Saturday, April 27, 2013

||వినోదవిలసితం నామ చతుర్వింశతితమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౨౪ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

గతాధ్యాయాంతీ దిధలే వచన | సాఈనాథ గురుకరుణాఘన | 
థట్టామస్కరీంతహీ దేతీ శికవణ | కైశీ తీ కథన కరితో మీ | ||౧|| 
1. పోయిన అధ్యాయంలో చెప్పిన నా మాట ప్రకారం, కరుణామయులైన సాయి సద్గురువు హాస్యాలతో, వినోదాలతో కూడా ఎలా బోధించేవారో ఇప్పుడు చెప్తాను.
కథన కరితో హా అహంకార | అసావే గురుపదీ నిరహంకార | 
తేణేంచీ కథేశీ పాఝర | ఫుటతో సాదర సేవావా | ||౨|| 
2. నేను చెప్పుతాను అని అనడం అహంకారం. గురు పాదాలలో అహంకారం లేకుండా ఉండాలి. అప్పుడే కథ చక్కగా సాగిపోతుంది. ఇక శ్రద్ధగా వినండి. 
నిత్య నిర్మల నిష్కల్మష | సాధు సజ్జన మహాపురుష | 
స్వచ్చ నిరభ్ర జైసే ఆకాశ | శుద్ధ నిర్దోష తైసే తే | ||౩|| 
3. సాధు సజ్జనులు మహాపురుషులు ఎప్పుడూ మబ్బులు లేని ఆకాశంలాగా స్వచ్ఛంగా, నిర్మలంగా, ఏ దోషమూ లేకుండా, శుద్ధంగా ఉంటారు. 
మహారాజ సాఈచే భజన | స్వార్థ ఆణి పరమార్థ సాధన | 
స్వస్వరూపీ అనుసంధాన | సమాధాన అంతరీ | ||౪|| 
4. సాయి మహారాజు భజన చేయడం లౌకికంగా, పరమార్థంగా బాగు పడడానికి సులభ సాధనం. అంతే కాక, ఆత్మయొక్క రూపాన్ని తెలుసుకోవడానికి సహాయ పడుతుంది. అందు వలన మనసుకు శాంతి కలుగుతుంది. 
జయా మనీ స్వహిత సాధణే | కథేసీ ఆదర ధరావా తేణే | 
సహజ పరమానంద భోగణే | సార్థక సాధణే జీవాచే | ||౫|| 
5. తమ హితాన్ని కోరుకునే వారు, ఈ కథలను శ్రద్ధగా వినాలి. దానితో సహజంగా పరమానందాన్ని అనుభవిస్తారు. జీవితం తరిస్తుంది. 
శ్రవణే లాభలే నిజ విశ్రాంతి | నిరసేల భవభయాచీ భ్రాంతి | 
హోఈల పరమానంద ప్రాప్తి | శ్రోతియా సద్గతి రోకడీ | ||౬|| 
6. ఈ కథలను వింటే, మనసుకు శాంతి కలిగి, సాంసారికమైన భయాలన్నీ తొలగి పోతాయి. పరమానందం కలుగుతుంది. విన్నవారికి తప్పక సద్గతి లభిస్తుంది. 
అంతరసాక్ష సాఈసమర్థ | పూర్ణ జాణే భక్తభావార్థ | 
సంపాదూని నిజకర్తవ్యార్థ | వచన నిర్ముక్త హోఈల | ||౭|| 
7. అంతర్‍జ్ఞాని అయిన సాయి సమర్థులు, తమ భక్తుల మనసులోని ఆలోచనలను పూర్తిగా తెలుసుకుంటారు. భక్తుల పట్ల వారికున్న బాధ్యతలను నెరవేర్చి, తమ మాటను నిలబెట్టుకుంటారు. 
బుద్ధిప్రేరక సాఈసమర్థ | తేచ వదవితీ నిజవచనార్థ | 
కథీన యథామతి తద్భావార్థ | స్వార్థ పరమార్థ సాధక | ||౮|| 
8. బుద్ధికి ప్రేరణనిచ్చే సాయి సమర్థులు, తమ మాటలను తామే తెలియ చేస్తారు. లౌకికంగా, పారమార్థికంగా మేలు చేసే ఆ మాటలను నా శక్తి కొలది చెప్పుతాను. 
నవ్హే అంధ నా రాతాంధళే | డోళే అసోన జన ఆంధళే | 
కేవళ యా దేహబుద్ధీచియా బళే | నిజ హిత న కళే తయాంతే | ||౯|| 
9. సహజంగా జనులు గుడ్డివారు కారు. రేచీకటి ఉన్న వారూ కారు. కాని, కేవలం దేహం మీద అభిమానం కొద్ది, వారు కళ్ళు ఉన్నా గుడ్డివారౌతారు. తమ మేలుని తెలుసుకోలేకున్నారు. 
దేహ తరీ హా ఆహే ఏసా | నాహీ క్షణాచాహీ భరంవసా | 
పసరితో మీ పదరపసా1 | క్షణైక రసా చాఖాయా | ||౧౦||
10. ఈ దేహం ఎలా ఉంది అంటే, ఒక్క క్షణం కూడా దీనిని నమ్మలేము. అందుకే, ఒక్క క్షణం, ఈ కథా రసాన్ని చవి చూడమని, చేతులు జోడించి, ప్రార్థిస్తున్నాను. 

థట్టావినోదీ సకళా ప్రీతి | బాబాంచీ తో అలౌకిక రీతి | 
థట్టేంతూనహీ సారచి ఠసవితీ | హితకారక తీ సకళాంనా | ||౧౧|| 
11. వినోదాలు, హాస్యం అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. బాబా పద్ధతి సామాన్యమైనది కాదు. హాస్యంలోనుండి కూడా, వారు అందరికీ మేలు చేసే బోధను చేసేవారు. 
జన థట్టేచ్యా నాదీ న భరతీ | పరీ బాబాంచ్యా థట్టేసీ లాంచావతీ | 
కధీ కీ ఆపులే వాట్యాస యేతీ | వాటచి పాహతీ ఆవడీనే | ||౧౨|| 
12. అదే ఎగతాళి అంటే, ఎవరూ ఎక్కువగా ఇష్ట పడరు. కాని, బాబా ఎగతాళి చేసే పద్ధతిని అందరూ కోరుకునేవారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆతురంగా ఎదురు చూసేవారు. 
థట్టా కోణాస బహుదా నావడే | పరీ హీ థట్టా పరమ ఆవడే | 
వరీ అభినయాచీ జోడ జంవ జోడే | కార్యచి రోకడే తై సాధే | ||౧౩|| 
13. ఎగతాళి అంటే ఎవరికీ ఇష్టం లేకున్నా, బాబా పద్ధతి వలన అందరూ ఇష్ట పడేవారు. తమ అభినయంతో, హావభావాలతో వారు చెప్పడం వలన, ఆ ఎగతాళి, దాని లక్ష్యాన్ని తప్పక సాధించేది. 
సహజ అభినయ అప్రయాస | సస్మిత వదన నయన విలాస | 
ఇహీ జవ థట్టేంత భరే రస | తియేచీ సురసతా అవర్ణ్య | ||౧౪|| 
14. వారి హాస్యం ఎప్పుడూ సహజంగా, కొత్తగా ఉండేది. నవ్వు ముఖంతో, కళ్ళను త్రిప్పుకుంటూ, మంచి అభినయంతో వారు చేసే హాస్యాన్ని వర్ణించటానికి సాధ్యం కాదు. 
ఆతా కథితో ఎక అనుభవ | కథా అల్పబోధ అభినవ | 
థట్టేపోటీ పరమార్థోద్భవ | శబ్దగౌరవ పరిసాతే | ||౧౫|| 
15. ఇప్పుడు ఒక కొత్తదైన, బోధను తెలియ చేసే, అనుభవాన్ని చెప్తాను. హాస్యంలోనుండి పరమార్థాన్ని పుట్టించే ఒక చిన్న ఉపదేశాన్నిచ్చిన, గొప్ప మాటలను శ్రద్ధగా వినండి. 
ఆఠవడ్యాచా ప్రతి రవివార | శిరడీస భరతో మోఠా బాజార | 
పాల దేఊని ఉఘడ్యావర | ఉదీమ వ్యాపార చాలతో | ||౧౬|| 
16. ప్రతి ఆదివారం, శిరిడీలో పెద్ద సంత జరుగుతుంది. ఆరు బయట డేరాలు వేయబడతాయి. వ్యాపారం జోరుగా సాగిపోతుంది. 
తేథేంచ మగ రస్త్యావర | భాజీపాల్యాచే పడతీ ఢిగార | 
తేలీ తాంబోళీ యాంచే సంభార | చవ్హాఠ్యావరీ బైసతీ | ||౧౭|| 
17. అక్కడే, దారి ప్రక్కన, కూరగాయల రాసులుంటాయి. నూనెలను, తమలపాకులను, వక్కలను, పొగాకు మొదలైనవి అన్నీ దారిలో కూర్చుని అమ్మేవారు. 
ఏశా త్యా ఎక రవివారీ | బాబాంచే పాశీ దోన ప్రహరీ | 
కరితా పాదసంవాహన కరీ | నవల పరీ వర్తలీ | ||౧౮|| 
18. అలాంటి ఒక ఆదివారం మధ్యాహ్నం, నేను బాబా దగ్గర కూర్చుని, వారి పాదాల సేవ చేస్తుండగా, ఒక వింత జరిగింది. 
తో దోన ప్రహరచా దరబార | నిత్యచి భరే బహుచికార | 
త్యాంత బాజార ఆణి రవివార | లోక అనివార లోటలే | ||౧౯|| 
19. అది మధ్యాహ్నం దర్బారు. ప్రతి రోజులాగే జనం కిక్కిరిసి ఉన్నారు. పైగా అప్పుడు ఆదివారం సంత. మసీదుకు చాలా మంది వచ్చి చేరారు. 
ఉజూ బాబాంచే సన్ముఖ బైసూన | వాంకవూనియా ఖాలీ మాన | 
కరీత హోతో మీ పాదసంవాహన | నామస్మరణ సమవేత | ||౨౦||
20. బాబా ఎదుట, వారి కుడి వైపున నేను తలవంచుకుని కూర్చుని, వారి నామాన్ని తలచుకుంటూ, వారి పాద సేవను చేస్తున్నాను. 

మాధవరావజీ వామభాగీ | వామనరావ దక్షిణాంగీ | 
శ్రీమంత2 బుట్టీ తయే జాగీ | సేవేలాగీ బసలేలే | ||౨౧|| 
21. బాబా ఎడమ ప్రక్కన మాధవరావు, కుడివైపు వామనరావు, శ్రీమంతుడైన బుట్టీ, తమ తమ చోట్లలో సేవ కొరకు ఎదురు చూస్తూ, కూర్చున్నారు.
కాకాహీ3 హోతే తేథేంచ బైసలే | తితక్యాంత మాధవరావ హంసలే | 
కా అణ్ణాసాహేబ హే యేథే కసలే | దాణే హే డసలే4 దిసతాతీ | ||౨౨|| 
22. కాకా కూడా అక్కడే కూర్చున్నాడు. అనుకోకుండా మాధవరావు నవ్వాడు. ‘ఏమిటి అణ్ణాసాహేబు! ఇక్కడ అతుక్కున్నట్టు కనిపిస్తున్న గింజలు ఎక్కడివి?’ 
ఏసే మ్హణూని కోటాచీ5 అస్తనీ | బోటానే స్పర్శతా మాధవరాయాంనీ | 
కోటాచియా వళీయాంమధూని6 | దాణే వరూని ఆఢళలే | ||౨౩|| 
23. అలా అంటూ, నా కోటు మడతలని మాధవరావు తన వ్రేలితో తాకగా, అతుక్కున్న గింజలు పైకి వచ్చాయి. 
తే కాయ మ్హణూన పాహూ జాతా | డావే కోపర లాంబ కరితా | 
ఫుటాణే దిసలే ఖాలీ గడబడతా | మండళీ టిపతా దేఖిలీ | ||౨౪|| 
24. ఎడమ మోచేయి చాచి, అవి ఏమిటా అని చూద్దును గదా, టపటపమని పుట్నాల పప్పు గింజలు కిందకు రాలాయి. భక్తులు వానిని ఏరటం చూచాను. 
టిపూన టిపూన గోళా కేలే | పాంచ పంచవిస ఫుటాణే భరలే | 
తేథేంచ థట్టేస కారణ ఉద్భవలే | ఏసే ఘడలే కైసేంనీ | ||౨౫|| 
25. అలా ఏరి పోగు చేసినవి పాతిక పుట్నాల పప్పు గింజల దాకా ఉన్నాయి. అప్పుడవి హాస్యానికి కారణమైంది. కాని, ఇది ఎలా జరిగింది? 
తర్కావరీ చాలలే తర్క | జో తో విచారాత ఝాలా గర్క | 
ఫుటాణ్యాంచా కోటాశీ సంపర్క | విస్మయ సమస్తా జాహలా | ||౨౬|| 
26. ఊహల మీద ఊహలు చేయసాగారు. పుట్నాల పప్పు గింజలు కోటులోకి ఎలా వెళ్ళాయి? అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. ప్రతియొక్కరూ వారి వారి ఆలోచనల్లోనే ఉన్నారు. 
ఖాకీ కోటాచ్యా వళ్యా త్యా కితీ | త్యాంత హే దాణే కైసే సామావతీ | 
ఆలేచ కోఠూని కైశా స్థితి | న కళే నిశ్చితీ కవణా హే | ||౨౭|| 
27. ఖాకీ కోటుకు ఎన్ని మడతలుంటాయి? ఆ మడతలలో ఈ గింజలు ఎలా అతుక్కుంటాయి? ఖచ్చితంగా ఎవరికీ తెలియ లేదు. 
కరీత అసతా పాదసంవాహన | లావూని నామీ అనుసంధాన | 
మధేంచ హే ఫుటాణ్యాంచే ఆఖ్యాన | కైసేని ఉత్పన్న జాహలే | ||౩౮|| 
28. నేను నామాన్ని జపిస్తూ, పాద సేవ చేస్తుండగా, ఈ పప్పు గింజల కథ ఎలా పుట్టుకొచ్చింది? 
ఇతుకా కాళ సేవేంత జాతా | కధీంచ కా నా పడలే హే తత్వతా | 
హా వేళ రాహిలే హీచ ఆశ్చర్యతా | సకళాంచ్యా చిత్తా వాటలీ | ||౨౯|| 
29. ఇంతకూ, ఎంతో సేపటినుండి, నేను బాబా సేవ చేస్తుండగా, ఈ గింజలు అంత సేపు అక్కడ ఎలా అతుక్కుని ఉన్నాయి? కిందకు రాలలేదేం? అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. 
కోఠూని ఫుటాణే తేథే ఆలే | వడియాంవరీ కైసే స్థిరావలే | 
జే తే ఆశ్చర్య కరూన రాహిలే | మగ బాబా వదలే తే పరిసా | ||౩౦||
30. ఈ గింజలు ఎక్కడినుండి అక్కడికి వచ్చాయి? కోటు మడతలలో ఎలా చేరుకున్నాయి? అని అందరూ ఆశ్చర్య పడుతుండగా, బాబా ఏమన్నారో వినండి. 

శిక్షణాచ్యా విలక్షణ పద్ధతీ | అనేకాంచ్యా అనేక అసతీ | 
బాబా జయాంచీ జైసీ గతి | శిక్షణ దేతీ త్యా తైసే | ||౩౧|| 
31. భక్తులకు బోధించే పద్ధతి ఎంతో వింతగా ఎన్నో రకాలుగా ఉంటాయి. వారి వారి గ్రహించే శక్తిని బట్టి, బాబా ఒక్కొక్కరికీ ఒక్కొక్క రీతిలో బోధించేవారు. 
పద్ధతీ విచిత్ర మహారాజాంచీ | సరణీ స్మరణీయ బహు మజేచీ | 
అన్యత్ర తైసీ దేఖిల్యా ఏకిల్యాచీ | నాహీ ప్రచీతీ మజప్రతీ | ||౩౨|| 
32. మహారాజు శిక్షణా పద్ధతి చాలా విచిత్రంగా ఉండేది. ఎంతో ఆసక్తికరంగా ఉండే ఆ పద్ధతి, ఎప్పుడూ గుర్తుంటుంది. నా అనుభవంలో అటువంటి దానిని కని విని ఎరుగను. 
మ్హణతీ “యాలా వాఈట ఖోడీ | ఎకేకటే ఖాణ్యాచీ గోడీ | 
ఆజ బాజారాచీ సాధూని ఘడీ | ఫుటాణే రగడీత హా ఆలా | ||౩౩|| 
33. “ఇతనికి, తను ఒక్కడే పదార్థాలను తినే చెడు అలవాటుంది. ఇవాళ సంత కదా! వెళ్ళి పుట్నాల పప్పు తిని వచ్చాడు. 
ఎకేకటే ఖాణే బరే నవ్హే | ఠావీ మలా త్యాచీ సవే | 
హేచ ఫుటాణే యాచే పురావే | ఉగా నవలావే కశాస” | ||౩౪|| 
34. “ఒక్కరే తినటం మంచిది కాదు. అతనికి ఈ అలవాటు ఉండటం నాకు తెలుసు. ఈ పుట్నాల పప్పే దానికి సాక్ష్యం. ఇందులో ఆశ్చర్యమేముంది? 
మగ మీ మ్హణే కోణా న దేతా | ఠావే న ఖాణే మాఝియా చిత్తా | 
తేథే యా ఖోడీచీ కైంచీ వార్తా | అంగీ చికటతా చికటేనా | ||౩౫|| 
35. అప్పుడు నేను, ‘ఎవ్వరికీ పెట్టకుండా తినటం నాకు తెలియదు. కనుక, ఈ చెడు అలవాటును నాకు అంటగట్టినా, అది నాకు వర్తించదు’. అని అన్నాను. 
బాబా మీ ఆజ హా వేళభర | పాహిలా నాహీ శిరడీచా బాజార | 
గేలోంచ తరీ ఫుటాణే ఘేణార | మగ ఖాణార హే పుఢేంచ | ||౩౬|| 
36. ‘బాబా! ఇంత వరకూ శిరిడీలోని సంతను నేను అసలు చూడనే లేదు. మరి అక్కడికి వెళ్ళితేనే గదా, పుట్నాల పప్పు కొని, తరువాత తినటం! 
అసేల త్యాసహీ అసో గోడీ | మాఝీ తో నాహీ ఏసీ ఖోడీ | 
దుజియా న దేతా ఆధీ థోడీ | వస్తు మీ తోండీ ఘాలీనా | ||౩౭|| 
37. ‘ఒకరే తినాలని ఎవరికైనా ఇష్టముంటే తినొచ్చుగాని, నాకు మాత్రం ఆ చెడు అలవాటు లేదు. ముందుగా ఎవరికైనా కొంచెం కూడా పెట్టకుండా, ఏ వస్తువునూ నేను నోట్లో వేసుకోను అని చెప్పాను. 
మగ బాబాంచీ పహా యుక్తి | కైసీ జడవితీ నిజపదీ భక్తి | 
ఏకోన హీ మాఝీ స్పష్టోక్తి | కాయ వదతీ లక్ష ద్యా | ||౩౮|| 
38. కాని, అప్పుడు భక్తుల నమ్మకాన్ని యుక్తిగా బాబా తమ వైపు ఎలా స్థిర పరుస్తారో గమనించండి. నా మాటలను విని ఏమన్నారో వినండి. 
“సన్నిధ అసేల తయాస దేసీ | నసల్యాస తూ తరీ కాయ కరిసీ | 
మీ తరీ కాయ కరావే త్యాసీ | ఆఠవతోసీ కాయ మజ | ||౩౯|| 
39. “ఎవరైనా దగ్గరుంటే వారికి ఇస్తావు. ఎవరూ లేకపోతే, నువ్వు మాత్రం ఏం చేయగలవు? నేను మాత్రం ఏం చేయగలను? అప్పుడు నేను గుర్తుకు వస్తానా? 
మీ నాహీ కా తుఝ్యా జవళ | దేతోస కాయ మజలా కవళ” | 
ఏసే ఫుటాణ్యాచే హే మిష కేవళ | తత్వ నిశ్చళ ఠసవిలే | ||౪౦||
40. “నేను నీ దగ్గర లేనా? నాకు ఒక్క మెదుకైనా అర్పిస్తున్నావా?” అని కేవలం పుట్నాల పప్పు నెపంతో, అసలు తత్వాన్ని, మనసులో నిలిచి పోయేటట్టు, చక్కగా బోధించారు. 

దేవతా7 ప్రాణ7 అగ్ని7 వంచన8 | వైశ్వదేవాంతీ అతిథి వర్జన | 
కరూని కరితీ జే పిండ పోషణ | మహద్దూషణ త్యా అన్నా | ||౪౧|| 
41. “ముందు దేవతలకు, పంచ ప్రాణాలకు, వైశ్వానర దేవతాగ్నికి అర్పించకుండా, అతిథికి కూడా పెట్టకుండా భోజనం చేస్తే, ఆ ఆహారం మహా దోషంతో కూడుకున్నది.
వాటేల హే లహాన తత్వ | వ్యవహారీ లావితా అతి మహత్వ | 
రసాస్వాదన తో ఉపలక్షణత్వ | పంచ విషయత్వ యా పోటీ | ||౪౨|| 
42. “చూడ్డానికి ఇది చాలా చిన్న సంగతిగా అనిపిస్తుంది, కాని, దీనిని రోజూ పాటిస్తే, గొప్ప మహిమగలదని తెలుస్తుంది. ఇది ఒక రుచిగురించి (నాలుక) చెప్పినా, మొత్తం ఐదు కర్మ ఇంద్రియాలకూ వర్తిస్తుంది. 
విషయీ జయాసీ హవ్యాస | పరమార్థ న ధరీ తయాచీ ఆస | 
తయాంవరీ9 జో ఘాలీల కాస | తయాచా దాస పరమార్థ | ||౪౩|| 
43. “ఇంద్రియాల కోరికలకు అలవాటు పడి, వాటికి దాసుడైన వాడు పరమార్థాన్ని సాధించ లేడు. ఆ ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకునే వానికి పరమార్థం దాసోహం అంటుంది”. 
“యదా పంచావ తిష్టంతే10” | యా మంత్రే జే శ్రుతి వదతే | 
తేంచ బాబా యా థట్టేచ్యా నిమిత్తే | దృఢ కరితే జాహలే | ||౪౪|| 
44. ‘యదా పంచావ తిష్ఠంతే’ అన్న శ్రుతి చెప్పిన మంత్రాన్నే బాబా హాస్యంతో కలిపి, మనకు నొక్కినొక్కి చెప్పారు. 
శబ్దస్పర్శరూపగంధ | యా చతుష్ట్యాచాహీ హాచ సంబంధ | 
కితీ బోధప్రద హా ప్రబంధ | కథానుబంధ బాబాంచా | ||౪౫|| 
45. శబ్ద (చెవులు), స్పర్శ (చర్మం), రూప (కళ్ళు), వాసన (ముక్కు), ఈ నాలుగింటితో సంబంధం కూడా ఇదే. బాబా చెప్పిన ఈ కథ ఎంతో బోధ, ఎంతో సమయానికి సరిగ్గా ఉంది కదూ! 
మనబుద్ధ్యాది ఇంద్రియగణ | కరూ ఆదరితా విషయసేవన | 
కరావే ఆధీ మాఝే స్మరణ | తై మజ సమర్పణ అంశాంశే | ||౪౬|| 
46. “మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలు వాటి కోరికలను తీర్చుకునేటప్పుడు, ముందుగా నన్ను తలచుకుని, తరువాత, కొద్ది కొద్దిగా నాకు సమర్పించండి. 
ఇంద్రియే విషయాంవీణ రాహతీ | హే తో న ఘడే కల్పాంతీ | 
తే విషయ జరీ గురుపదీ అర్పితీ | సహజీ ఆసక్తి రాహీల | ||౪౭|| 
47. “ఇంద్రియాలు కోరికలను అనుభవించకుండా ఉండటం అనేది, ఈ ప్రపంచం ఉన్నంత వరకు జరగదు. ఆ కోరికలను అనుభవించే మునుపు, గురు పాదాలకు అర్పిస్తే, సహజంగా ఆ కోరికలు తొలగిపోతాయి. 
కామ తరీ మద్విషయీంచ కామావే | కోప ఆల్యా మజవరీంచ కోపావే | 
అభిమాన దురాగ్రహ సమర్పావే | భక్తీ వహావే మత్పదీ | ||౪౮|| 
48. “దేని మీదైనా కోరిక కలిగితే, నా గురించే కోరుకోండి. కోపమొస్తే, నా పైనే కోపం తెచ్చుకోండి. అహంకారాన్ని, దురభిమానాన్ని, నాకు సమర్పించి, నా పాదాలయందు భక్తి కలిగి ఉండండి. 
కామ క్రోధ అభిమాన | వృత్తి జంవ ఉఠతీ కడకడూన | 
మీ ఎక లక్ష్య లక్షూన | మజవరీ నిక్షూన సోడావ్యా | ||౪౯|| 
49. “కామం, కోపం, అభిమానం ఈ గుణాలు మనసులో విపరీతంగా పెరిగినప్పుడు, వానిని నా వైపుకు మళ్ళించండి. 
క్రమే క్రమే యేణేపరీ | వృత్తి నికృంతన కరీల హరీ | 
మగ యా విఖారత్రయాచ్యా లహరీ | తో పరీహరీల గోవింద | ||౫౦||
50. “ఈ కామం, కోపం మరియు అభిమానం అనే విషంలాంటి మూడు అలలను ఈ విధంగా గోవిందుడు శాంత పరచి, క్రమక్రమంగా వాటిని శ్రీహరి తొలగిస్తాడు. 
    
కింబహునా హే వికార జాత | మత్స్వరూపీంచ లయ పావత | 
కింవా మద్రూపచి తే స్వయే హోత | విశ్రామత మత్పదీ | ||౫౧|| 
51. “నిజానికి, ఈ మనసులోని వికారాలు, నా రూపంలోనే కలిసిపోతాయి. లేదా, అవి నా రూపాన్నే పొందుతాయి. నా పాదాలయందే విశ్రమిస్తాయి. 
ఏసే హోతా అభ్యసన | వృత్తి స్వయేంచ హోతీ క్షీణ | 
కాలాంతరే సమూల నిర్మూలన | వృత్తిశూన్య మన హోఈ | ||౫౨|| 
52. “ఈ అలవాటుని క్రమం తప్పకుండా పాటిస్తే, మనసుయొక్క ఈ గుణాలు శాంతించి, కొంత కాలానికి నాశమైపోతాయి. మనసు అప్పుడు నిర్మలమౌతుంది. 
గురు అసే నిరంతర సంన్నిధీ | ఏసీ వాఢతా దృఢ బుద్ధీ | 
తయాస యా ఏసియా విధీ | విషయ న బాధీ కదాహీ | ||౫౩|| 
53. “గురువు ఎప్పుడూ మనతోనే ఉన్నారన్న సంగతి, బుద్ధికి నమ్మకం కలిగితే, ఇంద్రియాల కోరికలు ఈ రకంగా ఎప్పుడూ బాధించవు. 
జేథ హా సద్భావ ఠసలా | తేథేంచి భవబంధ ఉకలలా | 
విషయోవిషయీ గురు ప్రకటలా | విషయచి నటలా గురురూపే | ||౫౪|| 
54. “ఈ మంచి ఆలోచన మనసులో బాగా నాటుకుంటే చాలు, ఇక సంసారంతో ఉన్న బంధాలు విడిపోయినట్లే. కలిగే కోరికలన్నింటిలోనూ గురువే ఉంటారు. అలా ప్రతి ఇంద్రియ కోరికా గురువు రూపంలో ఉంటాయి”. 
యత్కించిత విషయ సేవనీ | బాబా ఆహేత సంన్నిధానీ | 
సేవ్యా సేవతా విచార మనీ | సకృద్దర్శనీ ఉఠేల | ||౫౫|| 
55. ఇంద్రియాల కోరికలను ఏ కాస్తైనా అనుభవిద్దాము అని అనిపిస్తే, బాబా అక్కడే ఉన్నారన్నది గుర్తుకు వచ్చి, అవి అనుభవించ తగినవా, తగనివా అన్న ఆలోచన మనసుకు కలుగుతుంది. 
అసేవ్య విషయ సహజచి సుటే | వ్యసనీ భక్తాచే వ్యసన తుటే | 
అసేవ్యార్థీ మనహీ విటే | వళవితా నేహటే11 హే వళణ | ||౫౬|| 
56. అనుభవించ తగనివి సహజంగా వదిలిపోతాయి. భక్తుని వ్యసనం తొలగిపోతుంది. దృఢమైన అభ్యాసంతో, అనుభవించ తగని వాటిమీద మనసు అసహ్యాన్ని పెంచుకుంటుంది. 
విషయ నియమనీ హోఈ సాదర | వేద త్యా నియమాచా ఆకర12
విషయ సేవీ మగ నియమానుసార | స్వేచ్చాచార వర్తనా | ||౫౭|| 
57. ఈ నియమాలన్నీ వేదాలలో ఉన్నాయి. వీని ప్రకారం, ఇంద్రియాల కోరికలను అనుభవించేవారు విచ్చలవిడిగా నడుచుకోరు. 
ఏసీ సవయీ లాగతా మనా | క్షీణ హోతీ విషయకల్పనా | 
 ఆవడీ ఉపజే గురుభజనా | శుద్ధజ్ఞానా అంకుర యే | ||౫౮|| 
58. “మనసుకు అలా అలవాటు చేయగా, ఇంద్రియ సుఖాల ఆలోచనలు తగ్గుతాయి. గురువుయొక్క ఆరాధనయందు ప్రీతి కలుగుతుంది. శుద్ధమైన జ్ఞానం మొలక ఎత్తుతుంది. 
శుద్ధ జ్ఞాన లాగతా వాఢీ | దేహబుద్ధీచీ తుటే బేడీ | 
తే బుద్ధీ దే అహంబ్రహ్మీ బుడీ | సుఖ నిర్వడీ మగ లాహే | ||౫౯|| 
59. “శుద్ధ జ్ఞానం పెరిగిన కొద్దీ, దేహంతో ఉన్న బంధం విడిపోతుంది. అప్పుడు ఆ బుద్ధి ‘అహం బ్రహ్మ’ అనే భావంలో లీనమై, పరమానందాన్ని అనుభవిస్తుంది. 
జరీ హా దేహ క్షణభంగుర దేఖ | తరీ హా పరమ పురుషార్థ సాధక | 
జో ప్రత్యక్ష మోక్షాహూన అధిక | కీ భక్తియోగప్రదాయక హా | ||౬౦||
60. “ఈ శరీరం క్షణం పాటే ఉండేదైనా, పరమ పురుషార్థాన్ని సాధించేది దీని వల్లనే. మోక్షం కంటే గొప్పదైన భక్తియోగాన్ని కలిగించేది కూడా ఈ శరీరమే. 

చారీ పురుషార్థాంచ్యావరీ | యా పంచమ పురుషార్థాచీ పాయరీ | 
కాంహీ న పావే యా యోగాచీ సరీ | అలౌకిక పరీ భక్తీచీ | ||౬౧|| 
61. “ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాల కంటే గొప్పది, ఐదవ పురుషార్థమైన భక్తియోగం. ప్రత్యేకమైన ఈ భక్తియోగానికి సమానమైనది వేరే ఏదీ లేదు.
గురు సేవేనే జో హోఈ కృతార్థ | తయా ఆకళే హే వర్మ యథార్థ | 
భక్తిజ్ఞాన వైరాగ్య స్వార్థ | తోచి పరమార్థ పావేల | ||౬౨|| 
62. “గురు సేవ చేసి జీవితంలో తృప్తిని పొందినవారికి, ఈ నిజాలు అర్థమౌతాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్యం వీటిలోనే వారి మేలు ఉందని తెలుసుకుంటారు. అలాంటి వారికే పరమార్థం లభిస్తుంది. 
గురు ఆణి దేవ యాంత | భేద పాహీ జయాచే చిత్త | 
తేణే అఖిల భాగవతాంత | నాహీంచ భగవంత దేఖిలా | ||౬౩|| 
63. “గురువు మరియు దేవుడు వేరు వేరు అనుకునే వారు, మొత్తం భాగవతం పారాయణం చేసినా, దేవుణ్ణి చూడలేరు. 
వాచిలే అఖిల రామాయణ | ఠావీ న రామాచీ సీతా కోణ | 
సాండునియా ద్వైతదర్శన | గురుదేవ అభిన్న జాణావే | ||౬౪|| 
64. “రామాయణమంతా చదివినా, రామునికి సీత ఏమౌతుందో తెలియక పోవడం లాంటిదే ఇది కూడా. వేరు వేరు భావాన్ని వదిలి, గురువు, దేవుడు ఒకటే అని తెలుసుకోవాలి. 
ఘడతా గురుసేవా నిర్మళ | హోఈల విషయవాసనా నిర్మూళ | 
చిత్త హోఈల శుద్ధ సోజ్వళ | స్వరూప ఉజ్వళ ప్రకటేల | ||౬౫|| 
65. “నిర్మలమైన మనసుతో గురు సేవ చేస్తే, ఇంద్రియాల కోరికలన్నీ నశిస్తాయి. మనసు పరిశుద్ధమై, వెలుగునిచ్చే నిజమైన ఆత్మ రూపం కనిపిస్తుంది”. అని చెప్పారు. 
అసో ఇచ్ఛాశక్తి హోతా ప్రబళ | ఫుటాణే బాబాంచే హాతచా మళ | 
యాహూన విలక్షణ కరితా ఖేళ | త్యా కాళవేళ లాగేనా | ||౬౬|| 
66. బాబా గట్టిగా తలుచుకుంటే, పుట్నాల పప్పును చూపించుట పెద్ద పనేం కాదు. ఇంతకంటే, విచిత్రమైన లీలలను చూపించిన వారికి, ఇది ఎంతో సమయం పట్టదు. 
కేవళ పోటాచియా ఓఢీ | ఏంద్రజాలీ లౌకిక గారోడీ | 
ఫిరవూన భారలీ హాడాచీ కాండీ | పదార్థ కాఢీ మానే13 తో | ||౬౭|| 
67. సాధారణమైన ఒక గారడీ చేసేవాడు, కేవలం పొట్ట నింపుకోవటం కోసం, ఎముకతో చేసిన మంత్రదండాన్ని తిప్పుతూ, కోరిన వస్తువును బయటికి తీస్తాడు. 
సాఈనాథ అలౌకిక గారోడీ | కాయ తయాంచ్యా ఖేళాచీ ప్రౌఢీ | 
ఇచ్ఛా హోతా న భరతా చిపడీ14 | ఫుటాణే కాఢీల అగణీత | ||౬౮|| 
68. అద్భుతమైన గారడీలు చేసే సాయినాథుని లీలలు, ఎంతో మహిమతో కూడుకున్నవి. తలుచుకున్నంత మాత్రమే, ఎన్నో లెక్కలేనన్ని పుట్నాల పప్పు గింజలను క్షణంలో పుట్టించగలరు. 
పరీ యా కథేచే సార కాయ | తేథేంచ ఆపణ ఘాలూ ఠాయ | 
పాంచా పోటీ కోణతాహీ విషయ | బాబాశివాయ సేవూ నయే | ||౬౯|| 
69. ఈ కథలోని నీతి ఏమిటి అని ఇప్పుడు ఆలోచిద్దాం. ఐదు ఇంద్రియాల సుఖాలలో ఏ ఒక్క దానినైనా, బాబాను తలచుకోకుండా అనుభవించరాదు. 
మనాస దేతా హీ శికవణ | వేళోవేళీ హోఈల ఆఠవణ | 
దేతా ఘేతా సాఈ చరణ | అనుసంధాన రాహీల | ||౭౦||
70. అని మనసుకు పాఠం నేర్పిస్తే, ఎప్పటికీ బాగా గుర్తుండి, ఇచ్చి పుచ్చుకునే ప్రతి సంగతులలో, సాయి పాదాలు ప్రతి మారూ గుర్తుకొస్తుంటాయి. 

హే శుద్ధ బ్రహ్మ సగుణ మూర్తి | నయనాసమోర రాహీల నిశ్చితీ | 
ఉపజేల భక్తి ముక్తి విరక్తి | పరమ ప్రాప్తీ లాధేల | ||౭౧|| 
71. సగుణ మూర్తియైన ఈ శుద్ధ బ్రహ్మ, కనుల ఎదుట ఉంటాడు. భక్తి, విరక్తి ముక్తి, కలిగి, అన్నింటికంటే ఉత్తమమైన స్థితి లభిస్తుంది. 
నయనీ దేఖతా సుందర ధ్యాన | హరేల సంసార భూక తహాన | 
హరపేల ఏహిక సుఖాచే భాన | మన సమాధాన పావేల | ||౭౨|| 
72. ఆ సుందర రూపాన్ని కళ్ళు ఎప్పుడూ చూస్తుంటే, సంసార సుఖాలు, ఆకలి, దప్పులు తొలగిపోతాయి. దేహంయొక్క సుఖాల కోరిక నశించి, మనసుకు తృప్తి, శాంతి కలుగుతుంది. 
ఓవీ నాఠవే ఆఠవూ జాతా | పరీ తీ ఆఠవే జాత్యావర బసతా | 
తైసీహీ చణకలీలా కథితా | సుదామకథా ఆఠవలీ | ||౭౩|| 
73. ఓవీలను గుర్తుకు తెచ్చుకుందామని ఎంత ప్రయత్నించినా, ఒక్క పదం కూడా గుర్తుకు రాదు. కాని, తిరగలి దగ్గర కూర్చున్నప్పుడు, వెంటనే గుర్తుకు వస్తుంది. అలాగే, ఈ పుట్నాల పప్పు లీల చెప్పుతుంటే, సుదాముని కథ గుర్తుకు వచ్చింది. 
ఎకదా రామ కృష్ణ సుదామా | సేవీత అసతా గుర్వాశ్రమా15
లాంకడే ఆణావయాచే కామా | కృష్ణ బలరామా పాఠవిలే | ||౭౪|| 
74. బలరాముడు, కృష్ణుడు మరియు సుదాముడు గురువు ఆశ్రమంలో గురువును సేవిస్తుండగా, ఎండు కర్రలను తేవటానికి బలరాముని, శ్రీకృష్ణుని ఒక సారి పంపారు. 
గురుపత్నీచియా నియోగే16 | కృష్ణ బలరామ అరణ్యమార్గే | 
నిఘాలే మాత్ర తో తయాంచ్యా మాగే | సుదామా సంగే పాఠవిలా | ||౭౫|| 
75. గురు పత్ని ఆజ్ఞాపించగా, కృష్ణుడు, బలరాముడు అడవికి వెళ్ళారు. వారు వెళ్ళిన కొద్ది క్షణాలకే, వారికి తోడుగా సుదాముని కూడా పంపారు. 
తయాపాశీ దిధలే చణే | క్షుధా లాగతా ఫిరతా అరణ్యే | 
తిఘాంహీ హే భక్షణ కరణే | గురుపత్నీనే ఆజ్ఞాపిలే | ||౭౬|| 
76. అడవిలో ఆకలి వేసినప్పుడు, ముగ్గురూ తినండని, గురు పత్ని సుదామునికి శనగలను ఇచ్చి పంపించింది. 
పుఢే రానాంత కృష్ణ భేటతా | “దాదా తహాన లాగలీ” మ్హణతా | 
ఫుటాణ్యాచీ వార్తా న కరితా | పరిసా వదతా ఝాలాతే | ||౭౭|| 
77. తరువాత, సుదాముడు కృష్ణుణ్ణి అడవిలో కలిశాడు. అప్పుడు కృష్ణుడు, ‘అన్నా! దాహం వేస్తూ ఉంది’ అని అన్నాడు. సుదాముడు శనగల గురించి చెప్పకుండా ఏమన్నాడో వినండి. 
అనశేపోటీ పాణీ న ప్యావే | మ్హణే సుదామా క్షణైక విసావే17
పరీ న వదే హే చణే ఖావే | కృష్ణ విసావే మాండీవర | ||౭౮|| 
78. ‘పరగడుపున ఎప్పుడూ నీరు తాగ కూడదు. కాసేపు విశ్రమించు’ అని అన్నాడే కాని, ‘ఈ శనగలను తిను’ అని అనలేదు. కృష్ణుడు సుదాముని ఒడిలో విశ్రమించాడు. 
పాహూన లాగలా కృష్ణాచా డోళా | సుదామా చణే ఖాఊ లాగలా | 
“దాదా కాయహో ఖాతా హా కసలా | ఆవాజ” వదలా కృష్ణ తదా | ||౭౯|| 
79. కృష్ణుని కళ్ళు మూత పడగానే, సుదాముడు శనగలను తినసాగాడు. ‘అన్నా! ఈ శబ్దం ఏమిటి? ఏం తింటున్నావు?’ అని కృష్ణుడు అడిగాడు. 
“కాయరే ఖాయా ఆహే యేథే | థండీనే ద్విజపంక్తీ18 థుడథుడతే | 
విష్ణు సహస్త్ర నామహీ ముఖాతే | స్పష్టోచ్చారితే యేఈనా | ||౮౦||
80. ‘ఏముందిరా ఇక్కడ తినడానికి? ఈ చలి వలన పళ్ళు పటపటమంటున్నాయి. విష్ణు సహస్ర నామాన్ని కూడా సరిగ్గా ఉచ్చరించ లేకుండా ఉన్నాను’ అని చెప్పాడు. 

ఏకూన హే సుదామ్యాచే ఉత్తర | సర్వసాక్షీ కృష్ణ పరాత్పర | 
మ్హణే మలాహీ స్వప్న ఖరోఖర | పడలే బరోబర తైసేంచ | ||౮౧|| 
81. సుదాముడు చెప్పిన జవాబు విని, అన్నీ తెలిసిన కృష్ణ పరమాత్మ, ‘ఔనా! సరిగ్గా, నాకు ఇలాంటి కలే వచ్చింది.
ఎకాచీ వస్తు దుజా ఖాతా | కాయ రే ఖాతోస ఏసా వదతా | 
ఖాఊ కాయ మాతీ తో మ్హణతా | వాణీ తథాస్తుతా19 ప్రకటలీ | ||౮౨|| 
82. ‘ఒకరి వస్తువును ఇంకొకరు తింటుండగా, ‘ఏమి తింటున్నావురా?’ అని అడిగితే, ‘ఏం తింటాను? మట్టి తప్ప’ అని బదులిచ్చాడు. దానికి మొదటివాడు ‘తథాస్తు’ అని అన్నాడు. అది నిజమైంది. 
అరే హే స్వప్నచి బరే దాదా | ఆపణ మజవీణ ఖాల కా కదా | 
ఖాతా కాయ హా ప్రశ్నహీ తదా | స్వప్నాచ్యా నాదాంత పుసియేలా | ||౮౩|| 
83. ‘అన్నా! ఇది ఒట్టి కలయే. నన్ను విడిచి, ఎప్పుడైనా నీవు తిన్నావా? నువ్వు ఏమి తింటున్నావు అని నేను అడిగినప్పుడు కూడా, నేను ఇంకా కలలోనే ఉన్నాను’ అని అన్నాడు. 
పూర్వాశ్రమీ సుదామజీలా | అసతీ ఠావీ కృష్ణలీలా | 
తరీ హా నసతా ప్రమాద ఘడలా | నసతా భోగిలా పరిణామ | ||౮౪|| 
84. కృష్ణుడి పూర్వాశ్రమం లీలల గురించి సుదామునికి తెలిసి ఉంటే, ఈ తప్పు చేసి, దాని పరిణామాన్ని అనుభవించి ఉండేవాడు కాదు. 
తో తరీ కాయ సాధారణ | అఠరా విశ్వే దరిద్ర్య ఘన | 
తరీ ఎకేకటే ఖాతీ తే జన | త్యాంనీ హే స్మరణ ఠేవావే | ||౮౫|| 
85. ఆ పరిణామం కూడా సామాన్యమైనదా? కానే కాదు! అతడు పరమ దారిద్ర్యానికి గురి అయ్యాడు. అందుకే, ఎవరికీ పెట్టకుండా తామే తినేవారు, దీనిని గుర్తుంచుకోవాలి. 
కృష్ణ పరమాత్మా జయాచా సఖా | ఏసా హా భక్త సుదామ్యాసారిఖా | 
నీతీస యత్కించిత హోతా పారఖా | పావలా ధోకా సంసారీ | ||౮౬|| 
86. శ్రీకృష్ణుని వంటి మిత్రుడున్నా, భక్తుడైన సుదామునికి, నియమంలో కొంచెం పొరపాటు కాగా, సంసారంలో చాలా బాధను అనుభవించాడు. 
తోచ స్వస్త్రీ కష్టార్జిత | ప్రేమే మూఠభర పోహే అర్పిత | 
కృష్ణ హోఊని ప్రసన్నచిత్త | ఏశ్వర్య తృప్తకరీ తయా | ||౮౭|| 
87. కాని, అదే సుదాముడు, తన భార్య కష్టపడి సంపాదించిన దానితో పిడికెడు అటుకులను, ప్రేమతో సమర్పించగా, కృష్ణుడు ఆనందించి, అతనికి ఐశ్వర్యాన్నిచ్చి, తృప్తి చెందేలా చేశాడు. 
అసో ఆతా ఆణిక ఎక | వార్తా కథితో బోధప్రదాయక | 
ఆధీ ఆనంద వినోద సుఖ | బోధ ప్రముఖ జీ అంతీ | ||౮౮|| 
88. ఇప్పుడు ఉపదేశంతో కూడుకున్న ఇంకొక కథను చెప్పుతాను. మొదట అది వినోదంగా ఉండి, ఆనందాన్ని కలిగించినా, చివర గొప్ప జ్ఞానాన్ని తెలియ చేస్తుంది. 
కోణాస ఆవడే పరమార్థ బోధ | కోణాస తర్కయుక్తి వాద | 
కోణాస ఆవడే థట్టా వినోద | ఆనందీ ఆనంద సకళాంతే | ||౮౯|| 
89. కొందరికి పరమార్థం గురించిన ఉపదేశం అంటే ఇష్టం. ఇంకొందరికి, తర్కం, యుక్తి, వాదం అంటే ఇష్టం. మరీ కొందరికి హాస్యం, వినోదం అంటే ఇష్టం. అలా అందరికీ ఆనందమే కావాలి. 
హీహీ హోతీ ఎక థట్టా | బాఈబువా పేటలే హట్టా | 
సాఈ దరబారీ మాజలా తంటా | తుటలా న బట్టా లాగతా | ||౯౦||
90. ఇది ఒక హాస్య కథ. ఒక ఆడమనిషికి మరియు ఒక ముసలాయనకి సాయి దర్బారులో తగువు వచ్చింది. ఎవరినీ కించ పరచకుండానే, ఆ తగువు తీర్చబడింది. 

హీహీ కథా పరమ సురస | శ్రోతయా ఆనందదాయీ బహువస | 
భక్త భాండతా అరస పరస | హాస్య రస పికేల | ||౯౧|| 
91. ఈ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రోతలకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తులిద్దరు తమలో తాము పొట్లాడుకుంటూ ఉంటే, అందరికీ ఎంతో హాస్యం కలిగింది. 
భక్త దామోదర ఘనశ్యామ20 | బాబరే జయాంచే ఉపనామ | 
అణ్ణా చించణీకర టోపణ నామ | ప్రేమ నిఃసీమ బాబాంచే | ||౯౨|| 
92. బాబరే అనే ఉపనామం కలిగిన దామోదర ఘనశ్యాం, సాయికి భక్తుడు. వానికి వాడుకలోనున్న పేరు అణ్ణా చించణీకరు అని. అతనికి బాబాపై విపారీతమైన ప్రేమ. 
స్వభావ మోఠా ఖరమరీత | కోణాచీహీ న ధరీత ముర్వత | 
ఉఘడ బోలణే విహితావిహిత | హితాహిత పాహతీ నా | ||౯౩|| 
93. మొరటు స్వభావం కలవాడు. ఎవరినీ లెఖ్ఖ చేసేవాడు కాదు. ఎదుటివారు బాధ పడతారా లేదా అని కూడా ఆలోచించకుండా, మంచి చెడు చూడకుండా, ఏ రకమైన మొహమాటమూ లేక, మాట్లాడేవాడు. 
వృత్తి అణ్ణాచీ జితకీ కడక | తితకీంచ సాలస ఆణి సాత్విక | 
మాథే జైసీ భరలేలీ బందూక | లావితా రంజూక భడకా ఘే | ||౯౪|| 
94. ఎంత కఠినంగా మాట్లాడినా, మోసం తెలియని వాడు, మంచివాడు మరియు సాత్వికుడు. కాని, నొక్కగానే పేలిపోయే గుళ్ళతో నిండిన తుపాకి, తలపై ఎప్పుడూ ఉన్నట్లుండేవాడు. 
సకళ కామీ తడకా ఫడకీ | ఉధారీచీ వార్తా న ఠాఉకీ | 
న ధరీ కుణాచీ భీడభాడ కీ | రోఖఠోకీ వ్యవహార | ||౯౫|| 
95. అన్ని పనులూ అప్పటికప్పుడు జరిగిపోవాలి. అరువు మాటేలేదు. ఎవరి దగ్గరా మొహమాటం లేకుండా, నిష్కర్షగా, తొందరగా వ్యవహారాలు చేసేవాడు. 
వేళీ ధరవేల విస్తవ హాతీ | అణ్ణా తయాహూన ప్రఖర అతి | 
పరీ హీ నిష్కపట స్వభావ జాతీ | తేణేంచ ప్రీతి బాబాంచీ | ||౯౬|| 
96. నిప్పునైనా చేతిలో పట్టుకోవచ్చుగాని, అణ్ణా మాత్రం అంతకంటే ఎక్కువగా మండి పడుతుండే వాడు. అమాయకుడు, మోసం అసలే తెలియని వాడు. అందుకే అతనంటే బాబాకు ప్రేమ. 
అసేచ ఎకదా దోనప్రహరీ | మశీదీంత భర దరబారీ | 
వామహస్త కఠడ్యావరీ | బైసలీ స్వారీ బాబాంచీ | ||౯౭|| 
97. ఒక సారి మధ్యాహ్నం, మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది. తమ ఎడమ చేతిని కటకటాల పైన వేసి, బాబా కూర్చున్నారు. 
బాబా పాహతీ తటస్థపణే | నకళత లావీత భక్తాంచీ భాండణే | 
సంపతా రాగావణే వా రూసణే | ఉభయా సమజావణే అఖేర | ||౯౮|| 
98. ఏమీ ఎరుగనట్లు, ఏదీ పట్టించుకోనట్లు కనిపించినా, భక్తులలో పోట్లాటను పెట్టి, కోపతాపాలను కలిగించి, అప్పుడు బాబా వారికి నచ్చ చెప్పుతుండే వారు. 
కోణీ బాబాంచీ కూస దాబీత | కోణీ పాదసంవాహన కరీత | 
కోణీ పాఠపోట చేపీత | సేవా కరీత యే రీతీ | ||౯౯|| 
99. కొందరు భక్తులు బాబా నడుం పట్టేవారు. ఇంకొందరు వారి పాదాలను పట్టేవారు. మరొకరు వారి వీపును, పొట్టను మర్దించే వారు. ఇలా ఏదో ఒక రీతిలో బాబా సేవ చేయాలనే కోరిక అందరికీ ఉండేది. 
బాబా బాలబ్రహ్మచారీ | ఊర్ధ్వరేతే శుద్ధాచారీ | 
కరూందేత సేవా చాకరీ | నరనారీ సమస్తా | ||౧౦౦||
100. బాల బ్రహ్మచారియైన, శుద్ధమైన నడత కలిగిన బాబా, ఆడవారిని, మగవారిని, అందరినీ సేవ చేయనిచ్చే వారు. 

అణ్ణా బాహెర ఓణవే రాహతీ | హళూహళూ వామహస్త దాబితీ | 
తో ఉజవే బాజూచీ పరిస్థితీ | స్వస్థ చిత్తీ ఏకావీ | ||౧౦౧|| 
101. బయట కటకటాల దగ్గర వంగి, బాబా ఎడమ చేతిని, అణ్ణా మెల్లమెల్లగా పట్టుతున్నాడు. కుడి వైపు పరిస్థితిని వినండి.
తికడే హోతీ ఎక బాఈ | అనన్య భక్త బాబాంచే పాయీ | 
బాబా జీస మ్హణత ఆఈ | మావశీబాఈ జన లోక | ||౧౦౨|| 
102. బాబా మీద విపరీతమైన భక్తిగల ఒక ఆడమనిషి అక్కడ ఉంది. బాబా ఆమెను ‘అమ్మా’ అని పిలిచేవారు. జనులు ‘పిన్నమ్మ’ అని పిలిచేవారు. 
మావశీబాఈ మ్హణత సర్వ | వేణూబాఈ మూళ నాంవ | 
కౌజలగీ హే ఆడనాంవ | అనుపమ భావ సాఈపదీ | ||౧౦౩|| 
103. పిన్ని అని అందరూ పిలిచినా, ఆమె అసలు పేరు వేణూబాయి. ఇంటి పేరు కౌజలగి అని. ఆమెకు సాయి పాదాల మీద విపరీతమైన ప్రేమ. 
అణ్ణాచీ ఉలటలీ పన్నాశీ | తోండాంత నవ్హతీ బత్తీశీ | 
పోక్త వయస్కరహీ తీ మావశీ | తంటా ఉభయాశీ ఉద్భవలా | ||౧౦౪|| 
104. అణ్ణాకు వయసు యాభై దాటింది. నోట్లో పళ్ళు లేవు. పిన్ని కూడా వయసు మళ్ళిందే. ఆ ఇద్దరికీ తగాదా వచ్చింది. 
అణ్ణా సహకుటుంబ కరీత సేవా | ఆఈ హోతీ విగతధవా | 
దాబితా బాబాంచే పోట కుసవా | నావరే నిఃశ్వాస21 తియేస | ||౧౦౫|| 
105. తన భార్యతో సహ అణ్ణా బాబాయొక్క సేవ చేస్తున్నాడు. పిన్ని విధవరాలు. బాబా పొట్టను బలంగా ఒత్తటంలో, ఆమెకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది. 
శ్రీసాఈ సేవేసీ సబళ | మావశీబాఈ మనాచీ నిర్మళ | 
ఉభయ హస్తీ ఘాలూనిపిళ | మాండలీ మళణీ పోటాచీ | ||౧౦౬|| 
106. ఆమె మనసు నిర్మలమైనది. సాయి సేవను చక్కగా చేస్తుంది. తన రెండు చేతులనూ కలిపి, బాబా పొట్టను బలంగా పిండి పిసికినట్లు పిసక సాగింది. 
పాఠీమాగూన నిరణావేరీ22 | ధరూని బాబాంస దోహీ కరీ | 
దాబదాబూని ఘుసళణ కరీ | జైసీ డేరీ23 తాకాచీ | ||౧౦౭|| 
107. వెనుకనుండి ముందు పొట్ట వరకు, రెండు చేతులతో, మజ్జిగ చిలుకుతున్నట్లు ఒత్త సాగింది. 
సాఈనామీ లావూని లయ | మావశీబాఈ దాబీ నిర్భయ | 
బాబాహీ న కరీత హాయహూయ | వాటే నిరామయ జణూ తయా | ||౧౦౮|| 
108. సాయి నామాన్ని తలచుకుంటూ, ఏ భయమూ లేక ఒత్తుతూ ఉంది. బాబా కూడా కిమ్మనకుండా, వారికి ఏ బాధ లేనట్లు ఉన్నారు. 
దాబణ్యాచీ విలక్షణ పరీ | పోటపాఠ సపాట కరీ | 
ప్రేమచి తే పరీ తే అవసరీ | దయా అంతరీ ఉపజవీ | ||౧౦౯|| 
109. చాలా వింతగా, పొట్ట వీపుకు అంటుకు పోయేలా, బాగా నలిపేస్తూ, పొట్ట ఒత్తుతూ ఉంది. ఎంతో ప్రేమతో ఆమె చేస్తున్నా, చూసేవారికి బాబా బాధను తలుచుకుని, దయ కలిగేది. 
సాఈచ హే నిష్కపట ప్రేమ | దేఊని ఘేతీ సేవా అనుత్తమ | 
కీ తే నిజస్మరణ అవిశ్రమ | ఘడోహో క్షేమ భక్తాంస | ||౧౧౦||
110. నిర్మలమైన మనసుతో చేస్తున్న భక్తుల సేవను బాబా తీసుకునేవారు. తమను ఎప్పుడూ తలుచుకుని, భక్తులు తమ మేలు సాధించుకోవాలనేదే బాబా కోరిక. 

ఆపులీ తపశ్చర్యా తీ కితీ | జేణే లాధావీ హీ సంతసంగతీ |
పరీ సాఈచ దీనవత్సల నిశ్చితీ | ఉపేక్షితీ నా భక్తాంతే | ||౧౧౧||
111. అలాంటి సత్పురుషుల సహవాసం దొరకటానికి, మనమెంత తపస్సు చేసి ఉండాలి! కాని, దయ కలిగిన సాయి, భక్తులను ఎప్పుడూ తక్కువగా చూసేవారు కాదు. 
కాయ త్యా హేలకావ్యాంచీ కుసరీ | బాబా హాలత ఖాలీవరీ |
తీహీ హాలే తైశియా పరీ | నవల పరీ హీ సేవేచీ | ||౧౧౨||
112. ఇటూ అటూ కదులుతూ చేసే ఆమె సేవలో ఎంత నేర్పు ఉన్నది! దానితో బాబా కూడా కిందకూ పైకీ ఊగిపోతున్నారు. ఆ సేవ ఎంతో విచిత్రమైనది! 
అణ్ణా ఓణవే పరీ స్థిర | బాఈ ఆపుల్యా సేవేంత చూర |
తేణే హోఈ ముఖ ఖాలవర | మగ కాయ ప్రకార వర్తలా | ||౧౧౩||
113. కొంచెం ముందుకు వంగినా, అణ్ణా కదలిక స్థిరంగా ఉంది. ఆమె సేవలో లీనమై ఉండటం వలన, ఆమె ముఖం కిందకూ పైకీ కదులుతూ ఉంది. అప్పుడు ఏమైంది? 
సాఈ సేవేచియా సుఖా | పిళితా పోట ఖాతా ఝోకా |
సన్నిధ అణ్ణాచియా ముఖా | ఆలే అవలోకా ముఖ తిచే | ||౧౧౪||
114. సాయి సేవలో ఆమె సుఖంగా, బాబా పొట్టను పిండేస్తుండగా, కొంచెం పక్కకు తిరగటంతో, గబుక్కున ఆమె ముఖం అణ్ణా ముఖం దగ్గరకు వచ్చింది. 
పాహూనియా ఏసీ సంధీ | మావశీబాఈ మోఠీ వినోదీ |
మ్హణే “కాయహో అణ్ణా నాదీ | ముకా ఆధీ మాగే మజ | ||౧౧౫||
115. పిన్నికి మంచి హాస్య స్వభావం ఉండటంతో, ఆ అవకాశాన్ని వదులుకోకుండా, ‘ఏమిటీ! తుంటరి అయిన ఈ అణ్ణా నన్ను మొదలు ముద్దివ్వమని అడుగుతున్నాడు! 
పికల్యా కేసాచీ లాజ నాహీ | ఘేతోస మాఝా ముకా పాహీ” |
ఏసే వదతా మావశీబాఈ | అణ్ణా బాహీ24 సరసావీ | ||౧౧౬||
116. ‘జుత్తు తెల్లబడినా, సిగ్గు లేదా నీకు! నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు’ అని పిన్ని అనేసరికి, అణ్ణా కోపంతో, తన చొక్కా చేతిని పైకి మడుచుకున్నాడు. 
మ్హణే “మీ ఇతుకా థేరడా | మీ కాయ మూర్ఖ అగదీంచ వేడా |
తూంచ తోండ లావునీ తోండా | సజలీసీ భాండాయా మజసీ” | ||౧౧౭||
117. ‘ముసలివాణ్ణి అయిన నేను, అంత మూర్ఖుణ్ణా? లేక పిచ్చివాణ్ణా? నీవే మొహంలో మొహం పెట్టి, పైగా నాతో తగువుకు నిలబడ్డావు!’ అని అన్నాడు. 
పాహూనియా మాతలీ కళ | బాబాంస తయా దోఘాంచీ కళకళ |
కరాయా దోఘాంసీ శీతళ | యుక్తి ప్రబళ యోజితీ | ||౧౧౮||
118. వారిద్దరంటేనూ బాబాకు చాలా ప్రేమ. ఇద్దరూ ఇలా తగువు పడటం చూసి, వారిని శాంత పరచటానికి, ఒక మంచి యుక్తిని పన్నారు. 
ప్రేమే మ్హణతీ “అరే అణ్ణా | ఉగాచ రే కా మాండిలా దణాణా |
అనుచిత కాయ తేంచ సమజేనా | ముకా ఘేతాంనా ఆఈచా” | ||౧౧౯||
119. ఎంతో ప్రేమగా, “అరే అణ్ణా! ఊరికే ఎందుకు గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవటంలో తప్పేముందో అర్థం కావటం లేదు” అని అన్నారు. 
పరిసోని మనీ దోన్హీ విరమలీ | వినోదవాణీ ఠాయీంచ జిరలీ |
సప్రేమ హాస్యా ఉకళీ ఫుటలీ | థట్టా తీ రుచలీ అవఘియా | ||౧౨౦||
120. అది విని ఇద్దరూ చల్లబడ్డారు. హాస్యం అక్కడికే ఆగిపోయింది. హాస్యంలోనుండి ప్రేమ ఉప్పొంగింది. అందరికీ ఆ హాస్యం బాగా నచ్చింది. 

పాహూ జాతా కథా థోడీ | మార్మిక శ్రోతే ఘేతీల గోడీ | 
ఠాయ కైసా ఘాలావా హే పరవడీ | కథేంత రోకడీ దిసేల | ||౧౨౧|| 
121. చూడటానికి ఇది చాలా చిన్న కథే. దీనిలోని నీతిని తెలుసుకోగల శ్రోతలు, ఎన్నో రకాలుగా, ఎలా ఒకరి నోరు మూయించ వచ్చని, తెలుసుకుంటారు.
మాయ లేకాంత జైసీ ప్రీతీ | ప్రేమబుద్ధి ఉభయతాంత అసతీ | 
తేథేంహీ కళ ఉద్భవలీ నసతీ | క్రోధ వృత్తీ ఉఠతీచ న | ||౧౨౨|| 
122. అసలు తల్లి బిడ్డలలో ఉండే ప్రేమ, ఆ ఇద్దరిలో ఉండి ఉంటే, వారికిలా తగువు వచ్చేది కాదు, కోపం పెరిగేదీ కాదు. 
చాబుకే హాణితా హాంసే ఉసళే | ఫులాచ్యా మారే రడే కోసళే | 
వృత్తీచే తరంగ భావనా బళే | కోణాస నకళే అనుభవ హా | ||౧౨౩|| 
123. కొరడాతో కొడితే నవ్వటం, పూలతో కొడితే ఏడవటం, ఇవి వారి వారి గుణాల వలన వచ్చే అలలలాంటివి. ఇలాంటి అనుభవాలు ఎవరికి కాలేదు? 
నవల బాబాంచీ సహజ యుక్తి | బోల బోలతీ సమయోచితీ | 
జేణే శ్రోతే అంతరీ నివతీ | బోధహీ ఘేతీ తాత్కాళ | ||౧౨౪|| 
124. బాబాలో ఉన్న సహజమైన యుక్తి, నిజంగా ఆశ్చర్యకరమైనది. సమయానికి సరిగ్గా వారు చెప్పిన మాటలలోని తెలివిని శ్రోతలు విని, తృప్తి పడటమే కాకుండా, చక్కని పాఠాన్ని కూడా నేర్చుకుని ఉంటారు. 
ఏసేచ ఎకదా పోట రగడతా | ఉపజలీ బాబాంచ్యా పరమభక్తా | 
కళకళ దయా ఆణి చింతా | తిచీ అతిరేకతా పాహూనీ | ||౧౨౫|| 
125. ఇలాగే ఒక సారి, బాబా పొట్టను ఎంతో బలంతో, పిండిని పిసికినట్లు పిసుకుతుంటే, ఆ మొరటుతనాన్ని చూసిన బాబా పరమ భక్తుడొకడికి చాలా బాధ, దయ, చింత కలిగాయి. 
మ్హణతీ “బాఈ దయా కరా | హీ కా అంగ దాబణ్యాచీ తర్హా | 
అంతరీ థోడీ కీంవ ధరా | తుటతీల శిరా బాబాంచ్యా” | ||౧౨౬|| 
126. ‘ఓ తల్లీ! దయ ఉంచు. మర్దించటానికి ఇదీ ఒక పద్ధతేనా? మనసులో కొంచెం దయ పెంచుకో. బాబా నరాలు తెగి పోగలవు’ అని అన్నాడు. 
కానీ పడతా ఇతుకీ అక్షరే | బాబా స్థానావరూని సత్వరే | 
ఘేఊని అపులా సటకా నిజకరే | భూమి ప్రహారే తాడిలీ | ||౧౨౭|| 
127. ఆ మాటలు చెవిన పడగానే, బాబా వెంటనే తమ ఆసనంనుంచి లేచి, చేతిలోకి సటకా తీసుకుని, నేలపై కొట్టారు. 
చఢలీ వృత్తీ దుర్ధర క్షోభా | సమోర కోణ రాహీల ఉభా | 
నేత్ర ఖదిరాంగార ప్రభా | ఫిరతీ సభోవార జై | ||౧౨౮|| 
128. వారి కోపం విపరీతంగా పెరిగి, నిప్పు కణాలవలె కళ్ళు మెరుస్తూ, అక్కడున్న వారి చూట్టూ తిరగ సాగాయి. అలాంటప్పుడు వారి ఎదుట ఎవరైనా నిలిచే సాహసం చేయగలరా? 
అంధారీ మార్జారాచీ బుబుళే | తేవీ చమకతీ దివసా డోళే | 
వాటే నయనీంచియా జ్వాళే | ఆతాంచ జాళీతీల సృష్టీ | ||౧౨౯|| 
129. చీకటిలో పిల్లి కళ్ళు మెరిసేలా, పగలే బాబా కళ్ళు మెరవ సాగాయి. వారి కళ్ళల్లోని జ్వాలలతో మొత్తం సృష్టిని కాల్చేస్తారేమో అని అనిపించింది. 
సటక్యాచే టోంక దోహాతీ ధరలే | పోటాచియా ఖళగీంత ఖోంచలే | 
దుజే ఖాంబాంత సమోర రోవిలే | ఘట్ట కవళిలే ఖాంబాలా | ||౧౩౦||
130. సటకాలోని ఒక చివరి భాగాన్ని చేత్తో పట్టుకుని, తమ పొట్ట లోపలికి గుచ్చి, మరో వైపు కొనను ఎదుట ఉన్న కంభానికి ఆన్చి, ఆ కంభాన్ని గట్టిగా వాటేసుకున్నారు. 

సటకా లాంబ సవ్వాహాత | శిరలా వాటే సబంధ పోటాంత | 
ఆతా స్ఫోట హోఊని ప్రాణాంత | ఓఢవేల క్షణాంత తై వాటే | ||౧౩౧|| 
131. సుమారు రెండున్నర అడుగుల పొడవు ఉన్న ఆ సటకా మొత్తం, బాబా కడుపులో పోయి, క్షణంలో పొట్ట పగిలి, ప్రాణం పోతుందేమో అని అనిపించింది. 
ఖాంబ అఢళ తో కాయ హాలే | బాబా జవళీ జవళీ భిడలే | 
ఖాంబాస పోటాశీ ఘట్ట ఆవళిలే | పాణీ పళవిలే దేఖత్యాంచే | ||౧౩౨|| 
132. స్థిరంగా ఉన్న కంభం ఎలా కదులుతుంది? అందుకే, బాబాయే దానికి దగ్గర దగ్గరగా పోతూ, కంభానికి పొట్టను గట్టిగా అదిమి పట్టారు. చూసేవారికి విపరీతమైన భయం పుట్టుకొచ్చింది. 
ఆతా హోఈల పోటాచా స్ఫోట | జో తో తోండాత ఘాలీ బోట | 
బాప హా కాయ ప్రసంగ దుర్ఘట | ఓఢవలే సంకట దుర్ధర | ||౧౩౩|| 
133. ఏ క్షణమైన ఇక పొట్ట పగిలి పోగలదేమో అని అనుకుని, ‘ఇదెక్కడి భరించరాని కష్టం వచ్చి పడింది రా బాబూ’, అని ఆశ్చర్యపోయారు. ఎలాంటి అనుకోని ఘోరం! ఈ అనర్థం తొలిగేది ఎలా? 
ఏసీ లోక కరితీ చింతా | కాయ కరావే యా ఆకాంతా | 
ఎవఢే సంకట త్యా మావశీకరితా | భక్తాధీనతా హే బ్రీద | ||౧౩౪|| 
134. ‘భక్తుల అధీనంలో ఉండటం బాబా వ్రతమే. కాని, ఆ పిన్ని కొరకు ఇంత కష్టం సహించాలా’ అని భక్తులు చాలా బాధపడ్డారు. 
కధీ కోణీహీ సేవా కరితా | మధ్యేంచ దర్శవితా అనుచితతా| 
కింవా సేవేకర్యాస కోణీ బోలతా | బాబాంచే చిత్తా ఖపేనా | ||౧౩౫|| 
135. సేవ చేస్తున్న వారిని ఎవరినైనా, మధ్యలో విమర్శించినా, లేక వారిని ఏమైనా అన్నా, అది బాబాకు నచ్చేది కాదు. 
భక్తా ప్రేమళా ఆలే జీవా | మావశీబాఈస ఇశారా ద్యావా | 
సాఈబాబాంస ఆరామ వ్హావా | పరిణామ యావా కా ఏసా | ||౧౩౬|| 
136. బాబా మీద ప్రేమతో, బాబాకు బాధ కలగకూడదని, భక్తులు పిన్నికి తెలిపినందుకు, దాని పరిణామం ఇలా కావాలా, అని బాధ పడ్డారు. 
అసో దేవాస ఆలీ కరూణా | శాంతతా ఉద్భవలీ సాఈచే మనా | 
సోడూనియా తే భయప్రద కల్పనా | యేఊని ఆసనా బైసతీ | ||౧౩౭|| 
137. ఎలాగో, చివరికి దేవుడికి దయ కలిగింది. సాయి శాంతించారు. భయంకరమైన ఆ ఆలోచనను మానుకుని, తమ ఆసనంలో కూర్చున్నారు. 
భక్త ప్రేమళ జరీ నిధడా | బాబాంచా స్వభావ పాహూని కరడా | 
లావిలా తేథూని కానాస ఖడా | ఘేతలా ధడా పుఢారా | ||౧౩౮|| 
138. బాబా అంటే ప్రేమ కలిగిన భక్తులు, బాబాయొక్క కఠిన స్వభావాన్ని తెలుసుకొని, అప్పటినుండి అలాంటి తప్పును చేయకూడదనే పాఠాన్ని నేర్చుకున్నారు. 
తేవ్హాంపాసూని నిశ్చయ కేలా | జావే న కోణాచ్యాహీ వాటేలా | 
యేఈల జైసే జ్యాంచే మనాలా | తైసే తయాలా కరూ ద్యావే | ||౧౩౯|| 
139. అప్పటినుండీ ఎవరికి తోచినట్లు వారిని సేవ చేయనివ్వాలి, ఎవరి దారికీ అడ్డుపోకూడదు అని నిశ్చయించుకున్నారు. 
సమర్థ స్వయే సామర్థ్యవంత | నిగ్రహానుగ్రహ జ్ఞానవంత | 
గుణావగుణ సేవక జనాంత | ఆపణ కిమర్థ పాహావే | ||౧౪౦||
140. సాయి సమర్థులు స్వయంగా శక్తివంతులు, ఏది చేయనివ్వాలో, ఏది ఆపాలో ఎరిగిన జ్ఞానులు. సేవ చేసేవారి గుణాలు, అవగుణాలు వారికి బాగా తెలుసు. మనమెందుకు విమర్శించాలి అని అనుకున్నారు. 

ఎకాచీ సేవా సాఈస సుఖకర | దుజయాచీ తీ అసతీ ప్రఖర | 
హే తరీ నిజబుద్ధీచే వికార | ఖరా ప్రకార ఆకళేనా | ||౧౪౧|| 
141. బాబాకు ఒకరి సేవ సుఖంగా ఉంటుంది, మరొకరి సేవ కటువుగా, మొరటుగా ఉంటుందని మనం మన ఆలోచనలను బట్టి అనుకోవడమే కాని, నిజం ఏదో మనకు తెలియదు. 
అసో ఆతా హా థట్టా వినోద | ఘేణారా ఘేఈల యాంతీల బోధ | 
సాఈకథా రసామోద | భక్తమకరంద సేవోత | ||౧౪౨|| 
142. ఇది ఒక వినోదం, హాస్యంతో కూడుకున్న కథ. ఇందులోని నీతిని అర్థం చేసుకోగలిగిన వారు అర్థం చేసుకునే ఉంటారు. పువ్వులోని తేనెను తేనెటీగ జుర్రుకున్నట్టు, సాయి కథలోని ఆనందాన్ని భక్తులు సేవించుగాక. 
హెమాడ సాఈపదీ లీన | పుఢీల అధ్యాయ యాహూని గహన | 
భక్త దామోదరాచీ ఇచ్ఛా పూర్ణ | సాఈ దయాఘన కరితీల | ||౧౪౩|| 
143. సాయి పాదాలలో హేమాడు లీనమౌతాడు. తరువాతి అధ్యాయంలొ, ఇంతకంటేనూ గంభీరమైన కథలో, సాయి దయామయులు భక్త దామోదరుని కోరిక తీర్చుతారు. 
తోహీ మోఠా చమత్కార | దామోదర సంసారత్రస్త ఫార | 
తయాస పాచారూన ఆపులే సమోర | ఘాలావిలా ఘోర తయాచా | ||౧౪౪||
144. అది కూడా ఒక గొప్ప చమత్కారం. దామోదరు ప్రపంచంలో చాలా కష్టాలు పడుతుంటే, అతనిని తమ దగ్గరకు రప్పించుకుని, అతని బాధ తీరుస్తారు. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
 | శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | వినోద విలసితం నామ | 
| చతుర్వింశతితమోధ్యాయః సంపూర్ణః |

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||


టిపణీ: 
1. హాతాంచీ అంజుళీ. 2. శ్రీమంత గోపాళరావ బుట్టీ. 3. శ్రీ హరీ సీతారామ దీక్షిత. 
4. చికటలేలే. 5. అంగాత అసలేల్యా శార్ట కోటాచీ. 6. వళకట్యా. 
7. ఇంద్రియాధిష్ఠిత వ ఇతర దేవతా, ప్రాణాపానాది పంచప్రాణ, గార్హపత్యాది పంచాగ్నీ. 
8. ఫసవిణే. 9. విషయాంవర. 10. కఠోపనిషద్, అ. ౨, వల్లీ ౩, మం. ౧౦. 11. దృఢాభ్యాసానే. 
12. మూళ ఠికాణ. 13. జో పాహిజే తో. 14. ఎక క్షణ. 
15. గురు సాందీపనీ యాంచ్యా ఆశ్రమీ సేవా కరీత అసతా. 16. ఆఝేనే. 17. విసావా ఘే! 
18. దాత. 19. తసేచ హోవో! 
20. యాంనా అణ్ణాచించణీకర యా నావానే బహుధా ఓళఖీత. హే వ యాంచే కుటుంబ హీ దోఘే శ్రీసాఈబాబాంచీ ఫార భక్తీ కరీత. హీ దోఘే కిత్యేక వర్షే త్యాసాఠీ శిరడీసచ జాఊన రాహిలీ హోతీ. అణ్ణాంచే కుటుంబ కాహీ వర్షాంనీ ఆపల్యా గావీ అసతా వారలే వ త్యాంచ్యా పాఠీమాగూన లవకరచ అణ్ణాహీ ఆపల్యా గావీ అసతానాచ కైలాసవాసీ ఝాలే. త్యాంనీ ఆపలీ స్థావర - జంగమ సర్వ ఇస్టేట మోఠ్యా ప్రేమానే శ్రీంచ్యా ఖర్చాసాఠీ శ్రీశిరడీ సంస్థానాస అర్పణ కేలీ. ‘శ్రీసాఈలీలా’ మాసికాచా శకే ౧౮౪౫చా అంక ౧౨యాత త్యాంచ్యా మృత్యూపత్రాచీ నక్కల ఛాపలీ ఆహే. 
21. శ్వాసోచ్ఛ్వాస. 22. నేసణ్యాచ్యా ధోతరాచీ గాఠ జేథే యేతే తో పోటాచా పుఢీల భాగ. 
23. మాథణీ. 24. అస్తన్యా. 

No comments:

Post a Comment