Wednesday, May 1, 2013

||భక్తాభిష్ట సంపాదనం నామ పంచవింశతితమోధ్యాయః||


శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౨౫ వా||

||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః|| 
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః|| 
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః|| 

సాఈ మహారాజ కృపాసాగర | సాక్షాత్ ఈశ్వరీ అవతార | 
పూర్ణబ్రహ్మ మహాన యోగేశ్వర | సాష్టాంగ నమస్కార తయాంసీ | ||౧|| 
1. దయాసాగరులైన సాయి మహారాజు నిజంగా దేవుని అవతారం. పూర్ణ బ్రహ్మ, మహాయోగీశ్వరులైన వారికి సాష్టాంగ నమస్కారం.
జయ జయాజీ సంతలలామా | మంగలధామా ఆత్మారామా | 
సాఈసమర్థా భక్తవిశ్రామా | పూర్ణకామా తుజ నమో | ||౨|| 
2. జయజయ సాధువులలో శ్రేష్ఠుడా! మంగళ ధామా! ఆత్మారామా! సాయి సమర్థా! భక్తులకు ఆశ్రయమా! పూర్ణ కామా! మీకు నమస్కారాలు. 
పూర్వాధ్యాయీ నిరూపణ | థట్టా వినోద పరిశీలన | 
పరీ హా సాఈ భక్త భావన | భక్తరంజన నిత్య కరీ | ||౩|| 
3. పోయిన అధ్యాయంలో, హాస్య రసం గురించిన వర్ణన జరిగింది. భక్తులను ప్రేమించే సాయి, వారికి ఎప్పుడూ ఆనందాన్నిస్తూ ఉంటారు. 
సాఈ పరమ దయామూర్తి | ఎక పాహిజే అనన్య భక్తి | 
భక్త శ్రద్ధాళూ ఆణి భావార్థీ | ఇచ్ఛితార్థీ నా న్యూన | ||౪|| 
4. సాయి పరమ దయామూర్తి. వారి మీద ఎప్పుడూ భక్తి ఉంటే చాలు. భక్తి శ్రద్ధలున్న భక్తులు, ఏది కోరుకున్నా, దానికి కొదువ లేదు. 
‘సద్గురు తోచి మాఝీ మూర్తి’ | కృష్ణ బోలే ఉద్ధవాప్రతీ | 
ఏసా సద్గురు భజావా ప్రీతీ | అనన్య భక్తి యా నాంవ | ||౫|| 
5. “సద్గురువు నా రూపమే” అని శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పాడు. అలాంటి సద్గురువులను భక్తితో, ప్రేమతో భజించాలి. దీనినే అంతు లేని భక్తి అని అంటారు. 
అంతరీ ఉదేలా మనోరథ | ల్యాహావే శ్రీసాఈచరిత | 
లీలా శ్రవణార్హ అత్యద్భుత | లిహవూని నిశ్చింత మజ కేలే | ||౬|| 
6. శ్రీ సాయి చరిత్రను వ్రాయాలని, నా మనసులో ఒక కోరిక కలిగింది. వినడానికి ఎంతో మధురంగా ఉండే తమ లీలలను నా చేత వ్రాయించారు. 
నసతా అధికార జ్ఞాన వ్యుత్పత్తి | మజ పామరా స్ఫురవిలీ స్ఫూర్తి | 
గ్రంథ లిహవిలా మాఝియే హాతీ | ద్యావయా జాగృతి నిజభక్తా | ||౭|| 
7. శాస్త్రాల జ్ఞానం కాని, భాష మీద అధికారం కాని, లేకున్నా, నాలాంటి మూర్ఖుడికి స్ఫూర్తినిచ్చి, భక్తులలో అవగాహన పుట్టించడానికి, నా మూలకంగా ఈ గ్రంథాన్ని రచింప చేశారు. 
“దఫ్తర ఠేవీ” ఏసీ అనుజ్ఞా | జేవ్హా జాహలీ మజసమ ఆజ్ఞా | 
తేవ్హాంచ మాఝీ అల్ప ప్రజ్ఞా | ధైర్య విజ్ఞాన సంపన్న | ||౮|| 
8. సంగతులను సేకరించు అని నాలాంటి తెలివి లేనివానికి, వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడే, వెంటనే నా మంద మతి జ్ఞానంతో నిండిపోయింది. 
తేవ్హాంచ మజ ఆలా ధీర | కీ హా సాఈ గుణ గంభీర | 
ఠేవూని ఘేణార అపులే దఫ్తర | నిజ భక్తోద్ధార కారణే | ||౯|| 
9. ఎంతో గంభీర స్వభావంగల ఈ సాయి, తమ భక్తులను ఉద్ధరించటానికి, తమ కథల వివరాలను అంతా నాకు అందిస్తారని, అప్పుడే నాకు ధైర్యం కలిగింది. 
నాతరీ హా వాగ్విలాస | హోతే కాయ మజ హే సాహస | 
సంతచరణ ప్రసాద పాయస | చరిత సుధారస హా ఏసా | ||౧౦||
10. లేకుంటే, ఇంతటి జ్ఞానాన్నిచ్చే గ్రంథ రచనకు సాహసించగలనా? సాయి చరిత్ర రూపంలో ఉన్న ఈ కథల అమృతం, వారి పాదాల ప్రసాదం. 

హీ శ్రీసాఈచరిత రూపా | భక్తార్థ సాఈకథామృతప్రపా1
యథేచ్ఛ సేవా సాఈకృపా2 | భవదవతాపా3 నివారా | ||౧౧|| 
11. భక్తులకు ఈ శ్రీసాయి చరిత్ర అమృతపు చలివేంద్రం. సంసారంలోని తాపాన్ని తొలగించే దీనిని, సాయి కృపతో, ఇష్టం వచ్చినంత త్రాగండి. 
చరిత నవ్హే హా సోమకాంత | సాఈకథా చంద్రామృత స్త్రవత | 
భక్త చకోర తృషాకులిత | హోవోత తృప్త మనసోక్త | ||౧౨|| 
12. ఇది ఒట్టి జీవిత చరిత్ర కాదు. ఇది చంద్రకాంతం. చంద్రునిలోని అమృతాన్ని, సాయి కథల రూపంలో ఎప్పుడూ చెమరుస్తూ ఉంటుంది. చకోర పక్షిలా దప్పికగొన్న భక్తులు, మనసారా త్రాగి తృప్తులవుగాక. 
ఆతా ప్రేమళ శ్రోతేజన | సంకోచరహిత ఎకాగ్ర మన | 
పరిసోత యా కలిమలదహన | కథా పావన సాఈచ్యా | ||౧౩|| 
13. ఇక ఇప్పుడు ప్రేమికులైన శ్రోతలు, ఒకే మనసుతో, ఏ సందేహాలూ లేక, కలికాలంలోని పాపాలను కాల్చి వేసే సాయియొక్క పవిత్రమైన కథను వినండి. 
జడలీ ఎకదా అనన్య నిష్ఠా | కీ త్యా భక్తాచ్యా సకళ అనిష్టా | 
వారూని అర్పితో తయా అభీష్టా4 | తయాచే కష్ట నివారీ | ||౧౪|| 
14. ఒకే మనసుతో సాయి మీద భక్తి, నిష్ఠ కుదిరితే, ఆ భక్తుల కష్టాలు, అరిష్టాలు, అన్నీ తొలగి, వారి కోరికలన్నీ తీరుతాయి. 
యే అర్థీచీ ఎక వార్తా | దావీల సాఈచీ భక్తవత్సలతా | 
శ్రోతీ పరిసతా తీ సాదరతా | ఆనంద చిత్తా హోఈల | ||౧౫|| 
15. భక్తుల మీద సాయికి ఉండే ప్రీతిని తెలియ చేసే ఒక కథను, శ్రోతలు శ్రద్ధగా వింటే, మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. 
తరీ లావూనియా జీవ | కథా ఏకా హే అభినవ | 
పటేల మనాస అనుభవ | కైసీ దయార్ణవ5 గురుమాయా | ||౧౬|| 
16. శ్రద్ధగా మనసు పెట్టి, ఈ కొత్త కథను వినండి. గురుమాత ఎంతటి దయా సముద్రమో అనే మీ అనుభవాన్ని స్థిర పరుస్తుంది. 
కథా జరీ హీ బహు తోకడీ | అర్థావబోధే అతి చోఖడీ | 
 అవధాన దీజే ఎక ఘడీ | సరతీల సాంకడీ బాజూలా | ||౧౭|| 
17. ఇది చాలా చిన్న కథే అయినప్పటికీ, దీనిలో ఎంతో జ్ఞానం ఉంది. ఒక ఘడియ సేపు మీరు శ్రద్ధగా వింటే, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. 
అహమదనగరచే సుఖవస్త6 | కాసార ఎక ధనవంత | 
దామూఅణ్ణా నామే భక్త | పదీ జే అనురక్త సాఈచ్యా | ||౧౮|| 
18. శ్రీమంతుడైన సాయి భక్తుడు, కాసార జాతికి చెందిన, దాము అణ్ణా అహమ్మదునగరులో సుఖంగా ఉన్నాడు. సాయి పాదాలయందు విపరీతమైన ప్రేమ కలిగిన వాడు. 
తయా పరమ భక్తాచీ కథా | ఆనంద హోఈల శ్రవణ కరితా | 
భక్తరక్షణతత్పరతా | దిసేల ప్రత్యక్షతా సాఈచీ | ||౧౯|| 
19. ఆ పరమ భక్తుని కథను వింటే, ఆనందం కలుగుతుంది. అలాగే, భక్తులను రక్షించటానికి సాయి ఎలా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారో మనకు తెలియ చేస్తుంది. 
రామనవమీ వార్షికోత్సవీ | మోఠీ దోన నిశాణే నవీ | 
నిఘతీ మిరవీత శిరడీ గాంవీ | ఆహేత ఠావీ తత్రస్థా | ||౨౦||
20. శిరిడీ గ్రామస్థులందరికీ తెలిసినట్లు, శ్రీరామనవమి వార్షికోత్సవంలో రెండు పెద్ద, కొత్త పతాకాలను శిరిడీలో ఊరేగిస్తారు. 

త్యాంతీల ఎక నిమోణకరాంచే7 | దుసరే యా దామూఅణ్ణాంచే | 
నేమ హే త్యాంచే కైక వర్షాచే | భక్తిప్రేమాచే అవ్యాహత | ||౨౧|| 
21. వానిలో, ఒకటి నిమోన్కరుది. రెండవది ఈ దామూ అణ్ణాది. భక్తి, ప్రేమలతో చేసిన ఈ పద్ధతి, ఎన్నో సంవత్సరాలనుండి, ఆగకుండా, సాగుతూ ఉంది.
తీన స్త్రియా దామూఅణ్ణాంస | పుత్ర సంతతి నవ్హతీ త్యాంస | 
లాధూన సాఈచ్యా ఆశీర్వాదాస | పుత్రరత్నాస పావలే | ||౨౨|| 
22. ఇద్దరు పెళ్ళాలున్నా, దాము అణ్ణాకు మగ సంతానం కలగలేదు. సాయి ఆశీర్వాదంతో, ఒక కొడుకు పుట్టాడు. 
కేలా నిశాణాచా నవస | రామనవమీచ్యా ఉత్సవాస | 
ఆరంభ ఝాలా మిరవణుకీస | నిశాణ వర్షాస తేథూన | ||౨౩|| 
23. తన కృతజ్ఞత చూపటానికి, అప్పటినుండి రామనవమి రోజు జరిగే ఊరేగింపు కోసం, పతాకాన్ని ఇస్తానని మ్రొక్కుకున్నాడు. ఆ ఏటినుండి, ప్రతి ఏడూ ఈ ఊరేగింపు మొదలైంది. 
కోండ్యా సుతారాచ్యా ఘరీ | హోతే మిరవణూకీచీ తయారీ | 
తేథూని మగ వాద్యాంచే గజరీ | నిశాణ మిరవీత నేతాత | ||౨౪|| 
24. వడ్రంగి కొండ్యా ఇంట్లో పతాకం ఊరేగింపుకు సిద్ధతలు మొదలౌతాయి. అక్కడినుండి, వాద్యాల మ్రోగింపుతో, పతాకాలను ఊరేగింపుకు తీసుకుని వెళ్ళేవారు. 
మశిదీచియా దోనీ టోంకా | బాంధితీ తై దీర్ఘ పతాకా | 
సమారంభేసీ మహోత్సవ నికా | కరితీ విలోకా ప్రతివర్షీ | ||౨౫|| 
25. పొడవైన ఆ పతాకాలను, మసీదు పైన రెండు వైపులా కట్టేవారు. ప్రతి ఏడూ ఆ మహోత్సవం అలా జరుప బడుతుంది. 
తైసేంచ తేథే జే ఫకీర యేతీ | తయాంస యథేష్ట జేవూ ఘలితీ | 
రామనవమీ ఏసియే రీతీ | ప్రతిపాళితీ హీ శేట | ||౨౬|| 
26. అలాగే, అప్పుడు అక్కడికి వచ్చే ఫకీరులకు తృప్తిగా భోజనం పెట్టేవారు. ఈ రీతిగా దాము అణ్ణా రామనవమిని జరిపించేవాడు. 
త్యా యా దామూఅణ్ణాచీ కథా | శ్రవణార్థియా నివేదితో ఆతా | 
శ్రవణ కరితా సావధానతా | సాఈసమర్థతా ప్రకటేల | ||౨౭|| 
27. ఆ దాము అణ్ణా కథనే, ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. శ్రద్ధగా వింటే సాయియొక్క సామర్థ్యం తెలుస్తుంది. 
ముంబానగరీచా తయాంచా స్నేహీ | ముంబఈహూన పత్ర లిహీ | 
దోంలాఖ నివ్వళ నఫా హోఈ | ఏసీ8 కిఫాఈత కరూంకీ | ||౨౮|| 
28. ముంబై నగరంలో ఉండే దాము అణ్ణా మిత్రుడు, ‘రెండు లక్షల లాభం వచ్చే వ్యాపారం ఉంది. లాభాలనిచ్చే ఈ వ్యాపారం చేద్దామా?’ అని ఉత్తరం వ్రాశాడు. 
తుమ్హా ఆమ్హా భాగీ దేఖ | కమావూ ప్రత్యేకీ లాఖ లాఖ | 
ఉత్తర ధాడా కరా చలాఖ9 | ధందాహీ చోఖ నిర్భయ కీ | ||౨౯|| 
29. ‘నువ్వూ నేనూ ఇద్దరం భాగస్వాములై, చెరో లక్ష సంపాదించుకుందాం. ఏ మోసమూ లేని అసలైన వ్యాపారం ఇది, వెంటనే జాబు వ్రాయి. 
ఖరేదూ కాపూస వక్తీ10 | భావ చఢేల హాతోహాతీ | 
సౌదా న సాధితీ వేళేవరతీ | మగ తే పస్తాతీ11 మాగాహూన | ||౩౦||
30. ‘ఇప్పుడు దూదిని కొందాం. దాని ధర వెంటనే పెరిగి పోతుంది. ఈ అవకాశం ఇప్పుడు ఉపయోగించుకోక పోతే, తరువాత మనం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. 

దవడూ న ద్యావీ ఏసీ వేళ | ఉడాలీ అణ్ణాంచే మనాచీ ఖళబళ | 
భరంవసా త్యా స్నేహ్యావరీ సబళ | విచార నిశ్చళ12 సుచేనా | ||౩౧|| 
31. ‘ఇలాంటి అవకాశం వదులుకోకు’ అని వ్రాయగా, అణ్ణా మనసు కలవర పడింది. తన స్నేహితునిపై అతనికి గట్టి నమ్మకం. అయినా ఏం చేయాలో నిర్ణయించుకోలేక పోయాడు. 
ధందా కరావా వా న కరావా | విచార పడలా అణ్ణాచే జీవా | 
కాయ హోఈల కైసే దేవా | గోవా13 పడలా మనాలా | ||౩౨|| 
32. ‘వ్యాపారం చేయాలా వద్దా, దేవుడా! ఎమౌతుంది? నేనేం చేయాలి?’ అన్న సంశయంతో అణ్ణాకు చింత పట్టుకుంది. 
దామూఅణ్ణా హీ గురుపుత్ర | బాబాంస లిహితే ఝాలే పత్ర | 
ఆమ్హా న బుద్ధి స్వతంత్ర | ఆపణచి ఛత్ర ఆమ్హాంతే | ||౩౩|| 
33. దాము అణ్ణా కూడా గురుపుత్రుడే (నమ్మకమున్న భక్తుడు). అప్పుడు, బాబాకు ఉత్తరం వ్రాశాడు. ‘బాబా! మాకు స్వతహాగా ఆలోచించే బుద్ధి లేదు. మీరే మాకు అండదండ, మీరే మాకు రక్ష. 
వ్యాపార హా తో సకృద్దర్శనీ | కరావా ఏసే యేతే మనీ | 
పరీ హోఈల లాభ కీ హానీ | కృపా కరోని సాంగాజీ | ||౩౪|| 
34. ‘వ్యాపారం బాగానే ఉంది. చేద్దాము అని అనిపిస్తుంది. కాని, ఇందులో లాభాలు వస్తాయా, లేక నష్టాలేనా అని దయచేసి తెలియ చేయండి’. 
పత్ర లిహిలే మాధవరావా | కీ హే బాబాంస వాచూన దావా | 
ఆజ్ఞా హోఈల తైసే కళవా | ఉద్యమ బరవా వాటతో | ||౩౫|| 
35. ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించి, వారి ఆజ్ఞను తెలియ చేయమని, మాధవరావుకు ఆ ఉత్తరం వ్రాశాడు. 
దుసరే దివసీ తిసరే ప్రహరీ | పత్ర పడలే మాధవరావకరీ | 
తేణే నేఊని మశీదీభీతరీ | చరణావరీ ఘాతలే | ||౩౬|| 
36. ఆ ఉత్తరం మరునాడు మధ్యాహ్నం మాధవరావు చేతికి అందింది. అతడు దానిని తీసుకుని వెళ్ళి, మసీదులో బాబా పాదాల దగ్గర ఉంచాడు. 
“కాయ శామా కాయ ఘాఈ | కాగుద కసలా లావితో పాయీ” | 
‘బాబా తో నగరచా దామూశేట కాంహీ | విచారూ పాహీ ఆపణాతే’ | ||౩౭|| 
37. “ఏమిటి శామా! ఏమిటీ హడావిడి? నా పాదాల దగ్గర పెట్టిన ఈ కాగితం ఏమిటి?” అని బాబా అడిగారు. ‘బాబా! నగరులోని దాము శేటు మిమ్మల్ని ఏదో అడగాలని అనుకుంటున్నాడు’. 
“కా బరే తో కాయ లిహితో | కాయ కసలే బేత కరతో | 
వాటే ఆభాళా హాత లావితో | దేవ దేతో తే నకో | ||౩౮|| 
38. “సరే, ఏమిటది? ఏం వ్రాశాడు? ఆకాశాన్ని అందుకోవాలని ఏ ప్రయత్నాలు చేస్తున్నాడు? దేవుడు ఇస్తున్నది అక్కరలేదు. 
వాచ వాచ పత్ర త్యాచే” | శామా మ్హణే ‘జే వదతా వాచే | 
తేచ అర్థాచే పత్ర సాచే | దామూఅణ్ణాంచే అక్షరశః | ||౩౯|| 
39. “చదువు, చదువు అతని ఉత్తరాన్ని” అని బాబా అన్నారు. ‘అసలు మీరు ఇప్పుడు చెప్పినదే ఆ ఉత్తరంలోని తాత్పర్యం. 
దేవా ఆపణ బసతా నిశ్చళ | ఉడవితా భక్తాంచీ ఖళబళ | 
మగ హోతా మనాచీ తళమళ | పాయాజవళ ఆణితా | ||౪౦||
40. ‘దేవా! మీరు కదలకుండా కూర్చుని, భక్తుల మనసులో కలవరం లేపుతారు. వారు బాధపడుతుంటే, వారిని మీ పాదాల దగ్గరకు రప్పించుకుంటారు. 

కోణాస స్వయే ఓఢూన ఆణితా | కోణాలాగీ పత్రే లిహవితా | 
అంతస్థ ఆశయ ఆధీంచ సాంగతా | మగ వాచవితా కిమర్థ’ | ||౪౧|| 
41. ‘కొందరిని స్వయంగా రప్పిస్తారు. మరి కొందరికి, ఉత్తరాన్ని వ్రాయిస్తారు. ఉత్తరంలోని సంగతిని ముందే చెప్పేశారు కదా, ఇక చదవటం ఎందుకు?’ అని శామా అడిగాడు.
“అరే శామా వాచ వాచ | మాఝే కాయ మానితో సాచ | 
మీ తవ ఆపులా ఆహే అసాచ | బోలే ఉగాచ మానే14 తే” | ||౪౨|| 
42. “అరే శామా! చదువు, చదువు. నేను చెప్పిందే ఎందుకు నమ్ముతావు? తోచింది ఏదో ఒకటి, నేను ఇలాగే చెప్పుతుంటాను లే!” 
మగ మాధవరావ పత్ర వాచితీ | బాబా లక్ష లావూని ఏకతీ | 
కళకళూని మగ బాబా వదతీ | “చళలీ మతీ శేటీచీ | ||౪౩|| 
43. తరువాత మాధవరావు ఉత్తరం చదవగా, బాబా శ్రద్ధగా విని, అసలైన బాధతో “శేటుకి మతి పోయింది” అని అన్నారు. 
సాంగకీ తయాస ప్రత్యుత్తరీ | కాయఉణే తుజ అసతా ఘరీ | 
పురే ఆపులీ అర్ధీ భాకరీ | లాఖాచే భరీ పడూ నకో” | ||౪౪|| 
44. “‘నీ ఇంట్లో ఏం తక్కువైంది? ఉన్న సగం భక్రి (జొన్న రొట్టె) చాలు మనకు. లక్షల వెంట పడకు’ అని అతనికి జాబు వ్రాయి” అని చెప్పారు. 
ప్రత్యుత్తరాచీ క్షణక్షణా | వాటచి పాహత దామూ అణ్ణా | 
ఉత్తర యేతాంచి తత్క్షణా | దామూఅణ్ణా వాచితీ | ||౪౫|| 
45. ఆ జాబు కోసమే ప్రతి క్షణం ఎదురు చూస్తున్న దాము అణ్ణా, అది అందగానే, వెంటనే దానిని చదివాడు. 
ఏకూని త్యా ప్రత్యుత్తరాలా | దామూశేటీచా విరస ఝాలా | 
మనోరథాచా దుర్గచి ఢాసళలా | వృక్ష ఉన్మళలా ఆశేచా | ||౪౬|| 
46. ఆ జాబుని చదివి, దామూ శేటు చాలా నిరాశ చెందాడు. గాలిలో కట్టిన మేడలన్నీ కూలి పోయాయి. ఆశతో మనసులో పెంచుకున్న చెట్టు పడిపోయింది. 
ఆతా ఎక లాఖ కమావూ | అర్ధాలాఖ వ్యాజీ లావూ | 
తాత్కాళ లాఖే సావకార హోఊ | ఆనందే రాహూ నగరాంత | ||౪౭|| 
47. ‘ఒక లక్షను ఇప్పుడు సంపాదించి, అందులో అర లక్షను వడ్డీకి ఇచ్చి, వెంటనే లక్షల షావుకారునై, నగరులో సుఖంగా ఉంటాను’. 
మనోరాజ్య హోతే జే కేలే | జాగచే జాగీంచ తే విరఘళలే | 
దామూఅణ్ణా అత్యంత హిరముసలే | హే కాయ కేలే బాబాంనీ | ||౪౮|| 
48. అని అతను తన మనసులోనే కట్టుకున్న మనోరాజ్యాలు, అక్కడికక్కడే కరిగి పోయాయి. ‘ఇదేమిటి బాబా ఇలా చేశారు?’ అని దాము అణ్ణా చాలా నిరాశ చెందాడు. 
పత్ర లిహిలే ఎథేంచ ఫసలే | ఆపులే ఆపణ అనహిత కేలే | 
దేఖత దేఖత వాఢిలేలే | తాట లాథాడిలే ఆపణచి | ||౪౯|| 
49. ‘అసలు నేను ఉత్తరం వ్రాయడమే తప్పైంది. నా మంచిని నేనే పాడు చేసుకున్నాను. చూస్తూ చూస్తూ, తలుపు దగ్గరకు వచ్చిన వడ్డించిన విస్తరిని నేనే తన్నుకున్నట్లు అయింది!’ 
అసో త్యా పత్రాంత దామూఅణ్ణాతే | ఏసేహీ ధ్వనిత కేలే హోతే | 
కానాడోళ్యాంచే అంతర అసతే | యావే కీ యేథే సమక్ష | ||౫౦||
50. ‘కళ్ళతో చూడటానికి, చెవులతో వినటానికి తేడా రావచ్చు. కనుక, మీరు స్వయంగా బాబా దగ్గరకు వస్తే బాగుంటుంది’ అని ఆ జాబులో సూచించడమైంది. 

ఏసే మాధవరావాంచే సూచిత | సమక్ష జావే వాటలే ఉచిత | 
న జాణే అసేల త్యాంతహీ హిత | కదాచిత అనుమత దేతీల | ||౫౧|| 
51. మాధవరావు అలా సూచించటంతో, ‘దాని ప్రకారం బాబా దగ్గరకు వెళ్ళటం మంచిదేమో, దాని వలనే తనకు మేలు జరుగుతుందేమో! ఒక వేళ, బాబా అనుమతిని కూడా ఇవ్వవచ్చేమో!’ 
ఏసా విచార కరూని మనీ | అణ్ణా ఆలే శిరడీ లాగునీ | 
బైసలే బాబాంచే సన్నిధానీ | లోటాంగణీ యేఊన | ||౫౨|| 
52. అని ఆలోచించుకుని, అణ్ణా శిరిడీకి వచ్చాడు. సాయికి సాష్టాంగ నమస్కారం చేసి, వారి దగ్గరే కూర్చున్నాడు. 
హళూ హళూ పాయ దాబితీ | విచారావయా నాహీ ధృతీ | 
అంతర్యామీ ఉఠలీ వృత్తీ | బాబాంచీ పాతీ15 ఠేవావీ | ||౫౩|| 
53. మెల్ల మెల్లగా వారి కాళ్ళను పట్ట సాగాడు. బాబాను అడగటానికి ధైర్యం చాలలేదు. వెంటనే, అతనికి ఒక ఆలోచన వచ్చి, బాబాకు లాభంలో వాటా ఇవ్వాలని అనిపించింది. 
మనాంత మ్హణతీ సాఈనాథా | కరాల జరీ యా వ్యాపారా సాహ్యతా | 
నఫ్యాచా కాంహీ భాగ మీ అర్పితా | పాయావరతా హోఈన | ||౫౪|| 
54. ‘సాయినాథా! ఈ వ్యాపారంలో నాకు సహాయం చేస్తే, లాభంలో కొంత వాటా మీ పాదాలకు సమర్పిస్తాను’ అని మనసులో అనుకున్నాడు. 
మస్తకీ ధరిలే సాఈచరణ | దామూఅణ్ణా బైసలే క్షణ | 
సంకల్ప వికల్ప మనాచే లక్షణ | వ్యాపార ఆంతూన చాలలే | ||౫౫|| 
55. సాయి పాదాలపై తలనుంచి, కొంత సేపు కూర్చున్నాడు. అతని మనసులో ఎన్నో సందేహాలు, నిర్ణయాలు గుమిగూడాయి. మనిషి మనసు స్వభావం ఇంతే! 
భక్తీ కరావే మనోరథ | తే న జాణతీ ఖరా స్వార్థ | 
గురు ఎక జాణే శిష్యాచే హిత | భావీ భూత వర్తమాన | ||౫౬|| 
56. భక్తులు తమ భవిష్యత్తు కోసం ఎన్నో రకాల ఆలోచనలను చేస్తుంటారు. కాని, తమ అసలైన మేలు దేనివలన కలుగుతుందని వారికి తెలియదు. గురువు ఒక్కరికే భక్తుల భూత భవిష్య వర్తమానాలలోని మేలు తెలుసు. 
నిజమనీచే మనోగత | కోణీ కితీహీ ఠేవో గుప్త | 
సాఈ సమర్థ సర్వగత16 | అంతర్వృత్త జాణే తో | ||౫౭|| 
57. ఎవరైనా కాని, తమ మనసులోని కోరికలను ఎంత రహస్యంగా దాచుకున్నా, వారు దాచుకున్న కోరికలను, సాయి సమర్థులు తెలుసుకుంటారు. 
జేవ్హా కోణీ మనీచే హృద్గత | సాఈ చరణీ ప్రేమే నివేదిత | 
పూర్ణ విశ్వాసే అనుజ్ఞా ప్రార్థిత | దావిత సత్పంథ సాఈ త్యా | ||౫౮|| 
58. కాని, సాయి పాదాలయందు ప్రేమతో భక్తితో, తమ మనసులోని కోరికలను, సాయియందు పూర్తి నమ్మకంతో, వారికి మనవి చేసుకుంటే, సాయి వారికి సరియైన మార్గాన్ని చూపుతారు. 
హే తో తయాంచే నిజవ్రత | జాణతీ హే భక్త సమస్త | 
జో జో అనన్య శరణాగత | ఆపదా వారీత తయాంచ్యా | ||౫౯|| 
59. ఇదే వారి వ్రతం. వారి భక్తులందరికీ ఈ సంగతి తెలుసు. వారికి శరణుజొచ్చిన భక్తులను ఎలాంటి ఆపదలనుంచైనా రక్షిస్తారు. 
గురూచి సత్య మాతా పితా | అనేకా జన్మీంచా పాతాత్రాతా | 
తోచి హరిహర ఆణి విధాతా | కర్తాకరవితా తో ఎక | ||౬౦||
60. గురువే నిజమైన తల్లి తండ్రి. ఎన్నో జన్మలనుండి మనల్ని పోషించి, రక్షించిన వారు గురువే. గురువే బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు. చేసేవారు, చేయించేవారూ వారు ఒక్కరే. 

బాళ మాగతా గోడధడూ | మాతా పాజీ బోళకడూ17
బాళ తడఫడూ వా రడూ | ప్రేమ నివాడూ హా ఏసా | ||౬౧|| 
61. బిడ్డ తియ్యటి వస్తువులను తినడానికి అడిగినప్పుడు, తల్లి చేదు మందును త్రాగిస్తుంది. బిడ్డ ఏడ్చి గోల చేసినా, తల్లి నిర్ణయం మారదు. బిడ్డ మేలు గురించి తల్లికి ఉండే బాధ్యత అలాంటిది.
బోళాచా తో కడూపణా | యోగ్య కాళే చఢణార గుణా | 
బాళ కాయ జాణే త్యా లక్షణా | మాతేచ్యా ఖుణా మాతేస | ||౬౨|| 
62. ఆ చేదు మందు జబ్బు నయం చేస్తుంది. కాని, చేదు మందు మంచితనం బిడ్డకేం తెలుసు? ఏది మంచిదో, ఏది కాదో, తల్లికే తెలుస్తుంది. 
అణ్ణా జరీ ఠేవితీ పాతీ | బాబా కాయ తేణే భులతీ | 
లాభేవీణ తయాంచీ ప్రీతీ | నిజభక్తహితీ తత్పర | ||౬౩|| 
63. తనకి వచ్చిన లాభాలలో, వాటా ఇవ్వాలని అణ్ణా అనుకున్నా, బాబా దానికి లొంగుతారా! వారి ప్రేమ ఏ లాభమూ ఆశించనిది. వారు ఎప్పుడూ తమ భక్తుల మేలు గురించే పాటు పడుతుంటారు. 
ధన కనక జయా మాతీ | కింపదార్థ తయాంతే పాతీ | 
కేవళ దీనజనోద్ధరణార్థీ | జగీ అవతరతీ హే సంత | ||౬౪|| 
64. డబ్బు, బంగారం అన్నీ మట్టిలా ఎవరికి అనిపిస్తుందో వారికి, లాభాలలో వాటా ఏపాటిది? ఈ సత్పురుషులు కేవలం దీనులను ఉద్ధరించటానికే జగత్తులో అవతరిస్తారు. 
యమనియమశమదమసంపన్న | మాయామాత్సర్యదోషవిహీన | 
కేవళ పరానుగ్రహ ప్రయోజన | జయాచే జీవన తో సంత | ||౬౫|| 
65. యమ-నియమ, శమ-దమ, మొదలైన సంపదలున్నవారు, అసూయ, మాయ, అత్యాశ మొదలైన దోషాలు లేని వారు, ఇతరులను అనుగ్రహించటానికే జీవించేవారు, ఇలాంటి వారే నిజమైన సత్పురుషులు. 
దామూఅణ్ణాచీ హీ పాతీ | మనీంచేమనీ గుప్త హోతీ | 
బాబా ప్రకట ఉత్తర దేతీ | సాదరవృత్తీ పరిసావే | ||౬౬|| 
66. లాభాలలో బాబాకు వాటా ఇవ్వటం అనే ఆలోచన, దామూ అణ్ణా మనసులో రావటంతోనే, బాబా బయటికి ఏం సమాధానం చెప్పారో శ్రద్ధగా వినండి. 
జీవమాత్రాచే మనోగత | బాబాంస సకళ అవగత | 
వర్తమాన భవిష్య భూత | జైసా కరతలగత ఆమలక18 | ||౬౭|| 
67. ప్రతి జీవియొక్క రహస్యమైన కోరికలు కూడా బాబాకు తెలుసు. భక్తుల భూత, భవిష్య, వర్తమానాలు బాబాకు అరచేతిలోని ఉసిరికాయలా స్పష్టంగా తెలుసు. 
నిజ భక్తాచీ భావీ స్థితీ | సమస్త ఠావీ బాబాంప్రతీ | 
కైసే వేళేవర సావధ కరితీ | తీ స్పష్టోక్తీ పరిసావీ | ||౬౮|| 
68. తమ భక్తులకు ముందు ముందు ఏమి జరుగుతుందనేది, బాబాకు పూర్తిగా తెలుసు. సమయానికి సరిగ్గా, వారు ఏ విధంగా స్పష్టంగా హెచ్చరించేవారో వినండి. 
“ఆపణ నాహీరే బాపూ19 కిసమే20” | బాబా దేతీ సూచనా ప్రేమే | 
వ్యాపార బరవా సాఈస న గమే | అణ్ణా శరమే మనాంత | ||౬౯|| 
69. “నేను ఎందులోనూ లేను రా, బాపూ!” అని ఎంతో ప్రేమగా, బాబా ఈ వ్యాపారం సరియైనది కాదని, తమకు ఇష్టం లేదని సూచించారు. అణ్ణా లోలోనే సిగ్గు పడిపోయాడు. 
ఏకూన హే బాబాంచే వచన | దామూఅణ్ణాస పటలీ ఖూణ | 
దిధలా మనాచా సంకల్ప సోడూన | బైసలే అధోవదన ఉగా | ||౭౦||
70. బాబా మాటలు విన్నాక, వారి ఉద్దేశం దామూ అణ్ణాకు బాగా అర్థమైంది. వ్యాపారం గురించిన ఆలోచనను వదిలేసి, తలదించుకుని, ఊరికే కూర్చున్నాడు. 

పునశ్చ మనీ ఉఠలా విచార | కరూ కాయ దుసరా వ్యాపార | 
తాందూళ గహూ భుసార | పరిసా ప్రత్యుత్తర బాబాంచే | ||౭౧|| 
71. అంతలోనే, అతనికి ఇంకొక ఆలోచన కలిగింది. బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలతో మరో వ్యాపారం చేస్తేనో అని. ఆ ఆలోచన బయటికి చెప్పక మునుపే, బాబా ఇచ్చిన సమాధానాన్ని వినండి. 
“పాంచ శేర తూ ఘేసీల | సాత శేర ఓపిసీల21” | 
పరిసూన హే బాబాంచే బోల | అంతరీ ఖాజీల అణ్ణా తై | ||౭౨|| 
72. “(రూపాయికి) అయిదు సేర్ల చొప్పున కొని, ఏడు సేర్ల చొప్పున అమ్ముతావు” అని చెప్పారు. ఆ మాటలు విని మనసులోనే అణ్ణా సిగ్గు పడిపోయాడు. 
ఏసే కోఠే కాంహీహీ న ఘడే | జే సాఈచ్యా దృష్టీస న పడే | 
ఖాలీ వరతీ జికడే తికడే | సర్వత్ర ఉఘడే తయాస | ||౭౩|| 
73. ఎక్కడ ఏది జరిగినా, సాయి దృష్టిలో పడకుండా ఉండదు. కిందా, పైనా, ఇక్కడా, అక్కడా, అంతా, వారికి తెలుసు. 
యేరీకడే త్యాంచా స్నేహీ | విచార గహనీ పడలా పాహీ | 
కాయ కరావే సుచేనా కాంహీ | ఉత్తరహీ నాహీ అణ్ణాచే | ||౭౪|| 
74. దామూ అణ్ణా దగ్గరనుండి జాబు రాక, ఇక్కడ అణ్ణా స్నేహితుడు ఏం చేయాలో తెలియక, ఆలోచనలో పడ్డాడు. 
తో తే శేట పత్ర లిహిత | వృత్తాంత ఘడాలేలా కళవీత | 
వాచూని స్నేహీ విస్మిత హోత | మ్హణతీ కర్మగత విచిత్ర | ||౭౫|| 
75. ఇంతలో, జరిగినదంతా దామూ అణ్ణా అతనికి ఉత్తరంలో తెలుపగా, అతడు అది చదివి, ఆశ్చర్యపోయాడు. ‘కర్మ గతి ఎంత విచిత్రం’ అని అనుకున్నాడు. 
కాయ సౌదా చాలూన ఆలా | స్వయేంచ కా నా విచార కేలా | 
కిమర్థ ఫకీరాచే22 నాదీ లాగలా | వ్యర్థ ముకలా లాభాలా | ||౭౬|| 
76. ‘ఎంత మంచి వ్యాపారం చేతికొచ్చింది! తనే ఎందుకు ఆలోచించలేదు? ఆ ఫకీరు వెంట పడటంలో ఏమర్థం? అనవసరంగా అంత లాభాలని వదులుకున్నాడు! 
‘దేవ దేతో కర్మ నేతే | హోణారా సారఖీ బుద్ధి హోతే’ | 
ఏసా చోఖ ధందా జేథే | ఫకీర తేథే కా వ్హావా | ||౭౭|| 
77. ‘దేవుడిచ్చినా, మన కర్మ లాగేసుకుంటుంది! జరగవలసిన దానిని బట్టే మన బుద్ధి పని చేస్తుంది. ఇంత చక్కటి వ్యాపారం అందుతుండగా, మధ్యన ఆ ఫకీరు ఎందుకు అడ్డు రావాలి? 
వ్యవహారావర దేఊని పాణీ | దారోదార వేడ్యావాణీ | 
పోట భరితీ తుకడే మాగునీ | తే తాయ సాంగూని సాంగతీ | ||౭౮|| 
78. ‘సంసారాన్ని వదిలేసి, ఇంటింటా రొట్టెముక్కలు అడుక్కుని, కడుపు నింపుకునే వాడు, ఏ మాత్రం సలహ చెప్పగలడు! 
అసో నాహీ తయాచే దైవీ | తేణేంచ ఏసీ త్యా బుద్ధి వ్హావీ | 
దుసరీ కోణీ పాతీ23 వ్హావీ | ‘యద్భావీ న భావి24’ తే | ||౭౯|| 
79. ‘అసలు, అతనికే అదృష్టం లేదు. అందుకే ఇలాంటి బుద్ధి పుట్టింది. ఇంకెవరినైనా భాగస్వామిగా చూసుకోవాలి. తలరాతలో లేనిది ఏదీ జరగదు, అంతే!’ అని అనుకున్నాడు. 
ఝాలే అణ్ణా స్వస్థ బసలే | హోతే జయాచే కర్మ ఓఢవలే | 
తేచ త్యా స్నేహ్యాచే పాతీదార ఝాలే | ఆలే తపేలే గళ్యాంత | ||౮౦||
80. ఏమి చేయాలో తెలియక, అణ్ణా ఊరికే ఉండిపోయాడు. కర్మ కాలినవాడెవడో ఇంకొకడు, భాగస్వామిగా చేరి, కష్టాలలో పడ్డాడు! 

కరావయా గేలే సట్టా | పరీ తయాంచా దివస ఉలటా | 
ఠోకర లాగలీ ఝాలా తోటా | కైసా సోటా ఫకీరాచా | ||౮౧|| 
81. సట్టా వ్యాపారం చేయగా, రోజులు బాగా లేక, అక్కడ కూడా దెబ్బ తిని నష్టపోయాడు. ఫకీరు దెబ్బ అలాంటిది!
కాయ మాఝా దామూఅణ్ణా | నశీబాచా, మోఠా శహాణా | 
ఖరా త్యాచా సాఈ దాణా | భక్త కరుణా కేవఢీ | ||౮౨|| 
82. ‘ఎంత అదృష్టవంతుడు, మా దామూ అణ్ణా! చాలా తెలివైనవాడు! సాయి నిజంగా మహాత్ముడు. భక్తుల మీద వారికి ఎంత దయ! 
స్నేహీ మ్హణూన మాఝే ఫందీ | పడతా నాగవతా25 స్వచ్ఛందీ | 
తరలా బిచారా ఫకీరాచే నాదీ | కాయ దృఢబుద్ధి తయాచీ | ||౮౩|| 
83. ‘స్నేహితుడని, దామూ అణ్ణా నా మాట విని ఉంటే, కష్టాలలో చిక్కుకునే వాడు. ఫకీరు మాట వినటం వలన రక్షించ బడ్డాడు. అతని నమ్మకం ఎంత బలంగా ఉంది! 
థట్టా త్యాచే వేడేపణాచీ | ఘమండ మాఝే శహాణపణాచీ | 
వ్యర్థవ్యర్థ జహాలీ సాచీ | అనుభవ హాచీ లాధలో | ||౮౪|| 
84. ‘అతనిది పిచ్చితనమని ఎగతాళి చేశాను. నేను చాలా తెలివైన వాణ్ణి అని గర్వ పడ్డాను. ఆ తెలివి అంతా వ్యర్థమని అనుభవమైంది. 
ఉగీచ త్యా ఫకీరాచీ నిందా | న కరితా లాగతో త్యాచే నాదా | 
మజలాహీ తో వేళేవర జాగా | కరితా న దగా హోతా హా | ||౮౫|| 
85. ‘అనవసరంగా ఆ ఫకీరును నిందించకుండా, వారి సలహాను పాటించి ఉంటే, నాకు కూడా వారు సమయానికి సరిగ్గా సూచనలిచ్చే వారు. నేను ఇంత నష్టపోయేవాణ్ణి కాను’. 
ఆతా ఆణిక ఎక వార్తా | సాంగూని ఆవరూ అణ్ణాచ్యా గ్రంథా | 
ఆనంద హోఈల శ్రోతియా చిత్తా | వాటేల ఆశ్చర్యతా బాబాంచీ | ||౮౬|| 
86. ఇంకొక కథ చెప్పి, ఈ అణ్ణా కథలను ముగిస్తాను! బాబా లీలలు శ్రోతలకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగ చేస్తాయి. 
పహా ఎకదా ఏసే వర్తలే | గోవ్యాహూన పార్సల ఆలే | 
ఆంబే నామాంకిత కోణీ ధాడిలే | మామలేదార రాళే యా నావే | ||౮౭|| 
87. ఒక సారి, గోవానుండి ఒక పార్సిలు వచ్చింది. గోవాలో ప్రసిద్ధి చెందిన మామిడి పండ్లను, రాళే అన్న పేరుగల మామలేదారు, పంపించాడు. 
మాధవరావాంచ్యా నాంవావర | బాబాంచ్యా పాయీ వ్హావే సాదర | 
మ్హణూన కోపరగాంవీ స్వీకార | హోఊని శిరడీవర తే ఆలే | ||౮౮|| 
88. మాధవరావు పేరున, బాబా పాదాలకు సవినయంగా సమర్పించటానికి, ఆ పార్సిలు కోపర్గాంనుండి శిరిడీకి వచ్చింది. 
మశీదీంత బాబా సమోర | ఉఘడతా ఆంబే నిఘాలే సుందర | 
హోతే ఎకందర తీనశేంవర | ఫళే తీ మధుర ఘమఘమిత | ||౮౯|| 
89. మసీదులో బాబా ఎదుట ఆ పార్సిలును విప్పగా అందులో, ఘుమఘుమలాడే సువాసనతో, మూడు వందల పైగా, మధురమైన మంచి మామిడి పళ్ళు ఉన్నాయి. 
బాబాంనీ తీ అవఘీ పాహిలీ | మాధవరావాంపాశీ దిధలీ | 
తయాంనీ చార కోళంబ్యాంత26 టాకిలీ | ఉరలీ తీ నేలీ బరోబర | ||౯౦||
90. వాటన్నిటినీ చూచి బాబా, ఆ పళ్ళను మాధవరావుకు ఇచ్చారు. నాలుగు పళ్ళను కొళంబాలో వేసి, మిగిలిన వాటిని మాధవరావు తన వెంట తీసుకెళ్ళాడు. 

ఫళే పడతా కోళంబ్యాంత | బాబా ముఖే కాయ ఉద్గారత | 
“ఫళే తీ దాముఅణ్ణా ప్రీత్యర్థ | అసూదే తేథ పడలేలీ” | ||౯౧|| 
91. కొళంబాలో పళ్ళు పడగానే, బాబా “ఆ పళ్ళు దాముఅణ్ణా కోసం, అవి అక్కడే ఉండనీ” అని చెప్పారు. 
యావర జాతా దోన తాస | ఆలే పూజా కరావయాస | 
దామూఅణ్ణా మశీదీస | పుష్ప సంభారాస ఘేఊని | ||౯౨|| 
92. రెండు గంటలు అయ్యాక, పూలు, పూజా సామగ్రి పట్టుకుని, బాబా పూజ చేయటానికి, దాము అణ్ణా మసీదుకు వచ్చాడు. 
తయా న పూర్వ వృత్త తే కళలే | బాబా మోఠ్యానే బోలూ లాగలే | 
“ఆంబే దామ్యాచే న తే ఆపులే | ఖావయా టపలే లోక జరీ | ||౯౩|| 
93. తను రాక మునుపు ఏం జరిగింది అని అతనికి తెలియదు. బాబా గట్టిగా “మామిడి పళ్ళు దామ్యావి. వాటిని తినాలని లోకులుకు ఆతురంగా ఉన్నా, అవి మనవి కావు. 
జ్యాచే ఆంబే త్యానేంచ ఘ్యావే | కిమర్థ ఆపణా కోణాచే వ్హావే | 
జ్యాచే అసతీల త్యానేంచి ఖావే | మరూని జావే ఖావోనీ” | ||౯౪|| 
94. “ఆ పళ్ళు ఎవరివో, వారే తీసుకోవాలి. ఇంకొకరివి మనకెందుకు కావాలి? అవి ఎవరివో వారే తినాలి, తిని చావాలి” అని అన్నారు. 
ప్రసాదచి హా ఏసియా భావే | అణ్ణా స్వీకారితీ స్వభావే | 
విపరీతార్థాలాగీ న భ్యావే | పూర్ణ హే ఠావే అణ్ణాస | ||౯౫|| 
95. అవి బాబా ప్రసాదం అనే నమ్మకంతో, అణ్ణా వానిని తీసుకున్నాడు. బాబా మాటల విపరీత అర్థానికి భయపడాల్సిన అవసరం లేదని అణ్ణాకు బాగా తెలుసు. 
పూజా సారోనీ అణ్ణా గేలే | పునశ్చ యేఊని పుసూ లాగలే | 
మోఠీస27 కీ ధాకటీస27 హీ ఫళే | అర్పూ న కళే కోణాస | ||౯౬|| 
96. పూజ ముగించుకుని, అణ్ణా ఇంటికి వెళ్ళాడు. మరల వచ్చి, ‘పెద్ద భార్యకా, లేక చిన్న భార్యకా? ఈ పళ్ళు ఎవరికివ్వాలో నాకు తెలియదే?’ అని అడిగాడు. 
బాబా వదతీ ధాకటీలా | “దే ఆఠ ములే హోతీల తిజలా | 
చార ములగే చార ములీలా | హీ ఆమ్రలీలా ప్రసవేల” | ||౯౭|| 
97. “చిన్న భార్యకివ్వు. ఆమెకు ఎనమండుగురు బిడ్డలు పుడతారు. నలుగురు మగ పిల్లలు, నలుగురు ఆడ పిల్లలు, ఈ మామిడి పళ్ళ లీల వలన, కలుగుతారు” అని బాబా చెప్పారు. 
పోటీ నాహీ పుత్రసంతాన | మ్హణూన కరావే బహు ప్రయత్న | 
సాధుసంతాంచే కరావే భజన | కృపాశీర్వచన మిళవావే | ||౯౮|| 
98. మగ సంతానం లేక పోవటం వలన, దాము అణ్ణా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సాధు సత్పురుషుల సేవ చేసి, వారి అనుగ్రహం మరియు ఆశీస్సుల కోసం వారిని భజించేవాడు. 
యదర్థ సాధుసంతాంచా నాద | మిళవావయా గ్రహ ప్రసాద | 
జ్యోతిర్విద్యేచా లాగలా ఛంద | జాహలే జ్యోతిర్విద స్వయమేవ | ||౯౯|| 
99. గ్రహాల అనుగ్రహం కోసం తనే జ్యోతిష్య విద్య నేర్చుకుని, జ్యోతిష్కుడయ్యాడు. 
నశీబీ నాహీ సంతాన | హేంచ జ్యోతిర్విద్యేచే నిదాన | 
అణ్ణా హోతే పూర్ణ జాణూన | నిరాశ హోఊన బసలేలే | ||౧౦౦||
100. జ్యోతిష్యం ప్రకారం తనకు మగ సంతానం లేదని తెలుసుకుని, అతడు చాలా నిరాశ చెందాడు. 

తథాపి హే ఆశ్వాసన | సాఈ సంత ముఖీంచే వచన | 
పునశ్చ ఆశా ఝాలీ ఉత్పన్న | సమర్థ ప్రసన్న హోతాంచి | ||౧౦౧|| 
101. అయినా, సాయి సత్పురుషులు స్వయంగా చెప్పిన మాటలు అతని మనసులో కొత్త ఆశలను, ధైర్యాన్ని కలిగించాయి. తన మీద సాయికున్న ప్రేమ అతనికి తెలుసు.
అసో పుఢే కాలాంతరే | సఫల ఝాలీ బాబాంచీ అక్షరే | 
సంతప్రసాదామ్రాంకురే | సంతతి ఫలభరే ప్రసవలీ | ||౧౦౨|| 
102. అలా, కొంత కాలం తరువాత, బాబా మాటలు ఫలించాయి. మామిడి పళ్ళ రూపంలో, వారి అనుగ్రహం అంకురించి, దాము అణ్ణాకు పిల్లలు పుట్టారు. 
జైసే బోలలే తైసేంచ ఘడలే | అపులే జ్యోతిష నిర్ఫల ఝాలే | 
సాఈచే బోల అమోఘ ఠరలే | జాహలీ ములే వచనోక్త | ||౧౦౩|| 
103. ‘బాబా చెప్పినట్లే జరిగింది. నా జ్యోతిష్యం ఫలించలేదు. కొంచెం కూడా పొల్లు పోకుండా, సాయి మాట నిజమని నిరూపించ బడింది. వారి మాట ప్రకారమే, పిల్లలు పుట్టారు’. 
అసో హీ తో బాబాంచీ వైఖరీ | బాబా అసతా దేహధారీ | 
పరీ పుఢేహీ దేహ త్యాగానంతరీ | స్వయే నిర్ధారీ నిజ మహిమా | ||౧౦౪|| 
104. అయినా, ఇది బాబా శరీరాన్ని ధరించి ఉన్నప్పుడు, జరిగిన వారి మాట మహిమ. దేహాన్ని వదిలిన తరువాత కూడా, తమ మాటల శక్తిని, తమ భక్తులకు తామే వివరించారు. 
“ఝాలో జరీ గత ప్రాణ | వాక్య మాఝే మానా ప్రమాణ | 
మాఝీ హాడే తుర్వతీమధూన28 | దేతీల ఆశ్వాసన తుమ్హాంస | ||౧౦౫|| 
105. “నా ప్రాణాలు పోయిన తరువాత కూడా, నా మాటలను నిజమని నమ్మండి. నా సమాధినుండి నా ఎముకలు మీకు ధైర్యాన్ని, ఓదార్పును కలిగిస్తాయి. 
మీ కాయ పణ మాఝీ తుర్వత28 | రాహీల తుమ్హాంసవే బోలత | 
జో తీస అనన్య శరణాగత | రాహీల డోలత తయాసవే | ||౧౦౬|| 
106. “నేనే కాదు, నా సమాధి కూడా మీతో మాట్లాడుతుంది. పూర్తిగా శరణాగతులైన వారి వెంటే అది ఎప్పుడూ ఉంటుంది. 
డోళ్యాఆడ హోఈన హీ చింతా | కరూ నకా తుమ్హీ మజకరితా | 
మాఝీ హాడే ఏకాల బోలతా | హితగుజ కరితా తుమ్హాంసవే | ||౧౦౭|| 
107. “నేను మీ కళ్ళకు కనిపించకుండా పోతానని, నా కోసం చింతించకండి. నా ఎముకలు మీ మేలు గురించి, మీతో మాట్లాడటాన్ని, మీరే వింటారు. 
మాత్ర మాఝే కరా స్మరణ | విశ్వాసయుక్త అంతఃకరణ | 
ఠేవా కరా నిష్కామభజన | కృతకల్యాణ పావాల’ | ||౧౦౮|| 
108. “కేవలం, నన్ను తలచుకొండి. మనసులో, నా మీద నమ్మకం ఉంచండి. ఏ కోరికలూ లేకుండా, నన్ను ఆరాధించండి. మీకు మేలు జరిగి, ధన్యులవుతారు”. 
హే భక్తకామ కల్పతరో | సమర్థ సాఈ శ్రీసద్గురో | 
హేమాడ తుఝియా చరణా న అంతరో | భాకీ పరోపరీ హే కరుణా | ||౧౦౯|| 
109. భక్తుల కోరికలను తీర్చే ఓ కల్పతరువా! శ్రీ సమర్థ సాయి సద్గురూ! మీ పాదాలనుండి ఎన్నటికీ దూరం కాకూడదని ఈ హేమాడు ప్రార్థిస్తున్నాడు. మిమ్మల్ని కోరే ఒకే ఒక కోరిక ఇదే! 
ధావపావగా గురువరా | భక్తజనకరుణాకరా | 
ఉసంత నాహీ యా సంసారా | యేరఝరా పురే ఆతా | ||౧౧౦||
110. గురువరా! భక్త జన కరుణాకరా! పరుగెత్తుకుంటూ రా! ఈ సంసార జీవితంలో క్షణం పాటు కూడా విశ్రాంతి లేదు. కనుక, ఈ చావు పుట్టుకలు ఇక ఖచ్చితంగా చాలు. 

ఆమ్హా స్వభావప్రవృత్తిపరా29 | బాహ్యవిషయాలోచన తత్పరా30
విషయ భోగాంపాసావ ఆవరా | వృత్తీసీ కసా అంతర్ముఖ | ||౧౧౧|| 
111. మా స్వభావానికి తగ్గట్టు మేము నడచుకుంటాం. ఎప్పుడూ, బయట ప్రపంచంలోని ఇంద్రియ సుఖాల గురించే ఆలోచించడంలో మునిగిపోయి ఉన్నాము. మమ్ము ఈ భోగాలనుండి దూరం చేసి, మా మనసును లోపలి ప్రపంచంలోకి మరలించండి. 
లాటేస రసే సైరా వాహత | చాలలో ఆమ్హీ భవసాగరాంత | 
దేఊనియా ప్రసంగీ హాత | భవ నిర్ముక్త కరా కీ | ||౧౧౨|| 
112. ఈ సంసార సాగరంలో, అలల వలె ఊగిసలాడుతున్నాం. మా కష్ట కాలంలో, మాకు చేయూతనిచ్చి, ఈ సంసారంనుంచి మమ్మల్ని బయటకు తీయండి. 
ఇంద్రియే వాహతీ సైరావైరా | ప్రవృత్త హోతీ దురాచారా | 
బాంధా ఉచ్ఛృంఖల నదీస బంధారా | ఫిరవా మాఘారా ఇంద్రియగణ | ||౧౧౩|| 
113. ఇంద్రియాలు తమకు తోచినట్లుగా వెళ్ళి, ఎన్నో పాపాలను చేస్తాయి. ఏ ఆనకట్టూ లేక విచ్చలవిడిగా ప్రవహించే ఈ నదికి, ఒక ఆనకట్ట కట్టి, ఇంద్రియాలను వెనుకకు మరలించండి. 
ఇంద్రియే న జో అంతర్ముఖ | ఆత్మా న కదా హోఈ సన్ముఖ | 
త్యావీణ కైచే ఆత్యంతిక సుఖ | జన్మ నిరర్థక హోఈల | ||౧౧౪|| 
114. ఇంద్రియాలు అదుపు లోకి రాక, లోపలి వైపు మరలనంత వరకు, ఆత్మ దర్శనం ఎప్పటికీ కాదు. అది కానంత వరకూ, అత్యంత సుఖం సాధ్యం కాదు. అప్పుడు ఈ జీవితం వృథా అవుతుంది. 
కలత్ర పుత్ర మిత్రపంక్తి | కోణీహీ కామా యేతీ న అంతీ | 
తూంచి ఎక అఖేరచా సాథీ | సుఖ నిర్ముక్తిదాయక తూ | ||౧౧౫|| 
115. చివరి ఘడియలలో, పెళ్ళాం పిల్లలు గాని, స్నేహితులు గాని, ఎవరూ తోడు రారు. మాకు ఎప్పుడూ తోడుగా ఉండి, ముక్తిని, ఆనందాన్ని ప్రసాదించేది మీరొక్కరే. 
ఉకలూన కర్మాకర్మాచే జాళే | కరీ ఎకవేళ దుఃఖావేగళే | 
ఉద్ధరీ హే దీనదుబళే | కృపాబళే మహారాజా | ||౧౧౬|| 
116. చేసిన, చేయని పనులవలన కలిగే బంధాలను తొలగించి, వీటి వలన కలిగే దుఃఖాలనుండి, ముక్తిని కలిగించండి. మహారాజా! మీ దయా శక్తితో, ఈ దీనుల, దుర్బలులను ఉద్ధరించండి. 
వాదావాదీ ఇతర అవకళా | కృపాబళే సమూళ నిర్దళా | 
రసనేస లాగో నామాచా చాళా | సునిర్మళా సాఈరాయా | ||౧౧౭|| 
117. ఓ సాయిరాయా! మీ దయతో, వాదాలు, తగాదాలు చేసే చెడు స్వభావాన్ని, పూర్తిగా నశింప చేయండి. సాయి మహారాజా! పావనమైన మీ పేరును తలచుకోవటంలోనే, మా నాలుకకు రుచిని కలగనీయండి. 
ఏసే దేఈ ప్రేమ మనా | ఘాలవీ సంకల్పవికల్పాంనా | 
విసరవీ దేహగేహ భానా | మాఝా మీపణాహీ దవడీ | ||౧౧౮|| 
118. కోరికలు, అనుమానాలు ఇవన్నీ పోయి, ‘నేను నా దేహం మరియు నాది’ అనే అహంభావం తొలగిపోయేలా, నా మనసంతా ప్రేమతో నింపండి. 
ఘడో తుఝే నామస్మరణ | వ్హావీ న ఇతర ఆఠవణ | 
యావే మనాసీ నిశ్చలపణ | చంచలపణ నాతళో | ||౧౧౯|| 
119. ప్రతి క్షణం ఊగిసలాడే నా మనసు యొక్క స్వభావాన్ని తొలగించి, దానికి ఇతర సంగతులేవీ గుర్తుకు రాకుండా, ఎప్పుడూ మీ పేరునే తలచుకునేటట్లు జరుగుగాక. 
త్వా ఆమ్హా ధరితా పోటాశీ | మావళేల అజ్ఞానతమనిశీ | 
సుఖే నాందూ తుఝియా ప్రకాశీ | ఉణే ఆమ్హాంసీ కాయసే | ||౧౨౦||
120. మీ అక్కున మమ్మల్ని చేర్చుకుంటే, మా అజ్ఞానం తొలగిపోయి, మీ వెలుగులో సుఖంగా ఉంటాము. అప్పుడు మాకు లోటంటూ ఉంటుందా? 

తువా హే జే ఆమ్హాంప్రత | పాజిలే నిజచరితామృత | 
థాపటోని జే కేలె జాగృత | హే కాయ సుకృత సామాన్య | ||౧౨౧|| 
121. మా వెన్నుతట్టి, మమ్మల్ని మేల్కొలిపి, మాకు మీ చరితామృతాన్ని మీరే త్రాగించారు. ఇదేం తక్కువైన అదృష్టమా? 
పుఢీల అధ్యాయ యాహూని గోడ | పురేల శ్రవణార్థియాంచే కోడ | 
వాఢేల సాఈచరణీ ఆవడ | శ్రద్ధాహీ సుదృఢ హోఈల | ||౧౨౨|| 
122. తరువాతి అధ్యాయం ఇంత కంటే తీయనిది. అది వినేవారి కోరికలను తీర్చి, సాయి పాదాల మీద ప్రేమను పెంచి, దృఢమైన శ్రద్ధను కలిగిస్తుంది. 
ఆలే ఎక భక్త దర్శనా | సోడూనియా నిజ గురుచరణా | 
కరితా సాఈపదాభివందనా | నిజగురుస్థానా దృఢ కేలే | ||౧౨౩|| 
123. తన గురువు పాదాలను వదిలి, ఒక భక్తుడు, సాయి దర్శనానికి వచ్చి, సాయి పాదాలకు నమస్కారం చేయగా, అతనిని అతని గురువు దగ్గరే స్థిరంగా ఉండేలా బాబా చేశారు. 
తైసేచ ఎక దుసరే గృహస్థ | శ్రీమంత పరీ విపదగ్రస్త | 
ఆలే పుత్రకలత్రసహిత | దర్శనార్థ సాఈచ్యా | ||౧౨౪|| 
124. శ్రీమంతుడై ఉండి కూడా, కష్టాలలో చిక్కుకుని, ఇంకొక గృహస్థుడు, భార్యాబిడ్డలతో సహా సాయి దర్శనానికి వచ్చాడు. 
కైసా తయాంచా పురవిలా హేత | కైసా పుత్ర అపస్మారవ్యథిత | 
కేలా దర్శనే వ్యాధినిర్ముక్త | పూర్వదృష్టాంత స్మరవునీ | ||౧౨౫|| 
125. బాబా అతని బాధను ఎలా తీర్చి, అపస్మార రోగంతో బాధ పడుతున్న అతని కొడుకు రోగాన్ని, కేవలం దర్శనంతోనే తొలగించి, అతనికి తన వెనుకటి అనుభవాన్ని గుర్తు చేసిన వివరాలన్నీ వినండి. 
మ్హణోని హేమాడ సాంఈస శరణ | కరీ శ్రోతయా ఆదరే వినవణ | 
హోఊని సాఈకథాప్రవణ | కరాజీ శ్రవణసార్థక్య | ||౧౨౬||
126. అందుకే, హేమాడు సాయికి శరణుజొచ్చి, సాయి కథలను విని, మీ చెవులను సార్థకం చేసుకోండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాడు. 
 
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే | 
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | భక్తాభిష్ట సంపాదనం నామ | 
| పంచవింశతితమోధ్యాయః సంపూర్ణః | 

||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు || 


టిపణీ: 
1. పాణపోఈ. 2. సాఈకృపేనే. 3. సంసారరూపీ వణవ్యాచ్యా తాపాస. 
4. ఇచ్ఛిలేల్యా మనోరథాస. 5. దయేచా సాగర. 6. సుఖవస్తూ గృహస్థ. 
7. కై. శంకరరావ రఘునాథ దేశపాండే ఊర్ఫ నానాసాహేబ నిమోణకర. 
8. జేవఢా నఫా జేణేకరూన హోఈల అసా ధందా. 9. త్వరా, జలదీ. 
10. యా వేళీ. 11. పశ్చాత్తాప పావతాత. 12. నిశ్చిత. 
13. గుంతీ, సంశయ. 14. వాచేస యేఈల తే. 15. భాగ. 
16. సర్వాంతర్యామీ. 17. ‘బాళకడూ’ నావాచే లహాన ములాంచే ఔషధ. 
18. హాతాచ్యా తళవ్యావరీల ఆవళ్యాప్రమాణే. 19. బాబా. 
20. కశాతహీ. 21. దేశీల. 
22. సాఈబాబాంచే. 23. భాగీదార. 
24. ‘యద్భావి న తద్భావి, భావి చేన్న తదన్యథా’ మ్హణజే, ఘడావయాచే నాహీ తే ఘడణారచ నాహీ. 
25. ఫసలా అసతా. 26. ఎక మాతీచే భాండే. 
27. మోఠ్యా బాయకోలా కీ ధాకట్యా బాయకోలా. 
28. కబర. 29. మనాస వాటేల తసే వాగణార్యాస. 
30. సంసారాతీల విషయాంతచ గఢలేల్యాంనా. 

No comments:

Post a Comment