శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౨౨ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
జయ సద్గురో ఆనందఘనా | జ్ఞాన స్వరూపా పరమ పావనా |
జయజయాజీ భవభయ నికందనా | కలిమలదహనా పరిపూర్ణా | ||౧||
1. జయ సద్గురు! మూర్తీభవించిన ఆనందమా! జ్ఞాన స్వరూపా! పరమ పావనా! జయ జయ సంసార భయాలని నివారించేవాడా! కలికాలంలోని చెడును కాల్చేవాడా! పరిపూర్ణా!
త్యాహీ తూంచ తూంచ ఆవరీ | కృపా కరీ నిజభక్తా | ||౨||
2. మీరు ఆనంద సాగరం. ఆ సాగరంలో లేచే అనేక ఆలోచనల అలలు కూడా మీరే. భక్తుల మీద దయతో వారిని అనుగ్రహించే వారు కూడా మీరే.
అల్పాంధారీచా1 జో సాప | తోచ ప్రకాశీ దోర ఆపాప2 | అల్పాంధార ప్రకాశ స్వరూప | దోహీంచా బాప3 తూ ఎక | ||౩||
3. మసక చీకటిలోని పాము, వెలుతురులో త్రాడు. చీకటిని, వెలుతురును, రెంటినీ పుట్టించింది మీరే.
సర్పాకార వృత్తీచా జనితా | తిజలాచ దోరాచా ఆకార దేతా | తూంచ భీతీతే ఉత్పన్నకర్తా | అంతీ నివారితాహీ తూంచ | ||౪||
4. పాము అనే అపోహ పుట్టించి, భయాన్ని కలిగించేదీ మీరే, కాదు, అది త్రాడు అని తెలిపేదీ మీరే. ఇలా భయాన్ని కలిగించి, దానిని తొలగించేది కూడా మీరే.
ఆధీ జేవ్హా పూర్ణాంధార | నాహీ సర్ప నాహీ దోర | వృత్తి ఉఠాయా నాహీ థార | తోహీ నిరాకార తూ హోసీ | ||౫||
5. మొత్తం చీకటిగా ఉన్నప్పుడు, పాము లేదు, త్రాడు లేదు. అక్కడ ఏ విధమైన అపోహకు వీలు లేదు. ఏ ఆకారం లేని నిరాకారం మీరే.
పుఢే నిరాకారాచా ఆకార | తోహీ అల్ప ప్రకాశాచా అవసర | తేణే ఆభాసూ లాగలా విఖార4 | ఆభాసా కారణహీ తూంచ | ||౬||
6. నిరాకారం ఒక ఆకారాన్ని దాల్చి, అది కొద్ది వెలుతురులో, పాములా కనిపిస్తుంది. ఆ అపోహకు కారణం కూడా మీరే.
ఏసా దృశ్యాదృశ్య భావ | హా తవ వృత్యానందప్రభావ5 | భావాభావరహిత స్వభావ | నలగే ఠావ కవణాహీ | ||౭||
7. ఇలా ఒక క్షణం కనిపించి, మరు క్షణంలో కనిపించక పోవటమనేది, ఆనందంతో మీరు ఆడుకునే ఆట ప్రభావం. కనిపించడం, కనిపించక పోవడం అనే ఏ మార్పూ లేకుండా ఉన్న మీ స్వభావం, ఎవరికీ అంతు పట్టదు.
శ్రుతి మౌనావల్యా ఏశియాస్తవ6 | అశేష ముఖాంహీ స్తవ7 | శేషహీ నేణే స్వరూప వాస్తవ8 | తే మీ కవణ జాణావయా | ||౮||
8. అందుకే శ్రుతులు మాట్లాడకుండా ఉన్నాయి. ఎన్నో ముఖాలు ఉన్న ఆదిశేషుడు కూడా, మీ రూపాన్ని తెలుసుకోలేక, మీ స్తుతి చేయలేక పోయినప్పుడు, నేనెంతటి వాణ్ణి?
బాబా తవ స్వరూప దర్శనా | వాంచూన కాంహీ రుచేనా మనా | వాటే ఆణావే తేంచ ధ్యానా | ఠేవావే లోచనాసమోర | ||౯||
9. బాబా! మీ రూపాన్ని దర్శించడం తప్ప నా మనసుకు ఏదీ రుచించదు. ఆ మీ రూపాన్నే కళ్ళ ఎదుట నిలుపుకుని, ధ్యానించాలని అనిపిస్తుంది.
కేవళ శుద్ధజ్ఞానమూర్తి | వ్హావయా ఆత్యంతిక సౌఖ్యపూర్తి | నాహీ తుఝియా పాయాపరతీ | ఆణిక గతి ఆమ్హాంతే | ||౧౦||
10. పరమ సుఖాన్ని పొందటానికి, శుద్ధమైన జ్ఞాన మూర్తి అవతారమైన మీ పాదాలు తప్ప మాకు వేరే గతి లేదు.
ఠేవూనియా పాయీ మస్తక | ప్రేమే నిజసుఖ లూటిత | ||౧౧||
11. రోజూ జరిగే మీ వైభవం ఎంత గొప్పది! ఎందరో భక్తులు మీ దర్శనానికి వచ్చి, మీ పాదాలలో తలనుంచి, ప్రేమగా ఆనందాన్ని దోచుకుంటారు.
తోహీ తుఝా పాయ కైసా | శాఖాచంద్ర న్యాయ జైసా | పాదాంగుష్ఠ కవళీ తైసా | దర్శన జిజ్ఞాసా పూరవీ | ||౧౨||
12. ఆ మీ పాదాలు ఎలాంటివి! కొమ్మ-చంద్రుని న్యాయంవలె, పాదాలలోని బొటన వేలును పట్టుకుని, కూర్చుని, మీ దర్శనం కోసం వచ్చిన వారి కోరికలను తీర్చుతారు.
కృష్ణపక్షాచీ పంచదశీ9 | అమావాస్యా అంధారీ నిశీ | ఉలటతా చంద్రదర్శనాచీ అసోసీ | హోతే సకళాంశీ సాహజిక | ||౧౩||
13. కృష్ణ పక్షంలోని అమావాస్యనాటి చీకటి రాత్రి గడచి పోగానే, చంద్రుని చూడాలని అందరికీ సహజంగా ఆశ కలుగుతుంది.
సరతా వద్య పక్షాచీ నిశా | చంద్రదర్శనీ ఉపజే ఆశా | జో తో అవలోకీ పశ్చిమ దిశా | దృష్టి ఆకాశా లావునీ | ||౧౪||
14. కృష్ణ పక్షం రాత్రి గడవగానే, చంద్రుని చూడాలనే ఆశతో, జనులు పశ్చిమ దిక్కునా ఆకాశాన్ని చూస్తారు.
తీ నిజభక్తాంచీ అసోసీ | పురవిసీ నిజ పాయాంపాసీ | వామజానూవరీ దక్షిణ పాయాశీ | ఠేవూని బైససీ జే సమయీ | ||౧౫||
15. అలాగే, ఎడమ తోడ పైన కుడికాలు వేసుకుని, మీ దర్శనానికోసం వచ్చిన భక్తుల కోరికను, మీ పాదాల వద్ద తీర్చుతారు.
వామకర తర్జనీ మధ్యమాంగుళీ | శాఖా బేచకే అంగుష్ఠ జో కవళీ | త్యా దక్షిణపాదాంగుష్టాజవళీ | నఖచంద్ర ఝళాళీ బీజేచా | ||౧౬||
16. ఎడమ చేతి చూపుడు వ్రేలు, మరియు మధ్య వ్రేలుతో, మీ కుడికాలు బొటన వ్రేలును పట్టుకుని ఉన్నప్పుడు, రెండు వ్రేళ్ళ మధ్యన ఉన్న కాలి బొటన వ్రేలి గోరు (రెండు కొమ్మల నడుమ కనిపించే చంద్రునిలాగా) విదియ చంద్రునివలె వెలుగుతూ కనిపిస్తుంది.
దర్శాచీ జిజ్ఞాసా థోర | ఎరవ్హీ నభీ దిసేనా కోర | జ్ఞాతా మగ యా బేచక్యాసమోర | ఆణోని నజర లావీ మ్హణే | ||౧౭||
17. చంద్రుని చూడాలని ఎంతో కుతూహలంగా ఉన్నా, ఆకాశంలో చంద్రుని దర్శనం కాదు. అయినా తెలిసిన వారు, చెట్టుయొక్క రెండు కొమ్మల మధ్యనుండి చూడాలని చెబుతారు.
పహా ఆతా యా బేచక్యామధూన | సమోర హోఈల చంద్రదర్శన | కోర జరీ తీ హోతీ లహాన | జాహలీ తేథూన దృగ్గోచర | ||౧౮||
18. ఇలా ఈ రెంటి కొమ్మల మధ్యనుండి చూస్తే, చంద్రుని దర్శనం అవుతుంది. సన్నని గీతవలె కనిపించినా, చంద్రుని చూడాలనే కోరిక తీరుతుంది.
ధన్య అంగుష్ఠ మహిమాన | వేణీమాధవ స్వయే హోఊన | గంగా యమునా ప్రకటవూన | దాసగణూతే తుష్టవిలే | ||౧౯||
19. బొటన వ్రేలి మహిమ ధన్యం! బాబాయే స్వయంగా వేణీ మాధవుడై, గంగా యమునలను ప్రవహించేలా చేసి, దాసగణుని తృప్తి పరచారు.
ప్రయాగతీర్థీ కరావే స్నాన | మ్హణూన మాగతా ఆజ్ఞాపన | “హా మదంగుష్ఠ ప్రయాగ జాణ | కరీ అవగాహన యేథేంచ” | ||౨౦||
20. ప్రయాగ తీర్థంలో స్నానానికి వెళ్ళాలనుకుని, బాబా అనుమతిని కోరగా, వారు “నా ఈ బొటన వ్రేలే ప్రయాగ అనుకుని, ఇక్కడే స్నానం చేయి” అని చెప్పారు.
ఏసే బాబా మ్హణతా డోఈ | దాసగణూనే ఠేవితా పాయీ |
గంగా యమునా ఉభయతోయీ | ప్రకటల్యా పాహీ తే ఠాయీ | ||౨౧||
21. బాబా అలా చెప్పగా, బాబా పాదాలపై దాసగణు తన తలనుంచగా, అప్పుడు అక్కడ, గంగా యమున రెండు నదుల నీరు ప్రవహించ సాగాయి.
“అగాధ శక్తీ అఘటిత లీలాపర” | శ్రవణ తత్పర జరీ శ్రోతే | ||౨౨||
22. అప్పుడు దాసగణు రచించి, తానే పాడిన, ‘అగాధ శక్తి అఘటిత లీల’ అన్న అందమైన పద్యాన్ని వినాలనే కుతూహలం గల శ్రోతలు,
సాఈసచ్చరిత చతుర్థాధ్యాయీ | దాసగణూ నిజవాణీ10 తే గాఈ | పునశ్చ శ్రోతా వాచితా తే ఠాయీ | పున్హాంహీ నవాఈ ప్రకటేల | ||౨౩||
23. ఈ సాయి సచ్చరితలోని నాలుగవ అధ్యాయాన్ని మరల చదివితే, వారికి మొదట చదివినప్పుడు కలిగిన అద్భుతమైన అనుభవం, మరల కలుగుతుంది.
మ్హణవూని శాఖాచంద్రన్యాయ | అంగుష్ఠీ11 తర్జనీ మధ్యమా12 ఉభయ13 | ఠేవూని దావీ సాఈమాయ | సోపా ఉపాయ నిజభక్తా | ||౨౪||
24. అంటే, కొమ్మ-చంద్ర న్యాయం ప్రకారం, చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, రెంటిని కాలి బొటన వ్రేలిపై ఉంచి, సాయి మాత భక్తులకు సులభమైన ఉపాయాన్ని చూపారు.
మ్హణే హోఊని నిరభిమాన | సర్వాంభూతీ ఖాలవా మాన | కరా ఎక అంగుష్ఠధ్యాన | సోపే సాధన భక్తీచే | ||౨౫||
25. “నిరభిమానంగా ఉంటూ, అన్ని ప్రాణుల ఎదుట నమ్రతగా తలవంచి, ఒక్క బొటన వ్రేలును ధ్యానం చేయడం భక్తికి సులభమైన దారి” అని సాయి సూచించారు.
ఆతా పూర్వీల కథానుసంధాన | జాహలే భక్తానుగ్రహ కథన | పుఢీల అపూర్వ చరిత్ర శ్రవణ | అవధానపూర్ణ పరిసిజే | ||౨౬||
26. ఇప్పుడు మనం మునుపటి కథకు వెళ్ళిపోదాం. భక్తులను బాబా అనుగ్రహించిన కథ అయింది. తరువాత చెప్పే గొప్ప కథను శ్రద్ధగా వినండి.
శిరడీ జాహలే పుణ్య క్షేత్ర | బాబాంచోని తే అతి పవిత్ర | యాత్రా వాహే అహోరాత్ర | యేతీ సత్పాత్ర పుణ్యార్థీ | ||౨౭||
27. శిరిడీ అతి పవిత్రమైన పుణ్య క్షేత్రం కావటానికి బాబాయే కారణం. పుణ్యాన్ని కోరుకునే మంచి బుద్ధిగల యాత్రికులు, భక్తులు రాత్రింబవళ్ళూ అక్కడికి వస్తుంటారు.
దాహీ దిశేసీ జయాచీ సాక్ష | పటూన రాహిలీ ప్రత్యక్ష వా పరోక్ష | సాఈవేషే హా కల్పవృక్ష | అవతరలా ప్రత్యక్ష శిరడీంత | ||౨౮||
28. తమ కోరికలను తీర్చే కల్పవృక్షం, శిరిడీలో సాయి రూపంలో వెలిసిందని, తమ స్వంత అనుభవంతో కాని, ఇతరులు చెప్పడంతో కాని, తెలుసుకున్నారు.
అకించన వా సంపత్తిమాన | దేఖే సమస్తా సమసమాన | దావూన కాంహీ అతర్క్య విందాన | భక్త కల్యాణ సాధీ జో | ||౨౯||
29. పేదవాడైనా, డబ్బున్నవాడైనా, ఇద్దరినీ బాబా సమానంగా చూస్తారు. అద్భుతమైన లీలలను చూపి, భక్తులకు శ్రేయస్సును కలిగిస్తారు.
కాయ తీ నిఃసీమ ప్రేమళతా | నైసర్గిక14 జ్ఞాన సంపన్నతా | తైసీచ ఆత్యంతిక సర్వాత్మభావతా | ధన్య అనుభవితా భాగ్యాచా | ||౩౦||
30. ఏమిటి వారి అంతులేని ప్రేమ, స్వాభావికంగా ఉండే బ్రహ్మజ్ఞానం! ఆ జ్ఞానంతోనే, అన్ని జీవులూ ఒక్కటే అని వారి గట్టి నమ్మకం. అలాంటి సాయి సహవాసం స్వయంగా అనుభవించిన వారే ధన్యులు!
కధీ దృఢ మౌన ధారణ | హేంచ జయాంచే బ్రహ్మవ్యాఖ్యాన |
కధీ చైతన్య ఆనందఘన | భక్తగణ పరివేష్టిత | ||౩౧||
31. ఒకొక్కప్పుడు, అసలే మాట్లాడకుండా ఉండేవారు. ఆ మౌనమే బ్రహ్మ గురించిన వారి ఉపదేశం. మరొకప్పుడు, ఆ చిదానంద మూర్తి భక్తులతో చుట్టుకోబడి ఉంటారు.
కధీ గూఢార్థ ధ్వనిత బోలణే | కధీ థట్టేనే వినోద కరణే | కధీ సందిగ్ధతా సోడూన దేణే | కాతావణే15 చాలావే | ||౩౨||
32. ఒకప్పుడు ఏదో రహస్యం ఉన్నట్లు, ఏమీ అర్థం కాకుండా మాట్లాడటం, మరొకప్పుడు, సరదాగా వినోదంగా మాట్లాడటం, ఇంకొకప్పుడు, ఏ అనుమానమూ లేకుండా, కోపంతో మండి పడటం,
కధీ భావార్థ కధీ వివేక | కధీ ఉఘడే నిశ్చయాత్మక | అసే అనేకీ అనేక | ఉపదేశ దేఖ కరీత తే | ||౩౩||
33. ఒకప్పుడు ఎంతో అర్థవంతంగా, ఒకప్పుడు వివేకంగా, ఒకప్పుడు నిశ్చయ పూర్వకంగా, ఇలా ఎందరికో ఎన్నో రకాలుగా ఉపదేశాలను ఇచ్చేవారు.
ఏసే హే సాఈసమర్థాచరిత16 | మనోబుద్ధివాచాతీత17 | అకళ కరణీ అకల్పిత | అనిర్జ్ఞాత అవచిత | ||౩౪||
34. ఆ రకంగా, సాయి సమర్థుల ఆచరణ - మాటకు, మనసుకు, బుద్ధికి తెలియనివి. అవేవీ మన ఆలోచనలకు అందనివి. జ్ఞానానికి మించినవి.
ధణీ న పురే ముఖ అవలోకితా | ధణీ న పురే సంభాషణ కరితా | ధణీ న పురే వార్తా పరిసతా | ఆనంద చిత్తా న సమాయే | ||౩౫||
35. వారిని ఎంత సేపు చూచినా, వారి మాటలను ఎంత సేపు విన్నా, తృప్తి కలగదు. వారితో ఎంత మాట్లాడినా తనివి తీరదు. మనసుకు భరించ లేనంత ఆనందం కలుగుతుంది.
మోజూ యేతీల పర్జన్యధారా | బాంధూ యేఈల మోటే వారా | పరీ యా సాఈచ్యా చమత్కారా | కవణ మాపారా18 మోజీల | ||౩౬||
36. వాన చుక్కలను లెక్కపెట్టవచ్చు. పెను గాలిని మూట కట్టవచ్చు. కాని, సాయియొక్క లీలలను ఎవరు లెక్కపెట్టగలరు?
అసో ఆతా పుఢీల కథా | సాఈచీ భక్త సంరక్షణీ చింతా | తైశీచ దుర్ధర ప్రసంగ నివారకతా | స్వస్థ చిత్తా పరిసావీ | ||౩౭||
37. ఇక తరువాతి కథ. భక్తులను సంరక్షించటంలో సాయికి ఉన్న చింతను, మరియు భక్తుల కష్టాలను వారు నివారించటం గూర్చి, మనసుకు నెమ్మది తెచ్చుకుని, శ్రద్ధగా వినండి.
కైసే భక్తాంచే గండాంతర | జాణూన దేత వేళీ ధీర | టాళూని కరీత నిజపదీ స్థిర | కల్యాణ తత్పర సర్వదా | ||౩౮||
38. భక్తులకు వచ్చే అపాయాలను ముందే తెలుసుకొని, సమయానికి సరిగ్గా వారికి ధైర్యాన్నిచ్చి, వారి కష్టాలను నివారించి, వారిని తమ పాదాల దగ్గర, బాబా స్థిరపరచేవారు. భక్తుల శ్రేయస్సును గురించే వారు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు.
యే అర్థీంచీ ఆఖ్యాయికా | రిఝవీల తుమ్హా శ్రవణోత్సుకా | వాఢవీల సాఈసమాగమ సుఖా | శ్రద్ధా భావికా ఉపజవీల | ||౩౯||
39. దీని గురించే ఒక కథ, వినటంలో ఉత్సుకత ఉన్న మీకు, ఆనందాన్ని కలిగిస్తుంది. సాయి సహవాసంతో సుఖాన్ని పెంచుతుంది. భక్తులకు శ్రద్ధను కలిగిస్తుంది.
అసోత హీన దీన బాపుడీ | వాఢేల సాఈ కథేచీ ఆవడీ | జపతా సాఈనామ హరఘడీ | లావీల పరథడీ సాఈ త్యా | ||౪౦||
40. హీనులు గాని, దీనులు గాని, పేదవారు గాని, అందరికీ సాయి కథలంటే భక్తి శ్రద్ధలు కలుగుతాయి. ప్రతి క్షణం సాయి నామాన్ని జపించే వారిని, సాయి తీరానికి చేర్చుతారు.
కాకాసాహేబ మిరీకర | నివాస శహర అహమదనగర |
ప్రసన్నపణే జయా సరకార | పావవీ సరదార పదవీ తే | ||౪౧||
41. కాకాసాహేబు మిరీకరు అహమ్మదు నగరు పట్టణంలో ఉండేవాడు. ప్రభుత్వం అతని పనికి సంతోషించి ‘సర్దార్’ అన్న పదవిని ఇచ్చింది.
అసతా చిథళీచే దౌర్యావర | ఆలే శిరడీవర దర్శనా | ||౪౨||
42. అతని కుమారుడు కూడా తన పనులను చక్కగా నెరవేర్చేవాడు. కోపర్గాంకు మామలేదారుగా ఉన్నప్పుడు, చితలీకి వెళ్ళవలసి వచ్చి, బాబా దర్శనానికోసం శిరిడీకి వచ్చాడు.
మశీదీంత జాఊన బసతా | బాబాంచే చరణీ మస్తక ఠేవితా | క్షేమకుశల పుసతా సవరతా | కథావార్తా చాలల్యా | ||౪౩||
43. మసీదుకు వెళ్ళి, బాబా పాదాలపై తన తలనుంచాడు. క్షేమ సమాచారాలు జరిగాయి. అందరి క్షేమం గురించి బాబా అడిగారు.
హోతీ తేథే బరీచ మండళీ | మాధవరావహీ19 హోతే జవళీ | కథామృతాచీ తే నవాళీ | అవధానశీళీ20 సేవిజే | ||౪౪||
44. అప్పుడు భక్తులు బాగా ఉన్నారు. మాధవరావు కూడా దగ్గరలోనే ఉన్నాడు. ప్రత్యేకమైన ఈ కథామృతాన్ని శ్రద్ధగా సేవించండి.
కైసీ భావీ సంకట సూచనా | సోపాయ21 తన్నివారణ యోజనా | కరూన కైసే రక్షీత భక్తజనా | అఘటిత ఘటనా బాబాంచీ | ||౪౫||
45. భక్తులకు ముందుముందు జరిగే కష్టాలను సూచించి, వానిని తప్పించుకునే ఉపాయాలను కూడా తెలిపి, వారిని రక్షించడం - ఇది నిజంగా బాబాయొక్క అద్భుతమైన చమత్కారం.
బాబా మిరీకరాంస తే ఠాయీ | పుసతీ ప్రశ్న పహా నవలాఈ | “అహో తీ ఆపులీ ద్వారకామాఈ | ఆహే కా ఠావీ తుమ్హాంతే” | ||౪౬||
46. అనుకోకుండా, మిరీకరుని బాబా అడిగిన ప్రశ్నను గమనించండి. “ఇది మన ద్వారకామాయి, నిజంగా ఇది నీకు తెలుసా?”
బాళాసాహేబాంస హా కాంహీ | ముఖీంచ ఉలగడా ఝాలా నాహీ | తంవ బాబా వదతీ “ఆతా పాంహీ | ద్వారకామాఈ తీ హీచ22 | ||౪౭||
47. బాబా ఎందుకు ఈ ప్రశ్న అడిగారో, బాళాసాహేబుకు అర్థం కాలేదు. అప్పుడు బాబా “ఇదిగో చూడు! ఇదే ద్వారకామాయి” అని అన్నారు.
హీచ ఆపలీ ద్వారకామాత | మశీదీచే యా అంకీ బైసతా | లేంకురా దేఈ తీ నిర్భయతా | చింతేచీ వార్తా నురేచి | ||౪౮||
48. “ఇదే మన ద్వారకామాత! మసీదులోని ఈమె ఒడిలో కూర్చున్న బిడ్డలను, భయం లేకుండా చేస్తుంది. అసలు వారికి చింత, దుఃఖమనే మాటే ఉండదు!
మోఠీ కృపాళూ హీ మశీదమాఈ | భోళ్యా భావికాంచీ హీ ఆఈ | కోణీ కసాహీ పడో అపాయీ | కరీల హీ ఠాయీంచ రక్షణ | ||౪౯||
49. “ఈ మసీదుమాత చాలా దయగలది. అమాయకులకు, నమ్మినవారికి అసలు తల్లి. ఎవరు ఏ అపాయాలలో చిక్కుకున్నా, ఈమె వెంటనే వారిని రక్షిస్తుంది.
ఎకదా హిచే జో అంకీ బైసలా | బేడా23 తయాచా పార పడలా | సాఉలీంత హిచే జే పహుడలా24 | తో ఆరూఢలా25 సుఖాసనీ | ||౫౦||
50. “ఒక్క సారి ఈమె ఒడిలో కూర్చుంటే, వారి కష్టాలు తొలగిపోతాయి. ఈమె నీడలో విశ్రమించిన వారు, శాంతి సుఖాల మీద కూర్చున్నట్లే!
హీచ ద్వారకా ద్వారావతీ” | బాబా మగ తయాంస దేతీ విభూతి26 |
అభయ హస్త శిరీ ఠేవితీ | జావయా నిఘతీ మిరీకర | ||౫౧||
51. “ఈమెయే ద్వారక, ద్వారావతి” అని చెప్పి, బాబా అతనికి ఊదినిచ్చి, తమ అభయ హస్తాన్ని అతని తలపై ఉంచారు. మిరీకరు వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు.
ఆణీక వాటలే బాబాంచే జీవా | మిరీకరాంతే ప్రశ్న పుసావా | ఠావా కా తుజ లాంబ27 బావా | ఆణీక నవలావా తయాచా | ||౫౨||
52. అప్పుడు, అనుకోకుండా మీరీకరును ఇంకొక ప్రశ్న అడగాలని బాబా “నీకు పొడుగాటి బాబా గురించి, అతని ఆశ్చర్యకరమైన సంగతి గురించి, తెలుసా?”
మగ మూఠ వళూని డావా హాత | కోపరాపాశీ ఉజవే హాతాంత | ధరూని ఫిరవీత ముఖే వదత | “ఏసా భయంకర అసతో తో | ||౫౩||
53. అని, కుడి చేతి మోచెయ్యి క్రింద ఎడమ చేతిని ఉంచి, కుడిచేతిని త్రిప్పుతూ, “అది చాలా భయంకరంగా ఉంటుంది.
పరీ తో కాయ కరితో అపులే | ఆపణ ద్వారకామాఈచీ పిల్లే | కోణా న ఉమగే తిచే కేలే28 | కౌతుక ఉగలే29 పహావే | ||౫౪||
54. “అయినా, అది మనల్ని ఏం చేయగలదు? మనం ద్వారకామాయి బిడ్డలం. ఆమె వింత పనులు ఎవరికీ అర్థం కావు. సావధానంగా ఉండి, ఆమె చమత్కారాలను చూడటమే!
ద్వారకామాఈ అసతా తారితీ | లాంబ బావా కాయ మారితీ | తారిత్యా పుఢే మారిత్యాచీ గతీ | తీ కాయ కితీ సమజావీ” | ||౫౫||
55. “రక్షించడానికి ద్వారకామాయి ఉండగా, పొడుగాటి బాబా ఏం చంపగలడు? రక్షించే వారి శక్తి ముందు, చంపేవారి శక్తి ఎంత మాత్రం?” అని అన్నారు.
యాచ ప్రసంగీ హా ఖులాసా | బాబాంనీ కా కరావా ఏసా | మిరీకరాంశీ సంబంధ కైసా | లాగలీ జిజ్ఞాసా సకళికా | ||౫౬||
56. ఈ సమయంలో బాబా ఇదే సంగతిని ఎందుకు చెప్పారు? దీనికీ మిరీకరుకు ఏమిటి సంబంధం? అందరికీ తెలుసుకోవాలని కుతూహలం కలిగింది.
బాబాంస పుసాయా నాహీ ధీర | తైసేంచ చరణీ ఠేవూని శీర | చిథళీస30 జావయా ఝాలా ఉశీర | మ్హణూన మిరీకర ఉతరలే | ||౫౭||
57. కాని, బాబాను అడిగే ధైర్యం ఎవరికీ లేదు. చితళీకి వెళ్ళటానికి ఆలస్యమై పోతుందని, మిరీకరు బాబా పాదాలకు నమస్కరించి, క్రిందకు దిగాడు.
హోతే మాధవరావ బరోబరీ | దోఘే జో పోహోంచలే మండపద్వారీ | మాధవరావాంస బాబా మాఘారీ | “యేఈ క్షణభరీ” మ్హణాలే | ||౫౮||
58. అతనూ, అతనితో ఉన్న మాధవరావు, ఇద్దరూ మండపం వాకిలి దగ్గరకు చేరుకోగానే, బాబా మాధవరావును “ఒక క్షణం ఇటురా” అని వెనుకకు పిలిచారు.
మ్హణతీ “శామా తూంహీ తయారీ | కరీ జాఈ త్యాచే బరోబరీ | మారూన యే చిథళీచీ ఫేరీ | మౌజ భారీ హోఈల” | ||౫౯||
59. “శ్యామా! నువ్వు కూడా అతనితో వెళ్ళటానికి సిద్ధం చేసుకో. చితళీకి వెళ్ళి చూసి రా! బాగా సరదాగా ఉంటుంది!” అని చెప్పారు.
తాత్కాళ శామా ఖాలీ ఉతరలా | మిరీకరాం సన్నిధ ఆలా | మ్హణే ఆపలే టాంగ్యాంత మజలా | యేణే చిథళీలా ఆహే కీ | ||౬౦||
60. వెంటనే శ్యామా క్రిందకు దిగి, మిరీకరు దగ్గరకు వచ్చి ‘మీ టాంగాలో, మీ వెంట నేను కూడా చితళీకి రావాలి’ అని అన్నాడు.
ఘరీ జాఊన కరితో తయారీ | హా ఆలోంచ జాణా సత్వరీ |
బాబా మ్హణతీ తుమ్హాంబరోబరీ | చిథళీవరీ జావే మ్యా | ||౬౧||
61. ‘ఇంటికి వెళ్ళి తయారై వస్తాను. తొందరగానే వచ్చి కలుస్తాను. మీతో నన్ను కూడా చితళీ వెళ్ళమని బాబా చెప్పారు’ అని అన్నాడు.
తుమ్హీ యేఊన కాయ కరణార | వ్యర్థ హా జోజార31 తుమ్హాంలా | ||౬౨||
62. మిరీకరు అతనితో ‘చితళీ అంత దూరం వరకూ మీరు వచ్చి, ఏం చేస్తారు? మీకు అనవసరం అయిన శ్రమ కదా?’ అని అన్నాడు.
మాధవరావ మాగే పరతలే | జే ఝాలే తే బాబాంస కథిలే | బాబా మ్హణతీ “బరే ఝాలే | కాయ కీ హరవలే ఆపులే | ||౬౩||
63. మాధవరావు వెనుకకు వెళ్ళి, జరిగినదంతా బాబాకు చెప్పాడు. అప్పుడు బాబా “సరే మంచిదే! మనదేం పోతుంది!” అని అన్నారు.
మంత్ర తీర్థ ద్విజ దేవ | దైవజ్ఞ వైద్య కీ గురురావ | యాంచ్యా ఠాయీ జైసా భావ | తైసాచ ఉద్భవ ఫలాచా | ||౬౪||
64. “మంత్రం, తీర్థ క్షేత్రం, బ్రాహ్మణులు, దేవతలు, దైవజ్ఞులు, వైద్యులు, గురువు - వీరి మీద ఎంత నమ్మకం ఉంటే, అంతే ఫలం దొరకుతుంది.
ఆపణ చింతావే నిత్య హిత | ఉపదేశావా అర్థ విహిత32 | అసేల జైసే జయాచే కర్మాంత | తైసేంచ నిశ్చిత ఘడేల” | ||౬౫||
65. “మనం ఎప్పుడూ ఇతరుల మంచినే ఆలోచించాలి. సరియైన దానినే ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే, తప్పకుండా అలాగే జరుగుతుంది”.
ఇతక్యాంత మిరీకర శంకలే33 | పాహిజే బాబాంచే శబ్ద మానిలే | మాధవరావాంస హళూచ ఖుణావిలే | చలా మ్హణాలే చిథళీలా | ||౬౬||
66. ఇంతలో, మిరీకరుకు తన నిర్ణయం తప్పేమో అనే సందేహం కలిగింది. ‘బాబా మాటలను పాటించాలి’ అని తలచి, మాధవరావుతో ‘చితళీకి పోదాం పద’ అని మెల్లగా సైగ చేశాడు.
మగ తే మ్హణతీ థాంబా యేతో | పున్హా బాబాంచీ అనుజ్ఞా34 ఘేతో | హో మ్హణతా తే క్షణీచ పరతతో | ఆతాంచ యేతో మాఘారా | ||౬౭||
67. ‘సరే, ఆగండి! అలాగే వస్తాను. కాని, మరల బాబా అనుమతిని తీసుకోనీయండి. వారు వెళ్ళమంటే, వెంటనే తిరిగి వచ్చేస్తాను.
నిఘాలో హోతో తుమ్హీ పరతవిలే | బాబా మ్హణాలే “బరే ఝలే | కాయ ఆపులే త్యాంత హరవలే | స్వస్థ బసవిలే మజలాగీ | ||౬౮||
68. ‘నేను వస్తుంటే, మీరు వద్దని వెనక్కు పంపారు. బాబా “పోనీలే, మనదేం పోతుంది” అని నన్ను ఊరికే కూర్చోబెట్టారు.
ఆతా పునశ్చ విచార ఘేతో | హో మ్హణతాంచ సత్వర యేతో | మ్హణతీల జైసే తైసే కరితో | దాస మీ తో ఆజ్ఞేచా | ||౬౯||
69. ‘ఇప్పుడు మరల వారిని అడుగుతాను. “సరే” అంటే, వెంటనే వచ్చేస్తాను. వారు ఎలా చెప్పితే అలా చేస్తాను, ఎందుకంటే, నేను వారి ఆజ్ఞను పాలించే దాసుణ్ణి’.
మగ తే జాతీ బాబాప్రతీ | మ్హణతీ మిరీకర బోలావితీ | చిథళీస మజలా సవే నేతీ | ఆజ్ఞా మాగతీ ఆపులీ | ||౭౦||
70. అని చెప్పి, బాబా దగ్గరకు వెళ్ళి, ‘మిరీకరు తన వెంట చితళీకి నన్ను రమ్మంటున్నాడు. మీ అనుమతి కోరుతున్నాడు’ అని అన్నాడు.
మగ హాంసూన మ్హణతీ సాఈ | “బరే తో నేతో తర తూ జాఈ |
నాంవ హిచే మశీదమాఈ | బ్రీదాస కాఈ ఘాలవీల | ||౭౧||
71. బాబా నవ్వుతూ “సరే! అతడు తీసుకుని వెళ్ళితే, నువ్వు వెళ్ళు. ఈమె పేరు మశీదుమాయి. ఆమె ఎప్పుడైనా, తన మాటను నిలబెట్టుకోక పోయిందా?
ఆఈ తీ ఆఈ బహు మాయాళూ | లేంకరాలాగీ అతి కనవాళూ | పరీ లేంకరేంచ నిఘతా టవాళూ35 | కైసా సాంభాళూ కరీ తీ” | ||౭౨||
72. “ఈ తల్లి, ఎంతైనా తల్లి, చాలా దయాళువు. తల్లికి బిడ్డల పైన ఎప్పుడూ విపరీతమైన ప్రేమ. కాని, బిడ్డలకే తల్లి మీద నమ్మకం లేక పోతే, ఆమె వారిని ఎలా రక్షిస్తుంది?” అని అన్నారు.
మగ వందోని సాఈ పాయా | నిఘాలే మాధవరావ జాయా | మిరీకర హోతే జయా ఠాయా | తాంగ్యాంత బైసాయా పాతలే | ||౭౩||
73. సాయి పాదాలకు నమస్కరించి, మాధవరావు టాంగాలో ఎక్కటానికి మిరీకరు దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే మిరీకరు టాంగాలో ఎక్కి కూర్చుని ఉన్నాడు.
ఉభయతా తే చిథళీస గేలే | తపాసాంతీ హుజూరవాలే36 | యేణార పరీ నాహీ ఆలే | మగ తే బైసలే నివాంత | ||౭౪||
74. అలా, వారిద్దరూ చితళీకి వెళ్ళారు. అక్కడ అడగగా, రావలిసిన అధికారులు రాలేదని తెలిసింది. నిశ్చింతగా వారు అక్కడే కూర్చున్నారు.
మారుతీచే దేవాలయీ | ఉతరణ్యాచీ హోతీ సోయీ | ఉభయతాంహీ మగ తే ఠాయీ | ప్రయాణ లవలాహీ కేలే కీ | ||౭౫||
75. అక్కడ ఉన్న మారుతీ గుడిలో, ఉండటానికి చోటు ఉండేది. వెంటనే వారిద్దరూ అక్కడికి వెళ్ళారు.
ఎక ప్రహర ఝాలీ నిశీ | టాకూని సత్రంజీ బిఛానా ఉశీ | బత్తీచియా ఉజేడాపాశీ | వార్తా పుసీత బైసలే | ||౭౬||
76. రాత్రి ఒక ఝాము గడిచింది (అంటే రాత్రి పది గంటలైంది). జంపఖాన, పరుపు, తలగడ వేసుకుని, అక్కడే ఉన్న దీపం వెలుగులో మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
వృత్తపత్ర37 హోతే తేథ | ఉఘడూన మిరీకర వాచూ లాగత | నవల విశేషీ లోధలే38 చిత్త | తో నవల విచిత్ర వర్తలే | ||౭౭||
77. అక్కడే ఒక వార్తా పత్రిక ఉంది. మిరీకరు దానిని తెరచి, చదవ సాగాడు. ఏదో ఒక ప్రత్యేకమైన వార్తలో అతని మనసు లీనమై పోయింది. అప్పుడు, ఒక విచిత్రం జరిగింది.
సర్ప ఎక త్యా కాళవేళే39 | కైసా కోఠూని ఆలా నకళే | బైసలా కరూనియా వేంటోళే | చుకవూని డోళే సకళాంచే | ||౭౮||
78. భయంకరమైన ఆ చీకటి వేళలో, ఒక పాము ఎక్కడినుండి, ఎలా వచ్చిందో తెలియకుండా, ఎవరి కంటా పడకుండా, చుట్ట చుట్టుకుని కూర్చుంది.
మిరీకరాంచే కంబరేవర | హోతా ఉపరణ్యాచా పదర | తయా మృదుల ఆసనావర | శాంత నిర్ఘోర40 బైసలా | ||౭౯||
79. మిరీకరు నడుం దగ్గర ఉన్న అతని కండువా ఒక చివర, మెత్తగా ఉన్నందువలన, ఆ పాము హాయిగా, ఏ భయమూ లేక కూర్చుని ఉంది.
ప్రవేశ కరితా ఓజే ఓజే41 | సుర సుర సుర సుర కాగద వాజే | పరీ న కోణా తయా ఆవాజే | ఘేణే సాజే సర్పశంకా | ||౮౦||
80. అది అక్కడికి మెల్ల మెల్లగా వచ్చిన చప్పుడు, వార్తా పత్రిక కాగితాల చప్పుడుతో కలిసి పోయింది గాని, ఆ శబ్దం పాముదే అని ఎవరూ ఊహించ లేదు.
ఇతుకా భయంకర జరీ ప్రసంగ | మిరీకర ఖబరపత్రాంత దంగ |
పరీ పట్టేవాల్యాచే అంతరంగ | కల్పనాతరంగీ వాహవిలే | ||౮౧||
81. ఇంతటి భయపెట్టే సమయంలో కూడా, మిరీకరు, ఏమీ పట్టనట్టు, వార్తా పత్రిక చదువుతూ ఉన్నాడు. కాని, నౌకరు మటుకు , శబ్దం విన్న తరువాత, అనుమానించ సాగాడు.
మ్హణోని ఉచలితా బత్తీ జూజ42 | లంబూమహరాజ43 దేఖిలే | ||౮౨||
82. ‘శబ్దం ఏమై ఉంటుంది? ఎక్కడినుండి వచ్చింది?’ అని ఆలోచిస్తూ, దీపాన్ని కొంత పైకి ఎత్తే సరికి, పొడుగాటి మహారాజును చూశాడు.
దేఖతాంచ తో ఘాబరలా | సాప రే సాప హళూచ ఓరడలా | మిరీకరాంచా ధీరచి సుటలా | కంప సుటలా సకళాంగా | ||౮౩||
83. చూసిన వెంటనే, గాబరా పడుతూ ‘పాము, పాము’ అని మెల్లగా అరిచాడు. అది విని, మిరీకరుకు ధైర్యం సడలి, శరీరమంతా వణుక సాగింది.
శామరావహీ చకిత ఝాలే | మ్హణతీ బాబా హే కాయ కేలే | నసతే విఘ్న కోఠూని ధాడిలే | ఆతా నిరసిలే పాహిజే | ||౮౪||
84. శామరావుకు కూడా నోట మాట రాక, ‘బాబా! ఏమిటిలా చేశావు? ఎక్కడినుండి ఈ కష్టాన్ని తెచ్చి పెట్టావు? దీనిని ఇప్పుడు నువ్వే తొలగించాలి’ అని మొర పెట్టుకున్నాడు.
మగ పాహూని తే అవస్థా | జయాచే జే జే లాగలే హాతా | తే తే ఘేఊని ధాంవలే తత్వతా | వాజూ న దేతా పదాతే | ||౮౫||
85. అక్కడి పరిస్థితిని చూసి, ఎవరి చేతికి ఏది దొరికితే దాన్ని పుచ్చుకుని, జనం చప్పుడు చేయకుండా పరుగున వచ్చారు.
తో తో సర్ప కంబరేఖాలతా | దేఖిలా హళూ హళూ సరకతా | సర్ప కైంచా తీ44 మూర్త అనర్థతా | ఉతరతాహే వాటలీ | ||౮౬||
86. అప్పుడు ఆ పాము మెల్ల మెల్లగా, మిరీకరు నడుం క్రిందనుండి జారుకోవడం కనిపించింది. కాని, చూసిన వారికి, అది పాములా కాక, ఆకారం దాల్చిన అనర్థం దిగుతున్నట్లు అనిపించింది.
పహాతా పహాతా తే గ్రహణ సుటలే | బడగే ఆధీంచ హోతే ఉచలలే | ధడాధడ తే సర్పావర పడలే | జాహలే తుకడే తయాచే | ||౮౭||
87. చూస్తూ చూస్తుండగానే, ఆ గ్రహణం గడిచింది. పైకి లేచిన కర్రలు టపటపమని ఆ పాముపై పడగానే, అది ముక్కలై పోయింది.
ఎణేంపరీ అరిష్ట టళళే | పాహూని మిరీకర అతి గహింవరలే | సాఈ సమర్థాచియా వరలే | ప్రేమ తరతరలే45 అతితర46 | ||౮౮||
88. ఆ గండం ఇలా తొలగిపోవడం చూసి, మిరీకరు మనసులో సాయి సమర్థులపై విపరీతమైన ప్రేమ అలలు అలలుగా ఉప్పొంగింది.
దుఃఖాచే శహారే మావళలే | ప్రేమ డోళా వాహూ లాగలే | కేవఢే హే అరిష్ట టళలే | కైసే కళలే బాబాంనా | ||౮౯||
89. దుఃఖంతో కూడుకున్న బాధ కొంచెం కొంచెంగా తగ్గిపోయింది. దానికి బదులు, ప్రేమతో నిండిన నీరు కళ్ళనుండి ప్రవహించ సాగాయి. ‘ఎంతటి అరిష్టం తొలగిపోయింది! మరి బాబాకు ఇదంతా ఎలా తెలిసింది?
కైసే హే గండాంతర చుకలే | బాబాంనీ వేళీ కైసే సుచవిలే | నకో మ్హణతా టాంగ్యాంత బసవిలే | శామాస దిధలే సాహ్యార్థ | ||౯౦||
90. ‘గండం నిజంగానే గడిచిపోయింది. సమయానికి సరిగ్గా సూచించి, వద్దంటున్నా, శ్యామాను సహాయానికి పంపి, టాంగాలో కూర్చోపెట్టారు.
కితీ తరీ దయా పోటీ | కాయ తీ త్యాంచీ అంతర్దృష్టి |
జాణూనీ పుఢీల వేళ ఓఖటీ47 | వార్తా గోమటీ కథియేలీ | ||౯౧||
91. ‘వారి మనసులో ఎంతటి దయ! అవలీలగా అన్నీ తెలుసుకునే వారి జ్ఞానం ఎటువంటిది! ముందు ముందు రానున్న చెడును తెలుసుకొని, ఎంత చక్కగా తెలియజేశారు!
దర్శనాచే మాహాత్మ్య దావిలే | మశీదీంచే మహత్వ ఠసవిలే | నిజప్రేమ నిదర్శనా ఆణీలే | సహజ లీలే కరూన | ||౯౨||
92. ‘వారి దర్శనంలోని మహత్యాన్ని తెలియ చేశారు. మసీదుయొక్క మహత్యాన్ని అందరి మనసులో నాటారు. భక్తుల మీద వారికి ఉన్న ప్రేమను, తమ అద్భుతమైన లీలలతో నిరూపించి, చూపారు’ అని అనుకున్నాడు.
ఎకదా ఎక మోఠే జ్యోతిషీ | నానా డేంగళే నామ జయాంసీ | హోతే శ్రీమంత బుట్టీపాసీ | మ్హణాలే తయాంసీ తే పరిసా | ||౯౩||
93. ఒక సారి, శ్రీమంతుడైన బుట్టీతో ఉన్న, నానా డేంగళే అన్న ఒక గొప్ప జ్యోతిష్యుడు, బుట్టీతో ఏమన్నాడో వినండి.
ఆజిచా దివస అశుభ ఫార | ఆహే ఆపణా గండాంతర | అంతరీ అసో ద్యావా ధీర | అసావే ఫార సావధ | ||౯౪||
94. ‘ఈ రోజు మీకు చాలా అశుభం. పెద్ద గండం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా, ధైర్యంగానే ఉండండి’.
డేంగళ్యాంనీ ఏసే కథితా | బాపూసాహేబ అస్వస్థ చిత్తా | రాహూన రాహూన కరితీ చింతా | దివస జాతా జాఈనా | ||౯౫||
95. డేంగళే అలా చెప్పగా, బాపూసాహేబు మనసులో అలజడి మొదలైంది. మాటి మాటికీ అదే ఆలోచనతో మనసుకున్న శాంతి పోయి, సమయం అసలు గడవకున్నట్లు అనిపించింది.
పుఢే మగ నిత్యాచే వేళీ | మశీదీస నిఘాలీ మండళీ | బాపూసాహేబ నానాది సగళీ | జాఊని బైసలీ బాబాకడే | ||౯౬||
96. తరువాత, రోజూ వెళ్ళే వేళకు, భక్తులు మసీదుకు బయలుదేరారు. బాపూసాహేబు, నానా (డేంగళే), మొదలైన వారు వెళ్ళి బాబా దగ్గర కూర్చున్నారు.
తాత్కాళ బాబా బుట్టీస పుసతీ | “కాయ హే నానా కాయ వదతీ | తే కాయ తుజ మారాయా బఘతీ | నలగే తీ భీతీ ఆపణా | ||౯౭||
97. వెంటనే, బుట్టీతో బాబా “ఏమిటీ, ఈ నానా ఏమంటున్నాడు? నిన్ను చంపాలని చూస్తున్నాడా? కాని, మనకేం భయం లేదు.
‘కైసా మారతోస పాహూ మార’ | ఖుశాల త్యాంనా దేఈ ఉత్తర” | అసో ఏసే ఝాలియా నంతర | పహా చమత్కార పుఢీల | ||౯౮||
98. “‘ఎలా చంపుతావో చూస్తాను, చంపు’, అని అతనితో ఏ భయమూ లేక సవాలు చేయి” అని చెప్పారు. దీని తరువాత జరిగిన చమత్కారాన్ని చూడండి.
సాయంకాళీ బహిర్దిశేస | బాపూసాహేబ శౌచవిధీస | గేలే అసతా శౌచకూపాస | ఆలా తే సమయాస సర్ప ఎక | ||౯౯||
99. సాయంత్రం, మల విసర్జనకై బుట్టీ బయలు ప్రదేశానికి వెళ్ళగా, ఆ సమయంలో అక్కడికి ఒక పాము వచ్చింది.
పాహూనియా తే విఘ్న భయంకర | బాపూసాహేబ ఆలే బాహేర | లహానూ48 తయాంచా కరీ జో విచార | దగడానే ఠార కరూ యా | ||౧౦౦||
100. భయంకరమైన ఆ అరిష్టాన్ని చూసి, బుట్టీ బయటకు వచ్చేశాడు. అతని నౌకరు లహాను, పాముని చూసి, రాయితో దానిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
లహానూ దగడ ఉచలూ జాఈ | బాపూసాహేబ కరితీ మనాఈ |
మ్హణతీ జా కాఠీ ఘేఊన యేఈ | బరీ న ఘాఈ యే కామీ | ||౧౦౧||
101. కాని, బాపూసాహేబు అతనిని ఆపి, ‘ఇలాంటి సమయాలలో త్వర పడకూడదు. వెళ్ళి కర్రను పట్టుకురా’ అని చెప్పాడు.
ఝోంక జాఊన పడలా అవచితా | గేలా సరపటతా భోకాంతునీ | ||౧౦౨||
102. నౌకరు కర్ర తేవడానికి వెళ్ళగా, ఆ పాము గోడ పైకి ఎగప్రాకి పోతూ, అకస్మాత్తుగా జారి క్రింద పడి, సరసరా ఒక బొక్కలోకి దూరిపోయింది.
తేథూన మగ తో గేలా పళూన | ఉరలే న మారావయాచే కారణ | జాహలే బాబాంచ్యా శబ్దాంచే స్మరణ | సంకట నివారణ ఉభయత్ర | ||౧౦౩||
103. అలా ఆ పాము అక్కడినుండి తప్పించుకుని పోయింది. దానితో, దానిని చంపవలసిన అవసరం తప్పింది. బాబా మాటలు బుట్టీకి గుర్తుకు వచ్చాయి. ఈ విధంగా, అతనికి, పాముకు ఇద్దరికీ కష్టం తొలగిపోయింది.
అసో హా సాఈసమాగమ సోహళా | భాగ్యే పాహిలా జయానే డోళా | తయాసీ తో స్మరణావేగళా | కదాకాళా కరవేనా | ||౧౦౪||
104. అదృష్టం కొద్దీ తమ కళ్ళతో, సాయి సన్నిధిలోని వైభవాన్ని చూచినవారు, దానిని ఎన్నటికీ మరచిపోలేరు.
ఏస ఏశీ ప్రత్యంతరే | దావూన ఆకర్షిలీ భక్తాంతరే | వర్ణూ జాతా కాగద న పురే | వర్ణన49 న సరే కదాపి | ||౧౦౫||
105. ఇలాంటి ఎన్నో అనుభవాలను కలిగించి, భక్తుల మనసులను బాబా ఆకట్టుకునేవారు. వానిని వర్ణించాలంటే, ఆ వర్ణనా ముగిసిపోదు, కాగితాలూ సరిపోవు.
అసేంచ ఎక కథాంతర50 | రాత్ర పడతా దోన ప్రహర | ప్రత్యక్ష ఘడలే చావడీవర | బాబాంచే సమోర తే పరిసా | ||౧౦౬||
106. ఇలాంటిదే ఇంకొక కథ. రాత్రి రెండవ ఝాములో (సుమారు రాత్రి ఒంటి గంటప్పుడు), చావడిలో, బాబా ఎదుటే జరిగినది, ఇప్పుడు వినండి.
కోరాళే తాలుకా కోపరగాంవ | వతనవాడీచా మూళ గాంవ | అమీర శక్కర జయా నాంవ | జయాచా భావ సాఈపదీ | ||౧౦౭||
107. కోపర్గాం తాలూకాలోని కోరాలే అన్న గ్రామంలో, అమీర శక్కర అను ఒకతనికి, వంశ పారంపర్యంగా వచ్చిన పంట భూములున్నాయి. సాయి పాదాలంటే అతనికి చాలా భక్తి.
జాత ఖాటిక ధందా దలాల | వాంద్ర్యాంత జయాచా బోలబాల | దుఖణ్యానే గాంజలా ప్రబళ | అతి వికళ జాహలా | ||౧౦౮||
108. అతడు కసాయి జాతికి చెందినవాడు. దళారి వ్యాపారం చేసేవాడు. బాంద్రాలో అతనికి బాగా పలుకుబడి ఉంది. కాని, ప్రస్తుతానికి, చాలా బలమైన కష్టం వచ్చి, విపరీతంగా నీరస పడిపోయాడు.
పడతా సంకట ఆఠవే దేవ | సోడిలీ ధంద్యాచీ ఉఠాఠేవ | నిరవూన సారీ దేవఘేవ | ఠోకిలీ ధాంవ శిరడీస | ||౧౦౯||
109. కష్టాలు వచ్చినప్పుడు, దేవుడు గుర్తుకు వస్తాడు. వ్యాపార వ్యవహారాలలో ఉన్న కష్టాలన్నింటినీ వదిలేసుకుని, తన వ్యాపారాన్ని మూసివేశాడు. వెంటనే, శిరిడీకి పరుగున వెళ్ళాడు.
కుంతీ పాంచ పాండవాంచీ ఆఈ | అజ్ఞాత51 ఆణి వనవాసాపాయీ | కష్టలీ జరీ అనంత అపాయీ52 | ప్రార్థీ అపాయచి52 దేవాతే | ||౧౧౦||
110. ఐదుగురు పాండవుల తల్లి అయిన కుంతి, వనవాసంలోని అజ్ఞాతవాసంలో, ఎన్నో రకాల కష్టాలను, అపాయాలను సహించింది. అయినా, ఎప్పుడూ దేవుణ్ణి కష్టాలనే ఇమ్మని కోరేది.
మ్హణే దేవా పరమేశ్వరా | సౌఖ్య ద్యాజీ మాగత్యా53 ఇతరా |
మజ ద్యా నిరంతర దుఃఖ పరంపరా | పాడీ న విసరా తవ నామీ | ||౧౧౧||
111. ‘దేవా! పరమేశ్వరా! సుఖాలను కోరుకునే వారికి సుఖాలను ఇవ్వు. కాని, నాకు ఎప్పుడూ వరుసగా కష్టాలనే ఇవ్వు. అప్పుడే, నిన్ను తలచుకోకుండా నేను ఉండను’.
తేంచ కీ దేవా మాఝే మాగణే | దేణే తరీ మజ హేంచ దేణే | హోఈల మగ తవ నామ తేణే | అఖండ లేణే54 మమ కంఠా | ||౧౧౨||
112. ‘నేను కోరుకునేది ఇదొకటే. నాకేమైనా ఇవ్వాలనుకుంటే, దీనినే ఇవ్వు. దీని వలన ఎప్పుడూ నీ నామ స్మరణ కలుగుతుంది. నా గొంతుకు ఇదే అలంకారం’.
శ్రోతా వక్తా అహర్నిశీ | హేంచ కీ మాగూ సాఈపాశీ | విసర న వ్హావా తవ నామాశీ | పాయాపాశీ ఠేవిజే | ||౧౧౩||
113. శ్రోతలైన మీరు, వక్త అయిన నేను, మనం అందరం రాత్రింబవళ్ళూ దీనినే సాయి పాదాల దగ్గర కోరుకుందాము. ‘దేవా! మీ నామాన్ని మరచి పోకుండా, ఎల్లప్పుడూ మీ పాదాల దగ్గర చోటివ్వండి’ అని.
అసో అమీరే కేలే నమన | విధియుక్త బాబాంచే హస్తచుంబన | వ్యాధీచేంహీ సవిస్తార నివేదన | దుఃఖ విమోచన ప్రార్థిలే | ||౧౧౪||
114. బాబాకు నమస్కరించి, భక్తిగా బాబా చేతిని అమీరు ముద్దుపెట్టుకున్నాడు. తన రోగం గురించి, వివరంగా చెప్పి, ఆ దుఃఖంనుండి తనను ముక్తుణ్ణి చేయమని ప్రార్థించాడు.
జడలా జో హోతా వాతవికార | పుసిలా తయాచా ప్రతికార | బాబా మగ దేతీ ప్రత్యుత్తర | వ్హావే సుస్థిత చావడీంత | ||౧౧౫||
115. తనకు వచ్చిన సంధివాత (రూమెటిసం) పోయే ఉపాయం చెప్పమని బాబాను కోరుకున్నాడు. దానికి బాబా, “నెమ్మదిగా చావడిలో ఉండు, వెళ్ళు” అని అన్నారు.
మశీదీంతూన నేమానే రాతీ | బాబా జయా చావడీప్రతీ | ఎక దివసా ఆడ జాతీ | అమీరా వసతీ55 తే స్థానీ | ||౧౧౬||
116. రోజు విడిచి రోజు రాత్రి, బాబా చావడిలో పడుకునేవారు. అక్కడే అమీరుకు ఇప్పుడు బస.
అమీర గాంజలే సంధివాతే | కుఠేంహీ గావాంత సుఖానే రహాతే | కోరాళ్యాసహీ జాఊన పడతే | అధిక మానవతే తయాంనా | ||౧౧౭||
117. సంధివాతంతో చాలా బాధ పడుతున్న అమీరు, ఆ గ్రామంలో ఇంకెక్కడైనా చాలా సుఖంగా ఉండగలిగే వాడు. లేదా కోరాలేకైనా వెళ్ళగలిగేవాడు. అక్కడ అతనికి చాలా గౌరవం కూడా!
చావడీ తీ మలికంబరీ56 | జీర్ణ ఝాలేలీ ఖాలీవరీ | జేథే సరడ పాలీ వించూ విఖారీ57 | స్వేచ్ఛాచారీ నాందావే | ||౧౧౮||
118. చావడి చాలా పాతది (అహమ్మదునగరం దివానైన మలిక అంబర్ కాలం నాటిది - సుమారు ౧౫౯౭). కిందా, పైనా, అంతా పాడై పోయింది. తొండలు, బల్లులూ, తేళ్ళూ, పాములూ తమ ఇష్ట ప్రకారం ఉండేవి.
త్యాంతచి వసతీ రోగీ కుష్టీ58 | కుత్రీ తేథేంచ ఖాతీ ఉష్టీ | అమీర ఝాలా మోఠా కష్టీ | చాలతీ న గోష్టీ బాబాంపుఢే | ||౧౧౯||
119. అక్కడే కుష్టు రోగులూ ఉంటారు. కుక్కలు ఎంగిలి మెతుకులు తింటుంటాయి. అమీరు బాధ పడ్డాడు, కాని బాబాతో వాదించలేడు కదా!
మాగీల భాగాంత భరలా కచరా | ఢోపరఢోపర ఛిద్రే సతరా | హాల ఖాఈనా తయాచే కుత్రా | తీ ఎక యాత్రాచ జన్మాచీ | ||౧౨౦||
120. చావడి వెనుక భాగం చెత్తతో నిండిపోయింది. మోకాలి లోతు గోతులు. గోడకు పదహారు బొక్కలు. అతని పరిస్థితి కుక్క బ్రతుకుకంటే హీనమై పోయింది. అక్కడికి రావటమే దండుగ.
వరూన పాఊస ఖాలూన ఓల | జాగా ఉంచనీచ సఖోల |
వార్యాథండీచా ఎకచి కల్లోళ | మనాసీ ఘోళ59 అమీరాచే | ||౧౨౧||
121. పైనుండి వాన నీరు కారటం, కింద నేలంతా తేమ, మొత్తం నేలంతా ఎత్తు పల్లాలు - ఇలా ఉండేది. దీనికి తోడు చల్లని చలిగాలి కల్లోలం, అమీరుకు మనసులోనే చింత పట్టుకుంది.
ఓల తో తేథే ఏశాపరీచే | ఔషధ బాబాంచే వచన60 కీ | ||౧౨౨||
122. గాలి, వాన, నేలలోని తేమ, వీటి వలన అమీరు దేహంలోని కీళ్ళు పట్టుకుని పోయాయి. కాని, దీనికి మందు బాబా మాటలోక్కటే.
తయాస బాబాంచే ఠామ బోల | వారా పాఊస వా అసో ఓల | జాగా ఉంచ నీచ వా సఖోల | తయాచే తోల61 కరూ నయే | ||౧౨౩||
123. “గాలి, వాన వచ్చినా, నేల తడిగా, ఎత్తు పల్లాలుగా ఉన్నా సరే, ఇక దాని గురించి ఆలోచించనే కూడదు” అని బాబా ఖచ్చితంగా అతనికి చెప్పేశారు.
జరీ తే స్థాన వికల్పాస్పద62 | సాఈసమాగమ మహాప్రసాద | తయాంచే వచన హేంచి అగద63 | మానూని సుఖద64 రాహిలా | ||౧౨౪||
124. ఆ చోటు మార్చే అవకాశం లేక పోయినా, అక్కడ అతనికి సాయి సహవాసం మహాప్రసాదం; వారి మాటలే ఔషధం అని అనుకొని, సుఖంగా ఉండ సాగాడు.
చావడీ చఢతా తేథే సమోర | బిస్తరా65 లావూన మధ్యావర | నఊ మహినే త్యా చావడీవర | అమీర శక్కర రాహిలా | ||౧౨౫||
125. చావడి మెట్లు ఎక్కగానే, ఎదురుగా కనిపించే మధ్య భాగంలో, పరుపు పరుచుకుని, అమీరు శక్కరు అక్కడ తొమ్మిది నెలలున్నాడు.
అంగీ ఖిళలా సంధివాత | అనుపాన బాహ్యతః సర్వ విపరీత66 | పరీ అంతరీ విశ్వాస నిశ్చిత | తేణే యథాస్థిత జాహలే | ||౧౨౬||
126. సంధివాతం అతని దేహాన్నంతా వ్యాపించింది. అక్కడి వాతావరణం ఆ జబ్బును పెంచేదిగా ఉన్నా, అతని గట్టి నమ్మకం కారణంగా, అది సరిపోయింది.
నఊ మహినే తేథేంచ వాస | నేమిలా హోతా అమీరాస | మనాఈ హోతీ దర్శనాస | మశీదీసహీ యావయా | ||౧౨౭||
127. అతడు తొమ్మిది నెలలు అక్కడే ఉండాలని బాబా ఆజ్ఞాపించారు. దర్శనాని కోసం మసీదుకు వెళ్ళటానికి కూడా అనుమతి లేదు.
పరీ తీ చావడీ ఏసే స్థాన | దిధలే హోతే తయాస నేమూన | కీ బాబాంచే ఆపాప దర్శన | ప్రయాసావీణ ఘడతసే | ||౧౨౮||
128. అయినా, చావడివంటి చోటులో ఉండాలని ఆజ్ఞాపించినా, అతనికి, ఏ కష్టమూ లేకుండా బాబా దర్శనం కలిగేది.
తేంహీ రోజ సాంజ67 సకాళా68 | శివాయ ఎకాంతరా దోనీ69 వేళా | తేథే తయా చావడీచా సోహళా | మిళే డోళాభర పహావయా | ||౧౨౯||
129. రోజూ అతనికి తెల్లవారి, సాయంత్రం బాబా దర్శనం కలిగేది. ఇది కాక, రోజు విడిచి రోజు, రెండు పూటలా, చావడిలో జరిగే వైభవాన్ని, తనివి తీరా చూసే అవకాశం కూడా లభించింది.
రోజ సకాళీ భిక్షేస జాతా | చావడీవరూనచ బాబాంచా రస్తా | సహజ దర్శన జాతా యేతా | స్థాన న సోడితా అమీరాస | ||౧౩౦||
130. ప్రతి రోజూ ఉదయం బాబా భిక్షకు వెళ్ళేటప్పుడు, చావడి మీదుగానే వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు, మరల తిరిగి వస్తున్నప్పుడు, ఉన్న చోటునుంచి కదలకుండానే, అమీరుకు బాబా దర్శనం కలిగేది.
తైసేచ రోజ అస్తమానీ | చావడీసమోర బాబా యేఊనీ |
తర్జనీ మస్తక డోలవునీ | దిగ్వందనీ70 సన్నిష్ఠ | ||౧౩౧||
131. అలాగే, ప్రతి రోజూ సాయంత్రం, చావడి ఎదుట నిలుచుని, చూపుడు వేలును, తలను ఊపుతూ, బాబా దిక్కులకు నమస్కారం చేసేవారు.
తేథూన మగ మాఘారా జాత | సమాధిగృహాచే కోనాపర్యంత | తేథూన మాఘారా మశీదీంత | భక్త సమవేత తే జాత | ||౧౩౨||
132. అక్కడినుండి వెనుకకు మరలి, సమాధి మందిరం మూల వరకు వెళ్ళి, భక్తులతో మసీదుకు తిరిగి వచ్చేవారు.
చావడీ ఎకా దిసా ఆడ | నావాలా ఎక పడదా ఆడ | దోఘాంమాజీ ఫళ్యాంచే కవాడ | దోఘాంహీ ఆవడ గోష్టీంచీ | ||౧౩౩||
133. బాబా చావడికి రోజు విడిచి రోజు వచ్చేవారు. బాబాకు, అమీరుకు మధ్యన, నామ మాత్రంగా, ఒక పలకల తలుపు, పరదావలె అడ్డు ఉండేది, అంతే. వారిద్దరికీ ముచ్చటించుకోవటం అంటే చాలా సరదా.
తేథేంచ పూజా తేథేంచ ఆరతీ | హోఊన భక్తజన ఘరోఘర జాతీ | తేథూన పుఢే స్వస్థ చిత్తీ | మగ తే బోలతీ పరస్పర | ||౧౩౪||
134. చావడిలోనే పూజ, ఆరతి చేసి, భక్తులు తమ ఇళ్ళకు వెళ్ళి పోయేవారు. దాని తరువాత, వారిద్దరూ నెమ్మదిగా కబుర్లు చెప్పుకునేవారు.
బాహ్యాత్కారే బందివాస | ఆంతూన సాఈసీ దృఢ సహవాస | భాగ్యావీణ హా లాభ ఇతరాస | భోగావయాస దుర్మిళ | ||౧౩౫||
135. బయటనుండి అది బందిఖానాలా అనిపించినా, నిజానికి, సాయి సహవాసం ఎంతో భాగ్యం. లేకుంటే, అలాంటి సుఖాన్ని, ఆనందాన్ని, అనుభవించటం ఎవరికి సాధ్యం?
తరీహీ అమీర కంటాళలా | ఎకేచ స్థానీ రహావయాలా | బందివాసచి తో తయా గమలా | మ్హణే గాంవాలా జావే కోఠే | ||౧౩౬||
136. అయినా కూడా, అమీరుకు విసుగెత్తి పోయింది. ఒకే చోట ఉండటం, చెరసాలలో ఉన్నట్లు అనిపించింది. వేరే ఏ ఊరికైనా వెళ్ళాలని అతనికి అనిపించింది.
స్వాతంత్ర్యాచీ హౌస మనా | త్యా కాయ ఆవడే పరతంత్రపణా | పురే ఆతా హా బందిఖానా | ఉఠలీ కల్పనా అమీరా | ||౧౩౭||
137. స్వేచ్ఛను కోరుకునే అతనికి ఈ చెరసాల వాసం ఏం నచ్చుతుంది? ‘ఈ బందిఖానా ఇక చాలు’ అని అతని మనసు అతనిని పురిగొల్పింది.
నిఘాలా బాబాంచ్యా అనుజ్ఞేవీణ | త్యాగూని ఆపులే నియమిత స్థాన | గేలా కోపరగాంవాలాగూన | రాహిలా జాఊన ధర్మశాళే | ||౧౩౮||
138. బాబా అనుమతి లేకుండానే, బాబా నియమించిన చోటును వదిలి, కోపర్గాంకు వెళ్ళి, అక్కడ ఒక ధర్మశాలలో ఉన్నాడు.
తేథే పహా చమత్కార | మరాయా టేకలా ఎక ఫకీర | తృషేనే వ్యాకూళ హోఊన ఫార | పాజా ఘోటభర పాణీ మ్హణే | ||౧౩౯||
139. ఇప్పుడు అక్కడ జరిగిన చమత్కారాన్ని చూడండి. చావటానికి సిద్ధంగా ఉన్న ఒక ఫకీరు, దాహంతో చాలా బాధపడుతున్నాడు. ఒక గుక్కెడు నీరు త్రాగించమని అడిగాడు.
అమీరాస ఆలీ దయా | గేలా పాణీ పాజావయా | పాణీ పీతాక్షణీ తే ఠాయా | పడలీ కాయ71 నిచేష్టిత | ||౧౪౦||
140. అమీరుకు జాలి కలిగింది. త్రాగడానికి నీరు ఇచ్చాడు. నీరు త్రాగిన వెంటనే, ఆ ఫకీరు దేహం, ఏ కదలికా లేక, అప్పటికప్పుడే, కింద పడిపోయింది.
ఝాలే తయాచే దేహావసాన | జవళపాస నాహీ కోణ |
త్యాంతహీ రాత్రీచా సమయ పాహూన | గడబడలే మన అమీరాచే | ||౧౪౧||
141. అతను చచ్చిపోయాడు. చుట్టు ప్రక్కలా ఎవరూ లేరు. పైగా రాత్రి సమయం; పాపం అమీరు గాబరా పడిపోయాడు.
హోఈల సురూ ధరాధరీ | తపాస కరీల సరకార | ||౧౪౨||
142. ‘తెల్లవారగానే, ఫకీరు ఆకస్మిక చావుకు విచారణ జరుగుతుంది. దోషిని పట్టుకుంటారు. ప్రభుత్వం విచారణ జరుపుతుంది.
ఘడలేలీ వార్తా జరీ ఖరీ | సకృద్దర్శనీ72 కోణ నిర్ధారీ73 | నికాల సాక్షీ పురావ్యావరీ | ఏసీ హీ పరీ న్యాయాచీ | ||౧౪౩||
143. ‘జరిగిన దానిని ఉన్నదున్నట్లుగా చెబితే, ఎవరు నమ్ముతారు? సాక్షుల విచారణలో తేలిన దానిని బట్టి, న్యాయం జరుగుతుంది.
మీచ యాతే పాణీ పాజితా | ఫకీర అవచిత ముకలా జీవితా | ఏసీ సత్య వార్తా మీ వదతా | లాగేన హాతా ఆయతాచ | ||౧౪౪||
144. ‘నేనే అతనికి నీరు త్రాగిస్తుంటే, అకస్మాత్తుగా ఫకీరు ప్రాణాలు పోయాయి అని జరిగిన నిజాన్ని చెబితే, నేనే పట్టుబడి పోతాను.
మాఝాచ సంబంధ యేఈల ఆధీ | ధరితీల మజలాచి యా సంబంధీ | పుఢే ఠరతా మరణాచీ ఆదీ74 | మీ నిరపరాధీ ఠరేన | ||౧౪౫||
145. ‘అతని చావుకి అసలు నేనే కారణమని, ముందు నన్ను పట్టుకుంటారు. ముందెప్పుడో నిజం తెలిశాక, నేను నిరపరాధినని నిశ్చయమవుతుంది.
పరీ తే ఠరేపర్యంతచా కాల | జాఈల దుఃసహ హోతీల హాల | తైసాచ ఆల్యా వాటేనే పళ | కాఢావా తాత్కాళ హే ఠరలే | ||౧౪౬||
146. ‘కాని, అంతవరకు బాధతో భరించరాని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే వెంటనే వచ్చిన దారినే పారిపోవాలి’ అని నిశ్చయించుకున్నాడు.
మ్హణోన అమీర రాతోరాత | నిఘాలా తేథూన కోణా న దేఖత | పుఢే జాతా మాగే పాహత | అస్వస్థచిత్త మార్గాంత | ||౧౪౭||
147. అలా అనుకుని, రాత్రికి రాత్రే, ఎవరూ చూడకుండా అమీరు అక్కడనుండి బయలుదేరాడు. వెనుక ఎవరైనా వస్తున్నారేమో అని తిరిగి చూసుకుంటూ, ముందుకు నడుస్తూ, దారి పొడుగునా బాధ పడ్డాడు.
చావడీ కైసీ యేతే హాతీ | మనాస తోంవర నా నిశ్చింతీ | ఏసా అమీర శంకితవృత్తీ | శిరడీప్రతీ చాలలా | ||౧౪౮||
148. ‘చావడి చేరుకునే వరకు మనసుకు శాంతి లేదు’ అని ఆలోచిస్తూ, అమీరు శిరిడీకి బయలుదేరాడు.
మ్హణే బాబా హే కాయ కేలే | కాయ కీ హే పాప ఓఢవలే | మాఝేంచ కర్మ మజలా ఫళలే | తే మజ కళలే సంపూర్ణ | ||౧౪౯||
149. ‘బాబా ఇలా చేశారేమిటి? ఇదెక్కడి పాపం ముంచుకొచ్చింది? నా కర్మే ఇలా ఫలించింది అని నాకు బాగా తెలిసింది.
సుఖాలాగీ సోడిలీ చావడీ | మ్హణూన మాఝీ తోడిలీ ఖోడీ | అసో ఆతా యా దుఃఖాంతూని కాఢీ | నేఊని శిరడీంత ఘాలీగా | ||౧౫౦||
150. ‘చావడికంటే మంచి చోటుకు వెళ్ళాలని, చావడిని వదిలి పెట్టాను. అందుకే నన్ను శిక్షించావు. కాని, ఇప్పుడు నన్నీ కష్టంనుండి బయటకు లాగి, శిరిడీలో పడివేయండి’ అని అనుకున్నాడు.
కేలీ తయారీ హాతోహాత | అమీర నిఘాలా రాతోరాత |
టాకూన తేథే తైసేంచ ప్రేత | ధర్మశాళేంత త్యా రాత్రీ | ||౧౫౧||
151. ఆ శవాన్ని ధర్మశాలలోనే వదిలేసి, రాత్రికి రాత్రే అమీరు బయలుదేరాడు.
“బాబా బాబా” ముఖే వదత | క్షమాకరా కరుణా భాకిత | పాతలా జేవ్హా చావడీప్రత | జాహలా స్వస్థ చిత్తాంత | ||౧౫౨||
152. ‘బాబా! బాబా!’ అని నోటితో అంటూ, మనసులో కరుణించమని వేడుకుంటూ, చావడికి చేరిన తరువాత, అతని మనసుకు నెమ్మది కలిగింది.
ఎవంచ హా తరీ ఎక ధడా | తేథూన కానాస లావిలా ఖడా | అమీర వర్తూ లాగలా పుఢా | సోడూన కుడా కుమార్గ | ||౧౫౩||
153. అలా అమీరుకు మంచి గుణపాఠం కలిగి, లెంపలు వేసుకుని, చెడు మార్గాన్ని వదిలి, మంచిగా ఉండసాగాడు.
అసో విశ్వాసే గుణ ఆలా | వాతాపాసూన ముక్త ఝాలా | పుఢే కైసా ప్రసంగ పాతలా | ప్రకార ఘడలా తో ఎకా | ||౧౫౪||
154. బాబాపై ఉన్న అతని నమ్మకంతో, వాతం జబ్బునుండి తేరుకున్నాడు. తరువాత జరిగినదానిని ఇప్పుడు వినండి.
చావడీ అవఘే తీన ఖణ | అగ్నఈ కోణ బాబాంచే ఠికాణా | చహూ బాజూంనీ ఫళ్యాంచే వేష్టణ | కరితీ శయన తై బాబా | ||౧౫౫||
155. చావడిలో మొత్తం మూడు భాగాలు. ఆగ్నేయ మూల బాబా చోటు. దీనికి నాలుగు దిక్కులా చెక్క పలకలు వేయబడి ఉన్నాయి. బాబా అందులో పడుకునేవారు.
అవధీ రాత్ర బత్యా తేవతీ75 | సదైవ ఉజేడాంత నిజతీ | ఫకీర ఫుకరే బాహేర బైసతీ | బాహ్య ప్రదేశీ అంధార | ||౧౫౬||
156. రాత్రంతా దీపాలు వెలిగించి ఉంచేవారు. బాబా ఎప్పుడూ వెలుగులోనే పడుకునేవారు. బయట ఉన్న చోటులో, ఫకీరులు, బైరాగులు చీకటిలో ఉండేవారు.
అమీర జణూ త్యాంతచి ఎక | ఆజూబాజూస ఇతర లోక | తేహీ లవండతీ తేథచి దేఖ | ఏసే కైక తే అసతీ | ||౧౫౭||
157. వారిలో అమీరు కూడా ఒక్కడు కావచ్చు. ఇటూ అటూ ఇతరులు కూడా ఎంతో మంది అక్కడే అడ్డంగా చెరబడో లేక నిద్రపోతూనో ఉండేవారు.
తేథేంచ బాబాంచే పశ్చాద్భాగీ | సరసమాన కోఠీచే జాగీ | భక్త అబదుల పరమ విరాగీ | సేవేస నిజాంగీ తత్పర | ||౧౫౮||
158. బాబా ఉన్న చోటుకు, వెనుక వైపు, సామాను ఉంచే గదిలో, పరమ విరాగి, సేవా తత్పరుడైన అబ్దుల్ అనే భక్తుడుండేవాడు.
ఏసే అసతా మధ్యరాత్రీశీ | బాబా ఆక్రందతా76 అబదుల్లాసీ | మ్హణతీ “మాఝీయా బిఛాన్యాచే కుశీ | పహా రే” వివశీ77 ఆదళలీ | ||౧౫౯||
159. ఒక మధ్య రాత్రి వేళ బాబా గట్టిగా కేకలు వేస్తూ, అబ్దుల్‍ను పిలిచి, “నా ప్రక్కలోకి దెయ్యం వచ్చి చేరింది, చూడరా!” అని అన్నారు.
హాంకేపాఠీ హాంక దేతీ | అబదుల పాతలా బత్తీ హాతీ | బాబా ఆక్రందే78 తయాస మ్హణతీ | ఆతా హోతీ నా తీ తేథే | ||౧౬౦||
160. మరల మరల బిగ్గరగా బాబా పిలువగా, అబ్దుల్ దీపాన్ని చేత పట్టుకుని వచ్చాడు. “అది ఇప్పుడే ఇక్కడ ఉండింది కదా!” అని గట్టిగా కేకలు వేస్తూ బాబా అన్నారు.
అబదుల మ్హణే సారే పాహిలే | యేథే న కాంహీచ దృష్టీస పడలే |
బాబా మ్హణతీ ఉఘడూన డోళే | నీట సగళే దేఖే రే | ||౧౬౧||
161. ‘అంతా చూశాను కాని, నాకిక్కడేదీ కనిపించ లేదు’ అని అబ్దుల్ చెప్పాడు. “కళ్ళు తెరచి సరిగ్గా చూడరా” అని బాబా మరల అన్నారు.
బహిర్నిద్రిస్త సకళ జన | జాగృత హోఊని అవలోకితీ | ||౧౬౨||
162. తిరిగి తిరిగి అబ్దుల్ అంతా చూశాడు. తమ సటకాతో బాబా నేలపై కొట్టడంతో, బయట నిద్రపోతున్న జనం మేల్కొని, ఏమైందని చూడసాగారు.
జాగా ఝాలా అమీర శక్కర | మ్హణే హా ఆజ కాయ కహర80 | హే అపరాత్రీ సటక్యాచే ప్రహార | హోతాత వరచేవర కా బరే | ||౧౬౩||
163. అమీరు శక్కరు కూడా మేల్కొన్నాడు. ‘ఇదేం గొడవ ఇవాళ? ఈ అర్ధరాత్రప్పుడు, మాటి మాటికి సటకా దెబ్బలు ఎందుకో మరి!’ అని అనుకున్నాడు.
పాహూని హీ బాబాంచీ లీలా | అమీర తాత్కాళ మనీ తరకలా | విఖార81 కోఠే తరీ ప్రవేశలా | కళోని ఆలా బాబాంస | ||౧౬౪||
164. బాబాయొక్క ఈ లీలను చూసి, ఎక్కడినుండో పాము వచ్చిందని బాబాకు తెలిసిందని, వెంటనే అమీరు అర్థం చేసుకున్నాడు.
తయాస బాబాంచా ఫార అనుభవ | ఠావా తయాస బాబాంచా స్వభావ | ఆణి తయాంచ్యా బోలణ్యాచీ మావ | త్యానే హే సర్వ జాణలే | ||౧౬౫||
165. అంత కాలం అతను బాబాతో ఉండటంతో, బాబా స్వభావాన్ని అనుభవంతో బాగా తెలుసుకున్నాడు. బాబా మాట్లాడే రీతి కూడా అతనికి తెలుసు. జరుగుతున్న దాన్నంతా అర్థం చేసుకున్నాడు.
అరిష్ట జేవ్హా భక్తాంచే ఉశాశీ | మ్హణతీల బాబా తే ఆపులే కుశీసీ | భాషా హీ అవగత అమీరాసీ | తేణే హే మనాశీ తాడిలే | ||౧౬౬||
166. భక్తులకు ఏదైనా ఆపద కలిగితే, అది తమకే కలిగినట్లు బాబా చెప్తారు. బాబాయొక్క ఆ భాష అమీరుకు బాగా తెలుసు. అందుకే, అతను వెంటనే సంగతి అర్థం చేసుకున్నాడు.
ఇతుక్యాంత త్యాచ్యాచ ఉశాకడే | కాంహీ విళవిళతా82 దృష్టీ పడే | అబదుల బత్తీ రే బత్తీ ఇకడే | మ్హణూన ఓరడే అమీర | ||౧౬౭||
167. ఇంతలో, తన పక్క దగ్గరే ఏదో కదులుతున్నట్లు అతను చూశాడు. వెంటనే, ‘అబ్దుల్, దీపం, ఆ దీపం ఇక్కడికి తీసుకురా’ అని అమీరు గట్టిగా అరిచాడు.
బత్తీ ఆణీతాంచ బాహేర | పసరలే దిసలే వేటోళే థోర | ప్రకాశే తో దిపలా విఖార | మాన ఖాలీంవర కరీతసే | ||౧౬౮||
168. దీపం అక్కడికి తీసుకుని రాగానే, దాని వెలుగులో, చుట్ట చుట్టుకుని ఉన్న పాము కనిపించింది. దాని పడగను అది కిందకూ పైకీ ఆడిస్తూంది.
తేథేంచ కేలీ తయాచీ శాంతీ | బాబాంచే బహదుపకార మానితీ | మ్హణతీ కాయ హీ విలక్షణ పద్ధతీ | దేతీ జాగృతీ కైసీ కీ | ||౧౬౯||
169. అక్కడున్న జనం ఆ పామును అక్కడే చంపేశారు. వారంతా ‘ఇది బాబాయొక్క గొప్ప ఉపకారమే’ అని, ‘భక్తులను హెచ్చరించే రీతి ఎంత ప్రత్యేకమో కదా!’ అని అన్నారు.
కైచీ వివశీ కైంచీ బత్తీ | కాళవేళేచీ ద్యావీ జాగృతీ | నిజభక్తాంచీ సంకటనిర్ముక్తి | హేచ యుక్తి తే హోతీ | ||౧౭౦||
170. ఎక్కడి దెయ్యం? ఎక్కడి దీపం? సమయానికి సరిగ్గా మేలుకొలిపి, కష్టాలనుండి భక్తులను కాపాడటానికే ఇది వారి యుక్తి.
ఏశా సర్పాంచ్యా అగణిత కథా | యేతీల బాబాంచ్యా చరిత్రీ వర్ణితా |
హోఈల గ్రంథాచీ అతి విస్తారతా | మ్హణూన సంక్షేపతా ఆదరిలీ | ||౧౭౧||
171. ఇలాంటి లెక్కలేనన్ని పాముల కథలను, బాబా చరిత్రలో వర్ణించవచ్చు. దీని వలన ఈ గ్రంథం చాలా పెద్దదై పోతుంది. అందుకే సారాంశంలో చెప్పాను.
“సర్ప వించూ నారాయణ” | సాధు తుకారామాచే వచన | "పరి తే సర్వ వందావే దురూన" | హేహీ వచన తయాంచే | ||౧౭౨||
172. పాము, తేలు మొదలైనవి నారాయణుని అంశాలే, అని భక్త తుకారాం వచనం. దూరంనుండే వానికి నమస్కారం చేయాలని కూడా అతనే అన్నాడు.
తేచ మ్హణతీ తయా "అధమ" | తయా "పైజారీచే కామ" | తయా సంబంధే వర్తనక్రమ | కళేనా ఠామ నిర్బంధ | ||౧౭౩||
173. అవి తక్కువ జాతికి చెందినవి గనుక, చెప్పులతోనే వాని పని పట్టాలని అన్నాడు. దాని వలన క్రూర జీవులతో ఎలా నడుచుకోవాలో, నిశ్చయంగా తెలియదు.
జయాచా జైసా స్వభావధర్మ | తదనుసార తయాంచే కర్మ | జైసా ఈశ్వరీ నేమానేమ | హేంచి కీ వర్మ తేథీల | ||౧౭౪||
174. ఈశ్వరుని నియమం ప్రకారం, జీవుల స్వభావం ఎలా ఉంటుందో, వాని పనులు కూడా అలాగే ఉంటాయి. ఇదే ఇందులోని రహస్యం.
యా శంకేచే సమాధాన | బాబాపాశీ ఎకచ జాణ | జీవమాత్ర సమసమాన | అహింసా ప్రమాణ సర్వార్థీ | ||౧౭౫||
175. వీటన్నిటికీ బాబా చెప్పేది ఒక్కటే. “అన్ని జీవులూ సమానం. అందుకే అన్నింటినీ అహింసా భావంతోనే చూడాలి” అని.
వించూ కాయ సర్ప కాయ | ఈశ్వరచి సర్వాంచా ఠాయ83 | తయాచీ ఇచ్చా నసతా అపాయ | కరవేల కాయ త్యాంచేనీ | ||౧౭౬||
176. “పాము కాని తేలు కాని, అన్నింటిలోనూ ఈశ్వరుడున్నాడు. ఆయన అనుకోనిదే ఎవరైనా ఎవరికైనా అపాయాన్ని తలపెట్టగలరా?
హే విశ్వ అవఘే ఈశ్వరాధీన | స్వతంత్ర యేథే కాంహీచహీ న | హే బాబాంచే అనుభవజ్ఞాన | ఆమ్హా దురభిమాన సోడీనా | ||౧౭౭||
177. “ఈ విశ్వమంతా ఈశ్వరుని అధీనంలో ఉంది. ఏదీ ఇక్కడ స్వతంత్రం కాదు”. బాబా తెలిపిన అనుభవ జ్ఞానం ఇదే. అయినా, మనము దురభిమానాన్ని వదిలిపెట్టం.
తళ్యాంత పడలా వించూ తళమళీ | ఖాలీ జాతా పాణ్యాచే తళీ | ఎక ఆనందే వాజవీ టాళీ | మ్హణే తూ ఛళీసీ ఏసాచ | ||౧౭౮||
178. చెరువులో పడిన ఒక తేలు, ఉక్కిరి బిక్కిరై, బాధతో, నీళ్ళలో మునిగి పోతుంటే, ఆనందంగా ఒకడు చప్పట్లు కొడుతూ ‘నీవూ ఇలాగే మమ్మల్ని బాధ పెడతావు కదా’ అని అన్నాడు.
ఎక ఏకూనియా తీ టాళీ | ధాంవత ఆలా తళ్యాచే పాళీ | పాహూని వించూ ఖాతా గటంగళీ | కరుణా బహాళీ కళవళే | ||౧౭౯||
179. ఆ చప్పట్లు విని, ఇంకొకడు పరుగెత్తుకుని వచ్చి, నీటిలో తేలు మునకలు వేస్తుంటే చూసి, జాలితో కరిగి పోయాడు.
మగ తో జాఊని తయాజవళీ | హళూచ చిమటీంత వించూ కవటాళీ | తేణే జాతి స్వభావే ఉసళీ | మారుని అంగుళీ డంఖిలీ | ||౧౮౦||
180. అప్పుడు అతను తేలు దగ్గరికి వెళ్ళి, తన బొటన వేలును చూపుడు వేలును పటకారంలా చేసి, దానిని బయటకు తీశాడు. కాని, తన జాతి స్వభావంతో, ఆ తేలు అతని చిటికెన వేలుని కుట్టింది.
యేథే కాయ ఆముచే జ్ఞాన | ఆమ్హీ సర్వథైవ పరాధీన |
బుద్ధిదాతా నారాయణ | ఘడవీల ఆపణ తే ఖరే | ||౧౮౧||
181. మన తెలివి ఇక్కడ ఏం పనికి వస్తుంది? అన్ని విధాలా మనము ఇంకొకరి చేతిలో కీలుబొమ్మలం. మనకు బుద్ధిని ఇచ్చేవాడు నారాయణుడు. అతడు ఏమనుకుంటే అదే జరుగుతుంది.
సాఈవచన విశ్వాస గౌరవ | కేవళ వైభవ నిష్ఠేచే | ||౧౮౨||
182. ఎందరికో ఎన్నో అనుభవాలున్నాయి. నా అనుభవాన్ని కూడా నేను చెప్పుతాను. సాయిని నమ్మి, వారి మాటలను విని, వానిని గౌరవించాలి. అలాంటి నమ్మకమున్నప్పుడే, వారి వైభవాన్ని అనుభవించగలము.
జైసే కాకాసాహేబ దీక్షిత | దివసా వాచిత నాథ భాగవత | తైసేచ తే ప్రతిరాత్రీ నిత84 | రామాయణ85 భావార్థ వాచీత | ||౧౮౩||
183. కాకాసాహేబు దీక్షితు ప్రతి రోజూ ఏకనాథ భాగవతాన్ని చదివేవాడు. అలాగే ప్రతి రాత్రి భావార్థ రామాయణాన్ని పఠించేవాడు.
టళేల దేవావరచే ఫూల | టళేల ఎకవేళ అంఘోళ | టళేల ఇతర నేమ సకళ | వాచన వేళ అటళ తీ | ||౧౮౪||
184. స్నానం చేయడం మరచి పోయినా, దేవుని పూజ చేయటం మానినా, మిగతా అన్ని నియమాలనీ మానినా, పఠించే సమయం మాత్రం తప్పేది కాదు.
హే దోన్హీ గ్రంథ నాథాంచే | సార సర్వస్వ పరమార్థాచే | సమర్థ సాఈచ్యా అనుగ్రహాచే | ద్యోతక సాచే దీక్షితా | ||౧౮౫||
185. ఏకనాథుని ఈ రెండు గ్రంథాలు పరమార్థానికి రూప కల్పనలు. సాయి సమర్థుల అనుగ్రహంతో, అవి దీక్షితుకు బాగా అర్థమయ్యేవి.
యా అద్వితీయ గోడ గ్రంథీ | ఆత్మజ్ఞాన వైరాగ్య నీతి | యాంచీ అఖండ త్రిగుణ జ్యోతి | దివ్యదీప్తి ప్రకాశే | ||౧౮౬||
186. సాటిలేని, అతి మధురమైన ఈ గ్రంథాలలోని నీతి, వైరాగ్యం, ఆత్మజ్ఞానం - ఈ మూడింటి జ్యోతి ఎప్పటికీ దేదీప్యమానంగా వెలుగునిస్తుంది.
యాంతీల బోధామృతాచా ప్యాలా | జయా సభాగ్యాచే86 ఓఠాస లాగలా | తయాచా త్రితాప ఎకసరా శమలా | మోక్ష లాగలా పాయాతే | ||౧౮౭||
187. భాగ్యం కొద్దీ, ఈ బోధామృత పాత్రను నోటికి అందుకున్న వారి మూడు తాపాలు (అధిభౌతిక, అధిదైవిక మరియు అధిఆత్మిక) తొలగిపోయి, మోక్షం కలుగుతుంది.
సాఈకృపే దీక్షితాలా | శ్రవణాసీ శ్రోతా వ్హావా ఝాలా | యోగ భాగవత శ్రవణాచా ఆలా | ఉపకార ఝాలా మజ తేణే | ||౧౮౮||
188. సాయి అనుగ్రహం వలన, దీక్షితుకు వినేందుకు శ్రోతలు, భాగవతం వినే అవకాశం నాకూ, లభించింది. దాని వలన నాకు గొప్ప ఉపకారం జరిగింది.
జాఊ లాగలో దివస రాత్ర | ఏకావాయా త్యా కథా పవిత్ర | భాగ్యే ఉఘడలే శ్రవణసత్ర | పావన శ్రోత్ర తేణేనీ | ||౧౮౯||
189. ఆ పవిత్రమైన కథలను వినడానికి, పగలూ రాత్రీ వెళ్ళ సాగాను. భాగ్యం కొద్దీ, చెవులను పవిత్రం చేసుకునే అవకాశం కలిగింది.
అసో ఏసీ ఎక రాత్ర | కథా చాలతా పరమ పవిత్ర | ఆడకథా జీ ఘడలీ విచిత్ర | శ్రోతా తే చరిత్ర ఏకిజే | ||౧౯౦||
190. ఇలా కథలు వింటున్నప్పుడు, ఒక రాత్రి, అతి పవిత్రమైన కథ జరుగుతుండగా, ఒక విచిత్రం జరిగింది. శ్రోతలూ! ఆ కథను వినండి.
కాయ కరూ ఎక వానితా | మధ్యేంచ దుసరే స్ఫురే చిత్తా |
జాణోని తయాచీ శ్రవణార్హతా | కిమర్థ ‘ఉపేక్షితా హోఊ’ మీ | ||౧౯౧|
191. ఏం చేయను? ఒక కథను వర్ణిస్తుంటే, ఇంకొకటి గుర్తుకు వస్తుంది. అది ఎంత వినదగినదో తెలిసిన తరువాత, దానినెలా వదిలేది?
చాలలీ87 సురస రామాయణీ కథా | పటలీ మాతేచీ ఖూణ హనుమంతా | తరీ కసూ జాఈ స్వామీచీ సమర్థతా | అంతీ అనర్థతా భోగిలీ | ||౧౯౨||
192. రామాయణంలోని కథ రసవత్తరంగా సాగుతుంది. తన తల్లి చెప్పిన ఆనవాలు ప్రకారం హనుమంతుడు శ్రీరాముని గుర్తించినా, స్వామి సమర్థతను పరీక్షించాలని వెళ్ళి, కష్టాలను తెచ్చుకున్నాడు.
లాగతా రామబాణ పిచ్చాచా వారా | హనుమంత అంబరీ ఫిరే గరగరా | ప్రాణ కాసావీస ఘాబరా | పితా88 తే అవసరా పావలా | ||౧౯౩||
193. రాముడి బాణం వెనుక ఉన్న ఈకలు పుట్టించిన సుడిగాలిలో, హనుమంతుడు ఆకాశంలో గిరగిరా తిరగసాగాడు. అతనికి ఊపిరాడక, భయం కలిగి, బాధ పడుతుంటే, అతని తండ్రి, వాయుదేవుడు అక్కడికి వచ్చాడు.
ఏకోని తయాచ హితవచన | హనుమంత రామాసీ ఆలా శరణ | హోత అసతా యా భాగాచే శ్రవణ | ఘడలే విలక్షణ తే ఏకా | ||౧౯౪||
194. తండ్రి హితమైన మాటలను విని, హనుమంతుడు రాముని శరణుజొచ్చాడు. ఈ కథా భాగాన్ని వింటుండగా జరిగిన విచిత్రాన్ని వినండి.
చిత్త కథాశ్రవణీ సంల్లగ్న | శ్రవణానందీ సకళ మగ్న | తో ఎక వృశ్చిక మూర్త విఘ్న | కైసే కీ ఉత్పన్న జాహలే | ||౧౯౫||
195. అందరి మనసులూ కథను వినడంలో లీనమై ఉన్నాయి. అప్పుడు, రూపు దాల్చిన అరిష్టంలా, ఒక తేలు ఎలాగో అక్కడికి వచ్చింది.
నకళే తయా హీ కాయ ఆవడీ | నకళత మాఝియా స్కంధీ ఉడీ | మారిలీ దేఊని బైసలా దడీ | రససుఖాడీ89 చాఖీత | ||౧౯౬||
196. కథ వినాలని దానికి ఎందుకు అంత ఆసక్తి కలిగిందో, అర్థం కాలేదు. నాకు తెలియకుండానే, నా భుజాల పై ప్రాకి, ముడుచుకుని కూర్చుని, కథలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉంది.
యేథేంహీ పహా బాబాంచీ సాక్ష | మాఝే నవ్హతే తికడే లక్ష | పరీ జో హరికథేసీ దక్ష | తయా సంరక్షక హరి స్వయే | ||౧౯౭||
197. ఇక్కడ కూడా బాబా ఇచ్చిన అనుభవాన్ని చూడండి. నా చూపు అక్కడ లేదు. హరికథ వినటంలో లీనమైన వారిని, హరియే స్వయంగా రక్షిస్తాడు.
సహజ గేలీ మాఝీ నజర | పాహూ జాతా వించూ భయంకర | మాఝియా దక్షిణ స్కంధావర | ఉపరణ్యావర సుస్థిర | ||౧౯౮||
198. అనుకోకుండా నా చూపు అటువైపు మరలి, చూస్తాను కదా! భయంకరమైన తేలు నా కుడి భుజం మీద కండువాపై కదలకుండా, ఆనందంగా కూర్చుని ఉంది.
నాహీ చలన నా వలన | స్వస్థచిత్త దత్తావధాన | శ్రోతా జణూ శ్రవణ పరాయణ | స్వస్థ నిజాసన విరాజిత | ||౧౯౯||
199. ఏ అలజడి, కదలిక లేకుండా వినడంలో లీనమైన శ్రోత, తన ఆసనంలో శాంతంగా కూర్చుని, శ్రద్ధగా వింటున్నాడా అన్నట్లుంది.
ఉగీచ దేహ స్వభావానుసార | నాంగీస చాళవితా లవభార | తరీ బైసాయా దేతా న థార | దుఃఖ అనివార వితరితా90 | ||౨౦౦||
200. దాని శరీర స్వభావంతో, ఊరికే, మెల్లగా తన కొండిని ఏ కాస్త కదలించినా, భరించలేని బాధతో, నేను శాంతంగా కూర్చోలేక పోయేవాణ్ణి.
సకళాంచా కరితా రసోభంగ | ఏసా హా కుసంగ దుర్ధర | ||౨౦౧||
201. రామకథ చాలా ఆసక్తిని పెంచుతూ, సాగుతూ ఉంది. వక్త, శ్రోత ఇద్దరూ గ్రంథంలో మునిగిపోయారు. అంతటి అద్భుతమైన రామకథను వినటంలో భంగం కలిగించేది ఆ అపాయమైన, చెడు తేలు.
తియే పావావే లాగే ఉపరమా | నిజధర్మావిసరూనీ | ||౨౦౨||
202. అదే మరి రామకథలోని శక్తి, మహిమ. అక్కడ అడ్డంకుల ప్రభావం సాగదు. అడ్డంకులు తమ స్వభావాన్ని మరచి, అక్కడ విశ్రాంతిని పొందుతాయి.
రామకృపేనే లాధలో బుద్ధి | హళూచ దూర టాకావీ ఉపాధీ | విసంబూ నయే తో చంచలధీ92 | పరమావధీ హోఈ తో | ||౨౦౩||
203. ఆ చంచల స్వభావంగల ప్రాణిని చివరిదాక నమ్మకుండా, రాముని దయవలన, నా కండువాను మెల్లగా దూరంగా పడివేయాలని, నాకు బుద్ధి పుట్టింది.
హోతే జే ఉపరణే పాంఘురలే | హళూచ దోబాజూ సాంవరిలే | ఆంత వించూస దృఢ గుండిలే93 | నేఊని పసరిలే బాగేంత | ||౨౦౪||
204. పైన వేసుకున్న కండువాను, మెల్లగా రెండు కొనలూ పట్టుకుని, దానిలో తేలును బాగా గట్టిగా మూట కట్టి, తోటలోకి తీసుకుని వెళ్ళి, జారవిడిచాను.
వించూ జాత్యాచ భయంకర | వేళీ జాఈలహీ జాతీవర | భయ ఖరే పరీ బాబాంచీ ఆజ్ఞాహీ సధర | మారావయా కర ధజేనా | ||౨౦౫||
205. తన జాతి వలన, తేలు చాలా భయంకరమైనది. అవకాశం దొరికితే, దాని జాతి, స్వభావం కారణంగా కుట్టుతుందేమో అని నా భయం. అయినా, బాబా ఆజ్ఞ బలీయమైనది గనుక తేలును చంపటానికి చేతులు రాలేదు.
యేథే శ్రోతియా సహజీ శంకా | వించూ ఘతకీ వధ్య నవ్హే కా | డంఖితా దేఈల కా తో సుఖా | మారూ నయే కా న కళే కీ | ||౨౦౬||
206. శ్రోతలకు ఇక్కడ ఒక సందేహం కలగటం సహజం. తేలు నమ్మదగినది కాదు కదా, మరి దానిని ఎందుకు చంపకూడదు? అది కుట్టితే, సుఖంగా ఉంటుందా? ఎందుకు దానిని చంప కూడదో, అర్థం కాదు!
సర్ప వించూ విషారీ ప్రాణీ | నుపేక్షీ తయా కదా కోణీ | బాబా కాయ తయా లాగోని | ద్యావే సోడూని మ్హణతీల | ||౨౦౭||
207. పాములు, తేళ్ళు వంటి విష ప్రాణులను, ఎవరూ, ఎప్పుడూ వదల కూడదు. మరి బాబా ఎందుకు వానిని విడిచి పెట్టాలని అన్నారు?
శ్రోతియాంచీ శంకా ఖరీ | మాఝీహీ హోతీ తీచ పరీ | పరీ పూర్వీల ఏసియా ప్రసంగాభీతరీ | పరిసా వైఖరీ బాబాంచీ | ||౨౦౮||
208. శ్రోతల అనుమానం నిజమే. నాకూ అలాగే అనిపించేది. కాని ఇలాంటి సమయాలలో, బాబా ఇంతకు మునుపు చెప్పిన మాటలను, వినండి.
ప్రశ్న హోతా యాహూన బికట | శిరడీంత కాకాంచే వాడియా ప్రకట | ఎకదా మాడీవర ఖిడకీ నికట | విఖార బికట ఆఢళలా | ||౨౦౯||
209. ఇంతకంటే అపాయమైన సమయం ఇంకొకటి ఉంది. ఒక సారి, శిరిడీలో కాకా దీక్షితు ఇంట్లో, మేడపైన కిటికీ దగ్గర, ఒక భయంకరమైన పాము వచ్చి చేరింది.
చౌకటీతళీ ఛిద్రద్వారే | భీతరీ ప్రవేశ కేలా విఖారే | దిపలా దీపజ్యోతి నికరే | వేటోళే కరూని బైసలా | ||౨౧౦||
210. కిటికీ చట్రం కింద ఉన్న బొక్కలోనుంచి అది లోపలికి వచ్చింది. దీపం వెలుగుతో దాని కళ్ళు సరిగ్గా కనిపించకుండా, అక్కడే చుట్ట చుట్టుకుని కూర్చుంది.
దీపప్రకాశే జరీ దీపలా | మనుష్యాచ్యా చాహులే బుజలా |
గజబజ ఝాలీ తైసా చమకలా | క్షణైక ఉగలా రాహిలా | ||౨౧౧||
211. దీపం వెలుగుకు కొంత, మనుషుల సందడికి ఇంకొంత కలవర పడి, తరువాత అది ఊరికే ఉండిపోయింది.
మాగే న జాఈ పుఢే న యేఈ | ఖాలీవర కరీ డోఈ | మగ ఎకచి ఉడాలీ ఘాఈ | కైశా ఉపాయీ మారావా | ||౨౧౨||
212. వెనుకకూ పోదు, ముందుకూ రాదు. ఉత్తినే, పడగను కిందకూ, పైకి కదుల్చుతూ ఉంది. దానిని ఎలా చంపాలి అని అందరూ ఒకటే గోల పెడుతున్నారు.
కోణీ బడగా కోణీ కాఠీ | ఘేఊని ఆలే ఉఠాఉఠీ | జాగా సాంకడ తయాసాఠీ | బహుత కష్టీ జాహలే | ||౨౧౩||
213. ఒకరు బడితెను, ఒకరు కర్రను పట్టుకుని పరుగున వచ్చారు. వాటితో దానిని కొట్టడానికి చోటు ఇరుకుగా ఉన్నందున, చాలా కష్టం కలిగింది.
సహజ మారితా ఎక సరపటీ94 | ఆణీ ఉతరతా భింతీ తళవటీ | ప్రథమ గాంఠితా మాఝీచ వళకటీ95 | మహత్సంకటీ టాకితా | ||౨౧౪||
214. దాని స్వభావంతో అది ప్రాకుతూ, గోడ పైనుండి కిందికి దిగి ఉంటే, మొదట నా పరుపు చుట్ట దగ్గరకు వచ్చి ఉండేది. అప్పుడు నేను ఘోరమైన అపాయంలో చిక్కుకునే వాణ్ణి.
లాగలా వర్మీ తరీ తో ఘావ | చుకతా డంఖ ధరితా అపావ | బత్తీ ఆణూని లక్షితీ ఠావ | తంవ త్యా వావ96 సాంపడలా | ||౨౧౫||
215. దాని దేహంయొక్క రహస్య భాగాలపై దెబ్బ పడితే, అది దెబ్బ తప్పించుకుని ఉంటే, పగతో అది అపాయాన్ని కలిగించేది. దీపాన్ని దగ్గరకు తెచ్చి, అది ఉన్న చోటును చూస్తుంటే, అది మెల్లగా తప్పించుకుంది.
త్యాచీ ఆలీ నవ్హతీ వేళ | ఆమ్హా సకళాంచే దైవహీ సబళ | హోతీ జరీ తీ కాళవేళ | కేలా ప్రతిపాళ బాబాంనీ | ||౨౧౬||
216. దానికి పోయే కాలం రాలేదు. మా అందరి అదృష్టం కూడా బాగుంది. అంతటి భయంకరమైన, అపాయమైన సమయంలో కూడా, బాబా మమ్మల్ని రక్షించారు.
ఆల్యా మార్గే కరూని త్వరా | నిఘూన గేలా తో ఝరఝరా | స్వయే నిర్భయ నిర్భయ ఇతరా | సుఖ పరస్పరా వాటలే | ||౨౧౭||
217. ఆ పాము చరచరా తాను వచ్చిన దారినే వెళ్ళిపోయింది. దానికి, ఇతరులకూ భయం తప్పింది. మా అందరి మనసుకు నెమ్మది, సుఖం కలిగింది.
మగ ముక్తారామ97 ఉఠలా | మ్హణే బిచారా బరా సుటలా | నసతా త్యా ఛిద్రాద్వారే నిసటలా | హోతా ముకలా ప్రాణాలా | ||౨౧౮||
218. అప్పుడు ముక్తారాం లేచి, ‘పాపం! పాము తప్పించుకుని పారి పోయింది గనుక, బ్రతికి పోయింది. ఆ బొక్కలోంచి వెళ్ళి ఉండక పోతే, దాని ప్రాణం పోయేది’ అని అన్నాడు.
ముక్తారామాచీ దయార్ద్ర దృష్టీ | పాహోని ఝాలో మీ మనీ కష్టీ | కాయ కామాచీ దయా దృష్టీ98 | చాలేల సృష్టీ కైసేనీ | ||౨౧౯||
219. అతని దయగల మాటలు నా మనసుకు బాధ కలిగించింది. విష జంతువుల పైన దయ ఎందుకు? ఇలా అయితే, ఈ సృష్టిలో పనులెలా సాగుతాయి?
ముక్తారామ యే కదాకాళీ99 | ఆమ్హీ బసూ తై సాంజ సకాళీ | మాఝీ తో వళకటీ ఖిడకీ జవళ | మజ తే బోలీ నావడలీ | ||౨౨౦||
220. ముక్తారాం అక్కడికి అప్పుడప్పుడు వస్తాడు, కాని మేము రోజూ తెల్లవారి, సాయంత్రం అక్కడే కూర్చుంటాం. నా పరుపు చుట్ట కిటికీకి మరీ దగ్గరగా ఉండటంతో, అతని మాట నాకు అసలు నచ్చలేదు.
పూర్వపక్ష త్యానే కేలా | ఉత్తరపక్ష మ్యా ఉచలిలా |
ఎకచి వాద మాతూన రాహిలా | నిర్ణయ ఠేలా100 తైసాచ | ||౨౨౧||
221. అతడు మునుపు పాము మీద దయ చూపుతూ, ఒక మాట అన్నాడు. నేను దానిని ఖండిస్తూ మాట్లాడాను. ఒకటే వాదోపవాదాలు. ఇద్దరి మధ్య చర్చలు బాగానే సాగాయి. కాని, ఏ నిర్ణయానికీ రాలేదు.
ఎక మ్హణే సర్ప మారావా | క్షణ ఎకహీ న ఉపేక్షావా | దుజా మ్హణే నిరపరాధ జీవా | కా దుష్టావా కరావా | ||౨౨౨||
222. పామును చంపాలి, క్షణం కూడా వదిలి పెట్టరాదని ఒకరు అన్నారు. ఏ నేరమూ చేయని జీవిని ఎందుకు హింసించాలి అని ఇంకొకరు అన్నారు.
ఎక ముక్తారామాచా ధిఃకార | ఎక మాఝా పురస్కార | వాద బళవలా పరస్పర | అంతపార యేఈనా | ||౨౨౩||
223. ఒకరు ముక్తారాం మాటలను వ్యతిరేకించి, నా మాటలను సమర్థించారు. అలా ఒకరికొకరిలో వాదన బాగా పెరిగింది. కాని, చివరకు ఏమీ తేలలేదు.
గేలే ముక్తారామ ఖాలీ | మ్యా ఆపులీ జాగా బదలలీ | ఛిద్రాస ఎక గుడదీ బసవిలీ | వళకటీ పసరలీ నిజావయా | ||౨౨౪||
224. ముక్తారాం కిందికి వెళ్ళిపోయాడు. నేను నా చోటును మార్చాను. కిటికీ బొక్కకి ఒక చెక్క ముక్కను కొట్టి, పడుకోవటానికి పక్క బట్టలు పరచుకున్నాను.
డోళే లాగలే పేంగావయా | మండళీ గేలీ నిజావయా | మీహీ దేఊ లాగలో జాంభయా | వాద ఆపసయా101 థాంబలా | ||౨౨౫||
225. నిద్రతో కళ్ళు మూతలు పడుతున్నాయి. భక్తులు నిద్రపోవటానికి వెళ్ళిపోయారు. నేను ఆవులించ సాగాను. వాదన దానంతట అదే ఆగిపోయింది.
రాత్ర సరలీ ఉజాడలే | శౌచ ముఖమార్జన ఆటోపలే | బాబా లేండీవరూన పరతలే | లోక జమలే మశీదీ | ||౨౨౬||
226. అలా ఆ రాత్రి గడిచి, తెల్లవారింది. లేచి, తెల్లవారి చేసే పనులను ముగించుకుని, ముఖం కడుక్కున్నాను. లెండీనుండి బాబా తిరిగి వచ్చారు. మసీదులో జనం గుమిగూడారు.
నిత్యాప్రమాణే ప్రాతఃకాళీ | ఆలో మశీదీస నిత్యాచే వేళీ | ముక్తారామాది సర్వ మండళీ | ఆలీ బసలీ స్వస్థానీ | ||౨౨౭||
227. ఎప్పటిలాగే, పొద్దున్నే మసీదుకు వెళ్ళాను. ముక్తారాం మొదలైన భక్తులు వచ్చి, వారి వారి చోట్లలో కూర్చున్నారు.
కోణీ హాతావర తమాఖూ చురితీ | కోణీ బాబాంచీ చిలీమ భరితీ | కోణీ తై హాతపాయ దాబితీ | సేవా యే రీతీ చాలలీ | ||౨౨౮||
228. ఒకరు చేతిలో పొగాకును నలుపుతున్నారు. ఇంకొకరు బాబాయొక్క చిలుం గొట్టాన్ని నింపుతున్నారు. ఒకరు బాబా పాదాలను, చేతులను పట్టుతున్నారు. ఇలా అందరూ బాబా సేవ చేస్తున్నారు.
బాబా జాణతీ సకళాంచ్యా వృత్తీ | మగ తే హళూచ ప్రశ్న పుసతీ | వాదావాదీ తీ కాయ హోతీ | తీ గతరాతీ వాడ్యాంత | ||౨౨౯||
229. బాబాకు అందరి స్వభావాలూ తెలుసు. అందుకే మెల్లగా, “పోయిన రాత్రి, వాడాలో దేని గురించి వాదోపవాదాలు జరిగాయి?” అని అడిగారు.
మగ మీ జే జే జైసే ఘడలే | తైసే తైసే బాబాంస కథిలే | మారావే వా న మారావే పుసిలే | సర్పాస వాహిలే యే స్థితీ | ||౨౩౦||
230. జరిగినదంతా నేను బాబాతో చెప్పాను. ‘ఇలాంటప్పుడు, పాములను చంపాలా, చంపకూడదా?’ అని అడిగాను.
బాబాంచీ తో ఎకచి పరీ | సర్ప వించూ ఝాలే తరీ |
ఈశ్వర నాందే సర్వాంభీతరీ | ప్రేమచి ధరీ సర్వార్థీ | ||౨౩౧||
231. బాబా ఒక్కటే చెప్పారు. “పామైనా, తేలైనా, అన్నింటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. అందుకే అన్నింటినీ ప్రేమించాలి.
ఈశ్వర జగాచా సూత్రధారీ | తయాచ్యా ఆజ్ఞేత వర్తతీ సారీ | హో కా విఖార వించూ తరీ | ఆజ్ఞేబాహేరీ వర్తేనా | ||౨౩౨||
232. “సూత్రాలను పట్టుకుని ఈ జగత్తు నడిపించేవాడు ఆ ఈశ్వరుడే. ఆయన ఆజ్ఞ ప్రకారమే అన్ని జీవులూ నడుచుకుంటాయి. పాముకాని, తేలు కాని, ఈశ్వరుని ఆజ్ఞకు విరోధంగా నడుచుకోలేవు.
మ్హణవూని ప్రాణిమాత్రావరీ | ప్రేమ ఆణి దయాచ కరీ | సోడీ సాహస ధరీ సబూరీ | రక్షితా శ్రీహరీ సకళాంతే | ||౨౩౩||
233. “అందుకే అన్ని ప్రాణులను ప్రేమతో, దయతో చూడండి. సాహసాన్ని వదిలి, సహనాన్ని వహించండి. శ్రీహరి అందరినీ రక్షిస్తాడు” అని చెప్పారు.
యేణే పరీ కితీశా కథా | సాఈ బాబాంచ్యా యేతీల సాంగతా | మ్హణవూన యాంతీల సారచి తత్త్వతా | నివడూని శ్రోతా ఘ్యావే కీ | ||౨౩౪||
234. ఈ విధంగా ఎన్నని సాయి బాబాయొక్క కథలను చెప్పగలం? అందుకే శ్రోతలు విని, ఆ కథలలోని భావాన్ని గ్రహించాలి.
పుఢీల అధ్యాయ యాహూన గోడ | భక్తి శ్రద్ధేచీ తీ జోడ | భక్త దీక్షిత102 ప్రసంగ అవఘడ | నిఘతీల బోకడ మారావయా | ||౨౩౫||
235. భక్తి శ్రద్ధలతో కూడుకున్న తరువాతి అధ్యాయం, ఇంతకంటే మధురమైనది. విపరీతమైన కష్ట పరిస్థితిలో, బాబా ఆజ్ఞ ప్రకారం, భక్త దీక్షితు ఒక మేకను చంపటానికి సిద్ధపడతాడు.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | అపమృత్యు నివారణం నామ |
| ద్వావింశోధ్యాయః సంపూర్ణః |
||శ్రీసద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ:
1. థోడా అంధార వ థోడా ప్రకాశ అశా స్థితీతలా. (౩ అల్పాంధారీంచా) 2. ఆపల్యా ఆపణ. (౩ ఆపాప)
3. జనితా, ఉత్పాదక. (౩ బాప) 4. సర్ప. (౬ విఖార)
5. తుఝ్యా వృత్తీచ్యా ఆనందాచా ప్రభావ. (౭ వృత్త్యానందప్రభావ) 6. యాసాఠీ. (౮ ఏశియాస్తవ)
7. స్తుతీ. (౮ స్తవ) 8. ఖరే. (౮ వాస్తవ) 9. పంధరావీ తిథీ, అమావాస్యా. (౧౩ పంచదశీ)
10. వాణీనే. (౨౩ నిజవాణీ) 11. పాయాంచ్యా అంగఠ్యావర. (౨౪ అంగుష్ఠీ)
12. మధలే బోట. (౨౪ మధ్యమా) 13. దోన్హీ. (౨౪ ఉభయ) 14. స్వాభావిక. (౩౦ నైసర్గిక)
15. రాగావణే. (౩౨ కాతావణే) 16. సాఈసమర్థాంచే ఆచరణ. (౩౪ సాఈసమర్థాచరిత)
17. మన, బుద్ధీ వ వాణీ యాంచ్యా శక్తీపలీకడీల. (౩౪ మనోబుద్ధివాచాతీత)
18. మాప కరణారా. (౩౬ మాపారా)
19. మాధవరావ దేశపాండే అథవా బాబాంచా శామా. (౪౪ మాధవరావహీ)
20. చాంగలే లక్ష దేణార్యాంనీ. (౪౪ అవధానశీళీ) 21. ఉపాయాసహ. (౪౫ సోపాయ)
22. హీచ మశీద. (౪౭ హీచ) 23. సంకట, జడభారీ. (౫౦ బేడా)
24. విసావలా. (౫౦ పహుడలా) 25. చఢలా. (౫౦ ఆరూఢలా) 26. అంగారా, ఉదీ. (౫౧ విభూతి)
27. సర్ప. (౫౨ లాంబ) 28. కరామత. (౫౪ కేలే) 29. ఉగీ రాహూన. (౫౪ ఉగలే)
30. హా గావ శిరడీహూన గాడీమార్గానే తేరా మైల ఆహే. (౫౭ చిథళీస)
31. త్రాస, తసదీ. (౬౨ జోజార) 32. యోగ్య. (౬౫ విహిత) 33. సంశయాత పడలే. (౬౬ శంకలే)
34. పరవానగీ. (౬౭ అనుజ్ఞా) 35. అవిశ్వాసీ, శ్రద్ధావిహీన. (౭౨ టవాళూ)
36. వరిష్ఠ ఆఫిసచే లోక. (౭౪ హుజూరవాలే) 37. వర్తమానపత్ర. (౭౭ వృత్తపత్ర)
38. గుంగ ఝాలే. (౭౭ లోధలే) 39. భయంకర వేళేస. (౭౮ కాళవేళే) 40. నిర్భయపణే. (౭౯ నిర్ఘోర)
41. హళూహళూ. (౮౦ ఓజే) 42. జరా. (౮౨ జూజ) 43. లాంబబువా. (౮౨ లంబూమహారాజ)
44. మూర్తిమంత అనర్థ. (౮౬ తీ) 45. డబడబలే. (౮౮ తరతరలే) 46. అతిశయచ. (౮౮ అతితర)
47. వాఈట. (౯౧ ఓఖటీ) 48. యా నావాచా శ్రీ బుట్టీంచా శిపాఈ. (౧౦౦ లహూన)
49. ఎకే దివశీ యాచ మాధవరావ దేశపాండ్యాంనా తే శిరడీస అసతా సాప చావలా. జవళచ ఎక విరోబాచే స్థాన ఆహే వ సాప చావలేల్యా మాణసాస తేథే నేఊన టాకలే మ్హణజే తో బరా హోతో అసా తేథీల లోకాంచా సమజ వ అనుభవహీ ఆహే. త్యాప్రమాణే త్యాంనా పుష్కళ మండళీంనీ తేథే జాణ్యావిషయీ ఆగ్రహ కేలా. త్యాంనీ, 'మహారాజాంచీ ఆజ్ఞా హోఈల తసే కరూ’ అసే ఉత్తర దిలే వ మహారాజాంకడే గేలే. మహారాజాంనీ మాధవరావ ఖాలీ అసతాచ ’వర చఢూ నకో’ అశీ మోఠ్యానే ఆజ్ఞా కేలీ. మాధవరావ, తీ స్వతఃలాచ ఆజ్ఞా ఆహే, అసే సమజూన, వర చఢలే నాహీత; పణ తీ ఆజ్ఞా త్యాంనా నసూన సర్పాచ్యా విషాలా అసావీ అసే వాటతే; కారణ తే విష జే చఢత చాలలే హోతే తే త్యా క్షణాపాసూన వర చఢలే నాహీ. మగ పుఢే హళూహళూ మాధవరావ మహారాజాంచ్యా కృపేనే కాహీ ఉపచార న కరితా బరే ఝాలే. యావిషయీ దృష్టాంత త్యాంనా ఎక వర్ష ఆగాఊ ఝాలా హోతా. (౧౦౫ వర్ణన)
50. దుసరీ కథా. (౧౦౬ కథాంతర)
51. అజ్ఞాతవాస. (౧౧౦ అజ్ఞాత)
52. సంకటే. (౧౧౦ అపాయీ, ౧౧౦ అపాయచి)
53. జో కోణీ మాగేల త్యా దుసర్యాలా. (౧౧౧ మాగత్యా) 54. అలంకార. (౧౧౨ లేణే) 55. వస్తీచే స్థాన. (౧౧౬ వసతీ) 56. ఫార జునీ. (౧౧౮ మలికంబరీ)
57. సర్పాంనీ. (౧౧౮ విఖారీ) 58. మహావ్యాధీచే వ రక్తపితీచే రోగీ. (౧౧౯ కుష్టీ)
59. చింతా. (౧౨౧ ఘోళ) 60. బాబాంచా శబ్ద హేచ ఔషధ. (౧౨౨ వచన)
61. విచార. (౧౨౩ తోల) 62. సంశయాత్మక. (౧౨౪ వికల్పాస్పద) 63. ఔషధ. (౧౨౪ అగద)
64. సుఖ దేణారే. (౧౨౪ సుఖద) 65. బిఛానా. (౧౨౫ బిస్తరా) 66. ఉలట. (౧౨౬ విపరీత)
67. సాయంకాళచ్యా ఫేరీచ్యా వేళీ. (౧౨౯ సాంజ) 68. సకాళీ భిక్షేస నిఘతానా. (౧౨౯ సకాళా)
69. ఎక దివసాఆడ బాబా చావడీత జాత వ తేథేచ పూజా-ఆరతీ హోఊన నిజత వ దుసర్యా దివశీ ప్రాతఃకాళీ మశీదీత పరత జాత తేవ్హా. (౧౨౯ దోనీ)
70. దిశాంస అభివందన కరణ్యాత. (౧౩౧ దిగ్వందనీ)
71. త్యా ఫకిరాచా దేహ. (౧౪౦ కాయా)
72. ఎకదమ. (౧౪౩ సకృద్దర్శినీ) 73. తీ హకీకత ఖరీ మ్హణూన అమీరవర కోణ విశ్వాస ఠేవణార? (౧౪౩ నిర్ధారీ)
74. ఆదికారణ, ఖరే కారణ. (౧౪౫ ఆదీ) 75. పేటతీ. (౧౫౬ తేవతీ)
76. ఓరడూ లాగలే. (౧౫౯ ఆక్రందత) 77. భూత. (౧౫౯ వివశీ) 78. మోఠ్యానే. (౧౬౦ ఆక్రందే)
79. హాతాతలా లహాన దండుకా. (౧౬౨ సటక్యానే) 80. గడబడ. (౧౬౩ కహర)
81. సర్ప. (౧౬౪ విఖార) 82. హాలతా. (౧౬౭ విళవిళతా) 83. అధిష్ఠాన. (౧౭౬ ఠాయ)
84. నిత్య. (౧౮౩ నిత) 85. భావార్థ రామాయణ (ఎకనాథమహారాజకృత). (౧౮౩ రామాయణ)
86. భాగ్యవానాచ్యా. (౧౮౭ సభాగ్యాచే) 87. రామాయణాతీల ఎక కథా. (౧౯౨ చాలలీ)
88. వాయూ. (౧౯౩ పితా) 89. కథారసాచీ గోడీ. (౧౯౬ రససుఖాడీ) 90. దేతా. (౨౦౦ వితరితా)
91. ప్రభావ. (౨౦౨ గరిమా) 92. చంచల బుద్ధీచా ప్రాణీ. (౨౦౩ చంచలధీ)
93. గుండాళిలే. (౨౦౪ గుండిలే) 94. సరపటణే. (౨౧౪ సరపటీ) 95. బిఛాన్యాచీ వళకటీ. (౨౧౪ వళకటీ)
96. జాగా. (౨౧౫ వావ) 97. యా నావాచా బాబాంచా ఎక భక్త హోతా. (౨౧౮ ముక్తారామ)
98. దుష్ట ప్రాణ్యాంచ్యా సంబంధీ. (౨౧౯ దుష్టీ) 99. కధీతరీ. (౨౨౦ కదాకాళీ)
100. రాహిలా. (౨౨౧ ఠేలా) 101. ఆపోఆప. (౨౨౫ ఆపసయా) 102. శ్రీ. హరీ సీతారామ దీక్షిత. (౨౩౫ దీక్షిత)
No comments:
Post a Comment