శ్రీ సాఈసచ్చరిత
|| అథ శ్రీసాఈసచ్చరిత || అధ్యాయ ౨౭ వా||
||శ్రీ గణేశాయ నమః||శ్రీ సరస్వత్యై నమః||
||శ్రీ కులదేవతాయై నమః||శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః||
||శ్రీ సద్గురుసాఈనాథాయ నమః||
సాక్షాత్పరబ్రహ్మాభివందన | స్వానందఘన సుప్రకట | ||౧||
1. శ్రీ సద్గురు పాదాలను గట్టిగా పట్టుకున్నప్పుడు, నిజంగా అది బ్రహ్మాది త్రిమూర్తులకు నమస్కరించినట్లే. సాక్షాత్తు పరబ్రహ్మకే నమస్కారం చేసినట్లే. దాని వల్ల విపరీతమైన ఆనందం కలుగుతుంది.
బైసతా గురుపదీ దేఊని దడీ | ఆతుడతీ బుడీ1 సకల దేవ | ||౨||
2. ఒక్క సాగరంలో మునిగి లేస్తేనే, అన్ని తీర్థాలలో స్నానం చేసినట్లు. గురు పాదాలను గట్టిగా పట్టుకుని, అక్కడే కూర్చుంటే, అందరు దేవుళ్ళూ అక్కడే దొరకుతారు.
జయజయాజీ సాఈ సద్గురు | జయజయాజీ సాయుజ్యకల్పతరూ | జయ జయాజీ నిజబోధసాగరూ | కథేసీ ఆదరూ ఉపజవీ | ||౩||
3. సాయి సద్గురూ, మీకు జయము జయము! సాయుజ్య ముక్తినిచ్చే కల్పతరూ, మీకు జయము జయము! ఆత్మజ్ఞాన సాగరా, మీకు జయము! ఈ కథల మీద మాకు పూజ్య భావాన్ని కలిగించండి.
మేఘోదకాలాగీ చాతక | తైసే తవ కథామృతా భావిక | సేవోత తుఝే భక్త సకళీక | పావోత సుఖ సదైవ | ||౪||
4. మబ్బులనుంచి పడే వాన చుక్కల కొరకు, చాతక పక్షులు ఎలా ఎదురు చూస్తుంటాయో, అలాగే భక్తులు అమృతంలాంటి ఈ కథల కొరకు ఎదురు చూస్తుంటారు. మీ భక్తులందరూ, ఈ అమృతాన్ని తాగి, ఎప్పటికీ సంతోషాన్ని పొందుదురు గాక.
పరిసతా తవ కథా నిర్మళ | స్వేద అంగీ ఫుటో నిఖళ2 | నేత్రీ దాటో ప్రేమజళ | ప్రాణ పాంగుళలా రాహో | ||౫||
5. నిర్మలమైన మీ కథను విని, శరీరమంతా చెమటలు పట్టి, రోమాంచితమగు గాక. కళ్ళనుండి ప్రేమతో నీరు కారు గాక. ప్రాణాలు ఎప్పుడూ మీ పాదాల దగ్గరే ఉండుగాక.
మనా యేవో గహింవర | రోమాంచ ఉఠోత వరచేవర | రూదన స్ఫుందన వారంవార | ఘడో సపరివార శ్రోతయా | ||౬||
6. బలమైన ప్రేమతో మనసు ఉప్పొంగు గాక, మాటి మాటికి శరీరం రోమాంచితమగు గాక. శ్రోతలు, వారి కుటుంబం, మరల మరల కన్నీరు కార్చుదురు గాక.
తుటూన జావోత పరస్పరవిరోధ | సానథోర భేదాభేద | హాచ గురుకృపావబోధ | కరావా శోధ అంతరీ | ||౭||
7. ఒకరికొకరికి ఉండే విరోధాలు, చిన్నా పెద్దా అనే భేద భావాలు తొలగిపోవు గాక. మనసును జాగ్రతగా పరిశీలిస్తే, గురువుయొక్క అనుగ్రహం కలిగిందని తెలియటానికి ఇదే గుర్తు.
యేఈ న హా3 దృష్టీ దావితా | సర్వేంద్రియా యాచీ అగోచరతా | సద్గురూవీణ యాచా దాతా | న మిళే ధుండితా త్రిభువనీ | ||౮||
8. గురువుయొక్క అనుగ్రహమనేది కళ్ళతో చూసి తెలుసుకునేది కాదు. ఎందుకంటే, అది ఇంద్రియాలకు అందనిది. ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చే దాతను మూడు లోకలలో ఎక్కడ వెదికినా, సద్గురువు తప్ప వేరే ఎవరూ కనిపించరు.
కామాది షడ్వికారోపశమ | భక్తిభావ నిఃసీమ ప్రేమ | నుపజతా గురుపదీ నిష్ఠా పరమ | హోఈ న ఉద్గమ అష్టభావా | ||౯||
9. గురువు పాదాల మీద విపరీతమైన ప్రేమ, నమ్మకం లేకపోతే, కామ క్రోధాలనే ఆరు శత్రువులను అరికట్ట లేకుండా, ఎనిమిది భావాలు కూడా కలగవు.
భక్తాచే జే నిజసుఖ | తేణేంచి గురూసీ పరమ హరిఖ4 | భక్త జో జో పరమార్థోన్ముఖ | తో తో కౌతుక గురూతే | ||౧౦||
10. ఆత్మ రూపాన్ని తెలుసుకున్న భక్తులు పొందే ఆనందాన్ని చూసి, గురువుకు పరమ సుఖం కలుగుతుంది. భక్తులు పరమార్థంలో అభివృద్ధి చెందుతున్న కొద్దీ, భక్తుల మీద గురువుకు అంతంత అభిమానం పెరుగుతుంది.
దేహ గేహ5 పుత్ర జాయా | మీ మాఝే హా వ్యాప వాయా |
హీ తో సర్వ క్షణిక మాయా | జైసీ ఛాయా దుపారచీ | ||౧౧||
11. ఈ దేహం, ఇల్లు, భార్యాపిల్లలు, నావారు, నేను, నాది అన్న భావంతో మనము ఒకటైతే, అది వృథా శ్రమ. ఎందుకంటే, ఇవన్నీ మధ్యాహ్నపు నీడలాగా, క్షణం ఉండి మళ్ళీ పోయే మాయ.
బాధూ నయే మాయేచీ గుంతీ6 | ఏసే జరీ అసేల చిత్తీ | అనన్యభావే సాఈప్రతీ | శరణాగతీ సంపాదా | ||౧౨||
12. ఈ మాయ చిక్కులో పడకుండా ఉండాలంటే, ఇంకే ఆలోచనా లేకుండా, సాయిని శరణు వేడండి.
లావావయా మాయేచా అంత | వేదశాస్త్రీ టేకిలే హాత | పాహీల జో భూతీ భగవంత | తోచి తో నిశ్చిత తరేల | ||౧౩||
13. మాయయొక్క రహస్యాన్ని తెలుసుకోవాలన్న వేద శాస్త్రజ్ఞులు ఆశలు వదులుకున్నారు. అన్ని ప్రాణులలోనూ దేవుణ్ణి చూసేవారే ఖచ్చితంగా తరించగలరు.
సోడూనియా నిజామశాఈ | ధన్య తో పాటీల చాందభాఈ | సవే ఘేఊని ఫకీర సాఈ | ఆరంభీ యేఈ నేవాసియా7 | ||౧౪||
14. నిజాం రాజ్యాన్ని వదిలి, ఫకీరైన సాయిని వెంట పెట్టుకుని, మొదట నెవాసాకు వచ్చిన చాందు పటేలు నిజంగా ధన్యుడు.
తేథే వర్ష సహా మాస | ఫకీరాచా హోఈ నివాస | తేథేంచ కానడ గాంవీంచ్యా కమాస | సహవాసాస ఠేవియలే | ||౧౫||
15. సంవత్సరమో, ఆరు నెలలో ఆ ఫకీరు అక్కడ ఉన్నారు. అక్కడే (రాహూరి జిల్లాలోని) కానడ అనే పల్లెలో కమా అనే అతనితో స్నేహం కుదిరింది.
అసో పుఢే ప్రసిద్ధ టాకళీ | ఘేఊన తేథీల దగడూ తాంబోళీ | కమా బాబాసమవేత హీ మండళీ | తేథూన ఆలీ శిరడీస | ||౧౬||
16. తరువాత, ప్రసిద్ధమైన టాకళీ అనే ఊరిలోని దగడు, తమలపాకులు అమ్మే తాంబోళీ, మరియు కమా, ఈ ముగ్గురూ బాబాతో శిరిడీకి వచ్చారు.
జాగోజాగీ అపరిమిత | పవిత్ర స్థళే తీర్థ బహుత | పరీ సాఈంచ్యా భక్తాంప్రత | శిరడీచ అత్యంత పవిత్ర | ||౧౭||
17. అక్కడక్కడా ఎన్నో పుణ్య క్షేత్రాలు, పవిత్రమైన తీర్థ స్థలాలు ఉన్నాయి. కాని, సాయి భక్తులకు శిరిడీయే అన్నింటికంటే పవిత్రమైనది.
జరీ న దైవే యేతా హా యోగ | కైచా మగ హా మహాభాగ | ఆమ్హా దీనా హా8 సంయోగ | మహద్భాగ్య హే ఆముచే | ||౧౮||
18. దైవవశాత్తు, బాబా శిరిడీకి రాకుండా ఉంటే, దీనులైన మనకు, సాయితో కలిసి ఉండే మహా భాగ్యం ఎలా కలిగేది? నిజంగానే మనకు ఇది ఒక గొప్ప అదృష్టం.
జే జే భక్త శరణాగత | సాధావయా తత్కార్యార్థ | సాఈ తయాంస దావీ యథార్థ | సన్మార్గ హితార్థ తయాంచ్యా | ||౧౯||
19. తమ మేలు కోసం వెళ్ళి, బాబాకు సంపూర్ణంగా శరణుజొచ్చితే, అలాంటి భక్తులకు సరియైన దారిని బాబా చూపేవారు.
తరీ శ్రోతా ఎకాగ్రమన | హోఊని కరా సచ్చరితావర్తన | తే హే పరమ గురుకృపాసాధన | చరిత్ర పావన సాఈచే | ||౨౦||
20. అందుకే, ఒకే మనసుతో ఈ సాయి సచ్చరితను మరల మరల పారాయణం చేయండి. ఎందుకంటే, గురువు అనుగ్రహాన్ని పొందటానికి, పరమ పావనమైన ఈ సాయి చరిత్ర అన్నింటికంటే ఉత్తమమైన సాధనం.
గతాధ్యాయీ నిరూపణ | ఎకాస నిజగురుపదీ స్థాపన |
అక్కలకోట స్వామీచీ ఖూణ | ఎకాస దేఊన జాగవిలే | ||౨౧||
21. పోయిన అధ్యాయంలో, ఒకరిని అతని గురువు పాదాల వద్ద స్థిరపరచటం, ఒకరికి అక్కలకోట స్వామిని గుర్తు చేసి, వారి పట్ల భక్తి శ్రద్ధలను కలిగించటం,
జీవదాన దిధలే క్షణాంత | ఓఢవలా9 దేహాంత టాళునీ | ||౨౨||
22. ఇంకొకరిని, ఉపాయంతో, జీవితాన్ని ముగించే ఆత్మహత్యనుండి క్షణంలో తప్పించి, అనుకోకుండా, జీవన దానం చేయటాన్ని వర్ణించడమైనది.
ఆతా యా అధ్యాయీ కథన | కధీ సాఈ కైసే ప్రసన్న | హోఊన కరీత అనుగ్రహదాన | సుఖసంపన్న భక్తాంస | ||౨౩||
23. ఇప్పుడు ఈ అధ్యాయంలో, సాయి ప్రసన్నమై భక్తులకు ఎలా అనుగ్రహాన్ని ప్రసాదించి, వారిని ఎలా సుఖ సంపన్నులను చేస్తారో, తెలియ చేస్తాను.
దీక్షా ప్రకార తో అద్భుత | కైసా కవణాలాగీ హోత | వినోద పూర్ణ హాంసత ఖేళత | శ్రోతే పరిసోత సావచిత్త | ||౨౪||
24. బాబా అనుగ్రహించి, దీక్షనిచ్చే పద్ధతి నిజంగా అద్భుతమైనది. ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, వినోదంతో, ఎవరికి ఏ విధంగా చెప్పేవారో, శ్రోతలు, శ్రద్ధగా వినండి.
ఉపదేశాచ్యా అనేక రీతీ | మాగా వర్ణిల్యా యేచ గ్రంథీ | జైసీ జ్యాచీ గ్రాహకస్థితీ | మార్గ ఉపదేశితీ తైసాచ | ||౨౫||
25. ఇంతకు మునుపు, ఇదే గ్రంథంలో, బాబా ఉపదేశం చేసే పద్ధతి గురించి వర్ణించాను. ప్రతి భక్తునికి, వారి వారి అర్హతలను, గ్రహణ శక్తిని బట్టి, తగిన మార్గాలను ఉపదేశించేవారు.
వైద్య జాణే రోగాచే నిదాన | తయాస ఠావా మాత్రేచా గుణ | రోగ్యాస నాహీ త్యాచీ జాణ10 | ఆధీ ఆణ గూళ మ్హణే | ||౨౬||
26. రోగమేమిటో తెలుసుకుని, దానికి ఏ ఔషధం ఎంత ఇవ్వాలి అన్నది వైద్యునికి తెలుస్తుందే కాని, రోగికి అవేవీ తెలియవు. ఇవేవీ తెలియకుండా, రోగి తియ్యగా ఉండే బెల్లాన్నే, ముందు కోరుతాడు.
గూళ గోడ పరీ అపకారీ | రోగీ తదర్థచి హట్ట ధరీ | ఘేఈ న వాటీ ఔషధాచీ కరీ | గూళ కరావరీ న ఠేవితా | ||౨౭||
27. బెల్లం తియ్యగా ఉంటుంది కాని, అది రోగికి మంచిది కాదు. అయినా రోగి అదే కావాలని మొండి చేస్తాడు. బెల్లం లేకుండా మందు అసలు చేతికి తీసుకోడు.
చాలే న రుగ్ణావరీ11 సక్తీ | వైద్య తేవ్హా యుక్తి యోజితీ | ఆధీ గూళ మగ ఔషధ దేతీ | పరీ సాధితీ నిజకార్య | ||౨౮||
28. రోగిని బలవంతం చేస్తే, ప్రయోజనం ఉండదు. అందుకు, వైద్యులు, చాలా తెలివిగా, ముందు బెల్లం ముక్క పెట్టి, తరువాత ఔషధాన్నిచ్చి, తాము చేయవలసింది సాధిస్తారు.
మాత్ర అనుపాన తేవఢే బదలతీ | జేణే గుళాచే దోష హరపతీ | యోజిలీ ఔషధే కార్యక్షమ హోతీ | తేచ కీ రీతీ బాబాంచీ | ||౨౯||
29. అయితే, బెల్లంయొక్క చెడును తగ్గించటానికి, తరువాతి ఔషధాన్ని మారుస్తారు. దాంతో మందు ఒంటికి పట్టుతుంది. బాబా పద్ధతి కూడా అదే.
హాచ నవ్హే సర్వత్ర నియమ | అధికార ఆణి మనోధర్మ | జైసీ సేవా భక్త ప్రేమ | తైసాచ ఉపక్రమ అనుగ్రహా | ||౩౦||
30. కాని, ఇది వారు అందరి పట్లా వాడే నియమం కాదు. భక్తుల యోగ్యతలను, స్వభావాలను, భక్తి శ్రద్ధలను, సేవను, ప్రేమను, గమనించి, వారికి అనుగ్రహాన్ని ఇచ్చేవారు.
నవల బాబాంచీ అద్భుత కృతీ | జేవ్హా కోణా ప్రసన్న హోతీ |
తయా మగ తే అనుగ్రహ దేతీ | కవణ్యా స్థితీ తే పరిసా | ||౩౧||
31. బాబా లీలలు ఎంతో అద్భుతం! ఎవరి పైనేనా వారికి మనసు పడితే, వారిని ఎలా అనుగ్రహిస్తారో వినండి.
ఆలే ఎకదా తయాంచే చిత్తా | ధ్యానీ మనీ కోణాచ్యా నసతా | సహజ థట్టా వినోద కరతా | భక్త కృతార్థతా సాధీత | ||౩౨||
32. బాబా మనసుకు ఒక సారి తోచిందంటే, ఆ భక్తునికి కోరిక లేకపోయినా, మామూలుగా వినోదాలతో, పరిహాసం చేస్తూ, ఆ భక్తుని జీవితం ధన్యమయేటట్టు చేస్తారు.
ఇచ్ఛా ఉద్భవతా గ్రంథవాచనీ | సహజ యేఈ భక్తాంచ్యా మనీ | గ్రంథ బాబాంచ్యా హాతీ దేఊని | ప్రసాద మ్హణూని తో ఘ్యావా | ||౩౩||
33. ఏదైనా గ్రంథాన్ని పఠనం చేయాలని భక్తుల మనసులో కోరిక కలిగితే, వారు ఆ గ్రంథాన్ని బాబా చేతులలో పెట్టి, దానిని మరల బాబా ప్రసాదంగా తీసుకునేవారు.
పుఢే మగ త్యా గ్రంథాచే వాచన | కేలియా హోఈల శ్రేయ సంపాదన | శ్రోత్యా వక్త్యాంచే పరమ కల్యాణ | ప్రసాదపూర్ణ శ్రవణ తే | ||౩౪||
34. ఆ తరువాత, దానిని పఠనం చేస్తే, అది చదివే వారికి, రచించిన వారికి పరమ శుభప్రదం. అదే ప్రసాద పూర్ణ శ్రవణం.
కోణీ దశావతార చిత్రే | కోణీ దశావతారాంచీ స్తోత్రే | కోణీ పంచరత్నీ గీతేసమ పవిత్రే | పుస్తకే చరిత్రే అర్పీత | ||౩౫||
35. కొందరు ‘దశావతార’ చిత్రాలను, మరి కొందరు ‘దశావతార’ స్త్రోత్రాలను, ఇంకొందరు ‘పంచరత్న గీత’ వంటి పవిత్ర పుస్తకాలను, చరిత్రలను బాబాకు అర్పించేవారు.
దాసగణూహీ సంతలీలామృత | భక్తలీలామృతహీ అర్పీత | కోణీ వివేకసింధు గ్రంథ | బాబా తే దేత శామాతే | ||౩౬||
36. మరి కొందరు, దాసగణు రచించిన ‘సంత లీలామృతం’ మరియు ‘భక్త లీలామృతం’ గ్రంథాలను, ఇంకొందరు ‘వివేక సింధు’ (ముకుంద రాజు రచించినది) గ్రంథాన్ని అర్పించేవారు. బాబా వానిని శామాకు ఇచ్చేవారు.
పుస్తకే శామా హీ తుజలా వ్హావీ | మ్హణతీ ఘరీ బాంధూన ఠేవీ | శామానే ఆజ్ఞా శిరీ వందావీ | పుస్తకే రక్షావీ దప్తరీ | ||౩౭||
37. “శామా ఈ పుస్తకాలు నీ కొరకు. దీనిని ఇంట్లో భద్రంగా కట్టి ఉంచు” అని చెప్పేవారు. వారి ఆజ్ఞను పాలించి, శామా ఆ పుస్తకాలను భద్రపరచేవాడు.
ఆణూని ఏసే భక్త మనీ | గ్రంథ ఆణీత దుకానాంతునీ | కీ బాబాంచే హాతీ దేఊనీ | ప్రసాద మ్హణునీ మాగావే | ||౩౮||
38. అలా అంగళ్ళనుండి పుస్తకాలను తెచ్చి, భక్తులు వానిని బాబా చేతికిచ్చి, వారి ప్రసాదం అనుకుని, వాటిని మరల తీసుకోవాలని అడిగేవారు.
స్వభావ బాబాంచా జరీ ఉదార | హేహీ కరాయా లాగే ధీర | నేతీ మాధవరావాంస బరోబర | కరితీ సమోర తయాంసీ | ||౩౯||
39. బాబా ఎంతో ఉదార స్వభావం కలవారే అయినా, అలా పుస్తకాలను బాబా చేతిలో ఇవ్వటానికి ధైర్యం చాలక, మాధవరావును వెంటబెట్టుకుని, బాబా దగ్గరకు వెళ్ళేవారు.
తయా కరవీ బాబాంచే హాతీ | సమయ పాహూని గ్రంథ దేతీ | బాబాంస జైసీ గ్రంథాంచీ మహతీ | తైసీచ భక్త స్థితీ ఠావీ | ||౪౦||
40. అదను చూసి, అతని ద్వారా అతని చేత్తోనే, బాబా చేతికి పుస్తకాన్ని ఇప్పించేవారు. ఆ గ్రంథాల గొప్పతనం తెలిసినట్లే, భక్తుల మనసు కూడా బాబాకు తెలుసు.
భక్తాంనీ ఘ్యావయా తే మాఘారీ | హస్త పుఢారీ ధరావే | ||౪౧||
41. చేతికి భక్తులు పుస్తకాలను ఇచ్చినప్పుడు, ఆ పుస్తకాల పుటలను బాబా మరలమరల త్రిప్పేవారు. అది చూసి, భక్తులు పుస్తకాలను తిరిగి తీసుకోవటానికి చేతులు చాచేవారు.
మ్హణత “శామా ఠేవ యా ప్రతీ | అసూందే సంప్రతీ తుజాపాశీ” | ||౪౨||
42. కాని, బాబా ఆ పుస్తకాలను వారికి ఇవ్వకుండా, వాటిని మాధవరావుకు ఇచ్చి, “శామా! దీనిని ఇప్పటికి నీ దగ్గర ఉంచు” అనేవారు.
శామానే పుసావే స్పష్టోక్తీ | హే జే ఆతురతే12 హాత పసరతీ | త్యాంచా త్యాంస దేఊ కా ప్రతీ | తరీ తే వదతీ “తూ ఠేవ” | ||౪౩||
43. అప్పుడు శామా, ‘అదిగో, ఆతురతతో చేతిని చాచిన వారిది, ఇది. వారిది వారికి ఇవ్వనా?’ అని స్పష్టంగా అడిగేవాడు. కాని, బాబా “నీ దగ్గరే ఉంచు” అని చెప్పేవారు.
ఎకదా భక్త కాకా మహాజనీ | ఆవడ జయాంస భాగవత వాచనీ | సవే గ్రంథాచీ ప్రత ఘేఉనీ | శిరడీ లాగూని పాతలే | ||౪౪||
44. ఒక సారి, వారి భక్తుడైన, కాకా మహాజనీ, భాగవత గ్రంథాన్ని చదవాలని, దానిని తన వెంట తీసుకుని, శిరిడీ వెళ్ళాడు.
మాధవరావ భేటూ ఆలే | వాచూ మ్హణూన పుస్తక ఉచలలే | హాతీ ఘేఊని మశీదీ గేలే | సహజ పుసియేలే బాబాంనీ | ||౪౫||
45. అతనిని చూడటానికి మాధవరావు వచ్చాడు. సహజంగా, ఆ పుస్తకాన్ని చూసి, తను కూడా చదువుదామని, చేతిలో పట్టుకుని మసీదుకు వెళ్ళాడు. అప్పుడు మామూలుగా బాబా,
“శామా హే హాతీ పుస్తక కసల” | శామానే తే నివేదన కేలే | బాబాంనీ తే హాతీ ఘేతలే | పరత కేలే పాహూన | ||౪౬||
46. “శామా! నీ చేతిలోని ఈ పుస్తకం ఏమిటి?” అని అడిగారు. ఏమిటో శామా చెప్పాడు. ఆ పుస్తకాన్ని చేతికి తీసుకుని, చూసి, బాబా తిరిగి అతనికే ఇచ్చేశారు.
హేంచ పుస్తక హీచ ప్రత | హేంచ నాథాంచే భాగవత | హోతే శ్రీకరప్రసాదప్రాప్త13 | మహాజనీప్రత పూర్వీంచ | ||౪౭||
47. ఇదే ఏకనాథ భాగవత పుస్తకాన్ని, ఇదే ప్రతిని, ఇంతకు మునుపు, కాకా మహాజనీ శ్రీవారినుండి ప్రసాదంగా తీసుకున్నదే.
గ్రంథ నవ్హే తో మాలకీచా | ఆహే కాకా మహాజనీంచా | వాచూ తాత్పురతా జాహలీ ఇచ్ఛా | స్పష్ట వాచా కళవిలే | ||౪౮||
48. ‘ఈ పుస్తకం నాది కాదు. అసలు ఇది కాకా మహాజనీది. చదవాలనే ఆశతో తీసుకున్నాను’ అని శామా స్పష్టంగా చెప్పాడు.
తరీహీ బాబా వదతీ14 “తయాంలా | జ్యాఅర్థీ మ్యా హా తుజ దిధలా | ఠేవ తూ ఆపులే సంగ్రహాలా | యేఈల కామాలా దప్తరీ” | ||౪౯||
49. అయినా, బాబా “నేను నీకిది ఇచ్చాను గనుక, నీ దగ్గరే ఉంచు. నీకు పనికి వస్తుంది” అని అతనితో అన్నారు.
అసా పుఢే కాంహీ కాలే | పునశ్చ కాకా15 శిరడీస ఆలే | సవే ఆణిక భాగవత ఆణిలే | హస్తీ ఓపిలే సాఈచ్యా | ||౫౦||
50. అలా కొంత కాలమయాక, కాకా మహాజనీ మరల శిరిడీకి వచ్చాడు. భాగవత గ్రంథంయొక్క ఇంకొక ప్రతిని తీసుకుని వచ్చి, బాబా చేతిలో ఉంచాడు.
ప్రసాద మ్హణూన మాఘారా దిధలే | “నీట జీవ లావ” ఆజ్ఞాపిలే |
కీ తే జీవాభావాలా అపులే | యేఈల ఆశ్వాసిలే కాకాంస | ||౫౧||
51. దానిని ప్రసాదంగా బాబా అతనికి తిరిగి ఇచ్చి, “చాలా జాగ్రత్తగా ఉంచు” అని ఆజ్ఞాపించారు. “ఇది నీకు బాగా పనికి వస్తుంది” అని హామీ ఇచ్చారు.
“హేంచ కామీ యేఈల అపులే | నకో దేఊ హే కోణాస వహిలే” | ఏసే మోఠ్యా కళకళీనే కథిలే | సప్రేమ వందిలే కాకాంనీ | ||౫౨||
52. అంతే కాకుండా, “ఇదే నిజంగా నీకు పనికి వస్తుంది. దీనిని ఎవరికీ ఇవ్వకు” అని ఎంతో ప్రేమగా చెప్పారు. భక్తిగా కాకా మహాజనీ వారికి నమస్కరించాడు.
బాబా స్వయే అవాప్తకామ16 | పదార్థమాత్రీ పూర్ణ నిష్కామ | భాగవత జయాంచా ఆచరతా ధర్మ | సంగ్రహశ్రమ కిమర్థ | ||౫౩||
53. స్వయంగా, బాబాకు ఏ కోరికలూ లేవు. దేనినీ ఆశించేవారు కాదు. ఎప్పుడూ అందరిలో దేవుణ్ణి చూసే వారికి, వస్తువులను పోగు చేయాల్సిన అవసరమేముంది?
కోణ జాణే బాబాంచే మన | పరీ హే గ్రంథాంచే సంమేలన | వ్యవహారదృష్ట్యా అతి పావన | శ్రవణ సాధన నిజభక్తా | ||౫౪||
54. అయినా, బాబా మనసును ఎవరు అర్థం చేసుకోగలరు? వ్యవహార దృష్టిలో, ఈ గ్రంథాలను పోగు చేయటం అనేది ఒక పవిత్రమైన పని. వానిని వినే అవకాశం భక్తులకు దొరుకుతుంది.
శిరడీ ఆతా స్థాన పవిత్ర | దేశోదేశీంచే బాబాంచే ఛాత్ర17 | హోతీల వేళోవేళీ ఎకత్ర | జ్ఞానసత్ర మాండితీల | ||౫౫||
55. “శిరిడీ ఇప్పుడొక పవిత్రమైన క్షేత్రము. దేశ దేశాలనుండి బాబా భక్తులు ఇక్కడికి వచ్చి, అందరూ కలిసి, జ్ఞానయజ్ఞాన్ని చేస్తారు. పరమార్థం గురించి చర్చిస్తారు.
తేవ్హా హే గ్రంథ యేతీల కామా | దప్తరాంతూన దావీల శామా | స్వయే ఆపణ జాఊ నిజధామా | గ్రంథ ప్రతిమా హోతీల | ||౫౬||
56. “అప్పుడు వారికి ఈ గ్రంథాలు పనికి వస్తాయి. నేను నా నివాసానికి వెళ్ళిపోయాక, శామా వీనిని తీసి వారికి చూపిస్తాడు. అప్పుడు ఈ గ్రంథాలు జ్ఞానాన్ని పంచి పెడతాయి”.
ఏసే హే గ్రంథ పరమ పావన | అసో శిరడీ వా అన్య స్థాన | వాచితా భక్తాస వ్హావీ ఆఠవణ | సంగ్రహ కారణ అసేల హే | ||౫౭||
57. శిరిడీలో కాని, లేక ఇంకెక్కడైనా కాని, భక్తులు ఈ గ్రంథాలను పఠిస్తే, అప్పుడు వారికి బాబా గుర్తుకు వస్తారు. వారి ఉపదేశాలు గుర్తుకు వస్తాయి. పుస్తకాలు పోగుచేయటానికి అసలు కారణం ఇదే అయి ఉంటుంది.
అసో రామాయణ వా భాగవత | పరమార్థాచా కోణతాహీ గ్రంథ | వాచితా రామకృష్ణాదికాంచే చరిత | సాఈచ దిసత మాగే పుఢే | ||౫౮||
58. రామాయణం కాని, భాగవతం కాని, లేక ఇంక ఏ పరమార్థం గురించిన గ్రంథమే కాని, లేక రాముడు కృష్ణుడి చరిత్రలను చదువుతుంటే, మన కళ్ళకు సాయియే కనిపిస్తారు.
వాటే యా గ్రంథాచ్యా విభూతి | సాఈచ నటలా తే తే స్థితి | శ్రోతే వక్తే నిత్య దేఖతీ | సమోర మూర్తి సాఈచీ | ||౫౯||
59. ఆ గ్రంథాలలోని మహాత్ముల రూపంలో సాయియే నటించారని అనిపిస్తుంది. అందుకే, శ్రోతలు, చెప్పేవారు, ఎప్పుడూ తమ ఎదుట సాయి మూర్తినే చూస్తారు.
గ్రంథ కరితీ గురూస అర్పణ | కివా బ్రాహ్మణా కరితీ దాన | త్యాంతహీ ఆహే దాత్యాచే కల్యాణ | శాస్త్ర ప్రమాణ యే అర్థీ | ||౬౦||
60. ఏ గ్రంథాన్నయినా గురువుకు అర్పించినా, లేదా బ్రాహ్మణునకు దానం చేసినా, ఇచ్చిన వారికి అది శుభమని శాస్త్రాలలో చెప్పబడింది.
త్వా హే గ్రంథ గృహీ నేఊన | దప్తరీ సంరక్షణ కరావే | ||౬౧||
61. పుస్తకాలను తనింటికి తీసుకుని వెళ్ళి, వానిని భద్ర పరచే బాధ్యతను, శామాకు అప్పచెప్పటం వెనుక, బాబాకు చాలా గొప్ప ఉద్దేశం ఉండేది.
తయాస లావావా కాంహీ నియమ | ఉదేలా కామ సాఈ మనీ | ||౬౨||
62. శామాకు బాబాపై అంతులేని భక్తి ఉన్నట్లే, బాబాకు కూడా అతనిపై చాలా ప్రేమ ఉండేది. ఆ ప్రేమ వలనే, అతనికి ఏదైనా నియమాన్ని విధించి, అతని జీవితాన్ని ఒక పద్ధతిలో పెట్టాలని, సాయికి అనిపించింది.
తంవ తే పహా కాయ కరితీ | జరీ శామాచీ ఇచ్ఛా నవ్హతీ | తరీ తయావరీ అనుగ్రహ కరితీ | కవణ్యా స్థితీ తే పరిసా | ||౬౩||
63. శామాకు అప్పుడు తీరని కోరిక ఏదీ లేకున్నా, బాబా అతనిని అనుగ్రహించారు. ఎలాంటి పరిస్థితులలో అది జరిగిందో, వినండి!
ఎకే దివశీ మశీదీసీ | బువా ఎక రామదాసీ | హోతా నిత్యనేమ తయాసీ | రామాయణాసీ వాచావే | ||౬౪||
64. ఒక రోజు, ఒక రామదాసీ బువా (సాధువు) మసీదుకు వచ్చాడు. అతనికి మసీదులో రామాయణాన్ని నియమంగా రోజూ పఠించడం అనేది ఒక అలవాటు.
ప్రాతఃకాళీ ముఖమార్జన | స్నానసంధ్యా భస్మచర్చన | కరోని భగవే వస్త్ర పరిధాన | అనుష్ఠాన మాండావే | ||౬౫||
65. తెల్లవారే మొహం కడుక్కుని, స్నానం సంధ్యావందనాలు చేసి, విభూతి పెట్టుకుని, తరువాత కాషాయ వస్త్రాలను ధరించి, రోజూ చేసే వ్రతాన్ని చేసేవాడు.
విష్ణుసహస్త్రనామావర్తన | మాగూన అధ్యాత్మరామాయణ | పారాయణావరీ పారాయణ | శ్రద్ధాపరిపూర్ణ చాలావే | ||౬౬||
66. మొదట విష్ణు సహస్రనామం చెప్పుకున్న తరువాత, ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం చేసి, మరల, ఎంతో శ్రద్ధతో దానినే పారాయణం చేసేవాడు.
ఏసా కితిఎక కాళ లోటతా | మాధవరావాంచీ వేళ యేతా | ఆలే సాఈసమర్థాచే చిత్తా | కాయ తీ వార్తా పరిసావీ | ||౬౭||
67. అలా కొన్ని రోజులు గడిచాక, మాధవరావుకు మంచి కాలం వచ్చి, సాయి సమర్థుని మనసులో ఒక ఆలోచన కలిగింది. అది ఏమిటో వినండి.
ఫళలీ మాధవరావాంచీ సేవా | లావావా కాంహీ నియమ జీవా | భక్తిమార్గాచా ప్రసాద వ్హావా | లాహో విసావా సంసారీ | ||౬౮||
68. మాధవరావు సేవ ఫలించింది. సంసార బాధలనుండి ముక్తి పొందటానికి, అతనికి ఒక మంచి నియమాన్ని చూపించి, భక్తి మార్గంలోకి తీసుకుని రావాలని బాబాకు ఆలోచన వచ్చింది.
ఏసే బాబాంచే ఆలే మనీ | రామదాసాస జవళ బోలావునీ | మ్హణతీ “పోటాంత ఆలీ కళ ఉఠునీ | ఆంతడీ తుటూని పడత కీ | ||౬౯||
69. ఆ ఆలోచన మనసులో రాగానే, రామదాసిని పిలిచి, “కడుపులో ప్రేగులు తెగిపోయేలా విపరీతమైన నొప్పి ఉంది.
జా, హీ రాహీ న పోటదుఖీ | ఆణకీ సత్వర సోనాముఖీ | మారిల్యావిణ థోడీసీ ఫకీ | జాఈ న రుఖరుఖీ18 పోటాచీ” | ||౭౦||
70. “వెంటనే పోయి, సోనాముఖిని తొందరగా తీసుకుని రా. దానిని కొంచెమైనా తీసుకుంటే తప్ప, ఈ కడుపు నొప్పి పోదు” అని బాబా చెప్పారు.
రామదాస బిచారా భావార్థీ | ఖూణ ఘాలూన ఠేవిలీ పోథీ |
గేలా ధావంత బాజారాప్రతీ | ఆజ్ఞావర్తీ బాబాంచా | ||౭౧||
71. రామదాసి, పాపం, చాలా నమ్మకమున్న భక్తుడు. చదువుతున్న గ్రంథంలో గుర్తు పెట్టి, బాబా ఆజ్ఞను పాలించాలని, సోనాముఖీ కోసం పరుగు తీశాడు.
రామదాస ఖాలీ ఉతరలే | ఇకడే బాబాంనీ కాయ కేలే | తాత్కాళ ఆసనావరూని ఉఠలే | జవళ గేలే పోథీచ్యా | ||౭౨||
72. రామదాసు అలా మెట్లు దిగి క్రిందకు పోగానే, ఇక్కడ బాబా ఏం చేశారంటే, తమ ఆసనంనుండి లేచి, ఆ గ్రంథం దగ్గరకు వెళ్ళారు.
తేథే ఇతర పోథ్యాంత హోతీ | విష్ణుసహస్త్రనామాచీ పోథీ | ఉచలూన బాబాంనీ ఘేతలీ హాతీ | ఆలే మాగుతీ స్వస్థానా | ||౭౩||
73. అక్కడ, మిగతా పుస్తకాలతో పాటు, విష్ణు సహస్రనామం పుస్తకం ఉంది. దానిని తీసుకుని, బాబా తిరిగి తమ చోటుకు వచ్చారు.
మ్హణతీ “శామా19 హీ పోథీ కనీ20 | ఆహే పహా బహుగుణీ21 | మ్హణూన దేతో తుజలాగునీ | తీ త్వా వాచూన పహావీ | ||౭౪||
74. శామాతో, “శామా! ఈ గ్రంథాన్ని చూడు! దీనిలో చాలా గొప్ప గుణాలున్నాయి. అందుకని, దీనిని నీకు ఇస్తున్నాను. నువ్వు దానిని చదివి చూడు.
ఎకదా మజ ఉపజలీ నడ22 | కాళీజ కరూ లాగలే ధడధడ | ఝాలీ జీవాచీ చడఫడ | దిసే న ధడగత మాఝీ మజ | ||౭౫||
75. “ఒక సారి, నాకు చాలా బాధ కలిగింది. గుండే చాలా వేగంగా కొట్టుకో సాగింది. ప్రాణం రెపరెపలాడింది. బ్రతుకుతానన్న నమ్మకం నాకు పోయింది.
ఏసియా త్యా ప్రసంగాలా | కాయ సాంగూ శామా మీ తుజలా | యా పోథీచా23 జో ఉపయోగ ఝాలా | హా జీవ తరలా తిచేనీ | ||౭౬||
76. “ఆ స్థితిలో ఈ గ్రంథం ఎంతగా ఉపయోగ పడిందో, శామా, నీకెలా చెప్పను! ఈ గ్రంథంవలనే నా ప్రాణం రక్షింప బడ్డది.
క్షణైక ఉరీ24 విసావా దిలా | తాత్కాళ హా జీవ గార ఝాలా | అల్లాచ25 వాటే పోటీ ఉతరలా | జీవ హా జగలా తిచేనీ | ||౭౭||
77. “దానిని నా గుండెకు హత్తుకున్నాను. క్షణం తిరిగే లోగ, ప్రాణం కుదట పడింది! దేవుడే ఆ గ్రంథం ద్వారా నా దేహంలోకి వచ్చాడా అని అనిపించింది. దీని వల్లనే నేను బ్రతికాను.
మ్హణోని శామా హీ తుజలా నేఈ | ఓజే26 ఓజే వాచీత జాఈ | రోజ ఎకాదే అక్షర ఘేఈ | ఆనందదాయీ హీ మోఠీ” | ||౭౮||
78. “అందుకే శామా! నువ్వు దీనిని తీసుకుని వెళ్ళి, మెల్లమెల్లగా చదువు. రోజుకు ఒకటో అరో పేరుని నేర్చుకున్నా కూడా, నీకు అంతులేని ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తుంది”.
శామా మ్హణే ’హీ మజలా నలగే | రామదాస మజ భరేల రాగే | తో మ్హణేల మీచ త్యాచే మాగే | కర్మ వావుగే27 హే కేలే | ||౭౯||
79. అప్పుడు శామా, ‘ఇది నాకు వద్దు. ఆ రామదాసుకు నా మీద కోపం వస్తుంది. తను లేనప్పుడు, ఈ చేయరాని పనిని నేనే చేశానని అతను అనుకుంటాడు.
ఆధీంచ తో జాతీచా పిసాట | మాథేఫిరూ తాపట ఖాష్ట | కిమర్థ వ్హావీ హీ కళ ఫుకట | నకో కటకట హీ మాతే | ||౮౦||
80. ‘అసలే అతడు చాలా కోపిష్ఠి. తలతిక్కగా, అడ్డదిడ్డంగా వాగుతాడు. ఎందుకీ పనికి రాని పోట్లాట? వద్దు, వద్దు, నాకీ గొడవంతా వద్దు.
శివాయ పోథీచీ లిపీ సంస్కృత | మాఝీ వాణీ రాంగడీ కుశ్చిత |
జోడాక్షరహీ న జివ్హేస ఉలటత | ఉచ్చార స్పష్ట హోఈ న మజ” | ||౮౧||
81. ‘పైగా, ఈ గ్రంథం సంస్కృత భాషలో ఉంది. నా మాట మొరటు మాట. నా నాలుకకు కలిసిన పదాలు పలకవు. వానిని నేను స్పష్టముగా చెప్పలేను’ అని చెప్పాడు.
బాబాస శామాచీ కేవఢీ కళకళ | శామాస అటకళ నాహీ తీ | ||౮౨||
82. అంతవరకు బాబా చేసినదంతా చూసిన శామా, తనకు రామదాసికి తగువు పెట్టటానికి, బాబా చేసిన పని, అని అనుకున్నాడు. కాని, అతనిపై బాబాకు ఎంత ప్రేమ ఉందని అతనికి తెలియదు.
“మాఝా శామా అసేల ఖుళా28 | పరీ మజలా తయాచా లళా | లోభ లావీ జీవా ఆగళా | తయాచా కళవళా మజ మోఠా | ||౮౩||
83. “మా శామా వెర్రివాడే కావచ్చు. అయినా, అతనంటే నాకు చాలా మమకారం. అతనికి నా పై ప్రేమ. అందుకే అతనిపై నాకు పరితాపం.
హీ విష్ణుసహస్త్ర నామమాళా | బాంధీన స్వహస్తే తయాచే గళా | కరీన తయా భవదుఃఖా వేగళా | లావీన చాళా వాణీలా | ||౮౪||
84. “విష్ణు సహస్రనామ మాలను నా చేతులతో అతని మెడకు వేస్తే, అది అతనిని ఈ సంసార బాధలనుండి ముక్తుణ్ణి చేస్తుంది. నామంపై అతనికి ప్రీతిని కలిగిస్తాను.
నామ పాపాచే పర్వత ఫోడీ | నామ దేహాచే బంధన తోడీ | నామ దుర్వాసనేచ్యా కోడీ | సమూళ దవడీ లోటునీ | ||౮౫||
85. “పాపాలనే కొండలను కూడా ఈ నామం పగలగొట్టుతుంది. నామం శరీరంతో కలిగిన బంధాలను విడదీస్తుంది. కోటి చెడు గుణాలను, నామం సమూలంగా పెరికి వేస్తుంది.
నామ కాళాచీ మాన మోడీ | చుకవీ జన్మమరణ ఓఢీ | ఏసి యా సహస్త్ర నామాచీ జోడీ | శామ్యాస గోడీ లాగావీ | ||౮౬||
86. “నామం కాలుని (యముని) మెడనే విరిచేస్తుంది. చావు-పుట్టుకల చక్రాన్ని తప్పిస్తుంది. ఇంత గొప్ప గుణాలున్న సహస్రనామంపై శామ్యాకు ప్రేమ కలగాలి.
నామ ప్రయత్నే ఘేతా చోఖట | అప్రయత్నేహీ నాహీ ఓఖట | ముఖాసి ఆలే జరీ అవచట | ప్రభావ ప్రకట కరీల | ||౮౭||
87. “ప్రయత్న పూర్వకంగా నామాన్ని జపిస్తే, మంచిది. అనుకోకుండా నామ జపం చేసినా, చెడు కలుగదు. తెలియకుండా నోటితో చెప్పినా, నామం తన శక్తిని చూపిస్తుంది.
నామాపరీస సోపే ఆన | అంతఃశుద్ధీస నాహీ సాధన | నామ జివ్హేచే భూషణ | నామ పోషణ పరమార్థా | ||౮౮||
88. “మనసును శుద్ధ పరచడానికి, నామం కంటే సులభమైన ఇంకో సాధనం లేదు. నాలుకకు నామం అందం. నామం పరమార్థాన్ని పెంచుతుంది.
నామ ఘ్యావయా నలగే స్నాన | నామాసి నాహీ విధి విధాన | నామే సకళ పాప నిర్దళణ | నామ పావన సర్వదా | ||౮౯||
89. “నామం జపించటానికి, స్నానం చేయాల్సిన అవసరం లేదు. అలాగే, నామం జపించటానికి ఏ పద్ధతులూ, నియమాలూ లేవు. నామ జపంతో అన్ని పాపాలు నశిస్తాయి. నామం ఎల్లప్పుడూ పవిత్రమైనది.
అఖండ మాఝేంహీ నామ ఘేతా | బేడా పార హోఈల తత్వతా | నలగే కాంహీ ఇతర సాధనతా | మోక్ష హాతా చఢేల | ||౯౦||
90. “ఎప్పుడూ నా పేరునే తలచుకునే వారు, క్షేమంగా తీరానికి చేరుకుంటారు. మిగతా సాధనలేవీ లేకుండానే, దానితో మోక్షం చేతికందుతుంది.
జయా మాఝే నామాచీ ధోకణీ | ఝాలీచ తయాచే పాపాచీ ధుణీ |
తో మజ గుణియాహుని గుణీ | జయా గుణగుణీ29 మన్నామీ” | ||౯౧||
91. “నా పేరును ఎప్పుడూ జపించేవారి పాపాలు తుడిచి వేయబడతాయి. మెల్లగా, లోలోపల, నా పేరును ఎల్లప్పుడూ జపించేవారు, ఉత్తములకంటే ఉత్తములు” అని బాబా చెప్పారు.
హేంచ బాబాంచే మనోగత | తదనుసార మగ తే వర్తత | శామా జరీ నకో మ్హణత | బాబా తే సారీత ఖిశాంత | ||౯౨||
92. ఇది బాబా మనసులోని ఆలోచన. దానిని బట్టే, వారు నడుచుకునే వారు. శామా వద్దువద్దు అని అంటున్నా, అతని జేబులో బాబా ఈ గ్రంథాన్ని పెట్టారు.
వాడవడిలాంచీ పుణ్యాఈ సబళ | తేణేంచ సాఈకృపేచే ఫళ | ఏసే హే సహస్త్రనామ నిర్మళ | ప్రపంచ తళమళ వారీల | ||౯౩||
93. అతని తల్లి తండ్రుల పుణ్యం బలం కొద్దీ, అతనికి సాయిబాబాయొక్క అనుగ్రహం దొరికింది. విష్ణు సహస్రనామం అంత పావనమైనది. ప్రపంచంలోని బాధలను, మనసులోని అలజడిని తొలగిస్తుంది.
ఇతర కర్మా లాగే విధి | నామ ఘ్యావే కధీహీ నిరవధీ | తయా న అనధ్యాయ ప్రదోష బాధీ | ఉపాసనా సాధీ నాహీ దుజీ | ||౯౪||
94. వేరే వ్రతాలను చేయాలంటే, వాటికి నియమాలు, పద్ధతులు పాటించాలి. కాని, నామ జపానికి అవేవీ లేవు. ప్రదోషం, చదవకూడని సమయంలాంటివి లేవు. ఎప్పుడైనా, ఎంత కాలమైనా జపించవచ్చు. నామ జపంవంటి మంచి ఆరాధన వేరే ఏదీ లేదు.
నాథాంనీహీ యేచ రీతీ | ఎకా అపుల్యా శేజారియావరతీ | హేంచ సహస్త్రనామ మారోని మాథీ | పరమార్థపంథీ సూదిలే | ||౯౫||
95. ఏకనాథ మహారాజు కూడా, ఇదే విష్ణు సహస్రనామాన్ని, ఇలాగే తమ పొరుగింటి మనిషి తలపై పెట్టి, అతనిని పరమార్థ దారిలో పెట్టారు.
నాథాఘరీ నిత్య పురాణ | శేజారీ జాతీచా బ్రాహ్మణ | హోతా స్నానసంధ్యా విహీన | దురాచరణ నిమగ్న | ||౯౬||
96. ఏకనాథుల వారింట ప్రతి రోజూ పురాణ పఠనం జరిగేది. వారి పొరుగింటి మనిషి బ్రాహ్మణ జాతీయుడు. కాని, స్నాన సంధ్యాదులు చేయక, చెడు పనులలో నిమగ్నుడై ఉండేవాడు.
కధీ కరీనా పురాణ శ్రవణ | వాడ్యాంత పాఊల ఠేవీనా దుర్జన | నాథ హోఊనియా సకరుణ | కేలే పాచారణ తయాస | ||౯౭||
97. ఏ రోజూ పురాణ పఠనాన్ని వినేవాడు కాదు. ఆ దుర్మార్గుడు అసలు ఏకనాథుని ఇంట్లో అడుగు పెట్టేవాడు కాదు. అతని మీద దయ కలిగి, ఏకనాథులు అతనిని పిలిపించారు.
ఉంచవర్ణీ అసోని జన్మ | వాయా జాతో హె జాణోని వర్మ | నాథాంస ఉపజలీ కృపా పరమ | కైసా హా ఉపరమ పావేల | ||౯౮||
98. గొప్ప జాతిలో పుట్టి, జీవితాన్ని దండుగ చేసుకుంటున్నాడు. అతడు ఎలా బాగు పడుతాడా అని, ఏకనాథులకు చాలా దయ కలిగింది.
మ్హణోన తయానే నకో మ్హణతా | సహస్త్రనామాచీ దిధలీ సంథా | ఎకేక శ్లోక పఢవితా పఢవితా | నిజోద్ధారతా లాధలా | ||౯౯||
99. అందుకే, అతడు వద్దంటున్నా, అతనిచే విష్ణు సహస్రనామంలోని ఒక్కో శ్లోకాన్ని చదివించి, అతనిని ఉద్ధరింప చేశారు.
యా30 సహస్త్ర నామాచా పాఠ | చిత్తశుద్ధీచా మార్గ ధోపట | పరంపరాగత హా పరిపాఠ | తేణేంచ హీ ఆటాట31 బాబాంనా | ||౧౦౦||
100. మనసును శుద్ధి చేసుకోవటానికి, ఈ విష్ణు సహస్రనామ పారాయణమే సులువైన దారి. ఇది పూర్వీకులనుండి వంశ పారంపర్యంగా వచ్చినది. అందుకే బాబాయొక్క ప్రయత్నం, మరియు శ్రమ.
తో ఆలే రామదాస జలద | ఘేఊని సోనాముఖీ అగద32 |
అణ్ణా33 ఉభేచ కళీచే నారద | వృత్తాంత సాద్యంత కళవిలా | ||౧౦౧||
101. ఇంతలో, సోనాముఖీని తీసుకుని రామదాసు త్వరగా వచ్చాడు. కలియుగ నారదుడైన అణ్ణా (చించణీకరు) అతనికి జరిగినదంతా తెలియ చేశాడు.
మగ త్యా ప్రసంగాచీ అపూర్వాఈ | కోణ గాఈల యథార్థ | ||౧౦౨||
102. అసలే రామదాసు కోపిష్టి. దాని మీద, ఈ నారదుడు చెప్పిన మాట. ఇక ఆ అద్భుతమైన సమయాన్ని ఎవరు వర్ణించగలరు?
ఆధీంచ రామదాస వికల్పమూర్తి35 | మాధవరావాంచా సంశయ చిత్తీ | మ్హణే బళకావయా మాఝీ పోథీ | బాబాంనా మధ్యస్థీ ఘాతలే | ||౧౦౩||
103. అనుమానాలు, సందేహాలు గల రామదాసుకి, మొదలే మాధవరావు పై సంశయం. ‘నా పుస్తకాన్ని కాజేయటానికి, నీవే బాబాను మధ్యవర్తిగా చేశావు’ అని అన్నాడు.
సోనాముఖీచీ వార్తా విసరలా | మాధవరావావరీ ఘసరలా | వృత్తిప్రకోప అనావర ఝాలా | ఉదండ వరసలా వాగ్డంబర | ||౧౦౪||
104. తాను తెచ్చిన సోనాముఖీ గురించి మరచిపోయి, మాధవరావుపై విరుచుకు పడ్డాడు. ఆపుకోలేనంత కోపంతో, ఒకటే తిట్లను కురిపించాడు.
పోటదుఖీచే హే ఢోంగ సగళే | తువాంచ బాబాంస ఉద్యుక్త కేలే | మాఝ్యా పోథీవర తుఝే డోళే | హే న చాలే మజపుఢే | ||౧౦౫||
105. ‘కడుపునొప్పి అన్నది ఒట్టి సాకు. నీ కళ్ళు నా పుస్తకాలపై పడ్డాయి. అందుకే నువ్వు బాబాని పురికొల్పావు. కాని, నా దగ్గర ఇవేం సాగవు.
నాంవాచా మీ రామదాస నిధడా | పోథీ న దేతా గుణాధడా36 | పహా హే మస్తక ఫోడీన తుజపుఢా | ఘాలీన సడా రక్తాచా | ||౧౦౬||
106. ‘నా పేరు రామదాసు, వీరుణ్ణి, భయం లేని వాణ్ణి. మంచి మాటలతో నా పుస్తకాన్ని తిరిగి ఇచ్చేయి, లేకుంటే నీ ఎదుటే, నా తలబ్రద్దలు కొట్టుకుని, రక్తాన్ని చిందిస్తాను.
తుఝా మాఝే పోథీవర డోళా | స్వయేంచ రచూనియా కవటాళా37 | ఘాలిసీ సకళ బాబాంచే గళా | నామానిరాళా రాహూన | ||౧౦౭||
107. ‘నీ కళ్ళు నా గ్రంథంపై పడింది. అందుకే నువ్వు ఈ నాటకమంతా చేసి, అన్నీ బాబాపై రుద్ది, ఏమీ తెలియనట్లు నటిస్తున్నావు’.
మాధవరావ బహు సమజావితీ | రామదాసా నాహీ శాంతీ | తంవ మాధవరావ సౌమ్యవృత్తీ | కాయ వదతీ తే పరిసా | ||౧౦౮||
108. మాధవరావు ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాలని ప్రయత్నించినా, రామదాసు శాంతించ లేదు. అప్పుడు మాధవరావు శాంతంగా ఏమన్నాడో అది వినండి.
మీ కపటీ హా మాఝే మాథా | మారూ నకో రే ప్రవాద38 వృథా | కాయ తుఝ్యా త్యా పోథీచీ కథా | నాహీ దుర్మిళతా తియేలా | ||౧౦౯||
109. ‘నేను మోసగాణ్ణని నా మీద నింద వేయకు. అనవసరంగా ఆ దోషాన్ని నాకు అంటగట్టకు. ఇంతకూ ఆ పుస్తకంలోని గొప్పతనమేమిటి? అది ఎక్కడా దొరకనిదా?
తుఝ్యాచ పోథీలా కాయ సోనే | కివా హిరకణీ జడలీ నేణే | బాబాంచాహీ విశ్వాస జేణే | ధరిసీ న జిణే ధిక్ తుఝే | ||౧౧౦||
110. ‘బాబాపైన కూడ నమ్మకం లేనంత విలువైనదా నీ పుస్తకం? దానికేమైనా రత్నాలు పొదిగారా, లేక బంగారం తొడిగారా? ఇది చాలా సిగ్గు పడవలసిన సంగతి’ అని అన్నాడు.
పాహూని తయాచా అట్టహాస | బాబా మధుర బోలతీ తయాస |
“కాయ బిఘడలే రే రామదాస | వ్యర్థ సాయాస కా వహాసీ | ||౧౧౧||
111. రామదాసుయొక్క విపరీతమైన కోపాన్ని చూసి, బాబా మధురంగా, “ఇప్పుడేం మునిగింది రా, రామదాసు? అనవసరంగా ఎందుకు ఇంత బాధ పడుతున్నావు?
అరే శామా ఆపలాచ పోరగా | తూ కా శిరా తాణిసీ ఉగా | కిమర్థ ఇతకా కష్టసీ వాఉగా | తమాశా జగా దావిశీ | ||౧౧౨||
112. “అరే, శామా మన కుర్రాడే కదా, ఊరికే నరాలేందుకు తెంచుకుంటున్నావు? వృథాగా ఎందుకింత కష్ట పడుతున్నావు? బాధ పడి, ప్రపంచానికి తమాషా చూపిస్తున్నావు?
ఏసా కైసా తూ కలహతత్పర | కా నా బోలావే మధురోత్తర | అరే హ్యా పోథ్యా పఢతాంహీ నిరంతర | అజుని అంతర39 అశుద్ధ | ||౧౧౩||
113. “ఎందుకిలా పోట్లాటకు దిగావు? చక్కగా, తియ్యగా, మంచిగా మాట్లాడరాదూ? ఈ గ్రంథాలను ఎప్పుడూ చదువుతుంటావు. అయినా, నీ మనసు ఇంకా నిర్మలంగా కాలేదు.
ప్రత్యహీ అధ్యాత్మరామాయణ పఢశీ | సహస్త్రనామాచే ఆవర్తన కరిశీ | తరీ హీ ఉచ్ఛృంఖలవృత్తి న త్యజిసీ | ఆణి మ్హణవిశీ రామదాస | ||౧౧౪||
114. “ప్రతిరోజూ ఆధ్యాత్మ రామాయణాన్ని చదువుతావు, సహస్రనామాన్ని చెప్పుకుంటావు. కాని, ఈ విచ్చలవిడి స్వభావాన్ని విడిచిపెట్టలేదు. పైగా రామదాసునని చెప్పుకుంటావు.
ఏసా కైసా తూ రామదాస | తువా సర్వార్థీ అసావే ఉదాస | పరీ తుటేనా పోథీచా సోస40 | కాయ యా కర్మాస సాంగావే | ||౧౧౫||
115. “ఎలాంటి రామదాసువయ్యా నువ్వు? దేని మీద నీకు ఆసక్తి లేకుండా ఉండాలి. కాని, పుస్తకం మీద మోహం నీకింకా పోలేదు. నువ్వు చేస్తున్న దానిని ఏమనాలి?
రామదాసీ నసావీ మమతా | సాన థోరీ అసావీ సమతా | త్యా తుఝీ యా పోరాసీ విషమతా | ఝోంబసీ హాతా పోథీస్తవ | ||౧౧౬||
116. “రామదాసికి మమత ఉండరాదు. చిన్నా, పెద్దా అందరి మీదా సమతా భావముండాలి. కాని, నువ్వు భేద భావంతో, ఈ కుర్రాడి మీద కోపంతో, వాడి చేతిలోని పుస్తకం కోసం పోట్లాడుతున్నావు.
జా బైస జాఊనీ స్థానావరీ | పోథ్యా మిళతీల పైశా పాసరీ | మాణూస మిళేనా ఆకల్పవరీ | విచార అంతరీ రాఖావా | ||౧౧౭||
117. “వెళ్ళు! వెళ్ళి నీ చోటులో కూర్చో. డబ్బు పెడితే పుస్తకాలు దొరుకుతాయి. కాని, ఈ ప్రపంచం ముగిసినా, మంచి మనుషులు దొరకరు.
తుఝ్యా పోథీచీ కాయ మహతీ | శామ్యాలా త్యాంత కైంచీ గతీ | ఉచలలీ తీ మ్యాంచ ఆపమతీ | దిధలీ తయాప్రతి మీచ తీ | ||౧౧౮||
118. “నీ గ్రంథంయొక్క గొప్పతనం శామ్యాకేం తెలుసు? అది చెప్పటానికి, నేనే స్వయంగా ఆ పుస్తకాన్ని తీసి, అతనికి ఇచ్చాను.
తులా తీ తో ముఖోద్గత | శామ్యాస ద్యావీ ఆలే మనాంత | వాచీల ఠేవిల ఆవర్తనాంత | కల్యాణ అత్యంత హోఈల” | ||౧౧౯||
119. “ఇంతకూ అదంతా నీకు కంఠస్థం కదా, అందుకు దానిని శామ్యాకు ఇవ్వాలని అనిపించింది. అతను మరలమరల దానిని చదువుతుంటే, శుభాన్ని పొందుతాడు”.
కాయ త్యా వాణీచీ రసాళతా | మధురతా ఆణి కనవాళుతా | తైసీచ స్వానందజళ శీతళతా | అతి అపూర్వతా తియేచీ | ||౧౨౦||
120. సాయి చెప్పిన ఆ మాటలలో ఎంతటి మధురం! ఎంతటి దయ! మనసుకు ఆనందాన్ని కలిగించే చల్లటి హాయి. ఆ మాటలు నిజంగా అద్భుతమైనవి.
రామదాస ఉమగలా చిత్తా | మ్హణే మాధవరావాస ఫణఫణతా41 |
ఘేఈన బదలా పంచరత్నీ గీతా | హే తుజ ఆతా సాంగతో | ||౧౨౧||
121. రామదాసు తన మనసులో బాగా అర్థం చేసుకున్నాడు. కోపంతో ఎర్రబారిన ముఖంతోనే శామాకు ‘ఇదిగో, నీకు ఇప్పుడే చెప్పుతున్నాను. దీనికి బదలుగా పంచరత్ని గీతాన్ని తీసుకుంటాను’ అని అన్నాడు.
ఎకచ కాయ మీ దహా తుజలా | గీతా బదలా దేఈన | ||౧౨౨||
122. రామదాసు ఇంతగా చల్లబడి పోవటం చూసి, మాధవరావుకు సంతోషం కలిగింది. వెంటనే ‘ఒక్కటేమిటి, మీకు నేను పది గీతలను బదలుగా ఇస్తాను’ అని అన్నాడు.
అసో పుఢే తో తంటా నివాలా | గీతాగ్రంథ జామీన రాహిలా | దేవ గీతేచా జ్యాతే న కళలా | గీతా కశాలా తయాస | ||౧౨౩||
123. అంతటితో ఆ పోట్లాట శాంతించింది. గీతా గ్రంథాన్ని జామీనుగా ఇవ్వటానికి ఒప్పుకున్నారు. కాని, గీతలోని దేవుణ్ణే తెలుసుకోలేని వానికి, అసలు గీత ఎందుకు?
సాఈసన్ముఖ అధ్యాత్మరామాయణ | పాఠావర పాఠ కరీ జో జాణ | త్యా రామదాసే సాఈసీ తోండ దేఊన | కరావే భాండణ కా ఏసే | ||౧౨౪||
124. సాయి దగ్గర కూర్చుని, ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం పై పారాయణం చేసే ఆ రామదాసు, సాయితో ఇలా మాటకు మాట చెప్తూ, పోట్లాడటమేమిటి?
హే తరీ మ్యా కైసే వదావే | దోష కోణాస కైసే ద్యావే | ఝాలే తే ప్రకార జరీ న వ్హావే | మహత్వ ఠసావే కైసేనీ | ||౧౨౫||
125. ఇంతకీ తప్పెవరిదని ఎలా చెప్పటం? నేను ఇలా అంటున్నానేమిటి? ఆ ప్రకారంగా జరగక పోతే, సహస్రనామం మహాత్మ్యం ఎలా తెలిసేది?
ఇతుకా ఝగడా లావిలా జ్యానే | బాబాంచేహీ ఘాలవిలే దుఖణే42 | కల్యాణ ఆహే మాఝే జేణే | అలౌకిక దేణే సాఈచే | ||౧౨౬||
126. బాబాయొక్క బాధను తొలగించి, ఇంతటి పోట్లాటకు కారణమైన ఆ పుస్తకం (సహస్రనామం) మనకు కూడా మేలు చేస్తుంది. అది సాయియొక్క అద్భుతమైన వరం.
జరీ న హోతా హా సాయాస | బసతా న మాధవరావాచా విశ్వాస | ఖరేంచ చఢతే న అక్షర జివ్హేస | పాఠచి తయాంస హోతే నా | ||౧౨౭||
127. ఇంత శ్రమ పడక పోతే, మాధవరావుకు నమ్మకం కుదిరేది కాదు. అతని నాలుకకు అక్షరాలు అలవాటు అయ్యేవి కావు. అతనికది కంఠస్థం అయేది కూడా కాదు.
ఏసా హా సాఈనాథ ప్రేమళ | ఖేళియా పరమార్థాచా దుర్మిళ | దాబీల కేవ్హా కైసీ కళ | కరణీ అకళ43 తయాచీ | ||౧౨౮||
128. చూడటానికి అరుదుగా దొరికే ఇలాంటి పరమార్థ లీలలను, ప్రేమమయులైన సాయినాథులు ఎప్పుడు ఎలా చేస్తారో, తెలుసుకోవటం కష్టం.
పుఢే శామాచీ నిష్ఠా జడలీ | దీక్షిత44 నరక్యాంహీ45 సంథా దిధలీ | అక్షర ఓళఖ కరూన ఘేతలీ | పోథీ చఢలీ జివ్హేవర | ||౧౨౯||
129. దీని తరువాత, శామాకు బాగా నిష్ఠ కుదిరింది. దీక్షితు మరియు నార్కే అతనికి అక్షరాలు పలుకటం బాగా నేర్పారు. తొందరలోనే, అక్షరాలను గుర్తుపట్టి, చదవటం నేర్చుకుని, శామా పుస్తకాన్ని కంఠస్థం కూడా చేశాడు.
అసో హా మాధవరావాంచా వాద46 | సాఈ శుద్ధబోధానువాద | పరమానంద పూర్ణ హా వినోద | నిర్వివాద సుఖదాయీ | ||౧౩౦||
130. ఇలా మాధవరావుతో జరిగిన మాటలు, సాయియొక్క శుద్ధమైన బోధ, ఎంతో ఆనందాన్ని, వినోదాన్ని ఇవ్వటమే కాక, చాలా సుఖాన్ని కూడా ఇస్తుంది.
ఎకదా కాకాసాహేబ దీక్షిత | నియమానుసార ప్రాతఃస్నాత |
అసతా ఆసనస్థిత ధ్యానస్థ | దర్శన పావత విఠ్ఠలాచే | ||౧౩౧||
131. ఒక సారి, ఎప్పటిలాగే నియమంతో తెల్లవారే స్నానం చేసి, ఆసనంలో ధ్యానంలో ఉండగా, కాకాసాహేబు దీక్షితుకు విఠలుని దర్శనమైంది.
పుఢే జాతా బాబాంచే దర్శనా | నవల బాబా పుసతీ తయాంనా | విఠ్ఠల పాటీల ఆలా హోతా నా | భేట ఝాలీ నా తయాచీ | ||౧౩౨||
132. తరువాత బాబా దర్శనానికి వెళ్లినప్పుడు, “విఠల పటేలు వచ్చాడు కదా, అతనిని కలిశావా?” అని విచిత్రంగా బాబా ప్రశ్నించారు.
మోఠా పళపుట్యా తో విఠ్ఠల | మేఖ మారూని కరీ అఢళ | దృష్టీ చుకవూని కాఢీల పళ | హోతా పళ ఎక దుర్లక్ష | ||౧౩౩||
133. “ఆ విఠలుడు పారుబోతు! అలక్ష్యం చేసి, ఒక్క క్షణమైనా దృష్టిని మరలిస్తే, పారిపోతాడు. గట్టిగా మేకు కొట్టి అతనిని కదలకుండా ఉంచు” అని అన్నారు.
హా తో ప్రాతఃకాళీ ప్రకార | పుఢే జేవ్హా భరలీ దుపార | పహా ఆణీక ప్రత్యంతర | విఠ్ఠల దర్శన సోహళా | ||౧౩౪||
134. ఇది తెల్లవారే జరిగింది. విఠలుని దర్శన వైభవం, మధ్యాహ్నం మరో సారి అనుభవానికి వచ్చింది.
పంఢరపురచ్యా విఠోబాచ్యా | ఛబ్యా పాంచపచ్చీస సాచ్యా | ఘేఊని కోణీ బాహేర గాంవీచా | వికావయాచ్యా ఇచ్ఛే యే | ||౧౩౫||
135. పంఢరీపుర విఠలుని పాతిక చిత్రపటాలను అమ్ముకోవాలని, ఇంకొక ఊరినుంచి ఒకడు శిరిడీ వచ్చాడు.
సకాళీ ధ్యానీ ఆలీ జీ మూర్తి | తియేచీచ సంపూర్ణ ప్రతికృతీ | పాహూని దీక్షిత విస్మత చిత్తీ | బోల ఆఠవతీ బాబాంచే | ||౧౩౬||
136. ఉదయం ధ్యానంలో కనిపించిన రూపంలాంటి ఫోటోలు, పూర్తిగా అదే రూపం చూసి, దీక్షితు ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతనికి బాబా మాటలు గుర్తుకు వచ్చాయి.
దీక్షిత తంవ అతి ప్రీతీ | వికణారాసీ మోల దేతీ | ఛబీ ఎక వికత ఘేతీ | భావే లావితీ పూజేస | ||౧౩౭||
137. అమ్ముకునే వానికి డబ్బిచ్చి, ఎంతో ప్రేమతో ఒక పటాన్ని కొని, భక్తిగా పూజకోసం పెట్టుకున్నాడు.
తైసేంచ బ్రహ్మవిద్యా అభ్యాసితీ | తయాంచీ బాబాంస మోఠీ ప్రీతీ | ప్రసంగోపాత్త అభివ్యక్తి | దావితీ కైసీ అవలోకా | ||౧౩౮||
138. బ్రహ్మ విద్యను అభ్యసించే వారి మీద బాబాకు విపరీతమైన ప్రేమ. సరియైన సమయంలో దానిని వారు ఎలా తెలిపేవారో గమనించండి.
ఎకదా జోగాంచీ ఆలీ బంగీ | శిరడీ పోస్టాంత టపాలమార్గీ | స్వీకారావయా తయా జాగీ | లాగవేగీ నిఘాలే | ||౧౩౯||
139. ఒక సారి, జోగుకు తపాలా ద్వారా, ఒక పార్సిలు శిరిడీ పోస్టాఫీసుకు వచ్చింది. వెంటనే దానిని తీసుకోవటానికి, గబగబా అక్కడికి వెళ్ళాడు.
పుస్తక పాహతీ తో తే భాష్య | లోకమాన్యాంచే గీతారహస్య | బగలేస మారూన మశీదీస | దర్శనాస పాతలే | ||౧౪౦||
140. పార్సిలు తెరచి చూడగా, అందులో లోకమాన్య తిలక రచించిన గీతారహస్య భాష్యం పుస్తకం ఉంది. దానిని చంకలో పెట్టుకుని, బాబా దర్శనానికని మసీదుకు వచ్చాడు.
నమస్కారార్థ ఖాలవితా డోఈ | బంగీహీ పడలీ బాబాంచే పాయీ |
“బాపూసాబ హీ కశాచీ కాఈ” | బాబా తే ఠాయీ పుసతీ | ||౧౪౧||
141. నమస్కరించాలని తలవంచే సరికి, ఆ పార్సిలు బాబా పాదాల మీద పడింది. “బాపూసాహేబ్! ఇది ఏమిటి? ఎక్కడిది?” అని బాబా అడిగారు.
గ్రంథాసహ బాబాంచే హాతీ దిధలీ | అవలోకిలీ బాబాంనీ | ||౧౪౨||
142. బాబా ఎదుటే పార్సిలు విప్పి, అదేమిటో చెప్పాడు. గ్రంథాన్ని బాబా చేతికిచ్చాడు. బాబా దానిని చూడ సాగారు.
గ్రంథ కాఢోని హాతీ ఘేతలా | క్షణార్ధాత చాళూన పాహిలా | ఖిశాంతూన ఎక రుపయా కాఢిలా | వరతీ ఠేవిలా కౌతుకే | ||౧౪౩||
143. గ్రంథాన్ని చేతిలోకి తీసుకున్నారు. క్షణం పాటు అటు ఇటు తిరగేసి చూసి, తమ జేబులోంచి ఒక రూపాయని తీసి, ప్రేమగా ఆ పుస్తకంపై ఉంచారు.
రుపయాసహ మగ తో గ్రంథ | ఘాతలా కీ జోగాంచే పదరాంత | మ్హణాలే హా వాచ సాద్యంత | కల్యాణప్రద హోఈల | ||౧౪౪||
144. ఆ రూపాయతో సహా, ఆ గ్రంథాన్ని జోగు కండువాలో వేసి, “దీనిని మొత్తం చదువు. నీకు శుభం కలుగుతుంది” అని చెప్పారు.
ఏశా బాబాంచ్యా అనుగ్రహ కథా | వర్ణితా యేతీల అసంఖ్యాతా | గ్రంథ పావేల అతి విస్తృతతా | మ్హణోన సంక్షిప్తతా ఆదరీ | ||౧౪౫||
145. ఇలాంటి బాబా అనుగ్రహ కథలను, లెక్క లేనంతగా వర్ణించవచ్చు. కాని, గ్రంథం పెద్దది అవుతుందేమో అని సంక్షిప్తంగా చెప్పుతున్నాను.
ఎకదా శిరడీంత ఏసే ఝాలే | దాదాసాహేబ ఖాపర్డే ఆలే | సహపరివార తేథే రాహిలే | ప్రేమే రంగలే బాబాంచ్యా | ||౧౪౬||
146. ఒక సారి శిరిడీలో ఏం జరిగిందంటే, దాదాసాహేబు ఖాపర్డే కుటుంబ సమేతంగా శిరిడీకి వచ్చి, బాబా ప్రేమలో లీనమై, అక్కడే ఉండిపోయాడు.
ఖాపర్డే నవ్హేత సామాన్య గృహస్థ | అతి విద్వాన మోఠే ప్రస్థ | సాఈ సన్నిధ జోడూని హస్త | పాయీ మస్తక ఖాలవీత | ||౧౪౭||
147. ఖాపర్డే సామాన్య మనిషి కాదు. గొప్ప విద్వాంసుడు. పెద్ద స్థానంలో ఉన్నవాడు. అయినా, సాయి ఎదుట చేతులు జోడించుకుని, వారి పాదాల మీద తలనుంచే వాడు.
ఆంగ్లవిద్యా పారంగత | ధారాసభేంత కీర్తిమంత | వక్తృత్వే సర్వాస హాలవీత | మూగ తే గిళత సాఈపుఢే | ||౧౪౮||
148. ఇంగ్లీషు భాషలో పారంగతుడు. శాసన సభలో బాగా పలుకుబడి కలవాడు. సభలో అందరినీ ఆకట్టుకునే మాటకారి. అయినా, బాబా ఎదుట మౌనంగా ఉండేవాడు.
భక్త బాబాంచే అసంఖ్యాత | పరీ త్యాం పాశీ మూకవ్రత | ఖాపర్డే, నూలకర, బుట్టీ వ్యతిరిక్త | ధరితా న భక్త ఆఢళలా | ||౧౪౯||
149. బాబా భక్తులు ఎందరో ఉన్నా, బాబా దగ్గర మౌనంగా ఉండేవారు, ఖాపర్డే, నూల్కరు, బుట్టీ తప్ప ఇతరులెవరూ కారు.
ఇతర సర్వ బాబాంశీ బోలత | కాంహీ తోండాసీ తోండహీ దేత | నాహీ భీడభాడ ముర్వత | మూకవ్రత తే యా తిఘా | ||౧౫౦||
150. మిగతా వారంతా బాబాతో బాగా మాట్లాడే వారు. కొందరు ఏ జంకూ లేకుండా, వారికి సమానంగా మాటకు మాట జవాబు చెప్పేవారు. పై ముగ్గురు మాత్రం మౌనంగా ఉండేవారు.
బోలణ్యాచీచ కాయ కథా | బాబా సన్ముఖ తుకవితీ మాథా |
అవర్ణీయ తయాంచీ లీనతా | శ్రవణ శాలీనతాహీ తైసీ | ||౧౫౧||
151. మాట్లాడక పోవటం ఒకటే కాదు, బాబా ఎదుట ఎప్పుడూ తలవంచి, ఉండేవారు. వారి వినయం, భక్తి, శ్రద్ధ వర్ణించ తరం కాదు. బాబా చెప్పినదాన్ని, అంతే శ్రద్ధగా, వినయంగా వినేవారు.
విద్యారణ్యాంచీ పంచదశీ | సమజూన ఘ్యావీ జయాంపాశీ | తే దాదాసాహేబ మూకవృత్తీశీ | ధరీత మశీదీసీ యేతాంచ | ||౧౫౨||
152. విద్యారణ్యులు రచించిన ‘పంచదశి’ని ఎంతో అద్భుతంగా విడమర్చి చెప్పే దాదాసాహేబు, మసీదులోకి వెళ్ళగానే, మౌనంగా ఉండిపోయే వాడు.
శబ్దబ్రహ్మాచే కితీహీ తేజ | శుద్ధబ్రహ్మాపుఢే నిస్తేజ | సాఈ పరబ్రహ్మమూర్తి సతేజ | విద్వత్తే లాజ లావీ తీ | ||౧౫౩||
153. శబ్దబ్రహ్మ ఎంత ప్రకాశవంతమైనా, శుద్ధ బ్రహ్మ వెలుగు ముందు, అది నిస్తేజమే కదా! సాక్షాత్తు పరబ్రహ్మ మూర్తి అయిన సాయి ముందు, మిగతా పాండిత్యమంతా తలవంచుకోవాల్సిందే.
చార మహినే తయాంచా వాస | కుటుంబ రాహిలే సాత మాస | దివసోందివస ఉభయతాంస | అతి ఉల్హాస వాటలా | ||౧౫౪||
154. ఖాపర్డే నాలుగు నెలలు, అతని భార్య ఏడు నెలలు, శిరిడీలో ఉన్నారు. వారిద్దరికీ, ప్రతి రోజూ ఎంతో ఆనందం అనుభవమైంది.
కుటుంబ మోఠే నిష్ఠావంత | సాఈపదీ ప్రేమ అత్యంత | సాఈస నిత్య నైవేద్య ఆణీత | మశీదీంత స్వహస్తే | ||౧౫౫||
155. అతని భార్య చాలా నిష్ఠావంతురాలు. ఆమెకు సాయి పాదాలంటే విపరీతమైన ప్రేమ. ప్రతి రోజూ, సాయిబాబా నైవేద్యాన్ని ఆమె స్వయంగా మసీదుకు తీసుకుని వచ్చేది.
హోఈ జో న నైవేద్య గ్రహణ | బాఈస తోంవర ఉపోషణ | మహారాజాంనీ కేలియా సేవన | మాగూన జేవణ బాఈచే | ||౧౫౬||
156. బాబా నైవేద్యం తీసుకునే వరకు, ఆమె ఉపవాసంగా ఉండేది. సాయి మహారాజు ఆరగించిన తరువాతే, ఆమె భోజనం చేసేది.
అసో ఎకదా ఆలీ వేళ | బాబా పరమ భక్తవత్సల | బాఈచీ శ్రద్ధా పాహూన అచళ | మార్గ సోజ్వళ దావీత | ||౧౫౭||
157. ఇలా ఉండగా, ఒక మంచి సమయం వచ్చింది. ఆమె శ్రద్ధను, నమ్మకాన్ని చూసి, పరమ దయాళువైన బాబా, ఉజ్వలమైన పరమార్థ మార్గాన్ని ఆమెకు చూపించారు.
అనేకాంచ్యా అనేక పరీ | బాబాంచీ తో అగదీంచ న్యారీ47 | హాంసతా ఖేళతా అనుగ్రహ వితరీ48 | జో దృఢ అంతరీ ఠసావే | ||౧౫౮||
158. ఒక్కొక్కరు బోధించే రకం ఒక్కో విధంగా ఉంటుంది. కాని, బాబా పద్ధతి చాలా ప్రత్యేకమైనది. ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ, మనసులో బాగా నాటుకునేలా వారు అనుగ్రహాన్ని ప్రసాదించే వారు.
ఎకదా సాంజా శిరాపురీ | భాత వరాన్న49 ఆణి ఖిరీ | సాండగే పాపడ కోశింబిరీ | బాఈనే తాటభరీ ఆణిలే | ||౧౫౯||
159. ఒక సారి, ఖాపర్డే భార్య, అన్నం, పప్పు, శిరా, హల్వా, పూరి, పాయసం, అప్పడాలు, వడియాలు, వడపప్పు, మొదలైనవన్నీ ఒక పళ్ళెం నిండా పట్టుకుని వచ్చింది.
ఏసే తే తాట యేతాంక్షణీ | బాబా అతి ఉత్కంఠిత మనీ | కఫనీచ్యా అస్తన్యా వరీ సారునీ | ఆసనావరూనీ ఊఠలే | ||౧౬౦||
160. ఆ పళ్ళెం వచ్చిన వెంటనే, చాలా ఆతురతతో, బాబా తమ ఆసనం పైనుండి లేచారు. కఫనీ చేతులను పైకి జరుపుకున్నారు.
జాఊని బైసలే భోజనస్థానీ | ఘేతలే తాట సన్ముఖ ఓఢునీ |
వరీల ఆచ్ఛాదన బాజూస సారునీ | అన్న సేవనీ ఉద్యుక్త | ||౧౬౧||
161. భోజనం చేసే చోట కూర్చున్నారు. పళ్ళాన్ని తమ ముందుకు లాక్కుని, దాని మీదున్న మూతను ప్రక్కకు జరిపి, భోజనానికి సిద్ధమయ్యారు.
కిత్యేక వేళ తే పడూన రాహత | యావరీచ హేత కా ఇతుకా | ||౧౬౨||
162. అంతకంటే చాలా రుచిగా ఉన్న నైవేద్యాలను ఇతరులు కూడా రోజూ ఎంతో తీసుకుని వచ్చినా, అవి అలాగే చాలా సేపు పడి ఉంటాయి. మరి, ఈ భోజనం మీద వారికి ఎందుకింత ప్రేమ?
హీతో ప్రపంచాచీ వార్తా | శివావీ కా సంతాంచే చిత్తా | మాధవరావజీ సాఈసమర్థా | మ్హణతీ “హీ విషమతా కా బరే | ||౧౬౩||
163. ప్రపంచంలోని మిగతా జనులకు ఇది సహజం. కాని, సత్పురుషులకు ఇలాంటి భేద భావం ఉంటుందా? అది తగునా? అందుకు మాధవరావు వెంటనే ‘బాబా, ఈ భేదభావం ఏం బాగుంది?’ అని సాయి సమర్థులను అడిగాడు.
అవఘ్యాంచీ తాటే ఠేవూని దేతా | కోణాచీ చాందీచీంహీ దూర భిరకావితా | మాత్ర యా బాఈచే యేతాంచ ఉఠతా | ఖాఊ లాగతా నవల హే | ||౧౬౪||
164. ‘మిగతా వారి పళ్ళాలను అక్కడే ఉంచేస్తావు, వెండి పళ్ళాలను కూడా దూరంగా విసిరేస్తావు. కాని, ఈమె పళ్ళెం రాగానే, వెంటనే లేచి ఆరగిస్తున్నావు, ఇది ఆశ్చర్యమే!
హిచేంచ అన్న కా ఇతుకే గోడ | దేవా హే ఆమ్హాంస మోఠే గూఢ | కాయ తరీ హే తుఝే గారుడ | ఆవడనివడ తుమ్హా కా” | ||౧౬౫||
165. ‘ఈమె అన్నం అంత గొప్పగా ఉందా? దేవా! ఇది మాకు పెద్ద రహస్యం. ఏమిటి నీ ఈ మాయ? నీకెందుకు ఈ ఇష్టాయిష్టాల భేదభావం?’ అని అడిగాడు.
బాబా మ్హణతీ “సాంగూ కాఈ | కాయ యా అన్నాచీ అపూర్వాఈ | పూర్వీ50 హీ ఎకా వాణ్యాచీ గాఈ | దుధాళ లఈ లఠ్ఠ అసే | ||౧౬౬||
166. అప్పుడు బాబా “ఏమిటో చెప్పనా! ఈ అన్నంయొక్క ప్రత్యేకత ఏమిటి అని ఎలా చెప్పను! మునుపు, ఒక వ్యాపారస్థుని దగ్గర, ఈమె బాగా పాలిచ్చే ఒక ఆవు.
మగ తీ కుఠే నాహీంసీ ఝాలీ | మాళియాకడే జన్మాస ఆలీ | తీచ పుఢే క్షత్రియాకడే గేలీ | పత్నీ ఝాలీ వాణియాచీ | ||౧౬౭||
167. “ఆ తరువాత ఈమె ఎక్కడా కనిపించకుండా పోయింది. తరువాత ఒక తోటమాలి దగ్గర పుట్టింది. ఆ పైన ఒక క్షత్రియుని ఇంట్లో పుట్టింది. తరువాతి జన్మలో, ఒక వైశ్యుని భార్య అయింది.
పుఢే హీ ఉపజలీ బ్రాహ్మణాపోటీ | బహుతా కాళానే పడలీ దృష్టీ | ప్రేమాచే దోన ఘాంస పోటీ | సుఖసంతుష్టీ జాఊందే” | ||౧౬౮||
168. “ఆ పైన, బ్రాహ్మణుల ఇంట్లో పుట్టింది. చాలా కాలానికి కనిపించింది. ప్రేమతో ఆమె తెచ్చిన అన్నంలో, రెండు ముద్దలు ఆనందంగా, సుఖంగా తిననివ్వు”.
ఏసే మ్హణూని యథేష్ట జెవలే | ముఖ ఆణి హాత ధుతలే | సహజ తృప్తీచే ఢేకర దిధలే | యేఊన బైసలే గాదీవర | ||౧౬౯||
169. అని అంటూ మనసుకు తృప్తిగా తిన్నారు. చేతులు, నోరు కడుక్కుని, తృప్తిగా త్రేన్చి, తమ ఆసనంపై కూర్చున్నారు.
బాఈనే మగ కరూని నమన | ఆరంభిలే సాఈచరణ సంవాహన | బాబాంనీ తీ సంధీ సాధూన | హితగుజ సాంగూన రాహిలే | ||౧౭౦||
170. అప్పుడు, ఆమె వారికి నమస్కరించి, వారి పాదాలను ఒత్త సాగింది. ఆ అవకాశాన్ని తీసుకుని, బాబా ఆమెకు హితోపదేశం చేయసాగారు.
బాఈ జయాంనీ చరణ చూరీ | దాబీత తే కర బాబా స్వకరీ |
పాహూని దేవ భక్తాంచీ చాకరీ | కరీ మస్కరీ తంవ శామా | ||౧౭౧||
171. బాబా పాదాలను ఒత్తుతున్న ఆమె చేతిని, బాబా తమ చేత్తో ఒత్త సాగారు. దేవుని, భక్తురాలి పరస్పర సేవను చూసి, శామా ఎగతాళి చేయసాగాడు.
“ఠీక చాలలే ఆహే కీ దేవా | కాయ మౌజేచా హా దేఖావా | పాహూని యా పరస్పరాంచ్యా భావా | వాటే నవలావా అత్యంత” | ||౧౭౨||
172. ‘భలే బాగా జరుగుతుంది, దేవా! చూడటానికి ఎంతో ఆనందంగా ఉంది! మీ పరస్పర భావాన్ని చూస్తుంటే, చాలా ఆశ్చర్యంగా ఉంది!’ అని అన్నాడు.
పాహోని తిచా సేవా కామ | ప్రసన్న బాబాంచే అంతర్యామ | హళూచ మ్హణతీ ‘రాజారామ | రాజారామ’ వద వాచే | ||౧౭౩||
173. ఆమె సేవకు బాబా మనసులో చాలా ఆనందించారు. మెల్లగా ఆమెతో, “‘రాజారాం, రాజారాం’ అను” అని అన్నారు.
ఏసే మ్హణత రాహీ నిత | సఫల హోఈల ఆఈ జీవిత | శాంత హోఈల తుఝే చిత్త | హిత అపరిమిత పావసీల” | ||౧౭౪||
174. “అలా ఎప్పుడూ అంటూ ఉండు. అమ్మా! నీ జీవితం సఫలమౌతుంది. నీ మనసు శాంతిస్తుంది. నీకు అంతులేని శుభం కలుగుతుంది” అని చెప్పారు.
కాయ త్యా వచనాచీ మాత | హృదయాంతరీ జాఊన ఖోంచత | వచన యోగేంచ శక్తిపాత | క్షణార్ధాంత కరీత | ||౧౭౫||
175. ఆహా! ఎంత అద్భుతమైన మాటలవి! మనసులోకి చొచ్చుకు పోతాయి. ఒట్టి ఆ మాటలతోనే బాబా తమ శక్తిని భక్తురాలికి ధార పోసినట్లు అనిపిస్తుంది.
ఏసా కృపాళూ శ్రీసమర్థ | ప్రణతపాళ సాఈనాథ | పురవీ నిత్య భక్తమనోరథ | సాధీ నిజహిత తయాంచే | ||౧౭౬||
176. ఇలాంటి దయామయులయిన శ్రీ సమర్థులు, శరణాగతులను రక్షించే సాయినాథులు, ఎల్లప్పుడూ భక్తుల కోరికలను తీర్చి, వారికి హితాన్ని కలుగ చేస్తారు.
అత్యంత హిత అతి ప్రీతీ | అత్యంత లీన శ్రోతయాంప్రతీ | కథితో మీ తే ధరా చిత్తీ | కరితో వినంతీ సలగీచీ | ||౧౭౭||
177. ఇక ఎంతో ప్రేమతో, వినయంతో, శ్రోతలకు చాలా మేలు చేసే సంగతిని చెప్పుతాను. దానిని మీరు మీ మనసులో భద్ర పరచుకొండని, వినయంగా విన్నవించుకుంటున్నాను.
లంపట గుళాచియే గోడీ | సాండీ న ముంగీ తుటతా ముండీ | తైసీ ద్యా సాఈచరణీ దడీ | కృపా పరవడీ రక్షీల తో | ||౧౭౮||
178. బెల్లం తీపికి ఆకర్షింపబడ్డ చీమ, తన తల తెగిపోయినా, ఆ బెల్లం ముక్కను వదలదు. అంతే శ్రద్ధతో, మీరు సాయి పాదాలకు శరణుజొచ్చితే, వారు ఎంతో కరుణతో, మిమ్మల్ని రక్షిస్తారు.
గురు-భక్త హే నాహీ వేగళే | దోఘేహీ ఎకాంగ ఆగళే | ప్రయత్నే వేగళే కరితా బళే | అభిమాన గళే కర్త్యాచా | ||౧౭౯||
179. గురువు, భక్తులు వేరు వేరు కారు. వేరుగా కనిపించినా, వారు ఒక్కరే. వారిని వేరు చేయాలని, ఎవరు ఎంతగా ప్రయత్నించినా, ప్రయత్నించిన వారు తమ అహంకారాన్ని వదులుకోవాల్సి వస్తుంది.
ఎకావాచూన ఎక ఠేలా | కచ్చా గురూ తో కచ్చాహీ చేలా | పరీ జో పక్క్యా గురూచా కేలా51 | ద్వైతీ అబోలా తయాసీ | ||౧౮౦||
180. ఒకరు లేకుండా మరొకరు ఉండరు. గురువు అజ్ఞాని అయితే, శిష్యుడు కూడా అజ్ఞానియే. ఎవరు జ్ఞానియైన గురువు దగ్గర చేరుకుంటారో, వారికి వేరు వేరన్న భావం నశించి పోతుంది.
గురూ రాహీ ఎక్యా గాంవీ | శిష్య తయాచా ఇతర గాంవీ |
ఏసే జయాచే మన భావీ | తే మానభావీ52 ఉభయహీ | ||౧౮౧||
181. గురువు ఒక ఊరిలో ఉంటాడని, శిష్యుడు ఇంకొక ఊరిలో ఉన్నట్లు అనుకుంటే, అది నిజం కాదు. అలాంటి వారిద్దరూ బయటికి మాత్రమే గురు శిష్యులు.
ఎక న రాహే ఎకావీణ | ఇతుకే అనన్య తే దోఘే | ||౧౮౨||
182. అసలు, వారు ఇద్దరు కానప్పుడు, వారు వేరు వేరెలా అవుతారు? ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు. వారిద్దరిలో అంత ప్రేమ ఉంటుంది.
గురుభక్తాంత నాహీ అంతర | ఏసే వాస్తవ్య నిరంతర |గురుపదావరీ భక్త శిర | హాహీ ఉపచార స్థూలాచా | ||౧౮౩||
183. గురువుకు, భక్తులకు దూరమే ఉండదు. మానసికంగా వారిద్దరూ ఒకటిగా ఉంటారు. ఇది ఎప్పటికీ ఉండే నిజం. భక్తుడు గురువు పాదాల మీద తలను ఉంచడం దైహికంగా చేసే ఒక ఆచారం.
భక్త అద్వైత భజనపర | గురూహీ అద్వైత భక్తపర |ఏసే న మీనతా53 పరస్పర | కేవళ తో వ్యవహార నాంవాచా | ||౧౮౪||
184. తాము ఇద్దరూ ఒకటే అనే భావంతో, భక్తుడు గురువును పూజిస్తాడు, అలాగే, గురువు కూడా భక్తుని గురించి అనుకుంటాడు. వారిరువురూ ఒకరికొకరు అలా సమ భావంతో ఉండకపోతే, వారి సంబంధం నామ మాత్రానికే.
కైసే లాధేల అన్నాచ్ఛాదన | క్షణమాత్రహీ న కరా చింతన |హేతో సర్వ ప్రారబ్ధాధీన | ప్రయత్నావీణ ఆపాద్య54 | ||౧౮౫||
185. తినటానికి అన్నం, కట్టుకోవటానికి బట్టలు ఎలా దొరుకుతాయని, ఒక క్షణం కూడా చింతించకండి. ఇవన్నీ పూర్వ జన్మ పుణ్యం కొద్దీ, ఏ ప్రయత్నమూ లేకుండానే దొరుకుతాయి.
కరూ జాల ప్రయత్నే సంపాదన | తరీ తో హోఈల వ్యర్థ శీణ |ప్రయత్నే వ్హా పరమార్థసంపన్న | చింతన రాత్రందిన హే కరా | ||౧౮౬||
186. వానిని సంపాదించాలని ఎంత ప్రయత్నించినా, అది వ్యర్థమైన శ్రమే అవుతుంది. మీ సమయాన్ని, పరమార్థ సంపద కోసం, రాత్రింబవళ్ళూ చింతన చేస్తూ, ప్రయత్నాన్ని చేయండి.
‘ఉత్తిష్ఠత’ ఆణి ‘జాగృత’ | గాఢ నిద్రేంత పడతా కా ఘోరత |శ్రుతిమాయ55 తారస్వరే గర్జత | ప్రేమే జాగవీత భక్తాంస | ||౧౮౭||
187. ‘లే! మేలుకో! గాఢ నిద్రలో పడి, ఎందుకు గుర్రు పెడుతున్నావు?’ అని శ్రుతిమాత పై స్వరంతో గర్జిస్తూ, ప్రేమగా, భక్తులను మేలుకొలుపుతూ ఉంది.
సర్వానర్థ బీజభూత | అవిద్యానిద్రేంత జే జే లోళత |తయాంనీ వేళీ హోఊని జాగృత | గురుజ్ఞానామృత సేవావే | ||౧౮౮||
188. అన్ని అనర్థాలకూ మూలమైన అజ్ఞానమనే నిద్రలో మునిగి ఉన్న వారు, సమయానికి సరిగ్గా మేలుకొని, గురువు అందించే జ్ఞానామృతాన్ని త్రాగాలి.
తదర్థ హోఊని అతి వినీత | వ్హా గురుచరణీ శరణాంగత |తో ఎక జాణే విహితావిహిత56 | ఆమ్హీ తో నేణత లేంకురే | ||౧౮౯||
189. దాని కొరకు, చాలా వినయంతో, గురువు పాదాలలో శరణాగతులవండి. సరియైనది ఏది, కానిది ఏది అని తెలిసిన వారు గురువు ఒక్కరే. వారి ముందు మనం పసిపిల్లలవంటి వారము. మనకు ఏదీ తెలియదు.
సాహంకార కించిజ్ఞ జీవ | నిరహంకార సర్వజ్ఞ శివ |దోఘాంఠాయీ అభేదభావ | వ్హావయా ఉపావ గురు ఎక | ||౧౯౦||
190. అహంకారం వలన, తెలిసీ తెలియని మిడి మిడి జ్ఞానంతో ఉన్న జీవాత్మ, అన్నీ తెలిసి అహంకారం లేని శివుడు, ఇద్దరూ ఒక్కటే, అనే అద్వైత భావాన్ని కలిగించేవారు, గురువు ఒక్కరే.
అవిద్యోపాధి ఆత్మా ‘జీవ’ | మాయోపాధి ఆత్మా ‘శివ’ |
జాణే ఘాలవూ హా భేదభావ | సమర్థ గురురావ ఎకలా | ||౧౯౧||
191. అజ్ఞానంతో నిండిన జీవాత్మకు, మాయతో కూడుకున్న శివునికి మధ్య ఉన్న దూరాన్ని తొలగించగల సమర్థులు గురువు ఒక్కరే.
మన సంకల్పవికల్పాధీన | కరా సాఈపాయీ సమర్పణ | మగ తేథూన పావే జే స్ఫురణ | త్యాచే అహంపణ త్యాజవళ | ||౧౯౨||
192. ఆశల, అనుమానాల అధీనంలో మనసు ఉంటుంది. దానిని సాయి పాదాల దగ్గర సమర్పించండి. అప్పటినుండి, మనసు అనుకునే పనులన్నిటినీ చేసే భారం గురువుదే.
తైసీచ సకల క్రియాశక్తీ | తీహీ సమర్పా సాఈప్రతీ | మగ తో ఆజ్ఞాపీ జైసియా రీతీ | తైసియే స్థితీ వర్తావే | ||౧౯౩||
193. అలాగే, పనులను చేసే శక్తినంతా సాయికి సమర్పించి, వారు ఆజ్ఞాపించిన ప్రకారంగానే నడుచుకోండి.
జాణా సకల సాఈచీ సత్తా | భార ఘాలోని తయా వరతా | కార్య కరితా నిరభిమానతా | సిద్ధి యే హాతా అవికళ | ||౧౯౪||
194. సాయియొక్క శక్తి అంతులేనిదని తెలుసుకోండి. ఏ అహంకారమూ లేక, వారిపై భారం వేసి, పనులను చేస్తే, సిద్ధి చేతికి అందుతుంది.
పరీ మ్హణాల మీ హే కరీన | ధరాల అత్యల్పహీ అభిమాన | ఫళ యేఈల తాత్కాళ దిసోన | విలంబ క్షణహీ న లాగేల | ||౧౯౫||
195. అలా కాకుండా, ‘ఇది నేను చేస్తాను’ అని ఏ కొంచెం గర్వం ఉన్నా, క్షణం కూడా ఆలస్యం కాకుండా, దాని ఫలితం తక్షణమే తెలిసి పోతుంది.
మాయామోహ నిశీస | యా కుశీచే త్యా కుశీస | హేమాడ అసతా దేతా ఆళస57 | హరి గురు కృపేస లాధలా | ||౧౯౬||
196. మాయా, మోహమనే రాత్రిలో, బద్ధకంతో అటు ఇటు పొర్లుతున్న హేమాడు పంతుకు, ఏ ప్రయత్నమూ లేక, హరి మరి గురువుయొక్క అనుగ్రహం లభించింది.
తేంహీ కేవళ అదృష్టవశే58 | వినా అభ్యాస వా సాయాసే | త్యాంనీంచ కేవళ నిజోద్దేశే | గౌరవిలే ఏసే వాటతే | ||౧౯౭||
197. కేవలం అదృష్టం కొద్ది, ఏ ప్రయత్నమూ, ఏ సాధనా లేకుండానే లభించింది. తాము అనుకున్నది సాధించేందుకు, వారే (హరి మరియు గురువు) నన్ను గౌరవించినట్లుగా నాకు అనిపిస్తుంది.
కరావయా భక్తోద్ధార | కరోని నిజ చరిత్ర నిర్ధార | బళేంచ త్యాచా ధరోని కర | గ్రంథ సవిస్తర లిహివిలా | ||౧౯౮||
198. భక్తులను ఉద్ధరించాలని, బలవంతంగా పంతు చేయి పట్టుకుని, తమ చరిత్రను విస్తారమైన గ్రంథంగా వ్రాయించారు.
అఖండానుసంధాన సూత్ర | అనన్య ప్రేమపుష్పీ విచిత్ర | గుంఫోనియా హార మనోహర | అర్పూ సాదర సాఈస | ||౧౯౯||
199. అంతులేని ఆరాధన అనే దారంతో, స్థిరమైన నమ్మకం మరియు ఎప్పటికీ ఉండే ప్రేమ అనే చిత్ర విచిత్రమైన పువ్వులతో ఒక హారం గ్రుచ్చి, భక్తితో సాయికి సమర్పిద్దాం.
మిళవూ స్వరాజ్యసింహాసన59 | హోఊ స్వపదీ విరాజమాన | భోగూ స్వానంద నిరభిమాన | సుఖాయమాన నిజాంతరీ | ||౨౦౦||
200. ఆత్మజ్ఞానమనే స్వరాజ్య సింహాసనాన్ని సాధించి, ఆత్మలో లీనమైన భావంతో ఆ ఆసనాన్ని అలంకరించి, దానిపై స్థిరంగా కూర్చుందాము. కొంచెం కూడా అహంకారం లేకుండా, మనసులో ఆ పరమానందాన్ని అనుభవిద్దాము.
ఏసే అగాధ సాఈ చరిత్ర | పుఢీల కథా యాహూన విచిత్ర |
దత్తావధాన వ్హా క్షణమాత్ర | శ్రవణ పవిత్ర కరావయా | ||౨౦౧||
201. ఇలాంటి అగాధమైన సాయి చరిత్రలో, తరువాతి కథ ఇంతకంటే విచిత్రమైనది. మీ చెవులను పవిత్రం చేసుకోవటానికి, క్షణం పాటు సావధానంగా ఉండండి.
పుఢే యేఈల అధ్యాయత్రయీ60 | బాబా బైసూని ఠాయీంచే ఠాయీ | దృష్టాంతాచీ అపూర్వాఈ | పహా నవలాఈ దావితీల | ||౨౦౨||
202. తరువాతి మూడు అధ్యాయాలలో, కూర్చున్న చోటే కూర్చుని, వేరు వేరు చోట్లలో ఉండే భక్తులకు, బాబా అద్భుతమైన కలలను ఎలా చూపించారు అన్నది తెలుస్తుంది.
త్యాంతీల ఆరంభీచా అధ్యాయ | లాలా లఖమీచందాచా విషయ | ప్రేమసూత్రే బాంధూన పాయ | దావిలా నిజఠాయ తయాస | ||౨౦౩||
203. మొదటి అధ్యాయంలో, లాలా లఖమీచందు సంగతి. అతని పాదాలకు ప్రేమనే దారం కట్టి, అతనికి తమ ఆశ్రయాన్ని కలిగించారు.
బర్హాణపూరస్థ బాఈ ఎక | తిచియా ఖిచడీలాగీ కాముక | హోఊని కేలే దర్శనోత్సుక | దావిలే కౌతుక ప్రేమాచే | ||౨౦౪||
204. బర్హాణపురంలోని ఒక స్త్రీనుండి పులగాన్ని కోరి, ఆమెను తమ దర్శనానికి ఆరాట పడేలా చేసి, ఆమెకు ప్రేమయొక్క అద్భుతాన్ని చూపించారు.
పుఢే మేఘాచియా61 స్వప్నాంత | త్రిశూళ కాఢాయా ఝాలా దృష్టాంత | తయాపాఠీ అకస్మాత | లింగ హో ప్రాప్త శంకరాచే | ||౨౦౫||
205. తరువాత, మేఘా కలలో త్రిశూలాన్ని గీయటమనే కల. దాని తరువాత, అకస్మాత్తుగా అతనికి శివలింగం లభించుట.
ఏసఏసియా అనేక కథా | యేథూన పుఢే యేతీల ఆతా | భక్తిపూర్వక ఏకతా శ్రోతా | శ్రవణ సార్థకతా హోఈల | ||౨౦౬||
206. ఇలాంటివి ఎన్నో కథలు ముందు ముందు చాలా ఉన్నాయి. వీనిని శ్రోతలు భక్తితో వింటే, వారికి తృప్తి కలుగుతుంది.
సైంధవ62 సింధూ నిమజ్జన | తైసా హేమాడ సాఈస శరణ | సోహంభావాచే అభిన్నపణ | త్యా అనన్యపణే నమన కరీ | ||౨౦౭||
207. ఉప్పుతో చేసిన బొమ్మ సముద్రంలోకి వెళితే ఎలా మునిగి పోతుందో, అలా హేమాడు సాయికి శరణుజొచ్చి, ప్రేమతో భక్తితో సాయి పాదాలకు నమస్కరించి, అంతా ఒక్కటే అనే భావాన్ని ఆనందిస్తున్నాడు.
వరీ కరీ ప్రేమే వినవణ | లాగో అహర్నిశ సాఈచే ధ్యాన | త్యావీణ ధ్యానీ న రిఘో ఆన | మన సావధాన అసావే | ||౨౦౮||
208. ఆ పైన, రాత్రింబవళ్ళూ తన మనసు సాయి ధ్యానంలోనే ఉంటూ, వారు తప్ప వేరే ఏదీ మనసులో రాకుండా, జాగ్రత్తగా ఉండాలని, భక్తిగా ప్రార్థిస్తున్నాడు.
హోవో మాగీల పరిహార | పుఢీల నిర్దళూన జావా పార | అవశేష జే మధ్యంతర | రాహో నిరంతర గురు పాయీ | ||౨౦౯||
209. గతం తుడిచి పెట్టుకుని పోని, భవిష్యత్తు ఇంకా ముందుకు తోయబడి, ఇప్పుడు మిగిలిన వర్తమానం అంతా ఎప్పుడూ గురువు పాదాలలోనే మనసు ఉండుగాక.
| ఇతి శ్రీ సంతసజ్జన ప్రేరితే | భక్త హేమాడపంత విరచితే |
| శ్రీ సాఈ సమర్థ సచ్చరితే | | దీక్షానుగ్రహదానం నామ |
| సప్తవింశతితమోధ్యాయః సంపూర్ణః |
||శ్రీ సద్గురూ సాఈనాథార్పణమస్తు|| శుభం భవతు ||
1. సాగరాచ్యా తళాశీ. 2. సర్వత్ర. 3. గురుకృపావబోధ. 4. హర్ష.
5. గృహ. 6. గుంతాగుంత. 7. నేవాశాత. 8. హా సాఈ-సమాగమ.
9. ఓఢవలేలా. 10. జాణీవ. 11. రోగ్యావర. 12. ఉత్కంఠేనే.
13. శ్రీ సాఈబాబాంచ్యా హాతానే ప్రాప్త ఝాలేలే. 14. మాధవరావాంనా.
15. కాకా మహాజనీ. 16. జ్యాంచే సర్వ ఇచ్ఛిత ప్రాప్త ఝాలేలే ఆహే అసే.
17. శిష్య. 18. బారీక చావటీ.
19. యా నావానే మాధవరావాంస బాబా హాక మారీత.
20. కీ నాహీ. 21. ఫార కల్యాణకారీ. 22. పిడా.
23. యా విష్ణుసహస్త్రనామాచా. 24. ఛాతీవర, హృదయాత.
25. పరమేశ్వర. 26. హళూహళూ.
27. ఖోటే (మ్హణజే త్యాచ్యా పరవానగీఖేరీజ త్యాచీ పోథీ ఘేణే హే).
28. వేడా. 29. సతత వ హళూ జప (గుణగుణ).
30. కేశవస్వామీకృత శ్రీఎకనాథస్వామీంచే చరిత్ర, అ. ౫౭, ఓ. ౩౪ తే ౭౧ పహా. 31. ధడపడ, కళకళ. 32. ఔషధ.
33. కై. అణ్ణా చించణీకర (దామోదర ఘనశ్యామ బాబరే).
34. ఫార రాగీట. 35. కుతర్కాచీ ప్రతిమా. 36. ధడ్యా గుణాంనీ.
37. కపటవిద్యా. 38. దోష. 39. మన. 40. లాభ.
41. రాగానే తాంబడాలాల హోఊన. 42. నడ, పిడా.
43. కళణ్యాస అవఘడ.
44. రా. హరీ సీతారామ దీక్షిత, బీ. ఎ., ఎల్ఎల్. బీ., సాలిసిటర్.
45. ప్రోఫేసర గణేశ గోవింద నరకే, ఎమ్. ఎ.
46. సాఈబాబాబరోబర ఝాలేలే సంభాషణ. 47. నిరాళీ. 48. దేత.
49. వరణ. 50. పూర్వీచ్యా ఎకా జన్మీ. 51. పదరీ తయార బనలేలా.
52. దిఖాఊ. 53. సమరసతా. 54. మిళణారే. 55. కాఠకోపనిషద.
56. యోగ్య కాయ, అయోగ్య కాయ. 57. శరీరాస ఆళేపిళే.
58. దైవవశాత. 59. ఆత్మస్వరూపరూపీ స్వరాజ్య. 60. తీన అధ్యాయ.
61. యా నావాచా శ్రీంచా నిస్సీమ భక్త. 62. మిఠాచా ఖడా.
No comments:
Post a Comment