తమాన పుఢీల | ||౬౭|| 
67. అతని మనసు అనుమానాలతో నిండి ఉంది. అలాంటప్పుడు, ఆ మాటలు ఎలా నచ్చుతాయి? తరువాత శేవడే అక్కడనుంచి వెళ్లిపోయాడు. ఆ పైన ఏం జరిగిందో వినండి. 
పుఢే కాలే అనుభవాంతీ | అన్వర్థ ఝాల్యా శేవడ్యాంచ్యా ఉక్తీ | 
దోనీహీ పరీక్షా పాస హోతీ | ఆశ్చర్య చిత్తీ సపటణేకరా | ||౬౮|| 
68. కొంత కాలం గడిచిన తరువాత, శేవడే మాటలు నిజమని సపటణేకరు అనుభవంతో తెలుసుకున్నాడు. శేవడే రెండు పరీక్షలూ పాసు కావటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 
పుఢే జాతా దహా సాలే | సపటణేకర ఉద్విగ్న ఝాలే | 
దుర్దైవ ఎకాఎకీ ఓఢవలే | తంవ తే పావలే ఉదాసతా | ||౬౯|| 
69. దీని తరువాత పదేళ్లు గడిచాయి. సపటణేకరును అకస్మాత్తుగా దౌర్భాగ్యం ఆవరించింది. దాంతో దుఃఖంతో ఉదాసీనుడయ్యాడు. 
ఎకులతా ఎక ములగా త్యాంలా | కంఠరోగానే నిధన పావలా | 
సన ఎకూణీసశే తేరా సాలాలా | అత్యంత విటలా సంసారా | ||౭౦||
70. క్రి. శ. ౧౯౧౩వ సంవత్సరంలో అతని ఏకైక పుత్రుడు, గొంతు జబ్బు చేసి, మరణించాడు. దాంతో అతనికి ఈ ప్రపంచమందు బాగా విరక్తి కలిగింది. 

ఆది కరూన పంఢరపూర | గాణగాపూరాదీ తీర్థే సమగ్ర | 
ఝాలీ పరీ న సుఖాచే అంతర | వాచిలా నంతర వేదాంత | ||౭౧|| 
71. పండరీపురం, గాణగాపురం మొదలైన తీర్థక్షేత్రాలని దర్శించడం ప్రారంభించాడు. అయినా అతని మనసుకు సుఖశాంతులు లభించలేదు. తరువాత వేదాంతాన్ని చదవడం మొదలు పెట్టాడు. 
ఏసా కాంహీ కాళ లోటతా | చిత్తాస కాంహీ యేతే కా శాంతతా | 
మ్హణూని మార్గప్రతీక్షా కరితా | ఆఠవలా వృత్తాంత శేవడ్యాంచా | ||౭౨|| 
72. అలా కొంత కాలం గడిచింది. మనసుకు ఎలా శాంతి కలుగుతుంది అని ఎదురు చూస్తుండగా, అతనికి శేవడే మాటలు గుర్తుకు వచ్చాయి. 
శేవడే యాంచా నిశ్చయ స్మరలా | సాఈపదీంచా విశ్వాస ఆఠవలా | 
ఆపణహీ జావే శ్రీదర్శనాలా | వాటలే మనాలా తయాంచ్యా | ||౭౩|| 
73. శేవడేయొక్క గట్టి పట్టుదల, సాయి పాదాలయందు అతనికి గల దృఢ నమ్మకం గుర్తుకు వచ్చి, తాను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్లాలని అనుకున్నాడు. 
సంత దర్శనీ ధరిలా హేత | సన ఎకోణీసశే తేరా సాలాంత | 
శిరడీస జాణ్యాచా ఝాలా బేత | నిఘాలే సమవేత బంధూచ్యా | ||౭౪|| 
74. క్రి. శ. ౧౯౧౩వ సంవత్సరంలో సాయిని దర్శించుకోవాలని, తన తమ్ముని తోడు తీసుకుని శిరిడీకి బయలుదేరాడు. 
నిమిత్త శేవడే యాంచే స్మరణ | వందావయా ఆపులే చరణ | 
సాఈచ తయా కరితీ పాచారణ | తే సావచిత్త శ్రవణ కరా | ||౭౫|| 
75. అతనికి శేవడే గుర్తుకు రావటం కేవలం ఒక నెపం. అతనిని సాయియే తమ పాదాభివందనానికి పిలిపించుకున్నారు. శ్రద్ధగా దీనిని వినండి. 
పండితరావ కనిష్ఠ సహోదర | తయా ఘేఊనియా బరోబర | 
సంతదర్శనా సపటణేకర | నిఘాలే సపరివార శిరడీస | ||౭౬|| 
76. తన తమ్ముడైన పండితరావును వెంటబెట్టుకుని, కుటుంబ సమేతంగా, సపటణేకరు సాయి సత్పురుషుని దర్శించాలని శిరిడీ బయలుదేరాడు. 
అసో తే దోఘే తేథే ఆలే | యేతాంచ శ్రీంచ్యా దర్శనా నిఘాలే | 
దురూన బాబాంచే దర్శన ఝాలే | అత్యంత ధాలే చిత్తాంత | ||౭౭|| 
77. అక్కడికి చేరుకోగానే, ఇద్దరూ శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దూరంనుండే బాబాను దర్శించగానే అతని మనసుకు చాలా ఆనందం కలిగింది. 
దురూని పరి తీ డోళేభేట | హోతాంచ సత్వర గేలే నికట | 
దోఘేహీ జోడూన కరసంపుట | సమోర తిష్ఠత బాబాంచే | ||౭౮|| 
78. దూరంనుండే వారి కళ్లు కలుసుకోగానే, తొందరగా వారి సమీపానికి వెళ్లారు. రెండు చేతులూ జోడించుకుని ఇద్దరూ బాబా ఎదుట నిలుచున్నారు. 
దోఘేహీ తే అతి వినీత | బాబాసన్ముఖ లోటాంగణీ యేత | 
శ్రీఫల సాఈచరణీ సమర్పిత | శుద్ధ బావాన్విత సప్రేమ | ||౭౯|| 
79. అత్యంత వినయంగా ఇద్దరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసారు. నిర్మల భక్తితో, ప్రేమతో, సాయి పాదాలకు శ్రీఫలాన్ని అర్పించారు. 
శ్రీఫల అర్పితా సపటణేకర | సమర్థాంచియా చరణావర | 
“చల హట్ట” శబ్దే బాబా ధికార | కరీత సపటణేకర యాంచా | ||౮౦||
80. సాయి సమర్థునియందు సపటణేకరు శ్రీఫలాన్ని అర్పించగా, “చల్‍ హట్‍” అని ధిక్కరిసూ బాబా అతనిని పోఫొమ్మని అన్నారు. 

సపటణేకర చింతాగ్రస్త | బాబా వ్హావే కా సంతప్త | 
మనీ మ్హణతీ బాబాంచే పరిచిత | పాహూని త్యా ఇంగిత పుసావే | ||౮౧|| 
81. దాంతో, సపటణేకరు బాధ పడ్డాడు. బాబాతొ బాగా పరిచయమున్న వారి ద్వారా, ‘బాబా ఎందుకు కోపగించారు, బాబా ఉద్దేశం ఏమిటి’ అని తెలుసుకోవాలని తలచాడు.
దర్శనే జే వ్హావే ప్రసన్న | తేచ యా శబ్దే అత్యంత ఖిన్న | 
హోఊన సచింత అధోవదన | బైసలే సరకూన మాఘారా | ||౮౨|| 
82. బాబా దర్శనంతో ఆనందించవలసిన వాడు, బాబా మాటలకు అత్యంత దుఃఖితుడై, వెనుకకు జరిగి, చింతిస్తూ కూర్చున్నాడు. 
ఆతా కోణాపాసీ జావే | కోణా భక్తాలాగీ పుసావే | 
కాయ బాబాంచ్యా బోలాంత అసావే | మనోగత పుసావే కోణాస | ||౮౩|| 
83. ‘ఇప్పుడు ఎవరి వద్దకు వెళ్లాలి? బాబా మాటలను బట్టి, వారి మనసులో ఏముంది? అని ఏ భక్తుని అడగాలి?’ 
ఏసా త్యాంచా పాహూని భావ | కోణీ త్యాంచియా సమాధానాస్తవ | 
కథితా బాళా శిష్యాచే నాంవ | శోధిలా ఠావ తయాచా | ||౮౪|| 
84. అతని బాధను చూసి, అక్కడున్న ఒకరు అతనిని సమాధాన పరచటానికి, అతనికి బాలా శింపి పేరు చెప్పారు. సపటణేకరు బాలా (దర్జీ) ఉన్న చోటును వెదికాడు. 
తయాలాగీ సపటణేకర | నివేదితే ఝాలే వృత్తాంత సాగ్ర | 
మ్హణాలే బాబా మాఝా ధిక్కార | కరితీ అత్యుగ్రవాచేనే | ||౮౫|| 
85. జరిగినదంతా సపటణేకరు అతనితో చెప్పాడు. ‘చాలా కోపంగా బాబా నన్ను తరిమి వేశారు’ అని అన్నాడు. 
తుమ్హీ తరీ మజసవే యావే | దర్శన శాంతపణే కరవావే | 
 కృపావలోకన బాబాంచే వ్హావే | కోపా న యావే ఆమ్హావరీ | ||౮౬|| 
86. ‘నీవైనా నా వెంట రా. వారు మాపై కోపగించకుండా, వారి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేలా, బాబా మమ్మల్ని కృపాదృష్టితో చూచేలా చేయి’ అని అన్నాడు. 
అసో హే బాళానే మాన్య కేలే | సపటణేకర నిశ్చింత ఝాలే | 
ఫోటో బాబాంచే వికత ఆణవిలే | దర్శనా నిఘాలే బాబాంచ్యా | ||౮౭|| 
87. దీనికి బాలా ఒప్పుకోగా, సపటణేకరుకు చింత తగ్గింది. బాబా పటాన్ని కొని తెచ్చి, బాబా దర్శనానికి వెళ్లాడు. 
బాళా శింపీ హోతా సంగతీ | ఫోటో ఘేఊని ఆపులే హాతీ | 
బాళా మగ దేఉని బాబాంప్రతీ | బాబాంస విజ్ఞప్తి కరితాహే | ||౮౮|| 
88. బాళా శింపి అతని వెంట వెళ్లాడు. బాబా పటాన్ని అందుకుని, దానిని వారి చేతికిచ్చి, బాళా వారిని ప్రార్థించాడు. 
కాయ హే దేవా కసలే చిత్ర | పాహూని బాబా దేతీ ఉత్తర | 
హా ఫోటో ఆహే యాచా యార | బోటానే సపటణేకర దావీత | ||౮౯|| 
89. ‘దేవా! ఇది ఎవరి పటం?’ అని అడిగాడు. దానిని చూచి, సపటణేకరు వైపు చేయి చూపిస్తూ, ‘ఈ ఫోటో ఇతని స్నేహితునిది’ అని బాబా అన్నారు. 
ఏసే బోలూన బాబా హాంసలే | మండళీసహీ హాంసూ ఆలే | 
బాబా కాయ హో ఇంగిత యాంతలే | బాళానే పూసిలే బాబాంస | ||౯౦||
90. అని చెప్పి, నవ్వారు. భక్తులు కూడా నవ్వారు. ‘బాబా దీని అర్థం ఏమిటి?’ అని బాబాను బాళా ప్రశ్నించాడు. 

తాత్కాళ బాళా సపటణేకరా | మ్హణే ఘ్యా దర్శన కరా త్వరా | 
మగ తే కరితా నమస్కారా | “చల హట్ట” ఉద్గారా పరిసిలే | ||౯౧|| 
91. వెంటనే బాళా సపటణేకరుతో ‘త్వరగా వెళ్లి దర్శనం చేసుకో’ అని చెప్పాడు. అలాగే బాబాకు నమస్కారం చేయగా, మరల “చల్‍ హట్‍” పో వెళ్లిపో అన్న మాటలు వినిపించాయి. 
తేచ పూర్వీల “చల హట్ట” | అజూన మాఝీ పురవీ పాఠ | 
ఆతా కాయ కరావీ వాట | ఆశ్చర్య ఉద్భట సపటణేకరా | ||౯౨|| 
92. ‘మునపటి వలె, మరల అదే వెళ్లిపో అనే మాట. ఇప్పుడు దారి ఏది?’ అనేదే సపటణేకరుకు చాలా చిక్కు సమస్య. 
మగ తే దోఘే జోడూని కర | తిష్ఠత అసతా బాబాంసమోర | 
 “నిఘూని జా యేథూని సత్వర” | ఆజ్ఞా త్యా అఖేర బాబాంచీ | ||౯౩|| 
93. ఇద్దరు సోదరులూ చేతులు జోడించుకుని బాబా ఎదుట నిలబడి ఉండగా, చివరకు “ఇక్కడనుండి వెంటనే వెళ్లిపోండి” అని బాబా వారికి ఆజ్ఞాపించారు. 
వాక్య తుమచే స్వామీసమర్థా | అనుల్లంఘ్య కోణాహీ సర్వథా | 
కాయ ఆమ్హా పామరాంచీ కథా | నిఘాలో ఆతా యేచ ఘడీ | ||౯౪|| 
94. ‘స్వామీ సమర్థా! మీ ఆజ్ఞను ఎవరూ జవదాటలేరు. పామరులం మేమెంతటి వారం? ఇప్పుడే, ఈ క్షణమే వెళ్లిపోతాము. 
ఏకోని ఆపణ మహా ఉదార | దర్శనా ఆలో తో ధిక్కార | 
“చల హట్ట” శబ్దే ఆముచా సత్కార | కాయ హా చమత్కార కళేనా | ||౯౫|| 
95. ‘మీరు మహా ఉదారులని విని మీ దర్శనానికి వచ్చాము. ధిక్కారంతో “చల్‍ హట్‍” అని మమ్మల్ని సత్కరించారు. ఇదేం చమత్కారమో మాకు తెలియదు. 
తేవ్హా అసావే కృపావలోకన | ద్యావే ఆమ్హా ఆశీర్వచన | 
వ్హావే సత్వర పునర్దర్శన | ఏసే ఆశ్వాసన మాగితలే | ||౯౬|| 
96. ‘అయినా, మీ కృపాదృష్టిని మా పై ఉంచండి. మీ దర్శనం త్వరలో మాకు కలిగేలా మమ్ము ఆశీర్వదించండి’ అని వారిని వేడుకున్నారు. 
ఏసా కోణ ఆహే జ్ఞానీ | జాణేల కాయ బాబాంచే మనీ | 
పరంతు ఝాలేలీ ఆజ్ఞా మానునీ | గేలే స్వస్థానీ మాఘారా | ||౯౭|| 
97. బాబా మనసులో ఏముంది అని తెలుసుకునే జ్ఞానులు ఎవరుంటారు? బాబా ఆజ్ఞను శిరసావహించి స్వస్థలానికి తిరిగి వెళ్లిపోయాడు. 
ఏసే హే త్యాంచే ప్రథమ దర్శన | తేణే తే దోఘే అతి ఉద్విగ్న | 
గేలే అపులే గాంవా పరతోన | యత్కించిత విలంబ న కరితా | ||౯౮|| 
98. బాబాతో అతని మొదటి దర్శనం అలా జరిగింది. దీనితో, ఆ సోదరులిద్దరూ చాలా బాధ పడ్డారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తమ ఊరికి వెళ్లిపోయారు. 
పుఢే ఆణీక వర్ష గేలే | తరీహీ న మన స్థిర ఝాలే | 
పునశ్చ గాణగాపూర కేలే | చిత్త భడకలే అధికచ | ||౯౯|| 
99. తరువాత మరో సంవత్సరం గడిచింది. అయినా, సపటణేకరు మనసు స్థిర పడలేదు. మరల గాణగాపురం వెళ్లాడు. కాని, మనసులో మరింత కలవరం చెలరేగింది. 
విశ్రాంత్యర్థ సపటణేకర | గేలే మాఢేగాంవీ నంతర | 
కాశీక్షేత్రీ జాణ్యాచా విచార | కేలా కీ అఖేర తయాంనీ | ||౧౦౦||
100. విశ్రాంతి కోసం తరువాత అతడు మాడేగాంకు వెళ్లాడు. చివరకు, కాశీ క్షేత్రానికి వెళ్లాలని అనుకున్నాడు. 

ఆతా కాశీస నిఘావయాస | ఉరలే అవఘే దోనచ దివస | 
ఝాలా దృష్టాంత నిజకాంతేస | రాహిలా ప్రవాస కాశీచా | ||౧౦౧|| 
101. కాశీకి వెళ్లడానికి ఇంకా రెండు రోజులు ఉందనగా, అతని భార్యకు స్వప్న దృష్టాంతం కలిగి, కాశీ ప్రయాణం ఆగిపోయింది.
దృష్టాంతాచా చమత్కార | కైసా త్యాచా అభినవ ప్రకార | 
కథితో వ్హావే శ్రవణతత్పర | లీలాచరిత్ర సాఈచే | ||౧౦౨|| 
102. చమత్కారమైన ఆ దృష్టాంతం ఎంత విశేషమైనదో చెప్పుతాను. సాయియొక్క ఆ లీలను వినటానికి శ్రోతలు సిద్ధమవండి. 
ఝోపేంత అసతా శేజేవర | స్వప్నసృష్టీ డోళ్యాసమోర | 
బాఈ ఘేఊనియా ఘాగర | జాఈ విహిరీవర లక్కడశాచే | ||౧౦౩|| 
103. పక్క మీద ఆ స్త్రీ నిద్రలో ఉండగా కళ్ల ఎదుట స్వప్నం. ఆమె కుండను తీసుకుని లక్కడ్శా బావికి వెళ్లింది. 
తేథే ఎకా నింబాతళీ | డోఈస జో ఫడకా గుండాళీ | 
ఏసా ఎక ఫకీర తే వేళీ | మ్హణే మజజవళీ పాతలా | ||౧౦౪|| 
104. ‘అక్కడ ఒక వేప చెట్టు క్రింద, తలకు రుమాలు చుట్టుకుని ఉన్న ఒక ఫకీరు, నా వద్దకు వచ్చాడు. 
“కా వ్యర్థ శ్రమసీ బాళ” | ఫకీర ఉద్గారలా స్వరే కోమళ | 
“భరూన దేతో తుఝీ హీ సకళ | ఘాగర నిర్మళ ఉదకేసీ” | ||౧౦౫|| 
105. “అమ్మాయీ! అనవసరంగా ఎందుకు శ్రమపడతావు? నీ కుండను మంచి నీటితో నింపి ఇస్తాను” అని చాలా మంజుల స్వరంతో పలికాడు. 
వాటలీ భీతీ ఫకిరాచీ | ఘేఊన ఘాగర రికామీచి | 
వాట మాఘారా ధరిలీ ఘరాచీ | సవే మాగేమాగేంచి ఫకీర | ||౧౦౬|| 
106. ‘ఫకీరు భయంతో, ఖాళీ కుండను తీసుకుని ఇంటి దారి పట్టాను. ఆ ఫకీరు నా వెంటే, నా వెనుక వస్తున్నాడు. 
ఏసియేపరీ పాహూని స్వప్న | జాగీ ఝాలే ఉఘడలే నయన | 
పరిసూన కాంతా స్వప్ననివేదన | నేమిలే గమన శిరడీచే | ||౧౦౭|| 
107. ‘ఇలాంటి కలను చూచి, మేలుకున్నాను. నా కళ్ళు తెరుచుకున్నాయి.’ భార్యయొక్క ఈ స్వప్న వృత్తాంతాన్ని విని సపట్ణేకరు శిరిడీ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. 
తేచ ముహూర్తీ దోఘే నిఘాలీ | ఉదఈక శిరడీగ్రామా పాతలీ | 
యేతాంచ మశీదీమాజీ గేలీ | బాబా తే కాలీ లేండీవర | ||౧౦౮|| 
108. అనుకున్న వెంటనే, భార్యాభర్తలిద్దరూ బయలుదేరి మరునాడు శిరిడీ గ్రామం చేరుకున్నారు. చేరిన వెంటనే మసీదుకు వెళ్లారు. అప్పుడు, బాబా లెండీకి వెళ్లి ఉన్నారు. 
బాబా పరత యేఈపర్యంత | బైసతీ ఝాలీ దోఘేంహీ తేథ | 
బాబాంచీ మార్గప్రతీక్షా కరిత | బాబా తంవ ఇతుక్యాంత పాతలే | ||౧౦౯|| 
109. బాబా తిరిగి వచ్చే వరకు, బాబా కోసం ఎదురు చూస్తూ, ఆ ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. ఇంతలో, బాబా వచ్చారు. 
మూర్తీ జీ దేఖిలీ దృష్టాంతాంత | తీచ తీ పాహూన నఖశిఖాంత | 
బాఈ జాహలీ విస్మయాన్విత | మగ తీ న్యాహాళీతచి రాహిలీ | ||౧౧౦||
110. తాను కలలో చూసిన మూర్తినే, మరల కళ్ల ఎదుట ఆపాదమస్తకం చూచి, ఆమె చకితురాలైంది. కళ్లార్పకుండా చూడ సాగింది. 

హోతా బాబాంచే పాదక్షాలన | బాఈ గేలీ ఘ్యావయా దర్శన | 
కరోని సాఈపదాభివందన | బైసలీ అవలోకన కరితచి | ||౧౧౧|| 
111. బాబాయొక్క పాద ప్రక్షాళనం కాగానే, ఆమె వారి వద్దకు వెళ్లి, పాదాలకు నమస్కరించింది. కూర్చుని, బాబానే చూడ సాగింది. 
పాహోని తియేచీ వినీతతా | ఉల్లాస సాఈనాథాచే చిత్తా | 
బాబాంనీ హళూచ ఆరంభిలీ కథా | బాఈచీ వ్యథానివారక | ||౧౧౨|| 
112. ఆమె వినయానికి సాయినాథునికి సంతోషం కలిగింది. మెల్లగా, మృదువైన గొంతుతో, ఆ స్త్రీ బాధను నివారించే కథను బాబా చెప్పనారంభించారు. 
తేవ్హా నిత్యక్రమానుసార | బాబా అపులీచ వ్యథా సవిస్తర | 
నివేదూ లాగలే ప్రేమపురఃసర | తత్రస్థ ఎక్యా తిసర్యాస | ||౧౧౩|| 
113. ఎప్పటివలనే, అక్కడ ఉన్న మూడో వ్యక్తితో, తమ బాధను, బాబా ప్రేమగా, సవిస్తారంగా చెప్పసాగారు. 
పాహూ జాతా బాఈచీ కథా | బాఈస సాంగావయాచీ అసతా | 
తిచ్యాసమక్ష తిసర్యాస కథితా | పరిసిలీ అతిసావధానతా బాఈనే | ||౧౧౪|| 
114. నిజానికి, అది ఆమె కథ. ఆమెకు చెప్పవలసిన కథ. ఆమె ఎదుట ఎవరో మూడో వ్యక్తికి బాబా చెప్పడం వలన, ఆమె అత్యంత శ్రద్ధగా విన్నది. 
“మాఝే హాత పోట కంబర | బహుత దివస దుఖే అనివార | 
ఔషధే కరితా ఝాలో బేజార | హోఈనా పరిహార వ్యథేచా | ||౧౧౫|| 
115. “చాలా రోజులనుంచి, నా చేతలు, కడుపు, నడుము నొప్పి పెడుతున్నాయి. మందులు వాడి, వాడి విసుగెత్తి పోయాను. కాని, బాధ తగ్గటం లేదు. 
“కంటాళలో మీ ఔషధే ఖాతా | గూణ మ్హణూన యేఈనా తత్వతా | 
పరి మజ ఆశ్చర్య వాటే ఆతా | గేలీ కీ వ్యథా ఎకాఎకీ” | ||౧౧౬|| 
116. “ఎన్నో మందులు తీసుకుని, నిజంగానే విసిగిపోయాను. అయినా ఏం గుణం కనిపించలేదు. కాని, అకస్మాత్తుగా ఇప్పుడు తగ్గిపోయాయని ఆశ్చర్యంగా ఉంది.” 
ఏసీ హీ కథా తిజియా కథితా | బాఈచా నామనిర్దేశహీ న కరితా | 
తియేచీచ హీ వార్తా సర్వథా | సంబంధ హా హోతా తియేచా | ||౧౧౭|| 
117. అని బాబా, ఆమెకు సంబంధించిన కథనంతా, ఆమె పేరు చెప్పకుండా ఏకరువు పెట్టారు. 
పుఢే మాసా దోమాసా అంతీ | బాబాంనీ ఆపులీ జీ వర్ణిలీ హోతీ | 
త్యాచ తియేచ్యా వ్యథేచీ నివృత్తీ | ఝాలీ తంవ ప్రతీతీ పటలీ తిలా | ||౧౧౮|| 
118. ఒకటి, రెండు నెలల చివరిలో, బాబా తమవిగా వర్ణించిన ఆమె బాధలు తొలగిపోయాయి. బాబా మాటలలోని నిజం ఆమెకు అనుభవ పూర్వకంగా అర్థమైంది. 
పూర్ణ ఝాలీ బాఈచీ కామనా | తంవ సపటణేకర ఘేతీ దర్శనా | 
త్యాంచీ పూర్వీల “చల హట్ట” సంభావనా | బాబాంనీ పున్హా కేలీచ | ||౧౧౯|| 
119. భార్య కోరిక తీరింది. కాని, సపటణేకరు దర్శనానికి వచ్చినప్పుడు, బాబా మరల, మునపటి వలెనే “చల్ హట్” అని అతనికి చెప్పారు. 
న కళే కాయ మాఝీ చూక | ధిక్కారితీ మజ బాబా అచూక | 
నమస్కారితా ఉత్తర ఎక | మజలా ఠరావిక తయాంచే | ||౧౨౦||
120. ‘నా పొరపాటేమిటో నాకు అర్థం కావటం లేదు. మరి, నన్ను ఎందుకిలా బాబా తిరస్కరిస్తున్నారు? ఎప్పుడు నమస్కరించినా, నాకు వారి జవాబు ఒకటే.’ 

కాయకీ మాఝే పూర్వార్జిత | మజవరీచ కా రాగేజత | 
ఇతరాం పాశీ మాఝియా దేఖత | వర్తత అత్యంత ప్రేమానే | ||౧౨౧|| 
121. ‘వెనుకటి జన్మలో నేను చేసిన పాపమైనా ఏమిటి? నాపైనే ఎందుకు ఇంత కోపం కలుగుతుంది? నేను చూస్తుండగా, ఇతరులతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తారు?
పాహూ జాతా సాంజసకాళీ | బాబాంపాశీ అవఘీ మండళీ | 
ఆనందే అనుభవీత నిత్య దివాళీ | మాఝేచ కపాళీ “చల హట్ట” | ||౧౨౨|| 
122. ‘ఉదయం, సాయంత్రం బాబా వద్ద అందరూ ఆనందంగా రోజూ దీపావళిని అనుభవిస్తుంటే, నాకే ఎందుకు “చల్ హట్”? 
కాంహీ మాఝే కర్మ వికోపా | గేలే పావలో ధర్మ విలోపా | 
ఆశ్రయ ఝాలో అనంత పాపా | తేణేంచ హీ అవకృపా మజవరీ | ||౧౨౩|| 
123. ‘నా కర్మ ద్వారా ఏదో అధర్మం జరిగి, ఎన్నో పాపాలు నాలో చేరి ఉంటాయి. అందుకే, బాబాకు నామీద కోపం వచ్చి ఉంటుంది. 
ఆరంభీ మీ బాబా విషయీ | హోతో కుతర్కీ తైసాచ సంశయీ | 
తేణేంచ వాటలే ఏసియా ఉపాయీ | బాబాచ మజఠాయీ పాడీత | ||౧౨౪|| 
124. ‘మొదట, బాబా గురించి సంశయించి ఎన్నో కుతర్కాలు చేశాను. అందుకే నన్ను ఈ విధంగా, బాబా తమ వద్దకు లాక్కుంటున్నట్లు అనిపిస్తూ ఉంది.’ 
మ్హణూని కేలా నిజనిర్ధార | అనుగ్రహ బాబాంచా హోయతోంవర | 
తేథేంచ వృత్తి ఠేవూన స్థిర | రహావే సుస్థిర మానసే | ||౧౨౫|| 
125. అలా అనుకుని, బాబా అనుగ్రహం కలిగేవరకు, శిరిడీలోనే, బాబా వద్ద స్థిరమైన మనసుతో ఉండాలని, నిర్ధారణ చేసుకున్నాడు. 
త్రివిధతాపే తాపలేలా | వరీ సాఈచ్యా దర్శనా భుకేలా | 
 ఏసా కోణ విన్ముఖ గేలా | జో న నివాలా అంతరీ | ||౧౨౬|| 
126. మూడు విధాల తాపంతో తపించిపోయి, సాయి దర్శనానికి ఆరాటపడుతూ వెళ్లి, మనసుకు శాంతి లభించకుండా, నిరాశతో తిరిగి వెళ్లిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? 
తరీ తే దివసీ అతి ఉద్విగ్న | గోడ న లాగే అన్నపాన | 
గోడ న లాగే గమనా గమన | ఉన్నిద్ర నయన శేజేవర | ||౧౨౭|| 
127. ఆ రోజు సపటణేకరు చాలా బాధ పడ్డాడు. అతనికి అన్న పానీయాలు రుచించలేదు. ఎక్కడికీ కదల బుద్ధి కాలేదు. నిద్ర లేకుండా, కళ్లు తెరుచుకుని, పక్క మీద పడి ఉన్నాడు. 
జవళ నాహీ కోణీ అవాంతర | బాబాచ ఎకలే అసతీ గాదీవర | 
సాధూనియా ఏసా అవసర | ధరావే చరణ బాబాంచే | ||౧౨౮|| 
128. ‘ఎవరూ దగ్గర లేనప్పుడు, బాబా ఒకరే ఆసనంపై ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని వారి పాదాలను గట్టిగా పట్టుకోవాలి.’ 
కరీత నిశ్చయ సపటణేకర | ఫళాసి ఆలా త్యాంచా నిర్ధార | 
హోఊనియా సద్గదితాంతర | ధరీత చరణ బాబాంచే | ||౧౨౯|| 
129. అని సపటణేకరు నిశ్చయించుకున్నాడు. దాని ఫలితంగా, గద్గద హృదయంతో, బాబా పాదాలను పట్టుకున్నాడు. 
పాయావరీ ఠేవితా శిర | బాబా తయావర ఠేవిత నిజకర | 
పాదసంవాహన కరిత సపటణేకర | ఆలీ ఎక బాఈ ధనగర తో | ||౧౩౦||
130. బాబా పాదాలపై తన తలను ఉంచగా, బాబా తమ చేతిని అతని తలపై ఉంచారు. అతడు బాబా పాదాలను పట్టసాగాడు. అప్పుడు అక్కడికి ఒక గొర్రెల కాపరి అయిన ఒక స్త్రీ వచ్చింది. 

బాఈ యేతాంచ తేథవర | రగడూ బైసలీ బాబాంచీ కంబర | 
బాబా నిత్యక్రమానుసార | వార్తా తిజబరోబర కరితాత | ||౧౩౧|| 
131. అక్కడికి రాగానే ఆమె బాబా నడుము మర్దన చేస్తూ కూర్చుంది. రోజూ మాట్లాడే విధంగా బాబా ఆమెతో ముచ్చటించ సాగారు. 
వార్తేచా త్యా చమత్కార | లక్షపూర్వక సపటణేకర | 
ఏకతా తీ త్యాంచీచ సమగ్ర | అక్షరే అక్షర ఆఢళలీ | ||౧౩౨|| 
132. చమత్కార పూర్వకమైన ఆ వృత్తాంతాన్ని, సపటణేకరు శ్రద్ధగా విన్నాడు. అక్షరం అక్షరం మొత్తం అది అతని కథే. 
జరీ హోకార ధనగరీ దేత | సపటణేకర ఆశ్చర్యభరిత | 
అపులేంచ వృత్త బైసలే ఏకత | తేణే తే చకిత అంతరీ | ||౧౩౩|| 
133. ఆ స్త్రీ ‘ఊ’ కొడుతూ వింటూ ఉన్నా, ఆశ్చర్యభరితమైన తన కథను సపట్ణేకరు వింటూ కూర్చున్నాడు. దాంతో అతడు చాలా అచ్చెర పడ్డాడు. 
గోష్ట తీ ఎకా వాణియాచీ | పరీ వస్తుతః హోతీ త్యాంచీ | 
త్యాంతహీ త్యాంచే మయత ములాచీ | వార్తా మృత్యూచీ నిఘాలీ | ||౧౩౪|| 
134. ఆ కథ ఒక వర్తకునికి సంబంధించినదే అయినా, అది నిజానికి తన కథే. అందులో చనిపోయిన అతని కుమారుని మరణాన్ని గురించి కూడా ఉంది. 
కోణీ అత్యంత పరిచిత | నాతేవాఈక సాంగే వృత్త | 
జన్మాపాసూన మరణాపర్యంత | తైసే తే సాద్యంత కథియేలే | ||౧౩౫|| 
135. పుట్టింది మొదలు చనిపోయేవరకు మొత్తం కథను, అత్యంత ఆప్తులు పరిచితులు చెప్పిన విధంగా, బాబా చెప్పారు. 
బాఈలాగీ సాంగతీ కథా | తిచా న కథేంశీ సంబంధ తత్వతా | 
తీ తో పితాపుత్రాంచీ వార్తా | విషయ సర్వథా దోఘాంచా | ||౧౩౬|| 
136. అసలు ఆమెకు ఏమీ సంబంధం లేని కథను బాబా ఆ స్త్రీకి చెప్పసాగారు. అది ఒక తండ్రి మరియు కొడుకు కథ. అందులోని సంగతంతా వాళ్లిద్దరిదే. 
అసో ఏసీ నిజకథా | సాఈముఖే సపటణేకర ఏకతా | 
పరమ విస్మయ జాహలా చిత్తా | బాణలీ ఆదరతా సాఈపదీ | ||౧౩౭|| 
137. సాయి నోటినుండి తన స్వంత కథను విన్న సపటణేకరుకు పరమాశ్చర్యం కలిగింది. సాయి పాదాలయందు అతని పూజ్య భావం బలపడింది. 
వాటలే తయా మోఠే కౌతుక | బాబాంలా హీ కైశీ ఠాఊక | 
పరీ జైసా కరతలామలక | తేవీ హే సకళిక బాబాంనా | ||౧౩౮|| 
138. అరచేతిలోని ఉసిరి కాయలా, ఇదంతా బాబాకు ఎలా తెలిసింది అని అతనికి చాలా కుతూహలంగా అనిపించింది. 
బ్రహ్మస్వరూప స్వయే ఆపణ | తయాచే విశ్వ కుటుంబ జాణ | 
కింబహునా విశ్వచి నటలా పూర్ణ | తీచ హీ ఖూణ సాఈచీ | ||౧౩౯|| 
139. సాయి స్వయం పరబ్రహ్మ స్వరూపం. విశ్వమంతా వారి కుటుంబం. అంతే కాదు, విశ్వమంతా వారి స్వరూపమే. అదే వారి గుర్తు. 
ఎకాత్మతేచా విస్తార | తోచ కీ సాఈచా అవతార | 
తయాస కైచే ఆపపర | స్వయే సవిస్తర జగరూప | ||౧౪౦||
140. అంతటా వ్యాపించి ఉన్న ఏకాత్మత సాయియొక్క అవతారం. జగత్తంతా వారు విస్తరించి ఉండగా, వారికి తన పర భేదం ఎందుకుంటుంది? 

వినటలా జో పరమపురషా | తయా కైచీ ద్వైతభాషా | 
ద్రష్టా దర్శన అథవా దృశ్యా | నాతళే ఆకాశా జణూ లేప | ||౧౪౧|| 
141. పరమ పురుషునిలో లీనమైన వారికి, జీవాత్మ పరమాత్మలకు భేదం ఎలా ఉంటుంది? ఆకాశనికి ఏ లేపనం అంటుకోనట్లుగా, చూసేవారు, చూపు మరియు కనబడునది ఈ మూడింట్లో వారికి భేదం లేదు.
బాబా మహాన అంతర్జ్ఞాదనీ | ఏసే యేతాంచ తయాంచే మనీ | 
బాబా కాయ తయాలాగుని | వదలే తే సజ్జనీ పరిసీజే | ||౧౪౨|| 
142. బాబా నిజంగా గొప్ప అంతర్ జ్ఞాని. ఈ ఆలోచన సపటణేకరు మనసులో వచ్చినప్పుడు, అతనితో బాబా ఏం అన్నారో సజ్జనులైన శ్రోతలు వినండి. 
బోట దావూని తయాసమోర | బాబా సాశ్చర్య కాఢితీ ఉద్గార | 
“మారిలే మ్హణే మీ యాంచే పోర | ఆరోప మజవర హా ఠేవీ | ||౧౪౩|| 
143. సపటణేకరును చేత్తో చూపిస్తూ, ఆశ్చర్యంగా బాబా “నేను ఇతని కొడుకును చంపానని నాపై నేరాన్ని ఆరోపిస్తున్నాడు.” అని అన్నారు. 
మీ లోకాంచీ పోరే మారితో | హా కా మశీదీస యేఊన రడతో | 
బరే మీ ఆతా ఏసే కరితో | పోటాసీ ఆణితో పుత్ర త్యాచా | ||౧౪౪|| 
144. “నేను లోకుల బిడ్డలను చంపుతానా? అయితే, ఇతడు మసీదుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు? సరే, ఇప్పుడు అతని కొడుకును మరల తీసుకుని వస్తాను. 
జైసా మేలేలా రామదాస | దిలా మాఘారా త్యా బాఈస | 
తైసాచ పునశ్చ త్యాచియే ములాస | ఆణితో మీ పోటాస త్యాచియా” | ||౧౪౫|| 
145. “చనిపోయిన కొడుకును మరల వాని తల్లికి రామదాసు ఇచ్చినట్లుగా, ఇతని కొడుకుని మరల ఇతని భార్య గర్భంలోకి తీసుకుని వస్తాను.” 
ఏసే ఏకూన సపటణేకర | తిష్ఠత లావుని బాబాంకడే నజర | 
ఠేవూని త్యాచ్యా మస్తకీ కర | బాబా త్యా ధీర దేతాత | ||౧౪౬|| 
146. ఆ మాట విన్న సపటణేకరు బాబానే చూస్తూ కూర్చున్నాడు. బాబా అతని తలపైన తమ చేతిని ఉంచి, అతనికి ధైర్యాన్నిచ్చారు. 
మ్హణతీ “హే పాయ పురాతన ఫార | జాహలీ తుఝీ కాళజీ దూర | 
పూర్ణ భరంవసా ఠేవ మజవర | కృతార్థ లవకర హోసీల” | ||౧౪౭|| 
147. “ఈ పాదాలు చాలా పురాతనమయినవి. నీ చింత ఇంక తొలగిపోతుంది. నాయందు పూర్తి నమ్మకాన్ని ఉంచు. త్వరలోనే నీ కోరికలు తీరుతాయి.” 
కరీత అసతా పాదసంవాహన | పరిసతా బాబాంచే మధురవచన | 
సపటణేకర సద్గదిత నయన | పదాభివందన కరీత | ||౧౪౮|| 
148. సపటణేకరు బాబా పాదాలను పట్టుతుండగా, వారి మధురమైన మాటలను విని, కళ్ళు చెమర్చాయి. బాబా పాదాలకు నమస్కారం చేశాడు. 
ఆలే అష్టభావ దాటూన | నయనీ ఆనందాశ్రూ జీవన | 
తేణే బాబాంచే పాదక్షాలణ | ప్రేమే ప్రక్షాలణ మగ కేలే | ||౧౪౯|| 
149. అతనికి ఎనిమిది భావాలూ ఉప్పొంగాయి. కళ్లనుండి కారిన ఆనందాశ్రువులతో, బాబా పాదాలను ప్రేమగా కడిగాడు. 
పున్హా బాబాంనీ మస్తకీ హాత | ఠేఊని మ్హణాలే “బసావే స్వస్థ” | 
తేవ్హా సపటణేకర బిర్హాడీ పరత | ఆలే ఆనందిత మానసే | ||౧౫౦||
150. మరల అతని తలపై తమ చేతిని ఉంచి, బాబా “సుఖంగా కూర్చో” అని చెప్పారు. అప్పుడు, సంతోషంగా సపటణేకరు బసకు వెళ్లాడు. 

నైవేద్యాచీ కేలీ తయారీ | దేఊనియా నిజ యువతీ కరీ | 
పూజా ఆరతీ జాహలియావరీ | తాట తే సారీత బాబాంపుఢే | ||౧౫౧|| 
151. నైవేద్యాన్ని తయారు చేయించి, తన భార్య చేతికిచ్చాడు. పూజ మరియు హారతి అయిన తరువాత, నైవేద్య పళ్లెమును బాబా ముందు ఉంచాడు. 
మగ ప్రోక్షూనియా పాత్రాస | కరోని సవిధి నేత్రస్పర్శ | 
ప్రాణాపాన వ్యానాదికాస | అర్పోని మగ బాబాంస సమర్పిలా | ||౧౫౨|| 
152. పళ్లెం చుట్టూ నీటిని సంప్రోక్షించి విధిగా కళ్లకు అద్దుకుని, ప్రాణ అపాన వ్యానాది పంచప్రాణాలకు అర్పించి, తరువాత నైవేద్యాన్ని బాబాకు సమర్పించాడు. 
మగ అనుసరూన నిత్యక్రమాస | బాబాంచా హోతా హస్తస్పర్శ | 
స్వీకారితా నైవేద్యాస | వాటలా హర్ష సపటణేకరా | ||౧౫౩|| 
153. రోజువారి పద్ధతి ప్రకారం బాబా తమ చేతులతో నైవేద్యాన్ని తాకి స్వీకరించగా, సపటణేకరుకు ఆనందం కలిగింది. 
మగ తత్రస్థ ఇతర భక్త | హోతే బాబాంచే పాయా పడత | 
శిరలే సపటణేకర త్యా గర్దీత | పునశ్చ నమస్కారిత త్వరేనే | ||౧౫౪|| 
154. అక్కడున్న ఇతర భక్తులు బాబా పాదాలను నమస్కరిస్తుండగా, వారితో పాటు సపటణేకరు కూడా మరల బాబాకు నమస్కరించాడు. 
అసో ఏసియా త్యా ఘాఈంత | మస్తకా మస్తక ఆథడత | 
బాబా తేవ్హా సపటణేకరాప్రత | కైసే అనువాదత సంథపణే | ||౧౫౫|| 
155. ఆ గుంపులో, ఒకరి తలలు మరొకరి తలలతో ఢీకొంటున్నాయి. అప్పుడు బాబా మెల్లగా సపటణేకరుతో, 
“అరే కశాలా వారంవార | నమస్కారావర నమస్కార | 
పురే తో కేలా ఎకవార | ఆదరసత్కారపూర్వక” | ||౧౫౬|| 
156. “అరే! మాట మాటికీ ఎందుకు నమస్కారంపై నమస్కారం? గౌరవ ఆదరాలతో ఒక్క సారి చేస్తే చాలు” అని చెప్పారు. 
అసో తే రాత్రీ హోతీ చావడీ | సపటణేకర అతి ఆవడీ | 
ప్రేమే నిఘాలే పాలఖీ అఘాడీ | ఆనంద పరవడీ దండధారీ | ||౧౫౭|| 
157. ఆ రాత్రి చావడి ఉత్సవం. సపటణేకరు ఎంతో ఉత్సాహంగా చేత దండాన్ని పట్టుకుని ఆనంద పరవశంతో, బాబా పల్లకి ముందు నడిచాడు. 
అసో హీ చావడీ మిరవణూక | శ్రోతయా పూర్వీంచ ఆహే ఠాఊక | 
తరీ పునరుక్తి ఆవశ్యక | విస్తారకారక వర్జియేలీ | ||౧౫౮|| 
158. ఈ చావడి ఊరేగింపు గురించి శ్రోతలకు ఇదివరకే తెలుసు. కనుక, గ్రంథం విస్తారమవుతందని, మరల చెప్పటం వదలి వేస్తున్నాను. 
అసో పుఢే తే రాత్రీలా | హీ బాబాంచీ అగాధ లీలా | 
బాబా దిసలే సపటణేకరాలా | జణూ పాండురంగాలాచ పాహతో | ||౧౫౯|| 
159. ఆ రాత్రి బాబా అగాధ లీలను చూడండి. సపటణేకరు బాబాను చూస్తుంటే, పాండురంగని చూస్తున్నట్లే అనిపించింది. 
అసో పుఢే మాగతా ఆజ్ఞా | జేవూన జావే ఝాలీ అనుజ్ఞా | 
న కరితా యత్కించిత అవజ్ఞా | నిఘాలే మగ దర్శనా జాతాంనా | ||౧౬౦||
160. తరువాత, అతడు తన తిరుగు ప్రయాణానికి బాబా ఆజ్ఞను కోరగా, వారు భోజనం చేసి వెళ్లమని అనుమతినిచ్చారు. బాబా ఆజ్ఞను కొంచెమైనా జవదాటకుండా, బయలుదేరే ముందు బాబా దర్శనానికి వెళ్లాడు. 

ఇతక్యాంత మగ త్యాంచియే మనా | ఎకాఎకీ ఉఠలీ కల్పనా | 
బాబా ఆతా మాగతా దక్షిణా | తీ మీ పురవిణార కైసేనీ | ||౧౬౧|| 
161. ఇంతలో, అకస్మాత్తుగా అతని మనసులో ఆలోచనలు వచ్చాయి. ‘బాబా ఇప్పుడు దక్షిణను అడిగితే, నేను ఎలా ఇవ్వాలి.’
పైసే గాంఠీస హోతే తే సరలే | గాడీభాడ్యాచే పురతేచ ఉరలే | 
“దక్షిణా దే” బాబా జర వదలే | ఉత్తర ఠరవిలే మనానే | ||౧౬౨|| 
162. దగ్గరున్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. బండి బాడుగకు సరిపడ డబ్బు మాత్రమే మిగిలి ఉంది. 'దక్షిణను ఇవ్వు' అని బాబా అడిగితే ఏం జవాబు చెప్పాలో మనసులో నిశ్చయించుకున్నాడు. 
మాగావయాచే ఆధీంచ ద్యావా | రుపయా ఎక హాతీ ఠేవావా | 
పున్హా మాగతా ఆణఖీ అర్పావా | నాహీ మ్హణావా తయాపుఢే | ||౧౬౩|| 
163. ‘అడగక మునుపే బాబా చేతిలో ఒక రూపాయిని ఉంచాలి. బాబా మరల అడిగినప్పుడు, మరొక రుపాయిని ఇవ్వాలి. ఆ తరువాత లేదని చెప్పాలి. 
అగ్నిరథాచే భాడ్యాసాఠీ | ఆవశ్యక తేచి ఠేవిలే గాఠీ | 
ఏసే బాబాంస సాంగావే స్పష్టోక్తీ | ఠరవోని భేటీస తే గేలే | ||౧౬౪|| 
164. ‘రైలు బండి ఖర్చుకు మాత్రమే డబ్బు ఉంచుకున్నానని బాబాతో స్పష్టంగా చెప్పాలి’, అని నిర్ణయించుకుని బాబా వద్దకు వెళ్లాడు. 
పూర్వీల కృతనిశ్చయానుసార | రుపయా ఎక ఠేవితా హాతావర | 
ఆణిక ఎకచి మాగితలా త్యావర | దేతా తే భరపూర అనువాదలే | ||౧౬౫|| 
165. తను ముందుగా నిశ్చయించుకున్నట్లే, బాబా చేతిలో ఒక రూపాయిని ఉంచగా, బాబా మరల ఒక్క రూపాయినే అడిగారు. దానిని ఇచ్చిన తరువాత స్పష్టంగా, 
మ్హణాలే “హా ఘే ఎక నారళ | స్వస్త్రియేచ్యా ఓటీంత ఘాల | 
ఆణిక మగ తూ జాఈ ఖుశాల | సోడూని తళమళ జీవాచీ” | ||౧౬౬|| 
166. “ఈ కొబ్బరికాయను తీసుకో. దానిని నీ భార్య ఒడిలో వేయి. నీ మనసులోని బాధను వదిలి సుఖంగా వెళ్లు” అని చెప్పారు. 
పుఢే జాతా మహినే బారా | పుత్ర ఆలా త్యాంచియే ఉదరా | 
ఘేఊని ఆఠా మాసాంచియా లేంకురా | ఆలీ తీ మాఘారా దర్శనా | ||౧౬౭|| 
167. తరువాత, పన్నెండు నెలలు గడిచాయి. సపటణేకరుకు కొడుకు కలిగాడు. ఎనిమిది నెలల బిడ్డను తీసుకుని, ఆ దంపతులు మరల దర్శనానికి వచ్చారు. 
ములగా ఘాతలా బాబాంచే చరణీ | కాయ సంతాంచీ నవల కరణీ | 
మగ తీ దోఘే జోడూని పాణి | కరితీ వినవణీ తీ పరిసా | ||౧౬౮|| 
168. కొడుకును బాబా పాదాల మీద ఉంచారు. సత్పురుషుల లీల ఎంత విచిత్రం? ఆ ఇద్దరూ చేతులు జోడించి, ఏం మనవి చేశారో వినండి. 
యా ఉపకారా సాఈనాథా | కేవీ ఉతరాఈ వ్హావే ఆతా | 
ఆమ్హా కాంహీంచ కళేనా సర్వథా | ఠేవితో మాథా చరణావర | ||౧౬౯|| 
169. ‘సాయినాథా! ఈ ఉపకారానికి ఎలా ఋణం తీర్చుకోవాలో మాకు అర్థం కావటం లేదు. మీ పాదాలయందు మా శిరసును ఉంచుతున్నాము. 
హీన దీన ఆమ్హీ పామర | కృపా అసావీ అనాథాంవర | 
ఆతా యేథూన పుఢే నిరంతర | చరణీ తవ థార అసావా | ||౧౭౦||
170. ‘మేము దీనులం, పామరులం, హీనులం. ఈ అనాథుల పైన మీ దయ చూపండి. ఇకనుండి, మీ పాదాల వద్ద మాకు ఎల్లప్పుడూ చోటు కలిగించండి. 

జాగృతీ మాజీ తైసేంచ స్వప్నీ | నానా తరంగ ఉఠతీ మనీ | 
ఉసంత నాహీ దివస రజనీ | తరీ తవ భజనీ లావీ ఆమ్హా | ||౧౭౧|| 
171. ‘మేలుకున్నప్పుడు, కలలోనూ, రాత్రీ, పగలూ, తీరిక లేకుండా అనేక రకాల ఆలోచనలు వస్తూంటాయి. అయినా, మీ ఆరాధనలో మేము ఉండేలా అనుగ్రహించండి.’ 
అసో తో ములగా మురలీధర | ఆణిక దోన భాస్కర దినకర | 
యాంచియా సమవేత సపటణేకర | ప్రసన్నాంతర జాహలే | ||౧౭౨|| 
172. మురలీధరుడన్న ఆ అబ్బాయి తరువాత భాస్కరు, దినకరు అను మరో ఇద్దరు కొడుకులు కలగగా, సపటణేకరు మనసులో చాలా ఆనందించాడు. 
మగ తే సవే ఘేఊన భార్యా | కరూని వందన సాఈ సదయా | 
సాధూని చంచల మనాచే స్థైర్యా | హోఊని కృతకార్యా పరతలే | ||౧౭౩|| 
173. అలా, సాయి దయామయయునికి సపటణేకరు ఆనందంగా నమస్కరించాడు. నిలకడలేని తన మనసును స్థిరపరచుకుని, కోరికలన్నీ తీర్చుకుని, భార్యతో వెళ్లిపోయాడు. 
కథా సాంగావీ సంకలిత | హోతా మనీ ఆరంభీ హేత | 
 పరీ వదవితా సాఈనాథ | తేణే హా గ్రంథ విస్తారలా | ||౧౭౪|| 
174. కథను సంక్షిప్తంగా చెప్పాలని మొదట అనుకున్నాను. కాని, చెప్పించేవారు సాయినాథులే కనుక ఈ గ్రంథం పెద్దదైంది. 
తయాసీ హా హేమాడ శరణ | పుఢీల కథేచే అనుసంధాన | 
తాత్పర్యార్థ దిగ్దర్శన | శ్రోతయాం లాగూన కరీతసే | ||౧౭౫|| 
175. హేమాడు సాయినాథునికి శరణుజొచ్చి, తరువాతి కథతో సంబంధం మరియు తాత్పర్యం శ్రోతలకు తెలియ చేస్తాడు. 
కథా తీ యాహూన బహు గోడ | చమత్కారాచీ జయా ఆవడ | 
ఏసియా ఎకా భక్తాచే కోడ | పురవిలే నితోడ సాఈనీ | ||౧౭౬|| 
176. ఆ కథ ఇంతకంటే అతి మధురమైనది. చమత్కారాలలో ఇష్టమున్న ఒక భక్తుని కోరికను, బాబా ఎంతో అమోఘంగా తీర్చారు. 
లోక వర్ణితా సాఈచే గుణ | దోషదర్శీ దేఖే అవగుణ | 
స్వయే న స్వార్థపరమార్థపరాయణ | దోషైక దర్శన హేతూ మనీ | ||౧౭౭|| 
177. సాయి సుగుణాలను ప్రజలు వర్ణిస్తుంటే, వారిలో దోషాలను చూడాలనుకునేవారు, దోషాలనే వెదుకుతుంటారు. లోకికమైన కోరికలు గాని, పరమార్థంలోగాని ఏ శ్రద్ధా లేనివారికి, దోషాలను వెదకటమే ఉద్దేశం. 
అసతీల సాఈబాబా సంత | తరీ తే మజ దేతీల ప్రచీత | 
మజలా అనుభవ ఆలియా విరహిత | మీ త్యా యత్కించిత మానీనా | ||౧౭౮|| 
178. ‘సాయిబాబా సత్పురుషులే కావచ్చు. కాని, నాకు వారు తమ మహిమయొక్క అనుభవాన్ని కలిగించాలి. ఆ అనుభవం నాకు కలగకపోతే, వారిని నేను అసలు నమ్మను’. 
కేవళ పరీక్షా పహావయాస | గేలియాచీ హీ ఇచ్ఛా పురత | 
హీచ కథా పుఢీల అధ్యాయాంత | శ్రవణ కరోత సత్శ్రో తే | ||౧౭౯||
179. అని కేవలం బాబాను పరీక్షించాలనే ఉద్దేశంతో వెళ్లిన వారి కోరిక కూడా తీరింది. ఇదే కథను శ్రోతలు తరువాతి అధ్యాయంలో వినండి. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | సాశంకభక్తానుగ్రహకరణం నామ | 
| అష్టచత్వారింశోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

No comments:

Post a Comment