Tuesday, April 2, 2013

||అనుగ్రహకరణం నామ ఎకవింశోద్యాయః||

శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౨౧ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

గతాధ్యాయాంతీ కథానుసంధాన | ఠాకూరాదికా మహాపురుష దర్శన | 
కైసే ఝాలే తే కరావే శ్రవణ | ఎకాగ్ర మన కరోని | ||౧|| 
1. పోయిన అధ్యాయంలో చెప్పినట్లుగా, ఇప్పుడు ఠాకూరు మొదలైన వారు ఆ మహాపురుషుని దర్శనాన్ని చేసుకున్న సంగతి. దీనిని, ఒకే మనసుతో, శ్రద్ధగా వినండి.
కాయ తయా వక్త్యాచ్యా బోలే | శ్రవణీ జే పడతా శ్రోతా న డోలే | 
అంగీచా రోమాంచహీ న హాలే | వ్యర్థ గేలే తే బోల | ||౨|| 
2. ప్రసంగించేవారి మాటలు చెవిన పడగానే, వినేవారి మనసులు ఆనందంతో ఊగి, దేహమంతా రోమాంచితం కాకపోతే, ఆ ప్రసంగం వలన ఏం ప్రయోజనం? అవి వ్యర్థమే. 
జయా శ్రవణీ న శ్రీతే రిఝలే | బాష్పగద్గద కంఠ న దాటలే | 
నయనీ ప్రేమానందాశ్రూ న వాహిలే | వ్యర్థ గేలే తే కథన | ||౩|| 
3. దానిని విని, విన్నవారు కరిగిపోక పోతే, గొంతు గద్గదమై, కళ్ళ నిండా నీరు నిండి, ఆ ప్రేమతో కూడుకున్న నీరు ప్రవహించక పోతే, ఆ మాటలు దండుగ. 
వాణీ బాబాంచీ మనోహారిణీ | ఉపదేశాచీ అలౌకిక సరణీ | 
జయాంచీ ప్రతిపదీ అభినవ కరణీ | మస్తక చరణీ తయాంచే | ||౪|| 
4. బాబా మాటలు మనసును వెంటనే ఆకట్టుకునేవి. వారు ఉపదేశించే పద్ధతే వేరు. వారి ప్రతి మాటలోనూ ఏదో క్రొత్తదనం ఉంటుంది. వారి పాదాలలో నా తలనుంచుతున్నాను. 
న యేతా దైవ ఉదయాసీ | గాంఠీ న పడే సాధుసంతాంశీ | 
తో జవళ అసతా ఉశాపాశీ | పాప రాశీస దిసేనా | ||౫|| 
5. అదృష్టం కలిసి రాకపోతే, సాధు సంతులను కలవడం జరగదు. వారు ఎంత దగ్గరలో ఉన్నా, పాపులకు కనిపించరు. 
యా ప్రమేయాచ్యా సిద్ధతేశీ | నలగే జావే దేశీ విదేశీ | 
మీచ మాఝియా అనుభవాశీ | శ్రోతియాంసీ కథితో కీ | ||౬|| 
6. ఈ నిజాన్ని నిరూపించటానికి ఏ దేశ విదేశాలకో వెళ్ళవలసిన అవసరం లేదు. అంతెందుకు, నేను నా అనుభవాన్నే శ్రోతలకు చెప్పుతాను. 
పీర మౌలానా నామే ప్రసిద్ధ | హోతే వాంద్రే శహరీ సిద్ధ | 
హిందూ పారశీ పరధర్మీ ప్రభుద్ధ | ఘేతీ శుద్ధ దర్శన తే | ||౭|| 
7. పీరు మౌలానా అనే ప్రసిద్ధమైన సిద్ధుడు, బాంద్రా పట్టణంలో ఉండేవాడు. హిందువులు, పారసీకులు, ఇతర మతాల పండితులు కూడా, అతని దర్శనానికి వచ్చేవారు. 
మీ తే శహరచా న్యాయాధీశ | ముజావర తయాంచా నామ ఇనూస | 
పాఠ పురవిలీ రాత్రందివస | యావయా దర్శనాస తయానే | ||౮|| 
8. ఆ కాలంలో, నేను అక్కడ న్యాయాధీశునిగా ఉన్నాను. అతని దగ్గర భక్తితో సేవ చేసే ఇనూస అనే ఒక భక్తుడు, నన్ను పీరు మౌలానా దర్శనానికి రమ్మని , రాత్రింబవళ్ళూ, ఎంతగానో బలవంత పెట్టేవాడు. 
హజారో లోక తేథే యావే | కిమర్థ ఆపణ తేథే జావే | 
భీడేభాడేచ్యా భరీ భరావే | ఆచవావే నిజ లౌకికా | ||౯|| 
9. గుంపులు గుంపులుగా అక్కడికి వేలాది సంఖ్యలో జనం వచ్చేవారు. అలాంటప్పుడు నేను అక్కడికి వెళ్ళడంలో ఏమర్థం? అతని భావనలను గౌరవించాలనే ఒక్క కారణం కోసం, ఆ జనంలోకి వెళ్ళి నా గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? 
ఏసే కాంహీ మనీ భావావే | దర్శనాస కధీంహీ న జావే | 
ఆపణచి ఆపులే ఛాయేస భ్యావే | దుర్దైవ యావే ఆడవే | ||౧౦||
10. అన్న ఆలోచనలు అడ్డు వచ్చి, మన నీడకు మనమే భయపడినట్లు, అతని దర్శనానికి నేనెప్పుడూ వెళ్ళలేదు. లేక, నా దురదృష్టమే నన్ను అడ్డుకున్నదేమో! 

ఏసీ కిత్యేక వర్షే గేలీ | తేథూన పుఢే బదలీ ఝాలీ | 
పుఢే జేవ్హా తీ వేళ ఆలీ | శిరడీ జోడిలీ అఖండ | ||౧౧|| 
11. అలా ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. అక్కడినుండి నాకు బదిలీ అయింది. తరువాత, మంచి కాలం వచ్చి, శిరిడీతో శాశ్వత సంబంధం ఏర్పడింది. 
తాత్పర్య హా సంతసమాగమ | అభాగ్యాస నా తేథే రిగమ1
హోతా ఈశ్వరీ కృపా హా సుగమ | అన్యథా దుర్గమ హా యోగ | ||౧౨|| 
12. సారాంశం ఏమిటంటే, అదృష్టం లేనివారికి, సత్పురుషులను కలవడం సాధ్యం కాదు. దేవుని దయ ఉంటేనే అది సాధ్యం. లేకుంటే, ఆ అవకాశం అసలు రాదు. 
యే విషయీంచీ గోడ కథా | శ్రోతా సాదర పరిసిజే ఆతా | 
యా సంతాంచ్యా అనాదీ సంస్థా | గుహ్య వ్యవస్థా కైశా త్యా | ||౧౩|| 
13. శ్రోతలు! ఈ సంగతి గురించే ఒక మధురమైన కథను, ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ సత్పురుషుల ఏర్పాటు, ఎప్పటినుంచో ఎంత రహస్యంగా జరిగేదో, ఇప్పుడు గమనించండి. 
యథాకాల వర్తమాన | జయా జే జే ఆవడే స్థాన | 
అవతార ఘేతీ కార్యాకారణ | పరి తే అభిన్న పరస్పర | ||౧౪|| 
14. సరియైన సమయం వచ్చినప్పుడు, అవసరాలకు కావలసినట్లు, వారికి నచ్చిన ప్రదేశాలలో, తమ పనులను సాధించుకోవటానికి, వారు అవతరిస్తారు. వారు ఒకరికొకరు వేరు కాదు. 
దేశ కాల వస్తు భిన్న | పరి ఎకాచీ జీ ఊణఖూణ | 
దుజా సంత జాణే సంపూర్ణ | అంతరీ ఎకపణ సకళీకా | ||౧౫|| 
15. వారి చోటు, కాలం, మరియు ఉద్దేశం, వేరుగా ఉన్నా, ఒకరి మనసును మరొకరు, పూర్తిగా తెలుసుకుంటారు. లోలోపల వారంతా ఒక్కటే. 
జైసీ సార్వభౌమ రాజాచీ ఠాణీ | వసవిలీ అసతీ ఠికఠికాణీ | 
తేథ తేథ అధికారీ నేమునీ | అబాదానీ సంపాదితీ | ||౧౬|| 
16. ఒక సార్వభౌముడు తన రాజ్యాన్ని చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించి, అక్కడి బాగోగులను చూసుకోవటానికి, ప్రాంతాధికారులను నియమించేలా –  
తైసాచ హా స్వానంద సమ్రాట | జాగోజాగీ హోఊని ప్రకట | 
చాలవీ హా నిజరాజ్య శకట | సూత్రే అప్రకట2 హాలవీ | ||౧౭|| 
17. ఆత్మలోనే ఆనందించే సామ్రాట్టు, అక్కడక్కడ కనిపించి, తన రాజ్యమనే రథాన్ని, కనబడని పగ్గాలతో, రహస్యంగా నడిపిస్తాడు. 
ఎకదా ఎక ఆంగ్ల విద్యావిభూషిత | బీ. ఎ. ఉపపదానే యుక్త | 
జే హళూ హళూ మార్గ క్రమత | ఝాలే నామాంకిత అధికారీ | ||౧౮|| 
18. ఒకప్పుడు, ఒకడు, ఇంగ్లీషు విద్యతో, బి. ఏ. డిగ్రీ పొంది, క్రమ క్రమంగా అభివృద్ధి చెంది, పేరు సంపాదించుకున్న అధికారి అయ్యాడు. 
మిళాలీ పుఢే మామలత | వాఢతా వాఢతా ఝాలే ప్రాంత3
తయాంస సాఈబాబాంచా సాంగాత4 | సుదైవే ప్రాప్త జాహలా | ||౧౯|| 
19. తరువాత, మామలతుదారై, ఇంకా ఎదుగుతూ, ఎదుగుతూ, డెప్యూటీ కలెక్టరు అయ్యాడు. అతని అదృష్టం కొద్దీ, అప్పుడు అతనికి సాయిబాబా సహవాసం దొరికింది. 
దిసాయా హీ మామలత బరీ | డోంగరీ జైసీ దురూన సాజిరీ | 
 నికట జాతా వేఢిలీ కాజరీ5 | మానే6 పరీ తీ మోఠీచ | ||౨౦||
20. ఈ ఉద్యోగాలూ, పదవులూ, గౌరవ మర్యాదలతో కూడుకున్నవి. దూరపు కొండలవలె బాగానే కనిపిస్తాయి, కాని, దగ్గరకు వెళ్ళితే, ఖర్బూజా చెట్లతో నిండి ఉంటాయి. 

గేలే తే పూర్వీల గోడ దివస | జై హోతీ యా అధికారాచీ హౌస | 
ప్రజాహీ మానీ అధికారియాస | పరస్పరాంస ఆనంద | ||౨౧|| 
21. మునుపటి మంచి రోజులు పోయాయి. అప్పుడు, అధికారం ఉండే పదవులనే కోరుకునే వారు. ప్రజలు కూడా అలాంటివారిని గౌరవించేవారు. అలా వారు ఒకరికొకరు ఆనందంగా ఉండే వారు.
పుసూ నయే ఆతాంచే హాల | సుఖాచీ నోకరీ గేలా తో కాళ | 
ఆతా జబాబదారీచా సుకాళ | ఓలా దుకాళ పైశాచా | ||౨౨|| 
22. ఇప్పటి గురించి అడగకండి. సుఖంగా ఉద్యోగం చేసుకునే కాలం పోయింది. బరువు బాధ్యతలు ఇప్పుడు బాగా పెరిగాయి. డబ్బుకు కొరత లేకున్నా, శ్రమ ఎక్కువ. 
పూర్వీల మామలతీచా మాన | తైసేచ పూర్వీల ప్రాంతాసమాన | 
వైభవ ఆతా యేనా దిసూన | నోకరీ కసూన కరితాం హీ | ||౨౩|| 
23. మునుపు మామలతదారును, ప్రాంతీయ అధికారులను గౌరవించే వారు. ఆ పదవులకు మునుపు ఉన్న వైభవం, ఎంత కష్టపడి పని చేసినా, ఇప్పుడు కనిపించటం లేదు. 
అసో తేహీ అధికార సంపాదన | అలోట పైకా వేంచిల్యావాంచూన | 
న కరితా సతత అభ్యాస శీణ | ఇతర కోణ కరూ శకే | ||౨౪|| 
24. బాగా డబ్బు ఖర్చు పెట్టి, కష్టపడి చదువుకున్నా, అధికారం ఉన్న ఉద్యోగాలు దొరకవు. 
ఆధీ హోఊ లాగే బీ. ఎ. | మగ తో నగదీ కారకూన హోయే | 
మహినా పగార తీస రూపయే | మార్గే ఏసియే తే గతి | ||౨౫|| 
25. మొదట బి. ఎ. కావాలి. తరువాత, నెలకు ముప్పై రూపాయల జీతంపై గుమాస్తా అవుతాడు. ఇదే ఇప్పటి వారి గతి. 
యథాకాళే ఘాటావర జావే | జమిన మాపణీ కామ శికావే | 
మోజణీదారాంమధ్యే రహావే | పాస వ్హావే పరీక్షే | ||౨౬|| 
26. ఇదైన తరువాత, సమయం వచ్చినప్పుడు, కొండల మీదికి వెళ్ళి, భూమి కొలతలు కొలిచే వారి మధ్యన ఉండి, పని నేర్చుకోవాలి. ఇది అయిన తరువాత, పరీక్షలు పాసు కావాలి. 
పుఢే జేవ్హా ఎకాదీ అసామీ | స్వయే జాఈల వైకుంఠధామీ | 
కరీల అపులీ జాగా రికామీ | పడేల కామీ తీ యాచ్యా | ||౨౭|| 
27. ముందు ఎప్పుడైనా, పై అధికారులలో ఎవరైనా చనిపోతే, వారి పదవి ఖాలీ అయినప్పుడు, ఆ పదవి పనికొస్తుంది. 
ఆతా అసో హే చర్హాట | కశాస పాహిజే నుసతీ వటవట | 
ఏశా ఎకాస సాఈచీ భేట | ఝాలీ తీ గోష్ట పరిసావీ | ||౨౮|| 
28. ఇక ఈ ఊకదంపుడు కబుర్లు చాలు. ఊరికే వ్యర్థంగా వాగటమెందుకు? ఠాకుర్ అనే ఒకతను సాయిని ఎలా కలుసుకున్నాడో ఇప్పుడు వినండి. 
బెళగాంవానికట దేఖ | గ్రామ ఆహే వడగాంవ నామక | 
ఆలే మోజణీదారాంచే పథక7 | ముక్కామ ఎక తై కేలా | ||౨౯|| 
29. బెళగాం దగ్గర వడగాం అనే ఒక గ్రామముంది. అక్కడికి సర్వేయర్ల గుంపు ఒకటి వచ్చి, మకాం పెట్టారు. 
గాంవీ హోతే ఎక సత్పురుష | గేలే తయాంచే దర్శనాస | 
చరణాంవరీ ఠేవలే శీస8 | ప్రసాద ఆశీష9 పావలే | ||౩౦|| 
30. ఆ గ్రామంలోనే ఉన్న ఒక మహాత్ముని దర్శనానికి ఠాకుర్ వెళ్ళి, ఆ మహాత్ముని పాదాల మీద శిరసునుంచి, ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొందాడు. 

త్యా సత్పురుషాచే హాతాంత | హోతా నిశ్చళదాస కృత | 
“విచారసాగర” నామక గ్రంథ | జో తే వాచీత తై హోతే | ||౩౧|| 
31. ఆ మహాత్ముని చేతిలో, నిశ్చల దాసు రచించిన ‘విచార సాగర్’ అన్న గ్రంథం ఉంది. అప్పుడు అతడు దానిని చదువుతున్నాడు. 
పుఢే కాంహీ వేళ జాతా | యేతో మ్హణూన నిఘూ లాగతా | 
తే సాధూ జే వదలే ఉల్హాసతా | తయా గృహస్థా తే పరిసా | ||౩౨|| 
32. కొంచెం సేపు అయ్యాక, ఠాకురు వెళ్ళుతానని చెప్పి, బయలుదేరుతుండగా, ఆ మహాత్ముడు సంతోషంతో అతనికి ఏం చెప్పాడో వినండి. 
బరే ఆతా ఆపణ యావే | యా గ్రంథాచే అవలోకన కరావే | 
తేణే తుమచే మనోరథ పురావే | అసావే హే లక్షాంత | ||౩౩|| 
33. ‘సరే, నువ్విప్పుడు వెళ్ళు. కాని, ఈ గ్రంథాన్ని పఠించు. దానితో నీ మనసులోని కోరిక తీరుతుంది, అన్నది మరచి పోకు. 
తుమ్హీ పుఢే నిజకార్యోద్దేశే | జాతా జాతా ఉత్తర దిశే | 
మార్గాంత మహాభాగ్యవశే | మహాపురుషాసీ దర్శన | ||౩౪|| 
34. ‘తరువాత, నీ పని మీద నువ్వు ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు, నీ మహా భాగ్యం కొద్దీ, దారిలో ఒక మహాపురుషుని దర్శనం కలుగుతుంది. 
పుఢీల మార్గ తే దావితీల | మనాసీ నిశ్చలతా తే దేతీల | 
తేచ మగ ఉపదేశితీల | ఠసవితీల నిజబోధ | ||౩౫|| 
35. ‘తరువాతి దారిని వారు నీకు చూపిస్తారు. నీ మనసుకు నెమ్మది ఏర్పడి, శాంతిని కలిగిస్తారు. నీకు ఉపదేశం చేసి, నీ మనసులో ఎప్పటికీ నిలిచిపోయే బోధ చేస్తారు. 
తేథీల మగ తే కార్య సరలే | జున్నరాస తేథూన బదలలే | 
నాణేఘాట10 చఢణే ఆలే | ఓఢవలే తే సంకట | ||౩౬|| 
36. అక్కడి పని ముగిసి, ఠాకూరుకు జున్నారుకు బదిలీ అయింది. అక్కడికి వెళ్ళడానికి, నాణే ఘాటును (పూనా జిల్లా) దాటాలి. 
మార్గ తేథిల అతి బికట | రేడ్యావరూన చఢతీ ఘాట | 
రేడా హాచ తదర్థ శకట11 | ఆణిల నికట ఆరూఢాయా | ||౩౭|| 
37. అక్కడి దారి చాలా కష్టమైంది. ఎనుబోతు పైన కొండ ఎక్కాలి. ఎనుబోతు ఒక్కటే అక్కడి వాహనం. అందుకే, ఎక్కటానికి దానినే తీసుకొచ్చారు. 
హోతీల పుఢే మోఠే అధికారీ | మిళతీల ఘోడే గాడ్యా మోటారీ | 
ఆజ తో ఘ్యా రేడ్యాచీ హాజిరీ | వేళ సాజిరీ కరా కీ | ||౩౮|| 
38. ముందు ఎప్పుడైనా, అతను పెద్ద అధికారి అయినప్పుడు, గుర్రపు బండో లేక మోటారు కారో దొరకుతుంది. కాని, ఇప్పటికి అతను ఎనుబోతుతోనే తన అవసరం తీర్చుకోవలసి వచ్చింది. 
ఘాట చఢణే అశక్య పాయీ | రేడియావీణ నాహీ సోఈ | 
ఏసీ తీ నాణేఘాటాచీ నవలాఈ | అపూర్వాఈ12 వాహనాచీ | ||౩౯|| 
39. నడకతో కొండ ఎక్కటం సాధ్యం కాని పని. ఎనుబోతు తప్ప వేరే వాహనం లేదు. నాణే ఘాటు కొండ ఎక్కే ప్రత్యేకమైన వాహనం అదే! 
మగ తయాంనీ కేలా విచార | పాలాణిలా13 రేడా కేలా తయార | 
తయావరీ చఢవిలే ఖోగిర | కష్టే స్వార జాహలే | ||౪౦||
40. అతను ఆలోచించి, ఎనుబోతు పై జీను వేసి, దానిని తయారు చేసుకొని, కష్ట పడుతూ దాని మీద కూర్చున్నాడు. 

స్వార ఖరే పణ హోతీ చఢణ | రేడియాసారఖే అపూర్వ వాహన | 
ఝోకే హిసకే ఖాతా జాణ | భరలీ కణకణ14 పాఠీంత | ||౪౧|| 
41. ఎక్కడమేమో ఎక్కాడు కాని, ఎనుబోతువంటి వాహనంపై ఎత్తైన కొండ ఎక్కటం, ఎగుడు దిగుడు నేల కారణంగా కలిగిన కుదుపులకు, వెన్ను నొప్పి వచ్చింది.
అసో పుఢే హా ప్రవాస సరలా | జున్నరాచా కార్యక్రమ పూరలా | 
మగ బదలీచా హుకూమ ఝాలా | ముక్కామ హాలలా తేథూని | ||౪౨|| 
42. ఎలాగో ఆ ప్రయాణం ముగిసింది. జున్నారులోని కార్యక్రమం పూర్తయింది. తరువాత, అతనికి బదిలీయై, అక్కడినుండి మకాం మారింది. 
కల్యాణాస ఝాలీ బదలీ | చాందోరకరాంచీ గాంఠ పడలీ | 
సాఈనాథాంచీ కీర్తీ ఏకిలీ | బుద్ధీ ఉదేలీ దర్శనాచీ | ||౪౩|| 
43. కల్యాణుకు బదిలీ అయి, నానా చాందోర్కరును కలుసుకోవడం జరిగింది. సాయినాథుని కీర్తి విని, వారిని దర్శించుకోవాలని బుద్ధి పుట్టింది. 
దుసరే దివశీ ఆలీ బారీ15 | ఝాలీ చాందోరకరాంచీ తయారీ | 
మ్హణతీ చలాహో బరోబరీ | కరూ వారీ శీరడీచీ | ||౪౪|| 
44. దానికి మంచి సమయం ఆ మరునాడే వచ్చింది. చాందోర్కరు శిరిడీ వెళ్ళటానికి సిద్ధమై, ‘పద, మనిద్దరం కలిసి శిరిడీకి వెళ్దాం’ అని అన్నాడు. 
ఘేఊ బాబాంచే దర్శన | కరూ ఉభయతా తయాంసీ నమన | 
రాహూ తేథే ఎక దో దిన | యేఊ పరతోన కల్యాణా | ||౪౫|| 
45. ‘బాబా దర్శనం చేసుకుని, ఇద్దరం వారికి నమస్కరించి, ఒకటి రెండు రోజులు అక్కడుండి, కల్యాణుకు తిరిగి వచ్చేద్దాం’. 
పరీ తేచ దినీ ఠాణే శహరాంత | దివాణీచే అదాలతీంత16
ముకద్దమా సునావణీ నిర్ణీత17 | త్యాగిలీ సోబత తదర్థ | ||౪౬|| 
46. కాని, ఆ రోజే, ఠాణా సివిలు కోర్టులో, ఒక కేసు గురించి, అతడు హాజరు కావలిసి ఉంది. దానివలన చాందోర్కరుతో వెళ్ళటాన్ని మానుకున్నాడు. 
నానాసాహేబ ఆగ్రహ కరీత | చలాహో ఆహేత బాబా సమర్థ | 
పురవితీల తుమచా దర్శనార్థ | కింపదార్థ తో ముకదమా | ||౪౭|| 
47. ‘పోదాం పద. కేసు గురించి సమర్థులైన బాబా చూసుకుంటారు. దర్శనం చేసుకోవాలన్న నీ కోరిక కూడా తీరుతుంది. వారి ముందు ఈ కోర్టు కేసు ఎంత?’ అని నానా బలవంత పెట్టాడు. 
పరీ హే కైంచే తయాంస పటే | తారీఖ చుకవితా భయ వాటే | 
చుకతీల కేవీ హేలపట్టే | భాలపట్టీ లిహిలేలే | ||౪౮|| 
48. కాని, అతను ఒప్పుకోలేదు. కేసు తారీఖు తప్పిపోతుందని అతని భయం. ఎంతైనా, పనికి రాని, కష్టమైన యాత్రల గురించి నొసట వ్రాసినదానిని ఎవరు తప్పించుకోగలరు? 
నానాసాహేబ చాందోరకరే | కథిలీ పూర్వీల ప్రత్యంతరే | 
దర్శనకామ18 ధరితా అంతరే | విఘ్న తే సరే బాజూలా | ||౪౯|| 
49. మునుపటి అనుభవాలను తెలుపుతూ, ‘మనసులో దర్శించాలనే కోరిక ఉంటే, అడ్డంకులు వాటంతట అవే ప్రక్కకు తొలగి పోతాయి’ అని నానాసాహేబు చాందోర్కరు చెప్పాడు. 
పరీ యేఈనా విశ్వాస జీవా | కరితీల కాయ నిజస్వభావా | 
మ్హణతీ ఆధీ ఘోర చుకవావా | నికాల లావావా దావ్యాచా | ||౫౦||
50. మనసుకు నమ్మకం కలుగలేదు. తన స్వభావం అలా ఉంటే, అతనేం చేస్తాడు? ‘ముందు కేసు సంగతి తేల్చుకుని, ఆ బాధను వదిలించుకోవాలి’ అని అన్నాడు. 

అసో తే మగ ఠాణ్యాస గేలే | చాందోరకర శిరడీస నిఘాలే | 
దర్శన ఘేఊన పరత ఫిరలే | నవల వర్తలే ఇకడే పై | ||౫౧|| 
51. తరువాత అతను ఠాణాకు వెళ్ళాడు. చాందోర్కరు శిరిడీకి వెళ్ళి, దర్శనం చేసుకుని, వెనుకకు తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఠాణాలో ఓ వింత జరిగింది. 
వేళీ జరీ హే హజర రాహిలే | దావ్యాచే కామ పుఢే నేమిలే | 
చాందోరకరహీ హాతచే గేలే | ఖజీల ఝాలే అంతరీ | ||౫౨|| 
52. సమయానికి సరిగ్గా ఠాకురు కోర్టుకు హాజరు అయినా, కేసు ఇంకో తేదికి వాయిదా పడింది. కాని ఇప్పుడు, చాందోర్కరు కూడా వెళ్ళిపోయాడు. మనసులో చాలా కలత చెందింది. 
విశ్వాస ఠేవితో బరే హోతే | చాందోరకర సవే నేతే | 
దర్శనాచే కార్య ఉరకతే | స్వస్థచిత్తే శిరడీంత | ||౫౩|| 
53. ‘చాందోర్కరు మాటలను నమ్మి ఉంటే ఎంత బాగుండేది! తన వెంట శిరిడీకి తీసుకొని వెళ్ళేవాడు. దర్శనం పని ముగించుకుని, శిరిడీలో నెమ్మదిగా ఉండేవాణ్ణి’. 
దావ్యాపరీ దావా రాహిలా | సాధు సమాగమహీ అంతరలా | 
ఉఠాఉఠీ నిశ్చయ కేలా | జావయాలా శిరడీస | ||౫౪|| 
54. ‘కేసు పనీ కాలేదు, సాధువును కలవటం కూడా కాలేదు’ అని అనుకుని, శిరిడీకి వెళ్ళాలని వెంటనే నిశ్చయించుకున్నాడు. 
న జాణో మీ శిరడీస జాతా | సమయీ నానాంచీ భేట హోతా | 
స్వయే నిరవితీల సాఈనాథా | ఆనంద చిత్తా హోఈల | ||౫౫|| 
55. ‘శిరిడీకి వెళ్ళాక, నానా కలుస్తాడో లేదో! తనైతే, సాయినాథునికి నా గురించి చెబుతాడు. అలా అయితే మనసు ఆనందిస్తుంది. 
శిరడీస నాహీ కోణీ పరిచిత | తేథ మీ సర్వథైవ అపరిచిత | 
నానా భేటతా హోఈల ఉచిత | జరీ క్వచిత యోగ తో | ||౫౬|| 
56. ‘శిరిడీలో నాకెవ్వరూ తెలియదు. నాకు ఆ చోటు క్రొత్త. నానాను కలిస్తే బాగుంటుంది. కాని కలిసే అవకాశం తక్కువ’. 
ఏసే విచార కరీత కరీత | బైసలే తే అగ్నిరథాంత | 
దుసరే దివశీ పావలే శిరడీంత | నానా తై అర్థాంత నాహీంత | ||౫౭|| 
57. అలా ఆలోచించుకుంటూ, రైలు బండిలో కూర్చున్నాడు. మరునాడు శిరిడీ చేరుకున్నాడు. కాని, నానా అక్కడ లేడు. 
హే జే దినీ యావయా నిఘాలే | నానా తే దినీ జావయా గేలే | 
తేణే హే బహు హతాశ ఝాలే | అతి హిరముసలే మనాంత | ||౫౮|| 
58. అతను వెళ్ళిన రోజే, నానా కూడా తిరిగి వచ్చేశాడు. ఠాకురుకు నిరాశ కలిగింది. విసుగుతో కుంగిపోయాడు. 
అసో మగ తయాంస తేథే భేటలే | తయాంచే దుసరే స్నేహీ భలే | 
తయాంనీ సాఈంచే దర్శన కరవిలే | హేతు పురవిలే మనాచే | ||౫౯|| 
59. కాని, అక్కడ ఇంకొక మంచి మిత్రుడు కలిసి, అతనికి సాయి దర్శనాన్ని కలిగించాడు. ఠాకురు మనసులోని కోరిక తీరింది. 
దర్శనే పాయీ జడలే చిత్త | ఘాతలా సాష్టాంగ దండవత | 
శరీర ఝాలే పులకాంకిత | నయనీ శ్రవత ప్రేమాశ్రు | ||౬౦||
60. సాయి పాదాలను చూడగానే, అతని మనసు అక్కడే నిలిచిపోయింది. సాష్టాంగ నమస్కారం చేయగా, దేహం పులకించి, ప్రేమతో కళ్ళనుండి నీరు ప్రవహించింది. 

మగ తే హోతా క్షణైక స్థిత | కాయ తయాంసీ బాబా వదత | 
త్రికాలజ్ఞ ముఖ కరోని సస్మిత | సావచిత్త తే పరిసా | ||౬౧|| 
61. ఒక క్షణం పాటు, అతను కదలకుండా ఉండగా, త్రికాలజ్ఞులైన బాబా, చిరునవ్వుతో, అతనితో ఏమన్నారో జాగ్రత్తగా వినండి.
“కానడీ ఆప్పాచే తే సాంగణే | జైసే రేడియా సంగే ఘాట చఢణే | 
ఏసే న యేథీల సోపే చాలణే | అంగ ఝిజవిణే అనివార్య” | ||౬౨|| 
62. “కన్నడ అప్పా చెప్పినట్లుగా, ఎత్తైన కొండ ఎక్కడానికి ఉండే, ఎనుబోతులాంటి సులభమైన ఉపాయాలు, ఇక్కడ లేవు. దేహాన్ని అరగ తీయక తప్పదు”. 
కర్ణీ పడతా ఖుణేచీ అక్షరే | అంతరంగ అధికచి గహింవరే | 
పూర్వీల సత్పురుష వచన ఖరే | ప్రత్యంతరే ఠరలే కీ | ||౬౩|| 
63. గుర్తుకు తెచ్చే ఈ పదాలు చెవిలో పడగానే, అతని మనసులో సంతోషం ఉప్పొంగింది. మహాత్ముడు మునుపు చెప్పిన మాటలు నిజమని ఇప్పుడు అనుభవమైంది. 
మగ జోడూనియా ఉభయ హస్తా | సాఈపదీ ఠేవిలా మాథా | 
మ్హణతీ కృపా కరా సాఈనాథా | మజ అనాథా పదరీ ఘ్యా | ||౬౪|| 
64. తన రెండు చేతులో జోడించి, సాయి పాదాల మీద తలనుంచాడు. ‘సాయినాథా! నన్ను కరుణించండి. నేను అనాథను. నన్ను మీ ఒడిలోకి తీసుకోండి. 
ఆపణచి మాఝే మహాపురుష | నిశ్చళదాసగ్రంథోపదేశ | 
ఆజ మజ కళలా అశేష | నిర్విశేష సుఖబోధ | ||౬౫|| 
65. ‘మీరే నాకు మహాపురుషులు. నిశ్చళదాసు గ్రంథంలోని ఉపదేశం ఇవాళ నాకు బాగా అర్థమైంది. విపరీతమైన ఆనందాన్ని పొందాను. 
కుఠే వడగాంవ కుఠే శిరడీ | కాయ హీ సత్పురుష మహాపురుష జోడీ | 
కితీ తీ స్వల్పాక్షర భాషా ఉఘడీ | ఉపదేశ నిరవడీ కైసీ హే | ||౬౬|| 
66. ‘ఎక్కడ వడగాం, ఎక్కడ శిరిడీ! ఎలాంటి సత్పురుషులైన మహానుభావుల జంట! వారి ఉపదేశాలు చిన్నవిగా ఉన్నా, ఎంత స్పష్టంగా ఉన్నాయి! 
ఎక మ్హణతీ గ్రంథ వాచా | పుఢే సంగమ మహాపురుషాచా | 
మగ తే పుఢీల కర్తవ్యాచా | ఉపదేశ సాచా కరతీల | ||౬౭|| 
67. ‘ఒకరేమో ‘ఈ గ్రంథాన్ని చదువు. ముందు నువ్వు ఒక మహాపురుషుని కలిసినప్పుడు, వారు నీకు తరువాతి దారిని చూపిస్తారు’ అని చెప్పారు. 
దైవయోగే తేహీ భేటలే | తేచ తే హే ఖుణాంహీ పటవిలే | 
పరీ తే ఎకాచే వాచిలే | దుజియా ఆచరిలే పాహిజే | ||౬౮|| 
68. ‘అదృష్టం కొద్దీ, ఆ మహాపురుషుణ్ణి కూడా కలుసుకున్నాను. తానే ఆ మహాపురుషుడని, ఆయనే సూచించాడు. ఒకరు చెప్పినట్లు పఠించాను. ఇప్పుడు ఈ రెండవ వారు చెప్పినట్లు నడుచుకోవాలి’. 
తయాంసీ మ్హణతీ సాఈనాథ | “అప్పాంనీ సాంగితలే యథార్థ | 
పరీ జేవ్హా తే యేఈల కృతీంత | పూర్ణ మనోరథ తై హోతీ” | ||౬౯|| 
69. అతనితో సాయినాథులు “అప్పా చెప్పినది నిజమే. కాని, ఆయన చెప్పినదానిని నీవు ఆచరించినప్పుడే, నీ మనసులోని కోరిక పూర్తిగా తీరుతుంది”. 
నిశ్చలదాస విచారసాగర | వడగాంవీ భక్తార్థ ఝాలా ఉచ్చార | 
కాళే గ్రంథ పారాయణానంతర | శిరడీంత ఆచార కథియేలా | ||౭౦||
70. నిశ్చళ దాసు రచించిన ‘విచార సాగర్’ అను గ్రంథాన్ని, భక్తుల శ్రేయస్సు కొరకు పఠించమని, వడగాంలో చెప్పారు. ఆ చదివినదాన్ని ఎలా ఆచరించాలో, శిరిడీలో చెప్పారు. 

గ్రంథ కరావా ఆధీ శ్రవణ | త్యాచేంచ మగ కరావే మనన | 
హోతా పారాయణావర్తన | నిదిధ్యాసన హోతసే | ||౭౧|| 
71. మునుపు, గ్రంథాన్ని బాగా విని, దాని గురించి ఆలోచించాలి. దానిని మరల మరల పారాయణం చేస్తూ ఉంటే, అదే ధ్యానంగా మారుతుంది. 
వాచిలే తే నాహీ సంపలే | పాహిజే తే కృతీంత ఉతరలే | 
యా ఉపడీ ఘడ్యావర తోయ ఓతలే | తైసే జాహలే తే సకళ | ||౭౨|| 
72. ఊరికే చదివినంత మాత్రాన సరిపోదు. చదివిన దానిని ఆచరణలో పెట్టాలి. లేకుంటే, బోర్లించిన కుండపై నీరు పోసినట్లు ఉంటుంది. 
వ్యర్థ వ్యర్థ గ్రంథవాచన | హాతీ న యే జో అనుభవజ్ఞాన | 
బ్రహ్మసంపన్న గురుకృపేవీణ | పుస్తకీ జ్ఞాన నిష్ఫళ | ||౭౩|| 
73. చదివినది స్వయంగా అనుభవంచి, ఆ అనుభవంతో జ్ఞానం పొందనంత వరకు, గ్రంథ పఠన దండుగ. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన గురువు కృప లేకుండా, పుస్తకం చదివితే వచ్చే జ్ఞానం పనికి రానిది. 
యే అర్థీంచీ అల్ప కథా | దావీల భక్తీచీ యథార్థతా | 
పురుషార్థాచీ అత్యావశ్యకతా | శ్రోతా నిజస్వార్థా పరిసిజే | ||౭౪|| 
74. దీని గురించి, భక్తిలోని నిజాన్ని, మరియు మనిషి ప్రయత్నాన్ని తెలియ చేసే ఒక చిన్న కథను, శ్రోతలు, మీ శ్రేయస్సు కోసం వినండి. 
ఎకదా ఎక పుణ్యపట్టణకర | నామే అనంతరావ పాటణకర | 
సాఈదర్శనీ ఉపజలా ఆదర | ఆలే సత్వర శిరడీస | ||౭౫|| 
75. పుణే పట్టణంలో ఉండే ఒక మనిషి, సాయి దర్శనానికని శిరిడీకి వచ్చాడు. అతని పేరు అనంతరావ పాటణకరు. 
వేదాంత శ్రవణ జాహలా సకళ | సటీక ఉపనిషదే వాచిలీ సమూళ | 
పరీ తన్మానస అక్షయీ చంచళ | రాహీనా తళమళ తయాచీ | ||౭౬|| 
76. అతడు వేదాంతాన్ని చాలా సార్లు విన్నాడు. ఉపనిషత్తులను, మూలమైన సంస్కృత భాషలో, మొత్తం చదివాడు. కాని, అతని మనసుకు నెమ్మది లేకుండా, ఎప్పుడూ అలజడిగా కలతగా ఉండేది. 
ఘేతా సాఈసమర్థాంచే దర్శన | నివాలే పాటణకరాంచే నయన | 
కరూని పాయాంచే అభివందన | యథోక్త పూజన సంపాదిలే | ||౭౭|| 
77. సాయి సమర్థుని దర్శనం చేసుకున్న తరువాత, పాటణకరు కళ్ళు తృప్తి చెంది, మనసు శాంతించింది. బాబా పాదాలకు నమస్కరించి, శాస్త్ర ప్రకారం పూజ చేశాడు. 
మగ హోఊని బద్ధాంజుళీ | బైసూని సన్ముఖ బాబాంచే జవళీ| 
అనంతరావ ప్రేమ సమేళీ | కరుణా బహాళీ పుసత కీ | ||౭౮|| 
78. తరువాత, చేతులు జోడించుకుని, బాబా ఎదుట కూర్చుని, ప్రేమగా, దీనంగా అనంతరావు అడిగాడు. 
కేలే వివిధ గ్రంథావలోకన | వేదవేదాంగ ఉపనిషదధ్యయన19
కేలే సచ్ఛాస్త్ర పురాణ శ్రవణ | పరీ హె నిర్విణ్ణ మన కైసే | ||౭౯|| 
79. ‘నేను ఎన్నో గ్రంథాలను చదివాను. వేద వేదాంగాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేశాను. శాస్త్రాలను, పురాణాలను విన్నాను. అయినా, మనసుకు శాంతి లేదెందుకు? 
వాచిలే తే వ్యర్థ గేలే | ఏసేంచ ఆతా వాటూ లాగలే | 
అక్షరహీన భావార్థీ భలే | వాటతీ చాంగలే మజహూన | ||౮౦||
80. ‘కాని, చదివినదంతా వ్యర్థమని ఇప్పుడు అనిపిస్తుంది. నాకంటే, ఏ చదువూ లేని భక్తులే నయం. 

వాయా గేలే గ్రంథావలోకన | వాయా శాస్త్రపరిశీలన | 
వ్యర్థ హే సకళ పుస్తకీ జ్ఞాన | అస్వస్థ మన హే జోంవరీ | ||౮౧|| 
81. ‘మనసుకు నెమ్మది, ప్రశాంతత ఇవ్వనప్పుడు, ఎన్ని పుస్తకాలను చదివినా, ఎన్ని శాస్త్రాలను లోతుగా అభ్యసించినా, దండుగే కదా!
కాయ తీ ఫోల శాస్త్ర వ్యుత్పత్తీ | కిమర్థ మహావాక్యానువృత్తీ20
 జేణే న లాధే చిత్తాస శాంతీ | బ్రహ్మసంవిత్తి21 కాశ్యాచీ22 | ||౮౨|| 
82. ‘శాస్త్రాల మూలాన్ని తెలుసుకొని, తర్కించడంలో ఏముంది? మహావాక్యాలను మరల మరల పఠించడమెందుకు? వీనితో మనసుకు శాంతి దొరకనప్పుడు, ఇంక బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది? 
కర్ణోపకర్ణీ పరిసిలీ వార్తా | సాఈ దర్శనే నివారే చింతా | 
వినోద గోష్టీ వార్తా కరితా | సహజ సత్పథా లావితీ తే | ||౮౩|| 
83. ‘సాయి దర్శనంతో చింతలు తొలగి పోతాయని, సరదాగా, వినోదంగా మాట్లాడుతూ, బాబా మంచి దారిని చూపిస్తారని, ఆ నోటా ఆ నోటా చెప్పగా విన్నాను. 
మ్హణవూన మహారాజ తపోరాశీ | పాతలో ఆపుల్యా పాయాంపాశీ | 
యేఈల స్థైర్య మాఝియా మనాసీ | ఆశీర్వచనాసీ ద్యా ఏశా | ||౮౪|| 
84. ‘అందుకే, మహారాజా! తపోరాశి! మీ పాదాల దగ్గరకు చేరాను. నా మనసుకు నెమ్మదిని, నిలుకడని కలిగేలా నన్ను ఆశీర్వదించండి’ అని దీనంగా వేడుకున్నాడు. 
తవ మహారాజ ఝాలే కథితే | ఎకా వినోదపర ఆఖ్యాయికేతే | 
జేణే అనంతరావ సమాధానాతే | పావలే సాఫల్యతే జ్ఞానాచ్యా | ||౮౫|| 
85. అప్పుడు సాయి మహారాజు, సరదాగా, వినోదంగా ఉన్న ఒక కథను చెప్పారు. దానిని విని అనంతరావు తాను ఇంతవరకూ సంపాదించుకున్న జ్ఞానం వ్యర్థం కాలేదని సంతోష పడి, తృప్తి చెందాడు. 
తీ అల్పాక్షర పరమసార | కథా కథితో వ్హా శ్రవణతత్పర | 
వినోద పరీ తో బోధపర | కోణ అనాదర కరీల | ||౮౬|| 
86. చాలా తక్కువ మాటలతో సాయి చెప్పిన, పరమార్థ సారమైన ఆ కథను చెబుతాను వినండి. వినోదంగా అనిపించినా, జ్ఞానంతో కూడినది. ఇలాంటి కథను, ఎవరైనా ఆదరించకుండా ఉండగలరా? 
బాబా దేత ప్రత్యుత్తర | “ఎకదా ఎక ఆలా సౌదాగర | 
తేవ్హా ఎక ఘోడే సమోర | ఘాలీ లేండార23 నవాంచే24 | ||౮౭|| 
87. బాబా చెప్పారు, “ఒక సారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడు అతని ఎదుట, ఒక గుర్రం తొమ్మిది లద్దెలను వేసింది. 
సౌదాగర నిజకార్య తత్పర | లేండియా పడతా పసరిలా పదర | 
బాంధూన ఘేతా ఘట్ట త్యా సమగ్ర | చితైకాగ్ర్య లాధలా” | ||౮౮|| 
88. “వ్యాపారి తన లాభాన్ని ఆలోచించి, వెంటనే తన కండువాను పరచి, ఆ లద్దెలన్నిటినీ సేకరించి, గట్టిగా మూట కట్టుకుని, మనసుకు నెమ్మదిని, ఏకాగ్రతను పొందాడు” అని చెప్పారు. 
హేకాయ వదలే సాఈసమర్థ | కాయ అసావా కీ మథితార్థ | 
లేండియా సంగ్రహీ సౌదాగర కిమర్థ | కాంహీహీ అర్థ కళేనా | ||౮౯|| 
89. ‘సాయి సమర్థులు ఏం చెప్పారు? దీని అసలు అర్థం ఏమై ఉంటుంది, వ్యాపారి లద్దెలను ఎందుకు పోగు చేసుకున్నాడు? ఏమో, ఏదీ అర్థం కావటం లేదు’. 
ఏసా విచార కరీత కరీత | అనంతరావ మాఘారా యేత | 
కథిలే సంభాషణ ఇత్యంభూత | కేళకరాంప్రత25 తయానే | ||౯౦||
90. అని అనంతరావు ఆలోచిస్తూ, దాదా కేళకరు దగ్గరికి వెళ్ళి, జరిగినదంతా వివరంగా చెప్పాడు. 

మ్హణతీ సౌదాగర తో కోణ | లేండియాంచే కాయ ప్రయోజన | 
నవాంచేచ కాయ కారణ | సాంగా ఉలగడూన హే మజలా | ||౯౧|| 
91. ‘అసలు ఆ వ్యాపారి ఎవరు? లద్దెలనుండి ప్రయోజనమేమిటి? తొమ్మిదే ఎందుకు? వీటన్నిటికీ నాకు వివరంగా జవాబు చెప్పండి. 
దాదా హే కాయ ఆహే కోడే | మీ అల్పబుద్ధీ మజ తే నులగడే | 
హోఈల బాబాంచే హృదయ ఉఘడే | ఏసే రోకడే మజ కథా | ||౯౨|| 
92. ‘దాదా! దీని రహస్యమేమిటి? బుద్ధి తక్కువగా ఉన్న నాకు, ఏమీ అర్థం కావటం లేదు. బాబా మనసులో ఏముందో, దానిని నాకు అర్థమయ్యేలా వివరంగా చెప్పు’ అని అడిగాడు. 
దాదా వదతీ మజహీ న కళే | ఏసేంచ బాబాంచే భాషణ సగళే | 
కరీ తయాంచ్యాచ స్ఫూర్తీచ్యా బళే | కథితో ఆకళే జే మజ | ||౯౩|| 
93. అతనితో దాదా ‘నాకు కూడా ఏం అర్థం కావటం లేదు. బాబా మాటలన్నీ ఇలాగే ఉంటాయి. అయినా, వారు నాకు ఇచ్చే ప్రేరణతో, నాకు అర్థమైనది, చెప్పుతాను. 
కృపా ఈశ్వరీ తే హే ఘోడే | హే తో నవవిధా భక్తీచే కోడే | 
వినా భక్తి న పరమేశ్వర జోడే | జ్ఞానా న ఆతుడే ఎకల్యా | ||౯౪|| 
94. ‘ఈశ్వరుని అనుగ్రహమే ఆ గుర్రం. తొమ్మిది రకాలైన భక్తి మార్గాలే ఆ లద్దెలు. భక్తి, ప్రేమ లేకుండా ఈశ్వరుడు దొరకడు, జ్ఞానం కూడా లభించదు. 
శ్రవణ కీర్తన విష్ణుస్మరణ | చరణసేవన అర్చన వందన | 
దాస్య సఖ్య ఆత్మనివేదన | భక్తి హే జాణ నవవిధా | ||౯౫|| 
95. ‘శ్రవణం (దేవుని గురించిన సంగతులు వినడం), కీర్తన (దేవుని గురించి పాడటం), స్మరణ (దేవుణ్ణి తలుచుకుని, దేవుడి పేర్లు ధ్యానం చేయుట), పాదసేవన (పాదాలు కడగటం, నొక్కటం), అర్చన (పూజ చేసి, నైవేద్యం ఇవ్వటం), వందనం (నమస్కరించుట), దాస్యం (సేవ చేయటం), సఖ్యం (దేవుడితో స్నేహంగా ఉండటం) మరియు ఆత్మనివేదనం (తనను తాను సమర్పించుకోవటం) అనేవి తొమ్మిది రకాల భక్తి మార్గాలు. 
పూర్ణ భావ ఠేవూని అంతరీ | యాంతూన ఎకహీ ఘడలీ జరీ | 
భావాచా భుకేలా శ్రీహరీ | ప్రకటేల ఘరీంచ భక్తాచ్యా | ||౯౬|| 
96. ‘వీటిలో ఏ ఒక్కటైనా, పూర్తి భక్తితో, ఆచరిస్తే, భక్తికి అర్రలు చాచే శ్రీహరి, భక్తుల ఇంట్లోనే కనిపిస్తాడు. 
జపతపవ్రత యోగసాధన | వేదోపనిషద పరిశీలన | 
ఉదండ ఆధ్యాత్మజ్ఞాన నిరూపణ | భక్తి విహీన తే ఫోల | ||౯౭|| 
97. ‘జప, తప, వ్రతాలు మొదలైన యోగ సాధనలు, వేదోపనిషత్తుల అధ్యయనం, పరమార్థ జ్ఞానాన్ని గొప్పగా చెప్పుకోవటం, ఇవన్నీ భక్తి లేకుంటే, వ్యర్థమే. 
నకో వేదశాస్త్ర వ్యుత్పత్తీ | నకో జ్ఞానీ హే దిగంత కీర్తి | 
నకో శుష్క భజన ప్రీతీ | ప్రేమళ భక్తీ పాహిజే | ||౯౮|| 
98. ‘వేద శాస్త్రాల మూలం తెలుసుకోవటం అవసరం లేదు. గొప్ప జ్ఞాని అన్న కీర్తి ప్రతిష్ఠలూ అక్కర లేదు. భక్తి, ప్రేమ లేని భజనలు చేయనవసరం లేదు. ప్రేమతో కూడిన భక్తి ఉంటే చాలు. 
స్వయే ఆపణా సౌదాగర సమజా | సౌద్యాచ్యా యా భావార్థా ఉమజా | 
ఫడకతా శ్రవణాది భక్తీచీ ధ్వజా | జ్ఞానరాజా ఉల్హాసే | ||౯౯|| 
99. ‘నీవే వ్యాపారి అనుకొని, వ్యాపారంలోని అసలు అర్థం తెలుసుకో. అదేమిటంటే, ఒక్క మారు తొమ్మిది రకాల భక్తి మార్గంయొక్క ధ్వజం ఎగురుతుంటే, జ్ఞానరాజు ఆనందిస్తాడు. 
ఘోడ్యానే ఘాతల్యా లేండ్యా నఊ | సౌదాగర అతురతే ధాంవలా ఘేఊ | 
తైసాచ నవవిధా భక్తిభావూ | ధరితా విసావూ మనాతే | ||౧౦౦||
100. ‘గుర్రం తొమ్మిది లద్దెలను వేయగానే, వ్యాపారి వానిని తీసుకోవటానికి ఆతురతతో పరుగెత్తాడు. అలాగే, తొమ్మిది రకాల భక్తి మార్గాన్ని మూట కట్టుకుంటే, మనసుకు శాంతి కలుగుతుంది. 

తేణేంచ మనాస యేఈల స్థైర్య | సర్వాంఠాయీ సద్భావ గాంభీర్య | 
త్యావీణ చాంచల్యా హే అనివార్య | కథితీ గురువర్య సప్రేమ | ||౧౦౧|| 
101. ‘దానివలననే అందరి పట్లా మంచి అభిప్రాయం కలుగుతుంది. గంభీరత పెరుగుతుంది. అలా కాకపోతే, మనసులోని కలత తప్పదు అని గురువర్యులు ప్రేమతో తెలియచేశారు’ అని చెప్పాడు.
దుసరే దివశీ అనంతరాయ | వందూ జాతా సాఈంచే పాయ | 
“పదరీ బాంధిల్యాస లేండ్యా కాయ” | పృచ్ఛా హీ హోయ తయాంస | ||౧౦౨|| 
102. మరునాడు, అనంతరావు సాయి పాదాలకు నమస్కరిస్తుండగా, బాబా అతనిని “లద్దెలను కొంగున కట్టుకున్నావా?” అని అడిగారు. 
అనంతరావ తేవ్హా ప్రార్థితీ | కృపా అసావీ దీనావరతీ | 
 సహజ మగ త్యా బాంధిల్యా జాతీ | కాయ తీ మహతీ తయాంచీ | ||౧౦౩|| 
103. అప్పుడు అనంతరావు ‘ఈ దీనునిపై మీ అనుగ్రహముంటే, వానిని సులభంగా మూట కట్టుకోవచ్చు. అందులో గొప్పతనం ఏముంది?’ అని చెప్పాడు. 
తంవ బాబా ఆశీర్వాద దేతీ | “కల్యాణ హోఈల” ఆశ్వాసితీ | 
అనంతరావ ఆనందలే చిత్తీ | సుఖ సంవిత్తి లాధలే | ||౧౦౪|| 
104. తరువాత బాబా అతనిని ఆశీర్వదించి, “నీకు శుభం జరుగుతుంది” అని చెప్పారు. అనంతరావుకు సుఖశాంతులు లభించి, ఆనందించాడు. 
ఆతా ఆణీక అల్ప కథా | శ్రోతా పరిసిజే సాదర చిత్తా | 
కళేల బాబాంచీ అంతర్జ్ఞానితా | సన్మార్గ ప్రవర్తకతా తైసీచ | ||౧౦౫|| 
105. ఇప్పుడు, మరొక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా వింటే, అన్నీ అలవోకగా తెలుసుకోగల బాబా శక్తి గురించి, వారు భక్తులను మంచి మార్గంలో పెట్టే విధానం తెలుస్తాయి. 
ఎకదా ఎక వకీల ఆలే | యేతాంక్షణీంచ మశీదీ గేలే | 
సాఈనాథాంచే దర్శన ఘేతలే | పాయ వందిలే తయాంచే | ||౧౦౬|| 
106. ఒక సారి ఒక వకీలు వచ్చి, వెంటనే మసీదుకు వెళ్ళి, సాయినాథుల దర్శనం చేసుకుని, వారి పాదాలకు నమస్కారం చేశాడు. 
సవేంచ మగ దేఊని దక్షిణా | బైసలే బాజూస వకీల తత్క్షణా | 
తేథే చాలాల్యా సాఈ సంభాషణా | ఆదర శ్రవణా ఉపజలా | ||౧౦౭|| 
107. తక్షణం దక్షిణను ఇచ్చి, ఒక ప్రక్కన కూర్చున్నాడు. సాయి ఎవరితోనో మాట్లాడుతుంటే, అతనికి వినాలనే కోరిక కలిగింది. 
బాబా తవ తికడే ముఖ ఫిరవితీ | వకీలాంస అనులక్షూన వదతీ | 
బోల తే వర్మీ జాఊన ఖోంచతీ | వకీల పావతీ అనుతాప | ||౧౦౮|| 
108. అతని వైపే చూస్తూ, అతనిని ఉద్దేశించి బాబా చెప్పిన మాటలు, ఆ వకీలు మనసులో గ్రుచ్చుకుని, పశ్చాత్తాపం కలిగింది. 
“లోక తరీ హో లబాడ కితీ | పాయా పడతీ దక్షిణా హీ అర్పితీ | 
ఆణీక ఆంతూన శివ్యాహీ దేతీ | కాయ చమత్కృతీ సాంగావీ” | ||౧౦౯|| 
109. “జనులు ఎంత మోసగాళ్ళు! పాదాలపై పడుతారు. దక్షిణను కూడా ఇస్తారు. అలాగే మనసులో తిడతారు కూడా. ఎంత ఆశ్చర్యం!” 
ఏకూన హే వకీల స్వస్థ రాహిలే | కీ తే నిజాంతరీ పూర్ణ ఉమజలే | 
ఉద్గార అన్వర్థ హే తయా పటలే | తాత్పర్య ఠసలే మనాసీ | ||౧౧౦||
110. ఆ మాటలు విన్న వకీలు ఊరికే కూర్చునే ఉన్నాడు. కాని, మనసులో ఆ మాటల వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకున్నాడు. బాబా మాటలలోని సారాంశం, మనసులో బాగా నాటుకుంది. 

పుఢే జేవ్హా తే వాడ్యాంత గేలే | దీక్షితాంలాగీ కథితే ఝాలే | 
కీ జే బాబా లావూని బోలలే | సార్థచి వహిలే తే సర్వే | ||౧౧౧|| 
111. తరువాత, వాడాకు వెళ్ళినప్పుడు, దీక్షితుతో ‘బాబా మాటలు మనసులో గుచ్చుకున్నా, అవన్నీ అర్థంతో నిండిన నిజాలే. 
యేతాంచ మజవర ఝాడిలా తాశేరా | తో మజ కేవళ దిధలా ఇశారా | 
కుణాచీ థట్టా నిందాది ప్రకారా | దేఈ న థారా అంతరీ | ||౧౧౨|| 
112. ‘నేను రాగానే, నా పై చెణుకు విసిరారు. నిందలతో, వెటకారాలతో ఎవరి మనసునూ బాధ పెట్టరాదని బాబా సూచించారు. 
శరీరప్రకృతి హోఊని అస్వస్థ | మున్సఫ అముచే జాహలే త్రస్త | 
రాహిలే రజేవర యేథే స్వస్థ | అపులీ ప్రకృతీ సుధరావయా | ||౧౧౩|| 
113. ‘మా మునసబు ఆరోగ్యం బాగా లేక, బాధ పడుతుండగా, దేహానికి విశ్రాంతినిచ్చి, ఆరోగ్యం పొందాలని, సెలవు మీద ఇక్కడికి వచ్చాడు. 
వకీలాంచ్యా ఖోలీంత అసతా | మున్సఫాంసంబంధే నిఘాల్యా వార్తా | 
అర్థోఅర్థీ సంబంధ నసతా | ఊహాపోహతా చాలలీ | ||౧౧౪|| 
114. ‘వకీళ్ళు కూర్చునే గదిలో మేముండగా, ఆ మునసబు మాట వచ్చి, మాకు సంబంధం లేకున్నా, ఎన్నో రకాల అర్థం పర్థం లేని చర్చ జరిగింది. 
ఔషధావీణ యా శరీరాపదా | టళతీల కా లాగతా సాఈంచ్యా నాదా | 
పావలే జే మున్సఫీచే పదా | తయా హా ధందా సాజే కా | ||౧౧౫|| 
115. ‘ఏ మందులూ లేకుండా, సాయిని ఆశ్రయిస్తే మాత్రం, రోగం నయమౌతుందా? మునసబు పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఇలా చేయటం సబబా? 
ఏసీ తయాంచీ నిందా చాలతా | చాలలీ సాఈంచీ ఉపహాసతా | 
మీహీ తయాంతచి హోతో అంశతా | తిచీ అనుచితతా దర్శవిలీ | ||౧౧౬|| 
116. ‘అని మునసబు గురించి ఆడిపోసుకుంటూ, సాయిని కూడా అపహాస్యం చేయడం జరిగింది. అందులో నేను కూడా పాల్గొన్నాను. అది సరికాదని, బాబా తెలియ చేశారు. 
తాశేరా నవ్హే హా అనుగ్రహ | వ్యర్థ కుణాచా ఊహాపోహ | 
ఉపహాస నిందాది26 కుత్సిత సంగ్రహ | అసత్పరిగ్రహ వర్జావా | ||౧౧౭|| 
117. ‘అవి కోపంతో అన్న మాటలు కావు. అవి వారి అనుగ్రహం. ఎవరి గురించైనా చెడుగా, వ్యర్థంగా చర్చించుకోకూడదు. వెటకారం, అపహాస్యం, నింద మొదలైన చెడు ఆలోచనలను వదిలిపెట్టాలి. 
ఆణీక ఎక హే ప్రత్యంతర | అసతా శంభర కోసాంచే అంతర | 
సాఈ జాణే సర్వాభ్యంతర | ఖరే అంతర్జ్ఞానీ తే | ||౧౧౮|| 
118. ‘ఇంకో సంగతి. వందల కోసుల దూరంలో ఉన్నా, సాయి అందరి మనసులను తెలుసుకుంటారని అనుభవమైంది. నిజంగా, బాబా ఎంత అంతర్‍జ్ఞాని! 
ఆణిక ఎక ఝాలా నివాడ | అసోత మధ్యే పర్వత పహాడ | 
కాంహీ న సాఈచ్యా దృష్టీ ఆడ | గుప్తహీ ఉఘడ త్యా సర్వ | ||౧౧౯|| 
119. ‘అలాగే మరొక సంగతి కూడా తెలిసింది. కొండలు గుట్టలు ఎన్ని అడ్డం ఉన్నా, వారి చూపుకు ఏవీ అడ్డు తగలవు, అని బాగా నమ్మకమైంది. ఎంతో రహస్యంగా ఉన్నవి కూడా వారికి తేట తెల్లం’. 
అసో పుఢే తేవ్హాంపాసునీ | కేలా నిశ్చయ వకీలాంనీ | 
అతఃపర నిందా దురుక్తి వచనీ | ఖడా కానీ లావిలా | ||౧౨౦||
120. అప్పటినుండి, ఎవరి నిందా చేయకూడదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదని నిశ్చయించుకుని, ఆ వకీలు లెంపలు వేసుకున్నాడు. 

ఆపణ కాంహీహీ కుఠేహీ కరితా | యేఈ న సాఈంచీ దృష్టీ చుకవితా | 
యేవిషయీ జాహలీ నిశ్చితతా | అసత్కార్యార్థతా విరాలీ | ||౧౨౧|| 
121. మనం ఏమి చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా, అది సాయికి తెలియకుండా ఉండదు అన్న సంగతి స్పష్టమయింది. దాంతో చెడు పనులు చేయాలనే స్వభావం మారింది. 
ఉదేలీ సత్కార్య జాగరూకతా | మాగే పుఢే సాఈసన్నిధతా | 
సమర్థ కోణ తయా వంచితా27 | నిర్ధార చిత్తా హా ఠసలా | ||౧౨౨|| 
122. దానికి బదులు, మంచి పనులు చేయాలనే ఉత్సుకత పెరిగింది. ముందు, వెనుకా, సాయి ఉన్నారన్న భావన మనసు తెలుసుకుంటే, సాయిని ఎవరు మోసగించగలరు? అన్న సంగతి అర్థం అవుతుంది. 
పాహూ జాతా యా కథేసీ | సంబంధ జరీ త్యా వకీలాసీ | 
తరీ తీ సర్వార్థీ ఆణి సర్వాంసీ28 | బోధక సర్వాంశీ29 సారిఖీ | ||౧౨౩|| 
123. ఈ కథను మనము జాగ్రత్తగా పరిశీలిస్తే, ఇది వకీలుకు సంబంధించినదే అయినా, మనందరికీ జ్ఞానం కలిగించేదిగా ఉంది. 
వకీల వక్తే శ్రోతే సమగ్ర | ఆణిక సాఈచే భక్త ఇతర | 
తయాంచాహీ ఐసాచ నిర్ధార | వ్హావా మీ సాచార ప్రార్థితో | ||౧౨౪|| 
124. ఆ వకీలులాగా, వక్తకు, శ్రోతలకు, మరి సాయియొక్క భక్తులందరికి కూడా, ఇలాంటి నమ్మకం కలిగి, మంచిని చేయాలనే ఉత్సుకత కలగాలని ప్రార్థిస్తాను. 
సాఈ కృపా మేఘ వర్షతా | హోఈల ఆపణా సర్వాంచీ తృప్తతా | 
యే అర్థీ కాంహీ నాహీ నవలతా | సకళా తృషార్తా నివవీల | ||౧౨౫|| 
125. కనికరం అనే సాయి మబ్బు వర్షం కురిపిస్తే, మనందరి దాహం తీరి, తృప్తి కలుగుతుంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. 
అగాధ సాఈనాథాంచా మహిమా | అగాధ తయాంచ్యా కథా పరమా | 
అగాధ సాఈచరిత్రాచీ సీమా | మూర్త పరబ్రహ్మావతార | ||౧౨౬|| 
126. సాయినాథుని మహిమ అద్భుతమైనది. వారి పరమ పావన కథలు అంతు లేనివి. పరబ్రహ్మ అవతారమైన సాయినాథుని చరిత్ర చాలా గొప్పది. 
ఆతా పుఢీల అధ్యాయీ కథా | పరిసాజీ సాదర శ్రద్ధాళూ శ్రోతా | 
 పురవీల తుమచ్యా మనోరథా | దేఈల చిత్తా స్థైర్యతా | ||౧౨౭|| 
127. ఇక తరువాతి అధ్యాయంలోని కథను శ్రోతలు శ్రద్ధగా వింటే, మీ మనసులోని కోరికలు తీరి, మీ మనసుకు నిలుకడ కలిగి, నెమ్మదినిస్తుంది. 
భక్తాంచీ భావీ సంకటావస్థా | ఠాఊక ఆధీంచ సాఈసమర్థా | 
ఠట్టామస్కరీ వినోద వార్తా | హసతా ఖేళతా టాళితీ | ||౧౨౭|| 
128. భవిష్యత్తులో భక్తులకు రాబోయే కష్టాలు, సాయి సమర్థులకు ముందుగానే తెలిసేవి. వినోదంతో, హాస్యాలతో, నవ్వుతూ, ఆడుతూ వారు వానిని తొలగించేవారు. 
భక్త హేమాడ సాఈస శరణ | జాహలే హే కథానక సంపూర్ణ | 
పుఢీల కథేచే అనుసంధాన | సంకట నివారణ భక్తాంచే | ||౧౨౯|| 
129. భక్త హేమాడు సాయికి శరణుజొచ్చి, ఈ కథను ముగిస్తున్నాడు. భక్తుల కష్టాల నివారణే తరువాతి కథ. 
కైసే సాఈ కృపాసాగర | భక్తాంచీ భావీ సంకటే దుర్ధర | 
ఆధీంచ జాణూని కరితా పరిహార | ఈశారా వేళేవర దేఉనీ | ||౧౩౦||
130. భక్తుల భరించ రాని కష్టాలను ముందుగానే తెలుసుకుని, సమయానికి సరిగ్గా వారికి సూచించి, దయాసాగరులైన సాయి, వానిని ఎలా తొలగిస్తారో తెలుసుకొండి. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
 | శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | అనుగ్రహకరణం నామ | 
| ఎకవింశోద్యాయః సంపూర్ణః |

||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||

 

టిపణీ: 
1. రిఘావ. (౧౨ రిగమ) 2. గుప్త ప్రకారే. (౧౭ అప్రకట) 3. ప్రాంతాధికారీ (అ. కలేక్టర). (౧౯ ప్రాంత) 
4. సమాగమ. (౧౯ సాంగాత) 5. కాజర్యాచ్యా ఝాడాంనీ. (౨౦ కాజరీ) 
6. మానానే. (౨౦ మానే) 7. ఎక క్లాస. (౨౯ పథకా) 8. డోకే. (౩౦ శీస) 
9. ఆశీర్వాద. (౩౦ ఆశీష) 10. యా నావాచా ఎక ఘాట ఆహే. (౩౬ నాణేంఘాట) 
11. వాహన. (౩౭ శకట) 12. తర్హేవాఈకపణా. (౩౯ అపూర్వాఈ) 13. తయార కేలా. (౪౦ పాలాణిలా) 
14. ఉసణ. (౪౧ కణకణ) 15. వేళ. (౪౪ బారీ) 16. కోర్టాత. (౪౬ అదాలతీంత) 
17. నేమలేలీ. (౪౬ నిర్ణీత) 18. దర్శనాచీ ఇచ్ఛా. (౪౯ దర్శనకామ) 
19. ఉపనిషదాంచే అధ్యయన. (౭౯ ఉపనిషదధ్యయన) 20. మహత్ వాక్యాంచా జప. (౮౨ వాక్యానువృత్తీ) 
21. బ్రహ్మజ్ఞాన. (౮౨ బ్రహ్మసంవిత్తీ) 22. కసలీ? (౮౨ కాశాచీ) 23. లేండ్యా. (౮౭ లేండార) 
24. నఊ. (౮౭ నవాంచే) 25. గణేశ దామోదర కేలకర ఊర్ఫ దాదా కేలకర. (౯౦ కేళకరాంప్రత) 
26. అంజనవేలచే మథురాదాస మహారాజాంచే దర్శనాస వారంవార యేత. తే, శిరడీస ఎక సగుణ నావాచా ఖాణావళవాలా ఆహే, త్యాచేకడే ఉతరత. ఎకదా తే వ సగుణ బోలత బసలే అసతా కాహీ లోకాంచ్యా ఉఖాళ్యాపాఖాళ్యా నిఘాల్యా. త్యానంతర మథురాదాస మహారాజాంకడే గేలే. తే బసల్యానంతర లగేచ మహారాజాంనీ విచారలే, 'సగుణ కాయ మ్హణత హోతా?’ అర్థాత్, మథురాదాస లాజలే వ మనాత సమజలే కీ, జే సగుణకడే చాలలే హోతే తే మహారాజాంస పసంత నాహీ. కోణాచ్యా ఉఖాళ్యాపాఖాళ్యా కాఢణే కింవా త్యా ఏకణే చాంగలే నవ్హే, హా ధడా మథురాదాసాంనీ ఘేతలా. (౧౧౮ నిందాది) 
27. ఫసవణూక కింవా ప్రతారణా. (౧౨౨ వంచితా) 28. సర్వ బాజూంనీ. (౧౨౩ సర్వాంశీ) 
29. సర్వాంనా. (౧౨౩ సర్వాంసీ)

No comments:

Post a Comment