శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౧ వా ||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
గతకథేచే అనుసంధాన | బాబాంచే అరూంద ఫళీవర శయన |
అలక్ష్య ఆరోహణ అవతరణ | అకళ విందాన తయాంచే | ||౧||
1. మునపటి కథను కొనసాగిద్దాము. వెడల్పులేని చెక్క పలకపై బాబా పడుకోవటం, వారు ఆ పలక పైకి ఎలా వెళ్ళేవారో, దిగేవారో, ఎవరికీ అర్థం కాని వారి కుశలతను గూర్చి చెప్పడమైంది.
జాహలే ఆయుర్దాయ పర్యాలోచన | తే హే దేవార్చన శిరడీచే | ||౨||
2. హిందువు కాని, ముస్లిము కాని ఇద్దరినీ సమానంగా చూడటం, వారి జీవిత కాలం గురించి, శిరిడీలోని జనులకు వారే పూజ్య దైవమని తెలియజేయటం జరిగింది.
ఆతా హా అధ్యాయ అకరావా | గోడ గురూకథేచా సుహావా | వాటలే సాఈచరణీ వహావా | దృఢ భావా ధరూని | ||౩||
3. గురు కథలతో ఈ పదకొండవ అధ్యాయాన్ని అలంకరించి, దృఢమైన భక్తితో, సాయి పాదాలకు అర్పించాలని అనిపించింది.
ఘడేల యేణే సగుణధ్యాన | హే ఎకాదశరూద్రావర్తన | పంచభూతాంవర సత్తా ప్రమాణ | బాబాంచే మహిమాన కళేల | ||౪||
4. అలా చేయడం వలన, సాయి సగుణ, సాకార రూపం గురించి ధ్యానం సాధ్యమౌతుంది. ఈ అధ్యాయం ఏకాదశ రుద్రావర్తన వంటిది. పంచ భూతాలపై బాబాకున్న శక్తి, అధికారం, ఇంకా వారి మహిమ ఇవన్నీ ప్రమాణ పూర్వకంగా అర్థమౌతుంది.
కై సే ఇంద్ర అగ్ని వరూణ | బాబాంచ్యా వచనాస దేతీ మాన | ఆతా కరూ తయాంచే దిగ్దర్శన | శ్రోతా అవధాన దేఇంజే | ||౫||
5. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు బాబా మాటలను ఎలా గౌరవించేవారో, ఇప్పుడు తెలియజేస్తాను. శ్రోతలారా! శ్రద్ధగా వినండి.
పూర్ణ విరక్తీచీ విరక్తీ | ఏసీ సాఈచీ సగుణ మూర్తి | అనన్య భక్తా నిజవిశ్రాంతి | ఆఠవూ చిత్తీ సప్రేమ | ||౬||
6. పూర్తి విరక్తికి ఆకారం వచ్చి, విపరీతమైన భక్తితో శరణుజొచ్చే భక్తులకు విశ్రాంతి నిలయమే సాయి. ఆ సాయి సగుణ మూర్తిని ప్రేమతో మనసున ధ్యానిస్తాను.
గురూవాక్యైక విశ్వాసన | హేంచి బసాయా దేఊ ఆసన | సర్వ సంకల్ప సంన్యాసన | కరూ పూజన యా సంకల్పే | ||౭||
7. గురువు మాటల మీద మనకున్న నమ్మకాన్నే, వారికి కూర్చోవటానికి ఆసనంగా సమర్పిద్దాము. అన్ని కోరికలను వదిలి వేయాలనే సంకల్పంతో పూజ చేద్దాము.
ప్రతిమా స్థండిల అగ్ని తేజ | సూర్యమండల ఉదక ద్విజ | యా సాతాంహీ వరీ గురూరాజ | అనన్య పూజన కరూ కీ | ||౮||
8. విగ్రహం, స్థండిలం (దర్భలతో శుభ్రపరచిన భూమి), నిప్పు, సూర్య మండలం, నీరు, బ్రాహ్మణులు ఈ ఏడింటి కంటే గురువే గొప్ప. వారిని దృఢమైన భక్తితో పూజిద్దాము.
చరణ ధరితా అనన్యభావే | గురూచి కాయ పరబ్రహ్మ హేలావే | ఏసే గురూపూజేచే నవలావే | అనుభవావే గురూభక్తే | ||౯||
9. దృఢమైన నమ్మకంతో, భక్తితో వారి పాదాలను ఆశ్రయిస్తే, గురువే కాదు, దేవుడు కూడా కదలి వస్తాడు. గురు పూజలో ఇంతటి మహిమ ఉంది. దీనిని గురువుయొక్క భక్తులు స్వతః అనుభవించాలి.
పూజక జేథవర సాకారూ | దేహధారీచ ఆవశ్యక గురూ | నిరాకారాస నిరాకారూ | హా నిర్ధారూ శాస్త్రాచా | ||౧౦||
10. పూజించే వారు తమ దేహమే తాము అని అనుకున్నప్పుడు, గురువు కూడా శరీరంతో ఉండాలి. తమ దేహాన్ని మించి పూజించే వారికి, ఆకారం లేని గురువునే ధ్యానం చేయాలి అని శాస్త్రాలు చెప్పాయి.
న కరితా సగుణాచే ధ్యానా | భక్తి భావ కదా ప్రకటేనా |
ఆణి సప్రేమ జంవ భక్తి ఘడేనా | కళీ ఉఘడేనా మనాచీ | ||౧౧||
11. కంటికి కనిపించే ఆకారం లేనంత వరకు, మనసులో భక్తి కలుగదు. ప్రేమతో నిండిన భక్తి కలుగనంత వరకు, మనసనే మొగ్గ వికసించదు.
తే ఉమలల్యావిణ కాంహీ | కేవళ కర్ణికేస గంధ నాహీ | నా మకరంద నా భ్రమర పాహీ | తేథ రాహీల క్షణభర | ||౧౨||
12. మొగ్గ వికసించక పోతే, సువాసన ఉండదు. సువాసన లేకుంటే, తేనెటీగలు క్షణమైనా అక్కడ నిలువవు. అవి నిలవక పోతే, అక్కడ తేనె ఉండదు.
సగుణ తేంచి సాకార | నిర్గుణ తే నిరాకార | భిన్న నాహీ పరస్పర | సాకార నిరాకార ఎకచి | ||౧౩||
13. త్రిగుణాలతో కూడిన ఆకారంతో కనిపించటమే సగుణము. అదే సాకారం. గుణాలు లేనిదే నిర్గుణం. అదే నిరాకారం. ఇవి రెండూ ఒక్కటే, ఏ భేదమూ లేదు. సాకారం నిరాకారం రెండూ ఒక్కటే.
థిజలే తరీ తే ఘృతచి సంచలే | విఘురలే తేహీ ఘృతచి మ్హణితలే | సగుణ నిర్గుణ ఎకచి భరలే | సమరసలే విశ్వరూపే | ||౧౪||
14. నెయ్యి పేరుకొని గట్టిగా ఉన్నా, కరిగి ద్రవరూపంలో ఉన్నా, నెయ్యి అనే అంటాము. సగుణ, నిర్గుణాలు రెండూ సమపాళ్ళలో కలిసి, ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి.
డోళే భరూని జే పాహూ యేఈ | పదీ జ్యాచ్యా యే ఠేవితా డోఈ | జేథ జ్ఞానాచీ లాగే సోఈ | ఆవడీ హోఈ తే ఠాయీ | ||౧౫||
15. కంటి నిండా చూసేందుకు, మనసారా భక్తితో పాదాల మీద తల ఉంచటానికి వీలుగా, సాకార రూపం ఉంటే, అక్కడ జ్ఞానం ఏ ఆటంకమూ లేక ప్రవహిస్తుంది. అక్కడే ప్రేమ కలుగుతుంది.
జయాచియే సంగతీ | ప్రేమవార్తా కరూ యేతీ | జయాస పూజూ యే గంధాక్షతీ | మ్హణూని ఆకృతి పాహిజే | ||౧౬||
16. ప్రేమతో మాట్లాడుకోవటానికి, పూలు గంధం అక్షతలతో పూజించటానికి, ఒక ఆకారం కావాలి.
నిర్గుణాహూన సగుణాచే | ఆకలన బహు సుకర సాచే | దృఢావల్యా ప్రేమ సగుణాచే | నిర్గుణాచే బోధన తే | ||౧౭||
17. నిర్గుణం కంటే, ఆకారం ఉన్నవారిని తెలుసుకోవటం చాలా సులభం. ఆకారం ఉన్న మూర్తిపై ప్రేమ, భక్తి దృఢమైతే, నిర్గుణ ధ్యానం తనంతట తానే కలుగుతుంది.
భక్తా నిర్గుణ ఠాయీ పడావే | బాబాంనీ అనంత ఉపాయ యోజావే | అధికారానురూప దూర బసవావే | దర్శన వర్జావే బహుకాళ | ||౧౮||
18. భక్తులు నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని, బాబా చాలా ఉపాయాలను చేసేవారు. తమ భక్తులు భక్తి మార్గంలో వారు ఎదిగిన స్థితిని బట్టి, వారిని దూరంగా ఎక్కడికో పంపిచడం, లేక చాలా కాలం వారికి తమ దర్శనం లేకుండా చేయడం, వంటివి చేసేవారు.
ఎకాస దేశాంతరా పాఠవావే | ఎకాస శిరడీంత ఎకాంతీ కోండావే | ఎకాస వాడయాంత అడకవావే | నేమ ద్యావే పోథీచే | ||౧౯||
19. ఒకరిని శిరిడీనుంచి దూరం పంపితే, మరొకరిని శిరిడీలోనే ఒంటరి చోటులో ఉంచేవారు. ఇంకొకరిని వాడాలోనే బంధించి, గ్రంథ పారాయణం చేయించేవారు.
వర్షానువర్ష హా అభ్యాస | హోతా వాఢేల నిర్గుణధ్యాస | అసనీ శయనీ భోజనీ మనాస | జడేల సహవాస బాబాంచా | ||౨౦||
20. ఇలా చాలా సంవత్సరాలు అభ్యాసం చేస్తే, నిర్గుణ ధ్యానం పెరుగుతుంది. కూర్చున్నా, పడుకున్నా, భోజనం చేస్తునా, మనసు బాబా మీదే లగ్నమై ఉంటుంది.
దేహ తరీ హా నాశివంత | కధీ తరీ హోణార అంత |
మ్హణూని భక్తి న కరావీ ఖంత | అనాద్యనంత లక్షావే | ||౨౧||
21. ఈ దేహం శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అంతం కావలిసిందే. అందువలన, నశించే ఈ దేహం గురించి భక్తులు దుఃఖించకుండా, ఆది అంతము లేని ఆ దేవుడి మీద మనసు పెట్టాలి.
అవ్యక్తాంతూన ఆలా ఆకారా | జాణార మాఘారా అవ్యక్తీ | ||౨౨||
22. రకరకాలుగా కనిపించే ఈ జగత్తంతా ఒక మాయ. కనిపించని ఆ దేవుడినుండి ఆకారం పొంది, కనిపించ సాగింది. మరల అది కనిపించకుండా మాయమౌతుంది.
హీ ‘ఆబ్రహ్మస్తంబ’ సృష్టీ | వ్యష్టీ జైసీ తైసీ సమష్టీ | ఉపజలీ జ్యా అవ్యక్తాపోటీ | తెథేంచ శేవటీ సమరసే | ||౨౩||
23. ఈ సృష్టిలో, బ్రహ్మనుండి మొదలుకొని అతి చిన్న అణువు దాకా, విడి విడిగా తీసుకున్నా, లేక మొత్తాన్ని తీసుకున్నా, కనిపించని ఆ దేవుడినుండి పుట్టి, మరల ఆ దేవుడిలోనే లీనమై పోతుంది.
మ్హణవూన కోణాసహీ నా మరణ | మగ తే బాబాంస తరీ కోఠూన | నిత్య శుద్ధబుద్ధనిరంజన | నిర్మరణ శ్రీసాఈ | ||౨౪||
24. అందువలన చావు అన్నది ఎవరికీ రాదు. ఇక మరి బాబాకు చావెక్కడిది? వారికి చావే లేదు. వారు శాశ్వతమైన, శుద్ధమైన బుద్ధ జీవి.
కోణీ మ్హణోత భగవద్భక్త | కోణీ మ్హణోత మహాభాగవత | పరీ ఆమ్హాంస తే సాక్షాత భగవంత | మూర్తిమంత వాటలే | ||౨౫||
25. కొందరు వారిని భగవద్భక్తులని, మరి కొందరు భాగవతుడని (శ్రీ విష్ణు భక్తుడు) అంటారు. కాని మనకు వారు మూర్తీభవించిన దేవుడే!
గంగా సముద్రా భేటూ జాతే | వాటేనే తాపార్తా శీతల కరితే | తీరీంచే తరూంస జీవన దేతే | తృషా హరితే సకళాంచీ | ||౨౬||
26. సాగర సంగమానికోసం గంగా నది వెళ్ళుతూ, దారిలో తపించేవారిని చల్లబరచి, తీరంలోని చెట్లకు నీరందిస్తూ, అందరి దాహాన్ని తీరుస్తుంది.
తైసీచ సంతాంచీ అవతార స్థితి | ప్రకట హోతీ ఆణి జాతీ | పరీ తయాంచీ ఆచరితీ రీతీ | పావన కరితీ జగాతే | ||౨౭||
27. అలాగే, సాధు సంతుల అవతారం. వారు కనిపించి, మరల కనిపించకుండా వెళ్ళిపోతారు. కాని కనిపించినంత కాలం వారు ఆచరించిన రీతి ఈ జగత్తును పావనం చేస్తుంది.
కమాలీచీ క్షమాశీలతా | నైసర్గిక విలక్షణ అక్షోభ్యతా | ౠజుతా మృదుతా సోశీకతా | తైసీచ సంతుష్టతా నిరూపమ | ||౨౮||
28. దేనినైనా క్షమించే వారి ప్రత్యేకమైన గుణం, ఎంతో సహజంగా ఉండే వారి శాంత స్వభావము, అపురూపమైన వారి నిష్కపట గుణం, వారి మృదుత్వం, ఎప్పుడూ తృప్తిగా ఉండే వారి స్వభావం, ఇవన్నీ సాటి లేనివి, అసామాన్యమైనవి.
దిసాయా జరీ దేహధారీ | తరీ తో నిర్గుణ నిర్వికారీ | నిఃసంగ నిర్ముక్త నిజ అంతరీ | ప్రపంచీ జరీ విచరలా | ||౨౯||
29. శరీరంతో కనిపిస్తున్నా, మనతో ఈ ప్రపంచంలో తిరుగుతున్నా, వారు లోలోపల నిర్గుణులు, ఏ కోరికలూ లేనివారు, ఏ సహవాసమూ లేనివారు, మరియు ముక్తులు.
కృష్ణ స్వయే జో పరమాత్మా | తోహీ మ్హణే సంత మదాత్మా | సంత మాఝీ సజీవ ప్రతిమా | సంత సప్రేమా తో మీచ | ||౩౦||
30. దేవుడై ఉండీ శ్రీకృష్ణుడు, “సంతులు నా ఆత్మ. వారు జీవంతో ఉన్న నా ప్రతిమా రూపాలు. ప్రేమతో నిండిన సత్పురుషులలో నేనే ఉన్నాను.
ప్రతిమారూపహీ1 సంతా న సాజే | సంత నిశ్చళ స్వరూప మాఝే |
మ్హణవూని మద్భక్తాంచే ఓఝే | తయాంచే లాజే మీ వాహే | ||౩౧||
31. “అయినా, వారిని నా ప్రతిమా రూపలు అని అనటం సరి కాదు. వారు మారని నా రూపాలే. అందుకే, వారి కోసం, నా భక్తుల బరువు బాధ్యతలను నేనే మోస్తాను. వారికి కలిగే అవమానాలను కూడా నేనే భరిస్తాను.
సంతాంసీ జో అనన్యశరణ | మీ హీ వందీ తయాచే చరణ | ఏసే వదలా ఉద్ధవా ఆపణ | సంత మహిమాన శ్రీకృష్ణ | ||౩౨||
32. “సాధు సంతులకు శరణుజొచ్చిన వారి పాదాలకు కూడా నేను నమస్కరిస్తాను”. అని సత్పురుషుల మహిమను శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పారు.
సగుణాంతలా జో సగుణ | నిర్గుణాంతలా జో నిర్గుణ | గుణవంతాతీల జో అనుత్తమ గుణ | గుణియాంచా గుణియా గుణి రాజా | ||౩౩||
33. సగుణాలలో సంపూర్ణమైన వారు, నిర్గుణులలో నిర్గుణులు, గుణవంతులలో ఉత్తమమైన గుణవంతులు, మరియు గొప్ప గుణాలున్న వారందరికీ రాజు వంటి వారు సాయి.
పర్యాప్త కామ జో కృతకృత్య | సదా యదృచ్ఛా లాభ తృప్త | జో అనవరత ఆత్మనిరత | సుఖదుఃఖాతీత జో | ||౩౪||
34. కోరికలన్నీ తీరినవారు, దొరికిన వాటితో తృప్తి పడే సంతుష్టులు, ఎప్పుడూ ఆత్మ ధ్యానంలో లీనమైన వారు, సుఖ దుఃఖాలను మించిన వారు సాయి.
ఆత్మానందాచే జో వైభవ | కోణా వర్ణవేల తే గౌరవ | అనిర్వాచ్య సర్వథైవ | బ్రహ్మ దైవత మూర్త జో | ||౩౫||
35. ఆత్మ ధ్యానంలో లీనమై పొందే ఆనందానికి ఐశ్వర్యమైనట్టి వారిని ఎవరు వర్ణించగలరు? మూర్తీభవించిన ఈ బ్రహ్మ దేవుణ్ణి ఎవరూ ఏ విధంగానూ వర్ణించలేరు.
కీ హీ అనిర్వచనీయ శక్తి | దృశ్య రూపే అవతరలీ క్షితీ | సచ్చిత్సుఖానందాచీ మూర్తి | జ్ఞాన సంవిత్తి తీచ తీ | ||౩౬||
36. వర్ణించ సాధ్యం కాని ఈ శక్తియే, మనిషి రూపంలో భూమిపై అవతరించింది. సచ్చిదానంద మూర్తి అయిన జ్ఞాన సంపత్తే సాయి.
బ్రహ్మాకారాంతఃకరణమూర్తి | ఝాలీ జయాచీ ప్రపంచీ నివృత్తి | నిత్య నిష్ప్రపంచ బ్రహ్మాత్మ్యైక్యస్థితి | ఆనంద మూర్తి కేవళ తీ | ||౩౭||
37. సాంసారిక బంధాలనుంచి ముక్తి పొంది, బ్రహ్మతో ఒకటైన కరుణామూర్తి, వీరే. ఎల్లప్పుడూ ప్రపంచానికి దూరంగా, బ్రహ్మతో ఏకమై, శుద్ధమైన ఆనందానికి రూపం సాయి.
“ఆనందోబ్రహ్మోతి” శ్రుతి | శ్రోతే నిత్య శ్రవణ కరితీ | పుస్తకజ్ఞానీ పోథీంత వాచితీ | భావికా ప్రతీతీ శిరడీంత | ||౩౮||
38. ‘ఆనందో బ్రహ్మేతి (శుద్ధమైన ఆనందమే దేవుడు)’ అని శ్రుతులు చెబుతాయి. శ్రోతలు దీనిని రోజూ వింటారు. పుస్తకాలు చదివే వారు పారాయణం చేస్తారు. మరియు భక్తులు ఈ అనుభవాన్ని శిరిడీలో పొందుతారు.
ధర్మాధర్మాది జ్యాచే లక్షణ | తోహా సంసార అతి విలక్షణ | అనాత్మజ్ఞాంసీ క్షణోక్షణ | కరణే రక్షణ ప్రాప్త కీ | ||౩౯||
39. ధర్మం అధర్మంతో కూడుకున్న అతి విచిత్రమైనది ఈ ప్రపంచం. ఆత్మ గురించి జ్ఞానం లేనివారు ప్రతి క్షణం దీనినుండి తమను తాము రక్షించుకుంటూ ఉండాలి.
పరీ హా న ఆత్మాజ్ఞాంచా విషయ | తయాంసీ ఆత్మస్వరూపీంచ ఆశ్రయ | తే నిత్య ముక్త ఆనందమయ | సదా చిన్మయరూప జే | ||౪౦||
40. కాని, ఆత్మను తెలుసుకున్న వారికి ఈ రక్షణ అవసరం లేదు. ఎప్పుడూ వారు ఆత్మలో లీనమై ఉంటారు. శాశ్వతంగా ముక్తిని పొందినవారు. ఎప్పుడూ ఆనందంతో ఉన్న శుద్ధ జ్ఞానానికి రూపాలు.
బాబాంచ సర్వాంచె అధిష్ఠాన | తయాంస కేఉతే ఆసన |
త్యాహీ వరీ రౌప్య సింహాసన | భక్త భావనపరీ బాబా | ||౪౧||
41. స్వతఃగా బాబాయే అందరికీ ఆధారం. వారికి ఆసనం ఎందుకు? అందునా వెండి సింహాసనం! కాని, బాబా ఒప్పుకున్నది, భక్తుల ముచ్చట తీర్చటానికే.
త్యావరి ఘాలితీ భక్త భావిక | గాదీ సురేఖ బైసాయా | ||౪౨||
42. వారి మామూలు ఆసనం అంటే, ఏ నాటిదో ఒక పాత గోనె ముక్క. దానిపై, భక్తులు ప్రేమతో చక్కటి గద్దెను వేసేవారు.
మాగీల టేకాయాచి భింత | తెథే తక్యా ఠేవితీ భక్త | జైసే భక్తాంచే మనోగత | బాబాహీ వాగత తైసేచ | ||౪౩||
43. వెనుక ఆనుకోవటానికి ఒక తలగడను గోడకు ఉంచేవారు. భక్తుల మనసులోని కోరికలను బట్టి బాబా నడుచుకునేవారు.
వాస్తవ్య దిసే శిరడీంత | తరీ తే హోతే సర్వగత | హా అనుభవ నిజభక్తాంప్రత | సాఈ నిత దాఖవీత | ||౪౪||
44. అసలు వారు శిరిడీలో కనిపించినా, అంతటా ఉన్నట్లు, తమ భక్తులకు రోజూ అనుభవాలను కలిగించేవారు.
స్వయే జరీ నిర్వికార | అంగికారీత పూజా ఉపచార | భక్తభావార్థానుసార | ప్రకార సర్వ స్వీకారిత | ||౪౫||
45. ఏ కోరికలూ లేకుండా, అన్నిటినీ త్యాగం చేసినా, భక్తుల భావాలకు తగ్గట్టు అన్ని రకాల పూజ ఉపచారాలను చేయించుకునేవారు.
కోణీ కరీత చామరాందోలన2 | కోణీ తాలవృన్త3 పరివీజన | సనయా చౌఘడే మంగల వాదన | కోణీ సమర్పణ పూజేచే | ||౪౬||
46. ఒకరు వింజామర, మరొకరు వీవన వారికి వీచేవారు. కొందరు సన్నాయి, డోలు మొదలయిన వాద్యాలు వాయించేవారు. కొందరు పూజను చేసేవారు.
కోణీ హస్త పాదప్రక్షాలన | కోణీ అత్తర గంధార్చన | కోణీ త్రయోదశగుణీ తాంబూల దాన | నివేదన మహానైవేద్యా | ||౪౭||
47. వారి చేతులను, పాదాలను ఒకరు కడిగితే, మరొకరు అత్తరు గంధం పూసేవారు. ఇంకొకరు మహానైవేద్యాన్ని సమర్పించి, జాజి, జాపత్రి మొదలగు పదమూడు పరిమళ వస్తువులతో కూడిన తాంబూలాన్ని అర్పించేవారు.
కోణీ దుబోటీ ఆడవే గంధ | శివలింగా తైసే చర్చితీ సలంగ | కోణీ కస్తూరీమిశ్రిత సుగంధ | తైసేంచి చందన చర్చీత | ||౪౮||
48. ఇంకా కోందరు, బొటన వ్రేలితో, శివలింగానికి పెట్టేలా అడ్డబొట్టు పెట్టేవారు. మరొకరు కస్తూరి కలిపిన సుగంధ చందనాన్ని రాసేవారు.
ఎకదా తాత్యాసాహేబ నూలకరాంచే | స్నేహీ డాక్టర పండిత నాంవాచే | ఘ్యావయా దర్శన సాఈ బాబాంచే | ఆలే ఎకదాంచే శిరడీంత | ||౪౯||
49. ఒక మారు, తాత్యాసాహేబు నూల్కరు స్నేహితుడు, డాక్టరు పండిత్ అనే పేరుగలతను సాయి దర్శనానికి శిరిడీ వచ్చాడు.
పాఊల ఠేవితా శిరడీంత | ఆరంభీ గేలే మశీదీంత | కరూని బాబాంసీ ప్రణిపాత | బైసలే నివాంత క్షణ భరీ | ||౫౦||
50. శిరిడీలో అడుగు పెట్టగానే, వెంటనే మసీదుకు వెళ్ళి, బాబాకు నమస్కరించి, కొంత సేపు విశ్రమించటానికి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు.
బాబా మగ వదతీ తయాంతే | “జాఈ దాదా భటాచ్యా యేథే |
జా అసే జా” మ్హణూని బోటే హాతే | లావితీ మార్గాతే తయాస | ||౫౧||
51. అప్పుడు బాబా అతనితో “దాదా భట్టు దగ్గరకు ఇలా వెళ్ళు” అని తమ చేత్తో దారిని చూపించారు.
పండిత దాదాంకడే గేలే | దాదాంనీ యోగ్య స్వాగత కేలే | మగ దాదా బాబాంచే పూజేస నిఘాలే | యేతా కా విచారిలే తయాంసి | ||౫౨||
52. పండితు దాదా దగ్గరకు వెళ్ళాడు. దాదా అతనిని బాగా సత్కరించాడు. ఆ తరువాత, బాబా పూజకని దాదా బయలుదేరి, ‘మీరూ వస్తారా?’ అని అడిగాడు.
దాదా సమవేత పండిత గేలే | దాదానీ బాబాంచే పూజన కేలే | కోణీహీ న తోంవర లావాయా ధజలే | గంధాచే టికలే బాబాంస | ||౫౩||
53. దాదా వెంట పండితు వెళ్ళాడు. బాబా పూజను దాదా చేశాడు. అప్పటి వరకూ బాబా నుదుటి మీద గంధం పెట్టటానికి ఎవరూ సాహసించలేదు.
కోణీ కసాహీ యేవో భక్త | కపాళీ గంధ లావూ న దేత | మాత్ర మ్హాళసాపతీ గళ్యాసీ ఫాంసీత | ఇతర తే లావీత పాయాంతే | ||౫౪||
54. ఏ భక్తుడైనా సరె, ఏ కారణం చేత వచ్చినా, తమ నుదుట మీద బాబా గంధం రాయనిచ్చేవారు కాదు. మహల్సాపతి ఒక్కడే వారి గొంతుకు చందనం పూసేవాడు. ఇతరులు వారి పాదాలకు మాత్రమే పూసేవారు.
పరీ హే పండిత భోళే భావిక | దాదాంచీ తబకడీ కేలీ హస్తక | ధరూనియా శ్రీసాఈచే మస్తక | రేఖిలా సురేఖ త్రిపుండ్ర | ||౫౫||
55. కాని, ఇది తెలియని అమాయకుడైన పండితు, చందనం గిన్నెను తన చేతిలోకి లాక్కొని, సాయి నుదుట మీద మూడు అడ్డ రేఖలను (త్రిపుండ్రం) దిద్దాడు.
పాహూని హే తయాంచే సాహస | దాదాంచే మనీ ధాసధూస | చఢతీల బాబా పరమ కోపాస | కాయ హే ధాడస మ్హణావే | ||౫౬||
56. అతని ధైర్యాన్ని చూచి, దాదా మనసులో కలవర పడ్డాడు. ‘ఎంత ధైర్యం! బాబా కోపంతో మండి పడుతారేమో!’ అని అనుకున్నాడు.
ఏసే అఘడతే జరీ ఘడలే | బాబా ఎకహీ న అక్షర వదలే | కింబహునా వృత్తీనే ప్రసన్న దిసలే | ముళీ న కోపలే తయాంవర | ||౫౭||
57. అలా జరగకూడనిది జరిగినా, బాబా ఒక ముక్కైనా అనలేదు. ఇంకా, చాలా ప్రసన్నంగా కనిపించారు. పండితు మీద అసలు కోపగించ లేదు.
అసో తీ వేళ జాఊ దిలీ | దాదాంచే మనీ రూఖరూఖ రాహిలీ | మగ తేచ దినీ సాయంకాళీ | బాబాంస విచారిలీ తీ గోష్ట | ||౫౮||
58. దాదా మనసులో అలజడి మొదలైంది. అయినా ఆ పూట గడవనిచ్చాడు. అదే రోజు సాయంత్రం, దాని గురించి బాబాను అడిగాడు.
ఆమ్హీ గంధాచా ఉలాసా టిళా | లావూ జాతా ఆపులియా నిఢళా | స్పర్శ కరూ ఘ్యానా కపాళా | ఆణి హే సకాళా కాయ ఘడలే | ||౫౯||
59. ‘మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని మేము ఎంత ఉత్సాహ పడినా, మమ్మల్ని అసలు తాకనివ్వరు కదా, మరి ఈ ఉదయం ఏం జరిగింది?
ఆముచ్యా టిళ్యాచా కంటాళా | పండితాంచ్యా త్రిపుండ్రాచా జివ్హాళా | హా కాయ నవలాచా సోహళా | బసేనా తాళా సుసంగత | ||౬౦||
60. ‘మా తిలకం మీకు నచ్చదు గాని, ఆ పండితు త్రిపుండ్ర రేఖలంటే అంత ప్రేమమా? ఏమిటీ వింత? తాళానికి సరిగ్గా లేదు!’
తంవ సస్మితవదన ప్రీతీ | సాఈ దాదాంలాగీ వదతీ |
పరిసావీ తీ మధుర ఉక్తీ | సాదర చిత్తీ సకళికీ | ||౬౧||
61. అప్పుడు, ముఖం మీద చిరునవ్వుతో, ఎంతో ప్రేమగా దాదాతో పలికిన మధురమైన మాటలను అందరూ శ్రద్ధగా వినండి.
తరీ మీ తోచి ఏసే మానూన | కేలే గురూపూజన తయానే | ||౬౨||
62. “దాదా! అతని గురు బ్రాహ్మణుడు. నేను జాతిలో ముస్లిమును. అయినా అతడు నన్ను తన గురువు అని అనుకుని పూజ చేశాడు.
ఆపణ మోఠే పవిత్ర బ్రాహ్మణ | హా జాతీచా అపవిత్ర యవన | కైసే కరూ త్యాంచే పూజన | ఏసే న తన్మన శంకలే | ||౬౩||
63. “‘నేను శుద్ధమైన, పవిత్రుడైన బ్రాహ్మణుణ్ణి. ఇతడు అపవిత్రమైన ముసల్మాను జాతివాడు కదా, ఇతనిని ఎలా పూజించడం’ అని అతడు అసలు సందేహించ లేదు.
ఏసే మజ త్యానే ఫసవిలే | తెథే మాఝే ఉపాయ హరలే | నకో మ్హణణే జాగీంచా రాహిలే | ఆధీన కేలే మజ తేణే ” | ||౬౪||
64. “అలా తను నన్ను యేమార్చాడు. అప్పుడు నా ఉపాయమేమీ సాగక, నేను అతనిని కాదనలేక పోయాను. అలా నన్ను తన వశం చేసుకున్నాడు”.
ఏసే జే హే ఉత్తర పరిసిలే | వాటలే కేవళ వినోదే భరలే | పరీ తయాంతీల ఇంగిత కళలే | మాఘారా పరతలే జై దాదా | ||౬౫||
65. ఇలాంటి జవాబు విని, దాదాకు అది కేవలం వినోదంగా అనిపించింది. ఇంటికెళ్ళిన తరువాతే, ఆ మాటలలోని ఇంగితం అతనికి అర్థం అయింది.
హీ బాబాంచీ విసంగతతా | దాదాంచ్యా ఫారచ లాగలీ చిత్తా | పరీ పండితాసవే వార్తా కరితా | కళలీ సుసంగతతా తాత్కాళ | ||౬౬||
66. పొసగు లేని బాబా నడత, దాదాను చాలా బాధపెట్టింది. తరువాత, పండితుతో మాట్లాడినప్పుడు బాబా నడత ఎంత నిలకడగా ఉందో తెలిసింది.
ధోపేశ్వరీంచే రఘునాథ సిద్ధ | ‘కాకా పురాణిక’ నామే ప్రసిద్ధ | పండిత తయాంచే పదీ సన్నద్ధ | ఋణానుబంధ శిష్యత్వే | ||౬౭||
67. ధోపేశ్వరులో రఘునాథ అన్న సిద్ధుడు కాకా పురాణిక (౧౮౨౧ - ౧౯౧౦) అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఎన్నో జన్మల ఋణానుబంధం వలన, వారి పాదాలయందు పండితు భక్తితో శిష్యుడిగా ఉన్నాడు.
త్యానీ కాకాంచా ఘాతలా ఠావ | తయాంస తైసాచ ఆలా అనుభవ | జయా మనీ జైసా భావ | భక్తి ప్రభావహీ తైసాచ | ||౬౮||
68. బాబాను చూసినప్పుడు, బాబాయే తన గురువైన కాకా అని అనుకున్నాడు. అతనికి అలాగే అనుభవమైంది. మనసులో ఉండే భావాన్ని బట్టి భక్తి ప్రభావం కూడా ఉంటుంది.
అసో హే సర్వోపచార కరవూన ఘేతీ | కేవళ తయాంచ్యా ఆలియా చిత్తీ | నాతో పూజేచీ తాటే భిరకావితీ | రూప ప్రకటితీ నరసింహ | ||౬౯||
69. కాని, ఇలాంటి పూజలను తనకు నచ్చినప్పుడే బాబా చేయించుకునే వారు. లేకుంటే, పూజా పళ్ళాన్ని కోపంతో విసిరి వేసి, నరసింహావతారాన్ని చూపేవారు.
హే రూప కా జై ప్రకటిజేల | కోణ ధీరాచా పాశీ ఠాకేల | జో తో జీవాభేణే పళేల | వృత్తి ఖవళేల తీ జేవ్హా | ||౭౦||
70. ఇలాంటి ఉగ్ర రూపాన్ని చూపినప్పుడు, వారి దగ్గర నిలబడే ధైర్యం ఎవరికి ఉంటుంది? అంత కోపాన్ని చూసి, ప్రాణ భయంతో అందరూ పరిగెత్తేవారు.
కధీ అవచిత క్రోధవృత్తి | భక్తాంవరీ ఆగ పాఖడితీ |
కధీ మేణాహూని మఊ భాసతీ | పుతళా శాంతి క్షమేచా | ||౭౧||
71. ఒకొక్కప్పుడు అకస్మాత్తుగా బాబా కోపంతో భక్తులపై నిప్పులు చెరిగేవారు. ఇంకొకప్పుడు మైనంకంటే మెత్తగా, శాంతి, క్షమలు ఆకారం దాల్చినట్లు ఉండే వారు.
కధీ కాళాగ్నిరూప భాసతీ | భక్తాంస ఖడ్గాచే ధారేవర ధరితీ | కధీ లోణ్యాహూని మవాళ హోతీ | ఆనంద వృత్తి విలసతీ | ||౭౨||
72. ఒకొక్కప్పుడు కోపంతో ఉగ్రంగా కాలాగ్ని రూపంతో కనిపించి, భక్తులను ఖడ్గ ధారపై నడిపించేవారు. ఇంకొకప్పుడు, వెన్నకంటే మెత్తగా, ఎంతో ఆనందంగా కనిపించేవారు.
జరీ క్రోధే కాంపలే థరథరా | డోళే జరీ ఫిరవిలే గరగరా | తరీ పోటీ కారూణ్యాచా ఝరా | మాతా లేంకురా తైసా హా | ||౭౩||
73. బయటకు కోపంతో అటు ఇటు ఊగిపోతున్నా, కళ్ళు గిరగిరా త్రిప్పినా, లోపల మటుకు బిడ్డలపై కన్నతల్లికి ఉండే కరుణ ఝరి ఉండేది.
క్షణాంత వృత్తీవరీ యేతా | హాంకా మారూని బాహతీ భక్తా | మ్హణతీ “మీ కోణావరీహీ రాగావతా | ఠావే న చిత్తా మాఝియా | ||౭౪||
74. కోపం తగ్గగానే, భక్తులను పిలిచి, “ఎవరి మీదైనా నేను కోపించినట్లు కనిపించినా, మనసులో నాకు కోపం లేదు.
మాయ హాణీ లేంకరా లాతా | సముద్ర కరీ నదియా పరతా | తరీచ మీ హోయ తుమ్హా అవ్హేరితా | కరీన అహితా తుమచియా | ||౭౫||
75. “తల్లి తన బిడ్డలను తన్ని తరిమి వేసినప్పుడు, సముద్రం నదులను వెనుకకు పంపినప్పుడు, నేను మిమ్మల్ని తరిమి వేస్తాను. అప్పుడు మీకు చెడు చేస్తాను.
మీ మాఝియా భక్తాంచా అంకిలా | ఆహే పాసీంచ ఉభా ఠాకలా | ప్రేమాచా మీ సదా భుకేలా | హాక హాకేలా దేతసే” | ||౭౬||
76. “నేను నా భక్తుల అధీనంలో ఉన్నవాణ్ణి. భక్తుల దగ్గరే ఉంటాను. నేనెప్పుడూ వారి ప్రేమ కోసం తపిస్తుంటాను. భక్తులు ఎప్పుడు పిలిచినా పలుకుతాను”.
హా కథాభాగ లిహితా లిహితా | ఓఘానే ఆఠవలీ సమర్పక కథా | ఉదాహరణార్థ కథితో శ్రోతా | సాదరాచిత్తా పరిసిజే | ||౭౭||
77. కథలోని ఈ భాగాన్ని వ్రాస్తున్నప్పుడు, పైన చెప్పిన దానికి సంబంధించిన ఇంకొక కథ సహజంగా గుర్తుకు వచ్చింది. ఉదాహరణగా చెబుతాను. శ్రోతలారా! శ్రద్ధగా వినండి.
ఆలా కల్యాణవాసీ ఎక యవన | సిదీక ఫాళకే నామాభిధాన | మక్కా మదీనా యాత్రా కరూన | శిరడీ లాగూన పాతలా | ||౭౮||
78. కళ్యాణలో ఉండే సిద్ధిక ఫాళకే అను పేరుగల ముస్లిము, మక్కా మదినా యాత్రలు చేసి, శిరిడీకి వచ్చాడు.
ఉతరలా తో వృద్ధ హాజీ | ఉత్తరాభిముఖ4 చావడీమాజీ | ప్రథమ నఊ మాస ఇతరాజీ | బాబా న రాజీ తయాతే | ||౭౯||
79. ముసలివాడైన ఆ హాజీ ఉత్తర దిశలో ఉన్న చావడిలో బస చేసాడు. మొదటి తొమ్మిది నెలలూ, అతనిపై బాబా ప్రసన్నులు కాకపోగా, అతనంటే బాబాకు ఇష్టం ఉండలేదు.
ఆలా నాహీ తయాచా హోరా | వ్యర్థ జాహల్యా యేరఝారా | కేల్యా తయానే నానా తర్హా | నజరానజర హోఈనా | ||౮౦||
80. కాలం కలసిరాలేదు. అతను ఎన్ని మార్లు మసీదుకు వెళ్ళినా అన్నీ వృథా అయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, బాబా దర్శనం కాలేదు.
మశీద ముక్త ద్వారా అవఘ్యాంసీ | కోణాసహీ నా పడదపోశీ |
పరీ న ఆజ్ఞా త్యా ఫాళక్యాసీ | చఢావయాసీ మశీదీ | ||౮౧||
81. మసీదు తలుపులు అందరికీ తెరచి ఉండేవి. ఎవరికీ ఏ అడ్డు, తెరగానీ లేవు. కాని, ఆ ఫాళకేకు మాత్రం మసీదు మెట్లు ఎక్కటానికి అనుమతి దొరకలేదు.
మశీదీస న లాగతీ పాఊలే | కాయ మ్యా కేలే పాప కీ | ||౮౨||
82. ‘ఏమిటి నాకు ఈ కర్మ! మసీదులో అడుగు పెట్టలేకున్నానే? నేనేం పాపం చేశాను?’ అని ఫాళకే మనసులో దుఃఖించాడు.
కవణ్యా యోగే ప్రసన్న హోంతీ | ఆతా బాబా మజవర పుఢతీ | హాచ విచార దివసరాతీ | హృద్రోగ చిత్తీ ఫాళక్యాంచే | ||౮౩||
83. ‘ఏం చేసి, బాబా అనుగ్రహాన్ని పొందగలను?’ అని రాత్రి పగలూ అతనికి ఒకటే ఆలోచన. దాంతో, రోగంలా ఈ ఆలోచన, అతని హృదయాన్ని పీడించ సాగింది.
తితక్యాంత కోణీ కళవిలే తయాంస | హోఊ నకా ఏసే ఉదాస | ధరా మాధవరావాంచీ కాస | పురేల ఆస మనీంచీ | ||౮౪||
84. ఇంతలో ‘విచారించకు! మాధవరావు సహాయం పొందితే, నీ కోరిక తీరుతుంది’ అని ఎవరో తెలియజేసారు.
ఆధీ న ఘేతా నందీచే దర్శన | శంకర హోఈల కాయ ప్రసన్న | తయాసీ యాచ మార్గాచే అవలంబన | గమలే సాధన తే బరవే | ||౮౫||
85. ముందుగా నంది దర్శనం చేసుకోకపోతే, శంకరుడు ప్రసన్నమౌతాడా! అతనికి ఈ మార్గమే మంచిదనిపించి, ఆ ఉపాయం నచ్చింది.
సకృద్దర్శనీ హీ అతిశయోక్తి | ఏసే వాటేల శ్రోతయా చిత్తీ | పరీ హా అనుభవ దర్శనవక్తీ5 | భక్తాంప్రతీ శిరడీంత | ||౮౬||
86. ఇది విని శ్రోతలకు అతిశయోక్తిగా అనిపించ వచ్చు. కాని, శిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకు, ఎన్నో మార్లు ఈ అనుభవమైంది.
జయా మనీ బాబాంచే సవే | సంథపణే సంభాషణ వ్హావే | తయాచియా సమవేత జావే | మాధవరావే ఆరంభీ | ||౮౭||
87. బాబాతో ఏకాంతంగా మాట్లాడాలని ఇష్టపడే వారు, మొదలు మాధవరావును వెంటబెట్టుకుని వెళ్ళేవారు.
ఆలే హే కోణ కోఠూన కిమర్థ | గోడ శబ్దే కళవావా కార్యార్థ | సూతోవాచ హోతాంచ సమర్థ | హోత మగ ఉద్యుక్త బోలాయా | ||౮౮||
88. అతను ముందుగా, ఎవరు ఎక్కడనుండి ఏ పని మీద వచ్చారన్నది అతి సున్నితంగా బాబాకు చెప్పేవాడు. దాని తరువాత, బాబా మాట్లాడటానికి మొదలుపెట్టేవారు.
ఏకోనియా తే హాజీనే సకళ | మాధవరావాంస ఘాతలీ గళ | మ్హణాలే “ఎకదాంహీ మాఝీ తళమళ | ఘాలవా దుర్మిళ మిళవూని ఘ్యా | ||౮౯||
89. ఇదంతా విని మాధవరావుతో ఆ హాజీ, ‘నా మనసులో ఉన్న ఈ బాధను ఒక్క సారి తొలగించు. ఇంత వరకు నాకు సాధ్యం కాని బాబా దర్శనాన్ని కలిగించు’ అని వేడుకున్నాడు.
పడతా మాధవరావాంస భీడ | కేలా మనాచా నిశ్చయ దృఢ | అసో వా నసో కార్య అవఘడ | పాహూ కీ దగడ టాకునీ | ||౯౦||
90. అంత దీనంగా అతను మాధవరావును వేడుకోగా, సాధ్యం కాని, కాకపోనీ, ఎంత కష్టమైనా సరె, ప్రయత్నించి చూడాలని అతను నిశ్చయించుకున్నాడు.
గేలే మశీదీస కేలా ధీర | గోష్ట కాఢిలీ అతిహళువార |
“బాబా తో మ్హాతారా కష్టీ ఫార | కరానా ఉపకార తయావర | ||౯౧||
91. ధైర్యాన్ని కూడబెట్టుకుని, మసీదుకు వెళ్ళాడు. జాగ్రతగా, మెల్లగా బాబాతో ‘బాబా! ఆ ముసలివాడు చాలా బాధ పడుతున్నాడు. అతన్ని కరుణించ రాదా?’
హాజీ తో కరూని మక్కా మదీనా | శిరడీస ఆలా ఆపులే దర్శనా | తయాచీ కైసే యేఈనా కరూణా | యేఊంచ ఘ్యానా మశీదీ | ||౯౨||
92. ‘ఆ హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి, తమ దర్శనానికి శిరిడీ వచ్చాడు. అతనిపై ఎందుకు దయ చూపటం లేదు? దయచేసి అతన్ని మసీదులోకి రానివ్వ రాదా?
జన యేతీ అసంఖ్యాత | జాఊన మశీదీంత దర్శన ఘేత | హాతోహాత చాలలే జాత | హాచ ఖిచపత పడలా కా | ||౯౩||
93. ‘లెక్కలేనన్ని జనులు వచ్చి, మసీదులో మీ దర్శనం చేసుకుని వెళుతున్నారు కదా? మరి ఇతని మీదే ఎందుకింత నిరాదరణ?
కరాకీ ఎకదా కృపాదృష్టీ | హోవో తయాసీ మశీదీంత భేటీ | జాఈల మగ తోహీ ఉఠాఉఠీ | పుసూని గోష్టీ మనీంచీ” | ||౯౪||
94. ‘ఒక్క సారి అతని మీద మీ దయ చూపండి. అతనిని మసీదులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి. మనసులోని మాట చెప్పుకుని వెంటనే వెళ్ళిపోతాడు’ అని అన్నాడు.
“శామ్యా తుఝ్యా ఓఠాచా జార | అజూన నాహీ వాళలా తిళభర | నసతా అల్లాచీ ఖుదరత తయావర | మీ కాయ కరణార తయాసీ | ||౯౫||
95. “శ్యామా! నువ్వింకా ముక్కు పచ్చలారని పసివాడవు. అల్లా అనుగ్రహం అతనిపై లేక పోతే, నేనేం చేయ్యను?
నసతా అల్లామియాచా ఋణీ | చఢలే కాయ యా మశీదీ కుణీ | అఘటిత యేథీల ఫకీరాచీ కరణీ | నాహీ మీ ధణీ తయాచా | ||౯౬||
96. “అల్లా మియాకు ఋణపడి ఉండకపోతే, ఎవరైనా మసీదు మెట్లు ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు లీలలు ఎవరికీ అర్థం కానివి. నేను అతని యజమానిని కాను (అతని మీద నాకే అధికారము లేదు).
అసో బారవీ6 పలీకడే థేట | ఆహేజీ ఎక పాఊలవాట | చాలూన యేసీల కాయ తూ నీట | విచారజా స్పష్ట తయాతే” | ||౯౭||
97. “అయినా సరే, అక్కడ బారవీ (అనే పేరుగల బావి) దగ్గరగా, వెనకాల ఇరుకు బాట ఉంది. ఆ దోవలో అతడు రాగలడా, అని వెళ్ళి స్పష్టంగా అడుగు.” అని అన్నారు.
హాజీ వదే “కితీహీ బికట | అసేనా తీ మీ చాలేన నీట | పరీ మజ ఘ్యావీ ప్రత్యక్ష భేట | చరణానికట బైసూ ఘ్యా | ||౯౮||
98. దానినే మాధవరావు అడగగా ఆ హాజీ ‘ఎంత కష్టమైనా సరే వస్తాను. వారిని స్వయంగా కలుసుకోవాలి. వారి పాదాల దగ్గర నేను కూర్చోవాలి అని అన్నాడు.
పరిసూని శామాకరవీ హే ఉత్తర | బాబా వదతీ ఆణీక విచార | “చారవేళాంతీ చాళీస హజార | రూపయే తూ దేణార కాయ మజ” | ||౯౯||
99. దీనినే మాధవరావు బాబాకు చెప్పగా “నాలుగు వాయిదాలలో, నలభై వేల రూపాయలను నాకు ఇస్తాడా అని అడుగు” అని అన్నారు.
మాధవరావ హా నిరోప సాంగతా | హాజీ మ్హణాలే “హే కాయ పుసతా | దేఈన చాళీస లాఖహీ మాగతా | హజారాంచీ కథా కాయ” | ||౧౦౦||
100. మాధవరావు చెప్పిన మాటలు విని ఆ హాజీ ‘దీన్ని అడగాలా? అడగాలే కాని, వేలు ఏమిటి, నలభై లక్షలన్నా ఇస్తాను’ అని అన్నాడు.
ఆహే ఆముచా మశీదీస | తుజ కాయ ఘోస7 పాహిజే | ||౧౦౧||
101. అది విని బాబా “ఈ రోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది. ఆ మాంసంలో నీకు ఏ భాగం కావాలి?
జా విచార త్యా మ్హాతార్యాప్రతీ | కాయ నిశ్చితీ వాంఛీతో” | ||౧౦౨||
102. “ఎముక మాంసం కావాలా? లేక వృషణాలంటే ఇష్టమా? ఆ ముసలివాణ్ణి నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు”.
మాధవరావే సమగ్ర కథిలే | హాజీప్రతీ బాబా జే వదలే | హాజీ నిక్షూన వదతే ఝాలే | “నలగే త్యాంతలే ఎకహీ మజ | ||౧౦౩||
103. బాబా చెప్పిన మాటలన్నీ మాధవరావు హాజీతో చెప్పాడు. అందుకు హాజీ ‘నాకవేవీ వద్దు.
ఘ్యావే మజ కాహీ అసేల చిత్తా | తరీ మజ ఆహే ఎకచి ఆస్థా | కోళంబ్యాంతీల9 తుకడా లాభతా | కృతకల్యాణతా పావేన” | ||౧౦౪||
104. ‘నాకేమైనా ఇవ్వాలని వారికి ఉంటే, నా కోరిక ఒకటే. కొళంబాలోని ఒక ముక్క దొరికితే చాలు. ధన్యుణ్ణి’.
హాజీచా హా నిరోప ఘేఊన | మాధవరావ ఆలే పరతోన | కరితాంచ బాబాంస తో నివేదన | బాబా జే తత్క్షణ ఖవళలే | ||౧౦౫||
105. హాజీ చెప్పిన మాటలను మాధవరావు బాబాకు మనవి చేశాడు. వెంటనే బాబా కోపంతో ఉగ్రులయ్యారు.
కోళంబా ఆణి పాణ్యాచ్యా ఘాగరీ | స్వయే ఉచలూని భిరకావిల్యా ద్వారీ | హాత చావోనియా కరకరీ | ఆలే శేజారీ హాజీచ్యా | ||౧౦౬||
106. కోపంతో మట్టి పాత్రను, నీళ్ళ కుండను స్వయంగా పైకెత్తి, తలుపుల వైపు విసిరి వేశారు. తమ చేతిని కరకరా కొరుకుతూ, హాజీ వద్దకు వచ్చి పక్కన నిలుచున్నారు.
ధరూని ఆపులీ కఫనీ దోంకరీ | హాజీ సన్ముఖ ఉచలూని వరీ | మ్హణతీ “తూ కాయ సమజలాస అంతరీ | కరిసీ ఫుశారీ మజపుఢే | ||౧౦౭||
107. హాజీ ఎదుట రెండు చేతులా తమ కఫినీని పట్టుకుని, పైకి లేవనెత్తి, “నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ముందా నీ బడాయి అంతా?
బుఢ్ఢేపణాచా తోరా దావిసీ | ఏసేచ కాయ తూ కురాణ పఢసీ | మక్కా కేల్యాచా తాఠా వాహసీ | పరీ న జాణాసీ తూ మాతే” | ||౧౦౮||
108. “ముసలివాడని బడాయి చూపిస్తున్నావు. ఖురాను పఠించటం ఇలాగేనా? మక్కా యాత్ర చేశానని గర్వ పడుతున్నావు గాని, నన్నింకా తెలుసుకోలేక ఉన్నావు!”
ఏసే తయాసీ నిర్భత్సిలే | అవాచ్య శబ్దప్రహార కేలే | హాజీ బహు గాంగరూన గేలే | బాబా పరతలే మాధారా | ||౧౦౯||
109. అని అతనిని అవమానించారు. చెప్పరాని మాటలను అన్నారు. హాజీ చాలా గాబరా పడ్డాడు. బాబా వెనుకకు తిరిగి వచ్చేశారు.
మశీదీచే ఆంగణీ శిరతా | మాళీణీ దేఖిల్యా ఆంబే వికితా | ఖరేదిల్యా త్యా పాట్యా సమస్తా | పాఠవిల్యా తత్వతా హాజీస | ||౧౧౦||
110. మసీదు లోనికి వస్తూ, తోటమాలి మామిడి పళ్ళను అమ్మటం చూశారు. వెంటనే మొత్తం బుట్టను కొని, హాజీకు పంపించారు.
తైసేచి తాత్కాళ మాగే పరతలే | పున్హా త్యా ఫాళక్యాపాశీ గేలే |
రూపయే పంచావన్న ఖిశాంతూని కాఢిలే | హాతావర మోజిలే తయాచే | ||౧౧౧||
111. వెంటనే, ఆ హాజీ దగ్గరకు మళ్ళీ వెళ్ళారు. తమ జేబులోనుండి ౫౫ రూపాయలను లెక్క పెట్టి, అతని చేతిలో ఒక్కొకటిగా ఇచ్చారు.
తెథూన పుఢే మగ ప్రేమ జడలే | హాజీస జేవావయా నిమంత్రిలే | దోఘేహీ జణు అవఘే విసరలే | హాజీ సమరసలే నిజరంగీ | ||౧౧౨||
112. అప్పటినుండి అతనిపై ప్రేమ కలిగి, అతనిని భోజనానికి పిలిచారు. ఇద్దరూ అంతా మరచి పోయారు. ఆత్మానందంలో హాజీ లీనమై పోయాడు.
పుఢే మగ తే గేలే ఆలే | యథేచ్ఛ బాబాంచే ప్రేమీ రంగలే | నంతరహీ బాబాంనీ వేళోవేళే | రూపయే దిధలే తయాస | ||౧౧౩||
113. కొంత కాలం తరువాత, హాజీ శిరిడీనుండి వెళ్ళిపోయాడు. కాని, మరల వచ్చాడు. అలా వస్తూ పోతూ బాబా ప్రేమలో మునిగి పోయాడు. అప్పుడప్పుడు బాబా అతనికి రూపాయలనిచ్చేవారు.
అసో ఎకదా సాఈసమర్థా | మేఘావరీహీ జయాచీ సత్తా | తయా ఇంద్రాసీ పాహిలే ప్రార్థితా | ఆశ్చర్య చిత్తా దాటలే | ||౧౧౪||
114. మేఘాలను కూడా శాసించగల సమర్థులు సాయి. ఒక సారి ఇంద్రుని ప్రార్థించడం చూసి, నాకు ఆశ్చర్యం కలిగింది.
అతి భయంకర హోతా సమయ | నభ సమగ్ర భరలే తమోమయ | పశు పక్షియా ఉద్భవలే భయ | ఝంజావాయూ సూటలా | ||౧౧౫||
115. అది చాలా భయంకరమైన సమయం. ఆకాశమంతా మేఘాలు క్రమ్ముకుని, చీకటియై పోయింది. ఝంఝా మారుతం వీస్తుంటే, పశువులు పక్షులు భయంతో విలవిలలాడాయి.
ఝాలా సూర్యాస్త సాయంకాళ | ఉఠలీ ఎకాఎకీ వాహుటళ | సుటలా వార్యాచా సోసాటా ప్రబళ | ఉడాలీ ఖళబళ దుర్ధర | ||౧౧౬||
116. సూర్యుడు అస్తమించాడు. సాయంత్రం అకస్మాత్తుగా సుడిగాలి వీచి, పెరిగి పెద్దదై, అన్ని చోట్లా భయంకరమైన అల్లకల్లోలం మొదలైంది.
త్యాంతచి మేఘాంచా గడగడాట | విద్యుల్లతాంచా కడకడాట | వార్యాచా భయంకర సోసాట | వర్షావ ఘనదాట జోరాచా | ||౧౧౭||
117. దీనికి తోడుగా మేఘాలు ఉరమ సాగాయి. మెరుపులు శబ్దం చేస్తున్నాయి. గాలియొక్క భయంకర శబ్దంతో పెద్ద వర్షం మొదలైంది.
మేఘ వర్షలా ముసళ ధారా | వాజూ లాగల్యా ఫటఫట గారా | గ్రామస్థాంస సుటలా భేదరా | గురాంఢోరా ఆకాంత | ||౧౧౮||
118. ధారలు ధారలుగా వర్షం, టపటపమని వడగళ్ళ చప్పుడు, వీటన్నిటికీ గ్రామస్థులు భయపడి పోయారు. దూడలు, పశువులు భయంతో అరవ సాగాయి.
మశీదీచ్యా వళచణీఖాలీ | భణంగభికారీ నివార్యా ఆలీ | గురేంఢోరే వాంసరే ఎకత్ర మిళాలీ | భీడ ఝాలీ మశీదీ | ||౧౧౯||
119. బికారులు, భిక్షగాళ్ళు ఎక్కడ దాచుకోవాలో తెలియక, మసీదు చూరు క్రిందకు వచ్చారు. పశువులు, దూడలు కూడా మసీదులో చేరుకున్నాయి. మసీదు క్రిక్కిరిసింది.
పాణీచ పాణీ చౌఫేర ఝాలే | గవత సారే వాహూన గేలే | పీక హీ ఖళ్యాంతీల సర్వ భిజలే | లోక గజబజలే మానసీ | ||౧౨౦||
120. నలువైపులా ఎక్కడ చూసినా అక్కడంతా నీరే. గడ్డి కొట్టుకుని పోయింది. కళ్ళాలలోని పంటంతా నీళ్ళపాలైంది. జనం ఏమి చేయాలో తెలియక ఆందోళనతో దిగ్‍భ్రమ చెందారు.
అవఘే గ్రామస్థ ఘాబరలే | సభామండపీ యేఊని భరలే |
కోణీ మశీదీచే వళచణీస రాహిలే | గార్హాణే ఘాతలే బాబాంనా | ||౧౨౧||
121. గ్రామస్థులంతా భయంతో గాబరా పడి, మసీదులోని సభా మంటపంలోకి చేరుకున్నారు. సభా మంటపం నిండి పోయింది. కొందరు మసీదు చూరు క్రింద వచ్చి, బాబాతో మొర పెట్టుకున్నారు.
మారూతి ఖండోబా మ్హాళసాఈ | ఠాయీ ఠాయీ శిరడీంత | ||౧౨౨||
122. జోగులాంబ, జాఖాలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సమ్మ మొదలైన దేవీదేవతలు శిరిడీలో ఎక్కడో ఒక చోటులో నెలకొని ఉన్నారు.
పరీ అవఘడ ప్రసంగ యేతా | కామీ పడేనా ఎకహీ గ్రామస్థా | తయాంచా తో చాలతా బోలతా ధాంవతా | సంకటీ పావతా ఎక సాఈ | ||౧౨౩||
123. కాని, ఇలాంటి ఘోరమైన కష్ట కాలంలో, ఏ ఒక్కరూ గ్రామస్థుల సహాయానికి రాలేదు. అందరితో మాట్లాడుతూ, నడుస్తూ, పరిగెత్తుతూ, వారి కష్టాలలో ఆదుకునేది, ఆ సాయి ఒక్కరే.
నలగే తయాస బోకడ కోంబడా | నలగే తయాస టకా దోకడా | ఎకా భావాచా భుకేలా రోకడా | కరీ ఝాడా సంకటాంచా | ||౧౨౪||
124. ఇలా ఆదుకోవటానికి, వారికి ఏ కోడినో లేక మేకనో బలి చేయక్కరలేదు. ఒకటో, రెండో రూపాయలూ అవసరం లేదు. కేవలం భక్తినే ఆశిస్తూ, అందరి కష్టాలనూ వారు తుడిచి వేస్తారు.
పాహూని ఏసే లోక భ్యాలే | మహారాజ ఫారచి హేలావలే | గాదీ సోడునీ పుఢే ఆలే | ఉభే రహిలే ధారేవర10 | ||౧౨౫||
125. ప్రకృతి క్రూరత్వానికి భయంతో వణికిపోతున్న ప్రజలను చూసి, సాయి మహారాజు విపరీతంగా కరిగిపోయారు. కూర్చున్న చోటునుండి లేచి, ముందుకు వచ్చి, మసీదు అంచున నిలుచున్నారు.
మేఘనినాదే భరల్యా నభా | కడాడతీ విజా చమకతీ ప్రభా | త్యాంతచి సాఈమహారాజ ఉభా | ఆకంఠ బోభాయ ఉచ్చస్వరే | ||౧౨౬||
126. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లి పోయింది. ఉరుములు ఉరిమి, మెరుపులు మెరుస్తున్నాయి. వీటి మధ్యలో, అక్కడ సాయి మహారాజు నిలుచుని, గట్టిగా ఎత్తైన స్వరంలో, గర్జించారు.
నిజ జీవాహూని నిజభక్త | దేవాస ఆవడతీ సాధూసంత | దేవ తయాంచే బోలాంత వర్తత | అవతార ఘేత త్యా లాగీ | ||౧౨౭||
127. దేవుడికి తనపై కంటే, తన భక్తుల పైన, సాధు సంతుల పైన ప్రేమ. అందుకే దేవుడు వారు చెప్పినట్లు చేస్తాడు. దేవుడు అవతరించేది కూడా భక్తుల కోసమే.
పరిసోని భక్తాంచా ధాంవా | దేవాస లాగే కైవార ఘ్యావా | వరచేవర శబ్ద ఝేలావా | భక్త భావా స్మరోని | ||౧౨౮||
128. కష్టాల్లో ఉన్న భక్తుల మొర వినిన తరువాత, వారిని రక్షించాల్సిందే. భక్తుల భావాన్ని, భక్తిని గుర్తుంచుకొని, తను ఇచ్చిన మాటను తప్పక నిలబెట్టుకుంటాడు.
చాలలీ ఆరోళీవర ఆరోళీ | నాద దుమదుమలా నిరాళీ | వాటే మశీద డళమళీ | కాంటాళీ బసలీ సకళాంచీ | ||౧౨౯||
129. బాబాయొక్క గర్జనలపై గర్జనల శబ్దం ఆకాశమంతా ప్రతిధ్వనించగా, మసీదు ఎక్కడ కదలి పోతుందో అన్నట్లుగా అనిపించింది. వారి నాదానికి అందరి చెవులూ మూత పడ్డాయి.
త్యా గిరాగజర తారస్వరే | దుమదుమలీ మశీద మందిరే | తంవ మేఘ నిజగర్జనా ఆవరే | వర్షావథారే ధారాంచా | ||౧౩౦||
130. వారి గర్జనల ఆ పెద్ద శబ్దం పర్వతాలలో, మసీదులో, మందిరాలలో మారు మ్రోగింది. వారి గర్జనకు భయపడ్డట్లు, మేఘాల గర్జనలు, ధారలుగా కురుస్తున్న వర్షాలు టక్కున ఆగిపోయాయి.
ఉదండ బాబాంచీ ఆరోళీ | అవఘా సభామండప డండళీ11 |
గజబజలీ భక్త మండళీ | తటస్థ ఠేలీ ఠాయీంచ | ||౧౩౧||
131. బాబాయొక్క కేకలతో, సభామంటమంతా అదిరిపోయింది. భక్త మండలి భయంతో గాబరా పడ్డారు. ఏమి చేయాలో తెలియక, తామున్న చోట్లలోనే ఊరికే ఉండిపోయారు.
అతర్క్య బాబాంచే విందాన | జాహలే వర్షావా ఆకర్షణ | వాయూహీ ఆవరలా తత్క్షణ | ధుఈ విచ్ఛిన్న జాహలీ | ||౧౩౨||
132. నిజంగా, బాబా ఈ లీల వర్ణించ సాధ్యం కాదు. వర్షం ఆగిపోయింది. వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి.
హళూహళూ పాఊస ఉగవలా12 | సోసాటాహీ మందావలా | నక్షత్రగణ దిసూ లాగలా | తమ నిరసలా తే కాళీ | ||౧౩౩||
133. మెల్ల మెల్లగా తుఫాను తగ్గింది. వాన తగ్గింది. నక్షత్రాలు కనిపించ సాగాయి. చీకటి మొత్తం తొలిగిపోయి, వెలుగు వచ్చింది.
పాఊస పుఢే పూర్ణ ఉగవలా | సోసాట్యాచా పవనహీ విరమలా | చంద్ర గగనీ దిసూ లాగలా | ఆనంద ఝాలా సకళాంతే | ||౧౩౪||
134. తరువాత, వర్షం మొత్తంగా ఆగిపోయింది. గాలి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ సంతోషమైంది.
వాటే ఇంద్రాస దయా ఆలీ | పాహిజే సంతాంచీ వాణీ రాఖిలీ | ఢగే బారా వాంటా ఫాంకలీ | శాంత ఝాలీ వావటళ | ||౧౩౫||
135. ఇంద్రునికి దయ కలిగిందేమో అని అనిపించింది. సత్పురుషుల మాటను నిలపెట్టాలి కదా. వాతావరణం శాంతించగానే మేఘాలు పన్నెండు దిక్కులలో వెళ్ళిపోయాయి.
పాఊస సర్వస్వీ నరమలా | వారాహీ మంద వాహూ లాగలా | గడగడాట జాగీంచ జిరాలా | ధీర ఆలా పశుపక్ష్యా | ||౧౩౬||
136. వాన పూర్తిగా ఆగిపోయింది. గాలి మెల్ల మెల్లగా వీచింది. ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులకు, పక్షులకు ధైర్యం వచ్చింది.
సోడూనియా ఘరాంచ్యా వళచణీ | గురే వాసరే బాహేర పడునీ | వావరూ లాగలీ నిర్భయ మనీ | పక్షీహీ గగనీ ఉడాలే | ||౧౩౭||
137. ఇళ్ళ చూరుల క్రింద చేరుకున్న దూడలు, పశువులు బయటకు వచ్చి, ఏ భయం లేకుండా తిరగ సాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి.
పాహూన పూర్వీల భయంకర ప్రకార | మానూనియా బాబాంచే ఉపకార | జన సర్వ గేలే ఘరోఘర | గురేంహీ సుస్థిర ఫరకలీ13 | ||౧౩౮||
138. ఇంతకు మునుపు ఉన్న ఘోర పరిస్థితిని చూసిన తరువాత, అందులోనుంచి తమను రక్షించిన బాబాకు జనులంతా తమ కృతజ్ఞతలు తెలిపి, వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా మసీదునుండి వెళ్ళిపోయాయి.
ఏసా హా సాఈ దయేచా పుతళా | తయాస భక్తాంచా అతి జివ్హాళా | లేంకురా జైసా ఆఈచా కళవళా | కితీ మీ ప్రేమళా గాఊ త్యా | ||౧౩౯||
139. ఇంతటి కరుణామూర్తి మన సాయి. బిడ్డల గురించి కన్నతల్లివలె, వారు భక్తుల గురించి కలవర పడతారు. భక్తుల మీద వారికి ఉన్న విపరీతమైన ప్రేమను నేనెంతని వర్ణించగలను?
అగ్నీవరీహీ ఏసీచ సత్తా | యే అర్థీచీ సంక్షిప్త కథా | శ్రోతా పరిసజే సాదర చిత్తా | కళేల అపూర్వతా శక్తీచీ | ||౧౪౦||
140. అగ్ని మీద కూడా బాబాకు ఇలాంటి శక్తి ఉంది. దీని గురించి ఒక చిన్న కథను చెబుతాను. శ్రోతలు ఈ కథను శ్రద్ధగా వింటే, బాబాయొక్క అద్భుతమైన శక్తి గురించి తెలుస్తుంది.
ఎకదా మధ్యాన్హీచీ వేళ | ధునీనే పేట ఘేతలా సబళ |
కోణ రాహీల తెథ జవళ | జ్వాళాకల్లోళ ఉఠలా | ||౧౪౧||
141. ఒక సారి, మధ్యాహ్నం వేళ, ధునిలోని మంట బాగా రగులుకుంది. మంటలు పైపైకి లేస్తూవుంటే, దగ్గర ఎవరు ఉండగలరు? ఎవరికి అంత ధైర్యం ఉంటుంది?
వాటే హోతే మశీదీచీ హోళీ | రాఖ రాంగోళీ క్షణాంత | ||౧౪౨||
142. విపరీతంగా పైకి వస్తున్న ఆ మంట శిఖలు, మసీదు పైకప్పును తాకుతున్నాయి. మసీదు మండి బూడిదైపోతుందేమో అని ఆ క్షణంలో అనిపించింది.
తరీ బాబా మనీ స్వస్థ | సకళ లోకచింతాగ్రస్త | తోండాత బోటే ఘాలీత సమస్త | కాయ హీ శికస్త బాబాంచీ | ||౧౪౩||
143. ఏమౌతుందో అని జనులంతా గాబరాగా ఉంటే, బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. అక్కడున్న వారు ముక్కు మీద వేలు వేసుకుని, ‘ఏమిటి బాబా ఇంత ప్రశాంతంగా ఉన్నారు’ అని అనుకున్నారు.
ఎక మ్హణే ఆణా కీ పాణీ | దుజా మ్హణే ఘాలావే కోణీ | ఘాలితా మాథా సటకా హాణీ | కోణ త్యా ఠికాణీ జాఈల | ||౧౪౪||
144. వారిలో ఒకరు నీళ్ళు పట్టుకొని రండి అని అంటే, ఇంకొకరు పోసేవారెవరు అని అన్నారు. అలా పోస్తే, సటకాతో బాబా కొడతారేమో? అమ్మో! ఎవరు ముందుకు రాగలరు?
మనీ జరీ సర్వ అధీర | విచారావయా నాహీ ధీర | బాబాచ తంవ హోఊని అస్థిర | సటక్యావర కర టాకియలా | ||౧౪౫||
145. అందరికీ భయమే. బాబాను అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు బాబా చిరాకుగా సటకా పైన చెయ్యి వేశారు.
పాహోని జ్వాళాంచా భడకా | హాతీ ఘేఊనియా సటకా | హాణితీ ఫళాక్యావరీ ఫటకా | మ్హణతీ ‘హటకా మాఘారా’ | ||౧౪౬||
146. రగులుతున్న మంటలను చూసి, సటకాను చేతిలోకి తీసుకొని దెబ్బపై దెబ్బ కొట్టుతూ “వెనక్కు తగ్గు! తగ్గు పో!” అని అన్నారు.
ధునీ పాసావ ఎక హాత | స్తంభావరీ కరితీ ఆఘాత | జ్వాళాంకడే పహాత పహాత | ‘సబూర సబూర15’ వదత తే | ||౧౪౭||
147. ధునికి ఒక మూర దూరంలో ఉన్న స్తంభంపైన సటకాతో కొడుతూ, మంటలను చూస్తూ “శాంతించు, శాంతించు” అని అన్నారు.
ఫటక్యా ఫటక్యాస ఖాలీ ఖాలీ | జ్వాలా నరమ పడూ లాగలీ | భీతి సమూళ ఉడూని గేలీ | శాంత ఝాలీ తై ధునీ | ||౧౪౮||
148. ఒక్కొక్క దెబ్బకు మంటలు తగ్గి, ధుని శాంతించింది. భయపడ్డ జనులు కూడా భయాన్ని వదిలి శాంతించారు.
తో హా సాఈ సంతవర | ఈశ్వరాచా దుజా అవతార | డోఈ తయాచ్యా పాయాంవర | ఠేవితా కృపాకర ఠేవీల | ||౧౪౯||
149. సాధు సంతులలో చాలా గొప్పవారైన మన సాయి, దేవుడి మరో అవతారం. వారి పాదాలపై తలను ఉంచితే, వారు తమ కృపా హస్తాన్ని మనపై ఉంచుతారు.
హోఊనీ శ్రద్ధా భక్తియుక్త | కరీల జో యా అధ్యాయాచే నిత | పారాయణ హోఊని స్వస్థచిత్త | ఆపదా నిర్ముక్త హోఈల | ||౧౫౦||
150. నమ్మకంతో, భక్తిశ్రద్ధలతో, ప్రతి రోజు ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తే, ఆపదలన్నీ తొలగి పోతాయి.
నేమనిష్ఠ వ్హా సాఈపరాయణ | బ్రహ్మ సనాతన పావాల | ||౧౫౧||
151. ఇంత కంటే ఇంకేమి చెప్పను? మీ మనసును శుద్ధం చేసుకోండి. నిర్మలమైన మనసుతో, నియమ నిష్ఠలతో, భక్తితో సాయిని పూజిస్తే, శాశ్వతమైన పరబ్రహ్మను పొందగలరు.
పురేల అపూర్వ ఇచ్ఛిత కామ | వ్హాల అంతీ పూర్ణ నిష్కామ | పావాల దుర్లభ సాయుజ్య ధామ | అఖండ రామ లాధాల | ||౧౫౨||
152. కష్టమైన మీ కోరికలన్నీ కూడా ఫలిస్తాయి. అన్ని కోరికలూ తీరి, చివరకు పూర్తిగా ఏ కోరికలూ లేనివారౌతారు. చాలా కష్టమైన ‘సాయుజ్య ముక్తి’ని చేరుకుంటారు. ఎప్పటికీ తరగని శాంతి సుఖాలు తృప్తి కలుగుతాయి.
అసో జయా భక్తాంచ్యా చిత్తీ | భోగావీ పరమార్థ సుఖ సంవిత్తీ | తేణే యే అధ్యాయానువృత్తీ | ఆదరవృత్తి ఠేవావీ | ||౧౫౩||
153. పరమార్థ జ్ఞానాన్ని, పరమార్థ సుఖాన్ని, పొందాలని మనసులో కోరుకునే భక్తులు ఈ అధ్యాయాన్ని మరల మరల శ్రద్ధగా చదవండి.
శుద్ధ హోఈల చిత్తవృత్తి | కథా సేవనీ పరమార్థ ప్రవృత్తి | ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి | పహావీ ప్రచీతి బాబాంచీ | ||౧౫౪||
154. అలా చేయడం వలన, మనసు పరిశుద్ధమౌతుంది. పరమార్థ మార్గంలో ముందుకు పోవాలనే కోరిక మనసుకు కలుగుతుంది. అరిష్టాలు తొలగిపోతాయి. ఇష్ట దేవత దర్శనం కలుగుతుంది. బాబా లీలలను స్వయంగా అనుభవించి, తెలుసుకోండి.
హేమాడపంత సాఈస శరణ | పుఢీల అధ్యాయ అతిపావన | గురూశిష్యాంచే తే మహిమాన | ఘోలప దర్శన గురూ పుత్రా | ||౧౫౫||
155. హేమాడు పంతు సాయికి శరణుజొచ్చి, అతి పావనమైన తరువాతి అధ్యాయంలో, గురుశిష్యుల మహిమ, గురు పుత్రునికి గురు ఘోలప దర్శనం గురించి చెప్పబడుతుంది.
శిష్యాస కైసాహీ ప్రసంగ యేవో | తేణే న త్యజావా నిజ గురూదేవో | సాఈ తయాచా ప్రత్యక్ష అనుభవో | దావీ దృఢ భావో వాఢవీ | ||౧౫౬||
156. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంతటి పరిస్థితిలోనైనా, శిష్యుడు తన గురువును వదిలి పెట్టరాదని, సాయి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలుగ చేసి, భక్తి భావాన్ని దృఢ పరచారు.
జే జే భక్త ఆలే పాయీ | ప్రత్యేకా దర్శనాచీ నవాఈ | కోణాస కాంహీ కోణాస కాంహీ | దేఊని ఠాయీంచ దృఢ కేలే | ||౧౫౭||
157. బాబా పాదాలకు శరణుజొచ్చిన ప్రతి ఒక్క భక్తునికీ, అద్భుతమైన అనుభవం కలిగించి, ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా దర్శనమిచ్చి, బాబా ఆ భక్తులకు తమ గురువు మీద ఉన్న నమ్మకాన్ని, భక్తిని బాబా దృఢ పరచారు.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | శ్రీసాఈమహిమావర్ణనం నామ |
| ఎకాదశోధ్యాయః సంపూర్ణః |
||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
1. “ప్రతిమా మాఝ్యా అచేతన వ్యక్తీ |
సంత సచేతన మాఝ్యా మూర్తీ ||” (ఎకనాథీ భాగవత)
2. చవరీ వారణే. 3. పంఖా.
4. శిరడీంత దోన చావడ్యా ఆహేత - ఎక ఉత్తరాభిముఖ వ దుసరీ దక్షిణాభిముఖ. దోన్హీ సమోరసమోర ఆహేత.
5. దర్శనసమయీ. 6. కాహీ అంతరావరీల ఎక విహీర. 7. మాంస.
8. ఎకా భాగాచ్యా మాంసాసకట అస్థీ.
9. భాకరతుకడా ఠేవణ్యాచే మాతీచే భాండే.
10. మశీదీచ్యా జోత్యాచ్యా కడేవర.
11. డళమళలా.
12. కమీ ఝాలా. 13. ఫాకలీ. 14. అగ్నీ. 15. శాంత హో; శాంత హో!
No comments:
Post a Comment