Sunday, May 5, 2013

||అపస్మారాత్మహత్యా నివారణం తథా నిజ గురుపద స్థిరీకరణం నామ షడ్వింశతితమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౨౬ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||

భూతభౌతిక విషయ జాత | హే అఖిల విశ్వనిజాంతర్గత | 
దర్పణీ1 నగరీసే2 ప్రతిబింబిత | మాయావిజృంభిత3 మాయిక | ||౧|| 
1. కదిలే, కదలని వస్తువులతో కూడుకుని, అద్దంలో ప్రతిబింబంలా కనిపిస్తున్న ఈ జగత్తంతా, మాయయొక్క నమ్మరాని సృష్టి.
వస్తుగత్యా4 అనుద్భూత5 | ఆత్మస్వరూపీ అనుస్యూత6
తే హే విశ్వస్వరూపీ స్థిత | దిసే ఉద్భూత చరాచర | ||౨|| 
2. నిజానికి, ఇది అసలు సృష్టే కాదు. మనసులోనే పుట్టి, ఆ మనసుకే నిజమని అనిపించే అద్భుతమైన వంచన, మోసం. 
జే జే కాంహీ ఆరిసా7 దిసే | తే తే వాస్తవ8 తేథే నసే | 
జైసే వాసనామయ నిద్రేంత ఆభాసే | పరీ తే నాసే ప్రబోధీ9 | ||౩|| 
3. అద్దంలో కనిపించేవన్నీ, నిజానికి అద్దంలో ఉండవు. నిద్రలో నిజమైనట్లు కనిపించే కోరికలన్నీ, మెలుకువ రాగానే కరిగి పోతాయి. 
జాగృదవస్థా ప్రాప్తకాళే | స్వప్నోపలబ్ధ ప్రపంచ వితళే | 
అద్వయానందప్రకాశ వివళే10 | మహావాక్య మేళే సద్గురూచ్యా | ||౪|| 
4. నిద్రలోంచి మేలుకోగానే, కలలో దొరికిన ప్రపంచం కనిపించదు. వేదాలలోని మహావాక్యాలను సద్గురువు ఉపదేశించినప్పుడే, ‘అంతా ఒక్కటే’ అనే ఆనందాన్నిచ్చే వెలుగు కనిపిస్తుంది. 
విశ్వాచే జే సత్తా స్ఫురణ | తయాంచే అన్య నిరపేక్ష అధిష్ఠాన | 
తో గుర్వాత్మా ఈశ్వర జై ప్రసన్న | తయీంచ సాక్షాత్కారణ హే | ||౫|| 
5. స్వార్థం లేని, సృష్టించే శక్తిగల, దేవుని అవతారమైన గురువు ప్రసన్నుడైనప్పుడే, ఆ వెలుగుయొక్క ఉనికి తెలిసేది. 
స్వప్రకాశ సదాత్మక | తే హే ఆత్మస్వరూప దేఖ | 
తేథే హే విశ్వ భూతభౌతిక | మాయా కౌతుక హా ఖేళ | ||౬|| 
6. ఇదే నిజమైన, స్వతఃగా వెలుగుతున్న, ఎప్పుడూ ఉండే, ఆత్మ రూపం. కనిపించే ఈ విశ్వమంతా ఆ సృష్టి కర్తయొక్క ఆట, లేక మాయ. 
ఆబ్రహ్మస్తంబ పర్యంత | భూతభౌతిక హే సర్వ కల్పిత | 
ఏసే హే విస్తారలే జగత | మాయావిజృంభిత కేవళ | ||౭|| 
7. ఆ బ్రహ్మ మొదలుకొని, చిన్న పొదల దాకా, ఉండే ఈ జగత్తంతా కల్పనే. మాయ సృష్టించిన గొప్ప అద్భుతం ఇది. 
సర్ప మాలా దండ ధారా | స్వరూపాజ్ఞానే10 మానితీ దోరా | 
తైసాచి హా సకళ జగత్పసారా | స్వరూపీ థారా నాహీ యా | ||౮|| 
8. అజ్ఞానంతో పాముగా, మాలగా, కర్రగా, ప్రవాహంగా, తాడు కనిపిస్తుంది. అలాగే, విశాలంగా ఉండే ఈ విశ్వమంతా, అజ్ఞానంతో, నిజంగా ఉన్నట్లు అనిపిస్తుంది కాని, నిజమైన ఆత్మ రూపంలో దానికి చోటు లేదు. 
హే దృశ్య జాత మాయామయ | తత్వజ్ఞానే యాసీ లయ | 
గురువాక్య ప్రబోధసమయ | ప్రాప్త హోయ త్యాకాళీ | ||౯|| 
9. గురువు తత్వజ్ఞానాన్ని బోధించే సమయం వచ్చినప్పుడు, మాయతో కూడుకున్న, ఈ కనిపించే జగత్తు, ఆ తత్వ జ్ఞానంలో నశించి పోతుంది. 
తృతీయ పురుష ఎకవచనీ | ‘గృణాతి’ రూపార్థ ధరితా మనీ | 
శిష్యాస తత్వోపదేశదానీ | గురు ఎక జనీ సమర్థ | ||౧౦||
10. సంస్కృతంలో, ‘గృణాతి’ అనే పదానికి, ప్రథమ పురుష, ఏకవచన రూపాన్ని, దాని అర్థాన్ని, మనసులో ఉంచుకుంటే, తత్వోపదేశం చేయటంలో, గురువొక్కరే సమర్థులు అన్న సంగతి శిష్యునికి తెలుస్తుంది. 

మ్హణవూని ప్రార్థూకీ బాబాంప్రత | కరావీ బుద్ధి అంతరాసక్త | 
నిత్యానిత్య వివేక యుక్త | వైరాగ్యరత మజ కరీ | ||౧౧|| 
11. అందుకే, మన బుద్ధిని లోపలికి మలచి, అదే బుద్ధికి, ఏది ఎప్పుడూ ఉండేదో, ఏది కానిదో తెలుసుకునే శక్తినిచ్చి, ఇంద్రియాల కోరికలను తొలగించేలా చేయమని, బాబాను ప్రార్థిద్దాం. 
మీ తో సదా అవివేకీ మూఢ | ఆహే అవిద్యావ్యవధాననిగూఢ | 
బుద్ధి సర్వదా కుతర్కారూఢ | తేణేంచి హే గూఢ పడలే మజ | ||౧౨|| 
12. నేనేమో తెలివి లేనివాణ్ణి, మూఢుణ్ణి. నా బుద్ధి, ఏమీ తెలియక, అజ్ఞానంతో, చెడు ఆలోచనలతో కూడుకుని ఉన్నది. అందుకే ఇవన్నీ నాకు చిక్కు ప్రశ్నలుగా అనిపిస్తుంది. 
గురువేదాంత వచనీ భరంవసా | ఠేవీన మీ అఢళ ఏసా | 
కరీ మన జైసా ఆరసా | నిజ బోధ ఠసా ప్రకటేల | ||౧౩|| 
13. గురువు మీద, వేదాంతంలోని మాటల మీద నమ్మకముండేలా, నా మనసు అద్దంలా నిర్మలమై, అందులో ఆత్మ జ్ఞానం కనిపించేలా, ఓ సాయి, చేయండి. 
వరీ సద్గురో సాఈ సమర్థా | కరావీ యా జ్ఞానాచీ అన్వర్థతా | 
వినా అనుభవ వాచావిగ్లాపనతా11 | కాయ పరమార్థా సాధీల | ||౧౪|| 
14. సద్గురు సాయి సమర్థా! వీటన్నిటికంటే ఎక్కువగా, ఈ జ్ఞానంయొక్క నిజమైన అర్థం నాకు తెలిసేలా, అనుగ్రహించండి. అసలైన అనుభవం లేక, ఒట్టి మాటల గారడీతో పరమార్థాన్ని ఎలా సాధించగలం? 
మ్హణోన బాబా ఆపుల్యా ప్రభావే | హే జ్ఞాన అంగే అనుభవావే | 
సహజ సాయుజ్య పద పావావే | దాన హే ద్యావే కృపేనే | ||౧౫|| 
15. అందుకే, బాబా! మీ దయతో ఈ జ్ఞానాన్ని అనుభవించేలా చేసి, దానిని నేను నా స్వంతం చేసుకుని, సహజంగా ఆ దేవునిలో ఒక్కటైయేలా చేయండి. 
తదర్థ దేవా సద్గురుసాఈ | దేహాహంతా వాహతో పాయీ | 
ఆతా యేథూన తుఝే తూ పాహీ | మీపణ నాహీంచ మజమాజీ ||౧౬|| 
16. కాబట్టి ఓ దేవా! సద్గురు సాయీ! ‘ఈ దేహమే నేను’ అనే నా అహంభావాన్ని, మీ పాదలయందు అర్పిస్తున్నాను. మాలో ‘నేను’ అనేది ఇక ముందు లేకున్నట్లు, మీరే మమ్మల్ని కాపాడాలి. 
ఘేఈ మాఝా దేహాభిమాన | నలగే సుఖదుఃఖాచీ జాణ | 
ఇచ్ఛేనుసార నిజసూత్రా చాలన | దేఊని మన్మన ఆవరీ | ||౧౭|| 
17. నా శరీరాభిమానాన్ని తేసేసుకోండి. దానివలన కలిగే సుఖ దుఃఖాల అనుభవాలు నాకొద్దు. తరువాత, మీ ఇష్టం వచ్చినట్లు, మీ సూత్రాన్ని ఆడించి, నా మనసును అరికట్టండి. 
అథవా మాఝే జే మీపణ | తేంచి స్వయే తూ హోఊని ఆపణ | 
ఘేఈ సుఖదుఃఖాచే భోక్తేపణ | నకో వివంచన మజ త్యాచే | ||౧౮|| 
18. లేదంటే, నా అహంభావం కూడా మీరే అయి, నా సుఖ దుఃఖాల అనుభవాలను కూడా మీరే తీసుకోండి. దానివలన కలిగే చింతలు నాకొద్దు. 
జయజయాజీ పూర్ణకామా | జడో తుఝియాఠాయీ ప్రేమా | 
మన హే చంచల మంగలధామా | పావో ఉపరమా తవ పాయీ | ||౧౯|| 
19. పూర్ణ కామా! మీకు జయము జయము. నాకు మీ మీదున్న ప్రేమ రోజు రోజుకూ పెరుగుగాక. మంగళధామా! నా ఈ చంచలమైన మనసు, మీ పాదాలలో స్థిరంగా ఉండుగాక. 
తుజ వాంచూని దుజా కోణ | సాంగేల ఆమ్హాంస హితవచన | 
కరీల ఆముచే దుఃఖనిరసన | సమాధాన మనాచే | ||౨౦||
20. బాబా! మా మేలు గురించి, మీరు గాక మాకు వేరే ఎవరు చెప్పగలరు? మా దుఃఖాలను తొలగించి, మా మనసుకు శాంతిని వేరే ఎవరు చేకూరుస్తారు? 

దైవ శిరడీచే మ్హణూన ఝాలే | బాబా తేథే ఆగమన ఆపులే | 
పుఢే తేథేంచ వాస్తవ్య కేలే | క్షేత్రత్వ ఆణిలే త్యా స్థానా | ||౨౧|| 
21. బాబా! శిరిడీయొక్క భాగ్యంవలన మీరు అక్కడికి వచ్చారు. వచ్చిన తరువాత, మీరు అక్కడే ఉండి, శిరిడీని పుణ్య క్షేత్రంగా చేశారు.
ధన్య శిరడీచే సుకృత | కీ హా సాఈ కృపావంత | 
కరీ యా స్థళా భాగ్యవంత | అలంకృత నిజవాస్తవ్యే | ||౨౨|| 
22. ధన్యం శిరిడీ! అది వెనుక చేసుకున్న పుణ్యాల ఫలంగా, దయామయులైన సాయి అక్కడే ఉండి, దానిని అలంకరించి, ఎంతో భాగ్యవంతంగా చేశారు. 
తూంచి మాఝా చేతవితా | తూంచి మాఝా చాళితా | 
తై మీ కోణ తవ గుణ గాతా | కర్తాకరవితా తూ ఎక | ||౨౩|| 
23. సాయిదేవా! మీరే నాకు ప్రేరణ కలిగించేది. నాకు మాట వచ్చేలా చేసేది మీరే. అలాంటి మీ గుణాలను పాడటానికి నేనెవరిని? చేసేవారూ, చేయించేవారూ మీరొక్కరే. 
తుఝా నిత్య సమాగమ | హాచి ఆమ్హా ఆగమ నిగమ | 
తుఝే నిత్య చరిత్రశ్రవణ | హేంచ పారాయణ ఆముతే | ||౨౪|| 
24. మీతో ఎప్పుడూ కలిసి ఉండటమే మాకు శాస్త్రాలు, వేదాలు. ప్రతి రోజూ మీ కథలను వినటమే మాకు పవిత్ర గ్రంథాల పారాయణం. 
అనిమేష12 తుఝే నామావర్తన | హేంచ ఆమ్హా కథాకీర్తన | 
హేంచి ఆముచే నిత్యానుసంధాన | హేంచి సమాధాన ఆమ్హాంతే | ||౨౫|| 
25. ఒక్క నిమిషమైనా వదలకుండా, మీ పేరును చెప్పుకోవడమే మాకు కథా కీర్తన. మాకు మీ సహవాసం చేయించేది అదొక్కటే. అదే మాకు తృప్తినిచ్చేది. 
నలగే ఆమ్హా ఏసే సుఖ | జేణే హోఊ భజన విన్ముఖ | 
యాహూన అధఃపతన తే అధిక | పరమార్థ బాధక కాయ అసే | ||౨౬|| 
26. మీ భజనలనుండి వేరు చేసే సుఖాలు మాకొద్దు. పరమార్థంలో దిగజారి పోవటానికి, ఇంతకంటే ఎక్కువ అడ్డంకులు ఏవి ఉంటాయి? 
ఆనందాశ్రూ ఉష్ణ జీవన | కరూ తేణే చరణక్షాలణ | 
శుద్ధ ప్రేమ చందన చర్చన | కరవూ పరిధాన సత్శ్రద్ధా | ||౨౭|| 
27. ఆనందంతో కళ్ళనుండి పొంగి వస్తున్న వేడి నీటితో, మీ పాదాలను కడుగుతాము. నిర్మలమైన ప్రేమ అనే చందనాన్ని, మీ వొంటికి పూస్తాము. శ్రద్ధ అనే బట్టలు మీకు తొడిగిస్తాము. 
హే అంతరంగ పూజా విధాన | బాహ్యోపచార పూజేహూన | 
యేణే తుజ సుప్రసన్న | సుఖసంపన్న కరూ కీ | ||౨౮|| 
28. బయట చేసే పూజకంటే, ఇలా మనసులోనే మిమ్మల్ని పూజించి, మెప్పించి, ధన్యులమవుతాము. 
సాత్విక అష్టభావ కమల | అష్టదల అతీవ నిర్మల | 
మన కరూన ఎకాగ్ర అవికల | వాహూ నిజఫల సంపాదూ | ||౨౯|| 
29. సాత్వికమైన ఎనిమిది భావాలనే, నిర్మలమైన ఎనిమిది దళాలున్న కమలాన్ని, ఒకే మనసుతో, పావనమైన మీ పాదాలకు సమర్పించి, ఫలితాన్ని పొందుతాము. 
లావూ భావార్థ బుకా భాళా | బాంధూ దృఢ భక్తీచీ మేఖళా | 
వాహూ పాదాంగుష్ఠీంగళా | భోగూ సోహళా అలోలిక | ||౩౦||
30. నిర్మలమైన నమ్మకం అనే బుక్కాను (సువాసనలిచ్చే నల్లటి పుడి) మీ నొసట దిద్ది, చదరని భక్తి అనే మొలత్రాటిని మీ నడుముకు కట్టి, మీ పాదంయొక్క బొటన వేలి మీద మా మెడను వంచి, అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తాము. 

ప్రీతి రత్నాలంకారమండణ | కరూ సర్వస్వ నింబలోణ | 
కరూ భక్తిచామరాందోలన | తాపనివారణ తన్మయ ఛత్రే | ||౩౧|| 
31. రత్నాలతో పొదిగి ఉన్న మా ప్రేమతో మిమ్మల్ని అలంకరించి, మా సర్వస్వాన్నీ మీకు దిగదుడుపు దిష్టి తీస్తాము. మా పంచప్రాణాలను వింజామరాలుగా చేసి, మీకు ఎప్పుడూ వీస్తుంటాము. దహించి వేసే భయంకరమైన తాపాన్ని తొలగించటానికి, మీలో లీనమై పోయిన మమ్మల్నే గొడుగుగా చేస్తాము. 
సమర్పూ ఏసీ స్వానంద పూజా | అష్టభావ గంధ అర్గజా | 
ఏసే ఆమ్హీ ఆముచ్యా కాజా | సాఈరాజా పూజూ తుజ | ||౩౨|| 
32. ఈ రకంగా, గంధం, అక్షింతలతో మొదలైన ఎనిమిది రకాల ఉపచారాలతో, సాయి మహారాజా! మా మేలు కోసం, మీకు మానసిక పూజ చేస్తాము. 
అభీప్సితార్థ సిద్ధ్యర్థ | స్మరూ నిత్య ‘సాఈసమర్థ’ | 
యాచ మంత్రే సాధూ పరమార్థ | హోఊ కృతార్థ నిజనిష్ఠా | ||౩౩|| 
33. మా మనసులోని కోరికలు తీరటానికి, ఎప్పుడూ ‘సాయి సమర్థ’ అని ధ్యానం చేస్తాము. ఈ మంత్రం ద్వారానే పరమార్థాన్ని సాధిస్తాము. నిష్ఠతో, నమ్మకంతో తృప్తిని అనుభవిస్తాము. 
పూర్వీల అధ్యాయీ కథన | సాఈ సమర్థ దయాఘన | 
సాధావయాస నిజ భక్త కల్యాణ | కైసే శిక్షణ తే దేత | ||౩౪|| 
34. గడచిన అధ్యాయంలో, దయామయులైన సాయి సమర్థులు, తమ భక్తులకు మేలు చేయటానికి, ఎలా బోధించే వారో చెప్పాను. 
ఆతా యే అధ్యాయీ నిరూపణ | భక్తా స్వగురుపదీ స్థాపన | 
కవణే పరీ కరీత జాణ | కథావిందాన తే పరిసా | ||౩౫|| 
35. ఈ అధ్యాయంలో, భక్తులను వారివారి గురువుల పాదాలలో, బాబా ఎలా స్థిర పరచారో, ఆ అద్భుతమైన కథను చెప్పుతాను, వినండి. 
గతాధ్యాయాంతీ నిదర్శిత | భక్తపంతకథామృత | 
శ్రోతా పరిసిజే దత్తచిత్త | తత్వ నిశ్చిత వ్హావయా | ||౩౬|| 
36. పోయిన అధ్యాయం చివర, పంతు అనే భక్తుని కథామృతాన్ని తెలియ చేస్తానని చెప్పాను. ఆ కథయొక్క నీతి మనసులో బాగా నాటుకోవాలంటే, శ్రోతలు కథను శ్రద్ధగా వినాలి. 
కైసే కైసే అనుభవ దావిలే | కైసే నేత్రీ నిష్ఠాంజన సూదిలే | 
కైసే స్వగురుపదీ అఢళ కేలే | మన నివాలే కైసేనీ | ||౩౭|| 
37. ఆ భక్తునికి బాబా ఎటువంటి అనుభవాలను చూపించారు? అతని కళ్ళకు నమ్మకం అనే అంజనాన్ని ఎలా వేశారు? అతని గురువు పాదాలయందు అతనిని దృఢ పరచి, అతని మనసును ఎలా శాంత పరచారో వినండి. 
ఎకదా ఎక బహుత శ్రమే | భక్త ఎక పంత నామే | 
గేలే శిరడీస మిత్రసమాగమే | దర్శనకామే సాఈచ్యా | ||౩౮|| 
38. ఒక సారి, పంతు అనే ఒక భక్తుడు, చాలా కష్ట పడి, తన మిత్రుడితో సాయి దర్శనానికని శిరిడీకి వెళ్ళాడు. 
తే పూర్వీల అనుగృహీత | హోతే నిజగురుపాదీ స్థిత | 
శిరడీస జావే కింనిమిత్త | ఝాలే శంకిత మానసీ | ||౩౯|| 
39. అప్పటికే, అతడు తన గురువు అనుగ్రహాన్ని పొంది, వారి మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. అలాంటప్పుడు, ఇక శిరిడీకి ఎందుకు వెళ్ళాలి? అని సందేహం కలిగింది. 
తథాపి జయాచా జైసా యోగ | తైసా అకల్పిత ఘడతో భోగ | 
ఆలా సాఈదర్శనాచా ఓఘ | జాహలా అమోఘ సుఖదాయీ | ||౪౦||
40. అయినా, ఎప్పుడు ఏది జరగాలో, అది అనుకోకుండానే జరిగి పోతుంది. అలా అతనికి సాయి దర్శన భాగ్యం లభించి, ఎంతో సుఖం కలిగింది. 

ఆపణ కల్పావీ ఎక యోజనా | ఈశ్వరాచ్యా ఆణీకచి మనా | 
అదృష్టాపుఢే కాంహీ చాలేనా | తే స్వస్థ మనా పరిసిజే | ||౪౧|| 
41. మనమొకటి తలచితే, దేవుడు ఇంకొకటి తలచు! విధి ఎదుట ఎవరిదీ సాగదు కదా! దాని గురించి సావధానంగా వినండి.
ఠేవూనియా శిరడీచే ప్రస్థాన | కిత్యేక జన నిజ స్థానాహూన | 
నిఘాలే అగ్నిరథీ బైసూన | సకళ మిళూన ఆనందే | ||౪౨|| 
42. శిరిడీకి వెళ్ళాలని కొంత మంది నిశ్చయించుకుని, తమ ఇళ్ళనుండి బయలుదేరి, అందరూ కలిసి ఆనందంగా రైలు బండి ఎక్కారు. 
గాడీంత జై హే చఢలే అవచిత | తేథేంచ హోతే స్థిత హే పంత | 
శిరడీస జాణ్యాచా తయాంచా బేత | ఝాలా అవగత పంతాంస | ||౪౩|| 
43. వారు బండిలో ఎక్కే సరికి, బండిలోపల కూర్చున్న పంతు కనిపించాడు. వారందరూ శిరిడీకి వెళ్ళుతున్నట్లు పంతుకు తెలిసింది. 
మండళీంత కాంహీ పంతాచే స్నేహీ | త్యాంతచి కాంహీ విహిణీ వ్యాహీ | 
పంతాంచే మనాంత జాణే నసతాంహీ | బళేంచ ఆగ్రహీ సాంపడలే | ||౪౪|| 
44. వారిలో పంతు బంధువులు, స్నేహితులూ ఉన్నారు. దానివలన, పంతుకు శిరిడీ వెళ్ళాలని లేకపోయినా, వారందరి బలవంతం మీద వెళ్ళాల్సి వచ్చింది. 
అరంభీ పంతాంచా విచార | జాణే హోతే జేథవర | 
తికీటహీ తయాంచే తేథవర | పుఢే తో విచార బదలలా | ||౪౫|| 
45. అసలు తను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో అక్కడి వరకే, టికట్టు తీసుకుని ఉన్నాడు. తరువాత, తన ఆలోచన మార్చుకోవాల్సి వచ్చింది. 
స్నేహీ వ్యాహీ మ్హణతీ చలా | జాఊ సమవేత కీ శిరడీలా | 
మనీ నసతాంహీ ఆగ్రహాలా | హోకార దిధలా పంతాంనీ | ||౪౬|| 
46. ‘మనం అందరం కలిసి శిరిడీకి వెళ్ళుదాము’ అని బంధువులు, మిత్రులూ ఒత్తడి చేయగా, పంతు సరేనన్నాడు. 
పంత ఉతరలే విరారాస | మండళీ గేలీ ముంబఈస | 
ఉసనే ఘేఊని ఖర్చావయాస | పంతహీ ముంబఈస మగ గేలే | ||౪౭|| 
47. వారందరూ ముంబైకు వెళ్ళారు. పంతు విరార్‍ లోనే దిగాడు. చేతి ఖర్చుకు అప్పు తీసుకుని, పంతు కూడా ముంబైకి వెళ్ళాడు. 
మోడవేనా మిత్రాంచే మన | మిళవిలే నిజ గుర్వనుమోదన | 
ఆలే మగ తే శిరడీ లాగూన | సకల మిళూని ఆనందే | ||౪౮|| 
48. తన బంధువుల, మిత్రుల మనసు కష్ట పెట్టకూడదనుకుని, తన గురువు అనుమతిని తీసుకున్నాడు. తరువాత, అందరూ కలిసి ఆనందంగా శిరిడీ వెళ్ళారు. 
గేలే సర్వ మశీదీస | సకాళీ అకరాచే సమయాస | 
దాటీ భక్తాంచీ పూజనాస | పాహూని ఉల్హాస వాటలా | ||౪౯|| 
49. ఉదయం పదకొండు గంటల వేళకు, అందరూ మసీదుకు వెళ్ళారు. అక్కడ భక్తులు గుంపులుగా, బాబా పూజ చేయటం చూసి, వారందరికీ చాలా ఉత్సాహం కలిగింది. 
పాహూని బాబాంచే ధ్యాన | జాహలే సకళ ఆనందసంపన్న | 
ఇతుక్యాంత పంతాంస ఝీట యేఊన | బేశుద్ధ హోఊన తే పడలే | ||౫౦||
50. బాబానే చూస్తూ ఉండటం వలన, వారందరికీ చాలా ఆనందం కలిగింది. ఇంతలో అనుకోకుండా, పంతుకు తల తిరిగి, తెలివి తప్పి పడిపోయాడు. 

పాతలీ జీవాస వికలతా | పావలే సబళ నిచేష్టతా | 
సాంగాతియా ఉద్భవలీ చింతా | అతి వ్యగ్రతా మానసీ | ||౫౧|| 
51. అతని ప్రాణం చాలా నీరసించి పోయింది. దేహం ఏ కదలికా లేకుండా పడిపోయింది. అతని వెంట వచ్చిన వారికి భయం కలిగి, మనసులో చాలా అలజడిగా ఉండేది. 
మండళీచీ మదత మోఠీ | సాఈ బాబాంచీ కృపాదృష్టీ | 
కరితా మస్తకీ ఉదకవృష్టీ | గేలీ నిచేష్టితతా సమూళ | ||౫౨|| 
52. సాయిబాబాయొక్క కృపాదృష్టి పడింది. అక్కడున్న వారందరూ చాలా సహాయం చేశారు. అతని తలపై నీరు చల్లగా, అతనికి తెలివి వచ్చింది. 
హోఊనియా సావధాన | ఉఠూని బైసలే ఖడబడోన | 
వాటలే జణూ ఝోంపేతూన | ఆతాంచ ఊఠూన బైసలే | ||౫౩|| 
53. తెలివి రాగానే, గాబరా పడుతూ, లేచి కూర్చున్నాడు. నిద్రనుండి అప్పుడే లేచినట్లు అనిపించింది. 
బాబా పూర్ణ అంతర్జ్ఞానీ | తయాచీ గురుపుత్రతా జాణూనీ | 
తయాస అభయతా ఆశ్వాసూని | నిజ గురుభజనీ స్థాపితీ | ||౫౪|| 
54. బాబాకు అన్నీ తెలుసు. అంతా తెలుసు. పంతు అదివరకే ఒక గురువుకు శిష్యుడన్న సంగతి తెలిసి, అతనికి ధైర్యాన్ని, రక్షణను ఇచ్చి, అతని గురువు మీదే అతని భక్తిని స్థిరపరచారు. 
యేవో మ్హణతీ ప్రసంగ కాహీ | “ఆపనా తకియా ఛోడనా నహీ” | 
సదాసర్వదా నిశ్చళ రాహీ | అనన్య పాహీ ఎకత్వీ | ||౫౫|| 
55. “మన దిండును (గుండ్రనిది) ఎప్పటికీ విడిచి పెట్టరాదు. ఎప్పుడూ చదరని నమ్మకంతో ఉంటూ, అందరిలోనూ ఏకత్వాన్ని చూడు” అని చెప్పారు. 
పంతాలా తీ పటలీ ఖూణ | నిజ గురూచే జాహలే స్మరణ | 
సాఈబాబాంచే కనవాళూపణ | రాహిలే స్మరణ జన్మాచే | ||౫౬|| 
56. బాబా మాటలు పంతు మనసులో బాగా నాటుకు పోయాయి. తన గురువును తలచుకున్నాడు. సాయిబాబాయొక్క దయ, కృప అతనికి జీవితాంతం గుర్తు ఉండిపోయింది. 
తైసేచ ఎక ముంబాపురస్థ | హరిశ్చంద్ర నామే గృహస్థ | 
పుత్ర అపస్మార వ్యథాగ్రస్త | తేణే అతి త్రస్త జాహలే | ||౫౭|| 
57. అలాగే, ముంబైలో ఉండే హరిశ్చంద్ర అన్న ఒక గృహస్థుడు, తన కొడుకు అపస్మార రోగి కావడంతో, ఎంతో దుఃఖంలో ఉన్నాడు. 
దేశీ విదేశీ వైద్య ఝాలే | కాంహీ ఎక ఉపాయ న చలే | 
పాహూన సర్వాంచే ప్రయత్న హరలే | రాహతా రాహిలే సాధుసంత | ||౫౮|| 
58. దేశ, విదేశాల వైద్యులందరూ ఏమీ చేయలేక పోయారు. అందరి ప్రయత్నాలు వ్యర్థమై, ఇక సాధు సత్పురుషులు మిగిలారు. 
సన ఎకోణీససే దహా సాలీ | దాస గణూంచీ కీర్తనే ఝాలీ | 
శ్రీ సాఈనాథాంచీ కీర్తి పసరలీ | యాత్రా వాఢలీ శిరడీచీ | ||౫౯|| 
59. క్రి. శ. ౧౯౧౦వ సంవత్సరంలో, కీర్తనలు చేసి, దాసగణు సాయినాథుని కీర్తిని బాగా వ్యాపింప చేశాడు. దానితో, శిరిడీకి వచ్చే భక్తులు ఎక్కువయ్యారు. 
కుగ్రామ పరీ భాగ్యే థోర | శిరడీ ఝాలీ పంఢరపూర | 
మహిమా వాఢలా అపరంపార | యాత్రా అపార లోటలీ | ||౬౦||
60. శిరిడీ గ్రామము చిన్నదే అయినా, గొప్ప భాగ్యం వలన, అది పంఢరిపురం వలె, చాలా మహిమ కలగటంతో, యాత్రికులు బాగా వచ్చేవారు. 

రోగ ఘాలవితీ కేవళ దర్శనే | అథవా కేవళ హస్తస్పర్శనే | 
అథవా శుద్ధ కృపావలోకనే | ఆలే అనేకా అనుభవ | ||౬౧|| 
61. కేవలం దర్శనంతోనే, లేక కేవలం చేతి స్పర్శతోనో, లేదా వారి కృపాదృష్టితోనో, బాబా రోగాలను నయం చేస్తారనేది ఎందరికో అనుభవమైంది.
హోతా అనన్య శరణాగత | కృత కల్యాణ పావత భక్త | 
జాణూని సకళాంచే మనోగత | పురవీత మనోరథ సర్వాంచే | ||౬౨|| 
62. మనస్ఫూర్తిగా బాబాకు శరణుజొచ్చిన భక్తులు, శుభాలను పొందుతారు. భక్తుల కోరికలను తెలుసుకుని, బాబా వానిని తీర్చుతారు. 
ఉదీ ధారణే పిశాచే పళతీ | ఆశీర్వచనే పీడా తళతీ | 
కృపా నిరీక్షణే బాధా చుకతీ | లోక యేతీ ధాంవోని | ||౬౩|| 
63. వారి ఉదీని రాసుకున్నంతనే పిశాచాలు పారిపోతాయి. వారి ఆశీర్వాదంతో, దుఃఖాలు తొలగిపోతాయి. వారి చల్లని చూపుతో, బాధలు నశిస్తాయి అని, జనులు శిరిడీకి పరుగెత్తుకుంటూ వస్తారు. 
ఏసే మహాత్మ్య కథాకీర్తనీ | దాస గణూంచ్యా గ్రంథాంతూనీ | 
ఏకోని యా కర్ణోపకర్ణీ | ఉత్కంఠా దర్శనీ ఉదేలీ | ||౬౪|| 
64. దాసగణు రచించిన గ్రంథాలలోను, అతను చేసే కథా కీర్తనలలోను, ఇవే కాక, బాబా మహాత్మ్యాన్ని ఆనోటా ఈనోటా విని, పితళేకు బాబా దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది. 
సవే ఘేఊని ములేబాళే | నానావిధ ఉపాయనే ఫళే | 
ఆలే శిరడీ గ్రామాస పితళే13 | పూర్వార్జితబళే దర్శనా | ||౬౫|| 
65. తను చేసుకున్న పూర్వ జన్మల పుణ్య ఫలంగా, భార్యాబిడ్డలతో, రకరకాల పళ్ళను వెంట తీసుకుని, పితళే శిరిడీకి వచ్చాడు. 
ములాస పాయాంవరీ ఘతలే | స్వయే బాబాంస లోటాంగణీ ఆలే | 
తో తేథ ఎక విపరీత వర్తలే | పితళే గడబడలే అత్యంత | ||౬౬|| 
66. కొడుకును బాబా పాదాల మీద పడవేసి, తానూ స్వయంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు ఒక విపరీతం జరిగే సరికి, పితళే చాలా గాబరా పడ్డాడు. 
దృష్టాదృష్ట సాఈంచీ హోతా | ములగా పావలా బేశుద్ధావస్థా | 
డోళే ఫిరవిలే పడలా అవచిత | మాతాపితా గడబడలే | ||౬౭|| 
67. కొడుకు చూపు సాయి చూపుతో కలువగానే, పితళే కొడుకు కళ్ళు తిరిగి, అకస్మాత్తుగా తెలివి తప్పి పడిపోయాడు. అతని తల్లి తండ్రులు భయపడి పోయారు. 
పడిలా విసంజ్ఞ భూమీసీ | తోండాసీ ఆలీ ఉదండ ఖరసీ14
చింతా ఓఢవలీ మాతాపిత్యాంసీ | కాయ దైవాసీ కరాంవే | ||౬౮|| 
68. తెలివి లేకుండా నేల మీద పడి, నోటినుండి బాగా నురుగు కక్కుతుంటే, తల్లి తండ్రులకు చింత పట్టుకుంది. తమ కర్మ అలా ఉంటే ఏం చేయాలి అని అనుకున్నారు. 
నిఘూని గేలా వాటే శ్వాస | తోండావాటే చాలలా ఫేంస | 
ఫుటలా ఘామ సర్వాంగాసీ | సరలీ ఆస జీవితాచీ | ||౬౯|| 
69. కుర్రాడి శరీరమంతా చెమటలు పట్టాయి. నోటినుండి వచ్చే నురుగు, శ్వాస ఆగిపోతుందేమో అని అనిపించే పరిస్థితి చూసి, వాడు ఇంక బ్రతుకుతాడన్న ఆశ పోయింది. 
ఏసే ఝటకే అనేక వేళా | పూర్వీ యేఊని గేలే ములాలా | 
పరీ న ఇతుకా విలంబ ఝాలా | ప్రసంగాలా ఎకాహీ | ||౭౦||
70. అంతకు మునుపు, ఆ కుర్రాడికి చాలా సార్లు తెలివి పోవటం జరిగింది. కాని, ఇంత సేపు ఎప్పుడూ ఇలా ఉండలేదు. 

హా ‘న భూతో న భవిష్యతి’ | త్యానే ఆణిలీ ప్రాణాంతిక గతి | 
మాతేచ్యా డోళా అశ్రూ న ఖళతీ | పాహూని స్థితి బాళాచీ | ||౭౧|| 
71. ఇప్పుడు వచ్చిన స్థితి, ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లు ప్రాణం మీదికే వచ్చింది. కొడుకును చూసిన తల్లి కళ్ళనుండి ‘ఏమిటి ఇలా జరిగింది’ అని నీళ్ళు ఆగకుండా కారుతున్నాయి. 
ఆలో కిమర్థ ఝాలే కాయ | ఉపాయ తో ఝాలా అపాయ | 
ఏసే ఘాతుక వ్హావే హే పాయ15 | వ్యర్థ వ్యవసాయ ఝాలా కీ | ||౭౨|| 
72. ‘అసలు వచ్చింది దేనికి? జరిగిందేమిటి? ఏదైనా ఉపాయం దొరుకుతుందని వస్తే, అపాయమే జరిగింది. ఈ సాయి పాదాలు ఇంతటి ఘోరం చేస్తాయా? మా ప్రయత్నమంతా వ్యర్థమైంది కదా! 
ఘరాంత రిఘావే చోరా భేణే | తో ఘరచి అంగావరీ కోసళణే | 
తైసేంచి కీ హే ఆముచే యేణే | ఝాలే మ్హణే తీ బాఈ | ||౭౩|| 
73. ‘దొంగలు దోచుకుంటారని, ఇంట్లోకి చేరితే, ఇల్లే పైన పడ్డట్లయింది. మేమిక్కడకు రావడం అలాగే జరిగింది’ అని ఆమె అన్నది. 
వ్యాఘ్ర భక్షీల మ్హణూని గాఈ | జీవా భేణే పళూని జాఈ | 
తిజలా మార్గాంత భేటే కసాఈ | తైసేంచ పాహీ జాహలే | ||౭౪|| 
74. ‘పులి తినేస్తుందనే ప్రాణభయంతో, ఆవు పారిపోతుంటే, దారిలో ఎదురుగా కసాయి కనిపించినట్లు అయింది. 
ఉన్హాంత తాపలా పాంథస్థ | వృక్షచ్ఛాయేస జో విసావత | 
తో వృక్షచి ఉన్మళూని పడత | ఝాలీ తే గత తయాంసీ | ||౭౫|| 
75. ‘మాడిపోతున్న ఎండనుంచి తప్పించుకోవాలని బాటసారి, చెట్టు నీడకు వెళ్ళితే, ఆ చెట్టే వ్రేళ్ళతో సహా ఊడి అతని మీద పడ్డట్లయింది మా గతి. 
భావ ఠేవూని దేవావరీ | పూజేస జాతా దేఉళాభీతరీ | 
దేఉళచి కోసలే అంగావరీ | తైసీచ పరీ హే ఝాలీ | ||౭౬|| 
76. ‘భక్తిగా, దేవుని మీద నమ్మకంతో, గుడిలోనికి పూజకని వెళ్ళితే, గుడియే కూలి మీద పడ్డట్లయింది మా గతి’ అని ఆ తల్లి బాధపడింది. 
బాబా మగ తయా ఆశ్వాసితీ | ’ధీర ధరావా థోడా చిత్తీ | 
ములాస ఉచలూని న్యా నిగుతీ | నిజావగతీ16 తో లాధేల | ||౭౭|| 
77. అప్పుడు బాబా ఆమెకు హామీ ఇస్తూ, “మనసులో కొంచెం ధైర్యం తెచ్చుకో. కుర్రాణ్ణి లేపి, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. అతనికి మళ్ళీ తెలివి వస్తుంది. 
ములాస ఘేఊని జా బిర్హాడీ | ఆణీక ఎక భరతా ఘడీ | 
సజీవ హోఈల తయాచీ కుడీ | ఉగీచ తాంతడీ కరూ నకా’ | ||౭౮|| 
78. “పిల్లవాణ్ణి బసకు తీసుకుని వెళ్ళు. ఇంకో ఘడియలో(ఇరవై నాలుగు నిమిషాలు) అతడు బాగు పడతాడు. ఊరికే కంగారు పడకు” అని బాబా ధైర్యం చెప్పారు. 
అసో పుఢే తైసే కేలే | బోల బాబాంచే ఖరే ఝాలే | 
పితళే సహకుటుంబ ఆనందలే | కుతర్క గేలే విరోన | ||౭౯|| 
79. వారు అలానే చేశారు. తరువాత, బాబా మాటలు నిజమయ్యాయి. పితళే కుటుంబమంతా ఆనందించారు. మనసులో ఉన్న సందేహాలన్నీ తొలగి పోయాయి. 
వాడియాంత నేతా తీ కుమర | తాత్కాళ ఆలా శుద్ధీవర | 
మాతాపితయాంచా ఫిటలా ఘోర | ఆనంద థోర జాహలా | ||౮౦||
80. వాడకు తీసుకుని వెళ్ళగానే కుర్రాడికి తెలివి వచ్చింది. అతని తల్లి తండ్రులకు ఎంతో ఊరట కలిగింది. వారు చాలా ఆనందించారు. 

మగ పితళే స్త్రియేసహిత | బాబాంచియా దర్శనా యేత | 
కరీత సాష్టాంగ ప్రణిపాత | అతి వినీత హోఉనీ | ||౮౧|| 
81. తరువాత, పితళే భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చి, ఎంతో వినయంగా, వారికి సాష్టాంగ నమస్కారం చేశాడు.
ఉఠలా పాహూని ఆపులా సుత | సాభార మానసీ ఆనందిత | 
బసలే బాబాంచే చరణ చూరిత | బాబా సస్మిత పూసతీ | ||౮౨|| 
82. తన కొడుకుకు నయమైనందుకు, కృతజ్ఞతతో, ఆనందంతో, బాబా పాదాలను ఒత్తుతూ కూర్చున్నాడు. అప్పుడు బాబా చిరునవ్వు నవ్వుతూ, 
“కా త్యా సంకల్ప వికల్ప లహరీ | శాంత ఝాల్యా కా ఆతా తరీ | 
ఠేవీల నిష్ఠా ధరీల సబూరీ17 | తయాసీ శ్రీహరీ రక్షీల” | ||౮౩|| 
83. “ఏమిటీ! నీ మనసులో లేచిన అనుమానాలు, భయాలు అనే అలలు ఇప్పటికైనా శాంతించాయా?” అని అడిగి, “పూర్తి నమ్మకంతో, సహనం కలిగిన వారిని, శ్రీహరి రక్షిస్తాడు” అని అన్నారు. 
పితళే మూళచేచ శ్రీమంత | ఘరందాజ లౌకీకవంత | 
మేవా మిఠాఈ లుటవీత | బాబాంస అర్పిత ఫళ పాన | ||౮౪|| 
84. పితళే ఆగర్భ శ్రీమంతుడు. గౌరవంగల గొప్ప వంశంలో పుట్టినవాడు. తన కొడుకుకు నయమైన సందర్భాన్ని చాలా ఆనందంతో ఆచరించాడు. అందరికీ మిఠాయిలు పంచి, పూలు, పళ్ళను బాబా పాదాలకు అర్పించాడు. 
కుటుంబ తయాంచే ఫార సాత్విక | ప్రేమళ శ్రద్ధాళూ భావిక | 
బాబాంకడేస లావూని టక | ఖాంబానికట బైసతసే | ||౮౫|| 
85. అతని భార్య చాలా మంచి సాత్వికురాలు. శ్రద్ధా, భక్తులున్న ప్రేమమయి. కంభం దగ్గర కూర్చుని, ఎప్పుడూ బాబా వైపే చూస్తూ ఉండేది. 
పహాతా పహాతా డోళే భరావే | ఏసే తినే నిత్య కరావే | 
పాహూని తత్ప్రేమాచే నవలావే | అత్యంత భులావే బాబాంనీ | ||౮౬|| 
86. అలా బాబానే చూస్తూ ఉండటం వలన, ఆమె కళ్ళలో నీళ్ళు నిండిపోయేవి. ఆమె అలా రోజూ చేస్తుంటే, ప్రత్యేకమైన ఆమె ప్రేమకు, బాబా తమను తాము మరచి పోయేవారు. 
జైసే దేవ తైసేచ సంత | భక్త పరాధీన తే అత్యంత | 
అనన్యత్వే తయా జే భజత | కృపావంత తయాంవరీ | ||౮౭|| 
87. సత్పురుషులు కూడా దేవునిలాగే భక్తులకు అధీనులు. వారిని మనస్ఫూర్తిగా ఆరాధించే వారిని అనుగ్రహిస్తారు. 
అసో హీ మండళీ జావయా నిఘాలీ | మశీదీస దర్శనార్థ ఆలీ | 
బాబాంచీ అనూజ్ఞా ఉదీ ఘేతలీ | తయారీ కేలీ నిఘావయా | ||౮౮|| 
88. పితళే కుటుంబం తిరిగి వెళ్ళి పోవటానికి సిద్ధమై, మసీదుకు బాబా దగ్గర వెళ్ళారు. బాబా అనుమతిని, ఉదీని తీసుకుని, బయలుదేరారు. 
ఇతుక్యాంత బాబా కాఢీతీ తీన | రూపయే ఆపులే ఖిశాంతూన | 
పితళ్యాంస నికట బోలావూన | బోలతీ వచన తే పరిసా | ||౮౯|| 
89. ఇంతలో, అకస్మాత్తుగా, తమ జేబునుండి బాబా మూడు రూపాయలను తీసి, పితళేను దగ్గరకు పిలిచి, చెప్పిన మాటలను వినండి. 
“బాపూ18 తుజలా పూర్వీ దోన | దిధలేతీ19 మ్యా త్యాంత హే తీన | 
ఠేవూని యాంచే కరీ పూజన | కృతకల్యాణ హోసీల” | ||౯౦||
90. “బాపూ! ఇంతకు మునుపు నీకు నేను రెండు రూపాయలను ఇచ్చాను. వాటితో పాటు, ఈ మూడింటినీ ఉంచి, పూజ చేయి. నీకు శుభం కలుగుతుంది”. 

పితళే రూపయే ఘేతీ కరీ | ప్రసాద జాణోని ఆనందే స్వీకారీ | 
లోటాంగణీ యేత పాయాంవరీ | మ్హణతీ కృపా కరీ మహారాజా | ||౯౧|| 
91. ఆ రూపాయలను బాబా ప్రసాదంగా భావించి, ఆనందంగా, పితళే చేతిలోకి తీసుకున్నాడు. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, “మహారాజా! నన్ను కరుణించండి” అని వేడుకున్నాడు. 
మనీ ఉదేలీ విచార లహరీ | మాఝీ తో హీ ప్రథమ ఫేరీ | 
బాబా హే వదతీ కాయ తరీ | హే మజ నిర్ధారీ కళేనా | ||౯౨|| 
92. వెంటనే, అతని మనసులో ఆలోచనల అలలు మొదలైయాయి. ‘నేను ఇక్కడికి రావటం ఇదే మొదటి సారి కదా! మరి బాబా ఇదేం ఇలా అంటున్నారు? నాకేం అర్థం కావటం లేదు. 
బాబాంస పూర్వీ నాహీ దేఖిలే | పూర్వీ దోన కైసే దిధలే | 
అర్థావబోధ కాంహీంచ న కళే | విస్మిత పితళే మనీ ఝాలే | ||౯౩|| 
93. ‘ఇంతకు మునుపు ఎప్పుడూ, బాబాను నేను చూడనే లేదు. మరి, రెండు రూపాయలను వారు నాకు ఎప్పుడిచ్చారు? దీని అర్థం అసలు బోధ పడటం లేదు’ అని ఆశ్చర్యపోయాడు. 
కైసీ వ్హావీ పరిస్ఫుటతా | వాఢలీ మనాచీ జిజ్ఞాసుతా | 
బాబా న లాగూ దేత పత్తా | రాహిలీ ముగ్ధతా తైసీచ | ||౯౪|| 
94. ఆ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? అని అతనిలో కుతూహలం ఎక్కువైంది. కాని, బాబా ఏ సూచననూ ఇవ్వలేదు. వారి మాటలు అలానే అర్థం కాకుండా మిగిలిపోయాయి. 
సంత సహజ ఉద్గారలే జరీ | తరీ తే వాణీ హోణార ఖరీ | 
జాణీవ హీ పితళ్యాంచే అంతరీ | మ్హణూన విచారీ తే పడలే | ||౯౫|| 
95. ఎంత అనుకోకుండా చెప్పినా, సత్పురుషులు చెప్పిన మాటలు, తప్పక నిజమవుతాయని పితళేకు తెలుసు. అందువల్ల అతని ఆలోచన ఇంకా ఎక్కువైంది. 
పరీ పుఢే హే ముంబాపురీ | గేలే జేవ్హా ఆపులే ఘరీ | 
హోతీ ఘరాంత ఎక మ్హాతారీ | జిజ్ఞాసా పురీ తీ కరీ | ||౯౬|| 
96. తరువాత ముంబైలోని తన ఇంటికి వెళ్ళాడు. అక్కడున్న ఒక ముసలావిడ అతని కుతూహలాన్ని తీర్చింది. 
మ్హాతారీ పితళ్యాంచీ మాతా | సహజ శిరడీచా వృత్తాంత పుసతా | 
నిఘాలీ తీన రూపయాంచీ వార్తా | సంబంధ కథా జుళేనా | ||౯౭|| 
97. ఆ ముసలావిడ పితళేకు తల్లి. శిరిడీయాత్ర గురించి ఆమె సహజంగా ముచ్చటిస్తుండగా, మూడు రూపాయల సంగతి వచ్చింది. కాని, ఆమెకు కూడా ఆ రూపాయలతో ఉన్న సంబంధం అర్థం కాలేదు. 
విచార కరితా స్మరణ ఝాలే | మగ మ్హాతారీ పితళ్యాంస బోలే | 
“ఆతా మజ యథార్థ ఆఠవలే | బాబా బోలలే సత్య తే | ||౯౮|| 
98. దాని గురించే ఆలోచిస్తుండగా, అకస్మాత్తుగా, ఆమెకు గుర్తుకు వచ్చింది. ‘బాబా చెప్పింది నిజమే. ఇప్పుడు నాకు ఈ సంగతి గుర్తుకు వచ్చింది’ అని పితళేతో చెప్పింది. 
ఆతా త్వా తుఝ్యా ములాస నేలే | శిరడీస సాఈచే దర్శన కరవిలే | 
తైసేంచ పూర్వీ తుజ పిత్యానే వాహిలే | హోతే నేలే అక్కలకోటీ | ||౯౯|| 
99. ‘సాయి దర్శనానికని, నీ కొడుకును నువ్వు ఇప్పుడు శిరిడీకి తీసుకుని వెళ్ళినట్లుగానే, ఇంతకు మునుపు, మీ నాన్న నిన్ను అక్కలకోటకు తీసుకుని వెళ్ళారు. 
తేథీల మహారాజహీ సిద్ధ | పరోపకారీ మహా ప్రసిద్ధ | 
అంతర్జ్ఞానీ యోగీ ప్రబుద్ధ | పితాహీ శుద్ధ ఆచరణీ | ||౧౦౦||
100. ‘అక్కడ ఉండే మహారాజు సిద్ధులు. పరోపకార పరాయణులు. మహా ప్రసిద్ధులు. సర్వజ్ఞులు. యోగులు, విద్వాంసులు. మీ నాన్నగారు కూడా పవిత్రమైన ఆచారాలతో ఉండేవారు. 

ఘేవోని తవ పిత్యాచీ పూజా | ప్రసన్న ఝాలా యోగీరాజా | 
దోన రుపయే ప్రసాదకాజా | దిధలే పూజా కరాయా | ||౧౦౧|| 
101. ‘మీ తండ్రి చేసిన పూజకు తృప్తి చెంది, ఆ యోగిరాజు ఆనందంతో, పూజ చేసుకోవటానికని రెండు రూపాయలను ప్రసాదంగా ఇచ్చారు.
హే హీ పూర్వీల రుపయే దోన | స్వామీనీ బాళా తుజ లాగోన | 
దిధలే హోతే ప్రసాద మ్హణూన | పూజనార్చన కరావయా | ||౧౦౨|| 
102. ‘ఆ రెండు రూపాయలు కూడా, ఆ స్వామి నువ్వు పూజార్చనలను చేయటానికి, ప్రసాదంగా ఇచ్చారు. 
తుమచే దేవ దేవతార్చన | త్యాంత హే హోతే రుపయే దోన | 
కరీత అసత నేమే పూజన | అతి నిష్ఠేనే వడిల తుఝే | ||౧౦౩|| 
103. ‘ఇంట్లో దేవుళ్ళను పెట్టిన చోటే ఆ రెండు రూపాయలు ఉండేవి. వానిని మీ నాన్న నమ్మకంతో, ఎంతో శ్రద్ధా నిష్ఠలతో పూజించేవారు. 
తయాంచీ నిష్ఠా మీ ఎక జాణే | వాగత గేలే నిష్ఠేప్రమాణే | 
తయాంచ్యా పశ్చాత పూజా ఉపకరణే | జాహలీ ఖేళణీ ములాంచీ | ||౧౦౪|| 
104. ‘నాకు ఒక్కదానికే వారి నిష్ఠ గురించి తెలుసు. కాని, వారి తరువాత, పూజా సామానులు పిల్లల ఆటవస్తువులై పోయాయి. 
నిష్ఠా ఉడాలీ దేవావరచీ | లాజ వాటూ లాగలీ పూజేచీ | 
పూజేసీ యోజనా ఝాలీ ములాంచీ | దాద రుపయాంచీ కోణ ఘేఈ | ||౧౦౫|| 
105. ‘దేవుని మీద శ్రద్ధ లేకపోయింది. పూజ చేయటం అంటే సిగ్గుగా మారింది. చిన్న పిల్లలే పూజ చేసే కాలం వచ్చింది. అలాంటి పరిస్థితులలో, ఆ రూపాయలను ఎవరు పట్టించుకుంటారు? 
ఏసీ కిత్యేక వర్షే లోటలీ | రుపయాంచీ త్యా బేదాద ఝాలీ | 
ఆఠవణహీ సాఫ బుజాలీ | జోడీ హరవలీ రుపయాంచీ | ||౧౦౬|| 
106. ‘అలా ఎన్నో ఏళ్ళు గడచి పోయాయి. ఆ రెండు రూపాయలని ఎవరూ పట్టించుకోకుండా, వాటి గుర్తు కూడా లేకుండా పోయాయి. దానితో, ఆ రెండు రూపాయలూ పోయాయి. 
అసో తుమచే భాగ్య మోఠే | సాఈమిషే మహారాజచి20 భేటే | 
పుసావయా విస్మరణాంచీ పుటే | తైసీంచ సంకటే నిరసాయా | ||౧౦౭|| 
107. ‘కాని, నీ అదృష్టం చాలా గొప్పది. నీ కష్టాలను తొలగించటానికి, నీ మహాభాగ్యం కొద్దీ, అదే అక్కలకోట మహారాజు సాయి రూపంలో నిన్ను కలిశారు. 
తరీ ఆతా యేథూని పుఢే | సోడూని ద్యావే తర్క కుడే | 
పహా ఆపల్యా పూర్వజాంకడే | నకో వాంకడే వ్యవహార | ||౧౦౮|| 
108. ‘కనుక, ఇప్పటినుండైనా కుతర్కాలు, సందేహాలు, అపనమ్మకాలు వదిలిపెట్టి, నీ పూర్వీకులను తలచుకో. చెడు వ్యవహారాలను మానివేయి. 
కరీత జా రుపయాంచే పూజన | సంతప్రసాద మానా భూషణ | 
సమర్థ సాఈనీ హీ పటవిలీ ఖూణ | పునరుజ్జీవన భక్తీచే” | ||౧౦౯|| 
109. ‘ఆ రూపాయలను నిత్యమూ, నియమంగా పూజించు. సత్పురుషులు ఇచ్చిన ప్రసాదాన్ని భూషణంగా భావించు. మరచిన దానిని, సాయి సమర్థులు గుర్తు చేసి, నీలో భక్తిని మరల జీవింప చేశారు’. 
ఏకతా హీ మాతేచీ కథా | పరమానంద పితళ్యాంచే చిత్తా | 
ఠసలీ సాఈచీ వ్యాపకతా | ఆణి సార్థకతా దర్శనాచీ | ||౧౧౦||
110. తల్లి చెప్పినదంతా విని, పితళే మనసు పరమానందంతో నిండిపోయింది. సాయి అన్ని చోట్ల వ్యాపించి ఉండటం అన్నది మనసులో బాగా నాటుకుంది. వారి దర్శనంతో, తన జీవితం సార్థకమైందని అనుకున్నాడు. 

మాతేచే తే శబ్దామృత | నష్ట భావనా కరీ జాగృత | 
దేఈ పశ్చాత్తాప ప్రాయశ్చిత్త | భావీ హిత దర్శవీ | ||౧౧౧|| 
111. తల్లియొక్క అమృతం వంటి మాటలు, నిద్రిస్తున్న అతని భక్తి భావాన్ని మేలుకొలిపినవి. అతనికి పశ్చాత్తాపమనే ప్రాయశ్చిత్తం కలిగింది. ముందుముందు మంచి దారిని చూపించాయి. 
అసో హోణార హోఊని గేలే | పుఢీల కార్యార్థా సంతీ జాగవిలే | 
మానూని తయాంచే ఉపకార భలే | సావధ రాహిలే నిజకార్యా | ||౧౧౨|| 
112. జరగవలసింది జరిగింది. కాని, సత్పురుషులు అతని తరువాతి జీవితాన్ని జాగృతం చేశారు. వారి ఉపకారాన్ని కృతజ్ఞతతో గుర్తుంచుకుని, పితళే తన పనులలో చాలా జాగ్రతగా ఉన్నాడు. 
ఏసీచ ఎక ఆణిక ప్రచీతీ | కథితో పరియేసా స్వస్థ చిత్తీ | 
భక్తాంచ్యా ఉచ్ఛృంఖల మనోవృత్తీ | బాబా ఆవరితీ కైశా తే | ||౧౧౩|| 
113. ఇలాంటిదే ఇంకొక అనుభవాన్ని చెప్పుతాను, శ్రద్ధగా వినండి. విచ్చలవిడిగా నడుచుకునే భక్తుల మనసును బాబా ఎలా అదుపులో పెట్టేవారో గమనించండి. 
గోపాళ నారాయణ ఆంబడేకర | నామే ఎక భక్త ప్రవర | 
ఆహే బాబాంచ్యా పుణేకర | పరిసా సాదర తత్కథా | ||౧౧౪|| 
114. గోపాల నారాయణ ఆంబడేకరు అనే బాబా భక్త శ్రేష్ఠుడు పుణేలో ఉండేవాడు. అతని కథను వినండి. 
ఆంగ్లభౌమ సరకార పదరీ | అబకారీ ఖాత్యాంత హోతీ నోకరీ | 
దహా వర్షే భరతా పూరీ | బైసలే ఘరీ సోడూని | ||౧౧౫|| 
115. ఆంగ్ల ప్రభుత్వంలోని అబ్కారి శాఖలో అతను ఉద్యోగి. అక్కడ పదేళ్ళు పని చేసి, ఉద్యోగం మానేసి, ఇంట్లో కూర్చున్నాడు. 
దైవ ఫిరలే ఝాలే పారఖే | సర్వ దివస నాహీంత సారఖే | 
ఆలే గ్రహదశేచే గరకే | కోణ ఫరకే న భోగితా | ||౧౧౬|| 
116. అతని అదృష్టం తిరగబడింది. అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! దురదృష్టం అతని వెంటబడింది. గ్రహగతుల వలన కలిగే కష్టాలను అనుభవించకుండా, ఎవరు తప్పించుకోగలరు? 
ఆరంభీ ఠాణే జిల్హ్యాంత నోకర | పుఢే నశీబీ ఆలే జవ్హార | 
హోతే తేథే అమ్మలదార | తేథేంచ బేకార జాహలే | ||౧౧౭|| 
117. మొదట్లో అతని ఉద్యోగం ఠాణా జిల్లాలో ఉండేది. ఆ తరువాత, అదృష్టం కొద్ది, అదే జిల్లాలోని జవహారుకు అధికారిగా వచ్చాడు. అక్కడే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. 
నోకరీ ఆళవావరచే పాణీ | పునశ్చ పడావే కైసే ఠికాణీ | 
ప్రయత్నాచీ శికస్త త్యాంనీ | పాహిలీ కరూని త్యావేళీ | ||౧౧౮|| 
118. ఉద్యోగం అనేది ఆకు మీద నీటి బొట్టులాంటిది. క్షణ కాలం కూడా ఒక చోట ఉండదు. పోయిన ఉద్యోగం మరల దొరకటం అంటే మాటలా? చేయాల్సిన ప్రయత్నాలన్నీ అతడు చేశాడు. 
పరీ న ఆలే తయాసీ యశ | నిశ్చయ ఠరలా రాహావే స్వవశ | 
ఆపత్తీంచా ఝాలా కళస | జాహలే హతాశ సర్వాంపరీ | ||౧౧౯|| 
119. కాని, అతనికి అదృష్టం లేదు. అందుకే, స్వతంత్రంగా బ్రతకాలని నిశ్చయించుకున్నాడు. కాని, అక్కడ కూడా, ఒకటి తరువాత ఒకటి, కష్టాలు పెరిగి, అతను అన్ని విధాలా నిరాశ చెంది, మానసికంగా చాలా క్రుంగిపోయాడు. 
వర్షానువర్ష ఖాలీ ఖాలీ | సాంపత్తిక స్థితి ఖాలావలీ | 
ఆపత్తీవర ఆపత్తీ ఆలీ | దుఃసహ ఝాలీ గృహస్థితి | ||౧౨౦||
120. ఉన్న డబ్బంతా ప్రతి ఏడూ ఊడ్చుకుని పోయి, కష్టాల పైన కష్టాలు వచ్చి, చాలా దిగజారి పోయాడు. అతని ఇంటి పరిస్థితి భరించ లేనంతగా బాధాకరమైనది. 

ఏసీ గేలే వర్షే సాత | సాలోసాల శిరడీస జాత | 
బాబాంపుఢే గార్హాణే గాత | లోటాంగణీ యేత దినరాత్ర | ||౧౨౧|| 
121. ఇలా ఏడు ఏళ్ళు గడిచిపోయాయి. ప్రతి ఏడూ శిరిడీకి వెళ్ళి, బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, వారి ముందు తన బాధను చెప్పుకునేవాడు.
ఎకోణీసశే సోళా సాలాంత | వైతాగూన గేలే అత్యంత | 
వాటలే కరావా ప్రాణఘాత | శిరడీ క్షేత్రాంత జాఊని | ||౧౨౨|| 
122. క్రి. శ. ౧౯౧౬వ సంవత్సరంలో జీవితం మీద పూర్తిగా విరక్తి చెంది, శిరిడీ క్షేత్రానికి వెళ్ళి, అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 
కుటుంబ సమవేత యా సమయాస | రాహిలే శిరడీస దోన మాస | 
కాయ వర్తలే ఎకే నిశీస | తయా వార్తేస పరియేసా | ||౧౨౩|| 
123. ఆ సమయంలో తన భార్యతో అక్కడ రెండు నెలలున్నాడు. ఒక రోజు రాత్రి జరిగినదానిని ఇప్పుడు వినండి. 
దీక్షితాంచే వాడ్యాసమోర | ఎకా బైలాచే గాడీవర | 
బసలే అసతా ఆంబడేకర | చాలలే విచార తరంగ | ||౧౨౪|| 
124. దీక్షితు వాడా ఎదుట, ఒక ఎద్దు బండి మీద ఆంబడేకరు కూర్చున్నాడు. అప్పుడు అతనిలో విపరీతమైన ఆలోచనలు మొదలయ్యాయి. 
కంటాళలే తే జీవితాస | వృత్తి ఝాలీ అత్యంత ఉదాస | 
పురే ఆతా హా నకో త్రాస | సోడిలీ ఆస జీవితాచీ | ||౧౨౫|| 
125. జీవితంలో అలసిపోయాడు. చాలా నిరాశతో, ‘చాలు బాబూ, చాలు. ఇక ఈ కష్టాలు ఇక వద్దు. జీవించాలన్న కోరిక నాకు లేదు’. 
కరూనియా ఏసా విచార | హోఊనియా జీవావరీ ఉదార | 
విహిరీంత ఉడీ ఘాలావయా తత్పర | ఆంబడేకర జాహలే | ||౧౨౬|| 
126. అలా అనుకుని, ప్రాణాల పైన ఆశను వదిలేసి, ఆంబడేకరు దగ్గరే ఉన్న బావిలో దూకటానికి సిద్ధమయ్యాడు. 
దుసరే కోణీ నాహీ జవళా | సాధూనియా ఏసీ నివాంత వేళా | 
పురవీన ఆపులే మనాచా సోహళా | దుఃఖా వేగళా హోఈన | ||౧౨౭|| 
127. ‘దగ్గరలో ఎవరూ లేని ఈ ప్రశాంత సమయంలో, నేను అనుకున్నది చేసి, నొప్పి, బాధలను తొలగించుకుంటాను’ అని ఆలోచించాడు. 
ఆత్మహత్యేచే పాప దుర్ధర | తరీ హా దృఢ కేలా విచార | 
పరీ బాబా సాఈ సూత్రధార | తేణే హా అవిచార టాళిలా | ||౧౨౮|| 
128. తన ప్రాణాన్ని తానే తీసేసుకోవడం చాలా ఘోరమైన పాపం. అయినా, ఆ నిర్ణయాన్నే తీసుకున్నాడు. కాని, సూత్రధారులైన సాయి బాబా అతని తప్పుడు నిర్ణయాన్ని తొలగించారు. 
తేథేంచ చార పావలాంవర | ఎకా ఖాణావళవాల్యాచే ఘర | 
తయాంసహీ బాబాంచా ఆధార | తోహీ పరిచారక21 బాబాంచా | ||౧౨౯|| 
129. అక్కడికి నాలుగు అడుగుల దూరంలో, ఒక భోజనశాల యజమాని (సగుణ మేరు నాయక) ఇల్లు ఉంది. అతనికీ బాబాయే ఆధారం. ఎంతో ప్రేమతో బాబాకు సేవలు చేసేవాడు. 
సగుణ యేఊని ఉంబర్యావరతీ | పుసే ఆంబడేకరాంస తే వక్తీ | 
హీ అక్కలకోట మహారాజాంచీ పోథీ | వాచిలీ హోతీ కా కధీ | ||౧౩౦||
130. తన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి, ఆంబడేకరును ‘అక్కలకోట మహారాజుగారి ఈ పుస్తకం ఎప్పుడైనా చదివావా?’ అని సగుణ అడిగాడు. 

పాహూ పాహూ కాయ తీ పోథీ | మ్హణూని ఆంబడేకర హాతీ ఘేతీ | 
సహజ పానే చాళూని పాహతీ | వాచూ లాగతీ మధ్యేంచ | ||౧౩౧|| 
131. ‘చూడని, చూడనీ, ఏం పుస్తకం?’ అంటూ, ఆంబడేకరు ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని, మామూలుగా పుటలను తిరగేశాడు. తరువాత, పుస్తకం మధ్యలోనుంచి, ఏదో చదవ సాగాడు. 
కర్మధర్మసంయోగ కైసా | విషయహీ వాచావయా ఆలా తైసా | 
అంతర్‍వృత్తీంత వాచణ్యాసరిసా | ఉమటలా ఠసా తాత్కాళ | ||౧౩౨|| 
132. అదృష్టం ఎలా కలిసి వచ్చిందంటే, అనుకోకుండా, అతను చదువుతున్న అంశం, అతని ఆలోచనలకు సరిగ్గా సరిపోయింది. 
సహజాసహజీ ఆలీ జీ కథా | నివేదితో మీ శ్రోతియా సమస్తా | 
తాత్పర్యార్థే అతి సంక్షేపతా | గ్రంథ విస్తరతాభయార్థ | ||౧౩౩|| 
133. అతి సహజంగా వచ్చిన ఆ కథను, శ్రోతలకు పూర్తిగా చెప్పాలంటే, ఈ గ్రంథం పెద్దదై పోతుందన్న భయంతో, సారంశంలో మనవి చేస్తాను. 
అక్కలకోటీ సంత వరిష్ఠ | అసతా మహారాజ అంతర్నిష్ఠ | 
భక్త ఎక బహు వ్యాధిష్ట | దుఃసహ కష్ట పావలా | ||౧౩౪|| 
134. సత్పురుషులలో శ్రేష్ఠులైన, ఎప్పుడూ ఆత్మలోనే లీనమై పోయిన, మహారాజు అక్కలకోటలో ఉన్నప్పుడు, అక్కడ, రోగి అయిన ఒక భక్తుడు భరించలేనంతగా బాధ పడుతుండేవాడు. 
సేవా కేలీ బహుత దిన | వ్యాధివిహీన హోఈన మ్హణూన | 
హోఈనాత తే కష్ట సహన | అతి ఉద్విగ్న జాహలా | ||౧౩౫|| 
135. తన రోగం తొలగించుకుందామనే ఆశతో, చాలా రోజులు మహారాజుకు సేవ చేశాడు. కాని, బాధ ఇక సహించ లేనంత వరకు వచ్చాక, చాలా కలత చెందాడు. 
కరూని ఆత్మహత్యేచా నిర్ధార | పాహూనియా రాత్రీచా ప్రహర | 
జాఊని ఎకా విహీరీవర | కేలా శరీరపాత తేణే | ||౧౩౬|| 
136. ఆత్మహత్యే దారి అని నిశ్చయించుకుని, ఒక రాత్రి వేళలో, దగ్గరలో ఉన్న బావికి వెళ్ళి, అందులో దూకేశాడు. 
ఇతుక్యాంత మహారాజ తేథే ఆలే | స్వహస్తే తయాస బాహేర కాఢిలే | 
“భోక్తృత్వ సారే పాహిజే భోగిల” | ఉపదేశిలే తయాస | ||౧౩౭|| 
137. అంతలో మహారాజు అక్కడికి వచ్చారు. తమ చేతులతో అతనిని బయటకు లాగి, “అనుభవించ వలసిన వానినంతా అనుభవించాల్సిందే” అని ఉపదేశించారు. 
అపుల్యా పూర్వకర్మా జోగ | వ్యాధీ కుష్ట క్లేశ వా రోగ | 
జాహల్యావీణ పూర్ణ భోగ | హత్యాయోగ22 కాయ కరీ | ||౧౩౮|| 
138. “వెనుకటి జన్మలో మనము చేసిన పనుల వలన వచ్చే కుష్టు రోగంగాని, లేక ఇతర రోగాల బాధలను గాని, పూర్తిగా అనుభవించకుంటే, ఆత్మహత్యా ప్రయత్నం ఏం చేస్తుంది? 
హా భోగ రాహతా అపురా | జన్మ ఘ్యావా లాగే దుసరా | 
మ్హణూని తైసేచ సాహే కష్ట జరా | ఆత్మహత్యారా హోఊ నకో | ||౧౩౯|| 
139. “అనుభవించాల్సిన బాధలు మిగిలి పోతే, వాటిని పూర్తిగా అనుభవించటానికి, మరొక సారి పుట్టవలసి వస్తుంది. అందువలన, ఈ కష్టాన్ని ఇంకొంచెం ఓర్చుకో. ఆత్మహత్య చేసుకోకు” అని బోధించారు. 
వాచూని హీ సమయోచిత కథా | థక్క జాహలే ఆంబడేకర చిత్తా | 
జాగీంచ వరమలే అవచితా | బాబాంచీ వ్యాపకతా పాహూని | ||౧౪౦||
140. తన జీవితానికి సరిగ్గా సరిపోయిన ఆ కథను చదివి, ఆంబడేకరుకు చాలా ఆశ్చర్యమయ్యింది. బాబా ఇలా అంతటా వ్యాపించి ఉండటాన్ని అర్థం చేసుకుని, సిగ్గుతో అక్కడే కూర్చుని పోయాడు. 

ఆంబడేకర మనీ తరకలే | పూర్వ అదృష్ట పాహిజే భోగిలే | 
హేంచ యోగ్య ప్రసంగీ సుచవిలే | సాహస యోజిలే న భలే తే | ||౧౪౧|| 
141. ‘పూర్వ జన్మ భాగ్యాన్ని అనుభవించి తీరాలి’ అని అప్పుడు సూచించిన విధం ఆంబడేకరు మనసుకు బాగా అర్థమైంది. అందుకే తాను అనుకున్న సాహసం, చేయక పోవటం మంచిదే అయింది అని అనుకున్నాడు.
జైసీ వాచా అశరీరిణీ23 | తైసీచ యా దృష్టాంతాచీ కరణీ | 
హేత జడలా సాఈచే చరణీ | అఘటిత ఘటణీ సాఈచీ | ||౧౪౨|| 
142. ఆ అనుభవం అతనికి ఆకాశవాణి మాటలవలె అనిపించింది. సాయియొక్క అద్భుతమైన లీలను చూసి, సాయి పాదాలలో ఉన్న అతని నమ్మకం ఇంకా దృఢమైంది. 
సగుణముఖే సాఈచా ఇశారా | హా అకల్పిత పుస్తకద్వారా | 
యావయా విలంబ లాగతా జరా | హోతా మాతేరా జన్మాచా | ||౧౪౩|| 
143. ‘సగుణుని నోటితో, మరియు ఆ పుస్తకం ద్వారా సాయి అందించిన సూచన, కాస్త ఆలస్యంగా అంది ఉంటే, ఈ జన్మ నాశమైయేది కదా! 
ముకలో అసతో నిజ జీవితా | కరితో దుర్ధర కుటుంబ ఘాతా | 
స్త్రియేవరీ ఓఢవితో అనర్థా | స్వార్థా పరమార్థా నాగవితో | ||౧౪౪|| 
144. ‘ఈ జీవితం పోగొట్టుకునే వాణ్ణి. కుటుంబానికి ఘోరమైన కష్టాలు కలిగించే వాణ్ణి. భార్యకు ఎంతో చెడు కలిగేది. స్వార్థాన్ని, పరమార్థాన్నీ పోగొట్టుకునే వాణ్ణి. 
పోథీచే కరూనియా నిమిత్త | బాబానీ కేలే సగుణాస ప్రవృత్త | 
ఆత్మఘాతాపాసావ చిత్త | పరావృత్త కేలే కీ | ||౧౪౫|| 
145. ‘ఆ పుస్తకం సాకుతో, సగుణుని ప్రేరేపించి, నన్ను ఆత్మహత్యనుండి విరమించుకునేలా బాబా చేశారు’ అని అనుకున్నాడు. 
ప్రకార ఏసా జరీ న ఘడతా | బిచారా వ్యర్థ జివాస ముక్తా | 
పరీ జేథే సాఈసమ తారితా | కాయ తో మారితా మారీల | ||౧౪౬|| 
146. ఇలా జరిగి ఉండకపోతే, పాపం, అనవసరంగా అతడు తన ప్రాణాలను పోగొట్టుకునే వాడే. కాని, సాయి వంటి రక్షకుడు ఉండగా, చంపేవాడు అతనిని ఎలా చంపగలడు? 
అక్కలకోట స్వామీచీ భక్తీ | యా భక్తాచే వడిలాస హోతీ | 
తీచ పుఢే చాలవా హీ ప్రచీతీ | ఆణూని దేతీ త్యా బాబా | ||౧౪౭|| 
147. ఆంబడేకరు తండ్రికి అక్కలకోట స్వామి మీద విపరీతమైన భక్తి. ఇతనికి కూడా అలాంటి భక్తి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు. 
అసో పుఢే బరవే ఝాలే | హేహీ దివస నిఘూన గేలే | 
జ్యోతిర్విద్యేంత పరిశ్రమ కేలే | ఫళహీ ఆలే ఉదయాలా | ||౧౪౮|| 
148. ఇదైన తరువాత, అంతా బాగా జరిగింది. కష్టమైన రోజులు గడిచి పోయాయి. ఎంతో కష్ట పడి, ఆంబడేకరు జ్యోతిష్య విద్యను నేర్చుకున్నాడు. దాని వలన తొందరలోనే మంచి ఫలితం అనుభవించ సాగాడు. 
సాఈకృపాప్రసాద పావలే | పుఢే ఆలే దివస చాంగలే | 
జ్యోతిర్విద్యేత ప్రావీణ్య సంపాదిలే | దైన్య నిరసలే పూర్వీల | ||౧౪౯|| 
149. సాయి కృపా మరియు ప్రసాదంతో, అతనికి మంచి రోజులు వచ్చాయి. జ్యోతిష్య శాస్త్రంలో మంచి నేర్పు సంపాదించాడు. మునుపటి పేదరికం, దైన్యం తొలగిపోయింది. 
వాఢలే గురుపదీ ప్రేమ | జాహలే సుఖ కుశల క్షేమ | 
లాధలే గృహసౌఖ్య ఆరామ | ఆనంద పరమ పావలే | ||౧౫౦||
150. గురు పాదాలలో అతనికి ప్రేమ ఎక్కువైంది. సుఖంగా, సంపదతో ఉన్నాడు. ఇంట్లో సుఖ శాంతులు రాగా, పరమానందాన్ని పొందాడు. 

ఏసే అగణిత చమత్కార | ఎకాహూని ఎక థోర | 
కథితా హోఈల గ్రంథ విస్తార | తదర్థ సార కథియేలే | ||౧౫౧|| 
151. ఇటువంటి చమత్కారాలు లెక్కలేనన్ని. ఒకదానికంటే మరొకటి గొప్పది. కాని, ఇలా చెప్పుతుంటే, ఈ గ్రంథం పెరిగి పోతుందని, సారాంశంలో చెప్పాను. 
హేమాడ సాఈపదీ శరణ | పుఢీల అధ్యాయీ గోడ కథన | 
విష్ణుసహస్త్రనామ దాన | శామయాలాగూని24 దీధలే | ||౧౫౨|| 
152. హేమాడు సాయి పాదాలలో శరణుజొచ్చి, తరువాతి అధ్యాయంలో బాబా విష్ణు సహస్రనామాన్ని శ్యామాకు ప్రసాదించిన మధురమైన కథను చెప్పుతాడు. 
నకో నకో మ్హణతా శామా | బాబాంస అనివార తయాచా ప్రేమ | 
బళేంచ దేతీల సహస్త్రనామా | సుందర మాహాత్మ్యా వర్ణూన | ||౧౫౩|| 
153. శామా వద్దు వద్దంటున్నా, అతనిపై అంతులేని ప్రేమతో, బాబా బలవంతంగా అతనికి విష్ణు సహస్రనామాన్నిచ్చి, అందులోని మహాత్మ్యాన్ని అందంగా వర్ణించారు. 
ఆతా సాదర పరిసా తీ కథా | అనుగ్రహాచా సమయ యేతా | 
శిష్యాచీ ఇచ్ఛా ముళీంహీ నసతా | బాబా తో దేతా దిసతీల | ||౧౫౪|| 
154. అనుగ్రహించే సమయం వచ్చినప్పుడు, శిష్యునికి అసలు కోరిక లేక పోయినా, బాబా దానిని ప్రసాదించే మధురమైన కథను శ్రద్ధగా వినండి. 
అనుగ్రహాచీ అలౌకిక పరీ | కైసీ అసతే సద్గురు ఘరీ | 
దిసూని యేఈల అధ్యాయాంతరీ | శ్రోతా ఆదరీ పరిసిజే | ||౧౫౫|| 
155. ఎవరూ ఇవ్వలేని దానిని, సద్గురువు ఎలా ప్రసాదిస్తారు, అన్న అద్భుతమైన సంగతిని అధ్యాయం చివరిలో తెలిపే, ఈ కథను శ్రోతలూ, భక్తితో వినండి. 
కల్యాణాచే జే కల్యాణ | తో హా సాఈ గుణ నిధాన | 
సభాగ్య పుణ్యశ్రవణ కీర్తన | చరిత్ర పావన జయాచే | ||౧౫౬||
156. శుభాలకే శుభాలను చేసే ఈ సాయి, అన్ని మంచి గుణాలకు నిధి. ఎంతో భాగ్యం ఉంటేనే, ఈ పావనమైన, పవిత్రమైన వారి చరిత్రను విని, కీర్తించే అవకాశం దొరికేది. 

| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | అపస్మారాత్మహత్యా నివారణం తథా నిజ గురుపద స్థిరీకరణం నామ | 
|షడ్వింశతితమోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||


టిపణీ: 
1. ఆరశాత. 2. శహరాసారఖే. 3. మాయేచా దేఖావా. 4. ఖరోఖర పాహతా. 
5. ప్రగట ఝాలేలే నాహీ. 6. ఓవిలేలే. 
7. వస్తుతః. 8. జాగృతీ ఆల్యావర. 9. ప్రగట హోతో. 
10. స్వస్వరూపాచ్యా యథార్థ జ్ఞానాచ్యా అభావీ. 
11. తోండాచీ బడబడ. 12. ఎక నిమిష - క్షణ వ్యర్థ న జాతా. 
13. శేట హరిశ్చంద్ర పితళే. 14. ఫేస. 
15. శ్రీ సాఈబాబాంచే పాయ. 16. త్యాచీ శుద్ధీ. 17. ధీర. 
18. యా నావానే శ్రీసాఈబాబా కోణాలాహీ మోఠ్యా ప్రేమానే సంబోధీత. 
19. దిలే హోతే. 20. అక్కలకోటచే స్వామీ. 
21. సేవేకరీ. 22. ఆత్మహత్యా కరూన ఘేణ్యాచా ప్రసంగ. 
23. ఆకాశవాణీ. 24. మాధవరావ దేశపాండే. 

No comments:

Post a Comment