Saturday, January 26, 2013

||భీమాజీక్షయనివారణం నామ త్రయోదశోధ్యాయః||

శ్రీ సాఈసచ్చరిత 
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౩ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

ఆకారే సూత్రమయ అతి లహాన | అర్థగాంభీర్యే అతి గహన | 
వ్యాపకత్వే బహు విస్తీర్ణ | సంకీర్ణ తరీ తితుకేచ | ||౧|| 
1. బాబా పలుకులు చాలా చిన్నవిగా, సూత్రాల లాగ, సంగ్రహంగా ఉంటాయి. కాని, వాటి అర్థం చాలా లోతుగానూ గంభీరంగానూ, పూర్తిగానూ ఉంటాయి.
ఏసే తే బాబాంచే బోల | అర్థే తత్వే అతి సఖోల | 
కల్పాంతీహీ నవ్హతీ ఫోల | సమతోల ఆణి అనమోల | ||౨|| 
2. వారి మాటలలోని అర్థం, లోతుగా, సులభంగా అర్థం కానిదిగా ఉండేది. వారి మాటలు ఎప్పుడూ అర్థం లేకుండా ఉండవు. అవి చాలా వెలలేనివిగా, సమంగాను ఉండేవి. 
పూర్వాపరానుసంధాన రహావే | యథా ప్రాప్తానువర్తీ వ్హావే | 
నిత్య తృప్త సదా అసావే | నసావే సంచిత కదాపి | ||౩|| 
3. “ఇంతకు మునుపు ఏమి జరిగిందో, ఇక ముందు ఏది జరుగబోతుందో, దానిని బట్టి మీ లక్ష్యాన్ని అనుసరించండి. దొరికిన దానితో ఎప్పుడూ తృప్తిగా ఉండండి. లేనిదానికై చింతించకండి. 
“అరే జరీ మీ ఝాలో ఫకీర | ఘర నా దార బేఫికీర | 
బైసలో ఎకా ఠాయీ స్థిర | సారీ కిరకిర త్యాగూని | ||౪|| 
4. “నన్ను చూడండి! ఇల్లు వాకిలి, పెళ్ళాం పిల్లలు లేకుండా, అన్ని చింతలనూ వదిలేసి, ఒకే చోట శాంతంగా కూర్చున్నాను. 
తరీ తీ మాయా అనివార | మలాహీ గాంజీ వరచేవర | 
మీ విసరే పరి తిజలా న విసర | మజ తీ నిరంతర కవటాళీ | ||౫|| 
5. “అయినా, ఈ మాయనుంచి తప్పించుకో లేకుండా ఉన్నాను. తరచూ, నన్ను కూడా బాధ పెడుతుంది. నేను మరచి పోయినా, అది నన్ను మరచి పోకుండా, ఎప్పుడూ పెనవేసుకుని ఉంటుంది. 
ఆది మాయాచ తే హరీచీ | త్రేధా ఉడవితే బ్రమ్హాదికాంచీ | 
తేథ మజ దుబళ్యా ఫకీరాచీ | వార్తా కైచీ తిజపుఢే | ||౬|| 
6. “అది శ్రీహరియొక్క ఆది మాయ. బ్రహ్మాదులను కూడా దిగ్‍భ్రమ చేస్తుంది. అసలే బలంలేని ఫకీరుణ్ణి. దాని ముందు నేను ఎంతటి వాణ్ణి? 
హరీచ హోఈల జేవ్హా ప్రసన్న | తెవ్హాంచ హోఈల తే విచ్ఛిన్న | 
వినా అవిచ్ఛిన్న హరిభజన | మాయానిరసన నోహేపా” | ||౭|| 
7. “శ్రీహరి ఎప్పుడు ప్రసన్నమైతే అప్పుడే, అది పటాపంచలౌతుంది. ఎల్లప్పుడూ హరి భజన లేకుండా, మాయనుంచి ముక్తి దొరకదు”. 
ఏసీ హీ మాయేచీ మహతీ | భక్తాంలాగీ బాబా కథితీ | 
సేవేంచి వ్హావయా తన్నివృత్తి | భజనస్థితి వానితీ | ||౮|| 
8. మాయయొక్క మహిమ ఇలా ఉంటుంది అని బాబా భక్తులకు వివరంగా చెప్పారు. దానినుండి తప్పించుకోవాలంటే, భజన పద్ధతి ఒక్కటే అని తెలియచేశారు. 
సంత మాఝీ సచేతన మూర్తీ | కృష్ణ స్వయే మ్హణే భాగవతీ | 
కోణా న ఠావీ హీ స్పష్టోక్తి | ఉద్ధవాప్రతీ హరీచీ | ||౯|| 
9. “సాధు సంతులు జీవంతో ఉన్న నా ప్రతిరూపాలు” అని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఉద్ధవునితో, భాగవతంలో స్పష్టంగా చెప్పారు. ఇది తెలియని వారెవరు? 
మ్హణోని భక్తకల్యాణార్థ | దయాఘన సాఈసమర్థ | 
వదతే ఝాలే జే సత్య సార్థ | పరిసా అతివినీత హోఊని | ||౧౦|| 
10. దయామయులైన సాయి సమర్థులు, భక్తుల శ్రేయస్సు కోసం తెలిపిన ఈ నిజాలను అతి వినయంగా వినండి. 

“పాప జయాంచే విలయా గేలే | ఏసే జే పుణ్యాత్మే వహిలే | 
తేచ మాఝే భజనీ లాగలే | ఖూణ లాధలే తే మాఝీ | ||౧౧|| 
11. “పాపాలన్నీ తొలగిపోయిన తరువాత, పుణ్యాత్ములైన వారే నా భజన చేసి, నన్ను తెలుసుకుంటారు. 
సాఈ సాఈ నిత్య మ్హణాల | సాత సముద్ర కరీన న్యాహాల | 
యా బోలా విశ్వాస ఠేవాల | పావాల కల్యాణ నిశ్చయే | ||౧౨|| 
12. “‘సాయి, సాయి’ అని ఎల్లప్పుడూ స్మరించే వారిని ఏడు సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. నా ఈ మాటలను నమ్మితే, తప్పక మేలు జరుగుతుంది. 
నలగే మజ పూజా సంభార | షోడశ వా అష్టోపచార | 
జేథే భావ అపరంపార | మజలా థార తే ఠాయీ” | ||౧౩|| 
13. “పూజా సామగ్రి కాని, ఎనిమిది రకాల ఉపచారంగాని, ఆరు రకాల ఉపచారంగాని, నాకు అవసరం లేదు. అంతు లేని భక్తి ఎక్కడుంటే, అక్కడే నేనుంటాను”. 
ఏసే బాబా వేళోవేళా | బోలూన గేలే భక్తజివ్హాళా | 
ఆతా ఆఠవూని త్యా ప్రేమళ బోలా | కరూ విరంగుళా మనాసీ | ||౧౪|| 
14. భక్తుల మీద ప్రేమతో వారు ఇలా చాలా సార్లు చెప్పారు. వారి ప్రేమతో నిండిన ఆ మాటలను, ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే, మనసుకు కొంత ఊరట కలుగుతుంది. 
ఏసా హా దయాళూ సాఈసఖా | శరణాగతాంచా పాఠిరాఖా | 
భక్తకైవార ఘేఊని నికా | నవల విలోకా కేలే తే | ||౧౫|| 
15. ఇలాంటి దయామయులు, శరణాగతులను రక్షించే సాయి స్నేహితులు, భక్తుల సేవలను స్వీకరించి, వారిపై చూపించిన ప్రత్యేకతను చూడండి. 
దవడూని చిత్తాచీ అనేకాగ్రతా | కరోని తయాచీ ఎకాగ్రతా | 
పరిసావీ హీ నూతన కథా సాగ్రతా | కృతకార్యతా హోఈల | ||౧౬|| 
16. మనసు అటూ ఇటూ పోకుండా, ఒకే చోట స్థిరంగా నిలిపి, ఈ క్రొత్త కథను మొత్తంగా వింటే, మీరు ధన్యులౌతారు. 
సాఈముఖీంచీ అమృతవృష్టి | తీచ జేథే పుష్టి తుష్టి | 
కోణ కంటాళే శిరడీచే కష్టీ | నిజ హిత దృష్టి ఠేవిల్యా | ||౧౭|| 
17. సాయి నోటినుండి వెలువడిన అమృత వర్షమే మనకు పుష్టి, తుష్టి. అలాంటిది, తమ మేలును కోరుకునే వారు, శిరిడీకి రావాలంటే, వచ్చే కష్టాలను అసలు లెక్క చేయరు. 
గతాధ్యాయీ అనుసంధాన | దిధలే ఎకా అగ్నిహోత్ర్యా లాగూన | 
బ్రహ్మీభూత నిజగురూ దర్శన | ఆనందసంపన్న త్యా కేలే | ||౧౮|| 
18. ఇంతకు మునుపటి అధ్యాయంలో, ఒక అగ్నిహోత్రునికి, ఎప్పుడో సమాధి చెందిన అతని గురువు దర్శనాన్ని కలిగించి, బాబా అతనికి ఆనందాన్ని కలిగించారు. 
ఆతా హా అధ్యాయ త్యాహూన గోడ | భక్త ఎక క్షయీ రోడ | 
దిధలీ తయా ఆరోగ్యాచీ జోడ | మోడూని ఖోడ స్వప్నాంత | ||౧౯|| 
19. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురమైనది. క్షయ రోగంతో, బక్క చిక్కి ఎండిపోయిన, ఒక భక్తుణ్ణి, కలలోనే శిక్షించి, అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. 
తరీ ఎకా భావికజన | హోఊనియా దత్తావధాన | 
సాఈనాథ చరిత్ర గహన | కల్మషదహనకారక జే | ||౨౦||
20. అన్ని పాపాలనూ కాల్చివేసే సాయినాథుని అద్భుత చరిత్రను, భక్తులూ, సావధానంగా వినండి. 

పుణ్యపావన హె చరిత్ర | జల జైసే గంగేచే పవిత్ర | 
ధన్య శ్రవణకర్త్యాంచే శ్రోత్ర | ఇహపరత్రసాధక తే | ||౨౧|| 
21. ఈ లోకానికి, పరలోకానికి, సాధనమై, పుణ్యం పావనం అయిన ఈ సాయి చరిత్ర గంగా జలంవలె పవిత్రమైనది. దీనిని వినేవారి చెవులు ధన్యం.
పాహూ అమృతాచీ ఉపమా దేఊన | పరి అమృత కాయ గోడ యాహూన | 
అమృత కరీల ప్రాణరక్షణ | జన్మనివారణ చరిత్ర హే | ||౨౨|| 
22. దీనిని అమృతంతో పోల్చుదామంటే, ఆ అమృతం దీనికంటే మధురంగా ఉంటుందా? అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది, కాని ఈ సాయి చరిత్ర చావు పుట్టుకలనే తొలగిస్తుంది. 
జీవ మ్హణతీ సత్తాధీశ | కరీల జె జే యెఈల ఇచ్ఛేస | 
ఏసే జయాచే వాటే మనాస | కథానకాస యా పరిసావే | ||౨౩|| 
23. మేమే చాలా శక్తివంతులం, తలచినదేదైనా చేయగలం, అని జీవులు అనుకుంటారు. అలా అనుకునేవారు ఈ కథను వినాలి. 
జీవ జరీ ఖరా స్వతంత్ర | సుఖాలాగీ కష్టతా అహోరాత్ర | 
పదరీ పడతే దుఃఖ మాత్ర | హే తో చరిత్ర సత్తేచే | ||౨౪|| 
24. నిజంగా వారనుకున్నట్లు చేయగలిగితే, మరి, రాత్రి పగలూ సుఖానికై కష్ట పడుతున్నా, దుఃఖం మాత్రమే మిగులుతుంది. ఎందుకు? ఎందుకంటే, వారి శక్తి అంతవరకే, మిగతాది వారి విధి వ్రాత. 
దుఃఖే టాళావయాలాగీ | అసతా సావధాన జాగోజాగీ | 
తీ త్యా ధుండీత లాగవేగీ | త్యాచీచ మాగీ ఘేతాత | ||౨౫|| 
25. ప్రతి క్షణమూ, అడుగడుగునా, ఎంతో జాగ్రత్తగా ఉంటూ, దుఃఖాన్ని తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నా, దుఃఖం అతి శ్రద్ధగా, మనలను వెదికి వెంటాడుతుంది. 
వారూ జాతా గళా పడతీ | ఝాడూని టాకితా అధిక లిపడతీ | 
వాఉగీ జీవాచీ ధడపడతీ | అహోరాతీ తో శీణ | ||౨౬|| 
26. తప్పించుకోబోతే, మెడకు చుట్టుకుంటుంది. తీసి పారేయాలనుకుంటే, ఇంకా గట్టిగా పెనవేసుకుంటుంది. అందుకే, జీవులు రాత్రి పగలూ పోరాడటం దండుగ. 
జీవ జరీ ఖరా స్వవశ | తరీ తో అసతా పూర్ణ సుఖవశ | 
దుఃఖాచా ఎక లవలేశ | రేసభరహీ నాతళతా | ||౨౭|| 
27. అసలు, జీవులు నిజంగా తమ ఇష్ట ప్రకారమే ఉండగలిగితే, సుఖాలన్నీ వారి అధీనంలో ఉంటూ, దుఃఖమనేది కొంచెం కూడా వారిని అంటకుండా ఉండాలి కదా! 
పాపా న ఆచరితా కధీ | పుణ్యాచీచ కరితా సమృద్ధి | 
సుఖాచీచ సంపాదితా వృద్ధి | స్వతంత్ర బుద్ధి మ్హణవోని | ||౨౮|| 
28. స్వంత బుద్ధితో పాపాలను ఎప్పుడూ చేయకుండా, పుణ్యాలనే విపరీతంగా సంపాదించుకుని, అంతు లేని సుఖాలనే పొందాలి కదా! 
పరి జీవ నాహీ స్వతంత్ర | పాఠీ లాగలే కర్మతంత్ర | 
తయాచా ఖేళచి విచిత్ర | కళసూత్ర హాతీ కర్మాచే | ||౨౯|| 
29. కాని, జీవుడు అలా చెయ్యలేడు. కర్మమనేది అతని వెంటనే ఉంటుంది. దాని లీలలు విచిత్రం. ఈ కర్మ, తన చేతిలో ఉన్న త్రాడుతో ఎలా త్రిప్పితే, అలా బొంగరంలా, ప్రతియొక్క జీవి ఆడాలి. 
పుణ్యాకడే లక్ష జాయ | పాపాకడే ఓఢితీ పాయ | 
సత్కర్మాచా శోధితా ఠాయ | కుకర్మీ కాయ ఆతుడే | ||౩౦||
30. పుణ్య కర్మలను చేయాలని అనుకున్నా, ఆ జీవి పాదాలు, వెనుకటి కర్మ ప్రభావం వలన, పాపం వైపుకు లాక్కెళ్ళుతాయి. ఏదైనా మంచి పని చేయాలని అని వెతుకుతూ ఉంటే, చెడు పనులే ఎదురౌతాయి. 

పుణే జిల్హ్యాంతీల జున్నరామాజీ | నారాయణ గాంవాచా పాటీల భీమాజీ | 
తయాచీ కథా ఆతా పరిసాజీ | రసరాజీచ అమృతాచీ | ||౩౧|| 
31. పుణే జిల్లాలోని జున్నారు తాలూకాలో, నారాయణగాం అనే ఊరికి భీమాజి అనే అతను పటేలు. అమృత రసం వంటి అతని కథను, ఇప్పుడు వినండి. 
భీమాజీ ఘరచా సుఖసంపన్న | ఆల్యాగేల్యా ఘాలీ అన్న | 
కధీ న జ్యాచే వదన ఖిన్న | ప్రసన్నవదన సర్వదా | ||౩౨|| 
32. భీమాజి ఇల్లు అన్ని రకాల సుఖ సంపదలతో నిండి ఉంది. వచ్చే పోయే వారికి అతను భోజనం పెట్టేవాడు. ఎన్నడూ ఏ బాధా లేకుండా, ఎప్పుడూ ఆనందమైన మనసుతో ఉండేవాడు. 
అదృష్టాంచే విలక్షణ సంజోగ | న కళతా హోతీ లాభ వియోగ | 
చాలూన యేతీ కర్మభోగ | నసతే రోగ ఉద్భవతీ | ||౩౩|| 
33. కాని, విధియొక్క విచిత్రమైన లీలల వలన, మేలుగాని, కీడుగాని, మనకు తెలియకుండానే జరుగుతాయి. మునుపు చేసిన కర్మల ప్రభావంతో, మనకు రాకూడని రోగాలు ఎన్నో పుట్టుకొస్తాయి. 
ఇసవీ సన ఎకోణీసశే నవ | భీమాజీస పీడీ దుర్దైవ | 
హోయ కఫక్షయ రోగోద్భవ | ప్రాదుర్భావ జ్వరాచా | ||౩౪|| 
34. క్రి. శ. ౧౯౦౯వ సంవత్సరంలో దురదృష్టం భీమాజీని పీడించటం మొదలైంది. కఫ, క్షయ రోగాలు రావటంతో, జ్వరం కూడా పుట్టుకొచ్చింది. 
యేఊ లాగలా అసహ్య ఖోకలా | జ్వరహీ ఫార వాఢూ లాగలా | 
దివసేదివస బళవత గేలా | నిరాశ ఝాలా భీమాజీ | ||౩౫|| 
35. భరించ లేనంత దగ్గుతో, జ్వరం కూడా పెరగసాగింది. రోజు రోజుకూ బాధ ఎక్కువ కాగా, భీమాజీ చాలా నిరాశ చెందాడు. 
తోండాస ఫేంస సర్వదా యేణే | మచూళ ఆణి రక్తాచే గుళణే | 
పోటాంత అక్షయీ కళమళణే | జీవ తగమగణే రాహీనా | ||౩౬|| 
36. ఎప్పుడూ నోటి దగ్గర నురుగు, రక్తం గడ్డలు పడటం, ఎక్కువ కాసాగింది. కడుపులో నొప్పి. ఆ బాధకు ప్రాణం గిలగిలలాడేది. 
శేజే ఖిళిలా దుఖణాఈత | గళాలీ గాత్రే చాలలా వాళత | 
ఉపాయాంచీ ఝాలీ శికస్త | ఝాలా తో త్రస్త అత్యంత | ||౩౭|| 
37. బాధ ఎక్కువ అవటంతో, భీమాజీ పక్కకు అంటుకు పోయాడు. శరీరం ఎండిపోసాగింది. ఎన్నో ఉపాయాలు, చికిత్సలూ అయ్యాయి. అతనికి చాలా విరక్తి కలిగింది. 
అన్నపాన కాంహీ న రూచే | పేజపథ్య కాంహీ న పచే | 
తేణే అస్వస్థ కాంహీ న సుచే | హాల జివాచే అసహ్య | ||౩౮|| 
38. అన్న పానీయాలు రుచించేవి కాదు. పథ్యం కూడా జీర్ణమయ్యేది కాదు. అటువంటి రోగానికి కారణం ఏమిటో తెలియక, అతని పరిస్థితి సహించలేనిదిగా తయారైంది. 
దేవదేవస్కీ ఝాలీ సారీ | హాత టేకిలే వైద్య డాక్టరీ | 
పాణీ సోడిలే జీవితాశేవరీ | పడలా విచారీ భీమాజీ | ||౩౯|| 
39. దేవీ దేవతలకు పూజోపచారాలు జరిగాయి. వైద్యులు, డాక్టర్లు చేతులు వ్రేలాడేశారు. బ్రతుకుతానన్న ఆశ వదులుకుని, భీమాజీ దుఃఖంలో మునిగి పోయాడు. 
పాటీల ఝాలే ఉద్విగ్న చిత్తీ | దిసతీ థోడే దిసాంచే సోబతీ | 
ఉత్తరోత్తర ఫారచి థకతీ | దివస గతీ లాగలే | ||౪౦||
40. బ్రతికేది కొద్ది రోజులేనని, పాటీలు మనసులో బాధపడ సాగాడు. బాగా చిక్కి పోయి, విసుగుతో రోజులు గడిపేవాడు. 

ఆరాధిలీ కులదేవతా | తీహీ దేఈన ఆరోగ్యతా | 
జోశీ పంచాక్షరీ సమస్తా | థకలే పుసపుసతా పాటీల | ||౪౧|| 
41. తన కులదేవతని ఆరాధించాడు, కాని కులదేవత ఆరోగ్యాన్నివ్వలేదు. జ్యోతిష్యులను, వైద్యులను, భూతవైద్యులను అడిగి అడిగి విసిగిపోయాడు.
కోణీ మ్హణతీ అంగరోగ | కాయ తరీ హా దైవయోగ | 
వాటే ఓఢావలా పురా భోగ | నిరూపయోగ మనుష్య యత్న | ||౪౨|| 
42. కొందరేమో ఇది దేహానికి సంబంధించిన రోగం అని, మరి కొందరు, మునుపు చేసిన కర్మవలన జరిగిన విధివిలాసం అని, దీనికి మనిషి ప్రయత్నమేమీ పనికి రాదని అన్నారు. 
డాక్టర ఝాలే హకీమ ఝాలే | ఉపచార కరితా టేకీస ఆలే | 
కోణాచే కాంహీచ న చలే | ప్రయత్న హరలే సకళాంచే | ||౪౩|| 
43. డాక్టర్లు, హకీములు అందరూ చికిత్సలు చేసి, చేసి అలసిపోయారు. ఏ ప్రయత్నమూ ఉపయోగ పడలేదు. అన్నీ వృథా అయ్యాయి. 
పాటీల అత్యంత కదరలే1 | మ్హణతీ దేవా మ్యా కాయ కేలే | 
కాంహీచ కా ఉపయోగా న ఆలే | పాప అసలే కైంచే హె | ||౪౪|| 
44. పాటీలు చాలా నిరుత్సాహ పడ్డాడు. ‘దేవా! నేనేం పాపం చేశాను? ఎందుకు ఏదీ ఫలించటం లేదు?’ అని బాధ పడేవాడు. 
దేవ తరీ కైసా విలక్షణ | సౌఖ్య భోగత్యా ఎకహీ క్షణ | 
ఆపులే హోఊ నేదీ స్మరణ | నవల విందాన తయాచే | ||౪౫|| 
45. దేవుడి లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయి! సుఖాలను అనుభవిస్తున్నప్పుడు, ఒక క్షణమైనా తనను తలచుకోనివ్వడు. తెలియరానిది అతని లీల! 
మగ తయాచ్యాచ జై యేఈ మనా | సంకట పరంపరా ధాడితో నానా | 
కరవూని ఘెఈ ఆపల్యా స్మరణా | ’నారాయణా ధాంవ’ మ్హణవీ | ||౪౬|| 
46. అదే తనకు కావలిసినప్పుడు, ఎన్నో కష్టాలకు గురిచేసి, ‘నారాయణా! పరుగున రా!’ అని తనను తలచుకునేటట్లు చేస్తాడు. 
అసో కళవళ్యాచా ధాంవా ఏకిలా | దేవ తాత్కాళ గహింవరలా | 
బుద్ధి ఉపజలీ భీమాజీలా | పత్ర ఘాలావే నానాలా2 | ||౪౭|| 
47. ఇలా పాటీలు దేవుడిని మొర పెట్టుకున్న వెంటనే, అతని ఆర్తనాదాన్ని విన్న దేవుడు, వెంటనే కరిగిపోయాడు. నారాయణ చాందోర్కరుకు ఉత్తరం వ్రాయాలని, భీమాజీకి బుద్ధి పుట్టింది. 
కరితీల కాంహీ తరీ నానా | ఇతర కవణా జే కరవేనా | 
ఏసా పూర్ణ విశ్వాస మనా | పాటలాంనా వాటలా | ||౪౮|| 
48. ‘వేరెవరూ చేయలేనిదానిని, నానా తప్పుకుండా ఎలాగైనా, ఏదైనా చేస్తాడు అని పాటీలుకు నానామీద గొప్ప నమ్మకం కలిగింది. 
తోచి త్యాంచా శుభశకున | తేంచి రోగాచే నిరసన | 
పుఢే సవిస్తర పత్ర లిహూన | నానాంస త్యాంనీ పాఠవిలే | ||౪౯|| 
49. ఆ ఆలోచనే మంచి శకునమై, రోగం తగ్గటానికి కారణమైంది. తరువాత అతడు, విస్తారంగా నానాకు ఉత్తరం వ్రాసి పంపించాడు. 
నానాసాహేబాంచే స్మరణ | తేంచ సాఈనాథాంచే స్ఫురణ | 
ఉద్భవలే రోగనివారణ కారణ | అతర్క్య విందాన3 సంతాంచే | ||౫౦||
50. ఆ క్షణంలో నానాసాహేబును గుర్తు చేసుకోవటం కూడా సాయినాథుని ప్రేరణే. ఆ ప్రేరణే రోగ నివారణకు కారణమైంది. సత్పురుషుల లీలలు మన ఆలోచనలకు అందనివి. 

హోకా కాలచక్రాచీ రచనా | తెథహీ దిసతే ఈశ్వరీ యోజనా | 
యాస్తవ కోణీ అన్యథా కల్పనా | కరూని వల్గనా న కరావీ | ||౫౧|| 
51. కాల చక్రం తిరిగే విధానంలో కూడా, దేవుడి ఉద్దేశమే కనిపిస్తుంది. ఇది కాదని, అంతా మన ప్రయత్నమే అని వ్యర్థమైన గొప్పతనాన్ని మన మీద వేసుకుని, అహంకారం పడరాదు. 
బరీ వాఈట క్రియా సారీ | ఈశ్వర తేథీంచా సూత్రధారీ | 
తోచి తారీ తోచ మారీ | కార్యకారీ తో ఎక | ||౫౨|| 
52. మంచి, చెడు ఈ పనులన్నిటినీ నడిపించే సూత్రధారి ఆ దేవుడే. రక్షించినా, చంపినా, అది చేసేవాడు ఆ దేవుడొక్కడే. 
పాటీల లిహితి చాందోరకరాంస | ఔషధే ఖాతా ఆలా త్రాస | 
కదరలో మీ యా జీవితాస | మగ ఉదాస వాటతే | ||౫౩|| 
53. నానా చాందోర్కరుకు పాటీలు విస్తారంగా ఇలా ఉత్తరం వ్రాశాడు – ‘మందులు తిని తిని విసుగెత్తి, నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది. ఈ లోకమంతా నాకు చాలా దుఃఖమయం అని అనిపిస్తూంది. 
డాక్టరాంనీ ఆశా సోడిలీ | వ్యాధీ దుఃసాధ్య ఏసీ ఠరవిలీ | 
హకీమవైద్యాంచీ బుద్ధీ థకలీ | ఉమేద ఖచలీ మాఝీ హీ | ||౫౪|| 
54. ‘రోగానికి చికిత్స ఇక సాధ్యం కాదని, డాక్టర్లు నా ప్రాణాలపై ఆశను వదిలేశారు. వైద్యులకు, హకీములకు, రోగం గురించి ఏమీ అర్థం కాకుండా ఉంది. నాకు కూడా నమ్మకం పోతూ ఉంది. 
తరీ ఆతా ఎక వినంతి | ఆహే ఆపులే చరణాంప్రతీ | 
వ్హావీ మజ ఆపులీ భేట నిశ్చితీ | హీ ఎక చిత్తీ అసోసీ | ||౫౫|| 
55. ‘అందుకు, మీ పాదాల వద్ద నాదొక మనవి. చివరి సారిగా, మిమ్మల్ని తప్పుకుండా ఒక మారు కలవాలని నాకు కోరికగా ఉంది’. 
చాందోరకరాంనీ పత్ర వాచిలే | త్యాంచేహీ మన ఖిన్న ఝాలే | 
భీమాజీ పాటీల బహు భలే | నానా ద్రవలే అంతరీ | ||౫౬|| 
56. ఆ ఉత్తరాన్ని నానా చాందోర్కరు చదివాడు. భీమాజీ చాలా మంచివాడని అతనికి తెలుసు. నానా చాలా బాధ పడ్డాడు. అతని మనసు కరిగిపోయింది. కళ్ళ నిండా నీళ్ళు నిండాయి. 
ఉత్తరీ కళవితీ ఎకచి ఉపాయ | సాఈబాబాంచే ధరావే పాయ | 
హాచి కేవళ తరణోపాయ | బాప మాయ తో ఎక | ||౫౭|| 
57. ‘వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలను పట్టుకో. నీ ఉత్తరానికి ఇదొక్కటే సమాధానం. మనకు తల్లి తండ్రి అంతా వారొక్కరే’. అని నానా జవాబు వ్రాశాడు. 
తీచ కనవాళూ సర్వాంచీ ఆఈ | హాంకేసరసీ ధాంవత యేఈ | 
కళవళూన కడియే ఘేఈ | జాణే సోఈ లేంకరాంచీ | ||౫౮|| 
58. ‘మన ఒక్కరికే కాదు, ఎవరైనా రక్షించమని పిలవగానే, వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి, దయతో చేయూతనిచ్చి, తల్లిలా ఆదరిస్తారు. బిడ్డల అవసరాలు తల్లిలాంటి వారొకరికే తెలుసు. 
క్షయరోగాచీ కథా కాయ | మహారోగ దర్శనే జాయ | 
శంకా న ధరీ తిళప్రాయ | ఘట్ట పాయ ధరీ జా | ||౫౯|| 
59. ‘మహా భయంకరమైన కుష్టురోగాన్నే వారు దర్శనంతో నివారించారు, ఇంక క్షయ రోగం మాటేమిటి! ఏ మాత్రం సందేహించకుండా, వెళ్ళి వారి పాదాలను గట్టిగా పట్టుకో. 
జో జే మాగే త్యా తే దేఈ | హే బ్రీద జయానే బాంధిలే పాయీ | 
మ్హణోని మ్హణతో కరీ గా ఘాఈ | దర్శన ఘేఈ సాఈంచే | ||౬౦|| 
60. ‘ఎవరు ఏది కోరినా, అది వారు ఇస్తారు. ఇది వారి ప్రతిజ్ఞ. దీనికి వారు కట్టుబడి ఉన్నారు. అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకోమని చెబుతున్నాను. 

భయామాజీ మోఠే భయ | మరణాపరిస దుజే కాయ | 
ఘట్టధరీ జా సాఈంచే పాయ | కరీల నిర్భయ తో ఎక | ||౬౧|| 
61. ‘భయాలన్నింటిలో అతి పెద్దదైనది చావు గురించి భయం. ఇంతకంటే వేరొకటి ఉంటుందా? వెళ్ళు. సాయి పాదాలను గట్టిగా పట్టుకో. వారొక్కరే నిన్ను ఈ భయంనుంచి రక్షించగలరు’.
దుఃసహ్య పాటలాచీ వ్యథా | పాతలీ ప్రాణాంతీక అవస్థా | 
కధీ భేటేన సాఈనాథా | కధీ కార్యార్థా సాధేన | ||౬౨|| 
62. పాటీలు పరిస్థితి భరించలేని బాధతో, ప్రాణాపాయ స్థితిలో ఉంది. ‘సాయినాథులను ఎప్పుడు కలుసుకుంటాను, ఎప్పుడు నా ఆరోగ్యం బాగు పడుతుందా’ అని ఎదురు చూస్తున్నాడు. 
ఏసా పాటీల ఝాలా బావరా | మ్హణే సరసామాన ఆవరా | 
ఉదయీక సత్వర తయారీ కరా | వాటధరా శిరడీచీ | ||౬౩|| 
63. పాటీలు చాలా తహతహలాడాడు. త్వరత్వరగా సామాను సర్దుకుని, ఆ మరునాడే, శిరిడీకి వెళ్ళాలని అనుకున్నాడు. 
యేణేప్రమాణే దృఢనిశ్చయేసీ | నిరోప పుసూన సకళికాంసీ | 
మహారాజాంచే దర్శనాసీ | నిఘాలే శిరడీసీ పాటీల | ||౬౪|| 
64. అలా దృఢంగా నిశ్చయించుకుని, అందరి వద్దా సెలవు తీసుకుని, సాయి మహారాజు దర్శనానికి పాటీలు శిరిడీ బయలుదేరాడు. 
ఘేతలే ఆప్తజన బరోబరీ | భీమాజీ నిఘాలే ఝడకరీ | 
ఉత్కంఠ ఫారచి అంతరీ | శిరడీ సత్వరీ కై దేఖే | ||౬౫|| 
65. తన వారందరితో కలిసి, ఎంత త్వరగా శిరిడీ చేరుకుంటానా అని ఉత్సాహంగా బయలుదేరాడు. 
మశీదీచ్యా చౌకాశేజారీ | గాడీ ఆలీ పుడలే ద్వారీ | 
చౌఘాంహీ వాహూనియా కరీ | భీమాజీ వరీ ఆణిలే | ||౬౬|| 
66. అతని బండి, మసీదు ప్రక్కన, ముందు వాకిలి వద్దకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకుని పైకి తీసుకుని వచ్చారు. 
నానాసాహేబ సమవేత హోతే | మాధవరావహీ ఆలే తేథే | 
జ్యా మాధవరావాంచియా హాతే | సుగమ పద తే సర్వత్రా | ||౬౭|| 
67. వారి వెంట నానాసాహేబు కూడా ఉన్నాడు. మాధవరావు కూడా అక్కడికి వచ్చాడు. అతని ద్వారా బాబాను కలుసుకోవటం అందరికీ సులభం. 
పాటీల పాహోని బాబా వదతీ | ’శామా హే చోర ఆణూని కితీ | 
ఘాలశీ మాఝే అంగావరతీ | కాయ హే కృతి బరీకా’ ||౬౮|| 
68. పాటీలును చూసి, బాబా “శ్యామా! ఇంకా ఎంత మంది దొంగలను తీసుకు వచ్చి, నా మీద పడవేస్తావు? ఏమిటి, ఇదేమైనా మంచి పనేనా!” అని అన్నారు. 
సాఈపదీ ఠేవిలా మాథా | భీమజీ మ్హణే సాఈనాథా | 
కృపా కరీ మజ అనాథా | దీనానాథా సాంభాళీ | ||౬౯|| 
69. సాయి పాదాల మీద తలనుంచి, భీమాజీ ‘సాయినాథా! అనాథైన నన్ను కరుణించండి. దీననాథా! నన్ను రక్షించండి’ అని వేడుకున్నాడు. 
దేఖూనియా పాటలాచీ వ్యథా | దయా ఉపజలీ సాఈనాథా | 
తే సరసీ శమలీ దుఃఖావస్థా | పాటీల చిత్తా విశ్వాసలా | ||౭౦||
70. పాటీలు బాధను చూసిన తరువాత, సాయినాథులకు దయ ఉప్పొంగింది. తన బాధ వెంటనే తీరిపోతుందని పాటీలుకు ఆ క్షణంలో నమ్మకం కుదిరింది. 

పాహూని భీమాజీ అస్వస్థ | కృపాసాగర సాఈ సమర్థ | 
హేలావలా అపరిమిత | బోలే సస్మితముఖ తేవ్హా | ||౭౧|| 
71. భీమాజీ అనారోగ్యాన్ని గమనించి, దయాసాగరులైన సాయి సమర్థులు విపరీతంగా కరిగిపోయారు. నవ్వుతూ, 
“బైస ఆతా సోడీ ఖంత | ఖంత న కరితీ విచారవంత | 
ఝాలా తుఝియా భోక్తృత్వా అంత | పాయ శిరడీంత టాకితా | ||౭౨|| 
72. “కూర్చో, చింతను వదిలేయి. బుద్ధిమంతులు కలవర పడరు. శిరిడీలో అడుగు పెట్టగానే, నీవు అనుభవించాల్సిన కర్మ తీరిపోయింది. 
ఆకంఠ సంకటార్ణవీ బుడాలా | హోకా మహద్దుఃఖ గర్తేంత గఢలా | 
జో యా మశీదమాఈంచీ పాయరీ చఢలా | సుఖా ఆరూఢలా తో జాణా | ||౭౩|| 
73. “గొంతు వరకు కష్టాలలో మునిగి ఉన్నా, మహా మహా బాధల గోతులలో పాతుకు పోయినా, ఈ మసీదు మాత మెట్లెక్కిన వారు, అంతు లేని సుఖాన్ని పొందినట్లే అని తెలుసుకో. 
ఫకీర యేథీంచా మోఠా దయాళు | కరీల వ్యథేచే నిర్మూళు | 
ప్రేమే కరీల ప్రతిపాళు | తో కనవాళ సకళాంచా | ||౭౪|| 
74. “ఇక్కడి ఫకీరు చాలా దయాళువు. నీ బాధను తొలగించి, ప్రేమతో నిన్ను రక్షిస్తాడు. వాడు అందరి పట్లా కరుణ కలిగినవాడు. 
యాలాగీ తు స్వస్థ పాహీ | భీమాబాఈచ్యా సదనీ రాహీ | 
ఆరామ తో ఎకా దో దిసాంహీ | జా కీ హోఈల తుజప్రతి” | ||౭౫|| 
75. “అందుకని, నీవు నిశ్చింతగా భీమాబాయి ఇంట్లో ఉండు. ఒకటి రెండు రోజుల్లో, నీకు సుఖం చేకూరుతుంది. ఇక వెళ్ళు” అని చెప్పారు. 
జైసా ఎకాదా ఆయుష్యహీన | పావే సుదైవే అమృత సించన | 
లాధే తాత్కాళ పునరూజ్జీవన | తైసే సమాధాన పాటిలా | ||౭౬|| 
76. ఆయువు ముగిసిన వాడికి, దేవుడు దయతో అమృతం కురిపిస్తే పునర్జన్మ కలిగినట్లు, పాటీలుకు తృప్తి కలిగింది. 
ఏకూని సాఈ ముఖీంచే వచన | మరణోన్ముఖా అమృతపాన | 
కింవా తృషార్తా లాధావే జీవన | తైసే సమాధాన పాటిలా | ||౭౭|| 
77. చావును ఎదురుగా చూస్తున్నవాడికి, అమృతం తాగినట్లు, దాహంతో బాధ పడుతున్న వాడికి మంచినీరు దొరికినట్లు, సాయి నోటినుండి వచ్చిన మాటలు పాటీలు మనసుకు శాంతిని కలిగించాయి. 
ప్రతి పాంచ మినిటాంస | రక్తాచ్యా గుళణ్యా యేత ముఖాస | 
బాబా సన్ముఖ ఎక తాస | బైసతా నిరాస పావల్యా | ||౭౮|| 
78. ప్రతి ఐదు నిమిషాలకొక సారి, అతని నోటినుండి రక్తపు గడ్డలు పడేవి. కాని, బాబా ఎదుట గంట సేపు కూర్చున్నా, ఏమీ కాలేదు. 
కేలే న వ్యథేచే పరీక్షణ | పుసిలే న తదుద్భవ కారణ | 
కేవళ కృపా నిరీక్షణ | రోగాన్మూలన తాత్కాళ | ||౭౯|| 
79. అతని జబ్బును బాబా పరీక్షించ లేదు. ఆ రోగం ఎలా వచ్చింది అని కూడా అడగలేదు. కేవలం వారి దయగల చూపుతోనే రోగం వెంటనే తొలగిపోయింది. 
కృపా నిరీక్షణ హోతా పురే | వాళల్యా కాష్ఠా యేతీ కోంభరే | 
వసంతావిణ ఫులతీ తురే | తే ఫళీ డవరే రమణీయ | ||౮౦||
80. కరుణతో వారు చూసే ఒక చూపు చాలు. ఎండి పోయి, మోడుబారిన చెట్టు కూడా చిగురిస్తుంది. వసంత ఋతువు లేకపోయినా, పూలు వికసించి, తీయనైన పళ్ళనిస్తుంది. 

రోగ కాయ ఆరోగ్య కాయ | పుణ్యాపాపాచా హోతా క్షయ | 
జ్యాచే త్యానే భోగిల్యాశివాయ | అన్య ఉపాయ చాలేనా | ||౮౧|| 
81. రోగం అంటే కానీ, ఆరోగ్యం అంటే కాని ఏమిటి? మన పాప పుణ్యాలు తక్కువ కావడమే. (పుణ్యం తగ్గితే రోగం - పాపం తగ్గితే ఆరోగ్యం). ఎవరి కర్మను వారు అనుభవించడం తప్ప వేరే మార్గమే లేదు.
కేవళ భోగేంచ తయాంసీ క్షయ | జన్మజన్మాంతరీ హాచి నిశ్చయ | 
భోగిల్యావీణ అన్య ఉపాయ | నివృత్తిదాయక నాహీంచ | ||౮౨|| 
82. అనుభవించటం వలన కర్మ ఫలం తగ్గడంతో, రోగం కూడా తగ్గుతుంది. రోగం నశించటానికి ఇదొకటే మార్గం. జన్మజన్మలలోనూ ఇదే తప్పక జరుగుతుంది. కర్మ ఫలాన్ని అనుభవించటం తప్ప, రోగాన్ని తొలగించే మరో ఉపాయం లేదు. 
తథాపి భాగ్యే సంతదర్శన | హే ఎక వ్యాధీచే ఉపశమన | 
వ్యాధిగ్రస్త మగ వ్యాధీచే సహన | దుఃఖేవీణ సహజ కరీ | ||౮౩|| 
83. అయినా, రోగం తగ్గటానికి, సాధు సంతుల దర్శనం ఒక ఉపాయం. దానితో, రోగంతో బాధ పడుతున్నవారు, ఎక్కువగా బాధ పడకుండా, రోగంయొక్క పీడను సహించగలరు. 
వ్యాధీ దావీ భోగ దారూణ | సంత ఠేవీ దృష్టిసకరూణ | 
తేణే భోక్తృత్వ దుఃఖావీణ | సంత నివారణ కరితాత | ||౮౪|| 
84. రోగం విపరీతమైన బాధను కలిగిస్తుంది. కాని, సత్పురుషులు తమ కరుణతో, కర్మ ఫలాన్ని తక్కువ చేసి, రోగ బాధను సులభంగా నివారిస్తారు. 
కేవళ బాబాంచా శబ్ద ప్రమాణ | తేంచ ఔషధ రామబాణ | 
ఎకదా కృష్ణ శ్వాన భక్షితా దధ్యోదన | జాహలే నివారణ హిమజ్వరాచే | ||౮౫|| 
85. దానికి, బాబా మాటలే ప్రమాణం. అవి రామబాణం వంటి ఔషధం. నల్ల కుక్కకు పెరుగన్నం తినిపించటంతో, చలిజ్వరం ఒక సారి తొలిగిపోయింది. 
కథేత వాటతీల యా ఆడ కథా | పరి యా సంకలిత శ్రవణ కరితా | 
దిసూని యేఈల సమర్పకతా | స్మరణ దాతాహీ సాఈచ | ||౮౬|| 
86. కథలో ఒక చిన్న అడ్డు కథ అని అనిపిస్తుంది కాని, దీని సారాంశాన్ని వింటే, ఆ కథ ఇక్కడ బాగా యిముడుతుంది అని అనిపిస్తుంది. దీనిని నాకు గుర్తు చేసింది ఆ సాయియే. 
“మాఝీ కథా మీచ కరీన” | సాఈచ గేలే ఆహేత బోలూన | 
త్యాంనీచ యా కథాంచీ ఆఠవణ | దిధలీ మజలాగూన యేసమయీ | ||౮౭|| 
87. “నా కథను నేనే చెబుతాను” అని వారు చెప్పినట్లే, ఇప్పుడు వారే నాకు ఈ కథను గుర్తు చేశారు. 
బాళా గణపత నామే ఎక | జాతీచా శింపీ మోఠా భావిక | 
యేఊని మశీదీంత బాబా సన్ముఖ | అతి దీనముఖ వినవీత | ||౮౮|| 
88. బాలా గణపతి అనే దర్జీ వాడు బాబాకు గొప్ప భక్తుడు. ఒక సారి అతను, మసీదులో, బాబా దగ్గరకు అతి దీనంగా వచ్చాడు. 
కాయ ఏసే మ్యా కేలే పాప | కా హా సోడీనా మజ హింవతాప | 
బాబా ఝాలే ఉపాయ అమూప | హలేనా తత్రాప అంగీచా | ||౮౯|| 
89. ‘బాబా నేను అలాంటిదేమి పాపం చేశానో గాని, ఈ చలిజ్వరం నన్ను విడిచి పెట్టటం లేదు. ఎన్ని మందులు తీసుకున్నా, ఇది నా దేహాన్ని వదిలి పోవటం లేదు. 
తరీ మీ ఆతా కరూ కాయ | జాహలీ సర్వ ఔషధే కషాయ | 
ఆపణ తరీ సాంగా ఉపాయ | కైసేని జాయ హా తాప | ||౯౦||
90. ‘ఇప్పుడు నేనేం చేయాలి? మందులు, కషాయాలు అన్నీ అయ్యాయి. మీరైనా ఈ జ్వరం తగ్గే ఉపాయాన్ని చెప్పండి’ అని వేడుకున్నాడు. 

తంవ దయా ఉపజలీ అంతరీ | బాబా వదత ప్రత్యుత్తరీ | 
ఉపాయ త్యా హిమజ్వరావరీ | తీ నవలపరీ పరిసావీ | ||౯౧|| 
91. అతని మీద బాబాకు దయ కలిగి, చలిజ్వరానికి ఒక ఉపాయం చెప్పారు. ఆ వింత ఉపాయం గురించి వినండి. 
“దహీభాతాచే కాంహీ కవళ | లక్ష్మీ ఆఈచ్యా దేఉళాజవళ | 
కాళ్యా కుత్ర్యాస ఖాఊ ఘాల | బరా హోశీల తాత్కాళ” | ||౯౨|| 
92. “లక్ష్మీ దేవాలయం దగ్గర, ఒక నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు. వెంటనే, నువ్వు కోలుకుంటావు”, అని చెప్పారు. 
బాళా భీత భీతచి గేలా | ఘరీ జాఊన పాహూ లాగలా | 
ఝాంకూన ఠేవిలా భాత ఆఢళలా | దహీ హీ లాధలా శేజారీ | ||౯౩|| 
93. అప్పుడు బాళా భయపడుతూ ఇంటికి వెళ్ళి చూడగా, మూత పెట్టిన అన్నం కనిపించింది. ప్రక్కనే పెరుగు కూడా దొరికింది. 
బాళా మనీ విచార కరీ | దహీ భాత మిళాలా తరీ | 
కాళాచ కుత్ర వేళేవరీ | దేఉళాశేజారీ అసేల కా | ||౯౪|| 
94. ‘పెరుగు అన్నం రెండూ దొరికాయి, బాగానే ఉంది. కాని, ఈ వేళప్పుడు దేవాలయం దగ్గర నల్ల కుక్క ఉంటుందా?’ అని బాళా అనుకున్నాడు. 
పరి హీ బాళాచీ ఉగీచ చింతా | నిర్దిష్ట స్థళీ జాఊని పోహచతా | 
కృష్ణ శ్వాన ఎక పుచ్ఛ హలవితా | సమోర యేతా దేఖిలే | ||౯౫|| 
95. అనవసరంగా బాళా భయపడ్డాడు. బాబా చెప్పిన చోటికి చేరుకునే సరికి, ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ, తన దగ్గరకు రావటం చూశాడు. 
పాహూని ఏసా హా యోగ జుళలా | బాళాస మోఠా ఆనంద జాహలా | 
దహీభాత ఖాఊ ఘాతలా | వృత్తాంత కళవిలా బాబాంస | ||౯౬|| 
96. అలా అంతా కలిసి రావడంతో, బాళా చాలా సంతోష పడ్డాడు. కుక్కకు పెరుగన్నం పెట్టి, ఆ సంగతి బాబాకు తెలియ చేశాడు. 
సారాంశ హా జో ప్రకార ఘడలా | కోణీ కాహీహీ మ్హణో తయాలా | 
తేవ్హాపాసూన హిమజ్వర గేలా | ఆరామ జాహలా బాళాస | ||౯౭|| 
97. అసలు ఏమిటంటే, దీని గురించి ఎవరు ఏమనుకున్నా, బాళాకు చలిజ్వరం తగ్గి, ఆరోగ్యం చేకూరింది. 
ఏసేచ బాపూసాహెబ బుట్టీ | థండీ జాహలీ హోతీ పోటీ | 
జులాబ హోత పాఊఠోపాఉఠీ | ఉలటీ వర ఉలటీ ఎక సరా | ||౯౮|| 
98. ఇలాగే, ఒక సారి, బాపూసాహేబు బుట్టీకి కడుపులో చలి కలిగి, వెంట వెంటనే విరోచనాలు, వాంతుల పైన వాంతులు, ఆగకుండా రాసాగాయి. 
సర్వౌషధానీ కపాట భరలే | పరి ఎకహీ న లాగూ పడలే | 
బాపూసాహెబ మనీ ఘాబరలే | బహుత పడలే విచారీ | ||౯౯|| 
99. అతని అలమారా అంతా మందులతో నిండిపోయింది. కాని, ఏ ఒక్కటి వలననూ పని కాలేదు. ఆ చింతతో, ఆలోచనలతో, బాపూసాహేబు చాలా భయ పడ్డాడు. 
జులాబ ఉలట్యా హోఊన హోఊన | బాపూసాహెబ జాహలే క్షీణ | 
నిత్యనేమ బాబాంచే దర్శన | ఘ్యావయా త్రాణ నురలే త్యా | ||౧౦౦||
100. వాంతులు, విరేచనాలూ ఆగకుండా కావడం వలన, అతడు బాగా నీరసించి పోయాడు. అలవాటు ప్రకారం రోజూ వెళ్ళే బాబా దర్శనానికి పోవటానికి కూడా అతనికి శక్తి లేకపోయింది. 

గోష్ట గేలీ బాబాంచే కానీ | ఆణవూన బైసవిలే సన్ముఖ త్యాంనీ | 
మ్హణాలే ఖబరదార ఆతాపాసూని | మల విసర్జనీ జాతా నయే | ||౧౦౧|| 
101. ఈ సంగతి బాబా చెవిన పడింది. బుట్టీని పిలిపించి తమ ఎదుట కూర్చోబెట్టుకున్నారు. “ఖబర్దార్! ఇకనుండి మల విసర్జనానికి వెళ్ళకూడదు.
వాంతీహీ రాహిలీ పాహిజే ఠికాణీ | తయాంసన్ముఖ హాలవూన తర్జనీ | 
పునశ్చ పూర్వవత తయా అనులక్షునీ | మ్హటలే బాబాంనీ తైసేంచ | ||౧౦౨|| 
102. “ఇక వాంతుల కూడా ఆగిపోవాల్సిందే!” అని అన్నారు. చూపుడు వ్రేలితో అతన్ని ఉద్దేశించి, మరలా అలాగే అన్నారు. 
తాత్పర్య కాయ త్యా శబ్దాంచా దరారా | దోనీ వ్యాధీనీ ఘేతలా భేదరా | 
కేలా పహా తాత్కాళ పోబారా | జాహలా ఆరామ బుట్టీంస | ||౧౦౩|| 
103. చెప్పాల్సిందేమిటంటే, వారి మాటల దెబ్బ ఎలాటిదో గాని, రెండు రోగాలూ పారిపోయి, బుట్టీ ఆరోగ్యం బాగుపడింది. 
ఎకదా గాంవీ వాఖ్యాచా ఉద్భవ | అసతా జాహలా తయాంస ఉపద్రవ | 
వాంతీ రేచ యాంచా సముధ్బవ | కళమళలా జీవ తృషాకుల | ||౧౦౪|| 
104. ఒక సారి శిరిడీలో కలరా రోగం వచ్చింది. దీనివల్ల బుట్టీకి ఆగకుండా వాంతులు, విరేచనాలు, మొదలైనాయి. దప్పికతో అతని ప్రాణం విలవిలలాడింది. 
పాశీంచ హోతే డాక్టర పిల్లే | తయాంనీ ఉపాయ సర్వ వేంచలే | 
శేవటీ జేవ్హా కాహీంచ న చలే | మగ తే గేలే బాబాంకడే | ||౧౦౫|| 
105. అతని దగ్గరే డాక్టరు పిళ్ళే ఉన్నాడు. అతను అన్ని ప్రయత్నాలు చేశాడు. కాని, అవేవి ఫలించలేదు. చివరకు డాక్టరు పిళ్ళే, బాబా దగ్గరకు వచ్చాడు. 
హోతే జైసే జైసే ఘడలే | సాఈ చరణీ సర్వ నివేదిలే | 
కాఫీ ద్యావీ కీ పాణీ చాంగలే | విచారితీ పిల్లే బాబాంస | ||౧౦౬|| 
106. జరిగినదంతా సాయికి వివరించాడు. ‘అతనికి కాఫీ ఇమ్మంటారా లేక మంచి నీరే మంచిదా’ అని పిళ్ళే బాబాను అడిగాడు. 
తవ బాబా వదతీ తయాంలా | “ఖా దూధ, బదామ, ఘాలా | 
అక్రోడ పిస్త్యాంసహ తయాంలా | ప్యావయాలా ద్యా తరణ | ||౧౦౭|| 
107. దానికి బాబా “పాలలో బాదాం, అక్రోట్‍, పిస్తా వేసి ఆ ఖీరును అతనికి త్రాగటానికి ఇవ్వండి. 
తేణే తయాచీ రాహీల తహాన | హోఈల సత్వర వ్యాధి హరణ” | 
సారాంశ ఏసే హే పాజితా తరణ | ఉపద్రవ నిరసన జాహలే | ||౧౦౮|| 
108. “దాని వలన అతని దప్పిక తీరుతుంది. రోగం కూడా త్వరగా తగ్గుతుంది” అని చెప్పారు. ఆ జావను త్రాగించగా, బుట్టీకి కలిగిన రోగం తొలగిపోయింది. 
“ఖా అక్రోడ పిస్తే బదామ” | యేణే పటకీస పడావా ఆరామ | 
శబ్దచి బాబాంచా విశ్వాస ధామ | శంకేచే కామ నా యేథే | ||౧౦౯|| 
109. “అక్రోట్‍, పిస్తా, బాదాంలను తిను” అంటే కలరా రోగం తగ్గుతుందా? బాబా మాటల మీదున్న నమ్మకమే మూల కారణం. ఇందులో ఏ సందేహానికీ తావు లేదు. 
ఆళందీచే ఎక స్వామీ | సాఈ సమర్థ దర్శనకామీ | 
ఆలే ఎకదా శిరడీగ్రామీ | పాతలే ఆశ్రమీ సాఈచ్యా | ||౧౧౦||
110. ఒక సారి, ఆళందినుండి ఒక స్వామి, సాయి సమర్థుల దర్శనానికి శిరిడీ గ్రామానికి వచ్చి, సాయి ఉన్న చోటుకు చేరాడు. 

హోతా తయాంస కర్ణ రోగ | తేణే అస్వాస్థ్య నిద్రాభంగ | 
కరవితాంహీ శాస్త్ర ప్రయోగ | కాంహీ న ఉపయోగ తిళమాత్ర | ||౧౧౧|| 
111. అతనికి చెవిపోటు. దాని కారణంగా సరిగ్గా నిద్ర పట్టకుండా ఉండేది. శస్త్ర చికిత్స చేయించుకున్నా, కొంచెం కూడా ప్రయోజనం కాలేదు. 
ఠణకా లాగే అనావర | చాలే న కాంహీ ప్రతీకార | 
నిఘావయాచా కేలా విచార | గేలే ఆశీర్వాద మాగావయా | ||౧౧౨|| 
112. భరించలేని చెవిపోటు వచ్చింది. ఏ మందూ పని చేయలేదు. ఆళంది వదిలి వెళ్ళాలని నిశ్చయించుకుని, సాయి ఆశీర్వాదం కోసం వచ్చాడు. 
అభివందూని సాఈ పాదా | పావూనియా ఉదీ ప్రసాదా | 
స్వామీ మాగత ఆశీర్వాదా | కృపా సర్వదా అసావీ | ||౧౧౩|| 
113. సాయి పాదాలకు నమస్కరించి, బాబా ఇచ్చిన విభూతిని తీసుకుని ‘మీ కృప ఎప్పుడూ ఉండాలి’ అని సాయి ఆశీస్సులను స్వామి కోరాడు. 
మాధవరావ దేశపాండ్యానీ | కానాప్రీత్యర్థ కేలీ వినవణీ | 
“అల్లా అచ్ఛా కరేగా” మ్హణూని | మహారాజాంనీ ఆశ్వాసిలే | ||౧౧౪|| 
114. ఆ స్వామి చెవిపోటు గురించి, మాధవరావు దేశపాండే బాబాతో మనవి చేశాడు. “అల్లా అచ్ఛా కరేగా (అల్లా మంచిని చేస్తాడు)” అని మహారాజు ధైర్యాన్నిచ్చారు. 
ఏసా ఆశీర్వాద లాధూనీ | స్వామీ పరతలే పుణ్యపట్టణీ | 
పత్ర ఆలే ఆఠా దిసాంనీ | ఠణకా తత్క్షణీచ రాహిలా | ||౧౧౫|| 
115. అలా సాయి ఆశీస్సులను అందుకుని, ఆ స్వామి పుణే పట్టణం చేరుకున్నాడు. వారం రోజులలోగా అతని చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం వ్రాశాడు. 
సూజ మాత్ర కాయమ హోతీ | శస్త్రప్రయోగ కరావా మ్హణతీ | 
పున్హా తో ప్రయోగ కరావా యే అర్థీ | ఆలో ముంబఈప్రతీ మాగుతా | ||౧౧౬|| 
116. ‘వాపు ఇంకా ఉన్నందు వలన, ఇంకొక శస్త్ర చికిత్స చేయించుకోవాలని తిరిగి ముంబైకి వెళ్ళాను. 
గేలో పుఢీల డాక్టరాంకడే | నకళే బాబాంనా పడలే సాంకడే | 
డాక్టర పాహీ జో కానాకడే | సూజ కోణీకడే లక్షేనా | ||౧౧౭|| 
117. ‘ఇంతకు మునుపు శస్త్ర చికిత్స చేసిన డాక్టరు దగ్గరే వెళ్ళాను. అతను మరల పరీక్షించి, వాపు ఎక్కడా కనిపించలేదు. 
శస్త్రప్రయోగ ఆవశ్యకతా | డాక్టర మ్హణే నలగే ఆతా | 
స్వామీచీ హరలీ దుర్ధర చింతా | విస్మయ సమస్తా వాటలా | ||౧౧౮|| 
118. ‘ఇక శస్త్ర చికిత్స అవసరం లేదని ఆ డాక్టరు చెప్పాడు’. దానితో ఆ స్వామికున్న చింత తొలగిపోయింది. బాబా లీలలను చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. 
ఏశీచ ఆణిక ఎక కథా | ఓఘాస ఆలీ జీ ప్రసంగవశతా | 
తీ సాంగూన శ్రోతయా ఆతా | అధ్యాయ ఆటోపతా ఘేఊ హా | ||౧౧౯|| 
119. ఇలాంటిదే ఇంకొక కథ గుర్తుకు వచ్చింది. దానిని శ్రోతలకు ఇప్పుడు చెప్పి, ఈ అధ్యాయాన్ని త్వరగా ముగిస్తాను. 
సభామండపాచీ ఫరసీ | బాంధూ ఆరంభిలీ జె దివసీ | 
త్యా ఆధీ ఆఠ దిన మహాజనీసీ | జాహలీ మోడసీ దుర్ధర | ||౧౨౦||
120. మసీదు సభామండపంలో, నేల పని మొదలు పెట్టటానికి ఎనిమిది రోజులు ఉందనగా, కాకా మహాజనికు భరించలేని కలరా రోగం వచ్చింది. 

జులాబ హోఊ లాగలే ఫార | మనీంచే మనీ బాబాంవర భార | 
కరీనాత ఔషధ వా ఉపచార | అత్యంత బేజార జాహలే | ||౧౨౧|| 
121. దాంతో విరేచనాలు చాలా అవసాగాయి. బాబాపై భారం వేసి, ఏ మందులూ తీసుకోలేదు. ఏ చికిత్సా చేసుకోలేదు. రోగంతో చాలా అలసిపోయాడు.
సాఈ పూర్ణ అంతర్జ్ఞానీ | జాణత హోతే మహాజనీ | 
మ్హణవూని హే అస్వాస్థ్య తయాంలాగూని | కేలే న త్యాంనీ నివేదన | ||౧౨౨|| 
122. సాయి అంతర్‍జ్ఞాని అని మహాజనికి తెలుసు. అందుకే, తన రోగం గురించి, బాబాకు చెప్పలేదు. 
యేఈల జేవ్హా తయాంచే మనీ | కరితీల నివారణ ఆపణ హోఊని | 
ఏసే పూర్ణ విశ్వాసూని | వ్యాధీ సోసూని రాహిలే | ||౧౨౩|| 
123. బాబా తలచుకున్నప్పుడే, తన వ్యాధిని తొలగిస్తారని పూర్తి నమ్మకంతో, దానిని సహిస్తూ ఉన్నాడు. 
భోగ భోగూ ఆపణ సకళ | పరి న పూజేసీ పడావా ఖళ | 
హీచ ఎక ఇచ్ఛా ప్రబళ | సర్వకాళ కాకాంస | ||౧౨౪|| 
124. కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే అని తెలిసినా, పూజలో తనకు ఏ ఆటంకమూ కలగ కూడదనే ఒక కోరికను కాకా ఎప్పుడూ కోరుకునేవాడు. 
జులాబ కితీదా ఆణి కేవ్హా | ప్రమాణాతీత ఝాలే జేవ్హా | 
చుకూ నయే ఆరతి సేవా | మ్హణూన తేవ్హా కాయ కరితీ | ||౧౨౫|| 
125. ఎడతెరపి లేకుండా విరేచనాలు అవటం వలన, హారతి సేవ తప్పిపోకుండా ఉండాలని ఏం చేశాడంటే, 
తాంబ్యా ఎక పాణ్యానే భరలా | అంధారాంతహీ లాగేల హాతాలా | 
ఏసే జాగీ మశీదీలా | ఎకా బాజూలా ఠేవీత | ||౧౨౬|| 
126. చెంబులో నీరు నింపి, చీకట్లో కూడా సులభంగా చేతికి అందేలా, మసీదులోని ఒక మూలలో ఉంచాడు. 
స్వయే బైసత బాబాంపాశీ | చరణ సంవాహన కరావయాసీ | 
హజర నిత్య ఆరాతీసీ | నిత్యనేమేసీ చాలవీత | ||౧౨౭|| 
127. వీలైనంత, తను బాబా వద్ద కూర్చుని, వారి పాదాలను నొక్కి సేవ చేసేవాడు. హారతికి హాజరయ్యేవాడు. రోజూ ఇలాగే జరిగేది. 
ఆలీ జరీ పోటాంత కళ | తాంబ్యా హోతాచ హాతాజవళ | 
పాహూని జవళ ఎకాంత స్థళ | హోఊని నిర్మళ పరతత | ||!౧౨౮|| 
128. కడుపులో కదలిక కలగగానే, అందుబాటులో ఉన్న చెంబు పుచ్చుకుని, ఎవరూ లేని చోటుకు వెళ్ళి, తన పని ముగించుకుని తిరిగి వచ్చేవాడు. 
అసో ఫరసీ కరావయాసీ | ఆజ్ఞా మాగతా బాబాంపాసీ | 
దిధలీ పహా తీ తాత్యాబాంసీ | వదత తయాంసీ కాయ పహా | ||౧౨౯|| 
129. సభా మండపంలోని నేల పని మొదలు పెట్టటానికోసం, బాబా అనుమతిని తాత్యా వేడగా, వారు అతనితో ఏమన్నారో వినండి. 
“జాతో ఆమ్హీ లేండీవర | లేండీవరూన పరతల్యావర | 
కరా ఆరంభ బరోబర | యా ఫరశీచే కార్యాస” | ||౧౩౦||
130. “మేము లెండీకి వెళ్ళి, తిరిగి వచ్చిన తరువాత, ఈ నేల పని మొదలు పెట్టండి” అని అన్నారు. 

పుఢే బాబా పరత ఆలే | ఆసనావరీ జాఊని బైసలే | 
పాదసంవాహన సురూ కేలే | యేఊన వేళేవర కాకాంనీ | ||౧౩౧|| 
131. తరువాత, లెండీనుండి బాబా తిరిగి వచ్చి, వెళ్ళి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పటికి కాకా కూడా వచ్చి, వారి పాదాలను మెల్లగా నొక్కటం మొదలు పెట్టాడు. 
కోపరగాంవాహూన తాంగే ధడకలే | ముంబఈకడీల భక్త పాతలే | 
పూజాసంభార సహిత చఢలే | యేఊని అభివందిలే బాబాంస | ||౧౩౨|| 
132. కోపర్గాంనుండి టాంగాలు వచ్చాయి. ముంబైనుండి భక్తులు వచ్చారు. పూజా సామగ్రితో పైకి వెళ్ళి, బాబాకు నమస్కరించారు. 
ఇతర మండళీ సమవేత | అంధేరీచే పాటీలహీ యేత | 
ఘేఊని పూజా పుష్పాక్షత | వాట పాహత బైసలే | ||౧౩౩|| 
133. ఇతర భక్తులతో పాటు, అంధేరీనుండి పాటీలు (అతని క్షయ రోగం నయమైన కొద్ది కాలం తరువాత) కూడా వచ్చి, పూజ కోసం పువ్వులను, అక్షతలను పట్టుకుని, ఎదురు చూస్తూ కూర్చున్నాడు. 
ఇతక్యాంత ఖాలీ పటాంగణాంత | రథ జేథే ఠేవీత అసత | 
కుదళ మారూన బరోబర తేథ | ఫరశీచీ సురువాత జాహలీ | ||౧౩౪|| 
134. ఇంతలో, క్రింద సభామండపంలో, రథాన్ని ఉంచే చోట, గునపంతో త్రవ్వుతూ, నేల పని మొదలైంది. (గునపాన్ని నేలమీద కొట్టడంతో శబ్దం అయ్యింది). 
ఏకిలా తో ఆవాజ మాత్ర | బాబాంనీ ఓరడ కేలీ విచిత్ర | 
ధరిలా తాత్కాళ నృసింహావతార | నేత్రటవకార భయంకర | ||౧౩౫|| 
135. ఆ శబ్దాన్ని విన్నంతనే, బాబా విచిత్రంగా కేకలు వేశారు. వెంటనే భయంకరంగా తమ కళ్ళను పెద్దవి చేసి, నరసింహావతారం లాగా కనిపించారు. 
కోణ మారతో కుదళీచా ఫటకా | కరితో తయాలా కంబరేత లటకా | 
బోలత ఉఠలేచ ఘేఊని సటకా | భీతీచా ధడకా సమస్తా | ||౧౩౬|| 
136. “గునపంతో ఎవరు త్రవ్వుతున్నారు? వారి నడుం విరక్కొడతాను” అంటూ సటకా పుచ్చుకుని, కోపంగా లేచే సరికి అందరూ భయపడి పోయారు. 
కుదళీ టాకూన మజూర పళాలా | జో తో ఉఠూన ధాంవత సుటలా | 
కాకాంచాహీ జీవ దచకలా | తో హాతచి ధరిలా బాబాంనీ | ||౧౩౭|| 
137. గునపాన్ని పారవేసి, పనివాళ్ళందరూ పారిపోయారు. కాకా కూడా బెదిరిపోయి, పరుగెడతామని లేవబోతే, బాబా అతని చేతిని పట్టుకున్నారు. 
మ్హణతీ జాతోస కుఠే బస ఖాలీ | ఇతక్యాంత తాత్యా లక్ష్మీ ఆలీ | 
తయాంసహీ శివ్యాంచీ లాఖోలీ | మనసోక్త వాహిలీ బాబాంనీ | ||౧౩౮|| 
138. “ఎక్కడికెళ్తున్నావు, ఇక్కడే కూర్చో” అని అన్నారు. ఇంతలో తాత్యా, లక్ష్మీ వచ్చారు. వారిపై కూడా ఇష్టం వచ్చినట్లు బాబా తిట్లను కురిపించారు. 
అంగణాబాహేర జీ మండళీ | తయాంసహీ శివీగాళీ కేలీ | 
ఇతక్యాంత భాజల్యా భుఈముగాంచీ థైలీ | ఓఢూని ఘేతలీ పడలేలీ | ||౧౩౯|| 
139. సభా మండపం బయటున్న గుంపును కూడా బాగా తిట్టారు. అకస్మాత్తుగా, అక్కడ పడి ఉన్న వేయించిన వేరు శనగపప్పు సంచిని చూసి, అందుకున్నారు. 
బాబా అసతా త్వేషావేశీ | పళాలే జే భీతీనే చౌపాశీ | 
ఎకాద్యాచీ తీ మశీదీసీ | పిశవీ అసేల కీ పడలేలీ | ||౧౪౦|| 
140. కోపంగా బాబా నరసింహావతారాన్ని దాల్చినప్పుడు, భయంతో నలుదిక్కులకూ పరుగెత్తిన వారిదెవరిదో అయిన ఆ సంచి, మసీదులో పడిపోయి ఉంది. 

దాణే అసతీల పక్కా శేర | మూఠమూఠ కాఢూని బాహేర | 
చోళూనియా హాతావర | మారూని ఫుంకర సాఫ కరీత | ||౧౪౧|| 
141. ఆ సంచిలో సుమారు ఒక శేరంత వేరుశనగ గింజలుండి ఉంటాయి. పిడికెడు, పిడికెడుగా బయటకు తీసి, చేతితో నలిపి, పొట్టు ఊదేసి, శుభ్రం చేసి,
మగ తే స్వచ్చ ఝాలేలే దాణే | మహాజనీకడూన ఖావవిణే | 
ఎకీకడేస శివ్యాహీ దేణే | ఎకీకడే చోళణే సురూచ | ||౧౪౨|| 
142. వానిని, బాబా మహాజనికు తినటానికి ఇచ్చారు. అలా ఒక వైపు తిడుతూనే, మరోవైపు గింజలను నలపటం, 
ఖాఊన ఘే మ్హణత మ్హణత | స్వచ్చ దాణే హాతావర ఠేవీత | 
కాంహీ ఆపణహీ తోండాంత టాకిత | పిశవీ సంపవీత యేరీ తీ | ||౧౪౩|| 
143. శుభ్రమైన గింజలను అతని చేతిలో పోసి, “తినేసేయి!” అని అంటూ, కొన్నిటిని తామూ నోట్లో వేసుకుంటూ, సంచిని ఖాళీ చేశారు. 
దాణే సంపతా మ్హణతీ ఆణ | పాణీ లాగలీ మజలా తహాన | 
కాకా ఆణితీ ఝారీ భరూన | స్వయే తే పిఊన పీ మ్హణతీ | ||౧౪౪|| 
144. గింజలన్నీ అయిపోయాక, “నాకు దాహం వేస్తూ ఉంది, నీరు తీసుకునిరా” అని చెప్పారు. కాకా చెంబు నిండా నీరు తేగా, తాము కొంచెం త్రాగి, అతనినీ “త్రాగు” అని చెప్పారు. 
కాకా పితా తయాంస వదతీ | ఝాలీ జా తుఝీ బంద బృహతీ | 
మేలే కుఠే తే బామణ మ్హణతీ | జా తయాంప్రతీ ఘేఊన యే | ||౧౪౫|| 
145. కాకా నీరు త్రాగిన తరువాత “నీ మలద్వారం మూసుకుంది. ఆ బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళి వారిని పిలుచుకుని రా” అని అన్నారు. 
అసో పుఢే మండళీ ఆలీ | మశీద పూర్వీప్రమాణే భరలీ | 
ఫరశీస పునః సురూవాత ఝాలీ | మోడశీ థాంబలీ కాకాంచీ | ||౧౪౬|| 
146. తరువాత భక్తులు వచ్చారు. మసీదు మరల ఎప్పటి వలెనే నిండి పోయింది. నేల పని మొదలైంది. కాకా విరేచనాలు ఆగిపోయినై. 
జులాబావర హే కాయ ఔషధ | పరి ఔషధ తో సంతాంచా4 శబ్ద | 
దేతీల తో జో మనీ ప్రసాద | తయా న అగద ఆణిక | ||౧౪౭|| 
147. విరేచనాలకు ఇదేం మందు? సాధు సంతుల మాటే అసలు మందు. వారిచ్చినది ప్రసాదంగా తీసుకుంటే, దానికంటే గొప్పదైనది ఇంకొకటి లేదు. వారి మాటలను అనుగ్రహం అని అనుకుంటే, వేరే మందుల అవసరం ఉండదు. 
హరదా శహరచే ఎక గృహస్థ | పోటశూళ వ్యాధిగ్రస్త | 
చవదా వర్ష జాహలే త్రస్త | ఉపాయ సమస్త జాహలే | ||౧౪౮|| 
148. హార్దా పట్టణంలోని ఒక గృహస్థుడు కడుపులో శూల రోగంతో పదునాలుగేళ్ళు బాధపడ్డాడు. అన్ని ప్రయత్నాలూ చేశాడు. 
నామ తయాంచే దత్తోపంత | కర్ణోపకర్ణీ ఏకిలీ మాత | 
శిరడీత సాఈ మహా సంత | దర్శనే హరతాత ఉపాయ | ||౧౪౯|| 
149. అతని పేరు దత్తో పంతు. శిరిడీలోని సాయి మహాత్ములు దర్శనంతో కష్టాలను తొలగిస్తారని ఆనోటా ఆ నోటా అనగా విన్నాడు. 
పరిసూనియా ఏసీ కీర్తి | గమన కేలే శిరడీప్రతీ | 
చరణ సాఈచే మాథా వందితీ | కరూణా భాకితీ తయాంతే | ||౧౫౦||
150. ఇంత కీర్తి ఉన్నవారిని చూడాలని శిరిడీకి వెళ్ళాడు. సాయి పాదాలకు నమస్కారం చేసి, వారిని కరుణించమని ప్రార్థించాడు. 

బాబా చౌదా వర్షే భరలీ | పోటశూళే పిచ్చా పురవిలీ | 
పురే ఆతా పరమావధి ఝాలీ | శక్తి న ఉరలీ భోగావయా | ||౧౫౧|| 
151. ‘బాబా! ఈ కడుపు శూల నా వెంటబడి పదునాలుగేళ్ళు నిండాయి. ఈ బాధను భరించలేక పోతున్నాను. ఇది ఇక చాలు. ఈ బాధను ఇంకా అనుభవించే శక్తి నాలో లేదు. 
కేలా న కోణాచా ఘాతపాత | అవమానిలీ న మాయతాత | 
నాఠవే పూర్వజన్మీంచీ మాత | జేణే హే హోతాత కష్ట మజ | ||౧౫౨|| 
152. ‘నేనెవరినీ బాధపెట్టలేదు. తల్లి తండ్రులను అవమానించ లేదు. పూర్వ జన్మలో ఏం చేశానో గుర్తు లేదు కాని, దాని వలనే నాకీ కష్టం వచ్చి ఉంటుంది’ అని దుఃఖించాడు. 
కేవళ సంతప్రేమావలోకన | సంతప్రసాద ఆశీర్వచన | 
యేణేంచ హోయ వ్యాధి నిరసన | నలగే ఆన కాంహీహీ | ||౧౫౩|| 
153. సత్పురుషులు ప్రేమతో చూసే ఒక చూపు, వారి ఆశీర్వాదం, వారి ప్రసాదం మాత్రంతో రోగం నయమౌతుంది. వేరే ఇంకేమీ అవసరం లేదు. 
తైసాచ అనుభవ దత్తోపంతా | బాబాంచా కర పడతా మాథా | 
విభూతీ ఆశీర్వాద లాధతా | ఆరామ చిత్తా వాటలా | ||౧౫౪|| 
154. అలాంటిదే దత్తో పంతు అనుభవం. బాబా చేయి అతని తలమీద పడి, వారి ఆశీర్వాదం, విభూతి ప్రసాదం దొరకగానే, అతని మనసుకు శాంతి కలిగింది. 
మగ మహారాజాంనీ తయాంస | ఠేవూని ఘేతలే కాంహీ దివస | 
హళూహళూ పోటశూళాచా5 త్రాస | గేలా విలయాస సమూళ | ||౧౫౫|| 
155. సాయి మహారాజు అతనిని కొన్ని రోజులు అక్కడే ఉంచేసుకున్నారు. కొద్ది కొద్దిగా అతని కడుపు శూల బాధ పూర్తిగా నయమైంది. 
అసో ఏసే హే మహానుభావ | కాయ వానూ మీ తయాంచా ప్రభావ | 
పరోపకృతి హా నిత్య స్వభావ | జయా సద్భావ చరాచరీ | ||౧౫౬|| 
156. ఇలాంటి మహానుభావుని గొప్పతనాన్ని నేనెంతని వర్ణించను? ఇతరులకు ఉపకారం చేయటమే వారి స్వభావం. జగత్తులో ఉన్న జీవులందరికి వారు మంచినే చేస్తారు. 
గాఊ జాతా హే శబ్ద స్తోత్ర | ఎకాహూన ఎక విచిత్ర | 
ఆతా పూర్వానుసంధాన సూత్ర | భీమాజీ చరిత్ర చాలవూ | ||౧౫౭|| 
157. వారి లీలలను పొగడాలన్నా, ఆ లీలల గురించి గానం చేయాలన్నా, ఒకటి కంటే మరొకటి విచిత్రం. అదాలా ఉంచి, ముందు మొదలుపెట్టిన భీమాజీ కథను ఇప్పుడు తెలుసుకుందాం. 
అసో బాబా ఉదీ మాగవితీ | భీమాజీస థోడీ దేతీ | 
థోడీ తయాచే కపాళా ఫాంసితీ | శిరీ ఠేవితీ నిజ హస్త | ||౧౫౮|| 
158. తరువాత, విభూతిని తెప్పించి, కొంచెం భీమాజీకి ఇచ్చి, కొంచెం అతని నుదుట రాసి, అతని తలపై బాబా తమ చేతిని ఉంచారు. 
జావయా బిర్హాడీ ఆజ్ఞా ఝాలీ | పాటీల నిఘాలే పాయచాలీ | 
గాడీ పర్యంత ఆపులే పాఉలీ | గేలే హుషారీ వాటలీ | ||౧౫౯|| 
159. బసకు వెళ్ళటానికి బాబా ఆజ్ఞ ఇచ్చారు. పాటీలు కొన్ని అడుగులు వేశాడు. తరువాత, బండి వరకు తనే నడుచుకుంటూ వెళ్ళాడు. అతనికి చాలా హుషారుగా అనిపించింది. 
తేథూన నిర్దిష్ట జాగీంచ జాత | స్థాన జరీ హోతే సంకోచిత | 
పరి తే బాబాంహీ కేలే సూచిత | హేంచ కీ మహత్వ తయాంచే | ||౧౬౦||
160. బాబా చెప్పిన చోటుకు (భీమాబాయి ఇల్లు) అతను వెళ్ళాడు. అది చాలా ఇరుకుగా ఉంది. అయినా, అది స్వయంగా బాబా సూచించిన చోటు. అందుకే దానికి అంత మహత్వం. 

చోపణ్యాంనీ నవథర చోపిలీ | మ్హణూన జమీన హోతీ ఓలీ | 
తరీ బాబాంచీ ఆజ్ఞా మానిలీ | సోఈ లావిలీ తేథేంచ | ||౧౬౧|| 
161. దిమ్మెసతో అప్పుడే సమంగా చదును చేసిన నేల ఇంకా చెమ్మగా ఉంది. అయినా, బాబా ఆజ్ఞ కనుక తలవంచి, భీమాజీ అక్కడే తను ఉండటానికి ఏర్పాట్లను చేసుకున్నాడు.
గాంవాంత మిళతీ జాగా సుకీ | భీమాజీచ్యా బహుత ఓళఖీ | 
పరి స్థాన జే ఆలే బాబాంచే ముఖీ | సోడూన ఆణికీ నవ జాణే | ||౧౬౨|| 
162. ఆ ఊళ్ళో భీమాజీకి తెలిసినవారు చాలా మంది ఉన్నారు. అంతకంటే మంచి చోటు కూడా దొరికేది. కాని అది బాబా స్వయంగా చెప్పిన చోటు కనుక, అక్కడ వదిలి, ఇంకో చోటును చూసుకోలేడు కదా! 
తేథేంచ దోన పాథరిలే గోణ | వరీ పసరూనియా అంథరూణ | 
కరూనియా స్వస్థ మన | కేలే శయన పాటలానీ | ||౧౬౩|| 
163. అక్కడే రెండు గోనె గుడ్డలు పరచుకుని, వానిపై పరుపు వేసుకుని, పాటీలు నిశ్చింతగా పడుకున్నాడు. 
తేచ రాత్రీ ఏసే వర్తలే | భీమాజీస స్వప్న పడలే | 
బాళపణీచే పంతోజీ ఆలే | మారూ లాగలే తయాతే | ||౧౬౪|| 
164. ఆ రోజు రాత్రి అతనికి ఒక కల వచ్చింది. అందులో, అతని చిన్నప్పటి స్కూలు మాష్టారు వచ్చి అతన్ని బాగా కొట్టసాగాడు. 
హాతీ ఎక వేతాచీ కాఠీ | మారమారోని ఫోడిలీ పాఠీ | 
సవాఈ ముఖోద్గత వ్హావయాసాఠీ | కేలే బహు కష్టీ శిష్యాతే | ||౧౬౫|| 
165. భీమాజీ చేత ఒక పద్యం కంఠస్థం చేయించటానికి, మాష్టారు చేతిలో బెత్తం పుచ్చుకొని, భీమాజీని బాగా దెబ్బలు కొడుతూ, అతని వీపు చితకబాదాడు. శిష్యుణ్ణి చాలా కష్ట పెట్టాడు. 
సవాఈ తరీ హోతీ కైంచీ | జిజ్ఞాసా ప్రబళ శ్రోతయాచీ | 
మ్హణూన అక్షరే అక్షర తీచి | దేతో సమూళచి పరిసిలీ జీ | ||౧౬౬||
166. ఆ పద్యమేమిటో దానిని తెలుసుకోవాలని శ్రోతలు చాలా కుతూహల పడుతున్నారని, ఆ పద్యాన్ని అక్షరం అక్షరంగా వివరంగా చెబుతున్నాను. 

సవాఈ 
“జీస గమే పద అన్య గృహీ జరి ఠేవియలే జణు సర్పశిరీ | 
వాక్య జిచే అతి దుర్లభ జ్యాపరి దుర్మిళ తే ధన లోభి కరీ | 
కాంతసమాగమ తేంచ గమే సుఖపర్వ నసే జరి విత్త ఘరీ | 
శాంత మనే నిజ కాంత మతే కరి కృత్య ‘సతీ’ జని తీచ ఖరీ” | 

శ్రేష్ఠత
ఇతరుల ఇళ్ళల్లో అడుగు పెట్టటం, 
పాము తలపై అడుగు పెట్టటమే అని అనుకునే స్త్రీ| 
లోభి చేతినుండి అతి కష్టంగా రాలే డబ్బులా, 
చాలా తక్కువగా మాట్లాడే స్త్రీ| 
ఇంట్లో డబ్బు లేక పోయినా, 
పతితో ఉండటమే సుఖమని అనుకునే స్త్రీ| 
తన భర్త కోరిన విధంగా ప్రశాంతమైన మనసుతో నడుచుకునే స్త్రీ| 
ఈ స్వభావం కల స్త్రీయే నిజమైన సతి| 

పరి హే శాసన కశాసాఠీ | హే తో కాంహీచ కళేనా గోఠీ | 
పంతోజీ టాకీనా వేతాటీ | పేటలా హట్టీ అనివార | ||౧౬౭||
167. ఏ తప్పుకు ఈ శిక్ష అన్న సంగతి అసలు అర్థం కాలేదు. ఎంతో పట్టుదలతో, మాష్టారు బెత్తాన్ని వదలకుండా చితకబాద సాగారు. 
లగేచ పడలే దుసరే స్వప్న | తే తో యాహూని విలక్షణ | 
కోణీ ఎక గృహస్థ యేఊన | ఛాతీ దడపూన బైసలా | ||౧౬౮|| 
168. ఈ కల ముగిసిన వెంటనే, ఇంకో కల వచ్చింది. అది దీనికంటే విచిత్రమైనది. ఎవరో ఒకతను వచ్చి, అతని ఎదను అదిమి పట్టి దాని మీద కూర్చున్నాడు. 
హాతీ ఘేతలా వరవంటా | వక్షస్థళాచా కేలా పాటా | 
ప్రాణ కాసావీస ఆలే కంఠా | జణు వైకుంఠా నిఘాలే | ||౧౬౯|| 
169. నూరడానికి వాడే గుండ్రాయిని ఒక చేతిలో తీసుకుని, దానితో భీమాజీ ఎదను సన్నికల్లుగా చేసి బలంగా రుద్దుతుంటే, ప్రాణం గొంతుదాకా వచ్చి, వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు భీమాజీకి అనిపించింది. 
స్వప్న సరలే లాగలా డోళా | తేణే మనాస థోడా విరంగుళా | 
ఉదయాచలా సూర్య ఆలా | జాగా ఝాలా పాటీల | ||౧౭౦||
170. ఎంత కష్టకరమైనా, కలలు ముగిశాయి. అతనికి బాగా నిద్ర పట్టింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యుడు లేచేసరికి, పాటీలు మేలుకున్నాడు. 

హుశారీ వాటే అపూర్వ మనా | సమూళ మావళే రోగాచీ కల్పనా | 
పాటా వరవంటా ఛడీచ్యా ఖుణా | ఆఠవ కోణా పహాణ్యాచీ | ||౧౭౧|| 
171. అతని మనసుకు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. తన రోగం గురించిన ఆలోచనంతా పూర్తిగా మాయమైంది. బెత్తంతో కొట్టడం, సన్నికల్లు గుండ్రాయి ఇవన్నీ ఎక్కడ గుర్తుంటాయి? 
స్వప్నాస జన ఆభాస మ్హణతీ | పరి కధీ యే ఉలట ప్రతీతి | 
తేచ ముహూర్తీ రోగోచ్ఛిత్తి | దుఃఖనివృత్తి పాటిలా | ||౧౭౨|| 
172. కల నిజం కాదని, భ్రమ అని జనులంటారు. కాని, ఒక్కొక్కప్పుడు అలా అనుకునే దానికంటే విరుద్ధంగా అనుభవమౌతుంది. పాటీలుకు ఆ కల నిజమనిపించి, అప్పుడే తన రోగం వదిలి, బాధ తొలగిపోయింది. 
పాటీల మనీ బహు ధాలా | కీ వాటే పునర్జన్మ ఝాలా | 
మగ తో హళూహళూ నిఘాలా | దర్శనాలా బాబాంచే | ||౧౭౩|| 
173. మనసులో అతనికి చాలా సంతోషమైంది. పునర్జన్మ కలిగినట్లనిపించింది. బాబా దర్శనానికి మెల్ల మెల్లగా బయలుదేరి వెళ్ళాడు. 
పాహోని బాబాంచే ముఖచంద్రా | పాటిలాచే ఆనంద సముద్రా | 
భరతే దాటలే ఆనందముద్రా | నయనా తంద్రా లాగలీ | ||౧౭౪|| 
174. చంద్రుడిలాంటి బాబా ముఖము చూచి, పాటీలు మనసు సముద్రంలా పొంగింది. ఆ ఆనంద సాగరంలో అతను మునిగి పోగా, అతని కళ్ళు మూసుకుని పొయాయి. 
ప్రేమాశ్రూంచే వాహతీ లోట | పాయాంవరీ ఠేవిలే లలాట | 
వేత శాసన హృదయస్ఫోట | పరిణామ స్పష్ట సుఖకరీ | ||౧౭౫|| 
175. ప్రేమతో కళ్ళనుండి నీరు ప్రవహించ సాగింది. అలా ఉండగా, బాబా పాదాలపై తన తలనుంచాడు. బెత్తంతో శిక్షించినా, గుండేను గుండ్రాయితో బ్రద్దలు చేసినా, దాని ఫలితం ఆనందాన్నిచ్చింది. 
యా ఉపకారాసీ ఉతరాఈ | హోఈన మీ పామర కాఈ | 
హే తో అశక్య మ్హణవూని పాఈ | కేవళ డోఈ ఠేవితో | ||౧౭౬|| 
176. ‘బాబా! దరిద్రుడైన నేను, మీ ఉపకారానికి ఎలా బదులు తీర్చుకోగలను? అది అసలే సాధ్యం కాని పని. అందుకే, మీ పాదాలపై నా తలనుంచుతున్నాను. 
ఎణేంచ మాఝీ భరపాఈ | యాహూన అన్య ఉపాయ నాహీ | 
అచింత్య అతర్క్య హే నవలాఈ | బాబా సాఈ ఆపులీ | ||౧౭౭|| 
177. ‘దీంతో కొంత వరకైనా మీ ఋణాన్ని తీర్చుకోగలనేమో! ఇంతకంటే వేరే దారి లేదు. సాయి! మీ లీలలు ఏ మాత్రం అర్థం కానివి, మా ఆలోచనలకు ఎప్పటికీ అందనివి’. 
అసో ఏసే పవాడే గాత | పాటీల మహినా రాహిలే తేథ | 
పుఢే నానాంచే ఉపకార స్మరత | హోఊని కృతార్థ పరతలే | ||౧౭౮|| 
178. అని బాబా మహిమను పాడుతూ అక్కడ నెల రోజులున్నాడు. ఆ తరువాత నానాసాహేబు ఉపకారాన్ని కూడా తలచుకుని, ధన్యుడై, తిరిగి వెళ్ళిపోయాడు. 
ఏసే తే భక్తిశ్రద్ధాన్విత | పాటీల ఆనంద నిర్భరచిత్త | 
సాఈకృపా కృతజ్ఞతాయుక్త | వరచేవర యేత శిరడీస | ||౧౭౯|| 
179. మనసంతా బాబా మీద భక్తి శ్రద్ధలతో నిండి పోయి, వారి కృపకు కృతజ్ఞతతో, ఆనందం పొంగుతుండగా, పాటీలు తరచు శిరిడీ వచ్చేవాడు. 
దోన హాత ఎక మాథా | స్థైర్య శ్రద్ధా అనన్యతా | 
నలగే దుజే సాఈనాథా | ఎక కృతజ్ఞతా తే వ్హావీ | ||౧౮౦|| 
180. పాదాలను నమస్కరించటానికి రెండు చేతులూ, ఆ పాదాల మీద ఉంచడానికి ఒక తల, అంతులేని శ్రద్ధ, నమ్మకం ఇవే సాయినాథునికి కావలసినవి. ఇంతకంటే వేరే ఏవీ అనసరం లేదు. వారి పట్ల కృతజ్ఞత చూపితే, అంతే చాలు. 

హోతా కోణీ విపత్గ్రస్త | సత్యనారాయణా నవసిత | 
తయాచే సాంగవ్రత ఆచరత | సంకట నిర్ముక్త హోత్సాతా | ||౧౮౧|| 
181. మనం కష్టాలలో చిక్కుకున్నప్పుడు శ్రీ సత్యనారాయణ స్వామికి మ్రొక్కుకుని, ఆ కష్టాలనుండి బయట పడగానే, శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని సాంగోపాంగంగా ఆచరిస్తాము. 
తైసేంచ పాటీల సత్యసాఈవ్ర్తత | తై పాసావ కరూ లాగత | 
ప్రత్యేక గురూవారీ సదోదిత | సుస్నాత వ్రతస్థ రాహూని | ||౧౮౨|| 
182. అలాగే పాటీలు శ్రీసాయి సత్య వ్రతం చేయడం మొదలు పెట్టాడు. ప్రతి గురువారం శుభ్రంగా స్నానం చేసి, విధి పూర్వకంగా వ్రతాన్ని చేసేవాడు. 
జన సత్యనారాయణ కథా | పాటీల అర్వాచీన భక్తలీలామృతా | 
దాసగణూకృత సాఈచరితా | సప్రేమతా వాచీత | ||౧౮౩|| 
183. శ్రీ సత్యనారాయణ వ్రతంలో జనులు సత్యనారాయణ స్వామి కథలు చదువుతారు. దాసగణు రచించిన అర్వాచీన భక్త లీలామృతంలోని సాయి చరితను పాటీలు ప్రేమతో చదివేవాడు. 
త్యా పంచేచాళీస గ్రంథాధ్యాయీ | గణూదాస భక్తా అనేకా గాఈ | 
త్యాంతీల సాఈనాథ అధ్యాయ త్రయీ | సత్య సాఈ కథా తీ | ||౧౮౪|| 
184. నలభై – ఐదు అధ్యాయాలున్న ఈ గ్రంథంలో అనేక భక్తుల గురించి దాసగణు గానం చేశాడు. వానిలో సాయినాథుని గురించి మూడు అధ్యాయాలు ఉన్నాయి. ఇవి సాయిసత్య వ్రతానికి కథలు. 
వ్రతాంమాజీ ఉత్తమ వ్రత | పాటీలహీ అధ్యాయత్రయీ వాచీత | 
పావలే సౌఖ్య అపరిమిత | స్వస్థ చిత్త జాహలే | ||౧౮౫|| 
185. వ్రతాలలో ఉత్తమమైన ఈ వ్రతంలో, పాటీలు ఈ మూడు అధ్యాయాలను చదివేవాడు. అలా అతను అంతులేని సుఖాన్ని పొందాడు. అతని మనసుకు శాంతి కలిగింది. 
ఆప్త ఇష్ట బంధూ సమేత | పాటీల మిళవూన సోయరే గోత | 
కరీత నేమే సత్య సాఈవ్రత | ఆనందభరిత మానసే | ||౧౮౬|| 
186. ఆప్తులు, బంధు మిత్రులు, వీరందరితో ఆనందమైన మనసుతో, నియమం తప్పకుండా సాయిసత్య వ్రతాన్ని పాటీలు ఆచరించేవాడు. 
నైదేద్యాచీ తీచ సవాఈ | మంగలోత్సవ తైసాచి పాహీ | 
తేథే నారాయణ యేథే సాఈ | న్యూన నాహీ ఉభయార్థీ | ||౧౮౭|| 
187. పూజ చేసే విధానం, నైవేద్యం అన్నీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రకారమే. అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి, ఇక్కడ శ్రీ సాయినారాయణ స్వామి. రెంటిలో ఏదీ తక్కువ కాదు. 
పాటిలానే ఘాతలా పాఠ | గాంవాంత పడలా తోచ పరిపాఠ | 
యా సత్య సాఈవ్రతాచే పాఠ | లాగోపాఠ చాలలే | ||౧౮౮|| 
188. పాటీలు ఈ వ్రతాన్ని మొదలు పెట్టాడు. రాను రాను, ఊరిలో ఒకరి తరువాత ఒకరు ఈ శ్రీసాయిసత్య వ్రతాన్ని ఆచరించగా, వాడుక లోకంలో ఇదొక పరిపాటై పోయింది. 
ఏసే హే సంత కృపాళ | ప్రాప్త హోతా ఉదయకాళ | 
దర్శనే హరితీ భవజంజాళ | కాళహీ మాగే పరతవితీ | ||౧౮౯|| 
189. సాధు సంతుల లీలలు ఇలా ఉంటాయి! ఇటువంటి సత్పురుషులు తమ చూపుతోనే ప్రపంచంలోని దుఃఖాలను తొలగిస్తారు. భక్తులకు భాగ్యముంటే, వారి చావును కూడా ఈ సత్పురుషులు వెనక్కి మళ్ళిస్తారు. 
ఆతా యేథూని పుఢీల కథా | వర్ణీల ఎకాచీ సంతతి చింతా | 
సంతాసంతాంచీ ఎకాత్మతా | చమత్కారతా ప్రకటేల | ||౧౯౦||
190. ఇక తరువాతి కథలో, సంతానం లేకపోవటం చేత, ఒకరికి కలిగిన చింత గురించిన వర్ణన. ఇంకా, దీనిలో, అందరు సత్పురుషులూ ఒక్కటే అన్న సంగతి చమత్కారంగా తెలుపటం జరుగుతుంది. 

నాందేడ శహరచా ఎక రహివాసీ | మోఠా శ్రీమంత జాతీచా పారసీ | 
మిళవీల బాబాంచే ఆశీర్వాదాసీ | పుత్ర పోటాసీ యేఈల | ||౧౯౧|| 
191. నాందేడు పట్టణంలోని, ఒక గొప్ప శ్రీమంతుడైన పార్శీ జాతి భక్తునికి, బాబా ఆశీర్వాదం వలన మగ సంతానం కలగటం గురించి చెప్పబడింది. 
మౌలీసాహెబ తేథీల సంత | తయాంచీ ఖూణ బాబా పటవీత | 
పారసీ మగ ఆనందభరిత | గేలా పరత నిజగ్రామా | ||౧౯౨|| 
192. పార్శీ భక్తుడు ఆనందంతో తన గ్రామానికి వెళ్ళి పోవటం, తరువాత, నాందేడులోని మౌల్వీ సాహేబు అనే సాధువుకు, బాబాకు రూపంలో తేడా ఉన్నా, ఆత్మలు ఒక్కటే అని తెలుస్తుంది. 
అతి ప్రేమళ ఆహే కథా | శ్రోతా పరిసిజే స్వస్థ చిత్తా | 
కళోన యేఈల సాఈచీ వ్యాపకతా | తైసీచ వత్సలతా తయాంచీ | ||౧౯౩|| 
193. ప్రేమతో నిండిన ఈ కథను, శాంతమైన మనసుతో శ్రోతలూ వినండి. సాయియొక్క వాత్సల్యం, అన్ని చోట్లా వారే ఉండటం మొదలైన అంశాలు మనకు తెలుస్తాయి. 
పంత హేమాడ సాఈసీ శరణ | సంతా శ్రోతయా కరితో నమన | 
పుఢీల అధ్యాయీ హే నిరూపణ | సాదర శ్రవణ కీజే జీ | ||౧౯౪|| 
194. హేమాడు పంతు సాయికి శరణుజొచ్చి, సాధువులకు, శ్రోతలకు నమస్కరించి, తరువాతి అధ్యాయాన్ని శ్రద్ధగా వినండి అని వేడుకుంటున్నాడు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | భీమాజీక్షయనివారణం నామ | 
| త్రయోదశోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||



టిపణీ: 
1. త్రాసలే, హతాశ ఝాలే. 2. నారాయణ గోవింద చాందోరకర ఊర్ఫ నానాసాహేబ. 
3. లీలా. 
4. శిరడీచే రా. మాధవరావ దేశపాండే యానా ఎకదా మూళవ్యాధ ఝాలీ. త్యాంనీ మహారాజాంనా సాంగితలే. మహారాజ మ్హణాలే, “ఆపణ దుపారీ ఔషధ కరూ.” త్యాప్రమాణే దుపారీ మహారాజానీ సోనాముఖీంచా కాఢా కేలా వ త్యాంతలా థోడా మాధవరావాంనా దిలా. త్యాబరోబర మూళవ్యాధ బంద ఝాలీ. పుఢే దోన వర్షాంనీ త్యాంనా పున్హా మూళవ్యాధ ఝాలీ. మహారాజాంనీ పూర్వీ కాఢా దిలా హోతా, మ్హణూన మాధవరావాంనీ ఆపల్యాచ విచారానే కాఢా ఘరీ తయార కరూన తో ఘాతలా. త్యా ఉపాయానే బరే న వాటతా మూళవ్యాధ జాస్తచ భడకలీ. పుఢే కాహీ దివసాంనీ మహారాజాంచ్యా కృపేనే తీ బంద ఝాలీ. సారాంశ, గుణ ఔషధాత నసూన మహారాజాంచ్యా హాతాంత వ ఆశీర్వాదాంత అసే. 
5. కాకా మహాజనీంచే వడీలబంధూ రా. గంగాధరపంత యాంనా పోటశూళాచా ఆజార పుష్కళ వర్ష హోతా. దరవర్షీ త్యాపాసూన త్యాంనా అతిశయ త్రాస హోత అసే. త్యాంనీ మహారాజాంచీ కీర్తీ ఏకల్యావరూన తే తికడే గేలే వ మహారాజాంజవళ గార్హణే కేలే. మహారాజాంనీ పోటాలా హాత లావలా వ “యేథే దుఖతే కా?” మ్హణూన విచారలే. గంగాధరపంతానీ ‘హోయ’ అసే ఉత్తర దిలే. మహారాజ మ్హణాలే, “అల్లా బరే కరీల”. తేవ్హాపాసూన గంగాధరపంతాంచా పోటశూళ జో గేలా తో పున్హా ఉమటలా నాహీ. ఎకదా నానాసాహేబ చాందోరకర యాంస పోటశూళాచా వికార ఝాలా. తో ఇతకా కీ, రాత్రందివస ఎకసారఖే తే తళమళత అసత. త్యాంనా డాక్టరాంనీ పిచకార్యా దిల్యా; పణ కాహీ ఉపయోగ ఝాలా నాహీ. శేవటీ తే మహారాజాంకడే గేలే వ మహారాజాంనీ త్యాంనీ బర్ఫీ తుపాత ఖలూన ఖావయాస సాంగితలీ వ త్యా ఉపాయానే త్యాంచ్యా అజిబాత బంద ఝాలా.

No comments:

Post a Comment