|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౧౨ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
జయ జయ సద్గురూ సాఈనాథా | నమితో చరణీ ఠేఊని మాథా |
నిర్వికారాఖండైక స్వరూపా | కరీ కృపా శరణాగతా | ||౧||
1. జయ జయ సద్గురు సాయినాథా! మీ పాదాలలో తలనుంచి నమస్కరిస్తున్నాను. ఎల్లప్పుడూ ఆకారంలేని ఆత్మ రూపంలో మీరు లీనమై ఉండి, మీకు శరణుజొచ్చిన వారిని కరుణిస్తారు.
అద్వైత బోధే ద్వైత ఛందా | మందాచ్యాహీ వారిసీ | ||౨||
2. సచ్చిదానందా! ఆనంద కందా! సంసార సాగరంలో చిక్కుకుని కష్ట పడుతున్నవారికి, సుఖాలను కలిగిస్తారు.
అవఘ్యా ఠాయీ పూర్ణ భరలే | గగన జైసే హే విస్తారలే | తేంచ కీ తవ స్వరూప రేఖాటలే | అనుభవీ భలే దైవశాలీ | ||౩||
3. ఆకాశం వలె ఈ జగతినంతా పూర్తిగా వ్యాపించి ఉన్న మీ రూపాన్ని, తలచుకుని అనుభవించిన వారు నిజంగా భాగ్యవంతులు.
సాధూంచే వ్హావే సంరక్షణ | అసాధూచే సమూళ నిర్దళణ | ఎతదర్థచి ఈశ్వరావతరణ | సంత హే విలక్షణ యా పరతే | ||౪||
4. సాధువులను రక్షించటానికి, చెడ్డవారిని మొత్తంగా నశింప చేయటానికి, దేవుడు అవతరిస్తాడు. కాని, ఈ సత్పురుషుల లక్షణాలే వేరు.
సాధు అసాధు సంతా సమాన | ఎక మోఠా ఎక ఊన | హే జాణేనా జయాంచే మన | సమసమాన ఉభయా జే | ||౫||
5. వారికి సాధువులు, సాధువులు కానివారు, అంతా సమానమే. ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అనే భేద భావం వారికి తెలియదు. వారికి ఇద్దరూ ఒకటే.
ఈశ్వరాహూన సంత మోఠే | అసాధూంస ఆధీ లావితీ వాటే | మన జయాంచే తిళతిళ తుటే | ప్రేమ దాటే దీనార్థ | ||౬||
6. సత్పురుషులు దేవుడికంటే గొప్పవారు. ఎందుకంటే, వారు మొదట చెడ్డవారిని మంచి దారిలో పెట్టాలని ప్రయత్నిస్తారు. దీనుల కోసం, వారి మనసు ప్రేమతో తపించి పోతుంటుంది.
భవసాగరాచే హే అగస్తి | అజ్ఞాన తమాచే హె గభస్తి | పరమాత్మ్యాచీ ఎథేంచ వస్తీ | వస్తుతః హే తదభిన్న | ||౭||
7. సంసార సాగరాన్ని, అగస్త్య ఋషివలె, సాయి ఔపోశనం పడతారు. అజ్ఞానమనే చికటిని తొలగించి జ్ఞానమనే వెలుగునిచ్చే సూర్యులు వీరు. దేవుడు వీరిలోనే ఉంటాడు. అసలుకు, వీరు దేవుడికంటే వేరే కాదు.
ఏశాంతీల హా సాఈ మాఝా | అవతరలా భక్తకాజా | మూర్తీమంత జ్ఞానరాజా | కైవల్యతేజాధిష్టిత | ||౮||
8. ఇలాంటి సత్పురుషులలో మన సాయి ఒకరు. భక్తుల కోసం అవతరించిన జ్ఞాన రాజు. దేవుడితో ఒకటైనప్పుడు కలిగే వెలుగుతో, వారు వెలిగిపోతారు.
జీవ మాత్రీ అత్యంత మమతా | ఇతరత్ర అత్యంత అనాసక్తతా | ఠాయీ సత్తా ఠాయీ విరక్తతా | నిర్వైర సమతా సర్వత్ర | ||౯||
9. అన్ని ప్రాణుల మీద వారికి విపరీతమైన ప్రేమ. మిగతా సంగతుల గురించి అసలు పట్టించుకోరు. ఒక చోట ఆసక్తి, ఇంకొక చోట అసలు ఆసక్తి లేనట్లు కనిపించినా, అన్ని చోట్లా వారికి సమ భావమే.
జయా న శత్రు మిత్రభావ | సరిసే జయా రంకరావ | ఏసా జో సాఈ మహానుభావ | ఏకా ప్రభావ తయాచా | ||౧౦||
10. వారికి మిత్రులు శత్రువులు అనే భావం అసలు ఉండదు. రాజైనా, పేదైనా వారికి ఒకటే. ఇలాంటి సాయి మహానుభావుని గొప్పతనాన్ని వినండి.
సంత ఆపుల్యా పుణ్య కోడీ | వేంచితీ భక్త ప్రేమాచ్యా ఓఢీ |
న పాహతీ ఆడ పర్వత దరడీ | ఘాలితీ ఉడీ భక్తార్థ | ||౧౧||
11. వారు సంపాదించిన పుణ్య సంపదను, భక్తులపై ప్రేమతో, వారి కోసం ఖర్చు పెడతారు. కొండలు, గుట్టలు ఏ అడ్డంకులు వచ్చినా, లెక్క చేయక, భక్తుల కోసం వాటిని దాటి వస్తారు.
ఎక అజ్ఞానీ మ్హణూన నేణతీ | పరమార్థ కాయ కశాశీ ఖాతీ | స్త్రీ పుత్ర ధన కామీ లోలంగితీ | బిచారీ నేణతీ తీ సోడా | ||౧౨||
12. పరమార్థం అంటే ఏమిటో తెలియక, భార్యాబిడ్డల మీద మోహంతో, డబ్బు సంపాదనలో మునిగి పోయిన వారిని, అజ్ఞానులని తలచి వదిలి వేయాలి.
ఏసీ నేణతీ బాళీ భోళీ | దేవ తయాంతే కృపా కురవాళీ | దేవాస విముఖ దేవా నిరాళీ | అభిమాన పోళీ తయాంతే | ||౧౩||
13. ఇలాంటి అమాయకులను దేవుడు కరుణిస్తాడు. కాని, దేవుడికి దూరంగా, అహంకారంతో ఉన్నవారి అభిమానాన్ని అణచి వేస్తాడు.
అజ్ఞానియాంచీ యేఈల కీంవ | సంత ఎకాదా లావీల జీవ | విశ్వాస ప్రకటేల లాఠీవ | జ్ఞానాచీ తాఠీవ నిష్ఫల | ||౧౪||
14. సాధువులు అజ్ఞానులను కరుణిస్తారు. దానితో వారికి సాధువులపై నమ్మకం కలుగుతుంది. తమకే జ్ఞానముందని అహంకారం పడటం దండుగ.
పండితంమన్య మూఢ మతీ | శుష్కాభిమానే ఉగీచ ఫుగతీ | భక్తిపంథ అవహేళితీ | నకో సంగతీ తయాంచీ | ||౧౫||
15. తామే పండితులమని మూర్ఖులు ఉత్తుత్తి అభిమానంతో పొంగిపోతారు. భక్తి మార్గాన్ని వారు అవహేళన చేస్తారు. అలాంటి వారి సహవాసం మనకు పనికి రాదు.
నకో వర్ణసంకర బండ | నకో వర్ణాభిమాన థోతాండ | న వ్హా వర్ణాశ్రమ ధర్మలండ | పాఖండ పండిత న వ్హావే | ||౧౬||
16. వర్ణాశ్రమానికి విరుద్ధంగా కాని, దాని పరంగా కాని, మనకు వాద వివాదాలు అనవసరం. వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తున్నాం అనే అహంకారము వద్దు. వీటితో పాషండ (వేదాలను వ్యతిరేకించిన) పండితులు కాకండి.
వేద వేదాంగ పారంగత | జ్ఞానగర్వే మదోన్మత్త | భక్తి మార్గాచే ఆడ యేత | తయాంచీ ధడగత దిసేనా | ||౧౭||
17. వేద వేదాంగాలను తెలుసుకున్న వారు, జ్ఞాన గర్వంతో, అహంకారంతో భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి తరించే మార్గం లేదు.
అజ్ఞానీ విశ్వాస పడిపాడే | తరేల తో భవభయ సాంకడే | పరీ యా శాస్త్ర పండితాంచే కోడే | కదా నులగడే కవణాతే | ||౧౮||
18. అమాయకులు నమ్మకం ఆధారంతో సంసార సాగరంలోని కష్టాలనుంచి బయట పడతారు. కాని, శాస్త్ర పండితుల చిక్కులను ఎవరూ విడదీయలేరు.
సంతాపాయీ ఠేవితా విశ్వాస | అజ్ఞానియా అజ్ఞాన నిరాస | జ్ఞానాభిమానియా న వికల్ప సాయాస | ఉపజేల తయాంస సద్భావ | ||౧౯||
19. సత్పురుషుల మీద నమ్మకం ఉంచితే, అజ్ఞానుల అజ్ఞానం తొలగిపోతుంది. జ్ఞానం అభిమానులకు అనుమానాలు తొలగిపోయి, మంచి భావన, ఆలోచనలు మొదలౌతాయి.
అసో ఎకదా సుదైవ పరిపాటీ | కైసీ ఘడలీ విచిత్ర గోష్టీ | హోతీ ఎకా కర్మఠాచే లలాటీ | అలభ్య భేటీ సాఈచీ | ||౨౦||
20. ఒక సారి ఒక విచిత్రమైన ఘటన జరిగింది. దైవ నిర్ణయం ప్రకారం, సంప్రదాయాన్ని కఠోరంగా పాటించే ఒక భక్తునికి సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం కలిగింది.
తయాచా సంకల్ప హోతా వేగళా | యోగాయోగ హోతా నిరాళా |
తేణేంచ శిరడీచా లాభ ఘడలా | దృష్టీస పడలా నిజగురూ | ||౨౧||
21. అతను అనుకున్నది వేరు. కాని, దైవం అనుకున్నది వేరు. దైవ నిర్ణయం ప్రకారం, శిరిడీ ప్రయాణ యోగం కలిగి, అక్కడ తన గురువు దర్శనం చేసుకున్నాడు.
శ్రవణ కరాజీ ఆవశ్యక | ప్రేమ నిదర్శక గురూభక్తా | ||౨౨||
22. గురువు మహిమను తెలియ చేసే రసభరితమైన ఆ కథను తప్పక వినండి. అది గురుభక్తుల ప్రేమకు ఉదాహరణ.
నాశిక క్షేత్రస్థ కర్మఠ సోంవళే | అగ్నిహోత్రీ ఉపనామ ముళే | పూర్వ పుణ్యాఈచ్యా బళే | శిరడీస ఆలే ఎకదా | ||౨౩||
23. నాసిక అనే ఊరిలో నివాసి. సంప్రదాయాలను అతిగా పాటించేవాడు. ఆచారాలను నిష్ఠగా పాటించే, ఒక అగ్నిహోత్రి. ఇంటి పేరు ముళే. వెనుకటి పుణ్య బలంతో ఒక సారి శిరిడీకి వచ్చాడు.
గాంఠీ నసతా హే బళ | శిరడీస కోణీహీ ఠరేనా పళ | కోణాచా కితీహీ నిశ్చయ ప్రబళ | న చలే చళవళ బాబాంపుఢే | ||౨౪||
24. ఎంతో పుణ్యం సంపాదించి ఉండకపోతే, శిరిడీలో ఎవరూ కూడా, ఒక క్షణమైనా ఉండ లేరు. ఎవరిదైనా, ఎంతటి దృఢ నిశ్చయమైనా, బాబా ఎదుట అవేవీ సాగవు.
కోణీ మ్హణేల మీ జాఈన | మనమానే తో తేథే రాహీన | నాహీ తయాచ్యా హే ఆధీన | పరాధీన తో సర్వస్వీ | ||౨౫||
25. శిరిడీ వెళ్ళి, నాకు తోచినంత కాలం నేను అక్కడుంటానని ఎవరైనా అనుకోవచ్చు. కాని, అది వారి చేతిలో లేదు. అనుకున్నట్లు జరగదు. అక్కడ అందరూ ఇంకొకరి అధీనంలో ఉండాల్సిందే.
ఏసే మీ మీ మ్హణతా | థకలే కిత్యేక నిశ్చయ కరితా | సాఈ ఎక స్వాతంత్ర్య దేవతా | గళే అహంతా ఇతరాంచీ | ||౨౬||
26. ఇలా నేను నేననే అహంకారంతో అనుకున్నది చేయలేక అలసిపోయారు. తామనుకున్న ప్రకారమే చేసే ఒక స్వతంత్ర దైవం బాబా. వారి ఎదుట ఇతరుల అహంకారం కరిగిపోతుంది.
అపులీ పాళీ ఆలియావీణ | బాబాంస హోఈనా అపులే స్మరణ | కానీ న యేఈ తద్గుణవర్ణన | దర్శన స్ఫురణ కోఠూన | ||౨౭||
27. మన వంతు వస్తేనే గాని, బాబాకు మనం గుర్తుకు రాము. వారి గుణగణాల వర్ణన మన చెవులకు వినిపించదు. ఇక వారిని తలచు కోవటం, వారిని దర్శించుకోవటం ఎక్కడిది?
జావే సాఈ సమర్థ దర్శనా | అసతా కిత్యేకాంచీ కామనా | యోగచి ఆలా నాహీ త్యాంనా | సాఈ నిర్వాణాపర్యంత | ||౨౮||
28. చాలా మంది సాయి సమర్థుల దర్శనానికి వెళ్ళాలని అనుకున్నా, సాయి నిర్వాణం వరకు వారికి ఆ అదృష్టం కలగలేదు.
పుఢే జాఊ జాఊ మ్హణతా | ఆడ యేఊన దీర్ఘసూత్రతా | రాహిలే కిత్యేక యేతా యేతా | బాబాహీ నిఘనతా పావలే | ||౨౯||
29. ఇంకా కొందరు తరువాత పోదాం, ఆ పై పోదాం అని అనుకుంటూ సమయాన్ని వృథా చేసిన వారికి, ఏవో అడ్డంకుల వలన ప్రయాణం కుదరలేదు. ఇంతలో బాబా సమాధి చెందారు.
ఆజ ఉద్యా కరిత రాహిలే | అఖేర ప్రత్యక్ష భేటీస అంతరలే | ఏసే పశ్చాత్తాప పావలే | అంతీ నాగవలే దర్శనా | ||౩౦||
30. ఇవాళ పోదాం, రేపు పోదాం అని అనుకుంటూ, చివరకు బాబా ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పోగొట్టుకుని, చాలా పశ్చాత్తాప పడ్డారు.
ఏసియాంచీ జీ రాహిలీ భూక | పరిసతా కథా యా ఆదర పూర్వక |
పురవీల దుధాచీ తహాన తాక | విశ్వాస ఎక ఠేవితా | ||౩౧||
31. సాయి దర్శనం చేసుకోవాలనే కోరిక తీరని వారు, ఈ కథల మీద నమ్మకం ఉంచి, భక్తి శ్రద్ధలతో వింటే, పాలకు బదులు మజ్జిగ దొరికినట్లు, బాబాయొక్క దర్శన దాహం కొంత వరకు తీరుతుంది. కాని, నమ్మకమొకటే ఉండాలి.
బరే జే భాగ్యే కోణీ గేలే | దర్శన స్పర్శనే చిత్తీ ధాలే | తే కాయ తెథే యథేచ్ఛ రాహిలే | బాబాంనీ ఠేవిలే పాహిజే | ||౩౨||
32. మన అదృష్టం కొద్దీ శిరిడీ వెళ్ళి, సాయి దర్శన, వారి స్పర్శ సుఖాలను పొందిన వారు, బాబా ఉంచితే తప్ప, అక్కడ తమ ఇష్టం కొద్దీ ఉండగలిగేవారా, బాబా ఉంచాలి గాని!
అపుల్యాపాయీ కోణా న జావవే | రాహూ మ్హణతా కోణా న రాహవే | ఆజ్ఞా హోఈ తోంచ వసావే | మాఘారా జావే జా మ్హణతా | ||౩౩||
33. ఎవరైనా కాని, వారు అనుకున్నట్లు అక్కడికి వెళ్ళలేరు. వెళ్ళినా, ఎంత బలమైన కోరిక ఉన్నా, ఉండలేరు. బాబా అనుమతిని ఇచ్చినంత వరకే ఉండగలము. “వెళ్ళి పో” అంటే తిరిగి వెళ్ళి పోవలసిందే.
ఎకదా కాకా మహాజనీ | శిరడీస గేలే ముంబఈహూనీ | ఎక ఆఠవడా శిరడీస రాహునీ | పరతావే మనీ తయాంచే | ||౩౪||
34. ఒక సారి, కాకా మహాజని ముంబైనుండి శిరిడీ వెళ్ళాడు. ఒక వారం రోజులు అక్కడ ఉండాలన్నది అతని కోరిక.
చావడీ సుందర శృంగారీత | బాబాంసమోర పాళణా టాంగీత | కృష్ణజన్మాచా ఉత్సవ కరీత | ఆనందే నాచత భక్తజన | ||౩౫||
35. శ్రీకృష్ణ జన్మాష్టమి కోసమని, చావడి అందంగా అలంకరించ బడింది. బాబా ఎదుట ఊయల వ్రేలాడ కట్టబడి ఉంది. భక్తులు శ్రీకృష్ణ జన్మోత్సవంలో ఆనందంగా నాట్యం చేస్తున్నారు.
గోకుళ అష్టమీచాహీ సోహళా | ఆనందానే పహావా డోళా | సాధూని ఏసీ మౌజేచీ వేళా | కాకా శిరడీలా పాతలే | ||౩౬||
36. ఆ గోకులాష్టమి వైభవాన్ని ఆనందంగా, కళ్ళారా చూడాలనే కోరికతో, కొంత ముందుగానే, కాకా శిరిడీ చేరుకున్నాడు.
ఆరంభీచ బాబాంచ్యా దర్శనా | జాతా బాబా పుసతీ తయాంనా | “పరతణార కేవ్హా నిజ సదనా” | విస్మిత మనా తై కాకా | ||౩౭||
37. కాని, బాబా దర్శనానికే మొదట వెళ్ళగా, బాబా అతనిని, “మీ ఇంటికి ఎప్పుడు వెళ్ళుతున్నావు?” అని అడిగారు. కాకా ఆశ్చర్యపోయాడు.
భేటతా క్షణీంచ హా కా ప్రశ్న | కాకా జాహలే విస్మయాపన్న | రాహూ శిరడీంత ఆఠ దిన | హోతే కీ మన తయాంచే | ||౩౮||
38. ‘కలిసిన వెంటనే ఇదేం ప్రశ్న’ అని కాకా తనలో తాను ఆశ్చర్య పడ్డాడు. వారం రోజులు ఉండాలనే కోరికతోనే అతను శిరిడీ వచ్చాడు.
బాబాచ జేవ్హా స్వయే పుసతీ | ఉత్తర దేణే కాకాప్రతీ | తేంహీ వాటే బాబాచ సుచవితీ | మ్హణూన దేతీ యోగ్యతే | ||౩౯||
39. కాని బాబాయే స్వయంగా ఈ ప్రశ్న అడిగి, చెప్పాల్సిన జవాబునూ సూచించారు. కాకా చెప్పిన సమాధానం చాలా సరియైనదే.
“బాబా జేవ్హా దేతీల ఆజ్ఞా | పరతేన తెవ్హా అపులే సదనా” | ప్రత్యుత్తర యేతాంచ కాకాంచ్యా వదనా | ‘ఉదయీక జా నా’ మ్హణాలే | ||౪౦||
40. ‘బాబా ఎప్పుడు ఆజ్ఞ చేస్తే అప్పుడు వెళ్తాను’ అని జవాబిచ్చాడు. కాకా చెప్పిన జవాబు విని బాబా “ఉదయం వెళ్దువు గాని లే” అని అన్నారు.
ఆజ్ఞా కేలీ శిరసా ప్రమాణ | కరూన బాబాంసీ అభివందన |
అసతా అష్టమీసారఖా సణ | కేలే ప్రయాణ తేచ దినీ | ||౪౧||
41. భక్తితో బాబా ఆజ్ఞను కాకా తలమీద పెట్టుకుని, వారి పాదాలకు నమస్కారం చేసి, కృష్ణాష్టమి పండుగ రోజే శిరిడీనుంచి బయలుదేరాడు.
మాలక మార్గ ప్రతీక్షాచ కరితీ | కాకా పరతతీ కేవ్హా హీ | ||౪౨||
42. ఊరు చేరిన తరువాత, తన కార్యాలయానికి వెళ్ళి చూడగా, కాకా ఎప్పుడు తిరిగి వస్తాడా అని, అక్కడ అతని యజమాని అతని రాకకు ఎదురు చూస్తున్నాడు.
మునీమ ఎకాఎకీ అజారీ | మాలకాస కాకాంచీ జరూరీ | కాకాంనీ త్వరిత యావే మాఘారీ | పత్ర శిరడీవరీ మోకలీలే | ||౪౩||
43. గుమాస్తాకు అకస్మాత్తుగా జబ్బు చేయటంతో, యజమానికి కాకా అవసరం తప్పని సరియై, అతనిని వెంటనే రమ్మని అప్పటికే శిరిడీకి ఉత్తరం వ్రాశాడు.
కాకా తేథూన నిఘాల్యావరీ | టపాలవాలా తపాస కరీ | మగ తే పత్ర పాఠవీ మాఘారీ | మిళాలే ఘరీ కాకాంస | ||౪౪||
44. శిరిడీనుండి కాకా బయలుదేరాక, టపాలా వాడు వాకబు చేసి, ఉత్తరాన్ని త్రిప్పి పంపగా, అది కాకాకు ఇంట్లో దొరికింది.
తేచ పహా కీ యాచే ఉలట | శ్రవణ కరా హీ అల్ప గోష్ట | భక్తాంస న కళే నిజాభిష్ట | సాఈ తే స్పష్ట జాణతసే | ||౪౫||
45. దీనికి విరుద్ధంగా, ఇంకో చిన్న కథను వినండి. తమ మంచి ఏమిటో భక్తులకే తెలియదు. కాని, బాబాకు అది స్పష్టంగా తెలుసు.
ఎకదా నాశికచే ప్రఖ్యాత వకీల | నామే భాఊసాహేబ ధుమాళ | బాబాంచే ఎక భక్త ప్రేమళ | ఆలే కేవళ దర్శనా | ||౪౬||
46. నాసికులో భావుసాహేబు ధుమాళ అను ప్రసిద్ధి చెందిన వకీలు ఉండేవాడు. బాబా అంటే అతనికి విపరీతమైన భక్తి, ప్రేమ. ఒక సారి అతను సాయి దర్శనానికై శిరిడీకి వచ్చాడు.
ఉభ్యా ఉభ్యా ఘ్యావే దర్శన | కరూనియా పాయీ నమన | ఘేఊని ఉదీ ఆశిర్వచన | జావే పరతోన హే పోటీ | ||౪౭||
47. దర్శనం చేసుకుని, బాబా పాదాలకు నమస్కరించి, విభూతిని, వారి ఆశిస్సులను తీసుకుని తొందరగా వెంటనే వెళ్ళి పోవాలని అతని ఉద్దేశం.
పరతతా వాటేవర నిఫాడాస | ఉతరణే హోతే ధుమాళాంస | తేథే ఎకా ముకదమ్యాస | జాణే తయాంస ఆవశ్యక | ||౪౮||
48. తిరుగు ప్రయాణంలో, నిఫాడ అను ఊరికి ఒక కేసు కోసం ధుమాళు వెళ్ళవలసిన అవసరం ఉంది.
హా జరీ తయాంచా బేత | బాబా జాణత ఉచితానుచిత | పరత జావయా ఆజ్ఞా మాగత | బాబా న దేత తీ త్యాంనా | ||౪౯||
49. అతని ఆలోచన అలా ఉంది కాని, బాబాకు అతని మంచి గురించి బాగా తెలుసు. అందుకే, తిరిగి వెళ్ళిపోవటానికి బాబా అనుమతి కోసం ధుమాళు వెళ్ళితే, వారు అతనికి అనుమతిని ఇవ్వలేదు.
ఆఠవడా ఎక ఠేవూన ఘేతలే | ఆజ్ఞా దేణ్యాచే స్పష్ట నాకారిలే | సునావణీచే కార్య లాంబలే | తైసేచ గేలే తీన1 వార | ||౫౦||
50. అనుమతిని ఇవ్వటానికి స్పష్టంగా నిరాకరించి, ఒక వారం రోజులు అక్కడే ఉంచేశారు. కేసు వాయిదా పడింది. అలా మూడు సార్లు జరిగింది.
ఆఠవడ్యావరహీ కాంహీ దివస | ఠేవూన ఘేతలే ధుమాళాంస |
ఇకడే ముకదమ్యాచే తారఖేస | న్యాయాధీశాస అస్వస్థతా | ||౫౧||
51. ధుమాళును వారం పైగా అక్కడ ఉంచేశారు. వాయిదా పడిన రోజులంతా న్యాయాధీశునికి ఆరోగ్యం బాగలేక పోయింది.
జన్మాంత కధీంహి నాహీ ఠావా | ఏసా పోటశూళ దుర్ధర ఉఠావా | ముకదమా ఆపాప పుఢే ఢకలావా | కాళ లాగావా సార్థకీ | ||౫౨||
52. జన్మలో ఎన్నడూ ఎరుగని, విపరీతమైన కడుపు నొప్పి వచ్చి, కేసు దానంతట అదే వాయిదా పడింది. ఆ సమయాన్ని ధుమాళు మంచి పనికి ఉపయోగించాడు.
అసో ధుమాళాంస సాఈసహవాస | పక్షకారాచా చింతా నిరాస | ఘడూన ఆలే అప్రయాస | ఠేవితా విశ్చాస సాఈవర | ||౫౩||
53. సాయిని నమ్మినందుకు, అతనికి సాయి సహవాసం, మరియు అతని ముద్దాయికి చింతా నివారణ, ఏ కష్టమూ లేకుండానే రెండూ కలిగాయి.
పుఢే మగ యోగ్య కాలీ | ధుమాళాతే ఆజ్ఞా దిధలీ | కార్య సర్వ యథాస్థిత ఝాలీ | అఘటిత కేలీ2 సాంఈచీ | ||౫౪||
54. తరువాత ఒక మంచి సమయాన, ధుమాళుకు వెళ్ళటానికి అనుమతి దొరికింది. సాయియొక్క విచిత్ర లీలా ప్రభావంతో అన్ని పనులూ చక్కగా జరిగాయి.
ముకదమా చాలలా చార3 మాస | జాహలే చార న్యాయాధీశ | పరీ అఖేరీస ఆలే యశ | ఆరోపీ నిర్దోష సూటలా | ||౫౫||
55. ఆ కేసు నాలుగు నెలలు నడిచింది. నలుగురు న్యాయాధీశులు మారారు. చివరకు విజయం లభించింది. నిందితుడు నిర్దోషి అని విడుదల చేయబడ్డాడు.
ఎకదా ఎక భక్తప్రవర | నానాసాహేబ నిమోణకర | కైసా తయాంచ్యా పత్నీచా కైవార | ఘేతలా తో ప్రకార పరిసావా | ||౫౬||
56. బాబా ఒక సారి, నానాసాహేబు నిమోణ్కరు అన్న భక్తుని భార్య పక్షం వహించిన చిన్న కథను, ఇప్పుడు వినండి.
నిమోణ గాంవీచే వతనదార | న్యాయాధీశాచా కారభార | సోంపవీ జయా సరకార | వజనదార హే మోఠే | ||౫౭||
57. నిమోణ అన్న ఊరికి నానాసాహేబు వతన్దారు. ప్రభుత్వం అతనికి గౌరవ మేజిస్ట్రేటు పదవిని ఇచ్చింది. ఇతనికి అక్కడ చాలా పలుకబడి ఉండేది.
మాధవరావాంచే పితృవ్య జ్యేష్ట | వయోవృద్ధ పూజ్య శ్రేష్ట | జాయాహీ4 మోఠీ ఎకనిష్ట | సాఈచ ఇష్ట దైవత జ్యా | ||౫౮||
58. మాధవరావుకు అతను పెదనాన్న. వయసులో పెద్దవాడు, అందరి గౌరవాలను పొందినవాడు. అతని భార్య కూడా చాలా గొప్ప నిష్ఠాపరురాలు. వారిద్దరికీ సాయియే ఇష్ట దైవం.
సోడూనియా వతనీ గాంవ | శిరడీంత దోఘాంహీ దిధలా ఠావ | సాఈచరణీ ఠేవూని భావ | సుఖ స్వభావ వర్తతీ | ||౫౯||
59. తమ స్వంత ఊరుని వదిలి, శిరిడీలో ఆ ఇద్దరూ సాయి పాదాలను భక్తి శ్రద్ధలతో సేవిస్తూ, సుఖంగా ఉన్నారు.
ఉఠూనియా బ్రహ్మ ముహూర్తీ | ప్రాతఃస్నాన పూజన సారితీ | కరాయా నిత్య కాకడ ఆరతీ | చావడీప్రతీ తీ యేత | ||౬౦||
60. ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తన (సూర్యోదయానికి గంటన్నర మునుపు) లేచి, స్నానం చేసి, పూజకు సిద్ధం చేసుకుని, కాకడ హారతిని చేయటానికై చావడికి వెళ్ళేవారు.
పుఢే అపులీ స్తోత్రే మ్హణత | నానా బాబాంపాశీంచ రాహత |
హోఈ సూర్యాస్త తో పర్యంత | సేవేత నిరత బాబాంచ్యా | ||౬౧||
61. ఆ తరువాత, స్తోత్రాలను చెప్పేవారు. రోజూ సూర్యుడు అస్తమించే వరకు, బాబా సేవలో, బాబా దగ్గరే నానా ఉండేవాడు.
పడేల తీ తీ సేవా కరీత | ప్రేమ భరీత మానసే | ||౬౨||
62. లెండీ వరకు బాబాతో వెళ్ళడం, అక్కడినుంచి మసీదు దాకా వారితో రావటం, మొదలైన ప్రేమ పూర్వకమైన, అవసరమైన, సేవలు చేసేవాడు.
బాఈనేహీ అపుల్యా పరీ | కరవేల తీ బాబాంచీ చాకరీ | కరావీ అతి ప్రేమభరీ | దివసభరీ తెథేంచ | ||౬౩||
63. అతని భార్య కూడా ఆమెకు చేతనైనంత, చాలా ప్రేమతో దినమంతా, బాబా దగ్గరే ఉండి, బాబా సేవ చేసేది.
మాత్ర కరాయా స్నాన పాన | స్వయంపాక జేవణ ఖాణ | అథవా రాత్రీ కరాయా శయన | నిజస్థాన సేవావే | ||౬౪||
64. స్నానానికి, వండుకోవటానికి, రాత్రి పడుకోవటానికి మాత్రమే ఆమె తన బసకు వెళ్ళేది.
బాకీ అవశేష సర్వకాళ | దుపారతిపార సాంజ సకాళ | ఘాలవీ హే దంపత్య ప్రేమళ | రాహూని జవళ బాబాంచ్యా | ||౬౫||
65. మిగతా సమయమంతా, తెల్లవారి, మధ్యాహ్నం, సాయంత్రం, ఆ ప్రేమమయ దంపతులు బాబా దగ్గరే ఉండేవారు.
అసో యా దోఘాంచీ సేవా వర్ణితా | హోఈల బహు గ్రంథ విస్తారతా | మ్హణూన ప్రస్తుత విషయాపురతా | భాగ మీ ఆతా ఏకవితో | ||౬౬||
66. ఇలా ఆ ఇద్దరి సేవలను వర్ణిస్తుంటే, ఈ గ్రంథం చాలా పెద్దదై పోతుంది. అందుకు, ఇప్పటికి సంబంధించిన కథా భాగాన్ని వినిపిస్తాను.
బాఈస జాణే బేలాపురీ | ములగా తెథే థోడా అజారీ | కేలీ పతీచ్యా విచారీ | తెథే తయారీ జాణ్యాచీ | ||౬౭||
67. వారి అబ్బాయికి ఆరోగ్యం బాగా లేకపోవటంతో, ఆమె బేలాపూరులో ఉన్న ఆ కోడుకును చూడాలని అనుకున్నది. అక్కడికి వెళ్ళటం గురించి భర్తతో మాట్లాడింది.
పుఢే నిత్యక్రమానుసార | బాబాంచాహీ ఘేతలా విచార | పడతాంచ బాబాంచా హోకార | ఘాతలా కానావర పతీచ్యా | ||౬౮||
68. తరువాత ఎప్పటిలాగే, బాబా అనుమతిని పొంది, ఆ సంగతి భర్తకు తెలిపింది.
అసో ఏసే నిశ్చితపణే | ఠరలే బేలాపురచే జాణే | పుఢే పడలే నానాచే మ్హణణే | ఉద్యాంచ పరతణే మాఘారా | ||౬౯||
69. ఈ రకంగా ఆమె బేలాపూరు వెళ్ళటం నిశ్చయమైంది. కాని, మరుసటి రోజే తిరిగి రావాలని నానా అన్నాడు.
నానాస హోతే కాంహీ కారణ | మ్హణూన మ్హణతీ తిజలాగూన | జా పరీ యే పరతోన | దుశ్చితమన కుటుంబ | ||౭౦||
70. ఏవో కారణాల వలన, ఆమెతో నానా ‘రేపే తిరిగి వచ్చేసేయి’ అని అన్నాడు. ఇది విని, ఆమె మనసుకు బాధ కలిగింది.
దుసరే దివశీ పోళ్యాచీ అవస | తోహీ తెథేంచ కాఢావా దివస |
హోతీ బాఈచ్యా మనాచీ హౌస | యేఈనా మనాస నానాంచ్యా | ||౭౧||
71. మరుసటి రోజు ‘పోళా’ అమావాస్య కావటంతో, ఆ రోజు అక్కడే గడపాలని ఆమె ఉబలాట పడింది. కాని, నానాకు అది ఇష్టం లేదు.
శివాయ అమావాస్యేచా దిన | అనుక్త కరాయా గమనాగమన | బాఈస పడలే కోడే గహన | కైసీ సోడవణ హోఈల | ||౭౨||
72. అమావాస్య రోజు ప్రయాణం మంచిది కాదు. ఈ పరిస్థితినుండి ఎలా తప్పించుకోవాలి, అని ఆమె చాలా ఆరాట పడింది.
బేలాపురాస గేల్యావీణ | వాటే న తిజలా సమాధాన | దుఖవితా నయే పతీచే మన | ఆజ్ఞోల్లంఘన మగ కైచే | ||౭౩||
73. బేలాపూరుకు వెళ్ళకపోతే, ఆమె మనసుకు శాంతి ఉండదు. అయినా, భర్త మనసును బాధ పెట్టటం ఆమెకు ఇష్టం లేదు. మరి, భర్త మాటను ఎలా కాదంటుంది?
అసో మగ కేలీ తయారీ | నిఘాలీ జావయా బేలాపురీ | లెండీస నిఘాలీ బాబాంచీ స్వారీ | నమస్కారీ తయాంతే | ||౭౪||
74. అయినా, అన్ని ఏర్పాట్లనూ చేసుకుని, బేలాపూరు వెళ్ళటానికి సిద్ధమై బయలుదేరింది. బాబా లెండీ తోటకు వెళ్ళడం చూసి, వారి పాదాలకు నమస్కరించింది.
కోణీహీ బాహేర గావీ జాతా | పావావయా నిర్విఘ్నతా | దేవాపుఢే ఖాలవీ మాథా | తీచ కీ ప్రథా శిరడీంత | ||౭౫||
75. ఎవరైనా బయటి ఊరికి వెళ్ళేటప్పుడు, ఏ అడ్డంకులూ రాకుండా ప్రయాణం జరగాలని, దేవుడికి నమస్కరించటం అలవాటు. ఈ పద్ధతిని శిరిడీలో కూడా పాటించేవారు.
పరీ తెథీంచా దేవ సాఈ | జావయాచీ కితీహీ ఘాఈ | నిఘావయాచే సమయీ డోఈ | తయాంచే పాయీ ఠేవీత | ||౭౬||
76. శిరిడీలో కనిపించే దైవం సాయి. అందుకు, ఎంత తొందరగా ఉన్నా, ముందు బాబా పాదాలకు నమస్కరించి, ఆ తరువాతే బయలుదేరే వారు.
యా తెథీల క్రమానుసార | సాఠ్యాంచియా వాడ్యాసమోర | బాబా ఉభే అసతా క్షణభర | బాఈనే చరణ వందిలే | ||౭౭||
77. అదే ప్రకారం, సాఠేవాడా ఎదుట బాబా ఒక క్షణం పాటు నిలవగా, ఆమె బాబా పాదాలకు నమస్కరించింది.
నానాసాహేబ నిమోణకర | ఆదీకరూన సాన థోర | యేఊన తెథే దర్శన తత్పర | నమస్కారీత బాబాంనా | ||౭౮||
78. ఆమెతో, నానాసాహేబు నిమోణ్కరు మొదలగు పెద్దలు, పిన్నలూ, బాబా దర్శనం చేసుకోవాలని వచ్చి, వారికి నమస్కరించారు.
ఏసియా సమస్త మండళీ దేఖతా | విశేషతః నానాంచియా సమక్షతా | బాబా జే వదలే బాఈస తత్వతా | పహావీ సమయోచితతా తయాచీ | ||౭౯||
79. అలా అక్కడ అందరూ చూస్తుండగా, బాబా పాదాలపై తల ఉంచి నమస్కరించి, బయలుదేరటానికి అనుమతిని కోరుతున్న నానా భార్యతో, నానా ఎదుటే, బాబా చెప్పిన దానిని, గమనించండి.
పాయీ ఠేవూనియా మాథా | నిఘావయాచీ ఆజ్ఞా మాగతా | “జా బరే లవకర జా ఆతా | స్వస్థ చిత్తా అసావే | ||౮౦||
80. బాబా పాదాలపై తల ఉంచి, బయలుదేరటానికి ఆమె అనుమతిని కోరగా, “సరే వెళ్ళు. త్వరగా వెళ్ళు. నిశ్చింతగా ఉండు.
గేల్యాసారఖే చార దివస | సుఖీ రాహీ బేలాపురాస |
విచారూనియా సర్వత్రాంస | మాఘారీ శిరడీస యేఈ తూ” | ||౮౧||
81. “బేలాపూరుకు వెళ్ళి, నాలుగు రోజులు నిశ్చింతగా, సుఖంగా ఉండి, అందరినీ కలసుకొన్న తరువాతే నువ్వు శిరిడీకి రా”.
నిమోణకరాంస పటలీ ఖూణ | సమాధాన ఉభయతా | ||౮౨||
82. బాబా మాటలు ఆమెకు ఎంతో ఊరటను కలిగించాయి. నిమోణ్కరుకు సంగతి అర్థమైంది. ఇద్దరికీ ఎంతో తృప్తి కలిగింది.
సారాంశ ఆపణ కరావే బేత | ఆమ్హా న జాణవే ఆదీ అంత | హితాహిత జాణతీ సంత | కాంహీ న అవిదిత తయాంతే | ||౮౩||
83. చెప్పదలచుకున్నది ఏమిటంటే, మనం ఏదైనా ఆలోచించినప్పుడు, దాని వెనుక జరిగినది, దాని తరువాత జరుగబోయేది, ఏవీ మనకు తెలియవు. కాని మన మంచి చెడులు సత్పురుషులకు బాగా తెలుస్తాయి. ఎందుకంటే, వారికి తెలియనిదేదీ లేదు.
భూత భవిష్య వర్తమాన | కరతలామలకవత్ తయా జ్ఞాన | కరితా తయాంచ్యా ఆజ్ఞేత వర్తన | సుఖసంపన్న భక్త హోతీ | ||౮౪||
84. అరచేతిలోని ఉసిరికాయ ఎలా స్పష్టంగా కనిపిస్తుందో, అలా వారికి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలంలో జరిగేది స్పష్టంగా తెలుస్తుంది. అందువలన, వారి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే, మనము సుఖ సంపన్నులౌతాము.
అసో ఆతా పూర్వానుసంధాన | చాలవూ ముఖ్యకథా నిరూపణ | కైసీ ముళ్యాంవరీ కృపా కరూన | దిధలే దర్శన గురూచే | ||౮౫||
85. ఇంతకు మునుపు మొదలు పెట్టిన కథను ఇప్పుడు కొన సాగిద్దాము. బాబా ముళేను కరుణించి, అతనికి గురు దర్శనాన్ని కలిగించిన ముఖ్య కథను చెప్పుతాను.
శ్రీమంత బాపూసాహేబ బుట్టీ | హేతూ ఘ్యావీ తయాంచీ భేటీ | పరతోనీ జావే ఉఠాఉఠీ | ముళ్యాంచ్యా పోటీ హే హోతే | ||౮౬||
86. శిరిడీలో శ్రీమంతుడైన బాపూసాహేబు బుట్టీని కలుసుకుని, వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని, ముళే అనుకున్నాడు.
అసో హా జరీ త్యాంచా హేత | బాబాంచా త్యాంత అన్య సంకేత | తో చమత్కార తే ఇంగిత | సావచిత్త పరిసావే | ||౮౭||
87. అతను అలా అనుకున్నా, బాబా అనుకున్నది వేరు. ఆ చమత్కారంలోని అర్థాన్ని సావధానంగా వినండి.
శ్రీమంతాంచీ భేట ఝాలీ | మండళీ మశీదీలాగీ నిఘాలీ | ముళ్యాంనాహీ ఇచ్ఛా ఉదేలీ | నిఘాలే మండళీ సమవేత | ||౮౮||
88. అనుకున్న ప్రకారమే ముళే బుట్టీని కలుసుకున్నాడు. తరువాత, అందరూ మసీదుకు బయలుదేరుతుంటే, ముళే మనసులో కూడా కోరిక కలిగి, వారితో తాను కూడా వెళ్ళాడు.
ముళే షట్శాీస్త్రీ అధ్యయన | జ్యోతిర్విద్యేత అతి ప్రవీణ | సాముద్రికాంతహీ తైసేచ పూర్ణ | రమలే దర్శన హోతాంచ | ||౮౯||
89. ఆరు శాస్త్రాలనూ ముళే చాలా లోతుగా తెలుసుకున్నాడు. జ్యోతిష్యంలో, హస్త సాముద్రికంలో కూడా అతను ప్రవీణుడు. బాబాను చూసి చాలా ఆనందించాడు.
పేఢే బత్తాసే బర్ఫీ నారళ | నారింగాది ఫళఫళావళ | అమూప అర్పితీ జన ప్రంజళ | భక్త ప్రేమళ బాబాంస | ||౯౦||
90. ముళే మసీదుకు వెళ్ళినప్పుడు, పాలకోవా, బత్తాసులను, బర్ఫీని, కొబ్బరికాయలను, నారింజ మొదలైన పళ్ళను, ఫలాహారాలను, భక్తులు ప్రేమతో బాబాకు అర్పిస్తున్నారు.
శివాయ తెథే యేతీ మాళిణీ | జాంబ కేళీ ఊంస ఘేఊనీ |
బాబా ఖరీదితీ ఆలియా మనీ | పైసే దేఉనీ పదరచే | ||౯౧||
91. ఇవి కాక, అమ్మకానికి స్త్రీలు తెచ్చిన జామపళ్ళు, అరటిపళ్ళు, చెరుకు, వీటిని తమకు తోచినప్పుడు, స్వంత డబ్బిచ్చి బాబా కొనేవారు.
పల్లవచా పైకా ఖర్చ కరీత | అంబ్యాచ్యా పాట్యా ఖరేదీత | కేళీంహీ ఉమాప ఆణవీత | వాంటీత మనసోక్త భక్తాంనా | ||౯౨||
92. తమ స్వంత డబ్బుతో మామిడి పళ్ళ బుట్టలను కొనేవారు. అరటి పళ్ళను కూడా చాలా తెప్పించి, తమకు ఇష్టం వచ్చినట్లుగా, భక్తులకు పంచేవారు.
ఎకేక ఆంబా ఘేఊన కరీ | ధరూన దోన్హీ తళ హస్తాభ్యంతరీ | చోళూన మఊ ఝాలియావరీ | భక్తాంకరీ మగ దేత | ||౯౩||
93. ఒక్కొక్కటే మామిడిపండును, రెండు చేతులతోనూ పట్టుకుని నలిపి, మెత్తబడిన తరువాత, భక్తులకు ఇచ్చేవారు.
ఆంబా లావితా ఓఠీ | రస ఎకదాంచ ఉతరావా పోటీ | జైసీ భరలీ రసాచీ వాటీ | సాల బాఠీ ఫేంకావీ | ||౯౪||
94. అలా మెత్తబడిన మామిడిపండు పెదవులకు తగలగానే, గిన్నెలోనుండి వచ్చినట్లు, రసమంతా ఒక్క సారిగా కడుపులోకి వెళ్ళిపోయేది. తరువాత తొక్క, టెంకను పారవేయటమే.
కేళ్యాంచీ తో అపూర్వ శైలీ | భక్తాంనీ ఘ్యావీ గర్భనవ్హాళీ | బాబాంనీ సేవావ్యాంత తయాంచ్యా సాలీ | కాయ త్యా కేలీ అద్భుత | ||౯౫||
95. అరటిపళ్ళతో కూడా బాబాది ప్రత్యేకమైన పద్ధతి. లోపలి పండును భక్తులకు ఇచ్చి, దాని తొక్కలను బాబా తీసుకునేవారు. ఎంతటి అద్భుతమైన లీల!
హీ సర్వ ఫళే ఆపులే హాతీ | బాబా తెథే అవఘ్యాంస వాంటితీ | కోకాలీ ఆలియా చిత్తీ | స్వయే చాఖితీ ఎకాదే | ||౯౬||
96. ఈ పళ్ళను అంతటినీ తమ చేతులతో బాబా అక్కడున్న వారందరికీ పంచేవారు. ఎప్పుడైనా తమ మనసుకు అనిపిస్తే, ఒకటీ, అరా స్వయంగా తినేవారు.
యా క్రమాచియా పరిపాటీ | కేవళ భక్తజనాంచియా సాఠీ | ఖరీదూనీ కేళియాంచీ పాటీ | బాబా వాంటీత హోతే తై | ||౯౭||
97. అలవాటు ప్రకారం, ఆ రోజు భక్తుల కోసమే అరటిపళ్ళ బుట్టను కొని, బాబా అందరికీ పంచిపెడుతున్నారు.
శాస్త్రీబువాంస ఆశ్చర్య గహన | జాహలే దేఖూనీ బాబాంచే చరణ | ధ్వజ వజ్రాంకుశ రేఖా నిరీక్షణ | కరావే మన జాహలే | ||౯౮||
98. బాబా పాదాలను చూసి, శాస్త్రీ బువాకు (ముళే) చాలా ఆశ్చర్యం కలిగింది. వారి చేతిలోని, ధ్వజ, వజ్రాంకుశ రేఖలను చూడాలని అతనికి కోరిక కలిగింది.
భక్త కాకాసాహేబ దీక్షిత | హోతే తెవ్హా నికట స్థిత | ఉచలూని చార రంభా ఫళే దేత | బాబాంచే హాతాంత తేధవా | ||౯౯||
99. కాకాసాహేబు దీక్షితు కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. అతను నాలుగు అరటిపళ్ళను బాబా చేతులలో పెట్టాడు.
కోణీ బాబాంస బహు వినవిలే | బాబా హే క్షేత్రస్థ శాస్త్రీ ముళే | పాతలే చరణీ పుణ్యబళే | ప్రసాద ఫళే ద్యా కీ యా | ||౧౦౦||
100. అక్కడున్న వారిలో ఎవరో ఒకరు బాబాతో ‘ఇతడు ముళే శాస్త్రి. నాసిక నివాసి. అతని పుణ్యం కొద్దీ మీ పాదాల దగ్గరకు వచ్చాడు. అతనికి పళ్ళ ప్రసాదం ఇవ్వండి’ అని అన్నారు.
వినవా కోణీ వా న వినవా | బాబాంచే ఆలియావీణ జీవా |
కోణాంతే కాంహీ న దేతీ తే కెవ్హా | కరితీ తెవ్హా కాయ తే | ||౧౦౧||
101. ఎవరు చెప్పినా, చెప్పకున్నా, బాబా తమ మనసుకు నచ్చితే తప్ప, ఎవరికీ ఏమీ ఇచ్చేవారు కాదు. అలాంటప్పుడు, చెప్పినవారు ఏం చేస్తారు?
బాబా న తికడే చిత్త దేతీ | ప్రసాద వాటీతీ సకళికా | ||౧౦౨||
102. అరటిపళ్ళ కోసం కాక, బాబా చేతిని చూడాలనే కోరికతో, ముళే తన చేతిని ముందుకు చాచాడు. బాబా అటువైపు అసలు చూడకుండా, అందరికీ ప్రసాదాన్ని పంచుతున్నారు.
ముళే బాబాంస కరితీ వినంతీ | ఫళే నకో హాత ద్యా మాగతీ | పాహూ యేతే సాముద్రిక వదతీ | బాబా న దేతీ త్యా హాత | ||౧౦౩||
103. బాబాతో ముళే ‘నాకు పళ్ళు వద్దు. మీ చేతిని ఇటివ్వండి. సాముద్రికాన్ని చూస్తాను’ అని వేడుకున్నాడు. కాని అతనికి బాబా తమ చేతిని ఇవ్వలేదు.
తరీహీ ముళే పుఢే సరకత | సాముద్రికార్థ హాత లాంబవిత | బాబా న తికడే ఢూంకూన పహాత | జణూ నాహీంత గాంవీంచే త్యా | ||౧౦౪||
104. అయినా, ముందుకు జరిగి ముళే చేయి చాచాడు. తమకు ఏమీ తెలీనట్లు బాబా ఉన్నారు. అటువైపు తిరిగి కూడా చూడలేదు.
పసరిల్యా ముళ్యాంచే హాతీ | బాబా తీ చార కేళీ ఠేవితీ | బసా మ్హణతీ పరీ న దేతీ | ముళ్యాంచే హాతీ నిజహస్త | ||౧౦౫||
105. చూడలేదు సరికదా, ముళే చేతిలో నాలుగు అరటిపళ్ళను ఉంచి కూర్చోమని చెప్పారు. అంతే కాని, తమ చేతిని ముళే చేతికివ్వలేదు.
ఆజన్మ ఈశ్వరార్థ ఝిజవిలా కాయ | తయాస సాముద్రికీ కర్తవ్య కాయ | అవాప్త సకళ కామ సాఈరాయ | సద్భక్తా మాయబాప జో | ||౧౦౬||
106. జీవిత కాలమంతా దేవుడి కొరకు దేహాన్ని అరగ తీసిన వారికి, అన్ని కోరికలూ తీరి, సద్భక్తులకు తల్లి తండ్రి అయిన, సాయి మహారాజుకు సాముద్రికంతో ఏం పని?
పాహూని బాబాంచీ నిఃస్పృహ స్థితీ | సాముద్రికార్థ ఉదాసీనవృత్తీ | శాస్త్రీబువా హస్త ఆంవరితీ | నాద టాకితీ బాబాంచా | ||౧౦౭||
107. బాబాయొక్క వైరాగ్యాన్ని, సాముద్రికం పట్ల అసలు ఆసక్తి లేకపోవడం చూచి, ముళే శాస్త్రి తన చేతిని వెనుకకు తీసుకుని, వారిని ఇబ్బంది పెట్టడం మానుకున్నాడు.
కాంహీ వేళ స్వస్థ బైసలే | మండళీ సమవేత వాడ్యాంత గేలే | స్నాన కేలే సోవళే ల్యాలే | ఆరంభూ సరలే అగ్నిహోత్ర | ||౧౦౮||
108. కొంత సేపు నిశ్చింతగా కూర్చుని, తరువాత భక్తులతో పాటు బసకు వెళ్ళాడు. స్నానం చేసి, మడి బట్టలు కట్టుకుని, అగ్నిహోత్రాన్ని మొదలు పెట్టాడు.
ఇకడే నిత్యక్రమానుసార | బాబా నిఘాలే లేండీవర | మ్హణతీ గేరూ ఘ్యారే బరోబర | భగవే అంబర పరిధానూ | ||౧౦౯||
109. ఇక్కడ, మసీదులో, ఎప్పటిలాగే బాబా లెండీకి బయలుదేరుతూ “కాషాయ రంగు తీసుకుని రండి, కాషాయ వస్త్రాలు ధరిస్తాను” అని అన్నారు.
సర్వాంస వాటలా చమత్కార | గేరూచే బాబా కాయ కరణార | జో తో కరూ లాగే విచార | గేరూ స్మరలా ఆజ కా | ||౧౧౦||
110. అక్కడ ఉన్న వారందరికీ చాలా ఆశ్చర్యమైంది. ‘అసలు కాషాయ రంగు ఎందుకు బాబాకు? ఈ రోజే ఇదెందుకు గుర్తుకు వచ్చింది?’ అని వారు ఆలోచించ సాగారు.
బాబాంచీ అశీచ సందిగ్ధ వాణీ | కాయ అర్థ జాణావా కోణీ |
పరీ ఆదరే సాంఠవిల్యా శ్రవణీ | అర్థ శ్రేణీ వోగరితీ | ||౧౧౧||
111. బాబా మాటలు, మిగతా వారికి సులభంగా అర్థం కాకుండా, ఇలాగే ఉంటాయి. ఎవరైనా ఆ మాటలను ఎలా తెలుసుకోగలరు? కాని, శ్రద్ధగా వింటే, సరియైన అర్థం తెలుస్తుంది.
కీ తే సంతాచే బోల | కధీంహీ జే నసణార ఫోల | అర్థభరిత సదా సఖోల | కరవేల మోల కవణాతే | ||౧౧౨||
112. ఎందుకంటే సాధు సంతుల మాటలు ఎప్పుడూ అర్థం లేకుండా ఉండవు. అవి ఎప్పుడూ అర్థంతో నిండి ఉంటాయి. ఆ మాటలకు ఎవరు విలువ కట్టగలరు?
ఆధీ విచార మగ ఉచ్చార | హా తో నిత్యాచా వ్యవహార | ఉచ్చారామాగే ఆచార | సంత సాచార ఆదరితీ | ||౧౧౩||
113. మునుపు ఆలోచించుకుని, తరువాత మాట్లాడటమనేది సాధు సంతులు ఎప్పడూ చేసే పద్ధతి. చెప్పిన మాటలనే, తరువాత వారు ఆచరిస్తారు.
యా సర్వమాన్య సిద్ధాంతానుసార | సంతవచన కధీ న నిఃసార | ధ్యానీ ధరూని పడతాళితా ఫార | పడే వేళేవర ఉకల త్యా | ||౧౧౪||
114. అందరూ ఒప్పుకున్న ఈ నిజాన్ని బట్టి, సత్పురుషుల మాటలెప్పుడూ అర్థం లేకుండా ఉండవు. బాగా ఆలోచిస్తే, సమయం వచ్చినప్పుడు, చిక్కు విడిపోతుంది.
అసో ఇకడే బాబా పరతలే | నిశాణీ శింగ వాజూ లాగలే | బాపూసాహేబ జోగీ వహిలే | వేళీ సుచవిలే ముళ్యాంతే | ||౧౧౫||
115. లెండీనుండి బాబా తిరిగి వచ్చారు. సన్నాయి, బూరలు మ్రోగాయి. వెంటనే, బాపూసాహేబు జోగు ముళేతో ఇలా అన్నారు.
ఆరతీచా సమయ ఆలా | యేతా కాయ కీ మశీదీలా | శాస్త్రీబువాంచే సోవళేపణాలా | ప్రసంగ వాటలా అవఘడ తో | ||౧౧౬||
116. ‘హారతి సమయమైంది, మసీదుకు వస్తారా?’ అని అడిగాడు. శాస్త్రీ బువా మడిలో ఉన్నాడు. మసీదుకు ఎలా వెళతాడు? అతనికి చిక్కు పరిస్థితి ఎదురైంది.
వదతీ మగ తే ప్రత్యుత్తరీ | ఘేఊ దర్శన తిసరే ప్రహరీ | లాగలే జోగ మగ తే అవసరీ | కరూ తయారీ ఆరతీచీ | ||౧౧౭||
117. ‘మూడో ఝామున, సాయంత్రం, వెళ్ళి దర్శనం చేసుకుంటానని’ సమాధానం చెప్పాడు. జోగు హారతికి సిద్ధం చేసుకున్నాడు.
ఇకడే బాబా పరత యేవోనీ | బసలే బోలత జో నిజాసనీ | తో సర్వాంచ్యా పూజా హోఊని | ఆరతీ స్థానీ థాటలీ | ||౧౧౮||
118. ఇక్కడ మసీదులో, లెండీనుండి తిరిగి వచ్చి, బాబా తమ ఆసనంలో కూర్చుని, వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. అందరి పూజలూ అయింది. హారతి మొదలు పెట్టాలి.
ఇతుక్యాంత బాబా మ్హణతీ "ఆణా | త్యా నవ్యా బామణాకడూన దక్షిణా ’| బాపూసాహేబ బుట్టీచ తత్క్ష ణా | గేలే దక్షిణా మాగావయా | ||౧౧౯||
119. ఇంతలో బాబా “వెళ్ళి ఆ క్రొత్తగా వచ్చిన బ్రాహ్మణుని దగ్గరనుండి దక్షిణను తీసుకుని రండి” అని అన్నారు. వెంటనే బాపూసాహేబు బుట్టీ దక్షిణను అడగటానికి తానే వెళ్ళాడు.
నుకతేచ ముళే కరూని స్నాన | సోవళే వస్త్ర కరూని పరిధాన | బసలే హోతే ఘాలూని ఆసన | స్వస్థ మన కరూనియా | ||౧౨౦||
120. ముళే అప్పుడే స్నానం చేసి, మడి బట్టలు కట్టుకుని, యోగాసనంలో, శాంతంగా, స్థిరమైన మనసుతో కూర్చున్నాడు.
నిరోప పరిసతా తే అవసరీ | విక్షేప దాటలా ముళ్యాంచే అంతరీ |
దక్షిణా కిమర్థ మ్యా ద్యావీ తరీ | మీ అగ్నిహోత్రీ నిర్మళ | ||౧౨౧||
121. బాబా పెట్టిన కబురు విని, ముళే కలవర పడ్డాడు. ‘నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? శుద్ధమైన అగ్నిహోత్రుణ్ణి నేను.
మజపాశీ కా దక్షిణా మాగత | జాహలే దుఃశ్చిత్త మన తేణే | ||౧౨౨||
122. ‘బాబా గొప్ప సత్పురుషులే కావచ్చు. నేనేవిధంగానూ వారికి కట్టుబడలేదు. అలాంటప్పుడు నన్ను దక్షిణ అడగటం ఎందుకు?’ అని అతని మనసు కలవర పడింది.
సాఈసారిఖే దక్షిణా యాచితీ | కోట్యాధీశ నిరోప ఆణితీ | ముళే జరీ మనీ శంకతీ | దక్షిణా ఘేతీ సమవేత | ||౧౨౩||
123. కాని, సాయి వంటి వారు దక్షిణను అడగటం, కోటీశ్వరుడు ఆ కబురు తేవటం, వీటన్నిటినీ ఆలోచించి, అనుమానించి, తన దగ్గర ఉన్న కొంచెం దక్షిణను తీసుకొని, ముళే మసీదుకు బయలుదేరాడు.
ఆణీక సంశయ తయాంచే మనీ | ఆరబ్ధకర్మ అపూర్ణ టాకూని | జావే కేవీ మశీదీలాగునీ | నాహీ మ్హణూనహీ మ్హణవేనా | ||౧౨౪||
124. అంతలోనే, ఇంకొక సందేహం కలిగింది. మొదలు పెట్టిన అగ్నిహోత్రాన్ని పూర్తి కాకుండానే వదిలేసి, మసీదుకు ఎలా వెళ్ళటం, రానని అనలేడు.
సంశయాత్మ్యాస నాహీ నిశ్చితీ | సదా దోలాయమాన చిత్తీ | తయా న హీ నా తీ గతీ | త్రిశంకూ స్థితీ తయాంచీ | ||౧౨౫||
125. సంశయాలు వచ్చిన వారికి నెమ్మది అంటూ ఉండదు. నిశ్చింతగా ఉండలేరు. వారి మనసెప్పుడూ ఇటూ అటూ ఊగుతూ ఉంటుంది. అటూ ఇటూ గాని త్రిశంకు స్థితి వారిది.
తథాపి మగ కేలా విచార | జావయాచా కేలా నిర్ధార | గేలే సభామండపాభీతర | రాహిలే దూర తే ఉభే | ||౧౨౬||
126. బాగా ఆలోచించుకొని, వెళ్ళాలని ముళే నిర్ణయించుకున్నాడు. దక్షిణను తీసుకుని, మసీదులోని సభామండపంలోకి వెళ్ళి, దూరంగా నిలుచున్నాడు.
ఆపణ సోవళే మశీద ఓవళీ | జావే కైసే బాబా జవళీ | లాంబ రాహూనీ బద్ధాంజళీ | పుష్పాంజళీ ఫేకితీ | ||౧౨౭||
127. తనేమో మడిలో ఉన్నాడు. మసీదు అపవిత్రమైనది. బాబా దగ్గరకు ఎలా వెళ్ళాలి అని అనుకుని, చేతులు జోడించుకుని, దూరంగా నిలుచుని, బాబా మీద పూవులను విసిరాడు.
ఇతుక్యాంత ఏసా చమత్కార | ఝాలా తయాంచే దృష్టీసమోర | బాబా అదృశ్య గాదీవర | ఘోలప గురూవర దిసలే తై | ||౧౨౮||
128. ఇంతలో, ఒక అద్భుతమైన చమత్కారం జరిగింది. తను చూస్తుండగానే, ఆసనంలో కూర్చున్న బాబా కనిపించలేదు. మళ్ళీ చూడగా, అక్కడ తన గురువర్యులైన ఘోలపగారు కనిపించారు.
ఇతరాంస నిత్యాచే సాఈసమర్థ | ముళ్యాంచే డోళా ఘోలపనాథ | తే జరీ పూర్వీచ బ్రహ్మీభూత | ఆశ్చర్యచకిత బహు ముళే | ||౧౨౯||
129. మిగతా అందరికీ సాయి సమర్థులు కనిపించినా, ముళే కళ్ళకు, ఎప్పుడో సమాధి చెందిన ఘోలపనాథులు కనిపించారు. ముళేకు చెప్పలేనంతగా ఆశ్చర్యం కలిగింది.
గురూ జరీ వస్తుతః సమాధిస్త | తేహీ జై దృష్టీగోచర భాసత | తేణే ముళే అతి విస్మిత | తైసేచ సాశంకిత మానసీ | ||౧౩౦||
130. ఎప్పుడో సమాధి చెందిన గురువు కళ్ళకు కనిపించే సరికి, ఆశ్చర్యంతో పాటు ముళేకు అనుమానం కూడా కలిగింది.
స్వప్న మ్హణావే నాహీ నిజేలా | జాగృతి తంవ గురూ కైసా ఠేలా |
సంభ్రమ కేఉతా జీవీ ఉఠలా | బోల ఖుంటలా క్షణభరీ | ||౧౩౧||
131. ఇదంతా ఒక కల ఏమో అని అనుకోవటానికి, తను నిద్రపోవడం లేదు. మరి, మేలుకొని ఉండగా, తన గురువు తన ఎదుట ఎలా ఉన్నారు? తన మనసు ఎందుకింత గజిబిజిగా అయ్యింది? క్షణం పాటు ఆశ్చర్యంతో, అతనికి నోట మాట రాలేదు.
ఆపులా ఆపణ ఘేఈ చిమటా | మ్హణే నవ్హే హా ప్రకార ఖోటా | కిమర్థ మనా హా సంశయ ఫుకటా | సర్వాంసకటా మీ యేథే | ||౧౩౨||
132. తనను తాను గిల్లుకుని చూశాడు. ఇది అబద్ధం కాదు అని నమ్మకమైంది. అందరితో పాటు నేనూ ఇక్కడ ఉండగా, నా మనసులోనే ఎందుకిన్ని సందేహాలు?
ముళే ముళచే ఘోలపభక్త | బాబావిషయీ జరీ శంకిత | పరీ ఝాలే పుఢే అంకిత | అకలంకిత మానసే | ||౧౩౩||
133. అసలుకు ముళే ఘోలప భక్తుడు. మొదట బాబా గురించి ఎన్నో సందేహాలు ఉండేవి. కాని, ఇప్పుడు అవన్నీ చెదిరిపోయి, నిర్మలమైన మనసుతో, అతను బాబాకు అంకితమయ్యాడు.
స్వయే వర్ణాగ్రజ బ్రాహ్మణ | వేద వేదాంగ శాస్త్ర సంపన్న | మశీదీంత ఘోలప దర్శన | విస్మయాపన్న జాహలే | ||౧౩౪||
134. తనేమో గొప్ప బ్రాహ్మణ జాతికి చెందినవాడు. వేద వేదాంగ శాస్త్రాలను తెలుసుకున్నవాడు. కాని, ఒక మసీదులో, తన గురు ఘోలపగారి దర్శనంతో, అతనికి విపరీతమైన ఆశ్చర్యమేసింది.
మగ వరతీ గేలే చఢోన | నిజగురూచే చరణ వందూన | ఉభే రాహిలే కర జోడూన | వాచేసీ మౌన పడియేలే | ||౧౩౫||
135. తరువాత మెట్లెక్కి వెళ్ళి, తన గురువు పాదాలకు నమస్కారం చేసి, చేతులు జోడించుకుని, మాటలు రాక, ఊరికే నిలుచున్నాడు.
భగవీ వస్త్రే భగవీ ఛాటీ | ఘోలపస్వామీ దేఖోని దృష్టీ | ధాంవోనీ పాయీ ఘతలీ మిఠీ | ఉఠాఉఠీ ముళ్యాంనీ | ||౧౩౬||
136. సన్యాసివలె, కాషాయ వస్త్రాలు ధరించిన ఘోలపస్వామిని చూడగానే, ఆగలేక, ఎంతో ప్రేమతో, వారి పాదాలను ముళే కౌగలించుకున్నాడు.
తుటలా ఉచ్చ వర్ణాభిమాన | పడలే డోళియాంమాజీ అంజన | భేటతా నిజగురూ నిరంజన | నిధాన సంపన్న తే ఝాలే | ||౧౩౭||
137. గొప్ప జాతి తనది, అనే అభిమానం తొలగిపోయింది. కళ్ళలో కాటుక వ్రాసినట్టు, కళ్ళకు కనిపించని తన గురువు కనిపించగానే, చాలా గొప్ప నిధి దొరికినట్లు ముళే భావించాడు.
హరపలీ వికల్పవృత్తీ | జడలీ బాబాంవరీ ప్రీతీ | అర్ధోన్మీలిత నేత్రపాతీ | టక లావితీ సాఈ పదీ | ||౧౩౮||
138. మనసులోని సందేహాలన్నీ తొలగిపోయి, బాబాపై ప్రీతి కలిగింది. సగం మూసుకున్న కళ్ళతో, సాయి పాదాలను తదేకంగా చూడసాగాడు.
అనంత జన్మీచే సుకృత ఫళలే | దృష్టీ పడలీ సాఈంచీ పాఉలే | చరణ తీర్థీ స్నాన ఘడలే | దైవ ఉఘడలే వాటలే | ||౧౩౯||
139. ఎన్నో జన్మల పుణ్యం ఫలించి, సాయి పాద దర్శనం కలిగి, వారి పాదాల తీర్థ స్నానంతో, అతనికి దేవుడి దగ్గర ఉన్నట్లు అనిపించింది.
ఆశ్చర్య కేలే సకళికీ | హే కాయ ఘడలే ఎకాఎకీ | జాఊనీ ఫులాంచీ ఫేకాఫేకీ | పాయీ డోకీ ఠేవితీ కా | ||౧౪౦||
140. దూరంనుంచే పూలు విసిరిన మనిషి, బాబా పాదాల మీద తల ఉంచటంతో, అకస్మాత్తుగా ఏమిటీ వింత అని అక్కడున్న భక్తులందరూ ఆశ్చర్య పడ్డారు.
ఇతర మ్హణతీ బాబాంచీ ఆరతీ | ముళే ఘోలప నామే గర్జతీ |
ఉంచస్వరే త్యాంచీచ ఆరతీ గాతీ | రంగీ రంగతీ సప్రేమ | ||౧౪౧||
141. అందరూ బాబా హారతిని పాడుతుంటే, ఘోలపగారి పేరును ముళే బిగ్గరగా చెప్పసాగాడు. పై స్వరంలో వారి హారతినే గానం చేస్తూ, వారి ప్రేమలో లీనమై పోయాడు.
సాష్టాంగ దండాయమాన హోతీ | డోళే మిటితీ ఆనందే | ||౧౪౨||
142. మడి పట్ల అతనికున్న అభిమానం, గొప్పతనం అన్నీ తొలగిపోయాయి. పవిత్రం, అపవిత్రం గురించిన ఆలోచనలూ మాయమై, సాయికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆనందంతో, అతను కళ్ళు మూసుకున్నాడు.
ఉటల్యావరీ డోళే ఉఘడితా | ఘోలప స్వామీశీ అదృశ్యతా | త్యాంచే స్థానే సాఈ సమర్థా | దక్షిణా మాగతా దేఖిలే | ||౧౪౩||
143. కాని, లేచి కళ్ళు తెరచి చూస్తే, ఘోలపస్వామి మాయమై, వారికి బదలు సాయి సమర్థులు నవ్వుతూ, దక్షిణను అడుగుతూ కనిపించారు.
పాహోనీ బాబాంచీ ఆనందమూర్తి | ఆణి తయాంచీ తీ అతర్క్యశక్తీ | తటస్థ ఝాలీ చిత్తవృత్తీ | ముళే నిజ స్థితీ విసరలే | ||౧౪౪||
144. బాబాయొక్క అపార శక్తిని, వారి ఆనంద రూపాన్ని చూచి, అతని మనసు పని చేయటం మానివేసింది. ముళే తనను తాను మరచి పోయాడు.
ఏసే హే మహారాజాంచే కౌతుక | దేఖతా హరలీ తహాన భూక | జహాలే నిజగురూ దర్శనసుఖ | పరమహరిఖ ముళ్యాంనా | ||౧౪౫||
145. సాయి మహారాజుగారి ఈ అద్భుత లీలను చూసిన తరువాత, అతనికి ఆకలి దప్పులు మాయమై పోయాయి. తన గురువును చూసిన సుఖం ముళేకు పరమానందం కలిగించింది.
జాహలే మానసీ సమాధాన | ఘాతలే బాబాంస లోటాంగణ | ఆనందాశ్రూంస భరతే యేఊన | మస్తకీ చరణ వందిలే | ||౧౪౬||
146. అతని మనసు తృప్తి చెందింది. ఆనందంతో కళ్ళనుండి నీరు కారగా, బాబా పాదాలకు నమస్కరించాడు.
దక్షిణా కాయ హోతీ తీ దిధలీ | పునశ్చ డోఈ చరణీ ఠేవిలీ | నయనీ ప్రేమాచి ఆసువే ఆలీ | తను ఝాలీ రోమాంచిత | ||౧౪౭||
147. తన వద్ద ఉన్న దానిని దక్షిణగా ఇచ్చి, మరల బాబా పాదాలపై తలనుంచాడు. అతని కళ్ళ వెంట ప్రేమతో నీరు దొర్లాయి. శరీరం రోమాంచితమైంది.
సద్గదీత కంఠ ఝాలా | అష్టభావ మనీ దాటలా | మ్హణతీ మనీచా సంశయ ఫిటలా | వరి భేటలా నిజగురూ | ||౧౪౮||
148. గొంతు గద్గదమైంది. మనసులో ఎనిమిది భావాలు ఉప్పొంగాయి. ‘నా సందేహాలన్నీ దూరమయ్యాయి. పైగా నా గురువు దొరికారు’ అని అనుకున్నాడు.
పాహోని బాబాంచీ అలౌకిక లీలా | ముళ్యాంసహ సర్వ జన గహీంవరలా | గేరూచా అర్థ నిశద ఝాలా | అనుభవ ఆలా తేధవా | ||౧౪౯||
149. ముళేతో సహ అక్కడున్న వారందరూ బాబాయొక్క ఈ విచిత్రమైన లీలను చూసి, ఆశ్చర్య పడ్డారు. అప్పుడు వారికి కాషాయ రంగు గురించి అర్థమై, బాబా మహిమను అనుభవంతో తెలుసుకున్నారు.
హేచ మహారాజ హేచ ముళే | ఆశ్చర్య కైసే యేచ వేళే | కోణ జాణే మహారాజాంచే కళే | అగాధ లీలే తయాంచే | ||౧౫౦||
150. అదే సాయి మహారాజు, అదే ముళే, కాని ఆ సమయంలోనే ఆ మార్పు ఎలా వచ్చింది? బాబా లీలలను ఎవరు తెలుసుకోగలరు? వారి లీలలను అర్థం చేసుకోవడం సాధ్యం కాని పని.
ఏసేచ ఎక మామలతదార | ధరూని సాఈ దర్శనీ ఆదర |
సవే ఘేఊన మిత్ర డాక్టర | నిఘాలే శిరడీస యావయా | ||౧౫౧||
151. ఇలాగే, సాయి దర్శనంలో శ్రద్ధగల ఒక మామలతుదారు, తన స్నేహితుడైన ఒక డాక్టరుని వెంటబెట్టుకుని, శిరిడీకి బయలుదేరాడు.
డాక్టర జ్ఞాతీనే బ్రహ్మణ | రామోపాసక ఆచారవాన | స్నాన సంధ్యా విహితాచరణ | నేమ నిర్భంధన ఆవడ | ||౧౫౨||
152. ఆ డాక్టరు ఒక బ్రాహ్మణుడు. రాముణ్ణి ఉపాసించేవాడు. ఆచారవంతుడు, స్నాన సంధ్యలూ, శాస్త్రాలయందు, నియమ నిష్ఠల మీద ప్రీతి కలవాడు.
సాఈబాబా ముసలమాన | ఆపులే ఆరాధ్య జానకీజీవన | ఆధీంచ స్నేహ్యాస ఠేవిలే సాంగూన | నాహీ మీ నమన కరణార | ||౧౫౩||
153. ఆ డాక్టరు ‘జానకీనాథుడు నేను పూజించే దేవుడు. సాయిబాబా ముస్లిము కనుక నేను వారికి నమస్కరించను’ అని మామలతుదారుకు ముందుగానే చెప్పాడు.
ముసలమానాచ్యా పాయీ నమన | కరావయా హే ఘేఈనా మన | మ్హణూన శిరడీస కరావయా గమన | ప్రథమపాసూన శంకిత మీ | ||౧౫౪||
154. ‘ఒక ముసల్మాను పాదాలకు నమస్కరించడం నా మనసు ఒప్పుకోవటం లేదు. అందు చేతనే, శిరిడీకి వెళ్ళటానికి నేను మొదటినుండి వెనుకాడుతున్నాను’ అని అన్నాడు.
“పాయ పడా” హా కోణీహీ ఆగ్రహ | ధరణార నాహీ ఏసా దురాగ్రహ | కరూన ఘేఊ నకా హా గ్రహ | కరా హా నిగ్రహ మనాచా | ||౧౫౫||
155. ‘బాబా పాదాలపై పడు అని నిన్నెవరూ బలవంత పెట్టరు. ఇలాంటి ఆలోచనలను, పట్టుదలను వదిలేయి. మనసును బాగా దృఢ పరచుకో.
’కరావా మాతే నమస్కార’ | బాబాహీ న కధీ వదణార | ఆశ్వాసితా హే మామలతదార | ప్రకటలా ఆదర గమనార్థీ | ||౧౫౬||
156. ‘నాకు నమస్కారం చేయి అని బాబా ఎప్పుడూ అనరు’. అని మామలతుదారు బాగా నచ్చచెప్పగా, అతడు సరేనని వెళ్ళటానికి ఒప్పుకున్నాడు.
ఏసా దృఢనిశ్చయ కరూన | మానూని ఆపులే మిత్రాచే వచన | వికల్ప అవఘా దూర సారూన | నిఘాలే దర్శన ఘ్యావయా | ||౧౫౭||
157. తన స్నేహితుని మాటలని విని, కలిగిన అనుమానాలను వదిలేసి, నిశ్చయమైన మనసుతో, ఆ డాక్టరు సాయి దర్శనానికి బయలుదేరాడు.
పరీ ఆశ్చర్య జై శిరడీస ఆలే | దర్శనార్థ మశీదీస గేలే | ఆరంభీ త్యాంనీంచ లోటాంగణ ఘాతలే | విస్మీత ఝాలే బహు స్నేహీ | ||౧౫౮||
158. అయితే, శిరిడీ వెళ్ళి, బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళగానే, ఆశ్చర్యకరంగా, అతనే ముందుగా సాయికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చూసి, అతని స్నేహితుడు చాలా ఆశ్చర్యపోయాడు.
తంవ తే పుసతీ తయాంతే | కైసే విసరలా కృత నిశ్చయాతే | ఆమ్హా ఆధీంచ లోటాంగణాతే | ముసలమానాతే ఘాతలే కైసే | ||౧౫౯||
159. ‘నాకంటే ముందుగానే, నువ్వు ముసల్మానుకు ఎలా సాష్టాంగ పడ్డావు? వారికి నమస్కరించను అన్న నీ నిర్ణయాన్ని మరచిపోయావా?’ అని అడిగాడు.
మగ తే డాక్టర కథితీ నవల | రామరూప మ్యా దేఖిలే శామల | తే మీ తాత్కాళ వందిలే నిర్మల | సుందర కోమల సాజిరే | ||౧౬౦||
160. అందుకు ఆ డాక్టరు ‘నేను మేఘశ్యాముడైన ఆ రాముని రూపాన్ని చూసాను. పావనుడు, కోమలడు, అందంగా శోభిస్తున్న ఆ రామునికి నమస్కారం చేశాను.
తేంచ పహా హే ఆసనస్థిత | తేంచ హే సర్వాంసవే బోలత |
మ్హణతా మ్హణతా క్షణార్ధాంత | దిసూ లాగత సాఈరూప | ||౧౬౧||
161. ‘చూడు! అక్కడ కూర్చుని అందరితో మాట్లాడుతున్నది ఆ రాముడే’ అని అంటూ ఉండగానే, క్షణంలో అతనికి సాయి రూపం కనిపించింది.
మ్హణే హే కైచే ముసలమాన | యోగసంపన్న అవతారీ | ||౧౬౨||
162. అప్పుడు ఆ డాక్టరు ఆశ్చర్యంతో ‘ఇది కల కాదు కదా! వీరు ముస్లిము కాదు. యోగ సంపన్నులైన అవతార పురుషులు.
చోఖామేళా జాతీచా మహార | రోహిదాసహా తో చాంమార | సజన కసాఈ హింసా కరణార | జాతీచా విచార కాయ యాంచ్యా | ||౧౬౩||
163. ‘చోఖామేళా మాల జాతివాడు. రోహిదాసు మాదిగవాడు. సజ్జన, కసాయి - హింస చేసేవాడు. ఈ సాధు సంతుల జాతిని గురించి ఎందుకు ఆలోచించాలి?
కేవళ జగాచీయా ఉపకారా | చుకవావయా జన్మమరణాచా ఫేరా | త్యాగూని నిర్గుణా నిరాకారా | ఆలే హె ఆకారా సంత జగీ | ||౧౬౪||
164. ‘వీరందరూ కేవలం జగత్తును ఉద్ధరించటానికి, జీవులను చావు పుట్టుకల చక్రంనుండి తప్పించటానికి, నిరాకారంనుండి, అందరికీ కనిపించేలా సాకార రూపంతో ఈ ప్రపంచానికి వచ్చారు.
హా తో ప్రత్యక్ష కల్పద్రుమ | క్షణాంత సాఈ క్షణాంత రామ | మాఝా దండిలా అహంభ్రమ | దండప్రణామ కరవూనీ | ||౧౬౫||
165. ‘క్షణంలో సాయిలా, మరు క్షణంలో రామునిలా కనిపించే వీరు, మన కళ్ళ ఎదుట ఉన్న కల్పవృక్షం. నాతో సాష్టాంగ నమస్కారం చేయించి, నా అహంకారాన్ని అణచి వేశారు’, అని అనుకున్నాడు.
దుసరే దివశీ ఘేతలే వ్రత | కృపా న కరితా సాఈనాథ | పాఊల న ఠేవణే మశీదీంత | బైసలే ఉపోషిత శిరడీంత | ||౧౬౬||
166. ఇది జరిగిన మరునాడే ‘సాయినాథులు నన్ను కరుణిస్తే తప్ప, నేను మసీదులో అడుగు పెట్టను’ అని దీక్షబూని శిరిడీలో ఉపవాసంతో ఉన్నాడు.
ఏసే క్రమిలే దివస తీన | పుఢే ఉగవతా చౌథా దిన | కాయ ఘడలే వర్తమాన | దత్తావధాన పరిసా తే | ||౧౬౭||
167. అలా మూడు రోజులు గడిచాయి. నాలుగవ రోజున ఏం జరిగిందో శ్రద్ధగా వినండి.
వాస్తవ్య జ్యాచే ఖానదేశాంత | ఏసా ఎక అకస్మాత | స్నేహీ తయాంచా పాతలా తేథ | దర్శనార్థ సాఈంచ్యా | ||౧౬౮||
168. ఆ డాక్టరుకు ఖాందేశంలో ఒక స్నేహితుడు ఉండేవాడు. అకస్మాత్తుగా వాడు సాయి దర్శనానికని శిరిడీకి వచ్చాడు.
నఊ వర్షాంనీ జాహలీ భేటీ | పరమానంద మాఈనా పోటీ | డాక్టరహీ గేలే ఉఠాఉఠీ | తయాచే పాఠీ మశీదీస | ||౧౬౯||
169. తొమ్మిది నెలల తరువాత అతనిని కలుస్తున్నందుకు డాక్టరుకు పరమానందం కలిగింది. అతనితో తనూ మసీదుకు వెళ్ళాడు.
జాతాంచ ఘాతలా నమస్కార | బాబా పుసతీ “కా డాక్టర, | కోణీ ఆలా కా బోలావిణార ? | ఆలాస కా ఉత్తర దేఈ మజ” | ||౧౭౦||
170. వెళ్ళిన వెంటనే బాబా పాదాలకు నమస్కరించాడు. అప్పుడు బాబా అతనితో “ఏం డాక్టరు! నిన్ను ఎవరైనా పిలవటానికి వచ్చారా? ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు” అని అడిగారు.
ఏకూన ఏసా వర్మీ ప్రశ్న | డాక్టర గేలే విరఘళూన |
జాహలే కృతనిశ్చయాచే స్మరణ | అనుతాప ఖిన్న అంతరీ | ||౧౭౧||
171. మర్మంతో కూడుకున్న ఆ ప్రశ్న విని డాక్టరు కరిగిపోయాడు. తను తీసుకున్న నిర్ణయం గుర్తుకు వచ్చి, మనసులో చాలా బాధ పడ్డాడు.
పరీ తే దివశీ మధ్యరాత్రీ | కృపా జాహలీ తయావరీ | పరమానంద స్థితీచీ మాధురీ | నిద్రే మాఝారీ చాఖిలీ | ||౧౭౨||
172. అయినా అదే రోజు అర్ధరాత్రప్పుడు, అతనిపై బాబా కృప కలిగి, నిద్రలోనే పరమానందం అంటే ఏమిటో దాని మాధుర్యాన్ని చవిచూశాడు.
పుఢే డాక్టర స్వగ్రామా పరతతీ | తరీ తీ సంపూర్ణస్వానంద స్థితీ | సంపూర్ణ పంధరా దిన అనుభవితీ | వాఢలీ భక్తి సాఈపదీ | ||౧౭౩||
173. తన ఊరికి వెళ్ళి పోయిన తరువాత కూడా, పదిహేను రోజుల దాకా, సంపూర్ణ ఆనందాన్ని అనుభవించాడు. అలా అతనికి సాయి పాదాల మీద ఉన్న భక్తి విపరీతంగా పెరిగింది.
ఏసేచ సాఈంచే అనేక అనుభవ | సాంగూ యేతీల ఎకేక అభినవ | వాఢేల బహుత గ్రంథ గౌరవ | విస్తారభయాస్తవ ఆంవరితో | ||౧౭౪||
174. ఇలాగే, సాయి లీలల అనుభవాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక దానిని మించినది మరొకటి. చెప్పుకుంటూ పోతే, ఈ గ్రంథానికి గౌరవం పెరుగుతుంది. కాని, గ్రంథం చాలా పెద్దదై పోతుందన్న భయంతో తగ్గిస్తున్నాను.
ఆరంభీచీ ముళ్యాంచీ కథా | పరిసతా విస్మయ శ్రోతియా చిత్తా | పరీ యేథీల తాత్పర్యార్థితా | తైసీచ బోధకతా ఆకళిజే | ||౧౭౫||
175. మొదట చెప్పిన ముళే కథను వింటే, శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. కాని అందులోని సారాన్ని, బోధించిన నీతిని అర్థం చేసుకోవాలి.
జో జో జయాచా గురూ అసావా | త్యాచేచ ఠాయీ దృఢ విశ్వాస బసావా | అన్యత్ర కోఠేహీ తో నసావా | మనీ ఠసావా గుహ్యార్థ హా | ||౧౭౬||
176. మన గురువు ఎవరైనా, వారి మీద దృఢమైన నమ్మకం ఉంచాలి కానీ, ఇంకెక్కడా ఇంకెవరి మీదా ఉంచకూడదు. ఈ కథయొక్క అసలైన రహస్యం ఇదే. దీనిని మనసులో బాగా నిలుపు కోవాలి.
యాంహూన అన్య కాంహీ హెతూ | దిసేనా యా బాబాంచే లీలే ఆంతూ | కోణీ కసాహీ విచారవంతూ | అసో పరంతు అర్థ హాచీ | ||౧౭౭||
177. బాబాయొక్క ఈ లీలలో ఇంతకంటే వేరే ఏ కారణమూ కనిపించదు. ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచించినా, దీని అసలైన అర్థం ఇదే.
కోణాచీ కీర్తీ కితీహీ అసో | ఆపులే గురూచీ ముళీంహీ నసో | పరీ ఆపులేచ ఠాయీ విశ్వాస వసో | హాచి ఉపదేశో యేథిలా | ||౧౭౮||
178. మిగతా గురువులకు ఎంత గొప్ప కీర్తి ప్రతిష్ఠలు ఉన్నా, మన గురువుకు అవేవీ లేకున్నా, మన గురువు మీదే నమ్మకం ఉంచాలి అన్నదే ఈ కథలోని నీతి, సారాంశం.
పోథీ పురాణ ధుండూ జాతా | హాచ ఉపదేశ భరలా తత్వతా | పరీ ఏసీ ఖూణ గాంఠ న పఢతా | నిష్టా వఠతా వఠేనా | ||౧౭౯||
179. పురాణాలను, మతపరమైన గ్రంథాలను, ఎంత వెదికినా, అంతటా ఈ బోధయే నిండి ఉంది. కాని, ఇది అనుభవంలోకి వస్తే తప్ప, నమ్మకం కుదరదు.
నసోని ఆత్మనిశ్చయ వరిష్ఠ | మిరవితీ ఆపణ ఆత్మనిష్ఠ | త్యాంచ్యా జన్మాచే అవఘే కష్ట | దిసతీ స్పష్ట ఠాయీ ఠాయీ | ||౧౮౦||
180. తమ పైనే తమకు నమ్మకం లేని కొందరు, తామే ఆత్మను తెలుసుకున్న వారని ఊరేగుతారు. కాని, ఈ జన్మలో వారు పడే బాధలు అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తుంటాయి.
ఇదంచ నాస్తీ పరంచనా | ఆజన్మ సదైవ వివంచనా |
స్థైర్య లభేనా క్షణైక మనా | ముక్తాచ్యా వల్గనా కరితాతీ | ||౧౮౧||
181. అలాంటి వారికి ఇహ లోకం కాని, పరలోకం కాని ఏవీ లేవు. బ్రతికున్నన్ని రోజులూ ఎదో ఒక చింత. ఒక్క క్షణమైనా మనసుకు శాంతి లేక, ముక్తి పొందిన వారము అని గొప్పలు చెప్పుకుంటారు.
అసో పుఢీల అధ్యాయాచీ గోడీ | యాహూన ఆఢళేల చోఖడీ | కేవళ సాఈదర్శన పరవడీ | ఆనంద నిఖడీ భోగవీ | ||౧౮౨||
182. వచ్చే అధ్యాయం ఇంతకంటే మధురంగా, మనసును హత్తుకునేలా ఉంటుంది. కేవలం సాయి దర్శనంలో కలిగే ఆనందాన్ని అనుభవించండి.
భక్త భీమాజీ పాటీల ఏసా | క్షయరోగ తయాచా ఘాలవిలా కైసా | భక్త చాందోరకరాంచా భరవసా | దృష్టాంతా సరిసా పటవిలా | ||౧౮౩||
183. భీమాజీ పాటీలు అనే భక్తుని క్షయ రోగాన్ని బాబా ఎలా తొలగించారు, మరియు కలలో కనిపించి, భక్త చాందోర్కరు నమ్మకాన్ని బాబా ఎలా దృఢం చేశారు అన్న దాని గురించి చెబుతాను.
ఏసా కేవళ దర్శన ప్రతాప | ఏహికాంచే లావీ మాప | ఆముష్మికాహీ దేఈ ఉగ్రాప | దర్శనే నిష్పాప కరీ జో | ||౧౮౪||
184. కేవలం తమ దర్శనంతోనే భక్తుల పాపాలను తొలగించి, ఈ లోకంలో వారికి కలిగే కోరికలనే కాకుండా, వారి ఆధ్యాత్మిక అవసరాలను కూడా బాబా తీర్చేవారు.
కరీ జై యోగియాచా దృష్టిపాత | నాస్తికాంసహీ పాప నిర్ముక్త | ఆస్తికాంచీ తై కాయ మాత | పాప పరిచ్యుత సహజేంచ | ||౧౮౫||
185. యోగుల చూపు మాత్రం ప్రభావంతోనే, నాస్తికుల పాపాలు తొలగినప్పుడు, ఇక ఆస్తికుల పాపాలు కనిపించకుండా మాయమౌతాయి.
తత్వీ జయాచీ బుద్ధీ స్థిర | ఝాలా జయా అపరోక్ష సాక్షాత్కార | జో హోయ తయాచే దృష్టీగోచర | పాప దుస్తర తరలా తో | ||౧౮౬||
186. బ్రహ్మలోనే తమ మనసును స్థిరంగా నిలిపి, ఆత్మయొక్క అనుభవాన్ని పొందిన మహాత్ముల చూపు పడగానే, భక్తులు తరింప చేయలేని పాపాలనుండి కూడా తరింప బడుతారు.
ఏసీ బాబాంచీ కళా అకళ | బాబా తుమ్హాలాగీ ప్రేమళ | మ్హణోని జాణతే నేణతే సకళ | హోఊని నిర్మళ శ్రవణ కరా | ||౧౮౭||
187. ఇలా ఉంటాయి, బాబాయొక్క అర్థం కాని లీలలు. మీపట్ల బాబా ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకుని, జ్ఞానులు, అజ్ఞానులు అందరూ నిర్మలమైన మనసుతో ఈ కథలను వినండి.
జేథే భక్తిప్రేమాచా జివ్హాళా | జేథే జీవాస బాబాంచా లళా | తేథేంచ ప్రకటే ఖరా కళవళా | శ్రవణాచా సోహళా తేథేంచ | ||౧౮౮||
188. ఎక్కడ భక్తి ప్రేమలందు శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ బాబా మీద మనసులో ప్రీతి ఉంటుందో, అక్కడే నిజమైన ప్రేమను పొందాలనే తపన ఉంటుంది. అక్కడే వారి కథలను వినడం వలన ఆనందం కలుగుతుంది.
హేమాడ నమితో సాఈచరణా | వజ్రపంజర జే అనన్య శరణా | పార నాహీ తయాంచా కవణా | భవభయ హరణాశక్త జే | ||౧౮౯||
189. ఒకే మనసుతో శరణుజొచ్చిన వారికి, విపరీతమైన శక్తినిచ్చి, సంసార భయాన్ని తొలగించే సాయి పాదాలకు, హేమాడు నమస్కరిస్తున్నాడు.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | శ్రీసంతఘోలపరామ దర్శనం నామ |
| ద్వాదశోధ్యాయః సంపూర్ణః |
||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ:
1. నేమలేల్యా తీన తారఖా (ఎక వార మ్హణజే ఎక ఆఠవడా, తీన వార మ్హణజే తీన ఆఠవడే).
2. క్రీడా, లీలా.
3. హా ముకదమా ఎకాకడూన దుసర్యాకడే అసా చాలతా చార మాజిస్ట్రేటాంకడే వర్గ హోత గేలా.
4. పత్నీ.
No comments:
Post a Comment