శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౨౯ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
గతాధ్యాయీ జాహలే కథన | త్యాహూన యా అధ్యాయీ శ్రవణ |
కరవితో శ్రీచే అతర్క్య విందాన | కథానుసంధాన ఎకచి | ||౧||
1. ఈ అధ్యాయంలో ఊహించటానికి కూడా వీలు కాని, బాబా మహిమను వినిపిస్తానని, పోయిన అధ్యాయంలో చెప్పాను. కథావస్తు ఒకటే, కాని ఇది దానికంటే ఎంతో వింతైనది.
తో వర్షీ ఎక భజనీ మేళా | శిరడీస ఆలా దర్శనార్థ | ||౨||
2. క్రి. శ. ౧౯౧౬వ సంవత్సరంలో, బాబా అద్భుత లీలల గురించి విని, వారి దర్శనం చేసుకోవాలని, ఒక భజన మండలి శిరిడీకి వచ్చింది.
మండళీ హీ సర్వ ప్రవాసీ | కీర్తి పరిసిలీ మద్రదేశీ1 | జాత అసతా కాశీయాత్రేసీ | వాటేంత శిరడీసీ ఉతరలీ | ||౩||
3. వారందరూ కాశీకి తీర్థయాత్రకు వెళుతున్న యాత్రికులు. మద్రాసులో ఉండగా బాబా కీర్తి విని, మార్గంలో శిరిడీలో దిగాలని నిశ్చయించుకున్నారు.
సాఈబాబా మహాసంత | ధీర ఉదార ఆణి దాంత | యాత్రేకరూంసీ కృపావంత | పైసే అత్యంత వాటితీ | ||౪||
4. ‘సాయిబాబా గొప్ప సాధువు, ధీరులు, ఉదారులు, దయామూర్తి, యాత్రికులకు డబ్బు బాగా పంచి పెడతారు.
దిడక్యా చవల్యా హాతాచా కీస | అధేల్యా పావల్యాంచా పాఊస | రుపయే దహా కోణాస వీస | కోణాస పన్నాస తే దేత | ||౫||
5. ‘దమ్మిడీలు, దుగ్గాణీలు వారికి లెక్కేలేదు. పావులాలను, అర్ధ రూపాయలను వర్షంలా కురిపిస్తారు. ఒకరికి పది, ఇంకొకరికి ఇరవై, మరొకరికి యాభై అలా ఇస్తుంటారు.
హే కాయ సణాసూదా2 దిసీ | కార్య విశేషీ కా పర్వకాళాసీ | ప్రతిదివశీ ఉక్త ప్రమాణేంసీ | సంతోషేసీ అర్పీత | ||౬||
6. ‘ఇది పండుగ పబ్బాలలోనో, లేక విశేషమైన దినాలలోనే కాదు, ప్రతి రోజూ అదే విధంగా, సంతోషంగా పంచి పెడతారు.
పహూడ3 యేతీ భవయ్యే3 నాచతీ | గవయ్యే గాతీ భాట వానితీ | తమాసగీర ముజరే దేతీ | భజనీ రంగతీ హరిభక్త | ||౭||
7. ‘పాముల వాళ్ళు, వినోదాలు చేసేవాళ్ళు వచ్చి నాట్యం చేస్తారు. పాటలు పాడేవారు పాడుతారు. భట్రాజులు పొగుడుతుంటారు. తమాషాలు, గారడీ చేసేవారు సలాములు చేస్తారు. హరిభక్తులు వచ్చి భజన చేస్తారు.
ఏసే మహారాజ ఉదారవృత్తీ | దానధర్మీ సఢళ స్థితీ | ఏకూని కర్ణోపకర్ణీ హీ కీర్తీ | ఇచ్ఛా ధరితీ దర్శనాచీ | ||౮||
8. ‘మహారాజు ఎంత ఉదారులు! దాన ధర్మాలు విరివిగా చేస్తారు!’ అని వారి కీర్తిని ఆ నోట ఈ నోటా విని, మద్రాసు వారికి సాయిని చూడాలని కోరిక కలిగింది.
కధీ ఆలియా బాబాంచే చిత్తీ | పాంథస్థాంతేహీ పైసే వాటితీ | దీనా దుబళ్యాంచా పరామర్ష ఘేతీ | కృపామూర్తీ సాఈనాథ | ||౯||
9. బాబా మనసుకు ఎప్పుడైనా తోస్తే, బాటసారులకు, ప్రయాణీకులకు కూడా డబ్బు పంచేవారు. ఎంతో దయామూర్తి అయిన సాయినాథులు, పేదలను, రోగ పీడితులను చక్కగా పరామర్శించేవారు.
పురూష ఎక బాయా తీన | మేళా అవఘా చౌధాంమిళూన | మేహుణీ స్వస్త్రీ దుహితా ఆపణ | సంతదర్శన కాముక | ||౧౦||
10. ఆ భజన మండలిలో, ఒక మగవాడు, ముగ్గురు ఆడవారు ఉన్నారు. అంతా కలిసి నలుగురు. అంటే మగవాడు, అతని భార్య, మరదలు, అతని అమ్మాయి, అందరూ సాయి దర్శనానికి ఇష్ట పడ్డారు.
ఘేఊని సాఈచే దర్శన | మండళీ పావలీ సమాధాన |
కరీత సాఈపాశీ అనుదీన | ప్రేమళ భజన నేమానే | ||౧౧||
11. సాయిని దర్శించుకున్న తరువాత, వారికి ఆనందంతో పాటు తృప్తి కూడా కలిగింది. రోజూ నియమంగా, భక్తితో, బాబా దగ్గర భజన చేసేవారు.
సాంప్రదాయ రామదాసీ | భజన కరీత అతి ఉల్హాసీ | బాబాహీ రుపయా ఆఠ ఆణే తయాంసీ | ఆలియా మనాసీ అర్పీత | ||౧౨||
12. వారు రామదాసి సంప్రదాయానికి చెందినవారు. ఎంతో ఉత్సాహంగానూ, ఉల్లాసంగానూ భజన చేసేవారు. తమకు తోచినప్పుడు, బాబా వారికి ఒక రూపాయో, అర్ధ రూపాయో ఇచ్చేవారు.
కధీ తయాంస బర్ఫీ దేత | కధీ పరతవీత రిక్తహస్త | బాబాంచే హే ఏసే సదోదిత | పరి న నిశ్చిత కాంహీంహీ | ||౧౩||
13. కొన్ని సార్లు బర్ఫీ మిఠాయిలనిచ్చేవారు. మిగతా సార్లు ఒట్టి చేతులతోనే పంపేవారు. వారి పద్ధతి ఇలాగే ఉండేది. కాని, ఏదీ ఎప్పుడూ నిశ్చితం కాదు.
పైసే వాటీత హే తో సత్య | నవ్హతే యాంత కాంహీంహీ అసత్య | పరి తే నవ్హతే సర్వాంస దేత | ఠావే న మనోగత కవణాతే | ||౧౪||
14. వారు డబ్బును పంచేవారు, అనేది మాత్రం నిజం. ఇందులో అబద్ధమేమీ లేదు. కాని, అందరికీ ఇచ్చేవారు కాదు. వారి మనసులో ఏముండేదో, ఎవరికీ తెలిసేది కాదు.
ఫకీర ఫుకరే భిక్షేకరీ | సదైవ యేత బాబాంచే ద్వారీ | బాబా జరీ దయాళూ భారీ | ధర్మ న కరీత సర్వాంతే | ||౧౫||
15. ఫకీరులు, బిచ్చగాళ్ళు మొదలైన వారు బాబా దగ్గరకు ఎప్పుడూ వస్తుండే వారు. బాబా ఎంతో గొప్ప కరుణామయులైనా, అందరికీ ధర్మం చేసేవారు కాదు.
జయాచీ లాభ కాళాచీ ఘడీ | తయాసీంచ హీ సుఖపరవడీ | సంత హస్తస్పర్శాచీ కవఢీ | లాభేల జోడీ భాగ్యాచీ | ||౧౬||
16. ఆ భాగ్యాన్ని పొందే సమయం వచ్చిన వారికే, ఆ సత్పురుషుని చేతిని తాకిన డబ్బు దొరికేది.
యే అర్థీంచీ ఎక గోష్ట | ఏకతా శ్రోతే హోతీల సంతుష్ట | కరూని తయాంపుఢే తీ ప్రవిష్ట | ధరూ మగ వాట పుఢీల | ||౧౭||
17. ఈ సందర్భంలో, శ్రోతలను తృప్తి పరచే ఒక కథ మనవి చేసి, ముందుకు సాగుతాను.
హోఊన ప్రాతఃకాళచీ న్యాహారీ | బైసతా బాబా స్తంభాశేజారీ | ధునీ సంన్నిధ మశీదీమాఝారీ | యేతసే పోరీ అమనీ4 తై | ||౧౮||
18. తెల్లవారి ఫలహారాన్ని తీసుకున్న తరువాత, మసీదులోని ధుని దగ్గర ఉన్న స్తంభం వద్ద బాబా కూర్చుని ఉండగా, అమనీ అక్కడికి వచ్చేది.
పోరీ తీన వర్షాంచీ నాగడీ | హాతీ జినతానీ డబీ ఉఘడీ | ఆఈ జమలసహ తాంతడీ | యేతసే తీ ఘడీ సాధూని | ||౧౯||
19. సమయం సరిగ్గా చూసుకుని, ఆ మూడేళ్ళ పిల్ల, చేతిలో రేకు డబ్బా పుచ్చుకుని, తల్లి జమలతో, గబగబా వచ్చేది.
అమనీ బైసే మాండీవరీ | డబీ దేఈ బాబాంచే కరీ | “బాబా రుపయ్యా రుపయ్యా” కరీ | హాత ధరీ బాబాంచా | ||౨౦||
20. బాబా ఒడిలో అమనీ కూర్చుని, వారి చేతికి డబ్బానిచ్చి, బాబా చేతిని పట్టుకుని, ‘బాబా! రుపయ్యా, రుపయ్యా’ అనేది.
బాబాంస ములాంచే వేడ భారీ | పోరహీ హోతీ గోండస సాజిరీ |
ముకే ఘేత కురవాళిత కరీ | పోరీస ధరీత పోటాశీ | ||౨౧||
21. బాబాకు పిల్లలంటే, విపరీతమైన ప్రీతి. ఈ పిల్ల కూడా ముద్దుగా, అందంగా ఉండేది. ఆ పిల్లను బాబా ముద్దాడుతూ, చేత్తో నిమురుతూ, గట్టిగా కౌగలించుకునేవారు.
“బాబా దేనా దేనా మజసీ” | మ్హణే ఖిశాశీ లక్ష సారే | ||౨౨||
22. బాబా కౌగలించుకుని అంత ముద్దాడినా, అమనీ మనసు మాత్రం రూపాయి మీదే. ‘బాబా! ఇచ్చేయి, నాకిచ్చేసేయి!’ అనేది. ఆమె చూపంతా బాబా జేబు మీదే.
అమనీచా తో పోర స్వభావ | థోరామోఠ్యాంహీ తీచ హాంవ | స్వార్థాసాఠీంచ ధాంవా ధాంవ | పరమార్థీ భావ ఎకాద్యా | ||౨౩||
23. అమనీ ఏమో పసిపిల్ల, కాని ఎందరో పెద్దవారికి, గొప్పవారికి కూడా డబ్బు మీదే ఆశ. అంతా స్వార్థం కోసమే, పరుగులు తీస్తారు. పరమార్థం కావాలిని ఇష్టపడేవారు ఏ ఒకరిద్దరో ఉంటారు.
పోరీనే బసావే మాండీవరీ | ఆఈనే దూర కఠడ్యా బాహేరీ | హాలూ నకో దేత తోంవరీ | ఖుణావీ పోరీస దూరుని | ||౨౪||
24. ఆ పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. కటకటాల బయట దూరంగా నిలబడి, ఆమె తల్లి, ‘బాబా ఇచ్చేవరకూ కదలకుండా అక్కడే ఉండు’ అని ఆ పిల్లకు సైగ చేసేది.
“తుఝ్యా బాపాచే మీ కాయ లాగే | ఉఠలీ తీ సుటలీ మాఝ్యా మాగే | ఫుకట ఖాఊ మేలే నిలాగే5” | మ్హణావే రాగే బాబాంనీ | ||౨౫||
25. “లేచిన వెంటనే ఇలా వచ్చి, నా మీద పడటానికి, మీ బాబుకు నేనేమైనా చుట్టాన్నా, లేక ఏమైనా ఋణ పడ్డానా? పనికి మాలినదానా! ఉత్త పుణ్యానికి తినే మేళం!” అని బాబా కోప్పడేవారు.
పరీ హా రాగ బాహ్యాత్కారీ | అంతరీ ప్రేమాచ్యా ఉసళతీ లహరీ | హస్త ఘాలూని ఖిశాభీతరీ | రుపయా బాహేరీ కాఢావా | ||౨౬||
26. కాని, ఆ కోపం అంతా పైపైనే. లోపల ప్రేమయొక్క అలలు ఉప్పొంగుతుంటాయి. జేబులో చేయి వేసి, రూపాయిని బయటకు తీసేవారు.
ఘాలూనియా తో డబీంత ఘట్ట | ఝాంకితా ఆవాజ హోఈ జో ఖట్ట | డబీ హాతీ పడతా తీ ఝట్ట | ఘరాచీ వాట ధరితసే | ||౨౭||
27. దానిని ఆ చిన్న డబ్బాలో వేసి, గట్టిగా మూసినప్పుడు ‘ఠక్’ అని చప్పుడు అయ్యేది. మూసిన ఆ డబ్బా చేతికి రాగానే, ఆ పిల్ల వెంటనే, ఇంటి దారి పట్టేది.
హే తో హోఈ న్యాహారీ వక్తీ | తైసేంచ జంవ తే లేండీవర నిఘతీ | తేవ్హాం హీ అమనీస రుపయ్యా దేతీ | రాగే భరతీ తైసేంచి | ||౨౮||
28. ఇది, తెల్లవారి ఫలహారం వేళప్పుడు జరిగేది. అలాగే, బాబా లెండీకి బయలుదేరేటప్పుడు కూడా, కోప్పడుతూ అమనీకి ఇంకొక రూపాయినిచ్చేవారు.
ఏసే ప్రతిదినీ దోన తిజలా | సహా దేత త్యా జమలీలా6 | పాంచ దాదా కేళకరాంలా | భాగ్యా సుందరీలా దోన దోన | ||౨౯||
29. ఇలా ప్రతి రోజూ, అమనీకి రెండు, జమలీకి ఆరు, దాదా కేల్కరుకు అయిదు, భాగ్యా, సుందరికి చెరో రెండు, ఇచ్చేవారు.
దహా తే పంధరా తాత్యాబాంసీ | పంధరా తే పన్నాస ఫకీర బాబాంసీ | ఆఠ వాటితీ గోరగరీబాంసీ | నిత్య నేమేసీ హే దేణే | ||౩౦||
30. తాత్యాబాకు పదినుండి పదిహేను, ఫకీరు బాబాకు పదిహేనునుండి యాభై వరకు, పేదవారికి ఎనిమిది, ఇలా నిత్యం నియమంగా పంచేవారు.
అసో ఏసీ హీ దానశీలతా | మద్రాసియాంనీ ఏకోని వార్తా |
సహజ ఉపజోని అర్థస్వార్థతా | భజనోపక్రమతా మాండిలీ | ||౩౧||
31. బాబాయొక్క ఇటువంటి దానశీలత కీర్తిని విని, మద్రాసు బృందంవారు, తామెంత డబ్బు రాబట్టొచ్చని, డబ్బు కోసం, బాబా ఎదుట భజన చేయటం మొదలు పెట్టారు.
బాహ్యతః తే భజన సుందర | అంతరీ ద్రవ్యాచా లోభ దుర్ధర | పైసే దేతాత యా ఆశేవర | రాహిలే సపరివార శిరడీంత | ||౩౨||
32. వారి భజన, బయటకు ఎంతో భక్తితో, చక్కగా ఉన్నా, లోపల, వారి మనసులలో డబ్బు గురించి విపరీతమైన లోభం. వారికి బాబా బోలెడంత డబ్బు ఇస్తారనే ఆశతో, ఆ కుటుంబం వారు శిరిడీలోనే ఉండ సాగారు.
త్యాంతూన తిఘాంస మోఠీ హావ | బాబాంనీ ద్యావే బహుత ద్రవ్య | పరి సాఈపదీ భజన సద్భావ | హా ఎక నిజభావ స్త్రియేచా | ||౩౩||
33. వారిలో ముగ్గురికి, బాబా చాలా డబ్బును ఇస్తారని ఆశ. కాని, భార్యకు మాత్రం సాయి పాదాల మీద ఉండే ప్రేమ, భక్తి, ఆమె పాడే భజనల ద్వారా తెలిసేది.
పాహూనియా మేఘాసమోర | ఆనందే ఎక నాచేల మోర | చంద్రాలాగీ జైసా చకోర | తైసాచ ఆదర తియేచా | ||౩౪||
34. మబ్బులను చూసినప్పుడు ఆనందంగా నాట్యం చేసే నెమిలివలె, చంద్రుని చూసి ఆనందించే చకోరంవలె, ఆమెకు బాబా అంటే గౌరవం, ఆదరం ఉండేవి.
ఎకదా మధ్యాన్హీచీ ఆరతీ | చాలతా సాఈ కృపామూర్తి | పాహూని బాఈచీ సద్భావ స్థితీ | దర్శన దేతీ రామరూపే | ||౩౫||
35. ఆమె భక్తి భావాన్ని గమనించి, ఒక రోజు మధ్యాహ్న ఆరతి వేళప్పుడు, కరుణామూర్తి అయిన సాయి, ఆమెకు శ్రీరాముని రూపంలో కనిపించారు.
ఇతరాంస నిత్యాచే సాఈనాథ | బాఈచ్యా దృష్టీస జానకీకాంత | డోళా ఘళఘళ అశ్రూ స్త్రవత | పాహోని విస్మిత జన ఝాలే | ||౩౬||
36. మిగతా అందరికీ సాయినాథుల వలె, ఆమెకు మాత్రం జానకీనాథునివలె, కనిపించే సరికి, ఆమె కళ్ళనుండి నీరు జలజలా రాలాయి. దానిని చూసి జనులు ఆశ్చర్యపడ్డారు.
దోహీ హాతీ వాజవీ టాళీ | సవేంచ నయనీ ఆసువే ఢాళీ | దేఖూన హే అపూర్వ తే వేళీ | జాహలీ మండళీ విస్మిత | ||౩౭||
37. రెండు చేతులతో తాళాలు వాయిస్తూ, కళ్ళనుండి నీరు కారుతుంటే, ఆ వింతైన దృశ్యాన్ని చూసి, భక్తులు ఆశ్చర్యపోయారు.
ఏసా పాహోని తో దేఖావా | జిజ్ఞాసా జాహలీ సకళాంచే జీవా | ఇతుకా ప్రేమాచా పూర కా లోటావా | ఆనంద వ్హావా తియేసచి కా | ||౩౮||
38. ఇలాంటి దృశ్యాన్ని చూసి, ‘ఈమె ఒక్కర్తికే ఇంత ప్రేమ, ఆనందం ఎందుకు కలిగింది?’ అని అందరికీ కుతూహలం పెరిగింది.
పుఢే స్వపతీస తిసరే ప్రహరీ | ఆపణ హోఊన ఆనంద నిర్భరీ | రామదర్శన నవల పరీ | వదే ఆచరిత సాఈచే | ||౩౯||
39. తరువాత, సాయంత్రం (సుమారు ౪-౪.౩౦ అప్పుడు) ఆమె సాయియొక్క అద్భుత లీలను తన భర్తకు చెప్పింది. వారు తనకు శ్రీరాముని రూపంలో కనిపించిన సంగతిని, తనంతట తానే, ఎంతో ఆనందంతో తెలియ చేసింది.
నీలోత్పలదలఃశామ | భక్తకామ కల్పద్రుమ | తో హా భరతాగ్రజ సీతాభిరామ | దాశరథీ రామ మజ దిసలా | ||౪౦||
40. ‘నీలకమలం రేకుల రంగులో ఉన్న శ్యాముడు (నీలోత్పలదళ శ్యామ), భక్తుల కోరికలను తీర్చే కల్పవృక్షం, భరతునికి అన్న, సీతా మనసుకు ఆనందాన్నిచ్చే (సీతామనోభిరాముడు) రాముడు, దశరథరాముడు నాకు కనిపించాడు.
కిరీటకుండలమండిత | వనమాలా విరాజిత |
పీతవాస చతుర్హస్త | జానకీనాథ మజ దిసలా | ||౪౧||
41. ‘తలమీద కిరీటంతో, చెవులలో కుండలాలతో (కిరీటకుండల మండితుడు), గొంతులో పూలమాలతో (వనమాలా విరాజితుడు), పసుపు రంగు బట్టలను తొడుగుకున్నవాడు (పీతాంబరధారి), నాలుగు చేతులున్న (చతుర్భుజుడు) జానకీనాథుడు నాకు కనిపించాడు.
తో హా పురుషోత్తమ పరాత్పర | రూప మనోహర దేఖిలా | ||౪౨||
42. ‘శంఖం, చక్రం మరియు గదను పట్టుకున్నవాడు (శంఖచక్రగదాధారి), ఎదమీద శ్రీవత్స అనే గుర్తుగలవాడు (శ్రీవత్సలాంఛన), విలువైన కౌస్తుభ హారంతో మెరుస్తున్నవాడు (కౌస్తుభహార), పురుషోత్తముడు, అందగాడు అయిన రాముణ్ణి నేను చూశాను.
మ్హణే హా మానవ రూపధారీ | అసామాన్య లీలావతారీ | జానకీజీవన మనోహారీ | ధనుర్ధారీ మజ దిసలా | ||౪౩||
43. ‘మనిషి రూపంలో ఉన్న, అసామాన్య అవతారాన్ని, విల్లు బాణాలను ధరించినవాడు (ధనుర్ధారీ), మనోహరుడు, అయిన జానకీనాథుడు నాకు కనిపించాడు’ అని ఆమె చెప్పింది.
ఫకీర దిసో హా బాహ్యాత్కారీ | భిక్షాహి మాగో దారోదారీ | జానకీజీవన మనోహారీ | ధనుర్ధారీ మజ దిసలా | ||౪౪||
44. ‘పైకి ఫకీరువలె కనిపించినా, ఇంటింట భిక్షాన్ని అడుక్కున్నా, నాకు మాత్రం మనోహరుడు, విల్లంబులను ధరించిన, జానకీనాథుడైన శ్రీరాముడిగా కనిపించాడు.
అసో హా అవలియా ఉపరాఉపరీ | కోణాస కైసాహీ దిసో అంతరీ | జానకీజీవన మనోహారీ | ధనుర్ధారీ మజ దిసలా | ||౪౫||
45. ‘పైకి అవలియా లాగ ఉన్నా, ఎవరికి ఎలా కనిపించినా, నాకు మాత్రం విల్లంబులను ధరించిన, మనోహరుడైన జానకీనాథుడు కనిపించాడు’.
బాఈ మోఠీ పరమ భావార్థీ | పతీ తియేచా అత్యంత స్వార్థీ | ఏసీచ భోళీ స్త్రియాంచీ జాతీ | కైచా రఘుపతీ యే స్థళీ? | ||౪౬||
46. ఆమె గొప్ప భక్తురాలు కాని, ఆమె భర్త చాలా స్వార్థపరుడు. ‘స్త్రీలు అమాయక స్వభావం కలవారు. ఇక్కడ, రఘుపతి (శ్రీరాముడు) ఎలా కనిపించగలడు?’
మనీ వసే జైసే జైసే | భోళ్యా భావికా ఆభాసే తైసే | ఆమ్హా సకళా సాఈ దిసే | హిలాచ కైసే రామరూప | ||౪౭||
47. ‘అమాయక భక్తుల మనసులో ఏదుంటే, అదే వారికి పైకి అనిపిస్తుంది. మాకందరికీ సాయి కనిపిస్తే, ఈమె ఒక్కర్తికే రాముని రూపం ఎలా కనిపించింది?’
ఏసే కుతర్క కరూని నానా | కేలీ తియేచీ అవహేలనా | విషాద నాహీ బాఈచ్యా మనా | అసత్య కల్పనా తీ నేణే | ||౪౮||
48. ఇలా ఎన్నో కుతర్కాలతో ఆమెను విపరీతంగా ఎగతాళి చేశాడు. అయినా, ఆమె మనసులో ఏమీ బాధ పడలేదు. నిజం కానివాటిని ఊహించుకోవటం ఆమెకు తెలియదు.
తీ పూర్వీ మోఠీ అధికారీ | అసీ తియేచీ ఆఖ్యా భారీ | హోతసే రామదర్శన సుఖకారీ | ప్రహరో ప్రహరీ తియేస | ||౪౯||
49. పరమార్థంలో ఆమె ఇదివరకే అర్హతను పొంది, ప్రసిద్ధిని సంపాదించుకున్నది. ఆమెకు అప్పుడప్పుడూ అలా రాముని దర్శనం కలుగుతుండేది.
పుఢే జాహలా ద్రవ్య లోభోద్భవ | ద్రవ్యాపాశీ నాహీ దేవ | జాహలా రామదర్శనీ అభావ | ఏసా హా స్వభావ లోభాచా | ||౫౦||
50. కాని, తరువాత, ఆమెకు డబ్బు మీద ఆశ పెరిగింది. డబ్బు ఉండే చోట దేవుడుండడు. అందుకే రాముని దర్శనం కరువై పోయింది. లోభంయొక్క ఫలితం ఇదే.
సాఈస హే తో సర్వ అవగత | జాణూని తిచే సరలే దురిత |
పునరపి రామదర్శన దేత | పురవీత హేత తియేచా | ||౫౧||
51. సాయికి ఇవన్నీ తెలుసు. ఆమె పాపాలు తొలగిపోయింది తెలుసుకొని, ఆమెకు మరల రాముని దర్శనాన్ని కలిగించి, ఆమె కోరికను తీర్చారు.
అసో పుఢే తేచ రాత్రీ | కైసీ వర్తలీ నవల పరీ | గృహస్థ దేఖే నిద్రేమాఝారీ | స్వప్న భారీ భయంకర | ||౫౨||
52. తరువాత, అదే రాత్రి జరిగిన వింతను గమనించండి. నిద్రలో, ఆమె భర్త భయంకరమైన కలను కన్నాడు.
ఆపణ ఆహోంత ఎకా శహరీ | పోలీస ఎక ఆపణా ఘరీ | ముసక్యా బాంధూన ఆవళీ కరకరీ | టోకే నిజకరీ మాగే ఉభా | ||౫౩||
53. తాను ఒక పట్టణంలో ఉండగా, తనను ఒక పోలీసు పట్టుకుని, తన చేతులను వెనుకకు విరచి కట్టి, అక్కడే వెనుక నిలబడి, త్రాటి రెండు కొనలను గట్టిగా బిగిస్తున్నాడు.
తేథేంచ ఎక పింజరా తే జాగీ | నికట తయాచియా బాహ్యభాగీ | సాఈ హీ సర్వ పహావయాలాగీ | ఉభేచ కీ ఉగీ నిశ్చళ | ||౫౪||
54. అక్కడే, అదే చోట్లో, ఒక పెద్ద పంజరం ఉంది. దాని బయట, దగ్గరలోనే, సాయి ఆ దృశ్యాన్ని చూస్తూ ఊరికే నిలుచున్నారు.
పాహూని మహారాజ సంనిధానీ | జోడూనియా దోనీ పాణీ | కరోనియా ముఖ కేవిలవాణీ | దీన వాణీ తవ వదే | ||౫౫||
55. సాయి మహారాజు తన దగ్గరలోనే ఉండటం చూసి, రెండు చేతులూ జోడించి, అతను ఎంతో దైన్యంగా,
‘బాబా ఆపులీ కీర్తీ ఏకూని | పాతలో అసతా అపులే చరణీ | ప్రసంగ హా కా ఆమ్హాలాగూని | తుమ్హీహీ అసూని ప్రత్యక్ష’ | ||౫౬||
56. ‘బాబా! మీ కీర్తిని విని, మీ పాదాల దగ్గరకు వస్తే, మీరిక్కడే ఉండగా, మాకు ఈ గండం ఎందుకు?’ అని అడిగాడు.
మహారాజీ ప్రత్యుత్తర దిధలే | “కృతకర్మ అవఘే పాహిజే భోగిలే” | గృహస్థ అతి వినీత బోలే | ‘కాంహీ న కేలే ఏసే మ్యా | ||౫౭||
57. “చేసిన కర్మలను అనుభవించి తీరాలి” అని సాయి మహారాజు జవాబిచ్చారు. అతడు మరల చాలా వినయంగా, ‘నేనలాంటిది ఏదీ చేయలేదే?’ అని అన్నాడు.
యా జన్మీ తరీ కాంహీ న కేలే | జేణే హే ఏసే సంకట గుజరలే’ | తయావరీ మహారాజ బోలలే | “అసేల కేలే జన్మాంతరీ” | ||౫౮||
58. ‘ఇంతటి గండం మీద పడేంత నేరం, నేనీ జన్మలో ఏదీ చేయలేదు’ అని అన్నాడు. అప్పుడు మహారాజు, “వెనుకటి జన్మలలో చేసి ఉండవచ్చు” అని అన్నారు.
దిధలే మగ ప్రత్యుత్తర తేణే | ‘మాగీల జన్మాచే మీ కాయ జాణే | అసలే తరీ తే అపులే దర్శనే | భస్మ హోణే ఆవశ్యక | ||౫౯||
59. ‘వెనుకటి జన్మలలో నేనేం చేశానో నాకేం తెలుసు? ఒక వేళ ఏదైనా చేసి ఉన్నా, అది మీ దర్శనంతో, కాలి బూడిద అవ్వాలి, కదా!’ అని అతను అన్నాడు.
హోతా అమ్హా ఆపులే దర్శన | అగ్నీపుఢే జైసే తృణ | తైసే తే సమూళ భస్మ హోఊన | కైసా న త్యాపాసూన ముక్త మీ | ||౬౦||
60. ‘నిప్పులో కాలి, గడ్డి బూడిద అయినట్లు, మీ దర్శనంతో ఆ కర్మలు కాలి బూడిద అయ్యి, వాటినుండి నేను ఎందుకు ముక్తుణ్ణి కాలేదు?’
తంవ మహారాజ వదతీ తయాస | “ఏసా తరీ ఆహే కా విశ్వాస” |
‘హోయ’ మ్హణతా గృహస్థాస | డోళే మిటావయాస ఆజ్ఞాపితీ | ||౬౧||
61. అప్పుడు మహారాజు “నీకంతటి నమ్మకం ఉందా?” అని అడిగారు. ‘ఉన్నది’ అని అతడు చెప్పగా, కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు.
ధాడదిశీ జైసే పడలే కోణీ | ఆవాజ శ్రవణీ ఏకిలా | ||౬౨||
62. ఆజ్ఞ ప్రకారం అతడు కళ్ళు మూసుకుని నిలబడగా, వెంటనే, దభేలుమని ఎవరో పడ్డట్లు పెద్ద చప్పుడు వినిపించింది.
ఆవాజ కానీ పడాతా దచకలా | డోళే ఉఘడూని పాహూ లాగలా | ఆపణ బంధనిర్ముక్త దిసలా | పోలీస పడలా రక్తబంబాళ | ||౬౩||
63. అది విని, ఉలిక్కిపడి, కళ్ళు తెరచి, చుట్టూ చూశాడు. తను బంధనంనుండి విముక్తుడైయాడు. కాని, పక్కనే, రక్తపు మడుగులో ఒక పోలీసు పడి ఉండటాన్ని చూశాడు.
తేణే మనీ అత్యంత ఘాబరలా | మహారాజాంకడే పాహూ లాగలా | హాంసూన మగ తే మ్హణతీ తయాలా | “భలా సాంపడలాస తూ ఆతా | ||౬౪||
64. దాంతో, చాలా భయపడి, మహారాజు వైపు చూడసాగాడు. మహారాజు నవ్వుతూ అతనితో “నీవు ఇప్పుడు భలేగా పట్టుబడ్డావు” అని అన్నారు.
ఆతా యేతీల అమలదార | పాహూన యేథీల సర్వ ప్రకార | తూంచ దాండగా మ్హణతీల అనివార | పునః గిరఫతార కరతీల7” | ||౬౫||
65. “ఇప్పుడు పై అధికారి ఇక్కడికి వచ్చి, ఇదంతా చూసి, నువ్వే నేరం చేశావని, నిన్ను మరల బందీగా పట్టుకుంటాడు”.
మగ తో గృహస్థ వదే తత్వతా | ‘బాబా ఆపణ ఖరేంచ బోలతా | కసేంహీ కరా సోడవా ఆతా | దిసేనా త్రాతా తుమ్హాంవీణ’ | ||౬౬||
66. అతడు ‘బాబా! మీరు చెప్పింది నిజమే. ఏమైనా చేసి, నన్నిప్పుడు విడిపించండి. రక్షించటానికి, మీరు తప్ప నాకింకెవరూ కనిపించటం లేదు’ అని వేడుకున్నాడు.
ఏసే ఏకూని సాఈ వదతీ | “పునశ్చ లావీ నేత్రపాతీ” | తైసే కరూని డోళే జో ఉఘడితీ | నవల స్థితీ ఆణిక | ||౬౭||
67. అది విని బాబా, “మరల కళ్ళు మూసుకో”, అని చెప్పారు. అతడలాగే చేసి, తెరచి చూడగా, ఇంకొక అద్భుతం చూశాడు.
ఆపణ పింజర్యాచే బాహ్యదేశీ | మహారాజ సాఈ అపులేపాశీ | ఘాతలే సాష్టాంగ నమన త్యాంసీ | బాబా మగ పుసతీ తయాతే | ||౬౮||
68. తను పంజరం బయట ఉన్నాడు. సాయి మహారాజు దగ్గరలోనే ఉన్నారు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు బాబా,
“ఆతాంచా తుఝా నమస్కార | ఆణి యా పూర్వీ జే ఘాలీస8 నిరంతర | ఆహే కా దోహీత అంతర | కరూన విచార సాంగే మ” | ||౬౯||
69. “నువ్వు ఇప్పుడు చేసిన నమస్కారానికీ, మరి ఇంతకు మునుపు చేసినదానికి, ఈ రెండింటిలో తేడా ఏమైనా ఉందా? బాగా ఆలోచించి చెప్పు” అని అన్నారు.
తంవ తో గృహస్థ దేఈ ఉత్తర | ‘జమీన అస్మానాచే అంతర | కేవళ ద్రవ్యార్థ పూర్వ నమస్కార | సాంప్రత పరమేశ్వరభావానే | ||౭౦||
70. అప్పుడతను, ‘బాబా! నింగికీ, నేలకూ, ఉన్నంత తేడా ఉంది. మొదటిది కేవలం డబ్బు మీద ఆశతో చేసింది. కాని ఇప్పుడు, మీరే దేవుడని నమస్కరించాను!
పూర్వీ కాంహీంహీ భావ నవ్హతా | ఇతకేంచ నవ్హే ముసలమాన అసతా |
ఆపణ ఆమ్హా హిందూస భ్రష్టవితా | హోతా చిత్తా హా రోష’ | ||౭౧||
71. ‘మునుపు నాకసలు ఏ మాత్రం భక్తి లేదు. పైగా, మీరు ముసల్మానులై, హిందువులైన మమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నారని, నా మనసులో కోపం ఉండేది’.
తయావరీ బాబా పుసతీ | “నాహీ కాయ తుఝియా చిత్తీ | ముసలమానాచ్యా దేవాంచీ భక్తీ” | ‘నాహీ’ మ్హణతీ గృహస్థ | ||౭౨||
72. అని చెప్పగా, బాబా “నీ మనసులో ముసల్మానుల దేవుళ్ళపై భక్తి లేదా?” అని అడిగారు. అతను ‘లేదు’ అని చెప్పాడు.
పుసతీ బాబా తయాలాగునీ | “పంజా నాహీ కా తుఝియా సదనీ | పూజీత నాహీస కా తాబుతాచే దినీ | పాహీ మనీ విచారూనీ | ||౭౩||
73. బాబా అతనిని “మీ ఇంట్లో పంజా లేదా? తాబూతు (మొహరం) రోజున దానిని పూజ చేయవా? బాగా ఆలోచించుకో” అని అడిగారు.
కాడ-బిబీ9 హీ ఆహే సదనీ | లగ్న కార్యాసీ తిజలా పూజూనీ | తుష్టవితోసనా మానపానీ | ముసలమానీ దైవత హే” | ||౭౪||
74. “కాడ బీబీ కూడా ఇంట్లో ఉంది. పెళ్ళిలాంటి శుభకార్యాలలో ఆమెను పూజించి, ముస్లిముల దేవత అయిన ఆమెను శాంత పరుస్తారా లేదా?” అని అడిగారు.
‘హోయ’ మ్హణూని మాన్య కరితా | “ఆణిక కాయ ఇచ్ఛా” పుసతా | ‘నిజగురూ రామదాస దర్శనతా10’ | ఉపజలీ ఆస్థా గృహస్థా | ||౭౫||
75. అవునని అతను ఒప్పుకున్నాడు. “ఇంకా ఏమైనా కోరిక ఉందా?” అని బాబా అడగగా, తన గురువైన రామదాసును దర్శించాలని చెప్పాడు.
మహారాజ మగ తయాప్రతీ | “మాగే వళూన పహా” మ్హణతీ | మగ జో మాగే వళూన పాహతీ | సమర్థ మూర్తీ11 సన్ముఖ | ||౭౬||
76. మహారాజు అతనిని “వెనుకకు తిరిగి చూడు” అని అన్నారు. అలా అతను తిరిగి చూసే సరికి, తన ఎదుటే సమర్థ రామదాసు కనిపించారు.
పడతాంచ సమర్థాంచే పాయీ | అదృశ్య జాహలే ఠాంఈచే ఠాయీ | మగ తో జిజ్ఞాసా పూర్వక పాహీ | ఆణిక కాంహీ విచారీ | ||౭౭||
77. సమర్థుల పాదాల పై పడగా, వారు వెంటనే మాయమయ్యారు. తరువాత, కుతూహలంతో అతను బాబాతో,
‘బాబా ఆపులే జాహలే వయ | మ్హాతారా హా దిసతో కాయ12 | ఆహే ఆపణ ఠావా కాయ | ఆయుర్దాయ13 ఆపులా’ | ||౭౮||
78. ‘బాబా! మీకు వయసు మళ్ళింది. మీ దేహం కూడా ఎంతో ముసలిగా కనిపిస్తుంది. మీ జీవిత కాలమెంతో మీకు తెలుసా?’ అని అడిగాడు.
“కాయ వదసీ మీ మ్హాతారా ఆహే | మాఝియా సవే ధాంవూని పాహే” | మ్హణోన సాఈ జో ధాంవతాహే | హా లాగలాహే మాఘారా | ||౭౯||
79. “ఏమంటున్నావు? నేను ముసలివాణ్ణా? ఏదీ, నాతో పరుగెత్తి చూడు” అంటూ, బాబా పరుగెత్త సాగారు. వారి వెనుక అతడు పరుగు పెట్టాడు.
మహారాజ సవేగ ధాంవతా | ధుళోరా జో ఉసళలా వరతా | తేచ సంధీస పావలే అదృశ్యతా | పావలీ జాగృతతా గృహస్థాస | ||౮౦||
80. మహారాజు వేగం పెంచుతూ పరుగెత్తుతుంటే, లేచిన ఆ ధూళిలో వారు మాయమయ్యారు. గృహస్థునికి మెలుకువ వచ్చింది.
అసో తో జై లాధలా జాగృతీ | మనీ విచారితా స్వప్నస్థితీ |
తాత్కాళ పాలటలీ చిత్తవృత్తీ | వానీ మహతీ బాబాంచీ | ||౮౧||
81. నిద్రలోంచి మేలుకున్న తరువాత, తనకు వచ్చిన కల గురించి అతను మనసులోనే బాగా ఆలోచించుకో సాగాడు. అప్పటికప్పుడే, అతని మనసు మారిపోయి, బాబా గొప్పతనాన్ని పొగడ సాగాడు.
బాబాంవిషయీ సంశయవృత్తీ | మావళలీ పరిస్థితీ పూర్వీల | ||౮౨||
82. సాయియొక్క అద్భుతమైన లీలను చూసి, సాయి పాదాలమీద అతనికి నమ్మకం, భక్తి కుదిరాయి. సాయి పట్ల ఉన్న మునుపటి చెడు అభిప్రాయాలు, అనుమానాలు తొలగిపోయాయి.
పాహూ జాతా అవఘే స్వప్న | పరి తీ ఉత్తరే ఆణి తే ప్రశ్న | ఏకూని శ్రోతా కరావా గ్రహణ | భావార్థ గహన ఆంతీల | ||౮౩||
83. చూడటానికి అది అంతా ఒట్టి కలే. అయినా, అందులోని ప్రశ్నలు జవాబులు విన్న శ్రోతలు, వానిలోని గూఢమైన అర్థాన్ని గ్రహించాలి.
హా ప్రశ్నోత్తర అనువాద | మద్రాసీ పావలా పరమ బోధ | విరాలా సాఈసంబంధీ విరోధ | హాస్య వినోద రూపానే | ||౮౪||
84. ఈ ప్రశ్నలు, ఉత్తరాల సంభాషణ ద్వారా, మద్రాసునుంచి వచ్చిన అతనికి చక్కటి జ్ఞానం కలిగింది. అలా, వినోదాల ద్వారా, అతనికి బాబా మీదున్న ద్వేషం తొలగిపోయింది.
దుసరే దివశీ ప్రాతఃకాళీ | మండళీ మశీదీ దర్శనా ఆలీ | దోన రుపయాంచీ బర్ఫీ దిధలీ | కృపా కేలీ సాఈనాథే | ||౮౫||
85. మరునాడు ఉదయం, ఆ మద్రాసీ భక్తులందరూ బాబా దర్శనానికి మసీదుకు వచ్చారు. సాయినాథులు వారిని కరుణించి, వారికి రెండు రూపాయల బర్ఫీ మిఠాయిని ఇచ్చారు.
తైసేచ పల్లవచే రుపయే దోన | బాబాంనీ తయా సమస్తా దేఊన | ఘేతలే కాంహీ దివస ఠేవూన | భజన పూజన చాలలే | ||౮౬||
86. దాంతో పాటే, తమ జేబులోంచి రెండు రూపాయలను వారందరికి ఇచ్చి, వారిని మరి కొన్ని రోజులు అక్కడే ఉంచుకున్నారు. వారు పూజలు, భజనలు చేశారు.
పుఢే కాంహీ కాళ క్రమిలా | నిఘాలీ మండళీ జాణ్యాలా | నాహీ జరీ బహు పైసా లాధలా | భరపూర లాభలా ఆశీర్వాద | ||౮౭||
87. అలా కొన్ని రోజులు గడిచాయి. వారు వెళ్ళి పోవటానికి సిద్ధంగా ఉన్నారు. వారు అనుకున్నంత డబ్బు వారికి దొరకలేదు కాని, బాబా ఆశీస్సులు చాలా దొరికాయి.
"అల్లా మాలిక బహోత దేగా | అల్లా తుమ్హారా అచ్ఛా కరేగా" | పుఢే హేంచ కీ ఆలే ఉపేగా14 | లాగలే మార్గా తే జేవ్హా | ||౮౮||
88. “అల్లా మాలిక బహుత దేగా (అల్లా మాలిక చాలా ఇస్తాడు), అల్లా తుమ్హారా అచ్ఛా కరేగా (అల్లా మీకు మేలు చేస్తాడు)” అని అన్నారు. ఆ ఆశీర్వచనాలే వారికి దారిలో, రాత్రింబవళ్ళూ ఉపయోగ పడ్డాయి.
సాఈచియా ఆశీర్వచనీ | సాఈచీ ఆఠవణ ధ్యానీ మనీ | మార్గ చాలతా దివస రజనీ | దుఃఖ నా స్వప్నీ తిళభరీ | ||౮౯||
89. సాయి ఆశీర్వాదంతో, సాయి పేరు మనసులో ధ్యానిస్తూ ఉండటం వలన, వారికి ప్రయాణంలో, పగలూ రాత్రి, కలలోనైనా కొంచెం కూడా ఇబ్బంది కలుగలేదు.
ఘడలీ ఆశీర్వాదానురూప | యథాసాంగ యాత్రా అమూప | వాటేస న హోతా యత్కించిత తాప | పాతలే సుఖరూప నిజగృహా | ||౯౦||
90. బాబా ఆశీర్వాద ఫలంగా, వారు ఎన్నో తీర్థయాత్రలు, ఏ లోటూ లేక, సుఖంగా చేసి, ఏ బాధ పడకుండా, ఇంటికి చేరుకున్నారు.
మనీ చింతిల్యా హోత్యా ఎకా | త్యా ఘడూన ఘడల్యా యాత్రా అనేకా |
వానీత సాఈవచన కౌతుకా | ఆనంద సకళికా అనుపమ | ||౯౧||
91. వారు మనసులో అనుకున్న యాత్రలే కాక, ఇంకా ఎన్నో ఇతర యాత్రలు కూడా చేశారు. అందరికీ ఎంతో ఆనందం కలిగింది. సాయి మాటలలోని అద్భుతమైన శక్తిని వర్ణిస్తూ, వారు చెప్పలేనంత ఆనందాన్ని పొందారు.
శివాయ సంతాచే ఆశీర్వచన | “అల్లా అచ్ఛా కరీల” హే వచన | అక్షరే అక్షర సత్య హోఊన | మనోరథ పూర్ణ జాహలా | ||౯౨||
92. అంతే కాకుండా, “అల్లా అచ్ఛా కరేగా (అల్లా మేలు చేస్తాడు)” అన్న సాయి ఆశీర్వచనం, అక్షర సత్యమై, వారి మనసులోని కోరికలన్నీ తీరాయి.
ఏసే తే సమస్త తీర్థోపాసక | భగవద్భక్త మద్రాసీ లోక | సకళ సత్వస్థ సాత్వీక | బంధమోచక సాఈ త్యా | ||౯౩||
93. ఈ రకంగా తీర్థయాత్రలకు బయలుదేరిన మద్రాసు బృందం, సదాచార సంపన్నులూ, సాత్వికులుగా మారి, భగవద్భక్తులైనారు. బాబా వారికి ముక్తిని ప్రసాదించారు.
ఏసీచ సురస ఆణీక కథా | సాంగతో పరిసిజే సాదర శ్రోతా | భక్తిభావే శ్రవణ కరితా | ఆశ్చర్య చిత్తా ప్రకటేల | ||౯౪||
94. ఇలాంటిదే ఇంకొక రసభరితమైన కథను చెప్పుతాను, వినండి. భక్తితో శ్రద్ధగా వింటే, శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది.
భక్తకాజకల్పద్రుమ | కైసే సాఈ దయాళూ పరమ | కైసే సప్రేమ భక్తాంచే కామ | పురవీత అవిశ్రమ సర్వదా | ||౯౫||
95. పరమ దయాళువు, భక్తుల పాలిట కల్పవృక్షం సాయి. తమ భక్తుల కోరికలను ఎంతో ప్రేమతో, శ్రమ లేకుండా, ఏ విధంగా ఎల్లప్పుడూ తీరుస్తారో, వినండి.
ఠాణే జిల్హ్యాంత వాంద్రే శహర | తత్రస్థ ఎక భక్తప్రవర | రఘునాథరావ తేండూలకర | చతురధీర బహుశ్రుత | ||౯౬||
96. ఠాణా జిల్లాలోని బాంద్రా పట్టణంలో (ఇప్పుడు ఇది ముంబై నగరంలో ఒక భాగం) ఉన్న రఘునాథరావు తేండూలకరు అనే ఒక భక్త శ్రేష్ఠుడు, శాంత స్వభావుడు, పండితుడు.
సదా ఆనందీ మోఠే ప్రేమీ | వినటలే సాఈచే పాదపద్మీ | తేథీల బోధ మకరందకామీ | అఖండ నామీ గుణగుణత | ||౯౭||
97. ఎప్పుడూ ఎంతో సంతోషంగా ఉండే గొప్ప ప్రేమగలవాడు. సాయి పాదాల దగ్గర లభించే అమృతంలాంటి జ్ఞానాన్ని పొందాలని, వారి పాదాల దగ్గరకు చేరాడు. సాయినామాన్ని ఆపకుండా జపించేవాడు.
రూప దేఊని ‘భజనమాలా’ | వర్ణిలీ జయాంనీ సాఈలీలా | తీ భక్తి ప్రేమే వాచీల త్యాలా | సాఈచ పావలా పావలీ15 | ||౯౮||
98. సాయి లీలలను ‘భజనమాల’ అనే పుస్తకంలో రచించాడు. వానిని భక్తితో పఠించిన వారికి అడుగడుగునా సాయియే కనిపిస్తారు.
సావిత్రీ నామే తయాంచే కలత్ర | బాబూ తయాంచా జ్యేష్ఠ పుత్ర | పహా తయాంచా అనుభవ విచిత్ర | పరిసా తే చరిత్ర సాఈచే | ||౯౯||
99. అతని భార్య పేరు సావిత్రి. వారి పెద్ద కుమారుడు బాబు. వారికి కలిగిన విచిత్రమైన అనుభవాలను, సాయి లీలలను ఇప్పుడు వినండి.
ఎకదా బాబూ సాశంకితమన | వైద్యకీయ పాఠశాళేమధూన | ఘేఊన పరదేశీయ వైద్యకీ శిక్షణ | పరిక్షేలాగూన బైసేనా | ||౧౦౦||
100. మెడికల్ కాలేజీలో అలోపతి వైద్యం చదువుతున్న బాబు, ఒక సారి, అనుమానం రావటంతో, పరీక్షకు కూర్చోలేదు.
తయానే రాత్రీచా దివస కరూన | అభ్యాస కేలా అతి కసూన |
సహజ జ్యోతిష్యాస కేలా ప్రశ్న | పరీక్షేంత ఉత్తీర్ణ హోఈన కా | ||౧౦౧||
101. రాత్రింబవళ్ళూ కష్ట పడి బాగా చదివాడు. అయినా, తను పాసు అవుతానా లేదో అనే అనుమానం వచ్చి, ఒక జ్యోతిష్యుని అడిగాడు.
రాశీ నక్షత్రే మోజూని బోటానే | సచింత ముద్రేనే అవలోకీ | ||౧౦౨||
102. జ్యోతిష్యుడు పంచాంగంలోని పేజీలను తిరగవేసి, వేళ్ళమీద రాసులను నక్షత్రాలను లెక్క పెట్టి, గ్రహబలాలు ఎంత ఉన్నాయో చూశాడు.
మ్హణే కేలాంత పరిశ్రమ థోర | పరి యే వర్షీ న గ్రహాంచే జోర | పుఢీల వర్షే ఫార శ్రేయస్కర | పరీక్షా నిర్ఘోర తే వర్షీ | ||౧౦౩||
103. అంతా చేసిన తరువాత ‘నువ్వు బాగా కష్టపడి చదివావు. కాని, ఈ ఏడు నీకు గ్రహబలం లేదు. వచ్చే ఏడు నీకు మంచి జరుగుతుంది. అప్పుడు నువ్వు ఖచ్చితంగా పాసవుతావు’ అని బాబుతో అన్నాడు.
బైసూన పరీక్షేస కాయ సార్థక | హోణార జరీ శ్రమ నిరర్థక | విద్యార్థ్యానే హా ఘేతలా వచక | తేణే తో కచకలా మనాసీ | ||౧౦౪||
104. విద్యార్థి ఈ మాట విని, ‘పడిన శ్రమ వ్యర్థమైతే, ఇంక పరీక్షకు వెళ్ళి ఏం లాభం?’ అని అనుకున్నాడు. అతనికి ధైర్యం తగ్గి పోయి, భయం కలిగింది.
పుఢే తయా విద్యార్థ్యాచీ మాతా | అల్పావకాశీ శిరడీస జాతా | నమితా సాఈచరణ మాథా | కుశల వార్తా చాలల్యా | ||౧౦౫||
105. కొన్ని రోజుల తరువాత, ఆ విద్యార్థి తల్లి శిరిడీకి వెళ్ళి, సాయి పాదాల మీద తలనుంచి నమస్కరించగా, బాబా అందరి క్షేమ సమాచారాన్ని అడిగారు.
నిఘాలీ తైంహీ హీ కథా | కరుణా వచనీ బాబాంసీ ప్రార్థితా | మ్హణే ములగా పరీక్షేస బసతా16 | అసతీ అనుకూలతా గ్రహాంచీ | ||౧౦౬||
106. అప్పుడు మాట్లాడుతూ, ఆమె మిగతా సంగతులతో పాటు, పరీక్ష గురించి చెబుతూ, అతి దీనంగా ‘గ్రహాలు అనుకూలంగా ఉంటే, అబ్బాయి పరీక్ష రాసేవాడు.
పత్రికా పాహిలీ జ్యోతిష్యాంహీ | మ్హణతీ యందా యోగ నాహీ | అసూన అభ్యాసాచీ తయారీహీ | ములగా న జాఈ పరీక్షేస | ||౧౦౭||
107. ‘కాని, జ్యోతిష్యుడు జాతకం చూసి, ఈ ఏడు ఆ యోగం లేదన్నాడు. అందుకే అబ్బాయి బాగా చదివి కూడా, పరీక్షకు పోవటం లేదు.
తరీ బాబా హీ కాయ గ్రహదశా | యందా అశీ కాంహీ నిరాశా | పడేల ఎకదా పదరీ పరీక్షా | ఏసీ బహు ఆశా సమస్తా | ||౧౦౮||
108. ‘కానీ, బాబా! ఈ గ్రహదశ అంటే ఏమిటి? ఇప్పుడు మాకీ నిరాశ ఎందుకు? ఈ ఏడు పరీక్ష పాసయి పోతాడని అందరం చాలా ఆశ పడ్డాం’ అని చెప్పింది.
ఏకూన బాబా వదలే వచన | "సాంగే తయాస మాఝే మాన17 | పత్రికా ఠేవీ గుండాళూన | బైసే జా స్వస్థ మన పరీక్షే | ||౧౦౯||
109. ఇది విని బాబా, “వాడికి నన్ను నమ్మమని చెప్పు. జాతకాలని చుట్టి పెట్టి, స్థిరమైన మనసుతో, ధైర్యంగా పరీక్షకు వెళ్ళమని చెప్పు.
నాదా కుణాచ్యా లాగూ నకా | జన్మపత్రికా పాహూ నకా | సాముద్రికా విశ్వాసూ నకా | చాలవా నికా అభ్యాస | ||౧౧౦||
110. “ఎవరి మాటా వినకుండా, జాతకాన్ని చూడకుండా, హస్త సాముద్రికాన్ని నమ్మ వద్దని చెప్పు. చక్కగా చదువుకోమని చెప్పు.
మ్హణావే ములాస యేఈల యశ | స్వస్థ చిత్తే పరీక్షేస బైస |
హోఊ నకో అసా నిరాశ | ఠేవీ విశ్వాస మజవరీ” | ||౧౧౧||
111. “ ‘నువ్వు తప్పకుండా పాసవుతావు, వెళ్ళి, వేరే ఏ ఆలోచనా లేకుండా, పరీక్ష రాయి’ అని చెప్పు. నిరాశ పడకుండా, నా మీద పూర్తి నమ్మకం ఉంచమని చెప్పు”.
అసో బాబాంచీ ఆజ్ఞా ఘేఊని | ఆఈ పరతలీ గ్రామాలాగునీ | ములాస బాబాంచా నిరోప కథునీ | ఉత్సాహే జననీ ఆశ్వాసీ | ||౧౧౨||
112. తరువాత బాబా అనుమతిని పొంది, ఆ తల్లి ఊరికి తిరిగి వెళ్ళింది. బాబా చెప్పినదానిని అబ్బాయికి తెలియచేసి, అతని ఉత్సాహాన్ని, ధైర్యాన్ని పెంచింది.
ఏసా తో సాఈవచనోల్హాస | ములగా బైసలా పరీక్షేస | ఉత్తరేంహీ లేఖీ ప్రశ్నాంస | యథావకాశ దిధలీ | ||౧౧౩||
113. సాయి మాటలతో ఉత్తేజితుడై, ఎంతో ఉత్సాహంగా ప్రశ్నలన్నింటికీ సరియైన సమాధానాలు రాసి, ఇచ్చిన సమయంలోనే పరీక్ష ముగించాడు.
లేఖీ పరీక్షా పూర్ణ ఝాలీ | ఉత్తరేంహీ సంపూర్ణ లిహిలీ | పరి ఆత్మవిశ్వాసే18 ఘేరలీ | సంశయే చళలీ స్థిరబుద్ధి | ||౧౧౪||
114. రాత పరీక్షలు పూర్తి అయినాయి. అన్ని ప్రశలకూ బాగా, తృప్తికరంగా సమాధానాలు రాశాడు. కాని, తరువాత, అతని ధైర్యం సడలి, మనసు, బుద్ధి అటూ ఇటూ ఊగసాగింది.
అసతా లిహిలీ సమ్యగుత్తరే | ఉత్తీర్ణ వ్హావయా తితుకీ పురే | పరి విద్యార్థియా వాటే తే అపురే | సోడిలా ధీర తయాతే | ||౧౧౫||
115. పరీక్ష పాసవటానికి కావలిసినంత బాగా అతడు రాశాడు. కాని, అది సరిపోదేమోనని అనుకుని, ఆశ వదులుకున్నాడు.
వస్తుతః లేఖీ పరీక్షేంత పాస | హోతా తరీ త్యాస వాటే మీ నాపాస | తేణే హోఊన తో ఉదాస | తోండీ పరీక్షేస బైసేనా | ||౧౧౬||
116. నిజానికి, రాత పరీక్షలో పాసైనా, అవలేదని అతనికి అనిపించి, బాగా కుంగిపోయి, నోటి పరీక్షకు వెళ్ళలేదు.
తోండీ పరీక్షేస ఆరంభ ఝాలా | ప్రథమ దివస తైసాచ గేలా | దుసరే దివశీ ఎక స్నేహీ ఆలా | విద్యార్థీ దేఖిలా భోజనస్థిత | ||౧౧౭||
117. నోటి పరీక్ష మొదలైంది. నిరాశతోనే మొదటి రోజు గడచి పోయింది. రెండవ రోజు, బాబు భోజనం చేస్తుండగా, అతని స్నేహితుడు ఒకడు వచ్చాడు.
మ్హణే హీ కాయ ఆశ్చర్యతా | పరీక్షకాలా తుఝీ చింతా | మ్హణే జా పాహూన యే ఆతా | తేండులకర నవ్హతా కా కాల | ||౧౧౮||
118. ‘ఏమిటీ ఆశ్చర్యం? పరీక్ష చేసేవానికి, నీ గురించి చింత. ‘తేండులకర నిన్న ఎందుకు రాలేదో, వెళ్ళి కనుక్కొని రా’ అని అన్నారు.
లేఖీ పరీక్షేంత తో నాపాస | తయా తోండీచే కిమర్థ సాయాస | మ్హణూన ఘరీ తో బైసలా ఉదాస | స్పష్ట మీ తయాస సాంగితలే | ||౧౧౯||
119. ‘రాత పరీక్షలో పాసు కాకపోవటం వలన, నోటి పరీక్ష కోసం శ్రమ పడి ఏం లాభం అని, నిరాశతో ఇంట్లోనే కూర్చున్నాడు’ అని నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాను.
తేవ్హా పరీక్షక వదే తూ జాఈ | అసేల తైసా ఘేఊన యేఈ | ‘లేఖీ పరీక్షేంత పాస’ హీ దేఈ | ఆనందదాయీ ఖబర త్యా | ||౧౨౦||
120. ‘దానికి ఆ పరీక్షకుడు ‘నీవు వెళ్ళి, ఉన్న పళంగా అతనిని వెంటబెట్టుకుని రా. రాత పరీక్షలో పాసయిన సంతోష సమాచారం అతనికి తెలియ చేయి’ అని చెప్పాడు’.
మగ తో ఆనంద కాయ పుసావా | కేలా మహారాజ సాఈచా ధాంవా |
న ఘేతా ఎక క్షణాచా విసావా | ఉల్హాస భావా ధాంవలా | ||౧౨౧||
121. తరువాత కలిగిన ఆనందాన్ని అడగాలా? సాయి మహారాజును తలుచుకొని, ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా, సంతోషంగా నోటి పరీక్షకు పరుగు తీశాడు.
దిధలీ దృఢ నిజపదీ జోడ | సాఈనీ కోడ పురవునీ | ||౧౨౨||
122. తరువాత, అతనికి అన్నీ మేలు జరిగింది. పరీక్ష పాసయాడు. అలా అతని కోరికను తీర్చి, అతనికి తమ మీదున్న నమ్మకాన్ని సాయి బలపరచారు.
దళావయాచే జాత్యాచా ఖుంట | హాలహాలవూని బసవితీ ఘట్ట | తైసీచ గురుపదనిష్ఠేచీ గోష్ట | హాలవూని చోఖట సాఈ కరీ | ||౧౨౩||
123. తిరుగలి పిడిని ఊపి, గట్టిగా కొట్టి బిగించినట్లు, గురువు పాదాల మీద కలిగే భక్తిని కూడా, సాయి బాగా తిప్పి, తిప్పి, దృఢంగా నాటుకునేలా చేస్తారు.
ఏసే న కోణా కేవ్హాంహీ కథితీ | జేణే న హాలేల చిత్తవృత్తీ | హే తో బాబాంచీ నిత్య ప్రచీతీ | నిష్ఠా యేరీ తీ దృఢ కరితీ | ||౧౨౪||
124. ఎవరికైనా, ఎప్పుడైనా, ఏదైనా వారు చెప్పితే, అది భక్తుల మనసుల మీద ముద్ర వేయకుండా ఉండేది కాదు. బాబాతో జరిగే అనుభవాలంతా ఇలాగే ఉండేవి. భక్తిని, నమ్మకాన్ని వారు ఇలాగే బలపరచేవారు.
చాలూ జాతా కథిల్యా వాటే | ఆరంభీ ఆరంభీ గోడ వాటే | పుఢే ఏసే పసరితీల సరాటే | కాంటేచ కాంటే చోంహీకడే | ||౧౨౫||
125. వారు చూపిన దారిలో పోతుంటే, మొదట సుఖంగానే ఉంటుంది. కాని, తరువాత ఆ దారిలో ముళ్ళు పరచి ఉండటంతో, ఎటు చూసినా ముళ్ళే కనిపిస్తాయి.
మగ త్యా నిష్ఠేస ఫుటతీల ఫాంటే | సహజ మనీ సంశయ దాటే | కిమర్థ సాఈ యా ఆడ వాటే | ఆణీ హే వాటే మనాలా | ||౧౨౬||
126. ముళ్ళ దారిలో పోయేటప్పుడు, నమ్మకం సడలుతుంది. ‘బాబా ఇలాంటి అడ్డదారిలో ఎందుకు తీసుకుని వచ్చారా?’ అని మనసులో అనుమానం కలుగుతుంది.
పరి హే ఏసే జేథే వాటే | తేథేంచ శ్రద్ధా ధరా నేటే | కసోటీచ హీ ప్రత్యక్ష సంకటే | తేణేంచ పైఠే19 దృఢ శ్రద్ధా | ||౧౨౭||
127. కాని, అలాంటప్పుడే, బలమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ కష్టాలే మనకు నిజమైన పరీక్షలు. వీని వలననే, మనసులోని శ్రద్ధ బలంగా నాటుకుంటుంది.
దేఊనియా సంకటా తోండ | కరితా సాఈ స్మరణ అఖండ | హోతీల సకళ అపాయ దుఖండ | శక్తీహీ ప్రచండ నామాచీ | ||౧౨౮||
128. కష్టాలను లెక్క చేయకుండా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని, ఆగకుండా సాయి నామస్మరణ చేస్తే, అన్ని కష్టాలూ తొలగిపోతాయి. ఇదే నామంయొక్క ప్రచండ శక్తి.
హేంచ యా అంతరాయాంచే ప్రయోజన | తేంహీ కరీ సాఈచ నిర్మాణ | తేవ్హాంచ ఘడేల సాఈస్మరణ | సంకటోపశమనహీ తేవ్హాంచ | ||౧౨౯||
129. ఈ కష్టాల వల్ల కలిగే ప్రయోజనం ఇదే. ఆ కష్టాలను కలుగ చేసేది కూడా సాయియే. అవే మన మనసులో సాయిని తలచుకునేటట్లు చేస్తాయి. తరువాతే, కష్టాలు కూడా తొలగిపోతాయి.
అసో యాచ ములాచే వడీల | భక్త బాబాంచే అతి ప్రేమళ | ధీర ఉదార సత్వశీల | గాత్రే శిథిల జాహలీ | ||౧౩౦||
130. అదే అబ్బాయి తండ్రి చాలా ప్రేమమయుడు. ధీరుడు, ఉదారుడు, సత్యశీలుడు మరియు బాబా భక్తుడు. కాని, ఇప్పుడు అతని దేహం నీరసించి పోయింది.
ప్రసిద్ధ పరదేశీయ వ్యాపారీ | పేఢీ జయాంచీ ముంబఈ శహరీ |
ఇమానే ఇతబారే తయాంచే పదరీ | కేలీ నోకరీ తయాంనీ | ||౧౩౧||
131. ముంబైలోని ప్రసిద్ధమైన వ్యాపార సంస్థలో అతడు శ్రద్ధగా, నమ్మకంతో ఉద్యోగం చేశాడు.
పుఢే హోతా వృద్ధాపకాళ | నేత్రాంస యేఊ లాగలీ ఝాంకళ | ఇంద్రియే నిజకార్యీ వికళ | వాంఛితీ నిశ్చళ ఆరామ | ||౧౩౨||
132. ముసలితనం రావటంతో, కళ్ళు సరిగ్గా కనిపించకుండా అయ్యింది. దేహంలోని అవయవాలు తమ పనులు చేయలేక పోతున్నాయి. దాంతో, అతను విశ్రాంతి కావాలని అనుకున్నాడు.
కామ కరాయా ఉరలీ న శక్తి | మ్హణూన సుధారావయా ప్రకృతీ | రఘునాథరావ రజా ఘేతీ | స్వస్థ విశ్రాంతీ భోగితీ | ||౧౩౩||
133. పని చేయటానికి, దేహంలో శక్తి మిగల లేదు. అందుకు తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటానికి, రఘునాథరావు సెలవు తీసుకుని, సుఖంగా విశ్రాంతి తీసుకున్నాడు.
పుఢే తీ రజా సంపూర్ణ భరలీ | నాహీ పూర్ణ విశ్రాంతీ లాభలీ | మ్హణూన మాగుతీ అర్జీ లిహిలీ | రజా ప్రార్థిలీ ఆణీక | ||౧౩౪||
134. సెలవంతా అయిపోయినా, పూర్తి విశ్రాంతి దొరకినట్లు అతనికి అనిపించలేదు. అందుకే, ఇంకా సెలవు కావాలని ప్రార్థిస్తూ, దరఖాస్తు పెట్టుకున్నాడు.
అర్జీ దేఖూనియా ఉపరీ20 | అపేక్షిత రజేచీ శిఫారస కరీ | పరి త్యా పేఢీచే వరిష్ఠాధికారీ | పూర్ణ విచారీ దయాళూ | ||౧౩౫||
135. అతని దరఖాస్తు చూసి, కోరుకున్న సెలవు పొడిగించటానికి అతని పై అధికారి సిఫారసు చేశాడు. ఆ సంస్థ ముఖ్య అధికారి చాలా నిదానస్థుడు, దయాళువు.
ధనీ మనాచా ఉదార | పాహూని అపులా ఇమానీ చాకర | దేఈ ప్రేమాచీ అర్ధీ భాకర | పుఢీల చరితార్థ చాలావయా | ||౧౩౬||
136. నమ్మకంతో పని చేసిన వారికి, తదుపరి జీవితాన్ని గడపటానికి, జీతంలో సగభాగాన్ని పెన్షనుగా, ఉదారుడైన యజమాని ప్రేమతో ఇస్తాడు.
ఏసీ హీ సరకారీ పద్ధత | ఉత్తమ పేఢ్యాహీ ప్రసంగోపాత | ప్రామాణిక సేవకాంనిమిత్త | ఉత్తేజనార్థ అవలంబితీ | ||౧౩౭||
137. సాధారణంగా ప్రభుత్వం పాటించే పద్ధతి ఇది. నమ్మకమైన ఉద్యోగస్థులను సంతోష పెట్టటానికి, కొన్ని మంచి సంస్థలు కూడా, ఈ పద్ధతిని అవలంబిస్తాయి.
పరి హీ భాకర మాఝా ధనీ | దేఈల కాయ మజలాగునీ | పడేన జేవ్హా మీ బేకార21 హోఊనీ | ఏసియా చింతనీ పడలే తే | ||౧౩౮||
138. ‘కాని, ఉద్యోగం మానేస్తే, నా యజమాని నాకు కూడా పెన్షను ఇస్తాడా?’ అని రఘునాథరావు చింతించ సాగాడు.
దీడశే అవఘా మాఝా పగార | పాఊణశేంచ్యా పేన్శనావర | పడేల దినచర్యేచా భార | మనాంత విచార ఘోళత | ||౧౩౯||
139. ‘నా జీతం మొత్తం నూటయాభై రూపాయలు. డబ్భై అయిదు రూపాయల పెన్షనుపై రోజువారి ఖర్చు భారం పడుతుంది’ అని మనసులో ఆలోచించాడు.
పరి పుఢే జాహలీ మౌజ | పహా బాబాంచే నవల భోజ | రఘునాథరావాంచే కుటుంబా హితగుజ | పుసతీ22 తే చోజ పరిసిజే | ||౧౪౦||
140. కాని, తరువాత అద్భుతమైన వింతొక్కటి జరిగింది. ఆ లీలలోని ప్రత్యేకతను గమనించండి. రఘునాథరావు భార్యతో, వారి మేలు కోసం, బాబా ముచ్చటించిన కౌతుకాన్ని వినండి.
అఖేరచా హుకుమ వ్హావయా ఆధీ | అసతా పంధరా దిసాంచా అవధీ |
జాఊని తియేచ్యా స్వప్నామధీ | పుసతీ బుద్ధీ తియేస | ||౧౪౧||
141. పెన్షను ఆర్డరును చివరిగా నిర్ణయించడానికి, ఇంకా పదిహేను రోజుల సమయముండగా, ఆమె కలలో బాబా కనిపించి, ఆమె అభిప్రాయం అడిగారు.
బాఈ వదే ‘హే కాయ పుసా | ఆమ్హా భరంవసా అపులాచ’ | ||౧౪౨||
142. “వంద రూపాయలు ఇవ్వాలని నా ఇచ్ఛ. నీ మనసులోని కోరికకు అది సరిపోతుందా?” అని అడగగా ‘బాబా! మీరేమిటిది అడుగుతున్నారు? మాకు మీమీదే నమ్మకం’ అని ఆమె చెప్పింది.
తికడే ఠరావ అర్జీవర | రఘునాథరావ ఇమానీ నోకర | బహుత జాహలీ సేవా ఆజవర | అర్ధీ23 భాకర ఘ్యావీ త్యా | ||౧౪౩||
143. అక్కడ అతని దరఖాస్తుపై, ‘రఘునాథరావు నమ్మకమైన ఉద్యోగిగా, నేటి వరకు చాలా సేవ చేశాడు. కనుక, అతనికి జీతంలో సగం పెన్షనుగా ఇవ్వాలి’ అని నిర్ణయం జరిగింది.
ముఖే జరీ వదలే శంభర | దహా దిధలే ఆణిక వర | ఏసే హే సమర్థ కరుణాకర | ప్రేమ అనివార భక్తాంచే | ||౧౪౪||
144. నోటితో బాబా వంద అని చెప్పినా, పైన మరో పది కూడా ఇచ్చారు. కరుణామయులైన సాయి సమర్థులకు, భక్తుల పైన ఇలా అంతు లేని ప్రేమ.
ఆతా పరిసా ఆణిక ఎక | కథా సుందర మనోరంజక | భక్తప్రేమోల్హాసకారక | ఆనందదాయక శ్రోతయా | ||౧౪౫||
145. ఇప్పుడు, మనసును సంతోష పరిచేది, సుందరమైంది, భక్తులకు ప్రేమను పెంచేది, శ్రోతలకు ఆనందాన్నిచ్చేది, అయిన మరొక కథను వినండి.
డాక్టర నామే క్యాపటన హాటే | బాబాంచే భక్త శ్రద్ధాళూ మోఠే | బాబాంనీ స్వప్నాంత దర్శన పహాంటే | దిధలే తే గోమటే కథానక | ||౧౪౬||
146. క్యాప్టన్ హాటే అను పేరుగల ఒక డాక్టరు, బాబాకు నమ్మకమైన భక్తుడు. ఒక తెల్లవారు ఝామున, అతని కలలో బాబా దర్శనమిచ్చిన అందమైన కథ ఇది.
హాటే రాహతీ గ్వాలేరీ | బాబాంస దేఖతీ స్వప్నామాఝారీ | పహా బాబాంచీ ప్రశ్నకుసరీ | హాటేహీ ఉత్తరీ కాయ వదతీ | ||౧౪౭||
147. హాటే, తన కలలో బాబాను, గ్వాలియరులో చూశాడు. అప్పుడు బాబా అడిగిన ప్రశ్నలోని నేర్పును, దానికి హాటే ఇచ్చిన జవాబును గమనించండి.
మ్హణతీ బాబా మజ విసరలాసీ కాయ | తాత్కాళ హాట్యాంనీ ధరిలే పాయ | జరీ విసరలే లేంకరూ మాయ | తరణోపాయ కైసేనీ | ||౧౪౮||
148. “నన్ను మరచి పోయావా, ఏమిటి?” అని బాబా అడగగా, వెంటనే హాటే వారి పాదాలను పట్టుకుని, ‘బిడ్డలు తల్లిని మరచి పోతే, వారికిక వేరే గతి ఏమిటి?’
ఉఠూన బాగేంత గేలే తాంతడీ | ఖుడిలీ తాజీ వాలపాపడీ | శిఘా సాహిత్య దక్షిణా రోకడీ | భక్తి పరవడీ సిద్ధ కేలీ | ||౧౪౯||
149. అని వెంటనే లేచి, తోటలోకి వెళ్ళి, తాజా చిక్కుళ్ళను కోసుకుని వచ్చి, స్వయంపాకం వస్తువులను, దక్షిణను, ఎంతో భక్తిగా సిద్ధపరచుకున్నాడు.
ఏసీ పాహోని సిద్ధీ పూర్తి | హాటే తే సూప జో సమర్పూ సరతీ | అవచిత ఉఘడలీ నేత్రపాతీ | స్వప్నస్థితీ హే తై కళలే | ||౧౫౦||
150. అన్నీ ఉన్న చేటను సమర్పించాలని అనుకునే సరికి, అతనికి అకస్మాత్తుగా మెలుకువ వచ్చింది. అప్పుడు అది కల అని తెలుసుకున్నాడు.
తాత్కాళ హాట్యాంచే జాహలే మన | పదార్థ హే సమస్త మిళవూన |
కరావే బాబాంస ప్రత్యక్ష అర్పణ | తదర్థ జాఊన శిరడీస | ||౧౫౧||
151. తక్షణం, ఆ పదార్థాలన్నిటినీ బాబాకు తానే సమర్పించటానికి శిరిడీ వెళ్ళాలని, హాటేకు కోరిక కలిగింది.
పరి తే తేవ్హా గ్వాలేరీస | పత్ర24 లిహిలే ముంబఈస | వృత్తాంత సాద్యంత కళవిలా స్నేహ్యాస | వినవిలే శిరడీస జావే స్వయే | ||౧౫౨||
152. కాని, అప్పుడు అతడు గ్వాలియరులో ఉన్నాడు. అందుకు, ముంబైలోని తన స్నేహితునికి (కాకాసాహేబు దీక్షితు) తన కలగురించి ఉత్తరం రాశాడు. అందులో ‘నీవు స్వయంగా శిరిడీకి వెళ్ళు.
టపాల మార్గే యేఈల పైసా | శిధా ఘ్యావా యోగ్య తైసా | శేంగా పాపడీచ్యా సుందర ఖాశా | మిళవావ్యా కైశాతరీహీ | ||౧౫౩||
153. ‘తపాలా ద్వారా నీకు అందే డబ్బుతో, స్వయంపాక వస్తువులను, మంచి చిక్కుళ్ళను ఎలాగైనా సంపాదించాలి.
ఉరలా పైకా సవే న్యావా | శిధ్యాసమవేత బాబాంస ద్యావా | చరణ వందూని ప్రసాద మాగావా | తో మజ ద్యావా పాఠవూన | ||౧౫౪||
154. ‘మిగిలిన డబ్బును, ఈ వస్తువులతో, బాబాకు సమర్పించు. వారి పాదాలకు నమస్కరించి, వారి ప్రసాదాన్ని తీసుకుని నాకు పంపించు’.
పైసా యేతాంచ స్నేహీ నిఘాలే | శిరడీస జాఊన సామాన ఘేతలే | పాపడీవాంచూన కించిత అడలే | తో ఎక టోపలే తై ఆలే | ||౧౫౫||
155. డబ్బు అందగానే ఆ స్నేహితుడు, శిరిడీకి వెళ్ళి, సరుకులన్నిటినీ కొన్నాడు. కాని చిక్కుళ్ళు దొరకక పోయే సరికి, ఎలా అని ఆలోచన మొదలైంది. ఇంతలో అకస్మాత్తుగా తలపై బుట్టతో ఒక స్త్రీ వచ్చింది.
తే హోతే జియే బాఈచే మాథా | తియేస బోలాఊన పాహూ జాతా | శేంగాచ పాపడీచ్యా లాగల్యా హాతా | అతి ఆశ్చర్యతా సకళాంతే | ||౧౫౬||
156. ఆమెను పిలిచి చూడగా, ఆమె బుట్టలో చిక్కుళ్ళు చేతికి అందింది. ఇది చూసి, అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది.
మగ తే సర్వ సాహిత్య ఆణిలే | మహారాజాంసీ సాదర కేలే | త్యాంనీ నిమోణకరాంతే దిధలే | ఉదయీక నివేదిలే25 శిజవూన | ||౧౫౭||
157. తరువాత, ఆ వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళి, సాయి మహారాజుకు శ్రద్ధగా అర్పించాడు. వారు వానిని, నిమోంకరుకు ఇచ్చారు. మరునాడు, అతడు వానిని వండి, నైవేద్యాన్ని అర్పించాడు.
పుఢే బాబా భోజనా బైసతా | వరణ భాతాదికా న శివతా | శేంగాచ తేవఢ్యా ఉచలూన ఘేతా | ఆశ్చర్య సమస్తా వాటలే | ||౧౫౮||
158. భోజనానికి కూర్చున్నప్పుడు, బాబా పప్పు, అన్నం అవీ, ఏవీ తాకకుండా, చిక్కుళ్ళ కూరనే తీసుకుని తినగా, అందరికీ ఆశ్చర్యం కలిగింది.
శేంగాచ తేవఢ్యా గ్రహణ కేల్యా | త్యాచ తేవఢ్యా ముఖీ ఘాతల్యా | హాట్యాంనా బహు ఆనంద ఝాలా | వృత్తాంత కళలా హా తేవ్హా | ||౧౫౯||
159. బాబా చిక్కుళ్ళ కూరనే తీసుకుని తిన్నారన్న సంగతి తెలిసినప్పుడు, హాటేకు చాలా ఆనందం కలిగింది.
జయా మనీ జైసా భావ | తైసాచ కీ హా హాట్యాంచా అనుభవ | పుఢీల కథేచా పరిసా నవలావ | గోడ లాఘవ సాఈచే | ||౧౬౦||
160. ‘జయా మనీ జైసా భావ’, మనసులోని భావాలను బట్టి, అనుభవాలు కలుగుతాయని హాటేకు అనుభవమైంది. తరువాత జరిగిన కథను వినండి. సాయి భక్తుల కోరికలను తీర్చటంలోని మాధుర్యం తెలుస్తుంది.
సాఈ హస్తస్పర్శపూత | అసావా ఎక రుపయా గృహాంత |
ఇచ్ఛా ఉద్భవలీ హాట్యాంచే మనాంత | పురవీత మనోగత తో సాఈ | ||౧౬౧||
161. సాయి చేయి తాకి పవిత్రమైన, ఒక రూపాయి బిళ్ళను, తన ఇంట్లో అట్టి పెట్టుకోవాలని, హాటేకు ఒక కోరిక కలిగింది. సాయి దానిని పూర్తి చేశారు.
మగ పహా సాఈచీ కైసీ హతవటీ | ఉభాచ పాఠీ భక్తాంచ్యా | ||౧౬౨||
162. మనసులో కోటానుకోట్ల ఆలోచనలు. వానిలో చెడును వదిలి, మంచిని ఉంచుకోవాలి. అప్పుడు సాయియొక్క సామర్థ్యాన్ని చూడండి. వారు భక్తుల వెనుకే, ఎలా నిలచి ఉంటారు, అనేది తెలుస్తుంది.
హోతా ఏసీ సదిచ్ఛా నిర్మాణ | సఫళ వ్హావయా నలగే క్షణ | నిఘాలా ఎక స్నేహీ తత్‍క్షణ | సాఈదర్శనకాముక | ||౧౬౩||
163. మంచి ఆలోచన ఒక సారి వచ్చిందంటే, అది ఫలించటానికి క్షణం కూడా పట్టదు. హాటేకు ఆ ఆలోచన వచ్చిన వెంటనే, ఒక స్నేహితుడు, సాయి దర్శనానికని శిరిడీకి బయలుదేరటానికి, సిద్ధమయ్యాడు.
వృత్తీ అసావీ మాత్ర గోడ | నవల సాఈ పురవితో హోడ | జయా సద్‍వృత్తీచీ ఆవడ | తయాచే కోడ త్యా హాతీ | ||౧౬౪||
164. కోరికలు మంచివై ఉండాలి. సాయి వానిని తీరుస్తారు. మంచి ఆలోచనలు కలిగిన వారి కోరికలను తీర్చే బాధ్యత సాయిదే.
తంవ హాటే ఎక రుపయా దేతీ | తయా స్నేహ్యాసీ అతి ప్రీతీ | మ్హణతీ నకా పడూ దేఊ విస్మృతీ | ఘాలా హా హాతీ బాబాంచ్యా | ||౧౬౫||
165. ఎంతో ప్రేమతో, హాటే ఒక రూపాయిని స్నేహితునికి ఇచ్చి, ‘దీనిని మరవకుండా బాబా చేతిలో ఉంచు’ అని చెప్పాడు.
స్నేహీ జేవ్హా శిరడీస గేలే | తాత్కాళ బాబాంచే దర్శన ఘేతలే | చరణ తయాంచే మాథా వందిలే | సన్ముఖ బైసలే బాబాంచే | ||౧౬౬||
166. ఆ స్నేహితుడు, శిరిడీ వెళ్ళిన వెంటనే, బాబా దర్శనం చేసుకున్నాడు. వారి పాదాలకు నమస్కరించి, వారి ఎదుట కూర్చున్నాడు.
దక్షిణేలాగీ కర పసరితా | అపులీ దక్షిణా దిధలీ ప్రథమతా | బాబాంనీ ఖిశాంత సూదిలీ అవిలంబతా | కాఢీ తో మాగుతా హాట్యాంచీ | ||౧౬౭||
167. దక్షిణ కోసం బాబా చేయి చాపగా, అతడు తన దక్షిణను మొదట ఇచ్చాడు. వెంటనే బాబా దానిని తమ జేబులో వేసుకున్నారు. తరువాత, అతను హాటే ఇచ్చిన రూపాయను బయటకు తీశాడు.
తోహీ రుపయా జోడూని కర | ఠేవీ బాబాంచే కరతలావర | మ్హణే హీ దక్షిణా మజబరోబర | హాటే డాక్టర పాఠవితీ | ||౧౬౮||
168. జోడించిన చేతులతో, ఆ రూపాయిని బాబా అరచేతిలో ఉంచి, ‘ఈ దక్షిణను డాక్టరు హాటే నాతో పంపించాడు’ అని చెప్పాడు.
హా సాఈ సర్వహృదయవాసీ | హాటే జరీ గ్వాలేరనివాసీ | జాణూని మనీషా తయాంచే మానసీ | బైసలే రుపయాసీ న్యాహాళీత | ||౧౬౯||
169. అందరి మనసులో వాసం చేసేది సాయి. హాటే గ్వాలియరులో ఉన్నా, అతని మనసులోని కోరిక తెలుసు గనుక, ఆ రూపాయినే చూస్తూ కూర్చున్నారు.
హోఊనియా ప్రేమోన్ముఖ | బాబా రుపయా ధరితీ సన్ముఖ | నవల అవలోకితీ లావోని టక | లోక టకమక దేఖతీ | ||౧౭౦||
170. ఎంతో ప్రేమతో బాబా ఆ రూపాయినే చూస్తూ ఉంటే, జనులు ఆశ్చర్యంగా బాబానే చూడసాగారు.
దక్షిణాంగుష్ఠే వరచేవరీ | ఉడవూని ఝేలితీ బాబా నిజకరీ |
ఏసీ క్రీడా కరూని క్షణభరీ | రుపయా కరీత తే పరత | ||౧౭౧||
171. తమ కుడి చేతి బొటన వేలితో, ఆ రూపాయిని బాబా మాటి మాటికీ ఎగురవేస్తూ, కాసేపు ఆడుకుని, దానిని తిరిగిచ్చేశారు.
మ్హణతీ "హా జ్యాచా త్యాస దేఈ | సవే హా ఉదీచా ప్రసాద నేఈ | నలగే ఆమ్హాంస తుఝే కాంహీ | స్వస్థ రాహీ మ్హణే తయా" | ||౧౭౨||
172. “ఇది ఎవరిదో వారికి ఇచ్చేయి. నీ వెంట ఉదీ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళు. ‘నీదేదీ మాకు అవసరం లేదు. నిశ్చింతగా ఉండు’ అని అతనితో చెప్పు” అని అన్నారు.
ఘాలూన లోటాంగణ బాబాంచే పాయీ | ఉదీ ప్రసాద పాఊని ఠాయీ | ఘేఊని బాబాంచీ ఆజ్ఞా తో స్నేహీ | ఆలా నిజ గృహీ గ్వాలేరీస | ||౧౭౩||
173. సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆ స్నేహితుడు వారి అనుమతిని, ఉదీ ప్రసాదాన్నీ తీసుకుని, గ్వాలియరులోని తన ఇంటికి చేరుకున్నాడు.
ఆలియావరీ గ్వాలేరీతే | రుపయా దేఊని డాక్టరాతే | కళవిలే సకళ వృత్తాంతాతే | దాటలే భరతే హాట్యాంతే | ||౧౭౪||
174. గ్వాలియరు చేరుకోగానే, డాక్టరు హాటేకు రూపాయినిచ్చి, జరిగిన సంగతులు అన్నింటినీ అతను చెప్పాడు. ప్రేమతో హాటే మనసు పొంగిపోయింది.
మ్హణే మనీ జైసా హేత | కేలా హోతా జైసా సంకేత | జాణోని మాఝే మనోగత | పురవిలా మనోరథ బాబాంనీ | ||౧౭౫||
175. ‘నేను కోరుకున్నట్లే, నా మనసులోని కోరికను బాబా తెలుసుకుని, దానిని తీర్చారు’ అని అన్నాడు.
ఏసే వాటలే హాట్యాంచే మనా | పరి హీ తరీ త్యాంచీ కల్పనా | కోణ జాణీల సంతాంచీ యోజనా | ప్రయోజనా తయాంచ్యా | ||౧౭౬||
176. హాటే మనసుకు అలా అనిపించింది. అదేమో అతని ఆలోచన. కానీ, సాధువుల యోచన, దాని ప్రయోజనాన్ని ఎవరు తెలుసుకోగలరు?
హే జరీ మ్హణావే నిశ్చిత | తీచ పహా దుసరీ ప్రచీత | తీ తో యాహూన విపరీత | జ్యాచే మనోగత త్యా ఠావే | ||౧౭౭||
177. ఏదీ ‘ఇలాగే’ అని ఖచ్చితంగా చెప్పలేం. దీనికి వ్యతిరేకమైన ఇంకొక సంఘటనను చూడండి. సత్పురుషుల మనసు వారికే తెలుస్తుంది తప్ప, ఇతరులకు తెలియదు.
ఎకాచా రుపయా పరత దేతీ | ఎకాచా తో ఖిశాంత సూదతీ | కారణ కాయ వదావే నిశ్చితీ | కాయ చిత్తీ బాబాంచ్యా | ||౧౭౮||
178. ఒకరికి, ఇచ్చిన రూపాయిని తిరిగి ఇచ్చేస్తారు. మరొకరు ఇచ్చిన దానిని, జేబులో వేసుకుంటారు. అది ఎందుకు అని ఎలా చెప్పగలం? బాబా మనసులో ఏముందో, ఎవరు చెప్పగలరు?
త్యాంచీ కారణే తయాంస ఠావీ | ఆపణ కేవళ మౌజ పహావీ | ఏసీ గోడ సంధీ న దవడావీ | కథా పరిసావీ యే అర్థీ | ||౧౭౯||
179. కారణాలు వారికే తెలుసు. మధురమైన అవకాశాన్ని వదులుకోకుండా, వారి లీలలను చూడటమే మన పని. దీని గురించి, ఈ కథను వినండి.
ఎకదా వామన నార్వేకర | జయాంస బాబాంచే ప్రేమ అపార | ఆణిలా ఎక రుపయా సుందర | భక్తిపురఃసర అర్పాయా | ||౧౮౦||
180. బాబా అంటే అంతులేని ప్రేమ ఉన్న వామన నార్వేకరు, ఒక సారి, అందమైన ఒక రూపాయి నాణ్యాన్ని భక్తిగా బాబాకు అర్పించాలని, తెచ్చాడు.
ఎకా బాజూస కోరిలీ హోతీ | రామ లక్ష్మణ సీతాసతీ |
దుజియా బాజూస రమ్య మూర్తీ | హోతా మారుతీ బద్ధాంజుళీ | ||౧౮౧||
181. ఆ నాణ్యానికి, ఒక వైపు రామలక్ష్మణులతో సీతామాత, మరోవైపు చేతులు జోడించుకుని, బద్ధాంజలుడైన అందమైన మారుతి బొమ్మ, చెక్కి ఉన్నాయి.
మిళావా ఊదీ ప్రసాదాసహిత | మ్హణూన హస్తాంత ఠేవిలా | ||౧౮౨||
182. బాబా చేయి తాకి, ఉదీ ప్రసాదంతో, అది మరల తనకు లభించాలనే ఆశతో, దానిని వారి చేతిలో ఉంచాడు.
కోణ మనీ కాయ హృద్గత | బాబా హే తో సకళ జాణత | పరీ తో రుపయా పడతా హస్తాంత | తాత్కాళ ఖిశాంత సూదిలా | ||౧౮౩||
183. ఎవరి మనసులో ఏ కోరికుందో, బాబాకు అన్నీ తెలుసు. అయినా, ఆ రూపాయి తమ చేతిలో పడగానే, దానిని జేబులో వేసుకున్నారు.
వామనరావాచా మానస | మాధవరావాంనీ కళవిలా బాబాంస | రుపయా పరత కరావయాస | వినవిలే తయాంస అత్యంత | ||౧౮౪||
184. వామనరావు మనసులోని కోరికను, మాధవరావు బాబాకు చెప్పి, ఆ రూపాయిని అతనికి తిరిగి ఇమ్మని ప్రార్థించాడు.
“త్యాలా కసలా ద్యావయాచా | ఆపణాసచి తో ఠేవావయాచా” | వదలే బాబా స్పష్ట వాచా | వామనరావాంచ్యా సమక్ష | ||౧౮౫||
185. “అతనికి ఎందుకు ఇవ్వాలి? దానిని మనమే ఉంచుకోవాలి” అని బాబా, వామనరావు ఎదుటే, స్పష్టంగా అన్నారు.
“తరీహీ తో దేఈల | రుపయే పంచవీస యాచే మోల | హా మీ యాసీ దేఈన బదల” | మ్హణాలే బోల తయాలా | ||౧౮౬||
186. “అయినా, దీని వెల ౨౫ రూపాయలను అతను నాకు ఇస్తే, బదులుగా దీనిని నేను అతనికి తిరిగి ఇస్తాను” అని మాధవరావుతో అన్నారు.
మగ త్యా ఎకా రుపయాలాగీ | వామనరావానే లాగవేగీ | తేహీ మిళవూన జాగోజాగీ | బాబాలాగీ దిధలే | ||౧౮౭||
187. ఆ ఒక్క రూపాయి కోసం, గబగబా, అక్కడా ఇక్కడా అన్ని చోట్ల తిరిగి, వామనరావు డబ్బు సేకరించి, బాబాకు ఇచ్చాడు.
తేహీ పూర్వవత ఖిశాంత ఠేవిలే | మ్హణతీ రుపయాంచే ఢిగార లావిలే | తరీ త్యా రుపయాసవే న తోలే | ఉణే తే మోలే తయాపుఢే | ||౧౮౮||
188. వానిని కూడా బాబా, మునుపటి లాగే, జేబులో పెట్టుకున్నారు. “రూపాయల రాశి పోసినా, అవి ఈ రూపాయంత తూచలేవు. వాని విలువ దీనికంటే చాలా తక్కువ.
మ్హణతీ “శామా26 హా తూ ఘేఈ | అసూందే హా అపులే సంగ్రహీ | దేవ్హార్యామాజీ ఠేవూన దేఈ | కరీత జాఈ పూజన” | ||౧౮౯||
189. “శామా! దీనిని నువ్వు తీసుకో. నీ వస్తువులలో పెట్టుకో. దేవుళ్ళ దగ్గర పెట్టి, పూజ చేస్తూ ఉండు” అని అన్నారు.
ఆతా హే ఏసే కాయ కరితా | విచారావయాచీ కోణాస సత్తా | సాఈ యోగ్యాయోగ్య జాణతా | దేతా ఘేతా సమర్థ | ||౧౯౦||
190. ఇప్పుడు, ‘ఇలా ఎందుకు చేశారు?’ అని అడిగే ధైర్యం ఎవరికి ఉంది? యోగ్యమైనది ఏదో, కానిదేదో సాయికు బాగా తెలుసు. ఇచ్చినా, తీసుకున్నా దానికి వారే సమర్థులు.
అసో ఆతా హీ కథా ఆటపతా | విసావా దేఊ శ్రోతయా చిత్తా |
జేణే మనన ఆణీ నిదిధ్యాసతా | కథా పరిసతా ఘడావీ | ||౧౯౧||
191. ఇప్పుడు ఈ కథ ముగించి, శ్రోతల మనసుకు కొంత విశ్రాంతిని కలిగిస్తా. దాని వలన, విన్నదానిని, మళ్ళీ తలచుకుని, దాని గురించి ఆలోచించటానికి, కొంత సమయం దొరుకుతుంది.
కేలే కాయ ఏకలే శ్రవణ | పచనీ న పడే మననావీణ | వరీ న ఘడతా నిదిధ్యాసన | శ్రవణ నిష్కారణ హోఈల | ||౧౯౨||
192. విన్నదానిని, మళ్ళీ గుర్తు చేసుకోకపోతే, అది ఒంటికి పట్టదు. అలాగే, దాని గురించి ఆలోచించకపోతే, విన్నది వ్యర్థమవుతుంది.
తరీ హెమాడ సాఈసీ శరణ | మస్తకీ ధరీ సాఈచే చరణ | సకళ సాధనాంచే హే సాధన | పుఢీల నివేదన పుఢారా | ||౧౯౩||
193. హేమాడు సాయికి శరణుజొచ్చి, వారి పాదాలపై తన తలను ఉంచుతాడు. అన్ని సాధనాలలో కల్లా, గొప్ప సాధనం ఇదే. తరువాతి కథ తరువాత.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | స్వప్నకథా కథనం నామ |
| ఎకోనత్రింశత్తమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
టిపణీ:
1. మద్రాస (సధ్యాచే నావ చేన్నఈ) ఇలాఖ్యాత. 2. సణావారీ.
3. తమాసగీర లోక. 4. శ్రీంచా ఎక భక్త కోండాజీ యాంచీ ములగీ.
5. నిరుపయోగీ. 6. కోండాజీచ్యా బాయకోస. 7. పకడతీల.
8. ఘాలీత అసే. 9. నావాచే దైవత. 10. దర్శనాచీ ఇచ్ఛా.
11. సమర్థ రామదాస. 12. శరీర. 13. ఆయుష్యాచీ మర్యాదా.
14. ఉపయోగాలా. 15. పదోపదీ. 16. బసలా అసతా.
17. ఏక. 18. స్వతఃబద్దల స్వతఃసచ అసలేలా అవిశ్వాస.
19. ప్రవేశ కరితే. 20. వరిష్ఠ. 21. నోకరీవిరహిత. 22. కౌతుక.
23. అర్ధ్యా పగారాచే పేన్శన.
24. Extract from Captain Hate's letter, dated X'mas, Lashkar, Gwalior, C. I., addressed to Mr. H. S. Dikshit: "Though I am miles away the favour that Sai Baba Sad-Guru shows on me is marvellous. Duty keeps me here, but I will take the first opportunity of coming to Shirdi. My humble respects to Sai Baba. I have sent a M. O. of Rs. twelve only. Please give Rs. 10 as 'Dakshina' and Rs. 2 should be spent in buying ghee, wheat-flour, dal etc. as shidha. Please do keep on it, vegetable of वालपापडीच्या शॆंगा. All this shidha etc. has a special meaning and I shall be highly obliged to you for this favour of yours".
25. నైవేద్య కేలా.
26. మాధవరావ దేశపాండే.